సత్ప్రవర్తనతో విద్యను అభ్యసించాలి
కడప అర్బన్ : పిల్లలు సత్ప్రవర్తనతో విద్యను అభ్యసించాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ తెలిపారు. గురువారం కడప నగర శివార్లలోని చిన్నచౌక్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. వంట గదులను, వసతి గదులను, టాయిలెట్స్, ఫ్యాన్‌లు, లైట్లు పరిశీలించారు. తగినన్ని ఫ్యాన్లు, లైట్లు లేకపోవడం గమనించి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడారు. పిల్లలు విద్య, ఆరోగ్య విషయాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలుంటే కడపలోని జిల్లా న్యాయసేవాధికారసంస్థ, దృష్టికి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ,
జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్
Comments
Please login to add a commentAdd a comment