ఘనంగా డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతి
పులివెందుల టౌన్ : పట్టణంలోని స్థానిక శ్రీనివాస థియేటర్ సమీపంలో మెకానిక్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పులివెందుల ప్రాంత ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్లు హాలు గంగాధర్ రెడ్డి, హఫీజ్, వైఎస్సార్‌సీపీ నూర్ బాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రసూల్, జేసీఎస్ కన్వీనర్ పార్నపల్లి కిశోర్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు యార్వ వెంకట సుబ్బయ్య, కౌన్సిలర్లు గండి రాము, ఖాదర్, కో.ఆప్షన్ సభ్యుడు చంద్రమౌళి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల భాస్కర్, వైఎస్సార్‌సీపీ నాయకులు హరి, రాయుడు, మహమ్మద్, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment