![23 నుంచి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12rct51-170016_mr-1739415283-0.jpg.webp?itok=3cj-M49x)
23 నుంచి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అన్నమయ్య జిల్లా రెవెన్యూ అధికారి మధుసూధన్ రావు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్రహోత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి మార్చి 5వ తేదీ వరకు వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు చూసేందుకు స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారన్నారు.భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసలు బందోబస్తు నిర్వహించాలన్నారు. దేవదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాఽథ్, మున్సిపల్ కమిషనర్ వాసు, రాయచోటి తహసీల్దార్ పుల్లారెడ్డి, విద్యాశాఖ అధికారి శివప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment