దెబ్బతిన్న పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
సింహాద్రిపురం : కలుపు నివారణ మందు పిచికారీ చేయడంతో ఎదుగుదలలేని పంటలను కేవీకే, డాట్ శాస్త్రవేత్తలు వీరయ్య, అంకయ్య కుమార్, వి.మాధురి, భగవతి ప్రియలు గురువారం పరిశీలించారు. మండలంలోని రావులకొలను గ్రామంలో మహేశ్వర్ రెడ్డి అనే రైతు తాను కౌలుకు తీసుకున్న 15 ఎకరాల్లో నువ్వుల పంటను సాగు చేశాడు. పులివెందుల గురు బాలాజీ ఫర్టిలైజర్ యజమాని సలహా మేరకు కలుపు నివారణ మందును కొట్టడంతో పంట ఎదుగుదల లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం దెబ్బతిన్న పంటను పరిశీలించారు. ఇలా నాసిరకం కలుపు నివారణ మందుతో ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. దీంతో గురువారం శాస్త్రవేత్తల బృందం పంటను పరిశీలించింది. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ముద్దనూరు ఏడీఏ వెంకటసుబ్బయ్య, వీఏఏ దీపిక, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment