IPL Auction
-
13 ఏళ్లకే కోటి రూపాయలు.. క్రికెట్లో కొత్త ‘వైభవం’
12 సంవత్సరాల 9 నెలల 9 రోజులు.. సాధారణంగా ఈ వయసులో చిన్నారులంతా ఏం చేస్తుంటారు? బడిలో పాఠాలు నేర్చుకుంటూంటారు. కానీ ఆ అబ్బాయి దేశంలో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగాడు. 13 సంవత్సరాల 7 నెలల 29 రోజులు.. ఈ వయసులో చిన్నారులు సంపాదిస్తారా? తాము కోరుకున్నది పేరెంట్స్ కొనిస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఆ బాలుడు తన ఆటతో కోటి రూపాయలు సంపాదించి, ఔరా అనిపించాడు. భారత క్రికెట్లో సంచలనంలా మారిన ఆ అబ్బాయే వైభవ్ సూర్యవంశీ. అతి పిన్న వయసులో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాడిగా కొత్త ఘనతను నమోదు చేశాడు.చిన్నప్పటి నుంచి అపార ప్రతిభను ప్రదర్శించిన వైభవ్ ఎప్పటికప్పుడు తనకంటే పెద్ద వయసు ఉన్న ఆటగాళ్ల టోర్నీలలోనే పాల్గొంటూ వచ్చాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఇతర ఆటగాళ్లు అతని కంటే కనీసం 5–6 ఏళ్లు పెద్దవాళ్లు. అలాంటి చోట బరిలోకి దిగడమే కాదు.. తన పదునైన బ్యాటింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. స్థానికంగా జరిగిన ఒక అండర్–19 స్థాయి టోర్నీలో ఏకంగా 332 పరుగులతో వైభవ్ అజేయంగా నిలవడం విశేషం. ఫలితంగా బిహార్ రాష్ట్ర అండర్–19 జట్టులో చోటు దక్కింది. ఈ స్థాయిలో బీసీసీఐ నిర్వహించే రెండు ప్రధాన టోర్నీలు కూచ్‌బెహర్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలలో ప్రదర్శన వైభవ్ ఆట గాలివాటం కాదని నిరూపించింది. కూచ్‌బెహర్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 128 బంతుల్లోనే 151 పరుగులు చేయడంతో అతని ఆట అందరికీ తెలిసింది. వినూ మన్కడ్ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌లో 78.60 సగటుతో 393 పరుగులు చేయడం వైభవ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. సహజంగానే ఈ ప్రదర్శన భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. విజయవాడలో నాలుగు జట్ల మధ్య జరిగిన చాలెంజర్ టోర్నీలో భారత అండర్–19 బి జట్టు తరఫున బరిలోకి దిగిన అతను తన చూడ చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక్కడే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. వైభవ్‌లోని ప్రతిభను గుర్తించాడు. అప్పటి నుంచి జాఫర్ అతనికి మార్గనిర్దేశనం చేస్తూ వచ్చాడు. నాన్న నేర్పిన ఓనమాలతో..బిహార్‌లోని సమస్తీపుర్కి చెందిన సంజీవ్ సూర్యవంశీకి క్రికెట్ అంటే పిచ్చి. ఆటను అభిమానించడమే కాదు.. క్రికెటర్‌గా కూడా ఎదిగే సత్తా తనలో ఉందని నమ్మిన అతను భవిష్యత్తును వెతుక్కుంటూ ముంబైకి చేరాడు. అక్కడి ప్రఖ్యాత మైదానాల్లో మ్యాచ్‌లు ఆడుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాతే సంజీవ్‌కు వాస్తవం అర్థమైంది. ముంబై మహానగరంలో తనలాంటివారు, తనకంటే ప్రతిభావంతులు ఎందరో క్రికెట్లో ఎదిగేందుకు సర్వం ఒడ్డి పోరాడుతున్నారని! దాంతో తన ఆశలను కట్టిపెట్టి మళ్లీ బిహార్ చేరాడు. అయితే తాను చేయలేనిది కొడుకు ద్వారా సాధించాలనే తపనతో వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్ బ్యాట్ పట్టిన వైభవ్.. తండ్రి శిక్షణ, పర్యవేక్షణలో రాటుదేలాడు. 13 ఏళ్ల వయసుకే ప్రపంచ క్రికెట్ దృష్టిలో పడ్డాడు.రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి..ఏజ్ గ్రూప్ క్రికెట్ తర్వాత ప్రతి ఆటగాడి లక్ష్యం సీనియర్ టీమ్‌లోకి ఎంపిక కావడమే. అక్కడికి వెళ్లాక ఆట స్థాయి, ప్రత్యర్థుల స్థాయి కూడా పెరుగుతుంది. సీనియర్ టీమ్‌లోకి రావడం అంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి భీకరమైన బౌలింగ్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అతి పిన్న వయసులో రంజీ ట్రోఫీలోకి అడుగు పెడుతూ అతను తొలి మ్యాచ్‌లోనే అత్యంత పటిష్ఠమైన ముంబై టీమ్‌ను ఎదుర్కొన్నాడు. భారీ స్కోరు చేయకపోయినా అతని షాట్లు చూసినవారు ప్రశంసల వర్షం కురిపించారు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను అభిమానించే ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ ఇప్పటికి 5 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. ఆడిన ఏకైక టి20 మ్యాచ్‌లో కొట్టిన భారీ సిక్సర్లు అతని ధాటిని చూపించాయి. వేలంలో ప్రధాన ఆకర్షణగా..వైభవ్ కెరీర్లో అసలు మలుపు రెండు నెలల క్రితం చెన్నైలో ఆస్ట్రేలియా అండర్–19 టీమ్‌తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో వచ్చింది. ఈ పోరులో భారత అండర్–19కు ప్రాతినిధ్యం వహించిన అతను 62 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు బాదాడు. ఇదే ఆట అతణ్ణి ఐపీఎల్ దిశగా అడుగులు వేయించింది. నాగపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్‌లో వైభవ్ దూకుడు టీమ్ సీఈఓ జేక్ లష్ను ఆకర్షించింది. భవిష్యత్తు కోసం తీర్చిదిద్దగల తారగా ఆయన భావించాడు. అందుకే వేలంలో రూ. 30 లక్షల కనీస విలువ నుంచి ఢిల్లీతో పోటీ పడి మరీ రాజస్థాన్ రూ.1.10 కోట్లకు వైభవ్‌ను ఎంచుకుంది. ‘వైభవ్‌లో నిజంగా చాలా ప్రతిభ ఉంది. మా టీమ్‌లో అతను ఎదిగేందుకు తగిన వాతావరణం ఉంది. అందుకే అతణ్ణి తీసుకోవడం పట్ల మేం సంతృప్తిగా ఉన్నాం’ అని రాజస్థాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పడం వైభవ్ కెరీర్ సరైన రీతిలో వెళ్లనుంది అనేందుకు సంకేతం. -
ఐపీఎల్ ఆడతానంటున్న రాజేష్
-
13 ఏళ్లకే కోటీశ్వరుడు
-
ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం
కేఎల్ రాహుల్ క్లాసిక్ షాట్లను దగ్గరుండి చూడొచ్చు. మిచెల్ స్టార్క్ బులెట్ యార్కర్ల గుట్టు తెలుసుకోవచ్చు. హ్యారీ బ్రూక్ పరుగుల దాహం వెనుక రహస్యం తెలుసుకోవచ్చు. ఫాఫ్ డూప్లెసిస్ అనుభవాలను తెలుసుకుని పునాదులు పటిష్టం చేసుకోవచ్చు. జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్‌కు బంగారం లాంటి అవకాశం తలుపు తట్టింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి అడుగుపెట్టబోతున్న విజయ్‌కు అనుభవజు్ఞల ఆటతీరు మార్గదర్శకం కాబోతోంది. టీమిండియాలోకి ప్రవేశించేందుకు ఇది తొలి అడుగు కానుంది. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్నాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో రిజిస్టర్ చేసుకున్న విజయ్ను ఢిల్లీ డేర్ క్యాపిటల్స్ జట్టు అదే ధరకు కొనుగోలు చేసింది. సౌదీ అరేబియాలో ఈ ఐపీఎల్ వేలం జరిగింది. వేలంలో డీసీ జట్టు కొనుగోలు చేసిందని తెలిశాక క్రికెట్ తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా నిలకడగా రాణింపు.. విజయ్ పదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నా.. గత మూడే ళ్లుగా నిలకడ చూపిస్తున్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సెలెక్షన్స్ ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. కుచ్‌బిహార్ ట్రోఫీ, విజయ్‌హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ క్రికెట్ టోరీ్నలు, రంజీల్లో రాణించడంతో బీసీసీఐ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో ఐపీఎల్ ఎంపిక కచ్చితంగా జరుగుతుందని తల్లిదండ్రులతోపాటు జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు ఆశించారు. వారి ఆశలు నిజమయ్యాయి.శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక క్రికెటర్ ఐపీఎల్‌కు చేరువ కావడం గర్వంగా ఉందని జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షులు పెద్దలు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాదికి మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లను తయారుచేస్తామని వారు చెబుతున్నారు. జిల్లా నుంచి ఒకే ఒక్కడు..జిల్లా నుంచి ఐపీఎల్ వరకు వెళ్లిన మొదటి క్రికెటర్‌గా త్రిపురాన విజయ్ గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పాఠశాల దశలో క్రికెట్‌పైన మక్కువతో త్రిపురాన విజయ్ 2013–14లో అరంగ్రేటం చేశాడు. అంతర్ జిల్లాల నార్త్‌జోన్ అండర్–14 జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఉత్తమ ప్రదర్శనతో రాణించడంతో కడప క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటింగ్‌తోపాటు ఆఫ్‌స్పిన్ మ్యాజిక్‌తో విశేషంగా ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ట్రాక్ రికార్డ్2022–23, 2024–25 రెండు సీజన్లలో ప్రతిష్టాత్మక రంజీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రా పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు. అండర్–19 విభాగంలో ఏసీఏ నార్త్‌జోన్ పోటీల్లో 6 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీయడంతోపాటు 265 పరుగులు సాధించి ఉత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్ రాష్ట్ర అండర్–25 వన్డే క్రికెట్ టో రీ్నలో హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో 4.4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లను ఆకర్షించాడు. 2021–22లో అంతర్రాష్ట్ర అండర్–23 క్రికెట్ టోరీ్నలో మెరుగ్గా రాణించడంతో బీసీసీఐ నిర్వహిస్తున్న బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికై శిక్షణ పొందారు. ఆంధ్ర ప్రీమియం లీగ్(ఏపీఎల్) టీ–20 క్రికెట్ పోటీల్లో మూడు సీజన్లలోనూ రాణించా డు. రాయలసీమ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 63 పరుగులు సాధించి అజేయంగా నిలిచి విశేషంగా ఆకట్టుకున్నాడు. బౌలింగ్లోను సత్తాచాచడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నారు. ఏపీఎల్ టీ–20 క్రికెట్ మ్యాచ్‌ల్లో బెస్ట్ ఫీల్డర్‌గా మరో రూ.50వేల నగదు బహుమతిని ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చేతులమీదుగా అందుకున్నాడు. గత సీజన్లో నాగ్‌పూర్‌లో జరిగిన విదర్భపై తన మొదటి మ్యాచ్‌లోనే నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు.చాలా సంతోషంగా ఉంది మా కుమారుడు విజయ్ ఐపీఎల్‌కు ఎంపిక కావడం నిజంగా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులుగా మేము గర్వపడుతున్నాం. ఐపీఎల్లో మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తే తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. గత దశాబ్ద కాలంగా క్రికెట్టే శ్వాసగా ఉంటున్నాడు. భగవంతుడు శ్రమకు తగిన ఫలితాన్ని అందించాడని నమ్ముతున్నాం. –వెంకట కృష్ణంరాజు, లావణ్య త్రిపురాన విజయ్ తల్లిదండ్రులుచాలా గర్వంగా ఉంది.. చాలా గర్వంగా, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఐపీఎల్‌కు ఎంపిక కావాలన్న నా కల సాకారమైంది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ సెలక్షన్ ట్రయల్స్ పాల్గొన్నప్పుడే నమ్మకం కలిగింది. నా బేస్ ప్రైస్ రూ.30లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, ప్రతినిధులకు థాంక్స్ చెప్పుకుంటున్నాను. అవకాశం లభించిన మ్యాచుల్లో సత్తా చాటేందుకు ప్రయతి్నస్తాను. ఈ నాలుగు నెలలపాటు కఠోర సాధన చేస్తాను. నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులకు, జిల్లా క్రికెట్ సంఘం, ఆంధ్రా క్రికెట్ సంఘ పెద్దలకు కృతజ్ఞతలు. త్రిపురాన విజయ్ -
కావ్య మారన్ సెలక్షన్ అదిరిందంటున్న ఫ్యాన్స్
-
ఇటు కావ్యా మారన్, ప్రీతి జింటా.. అటు నీతా అంబానీ, జూహీ చావ్లా.. వేరే లెవల్! (ఫొటోలు)
-
AP: ఐపీఎల్ రేసులో చిన్నదోర్నాల మనీష్‌రెడ్డి
పెద్దదోర్నాల: ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ రేసులో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన గొలమారు మనీష్‌రెడ్డి ఉన్నారు. గొలమారు ఉమామహేశ్వరరెడ్డి కుటుంబం వ్యాపార రీత్యా విశాఖపట్నంలో స్థిరపడింది. ఉమామహేశ్వరరెడ్డి తండ్రి గొలమారు పెద్దతాతిరెడ్డి గతంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలోని అఖిల భారత రెడ్ల సత్రం ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు నిర్వర్తించారు. ఉమామహేశ్వరరెడ్డి పెద్ద కుమారుడు మనీష్‌రెడ్డి చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని, ఆంఽధ్ర తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వేలానికి సిద్ధమయ్యారు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ వేలం రిజిస్టర్ చేసుకున్నారు. పలు ఐపీఎల్ జట్లు కొత్త కుర్రాళ్ల వైపు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో మనీష్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. కాగా సోమవారం కూడా నిర్వహించనున్న ఐపీఎల్ వేలంలో మనీష్‌రెడ్డికి అవకాశం దక్కవచ్చని భావిస్తూ మనీష్‌రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. -
అర్ష్‌దీప్ సింగ్ ను రూ.18 కోట్లకు దక్కించుకున్న పంజాబ్
-
రిషబ్ పంత్ కి 30 కోట్లు?
-
IPL 2025 సీజన్ షెడ్యూల్ విడుదల
-
ఐపీఎల్ మెగా వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితా విడుదల
మెగా వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 15) విడుదల చేసింది. వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు లిస్ట్ అయ్యారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు.వేలంలో 318 మంది భారత అన్క్యాప్డ్ ప్లేయర్లు.. 12 మంది విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు పాల్గొననున్నారు. మొత్తం 204 స్లాట్లకు వేలం జరుగనుండగా.. 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో మొత్తం 81 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు.క్యాప్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్ల వివరాలు..భారతీయ క్యాప్డ్ ప్లేయర్లు- 48విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు- 193అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్లు- 3భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 318విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 12మొత్తం- 574వివిధ బేస్ ధర విభాగాల్లో పాల్గొననున్న ఆటగాళ్లు..రూ. 2 కోట్లు- 81 మంది ఆటగాళ్లురూ. 1.5 కోట్లు- 27రూ. 1.25 కోట్లు- 18రూ. కోటి- 23రూ. 75 లక్షలు- 92రూ. 50 లక్షలు- 8రూ. 40 లక్షలు- 5రూ. 30 లక్షలు- 320మొత్తం- 574సెట్-1..జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడ, మిచెల్ స్టార్క్, అర్షదీప్ సింగ్సెట్-2..యుజ్వేంద్ర చహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్సెట్-3..హ్యారీ బ్రూక్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్, ఎయిడెన్ మార్క్రమ్, దేవ్‌దత్ పడిక్కల్, రాహుల్ త్రిపాఠి, డేవిడ్ వార్నర్సెట్-4..అశ్విన్, వెంకటేశ్ అయ్యర్ మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్, రచిన్ రవీంద్ర, సోయినిస్సెట్-5..బెయిర్‌స్టో, డికాక్, గుర్బాజ్, ఇషాన్‌కిషన్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మసెట్-6..బౌల్ట్, హాజిల్‌వుడ్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, నటరాజన్, నోర్జే, ఖలీల్ అహ్మద్సెట్-7..నూర్ అహ్మద్, రాహుల్ చాహర్, హసరంగ, సలామ్‌ఖీల్, తీక్షణ, ఆడమ్ జంపాకాగా, జెద్దా వేదికగా ఐపీఎల్ 2025 మెగా వేలం సెప్టెంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం ప్రారంభంకానుంది. -
IPL 2025: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్‌పాట్ తగలనుందా?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా ఐపీఎల్–2025 వేలం జరగనుండగా... ఇందులో భారత్ నుంచి 23 మంది ప్లేయర్లు రూ. 2 కోట్ల కనీస ధరతో పాల్గొననున్నారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లతో పాటు... చాలా రోజుల నుంచి జాతీయ జట్టుకు దూరమైన ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వంటి వాళ్లూ ఈ జాబితాలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ కూడా తమ కనీస ధరను రెండు కోట్లుగా నమోదు చేసుకోవడం విశేషం. శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకుంటున్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, యుజువేంద్ర చహల్ కూడా ఉన్నారు. మూడేళ్ల కోసం చేపడుతున్న ఈ మెగా వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీస ధర నిర్ణయించుకునే అవకాశం ఆటగాళ్లదే కాగా... ఒక్కో జట్టు గరిష్టంగా 25 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అండర్సన్ తొలిసారి... టెస్టు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ ఈసారి ఐపీఎల్ వేలానికి దూరమయ్యాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ తొలిసారి ఐపీఎల్ వేలం కోసం తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం. 42 ఏళ్ల అండర్సన్ ఈ ఏడాదే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేసర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన అండర్సన్... టి20 మ్యాచ్ ఆడి ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది. అండర్సన్ చివరిసారిగా 2014లో ఈ ఫార్మాట్లో మ్యాచ్ ఆడాడు. అండర్సన్ తన కనీస ధరను రూ. 1 కోటీ 25 లక్షలుగా నిర్ణయించుకున్నాడు. గత వేలంలో అత్యధిక ధర (రూ. 24 కోట్ల 50 లక్షలు) పలికిన ప్లేయర్‌గా ఘనత సాధించిన ఆ్రస్టేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు, మినీ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ రూ. 2 కోట్ల ప్రాథమిక ధరలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 2023లో చివరిసారి ఐపీఎల్లో పాల్గొన్న ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఇదే ధరతో వేలంలో పాల్గొననున్నాడు. రూ. 75 లక్షలతో సర్ఫరాజ్ గత వేలంలో అమ్ముడిపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు... పేలవ ఫామ్‌తో ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా ఈసారి వేలంలో రూ. 75 లక్షల ప్రాథమిక ధరతో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వేలంలో పేర్లు నమోదు చేసుకున్న వారిలో 1165 మంది భారతీయ ప్లేయర్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి అత్యధికంగా 91 మంది ప్లేయర్లు పోటీలో ఉండగా... ఆ్రస్టేలియా నుంచి 76 మంది, ఇంగ్లండ్ నుంచి 52 మంది, న్యూజిలాండ్ నుంచి 39 మంది, వెస్టిండీస్ నుంచి 33 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. ఇటలీ, యూఏఈ నుంచి ఒక్కో ప్లేయర్ తమ పేరు నమోదు చేసుకున్నారు. ఇటలీ నుంచి తొలి ఎంట్రీ... ఇటలీ పేసర్ థామస్ డ్రాకా ఐపీఎల్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా... ఈ ఏడాది టి20 ప్రపంచకప్ సందర్భంగా ఆకట్టుకున్న భారత సంతతికి చెందిన అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా డ్రాకా నిలిచాడు. ఇటలీ తరఫున ఇప్పటి వరకు నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన 24 ఏళ్ల డ్రాకా... గ్లోబల్ టి20 కెనడా టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ టోరీ్నలో 11 వికెట్లు పడగొట్టిన డ్రాకా... ఆల్‌రౌండర్ల జాబితాలో ప్రాథమిక ధర రూ. 30 లక్షలతో ఐపీఎల్ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవల ఐఎల్ టి20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చెందిన ముంబై ఎమిరేట్స్ జట్టుకు డ్రాకా ఎంపికయ్యాడు. ఇక అండర్–19 స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత మెరుగైన ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడి అక్కడ అటు ఉద్యోగంతో పాటు ఇటు క్రికెట్లో రాణిస్తున్న నేత్రావల్కర్ కూడా రూ. 30 లక్షల ప్రాథమిక ధరతో వేలానికి రానున్నాడు. -
IPL 2025: మెగా వేలం వేదిక మార్పు..?
2025 ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం, వేదిక ఖరారైనట్లు తెలుస్తుంది. తొలుత మెగా వేలాన్ని సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే తాజాగా వేదికను జెద్దా నగరానికి మార్చినట్లు సమాచారం. అబేది అల్ జోహార్ అరీనా (బెంచ్‌మార్క్ అరీనా) మెగా వేలానికి వేదిక కానున్నట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ వెల్లడించింది. ఫ్రాంచైజీ ప్రముఖులకు వసతి ఏర్పాట్లను అబేది అల్ జోహార్ అరీనా సమీపంలో గల హోటల్ షాంగ్రీ-లాలో సిద్దం చేసినట్లు తెలుస్తుంది. వేలం తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేనట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరుగనుందని సమాచారం.కాగా, వేలంలో పాల్గొనే 10 ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే కావడం విశేషం. ఈ సారి మెగా వేలానికి మొత్తం 1574 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో 1165 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 409 మంది విదేశీ ఆటగాళ్లని సమాచారం. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకుని వదిలేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా..పంజాబ్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుశశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లుపంజాబ్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుశిఖర్ ధవన్ (కెప్టెన్)రిలీ రొస్సోహర్ప్రీత్ సింగ్ భాటియాశివమ్ సింగ్అధర్వ తైడేఅశుతోష్ శర్మవిశ్వనాథ్ సింగ్సికందర్ రజాసామ్ కర్రన్క్రిస్ వోక్స్రిషి ధవన్తనయ్ త్యాగరాజన్జానీ బెయిర్స్టోజితేశ్ శర్మరాహుల్ చాహర్విధ్వత్ కావేరప్పహర్షల్ పటేల్నాథన్ ఎల్లిస్అర్షదీప్ సింగ్ప్రిన్స్ చౌదరీహర్ప్రీత్ బ్రార్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: నలుగురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుపాట్ కమిన్స్- రూ. 18 కోట్లుఅభిషేక్ శర్మ- రూ. 14 కోట్లునితీశ్కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లుహెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లుట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన ఆటగాళ్లుగ్లెన్ ఫిలిప్స్రాహుల్ త్రిపాఠిఎయిడెన్ మార్క్రమ్మయాంక్ అగర్వాల్అబ్దుల్ సమద్అన్మోల్ప్రీత్ సింగ్వాషింగ్టన్ సుందర్షాబాజ్ అహ్మద్సన్వీర్ సింగ్మార్కో జన్సెన్ఉపేంద్ర యాదవ్జయదేవ్ ఉనద్కత్టి నటరాజన్జఠావేద్ సుబ్రమణ్యన్మయాంక్ మార్కండేభువనేశ్వర్ కుమార్ఫజల్ హక్ ఫారూఖీఆకాశ్ మహారాజ్ సింగ్ఉమ్రాన్ మాలిక్విజయ్కాంత్ వియాస్కాంత్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చులక్నో సూపర్ జెయింట్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లునికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లులక్నో సూపర్ జెయింట్స్ వదిలేసిన ఆటగాళ్లుప్రేరక్ మన్కడ్దేవ్దత్ పడిక్కల్కైల్ మేయర్స్కృనాల్ పాండ్యామార్కస్ స్టోయినిస్అర్షిన్ కులకర్ణిదీపక్ హుడాఆస్టన్ అగర్కృష్ణప్ప గౌతమ్క్వింటన్ డికాక్కేఎల్ రాహుల్ (కెప్టెన్)మణిమారన్ సిద్దార్థ్యుద్ద్వీర్సింగ్ చరక్నవీన్ ఉల్ హక్యశ్ ఠాకూర్షమార్ జోసఫ్అమిత్ మిశ్రాఅర్షద్ ఖాన్మ్యాట్ హెన్రీవేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం లేదు: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుకోల్కతా నైట్‌రైడర్స్ ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లురింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుకోల్‌కతా నైట్‌రైడర్స్ వదిలేసిన ఆటగాళ్లుమనీశ్ పాండేనితీశ్ రాణాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)సకీబ్ హుసేన్షెర్ఫాన్ రూథర్ఫోర్డ్వెంకటేశ్ అయ్యర్అనుకుల్ రాయ్అంగ్క్రిష్ రఘువంశీరహ్మానుల్లా గుర్భాజ్శ్రీకర్ భరత్వైభవ్ అరోరాసుయాశ్ శర్మచేతన్ సకారియామిచెల్ స్టార్క్దుష్మంత చమీరాఅల్లా ఘజన్ఫర్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం లేదుఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన ఆటగాళ్లురికీ భుయ్యశ్ ధుల్డేవిడ్ వార్నర్పృథ్వీ షాజేక్ ఫ్రేసర్ మెక్గుర్క్స్వస్తిక్ చికారలలిత్ యాదవ్సుమిత్ కుమార్గుల్బదిన్ నైబ్షాయ్ హోప్కుమార్ కుషాగ్రారిషబ్ పంత్ (కెప్టెన్)ఇషాంత్ శర్మజై రిచర్డ్సన్రసిఖ్ దార్ సలామ్విక్కీ ఓస్త్వాల్ఖలీల్ అహ్మద్ముకేశ్ కుమార్అన్రిచ్ నోర్జేప్రవీణ్ దూబేలిజాడ్ విలియమ్స్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన ఆటగాళ్లుసుయాశ్ ప్రభుదేశాయ్ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)గ్లెన్ మ్యాక్స్వెల్కెమరూన్ గ్రీన్మహిపాల్ లోమ్రార్మనోజ్ భండగేసౌరవ్ చౌహాన్స్వప్నిల్ సింగ్టామ్ కర్రన్అనూజ్ రావత్కర్ణ్ శర్మవిజయ్కుమార్ వైశాఖ్అల్జరీ జోసఫ్రాజన్ కుమార్మయాంక్ డాగర్లోకీ ఫెర్గూసన్మొహమ్మద్ సిరాజ్హిమాన్షు శర్మఆకాశ్దీప్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చుచెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లుమతీశ పతిరణ- రూ. 13 కోట్లుశివమ్ దూబే- రూ. 12 కోట్లురవీంద్ర జడేజా- రూ. 18 కోట్లుఎంఎస్ ధోని- రూ. 4 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుఅజింక్య రహానేషేక్ రషీద్సమీర్ రిజ్విడారిల్ మిచెల్డెవాన్ కాన్వేరచిన్ రవీంద్రనిషాంత్ సంధుమిచెల్ సాంట్నర్అరవెల్లి అవనీశ్అజయ్ జాదవ్ మండల్హంగేర్కర్ముకేశ్ చౌదరీప్రశాంత్ సోలంకిశార్దూల్ ఠాకూర్సిమ్రన్జీత్ సింగ్తుషార్ దేశ్పాండేమహీశ్ తీక్షణరిచర్డ్ గ్లీసన్దీపక్ చాహర్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుజస్ప్రీత్ బుమ్రా- రూ. 18 కోట్లుసూర్యకుమార్ యాదవ్- రూ. 16.35 కోట్లుహార్దిక్ పాండ్యా- రూ. 16.35 కోట్లురోహిత్ శర్మ- రూ. 16.30 కోట్లుతిలక్ వర్మ- రూ. 8 కోట్లుముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లుటిమ్ డేవిడ్డెవాల్డ్ బ్రెవిస్నేహల్ వధేరానమన్ ధిర్శివాలిక్ శర్మషమ్స్ ములానీశ్రేయస్ గోపాల్రొమారియో షెపర్డ్కుమార్ కార్తీకేయమొహమ్మద్ నబీఅర్జున్ టెండూల్కర్ఇషాన్ కిషన్హార్విక్ దేశాయ్పియూశ్ చావ్లాఅన్షుల్ కంబోజ్గెరాల్డ్ కొయెట్జీఆకాశ్ మధ్వాల్నువాన్ తుషారక్వేనా మపాకాలూక్ వుడ్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుగుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురషీద్ ఖాన్- రూ. 18 కోట్లుశుభ్మన్ గిల్- రూ. 16.5 కోట్లుసాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లురాహుల్ తెవాతియా- రూ. 4 కోట్లుషారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లుగుజరాత్ టైటాన్స్ వదిలేసిన ఆటగాళ్లుడేవిడ్ మిల్లర్కేన్ విలియమ్సన్అభినవ్ మనోహర్విజయ్ శంకర్అజ్మతుల్లా ఒమర్జాయ్వృద్దిమాన్ సాహామాథ్యూ వేడ్శరత్ బీఆర్కార్తీక్ త్యాగినూర్ అహ్మద్రవిశ్రీనివాసన్ సాయి కిషోర్జాషువ లిటిల్స్పెన్సర్ జాన్సన్మొహిత్ శర్మదర్శన్ నల్కండేజయంత్ యాదవ్ఉమేశ్ యాదవ్సందీప్ వారియర్మారవ్ సుతార్గుర్నూర్ బ్రార్పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చురాజస్థాన్ రాయల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..సంజూ శాంసన్- రూ. 18 కోట్లుయశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లురియాన్ పరాగ్- రూ. 14 కోట్లుదృవ్ జురెల్- రూ. 14 కోట్లుషిమ్రోన్ హెట్‌మైర్- రూ. 11 కోట్లుసందీప్ శర్మ- రూ. 4 కోట్లురాజస్థాన్ రాయల్స్ వదిలేసిన ఆటగాళ్లు..రోవ్‌మన్ పొవెల్శుభమ్ దూబేతనుశ్ కోటియన్రవిచంద్రన్ అశ్విన్డొనొవన్ ఫెరియెరాకునాల్ సింగ్ రాథోర్టామ్ కొహ్లెర్-కాడ్మోర్ఆవేశ్ ఖాన్ట్రెంట్ బౌల్ట్నవ్దీప్ సైనీనండ్రే బర్గర్యుజ్వేంద్ర చహల్కుల్దీప్ సేన్ ఆబిద్ ముస్తాక్కేశవ్ మహారాజ్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు -
IPL 2025: మెగా వేలం డేట్స్ ఫిక్స్! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి పూర్తి ప్రణాళికను సిద్ధం చేసిందని.. ఈ నెల ఆఖరి వారంలో రియాద్ వేదికగా ఆక్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. అదే విధంగా.. వేలం రెండు రోజుల పాటు సాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రైట్ టూ మ్యాచ్ కార్డు అందుబాటులోకికాగా మెగా వేలం నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచడం సహా రైట్ టూ మ్యాచ్(ఆర్టీఎమ్) కార్డు అందుబాటులోకి రావడంతో ఫ్రాంఛైజీలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. కీలకమైన ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుని.. స్టార్లు అయినా సరే తమకు భారం అనుకుంటే.. వాళ్లను వదిలించుకున్నాయి.వదిలించుకున్నాయిరాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్(ఇంగ్లండ్), సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐడెన్ మార్క్రమ్(సౌతాఫ్రికా), ఆర్సీబీ గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(సౌతాఫ్రికా), లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈ ఏడాది టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌లను రిలీజ్ చేయడం ఇందుకు ఉదాహరణ.ఆ తేదీల్లోనే వేలం!ఇక పది జట్లు కలిపి మొత్తంగా 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఇక ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే.. అందులోనూ పది మంది అన్క్యాప్డ్ ఇండియన్స్ కావడం విశేషం. కాగా ఈ సీజన్లో కూడా సొంతగడ్డపై కాకుండా విదేశంలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇందుకోసం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. నవంబరు 24, 25 తేదీల్లో వేలం నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా గతేడాది డిసెంబరు 19న దుబాయ్‌లో ఐపీఎల్ వేలం జరిగిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మెగా వేలం-2025 రిటెన్షన్స్ పోనూ ఎవరి పర్సులో ఎంత?రాజస్తాన్ రాయల్స్ 👉సంజూ సామ్సన్-భారత్- రూ. 18 కోట్లు 👉యశస్వి జైస్వాల్- భారత్- రూ. 18 కోట్లు 👉రియాన్ పరాగ్- భారత్- రూ. 14 కోట్లు 👉ధ్రువ్ జురెల్- భారత్- రూ. 14 కోట్లు 👉హెట్‌మైర్-వెస్టిండీస్ రూ. 11 కోట్లు 👉సందీప్ శర్మ- భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 41 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదుగుజరాత్ టైటాన్స్👉రషీద్ ఖాన్-అఫ్గానిస్తాన్- రూ. 18 కోట్లు 👉శుబ్‌మన్ గిల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉సాయి సుదర్శన్- భారత్- రూ. 8.50 కోట్లు 👉రాహుల్ తెవాటియా- భారత్ రూ. 4 కోట్లు 👉షారుఖ్ ఖాన్ భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుఢిల్లీ క్యాపిటల్స్ 👉అక్షర్ పటేల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉కుల్దీప్ యాదవ్- భారత్ రూ. 13.25 కోట్లు 👉ట్రిస్టన్ స్టబ్స్- దక్షిణాఫ్రికా రూ. 10 కోట్లు 👉అభిషేక్ పొరెల్- భారత్ రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు లక్నో సూపర్ జెయింట్స్ 👉నికోలస్ పూరన్- వెస్టిండీస్- రూ. 21 కోట్లు 👉రవి బిష్ణోయ్- భారత్- రూ. 11 కోట్లు 👉మయాంక్ యాదవ్ -భారత్- రూ. 11 కోట్లు 👉మోహసిన్ ఖాన్- భారత్- రూ. 4 కోట్లు 👉ఆయుష్ బదోని- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదు: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు సన్‌రైజర్స్ హైదరాబాద్ 👉హెన్రిచ్ క్లాసెన్- దక్షిణాఫ్రికా- రూ. 23 కోట్లు 👉ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- రూ. 18 కోట్లు 👉అభిషేక్ శర్మ- భారత్- రూ. 14 కోట్లు 👉ట్రావిస్ హెడ్- ఆస్ట్రేలియా- రూ. 14 కోట్లు 👉నితీశ్ రెడ్డి- భారత్- రూ. 6 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుముంబై ఇండియన్స్ 👉జస్ప్రీత్ బుమ్రా- భారత్- రూ. 18 కోట్లు 👉సూర్యకుమార్- భారత్- రూ. 16.35 కోట్లు 👉హార్దిక్ పాండ్యా- భారత్- రూ. 16.35 కోట్లు 👉రోహిత్ శర్మ- భారత్- రూ. 16.30 కోట్లు 👉తిలక్ వర్మ- భారత్- రూ. 8 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుచెన్నై సూపర్ కింగ్స్ 👉రుతురాజ్ గైక్వాడ్- భారత్- రూ. 18 కోట్లు 👉మతీశా పతిరన- శ్రీలంక- రూ. 13 కోట్లు 👉శివమ్ దూబే- భారత్- రూ. 12 కోట్లు 👉రవీంద్ర జడేజా- భారత్- రూ. 18 కోట్లు 👉ధోనీ - భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుకోల్కతా నైట్ రైడర్స్ 👉రింకూ సింగ్- భారత్- రూ. 13 కోట్లు 👉వరుణ్ చక్రవర్తి- భారత్ -రూ. 12 కోట్లు 👉సునీల్ నరైన్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉ఆండ్రె రసెల్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉హర్షిత్ రాణా- భారత్- రూ. 4 కోట్లు 👉రమణ్‌దీప్ సింగ్- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదురాయల్ చాలెంజర్స్ బెంగళూరు 👉విరాట్ కోహ్లి- భారత్- రూ. 21 కోట్లు 👉రజత్ పాటిదార్- భారత్ -రూ. 11 కోట్లు 👉యశ్ దయాళ్- భారత్- రూ. 5 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చుపంజాబ్ కింగ్స్ 👉శశాంక్ సింగ్- భారత్- రూ. 5.5 కోట్లు 👉ప్రభ్‌సిమ్రన్ సింగ్ -భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: నలుగురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.చదవండి: BGT 2024: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
ఐపీఎల్-2025కు స్టార్ ప్లేయర్ దూరం.. కారణమిదేనా?
ఐపీఎల్-2025 సీజన్‌కు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో తన పేరును నమోదు చేయకూడదని స్టోక్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది బిజీ టెస్టు షెడ్యూల్ కారణంగా స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది. టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం.. వచ్చే ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ సీజన్ వేలానికి స్టోక్స్‌తో పాటు మరికొంతమంది ఇంగ్లీష్ ఆటగాళ్లు సైతం దూరంగా ఉండనున్నట్లు సమాచారం. కాగా స్టోక్సీ చివరగా ఐపీఎల్-2023 సీజన్లో ఆడాడు. సీఎస్కే అతడిని రూ.16.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసింది. కానీ తన ధరకు తగ్గ న్యాయం స్టోక్స్ చేయలేకపోయాడు. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన స్టోక్స్ గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తానికి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు స్టోక్సీను చెన్నై ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. ఐపీఎల్-2024 వేలంలోనూ ఈ ఇంగ్లీష్ క్రికెటర్ వ్యక్తిగత కారణాలతో పాల్గోలేదు. ఇప్పుడు ఐపీఎల్-2025 మెగా వేలం కూడా దూరం కానున్నాడు.రేపే లాస్ట్.. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు గడువు ఆదివారం(నవంబర్ 3)తో ముగియనుంది. అయితే వచ్చే ఏడాది సీజన్ వేలానికి ముందు బీసీసీఐ రూల్స్‌ను మరింత కఠినం చేసిన సంగతి తెలిసిందే. ఒక్కసారి వేలంలో ఏదైనా జట్టు ఆటగాడిని తీసుకుంటే కనీసం మూడేళ్లపాటు ఉండాల్సిందేనని షరతు విధించింది. దీంతో చాలా మంది ఆటగాళ్లు విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాల వద్ద అన్న సందిగ్ధంలో పడ్డారు. కాగా మెగా వేలం నవంబర్ ఆఖరిలో సౌథీ అరేబియా వేదికగా జరిగే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి -
IPL 2025: వేలంలో పాల్గొనబోయే స్టార్ ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. రిటెన్షన్స్‌లో కొన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు స్టార్ ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. ఫ్రాంచైజీలు వదిలేసిన అనంతరం వేలానికి రానున్న స్టార్ ఆటగాళ్లు వీరే.రిలీ రొస్సో సామ్ కర్రన్ జానీ బెయిర్‌స్టో గ్లెన్ ఫిలిప్స్ఎయిడెన్ మార్క్రమ్మార్కస్ స్టోయినిస్కేఎల్ రాహుల్ (కెప్టెన్)శిఖర్ ధవన్ (కెప్టెన్)క్వింటన్ డికాక్శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)మిచెల్ స్టార్క్రిషబ్ పంత్ (కెప్టెన్)డేవిడ్ వార్నర్జేక్ ఫ్రేసర్ మెక్గుర్క్ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)గ్లెన్ మ్యాక్స్వెల్కెమరూన్ గ్రీన్డెవాన్ కాన్వేరచిన్ రవీంద్రటిమ్ డేవిడ్డెవాల్డ్ బ్రెవిస్ఇషాన్ కిషన్డేవిడ్ మిల్లర్కేన్ విలియమ్సన్జోస్ బట్లర్ట్రెంట్ బౌల్ట్రవిచంద్రన్ అశ్విన్యుజ్వేంద్ర చహల్చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల -
IPL 2025 Auction: ఏయే ఫ్రాంచైజీల దగ్గర ఎంత మొత్తం మిగిలి ఉంది..?
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్స్ బ్యాలెన్స్ మిగిలిందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.రిటెన్షన్స్‌లో అతి తక్కువ ఖర్చు చేసింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ. టోటల్ పర్స్ వాల్యూ 120 కోట్లైతే ఈ ఫ్రాంచైజీ కేవలం 9.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్‌ను 5.5 కోట్లకు, ప్రభ్‌మన్‌సిమ్రన్ సింగ్‌ను 4 కోట్లకు రిటైన్ చేసుకుని మిగతా ఆటగాళ్లందరినీ వేలానికి వదిలేసింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా 110.5 కోట్లు బ్యాలెన్స్ ఉంది. వేలంలో పాల్గొనే ఫ్రాంచైజీల్లో ఏ ఫ్రాంచైజీ దగ్గర ఇంత మొత్తం లేదు. కాబట్టి పంజాబ్ కింగ్స్ వేలంలో భారీ కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది.పంజాబ్ కింగ్స్ తర్వాత అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఆర్సీబీ దగ్గర ఉంది. ఆర్సీబీ రిటెన్షన్స్‌లో 37 కోట్లు ఖర్చు చేసి ఇంకా 83 కోట్ల పర్స్ బ్యాలెన్స్ కలిగి ఉంది. ఆర్సీబీ రిటెన్షన్స్‌లో భాగంగా విరాట్ కోహ్లికి 21 కోట్లు, రజత్ పాటిదార్‌కు 11 కోట్లు, యశ్ దయాల్‌కు 5 కోట్లు ఖర్చు చేసింది. పంజాబ్, ఆర్సీబీ తర్వాత అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ఉంది. ఈ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా 73 కోట్ల బ్యాలెన్స్ ఉంది.పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ తర్వాత ఎల్ఎస్జీ, గుజరాత్, సీఎస్కే, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ వద్ద వరుసగా 69 కోట్లు, 69, 55, 51, 45, 45, 41 కోట్ల బ్యాలెన్స్ ఉంది. అన్ని ఫ్రాంచైజీల దగ్గర భారీ మొత్తం మిగిలి ఉండటంతో ఈ సారి వేలం ఆసక్తికరంగా మారనుంది. రిటెన్షన్స్‌లో చాలా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను వదిలి పెట్టడంతో సదరు స్టార్ ఆటగాళ్ల కోసం వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల -
IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. రిటెన్షన్ పూర్తి లిస్టు ఇదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 రిటెన్షన్ లిస్టు.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అక్టోబరు 31 వరకు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంఛైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుందనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించబోయేది వీరిపైనే అంటూ ఔత్సాహికులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఆ విశేషాలపై మనమూ ఓ లుక్కేద్దామా!నిబంధనలు ఇవీఅంతకంటే ముందు ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ఎలా ఉందో పరిశీలిద్దాం. రూల్స్ ప్రకారం.. ఈసారి పర్స్ వాల్యూ 120 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతేకాదు.. రైట్ టూ మ్యాచ్ కార్డు కూడా ఉపయోగించుకునే వీలు కలిగింది.అంటే.. ఒక ఆటగాడిని ఓ ఫ్రాంఛైజీ వదిలేసిన తర్వాత.. అతడు వేలంలోకి వస్తే.. మరో ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసిన పక్షంలో.. ఈ కార్డును ఉపయోగించి పాత ఫ్రాంఛైజీ మళ్లీ సదరు ప్లేయర్‌ను వేలంలోని ధరకు సొంతం చేసుకోవచ్చు. గరిష్టంగా ఆరుగురుఇక ఒక్కో టీమ్ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. అందులో కనీసం ఒక్కరైనా అన్క్యాప్డ్ ప్లేయర్ అయి ఉండాలి. అంటే.. ఇంత వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడని క్రికెటర్ అయి ఉండాలి.ఇక తాము కొనసాగించాలనుకున్న తొలి ఐదుగురు ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆరో ఆటగాడు గనుక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే రూ. 4 కోట్ల మేర చెల్లించాలి.రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంతఅయితే, కొన్ని జట్లు కొందరు ఆటగాళ్లను వదులుకోవడానికి అస్సలు సిద్ధపడవు. అలాగే, వారి డిమాండ్‌కు తగ్గట్లు భారీ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంఛైజీలకు బీసీసీఐ ఓ వెసలుబాటు కల్పించింది. తాము రిటైన్ చేసుకోవాలనుకునే తొలి ఐదుగురు క్రికెటర్లకు కలిపి గరిష్ట పరిమితి అయిన రూ.75 కోట్ల నుంచి తమకు నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు.ఐపీఎల్-2025 రిటెన్షన్ లిస్టు అంచనాలు ఇవేముంబై ఇండియన్స్1. హార్దిక్ పాండ్యా- రూ. 18 కోట్లు2. జస్ప్రీత్ బుమ్రా- రూ. 14 కోట్లు3. తిలక్ వర్మ- రూ. 11 కోట్లు4. సూర్యకుమార్ యాదవ్- రూ. 18 కోట్లు5. నమన్ ధీర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ఆకాశ్ మధ్వాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లురాయల్ చాలెంజర్స్ బెంగళూరు1. విరాట్ కోహ్లి- రూ. 18 కోట్లు2. ఫాఫ్ డుప్లెసిస్- రూ. 14 కోట్లు3. మహ్మద్ సిరాజ్- రూ. 11 కోట్లు4. యశ్ దయాల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అనూజ్ రావత్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్1. రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు2. మతీశ పతిరణ- రూ. 14 కోట్లు3. రచిన్ రవీంద్ర- రూ. 11 కోట్లు4. రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు5. ఎంఎస్ ధోని(అన్క్యాప్డ్- అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్1. శ్రేయస్ అయ్యర్- రూ. 18 కోట్లు2. సునిల్ నరైన్- రూ. 14 కోట్లు3. రింకూ సింగ్- రూ. 11 కోట్లు4. ఆండ్రీ రసెల్- రూ. 18 కోట్లు5. హర్షిత్ రాణా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. అంగ్క్రిష్ రఘువంశీ(అన్‌కాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 55 కోట్లురాజస్తాన్ రాయల్స్1. సంజూ శాంసన్- రూ. 18 కోట్లు2. జోస్ బట్లర్- రూ. 14 కోట్లు3. రియాన్ పరాగ్- రూ. 11 కోట్లు4. యశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లు5. సందీప్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది- రూ. 55 కోట్లులక్నో సూపర్ జెయింట్స్1. నికోలస్ పూరన్- రూ. 18 కోట్లు2. మార్కస్ స్టొయినిస్- రూ. 14 కోట్లు3. మయాంక్ యాదవ్- రూ. 11 కోట్లు4. ఆయుశ్ బదోని(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. మొహ్సిన్ ఖాన్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుపంజాబ్ కింగ్స్1. అర్ష్‌దీప్ సింగ్- రూ. 18 కోట్లు2. సామ్ కరన్- రూ. 14 కోట్లు3. కగిసో రబాడ- రూ. 11 కోట్లు4. అశుతోశ్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. ప్రభ్‌సిమ్రన్ సింగ్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్1. రిషభ్ పంత్- రూ. 18 కోట్లు2. అక్షర్ పటేల్- రూ. 14 కోట్లు3. కుల్దీప్ యాదవ్- రూ. 11 కోట్లు4. రసిఖ్ సలాం దర్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు5. అభిషేక్ పోరెల్(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 69 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్1. హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు (ప్రస్తుత సమాచారం ప్రకారం ఇతడే ఈసారి రిటెన్షన్ జాబితాలో అత్యంత ఖరీదైన ఆటగాడు)2. ప్యాట్ కమిన్స్- రూ. 18 కోట్లు3. అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు4. ట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లు5. నితీశ్ రెడ్డి- రూ. 6 కోట్లు 6. రైట్ టు మ్యాచ్ కార్డుపర్సులో మిగిలేది: రూ. 45 కోట్లుగుజరాత్ టైటాన్స్1. శుబ్‌మన్ గిల్- రూ. 18 కోట్లు2. మహ్మద్ షమీ/డేవిడ్ మిల్లర్- రూ. 14 కోట్లు3. సాయి సుదర్శన్- రూ. 11 కోట్లు4. రషీద్ ఖాన్- రూ. 18 కోట్లు5. రాహుల్ తెవాటియా(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లు6. మోహిత్ శర్మ(అన్క్యాప్డ్)- రూ. 4 కోట్లుపర్సులో మిగిలేది: రూ. 51 కోట్లు.చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్ -
IPL 2025: మెగా వేలంలో అతడికి రూ. 30 కోట్లు!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీలన్నీ పంత్ వైపు చూస్తున్నాయన్న ఆకాశ్ చోప్రా.. అతడు ఈసారి రూ. 25- 30 కోట్ల ధర పలికినా ఆశ్చర్యం లేదన్నాడు.ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయం.. కారణాలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం సమీపిస్తోంది. నవంబరు ఆఖరి వారంలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబరు 31లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. రిషభ్ పంత్ వేలంలోకి వస్తే ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమంటూ.. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించాడు.‘‘రిషభ్ పంత్ వేలంలోకి వస్తాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అతడు వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, చాలా మంది అతడి టీ20 గణాంకాలు అంత బాగా లేవని అంటూ ఉంటారు. ఐపీఎల్లో ఇంత వరకు భారీ స్థాయిలో పరుగులు రాబట్టలేదన్నది వాస్తవమే.అయినప్పటికీ అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఆర్సీబీకి కీపర్ కావాలి.. బ్యాటర్ కావాలి.. బహుశా కెప్టెన్ కూడా కావాలి. ఇక పంజాబ్‌కి కూడా వికెట్ కీపర్ లేడు. ఢిల్లీకీ పంత్ కావాలి.వాళ్లకూ వికెట్ కీపర్ లేడుకేకేఆర్కు కూడా అతడి అవసరం ఉంది. ఇక సీఎస్కే కూడా పంత్ లాంటి వికెట్ కీపర్‌ను కోరుకోవడంలో సందేహం లేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ జట్టులో లేకుంటే.. ముంబైకీ పంత్ కావాలి. నికోలస్ పూరన్ ఉన్నా... లక్నో కూడా పంత్‌పై ఆసక్తి చూపవచ్చు.గుజరాత్ జట్టు పరిస్థితి కూడా ఇదే. వాళ్లకూ వికెట్ కీపర్ లేడు. కాబట్టి రిషభ్ పంత్ వేలంలోకి వస్తే రూ. 25- 30 కోట్ల మధ్య అమ్ముడుపోతాడు’’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.ఈ ఏడాది రీ ఎంట్రీఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. జట్టును ఆరోస్థానంలో నిలిపాడు. సారథిగా ఆకట్టుకోలేకపోయినా.. 446 పరుగులతో బ్యాటర్‌గా రాణించాడు. వికెట్ కీపర్‌గానూ తన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ‘నన్ను వెక్కిరించావు కదా.. అందుకే అలా చేశాను’ -
ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ఇవే.. ఆర్టీఎమ్ కార్డుకు నో ఛాన్స్..!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను (ముగ్గురు దేశీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు) రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎమ్) కార్డుకు బీసీసీఐ ఒప్పుకోలేదని తెలుస్తోంది. బుధవారం బెంగళూరులో జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాలన్ని ఫైనలైజ్ అయినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.రైట్ టు మ్యాచ్ కార్డ్(ఆర్టీఎమ్) అంటే.. ఏదైనా ఫ్రాంచైజీ వేలంలో తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్టీఎమ్ కార్డు ద్వారా ఆ ధరను సదరు ప్రాంచైజీకి చెల్లించి ఆటగాడిని తిరిగి తీసుకోవచ్చు. 2018 ఐపీఎల్ మెగా వేలంలో ఆర్టీఎమ్ కార్డ్‌ను చివరిసారిగా ఉపయోగించారు. ఆ తర్వాత బీసీసీఐ ఆర్టీఎమ్ కార్డ్ రూల్‌ను తొలగించింది. రానున్న మెగా వేలం తిరిగి ఈ రూల్‌ను ప్రవేశపెట్టాలని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే బీసీసీఐ ఇందుకు ససేమిరా అన్నట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేయగా.. దీనికి కూడా బీసీసీఐ నో చెప్పినట్లు సమాచారం. అంతిమంగా ఐదు రిటెన్షన్స్, నో ఆర్టీఎమ్, మెగా వేలానికి బీసీసీఐ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్లో ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం జరిగే అవకాశం ఉంది.చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. రెండేళ్ల కరువును తీర్చుకున్న చండీమల్ -
ఐపీఎల్-2025కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం!?
ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించిన ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని బీసీసీఐ దాదాపుగా ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలకు ఓ గుడ్‌న్యూస్ చెప్పే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను ఐదుకు పెంచాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ఛాన్స్ మాత్రమే ఐపీఎల్ జట్లకు ఉంటుంది. ఎప్పటి నుంచో రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచమని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ ఏడాది జూలై 31న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ మరోసారి ఇదే విషయాన్ని ఫ్రాంచైజీలు ప్రస్తావించాయి.అయితే ఈసారి మాత్రం ఐపీఎల్ ఫ్రాంచైజీల డిమాండ్‌కు భారత క్రికెట్ బోర్డు ఒకే చెప్పినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య ఐదు పెంచితే ఆయా ఫ్రాంచైజీలకు ప్రయోజనం చేకూరనుంది. ఐపీఎల్-2025 రిటెన్షన్ రూల్స్‌ను గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా గురువారం(సెప్టెంబర్ 26) ప్రకటించే అవకాశం ఉంది.చదవండి: BAN vs IND: టీమిండియాతో రెండో టెస్టు.. బంగ్లాకు అదిరిపోయే గుడ్ న్యూస్ -
2025 ఐపీఎల్‌కు సంబంధించి కీలక అప్డేట్స్
2025 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి కీలక అప్డేట్స్ అందుతున్నాయి. మెగా వేలం నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు నవంబర్ 15ను డెడ్ లైన్‌గా విధించినట్లు సమాచారం. రిటెన్షన్ నిబంధనలు ఈ నెలాఖరుకు వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈసారి వేలం భారత్‌లో కాకుండా విదేశాల్లో జరగవచ్చు. వేలానికి ఆతిథ్యం ఇచ్చేందుకు సౌదీ అరేబియా మొగ్గు చూపుతుంది. ఈ విషయాలన్నిటినీ బీసీసీఐ ప్రాంచైజీ యాజమాన్యాలకు తెలియజేసినట్లు సమాచారం. గతేడాది మెగా వేలం దుబాయ్‌లో జరిగిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ నిన్ననే తమ నూతన హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ పేరును ప్రకటించింది. గత సీజన్ వరకు పంజాబ్ హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్ పని చేశాడు. పేలవ ప్రదర్శనను కారణంగా చూపుతూ పంజాబ్ యాజమాన్యం బేలిస్‌ను తప్పించింది. పాంటింగ్ గత సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. పాంటింగ్ ఆ బాధ్యతల నుంచి ఇటీవలే తప్పుకున్నాడు. వచ్చే సీజన్ కోసం చాలా ఫ్రాంచైజీలు ఇప్పటికే హెడ్ కోచ్‌లకు మార్చాయి. తాజాగా ఈ జాబితాలోకి పంజాబ్ చేసింది.చదవండి: పంజాబ్ కింగ్స్ రాత మారేనా! -
ఒక్కడి కోసం అంత ఖర్చు పెడతారా? లక్నో జట్టు ఓనర్
‘‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 కోట్లు అయినా సరే ఖర్చుపెట్టబోతోంది.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ నేపథ్యంలో అతడికి ఇప్పటికే ఈ మేర భారీ ఆఫర్ కూడా ఇచ్చింది’’ అంటూ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తాజాగా స్పందించాడు. ముంబై జట్టుతో సుదీర్ఘ అనుబంధంఇలాంటి నిరాధార వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తనకు అర్థం కావడం లేదని.. అయినా ఒక్క ఆటగాడి కోసం ఇంత పెద్ద మొత్తం ఎవరైనా ఖర్చు చేస్తారా? అంటూ విస్మయం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళ్లన్నీ దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్స్‌గా నిలిపిన హిట్‌మ్యాన్.. పదేళ్లపాటు ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనూహ్య రీతిలో వేటుఅయితే, గతేడాది ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆగమనంతో రోహిత్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి ముంబై యాజమాన్యం. దీంతో అసంతృప్తికి లోనైన రోహిత్ శర్మ ఆ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రోహిత్ శర్మ వేలంలోకి రానున్నాడని.. అతడి కోసం లక్నో, ఢిల్లీ తదితర జట్లు పోటీపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి సంజీవ్ గోయెంకాకు ప్రశ్న ఎదురైంది.‘‘రోహిత్ కోసం లక్నో రూ. 50 కోట్లు విడిగా పెట్టిందనే వదంతులు వస్తున్నాయి. ఇవి నిజమేనా?’’ అని యాంకర్ ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు రోహిత్ శర్మ వేలంలోకి వస్తాడో? లేదో మీరే చెప్పండి. ఈ విషయం గురించి ఎవరికైనా స్పష్టత ఉందా?ఒక్కడి కోసం రూ. 50 కోట్లా?ఇవన్నీ వట్టి వదంతులే. ముంబై ఇండియన్స్ రోహిత్‌ను రిలీజ్ చేస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ అదే జరిగి అతడు వేలంలోకి వచ్చినా.. సాలరీ పర్సులోని 50 శాతం డబ్బు ఒక్క ప్లేయర్ కోసమే ఎవరైనా ఖర్చు చేస్తారా? అలాంటపుడు మిగతా 22 ప్లేయర్ల సంగతేంటి?’’ అని సంజీవ్ గోయెంకా తిరిగి ప్రశ్నించాడు.కోరుకుంటే సరిపోదుఈ క్రమంలో.. ‘‘రోహిత్ మీ విష్ లిస్ట్‌లో ఉన్నాడా?’’ అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్కరికి ఒక విష్ లిస్ట్ ఉంటుంది. అత్యుత్తమ ఆటగాడు, అత్యుత్తమ కెప్టెన్‌నే ఎవరైనా కోరుకుంటారు. అయితే, మనం ఏం ఆశిస్తున్నామనేది కాదు.. మనకు ఏది అందుబాటులో ఉంది.. మనం పొందగలిగేదన్న విషయం మీదే అంతా ఆధారపడి ఉంటుంది. నేను కావాలనుకున్న వాళ్లను వేరే ఫ్రాంఛైజీ దక్కించుకోవచ్చు కదా!’’ అని సంజీవ్ గోయెంకా సమాధానం దాటవేశాడు.చదవండి: ‘రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తోనే ఉంటాడు’గంభీర్ స్థానంలో జహీర్ ఖాన్.. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉంటాడా? -
IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం-2025 నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. పది జట్ల ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారుల మధ్య జూలై 31 నాటి సమావేశంలో ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫ్రాంఛైజీ యజమానుల్లో అధికులు ఆరుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరగా.. బీసీసీఐ ఇందుకు సానుకూలంగా స్పందించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ఫ్రాంఛైజీలు మాత్రం తమ కెప్టెన్లను విడిచిపెట్టి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలనే యోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.ఆర్సీబీఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ సారథిని మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వేలానికి ముందు ఫాఫ్ డుప్లెసిస్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల డుప్లెసిస్ ఐపీఎల్-2024లో 438 పరుగులు చేయడంతో పాటు.. జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చగలిగాడు.అయితే, డుప్లెసిస్ వయసు రీత్యా కెప్టెన్‌గా అతడిని కొనసాగించేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని.. యువ టీమిండియా ఆటగాడిని సారథిగా నియమించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.పంజాబ్ కింగ్స్ఐపీఎల్ టాప్ రన్ స్కోర్లలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఒకడు. అయితే, పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న అతడు గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో ఆరంభ మ్యాచ్‌ల తర్వాత గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.ధావన్ స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ పంజాబ్ కింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే, ప్లే ఆఫ్స్మాత్రం చేర్చలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడమే. ఇక ధావన్ ఇప్పటికే జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాదు దేశవాళీ క్రికెట్లోనూ ఆడటం లేదు. అలాంటి ఆటగాడిని సారథిగా కొనసాగించడంలో అర్థం లేదని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 38 ఏళ్ల ధావన్‌ను కెప్టెన్‌గా తప్పించి.. అతడి స్థానంలో యువ నాయకుడిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.లక్నో సూపర్ జెయింట్స్ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు మూడేళ్లుగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2022, 2023 సీజన్లలో లక్నోను టాప్-4లో నిలబెట్టిన రాహుల్.. 2024లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆటగాడినూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 520 పరుగులు చేసినప్పటికీ.. స్ట్రైక్‌రేటు(136.12) పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్‌పై బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా బాగానే ఉందని సంజీవ్ గోయెంకా సంకేతాలు ఇచ్చినా.. రాహుల్ మాత్రం బాగా హర్టయినట్లు సమాచారం. జట్టును వీడాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ సైతం రాహుల్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు! -
అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ధోని?.. కావ్యా మారన్ కామెంట్స్ వైరల్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 మెగా వేలం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) చేసిన ప్రతిపాదనను.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. పాత నిబంధనలు మళ్లీ ప్రవేశపెట్టి.. మహేంద్ర సింగ్ ధోని వంటి దిగ్గజాలను అవమానపరచడం సరికాదని ఆమె చెన్నై ఫ్రాంఛైజీకి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి టీమిండియా లెజెండరీ కెప్టెన్ ధోని సీఎస్కేతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చెన్నైని అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి.. సీఎస్కేకు పర్యాయపదంగా మారిపోయాడు ఈ మిస్టర్ కూల్. అయితే, ఐపీఎల్-2024లో రుతురాజ్ గైక్వాడ్‌ను తన వారసుడిగా ఎంపిక చేసుకున్న 43 ఏళ్ల ధోని.. వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే జట్టులో కొనసాగాడు. అవసరమైనపుడు రుతుకు సూచనలు, సలహాలు ఇస్తూ జట్టును ముందుకు నడిపించడంలో సహాయపడ్డాడు.నలుగురికే అవకాశం?అయితే, వయసు, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ధోని వచ్చే ఏడాది ఆటగాడిగా కొనసాగే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జట్టుకు వెన్నెముక అయిన ధోనిని ఇప్పుడే వదులుకునేందుకు సీఎస్కే సిద్ధంగా లేదని.. ధోని కూడా మరో ఏడాది పాటు ఫ్రాంఛైజీతో కొనసాగాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, మెగా వేలం నేపథ్యంలో కేవలం నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకునే అవకాశం ఉందన్న వార్తల నడుమ.. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరానా కోసం ధోని తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.అదే జరిగితే.. ఒకవేళ ధోని ఇంకా ఐపీఎల్లో ఆటగాడిగా కొనసాగాలనుకుంటే వేలంలోకి రావాల్సి ఉంటుంది. అయితే, సీఎస్కే యాజమాన్యం ఇందుకు ఇష్టపడటం లేదట. ఈ నేపథ్యంలో జూలై 31న భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులతో భేటీ సందర్భంగా ఆసక్తికర చర్చ లేవలెత్తినట్లు సమాచారం. ధోని కోసం పాత రూల్‌ను తిరిగి తీసుకురావాలని కోరినట్లు సమాచారం.అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనిఇందులో భాగంగా ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా గుర్తించాలని బీసీసీఐకి విన్నవించినట్లు తెలుస్తోంది. కాగా ఓ క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ ఏళ్లు గడిస్తే అతడిని అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలోకి తీసుకోవచ్చని.. 2008- 2021 వరకు ఐపీఎల్లో నిబంధన ఉండేది. ఈ రూల్‌ను తిరిగి తీసుకువస్తే.. ధోనిని ఆ విభాగంలో ఆటగాడిగా చేర్చి.. అన్క్యాప్డ్ప్లేయర్గా రిటైన్ చేసుకోవాలని సీఎస్కే తమ అభిప్రాయాన్ని సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.అలా చేస్తే అవమానించినట్లే ఇందుకు స్పందించిన సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్.. సీఎస్కే ప్రపోజల్‌ను తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో ఘనతలు సాధించిన ఆటగాళ్ల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు. ఇలా చేస్తే వారి విలువను తగ్గించినట్లే అవుతుంది. అలా కాదని.. అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో ఇలాంటి వాళ్లను రిటైన్ చేసుకుంటే వారికి చెల్లించే మొత్తం మిగతా వాళ్లకు వేలంలో లభించే కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పాత నిబంధనలు తిరిగి తీసుకురావాల్సిన అవసరం లేదు. ధోని ఐపీఎల్-2025 మెగా వేలంలోకి వస్తేనే మంచిది’’ అని కావ్యా మారన్ అన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది. -
అక్కడ రూ. 10 కోట్లు.. ఇక్కడ కోటిన్నర!.. కావ్యా మారన్ వ్యాఖ్యలు వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మెగా వేలానికి సంబంధించి ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి మధ్య చర్చలు వాడివేడిగా సాగినట్లు సమాచారం. ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్ విధానంలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని పలువురు ఫ్రాంఛైజీ యజమానులు కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నిషేధం విధించాలి‘‘వేలంలో ఓ ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత.. గాయం మినహా ఇతరత్రా కారణాలు చెప్పి సీజన్‌కు దూరమైతే అతడిపై కచ్చితంగా నిషేధం విధించాలి. నిజానికి ఒక్కో ఫ్రాంఛైజీ తమ జట్టు కూర్పు కోసం అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే ఒక ఆటగాడిని కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతుంది.కానీ కొందరు ఆటగాళ్లు ముఖ్యంగా విదేశీ ప్లేయర్లు వివిధ కారణాలు చెప్పి సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. తక్కువ మొత్తానికి అమ్ముడు పోవడం వల్లే వాళ్లు ఇలా చేస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ.. వాళ్లను కొనుక్కున్న మేము.. అర్ధంతరంగా వారు వెళ్లిపోవడం వల్ల కాంబినేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుందిఇక రిటెన్షన్ విషయానికొస్తే.. అట్టిపెట్టుకునే ఆటగాళ్లకు కేటాయించే మొత్తంలో మాకు స్వేచ్ఛ ఇవ్వాలి. అలా అయితే ఆటగాళ్లతో విభేదాలు తలెత్తకుండా ఉంటుంది. ఎందుకంటే.. కొంతమంది తమ కంటే తక్కువ నైపుణ్యాలు కలిగి ఉన్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీ తమ అవసరాల దృష్ట్యా ఎక్కువ మొత్తం చెల్లిస్తుందని భావిస్తూ ఉంటారు. ఇలాంటివి విభేదాలకు దారితీస్తాయి. ఈ వ్యవహారం కాంట్రాక్టు రద్దు చేసుకునేదాకా కూడా వెళ్తుంది.అయినా.. ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని జట్లలో చాకుల్లాంటి విదేశీ ప్లేయర్లు ఉంటే.. మరికొన్ని జట్లలో టీమిండియా సూపర్స్టార్లు ఉంటారు. ఇంకొన్నింటిలో నైపుణ్యాలు గల అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా ఉంటారు.మా జట్టు బలం వారేఉదాహరణకు.. మా విషయమే తీసుకుంటే.. మా జట్టులో విదేశీ ఆటగాళ్ల బెంచ్ పటిష్టంగా ఉంది. కాబట్టి మేము.. నలుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు ఇద్దరు క్యాప్డ్ ఇండియన్స్ లేదంటే ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో పాటు ముగ్గురు అన్క్యాప్డ్ ఇండియన్స్.. ఇలాంటి కాంబినేషన్లలో రిటైన్ చేసుకునే విధానం ఉంటే బాగుంటుందని భావిస్తాం. ఈ విషయంలో ఐపీఎల్ పాలక మండలి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి’’ అని కావ్యా మారన్ అభిప్రాయపడింది. ఈ మేరకు క్రిక్‌బజ్ కథనం ప్రచురించింది.రన్నరప్‌తో సరికాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎక్కువ శాతం విదేశీ ఆటగాళ్లే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు వరల్డ్‌క్లాస్ టీ20 స్టార్ హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్ వంటి వాళ్లు జట్టుకు బలం. ఇక గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఏకంగా ఫైనల్ చేరుకుంది.అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన టైటిల్ పోరులో వెనుకబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఆద్యంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి లీగ్ చరిత్రలో ఆల్‌టైమ్ హయ్యస్ట్ స్కోరు(287/3) రికార్డును తమ పేరిట లిఖించుకుంది.అక్కడ పది కోట్లు కాగా ఐపీఎల్-2024 వేలంలో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగను రూ. 1.5 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. అయితే, గాయం పేరు చెప్పి అతడు సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కానీ అతడు వేరే కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉన్నాడని ఫ్రాంఛైజీ భావించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఆర్సీబీకి ఆడిన అతడు రూ. 10 కోట్లు అందుకున్న విషయం తెలిసిందే. -
IPL: అలాంటి వాళ్లపై నిషేధం?.. ఫ్రాంఛైజీల షాకింగ్ డిమాండ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఖరీదైన వ్యవహారం. ఫ్రాంఛైజీ యజమానులు వేలంలో రేసు గుర్రాల్లాంటి క్రికెటర్లను సొంతం చేసుకోవడానికి కోట్లకు కోట్లు కుమ్మరించడానికి కూడా వెనకాడరు. సదరు ఆటగాడి అవసరం తమ జట్టుకు ఉందని భావిస్తే ప్రత్యర్థులతో పోటీపడి భారీ మొత్తానికి కొనుగోలు చేస్తారు.తమ బ్రాండ్ వాల్యూను పెంచుకునేందుకు స్టార్ల కోసం జరిగే వేటలో తగ్గేదేలే అంటూ కనక వర్షం కురిపిస్తారు. అయితే, ఇటీవలి కాలంలో విదేశీ ఆటగాళ్లు, బోర్డుల కారణంగా ఫ్రాంఛైజీలకు తలనొప్పులు ఎక్కువయ్యాయి. చాలా మంది ఆటగాళ్లు సీజన్ ఆరంభానికి ముందే లీగ్ నుంచి తప్పుకొంటుండగా.. మరికొందరు జాతీయ విధుల దృష్ట్యా మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు.అసలు కారణం అదే?!అయితే, వ్యక్తిగత కారణాలు చూపేవారిలో చాలా మంది తప్పుడు సమాచారమే ఇస్తున్నారని ఫ్రాంఛైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలో అనుకున్నంత సొమ్ము దక్కకపోవడంతోనే చాలా మంది అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సాకులతో తప్పించుకునే విదేశీ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ఇటీవల బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్‌తో ఫ్రాంఛైజీ అధికారులు సమావేశమై.. ఈ విషయం గురించి చర్చించారు. విదేశీ ఆటగాళ్లు తప్పుకొంటున్నామన్న నిర్ణయాన్ని అకస్మాత్తుగా చెప్పడం వల్ల తమ ప్రణాళికలు దెబ్బతింటున్నాయని.. వారి స్థానంలో అప్పటికప్పుడు మరో విదేశీ ప్లేయర్‌ను భర్తీ చేయడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై వేటు వేయాలి!ఈ నేపథ్యంలో సాకులు చెప్పి తప్పించుకునే విదేశీ ఆటగాళ్లపై వేటు వేయాలని విజ్ఞప్తి చేసినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక సమయంలో స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో అతడు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. బట్లర్ లేని లోటు రాయల్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే ఆ జట్టు రేసు నుంచి నిష్క్రమించింది. అయితే, ఇంగ్లండ్ బోర్డు తనను అర్ధంతరంగా వెనక్కి పిలిపించడంపై బట్లర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఐపీఎల్‌లోని పది ఫ్రాంఛైజీల యజమానులు బుధవారం(జూలై 31) బీసీసీతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఆటగాళ్ల రిటెన్షన్ విధానం, సాలరీ క్యాప్స్, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన తదితర అంశాల గురించి ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. పది జట్లుకాగా పదిహేడేళ్లుగా ఈ క్యాష్ రిచ్ లీగ్ విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్రస్తుతం బరిలో ఉన్నాయి.చదవండి: Ind vs SL: ఇది చాలదు.. ఇంకా కావాలి.. సూర్యకు కంగ్రాట్స్: గంభీర్NEW FOREIGN PLAYERS RULE. 🚨- IPL teams have requested the BCCI to take actions against foreign players who withdraw last minute from the season. (Cricbuzz). pic.twitter.com/vJTOmTtOsI— Mufaddal Vohra (@mufaddal_vohra) July 31, 2024 -
ఐపీఎల్ మినీ వేలం 2023
-
నీకు రూ. 20.50 కోట్లు... నాకు రూ. 24.75 కోట్లు
ఐపీఎల్ వేలం షురూ... ముందుగా బ్యాటర్ల జాబితా... అది ముగిసిన తర్వాత రెండో సెట్ క్యాప్డ్ బౌలర్ల జాబితా ముందుకు వచ్చింది... నాలుగో ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ పేరు వినిపించింది... రూ.2 కోట్ల కనీస విలువతో వేలం మొదలైంది... చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ముందుగా పోటీ పడగా, ఆపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వచ్చి చేరింది. రూ.7.80 కోట్ల వద్ద సన్‌రైజర్స్ బరిలోకి దిగింది.. ఆపై మిగతా జట్లు తప్పుకోగా... రైజర్స్, ఆర్సీబీ మాత్రమే వేలం మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాయి... రూ.20.25 కోట్ల వద్ద రెండు టీమ్‌లు ఆగాయి... దానికి మరో రూ.25 లక్షలు సన్‌రైజర్స్ జోడించాక బెంగళూరు స్పందించలేదు. రూ.20.50 కోట్లతో కమిన్స్ హైదరాబాద్ చెంత చేరడంతో ఐపీఎల్లో కొత్త రికార్డు నమోదైంది. కానీ సినిమా అంతటితో ముగిసిపోలేదు... గంట సేపటి తర్వాత మిచెల్ స్టార్క్ పేరు వేలంలోకి వచ్చింది... ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ మొదలు పెట్టింది. ఆపై ముంబై, కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) సీన్లోకి వచ్చేశాయి. కోల్‌కతా, గుజరాత్ టైటాన్స్ పోటీ పడి స్టార్క్ విలువను రూ.20 కోట్లు దాటించేశాయి... అయినా ఇరు జట్లు వెనక్కి తగ్గలేదు. ఆసీస్ పేసర్ కోసం పోటీని కొనసాగించాయి... మరింత వేగంగా ఈ మొత్తం రూ.24.50 కోట్లకు చేరింది... ఈ దశలో కోల్‌కతా మరో అడుగు ముందుకేసింది... గుజరాత్ ఇక చాలనుకుకోవడంతో రూ.24.75 కోట్లతో స్టార్క్ తన సహచరుడు కమిన్స్ రికార్డును కొద్ది సేపటికే బద్దలు కొట్టేశాడు. ఇద్దరు స్టార్ ఆసీస్ పేసర్లు కలిసి ఐపీఎల్ ద్వారా రూ. 45.25 కోట్లతో పండగ చేసుకున్నారు! ఐపీఎల్ వేలం ఎప్పటిలాగే అంచనాలకు భిన్నంగా ఊహించని రీతిలో సాగింది. పేరుకే మినీ వేలం అయినా ఆటగాళ్లకు లభించిన మొత్తాలు మెగా వేలంలా అనిపించాయి. పెద్దగా గుర్తింపు లేని, టి20 ఫార్మాట్లో అంతగా అద్భుతాలు చూపించని ఆటగాళ్లపై కూడా కాసుల వాన కురవగా, ఇప్పటికే తమ ఆటతో సత్తా నిరూపించుకున్న కొందరికి ఆశ్చర్యకరంగా తక్కువ విలువే దక్కింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్, న్యూజిలాండ్ ప్లేయర్ డరైల్ మిచెల్, విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్, హరియాణా బౌలర్ హర్షల్ పటేల్ భారీ సొమ్మును తమ ఖాతాలో వేసుకోగా... అన్క్యాప్డ్ భారత ఆటగాడు సమీర్ రిజ్వీ (ఉత్తరప్రదేశ్), కుమార్ కుశాగ్ర (జార్ఖండ్) భారీ విలువ పలికి సంచలనం సృష్టించడం వేలంలో హైలైట్. 72 మంది ఆటగాళ్లతో... దుబాయ్: ఐపీఎల్–2024 కోసం మంగళవారం జరిగిన వేలం ముగిసింది. మొత్తం 332 మంది ఆటగాళ్లు వేలంలో అందుబాటులోకి రాగా... 10 ఫ్రాంచైజీలు కలిసి 72 మందిని ఎంచుకున్నాయి. ఇందులో 30 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వేలంలో గరిష్టంగా 77 మందిని తీసుకునే అవకాశం ఉన్నా... కోల్‌కతాలో 2 ఖాళీలు, రాజస్తాన్‌లో 3 ఖాళీలు ఉండిపోయాయి. తొలిసారి విదేశీ గడ్డపై జరిగిన ఐపీఎల్ వేలంను మొదటిసారి ఓ మహిళ (మల్లిక సాగర్) నిర్వహించడం విశేషం. మధ్యాహ్నం 1 గంటకు మొదలైన వేలం స్వల్ప విరామాలతో రాత్రి 9 గంటల వరకు సాగింది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.230 కోట్ల 45 లక్షలు వెచ్చించాయి. ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లతో కొత్త రికార్డు నెలకొల్పగా... 24 మంది క్రికెటర్లను కనీస విలువ రూ.20 లక్షలతో జట్లు సొంతం చేసుకున్నాయి. వచ్చే సీజన్ ఐపీఎల్ మార్చి 22 నుంచి మే 26 జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ వేలం విశేషాలు... ♦ విండీస్ ప్లేయర్ రావ్మన్ పావెల్ కోసం రాజస్తాన్ భారీ మొత్తం (రూ.7.40 కోట్లు) వెచ్చించింది. గతంలో ఢిల్లీ తరఫున ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా... కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తమ జట్టు బార్బడోస్ రాయల్స్‌కు అతను కెపె్టన్ కావడమే ప్రధాన కారణం. ♦ హ్యారీ బ్రూక్‌ను చాలా తక్కువ మొత్తం (రూ.4 కోట్లు)కే ఢిల్లీ సొంతం చేసుకుంది. గత ఏడాది సన్‌రైజర్స్ బ్రూక్‌కు రూ. 13.25 కోట్లు ఇచ్చింది. ♦ బెంగళూరు తరఫున 3 సీజన్లలో ఆకట్టుకున్న లెగ్‌స్పిన్నర్ హసరంగను సన్‌రైజర్స్ చాలా తక్కువ మొత్తానికి (రూ. 1.50 కోట్లు) సొంతం చేసుకుంది. ♦ వన్డే వరల్డ్‌కప్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చినా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు తక్కువ మొత్తమే (రూ.1.80కోట్లు) దక్కింది. అతని సహచరుడు డరైల్ మిచెల్ కోసం మాత్రం చెన్నై చాలా మొత్తం (రూ.14 కోట్లు) ఖర్చు చేసింది. ♦ ఫామ్ కోల్పోయి భారత జట్టులో స్థానం చేజార్చుకోవడంతో పాటు ఐపీఎల్‌లోనూ భారీగా పరుగులిస్తూ వచ్చిన హర్షల్ పటేల్ కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.11.75 కోట్లు వెచ్చించింది. ♦ విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ కోసం బెంగళూరు అనూహ్యంగా చాలా పెద్ద మొత్తం (రూ.11.50 కోట్లు) చెల్లించింది. ♦ ఒకే ఒక అంతర్జాతీయ వన్డే, 2 టి20లు ఆడిన ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్‌కు రూ. 10 కోట్లు దక్కడం అనూహ్యం. ♦ వేలంలో ముందుగా పేరు వచ్చినప్పుడు రిలీ రోసో (దక్షిణాఫ్రికా)ను ఎవరూ పట్టించుకోలేదు కానీ చివర్లో పంజాబ్ కింగ్స్ రూ. 8 కోట్లకు అతడిని కొనుగోలు చేయడం విశేషం. వేలంలో టాప్–10 వీరే... 1. స్టార్క్ (కోల్‌కతా) రూ. 24.75 కోట్లు 2. కమిన్స్ (హైదరాబాద్) రూ. 20.50 కోట్లు 3. మిచెల్ (చెన్నై) రూ. 14 కోట్లు 4. హర్షల్ పటేల్ (పంజాబ్) రూ. 11.75 కోట్లు 5. జోసెఫ్ (బెంగళూరు) రూ. 11.50 కోట్లు 6. స్పెన్సర్ జాన్సన్ (గుజరాత్) రూ. 10 కోట్లు 7. సమీర్ రిజ్వీ (చెన్నై) రూ. 8.40 కోట్లు 8. రిలీ రోసో (పంజాబ్) రూ. 8 కోట్లు 9. షారుఖ్ (గుజరాత్) రూ. 7.40 కోట్లు 10. పావెల్ (రాజస్తాన్) రూ. 7.40 కోట్లు నిజంగానే షాక్‌కు గురయ్యాను. ఇంత మొత్తాన్ని అసలు ఊహించలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ టి20 లీగ్‌లో మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు విలువ పెరిగినా నా ఆటతీరు ఎప్పుడూ మారలేదు. భారీ మొత్తం కాబట్టి ఒత్తిడి సహజమే అయినా... నాకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. –మిచెల్ స్టార్క్ సన్‌రైజర్స్‌తో జత కట్టేందుకు అమితోత్సాహంతో ఉన్నా. ఆరెంజ్ ఆర్మీ గురించి చాలా విన్నా. హైదరాబాద్‌లో కూడా మ్యాచ్‌లు ఆడా. నాకు బాగా నచ్చింది. నాతో పాటు హెడ్ కూడా ఉన్నాడు. విజయాలతో సీజన్ సాగాలని ఆశిస్తున్నా. –ప్యాట్ కమిన్స్ మిచెల్ స్టార్క్ రెండు సార్లు మాత్రమే ఐపీఎల్లో (2014–15) అదీ బెంగళూరు జట్టు తరఫునే ఆడాడు. 27 మ్యాచ్‌లలో 7.16 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను ఎనిమిది సీజన్ల పాటు లీగ్‌కు దూరంగా ఉన్నాడు. 2018లో కోల్‌కతా అతడిని ఎంచుకున్నా... గాయంతో టోర్నీకి ముందే తప్పుకున్నాడు. ప్యాట్ కమిన్స్ ఢిల్లీ తరఫున 12 మ్యాచ్‌లు, కోల్‌కతా తరఫున 30 మ్యాచ్‌లు ఆడి మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు. 2020 వేలంలో కేకేఆర్ అతనికి రూ. 15.50 కోట్లు ఇచ్చింది. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా 2023 సీజన్లో కమిన్స్ ఆడలేదు. వరల్డ్ కప్‌లో జట్టును విజేతగా నిలిపి అతను మళ్లీ ఇక్కడ అడుగు పెట్టాడు. -
IPL 2024: ఎవరెవరు ఏ జట్టులో...
కోల్‌కతా నైట్‌రైడర్స్ (10) మిచెల్ స్టార్క్ (రూ. 24 కోట్ల 50 లక్షలు; ఆ్రస్టేలియా), ముజీబ్ రెహ్మాన్ (రూ. 2 కోట్లు; అఫ్గానిస్తాన్), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (రూ. కోటీ 50 లక్షలు; వెస్టిండీస్), అట్కిన్సన్ (రూ. 1 కోటీ; ఇంగ్లండ్), మనీశ్ పాండే (రూ. 50 లక్షలు; భారత్), కేఎస్ భరత్ (రూ. 50 లక్షలు; భారత్), చేతన్ సకారియా (రూ. 50 లక్షలు; భారత్), అంగ్క్రిష్ రఘువంశీ (రూ. 20 లక్షలు; భారత్), రమణ్‌దీప్ సింగ్ (రూ. 20 లక్షలు, భారత్), సకీబ్ హుస్సేన్ (రూ. 20 లక్షలు; భారత్). ఢిల్లీ క్యాపిటల్స్ (9) కుమార్ కుశాగ్ర (రూ. 7 కోట్ల 20 లక్షలు; భారత్), జై రిచర్డ్సన్ (రూ. 5 కోట్లు; ఆ్రస్టేలియా), హ్యారీ బ్రూక్ (రూ. 4 కోట్లు; ఇంగ్లండ్), సుమిత్ కుమార్ (రూ. 1 కోటీ; భారత్), షై హోప్ (రూ. 75 లక్షలు; వెస్టిండీస్), ట్రిస్టన్ స్టబ్స్ (రూ. 50 లక్షలు; దక్షిణాఫ్రికా), రికీ భుయ్ (రూ. 20 లక్షలు; భారత్), స్వస్తిక్ చికారా (రూ. 20 లక్షలు; భారత్), రసిక్ ధార్ (రూ. 20 లక్షలు; భారత్). గుజరాత్ టైటాన్స్ (8) స్పెన్సర్ జాన్సన్ (రూ. 10 కోట్లు; ఆస్ట్రేలియా), షారుఖ్ ఖాన్ (రూ. 7 కోట్ల 40 లక్షలు; భారత్), ఉమేశ్ యాదవ్ (రూ. 5 కోట్ల 80 లక్షలు; భారత్), రాబిన్ మింజ్ (రూ. 3 కోట్ల 60 లక్షలు; భారత్), సుశాంత్ మిశ్రా (రూ. 2 కోట్ల 20 లక్షలు; భారత్), కార్తీక్ త్యాగి (రూ. 60 లక్షలు; భారత్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ. 50 లక్షలు; అఫ్గానిస్తాన్), మానవ్ సుథర్ (రూ. 20 లక్షలు; భారత్). ముంబై ఇండియన్స్ (8) గెరాల్డ్ కొయెట్జీ (రూ. 5 కోట్లు; దక్షిణాఫ్రికా), నువాన్ తుషారా (రూ. 4 కోట్ల 80 లక్షలు; శ్రీలంక), దిల్షాన్ మదుషంక (రూ. 4 కోట్ల 60 లక్షలు; శ్రీలంక), మొహమ్మద్ నబీ (రూ. 1 కోటీ 50 లక్షలు; అఫ్గానిస్తాన్), శ్రేయస్ గోపాల్ (రూ. 20 లక్షలు; భారత్), శివాలిక్ శర్మ (రూ. 20 లక్షలు; భారత్), అన్షుల్ కంబోజ్ (రూ. 20 లక్షలు; భారత్), నమన్ ధీర్ (రూ. 20 లక్షలు; భారత్). పంజాబ్ కింగ్స్ (8) హర్షల్ పటేల్ (రూ. 11 కోట్ల 75 లక్షలు; భారత్), రిలీ రోసో (రూ. 8 కోట్లు; దక్షిణాఫ్రికా), క్రిస్ వోక్స్ (రూ. 4 కోట్ల 20 లక్షలు; ఇంగ్లండ్), తనయ్ త్యాగరాజన్ (రూ. 20 లక్షలు; భారత్), విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (రూ. 20 లక్షలు; భారత్), అశుతోష్ శర్మ (రూ. 20 లక్షలు; భారత్), శశాంక్ సింగ్ (రూ. 20 లక్షలు; భారత్), ప్రిన్స్ చౌధరీ (రూ. 20 లక్షలు; భారత్). సన్‌రైజర్స్ హైదరాబాద్ (6) ప్యాట్ కమిన్స్ (రూ. 20 కోట్ల 50 లక్షలు; ఆ్రస్టేలియా), ట్రవిస్ హెడ్ (రూ. 6 కోట్ల 80 లక్షలు; ఆ్రస్టేలియా), జైదేవ్ ఉనాద్కట్ (రూ. 1 కోటీ 60 లక్షలు; భారత్), హసరంగ (రూ. 1 కోటీ 50 లక్షలు; శ్రీలంక), జథవేద్ సుబ్రమణ్యన్ (రూ. 20 లక్షలు; భారత్), ఆకాశ్ సింగ్ (రూ. 20 లక్షలు; భారత్). లక్నో సూపర్ జెయింట్స్ (6) శివమ్ మావి (రూ. 6 కోట్ల 40 లక్షలు; భారత్), సిద్ధార్థ్ (రూ. 2 కోట్ల 40 లక్షలు; భారత్), డేవిడ్ విల్లీ (రూ. 2 కోట్లు; ఇంగ్లండ్), ఆష్టన్ టర్నర్ (రూ. 1 కోటీ; ఆస్ట్రేలియా), అర్షిన్ కులకర్ణి (రూ. 20 లక్షలు; భారత్), అర్షద్ ఖాన్ (రూ. 20 లక్షలు; భారత్). చెన్నై సూపర్ కింగ్స్ (6) డరైల్ మిచెల్ (రూ. 14 కోట్లు; న్యూజిలాండ్), సమీర్ రిజ్వీ (రూ. 8 కోట్ల 40 లక్షలు; భారత్), శార్దుల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు; భారత్), ముస్తఫిజుర్ రెహా్మన్ (రూ. 2 కోట్లు; బంగ్లాదేశ్), రచిన్ రవీంద్ర (రూ. 1 కోటీ 80 లక్షలు; న్యూజిలాండ్), అవినాశ్ రావు (రూ. 20 లక్షలు; భారత్). రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6) అల్జారీ జోసెఫ్ (రూ. 11 కోట్ల 50 లక్షలు; వెస్టిండీస్), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు; భారత్), ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు; న్యూజిలాండ్), టామ్ కరన్ (రూ. 1 కోటీ 50 లక్షలు; ఇంగ్లండ్), సౌరవ్ చౌహాన్ (రూ. 20 లక్షలు; భారత్), స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు; భారత్). రాజస్తాన్ రాయల్స్ (5) రోవ్‌మన్ పావెల్ (రూ. 7 కోట్ల 40 లక్షలు; వెస్టిండీస్), శుభమ్ దూబే (రూ. 5 కోట్ల 80 లక్షలు; భారత్), నాండ్రె బర్జర్ (రూ. 50 లక్షలు; దక్షిణాఫ్రికా), టామ్ కోలెర్ కాడ్మోర్ (రూ. 40 లక్షలు; ఇంగ్లండ్), ఆబిద్ ముస్తాక్ (రూ. 20 లక్షలు; భారత్). ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీ దూకుడైన బ్యాటింగ్‌తో యూపీ టి20 లీగ్‌లో సత్తా చాటాడు. ఈ టోర్నీలో కాన్పూర్ సూపర్‌స్టార్స్ తరఫున 9 ఇన్నింగ్స్‌లలోనే 455 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దాంతో మూడు ఐపీఎల్ టీమ్‌లు ట్రయల్స్‌కు పిలిచాయి. యూపీ టీమ్ అండర్–23 టైటిల్ గెలుచుకోవడంలో అతనిదే కీలక పాత్ర. అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీ మ్యాచ్‌లో ఒకే రోజు 280 పరుగులు చేసి రికార్డు రిజ్వీకి ఉంది. జార్ఖండ్ వికెట్ కీపర్ అయిన కుమార్ కుశాగ్ర కూడా ధాటిగా ఆడగల సమర్థుడు. విజయ్ హజారే టోర్నీలో మహారాష్ట్రపై 355 పరుగుల ఛేదనలో 37 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టును గెలిపించడం అతడిని హైలైట్ చేసింది. మనోళ్లు నలుగురు... తాజా వేలంలో ఆంధ్ర ఆటగాళ్లు కేఎస్ భరత్ (రూ. 50 లక్షలు; కోల్‌కతా), రికీ భుయ్ (రూ. 20 లక్షలు; ఢిల్లీ), హైదరాబాద్ క్రికెటర్లు అరవెల్లి అవినాశ్ రావు (రూ. 20 లక్షలు; చెన్నై), తనయ్ త్యాగరాజన్ (పంజాబ్ కింగ్స్)లను ఆయా జట్లు ఎంచుకున్నాయి. స్మిత్‌కు మళ్లీ నిరాశే... టెస్టుల్లో దిగ్గజంగా, వన్డేల్లోనూ మంచి బ్యాటర్‌గా గుర్తింపు ఉన్న ఆ్రస్టేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌ను టి20లకు తగడని ఐపీఎల్ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అందుకే గత ఏడాదిలాగే ఈసారి కూడా కనీస విలువ రూ.2 కోట్లకు కూడా ఎవరూ తీసుకోలేదు. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో ఉన్న ఆసీస్ బౌలర్ హాజల్వుడ్నూ ఎవరు ఎంచుకోలేదు. వేలంలో అమ్ముడుపోని ఇతర గుర్తింపు పొందిన ఆటగాళ్లలో జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్), క్రిస్ జోర్డాన్ (ఇంగ్లండ్), టిమ్ సౌతీ (న్యూజిలాండ్), స్యామ్ బిల్లింగ్స్ (ఆ్రస్టేలియా), మిల్నే (న్యూజిలాండ్), తబ్రీజ్ షమ్సీ (దక్షిణాఫ్రికా), హనుమ విహారి, సర్ఫరాజ్ ఖాన్ (భారత్) తదితరులు ఉన్నారు. -
ఐపీఎల్ వేలం నిర్వహించనున్న మహిళ ఎవరో తెలుసా..?
మహిళల ఐపీఎల్ (WPL) తొట్టతొలి వేలాన్ని నిర్వహించేందుకు మల్లిక సాగర్ అడ్వానీ అనే మహిళను బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. ఇనాగురల్ WPL యొక్క వేలం ఇవాళ (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగనుంది. ఈ నేపథ్యంలో వేలం నిర్వహించనున్న మల్లిక గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ముంబైకి చెందిన మల్లిక అడ్వానీ పురాతన పెయింటింగ్స్ (ఆర్ట్)ను సేకరించే వృత్తిలో ఉన్నారు. ఆమె మోడ్రన్ అండ్ కాన్టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. అలాగే ఆమె ఆర్ట్ ఇండియా కన్సల్టెంట్స్ ఫర్మ్‌లో పార్ట్నర్గా కూడా ఉన్నారు. ఆక్షన్లు నిర్వహించడంలోనూ మల్లికకు పూర్వ అనుభవం ఉంది. 🥁🥁🥁 Doubling the #vivoProKabaddiPlayerAuction excitement is our auctioneer Mallika Sagar! Let's welcome our first Indian auctioneer and get ready for a 🤯 auction this season. pic.twitter.com/Qhw1YkC1rP — ProKabaddi (@ProKabaddi) August 26, 2021 పుండోల్స్ అనే ముంబై బేస్డ్ సంస్థ తరఫున వైవిధ్యభరితంగా వేలం నిర్వహించి గతంలో ఆమె వార్తల్లోకెక్కారు. క్రీడలకు సంబంధించిన వేలం నిర్వహణలోనూ మల్లికకు ప్రవేశం ఉంది. 2021 ప్రో కబడ్డీ లీగ్ వేలాన్ని ఆమె సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. వృత్తి రిత్యా మల్లికకు సంబంధించిన వివరాలు ఇవి. కాగా, పురుషుల ఐపీఎల్ వేలం ప్రక్రియను గతంలో హగ్ ఎడ్మియాడెస్, రిచర్డ్ మ్యాడ్లీ లేక చారు శర్మ నిర్వహించిన విషయం తెలిసిందే. మహిళల లీగ్ కోసం మహిళా ఆక్షనీర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో బీసీసీఐ మల్లిక పేరును కొద్ది రోజుల కిందటే తెరపైకి తెచ్చింది. ఇదిలా ఉంటే, ఇవాళ జరుగబోయే WPL వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు పాల్గొననుండగా.. కేవలం 90 స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. లీగ్‌లో పాల్గొనబోయే 5 జట్లు కనీసం 15 మంది ప్లేయర్లను కొనుగోలు చేస్తాయి. ఆయా ఫ్రాంచైజీలు ప్లేయర్ల కోసం 9 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫుల్ పర్స్ వ్యాల్యూ 12 కోట్లుగా ఉంది. ఒక్కో జట్టుకు కేవలం ఆరుగురు ఫారిన్ ప్లేయర్లను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. వేలంలో పాల్గొంటున్న క్రికెటర్లలో 24 మంది 50 లక్షల కనీస ధరకు, 30 మంది 40 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పేర్తు రిజిస్టర్ చేసుకున్నారు. 50 లక్షల విభాగంలో ఉన్నప్లేయర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ వంటి భారత క్రికెటర్లు.. ఎలైస్ పెర్రీ(ఆస్ట్రేలియా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), సోఫీ డెవినె (న్యూజిలాండ్), డియాండ్ర డొటిన్ (వెస్టిండీస్) వంటి విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వేలం ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభంకానుంది. ముంబై వేదికగా మార్చి 4 నుంచి WPL మొదలు కానుంది. ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడతాయి. మార్చి 22న ఫైనల్ జరుగుతుంది. -
డబ్ల్యూపీఎల్ వేలం.. బరిలో 409 మంది
ముంబై: వచ్చే నెలలో తొలిసారి నిర్వహించనున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నీ వేలం బరిలో నిలిచిన ప్లేయర్ల జాబితాను మంగళవారం విడుదల చేశారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు బరిలో ఉన్నాయి. గరిష్టంగా 90 బెర్త్‌ల కోసం మొత్తం 409 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. ఈనెల 13న ముంబైలో మధ్యాహ్నం 2:30 నుంచి వేలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 1525 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకోగా... చివరకు 409 మందిని ఎంపిక చేశారు. ఇందులో 246 మంది భారత క్రికెటర్లు... 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 24 మంది క్రికెటర్లు గరిష్ట కనీస ధర రూ. 50 లక్షల విభాగంలో ఉన్నారు. ఐదు ఫ్రాంచైజీలు రూ. 12 కోట్లు చొప్పున వేలంలో వెచ్చించడానికి వీలు ఉంది. ఒక్కో జట్టు 15 నుంచి 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు. గరిష్టంగా ఆరుగురు విదేశీ క్రికెటర్లను తీసుకోవచ్చు. వేలం బరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, షబ్నమ్, శరణ్య, నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ దీప్తి, కట్టా మహంతి శ్రీ, వై.హేమ, బారెడ్డి అనూష, చల్లా ఝాన్సీలక్ష్మీ, విన్నీ సుజన్... హైదరాబాద్ నుంచి అరుంధతి రెడ్డి, గొంగడి త్రిష, యషశ్రీ, మమత, ప్రణవి, కోడూరి ఇషిత ఉన్నారు. చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ . -
WPL Players Auction: 90 మందికే ఛాన్స్! కానీ 1000 పేర్లు నమోదు..
ఆరంభ మహిళల ఐపీఎల్(డబ్ల్యూపీఎల్)కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగమయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెటర్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మహిళల ఐపీఎల్‌కు సంబంధించిన మొట్టమొదటి వేలం ముంబై వేదికగా ఫిబ్రవరి 13న బీసీసీఐ నిర్వహించనుంది. కాగా న్యూస్ 18 రిపోర్ట్ ప్రకారం.. ఈ వేలంలో పాల్గొనేందుకు దాదాపు 1000 మంది మహిళా క్రికెటర్లు తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. "అరంగేట్ర మహిళల ఐపీఎల్లో ఆడేందుకు చాలా మంది క్రికెటర్లు ఆసక్తిగా ఉన్నారు. ఐపీఎల్ వేలం కోసం ఇప్పటికే 1000 మంది వరకు అమ్మాయిలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో భారత్‌తో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు" అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించినట్లు న్యూస్ 18 పేర్కొంది. 90 మందికే అవకాశం.. ఈ తొలి మహిళల ఐపీఎల్ సీజన్లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. ఒక్కో ప్రాంఛైజీకి 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేసుకోనేందుకు బీసీసీఐ అనుమతించింది. అంటే మొత్తంగా 90 మంది మాత్రమే ఈ వేలంలో అమ్ముడుపోతారు. 90 స్థానాలకు ఇక మొత్తం ఐదు ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి ఆయా సంస్ధలు మొత్తంగా రూ.4669.99 కోట్లను వెచ్చించాయి. మహిళల ఐపీఎల్ జట్లను కొనుగోలు చేసిన సంస్థలు ఇవే 1. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు) 2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు) 3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు) 4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు) 5. క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు) -
మహిళల ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
మహిళల ఐపీఎల్ (WPL)కు సంబంధించిన తొట్టతొలి వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న విధంగా వేలం ప్రక్రియను ఫిబ్రవరి తొలి వారంలో కాకుండా ఫిబ్రవరి 11, 13 తేదీల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మెజార్టీ శాతం WPL ఫ్రాంచైజీలను (ఐదులో నాలుగింటిని) దక్కించున్న యాజమాన్యాలు దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో (ILT20) బిజీగా ఉండనుండటం వేలం తేదీల్లో మార్పులకు కారణంగా తెలుస్తోంది. అందుకే ILT20 ఫైనల్ ముగిసాక ఈ తంతుని నిర్వహించాలని ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు బీసీసీఐని కోరాయట. ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. మరోవైపు వేలం ప్రక్రియను ఢిల్లీ లేదా ముంబై నగరాల్లో నిర్వహించే అవకాశం ఉంది. మహిళల టీ20 వరల్డ్‌కప్ ముగిశాక మార్చి 4 - 24 మధ్యలో WPLను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. WPLకు సంబంధించిన వివరాలు.. లీగ్‌లో మొత్తం జట్లు: 5 మ్యాచ్‌ల సంఖ్య (అంచనా): 22 వేదికలు (అంచనా): బ్రబౌర్న్ స్టేడియం (ముంబై), డీవై పాటిల్ స్టేడియం (ముంబై) జట్లు తదితర వివరాలు.. 1. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు) 2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు) 3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు) 4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు) 5. క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు) -
శుక్రవారం కోచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం
-
వేలంలో 991 మంది ఆటగాళ్లు! అతడికి అప్పుడు 14 కోట్లు.. ఇప్పుడు కనీసం కోటి ధరతో..
ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆక్షన్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేయడానికి గడువు నవంబర్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మినీ వేలంలో 991 ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. అందులో 714 భారత ఆటగాళ్లు, 277 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అదే విధంగా ఈ ఆటగాళ్ల జాబితాలో 185 మంది జాతీయ క్రికెటర్లు, 786 మంది ఫస్ట్‌క్లాస్, 20 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. 991 మంది ఆటగాళ్ల లిస్టులో 21 మంది తమ బేస్‌ప్రైజ్ రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నారు. కాగా 21 మంది జాబితాలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. ధర తగ్గించిన రహానే, ఇషాంత్ శర్మ కాగా ఈ సారి మినీవేలంలో 19 మంది టీమిండియా ఆటగాళ్లు భాగం కానున్నారు. వారిలో అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ వంటి ప్లేయర్లు ఉన్నారు. అయితే రహానే, ఇషాంత్ ఈ సారి తమ బేస్ ప్రైస్‌ను భారీగా తగ్గించారు. ఈ ఏడాది మెగా వేలంలో కోటి రూపాయలును కనీస ధరగా ఉంచిన రహానే.. ఇప్పుడు దాన్ని రూ. 50 లక్షలకు తగ్గించాడు. మయాంక్ పరిస్థితి మరీ దారుణం అదే విధంగా ఇషాంత్ కూడా తన బేస్ ప్రైస్‌ను రూ. 75లక్షలుగా నిర్ణయించుకున్నాడు. ఇక గతేడాది లక్నో సూపర్‌జెయింట్స్ రాకతో కేఎల్ రాహుల్ తమ జట్టును వీడటంతో పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. అతడి కోసం 14 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు విఫలం కావడంతో ఇటీవలే మయాంక్‌ను రిలీజ్ చేసింది. దీంతో ఇప్పుడు మినీ వేలంలో మయాంక్ తన కనీస ధరను కోటి రూపాయలుగా ప్రకటించడం గమనార్హం. 2 కోట్లు బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు వీరే నాథన్ కౌల్టర్-నైల్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రిలీ రోసోవ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్ 1.5 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్ సీన్ అబోట్, రిలే మెరెడిత్, ఝే రిచర్డ్సన్, ఆడమ్ జంపా, షకీబ్ అల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కోటి కనీస ధర కలిగిన ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, మోయిసెస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్ వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జామీసన్, మాట్ హెన్రీ, డారిన్ మిచెల్, టామ్ లాథమ్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షమ్సీ, కుశల్ పెరెరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షాయ్ హోప్, అకేల్ హోస్సేన్, డేవిడ్ వైస్ చదవండి: Pak Vs Eng: పాక్‌కు దిమ్మతిరిగేలా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు! టీమిండియాను వెనక్కినెట్టి.. -
అలాంటి వాళ్లకు స్థానం ఉండదు.. మయాంక్ కోసం పోటీ ఖాయం: భారత మాజీ క్రికెటర్
IPL 2023 Mini Auction- Mayank Agarwal: ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో మయాంక్ అగర్వాల్‌ను విడుదల చేసింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ. గత సీజన్లో తమ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్‌కు గుడ్ బై చెప్పింది. అతడి స్థానంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ క్రమంలో పంజాబ్ రిటెన్షన్ జాబితాలోలేని మయాంక్ వేలంలోకి రానున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మయాంక్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయమని అభిప్రాయపడ్డాడు. సంజయ్ మంజ్రేకర్(PC: Sanjay Manjrekar Twitter) మయాంక్ కోసం పోటీ ఎందుకంటే అందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘ఓ సీజన్లో చెత్తగా ఆడామంటే.. కచ్చితంగా వారి కోసం వెచ్చించిన డబ్బు గురించి యాజమాన్యం ఆలోచించడం సహజమే! మిగత వాళ్లతో పోలిస్తే మయాంక్ అగర్వాల్ విషయం కాస్త భిన్నం. అతడిని వదులుకోవడం ద్వారా వచ్చిన డబ్బులో కొంతమొత్తం చెల్లించి అతడిని మళ్లీ కొనుగోలు చేయవచ్చు. లేదంటే వేరే ఆప్షన్ల వైపు చూడొచ్చు. నిజానికి మయాంక్ అగర్వాల్ మంచి ఆటగాడు. ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు ఎంత మంచి వాడంటే.. కెప్టెన్‌గా ఉన్నపుడు తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నిజానికి గత సీజన్లలో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కెప్టెన్ అయిన తర్వాత టాపార్డర్‌లో ఉన్నా కొన్నిసార్లు తన ఓపెనర్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో పరుగులు చేయలేకపోయాడు. నిజానికి తనకు మరో ఏడాది పాటు అవకాశం ఇవ్వాల్సింది. అయితే ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు. తన విషయంలో చాలా బాధగా ఉంది. ఏదేమైనా.. సరైన ఓపెనర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంఛైజీలు మయాంక్ కోసం పోటీ పడటం ఖాయం. 150, 160 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయగల.. స్పిన్, పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్ బ్యాటర్‌ను కొనడానికి ఆసక్తి చూపిస్తాయి’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ సారథిగా వ్యవహరించిన మయాంక్.. 13 ఇన్నింగ్స్ ఆడి 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, కెప్టెన్‌గా పద్నాలుగింట ఏడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో జట్టును ఆరో స్థానంలో నిలిపాడు. చదవండి: IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..! Kane Williamson: నన్ను రిలీజ్ చేస్తారని ముందే తెలుసు.. అయినా హైదరాబాద్‌తో: కేన్ మామ భావోద్వేగం IPL 2023 Retention: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు నిన్ననే (నవంబర్ 15) తమ రిటెన్షన్ లిస్ట్‌తో పాటు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో కొందరిని అవమానకర రితీలో వదిలించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రిలీజ్ చేసిన ఆటగాళ్ల గత రికార్డులు, వారి సామర్ధ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోని ఫ్రాంచైజీలు.. సదరు ఆటగాళ్ల గత సీజన్ ఫామ్, ప్రస్తుత ఫామ్‌ను మాత్రమే కొలమానంగా తీసుకుని, కనీసం ముందస్తు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా తప్పించాయని సమాచారం. ఫ్రాంచైజీలు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా రిలీజ్ చేయడంపై చాలా మంది ఆటగాళ్లు తీవ్ర మనస్థాపానికి గరయ్యారని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. ముఖ్యంగా కొందరు స్టార్ ఆటగాళ్లు, మెగా వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు.. ఫ్రాంచైజీలు ఇలా అవమానకర రీతిలో తమతో వ్యవహరిస్తాయని ఊహించలేదని వాపోయినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (14 కోట్లు) పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (14 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్: నికోలస్ పూరన్ (10.75 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్: జేసన్ హోల్డర్ (8.75 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్: రొమారియో షెపర్డ్ (7.75 కోట్లు) ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా.. గుజరాత్ టైటాన్స్: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్. వీరిలో రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్‌లను కేకేఆర్ ట్రేడింగ్ చేసుకోగా, మిగిలిన ముగ్గురిని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం వేలానికి వదిలి పెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్. వీరిలో శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్ చేసుకోగా, ఢిల్లీ యాజమాన్యం మిగిలిన ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. రాజస్తాన్ రాయల్స్: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా. వీరిలో డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ స్టార్లను ఆర్ఆర్ యాజమాన్యం చిన్నచూపు చూసింది. కేకేఆర్: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్. వీరిలో పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, ఆరోన్ ఫించ్ వివిధ కారణాల చేత స్వతాహాగా లీగ్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించగా.. అలెక్స్ హేల్స్, అజింక్య రహానే, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే లాంటి స్టార్లకు అవమానకర ఉద్వాసన తప్పలేదు. పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ. వీరలో కెప్టెన్‌గా ఉన్న మయాంక్ అగర్వాల్ అత్యంత దారుణ పరాభవం కాగా, ఒడియన్ స్మిత్ లాంటి విదేశీ ప్లేయర్‌ను ఫ్రాంచైజీ అస్సలు పట్టించుకోలేదు. ఆర్సీబీ: జేసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. వీరిలో జేసన్ బెహ్రెండార్ఫ్ను కేకేఆర్ ట్రేడ్ చేసుకోగా.. రూథర్‌ఫోర్డ్‌కు బలవంతపు ఉద్వాసన తప్పలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్. ఈ ఫ్రాంచైజీనే అత్యధికంగా స్టార్ ఆటగాళ్లను తప్పించింది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్ లాంటి విదేశీ స్టార్లు తీవ్రంగా మనసు నొచ్చుకున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్: వేలానికి ముందు అత్యధిక మంది ప్లేయర్లను వదిలిపెట్టిన ఫ్రాంచైజీ ఇదే. ఈ జట్టు కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్‌ను రిలీజ్ చేసింది. ఎంపై మేనేజ్మెంట్.. వీరిలో పోలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుని తృప్తి పరచగా.. డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్ టైమల్ మిల్స్ లాంటి ఆటగాళ్లకు అవమానం తప్పలేదు. లక్నో సూపర్ జెయింట్స్: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్. వీరిలో ఆండ్రూ టై, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే లాంటి పేరున్న ఆటగాళ్లను యాజమాన్యం నిర్ధాక్షిణ్యంగా రిలీజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్. వీరిలో డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. క్రిస్ జోర్డాన్‌పై వేటు పడింది. -
ఐపీఎల్ 2023 వేలంలో కోట్లు కొల్లగొట్టబోయే ఆటగాళ్లు వీళ్లే..!
టీ20 వరల్డ్‌కప్-2022లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెందిన ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలంలో ఆ ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు ఎంత సొమ్మునైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే తమ మనీ పర్స్ లెక్కలు కూడా సరి చేసుకున్నాయి. మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరంటే.. తొలుత ప్రస్తావన వచ్చే పేర్లు బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), కెమరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), జాషువ లిటిల్ (ఐర్లాండ్), రిలీ రొస్సో (సౌతాఫ్రికా), అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్), సికందర్ రజా (జింబాబ్వే). ఈ లిస్ట్ చాంతాడంత ఉన్నప్పటికీ వేలంలో వీరిపై మాత్రం కనక వర్షం కురిసే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్-2022లో వీరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఫ్రాంచైజీలు వీరిపై ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాక బంగ్లాదేశ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ లిటన్ దాస్, ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్ లాంటి ఆటగాళ్ల కోసం కూడా తీవ్రంగా పోటీ నడిచే అవకాశం ఉంది. అత్యధిక ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ కోసం కనీసం 12 కోట్లు, సామ్ కర్రన్ కోసం 10 కోట్లు, కెమరూన్ గ్రీన్ కోసం 8 కోట్లు, ఐర్లాండ్ పేసర్ జాషువ లిటిల్ కోసం 6 కోట్లు, రిలీ రొస్సో, అలెక్స్ హేల్స్, సికందర్ రజాల కోసం తలా 4 కోట్లు వెచ్చించేందుకు ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్లు వేసుకున్నట్లు సమాచారం. అలాగే లిటన్ దాస్, హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్‌లపై తలో 2 కోట్లు వెచ్చించే ఛాన్స్ ఉంది. వీరే కాక, ఆయా జట్లు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో జేసన్ రాయ్, కేఎస్ భరత్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, జేమ్స్ నీషమ్, డేనియల్ సామ్స్, ఎవిన్ లూయిస్, జేసన్ హోల్డర్, మనీశ్ పాండే కోటి నుంచి 2 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
13 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబై ఇండియన్స్..
ఈ ఏడాది ఐపీఎల్లో ఘోరమైన ప్రదర్శన కనబరిచిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2023లో సరికొత్తగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు ఏకంగా 13 మంది ఆటగాళ్లను ముంబై విడిచిపెట్టింది. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ముంబై ఇండియన్స్ ట్విటర్లో షేర్ చేసింది. కాగా మినీ వేలం ముందు ఇంతమంది ఆటగాళ్లను ముంబై రిలీజ్ చేయడం ఇదే తొలి సారి. అదే విధంగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ తరపున ఆడిన జాసన్ బెహ్రెండార్ఫ్ను ముంబై ట్రెడ్ చేసుకుంది. మరోవైపు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరాన్ పోలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా ముంబై ఇండియన్స్ నియమించింది. కాగా ఐపీఎల్‌కు పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్ విడిచిపెట్టిన ఆటగాళ్లు: కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ చదవండి: IPL 2023: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే!
ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది. మంగళవారంతో రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించే గడువు ముగియడంతో ఆయా ప్రాంఛైజీలు తమ తుది జాబితాలను ప్రకటించాయి. ఏ ప్రాంఛైజీ ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయో, ఎవరని వేలంలో పెట్టాయో ఓ లూక్కేద్దాం. గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా ఆరుగురిని విడిచిపెట్టింది. ఇక ఓవరాల్‌గా మినీవేలంకు ముందు గుజరాత్ పర్స్‌లో 19.25 కోట్లు ఉన్నాయి. గుజరాత్ రిటైన్ లిస్ట్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాద్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్ గుజరాత్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 20 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా ఐదుగురుని విడిచిపెట్టింది. ఇక ఓవరాల్‌గా మినీ వేలంకు ముందు ఢిల్లీ పర్స్‌లో 19.45 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎంగిడి, ముస్తఫిజర్ రెహ్మన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్ ఢిల్లీ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్ రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు రాజస్తాన్ రాయల్స్ 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 9 మంది ప్లేయర్స్‌ను వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం రాజస్తాన్ పర్స్‌లో రూ. 13.2 కోట్లు ఉన్నాయి. రాజస్తాన్ రిటైన్ లిస్ట్ సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ రాజస్తాన్ విడిచిపెట్టిన జాబితా అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు కేకేఆర్ 11 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 16 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం కోల్‌కతా పర్స్‌లో రూ. 7.5 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ రిటైన్ లిస్ట్ శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్ కేకేఆర్ రిలీజ్ లిస్ట్ పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు పంజాబ్ 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 9 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం పంజాబ్ పర్స్‌లో రూ. 32.2 కోట్లు ఉన్నాయి. పంజాబ్ రిటైన్ లిస్ట్ శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బిఆర్ పంజాబ్ విడుదలచేసిన జాబితా మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు ఆర్సీబీ 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 5 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం ఆర్సీబీ పర్స్‌లో రూ. 8.75 కోట్లు ఉన్నాయి. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్‌మర్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్ ఆర్సీబీ విడుదల చేసిన ఆటగాళ్లు: జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ. సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్ విడిచిపెట్టిన ఆటగాళ్లు: కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ మిగిలిన పర్స్ బ్యాలన్స్: రూ. 20.55 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ కెఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బడోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ విడుదలైన ఆటగాళ్లు: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్ చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్‌ధర్, సింఘాధర్ , దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ విడిచిపెట్టిన ఆటగాళ్లు: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్ మిగిలిన పర్స్ బ్యాలన్స్: రూ. 20.45 కోట్లు -
విలియమ్సన్కు బిగ్ షాకిచ్చిన సన్‌రైజర్స్! పూరన్‌కు కూడా..
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు సన్‌రైజర్స్ హైదరాబాద్ బిగ్ షాకిచ్చింది. ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు విలియమ్సన్‌ను రిటైన్ చేసుకోకుండా వేలంలో పెట్టింది. అతడితో పాటు ఈ ఏడాది మెగా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్‌ను కూడా ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది. తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించే గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో ఎస్ఆర్హెచ్ తమ జాబితాను ప్రకటించింది. ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ కేవలం 12 మంది ఆటగాళ్లనే మాత్రమే రిటైన్ చేసుకుంది. నిరాశ పరిచిన విలియమ్సన్ ఈ ఏడాది మెగా వేలంలో కేన్ విలియమ్సన్‌ను ఎస్ఆర్హెచ్ రూ.14 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్లో విలియమ్సన్ తన స్దాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలయ్యాడు. 13 మ్యాచ్‌లు ఆడిన కేన్ మామ 216 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్సీ పరంగా కూడా అంతగా అకట్టుకోలేకపోయాడు. అదే విధంగా నికోలస్ పూరన్‌ను కూడా రూ.10.75 కోట్ల భారీ దరకు కొనుగోలు చేసింది. అతడు కూడా దారుణంగా విఫమయ్యాడు. మరో విండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెఫార్డ్ను కూడా ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. మెగా వేలంలో షెఫార్డ్ను రూ.7.75 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఇక ఓవరాల్‌గా మినీ వేలంకు ముందు ఎస్ఆర్హెచ్ పర్స్‌లో రూ.42.25 కోట్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ. సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ చదవండి: T20 WC 2022: 'రోహిత్ పని అయిపోయింది.. ఆ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయండి' -
IPL 2023: అతడు పూర్తిగా విఫలం.. 14 కోట్లు ఖర్చుపెట్టడం అంటే!
IPL 2023 Mini Auction - Kane Williamson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబరు 23న ఆక్షన్ నిర్వహించనున్న నేపథ్యంలో తమతో అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించేందుకు సన్నద్ధమయ్యాయి. ఇందుకు మంగళవారం (నవంబరు 15) ఆఖరి రోజు కావడంతో ఇప్పటికే తుది జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ హెడ్‌కోచ్ టామ్ మూడీ.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో అతడు మాట్లాడుతూ.. ‘‘మెగా వేలానికి ముందు కేన్ విలియమ్సన్ వంటి సమర్థుడైన ఆటగాడిని 14 కోట్ల రూపాయలకు జట్టు రిటైన్ చేసుకుందంటే.. యాజమాన్యం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి పెట్టుకునే ఈ పని చేసిందని అర్థం. అయితే, గత నాలుగు నెలలుగా టీ20 క్రికెట్లో అతడు పూర్తిగా విఫలమవుతున్నాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. తను గొప్ప నాయకుడు అని తెలుసు. ఆటలో తన శక్తిసామర్థ్యాల గురించి కూడా మాకు తెలుసు. కెప్టెన్‌గా ఐపీఎల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అతడికి మంచి గుర్తింపు ఉంది. 14 కోట్లు అంటే చాలా ఎక్కువ అందుకే కేన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఒకవేళ అతడిని ఫ్రాంఛైజీ రిలీజ్ చేసినా చేయకపోయినా.. నా దృష్టిలో ఒక ఆటగాడి మీద 14 కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయడమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టామ్ మూడీకి గుడ్ బై చెప్పిన ఎస్ఆర్ హెచ్.. విండీస్ లెజెండ్ బ్రియన్ లారాను తమ హెడ్‌కోచ్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే. అక్కడా.. ఇక్కడా.. కెప్టెన్‌గా కేన్ విఫలం ఇదిలా ఉంటే.. గత సీజన్లో కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లకు గానూ ఆరింట మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఇక గత టీ20 వరల్డ్‌కప్‌లో కేన్ బృందం రన్నరప్‌గా నిలవగా.. ఈసారి సెమీస్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్‌గానూ కేన్ ఇటీవల కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ అతడిని వదిలేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: IPL 2023: వేలంలో స్టోక్స్, సామ్ కర్రన్.. రికార్డు ధర ఖాయం..! IPL 2023: కేకేఆర్‌కు వరుస షాక్‌లు.. మరో ఇద్దరు ఔట్ -
IPL 2023: వేలంలో స్టోక్స్, కర్రన్.. ఆ రెండు జట్ల కన్ను వీరిపైనే..!
Ben Stokes, Sam Curran Available For IPL 2023 Auction: టీ20 వరల్డ్‌కప్-2022 హీరోలు, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కర్రన్లు.. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలానికి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్‌కప్‌లో, ముఖ్యంగా పాక్‌తో జరిగిన ఫైనల్లో సంచలన ప్రదర్శన నేపథ్యంలో ఈ ఇద్దరు మ్యాచ్ విన్నర్లపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వీరిని సొంతం చేసుకోవడం కోసం ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. వివిధ కారణాల చేత గత ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న వీరిని దక్కించేందుకు, ఎంత ధర అయినా వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తమ పర్స్ నుంచి ఏకంగా 20 కోట్లు వెచ్చించేందుకైనా రెడీ అన్న సంకేతాలు పంపాయని తెలుస్తోంది. అయితే ఐపీఎల్-2023 సీజన్ పూర్తయిన వెంటనే (జూన్) ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో వీరు ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. స్టోక్స్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా, కర్రన్ ఆ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఉన్న నేపథ్యంలో వీరు ఐపీఎల్-2023పై ఏ నిర్ణయం తీసుకుంటారోనని అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా, ఐపీఎల్ 16వ ఎడిషన్ భారత్ వేదికగా 2023 మార్చి 20-మే 28 మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఐపీఎల్లో స్టోక్స్ ప్రస్తానం.. 2017 సీజన్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్.. స్టోక్స్‌ను రికార్డు స్థాయిలో 14.5 కోట్లకు సొంతం చేసుకోగా, ఆతర్వాతి సీజనే (2018) రాజస్తాన్ రాయల్స్ అతన్ని 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి వరుసగా రెండు సీజన్ల పాటు (2019, 2020) ఆర్ఆర్ తరఫున సత్తా చాటిన స్టోక్స్.. 2021 సీజన్లో గాయపడటంతో టోర్నీ ఆరంభంలోనే జట్టును వీడాడు. ఆతర్వాత 2022 మెగా వేలంలో ఆర్ఆర్ అతన్ని రిటైన్ చేసుకోకపోవడంతో అలకబూనిన స్టోక్స్.. మెగా వేలంలో తన పేరును సైతం రిజిస్టర్ చేసుకోలేదు. 🚨 Ben Stokes have been made available for the IPL mini auction.#IPLAuction #IPL2023 #IPL2023Auction #Ipl2023Retention #IPLretention #ipltrade #IPL #iplauction2023 #iplretentions #IPLT20 #BenStokes pic.twitter.com/V9P1Z1rrCZ — Top Edge Cricket (@topedge_cricket) November 15, 2022 ఐపీఎల్లో సామ్ కర్రన్ ప్రస్తానం.. 2019లో టీమిండియాపై సంచలన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన సామ్ కర్రన్‌ను అదే ఏడాది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 7.2 కోట్ల భారీ మొత్తం వెచ్చింది కొనుగోలు చేసింది. ఆ సీజన్లో బంతితో, బ్యాట్‌తో ఓ మోస్తరుగా రాణించిన కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ 2020 వేలంలో అనూహ్యంగా వదులుకుంది. దీంతో ఆ సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని 5.5 కోట్లకు సొంతం చేసుకుంది. సీఎస్కే తరఫున 2020, 2021 సీజన్లలో పర్వాలేదనిపించిన కర్రన్.. 2022 మెగా వేలానికి ముందు గాయం బారిన పడి, ఆ సీజన్ వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. చదవండి: ఐపీఎల్ 2023కు ముగ్గురు ఆసీస్ స్టార్లు డుమ్మా.. దేశ విధులే ముఖ్యమంటూ..! -
యువ ఆటగాడిని రిటైన్ చేసుకున్న లక్నో..
ఐపీఎల్-2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని నవంబర్ 15 వరకు బీసీసీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంజైలు తాము రిటైన్, విడుదల చేసే ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా యువ ఆటగాడు అయుష్ బదోని రిటైన్ చేసుకున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని లక్నో ట్విటర్ వేదికగా వెల్లడించింది. కాగా ఈ ఏడాది సీజన్లో లక్నో తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన బదోని ఆకట్టుకున్నాడు. ఐపీఎల్-2022లో 11 మ్యాచ్‌లు ఆడిన బదోని 161 పరుగులు చేశాడు. అదే విధంగా ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా బదోని అదరగొట్టాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన అయుష్ తమ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. Never underestimate the young guns! We’re all waiting to watch Ayush Badoni perform like a boss🙌 Welcome aboard, Ayush💪🔥#AyushBadoni #YoungGuns #LucknowSuperGiants #TATAIPL pic.twitter.com/W84bClwYdV — Lucknow Super Giants (@LucknowIPL) March 12, 2022 చదవండి: T20 WC Final: ఇంగ్లండ్, పాక్ ఫైనల్.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్ -
స్టార్ ఆల్‌రౌండర్‌ను వదులుకున్న ముంబై, జడేజాను అట్టిపెట్టుకున్న చెన్నై..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి ఎడిషన్ (16) కోసం ఇప్పటినుంచే సన్నాహకాలు ఊపందుకున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితా పాటు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్ 15ను డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో ప్రముఖ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. తమ రిలీజ్డ్, రీటెయిన్డ్ ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలుస్తోంది. తదుపరి సీజన్‌కు ముంబై వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాలో విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2010 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తూ, జట్టకు ఎన్నో అపురూప విజయాలు అందించిన పోలీని.. ఇలా అవమానకర రీతిలో తప్పించడం బాధాకరమని ఎంఐకి సంబంధించిన అతని ఫ్యాన్స్ వాపోతున్నారు. పోలార్డ్‌తో పాటు ఫాబ్ అలెన్, తైమాల్ మిల్స్, మయాంక్ మార్కండే, హతిక్ షోకీన్‌లను కూడా ఎంఐ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. పేస్ విభాగం బలం పెంచుకోవడం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి జేసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను ట్రేడింగ్ చేసుకున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల మీడియా కథనం మేరకు ముంబై అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేనియల్ సామ్స్, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క ఫోర్ టైమ్ ఛాంపియన్ సీఎస్కే అనూహ్యంగా రవీంద్ర జడేజాను అట్టిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలా జరగడానికి జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. గత సీజన్లో సీఎస్కే యజమాన్యానికి, జడేజాకు మధ్య విభేదాలు తలెత్తడంతో.. జడ్డూ లీగ్ మధ్యలోనే గాయం సాకుగా చూపి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక సీఎస్కే వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాలో క్రిస్ జోర్డన్, ఆడమ్ మిల్నే, మిచెల్ సాంట్నర్ ఉన్నట్లు సమాచారం. సీఎస్కే కొనసాగించనున్న ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముకేశ్ చౌదరీ, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రియాన్ పరాగ్ ఊచకోత.. కెరీర్లో తొలి శతకం బాదిన రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ -
T20 WC 2022: ఓటమి బాధలో ఉన్న కేన్ మామకు మరో భారీ షాక్..!
టీ20 వరల్డ్‌కప్-2022లో కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు.. నిన్న (నవంబర్ 9) జరిగిన తొలి సెమీఫైనల్లో పాక్ చేతిలో ఘోర పరాజయం పొంది టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కివీస్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక, అదృష్టం కొద్దీ సెమీస్‌కు చేరిన పాక్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈసారైనా జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాలన్న కేన్ మామ కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఊహించని ఈ పరాభవంతో కుమిలిపోతున్న కేన్ మామకు ఇంతలోనే మరో షాక్ తగిలిందని తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని పక్కకు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కెప్టెన్‌గా కొనసాగుతున్న కేన్‌ను రీటైన్ చేసుకోకుండా, వేలంలో విడుదల చేయాలని సన్‌రైజర్స్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఓ కథనంలో పేర్కొంది. Kane Williamson could be released by Sunrisers Hyderabad. (Reported by Cricbuzz). — Mufaddal Vohra (@mufaddal_vohra) November 9, 2022 గత సీజన్‌కు ముందు విజయవంతమైన కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను వదులుకుని కేన్‌కు పగ్గాలు అప్పజెప్పిన యాజమాన్యం.. ఇప్పుడు అతని బ్యాటింగ్ వైఫల్యాలు, గత సీజన్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతని ఫెయిల్యూర్స్‌ను కారణంగా చూపి ఉద్వాసన పలకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో కేన్ 13 మ్యాచ్‌లు ఆడి 19.63 సగటున కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. అతని కెప్టెన్సీ వైఫల్యాల కారణంగా సన్‌రైజర్స్ గత సీజన్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. ఈ అంశాలతో కేన్ ఆటలో వేగం లోపించడం, అతని ప్రస్తుత ఫామ్, టీ20 వరల్డ్‌కప్‌లో అతను ప్రాతినిధ్యం వహించిన జాతీయ జట్టు ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని వేటు వేయాలని ఎస్ఆర్హెచ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కేన్‌తో పాటు రొమారియో షెపర్డ్, జగదీశ్ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజల్ హక్ ఫారూఖీ, శ్రేయాస్ గోపాల్‌లను వదిలేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరిగే ఐపీఎల్ 2023 మినీ వేలంలో వీరి భవితవ్యం తేలనుంది. -
IPL 2023: వచ్చే నెల 23న ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం కార్యక్రమానికి కేరళలోని కొచ్చి నగరం వేదిక కానుంది. డిసెంబర్ 23న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈసారి మెగా వేలం కాకుండా మినీ వేలం ఉంటుందని, ఈనెల 15వ తేదీలోపు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను సమర్పించాలని ఫ్రాంచైజీలను కోరినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంతోపాటు బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావించింది. చివరకు కొచ్చి నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. -
ఈసారి ఐపీఎల్ వేలం కొత్త ప్రదేశంలో.. పరిశీలనలో బెంగళూరు కూడా..!
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే మినీ వేలాన్ని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తుంది. ఐపీఎల్ కొత్త చైర్మన్‌గా ఎన్నికైన అరుణ్ సింగ్ ధుమాల్, కొత్త బ్రాడ్‌కాస్టర్ వయాకామ్‌కు చెందిన ప్రతినిధులు కూడా ఈ విషయంపై సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన బీసీసీఐ-ఐపీఎల్ గవర్నింగ్ బాడీ చర్చల్లో మినీ వేలం నిర్వహించే వేదికను టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌గా ఖరారు చేసినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ముందుగా అనుకున్న వేదిక బెంగళూరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ-ఐపీఎల్ అధికారులంతా ఇస్తాంబుల్ వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఈ విషయంపై తుది నిర్ణయం నవంబర్ తొలి వారంలో వెలువడే అవకాశం ఉంది. వేదిక మాట అటుంచితే.. ఐపీఎల్-2023కి సంబంధించి మినీ వేలాన్ని నిర్వహించే తేదీని డిసెంబర్ 16గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఆన్యూవల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం)లో మినీ వేలం తేదీని ఖరారు చేయడంతో పాటు ఫ్రాంచైజీల పర్స్ వ్యాల్యూని కూడా సవరించారని సమాచారం. పర్స్ వ్యాల్యూని రూ. 90 నుంచి 95 కోట్లకు పెంచారని బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చదవండి: ఐపీఎల్-2023 మినీ వేలానికి ముహూర్తం ఖరారు..! -
ఐపీఎల్-2023 మినీ వేలానికి ముహూర్తం ఖరారు..!
ఐపీఎల్-2023 మినీ వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. గత సీజన్ వేలం జరిగిన బెంగళూరులోనే ఈసారి కూడా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్-2023 సీజన్‌ను మార్చి చివరి వారంలో ప్రారంభించాలని భావిస్తున్న బీసీసీఐ.. డిసెంబర్ 16న మినీ వేలాన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇటీవల జరిగిన ఆన్యూవల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం)లో మినీ వేలం తేదీని ఖరారు చేయడంతో పాటు ఫ్రాంచైజీల పర్స్ వ్యాల్యూని కూడా సవరించారని తెలుస్తోంది. పర్స్ వ్యాల్యూని రూ. 90 నుంచి 95 కోట్లకు పెంచనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అక్టోబర్ 18న జరిగే వార్షిక సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, వచ్చే ఐపీఎల్ సీజన్‌ను హోమ్ అండ్ అవే పద్దతిలో (ఇంటా బయటా) నిర్వహిస్తామని బీసీసీఐ తాజా మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ దిగిపోవడం, సమీకరణలన్నీ మారిపోవడంతో ఐపీఎల్‌ను ఎక్కడ, ఎలా నిర్వహిస్తారో అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు ఈసారి నిర్వహించబోయే వేలంలో ఏయే మార్పులు జరుగుతాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, గుజరాత్ నుంచి శుభ్‌మన్ గిల్ బయటకు వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే వచ్చే ఏడాది ఐపీఎల్‌కు పలువురు కొత్త విదేశీ ప్టార్లు కూడా వస్తారని అభిమానులు భావిస్తున్నారు. మినీ వేలం.. టీ20 వరల్డ్‌కప్‌లో ప్రదర్శన ఆధారంగా జరుగనుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. -
షాహిన్ ఆఫ్రిది ఐపీఎల్ వేలంలోకి వస్తే 15 కోట్లకు అమ్ముడుపోయేవాడు: అశ్విన్
Asia Cup 2022: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిది గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో గనుక షాహిన్ పాల్గొంటే 14- 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయేవాడని పేర్కొన్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించగల సత్తా ఉన్న బౌలర్ అంటూ పాకిస్తానీ యువ పేసర్‌ను కొనియాడాడు. కీలక బౌలర్‌గా ఎదిగి! 2018లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన షాహిన్ ఆఫ్రిది జట్టులో కీలక పేసర్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు ఆడిన 25 టెస్టుల్లో 99, 32 వన్డేల్లో 62, 40 టీ20లలో 47 వికెట్లు తీసి సత్తా చాటాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో ఎన్నడూ లేని విధంగా టీమిండియాపై పాక్ గెలవడంలో షాహిన్ ఆఫ్రిది కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వికెట్లు తీసి పాక్ విజయానికి బాటలు పరిచాడు. ఇక గాయం కారణంగా ఆసియా కప్-2022 టోర్నీకి దూరమైన ఆఫ్రిది ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో.. ఆఫ్రిది సేవలు కోల్పోయామంటూ పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చేసిన వ్యాఖ్యలు జట్టులో అతడి పాత్ర ఏమిటో మరోసారి స్పష్టం చేశాయి. వైరల్ అవుతున్న అశ్విన్ వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌కు ముందు తన యూట్యూబ్ చానెల్ వేదికగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు అశూ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తానీ ఫాస్ట్బౌలర్లంతా సుమారు గంటకు 140- 145 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేయగలుగుతున్నారు. నాకు తెలిసి ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టుకు కూడా పేస్ బెంచ్ ఇంత పటిష్టంగా లేదు. ఆ జట్టులో ప్రతిభ గల బౌలర్లకు కొదువలేదు. నా మదిలో ఎప్పుడూ ఓ క్రేజీ ఆలోచన మెదులుతూ ఉంటుంది. షాహిన్ ఆఫ్రిది ఒకవేళ ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎలా ఉంటుంది అని? ఈ లెఫ్టార్మ్ సీమర్ కొత్త బంతితో అద్భుతాలు చేయగలడు. డెత్ ఓవర్లలో యార్కర్లు సంధిస్తాడు. నిజంగా తను గనుక వేలంలోకి వస్తే 14- 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం ఖాయం అనిపిస్తుంది. కీలక మ్యాచ్‌లో ఆఫ్రిది లేకపోయినా మిగతా వాళ్లు ఆ లోటు తీర్చగల సత్తా గలవారే’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆసియా కప్-2022 టోర్నీ నేపథ్యంలో భారత జట్టుకు ఎంపికైన అశ్విన్‌కు మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాలేదు. చదవండి: Asia Cup 2022 Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్ కాంగ్‌ను పాక్ లైట్ తీసుకుంటే అంతే సంగతులు! SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Ravi Shastri: నేను వేలంలో బరిలో ఉంటే కనీసం 15 కోట్లు కొల్లగొట్టేవాడిని..!
టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత క్రికెట్ వ్యాఖ్యానంలో బిజీ అయిపోయిన రవిశాస్త్రి.. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య సోమవారం (మార్చి 28) జరిగిన మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన ఆయన.. ఐపీఎల్ వేలానికి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జమానాలో ఐపీఎల్ ఉండివుంటే కనీసం 15 కోట్లు కొల్లగొట్టేవాడినంటూ వ్యాఖ్యానించాడు. ఒకవేళ తాను ఏ జట్టుకైనా నాయకత్వం వహించాల్సి వచ్చివుంటే అంతకుమించి ధర పలికి ఉండేవాడినంటూ గొప్పలు పోయాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా కెరీర్ మొదలు పెట్టిన రవిశాస్త్రి.. ఆ తర్వాత ఓపెనర్‌గా మారి, నాటి టీమిండియాలో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదిగిన అందరికీ సంగతి తెలిసిందే. టీమిండియా తరఫున 80 టెస్ట్‌లు, 150 వన్డేలు ఆడిన ఆయన.. 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. రవిశాస్త్రి తన టెస్ట్ కెరీర్లో 11 సెంచరీలు, 12 అర్ధ సెంచరీల సాయంతో 3830 పరుగులు, వన్డేల్లో 4 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 3108 పరుగులు సాధించాడు. అలాగే శాస్త్రి.. టెస్ట్‌ల్లో 151 వికెట్లు, వన్డేల్లో 129 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022 GT vs LSG: అరె తమ్ముడు.. సారీ రా! పర్లేదు మేము మ్యాచ్ గెలిచాం కదా! -
కుర్రాళ్లదే హావ
-
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి..! ప్లేయర్స్‌తో పాటుగా దీని వేలం కూడా..!
బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం-2022 మొదలైన విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్స్‌ను దక్కించుకునేందుకు పలు ప్రాంచైజీస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కాగా ఈ ఐపీఎల్-2022 వేలంలో ప్లేయర్స్‌తో పాటుగా టాటా మోటర్స్‌కు చెందిన కారు కూడా ఆక్షన్‌లోకి రానుంది. బహుశా ఐపీఎల్ వేలంలో ప్లేయర్స్‌నే కాకుండా కారును కూడా వేలం వేయడం ఇదే తొలిసారి. వేలంలోకి టాటా పంచ్ లిమిటెడ్ ఎడిషన్..! ఐపీఎల్-2022 సీజన్‌కు టాటా సంస్థ స్పాన్సర్‌గా వ్యవహారిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వేలంలో టాటా మోటార్స్‌కు చెందిన సరికొత్త 'పంచ్ కజిరంగా ఎడిషన్' కారును కంపెనీ వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని కజిరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కోసం ఖర్చు పెట్టనున్నారు. పంచ్ కజిరంగా ఎడిషన్ కారు పలు ప్రత్యేమైన ఫీచర్స్‌తో రానుంది. ఈ ఫీచర్స్‌కు సంబంధించి ఎలాంటి విషయాలను టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. ఈ కారును కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే వేలం వేస్తున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. వేలంలో గెలిచిన వారు కజిరంగా టాటా పంచ్ స్ఫెషల్ ఎడిషన్ ఎస్యూవీ కారును సొంతం చేసుకుంటారని టాటా మోటార్స్ ప్రకటించింది. భారీ ఆదరణతో టాటా పంచ్..! గత ఏడాది లాంచ్ చేసిన టాటా పంచ్ ఎస్యూవీ భారత మార్కెట్లలో అత్యంత ఆదరణ లభిస్తోంది. టాటా మోటార్స్‌లో కూడా ఎక్కువగా సేల్ అవుతోన్న మోడల్‌గా టాటా పంచ్ నిలుస్తోంది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి నెలవారీ విక్రయాలు 40వేలను దాటడంలో ఈ ఎస్యూవీ పాత్ర కీలకంగా ఉంది. ఫీచర్స్‌లో భేష్..! టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ ఫీచర్స్‌లో అదిరిపోయింది. ఆటోమేటిక్ హెడ్‌లైట్స్ ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, క్రైమెట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు అత్యంత సురక్షితమైన రేటింగ్‌ను కూడా కల్గి ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ సెటప్‌తో, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 83బీహెచ్పీ వద్ద 113ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. టాటా పంచ్ ప్రారంభ ధర రూ.5.65 లక్షల నుంచి అత్యధికంగా రూ.9.29 లక్షల వరకు ఉంది.(ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్ ధర) చదవండి: అత్యంత తక్కువ ధరకే ఎస్యూవీ కార్..! ఎగబడి కొంటున్న టాటా మోటార్స్ ఎస్యూవీ కార్లు ఇవే.. -
IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్ వేలం చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. కాగా ఫిబ్రవరి 12న బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను సొంతం చేసుకుంది. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై వేలంలో 15.25 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడం విశేషం. కాగా ఇషాన్ కనీస ధర 2 కోట్లు కాగా ముంబై, హైదరాబాద్ పోటీ పడ్డాయి. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఇషాన్ కిషన్... ‘‘అందరికి నమస్కారం. ముంబై ఇండియన్స్‌తో మళ్లీ చేరడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. జట్టులోని ప్రతి ఒక్కరు నన్ను తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. నిజంగా నా జట్టుతో తిరిగి కలవడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ ఉత్సాహంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ట్విటర్లో షేర్ చేసింది. కాగా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ ముందు వరుసలో ఉన్నాడు. (చదవండి: అప్పుడు రూ.20 లక్షలు.. ఇప్పుడు ఏకంగా రూ.10.75 కోట్లు.. వారెవ్వా హర్షల్!) 2008లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడిని 16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు రికార్డు ధర పలికిన ఇషాన్ యువీ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. మరో టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను 12.25 కోట్లు పెట్టి కోల్‌కతా కొనుగోలు చేసింది. ఇక విదేశీ ఆటగాళ్లలో క్రిస్ మోరిస్(16 కోట్లు), ప్యాట్ కమిన్స్(15.5 కోట్లు), కైలీ జెమీషన్(15 కోట్లు) తదితరులు గతంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. 𝐓𝐡𝐞 𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐃𝐲𝐧𝐚𝐦𝐨 shares a message for the Paltan after coming ℍ𝕆𝕄𝔼 💙#AalaRe #MumbaiIndians #AalaRe #IPLAuction @ishankishan51 pic.twitter.com/Q9QcTQ34gL — Mumbai Indians (@mipaltan) February 12, 2022 -
IPL 2022: ఆ ముగ్గురు ఎవరో జనవరి 31లోగా తేల్చుకోండి..!
IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలు లక్నో, అహ్మదాబాద్‌లకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అంశంపై తుది గడువును ప్రకటించింది. గతంలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు 2021, డిసెంబర్ 25ను గడువు తేదీగా నిర్ణయించినా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్‌పై బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఆటగాళ్ల ఎంపిక వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జనవరి 31ని డెడ్‌లైన్‌గా ప్రకటిస్తూ బీసీసీఐ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ తంతు పూర్తి అయితే కానీ, వేలం నిర్వహించే వేదిక, తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించినట్లు సమాచారం. కాగా, ఇదివరకే బరిలో ఉన్న 8 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను మినహాయించి వేలంలో పాల్గొనే ఆటగాళ్లలో ముగ్గురు క్రికెటర్లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కొత్త ఫ్రాంచైజీలకు కల్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ ఇప్పటికే తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, కోచ్‌గా ఆశిష్ నెహ్రా, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్ గౌతమ్ గంభీర్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్ విషయంలో మాత్రం ఈ ఫ్రాంచైజీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. చదవండి: Ashes 4th Test: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ అద్భుత పోరాటం -
లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయాస్!
ఐపీఎల్ మెగావేలానికి సమయం దగ్గరవుతున్న కొద్ది ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడవుతాడనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న 8 ఫ్రాంచైజీలతో పాటు అదనంగా లక్నో, అహ్మదాబాద్ పేరిట మరో రెండు ఫ్రాంచైజీలు రానున్నాయి. దీంతో రెండు కొత్త ఫ్రాంచైజీలకు కెప్టెన్లుగా ఎవరు అవుతారనేదానిపై చాలా మంది ఎదురుచూస్తున్నారు. కాగా మెగావేలానికి ముందు ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలకు నాన్ రిటైన్ ప్లేయర్స్ జాబితా నుంచి ముగ్గురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 25లోపూ ఈ ప్రక్రియను పూర్తి చేసి ఐపీఎల్ బోర్డుకు వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు మెగావేలంలో ముగ్గురి పేర్లను దాదాపు ఖరారు చేసుకున్నట్లు సమాచారం. చదవండి: IPL 2022: రూ.100 కోట్లతో సునీల్ నరైన్ సరికొత్త రికార్డు రిపోర్ట్స్ ప్రకారం పంజాబ్ కింగ్స్ వదిలేసిన కేఎల్ రాహుల్ లక్నో ఫ్రాంచైజీకి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉండగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం ఉన్నప్పటికి.. వేలంలో వార్నర్‌ను దక్కించుకుంటే అతనికి కూడా అవకాశం ఉంది. ఇక కేఎల్ రాహుల్‌తో పాటు రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్‌లను లక్నో ఫైనలైజ్ చేయగా.. మరోవైపు అహ్మదాబాద్ శ్రేయాస్‌తో పాటు హార్దిక్ పాండ్యా రెండో ఆటగాడిగా, ఇక మూడో ఆటగాడిగా క్వింటన్ డికాక్ లేదా డేవిడ్ వార్నర్‌లలో ఎవరో ఒకరిని తీసుకోవాలని భావిస్తోంది. ఇక 2014 తర్వాత ఐపీఎల్ మెగావేలం జరగనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 8 జట్ల ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ జాబితాను విడుదలే చేశాయి. ఈసారి వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఎక్కువ మొత్తంలో ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. కాగా మెగావేలం జనవరి మొదటివారంలో జరిగే అవకాశాలున్నాయి. ఇక మెగావేలం ఇదే చివరిసారి కావొచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 Mega Auction: ఈ నలుగురు క్రికెటర్లు అమ్ముడుపోవడం కష్టమే! -
విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం..
KS Bharat Slams Century In Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో దేశీయ ఐపీఎల్ స్టార్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఈ దేశవాళీ టోర్నీలో ఐపీఎల్ 2021 ఆరెంజ్ క్యాప్ హోల్డర్, మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(సీఎస్కే) హ్యాట్రిక్ సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు, మధ్యప్రదేశ్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ రెండు సూపర్ శతకాలతో శివాలెత్తాడు. తాజాగా ఆర్సీబీ ఆటగాడు, ఆంధ్రా బ్యాటర్ కేఎస్ భరత్ సైతం భారీ శతకం(161) సాధించి.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు సత్తా చాటాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్ 109 బంతుల్లో 16 బౌండరీలు, 8 సిక్సర్ల సాయంతో 161 పరుగులు సాధించాడు. భరత్ తాజా ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అతనిపై కన్నేశాయి. గత ఐపీఎల్ వేలంలో బేస్ ధర రూ.20 లక్షలు మాత్రమే పలికిన భరత్(ఆర్సీబీ).. తాజా ప్రదర్శనతో భారీ ధర పలికే అవకాశం ఉంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రసవత్తర పోరులో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టుకు విజయాన్నందించిన ఈ ఆంధ్రా కుర్రాడు ఒక్క మ్యాచ్‌తో హీరోగా మారిపోయాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ అయిన భరత్.. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సాహా గైర్హాజరీలో టీమిండియా తాత్కాలిక వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టాడు. చదవండి: Venkatesh Iyer: శతక్కొట్టాక రజనీ స్టైల్లో ఇరగదీశాడు.. -
IPL 2022 Auction: నాతో పాటు అతడిని కూడా రీటైన్ చేసుకోరు.. ఎందుకంటే
I and Shreyas Iyer will not be retained by Delhi Capitals- R.Ashwin: ఐపీఎల్-2022 వేలానికి సమయం ఆసన్నమవుతున్న వేళ టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అశూ.. ఈసారి వేలంలో ఫ్రాంఛైజీ తనను రీటైన్ చేసుకోదని వ్యాఖ్యానించాడు. తనతో పాటు శ్రేయస్ అయ్యర్‌ను కూడా అట్టిపెట్టికునే ఆలోచన యాజమాన్యానికి లేదని భావిస్తున్నట్లు తెలిపాడు. కాగా బీసీసీఐ ప్రకటించిన రిటెన్షన్ పాలసీ ప్రకారం... ఐపీఎల్ ప్రాంఛైజీలు అత్యధికంగా నలుగురిని రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా అశూ మాట్లాడుతూ... ఈసారి ఢిల్లీ తనకు అవకాశం ఇవ్వబోదని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2021 సీజన్లో జట్టును టేబుల్ టాపర్‌గా నిలిపిన కెప్టెన్ రిషభ్ పంత్, యువ ఆటగాడు పృథ్వీ షా, దక్షిణాఫ్రికా ఆటగాడు ఆన్రిచ్ నోర్ట్జేను అట్టిపెట్టుకునే అవకాశం ఉందన్నాడు. ఇక ఈ ముగ్గురివైపే మొగ్గు చూపే క్రమంలో శ్రేయస్ అయ్యర్‌ను సైతం యాజమాన్యం వదులుకునే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా పంజాబ్ కింగ్స్ వదులుకోవడంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ అశ్విన్ 7.6 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2020 నుంచి ఢిల్లీకి అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా ఈ సీజన్లో 13 ఇన్నింగ్స్‌లో అశ్విన్.. 7 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో అంచె నుంచి అందుబాటులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ 175 పరుగులతో రాణించాడు. చదవండి: Shreyas Iyer- Mohammed Siraj: ఏమైనా మాట్లాడండి సర్.. ఆట పట్టించిన శ్రేయస్.. కార్డు పడేసి వెళ్లిపోయిన సిరాజ్! -
T20 WC: అతడికి ఐపీఎల్ వేలంలో మంచి డిమాండ్ ఉంటుంది!
Aakash Chopra feels IPL teams will be interested in buying This Player: శ్రీలంక యువ క్రికెటర్ చరిత్ అసలంక టీ20 వరల్డ్‌కప్-2021లో సత్తా చాటాడు. ఇప్పటి వరకు టోర్నీలో 6 ఇన్నింగ్స్ ఆడిన 24 ఏళ్ల అసలంక 231 పరుగులు చేశాడు. తద్వారా ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ప్రపంచకప్-2021లో రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు అసలంక. ముఖ్యంగా నవంబరు 4 నాటి వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 41 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో.. 68 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా క్రీడా ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చరిత్ అసలంక గురించి టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని ఈ శ్రీలంక బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు. రానున్న ఐపీఎల్ వేలంలో అసలంక కోసం ఫ్రాంఛైజీలు తప్పక ఆసక్తి చూపుతాయని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు... ‘‘ చరిత్ అసలంక రియల్ డీల్. టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అతడిని దక్కించుకునేందుకు.. వేలంలో ఐపీఎల్ జట్లు ఆసక్తి కనబరుస్తాయని భావిస్తున్నాను’’ అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో క్వాలిఫయర్స్ మ్యాచ్‌లలో వరుస విజయాలు నమోదు చేసి సూపర్ 12 కు అర్హత సాధించిన శ్రీలంక జట్టు.. సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. సూపర్ 12 రౌండ్లో 5 మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి నాకౌట్ దశలోనే వెనుదిరిగింది. చదవండి: Chris Gayle: ఏంటిది గేల్.. చెత్త రికార్డు...ఇన్ని ఘనతలు ఉన్నా.. శ్రీలంకపై మాత్రం.. Charith Asalanka is a real-deal. I expect a few #IPL teams setting their eyes on acquiring him at the auctions. #T20WorldCup #WIvSL — Aakash Chopra (@cricketaakash) November 4, 2021 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఈసారి ఐపీఎల్ వేలంలో నా పేరు చూడబోతున్నా
David Warner Confirms Name In IPL Mega Auction.. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ ఐపీఎల్ మెగా వేలంలో తన పేరును చూస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్ 2021 సీజన్లో వార్నర్‌ను ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాటర్‌గాను వార్నర్ పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక కరోనా విరామం తర్వాత మొదలైన ఐపీఎల్ సెకండ్‌ఫేజ్‌లో వార్నర్ కేవలం ఒక్క మ్యాచ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఆ తర్వాత డగౌట్‌కే పరిమితం కావడం.. ఆ తర్వాత జట్టుతో కలిసి కూర్చోకపోవడం.. క్రమేపీ దూరమవ్వడం స్పష్టంగా కనిపించింది. దీంతో వార్నర్ ఎస్ఆర్హెచ్ను వదిలి వేరే జట్టులో చేరబోతున్నట్లుగా సంకేతాలు అందాయి. తాజాగా టి20 ప్రపంచకప్ 2021 నేపథ్యంలో యూఏఈలోనే ఉన్న వార్నర్ స్పందించాడు. '' ఈసారి వేలంలో నా పేరును చూడాలనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ నన్ను ఎలాగో రిటైన్ చేసుకోదు కాబట్టి కచ్చితంగా వేలంలోకి వస్తా. ఈసారి కొత్త జట్టుతో చేరి ఫ్రెష్‌గా ఐపీఎల్ సీజన్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నా.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ENG Vs BAN: కన్ఫ్యూజ్ రనౌట్.. ఇంగ్లండ్ ఆటగాడి డ్యాన్స్ -
నలుగురిని రిటైన్ చేసుకోవచ్చు.. సీఎస్కే నుంచి ధోని సహా 'ఆ ముగ్గురు'..!
IPL Teams Can Retain Upto 4 Players From Their Current Squad Before 2022 Auction: వచ్చే ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు జట్లు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల సంఖ్యపై బీసీసీఐ ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను నిలుపుకునేందుకు అవకాశం ఉంటుందని ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ పేర్కొంది. రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ముగ్గురు భారతీయ ఆటగాళ్లతో పాటు ఓ విదేశీ ఆటగాడు ఉంటాడని సమాచారం. ఇదిలా ఉంటే, ఆటగాళ్లను అట్టిపెట్టువడంపై ప్రస్తుత ఛాంపియన్ సీఎస్కే యాజమాన్యం ఇది వరకే ఓ క్లారిటీ ఇచ్చింది. జట్టు సారధి ధోనిని రిటైన్ చేసుకోనున్నట్లు స్వయానా ఆ ఫ్రాంచైజీ యజమానే వెల్లడించారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యపై తాజాగా ఓ క్లారిటీ రావడంతో మిగిలిన ముగ్గురు ఆటగాళ్లపై కూడా సీఎస్కే యాజమాన్యం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ధోని సహా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌లను స్వదేశీ ఆటగాళ్ల కోటాలో.. విదేశీ ప్లేయర్స్ కోటాలో బ్రావో లేదా డుప్లెసిస్‌లలో ఒకరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సీఎస్కే వర్గాల సమాచారం. చదవండి: T20 World Cup 2021: పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ అత్యంత చెత్త రికార్డు -
రైనా సహా 'ఆ ముగ్గురి' ఖేల్ ఖతమైనట్టే..!
4 Players Who Might Go Unsold In IPL 2022 Auction: ప్రస్తుత ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫామ్ లేమితో సతమతమవుతున్న నలుగురు విధ్వంసకర ఆటగాళ్ల ఐపీఎల్ కెరీర్లు దాదాపుగా సమాప్తమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరంతా వచ్చేఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించే మెగా ఆక్షన్ అమ్ముడుపోని సరుకులుగా మిగిలిపోయే అవకాశం ఉందని వారు జోస్యం చెబుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్కే డాషింగ్ ప్లేయర్ సురేశ్ రైనా సహా ముగ్గురు విదేశీ విధ్వంసకర బ్యాటర్లు ఉంటారని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. విదేశీ బ్యాటర్ల లిస్ట్‌లో యూనివర్సల్ బాస్, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ క్రిస్ గేల్ ముందువరుసలో ఉంటాడని, అతని వెనకాలే కోల్‌కతా నైట్‌రైడర్స్ సారధి, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆతరువాత రాయల్ ఛాలెంజర్స్ స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నలుగురితో పాటు గతేడాది ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన డానియల్ క్రిస్టియన్(ఆర్సీబీ-4.8 కోట్లు), రిలే మెరిడిత్(పంజాబ్ కింగ్స్-8 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్(రాజస్థాన్ రాయల్స్-3 కోట్లు), టామ్ కర్రన్(ఢిల్లీ క్యాపిటల్స్-5.25 కోట్లు), జై రిచర్డ్సన్(పంజాబ్ కింగ్స్-14 కోట్లు)లు కచ్చితంగా అమ్ముడుపోని జాబితాలో ఉంటారని అంచనా వేస్తున్నారు. పైన పేర్కొన్న ఆటగాళ్లనంతా ఆయా ఫ్రాంచైజీలు భారీ ధర వెచ్చింది కొనుగోలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వారిపై వేటు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. చదవండి: మోదీపై అమిత్ షా ప్రశంసలు.. వ్యంగ్యంగా స్పందించిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ -
వచ్చే ఏడాది ఆ కేకేఆర్ ఆటగాడు 12-14 కోట్ల ధర పలుకుతాడు..!
Venkatesh Iyer Will Fetch 12 To 14 Crores In Next Year IPL Auction: వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ భారీ ధర పలికే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. ప్రస్తుత సీజన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న అయ్యర్.. మరుసటి సీజన్ మెగా ఆక్షన్‌లో 12 నుంచి 14 కోట్ల ధర పలుకుతాడని అంచనా వేశాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్ అయ్యర్ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవలే వెంకటేశ్ అయ్యర్ దేశవాళీ గణాంకాలు చూశానని.. ఫస్ట్‌క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్లో అతని రికార్డు అద్భుతంగా ఉందని.. 47 సగటు, 92 స్ట్రైక్‌రేట్‌తో అత్యుత్తమంగా రాణించాడని కొనియాడాడు. ఈ గణాంకాలను కొలమానంగా తీసుకుంటే అతని ఏ స్థాయి ఆటగాడో స్పష్టమవుతుందని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న అయ్యర్.. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సమర్ధుడని, కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్ చేయగల సామర్ధ్యం అతని సొంతమని ఆకాశానికెత్తాడు. బ్యాక్ ఫుట్‌పై అతను ఆడే పుల్ షాట్లు, కట్ షాట్లు అత్యద్భుతమని.. ఈ నైపుణ్యం అతన్ని ప్రపంచ స్థాయి బ్యాటర్ల జాబితాలో చేరుస్తుందని పేర్కొన్నాడు. మొత్తంగా అయ్యర్ తన ఆల్‌రౌండ్ సామర్ధ్యంతో కేకేఆర్‌కు తరుపు ముక్కలా మారాడని పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా, యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2021 రెండో దశలో కేకేఆర్ జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. అరంగేట్రం మ్యాచ్(27 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్)లోనే అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచాడు. ఆ తర్వాత ముంబై(30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంజాబ్(49 బంతుల్లో 67; 9 ఫోర్లు, సిక్స్) జట్లపై హాఫ్ సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు. బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మాయ చేసిన అతను.. ఢిల్లీ(2/29), పంజాబ్(1/30) జట్లపై వికెట్లు సాధించాడు. చదవండి: వార్నర్‌కు పట్టిన గతే ఆ సీఎస్కే ఆటగాడికి కూడా పడుతుంది..! -
మే నెలలో కొత్త ఐపీఎల్ జట్ల వేలం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 నుంచి పది జట్లు బరిలోకి దిగడం ఖరారైంది. అదనంగా రాబోయే రెండు కొత్త జట్ల కోసం వచ్చే మే నెలలో బీసీసీఐ వేలం నిర్వహించనుంది. శనివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత కొత్త ఫ్రాంచైజీలు మే చివరి వరకు ఖరారైతే... ఆయా జట్లు తమ సన్నాహాలు చేసుకునేందుకు ఏడాది పాటు సమయం ఉంటుందని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సీజన్లో 8 జట్లతోనే ఐపీఎల్ జరుగనుంది. తొలుత ఈ సీజన్‌కే పది జట్లు వస్తాయని భావించినా, అది కుదరలేదు. మెగా ఐపీఎల్ వేలం నిర్వహించడానికి సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో 10 జట్ల నిర్ణయాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే మే నెలలో కొత్త జట్ల వేలానికి రంగం సిద్ధం చేశారు. -
ఐపీఎల్ వేలం రేపే.. ఎవరి దగ్గర ఎంత!
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2021) మినీ వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ఈ వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 164 మంది ఇండియన్ ప్లేయర్లు కాగా.. 125 మంది విదేశీ ప్లేయర్లు ఉండగా... మరో ముగ్గురు అసోసియేట్ దేశాల ప్లేయర్లు ఉన్నారు. అయితే వీళ్ల నుంచి 61 మంది ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ టీమ్ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఏ టీమ్‌కు ఎంత మంది ప్లేయర్స్ తీసుకునే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ►చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 6 డబ్బు : రూ.19.9 కోట్లు ►ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 8 డబ్బు: రూ.13.04 కోట్లు ►పంజాబ్ కింగ్స్ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 9 డబ్బు: రూ.53.2 కోట్లు ►కోల్‌కతా నైట్‌రైడర్స్ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 8 డబ్బు: రూ.10.75 కోట్లు ►ముంబై ఇండియన్స్ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 7 డబ్బు: రూ.15.35 కోట్లు ►రాజస్థాన్ రాయల్స్ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 9 డబ్బు : రూ.15.35 కోట్లు ►రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 14 డబ్బు: రూ.35.4 కోట్లు ►సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 3 డబ్బు: రూ.10.75 కోట్లు -
ఐపీఎల్ 2021: కింగ్స్ పంజాబ్‌కు ‘వేలం’ కష్టాలు
ముంబై: ఫిబ్రవరి 18న ఐపీఎల్-2021 వేలం పురస్కరించుకొని బీసీసీఐ తెచ్చిన కొత్త నిబంధన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు తలనొప్పిలా మారనుంది. ప్రతి జట్టు ఆటగాళ్ల కొనుగోలుకు సంబంధించి మొత్తం కేటాయించిన దాంట్లో (ప్రతీ జట్టుకు రూ.85కోట్లు) 75 శాతం ఖర్చు చేయాలని.. అలా లేని పక్షంలో ఆ డబ్బులు బీసీసీఐ ఖాతాలోకి జమకానున్నాయి. ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొననున్న ఫ్రాంచైజీల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వద్ద అత్యధికంగా రూ. 53.2 కోట్లు ఉన్నాయి. పంజాబ్ జట్టు 16 మందిని రిటైన్ చేసుకొని మిగిలిన వారిని రిలీజ్ చేసింది. వీరిలో గత ఐపీఎల్లో తీవ్రంగా నిరాశపరిచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ సహా షెల్డన్ కాట్రెల్, కె. గౌతమ్, ముజీబ్ ఉర్ రెహమాన్, జిమ్మి నీషమ్, హార్డస్ విల్‌జెన్‌లోపాటు కరుణ్ నాయర్, సుచిత్, తేజిందర్ సింగ్ దిల్లాన్ తదితరులు ఉన్నారు. బీసీసీఐ వెల్లడించిన కొత్త నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకున్న 16 మంది ఆటగాళ్లకు పంజాబ్ రూ. 31.8 కోట్లు చెల్లించగా.. ఇప్పుడు వారి వద్ద 53.2 కోట్లు ఉన్నాయి. ఆటగాళ్ల వేలానికి మిగిలిఉన్న మొత్తంలో 75 శాతం ఖర్చు చేయాలని బీసీసీఐ తెలిపిన నేపథ్యంలో 53.2 కోట్లలో 75 శాతం అంటే 31.7 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బుతోనే ఆటగాళ్లను వేలంలో పొందే అవకాశం కింగ్స్ పంజాబ్‌కు ఉండనుంది. ఆ లెక్కన చూసుకుంటే పంజాబ్ దగ్గరుండే దాదాపు రూ. 21.5 కోట్లు బీసీసీఐ ఖాతాలోకి వెళ్లిపోనున్నాయి. ఇది కింగ్స్ పంజాబ్‌కు నష్టం కలిగించే అంశం అని చెప్పవచ్చు. పంజాబ్ తర్వాత రూ. 37.85 కోట్లతో రాజస్తాన్ ఉండగా, ఆర్సీబీ రూ. 35.40 కోట్లు, సీఎస్కే రూ. 19.9 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ. 15.35 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 13.4 కోట్లు, సన్‌రైజర్స్, కేకేఆర్ ఫ్రాంచైజీలు రూ. 10.75 కోట్లతో ఉన్నాయి. ఐపీఎల్ 2021 వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న చెన్నైలో జరిగే వేలంలో మొత్తం 292 క్రికెటర్లు అందుబాటులోకి రానున్నారు. ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు 1114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా... ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వేలంలో గరిష్టంగా 61 స్థానాలు ఖాళీలు ఉండగా, ఇందులో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్లను ఎనిమిది జట్లు ఎంచుకోవచ్చు. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13 స్థానాలు ఖాళీ, సన్‌రైజర్స్ జట్టులో 3 స్థానాలు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. కనీస రూ.2 కోట్ల జాబితాలో భారత్ నుంచి హర్భజన్, కేదార్ జాదవ్, విదేశాల నుంచి.. స్మిత్, మ్యాక్స్‌వెల్ ఉన్నారు. కాగా గతేడాది కేఎల్ రాహుల్ సారథ్యంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. రాహుల్ 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నా జట్టుగా విఫలమయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్‌వెల్ గత సీజన్లో దారుణంగా నిరాశపరిచాడు. చదవండి: 15 నెలల తర్వాత.. అన్ని స్వదేశంలోనే 'కమాన్ రోహిత్.. యూ కెన్ డూ ఇట్' -
చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్(2021)కు సంబంధించి మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్దమవుతుంది. ఈ మేరకు ఐపీఎల్ తన ట్విటర్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే ఐపీఎల్లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. లసిత్ మలింగ, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హర్భజన్ సింగ్ లాంటి స్టార్ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్ చేయడంతో 2021 ఐపీఎల్ సీజన్‌కు వేలంలోకి రానున్నారు. చదవండి: ఐసీసీ సరికొత్త అవార్డు.. పరిశీలనలో వారి పేర్లు! కాగా ఆయా ఫ్రాంచైజీలు మొత్తం 139 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. 57 మందిని రిలీజ్ చేశాయి. కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ వేదికగా జరిగినా ఈ ఏడాది మాత్రం భారత్‌లోనే నిర్వహించడానికి బీసీసీఐ భావిస్తుంది. కాగా ఐపీఎల్ 14వ సీజన్‌ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఏప్రిల్- మే నెలల్లో ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ తేదీలతో పాటు ఎక్కడ నిర్వహించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌కు 50 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇచ్చిన వేళ ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ 🚨ALERT🚨: IPL 2021 Player Auction on 18th February🗓️ Venue 📍: Chennai How excited are you for this year's Player Auction? 😎👍 Set your reminder folks 🕰️ pic.twitter.com/xCnUDdGJCa — IndianPremierLeague (@IPL) January 27, 2021 -
మ్యాక్సీని కొనుగోలు చేస్తే మూల్యం చెల్లించుకున్నట్లే
ముంబై : ఐపీఎల్ 2021కి సంబంధించి మినీ వేలానికి సన్నద్ధమవుతున్న ఫ్రాంచైజీలు ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాతో పాటు రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్టును ప్రకటించాయి. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కూడా తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్లను ప్రకటించింది. కింగ్స్ ప్రకటించిన రిలీజ్ జాబితాలో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున 13 మ్యాచులాడిన మ్యాక్స్‌వెల్ కేవలం 108 పరుగులు మాత్రమే చేసి దారుణ ప్రదర్శన కనబరిచాడు. మ్యాక్స్‌వెల్ వరుసగా విఫలమవుతున్న వేళ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకముంచి అవకాశాలు కల్పించినా తన ఆటతీరులో ఏ మాత్రం మార్పు లేదు. దీనికి తోడు మ్యాక్సీ ప్రదర్శనపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. 2019 డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో కింగ్స్ పంజాబ్ రూ. 10.5 కోట్లు పెట్టి మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: పంత్ నిరాశకు లోనయ్యాడు తాజాగా కివీస్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ మ్యాక్స్‌వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టైరిస్ మాట్లాడుతూ.. 'మాక్స్‌వెల్‌కు ఈసారి జరగబోయే ఐపీఎల్ వేలంలో ఆశించినంత ధర రాకపోవచ్చు... కానీ రాణించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నకు నా సమాధానాన్ని ఒక్క జవాబుతో చెప్పాలనుకుంటున్నా.. ఏ ఆటగాడైనా సరే వేలంలో 10 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోతే.. వాళ్ల తలలకు కొమ్ములు వస్తాయి.. మ్యాక్సీ విషయంలో ఇప్పటికే నిరుపితమైంది. ఒక ఆటగాడి ప్రదర్శనకు వేలంలో ఎక్కువ ధర ఇస్తే బాగుంటుంది.. కానీ అతని అంతర్జాతీయ ఆటతీరు చూసి మాత్రం తీసుకోవద్దని నా సలహా. ఈ విషయం ఫ్రాంచైజీలు తెలుసుకుంటే రానున్న వేలంలో మ్యాక్స్‌వెల్‌ను కనీస మద్దుత ధరకే ఎక్కువ అమ్ముడుపోయే అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసి మ్యాక్స్‌వెల్ ఏనాడు ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరచలేదు. గత ఐదారేళ్లుగా మ్యాక్సీ ఐపీఎల్ ఆడుతున్నా.. 2014 మినహా ఏనాడు చెప్పుకోదగ్గ విధంగా రాణించలేదు. ఒకవేళ ఏ జట్టైనా అతన్ని కొనుగోలు చేసినా .. మ్యాక్సీ మంచి ప్రదర్శన చేయకపోతే ఆయా జట్టు మేనేజ్మెంట్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.' అంటూ అభిప్రాయపడ్డాడు. చదవండి: ‘బాగా ఆడింది వారైతే నాకెందుకు ఆ క్రెడిట్’ -
12 ఏళ్ల బంధానికి ముంబై ఇండియన్స్ గుడ్‌బై
ముంబై: శ్రీలంక మాజీ స్టార్ బౌలర్ లసిత్ మలింగను వదులుకుంటున్నట్లు ముంబై ఇండియన్స్ బుధవారం ప్రకటించింది. మలింగతో ఉన్న 12 ఏళ్ల అనుబంధానికి ఈరోజుతో గుడ్‌బై చెబుతున్నట్లు ఉద్వేగంతో పేర్కొంది. ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి వేలానికి సిద్ధమవుతున్న తరుణంలో ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ మలింగతో పాటు ఆసీస్‌కు చెందిన జేమ్స్ పాటిన్సన్, నాథన్ కౌల్టర్‌నీల్, మిచెల్ మెక్లీగన్లతో పాటు షెర్ఫన్ రూథర్‌ఫర్డ్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్‌లను వదులుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా లసిత్ మలింగ గురించి ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు రాసుకొచ్చింది. 'మలింగ.. థ్యాంక్యూ ఫర్ ఎవర్.. నీలాంటి ఆటగాడు 12 ఏళ్లు మా జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు నిన్ను వదులుకున్నా..నీ స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది. మిస్ యూ లాట్.. మలింగ. మలింగతో పాటు మేము వదులుకున్న ఆటగాళల్లందరికి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో ఎప్పటికి ఒక భాగంగా ఉంటారంటూ' కామెంట్స్ జత చేసింది. చదవండి: స్మిత్‌కు గుడ్‌బై.. శాంసన్‌కు కెప్టెన్సీ 2008 ఐపీఎల్ సీజన్ నుంచి ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మలింగ 12 ఏళ్ల పాటు నిరంతరాయంగా జట్టుకు సేవలు అందించాడు. కాగా వ్యక్తిగత కారణాల వల్ల యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో మలింగ ఆడలేకపోయాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసని ఆటగాడిగా మలింగ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 122 మ్యాచ్‌లాడి 170 వికెట్లు తీశాడు. 2013,2015,2017,2019లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో మలింగ ప్రధానపాత్ర పోషించాడు. కాగా 2020లోనూ మలింగ లేకుండానే ముంబై ఇండియన్స్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. మలింగ గైర్హాజరీలో ప్రధాన పేసర్‌గా బాధ్యతలు నిర్వహించిన బుమ్రా 27 వికెట్లతో టాప్ లేపగా.. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 25 వికెట్లతో దుమ్మురేపాడు. చదవండి: థ్యాంక్యూ బీసీసీఐ.. మంచి గిఫ్ట్ ఇచ్చారు Thank you for everything! There will always be a special place for you all in MI’s #OneFamily! 💙#MumbaiIndians pic.twitter.com/qjhMLHPTLc — Mumbai Indians (@mipaltan) January 20, 2021 -
ఐపీఎల్: స్టార్ ఆటగాళ్లకు ఫ్రాంచైజీల షాక్
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి వేలానికి సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ఆటగాళ్లకు షాక్ ఇస్తున్నాయి. ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను వదులుకునేందుకు రాజస్తాన్ రాయల్స్ సిద్ధమైంది. ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున 14 మ్యాచ్‌లాడి 311 పరుగులు చేసిన స్మిత్.. టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ను చెరిపేసి అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇలాంటి చీటింగ్ చేసే వ్యక్తి ఐపీఎల్లో ఆడకుండా బ్యాన్ చేయాలంటూ స్మిత్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: థ్యాంక్యూ బీసీసీఐ.. మంచి సిరీస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు దీంతో పాటు టీమిండియా వెటరన్ ఆటగాళ్లు హర్బజన్ సింగ్, మురళీ విజయ్, పియూష్ చావ్లాలతో పాటు కేదార్ జాదవ్‌ను సీఎస్కే వదులుకున్నట్లు ప్రకటించింది. అయితే ఐపీఎల్ 13వ సీజన్‌కు దూరంగా ఉన్న సురేశ్ రైనా మాత్రం సీఎస్కేతో కొనసాగనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పలువురు ఆటగాళ్లను వదులుకుంటున్నట్లు ప్రకటించింది. ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్‌తో పాటు అలెక్స్ హేల్స్, భారత ఆటగాళ్లు సందీప్, మోహిత్ శర్మలకు గుడ్‌బై చెప్పనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. కాగా ఐపీఎల్ 2021కి సంబంధించి వేలంపాట ఫిబ్రవరి చివరివారంలో నిర్వహించనున్నట్లు సమాచారం.చదవండి: ఆసీస్‌తో సిరీస్ : అసలైన హీరో అతనే -
ధరలు పలికే ధీరులెవ్వరో!
కోల్‌కతా: ఐపీఎల్ 2020 సీజన్ ఆట కోసం నేడు ఆటగాళ్ల వేలం పాట జరగనుంది. భారత యువ క్రికెటర్లతో పాటు ప్రధానంగా ఆ్రస్టేలియా, వెస్టిండీస్ ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు కన్నేశాయి. అయితే ఇందులో ధరలు పలికే ధీరులు ఎందరో తేలాలంటే వేలం ముగిసేదాకా ఎదురుచూడాలి. ఓవరాల్‌గా ఎనిమిది జట్లలో మొత్తం 73 ఖాళీలుండగా... వేలంలో 332 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు ఆటగాళ్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, లిన్, మిచెల్ మాల్స్, కమిన్స్, హాజల్‌వుడ్‌లకు అత్యధిక మొత్తం లభించే అవకాశముంది. కరీబియన్ హిట్టర్ హెట్‌మైర్ ప్రధాన ఆకర్షణ కావొచ్చు. ప్రస్తుతం అతను అసాధారణ ఫామ్ కనబరుస్తుండటంతో ఎంతైనా వెచి్చంచేందుకు ఫ్రాంచైజీలు వెనుకాడకపోవచ్చు. టెస్టులకు పరిమితమైన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, పుజారా రూ. 50 లక్షల ప్రాథమిక ధరతో ఉన్నారు. గత సీజన్లో ఢిల్లీకి ఆడిన విహారిని విడుదల చేయగా... పుజారాను ఎవరూ కొనలేదు. ఈసారి ఐపీఎల్ వేలంలో ఆంధ్ర నుంచి ఆరుగురు (విహారి, భరత్, రికీ భుయ్, స్టీఫెన్, పృథ్వీరాజ్, ఇస్మాయిల్), హైదరాబాద్ నుంచి నలుగురు (సందీప్, తిలక్ వర్మ, యు«ద్వీర్, మిలింద్) ఉన్నారు. -
'అత్యంత శక్తివంతమైన టీమ్‌ను చూడనున్నారు'
ఈసారి జరగబోయే ఐపీఎల్లో అత్యంత శక్తివంతమైన టీంను చూడబోతున్నారని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విటర్ వేదికగా తమ అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడు. 13వ ఐపీల్ సీజన్‌కు సంబంధించి డిసెంబర్ 19న జరగనున్న వేలంలో అన్ని రంగాల్లో సమతుల్యం ఉన్న ఆటగాళ్లను తీసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. 'మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా! త్వరలో జరగబోయే ఐపీఎల్ వేలంలోకి రానున్న ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి మా జట్టు యాజమాన్యంతో పాటు కోచ్‌లు మైక్ హస్సీ, సైమన్ కటిచ్‌లు తమ శక్తి మేర కష్టపడుతున్నారు.ఇప్పటివరకు మీరు మమల్ని ఎంతో ఆదరించారు. ఇకపై కూడా ఇదే అభిమానాన్ని చూపిస్తూ మావెంటే ఉంటారని నమ్ముతున్నా. కాగా మా జట్టు యాజమాన్యంతో ఇప్పటికే వేలంకు సంబంధించి సంప్రదింపులు జరిపాం. వేలంలో అన్ని రకాలుగా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను తీసుకునేందుకు నిర్ణయించాం. 2020లో జరగనున్న 13 ఐపీఎల్ సీజన్‌కు మీరు కొత్త రాయల్ చాలెంజర్స్ టీమ్‌ను చూడబోతున్నారని' కోహ్లి ట్విటర్లో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి నాణ్యమైన ఆటగాళ్లను కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉండేది. ఇప్పటివరకు జరిగిన 12 ఐపీఎల్ సీజన్లలో మూడు సార్లు మాత్రమే మెరుగైన ప్రదర్శన నమోదు చేసింది. 2009, 2011, 2016 లో రన్నరప్‌తోనే సరిపెట్టుకోగా మిగతా తొమ్మిది సీజన్లలో నిరాశాజనకమైన ఆటతీరును కనబర్చింది. 2016 తర్వాత జరిగిన మూడు సీజన్లలో అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే డిసెంబర్ 19న కోల్‌కతాలో జరగనున్న ఐపీఎల్ వేలంలో కొత్త ఆశలతో పాల్గొననున్న బెంగళూరు టీమ్ తలరాత ఈసారైనా మారుతుందేమో చూడాలి. కాగా ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 13 ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, అందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లున్నారు. మిగతా 12 స్థానాలకు ఆటగాళ్ల ఎంపిక కోసం రూ. 27.90 కోట్లతో వేలంలోకి దిగనుంది. All set for the #IPLAuction? The Captain has a message for you.@imVkohli #ViratKohli #BidForBold #IPL2020 #PlayBold pic.twitter.com/moGkXCz31y — Royal Challengers (@RCBTweets) 17 December 2019 -
ఈ నిరసనలతో ఎలాగబ్బా..!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్నాయి. బంగ్లాదేశ్‌కు సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. ఐపీఎల్ వేలం ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో నిర్వహించనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యాలు కలవరపడుతున్నాయి. వచ్చే సీజన్‌కు సంబంధించి ఈ నెల 19న ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ఫ్రాంచైజీలు ఆరాతీస్తున్నాయి. కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. దీనిపై ఓ ఫ్రాంచైజీ అధికారి మాట్లాడుతూ ‘తీవ్రంగా ఆందోళన చెందడం లేదు కానీ... అక్కడి పరిస్థితులపై ఓ కన్నేశాం. వేలం గురువారం జరగనుండగా... సోమవారం భారీ ర్యాలీలతో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులపై సమీక్షిస్తున్నాం’ అని అన్నారు. మరో ఫ్రాంచైజీ అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఫ్రాంచైజీ వర్గాలు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై నమ్మకముంచాయి. పౌరసమాజమే కాదు... రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై భగ్గుమంటోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 20న కోల్‌కతాలో తమ పార్టీ నేతలతో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో వేలం పాట ముగిశాక మరుసటి రోజు తిరుగుపయనం కావడంపై కూడా ఫ్రాంచైజీలు ఆలోచిస్తున్నాయి. అయితే గురువారం జరిగే ఐపీఎల్ వేలం కార్యక్రమంలో ఎలాంటి మార్పు లేదని... ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే వేలం కార్యక్రమం జరుగుతుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
అటు 14... ఇటు 48
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంతో మంది కుర్రాళ్లకు పట్టం కట్టింది. అలాగే అనుభవజ్ఞులకూ అవకాశమిచ్చింది. గత 12 ఏళ్లుగా ఆటలో కుర్రాళ్లకు, సహాయ సిబ్బందిలో అనుభవజ్ఞులకు కూడా ఎంతో పేరు తెచ్చిపెట్టింది ఈ లీగ్. అయితే కొత్తగా ఈ సారి ఓ 14 ఏళ్ల కుర్రాడు, 48 ఏళ్ల అనుభవజ్ఞుడు ఇద్దరు కూడా ఆట కోసమే వేలం పాటకు అందుబాటులో ఉన్నారు. విచిత్రంగా ఉంది కదూ! ఆ టీనేజర్ అఫ్గానిస్తాన్ క్రికెటర్ నూర్ అహ్మద్ లఖన్వాల్ అయితే... ఆ వెటరన్ మన ముంబైవాలా ప్రవీణ్ తాంబే! చిత్రంగా ఇద్దరు స్పిన్నర్లే కాగా... లఖన్వాల్ చైనామన్. ఈ అఫ్గానీ ఆటగాడు రాజస్తాన్ రాయల్స్ నుంచి ఆహ్వానం దక్కడంతో ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈ టీనేజ్ చైనామన్ జట్టు వర్గాల్ని ఆకట్టుకున్నట్లు తెలిసింది. ఇటీవల లక్నోలో భారత అండర్–19 జట్టుతో జరిగిన సిరీస్‌లో నూర్ అహ్మద్ లఖన్వాల్ 9 వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతోపాటు అఫ్గానిస్తాన్ అండర్–19 జట్టు తరఫున త్వరలో అండర్–19 ప్రపంచకప్ ఆడనున్నాడు. వచ్చే నెల దక్షిణాఫ్రికాలో కుర్రాళ్ల మెగా ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో మణికట్టు బౌలర్‌పై ఫ్రాంచైజీల ఆసక్తి పెరిగింది. మరోవైపు వయసురీత్యా అర్ధసెంచరీ కొట్టబోతున్న వెటరన్ స్పిన్నర్ తాంబే ఐపీఎల్లో ఇదివరకు రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ (ఇప్పుడు లేదు), సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. -
ధోని అభిమాని ఏం చేశాడో తెలుసా?
లాస్ ఏంజెల్స్ : టీమిండియా మాజీకెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులన్నరనే విషయం మరోసారి స్పష్టమైంది. అమెరికా, లాస్‌ఎంజెల్స్‌లోని ఓ అభిమాని వినూత్నరీతిలో ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎల్లో జెర్సీ ప్రతిబింబించేలా.. తన కారు నంబర్ ప్లేట్‌పై ఎంఎస్ ధోని అని రాసుకున్నాడు. ఈ ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన అధికార ట్విటర్లో ‘లాస్ ఏంజెల్స్‌లో ధోని అభిమాని’ అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో వైరల్ అయింది. దటీజ్ తాళా! కింగ్ ఈజ్ బ్యాక్, సూపర్ అనే కామెంట్స్‌తో ధోని అభిమానులు సదరు అభిమానిపై పొగడ్తల వర్షం కురిపించడంతో ఈ ఫొటో నెట్టింట హల్చల్ చేస్తోంది. Aaah, so the legendary Soppanasundhari is now in LA! #WhistlePodu #Thala 💛😋🦁 https://t.co/wUHiaUWqQW — Chennai Super Kings (@ChennaiIPL) December 20, 2018 గతేడాది తిరిగి చెన్నై సారథ్య బాధ్యతలు చేపట్టిన ధోని ఆజట్టుకు మరో టైటిల్ అందించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ధోని సారథ్యంలోనే (2010, 2014, 2018) మూడు టైటిళ్లను నెగ్గింది. తాజా సీజన్‌కోసం జరిగిన వేలంలో చెన్నై ముగ్గురు ఆటగాళ్లను వదులుకుని కొత్తగా ఇద్దరిని జట్టులోకి తీసుకుంది. హర్యానా మీడియం పేసర్ అయిన మొహిత్ శర్మను రూ.5 కోట్లకు, రంజీ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. -
అసలు విషయం వెల్లడించిన యువరాజ్
సాక్షి, ముంబై: ఐపీఎల్ వేలంలో జరిగిన పరిణామాలు తనకు ఆశ్చర్యం కలిగించలేదని క్రికెటర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో మొదటి రౌండ్లో యువీని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. రెండో రౌండ్లో అతడి ప్రాథమిక ధర రూ.కోటికే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. దీనిపై యువీ స్పందిస్తూ.. ఈ సీజన్లో ముంబై జట్టుకు ఆడతానని ముందే ఊహించానని, అదిప్పుడు నిజమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. ‘ముంబై తరపున ఆడతానని ఎక్కడో ఒకచోట అనిపించేంది. నిజం చెప్పాలంటే ఈ ఏడాది ఐపీఎల్ ఆడే అవకాశం రావాలి కోరుకున్నాను. అనుకున్నది జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఆకాశ్(అంబానీ) నా గురించి కొన్ని మంచి వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఈ సీజన్లో అత్యుత్తమ స్థాయిలో రాణించేందుకు ప్రయత్నిస్తాన’ని యువరాజ్ ‘ముంబై మిర్రర్’తో చెప్పాడు. గత సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున తాను రాణించలేకపోయానని అతడు ఒప్పుకున్నాడు. ఒకే స్థానంలో బ్యాటింగ్‌కు పంపకపోవడమే తన వైఫల్యానికి కారణమని వెల్లడించాడు. తాను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగినట్టు గుర్తు చేశాడు. తన క్రీడాజీవితం తుదిదశలో ఉన్నందున ఐపీఎల్ వేలంలో మొదటి రౌండ్లోనే తనను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదని అంగీకరించాడు. ‘ఐపీఎల్ జట్టు కోసం ఆటగాళ్లను ఎంపిక చేసుకునేటప్పుడు ఫ్రాంచైజీలు ఎక్కువగా యువకులపై దృష్టి పెడతాయి. అటువంటి దశలో నాకు కూడా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నా కెరీర్ చివరి దశలో ఉంది. కనీసం చివరి రౌండ్‌లోనైనా నన్ను వేలంలో దక్కించుకుంటారన్న నా ఆశ నిజమైంద’ని యువరాజ్ వివరించాడు. -
ఐపీఎల్ వేలంపై మనోజ్ తివారీ అసహనం!
జైపూర్ : ఐపీఎల్ తాజా వేలంపై భారత క్రికెటర్ మనోజ్ తివారీ అసహనం వ్యక్తం చేశాడు. 2019 సీజన్ కోసం మంగళవారం జరిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ తివారీని కనుకరించలేదు. అతని కనీస ధర రూ.50 లక్షలకు కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబర్చలేదు. దీంతో అతను ఈ సీజన్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. దీనిపై మనోజ్ తివారీ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘నా జీవితంలో అసలేం జరుగుతుందో.. దేశం తరపున సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అందుకున్న తరువాత కూడా 14 మ్యాచ్‌ల వరకు అవకాశం రాలేదు. 2017 ఐపీఎల్ సీజన్లో ఇన్ని అవార్డులు గెలుచుకున్నా(అవార్డుల ఫొటోను ఉద్దేశిస్తూ) కూడా ఏం జరిగిందో అర్థం కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. Wondering wat went wrong on my part after getting Man of a match award wen I scored a hundred 4 my country and got dropped for the next 14 games on a trot ?? Looking at d awards which I received during 2017 IPL season, wondering wat went wrong ??? pic.twitter.com/GNInUe0K3l — MANOJ TIWARY (@tiwarymanoj) 18 December 2018 తివారీ గత సీజన్లో విఫలమైనప్పటికీ 2017లో రైజింగ్ పుణె తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 15 మ్యాచ్‌ల్లో 32.4 సగటుతో 324 పరుగులు చేశాడు. కానీ గత సీజన్లో కింగ్స్ పంజాబ్ తరఫున 5 మ్యాచ్‌ల్లో 37 పరుగులే చేశాడు. దీంతో అతన్ని తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అంతే కాకుండా ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌పై బెంగాల్ తరుఫున డబుల్ సెంచరీ కూడా సాధించాడు. అయినా అవకాశం దక్కపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. 2011 సీజన్లో కోల్‌కతా టైటిల్ నెగ్గడంలో తివారీ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 51 సగటుతో 359 పరుగులు చేశాడు. సీజన్ ప్రారంభమయ్యేలోపు ఏ ఫ్రాంచైజీ అన్న కరుణిస్తదో లేదో చూడాలి! -
తెలుగు కుర్రాడికి ఐపీఎల్లో మరో చాన్స్
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ కాపిటల్స్ జట్టు మరోమారు ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2018లో అయ్యప్పను దక్కించుకున్న ఢిల్లీ కాపిటల్స్ ఈసారి కూడా రూ.20 లక్షలకు అతన్ని జట్టులోకి తీసుకుంది. మీడియం పేసర్ అయ్యప్ప 2018-19 దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు సెలెక్ట్ అవ్వడం విశేషం. కాగా, ఐపీఎల్ 2019లో 351 ఆటగాళ్లు వేలానికి రాగా... 60 మందిని 8 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ సీజన్ 12 కోసం జరగుతున్న ఆటగాళ్ల వేలంలో సంచలనం నమోదు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డారు. ఏకంగా రూ.8.40 కోట్ల రికార్డు ధరకు కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకుంది. లిస్ట్ ఏ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ సంచలనం ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు. ఇదిలాఉండగా.. తొలి రౌండ్లో యువరాజ్‌ను పక్కకు పెట్టిన ఫ్రాంచైజీలు.. రెండో రౌండ్ వేలంలో కనీస ధర కోటి రూపాయలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. -
రూ.8.4 కోట్లు రికార్డు ధర: ఎవరీ వరుణ్ చక్రవర్తి?
సాక్షి, హైదరాబాద్ : వరుణ్ చక్రవర్తి.. నిన్నటి వరకు అంతగా తెలియని పేరు. కానీ మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలం అతన్నీ ప్రపంచానికి పరిచయం చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరున్ని కూడా చేసింది. తమిళ ఆల్‌రౌండర్ అయిన వరుణ్ చక్రవర్తి.. జాతీయ జట్టుకైతే ఇంతవరకు ఆడలేదు. అంతెందుకు రంజీ మ్యాచ్ కూడా అడింది ఒక్కటే. అదీ ఈ ఏడాదే. నిజానికి బాల్యం నుంచే అతనేమీ క్రికెట్ పిచ్చోడు కాదు. చాలా ఆలస్యంగా తన 13వ ఏట ఆటకు పరిచయమయ్యాడు. 17 ఏళ్ల వయసు వరకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. కానీ ఆయా వయో విభాగం పోటీల్లో తరచూ అతన్ని నిరాకరించడంతో ఆటకు బైబై చెప్పి ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో ఐదేళ్ల డిగ్రీ పూర్తిచేశాడు. కొన్నాళ్లు ఆర్కిటెక్చర్‌గా పనిచేశాడు. టెన్నిస్ బాల్‌తో.. అప్పుడప్పుడు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతుండటం వల్ల మళ్లీ ఆటపై మనసు పెట్టాడు. అంతే ఈసారి వరుణ్ జాబ్‌కు టాటా చెప్పి ఆటకు సై అన్నాడు. క్రోమ్‌బెస్ట్ క్రికెట్ క్లబ్లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా చేరాడు. కానీ మోకాలి గాయంతో పేస్‌ను వదిలేసి స్పిన్నరయ్యాడు. జూబ్లీ క్రికెట్ క్లబ్ తరఫున చెన్నైలో ఫోర్త్ డివిజన్ లీగ్ క్రికెట్ ఆడాడు. గత 2017–18 సీజన్లో ఆ క్లబ్ జట్టు తరఫున ఏడు వన్డేలాడిన వరుణ్ 3.06 ఎకానమీతో 31 వికెట్లు తీశాడు. టీఎన్పీల్తో.. బ్యాటింగ్‌లోనూ రాణించే చక్రవర్తి ఈ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)తో అందరికంటా పడ్డాడు. రెండేళ్లుగా ఒక్క మ్యాచ్ గెలవని సీచెమ్ మధురై పాంథర్స్‌ను ఈ ఏడాది విజేతగా నిలపడంతో అతని ప్రతిభ బయటపడింది. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున ఛాన్స్ కొట్టేశాడు. అక్కడ 9 మ్యాచ్‌లాడి లీగ్ దశలో అత్యధిక వికెట్లు (22) తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్–11 సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ నెట్స్‌లో బౌలింగ్ వేసేవాడు. స్థానిక వివాదం కారణంగా సీఎస్కే పుణే వేదికకు మారడంతో కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా... మళ్లీ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, జట్టు విశ్లేషకుడు శ్రీకాంత్‌ల పిలుపుమేరకు ఆ జట్టు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ ట్రయల్స్‌లోనూ పాల్గొన్నాడు. కానీ ఏమైందో వాళ్లు రిలీజ్ చేయడంతో వేలానికి వచ్చాడు. ఈ లక్కీ క్రికెటర్ రూ. 20 లక్షల ప్రాథమిక ధర నుంచి ఏకంగా కోట్లు కొల్లగొట్టాడు. ‘రూ. 20 లక్షలకు ఎవరో ఒకరు కొంటారనే నమ్మకం ఉంది. కానీ 40 రెట్లు పలుకుతానని అస్సలు ఊహించలేదు’ అని ఉబ్బితబ్బిబ్బయ్యాడు వరుణ్. సునీల్ నరైన్ టిప్స్.. కోల్‌కతా నైటరైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌కు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేస్తుండగా.. ఆ జట్టు ఆటగాడు సునీల్ నరైన్ తనకు బౌలింగ్‌లో మెలకువలు నేర్పాడని అవి తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వరుణ్ చెప్పుకొచ్చాడు. ‘క్రికెట్ కెరీర్లో తొలి నాళ్లలో నేను వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఆడేవాడిని. ఆ తర్వాత క్రికెట్ మానేసి రెండేళ్ల పాటు వేరే పనిలో నిమగ్నమయ్యాను. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్‌గా మళ్లీ ఆడటం మొదలుపెట్టాను. దాంతో నా మోకాళ్లపై భారం అధికమైంది. ఓ మ్యాచ్‌లో మోకాలికి గాయమైంది. దాంతో ఆర్నెళ్ల పాటు ఆటకు విరామం తీసుకున్నాను. స్పిన్ బౌలింగ్‌తో మళ్లీ ఆడటం మొదలు పెట్టాను’ అని వరుణ్ తెలిపాడు. -
కపిల్ అయితే 25 కోట్లు పలికేవాడు!
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ ప్రస్తుత ఐపీఎల్ వేలంలో ఉంటే రూ.25 కోట్లు తగ్గకుండా పలికేవాడని మాజీ క్రికెటర్ సునీల్ గావాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆజ్‌తక్ చానెల్ నిర్వహించిన ఓ కార్యక్రమానిక హాజరైన ఈ దిగ్గజ క్రికెటర్లు సరదాగా నాటి రోజులను నెమరువేసుకున్నారు. కపిల్‌దేవ్ గొప్ప ఆటగాడని ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ కొనియాడాడు. కపిల్ జింబాంబ్వేపై ఆడిన(175 పరుగులను) ఇన్నింగ్స్‌ను మళ్లీ తాను ఇంతవరకు చూడలేదని చెప్పుకొచ్చాడు. ‘ఓ ఆటగాడిగా.. కామెంటేటర్‌గా వన్డే చరిత్రలోనే అదో గొప్ప ఇన్నింగ్స్. మళ్లీ ఇంతవరకు నేను అలాంటి గొప్ప ఇన్నింగ్స్ చూడలేదు. ఆ మ్యాచ్‌లో మేము 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాం. అప్పుడు చాలా చలిగా ఉంది. అంతేకాకుండా బంతి కూడా బాగా తిరిగింది. ఈ పరిస్థితుల్లో 70 లేక 80 పరుగులు కూడా చేస్తామనుకోలేదు. కానీ కపిల్ అద్బుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. అతనేం నెమ్మదిగా ఆడలేదు. సిక్సర్లతో చెలరేగాడు. అతను కానీ తాజా ఐపీఎల్ వేలంలో ఉంటే కచ్చితంగా రూ.25 కోట్లు పలికేవాడు.’ అని ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై కపిల్ నవ్వుతూ.. ఇంత వరకు అంత డబ్బును ఊహించలేదని చెప్పుకొచ్చాడు. కానీ గవాస్కర్ మాత్రం అది కవిల్ విలువ అని స్పష్టం చేశాడు. ఆల్‌రౌండర్ అయిన కపిల్.. 225 వన్డేల్లో 3783 పరుగులతో పాటు 253 వికెట్లు పడగొట్టాడు. ఇక భారత్‌కు ప్రపంచకప్ అందించిన తొలి కెప్టెన్ కూడా కపిలేనన్న విషయం తెలిసిందే. ఐపీఎల్- 2019 సీజన్ కోసం మంగళవారం జరిగిన వేలంలో 351 ఆటగాళ్లలో 60 మందిని 8 ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పేసర్ ఉనాద్కత్, యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలు రూ.8.4 కోట్లు పలకగా..విహారి రూ.2 కోట్లు, ఇషాంత్ రూ.1.1 కోట్లు, షమీ రూ.4.8 కోట్లు పలికారు. సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ కోటీ రూపాయలకు సొంతం చేసుకుంది. -
ఐపీఎల్ వేలం: హమ్మయ్య యువరాజ్‌కు చాన్స్
జైపూర్: పదకొండు సీజన్లుగా అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పన్నెండో ఏడాదిలోకి ప్రవేశించింది. ఐపీఎల్–12 సీజన్ కోసం ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. మంగళవారం ప్రారంభమైన వేలం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించనుంది. తమ అభిమాన ఆటగాడు ఏ జట్టు సొంతం అవుతాడో, తమ అభిమాన జట్టు కొత్త స్వరూపం ఎలా ఉండబోతోందో అన్న ఆలోచన రాక మానదు. మరోవైపు ఫ్రాంచైజీలు కూడా పూర్తి స్థాయిలో జట్టును ఎంచుకోవాల్సి ఉండటంతో నాణ్యమైన, మేటి ఆటగాళ్లను చేజిక్కించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో బరిలో దిగనున్నాయి. ఈ వేలంలో ఏమైనా జరగొచ్చు. ఎన్నాళ్ల నుంచో తమ దృష్టి ఉన్న ప్రత్యర్థి జట్టులోని కీలక ఆటగాళ్లను తన్నుకుపోయేందుకు ఫ్రాంచైజీలకు ఇదే మంచి అవకాశం. 2019 సీజన్‌కు అవసరమైన ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు ‘పింక్ సిటీ’ జైపూర్ వేదికగా పోటీపడనున్నాయి. తుది వడపోత అనంతరం మిగిలిన 351 మంది నుంచి 70 మందిని లీగ్‌లోని 8 జట్లు ఎంపిక చేసుకోనున్నాయి. వచ్చే ఏడాది మే నెలాఖరు నుంచి వన్డే ప్రపంచ కప్ ఉన్నందున... లీగ్ మార్చి 23 నుంచే ప్రారంభమై మే రెండో వారంలో ముగుస్తుంది. ఇప్పటివరకూ జరిగిన వేలంలో జయదేవ్ ఉనాద్కత్(రూ. 8.40 కోట్లు-రాజస్థాన్), శివం దుబే(రూ. 5కోట్లు-ఆర్సీబీ), వరుణ్ చక్రవర్తి(రూ. 8.40 కోట్లు-కింగ్స్ పంజాబ్)లు జాక్‌పాట్ కొట్టారు. హనుమ విహారి కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్ బ్రాత్‌వైట్ ను రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్ తీసుకోగా, హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. సాయంత్రం 9.10: ముగిసిన ఐపీఎల్-12 సీజన్ ఆటగాళ్ల వేలం. సాయంత్రం 9.08: చివరి నిమిషంలో బతికి పోయిన వోహ్రా. రూ. 20 లక్షల కనీస ధరకు వోహ్రాను సొంతం చేసుకున్న రాజస్థాన్. సాయంత్రం 9.00: జోయ్ డెన్లీని కోటి రూపాయలకు చేజిక్కించుకున్న కేకేఆర్ సాయంత్రం 8.58: మురుగర్ అశ్విన్‌కు అందివచ్చిన అవకాశం. రెండో రౌండ్ వేలంలో ఈ స్పిన్నర్‌ను అతడి కనీస ధరకే సొంతం చేసుకున్న కింగ్స్ పంజాబ్. సాయంత్రం 8.35: రెండో రౌండ్ వేలంలోనూ దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్‌పై ఆసక్తి కనబరచని ప్రాంచైజీలు. సాయంత్రం 8.30: యూపీ బ్యాట్స్‌మన్ అక్ష్దీప్ నాథ్‌ను అదృష్టం వరించింది. రూ.3.60 కోట్లకు ఈ ఆటగాడిని ఆర్సీబీ సొంతం చేసుకుంది. గతంలో పంజాబ్ తరుపున ఆడాడు. సాయంత్రం 8.25: టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిమానులకు ఆనందం కలిగించే విషయం. తొలి రౌండ్లో యువరాజ్‌ను పక్కకు పెట్టిన ఫ్రాంచైజీలు.. రెండో రౌండ్ వేలంలో కనీస ధర కోటి రూపాయలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. దీంతో యువీ ఊపిరిపీల్చుకున్నాడు. లేకుంటే ఐపీఎల్లో యువీ ఆటను అభిమానులు చూసే అవకాశం కోల్పోయేవారు. సాయంత్రం 8.24: రెండో రౌండ్ వేలంలో ఊపిరి పీల్చుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గుప్తిల్. తొలి రౌండ్లో అతడిపై ఆసక్తి కనబరచని ప్రాంఛైజీలు.. రెండో రౌండ్లో అతడి కనీస ధర కోటి రూపాయలకు సొంతం చేసుకున్న సన్‌రైజర్స్. సాయంత్రం 8.22: అగ్నివేష్ అయాచి, హర్ప్రీత్లను సొంతం చేసుకున్న కింగ్స్ పంజాబ్. సాయంత్రం 8.19: 16 ఏళ్ల యంగ్ ఆల్‌రౌండర్ బర్మాన్ను రూ.1.50 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్సీబీ. సాయంత్రం 8.16: యార్ర పృథ్వీ రాజ్‌ను కేకేఆర్ రూ.20 లక్షలకు, లివింగ్‌స్టన్‌ను రాజస్థాన్ రూ.50 లక్షలకు, కీమో పాల్‌ను రూ.50 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి. సాయంత్రం 8.14: రిషిక్ దార్‌ను ముంబై ఇండియన్స్ రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. సాయంత్రం 8.12: వికెట్ కీపర్, అండర్-19 టీమిండియా మాజీ సారథి ప్రబుసిమ్రాన్ సింగ్‌ను రూ.4.80 కోట్ల భారీ మొత్తంతో సొంతం చేసుకున్న కింగ్స్ పంజాబ్. సాయంత్రం 8.02: బ్యాట్స్‌మన్ మిలింద్ కుమార్‌ను కనీస ధర రూ.20 లక్షలకే చేజిక్కించుకున్న ఆర్సీబీ సాయంత్రం 8.01: హ్యారీ గుర్నేని కనీస ధర రూ.75 లక్షలకు సొంతం చేసుకున్న కేకేఆర్ సాయంత్రం 8.00: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫ్యాబియన్ అలెన్‌పై ఆసక్తి కనబరచని ఫ్రాంచైజీలు సాయంత్రం 7.56: రూ. 65 లక్షలకు హిమ్మత్ సింగ్‌ను సొంతం చేసుకున్న ఆర్సీబీ. సాయంత్రం 7.54: హార్దూస్ విల్జొయెన్ను సొంతం చేసుకున్న కింగ్స్ పంజాబ్ సాయంత్రం 7.53: ఒషానే థామస్‌ను రూ.1.10 కోట్లకు సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ సాయంత్రం 7.48: జోయ్ డెన్లీని కనీస ధర రూ. కోటికి ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. సాయంత్రం 7.47: అన్రిచ్ నొర్తేజ్ను రూ. 20 లక్షల కనీస ధరకే సొంతం చేసుకున్న కేకేఆర్ సాయంత్రం 7.44: ఆల్‌రౌండర్ రూథర్‌ఫర్డ్‌ను రూ. రెండు కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్. సాయంత్రం 7.43: ప్రవీణ్ దుబేను కనీస ధరకు కూడా ఏ ప్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. బ్రేక్ తర్వాత ప్రారంభమైన ఐపీఎల్ వేలం పాట సాయంత్రం 6.40 : దక్షిణాఫ్రికా సీనియర్ బౌలింగ్ ద్వయం, బ్యాట్స్‌మెన్‌కు దడపుట్టించే మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్‌లకు ఈ ఐపీఎల్ వేలంలో నిరాశే ఎదురయింది. వారి కనీస ధరకు కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. సాయంత్రం 6.36: బౌలర్ బరిందర్ శ్రాన్‌కు అదృష్టం వరించింది. కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆ బౌలర్‌ను రూ.3.40 కోట్లకు ముంబై ఇండియన్స్ చేజిక్కించుకుంది. సాయంత్రం 6.33: దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసన్ కనీస ధర రూ.50 లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. సాయంత్రం 6.32: ల్యూక్ రాంచీ, ముష్పీకర్ రహీమ్, కుశాల్ పెరీరాల జోలికి ఏ ఫ్రాంచైజీ వెళ్లలేదు. సాయంత్రం 6.25: ముందుగా అనుకున్నట్టుగానే ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్యామ్ కర్రాన్ కోసం ఫ్రాంచైజీలు తెగ పోటీ పడ్డారు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ హిట్టర్‌ను కింగ్స్ పంజాబ్ రూ.7.40 కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. సాయంత్రం 6.22: న్యూజిలాండ్ ఆల్ రౌండర్, గత ఐపీఎల్లో సంచలన ప్రదర్శనలు చేసిన కోరె అండర్సన్‌ను ఈ సీజన్ కోసం ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. సాయంత్రం 6.20: శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌పై ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి కనబర్చక పోవడంతో అమ్ముడుపోలేదు. సాయంత్రం 6.19: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లాను ఈ సీజన్‌కు కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. గత సీజన్ వేలంలోనూ ఆమ్లా అమ్ముడుపోని విషయం తెలిసిందే. సాయంత్రం 6.17: న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ ఇంగ్రామ్ కోసం ఫ్రాంచైజీలు తెగ పోటీ పడ్డారు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఈ ఆటగాడిని రూ.6.40 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. సాయంత్రం 6.11: ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఏ ఫ్రాంచైజీ పెద్దగా పట్టింకోలేదు. సాయంత్రం 5.54: రాజస్థాన్ ఫాస్ట్ బౌలర్ నాథూ సింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అతడి కనీస ధర రూ.20 లక్షలకే ఢిల్లీ కొనుగోలు చేసింది. సాయంత్రం 5.50: కేరళ వికెట్ కీపర్ అరుణ్ కార్తీక్‌ను కనీస ధర రూ.20 లక్షలకు కూడా కోనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. సాయంత్రం 5.49: యువ క్రికెటర్లు జలజ్ సక్సేనా, జాక్సన్, బాబా ఇంద్రజిత్, అనుజ్ రావత్, జహీర్‌ఖాన్ పక్తీన్లను వారి కనీస ధర రూ.20 లక్షలకు కూడా కొనుగోలు చేయాడనికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు. సాయంత్రం 5.35: తమిళనాడు యువ ఆల్ రౌండర్ వరుణ్ చక్రవర్తి ఊహించని రీతిలో అమ్ముడుపోయాడు. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రూ. 20లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొన్న చక్రవర్తిని రూ. 8.40 కోట్ల భారీ మొత్తానికి కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకుంది. సాయంత్రం 5.31: ఆల్‌రౌండర్ శివం దుబే పంట పండింది. రూ 20 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొన్న ఈ యువ సంచలనాన్ని ఐదు కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ ఆటగాడి కోసం ముంబై, ఢిల్లీ, ఆర్సీబీ ప్రాంఛైజీలు పోటీ పడటం విశేషం. సాయంత్రం 5.30: యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌ను కింగ్స్ పంజాబ్ రూ.25 లక్షలకు సొంతం చేసుకుంది. గత సీజన్లో ఆర్సీబీకి ఆడినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. సాయంత్రం 5.23: మాజీ కింగ్స్ పంజాబ్ బ్యాట్స్‌మన్ మనాన్ వోహ్రాపై ఏ ప్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు. సాయంత్రం 5.23 : అన్క్యాప్డ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కాల్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 20 లక్షల కనీస ధరకు కొనగోలు చేసింది. సాయంత్రం 5.00: మోహిత్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. అతన్ని రూ. 5 కోట్ల భారీ మొత్తం చెల్లించి సీఎస్కే కొనుగోలు చేసింది. మధ్యాహ్నం 4.57: వరుణ్ అరోన్ రూ. 2.40 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మధ్యాహ్నం 4.51: మహ్మద్ షమీని రూ. 4.80 కోట్లకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. అతని కనీస ధర కోటి కాగా, కింగ్స్ పంజాబ్ పోటీ పడి దక్కించుకుంది. మధ్యాహ్నం 4.47: లసిత్ మలింగాను ముంబై ఇండియన్స్ చేజిక్కించుకుంది. అతని కనీస ధర రూ. 2 కోట్లకే ముంబై తీసుకుంది. మధ్యాహ్నం: 4.46: ఇషాంత్ శర్మను కోటి 10 లక్షలకు ఢిల్లీ కేపిటల్ తీసుకుంది. అతని కనీస ధర రూ. 75 లక్షలు మధ్యాహ్నం 4.43: జయదేవ్ ఉనాద్కత్ రూ. 8.40 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్ని రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఉనాద్కత్ కనీస ధర ఒక కోటి 50 లక్షల రూపాయిలు ఉండగా అతని కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. మధ్యాహ్నం 4.25: వృద్ధిమాన్ సాహా కనీస ధర కోటి రూపాయిలతో అందుబాటులోకి రాగా, అతన్ని రూ. 1కోటి 20 లక్షలకు సన్‌రైజర్స్ తీసుకుంది. మధ్యాహ్నం 4.23: విండీస్ కీపర్ నికోలస్ పూరన్‌ను కింగ్స్ పంజాబ్ రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా పలు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు కింగ్స్ పంజాబ్ అతనికి భారీ మొత్తం చెల్లించి తీసుకుంది. మధ్యాహ్నం 4.22: జానీ బెయిర్ స్టో కనీస ధర 1 కోటి 50 లక్షలు ఉండగా, రెండు కోట్ల 20 లక్షలకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. మధ్యాహ్నం 4.15: అక్షర్ పటేల్‌ను రూ. 5 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ. కోటి ఉండగా, ఐదు కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. మధ్యాహ్నం 4.08: టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. యువీ కనీస ధర రూ. 1 కోటి ఉండగా అతనిపై ఎవరూ ఆసక్తి చూపలేదు. మధ్యాహ్నం 4:07: ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ కోటి రూపాయల కనీస ధరతో వేలానికి వచ్చాడు. కానీ ఫ్రాంచైజీలు అతడిపై ఆసక్తి చూపలేదు. మధ్యాహ్నం 4.06: విండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌ను రూ. 5 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్నికోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేసింది. బ్రాత్‌వైట్ కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా, రూ. 5 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. మధ్యాహ్నం 3:58: ఇంగ్లండ్ క్రికెటర్ క్రిస్ వోక్స్‌పై కూడా ప్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు. మధ్యాహ్నం 3:56: న్యూజిలాండ్ మాజీ సారథి, హిట్టర్, టీ20 స్పెషలిస్టు బ్రెండన్ మెకల్లమ్ రెండు కోట్ల కనీస ధరతో వేలంలో పాల్గొన్నాడు. అయితే ఏ ఫ్రాంఛైజీ అతడిపై సుముఖత వ్యక్తం చేయలేదు. మధ్యాహ్నం 3.54: విండీస్ చిచ్చర పిడుగు హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా, ఆర్సీబీ నాలుగు కోట్లకు పైగా వెచ్చించి అతన్ని తీసుకుంది. హెట్మెయిర్ కోసం రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లతో ఆర్సీబీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. మధ్యాహ్నం 3.47: హనుమ విహారినికి ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది. అతని కనీసం ధర రూ. 50 లక్షలు ఉండగా, రెండు కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. మధ్యాహ్నం 3:43: ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ కోటిన్నర కనీస ధరతో ఐపీఎల్ వేలానికి వచ్చాడు. అయితే ఏ ఫ్రాంచైజీ అతడిపై అసక్తి కనబరచలేదు. మధ్యాహ్నం 3:43: టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పూజారా 50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొన్నాడు. అయితే అతడిని కొనుగోలు చేసుందుకే ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. మధ్యాహ్నం 3:42: వేలానికి మొదటి ఆటగాడిగా టీమిండియా ఆటగాడు మనోజ్ తివారి రాగా అతడిపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి కనబరచలేదు. మధ్యాహ్నం 3.40: ఈ సీజన్‌కు కొత్తగా ఎంపికైన వేలంపాట దారుడు హ్యూజ్ ఎడ్మీడ్స్ పోడియంకు చేరుకుని వేలాన్ని ఆరంభించారు. మధ్యాహ్నం 3.30: ఐపీఎల్ వేలం కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు మాజీ మహిళా క్రికెటర్, సీఓఏ సభ్యురాలు ఎడ్జుల్లీ స్వాగతం పలికారు. -
మాకు యువరాజే కావాలి !!
న్యూఢిల్లీ: భారత క్యాష్ రిచ్‌లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2019 సీజన్‌కు రంగం సిద్దమైంది. ఇప్పటికే ఈ నెల 18న నిర్వహించనున్న వేలానికి సంబంధించి 346 మంది క్రికెటర్ల పేర్లతో బీసీసీఐ జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేకపోవడం గమనార్హం. అయితే గత సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగిన టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌ను అతని పేలవప్రదర్శన కారణంగా ఆ జట్టు వదులుకుంది. దీంతో ఈ సీజన్‌కు యూవీ కనీస ధరను ఒక కోటిగా నిర్ణయించారు. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు యువరాజ్‌ను తీసుకోవాలని ఆ ప్రాంచైజీని పట్టుబడుతున్నారు. సదరు ఫ్రాంచైజీ.. ‘ఈ సమ్మర్లో మనజట్టులో కొత్తగా ఎవరిని కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి’ అని అధికారిక ట్వీటర్ పేజీలో ఓటింగ్ నిర్వహించింది. దీంతో తమకు యువరాజే కావాలంటూ చైన్నై అభిమానులు తమ ఓట్లతో పోటెత్తారు. యూవీని తీసుకోవాలని.. మళ్లీ యువరాజ్-ధోని కాంబో చూడముచ్చటగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక నిలకడలేమి ఆటతో చాలా రోజులుగా భారత జట్టుకు దూరమైన యువరాజ్.. గత సీజన్ ఐపీఎల్లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. అయినా చెన్నై అభిమానులు మాత్రం యూవీయే కావాలంటూ పట్టుబడుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 29న సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. ఇక 18న జరిగే వేలం నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరోన్ ఫించ్, మ్యాక్స్‌వెల్‌లు స్వయంగా తప్పుకున్నారు. 2019 ప్రపంచకప్‌కు సన్నాహకంలో భాగంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రెండు కోట్ల కనీస ధర జాబితాలో బ్రెండన్ మెకల్లమ్, వోక్స్, లసిత్ మలింగ, షాన్ మార్ష్, కొలిన్ ఇంగ్రామ్, కోరె అండర్సన్, మాథ్యూస్, స్యామ్ కరన్, డార్సీ షార్ట్‌లున్నారు. విశేషమేమంటే, గతేడాది రూ.11.5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ సొంతమై అత్యధిక ధర పలికిన భారత క్రికెటర్‌గా నిలిచిన పేసర్ జైదేవ్ ఉనాద్కట్... ఈసారి రూ.కోటిన్నరకే వేలానికి వచ్చాడు. Ahoy #WhistlePoduArmy, who's that one Lion you badly wanna see in #yellove this summer? #WhistlePodu and vote away at https://t.co/PpKTPCnYuG. 🦁💛 pic.twitter.com/wgJgK9INyR — Chennai Super Kings (@ChennaiIPL) December 13, 2018 pic.twitter.com/uHA4MDogBU — kathirsam (@kathirsam7) December 13, 2018 pic.twitter.com/TH6LrAdDaO — Barath KBK (@baratthh) December 13, 2018 -
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎదురుదెబ్బ
కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో మ్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. యువ పేసర్ కమలేశ్ నాగర్ కోటి పాదం గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పదునైన బంతులతో కమలేశ్ భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే ఐపీఎల్ వేలంలో ప్రాంచైజీలు యువబౌలర్‌ను చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. చివరికి అత్యధికంగా రూ. 3.2 కోట్లు పెట్టి కోల్‌కతా దక్కించుకుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే కమలేశ్‌ను గాయం బాధిస్తూ వచ్చింది. ఈ క్రమంలో త్వరగా కోలుకుని టోర్నీలో పాల్గొంటాడని భావించిన కోల్‌కతాకు నిరాశే ఎదురైంది. గాయం కారణంగా కమలేశ్ నాగర్కోటి ఐపీఎల్ 11 సీజన్ మొత్తానికి దూరమైనట్టు జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో అతని స్థానంలో కర్ణాటక ఆటగాడు ప్రసిద్ క్రిష్ణను తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ జట్టు యాజమాన్యం ఇంకా ధ్రువీకరించలేదు. టోర్నీలో భాగంగా ఇప్పటివరకు కోల్‌కతా ఓ విజయం అందుకోగా, తన తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. -
'ఐపీఎల్' ఆల్‌టైమ్ రికార్డు..!
బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)దే అగ్రస్థానం. అంతర్జాతీయంగా ఉన్న క్రికెట్ లీగ్‌లతో పోలిస్తే ఆదరణ, వీక్షకులు, బ్రాండ్ పరంగా ఐపీఎల్ ముందంజలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ వేలానికి కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సాధారణంగా లైవ్ మ్యాచ్‌లు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపే అభిమానులు.. ఈసారి ఐపీఎల్ వేలాన్ని కూడా భారీ స్థాయిలో వీక్షించారు. గత నెలలో ఐపీఎల్-11 సీజన్ కోసం బెంగళూరులో రెండు రోజుల పాటు నిర్వహించిన వేలాన్నిభారీ స్థాయిలో వీక్షించారు. ఆటగాళ్ల కోసం నిర్వహించిన వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయగా వేలం ప్రక్రియను 46.5 మిలియన్ల మంది వీక్షించినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఐదు రెట్లు అధికం. దాంతో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఈ వేలం కార్యక్రమాన్ని ఆరు ఛానెళ్లలో టెలికాస్ట్ చేసింది. టీవీతో పాటు డిటిటల్ ఫ్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో వీక్షకుల సంఖ్య ఐదు రెట్లు పెరినట్లు స్టార్ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఆదరణ లభించిందని స్టార్ ఇండియా ఎండీ సంజయ్ గుప్తా తెలిపారు. -
'ఐపీఎల్ వేలంతో కలత చెందా'
-
'ఐపీఎల్ వేలంతో కలత చెందా'
ముంబై: న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు సోమవారం స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా భారత్ జట్టు కప్‌ను సొంతం చేసుకుంది. అయితే భారత యువ జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కొన్ని విషయాలు కలత చెందేలా చేశాయట. ఒకవైపు భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం జరగడం తనను ఆందోళన గురి చేసిందన్నాడు. ఈ మేరకు మీడియాతో ముచ్చటించిన ద్రవిడ్..'ఐపీఎల్ వేలానికి ముందు, వెనుక ఒక వారం రోజుల పాటు పరిస్థితులు ఇబ్బందికరంగా సాగాయి. కాగా కుర్రాళ్లు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందుకు వారిని కచ్చితంగా అభినందించాలి. ఐపీఎల్ వేలం ముగిసిన వెంటనే ప్రాక్టీస్‌ను కొనసాగించారు. ఆ మూడు రోజులు నాకు చాలా భయంగా అనిపించింది. ఐపీఎల్ వేలంతో కుర్రాళ్లు ఆందోళనకు లోనై మెగా టోర్నీలో ఏకాగ్రాత చూపలేకపోతారేమో అని భయపడ్డా. వాటిని అధిగమించి వరల్డ్ కప్ సాధించిన ఆటగాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాలి' అని ద్రవిడ్ తెలిపాడు. -
క్రికెటర్లు సంతలో పశువులా?
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై న్యూజిలాండ్ క్రికెటర్ల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్ వేలంతో క్రికెటర్లను సంతలో పశువుల్లా మార్చారని అసోసియేషన్ అధ్యక్షుడు హీత్ మిల్స్ మండిపడ్డారు. స్థానిక హెరాల్డ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఐపీఎల్ వేలం పద్దతి ఆటగాళ్లందరినీ ఘోరంగా అవమానపరిచింది. ప్రపంచం ముందు సంతలో పశువుల్లా నిలబెట్టింది. ఐపీఎల్ వల్ల చాలా లాభాలున్నాయి. కానీ వేలం నిర్వహించే పద్దతి ఇది కాదు. అనైతిక చర్య’ అని మిల్స్ అభిప్రాయపడ్డారు. వేలం వల్ల ఏ జట్టుకు ఆడుతామో తెలియదని, యజమాని, కెప్టెన్ ఎవరో కూడా తెలియదని, కోచ్‌లతో సత్సంబంధాలు కూడా ఉండవని ఇది క్రికెట్‌కు మంచిది కాదని ఈ న్యూజిలాండ్ క్రికెటర్ చెప్పుకొచ్చారు. 10 ఏళ్లలో కొంతమంది ప్లేయర్లు అయితే ఏకంగా ఐదు, ఆరు జట్లకు ఆడటం చూశామని, ఇలా ఏ క్రీడాలీగ్‌లో జరగదని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు ఈ పద్దతి మారేలా చూడాలని కోరారు. ఐపీఎల్‌తో ఫిక్సింగ్, బెట్టింగ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయని, మరి ఈ లీగ్‌తో క్రికెట్ ఆటకు ఒరిగిన ప్రయోజనమెంటో చూడాలని బాంబే హైకోర్టు కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక భారత దిగ్గజ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ సైతం ఐపీఎల్ వేదికను మనీ ల్యాండరింగ్ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. -
జోఫ్రా ఆర్చర్‌పై భారత అభిమానుల ఆగ్రహం
సాక్షి, స్పోర్ట్స్ : ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికి అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న వెస్టిండీస్ అండర్-19 క్రికెటర్ జోఫ్రా ఆర్చర్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్చర్ కనీస ధర రూ.40 లక్షలు ఉండగా రూ.7.20 కోట్ల ధరకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. దీంతో ఆర్చర్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అయితే ఆర్చర్ భారత ద్వేషి అని, ముఖ్యంగా ధోనిని విమర్శిస్తూ గతంలో ట్వీట్లు చేశాడని భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. జోఫ్రా గతంలో చేసిన ట్వీట్స్‌ను తొలిగించినప్పటికి వాటి స్క్రీన్ షాట్లతో నిలదీస్తున్నారు. ఆర్చర్ భారతీయులు నాశనం కావలని, ధోని తనకు తానే స్మార్ట్ అని భావిస్తున్నాడని, ధోని లూల్ అంటూ ఆ ట్వీట్లలో పేర్కొన్నాడు. భారత నాశనాన్ని కోరుకున్న క్రికెటర్‌కు ఐపీఎల్లో అవకాశమివ్వడేమిటని రాజస్తాన్ రాయల్స్ జట్టును అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ ఆడాలంటే ముందుగా భారత దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విండీస్ అనమాక క్రికెటరైన ఆర్చర్ బిగ్‌బాష్ లీగ్‌లో రాణించి గుర్తింపు పొందాడు. బార్బోడాస్ జట్టు తరుపున బంతి, బ్యాట్‌తో సత్తా చాటడంతో ఐపీఎల్ వేలంలో కోట్లు పలికాడు. Don't let him play till he apologizes MSD — Rohit Joshi (@rpjoshi648) 29 January 2018 -
పుజారా మళ్లీ అక్కడికే.!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా నయావాల్ చతేశ్వర పుజారా మళ్లీ ఇంగ్లండ్ బాట పట్టనున్నాడు. వరుసగా రెండో సారి ఐపీఎల్ వేలంలోనూ పుజారాకు నిరాశే ఎదురైంది. ఏ ఫ్రాంచైజీ ఈ టెస్ట్‌బ్యాట్స్‌మన్‌ను తీసుకోకపోవడంతో మళ్లీ యార్క్‌షైర్ జట్టు తరుపున కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఆగస్టులో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కౌంటీలు మేలు చేస్తాయని పూజారా భావిస్తున్నాడు. ఇక యార్క్‌షైర్ జట్టు సైతం తమ వెబ్సైట్లో ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో పుజారా కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం ఉందని పేర్కొంది. కౌంటీ క్రికెట్ ఆడటంపై పుజారా సైతం ఆనందం వ్యక్తం చేశాడు. ‘మళ్లీ యార్క్‌షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. యార్క్‌షైర్ ఆటగాళ్లకు ఆట పట్ల ఉన్న నిబద్ధత నాకు చాల ఇష్టం. నేను నా సహజమైన ఆట ఆడటానికే ప్రయత్నిస్తూ క్లబ్ తరుపున అత్యధిక పరుగులు చేస్తాను. యువరాజ్, సచిన్‌లా నేను కౌంటీ ఆడటం గౌరవంగా భావిస్తున్నా. కౌంటీ ఆడిన ప్రతిసారి నా ఆట మెరుగవుతుంది. నా అనుభావాన్నంతా ఉపయోగించి సాధ్యమైనన్ని పరుగులు చేస్తాను’ అని పుజారా తెలిపాడు. -
‘గేల్‌ను అందుకే తీసుకున్నాం’
సాక్షి, స్పోర్ట్స్ : క్రిస్ గేల్.. ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ట్వంటీ 20ల్లో అమోఘమైన రికార్డు ఈ విధ్వంసకర క్రికెటర్ సొంతం. ప్రధానంగా సిక్సర్ల కింగ్‌గా పిలుచుకునే గేల్... ఈసారి ఐపీఎల్ వేలంలో విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన గేల్‌ను ఈ సారి వేలంలో ఆ జట్టు ఉద్వాసన పలికింది. అంతేగాకుండా ఏ ప్రాంచైజీ గేల్‌ను తీసుకోవడానికి ముందుకు రాలేదు. రూ.2 కోట్ల కనీస ధరతో రెండు సార్లు వేలంలో అతని పేరు ప్రకటించినా ఎవరూ ఆసక్తి కనబర్చలేదు. ఇక అమ్ముడుపోని క్రికెటర్లకు ఆఖర్లో మరొకసారి వేలం జరగ్గా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కనికరించి అదే బేస్ ప్రైస్‌కు సొంతం చేసుకుంది. అంత వరకు విముఖత కనబర్చి తరువాత ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీనిపై మాజీక్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు. ‘గేల్ ఓపెనింగ్ వస్తే ప్రత్యర్థి జట్లు భయపడతాయి. ఏ ప్రత్యర్థి జట్టుకైనా గేల్ విధ్వంసకర ఆటగాడు. ఇప్పటికే అతను నిరూపించుకున్నాడు. కింగ్స్ పంజాబ్ జట్టుకు ఆరోన్ ఫించ్, స్టోయినిస్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ సింగ్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్లతో మంచి బ్యాటింగ్ లైనప్ కలిగిఉంది. ఈ లైనప్‌కు గేల్‌తో మరింత బలం చేకూరుతుంది. ఇక గేల్ అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఓపెనింగ్‌కు బ్యాక్ అప్‌గా తీసుకున్నాం’ అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. -
ధోని జట్టుపై పేలుతున్న జోకులు
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్లో రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో జట్టు యాజమాన్యం డబ్బులన్నీ వృథా చేసిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలానికి ముందే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను రిటైన్ పద్దతిలో అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. మిగిలిన 22 మంది ప్లేయర్లను సీఎస్కే వేలంలో దక్కించుకుంది. అయితే జట్టు ఎంపికపై అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. యువ క్రికెటర్లను కాదని సీనియర్ క్రికెటర్లు తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జట్టు యాజమాన్యం కొనుగోలు చేసిన మెత్తం 25 మంది ఆటగాళ్లలో 11 మంది ప్లేయర్లు వయసు రీత్యా 30 ఏళ్లకు పైబడినవారే కావడం విశేషం. ఈ వ్యవహారమే అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. సోషల్ మీడియాలో వారి ఫొటో షాప్ నైపుణ్యానికి పని చెప్పి మరి సీఎస్కే యాజమాన్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. స్పిన్నర్ అశ్విన్ కాకుండా హర్భజన్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ధోని జట్టుకు పెన్షన్ పథకం అమలు చేయండని కొందరంటే.. ఆట కంటే వయస్సునే పరిగణలోకి తీసుకున్నారని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆటగాళ్లు వారి వయసు.. 1. ఎంఎస్ ధోనీ-36 (రూ. 15 కోట్లు) 2. సురేష్ రైనా-31 (11 కోట్ల రూపాయలు) 3. డ్వేన్ బ్రేవో-34 (రూ 6.4 కోట్లు) 4. షేన్ వాట్సన్-36 (రూ .4 కోట్లు) 5. కేదార్ జాధవ్-32 (రూ .7.8 కోట్లు) 6. హర్భజన్ సింగ్ (2 కోట్లు)-37 7. అంబటి రాయుడు-32 (రూ 2.2 కోట్లు) 8. ఇమ్రాన్ తాహిర్ -38(రూ. 1 కోట్లు) 9. డుప్లెసిస్-33 (రూ. 1.6 కోట్లు) 10. మురళీ విజయ్-33 (రూ .2 కోట్లు) 11. కరణ్ శర్మ-30 (రూ .5 కోట్లు) CSK have launched "MS Dhoni Buddhe Bachao, Pension Dilao Yojana" #IPLAuction — Amol (@Imamol97) 27 January 2018 pic.twitter.com/abW89vxZOe — VIRENDER SEHWAG (@virendr_sehwag) 28 January 2018 -
ఐపీఎల్ వేలంలో ఆ ఇద్దరిపై అందరి దృష్టి!
సాక్షి, బెంగళూరు: దేశంలో అత్యంత సంపన్న లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలంపాట ఇటీవల అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. టాప్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లే కాదు.. వేలంపాటలో పాల్గొన్న సంపన్నుల పిల్లలు కూడా పలువురి దృష్టిని ఆకర్షించారు. ఈ వేలంపాటలో ముంబై ఇండియన్స్ టేబుల్ వద్ద ఆ జట్టు యాజమాని ముఖేశ్ అంబానీ సతీమణి నీతతోపాటు వారి తనయుడు ఆకాశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆటగాళ్ల బిడ్డింగ్‌లో కీలక పాత్ర పోషిస్తూ.. పెడెల్ను రైజ్ చేయడంలో ఆకాశ్ ముందంజలో కనిపించాడు. ఇక, 17 ఏళ్ల ఝాన్వీ కూడా ఆటగాళ్ల వేలంపాటలో అందరి దృష్టి ఆకర్షించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు సహ యాజమానులైన నటి జుహీ చావ్లా, నిర్మాత జయ్ మెహతాల కూతురు ఝాన్వీ. కేకేఆర్ ఫ్రాంచైజీ వ్యూహరచనలోనూ పాలుపంచుకుంటున్న ఝాన్వీ ఆటగాళ్ల బిడ్డింగ్‌లోనూ చురుగ్గా పాల్గొని.. స్పెషల్ ఆట్రాక్షన్‌గా నిలిచింది. సహజంగా రిటైర్డ్ క్రికెట్ దిగ్గజాలు పాల్గొనే ఈ వేలంపాటలో ఈ యంగ్‌స్టర్స్ పాల్గొనడం ఆసక్తి రేకెత్తించింది. -
కోట్లతో ‘జై’ కొట్టారు
అనూహ్యానికి, ఆశ్చర్యానికి అడ్రస్‌లాంటి ఐపీఎల్ వేలంలో మరో పెద్ద సంచలనం. ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున డజను మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగిన లెఫ్టార్మ్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్‌పై కోట్ల వర్షం కురిసింది. రాజస్తాన్ రాయల్స్ ఏకంగా రూ. 11.5 కోట్ల మొత్తానికి అతడిని సొంతం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. గత ఏడాది ఐపీఎల్లో నిలకడగా రాణించడం ఒక కారణమైనా... ఇంత భారీ ధర పలకడం మాత్రం నివ్వెరపరిచేదే! తాజా వేలంలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా నిలిచిన ఉనాద్కట్... స్టోక్స్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. అన్క్యాప్డ్ ఆటగాడు కృష్ణప్ప గౌతమ్‌కు రూ.6.2 కోట్లు లభించడం మరో విశేషం కాగా... ఎట్టకేలకు రూ. 2 కోట్ల కనీస ధరతో క్రిస్ గేల్ పంజాబ్ చెంత చేరడం కొసమెరుపు. బెంగళూరు: ఐపీఎల్–2018 కోసం జరిగిన వేలంలో రెండో రోజు కూడా ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. ఇప్పటికే గుర్తింపు పొందిన ఆటగాళ్లతో పాటు కొత్తవాళ్లకు కూడా పెద్ద మొత్తం చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో ఉనాద్కట్, గౌతమ్ ముందు వరుసలో నిలిచారు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ఆండ్రూ టైని పంజాబ్ జట్టు రూ.7.20 కోట్లకు గెలుచుకుంది. విదేశీ ఆటగాళ్లలో రెండో రోజు ఇదే అత్యధిక మొత్తం. తొలి రోజు సన్‌రైజర్స్ తీసుకున్న రషీద్ ఖాన్‌తో పాటు మరో ముగ్గురు అఫ్గానిస్తాన్ ఆటగాళ్లకు కూడా ఐపీఎల్లో చోటు లభించగా... సందీప్ లిమిచానే ఈ లీగ్‌లో అడుగు పెడుతున్న తొలి నేపాల్ క్రికెటర్‌గా నిలవడం విశేషం. కోల్‌కతా జట్టు తమకు అందుబాటులో ఉన్న మొత్తం రూ. 80 కోట్లను పూర్తిగా వినియోగించుకోగా... చివర్లో ఆటగాళ్లను ఎంచుకోవడంలో గందరగోళానికి గురైన చెన్నై రూ.6.50 కోట్లను ఉపయోగించుకోలేక వృథా చేసుకుంది. ఎనిమిది జట్లలో కోల్‌కతా, పంజాబ్ గరిష్ట విదేశీ ఆటగాళ్లు (8)ను ఎంచుకోకుండా 7కే పరిమితమయ్యాయి. ఒక్కోజట్టు సభ్యుల సంఖ్య గరిష్టంగా 25 కాగా చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సరిగ్గా 25 మందిని తీసుకున్నాయి. బెంగళూరు (24), రాజస్తాన్ (23), పంజాబ్ (21), కోల్‌కతా (19) తక్కువ సంఖ్యకే తమ వేలాన్ని ముగించాయి. ఉనాద్కట్ కోసం పోటీ పడి... స్వయంగా ఉనాద్కట్ కూడా కలలో ఊహించలేని విధంగా అతని కోసం వేలం సాగింది. రూ. 1.5 కోట్ల కనీస ధరతో అతను వేలంలోకి అందుబాటులోకి వచ్చాడు. అందరికంటే ముందుగా చెన్నై రేసులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత పంజాబ్ వేలానికి సిద్ధమైంది. ఒకరితో మరొకరు పోటీ పడి విలువ పెంచేశారు. ఫలితంగా 4 కోట్లు... 5... 8... ఇలా పంజాబ్ 10 కోట్లకు తీసుకుపోయింది. చెన్నై 10.5 చెప్పినా మళ్లీ పంజాబ్ 11కు పెంచి ఆగిపోయింది. ఇక పంజాబ్‌కే ఖాయం అనిపించిన దశలో అనూహ్యంగా రాజస్తాన్ ముందుకొచ్చింది. రూ. 11.5 కోట్లకు సిద్ధమని ప్రకటించి ఉనాద్కట్‌ను సొంతం చేసుకుంది. నిజానికి ఉనాద్కట్ వేలానికి వచ్చే సమయానికి రాయల్స్ వద్ద మొత్తం 16.5 కోట్లు మాత్రమే మిగిలాయి. కానీ ఆ జట్టు ఒక్క ఆటగాడి కోసం అందులో 70 శాతం మొత్తాన్ని ఖర్చు చేయడం అమితాశ్చర్యం కలిగించింది. గత ఏడాది పుణే తరఫున ఆడిన ఉనాద్కట్ హ్యాట్రిక్ సహా 7.02 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ (26) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. గౌతమ్ కనీస ధర రూ. 20 లక్షలు కాగా... బెంగళూరు, కోల్‌కతాలతో పోటీ పడి రాయల్స్ చివరకు అతడిని తీసుకుంది. ఇది గౌతమ్ కనీస ధరకంటే 31 రెట్లు ఎక్కువ కావడం విశేషం. అంతర్జాతీయ టి20ల్లో భారత్‌పైనే 2 సెంచరీలు చేసిన ఎవిన్ లూయీస్ (వెస్టిండీస్) కోసం సన్‌రైజర్స్ ఆసక్తి చూపించినా, అతడిని ముంబై దక్కించుకుంది. ధోని ఫేవరెట్ మోహిత్ శర్మను చెన్నై రూ.2.4 కోట్లకు గెలుచుకోగా... రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా అతను పంజాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ముచ్చటగా మూడోసారి... విధ్వంసకర ఆటగాడిగా లెక్కలేనన్ని టి20 రికార్డులు తన పేరిట ఉన్న క్రిస్ గేల్ ఐపీఎల్ కెరీర్‌కు చివరకు పంజాబ్ ఊపిరి పోసింది. ఆదివారం రెండోసారి వేలంలో కూడా అతడిని ఎవరూ తీసుకోలేదు. మూడోసారి మాత్రం కనీస ధర రూ. 2 కోట్లకు కింగ్స్ ఎలెవన్ ఎంచుకోగా, మరే ఫ్రాంచైజీ పోటీ పడలేదు. శ్రీలంక తరఫున ఆఫ్ స్పిన్నర్ అఖిల ధనంజయ, ఆల్‌రౌండర్ దుష్మంత చమీరాలకు మాత్రమే ఐపీఎల్ అవకాశం లభించింది. మురళీ విజయ్ కూడా... తొలి రోజు వేలంలో అమ్ముడుపోని భారత టెస్టు ఓపెనర్ మురళీ విజయ్‌కు రెండో రోజు అదృష్టం వెంట వచ్చింది. అతని సొంత నగరానికే చెందిన చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధర రూ. 2 కోట్లకు విజయ్ను ఎంచుకుంది. చెన్నైకి ఆ సమయంలో కచ్చితంగా ఒక భారత బ్యాట్స్‌మన్, అదీ ఓపెనర్ అవసరం ఉండటం కూడా విజయ్‌కు కలిసొచ్చింది. శనివారం ఎవరూ పట్టించుకోని పార్థివ్ పటేల్ (రూ.1.7 కోట్లు–బెంగళూరు), మిచెల్ జాన్సన్ (రూ. 2 కోట్లు – కోల్‌కతా) రెండోసారి మాత్రం ఎంపికయ్యారు. ఐపీఎల్లో బిర్లా వారసుడు బిర్లా... ఈ పేరు వినగానే మన మదిలో అతి పెద్ద పారిశ్రామికవేత్త, అపార సంపద కలిగిన కోటీశ్వరుని పేరే మదిలో మెదులుతుంది! ఇప్పుడు అలాంటి బిర్లా కుటుంబ వారసుడు ఐపీఎల్లో అడుగు పెట్టబోతున్నాడు. ఐపీఎల్ రాకతో పేదలు ధనవంతులుగా మారిన కథలతో పోలిస్తే ఇది కాస్త భిన్నం. 20 ఏళ్ల ఆర్యమాన్ విక్రమ్ బిర్లా తాజా వేలంలో రాజస్తాన్ రాయల్స్ జట్టులోకి ఎంపికయ్యాడు. కుమార మంగళం బిర్లా కుమారుడే ఆర్యమాన్ కావడం విశేషం. రూ.20 లక్షల కనీస విలువతో ఆర్యమాన్ పేరు వేలంలోకి వచ్చింది. రాజస్తాన్ అదే మొత్తానికి ముందుగా రాగా పంజాబ్ మరో ఐదు లక్షలు పెంచింది. అయితే ఆ తర్వాత రాయల్స్ రూ. 30 లక్షలకు ఆర్యమాన్‌ను సొంతం చేసుకుంది. ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అయిన ఆర్యమాన్ మధ్యప్రదేశ్ తరఫున ఇటీవల తన ఏకైక రంజీ మ్యాచ్ ఆడాడు. కొన్నాళ్ల క్రితమే అండర్–23 సీకే నాయుడు టోర్నీలో 153 పరుగులతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబై జట్టులో అవకాశాలు లభించడం కష్టంగా భావించి మధ్యప్రదేశ్‌కు తరలి వెళ్లిన ఆర్యమాన్... వ్యాపారంకంటే క్రికెట్ కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పాడు. సిరాజ్ అదే మొత్తానికి.... హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఈసారి కోహ్లి సారథ్యంలోని బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు. గత ఏడాదిలాగే ఈసారి కూడా సిరాజ్ సరిగ్గా రూ. 2.6 కోట్ల ధర పలకడం విశేషం. 2017 ఐపీఎల్లో 6 మ్యాచ్‌లలో 10 వికెట్లు పడగొట్టిన సిరాజ్... ఆ తర్వాత భారత జట్టుకు కూడా ఎంపికై రెండు టి20లు ఆడి 2 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం వేలంలో సిరాజ్ కోసం వరుసగా కోల్‌కతా, ముంబై, చెన్నై, పంజాబ్ పోటీ పడినా... చివరకు బెంగళూరు అతడిని దక్కించుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఇతర ఆటగాళ్లలో తన్మయ్ అగర్వాల్ ఈసారి కూడా కనీస ధర (రూ. 20 లక్షలు)కు సన్‌రైజర్స్‌కే ఎంపికయ్యాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్‌ను కూడా తొలిసారి రైజర్స్ ఎంచుకోవడం విశేషం. ఆంధ్ర క్రికెటర్లలో రికీ భుయ్ (రూ.20 లక్షలు) వరుసగా రెండోసారి రైజర్స్ తరఫున కొనసాగనున్నాడు. మరో ఇద్దరు... అఫ్గానిస్తాన్ తరఫున గత ఏడాది ఐపీఎల్లో ఇద్దరు ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఈసారి కూడా రషీద్ ఖాన్ (రూ. 9 కోట్లు), మొహమ్మద్ నబీ (రూ. 1 కోటి) హైదరాబాద్‌కే ఆడనున్నారు. వీరితో పాటు కొత్తగా మరో ఇద్దరు కూడా ఐపీఎల్లో అడుగు పెడుతుండటం విశేషం. ప్రస్తుతం అండర్–19 ప్రపంచ కప్ ఆడుతున్న ముజీబ్ జద్రాన్, జహీర్ ఖాన్ పక్తీన్లకు చోటు లభించింది. 17 ఏళ్ల ముజీబ్‌కు ‘మిస్టరీ స్పిన్నర్’గా గుర్తింపు ఉంది. ప్రధానంగా ఆఫ్ స్పిన్నర్ అయినా లెగ్ స్పిన్, గుగ్లీలు కలగలిపి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. రెండు రోజుల క్రితం న్యూజిలాండ్‌పై 4 వికెట్లు తీసి అఫ్గాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ముజీబ్‌ను పంజాబ్ ఏకంగా రూ. 4 కోట్లకు సొంతం చేసుకుంది. 19 ఏళ్ల జహీర్ ఖాన్ చైనామన్ బౌలర్. ఇటీవల వైవిధ్యమైన శైలి బౌలర్లకు డిమాండ్ కనిపిస్తున్న నేపథ్యంలో రూ. 20 లక్షలకు జహీర్‌ను ముంబై గెలుచుకుంది. ముజీబ్, జహీర్ వీళ్లకు ఐపీఎల్ యోగం లేదు: ఇషాంత్ శర్మ, టైల్‌మిల్స్, ఫాల్క్‌నర్, హాజల్‌వుడ్, ఏంజెలో మాథ్యూస్, మోజెస్ హెన్రిక్స్, హషీం ఆమ్లా, నాథన్ లయన్, జో రూట్, డ్వేన్ స్మిత్, మెక్లీనగన్, లసిత్ మలింగ, డారెన్ స్యామీ, రాస్ టేలర్, మోర్నీ మోర్కెల్, తిసారా పెరీరా, ఇర్ఫాన్ పఠాన్, అశోక్ దిండా, వరుణ్ ఆరోన్. 169 అమ్ముడుపోయిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య 113 మొత్తం భారత ఆటగాళ్లు 71 అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు 56 మొత్తం విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీలు వెచ్చించిన మొత్తం రూ. 431 కోట్ల 70 లక్షలు ► కోల్‌కతా ముగ్గురు భారత అండర్–19 ఆటగాళ్లను సొంతం చేసుకుంది. వీరిలో పేసర్లు కమలేశ్ నాగర్కోటి (రూ. 3.20 కోట్లు), శివమ్ మావి (రూ. 3 కోట్లు) భారీ మొత్తాలకు అమ్ముడుపోగా, శుభ్‌మాన్ గిల్‌కు రూ. 1.80 కోట్లు దక్కాయి. ► పంజాబ్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్న మయాంగ్ డాగర్ సెహ్వాగ్‌కు స్వయానా మేనల్లుడు ► పంజాబ్ తీసుకున్న మంజూర్ దార్ లీగ్‌లో ఏకైక జమ్మూ కశ్మీర్ ఆటగాడు. ► చెన్నై జట్టులో ఏకంగా ఎనిమిది మంది అన్క్యాప్డ్ ఆటగాళ్లున్నారు. -
‘ఆ ఇద్దరితో ఆడాలనే నాకల నిజమైంది’
చెన్నై : గత ఐపీఎల్లో రైజింగ్ పుణే తరుపున ఆడి మహేంద్రసింగ్ ధోని, కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌లను మెప్పించిన తమిళ యువకెరటం, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఈ ఏడు వేలంలో రూ.3.3 కోట్లు పలికాడు. ఈ ధరకు రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు సుంధర్‌ను సొంతం చేసుకుంది. ఈ తరుణంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలయర్స్‌తో కలిసి ఆడాలనే తన కల నేరవేరిందని ఈ యంగ్ క్రికెటర్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘నన్ను ఆర్సీబీ ఎంచుకోవడం ఆనందం కలిగించింది. నేను విరాట్ కోహ్లికి, ఏబీ డివిలియర్స్‌కు పెద్ద అభిమానిని. గతేడాది రైజింగ్‌పుణే తరుపున ధోనితో కలిసి ఆడటం ఇప్పుడు ఈ లెజెండ్స్‌తో ఆడే అవకాశం రావడం వెలకట్టలేని అనుభవమని’ వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ధోని దగ్గర నేర్చుకున్న మెళుకువలు ఆర్సీబీ జట్టుకు ఎంపిక చేశాయని, ఈ జట్టులో సైతం సీనియర్ ప్లేయర్ల ఆటను దగ్గర నుంచి చూసి మరింత నేర్చుకుంటున్నాని ఈ 18 ఏళ్ల యువస్పిన్నర్ చెప్పుకొచ్చాడు. తన లక్ష్యం మాత్రం భారత జట్టులో చోటు సంపాదించుకోవడమేనని, ఇందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటానన్నాడు. ఇక సుంధర్ అత్యధిక ధర పలకడంపై అతని తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. యువక్రికెటర్లకు ఐపీఎల్ చక్కని వేదికని, సుంధర్లాంటి క్రికెటర్లకు తమ టాలెంట్ నిరూపించుకోవాడనికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
గేల్‌ను కనికరించిన ప్రీతి
బెంగళూరు: క్రిస్ గేల్.. ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ట్వంటీ 20ల్లో అమోఘమైన రికార్డు ఈ విధ్వంసకర క్రికెటర్ సొంతం. ప్రధానంగా సిక్సర్ల కింగ్‌గా పిలుచుకునే గేల్... ఈసారి ఐపీఎల్ వేలంలో ఎట్టకేలకు అమ్ముడుపోయాడు. గేల్‌ను రూ. 2 కోట్లకు కింగ్స్ పంజాబ్ చివరి నిమిషంలో దక్కించుకుంది. అతనికున్న కనీస ధరకే కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకుంది. కింగ్స్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతా కనికరించడంతో గేల్‌కు ఊరట లభించినట్లయ్యింది. శనివారం తొలి రోజు వేలంలో అమ్ముడుపోని గేల్.. ఆదివారం రెండో రోజు వేలం ఆరంభంలో కూడా అమ్ముడుపోలేదు. ఈ రోజు అన్‌సోల్డ్ వేలం పాటలో భాగంగా తొలుత గేల్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కాగా, అమ్ముడుపోని క్రికెటర్లకు ఆఖర్లో మరొకసారి వేలం జరగ్గా గేల్‌ను కొనుగోలు చేయడానికి కింగ్స్ పంజాబ్ ఆసక్తి చూపింది. అతని కనీస ధర రూ. 2 కోట్లకే కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు గప్టిల్‌కు మూడోసారి కూడా నిరాశే ఎదురుకావడం గమనార్హం. -
గేల్‌ను మళ్లీ వద్దనుకున్నారు..
బెంగళూరు: ట్వంటీ 20 స్పెషలిస్టులుగా ముద్రపడిన క్రిస్ గేల్(వెస్టిండీస్), మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్)లకు ఐపీఎల్-11 వేలంలో మరోసారి చుక్కెదురైంది. శనివారం తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఈ ఇద్దరి క్రికెటర్లు.. ఆదివారం కొనసాగుతున్న వేలంలో కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ స్టార్ క్రికెటర్ల వైపు కనీసం ఏ ఫ్రాంచైజీ కన్నెత్తికూడా చూడకపోవడం గమనార్హం. వీరిద్దరి కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా, ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకున్న ఫ్రాంచైజీలు ఎటువంటి ఆసక్తికనబరచలేదు. మరొకవైపు నిన్న అమ్ముడుపోని భారత క్రికెటర్ మురళీ విజయ్‌కు ఊరట లభించింది. అతని కనీస ధర రూ. 2 కోట్లకు చెన్నె సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అటు తరువాత శామ్ బిల్లింగ్స్‌ను కూడా సీఎస్కే దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 1 కోటికే సీఎస్కే కొనుగోలు చేసింది. -
ఐపీఎల్ వేలం: అఫ్గాన్ క్రికెటర్ల హవా
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా జరుగుతున్న వేలంలో అఫ్గానిస్తాన్ క్రికెటర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకూ నలుగురు అఫ్గానిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్ వేలంలో మెరిసి తమ దేశానికి వన్నె తెచ్చారు. ఇందులో ముగ్గరు క్రికెటర్ల కోట్ల రూపాయిలను కొల్లగొట్టడం ఇక్కడ మరో విశేషం. రషీద్ ఖాన్(రూ. 9 కోట్లు)ను సన్ రైజర్స్ హైదరాబాద్ రైట్ టు మ్యాచ్ కార్డ్ పద్ధతి ప్రకారం సొంతం చేసుకోగా, మొహ్మద్ నబీ(రూ. 1 కోటి)ని సైతం సన్ రైజర్స్ దక్కించుకుంది. వీరిద్దరూ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్య వహించిన క్రికెటర్లే కాగా, ఇక మరో అఫ్గాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబ్ జద్రాన్(రూ. 4 కోట్లు)ను కింగ్స్ పంజాబ్ పోటీ పడి మరీ దక్కించుకుంది. జర్దాన్ కనీస ధర రూ. 50 లక్షలు మాత్రమే ఉండగా కోట్లు వెచ్చించి మరీ కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. దాంతో ఈ ఐపీఎల్ వేలంలో అమ్ముడిపోయిన మూడో అఫ్గాన్ క్రికెటర్‌గా జర్దాన్ నిలిచాడు. కాగా, మరో అఫ్గాన్ ప్లేయర్ జహీర్ ఖాన్(రూ. 60 లక్షలు)ను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. అతని కనీస ధర రూ. 20 లక్షలు కాగా, మూడు రెట్లు అధికంగా అమ్ముడుపోయాడు. ఫలితంగా ఐపీఎల్ వేలంలో కొనుగోలైన నాల్గో అఫ్గానిస్తాన్ క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. -
అదృష్టమంటే ఆండ్రూదే..5 వికెట్లకు 7 కోట్లు!
-
ఐపీఎల్ వేలం: అదృష్టమంటే ఆండ్రూ టైదే!
బెంగళూరు: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో ఆస్ట్రేలియా బౌలర్ ఆండ్రూ టైని అదృష్టం వరించిందనే చెప్పాలి. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో చెలరేగిపోయిన ఆండ్రూ టై.. ఐపీఎల్-11 వేలంలో రూ. 7. 2 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోవడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. ఆండ్రూ టై కనీస ధర రూ. 1 కోటి ఉండగా, అతనికి భారీ మొత్తం చెల్లించి కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకుంది. అయితే ఇంగ్లండ్‌తో ఐదో వన్డేలో ఐదు వికెట్లను సాధించిన తర్వాత ఆండ్రూ టై ఐపీఎల్ వేలానికి రావడం విశేషం. దాంతో ఆండ్రూ టై ఐదు వికెట్లకు ఏడు కోట్లు దక్కాయంటూ క్రికెట్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. గత కొంతకాలంగా పెద్దగా ఆకట్టుకోని టై.. ఐపీఎల్ వేలానికి ముందే ఫామ్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌తో నాల్గో వన్డేలో మూడు వికెట్లు సాధించిన టై.. అంతముందు రెండు వన్డేలు ఆడి కనీసం వికెట్ కూడా సాధించలేదు. ఈ ఐదు వన్డేల సిరీస్‌లో చివరి రెండు వన్డేల్లో ఎనిమిది వికెట్లు సాధించడమే అతనికి అత్యధిక మొత్తం పలకడానికి ప్రధాన కారణం. మరొకవైపు గతేడాది రూ. 12 కోట్లకు అమ్ముడుపోయిన ఇంగ్లిష్ పేసర్ తైమాల్ మిల్స్‌ను ఈసారి ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 2017లో ఆర్సీబీ తరపున మిల్స్ ఆడిన సంగతి తెలిసిందే. -
యువ 'రైడర్స్'.. అ‘ధర’హో!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా జరుగుతున్న వేలంలో అండర్ -19 క్రికెటర్లు కోట్లు కొల్లగొడుతున్నారు. తొలి రోజు వేలంలో బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్(రూ.1.8 కోట్లు), పేసర్ కమలేశ్ నాగకోటి(రూ.3.2 కోట్లు)లను కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) సొంతం చేసుకోగా, పృథ్వీ షా(రూ.1.2 కోట్లు)ను ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. ఇక ఈ రోజు వేలంలో మరో అండర్-19 క్రికెట్ ఫాస్ట్ బౌలర్ శివం మావి(రూ. 3 కోట్లు)ని కేకేఆర్ దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 20 లక్షలుండగా, రూ. 3 కోట్లు వెచ్చించి కేకేఆర్ కొనుగోలు చేసింది. అండర్-19లో సత్తాచాటుతున్న శివం మావి కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ అతన్ని చివరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. దాంతో ప్రస్తుత భారత అండర్-19 క్రికెట్ జట్టులో ఉన్న ముగ్గురు క్రికెటర్లను కేకేఆర్ కొనుగోలు చేసినట్లయ్యింది. గత ఐపీఎల్ సీజన్లలో సీనియర్ క్రికెటర్లపై ఎక్కువ ఆసక్తి కనబరిచిన కేకేఆర్.. ఈసారి యువ క్రికెటర్లతో జట్టును నింపే యత్నం చేస్తోంది. దాంతో యువ రైడర్స్‌తో కేకేఆర్ పోరుకు సిద్దమవుతోంది. -
ఐపీఎల్ వేలంలో పెను సంచలనం
-
ఐపీఎల్ వేలంలో పెను సంచలనం
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు సంబంధించి రెండో రోజు కొనసాగుతున్న వేలంలో పెను సంచలనం నమోదైంది. సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనాద్కత్ రూ. 11.50 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నాడు. గతేడాది ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహించి బౌలింగ్‌లో సత్తాచాటిన ఉనాద్కత్‌కు ఈసారి వేలంలో అత్యధిక మొత్తాన్ని చెల్లించి రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఉనాద్కత్‌కు కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ చివరకు రాజస్థాన్ రాయల్స్ అతన్ని దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు ఉండగా, అంతకు 10 రెట్లు అధికంగా అమ్ముడుపోవడం విశేషం. అయితే ఇప్పటివరకూ జరిగిన ఈ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ఆటగాడిగా ఉనాద్కత్ నిలిచాడు. బెన్ స్టోక్స్(12.5 కోట్లు) అత్యధిక ధర పలికిన ఆటగాడు కాగా, ఆ తర్వాత స్థానంలో ఉనాద్కత్ నిలిచాడు. అయితే భారత్ నుంచి అత్యధిక ధర పలికిన ఆటగాడు ఉనాద్కత్ కావడం మరో విశేషం. మరొకవైపు హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ ఐపీఎల్ వేలంలో ఫర్వాలేదనిపించాడు. అతని కనీస ధర రూ. కోటి ఉండగా, రూ. 2.60 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ఇక కౌల్టర్ నైల్ రూ. 2.2 కోట్లకు ఆర్సీబీ దక్కించుకోగా, పేసర్ వినయ్ కుమార్‌ను రూ. 1 కోటి వెచ్చించి కేకేఆర్ సొంతం చేసుకుంది. -
స్టార్ క్రికెటర్లకు నిరాశ
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల)-11 సీజన్లో భాగంగా రెండో రోజు వేలంలో కూడా పలువురు స్టార్ క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. ట్వంటీ 20 స్పెషలిస్టులైన ఇంగ్లండ్ క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హేల్స్‌ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తిచూపలేదు. మరొకవైపు ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ వైపు సైతం ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూడలేదు. ఈ వేలంలో మోర్గాన్ కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా, హేల్స్ కు నిర్ణయించిన ధర రూ. 1 కోటిగా ఉంది. కాగా, ఈ ధరకు కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాకపోవడం ఆసక్తికరంగా మారింది. మార్ష్ కనీస ధర రూ. 1.5 కోట్లు ఉన్నప్పటికీ ఈ స్టార్‌ను కూడా ఎవరూ తీసుకోలేదు. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాకపోగా, వెస్టిండీస్ క్రికెటర్ సిమ్మన్స్‌ను కూడా వేలంలో అమ్ముడుపోలేదు. స్టెయిన్ కనీస ధర రూ. 1 కోటి ఉండగా, సిమ్మన్స్ కనీస ధర రూ. 1.5 కోట్లగా ఉంది. -
ఆఫ్ స్పిన్నర్ గౌతమ్ జాక్‌పాట్
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా రెండో రోజు వేలంలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తొలి రోజు వేలంలో పలువురు అనామక క్రికెటర్లు భారీ ధరకు అమ్ముడుపోగా, రెండో రోజు వేలంలో సైతం అదే పరంపర కొనసాగుతోంది. ఆదివారం బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో కర్ణాటక ఆఫ్ స్పిన్నర్ గౌతమ్ జాక్‌పాట్ కొట్టాడు. గౌతమ్‌ను రూ. 6.2 కోట్లు భారీ ధర పెట్టి రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. గౌతమ్ కనీస ధర రూ. 20 లక్షలు కాగా, అతని కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ గౌతమ్‌ను అత్యధిక మొత్తానికి కొనుగోలు చేసింది. గతంలో ముంబై ఇండియన్స్‌కు గౌతమ్ ప్రాతినిథ్య వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే, రెండో రోజు వేలంలో వెస్టిండీస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఇవెన్ లూయిస్ రూ. 3.8 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్ని ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. మరొకవైపు స్సిన్నర్ రాహుల్ చాహర్ రూ. 1.9 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోగా, షహబాజ్ నదీమ్‌ను రూ. 3.2 కోట్లు పెట్టి ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు చేసింది. మరొక స్సిన్నర్ మురుగన్ అశ్విన్‌కు రూ. 2.2 కోట్లు చెల్లించి ఆర్సీబీ దక్కించుకుంది. -
ఐపీఎల్ వేలం: ఆటగాళ్ల ధర ఎంతంటే..!
-
కోట్లు కొల్లగొట్టిన కుర్రాళ్లు
సాక్షి, బెంగళూరు : ఐపీఎల్ 11వ సీజన్‌కు జరుగుతున్న వేలంలో అండర్-19 కుర్రాళ్లు కోట్లు కొల్లగొట్టారు. తొలి రోజు బెంగళూరులో జరిగిన వేలంలో ప్రస్తుత అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్న పృథ్వీషా, కమలేష్ నాగర్ కోటి, శుభ్‌మన్ గిల్లు అధిక ధర పలికారు. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పదునైన బంతులతో భారత విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న కమలేష్ నాగర్ కోటి అత్యధికంగా రూ. 3.2 కోట్లు పలికాడు. ఈ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్ టోర్ని ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై నాగర్ కోటి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి (3/29) భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో ప్రాంచైజీలు ఈ యువబౌలర్‌ను చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. దీంతో 20 లక్షలున్న నాగర్ కోటి కనీస ధర వేలంలో రూ. మూడు కోట్లు పైగా పలికాడు. ఇక అండర్-19 భారత జట్టుకు నేతృత్వం వహిస్తున్న పృథ్వీషా తన ఆటతో జూనియర్ సచిన్‌గా గుర్తింపు పొందాడు. ఈ తరుణంలో కుర్రాళ్ల జాబితాలో అందరి కన్నా అధిక ధర పలుకుతాడని అందరూ ఊహించగా అనూహ్యంగా రూ.1.2 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. ఇక మరో యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 1.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక మాజీ అండర్-19 కెప్టెన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషాన్ అనూహ్యంగా 6.2 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. -
ఐపీఎల్ వేలంపై సెహ్వాగ్ సెటైర్
సాక్షి, బెంగళూరు : ట్వీటర్లో ప్రతివిషయంపై వ్యంగ్యంగా స్పందించే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ వేలంను సైతం విడిచిపెట్టలేదు. బెంగళూరు వేదికగా ఐపీఎల్-11 కోసం ఆటగాళ్ల వేలం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీలు ఉత్తమ ఆటగాళ్లను దక్కించుకొనేందుకు కోట్లానుకోట్ల రూపాయలతో పోటీపడుతున్నాయి. ఈ వేలంలో కింగ్స్ఎలెవన్ పంజాబ్‌కు మెంటర్‌గా పాల్గొన్న సెహ్వాగ్ ఫ్రాంచైజీ సహ యజమానైన ప్రితీజింతాపై సెటైరిక్ ట్వీట్ చేశాడు. ‘సాధారణంగా అమ్మాయిలకు షాపింగ్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ప్రీతి ఫుల్ షాపింగ్ మూడ్‌లో ఉంది. ఏదీ కనిపించినా కొనుగోలు చేస్తోంది.’ అని ట్వీట్ చేశాడు. ఇక ఆటగాళ్ల వేలంపై సైతం తనదైన శైలిలో స్పందించాడు. ‘‘చిన్నప్పుడు మనం కూరగాయలు కొనేందుకు వెళితే.. అమ్మ ధర సరిగ్గా చూసి కొనమని చెప్పేది. ఇప్పుడు మేం ఆటగాళ్లను కొనడానికి వెళ్తున్నాం. తేడా ఏంటంటే.. ఇప్పుడు ఓనర్ చెబుతారు.. సరైన ధరకి కొనమని’’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఇక కింగ్స్ఎలెవన్ పంజాబ్ రిటైన్ పద్దతిలో అక్సర్ పటేల్‌ను అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన వేలంలో కేఎల్ రాహుల్‌కు అత్యధికంగా రూ.11 కోట్లు వెచ్చించగా.. రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.7.6 కోట్లతో కొనుగోలు చేసింది. కింగ్స్ పంజాబ్ దక్కించుకున్న ఆటగాళ్లు అరోన్ ఫించ్ - 6.2 కోట్లు మార్కస్ స్టోయినిస్ - 6.2 కోట్లు కరుణ్ నాయర్ - 5.6 కోట్లు డేవిడ్ మిల్లర్ - 3 కోట్లు యువరాజ్ సింగ్ - 2 కోట్లు మయాంక్ అగర్వాల్ - రూ. కోటి అంకిత్ రాజ్‌పుత్ - రూ. 3 కోట్లు -
జోఫ్రా ఆర్చర్‌కు 'రికార్డు' ధర
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అనేది అనామక క్రికెటర్లను సైతం రాత్రికి రాత్రికే కోటీశ్వరుల్ని చేస్తుందనేది మరోసారి రుజువైంది. వెస్టిండీస్ అండర్-19 క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్న జోఫ్రా ఆర్చర్‌ను ఒక్కసారిగా స్టార్‌ను చేసింది ఈ ఐపీఎల్ సీజన్. ఐపీఎల్-11కు సంబంధించి ఈ రోజు బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో ఆర్చర్‌కు రూ. 7.20 కోట్ల రికార్డు ధర పలికింది. ఇటీవల కాలంలో అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ సత్తాచాటుతున్న బార్బోడాస్కు చెందిన ఆర్చర్‌ను అత్యధిక మొత్తం చెల్లించి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఆర్చర్ కనీస ధర రూ. 40 లక్షలు ఉండగా ఒకేసారి రికార్డు స్థాయిలో కోట్లను వెచ్చించి మరీ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇంతకీ జోఫ్రా ఆర్చర్ ఎవరు..? ట్వంటీ స్పెషలిస్టుగా ముద్రపడిన ఆర్చర్..2016లో ససెక్స్ తరపున ఆడటానికి సంతకం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. 2017 సంవత్సరానికి సంబంధించి ఇంగ్లిస్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరపున అత్యధిక వికెట్లను సాధించి సత్తా చాటుకున్నాడు. కాగా, గత రెండు నెలల నుంచి అతనికి మరింత స్టార్ డమ్ వచ్చి పడింది. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా హోబార్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్య వహించిన ఆర్చర్..తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు. బీబీఎల్‌లో 10 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు సాధించి తనదైన ముద్రను వేశాడు. గంటకు 140 కి.మీపైగా వేగంతో బౌలింగ్ వేయడమే ఆర్చర్‌కు అదనపు బలం. ప్రధానంగా యార్కర్లు, బౌన్సర్లు సంధించడంలో దిట్ట. 34 ట్వంటీ 20 మ్యాచ్‌ల్లో 40కి పైగా వికెట్లు సాధించాడు.మరొకవైపు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌లో అతని టీ 20 స్టైక్‌రేట్ 145. 45 గా ఉంది. వీటిన దృష్టిలో పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఈ 22 ఏళ్ల క్రికెటర్‌కు భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. -
ఐపీఎల్ వేలం.. రషీద్‌కు భారీ ధర!
బెంగళూరు: అఫ్గానిస్తాన్ యువ సంచలనం రషీద్ ఖాన్‌ను ఈసారి ఐపీఎల్ వేలంలో కూడా అదృష్టం వరించింది. గత ఐపీఎల్ వేలంలో నాలుగు కోట్లకు అమ్ముడుపోయిన రషీద్.. తాజాగా ఐపీఎల్-11 సీజన్ వేలంలో రూ. 9 కోట్ల దక్కించుకున్నాడు. ఈ రోజు బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి రోజు వేలంలో రషీద్ కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా, అతను భారీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం. రైట్ టు మ్యాచ్ కార్డ్ పద్ధతి ప్రకారం రషీద్‌ను తొమ్మిదికోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రషీద్‌ను కొనుగోలు చేయడానికి తొలుత కింగ్స్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. కాగా, చివర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తెరపైకి రావడంతో రషీద్ రేట్ అమాంతం పెరిగిపోయింది. రషీద్‌ను రూ. 9 కోట్లు దక్కించుకోవడానికి ఆర్సీబీ బిడ్ వేయగా, రైట్ టు మ్యాచ్ పద్దతిలో అదే రేటుకు సన్ రైజర్స్ హైదరాబాద్ అంటిపెట్టుకుంది. -
ఐపీఎల్ వేలం.. అమ్ముడుపోని క్రికెటర్లు..!
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ లో భాగంగా తొలి రోజు వేలంలో పలువురు ఆటగాళ్ల ధరలకు రెక్కలొస్తే, మరికొందరు స్టార్ క్రికెటర్లకు మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ రోజు బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో బెన్ స్టోక్స్(రూ.12.50 కోట్లు) అత్యధిక మొత్తంలో అమ్ముడు పోగా, మనీష్ పాండే(రూ.11.00 కోట్లు) కూడా రికార్డు ధర దక్కించుకున్నాడు. కాగా, మొదటి రోజు వేలంలో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ కు చుక్కెదురైంది. క్రిస్ గేల్ కనీస ధర రూ. 2.00 కోట్లు ఉండగా, అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ట్వంటీ 20ల్లో ఘనమైన రికార్డు ఉన్న గేల్ కు అత్యధిక మొత్తం దక్కుతుందని తొలుత భావించారు. కాగా, అనూహ్యంగా గేల్ ను పక్కకు పెట్టడంతో ఐపీఎల్ వేలంలో ఏదైనా సాధ్యమనేది మరోసారి రుజువైంది. అదే క్రమంలో జో రూట్, మురళీ విజయ్, హషీమ్ ఆమ్లా, మార్టిన్ గప్టిల్, జేమ్స్ ఫాల్కనర్, పార్థీవ్ పటేల్, జానీ బెయిర్ స్టోలను సైతం కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో వీరంతా ఈసారి ఐపీఎల్ కు దాదాపు దూరమయ్యారనే చెప్పాలి. ఒకవేళ ఆదివారం చివరిరోజు వేలంలో ఆయా ఆటగాళ్లకు నిర్ణయించబడి ఉన్న కనీస ధర కంటే తక్కువ మొత్తానికి ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన పక్షంలో మాత్రమే వారు ఐపీఎల్లో ఆడే అవకాశం ఉంటుంది. అన్ సోల్డ్ క్రికెటర్లు.. నమాన్ ఓజా( కనీస ధర రూ. 75 లక్షలు) బెయిర్ స్టో(కనీస ధర రూ.1.5 కోట్లు) పార్థీవ్ పటేల్(కనీస ధర రూ.1 కోటి) ఫాల్కనర్(కనీస ధర రూ. 2 కోట్లు) గప్టిల్(కనీస ధర రూ. 75 లక్షలు) ఆమ్లా(కనీస ధర రూ.1.5 కోట్లు) మురళీ విజయ్( కనీస ధర రూ.2 కోట్లు) జో రూట్(కనీస ధర రూ.1.5 కోట్లు) క్రిస్ గేల్(కనీస ధర రూ.2 కోట్లు) ఇషాంత్ శర్మ లసిత్ మలింగా -
ఐపీఎల్ వేలం: ఆటగాళ్ల ధర ఎంతంటే..!
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అత్యధికంగా రూ.12.5 కోట్ల ధర పలికాడు. గత రెండు సీజన్లలో నిషేధం ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్.. తాజా సీజన్ ఆరంభంలో భారీ ధరకు స్టోక్స్‌ను సొంతం చేసుకుంది. భారత యువ క్రికెటర్లు మనీశ్ పాండే, కేఎల్ రాహుల్‌లు రూ.11 కోట్లకు కొనుగోలు కాగా, సీనియర్ క్రికెటర్లు హర్భజన్, గంభీర్, టీ20 స్పెషలిస్టులు యువరాజ్, యూసఫ్ పఠాన్లు తక్కువ ధర పలకడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి లోను చేసింది. అత్యల్పంగా స్టూవర్ట్ బిన్నీని రూ.50 లక్షల ధర పలికాడు. కనీస ధరకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఆటగాళ్లు, వారి జట్ల వివరాలు బెన్ స్టోక్స్- రాజస్థాన్ రాయల్స్ -12.5 కోట్లు మనీశ్ పాండే- సన్‌రైజర్స్ హైదరాబాద్- 11 కోట్లు కేఎల్ రాహుల్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- రూ.11 కోట్లు క్రిస్‌లిన్- కోల్‌కతా నైట్‌రైడర్స్- 9.6 కోట్లు మిచెల్ స్టార్క్- కోల్‌కతా నైట్‌రైడర్స్- 9.4 కోట్లు గ్లెన్ మాక్స్వెల్ - ఢిల్లీ డేర్‌డెవిల్స్- 9 కోట్లు సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్ - 8 కోట్లు కేదార్ జాదవ్- చెన్నై సూపర్ కింగ్స్- 7.8 కోట్లు అశ్విన్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 7.6 కోట్లు క్రిస్ వోక్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 7.4 కోట్లు దినేశ్ కార్తీక్- కోల్‌కతా నైట్‌రైడర్స్- 7.4 కోట్లు డ్వేన్ బ్రేవో- చెన్నై సూపర్ కింగ్స్- 6.4 కోట్లు రాబిన్ ఉతప్ప- కోల్‌కతా నైట్‌రైడర్స్- 6.4 కోట్లు అరోన్ ఫించ్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 6.2 కోట్లు మార్కస్ స్టోయినిస్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 6.2 కోట్లు కరుణ్ నాయర్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 5.6 కోట్లు కీరన్ పోలార్డ్ - ముంబై ఇండియన్స్- 5.4 కోట్లు శిఖర్ ధావన్- సన్‌రైజర్స్ హైదరాబాద్- 5.2 కోట్లు వృద్ధిమాన్ సాహా- సన్‌రైజర్స్ హైదరాబాద్- 5 కోట్లు అజింక్య రహానే- రాజస్థాన్ రాయల్స్ - 4 కోట్లు బ్రెండన్ మెకల్లమ్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 3.6 కోట్లు డేవిడ్ మిల్లర్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 3 కోట్లు గౌతం గంభీర్- ఢిల్లీ డేర్‌డెవిల్స్- 2.8 కోట్లు క్వింటన్ డికాక్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 2.8 కోట్లు డి గ్రాండ్‌హోమ్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 2.2 కోట్లు కార్లోస్ బ్రాత్‌వైట్- సన్‌రైజర్స్ హైదరాబాద్- 2 కోట్లు (కనీస ధర కోటి) షేన్ వాట్సన్- చెన్నై సూపర్ కింగ్స్- 2 కోట్లు (కనీస ధర కోటి) హర్భజన్ సింగ్- చెన్నై సూపర్ కింగ్స్- 2 కోట్లు యువరాజ్ సింగ్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 2 కోట్లు షకీబ్ అల్ హసన్- సన్‌రైజర్స్ హైదరాబాద్- 2 కోట్లు (కనీస ధర కోటి) యూసఫ్ పఠాన్- సన్‌రైజర్స్ హైదరాబాద్- 1.9 కోట్లు మొయిన్ అలీ- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 1.7 కోట్లు (కనీస ధర 1.5 కోట్లు) డుప్లెసిస్- చెన్నై సూపర్ కింగ్స్- రూ.1.6 కోట్లు జేసన్ రాయ్- ఢిల్లీ డేర్‌డెవిల్స్- 1.5 కోట్లు స్టూవర్ట్ బిన్నీ- రాజస్థాన్ రాయల్స్ - రూ. 50 లక్షలు (కనీస ధర 50 లక్షలు) ప్యాట్ కమిన్స్- ముంబై ఇండియన్స్ - రూ. 5.4 కోట్లు ఉమేశ్ యాదవ్-ఆర్సీబీ- రూ.4.2 కోట్లు మొహ్మద్ షమీ-డిల్లీ డేర్ డెవిల్స్-రూ. 3 కోట్లు పీయూష్ చావ్లా- కేకేఆర్- రూ.4.2 కోట్లు జాస్ బట్లర్- రాజస్థాన్ రాయల్స్- రూ. 4.4 కోట్లు అంబటి రాయుడు రూ. 2.2 కోట్లు-చెన్నై సూపర్ కింగ్స్ కరణ్ శర్మ-చెన్నై సూపర్ కింగ్స్-రూ.5 కోట్లు ఇమ్రాన్ తాహీర్-చెన్నై సూపర్ కింగ్స్-రూ. కోటి శుభ్‌మాన్ గిల్-కేకేఆర్-రూ. 1.8 కోట్లు సూర్యకుమార్ యాదవ్-ముంబై ఇండియన్స్-రూ.3.2 కోట్లు కుల్దీప్ యాదవ్-కేకేఆర్- రూ.5.8 కోట్లు యజ్వేంద్ర చాహల్-ఆర్సీబీ-రూ. 6 కోట్లు అమిత్ మిశ్రా- ఢిల్లీ- రూ. 4 కోట్లు రషీద్ ఖాన్- సన్ రైజర్స్-రూ. 9 కోట్లు రాహుల్ త్రిపాఠి- రాజస్థాన్ రాయల్స్-రూ. 3.4 కోట్లు మోహన్ వోహ్రా-ఆర్సీబీ-1.1 కోట్లు పృథ్వీ షా-ఢిల్లీ-రూ.1.2 కోట్లు మయాంక్ అగర్వాల్-కింగ్స్ పంజాబ్-రూ. కోటి కృనాల్ పాండ్యా-ముంబై ఇండియన్స్- రూ.8.8 కోట్లు నితీష్ రాణా-కేకేఆర్- రూ. 3.4 కోట్లు రాహుల్ త్రిపాఠీ- రాజస్థాన్ రాయల్స్- రూ.3.4 కోట్లు రాహల్ తెవాటియా- ఢిల్లీడేర్ డెవిల్స్-రూ. 3 కోట్లు దీపక్ హుడా- సన్రైజర్స్హైదరాబాద్- రూ.3.6 కోట్లు విజయ్ శంకర్- ఢిల్లీడేర్ డెవిల్స్- రూ. 3.2 కోట్లు డీఆర్సీ షార్ట్- రాజస్థాన్ రాయల్స్- రూ. 4 కోట్లు కమలేష్ నాగర్కోటి(అండర్-19)- కేకేఆర్- రూ.3.2 కోట్లు ఇషాన్ కిషన్-ముంబై ఇండియన్స్-రూ. 6.2 కోట్లు జోఫ్రా ఆర్చర్-రాజస్థాన్ రాయల్స్- రూ. 7.2 కోట్లు అంకిత్ రాజ్‌పుత్-కింగ్స్ పంజాబ్-రూ. 3 కోట్లు బాసిల్ థంపి- సన్ రైజర్స్- రూ.95 లక్షలు సిద్ధార్థ్ కౌల్-సన్ రైజర్స్- రూ. 3.8 కోట్లు -
రాహుల్, మనీశ్ పాండేల పంట పండింది!
-
రాహుల్, మనీశ్ పాండేల పంట పండింది!
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో టీమిండియా సీనియర్ క్రికెటర్లకు తీవ్ర నిరాశే ఎదురుకాగా, యువ ఆటగాళ్లు భారీ ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. దీంతో వారిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత వేలంలో భారత యువ క్రికెటర్లు మనీశ్ పాండే, కేఎల్ రాహుల్‌లు ఊహించని రీతిలో రూ.11 కోట్ల ధరకు కొనుగోలు అయ్యారు. మనీశ్ పాండే కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ జట్లు రేట్లు పెంచుకుంటూ పోగా పదికోట్ల మార్కు చేరుకున్నాక సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. 11 కోట్ల ధరకు మనీశ్ పాండేను సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. టీమిండియా మరో యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ కోసం జరిగిన వేలం ఆసక్తికరంగా జరిగింది. ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్లు హోరాహోరీగా ధరను పెంచుతూ ఉత్కంఠ రేపారు. చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ రూ.11 కోట్లతో రాహుల్‌ను దక్కించుకుని అతడిపై అంచనాలు పెంచేసింది. కరుణ్ నాయర్ ను సైతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5.6 కోట్లతో కొనుగోలు చేసింది. మరోవైపు ట్వంటీ20ల్లో మంచి పేరున్న హార్డ్ హిట్టర్ యూసఫ్ పఠాన్ కేవలం 1.9 కోట్లకు కోనుగోలు కావడం గమనార్హం. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తక్కువ ధరకు పఠాన్‌ను తీసుకుంది. -
ఐపీఎల్ వేలం కాదు.. ఆటపై దృష్టి పెట్టండి
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ కెప్టెన్, అండర్ 19 వరల్డ్ కప్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ వేలం సంగతి పక్కన పెట్టి.. ముందు ఆటపై దృష్టిసారించాలని యువ ఆటగాళ్లకు ఆయన హితబోధ చేస్తున్నారు. ఐపీఎల్ వేలం కొనసాగుతున్న నేపథ్యంలో ద్రావిడ్ వ్యాఖ్యలను ఈఎస్పీన్ క్రిక్ఇన్ఫో ప్రముఖంగా ప్రచురించింది. ‘‘సందేహామే లేదు. ఐపీఎల్లో తమను కొనుగోలు చేస్తారో? లేదో? అన్న ఆత్రుత యువ ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, వాళ్లు ముందు ఆలోచించాల్సింది తమ ముందు ఉన్న లక్ష్యం గురించి. ఐపీఎల్ అనేది ప్రతీ ఏడాది ఉంటుంది. ఒకటి రెండు అవకాశాలు చేజారిన పెద్దగా బాధపడనక్కర్లేదు. అదేం మీ సుదీర్ఘ కెరీర్ మీద ప్రభావం చూపదు. కానీ, వరల్డ్‌కప్ ఆడే అదృష్టం మీకు పదే పదే మీకు దక్కకపోవచ్చు. కాబట్టి ఆలోచనలను ఆట మీద పెట్టండి’’ అని ది వాల్ యువ ఆటగాళ్లకు సూచించారు. సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్ తలపడనున్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాతో క్వార్టర్ ఫైనల్స్ కంటే ముందే ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అండర్-19 ఆటగాళ్లలో కెప్టెన్ పృథ్వీషాతోపాటు శుభమన్ గిల్, హిమాన్షు రానా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, కమలేష్ నా, హర్విక్ దేశాయ్‌ల పేర్లు ఐపీఎల్ వేలంలో పరిశీలనలో ఉన్నాయి. -
ధర తగ్గినా..దుమ్మురేపిన స్టోక్స్!
-
సీనియర్ క్రికెటర్లకు తీవ్ర నిరాశ!
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో టీమిండియా సీనియర్లకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. భారీ ధర పలకకున్నా, వారి స్థాయికి తగ్గట్లుగా రూ.4 నుంచి 5 కోట్ల వరకు ధర పలుకుతారని భావించినా కొందరు ఆటగాళ్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. హర్భజన్ సింగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ లను పాత ఫ్రాంచైజీలు తీసుకోకపోవడంతో పాటు వారి కొత్త యాజమాన్యాలు కనీస ధరలకే కొనుగోలు కావడం గమనార్హం. 10 సీజన్లు ముంబై ఇండియన్స్‌కు ఆడిన హర్భజన్ సింగ్ ను చెన్నై సూపర్ కింగ్స్ 2 కోట్లకు, సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2 కోట్లకు సొంతం చేసుకున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన గౌతం గంభీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ 2.8 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది భారీ ధర ఉన్న అజింక్య రహానేను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.4 కోట్లకు నమ్మకం ఉంచింది. వ విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.6 కోట్లకు, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 కోట్ల ధరకు తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఈ 11వ సీజన్లో చాలామంది ఆటగాళ్ల ధరలు వేలంలో చాలా తగ్గినట్లు కనిపిస్తున్నా.. అనూహ్యంగా కొందరికి భారీ ప్యాకేజీలతో కోనుగోలు అవుతున్నారు. -
ఐపీఎల్ వేలం: ధర తగ్గినా.. దుమ్మురేపిన స్టోక్స్!
సాక్షి, బెంగళూరు: గతేడాది ఐపీఎల్ సీజన్లో రికార్డు ధర పలికిన ఆటగాడు, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలను నిజం చేసినా స్టోక్స్ గతేడాది ధర రూ.14.5 కోట్లను అందుకోలేక పోయినా రికార్డు ధరతో అందర్నీ ఆశ్చర్యానికి లోను చేశాడు. పలు ఫ్రాంచైజీలు స్టార్ ఆల్ రౌండర్ కోసం వేలంలో పోటీ పడగా చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 12.5 కోట్లకు బెన్ స్టోక్స్ ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో నేటి వేలంలో ఇప్పటివరకూ అత్యధిక ధర స్టోక్స్‌దే కావడం గమనార్హం. ముంబై ఇండియన్స్ తమ ఆటగాడు కీరన్ పోలార్డ్పై మరోసారి నమ్మకం ఉంచింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన పోలార్డ్ ను నీతా అంబానీ ఫ్రాంచైజీ ముంబై రూ. 5.4 కోట్లకు దక్కించుకుంది. గతంలో ఎన్నో విజయాలు అందించిన పోలార్డ్ ఈ ఐపీఎల్‌లోనూ కీలకం కానున్నాడు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ధావన్‌ను రూ. 5.2 కోట్లకు, అశ్విన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7.6 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
‘అంత డబ్బా.. మాటలు రావడం లేదు’
-
క్రికెట్ సంత
-
' అప్పుడు నిద్రమత్తులో ఉన్నా'
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్లో తనకు అత్యధిక ధర పలకడంపై అప్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జింబాబ్వేతో సిరీస్ లో భాగంగా తాను హరారేలో ఉన్న విషయాన్ని తెలియజేసిన రషీద్.. ఐపీఎల్ వేలం జరిగే సమయానికి తాను గాఢమైన నిద్రమత్తులో ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ వేలంలో తన పేరు ఉండటంతో అప్ఘాన్ లో ఉన్న తల్లి దండ్రులు వేకువజామునే లేచి టీవీలు ముందు కూర్చున్నట్లు రషీద్ తెలిపాడు. తన పేరు ఐపీఎల్ బిడ్ లో వస్తుందనే విషయాన్ని అమ్మా-నాన్న ఫోన్ చేసి చెబితే కానీ తెలియలేదన్నాడు. దాంతో నిద్రమత్తులోనే ఐపీఎల్ బిడ్డింగ్ వీక్షించినట్లు తెలిపాడు. 'జింబాబ్వేతో సిరీస్ లో తగినంత విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకలేదు. ఆ క్రమంలోనే నేను సోమవారం నిద్రమత్తులో ఉన్నా. ఐపీఎల్ వేలం జరుగుతుందనే విషయం తెలుసు. కానీ బాగా అలసటగా ఉండి అలానే పడుకున్నా. అయితే నా పేరు బిడ్డింగ్ లో వచ్చిన విషయాన్ని మా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారు. దాంతో నేను హడావుడిగా లేచి నిద్రమత్తులోనే టీవీ వీక్షించా. నన్ను నాలుగు కోట్లు పెట్టి కొనుగోలు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. నన్ను నేను నమ్మలేకపోవడమే కాదు.. నా జీవితంలో ఐపీఎల్ చాలా సంతోషాన్ని తీసుకొచ్చింది'అని రషీద్ అన్నాడు. సోమవారం నాటి వేలంలో రషీద్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదుగురు అఫ్ఘాన్ ఆటగాళ్లు ఐపీఎల్ వేలం బరిలో నిలిస్తే, వారిలో ఇద్దర్ని అదృష్టం వరించింది. రషీద్ కంటే ముందు ఐపీఎల్ అమ్ముడుపోయిన మరో ఆఫ్ఘాన్ క్రికెటర్ మొహ్మద్ నబీ. ఇతన్ని కూడా సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. మొహ్మద్ నబీకి రూ. 30లక్షలు చెల్లించి సన్ రైజర్స్ దక్కించుకుంది. -
కూలీ కొడుకు కోటీశ్వరుడయ్యాడు..
బెంగళూరు: ఈసారి ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు ఎంత ధర పలికింది. భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఎందుకు ఆసక్తి కనబరచలేదు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ తైమాన్ మిల్స్ కు అంత ధర పలకడమేమిటి అనే దానిపైనే ప్రధానంగా చర్చసాగింది. దాంతో పాటు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని భారత ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, ప్రజ్ఞాన్ ఓజాలు కూడా ఆ తరువాత వార్తల్లో నిలిచారు. కానీ.. ఐపీఎల్ వేలం ద్వారా రాత్రికి రాత్రి కొంతమంది అనామక క్రికెటర్లు సైతం కోటీశ్వరలయ్యారు. అందులో తంగరాసు నటరాజన్ ఒకడు. తమిళనాడుకు చెందిన ఈ పేసర్ ను కింగ్స్ పంజాబ్ అత్యధిక మొత్తం పెట్టి దక్కించుకుంది. నటరాజన్ కనీస ధర రూ.10 లక్షలు ఉంటే అతన్ని రూ. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది కింగ్స్ పంజాబ్. తమిళనాడు జట్టులో నిలకడకు మారుపేరైన నటరాజన్ పై కింగ్స్ పంజాబ్ మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ విపరీతమైన ఆసక్తి కనబరిచడమే ఆ యువ బౌలర్ కు 30 రెట్లు అధిక ధర చెల్లించడానికి కారణమైంది. ఈ 25 ఏళ్ల యువ క్రికెటర్ ను దక్కించుకోవడానిక పలు ఫ్రాంచైజీలు పోటీ పడినప్పటికీ చివరకు అతన్ని కింగ్స్ పంజాబ్ దక్కించుకుంది. తమిళనాడుకు చెందిన నటరాజన్ ఓ రైల్వే కూలీ కొడుకు . నటరాజన్ వయసు 20 ఏళ్లప్పుడు అతని తల్లి ఓ స్టాల్ ను నిర్వహించగా, తండ్రి మాత్రం రోజు వారీ రైల్వే కూలీగా పని చేసేవాడు. అతని స్వస్థలం సాలెంలో టెన్నిస్ బాల్ తో క్రికెట్ ను ఎక్కువగా ఆడేవాడు. ఆ క్రమంలోనే ఆ ఫ్యామిలీ చెన్పైకు షిష్ట్ కావాల్సి వచ్చింది. చెన్నైలోని జాలీ రోవర్స్ క్రికెట్ క్లబ్లో సభ్యత్వం తీసుకున్న నటరాజన్ కు అక్కడే భారత ప్రధాన క్రికెటర్లు అశ్విన్, మురళీ విజయ్‌లతో పరిచయమైంది. ఇక్కడ నటరాజన్ ప్రతిభను అశ్విన్, మురళీ విజయ్‌లు గుర్తించారు. అతనికి తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) తరుపున ఆడే అవకాశం కూడా అశ్విన్, మురళీ ద్వారానే దక్కింది. ఇక్కడ నిలకడైన ప్రదర్శన చేసిన నటరాజన్ తమిళనాడు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ దృష్టిలో పడ్డాడు. దాంతో అతనికి 2015-16ల్లో రాష్ట్ర రంజీ జట్టు తరపున ఆడేందుకు పిలుపు వచ్చింది. ఇక అక్కడ నుంచి తన శ్రమనే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగాడు నటరాజన్. ఇప్పుడు ఐపీఎల్ -10సీజన్ ల్లో బరిలోకి దిగుతుండటంతో నటరాజన్ పై అందరి దృష్టి ఉంది. ఇప్పటివరకూ ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ క్రికెటర్ ఎలా రాణిస్తాడో అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రధానంగా కింగ్స్ పంజాబ్ నటరాజన్ పై భారీ ఆశల్నేపెట్టుకుంది. మరి ఆ ఆశల్ని నటరాజన్ నిజం చేస్తాడో లేదో చూడాలి. మిచెల్ జాన్సన్ ఆదర్శం ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సనే తనకు ఆదర్శం అంటున్నాడు నటరాజన్. అతని బౌలింగ్ అంటే తనకు విపరీతమైన ఇష్టమని పేర్కొన్నాడు. అతని బౌలింగ్ వీడియోలు ఎక్కువగా చూస్తూ ఉంటానన్నాడు. తాను కూడా ఎడమ చేతి బౌలింగ్ వాటం కావడం అతనిపై మక్కువ పెరగడానికి కారణంగా నటరాజన్ చెప్పుకొచ్చాడు. ఈ ఐపీఎల్ ద్వారా అతన్ని కలిసే అవకాశం దక్కుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.దాంతో పాటు తన ఉన్నతికి కారణమైన అశ్విన్, విజయ్ లతో పాటు, తమిళనాడు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీలకు ధన్యవాదాలు తెలియజేశాడు. తాను అసలు టీఎన్‌పీఎల్‌లో ఆడతానని అనుకోలేదని, అయితే ప్రస్తుతం ఇక్కడ వరకూ రావడం తనకు సరికొత్త అనుభూతిగా ఉందని నటరాజన్ పేర్కొన్నాడు. -
‘అంత డబ్బా.. మాటలు రావడం లేదు’
బెంగళూరు: ఐపీఎల్ వేలంపై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అమితాసక్తి కనబరిచాడు. బెంగళూరులో జరిగిన వేలంను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెల్లవారుజామునే మేల్కొన్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. వేలంలో తనకు అత్యధిక ధర పలకడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితాన్నే మార్చేసే ధర దక్కిందని వ్యాఖ్యానించాడు. ‘ వేలంపాటను ప్రత్యక్షంగా చూడాలని అలారం పెట్టుకుని తెల్లజామున 3.30 గంటలకు నిద్రలేచాను. వేలంలో నా వంతు వచ్చే వరకు 40 నిమిషాలు వేచి చూశాను. అలా ఉత్సాహంగా ఎదురు చూశాను. నిజానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. అయితే టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూడలేదు. ట్విటర్ ను ఫాలో అయ్యాను. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ట్విటర్ లో రీప్రెష్ కొడుతూనే ఉన్నాను. నెటిజన్లు పెట్టిన ట్వీట్లు చూసి పుణే నన్ను దక్కించుకుందని తెలుసుకున్నాను. ఇది నా జీవితాన్ని మార్చేసేంత పెద్ద ధర. నాకు మాటలు రావడం లేదు. గత కొద్ది రోజులుగా నా జీవితంలో అన్ని మంచి విషయాలు వింటున్నాను. ముఖ్యంగా ఈ వారం నాకు బాగా కలిసొచ్చింద’ని స్టోక్స్ అన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా స్టోక్స్ రికార్డు సృష్టించాడు. సోమరవారం బెంగళూరులో నిర్వహించిన ఐపీఎల్-10 వేలంలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ. 14 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. -
వేలంలో 'టాప్' లేపారు!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10వ సీజన్లో భాగంగా సోమవారం ఇక్కడ జరిగిన వేలంలో కొంతమంది క్రికెటర్లు అనూహ్య ధరలతో మెరవగా, మరి కొంతమంది మాత్రం కనీస ధరను కూడా దక్కించుకోలేక డీలా పడ్డారు. ఈ సీజన్ ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించగా, మరొ ఇంగ్లిష్ క్రికెటర్ తైమాన్ మిల్స్ రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ వేలంలో స్టోక్స్ కు రూ.14.5 కోట్లు చెల్లించి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ దక్కించుకోగా, మిల్స్ కు రూ.12 కోట్లు వెచ్చించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. మరొకవైపు భారత సీనియర్ క్రికెటర్లు ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, చటేశ్వర పూజారా, ప్రజ్ఞాన్ ఓజాలకు రెండో రౌండ్లో కూడా నిరాశే ఎదురైంది. వీరిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు.. బెన్ స్టోక్స్(ఇంగ్లండ్)-ధర రూ. 14. 5కోట్లు- రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తైమాన్ మిల్స్(ఇంగ్లండ్)-ధర రూ.12 కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్)-ధర రూ. 5 కోట్లు- కోల్ కతా నైట్ రైడర్స్ కగిసో రబడా(దక్షిణాఫ్రికా)-ధర రూ. 5 కోట్లు-ఢిల్లీ డేర్ డెవిల్స్ పాట్రిక్ కమ్మిన్స్(ఆస్ట్రేలియా)-ధర రూ. 4.50 కోట్లు-ఢిల్లీ డేర్ డెవిల్స్ క్రిస్ వోక్స్(ఇంగ్లండ్)-ధర రూ. 4.20 కోట్లు-కేకేఆర్ రషీద్ ఖాన్(ఆఫ్ఘాన్)-ధర రూ. 4 కోట్లు- సన్ రైజర్స్ హైదరాబాద్ కరణ్ శర్మ(భారత్)-ధర రూ. 3.20 కోట్లు- ముంబై ఇండియన్స్ టి.నటరాజన్(భారత్)-ధర రూ. 3 కోట్లు-కింగ్స్ పంజాబ్ -
అతని కోసం రిస్క్ చేశాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
ముంబై: గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా అరంగేట్రం చేసినప్పటికీ ఆ సీజన్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం చాలా నిరాశకు గురి చేసిందని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. తమ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ అది కేవలం కాగితాల వరకే పరిమితం కావడంతో అప్పుడు ఘోరంగా వెనుకబడిపోవడానికి కారణమైందని ఫ్లెమింగ్ తెలిపాడు. ఐపీఎల్ -10 సీజన్ ఆటగాళ్ల వేలం సందర్భంగా బెన్ స్టోక్స్ ను అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసిన తరువాత ఫ్లెమింగ్ స్పందించాడు. 'ఇది కచ్చితంగా రిస్క్ తో కూడిన అంశమే. బెన్ స్టోక్స్ కు రూ.14.5 కోట్లు పెట్టడం అంటే అది చాలా పెద్ద సాహసమే. ఇక్కడ మా ఫ్రాంచైజీ యాజమాన్యం స్టోక్స్ కొనుగోలు విషయంలో భారీ రిస్క్ చేసింది. కొంతమంది కీలక ఆటగాళ్లు అవసరమని భావించే రిస్క్ చేశాం. మా జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. దాంతో సీనియర్ ఆటగాళ్లు అవసరం కూడా ఉంది. జట్టును సమతుల్యం చేయడం కోసమే ఆటగాళ్ల కొనుగోలులో కొంతవరకూ రిస్క్ చేయాల్సి వచ్చింది. అత్యధికంగా డబ్బు పెట్టడం అంటే రిస్క్ కదా. ఆ రిస్క్ చేయడానికి పుణె సిద్ధంగా ఉంది కాబట్టే అలా చేసింది'అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. -
ఐపీఎల్లో ఆఫ్ఘాన్ ముద్ర..
ముంబై:ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంపాటలో పలువురు భారత సీనియర్ క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైతే.. తొలిసారి వేలం బరిలో నిలిచిన ఆఫ్ఘానిస్తాన్ మాత్రం ఆకట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ పరంగా అనుభవం పెద్దగా లేకపోయినప్పటికీ ఆఫ్ఘాన్ తన ప్రత్యేక ముద్రతో ఐపీఎల్ వేదికపై మెరిసింది. ఒక అసోసియేట్ దేశంగా అతి కొద్ది మంది సభ్యులతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తొలిసారి బరిలో నిలిచిన ఆఫ్ఘాన్.. వేలంలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది. ఐపీఎల్ వేలానికి వచ్చిన ఐదుగురు ఆఫ్ఘాన్ ఆటగాళ్లలో మొహ్మద్ నబీ, రషీద్ ఖాన్ లు బరిలో ముందు వరసులో నిలిచారు. ఈ ఇద్దర్నీ సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. తొలుత మొహ్మద్ నబీని రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్.. ఆ తరువాత రషీద్ ఖాన్ కు రూ.4 కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది. వీరిలో నబీ ఆల్ రౌండర్ కాగా, రషీద్ ఖాన్ లెగ్ బ్రేక్ బౌలర్. మరొకవైపు ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న తొలి ఆఫ్ఘాన్ ఆటగాడిగా నబీ గుర్తింపు పొందడం ఇక్కడ విశేషం. ఇటీవల రషీద్ తన ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో సన్ రైజర్స్ అతనికి భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. ఇప్పటివరకూ రషీద్ 18 వన్డేల్లో 31 వికెట్లు తీశాడు. అందులో అతని అత్యుత్తమం 4/21 కాగా, 21 ట్వంటీ 20 మ్యాచ్ ల్లో 31 వికెట్లను సాధించాడు. -
జాక్పాట్లు..షాక్‌లు..!
ముంబై:ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో సర్వ సాధారణం. ఇక్కడ ఎటువంటి అంచనాలు లేకుండా బరిలో నిలిచిన ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టడం ఒకటైతే, అత్యధిక ధర పలుకుతాడనుకునే క్రికెటర్లను అసలు ఎవ్వరూ పట్టించుకోక పోవడం మరొకటి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. మరొకసారి కూడా అదే కనిపించింది. ఐపీఎల్ -10 సీజన్ కు సంబంధించి సోమవారం నాటి వేలంలో ఊహించని పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్(రూ.14.5 కోట్లు), తైమాన్ మిల్స్(రూ.12 కోట్లు) అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మరొకవైపు ఇషాంత్ శర్మ, చటేశ్వర పూజారా, ఇర్ఫాన్ పఠాన్ లను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐపీఎల్ వేలం సందర్భంగా కొంతమంది క్రికెటర్ల ముఖాలు వెలిగిపోతే, మరి కొంతమంది మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. పలువురు ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వివరాలు.. భారత ఆటగాడు ఇషాంత్ శర్మ(అన్ సోల్డ్) దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ డేవిడ్ వైజ్(అన్ సోల్డ్) భారత ఆటగాడు కరుణ్ శర్మ- ధర రూ. 3 20 కోట్లు- ముంబై ఇండియన్స్ వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్(అన్ సోల్డ్) ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్-ధర రూ. 4.20 కోట్లు- కోల్ కతా నైట్ రైడర్స్ భారత ప్లేయర్ పర్వేజ్ రసూల్( అన్ సోల్డ్) ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ మ్యాడిన్సన్(అన్ సోల్డ్) వెస్టిండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్(అన్ సోల్డ్) వెస్టిండీస్ ఆటగాడు డారెన్ బ్రేవో(అన్ సోల్డ్) వెస్టిండీస్ ఆటగాడు మార్లోన్ శ్యామ్యూల్స్( అన్ సోల్డ్) భారత ఆటగాడు బద్రీనాథ్. ఎస్( అన్ సోల్డ్), భారత ఆటగాడు అభినవ్ ముకుంద్(అన్ సోల్డ్) ఆసీస్ ఆటగాడు మైకేల్ క్లింగర్(అన్ సోల్డ్) భారత ఆటగాడు చటేశ్వర పూజారా(అన్ సోల్డ్) భారత ఆటగాడు మనోజ్ తివారీ(అన్ సోల్డ్) భారత ఆటగాడు ప్రవీణ్ తాంబే- ధర రూ. 10 లక్షలు-సన్ రైజర్స్ హైదరాబాద్ భారత్ ఆటగాడు పవన్ నేగీ-ధర రూ. కోటి-ఆర్సీబీ శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్-ధర రూ. 2 కోట్లు(ఢిల్లీ డేర్ డెవిల్స్) భారత ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్(అన్ సోల్డ్) ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్-ధర రూ. 14.5 కోట్లు న్యూజిలాండ్ ఆటగాడు కోరీ అండర్సన్ ధర రూ కోటి(ఢిల్లీ డేర్ డెవిల్స్) దక్షిణాఫ్రికా ఆటగాడు సీన్ అబాట్(అన్ సోల్డ్) ఆఫ్ఘాన్ లెగ్ స్పిన్నర్ రషిద్ ఖాన్-ధర రూ. నాలుగు కోట్లు(సన్ రైజర్స్ హైదరాబాద్) భారత ఆటగాడు మురుగన్ అశ్విన్-ధర రూ. కోటి(ఢిల్లీ డేర్ డెవిల్స్) భారత ఆటగాడు నాథూ సింగ్-ధర రూ.50 లక్షలు(గుజరాత్ లయన్స్) భారత ఆటగాడు టీ నటరాజన్-ధర రూ. 3 కోట్లు( కింగ్స్ పంజాబ్) భారత ఆటగాడు అంకిత్ చౌదరి-ధర రూ. 2 కోట్లు( రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఆఫ్ఘాన్ ఆటగాడు మొహ్మద్ నబీ-ధర రూ. 30 లక్షలు( సన్ రైజర్స్ హైదరాబాద్) భారత్ ఆటగాడు అంకిత్ భావే-ధర రూ. 10 లక్షలు( ఢిల్లీ డేర్ డెవిల్స్) భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్(అన్ సోల్డ్) ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డాన్ క్రిస్టియన్-ధర రూ. కోటి( పుణె సూపర్ జెయింట్స్) భారత బౌలర్ మునాఫ్ పటేల్-ధర రూ. 30 లక్షలు( గుజరాత్ లయన్స్) వెస్టిండీస్ ఆటగాడు డారెన్ స్యామీ-ధర రూ. 30 లక్షలు( కింగ్స్ పంజాబ్) శ్రీలంక ఆటగాడు గుణరత్నే -ధర రూ. 30 లక్షలు(ముంబై ఇండియన్స్) -
తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్‌గా..
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10 వేలంలో ఆఫ్ఘానిస్తాన్ ఆటగాడు మొహ్మద్ నబీని రూ. 30 లక్షల ధరతో సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అసోసియేట్ దేశాలకు చెందిన ఆరుగురు క్రికెటర్లు ఈసారి ఐపీఎల్ వేలం బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిలో మొహ్మద్ నబీ ఒకడు. అయితే ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్ గా నబీ గుర్తింపు పొందాడు. అతను కనీస ధర రూ.30 లక్షలు కాగా, అదే ధరకు సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ కావడంతో అతన్ని తీసుకోవాడానికి సన్ రైజర్స్ ఆసక్తి కనబరిచింది. కుడి చేత వాటం ఆటగాడైన నబీ.. ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. ఆఫ్ఘాన్ తరపున 72 వన్డేలు ఆడిన నబీ 1724 పరుగులు చేయగా, 73 వికెట్లు తీశాడు. -
అత్యంత విలువైన ఆటగాళ్లు వీళ్లే!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం ఈనెల 20న(సోమవారం) వేలం జరగనుంది. వేలానికి 351 మంది ఆటగాళ్లతో తుది జాబితా తయారు చేశారు. ఇందులో 122 మంది అంతర్జాతీయ క్రికెటర్లున్నారు. తొలిసారిగా అసోసియేట్ దేశాలకు చెందిన ఆరుగురు ఆటగాళ్లకు కొత్త జాబితాలో చోటు దక్కడం విశేషం. ఇటీవలి కాలంలో విశేషంగా రాణిస్తున్న అఫ్గానిస్తాన్ జట్టు నుంచి ఏకంగా ఐదుగురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వచ్చే ఏడాది తమ ఆటగాళ్లతో అన్ని జట్లకు ఒప్పందం ముగుస్తుంది కాబట్టి ఈసారి వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు భారీ మొత్తం చెల్లించే అవకాశం ఉండకపోవచ్చు. ఐపీఎల్ తాజా వేలం నేపథ్యంలో గతంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లను ఒకసారి గుర్తు చేసుకుందాం. 1. డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 2015, ఐపీఎల్ లో రూ. 16 కోట్లుకు దక్కించుకుంది. 2. చెన్నై సూపర్ కింగ్స్ పై రెండేళ్లు నిషేధం పడడంతో ఎంఎస్ ధోనిని దక్కించుకునేందుకు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ రూ. 12.5 కోట్లు వెచ్చించింది. 3. రెండుసార్లు టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్ ను తమ వద్దే ఉంచుకునేందుకు కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 11.05 కోట్లు ముట్టజెప్పింది. 4. బరోడా బ్లాస్టర్ యూసఫ్ పఠాన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 2011 ఐపీఎల్ లో రూ. 9.6 కోట్లుతో వేలంలో కొనుగోలు చేసింది. 5. రాబిన్ ఊతప్పను పుణే వారియర్స్ 2011 ఐపీఎల్ లో రూ. 9.66 కోట్లతో దక్కించుకుంది. అయితే ధరకు తగినట్టు రాణించలేదు. -
అమ్ముడుపోని స్టార్స్
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. రూ. 50 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చినా ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. మైకేల్ హస్సీ (రూ. 2 కోట్లు), జయవర్ధనే (రూ. 1.5 కోట్లు), దిల్షాన్ (రూ. 1.5 కోట్లు), బ్రాడ్ హాడిన్ (రూ. 1.5 కోట్లు), బెయిలీ (రూ. 1 కోటి), ఆమ్లా (రూ. 1 కో టి), డారెన్ స్యామీ (రూ. 50 లక్షలు), అజంతా మెండిస్ (రూ. 50 లక్షలు), ఫిలాండర్ (రూ. 50 లక్షలు), మార్లన్ శామ్యూల్స్ (రూ. 50 లక్షలు)లాంటి అంతర్జాతీయ ఆటగాళ్ల వైపు కనీసం చూసే సాహసం కూడా ఫ్రాంచైజీలు చేయకపోవడం గమనార్హం. భారత దేశవాళీ స్టార్లలో కూడా కొందరికి అదరణ కరువైంది. ముఖ్యంగా మనోజ్ తివారి (రూ. 1 కోటి), చతేశ్వర్ పుజారా (రూ. 50 లక్షలు), బద్రీనాథ్ (రూ. 50 లక్షలు), ప్రజ్ఞాన్ ఓజా (రూ. 50 లక్షలు), మునాఫ్ పటేల్ (రూ. 50 లక్షలు), రాహుల్ శర్మ (రూ. 30 లక్షలు), అభినవ్ ముకుంద్ (రూ. 30 లక్షలు), అభిషేక్ నాయర్ (రూ. 30 లక్షలు)లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ♦ అత్యధికంగా ఢిల్లీ జట్టులో 27 మంది, పంజాబ్, కోల్‌కతాల్లో ♦ అత్యల్పంగా 22 మంది క్రికెటర్లు ఉన్నారు. -
ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు
ఈసారి ఐపీఎల్ వేలాన్ని గమనిస్తే... భారత జాతీయ జట్టుకు ఆడే క్రికెటర్లతో పాటు తుది జట్టులో ఎక్కువ అవసరం ఉన్న దేశవాళీ హిట్టర్స్ ప్రాముఖ్యాన్ని ప్రాంఛైజీలు గుర్తించినట్లు కనిపిస్తోంది. వేలానికి వచ్చే ముందే తమ జట్టు కూర్పు ఎలా ఉండాలనే స్పష్టతతోనే అన్ని జట్లూ వచ్చాయి. విదేశీ ఆల్‌రౌండర్లు క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా), మిషెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)లకు భారీ మొత్తాలు ఇచ్చిన ప్రాంఛైజీలు... ఇటీవలి కాలంలో విశేషంగా రాణిస్తోన్న మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) లాంటి క్రికెటర్‌ను ఏమాత్రం పట్టించుకోలేదు. గత ఎనిమిది సీజన్ల పాటు ఎవరికి పడితే వారికి లెక్కలేకుండా డబ్బులు ఇచ్చిన జట్లు ఈసారి ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాయి. వేలంలో డబ్బు వృథా కాకుండా జాగ్రత్తపడ్డాయి. భారీ కసరత్తు తర్వాత... ఐపీఎల్లో దేశవాళీ క్రికెటర్లు జట్టులో ఎక్కువ మం ది అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని మొత్తం అన్ని ఫ్రాంచైజీలు గుర్తించాయి. దీంతో గత ఏడాది దేశవాళీ క్రికెట్లో అన్ని మ్యాచ్‌లనూ అన్ని జట్లూ జాగ్రత్తగా పరిశీలించాయి. ముంబై కోచ్ జాన్‌రైట్ దేశవ్యాప్తంగా రెండు నెలల పాటు తిరిగి మ్యాచ్‌లు చూశారు. కొన్ని ఫ్రాంచైజీలు కేవలం ఈ పని కో సమే నిపుణులను తీసుకుని 2 నెలల పాటు దేశంలో అన్ని మ్యాచ్‌లూ చూపించాయి. మొత్తమ్మీద బాగా హోమ్‌వర్క్ చేశారు. ఈసారి వేలంలో ఫ్రాంచైజీలు అడిగిన కొందరు క్రికెటర్ల ఫొటోలు కూడా ఐపీఎల్ కౌన్సిల్ దగ్గర కూడా లేవు. దీనిని బట్టి ఏ స్థాయిలో కసరత్తు చేశారో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే... ఈసారి వేలంలో అనూహ్యంగా మనోజ్ తివారీ (బెంగాల్), ప్రజ్ఞాన్ ఓజా (బెంగాల్)లను ఎవరూ కొనకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా ‘దాదా’ గంగూలీ శిష్యుడుగా భావించే మనోజ్ తివారీ కోల్‌కతా క్రికెట్లో పెద్ద సంచలనం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఐపీఎల్లో ముంబై జట్టులో మొదటి నుంచీ కీలక ఆటగాడిగా ఉన్న హైదరాబాద్ రంజీ జట్టు మాజీ సభ్యుడు ఓజానూ ఏ జట్టూ తీసుకోలేదు. స్పిన్నర్ రాహుల్ శర్మనూ లెక్కలోకి తీసుకోలేదు. భారత జట్టుకు దూరమైన మునాఫ్ పటేల్, పంకజ్ సింగ్, సుదీప్ త్యాగిలనూ ఎవరూ తీసుకోలేదు. అయితే ఆర్పీ సింగ్ ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడంతో పాటు... ధోనికి సన్నిహితుడైనందున అతణ్ని పుణే తీసుకుంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో తన సీనియర్ సహచరుడు ప్రవీణ్ కుమార్ పట్ల గుజరాత్ లయన్స్ కెప్టెన్ రైనా ఆసక్తిచూపడంతో ఆ జట్టు కాస్త భారీ మొత్తమే వెచ్చించి ప్రవీణ్‌ను తీసుకుంది. విదేశీయులపై చిన్నచూపు ప్రతి జట్టులోనూ తుది జట్టులో నలుగురు మాత్రమే విదేశీ క్రికెటర్లు ఉండాలి. ప్రతి జట్టులోనూ గరిష్టంగా తొమ్మిది మందిని తీసుకోవచ్చు. గత ఏడాది వరకు దాదాపు అన్ని జట్లూ తొమ్మిది మందిని తీసుకున్నాయి. కానీ ఈసారి మాత్రం దీనిని పట్టించుకోలేదు. పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండే నలుగురు స్టార్ క్రికెటర్లు ఉంటే చాలనుకున్నారు. దాదాపు అన్ని జట్లకూ వేలానికి ముందే విదేశీ స్టార్స్ ఉన్నారు. నిజానికి న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అయినా ఎవరూ తీసుకోలేదు. కనీసం 50 లక్షల రూపాయలు ఇచ్చి రిజర్వ్‌గా అయినా తీసుకోవచ్చు. అయినా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇక శ్రీలంక క్రికెటర్లను పూర్తిగా చిన్నచూపు చూశారు. అలాగే వెటరన్స్ మైక్ హస్సీ, జయవర్ధనేల పట్లా ఆసక్తి చూపలేదు. ఏ లీగ్‌లో పడితే ఆ లీగ్‌లో పది వేలు, 20 వేల డాలర్లకు ఆడుతూ ఐపీఎల్లో మాత్రం భారీగా సంపాదించుకుంటున్న, సంపాదించాలనుకున్న విదేశీ క్రికెటర్లందరికీ ఈసారి ఐపీఎల్ వేలం షాక్‌ను మిగి ల్చిందనే అనుకోవాలి. -సాక్షి క్రీడావిభాగం -
మనోళ్ళే ముద్దు
♦ దేశవాళీ క్రికెటర్లపై కాసుల వర్షం స్టార్ క్రికెటర్లకు తగ్గిన రేటు ♦ ఐపీఎల్ వేలంలో అమ్ముడైన 94 మంది క్రికెటర్లు ♦ యువరాజ్ కంటే పవన్ నేగీకి ఎక్కువమొత్తం ♦ అందరికంటే ఎక్కువగా వాట్సన్‌కు రూ.9.5 కోట్లు గత ఏడాది వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం అంటే కాసుల వర్షం... పేరున్న ప్రతి క్రికెటర్‌కూ భారీగా డబ్బులు వచ్చేవి. కానీ ఈసారి ట్రెండ్ మారింది. ఫ్రాంచైజీలు ఆచితూచి డబ్బు ఖర్చు చేశాయి. కోట్లు పోసి విదేశీ క్రికెటర్లను తెచ్చి బెంచ్‌లపై కూర్చోబెట్టడం అనవసరమనే భావనతో వ్యవహరించాయి. దేశవాళీ క్రికెట్లో కొద్దోగొప్పో ఆడేవాళ్లపై కూడా కాసుల వర్షం కురిపించారు. అనామకులైనప్పటికీ నైపుణ్యం ఉందని భావించిన వాళ్లకోసం కోట్లు ఖర్చు చేశారు. మొత్తం మీద ఈసారి వేలంలో గతంతో పోలిస్తే స్టార్ క్రికెటర్లకు నిరాశ ఎదురైనా... దేశవాళీ ఆటగాళ్ల జేబులు నిండాయి. బెంగళూరు: గత రెండు సీజన్ల వేలంతో పోలిస్తే ఈసారి ఐపీఎల్ వేలంలో స్టార్ క్రికెటర్లందరికీ నిరాశే మిగిలింది. రెండేళ్ల క్రితం బెంగళూరు రూ. 14 కోట్లు... ఏడాది క్రితం వేలంలో ఢిల్లీ రూ. 16 కోట్లు ఇచ్చి కొనుక్కున్న యువరాజ్‌ను... ఈసారి కేవలం రూ.7 కోట్లకే హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు సొంతం చేసుకుంది. గత ఏడాది ఏకంగా రూ. 12 కోట్లు దక్కించుకున్న దినేశ్ కార్తీక్ ఈసారి కేవలం రూ. 2 కోట్ల 30 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ క్రికెటర్ కోసమూ భారీగా వెచ్చించడం అనవసరమనే భావనలో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరించాయి. వేలానికి వచ్చే సమయానికే ప్రతి జట్టులోనూ కావలసినంత మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు. కాబట్టి విదేశీ స్టార్ల కోసం వెంపర్లాడే బదులు... దేశవాళీ క్రికె ట్లో నిలకడగా ఆడిన, సంచలనాలు సృష్టించిన ఆటగాళ్లకు అన్ని ఫ్రాంచైజీలు పెద్ద పీట వేశాయి. ఇప్పటివరకూ భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని పవన్ నేగీకి ఏకంగా రూ. 8.5 కోట్లు లభించాయి. ఇది యువరాజ్ సింగ్ కంటే ఎక్కువ కావడం చెప్పుకోదగ్గ విశేషం. అలాగే సంజు శామ్సన్ (రూ. 4.2 కోట్లు), కరుణ్ నాయర్ (రూ. 4 కోట్లు), దీపక్ హుడా లాంటి దేశవాళీ క్రికెటర్లు జాక్‌పాట్ కొట్టారు. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో చక్కగా బౌలింగ్ చేసిన తమిళనాడు లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌కు ఏకంగా రూ. 4.5 కోట్లు దక్కడం విశేషం. వేలం హైలైట్స్ రెండేళ్ల నుంచి ఐపీఎల్‌కు దూరంగా ఉన్న కెవిన్ పీటర్సన్ మొదట వేలంలోకి వచ్చాడు. ఇతనికోసం పుణే, గుజరాత్ మాత్రమే పోటీపడ్డాయి. డ్వేన్ స్మిత్, ఇషాంత్ శర్మల కోసం కూడా గుజరాత్, పుణేలు పోటీపడినా.. మధ్యలో వేరే ఫ్రాంచైజీలు రావడంతో ధర కాస్త పెరిగింది. టెస్టులకు గుడ్‌బై చెప్పిన ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ నాలుగో ఆటగాడిగా వేలంలోకి వచ్చాడు. ఇక అన్ని ఫ్రాంచైజీలు ఈ ఆల్‌రౌండర్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. బెంగళూరు రూ. ఐదున్నర కోట్లకు తీసుకెళ్లడంతో పుణే వెనక్కితగ్గింది. అయితే ముంబై రాకతో రేట్ అమాంతం పెరిగింది. చివరకు బెంగళూరు రికార్డు ధరకు కొనుగోలు చేసింది. యువరాజ్ వేలానికి వచ్చినప్పుడు ఫ్రాంచైజీలు బాగా తటపటాయించాయి. అయితే 2 కోట్లతో ముంబై వేలాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రూ. 5 కోట్ల తర్వాత బెంగళూరు పక్కకు తప్పుకోగా ముంబై దాన్ని ఇంకా పైకి తీసుకెళ్లింది. చివరకు రూ. 6 కోట్ల వద్ద ఆలస్యంగా వేలంలోకి వచ్చిన హైదరాబాద్ మరింత పెంచి సొంతం చేసుకుంది. ♦ ఆసీస్ టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను మొదట వేలంలో ఎవరూ తీసుకోలేదు. కానీ రెండోసారి రావడంతో రూ. 1 కోటి బేస్‌ప్రైస్‌కే గుజరాత్ లయన్స్ దక్కించుకుంది. ♦ గతేడాది కోట్లలో పలికిన స్పిన్నర్ అమిత్ మిశ్రా పరిస్థితి ఈసారి ఘోరంగా మారింది. ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో బేస్ ప్రైస్‌కే అమ్ముడుపోయాడు. ♦ మొత్తం 351 మంది క్రికెటర్లు అందుబాటులో ఉంటే... ఫ్రాంచైజీలు 94 మందిని మాత్రమే తీసుకున్నాయి. ఓవరాల్‌గా 257 మందికి నిరాశ ఎదురైంది. ♦ భారత అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ మెంటార్‌గా పని చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ♦ ఓవరాల్‌గా వేలంలో తీసుకున్న ఆటగాళ్లలో భారత్‌కు ఆడిన ప్లేయర్లు 15, దేశవాళీ క్రికెటర్లు 51, ఆసీస్ నుంచి 13, దక్షిణాఫ్రికా నుంచి 4, వెస్టిండీస్ నుంచి 4, ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ఒక్కో ఆటగాడు ఉన్నారు. ♦ అండర్-19 ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆటగాళ్ల వైపు కూడా ఫ్రాంచైజీలు బాగానే మొగ్గు చూపాయి. రూ. 10 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన ఇషాన్ కిషన్‌ను రూ. 35 లక్షలకు గుజరాత్ కొనుగోలు చేసింది. ఇక రిషబ్ పంత్‌ను ఏకంగా రూ. 1.9 కోట్లకు ఢిల్లీ చేజిక్కించుకుంది. ♦ సెలబ్రిటీలు నీతా అంబానీ (ముంబై), ప్రీతి జింతా (పంజాబ్), విజయ్ మాల్యా (బెంగళూరు), మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఫ్లెమింగ్, లక్ష్మణ్, మూడీ, బ్రాడ్ హాడ్జ్, వెటోరి తమ ఫ్రాంచైజీల తరఫున వేలంలో పాల్గొన్నారు. తమ్ముడికి రెండు కోట్లు! ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తమ్ముడు క్రునాల్ హిమాన్షు పాండ్యా, కర్ణాటక ఆటగాడు కిశోర్ కామత్ కోసం ఫ్రాంచైజీలు ఊహించని రీతిలో డబ్బుల వర్షం కురిపిం చాయి. రూ. 10 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన ఈ ఇద్దరి కోసం ముంబై, ఢిల్లీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. చివరకు క్రునాల్‌ను రూ. 2 కోట్లకు, కామత్‌ను రూ. 1.4 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది. గుజరాత్‌కు చెందిన 24 ఏళ్ల క్రునాల్ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తమ్ముడు. ఐపీఎల్ లెక్కల ప్రకారం ముంబై ఇండియన్స్ హార్దిక్‌కు రూ.10 లక్షలు చెల్లిస్తుండగా... అదే ముంబై క్రునాల్‌కు రూ.2 కోట్లు ఇవ్వబోతోంది. మరోవైపు కిశోర్ కర్ణాటక ప్రీమియర్ లీగ్ మాత్రమే ఆడాడు. రాష్ట్ర జట్టుకుగానీ, అండర్-17, 19 జట్లకుగానీ ప్రాతినిధ్యం వహించలేదు. -
ఐపీఎల్-9 కొత్త జట్ల ఆటగాళ్లు!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ లో భాగంగా శనివారం జరుగుతున్న వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్లను కొత్తగా వచ్చిన పుణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ లు పోటీ పడి దక్కించుకున్నాయి. కెవిన్ పీటర్సన్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ లను పుణే దక్కించుకోగా, డేల్ స్టెయిన్, దినేష్ కార్తీక్, డ్వేన్ స్మిత్‌లను గుజరాత్ కొనుగోలు చేసింది. తాజా వేలంలో ఇరు జట్లు దక్కించుకున్న ఆటగాళ్లు.. పుణే సూపర్ జెయింట్స్: కెవిన్ పీటర్సన్(రూ.3.5కోట్లు) ఇషాంత్ శర్మ(రూ.3.8 కోట్లు) ఇర్ఫాన్ పఠాన్(రూ.1 కోటి) మిచెల్ మార్ష్(రూ.4.8 కోట్లు) ఆర్పీ సింగ్( రూ.30 లక్షలు) అంకిత్ శర్మ(రూ.10 లక్షలు) రాజట్ భాటియా(రూ.60లక్షలు) ఈశ్వర్ పాండే(రూ.20 లక్షలు) మురుగన్ అశ్విన్(రూ.4.5 కోట్లు) అంకుశ్ బెయిన్స్(రూ.10 లక్షలు) పీటర్ హేండ్ స్కాంబ్(రూ.30 లక్షలు) తిశారా పెరీరా(రూ.కోటి) బాబా అపరజిత్(రూ.10 లక్షలు అశోక్ దిండా(రూ.50 లక్షలు) స్కాట్ బోలాండ్(రూ.50 లక్షలు) ఆదమ్ జంపా(రూ.30 లక్షలు) జస్కరన్ సింగ్(రూ.10 లక్షలు) గుజరాత్ లయన్స్; డ్వేన్ స్మిత్(రూ.2.3 కోట్లు) డేల్ స్టెయిన్(రూ.2.3 కోట్లు) దినేష్ కార్తీక్(రూ.2.3 కోట్లు) ధావన్ కులకర్ణి(రూ.2 కోట్లు) ప్రవీణ్ కుమార్(రూ.3.5 కోట్లు) పరాస్ దోగ్రా(రూ.10 లక్షలు) ఇషాంత్ కిషన్(రూ.35 లక్షలు) ఏకలవ్య ద్వివేది(రూ.35లక్షలు) ప్రదీప్ సంగ్వాన్(రూ.20లక్షలు) ప్రవీణ్ తాంబే(రూ.20 లక్షలు) సర్బజిత్ లడ్డా(రూ.20లక్షలు) ఆరోన్ ఫించ్(రూ.కోటి) ఆండ్రూ టై(రూ.50 లక్షలు) శదాబ్ జకాతి(రూ.20లక్షలు) -
ఆ ఇద్దరి రాకతో మరింత సంతోషం:పాంటింగ్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ లో భాగంగా శనివారం జరిగిన వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బట్లర్, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీలను ముంబై ఇండియన్స్ దక్కించుకోవడం పట్ల ఆ జట్టు చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఆ ఇద్దరి రాకతో మరింత సంతోషంగా ఉందంటూ ట్విట్టర్ లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఆ స్టార్ ఆటగాళ్ల రాకతో తమ జట్టు మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అటు వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లో విశేషంగా రాణించే బట్లర్ సేవలు క్లిష్ట సమయాల్లో జట్టుకు ఉపయోగపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. మరోవైపు సౌథీ తమతో కలవడంతో లసిత్ మలింగా స్థానం భర్తీ అయినట్లేనని తెలిపాడు. ఐపీఎల్ తాజా వేలంలో కోటి యాభై లక్షల కనీస ధర ఉన్న బట్లర్ ను డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ రూ.3.8 కోట్లకు దక్కించుకోగా, ఒక కోటి కనీస ధర ఉన్న టిమ్ సౌథీని కూడా రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది. -
వేలంలో నాయర్, నేగీలకు ఊహించని ధర
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ కోసం శనివారం జరుగుతున్న వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు కరుణ్ నాయర్‌కు ఊహించని ధర దక్కింది. అతని కనీస ధర రూ.10 లక్షలు ఉండగా, నాలుగు కోట్లకు అమ్ముడుపోయాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కరుణ్ నాయర్ ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ లోని జోథ్‌పూర్ కు చెందిన కరుణ్ నాయర్.. 2013 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడగా, 2015 ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే నాయర్ ను ఈ ఏడాది బెంగళూరు జట్టు నుంచి విడుదల చేయడంతో వేలంలో తాను ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని పొందాడు. మరోవైపు త్వరలో ఆరంభం కానున్న శ్రీలంక, ఆసియాకప్, వరల్డ్ టీ 20 టోర్నీలలో భాగంగా భారత జట్టులో స్థానం దక్కించుకున్న లెఫ్మార్మ్ స్పిన్నర్ పవన్ నేగీ జాక్ పాట్ కొట్టాడు. పవన్ నేగీకి రూ. 8.5 కోట్ల ధర వెచ్చించి ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. ఇతని కనీస ధర రూ. 30 లక్షలు కాగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో నేగీ నిలవడం విశేషం. ఇదిలా ఉండగా యువరాజ్ సింగ్‌కు డిమాండ్ తగ్గగా, ఊహించని విధంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు కాసుల పంట పండింది. సన్ రైజర్స్ హైదరాబాద్.. యువీని 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గతేడాది వేలంలో రూ. 16 కోట్ల ధర పలికిన యువీ.. ఈసారి దాదాపు సగానికి సగం తక్కువ ధర పలికాడు. కాగా వాట్సన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9.5 కోట్ల రూపాయలకు వాట్సన్‌ను దక్కించుకుంది. వేలంలో ఆటగాళ్ల ధరలు.. కొనుకొన్న ఫ్రాంచైజీల వివరాలు.. *షేన్ వాట్సన్ (రూ. 9.5 కోట్లు): రాయల్ చాలెంజర్స్ బెంగళూరు *యువరాజ్ సింగ్ (రూ. 7 కోట్లు):సన్ రైజర్స్ హైదరాబాద్ *దినేశ్ కార్తీక్ (రూ. 2.3 కోట్లు): గుజరాత్ లయన్స్ *కెవిన్ పీటర్సన్ (రూ. 3.5 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్ *ఇషాంత్ శర్మ (రూ. 3.8 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్ *ఆశీష్ నెహ్రా (రూ. 5.5 కోట్లు): సన్ రైజర్స్ హైదరాబాద్ *డేల్ స్టెయిన్ (రూ. 2.3 కోట్లు): గుజరాత్ లయన్స్ *జోస్ బట్లర్ (రూ. 3.8 కోట్లు): ముంబై ఇండియన్స్ *సంజూ శామ్సన్ (రూ. 4.2 కోట్లు): ఢిల్లీ డేర్ డెవిల్స్ *ఇర్ఫాన్ పఠాన్(కోటి): పుణె సూపర్ జెయింట్స్ *క్రిస్ మోరిస్ (రూ. 7 కోట్లు): ఢిల్లీ డేర్ డెవిల్స్ *స్టువర్ట్ బిన్నీ (రూ.2 కోట్లు): రాయల్ చాలెంజర్స్ బెంగళూరు *మిచెల్ మార్ష్ (రూ. 4.8 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్ *ధవళ్ కులకర్ణి (రూ. 2 కోట్లు): గుజరాత్ లయన్స్ *ప్రవీణ్ కుమార్ (రూ.3.8 కోట్లు): గుజరాత్ లయన్స్ *మోహిత్ శర్మ (రూ. 6.5 కోట్లు): కింగ్స్ లెవెన్ పంజాబ్ *టిమ్ సౌథీ (రూ.2.5 కోట్లు): ముంబై ఇండియన్స్ *సచిన్ బేబీ (రూ.10 లక్షలు)-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు -
గతేడాది రూ. 10.5 కోట్లు.. నేడు 2.3 కోట్లు
ఐపీఎల్-9 వేలం ఊహించని విధంగా సాగుతోంది. భారీ ధర పలుకుతారని భావించిన ఆటగాళ్లు తక్కువ ధరకు అమ్ముడు పోగా.. అనూహ్యంగా విదేశీ, దేశవాళీ ఆటగాళ్లపై ప్రాంఛైజీలు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఇక గతేడాది భారీ ధర పలికిన ఆటగాళ్లకు ఈ సారి డిమాండ్ తగ్గిపోయింది. గతేడాది వేలంలో 10.5 కోట్ల రూపాయలకు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) అమ్ముడుపోయిన కీపర్/బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌కు ఈ సారి డిమాండ్ బాగా పడిపోయింది. గుజరాత్ లయన్స్ 2.3 కోట్ల రూపాయలకు దినేశ్‌ను కొనుగోలు చేసింది. తొలివిడతలో అమ్ముడుబోని క్రికెటర్లు మార్టిన్ గుప్టిల్, అరోన్ ఫించ్, రోసౌ, చటేశ్వర్ పుజారా, హషీం ఆమ్లా, బద్రీనాథ్, జార్జి బెయిలీ, మైకేల్ హస్సీ, మహేల జయవర్ధనె, ఉస్మాన్ ఖవాజ, ముష్ఫికర్ రహీం, బ్రాడ్ హాడిన్, వాన్ విక్, మనోజ్ తివారి, రవి బొపార, దిల్షాన్, జేసన్ హోల్డర్, డారెన్ సామీ, పెరెరా, నాథన్ లియోన్, దేవేంద్ర బిషూ, మైకేల్ బీర్, అజంతా మెండిస్, సులేమాన్ బెన్, రాహుల్ శర్మ, కామెరూన్ బాయ్సె, ప్రజ్ఞాన్ ఓజా, పెరుమాల్ -
యువరాజ్‌కు తగ్గిన డిమాండ్
ఐపీఎల్-9 సీజన్ వేలంలో భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కు డిమాండ్ తగ్గగా, ఊహించని విధంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు కాసుల పంట పండింది. శనివారం జరుగుతున్న వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్.. యువీని 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గతేడాది వేలంలో రూ. 16 కోట్ల ధర పలికిన యువీ.. ఈసారి దాదాపు సగానికి సగం తక్కువ ధర పలికాడు. కాగా వాట్సన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9.5 కోట్ల రూపాయలకు వాట్సన్‌ను దక్కించుకుంది. వేలంలో ఆటగాళ్ల ధరలు.. కొనుకొన్న ఫ్రాంచైజీల వివరాలు.. షేన్ వాట్సన్ (రూ. 9.5 కోట్లు): రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యువరాజ్ సింగ్ (రూ. 7 కోట్లు):సన్ రైజర్స్ హైదరాబాద్ దినేశ్ కార్తీక్ (రూ. 2.3 కోట్లు): గుజరాత్ లయన్స్ కెవిన్ పీటర్సన్ (రూ. 3.5 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్ ఇషాంత్ శర్మ (రూ. 3.8 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్ ఆశీష్ నెహ్రా (రూ. 5.5 కోట్లు): సన్ రైజర్స్ హైదరాబాద్ డేల్ స్టెయిన్ (రూ. 2.3 కోట్లు): గుజరాత్ లయన్స్ జోస్ బట్లర్ (రూ. 3.8 కోట్లు): ముంబై ఇండియన్స్ సంజూ శామ్సన్ (రూ. 4.2 కోట్లు): ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇర్ఫాన్ పఠాన్(కోటి): పుణె సూపర్ జెయింట్స్ క్రిస్ మోరిస్ (రూ. 7 కోట్లు): ఢిల్లీ డేర్ డెవిల్స్ స్టువర్ట్ బిన్నీ (రూ.2 కోట్లు): రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మిచెల్ మార్ష్ (రూ. 4.8 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్ ధవళ్ కులకర్ణి (రూ. 2 కోట్లు): గుజరాత్ లయన్స్ ప్రవీణ్ కుమార్ (రూ.3.8 కోట్లు): గుజరాత్ లయన్స్ మోహిత్ శర్మ (రూ. 6.5 కోట్లు): కింగ్స్ లెవెన్ పంజాబ్ టిమ్ సౌథీ (రూ.2.5 కోట్లు): ముంబై ఇండియన్స్ -
ఐపీఎల్ వేలం నేడు
బెంగళూరు: టి20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేసిన మరుసటి రోజే ధనాధన్ క్రికెట్‌కు సంబంధించి మరో కీలక ఘట్టానికి తెర లేస్తోంది. ఐపీఎల్-9 కోసం 116 మంది ఆటగాళ్లను ఎంచుకునేందుకు నేడు (శనివారం) వేలం జరగనుంది. కొత్తగా వచ్చిన పుణే జెయింట్స్, గుజరాత్ లయన్స్ సహా ఎనిమిది జట్లు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఎనిమిది మంది క్రికెటర్లు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకోగా, అతి తక్కువగా రూ. 10 లక్షల బేస్ ప్రైస్‌తో దేశవాళీ కుర్రాళ్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఒక్కరోజులోనే వేలం ముగుస్తుంది. వేలంలో భారత ఆటగాళ్లు యువరాజ్ సింగ్, ఇషాంత్, నెహ్రాలకు మంచి డిమాండ్ ఉంది. భారీ హిట్టర్లుగా పేరున్న విదేశీ ఆటగాళ్లు వాట్సన్, పీటర్సన్, ఫించ్, గప్టిల్, డ్వేన్ స్మిత్ భారీ మొత్తం ఆశిస్తున్నారు. దిల్షాన్, మిషెల్ మార్ష్, స్యామీ, ఇర్ఫాన్ పఠాన్, తిసార పెరీరా, ముస్తఫిజుర్లను తీసుకునేందుకు జట్లు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లను విడుదల చేయడం వల్ల అన్ని జట్ల వద్ద పెద్ద మొత్తం అందుబాటులో ఉండటంతో ఈ సారి కూడా క్రికెటర్ల పంట పండవచ్చు! అంచనాలు...అవకాశాలు... ఢిల్లీ డేర్‌డెవిల్స్: ప్రస్తుతం జట్టులో 13 మంది మాత్రమే ఉన్నారు. మరో 14 మంది వరకు కొనుక్కునే అవకాశం ఉంది. గుజరాత్ లయన్స్: పూర్తి స్థాయి జట్టును రూపొందించాల్సి ఉంది. ఒక అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్, ఒక టాప్ బౌలర్ కోసం చూస్తున్నారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్: టాప్ బౌలర్ అవసరం ఉండటంతో స్టెయిన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. జట్టుకు కెప్టెన్ కూడా కావాలి. కోల్‌కతా నైట్‌రైడర్స్: స్టార్ ఆల్‌రౌండర్ కావాలి. వాట్సన్‌పై దృష్టి పెట్టారు. ఇది మినహా ఈ జట్టు దూసుకెళ్లే ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తిగా లేదు. ముంబై ఇండియన్స్: తరచుగా గాయపడే మలింగకు ప్రత్యామ్నాయంగా ఒక పేసర్ అవసరం. పుణే సూపర్ జెయింట్స్: ప్రస్తుతం ఉన్న ఐదుగురు కాకుండా పూర్తిగా కొత్త జట్టును రూపొందించుకోవాలి. ధోని వ్యూహాల ప్రకారం ఆల్రౌండర్లపై దృష్టి పెట్టవచ్చు. బెంగళూరు: ఆర్సీబీ వద్ద అంతా స్టార్లే ఉన్నారు. గత అనుభవాల నేపథ్యంలో ఈ సారి ఉదారంగా ఖర్చు పెట్టకపోవచ్చు. సన్‌రైజర్స్ హైదరాబాద్: హిట్టింగ్ చేయగల భారత ఆటగాళ్లపై దృష్టి. పీటర్సన్పై కూడా ఆసక్తి చూపొచ్చు. -
జాక్‌పాట్ కొడతాడా!
♦ మళ్లీ యువరాజ్పైనే అందరి దృష్టి ♦ శనివారం ఐపీఎల్-9 వేలం ♦ అందుబాటులో 351 మంది క్రికెటర్లు రెండేళ్ల క్రితం ఐపీఎల్ వేలంలో రూ. 14 కోట్ల రికార్డు ధర, అందరిలో ఒక్కసారిగా ఆశ్చర్యం. అయితే బెంగళూరుతో ఈ సంబరం ఒక్క ఏడాదికే సరి. వరల్డ్ కప్ ఫైనల్ వైఫల్య భారాన్ని మోస్తూ రావడంతో 2015 వేలంలో అతని విలువపై వేల సందేహాలు ఉన్నా...అది మరో రూ. 2 కోట్లు పెరిగిందే కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఈసారీ ఒక సీజన్‌తోనే ఢిల్లీ బంధం తెగిపోయింది. మరి ఇప్పుడు ఎన్ని కోట్లు దక్కుతాయి...ఎవరు అతడిని ఎంచుకుంటారు...ఇలా ఐపీఎల్ వేలంలో మరోసారి స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ప్రస్తుతం భారత టి20 జట్టు సభ్యుడిగా కూడా ఉన్న అతను గతంలోకంటే ఎక్కువ మొత్తం రాబట్టి జాక్‌పాట్ కొడతాడా? లేక గత రెండు జట్ల అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఫ్రాంచైజీలు భారీ మొత్తం చెల్లించడంలో వెనుకడుగు వేస్తాయా? అనేది ఆసక్తికరం. సాక్షి క్రీడా విభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్-2016 కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ నెల 6న (శనివారం) బెంగళూరులో ఐపీఎల్ వేలం జరుగుతుంది. చెన్నై, రాజస్థాన్ జట్టు రద్దు కావడంతో కొత్తగా పుణే, రాజ్‌కోట్ జట్లు బరిలో నిలిచాయి. ప్రస్తుతానికి ఐదుగురేసి ప్రధాన ఆటగాళ్లను మాత్రమే తీసుకున్న ఈ టీమ్‌లు తమ పూర్తి స్థాయి జట్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. దాంతో గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ సారి లీగ్ వేలంకు ప్రాధాన్యత పెరిగింది. పైగా ఆరు జట్లు కలిపి మొత్తం 61 మంది ఆటగాళ్లను విడుదల చేశాయి. దాంతో ఫ్రాంచైజీల వద్ద చెప్పుకోదగ్గ మొత్తమే మిగిలింది. వేలం మొత్తం ఒక్కరోజులోనే ముగుస్తుంది. ఢిల్లీనుంచి కేదార్జాదవ్ను బెంగళూరు తీసుకోవడం ఒక్కటే ఈ ఏడాది ట్రేడింగ్ విండోలో జరిగిన మార్పు. యువీ హవా సాగుతుందా దాదాపు రెండేళ్ల తర్వాత టి20ల్లో భారత జట్టు తరఫున ఆడిన యువరాజ్ సింగ్ తాజా ఫామ్ వేలంలో కీలకం కావచ్చు. ఆసీస్‌తో రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్ అవకాశం రాలేదు కానీ బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. చివరి మ్యాచ్‌లో కాస్త నెమ్మదించినా కీలక సమయంలో ఫోర్, సిక్స్ బాది తన ‘హిట్టింగ్’లో ఇంకా పదును ఉందని చూపించాడు. దేశవాళీలో 2015-16 సీజన్లో వన్డేల్లో ఆరు మ్యాచ్‌లలో దాదాపు 70 సగటుతో 346 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చిన యువీ, ముస్తాక్ అలీ టి20లో మూడు ఇన్నింగ్స్‌లలో ఒక అర్ధ సెంచరీ చేసినా మిగతా రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. 2 వికెట్లూ పడగొట్టాడు. శుక్రవారం ప్రకటించే ప్రపంచకప్ టీమ్‌లోనూ అతను ఎంపికయ్యే అవకాశం ఉంది. పైగా రెండు కొత్త ఫ్రాంచైజీలు స్టార్ వ్యాల్యూ కోసం యువీ ఉంటేదని మంచిదని భావిస్తాయి. 2014 సీజన్లో ఆర్సీబీ తరఫున 14 మ్యాచ్‌లలో 376 పరుగులే చేసిన యువీ...గత ఏడాది డేర్‌డెవిల్స్ సభ్యుడిగా 13 ఇన్నింగ్స్‌లలో 248 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో టీమ్ యజమానులు గతంలోలాగా గుడ్డిగా వెళ్లకపోవచ్చు. ఇషాంత్ విలువెంత..? ఇతర భారత ప్రధాన ఆటగాళ్లలో పేసర్ ఇషాంత్ శర్మ, ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీతో పాటు భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఆశిష్ నెహ్రా కూడా వేలంలో అందుబాటులోకి రానున్నారు. వీరి ప్రారంభ విలువ రూ. 2 కోట్లుగా ఉంది. సన్‌రైజర్స్ జట్టులో గత ఏడాది పేసర్లు బౌల్ట్, భువనేశ్వర్ ఎక్కువ భాగం లీగ్ బరిలోకి దిగడంతో ఇషాంత్‌కు 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప రికార్డు లేకపోయినా... భారత పేసర్లందరిలో సీనియర్ ఆటగాడు కావడంతో అతనికి మంచి మొత్తం దక్కవచ్చు. చెన్నై రద్దు కావడంతో నెహ్రా కూడా వేలం బరిలో నిలిచాడు. పీటర్సన్ సిద్ధం విదేశీ ఆటగాళ్లలో ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆటగాడు కెవిన్ పీటర్సన్. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లలో దుమ్ము రేపుతున్న పీటర్సన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. గత రెండేళ్లుగా మెరుపు ప్రదర్శనను ఇచ్చిన కివీస్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్‌కు కూడా మంచి విలువ పలికే అవకాశం ఉంది. ఇక 40 ఏళ్లు దాటినా ఇటీవల బిగ్‌బాష్‌లో సిడ్నీ థండర్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన మైక్ హస్సీతో పాటు పాటు భారత్‌తో చివరి టి20లో భారీ సెంచరీతో చెలరేగిన షేన్‌వాట్సన్ వేలంలో భారీ మొత్తాన్ని ఆశిస్తున్నాడు. కుర్రాళ్లు రెడీ గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న పలువురు వర్ధమాన ఆటగాళ్లు కూడా ఐపీఎల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. భారీ విలువ దక్కకపోయినా...కనీస మొత్తానికే లీగ్‌లో అడుగుపెడితే చాలని వీరంతా ఆసక్తిగా ఉన్నారు. వీరిలో కొందరు గతంలో కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వారు కాగా... మరికొందరు పూర్తిగా తొలి చాన్స్ కోసం సిద్ధమయ్యారు. సంజు శామ్సన్, కరుణ్ నాయర్, నాథూసింగ్, కరియప్ప, అవేశ్ ఖాన్, రిషభ్ పంత్, ఆదిత్య తారే, కేఎస్ భరత్, పవన్ నేగి, దీపక్ హుడా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. 2016 వేలం విశేషాలు... మొత్తం వేలంలో ఉన్న ఆటగాళ్ల సంఖ్య: 351 భారత క్రికెటర్లు: 230 విదేశీయులు: 121 క్యాప్డ్: 130, అన్క్యాప్డ్: 219, అసోసియేట్ ఆటగాళ్లు: 2 (కెనడా/ఐర్లాండ్) ఎంత మందిని వేలంలో తీసుకునే అవకాశముంది: 116. మొత్తంగా ఒక జట్టులో ఆటగాళ్లు 27కు మించరాదు. వీరిలో 9 మంది మాత్రమే విదేశీయులు ఉండాలి. ఎవరి వద్ద ఎంత మొత్తం ఉంది? ఢిల్లీ రూ. 37.15 కోట్లు హైదరాబాద్ రూ. 30.15 కోట్లు పుణే రూ. 27 కోట్లు రాజ్‌కోట్ రూ. 27 కోట్లు పంజాబ్ రూ. 23 కోట్లు బెంగళూరు రూ. 21.62 కోట్లు కోల్‌కతా రూ. 17.95 కోట్లు ముంబై 14.40 కోట్లు ♦ రూ. 2 కోట్ల ప్రాథమిక ధరతో ఉన్న ఆటగాళ్లు (12 మంది): యువరాజ్, పీటర్సన్, వాట్సన్, ఇషాంత్, మిషెల్ మార్ష్, నెహ్రా, దినేశ్ కార్తీక్, బిన్నీ, సంజు శామ్సన్, ధావల్ కులకర్ణి, మైక్ హస్సీ, కేన్రిచర్డ్సన్. ♦ రూ. 1.50 కోట్ల జాబితా (8 మంది): డేల్ స్టెయిన్, కామెరాన్ వైట్, జయవర్ధనే, ప్యాటిన్సన్, మోహిత్ శర్మ, హాడిన్, బట్లర్, దిల్షాన్. -
8న ఐపీఎల్ కొత్త జట్ల ప్రకటన
ముంబై: వచ్చే రెండేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనే రెండు కొత్త జట్లను డిసెంబర్ 8న ప్రకటిస్తారు. ఆ రోజు జరిగే వేలం ద్వారా వాటిని నిర్ణయిస్తారు. రూ. 40 కోట్ల కనీస విలువతో రివర్స్ బిడ్డింగ్ జరుగుతుంది. కొత్త ఫ్రాంచైజీలు ఎంచుకునేందుకు 9 నగరాల పేర్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అందుబాటులో ఉంచింది. ఈ జాబితాలో జైపూర్, కొచ్చిలకు అవకాశం కల్పించలేదు. లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఐపీఎల్ నుంచి రెండేళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను నిషేధించడంతో రెండు కొత్త జట్ల అవసరం ఏర్పడింది. ఈ రెండు జట్లలోంచి పది మంది ఆటగాళ్లను కొత్త టీమ్ నేరుగా ఎంచుకునే అవకాశం కల్పిస్తుండగా... మిగతావారందరినీ వేలంలోకి తీసుకు వస్తారు. -
16కోట్లు పలికిన యువరాజ్
ఐపీఎల్ వేలంలో కోసం రికార్డు మొత్తం వెచ్చించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రపంచకప్‌లో చోటు దక్కకపోయినా... ఐపీఎల్లో మాత్రం యువరాజ్‌కు ‘రేటు’ పెరిగింది. గత ఏడాది రూ.14 కోట్లకు తీసుకున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్... తమకు భారమయ్యాడంటూ ఈ ఏడాది తప్పించింది. దీంతో సోమవారం బెంగళూరులో జరిగిన వేలంలోకి యువీ వచ్చాడు. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఐపీఎల్-8 సీజన్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రికార్డు స్థాయిలో రూ.16 కోట్లు పెట్టి యువీని కొనుక్కుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌కు ఒక ఆటగాడికి ఇంత మొత్తం లభించడం ఇదే తొలిసారి. ఈ వేలంలో దినేశ్ కార్తీక్, శ్రీలంక ఆల్‌రౌండర్ మాథ్యూస్‌లకు కూడా భారీ మొత్తాలు లభించాయి. ధోని వల్లే చోటు దక్కలేదు: యువీ తండ్రి ప్రపంచకప్‌కు భారత జట్టులో యువరాజ్‌కు స్థానం దక్కకపోవడానికి కెప్టెన్ ధోనియే కారణమని... యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్ ఆరోపించారు. ‘ప్రపంచంలోనే యువీ అత్యుత్తమ ఆల్‌రౌండర్ కాబట్టే ఐపీఎల్లో భారీగా డబ్బు ఇస్తున్నారు. అయితే ధోనికి యువీ అంటే ఇష్టం లేనందునే జట్టులోకి రానీయలేదు’ అని ఆయన ధ్వజమెత్తారు. అయితే దీనిని యువీ వెంటనే తోసిపుచ్చాడు. తనకు, ధోనికి సంబంధాలు బాగున్నాయని చెప్పాడు. -
వేలంలో అమ్ముడుపోని టాప్ బ్యాట్స్ మన్
బెంగళూరు: ఇండిన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో వరల్డ్ టాప్ ర్యాంకింగ్ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషిమ్ ఆమ్లాను ఎవరూ కొనలేదు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో ఉన్న ఆమ్లాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఆమ్లా ప్రాథమిక ధరను రూ. 2 కోట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతం తమ జట్టు తరపున వన్డే ప్రపంచకప్ ఆడుతున్న ఆమ్లా ఇప్పటివరకు 108 వన్డేలు ఆడాడు. అతడి బ్యాటింగ్ సగటు 55.93 గా ఉంది. 19 సెంచరీలు, 27 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 153. అయితే టి20ల్లో అతడి రికార్డు అంత ఘనంగా లేదు. 26 టి20 మ్యాచ్ లు ఆడిన ఆమ్లా 25 సగటుతో 600 పరుగులు చేశాడు. -
అండర్సన్ పై కన్నేసిన ఐపిఎల్ ఫ్రాంచైజీలు