ఉత్సాహంగా సాగిన కేఎంసీ స్పోర్ట్స్ మీట్
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా సాగింది. 100 మీటర్ల రన్నింగ్, 400 మీటర్ల రన్నింగ్ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కమిషనర్ మనోజ్‌రెడ్డి మొదట వాలీబాల్ ఆడి క్రీడలను ప్రారంభించారు. వాలీబాల్ బాలుర విభాగంలో స్పోర్ట్స్ స్కూల్ మొదటి స్థానంలో నిలవగా, విద్యామందిర్ స్కూల్ రెండో స్థానంలో, నారాయణ స్కూల్ విద్యార్థులు మూడో స్థానంలో నిలిచారు. వాలీబాల్ బాలికల విభాగంలో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు మొదటి స్థానంలో, మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ అగాడి స్ట్రీట్ విద్యార్థులు రెండో స్థానంలో, మున్సిపల్ హైస్కూల్ మెయిన్ విద్యార్థులు మూడో స్థానంలో నిలిచారు. బాలికల 100 మీటర్ల రన్నింగ్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎం. శ్రీలత రెడ్డి మొదటి స్థానంలో, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థిని వేదవర్షిని రెండోస్థానంలో, అంబేడ్కర్ స్కూల్ విద్యార్థిని కీర్తన మూడో స్థానంలో నిలిచారు. బాలుర 100 మీటర్ల రన్నింగ్‌లో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి బి. రాముడు, గాంధీనగర్ స్కూల్ విద్యార్థి తిమోతి, కడప పబ్లిక్ స్కూల్ విద్యార్థి ఎల్. జస్వంత్‌రెడ్డి మూడో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. అనంతరం 400 మీటర్ల రిలే పరుగు పందెంలో విద్యామందిర్ స్కూల్ విద్యార్థులు మొదటి స్థానంలో, మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ సాలే నాగయ్య స్కూల్ విద్యార్థులు రెండో స్థానాన్ని, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ నాగరాజుపేట విద్యార్థులు మూడో స్థానంలో నిలిచారు. రేపు కబడ్డీ, బాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.
క్రీడలను ప్రారంభించిన కమిషనర్ మనోజ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment