Money Mantra
-
కొనసాగుతున్న బుల్ ర్యాలీ.. నిఫ్టీ@24,250
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 24,257కు చేరింది. సెన్సెక్స్ 489 పాయింట్లు పెరిగి 79,929 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.67 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 86.6 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.62 శాతం, నాస్డాక్ 0.84 శాతం లాభపడ్డాయి.స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయులు నమోదు చేస్తున్నాయి. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్ఐఐలు డెరివేటివ్ మార్కెట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో 83 శాతం నెట్ లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. గరిష్ఠాల వద్ద అమ్మకాలకు మొగ్గు చూపితే మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు.రోజుకో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు సైతం దూసుకుపోతున్నాయి. దీంతో కొన్ని కంపెనీల ప్రమోటర్లు ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తమ వాటాలో కొంతమేర విక్రయిస్తున్నారు. తద్వారా నిధులను సమకూర్చుకుంటున్నారు. వీటిని రుణ చెల్లింపులు, విస్తరణ ప్రణాళికలు, పబ్లిక్కు కనీస వాటా తదితరాలకు వినియోగిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 24,123 వద్దకు చేరింది. సెన్సెక్స్ 34 పాయింట్లు దిగజారి 79,441 వద్ద ముగిసింది. డెరివేటివ్ మార్కెట్లో సుమారు 3.3 లక్షల లాంగ్ కాంట్రాక్ట్‌లు నమోదయ్యాయి. ఎఫ్ఐఐ, ఇతర పెద్ద ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పెరిగాక గరిష్ఠాల వద్ద అమ్మకాలకు సిద్ధమవుతారని చెబుతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, నెస్లే, ఐటీసీ, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొత్త గరిష్ఠాలను చేరుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 24,188కు చేరింది. సెన్సెక్స్ 169 పాయింట్లు పెరిగి 79,645 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 86.67 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.47 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.27 శాతం, నాస్డాక్ 0.83 శాతం లాభపడ్డాయి.స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయులు నమోదు చేస్తున్నాయి. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్ఐఐలు డెరివేటివ్ మార్కెట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో 83 శాతం నెట్ లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. గరిష్ఠాల వద్ద అమ్మకాలకు మొగ్గు చూపితే మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు.జూన్ జీఎస్టీ వసూళ్లు మే నెలతో పోలిస్తే 8 శాతం పెరిగాయి. జూన్‌లో రూ.1.74లక్షల కోట్లు వసూళయ్యాయి. జూన్ నెలలో ఆటో కంపెనీల వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మొత్తం జూన్‌లో 3,40,784 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో 3,28,710 యూనిట్లు విక్రయించారు. 3.67 శాతం వృద్ధి మాత్రమే నమోదైనట్లు డేటా ద్వారా తెలిసింది. సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి అవుతాయి. జూన్ 28తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, జూన్ 21తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(జూన్ 5న) విడుదల చేస్తుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో దూసుకుపోతున్న మార్కెట్ సూచీలు..నిఫ్టీ@24,123
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 112 పాయింట్లు పెరిగి 24,123 వద్దకు చేరింది. సెన్సెక్స్ 443 పాయింట్లు ఎగబాకి 79,476 వద్ద ముగిసింది. డెరివేటివ్ మార్కెట్లో సుమారు 3.3 లక్షల లాంగ్ కాంట్రాక్ట్‌లు నమోదయ్యాయి. దాంతో మార్కెట్లు ఆల్‌టైమ్‌హై చేరుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఐఐ, ఇతర పెద్ద ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పెరిగాక గరిష్ఠాల వద్ద అమ్మకాలకు సిద్ధమవుతారని చెబుతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, మారుతీసుజుకీ, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్ అండస్ట్రీస్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 24,031కు చేరింది. సెన్సెక్స్ 20 పాయింట్లు పెరిగి 79,046 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.85 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.39 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.4 శాతం, నాస్డాక్ 0.7 శాతం నష్టపోయాయి.స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిలు నమోదు తర్వాత అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఈ వారంలో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సమగ్ర బడ్జెట్‌పై అంచనాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు.జూన్ జీఎస్టీ వసూళ్లు, ఆటో కంపెనీలు జూన్ వాహన విక్రయ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఇదే రోజు జూన్ తయారీ రంగ పీఎంఐ డేటా వెల్లడి కానుంది. సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి అవుతాయి. జూన్ 28తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, జూన్ 21తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(జూన్ 5న) విడుదల చేస్తుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బుల్ ర్యాలీకి బ్రేకులు..నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిసాయి. బ్యాంకింగ్ రంగ స్టాక్‌లు నష్టపోవడంతో ఆ ప్రభావం మార్కెట్ సూచీలపై పడింది. మదుపరులు గరిష్ఠాల వద్ద లాభాలు స్వీకరించారు. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 24,004 వద్దకు చేరింది. సెన్సెక్స్ 210 పాయింట్లు దిగజారి 79,032 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, టైటాన్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీసుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్‌ఫైనాన్స్, టీసీఎస్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొనసాగుతున్న బుల్ ర్యాలీ
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 24,116కు చేరింది. సెన్సెక్స్ 227 పాయింట్లు పెరిగి 79,475 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.03 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.94 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.09 శాతం, నాస్డాక్ 0.30 శాతం పెరిగాయి.జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో గురువారం షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల స్థాయిలను అధిగమించాయని నిపుణులు చెబుతున్నారు. అధిక వెయిటేజీ షేర్లు రాణించడం, రాజకీయ స్థిరత్వం, విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమన అంశాలు సూచీలను సరికొత్త శిఖరాలపైకి చేర్చాయంటున్నారు. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.జీవితకాల గరిష్ఠానికి ఇన్వెస్టర్ల సంపదస్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ 4 రోజుల్లో 2,033 పాయింట్లు(2.63%) పెరగడంతో రూ.3.93 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్‌టైం రికార్డు రూ.438.41 లక్షల కోట్లకు చేరింది. ర్యాలీ ఇలా..నిఫ్టీ చేరేందుకు పట్టిన కాలం 20,000 51 రోజులు 21,000 60 రోజులు 22,000 25 రోజులు 23,000 88 రోజులు 24,000 25 రోజులు(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొనసాగుతున్న బుల్ జోరు.. నిఫ్టీ@24,030
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఆల్‌టైమ్‌హైలో దూసుకుపోతున్నాయి. ఐటీ రంగ రంగ స్టాక్‌లు, నిఫ్టీలో మేజర్ వాటా కలిగిన రిలయన్స్ భారీగా పెరగడంతో మార్కెట్ సూచీలు లాభాల్లోకి చేరుకున్నాయి. వరుసగా నాలుగో సెషన్లోనూ మార్కెట్ సూచీలు లాభాల్లో కదలాడాలి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 24,036 వద్దకు చేరింది. సెన్సెక్స్ 572 పాయింట్లు ఎగబాకి 79,246 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 23,833కు చేరింది. సెన్సెక్స్ 151 పాయింట్లు పెరిగి 78,517 వద్ద ట్రేడవుతోంది. వరుసగా వచ్చిన మూడు రోజుల లాభాలకు గురువారం ఉదయం బ్రేక్ పడింది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.99 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం, నాస్డాక్ 0.48 శాతం పెరిగాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి మించి వృద్ధిని నమోదు చేస్తుందని, వృద్ధిరేటు 7.5 శాతం సమీపానికీ చేరొచ్చని ఎన్సీఏఈఆర్ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్) తన నెలవారీ సమీక్షలో వెల్లడించింది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు లేకపోవడం, దేశీయంగా సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కావచ్చనే అంచనాలతో ఈ అభిప్రాయాన్ని తెలిపింది. దానికితోడు బ్యాంకింగ్రంగం, ఎఫ్ఎంసీజీ, ఐటీ స్టాక్‌లు పుంజుకోవడంతో మార్కెట్లు మంగళవారం లాభాల్లోకి చేరుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గరిష్ఠాల్లో దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్@78,550
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు ఆల్‌టైమ్‌హైలో దూసుకుపోతున్నాయి. బుధవారం బ్యాంకింగ్ రంగ స్టాక్‌లు భారీగా పెరగడంతో మార్కెట్ సూచీలు లాభాల్లోకి జీవితకాల గరిష్ఠాలను చేరాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 23,841 వద్దకు చేరింది. సెన్సెక్స్ 518 పాయింట్లు ఎగబాకి 78,572 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో రిలయర్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, కొటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, ఐటీసీ, టీసీఎస్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఎం అండ్ ఎం, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 23,718కు చేరింది. సెన్సెక్స్ 46 పాయింట్లు పెరిగి 78,097 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.66 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.96 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.39 శాతం, నాస్డాక్ 1.28 శాతం పెరిగాయి.ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో ర్యాలీ మందగించడంతో మంగళవారం సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ప్రైవేటు రంగ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దాంతో మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరాయి. మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫ్యూచర్లలో షార్ట్ పొజిషన్లను కవర్ చేయడంతో పాటు క్రమంగా లాంగ్ పొజిషన్లను బిల్డ్ చేసుకున్నారు. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఇండెక్స్ ఫ్యూచర్లలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఇండెక్సు ఫ్యూచర్లలో 59.08 శాతం లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. ఇది గత రెండు నెలల్లో అత్యధికం.గత ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో మనదేశ కరెంట్ ఖాతా మిగులు 5.7 మిలియన్ డాలర్లుగా ఉందని, ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని ఆర్బీఐ ప్రకటించింది. ఇది సానుకూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత ఇచ్చిన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచవచ్చని, రూపాయి మారకంపై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జీవితకాల గరిష్ఠాలను చేరిన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్@78,000
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఆల్‌టైమ్‌హై చేరాయి. బ్యాంకింగ్ రంగ స్టాక్‌లు భారీగా పెరగడంతో మార్కెట్ సూచీలు లాభాలతో దూసుకుపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 184 పాయింట్లు పెరిగి 23,722 వద్దకు చేరింది. సెన్సెక్స్ 720 పాయింట్లు ఎగబాకి 78,061 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టైటాన్, భారతీ ఎయిర్టెల్, ఎం అండ్ ఎం, హెచ్‌యూఎల్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్‌మార్కెట్లు.. 23,590 మార్కు వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 23,595కు చేరింది. సెన్సెక్స్ 209 పాయింట్లు ఎగబాకి 77,549 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.51 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 86.04 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.31 శాతం, నాస్డాక్ 1.07 శాతం నష్టపోయాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.8 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ఎస్ అండ్ పీ రేటింగ్స్ తెలిపింది. 2023-24లో భారత్ 8.2 శాతం వృద్ధి సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. 2025-26లో 6.9%, 2026-27లో 7 శాతం వృద్ధి నమోదుకావొచ్చని వెల్లడించింది.క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌పై విచారణఫ్రంట్ రన్నింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌పై సెబీ విచారణ చేపట్టింది. సెబీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని క్వాంట్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. క్వాంట్‌కు చెందిన ముంబయి, హైదరాబాద్ కార్యాలయాల్లో సెబీ సోదాలు జరిపి, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. స్టాక్ బ్రోకర్ లేదా విశ్లేషకుల నుంచి కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని ముందే తెలుసుకుని లావాదేవీలు చేయడాన్ని ఫ్రంట్ రన్నింగ్‌గా పరిగణిస్తారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 23,545 వద్దకు చేరింది. సెన్సెక్స్ 131 పాయింట్లు ఎగబాకి 77,341 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, నెస్లే, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీ, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, భారతీఎయిర్‌టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, మారుతీసుజుకీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 116 పాయింట్లు నష్టపోయి 23,383కు చేరింది. సెన్సెక్స్ 329 పాయింట్లు దిగజారి 76,878 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.09 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.26 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం, నాస్డాక్ 0.16 శాతం నష్టపోయాయి.జీఎస్టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాల ప్రభావంకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశ నిర్ణయాలతో ట్రేడింగ్‌పై ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5 శాతానికి తగ్గింపు ప్రతిపాదనను మంత్రుల బృందానికి (జీవోఎం) సిఫార్సు చేయడంతో ఫెర్టిలైజర్ స్టాక్ల్లో కదలికలు ఉండొచ్చని నిపుణులు చెబుతన్నారు. ఈ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీకి సంబంధించి ఎటువంటి చర్చ జరగకపోవడంతో ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చని అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న విదేశీ పెట్టుబడులువిధాన సంస్కరణలు, ఆర్థిక వృద్ధి కొనసాగింపుపై అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఈ జూన్ ఇప్పటివరకు(జూన్ 21 నాటికి) నికరంగా రూ.12,170 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్సియల్ సర్వీసెస్, టెలికం, రియల్టీ షేర్ల పట్ల ఆసక్తి కనబరిచారు. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లను విక్రయించారు. ఇక డెట్ మార్కెట్లో రూ.10,575 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను సానుకూలంగా ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 35.80 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 23,661 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 132.49 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 77,729.48 వద్ద ప్రారంభమయ్యాయి.ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. టాటా స్టీల్, హెచ్‌యూఎల్, టాటా మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజస్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 23,539కు చేరింది. సెన్సెక్స్ 116 పాయింట్లు పుంజుకుని 77,456 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.24 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.16 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.25 శాతం, నాస్డాక్ 0.03 శాతం లాభాల్లోకి చేరాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతోపాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల స్థిరంగా కదలాడేందుకు దోహదం చేశాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే..ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. బుధవారం ఈక్విటీ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.7,908 కోట్లు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.7,107 కోట్ల విలువచేసే షేర్లును కొనుగోలు చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)