వెంటాడుతున్న పులి భయం
పులివెందుల రూరల్: పులివెందుల నియోజకవర్గంలోని రైతులను పులుల భయం వెంటాడుతోంది. వారం రోజుల క్రితం సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో విద్యుత్ తీగలకు తగిలి మగ చిరుత పులి మృతి చెందింది. దీంతో ఆడ పులితోపాటు రెండు పులి పిల్లలు సంచరిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు, రైతులు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు వారు చెప్పారు. అలాగే బుధవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, లింగాల మండలం ఇప్పట్ల గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి సంచరించినట్లు చెబుతున్నారు. నియోజకవర్గంగా వివిధ గ్రామాల్లో పులులు సంచరిస్తున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పులి కనిపించిందని రైతులు చెబుతున్నా ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి ఇవి పులి అడుగులు కాదు అడవి పిల్లివి అని చెబుతుండటం గమనార్హం. రాత్రి సమయాల్లో రైతులు, ప్రజలు తోటల వద్దకు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. ఏదైనా ప్రాణాపాయం జరిగితే ఎవరూ బాధ్యులు అని వారు వాపోతున్నారు.ఇప్పటికై నా ఫారెస్ట్ అధికారులు స్పందించి పులివెందుల, లింగాల, తొండూరు మండలాల్లోని నల్లపురెడ్డిపల్లె, ఇప్పట్ల, క్రిష్ణంగారిపల్లె గ్రామ సమీపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పులి జాడను కనుక్కోవాలని కోరుతున్నారు.
మొన్న బలపనూరు.. నిన్న ఇప్పట్ల
నేడు నల్లపురెడ్డిపల్లెలో పులుల సంచారం
వెంటాడుతున్న పులి భయం
వెంటాడుతున్న పులి భయం
Comments
Please login to add a commentAdd a comment