![దరఖాస](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12myd101-170038_mr-1739415280-0.jpg.webp?itok=pNd4oT42)
దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో ఖాళీగా ఉన్న దుకాణాలకు ఐదు సంవత్సరాల లీజుకు ఔత్సాహికులైన వ్యాపారవేత్తలు, నిరుద్యోగుల నుంచి టెండరు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా ప్రజా రవాణాధికారి పి.గోపాల్‌రెడ్డి తెలిపారు. కడప డిపో పరిధిలో 20, పులివెందుల 12, వేంపల్లె 9, బద్వేలు 22, పోరుమామిళ్ల 5, మైదుకూరు 10, జమ్మలమడుగు 10, ముద్దనూరు 1, రాజుపాలెం 2తోపాటు అన్ని డిపోలలో బరువు తూచే యంత్రాలు, ప్రకటనల బోర్డుల కోసం టెండరు దరఖాస్తులు ఈనెల 18వ తేదీలోగా అన్ని డిపోల్లో లభ్యమవుతాయన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులు ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెండరు బాక్సులో వేయాలన్నారు. ఈ టెండర్లు అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు అందరి సమక్షంలో తెరువడం జరుగుతుందని తెలిపారు.
పదిలో ఉత్తమ
ఫలితాలు సాధించాలి
ఖాజీపేట: కష్టపడి చదివి పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ విద్యార్థులకు సూచించారు. ఖాజీపేటలోని ఉర్దూ పాఠశాలను ఆయన సందర్శించారు. 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. అధ్యపకుల పనితీరు పై విచారణ జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు అధ్యపకులు కృషి చేయాలని, అందుకు తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఖైదీలకు వైద్య పరీక్షలు
కడప అర్బన్: జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ప్రభుత్వ మంత్రిత్వకుటుంబ సంక్షేమశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను కడప కేంద్రకారాగారంలో ఖైదీలకు బుధవారం నిర్వహించారు. సర్వేలెన్స్‌లో భాగంగా జైళ్లలోని ఖైదీలకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి హెచ్‌ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్–బి అండ్ సీలకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తారు. వ్యాధులను నిర్ధారించిన తర్వాత వ్యాధి గ్రస్తులకు వైద్య సహాయం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ కె. రాజేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌లు ఎస్. కమలాకర్, రమేష్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీసాక్స్ క్లస్టర్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎల్. అలీహైదర్, వైద్యాధికారులు డాక్టర్ జి. పుష్పలత, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ కె.బి నవీన్, ప్రాజెక్ట్ కో–ఆర్టినేటర్ విజయచంద్ర, వైద్య సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.
ఇంటింటా న్యాయ ప్రచారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి న్యాయ ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ సూచించారు. బుధవారం కడపలోని ఎన్జీఓ కాలనీలో ఇంటింటి న్యాయ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇక్కడి భవిత కేంద్రాన్ని కూడాసందర్శించి పిల్లలను పలుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపుగల పిల్లలకు పుట్టుకతో వచ్చే ఎదుగుదల లోపాల సమస్యలను గుర్తించి నివారణ కోసం ఇంటింటి న్యాయ ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 46 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 5609 గృహాలను సందర్శించి, అందులో 99 మంది ఎదుగుదల లోపాలున్న పిల్లలను గుర్తించామన్నారు. వారికి కడప, ప్రొద్దుటూరులలో జిల్లా సత్వర చికిత్స కేంద్రం, జిల్లా బాల భవిత కేంద్రాల్లో సంప్రదించాలని సూచించామన్నారు. వివరాలకు డిస్ట్రిక్ట్ ప్రోగామ్ ఆఫీసర్ కడప 90142 65600, ప్రొద్దుటూరు 8121952684 నంబర్లలో సంపదించాలన్నారు.కార్యక్రమంలో పారా లీగల్ వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, వైద్యాధికారులు, భవిత కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
![దరఖాస్తుల ఆహ్వానం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12kdp853-170069_mr-1739415281-1.jpg)
దరఖాస్తుల ఆహ్వానం
![దరఖాస్తుల ఆహ్వానం 2](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12kdp53ar_mr-1739415281-2.jpg)
దరఖాస్తుల ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment