కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఏ.ఆర్ మొబిలైజేషన్‌లో భాగంగా పుష్పగిరి కంటి ఆసుపత్రిలో ఎం.టి (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) విభాగం డ్రైవర్ సిబ్బందికి గురువారం కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య మాట్లాడుతూ మన అవయవాల్లో అన్నిటికంటే ముఖ్యమైనవి కళ్లు అన్నారు. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారన్నారు. కళ్లు అనేవి మనకు దేవుడిచ్చిన అపురూపమైన నిధి అని వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మన విధి అని అన్నారు. 90 మంది పోలీసు వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి యూనిట్ హెడ్ వి. సూర్యప్రకాష్‌కు జిల్లా పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్.ఐ వీరేష్, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పుశంకర్ పాల్గొన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య
Comments
Please login to add a commentAdd a comment