ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్యూటీ ఎక్కిన మరుక్షణం ఆయన ఒళ్లంతా అటెన్షన్‌గా మారిపోతుంది.. కంటి చూపు రెట్టింపవుతుంది. మనసంతా పనిపైనే నిమగ్నమవుతుంది.. ఆ క్షణం తన వెనకాలనున్న యాభైమంది ప్రజలకు ఆయనో దేవుడు.. ఆయనే డ్రైవరు. ఇటు ప్రయాణికుల | - | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్యూటీ ఎక్కిన మరుక్షణం ఆయన ఒళ్లంతా అటెన్షన్‌గా మారిపోతుంది.. కంటి చూపు రెట్టింపవుతుంది. మనసంతా పనిపైనే నిమగ్నమవుతుంది.. ఆ క్షణం తన వెనకాలనున్న యాభైమంది ప్రజలకు ఆయనో దేవుడు.. ఆయనే డ్రైవరు. ఇటు ప్రయాణికుల

Published Fri, Jan 24 2025 12:46 AM | Last Updated on Fri, Jan 24 2025 12:47 AM

ఇంట్ల

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య

ఒత్తిడి ఎక్కువైంది..

నేను పదిహేనేళ్లుగా ఆర్టీసీ డ్రైవరుగా పనిచేస్తున్నాను. డ్యూటికి వచ్చి డ్రైవర్‌ సీట్లో కూర్చుంటే ఇంటి దగ్గర ఉండే భార్యాబిడ్డలు గుర్తుకురారు. రోడ్డుపై రద్దీగా ఉన్న ప్రజలతో పాటు కుంటి వారిని గుడ్డి వారిని, అన్నిరకాల వాహనాలను తప్పించుకుంటూ ఓపిగ్గా ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చడంలోనే నిమగ్నమైపోతాం. వాహనాల రద్దీ పెరిగింది. రోడ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్‌ తప్పించుకుని పోవాలంటే ఒత్తిడి పెరుగుతోంది.

–సి.పిచ్చయ్య,ఆర్‌టిసి డ్రైవర్‌,బద్వేలు డిపో

ప్రయాణికుల క్షేమమే ధ్యేయం

ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానం చేర్చడమే మా ధ్యేయంగా భావిస్తాం. ప్రయాణికులే మా సంస్థకు దేవుళ్లు.వారి వల్ల సంస్థకు ఆదాయం వస్తే మాకు జీవనోపాధి ఉన్నట్లు. అందుకే రోడ్డుపై ఎన్నిరకాలుగా అడ్డంకులు ఉన్నా ఓపికతో వారిని గమ్యస్థానానికి చేర్చుతున్నాం. బస్సులు మంచి కండిషన్‌లో ఉంటే మాకు కొంచెం ఒత్తిడి తగ్గుతుంది. –హరినాథ్‌,ఆర్‌టిసి డ్రైవర్‌ బద్వేలు డిపో

బద్వేలు: ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడంలో డ్రైవర్ల పాత్ర కీలకం. రాత్రి, పగలు తేడా లేకుండా డ్యూటీల్లో ఉంటారు. ఎండా వానా, చలి వంటి పరిస్థితులను తట్టుకుని నిబద్ధతతో బాధ్యతలు నిర్వహిస్తారు. వేళ కాని వేళల్లో డ్యూటీకి పిలిచినా వెళ్లాల్సి ఉంటుంది. జనవరి 24 రాష్ట్ర రోడ్డు రవాణా డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ డ్రైవర్ల విధులు.. పనితీరుపై ప్రత్యేక కథనం.

● వైయస్సార్‌ కడప జిల్లా పరిదిలో 6 బస్సు డిపోలు ఉన్నాయి. పులివెందుల,కడప,బద్వే లు , మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు డిపోల్లో దాదాపు 1,200 మంది డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు ప్రతిరోజూ 1.5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.

నియామకాలు లేకపోవడంతో

ఉన్నవారిపైనే పనిభారం

అంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 11 ఏళ్లుగా నియామకాలు చేపట్టలేదు. వేల మంది డ్రైవర్లు ఉద్యోగ విరమణ, మెడికల్‌ అన్‌ఫిట్‌ పొందుతున్నారు. నియామకాలు లేకపోవడంతో ఉన్న డ్రైవ ర్లతోనే డబుల్‌ డ్యూటీలు చేయిస్తున్నారు. దీంతో డ్రైవర్లకు సరైన విశ్రాంతి ఉండటం లేదు. రిటైర్డు అయిన డ్రైవర్లకు పెన్షన్‌ తక్కువ మొత్తంలో వస్తోంది. దీంతో చాలా మంది డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వాలు ఆదుకోవాలి

నిత్యం ప్రయాణికుల క్షేమం కోరుతూ వారిని గమ్యానికి సురక్షితంగా చేరుస్తున్న తమకు తమ కుటుంబాల ను ఆదుకునే విధంగా పథకాలు రూపొందించాలని ఆర్టీసి డ్రైవర్లు కోరుతున్నారు. ముఖ్యంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పిల్లల చదువులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఏటా పది లక్షల వివిధ రకాల వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. వాహనాలు పెరుగుతున్నత వేగంగా రోడ్ల విస్తరణ చేపట్టడంలేదు.సరికదా ఉన్న రోడ్డులను ఆక్రమించుకుని నిర్మాణాలు చే పడుతున్నారు.దీంతో డ్రైవర్లపై ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి తోడు కండిషన్‌ లేని బస్సులతో నడపాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్ల కష్టాలను గుర్తించి సమస్యలు పరిష్కరిస్తే మరింత భద్రంగా ప్రజల క్షేమం కోసం పాటుపడతామని డ్రైవర్లు కోరుతున్నారు.

ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానం చేర్చడమే వారి బాధ్యత

రద్దీని తట్టుకుంటూ ఓపిక తెచ్చుకుంటూ నడుపుతున్న వైనం

నియామకాలు లేకపోవడంతోఉన్నవారిపై పనిభారం

నేడు రాష్ట్ర రోడ్డు రవాణా డ్రైవర్ల దినోత్సవం

No comments yet. Be the first to comment!
Add a comment
ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య1
1/7

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య2
2/7

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య3
3/7

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య4
4/7

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య5
5/7

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య6
6/7

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య7
7/7

ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. ఒంట్లో ఎన్ని బాధలున్నా.. డ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement