కోడి పెంట తెచ్చిన తంటా
జమ్మలమడుగు రూరల్ : కోడి పెంట తమ ఇంటిలో పడుతోందని కోళ్లు పెంచుకుంటున్న వారికి చెప్పడంతో పాత కక్షలు మనసులో పెట్టుకుని కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటన జమ్మలమడుగు మండలంలోని పొన్నతోట గ్రామంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. పొన్నతోట గ్రామానికి చెందిన పొతనబోయిన నాగలక్షుమ్మ ఇంటిలో ఉన్న చెట్టుపైకి పక్కింట్లో ఉంటున్న రోశమ్మ కుటుంబానికి చెందిన కోళ్లు చేరి పెంట వేస్తున్నాయని నాగలక్షుమ్మ రోశమ్మకు చెప్పింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పాత కక్షలు మనసులో పెట్టుకుని నాగలక్షుమ్మ భర్త నారాయణ, కుమారుడు నారాయణ, కోడలు గంగాదేవిపై రోశమ్మ కుమారుడు శివకృష్ణ, అతని భార్య, దాయాదులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నారాయణను మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సోదరుడు మాజీ ఎంపీపీ పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
దాడిలో నలుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment