![సింహ వాహనంపై శ్రీరంగనాథుడు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12plvd55-170055_mr-1739415282-0.jpg.webp?itok=FlIk2C7K)
సింహ వాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్: పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్ వద్ద ఉన్న శ్రీరంగనాథ కాంప్లెక్స్‌లో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం రాత్రి శ్రీరంగనాథుడు సతీసమేతుడై సింహవాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. పట్టణ పురవీధులైన మెయిన్ బజార్, ముత్యాల వారి వీధి, గాడిచర్ల వీధి, అమ్మవారిశాల మీదుగా మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు జరిగింది. భక్తులు స్వామివారికి కాయ కర్పూరాలను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. ఉదయం ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉభయదారులతో ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ చైర్మన్ సుధీకర్‌రెడ్డి, ఈఓ రమణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవ ప్రాంగణంలో భజన బృందం భక్తి గీతాలను ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment