interest rates
-
కార్పొరేట్లకు.. రూపాయి టెన్షన్
రూపాయి పతనంతో ధరలు పెరిగిపోయి సామాన్యులు పడే కష్టాలు అటుంచితే కార్పొరేట్లకు కూడా టెన్షన్ తప్పట్లేదు. ముఖ్యంగా విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) తీసుకున్న కంపెనీలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. గత రుణాలను తీర్చేందుకు మరింత ఎక్కువగా చెల్లించాల్సి రానుండటమే ఇందుకు కారణం. సాధారణంగా కార్పొరేట్లు తమ వ్యాపార అవసరాల కోసం, దేశీయంగా వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంటే విదేశీ మార్కెట్ల నుంచి తక్కువ వడ్డీ రేటుపై రుణాలు తీసుకుంటూ ఉంటాయి. చౌకగా వచ్చిన నిధులను వ్యాపార విస్తరణకు లేదా అధిక వడ్డీ రేటు మీద తీసుకున్న రుణాలను తీర్చేసేందుకు ఉపయోగించుకుంటూ ఉంటాయి. గత రెండేళ్లుగా మిగతా కరెన్సీలు ఒడిదుడుకులకు లోనవుతున్నా రూపాయి మాత్రం దాదాపు స్థిర స్థాయిలోనే కొనసాగింది. దీంతో కార్పొరేట్లు గణనీయంగా విదేశీ రుణాలు సమీకరించాయి. ఈ మధ్య సంగతే చూస్తే గతేడాది ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో నికరంగా 13.5 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు వచ్చినట్లు ఆర్బీఐ డేటా చెబుతోంది. గతేడాది నవంబర్‌లో దాదాపు 2.83 బిలియన్ డాలర్ల ఈసీబీలను సమీకరించే ప్రతిపాదనలను కంపెనీలు సమరి్పంచాయి. రూపాయి విలువ పడిపోకుండా, స్థిరంగా ఉన్నన్నాళ్లూ విదేశీ రుణాల వ్యవహారం బాగానే ఉంటోంది. కానీ ఎక్కడా ఆగకుండా పడిపోతుంటేనే సమస్యాత్మకంగా మారుతోంది. ‘‘ఆర్బీఐ లెక్కలను బట్టి చూస్తే రూపాయి వేల్యుయేషన్ ఇప్పటికే అధిక స్థాయిలో ఉంది. దాని విలువ ఇంకా తగ్గాల్సి ఉంది. అమెరికా టారిఫ్‌లు విధిస్తే మరింతగా పడే అవకాశం ఉంది’’ అంటూ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కార్పొరేట్లకు రూపాయి బాధ ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభాలపైనా.. సాధారణంగా విమానయాన సంస్థలు ఎయిర్‌క్రాఫ్ట్‌ల లీజింగ్‌లు, ఇంధన కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులను డాలర్ల మారకంలో నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రూపాయి పతనంతో ఎయిర్‌లైన్స్ ఖర్చులూ పెరిగిపోయి లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు ఇండిగోను తీసుకుంటే ఇటీవలి మూడో త్రైమాసికంలో లాభం ఏకంగా 18 శాతం పడిపోయింది. రూపాయి క్షీణతతో విదేశీ టూర్లు మరింత భారంగా మారే అవకాశం ఉండటంతో ప్రయాణాలను వాయిదా లేదా రద్దు చేసుకునే అవకాశాలు ఉండటంతో టూరిజం, హాస్పిటాలిటీ లాంటి రంగాల మీద కూడా పడొచ్చని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అలాగే దిగుమతులపైన ఆధారపడిన లేక గణనీయంగా విదేశీ కరెన్సీలో రుణభారం ఉన్న రంగాల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భారం ఇలా.. 2020లో భారత్, అమెరికాలో వడ్డీ రేట్ల మధ్య దాదాపు అయిదు శాతం వ్యత్యాసం ఉన్న తరుణంలో రూపాయి మారకంలో కన్నా విదేశీ మారకంలో రుణాలు తీసుకోవడం చాలా ఆకర్షణీయంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అవే రుణాలు ఇప్పుడు గుదిబండలుగా మారుతున్నాయి. అప్పట్లో గానీ రూ. 2,000 కోట్లు విదేశీ రుణం తీసుకుని ఉంటే పెరిగిన వడ్డీ భారంతో పాటు రూపాయి కూడా క్షీణించడం వల్ల 22 శాతం అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు డాలరు విలువ రూ. 75గా ఉన్నప్పుడు 500 మిలియన్ డాలర్లు రుణం తీసుకుని ఉంటే, దేశీ కరెన్సీ విలువ 5 శాతం క్షీణించిన పక్షంలో అదనంగా రూ. 2,500 కోట్ల భారం పడుతుందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎండీ అమిత్ పాబ్రి తెలిపారు. ఇలా ఒకవైపు అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడంతో పాటు, రూపాయి బలహీనపడిపోవడం వల్ల విదేశీ రుణాలను తీర్చడం భారంగా మారుతోంది.హెడ్జింగ్ అంతంతే..విదేశీ రుణాలు తీసుకున్నప్పుడు రూపాయి పడిపోతే నష్టపోకుండా ఉండేందుకు, తిరిగి చెల్లించేటప్పుడు ఎక్కువ భారం పడకుండా ఉండేందుకు కంపెనీలు హెడ్జింగ్ వ్యూహాన్ని పాటిస్తుంటాయి. సుమారు గత మూడేళ్లుగా భారీగా విదేశీ నిధులు సమీకరించినవి, సమీకరించడంపై కసరత్తు చేస్తున్న వాటిలో ఆర్ఈసీ (500 మిలియన్ డాలర్లు), టాటా మోటార్స్ ఫైనాన్స్ (200 మిలియన్ డాలర్లు), ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (125 మిలియన్ డాలర్లు), టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు (100 మిలియన్ డాలర్లు) బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మొదలైనవి ఉన్నాయి. అయితే, దేశీ కంపెనీలు తీసుకున్న ఈసీబీల్లో దాదాపు మూడో వంతు రుణాలకు హెడ్జింగ్ రక్షణ లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, 2023–24లో దాదాపు 38.4 బిలియన్ డాలర్ల రుణాలు రాగా ఇందులో సుమారు 11.52 బిలియన్ డాలర్ల మొత్తానికి హెడ్జింగ్ రక్షణ లేదు. ఇలా హెడ్జింగ్ చేసుకోని కంపెనీలన్నింటికీ ప్రస్తుత రూపాయి పతనం సమస్యగా మారినట్లు పేర్కొన్నాయి. ఇటీవలి ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో సమీకరించిన మొత్తం ఈసీబీల్లో 40 శాతాన్నే పెట్టుబడి వ్యయాల కోసం కంపెనీలు ఉపయోగించుకున్నాయి. అంటే మిగతా 60 శాతాన్ని ఖరీదైన ఇతరత్రా రుణాలను తీర్చేందుకు ఉపయోగించుకుని ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మొదలైన ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభమైంది. కొత్త ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ వడ్డీ రేట్లు, పరపతి విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ కీలకంగా చూసేది ద్రవ్యోల్బణాన్నే. వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) డిసెంబర్ త్రైమాసికానికి 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 4.8 శాతంగా ఉంటుందన్నది ఎస్బీఐ రీసెర్చ్ అంచనా. జనవరి నెల ద్రవ్యోల్బణం 4.5 సమీపంలో ఉండొచ్చని పేర్కొంది. ‘‘ద్రవ్యపరమైన ఉద్దీపనలు, వాణిజ్య యుద్ధాల పరంగా అనిశి్చతుల మధ్య ఆర్బీఐ రిస్‌్కలను సమతుల్యం చేయాల్సిన సున్నితమైన టాస్క్‌ను ఎదుర్కొంటున్నది. కనీసం స్వల్పకాలానికి రేట్ల తగ్గింపు పరంగా ఆర్బీఐకి వెసులుబాటు ఉంది’’అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో పావు శాతం చొప్పున రేట్ల కోతలకు వెళ్లొచ్చని.. విరామం అనంతరం తిరిగి అక్టోబర్‌లో మళ్లీ రేట్ల కోత ఆరంభించొచ్చని తెలిపింది. మొత్తం మీద 0.75 శాతం మేర రేట్ల తగ్గింపు అవకాశాలను అంచనా వేస్తోంది. -
గృహ రుణం.. స్మార్ట్‌గా తీర్చేద్దాం..!
రుణంతో సొంతింటి కలను కెరీర్ ఆరంభంలోనే నెరవేర్చుకుంటోంది నేటి తరం యువత. 25–30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని, క్రమం తప్పకుండా చెల్లించడం ఒక విధంగా పొదుపే. కానీ, అందరికీ అంత సుదీర్ఘకాలం పాటు రుణ వాయిదాలు చెల్లించే నగదు ప్రవాహ వెసులుబాటు ఉండకపోవచ్చు. వివాహం అనంతరం పెరిగిపోయిన ఖర్చులతో ఈఎంఐ చెల్లింపులు భారంగా మారొచ్చు. దీంతో త్వరగా రుణ భారం నుంచి బయటపడిపోవాలని అనిపిస్తుంటుంది. అయితే ఈ దిశగా ఆచరణ చాలా మందికి తోచదు. వ్యవస్థలో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. కనుక గృహ రుణాన్ని నిర్ణీత కాలానికంటే ముందుగా తీర్చేయడం మంచి ఆలోచనే అవుతుంది. ఇందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఈ దిశగా నిపుణులు ఏమంటున్నారో తెలియజేసే కథనమిది... ముంబైకి చెందిన నీరవ్ (35) 2015లో రూ.40 లక్షల గృహ రుణాన్ని 30 ఏళ్ల కాలానికి 8.5 శాతం వడ్డీ రేటుపై తీసుకున్నారు. నెలవారీ రూ.31,000 చొప్పున ఇంటి రుణానికి చెల్లిస్తున్నారు. దీంతో వేతనంలో సగానికి పైనే రుణ చెల్లింపులకు పోతోంది. రుణ ఖాతా వార్షిక నివేదికను ఒక్కసారి పరిశీలించగా, తొలి నాళ్లలో తాను చెల్లిస్తున్న ఈఎంఐలో అధిక భాగం వడ్డీ చెల్లింపులకే వెళుతున్నట్టు అర్థమైంది. దీంతో నిపుణుల సాయంతో ఐదేళ్లలోనే ఆ రుణాన్ని తీర్చివేశారు. నీరవ్ మాదిరే ప్రతి ఒక్కరూ తమకు వీలైన మార్గంలో గృహ రుణ భారాన్ని ముందుగానే వదిలించుకోవచ్చు. ఈఎంఐలో తొలి ఏడాది 90 శాతం వడ్డీ చెల్లింపులకు వెళుతుంది. ఏటా ఇది క్రమంగా తగ్గుతూ, అసలు వాటా పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా 20–25 ఏళ్ల కాలానికి సంబంధించి గృహ రుణాల్లో మొదటి ఐదేళ్లలో వడ్డీ చెల్లింపులే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రూ.75 లక్షల గృహ రుణాన్ని 25 ఏళ్ల కాలానికి 8.5 శాతం వడ్డీ రేటుపై తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.60,392 అవుతుంది. 25 ఏళ్లలో వడ్డీ రూపంలోనే రూ.1.06 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అసలు రూ.75 లక్షలు కూడా కలిపితే మొత్తం రూ.1.81 కోట్లు అవుతుంది. అంటే తీసుకున్న మొత్తానికి రెట్టింపునకు పైగా వడ్డీ రూపంలో చెల్లించాలి. ఒకవేళ గృహ రుణంపై వడ్డీ రేటు 9.5 % గా ఉంటే అప్పుడు 25 ఏళ్లలో వడ్డీ రూపంలో 1.22 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. చాలా ఆదా చేసుకోవచ్చు.. గృహ రుణాన్ని కాల వ్యవధి చివర్లో కంటే మొదటి ఐదేళ్లలో తీర్చేయడం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆరంభ సంవత్సరాల్లో ఈఎంఐలో వడ్డీ భాగమే ఎక్కువగా ఉంటుంది’’అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి తెలిపారు. రూ.50 లక్షల రుణాన్ని 9 శాతం వడ్డీపై 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారని అనుకుందాం. ఈ కాలంలో వడ్డీ రూపంలోనే రూ.58 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పూర్తయిన వెంటనే రూ.5 లక్షల మొత్తాన్ని అదనంగా చెల్లించడం ద్వారా మొత్తం కాల వ్యవధిలో 17.6 లక్షల మేర వడ్డీని ఆదా చేసుకోవచ్చు. అంటే అప్పుడు నికరంగా రూ.40.4 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు 240 నెలల్లో తీరిపోవాల్సిన రుణ భారం, 190 నెలలకే ముగిసిపోతుంది. అంటే రుణాన్ని 50 నెలల ముందే ముగించేయొచ్చు. తొలి నాళ్లలో వడ్డీలకే సింహభాగం పోతుంది. దీంతో అసలు పెద్దగా తగ్గదు. ఇలా వడ్డీకి ఎక్కువ మొత్తం జమ అవుతున్న తొలి సంవత్సరాల్లో చేసే అదనపు చెల్లింపులతో అసలు భాగం తగ్గుతుంది. ఫలితంగా ఈఎంఐలో వడ్డీ భాగం తగ్గి, అసలు జమ వేగాన్ని అందుకుంటుంది.ముందుగా చెల్లిస్తే ఎంత ఆదా? రూ.50 లక్షల రుణం. కాల వ్యవధి 20 ఏళ్లు. వడ్డీ 9 శాతం. రూ.5 లక్షలను రుణం తీసుకున్న అనంతరం ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు పూర్తి అయిన వెంటనే చెల్లించనట్టయితే, తద్వారా ఎంత మేర ఆదా అవుతుందో టేబుల్లో తెలుసుకోవచ్చు. ఈక్విటీలో పెట్టుబడులు గృహ రుణాన్ని ముందుగా వదిలించుకునేందుకు ఈక్విటీ పెట్టుబడుల మార్గాన్ని సైతం ఆశ్రయించొచ్చు. ఈక్విటీల్లో పదేళ్లకు పైన కాలంలో వార్షిక రాబడులు 12–15 శాతంగా ఉండొచ్చు. గృహ రుణంపై 9 శాతం వడ్డీయే పడుతుంది. కనుక ప్రతి నెలా గృహ రుణ ఈఎంఐ చెల్లిస్తూనే, ఈఎంఐలో 10–20 శాతం మేర ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ఐదేళ్లు ముగిసిన తర్వాత నుంచి అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి సమానంగా ఉపసంహరించుకుంటూ గృహ రుణ చెల్లింపులకు వినియోగించుకోవాలి. లేదా పదేళ్ల పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, మార్కెట్లు బుల్లిష్‌గా ఉన్న తరుణంలో ఆ మొత్తాన్ని ఉపసంహరించుకుని గృహ రుణానికి జమ చేసుకోవచ్చు. ఒక ఆరి్థక సంవత్సరంలో ఈక్విటీల్లో 1.25 లక్షల మొత్తంపై పన్ను లేదు. కనుక ఏడాదిలో రూ.1.25 లక్షల్లోపే వెనక్కి తీసుకోవడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. పైన చెప్పుకున్న నీరవ్ ఉదాహరణను తీసుకుందాం. రూ.40 లక్షల రుణాన్ని 30 ఏళ్ల కాలానికి 8.50 శాతం రేటుపై తీసుకున్నారు. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.31,000. మొత్తం కాల వ్యవధిలో సుమారు రూ.61 లక్షలు వడ్డీ పడుతోంది. ప్రతి నెలా ఈఎంఐలో 20 శాతానికి సమాన మొత్తం అంటే, 6,200 చొప్పున 12 శాతం రాబడిని ఇచ్చే ఈక్విటీ ఫండ్‌లో 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా గృహ రుణం తీరిపోయే సమయానికి రూ. 62 లక్షలు సమకూరుతుంది. రుణంపై చెల్లించిన వడ్డీకి సమానంగా నిధి ఏర్పడినట్టు అవుతుంది. ఏటా 5 % లేదా ఒక ఈఎంఐ అసలులో ఏటా నిర్ణిత శాతాన్ని అదనంగా చెల్లించాలి. రూ.50 లక్షల రుణాన్ని 9 శాతం రేటుపై 20 ఏళ్లకు తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ. 44,986 అవుతుంది. కేవలం వడ్డీ రూపంలోనే రూ. 58 లక్షలు చెల్లించాలి. ఏటా రుణ బకాయిలో 5% చొప్పున ఒకే విడత తీర్చుతూ వెళితే చెల్లించాల్సిన వడ్డీ రూ.29.8 లక్షలకు తగ్గిపోతుంది. దీంతో 240 నెలలకు బదులు 143 నెలల్లోనే రుణాన్ని ముగించేయొచ్చు. ఏటా ఒక ఈఎంఐ (రూ.44,986) చొప్పున అదనంగా చెల్లిస్తూ వెళితే మొత్తం చెల్లించాల్సిన వడ్డీ రూ.58 లక్షలకు బదులు రూ.45 లక్షలు అవుతుంది. రూ.13 లక్షల వడ్డీ ఆదా అవడంతోపాటు రుణం 45 నెలల ముందే తీరిపోతుంది. ఎన్నో మార్గాలు.. → ఉద్యోగులు అయితే వార్షిక బోనస్‌ను ముందస్తు రుణ చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. → కొందరికి బోనస్‌లు రావు. కానీ వార్షికంగా ఎంతో కొంత వేతన పెంపు ఉంటుంది. పెరుగుతున్న వేతనం స్థాయిలోనే గృహ రుణం ఈఎంఐని పెంచుకుంటూ వెళ్లాలి. ఏడాదికి ఒక్క ఈఎంఐ అదనంగా చెల్లించినా చాలా మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. → స్వయం ఉపాధి, వ్యాపారాల్లోని వారు సైతం భిన్న సందర్భాల్లో వచ్చే అదనపు ఆదాయ వనరులను ఇందుకు వినియోగించుకోవచ్చు. → చాలా తక్కువ రాబడులు ఇచ్చే డెట్ పెట్టుబడులు ఉంటే వాటిని ఉపసంహరించుకుని గృహ రుణ చెల్లింపులకు మళ్లించుకోవచ్చు. కాకపోతే గృహ రుణం వడ్డీ రేటు కంటే, తక్కువ రాబడులు ఇస్తున్న పెట్టుబడులనే ఇందుకు పరిగణనలోకి తీసుకోవాలి. → ఈక్విటీ డివిడెండ్ రాబడులు ఉన్న వారు ఆ మొత్తాన్ని ఇందుకు వినియోగించుకోవచ్చు. → దీర్ఘకాల లక్ష్యాలైన రిటైర్మెంట్ (ఎన్పీఎస్), పిల్లల భవిష్యత్ విద్య (పీపీఎఫ్, ఈక్విటీ తదితర) కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దని నిపుణుల సూచన. → గృహ రుణం ముందుగా చెల్లించేస్తే ‘ఫోర్ క్లోజర్’ చార్జీలు విధించని బ్యాంక్‌ను ఎంపిక చేసుకోవాలి. → పదవీ కాలంలోనే గృహ రుణాన్ని ముగించేలా చూసుకోవాలని ఆదిల్ శెట్టి సూచన. హోమ్‌లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్... ఈ ఖాతా తెరవడం ద్వారా మిగులు నిధులను డిపాజిట్ చేసుకోవచ్చు. దీంతో రుణం అసలు వేగంగా తగ్గిపోతుంది. ‘‘ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లో మిగులు నిల్వలను కావాలనుకున్నప్పుడు జమ చేసుకోవచ్చు. ఈ విషయమై అధికారికంగా బ్యాంక్‌కు తెలియజేయక్కర్లేదు’’ అని ఆదిల్ శెట్టి వివరించారు. 20 20 60 ‘‘ఆదాయంలో 20 % పొదుపు చేసి పెట్టుబడులకు వినియోగించుకోవాలి. 20 శాతం రుణ ఈఎంఐలకి, మిగిలిన 60 శాతం జీవన అవసరాలకు వినియోగించుకోవాలి’’ అని ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా (అమెరికాకు చెందిన స్టాండర్డ్ బోర్డు లిమిటెడ్ సబ్సిడరీ) సీఈవో కృష్ణ మిశ్రా సూచించారు. అంటే ఆదాయంలో గృహ రుణ ఈఎంఐ 20 శాతానికి పరిమితం చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. జీవన అవసరాల్లో 10 శాతాన్ని ఆదా చేసి, ఆ మేరకు గృహ రుణ ముందస్తు చెల్లింపులకు కేటాయించుకోవచ్చు. అంటే ఆదాయంలో జీవన అవసరాలను 60 శాతానికి బదులు 50 శాతానికి పరిమితం చేసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వృద్ధి సాధనకు ఊతం ఏదీ?
ప్రపంచవ్యాప్తంగా చాలామేరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా, ఉపాధి కల్పన మెరుగ్గా కనబడు తున్నా వాణిజ్య వ్యవహారాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దేశాల మధ్య పెరుగుతున్న పోటీ ఒక రకమైన అనిశ్చిత వాతావరణానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్థిక సర్వే విడుదల చేసింది. పరస్పర ఆధారిత వర్తమాన ప్రపంచంలో ఏ దేశమూ సమస్యలనూ, సంక్షో భాలనూ తప్పించుకోలేదు. అలాగే వాటి పరిష్కారానికి సాగే కృషిలో భాగస్వామి కాకుండా ఒంట రిగా దేన్నీ అధిగమించలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే దీన్నంతటినీ ప్రతిబింబించింది. మనది ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ఇతర దేశాలతో పోలిస్తే మనది చురుకైన ఆర్థిక వ్యవస్థే. కానీ ఇటీవలి కాలంలో అది కొంత మంద గమనంతో కదులుతోంది. 2023లో 8.2 శాతంగా ఉన్న వృద్ధి రేటు నిరుడు 6.5 శాతానికి క్షీణించింది. ఇది 2026 వరకూ ఈ స్థాయిలోనే వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ నెల 17న అంచనా వేసింది. పట్టణ ప్రాంత వినియోగంలో క్షీణత, ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల, వేతన స్తంభన, అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి కల్పన, ప్రైవేటు రంగ పెట్టుబడుల మందకొడితనం స్పష్టంగా కనబడుతోంది. ఒక్క కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రమే వినియోగిత పెరి గింది. ఆంధ్రప్రదేశ్‌లో అంతక్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న వినియో గిత ఎన్డీయే సర్కారు వచ్చాక క్షీణించింది. ‘మొత్తంమీద ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయ’ని సర్వే అంగీకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండగా, అదిప్పుడు 4.9 శాతానికి చేరుకుంది. ఆహారేతర, ఇంధనేతర సరుకుల ధరల తగ్గుదల ఇందుకు కారణం. వాస్తవానికి పంపిణీ మెరుగుకావటం, వాతావరణం అనుకూలించటం వంటి కారణాల వల్ల చాలా దేశాల్లో ఆహార సరుకుల ధరలు తగ్గాయి. మన దేశమూ, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇందుకు భిన్నమైన పోకడ కనబడుతోంది. నిరుడు 7.5 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 8.4 శాతానికి చేరుకుంది. పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా కూరగాయలు, పప్పులు వగైరా ధరల్లో పెరుగుదల నమోదవుతున్నదని నిపుణుల అభిప్రాయం. రాగల రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని, ఖరీఫ్ పంటలు మార్కెట్లో అడుగుపెడితే ఇతర ధరలు కూడా సర్దుకుంటాయని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదంతా ప్రపంచ స్థితిగతులపై ఆధారపడి వుంటుంది. మున్ముందు ప్రపంచ సాగుపంటల ధర వరలు పెరుగుతాయని, వాతావరణ మార్పులు కూడా అనుకూలించకపోవచ్చని అంచనాలు న్నాయి. అదనంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండనే ఉన్నాయి. ఎదగదల్చుకున్నవారికి ఆశావహ దృక్పథం అవసరం. స్వాతంత్య్రం వచ్చి 2047కి వందేళ్లవు తాయి కాబట్టి అప్పటికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని ఎన్డీయే సర్కారు కోరుకుంటోంది. కానీ వరసగా రెండు దశాబ్దాలపాటు 8 శాతం నిలకడైన జీడీపీ కొనసాగితేనే ఇది సాధ్యం. ప్రస్తుత జీడీపీలో పెట్టుబడుల వాటా 31 శాతం. దీన్ని కనీసం 35 శాతానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా తయారీరంగం వృద్ధి చెందాలి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీరంగాల్లో విస్తరిస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ‘వికసిత్ భారత్’ సాకారమవుతుంది. అందుకు భూసంస్కరణలు, కార్మికరంగ సంస్కరణలు అత్యవసరం అంటు న్నది ఆర్థిక సర్వే. కానీ కార్మిక రంగ సంస్కరణలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. బ్రిటిష్ వలస పాలకుల కాలంనుంచి ఇంతవరకూ పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని లేబర్ కోడ్ హరిస్తున్నదని వాటి ఆరోపణ. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును కష్టతరం చేయటం, ఇప్పటికేవున్న ట్రేడ్ యూనియన్ల గుర్తింపు రద్దుకు వీలు కల్పించటం, సమ్మె హక్కును కాలరాయటం, మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పర్చటం, లేబర్ కోర్టుల మూసివేత, ట్రిబ్యునల్ ఏర్పాటు వంటివి ఉన్నాయంటున్నారు. వీటిపై కార్మిక సంఘాలతో చర్చించటం, పార దర్శకత పాటించటం, అవసరమైన మార్పులకు సిద్ధపడటం వంటి చర్యలద్వారా అపోహలు తొల గించటానికి కేంద్రం కృషి చేస్తే కార్మిక రంగ సంస్కరణల అమలు సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చటానికి సంస్కరణలు అవసరం అనుకున్నప్పుడు ఇదంతా తప్పనిసరి. వాస్తవాలను గమనంలోకి తీసుకుని జాగురూకతతో అడుగులేయకపోతే లక్ష్యసాధన కష్ట మవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నిరుడు లిస్టెడ్ కంపెనీల లాభార్జన22.3 శాతం పెరిగింది. చెప్పాలంటే ఆర్థిక, ఇంధన, ఆటోమొబైల్ రంగాల కార్పొరేట్ సంస్థలకు లాభాలు వచ్చిపడ్డాయి. కానీ ఆ రంగాల్లో ఉపాధి కల్పన పెరిగింది లేదు. వేతనాలు స్తంభించాయి. పరిస్థితులిలా వుంటే వినియోగిత పెరుగుతుందా? తగినంత డిమాండ్ లేనప్పుడు తయారీరంగంలో పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందా? ఈ వ్యత్యాసాలపై దృష్టి పెట్టనంతకాలమూ ఆర్థిక రంగ స్వస్థత సులభం కాదు. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా రుణాల వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వ్‌బ్యాంకును నిర్మలా సీతారామన్‌తోపాటు కేంద్ర వాణిజ్యమంత్రి పీయుష్ గోయల్ కూడా కోరుతున్నారు. మంచిదే. తమవంతుగా ఉద్యోగకల్పన, వేతనాల పెంపుపై కూడాకేంద్రం దృష్టి సారించాలి. శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అందుకు తగిన ప్రతిపాదనలుంటాయని ఆశిద్దాం. -
పొదుపు పథకాల్లో వడ్డీరేట్లు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) సహా వివిధ చిన్న పొదుపు పథకాలపై 2025 జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే నాలుగో త్రైమాసికానికి (జనవరి–మార్చి) వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాపూర్వం కొనసాగించింది. వడ్డీ రేట్లు గత నాలుగు త్రైమాసికాలుగా మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికానికి కొన్ని పథకాలలో ప్రభుత్వం చివరిసారి మార్పులు చేసింది.2024–25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు) కోసం నోటిఫై చేసిన రేట్లను మార్చకుండా కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ పేర్కొంది. పోస్టాఫీసులు, బ్యాంకులు(Banks) నిర్వహించే స్మాల్ సేవింగ్స్ పథకాలనుపై వడ్డీ రేట్లను ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి త్రైమాసికం ఆర్థికశాఖ నోటిఫై చేసే సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ‘బీ-రెడీ’లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..తాజా నోటిఫికేషన్ ప్రకారం జనవరి-మార్చి 2025 వరకు వడ్డీరేట్లు..పథకం-రేటు(%)సుకన్య సమృద్ధి 8.2 మూడేళ్ల టర్మ్ డిపాజిట్ 7.1 పీపీఎఫ్ 7.1 పోస్టాఫీ సేవింగ్స్ డిపాజిట్ 4.0 కిసాన్ వికాస్ పత్ర 7.5 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 7.7 మంత్లీ ఇన్కమ్ స్కీమ్ 7.4 -
క్రెడిట్ కార్డు యూజర్లకు అలెర్ట్
గడువు ముగిసిన క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన కార్డు చెల్లింపులపై ఏటా 30 శాతానికి వడ్డీరేట్లను పరిమితం చేస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ) 2008లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పువల్ల కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇచ్చినట్లు అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.అసలేం జరిగిందంటే..క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 30 శాతానికి పరిమితం చేస్తూ ఎస్సీడీఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కార్డు బకాయిలపై ఏడాదికి 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేయడం వడ్డీ విధానాల కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొంది. కాగా, ఇటువంటి అధిక వడ్డీరేట్లు మితిమీరినవని, అన్యాయమైన వాణిజ్య పద్ధతని ఎస్సీడీఆర్సీ గతంలో తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ, ప్రస్తుత నిబంధనలకు లోబడి బ్యాంకులు తమ సొంత వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.ఇదీ చదవండి: రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులుఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డైనమిక్స్, ఆర్బీఐ నియంత్రణ పర్యవేక్షణ ద్వారా నియంత్రిస్తారని కోర్టు నొక్కి చెప్పింది. భారతదేశంలోని చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్లను ప్రత్యేక పరిస్థితుల్లో 22% నుంచి 49% వరకు వసూలు చేస్తున్నాయి. -
అక్టోబర్‌లో.. రియల్ బ్యాక్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా నగర స్థిరాస్తి రంగంలో కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. అయితే, ఇటీవల ప్రభుత్వం కుదురుకోవటం, ఆర్థిక స్థిరత్వం చేకూరడం, అనుకూలమైన వడ్డీ రేట్లు ఉండటంతో కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగింది. దీంతో గృహ విక్రయాలు ప్రతి నెలా పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్‌లో రూ.2,820 కోట్ల విలువైన 4,903 అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. అక్టోబర్ నాటికి రూ.3,617 కోట్ల విలువైన 5,894 యూనిట్లు అమ్ముడుపోయాయి. నెలరోజుల్లో ప్రాపర్టీ వ్యాల్యూలో 28 శాతం, విక్రయాల్లో 20 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది.14 శాతం వాటా లగ్జరీదే..గ్రేటర్లో గతేడాది జనవరి–అక్టోబర్ మధ్య కాలంలో రూ.30,464 కోట్ల విలువైన 58,390 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది అదే 10 నెలకాలంలో 65,280 అపార్ట్మెంట్లను విక్రయించారు. వీటి విలువ రూ.40,078 కోట్లు. గత నెలలో అమ్ముడైన వాటిల్లో రూ.కోటి విలువైన, 2 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న లగ్జరీ గృహాలదే 14 శాతం వాటా. గత నెలలో రూ.497 కోట్ల విలువైన 811 లగ్జరీ యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న 1,601 ప్రాపరీ్టలు, రూ.50 లక్షల లోపు ధర ఉన్న 3,482 యూనిట్లు అమ్ముడుపోయాయి. -
వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం
-
వడ్డీ రేట్లు భారమే..
ముంబై: ప్రస్తుత వడ్డీ రేట్లను ప్రజలు భారంగా భావిస్తున్నారని, కనుక వాటిని అందుబాటు స్థాయికి తీసుకురావాలంటూ బ్యాంక్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎస్బీఐ నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం భారతీయ పరిశ్రమలు కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందంటూ.. వడ్డీ రేట్లను తగ్గించడం వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడంలో సాయపడుతుందన్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని, ఈ విషయంలో ఆహారపరమైన ద్రవ్యోల్బణాన్ని అవరోధంగా చూడడం సరికాదంటూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం వ్యాఖ్యానించడం తెలిసిందే. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరడంతో ఆర్బీఐ ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం: ద్రవ్యోల్బణానికి ప్రధానంగా మూడు లేదా నాలుగు కమోడిటీలు కారణమవుతున్నాయని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. మిగిలిన ప్రధాన ఐటమ్స్ అన్నీ కూడా మూడు లేదా నాలుగు శాతం ద్రవ్యోల్బణం స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం సూచీ లేదా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆహార ధరలను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా అన్న చర్చలోకి తాను వెళ్లాలనుకోవడం లేదన్నారు. ద్రవ్యోల్బణం ఎంతో సంక్లిష్టమైనదని, సామాన్యులపై భారం మోపుతుందంటూ.. సరఫరా వైపు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. వృద్ధి మందగమనంపై ఆందోళనలు అక్కర్లేదన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు బలంగా ఉన్నట్టు కొన్ని సంకేతాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. బ్యాంక్‌లు ప్రధానంగా రుణ వితరణ కార్యకలాపాలకే పరిమితం కావాలని, బీమా తదితర ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో కస్టమర్లకు అంటగట్టొద్దని, ఇది రుణాలను భారంగా మారుస్తుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడంలో ఇది చాలా కీలకమని సీతారామన్ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలకు 2025–26లో రూ.6.12 లక్షల కోట్లు, 2026–27లో రూ.7 లక్షల కోట్ల మేర రుణ వితరణ లక్ష్యాలను నిర్దేశించినట్టు ఆమె తెలిపారు. అనైతిక విధానాలను అరికట్టండి: దాస్ముంబై: సరైన కేవైసీ ధ్రువీకరణ లేకుండా ఖాతాలు తెరవడం, అబద్ధాలు చెప్పి ఉత్పత్తులను అంటగట్టడం వంటి అనైతిక విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా బ్యాంకులు గట్టి చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఇందుకోసం అంతర్గత గవర్నెన్స్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. తమ పోర్ట్‌ఫోలియోలను క్రియాశీలకంగా సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పారు. పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పుల వల్ల తలెత్తే ముప్పులు.. సవాళ్లను ముందస్తుగా గుర్తించి, నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్ల సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా దాస్ ఈ విషయాలు తెలిపారు. -
ఇళ్ల కొనుగోలులో కీలకంగా వడ్డీ రేట్లు
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఫిక్కీ, అనరాక్ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు సంస్థలూ ‘హోమ్ బయ్యర్ సెంటిమెంట్ సర్వే’ వివరాలను ముంబైలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ సదస్సులో భాగంగా విడుదల చేశాయి. 7,615 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను రూపొందించాయి. ఇళ్ల కొనుగోలుపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలు.. → గృహ రుణ రేట్లు 8.5 శాతం దిగువనే కొనసాగితే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 71 శాతం మంది స్పష్టం చేశారు. → 9 శాతం దాటితే తమ నిర్ణయాలు ప్రభావితం అవుతాయని 87 శాతం మంది తెలిపారు. 8.5–9 శాతం మధ్య రేట్లు కొనసాగితే తమ నిర్ణయాలపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54 శాతం మంది చెప్పారు. → 59 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడి సాధనంగా ఉంది. 67 శాతం మంది సొంత నివాస అవసరాలకే కొనుగోలు చేస్తున్నారు. → రూ.45–90 లక్షల ఇళ్లకు 35 శాతం మంది మొగ్గు చూపిస్తుంటే, రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్లకు 28 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. → 93 శాతం మంది నిర్మాణంలో నాణ్యతకు, 72 శాతం మంది మంచి వెలుతురు ఉండే ఇళ్లకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. చెప్పుకోతగ్గ మార్పు..‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోతగ్గ పరిణామక్రమాన్ని చూసింది. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలోని ప్రాపర్టీల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండడం డెవలపర్ల పట్ల, నియంత్రణ వాతావరణం పట్ల పెరిగిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది’’అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. నివాస ఇళ్ల మార్కెట్ 2029 నాటికి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఫిక్కీ అర్బన్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ చైర్మన్ రాజ్ మెండా తెలిపారు. ఏటా 25.6 శాతం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కన్జ్యూమర్ సర్వేకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతుందన్నారు. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ధోరణలను తెలియజేస్తుందన్నారు. రీట్లకు పెరుగుతున్న ఆదరణను టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ఈ సదస్సులో భాగంగా గుర్తు చేశారు. పాక్షిక యాజమాన్యంలో ఉన్న సానుకూలతలను ప్రస్తావించారు. తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన ఆస్తుల్లో వాటాను వీటి ద్వారా పొందొచ్చన్నారు. -
వడ్డీ రేట్ల తగ్గింపు తొందరపాటే
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల విషయమై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్లను ఈ దశలో తగ్గించడం తొందరపాటు నిర్ణయం అవుతుందని, ఇది చాలా చాలా రిస్క్‌గా మారుతుందన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోందంటూ, భవిష్యత్ ద్రవ్యపరమైన నిర్ణయాలు డేటా ఆధారంగానే ఉంటాయని సంకేతం ఇచ్చారు. ఈ నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయించడం తెలిసిందే. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, మానిటరీ పాలసీ విధానాన్ని తటస్థానికి సడలించింది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్ 6న జరగనుంది. బ్లూంబర్గ్ నిర్వహించిన ఇండియా క్రెడిట్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ అంశాలను ప్రస్తావించారు. సెపె్టంబర్ నెలకు ద్రవ్యోల్బణం అధికంగా ఉందంటూ, తదుపరి నెల గణాంకాల్లోనూ ఇదే తీరు ఉంటుందని, ఆ తర్వాత మోస్తరు స్థాయికి దిగి రావొచ్చన్నారు. కనుక ఈ దిశలో రేట్ల కోత ఎంతో తొందరపాటు అవుతుంది. ద్రవ్యోల్బణం 5.5 శాతం స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం చాలా చాలా రిస్‌్కగా మారుతుంది’’అని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పోలీసు మాదిరిగా వ్యవహరించకూడదంటూ.. ఫైనాన్షియల్ మార్కెట్లపై కఠిన నిఘా కొనసాగిస్తూ, అవసరమైనప్పుడు నియంత్రణపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నవి ఫిన్సర్వ్, ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ తదితర సంస్థలపై తాజాగా ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
చిన్న బ్యాంకుల్లో దారుణంగా వడ్డీ రేట్లు
ముంబై: కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు (ఎస్ఎఫ్బీలు) విపరీత పోకడలు పోతూ.. అట్టడుగు వర్గాలకు చెందిన రుణ గ్రహీతల నుంచి భారీ వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ వ్యాఖ్యానించారు. ముందస్తుగానే కొన్ని వాయిదాల మొత్తాన్ని రుణ గ్రహీతల నుంచి తీసుకుని, వాటిని రుణంలో సర్దుబాటు చేయడం లేదన్నారు. పైగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు.వ్యాపార వృద్ధి కోసం స్థిరమైన, బాధ్యతాయుత వ్యాపార విధానాలను పాటించాలని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లకు సూచించారు. ఎస్ఎఫ్బీలపై బెంగళూరులో ఆర్బీఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా స్వామినాథన్ మాట్లాడారు. కొన్ని ఎస్‌ఎఫ్‌బీల బోర్డులో కనీసం ఇద్దరు హోల్‌టైమ్ డైరెక్టర్లను కూడా లేకపోవడాన్ని ఆర్బీఐ గుర్తించినట్టు చెప్పారు. కేవలం ఒకే ఒక్క పూర్తి కాల డైరెక్టర్ కలిగి ఉండడం కొన్ని సందర్భాల్లో సమస్యలకు దారితీయవచ్చంటూ.. మరింత మంది హోల్‌టైమ్ డైరెక్టర్ల నియామకంపై దృష్టి పెట్టాలని సూచించారు. డిపాజిట్ల విషయంలో జాగ్రత్త.. అధిక వ్యయంతో కూడిన టర్మ్ డిపాజిట్లపై ఆధారపడడం లేదంటే కేవలం కొన్ని సంస్థల బల్క్ డిపాజిట్లపై ఆధారపడడం పట్ల ఎస్ఎఫ్బీలను స్వామినాథన్ హెచ్చరించారు. ఇలా ఏదో ఒక విభాగంలో ఎక్కువ డిపాజిట్లు తీసుకోవడం పట్ల ఉండే రిస్‌్కను మదింపు వేయాలని సూచించారు.సామాజిక బాధ్యత.. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక సేవల విస్తరణకు, యువ పారిశ్రామికవేత్తల సాకారానానికి ఎస్బీఎఫ్లు కీలక పాత్ర పోషించాలని స్వామినాథన్ సూచించారు. సమ్మిళిత వృద్ధి దేశ ఆర్థిక పురోగతికి ఎంతో అవసరమన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందుబాటు ధరలకే రుణాలను కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అందించేందుకు కృషి చేయాలని సూచించారు. -
‘సుకన్య సమృద్ధి’ వడ్డీ పెరిగిందా? పోస్టాఫీసు స్కీములపై అప్డేట్
చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. వీటిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ఆయా పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రస్తుత వడ్డీ రేట్లు∇ సుకన్య సమృద్ధి యాజన (SSY): సంవత్సరానికి వడ్డీ రేటు 8.2 శాతం∇ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): వడ్డీ రేటు 8.2 శాతం∇ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): వడ్డీ రేటు 7.1 శాతం∇ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): వడ్డీ రేటు 7.7 శాతం∇ పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS): వడ్డీ రేటు 7.4 శాతం∇ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్: వడ్డీ రేటు 7.5 శాతం∇ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్: వడ్డీ రేటు 6.7 శాతంఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. వడ్డీ రేట్లను చివరిగా 2023 డిసెంబర్ 31న సవరించింది. ఈ చిన్న పొదుపు పథకాలన్నీ పోస్టాఫీసు ద్వారా అందిస్తున్నారు. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు, సార్వభౌమాధికార హామీ ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్ వంటి కొన్ని పథకాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను-పొదుపు ప్రయోజనాలను అందిస్తాయి. -
ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!
బంధన్ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఏడాది కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు (FD) 8.55 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.బంధన్ బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.55 శాతం, ఇతర కస్టమర్లకు 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఐదు సంవత్సరాలలోపు కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. ఇతర కస్టమర్లకు ఈ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది.ఇదీ చదవండి: కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..మరోవైపు రూ. 10 లక్షలకు మించిన పొదుపు ఖాతా నిల్వలపై 7 శాతం వడ్డీ రేటును బంధన్ బ్యాంక్ అందిస్తుంది. రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎంబంధన్ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కస్టమర్లు సౌకర్యవంతంగా తమ ఇళ్లు లేదా తాము ఉండే చోటు నుంచే ఫిక్స్డ్ డిపాజిట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ సదుపాయం ద్వారా కస్టమర్లు ఎఫ్డీ బుకింగ్ ప్రక్రియను నిమిషాల వ్యవధిలో వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చు.కాలవ్యవధి వడ్డీ సీనియర్ సిటిజెన్లకు సాధారణ ప్రజలకు7 నుంచి 14 రోజులు 3.00% 3.75%15 నుంచి 30 రోజులు 3.00% 3.75%31 రోజుల నుంచి 2 నెలలలోపు 3.50% 4.25%2 నెలల నుంచి 3 నెలలలోపు 4.50% 5.25%3 నెలల నుంచి 6 నెలలలోపు 4.50% 5.25%6 నెలల నుంచి ఏడాదిలోపు 4.50% 5.25%ఏడాది 8.05% 8.55%ఏడాది నుంచి ఏడాది 9 నెలలు 8.00% 8.50%21 నెలల 1రోజు నుంచి 2 ఏళ్లలోపు 7.25% 7.75%2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు 7.25% 7.75%3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు 7.25% 7.75%5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 5.85% 6.60%ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ 7.00% 7.50% -
ఎఫ్డీపై అధిక వడ్డీ ఇస్తున్న సంస్థలు
-
ఎస్బీఐ రుణ రేట్లు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణరేటు (ఎంసీఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ఆగస్టు 15 నుంచి తాజా 0.1% రుణ రేటు పెరుగుదల అన్ని వర్తిస్తుందని తన వెబ్సైట్లో బ్యాంక్ పేర్కొంది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన కస్టమర్ల రుణాల వడ్డీరేట్లు స్వల్పంగా పెరగనున్నాయి. తాజా రేట్లను పరిశీలిస్తే..⇒ ఆటో, వ్యక్తిగత రుణాలకు సాధారణంగా వర్తించే ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 8.85% నుంచి 8.95%కి పెరిగింది. ⇒ రెండేళ్ల రేటు 9.05%కి, మూడేళ్లరేటు 9.10 శాతానికి ఎగసింది. ⇒ నెల, మూడు, ఆరు నెలల కాలపరిమితుల రేట్లు 8.45 శాతం–8.85 శాతం శ్రేణిలో ఉంటాయి. ఓవర్‌నైట్ కాలపరిమితి రేటు 8.10 శాతం నుంచి 8.20 శాతం ఎగసింది. ⇒ పీఎన్బీ రుణ రేటు ఇటీవలే అన్ని కాలపరిమితులపై 5 బేసిస్ పాయింట్లు పెరగ్గా, బీఓఐ కేవలం బెంచ్‌మార్క్ ఏడాది రుణ రేటును ఇదే స్థాయిలో 0.05 శాతం పెంచింది. ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ కూడా రుణ రేట్లను అన్ని కాలపరిమితుల 5 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజాగా ఎస్బీఐ మూడవసారి పెంచింది. -
వడ్డీ రేట్లను పెంచిన ప్రభుత్వ బ్యాంకులు ఇవే..
భారతదేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. మార్జినల్ కాస్ట్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బెంచ్ మార్క్ వడ్డీ రేటును 6.5 శాతం వద్ద ఉంచాలని నిర్ణయించిన తర్వాత ఇది జరిగింది.వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూసీఓ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా & కెనరా బ్యాంక్‌లకు సవరించిన రేట్లు ఆగస్టు 12 నుంచి అమలులోకి వస్తాయి. కాగా యూసీఓ బ్యాంక్ వడ్డీ రేట్లు ఆగష్టు 10 నుంచి అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది.ఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
హోమ్ లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న భారం!
హోమ్ లోన్ కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ వడ్డీ రేట్లలో (ఎంసీఎల్ఆర్) మార్పులు చేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 9.35 శాతంగా ఉన్న ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి తగ్గింది. ఫలితంగా అదే కాలపరిమితికి హోమ్ లోన్ రేట్లు తగ్గనున్నాయి. అయితే, ఇతర కాలపరిమితి రుణాలకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. సవరించిన ఎంసీఎల్ఆర్ 2024 జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.ఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అనేది బ్యాంకు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, కాలపరిమితి ప్రీమియం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. సాధరణంగా ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే ఈఎంఐల భారం తగ్గుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్ర్క్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. ఎంసీఎల్ఆర్ సవరణల ప్రభావం తక్షణమే ఉండదని గమనించాలి. ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణాలకు రీసెట్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత రుణగ్రహీతలకు రేట్లు సవరిస్తారు. -
RBI Governor Shaktikanta Das: ఆర్థికాభివృద్ధి.. ధరల కట్టడే లక్ష్యం
ముంబై: అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను (రెపో) వరుసగా ఎనిమిదో సారీ యథాతథంగా ఉంచింది. ఇటు పటిష్టమైన వృద్ధి అటు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి రేటు గతంలో భావించిన 7 శాతానికి మించి 7.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించారు. ఆగస్టు 8న తదుపరి పాలసీ ప్రకటన ఉంటుంది. వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు (ఆషిమా గోయల్, జయంత్ వర్మ) వీరిలో ఉన్నారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటే రెపో. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఈ రేటు య«థాతథంగా ఉంది.బల్క్ డిపాజిట్ల పరిమితి పెంపు బ్యాంకుల అసెట్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చేందుకు తోడ్పడేలా బల్క్ ఫిక్సిడ్ డిపాజిట్ల ప్రారంభ పరిమితిని ఆర్బీఐ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచింది. సాధారణంగా రిటైల్ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ ఎఫ్డీలపై బ్యాంకులు కొంత అధిక వడ్డీ రేటు ఇస్తాయి. పరిమితులను సవ రించడం సాధారణంగా జరిగేదేనని కొన్నేళ్ల క్రితం ఇది కోటి రూపాయలుగా ఉండేదని, తర్వాత రెండు కోట్లకు పెరిగిందని, తాజా పరిస్థితుల కు అనుగుణంగా దీన్ని రూ. 3 కోట్లకు పెంచామని డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ తెలిపారు. యూపీఐ లైట్ వాలెట్లు, ఫాస్టాగ్‌లకు ఆటోలోడ్ సదుపాయం.. చిన్న మొత్తాలను డిజిటల్‌గా చెల్లించేందుకు ఉపయోగపడే యూపీఐ లైట్ వాలెట్లలో బ్యాలెన్స్ తగ్గినప్పుడల్లా ఆటోమేటిక్‌గా లోడ్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం దీన్ని ఈ–మ్యాన్‌డేట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. యూపీఐ లైట్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడగలదని దాస్ తెలిపారు. ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ)లను కూడా ఈ–మ్యాన్‌డేట్ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం యూపీఐ లైట్ రోజువారీపరిమితి రూ. 2,000గా ఉండగా, ఒకసారి గరిష్టంగా రూ. 500 వరకు మాత్రమే చేయడానికి వీలుంది. యూపీఐ లైట్ యాప్‌లో బ్యా లెన్స్ గరిష్టంగా రూ. 2,000కు మించరాదు.బ్యాంకుల సిస్టమ్ వైఫల్యాల వల్లే పేమెంట్స్ అంతరాయాలు.. చెల్లింపు లావాదేవీల్లో అంతరాయాలతో కస్టమర్లకు సమస్యలు ఎదురవడానికి కారణం బ్యాంకుల సిస్టమ్‌ల వైఫల్యమే తప్ప యూపీఐ, ఎన్‌పీసీఐలు కాదని దాస్ చెప్పారు. ప్రతి అంతరాయాన్ని కేంద్రీయ బ్యాంకులో సంబంధిత అధికారులు నిశితంగా అధ్యయనం చేస్తారని, ఈ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) లేదా ఏకీకృత చెల్లింపుల విధానం ప్లాట్‌ఫాం లోపాలున్నట్లుగా ఏమీ వెల్లడి కాలేదని ఆయన తెలిపారు. టెక్నాలజీకి సంబంధించి బ్యాంకులు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయన్నారు. -
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. టైల్ స్థిర డిపాజిట్లకు (రూ.2 కోట్ల వరకూ ఎఫ్డీలు) సంబంధించి కొన్ని కాల పరిమితులపై వడ్డీరేట్లను పెంచింది. 2023 డిసెంబర్ తర్వాత బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీరేటు పెంచడం ఇదే తొలిసారి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, ఈ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వస్తాయి. 46 రోజుల నుంచి 179 రోజులు, 180 నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితుల డిపాజిట్ రేట్లు 25 నుంచి 75 బేసిస్ పాయింట్ల శ్రేణిలో (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగాయి. కాగా, సీనియర్ సిటిజన్లకు ఆయా కాలపరిమితులపై (టేబుల్లో పేర్కొన్న రేట్ల కన్నా అదనంగా) పేర్కొన్న డిపాజిట్ రేట్లకు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు లభిస్తుంది. దీర్ఘకాలిక (ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య) డిపాజిట్‌పై ఏకంగా 1% వరకూ అదనపు వడ్డీరేటు లభిస్తుంది. తాజా రేట్లు ఇలా... కాల పరిమితి వడ్డీ(%) 7–45 రోజులు 3.546–179 రోజులు 5.5 180–210 రోజులు 6.0 211 రోజులు– ఏడాది 6.25 ఏడాది–రెండేళ్లు 6.80 రెండేళ్లు–మూడేళ్లు 7.00 మూడేళ్లు– ఐదేళ్లు 6.75ఐదేళ్లు– పదేళ్లు 6.50 -
RBI Monetary Policy 2024: ఆర్బీఐ ఏడోసారీ
ముంబై: ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఏడోసారీ కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. రెపో రేటును ప్రస్తుత 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు పాలసీ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన రుణాలపై ఈఎంఐలు మరికొన్నాళ్ల పాటు స్థిరంగా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. 2023 ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మార్చలేదు. అంటే ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో రేటు యథాతథంగా కొనసాగింది. తాజాగా రెపో రేటును యథాతథంగా ఉంచాలన్న ప్రతిపాదనను మానిటరీ పాలసీ కమిటీలోని (ఎంపీసీ) ఆరుగురు సభ్యుల్లో ఒకరు వ్యతిరేకించగా అయిదుగురు సభ్యులు సానుకూలత వ్యక్తపర్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం స్థాయిలోనూ (2023–24లో 7.6 శాతం), ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలోను (2023–24లో 5.4 శాతం) ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ కొనసాగించింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా, ఆహార ధరల బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.66 శాతంగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం క్యూ1లో 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం చొప్పున మొత్తం మీద సగటున 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. కాగా విదేశాల నుంచి స్వదేశానికి పంపించే డబ్బుకు (రెమిటెన్స్) సంబంధించి భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ► యూపీఐని వినియోగించడం ద్వారా త్వరలో బ్యాంకుల్లో నగదు డిపాజిట్ సౌకర్యం ► ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం సులభతరానికి మొబైల్ యాప్ ప్రారంభం ► ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్‌కు అనుమతి ► డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిర శ్రేణిలో కదలాడుతోంది. ఆందోళక అక్కర్లేదు ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వ్యవస్థాగతంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు ► జూన్ 5 నుంచి 7 వరకూ 2024–25 ఆర్బీఐ రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ► సీబీడీసీ వాలెట్లను అందించడానికి నాన్–బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు అనుమతి ► బ్యాంకింగ్ ద్రవ్య సంబంధ ఇబ్బందులు పడకుండా లిక్విడిటీ కవరేజ్ రేషియో సమీక్ష ► 2023–24లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 41.6 బిలియన్ డాలర్లు. 2014–15 తర్వాత అత్యధికం పసిడి నిల్వల పెంపు విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టతలో భాగంగా పసిడి వాటాను భారత్ పెంచుకుంటుందని ఆర్బీఐ పేర్కొంది. మార్చి 29వ తేదీ నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ హై 645.6 బిలియన్ డాలర్లకు చేరితే, అందులో పసిడి వాటా 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది. సాగుపై చల్లని అంచనాలు తీవ్ర వేసవి, నీటి ఎద్దడి భయాందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఎకానమీపై చల్లని అంచనాలను వెలువరించింది. తగిన వర్షపాతం అంచనాల నేపథ్యంలో వ్యవసాయ, గ్రామీణ క్రియాశీలతలో సానుకూలతలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఆశించిన స్థాయిలో సాధారణ రుతుపవనాల అంచనాలు, మంచి రబీ గోధుమ పంట, ఖరీఫ్ పంటల మెరుగైన అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. బలమైన గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ– సేవల రంగంలో స్థిరమైన పురోగతి ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. అయితే దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య మార్గాలలో పెరుగుతున్న అంతరాయాలు దేశ ఎకానమీకి ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా పేర్కొంది. ఆహార ధరలపై అనిశ్చితి.. ఆహార ధరల్లో నెలకొన్ని అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది వేసవిలో కూరగాయల ధరల కదలికలపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వృద్ధికి ఊతమిస్తూనే మరోవైపు లకి‡్ష్యంచుకున్న స్థాయికి (4 శాతం) ద్రవ్యోల్బణం దిగి వస్తే కీలక రేట్లను తగ్గించడంపైనే ఎంపీసీ ప్రధానంగా దృష్టి పెడుతుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు మారాయ్..
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను (FD) సురక్షితమైన ఎంపికగా చాలా మంది పరిగణిస్తారు. నేటికీ పెట్టుబడి కోసం ఎఫ్డీలను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిపాజిటర్లను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ప్రకటిస్తున్నాయి. తాజగా ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినవారు లేదా చేయాలనుకుంటున్న వారు సవరించిన వడ్డీ రేట్లను పరిశీలించవచ్చు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్డీ సౌకర్యాన్ని అందిస్తోంది. మీరు 3 శాతం నుండి 8 శాతం వరకు వడ్డీ ప్రయోజనం పొందవచ్చు. 500 రోజుల ఎఫ్డీపై బ్యాంక్ అత్యధికంగా 8 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఎఫ్డీ చేసే సీనియర్ సిటిజన్లకు ఐడీఎఫ్సీ బ్యాంక్ మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. వీరికి 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు 2024 మార్చి 21 నుండి అమలులోకి వస్తాయి. సాధారణ పౌరులకు వడ్డీశాతం 7 నుండి 45 రోజులు - 3 శాతం 46 నుండి 180 రోజులు - 4.50 శాతం 181 రోజుల నుండి ఏడాదిలోపు - 5.75 శాతం 1 సంవత్సరం - 6.50 శాతం 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 7.50 శాతం 500 రోజులు - 8 శాతం 501 రోజుల నుండి 548 రోజులు - 7.50 శాతం 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 7.75 శాతం 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.25 శాతం 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7 శాతం సీనియర్ సిటిజన్లకు.. 7 నుండి 45 రోజులు - 3.50 శాతం 46 నుండి 180 రోజులు - 5 శాతం 181 రోజుల నుండి ఏడాదిలోపు - 6.25 శాతం 1 సంవత్సరం - 7 శాతం 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 8 శాతం 500 రోజులు - 8.50 శాతం 501 రోజుల నుండి 548 రోజులు - 8 శాతం 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 8.25 శాతం 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.75 శాతం 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7.50 శాతం -
22,000 దిగువకు నిఫ్టీ
ముంబై: బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక వడ్డీ రేట్లను 17 ఏళ్ల తర్వాత పెంచడంతో ద్రవ్యోల్బణ భయాలు భారత్ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫెడరల్ రిజర్వ్ ద్రవ పాలసీ నిర్ణయాల వెల్లడి(నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్రెండ్ క్రూడాయిల్ బ్యారెల్ ఫ్యూచర్స్ ధర అయిదు నెలల గరిష్టం 85 డాలర్లపైకి ఎగిసింది. జపాన్ వడ్డీ రేట్ల పెంపుతో డాలర్ ఇండెక్స్ బలపడింది. ఈ పరిణామాలతో మంగళవారం సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయి 72,012 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 238 పాయింట్లు పతనమై 22,000 స్థాయిని కోల్పోయి 21,817 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు నెల కనిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం బలహీనంగా మొదలైంది. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 815 పా యింట్లు క్షీణించి 72,000 స్థాయి దిగువున 71,933 వద్ద, నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయి 21,793 వద్ద ఇంట్రాడే కనిష్టాలను చూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విక్రయాలు కొనసాగాయి. జపాన్ ఎకానమీకి జోష్! ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ పురోగమన బాటన పడుతున్నట్లు కనిపిస్తోంది. 17 సంవత్సరాల నెగటివ్ రుణ రేటు వ్యవస్థకు 4.2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ముగింపు పలికింది. బ్యాంకులకు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇచ్చే ఓవర్‌నైట్ రుణ రేటు మైనస్ 0.1 శాతం నుంచి ప్లస్ 0–0.1 శాతం శ్రేణికి పెరిగింది. రూ. 4.86 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ ఒక శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.4.86 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.373 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఈ సూచీలో 30 షేర్లకు గానూ ఏడు మాత్రమే లాభపడ్డాయి. టీసీఎస్ నిరాశ.. టీసీఎస్ షేరు రెండేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ప్రమోటర్ సంస్థ టాటా సన్స్ బ్లాక్ డీల్ ద్వారా 2.3 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ట్రేడింగ్‌లో నాలుగున్నర శాతం క్షీణించి రూ. 3,967 వద్ద రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 4% నష్టంతో రూ.3,978 వద్ద ముగిసింది. పాపులర్ వెహికల్స్ పేలవం పాపులర్ వెహికల్స్ అండ్ సర్విసెస్ లిస్టింగ్ మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర(రూ.295)తో పోలిస్తే బీఎస్ఈలో 1% డిస్కౌంట్‌తో రూ.292 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% క్షీణించి రూ.263 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టంతో రూ.276 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,967 కోట్లుగా నమోదైంది. -
డబ్బులు ఈ బ్యాంకుల్లో వేసుకుంటే మంచి వడ్డీ!
FD Interest Rate: దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఇటీవల సవరించాయి. కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తమ ప్రత్యేక ఎఫ్డీ పథకాలకు గడువు తేదీని కూడా పొడిగించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించాయి. ప్రస్తుతం ఆయా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత శాతం వడ్డీ ఇస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనవరిలో ఎఫ్డీపై వడ్డీ రేటును రెండుసార్లు సవరించింది. ఒకే టెన్యూర్ ఎఫ్డీపై వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల ఎఫ్డీపై వడ్డీ రేటును సాధారణ కస్టమర్లకు 6.25 శాతం నుంచి 7.05 శాతానికి పెంచింది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ అందిస్తోంది. రేట్లు సవరించిన తర్వాత ఎఫ్డీలపై సాధారణ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్ (IDBI): ఐడీబీఐ బ్యాంక్ కూడా ఇటీవల ఎఫ్డీ వడ్డీ రేటును సవరించింది. మార్పు తర్వాత 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.50 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త మెచ్యూరిటీ వ్యవధితో ప్రత్యేక స్వల్పకాలిక ఎఫ్డీని ప్రారంభించింది. ఇందులో కస్టమర్లకు అధిక వడ్డీ లభిస్తుంది. కొత్త రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తిస్తాయి. బ్యాంక్ 360D (bob360) పేరుతో కొత్త మెచ్యూరిటీ ఎఫ్డీని తీసుకొచ్చింది. ఇది సాధారణ పౌరులకు 7.10 శాతం వడ్డీని ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్తరేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఎఫ్డీలపై సాధారణ కస్టమర్లకు 4.25 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం నుంచి 7.65 శాతం వడ్డీ అందిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ : ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 500 రోజుల వ్యవధిలో గరిష్టంగా 8 శాతం రాబడిని అందిస్తోంది. సవరించిన రేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.50 శాతం నుంచి 8.00 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. గమనిక: ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. డబ్బులు డిపాజిట్ చేసే ముందు వివరాలు క్షణ్ణుంగా తెలుసుకోవడం అవసరం. -
ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ కొత్త వడ్డీ రేట్లు - ఇలా ఉన్నాయి
మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది.. అంతకంటే ముందు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ.. అవన్నీ ఈ రోజు (డిసెంబర్ 27) నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ అయిన SBI తాజాగా కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు వరిస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. SBI కొత్త వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 45 రోజులకు - 3.50 శాతం 46 రోజుల నుంచి 179 రోజులకు - 4.75 శాతం 180 రోజుల నుంచి 210 రోజులు - 5.75 శాతం 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - 6 శాతం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ - 6.80 శాతం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ - 7.00 శాతం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 6.75 శాతం 5 సంవత్సరాలు & 10 సంవత్సరాల వరకు - 6.50 శాతం సీనియర్ సిటిజన్స్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 7 రోజుల నుంచి 45 రోజులకు - 4 శాతం 46 రోజుల నుంచి 179 రోజులకు - 5.25 శాతం 180 రోజుల నుంచి 210 రోజులకు - 6.25 శాతం 211 రోజుల నుంచి 1 సంవత్సరాల లోపు - 6.5 శాతం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు - 7.30 శాతం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు - 7.50 శాతం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు - 7.25 శాతం 5 సంవత్సరాలు & 10 సంవత్సరాల వరకు - 7.5 శాతం SBI ఇప్పడు తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది, అయితే ఇప్పటికే డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, డీసీబీ బ్యాంక్ వంటివి ఉన్నాయి. -
ఫెడ్ రేట్లు తగ్గితే... అంతా బాగేనా?
అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఈ మధ్య కాలం వరకూ వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. అనంతరం గత కొద్ది దఫాల తమ సమావేశాలలో ఆ పెరిగిన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణ యాలు తీసుకుంటూ వచ్చింది. ఈ వడ్డీరేట్ల పెంపు ఉద్దేశ్యం దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం. ఈ చర్య వల్ల ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. నవంబర్ 2023కు సంబంధించి వెలువడిన అమెరికా ‘వినియోగదారుల ధరల సూచీ’ 3.1 శాతంగా నమోదు అయింది. అంతకుముందరి అక్టోబర్ మాసంలో ఈ ద్రవ్యోల్బణం 3.2 శాతంగా ఉంది. ముఖ్యంగా, కోర్ ఇన్‌ఫ్లేషన్‌గా పిలవబడే ఆహార, ఇంధన ధరల పెరుగుదలను లెక్కలలోంచి తీసివేసి, అంచనా వేసే ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద స్థిరంగా ఉంది. నిన్నా మొన్నటి వరకూ పెరుగుతూ వచ్చిన వడ్డీరేట్ల వలన అమెరికా ప్రజల కొనుగోలు శక్తీ, వారు తమ అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశాలూ తగ్గిపోతూ వచ్చాయి. అలాగే వారు తాము గృహాలు లేదా వాహనాల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ మొత్తాలు పెరిగిపోయిన కారణంగా కూడా ప్రజల కొనుగోలు శక్తి దెబ్బ తినటం, అనేక సందర్భాలలో వారు అసలు తిరిగి తమ రుణా లను చెల్లించలేని స్థితికి చేరడం వంటివీ జరిగాయి. ఈ నేప థ్యంలోనే నేడు అమెరికాలోని అనేక బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు మొండి బకాయిలు పెరిగి పోయి, ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ పెరిగిన వడ్డీరేట్ల వలన అమెరికా ఆర్థిక వ్యవస్థలో మెల్ల మెల్లగా మందగమనం మొదలవుతోంది. అక్టోబర్ 2023లో అమెరికాలో ఉపాధి కల్పన 8.7 మిలియన్లకు తగ్గడం దీనిపర్యవసానమే. ఈ రెండేళ్ల కాలంలో అతి తక్కువ స్థాయి ఇదే! ఒక పక్కన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన దాఖలాలూ... మరో పక్కన తగ్గిపోతున్న ఉపాధి కల్పన గణాంకాలూ... డిసెంబర్ నెలలో జరిగిన అమెరికా ఫెడరల్ బ్యాంక్ సమావేశంలో 2024లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నా యంటూబ్యాంక్ ఛైర్మన్ జరోమ్ పావెల్ సంకేతాలను ఇచ్చేలా చేశాయి. పెరిగిపోతున్న ఆటోమేషన్ (మర మనుషులు, సాఫ్ట్ వేర్లలో పురోగతి), కొన్ని దేశాల్లో శ్రామిక శక్తి చౌకగా లభించడం వల్ల అమెరికా వంటి ధనిక దేశాల నుంచి పరి శ్రమలు, సేవారంగం భారీగా విదేశాలకు తరలిపోతున్నాయి. అమె రికాలో నేడు ప్రజల కొనుగోలు శక్తిని నిలిపి వుంచుతోంది షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ వంటి సట్టా వ్యాపారాలూ, ఉద్దీపనా పథకాలూ; రుణ స్వీకరణను సులువు చేస్తూ, బ్యాంక్వడ్డీరేట్ల తగ్గింపు వంటి చర్యలే! స్థూలంగా అటు ఉద్దీపన రూపంలో ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణీని పెంచే చర్యలూ... అలాగే వడ్డీరేట్లను 0 (సున్నా) శాతానికి తగ్గించి వేస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా వంటి దేశాలలో మార్కెట్లో డబ్బు చలామణి విపరీతంగా పెరిగిపోయింది. అందుకే సరఫరా పెరిగిపోయిన ఏ సరుకైనా దాని విలువ పడి పోయినట్లుగానే అమెరికా డాలర్ విలువ కూడా పడిపోయింది. సూక్ష్మంగా చెప్పాలంటే డాలర్ కొనుగోలు శక్తి పతనమై, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇలా ద్రవ్యోల్బణం పెరిగి నప్పుడు అటు ప్రజల కొనుగోలు శక్తీ, ఇటు షేర్ మార్కెట్లవంటి ఎటువంటి ఉత్పత్తి లేకుండానే పెట్టుబడిగా పెట్టిన డబ్బును లాభాలతో కలిపి మరింత డబ్బుగా పెంచే వ్యాపా రాలు వంటివన్నీ నష్టపోతాయి. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత మరలా తిరిగి ప్రభుత్వంపైనో... లేకుంటే ఆ దేశం తాలూకూ కేంద్రబ్యాంకు పైనో పడుతుంది. ఇక ఇప్పుడు, కేంద్రబ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు రూపంలో, తాను చలామణీలోకి తెచ్చిన అధిక నగదు మొత్తాన్నో... లేదా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోకి ఉద్దీపన రూపంలో పంపిన డబ్బునో తిరిగి మరలా వెనక్కి లాక్కోవలసి వస్తుంది. దీనికోసం కేంద్రబ్యాంకు వడ్డీరేట్లను పెంచుతుంది, ప్రభుత్వం ఉద్దీపన పథకాలను నిలిపివేస్తుంది. తద్వారా, ఆర్థిక వ్యవస్థలో ఉన్న అదనపు డబ్బును వెనక్కి లాగివేసి ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అమెరికాలో నేడు నడుస్తోన్న కథ ఇదే! ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏర్పడితే డబ్బు చలామణీ పెంచడం... ఈ డబ్బు చలామణీ పెరగడం వలన ద్రవ్యోల్బణం పెరిగితే తిరిగి మరలా అధికంగా చలామణిలోకి తెచ్చిన ఆ డబ్బును వెనక్కి లాగివేయటం అనే వలయమే ఈ కథ సారాంశం. అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు ఈ రెండు దశల మధ్యనా ఉన్న కాలవ్యవధి నేడు వేగంగా కుచించుకు పోతోంది. నిజానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థలో డాలర్ల ముద్రణ గత అనేక దశాబ్దాలుగా జరుగుతున్నప్పటికీ... మనం 2008 అనంతరం పరిణామాలను ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. 2008లో అమెరికాలో ఫైనాన్స్ సంక్షోభం ఏర్పడింది. ఈసంక్షోభ క్రమంలో, అమెరికా జనాభాలోని సగానికి సగంమంది రాత్రికి రాత్రే దారిద్య్ర రేఖకు దిగువకు నెట్టివేయ బడ్డారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు 2009 ఫిబ్రవరిలో ఒబామా ప్రభుత్వం 7,00,800 బిలియన్ డాలర్ల ఉద్దీపనను, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇచ్చింది. ఆ తరువాత కూడా కొద్ది దఫాలు మరిన్ని ఉద్దీపనలు ఇచ్చారు. తదనంతరం నెలవారీ (95 బిలియన్ల డాలర్ల మేర) ఉద్దీపనలను ఇస్తూ పోయారు. తరువాత ఈ ఉద్దీపనల స్టెరాయిడ్ల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ‘నిలదొక్కుకుందనే’ నమ్మకం కుదిరాక, కొంతమేర ఈ ఉద్దీప నలను తగ్గించివేశారు. అయితే, 2020 కోవిడ్, లాక్డౌన్ల అనంతరం మరలా లక్షల కోట్ల డాలర్ల మేర కరెన్సీనిముద్రించి అమెరికా ఉద్దీపనలను ఇచ్చింది. లాక్డౌన్ల వలన ఇళ్ళకే పరిమితం అయిపోయి... ఆదాయాలు నిలిచిపోయిన కుటుంబీకులను ఆదుకునేందుకు ఈ చర్య అవసరంఅయ్యింది. అయితే, 2008 తరువాతి ఉద్దీపనలూ, వడ్డీరేట్ల తగ్గింపులూ, తదనంతరం 2020 నాటి మరింత ఉద్దీపనలూ కలగలిసి 2022 నాటికి ద్రవ్యోల్బణం రూపంలో దాడి మొదలు పెట్టాయి. అప్పటికే శక్తికి మించిన భారాన్ని మోస్తోన్న ఒకఒంటె మూపుపై అదనంగా మరో గడ్డిపోచ వేసినా కుప్ప కూలి పోయినట్లు... 2008 నుంచి పెంచుతూ వచ్చిన డాలర్ల చలామణీ ప్రభావం, అంతిమంగా 2022లో తీవ్ర ద్రవ్యోల్బణ రూపంలో బయటపడింది. దీనికి విరుగుడుగా మరలా ద్రవ్య చలామణీని తగ్గించే వడ్డీరేట్ల పెంపు వంటి నిర్ణయాలు జరుగుతూ పోయాయి. ఈ క్రమంలోనే నేడు అమెరికా తిరిగి మందగమనం, ఉపాధి కల్పనలో బలహీన స్థితికి చేరింది. ప్రస్తుత ఫెడరల్ బ్యాంక్ సమావేశం 2024లో మూడు దఫాలుగా 75 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీరేట్లను తగ్గించే అవకాశం గురించి మాట్లాడిందంటే ఈ మందగమనం ద్రవ్యోల్బణాల విషవలయం తాలూకు మరో రౌండ్ మొదలయ్యిందన్న మాట! కానీ, ఈ రౌండ్... గత రౌండ్ (2008, 2022)లు ఉన్నంత కాలం ఉండే అవకాశమే లేదు. ప్రస్తుతరౌండు వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయాలు అతి స్వల్పకాలంలోనే ద్రవ్యోల్బణం తిరిగి తలెత్తే పరిస్థితిని తెచ్చి పెడతాయి. ఫలితంగా ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలుకూ ఈ గడియారం లోలకం పరస్పర విరుద్ధ కొసలు అయిన వృద్ధి మందగమనం– ద్రవ్యోల్బణం మధ్య... మరింత వేగంగా కొట్టుమిట్టాడుతుంది. ఆర్థిక వ్యవస్థలో అటువంటి అనిశ్చితి అమెరికా ప్రజా జీవితంలో మరింత తీవ్ర అభద్ర తకూ, అనిశ్చితికీ దారితీయగలదు. ఈ క్రమంలోనే అమెరికా డాలర్ పతనం ప్రమాదం కూడా మరింత తీవ్రతరం అవుతుంది. ఇదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాలూకూ స్వరూప స్వభావాలనే పునర్నిర్వచించే పరిస్థితి తలెత్తవచ్చు! - డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
కొనసాగుతున్న ఎఫ్‌పీఐ అమ్మకాలు
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీయంగా ఈక్విటీలను విక్రయించడం కొనసాగిస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం .. నవంబర్‌లో ఇప్పటివరకు (1 నుంచి 10వ తేదీ వరకు) రూ. 5,800 కోట్ల మేర అమ్మేశారు. ఇప్పటికే అక్టోబర్‌లో రూ. 24,548 కోట్లు, సెపె్టంబర్లో 14,767 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాని కన్నా ముందు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (మార్చి నుంచి ఆగస్టు వరకు) దాదాపు రూ. 1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు, అక్టోబర్‌లో డెట్ మార్కెట్లో రూ. 6,381 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,053 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఈక్విటీల్లో రూ. 90,161 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 41,554 కోట్లకు చేరాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు పెరగడం వంటి అంశాల కారణంగా ఎఫ్‌పీఐల విక్రయాల ధోరణి కొనసాగుతోందని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడి ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వరకు నిధులను స్వల్పకాలికంగా డెట్ మార్కెట్లోకి మళ్లించే వ్యూహాన్ని మదుపుదారులు అమలు చేస్తున్నట్లు పరిశీలకులు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలు మెరుగైన క్యూ2 ఫలితాలు ప్రకటిస్తూ, ఆశావహ అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ ఎఫ్‌పీఐలు వాటిలో అత్యధికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ స్టాక్స్ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ బూస్ట్!
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఊహించినట్లే యథాతథంగా ఉంచడంతో పాటు సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలు ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. దేశీయంగా వాహన విక్రయాలు రికార్డు గరిష్టానికి చేరుకోవడం, జీఎస్టీ వసూళ్లు పెరగడం, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడం కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 490 పాయింట్లు పెరిగి 64,081 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్లు బలపడి 19,133 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆద్యంతం జోరు కనబరిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 611 పాయింట్లు దూసుకెళ్లి 64,203 వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు బలపడి 19,175 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లకు చిన్న, మధ్య తరహా షేర్లు భారీ డిమాండ్ లభించింది. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు ఒకశాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,261 కోట్ల షేర్లను అమ్మేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1380 కోట్ల షేర్లు కొన్నారు. ఫెడ్ రిజర్వ్ నుంచి సానుకూల సంకేతాలు, జపాన్ ప్రభుత్వం 113 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ప్రకటన, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సైతం వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం తదితర పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2% ర్యాలీ చేశాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు 1–1.5 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో ఇన్వెస్టర్లు సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.1 లక్షల కోట్లు పెరిగి రూ. 313.32 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 షేర్లలో టెక్ మహీంద్రా(1%), బజాజ్ ఫైనాన్స్(0.25%) మాత్రమే నష్టపోయాయి. ► క్యూ2 నికర లాభం ఐదు రెట్లు వృద్ధి సాధించడంతో జేకే టైర్ షేరు 10% లాభపడి రూ.337 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ర్యాలీ చేసి రూ.351 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► క్యూ2 ఫలితాల ప్రకటన తర్వాత హీరో మోటో కార్ప్ షేరులో లాభాల స్వీకరణ జరిగింది. 1% నష్టపోయి రూ.3050 వద్ద స్థిరపడింది. -
RBI Governor Shaktikanta Das: అధికరేటు ఎప్పటివరకో... కాలమే చెప్పాలి
న్యూఢిల్లీ: భారత్‌లో వడ్డీరేట్లు కొంతకాలం అధిక స్థాయిలోనే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎంతకాలం ఈ స్థితి కొనసాగుతుందన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు. కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్, 2023లో ఆయన ఈ మేరకు ఒక ప్రసంగం చేస్తూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడానికి సెంట్రల్ బ్యాంక్ జాగరూకతతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ‘ఏకాగ్రతకు సంబంధించి అర్జునిడి కన్ను’’తో పోల్చారు. భారత్‌లో ద్రవ్యోల్బణానికి సంబంధించి ‘అంతర్జాతీయ ఇంధన ధరలే’ ప్రధాన సవాలుగా పేర్కొన్నారు. ఇజ్రాయిల్–గాజా సంఘర్షణ అమెరికాసహా ఇతర ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లోనూ భారత్ పటిష్ట ఆర్థిక పరిస్థితులను కలిగి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. భారత్ రూపాయి విలువ డాలర్ మారకంలో తీవ్ర ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. రూ. 2,000 నోట్లు తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవస్థలో రూ. 10,000 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆ మొత్తం కూడా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నామని వివరించారు. ఇదిలావుండగా, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని గవర్నర్ నేతృత్వంలో ఈ నెల మొదట్లో జరిగిన ఆరుగురు సభ్యుల ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయించినట్లు ఆ భేటీకి సంబంధించి తాజాగా వెలువడిన మినిట్స్ పేర్కొంది. ఫిబ్రవరి తర్వాత వరుసగా నాలుగు సమీక్షా సమావేశాల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై రాజీలేని వైఖరి అవలంభిస్తామని తద్వారా కమిటీ స్పష్టం చేస్తోంది. -
బ్యాంక్ డిపాజిట్లపై పండుగ ఆఫర్లు
న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా బ్యాంక్‌లు రుణాలపై ప్రాసెసింగ్ చార్జీల రద్దు వంటి ఆఫర్లు ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఈ విడత బ్యాంక్‌లు డిపాజిట్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మధ్య స్థాయి బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు సేవింగ్స్ డిపాజిట్లపై ప్రత్యేక రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. మరిన్ని డిపాజిట్లను ఆకర్షించేందుకు అవి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు అయితే డిపాజిట్లపై ఏకంగా 9.50 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. రిటైల్ డిపాజిట్లలో పెద్దగా వృద్ధి లేకపోవడంతో, తమ డిపాజిట్ బేస్‌ను పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో బ్యాంక్‌లు ప్రధానంగా బల్క్ డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. అందుకే, బల్క్ డిపాజిట్ల కంటే రిటైల్ డిపాజిట్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే నాలుగు రకాల సేవింగ్స్ ఖాతాలను ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై రేట్లను 0.50 శాతం వరకు పెంచింది. వివిధ కాలావధితో కూడిన బల్క్ డిపాజిట్లపై రేట్లను ఒక శాతం మేర పెంచింది. యస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ అయితే సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై ఏకంగా 7–8 శాతం రేటును ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా ఏడాది టర్మ్ డిపాజిట్లపైనే ప్రస్తుతం ఈ రేటు లభిస్తుండడం గమనార్హం. కొన్ని బ్యాంకుల్లో 1–3 ఏళ్ల టర్మ్ డిపాజిట్ రేట్లు ఇంతకంటే తక్కువే ఉండడాన్ని గమనించొచ్చు. పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు అధిక రేట్లతో ప్రత్యేక పథకాలను కూడా బ్యాంక్‌లు ప్రకటిస్తున్నాయి. ‘‘టర్మ్ డిపాజిట్ల కంటే సేవింగ్స్ రేట్లు అధికంగా ఉన్నాయి. ఇది చాలా అసహజంగా కనిపిస్తోంది. ఇది కేవలం మార్కెటింగ్ ఎత్తుగడే’’అని మాక్వేర్ రీసెర్చ్ పేర్కొంది. కాసా వృద్ధి కోసం పాట్లు బ్యాంకులకు కరెంట్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు (కాసా) చాలా కీలకం. సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై సాధారణంగా 3–4 శాతం మించి బ్యాంక్‌లు రేట్లను ఆఫర్ చేయవు. కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లపై అసలు వడ్డీని ఆఫర్ చేయవు. దీంతో కాసా డిపాజిట్లపై బ్యాంకులకు అయ్యే వ్యయాలు చాలా తక్కువ. అందుకే బ్యాంక్‌లు కాసా డిపాజిట్ల వృద్ధిని ప్రాధాన్యంగా చూస్తుంటాయి. ఇటీవలి కాలంలో కాసా డిపాజిట్లలో పెద్దగా వృద్ధి లేకపోవడంతో, రుణాల వృద్ధిని కాపాడుకునేందుకు అవి నిధుల కోసం అవి సేవింగ్స్ డిపాజిట్లపై అధిక రేట్లను ఆఫర్ చేస్తున్నట్టుందని మాక్వేర్ రీసెర్చ్ తెలిపింది. మొత్తం డిపాజిట్ల వృద్ధిలో సేవింగ్స్ డిపాజిట్ల వృద్ధి 6–7 శాతం తక్కువగా ఉండడాన్ని ప్రస్తావించింది. దేశంలోని టాప్–6 బ్యాంక్‌లు మొత్తం సేవింగ్స్ డిపాజిట్లలో 55 శాతం వాటా కలిగి ఉన్నాయి. క్యూ1లో టర్మ్ డిపాజిట్లు ఇతర అన్ని విభాగాలతో పోలిస్తే అధికంగా 17.4 శాతం వద్ధి చెందినట్టు కేర్ రేటింగ్స్ నివేదిక తెలియజేస్తోంది. అదే సేవింగ్స్ డిపాజిట్లలో వృద్ధి కేవలం 4.9 శాతంగానే ఉంది. -
ఈ బ్యాంకు కస్టమర్లకు సర్ప్రైజ్: పండగ బొనాంజా
DCB Rates Hike డీసీబీ బ్యాంకు తన ఖాతాదారులకు సర్ప్రైజ్ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచి వారికి పండగ బొనాంజా అందించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరించిన వడ్డీరేట్లు ఈ రోజు (సెప్టెంబరు 27) నుంచే అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. అలాగే సేవింగ్స్ ఖాతాలో ఉన్న నిల్వ ఆధారంగా డీసీబీ కస్టమర్లకు గరిష్టంగా 8.00 శాతం వడ్డీ లభించనుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ట వడ్డీరేటు 7.90 శాతంగా ఉంచింది. సేవింగ్స్ ఖాతాల నిల్వపై వడ్డీ రేట్లు ఒక లక్ష వరకు ఉన్న పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 1.75శాతం, 5 లక్షల లోపు నిల్వలపై 3.00 శాతం వడ్డీ అందిస్తుంది. 5 - 10 లక్షల లోపు , 10 లక్షల నుండి 2 కోట్ల లోపు ఖాతాలకు వరుసగా 5.25శాతం, 8.00శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే . రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 5.50శాతం రూ. 10 కోట్ల లోపు నిల్వ ఉన్న ఖాతాలకు 7.00శాతం వడ్డీ రేటును అందిస్తోంది. (UP Scorpio Accident Death: ఆనంద్ మహీంద్రపై చీటింగ్ కేసు, కంపెనీ క్లారిటీ ఇది) బ్యాంక్ FDలపై చెల్లించే రేట్లు 7- 45 రోజుల డిపాజిట్లపై 3.75శాతం , ఏడాదిలోపు డిపాజట్లపై 7.15శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. 12 నెలల 1 రోజు నుండి 12 నెలల 10 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై, బ్యాంక్ 7.75శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. 38 నెలల నుండి 61 నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న వాటికి 7.40శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు అన్ని పదవీకాలానికి ప్రామాణిక రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు అందిస్తోంది. (డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?) -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు తాజాగా నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 5.25–5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఉపాధి, హౌసింగ్ గణాంకాలు నీరసించడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు యథాతథ పాలసీ అమలుకు కారణమైనట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. వెరసి రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ).. గత 18 నెలల్లో రెండోసారి వడ్డీ రేట్ల పెంపునకు విముఖత చూపింది. ప్రస్తుత రేట్లు గత రెండు దశాబ్దాలలోనే అత్యధికంకాగా.. 2022 మార్చి నుంచి దశలవారీగా ఫెడ్.. 5.25 శాతంమేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీలు భారంగా మారినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా ధరలు ఫెడ్ లక్ష్యాన్ని మించుతున్నప్పటికీ లేబర్ మార్కెట్, హౌసింగ్ రంగం మందగించడంతో భవిష్యత్‌లోనూ ఎఫ్‌వోఎంసీ రేట్ల పెంపునకు ఆసక్తి చూపకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) -
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్
Axis Bank Fd Rates: ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రూ. 2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FDs) వడ్డీ రేట్లను యాక్సిస్ బ్యాంక్ సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు సోమవారం (సెప్టెంబర్ 18, 2023) నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ ఇప్పుడు 15 నెలల నుండి 5 సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.10శాతం వడ్డిని చెల్లిస్తుంది. 5 నుండి 10 ఏళ్లలో మెచ్యూరయ్యే ఎఫ్‌డిలపై 7శాతం వడ్డి లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల ఎఫ్డీలపై 7.75శాతం గరిష్ట స్టాండర్డ్ రేటు వర్తిస్తుంది. (చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, టీ బండి నడుపుకుంటున్నా!) 7- 10 ఏళ్ల లోపు మెచ్యూరిటీ ఉన్న FDలపై సాధారణ ప్రజలకు 3-7శాతం, సీనియర్ సిటిజన్లకు 3నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.75 శాతం వరకు వడ్డీ రేట్ యాక్సిస్ బ్యాంక్ చెల్లిస్తుంది.13 - 30 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై, నాన్-సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ వర్తిస్తుంది. అలాగే 15 నెలల నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 7.10శాతంగా ఉంటుంది. కాగా కేంద్ర బ్యాంకు ఆర్బీఐ వడ్డీరేట్ల ఆధారంగా ఆయా ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు లోన్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
ఎఫ్డీ విషయంలో ఈ పొరబాటు చేయకండి, ఇలా చేస్తే లాభాలు!
డిపాజిట్లపై వడ్డీ రేటు 8 శాతానికి చేరుకోవడంతో ఈ సమయంలో ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేయాలా..? లేక మరికొన్ని రోజులు వేచి చూడాలా? అన్నది ఎంతో మంది ఎదుర్కొంటున్న సందేహం. నిజానికి ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు ఇంకా పెరగొచ్చు. లేదంటే కొంత విరామం తర్వాత రేట్లు తగ్గొచ్చు. మరి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే అదనపు రాబడి అవకాశాన్ని కోల్పోతామేమో..? అనుకునే వారు ఒక రకం అయితే.. ఈ రేట్లపై ఇన్వెస్ట్ చేయకపోతే, రానున్న రోజుల్లో ఆర్బీఐ రేట్లను తగ్గిస్తే అప్పుడు మెరుగైన రాబడి చాన్స్ మిస్ అవుతామేమో అనుకునే వారు ఇంకో రకం. ఇలాంటి అయోమయ వాతావరణాన్ని చూసి పెట్టుబడుల అవకాశాలను కోల్పోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, వాటికి తగినట్టు పెట్టుబడుల వ్యూహాలను అనుసరించడమే ఇన్వెస్టర్ల ముందున్న మెరుగైన మార్గం. ఇలాంటి తరుణంలో ఇన్వెస్టర్లు ‘ఎఫ్డీ లాడరింగ్’ (అంచెలంచెలుగా) విధానాన్ని అనుసరించొచ్చు. అంటే డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి గడువు తీరే విధంగా ఇన్వెస్ట్ చేసుకోకుండా ఉండడం. మున్ముందు ఏం జరుగుతుందోనన్నది అన్ని సందర్భాల్లోనూ అంచనా వేయలేం. అటువంటప్పుడు వడ్డీ రేట్ల అస్థిరతలను అధిగమించేందుకు ఎఫ్డీ లాడార్ ఉపయోగపడుతుంది. మెరుగైన రాబడులకు మార్గం చూపుతుంది. ఆర్బీఐ గడిచిన రెండు ద్రవ్య విధాన సమీక్షల్లో కీలకమైన రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్బీఐ నియంత్రిత లక్ష్యానికి ఎగువనే చలిస్తోంది. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు ముగింపు పడిందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. త్వరలో వెలువడనున్న ఆగస్టు ద్రవ్యోల్బణం తదుపరి ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ద్రవ్యోల్బణం ఎగసి పడుతుండడంతో అదనపు సీఆర్ఆర్ రూపంలో బ్యాంకుల నుంచి ఆర్బీఐ మరింత లిక్విడిటీని తీసుకునే నిర్ణయాన్ని గత సమీక్షలో ప్రకటించింది. మరోవైపు యూఎస్ ఫెడ్ రానున్న సమీల్లో రేట్లను పెంచే అవకాశాలే ఉన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టాలా? వేచి చూడాలా? అన్న సందిగ్ధత ఎదుర్కొనే వారు ఎఫ్డీ లాడార్ను అనుసరించొచ్చు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) వడ్డీ రేట్ల అస్థిరతలకు చెక్ కాలానుగుణంగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఎఫ్డీ లాడార్ సాయపడుతుంది. ఈ విధానంలో పెట్టుబడి మొత్తాన్ని ఒకే కాల వ్యవధికి ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ కాల వ్యవధుల మధ్య భాగాలుగా చేసుకోవాలి. సాధారణంగా వడ్డీ రేట్లు పడిపోతున్న తరుణంలో ఇన్వెస్టర్లు దీర్ఘకాలానికి కాకుండా స్వల్ప కాలానికి ఎఫ్డీలు చేస్తుంటారు. ఒకవేళ వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం మొదలు పెడితే.. స్వల్పకాలానికి చేసిన ఎఫ్డీ గడువు తీరి చేతికి వస్తుందని, ఆ మొత్తాన్ని మెరుగైన రేటుపై మళ్లీ ఎఫ్డీ చేసుకోవచ్చని అనుకుంటారు. అదే మాదిరిగా, వడ్డీ రేట్లు పెరుగుతూ వెళుతుంటే అప్పుడు దీర్ఘకాలానికి ఎఫ్డీలు చేస్తుంటారు. ఒకవేళ అక్కడి నుంచి వడ్డీ రేట్లు పడిపోవడం మొదలు పెడితే.. అధిక రేటుపై ఎఫ్డీ చేసుకున్నట్టు అవుతుందని భావిస్తుంటారు. కానీ, ఇది సరైన విధానం కాబోదు. వడ్డీ రేట్లు అస్థిరంగా ఉన్న సమయంలో పెట్టుబడినంతా ఒకే ఎఫ్డీగా మార్చుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ‘‘ఇన్వెస్టర్లు సాధారణంగా గరిష్ట రేటుపై ఎఫ్డీ చేసుకోవాలని చూస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది చాలా కష్టం. భవిష్యత్ వడ్డీ రేట్ల గమనాన్ని అంచనా వేయడం రిస్‌్కతో కూడుకున్నదే అవుతుంది. దీనికి బదులు వడ్డీ రేట్ల చలనంతో వచ్చే రిస్‌్కను తగ్గించుకునేందుకు ఎఫ్డీ లాడరింగ్ ఒక టెక్నిక్’’అని ముంబైకి చెందిన సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అభిజిత్ తాలూక్దార్ సూచించారు. ‘‘లాడరింగ్ను క్రమం తప్పకుండా అనుసరించినట్టయితే వడ్డీ రేట్ల మారి్పడికి భిన్నంగా లేకుండా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో, కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉండొచ్చు. ఎఫ్డీలను తిరిగి రెన్యువల్ చేసుకునే సమయంలో అప్పటి వరకు ఉన్న రేటు కంటే మెరుగైన రేటు రావొచ్చు. లేదంటే తక్కువ రేటు ఉండొచ్చు. కాకపోతే మొత్తం మీద నా పెట్టుబడులపై రేటు సగటుగా ఉంటుంది. ఎఫ్డీ లాడరింగ్తో మెరుగైన రేటుపైనే ఇన్వెస్ట్ చేయాలన్న సందిగ్ధత, అయోమయం తొలగిపోతుంది’’అని ‘ఇంటర్నేషనల్ మనీ మ్యాటర్స్’ సంస్థ ఎండీ, సీఈవో లోవై నవలకి వివరించారు. రాబడి సగటుగా మారి.. ఉదాహరణకు మీ వద్ద రూ.9 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఈ మొత్తాన్ని ఒకే ఎఫ్డీగా కాకుండా.. రూ.3 లక్షల చొప్పున మూడు భాగాలు చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని వేర్వేరు కాల వ్యవధికి ఎఫ్డీగా మార్చుకోవాలి. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లకు ఒకటి చొప్పున ఎఫ్డీగా మార్చుకోవాలి. మొదటి రూ.3 లక్షలు ఏడాదికి మెచ్యూరిటీ తీరి చేతికి వస్తుంది. ఈ మొత్తాన్ని తిరిగి మళ్లీ ఎఫ్డీ చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతూ వెళ్లే తరుణంలో అధిక రేటుపై ఎఫ్డీ చేసుకున్నట్టు అవుతుంది. అదే వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో అప్పటి వరకు చేసిన రేటు కంటే కొంచెం తక్కువకు ఎఫ్డీ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మిగిలి ఉన్న రెండు, మూడేళ్ల ఎఫ్డీలపై అధిక రేటు పొందినట్టు అవుతుంది. ఎఫ్డీ లాడార్ విధానం వల్ల ఇన్వెస్టర్ తన పెట్టుబడిపై పొందే రేటు సగటుగా మారుతుందని, మెరుగైన రాబడికి వీలు కలుగుతుందని అభిజిత్ తాలూక్దార్ వివరించారు. ∙ ఉదాహరణకు రూ.9 లక్షలను రూ.3 లక్షల చొప్పున ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలానికి ఎఫ్డీ చేశారని అనుకుందాం. 2018 జనవరి నుంచి 2020 డిసెంబర్ మధ్య ఈ ఎఫ్డీలు మెచ్యూరిటీ తీరేట్టుగా డిపాజిట్ చేశారు. అప్పుడు వడ్డీ రేట్లు క్షీణ బాటలో ఉన్నాయి. కనుక 6.5 శాతం, 6 శాతం, 4.7 శాతంపై ఎఫ్డీ చేసినట్టు అయింది. 2020 డిసెంబర్ చివరికి మూడు ఎఫ్డీలపై కలిపి రూ.1,63,500 రాబడిగా వచ్చి ఉండేది. అలా కాకుండా మొత్తం రూ.9 లక్షలను 2018 జనవరిలో మూడేళ్ల కాలానికి (2020 డిసెంబర్లో గడువు తీరే విధంగా) ఎఫ్డీ చేసి ఉంటే, అప్పుడు రూ.1,75,500 రాబడిగా వచ్చి ఉండేది. మూడు భాగాలుగా చేయడం వల్ల (ఎఫ్డీ లాడరింగ్) ఈ ఉదాహరణలో (వడ్డీ రేట్లు పడిపోయే క్రమంలో) రూ.12,000 తక్కువ రాబడి పొందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో ఉదాహరణలో.. 2021 జనవరి నుంచి 2023 జూలై వరకు ఇంతే మొత్తాన్ని మూడు భాగాలుగా ఎఫ్డీ చేసుకుని ఉంటే (4.25 శాతం, 5.50 శాతం, 6.75 శాతం) మొత్తం మీద వడ్డీ రాబడి రెండున్నరేళ్లలో రూ.1,35,000 వచ్చి ఉండేది. అలా కాకుండా రూ.9 లక్షలను 2021 జనవరిలో ఒకే ఎఫ్డీగా చేసి ఉంటే, దీనిపై రాబడి రూ.1,14,750గా ఉండేది. ఎఫ్డీ లాడర్ కారణంగా రూ.20,300 అధిక రాబడి వచ్చినట్టు తెలుస్తోంది. ‘‘క్షీణించే, పెరుగుతూ పోయే వడ్డీ రేట్ల సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుని 2018–2023 కాలంలో ఎఫ్డీ లాడరింగ్ చేసి ఉంటే, ఈ మొత్తంపై రూ.8,250 అధిక రాబడికి అవకాశం లభించేది’’అని ముంబైకి చెందిన ఫిన్‌టెక్ సంస్థ ‘స్ట్రాటజీ’ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ ప్రశాంత బర్వాలియా వెల్లడించారు. ఏమిటి మార్గం..? నిజానికి వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో కంటే.. పెరుగుతున్న తరుణంలో, మిశ్రమంగా చలించే తరుణంలో ఎఫ్డీ లాడర్ ప్రయోజకరంగా ఉంటుంది. ఒక్క వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలోనే ఎఫ్డీ లాడర్ వల్ల కొంత నష్టపోవాల్సి వస్తుంది. కానీ, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు పెరుగుతాయా? లేదంటే తగ్గుతాయా? వడ్డీ రేటు గరిష్ట స్థాయికి చేరినట్టు ధ్రువీకరించుకోగలరా..? సాధారణ ఇన్వెస్టర్లకు ఇది క్లిష్టమైన టాస్క్ అవుతుంది. వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి కచి్చతంగా పెరుగుతాయని అనిపించినప్పుడే ఎఫ్డీ లాడర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఊహలు, అంచనాలపై ఆధారపడకుండా అన్ని కాలాల్లోనూ ఎఫ్డీ లాడార్ చేసుకోవడం అనుకూలమైన విధానం. ఎఫ్డీ లాడర్‌తో వడ్డీరేట్ల అస్థిరతలను అధిగమించడంతోపాటు, మరో ప్రయోజనం కూడా ఉంది. లిక్విడిటీ సమస్య ఉండబోదు. ఏడాదికోసారి లిక్విడిటీ చేతికి అందుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి క్రమం తప్పకుండా ఆదాయం అవసరం పడుతుంది. అటువంటి వారు మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలలు, పన్నెండు నెలల కాలానికి ఒక్కో భాగం చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ‘‘ఎఫ్డీ లాడరింగ్ అనేది వడ్డీ రేటు, పెట్టుబడుల రిస్‌్కను తగ్గిస్తుంది. దీనికితోడు వివిధ కాలాల్లో స్థిరమైన నగదు ప్రవాహాలకు అవకాశం కలి్పస్తుంది. కాకపోతే ఏడాదిలోపు కాల వ్యవధులకు చేసే మినీ లాడర్‌పై తక్కువ రాబడి వస్తుంది’’అని రాకెట్ఫోర్ట్ ఫిన్‌క్యాప్ వ్యవస్థాపకుడు వెంకట కృష్ణన్ శ్రీనివాసన్ సూచించారు. ఇక డిపాజిట్ చేసే ముందు అందుబాటులోని వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను పరిశీలించాలి. మెరుగైన రేటును ఆఫర్ చేసే బ్యాంక్‌లో ఎఫ్డీ చేసుకోవడం ద్వారా రాబడిని పెంచుకోవచ్చు. సాధారణంగా బ్యాంకుల్లో ఎఫ్‌డీల కాలవ్యవధి ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం అయితే 7.5 శాతం వరకు వడ్డీ రేటు ఎఫ్డీలపై లభిస్తోంది. 60 ఏళ్లు నిండిన వారికి అర శాతం అదనపు రేటు లభిస్తుంది. ఎఫ్డీ లాడార్లో వడ్డీ రేట్లు క్షీణించే క్రమంలో రాబడి తగ్గుతుంది. అయినా కానీ, ఈ విధానంపై నమ్మకం ఉన్న వారే దీన్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్య విషయం ఏమిటంటే.. ఏదైనా ఒక బ్యాంకులో అన్ని డిపాజిట్లు కలిపి రూ.5 లక్షలు మించకుండా, వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఏదైనా బ్యాంకు సంక్షోభంలో పడినా, రూ.5 లక్షల వరకు బీమా రూపంలో వెనక్కి వస్తుంది. -
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: వడ్డీ రేట్లు మారాయ్..
ప్రముఖ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను సవరించింది. రూ.2 కోట్లకుపైగా రూ.5 కోట్ల లోపు చేసే బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 2023 సెప్టెంబర్ 2 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి తెచ్చింది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల (Fixed Deposits) పై సీనియర్ సిటిజన్లతోపాటు సాధారణ వ్యక్తులకూ ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు కాల వ్యవధిలో ఉండే బల్క్ ఎఫ్డీలపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీ అందిస్తుంది. ఈ వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లు, సాధారణ వ్యక్తులకూ ఒకే రకంగా ఉంటుంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాల మెచ్యూరిటీలపై 7 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఇక 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు కాల వ్యవధిలో ఉండే డిపాజిట్లపై 6.75 శాతం లభిస్తుంది. 2 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే డిపాజిట్లపైనా ఇదే వడ్డీ రేటు ఉంటుంది. 185 రోజుల నుంచి 270 రోజుల వరకు టెన్యూర్ డిపాజిట్లపై 6.65 శాతం, 91 రోజుల నుంచి 184 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటు అమలవుతుంది. 61 రోజుల నుంచి 90 రోజుల టెన్యూర్‌కు 6 శాతం, 46 రోజుల నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లకు 5.75 శాతం, 30 రోజుల నుంచి 45 రోజుల వరకు టెన్యూర్ ఉండే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఇక కనిష్టంగా 7 రోజుల నుంచి 29 రోజుల వ్యవధిలో చేసే డిపాజిట్లపై 4.75 శాతం లభించనుంది. సవరించిన వడ్డీ రేట్లు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్లతోపాటు రెన్యూవల్ చేసే ఇప్పటికే ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకూ వర్తిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది. -
చైనా అనూహ్య నిర్ణయం: ఆందోళనలో ప్రపంచ దేశాలు
China ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వడ్డీరేట్లను రికార్డు స్థాయిలో పెంచుతూ పోతోంటే చైనా సర్కార్ మాత్రం ఇందుకు భిన్నమైన వైఖరిని తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను మరింత తగిస్తూ చైనా సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో రెండవసారి అనూహ్యంగా కీలక పాలసీ రేట్లను తగ్గించింది. (రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన) పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మంగళవారం మీడియం-టర్మ్ లెండింగ్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.5శాతంగా ఉంచింది. తగ్గించింది. మూడేళ్లలో ఇదే భారీ కోత. బలహీనమైన వినియోగదారుల వ్యయ వృద్ధి, స్లైడింగ్ పెట్టుబడి పెరుగుతున్న నిరుద్యోగం చూపిన జూలై డేటా విడుదలకు కొద్దిసేపటి ముందు ఈ చర్య తీసుకుంది. చైనా ఆర్థిక పరిస్థితి దారుణంగా కనిపిస్తోందనీ గత నెలలో బ్యాంకు రుణాలు 14 సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చైనా వృద్ధి గణాంకాలు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వృద్ధి రేటును వేగవంతం చేసేందుకు పింగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలోని నిరుద్యోగిత రేటును వెల్లడించకూడదని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నిర్ణయించింది. తాజా పరిణామాలతో హాంకాంగ్‌లో చైనా కరెన్సీ యువాన్ విలువ బలహీనపడి.. నవంబర్ 2022 స్థాయికి పడిపోయింది. భారీగా క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ అశాంతి ప్రమాదాన్ని పెంచుతుందని పెంటగాన్ మాజీ అధికారి, చైనాలో వ్యాపారవేత్త, ఇప్పుడు సింగపూర్‌లోని లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సీనియర్ ఫెలో డ్రూ థాంప్సన్ వ్యాఖ్యానించారు. అలాగే చైనా ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రపంచానికి కూడా చెడ్డ వార్తేనని ఆర్థిక విశ్లేషకులంటున్నారు. చైనాలో నిరంతర పునరుద్ధరణ లేకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన పెరగడంతో స్టాక్‌లు , బాండ్లు క్షీణించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2028 నాటికి ప్రపంచ వృద్ధికి అగ్రగామిగా ఉంటుందని గతంలో అంచనా వేసింది. చైనా మందగమనం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ ఈ వారం అన్నారు. ప్రధాన వినియోగ వస్తువుల దిగుమతులు క్షీణిస్తే ఆస్ట్రేలియా నుండి బ్రెజిల్ దాకా ప్రధాన ఉత్పత్తిదారుకు ప్రతికూలం. అలాగే ఎలక్ట్రానిక్స్‌కు స్వల్ప డిమాండ్ ఉన్న దక్షిణ కొరియా, తైవాన్ వంటి వాణిజ్య ఆధారిత ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుందనేది అంచనా. మరోవైపు వడ్డీరేట్లను భారీగా పెంచుతూ రష్యా కేంద్రబ్యాంకు తీసుకున్న నిర్ణయం గ్లోబల్‌గా ఆర్థిక వేత్తలను అందోళనకు గురిచేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగియ నంతవరకు, రష్యాలు ఆంక్షలు కొనసాగుతున్నంత కాలం ద్రవ్యోల్బణం, ఆ దేశ కరెన్సీ పతనానికి వడ్డీరేటు పెంపు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయంగా స్టాక్‌మార్కెట్లను ప్రభావితం చేస్తుందని అంచనావేసిన సంగతి తెలిసిందే. -
తగ్గిన వడ్డీ రేట్లు.. ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రద్దు.. బ్యాంక్ సంచలన నిర్ణయం!
Bank Of Maharashtra: ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో అప్పు చేయక తప్పదు. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేస్తే వడ్డీల మీద వడ్డీలు కట్టి అమాంతం మునిగిపోతారు. బ్యాంకుల వద్ద తీసుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ అంటూ ఎన్నెన్నో వసూలు చేస్తారు. అయితే అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ఒక బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాదారులు తీసుకునే లోన్ మీద ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వడ్డీ రేటుని కూడా భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అకౌంట్ హోల్డర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు హౌస్ అండ్ కార్ లోన్ వడ్డీ రేటుని 0.20 శాతం తగ్గించింది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు కూడా పూర్తిగా మాఫీ చేసింది. దీంతో కారు లోన్ 8.90 శాతం నుంచి 8.70 శాతానికి చేరింది. హౌస్ లోన్ వడ్డీ రేటు 8.60 శాతం నుంచి 8.50 శాతానికి (0.10 శాతం తగ్గింపు) చేరింది. ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త రూల్స్ 2023 ఆగష్టు 14 నుంచి అమలులో ఉంటాయని తెలుస్తోంది. తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల మినహాయింపు కస్టమర్లతో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో సహాయపడింది. అంతే కాకూండా లోనే తీసుకునే వారి సంఖ్య కూడా దీని వల్ల పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
‘గృహ ప్రవేశం’ ఎన్నికల తర్వాతే
ఎడతెరిపిలేని వర్షాలు, ఎన్నికల వాతావరణం, వడ్డీ రేట్ల ప్రభావం, ఐటీ ఉద్యోగుల లే–ఆఫ్‌లు, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కారణాలేవైనా హైదరాబాద్ స్థిరాస్తి రంగం మందగమనంలోకి జారిపోయింది. అపార్ట్మెంట్లే కాదు ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, ఆఫీసు స్పేస్ అన్ని లావాదేవీల్లోనూ ప్రతికూల వాతావరణమే కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి– మార్చి మధ్యకాలం (క్యూ1)తో పోలిస్తే ఏప్రిల్–జూన్ (క్యూ2) నాటికి అన్ని విభాగాల విక్రయాల్లోనూ తగ్గుదల నమోదయింది. –సాక్షి, హైదరాబాద్ కరోనా తర్వాత రెండేళ్లూ ఓకే.. కరోనా తర్వాత రెండేళ్ల పాటు స్థిరాస్తి రంగం బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మార్కెట్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా ప్రతి సార్వత్రిక ఎన్నికలకు 6–8 నెలల ముందు నుంచే స్థిరాస్తి వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం. ఏ ప్రభుత్వం వస్తుందో? కొత్త ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వ అభివృద్ధి పనులను కొనసాగిస్తుందో లేదో, పాత ప్రభు త్వమే వస్తే మళ్లీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వెంటాడుతుంటాయి. ఇటీవల డెవలç³ర్లు అనూహ్యంగా అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనలేని స్థితిలో ఉన్నారు. రూ.50 లక్షల లోపు ధర ఉండే మధ్యతరగతి గృహాలు విక్రయాలు లేక చాలావరకు ఖాళీగా ఉన్నాయి. గృహ విక్రయాలలో తగ్గుదల.. హైదరాబాద్‌లో అపార్ట్మెంట్ల సరఫరా, విక్రయాలు రెండింట్లోనూ తగ్గుదల కనిపిస్తోంది. ఈ ఏడాది క్యూ2లో హైదరాబాద్‌లో 10,470 గృహాలు ప్రారంభమయ్యాయి. అదే క్యూ1లో చూస్తే 14,620 యూనిట్లు ప్రారంభమయ్యాయి. అంటే 3 నెలల వ్యవధిలో గృహ సరఫరాలో 28 శాతం తగ్గుదల నమోదయ్యిందన్న మాట. ఇక విక్రయాలు చూస్తే.. క్యూ1లో 14,280 ఇళ్లు అమ్ముడుపోగా.. క్యూ2లో 13,570 యూనిట్లకు పడిపోయాయి. అంటే 5 శాతం తగ్గాయని అనరాక్ నివేదిక వెల్లడించింది. ఆఫీసు స్పేస్‌లోనూ క్షీణతే.. నివాస సముదాయాల్లోనే కాదు ఆఫీసు స్పేస్ లావాదేవీల్లోనూ తగ్గుదల నమోదయింది. ఈ ఏడాది క్యూ1లో హైదరాబాద్‌లో 24 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాల లీజు లావాదేవీలు జరగగా.. క్యూ2 నాటికి 23 లక్షల చ.అ.కు పడిపోయాయి. అంటే 3 నెలల్లో 4 శాతం క్షీణత చోటు చేసుకుందన్న మాట. దేశీయ, బహుళ జాతి కంపెనీల విస్తరణ నిర్ణయాల్లో జాప్యం, ప్రపంచ అనిశ్చిత పరిస్థితులు క్షీణతకు ప్రధాన కారణమని రియల్టీ కన్సల్టెన్సీ వెస్టియన్ సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో 1.39 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లూ అంతే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1.47 లక్షల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల దరఖాస్తులు వచ్చాయని ధరణి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో పార్టిషన్, సక్సెషన్, నాలా కింద వచ్చిన దరఖాస్తులే 40 వేల వరకుంటాయి. అంటే లక్ష డాక్యుమెంట్లు మాత్రమే క్రయవిక్రయాలకు సంబంధించి జరిగాయి. అదే గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పార్టిషన్, సక్సెషన్, నాలా మినహాయిస్తే.. 1.51 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే గతేడాదితో పోలిస్తే 50 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయన్న మాట. ఎన్నికల తర్వాతే మార్కెట్‌కు ఊపు హైదరాబాద్‌లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్నికల వాతావరణంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. కాబట్టి 3–6 నెలలు మార్కెట్ ప్రతికూలంగానే ఉంటుంది. ఎన్నికల తర్వాతే స్థిరాస్తి మార్కెట్జోరందుకుంటుంది. – టీవీ నర్సింహారెడ్డి, స్పేస్‌విజన్ గ్రూప్ -
మార్కెట్లో ‘ఫెడ్’ అప్రమత్తత
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ సూచీలు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం(నేటి రాత్రి), కీలక కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్ ఉదయం 146 పాయింట్ల లాభంతో 66,531 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 381 పాయింట్ల పరిధిలో 66,178 వద్ద కనిష్టాన్ని, 66,559 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29 పాయింట్ల స్వల్ప లాభంతో 66,356 వద్ద నిలిచింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 19,729 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 19,616 – 19,729 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి ఎనిమిది పాయింట్ల స్వల్ప నష్టంతో 19,681 వద్ద నిలిచింది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో రియల్టీ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. మెటల్, ఇంధన, ఆటో, ఫార్మా, మీడియా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.39%, 0.31 శాతం చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,089 కోట్ల షేర్లను కొన్నారు.., దేశీ ఇన్వెస్టర్లు రూ.334 కోట్ల షేర్లను అమ్మేశారు. ఆర్థిక వేత్తలు అంచనాలకు తగ్గట్లే ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంచొచ్చనే ఆశలతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ చైనాలో కోవిడ్ అనంతరం నెలకొన్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే వార్తలతో దేశీయ మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ మూడుశాతం ర్యాలీ చేసింది. జిందాల్ స్టీల్, హిందుస్థాన్ కాపర్, హిందాల్కో షేర్లు 5.50 – 4% ర్యాలీ చేశాయి. జేఎస్‌డబ్ల్యూ, ఏపీఎల్ అపోలో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, నాల్కో షేర్లు 3% లాభపడ్డాయి. సెయిల్, వేదాంత, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్ఎండీసీ, హిందూస్థాన్ జింక్ షేర్లు రెండు శాతం ర్యాలీ చేశాయి. ♦ దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో అదానీ గ్రూప్ షేర్లు లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 10%, అదానీ పవర్ 9.3% ర్యాలీ చేశాయి. అదానీ ట్రాన్స్మిషన్ 8%, అదానీ విల్మార్ 5%, అదానీ టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ షేర్లు పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ గ్రూప్ చెందిన అంబుజా సిమెంట్స్ 4%, ఏసీసీ 5%, లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్ 2% పెరిగాయి. పది కంపెనీల షేర్ల ర్యాలీతో గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఒక్క రోజులోనే రూ.50,501 కోట్లకు పెరిగి రూ.10.60 లక్షల కోట్లకు చేరింది. ♦ టాటా స్టీల్ షేరు ఆరంభ నష్టాల నుంచి కోలుకొని లాభాల్లోకి వచ్చింది. చివరికి 3% లాభపడి రూ.119 వద్ద స్థిరపడింది. -
వాహన రుణాలు రూ.5.09 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవస్థలో మొత్తం వాహన రుణాలు మే నాటికి రూ.5.09 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది మే నాటికి ఉన్న రూ.4.16 లక్షల కోట్లతో పోలిస్తే ఏడాదిలో 22 శాతం పెరిగాయి. 2021 మే నాటికి ఈ మొత్తం రూ.3.65 లక్షల కోట్లుగా ఉండడం గమనించొచ్చు. అంతకుముందు ఏడాది కంటే గతేడాది వాహన రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి వడ్డీ రేట్లను క్రమంగా సవరించడం మొదలు పెట్టి, ఈ ఏడాది ఫిబ్రవరిరి వరకు మొత్తం మీద 2.5 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. అయినప్పటికీ వాహన విక్రయాలు పెద్ద ఎత్తున పెరగడం వాహన రుణాలకు సైతం డిమాండ్‌ను తీసుకొచి్చంది. ఈ ఏడాది జూన్‌కు సంబంధించి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య విడుదల చేసిన గణాంకాలను పరిశీలించినా, అన్ని విభాగాల్లో వాహన విక్రయాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆటో రిటైల్ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వార్ గుప్తా తెలిపారు. కార్ల ధరలు, రుణాల రేట్లు పెరిగినప్పటికీ వాహన డిమాండ్ ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నా రు. అయితే కారు కొనుగోలు వ్యయం పెరిగినందున వాహన విచారణలు, విక్రయాల గణాంకాలు సమీప కాలానికి ఎలా ఉంటాయో పర్యవేక్షించాల్సి ఉందన్నారు. సెమీకండక్టర్ సరఫరా కొంత స్థిరపడినప్పటికీ, ఇక ముందూ సరఫరా పరంగా కొరత ఓఈఎంలను ఆందోళనకు గురి చేయవచ్చని గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఆదాయాలు ఆకాంక్షలు పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి వల్ల కార్లకు డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు ఆండ్రోమెడా సేల్స్, ఆప్నాపైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి.స్వామినాథన్ వివరించారు. ఆధునిక డిజైన్, ఫీచర్లతో నూతన కార్లను విడుదల చేస్తుండడంతో వీటి ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. కార్ల రుణాలకు ఎంతో ఆదరణ కనిపిస్తోందని, సగటు వాహన రుణం మొత్తం కూడా పెరిగినట్టు తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితం వైపు అడుగులు వేస్తుండడం, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో, అది వారి రుణ అర్హతను ఇతోధికం చేస్తుంది. దీనికి అదనంగా రుణ లభ్యతను ఫిన్‌టెక్ కంపెనీలు మరింత సులభతరం చేస్తున్నాయి. దీంతో వ్యక్తులు సులభంగా రుణాలు పొందేలా చేస్తోంది’’ అని స్వామినాథన్ వివరించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణతో, సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాతో ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుందని, ఇది ఆటో విక్రయాలకు మేలు చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. -
పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు, కానీ..!
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం సవరించింది. జూలై 1 నుంచి మొదలయ్యే మూడు నెలల కాలానికి తాజా రేట్లను ప్రకటించింది. కొన్నింటి పథకాల రేట్లను 0.3 శాతం వరకు పెంచగా, చాలా పథకాల్లో రేట్లను యథాతథంగా కొనసాగించింది. ♦ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)పై ప్రస్తుతం 6.2 శాతంగా ఉన్న రేటు పెంపు అనంతరం 6.5 శాతంగా మారింది. ♦ ఏడాది కాల టర్మ్ డిపాజిట్‌పై 0.1 శాతం పెరిగి 6.9 శాతానికి, రెండేళ్ల టైమ్ డిపాజిట్ రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి చేరింది ♦ మూడేళ్ల టర్మ్ డిపాజిట్ (7శాతం), ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ (7.5శాతం) రేట్లలో మార్పు చేయలేదు. ♦ అలాగే పీపీఎఫ్ వడ్డీ రేటు సైతం ఎలాంటి మార్పుల్లేకుండా 7.1 శాతంగా, సేవింగ్స్ డిపాజిట్ రేటు 4 శాతంగా కొనసాగనుంది. ♦ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) రేటు 7.7 శాతం, సుకన్య సమృద్ధి యోజన రేటు 8 శాతంలోనూ మార్పు చేయలేదు. ♦ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2శాతం, కిసా న్ వికాస్ పత్రం రేటు 7.5 శాతం కొనసాగనుంది. ♦ నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్) రేటు 7.4 శాతంగా కొనసాగుతుంది. పెంపు ఆగినట్టేనా? జనవరి-మార్చి, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి పొదుపు పథకాలపై రేట్లను పెంచింది. దీంతో ఈ విడత కేవలం 3 పథకాలు మినహా మిగిలిన వాటి రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ సైతం గత సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను మార్చలేదు. -
సానుకూలతలు కొనసాగొచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానంపై ఆర్బీఐ వైఖరి.., స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్ ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదైంది. మే తయారీ రంగ పీఎంఐ మెప్పించింది. తాజాగా అమెరికా ‘రుణ పరిమితి పెంపు’ చట్టంపై నెలకొన్న సందిగ్ధత సైతం తొలగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్న ఈ పరిణామాల ప్రభావం మరికొంత కాలం కొనసాగొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,650 – 18,800 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయి 18,450–18,500 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ తెలిపారు. అమెరికా అప్పుల పరిమితి పెంపు బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలుపుతుందో లేదో అనే ఆందోళనల నడుమ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా గతవారం సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు చొప్పున స్వల్పంగా లాభపడ్డాయి. మంగళవారం ఆర్బీఐ పాలసీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు గురువారం (జూన్ 8న) వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం దిగిరావడం, మార్చి జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదవడం తదితర పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే మొగ్గుచూపొచ్చని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోతే సూచీలు మరింత బలంగా ర్యాలీ చేయోచ్చంటున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం ఇవాళ భారత మే నెల సేవారంగ తయారీ గణాంకాలు విడుదల కానున్నాయి. అలాగే అమెరికా, యూరోజోన్, చైనా, పీఎఎంఐ డేటా సైతం ఇవాళ వెల్లడి కానుంది. బుధవారం మే నెల చైనా బ్యాలె న్స్ ఆఫ్ ట్రేడ్, గురువారం అమెరికా ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్, జపాన్ క్యూ1 జీడీపీ వృద్ధి, శుక్రవారం చైనా మే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. శుక్రవారం జూన్ తొలి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఏప్రిల్ 28న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. నైరుతి రుతుపవనాల వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. 9 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెలలో రూ.43,838 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇది తొమ్మిది గరిష్టమని మార్కెట్ నిపుణులు తెలిపారు. బలమైన ఆర్థిక గణాంకాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎఫ్‌పీఐలు 2022 ఆగస్టులో అత్యధికంగా రూ. 51,204 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలతో పాటు ప్రస్తుత నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి సానుకూలంగానే ఉన్నారు. జూన్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,490 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ‘‘గతవారం విడుదలైన జీడీపీ వృద్ధి రేటు, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల మద్దతు ఉన్నందున ఈ నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి అదే స్థాయిలో కొనసాగుతుంది’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ అన్నారు. -
స్కోర్ కొట్టు... లోన్ పట్టు!
అనుకోకుండా ఖర్చు వచ్చి పడితే ఏం చేయాలో తోచదు. వైద్యం, ఇంటి మరమ్మతులు, వేతనంలో కోత, ఉద్యోగం కోల్పోవడం, స్కూల్ ఫీజు.. అవసరం ఏదైనా వెంటనే డబ్బు కావాల్సి వస్తే.. క్రెడిట్ కార్డు నుంచి పరిమితి మేరకు డ్రా చేసుకుని గట్టె్టక్కేస్తుంటారు. ఇది కాకుండా అందుబాటులో ఉన్న మరో మార్గం వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్). హామీతో పని లేకుండా ఆదాయ వనరు ఉన్న ప్రతి ఒక్కరూ సులభంగా పొందగలిగి రుణం ఇది. దాదాపు అన్ని బ్యాంకులు మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లకు పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుంటాయి. వేగంగా ఒకటి రెండు రోజుల్లోనే రుణం మొత్తం చేతికి అందుతుంది. ప్రక్రియ ఎంతో సులభం, అందుకే నేటి రోజుల్లో పర్సనల్ లోన్ సాధనాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. అయితే, వ్యక్తిగత రుణం అయినా, గృహ రుణం అయినా వడ్డీ రేటు విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. దీనివల్ల పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కనీసం ఐదారేళ్ల కాలానికి వ్యక్తిగత రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అన్నేళ్లలో వడ్డీ రూపేణా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అందుకని వీలైనంత తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణాన్ని పొందే మార్గాలను అన్వేషించాలి. వీటిపై అవగాహన కల్పించే కథనమే ఇది. వ్యక్తిగత రుణం తీసుకునే వారు ముందు పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజును పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, వడ్డీ రేటు ఆధారంగా బ్యాంక్‌ను ఖరారు చేసుకోవాలి. ఖాతా ఉన్న బ్యాంకులోనే వ్యక్తిగత రుణం పొందాలనేమీ లేదు. తక్కువ రేటుకు వస్తుంటే ఇతర బ్యాంకుల ఆఫర్లను అయినా పరిశీలించొచ్చు. అయితే తక్కువ రేటుకు వ్యక్తిగత రుణం పొందేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ఇందులో ముందుగా వ్యక్తిగత క్రెడిట్ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఒకవైపు మన వ్యక్తిగత రుణ చరిత్ర బలంగా ఉండేలా (మెరుగైన స్కోర్) చూసుకోవాలి. మరోవైపు తక్కువ రేటుకు వ్యక్తిగత రుణాన్ని ఆఫర్ చేసే బ్యాంక్‌లను గుర్తించాలి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు కొంచెం తక్కువ రేటుకు రుణాన్నిచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే ఆ రుణం నమ్మకంగా తిరిగి వస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు ఉండవు. రిస్క్ దాదాపుగా ఉండదు కనుక తక్కువ రేటుకు ఇస్తాయి. ‘‘వ్యక్తిగత రుణాన్ని ఎలాంటి తనఖా లేదా హామీ లేకుండా బ్యాంకులు ఇస్తాయి. కనుక బ్యాంకులు ఎంత రుణం ఇవ్వాలి, ఎంత కాలానికి ఇవ్వాలి, ఎంత వడ్డీ రేటుకు ఇవ్వాలనే అంశాలను నిర్ణయించే విషయంలో రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. అధిక క్రెడిట్ స్కోరు ఉన్న వారు వడ్డీ రేటు తగ్గించాలంటూ బ్యాంకులను డిమాండ్ చేయవచ్చు’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ సూచించారు. (పెళ్లికొడుకు లుక్‌లో జబర్దస్త్‌గా..మస్క్: ఫోటోలు వైరల్) క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను ఉపయోగించుకునే వారు సకాలంలో బిల్లులను చెల్లించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డిఫాల్ట్ కాకూడదు. అలాగే, రుణం ఏదైనా కానీయండి ఈఎంఐల చెల్లింపుల విషయంలో బాధ్యతగా, క్రమశిక్షణగా వ్యవహరించాలి. వీలుంటే ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరిగే ఆప్షన్ నమోదు చేసుకోవాలి. వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తుంటే, అప్పటికే ఉన్న ఇతర రుణాలను తీర్చివేయడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. ‘‘మీ క్రెడిట్ కార్డ్ వినియోగ చరిత్ర చాలా సాఫీగా ఉండాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను కొన్ని రోజులు కూడా ఆలస్యం చేయొద్దు. ఒకటి రెండు సార్లు సకాలంలో చెల్లింపులు చేయకపోయినా, అది క్రెడిట్ చరిత్రలో మచ్చగా చేరొచ్చు. అప్పుడు రుణాలిచ్చే సంస్థలు దీన్ని రిస్క్‌గా భావిస్తాయి. రుణ వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది’’ అని ఇన్‌క్రెడ్ రిస్క్ అండ్ అనలైటిక్స్ ప్రెసిడెంట్ పృథ్వీ చంద్రశేఖర్ తెలిపారు. అవగాహన లేక క్రెడిట్ కార్డ్, వాహన, ఇతర రుణ వాయిదాల చెల్లింపుల్లో వైఫల్యం చోటుచేసుకుంటే అది భవిష్యత్తులో వారు తీసుకోబోయే రుణాలపై అధిక రేట్లకు దారితీస్తుందని గమనించాలి. అందుకే బ్యాంక్‌లు రుణ చరిత్రలో మచ్చలు ఉండి, రిస్క్ ఖాతాలుగా భావిస్తే అటువంటి వారికి సాధారణం కంటే అధిక వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తాయి. అదే సమయంలో చెల్లింపుల్లో ఎలాంటి వైఫల్యం లేని, మెరుగైన రుణ చరిత్ర ఉన్న వారికి తక్కువ రేటుకు ఆఫర్ చేస్తాయి. ఆఫర్లు.. వ్యక్తిగత రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకుల ఆఫర్లను, రుణ రేట్లు, నియమ, నిబంధనలు, షరతులు అన్నీ చూడాలి. ఆ తర్వాతే ఆకర్షణీయమైన ఆఫర్‌ను వినియోగించుకోవాలి. ముందుగా వేతన ఖాతా, డిపాజిట్లు ఉన్న బ్యాంకును అడిగి చూడాలి. ఆ తర్వాత వివిధ బ్యాంకుల రుణ రేట్లు, ఇతర ఆఫర్ల సమాచారం పొందొచ్చు. సాధారణంగా బ్యాంకుల వెబ్సైట్లో వ్యక్తిగత రుణాలపై ఫిక్స్డ్ రేటు ప్రదర్శించరు. కనిష్టం నుంచి గరిష్టం రేటును ప్రదర్శిస్తాయి. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి అందులో కనిష్ట రేటుకే రుణం లభించే అవకాశాలున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ‘‘రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు ఒక్కటే కాకుండా, కోరుకుంటున్న రుణం మొత్తం, లోన్ టు వ్యాల్యూ రేషియో, నెలవారీ ఆదాయం, ఉద్యోగ స్వరూపం, ఇతర అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని పైసా బజార్ సీనియర్ డైరెక్టర్ సని అరోరా తెలిపారు. కొన్ని బ్యాంకులు పండుగలు, ఇతర సమయాల్లో ప్రత్యేక రుణ మేళాలను నిర్వహిస్తుంటాయి. ఆ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీ రేటుపై రాయితీలు ఇస్తుంటాయి. కనుక వాటిని పరిశీలించొచ్చు. వీలైనన్ని రుణ సంస్థల మధ్య వ్యక్తిగత రుణ ఆఫర్లను పోల్చుకోవాలని అరోరా సూచించారు. ప్రముఖ సంస్థల ఉద్యోగులకు కొన్ని బ్యాంకులు కార్పొరేట్ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అలాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) మార్గాలు.. రుణ చెల్లింపులు సకాలంలో చేయడం వల్ల క్రెడిట్ స్కోరుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. రుణ వినియోగ రేషియో కూడా క్రెడిట్ స్కోరు లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే మీకు అందుబాటులో ఉన్న రుణం పరిమితిలో ఎంత వినియోగించుకున్నారనేది. రుణంపై మీరు ఏ మేరకు ఆధారపడుతున్నారో ఇది తెలియజేస్తుంది. నిపుణుల సూచన ప్రకారం.. క్రెడిట్ యూసేజ్ రేషియో 30 శాతం లోపు కొనసాగించాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై రూ.1 లక్ష క్రెడిట్ లిమిట్ ఉందని అనుకుందాం. అప్పుడు మీ వినియోగం రూ.30 వేల వరకు ఉండాలి. ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఒకే సమయంలో ఎక్కువ రుణాలకు దరఖాస్తు చేస్తుండడం కూ డా క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభా వం చూపి స్తుంది. అందుకే ఒకేసారి వెంటవెంట ఒక టికి మించిన క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవద్దు. అంతేకాదు ఒకటికి మించిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద వ్యక్తిగత రుణానికి అభ్యర్థనలు ఇవ్వొ ద్దు. దీనివల్ల ఏకకాలంలో ఒకటికి మించిన క్రెడిట్ అ భ్యర్థనల సమాచారం క్రెడిట్ బ్యూరోలకు చేరుతుంది. అది క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా?) వేతన ఖాతా.. ఉద్యోగులకు పర్సనల్ లోన్ విషయంలో బ్యాంకుల నుంచి మంచి ఆఫర్లు లభిస్తుంటాయి. వేతన ఖాతా ఉన్న బ్యాంకు నుంచి తీసుకోవడం అనుకూలమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ నెలవారీ వేతన జమ, మీ ఖర్చులు, ఉపసంహరణ వివరాలు ఖాతాలో నమోదై ఉంటాయి. కనుక రుణానికి ముందు బ్యాంక్ అధికారి వాటిని చూసి ఓ అంచనాకు రాగలరు. అందుకే వేతన ఖాతాలున్న వారికి ఇన్స్టంట్ పర్సనల్ లోన్‌ను చాలా బ్యాంకులు డిజిటల్‌గా ఆఫర్ చేస్తుంటాయి. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి తక్కువ రేటుకు రుణం పొందొచ్చు. ‘‘బ్యాంకులు సాధారణంగా తమ ఖాతాదారులకు సంబంధించి నియమ నిబంధనలు, షరతుల విషయంలో కొంచెం అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి. అంటే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తగ్గించడం, వేగంగా మంజూరు చేస్తాయి. సంబంధిత ఖాతాదారుకు సంబంధించి వేతనం, ఇతర వ్యయాల సమాచారం అందుబాటులో ఉండడం వల్ల ఆర్థిక స్థిరత్వం, సామర్థ్యాన్ని బ్యాంకులు అంచనా వేయగలవు’’అని అప్నా పైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వీ స్వామినాథన్ పేర్కొన్నారు. ఇతర చార్జీలనూ చూడాలి.. వ్యక్తిగత రుణంలో ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇతర చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. రుణంపై వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందుగా తీర్చేస్తే పడే చార్జీలు తెలుసుకుని నిర్ణయానికి రావాలి. కొన్ని బ్యాంకులు ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇతర బ్యాంకులు రుణం మొత్తంపై 1–3 శాతం మధ్య ప్రాసెసింగ్ ఫీజు విధిస్తున్నాయి. రుణం ముందుగా చెల్లిస్తే విధించే చార్జీలు కూడా బ్యాంకుల మధ్య వేర్వేరుగా ఉంటాయి. అందుకే భవిష్యత్తులో ముందుగా తీర్చివేసే ఉద్దేశం ఉందా అని చూడాలి. వడ్డీ రేటుపై అవగాహన... తక్కువ రేటుపై వ్యక్తిగత రుణాన్ని తీసుకున్నా.. రుణం కాల వ్యవధిలో వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే చెల్లిస్తుంటారు. ముందుగా బ్యాంకులు రుణంపై వడ్డీ రేటును ఎలా లెక్కిస్తాయన్నది తెలుసుకోవాలి. ఫ్లాట్ రేటు, లేదా తగ్గింపు రేటును బ్యాంకులు ఆఫర్ చేయొచ్చు. ఫ్లాట్ వడ్డీ రేటు అయితే రుణం కాల వ్యవధి అంతటా అసలు మొత్తం (ప్రిన్సిపల్)పైనే వడ్డీ రేటు అమలవుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షల రుణాన్ని 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారనుకోండి. మొత్తం మీద రూ.1,80,000ను వడ్డీ కింద చెల్లించాలి. నెలవారీ ఈఎంఐ రూ.18,889 అవుతుంది. అదే తగ్గింపు వడ్డీ రేటు విధానంలో.. ప్రతీ వాయిదాకు ముందు మిగిలిన ఉన్న బకాయిపైనే వడ్డీ రేటును బ్యాంకులు లెక్కిస్తాయి. రూ. 5 లక్షల రుణాన్ని తగ్గింపు రేటు విధానంలో 12 శాతం రేటుపై మూడేళ్లకు తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు మూడేళ్లలో వడ్డీ రూపేణా రూ.97,858 చెల్లించాల్సి వస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.16,607 అవుతుంది. దీంతో మొత్తం మీద ఈ విధానం వల్ల రూ.82,142 ఆదా అవుతుంది. అందుకే రెడ్యూసింగ్ ఇంటరెస్ట్ రేట్ విధానంలోనే వ్యక్తిగత రుణాన్ని తీసుకోవాలి. పర్సనల్ లోన్‌పై తక్కువ రేటుకు ఇస్తామంటే బుట్టలో పడిపోకుండా.. రుణంపై వడ్డీ రేటును నెలవారీ ఎలా లెక్కిస్తారో అడిగి స్పష్టత తెచ్చుకోవాలి. -
ఎఫ్డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది కాల ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) రేట్లను పెంచింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు ఏడాది కాల డిపాజిట్‌పై 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇది ఇంతకుముందు 6 శాతం ఉండేది. అంటే 100 బేసిస్ పాయింట్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. అదే 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏడాది కాల ఎఫ్డీపై 7.50 శాతం, 80 ఏళ్లు నిండిన వారికి 7.65 శాతం ఇస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. తాజా రేట్ల సవరణ తర్వాత ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలం వరకు డిపాజిట్లపై రేట్లు 3–7 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ డిపాజిట్లకు వర్తిస్తాయి. -
సూచీలకు మళ్లీ లాభాలు
ముంబై: ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత దేశీయ స్టాక్ సూచీలకు గురువారం మళ్లీ లాభాలొచ్చాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ దఫా చివరిది కావచ్చంటూ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన కమిటి నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల విడుదలైన దేశీయ కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలు మెప్పించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1% వరకు బలపడి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు పెరిగి 61,258 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 605 పాయింట్లు ర్యాలీ చేసి 61,797 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 556 పాయింట్ల లాభంతో 61,749 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 177 పాయింట్లు దూసుకెళ్లి 18,267 గరిష్టాన్ని తాకింది. చివరికి 166 పాయింట్లు బలపడి 18,256 వద్ద నిలిచింది. విస్తృత స్థాయి మార్కెట్లో ఒక్క ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.83%, 0.82% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1415 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.442 కోట్ల షేర్లను కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం విలువ రూ.2.21 లక్షల కోట్లు పెరిగి 275.13 లక్షల కోట్లకు చేరింది. ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్ సూచీలు లాభపడగా., కొరియా ఇండెక్స్ నష్టపోయింది. ఈసీబీ పావుశాతం వడ్డీరేట్ల పెంపుతో యూరప్ మార్కెట్లు 0.50 – 1% క్షీణించాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీస్ ‘బై’ రేటింగ్‌తో ఫుడ్ డెలీవరీ దిగ్గజం జొమాటో షేరు 3% పైగా లాభపడి రూ.65.63 వద్ద స్థిరపడింది. ► మార్చి త్రైమాసికంలో నికరలాభం 13% బజాజ్ కన్జూమర్ కేర్ షేరు నాలుగుశాతం పెరిగి రూ.172 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో పదిశాతం దూసుకెళ్లి రూ.182 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ► అంచనాలకు మించి మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడంతో ఏబీబీ షేరు ఐదున్నర శాతం బలపడి రూ.3,646 వద్ద స్థిరపడింది. -
లెక్క ఎక్కువైనా పర్లేదు..మాకు కాస్ట్లీ ఇళ్లే కావాలి!
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగితే అది తమ భవిష్యత్తు కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని 96 శాతం మంది కొనుగోలుదారులు (ఇల్లు కొనాలని అనుకుంటున్నట్టు) చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్, సీఐఐతో కలసి దీనిపై ఓ సర్వే నిర్వహించింది. ‘ద హౌసింగ్ మార్కెట్ బూమ్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి ఇప్పటి వరకు రెపో రేటుని 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. ఇటీవలి ఏప్రిల్ సమీక్షలో మాత్రం రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తటస్థ వైఖరిని ప్రదర్శించింది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 80 శాతం మంది తమకు ధరలు ముఖ్యమైన అంశమని చెప్పారు. ఒకవైపు నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు పెరిగిన ఫలితంగా ప్రాపర్టీల ధరలకు సైతం రెక్కలు రావడం తెలిసిందే. దీనికి తోడు గృహ రుణాలపై రేట్లు 2.5 శాతం మేర పెరగడం భారాన్ని మరింత పెరిగేలా చేసింది. విశాలమైన ఇంటికే ప్రాధాన్యం.. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో పెద్ద మార్పు కనిపించలేదు. 42 శాతం మంది 3బీహెచ్‌కే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 40 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలుకు అనుకూలంగా ఉండగా, 12 శాతం మంది ఒక్క పడకగది ఇంటి కోసం చూస్తున్నారు. 6 శాతం మంది అయితే 3బీహెచ్‌కే కంటే పెద్ద ఇళ్లను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది తాము రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధరలో ఇంటిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసుకునే ఇంటికే తాము ప్రాధాన్యం ఇస్తామని 36 శాతం మంది తెలిపారు. దేశ రాజధాని ప్రాంత పరిధిలో ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారిలో 45 శాతం మంది 3బీహెచ్‌కే తీసుకోవాలని అనుకుంటున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 42 శాతం మంది ఎంపిక 2బీహెచ్కేగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉండడం కొనుగోలు ప్రాధాన్యతల్లో మార్పునకు కారణమని తెలుస్తోంది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 52 శాతం మంది సొంత వినియోగానికేనని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల ప్రభావం ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, అంతర్జాతీ య ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితి ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశీయ హౌసింగ్ డిమాండ్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి అన్నారు. మొత్తం మీద ఇళ్ల డిమాండ్‌లో రేట్ల పెంపు ఒక భాగమేనని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెద్దా, చిన్న కంపెనీల్లో ఉద్యోగాల కోతలు సైతం ఇళ్ల కొనుగోలు డిమాండ్‌పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకోవచ్చన్నారు. 2024–25 నాటికి అన్ని సమస్యలు సమసిపోయి, హౌసింగ్ మార్కెట్ తిరిగి బలంగా పుంజు కుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
కోటక్ మహీంద్ర బ్యాంకు వినియోగదారులకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాల వ్యవధిలోని ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి) వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు సోమవారం( ఏప్రిల్ 10, 2023)నుంచి అమల్లోకి వచ్చాయి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు 2.75 శాతం నుంచి 7.20 శాతం వరకు వడ్డీ రేటును కోటక్ మహీంద్రా బ్యాంకు చెల్లిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుండి 7.70 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తుంది. సాధారణ ఖాతాదారులతో పోల్చితే, సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందిస్తుంది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) అలాగే 390 రోజుల నుంచి రెండేళ్ల లోపు ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు గరిష్టంగా 7.20 శాతం, అలాగే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. (మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ దెబ్బ! మస్క్‌కు భారీ ఝలక్!) ఎఫ్డీలపై కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రస్తుత వడ్డీ రేట్లు 2 నుంచి మూడేళ్ల లోపు కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 7 శాతం 3 నుంచి నాలుగేళ్ల లోపు పరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.50 శాతం 4- 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం 5 - 10 సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.20 శాతం వడ్డీ రేటును బ్యాంకు చెల్లిస్తుంది. -
భారత్ వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంక్ కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతానికి పరిమితమవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనాలను 6.6 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, ఆదాయ వృద్ధి మందగమనం, అధిక ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తన క్రితం అంచనాల తాజా తగ్గింపునకు కారణమని దక్షిణాసియాకు సంబంధించి ఆవిష్కరించిన నివేదికలో బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక (స్ప్రింగ్) సమావేశాలకు ముందు వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా) హన్స్ టిమ్మర్ ఈ నివేదిక విడుదల చేశారు. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ♦ బలహీన వినియోగం, కఠిన వడ్డీరేట్ల వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ ప్రస్తుత వ్యయ నియంత్రణ అంచనాల డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణం. ♦ దక్షిణాసియాలోని అనేక ఇతర దేశాల కంటే భారతదేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆర్థిక రంగంలో పరిస్థితి ఇతర దేశాల కంటే బాగుంది. భారతదేశంలోని బ్యాంకులు పటిష్ట స్థితిలో ఉన్నాయి. మహమ్మారి తర్వాత బ్యాంకింగ్ చక్కటి రికవరీ సాధించింది. ఆర్థిక వ్యవస్థలో తగిన రుణాలకుగాను లిక్విడిటీ బాగుంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే ప్రైవేట్ పెట్టుబడులు చాలా బలంగా ఉన్నాయి. సమస్యల్లా దేశం తన సామర్థ్యాన్ని తక్కువ స్థాయిలో వినియోగించుకోవడమే. ♦ భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అసంఘటిత రంగం ఉత్పాదకత పెరుగుతోందన్న దాఖలాలు లేవు. అలాగని ఫలితాలూ మరీ అధ్వానంగానూ లేవు. ఆయా అంశాలను పరిశీలిస్తే అన్ని వర్గాల భాగస్వామ్యంతో వృద్ధిని మరింత పెంచడానికి భారత్ ముందు భారీ నిర్మాణాత్మక ఎజెండా ఉందని భావిస్తున్నాం. ♦ విదేశాల నుండి ప్రైవేట్ పెట్టుబడులు మరింత పెరగాలి. ముఖ్యంగా సేవల రంగాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇందుకుగాను సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఉద్గారాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలి. దక్షిణాసియా దేశాలపై ఇలా.. స్వల్పకాలికంగా చూస్తే, భారత్ దక్షిణాసియాలో ఇతర దేశాలకంటే పటిష్ట ఎకానమీని కలిగి ఉంది. భూటాన్ మినహా ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు తమ వృద్ధి అంచనాలను కుదించుకుంటున్నాయి. గత ఏడాది విపత్తు వరదల ప్రభావంతో పాకిస్తాన్ ఇంకా సతమతమవుతూనే ఉంది. సరఫరాల వ్యవస్థకు తీవ్ర అంతరాయాలు ఎదురవుతున్నాయి. పెట్టుబడిదారుల విశ్వాసం దిగజారుతోంది. అధిక రుణ, మూలధన వ్యయాలు భారమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ వృద్ధి ఈ ఏడాది 0.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక రుణ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఎకానమీలో వృద్ధి లేకపోగా, ఇది ఈ ఏడాది 4.3% క్షీణిస్తుందన్నది అంచనా. పర్యాటకం ఊపందుకోవడం మాల్దీవులు, నేపాల్‌కు సానుకూల అంశాలైనా, అంతకుమించి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావాలు ఈ దేశాలు ఎదుర్కొననున్నాయి. దక్షిణాసియాలో 2023లో 8.9 శాతం ద్రవ్యోల్బణం అంచనాలు ఉన్నాయి. 2024లో ఇది 7% లోపునకు తగ్గవచ్చు. అయితే బలహీన కరెన్సీలు పెద్ద సమస్యగా ఉంది. ద్రవ్యోల్బణం భయాలను పెంచే అంశమిది. వృద్ధి 6.4 శాతం: ఏడీబీ ఇదిలాఉండగా, 2023–24లో భారత్ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అవుట్‌లుక్ ఒకటి పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసిన ఏడీబీ, 2023–24లో ఈ రేటు తగ్గడానికి కఠిన ద్రవ్య పరిస్థితులు, చమురు ధరలు పెరగడాన్ని కారణంగా చూపింది. కాగా, 2024–25లో వృద్ధి రేటు 6.7 శాతానికి పెరుగుతుందని ఏడీబీ అంచనావేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరగడం దీనికి కారణంగా చూపింది. రవాణా రంగం పురోగతికి, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఫలితాలు ఇస్తాయని ఏడీబీ వివరించింది. అంతర్జాతీయంగా పలు దేశాలు మాంద్యం ముంగిట నుంచున్నప్పటికీ, భారత్ ఎకానమీ తన సహచర దేశాల ఎకానమీలతో పోల్చితే పటిష్టంగా ఉందని ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టకియో కినీషీ పేర్కొన్నారు. -
చిన్న పొదుపులకు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: ఎకానమీలో వడ్డీరేట్ల పెరుగుదల పరిణామాలు చిన్న పొదుపుదారులకు మేలు చేకూర్చుతున్నాయి. 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి పలు పోస్టాఫీసు పొదుపు పథకాలపై వడ్డీరేట్లను 0.1 శాతం నుంచి 0.7 శాతం వరకూ పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆర్బీఐ రెపో రేటును వరుసగా ఆరుసార్లు 2.5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. ఇది బ్యాంకులు అటు రుణ రేట్లు-ఇటు డిపాజిట్ రేట్ల పెరుగుదలకు దారితీస్తోంది. రానున్న త్రైమాసికానికి సంబంధించి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సేవింగ్స్ డిపాజిట్ల వడ్డీరేట్లు వరుసగా 7.1శాతం, 4 శాతాలుగా కొనసాగించినప్పటికీ, ఇతర సేవింగ్స్ పథకాలపై రేట్లు 0.1శాతం నుంచి 0.7శాతం మధ్య పెరిగాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై (ఎన్ఎస్సీ)పై అత్యధికంగా వడ్డీరేటు పెరిగింది. పథకాల వారీగా రేట్ల పెరుగుదల (శాతాల్లో) పథకం కొత్త వడ్డీ పాత వడ్డీ ఎన్ఎస్సీ 7.7 7 సుకన్యా సమృద్ధి 8 7.6 సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2 8 కిసాన్ వికాస్ పత్ర 7.5 7.2 ఏడాది టర్మ్ డిపాజిట్ 6.8 6.6 రెండేళ్ల టర్మ్ డిపాజిట్ 6.9 6.8 మూడేళ్ల టర్మ్ డిపాజిట్ 7 6.9 ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ 7.5 7 నెలవారీ ఆదాయ పథకం 7.4 7.1 -
ఎస్బీఐ షాకిచ్చిందిగా.. రేపటినుంచే అమలు
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజంస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. తన బేస్ రేట్, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్లను పెంచింది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్)ని 70 బేసిస్ పాయింట్లు లేదా 0.7 శాతం పెంచింది. దీంతో బీపీఎల్ఆర్ రేటు 14.85 శాతానికి చేరింది. అలాగే పబ్లిక్ లెండర్ కూడా బేస్ రేటును 9.40 శాతం నుండి 10.10 శాతానికి పెంచింది. రేపటి(మార్చి15) నుంచి సవరించిన రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో ఎస్సీబీలో రుణాలు తీసుకున్న వినియోగ దారుల నెలవారీ ఈఎంఐ పెరగనున్నాయి. అన్ని రుణాలకు వర్తించే కనీస రేటునే బేస్ రేటు అంటారు. అంటే నిర్ణయించిన రేటు కంటే తక్కువకు రుణాలివ్వడానికి వీలుండదు. ఇక బీపీఎల్ఆర్ అనేది బేస్ రేటుకు ముందున్న రుణాలకు మాత్రమే వర్తించే రేటు. అయితే ఫండ్స్ ఆధారిత రుణ రేట్ల మార్జినల్ రేటు యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఇది గృహ రుణాల రేటుపై ప్రభావం చూపదని తెలిపింది. ఎంసీఎల్ఆర్ అంటే బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇచ్చే రేటు. కాగా ఫిబ్రవరి 15, 2023న 10 బేసిస్ పాయింట్లు లేదా 0.1 శాతం పెంచింది. దీని ప్రకారం ఒక సంవత్సరం రుణాలు, రెండేళ్ల,మూడేళ్ల రుణాలకు వర్తించే వడ్డీ రేట్లు వరుసగా 8.50 శాతం, 8.60 శాతం మరియు 8.70 శాతంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేక్రమంలో ఆర్బీఐ తన తాజా( ఫిబ్రవరి 8) నాటి పాలసీ రివ్యూలోరెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది. -
వివాద్ సే విశ్వాస్ను ఆకర్షణీయంగా మార్చాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో భాగంగా ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్పులు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ప్రభుత్వాన్ని కోరాయి. రీయింబర్స్మెంట్, వడ్డీ రేట్ల పరంగా ఆకర్షణీయంగా మార్చాలని ఎంఎస్ఎంఈలు కోరినట్టు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అంతేకాదు, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఆన్లైన్లో ఉండాలని డిమాండ్ చేశాయి. బడ్జెట్ అనంతరం డీపీఐఐటీ ఏర్పాటు చేసిన వెబినార్‌లో భాగంగా ఈ అంశాలను ఎంఎస్ఎంఈలు లేవనెత్తాయి. టెక్నాలజీ వినియోగంతో వ్యాపార సులభతర నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 2023–24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈలకు వివాద్సే విశ్వాస్ పథకాన్ని ప్రకటించారు. -
చాలా కాలం తర్వాత ఎఫ్డీలకు కళ!
ముంబై: చాలా ఏళ్ల విరామం తర్వాత బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. వడ్డీ రేట్లు 8 శాతాన్ని దాటాయి. ప్రభుత్వరంగంలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అత్యధికంగా 8–8.5 శాతం వరకు రేట్లను ఆఫర్ చేస్తోంది. ద్రవ్యోల్బణం మించి రాబడిని బ్యాంక్‌లు 200–800 రోజుల డిపాజిట్లపై ఇస్తున్నాయి. ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకోవంతో రుణాలకు డిమాండ్ నెలకొంది. రుణ డిమాండ్‌ను అందుకునేందుకు బ్యాంక్‌లు నిధుల కోసం వేట మొదలు పెట్టాయి. ఫలితంగా డిపాజిట్ రేట్లను సవరిస్తున్నాయి. జనవరి నెలకు ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉండడం గమనించాలి. రుణాలకు డిమాండ్.. జనవరి 13తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకుల రుణ వృద్ధి 16.5 శాతంగా (వార్షికంగా చూస్తే) ఉంది. కానీ, అదే కాలంలో డిపాజిట్లలో వృద్ధి 10.6 శాతంగా ఉంది. ఇక గత ఏడాది కాలంలో డిపాజిట్లలో వృద్ధి 6 శాతం మించి లేదు. ఇటీవల వడ్డీ రేట్లు పెరగడంతో డిపాజిట్లలోనూ వృద్ధి మొదలైందని చెప్పుకోవాలి. ఏడాది కాల పోస్టాఫీసు డిపాజిట్‌పై రేటు 6.6 శాతంగా ఉంటే, రెండేళ్ల కాలానికి 6.8 శాతంగా ఉంది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీ ఈల్డ్ 7.35 శాతంగా ఉంది. వీటితో ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్లు పోటీపడుతున్నాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచింది. దీంతో బ్యాంకులు సైతం రుణాలపై ఇంతే మేర రేట్లు పెంచాయి. ఫలితంగా డిపాజిట్లపై మరింత రాబడిని ఆఫర్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. కానీ, రుణాలపై పెంచిన స్థాయిలో రేట్లను డిపాజిట్లపై ఆఫర్ చేయకపోవడాన్ని గమనించొచ్చు. బ్యాంకుల వారీ రేట్లు.. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 200–800 రోజుల కాలానికి వడ్డీ రేట్లు 7–7.25శాతం స్థాయిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 20వేల శాఖలతో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ 400 రోజుల డిపాజిట్‌పై 7.10 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అదనంగా ఇస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజుల డిపాజిట్‌పై 7.35 శాతం రేటును ఇస్తోంది. యూనియన్ బ్యాంక్ 800 రోజుల డిపాజిట్‌పై 7.30 శాతం, పీఎన్బీ 666 రోజుల డిపాజిట్‌పై 7.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజులు డిపాజిట్‌పై ఇంతే మేర ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 200 రోజుల డిపాజిట్‌పై 7 శాతం ఇస్తుంటే, కెనరా బ్యాంక్ 400 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం, యూకో బ్యాంక్ 666 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 7 శాతం చొప్పున ఇస్తున్నాయి. -
వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు
ముంబై: వడ్డీ రేటు పెంపు జాబితాలో తాజాగా ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (ఐఓబీ) చేరాయి. ఈ నెల మొదట్లో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను పావుశాతం పెంచడం (6.5 శాతానికి) దీనికి నేపథ్యం. ఎస్బీఐ బుధవారం రేట్ల పెంపు నేపథ్యంలో తాజాగా ఈ జాబితాలో బీఓబీ, ఐఓబీలు చేరడం గమనార్హం. బీఓబీ: నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు– ఎంసీఎల్ఆర్ను అన్ని కాల వ్యవధులపై 5 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఫిబ్రవరి 12 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని పేర్కొంది. తాజా పెంపు నేపథ్యంలో ఏడాది రేటు 8.55 శాతానికి, ఓవర్‌నైట్, నెల, మూడు నెలా రేట్లు వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.3 శాతానికి చేరాయి. ఐఓబీ: అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 0.15 శాతం పెరిగి 8.45కు చేరింది. నెల, మూడు, ఆరు నెలల రేట్లుసైతం ఇదే స్థాయిలో పెరిగి వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.35 శాతాలకు చేరాయి. ఓవర్‌నైట్, రెండేళ్లు, మూడేళ్ల రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఎస్బీఐ డిపాజిటర్లకు తీపికబురు రుణ రేటును బుధవారం 10 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్ రేట్లను కూడా గురువారం 5 నుంచి 25 బేసిస్ పాయింట్ల శ్రేణిలో పెంచింది. తాజా పెంపు నేపథ్యంలో ఐదేళ్ల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 8.5 శాతం వడ్డీరేటు పొందుతారు. ఏడాది నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య రేటు పావుశాతం పెరిగి 7 శాతానికి చేరింది. మూడేళ్ల పైబడిన డిపాజిట్లపై రేటు కూడా పావుశాతం పెరిగి 6.5 శాతానికి చేరింది. (ఇదీ చదవండి: ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..) -
కెనరా బ్యాంక్ 400 రోజుల డిపాజిట్
హైదరాబాద్: కెనరా బ్యాంక్ నూతనంగా 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. దీనిపై 7.75 శాతం వరకు వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇందులో నాన్ కాలబుల్ డిపాజిట్ (గడువుకు ముందు ఉపసంహరించుకోలేనివి)పై 7.25 శాతం రేటును ఆఫర్ చేస్తుండగా, కాలబుల్ డిపాజిట్‌పై (గడువుకు ముందు రద్దు, పాక్షిక ఉపసంహరణకు వీలైనవి) 7.15 శాతం వార్షిక వడ్డీ రేటును ఇస్తున్నట్టు కెనరా బ్యాంక్ తెలిపింది. 60 ఏళ్లు నిండిన వారికి 0.50 శాతం అదనపు రేటును ఇస్తోంది. -
కొత్త సంవత్సరం.. కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్!
ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ కొత్త సంవత్సరం తన కస్టమర్లకు షాకిచ్చింది. జనవరి నెల నుంచి రుణ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం పడనుంది. తాజా పెంపుతో రుణగ్రహితలపై అధిక వడ్డీల భారం పడనుంది. ఇప్పటికే పలు బ్యాంకుల తమ వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. కెనరా బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR) 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పెంపు నిర్ణయం జనవరి 7 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. రేట్ల పెంపు తర్వాత వీటిపై లుక్కేస్తే.. ఓవర్ నైట్, ఒకనెల రోజులకు ఎంసీఎల్ఆర్ రేటు 7.5 శాతంగా ఉండగా, 3 నెలలకు ఎంసీఎల్ఆర్ 7.85 శాతంగా ఉంది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.2 శాతం, ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం పెంచిన కొత్త రేట్లు కారణంగా ఇకపై కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. వీటితో పాటు రెన్యూవల్, రీసెట్ డేట్ తర్వాత కూడా ఈ కొత్త రుణ రేట్లు అమలులోకి వస్తాయి. చదవండి: అమెజాన్: భారత్‌లో ఊడిన ఉద్యోగాల సంఖ్య ఇది -
కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్బీ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అన్ని కాలపరిమితులపై డిపాజిట్ రేటును అరశాతం పెంచింది. రూ.2 కోట్లలోపు ఏడాది, మూడేళ్ల మధ్య వడ్డీరేట్లు అరశాతం పెరిగి వరుసగా 6.75 శాతానికి పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం వడ్డీ అందుతుంది. ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయెల్ అవకాశం లేని పీఎన్బీ ఉత్తమ్ స్కీమ్ కింద డిపాజిట్ రేటు 6.8 శాతానికి ఎగసింది. 666 రోజుల స్థిర డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 8.1 శాతంగా కొనసాగుతుంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
వడ్డీ రేట్లవైపు మార్కెట్ చూపు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లను ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ తీసుకోనున్న పరపతి నిర్ణయాలు ప్రభావం చూపనున్నాయి. గత కొన్ని నెలలుగా ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల పెంపును బలపరుస్తోంది. ధరల అదుపునకే తొలి ప్రాధాన్యమిస్తూ కీలక రేటు రెపోను పెంచుతూ వస్తోంది. గత పాలసీ సమీక్షలో చేపట్టిన 0.5 శాతం పెంపుతో ప్రస్తుతం వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 5.9 శాతానికి చేరింది. తిరిగి ఈ నెల 5–7 మధ్య ఎంపీసీ పరపతి సమీక్షను నిర్వహించనుంది. ద్రవ్యోల్బణ కట్టడికి మరోసారి 0.25–0.35 శాతం స్థాయిలో రెపోను పెంచే వీలున్నట్లు అత్యధిక శాతం మంది బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఫలితాలపై కన్ను కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటి(5)తో పూర్తికానుంది. వీటితోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు 8న వెలువడనున్నాయి. 7న ఆర్బీఐ నిర్ణయాలు, 8న ఎన్నికల ఫలితాలు మార్కెట్ల దిశను నిర్ధారించవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు దీపక్ జసానీ పేర్కొంటున్నారు. ఇవికాకుండా విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సైతం సెంటిమెంటుపై ప్రభావం చూపగలవని భావిస్తున్నారు. పెట్టుబడులు కీలకం రష్యా– ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో కొద్ది రోజులుగా ప్రపంచస్థాయిలో ధరలు అదుపు తప్పుతున్న సంగతి తెలిసిందే. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు తదితర కఠిన పరపతి విధానాలను అమలు చేస్తున్నాయి. దీంతో డాలరు బలపడుతుంటే దేశీ కరెన్సీ నేలచూపులు చూస్తోంది. అయితే ఇకపై ఫెడ్ వడ్డీ పెంపు వేగం మందగించవచ్చన్న అంచనాలతో ట్రెజరీ ఈల్డ్స్, డాలరు కొంతమేర వెనకడుగు వేస్తున్నాయి. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్లకు కీలకంకానున్నాయి. ఇటీవల ఎఫ్‌పీఐలు అమ్మకాలను వీడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో దేశీ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను సాధిస్తున్న విషయం విదితమే. రికార్డుల వారం గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో పరుగు తీశాయి. సెన్సెక్స్ నికరంగా 575 పాయింట్లు బలపడి 62,869 వద్ద, నిఫ్టీ 183 పాయింట్లు పుంజుకుని 18,696 వద్ద స్థిరపడ్డాయి. గురువారం(1న) సెన్సెక్స్ 63,583, నిఫ్టీ 18,888 పాయింట్లను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాలను సాధించాయి. కాగా.. సమీప కాలంలో దేశీ మార్కెట్లకు ఆర్బీఐ, ఫెడ్ నిర్ణయాలు మార్గనిర్దేశం చేయనున్నట్లు శామ్కో సెక్యూరిటీస్ నిపుణులు అపూర్వ షేత్, కొటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు అమోల్ అథవాలే, జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. -
వారెవ్వా.. ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు!
ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) మరోసారి వడ్డీ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ఇది రెండో సారి. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నవంబర్ 7 నుంచి అమలులోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలకు ఈ పెంపు వర్తిస్తుంది. 15 నెలల ఒక రోజు నుంచి 18 నెలల లోపు కాలవ్యవధి ఎఫ్డీలు 6.40% వడ్డీని పొందుతారు. 18 నెలల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఎఫ్డీపై 6.50% వడ్డీని పొందనున్నారు. సీనియర్ సిటిజన్స్ హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు ఎఫ్‌డీల వడ్డీ రేటు పెంచిన సంగతి తెలిసింతే. అయితే 60 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం పెంచిన వడ్డీ రేటుపై మరో 0.50 శాతం అదనపు రేటు ప్రయోజనాన్ని అందిస్తోంది. దీంతో ఈ బ్యాంక్ ఖాతాదారులకు ఒకే సారి రెండు శుభవార్తలను అందించింది. బ్యాంక్‌లో వీరికి వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభం కాగా గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. వీటితో పాటు రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచేసింది. 15 నెలల ఒక రోజు నుండి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధికి ఇప్పుడు 6.90% వడ్డీని అందిస్తోంది. చదవండి: ఆ ఐఫోన్‌ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’! -
యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు షాక్!
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను అన్ని కాలపరిమితులపై 25 బేసిస్ పాయింట్లు పెంచింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. బ్యాంక్ వెబ్సైట్ సమాచారం ప్రకారం మెజారిటీ ఖాతాలకు అనుసంధానంగా ఉండే ఏడాది కాల వ్యవధి రుణ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగి, 8.35 శాతానికి చేరింది. ఏడాది, మూడు, ఆరు నెలల కాలపరిమితులకు రుణ రేట్లు పావుశాతం పెంపుతో 8.15 శాతం–8.30 శాతం శ్రేణికి చేరాయి. రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా ఉంది. మూడేళ్ల రేటు 8.50 శాతానికి ఎగసింది. తదుపరి సమీక్ష వరకూ ఈ రేట్లు అమల్లో ఉంటాయని బ్యాంక్ ప్రకటన వివరించింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
హమ్మయ్య!.. కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ
ఫిక్స్డ్ డిపాజిటర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎఫ్డీలపై 10 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ వరకు వడ్డీ రేట్లను పెంచింది. ఎస్బీఐ (SBI) వెబ్సైట్ ప్రకారం, కొత్త రేట్లు అక్టోబర్ 15, 2022 నుంచి అమలులోకి వస్తాయి. వీటితో పాటు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై అన్ని కాలాలకు సంబంధించిన వడ్డీ రేట్లను కూడా పెంచింది. దీంతో ఇకపై కస్టమర్లు 3శాతం నుంచి 5.85 శాతం మధ్య వడ్డీ రేట్లను పొందవచ్చు. అంతేకాకుండా, సీనియర్ సిటిజన్లు సాధారణ వడ్డీ రేటుపై అదనపు వడ్డీని పొందుతారు. బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్-రేట్ డిపాజిట్లపై (FDలు) వడ్డీ రేట్ల ఇలా ఉన్నాయి. సామాన్య ప్రజలకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5శాతం ఉంది. 46 నుంచి 179 రోజుల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న FDలు ఇకపై.. 4 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం ఇవ్వనుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 5.60% నుంచి 5.80%, సీనియర్ సిటిజన్లకు 6.10% నుంచి 6.30%కి పెంచింది. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న రుణాల వడ్డీ రేటును 5.65 శాతం నుంచి 5.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం నుంచి 6.65 శాతానికి బ్యాంక్ పెంచింది. చదవండి: ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్! -
గ్లోబల్ ట్రెండ్, ఆర్బీఐ సమీక్షపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పాలసీ సమీక్షను చేపట్టనుంది. బుధవారం(28) నుంచి మూడు రోజులపాటు సమావేశంకానున్న పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) శుక్రవారం(30న) నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్బీఐ అధ్యక్షతన ఎంపీసీ ధరల అదుపునకే ప్రాధాన్యతనిస్తూ గత మూడు సమీక్షల్లో వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 1.4 శాతం హెచ్చించింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ఈసారి సమీక్షలోనూ మరోసారి 0.5 శాతం రేటును పెంచే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వెరసి రెపో రేటు మూడేళ్ల గరిష్టం 5.9 శాతానికి ఎగసే వీలుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పరపతి నిర్ణయాలపై కన్నేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డాలరు జోరు యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా పలు కేంద్ర బ్యాంకులు గత వారం వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణ కట్టడికే కట్టుబడనున్నట్లు ప్రకటించిన ఫెడ్ ఫండ్స్ రేట్లను ఈ ఏడాది మరింత పెంచే వీలున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ ప్రభావం ఆర్బీఐపైనా పడనున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కాగా.. ఫెడ్ అండతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్టం 111కు చేరింది. ట్రెజరీ ఈల్డ్స్ సైతం 3.5 శాతాన్ని దాటాయి. దీంతో దేశీ కరెన్సీ ఏకంగా కొత్త చరిత్రాత్మక కనిష్టం 81కు పడిపోయింది. వడ్డీ రేట్లు, రూపాయి మారకం వంటి అంశాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సిరీస్ షురూ సెప్టెంబర్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు గురువారం(29) ముగియనుంది. వారాంతం నుంచీ అక్టోబర్ సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో ట్రేడర్లు పొజిషన్లను కొత్త సిరీస్‌కు రోలోవర్ చేసుకునే అవకాశముంది. ఇది మార్కెట్లలో ఆటుపోట్లకు దారితీయవచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్త వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలు కొద్ది రోజులుగా గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీస్తున్న విషయం విదితమే. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లను ఈ అంశాలు ప్రభావితం చేసే అవకాశముంది. పలు అంశాలు.. ఆర్బీఐ, ఎఫ్‌అండ్‌వో ముగింపు, గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్‌తోపాటు.. ఈ వారం ఇన్వెస్టర్లు మరిన్ని అంశాలపై దృష్టి సారించనున్నారు. యూఎస్ ఆర్థిక వృద్ధి(జీడీపీ) గణాంకాలు, ముడిచమురు ధరలపై రష్యా యుద్ధ భయాల ప్రభావం, ఎఫ్‌పీఐల పెట్టుబడులు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు తదితరాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు వివరించారు. ఎఫ్‌పీఐలు ఓకే పలు ఆటుపోట్ల మధ్య ఈ నెల(సెప్టెంబర్)లోనూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లపట్ల ఆసక్తి చూపుతున్నారు. 1–23 మధ్య మూడు వారాల్లో రూ. 8,638 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. గత నెల(ఆగస్ట్)లో ఏకంగా రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఇటీవల కాస్త వెనకడుగు వేస్తున్నారు. గత వారం చివరి రెండు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 2,500 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం! డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో ఇకపై పెట్టుబడులు మందగించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే 9 నెలల వరుస అమ్మకాల తదుపరి జులైలో తిరిగి ఎఫ్‌పీఐలు నికర ఇన్వెస్టర్లుగా నిలుస్తూ రూ. 5,000 కోట్ల విలువైన ఈక్విటీలను సొంతం చేసుకున్నారు! కాగా.. గతేడాది అక్టోబర్ మొదలు ఈ ఏడాది జూన్ వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్య ఆందోళనలు, డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం వంటి అంశాలు ఎఫ్‌పీఐలను వెనక్కి లాగుతున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ నిపుణులు శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. -
మరో బాదుడు.. కెనరా బ్యాంక్ రుణ రేటు పెంపు
ఇప్పటికే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నెలలో ద్రవ్యోల్బణం కట్టడిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుని పెంచిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారమనే చెప్పాలి. తాజాగా ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం వరకూ పెంచింది. పెంచిన రేట్లు బుధవారం(సెప్టంబర్ 7) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ పేర్కొంది. తాజా పెంపుతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు భారం కానున్నాయి. తాజా పెంపుతో ఏడాది రుణ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్, నెల వ్యవధుల ఎంసీఎల్ఆర్ 0.10% మేర పెరిగింది. -
పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్‌కు సవాళ్లు
న్యూఢిల్లీ: పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్‌కు సమీప కాలంలో సవాళ్లు నెలకొన్నాయని డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్‌సింగ్ పేర్కొన్నారు. అయినా పరిశ్రమపై గణనీయమైన ప్రభావం ఉండకపోవచ్చన్నారు. నివాస గృహాలకు డిమాండ్ పరంగా గడిచిన రెండేళ్లలో నిర్మాణాత్మక రికవరీ కనిపిస్తోందని.. పరిశ్రమలో స్థిరీకరణ కారణంగా నమ్మకమైన సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నట్టు తెలిపారు. కంపెనీ వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్లకు ఉన్న డిమాండ్, దేశ ఆర్థిక వ్యవస్థ బలం ఈ రంగానికి మద్దతునిస్తాయన్నారు. ఆర్బీఐ గడిచిన మూడు నెలల్లో మూడు విడతలుగా 1.40 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో బ్యాంకులు సైతం వెంటనే రుణ రేట్లను పెంచేశాయి. 6.5-7 శాతం మధ్య ఉన్న గృహ రుణ రేట్లు 8-8.5 శాతానికి చేరాయి. డిమాండ్‌కు అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొత్త ఉత్పత్తులను అందిస్తున్నట్టు రాజీవ్‌సింగ్ చెప్పారు. దీంతో కొత్త ఇళ్ల బుకింగ్‌లలో మెరుగైన వృద్ధిని నమోదు చేస్తామన్న ఆశాభావాన్ని తెలిపారు. డీఎల్ఎఫ్ సేల్స్ బుకింగ్‌లు 2021-22లో రూ.7,273 కోట్లకు పెరగ్గా.. అంతకు ముందు సంవత్సరంలో ఇవి రూ.3,084 కోట్లుగానే ఉన్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బుకింగ్‌లు రెట్టింపై రూ.2,040 కోట్లుగా నమోదయ్యాయి. -
27 ఏళ్ల తరువాత యూకే కేంద్ర బ్యాంక్ షాకింగ్ నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్ బాటలో పయనించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను భారీగా పెంచేసింది. ద్రవ్యోల్బణం ముప్పు, అధిక ధరలు, ఇంధన ధరలు తదితర ఆందోళనల నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను 1.25 నుంచి 1.75 శాతానికి పెంచింది. పెరుగుతున్న ధరల కట్టడికి ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకు ప్రకటించింది. పలువురు విశ్లేషకులు,పెట్టుబడిదారుల అంచనాల కనుగుణంగానే బీవోఈ గవర్నర్ ఆండ్రూ బెయిలీ 50 బీపీఎస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపును ప్రకటించారు. 1995 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు. ఆహార, ఇంధన ధరల సంక్షోభంతో యూకే ద్రవ్యోల్బణం 9.4 శాతం వద్ద జూన్‌లో 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. తరువాత ఇది దాదాపు 11 శాతానికి చేరుతుందని అంచనా. (Suryansh Kumar: వావ్!13 ఏళ్లకే 56 కంపెనీలకు బాస్! మరి ఆదాయం!) వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 15 శాతానికి చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 27 ఏళ్లలో అతిపెద్ద వడ్డీ రేటు పెంపు ప్రకటించడం గమనార్హం. రుణాలు తీసుకోవడం, ఖర్చుల తగ్గింపు లాంటి చర్యల్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వడ్డీరేట్లను పెంచడం వరుసగా ఇది ఆరోసారి. (ఇదీ చదవండి: Honda Dio Sports: హోండా డియో స్పోర్ట్స్ లాంచ్, ఆశ్చర్యంగా ధర తక్కువే!) -
ప్చ్.. మళ్లీ వడ్డీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్!
న్యూయార్క్: అంచనాలకు అనుగుణంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ధరల కట్టడికి మరోసారి వడ్డీ రేట్ల పెంపు అస్త్రాన్ని బయటకు తీసింది. తాజాగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 0.75 శాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 2.25–2.50 శాతానికి చేరాయి. ద్రవ్యోల్బణ అదుపునకు జనవరి మొదలు జూన్ వరకూ వడ్డీ రేటును 1.5 శాతం పెంచింది. నాలుగు దశాబ్దాలలోలేని విధంగా సీపీఐ 9 శాతానికి చేరడంతో ఈ ఏడాది(2022) చివరికల్లా వడ్డీ రేటును 3.4 శాతానికి చేర్చే యోచనలో ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఉంది. ఆర్థిక మాంద్య పరిస్థితులకంటే ధరల అదుపే తమకు ప్రధానమంటూ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఆరు ప్రధాన కరెన్సీల మారకంలో డాలరు ఇండెక్స్ 107ను దాటి కదులుతోంది. రేట్ల పెంపు అంచనాలతో ఈ నెల మొదట్లో రెండు దశాబ్దాల గరిష్టం 109.29ను తాకిన సంగతి తెలిసిందే. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఆర్థిక మాంద్య ముప్పు పొంచి ఉన్నట్లు విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్, ఆమె ఆస్తి ఎంతంటే! -
డాలర్.. రన్ రాజా రన్!
మంథా రమణమూర్తి ‘డాలర్ మాకు కరెన్సీ. మీకు సమస్య.’ 51 ఏళ్ల కిందట అమెరికా ఆర్థిక మంత్రి జాన్ కొనల్లీ చేసిన ఈ వ్యాఖ్యల్ని... ప్రపంచ మానవాళిపై వేసిన పచ్చబొట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ డాలర్ అమెరికాకు కరెన్సీనే. ప్రపంచానికి మాత్రం అన్నీ డాలరే. డాలర్ విలువ పెరిగినా... తగ్గినా... ప్రపంచంలోని ప్రతి కుటుంబంపైనా దాని ప్రభావం పడక తప్పదు. అలాంటి డాలర్ ఇçప్పుడు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రధాన కరెన్సీలుగా భావించే యూరప్ యూరో, యూకే పౌండ్, జపాన్ యెన్, చైనీస్ యువాన్... ఇవన్నీ డాలర్‌తో పోలిస్తే దారుణంగా క్షీణిస్తున్నాయి. అన్నిటికన్నా ఘోరంగా జపాన్ యెన్ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 20.57 శాతం మేర క్షీణించింది. ఏడాది కిందట డాలర్‌కు 110 యెన్లు కాగా... ఇప్పుడు 138.5 యెన్లు పెడితే తప్ప ఒక డాలర్ రావటం లేదు. యూకే పౌండ్ కూడా అంతే. ఏడాది కాలంలో ఏకంగా 15.5 శాతం పతనం కాగా... యూరో అదే స్థాయిలో 14 శాతం క్షీణించింది. ఆసియా దిగ్గజాలు చైనా, భారత్ మరీ అంత క్షీణించకుండా తమ కరెన్సీలను కాపాడుకున్నాయి. యువాన్ 4.5 శాతం, రూపాయి 6.25 శాతం మాత్రమే పతనమయ్యాయి. కరెన్సీలెందుకు పతనమవుతున్నాయి? అందరూ చెప్పే ప్రధాన కారణాలు రెండు. మొదటిది కోవిడ్ సంక్షోభం. దాదాపు రెండున్నరేళ్లు ప్రపంచపటంలో ఒక్కదేశాన్నీ వదలకుండా చుట్టేసిన ఈ మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఫలితంగా ప్రపంచం మొత్తం మునుపెన్నడూ చూడని వైపరీత్యాల్ని చూసింది. లాక్డౌన్లతో జీవితం అస్తవ్యస్తమయింది. కొనుగోలు శక్తి సన్నగిల్లి... ఉత్పాదకత ఘోరంగా పడిపోయింది. దీన్ని పెంచడానికి... అమెరికా లక్షల కోట్ల కరెన్సీని ముద్రించి బ్యాంకింగ్‌లోకి ప్రవేశపెట్టింది. వినియోగం పెంచడానికి నేరుగా జనం ఖాతాల్లోకీ నగదు వేసింది. మిగిలిన దేశాలు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచాయి. అది జనం చేతుల్లోకి రావటం కోసం వడ్డీ రేట్లు తగ్గించాయి. అలా... ప్రపంచమంతా వినియోగాన్ని పెంచే పనిలో పడింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... నగదు లభ్యత పెరగటంతో అసలే తక్కువగా ఉన్న వస్తువులకు డిమాండు... ఆ వెనకే ధరలూ పెరిగాయి. దిగుమతులపై ఆధారపడ్డ దేశాలు మరింత ఇబ్బందికి గురయ్యాయి. ఫలితంగా... ద్రవ్యోల్బణం రయ్యిమంది. కాకపోతే చాలా దేశాలు కొంతవరకూ దీన్ని తట్టుకుని మనగలిగాయి. అందుకే కరెన్సీలు కూడా ఆరేడు నెలల కిందటిదాకా కాస్తంత స్థిరంగానే కనిపించాయి. ఇదిగో... అప్పుడు మొదలయింది ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం. ఐదు నెలల కిందట మొదలయిన ఈ యుద్ధానికి ముగింపు దొరక్కపోవటం... ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియకపోవటంతో అసలే దెబ్బతిని ఉన్న సప్లయ్ వ్యవస్థలు మరింత కునారిల్లాయి. ముడిచమురు ఉత్పత్తిలో ప్రధాన వాటాదారైన రష్యాపై ఆంక్షల కారణంగా ముడి చమురు ఉత్పత్తి తగ్గి... ధర విపరీతంగా పెరిగింది. అన్ని దేశాల్లోనూ ద్రవ్యోల్బణం రికార్డులు తిరగ రాస్తోంది. దీన్ని కట్టడి చేయటానికి అమెరికాతో సహా... ప్రభుత్వాలన్నీ మళ్లీ వడ్డీ రేట్లు పెంచటం మొదలు పెట్టాయి. అమెరికా సైతం వడ్డీ రేట్లు పెంచుతూ అంతకు ముందు వ్యవస్థలోకి వదిలిన నగదును వెనక్కి తీసుకోవటం మొదలెట్టింది. వడ్డీ రేట్లు పెరిగితే... కరెన్సీ విలువ పతనం కావటమన్నది సహజం. డాలర్... ఎప్పుడూ పెరగటమేనా? కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. వడ్డీరేట్లు తగ్గుతున్నపుడు కూడా డాలర్‌తో పోల్చినప్పుడు మన కరెన్సీలు ఎంతో కొంత క్షీణిస్తూనూ వచ్చాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు ఈ క్షీణత ఇంకాస్త ఎక్కువగా ఉంది. రెండు సందర్భాల్లోనూ డాలర్ మాత్రం పెరుగుతూనే వచ్చింది. ఎందుకలా? ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ప్రపంచమంతా సంక్షోభ పరిస్థితుల్లో ఉంది. అన్నిచోట్లా డిమాండ్ పడిపోయింది. దీంతో ఏమవుతుందోనన్న భయం కొద్దీ ప్రపంచమంతా సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ మార్గాలవైపు పరుగులెత్తింది. ఫలితంగా డాలర్ పెరిగి... ఇతర కరెన్సీలు క్షీణత నమోదు చేశాయి. ఇప్పుడు కూడా అంతే. అన్నిచోట్లా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే మళ్లీ వ్యవస్థలో నగదు తగ్గి... మళ్లీ అది మందగమనానికి దారితీస్తుంది. మాంద్యమూ వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ డాలర్ ఇన్వెస్ట్మెంట్లే సురక్షితం. కాబట్టి డాలర్‌కే డిమాండ్. అందుకే అది పెరుగుతోంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే! జాన్ కొనల్లీ 51 ఏళ్ల కిందట జీ10 సదస్సులో చేసిన వ్యాఖ్యలు... అక్షర సత్యాలని!!. ఎవరికి లాభం... ఎవరికి నష్టం లాభనష్టాల విషయానికొస్తే డాలర్ బలోపేతమై స్థానిక కరెన్సీలు బలహీనమవున్నప్పుడు అది దేశ ప్రజలందరికీ నష్టమేనని చెప్పాలి. నేరుగా డాలర్‌తో అవసరం లేకున్నా... డాలర్ బలపడితే ఏ దేశమైనా దిగుమతులకు ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. భారత్ విషయానికొస్తే మన మొత్తం జీడీపీలో 21 శాతం వరకూ దిగుమతులే. అదే సమయంలో ఎగుమతులు 18.5 శాతం వరకూ ఉంటాయి. దిగుమతుల్లో అత్యధికం ముడిచమురు వాటాయే. ఈ రెండింటికీ మరీ దారుణమైన తేడా లేదు కనకే మన కరెన్సీ కొంతైనా ఈ పరిస్థితులను తట్టుకోగలుగుతోందన్నది వాస్తవం. అయితే అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే మాత్రం ఆ ప్రభావం మన రూపాయిపై కాస్త తీవ్రంగానే పడుతుంది. విదేశాల్లో తమ పిల్లల్ని చదివించేవారికి ప్రధానంగా ఇది ఇబ్బందే. అనుకున్న బడ్జెట్లు తారుమారవుతాయి. అయితే తమ వారు విదేశాల్లో పనిచేస్తూ డాలర్లలో సంపాదించేవారికి మాత్రం ఇది చాలావరకూ ఊరటే. ఐటీ కంపెనీల వంటి ఎగుమతి ఆధారిత సంస్థలకు, అత్యధికంగా విదేశీ రెమిటెన్సులు వచ్చే కేరళ లాంటి రాష్ట్రాలకు ఈ పరిణామం కలిసొచ్చేదే. దేశం మొత్తానికి ఏటా వచ్చే 86 బిలియన్ డాలర్లలో 19 శాతం వరకూ కేరళ వాటాయే. కోవిడ్‌తో ఇది దెబ్బతిన్నా... మళ్లీ యథా పూర్వ స్థితికి చేరుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూపాయి... 32 ఏళ్లలో 15 నుంచి 80కి! 1990కి ముందు డాలర్ విలువ 15 రూపాయలే. కాకపోతే ఆ మాత్రం వెచ్చించాలన్నా సర్కారుకు చుక్కలు కనిపించేవి. దాంతో దిగుమతులపై ఆంక్షలు. కార్లు, స్కూటర్లు, ఫోన్లు, గ్యాస్.. ఏదైనా దిగుమతి చేసుకోవాల్సిందే. దిగుమతికి డాలర్ల కొరత కనక డబ్బులు పెట్టి కొనాలనుకున్నా ఏదీ దొరకని పరిస్థితి. అన్నింటికీ రేషనే. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా వచ్చాక సరళీకరణ విధానాలతో కంపెనీలకు ద్వారాలు తెరిచారు. అలా తెరిచిన రెండేళ్లలోనే డాలర్ విలువ ఏకంగా 30 రూపాయలకు చేరింది. నాటి నుంచి.. డాలర్ల అవసరంతో పాటు విలువ కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పుడైతే ముడిచమురు, వజ్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, భారీ యంత్రాలు, ప్లాస్టిక్స్, రసాయనాలు, వంటనూనెలు, ఉక్కు భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది కనక డాలర్ మాదిరే వీటి ధరలూ పెరుగుతున్నాయి. ఆ మేరకు సామాన్యులపైనా ఈ ప్రభావం పడుతోంది. మున్ముందు పరిస్థితేంటి? కోవిడ్ తదనంతర పరిస్థితులు ఇంకా కొలిక్కి రాలేదు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయిన వారు, కుటుంబాలను కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నవారు కుదుటపడలేదు. అప్పట్లో డిమాండ్ లేక, అయినా నిర్వహించలేక మూతపడ్డ వ్యాపారాల పరిస్థితి అలానే ఉంది. ఇంతలోనే వచ్చిన ఉక్రెయిన్ యుద్ధం... ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించటం లేదు. ఇవన్నీ చూస్తుంటే సరఫరా వ్యవస్థలు పూర్తిస్థాయిలో కుదుటపడటానికి మరికొంత సమయం పట్టేలానే ఉంది. అప్పటి దాకా అంతా సురక్షితమైన పెట్టుబడులవైపు వెళతారు కనక డాలర్ మరింత బలోపేతమయ్యే అవకాశాలే ఎక్కువన్నది నిపుణుల అంచనా. ఈ లెక్కన చూస్తే రూపాయితో సహా ఇతర దేశాల కరెన్సీలు ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక దీనితో ముడిపడి ఉన్న స్టాక్ మార్కెట్లలోనూ ఆటుపోట్లు తప్పవు. కాబట్టి డాలర్‌తో అవసరాలున్న వారు ఇవన్నీ గమనంలోకి తీసుకున్నాకే తగిన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఏ సంక్షోభమూ ఎక్కువకాలం ఉండదు. -
అఫర్డబుల్ హౌస్ లోన్స్ .. వారికి కష్ట కాలమే!
ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణరంగ వ్యయాలు పెరిగి పోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్ ఇళ్లను అఫర్డబుల్‌గా చెబుతారు. ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అదిప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ (గృహ రుణాలు) మార్కెట్ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. పెరగనున్న భారం ‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1-6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8-13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్‌ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ సహా ఎన్నో ముడిసరుకు ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20-25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది. -
చిన్న మొత్తాల పొదుపు రేట్లు యథాతథం
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గాను (జూలై–సెప్టెంబర్) ఈ స్కీమ్‌లపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2020–21 ఏడాది తొలి త్రైమాసికం నుండి ఈ రేట్లను కేంద్రం సవరించలేదు. మూడు నెలలకు ఒకసారి ఆర్థిక శాఖ ఈ వడ్డీరేట్లను నోటిఫై చేస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా మే, జూన్ నెలల్లో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీరేటు రెపోను ఏకంగా 0.9 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కూడా తమ డిపాజిట్, రుణ రేట్ల పెంపునకు తెరతీశాయి. ఇండియన్ బ్యాంక్ రుణ రేట్ల పెంపు ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ గురువారం నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం వరకూ పెంచింది. అన్ని కాలపరమితులకు సంబంధించి రుణ రేట్లు పెరగనున్నట్లు ఒక ప్రకటన తెలిపింది. పెరిగిన రేట్లు ఆదివారం నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంక్ ప్రకటన ప్రకారం, వినియోగ రుణ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.55 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్ నుంచి 6 నెలల మధ్య కాలవ్యవధుల రుణ రేట్లు 6.75 శాతం నుంచి 7.40 శాతం శ్రేణిలో పెరిగాయి. వీటితోపాటు బ్యాంక్ ట్రజరీ బిల్స్ ఆధారిత (టీబీఎల్ఆర్) రుణ రేటును, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (బీపీఎల్ఆర్) కూడా పెంచింది. 3 నెలల నుంచి మూడేళ్ల కాలానికి పెంపు శ్రేణి 5 నుంచి 6.10 శాతం వరకూ ఉంది. పెంపు 0.40 శాతం నుంచి 0.55% వరకూ నమోదయ్యింది. ఇక బేస్ రేటు 8.30 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. -
యూనియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లు పెంపు
ముంబై: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) అన్ని కాలపరిమితులకు సంబంధించి డిపాజిట్లపై వడ్డీరేట్లను శుక్రవారం పెంచింది. దేశీయ టర్మ్ డిపాజిట్లు, నాన్–రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ), నాన్–రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) టర్మ్ డిపాజిట్లకు పెంపు వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం దేశీయ, ఎన్ఆర్ఓ టర్మ్ డిపాజిట్ రేటు(రూ.2 కోట్లు లోపు)పై 46–90 రోజుల మధ్య 55 బేసిస్ పాయింట్లు పెరిగి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 3.50 శాతం నుంచి 4.05 శాతానికి చేరింది. ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను మే, జూన్ నెలల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ, డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. -
మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04%
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మే నెల్లో 7.04 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర 2021 మే నెలతో పోల్చితే 7.04 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం నెల ఏప్రిల్ (7.79 శాతం) కన్నా ద్రవ్యోల్బణం కొంచెం తగ్గడం ఊరటనిచ్చే అంశం. అయితే ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణిపైన ద్రవ్యోల్బణం కొనసాగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆరుశాతం పైన రేటు నమోదుకావడం ఇది వరుసగా ఐదవనెల. ఏప్రిల్ కన్నా మేలో ధరల స్పీడ్ తగ్గడానికి ఆహార, ఇంధన ధరల్లో కొంత తగ్గుదల నమోదుకావడం కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, సరఫరాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఇక్కడ గమనార్హం. మరోవైపు గత నెల ప్రారంభంలో ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. జూన్ మొదటి వారంలో ఈ రేటు మరో అరశాతం పెరిగింది. ఇదే ధోరణిని ఆగస్టు ద్వైమాసిక సమావేశాల్లోనూ సెంట్రల్ బ్యాంక్ కొనసాగిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు.. ► 2022 మేలో ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 7.97 శాతం. ఏప్రిల్‌లో ఈ రేటు 8.31 శాతంగా ఉంది. మొత్తం వినియోగ ధరల సూచీలో ఫుడ్ బాస్కెట్ వెయిటేజ్ 39.06 శాతం. ఏప్రిల్‌లో 5.96 శాతం ఉన్న తృణ ధాన్యాల ద్రవ్యోల్బణం మేలో 5.33 శాతానికి తగ్గింది. ఇక ఆయిల్, ఫ్యాట్ ధరల స్పీడ్ కూడా ఇదే కాలంలో 17.28 శాతం నుంచి 13.26 శాతానికి తగ్గింది. పండ్ల ధరలు 4.99 శాతం నుంచి 2.33 శాతానికి తగ్గాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 15.41 శాతం నుంచి 18.26 శాతానికి పెరిగాయి. కాగా, గుడ్ల ధరలు 4.65 శాతం క్షీణిస్తే, పప్పు దినుసుల ధరలు 0.42% తగ్గాయి. ► ఇక ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 10.80% ఉంటే మేలో 9.54%కి తగ్గింది. ఆర్బీఐ అంచనాలు ఇలా... 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనాలతో ఇటీవలి పాలసీ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022లో తగిన వర్షపాతం, దీనితో తగిన ఖరీఫ్ పంట దిగుబడి అంచనాతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 6.7% ఉంటుందని (తొలి అంచనా 5.5%) ఆర్బీఐ అంచనావేసింది. మొదటి త్రైమాసికంలో 7.5%, రెండవ త్రైమాసికంలో 7.4%, మూడవ త్రైమాసికంలో 6.2% నమోద య్యే రిటైల్ ద్రవ్యోల్బణం నాల్గవ త్రైమాసికంలో కేంద్రం నిర్దేశిత స్థాయి లోపునకు దిగివస్తుందని, 5.8%గా నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. జనవరి (6.01%), ఫిబ్రవరి (6.07%), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95%) నెలల్లో హద్దులు మీరి రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళన కలిగించింది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీ రేట్లు పెంచే సంకేతాలిచ్చింది. తాజా ద్వైమాసిక రివ్యూలో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచనున్నట్టు నేషనల్ మీడియా నివేదించింది. ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతంగా నిర్ణయించింది. ఫలితంగా పలు రుణాలపై ఈఎంఐ భారం పెరగనుంది. ఆర్బీఐ క్రమంగా రేట్లు పెంచుతూ ఉంటే, బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా పెంచాల్సి వస్తుంది. దీంతో తాజా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కొత్త రేట్ల ప్రకారం ఉంటాయనీ, ఇప్పటికే నిర్దిష్ట మెచ్యూరిటీల పై డిపాజిట్ రేట్లను పెంచాలని భావిస్తున్నట్టు ఖరా వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఎస్బీఐ 12 నెలల - 24 నెలల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.10 వడ్డీ రేటును అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మూడు నుండి ఐదు సంవత్సరాల ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.45 శాతంగా ఉంది -
బ్యాంకుల వడ్డింపు షురూ..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 0.4 శాతం పెంచి 4.4 శాతానికి చేర్చడంతో బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. ఐసీఐసీఐ, బీఓబీ, బీఓఐ, సెంట్రల్ బ్యాంకులు తమ రుణ రేట్లను సవరించాయి. ఆయా రేట్లు పెంపు నిర్ణయాలను పరిశీలిస్తే.. ► తక్షణం అమల్లోకి వచ్చే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)ను 8.10 శాతానికి పెంచింది. ఆర్బీఐ పాలసీ రెపో రేటును ఈబీఎల్ఆర్ ప్రతిబింబిస్తుంది. రెపోరేటుకు అనుగుణంగా ఈబీఎల్ఆర్ కదలికలు ఉంటాయి. ► బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రేటును (బీఆర్ఎల్ఎల్ఆర్) 6.90%కి పెంచింది. తక్షణం ఈ రేటు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రెపో 4.40 శాతానికి ఇది 2.50% అదనమని వివరించింది. బ్యాంక్ రిటైల్ రుణాలకు ఇది వర్తిస్తుంది. రిటైల్ రుణాలకు వర్తింపజేసేందుకు వీలుగా 2019 అక్టోబర్ నుంచి రుణాలకు బీఆర్ఎల్ఎల్ఆర్ ప్రాతిపదికను బీఓబీ అమలు చేస్తోంది. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) తన ఆర్బీఎల్ఆర్ (రెపో ఆధారిత రుణ రేటు)ను రెపోరేటు పెంపునకు అనుగుణంగా 7.25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ► ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఎల్ఆర్ 0.40 శాతంమేర పెరిగి 7.25 శాతానికి చేరింది. 6వ తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది. వరుసలో ఎస్బీఐ...! బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్ ) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ రేటు అమల్లో ఉంది. ఆర్బీఐ తాజా నిర్ణయంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎస్బీఐ సమీక్షిస్తున్నట్లు సమాచారం. రుణ సమీకరణ ఆధారిత వ్యయాలను గత నెల ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఎస్బీఐ బెంచ్‌మార్క్ ఏడాది ఎంసీఎల్ఆర్ 7.10 శాతంగా ఉంది. ఎస్బీఐ కస్టమర్లు పెద్ద సంఖ్యలో ఈ రేటు ప్రాతిపదికగానే రుణాలు తీసుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 2019న కీలక ఆదేశాల జారీ చేస్తూ, వ్యక్తిగత లేదా రిటైల్, సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) రుణాలకు సంబంధించి ఫ్లోటింగ్ రేట్లకు బెంచ్‌మార్క్‌గా రెపో రేటు ఉండాలని బ్యాంకింగ్‌ను ఆదేశించింది. అదే ఏడాది అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ డిపాజిట్ రేటు పెంపు ప్రైవేటు రంగంలోకి కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్ని కాలపరిమితుల స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.35 శాతం పెంచింది. రూ.2 కోట్ల దిగువ డిపాజిట్లన్నింటికీ తాజా రేటు పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం, 390 రోజుల వరకూ డిపాజిట్ రేటు 0.30# పెరిగి 5.5 శాతానికి చేరింది. 23 నెలలకు రేటు 0.35% పెరిగి 5.6%కి ఎగసింది. సీనియర్ సిటిజన్లు 23 నెలలు, ఆపైన డిపాజిట్ల విషయంలో 6.10 శాతం వడ్డీరేటు పొందుతారు. ‘దాదాపు రెండు సంవత్సరాల తక్కువ వడ్డీరేటు ఆర్థిక వ్యవస్థలో తాజా పెంపు పరిణామం ఒక సువర్ణావకాశం. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి బ్యాంకుల వరుసలో కోటక్ ఒకటి. వినియోగదారులు తమ కీలక లక్ష్యాల కోసం పొదుపు చేసేందుకు అలాగే తమ పొదుపుపై పెరిగిన రాబడిని పొందేందుకు ఇదే సరైన సమయం’’ అని కోటక్ మహీంద్రా బ్యాంక్ (రిటైల్, బ్రాంచ్ బ్యాంకింగ్) గ్రూప్ ప్రెసిడెంట్ విరాట్ దివాన్జీ పేర్కొన్నారు. -
యధాతథంగా వడ్డీ రేట్ల కొనసాగింపు?
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలిసారిగా ఏప్రిల్ 6 నుండి 8 వరకూ సమావేశం కానుంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను 8న వెల్లడించనుంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, వృద్ధికి ఊతమిచ్చేందుకు తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉండటం తదితర అంశాల కారణంగా ఆర్బీఐ ఇప్పటివరకూ అనుసరిస్తున్న ధోరణిలో కొంత మార్పు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణ అంచనాలను ఎంపీసీ ఎగువ వైపుగా సవరించవచ్చని, 2022–23 వృద్ధి అంచనాలను కొంత తగ్గించవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ ఏప్రిల్ 2022 పాలసీ రివ్యూ నివేదికలో పేర్కొన్నారు. అయినప్పటికీ విదేశీ అంశాల కారణంగా పెరుగుతున్న ధరలను అదుపు చేయడం కోసం వృద్ధిని పూర్తిగా త్యాగం చేయకపోవచ్చని తెలిపారు. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే రేటు) 4 శాతంగాను, రివర్స్ రెపో (బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులపై ఆర్బీఐ ఇచ్చే వడ్డీ) 3.35 శాతంగాను ఉంది. ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ 4 శాతం స్థాయిలో (2 శాతం అటూ, ఇటూగా) కట్టడి చేయాల్సి ఉంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో పరపతి విధానాన్ని మరింత కఠినతరం చేసేందుకు ఆర్బీఐకి పరిమిత స్థాయిలోనే అవకాశాలు ఉన్నాయని ఎక్యూటీ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి అభిప్రాయపడ్డారు. -
చిన్న పొదుపులపై వడ్డీరేట్లు యథాతథం
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) సహా చిన్న పొదుపు పథకాలపై 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఉన్న వడ్డీరేట్లు వచ్చే 3 నెలల్లో కొనసాగనున్నాయి. చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు త్రైమాసికం ప్రాతిపదికన నోటిఫై చేసే సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాను ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4 శాతం) వరుసగా పది ద్వైమాసిక సమావేశాల్లో ఒకేరీతిన కొనసాగిస్తూ, నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులపై అదనపు వడ్డీ చెల్లింపు భారం అవకాశం లేదు. దీనివల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణాలపై రేట్లు దాదాపు యథాతథంగానే కొనసాగే వీలుంది. ఈ పరిణామం చిన్న పొదుపులపై కూడా రేట్లను ఎక్కడివక్కడే ఉంచడానికి కారణమవుతోంది. కొన్ని పథకాల రేట్లు ఇలా... ► పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై రేటు 7.1 శాతంగా ఉంది. ► నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ 6.8%. ► ఏడాది డిపాజిట్ స్కీమ్ 5.5% వడ్డీ ఆఫర్ చేస్తోంది ► బాలికా పథకం– సుకన్య సమృద్ధి యోజనపై అత్యధికంగా 7.6% వడ్డీ ఉంది. ► ఐదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీరేటు 7.4%. వీటిపై త్రైమాసిక పరంగా వడ్డీ అందుతుంది. ► సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీరేటు వార్షికంగా 4%గా కొనసాగుతుంది. ► ఏడాది నుంచి ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ 5.5 శాతం 6.7% శ్రేణిలో ఉంది. వీటిపైనే వడ్డీ త్రైమాసికంగా అందుతుంది. ► ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ 5.8%. -
యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!
గత కొద్ది రోజుల క్రితం బ్యాంకింగ్ సంస్థలు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కాగా తాజాగా యాక్సిస్ బ్యాంకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. ఈ వడ్డీరేట్ల పెంపు మార్చి 17, 2022 నుంచి అమలులోకి రానుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్లను యాక్సిస్ బ్యాంకు అందిస్తోంది. ఈ వడ్డీరేట్లు 2 కోట్లకు కంటే తక్కువ డిపాజిట్లపై వర్తించనుంది. ఇక 18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి గల టర్మ్ డిపాజిట్లకు యాక్సిస్ బ్యాంక్ 5.25 శాతం వడ్డీను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు..! ► 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.90 శాతం ► 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.90 శాతం ► 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం ► 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం ► 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం ► 91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం ► 1 రోజుల నుంచి 9 నెలల వరకు(6 నెలలగాను ): సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం ► 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ(9 నెలల గాను): సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం ► ఒక ఏడాది గాను: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం ► 5 ఏళ్ల వరకు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం ► 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.25 శాతం చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! -
స్థలం కొనుగోలుకు రుణం.. ఇల్లు కట్టుకునే వారికి ప్లాట్ రుణాలు
ఆకర్షణీయమైన ధరకు ప్లాట్ (స్థలం) విక్రయానికి ఉందని తెలిసినప్పుడు.. అందుబాటులో డబ్బు ఉండకపోవచ్చు. అటువంటి అవకాశం మళ్లీ రాదనుకుంటే, కొనుగోలుకు అప్పు తీసుకోవడం ఒక్కటే మార్గం. తెలిసిన వారి దగ్గర బదులు తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకులను ఆశ్రయించాలా? లేక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) తలుపు తట్టాలా? అసలు స్థలం కొనుగోలుకు రుణం లభిస్తుందా? ఎన్నో సందేహాలు వస్తాయి. ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కడదామనుకునే వారు.. పెట్టుబడి కోణంలోనూ ప్లాట్‌ను కొనుగోలు చేసేవారూ ఉన్నారు. వీరి కల సాకారం కోసం అందుబాటులో ఉన్న మార్గాలేమిటో తెలియజేసే కథనమే ఇది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ప్లాట్ కొనుగోలుకు రుణాలను (ప్లాట్ లోన్స్) ఆఫర్ చేస్తున్నాయి. కానీ, ఆ ప్లాట్ ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తున్నదై ఉండాలి. పెట్టుబడి కోణంలో ప్లాట్ కోసం రుణం తీసుకోవాలంటే వేరే మార్గాలను వెతుక్కోవాల్సిందే. ఇంటి కొనుగోలు కోసమే ప్లాట్‌ను సమకూర్చుకునే వారికి రుణం సులభంగానే లభిస్తుంది. నివాస యోగ్యమైన ప్లాట్‌ను రుణంపై కొనుగోలు చేసుకుంటే.. ఆ తర్వాత రుణ ఒప్పందం మేరకు 1–3 ఏళ్లలోపు ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. వీటినే ప్లాట్ లోన్స్గా చెబుతారు. రుణం తీసుకుని నివాస యోగ్యమైన ప్లాట్‌పై ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత ఇల్లు కట్టలేదనుకోండి. కావాలని ఇల్లు కట్టకుండా వదిలేసే వారు ఉంటారు. పలు రకాల కారణాల వల్ల ఇల్లు కట్టడానికి వీలు పడని పరిస్థితులూ ఉండొచ్చు. నిజానికి ప్లాట్ లోన్ తక్కువ వడ్డీ రేటుపై లభిస్తుంది. ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తుండడమే ఇందుకు కారణం. రుణ ఒప్పందంలో పేర్కొన్న కాల వ్యవధిలోపు ఇంటిని నిర్మించి, పూర్తయినట్టు సర్టిఫికెట్ బ్యాంకుకు సమర్పించకపోతే.. అప్పుడు ఆ రుణం సాధారణ రుణంగా మారుతుంది. బ్యాంకులు అదనపు వడ్డీరేటును వసూలు చేస్తాయి. ఒప్పందం చేసుకున్న నాటి నుంచి రుణంపై 2–3 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటును అమలు చేసే స్వేచ్ఛ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఉంటుంది. దీనివల్ల అదనపు వడ్డీ భారం పడుతుందని అర్థం చేసుకోవాలి. ఒప్పందంలో పేర్కొన్న కాలవ్యవధి ముగిసిన తర్వాత కూడా రుణ గ్రహీత బ్యాంకులను సంప్రదించని పరిస్థితుల్లో.. బ్యాంకులే కస్టమర్లకు సందేశం పంపిస్తాయి. అప్పటికీ స్పందించకపోతే అప్పుడు సాధారణ రుణంగా వర్గీకరించి ఆ మేరకు చర్యలు తీసుకుంటాయి. అదనపు వడ్డీ భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉంటేనే ప్లాట్‌లో ఇంటిని నిర్మించకుండా ఉండొచ్చన్నది దృష్టిలో పెట్టుకోవాలి. ప్లాట్ లోన్ అర్హతలు 18–70 ఏళ్ల వారు ప్లాట్ లోన్‌కు అర్హులు. సిబిల్ స్కోరు కనీసం 650కు పైన ఉండాలి. గరిష్టంగా 15 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లించే విధంగా ప్లాట్ లోన్ మంజూరవుతుంది. రుణం ఇచ్చే ముందు.. ఆ ప్లాట్ కొనుగోలు ప్రదేశం, ఎందుకోసం కొనుగోలు చేస్తున్నారు, తిరిగి చెల్లించే సామర్థ్యం, గత రుణాల చెల్లింపుల చరిత్ర ఇలా ఎన్నో అంశాలను బ్యాంకులు చూస్తాయి. లోన్ టు వ్యాల్యూ లోన్ టు వ్యాల్యూ అన్నది ప్రాపర్టీ విలువలో లభించే రుణంగా అర్థం చేసుకోవాలి. ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో గరిష్టంగా 85–90 శాతం వరకు రుణాన్ని (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అదే ప్లాట్ కోసం అయితే ఎల్టీవీ 60–70 శాతం మధ్యే ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కొనుగోలుదారులు స్వయంగా సమకూర్చుకోవాలి. సేల్‌డీడ్‌లో పేర్కొన్న విలువను ప్లాట్ విలువగా బ్యాంకులు పరిగణిస్తాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని రుణం ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయి. రుణం తీసుకునే ముందు విచారిస్తే ఈ విషయంపై స్పష్టత లభిస్తుంది. పైగా కొన్ని బ్యాంకులు సేల్డీల్ వ్యాల్యూ లేదా మార్కెట్ వ్యాల్యూలో రుణాన్ని 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. సమాచార లోపం కొన్ని సందర్భాల్లో మధ్యవర్తులు తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వొచ్చు. ప్లాట్ రుణం తీసుకుని, అందులో ఇల్లు కట్టకపోయినా ఫర్వాలేదు? అన్న మాట వినిపిస్తే అది నిజం కాదని గుర్తించాలి. వారు తమ స్వప్రయోజనాల కోసమే అలా చెబుతున్నారని అర్థం చేసుకోవాలి. అంతకీ అనుమానం ఉంటే లోన్ డాక్యుమెంట్‌ను ఒక్కసారి సమగ్రంగా చదవాలి. ప్రతి ఒక్కరికీ ఆవాసం కల్పించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. అందులో భాగంగానే తక్కువ రేటుపై ప్లాట్ రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అలాకాకుండా రుణం తీసుకుని కొనే ప్లాట్.. భవిష్యత్తులో లాభం కోసం విక్రయించేది అయితే అందుకు తక్కువ వడ్డీ రేటుపై రుణాలను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదని తెలుసుకోవాలి. ఇంటిని నిర్మించేట్టయితే బ్యాంకులకు రుణం చెల్లింపులపై భరోసా లభించడం కూడా తక్కువ రేటుకు ఇవ్వడానికి ఒక కారణం. పైగా ఇంటి నిర్మాణం చేస్తే దానిపై ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది. లేదంటే అందులో నివాసం ఉంటే రుణ గ్రహీత ఇంటి అద్దె రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని రుణ ఈఎంఐల చెల్లింపునకు వెసులుబాటుగా బ్యాంకులు చూస్తాయి. ఒక్కటే రుణం? కొన్ని బ్యాంకులు ప్లాట్ కొనుగోలుకు, తర్వాత అందులో ఇంటి నిర్మాణానికీ రుణం ఇస్తున్నాయి. ఎస్బీఐ అయితే ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు చేసిన 2–3 ఏళ్ల తర్వాత గృహ రుణాన్ని జారీ చేస్తోంది. కానీ, ఈ రెండు రుణాలకు వేర్వేరు ఖాతాలు ఉంటాయి. వడ్డీ రేటులోనూ స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. కానీ, కొన్ని బ్యాంకులు ఒక్కటే రుణం ఇచ్చేందుకూ ముందుకు వస్తున్నాయి. ఒప్పందంలో ఇందుకు సంబంధించి వివరాలు ఉంటాయి. మంజూరు చేసే రుణంలో ప్లాట్‌కు ఎంత, ఇంటి నిర్మాణానికి ఎంతన్న వివరాలు కూడా ఉంటాయి. పన్ను ప్రయోజనాలు ప్లాట్ కొనుగోలుకు రుణం తీసుకుని చేసే చెల్లింపులపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు లే వు. పన్ను ప్రయోజనం కావాలనుకుంటే ఒక్కటే రుణంగా (ప్లాట్, ఇల్లు) తీసుకుని వెంటనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం ఒక్కటే మార్గం. అప్పుడు అసలు, వడ్డీ చెల్లింపులపై ఒక ఏడాదిలో రూ.3.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని గుర్తుంచుకోవాలి.. ► ప్లాట్‌లో ఇంటిని నిర్మించేట్టు అయితేనే రుణం తీసుకోవాలి. ► ప్లాట్, ఇంటి నిర్మాణానికి కలిపి ఒక్కటే రుణం మంజూరు చేస్తుంటే.. ముందు ప్లాట్ కోసం ఒక పర్యాయం, ఇంటి నిర్మాణ సమయంలో మిగిలిన భాగాన్ని బ్యాంకులు ఇస్తాయి. ఇంటి నిర్మాణానికి కూడా ముందుగానే రుణం తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువ అవుతుంది. ► ఒకవేళ రుణంపై ప్లాట్‌ను కొనుగోలు చేసిన ఏడాది లేదా రెండేళ్లకు ఇల్లు కట్టకుండానే విక్రయించారనుకోండి. అప్పుడు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో విచారించాలి. అటువంటప్పుడు వాటిని సాధారణ/పర్సనల్ లోన్‌గా పరిగణించి అదనపు వడ్డీ, చార్జీలు వసూలు చేయవచ్చు. ► ప్లాట్ లొకేషన్ కూడా కీలకం. మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొనుగోలు చేస్తున్న ప్లాట్ ఉండాలి. గ్రామాల్లో ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు కాదు. ► అలాగే, పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాట్‌కు, వ్యవసాయానికి వినియోగించే ప్లాట్‌కు కూడా రుణం మంజూరు కాదు. ► ఇంటి కోసం రుణాన్ని 30 ఏళ్ల కాలవ్యవధిపైనా తీసుకోవచ్చు. అదే ప్లాట్ రుణం 15–20 ఏళ్లకే పరిమితం అవుతుంది. ► ప్లాట్ రుణానికి గరిష్ట పరిమితి కూడా ఉంది. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్యాంకులు పరిమితులు విధిస్తున్నాయి. ► రుణాన్ని ముందుగా చెల్లిస్తే అదనపు చార్జీలు చెల్లించాలేమో విచారించుకోవాలి. ఈ చార్జీలపై అధికారులను అడిగి తెలుసుకోవాలి. ► కొనుగోలు చేస్తున్న ప్లాట్‌కు రుణం వస్తుందా? లేదా? ముందే స్పష్టం చేసుకోవాలి. పెట్టుబడి కోసం అయితే..? ఇంటి నిర్మాణానికి కాకుండా పెట్టుబడి కోణంలో ప్లాట్‌ను కొనుగోలు చేద్దామనుకుంటే.. అందుకు ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉంటుంది. అప్పటికే మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే.. లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (ఎల్ఏపీ)ని తీసుకోవచ్చు. నివాస, వాణిజ్య ప్రాపర్టీలను బ్యాంకులకు హామీగా ఉంచితే, రుణం లభిస్తుంది. ఇలా తీసుకునే రుణా న్ని ఏ అవసరం కోసమైనా వినియోగించుకునే స్వేచ్ఛ రుణగ్రహీతకు ఉంటుంది. 15 ఏళ్ల కాల వ్యవధిపై ఈ రుణం లభిస్తుంది. ప్రాపర్టీ ఏమీ లేని వారు.. బంగారం ఉంటే దాన్ని తనఖా ఉంచి రుణాలను తీసుకోవచ్చు. బ్యాం కులు బంగారం రుణాలను 7.2–7.8శాతానికే ఆఫర్ చేస్తున్నా యి. వీటి కాల వ్యవ« ది 1–3 ఏళ్లే ఉంటుంది. కాల వ్యవధి తర్వాత చెల్లించే వెసు లుబా టు లేకపోతే రెన్యువల్ చేసుకోవచ్చు. ఏ మార్గం లేకపోతే, ప్లాట్ చౌకగా వస్తుంటే చివరిగా వ్యక్తిగత రుణం కూడా ఒక ఆప్షన్ అవుతుంది. కాకపోతే 10–12శాతం వరకు వడ్డీ రేటు భరించాల్సి ఉంటుంది. -
ఓహ్! స్టాక్ మార్కెట్ జోరు.. ఆశ్చర్యపోతున్న ఇన్వెస్టర్లు
ముంబై: ప్రపంచ మార్కెట్ సూచీలను అనుసరించి దేశీ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో ఉంది. మార్కెట్ ఆరంభం కావడం మొదలు ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. బంగారం, క్రూడ్ ఆయిల్ ధరలు కిందికి దిగడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేపు పెంపు ఊహించినట్టుగానే ఉండటంతో ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగితే మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి పోతాయనే అంచనాలు తారుమారు అయ్యింది. మార్కెట్ చూపిస్తున్న జోరు ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 760 పాయింట్లు లాభపడింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ మరోసారి 57 వేల మార్క్‌ని క్రాస్ చేసింది. మార్కెట్ ప్రారంభమైన 45 నిమిషాలకే 1.35 శాతం వృద్ధితో 57,576 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీలో సైతం ఇదే జోరు కొనసాగుతోంది. 209 పాయింట్ల లాభంతో 1.23 శాతం వృద్ధితో 17,184 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం కీలకమైన 17వేల మార్క్‌ని క్రాస్ చేసింది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్‌బ్యాంక్, ఏషియన్ పేయింట్స్ షేర్లు భారీ లాభాలు పొందగా సెన్సెక్స్ 30లో అన్ని అన్ని షేర్లు సానుకూలంగా ఉన్నాయి. మిడ్ క్యాప్ షేర్లలోనూ ఇదే జోరు కనిపిస్తోంది. ముఖ్యంగా నిఫ్టీ మిడ్కాప్ ఇండెక్స్ 1.36 శాతం వృద్ధిని చూపిస్తోంది. -
మైక్రోఫైనాన్స్‌లో భారీ వడ్డీ ఉండొద్దు.. ఆర్బీఐ కీలక ప్రకటన
ముంబై: సూక్ష్మ రుణ సంస్థలకు వడ్డీ రేట్ల పరంగా స్వేచ్ఛనిస్తూ ఆర్బీఐ ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సూక్ష్మ రుణాలపై వడ్డీ రేట్లను త్రైమాసికం వారీగా ఆర్బీఐ నిర్ణయిస్తూ వచ్చింది. ఇక నుంచి వడ్డీ రేట్లను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఎఫ్ఐలు) నిర్ణయించుకునేందుకు ఆర్బీఐ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం బోర్డు ఆమోదంతో ఒక విధానాన్ని రూపొందించుకోవాలని కోరింది. ఇందులో హెచ్చు వడ్డీలు అమలు చేయకుండా రైడర్‌కు చోటు ఇవ్వాలని నిర్ధేశించింది. వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉన్న వారికి హామీ లేకుండా ఇచ్చే రుణాలను సూక్ష్మ రుణాలుగా ఆర్బీఐ నిర్వచనాన్ని సవరించింది. ‘‘సూక్ష్మ రుణాలపై వడ్డీ రేట్లు, ఇతర చార్జీలు/ఫీజులు అన్నవి భారీగా (అన్యాయంగా) ఉండకూడదు. ఇవన్నీ కూడా ఆర్బీఐ సూక్ష్మ పరిశీలనకు లోబడి ఉంటాయి’’ అని తన ఆదేశాల్లో ఆర్బీఐ పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. నూతన నిబంధనలు.. - ప్రతి సూక్ష్మ రుణ సంస్థ (రెగ్యులేటెడ్ ఎంటెటీ/ఆర్ఈ) చార్జీలకు సంబంధించి సమాచారాన్ని రుణ గ్రహీతలకు ప్రామాణిక విధానంలో, సులభంగా అర్థమయ్యేట్టు తెలియజేయాలి. - రుణగ్రహీత నుంచి వసూలు చేసే ఏ చార్జీ అయినా ఫాక్ట్‌షీట్ లో తెలియజేయాలి - సూక్ష్మ రుణాలను నిర్ణీత కాలవ్యవధికి ముందే తీర్చి వేస్తే ఎటువంటి చార్జీ వసూలు చేయకూడదు - చెల్లింపులు ఆలస్యం చేస్తే, ఆ మొత్తంపైనే పెనాల్టీ విధించాలి కానీ, రుణం మొత్తంపై అమలు చేయకూడదు - రుణ గ్రహీత అర్థం చేసుకోతగిన భాషలో రుణ ఒప్పందం పత్రం ఉండాలి చదవండి:ఎయిర్టెల్ క్రెడిట్ కార్డులు.. ఫైనాన్స్ ఇప్పుడెంతో ఈజీ -
ఎన్ఎస్సీ, పీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్లలో వడ్డీరేట్లు.. పన్ను రాయితీలు ఇలా
ట్యాక్స్ ప్లానింగ్‌లో భాగంగా ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ వారం మరికొన్నింటి గురించి తెలుసుకుందాం. ప్రతి ఉద్యోగికి పి.పి.ఎఫ్. తప్పనిసరే. యజమాని తప్పనిసరిగా పీఎఫ్ రికవరీ చేసి, తాను మరికొంత చేర్చి, భవిష్య నిధికి జమ చేస్తారు. ఇది కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ.1,50,000 ఉంటుంది. కాస్త ఎక్కువ జీతం ఉన్న వారికి పీఎఫ్ మొత్తం రూ. 1,50,000 దాటిపోతుంది. వీరికి 80సి కింద సేవింగ్స్ చేసినా ఎటువంటి మినహాయింపు ఉండదు. ఇతర అంశాల జోలికి పోవడంవల్ల ఉపయోగం ఉండదు. తక్కువ రికవరీ ఉన్నవారు అవసరం అయితే పెంచుకోవచ్చు. వడ్డీ 8.5 శాతం వస్తుంది. వడ్డీ మీద ఎటువంటి పన్ను భారం లేదు. 15 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 3 సదుపాయాలు ఉంటాయి. దీన్ని E,E.E. అంటారు. ఇన్వెస్ట్ చేసినందుకు మినహాయింపు, వడ్డీకి మినహాయింపు, విత్‌డ్రా చేసుకున్నప్పుడు వచ్చే మొత్తానికి కూడా మినహాయింపు లభిస్తుంది. అంటే పన్నుభారం లేదు. దాచిన మొత్తాన్ని ఏడాదికి ఒకసారి విత్‌డ్రా చేసుకోవచ్చు (5వ సంవత్సరం తర్వాత నుండి). కోర్టుద్వారా ఎటువంటి అటాచ్మెంట్ చేయరు. రుణం తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఇది వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. జాయింట్‌గా తీసుకోవడానికి వీలుండదు. ఎన్నారైలకు వర్తిం చదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆలోచించుకోండి. ఉన్నవాటిలో ఇది అత్యుత్తమమైనది. కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ఇక ఎన్ఎస్సీలు.. అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు. ఒకప్పుడు ఆరు సంవత్సరాల్లో రెట్టింపై ఎంతో లాభసాటిగా ఉండేవి. క్రమేపీ వడ్డీ రేటును తగ్గించేశారు. ఇప్పుడు 6.8 శాతం వస్తుంది. ఇక్కడ E.E.E నియమం వర్తిస్తుంది. కనీసం రూ. 1,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. వడ్డీని అసలుకు కలుపుతారు. 80సి కింద దక్కే ప్రయోజనం పరిమితి రూ. 1,50,000. కొన్ని సందర్భాల్లో ముందుగానే నగదుగా మార్చుకోవచ్చు. ఏడాదిలోపే తీసేసుకుంటే వడ్డీ ఇవ్వరు. మొదటి సంవత్సరం దాటి 3 సంవత్సరాల లోపల అయితే సాధారణ వడ్డీ ఇస్తారు. నామినేషన్ సదుపాయం ఉంది. మరోవైపు, పోస్టాఫీస్‌లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంటులో జమకి 80సి మినహాయింపు లేదు. ఏటా 4 శాతం వడ్డీ ఉంటుంది. కనీసం రూ. 50 నుంచి గరిష్టంగా ఎంతైనా ఉంచవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా కొనసాగించవచ్చు. జాయింటుగా చేరవచ్చు. సింగిల్‌లో రూ. 3,500, జాయింటులో రూ. 7,000 వడ్డీకి మినహాయింపు ఉంటుంది. కానీ 80 టీటీఏ కింద రూ. 10,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు 80 టీటీబీ కింద రూ.50,000 వరకూ మినహాయింపు ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఒక స్కీమ్ ఉంది. వడ్డీ 7.4 శాతం లభిస్తుంది. కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 15,00,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. 5 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది. మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. వడ్డీకి మినహాయింపు ఉంటుంది. వడ్డీ రూ. 50,000 దాటితే టీడీఎస్ ఉంటుంది. దీనికి 80సి వర్తిస్తుంది.60 సంవత్సరాల వారికే ఇది వర్తిస్తుంది. 55 సంవత్సరాలు దాటిన వారు రిటైర్ అయిపోతే ఇందులో చేరవచ్చు (కొన్ని షరతులకు లోబడి). జాయింటు అకౌంటు తెరిచేందుకు వీలుంటుంది. ఇలా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
ఫిక్స్డ్ డిపాజిట్లు, ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా..?
మీరు బ్యాంక్‌లో పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటున్నారా?అయితే ఇది మీ కోసమే. ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడిని వచ్చేలా పలు బ్యాంకులు ఆశాజనకంగానే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆ వడ్డీ రేట్ల ఆధారంగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే మంచిదని ఆర్ధిక వేత్తలు సలహా ఇస్తున్నారు. మనలో చాలా మందికి ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి తక్కువగా ఉంటుందని అనుకుంటారు. అందులో కొంత వాస్తవం ఉన్నా.. మీ డబ్బులు సేఫ్‌గా ఉంటాయని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం బ్యాంకులు దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లపై 5% నుండి 6.5% వరకు ఆఫర్ చేస్తున్నాయి. అయితే, మీరు ఎఫ్డీలో పెట్టాలని నిర్ణయించుకునే ముందు బ్యాంకులు, పోస్టాఫీసులు అందించే వడ్డీ రేట్లను పోల్చడం మంచిది. లాంగ్ టర్మ్‌లో ఎలా ఉంటుంది వేర్వేరు లక్ష్యాలకు వేరే రకమైన పెట్టుబడి ప్రణాళిక అవసరం. ఉదాహరణకు ఎఫ్డీలో పెట్టుబడులు నిజమైన రాబడిని ఇవ్వవు. అనగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని అందించవు. కాబట్టి మీ పిల్లల విద్య కోసం 15 సంవత్సరాల ఎఫ్డీలో నిధులు ఉంచడం వల్ల లాభం ఉండదు. అయితే మీరు ఒకటి లేదా రెండు సంవత్సరాలకే పరిమితం చేసుకోవాలంటే ఎఫ్డీలపై బ్యాంకులు అందించే ఇంట్రస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి. -
గృహ రుణాలకు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత పెరగడం, గృహ రుణాలపై వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి తగ్గిపోవడం వంటి అంశాల ఊతంతో హోమ్ లోన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ తర్వాత హౌసింగ్‌కు డిమాండ్ పుంజుకోవడంతో పండుగ సీజన్ సందర్భంగా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు.. గృహ రుణాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని బ్యాంకులు 6.5 శాతానికే హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. ‘గత కొన్నాళ్లుగా ఆదాయ స్థాయులు ఎంతో కొంత పెరగ్గా దేశవ్యాప్తంగా ప్రాపర్టీ ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉండిపోయాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహాలు మరింత అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. చౌక వడ్డీ రేట్లు కూడా గృహ రుణాలు తీసుకోవడానికి ఒక కారణంగా నిలుస్తున్నాయి. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో కొనుగోలుదారులు కాస్త పెద్ద సైజు అపార్ట్మెంట్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు’ అని హెచ్డీఎఫ్సీ ఎండీ రేణు సూద్ కర్నాడ్ తెలిపారు. రెడీమేడ్ ఇళ్లకు మంచి డిమాండ్ ఉంటోందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ వై విశ్వనాథ గౌడ్ తెలిపారు. పండుగ సీజన్, ఆ తర్వాత కూడా రెడీమేడ్ ఇళ్లు, అందుబాటు ధరల్లో ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు పలు బ్యాంకులు, పండుగ సీజన్‌కు ముందే గృహ రుణాల రేట్లను తగ్గించాయని కోలియర్స్ ఇండియా కొత్త సీఈవో రమేష్ నాయర్ చెప్పారు. -
ఆర్బీఐ పాలసీ సమావేశం ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కీలక మూడు రోజుల పాలసీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ దేశ ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లపై ప్రధాన నిర్ణయాలను శుక్రవారం వెలువరించనుంది. అంతర్జాతీయంగా ఏడేళ్ల గరిష్టానికి పెరిగిన కమోడిటీ ధరలు, దేశీయంగా ధరల తీవ్రత కట్టడి ఆవశ్యకత, రూపాయి బలహీనత, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధరల కట్టడికి చర్యలు తీసుకుంటూనే, వృద్ధి లక్ష్యంగా యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)ను కొనసాగించే అవకాశాలే అధికమని మెజారిటీ ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా ఎనిమిది ద్వైమాసిక సమావేశంలోనూ ఆర్బీఐ యథాతథ రేటును కొనసాగించినట్లవుతుంది. 2020 మే 22 తర్వాత ఇప్పటి వరకూ రెపో విషయంలో ఆర్బీఐ యథాతథ పరిస్థితినే అను సరిస్తోంది. -
‘స్కోర్’ బాగుంటే రుణం ఈజీ!
మీరు తీసుకున్న రుణమే మీ అర్హతలను నిర్దేశిస్తుంది. భవిష్యత్తులో మీకు అవసరం ఏర్పడితే రుణదాతలు క్యూ కట్టి ‘బాబ్బాబు మేము ఇస్తాం’ అనే విధంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నేటి రోజుల్లో రుణం లభించడం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఎందుకంటే ఓ వ్యక్తి రుణ చరిత్ర అంతా క్రెడిట్ బ్యూరోల రికార్డుల్లో వివరంగా నమోదవుతుంటుంది. రుణాల మంజూరుకు ముందు బ్యాంకు అయినా ఎన్బీఎఫ్సీ అయినా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరును కచి్చతంగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు మీ రుణ అర్హతను నిర్ణయించడమే కాదు.. ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలనే విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే.. మీకు అంత ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు, కోరుకున్నంత రుణం లభిస్తుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీ రుణ దరఖాస్తు స్వీకరణ లేదా తిరస్కరణ అనేది మీ క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? మీ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలన్నది ఓసారి చూద్దాం... ఎలా లెక్కిస్తారంటే.. రుణ గ్రహీతల విశ్వసనీయతను.. చెల్లింపుల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాల్లో క్రెడిట్ స్కోర్ ఒకటి. దరఖాస్తుదారుల రుణ అర్హతను అంచనా వేయడానికి, రుణ మొత్తాన్ని నిర్ణయించడానికి బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంటాయి. దీనికితోడు, ఇతర సమాచారం ఆధారంగా రుణాలకు అర్హులా, కాదా? అన్నది నిర్ణయిస్తారు. వడ్డీ రేటుకూ ఇదే ప్రామాణికం అవుతుంది. రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల సమాచారాన్ని రుణ గ్రహీతల పాన్ నంబర్ ఆధారంగా.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) క్రమం తప్పకుండా నిరీ్ణత కాలానికోసారి క్రెడిట్ బ్యూరో సంస్థలకు (సిబిల్ తదితర) అందిస్తుంటాయి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తుంటాయి బ్యూరోలు. సాధారణంగా గత 36 నెలల రుణ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. చెల్లింపుల తీరు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మిశ్రమం ఎలా ఉంది, రుణాల కోసం విచారణలు, రుణాల వినియోగం.. ఈ నాలుగు అంశాలు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆల్గోరిథమ్‌ల సాయంతో.. రుణ చరిత్రతోపాటు వినియోగదారుల దీర్ఘకాలిక ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ (చెల్లించాల్సిన బకాయిలు), క్రెడిట్ కార్డ్‌ల లావాదేవీల చరిత్ర, కొత్త ఖాతాల ప్రారంభం లేదా తొలగింపులు, తిరిగి చెల్లింపుల నిష్పత్తి వంటివి కూడా క్రెడిట్ బ్యూరోలకు ప్రామాణికంగా మారాయి. సాధారణంగా.. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది. రుణదాతలకు వ్యక్తిగత రుణాలు లభించాలంటే.. కనీస సిబిల్ స్కోర్ 720 నుంచి 750 మధ్య అయినా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణాన్ని అధిక మొత్తంలో పొందే అర్హత ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే రుణం కూడా తక్కువే వస్తుంది. స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు.. క్రెడిట్ బ్యూరో సంస్థలు ఏటా ఒక్కసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ పొందే సౌకర్యాన్ని కలి్పస్తున్నాయి. ఇక వివిధ రకాల ఆర్థిక సేవల సంస్థలు సైతం తమ పోర్టళ్ల నుంచి, యాప్స్ నుంచి క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కలి్పస్తుంటాయి. తద్వారా రుణాల ఆఫర్లను అందించొచ్చన్న ప్రయోజనం అందులో దాగుంటుంది. మీకు రుణ అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పాన్ నంబర్ సాయంతో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ నంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మీ గుర్తింపును ధ్రువీకరించిన అనంతరం క్షణాల్లో ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌ను అందుకుంటారు. స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలంటే.. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడమే స్కోర్‌ను పెంచుకోవడానికి ప్రాథమిక సూత్రం. రుణ వాయిదాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు వల్ల, మర్చిపోవడం కారణంగానే వాయిదా రోజున చెల్లింపులు చేయలేకపోతే.. కంపెనీ నుంచి మీ కాల్ వచ్చిన తర్వాత అయినా వెంటనే ఆ వాయిదాను చెల్లించేయాలి. రీపేమెంట్లో ఎలాంటి జాప్యం చేసినా సరే రుణదాతలు దీన్ని ప్రతికూల అంశంగా పరిగణిస్తుంటారు. గృహ, వాహన రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ రుణాలు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటాయి. సెక్యూర్డ్ రుణాల్లో రుణదాత విఫలమైనా, రుణమిచి్చన సంస్థలకు రిస్క్ పెద్దగా ఉండదు. ఎందుకంటే హామీగా ఆస్తులు ఉంటాయి. వాటిని విక్రయించి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణాలను ఎగ్గొడితే.. వసూలు చేసుకోవడం రుణమిచి్చన సంస్థలకు తలనొప్పిగా పరిణమిస్తుంది. అందుకే రుణదాతలు అన్సెక్యూర్డ్స్ రుణాలు, వాటిని తిరిగి ఏ విధంగా చెల్లిస్తున్నారన్న చరిత్ర గురించి లోతైన విశ్లేషణ చేస్తుంటారు. మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించేవి కూడా ఈ అన్సెక్యూర్డ్ రుణాలే. ముఖ్యంగా..జాయింట్ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్న వారికి హామీ ఇవ్వటంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఆయా ఖాతా చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులెదురైనా ఆ బాధ్యత జాయింట్ ఖాతాదారులైన మీ మీద కూడా పడుతుంది. అంతిమంగా దీని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద కూడా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా మీ స్కోర్‌ను పెంచుకోవాలంటే.. వ్యక్తిగత రుణం, క్రెడిట్‌కార్డు వినియోగం, వాహన రుణం, గృహ రుణం ఇలా రుణ పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉండడం కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్‌కార్డు లేకపోతే దాన్ని తీసుకుని పరిమిత వినియోగంతోపాటు సకాలంలో చెల్లింపులతోనూ స్కోర్‌ను పెంచుకోవచ్చు. -
బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ పే యూజర్లు బ్యాంక్ ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయవచ్చు. ఈ విధమైన సేవలను పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నట్టు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్డీలపై 6.35 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చని వెల్లడించింది. రూ.5 లక్షల వరకు డిపాజిట్ గ్యారంటీ ఉంటుందని వివరించింది. వినియోగదార్లు గూగుల్ పే యాప్‌లో బిజినెస్ అండ్ బిల్స్ విభాగంలో ఈక్విటాస్ బ్యాంక్‌ను ఎంచుకోవాలి. డిపాజిట్ చేయదలచిన మొత్తం, కాల పరిమితి నిర్ధేశిస్తూ వ్యక్తిగత, కేవైసీ వివరాలను సమర్పించాలి. కాల పరిమితి ముగియక ముందే ఎఫ్డీని రద్దు చేసుకుంటే అదే రోజు వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఈక్విటాస్ వెల్లడిం చింది. చదవండి: పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు -
వడ్డీ రేట్ల పెంపు దిశగా అమెరికా
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలను ఎదుర్కొనేందుకు గతేడాది మార్చి నుంచి దాదాపు సున్నా స్థాయి వడ్డీ రేట్లను కొనసాగిస్తున్న అమెరికా క్రమంగా వాటిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. నియామకాలు పుంజుకునే కొద్దీ చౌక వడ్డీ రేట్ల విధానాలను క్రమంగా ఉపసంహరించడం మొదలుపెట్టే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఈ ఏడాది ఆఖరు మూడు నెలల్లో క్రమంగా తగ్గించుకోనున్నట్లు బ్యాంకర్లు, ఆర్థికవేత్తల సమావేశంలో ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం తాము నిర్దేశించుకున్న 2 శాతం స్థాయికి చేరడంతో బాండ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక వడ్డీ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం ద్వారా వ్యవస్థలో రుణాలు, వ్యయాలకు డిమాండ్ కల్పించేందుకు ప్రస్తుతం ఫెడ్ నెలకు 120 బిలియన్ డాలర్ల విలువ చేసే ట్రెజరీ బాండ్లను తిరిగి కొనుగోలు చేస్తోంది. దీన్ని నిలిపివేస్తే తనఖా రుణాలు, క్రెడిట్ కార్డులు, వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే, బాండ్ల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే దాకా వడ్డీ రేట్ల పెంపు ఉండదని పావెల్ తెలిపారు. పావెల్ ప్రకటనపై అమెరికా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ ఒక దశలో 225 పాయింట్లు పెరిగింది. -
కొత్త ఇల్లు కొనేవారికి ఎస్బీఐ శుభవార్త!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. 2021 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదని ప్రకటించింది. "ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున, గృహ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. గృహ రుణాలపై అందించే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. This Independence Day, step into your dream home, with ZERO* processing fee on Home Loans. Apply Now: https://t.co/N45cZ1DqLD #SBIHomeLoan #FreedomFromRent #SBI #StateBankOfIndia #AzadiKaAmrutMahotsav pic.twitter.com/Gs2qunIDwL — State Bank of India (@TheOfficialSBI) August 13, 2021 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గృహ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజును ఉండదు. ఎస్బీఐ మహిళా ఖాతాదారులకు 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది. ఎస్బీఐ యోనో వినియోగదారులకు కూడా యోనో ద్వారా అప్లై చేస్తే 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది. ఎస్బీఐ కస్టమర్లకు 6.70 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు పొందవచ్చు. రుణగ్రహీతలు గృహ రుణం కొరకు 7208933140 నెంబరుకు మిస్ డ్ కాల్ ఇవ్వవచ్చు. -
గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త!
మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. తక్కువ వడ్డీ రేటుకు ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ గోల్డ్ లోన్ అందిస్తుంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తాజాగా ఆకర్షణీయ గోల్డ్ లోన్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో వడ్డీ రేటు నెలకు 0.79 శాతం నుంచి ప్రారంభమౌతోంది. దేశవ్యాప్తంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచులు అన్నింటిలోనూ ఈ స్కీమ్ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తీసుకున్న లోన్ మొత్తాన్ని 24 నెలలలోగా చెల్లించవచ్చు అని పేర్కొంది. నెల, ద్వైమాసిక, త్రైమాసిక, అర్ధ వార్షికనికి ఒకసారి గోల్డ్ లోన్ వడ్డీ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ కోసం కస్టమర్లు బంగారం/ఆభరణాలతో ఐఐఎఫ్ ఎల్ ఫైనాన్స్ బ్రాంచీని సందర్శించవచ్చు. కేవలం 30 నిమిషాల వ్యవధిలో రుణాన్ని పొందవచ్చు అని కూడా తెలిపింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వడ్డీ తిరిగి చెల్లింపుల కొరకు 5-7 రోజుల గ్రేస్ పీరియడ్ అందిస్తుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ డిజిగోల్డ్ లోన్ ఫెసిలిటీని కూడా లాంఛ్ చేసింది. "మహమ్మారి సమయంలో రైతులు & చిన్న వ్యవస్థాపకుల మూలధన అవసరాలను తీర్చడానికి బంగారు రుణాలను తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ కాలానికి అందిస్తున్నాం. మా కస్టమర్లలో 70 శాతం మంది మళ్లీ వ్యాపారం కోసం మా వద్దకు రావడం మా నిజాయితీ, పారదర్శకతకు నిదర్శనం" అని బిజినెస్ హెడ్ - గోల్డ్ లోన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ శ్రీ సౌరభ్ కుమార్ అన్నారు. -
2022 జూన్ నుంచి రేట్ల పెంపు!
న్యూఢిల్లీ: వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత పెరుగుదల ధోరణి వ్యవస్థీకృతం (తీవ్రతను అడ్డుకోలేని వాస్తవ స్థితి) కాదని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత సరఫరాల పరమైనదని, తాత్కాలికమైన ఈ సమస్య అదుపులోనికి (2–6 శ్రేణిలోకి) దిగివస్తుందని ఈ నివేదిక సూచించింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది మేనెల వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా కొనసాగే అవకాశం ఉందని, 2022 జూన్ నుంచీ రేట్లు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష వివరాలు శుక్రవారం వెల్లడవనున్న నేపథ్యంలో యూబీఎస్ ఈ విశ్లేషణ చేయడం గమనార్హం. నివేదికలో తన్వీ గుప్తా జైన్ పేర్కొన్న మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.5 శాతంగా కొనసాగుతుంది. 2022–23లో 4.5 శాతంగా కొనసాగవచ్చు. దిగువస్థాయి వడ్డీరేట్ల వ్యవస్థ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించడం లేదు. వడ్డీరేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, గృహ పొదుపులు పెరిగాయి. మహమ్మారి ప్రేరిత అనిశ్చితి దీనికి ప్రధాన కారణం. తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వృద్ధికి, ఆదాయానికి, ఉపాధి కల్పనకు దోహపపడుతుంది. భారత జీడీపీ వృద్ధి అంచనాలను 2021–22 ఆర్థిక సంవత్సరానికి 1.5 శాతం తగ్గించి 10 శాతంగా యూబీఎస్ గత నెలలో ప్రకటించడం గమనార్హం. కార్మికుల భాగస్వామ్యం తగ్గడం, పట్టణ నిరుద్యోగిత 12 నెలల గరిష్టం 17.4 శాతానికి పెరగడం ప్రతికూల అంశాలుగా యూబీఎస్ పేర్కొంది. అయితే క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొంది. -
డిపాజిట్ల వడ్డీరేటు: ఆర్బీఐ కొత్త నిబంధన
సాక్షి,ముంబై: బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలి ఉన్న డిపాజిట్లకు వర్తించే వడ్డీరేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను సవరించింది. డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని బ్యాంకులకు ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం టర్మ్ డిపాజిట్లను కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా డిపాజిటర్ వెనక్కి తీసుకోకపోతే.. ఆ తర్వాత నుంచి ఆ మొత్తంపై సేవింగ్స్ డిపాజిట్ రేటు అమలవుతోంది. ఇక మీదట అలా కాదు. ‘‘టర్మ్ డిపాజిట్ గడువు తీరినా, క్లెయిమ్ చేసుకోకుండా బ్యాంకు వద్దే ఉండిపోతే ఆ మొత్తంపై సేవింగ్స్ ఖాతా రేటు లేదా టర్మ్ డిపాజిట్ ఒప్పంద రేటు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది అమలవుతుంది’’ అంటూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులకు నూతన ఆదేశాలు వర్తిస్తాయి. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ పోటు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వెల్లడించిన విధాన పరపతి నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిరాశపరిచాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 76 పైసల పతనం నుంచీ ప్రతికూల సంకేతాలు అందాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 179 పాయింట్లు క్షీణించి 52,323 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 15,691 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. ఫెడ్ విధాన కమిటీ బుధవారం రాత్రి పాలసీ నిర్ణయాలు ప్రకటించింది. అందరూ ఊహించినట్లే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. అయితే 2024 తొలినాళ్లలో పెంచుతారని భావించిన వడ్డీరేట్లను 2023లోనే పెంచే అవకాశం ఉందనే సంకేతాలను ఇచ్చింది. నెలకు 120 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను కొంటామని తెలిపింది. ఫెడ్ అనూహ్య నిర్ణయాలతో డాలర్, బాండ్ ఈల్డ్స్ పెరిగి ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్ 380 పాయింట్లు నష్టంతో 52,122 వద్ద, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో 15,648 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరంభ నష్టాలను పూడ్చుకోగలింది. యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. చివర అరగంటలో అమ్మకాలు మరోసారి వెల్లువెత్తడంతో సూచీల నష్టాల ముగింపు ఖరారైంది. ఒక్క ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల్లో అమ్మకాలు జరిగాయి. రూపాయి పతనం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. అత్యధికంగా బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.880 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ. 45 కోట్ల షేర్లను కొన్నారు. చదవండి: వేల కోట్ల నష్టం: అదానీ గ్రూప్ సీఎఫ్ఓ స్పందన -
మైక్రోఫైనాన్స్‌కు మహర్దశ!
ముంబై: సూక్ష్మ రుణ విభాగం దేశంలో మరింత విస్తరించేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ప్రణాళికలు రూపొందిస్తోంది. వేర్వేరు రుణ రేట్లు.. అంటే ఇప్పటి వరకు అనుసరిస్తున్న రుణ రేట్లను మరింత పెంచుకునే స్వేచ్ఛ.. నూతన ఉత్పత్తుల అభివృద్ధి ఇలా ఎన్నో ప్రణాళికలు ఆర్బీఐ అమ్ముల పొదిలో ఉన్నాయి. రుణ రేట్ల విషయంలో నియంత్రణలు తొలగించి అన్ని రకాల రుణ సంస్థలకూ ఓపెన్ ఆర్కిటెక్చర్ (కస్టమర్ల అవసరాలకు తగినట్టు ఉత్పత్తులను ఆఫర్ చేయడం)ను ఏర్పాటు చేయడంపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. దీంతో రుణ సంస్థలు కస్టమర్ల రిస్క్ ప్రొఫైల్ (తిరిగి చెల్లింపుల్లో సమస్య) ఆధారంగా అధిక రుణ రేట్లను వసూలు చేసుకునే వెసులుబాటు రానుంది. ‘‘రుణగ్రహీతల క్రెడిట్ రిస్క్ ఆధారంగా రేట్లలో మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇప్పటివరకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు)– సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) రుణగ్రహీతల క్రెడిట్ రిస్క్ ఆధారంగా రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు. ఇప్పుడిది సాధ్యం కానుంది’’ అని క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ ఎండీ ఉదయ్‌కుమార్ హెబ్బార్ తెలిపారు. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ సంస్థ దేశంలో అతిపెద్ద ఎంఎఫ్ఐ కావడం గమనార్హం. మరింత మందికి చేరువ.. సూక్ష్మ రుణ సంస్థల నియంత్రణకు సంబంధించి సంప్రదింపుల పత్రాన్ని ఇటీవలే ఆర్బీఐ విడుదల చేసింది. ఇందులో వినూత్నమైన ప్రతిపాదనలున్నాయి. రుణ రేట్లపై నియంత్రణలను తొలగించడం వల్ల దిగువ స్థాయిల్లోని రుణ గ్రహీతలకు సంబంధించి రుణ సంస్థలు వడ్డీ రేట్లను తగ్గిస్తాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఇలా దిగువ వర్గంలోని రుణ గ్రహీతలు ప్రస్తుతం వార్షికంగా 20 శాతానికిపైనే వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తోంది. నిధులపై వ్యయాలు చాలా తక్కువగా ఉండే పెద్ద బ్యాంకులు సైతం చిన్న రుణ గ్రహీతల నుంచి 24 శాతం వరకు వడ్డీని రాబడుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రుణ రేట్ల విషయంలో స్వేచ్ఛను కల్పించడం వల్ల రిస్క్ ఉండే చోట అధిక రేట్లు, రిస్క్ తక్కువ ఉండే చోట తక్కువ రేట్లను సూక్ష్మ రుణాల్లోనూ అమలు చేసేందుకు వీలు పడుతుందని భావిస్తున్నాయి. ‘‘ప్రతిపాదిత ఆర్బీఐ కార్యాచరణతో సూక్ష్మరుణ మార్కెట్ వ్యాపార నిర్వహణ పరంగా మార్పును చూడనుంది. రిస్క్ ఆధారంగా.. భిన్న భౌగోళిక ప్రాంతాల్లో భిన్నమైన రుణ రేట్లను అమలు చేయవచ్చు. ఉదాహరణకు రుణ ఎగవేతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక రేట్లు ఉండొచ్చు. అదే విధంగా అప్పటివరకు ఎటువంటి రుణ చరిత్ర లేని నూతన రుణ గ్రహీతల నుంచి ఎక్కువ రేటును వసూలు చేసుకోవడానికి ఉంటుంది. ఒక్కసారి వారికంటూ రుణ చరిత్ర ఏర్పాటైన తర్వాత ఆకర్షణీయమైన రేట్లకు రుణాలను ఆఫర్ చేయవచ్చు’’ అని అరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ మనోజ్‌కుమార్ చెప్పారు. మార్కెట్ విస్తరిస్తే మంచిది.. 60% పైగా మార్కెట్ వాటా కలిగి ఉన్న బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచబోవని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎండీ నితిన్చుగ్ చెప్పారు. ‘‘రేట్లన్నవి మార్కెట్ ఆధారితమే. ఆర్బీఐ ప్రతిపాదనలకు తగ్గట్టు మార్కెట్ విస్తరించినట్టయితే నిర్ణీత కాలానికి వడ్డీ రేట్లు దిగిరావడానికి అవకాశం ఉంటుంది’’ అని చుగ్ వివరించారు. ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల మేరకు.. ఒక రుణ గ్రహీతకు ఏవేనీ రెండు ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐలకు మించి రుణాలు ఇవ్వకూడదు. అదే బ్యాంకులకు ఇలాంటి నిర్బంధాలు లేవు. ఆర్బీఐ తాజా ప్రతిపాదనలతో రుణ సంస్థలు మరిన్ని కొత్త ఉత్పత్తులను తెచ్చే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
కరోనా సెకండ్ వేవ్ : ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: కరోనా సెకండ్ వేవ్ విలయం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విస్తృత అంచనాకు అనుగుణంగానే ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచింది. దీని ప్రకారం రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండనుంది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉండనుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ సందర్భంగా జీ-సాప్ 2.0 ను శక్తికాంత దాస్ ప్రకటించారు. జూన్ 17న రూ.40వేల కోట్ల మేర సెక్యూరిటీలు కొనుగోలు చేస్తామన్నారు. ఫారిన్ కరెన్సీ రిజర్వ్‌లు 600 బిలియన్ డాలర్లకు చేరిందని, ఫలితంగా కరెన్సీ ఒడిదుడుకులు, ఇతర పరిణామాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని ఆయన చెప్పారు. అలానే దేశ జీడీపీని 9.5శాతంగా అంచనా వేశారు. దేశంలో గ్రామీణ ప్రాంతంలో వినియోగ సంబంధింత డిమాండ్ మెరుగ్గా ఉండనుందనే ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఇందుకుసకాలంలో వచ్చిన మాన్సూన్ నిదర్శనమన్నారు. ఆర్థిక వృద్ధికి అవసరమైన సంకేతాలు తగ్గినట్లు కన్పిస్తున్నా, గత ఏడాది కంటే ఎక్కువగానే ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో పాటు ఇప్పటికే ప్రకటించిన అనేక ఉద్దీపన ప్యాకేజీలు ఆర్థిక పురోగమనానికి దోహదపడతాయని చెప్పారు. అలాగే కరోనా నేపథ్యంలో హాస్పిటల్ రంగానికి రూ.15,000 కోట్లను ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు గతంలో ఇచ్చినట్లుగా రూ.16 వేల కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు, ఆర్ధికంగా లిక్విడిటీ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. చదవండి : Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్! దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు! -
Shaktikanta Das: కోత లేదు.. పెంచేదీ లేదు!
సాక్షి, ముంబై: ఆర్థికవేత్తలు,నిపుణుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు-రెపోను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కడి రేటు అక్కడే ఉంచడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రస్తుతం రెపో 4 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో) మూడు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలను వ్యక్తం చేస్తున్న ఆర్బీఐ, రేటు తగ్గింపునకు మొగ్గు చూపే సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ శుక్రవారమూ ఏకగ్రీవంగా ఇదే విధానాన్ని పునరుద్ఘాటించింది. తద్వారా వృద్ధికి తగిన మద్దతు ఆర్బీఐ నుంచి ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ తరువాత, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్వహించిన మొట్టమొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఇది. ఏప్రిల్‌లో తదుపరి సమీక్ష : ఏప్రిల్ 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య ఎంపీసీ 28వ తదుపరి సమావేశం జరుగుతుంది. మే నాటికి సీఆర్ఆర్ 4 శాతానికి ‘రివర్స్’ : కాగా, రెపో రేటును తగ్గించని ఆర్బీఐ పాలసీ సమీక్ష, రివర్స్ రెపో రేటు (బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను తన వద్ద డిపాజిట్ చేసినప్పుడు ఇందుకు ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) కూడా 3.35 శాతంగానే కొనసాగుతుందని తన తాజా పాలసీలో ఆర్బీఐ స్పష్టంచేసింది. ఫిబ్రవరి తర్వాత ఈ రేటు కూడా 155 పాయింట్లు తగ్గి, 4.9 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చింది. ఇక బ్యాంకులు తమ నిధుల్లో తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద నిర్వహించాల్సిన మొత్తం క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను మార్చి 27 నాటికి 3.5 శాతానికి, మే 22 నాటికి 4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్బీఐ పాలసీ ప్రకటించింది. ప్రస్తుతం సీఆర్ఆర్ 3 శాతంగా ఉంది. అంటే బ్యాంకుల వద్ద ప్రస్తుతం ఉన్న నిధుల్లో మరికొంత మొత్తం ఆర్బీఐకి చేరుతుందన్నమాట. తద్వారా తన వద్దకు తిరిగి వచ్చే ‘మరిన్ని’ నిధులను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌కు అలాగే ఇతర లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) చర్యలకు సెంట్రల్ బ్యాంక్ వినియోగించ నుంది. డిసెంబర్ నాటికి 4.3 శాతానికి ద్రవ్యోల్బణం ఆర్బీఐ తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతంగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2021–22 ఏప్రిల్–సెప్టెంబర్) సగటున ఈ రేటు 5 శాతానికి తగ్గుతుంది. మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 4.3 శాతానికి దిగివస్తుంది. ఇదే కారణంగా కీలక రేటు విధానం సరళతరంగా ఉంచడానికే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. అంటే వడ్డీరేట్లు వ్యవస్థలో మరింత తగ్గడానికే అవకాశం ఉంది తప్ప, పెంచే యోచనలేదని భావించవచ్చు. ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్ దన్ను! భారత్ ఆర్థిక వ్యవస్థ ఒకేఒక్క దిశలో.. అదీ పురోగమన బాటలో ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. 2021–22లో ఎకానమీ 10.5% వృద్ధిని (ఎకనమిక్ సర్వే 11% కన్నా తక్కువ కావడం గమనార్హం) నమోదు చేసుకుంటుందన్న భరోసాను ఆయన ఇచ్చారు. మౌలిక రంగం, ఆరోగ్యం వంటి కీలక రంగాల పునరుత్తేజానికి ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తగిన చర్యలను ప్రకటించిందని తెలిపారు. ఆయా అంశాల దన్నుతో 2021–22 మొదటి ఆరు నెలల్లో వృద్ధి 26.2%–8.3% శ్రేణిలో ఉంటుందని, 3వ త్రైమాసికంలో 6% వృద్ధి నమోదవుతుందని తెలిపింది. బ్యాంకులకు నిధుల లభ్యత: అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకింగ్ ఆర్బీఐ నుంచి నిధులు పొందడానికి సంబంధించిన మార్జినల్ స్టాండింగ్ సౌలభ్యత (ఎంఎస్ఎఫ్)ను ఆర్బీఐ మరో ఆరు నెలలు పొడిగించింది. దీనివల్ల రూ.1.53 లక్షల కోట్లు బ్యాంకింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది మార్చి నుంచీ ఈ పొడిగింపులను ఆర్బీఐ కొనసాగిస్తోంది. ఆలోచనాపూర్వక పాలసీ : వృద్ధికి మద్దతు, రుణ నిర్వహణ, ద్రవ్య లభ్యత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఆలోచనాపూర్వక పాలసీ ఇదీ. వృద్ధే లక్ష్యంగా రూపొందించిన 2021-22 బడ్జెట్‌తో కలిసి తాజా విధాన నిర్ణయాలు కరోనా సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. - దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ రియల్టీకి ప్రయోజనం.. వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు తగిన నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలకు టీఎల్టీఆర్ఓ ప్రయోజనాలను విస్తరించడం రియల్టీసహా ద్రవ్య లభ్యత సమస్యలను ఎదుర్కొంటున్న పలు రంగాలకు దోహదపడుతుంది. తక్కువ వడ్డీరేట్ల వల్ల హౌసింగ్ రంగంలో డిమాండ్ ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. - శశిధర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ రికవరీ పటిష్టతకు దోహదం : ఇప్పటికే ఎకానమీ రికవరీ వేగవంతమైంది. సెంట్రల్ బ్యాంక్ తాజా పాలసీ నిర్ణయాలు ఈ రికవరీ బాటను మరింత పటిష్టం చేస్తాయని భావిస్తున్నాం.చిన్న పరిశ్రమలకు ద్రవ్య లభ్యతకు పాలసీ తగిన నిర్ణయాలను తీసుకోవడం హర్షణీయం. సరళ విధానాన్ని పునరుద్ఘాటించడం వృద్ధికి భరోసాను ఇచ్చే అంశం. - ఉదయ్ శంకర్, ఫిక్కీ ప్రెసిడెంట్ -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..!
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్బీఐ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గృహ రుణాలను తీసుకునే వారికి 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా మహిళ రుణ గ్రహీతలకు 5 బేసిక్ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనుంది. ఖాతాదారులు యోనో యాప్ నుంచి గృహరుణాలను పొందవచ్చునని ఎస్బీఐ తెలిపింది. యోనో యాప్ నుంచి రుణాలను తీసుకున్న ఖాతాదారులకు 5 బేసిక్ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనుంది. ఈ సందర్భంగా సంస్ధ ఎండీ సీఎస్ శెట్టి(రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) మాట్లాడుతూ...“ఎస్బీఐ హోమ్ ఫైనాన్స్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంటూ, గృహ రుణ మార్కెట్లో వినియోగదారులను సంతృప్తి పరచడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేట్లతో ఖాతాదారులకు రుణాలను తీసుకునే స్థోమత బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది ఈఎంఐ మొత్తాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ చర్యలతో రియల్ ఎస్టేట్ పరిశ్రమకు వెనుదన్నుగా నిలుస్తుంద"ని పేర్కొన్నారు. ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు రూ. 30 లక్షలకు 6.70 శాతం , రూ. 30 లక్షలు నుంచి 75 లక్షల వరకు 6.95 శాతం . రూ. 75 లక్షలకుపైగా రుణాలను తీసుకునే వారికి 7.05 శాతం వద్ద గృహ రుణాలు లభిస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ. 5 లక్షల కోట్ల మైలు రాయిని చేరిందని ఎస్బీఐ తెలిపింది. 2020 డిసెంబర్ 31 నాటికి బ్యాంకు దగ్గర ఆటో లోన్ బుక్ రూ. 75,937 కోట్లు ఉందని తెలిపింది. బ్యాంకు డిపాజిట్ బేస్ రూ. 35 లక్షల కోట్లు ఉందని పేర్కొన్నారు. చదవండి: SBI Recruitment 2021: ఎస్బీఐలో 5454 జూనియర్ అసోసియేట్ పోస్టులు -
పాలసీ రేట్లు యథాతథం?
న్యూఢిల్లీ: కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మళ్లీ అనిశ్చితి నెలకొంటున్న పరిస్థితుల మధ్య రిజర్వ్ బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్‌లో తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. మూడు రోజుల పాటు జరిగే సమాలోచనల తర్వాత ఏప్రిల్ 7న పాలసీ రేట్లను ప్రకటించనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఆర్బీఐ కమిటీ చివరిసారిగా సమావేశమైంది. ద్రవ్యోల్బణంపరమైన ఆందోళనల కారణంగా అప్పుడు కూడా రెపో రేటును (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) యథాతథంగానే ఉంచింది. ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఉదార పరపతి విధానాన్నే కొనసాగించవచ్చని, ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంలో విఫలం కాకుండా వృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకునేందుకు తగు సమయం వచ్చే దాకా వేచి చూసే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ కేసుల పెరుగుదల, పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు విధిస్తుండటం తదితర అంశాలు అనిశ్చితికి దారి తీయొచ్చని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఒక నివేదికలో పేర్కొంది. రెపో రేటు ప్రస్తుతం 4%గా ఉండగా, రివర్స్ రెపో రేటు 3.35%గా ఉంది. గతేడాది మే నుంచి ఆర్బీఐ పాలసీ రేట్ల విషయంలో యథాతథ స్థితి కొనసాగిస్తోంది. -
వడ్డీరేట్లు పెరుగుతాయా?
కరోనా కల్లోలం కారణంగా ఈక్విటీ ఫండ్స్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బ్యాంకింగ్, పీఎస్‌యూ, షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్‌కు మళ్లించాను. ఈ ఏడాది మార్చి తర్వాత వడ్డీరేట్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సమంజసమైన రాబడులు రావాలంటే నేను ఏ రకమైన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? –స్రవంతి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ భవిష్యత్తును ముందుగానే అంచనా వేయడం కష్టం. అలాగే వడ్డీరేట్ల గమనం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. వడ్డీరేట్లు తగ్గుతాయని, లేదు పెరుగుతాయని ఎవరికి వారు బలమైన వాదనలతో ఇన్వెస్టర్లను గందరగోళ పరుస్తున్నారు. అవసరాన్ని బట్టి రేట్లపై నిర్ణయాలు తీసుకుంటామని ఆర్బీఐ అంటోంది. బహుశా ఈ విధానం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగే అవకాశాలున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. ఆర్థిక వృద్ధి కూడా మెరుగుపడుతోంది. ఇన్ని అంశాల మధ్య వడ్డీరేట్ల తీరు ఎలా ఉంటుందో అంచనాలు వేయడం కొంచెం కష్టమైన విషయమే. అందుకని ఏ ఇన్వెస్టరైనా తన నియంత్రణలో లేని ఇలాంటి విషయాల కంటే తన నియంత్రణలో ఉండే ఇతర విషయాలపైననే దృష్టి సారించాలి. మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి? ప్రస్తుతమున్న ఆర్థిక అవసరాలు ? మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేయగలరు. ఇప్పుడు మీకు ఉన్న ఆదాయ, వ్యయ వివరాలు....ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఏ విధమైన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయాలు తీసుకోండి. సాధారణంగా పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం దీర్ఘకాలం (కనీసం ఏడేళ్లు... అంతకు మించి)ఇన్వెస్ట్ చేయడానికి ఈక్విటీ ఫండ్స్‌ను మించిన ఇన్వెస్ట్మెంట్ సాధనం మరొకటిలేదు. ఇన్కమ్ పోర్ట్‌ఫోలియోల్లో ఈక్విటీ ఫండ్స్ కూడా ఉండాల్సిందేనని మితృలంటున్నారు. అది సరైనదేనా? –వివేక్, విశాఖపట్టణం ఒక ఇన్వెస్టర్ ఇన్కమ్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ ఫండ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల కంటే ఈక్విటీ సాధనాలే మెరుగైన రాబడులు ఇస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన అవసరాలకు ఫిక్స్డ్–ఇన్కమ్ ఆధారిత పోర్ట్‌ఫోలియోపైననే ఆధారపడి ఉంటాడనుకుందాం. నెలకు రూ.50,000 వచ్చేట్లుగా ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. ప్రస్తుతానికి ఈ రూ.50,000 మొత్తం ఆ వ్యక్తి అవసరాలకు సరిపోతుంది. ఐదేళ్ల తర్వాత చూసుకుంటే, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు, సేవల ధరలు కూడా పెరుగుతాయి. అప్పుడు ఈ 50,000 సరిపోవు. ఈ రాబడిని పెంచుకోవలసి ఉంటుంది. పూర్తిగా స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే రాబడులు పొందే వ్యక్తి..... పెరుగుతున్న ధరలతో సమానమైన రాబడులను పొందలేడు. అందుకని ఆ వ్యక్తి పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా ఈక్విటీ ఫండ్స్ ఉండాల్సిందే. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందవచ్చు. ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలతో ఈక్విటీ ఫండ్స్‌ను కూడా కలిపితే మంచిది. ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం నిలకడైన రాబడిని ఇస్తుంది. ఇక ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిస్తుంది. -
రికవరీ ఆశలు- రియల్టీ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: ఒడిదొడుకుల మార్కెట్లోనూ రయల్టీ రంగ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. దీంతో తొలుత ఎన్ఎస్ఈలో రియల్టీ రంగం 3 శాతం ఎగసింది. పలు కౌంటర్లకు డిమాండ్ ఏర్పడటంతో లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఇందుకు పలు అంశాలు దోహదం చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం.. షేర్ల జోరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 285 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 289 వరకూ ఎగసింది. ఈ బాటలో గోద్రెజ్ ప్రాపర్టీస్ దాదాపు 4 శాతం పెరిగి రూ. 1,105 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,122 వరకూ లాభపడింది. డీఎల్ఎఫ్ లిమిటెడ్ సైతం 3 శాతం వృద్ధితో రూ. 196 వద్ద కదులుతోంది. తొలుత రూ. 201 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఇతర కౌంటర్లలో ఇండియాబుల్స్ రియల్టీ 2.7 శాతం బలపడి రూ. 63 వద్ద ట్రేడవుతోంది. శోభా లిమిటెడ్ 1.25 శాతం పుంజుకుని రూ. 318 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 323 వరకూ పురోగమించింది. ఇదే విధంగా ఒబెరాయ్, సన్‌టెక్, బ్రిగేట్ సైతం 0.5 శాతం స్థాయిలో బలపడి ట్రేడవుతున్నాయి. కారణాలివీ.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో రియల్టీ రంగ కంపెనీలు సగటున ప్రోత్సాహకర ఫలితాలు సాధించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా క్యూ2(జులై-సెప్టెంబర్)లో రెసిడెన్షియల్ విభాగం పటిష్ట పనితీరును చూపినట్లు తెలియజేశారు. తద్వారా నిర్వహణ లాభాలను సాధించినట్లు వివరించారు. ఇటీవల కనిపిస్తున్న ఆర్థిక రికవరీ రియల్టీకి డిమాండ్‌ను పెంచనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. రిటైల్, ఆతిథ్య రంగం నుంచి డిమాండ్ పెరిగే వీలున్నట్లు పేర్కొన్నాయి. దీనికితోడు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెసిడెన్షియల్ విభాగానికి పన్నుసంబంధ మినహాయింపులను ప్రకటించడంతో సెంటిమెంటు బలపడినట్లు తెలియజేశాయి. అంతేకాకుండా పీఎంఏవై పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు కేటాయించడం కూడా ఇందుకు దోహదపడనున్నట్లు విశ్లేషించాయి. -
ఎక్కడి ‘రేట్లు’ అక్కడే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మార్కెట్ అంచనాలకు అనుగుణంగా సాగింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 4 శాతంగానే కొనసాగించాలని శుక్రవారం వరకూ వరుసగా మూడు రోజులుగా సాగిన గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ధరల స్పీడ్ (2019 ఇదే కాలంలో పోల్చి) ఎక్కువగానే ఉందని అభిప్రాయపడ్డ విధాన ప్రకటన తరువాతి త్రైమాసికాల్లో ఇది దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆయా అంశాల నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వడ్డీరేట్లు మరింత తగ్గేందుకే అవకాశం ఉందని మార్కెట్‌కు సూచించింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1%) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టులో యథాతథ విధానాన్ని ప్రకటించింది. తాజా సమీక్షలోనూ ఇదే విధానాన్ని కొనసాగించింది. 2021 ఏప్రిల్–జూన్‌లో 20.6 శాతం వృద్ధి! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) ఎకానమీ 9.5 శాతం క్షీణిస్తుందని అంచనావేసింది. 2020–21 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 23.9 శాతం క్షీణతను ప్రస్తావిస్తూ, సెప్టెంబర్ , డిసెంబర్ త్రైమాసికాల్లోనూ క్షీణ రేటే నమోదవుతుందని అంచనా. ఈ క్షీణ రేట్లను వరుసగా 9.8 శాతం, 5.6 శాతంగా లెక్కగట్టింది. అయితే చివరి త్రైమాసికం అంటే జనవరి–మార్చి త్రైమాసికంలో స్వల్పంగా 0.5 శాతం ఆర్థికాభివృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2021 ఏప్రిల్–2021 జూన్) భారీగా 20.6 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తోంది. ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నాయి. అయితే ఇందుకు బేస్ ఎఫెక్ట్ (2020లో దారుణ పతన స్థితి) మరీ తక్కువగా ఉండడం కారణమని ఆయా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థకు చక్కటి తోడ్పాటును అందిస్తుందని విధాన కమిటీ అంచనావేసింది. మొత్తంగా చూస్తే, కరోనా వైరస్‌పై పోరులో భారత్ ఆర్థిక వ్యవస్థ నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించిందని, కరోనా కట్టడితోపాటు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణం దిగివస్తుంది సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. తొలి అంచనాల ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతం. (ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం ఈ రేటు మైనస్ 2 లేదా ప్లస్ 2తో 4 శాతం వద్ద కొనసాగాలి. సరఫరాలు– డిమాండ్ మధ్య అసమతౌల్యత కారణంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. అయితే వచ్చే త్రైమాసికాల్లో ఈ సమస్య తగ్గుతుంది. దీనికితోడు వ్యవసాయ రంగం పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంది. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. చిన్న పరిశ్రమలకు ఊరట రిటైల్ రుణ గ్రహీతలు, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు అందించే విషయంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు లభించింది. ఇందుకు సంబంధించిన పరిమితిని (ఫండ్ అండ్ నాన్–ఫండ్ ఆధారిత) రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్లకు పెంచింది. దీనికితోడు ఈ రుణాల మంజూరీకి సంబంధించి మూడవ పార్టీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల (సీఆర్ఏలు) నుంచి బ్యాంక్ లోన్ రేటింగ్ (బీఎల్ఆర్)ను బ్యాంకులకు పొందాల్సిన అవసరం లేదు. ఎగుమతిదారులకు వరం ఎగుమతిదారుల ప్రయోజనాలకు పెద్దపీటవేస్తూ, సిస్టమ్ ఆధారిత ఆటోమేటిక్ కాషన్ లిస్టింగ్‌ను మినహాయించింది. దీనివల్ల విదేశీ కొనుగోలుదారులతో ఎగుమతిదారులు మరింత మెరుగైన రీతిన లావాదేవీలు నిర్వహించగలుగుతారు. అలాగే ఎగుమతుల ద్వారా సముపార్జించిన మొత్తాన్ని మరింత సులభతరమైన రీతిలో అందుకోగలుగుతారు. 2016లో ప్రవేశపెట్టిన ఆటోమేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డేటా ప్రాసెసింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఈడీపీఎంఎస్)– ‘కాషన్/డీ–కాషన్ లిస్టింగ్ ప్రకారం... రెండేళ్లు పైబడిన షిప్పింగ్ బకాయిల విషయంలో ఎగుమతిదారుడు కొన్ని ప్రతికూల పరిస్థితును ఎదుర్కొనాల్సి ఉంటోంది. కరోనా కష్టకాలంలో ఎగుమతిదారుపై మరిన్ని నియంత్రణలు తగదని ఆర్బీఐ పాలసీ భావిస్తోంది. ద్రవ్య లభ్యతకు ఢోకా ఉండదు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు ఉంటాయి. వచ్చే వారం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (వోఎంవో) వేలం ద్వారా రూ.20,000 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే రూ.లక్ష కోట్లను అందుబాటులో ఉంచడానికి వీలుగా మూడేళ్ల కాలపరిమితితో దీర్ఘకాలిక రెపో చర్యలను (టీఎల్టీఆర్ఓ) ఆర్బీఐ తీసుకుంటుంది. ఇందుకుగాను ఫ్లోటింగ్ రేటును మార్చి 31, 2021 వరకూ ఉండే పాలసీ రెపో రేటుతో అనుసంధానించడం జరుగుతుంది. దిశా నిర్దేశం... విధాన నిర్ణయం వృద్ధి పునరుద్ధరణకు తగిన మార్గదర్శకాన్ని సూచించింది. ఆర్థిక వ్యవస్థను పాలసీ ప్రతిబింబిస్తోంది. ‘అధికారిక నిర్ణయాల’ ప్రాతిపదికన కాకుండా, ‘దిశా నిర్దేశం’ ప్రాతిపదికన వృద్ధికి ఊతం ఇవ్వాలని పాలసీ భావిస్తోంది. – దినేష్ కుమార్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ మరోదఫా రేటు కోత విధాన నిర్ణయాలను పరిశీలిస్తే, డిసెంబర్లో లేదా ఫిబ్రవరి పాలసీ సమీక్ష సందర్భంగా రెపో రేటు కోత అవకాశం ఉంది. ద్రవ్య లభ్యత విషయంలో ఎటువంటి ఇబ్బందిలేని పరిస్థితిపై పరపతి విధాన కమిటీ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ రియల్టీకి సానుకూలం గృహ రుణాలపై రిస్క్ వెయిటేజ్ హేతుబద్దీకరణ రియల్టీకి సానుకూల అంశం. ఈ రంగంలో రుణ లభ్యత పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. అయితే పరిశ్రమ పురోగతికి, డిమాండ్ పెరగడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. – సతీష్ మగార్, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వృద్ధికి మార్గం... వృద్ధి రికవరీ దిశలో ఆర్బీఐ తగిన నిర్ణయాలను తీసుకుంది. ద్రవ్య లభ్యత, ఎగుమతులు, రుణ వృద్ధి పలు అంశాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఆయా రంగాలకు ఊరటనిస్తాయి. ముఖ్యంగా మరోదఫా రేటు కోతకు అనుగుణమైన విధానం హర్షణీయం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ ఆర్టీజీఎస్ సేవలు ఇక 24x7 డిసెంబర్ నుంచి అమల్లోకి ముంబై: భారీ స్థాయిలో నగదు బదిలీ లావాదేవీలు నిర్వహించే వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే దిశగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) విధానాన్ని ఏడాది పొడవునా, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి తేనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిసెంబర్ నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రతి నెలా రెండు, నాలుగో శనివారం మినహా వారంలోని అన్ని పని దినాల్లో ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 గం. దాకా ఆర్టీజీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. ‘భారీ స్థాయి చెల్లింపుల వ్యవస్థను ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో తెచ్చిన అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా నిలుస్తుంది‘ అని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రూ. 2 లక్షల పైబడిన ఆర్థిక లావాదేవీలకు ఆర్టీజీఎస్ విధానాన్ని, రూ. 2 లక్షల లోపు లావాదేవీలకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. 2019 డిసెంబర్ నుంచి నెఫ్ట్ ఏడాది పొడవునా, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు లైసెన్సింగ్ సంబంధ అనిశ్చితిని తగ్గించేందుకు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు ఇచ్చే ఆథరైజేషన్ సర్టిఫికెట్ (సీవోఏ)ను సుదీర్ఘకాలం వర్తించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. గృహ రుణాలపై రిస్క్ వెయిటేజ్ హేతుబద్దత గృహ రుణాలకు సంబంధించి రిస్క్ (మొండిబకాయిగా మారే అవకాశాలు) వెయిటేజ్‌ని ఆర్బీఐ హేతుబద్దీకరించింది. అన్ని కొత్త గృహ రుణాలకు సంబంధించి రిస్క్ వెయిటేజ్ ఇకపై ఒకేగాటన కాకుండా, ‘లోన్ టూ వ్యాల్యూ నిష్పత్తి’కి అనుసంధానమై ఉంటుంది. ఇందుకు అనుగుణమైన విధంగా రుణ గ్రహీతలు వివిధ సంస్థల నుంచి తగిన వడ్డీరేటు ప్రయోజనాలు పొందవచ్చు. కొత్త విధానం 2022 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కరోనా.. క్రికెట్.. ఆర్బీఐ పాలసీ.. ఆర్బీఐ గవర్నర్ దాస్ ప్రకటనలో క్రికెట్ పరిభాష ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ ప్రకటనలో ఈసారి క్రికెట్ పరిభాష కూడా చోటు దక్కించుకుంది. రికవరీ ప్రక్రియ, వివిధ రంగాల పరిస్థితుల గురించి ఉటంకిస్తూ .. ఆఖరి ఓవర్లు, ఖాతా తెరవడం, ఇన్నింగ్స్ కాపాడుకోవడం వంటి పదాలను దాస్ ప్రస్తావించారు. కరోనా వైరస్ బారిన పడ్డ ఎకానమీ కోలుకునే ప్రక్రియను వివరించే ప్రయత్నం చేస్తూ ‘నా అభిప్రాయం ప్రకారం రికవరీ మూడంచెలుగా ఉండవచ్చు. కరోనాను కూడా తట్టుకుని నిలబడిన రంగాలను అన్నింటికన్నా ముందుగా ’పరుగుల ఖాతా తెరిచిన’ వాటిగా పరిగణించవచ్చు. వ్యవసాయం, ఎఫ్ఎంసీజీ, వాహనాలు, ఫార్మా మొదలైనవి ఈ కేటగిరీలోకి వస్తాయి. మాంచి ‘స్ట్రైక్ ఫామ్’లో ఉన్నవి రెండో కోవలోకి వస్తాయి. కార్యకలాపాలు క్రమంగా మళ్లీ సాధారణ స్థాయికి వస్తున్న రంగాలు ఇందులో ఉంటాయి. ఇక ‘ఆఖరు ఓవర్లను’ (తీవ్ర ఒత్తిడిని) ఎదుర్కొని బరిలో నిల్చి, ఇన్నింగ్స్‌ను కాపాడే రంగాలు మూడో కేటగిరీలోకి వస్తాయి. సామాజిక దూరం వంటి నిబంధనలతో తీవ్రంగా దెబ్బతిన్న రంగాలు ఇందులో ఉన్నాయి’ అని దాస్ పేర్కొన్నారు. -
వడ్డీరేట్లు యథాతథంగానే..!
న్యూఢిల్లీ: పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తదుపరి భేటీలో వడ్డీ రేట్లను సవరించకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ఎంపీసీ ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు భేటీ కానుంది. అక్టోబర్ 1న ఎంపీసీ తన నిర్ణయాలను ప్రకటించనుంది. మరింత రేట్ల కోతకు అవకాశాలు ఉన్నప్పటికీ అవసరమైనప్పుడే వాటిని వినియోగిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలే ఓ సందర్భంలో చెప్పారు. దీంతో తదుపరి రేట్ల కోతపై అంచనాలు ఏర్పడ్డాయి. చివరి ఎంపీసీ భేటీ ఆగస్ట్‌లో జరగ్గా.. అప్పుడు కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణం రిస్క్‌లను దృష్టిలో ఉంచుకుని యథాతథ స్థితికే మొగ్గు చూపించింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ బలహీన స్థితిలో ఉందని ఆసందర్భంలో పేర్కొంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.73 శాతంగా ఉంటే, ఆగస్ట్‌లో అతి స్వల్పంగా తగ్గి 6.69 శాతం స్థాయిలోనే ఉంది. కానీ, ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిల్లో.. గరిష్టంగా, కనిష్టంగా 2 శాతానికి మించకుండా చూడాలన్నది ఆర్బీఐ లక్ష్యం. అంటే ప్రస్తుతద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట లక్ష్యమైన 6 శాతానికి పైనే ఉండడం గమనార్హం. నిపుణుల అంచనాలు.. ‘‘యథాతథ స్థితికే ఆర్బీఐ మొగ్గు చూపించొచ్చు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఈ విడత రేట్ల కోత ఉంటుందని నేను అయితే భావించడం లేదు’’ అని యూనియన్ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ తెలిపారు. రేట్ల కోతకు అవకాశం ఉందని, అయితే, వచ్చే ఫిబ్రవరిలో అది సాధ్యపడొచ్చన్నారు. డిసెంబర్ నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని, మంచి పంటల ఉత్పాదకత కారణంగా రేట్ల కోతకు అవకాశం ఫిబ్రవరిలో కలగొచ్చని చెప్పారు. రెపో, రివర్స్ రెపో రేట్లతో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని.. స్థూల ఆర్థిక గణాంకాలను ఆర్బీఐ నిశితంగా పరిశీలించొచ్చని కోటక్ మహీంద్రా బ్యాంకు కన్జ్యూమర్ బ్యాంకింగ్ ప్రెసిడెంట్ శక్తిఏకాంబరం అన్నారు. ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలకు మరింత పెరగొచ్చు. తర్వాతి నెలల్లో క్రమంగా తగ్గుముఖం పడుతుంది. టోకు ద్రవ్యోల్బణం మాత్రం ప్రస్తుత స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఎంపీసీ నుంచి ఎటువంటి రేట్ల నిర్ణయాలు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నాము’’ అని అదితినాయర్ పేర్కొన్నారు. ఆర్బీఐ యథాతథ స్థితినే కొనసాగించొచ్చని, విధానంలోనూ, రెపో, సీఆర్ఆర్లోనూ ఏ విధమైన మార్పులు ఉండకపోవచ్చని కేర్ రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ సైతం పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉన్నందున వేచి చూసే ధోరణి అనుసరించొచ్చని పేర్కొన్నారు. తక్కువ స్థాయిల్లోనే కొనసాగించాలి.. ‘‘రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉన్నందున రేట్ల కోతకు బదులు ఆర్బీఐ తన సర్దుబాటు ధోరణిని కొనసాగించాలి. వృద్ధికి మద్దతునివ్వడం కీలకం. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొచ్చే వరకు ఆర్బీఐ వేచి చూడాలి’’ అని సీఐఐ కోరింది. అసోచామ్ సైతం ఇదే కోరింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి, ఎన్నో సవాళ్లు నెలకొన్నందున ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో తన సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. మహారాష్ట్రలో స్టాంప్ డ్యూటీ చార్జీలను తగ్గించడం, డెవలపర్లు ఇస్తున్న ఉచిత తాయిలాలతో రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ క్రమంగా ఏర్పడుతోందని.. ఈ క్రమంలో రానున్న పండుగల సీజన్లో కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు వీలుగా రెపో రేట్లను దిగువ స్థాయిల్లోనే ఉంచాల్సిన అవసరం ఉందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. -
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సొంత ఇల్లు కల కంటున్న కస్టమర్లకు శుభవార్త అందించింది. ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేటుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే రుణగ్రహీతలకు మూడు ప్రయోజనాలు లభిస్తాయని వెల్లడించింది. ఆ మేరకు వివరాలను బ్యాంకు ట్వీట్ ద్వారా తెలిపింది. ప్రయోజనాలు ప్రాసెసింగ్ ఫీజు రద్దు 30 లక్షలకు పైబడి, కోటి రూపాయల కంటే తక్కువ రుణాలపై సిబిల్ స్కోరు ఎక్కువ ఉన్న రుణగ్రహీతలకు 0.10శాతం వడ్డీ రాయితీ ఎస్బీఐ యోనో యాప్ ద్వారా అయితే అదనంగా 0.5 శాతం రాయితీ లభ్యం. దీంతో రుణం మొత్తంపై 0.40 శాతం వరకు వినియోగదారులకు ఆదా అవుతుంది. ఉదాహరణకు, 30 లక్షల రుణంపై 15 సంవత్సరాల కాల పరిమితిలో 1.52 లక్షల వరకు కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం వేతన జీవులకు గృహ రుణాలపై 6.95 శాతం నుండి 7.45 శాతం స్వయం ఉపాధి పొందుతున్నవారి రుణాలపై 7.10 శాతం నుండి 7.60 శాతం మధ్య వడ్డీ రేటు వసూలు చేస్తోంది. కాగా కరోనావైరస్ వ్యాప్తి తరువాత రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 4 శాతానికి తగ్గించిన తరువాత గృహ రుణాలపై వడ్డీ రేట్లు దశాబ్ద కనిష్టానికి దిగి వచ్చిన సంగతి తెలిసిందే. Knock Knock! Who's there? Concessions on SBI Home Loans through YONO. Apply now: https://t.co/wWHot51u7y *T&C Apply#YONOSBI #HomeLoan #DreamHome #SBI #StateBankOfIndia pic.twitter.com/7uQiKNecPM — State Bank of India (@TheOfficialSBI) September 9, 2020 -
రుణం కాకూడదు భారం!
‘మన పరిధిల్లోనే మనం జీవించాలి’ ఆర్థిక నిపుణులు ఇచ్చే సూచన ఇది. అంటే తమకు వస్తున్న ఆదాయాన్ని మించి ఖర్చులకు వెళ్లకపోవడం సురక్షితం. మెరుగైన జీవనం కోరుకునే వారు.. ముందు తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలి. అయితే, ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అప్పు అవసరం ఏర్పడవచ్చు. తీసుకునే రుణం మీకు లాభం తెచ్చిపెట్టాలి కానీ, మీ విలువను హరించివేసి అప్పుల ఊబిలోకి నెట్టేయకూడదు. అదే విధంగా మీ జీవిత లక్ష్యాలకు విఘాతంగా మారకూడదు. అవకాశం ఉన్నంత మేర రుణం పుచ్చుకోవడం కాకుండా.. తమ చెల్లింపుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. మన దేశంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు.. రుణం ఇచ్చే ముందు దరఖాస్తు దారుల నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని చెల్లింపుల సామర్థ్యంగా పరిగణనలోకి తీసుకుంటాయి. అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని ఈఎంఐ చెల్లిస్తుంటే ఆ మొత్తాన్ని నికర ఆదాయం నుంచి మినహాయించి రుణ అర్హతలను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు రమణ ప్రతీ నెలా నికరంగా రూ.లక్ష చొప్పున వేతనం పొందుతున్నాడని అనుకుంటే.. అందులో 50 శాతం రూ.50,000 అవుతుంది. అయితే, అప్పటికే రమణ తన కారు కోసం రూ.10,000 ఈఎంఐ చెల్లిస్తున్నాడు. దీంతో రమణ వద్ద మిగిలి ఉన్న రుణ చెల్లింపుల సామర్థ్యం రూ.40,000 అవుతుంది. ఈ విధంగా చూస్తే.. 9 శాతం వడ్డీ రేటుపై 15 ఏళ్ల కాలానికి రూ.40 లక్షల గృహ రుణాన్ని రమణ సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఆదాయంలో 50 శాతానికి ఈఎంఐను ఖరారు చేస్తే.. మిగిలిన 50 శాతం నుంచి మీ ఖర్చులుపోను భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేసుకునేందుకు దాదాపు మిగిలేది ఏమీ ఉండదు. దీంతో కొన్నింటి విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. కొనుగోళ్లను వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. ఎత్తు పల్లాలను ఎదుర్కొనే వెసులుబాటు కూడా తగ్గిపోతుంది. అందుకే మీకున్న గరిష్ట రుణ అర్హత పరిధిలో ఎంత వరకు రుణం తీసుకుంటే.. నెల నెలా చెల్లింపులు చేయడం సౌకర్యంగా ఉంటుందన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీ జీవన వ్యయాలు, ప్రస్తుత ఈఎంఐల మొత్తంతోపాటు.. ఇతర లక్ష్యాల కోసం ఆదాయంలో 15–20 శాతం మేర పొదుపును మినహాయించిన తర్వాతే ఈఎంఐపై స్పష్టతకు రావాలి. విలువను పెంచుకునేందుకు.. పెట్టుబడి కోసం, ఆస్తి కొనుగోలు కోసమో రుణం తీసుకుంటుంటే అందులో ‘లాభం’ సూత్రం దాగుండాలి. తీసుకున్న రుణానికి చేస్తున్న ఖర్చులకు మించి ఆదాయం ఇచ్చేది అయితేనే ప్రయోజనం లభిస్తుంది. లేదా కనీసం మీ నికర విలువను పెంచే వాటిపై రుణాన్ని ఖర్చు చేసినా పయ్రోజనం సిద్ధిస్తుంది. మన దేశంలో రిటైల్ రుణాలపై (గృహ రుణం మినహా) వడ్డీ రేట్లు అధిక స్థాయిల్లోనే ఉంటున్నాయి. ఈ రేట్లకు మించి పెట్టుబడులపై రాబడినిచ్చే సాధానాలు అరుదే. అయితే, తీసుకుంటున్న రుణాన్ని మీ నికర విలువను (నెట్‌వర్త్) తగ్గించేది కాకుండా పెంచేదానిపై ఇన్వెస్ట్ చేయడం మంచి విధానం అవుతుంది. ఇది ఎలా అంటారా..? భూమి కొనుగోలు, ఉన్నత విద్యార్హతల కోసం రుణం తీసుకోవడం. కొనుగోలు చేసిన భూమి విలువ పెరిగినా.. అదనపు విద్యార్హత అధిక ఆదాయానికి దారితీసినా మీ రుణ లక్ష్యం నెరివేరినట్టే. ఇలా కాకుండా రుణం తీసుకుని ఆకర్షణీయమైన ఫీచర్లతో చూడముచ్చటగా ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్, స్మార్ట్‌ఫోన్, హోమ్ థియేటర్ సిస్టమ్స్ వంటివి కొనుగోలు చేశారనుకోండి.. కాలం గడుస్తున్న కొద్దీ అవి విలువను కోల్పోతాయి. వీటి వల్ల రెండు విధాలా నష్టం ఎదురవుతుంది. వీటి కోసం రుణం తీసుకోవడం వల్ల వడ్డీ రూపంలో నష్టం ఒకటి అయితే.. కొనుగోలు చేసిన ఈ వస్తువుల విలువ కొంత కాలానికి జీరోకి చేరుకోవడం మరో నష్టం. వినియోగం కోసం లేక వినోద అనుభవం కోసం రుణం తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అర్థం చేసుకోవాలి. కనీసం జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం తగినంత నిధిని సమకూర్చుకునే వరకు అయినా.. ఇటువంటి వినియోగ, వినోద, విలాసాల కోసం రుణానికి దూరంగా ఉండడం ఆరోగ్యకరం. సామర్థ్యాన్ని మించొద్దు.. వేతన జీవులకు ఏటా ఎంతో కొంత ఆదాయం పెరుగుతుండడం సహజం. అయి తే, కచ్చితంగా పెరుగుతుందని అన్ని సందర్భాల్లోనూ చెప్పలేము. సమీప కాలంలో ఆదాయం పెరుగుతుందన్న అంచనాతో అధిక ఈఎంఐను ఎంచుకునే వారు కూడా ఉంటారు. కానీ, ఇలా చేయడం వల్ల పెరిగే వేతనంతో తొందరగా రుణ భారాన్ని తొలగించుకునే అవకాశాన్ని కోల్పోయినట్టవుతారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఉద్యోగ, వేతన కోతలను చవిచూస్తున్నారు. ఆర్థిక సంక్షోభాల్లోనూ లేదా విడిగా ఆయా కంపెనీలు సంక్షోభాల్లోకి వెళ్లిన సందర్భాల్లో ఉద్యోగులకు రిస్క్ ఏర్పడుతుంది. కనుక భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందన్న అంచనాలతో కాకుండా.. ప్రస్తుత చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. మెరుగైన ఆఫర్ రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నేడు వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలకు దిగొస్తున్నాయి. బ్యాంకులు రెపో ఆధారిత రుణాలను 6–7 శా తానికే ఆఫర్ చేస్తున్నాయి. కనుక రుణం తీసుకునే ముందు పలు సంస్థలను సంప్రదించి తక్కువ రేటుకు రుణాన్ని పొందడం వల్ల చెల్లింపుల భారాన్ని కొంతైనా తగ్గించుకోవచ్చు. అధిక ఈఎంఐ రుణం తీసుకునే సమయంలో చాలా మంది ఈఎంఐపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. రుణమిచ్చే సంస్థలు చెల్లింపులు సౌకర్యంగా ఉండేందుకు.. దీర్ఘకాలానికి రుణాన్ని, తక్కువ ఈఎంఐపై ఆఫర్ చేస్తుంటాయి. కానీ, కాల వ్యవధిని (లోన్ టర్మ్) దీర్ఘకాలానికి నిర్ణయించడం వల్ల.. రుణ గ్రహీత కంటే రుణదాతకే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వడ్డీ చెల్లింపులు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 15 సంవత్సరాల కాలానికి 9 శాతం వడ్డీపై తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (ఈఎంఐ) రూ.50,713 అవుతుంది. దీంతో 15 ఏళ్ల కాలానికి చెల్లించే మొత్తం రూ.91.28 లక్షలు అవుతుంది. ఒకవేళ రుణ కాల వ్యవధి 20 ఏళ్లకు పెంచుకుంటే ఈఎంఐ రూ.44,986 అవుతుంది. కానీ, 20 ఏళ్లలో చెల్లించే మొత్తం రూ.1.07 కోట్లకు పెరుగుతుంది. 15 ఏళ్ల కాలంలో వడ్డీ రూపంలో చెల్లించేది రూ.41.2 లక్షలు అయితే, 20 ఏళ్ల కాలంలో రూ.57.9 లక్షలుగా ఉంటుంది. కనుక రుణం విషయంలో కాల వ్యవధిని పెంచుకోకుండా, ఈఎంఐ పెంచుకునే విషయమై బ్యాంకుతో సంప్రదింపులు చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతూ పోతుంటే వాస్తవ ఈఎంఐకి అదనంగా వెసులుబాటు ఉన్నంత మేరకు చెల్లించుకోవడం ఇంకా మంచిది. -
తొలుత లాభాలు- తుదకు నష్టాలు
కోవిడ్-19 సృష్టిస్తున్న కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనట్లు ఆర్బీఐ తాజాగా పేర్కొంది. దీంతో ఆర్థిక పురోగతికి వీలుగా రెపో రేటును 0.4 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా మార్చి 1 నుంచి అమలు చేస్తున్న రుణ వాయిదా చెల్లింపులపై నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు తెలియజేసింది. ఫలితంగా కాలావధిగల రుణ చెల్లింపుల వాయిదాలపై ఆగస్ట్ 31వరకూ మారటోరియం కొనసాగనుంది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతానికి దిగివచ్చిన వెంటనే మార్కెట్లు జోరందుకోగా.. రుణ చెల్లింపులపై మారటోరియం కారణంగా బ్యాంకింగ్ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. రుణ చెల్లింపులపై ఆరు నెలల మారటోరియంతో బ్యాంకులకు సవాళ్లు ఎదురుకావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలియజేశారు. వెరసి సెన్సెక్స్ ఆటుపోట్ల మధ్య 260 పాయింట్లు కోల్పోయి 30,673 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 67 పాయింట్లు తక్కువగా 9,039 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 31,108 పాయింట్ల వద్ద గరిష్టాన్నీ, 30,475 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 9150- 8969 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. ప్రయివేట్ బ్యాంక్స్ డౌన్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, రియల్టీ 2.4-1.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే మీడియా, ఐటీ, ఫార్మా 2-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, ఐసీఐసీఐ, టాటా స్టీల్, బజాజ్ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్ 5.2-2 శాతం మధ్య డీలాపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో జీ, ఎంఅండ్ఎం, సిప్లా, శ్రీ సిమెంట్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, ఐవోసీ 7.2-1.6 శాతం మధ్య ఎగశాయి. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఈక్విటాస్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, పీఎఫ్సీ, ఐబీ హౌసింగ్, అశోక్ లేలాండ్ 6-5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు టాటా కెమికల్స్, నిట్ టెక్, సెంచురీ టెక్స్, ఏసీసీ, టాటా పవర్, జూబిలెంట్ ఫుడ్ 4.5-3.2 శాతం మధ్య జంప్ చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-0.25 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1317 నష్టపోగా.. 969 లాభపడ్డాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 259 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ. 402 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1467 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2373 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1328 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1660 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
మళ్లీ తగ్గిన వడ్డీ రేట్లు- మారటోరియం పొడిగింపు
కోవిడ్-19 కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మరోసారి రంగంలోకి దిగింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో తాజాగా 0.4 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 4 శాతానికి దిగివచ్చింది. ఇప్పటివరకూ రెపో రేటు 4.4 శాతంగా అమలవుతోంది. రెపో రేటును తగ్గించేందుకు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో రివర్స్ రెపో సైతం 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. కాగా.. మార్చి 1 నుంచి మే 31వరకూ మూడు నెలలపాటు రుణ చెల్లింపుల వాయిదాలపై విధించిన మారటోరియంను తాజాగా ఆగస్ట్ 31వరకూ పొడిగిస్తున్నట్లు శక్తికాంతదాస్ పేర్కొన్నారు. కోవిడ్-19 కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డవున్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా కుంటుపడినట్లు శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. పలు రంగాలలో ఉత్పాదక కార్యకలాపాలతోపాటు పెట్టుబడులు నిలిచిపోయినట్లు తెలియజేశారు.దీంతో తాజా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గతంలో భారీ కోత దేశీయంగానూ కరోనా వైరస్ విస్తరించడం ప్రారంభమయ్యాక ఆర్బీఐ నిర్వహిస్తున్న మూడో సమావేశమిది. మార్చి 27, ఏప్రిల్ 17న ఇంతక్రితం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలు చర్యలు ప్రకటించారు. కోవిడ్-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డవున్ విధించడంతో నీరసించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పంప్చేసిన విషయం విదితమే. ఈ బాటలో మార్చిలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో 75 బేసిస్ పాయింట్ల(0.7 శాతం)మేర కోత పెట్టింది. దీంతో రెపో రేటు 4.4 శాతానికి దిగివచ్చింది. ఇక ఆర్బీఐ వద్ద జమచేసే స్వల్పకాలిక నిధులపై బ్యాంకులు పొందే వడ్డీ రేటుకు సంబంధించిన రివర్స్ రెపోను సైతం 3.75 శాతానికి తగ్గించింది. రెపో బాటలో ఆర్బీఐ.. రివర్స్ రెపోలో సైతం 0.9 శాతం కోతను మార్చిలోనే విధించింది. దీంతో ఏప్రిల్ సమావేశంలో ప్రధానంగా లిక్విడిటీ చర్యలకే ప్రాధాన్యమిచ్చింది. దాదాపు అన్ని రకాల రుణ చెల్లింపుల వాయిదాలపై మే 31వరకూ మూడు నెలల మారటోరియం విధించింది కూడా. -
చిన్న పొదుపులు ఇప్పుడు ఓకేనా?
ఎన్నడూ లేని విధంగా, ఊహించని స్థాయిలో ఇటీవలే చిన్న మొత్తాల పొదుపు పథకాల (స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్) వడ్డీ రేట్లు గణనీయంగా కోతకు గురయ్యాయి. దేశంలో వడ్డీ రేట్లు అత్యంత కనిష్టాలకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల్లో వడ్డీ రేట్లను 2020–21 ఏప్రిల్–జూన్ త్రైమాసికి సవరించింది. ఇన్నాళ్లూ మెరుగైన వడ్డీ రేట్లతో చిన్న పొదుపు పథకాలు.. బ్యాంకు ఎఫ్డీలు, ఇతర స్థిరాదాయ పథకాలతో పోలిస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. వడ్డీ రేట్లను పరిశీలించినట్టయితే వివిధ పథకాల్లో 0.7% నుంచి 1.40% వరకు తగ్గించడం జరిగింది. కాకపోతే పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లపై వడ్డీ రేటు 4%లో ఎటువంటి మార్పు చేయలేదు. రేట్లు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ పథకాలను పెట్టుబడులకు పరిశీలించొచ్చా..? వీటిల్లో ఆకర్షణీయత ఇంకా మిగిలి ఉందా..? అన్న విషయమై నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందిస్తున్న ‘ప్రాఫిట్‌ప్లస్’ కథనం.. తాజా రేట్లు ఇవి.. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) రేటు ఎక్కువగా కోతకు గురైంది. ఇంతకుముందు వరకు 7.2 శాతం వడ్డీ రేటుతో ఈ పథకం ఆకర్షణీయంగా ఉండేది. తాజాగా 1.4 శాతం మేర తగ్గించడంతో 5.8 శాతానికి పరిమితమైంది. అలాగే ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కూడా 6.9 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించారు. ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేటు మాత్రం 7.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది. వృద్ధులకు నిలకడైన ఆదాయాన్నిచ్చే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లోనూ వడ్డీ రేటును 8.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 1.1 శాతం తగ్గి 7.9 శాతం నుంచి 6.8 శాతానికి దిగొచ్చింది. సుకన్య సమృద్ధి యోజనలో 7.6 శాతంగా ఉంది. ఇక ఎంతో ప్రాచుర్యం పొందిన పీపీఎఫ్‌లో వడ్డీ రేటు సవరణ తర్వాత 7.1 శాతంగా ఉంది. పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో 6.6 శాతానికి, కిసాన్ వికాస్ పత్రలో వడ్డీ రేటు 6.9 శాతానికి తగ్గిపోయింది. ఒకేసారి తగ్గింపు ఇంతలా..? చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను ప్రభుత్వ సెక్యూరిటీల (జీ–సెక్) రేట్లకు అనుసంధానించాలన్నది కేంద్రం ఉద్దేశ్యం. అందుకే 2016 ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లను త్రైమాసికానికి ఒకసారి సవరించడాన్ని ఆరంభించింది. గత రెండేళ్లలో పదేళ్ల జీసెక్ ఈల్డ్స్ 2 శాతం తగ్గిపోయాయి. కానీ అదే స్థాయిలో చిన్న పొదుపు పథకాల రేట్లను తగ్గించలేదు. అలాగే, గత రెండు త్రైమాసికాల్లోనూ రేట్లను అసలు మార్చలేదు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును గణనీయంగా తగ్గించడంతో ప్రభుత్వం ఒకేవిడత ఈ స్థాయిలో రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని తీసుకుంది. ఈ రేట్లపై ఇన్వెస్ట్ చేయవచ్చా? మరి ఈ స్థాయిలో రేట్లు తగ్గిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం దండగా..? అన్న సందేహం రావచ్చు. ఈ పథకాలకు సంబంధించి చూడాల్సిన ప్రధాన అంశం.. పెట్టుబడులకు అత్యధిక భద్రత కలిగి ఉండడం. పైగా మార్కెట్ రిస్క్ లేని స్థిరాదాయ పథకాలు. అదే విధంగా చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లతో పోల్చి చూస్తే ఇప్పటికీ కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు ఆకర్షణీయంగానే ఉన్నాయి. ప్రముఖ బ్యాంకుల్లో టర్మ్ డిపాజిట్ రేట్లు 6–7 శాతం మధ్యే ఉన్నాయి. పైగా ఈ ఆదాయంపై ఆదాయపన్ను అమలవుతుంది. ఇటీవలే ఆర్బీఐ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించినందున బ్యాంకుల డిపాజిట్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎస్బీఐ ఇప్పటికే ఈ దిశగా నిర్ణయం కూడా తీసుకుంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ రేటు 7 శాతానికిపైనే ఉండడం గమనార్హం. ఎన్ఎస్సీ, కిసాన్ వికాస్ పత్ర 6.8 శాతం, 6.9 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈరేట్లు ఆకర్షణీయమేనని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్ల రేట్లు ఏమాత్రం ఆకర్షణీయంగానూ లేవన్నది నిజం. పన్ను ప్రయోజనాన్ని చూడాలి... భద్రతకుతోడు, ఆకర్షణీయమైన వడ్డీరేటుతోపాటు కొన్ని పథకాలపై పన్ను ప్రయోజనం కూడా పొందే అవకాశం వీటిల్లో ఉంది. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్సీఎస్ఎస్, సుకన్య సమృద్ధి యోజన, ఐదేళ్ల టైమ్ డిపాజిట్లో పెట్టుబడులు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా ప్రయోజనానికి అర్హమైనవి. అలాగే, పీపీఎఫ్, సుకన్య స్కీమ్‌లో మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదు. ఆ విధంగా చూసుకుంటే పన్ను ఆదాతో కూడిన అధిక రాబడులకు ఇందులో అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయాలు.. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలతోపాటు అధిక రాబడులను ఇచ్చే కొన్ని ఇతర పెట్టుబడి సాధనాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఆర్బీఐ జారీ చేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్లు ఒక చక్కని ప్రత్యామ్నాయం. వీటిల్లో రేటు 7.75 శాతంగా ఉంది. భద్రత ఎక్కువే. కాకపోతే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. అలాగే, కొన్ని ప్రైవేటు బ్యాంకులు సైతం డిపాజిట్లపై అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. డీసీబీ బ్యాంకు మూడేళ్ల డిపాజిట్‌పై 7.70 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 500 రోజుల డిపాజిట్‌పై 7.50 శాతం, ఆర్బీఎల్ బ్యాంకు రెండేళ్ల నుంచి మూడేళ్ల డిపాజిట్లపై 7.45 శాతం రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 8.25–9.50 శాతం మధ్యన ఉన్నాయి. బ్యాంకుల్లో ఒక డిపాజిట్‌దారునికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్‌పై బీమా ఉంటుంది. బ్యాంకు సంక్షోభంలో పడినా కానీ, ఆ మేరకు డిపాజిట్‌దారునికి లభిస్తుంది. కనుక వీటిని పరిశీలనలోకి తీసుకోవచ్చు. అయితే, బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆర్బీఐ రేట్లను గణనీయంగా తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు ఇంకా డిపాజిట్ రేట్లను సవరించాల్సి ఉంది. -
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ కోత
సాక్షి, న్యూఢిల్లీ : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రా (కెవీపీ) నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సి) లాంటి ఏడు ప్రజాదరణ పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించింది. కరోనా వైరస్ ప్రభావంతో ఈ పథకాలపై చెల్లించే వడ్డీరేను 70 నుంచి 140 బేసిస్ పాయింట్లు మేర కోత పెట్టింది. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మధ్య, పేద తరగతి ప్రజలు కష్టపడి పొదుపు చేసుకునే లక్షల మంది ప్రభావితం కానున్నారు. ఈ సవరించిన రేట్లు నేటి (ఏప్రిల్ 1 ) నుంచి అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 2016 నుండి, అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రభుత్వ బాండ్ దిగుబడులతో అనుసంధానించిన నేపథ్యంలో ప్రతి త్రైమాసికంలో వడ్డీరేట్ల సమీక్ష వుంటుంది. పీపీఎఫ్ పథకంపై ప్రస్తుతం 7.9 శాతం వర్తిస్తుండగా, తాజా నిర్ణయం ప్రకారం ఇది 7.1 శాతానికి దిగి వచ్చింది. ఐదేళ్ల జాతీయ పొదుపు ధృవీకరణ (ఎన్ఎస్సి) పత్రంపై 7.9 శాతానికి బదులు ఇపుడు 6.8 శాతం వడ్డీ వర్తిస్తుంది. అలాగే కేవీపీ 6.9 శాతంగా వుంది. ఇప్పటివరకు ఇది 7.6 శాతం. సుకన్య సమృద్ది ఖాతా లకు 8.4 శాతానికి బదులుగా 7.4 శాతంగా వుంటుంది. ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 7.6 శాతంగా వుంది. అంతకు ముందు ఇది8.శాతం. ఐదేళ్ల నెలవారీ ఆదాయ పథకం 6.6శాతం. ఇప్పటివరకు ఇది 7.6 శాతం. అలాగే 1-5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లుపై వడ్డీ 5.5-6.7శాతం. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై 5.8 శాతం వడ్డీ వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ముందస్తు పాలసీ సమీక్షలొ రెపో రేటు కోతకు మొగ్గు చూపిన అనంతరం, తాజాగా చిన్న పొదుపు పథకాల వడ్డీరేటుపై కోత పడింది. అయితే ఊహించిన దానికంటే ఈ తగ్గింపు ఎక్కువగా వుందని డిపాజిట్ రేట్లను మరింత తగ్గించడానికి ప్రభుత్వం ఇలా చేసి ఉండవచ్చని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ పథకాల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రధానంగా ఆధారపడే వారు ఇప్పుడు వారి పోర్ట్‌ఫోలియోను తిరిగి సందర్శించాల్సి ఉంటుందని వైజెన్‌వెస్ట్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమంత్ రుస్తాగి తెలిపారు. తాజా నిర్ణయంతో సాంప్రదాయ పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.నేరుగా ఈక్విటీలో పెట్టుబడులు పెట్టాలని సూచించలేనప్పటికీ, మ్యూచువల్ ఫండ్లలో హైబ్రిడ్ ఫండ్స్ ను పరిశీలించాలని సూచించారు. కాగా కోవిడ్ -19 వ్యాప్తి, ఆర్థికవ్యవస్థపై ప్రభావం నేపథ్యంలో ఆర్బీఐ గత వారం రెపో రేటును 75 బీపీఎస్ పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. -
కోవిడ్‌పై ఫెడ్ అస్త్రం!
వాషింగ్టన్: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అత్యవసరంగా కీలక రేట్లను 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) తగ్గిస్తూ మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత విస్తరిస్తుండడంతో, దీన్నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచేందుకు రేట్లను 1–1.25 శాతం స్థాయికి తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఫెడ్ అత్యవసరంగా రేట్ల కోతకు దిగడం మళ్లీ ఇదే మొదటిసారి. ‘‘అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉంది. అయితే, కరోనా వైరస్‌తో ఆర్థిక కార్యకలాపాలకు సమస్యలు పొంచి ఉన్నాయి. ఈ రిస్క్‌ల నేపథ్యంలో, గరిష్ట ఉపాధి కల్పనను సాధించేందుకు, ధరల స్థిరత్వ లక్ష్యం కోసం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ‘ఫెడరల్ ఫండ్స్’ రేటు లక్ష్యంతో శ్రేణిని తగ్గించాలని నిర్ణయించింది’’ అని ఫెడ్ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి మార్చి 17–18 తేదీల్లో ఫెడ్ పాలసీ సమావేశం జరగనుంది. దీనికి మరో 15 రోజుల వ్యవధి ఉంది. కానీ, కరోనా వైరస్ అంతర్జాతీయ మాంద్యానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో.. ఫెడ్ ఈలోపే అత్యవసర రేట్ల కోతకు దిగాల్సి వచ్చింది. గతేడాది రేట్ల కోత తర్వాత తొలి రేట్ల కోత ఇది. గతేడాది మూడు విడతలుగా ఫెడ్ రేట్లను తగ్గించి 1.5–1.75 స్థాయికి తీసుకొచ్చింది. 2020లో రేట్లలో ఎటువంటి మార్పులు ఉండవని గతంలో ప్రకటించిన ఫెడ్.. కరోనా కారణంగా విధానాన్ని మార్చుకుంది. కాగా, ఆరంభంలో భారీ నష్టాల్లో నడిచిన డౌజోన్స్ ఫెడ్ రేట్ల కోత ప్రకటన తర్వాత తీవ్ర ఆటుపోట్ల మధ్య ట్రేడయింది. కరోనా భయాలతో గత వారం డౌజోన్స్ 14% పడిపోవడం గమనార్హం. మాంద్యం భయాలవల్లే... ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2008 నాటి మాంద్యం నుంచి బయటపడింది కానీ, చెప్పుకోతగ్గ స్థాయిలో రికవరీ కాలేదు. దాదాపు అన్ని సెంట్రల్ బ్యాంకులు మళ్లీ మాంద్యంలోకి జారిపోకుండా.. సర్దుబాటు ధోరణులతో రేట్ల తగ్గింపుతోపాటు అన్ని రకాల సాధనాలను వినియోగిస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారొచ్చన్న ఆందోళన విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఫెడ్ అత్యవసరంగా రేట్ల కోతను చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంగళవారం ఉదయం జీ–7 దేశాల(యూఎస్, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా) ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల చీఫ్‌లు అత్యవసరంగా సమావేశం కావడం కూడా ఇందుకే. కరోనా వైరస్‌ను నిలువరించి, ఆర్థిక వ్యవస్థలకు మద్దతుగా ద్రవ్యపరమైన చర్యలు సహా అవసరమైతే అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు జీ–7 దేశాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. జీ–7 నుంచి ఈ తరహా సంయుక్త ప్రకటనలు 2001 సెప్టెంబర్ 11 దాడుల ఘటన, 2008 మాంద్యం సమయాల్లోనూ వెలువడడం గమనార్హం. కరోనా వైరస్ 60కుపైగా దేశాలకు వేగంగా విస్తరించిందని, ఇది ప్రస్తుత త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిని దిగజార్చవచ్చని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) కూడా ఇప్పటికే హెచ్చరించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2020లో 2.4% కి తగ్గొచ్చని, వైరస్ మరింతగా విస్తరిస్తే 1.5%కి పడిపోయే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 2% దిగువకు ప్రపంచ వృద్ధి పడిపోతే దాన్ని మాంద్యంగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థపై వైరస్ ప్రభావం: పావెల్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం కొంత కాలం పాటు ఉంటుందన్నారు ఫెడ్ చైర్మన్ జీరోమ్ పావెల్. సెంట్రల్ బ్యాంకు చర్య ఆర్థిక వ్యవస్థకు తగినంత చేయూతనిస్తుందని తాను నమ్ముతున్నట్టు ఫెడ్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ‘‘ఆర్థిక వృద్ధి అంచనాలకు ఉన్న రిస్క్‌ను చూసే ఈ చర్య తీసుకున్నాం. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. బలమైన వృద్ధి, బలమైన లేబర్ మార్కెట్లోకి తిరిగి మళ్లీ మనం ప్రవేశిస్తామని నేను సంపూర్ణంగా భావిస్తున్నాను’’ అని పావెల్ పేర్కొన్నారు. ఇది సరిపోదు ‘‘ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గిస్తోంది కానీ మరింత తగ్గించాలి. మరీ ముఖ్యంగా ఇతర దేశాలు, పోటీదేశాల స్థాయికి రేట్లు దిగి రావాలి. మనం సహేతుక స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. మరింత రేట్ల కోత దిశగా ఫెడరల్ రిజర్వ్ అడుగులు వేయాల్సిన సమయం ఇది’’ – డోనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు చదవండి : వొడాఫోన్ ఐడియా బంపర్ ఆఫర్ రివోల్ట్ ఇ-బైక్స్ లాంచ్ -
పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటు కొనసాగింపు!!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20)లో ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 5న జరిగే ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2018–19లో కూడా ఇదే రేటు ఉంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని 8.5 శాతానికి తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. పోస్టాఫీస్ పొదుపు పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మొదలైన ఇతరత్రా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల స్థాయికి ఈపీఎఫ్ వడ్డీ రేటును కూడా సవరించాలంటూ కార్మిక శాఖపై ఆర్థిక శాఖ ఒత్తిడి తెస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా ప్రతీ ఆర్థిక సంవత్సరం వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో ఆర్థిక శాఖ అభిప్రాయాలను కూడా కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
మీ రుణం ‘బంగారం’ గాను..
ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే వెంటనే తెలిసిన వారి దగ్గర చేబదులు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. పర్సనల్ లోన్‌కు వెళ్లాలంటే అందుకు కొన్ని రోజుల సమయం తీసుకుంటుంది. వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణం తెచ్చుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో భారం పడుతుంది. ఇటువంటి అవసరాల్లో అన్నింటికంటే మెరుగైన మార్గంగా బంగారంపై రుణాన్ని చెప్పుకోవాలి. గోల్డ్‌లోన్ ఇతర రుణాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా సౌకర్యమైనదే కాదు, మన డబ్బును కొంత ఆదా చేస్తుంది. పర్సనల్ లోన్, ఇతర వ్యక్తిగత రుణాల్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది 12.75 శాతం నుంచి 19 శాతం వరకు ఉండొచ్చు. అదే గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఇతర రుణాలతో పోలిస్తే ఈ విషయంలో గోల్డ్‌లోన్ చౌక అని చెప్పుకోవాలి. ఇతర రుణాలతో పోలిస్తే ఆ మేరకు ఆదా చేసుకోవచ్చు. కాకపోతే బంగారం విలువలో గరిష్టంగా ఎంత మేరకు రుణాన్ని తీసుకుంటున్నారు? అనే అంశమే వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఉదాహరణకు మణప్పురం సంస్థ బంగారం విలువలో 45 శాతం వరకు రుణం తీసుకుంటే కేవలం 12 శాతం రేటునే చార్జ్ చేస్తోంది. ఇంకాస్త అదనంగా కావాలనుకుంటే అప్పుడు 18 శాతం వడ్డీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక బంగారం విలువలో 75 శాతం వరకు రుణం కోరుకుంటే అప్పుడు 24–26 శాతం వరకు వడ్డీ రాబడుతోంది. కనుక రుణం తీసుకునే వారు ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. తమవద్దనున్న బంగారం విలువలో సగానికి మించకుండా రుణం తీసుకుంటే అధిక వడ్డీ బాదుడు ఉండదు. గంటలోపే రుణం వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తే అందుకు ఎంతలేదన్నా కనీసం రెండు మూడు రోజుల సమయం తీసుకుంటుంది. మధ్యలో సెలవు రోజు ఉంటే ఇంకా ఒకటి రెండు రోజుల అదనపు సమయం తీసుకోవచ్చు. కానీ, బంగారంపై రుణానికి ఇంత సమయం వేచి ఉండక్కర్లేదు. మీ వద్దనున్న బంగారం, ఆధార్ కార్డు, మీ చిరునామా వివరాలతో ఎన్బీఎఫ్సీ సంస్థను ఆశ్రయిస్తే అరగంట నుంచి గంటలోపే రుణంతో తిరిగి వెళ్లిపోవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ అయినా మణప్పురం ఫైనాన్స్ అయినా గంటలోపే ప్రాసెస్ చేస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు పర్సనల్ లోన్‌పై కచ్చితంగా ప్రాసెస్ ఫీజు భరించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 1–2.5 శాతం వరకూ ఉండొచ్చు. గృహ, వాహన రుణాల్లోనూ ఈ చార్జీ తప్పదు. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండకపోవడం ఎంతో వెసులుబాటు. కొన్ని సందర్భాల్లో చార్జీ తీసుకున్నా, ఆ మొత్తం రూ.10–50 మధ్యే ఉంటోంది. క్రెడిట్ స్కోరు అవసరం లేదు బంగారంపై రుణం అన్నది సెక్యూర్డ్ లోన్. పర్సనల్ లోన్ అన్నది అన్సెక్యూర్డ్ లోన్. బంగారంపై రుణం ఎగవేతకు అవకాశాలు చాలా చాలా తక్కువ. రుణ గ్రహీత చెల్లింపులు చేయడంలో విఫలమైతే సంస్థ తనఖాగా ఉంచిన బంగారాన్ని విక్రయించి రుణం కింద సర్దుబాటు చేసుకుంటుంది. అందుకే దీన్ని సెక్యూర్డ్ లోన్ అంటారు. తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించడం ఇందువల్లే. ముఖ్యంగా ఇతర ఏ రుణానికైనా క్రెడిట్ స్కోరు చాలా కీలకం అవుతుంది. స్కోరు బాగాలేకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ, బంగారంపై రుణానికి క్రెడిట్ స్కోరుతో పనిలేదు. తనఖాగా బంగారం ఉంచితే చాలు. ముందుగా రుణాన్ని తీర్చేయవచ్చు.. వ్యక్తిగత, వాహన, గృహ రుణాలను నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే తీర్చివేస్తే అందుకు కొంత మొత్తం చార్జీలను భరించాల్సి వస్తుంది. అదే బంగారంపై రుణాన్ని ఈ రోజు తీసుకుని రేపు తీర్చివేసినా ఎటువంటి చార్జీల్లేకపోవడం మరో సానుకూలత. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంటే.. మణప్పురం, ముత్తూట్ వంటి సంస్థలు పట్టణాలకే పరిమితం. బ్యాంకులు మండల స్థాయి వరకు విస్తరించాయి. కనుక పట్టణాలకు కొంచెం దూరంలో ఉండే గ్రామీణులకు.. సమీపంలో ఉండే బ్యాంకుల నుంచి గృహ రుణం తీసుకోవడం కొంచెం సౌకర్యంగా ఉండొచ్చు. ఇంటివద్దకే రుణం కావాలంటే.. రుపీక్ అనే స్టార్టప్ ఇంటి వద్దకే వచ్చి బంగారంపై రుణాన్ని ఆఫర్ చేస్తోంది. ఆరు నెలల నుంచి ఏడాది వరకు కాల వ్యవధిపై రుణాలను ఇస్తోంది. వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే వడ్డీరేటును పెంచే చర్యలను అమలు చేయడం లేదు. పైగా ఆరు నెలలకు ఒకేసారి చెల్లించే సదుపాయాన్ని కూడా ఇస్తోంది. సేవల నాణ్యత బంగారంపై రుణం కోరుకునే వారు సేవల నాణ్యతను కూడా చూడాల్సిందే. బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల సేవలు కాస్త మెరుగ్గా ఉంటాయి. ముత్తూట్ వంటి సంస్థలు మొబైల్ అప్లికేషన్ ద్వారా రుణంపై వడ్డీ చెల్లింపులు, అసలు చెల్లింపు తదితర ఎన్నో సేవలను అందిస్తున్నాయి. ఆదాయంతో కూడా పనిలేదు రుణం కావాల్సిన వారిలో గృహిణులు, వితంతువులు, వృద్ధులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉండొచ్చు. మరి రుణం కోసం ఆదాయ ధ్రువీకరణ చూపించడం అంటే వీరికి కష్టమే. పర్సనల్ లోన్, వాహన రుణం, గృహ రుణాలకు ఆదాయాన్ని (బ్యాంకు స్టేట్మెంట్, పేస్లిప్ తదితర) కూడా చూపించాలి. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ఆదాయ ధ్రువీకరణలు కూడా అవసరం లేదు. వడ్డీ వరకే.. బంగారంపై రుణంలో ఉన్న మరో సాకర్యం.. కేవలం వడ్డీ మాత్రమే చెల్లించే అవకా శం ఇవ్వడం. ఉదాహరణకు బంగారాన్ని తనఖా గా ఉంచి రూ.లక్ష రుణాన్ని తీసుకున్నారనుకోం డి. 12 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా రూ.1,000 మొత్తాన్ని చెల్లిస్తూ వెళ్లొచ్చు. అసలు మొత్తాన్ని బంగారం విడిపించుకోవాలనుకునే సమయంలో చెల్లించేందుకు అవకాశం ఉంది. కాకపోతే గోల్డ్ లోన్ 3 నెలలు, 6 నెలల కాల వ్యవధితో ఉంటుంటాయి. లోన్ టర్మ్ అయిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. మణప్పురం, ముత్తూట్ వంటి ఎన్బీఎఫ్సీ సంస్థల్లో ఇలా ఉంటుంది. అదే బ్యాంకుల్లో అలా కాదు అసలు, వడ్డీతో కలసిన ఈఎంఐ మొత్తాన్ని ప్రతీ నెలా చెల్లిస్తూ వెళ్లాలి. ఒకవేళ విఫలమైతే చార్జీలు బాదేస్తాయి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే అవకాశం లేని వారికి ఇది ఇబ్బందే. అందుకే అటువంటి వారు ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకోవడం సౌకర్యం. కాల వ్యవధి బ్యాంకులు సాధారణంగా దీర్ఘకాలానికి అంటే – ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధికి బంగారం రుణాలను మంజూరు చేస్తుంటాయి. వ్యాపారానికి బంగారాన్ని తనఖాగా ఉంచి రుణా న్ని పొందే వారికి దీర్ఘకాలం అనుకూలం. కనుక అటువంటి వారికి బ్యాంకులే అనుకూలం. వీటిని గమనించాలి.. ► బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్లపై బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. అయితే, మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థలు బంగారు ఆభరణాలపైనే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. బంగారం స్వచ్ఛత 18–24 క్యారెట్ల మధ్య ఉండాలి. ► చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలు, ఇందులో ఆధార్ తప్పనిసరి, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ► ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకున్న బంగారం రుణంపై అసలు తర్వాత చెల్లించినా కానీ, వడ్డీని 30 రోజులు మించకుండా చెల్లించేయాలి. లేదంటే వడ్డీపై వడ్డీ పడుతుంది. అంతేకాదు, 12 శాతం వడ్డీ రేటు తీసుకుని 30 రోజులు దాటినా వడ్డీని చెల్లించకపోతే అప్పుడు ఆ రేటు కాస్తా 18 శాతానికి పెరిగిపోతుంది. ► అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే మూడు, ఆరు నెలల పాటు వేచి చూసి అప్పటికీ చెల్లించకపోతే.. ఆ తర్వాత సంస్థలు వేలానికి వెళ్లొచ్చు. ► మీ వద్ద రూ.లక్ష బంగారం ఉంటే రూ.లక్ష రుణంగా లభించదు. బంగారం విలువలో 60–75 శాతం వరకు రుణంగా (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) ఎన్బీఎఫ్సీలు ఇస్తున్నాయి. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే అప్పుడు 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. అదే బ్యాంకులు అయితే బంగారం విలువలో 65 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తున్నాయి. ► బ్యాంకులతో పోలిస్తే, సులభంగా, వేగంగా రుణం కోరుకుంటే గోల్డ్‌లోన్ కంపెనీలను ఆశ్రయించడమే మంచిది. కొన్ని బ్యాంకులు బంగారం రుణాలపైనా ప్రాసెసింగ్ చార్జీని రాబడుతున్నాయి. ► బంగారం రుణాలను టర్మ్ లోన్స్గానే బ్యాంకులు పరిగణిస్తున్నాయి. కనుక వడ్డీ, అసలు కలిపి వాయిదాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ► బ్యాంకుల్లో బంగారం రుణాలపై వడ్డీ 14–18 శాతం మధ్య ఉంది. కానీ, ఎన్బీఎఫ్సీల్లో ఇది గరిష్టంగా 26 శాతం వరకు ఉండడం గమనార్హం. -
గృహ రుణంలోనూ కలసికట్టుగా...
ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తేనేకానీ నగరాల్లో జీవనశైలికి అనుగుణంగా బతుకుబండి నడిచే పరిస్థితులు లేవు. అలాంటిది... ఇల్లు సమకూర్చుకోవడం ఎంత పెద్ద ప్రహసనమో చెప్పనక్కర్లేదు!! అయితే, గృహ రుణం ఒక్కరి పేరుతో తీసుకునేకంటే దంపతులు కలసి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది నిపుణుల మాట. అధిక మొత్తంలో రుణం సమకూరడమేకాదు, పన్ను ప్రయోజనాలు... తక్కువ నెలవారీ వాయిదా(ఈఎంఐ) వంటి లాభాలెన్నో జాయింట్ హోమ్‌లోన్‌తో పొందొచ్చు. కొత్తింటి ప్రణాళికల్లో ఉన్నవారికి ఉమ్మడి గృహ రుణంపై అవగాహన కల్పించే కథనమిది... శ్రీనివాస కుమార్ (40) సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన శ్రీమతి సుమలత (37) కూడా ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు 2013లో జాయింట్ హోమ్ లోన్ (ఉమ్మడిగా గృహ రుణం)ను ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి తీసుకున్నారు. ఇలా కలసి తీసుకోవడానికి కారణం జాయింట్ లోన్‌పై వడ్డీ రేటు తక్కువగా ఆఫర్ చేయడమే. రూ.44 లక్షల రుణం తీసుకున్నారు. వడ్డీ రేటు నాడు 9.5 శాతంగా ఉంటే, శ్రీనివాస కుమార్ దంపతులకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసింది. పైగా ఉమ్మడిగా దరఖాస్తు చేసుకోవడం వల్ల రుణ అర్హత అధికంగా ఉంటుంది. రుణంపై తక్కువ వడ్డీ రేటుకు తోడు, అర్హత మెరుగ్గా ఉండడమే తాము జాయింట్లోన్ తీసుకోవడానికి కారణాలుగా శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. జాయింట్ లోన్ ద్వారా మంచి ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు వీలు పడుతుంది. బడ్జెట్ ఎక్కువైనా కానీ, ఇద్దరు పేరిట రుణం తీసుకుంటున్నారు కనుక అధిక అర్హతలతో బ్యాంకు కూడా ఎక్కువే ఆఫర్ చేస్తుంది. దంపతులు ఇద్దరూ ఉద్యోగులైనా లేదా ఆర్జనా పరులైతే, కలసి ఉమ్మడి రుణం తీసుకోవడం వల్ల ఎంతో లాభం ఉంటుందని ఆర్థిక నిపుణుల విశ్లేషణ. మీరు నవ దంపతులు అయి ఉండి, ఇద్దరూ ఆర్జనా పరులైతే కలసి గృహ రుణం తీసుకునే ఆలోచన తప్పకుండా చేయవచ్చు. ‘‘రియల్ ఎస్టేట్ కొనుగోలు అధిక వ్యయంతో కూడుకుని ఉంటుంది. దీంతో సొంతింటి కల అన్నది ఒక్కరే ఆర్జనా పరులున్న కుటుంబానికి అంత సులభం కాకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో జీవిత భాగస్వామి సహ రుణ గ్రహీతగా చేరడం వల్ల ఇద్దరి ఆర్జనను కలపడం, ఇద్దరి క్రెడిట్ స్కోరుతో మరింత మొత్తం గృహ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకే సొంతం చేసుకోవచ్చు’’ అని బ్యాంకు బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి పేర్కొన్నారు. కలసి తీసుకోవడం వల్ల ప్రయోజనాలను పరిశీలించినట్టయితే... భారీ మొత్తంలో రుణం ఇద్దరు కలసి ఉమ్మడిగా రుణానికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా అర్హత ఎక్కువగా ఉంటుంది. దీంతో భార్యాభర్తల ఆదాయాన్ని కలిపి చూసి బ్యాంకు పెద్ద మొత్తంలో రుణాన్ని ఆఫర్ చేస్తుంది. ఉదాహరణకు మీరు రూ.కోటి విలువైన ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తే.. అందుకు మీ వంతు డౌన్ పేమెంట్ 20 శాతం (రూ.20లక్షలు) పోను మరో రూ.80 లక్షలను 20 ఏళ్ల కాలానికి రుణంగా తీసుకోవాల్సి ఉంటుందని అనుకుంటే, అప్పుడు 8.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ.70,000 అవుతుంది. సాధారణంగా రుణగ్రహీత ప్రతీ నెలా నికరంగా అందుకునే వేతనంలో గరిష్టంగా 50 శాతం వరకూ ఈఎంఐ కింద బ్యాంకులు అనుమతిస్తుంటాయి. దీని ప్రకారం రూ.80 లక్షల గృహ రుణం తీసుకోవాలంటే, ప్రతీ నెలా నికరంగా రూ.1.4 లక్షలను అందుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జీవిత భాగస్వామి కూడా ఆర్జిస్తున్నట్టు అయితే.. ఇద్దరూ కలసి ఈ మొత్తాన్ని చెల్లించే శక్తి కలిగి ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువే చెల్లించే సామర్థ్యం ఉంటే మరింత సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఇంటి కోసం ఇంకా అధిక రుణం తీసుకునేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. వేగంగా చెల్లింపులు ఇద్దరు కలసి రుణం తీసుకుంటే, తిరిగి చెల్లించడం సులభం కావడమే కాకుండా, వేగంగా దాన్ని తీర్చేయవచ్చు. వార్షికంగా వచ్చే బోనస్‌లు, పనితీరు ఆధారంగా వచ్చే పారితోషికాన్ని ఇలా గృహ రుణం తీర్చేందుకు వినియోగించినా వాస్తవ కాల వ్యవధి కంటే ముందే గృహ రుణం ముగిసిపోతుంది. ఎందుకంటే చెల్లింపులపై ఎటువంటి నియంత్రణలు ఉండవు. దీనివల్ల వడ్డీ భారం కూడా తగ్గిపోతుంది. రిజిస్ట్రేషన్ వ్యయం తక్కువ కొన్ని బ్యాంకులు మహిళా రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీకే గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే మహిళలకు ఇల్లు/ఫ్లాట్ రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తక్కువగా అమల్లో ఉంది. ‘‘ఉమ్మడి గృహ రుణంలో ప్రధాన దరఖాస్తు దారుగా భార్య ఉంటే వ్యయాలను తగ్గించుకోవచ్చు. గృహ రుణంపై తక్కువ వడ్డీ రేటుకు తోడు, రిజిష్ట్రేషన్ చార్జీలో తగ్గింపు ప్రయోజనాలను అందుకోవచ్చు’’ అ ని మైమనీమంత్రా డాట్ కామ్ ఎండీ రాజ్ ఖోస్లా చెప్పారు. క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఉమ్మడిగా రుణం తీసుకుంటే దంపతులిద్దరిపై సమానంగా చెల్లింపుల భాధ్య త ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఒకరు ఉద్యోగం కోల్పోతే ఆ మేరకు గృహ రుణ ఈఎంఐ చెల్లింపులో నెలసరి వాటా అందకపోవచ్చు. ఈ కారణంగా ఈఎంఐ చెల్లింపులో వైఫల్యం చెందితే అప్పుడు ఇద్దరి క్రెడిట్ స్కోరుపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ‘‘తిరిగి చెల్లింపుల బాధ్యత దంపతులపై పూర్తిగా ఉంటుంది. ఒక్కరు చెల్లింపుల్లో వైఫల్యం చెందినా ఇద్దరి క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది’’ అని ఆదిల్‌శెట్టి తెలిపారు. పన్ను ప్రయోజనాలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవడం వల్ల అధిక పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. దంపతులు ఉమ్మడిగా రూ.7 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద చెరో రూ.1.5 లక్షల చొప్పున రూ.3లక్షలు, సెక్షన్ 24(బి) కింద రూ.4లక్షల వడ్డీపై (చెరో రూ.2లక్షలు) పన్ను ప్రయోజనం లభిస్తుంది. మధ్యాదాయ వర్గాల నుంచి కొంచెం అధిక ఆర్జనా పరులకు ఈ మేరకు పన్ను ఆదా రూపంలో గణనీయంగానే మిగులుతుంది. వీటిని అనుసరిస్తే మేలు.. రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధిలో ఇంటి యజమాని మరణిస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విల్లు రాసుకోవడం మంచిది. ఇక వైవాహిక జీవితం నూటికి నూరు పాళ్లు కలసి సాగుతుందని నేటి రోజుల్లో చెప్పడం కష్టమే. కనుక ఉమ్మడిగా గృహ రుణానికి వెళ్లే దంపతులు.. ఇంటిలో వాటా, తిరిగి రుణానికి చేయాల్సిన చెల్లింపులు, ఇతర అంశాలపై స్పష్టమైన ఒప్పందం చేసుకోవడం ఇంకా మంచిది. దీనివల్ల భవిష్యత్తులో ఒకవేళ ఇద్దరూ విడిపోవాల్సి వస్తే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక గృహ రుణం తీసుకునే సమయంలోనే రుణానికి సరిపడా కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం తప్పనిసరిగా చేయాల్సినది. రుణ గ్రహీతకు ఏదైనా జరిగితే, కుటుంబంపై రుణ చెల్లింపుల బాధ్యతలు పడకుండా ఉండేందుకు ఇది సాయపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి గృహ రుణ గ్రహీతల్లో ఒకరు మరణించడం వల్ల మరొకరిపై చెల్లింపుల బాధ్యత పడకుండా ఈ టర్మ్‌ప్లాన్ ఆదుకుంటుంది. విడాకులు, మరణం... దంపతులు ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత జీవితంలో ఇకమీదట కలసి సాగకూడదని విడాకులకు వెళితే పరిస్థితి ఏమిటి..? గృహ రుణాన్ని తిరిగి చెల్లించడం తప్పనిసరి. కాకపోతే ఇందుకు మార్గాన్ని వారే అన్వేషించుకోవాలి. ‘‘బ్యాంకు తన బకాయిలను వసూలు చేసుకునేందుకు చర్యలు చేపడుతుంది. అవసరమైతే న్యాయపరమైన చర్యలనూ చేపట్టవచ్చు. అందుకని భవిష్యత్తులో విడిపోవాల్సి వస్తే గృహ రుణ చెల్లింపుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై దంపతులు ముందుగానే ఓ స్పష్టమైన అంగీకారానికి రావడం మంచిది’’ అని ఆదిల్‌శెట్టి సూచించారు. ఇక దురదృష్టవశాత్తూ ఉమ్మడి గృహ రుణం తీసుకున్న తర్వాత దంపతుల్లో ఒకరు మరణించినట్టయితే అప్పుడు చెల్లింపుల బాధ్యత పూర్తిగా రెండోవారిపై పడుతుంది. -
పీఎఫ్ చందాదారులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు శుభవార్త అందించింది. 2018-19 సంవత్సరానికి 6 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లోకి త్వరలోనే వడ్డీని చెల్లించనున్నారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే కొత్త వడ్డీ రేటు అమలులోకి వస్తుందని, తద్వారా ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. 2018-19 సంవత్సరానికి గాను 8.65శాతం వడ్డీని చెల్లించనున్నామన్నారు. పండుగ సీజన్ కన్నా ముందుగానే పీఎఫ్ ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇది 8.55 శాతం మాత్రమే. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు వారి పీఎఫ్ ఖాతాల్లో త్వరలోనే 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరపు వడ్డీ రేటుతో (8.55 శాతం) పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం పీఎఫ్ వడ్డీ 10 బేసిస్ పాయింట్లు (8.65 శాతం) ఎక్కువగా ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి గత మూడేళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరగడం ఇదే తొలిసారి. 2015–16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేట్లు 8.8 శాతం ఉండగా అప్పటి పరిస్థితుల రీత్యా వాటిని క్రమంగా ఐదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి తగ్గించారు. 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును అందించిన తరువాత 151.67 కోట్ల మిగులు ఉంటుందని ఈపీఎఫ్‌వో అంచనా. మునుపటి ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.7 శాతం వడ్డీ రేటును అందించడంపై 158 కోట్ల లోటు ఉండేది. అందుకే 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును అందించాలని నిర్ణయించింది. -
ఫిక్స్డ్ డిపాజిట్లు : ఎస్బీఐ బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంకు ఆఫ్ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లకు షాకిచ్చింది. వివిధ ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేటును తగ్గించింది. 45 రోజుల -10 ఏళ్ల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను భారీగా కోత పెట్టింది. ఈ సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. దాదాపు అన్ని కాలపరిమితి గత ఫిక్స్డ్ డిపాజిట్లపై రేటును తగ్గించింది. 2-3 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. 3-5 ఏళ్ల డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్లను తగ్గింపు అనంతరం వడ్డీరేటు 6.60 శాతంగా ఉంది. 7 రోజుల నుండి 45 రోజుల డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. 46-179 రోజుల ఎఫ్‌డిలపై వడ్డీ రేటు మే 6.25 శాతం నుండి 5.75 శాతానికి తగ్గించింది. 180-210 కాలపరిమితిగల డిపాజిట్లపై వడ్డీరేటు 6.25గా ఉంటుంది. 2 కోట్ల రూపాయలకు మించిన బల్క్ డిపాజిట్లపై కూడా వడ్డీరేటును తగ్గించింది. రానున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో చేపట్టనున్న పాలసీ రివ్యూలో మరోసారి వడ్డీరేటు కోతకు కేంద్ర బ్యాంకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తాజాగా ఇలాంటి సంకేతాలను అందించారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్బీఐ మరో సారి వడ్డీ రేట్ల తగ్గింపు అవసరమని భావిస్తున్నానని ఆమె పేర్కొనడం గమనార్హం. -
జెట్‌కు ఈపీఎఫ్‌వో నోటీసులు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్‌ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధులు, ఇతరత్రా బకాయీలను జమ చేయనందుకుగానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జెట్ ఎయిర్వేస్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తం బకాయిలపై విచారణ జరపనున్నట్లు, ప్రావిడెంట్ ఫండ్‌లో ఉద్యోగుల వాటాను జమ చేయనందుకు పోలీస్ కేసు పెట్టనున్నట్లు సంస్థ ఎండీకి పంపిన లేఖలో ఈపీఎఫ్‌వో ముంబై ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ దిలీప్ కే రాథోడ్ స్పష్టం చేశారు. లేఖ ప్రకారం 2019 మార్చి నుంచి బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు, బకాయిలు చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్వేస్కి అద్దెకిచ్చిన పలు కార్యాలయాలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఎయిర్‌లైన్ సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలను నగదుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఏఏఐ వర్గాలు తెలిపాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. జెట్‌కు బిడ్స్ దాఖలు.. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు సంబంధించి ఎతిహాద్ ఎయిర్‌వేస్‌తో పాటు మరికొన్ని సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు ఎస్బీఐ క్యాప్స్ వెల్లడించింది. సీల్డ్ కవర్లో వచ్చిన బిడ్లను పరిశీలించేందుకు రుణదాతలకు సమర్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. జెట్‌లో 31.2–75 శాతం దాకా వాటాల విక్రయానికి బ్యాంకుల కన్సార్షియం బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అర్హత పొందిన సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేయడానికి మే 10 (శుక్రవారం) ఆఖరు తేదీ. దీనికి అనుగుణంగా ఎతిహాద్ తదితర సంస్థల నుంచి బిడ్స్ వచ్చినట్లు బిడ్డింగ్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్బీఐ క్యాప్స్ పేర్కొంది. బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్ దాదాపు రూ. 8,000 కోట్లు బాకీపడింది. ప్రస్తుతం సంస్థలో బ్యాంకులకు 51 శాతం పైగా వాటాలు ఉన్నాయి. షేరు 3 శాతం అప్..: జెట్ కొనుగోలు కోసం బిడ్స్ వచ్చాయన్న వార్తలతో షేరు శుక్రవారం 3 శాతం పెరిగింది. రూ. 151.80 వద్ద క్లోజయ్యింది. -
ఈపీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్)పై 2018–19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటు అమలు కానుంది. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ అధ్యక్షతన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటు పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకోగా, దీనికి కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం అమోదం తెలిపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2017–18లో ఈపీఎఫ్ నిధులపై 8.55 శాతం వడ్డీ రేటు అమలు కాగా, దీన్ని స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరానికి 8.8 శాతం వడ్డీ రేటు ఉండగా, ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో స్వల్పంగా తగ్గించారు. ఆదాయపన్ను శాఖ, కార్మికశాఖ వడ్డీ రేటును నోటిఫై చేసిన తర్వాత చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న 120 క్షేత్రస్థాయి అధికారులకు ఈపీఎఫ్‌వో ఆదేశాలు జారీ చేస్తుంది. సభ్యుల భవిష్యనిధిపై 8.65 శాతం వడ్డీ చెల్లించిన అనంతరం కూడా సంస్థ వద్ద రూ.151.67 కోట్ల మిగులు నిల్వలు ఉంటాయని అంచనా. -
తక్కువ వడ్డీ దారిలో ఆర్బీఐ: ఫిచ్
న్యూఢిల్లీ: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో తక్కువ వడ్డీరేటు వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించిన తొలి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ పేర్కొంది. దేశీయంగా తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణ ధోరణులు, అమెరికా సెంట్రల్‌బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంచే అవకాశాలు కనబడని తీరు, దీనితో అంతర్జాతీయంగా సరళతరంగా ఉన్న ఫైనాన్షియల్ పరిస్థితులు... ఆర్బీఐ రేటు తగ్గింపునకు దోహదపడుతున్న అంశాలుగా ఫిచ్ వివరించింది. ఆర్బీఐ ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 4వ తేదీన రెపో రేటు పావుశాతం కోతకు నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. అంతకుముందు రెండు నెలల క్రితం జరిగిన ద్వైమాసిక సమావేశంలో (ఫిబ్రవరి 7) కూడా ఆర్బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి. గత ఏడాది ఆర్బీఐ రెండు సార్లు అరశాతం రేటు పెంచింది. తాజా నిర్ణయంతో పెరిగిన మేర రివర్స్ అయినట్లయ్యింది. ఈ నేపథ్యంలో ఫిచ్ తన తాజా ఆసియా పసిఫిక్ సావరిన్ క్రెడిట్ ఓవర్వ్యూ రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులోని ముఖ్యాంశాలు... ► మరింత రేటు తగ్గింపునకు అవకాశాలను ఆర్బీఐ అన్వేషించే అవకాశం ఉంది. అయితే 2019లో రేటు తగ్గింపు ఇంతకుమించి ఉండకపోవచ్చు. ► వస్తున్న ఆదాయాలు తగ్గడం– వ్యయాలు పెరగడం వంటి అంశాలు భారత్ ద్రవ్యలోటు పరిస్థితులకు సవాళ్లు విసిరే అవకాశం ఉంది. కొన్ని నగదు ప్రత్యక్ష బదలాయింపులు ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చు. ► 2025 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రభుత్వ రుణాన్ని 60 శాతానికి పరిమితం చేయాలన్నది భారత్ ప్రణాళిక. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, భారత్ ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. ► కేంద్ర రుణ భారం తీవ్రంగా ఉంది. ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి. వ్యవస్థాగత అంశాల్లో లోపాలు ఉన్నాయి. అయితే సమీప కాలంలో దేశం పటిష్ట వృద్ధి బాటన కొనసాగే అవకాశం ఉంది. విదేశీ మరకపు నిల్వలు (400 బిలియన్ డాలర్ల ఎగువన) పటిష్టంగా ఉన్నాయి. విదేశీ సవాళ్లను తట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనితో సవాళ్లు–ఆశావహ పరిస్థితులు మధ్య సమతౌల్యత కనిపిస్తోంది. దీనితో ఫిచ్ రేటింగ్స్ (‘బీబీబీ–’ దిగువస్థాయి పెట్టుబడుల గ్రేడ్) యథాతథంగా కొనసాగుతుంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండవచ్చు. 2020–21లో 7.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. -
వరుసగా మూడవదఫా రేటు కోత: బ్యాంక్ ఆఫ్ అమెరికా
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన 4 శాతంలోపే కొనసాగుతున్నందువల్ల వరుసగా మూడవసారి కూడా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం 6 శాతం) తగ్గే అవకాశం ఉందని ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా– మెరిలించ్ (బీఓఎఫ్ఏ–ఎంఎల్) అంచనా వేసింది. ‘‘జూన్ 3 నుంచి 6వ తేదీ వరకూ జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా మరోపావుశాతం రేటు కోత ఉంటుందని భావిస్తున్నాం’’ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదే జరిగితే రెపో 5.75 శాతానికి దిగివస్తుంది. ఆరు నెలల్లో 75 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లవుతుంది. పారిశ్రామిక వృద్ధి రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోవడం (ఫిబ్రవరిలో 20 నెలల కనిష్ట స్థాయి 0.1 శాతం), రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం దిగువనే (మార్చిలో 2.86 శాతం) ఉండటం వంటి అంశాలు ఆర్బీఐ మరోదఫా రేటు కోత అంచనాలకు ఊతం ఇస్తోంది. ఈ ఏడాది ‘‘దాదాపు సాధారణ’’ వర్షపాతం నమోదవుతుందని సోమవారం భారత వాతావరణ శాఖ పేర్కొనడం తాజా విశేషం. ఇది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే అంశం. -
పోల్ ధమాకా : వడ్డీ రేట్లలో కోత..?
సాక్షి, బెంగళూర్ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ఆర్బీఐ వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన భేటీ గురువారం ముగియనుండటంతో వడ్డీ రేట్ల తగ్గింపుపై కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకోవచ్చని రాయటర్స్ పోల్ అంచనా వేసింది. గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియామకం తర్వాత గత నెలలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన క్రమంలో తాజాగా మరోసారి వడ్డీ రేట్లలో కోత ఉంటుందని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటం, వృద్ధి మందగించిన నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపును ఆర్బీఐ సమర్ధించుకుంది. మారిన కేంద్ర బ్యాంక్ వైఖరితో తాజా సమీక్షలోనూ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ మొగ్గుచూపుతుందని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచేందుకు, డిమాండ్‌ను పెంచేందుకు వడ్డీ రేట్లను తగ్గించాల్సిందిగా పరిశ్రమ వర్గాలు ఎంతోకాలంగా ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు వడ్డీ రేట్ల తగ్గింపుతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలూ దిగివస్తాయని ఆయా కస్టమర్లు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆర్థిక వ్యవస్థ పురోగతికి బీజేపీ విజయం ఉపకరిస్తుందని రాయటర్స్ పోల్‌లో పలువురు పేర్కొన్నారు. -
చిన్న పొదుపులపై వడ్డీరేట్లు యథాతథం
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రస్తుతం లభిస్తున్న వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సంమృద్ధి యోజనసహా అన్ని పొదుపు పథకాలపై ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో యథాపూర్వ వడ్డీరేట్లు కొనసాగుతాయని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మూడు నెలలకు ఒకసారి పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సమీక్షించి ఆయా రేట్ల కొనసాగింపు లేదా మార్పులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. -
సెన్సెక్స్ రికార్డుస్థాయికి చేరేముందు...
ప్రపంచ స్టాక్ మార్కెట్లను లిక్విడిటీ ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత్‌కు సైతం హఠాత్తుగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగింది. ఈ కారణంగా గతవారం పెద్ద ర్యాలీ జరిపిన భారత్ స్టాక్‌సూచీలు ఆల్‌టైమ్ రికార్డుస్థాయికి కేవలం 3 శాతం దూరంలో ఉన్నాయి. మరోవైపు అటు విదేశీ, ఇటు స్వదేశీ ఫండ్స్ ఫెవరేట్ రంగమైన బ్యాంకింగ్ సూచి గతేడాది నెలకొల్పిన రికార్డుస్థాయిని అవలీలగా అధిగమించేసి, ఏ రోజుకారోజు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతోంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తిరిగి కఠిన వైఖరిలోకి మారకపోతే...ఇక్కడి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు–అంచనాలతో సంబంధం లేకుండా ర్యాలీ కొనసాగే అవకాశాలున్నాయని అత్యధికశాతం బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు... మార్చి 15తో ముగిసిన వారంలో అనూహ్యంగా ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ 38,250 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంకంటే 1,353 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించి, 38,024 పాయింట్ల వద్ద ముగిసింది. గతేడాది ఆగస్టు 29 నాటి రికార్డు గరిష్టస్థాయి 38,989 పాయింట్ల స్థాయివరకూ ర్యాలీ చేయడానికి అవసరమైన కీలక అవరోధాల్ని అన్నింటినీ సెన్సెక్స్ గతవారం అధిగమించినట్లే. అయితే లాభాల స్వీకరణ కారణంగా రికార్డుస్థాయిని చేరేముందు చిన్న విరామాలు వుండవచ్చు. ఈ కోణంలో.... ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 38,250–38,420 పాయింట్ల శ్రేణి వద్ద ఆగవచ్చు. అటుపైన ముగిస్తే 38,580 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన 38,730–38,989 పాయింట్ల శ్రేణి వరకూ పరుగు కొనసాగవచ్చు. ఈ వారం తొలి స్టాప్ వద్ద బ్రేక్పడితే 37,700 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే 37,480 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 37,230 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 10,345 గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,487 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 392 పాయింట్ల భారీ లాభంతో 11,427 పాయింట్ల వద్ద ముగిసింది. గతేడాది ఆగస్టు 28 నాటి రికార్డు గరిష్టస్థాయి అయిన 11,760 పాయింట్ల వద్దకు చేరేందుకు సాంకేతికంగా కీలక అవరోధమైన 11,345 పాయింట్ల స్థాయిని గతవారం అవలీలగా నిఫ్టీ అధిగమించింది. ఈ కారణంగా రానున్న రోజుల్లో కొత్త రికార్డుల సాధనకు మార్గం సుగమమయ్యింది. ఈ క్రమంలో ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగితే వెనువెంటనే 11,490–11,525 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే 11,605 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 11,700–11,760 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం 11,490–11, 525 పాయింట్ల శ్రేణిని దాటలేకపోతే 11,345 పాయింట్ల వద్ద తక్షణ మద్దతును పొందవచ్చు. ఈ లోపున ముగిస్తే 11,275 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన 11,225 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. -
పరిశ్రమ వర్గాలతో 26న ఆర్బీఐ గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: వచ్చే నెల పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ త్వరలో పరిశ్రమవర్గాలతో భేటీ కానున్నారు. ఈ నెల 26న వాణిజ్య సంఘాలు, రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారని, ఇందులో వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆలిండియా బ్యాంక్ డిపాజిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా దీనికి హాజరుకావాలని ఆహ్వానించినట్లు వివరించాయి. ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి సరిగ్గా వారం రోజులు ముందు.. ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక విధానాన్ని ప్రకటించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇదే ఎంపీసీ తొలి సమావేశం కూడా కావడంతో ఈ పరపతి విధాన సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీపై అభిప్రాయాలను, ఆర్బీఐపై అంచనాల గురించి తెలుసుకునేందుకు శక్తికాంత దాస్ ఇప్పటికే బ్యాంకర్లు, ప్రభుత్వ వర్గాలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మొదలైన వాటితో సమావేశమవుతూనే ఉన్నారు. గతేడాది డిసెంబర్లో ఆర్బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టారు. -
పసిడి భవితపై ‘ఫెడ్’ రేటు ప్రభావం
అమెరికా ఆర్థిక పరిస్థితి, కీలక వడ్డీ రేట్లపై (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) బుధవారం (20వ తేదీ) ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షా కమిటీ తీసుకునే నిర్ణయంపై పసిడి సమీప భవిష్యత్ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) 1,200 డాలర్ల నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, పటిష్టంగా కొనసాగుతోంది. 15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 4 డాలర్ల లాభంతో 1,302 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వృద్ధి, డాలర్ కదలికలు (15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 96), అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలపై తదుపరి పసిడి కదలికలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దేశంలో 32–33 వేల మధ్య స్థిరీకరణ ... కాగా డాలర్ మారకంలో రూపాయి పటిష్టత దేశీయ పసిడి ధరపై ప్రభావం చూపుతోంది. దేశీయ ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 24పైసలు లాభపడి 69.10కి చేరిన సంగతి తెలిసిందే. గడచిన ఐదు రోజుల్లో 104 పైసలు బలపడింది. అందువల్ల పసిడి అంతర్జాతీయ భారీగా పెరిగినా, దేశీయంగా సమీప కాలంలో అంతర్జాతీయ పెరుగుదల ధోరణి పూర్తిస్థాయిలో ప్రతిబింబించకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అయితే ఆయా అంశాల నేపథ్యంలోదేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000–33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 31,826 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,870, రూ.31,300 వద్ద ముగిశాయి. -
రేటు కోతకు బలం..!
న్యూఢిల్లీ: వృద్ధికి ఊతం అందించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర వడ్డీరేట్ల విధానాన్ని కొనసాగిస్తుందనే అంచనాలకు బలాన్నిచ్చే ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు జనవరిలో కేవలం 1.7 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో పోల్చితే (అప్పట్లో 7.5 శాతం) వృద్ధి కేవలం 1.7 శాతమన్నమాట. తయారీ, క్యాపిటల్, వినియోగ వస్తువుల రంగాలూ పూర్తిగా నిరాశపరచడం దీనికి కారణం. కాగా ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.57 శాతంగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల గరిష్టస్థాయే అయినప్పటికీ, ఆర్బీఐ నిర్దేశాలకు అనుగుణంగా (ప్లస్ లేదా మైనస్ 2తో 4 శాతం)నే ఉండడం గమనార్హం. ఏప్రిల్ 4న జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు. ప్రస్తుతం 6.25 శాతం) మరింత తగ్గిస్తుందన్న అంచనాలకు తాజా గణాంకాలు ఊతం ఇస్తుండడం గమనార్హం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) తాజా గణాంకాలను మంగళవారం విడుదల చేసింది. రంగాల వారీగా ఉత్పత్తి ► తయారీ రంగం ఉత్పత్తి వృద్ధి 8.7 శాతం నుంచి (జనవరి 2018) 1.3 శాతానికి (జనవరి 2019) పడిపోయింది. ► విద్యుత్ ఉత్పత్తి వృద్ధి 7.6 శాతం నుంచి 0.8 శాతానికి పడింది. డిసెంబర్లో కూడా ఈ వృద్ధి రేటు దాదాపు 0.8 శాతంగానే ఉంది. ► అయితే మైనింగ్ రంగంలో మాత్రం కొంత పురోగతి కనిపించింది. వృద్ధి రేటు 0.3 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది. ►పెట్టుబడులకు సంకేతమైన భారీ పరిశ్రమలకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదుచేసుకుంది. ►ఏప్రిల్ నుంచి జనవరి వరకూ 4.4 శాతం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు ఏప్రిల్ నుంచి జనవరి వరకూ.. 4.1% నుంచి 4.4%కి పెరిగింది. రిటైల్ ధరల స్పీడ్ ఆహార ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 2.57 శాతంగా నమోదయ్యింది. 2018 ఫిబ్రవరిలో ఈ రేటు 4.44 శాతంగా ఉంటే, 2019 జనవరిలో 1.97 శాతంగా నమోదయ్యింది. జనవరిలో అసలు ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధర పెరక్కపోగా –2.24 శాతం క్షీణిస్తే, (2018 జనవరితో పోల్చితే) ఫిబ్రవరిలో 0.66 శాతంగా నమోదవడం గమనార్హం. 2018 నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.33 శాతం. తన ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. n అక్టోబర్ 2018 తరువాత ఇప్పటి వరకూ ఈ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకాలేదు. ► ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తులు– మాంసం, గుడ్ల ధరలు 5.92%, 0.86% చొప్పున పెరిగాయి. ►తృణ ధాన్యాలు సంబంధిత ఉత్పత్తుల ధరలు 1.32 శాతం పెరిగాయి. ► ధరలు తగ్గిన ఉత్పత్తుల జాబితాలో పండ్లు (–4.62 శాతం), కూరగాయలు (–7.69 శాతం) ఉన్నాయి. జనవరి నెలలో కూడా ఈ ఉత్పత్తుల ధరలు – 4.18 శాతం, – 13.32 శాతం చొప్పున తగ్గాయి. ►ఇంధనం, లైట్ విభాగంలో రేటు 2.20 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గింది. రేటు కోతకు చాన్స్... ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించుకున్న మేర కట్టడిలో ఉంది. ఇక పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక క్రియాశీలతకు ఆర్బీఐ మరో దఫా రేటు కోతవైపే మొగ్గుచూపే వీలుంది. – రజనీ ఠాకూర్, ఎకనమిస్ట్, ఆర్బీఎల్ బ్యాంక్ -
‘వడ్డిం’పులు తగ్గించరేం..?
ముంబై: వృద్ధికి ఊతమిచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను తగ్గించినప్పటికీ .. బ్యాంకులు ఆ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో రుణ గ్రహీతలకు బదలాయించడం లేదు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది తొలినాళ్ల నుంచి రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు 8.15 – 8.55 శాతం శ్రేణిలో ఉంటున్నాయి. ఆర్బీఐ గత నెల 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించినప్పటికీ.. చాలా మటుకు బ్యాంకులు నామమాత్రంగా పది బేసిస్ పాయింట్ల దాకా తగ్గించి ఊరుకున్నాయి. పరపతి విధానానికి అనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేలా చూసేందుకు ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ కూడా బ్యాంకర్లతో చర్చలను జరుపుతున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. బ్యాంకులు మరింత అధికంగా రేట్ల కోత ప్రయోజనాలు రుణగ్రహీతలకు అందించాలంటే రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటును మరింత భారీ స్థాయిలో తగ్గించాల్సి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు అంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో రెపో రేటు 6.25 శాతానికి వచ్చి చేరింది. అయితే, రుణాలపై వడ్డీ రేట్ల మీద గణనీయ ప్రభావం చూపాలంటే ఇది సరిపోదని, ఇంతకన్నా అధిక స్థాయిలో రేట్ల కోత అవసరమని బ్యాంకులు చెబుతున్నాయి. ఆర్బీఐ సాధారణ స్థాయికి మించి 50 బేసిస్ పాయింట్ల కన్నా ఎక్కువగా రేటు తగ్గిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందని బ్యాంకర్లు అంటున్నారు. అలాఅయితేనే తాము మరింత వేగంగా వడ్డీ రేట్ల కోత ప్రయోజనాలను బదలాయించడానికి వీలవుతుందని చెబుతున్నారు. సాధారణంగా భారత్‌లో రెపో రేటు మార్పు ప్రభావాలు క్షేత్ర స్థాయిలో కనిపించేందుకు 6–9 నెలల సమయం పడుతుంది. రెపో రేటు సుమారు 25 బేసిస్ పాయింట్లు మారితే బ్యాంకు ఫ్లోటింగ్ రేటు దాదాపు 7–10 బేసిస్ పాయింట్ల మేర మారుతుందని ఎస్బీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఈ మధ్యే కొన్ని కేటగిరీ డిపాజిట్లు, స్వల్ప కాలిక రుణాలపై వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించింది. బ్యాంకులు చెబుతున్న కారణాలేంటంటే.. డిపాజిట్లు, రుణాల వృద్ధి మధ్య వ్యత్యాసం, పోస్టాఫీస్ చిన్న మొత్తాల పథకాల నుంచి భారీగా పోటీ ఉంటుండటం వంటి కారణాలతో పాలసీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను తాము తక్షణం బదలాయించలేకపోతున్నామని బ్యాంకులు చెబుతున్నాయి. పాలసీ రేట్లు తక్కువగా ఉన్నా.. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై బ్యాంక్ డిపాజిట్ రేట్లను మించి ప్రభుత్వం వడ్డీ ఇస్తోందని గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రాచీ మిశ్రా తెలిపారు. పోస్టాఫీస్ పథకాలపై వార్షికంగా 7 – 8 శాతం వడ్డీ రేటుతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. అదే ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐలో రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.8 శాతంగానే ఉంటోంది. ఇక బ్యాంకులు మంజూరు చేస్తున్న రుణాల వృద్ధి కన్నా డిపాజిట్ల వృద్ధి చాలా మందగతిన ఉంటోంది. రుణ వృద్ధికి దీటుగా డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేయాల్సి వస్తోంది. ఫిబ్రవరి నాటికి రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన బ్యాంకుల రుణాల వృద్ధి 14% నమోదు కాగా.. డిపాజిట్ల వృద్ధి మాత్రం 10%గానే ఉంది. ఇలా రుణ, డిపాజిట్ల వృద్ధి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నంత కాలం .. ఆర్బీఐ పాలసీ రేట్ల కోత ప్రయోజనాల బదలాయింపు పాక్షికమేనని, పైగా జాప్యాలు తప్పవని బ్యాంకర్లు పేర్కొన్నారు. బ్యాంకులు ఇప్పటికే మొండిబాకీలు, కఠిన ఆంక్షలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ సమస్య అంత త్వరగా పరిష్కారం కాకపోవచ్చని తెలిపారు. ‘డిపాజిట్లు సమీకరించుకోవాలంటే అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేయాలి. అలాంటప్పుడు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడానికి కుదరదు. ఆర్బీఐ పాలసీ రేట్ల కోత ప్రయోజనాలను బదలాయింపునకు సంబంధించి చిక్కంతా ఇక్కడే వస్తోంది‘ అని ఫెడరల్ బ్యాంక్ సీఎఫ్‌వో ఆశుతోష్ ఖజూరియా వ్యాఖ్యానించారు. ఏప్రిల్ తర్వాత తగ్గొచ్చన్న అంచనాలు.. ద్రవ్యోల్బణం ప్రస్తుత స్థాయిల్లోనే కొనసాగిన పక్షంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ తర్వాత) రేట్లు మరింత తగ్గొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బలహీన డిమాండ్ కారణం గా వడ్డీ రేట్లను తగ్గించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 2 శాతం స్థాయిలో ఉంటోంది. ఇది రిజర్వ్ బ్యాంక్ మధ్యకాలికంగా నిర్దేశించుకున్న 4%లో సగం. మంగళవారం విడుదలయ్యే తాజా గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం 2.4 శాతంగా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. -
రాబడులకు ఢోకా లేదు!
ఆర్బీఐ ఇటీవలి రేట్ల కోతతో వడ్డీ రేట్లు మళ్లీ తిరుగుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. దీంతో తదుపరి ఆర్బీఐ ఎంపీసీ భేటీల్లో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో వడ్డీ రేట్ల పరంగా అనిశ్చితి నెలకొని ఉంది. ద్రవ్య, కరెంటు ఖాతా లోటు పరంగా ఒత్తిళ్లు నెలకొని ఉన్నాయి. కనుక ఈ పరిస్థితుల్లో దీర్ఘకాల వ్యవధితో కూడిన బాండ్లను ఎంచుకోవడం తొందరపాటే అవుతుంది. దీంతో మధ్యస్థ రిస్క్ తీసుకునే మీడియం డ్యురేషన్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. దీర్ఘకాల బాండ్లతో పోలిస్తే వడ్డీ రేట్ల మార్పులతో వీటిపై పడే ప్రభావం తక్కువ. కనుక మధ్య కాలానికి ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఇన్వెస్టర్ల ముందున్న మార్గాల్లో యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ కూడా ఒకటి. పెద్దగా రిస్క్ తీసుకోకుండా మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యస్థీకరణకు ముందు వరకు ఈ పథకం యాకిŠస్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ పేరుతో కొనసాగింది. పెట్టుబడుల విధానం ఈ పథకం పెట్టుబడుల విషయంలో ఎక్కువ రిస్క్ తీసుకోదు. ఇందుకు నిదర్శనం పోర్ట్‌ఫోలియోలో ఉన్న బాండ్లలో ఎక్కువ భాగం అధిక భద్రతను సూచించే ఏఏఏ, ఏఏ రేటింగ్ ఉన్నవే. అలాగే, ఏ రేటింగ్ సాధనాలు కూడా ఉన్నాయి. పైగా ఇవన్నీ బడా కంపెనీలు జారీ చేసినవి కావడం గమనార్హం. మొత్తం మీద 80 శాతం పెట్టుబడులు ఏఏ అంతకంటే ఎక్కువ రేటింగ్ కలిగినవి. ఏ రేటింగ్ కలిగినవి 16 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడుల కాల వ్యవధి సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. కార్పొరేట్ డెట్, జీరో కూపన్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీస్‌ల్లో పెట్టుబడులు ఉన్నాయి. రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ వార్షికంగా 9.4 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం ఈ పథకం చక్కని పనితీరుకు నిదర్శనం. మూడేళ్ల కాలంలో చూసుకున్నా వార్షికంగా 8.8 శాతం మేర ఉన్నాయి. ఇక ఏడాది కాలంలో రాబడులు 7 శాతంగా ఉండడం గమనార్హం. ఈ విభాగం సగటు రాబడుల కంటే ఈ పథకంలోనే ఎక్కువ ఉన్నాయి. ఈ విభాగం సగటు రాబడులు ఏడాది కాలంలో 5.9 శాతంగా ఉండగా, మూడేళ్లలో 7.7 శాతం, ఐదేళ్లలో 8.4 శాతం చొప్పున ఉన్నాయి. ఈ కేటగిరీలోని అత్యుత్తమ పథకాల్లో ఇదీ ఒకటిగా ఉంది. హెచ్డీఎఫ్సీ మీడియం టర్మ్ డెట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మీడియం టర్మ్ బాండ్ పథకాల కంటే ఈ పథకమే ఎక్కువ రాబడులు ఇచ్చింది. బాండ్ ఫండ్స్ కావడంతో ఈ పథకాల్లో సిప్ మార్గం పెద్దగా పనిచేయదు. దీనికి బదులు ఏకమొత్తంలో నిర్ణీత కాలానికోసారి పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. -
డిపాజిట్ల రేటును తగ్గించిన ఎస్బీఐ
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. పొదుపు ఖాతాలు, స్వల్పకాలిక రుణ రేట్లను రెపోరేటుకు అనుసంధానం చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. తొలిసారిగా ఎక్స్టర్నల్ ప్రమాణిక వడ్డీరేట్లకు కలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన రేట్లు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తీసుకొచ్చింది. రూ.లక్ష పైబడిన సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై ప్రస్తుతం ఏడాదికి 3.50 శాతం రేటు ఉండగా.. ఇది రెపోరేటు కంటే 2.75 శాతం తక్కువగా ఉందని తెలిపింది. క్యాష్ క్రెడిట్ అకౌంట్స్, రూ.లక్ష దాటిన ఓవర్‌డ్రాఫ్ట్‌ను రెపోరేటు, 2.25 శాతం జోడించి అనుసంధానం ఉంటుందని వివరించింది. -
‘ఫేమ్’ రెండో విడతపై నేడు నిర్ణయం
న్యూఢిల్లీ: సబ్సిడీల ద్వారా ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం రెండో విడతకు కేంద్ర క్యాబినెట్ నేడు (గురువారం) ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు సబ్సిడీనిచ్చేందుకు రూ. 10,000 కోట్ల కేటాయింపులతో ఫేమ్–ఐఐ పథకాన్ని రూపొందించినట్లు వివరించాయి. అయితే, దీని వ్యవధి ముందుగా అనుకున్నట్లు అయిదేళ్లు కాకుండా మూడేళ్లకు మాత్రమే పరిమితం కానుంది. అలాగే, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్లకు ఉద్దేశించిన సబ్సిడీని.. ట్యాక్సీ సేవల సంస్థలకు మాత్రమే వర్తింప చేసే అవకాశం ఉంది. విద్యుత్‌తో నడిచే బస్సులు, ట్యాక్సీ అగ్రిగేటర్స్ ఉపయోగించే ప్యాసింజర్ కార్లు, త్రిచక్ర వాహనాలు, 10 లక్షల ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై ఫేమ్– ఐఐ కింద రూ. 10,000 కోట్ల మేర సబ్సిడీ లభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘రెండో విడతలో రూ. 50 లక్షల దాకా ఖరీదు చేసే 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సుమారు 40 శాతం దాకా సబ్సిడీ లభిస్తుంది. 5 లక్షల త్రిచక్రవాహనాలకు రూ. 50,000 దాకా సబ్సిడీ ఉంటుంది. ప్రైవేట్ కార్లకు కాకుండా ట్యాక్సీ అగ్రిగేటర్స్ కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనం ఉంటుంది‘ అని పేర్కొన్నాయి. వాహనం కేటగిరీని బట్టి రెండో విడతలో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, పార్కింగ్ చార్జీలు మొదలైన వాటి నుంచి మినహాయింపులు కూడా లభించే అవకాశం ఉందని తెలిపాయి. -
వడ్డీ భారం ఎందుకు తగ్గించట్లేదు?
ముంబై: బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. రేటు తగ్గింపు అమల్లో జాప్యం ఎందుకని బ్యాంకర్లను ప్రశ్నించారు. దాస్ గురువారం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్ల చీఫ్‌లతో సమావేశమయ్యారు. రెపో తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడం, రుణ వృద్ధి వంటి అంశాలపై ఆయన బ్యాంకర్లతో చర్చించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తదితర బ్యాంకుల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 7న ఆర్బీఐ రెపో రేటును 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో బ్యాంకర్లతో తాజాగా ఆర్బీఐ చీఫ్ సమావేశమయ్యారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ‘‘ రేట్లును తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం మనకు చెప్పింది. సెంట్రల్ బ్యాంక్ తన విధాన రేట్లను తగ్గించినప్పుడు కస్టమర్లకు ఈ ప్రయోజనం అందితీరాలి’’ అని గవర్నర్ స్పష్టం చేశారు. తమ నెలవారీ అసెట్ లయబిలిటీ కమిటీ సమీక్షల్లో వడ్డీరేట్ల తగ్గింపుపై దృష్టి సారించి ఒక నిర్ణయానికి వస్తామని శక్తికాంతదాస్‌కు బ్యాంకర్లు హామీ ఇచ్చినట్లు సమాచారం. దువ్వూరి నుంచీ ఇదే సమస్య... ఆర్బీఐ రేటు తగ్గిస్తున్నప్పటికీ, ఈ ప్రయోజనాన్ని బ్యాంకర్లు బదలాయించకపోవడంతో ప్రధానంగా పరిశ్రమ నుంచి విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తోంది. నిధుల సమీకరణ వ్యయాల భారం, ఇప్పటికే ఉన్న మొండిబకాయిలు, తగ్గిపోతున్న మార్జిన్లు వంటి అంశాలను బ్యాంకులు సాకుగా చూపుతున్నాయి. గత పావుశాతం పాలసీ రేటు తగ్గింపు సందర్భంగా కూడా కేవలం రెండే బ్యాంకులు– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలే రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. అదీ కేవలం ఐదు బేసిస్ పాయింట్లే (100 బేస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించాయి. దువ్వూరి సుబ్బారావు గవర్నర్‌గా ఉన్న సమయం నుంచీ ఆర్బీఐ– బ్యాంకర్ల మధ్య పాలసీ రేటు బదలాయింపుపైనే వివాదం ఉంది. కేవలం ఇదే ప్రయోజనం నిమిత్తం 2013 జూలైలో దువ్వూరి బీపీఎల్ఆర్ ఆధారిత రేటు స్థానంలో బేస్ రేటును తీసుకువచ్చారు. అప్పటికీ ఫలితం రాకపోవడంతో తదుపరి గవర్నర్ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలో ఆర్బీఐ 2015 ఏప్రిల్ నుంచి స్వల్పకాలిక నిధుల సమీకరణ వ్యయ ప్రాతిపాదికన ఎంసీఎల్ఆర్ను (మార్జినల్ కాస్ట బేస్డ్ ఫండింగ్) తీసుకువచ్చారు. అయినా తగిన ఫలితం రాలేదు. ఏప్రిల్ నుంచీ కొత్త రేటు విధానం? ప్రస్తుత నిబంధనల ప్రకారం– వడ్డీ తగ్గింపునకు ఆర్బీఐ కేవలం సూచనలు ఇవ్వగలదుతప్ప, ఎటువంటి ఆదేశాలూ జారీచేయలేదు. సమస్యను అధిగమించడానికి ప్రస్తుతం ఆర్బీఐ పరిశీలినలో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత ప్రైసింగ్ విధానం పరిశీలనలో ఉంది. శక్తికాంతదాస్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఉర్జిత్ పటేల్ నుంచి ఈ విధాన ప్రతిపాదన తొలుత వచ్చింది. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అన్నీ బాగుంటే ఏప్రిల్‌లో కొత్త రేటు విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వృద్ధి మందగమనం... ధరల స్పీడ్ తగ్గుదల ►రేటు కోతకు దోహదపడిన రెండు అంశాలు ►ఆర్బీఐ సమావేశ మినిట్స్‌లో వెల్లడి ముంబై: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగించడం, ధరలు తక్కువ స్థాయిలో ఉండడం.. రెండూ ఫిబ్రవరి 7వ తేదీ రెపో రేటు కోత నిర్ణయానికి దారితీశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) పేర్కొంది. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ జరిగిన మూడు రోజుల సమావేశం సందర్భంగా కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐకి వచ్చే వడ్డీరేటు) తగ్గింపునకు ఓటు చేశారు. దీనితో ఈ రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. నాటి ఎంపీసీ సమావేశ మినిట్స్ గురువారం విడుదలయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... ►రేటు తగ్గింపు ద్వారా వృద్ధికి ఊతం ఇవ్వవచ్చని ఆర్బీఐ భావించింది. ప్రస్తుతం ఈ అవసరం ఉందని గవర్నర్ భావించారు. ►ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో, ప్రైవేటు పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని, అలాగే వినియోగం పటిష్టమవ్వాల్సిన పరిస్థితి ఉందని దాస్ తన వాదనలు వినిపించారు. ►వృద్ధి 7.4 శాతం ఉంటుందని ఆర్బీఐ పేర్కొంటుంటే, కేంద్ర గణాంకాల కార్యాలయం దీనిని 7.2 శాతంగానే అంచనా వేస్తోంది. ఇది వృద్ధి మందగమనానికి సంకేతం. రేటు తగ్గింపు ద్వారా వృద్ధికి ఊతం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ సభ్యులు భావించారు. ►బ్యాంకింగ్ వ్యవస్థలో రుణ వృద్ధి అనుకున్నంతగా లేకపోవడాన్నీ దాస్ ప్రస్తావించారు. ►గవర్నర్ దాస్ సహా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ పాత్ర, ఆర్‌బీఐయేతర సభ్యులు పామీ దువా, రవీంద్ర ఢోలాకియాలు రేటు కోతకు అనుకూలంగా ఓటు చేయగా, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ఆర్‌బీఐయేతర సభ్యులు ఛేతన్ ఘాటేలు రేటు కోతను వ్యతిరేకించారు. -
గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు తగ్గుతాయ్
సాక్షి, ముంబై : ఆర్బీఐ పాలసీ రివ్యూలో వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపడంతో గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టనున్నాయి. రెపో రేటుపై పావు శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు తగ్గడం గృహ, వాహన రుణగ్రహీతలకు శుభపరిణామమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వడ్డీరేట్ల కోత విధించి గృహ, వాహన కొనుగోలుదారులకు కేంద్ర బ్యాంకు శుభవార్త అందించిందని పేర్కొన్నాయి. ఈ సవరించిన రేట్లను బ్యాంకులు వినియోగదారులక పాస్ చేస్తాయని తాము భావిస్తున్నామని నైట్ ఫ్రాంక్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ షిషీర్ బైజల్ చెప్పారు. ఇది కస్టమర్ల కొనుగోలు నిర్ణయాన్ని సులభతరం చేస్తుంది. కొంతకాలంగా డిమాండ్ లేక నీరసించిన రియల్ రంగ అభివృద్ధికి ఇది కీలక అడుగు అని వ్యాఖ్యానించారు. కీలక వడ్డీరేట్లపై ఆర్బీఐ యధాతథానికే మొగ్గు చూపనుందన్న విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా మానిటరీ పాలసీ కమిటీ స్పందించింది. వరుస యథాతథ పాలసీకి చెక్ చెబుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని కమిటీ రెపో రేట్ కోతకే మొగ్గు చూపింది. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగి వచ్చింది. రివర్స్ రెపో 6 శాతానికి చేరింది. అలాగే బ్యాంక్ రేటు 6.5 శాతంగా అమలు కానుంది. -
సొంతిల్లు మీ లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కాకపోతే కొందరే తక్కువ ధరలో ఇంటిని సొంతం చేసుకుంటారు. వీలైనంత తక్కువ ధరకు ఇంటిని కొనాలంటే.. మార్కెట్ పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసికొని తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. ఇతర నగరాలకు చెందిన నిర్మాణ సంస్థలు నగరంలోకి అడుగుపెట్టి కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ రేటు కంటే అధిక ధరను నిర్ణయించాయి. దీంతో అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణాన్ని చేపట్టే స్థానిక డెవలపర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచేశారు. ఈ కారణంగా గత రెండు మూడు నెలల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో రేట్లు పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది కాబట్టి సొంతింటి ఎంపికకు ఆలస్యం చేయకపోవటమే మంచిది. ముఖ్యంగా మొదటిసారి సొంతిల్లు కొనాలని భావించేవారికిదే సరైన సమయమని చెప్పొచ్చు. ఆకాశాన్నంటిని నిర్మాణ సామగ్రి ధరలు ఈ ఏడాది స్వల్పంగా తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గృహ రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని అంచనా. దీంతో రియల్టీ మార్కెట్ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే నిజమైతే కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా పెట్టుబడులు పెట్టేవారు ఈ రంగంలోకి అగుడుపెట్టి కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తారు కాబట్టి గృహ కొనుగోలు నిర్ణయానికి ఇదే సరైన సమయం. -
వడ్డీ రేట్లు తగ్గించాలి
న్యూఢిల్లీ: దేశ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కీలకమైన వడ్డీ రేట్లను, నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించాలని దేశ పారిశ్రామిక సంఘాలు ఆర్బీఐని కోరాయి. కీలకమైన మానిటరీ పాలసీ సమీక్షకు ముందు దేశ పారిశ్రామిక ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం ముంబైలో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయ త్నం చేశారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగొచ్చినందున రుణాలపై అధిక వ్యయాలను తగ్గించాలని, కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టాలని పారిశ్రామికవేత్తలు ఈ సందర్భంగా కోరారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రస్తుతం సీఆర్ఆర్ 4 శాతం (బ్యాంకు డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిష్పత్తి), రెపో రేటు 6.5 శాతంగా (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై రేటు) ఉన్నాయి. సీఐఐ సూచనలు ఇవీ... ‘‘నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కనీసం అర శాతమయినా తగ్గించాలి. ద్రవ్యోల్బణం స్థిరంగా కనిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నందున రెపో రేటును సైతం అరశాతం తగ్గించడాన్ని పరిశీలించాలి. తద్వారా రుణాలపై అధిక వ్యయ భారాన్ని తగ్గించాలి. ఎంఎస్ఎంఈ, ఇన్ఫ్రా రంగానికి రుణ సదుపాయాన్ని పెంచాలి’’ అని సీఐఐ సూచించింది. ద్రవ్యలభ్యత పెంపునకు ఆర్బీఐ తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు, బ్యాంకులు కోరే అదనపు హామీలను పరిమితం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. సరైన హామీలు ఇచ్చినప్పుడు వ్యక్తిగత హామీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చూడాలని కోరింది. సీఐఐ ప్రెసిడెంట్ డిసిగ్నేట్ ఉదయ్ కోటక్ ఆధ్వర్యంలో ఈ సూచనలు చేశారు. కొనుగోలు దారులకు క్రెడిట్ సదుపాయం కల్పించే లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌లను (ఎల్ఓయూ) ఎంఎస్ఎంఈలకు కూడా జారీ చేసేలా బ్యాంకులను ఆదేశించాలని కోరింది. బలహీన బ్యాంకుల విషయంలో కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణను పునఃసమీక్షించాలని, కనీసం ఆయా బ్యాంకులను నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు రుణాలిచ్చేందుకు అయినా అనుమతించాలని కోరింది. దీనివల్ల హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నిధుల లభ్యత పెరుగుతుందని అభిప్రాయపడింది. వృద్ధిని కూడా చూడాలి... రెపో రేటు, సీఆర్ఆర్ను తగ్గించాలని మరో పారిశ్రామిక సంఘం ఫిక్కీ కూడా ఆర్బీఐ గవర్నర్‌ను కోరింది. దీని వల్ల దేశంలో పెట్టుబడులు పుంజుకుంటాయని, వినియోగాన్ని పెంచి వృద్ధికి తోడ్పడతాయని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని పేర్కొన్నారు. ‘‘వృద్ధిపై దృష్టి సారించేలా సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ అవసరం. మానిటరీ పాలసీ ఉద్దేశ్యాలు కేవలం ధరల స్థిరత్వానికే పరిమితం కాకూడదు. వృద్ధి రేటు, కరెన్సీ మారకం స్థిరత్వానికి కూడా అవసరమే’’ అని సందీప్ సోమాని సూచించారు. దేశంలో నగదు లభ్యత పెంచే విధంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉండాలని, ద్రవ్య లభ్యత వృద్ధిని నిలబెట్టగలదని అసోచామ్ సూచించింది. ‘‘ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల నిధుల సమీకరణ సామర్థ్యాలు గణనీయంగా తగ్గాయి. నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను వాటికి కల్పించాల్సి ఉంది. కేవలం ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల ఆరోగ్యం కోసమే కాదు, జీడీపీ స్థిరమైన వృద్ధికి కూడా ఇది తప్పనిసరి అవసరం’’ అని అసోచామ్ తన సూచనల్లో పేర్కొంది. మరింత కరెన్సీ అవసరం: ఆర్బీఐ కోల్‌కతా: దేశ జీడీపీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ వ్యవస్థలో మరింత నగదు అవసరం ఉంటుందని రిజర్వ్ బ్యాంకు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలో నగదుకు కొరత ఏర్పడిన విషయం విదితమే. -
రుణాలకు ఇకపై ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటు
ముంబై: రుణాలపై వడ్డీ రేట్ల పరంగా మరింత పారదర్శకత తీసుకొచ్చే చర్యల్ని ఆర్బీఐ ప్రకటించింది. గృహ, ఆటో, పర్సనల్ లోన్, ఎంఎస్ఈ సంస్థల రుణాలపై ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను, అది కూడా ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లు అయిన రెపో లేదా ట్రెజరీ ఈల్డ్‌తో అనుసంధానించనుంది. ప్రస్తుతం ఈ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో బ్యాంకులు అంతర్గత బెంచ్ మార్క్ రేట్ల విధానాలు ప్రైమ్ లెండింగ్ రేట్ (పీఎల్ఆర్), బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (బీపీఎల్ఆర్), మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను అనుసరిస్తున్నాయి. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్లతో వడ్డీ రేట్ల అనుసంధానంపై తుది నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరులోపు విడుదల చేయనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఎంసీఎల్ఆర్ విధానంపై సమీక్ష కోసం ఏర్పాటైన కమిటీ సూచనల మేరకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్‌తో ముడిపడిన రుణాలను ఇతర రుణాలకూ అమలు చేసే స్వేచ్ఛను బ్యాంకులకు కల్పిస్తున్నట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘‘రుణగ్రహీతలు రుణ ఉత్పత్తులను సులువుగా అర్థం చేసుకునేందుకు, పారదర్శ కత కోసం బ్యాంకులు ఒక రుణ విభాగంలో ఒకే తరహా ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేటును అనుసరించడం తప్పనిసరి. ఒకే రుణ విభాగంలో ఒకటికి మించిన బెంచ్‌మార్క్ రేట్లను అనుసరించేందుకు అనుమతి లేదు’’అని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
ఆర్బీఐ పాలసీ రివ్యూ: వడ్డీరేట్లు యథాతథం
సాక్షి, ముంబై: కేంద్ర బ్యాంకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనకీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ నేడు (డిసెంబరు 5)న నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 6.5శాతంగాను, రివర్స్ రెపో6.25శాతంగా ఉండనుంది. అయితే ఎస్ఎల్ ఆర్ రేటులో 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) 6.5 శాతంగా ఉంది. రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద ఉంచే నగదుపై బ్యాంకులకు లభించే వడ్డీ) 6.25 శాతంగా కొనసాగుతోంది. -
ఆర్బీఐ మూడు రోజుల కీలక భేటీ ప్రారంభం
ముంబై: ద్రవ్య, పరపతి విధాన నిర్ణయానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మూడు రోజల సమావేశం సోమవారం ఇక్కడ ప్రారంభమైంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) బుధవారం నాడు కీలక వడ్డీరేట్లపై తన విధానాన్ని ప్రకటించనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) ఆర్బీఐ యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండడం, గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 30 డాలర్లు దిగివచ్చిన క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణం తగిన స్థాయిల్లో ఉండడం, రేటు పెంపు విషయంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఆచితూచి వ్యవహరిస్తుందనే సంకేతాలు, కఠిన అంతర్జాతయ ద్రవ్య పరిస్థితులు, దేశంలోనూ ఇదే ధోరణి నెలకొనడం దీనికి కారణం. ఆర్బీఐ స్వతంత్రతకు సంబంధించి కేంద్రంతో విభేదాలు, దిద్దుబాటు చర్యల పరిధిలో ఉన్న పదకొండు బ్యాంకుల్లో కొన్నింటిని తప్పించాలని కేంద్రం ఒత్తిడి తేనుందన్న వార్తలు తాజా సమావేశానికి నేపథ్యం. -
మార్కెట్లో కొనుగోళ్ల హుషారు
వడ్డీరేట్ల పెంపు విషయంలో గతంలో మాదిరి దూకుడుగా వ్యవహరించబోమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ చేసిన వ్యాఖ్యలు మన స్టాక్ మార్కెట్లలో లాభాల వర్షాన్ని కురిపించాయి. సాధారణంగా డెరివేటివ్స్ సిరీస్ ముగింపు రోజు స్టాక్‌సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. లేదా పరిమిత శ్రేణిలో కదలాడి నష్టాల్లోనో, ఫ్లాట్‌గానూ ముగుస్తాయి. కానీ ఈ నవంబర్ సిరీస్ దీనికి భిన్నంగా జరిగింది. వడ్డీరేట్ల విషయంలో భారత్ వంటి వర్ధమాన దేశాలకు ఊరటనిచ్చే వ్యాఖ్యలను ఫెడ్ చైర్మన్ పావెల్ చేశారు. మరోవైపు నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జోరుగా సాగడం కలసివచ్చింది. వీటన్నిటికీ తోడు డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 74 పైసలు బలపడి 70కు దిగువన (69.88) రావడం సానుకూల ప్రభావాన్ని చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 36వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగబాకాయి. స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజూ ముందుకే దూసుకుపోయాయి. సెన్సెక్స్ 453 పాయింట్లు లాభపడి 36,170 పాయింట్ల వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 10,859 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలకు ఇది దాదాపు రెండు నెలల గరిష్ట స్థాయి. ఐటీ షేర్లు నష్టపోగా, బ్యాంక్, వాహన, వినియోగ, లోహ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ఆరంభమే అదిరింది.... స్టాక్ మార్కెట్ ఆరంభమే అదిరిపోయింది. వడ్డీరేట్ల విషయమై పావెల్ చేసిన సానుకూల వ్యాఖ్యలతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ జోష్‌తో ఆసియా మార్కెట్లు మంచి లాభాలతో మొదలయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా దూకుడుగా ఆరంభమైంది. సెన్సెక్స్ 280 పాయింట్ల లాభంతో శుభారంభం చేయగా. ఎన్ఎస్ఈ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 10,800 పాయింట్ల ఎగువన ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ లాభాలు అంతకంతకూ పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 537 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్ల వరకూ పెరిగాయి. ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో ఈక్విటీ మార్కెట్ జోరుగా పెరిగిందని ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ జోసెఫ్ థామస్ చెప్పారు. వడ్డీరేట్ల విషయమై అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ చేసిన వ్యాఖ్యలు కొనుగోళ్లకు ఊపునిచ్చాయని పేర్కొన్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. నవంబర్లోనే భారీ లాభాలు... ఈ ఏడాది మొత్తం మీద ఈ నెలలోనే స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. నవంబర్ సిరీస్‌లో నిఫ్టీ 7 శాతం ఎగసింది. 10,100 పాయింట్ల నుంచి 10,859 పాయింట్ల వరకూ పెరిగింది. మార్కెట్ మరింత ముందుకేనా? రేపు (శనివారం) జరిగే జీ–20 సమావేశంలో అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే ఒప్పందం ఏదైనా కుదిరితే మార్కెట్ మరింత ముం దుకు దూసుకుపోతుందని నిపుణులు చెబు తున్నారు. సూచీలు మరో 12– 15 శాతం వరకూ పెరగడానికి అవకాశముందని బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ హేమాంగ్ జని అంచనా వేశారు. ఎన్నికల కారణంగా ఒకింత ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని, మార్కెట్ పతనమైనప్పుడల్లా కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. గత 3–4 రోజుల్లో వాల్యూమ్స్ పెరిగాయని, ఇది ర్యాలీ మరింత కొనసాగడానికి సూచిక అని ఇదే సంస్థకు చెందిన విశ్లేషకులు, గౌరవ్ రత్నపర్కి పేర్కొన్నారు. నిఫ్టీ 11,000–11,140 స్థాయికి పెరగవచ్చని అంచనాలున్నాయన్నారు. మరోవైపు గత నాలుగు రోజుల్లో మార్కెట్ పెరిగినందున లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశాలున్నాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా స్టాక్ మార్కెట్లో ఈ జోరు కొనసాగే అవకాశాల్లేవని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కారణంగా మార్కెట్లో జోరు ఉండకపోవచ్చని, మార్కెట్ నుంచి బైటకు రావడానికి ఈ ర్యాలీ మంచి అవకాశమని మరికొందరు విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం. ► ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ షేర్లు–బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీలు 1–3% రేంజ్లో పెరిగాయి. ► రానున్న సంవత్సరాల్లో వృద్ధి జోరుగా ఉండగలదన్న అంచనాల కారణంగా హోటల్ షేర్లు ఇంట్రాడేలో 20% వరకూ పెరిగాయి. హోటల్ లీలా, కామత్, తాజ్ జీవీకే, ఓరియంటల్ హోటల్స్ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. ► మార్కెట్ భారీ లాభాల్లో ఉన్నా కొన్ని బ్లూ చిప్ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, యస్ బ్యాంక్ వంటి షేర్లు ఇందులో ఉన్నాయి. నాలుగు రోజుల్లో రూ. 2 లక్షల కోట్లు గత 4 రోజుల్లో సెన్సెక్స్ మంచి లాభాలు సాధించడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2.03 లక్షల కోట్లు పెరిగి రూ.1,42,49,327 కోట్లకు పెరిగింది. ఒక్క గురువారం రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.88,000 కోట్లు ఎగసింది. లాభాలు ఎందుకంటే... ► ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో జోరు.... ఫెడరల్ రిజర్వ్ రేట్లు తటస్థ స్థాయి కంటే దిగువనే ఉన్నాయని ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యానించారు. వడ్డీరేట్ల విధానంలో మార్పులు.. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా కానీ, అడ్డుకునేలా కానీ లేవని పేర్కొన్నారు. దీంతో వచ్చే ఏడాది రేట్లను ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా పెంచబోదని ఆయన సంకేతాలిచ్చారని నిపుణులు అంటున్నారు. పావెల్ వ్యాఖ్యల కారణంగా డాలర్ పతనం కాగా, బాండ్ల రేట్లు దిగివచ్చాయి. ఫెడ్ రేట్లను పెంచకపోతే, భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే అవకాశాలు ఉండవు. విదేశీ పెట్టుబడులు కొనసాగుతాయని, ఇది మార్కెట్లకు మంచి చేస్తుందనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ► రూపాయి 70 దిగువకు... ఎగుమతి దారులు డాలర్లను విక్రయించడం కొనసాగింది. దీనికి ముడి చమురు ధరలు దిగిరావడం తోడయింది. ఫలితంగా రూపా యి మరింత బలపడింది. ► విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు.. అక్టోబర్‌లో ఈక్విటీలను తెగ విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌లో రూ.9,000 కోట్ల వరకూ కొనుగోలు చేశారు. ఈ వారంలో 4 రోజులూ నికర కొనుగోళ్లు జరిపారు. ► చల్లబడ్డ చమురు ధరలు.... ముడి చమురు నిల్వలు ఏడాది గరిష్ట స్థాయికి చేరడంతో ముడి చమురు ధరలు తగ్గాయి. ఒక పీపా బ్రెంట్ ముడి చమురు ధర 1 శాతం వరకూ తగ్గి 58 డాలర్లకు దిగివచ్చింది. ► సాంకేతిక కారణాలు... నిఫ్టీ 200 రోజుల చలన సగటు.. 10,774 పాయింట్లపైకి ఎగబాకడంతో సెంటిమెంట్ పాజిటివ్‌గా మారిందని ఎనలిస్ట్‌లు అంటు న్నారు. నిఫ్టీ కీలక 10,850 పాయింట్లపైన ముగియడంతో 11,000 దిశగా కదలనున్నదని, రానున్న నెల రోజుల్లో 11,400 స్థాయికి వెళ్లవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా. -
ఎస్బీఐ డిపాజిట్ రేట్లు కొంచెం పెరిగాయ్!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్థిర డిపాజిట్ రేట్లు వివిధ మెచ్యూరిటీలపై 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగి 6.80 శాతానికి చేరాయి. కోటి రూపాయల లోపు వివిధ డిపాజిట్లపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగిన ఈ రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు ఈ నెల ప్రారంభంలోనే డిపాజిట్ రేట్లను పెంచాయి. పెంపు వివరాల్లోకి వెళితే... ∙ఏడాది– రెండేళ్ల మధ్య డిపాజిట్ రేటు 6.70 శాతం నుంచి 6.80 శాతానికి పెరిగింది. సీనియర్ సిటిజన్స్ విషయంలో ఈ రేటు 7.20 శాతం నుంచి 7.30 శాతానికి పెరిగింది. ∙రెండు–మూడేళ్ల రేటు 6.75 శాతం నుంచి 6.80 శాతాని చేరింది. ఈ విభాగంలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే స్థిర డిపాజిట్ రేటు 7.25 శాతం నుంచి 7.30 శాతానికి పెరిగింది. -
అమెరికాను బట్టి అంచనా వేయొద్దు!
బాండ్ ఫండ్స్ పనితీరు గత ఏడాది కాలంలో సంతృప్తికరంగా లేదు. బాండ్ల రాబడులు పెరగడం వల్ల ఈ బాండ్ ఫండ్స్ ఎలాంటి రాబడులనివ్వలేదు. కొన్నైతే నష్టాలనూ ఇచ్చాయి. ఇప్పుడైతే అమెరికాలో బాండ్ల రాబడులు స్థిరంగా ఉన్నాయి. ఈ ప్రభావంతో భారత్‌లో కూడా బాండ్ల రాబడులు స్థిరత్వాన్ని పొందుతాయా? ఇప్పుడు బాండ్ల ఫండ్లు మంచి రాబడులనిచ్చే అవకాశాలున్నాయా? – వినయ్, హైదరాబాద్ సాధారణంగా ఇన్వెస్టర్లు ఆదాయం ఖచ్చితంగా వస్తుందనే అంచనాలుంటేనే బాండ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక ఈ ఏడాది అన్ని బాండ్ల ఫండ్లు నెగిటివ్ రాబడులిచ్చాయనేది నిజం కాదు. దీర్ఘకాల బాండ్ ఫండ్స్ మాత్రమే నష్టాలనిచ్చాయి. వడ్డీరేట్లు తగ్గుతాయేమోనని అందరూ అంచనాలు వేశారు. కానీ ఈ అంచనాలకు భిన్నంగా వడ్డీ రేట్లు పెరిగాయి. బాండ్ ఫండ్ల రాబడులు వడ్డీరేట్లకు విలోమంగా ఉంటాయి. అంటే వడ్డీరేట్లు తగ్గితే బాండ్ ఫండ్ల రాబడులు పెరుగుతాయి. వడ్డీరేట్లు పెరిగితే బాండ్ ఫండ్ల రాబడులు తగ్గుతాయి. అమెరికాలో బాండ్ల రాబడులు స్థిరంగా ఉన్నాయని, మన మార్కెట్లోనూ అలాంటి పరిస్థితే ఉంటుందని అంచనా వేయకూడదు. విదేశీ మార్కెట్ల ప్రభావం మనపై పెద్దగా ఉండదు. ద్రవ్యోల్బణం, నగదు సరఫరా తదితర అంశాలపై బాండ్ ఫండ్ల రాబడులు ఆధారపడి ఉంటాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఆర్బీఐ తీసుకునే నిర్ణయాన్ని బట్టి బాండ్ ఫండ్స్ రాబడులను అంచనా వేయొచ్చు. ఆ దృష్ట్యా చూస్తే, బాండ్ ఫండ్ల విషయంలో ఒక తటస్థ పరిస్థితి ఉత్పన్నమవ్వగలదని తెలుస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలున్నాయి. దీంతో బాండ్ల ఫండ్లకు ప్రయోజనం చేకూరుతుంది. బాండ్ల ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన ఇన్వెస్ట్‌మెంట్స్‌కు స్థిరత్వం కలుగుతుంది. ఒకవేళ నష్టాలు రావడం సంభవించినా, మన పెట్టుబడి పెద్ద స్థాయిలో హరించుకుపోయే ప్రమాదం ఉండకపోవచ్చు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీల వల్ల తలెత్తిన సంక్షోభం కారణంగా ఇటీవల కొన్ని లిక్విడ్, బాండ్ ఫండ్లకు నష్టాలు వచ్చాయి. ఇది తాత్కాలికమే. ఇది వడ్డీరేట్లపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. నా పోర్ట్‌ఫోలియోలో 10–15 వరకూ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఏ ఫండ్ ఏ రేంజ్లో ఎంత రాబడులు ఇచ్చిందో నాకు అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి ? –ఖదీర్, విజయవాడ దీనికి ఒకటే పరిష్కారం. మీ పోర్ట్‌ఫోలియోను ప్రక్షాళన చేయండి. మీ పోర్ట్‌ఫోలియోలో 4–5 మంచి ఫండ్స్‌ను మాత్రమే ఉంచుకోండి. మీ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏడాది దాటితే, ఆ ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, వాటికి ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఇలా ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండని, పనితీరు సరిగ్గా లేని, అంతంత మాత్రం పనితీరు ఉన్న ఫండ్స్‌ను, ఒకే పోర్ట్‌ఫోలియో ఉన్న ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోండి. మీ పోర్ట్‌ఫోలియోలో 4–5 మంచి మల్టీక్యాప్ ఫండ్స్ ఉండేలా చూసుకోండి. ఈ 4–5 మల్టీ క్యాప్ ఫండ్స్ డైవర్సిఫైడ్‌గా ఉండాలన్న విషయాన్ని మర్చిపోకండి. ఇక కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న కోరికను అదుపులో పెట్టుకోండి. నేను సీనియర్ సిటిజన్‌ను. అమెరికా షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చా? లేక అమెరికా, యూరప్ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే భారత మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే, అలాంటి వాటిల్లో కొన్ని మంచి ఫండ్స్‌ను సూచించండి? – ఆనంద రావు, విశాఖపట్టణం విదేశీ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి భారతీయులకు రెండు, మూడు మార్గాలున్నాయి. భారతీయులెవరైనా సరే 2 లక్షల డాలర్ల వరకూ అమెరికా షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. అమెరికా షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి సలహా, సహకారాలు అందించే స్టాక్ బ్రోకర్లు ఇక్కడ చాలా మందే ఉన్నారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా విదేశీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా మీరు ఇన్వెస్ట్ చేయడానికి మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్ ఫండ్‌ను పరిశీలించవచ్చు. గత ఏడాది కాలంలో ఈ ఫండ్ 20 శాతం వరకూ రాబ డినిచ్చింది. ఈ ఫండ్ ఆరంభమై... ఏడేళ్లు. ఈ ఏడేళ్లలో కూడా ఈ ఫండ్ మంచి రాబడులనే ఇచ్చింది. మీరు ఇన్వెస్ట్ చేయడానికి మరికొన్ని ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు. అవి ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, రిలయన్స్ యూఎస్ ఈక్విటీ అపర్చునిటీస్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్. కొన్ని ఫండ్స్ తమ మొత్తం నిధుల్లో 65 శాతం వరకూ భారత షేర్లలో, మిగిలిన 35 శాతం వరకూ ఇతర దేశాల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇలాంటి ఫండ్లలో పరాగ్ పరిఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించవచ్చు. ఈ ఫండ్ తన నిధుల్లో 30 శాతం వరకూ అమెరికా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తోంది. ఒక పూర్తి మార్కెట్ సైకిల్ కాలంలో ఈ ఫండ్ మంచి రాబడులనే ఇచ్చింది. ఈ ఫండ్‌లో డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు బాగా ఉన్నాయి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఇంటి రుణం ముందే తీర్చేస్తారా?
కిరణ్, వాణి దంపతులు 2008లో తొలిసారి హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్నారు. అందుకోసం 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల రుణాన్ని తీసుకున్నారు. కానీ, నాలుగేళ్లలోనే ఆ రుణాన్ని తీర్చేయాలనుకున్నారు. అనుకున్న ప్రణాళికకు కట్టుబడ్డారు. ఏటా వచ్చే బోనస్, ఇన్సెంటివ్, ప్రతి నెలా మిగిలే మొత్తాన్ని ఈ రుణం తీర్చేయడానికి ఉపయోగించారు. అలా ముందే రుణాన్ని తీర్చేయటం ద్వారా రూ.21 లక్షల వడ్డీని ఆదా చేసుకున్నారు. నిజానికి వీళ్లు అనుసరించినది ప్రత్యేకమైన విధానమేమీ కాదు. చాలామంది చేసేదే. కాకపోతే అనుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండటం ద్వారా ఆ లక్ష్యాన్ని ఈజీగా చేరుకున్నారు. ఇంటి రుణాన్ని ముందుగా తీర్చేయటమన్నది కొందరికి లాభదాయకం కావచ్చు. పన్ను పరిధిలో ఉన్న వారు ఇంటి రుణాన్ని కొనసాగించాలా లేక ముందుగానే తీర్చివేయాలా? అన్న సందేహం రావచ్చు. అయితే, ఎవరికి ఏ విధానం అన్నది వారి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. అందరికీ పెద్ద మొత్తంలో బోనస్ రాకపోవచ్చు. క్రమం తప్పకుండా, ప్రతి నెలా ఈఎంఐకు అదనంగా చెల్లిస్తూ పోవచ్చు. 2008లో కిరణ్ దంపతుల ఉమ్మడి ఆదాయం రూ.14 లక్షలకు పైమాటే. వారు చెన్నైలో తాము నివాసం ఉండే ఫ్లాట్‌కు రూ.22,000 అద్దె చెల్లించేవారు. అదే సమయంలో హైదరాబాద్ ఇంటి కోసం తీసుకున్న రుణానికి ప్రతినెలా రూ.21,000 చెల్లించేలా ఏర్పాటు చేసుకున్నారు. వీరి నెలసరి ఖర్చు రూ.50 వేలు. దీంతో ఎక్కువ మిగులు ఉండేది. దాంతో హైదరాబాద్‌లో మరో ప్రాపర్టీ కూడా కొన్నారు. దీనికి పొదుపు నిధులను వినియోగించారు. తమకు ఓ ప్లాట్ ఉంటే దాన్ని అమ్మేశారు. ఇపుడు వీరి పెట్టుబడులపై ప్రతి నెలా రూ.40,000 అద్దె వస్తోంది. ఏక మొత్తంలో చేతికందే నిధులను ముందస్తుగా చెల్లించేందుకు వాడుకోవటమన్నది ముఖ్యం. నోయిడాకు చెందిన అమర్దీప్ సైతం ఇంటి రుణం తీసుకోగా... ముందస్తుగా చెల్లింపులు చేస్తూ రూ.33 లక్షల రుణాన్ని స్వల్ప కాలంలోనే రూ.18 లక్షలకు తగ్గించుకున్నాడు. 2016లో తనకు బకాయిల రూపంలో రెండు విడతల్లో మొత్తం రూ.15 లక్షలు చేతికి అందడంతో, వాటిని ఇంటి రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగించాడు. రూ.50 లక్షల ఇంటి రుణం, 20 ఏళ్ల కాల వ్యవధి, 9 శాతం వడ్డీకి తీసుకోగా, అదనపు చెల్లింపులు చేస్తూ 9.3 సంవత్సరాల్లోనే రుణం మొత్తం తీర్చేశాడు. ప్రతీ 12 ఈఎంఐలకు ఓసారి రూ.3 లక్షలు అదనంగా చెల్లించాడు. ఈ విధంగా అవకాశం లేనప్పుడు... గతంలో చేసిన పెట్టుబడుల కాల వ్యవధి తీరిపోతే వాటితో ముందుగానే రుణాన్ని తీర్చేయవచ్చు. ఈఎంఐ పెంచుకోవచ్చు కూడా... పొదుపు నిధుల్లేనివారు, అదే సమయంలో ఇంటి కోసం తీసుకున్న రుణాన్ని ముందుగానే వదిలించుకోవాలన్న ఆలోచనతో ఉన్నవారి ముందున్న మార్గాల్లో... ఈఎంఐ మొత్తాన్ని పెంచుతూ చెల్లించడం ఒకటి. ‘‘రూ.50 లక్షల రుణాన్ని 9% వడ్డీ రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకుంటే... ఏటా ఈఎంఐ మొత్తాన్ని 15 శాతం పెంచి చెల్లించినట్టయితే రుణం 97 నెలల్లోనే తీరిపోతుంది. అంటే ఎనిమిదేళ్ల ఒక నెలలోనే రుణం పూర్తయిపోతుంది’’ అని మార్ట్గేజ్ వరల్డ్ వ్యవస్థాపకుడు పటేల్ చెప్పారు. ఈఎంఐ మొత్తాన్ని 10–15% పెంచి చెల్లించడం వల్ల వడ్డీ రేట్లు పెరిగితే రుణ కాల వ్యవధి పెంచుకోవాల్సిన ఇబ్బంది కూడా ఎదురుకాదు. ‘‘వడ్డీ రేట్లు పెరుగుతుంటే కాల వ్యవధిని పెంచుకోవద్దు. దీనికి బదులు ఈఎంఐను పెంచుకోవాలి. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గితే ఈఎంఐను తగ్గించుకోవడానికి బదులు రుణ కాల వ్యవధిని తగ్గించుకోవాలి. దీనివల్ల రుణాన్ని తొందరగా ముగించేయవచ్చు’’ అని ఫిన్పీస్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు రెవారియా సూచించారు. పన్ను అంశాలూ పరిగణనలోకి.. ఇంటి రుణం తీసుకున్న కొందరు పన్ను ఆదా కోసం పూర్తి కాల వ్యవధి పాటు కొనసాగిస్తుంటారు. సెక్షన్ 80సీ కింద ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులకు రూ.2 లక్షలు, అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే ఈ పన్ను ఆదా అంశంపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వడ్డీ వ్యయాల కంటే ఆదా చేసే పన్ను తక్కువగా ఉంటుంది కనక,. పన్ను ఆదా కోసం ఇంటి రుణాన్ని ముందుగా చెల్లించకుండా ఉండటం పొరపాటు అవుతుందనేది కొందరు నిపుణుల మాట. మిగులు నిధులను కాకుండా అవసరం కోసం ఉంచుకున్న కొద్ది నిధులు, పెట్టుబడులు అన్నింటినీ ముందుగా రుణ చెల్లింపునకు ఖాళీ చేసేసే వారు... దానికన్నా ముందు ఓ సారి ఆలోచించాల్సిందే. చేతిలో చిల్లిగవ్వ లేకుండా రుణాన్ని తీర్చివేస్తే... మళ్లీ డబ్బులతో పని పడితే అధిక వ్యయాలపై రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
‘పొదుపు’ మళ్లీ కళకళ!
(సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) : వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ కళొచ్చింది. సామాన్యుల పొదుపు సాధనాలుగా వర్ధిల్లిన ఈ పథకాలు నాలుగేళ్లుగా వడ్డీ రేట్ల క్షీణతతో కాస్తంత కళ తప్పాయనే చెప్పాలి. అయినప్పటికీ బ్యాంకులతో పోలిస్తే గతంలోనూ, ఇప్పుడు కూడా కాస్తంత ఎక్కువ రాబడి వస్తున్నది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనేనని నిస్సందేహంగా చెప్పుకోవాలి.అయితే, దేశంలో తిరిగి వడ్డీ రేట్లు పెరుగుతున్న వాతావరణం నెలకొంది. ఫలితంగా... అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే మూడు నెలల కాలానికి అన్ని జాతీయ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.40 శాతం వరకు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. అన్ని వయసుల వారి అవసరాలకు సరిపడే పథకాలు వీటిల్లో ఉన్నాయి. ఆ వివరాలొకసారి చూస్తే... ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఆదాయపన్ను ప్రయోజనంతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అనువైన పథకాల్లో ఒకటి. భద్రతతో కూడిన ఆకర్షణీయమైన దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల్లో ఇదీ ఒకటి. పైగా ఆదాయపన్ను ప్రయోజనాన్ని చూసుకుంటే అందరి పోర్ట్‌ఫోలియోలో తప్పని సరిగా ఉండాల్సిన సాధనం. దీని కాల వ్యవధి 15 ఏళ్లు. కావాలంటే ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. ఇందులో ఏటా కనీసం డిపాజిట్ చేయాల్సిన మొత్తం రూ.500. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి లేక 12 వాయిదాల రూపంలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యులు సైతం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో ఒక ఆర్థిక సంత్సరంలో రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధిలో 7వ ఏట నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ముందస్తుగా ఖాతా మూసివేసేందుకు అవకాశం లేదు. దీనిపై వడ్డీ రేటును కేంద్రం ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షించి, సవరిస్తుంటుంది. వడ్డీ గత నెల వరకు 7.6 శాతం కాగా దీన్ని తాజాగా 8 శాతానికి సవరించింది. వడ్డీని ఏడాదికోసారి అసలుకు కలుపుతారు. ఈ పథకంలో పెట్టుబడులపైనే కాదు, వడ్డీ రాబడి, కాల వ్యవధి తీరిన తర్వాత అందుకునే మొత్తంపైనా ఆదాయపన్ను లేదు. అందుకే మూడు మినహాయింపులు (ఈఈఈ) కలిగిన పథకంగా దీన్ని చెబుతారు. ముఖ్యంగా 30 శాతం ఆదాయపన్ను శ్లాబులో ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపులను లెక్కేసి చూస్తే అధిక రాబడి పొందొచ్చు. వీరికి నికరంగా 11.9 శాతం రాబడి పొందినట్లవుతుంది. చాలా డెట్ ఫండ్స్, బాండ్లతో పోలిస్తే పీపీఎఫ్ చక్కని రాబడి సాధనంగా ఉంది. అదనపు ప్రయోజనాలు పీపీఎఫ్ బ్యాలన్స్‌పై రుణాన్ని కూడా తీసుకోవచ్చు. ఖాతా ప్రారంభించిన తర్వాత మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఆరో ఆర్థిక సంవత్సరం వరకు ఈ అవకాశం ఉంటుంది. బ్యాలన్స్‌లో 25 శాతం పొందొచ్చు. మూడేళ్లలోగా తిరిగి చెల్లించాలి. పాక్షిక ఉపసంహరణ అవకాశం ఏడో సంవత్సరం నుంచి ఉంటుంది. ఏ పోస్టాఫీసులో అయినా లేక బ్యాంకులో అయినా పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. బ్యాంకుల్లో అయితే ఆన్లైన్లో ప్రారంభించే సదుపాయం కూడా ఉంది. వేరే శాఖకు కూడా బదిలీ చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) ఇటీవలి రేట్ల సవరణ తర్వాత నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (జాతీయ పొదుపు పత్రం) పథకంలో వడ్డీ రేటు 8 శాతానికి చేరుకుంది. కాల వ్యవధి ఐదేళ్లు. ఐదేళ్లపాటు లాకిన్‌లో ఉంటుంది. ఆ లోపు పెట్టుబడులను వెనక్కి తీసుకునే వీలుండదు. పెట్టుబడి సమయంలో ఉన్న వడ్డీ రేటే కాల వ్యవధి పూర్తయ్యే వరకూ అమలవుతుంది. ఏటా వడ్డీ ఆదాయాన్ని ఆసలుకు కలుపుతారు. కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూ.100 పెట్టుబడి ఐదేళ్ల తర్వాత రూ.144.23 అవుతుంది. ఇందులో పెట్టుబడులకు గరిష్ట పరిమితి లేదు. ఎన్ఎస్సీలో చేసే రూ.1.50 లక్షల పెట్టుబడికి ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీ ఏటా అసలుకు కలుస్తుంటుంది. ఇలా కలిసే మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టినట్టుగా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తుంది. కనుక దీనిపైనా సెక్షన్ 80సీ కింద గరిష్ట పరిమితి మేరకు పన్ను మినహాయంపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ, చివరి ఏడాది (ఐదో ఏట) వచ్చే వడ్డీ ఆదాయం తిరిగి ఇన్వెస్ట్ చేయడం ఉండదు కనుక దీనిపై పన్ను మినహాయింపు ఉండదు. దీన్ని తమ వ్యక్తిగత ఆదాయానికి కలిపి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ ఆదాయానికి టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) వర్తించదు. పోస్టాఫీసు ఐదేళ్ల టైమ్ డిపాజిట్ పథకంతో పోల్చిచూస్తే... ఎన్‌ఎస్‌సీలోనే కాస్తంత అధిక రాబడి ఉంది. టైమ్ డిపాజిట్లో 7.8 శాతమే వడ్డీ రేటు ఉంది. కాకపోతే , పన్ను ఆదా చేసే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో మాత్రం అధిక రాబడి అందుకోవచ్చు. ఉదాహరణకు డాయిష్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకు పన్ను ఆదా చేసే ఐదేళ్ల ఎఫ్డీలపై 8.5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. కానీ, వడ్డీ ఆదాయానికి పన్ను పడుతుంది. అలా చూస్తే ఎన్ఎస్సీయే మెరుగైనది. ఎందుకంటే పన్ను తర్వాత అధిక రాబడి ఎన్‌ఎస్‌సీలోనే అధికం. పైగా ఇందులో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. బ్యాంకు డిపాజిట్ల కంటే సురక్షితమైనది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ (ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం) అనే కాలమ్‌లో ఎన్ఎస్సీ రాబడిని చూపించాల్సి ఉంటుంది. ఏ పోస్టాఫీసు నుంచి అయినా ఎన్ఎస్సీ పత్రాలను కొనుగోలు చేయవచ్చు. సొంతంగాను, మైనర్ల పేరిట, జాయింట్‌గానూ తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) చిన్న వయసులో ఉన్న కుమార్తెల పేరిట వారి భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేసుకునేందుకు ఉద్దేశించిన సాధనం. కుమార్తెల ఉన్నత విద్య, వివాహ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు పూర్తి భద్రత కలిగిన మెరుగైన సాధనంగా దీన్ని చెప్పుకోక తప్పదు. తాజా త్రైమాసికానికి ఈ పథకంలో పెట్టుబడులపై వడ్డీ రేటును 8.1 శాతం నుంచి 8.5 శాతానికి పెంచారు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల కంటే (సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం మినహా) ఇందులో వడ్డీ రేటు ఎక్కువ. ఇక ఇందులో పెట్టుబడులు, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తాలపైనా పన్ను లేకపోవడం అదనపు ఆకర్షణ. ఇద్దరు కుమార్తెల పేరిటే ఖాతాలు తెరిచే అవకాశముంది. పదేళ్లలోపు కుమార్తె ఉన్న వారు తప్పకుండా పరిశీలించాల్సిన ఫిక్స్డ్ ఇన్కమ్ పథకమిది. దత్తత తీసుకున్న కుమార్తె పేరిటా ఖాతాను తెరవొచ్చు. ఏడాదిలో కనీసం రూ.250 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్టంగా ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంతకుమించి కుదరదు. ఇందులో పెట్టుబడులకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. పోస్టాఫీసులతోపాటు బ్యాంకుల్లోనూ ఈ ఖాతా తెరిచేందుకు వీలుంది. ఇందులో వడ్డీని ఏటా అసలుకు కలుపుతారు. 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఖాతా ప్రారంభించిన తర్వాత 21 ఏళ్లకు కాల వ్యవధి తీరిపోతుంది. ఏడాదిలో ఎన్ని విడతలుగానైనా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుంది. ఉన్నత విద్య కోసం కుమార్తె 18వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత లేదా 10వ తరగతి పూర్తయిన తర్వాత 50% బ్యాలన్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. ఏది ముందు అయితే దాన్నే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే, 18 ఏళ్లు నిండిన తర్వాత అమ్మాయి వివాహం కోసం మొత్తాన్ని వెనక్కి తీసేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) 60 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం ఉద్దేశించిన పథకం ఇది. ఇటీవలి వడ్డీ రేట్ల సవరణ తర్వాత ఈ పథకంలో పెట్టుబడిపై వార్షిక వడ్డీ రేటు 8.7 శాతానికి పెరిగింది. సురక్షితమైన సాధనాల్లో అత్యధిక రాబడి ఉన్న పథకం ఇదేనని స్పష్టంగా చెప్పొచ్చు. వీఆర్ఎస్తో ముందే పదవీ విరమణ చేసిన వారయితే 55 ఏళ్లకే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకుంటే 55 ఏళ్లకే చేరే వారు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిన నెలలోపే ఈ ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల మాదిరే ఈ పథకం వడ్డీ రేటును కూడా కేంద్రం మూడు నెలలకోసారి సవరిస్తుంది. ఇన్వెస్ట్ చేసిన రోజు ఉన్న వడ్డీ రేటే పూర్తి కాలావధికి వర్తిస్తుంది. ఐదేళ్ల తర్వాత కావాలనుకుంటే మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. విడిగా ఒకరు తమ పేరిట రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ పథకంలో రూ.1.5 లక్షల పెట్టుబడికి సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనానికి అనుమతి ఉంది. కాకపోతే ఈ పథకంలో పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రతీ త్రైమాసికం ముగింపు రోజున వడ్డీ ఆదాయం చెల్లించడం జరుగుతుంది. అన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్ డిపాజిట్లపై 6.5–8.25 శాతం మధ్యే వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఒక్క ఐడీఎఫ్సీ బ్యాంకు 8.75 శాతం ఆఫర్ చేస్తోంది. పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం పెట్టుబడికి భద్రత ఉండాలి, ప్రతీ నెలా ఆదాయం రావాలి అని కోరుకునే వారికి పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం కూడా ఒక సాధనమే. ఇందులో పెట్టుబడులపై 7.3%గా ఉన్న వడ్డీ రేటు ఈ నెల 1 నుంచి 7.7%కి పెరిగింది. ఈ పథకంలో పెట్టుబడు లకు ప్రభుత్వ హామీ ఉంటుంది. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. వడ్డీ ఆదాయాన్ని ప్రతి నెలా చెల్లిస్తారు. ఒకరు లేదా ఇద్దరు కలసి జాయింట్‌గానూ ప్రారంభించొచ్చు. కనీస పెట్టుబడి రూ.1,500. గరిష్ట పరిమితి రూ.4.5 లక్షలు. జాయింట్ ఖాతా అయితే గరిష్ట పరిమితి రూ.9 లక్షలు. దాదాపు అన్ని బ్యాంకుల ఎఫ్‌డీల కంటే (నెలవారీ వడ్డీ చెల్లించేవి) అధిక రాబడి ఇందులో అందుకోవచ్చు. డిఫాల్ట్ రిస్క్ ఉండదు. ఇక ఈ పథకంలో పెట్టుబడులకు సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనాల్లేవు. పైగా పోస్టాఫీసుల నెలసరి ఆదాయ పథకంపై వచ్చే వడ్డీ ఆదాయం, బ్యాంకు ఎఫ్డీలపై ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాస్త ఆకర్షణీయ అంశాలు ఏమిటంటే... వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అమలు చేయరు. ఏడాది తర్వాత ముందస్తుగా క్లోజ్ చేయవచ్చు. కాకపోతే కాస్త పెనాల్టీ భరించాలి. ఇక పదేళ్ల కాల వ్యవధి కలిగిన ప్రధానమంత్రి వయవందన యోజనలో సీనియర్ సిటిజన్లకు పెట్టుబడిపై 8.3 శాతం రాబడి మాత్రమే అందుతుంది. ఒకరు ఒకటికి మించిన ఖాతాలను ప్రారంభించొచ్చు. కానీ అన్నింటిలోనూ పెట్టుబడి మొత్తం రూ.15 లక్షలు మించకూడదు. వడ్డీ రేట్లు భవిష్యత్తులో పెరుగుతాయని భావిస్తే ఏక మొత్తంలో కాకుండా వివిధ కాల వ్యవధులతో క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఖాతాను ముందే క్లోజ్ చేయటానికి అనుమతిస్తారు. కాకపోతే పెట్టుబడిపై 1– 1.5 శాతం వరకు మినహాయిస్తారు. వడ్డీ ఆదాయం ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 దాటితే టీడీఎస్ మినహాయిస్తారు. పోస్టాఫీసు లేదా ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఈ ఖాతాను ప్రారంభించుకోవచ్చు. -
సిండికేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెంపు
న్యూఢిల్లీ: మూడు నెలల కాలపరిమితికి సంబంధించి ఎంసీఎల్ఆర్ (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు)ను సిండికేట్ బ్యాంక్ స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. దీనితో మూడు నెలల కాలపరిమితి రుణాలపై వడ్డీరేట్లు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కాగా ఓవర్‌నైట్ (8.30), నెల (8.35), ఆరు నెలలు (8.60), ఏడాది (8.80) రేట్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి. ఓబీసీ కూడా... పలు కాలపరిమితులకు సంబంధించి ఓబీసీ కూడా ఎంసీఎల్ఆర్ను 0.10 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. గురువారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రిటైల్ రుణాలకు బెంచ్‌మార్క్‌గా పేర్కొనే ఏడాది కాలపరిమితి రుణరేటు 8.65 శాతం నుంచి 8.75 శాతానికి పెరిగింది. అలాగే ఆరు నెలలు (8.70 శాతం), మూడు నెలలు (8.50 శాతం), నెల (8.45 శాతం) రుణ రేట్లు కూడా 0.10 శాతం పెరిగాయి. ఓవర్‌నైట్‌కు సంబంధించి రుణ రేటు 8.30 శాతానికి పెరిగింది. -
వడ్డీ.. రిస్కు రెండూ ఎక్కువే!
ఈ మధ్య ఆర్బీఐ వరుసగా రెండు సార్లు రెపో రేటు పెంచింది. దీంతో చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాయి. కాకపోతే సురక్షితంగా... నిర్ణీత మొత్తం వడ్డీగా కావాలనుకునేవారికి ఇలా బ్యాంకులు డిపాజిట్ రేట్లు పెంచటం అనుకోకుండా కలిసొచ్చిందని అనుకోవాలి. కాకపోతే ఇంకాస్త ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అవుతుందనుకునేవారు వివిధ కంపెనీలు ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల (సీఎఫ్‌డీ) వైపు చూస్తుంటారు. కాకపోతే ఇక్కడో చిక్కుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులయితే వాటికి పరోక్షంగానైనా ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఉంటుంది. ప్రయివేటు బ్యాంకులయితే వాటికి నిధుల బ్యాకప్ ఉంటుంది కనక అవి కూడా పర్వాలేదు. కానీ వడ్డీ రేటు ఎక్కువగా ఉందని మరే ఇతర అంశాలూ చూడకుండా కంపెనీలు ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం మాత్రం అంత శ్రేయస్కరం కాదన్నది నిపుణుల సూచన. ‘‘ఇలాంటి పెట్టుబడులు పెట్టినవారు తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అరుదైన సందర్భాల్లో పెట్టుబడులను కూడా నష్టపోవాల్సి రావచ్చు.ఎందుకంటే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్నంత భద్రత కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండదు. వీటిలో రిస్క్ ఎక్కువ. వీటిని అన్సెక్యూర్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌గానే చూడాలి’’ అనేది నిపుణుల మాట.!! దానికి కారణాలేమిటో చూద్దాం... –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం తయారీ రంగ కంపెనీలు, ఎన్బీఎఫ్సీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణకు, నిర్వహణకు నిధులు కావాల్సి వచ్చినపుడు వాటిని వివిధ మార్గాల ద్వారా సమీకరిస్తూ ఉంటాయి. కంపెనీలో వాటాను ఇతరులకు విక్రయించటం... రుణాలు తీసుకురావటం వంటి మార్గాలతో పాటు... నిర్ణీత మొత్తాన్ని వడ్డీగా ఇస్తామంటూ జనం నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లను ఆహ్వానించటం కూడా ఈ మార్గాల్లో ఒకటి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు వివిధ కాల వ్యవధులతో ఉంటాయి. అంటే.. మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్లు మాదిరి అన్నమాట. బ్యాంకు ఎఫ్‌డీల్లో వడ్డీ 6.7 శాతం నుంచి 7.25 శాతం మధ్య ఉంటే, ఈ కంపెనీలు ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8 శాతానికి పైగానే ఉంటుంది. కొన్నయితే 9– 9.5 శాతం కూడా ఆఫర్ చేస్తూ ఉంటాయి. కంపెనీలు, కాల వ్యవధులను బట్టి కనీస డిపాజిట్ మొత్తం, వడ్డీ రేట్లు మారుతుంటాయి. కొన్ని డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు ఆఫర్ చేయవచ్చు. కొన్ని కంపెనీలు ఆన్లైన్లోనే డిపాజిట్ చేసేందుకు అనుమతిస్తుంటే, మరికొన్ని ఆఫ్‌లైన్‌లో మాత్రమే పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, ఆన్లైన్ డిపాజి ట్లపై కాస్తంత అధిక వడ్డీ రేటు ఉండొచ్చు. ఎందుకం టే వాటికి బ్రోకర్ల ద్వారా సమీకరించటానికి అయ్యే చార్జీల బెడద తప్పుతుంది కనక. కొన్ని కంపెనీలు డిపాజిట్ల రెన్యువల్‌పై అధిక వడ్డీ రేటును ఇవ్వజూపు తున్నాయి. క్యుమిలేటివ్ డిపాజిట్ ఎంచుకుంటే వడ్డీని కాల వ్యవధి ముగిసిన తర్వాత అసలుతో కలిపి చెల్లిస్తాయి. నాన్ క్యుమిలేటివ్ డిపాజిట్లు ఎంచుకుంటే వడ్డీని నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, సంవత్సరానికోసారి చెల్లించడం జరుగుతుంది. కంపెనీలు ఆఫర్ చేసే ఎఫ్డీలన్నింటికీ రేటింగ్‌లు ఒకేలా ఉండవు. ఏ, ఏఏ, ఏఏఏ ఇలా ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులను బట్టి వాటి డిపాజిట్లకు రేటింగ్‌లు ఇస్తుంటాయి. ఆయా డిపాజిట్లలో పెట్టుబడులకు భద్రత ఏ మేరకు ఉంటుందన్నది ఈ రేటింగ్ తెలియజేస్తుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక డిపాజిట్‌కు ఇచ్చిన రేటింగ్ కాల వ్యవధి ముగిసే వరకూ స్థిరంగా ఉండదు. డిపాజిట్లు జారీ చేసిన కంపెనీ ఆర్థిక పరిస్థితులు, చెల్లింపు సామర్థ్యాలను రేటింగ్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాయి. అవసరమైతే రేటింగ్లను తగ్గించేస్తుంటాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ రేటింగ్‌ను తప్పకుండా గమనించాలి. ఉన్నట్లుండి ఆ కంపెనీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే... మన డిపాజిట్ల భద్రత మరింత తగ్గిందని భావించాలి. వడ్డీతో పాటే.. రిస్క్ కూడా! కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లలో రిస్క్ చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో పెట్టుబడి కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కొంతలో కొంత మెరుగేమి టంటే అధిక రేటింగ్ ఉన్న కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయ టం.వీటిక్కూడా రిస్క్ ఉంటుంది. అధిక రేటింగ్ అన్నది భద్రతను సూచించేదే కానీ... హామీ కాదు. అధిక రేటింగ్ కలిగిన కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లు డిఫాల్ట్ అవడం, పెట్టుబడి కూడా చెల్లించలేకపోయిన సందర్భాలు గతంలో ఉన్నాయి కూడా. ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించాలంటే తయారీ రంగంలోని కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు కచ్చితంగా రేటింగ్ పొందడం తప్పనిసరి. రూ.100 కోట్లకుపైగా నికర విలువ కలిగిన కంపెనీలు, టర్నోవర్ రూ.500 కోట్లకు పైగా ఉన్నవి ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించేందుకు కంపెనీల చట్టం అనుమతిస్తోంది. నిజానికి రేటింగ్ తక్కువ ఉండి, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న కంపెనీలు మరింత ఎక్కువ వడ్డీని ఆఫర్ చేయటానికి ముందుకొస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినవారు... రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేస్తే ఆయా సాధనాల్లో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఎన్ఏవీలు క్షీణిస్తాయి. సదరు ఫండ్ ఈ సాధనాల్లో ఎంత పెట్టుబడి పెట్టిందనేదానిపై ఈ క్షీణత ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పెట్టుబడి ఉంటే ఎక్కువ నష్టం తప్పదు. ఆగస్ట్ చివరి గణాంకాల ప్రకారం 40 డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు బాండ్లలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. వీటి పెట్టుబడులు 0.2–10 శాతం మధ్య ఉన్నాయి. ఈ గ్రూపు బాండ్ల రేటింగ్‌ను తగ్గించడంతో డెట్ ఫండ్స్ ఎన్ఏవీల విలువలు 0.05 నుంచి 2 శాతం వరకు ప్రభావితం అవుతాయని అంచనా. సీఎఫ్డీల్లో పెట్టుబడులకు పరిశీలించాల్సిన అంశాలివీ... ► సీఎఫ్డీల్లో రిస్క్ ఉన్నప్పటికీ ఎక్కువ రాబడుల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. బ్యాంకుల్లో రూ.లక్ష వరకు డిపాజిట్‌పై బీమా ఉంటుంది. సీఎఫ్డీల్లో ఇది రూ.20,000కే పరిమితం. కనుక ఒక కంపెనీలో రూ.20,000కు డిపాజిట్ పరిమితం చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ►అధిక రాబడులే కాదు! అదే సమయంలో అధిక రిస్క్ కూడా ఉంటుందని తెలుసుకోవాలి. ఏడాది కాల పరిమితి డిపాజిట్ల విషయంలో బ్యాంకులు, కంపెనీల డిపాజిట్ల మధ్య వడ్డీ రేటు వ్యత్యాసం తక్కువే. కనుక తక్కువ కాల వ్యవధి కోసం రిస్క్ చేయడం మంచిది కాదు. ►కార్పొరేట్ గవర్నెన్స్‌లో మంచి ప్రమాణాల కంపెనీల ఎఫ్డీలను పరిశీలించొచ్చు. ►దీర్ఘకాలం పాటు సీఎఫ్డీల్లో లాకిన్ అయిపోకుండా ఉండేందుకు, వివిధ కాల పరిమితుల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం తెలివైన పని. పైగా వడ్డీ రేట్లలో మార్పులు జరుగుతున్నందున ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాల పరిమితుల డిపాజిట్లను ఎంచుకోవచ్చు. ► సీఎఫ్డీలో వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఏడాదిలో ఈ ఆదాయం రూ.5,000 దాటితే కంపెనీయే టీడీఎస్ మినహాయించి మిగిలిన మేర చెల్లిస్తుంది. ఈ వడ్డీ ఆదాయం సంబంధిత డిపాజిట్ దారుని వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. క్రెడిట్ రేటింగ్ అంటే..? ఓ కంపెనీ వ్యాపారాన్ని పూర్తిగా అధ్యయనం చేసి, వ్యాపార పరమైన రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో యాజమాన్యం క్వాలిటీ, సామర్థ్యాన్ని రేటింగ్ ఏజెన్సీలు మదింపు వేసి దాన్ని తెలియజేస్తూ ఇచ్చేదే క్రెడిట్ రేటింగ్. దేశంలో కేర్, క్రిసిల్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఏజెన్సీలు ఈ సేవలు అందిస్తున్నాయి. రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం అంటే... డిపాజిట్లు, ఎన్సీడీల రూపంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం సంబంధిత కంపెనీకి తగ్గినట్టు లెక్క. దీనివల్ల రుణదాతలు కొత్త రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు. అలాగే, ప్రస్తుత రుణాల రీఫైనాన్స్‌కు కూడా ఒప్పుకోకపోవచ్చు. అలాగని, ఏ రేటింగ్ కూడా స్థిరంగా ఉంటుందని చెప్పలేం. నెగెటివ్ నుంచి పాజిటివ్‌కు, పాజిటివ్ నుంచి నెగెటివ్‌కు కూడా మారిపోవచ్చు. సాధారణంగా ఏఏఏ లేదా ఏఏ రేటింగ్ అనేవి అధిక రేటింగ్ సూచికలు. ఈ రేటింగ్ ఉన్న వాటికే పరిమితం కావడం కాస్తంత భద్రతనిస్తుంది. ఇంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కచ్చితంగా ఎక్కువ రిస్క్ తీసుకున్నట్టే. మీరు పెట్టుబడి పెట్టిన డిపాజిట్ రేటింగ్ తగ్గించడం జరిగితే, పెనాల్టీ చెల్లించయినా ముందే వైదొలగడం సురక్షితమన్నది నిపుణుల సూచన. క్రెడిట్ రేటింగ్ తగ్గితే...? క్రెడిట్ రేటింగ్ అన్నది ఓ ఆర్థిక సాధనానికి ఉన్న క్రెడిట్ రిస్క్‌ను తెలియజేస్తుంది. కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ రేటింగ్ అత్యంత ప్రధానమైన కొలబద్దగా భావించాలి. ఈ వారంలోనే ఇక్రా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీ), దీర్ఘకాలిక రుణాల రేటింగ్లను తగ్గించాయి. చాలా వరకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎన్సీడీలు, డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్ల రాబడులను ఈ పరిణామం దెబ్బతీస్తుంది కూడా. అయితే, ఓ కంపెనీ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఆమ్టెక్ ఆటో రేటింగ్‌ను కూడా ఇదే విధంగా రేటింగ్ ఏజెన్సీలు తగ్గించాయి. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన జేపీ మోర్గాన్ మ్యూచువల్ ఫండ్ చేదు ఫలితాలను చవిచూసింది. 2017లో ఐడీబీఐ బ్యాంకు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రేటింగ్లను కూడా ఏజెన్సీలు తగ్గించాయి. దీంతో ఈ కంపెనీ షేర్ల ధరలు పతనమయ్యాయి. రేటింగ్ ఏం చెబుతోంది..? దీర్ఘకాలిక డెట్ సాధనాలకు.... ఏఏఏ: చెల్లింపు బాధ్యతలను సకాలంలో నిర్వహిం చడంలో అత్యధిక భద్రతను ఈ రేటింగ్ తెలియ జేస్తుంది. అతి తక్కువ క్రెడిట్ రిస్క్ గ్రేడ్ ఇది. ఏఏ: ఈ రేటింగ్ కలిగిన సాధనాలు కూడా అధిక భధ్రతకు చిహ్నమే. ఇది కూడా తక్కువ రిస్క్‌ను సూచిస్తుంది. ఏ: సకాలంలో చెల్లింపులు చేసే విషయంలో తగినంత భద్రత ఉందని ఈ రేటింగ్ తెలియజేస్తుంది. మిగిలిన రెండు సాధనాల కంటే ఇందులో భద్రత కొంచెం తక్కువ. బీబీబీ: తీసుకున్న డిపాజిట్లు, రుణాలు తిరిగి చెల్లింపుల విషయంలో మోస్తరు భద్రతే ఉన్నట్టు ఈ రేటింగ్ అర్థం. మోస్తరు రిస్క్ ఉంటుంది. బీబీ: తీసుకున్న వాటిని తిరిగి చెల్లించే విషయంలో మోస్తరు డిఫాల్ట్ రిస్క్ ఉంటుందని ఈ రేటింగ్ తెలియజేస్తుంది. బీ: ఇది అధిక రిస్క్‌కు సూచిక. డిఫాల్ట్ రిస్క్ అధికంగా ఉంటుంది. సీ: ఈ రేటింగ్ ఉన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే డిఫాల్ట్‌కు అత్యధిక రిస్క్ ఉంటుంది. డీ: డిఫాల్ట్ అయ్యేందుకు, త్వరలోనే డిఫాల్ట్ అవనున్నట్టు ఈ రేటింగ్ తెలియజేస్తుంది. షార్ట్ టర్మ్ డెట్ సాధనాలకు రేటింగ్ ఏ1: క్రెడిట్ రిస్క్ చాలా తక్కువగా ఉందని తెలియజేస్తుంది. అంటే పెట్టుబడులకు, అధిక భద్రతకు చిహ్నం. సకాలంలో చెల్లింపులు చేసేందుకు అధిక సామర్థ్యం ఉందని తెలియజేసేది. ఏ2: తక్కువ క్రెడిట్ రిస్క్‌కు సూచిక. ఇందులో పెట్టుబడులకూ అధిక భద్రత ఉంటుందని భావించొచ్చు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ3: మోస్తరు స్థాయి భద్రతే ఉంటుంది. మిగిలిన రెండింటితో పోలిస్తే ఈ రేటింగ్ ఉన్న సాధనాల్లో పెట్టుబడులకు రిస్క్ కాస్త ఎక్కువ ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. ఏ4: భద్రత నామమాత్రంగా ఉంటుందన్న దానికి ఈ రేటింగ్ నిదర్శనం. సకాలంలో చేసే చెల్లింపులకు గ్యారంటీ ఉండదు. అధిక రిస్క్ ఉన్న గ్రేడ్‌గానే దీన్ని చూడాల్సి ఉంటుంది. డీ: ఈ రేటింగ్ కలిగిన సాధనంలో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే డిఫాల్ట్ లేదా డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే ఈ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. -
ఆర్బీఐ పాలసీ : వడ్డీరేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద గృహ రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్లను పెంచింది. నేటి నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘10 బేసిస్ పాయింట్ల మేర రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచుతున్నాం. నేటి నుంచే ఈ పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి’ అని హెచ్డీఎఫ్సీ స్టాక్ ఎక్స్చేంజ్కు తెలిపింది. దీంతో ఈఎంఐ మరింత భారంగా మారనుంది. ఆగస్టులో కూడా 20 బేసిస్ పాయింట్ల గృహ రుణాల వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను పెంచడంతో, హెచ్డీఎఫ్సీ కూడా వడ్డీరేట్లను పెంచింది. తాజాగా మరోసారి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైపాక్షిక మానిటరీ పాలసీ సమీక్ష మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, హెచ్డీఎఫ్సీ ఈ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది. ఈ సారి పాలసీలో కూడా రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్‌ధరలు పెరగడంతో, రూపాయి విలువ క్షీణించడంతో, ద్రవ్యోల్బణం మరింత పెరిగే భయాందోళనలు ఉండటంతో, కీలక రెపోను మరోసారి పెంపుకే ఆర్బీఐ మొగ్గుచూపుతుందని మెజార్టీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ఆర్బీఐ పాలసీ సమీక్ష అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ సమీక్ష జరగనుంది. గత నెలలో దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ కూడా మూడేళ్ల వరకు ఉన్న అన్ని కాల వ్యవధిలపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో ఏడాది కాలపరిమితి ఉన్న ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.45 శాతానికి పెరిగింది. -
చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మంచి రోజులు!
న్యూఢిల్లీ: చాలాకాలం తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. ఎన్ఎస్సీ, పీపీఎఫ్ తదితర పథకాల్లో డిపాజిట్లపై 0.30–0.40 శాతం వరకు పెంచింది. ఈ మేరకు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి అమల్లో ఉండే వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. ఇంత కాలం వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన కేంద్రం... ఆర్బీఐ కీలక రేట్లను పెంపు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకులు సైతం పలు డిపాజిట్లు, రుణాలపై రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటించాయి. చిన్న మొత్తాల పొదుపు, వృద్ధులు, ఆడపిల్లల సంక్షేమానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు రేట్లను సవరించింది. వాస్తవానికి 2012 ఏప్రిల్ 1 నుంచి వడ్డీ రేట్లు తగ్గుతూ వచ్చిన విషయం గమనార్హం. నూతన రేట్లు నూతన వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయి. ఈ సవరణ తర్వాత సుకన్య సమృద్ధి యోజన పథకంలో వడ్డీ రేటు 8.1 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ రేటు 8.3 శాతం నుంచి 8.7 శాతానికి చేరింది. పీపీఎఫ్, ఎన్ఎస్సీ పథకాల్లో 7.6 శాతం నుంచి 8 శాతానికి, కిసాన్ వికాస్ పత్ర రేటు 7.3 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగాయి. దీంతో కిసాన్ వికాస్పత్ర పథకంలో ఇప్పటి వరకు డిపాజిట్ 118 నెలల్లో రెట్టింపు అవుతుండగా, 112 నెలలకు తగ్గింది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై రేటు 7.8 శాతానికి, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ రేటు 7.3 శాతానికి చేరాయి. పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేటు 4 శాతంగానే కొనసాగుతుంది. అలాగే, ఏడాది నుంచి మూడేళ్ల వరకు కాల వ్యవధి టైమ్ డిపాజిట్లపై 0.30 శాతం అధికంగా వడ్డీ రేటు లభించనుంది. పొదుపును ప్రోత్సహించేందుకే: జైట్లీ చిన్న మొత్తంలో పొదుపు చేసే వారిని ప్రోత్సహించేందుకే ఈ చర్య అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. ‘‘ఇది ఆడపిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహిస్తుంది. వృద్ధుల ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది’’ అని జైట్లీ పేర్కొన్నారు. -
గుడ్‌న్యూస్ : పొదుపు ఖాతాలపై పెరిగిన వడ్డీ రేట్లు
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నతరహా పొదుపు ఖాతాల్లో మదుపు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జాతీయ పొదుపు సర్టిఫికెట్, పీపీఎఫ్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి 0.4 శాతం మేర పెంచింది. బ్యాంకుల్లో డిపాజిట్లపై పెరిగిన వడ్డీరేట్లకు అనుగుణంగా పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను సర్కార్ సవరించింది. చిన్నతరహా పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రతి త్రైమాసికంలో నోటిఫై చేస్తారు. 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సవరించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వడ్డీ రేట్ల సవరణతో అయిదేళ్ల కాలపరిమితి డిపాజిట్‌పై వడ్డీరేటును 7.8 శాతానికి, సీనియర్ సిటిజెన్ పొదుపు పథకంపై వడ్డీరేటును 8.7 శాతానికి, రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.3 శాతానికి పెరిగాయి. 4 శాతంగా ఉన్న సేవింగ్ డిపాజిట్లపై వడ్డీరేటును యథాతథంగా ఉంచారు. ఇక ప్రస్తుతం పీపీఎఫ్, ఎన్ఎస్సీపై 7.6 శాతం ఉన్న వడ్డీరేటు 8 శాతానికి పెరిగింది. సుకన్య సమృద్ధి ఖాతాలపై 0.4 శాతం వడ్డీరేటు అధికమై 8.5కు చేరింది. ఒకటి నుంచి మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీ రేటును 0.3 శాతం పెంచారు. -
హౌసింగ్ కంపెనీలకు చౌక ఇళ్ల బొనాంజా!
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో గృహాలు (అఫర్డబుల్ హౌసింగ్) రాజకీయ నేతలకు ఓట్లు కురిపించినట్టే... ఇళ్ల కొనుగోలుకు రుణాలిచ్చే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకూ భారీ వ్యాపార అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆర్థిక ఫలితాలపై కనిపిస్తోంది. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న హెచ్డీఎఫ్సీ, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) కంపెనీలు ఈ విభాగంలోనే 20 శాతం వృద్ధిని ఈ ఏడాది నమోదు చేయడం గమనార్హం. ఈ విభాగాలపై కంపెనీల దృష్టి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), తక్కువ ఆదాయ వర్గాలు (ఎల్ఐజీ), మధ్య ఆదాయ వర్గాలు (ఎంఐజీ–1), మధ్య ఆదాయంలోనే రెండో గ్రూపు (ఎంఐజీ–2) ఉన్నాయి. వీటిలో చివరి రెండు గ్రూపుల నుంచి హౌసింగ్ రుణాల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఎంఐజీ–1 విభాగంలో వార్షికంగా రూ.6–12 లక్షల ఆదాయం కలిగిన వారికి వడ్డీ రేటులో 4 శాతం సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. రుణం ఎంతన్న దానితో సంబంధం లేకుండా... రుణంలో రూ.9 లక్షలపై వడ్డీకి మాత్రమే దీన్ని ఆఫర్ చేస్తోంది. ఇక రూ.12–18 లక్షల ఆదాయం కలిగిన లబ్ధిదారులకు రూ.12 లక్షల రుణంపై వడ్డీకి 3 శాతం రాయితీ అమల్లో ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ వర్గాలకూ గృహ రుణాల్లో వడ్డీ రాయితీని కేంద్రం అందిస్తోంది. ఈడబ్ల్యూఎస్ గ్రూపులో రూ.3 లక్షల వరకూ ఆదాయం కలిగిన వారు, ఎల్‌ఐజీలో రూ.3–6 లక్షల ఆదాయం కలిగిన వారు వడ్డీలో 6.5 సబ్సిడీకి అర్హులు. పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రూ.20–40 లక్షల గృహ రుణాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. మధ్యస్థ ధరల ఇళ్లకు డిమాండ్ రూ.6–12 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారు తొలిసారి ఇల్లు కొనుగోలుకు రుణం తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరు తీసుకునే రుణం కూడా తమ వార్షికాదాయానికి మూడు రెట్ల మేర అంటే రూ.18–35 లక్షల మధ్య ఉంటోంది. రూ.25–40 లక్షల విలువ కలిగిన ఇళ్ల కొనుగోలుకు వీరు రుణాల బాట పడుతున్నారు. కొన్ని పట్టణాల్లో, పెద్ద పట్టణాలకు శివార్లలో మధ్య తరహా ఇళ్లకు డిమాండ్ ఉంటోందని ఆంటిక్యూ బ్రోకింగ్ అనలిస్ట్ దిగంత్ హారియా చెప్పారు. ‘‘రూ.10–20 లక్షల మధ్య ఇళ్లకు ఇంకా డిమాండ్ పుంజుకోలేదు. రెరా, నోట్ల రద్దు, సరఫరా తక్కువగా ఉండటం వల్ల ఈ విభాగం బంగారం వంటిది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ 37 శాతం రుణాలను ఈడబ్ల్యూఎస్ విభాగంలో, 19 శాతం రుణాలను ఎల్ఐజీ విభాగంలోనే ఆమోదించడం గమనార్హం. నెలవారీగా హెచ్డీఎఫ్సీ ఈ రెండు విభాగాలకు సంబంధించి 8.300 రుణ దరఖాస్తులను ఆమోదిస్తోంది. నెలవారీగా ఆమోదించే సగటు రుణాల విలువ రూ.1,346 కోట్లుగా ఉంది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే అందుబాటు గృహాలపై దృష్టి సారించడం ద్వారా 28 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఈ సంస్థ కస్టమర్లలో 65 శాతం మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే. తమ కస్టమర్లలో 35 శాతం మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద వడ్డీ రాయితీకి అర్హులేనని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వీసీ గగన్‌బంగా తెలిపారు. -
ఐసీఐసీఐ బ్యాంక్ : ఫిక్స్డ్ డిపాజిట్లపై గుడ్‌న్యూస్
ముంబై : ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ కూడా గుడ్‌న్యూస్ చెప్పింది. జనరల్, సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డీ) వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. నేటి నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. 7 రోజుల నుంచి 365 రోజుల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను వార్షికంగా 4 శాతం నుంచి 6.50 శాతం వరకు ఆఫర్ చేస్తుంది. సీనియర్ సిటిజన్లకు స్వల్పకాలిక ఎఫ్డీ రేట్లను 4.50 శాతం నుంచి 7.00 శాతం శ్రేణిలో నిర్ణయించింది. 2 ఏళ్ల ఒక్క రోజు నుంచి 5 ఏళ్ల వరకు ఉన్న టర్మ్ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్ బెస్ట్ ఎఫ్డీ రేటును ఆఫర్చేస్తోంది. అది 7.75 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్ల ఎఫ్డీలకు స్పెషల్ వడ్డీరేటును బ్యాంక్ ఆఫర్ చేస్తుంది. 5 ఏళ్ల ఒక్క రోజు నుంచి 10 ఏళ్ల వరకున్న దీర్ఘకాలిక డిపాజిట్లపై వచ్చే ఎఫ్డీ వడ్డీరేట్లు మంచి రిటర్నులను అందిస్తున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. 10 ఏళ్ల కాలవ్యవధిల ఉన్న ఎఫ్డీ డిపాజిట్ల రేట్లను 7.00 శాతంగా నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు దీర్ఘకాలిక ఎఫ్డీపై 7.50 శాతం వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది. 5 ఏళ్ల టాక్స్ సేవర్ ఎఫ్డీ(రూ.1.50 లక్షల వరకు) వడ్డీ రేట్లుగా జనరల్ కేటగిరీకి 7.25 శాతంగా, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతంగా నిర్ణయించినట్టు బ్యాంక్ పేర్కొంది. -
ఎఫ్డీలపై వడ్డీ రేటు పెంచిన హెచ్డీఎఫ్సీ
సాక్షి, ముంబై : ఆర్బీఐ కీలక రెపో రేటును పెంచిన క్రమంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సోమవారం వివిధ కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని 0.6 శాతం వరకూ పెంచింది. సవరించిన వడ్డీ రేటు తక్షణమే అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. ఎఫ్డీ రేట్లను పెంచడంతో రుణాలపై వడ్డీరేట్లకూ రెక్కలు వస్తాయని భావిస్తున్నారు. రుణాలపై వడ్డీ రేటు పెరిగితే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న కస్టమర్ల ఐఎంఐలు భారమవుతాయి. కాగా, 6 నెలల నుంచి ఐదేళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేట్లను హెచ్డీఎఫ్సీ పెంచింది. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఇప్పటికే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. -
అన్నీ 'చదివాకే' విద్యా రుణం
ఇప్పుడు విద్యా రుణం గతంతో పోలిస్తే చాలా తేలిగ్గా, చౌకగా పొందడం సాధ్యమే. ఎన్బీఎఫ్సీ సంస్థల రాకతో విద్యా రుణాల విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య పోటీ ఏర్పడింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహమూ ప్రధాన కారణమనే చెప్పాలి. అయితే, సులభంగా విద్యా రుణాలు పొందే పరిస్థితులున్నప్పటికీ, దరఖాస్తుదారులు మాత్రం ముందుగా అన్ని అంశాలూ విచారించుకున్నాకే రుణం తీసుకునే దిశగా అడుగులు వేయాలన్నది నిపుణుల సూచన. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం కోర్స్, సంస్థ కీలకం... పలు ప్రైవేటు విద్యా సంస్థల్లో బ్యాంకుల తరఫున విద్యా రుణాల మంజూరు కోసం డెస్క్‌లు ప్రారంభమవుతున్నాయి. అయితే, సులభంగా రుణం వస్తోంది కదా అని కోర్సునో, విద్యా సంస్థనో మార్చుకోవటం సరికాదన్నది నిపుణుల సూచన. విద్యా సంస్థ, కోర్సు కచ్చితంగా సరిపడేది అయి ఉండాలని, భవిష్యత్తులో ఏం చేయాలన్న అంశం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. కనుక ఏ కోర్స్ చేయాలన్నది నిర్ణయించుకున్నాకే రుణం ఎంత అవసరమన్నది తెలుసుకోవాలి. ట్యూషన్ ఫీజులకు తోడు హాస్టల్ చార్జీలు, మెస్ ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు అన్నింటినీ అంచనా వేశాకే రుణం ఎంతన్నది స్పష్టం అవుతుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చే మొత్తాన్ని ఈ వ్యయాల నుంచి మినహాయించాలి. మిగిలిన మేర విద్యా రుణానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. మీరు చదివిన చదువు.... ఆ తర్వాత విద్యా రుణాన్ని తిరిగి తీర్చివేసేందుకు అక్కరకు రావాలి. బ్యాంకులు కేవలం అభ్యర్థి విద్యా సంస్థ, కోర్సు ఆధారంగా తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేస్తాయని, రుణం తీసుకునే వారు మాత్రం తమ కోర్సుకున్న ఉద్యోగావకాశాలు చూసి... తిరిగి చెల్లించగలమా, లేదా అనేది నిర్ణయించుకోవాలని క్రెడిట్ మంత్రి సీఈవో రంజిత్ పుంజా చెప్పారు. ఇందుకోసం ఇప్పటి వరకు ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికున్న ప్లేస్మెంట్ అవకాశాలు, కంపెనీలు ఆఫర్ చేసిన వేతనం తాలూకు పూర్వ గణాంకాలు సాయపడతాయని తెలియజేశారు. గరిష్ట వేతన ఆఫర్ కాకుండా సగటు వేతన ఆఫర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే, కోర్సు అనంతరం పొందే వేతనం మొత్తంలో రుణం కోసం చేసే ఈఎంఐ చెల్లింపులు 30 శాతాన్ని మించకుండా చూసుకోవాలని కూడా పుంజా అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు ఎంత? ఇక విద్యా రుణం విషయంలో చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం వడ్డీ రేటు. ఎన్ఎస్డీఎల్ నిర్వహించే ఠీఠీఠీ.ఠిజీఛీy్చ ్చజుటజిఝజీ.ఛిౌ.జీn అనే పోర్టల్ ఇందుకు సాయపడుతుంది. అన్ని బ్యాంకుల విద్యా రుణాల వడ్డీ రేట్ల వివరాలు ఇందులో లభిస్తాయి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం, ఐఐటీల్లో చదివే వారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. కారణం వీటిల్లో చదివిన వారికి మెరుగైన వేతన ప్యాకేజీలతో ఆఫర్లు ఉండడమే. ఇండియన్ బ్యాంకు అయితే ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్సీల్లో చదివే వారికి విద్యా రుణాలను 9.95 శాతం వార్షిక వడ్డీ రేటుకే ఆఫర్ చేస్తోంది. అలాగే, ఎన్ఐటీలో చదివే విద్యార్థులకు 10.45 శాతం వడ్డీ రేటును చార్జ్ చేస్తుండగా, ఇతర సంస్థల్లో చదివే వారికి మాత్రం 11.75 శాతం రేటును అమలు చేస్తోంది. అలాగే, ప్రభుత్వ కోటా, మేనేజ్మెంట్ కోటాలో సీట్లను పొందే విద్యార్థుల విషయంలో బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి. పర్సనల్ లోన్స్ కంటే విద్యా రుణాలు చౌకే అయినా, గృహ రుణాలతో పోలిస్తే కాస్తంత ఖరీదైనవే. ఎందుకంటే గృహ రుణం సెక్యూర్డ్ లోన్ అవుతుంది. కానీ, విద్యా రుణం అన్సెక్యూర్డ్ లోన్. దీనిపై బ్యాంకులకు డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. ఇక, విద్యా రుణం మొత్తం భారీగా ఉంటే బ్యాంకులు హామీలను అడుగుతున్నాయి. దాదాపుగా ఎక్కువ కేసుల్లో ఇది గార్డియనే. సంరక్షకుల క్రెడిట్ హిస్టరీ లేదా అదనపు హామీలు ఇవ్వడం వల్ల విద్యా రుణాలపై వ్యయాలు తగ్గించుకోవచ్చు. చాలా బ్యాంకులు 10 ఏళ్ల కాలానికి విద్యా రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే, రుణం రూ.7.5 లక్షలు ఆ పైన ఉంటే కాల వ్యవధిని మరో ఐదేళ్ల పాటు అంటే మొత్తం మీద 15 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు. కాల వ్యవధి ఎక్కువ ఉంటే రుణ వాయిదా మొత్తం తగ్గుతుంది. మొత్తం మీద చెల్లించే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీర్ఘకాలం ఉంటే ఈఎంఐ వేతనంలో 30 శాతం మించకుండా చూసుకోవచ్చని పుంజా తెలిపారు. అయితే, దీర్ఘకాలానికి తీసుకున్నా, ఉద్యోగంలో చేరాక వెసులుబాటు చేసుకుని ముందస్తుగా రుణాన్ని తీర్చివేయడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. విద్యా రుణంపై ఆదాయపన్ను ప్రయోజనం కూడా ఉంది. విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపుల మొత్తాన్ని సెక్షన్ 80ఈ కింద ఎనిమిదేళ్ల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. మారటోరియం కూడా ఉంది... విద్యా రుణాల్లో మారటోరియం అనే ప్రత్యేకమైన సదుపాయం కూడా ఉంది. కోర్సు పూర్తయిన 12 నెలల వరకు లేదా ఉద్యోగంలో చేరిన ఆరు నెలల వరకు (ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది) విద్యా రుణం చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. అయితే, గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ మారటోరియం కాలంలో రుణంపై వడ్డీ పడుతూనే ఉంటుంది. అందుకని వడ్డీ భారంగా మారే వరకు వేచి ఉండకుండా కోర్సు పూర్తయిన వెంటనే రుణ ఈఎంఐ చెల్లింపులు మొదలు పెట్టడం మంచిదనేది ఆదిల్‌శెట్టి సూచన. ఇక మరో అంశం విద్యారుణం ఓ వ్యక్తి జీవితంలో తీసుకునే మొదటి రుణం అవుతుంది. కనుక సరైన చెల్లింపుల ద్వారా మంచి క్రెడిట్ స్కోరుకు బాటలు వేసుకోవడానికి ఇదో అవకాశం. -
ఆర్బీఐ, ఫెడ్ నిర్ణయాలు కీలకం..!
ముంబై: రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్ష, కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు వంటి దేశీ అంశాలకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించిన నిర్ణయం ఈ వారం స్టాక్ మార్కెట్‌కు అత్యంత కీలక కానున్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు సూచిస్తున్నారు. ఆగస్టు 1న వెలువడనున్న ఆర్బీఐ పాలసీ నిర్ణయం సమీపకాలంలో మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ద్రవ్యోల్బణం డేటా ఆధారంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఆర్బీఐ వైఖరి తటస్థం నుంచి కఠినతరమైన నిర్ణయం వైపునకు మళ్లింది. వడ్డీరేట్ల అంశం ఏవిధంగా ఉండనుందనే అంశం ఆధారం గానే సమీపకాలంలో మార్కెట్ దిశానిర్దేశం ఉంటుంది’ అని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి విశ్లేషించారు. 8 కీలక రంగాల ఉత్పత్తి, ద్రవ్య లోటు లాంటి అంశాలు సైతం ఈ వారంలో మార్కెట్‌కు అత్యంత కీలకంగా మారనున్నాయని అన్నారు. ఇదే వారంలో వెల్లడికానున్న ఆటోమొబైల్ అమ్మకాల డేటా, నికాయ్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) సమాచారంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించినట్లు తెలియజేశారు. ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. క్యూ1 ఫలితాలపై ఫోకస్..! ఈ వారంలో వెల్లడయ్యే కార్పొరేట్ ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నట్లు హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ అన్నారు. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్ర ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో ఎంపిక చేసిన షేర్ల కొనుగోలు విధానంలోనే తాము ఉన్నట్లు వెల్లడించారు. ‘తొలి త్రైమాసిక ఫలితాల ప్రభావం మార్కెట్‌పై కొనసాగుతుంది. ఆయా షేర్లు, రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది’ అని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ఐడియా సెల్యూలార్, ఐడీఎఫ్సీ, శ్రీ సిమెంట్ జులై 30న ఫలితాలు ప్రకటించనుండగా.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాబర్ ఇండియా, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, వేదాంత 31న ఫలితాలను వెల్లడించనున్నాయి. జూలైలో విదేశీ ఇన్వెస్టర్ల నికర కొనుగోళ్లు జూలై 2–27 మధ్యలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.1,848 కోట్ల షేర్లను నికరంగా కొనుగోలుచేశారు. అయితే, ఇదే సమయంలో డెట్ మార్కెట్లో రూ.482 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్–జులై కాలంలో రూ.20,000 కోట్ల విలువైన షేర్లను అమ్మివేసిన విదేశీ పెట్టుబడిదారులు.. జులైలో నికరంగా కొనుగోళ్లు జరపడాన్ని ఇప్పుడే సానుకూల అంశంగా భావించలేమని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇది ఒక స్వల్పకాలిక ఎత్తుగడగా తాము భావిస్తున్నట్లు చెప్పారు. 11,410 వద్ద కీలక నిరోధం ‘నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,410 పాయింట్ల వద్ద ఉంది. దిగువస్థాయిలో 11,071 వద్ద మద్దతు ఉంది.’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. ఈ వారం ప్రధానాంశాలు జూలై 31 మౌలిక పరిశ్రమల గణాంకాలు ఆగస్టు 1 ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఆగస్టు 1 ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ఆగస్టు 1 నికాయ్ తయారీ పీఎంఐ ఆగస్టు 3 నికాయ్ సేవల పీఎంఐ నేడే టీసీఎన్ఎస్ క్లోతింగ్ లిస్టింగ్ మహిళల దుస్తుల తయారీ సంస్థ టీసీఎన్ఎస్ క్లోతింగ్ సోమవారం (జులై 30, 2018న) లిస్టింగ్ కానుంది. రూ.1,125 కోట్ల నిధుల సమీకరణ కోసం జులై 18–20 తేదీలలో ఐపీఓకు వచ్చిన ఈ సంస్థకు ప్రైమరీ మార్కెట్లో భారీ స్పందన లభించింది. 1.57 కోట్ల షేర్లకు పబ్లిక్ ఆఫర్ ఇవ్వగా, 5 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఇష్యూ ధర రూ.714–716. -
సుకన్య సమృద్ధి పథకంలో మార్పులు
న్యూఢిల్లీ: ఆడ పిల్లల పేరిట పొదుపునకు ఉపకరించే సుకన్య సమృద్ధి యోజన పథకంలో కేంద్రం వార్షిక కనీస డిపాజిట్‌ను రూ.250కు తగ్గించింది. గతంలో ఇది రూ.1,000గా ఉండేది. ఖాతా ప్రారంభంలో కనీస డిపాజిట్‌ను రూ.250 చేయడమే కాకుండా, ఆ తర్వాత నుంచి వార్షికంగా రూ.250 కనీస డిపాజిట్‌గా నిర్ణయిస్తూ కేంద్రం పథకంలో మార్పులు చేసింది. 2017 నవంబర్ నాటికి 1.26 కోట్ల ఖాతాలు ఈ పథకం కింద ప్రారంభమయ్యాయని, రూ.19,183 కోట్ల మొత్తం ఆయా ఖాతాల్లో డిపాజిట్ చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2018 బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన విషయం గమనార్హం. జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి ఈ పథకం డిపాజిట్లపై వడ్డీ రేటు 8.1%గా ఉంది. పదేళ్ల లోపు ఆడపిల్లల పేరిట తల్లిదండ్రులు, గార్డియన్ ఈ ఖాతాను పోస్టాఫీసు లేదా ఎంపికచేసిన బ్యాంకుల్లోనూ తెరవవచ్చు. చిన్న మొత్తాల పొదుపు, పీపీఎఫ్ స్కీముల్లానే ఈ డిపాజిట్‌పై వడ్డీ రేటును ప్రతీ త్రైమాసికానికి ఒకమారు సవరిస్తారు. ప్రస్తుతం ఈ డిపాజిట్‌పై వడ్డీ రేటు 8.1% ఉంది. ఈ ఖాతాలో చేసే డిపాజిట్‌కు, డిపాజిట్ కాలం పూర్తయిన తర్వాత పొందే మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం 80సీసీ కింద పూర్తి మినహాయింపు లభిస్తుంది. -
ఐడీబీఐ బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు
ముంబై: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను 5–10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. జూలై 12 నుంచి కొత్త రేట్లు అమలవుతాయని బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం.. ఏడాది వ్యవధి రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) పది బేసిస్ పాయింట్లు పెరిగి 8.65% నుంచి 8.75 శాతానికి చేరింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ అయిదు బేసిస్ పాయింట్లు పెరిగి 8.45% నుంచి 8.50 శాతంగా ఉంటుంది. మూడు నెలలు, మూడేళ్ల వ్యవధి రుణాలపై వడ్డీ రేట్లు యథాతథంగా 8.35 శాతం, 8.80 శాతంగానే ఉంటాయని బ్యాంకు తెలిపింది. బేస్ రేటును 9.5 శాతం -
రిస్క్ ఉన్నా పర్వాలేదనుకుంటే..
పెరుగుతున్న వడ్డీ రేట్లతో అయోమయంలో ఉన్నట్లయితే... షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు. కానీ, రిస్క్ ఉన్నా పర్వాలేదనుకునే వారు కొంత మొత్తాన్ని క్రెడిట్ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదే. ఆ కోవలోనిదే ఎస్బీఐ క్రెడిట్ రిస్క్ ఫండ్. తక్కువ రేటింగ్ కలిగిన కార్పొరేట్ బాండ్స్‌లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంటుంది. బాండ్ల ధరల్ని మించి రాబడులను రాబట్టుకునే విధంగా దీని పనితీరు ఉంటుంది. నిన్నటి వరకు ఈ పథకం ఎస్బీఐ కార్పొరేట్ బాండ్ ఫండ్ పేరుతో నడిచింది. ఈ పథకం 55– 65 శాతం వరకు నిధుల్ని ఏఏ– అంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. సాధారణంగా ఇవి ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి. సెబీ మార్పుల తర్వాత కూడా పథకం పెట్టుబడుల విధానం మారలేదు. సెబీ ఆదేశాల ప్రకారం క్రెడిట్ రిస్క్ ఫండ్స్ తమ నిధుల్లో కనీసం 65 శాతాన్ని తక్కువ రేటింగ్ ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఎస్బీఐ క్రెడిట్ రిస్క్ ఇప్పటికే అమలు చేస్తోంది. కనుక సెబీ మార్పుల ప్రభావం ఈ పథకం పనితీరుపై ఉండదనే చెప్పుకోవాలి. 8 శాతంపైనే రాబడులు... ఈ పథకం రాబడులు అన్ని కాల వ్యవధుల్లోనూ ఆశాజనకంగానే ఉన్నాయి. మూడు, ఐదేళ్ల కాలంలో 8 శాతంపైనే రాబడులనిచ్చింది. ఏడాది కాలంలో 5.2 శాతం, మూడేళ్ల కాలంలో 8.1 శాతం, ఐదేళ్ల కాలంలో 9.1 శాతం చొప్పున వార్షిక రాబడులున్నాయి. ఇదే విభాగంలోని కొన్ని పథకాలతో పోలిస్తే రాబడులు తక్కువే. అయితే, ఇతర పథకాలు తక్కువ రేటింగ్ ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్ చేసే విధానం వేరుగా ఉండొచ్చు. కనక వాటితో పోల్చలేం. ఉదాహరణకు ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్ రాబడులు ఈ పథకంతో పోలిస్తే 1– 2 శాతం అధికంగా ఉన్నాయి. కానీ, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్ తక్కువ రేటింగ్ ఉన్న బాండ్లలో అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఉంది. కనుక రిస్క్ ఎక్కువుంటుంది. 90 శాతం నిధుల్ని ఏఏ– అంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయడం గమనించొచ్చు. మోస్తరు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండి, తగినన్ని రాబడులు ఆశించే వారికి ఎస్బీఐ క్రెడిట్ రిస్క్ అనుకూలమని చెప్పొచ్చు. స్ట్రాటజీ ఎలా ఉండాలంటే... కొన్ని డెట్ ఫండ్స్ భిన్న రేటింగ్లున్న బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అధిక వడ్డీ కోసం రిస్క్ తీసుకుంటాయి. ఒక్కటి బెడిసి కొట్టినా రాబడులు తల్లకిందులవుతాయి. అందుకే రిస్క్ అధికంగా ఉండేవే (తక్కువ రేటింగ్) అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తాయని గమనించాలి. కనుక రాబడుల కోసం వీటిని ఆశ్రయించే వారు, తమ రిస్క్ సామర్థ్యానికి పోలిన ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఈ ఫండ్స్‌ను ఆశ్రయించే ముందు, వాటి పెట్టుబడుల విధానం, ట్రాక్ రికార్డును కూడా పరిశీలించాలి. మరీ ఎక్కువ రిస్క్ తీసుకునే వారు వీటికి బదులు ఈక్విటీ, డెట్ ఫండ్స్‌తో కూడిన పథకాలను పరిశీలించొచ్చు. కాకపోతే ఈక్విటీ పథకాల్లో ఏవైనా కనీసం ఐదేళ్ల పాటు కొనసాగితే కానీ ఆశించిన మేర రాబడులు అందుకోలేం.