Life insurance
-
అతివలకు అడ్వైజర్లుగా మంచి కెరియర్..
చాలా మంది మహిళలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి బడ్జెట్లు చూసుకోవడం, ఖర్చుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడమనేది దైనందిన చర్యగానే ఉంటుంది. ఈ బాధ్యతలే ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం, కమ్యూనికేషన్, సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యాల్లాంటి అమూల్యమైన నైపుణ్యాలను అలవర్చుకోవడానికి ఉపయోగపడతాయి. విజయవంతమైన జీవిత బీమా అడ్వైజరు/ కన్సల్టెంటుగా మారాలంటే అచ్చంగా ఇలాంటి నైపుణ్యాలే అవసరం.అడ్వైజరు, కన్సల్టెంటుగా మారడమనేది, జీవిత లక్ష్యాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకోవడంలో ఇతరులకు తోడ్పడటంతో పాటు తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం కూడా కృషి చేయడానికి ఉపయోగపడుతుంది. ఐఆర్డీఏఐ ప్రకారం 2022 మార్చి నాటికి దేశీయంగా మొత్తం జీవిత బీమా ఏజెంట్లలో మహిళల వాటా 29 శాతంగా ఉంది. సుమారు 24.43 లక్షల మంది ఏజంట్లలో దాదాపు 7 లక్షల మంది మహిళా ఏజంట్లు ఉన్నారు. మహిళలు ముందుకొచ్చి, అవకాశాలను అందిపుచ్చుకుంటే, ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చు.అడ్వైజరుగా ఇలా మారొచ్చు..1. ప్రాథమిక అర్హతలు, శిక్షణ: బీమా పథకాలు, విక్రయించేందుకు టెక్నిక్‌లు, ఆర్థిక ప్రణాళిక సూత్రాలు మొదలైన విషయాల్లో అభ్యర్థులకు అవగాహన కల్పించేలా చాలా మటుకు కంపెనీలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. సమర్ధవంతంగా క్లయింట్లకు మార్గదర్శకత్వం వహించేందుకు మహిళలకు అవసరమయ్యే సాధన సంపత్తిని వీటి ద్వారా సమకూర్చుకోవచ్చు.2. నెట్వర్కింగ్: క్లయింట్ల నమ్మకాన్ని చూరగొనాలంటే సంభాషించే నైపుణ్యాలు, ఇతరులతో కలిసి పని చేయగలగడం, అవసరమైతే సారథ్య బాధ్యతలు చేపట్టడం, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మల్చుకోగలిగే సామర్థ్యాల్లాంటివి చాలా ముఖ్యం. తాము అడ్వైజరుగా వ్యవహరించే సంస్థల సహాయంతో మహిళలు సామర్థ్యాలను మెరుగుపర్చుకుని, దీర్ఘకాలిక ప్రొఫెషనల్ కనెక్షన్లను ఏర్పర్చుకోవచ్చు.3. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకోవడం: డిజిటల్ యుగంలో భావి కస్టమర్లను చేరుకునేందుకు సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ అనేవి శక్తివంతమైన సాధనాలుగా ఉంటున్నాయి. తమ అనుభవాన్ని తెలియజేసేందుకు, భావి కస్టమర్లలో అవగాహనను పెంపొందించేందుకు మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకోవచ్చు. 4. నిరంతరం నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం: పరిశ్రమలో వచ్చే కొత్త పోకడలు, కొత్త ప్రోడక్టులు, నియంత్రణ నిబంధనలపరమైన మార్పుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటే దీర్ఘకాలికంగా విజయాలకు దోహదపడుతుంది. సంబంధిత సర్టిఫికేషన్ల పొందితే కెరియర్లో పురోగమించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. చివరగా చెప్పేదేమిటంటే మహిళలు, ముఖ్యంగా గృహిణులు తమకు అంతర్గతంగా ఉండే నైపుణ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని, కెరియర్ను నిర్మించుకోవడానికి జీవిత బీమా రంగం అవకాశం కల్పిస్తుంది.సరైన శిక్షణ, సంకల్పం, నెట్వర్కింగ్ సామర్థ్యాలను అలవర్చుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా మహిళలూ విజయవంతగా రాణించగలరు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు కావడం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం, వర్క్–లైఫ్ సమతుల్యత, ఇతరులకు సాధికారత కల్పించే సంతృప్తిని పొందవచ్చు.ఇదీ చదవండి: ఇక ఒక రాష్ట్రం–ఒక ఆర్ఆర్బీ!జీవిత బీమాలో కెరియర్‌తో ఆర్థిక స్వాతంత్య్రంజీవిత బీమా రంగంలో మహిళలు కెరియర్‌పరంగా పురోగమించడంతో పాటు ఆర్థికంగా సాధికారతను కూడా పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కన్సల్టెంటుగా కెరియర్ ఇటు వ్యక్తిగత బాధ్యతలు, అటు ప్రొఫెషనల్ ఆకాంక్షల మధ్య సమతౌల్యం పాటిస్తూ, ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. స్థిరమైన ఆదాయార్జన పొందడంతో పాటు అర్థవంతమైన ప్రభావాన్ని చూపేందుకు ఇందులో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. తద్వారా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవడంలో తోడ్పడటమే కాకుండా ఆర్థిక స్వాతంత్య్రం పొందేందుకు కూడా ఇది ఉపయోగపడగలదు.-సమీర్ జోషి, చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్, బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ -
విప్రోకు ఫీనిక్స్ గ్రూప్ భారీ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో తాజాగా బ్రిటిష్ బీమా దిగ్గజం ఫీనిక్స్ గ్రూప్ నుంచి భారీ కాంట్రాక్టును పొందింది. 10 ఏళ్ల కాలానికి 50 కోట్ల పౌండ్ల (రూ.5,524 కోట్లు) విలువైన డీల్ కుదుర్చుకున్నట్లు విప్రో వెల్లడించింది. డీల్‌లో భాగంగా రీఎస్యూర్ బిజినెస్ కోసం జీవిత బీమా, పెన్షన్ బిజినెస్ నిర్వహణ సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ చేయాల్సి ఉంటుందని విప్రో పేర్కొంది. క్లయింట్లకు అత్యుత్తమ సర్వీసులు అందించడంలో ఫైనాన్షియల్ సంస్థలకు విప్రో సహకారాన్ని, కట్టుబాటును ప్రస్తుత ల్యాండ్‌మార్క్ డీల్ పట్టిచూపుతున్నదని విప్రో యూరప్ సీఈవో ఓంకార్ నిశల్ తెలియజేశారు. భారీ డీల్ నేపథ్యంలో విప్రో షేరు బీఎస్ఈలో 1.4% క్షీణించి రూ. 267 వద్ద ముగిసింది. -
సంపద వెలికితీద్దాం పదండి..!
ఎప్పుడో పది, ఇరవై ఏళ్ల క్రితం బ్యాంకులో డిపాజిట్ చేసి మర్చిపోయారా..? తల్లిదండ్రులు లేదా పూర్వికుల పేరిట స్టాక్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మరుగున పడి ఉన్నాయా?.. ఏమో ఎవరు చూసొచ్చారు. ఓసారి విచారిస్తేనే కదా తెలిసేది..! రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు క్లెయిమ్ లేకుండా, నిష్ప్రయోజనంగా ఉండిపోయినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సుమారు రూ.78,200 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.ఫిజికల్ షేర్ల రూపంలో ఉన్న మొత్తం సుమారు రూ.3.8 లక్షల కోట్లు. రూ.36 వేల కోట్లు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఉంటే, క్లెయిమ్ చేయని డివిడెండ్లు రూ.5 వేల కోట్ల పైమాటే. ఉలుకూ, పలుకూ లేకుండా ఉండిపోయిన ఈ పెట్టుబడులకు అసలు యజమానులు ఎవరు, నిజమైన వారసులు ఎవరు?.. ఏమో అందులో మన వాటా కూడా ఉందేమో..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం... – సాక్షి, బిజినెస్ డెస్క్ కుటుంబ యజమాని తాను చేసిన పెట్టుబడుల వివరాలను జీవిత భాగస్వామితో పంచుకునే అలవాటు గతంలో అతి కొద్ద మందిలోనే ఉండేది. స్టాక్ మార్కెట్ ఆరంభంలో ఇన్వెస్ట్ చేసి, కాలం చేసిన వారి పేరిట పెట్టుబడుల వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు కూడా. ఇంట్లో ఆధారాలుంటే తప్పించి ఆయా పెట్టుబడుల గురించి తెలిసే అవకాశం లేదు. అవేవో పత్రాలనుకుని, పక్కన పడేసిన వారు కూడా ఉండొచ్చు.లేదా భౌతిక రూపంలోని షేర్ సర్టీఫికెట్లు కనిపించకుండా పోవచ్చు. ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు. ఏళ్లకేళ్లకు క్లెయిమ్ లేకుండా ఉండిపోయిన పెట్టుబడులు ‘ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ’ (ఐఈపీఎఫ్ఏ/పెట్టుబడిదారుల అక్షరాస్యత, సంరక్షణ నిధి)కు బదిలీ అయిపోతాయి. ఐఈపీఎఫ్ఏ కిందకు ఇలా చేరిపోయిన లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ ఎంతన్నది అధికారిక సమాచారం లేదు. సెబీ నమోదిత ‘ఫీ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ’ అంచనా ప్రకారం.. ఈ మొత్తం 2024 మార్చి నాటికి సుమారు రూ.77,033 కోట్లుగా ఉంటుంది. ఐఈపీఎఫ్ఏ కిందికి..లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి వాటాదారులు వరుసగా ఏడు సంవత్సరాలు, అంతకుమించి డివిడెండ్ క్లెయిమ్ చేయకపోతే కంపెనీల చట్టంలోని సెక్షన్ 124 కింద ఆయా వాటాలను ఐఈపీఎఫ్ఏ కిందకు కంపెనీలు బదిలీ చేయాలి. గతంలో డివిడెండ్లు ఎన్‌క్యాష్ (నగదుగా మార్చుకోవడం) కాకపోవడం, చిరునామాలో మార్పులతో అవి కంపెనీకి తిరిగి వచ్చేవి. నేటి రోజుల్లో డీమ్యాట్ ఖాతాతో అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతా ఇనాపరేటివ్ (కార్యకలాపాల్లేని స్థితి)గా మారిన సందర్భాల్లో వాటాదారులకు డివిడెండ్ చేరదు. ఇలా పదేళ్ల పాటు కొనసాగితే, ఆయా వాటాలు ఐఈపీఎఫ్ఏ కిందకు వెళ్లిపోతాయి. గుర్తించడం ఎలా..? కార్పొరేట్ వ్యవహారాల శాఖ కింద ఐఈపీఎఫ్ఏ పనిచేస్తుంటుంది. అన్ క్లెయిమ్డ్ షేర్ల వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా gov. in/ login పోర్టల్‌లో డేటాబేస్ అందుబాటులో ఉంది. ఇన్వెస్టర్లు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అయి, పాన్ నంబర్ ఆధారంగా తమ పేరు, తమ తల్లిదండ్రులు, వారి పూర్వికులలో ఎవరి పాన్ నంబర్ లేదా పేరుమీద షేర్లు ఐఈపీఎఫ్ఏ కింద ఉన్నాయేమో పరిశీలించుకోవచ్చు.ఒకవేళ ఐఈపీఎఫ్ఏకు ఇంకా బదిలీ కాకుండా, కంపెనీ వద్దే ఉండిపోయిన అన్క్లెయిమ్డ్ షేర్లు, డివిడెండ్ల వివరాలు కూడా పోర్టల్‌లో లభిస్తాయి. ఫోలియో నంబర్‌తోనూ చెక్ చేసుకోవచ్చు. దీనికంటే ముందు ఒకసారి ఇల్లంతా వెతికి ఒకవేళ భౌతిక పత్రాలుంటే, వాటిని డీమ్యాట్ చేయించుకోవడం సులభమైన పని. ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థలు ఇన్వెస్టర్లకు పాన్ నంబర్ ఆధారంగా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్)ను నెలవారీగా పంపిస్తుంటాయి.ఇన్వెస్టర్ ఈమెయిల్స్‌ను పరిశీలించడం ద్వారా వారి పేరిట పెట్టుబడులను తెలుసుకోవచ్చు. తమ తల్లిదండ్రులు లేదా సమీప బంధువు ఇటీవలి కాలంలో మరణించినట్టయితే, వారి పేరిట పెట్టుబడులను తెలుసుకునేందుకు మరో మార్గం ఉంది. వారి ఆదాయపన్ను రిటర్నులను పరిశీలిస్తే వివరాలు తెలియొచ్చు. ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్కు లేఖ రాస్తూ, తమ వారి పేరిట ఉన్న పెట్టుబడుల సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తాము వారికి చట్టబద్ధమైన వారసులమన్న రుజువును లేఖకు జత చేయాలి. రికవరీ ఎలా..? ఐఈపీఎఫ్ఏ నుంచి షేర్లు, డివిడెండ్‌ను రికవరీ చేసుకోవడానికి కొంత శ్రమించక తప్పదు. ‘షేర్ సమాధాన్’ వంటి కొన్ని సంస్థలు ఫీజు తీసుకుని ఇందుకు సంబంధించి సేవలు అందిస్తున్నాయి. ఐఈపీఎఫ్ఏ వద్ద క్లెయిమ్ దాఖలు చేసి, షేర్లు, డివిడెండ్లను వెనక్కి తెప్పించుకోవడానికి చాలా సమయం పడుతుందని షేర్ సమాధాన్ చెబుతోంది.ప్రస్తుతం క్లెయిమ్ ఆమోదం/తిరస్కారానికి ఆరు నెలల నుంచి మూడేళ్ల సమయం తీసుకుంటున్నట్టు షేర్ సమాధాన్ డైరెక్టర్ శ్రేయ్ ఘోషల్ తెలిపారు. కొన్ని కంపెనీలు, ఆర్టీఏలు ఈ విషయంలో మెరుగ్గా స్పందిస్తుంటే.. కొన్నింటి విషయంలో ఒకటికి రెండు సార్లు సంప్రదింపులు నిర్వహించాల్సి వస్తున్నట్టు చెప్పారు. ఏదైనా కంపెనీలో వాటాలున్నట్టు గుర్తించి, అవి ఇంకా ఐఈపీఎఫ్ఏ కిందకు బదిలీ కాకపోతే.. కంపెనీ ఆర్టీఏను సంప్రదించాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను సమర్పించి, వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. డీమ్యాట్ చేసుకోవాలి..? 2019 ఏప్రిల్ నుంచి షేర్ల క్రయ, విక్రయాలకు అవి డీమ్యాట్ రూపంలో ఉండడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. వాటాదారులు మరణించిన కేసుల్లో వారి వారసుల పేరిట బదిలీకి మాత్రం మినహాయింపు ఉంది. ఇప్పటికీ పత్రాల రూపంలో షేర్లు కలిగి ఉంటే, ఆయా కంపెనీల ఆర్టీఏలను సంప్రదించి డీమెటీరియలైజేషన్ (డీమ్యాట్) చేయించుకోవాలి. షేర్ హోల్డర్ పేరు, ఫోలియో నంబర్ వివరాలతో ఆర్టీఏను సంప్రదిస్తే.. ఏయే పత్రాలు సమర్పించాలన్నది తెలియజేస్తారు.నిబంధనల మేరకు దరఖాస్తును పూర్తి చేసి, కేవైసీ, ఇతర పత్రాలను జోడించి ఆర్టీఏకి పంపించాలి. దరఖాస్తును ఆమోదిస్తే, ధ్రువీకరణ లేఖను ఆర్టీఏ జారీ చేస్తుంది. అప్పుడు దీన్ని డీమ్యాట్ ఖాతా కలిగిన డిపాజిటరీ పార్టీసిపెంట్ (సీడీఎస్ఎల్/ఎన్ఎస్డీఎల్)కు సమర్పించిన అనంతరం షేర్లు జమ అవుతాయి. ఈ విషయంలో కొందరు బ్రోకర్లు, కన్సల్టెన్సీ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. వాటి సాయం తీసుకునే ముందు ఆయా సంస్థల వాస్తవికతను నిర్ధారించుకోవడం అవసరం. బ్యాంక్ డిపాజిట్లు.. బ్యాంక్ ఖాతాలో రెండేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీ లేకపోతే అది ఇనాపరేటివ్‌గా మారిపోతుంది. ఖాతాదారు మరణించిన సందర్భంలో ఇలా జరగొచ్చు. అటువంటప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు నామినీ తన కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్ శాఖలో సమర్పించాలి. ఖాతాను మూసేసి, అందులోని బ్యాలన్స్‌ను నామినీకి బదిలీ చేస్తారు. ఒకవేళ నామినీ లేకపోయినప్పటికీ, ఇనాపరేటివ్ ఖాతాలో బ్యాలన్స్ రూ.25 వేల లోపు ఉంటే బ్యాంక్ స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు.అంతకుమించి బ్యాలన్స్ ఉంటే చట్టబద్ధమైన వారసులు (జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు/సోదరీమణులు) కోర్టుకు వెళ్లి సక్సెషన్ సర్టీఫికెట్ తెచ్చుకోవాలి. క్లెయిమ్ కోసం ఒకరికి మించి ముందుకు వస్తే, అప్పుడు ఇండెమ్నిటీ సర్టి ఫికెట్‌ను సైతం బ్యాంక్ కోరొచ్చు. డిపాజిట్ అయినా, ఖాతాలో బ్యాలన్స్ అయినా 10 ఏళ్లపాటు క్లెయిమ్ లేకుండా ఉండిపోతే, ఆ మొత్తాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తమ పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ గతంలో బ్యాంక్‌లను ఆదేశించింది. కనుక పేరు, పుట్టిన తేదీ, పాన్ తదితర వివరాలతో తమ పేరు, తమ వారి పేరిట డిపాజిట్లు ఉన్నాయేమో బ్యాంక్ పోర్టల్‌కు వెళ్లి పరిశీలించుకోవచ్చు. లేదంటే బ్యాంక్ శాఖకు వెళ్లి విచారణ చేయాలి. అన్క్లెయిమ్డ్ షేర్లు డీమ్యాట్ రూపంలో ఉంటే..?⇒ అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా వాటిని తమ పేరిట బదిలీ చేయించుకోవచ్చు.⇒డీపీ వద్ద దరఖాస్తు దాఖలు చేయాలి. షేర్లు పత్రాల రూపంలో ఉంటే? ⇒ విడిగా ప్రతి కంపెనీ ఆర్టీఏ వద్ద డీమెటీరియలైజేషన్కు దరఖాస్తు చేసుకోవాలి.⇒ అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. అవన్నీ కచ్చితమైనవని నిర్ధారించుకున్న తర్వాత, అప్పుడు డీమ్యాట్ ఖాతాకు బదిలీ అవుతాయి. .ఐఈపీఎఫ్ఏకు బదిలీ అయిపోతే..? ⇒ వాటాలున్న ప్రతి కంపెనీ ఆర్టీఏ నుంచి ఎంటైటిల్మెంట్ లెటర్‌ను పొందాలి. ⇒ ఐఈపీఎఫ్–5 ఈ–ఫారమ్‌ను ఐఈపీఎఫ్ఏ వద్ద దాఖలు చేయాలి. ⇒ కంపెనీ ఆమోదం తర్వాత క్లెయిమ్‌ను ఐఈపీఎఫ్ఏ ఆమోదిస్తుంది. దాంతో షేర్లు అసలైన యజమానులు లేదా వారసులకు బదిలీ అవుతాయి. ⇒ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (ఎస్ఆర్ఎన్) జారీ అవుతుంది. దీని ఆధారంగా ఆయా కంపెనీల ఆర్టీఏ వద్ద 7–10 రోజుల్లోగా డాక్యుమెంట్లను సమర్పించాలి.ఫండ్స్ పెట్టుబడుల సంగతి..? బ్యాంక్ డిపాజిట్లకు, బీమా పాలసీలకు మెచ్యూరిటీ ఉంటుంది. కానీ ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు అలాంటిదేమీ ఉండదు. అయినప్పటికీ పదేళ్లకు పైగా ఒక ఫోలియోపై ఎలాంటి లావాదేవీలు లేకుండా, కేవైసీ అప్డేట్ చేయకపోతే వాటిని అన్క్లెయిమ్డ్గా పరిగణించొచ్చు. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్లు క్లెయిమ్ కాకపోయి ఉండొచ్చు.చిరునామా, కాంటాక్ట్ వివరాలు మారిపోయి, ఇన్వెస్టర్ మరణించిన సందర్భాలు, బ్యాంక్ ఖాతా ఇనాపరేటివ్‌గా మారిపోయిన కేసుల్లోనూ ఇది చోటు చేసుకోవచ్చు. ఇలాంటి పెట్టుబడులను ఐఈపీఎఫ్ఏ కిందకు బదిలీ చేసినట్టయితే, షేర్ల మాదిరే నిర్దేశిత ప్రక్రియలను అనుసరించి వాటిని సొంతం చేసుకోవచ్చు. ఫండ్స్ పెట్టబడుల వివరాలను గుర్తించేందుకు క్యామ్స్, కే–ఫిన్‌టెక్ సాయం తీసుకోవచ్చు.యాక్టివ్‌గా లేని ఫండ్స్ పెట్టుబడులను తెలుసుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ‘మిత్రా’ పేరుతో (ఎంఎఫ్ పెట్టుబడుల గుర్తింపు, రికవరీ) ఒక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ త్వరలో అందుబాటులోకి రానుంది. అప్పుడు, తమ పేరు, తమ వారి పేరిట ఉన్న ఫండ్స్ పెట్టుబడి వివరాలను సులభంగా గుర్తించొచ్చు.ఇలా చేస్తే సమస్యలకు దూరం..⇒ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సంబంధించి (ట్రేడింగ్ ఖాతాకు అనుసంధానంగా ఉన్న) బ్యాంక్ ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవాలి. ⇒ పెట్టుబడుల వివరాలను జీవిత భాగస్వామితో పంచుకోవాలి. లేదంటే ఒక డైరీలో అన్ని పెట్టుబడులు, ఆర్థిక వివరాలను నమోదు చేసి, ఇంట్లో భద్రపరచాలి. ⇒ ప్రతి పెట్టుబడికి నామినీని నమోదు చేయాలి. ⇒ వీలునామా లేదా ఎస్టేట్ ప్లానింగ్ చేసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో వారసులకు క్లెయిమ్ సమస్యలు ఎదురుకావు. ⇒ చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా ఇలా కేవైసీకి సంబంధించి ముఖ్యమైన వివరాల్లో మార్పులు జరిగితే వెంటనే బ్యాంక్‌లు, మ్యూచువల్ ఫండ్స్, డీపీలు, బీమా కంపెనీల వద్ద అప్డేట్ చేసుకోవాలి. బీమా ప్రయోజనాలూ అంతే..ఎల్ఐసీ సహా కొన్ని బీమా సంస్థల పరిధిలో మెచ్యూరిటీ (గడువు) ముగిసినా, ఎలాంటి క్లెయిమ్ చేయని పాలసీలు చాలానే ఉన్నాయి. ఒక పాలసీదారు పేరిట క్లెయిమ్ చేయని మొత్తం రూ.1,000కి మించి ఉంటే, ఆ వివరాలను తమ వెబ్సైట్లలో బీమా సంస్థలు ప్రదర్శించాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. పాలసీదారు పేరు, పాలసీ నంబర్, పాన్, పుట్టిన తేదీ వివరాలతో వీటి గురించి తెలుసుకోవచ్చు. క్లెయిమ్ బ్యాంక్ డిపాజిట్ల మాదిరే ఉంటుంది. -
‘పెట్టుబడుల కంటే ప్రధానమైనవి ఇవే..’ కామత్ సూచన
పర్సనల్ ఫైనాన్స్(Personal Finance) ప్రణాళికలు మెరుగ్గా ఉంటే భవిష్యత్తులో ఆర్థిక స్వతంత్రం సాధించవచ్చని అనుకుంటారు. దాన్ని సాధించేందుకు చాలామంది స్టాక్‌మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి మార్గాలవైపు మొగ్గు చూపుతారు. కానీ జెరోధా స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు నితిన్ కామత్(Nitin Kamat) మాత్రం పర్సనల్ ఫైనాన్స్ కంటే ముఖ్యమైన అంశాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల కామత్ తన బ్లాగ్‌లో స్పందిస్తూ పర్సనల్ ఫైనాన్స్ కంటే ప్రతిఒక ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలియజేశారు.‘మీరు చేసే పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే అవకాశం ఉంటుంది. అందుకోసం చాలామంది స్టాక్ మార్కెట్లు, ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ కుటుంబంలో మీపై ఆదారపడినవారు ఉంటే ముందుగా మీరు పెట్టుబడుల కంటే జీవిత బీమాకే తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే మీ గొప్ప పెట్టుబడి ఆలోచనవుతుంది. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం మీ ప్రాథమిక బాధ్యత. అది చాలా అవసరం కూడా’ అని కామత్ రాశారు.ఇదీ చదవండి: ఒకే వాహనం.. 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 సెన్సార్లు‘మారుతున్న జీవన ప్రమాణాలు, ఆహార అలవాట్ల దృష్ట్యా మనుషుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతూ, ఆయుర్దాయం తగ్గుతోంది. ఊహించని వైద్య ఖర్చులను నిర్వహించేలా తగినంత ఆరోగ్య బీమాను ఎంచుకోండి. మీపై ఆధారపడిన వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మంచి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా కవరేజీని క్రమానుగతంగా పునఃసమీక్షించాలి. ఈ చర్యలు మీ కుటుంబానికి ఆర్థిక కష్టాల నుంచి కాపాడటమే కాకుండా మనశాంతిని అందిస్తాయి. ఫలితంగా పెట్టుబడిదారులు ఆత్మవిశ్వాసంతో తమ ఆర్థిక లక్ష్యాలను కొనసాగించడానికి ఈ విధానాలు వీలు కల్పిస్తాయి’ అని తెలిపారు.దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడులుమార్కెట్ కరెక్షన్ల సమయంలో క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్)లను ఆపవద్దని కామత్ ఇన్వెస్టర్లకు సూచించారు. ‘మార్కెట్ క్షీణత భయపెట్టవచ్చు, కానీ అవి దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలను అందిస్తాయి’ అని తెలిపారు. క్రమశిక్షణతో ఉండటం, సిప్ కంట్రిబ్యూషన్లను నిర్వహించడం ద్వారా పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. పెట్టుబడి పెట్టడానికి కంటే ముందుకు ప్రతిఒక్కరు విధిగా జీవిత, ఆరోగ్య బీమాలు తీసుకోవాలని కామత్ కోరారు. -
పన్ను ఆదా.. భవిష్యత్తుకు పెట్టుబడి!
మనది పొదుపు సమాజం. మన తల్లిదండ్రులు, తాతలు ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేసేవారు. భవిష్యత్ కోసం వీలైన ప్రతి రూపాయినీ ఆదా చేసేవారు. కానీ, నేటి తరం ఖర్చు చేయడాన్ని ఇష్టపడుతోంది. సౌకర్యాలు, సుఖాలు, ఆడంబరాలు, ఆనందం కోసం ఖర్చుకు వెనుకాడని ధోరణి పెరిగిపోతోంది. ‘ధనవంతుడు కావాలంటే పేదవారిగా బతకాలి’ అన్నది ఆర్థిక నిపుణులు చెప్పే సూక్తి. పేదవారిగా జీవించాలని చెప్పడం కాదు ఇందులోని అసలు అర్థం. ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు పోకూడదన్న సూచన ఇందులో కనిపిస్తుంది. తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపన్ను రాయితీలను గణనీయంగా పెంచేశారు విత్త మంత్రి. రూ.12.75 లక్షల వరకు కొత్త విధానంలో పన్ను లేకుండా వరాలు కురిపించారు. దీంతో వివిధ తరగతుల వారికి గరిష్టంగా రూ.లక్ష, అంతకుమించి పన్ను రూపంలో ఆదా కానుంది.ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని ఖర్చు బకెట్లో వేసేసుకుని సంబరపడిపోకుండా.. పెట్టుబడులకూ కొంత కేటాయించుకోవాలన్నది నిపుణుల సూచన. తద్వారా భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలకు మరింత బలం చేకూరుతుంది. త్వరగా ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకోగలరు. పన్ను భారం తప్పించుకునేందుకు కొత్త విధానంలోకి మారిపోయి.. ఇప్పటి వరకు పాత విధానంలో చేస్తున్న పన్ను ఆదా పెట్టుబడులకు మంగళం పాడే తప్పు అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు. ఆదాయ స్థాయిలకు అనుగుణంగా కొత్త పన్ను విధానంలో ఆదా అయ్యే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించే వారికి రూ.83,200, రూ.15 లక్షలు సంపాదించే వారికి రూ.32,500 వరకు తాజా ప్రతిపాదనలతో పన్ను ఆదా కానుంది. అలాగే, రూ.24 లక్షల సంపాదనాపరులకు రూ.1.14 లక్షలు, రూ.కోటి ఆదాయ వర్గాలకు రూ.1,25,840, రూ.5 కోట్ల ఆదాయం కలిగిన వారికి రూ.1.43 లక్షల వరకు పన్ను మిగులు లభించనుంది. ఈ కొత్త ప్రతిపాదనలు 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్నాయి. అంటే 2026–27 అసెస్మెంట్ సంవత్సరానికి ఇవి వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు అమల్లో ఉన్న రేట్లే వర్తిస్తాయి. పాత విధానంలో వివిధ సెక్షన్ల కింద పలు రకాల పెట్టుబడులతోపాటు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలతో కలుపుకుని రూ.8.50 లక్షల ఆదాయంపై పన్ను ఆదాకు అవకాశం ఉంది. పెట్టుబడులు ఆపొద్దు.. ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక ఉండాలి. జీవితంలో అన్ని ముఖ్య అవసరాలను సాధించే మార్గసూచీగా ఇది ఉంటుంది. ఈ లక్ష్యాలకు పెట్టుబడులే ఆధారం. ఆదాయంలో కనీసం 30 శాతం అయినా పెట్టుబడులకు మళ్లించుకోవాలి. అయితే, జీవిత లక్ష్యాల దృష్టితో కాకుండా పన్ను ఆదా కోసమే పెట్టుబడులను ఆశ్రయించే వేతన జీవులు కూడా ఉన్నారు. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), ఐదేళ్ల పన్ను ఆదా ఎఫ్‌డీల్లో పెట్టుబడులు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై సెక్షన్ 80సీ పరిధిలో (పాత పన్ను వ్యవస్థ) రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీనికి అదనంగా హెల్త్ ఇన్సూరెన్స్‌కు సెక్షన్ 80డీ పరిధిలో పన్ను మినహాయింపులు ఉన్నాయి. గృహ రుణం తీసుకుని అసలు చెల్లింపులను సెక్షన్ 80సీ పరిధిలో, వడ్డీ చెల్లింపులను సెక్షన్ 24 పరిధిలో చూపించుకోవచ్చు. కొత్త పన్ను వ్యవస్థ ఆకర్షణీయంగా ఉండడంతో, ఇంతకాలం పన్ను ఆదా దృష్టితో కొనసాగించిన ఈ పెట్టుబడులను నిలిపివేసే ప్రమాదం లేకపోలేదు. ఈ తప్పు అస్సలు చేయొద్దు. కొత్త పన్ను విధానం సూటిగా, సరళంగా ఉంటుంది. పన్నుల గందరగోళం వద్దనుకునే వారు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే తప్పేమీ కాదు. కానీ, అదే సమయంలో పాత పన్ను విధానం ప్రోత్సహిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, మదుపులను విస్మరించకుండా, వాటిని కొనసాగించడం ద్వారానే గరిష్ట ప్రయోజాన్ని పొందగలరు. పన్ను ఆదా కోసం ఉద్దేశించినవి కాకపోయినా, మెరుగైన ఇతర సాధనాల్లో అయి నా పెట్టుబడులు కొనసాగించుకో వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్‌లో ఈఎల్ఎస్ఎస్ ఒక విభాగం. ఇందులో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీంతో ఇతర ఈక్విటీ ఫండ్స్ అంత అమ్మకాల ఒత్తిడి వీటిల్లో ఉండదు. కనుక స్థిరత్వం ఎక్కువ. మల్టీక్యాప్ (ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేయగలదు) విధానంతో పెట్టుబడులు పెడుతుంటుంది. పదేళ్ల కాలంలో 12–18 శాతం మధ్య, ఐదేళ్లలో 13–27 శాతం మధ్య రాబడులు ఈ పథకాల్లో గమనించొచ్చు. కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు ఈఎల్ఎస్ఎస్లోనే ఇన్వెస్ట్ చేయాలని లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీక్యాప్, ఇండెక్స్ ఫండ్స్‌లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, బీమా పథకాలకు పన్ను ఆదాకు మించి ప్రయోజనాలను ఇచ్చే సామర్థ్యం ఉన్నట్టు సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ కునాల్ సవాని పేర్కొన్నారు. కొత్త విధానంలోకి వెళ్లినా కానీ, భవిష్యత్ కోసం ఉద్దేశించిన ఈ పెట్టుబడులను నిలిపివేయొద్దని సూచించారు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత బీమా (టర్మ్, ఎండోమెంట్) పాలసీల ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పాత వ్యవస్థలో పన్ను మిననహాయింపు ఉంది. వార్షిక ప్రీమియం మొత్తం కవరేజీలో (సమ్ అష్యూర్డ్/రక్షణ) 10 శాతం మించకపోతే, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను లేదు. ఈ పన్ను ప్రయోజనం కోసం ఎండోమెంట్, టర్మ్ పాలసీలను కొందరు తీసుకుంటున్నారు. ఏ పన్ను విధానంలో ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా, కుటుంబానికి ఆర్థికంగా ఆధారమైన ప్రతి వ్యక్తీ తన పేరిట తగినంత బీమా కవరేజీతో అచ్చమైన టర్మ్ పాలసీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తన వార్షిక ఆదాయానికి సుమారుగా 20 రెట్ల మేర సమ్ అష్యూర్డ్ ఉండేలా చూసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆర్జించే వ్యక్తి ప్రాణానికి ప్రమాదం వాటిల్లితే, వచ్చే బీమా పరిహారంతో అతనిపై ఆధారపడిన కుటుంబం సాఫీగా జీవించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నేడు జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. కనుక ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఇది కేవలం పన్ను ఆదా కోసం ఉద్దేశించిన సాధనం కానే కాదు. పెద్ద ప్రమాదం లేదా కరోనా వంటి విపత్తు పరిస్థితుల్లో ఆస్పత్రి పాలైతే, హెల్త్ కవరేజీ లేని పరిస్థితుల్లో అప్పటి వరకు కూడబెట్టినదంతా కరిగిపోయే ప్రమాదం ఎదురవుతుంది. అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం వల్ల ఆర్థికంగా సమస్యల్లోకి వెళ్లకూడదని కోరుకుంటే, హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి. ఒక కుటుంబానికి ఎంత లేదన్నా రూ.10లక్షలు ఉండేలా చూసుకోవాలి. దీనిపై అదనపు కవరేజీని సూపర్ టాపప్ ప్లాన్ రూపంలో తీసుకోవచ్చు. ఉద్యోగం చేసే సంస్థ తరఫున గ్రూప్ హెల్త్ కవరేజీ ఉన్న వారు సైతం విడిగా తమ కుటుంబానికి ఒక హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా కారణంతో కంపెనీని వీడినా, ఉద్యోగం మానేసినా కవరేజీ కొనసాగుతుంది.ఖర్చు కంటే పెట్టుబడి ముఖ్యం చాలా మంది తమ ఆదాయంలో ఖర్చులుపోను మిగులుంటే అప్పుడు పెట్టుబడులకు మళ్లిస్తుంటారు. కానీ, ముందు పెట్టుబడులకు కేటాయింపులు చేసిన తర్వాతే ఖర్చులకు వెళ్లాలన్నది నిపుణుల సూచన. కొత్త పన్ను వ్యవస్థలో మిగిలే నిధులను ఎన్పీఎస్ తదితర పెన్షన్ ప్లాన్లకు కేటాయించుకోవాలని సింఘానియా అండ్ కో పార్ట్నర్ బన్సాల్ సూచించారు. దీనివల్ల గణనీయమైన రిటైర్మెంట్ ఫండ్ ఏర్పడుతుందన్నారు. చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యాన్ని పెద్దగా పట్టించుకోరు. 60 ఏళ్ల తర్వాత సంగతి కదా అని తేలికగా తీసుకుంటారు. కానీ, ఉద్యోగంలో చేరిన నాటి నుంచే రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం పెట్టుబడి చేసుకుంటూ వెళ్లడం ద్వారా స్వల్ప మొత్తమే పెద్ద నిధిగా మారుతుందన్నది తెలుసుకోవాలి.కొత్త–పాత పన్ను వ్యవస్థలు ఏ విధానంలో కొనసాగాలన్నది తమ ఆదాయం ఆధారంగానే నిర్ణయించుకోవాలి. హెచ్ఆర్ఏ, గృహ రుణ ప్రయోజనాలు, ఎల్టీసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ పెట్టుబడులతో రూ.8 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్‌తో రూ.50 వేలు మొత్తంగా రూ.8.50 లక్షల వరకు పాత పన్ను వ్యవస్థలో మినహాయింపులున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే రూ.24 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారికి పాత వ్యవస్థ అనుకూలమని నిమిత్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు నితేష్ బుద్దదేవ్ తెలిపారు. ఒకవేళ తమ పెట్టుబడులు ఈ స్థాయిలో లేకపోతే కొత్త విధానాన్ని పరిశీలించొచ్చు. రూ.24 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి కొత్త విధానమే అనుకూలం. ఎన్పీఎస్ రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాల్లో ఎన్పీఎస్ ఒకటి. అతి తక్కువ నిర్వహణ చార్జీలతోపాటు, పెట్టుబడిపైనా, రాబడి ఉపసంహరణపైనా పన్ను ప్రయోజనాలున్నాయి. ఇందులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై సెక్షన్ 80సీసీఈ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80సీ గరిష్ట ప్రయోజనం కిందకే ఇది కూడా వర్తిస్తుంది. దీనికి అదనంగా సెక్షన్ 80సీసీడీ (1బి) కింద ఎన్పీఎస్ టైర్–1 ఖాతాలో మరో రూ.50,000 పెట్టుబడికి సైతం పన్ను మినహాయింపు ఉంది. ఈ సెక్షన్ కిందే ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడికీ పన్ను ఆదా ప్రయోజనాన్ని 2025–26లో బడ్జెట్లో కల్పించారు. తమ పేరు మీద లేదా తమ కుమార్తె లేదా కుమారుల పేరిట ఎన్పీఎస్ వాత్సల్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బి) కింద గరిష్ట ప్రయోజనం రూ.50వేలకు పరిమితం. 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకంలో సమకూరిన మొత్తం నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. మరో 40 శాతం మొత్తానికి పింఛను ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో చేసే జమలపైనా పాత విధానంలో పన్ను ప్రయోజనాలున్నాయి. సెక్షన్ 80సీసీడీ (2) కింద మూలవేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని ఉద్యోగి తరఫున యాజమాన్యం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగి తరఫున ప్రభుత్వమే జమ చేస్తుంటే అప్పుడు 14 శాతంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలోనూ సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పించారు. కొత్త విధానంలో ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ టైర్–1లో జమ చేస్తే (మూలవేతనం, డీఏలో 10 శాతం / వచ్చే ఏప్రిల్ నుంచి 14 శాతం) ఆ మేరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ హామీతో కూడిన డెట్ పెట్టుబడి సాధనాలు. వీటిల్లో రిస్క్ సున్నా. ఈ రెండు సాధనాల్లో ఏటా చేసే పెట్టుబడులను పాత పన్ను వ్యవస్థలోని సెక్షన్ 80సీ పరిధిలో చూపించుకుని రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తంపై పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో పన్ను లేదు. పన్ను ప్రయోజనాలున్న ఈ మెరుగైన పథకాలు ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిందే. తమ మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతం ఈ సాధనాలకు కేటాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌కు మళ్లించుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడికి కొంత రక్షణతోపాటు దీర్ఘకాలంలో అధిక రాబడిని సొంతం చేసుకోగలరు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో పెట్టుబడులకు వర్తించే వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ వీటి రేట్లను ప్రకటిస్తుంటుంది. పీపీఎఫ్‌లో ప్రస్తుతం 7.10 శాతం రేటు అమల్లో ఉంది. దీని కాల వ్యవధి 15 ఏళ్లు. అనంతరం మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.2 శాతం రేటు అమల్లో ఉంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని ప్రారంభించుకోవచ్చు. బాలికల వయసు 10 ఏళ్లు మించకూడదు. ఆలోపు వయసున్న వారి పేరుతో ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కుమార్తెలకు 21 ఏళ్లు నిండగానే పథకం ముగిసిపోతుంది. లేదా 18 ఏళ్లు నిండిన తర్వాత, 21 ఏళ్లు రాక ముందే వారికి వివాహం నిశ్చయమైతే అప్పుడు ఈ పథకం నుంచి వైదొలగొచ్చు. కొత్త పన్ను విధానంలో ఉన్న వారికీ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలు అనుకూలమేనని వేద్ జైన్ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అంకిత్ జైన్ సూచించారు. ఎందుకంటే ఈ రెండు పథకాల్లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనం కొత్త వ్యవస్థ కింద లేకపోయినా కానీ, వడ్డీ రాబడికి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉన్నట్టు తెలిపారు. కుమార్తెల వివాహం, ఉన్నత విద్య కోసం సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మహిళకూ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్
భారతీయ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నారు. ఆర్థికాంశాల్లో నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్(Term life insurance) ఆవశ్యకత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బీమా సాధనం గురించి తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నిర్దిష్ట ప్రీమియం చెల్లిస్తే, నిర్దిష్ట జీవిత బీమా కవరేజీని అందించే ప్యూర్ ప్రొటెక్షన్ పథకం. దురదృష్టవశాత్తు పాలసీదారు కన్నుమూసిన పక్షంలో సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని వారి నామినీకి బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ ప్రీమియంకే ఎక్కువ కవరేజీని అందించడం టర్మ్ ప్లాన్ల ప్రత్యేకత.ఉదాహరణకు 30 ఏళ్ల నేహా వార్షికంగా రూ.9,646 ప్రీమియంతో 30 ఏళ్ల వ్యవధికి రూ.1 కోటి సమ్ అష్యూర్డ్(Sum Assured)కి పాలసీ తీసుకున్నారనుకుందాం. ఒకవేళ దురదృష్టవశాత్తు నేహా మరణించిన పక్షంలో ఆమె నామినీకి రూ.1 కోటి బీమా మొత్తం లభిస్తుంది. ఇలా నేహా తీసుకున్న టర్మ్ పాలసీ అనేది ఆమె కుటుంబసభ్యులకు ఆర్థికంగా తోడ్పాటునిస్తుంది. అయితే, ఈ టర్మ్ పాలసీని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. ఉదాహరణకు నేహా గనుక టర్మ్ పాలసీని తీసుకోవడం ఒక పదేళ్లు వాయిదా వేశారనుకోండి .. అప్పుడు అదే లైఫ్ కవరేజీకి ఆమె ఏకంగా రూ.15,900 వార్షిక ప్రీమియం కట్టాల్సి వస్తుంది. పైగా పాలసీ వ్యవధి కూడా 20 ఏళ్లకే పరిమితమవుతుంది. మొత్తం మీద ఆమె తక్కువ కాలవ్యవధికి వర్తించే పాలసీకి ఏటా రూ.6,000 చొప్పున కట్టాల్సి వస్తుంది. అదే ముందుగా తీసుకుని ఉంటే, ఈ అదనపు మొత్తాన్ని మరో చోట ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. యాడ్–ఆన్‌తో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత జీవిత పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా మరికాస్త ప్రీమియం చెల్లించడం ద్వారా మరిన్ని అదనపు ప్రయోజనాలను అందించేందుకు యాడ్–ఆన్ రైడర్లు ఉపయోగపడగలవు. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ఇది ఇటు ఆరోగ్యం అటు జీవిత బీమా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొన్ని జీవిత బీమా కంపెనీలు 32 తీవ్ర అనారోగ్యాలకు కూడా కవరేజీని అందిస్తున్నాయి. మహిళలకు ప్రత్యేకమైన బ్రెస్ట్, సరి్వకల్, ఒవేరియన్ క్యాన్సర్లు, గుండె.. మెదడు.. కిడ్నీ సంబంధ సమస్యలు మొదలైనవి ఈ జాబితాలో ఉంటున్నాయి. 30 ఏళ్ల వయస్సు గల మహిళ, 30 ఏళ్ల కాలవ్యవధికి కేవలం నెలకు రూ. 977 చెల్లించడం ద్వారా రూ. 50 లక్షల వరకు ప్రయోజనాలను పొందేందుకు ఈ యాడ్–ఆన్‌ను తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉన్నట్లు తేలిందంటే, చికిత్స కోసం నిధుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, బీమా సంస్థ ఏకమొత్తంగా చెల్లిస్తుంది. ప్రస్తుతం కీమోథెరపీ వ్యయం దాదాపు రూ. 25 లక్షల వరకు ఉంటోంది. ఇలా వైద్య చికిత్స వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ యాడ్–ఆన్ ఎంతో ఉపయోగకరంగా ఉండగలదు.ప్రీమియం వెయివర్ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేని విధంగా జీవితం ఉంటుంది. కాబట్టి పాలసీదారు ప్రమాదవశాత్తూ శాశ్వత వైకల్యానికి గురై ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ యాడ్–ఆన్ బెనిఫిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మటుకు బీమా సంస్థలు అదనంగా తీసుకోకుండా, పాలసీ అంతర్గతంగానే ఈ ఫీచరును అందిస్తున్నాయి. ఒకవేళ మీరు తీసుకున్న పాలసీలో ఇది లేకపోతే, కొంత అదనపు ప్రీమియం చెల్లించైనా తీసుకోవడం శ్రేయస్కరం.యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు 11.9 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ యాడ్–ఆన్ ప్రయోజకరంగా ఉండగలదు. నెలకు కేవలం రూ.302 మేర అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.50 లక్షల లైఫ్ కవరేజీకి నేహాలాంటి వారు ఈ యాడ్–ఆన్ బెనిఫిట్‌ను తీసుకోవచ్చు. ఉదాహరణకు, రూ.1 కోటి కవరేజీ గల బేస్ పాలసీని, రూ.50 లక్షల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్‌ను తీసుకుంటే, ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో మొత్తం రూ.1.50 కోట్ల క్లెయిమ్ లభిస్తుంది.కుటుంబానికి ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్న వారికి దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగి, ఆదాయానికి అంతరాయం ఏర్పడినా, కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. క్లెయిమ్‌ల విషయంలో మెరుగైన ట్రాక్ రికార్డు ఉన్న బీమా సంస్థ నుంచి దీన్ని కొనుగోలు చేయడం మంచిది. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ మధ్య కాలంలో మొత్తం పరిశ్రమలో అత్యుత్తమంగా 99.3 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని నమోదు చేసింది. అలాగే, నాన్–ఇన్వెస్టిగేటెడ్ డెత్ క్లెయిమ్‌లను సగటున 1.2 రోజుల వ్యవధిలోనే సెటిల్ చేసింది.– ఎలిజబెత్ రాయ్, హెడ్ (ప్రోడక్ట్ మేనేజ్మెంట్), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ -
ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవితబీమా
ఉద్యోగులకు సామాజిక భద్రతా కల్పించేందుకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్ 1976లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్‌లో వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తారు.ఈడీఎల్ఐ స్కీమ్ వివరాలుఅర్హతలు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు రూ.15,000 వరకు మూల వేతనం ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్‌లో డిఫాల్ట్‌గా చేరతారు.యాజమాన్యం వాటా: ఉద్యోగి నెలవారీ వేతనంలో 0.5% యజమానులు ఈడీఎల్ఐ పథకానికి విరాళంగా ఇస్తారు. గరిష్ట వేతన పరిమితి రూ.15,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈడీఎల్ఐలో ఉద్యోగి నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ అవసరం లేదు.బీమా కవరేజీ: సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే, రిజిస్టర్డ్ నామినీకి ఏకమొత్తంలో బీమా డబ్బులు అందుతాయి. గత 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న సగటు నెలవారీ వేతనానికి 30 రెట్లు, నెలకు గరిష్టంగా రూ.15,000కు లోబడి ఈ బెనిఫిట్‌ను లెక్కిస్తారు.ప్రయోజనాలు: కనీస హామీ ప్రయోజనం రూ.2.5 లక్షలు, గరిష్ట ప్రయోజనం రూ.7 లక్షలుగా ఉంది. ఇది నెలవారీ గరిష్టవేతన పరిమితిపై ఆధారపడుతుంది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ఈడీఎల్ఐ(EDLI) పథకంలో ఉద్యోగి వేతనంలో 0.5 శాతం వాటాను యాజమాన్యం జమచేయాలి. అయితే దీని కంటే మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy)లు ఏవైనా ఉంటే యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఈడీఎల్ఐ స్కీమ్ ద్వారా అందించబడే కవరేజీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.ఇదీ చదవండి: కూతురి కోసం మంచి పథకంఎలా క్లెయిమ్ చేయాలి?ఉద్యోగి మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ఆ డబ్బులు చెందుతాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్లెయిమ్ ఫారాన్ని ఈపీఎఫ్ఓకు సమర్పించాలి. క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అందుకోసం నామినీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి ఫారం 5 ఐఎఫ్ (ఇన్సూరెన్స్ ఫండ్) పొందాలి. మరణించిన ఉద్యోగి పీఎఫ్ ఖాతా నంబర్, మరణించిన తేదీ, నామినీ వివరాలతో సహా అవసరమైన అన్ని వివరాలను ఫారంతో నింపి కార్యాలయంలో అందించాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లను జతచేయాలి. -
నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రేషియో క్షీణత
న్యూఢిల్లీ: నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంలో నికర చెల్లింపులు (క్లెయిమ్ రేషియో) 2023–24లో స్వల్పంగా తగ్గి 82.52 శాతంగా ఉన్నట్టు బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నివేదిక ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 82.95 శాతంగా ఉంది. నాన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కలసి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్ల ప్రీమియాన్ని నమోదు చేశాయి. 12.76 శాతం పెరిగింది. ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం 9 శాతం వరకు పెరిగి రూ.82,891 కోట్ల నుంచి రూ.90,252 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ప్రీమియం రూ.1.88 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.58 లక్షల కోట్లుగానే ఉంది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల లాభం రూ.10,119 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రూ.2,556 కోట్ల మేర నష్టాలను నమోదు చేయడం గమనార్హం. నివేదికలోని వివరాలు..2023–24లో నెట్ ఇన్కర్డ్ (నికర) క్లెయిమ్‌లు 15.39 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వరంగ బీమా సంస్థల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 99.02 శాతంగా ఉంటే, 2023–24లో 97.23 శాతానికి తగ్గింది.ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 76.49 శాతానికి మెరుగుపడింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 75.13 శాతంగా ఉంది.స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 61.44 శాతంగా ఉంటే, 2023–24లో 63.63 శాతానికి మెరుగుపడింది.స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 66.58 శాతంగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 73.71 శాతంగా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్జీవిత బీమా కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.77 లక్షల కోట్లను పాలసీదారులకు చెల్లించాయి. పాలసీదారుల నుంచి వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో చెల్లింపులు 70.22 శాతంగా ఉన్నాయి. పాలసీల సరెండర్లు/ఉపసంహరణలకు సంబంధించిన ప్రయోజనాలు 15 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల వాటా 58 శాతంగా ఉంది.2023–24లో 18 జీవిత బీమా కంపెనీలు నికర లాభాలను నమోదు చేశాయి. జీవిత బీమా కంపెనీల ఉమ్మడి లాభం 11 శాతం పెరిగి రూ.47,407 కోట్లకు చేరింది.ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్ఐసీ) లాభం 11.75 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా కంపెనీల లాభంలో 5 శాతం వృద్ధి నమోదైంది.మొత్తం బీమా వ్యాప్తి 2022–23లో 4 శాతంగా ఉంటే 2023–24లో 3.7 శాతానికి పరిమితమైంది. జీవిత బీమా వ్యాప్తి 3 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గగా.. సాధారణ బీమా వ్యాప్తి (ఆరోగ్య బీమా సహా) ఒక శాతం వద్దే స్థిరంగా ఉంది. -
ఏటీఎఫ్‌పై జీఎస్టీకి నో!
జైసల్మేర్: విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను (ఏటీఎఫ్) వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు అంగీకరించడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముడి పెట్రోలియం డీజిల్ ఉత్పత్తుల్లో భాగమని భావిస్తున్నందున ఏటీఎఫ్‌ను వేరుగా చూడలేమని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయని ఆమె చెప్పారు. రుణ నిబంధనలను పాటించనందుకు రుణగ్రహీతల నుంచి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వసూలు చేసే జరిమానా ఛార్జీలపై జీఎస్టీ మినహాయించాలని కౌన్సిల్ తాజాగా నిర్ణయించింది. రూ.2,000 కంటే తక్కువ చెల్లింపులను ప్రాసెస్ చేసే పేమెంట్ అగ్రిగేటర్లు జీఎస్టీ మినహాయింపునకు అర్హులు. ఫిన్‌టెక్ సర్వీసెస్, పేమెంట్ గేట్‌వేలకు ఇది వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఎగవేతకు ఆస్కారం ఉన్న వస్తువుల కోసం ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంను అమలు చేసే ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించింది. ఆరోగ్య బీమాపై.. బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపునకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి వివరించారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం కోసం మంత్రుల బృందానికి మరింత సమయం అవసరమని, పన్నుల హేతుబద్ధీకరణపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసినట్లు ఆమె తెలిపారు. దీనిపై బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి చెప్పారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే బీమా ప్రీమియంలను, అలాగే ఆరోగ్య బీమా కవర్ కోసం సీనియర్ సిటిజన్లు చెల్లించే ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. రూ.5 లక్షల వరకు కవరేజీతో ఆరోగ్య బీమా కోసం సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులు చెల్లించే ప్రీమియంపై జీఎస్టీ మినహాయించాలని బృందం సూచించింది. పాత ఈవీలపై పన్ను.. పాత ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఒక వ్యక్తి మరో వ్యక్తికి విక్రయిస్తే ఎటువంటి జీఎస్టీ ఉండదు. అయితే కంపెనీ లేదా పాత కార్ల అమ్మకాల్లో ఉన్న నమోదిత విక్రేత ఈవీ/పెట్రోల్/డీజిల్ కారును విక్రయిస్తే మార్జిన్ విలువపై 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బలవర్ధకమైన (ఫోర్టిఫైడ్) బియ్యంపై 18 శాతంగా ఉన్న జీఎస్టీ రేటు 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. అయితే జన్యు చికిత్సను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయిస్తున్నట్టు వివరించారు. పాప్‌కార్న్‌పై పన్ను రేటు మారలేదని జీఎస్టీ కౌన్సిల్ వివరణ ఇచ్చింది. 50 శాతం పైగా ఫ్లైయాష్ కలిగి ఉన్న ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ (ఏసీసీ) బ్లాక్స్‌పై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి కుదిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మిరియాలు, ఎండు ద్రాక్షలను వ్యవసాయదారుడు సరఫరా చేస్తే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. -
బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
బీమా ప్రీమియం వసూళ్లు నవంబర్ నెలలో తగ్గినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించింది. 2023 నవంబర్‌లో వసూలైన రూ.26,494 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో బీమా ప్రీమియం రూ.25,306 కోట్లుగా నమోదైంది. గతంలో పోలిస్తే ఇది 4.5% తక్కువగా ఉంది. బీమా రంగంలో ప్రముఖంగా సేవలందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లు ఈసారి తగ్గుముఖం పట్టాయి. దానివల్లే ఈ పరిస్థితి నెలకొందని కౌన్సిల్ అభిప్రాయపడింది.ఎల్ఐసీ ప్రీమియం తగ్గుముఖం పడుతుంటే ప్రైవేట్ సంస్థల ప్రీమియంలో మాత్రం గతంలో కంటే 31 శాతం వృద్ధి కనబడింది. నవంబర్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ రూ.3,222 కోట్లు, మ్యాక్స్ లైఫ్ రూ.748.76 కోట్లు, హెచ్డీఎఫ్సీ లైఫ్ రూ.2,159 కోట్లు, ఎస్బీఐ లైఫ్ రూ.2,381 కోట్ల వరకు ప్రీమియం వసూలు చేశాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో 16% వృద్ధి కనిపించింది. ఎల్ఐసీ కూడా అదే మొత్తంలో వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకమైంది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్‌తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ చాలా మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆసరాగా ఇవ్వగలిగేది టర్మ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ దీన్ని తీసుకోని వారు నిపుణుల సలహాతో మంచి పాలసీను ఎంచుకోవాలి. -
లైఫ్‌కి బీమా తప్పనిసరి
జీవిత బీమా అవసరంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ ముందుకెళుతున్నామని, తక్కువ ప్రీమియంతోనైనా ప్రతి కుటుంబం ఎంతో కొంత బీమాను కలిగి ఉండాలన్నదే తమ ఉద్దేశమని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ, ఎండీ కాస్పరస్ జేహెచ్ క్రామ్హూట్ చెప్పారు. ఈ వైఖరి వల్లే వ్యాపార పరిమాణం పరంగా తాము దేశంలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ పాలసీదారుల సంఖ్యను బట్టి చూస్తే 7వ స్థానంలో ఉన్నామని స్పష్టంచేశారు.పాలసీదారుల అవసరాలు తెలుసుకోవటానికి, క్లెయిమ్‌ల పరిష్కారానికి టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటున్నామని, అందుకే తమ సంస్థ లాభదాయకతలోనూ ముందుందని వివరించారు. మంగళవారం ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ...(సాక్షి, బిజినెస్ ప్రతినిధి) కుటుంబంలో ఆర్జించే వ్యక్తికి బీమా ఇచ్చి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించటమే జీవిత బీమా లక్ష్యం. కానీ కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యమివ్వటం లేదు. మరి ఆశించిన లక్ష్యం నెరవేరుతోందా? నిజమే! దేశంలో 4 శాతం మందికే జీవిత బీమా కవరేజీ ఉందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్‌ను చాలామంది అవసరం లేనిదిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. తెలంగాణలో లీడ్ ఇన్సూరర్‌గా ఉన్నాం కనక మేం రకరకాల అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెట్టాం. అందుకే 2025 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో బీమా పరిశ్రమ 24 శాతం పెరిగితే మేం 57 శాతం వృద్ధి సాధించాం. మా వ్యాపారంలో గ్రామీణుల వాటా 40 శాతానికిపైగా ఉండటమే మా నిబద్ధతకు నిదర్శనం. బీమా కంపెనీలు ‘టర్మ్’పై కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌తో ముడిపడిన ఎండోమెంట్, యులిప్ పాలసీలపై ఫోకస్ పెడుతున్నాయెందుకు? 30 ఏళ్ల వ్యక్తికీ 10 ఏళ్ల కాలపరిమితితో జీవితబీమా పాలసీ అమ్మటం మోసం కాదా? నిజమే! ఇలాంటి మిస్ సెల్లింగ్ జరగకూడదు. కాకపోతే తక్కువ ప్రీమియమే అయినా కొన్నేళ్ల పాటు కట్టి... చివరకు పాలసీ గడువు ముగిశాక ఏమీ తిరిగి రాని టర్మ్ పాలసీలపై కస్టమర్లు ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లను ఆకర్షించటానికే కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు, రాబడులతో ముడిపడ్డ ఎండోమెంట్ పాలసీలను తెచ్చాయి. లాభదాయకత కూడా ముఖ్యమే కనక ఈ పాలసీలను విక్రయిస్తున్నాయి. మరి 30 ఏళ్ల వ్యక్తికి 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న జీవిత బీమా పాలసీ విక్రయిస్తే... గడువు తీరాక తనకు కవరేజీ ఉండదు కదా? లేటు వయసులో కవరేజీ కావాలంటే భారీ ప్రీమియం చెల్లించాలి కదా? నిజమే. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారే ప్యూర్ టర్మ్ పాలసీలు తీసుకుంటున్నారు. ఇది అట్టడుగు స్థాయికి వెళ్లటం లేదు. మున్ముందు ఈ పరిస్థితి మారుతుందన్న విశ్వాసం నాకుంది.మీరూ ఇదే దార్లో వెళుతున్నారా... లేక? అలాంటిదేమీ లేదు. మేం ప్రధానంగా ఏడాదికి 4–15 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారిని లక్ష్యంగా పెట్టుకున్నాం. వారికి ఎంతోకొంత కవరేజీ ఉండేలా పాలసీలను తెచ్చాం. కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98 శాతానికిపైనే ఉంది. పైపెచ్చు ఎక్కువ శాతం చిన్న పాలసీలే కనక... సెటిల్మెంట్కు డాక్యుమెంట్లన్నీ అందజేస్తే 24 నుంచి 48 గంటల్లో పరిష్కరిస్తున్నాం. దీనికి టెక్నాలజీని వాడుతున్నాం. మీ వ్యాపారంలో ఆన్లైన్ శాతమెంత? మాకు దేశవ్యాప్తంగా విస్తరించిన శ్రీరామ్ గ్రూప్ కంపెనీల ఔట్లెట్ల నుంచే 40 శాతం వరకూ వ్యాపారం వస్తోంది. ఏజెన్సీల నుంచి మరో 40 శాతం వస్తోంది. మిగిలినది ఆన్లైన్, పాత కస్టమర్ల రిఫరెన్సులు సహా ఇతర చానళ్ల ద్వారా వస్తోంది. ఆన్లైన్లో ఎంక్వయిరీలొచ్చినా అవి వాస్తవరూపం దాల్చటం తక్కువ. ఆన్లైన్ ప్రచారానికి ఖర్చు కూడా ఎక్కువే. మాకు అంతర్జాతీయ బీమా దిగ్గజం ‘సన్ లామ్’తో భాగస్వామ్యం ఉంది కనక ఎప్పటికఫ్పుడు కొత్త టెక్నాలజీలని అందుబాటులోకి తేగలుగుతున్నాం. విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయి కనక దేశంలోని 15 రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి అడుగులు వేస్తున్నాం. మీ భవిష్యత్తు లక్ష్యాలేంటి? వ్యాపార విలువ పరంగా ప్రస్తుతం దేశంలో 13వ స్థానంలో ఉన్నాం. వచ్చే ఏడాది నాటికి 12వ స్థానానికి... మూడేళ్లలో టాప్–1లోకి రావాలనేది లక్ష్యం. ఇక పాలసీదార్ల సంఖ్య పరంగా 7వ స్థానంలో ఉన్నాం. వచ్చే మూడేళ్లలో టాప్–3లోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు?
బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించడంతోపాటు బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను పెంచకూడదని ప్రచార కార్యక్రమాలు సాగనున్నాయి. ఈమేరకు దేశవ్యాప్తంగా జీవిత బీమా ఉద్యోగుల సంఘం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్లు ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వి.నరసింహన్ పేర్కొన్నారు.బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు, బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పెట్టుబడుల పరిమితులను కట్టడి చేయాలనే డిమాండ్‌తోపాటు కొత్త కార్మిక విధానాల (న్యూ లేబర్ కోడ్) ఉపసంహరణకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు నరసింహన్ చెప్పారు. 2010 తర్వాత నియమితులైన ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం అమలవుతోంది. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం వర్తింపజేయాలనే డిమాండ్లను కూడా లేవనెత్తనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: జీడీపీ మందగమనంబీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కల్పించనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రీమియంపై ట్యాక్స్ మినహాయించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్డీఐకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే దేశీయ బీమా రంగంపై విదేశీ ఇన్వెస్టర్ల విధానాలు అమలవుతాయి. దాంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నుంచి కొత్త పాలసీ
పెరిగే వ్యయాలను ఎదుర్కొనడంలో పదవీ విరమణ చేసిన వారికి కొంత తోడ్పాటు అందించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కొత్త పాలసీని ఆవిష్కరించింది. ఏటా అయిదు శాతం అధికంగా యాన్యుటీ చెల్లింపు ప్రయోజనాలను అందించే ఫీచరుతో గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీని ప్రవేశపెట్టింది. ఈ తరహా పాలసీల్లో ఇదే మొట్టమొదటిదని సంస్థ తెలిపింది.ద్రవ్యోల్బణం వల్ల కాలక్రమేణా కొనుగోలు శక్తి తగ్గినా, జీవన ప్రమాణాలను స్థిరంగా కొనసాగించుకోవడంలో కస్టమర్లకు ఈ పాలసీ ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చీఫ్ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పల్టా తెలిపారు. ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లు ఉన్న నేపథ్యంలో జీవితకాలం పాటు అధిక రాబడులను అందుకునేలా యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేసేందుకు ఇది సరైన తరుణమని ఆయన పేర్కొన్నారు. -
వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?
నా వయసు 27 ఏళ్లు. నేను ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నాను. నాకు బీమా కంపెనీలు రూ.కోటి టర్మ్ పాలసీ ఇస్తాయా? రూ.5 లక్షల ఆరోగ్య బీమా కూడా తీసుకోవాలనుకుంటున్నాను సరిపోతుందా? - ఆకాశ్మీ వయసును పరిగణలోకి తీసుకుంటే బీమా సంస్థలు సాధారణంగా వార్షికాదాయానికి 20-25 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ వార్షికాదాయం రూ.5 లక్షలు కాబట్టి, మీకు రూ.కోటి పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఒకే కంపెనీ మీకు రూ.కోటి టర్మ్ పాలసీ జారీ చేయకపోతే మంచి చెల్లింపుల రికార్డున్న రెండు కంపెనీల నుంచి రూ.50 లక్షల చొప్పున పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేప్పుడు ఎలాంటి దాపరికాలు లేకుండా మీ ఆరోగ్య వివరాలు కచ్చితంగా తెలియజేయాలి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి పాలైతే లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మీ వయసులోని వారికి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే ఆరోగ్య బీమా కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎలాంటి కో-పే(పాలసీదారులు కొంత, కంపెనీ కొంత చెల్లించే విధానం) లేకుండా, పూర్తిగా కంపెనీయే క్లెయిమ్ చెల్లించే పాలసీను ఎంచుకోవాలి. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. రూ.5 లక్షలు ప్రస్తుతం సరిపోతాయని మీరు భావిస్తున్నా. భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి, మీరు రూ.10 లక్షలకు తగ్గకుండా పాలసీ తీసుకోవడం ఉత్తమం. -
కుటుంబానికి బీమా ధీమా..
షణ్ముఖ్, నిత్య దంపతులకు ఇద్దరు పిల్లలు. షణ్ముఖ్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నిత్య గృహిణి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేవు. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చిచ్చు పెట్టింది. షణ్ముఖ్ పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండున్నాయి. ఆ రెండింటి నుంచి వచ్చిన మొత్తం కేవలం రూ.15 లక్షలు. కుటుంబ జీవన అవసరాలకు ఈ మొత్తం చాలదని తెలియడంతో.. బాధను దిగమింగుకుని నిత్య ప్రైవేటు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. జీవిత బీమా రక్షణ లేని వారు కొందరు అయితే.. ఉన్నా తగినంత కవరేజీతో సరైన ప్లాన్ తీసుకోని వారే ఎక్కువ. ఇలాంటి వారికి షణ్ముఖ్ కేసు కనువిప్పు కలిగిస్తుంది. సరైన బీమా పథకాన్ని, తగినంత కవరేజీతో తీసుకున్నప్పుడే దాని లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. ఈ దిశగా అవగాహన కలి్పంచే కథనమే ఇది...తమపై ఎవరైనా ఆరి్థకంగా ఆధారపడి ఉంటే, అలాంటి ప్రతి ఒక్కరూ జీవిత బీమా రక్షణను (పాలసీ) తప్పకుండా తీసుకోవాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భాల్లో వారి కుటుంబం జీవన అవసరాల కోసం ఆరి్థకంగా ఇబ్బందులు పడకుండా జీవిత బీమా పరిహారం సాయంగా నిలుస్తుంది. కానీ, ఇదంతా సరైన, సరిపడా రక్షణ తీసుకున్నప్పుడే అని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. తమ విలువైన జీవితంపై చేస్తున్న అసలైన పెట్టుబడిగా అర్థం చేసుకోవాలి.కవరేజీ ఎంత?ఏజెంట్ లేదా బ్రోకర్ చెప్పిన మేరకు లేదా ప్రీమియం తమకు సౌకర్యంగా అనిపించిన మేరకు జీవిత బీమా కవరేజీని ఎక్కువ మంది తీసుకుంటుంటారు. కానీ, ఇది సరైన విధానం కాదు. ఎంత లేదన్నా వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం జీవిత బీమా రక్షణగా తీసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. అలాగే, వార్షిక ఆదాయానికి 25 రెట్ల వరకు కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. 20 రెట్లు మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ రుణాలు తీసుకుని ఉంటే ఆ మేరకు కవరేజీని అదనంగా ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.12 లక్షలు ఉంటే, కనీసం రూ.1.2 కోట్ల సమ్ అష్యూర్డ్‌తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే.. అప్పుడు రూ.1.2 కోట్లకు బదులు రూ.1.3 కోట్లను ఎంపిక చేసుకోవాలి. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ చెల్లించే పరిహారంతో అప్పులు తీర్చి, మిగిలిన మొత్తంతో కుటుంబం సాఫీగా జీవించడానికి అవకాశం ఉంటుంది.సరిపోతుందా..?ఇంతకు ముందు ఉదాహరణలో వార్షిక ఆదాయం రూ. 12 లక్షలకు పది రెట్లు అంటే రూ.1.2 కోట్లకు టర్మ్ లైఫ్ ప్లాన్ తీసుకున్న తర్వాత.. పాలసీదారు మరణించినట్టయితే వచ్చే పరిహారం కుటుంబానికి సరిపోతుందా..? ఇక్కడ రూ.1.2 కోట్ల డిపాజిట్‌పై 6 శాతం వార్షిక రేటు ఆధారంగా వచ్చే మొత్తం రూ.7.2 లక్షలు మించదు. అంటే అప్పటి వరకు వచ్చిన వార్షికాదాయం కంటే తక్కువ. తమకు ఏదైనా జరిగినా.. ఎప్పటి మాదిరే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇక్కడ రూ. 2.4 కోట్లకు బీమా రక్షణను (సమ్ అష్యూర్డ్) తీసుకోవాలి. ఉదాహరణకు షణ్ముఖ్ వయసు 30 ఏళ్లు. ప్రస్తుత వార్షికాదాయం రూ.12 లక్షలకు 20 రెట్ల చొప్పున రూ.2.4 కోట్లకు టర్మ్ లైఫ్ కవరేజీ తీసుకున్నాడని అనుకుందాం. 40 ఏళ్లకు వచ్చే సరికి షణ్ముఖ్ వార్షికాదాయం రూ.24 లక్షలకు పెరిగింది. ఈ ప్రకారం చూస్తే పదేళ్ల క్రితం తీసుకున్న టర్మ్ ప్లాన్‌లో రక్షణ వార్షిక ఆదాయానికి పది రెట్లకు తగ్గిపోయిందని తెలుస్తోంది. వయసు పెరిగే కొద్దీ జీవితంలో బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయని తెలిసిందే. కనుక పెరుగుతున్న ఆదాయానికి, జీవన వ్యయాలకు అనుగుణంగా బీమా కవరేజీ కూడా పెరిగేలా చూసుకోవాలి. సొంతిల్లు, పిల్లలకు మెరుగైన విద్య అన్నవి తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాలు. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించినప్పుడు వచ్చే పరిహారం కేవలం ఆ కుటుంబ జీవన అవసరాలే కాదు, ముఖ్యమైన జీవిత లక్ష్యాల సాకారానికీ తోడ్పాటునివ్వాలి. అందుకుని వాటికయ్యే వ్యయాలను కూడా కవరేజీని నిర్ణయించుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి..? ‘‘వివాహం అయిన తర్వాత లేదా పిల్లలు కలిగిన తర్వాత టర్మ్ ప్లాన్ తీసుకోవాలనే ధోరణి సరికాదు. ఎంత వీలైతే అంత ముందుగా టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాదు పాలసీ పూర్తి కాలానికి అదే కొనసాగుతుంది’’ అని ఆనంద్‌రాఠి ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌కు చెందిన దినేష్ దిలీప్ భోయ్ సూచించారు. వీలైనంత ముందుగా అంటే.. సంపాదన మొదలు పెట్టిన వెంటనే అని అర్థం చేసుకోవచ్చు. జీవితంలో స్థిరపడడంలో ఆలస్యమైన వారు.. కనీసం తమ సంపాదన మొదలైన మొదటి 30 రోజుల్లో అయినా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మరిచిపోవద్దు. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వయసు వారు టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఆలస్యం చేసిన కొద్దీ వయసుతోపాటు ప్రీమియం పెరుగుతుంది. పైగా నేటి రోజుల్లో చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు జీవిత బీమా తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసి, అనారోగ్య సమస్యలు పలకరించిన తర్వాత తీసుకోవాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్య వంతులతో పోలి్చతే ప్రీమియం 20–50 శాతం అధికంగా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రిస్క్ మరీ ఎక్కువ ఉంటుందని బీమా సంస్థలు భావిస్తే బీమా కవరేజీని తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదు.ఎంత కాలానికి? జీవిత బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత వయసు వచ్చే వరకు ఈ రక్షణ ఉండాలన్నది కూడా ముఖ్యమైన అంశమే అవుతుంది. మనలో చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఎక్కువ మంది 20–25 ఏళ్ల కాలానికే రక్షణను ఎంపిక చేసుకుంటుంటారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి జీవిత బీమా కవరేజీ తీసుకున్నారని అనుకుంటే.. అతడికి/ఆమెకు 50 ఏళ్లు వచ్చే సరికి ఆ రక్షణ ముగిసిపోతుంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ కొంత కాలానికి మరో పాలసీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రీమియం భారంగా మారుతుంది. ప్లాన్ తీసుకునే నాటికి తమ వయసు ఎంతన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతలేదన్నా రిటైర్మెంట్ వరకు (60 ఏళ్లు) జీవిత బీమా కవరేజీ ఉండాలి. కొందరికి ఆలస్యంగా వివాహం కావచ్చు. అంటే 30–45 ఏళ్ల మధ్యలో వివాహం చేసుంటే.. 60 ఏళ్లు వచ్చినా పిల్లలకు సంబంధించి, కుటుంబ బాధ్యతలు ఇంకా మిగిలి ఉంటాయి. పిల్లలకు కనీసం 23–25 ఏళ్ల వయసు వచ్చే వరకు అయినా తమకు టర్మ్ కవరేజీ ఉండేలా చూసుకోవడం సరైనది. రిటైర్మెంట్ నాటికి లేదా జీవితంలో అన్ని ముఖ్యమైన బాధ్యతలు తీరే నాటికి బీమా కవరేజీ ఉంటే సరిపోతుంది.ఎలాంటి టర్మ్ ప్లాన్? టర్మ్ ప్లాన్ అంటే అచ్చమైన బీమా రక్షణతో కూడిన పాలసీ కదా? అన్న సందేహం రావచ్చు. అవును టర్మ్ ప్లాన్ ఉద్దేశంఅదే. కానీ, వినియోగదారుల ధోరణి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా ఇందులోనూ పలు రకాలు వచ్చాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో బీమా రక్షణతోపాటు, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా కానీ రాబడి ప్రయోజనం లభిస్తుంది. అంటే అది బీమా, పెట్టుబడి కలిసిన సాధనం. టర్మ్ ప్లాన్ ఎలాంటి రాబడి ఇవ్వని.. కేవలం మరణించిన సందర్భాల్లోనే (పాలసీ కాల వ్యవధిలో) పరిహారం చెల్లించేది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి జీఎస్టీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం (టీఆర్‌వోపీ)గా దీన్ని పిలుస్తారు. లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇది అందరికీ తెలిసిన ప్లాన్. కాల వ్యవధి పూర్తయ్యే వరకు కవరేజీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకుంటే, కాల వ్యవధి ముగిసే వరకు రూ.50 లక్షల కవరేజీయే కొనసాగుతుంది. ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో సమ్ అష్యూర్డ్ స్థిరంగా ఉండదు. నిరీ్ణత కాలానికోసారి పెరుగుతూ పోతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి పరిహారానికి హెడ్జింగ్ లభిస్తుంది. అంతేకాదు పెరిగే వయసుకు తగ్గట్టు బాధ్యతలు కూడా అధికమవుతుంటాయి. ఈ విధంగానూ అదనపు రక్షణ అక్కరకు వస్తుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇంక్రీజింగ్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. నిరీ్ణత కాలానికోసారి కవరేజీ తగ్గుతూ వెళుతుంది. ఉదాహరణకు ఏదైనా లోన్ తీసుకుని, దానికి రక్షణ కోసం టర్మ్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. కొంత కాలానికి రుణ భారం తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా బీమా రక్షణ తగ్గేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో టర్మ్ ప్లాన్‌ను ఎండోమెంట్ లేదా హోల్‌లైఫ్ పాలసీగా మార్చుకోవచ్చు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్: నూరేళ్ల కాలానికి ఈ ప్లాన్‌లో రక్షణ లభిస్తుంది. నోట్: టర్మ్ ప్లాన్‌లో ఎన్ని రకాలున్నా.. అచ్చమైన టర్మ్ ప్లాన్ (లెవల్ టర్మ్ఇన్సూరెన్స్) సులభమైనది. మిగిలిన వాటిల్లో తమకు ఏదైనా మరింత ప్రయోజనం అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లెవల్ టర్మ్ ప్లాన్‌లో కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియం మారదు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్‌లో, కన్వర్టబుల్, హోల్‌లైఫ్ ప్లాన్లలో ప్రీమియం అధికంగా ఉంటుంది. సాధారణ లెవల్ టర్మ్ ప్లాన్‌తో పోల్చితే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌లోనూ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. రైడర్లు..టర్మ్ ప్లాన్‌కు అనుబంధంగా పలు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్: కేన్సర్, కాలేయ వైఫల్యం తదితర 20 నుంచి 64 వరకు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఈ రైడర్ నుంచి ఏక మొత్తంలో పరిహారం లభిస్తుంది. ఈ రైడర్లో ఎన్నింటికి కవరేజీ అన్నది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. వేవర్ ఆఫ్ ప్రీమియం: ప్రమాదంలో అంగవైకల్యం పాలైనా లేక తీవ్ర వ్యాధుల బారిన పడినా ఇక అక్కడి నుంచి పాలసీదారు ప్రీమియం చెల్లించే అవసరాన్ని ఇది తప్పిస్తుంది. బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియం చెల్లిస్తుంది. యాక్సిడెంటల్ డెత్, టోటల్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్: ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం పాలైనా ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర పరిహారం పొందొచ్చు. పరిహారం చెల్లింపు ఎలా..? పాలసీదారు మరణించినప్పుడు పరిహారం చెల్లింపులో పలు ఆప్షన్లను టర్మ్ ప్లాన్లు ఆఫర్ చేస్తుంటాయి. → ఎంపిక చేసుకున్న సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని ఒకే విడత చెల్లించడం ఇందులో ఒకటి. → సమ్ అష్యూర్డ్‌లో 50 శాతాన్ని ఏకమొత్తంగా చెల్లించి, మిగిలిన 50 శాతాన్ని సమాన వాయిదాల్లో కొన్ని సంవత్సరాల పాటు చెల్లించడం మరో ఆప్షన్. → సమ్ అష్యూర్డ్‌లో కొంత మొత్తాన్ని ఒకే విడత చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీగా పెంచుతూ చెల్లించడం మూడో ఆప్షన్.చిట్కాలు→ తగినంత కవరేజీ ఎంపిక చేసుకున్న తర్వాత.. అందుకు ఏటా చెల్లించే ప్రీమియం తమ సామర్థ్యం మేరకే ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం చెల్లించలేనంత భారంగా మారకూడదు. ప్రీమియం చెల్లించలేక పాలసీ మధ్య లో లాప్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకని తగినంత బీమా రక్షణ ఒక్కటే కాదు, తమ చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. → ఏదో ఒక కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం కాకుండా, వివిధ కంపెనీల మధ్య ఫీచర్లు, ప్రీమియం రేట్లను పరిశీలించి చూసుకోవాలి. → టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు అనుబంధంగా వచ్చే రైడర్లు, యాడాన్‌లను తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్‌ను తీసుకోవడం ఎంతో అవసరం. → ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంలో కొంత తగ్గింపు లభిస్తుంది. → పెరుగుతున్న జీవన అవసరాలకు అనుగుణంగా, అదనపు రుణం తీసుకున్న ప్రతి సందర్భంలో ఆ మేరకు బీమా కవరేజీని పెంచుకోవాలి. → ఎంపిక చేసుకునే బీమా సంస్థ, క్లెయిమ్‌లను ఏ మేరకు ఆమోదిస్తుందో తప్పకుండా పరిశీలించాలి. దీర్ఘకాలంలో మెరుగైన చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంపిక చేసుకోవాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
పాలసీను సరెండర్ చేస్తే ఎంత వస్తుందంటే..?
జీవిత బీమా పాలసీని వెనక్కిచ్చేసినప్పుడు (సరెండర్) పొందే ప్రయోజనాలపై నూతన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం గతంలో కంపెనీలిచ్చే సరెండర్ వాల్యూ పెరగనుంది. ప్రస్తుతం కంపెనీలు అమలు చేస్తున్న నియమాలు ఎలా ఉన్నాయో, కొత్త విధానం అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఎంతమేరకు సరెండర్ వాల్యూ వస్తుందో తెలుసుకుందాం.జీవిత బీమా పాలసీల గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, ముందస్తుగానే వైదొలగాలని భావించే వారికి మెరుగైన రాబడులు అందించడమే కొత్త నిబంధనల ఉద్దేశం. జీవిత బీమా పాలసీని తీసుకున్న తర్వాత నుంచి ఎన్నేళ్ల పాటు ప్రీమియం చెల్లించారు, అప్పటి వరకు ఎంత బోనస్‌లు జమయ్యాయన్న తదితర అంశాల ఆధారంగా సరెండర్ వ్యాల్యూని బీమా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ఇలా సరెండర్ చేసే పాలసీలపై బీమా సంస్థలు గతంలో తక్కువ ప్రయోజనాలనే పాలసీదారులకు చెల్లించేవి. ఉదాహరణకు ఎల్ఐసీలో వినయ్(35) వనే వ్యక్తి జీవన్ ఆనంద్ పాలసీను ఎంచుకున్నాడనుకుందాం. పాలసీ కాలం ముప్పై ఏళ్లు. పాలసీ మొత్తం రూ.10 లక్షలుగా భావిస్తే, వినయ్ నెలవారీ దాదాపు రూ.3,175 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏటా రూ.38,100 చెల్లించాలి. ఐదేళ్లు పాలసీ ప్రీమియం చెల్లించాలరనుకుందాం. రూ.38,100*5 మొత్తం రూ.1,90,500. ఐదేళ్ల తర్వాత వినయ్ తన పాలసీను సరెండర్ చేస్తే తనకు 30-35 శాతం సరెండర్, ఇతర ఛార్జీలు విధించి రూ.1,27,863 మాత్రమే కంపెనీ చెల్లిస్తుంది. మిగతా రూ.62,637 నష్టపోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?కొత్త నిబంధనల ప్రకారం సరెండర్ చేసే పాలసీపై సరెండర్ ఛార్జీలు, ఇతర ఛార్జీలను తగ్గించనున్నారు. దాంతో పాలసీదారుడికి గతంలో కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు సమకూరుతుంది. ఇదిలాఉండగా, కేవలం డబ్బు కోసమే పాలసీను సరెండర్ చేయాలనుకునేవారికి మరో అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పైన తెలిపిన ఉదాహరణలో వినయ్ చెల్లించిన ఐదేళ్ల పాలసీ ప్రీమియంను ఉపయోగించి లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. పాలసీను సరెండర్ చేస్తే రూ.1,27,863 వస్తుంది కదా. అదే తన పాలసీపై లోన్‌కు వెళితే సుమారు రూ.89,500 వరకు పొందే అవకాశం ఉంది. దాంతో పాలసీ కొనసాగించేలా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. -
బీమా పాలసీ వెనక్కిస్తే మెరుగైన ప్రయోజనాలు!
జీవిత బీమా పాలసీని వెనక్కిచ్చేసినప్పుడు (సరెండర్) పొందే ప్రయోజనాలపై నూతన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు బీమా సంస్థలు ఇప్పటికే సన్నద్ధం అయ్యాయి. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సవరించిన సరెండర్ వ్యాల్యూ నిబంధనలను ఈ ఏడాది ఆరంభంలోనే ప్రకటించడం గమనార్హం.జీవిత బీమా పాలసీల గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, ముందస్తుగానే వైదొలగాలని భావించే వారికి మెరుగైన రాబడులు అందించడమే కొత్త నిబంధనల ఉద్దేశం. జీవిత బీమా పాలసీని తీసుకున్న తర్వాత నుంచి ఎన్నేళ్ల పాటు ప్రీమియం చెల్లించారు, అప్పటి వరకు ఎంత బోనస్‌లు జమయ్యాయన్న తదితర అంశాల ఆధారంగా సరెండర్ వ్యాల్యూని బీమా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ఇలా సరెండర్ చేసే పాలసీలపై బీమా సంస్థలు గతంలో తక్కువ ప్రయోజనాలనే పాలసీదారులకు చెల్లించేవి. దీనివల్ల పాలసీ సరెండర్‌పై పాలసీదారులు సరైన విలువను పొందలేకపోయేవారు. నూతన నిబంధనలతో పాలసీ కమీషన్లో మార్పులు చోటు చేసుకోవచ్చని, ప్రీమియం రేట్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ గౌవర్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 2030 నాటికి భారత ఎకానమీ రెట్టింపు -
బీమాపై జీఎస్టీ కోతకు ఓకే!
న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ పట్ల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విస్తృత ఏకాభిప్రాయం వచి్చంది. దీనిపై వచ్చే నెల చివర్లోగా నివేదిక సమర్పించాలని బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన గల మంత్రుల బృందాన్ని (జీవోఎం) కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. ఈ నివేదిక అందిన తర్వాత దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది. ఇందులో బీమా పాలసీలపై ప్రీమియం తగ్గింపు ప్రధానంగా చర్చకు వచి్చంది. నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండడంతో పన్ను రేటు తగ్గింపు పట్ల చాలా రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కలి్పంచనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సరీ్వస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. కేన్సర్ ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు: కొన్ని రకాల కేన్సర్ ఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి.. కేదార్నాథ్ తదితర పర్యటనల కోసం వినియోగించుకునే హెలికాప్టర్ సేవలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. చార్టర్ హెలీకాప్టర్లపై ఎప్పటి మాదిరే 18 శాతం జీఎస్టీ అమలు కానుంది. ఆన్లైన్ గేమింగ్‌పై 2023 అక్టోబర్ 1 నుంచి 28 శాతం జీఎస్టీని అమలు చేయడం వల్ల ఆదాయం 412 శాతం పెరిగి రూ.6,909 కోట్లకు చేరుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలు దిగుమతి చేసుకునే సేవలపై జీఎస్టీని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది. -
జీవిత బీమా ఐపీవోపై కన్ను
న్యూఢిల్లీ: జీవిత బీమా భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 14.5 శాతం వాటా విక్రయానికి పీఎస్‌యూ సంస్థ కెనరా బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. వాటా విక్రయం ద్వారా కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(జేవీ) పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి జేవీని స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ, ఆర్థిక సేవల శాఖ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. తగిన సమయంలో ఇష్యూ పరిమాణం తదితర అంశాలను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. జేవీలో కెనరా బ్యాంక్‌కు 51 శాతం వాటా ఉంది. విదేశీ భాగస్వామిగా హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ 26 శాతం, మరో ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ 23 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. సీఆర్ఏఎంసీలోనూ...మ్యూచువల్ ఫండ్ అనుబంధ సంస్థ కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(సీఆర్ఏఎంసీ)లోనూ 13 శాతం వాటాను కెనరా బ్యాంక్ విక్రయించాలని చూస్తోంది. తద్వారా ఎంఎఫ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికలున్నట్లు పేర్కొంది. ఈ బాటలో గత డిసెంబర్లోనే లిస్టింగ్‌కు వీలుగా సూత్రప్రాయ అనుమతిని మంజూరు చేసింది. నిధుల సమీకరణబాండ్ల జారీ ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు కెనరా బ్యాంక్ బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో వ్యాపార వృద్ధిని సాధించేందుకు నిధులను వెచి్చంచనుంది. శుక్రవారం(31న) నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనిలో భాగంగా బాసెల్–3 నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనుంది. అంతేకాకుండా మరో రూ. 4,500 కోట్లను బాసెల్–3 నిబంధనల టైర్–2 బాండ్ల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 118 వద్ద ముగిసింది. -
హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ఎల్ఐసీ.. కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా..?!
ప్రభుత్వం జీవిత బీమా రంగ సంస్థ ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అందుకోసం పలు ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్న సంస్థల్ని కొనుగోలు చేసే అంశంపై ఎల్ఐసీ ప్రయత్నాలు చేస్తోందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఎల్ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ మొహంతీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని అందుకే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కాంపోజిట్ లైసెన్స్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది. -
గల్ఫ్ కార్మీకులకు జీవిత బీమా..: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల తరహాలోనే గల్ఫ్ కార్మీకులకు కూడా జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణకు చెందిన 15 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నాయని.. వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉండే తెలంగాణ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రజాభవన్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. గల్ఫ్ దేశాల ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే గల్ఫ్ సమస్యలపై దృష్టి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు గల్ఫ్ కార్మీకుల సమస్యలను పట్టించుకుంటాయన్న అభిప్రాయం ఉందని, కానీ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వారి హక్కులకు రక్షణ కల్పించాలని నిర్ణయించామని రేవంత్ చెప్పారు. చనిపోయిన కార్మీకుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల గల్ఫ్ విధానాలు అధ్యయనం చేసి రూపొందించిన డాక్యుమెంట్లో సవరణలు, సూచనల కోసం లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ భేటీకి గల్ఫ్ కార్మీకుల ప్రతినిధులను ఆహ్వానించి చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఏజెంట్లకు చట్ట బద్ధత ఉండేలా..రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు కాకుండా ఏ కార్మీకుడినీ ఏజెంట్లు దేశం దాటించే పరిస్థితి లేకుండా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీవన్‌రెడ్డి కేంద్రమంత్రి అవుతారని భావిస్తున్నా.. ‘కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అందుకు నేనే ఉదాహరణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయా. అప్పుడు నా మిత్రులు బాధపడితే శత్రువులు మాత్రం నా పని అయిపోయిందని సంతోషించారు. కానీ మూడు నెలలు తిరిగేసరికి ఎన్నికలొచ్చి ఎంపీనయ్యా. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిని అయ్యా. ఆ తర్వాత ముఖ్యమంత్రిని అయ్యా. జీవన్‌రెడ్డి కూడా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతారని భావిస్తున్నా. కేంద్రంలో తెలంగాణ గల్ఫ్ కార్మీకుల పక్షాన మాట్లాడేందుకు, విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపేందుకు నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిని గెలిపించాలి..’అని ముఖ్యమంత్రి కోరారు. సాయం చేసేందుకు కేసీఆర్‌కు మనసు రాలేదు: జీవన్‌రెడ్డి గత పదేళ్లలో రూ.2 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురావడం ద్వారా గల్ఫ్ కార్మీకులు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చారని జీవన్‌రెడ్డి తెలిపారు. గల్ఫ్ నుంచి ప్రతి యేటా 200 వరకు శవపేటికలు వచ్చేవని, పదేళ్లలో 2 వేల మంది చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.100 కోట్లు ఇచ్చేందుకు కేసీఆర్‌కు మనసు రాలేదని విమర్శించారు. గల్ఫ్ గోస లేకుండా చూడండి సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు గల్ఫ్ గోస లేకుండా చూడాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నారై సెల్‌ను పటిష్టం చేయాలని, గల్ఫ్ దేశాల్లోని ఎంబసీల్లో తెలుగువారిని నియమించాలని, ప్రత్యేక గల్ఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, కేరళ తరహా పాలసీని రూపొందించాలని కోరారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినందుకు కృతజ్ఞతగా గల్ఫ్ నుంచి తెచ్చిన ఖర్జూరాలను ముఖ్యమంత్రికి అందజేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ అంతర్జాతీయ కన్వీనర్ మంద భీంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెల్ చైర్మన్ డాక్టర్ వినోద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.5 లక్షల బీమా!
సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) కింద స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ఎస్‌హెచ్‌జీ మహిళలు మరణిస్తే వారికి సంబంధించిన రుణాలను సైతం మాఫీ చేయనుంది. మరణించిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు సంబంధించిన రుణ బకాయిలను ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ ఇకపై ఆ బకాయిలను పూర్తిగా మాఫీ చేయనున్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలను పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి ఐకేపీ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ మినీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు, పోలీసుల యూనిఫామ్‌లను కుట్టే బాధ్యతను సైతం ఎస్‌హెచ్‌జీ మహిళలకే అప్పగించనుంది. వీరి ద్వారానే ప్రభుత్వ బడుల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారితో నాప్కిన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన యంత్ర పరికరాలను కూడా పరిశీలించింది. మండలాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకుని ఆ పరిధిలోని ఎస్‌హెచ్‌జీలకు యూనిఫామ్‌లు కుట్టడం, శానిటరీ నాప్కిన్ల తయారీలో శిక్షణ ఇప్పించాలని భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎస్‌హెచ్‌జీలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకే సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చాన్స్ ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ 2018 నుంచి నిలిచిపోగా, త్వరలో మళ్లీ పునరుద్ధరిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వడ్డీ లేని రుణాలతో ఎస్‌హెచ్‌జీ గ్రూపులను స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహిస్తే వారి ఆర్థిక, కుటుంబ స్థితిగతులు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వడ్డీ లేని రుణాల పంపిణీ పునః ప్రారంభించడంతో పాటు అన్ని విధాలుగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా మహిళలకు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీమా ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళల కోసం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని రైతు బీమా పథకం తరహాలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి బీమా కంపెనీలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏటా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించనుంది. అన్ని తరహా మరణాలకు జీవిత బీమా వర్తించనుంది. మహిళ మరణించిన పక్షంలో నామినీ ఖాతాలో రూ.5 లక్షలను బీమా కంపెనీ జమ చేస్తుంది. 61 లక్షల మంది మహిళలకు బీమా 18–60 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు మాత్రమే ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో సభ్యులుగా ఉండడానికి అర్హులు కాబట్టి వారికే ఈ పథకం వర్తించనుంది. రాష్ట్రంలో 6.1 లక్షల ఎస్‌హెచ్‌జీ గ్రూపులుండగా, ఒక్కో గ్రూపులో 10 మంది చొప్పున మొత్తం 61లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 1.74 లక్షల గ్రూపుల్లో 17.40 లక్షల మంది, గ్రామీణ ప్రాంతాల్లోని 4.36 లక్షల గ్రూపుల్లో 43.6 లక్షల మంది సభ్యులుగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి చింతకాని: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు హామీ ఇవ్వని మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో నిర్వహించే మహిళా సదస్సులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. ఏడాదికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలను వడ్డీ లేకుండా అందించనున్నట్లు..ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని పేదలు దశాబ్ద కాలానికి పైగా ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిసోయారని, అయితే ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూదనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సోమవారం భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని భట్టి తెలిపారు. -
పట్టణ ప్రజల్లో ‘బీమా’పై పెరుగుతున్న చైతన్యం
న్యూఢిల్లీ: పట్టణ ప్రజల్లో జీవిత బీమా పట్ల అవగాహన పెరుగుతోంది. ప్రతి నలుగురిలో ముగ్గురికి జీవిత బీమా రక్షణ ఉన్నట్టు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ (ఐపీక్యూ) 6.0లో ద ప్రొటెక్షన్ ఇండెక్స్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 45కి చేరుకుందని, ఇది ఐపీక్యూ 5.0లో 43గానే ఉందని తెలిపింది. ప్రజల్లో రక్షణ పట్ల పెరుగుతున్న అవగాహన, ఆమోదాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఐదేళ్ల ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ను పరిశీలించి చూస్తే ఐపీక్యూ 1.0లో 35 నుంచి ఐపీక్యూ 6.0లో 45కు చేరుకుందని, పది పాయింట్లు పెరిగినట్టు వివరించింది. ఆర్థిక సామర్థ్యాలను నిర్మించుకునే దిశగా పట్టణ ప్రజల ప్రయాణాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రొటెక్షన్ క్వొటెంట్ 49 పాయింట్లతో దక్షిణ భారత్ ఆర్థికంగా ఎంతో రక్షణ కలిగినట్టు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత పశి్చమ భారత్ 42 పాయింట్ల నుంచి 46 పాయింట్లకు చేరుకున్నట్టు తెలిపింది. పట్టణ ప్రజల ఆర్థిక రక్షణ స్థాయిలను లెక్కించేందుకు ఐపీక్యూ అచ్చమైన కొలమానంగా మారినట్టు మ్యాక్స్‌లైఫ్ ఎండీ, సీఈవో ప్రశాంత్ త్రిపాఠి అన్నారు. -
టర్మ్ ప్లాన్స్.. అన్నీ ఒకటి కాదు!
జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణిలో మార్పు వస్తోంది. అయినా, ఇప్పటికీ అధిక శాతం మంది బీమా ప్లాన్‌ను రాబడి కోణం నుంచే చూస్తుంటారు. చివరిలో ఎంతొస్తుందని అడుగుతారు. అందుకే బీమా ఏజెంట్లు ఎండోమెంట్ ప్లాన్లను ఎక్కువగా మార్కెటింగ్ చేస్తుంటారు. కానీ, బీమా అర్థం వేరు. ఒక వ్యక్తి మరణం కారణంగా కుటుంబం ఆరి్థకంగా కష్టాలు పడకుండా ఆదుకునే సాధనం ఇది. బీమా రక్షణను ఈ కోణంలోనే తీసుకోవాలి. అచ్చమైన బీమా కవరేజీ ఇచ్చేదే టర్మ్ ఇన్సూరెన్స్. కానీ, ఇందులోనూ పలు రకాలు ప్రవేశించాయి. నిక్షేపంగా జీవించి ఉంటే మాకేంటి..? అని ప్రశ్నించే వారి కోసం టర్మ్ ప్లాన్‌ను బీమా సంస్థలు వినూత్నంగా అందిస్తున్నాయి. కానీ, ఏది తీసుకోవాలి..? దీనికి సమాధానం కావాలంటే నిపుణుల విశ్లేషణ తెలుసుకోవాల్సిందే. తన కుటుంబ క్షేమం కోరేవారు తీసుకోవాల్సిన బీమా పాలసీ ఏదన్నా ఉందంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పాలి. తక్కువ ప్రీమియానికే మెరుగైన కవరేజీ ఇందులో లభిస్తుంది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఇందులో చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. దీంతో కట్టిన ప్రీమియం గంగపాలేనా? అని ఆలోచించే వారి కోసం బీమా సంస్థలు పరిష్కారాన్ని కనుగొన్నాయి. సగటు మనిషి ఆలోచనా తీరుకు అనుగుణంగా, చెల్లించిన ప్రీమియం చివర్లో వెనక్కి వచ్చే ఆప్షన్‌తోనూ టర్మ్ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టాయి. అలాగే, పాలసీ గడువు ముగియకపోయినా కానీ, మధ్యలో వైదొలిగితే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియాన్ని వెనక్కి ఇచ్చే రకాన్ని కూడా తీసుకొచ్చాయి. కానీ, పాలసీదారు తనకు నిజంగా ప్రయోజనకరమైన పాలసీ తీసుకున్నప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది. టర్మ్ పాలసీలో రకాలు టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఇందులో మొదటిది రెగ్యులర్ టర్మ్ ప్లాన్. దీన్నే లెవల్ టర్మ్ ప్లాన్ అని కూడా అంటారు. పాలసీదారులు తమ అభీష్టం మేరకు నిరీ్ణత వయసు వరకు (నిరీ్ణత కాలానికి) కవరేజీని తీసుకోవచ్చు. కొన్ని బీమా సంస్థలు నూరేళ్ల కాలానికీ కవరేజీని ఆఫర్ చేస్తుంటే, కొన్ని గరిష్టంగా 85 ఏళ్లకే రక్షణను పరిమితం చేస్తున్నాయి. ఇక టర్మ్ ప్లాన్‌లో రెండో రకం టీఆర్‌వోపీ. అంటే టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. గడువు తీరే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి 18 శాతం జీఎస్టీని మినహాయించి మిగిలినది వెనక్కిచేస్తాయి బీమా సంస్థలు. మూడో రకం జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్. ఇప్పుడు బీమా సంస్థలు దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. మిగిలిన రెండు రకాల కలయికగా ఇది ఉంటుంది. పాలసీ కాల వ్యవధిలోనే కట్టిన ప్రీమియంలు వెనక్కి ఇవ్వాలని కోరొచ్చు. వీటిల్లో మూడో రకం 2022 నుంచే అందుబాటులోకి వచి్చంది. మ్యాక్స్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్, కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ తదితర సంస్థలు జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. వీటిల్లో రెగ్యులర్ టర్మ్ ప్లాన్ కాకుండా మిగిలిన రెండు రకాల పట్ల మొగ్గు చూపించేట్టు అయితే, ముందుగా వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. వ్యత్యాసాలు... రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్‌లో.. పాలసీ కాల వ్యవధి ముగిసేలోపు పాలసీదారు ఏ కారణంతో మరణించినా, పరిహారాన్ని నామినీకి చెల్లిస్తారు. పరిహారం మొత్తాన్ని ఒకే విడత లేదంటే, వాయిదాలుగానూ తీసుకోవచ్చు. కేవలం ఈ రిస్క్ వరకే ఈ పాలసీ పరిమితం. గడువు ముగిసేలోపు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ తిరిగి రాదు. దీన్ని చౌక ప్లాన్‌గానూ చెబుతారు. కోటి రూపాయిల కవరేజీ సైతం 30 ఏళ్ల ఆరోగ్యకరమైన వ్యక్తికి రూ.12వేల కంటే తక్కువ వార్షిక ప్రీమియానికి వచ్చేస్తుంది. టీఆర్‌వోపీ (పాలసీ గడువు తీరిన తర్వాత ప్రీమియం వెనక్కి వచ్చేవి) ప్లాన్‌లో పాలసీ గడువులోపు పాలసీదారు మరణించినట్టయితే నామినీకి పరిహారం వస్తుంది. పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి 18% జీఎస్టీని తగ్గించి ఇస్తారు. కానీ, రెగ్యులర్ టర్మ్ ప్లాన్లతో పోలిస్తే ఇవి ఖరీదుగా ఉంటాయి. రెగ్యులర్ టర్మ్ ప్లాన్ ప్రీమియం కంటే 2 రెట్ల వరకు అధిక ప్రీమియం వీటి కోసం చెల్లించాల్సి వస్తుంది. ఇలా అదనంగా వసూలు చేసే ప్రీమియంను సంప్రదాయ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి, గడువు తీరిన తర్వాత పాలసీదారులకు బీమా కంపెనీలు చెల్లిస్తుంటాయి. అదనంగా చెల్లించే మొత్తం నుంచే తమ ప్రీమియం వెనక్కి వస్తుందన్న వాస్తవాన్ని పాలసీదారులు గుర్తించాలి. జీరో కాస్ట్ ప్లాన్‌లో పాలసీ గడువు కంటే ముందుగానే వైదొలగొచ్చు. ఒక వ్యక్తి తన ఆరి్థక బాధ్యతలు ముగిశాయని భావించినప్పుడు లేదంటే పదవీ విమరణ తర్వాత పాలసీ గడువు ఇంకా మిగిలి ఉన్నా వైదొలగడానికి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత ఇలా చేయవచ్చు. ఇలా ముందస్తుగానే తప్పుకుంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తం నుంచి 18% జీఎస్టీని మినహాయించి బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేస్తాయి. దీంతో పాలసీ రద్దయిపోతుంది. దీనివల్ల బీమా సంస్థలకు ప్రయోజనం.. వృద్ధాప్యానికి వచి్చన పాలసీదారు తప్పు కోవడం వల్ల వాటికి క్లెయిమ్ రిస్క్ తగ్గుతుంది. వాస్తవం ఏంటి? జీరోకాస్ట్ టర్మ్ ప్లాన్ అంటే, ఎలాంటి చార్జీలు ఉండవని, దీన్నే చౌక ప్లాన్ అని పొరబడే అవకాశం లేకపోలేదు. ‘‘కొన్ని ప్లాన్లకు జీరోకాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనే లేబుల్ వేయడం ఎందుకంటే.. ప్రత్యేకంగా వైదొలగడం, ప్రీమియం వెనక్కి వచ్చే ఆప్షన్ వల్లే. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అనుసరించే మార్కెటింగ్ ఎత్తుగడల్లో భాగమే ఇది’’ అని ప్రోబస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్టర్ రాకేశ్ గోయల్ పేర్కొన్నారు. ప్రీమియం వెనక్కి వస్తుంది కనుక, జీరోకాస్ట్గా బీమా కంపెనీలు వీటిని వర్ణిస్తున్నాయి. అయినా, పాలసీదారు ఎప్పడంటే అప్పుడు పాలసీ నుంచి తప్పుకోవడం కుదరదని పాలసీబజార్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ రిషబ్ గార్గ్ స్పష్టం చేశారు. కనీస కాల వ్యవధి ముగిసి, ఆరి్థక బాధ్యతలు తీరిన తర్వాతే ఇందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ‘‘జీరో కాస్ట్ అనేది మైండ్ గేమ్. ఈ పాలసీ కోసం నేడు చెల్లించే ప్రీమియం విలువ, చివర్లో బీమా సంస్థ తిరిగిచ్చే ప్రీమియం కంటే చాలా ఎక్కువ’’అని వివరించారు. ఏమిటి మార్గం? టర్మ్ పాలసీ కాల వ్యవధి సాధారణంగా 30–40 ఏళ్లు అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఉద్యోగం వచి్చన నాటి నుంచే జీవిత బీమా కవరేజీ ఉండాలన్నది నిపుణుల సూచన. కనుక రిటైర్మెంట్ వరకు తీసుకోవడం ఎంతో అవసరం. 60 ఏళ్ల నాటికి కూడా ఆరి్థక బాధ్యతలు తీరుతాయో, లేదో అన్న సందేహంతో 75 ఏళ్లు, 85 ఏళ్ల వరకు కూడా పాలసీలు తీసుకుంటున్నారు. అయితే, కొన్ని పాలసీల్లో వయసు ఆధారంగా ఫీచర్లను బీమా సంస్థలు పరిమితం చేస్తుంటాయి. జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఆరి్థక బాధ్యతలు తీరిన వెంటనే పాలసీ నుంచి వైదొలగొచ్చు. దీనివల్ల ప్రీమియంలు వెనక్కి వస్తాయి. పాలసీ కాల వ్యవధి ముగియక ముందే ప్రీమియంల కోసం వైదొలగడం సరికాదు. దీనివల్ల జీవిత బీమా రక్షణను కోల్పోవాల్సి వస్తుంది. రెగ్యులర్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీకి ప్రీమియం ఎంత? ప్రీమియం వెనక్కి వచ్చే ప్లాన్‌లో ప్రీమియం ఎంత? ఈ రెండింటి మధ్య అంతరం చెప్పుకోదగినంత ఉంటుంది. కనుక చివర్లో ప్రీమియం వెనక్కి వచ్చే ప్లాన్ కాకుండా రెగ్యులర్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మేర మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే.. దీర్ఘకాలంలో భారీ మొత్తమే సమకూరుతుందని ఎన్నో నిదర్శనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐప్రొటెక్ట్ స్మార్ట్ జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్’ 60 ఏళ్ల వయసు వచ్చే వరకు రూ.కోటి కవరేజీ తీసుకునేట్టు అయితే ప్రీమియం రూ.16,287గా ఉంది. రెగ్యులర్ ప్లాన్‌లో ఇదే కవరేజీకి ప్రీమియం రూ.12,686. వ్యత్యాసం రూ.3,601. రెగ్యులర్ ప్లాన్ తీసుకుని, మిగిలే మొత్తాన్ని ప్రతి నెలా రూ.300 చొప్పున (ఏడాదికి రూ.3,600) ఈక్విటీ ఫండ్‌లో 30 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే 12 శాతం రాబడి అంచనా ప్రకారం 30 ఏళ్లకు రూ.10.5 లక్షలు సమకూరుతుంది. రిస్క్ తీసుకోని డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసుకున్నా రూ.4.5 లక్షలు సమకూరుతుంది. ఇలా చేయడం వల్ల రెగ్యులర్ ప్లాన్ సైతం జీరోకాస్ట్గానే సమకూరుతుంది. ఇక్కడ చెప్పుకున్నట్టు జీరోకాస్ట్ టర్మ్ ప్లాన్ కోసం ఏటా రూ.16,287 చొప్పున 30 ఏళ్లలో రూ.4.89 లక్షలు చెల్లించుకోవాలి. చివరి వరకు జీవించి ఉంటే, చెల్లించిన మొత్తం నుంచి 18 శాతం జీఎస్టీ మినహాయిస్తారు. అప్పుడు చేతికి వచ్చేది రూ.4 లక్షలు. ఇక కనిపించని చార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. జీవిత బీమా ప్రీమియంలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. మరి అవే ప్రీమియంలు వెనక్కి వచి్చనప్పుడు పన్ను వర్తించొచ్చు. ఇతర రకాలు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్.. చిన్న వయసులోనే టర్మ్ ప్లాన్ తీసుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నుంచి జీవితంలో పలు దశల్లో బాధ్యతలు పెరుగుతూ వెళతాయి. కనుక పెరిగే బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ విస్తృతం చేసుకునేందుకు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్ వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏటా నిరీ్ణత శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళుతుంది. అలాగే, ఐదేళ్లకోసారి సమ్ అష్యూర్డ్ పెరిగే పాలసీలు కూడా ఉన్నాయి. కవరేజీ పెరిగినప్పటికీ, పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్.. ఏటా కవరేజీ పెరిగే ప్లాన్‌కు విరుద్ధంగా ఇది పనిచేస్తుంది. సాధారణంగా 60–65 ఏళ్లకు వచ్చే సరికి ఆరి్థక బాధ్యతలు తగ్గిపోతుంటాయి. అటువంటప్పుడు ఈ ఆప్షన్లో ఏటా నిరీ్ణత శాతం మేర సమ్ అష్యూరెన్స్ తగ్గుతూ వెళుతుంది. ఇందులోనూ ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. ఇతర ప్లాన్లతో పోలిస్తే ప్రీమియం తక్కువ. లమ్సమ్, పీరియాడిక్ పేమెంట్స్.. మరణ పరిహారం మొత్తాన్ని ఒకే విడత చెల్లించేవి లమ్సమ్. ఒకేసారి అంత మొత్తం చేతికి వస్తే, దాన్ని ఆదాయంగా మలుచుకోవడం సమస్యగా భావించేవారు, పీరియాడిక్ పేమెంట్స్ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించిన సందర్భంలో పరిహారాన్ని నెలవారీ చొప్పున పదేళ్ల పాటు చెల్లించేలా ఎంపిక చేసుకోవచ్చు. సగం పరిహారం ఏక మొత్తంలో చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా తీసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్.. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంపిక చేసుకున్న కాలానికి అమల్లో ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల కాలానికి టర్మ్‌ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. 70 ఏళ్లకు వచ్చే సరికి టర్మ్ ప్లాన్ ముగిసిపోతుంది. అప్పుడు కావాలంటే దాన్ని మరింత కాలానికి బీమా పాలసీ కింద మార్చుకోవచ్చు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్.. చిన్న వయసులోనే టర్మ్ ప్లాన్ తీసుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నుంచి జీవితంలో పలు దశల్లో బాధ్యతలు పెరుగుతూ వెళతాయి. కనుక పెరిగే బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ విస్తృతం చేసుకునేందుకు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్ వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏటా నిరీ్ణత శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళుతుంది. అలాగే, ఐదేళ్లకోసారి సమ్ అష్యూర్డ్ పెరిగే పాలసీలు కూడా ఉన్నాయి. కవరేజీ పెరిగినప్పటికీ, పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. లిమిటెడ్ పే, సింగిల్ పే.. రెగ్యులర్ ప్లాన్‌లో ఎంపిక చేసుకున్న కాలం అంతటా నిరీ్ణత రోజులకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తుండాలి. అదే సింగిల్ ప్రీమియం పాలసీలో ఆరంభంలోనే ఒకసారి ప్రీమియం చెల్లించాలి. రెగ్యులర్‌గా ప్రీమియం కట్టే వెసులుబాటు లేని వారు దీన్ని పరిశీలించొచ్చు. ఇక లిమిటెడ్ పే ప్రీమియం ప్లాన్‌లో.. పాలసీ కాల వ్యవధి అంతటా కాకుండా, కొన్నేళ్ల పాటు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 80 ఏళ్లు వచ్చే వరకు 50 ఏళ్ల కాలానికి టర్మ్ ప్లాన్ ఎంపిక చేసుకున్నాడని అనుకుందాం. 60 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారంగా భావిస్తే లిమిటెడ్ పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. 5–10–15 ఏళ్లు ఇలా లిమిటెడ్ పేలో ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధి ఉంటుంది. -
Catastrophe Insurance: మీ ఇంటికి బీమా ఉందా..?
దీపావళి రోజున హైదరాబాద్‌కు చెందిన రామన్ కుటుంబం ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. స్కై షాట్ క్రాకర్ గతితప్పి ఎనిమిదో అంతస్తులోని రామన్ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లింది. దాంతో మంటలు మొదలయ్యాయి. ఇంట్లోని ఫరి్నచర్, విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వ్రస్తాలు కాలిపోయాయి. ఒకింత అదృష్టం ఏమిటంటే రామన్ కుటుంబ సభ్యులు అందరూ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, ఇంట్లోని విలువైన వస్తువులు కాలిపోవడం వల్ల రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇది ఊహించని నష్టం. ఇలాంటి ప్రమాదం ఏర్పడుతుందని ఎవరూ అనుకోరు. కానీ, ప్రమాదాలు అన్నవి చెప్పి రావు. అందుకే ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ఉండాలని నిపుణులు తరచూ చెబుతుంటారు. కానీ, దీన్ని పాటించే వారు చాలా తక్కువ మందే అని చెప్పుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటితోపాటు, ఇంట్లోని విలువైన వస్తువులకు ప్రమాదాలు, విపత్తుల కారణంగా ఏర్పడే నష్టం నుంచి రక్షణనిస్తుంది. చౌక ప్రీమియానికే వస్తుంది. రోజుకు ఒక టీకి పెట్టేంత ఖర్చు కూడా కాదు. హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి అనేది వివరంగా చూద్దాం... ‘‘ప్రజలు తమ జీవిత కాల పొదుపును ఇంటి కొనుగోలు కోసం వెచి్చస్తున్నారు. మరి అంతటి విలువైన ఆస్తిని కాపాడుకునేందుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఎంతో విలువైన ఆస్తికి ఎల్లప్పుడూ రిస్క్ పొంచి ఉంటుంది’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ , ప్రాపర్టీ క్లెయిమ్స్ చీఫ్ గౌరవ్ అరోరా తెలిపారు. నిజానికి ప్రతి 20 ఇళ్లల్లో కేవలం ఒక ఇంటికే ప్రస్తుతం బీమా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సగటు వ్యక్తికి ఇల్లు అనేది పెద్ద పెట్టుబడి అవుతుంది. అందుకే ఆ విలువైన ఆస్తికి తప్పకుండా రక్షణ తీసుకోవాలి. ‘‘విపత్తులు రావడం అన్నది అరుదే. కానీ, వచి్చనప్పుడు వాటిల్లే నష్టం భారీగా ఉంటుంది’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది పేర్కొన్నారు. అనుభవాలను మర్చిపోవద్దు.. జీవిత బీమా తీసుకోవాలని చాలా మంది ఏజెంట్లు అడగడం వినే ఉంటారు. కానీ, అదే స్థాయిలో హోమ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కనిపించదు. దీన్ని తీసుకున్నామని, తీసుకోవాలని సూచించే వారు కూడా అరుదు. విపత్తులు, ప్రమాదాలే హోమ్ ఇన్సూరెన్స్ దిశగా అడుగులు వేయించేవిగా భావించాలి. నిజానికి ప్రకృతి విపత్తుల సమయాల్లో హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. 2018లో కేరళను వరదలు తీవ్రంగా నష్టపరిచాయి. ఆ తర్వాతి ఏడాదిలో హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆదాయం 34 శాతం పెరిగింది. ఇంటి బీమా కోసం ఆసక్తి పెరిగింది. 2020లో యాంఫాన్ తుపాను పశి్చమబెంగాల్ను నష్టపరచగా ఆ తర్వాతి ఆరి్థక సంవత్సరంలో పై ప్రీమియం ఆదాయం 27 శాతం పెరగడం గమనించొచ్చు. కానీ, ఇదంతా తాత్కాలిక ధోరణిగానే ఉంటోంది. విపత్తులు లేదా ప్రమాదాలు తలెత్తినప్పుడు సహజంగా హోమ్ ఇన్సూరెన్స్ విక్రయాలు పెరుగుతుంటాయి. తిరిగి ఏడాది రెండేళ్ల తర్వాత అక్కడి ప్రజలు వాటిని మరిచిపోతుంటారు. దీంతో విక్రయాలు మళ్లీ తగ్గుతుంటాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోనూ కనిపిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో వైద్య బిల్లులు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆరోగ్య బీమా తీసుకునే వారిలో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించింది. ఇప్పుడు కరోనా విపత్తు బలహీనపడింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ విక్రయాలు తిరిగి సాధారణ స్థాయికి చేరాయి’’అని డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన చతుర్వేది తెలిపారు. ఫ్లాట్ యజమానులు హౌసింగ్ సొసైటీ తీసుకున్న హోమ్ ఇన్సూరెన్స్‌పై ఆధారపడడం సరికాదని నిపుణుల సూచన. తమ ఫ్లాట్‌తోపాటు, అందులోని విలువైన వస్తువులకు విడిగా కవరేజీ తీసుకోవడం అన్ని విధాలుగా మెరుగైన నిర్ణయం అవుతుంది. ఇంటికి భూకంపాలు, తుపాను, వరదల ముప్పు మాత్రమే కాదు, ఎత్తయిన భవనాలు, ఖరీదైన గాడ్జెట్ల వినియోగం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల ముప్పు కూడా ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. ముంబైలో ఏటా 5,000 వరకు అగ్ని ప్రమాదాలు నమోదవుతున్నట్టు ఒక అంచనా. ఇందులో 70 శాతానికి విద్యుత్తే కారణంగా ఉంటోంది. ఢిల్లీ, బెంగళూరు తదితర పట్టణాల్లో ఏటా 2,500 మేర అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘‘ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ గాడ్జెట్ల వినియోగం పెరిగిపోవడంతో, ఎలక్ట్రికల్ వైరింగ్‌పై భారం అధికమై అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ చతుర్వేది తెలిపారు. అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదానికి సంబంధించి అలారమ్ మోగిన వెంటనే, స్ప్రింక్లర్ సిస్టమ్ నుంచి నీరు ఎంతో ఒత్తిడితో ఎగజిమ్మడం మొదలవుతుంది. ఈ నీటి కారణంగా ఇంట్లోని విలువైన గాడ్జెట్లు, ఇంటీరియర్ దెబ్బతింటాయి. కనుక అగ్ని ప్రమాదం జరగకపోయినప్పటికీ, ఇంటి యజమా ని చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్దె ఇంట్లో ఉంటే హోమ్ ఇన్సూరెన్స్ అవసరం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది ఎంత మాత్రం సరైనది కాదు. హోమ్ ఇన్సూరెన్స్ అన్నది కేవలం ఇంటి నిర్మాణానికి జరిగిన నష్టానికే పరిమితం కాదు. ఇంట్లోని వస్తువులు దెబ్బతింటే ఏర్పడే నష్టం నుంచి గట్టెక్కడానికి బీమా అక్కరకు వస్తుంది. దోపిడీ, దొంగతనాల వల్ల ఏర్పడే నష్టాన్ని సైతం భర్తీ చేసుకోవచ్చు. కవరేజీ చాలినంత.. హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. తమ అవసరాలకు తగిన పాలసీ కీలకం అవుతుంది. భారత్ గృహ రక్ష (బీజీఆర్) అన్నది ఐఆర్డీఏఐ ఆదేశాల మేరకు అన్ని సాధారణ బీమా సంస్థలు తీసుకొచి్చన ప్రామాణిక నివాస బీమా. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలతోపాటు అగ్ని ప్రమాదాలు, చెట్టు విరిగి పడడం, వాహనం డ్యాష్ ఇవ్వడం కారణంగా ఇంటికి వాటిల్లే నష్టానికి ఈ పాలసీలో పరిహారం లభిస్తుంది. శిధిలాల తొలగింపునకు, ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్ట్ ఫీజులకు అయ్యే మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. కానీ, ఇందులో పరిమితులు కూడా ఉన్నాయి. రూ.10 లక్షలు లేదా తీసుకున్న కవరేజీలో 20 శాతం ఏది తక్కువ అయితే అంత మేరే ఈ పాలసీ కింద పరిహారం లభిస్తుంది. ఓ సాధారణ మధ్య తరగతి ఇంటికి రూ.10 లక్షలు బీమా సరిపోదు. ఇంట్లో అధిక విలువ కలిగిన వస్తువులు ఉంటే, వాటి కోసం ప్రత్యేక కవరేజీ తీసుకోవాలని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ అండ్ రైటింగ్ హెడ్ గురుదీప్ సింగ్ బాత్రా సూచించారు. ఇంటి మార్కెట్ విలువ ఆధారంగా బీమా కవరేజీపై నిర్ణయానికి రావద్దు. ఇంటి నిర్మాణం దెబ్బతింటే, పునరుద్ధరించడానికి అయ్యే వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చదరపు అడుగుకు ఎంత వ్యయం అవుతుందో ఇంజనీర్లను అడిగితే తెలుస్తుంది. ఇంట్లో విలువైన ఫిట్టింగ్‌లు ఏర్పాటు చేసుకున్న వారు, ఆ విలువను కూడా బీమా కవరేజీకి అదనంగా జోడించుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏటా ఎంతో కొంత పెరుగుతుంటుంది. కనుక ఏడాదికి కాకుండా ఒకేసారి రెండు, మూడేళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. ‘‘ఇంటికి తీసుకునే బీమాని ఏటా రెన్యువల్‌కు ముందు ఆ కవరేజీని సమీక్షించుకోవాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటా ఇంటి నిర్మాణ వ్యయం పెరిగిపోతుంటుంది. అందుకు అనుగుణంగా ఏటా నిర్ణీత శాతం మేర కవరేజీని పెంచుకోవాలి. ఏటా 10 శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళ్లే వాటిని పరిశీలించొచ్చు. ఇంట్లో ఉన్న ఒక్కో పరికరం, కొనుగోలు చేసిన సంవత్సరం, మోడల్ నంబర్, దాని విలువ ఈ వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ సంస్థలు ఈ వివరాల ఆధారంగానే పరిహారాన్ని నిర్ణయిస్తాయి. అవి ఎన్నేళ్ల పాటు వాడారన్న వివరాల ఆధారంగా ప్రామాణిక తరుగును అమలు చేస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరాల విలువ ఏటా తగ్గుతూ ఉంటుంది. రూ.50 వేలు పెట్టి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన వస్తువు విలువ ఇప్పుడు సగానికి తగ్గిపోతుంది. కనుక పాడైపోయిన దాని స్థానంలో కొత్తది కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుందని అనుకోవద్దు. ఇంట్లో విలువైన కళాకృతులు ఉంటే, వాటికి సైతం బీమా కవరేజీ కోరుకుంటే.. సరి్టఫైడ్ ఏజెన్సీ నుంచి వ్యాల్యూషన్ సరి్టఫికెట్ తీసుకోవాలి. ఒకవేళ కళాఖండాల మొత్తం విలువ రూ.5 లక్షలు, విడిగా ఒక్కోటి విలువ రూ.లక్ష మించకపోతే వ్యాల్యూషన్ సరి్టఫికెట్ అవసరం పడదు. ఎలాంటి కవరేజీ..? ప్రతి ఇంటికి కనీసం హోమ్ ఇన్సూరెన్స్ బేసిక్ పాలసీ అయినా ఉండాలి. భూకంపాలు, పిడుగులు, తుపానులు, వడగళ్లు, వరదలు తదితర ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదం, విధ్వంసం, అల్లర్ల కారణంగా ఇంటి నిర్మాణానికి నష్టం ఏర్పడితే బేసిక్ పాలసీలో పరిహారం లభిస్తుంది. మరమ్మతులు లేదంటే తిరిగి నిర్మాణం వీటిల్లో సరైన దానికి కవరేజీనిస్తుంది. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం రూ.30 వరకు ఉంటుంది. ఇక ఇంటి నిర్మాణానికి అదనంగా, ఇంట్లోని వస్తువులకు కూడా రక్షణ తీసుకోవచ్చు. ఈ తరహా కవరేజీకి ప్రతి రూ.లక్షకు గాను ప్రీమియం రూ.60 వరకు ఉంటుంది. దోపిడీ, దొంగతనాల నుంచి సైతం రక్షణ అవసరం. ఇంట్లోని ఫరి్నచర్, కళాఖండాలు, వ్రస్తాలు, గృహోపకరణాలు, గాడ్జెట్ల వంటి వాటికి దొంగతనాల నుంచి రక్షణ కోరుకుంటే ప్రతి రూ.లక్షకు రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఇంట్లో గాడ్జెట్లు పనిచేయకుండా పోవడం చూస్తుంటాం. ఇలా ఉన్నట్టుండి ఇంట్లో పరికరం పనిచేయకుండా పోతే, పరస్పర అంగీకారం మేరకు పరిహారం అందించే ‘బ్రేక్‌డౌన్’ కవర్ కూడా ఉంటుంది. దీనికి ప్రీమియం రూ.లక్షకు రూ.200–300 వరకు ఉంటుంది. రుణంపై ఇంటిని తీసుకున్న వారు ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణం వరకు రుణ ఈఎంఐని బీమా కంపెనీ చెల్లించాలని కోరుకుంటే ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవచ్చు. ఆరు నెలల ఈఎంఐ రక్షణకు ప్రీమియం రూ.2,500 వరకు ఉంటుంది. ఇంటి నిర్మాణం దెబ్బతిన్నప్పుడు అందులో ఉండే కిరాయిదారు ఖాళీ చేయాల్సి రావచ్చు. అదే జరిగితే అప్పటి వరకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వస్తున్న అద్దె ఆదాయానికి బ్రేక్ పడుతుంది. ఇలా అద్దె ఆదాయాన్ని నష్టపోకుండా, బీమా సంస్థ చెల్లించేలా యాడాన్ కవర్ తీసుకోవచ్చు. దీనికి ప్రతి నెలా రూ.25వేల అద్దె చొప్పున ఆరు నెలల పాటు చెల్లించే కవర్‌కు ప్రీమియం రూ.2,000 ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా ప్రత్యేకంగా ఉంటే, హోమ్ ఇన్సూరెన్స్‌తో తీసుకోవాల్సిన అవసరం లేదు. భారం తగ్గాలంటే..? హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇల్లు, ఇంట్లోని వస్తువులకు నష్టం వాటిల్లినప్పుడు, కొంత మొత్తాన్ని తామే భరించేట్టు అయితే ప్రీమియం తగ్గుతుంది. కొన్ని కంపెనీలే ఈ ఆప్షన్ ఇస్తున్నాయి. ఇంట్లో అన్నింటికీ బీమా అవసరం ఉండదు. బాగా పాత పడిపోయిన వాటికి, పెద్దగా వ్యాల్యూ లేని (తరుగు బాగా పడే) వాటికి బీమా అనవసరం. అగ్ని ప్రమాదం జరిగితే హెచ్చరించి, అప్రమత్తం చేసే అలారమ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే, అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసే పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. స్వయం ఉపాధిలోని నిపుణులు లేదా వ్యాపారులు అయితే హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. వేతన జీవులకు ఈ వెసులుబాటు లేదు. ఏడాదికి కాకుండా, ఏడాదికి మించి ఎక్కువ కాలానికి పాలసీ తీసుకుంటే ప్రీమియంలో 10 శాతం తగ్గింపు వస్తుంది. -
అనివార్య ఖర్చులు, సరదా ఖర్చులు, పొదుపు
ట్రెండ్స్ స్థిరంగా ఉండనట్లే ఆలోచనలు, అభిప్రాయాలు కూడా స్థిరంగా ఉండవు. జెన్ జెడ్, మిలీనియల్స్ కొత్త ప్రయాణం కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? యోలో(వైవోఎల్వో–యూ వోన్లీ లివ్ వన్స్) సెగ్మెంట్లో ఉన్న యువతరం అవసరానికి మించి ఖర్చు చేయడానికి తప్ప‘ఆర్థిక భద్రత’కు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు. అయితే ఈ ధోరణిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘యోలో’ నుంచి 50–30–20 కాన్సెప్ట్ వైపు ప్రయాణించడానికి యువతరం ఆసక్తి చూపుతున్నారు... సినిమాల గురించి తప్ప మరో లోకంతో సంబంధం లేనట్లుగా ఉండే మిలీనియల్స్, జెన్ జెడ్ ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నుంచి పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్ వరకు ఎన్నో విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో నిర్ణీత మొత్తాన్ని నెలవారీ లేదా త్రైమాసికం చొప్పున పెట్టుబడిగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్) అనేది ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్‌ను అందించే దీర్ఘకాలిక పొదుపు పథకం. పదిహేను సంవత్సరాల లాక్–ఇన్ వ్యవధిని కలిగి ఉన్న ప్రభుత్వ పథకం ఇది.‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనే మాట వినబడగానే ‘ఇది నాకు సంబంధించిన విషయం కాదు’ అన్నట్లుగా పట్టించుకునే వారు కాదు చాలా మంది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనేది వయసు మళ్లిన వారికి సంబంధించిన విషయం అన్నట్లుగా ఉండేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఎర్లీ ఏజ్‌లోనే హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తగిన అవగాహనతో ఉన్నారు. అన్ ఎక్స్పెక్టెడ్ మెడికల్ సిచ్యువేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకుంటున్నారు. యాన్యువల్ హెల్త్బడ్జెట్ను ప్లాన్‌చేసుకుంటున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘పర్సనల్ యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్’పై ఆసక్తి చూపుతున్నారు. ‘సరైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జీవన ప్రయాణానికి దిక్సూచి లాంటిది’ అనే మాటను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా కాకుండా ఆచి తూచి సరిౖయెన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్ ప్లాన్’ అనే మాట వినబడగానే ఒకప్పుడు యువతరం నోటి నుంచే వచ్చే మాటలు... ‘అబ్బే! అంత టైమ్ లేదు’ ‘ఫైనాన్షియల్ విషయాలు నాకు బొత్తిగా తెలియవు’ ఇప్పుడు మాత్రం ‘బొత్తిగా తెలియదు’ అనుకునే విషయాలపై టైమ్ చేసుకొని మరీ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో మిలీనియల్స్, జెన్ జెడ్‌ను బాగా ఆకట్టుకున్న కాన్సెప్ట్ 50–30–20 ‘50–30–20’ కాన్సెప్ట్ ప్రకారం సం΄ాదించే జీతంలో అనివార్య ఖర్చులకు 50 శాతం ఖర్చుచేయాలి. ఇంటి అద్దె నుంచి భోజన ఖర్చు వరకు ఇందులో ఉంటాయి. వ్యక్తిగత అవసరాలు, సరదాల కోసం 30 శాతం ఖర్చు చేయాలి. ట్రెండీ దుస్తులు కొనుక్కోవడం నుంచి సినిమాలు చూడడం వరకు ఇందులో వస్తాయి. 20 శాతం మాత్రం తప్పనిసరిగా పొదుపు చేయాలి. ‘మిలీనియల్స్‌లో చాలామంది ఇన్సూరెన్స్‌ల గురించి పట్టించుకోవడం లేదు. అనారోగ్యం లేదా ప్రమాదం జరిగిన సందర్భాల్లో మన ఖజానా అంతా ఖాళీ అవుతుంది. దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే లైఫ్, హెల్త్, ఆటో ఇన్సూరెన్స్‌పై మిలీనియల్స్ తప్పనిసరిగా దృష్టి పెట్టాలి’ అంటున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శరద్ కోహ్లీ. శరద్ సలహా చదివి మారిన వారిలో తేజస్విని ఒకరు. దిల్లీకి చెందిన తేజస్వినికి ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆసక్తి, అవగాహన లేదు. ఇప్పుడు మాత్రం రకరకాల పాలసీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న మిలీనియల్స్, జెన్ జెడ్ దగ్గర ‘ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిటైర్మెంట్’ ప్రస్తావన తెస్తే పెద్దగా నవ్వుతారు లేదా ‘రిటైర్మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం ఎందుకు!’ అన్నట్లుగా మాట్లాడుతారు. అయితే ఈ ధోరణిలో కూడా మెల్లగా మార్పు వస్తుంది. ‘రిటైర్మెంట్ లేదా భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు అత్యవసర సమయాల్లోనే కాదు విదేశీ ప్రయాణం చేయాలి లాంటి చిరకాల కలలను నిజం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. ప్రతి ఉద్యోగి ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందే. కొన్ని సమయాల్లో ముందస్తు పదవీ విరమణ తప్పనిసరి కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ ఫర్ రిటైర్మెంట్ను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి’ అంటున్నాడు శరద్ కోహ్లీ. స్టాక్ మార్కెట్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్కు మాత్రమే యువతప్రాధాన్యత ఇస్తుంది. స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లాంటి మాటలు వినబడితే దూరంగా పారిపోయే వారిని కూడా తన మాటలతో, రాతలతో ఆకట్టుకొని నాలుగు మంచి విషయాలు చెబుతుంది నేహా నగార్. ఎంబీయే చేసిన నేహా స్టార్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్గా యువతలో ఎంతోమంది ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. స్టాక్‌మార్కెట్, క్రిప్టోకరెన్సీ, ట్యాక్స్యేషన్, ట్రేడింగ్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థం అయ్యేలా చెబుతుంది. ‘మనం ఎలా చెబుతున్నాం అనేదానిపై అవతలి వారి ఆసక్తి ఆధారపడి ఉంటుంది. ఆకట్టుకునేలా, సులభంగా అర్థమయ్యేలా చెప్పగలితే వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు’ అంటుంది నేహా నాగర్. -నేహా నాగర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ -
జనవరి 1 నుంచి బీమాలో కొత్త రూల్స్ - తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీహోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా ఇవ్వాల్సిందేనని బీమా కంపెనీలకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డీఏఐ సూచించింది. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ), పాలసీలో వేటికి కవరేజీ ఉంటుంది, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ ఎలా చేయాలి తదితర వివరాలను తప్పకుండా వెల్లడించాలి. అలాగే, ఫిర్యాదుల ప్రక్రియ గురించీ చెప్పాలి. ఈ మేరకు కస్టమర్ సమాచార పత్రాన్ని (సీఐసీ) బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సవరించింది. దీనివల్ల పాలసీదారులు నియమ నిబంధనలు, షరతుల గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయంలో పాలసీ డాక్యుమెంట్ది కీలక పాత్ర అని పేర్కొంది. కాబట్టి పాలసీకి సంబంధించి ప్రాథమిక వివరాలు, అవసరమైన సమాచారాన్ని సులువైన పదాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని సర్క్యులర్‌లో తెలిపింది. బీమా సంస్థకు, పాలసీ హోల్డర్‌కు మధ్య వివరాల విషయంలో అస్పష్టత మూలంగానే అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌ను సవరిస్తున్నట్లు ఐఆర్డీఏఐ చెప్పింది. సవరించిన సీఐఎస్ ప్రకారం.. బీమా ప్రొడక్ట్/ పాలసీ, పాలసీ నంబర్, ఇన్సురెన్స్ టైప్, సమ్ అష్యూర్డ్ వంటి ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. అలాగే, హాస్పటల్ ఖర్చులు, పాలసీలో కవర్ కానివి, వెయిటింగ్ పీరియడ్, కవరేజీ పరిమితులు, క్లెయిమ్ ప్రొసీజర్, గ్రీవెన్స్/ కంప్లయింట్స్ వివరాలు వంటివీ పొందుపరచాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఒకవేళ పాలసీ హోల్డర్ కోరితే సదరు వివరాలు స్థానిక భాషలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది. సవరించిన సీఐసీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు కొత్త తరహా టర్మ్ ప్లాన్స్..
జీవిత బీమాకు సంబంధించి అత్యంత సరళమైన పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది పాలసీదారు కన్నుమూసిన పక్షంలో, వారు తమ జీవితకాలంలో చెల్లించిన ప్రీమియంలకు ప్రతిగా వారి కుటుంబసభ్యులకు (లబ్ధిదారులకు) నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తామంటూ బీమా కంపెనీ ఇచ్చే హామీ. కొత్త ఇన్వెస్టర్లు సాధారణంగానే సరళమైన, సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అన్వేషిస్తుంటారు కాబట్టి వారి కేటగిరీలో టర్మ్ ప్లాన్లకు ఆదరణ ఉంటోంది. ఈ పాలసీల కాలవ్యవధి 15 నుంచి 40 ఏళ్లు, అంతకు పైబడి ఉంటుంది. తమకు అనుకూలమైన కాలవ్యవధిని పాలసీదారు ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ ప్రారంభమయ్యే సమయానికి పాలసీదారు వయస్సు, ఎంచుకున్న మొత్తం సమ్ అష్యూర్డ్ బట్టి ప్రీమియం ఉంటుంది. వార్షిక ప్రీమియం ఎంత కట్టాల్సి ఉంటుందనేది తెలుసుకునేందుకు చాలా మటుకు బీమా కంపెనీల వెబ్సైట్లలో ఉండే ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాల్క్యులేటర్లను కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. దురదృష్టవశాత్తూ ఒకవేళ పాలసీదారు మరణించిన పక్షంలో నామినీకి మొత్తం సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. ఇన్సూరెన్స్ కాల వ్యవధి తీరేంత వరకు పాలసీదారు జీవించే ఉన్న పక్షంలో వారు మొత్తం సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్‌ల రూపంలో వడ్డీని కూడా పొందే విధమైన పాలసీలూ ఉన్నాయి. కొన్ని కంపెనీలు దీనికి అదనంగా ప్రత్యేక అలవెన్సులు, బహుమతులు, లాయల్టీ అడిషన్ వంటివి కూడా ఇస్తున్నాయి. టర్మ్ ప్లాన్లకు ఎందుకింత ఆదరణ.. వివిధ ప్రొఫెషన్స్‌కు చెందిన కస్టమర్లు తమకు అవసరమైనవి ఎంపిక చేసుకునేలా వివిధ ఫీచర్లు, సరళమైన ఆప్షన్స్‌తో టర్మ్ ప్లాన్లు లభిస్తాయి. కొన్ని ప్లాన్లు డెత్ క్లాజ్‌తో వచ్చినప్పటికీ యాక్సిడెంటల్ డెత్, శాశ్వత వైకల్యం, తీవ్ర అనారోగ్యం వంటి ఆప్షన్స్‌తో పాటు నిర్దిష్ట వయస్సుకు వచ్చాకా పెన్షన్ పొందేటువంటి అదనపు క్లాజ్లతో కూడా లభిస్తుంటాయి. ఇక కొన్ని టర్మ్ ప్లాన్లలో మనీ బ్యాక్ ఫీచర్ ఉంటుంది. ఈ తరహా పాలసీలో ప్రతి 5 నుంచి 10 ఏళ్లకోసారి సమ్ అష్యూర్డ్‌లో నిర్దిష్ట శాతం మొత్తాన్ని పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. ఈ చెల్లింపులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 కింద ఇన్‌కం ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. పిల్లల చదువు లేదా వివాహం లేదా వ్యాపారంపై పెట్టుబడి పెట్టుకోవడం వంటి ఖర్చుల కోసం పాలసీదారుకి ఈ మొత్తం ఉపయోగపడగలదు. కొన్ని టర్మ్ ప్లాన్లలో చెల్లించాల్సిన ప్రీమియాన్ని తగ్గించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కొందరు ప్రొఫెషనల్స్‌కు సంపద ఉండొచ్చు. దానితో పాటు కట్టాల్సిన బకాయిలు, అప్పులూ ఉండొచ్చు. అలాంటి వారు తమకు ఆర్థికంగా భారం కాకుండా తక్కువ ప్రీమియాన్ని చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా వారు పెట్టుబడి పెట్టడం కోసం పెద్ద మొత్తంలో నగదును కేటాయించాల్సిన అవసరం లేకుండా, అలాగే అదే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా తమ ఆర్థిక భవిష్యత్తును భద్రపర్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదు. ఎండోమెంట్ పాలసీగా లేదా నెలవారీ యాన్యుయిటీలతో కూడుకున్న పెన్షన్ ఫండ్‌లాగా మార్చుకునే సౌలభ్యంతో కూడా పలు టర్మ్ పాలసీలు లభిస్తున్నాయి. ఆ విధంగానూ ఇవి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఇలాంటి కేసుల్లో బీమా కంపెనీ, ప్రీమియాన్ని సవరించే అవకాశం ఉన్నప్పటికీ, మారే తమ అవసరాలకు అనుగుణమైన బీమా పాలసీ ప్రయోజనాలను పాలసీదారు పొందవచ్చు. కొందరు ప్రొఫెషనల్స్ తమ టర్మ్ ప్లాన్లను హోల్ లైఫ్ పాలసీలుగా మార్చుకోవాలనుకోవచ్చు. అలాంటప్పుడు సర్వైవల్ ప్రయోజనాలు లభించవు. దానికి బదులుగా పాలసీదారు మరణానంతరం, పాలసీ మెచ్యూరిటీ మొత్తాన్ని వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు బీమా కంపెనీ చెల్లిస్తుంది. కొత్త తరహా ప్లాన్స్ .. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బీమా కంపెనీలు టర్మ్ పాలసీల్లో పలు కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. డెత్ క్లాజ్‌తో పాటు కొన్ని టర్మ్ ప్లాన్లు 64 పైచిలుకు కీలక అనారోగ్యాలు, వ్యాధులకు కవరేజీ అందిస్తున్నాయి. ఇక టర్మ్ ప్లాన్ 40 ఏళ్ల పైబడిన కాలానికి ఉన్నా, పాలసీదారులు 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేని విధమైన పాలసీలూ ఉన్నాయి. సదరు వయస్సుకు వచ్చాకా రిటైర్ అయ్యే ప్రొఫెషనల్స్ ఈ తరహా టర్మ్ పాలసీలతో ప్రయోజనం పొందవచ్చు. ఇక కొన్ని కొత్త రకం ప్లాన్లను చూస్తే.. వరుసగా పదేళ్ల పాటు ప్రీమియంలు చెల్లించిన తర్వాత కొన్ని ప్రీమియంలను దాటవేసేందుకు వీలు కల్పించేవీ ఉంటున్నాయి. తద్వారా పాలసీదారులకు ఒక ఏడాది, రెండేళ్ల పాటు కాస్త వెసులుబాటు లభించగలదు. ఏదైతేనేం.. తమ భవిష్యత్తు అలాగే తాము ప్రేమించే వారి భవిష్యత్తుకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు టర్మ్ పాలసీలపై ఇన్వెస్ట్ చేయడం వివేకవంతమైన నిర్ణయం కాగలదు. ఆలస్యం చేసే కొద్దీ వయస్సును బట్టి ప్రీమియం భారం కూడా పెరిగిపోతుంది కాబట్టి.. దీన్ని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. -
మహిళలూ.. డబ్బులు సంపాదిస్తుంటే.. పెట్టుబడులు ఎలా పెట్టాలో ఇలా తెలుసుకోండి!
పురుషులతో సమానత్వం కోసం మహిళలు దశాబ్దాలుగా పోరాడాల్సి వచ్చింది. సుదీర్ఘకాలం పోరాటం ఫలితంగా.. నేడు మహిళలకు సముచిత స్థానం ఏర్పడింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను పురుషులతో సమానంగా మహిళలూ సొంతం చేసుకుంటున్నారు. స్త్రీలు కేవలం చదువుతోనే ఆగిపోవడం లేదు. కెరీర్ కొనసాగిస్తూ, ఎన్నో విజయాలను నమోదు చేస్తున్నారు. ఉన్నత శిఖరాల దిశగా దూసుకుపోతున్నారు. మహిళలు సొంత కాళ్లపై నిలబడుతూ, మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న తరుణంలో, తమ సంపదను పెంచుకునేందుకు వారికంటూ ప్రత్యేకమైన పెట్టుబడుల విధానాలు, ప్రణాళికలు అవసరం అవుతాయి. పరిశీలించి చూస్తే ఆర్జించే మహిళల్లో అధిక శాతం మంది పెట్టుబడులు, ఆర్థిక విషయాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పొదుపు, మదుపు గురించి అంతగా తెలియదనే ధోరణి వారిలో కనిపిస్తుంది. కానీ, ఇది సరికాదు. ప్రతి ఒక్క మహిళ తప్పకుండా ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, వివిధ సాధనాల గురించి తెలుసుకోవాలి. జీవిత భాగస్వాములపై ఆధారపడక్కర్లేకుండా తమ సంపదను తామే నిర్వహించుకునే సామర్థ్యాలు అవసరం. ఈ దిశగా ఏం చేయాలన్నది చర్చించే కథనమే ఇది. మహిళలే ఎందుకు? మన దేశంలో చాలా మంది మహిళలు తమ పెట్టుబడుల వ్యవహారాలను భర్త లేదా తండ్రికే విడిచిపెడుతుంటారు. దీంతో వారికి పెట్టుబడుల వ్యవహారాల గురించి తెలియకుండా పోతుంది. కానీ, ఇది సరికాదు. సంపాదన ఒకరిది అయినప్పుడు, నిర్వహణ బాధ్యతలు మరొకరిపై మోపడం ఎందుకు..? ఇల్లాలిగానే కాదు, ఒంటరిగానూ మహిళలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు. తమ జీవిత లక్ష్యాల సాధన కోసం ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. సంపాదనను సంపదగా మలిచేందుకు అనుసరించాల్సిన మార్గాలపై మహిళలకు తప్పకుండా అవగాహన ఉండాల్సిందే. కారు కొనుక్కోవాలని, ఆభరణాలు కొనుగోలు చేయాలని, మంచి ట్రిప్లెక్స్ విల్లా సమకూర్చుకోవాలని, సెలవుల్లో ఎక్కడికైనా పర్యటించి రావాలనే కోరికలు, లక్ష్యాలు చాలా మందికి ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి అవసరమైన అడుగులు పెట్టుబడుల రూపంలో వేయాలి. ఆర్థిక, పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించేందుకు మహిళలు ఆర్జనా పరులే కానక్కర్లేదు. గృహలక్ష్మి అయినా సరే ఈ విషయాలు తెలిసి ఉండడం వల్ల ఎంతో లాభం ఉంటుంది. కుటుంబ లక్ష్యాల కోసం మార్కెట్లో పెట్టుబడుల వ్యవహారాలు నిర్వహించడం ఎలాగో తెలుసుకోవాలి. మహిళలు తమ పిల్లల కోసం, కుటుంబ బాధ్యతల కోసం లేదంటే తల్లిదండ్రుల కోసం కెరీర్ మధ్యలో పలు సందర్భాల్లో విరామం తీసుకుంటుంటారు. తమ జీవిత భాగస్వాములతో పోలిస్తే అధిక కాలం జీవించే అవకాశాలు ఉంటాయి. కనుక మహిళలకు తప్పకుండా పెట్టుబడుల వ్యవహారాలు తెలిసి ఉండాలి. నైపుణ్యాలు అవసరం.. పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించుకోవడం అన్నది నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. మొదటగా అసలు అందుబాటులో ఉన్న సాధనాలు ఏంటి? అనేది తెలుసుకోవాలి. తర్వాత వాటిల్లో ఏది తమకు అనుకూలమన్నది తేల్చుకోవాలి. పెట్టుబడుల్లో దేనికీ గ్యారంటీ ఉండదు. వివిధ సాధనాల గురించి లోతుగా తెలుసుకోవడం వల్ల మెరుగైన నిర్ణయాలకు వీలుంటుంది. పెట్టుబడుల అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ ధోరణుల గురించి ఆన్లైన్లో సమాచారాన్ని అందించే పోర్టళ్లు ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు. అవసరమైతే నిపుణుల సూచనలు తీసుకోవాలి. పెట్టుబడుల ఆరంభించే ముందు నెలవారీ నగదు ప్రవాహాలను ఒకసారి చెక్ చేసుకోవాలి. వస్తున్న ఆదాయం, పెడుతున్న ఖర్చులపై స్పష్టత ఉండాలి. నెలవారీ వేతనం, అద్దె ఆదాయం, ఇతర రూపాల్లో వచ్చేదంతా ఆదాయం కిందకే వస్తుంది. ఖర్చుల్లో తప్పనిసరి, తప్పనిసరి కాదు అని రెండు భాగాలు చేసుకోవాలి. విచక్షణారహితం కానివి అంటే.. ఇంటికి చెల్లించే అద్దె, గృహ రుణ చెల్లింపులు, పిల్లల స్కూల్ ఫీజులు, గ్రోసరీ, యుటిలిటీ కోసం చేసే ఖర్చు తదితరాలు. విచక్షణారహితం అంటే విలాసం, వినోదం కోసం చేసే ఖర్చులు. వీటి ఆధారంగా నెలవారీ ఎంత పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చులను తగ్గించుకోవాలనే దానిపై స్పష్టత వస్తుంది. దీంతో నెలవారీ బడ్జెట్‌ను రూపొందించుకోవచ్చు. లక్ష్యాలపై స్పష్టత.. పెట్టుబడికి లక్ష్యాలు తోడు కావాలి. అప్పుడే స్పష్టమైన మార్గం తెలుస్తుంది. వచ్చే ఏడాది కాలానికి ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి. అలాగే, ఐదేళ్లు, పదేళ్లు? ఇలా ప్రశ్నించుకోవాలి. వచ్చే ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లొచ్చు. లేదంటే 5–10 ఏళ్లలో సొంతిల్లు సమకూర్చుకోవచ్చు. లేదంటే 20–30 ఏళ్లకు వచ్చే రిటైర్మెంట్ తర్వాతి జీవితానికి నిధిని సమకూర్చుకోవడం కావచ్చు. ఇలా లక్ష్యాలన్నింటినీ నిర్ణయించుకున్న తర్వాత.. విడిగా ఒక్కో దానికి ఉన్న సమయం, ఎంత మొత్తం కావాలి, అందుకు నెలవారీగా ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అందుకు అనుకూలించే పెట్టుబడి సాధనాలపై స్పష్టత తెచ్చుకోవాలి. అత్యవసర నిధి అన్నింటికంటే ముందు అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. ఏ కారణం వల్ల అయినా ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. లేదా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ప్రమాదం కారణంగా ఉద్యోగానికి తాత్కాలికంగా వెళ్లలేకపోవచ్చు. ఇలాంటి ఊహించని ఖర్చులను ఎదుర్కోవాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం అత్యవసర నిధి. అత్యవసర నిధి అనేది ఎప్పుడైనా వినియోగించుకోవడానికి అందుబాటులో ఉండే సాధనం. దీనివల్ల కష్ట కాలంలో రుణాలను ఆశ్రయించకుండా దీని సాయంతో గట్టెక్కవచ్చు. సాధారణంగా అత్యవసర నిధి మూడు నుంచి ఆరు నెలల అవసరాలను తీర్చే స్థాయిలో ఉండాలి. దీన్ని సమకూర్చుకునేందుకు ప్రతి నెలా కొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. బ్యాంక్ ఖాతా లేదంటే లిక్విడ్ ఫండ్స్‌లో ఈ మొత్తాన్ని ఉంచుకోవచ్చు. ఒకవేళ అత్యవసర నిధి ఏర్పాటుకు సరిపడా నగదు ప్రవాహం లేకపోతే, ఏవైనా అవసరాలను తగ్గించుకుని అయినా ఇన్వెస్ట్ చేయాలి. బీమా రక్షణ మహిళలకు జీవిత బీమా పాలసీ అవసరమా? చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఇది. మహిళలకు కూడా జీవిత బీమా కావాలి. ఎందుకంటే వారు లేని లోటును పూర్తిగా కాకపోయినా, కొంత అయినా అధిగమించేందుకు జీవిత బీమా రక్షణ సాయపడుతుంది. బీమా రక్షణ ఉంటే, దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే, వారిపై ఆధారపడిన వారు ఇబ్బందుల పాలు కాకుండా ఉంటుంది. జీవిత బీమా అంటే జీవితంపై పెట్టుబడి పెట్టేది. భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టేది. చాలా మంది వివాహం అయి, తమకంటూ కుటుంబం ఏర్పాటైన తర్వాతే జీవిత బీమా గురించి ఆలోచిస్తుంటారు. కానీ, ఇది సరైనది కాదు. యుక్త వయసులోనే జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. జీవితంలో వివిధ దశల్లో, పెరిగే తమ బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ మొత్తాన్ని సవరించుకుంటూ వెళ్లాలి. ఇది భవిష్యత్తుకు భరోసానిచ్చేదిగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ సైతం మహిళలకు ఎంతో ముఖ్యం. పురుషులతో పోలిస్తే మహిళలకు అనారోగ్య సమస్యల రిస్క్ ఎక్కువ. గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. పోర్ట్‌ఫోలియో నిర్వహణ మహిళలు పెట్టుబడుల నిర్వహణలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడాన్ని గమనించొచ్చు. ఇదంతా గతం నుంచి ఉన్న ధోరణి వల్లేనని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల నిర్వహణ ఎలా? అన్న సందేహం ఎదురైతే.. ముందు తమ బలాల గురించి తెలుసుకోవాలి. రిస్క్‌కు దూరంగా సంప్రదాయ ధోరణితో ఉంటే డివిడెండ్ చెల్లించే కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు, యుటిలిటీ సంస్థలను పరిశీలించొచ్చు. రిస్క్ తీసుకునే వారు లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. అయితే మొత్తం పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట కాకుండా, వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం తప్పనిసరి. తమ జీవిత లక్ష్యాల సాకారానికి, మెరుగైన విశ్రాంత జీవనానికి.. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందుకు మహిళల ముందు ఎన్నో మార్గాలున్నాయి. ఇందుకోసం వెంటనే పెట్టుబడులు ప్రారంభించాలి. చాలా ముందుగా ఆరంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనంతో సంపద వేగంగా వృద్ధి చెందుతుంది. మహిళలకు సంబంధించి జీవిత లక్ష్యాలకు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీతోపాటు డెట్, బంగారం తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిపుణుల నిర్వహణలో, తగినంత వైవిధ్యం, రిస్క్ బ్యాలన్స్తో నడిచే మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఇవ్వగలవు. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు ఇదే తెలియజేస్తున్నాయి. స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసేంత విషయ పరిజ్ఞానం, సమయం లేని వారికి మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం. పరిమిత పెట్టుబడితోనే ఎన్నో రకాల కంపెనీలు, రంగాల్లో ఎక్స్పోజర్ లభిస్తుంది. అందులోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సగటు కొనుగోలు వ్యయం తగ్గి, అధిక రాబడి లభిస్తుంది. -
మనోళ్ల ‘హెల్త్ కవర్’ అంతంతే..!
సాక్షి, హైదరాబాద్: జీవిత బీమా, హెల్త్ కవర్–ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కవరేజీ వంటి విషయాల్లో భారతీయులు అంత చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, సరైన ఆరోగ్య రక్షణలు లేనివారు రూ. 20 వేల కోట్లకు పైగానే కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలపై చికిత్స కోసం వ్యయం చేయాల్సి వచ్చిదనే అనధికార అంచనాలున్నాయి. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎదురైన పరిస్థితుల కారణంగా మధ్య, దిగువ, పేద వర్గాల ప్రజలకు చెందిన వారు తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదంతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి అని 46 శాతం మంది భావిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న వైద్యఖర్చులకు ఈ హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయని 43 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇదీ అధ్యయనం... తాజాగా భారతీయ టెక్–ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ–అక్నో అధ్యయనంలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. 68 శాతం మందికి రూ.10 లక్షలలోపే ఆరోగ్య బీమా కవరేజీ ఉందని, వారిలోనూ 27 శాతం మందికి మెడికల్ కవర్ రూ. 5 లక్షలలోపే ఉన్నట్టుగా ఇది స్పష్టం చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లోని 28–55 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంస్థ నివేదికను సిద్ధం చేసింది. అన్లిమిటెడ్ కవరేజీ, కన్జుమబుల్స్, రూమ్‌రెంట్ క్యాపింగ్ వంటి వాటిపై పాలసీ హోల్డర్లకు అంతగా అవగాహన ఉండటం లేదన్న విషయం నివేదికలో వెల్లడైంది. -
బీమా పాలసీని వెనక్కి ఇచ్చేస్తే..?
విష్ణు స్వరూప్ (30) పేరిట రెండు జీవిత బీమా ఎండోమెంట్ పాలసీలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం తనకు ఉద్యోగం వచి్చన కొత్తలో ఆ పాలసీలను విష్ణు పేరిట ఆయన తండ్రి ప్రారంభించారు. వీటి కోసం ఏటా రూ.50,000 ప్రీమియంను విష్ణు స్వయంగా చెల్లిస్తున్నారు. ఈ రెండింటి రూపంలో వస్తున్న బీమా రక్షణ రూ.10 లక్షలు. కాల వ్యవధి 20 ఏళ్లు. ఎందుకోగానీ తాను తీసుకున్న బీమా ఉత్పత్తులు తగినంత రక్షణ ఇవ్వడం లేదన్న అభిప్రాయం అతడిలో కలిగింది. దీంతో ఓ ఆరి్థక సలహాదారుడిని సంప్రదించాడు. పాలసీల పూర్తి వివరాలు, విష్ణు ఆదాయం, జీవిత లక్ష్యాలన్నింటినీ సమగ్రంగా విశ్లేíÙంచిన అనంతరం.. వెంటనే సదరు రెండు ఎండోమెంట్ పాలసీలను సరెండ్ చేసేయాలని ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచించారు. నిపుణుడిని సంప్రదిస్తే కానీ, ఆ పాలసీల వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న విషయం అతడికి బోధపడలేదు. విష్ణు మాదిరే ఎండోమెంట్ పాలసీలకు భారీ ప్రీమియం చెల్లించే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమ ప్లాన్‌ను సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిన్న మొన్నటి వరకు జీవిత బీమా అంటే ఎక్కువ మందికి తెలిసింది ఎండోమెంట్ పాలసీల గురించే. టర్మ్ ఇన్సూరెన్స్ ఇటీవలి కాలంలోనే ఆదరణను, ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. ఎండోమెంట్ పాలసీలు గతంలో ప్రజల సహజ పొదుపు మనస్తత్వం కోణం నుంచి అభివృద్ధి చేసినవి. అంతేకానీ, అచ్చమైన బీమా రక్షణ కోసం కావు. పెట్టుబడుల సాధనాలు, రాబడులపై అవగాహన విస్తృతమవుతున్న కొద్దీ, టర్మ్ పాలసీల ప్రాధాన్యం తెలిసి వస్తోంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. పాలసీ హోల్డర్ దురదృష్టవశాత్తూ మరణిస్తే కుటుంబానికి మెరుగైన పరిహారం ఇచ్చి ఆదుకునేవి టర్మ్ ప్లాన్లు. కాల వ్యవధి ముగిసే రోజు వరకు జీవించి ఉంటే రూపాయి తిరిగి రాదు. దీనికి భిన్నంగా.. పాలసీ కాల వ్యవధిలో మరణించినా లేక పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉన్నా.. ఈ రెండు సందర్భాల్లోనూ ఎంతో కొంత ముట్టజెప్పేవి ఎండోమెంట్ ప్లాన్లు. ఇవి తక్కువ బీమా రక్షణ, తక్కువ రాబడితో కూడినవి. బీమా ఏజెంట్లు ఎండోమెంట్ ప్లాన్ల విక్రయానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తుంటారు. దీనిపై వారికి లభించే కమీషన్ ఎక్కువగా ఉంటుంది. మొదటి ఏడాది ప్రీమియంలో 10–25 శాతం వరకు వారికి కమీషన్‌గా ముడుతుంది. అంతేకాదు రెండో సంవత్సరం నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియంపై 5–7 శాతం కమీషన్‌గా ఏజెంట్లకు ఆదాయం వస్తూనే ఉంటుంది. టర్మ్ ప్లాన్ల పైనే ఇదే స్థాయిలో కమీషన్ ఉంటుంది. కాకపోతే టర్మ్ పాలసీల ప్రీమియం తక్కువ కనుక కమీషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. దేశ వాసుల్లో చాలా మందికి ఎండోమెంట్ ప్లాన్లే ఉన్నాయి. తెలిసిన ఏజెంట్ బలవంతం పెట్టాడని, స్నేహితులు, బంధువులు సూచించారని చెప్పి వీటిని తీసుకోవడం కనిపిస్తుంది. చెల్లిస్తున్న ప్రీమియానికి మెరుగైన బీమా రక్షణ ఇవ్వని, ప్రీమియం భారంతో కూడిన ఇలాంటి ఎండోమెంట్ ప్లాన్లను వదిలించుకునే మార్గం ఉంది. సరెండర్ చేసేయడమే.. ఎందుకు సరెండర్ చేయాలి..? తాము తీసుకున్న జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్‌లో తగినంత కవరేజీ లేదని, ప్రీమియం ఎక్కువగా ఉందని అనిపిస్తే దాన్ని నిలిపివేయడంలో ఎలాంటి తప్పు లేదు. జీవిత బీమా ప్లాన్ తీసుకునేది ఎందుకు..? తమకు ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకూడదనే. తమపై ఆధారపడిన వారు, అసాధారణ సందర్భాల్లో కష్టాలు పడకూడదంటే అందుకు తగినంత కవరేజీతో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండాల్సిందే. పిల్లల విద్య ఆగిపోకూడదు. వారి రోజువారీ జీవనం, ఇతర వ్యయాలు అన్నింటినీ జీవిత బీమా పరిహారం ఆదుకునే విధంగా ఉండాలి. అందుకే వార్షిక ఆదాయానికి ఎంతలేదన్నా కనీసం పది రెట్ల మేరకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. విష్ణు స్వరూప్నే ఉదాహరణగా తీసుకుందాం. అతడు రూ.10 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.50వేలు చెల్లిస్తున్నాడు. కానీ, కేవలం రూ.20 వేల వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా విష్ణు రూ.1.5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో విష్ణు అదే పనిచేశాడు. ఉన్న ఎండోమెంట్ ప్లాన్లను సరెండ్ చేశాడు. రూ.1.5 కోట్ల టర్మ్‌ప్లాన్ తీసుకున్నాడు. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి రూ.కోటి సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.25,000. ఎండోమెంట్ పాలసీల్లో బీమా రక్షణతోపాటు, ఎంతో కొంత రాబడి ఉంటుందన్నది చాలా మంది అభిప్రాయం. కానీ, ఇందులో వాస్తవం ఏంటన్నది పాలసీదారులకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి 4.5–5.5 శాతం మించి ఉండదు. అరుదైన సందర్భాల్లోనే రాబడి 6 శాతం ఉంటుంది. కానీ ద్రవ్యోల్బణం కూడా దీర్ఘకాల సగటు అదే స్థాయిలో ఉంది. దీంతో నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. ఉదాహరణకు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. సమ్ అష్యూర్డ్‌పై ఏటా 5 శాతం సింపుల్ గ్యారంటీడ్ అడిషన్ వస్తుంది. ఈ పాలసీలో మెచ్యూరిటీ కింద రూ.21 లక్షలు వస్తుంది. రాబడి రేటు 6.22 శాతం. ద్రవ్యోల్బణం 6 శాతం (సగటున) మినహాయిస్తే నికర రాబడి 0.22 శాతమే. అదే ఈక్విటీ పథకాల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తే రాబడి వార్షికంగా 10–12 శాతం లేదా అంతకంటే ఎక్కువే ఉంటుంది. డెట్ సాధనాల్లోనూ 7 శాతం మేర రాబడి వస్తుంది. పాలసీని నిలిపివేస్తే..? ఎండోమెంట్ ప్లాన్ గురించి ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత, ఇక వద్దనుకుంటే పాలసీదారుల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి నుంచి ప్రీమియం చెల్లించకుండా ఉండిపోవడం. లేదంటే పాలసీని సరెండర్ చేయడమే సరైనది. పాలసీలో కవరేజీ, రాబడి ఆకర్షణీయంగా లేదని అసంతృప్తిగా ఉంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించకుండా ఆగిపోవచ్చు. కాల వ్యవధి తర్వాత ఫండ్ వెనక్కి వస్తుంది. దీన్నే పాలసీ పెయిడప్ అని అంటారు. మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుందన్నది బీమా సంస్థ చెబుతుంది. అంతేకాదు, జీవిత బీమా కవరేజీ కూడా కొనసాగుతుంది. కాకపోతే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు అనుగుణంగా జీవిత బీమా కవరేజీని తగ్గిస్తారు. ఉదాహరణకు రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. అప్పుడు రూ.10 లక్షలకు బదులు రూ.2.5 లక్షల జీవిత బీమా కవరేజీ కాల వ్యవధి ముగిసే వరకు లభిస్తుంది. పెయిడప్ చేసే నాటికి జమ అయిన గ్యారంటీడ్ అడిషన్స్, బోనస్‌లు కలిపి పెయిడప్ వ్యాల్యూని నిర్ణయిస్తారు. సరెండర్ ఎప్పుడు చేయాలి? బీమా పాలసీల్లో సరెండర్ పెనాల్టీ ఎంతో ఎక్కువగా ఉంటుందని భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ నితిన్ మెహతా తెలిపారు. పాలసీ సరెండర్ చేయడానికి ముందే, ఎదురయ్యే ఆరి్థక ప్రతికూలతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అందుకుని సరెండర్ చేసే ముందు ఎంత వస్తుందన్నది తెలుసుకోవాలి. ఎండోమెంట్ ప్లాన్‌కు ప్రీమియం ఇక చెల్లించడం కష్టంగా ఉందని భావిస్తే అప్పుడు సరెండర్ చేస్తే ఎంతొస్తుంది? పెయిడప్‌గా మారిస్తే గడువు ముగిసిన తర్వాత ఎంతొస్తుందన్నది విశ్లేíÙంచుకోవాలి. సరెండర్ చేసినా లేక పెయిడప్ చేసినా.. అదే సమయంలో టర్మ్ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి. లేదంటే అసులు లక్ష్యమే దెబ్బతింటుంది. రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత సరెండర్ చేసేయాలని నిర్ణయించారు. దీంతో అప్పటి నుంచి ఏటా రూ.50,000 ప్రీమియం రూపంలో ఆదా అవుతుంది. అప్పుడు ఏటా రూ.20,000 ప్రీమియంపై రూ.కోటి టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. మిగిలిన రూ.30వేలను ఇండెక్స్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా చేస్తే ఏటా 12 శాతం సగటు రాబడి అంచనా ఆధారంగా 15 ఏళ్ల తర్వాత రూ.12.50 లక్షలు సమకూరుతుంది. ఐదేళ్ల తర్వాత సరెండర్ చేయడం వల్ల వచి్చన మొత్తాన్ని తీసుకెళ్లి ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అది కూడా ఏటా 12 శాతం చొప్పున 15 ఏళ్లలో వృద్ధి చెందుతుంది. బీమా, పెట్టుబడిని కలిపి చూడకూడదు. అచ్చమైన బీమా రక్షణ ఏర్పాటు చేసుకోవడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి రాబడి కోసం మేలైన పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. పాలసీ కాల వ్యవధి ముగియకముందే దాన్నుంచి వైదొలగాలని అనుకుంటే, సరెండర్ వేల్యూని వెనక్కి పొందొచ్చు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించారు, ఎంత చెల్లించారు, బోనస్, పెయిడప్ వేల్యూ ఆధారంగా సరెండర్ వేల్యూ ఎంతన్నది ఉంటుంది. ఇందుకు సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ చార్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. సరెండర్ ఫ్యాక్టర్ 35 శాతం అనుకుంటే.. రూ.10 లక్షల పాలసీలో రూ.3.5 లక్షలు పాలసీదారునికి దక్కుతుంది. పాలసీ తీసుకుని కాల వ్యవధి పెరుగుతూ వెళుతున్న కొద్దీ, ఈ సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ 70 శాతం వరకు చేరుతుంది. ‘‘కాల వ్యవధికి ముందే పాలసీని సరెండర్ చేస్తే తీవ్రంగా నష్టపోవాలి. సరెండర్ ఫీజుల రూపంలో అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలో గణనీయమైన మొత్తాన్ని కోల్పోతారు. కొన్ని కేసుల్లో బోనస్ వంటివి కూడా రావు. కనుక పాలసీ నియమ, నిబంధనలను చదివి అర్థం చేసుకోవాలి’’అని ఫైనాన్షియల్ ప్లానింగ్ సంస్థ ‘ఫైనాన్షియల్ స్మార్ట్’ సీఈవో నీతా మెనెజెస్ సూచించారు. సరెండర్ వేల్యూ విషయంలో బీమా సంస్థల మధ్య ఏకరూపత కనిపించదు. కొన్ని బీమా సంస్థలు ప్రత్యేకమైన సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్చార్ట్లను ఉపయోగిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో అయితే చాలా దారుణంగా, నామమాత్రంగా సరెండర్ వేల్యూని నిర్ణయిస్తున్నారు. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం ఆధారంగా సరెండర్ వేల్యూని కొన్ని ఖరారు చేస్తున్నాయి. సరెండర్ చేస్తే ఎంతొస్తుంది? సమ్ అష్యూర్డ్: రూ.10లక్షలు పాలసీ కాల వ్యవధి: 20 ఏళ్లు వార్షిక ప్రీమియం: రూ.50వేలు బోనస్ అడిషన్ ఏటా: రూ.50వేలు సరెండర్ కాల వ్యవధి 5ఏళ్ల 10 ఏళ్ల 15 ఏళ్ల తర్వాత తర్వాత తర్వాత పెయిడప్ వేల్యూ (రూ.లక్షల్లో) 5 10 15 సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ (శాతంలో) 35 50 70 సరెండర్ వేల్యూ (రూ.లక్షల్లో) 1.75 5 10.50. -
వందేళ్ల వరకు ఆదాయాన్నిచ్చే జీవిత బీమా పథకం
బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ఏస్ పేరిట జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇటు జీవిత బీమా అటు దీర్ఘకాలం అంటే వందేళ్ల వరకు ఆదాయాన్ని ఆఫర్ చేసే పథకం ఇది. పాలసీ ప్రారంభమయ్యాక తొలి నెల/సంవత్సరం నుంచి లేదా అయిదేళ్ల తర్వాత నుంచి కూడా ఆదాయాన్ని అందుకోవడాన్ని ఎంచుకోవచ్చు. అలాగే పాలసీ కాల వ్యవధిని కనీసం 10 ఏళ్ల నుంచి తమకు 100 సంవత్సరాలు వచ్చే దాకా ఎంచుకోవచ్చని సంస్థ ఎండీ తరుణ్ చుగ్ తెలిపారు. తమ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఎప్పుడు, ఎంతకాలం పాటు, రాబడిని ఎలా అందుకోవాలనుకుంటున్నదీ కూడా కస్టమర్లు తామే నిర్ణయించుకోవచ్చని ఆయన వివరించారు. వార్షిక ప్రీమియానికి సమ్ అష్యూర్డ్ 11 రెట్లు ఉంటుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో నామినీకి డెత్ బెనిఫిట్, ప్రీమియంల చెల్లింపు నుంచి మినహాయింపుతో పాటు రాబడి కొనసాగడం, మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మహిళా పాలసీదారులకు అదనంగా 2 శాతం ఆదాయ ప్రయోజనం ఉంటుంది. -
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారా? మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను తప్పదు!
న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే, వాటి మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తంపై పన్నును ఏ విధంగా లెక్కించాలన్నది ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సవరించిన నిబంధనలను నోటిఫై చేసింది. ఏడాదికి చెల్లించే ప్రీమియం రూ.5 లక్షలకు మించితే పాలసీ గడువు తర్వాత అందుకునే మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 2023 ఏప్రిల్ 1 తర్వాత నుంచి రూ.5 లక్షలకు మించి ప్రీమియం ఉండే పాలసీల మెచ్యూరిటీపై పన్ను అమల్లోకి వచ్చిన విషయం గమనార్హం. అంతకుముందు వరకు పాలసీల ప్రీమియం ఎంతన్న దానితో సంబంధం లేకుండా మెచ్యూరిటీ మొత్తంపై సెక్షన్ 10(10డీ) కింద పన్ను మినహాయింపు అమల్లో ఉంది. -
నామినీ నమోదు చేశారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్ లేని సందర్భాల్లో క్లెయిమ్ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నామినీ అంటే ఎవరు..? పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్‌ను పేర్కొంటే, సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. ఎంతో ప్రాధాన్యం.. 3నామినేషన్ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్ హేర్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ రిజిస్టర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్ దరఖాస్తులో నామినేషన్ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది. అకౌంట్ హోల్డర్ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ నామినేషన్ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్ కాలమ్‌ను తప్పకుండా పూరించాలి. ఎంత మంది? నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్‌కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు నామినేషన్ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి. సవరణ..: నామినేషన్ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్‌ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్‌ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి. ఊహించని అనుభవం 2021లో మద్రాస్ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది. సరైన నిర్ణయం మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. నామినేషన్ గడువు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్ 30 నాటికి నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్ గుర్తించాలి. -
జీవిత బీమా.. రాబడి చూడొద్దు
జీవిత బీమా అనగానే.. ప్రీమియం ఎంత.. రాబడి ఎంత..? అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికీ జీవిత బీమా విషయంలో ఎక్కువ మంది ఎంపిక సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలే. ఇందుకోసం భారీగా ప్రీమియం చెల్లిస్తుంటారు. ఒకవైపు బీమా కవరేజీ. మరోవైపు రాబడి. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా తప్పు. రాబడి రేటు చాలా తక్కువ. సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువేనని గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. మార్కెటింగ్‌లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని బీమా సంస్థలు, ఏజెంట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ స్పష్టంగా తేల్చుకోవాల్సింది ఏమిటంటే.. కావాల్సింది బీమా రక్షణా? లేక రాబడా? ఈ అంశాలను వివరించే కథనం ఇది... సంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి బీమా జ్యోతి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను చెల్లిస్తుంది. 55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై రూ.50 చొప్పున వస్తుంది. అంటే మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది. ప్రత్యామ్నాయం... బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైనా బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా అచ్చమైన జీవిత బీమా రక్షణను ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పై ఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేల లోపే. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. బీమా జ్యోతి ప్లాన్‌లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బీమా జ్యోతితో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. కాంపౌండింగ్ ఉండదు.. విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది. ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. గ్యారంటీడ్/ పార్టిసిపేటింగ్ బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్‌లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ను ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్ ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో చెల్లిస్తారు. ఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటున్నట్టు అయితే, కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్‌కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్‌ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమి యంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది. -
మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్
సాక్షి,ముంబై: దేశీయంగా ప్రధాన బ్యాంకులు తమ డెబిట్‌కార్డులపై వినియోగదారులకు ఉచిత ప్రమాద బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తాయి. అలాగే పోయిన సామాన్లు, లావాదేవీలకు రక్షణ కల్పిస్తాయి. డెబిట్ కార్డులతో, మెజారిటీ బ్యాంకులు కాంప్లిమెంటరీ బీమా కవరేజీని అందిస్తాయి. డెబిట్ కార్డులకు ఉచిత బీమా ఉంటుంది. వాస్తవానికి ఈ విషయం చాలామంది కస్టమర్లకు తెలియదు. ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తోపాటు, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించే కవరేజ్‌ని ఒకసారి చూద్దాం. (కేజీఎఫ్ లాంటి సూపర్ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!) కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యక్తిగత ప్రమాద మరణ ప్రయోజనాన్ని రూ. 25 లక్షల వరకు అందిస్తుంది. బీమా కవరేజీని యాక్టివేట్ చేయడానికి, ఏటీఎం లావాదేవీ, పాయింట్-ఆఫ్-సేల్ లావాదేవీ లేదా ఆన్లైన్ కొనుగోలు లాంటి విషయాల్లో ఘటనకు, లేదా ప్రమాద తేదీకి 90 రోజుల ముందు కనీసం ఒక్క సారైనా కార్డ్‌ని ఉపయోగించి ఉండాలి. అంతేకాకుండా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవరేజీని అందజేస్తుంది. దీని రూ. 6 లక్షల వరకు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన కార్డ్‌లతో మర్చంట్, ఆన్లైన్ పోర్టల్లలో చేసిన కొనుగోళ్లకు రక్షణ కల్పిస్తుంది. (మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్: నామినీ నమోదు ఎలా?) ఎస్బీఐ ఎయిర్‌లైన్ అందించే కవరేజీకి అదనంగా, ఎస్బీఐ డెబిట్ కార్డ్ రకాన్ని బట్టి విభిన్న విమానయాన ప్రమాద మరణ బీమాను అందిస్తుంది. స్థానిక, అంతర్జాతీయ విమానాలకు బ్యాగేజ్ నష్ట బీమాను కూడా అందిస్తుంది. అయితే ఎయిర్‌లైన్ టిక్కెట్‌ను కొనుగోలుకు బ్యాంకు డెబిట్ కార్డ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అదీ ప్రమాదం జరిగిన 90 రోజులలోపు ఉపయోగించాలి. అలా చేయడంలో విఫలమైతే బీమా ప్రయోజనం ఉండదు. ఒక వేళ కార్డ్ దారుడు విమాన ప్రమాదంలో మరణిస్తే, బీమా కవరేజ్ దాదాపు రెట్టింపు అవుతుంది. (Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) ఎస్బీఐకి సంబంధించి వివిధ రకాల కార్డులపై ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఎస్బీఐ గోల్డ్‌కు రూ. 2 లక్షలు, ప్లాటినం కార్డ్‌కు రూ. 5 లక్షలు, ప్రైడ్ కార్డ్‌కు రూ. 2 లక్షలు, ప్రీమియం కార్డ్‌కు రూ. 5 లక్షలు, వీసా, సిగ్నేచర్, మాస్టర్‌కార్డ్‌కు రూ. 10 లక్షలు బీమా కవరేజ్ ఉంటుంది. అలాగే ఎస్బీఐ డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసిన 90 రోజులలోపు, రూ. 1 లక్షల వరకు నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 1 కోటి వరకు లభించే ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మినహా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించే ప్రమాద బీమా కవరేజీ రూ. 5 లక్షలు. -
Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు
న్యూఢిల్లీ: బీమా సంబంధిత మోసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విధమైన మోసాల రిస్క్ నేపథ్యంలో.. చురుకైన రిస్క్ నిర్వహణ విధానం అవసరమని అవి భావిస్తున్నట్టు డెలాయిట్ సర్వే నివేదిక వెల్లడించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో మోసాలు పెరిగిపోవడాన్ని బీమా సంస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. డిజిటైజేషన్ పెరిగిపోవడం, కరోనా తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం, నియంత్రణలు బలహీనపడడం వంటివి మోసాలు పెరిగిపోవడానికి కారణాలుగా డెలాయిట్ ‘ఇన్సూరెన్స్ ఫ్రాడ్ సర్వే 2023’ నివేదిక వెల్లడించింది. మోసాలు భారీగా పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పగా, మోస్తరుగా ఉన్నట్టు 10 శాతం మంది తెలిపారు. 2020 జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. బీమా సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగుల అభిప్రాయాలను డెలాయిట్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలు బీమా రంగంలో వేగం, మెరుగైన కస్టమర్ అనుభవం, సులభ వినియోగానికి సాయపడినట్టు డెలాయిట్ తెలిపింది. అదే సమయంలో రిస్క్‌లు సైతం పెరిగినట్టు పేర్కొంది. డేటా చోరీ, థర్డ్ పార్టీల కుమ్మక్కు, బీమా ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయించడం అన్నవి బీమా రంగానికి ఆందోళనకర అంశాలుగా ప్రస్తావించింది. ఈ మోసాలను అధిగమించేందుకు వ్యూహాత్మక జోక్యం, బీమా కార్యకలాపాల నిర్వహణపై ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసమని సూచించింది. తిరిగి ఆవిష్కరించుకోవాలి.. ‘‘భారత బీమా రంగం డిజిటల్ విప్లవం ఆరంభ దశలో ఉంది. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్లను సొంతం చేసుకోవడం, టెక్నాలజీతో కూడిన అనుభవాన్ని అందించేందుకు ఇతర రంగాల మాదిరే బీమా పరిశ్రమ సైతం తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడర్ సంజయ్ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కంపెనీ బోర్డ్, యజమాన్యానికి మోసాల నివారణ ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు 40 శాతం జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. మిగిలిన బీమా కంపెనీల ప్రతినిధులు సైతం తమ ప్రాధాన్య అంశాల్లో మోసాల నివారణ కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పటిష్టమైన మోసాల నివారణ కార్యాచరణ అవసరమని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది. -
ఎగాన్ లైఫ్ ఐ టర్మ్ ప్లాన్.. స్వయం ఉపాధిలోని వారికి ప్రత్యేకం
హైదరాబాద్: స్వయం ఉపాధిలోని వారిని దృష్టిలో ఉంచుకుని ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐటర్మ్ ప్రైమ్ ఇన్సూరెన్స్’ ప్లాన్‌ను విడుదల చేసింది. వీరికి 10 శాతం ప్రీమియం తగ్గింపు ఇవ్వనుంది. 5 శాతం ఆన్లైన్ డిస్కౌంట్‌కు మరో 5 శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ తగ్గింపు మొదటి ఏడాది ప్రీమియంకే పరిమితం. కనీసం రూ.25 లక్షల సమ్ అష్యూర్డ్‌ను ఈ ప్లాన్ కింద పొందొచ్చని, గరిష్ట పరిమితి లేదని ఏగాన్ లైఫ్ ప్రకటించింది. ఏగాన్ లైఫ్ వెబ్ పోర్టల్ నుంచి, తన భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, అప్లోడ్ కూడా చేయనవసరం లేదని, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో ‘స్పెషల్ ఎగ్జిట్ వ్యాల్యూ’ ఆప్షన్ ఉందని, పాలసీదారు 55 ఏళ్ల వయసుకురాగానే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం అంతా వెనక్కి వస్తుందని పేర్కొంది. 99.03 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పరిశ్రమలో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ కవర్లను జోడించుకోవచ్చని తెలిపింది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
టాటా ఏఐఏ లైఫ్ పాలసీదారులకు కొత్త పథకం
ముంబై: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన యులిప్ పాలసీదారుల కోసం ‘ఎమర్జింగ్ అపార్చునిటీస్ ఫండ్’ అనే నూతన పతకాన్ని (ఎన్ఎఫ్వో) ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. మధ్య స్థాయి కంపెనీలు, భవిష్యత్తులో గణనీయమైన వృద్ధిని చూపించే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుందని ప్రకటించింది. యులిప్ హోల్డర్లు ఈ నూతన ఫండ్ ఆఫర్ కోసం ఈ నెల 30వరకు తమ ఆప్షన్ ఇచ్చుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
సంవత్సరానికి రూ.436 కడితే.. రూ.2 లక్షల బెన్ఫిట్
కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాన్ని అందిస్తోంది. అతి తక్కువ ప్రీమియంతో ఈ స్కీమ్ లబ్ధి దారులు రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఇన్సూరెన్స్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీమ్‌లో చేరిన వారు సంవత్సరానికి రూ.436 చెల్లించి రూ.2 లక్షల వరకు జీవిత బీమా భద్రతను పొందవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో పాలసీ దారుడు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 2 లక్షల్ని కేంద్రం అందజేస్తుంది. పథకంలో ఎలా చేరాలి? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ స్కీమ్‌లో చేరేందుకు బ్రాంచ్ బ్యాంక్, పోస్టాఫీస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న మొత్తం అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. అర్హతలు ఇవే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో చేరాలని భావించే వారు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు మాత్రమే అర్హులు. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. రూ. 2 లక్షలు ఎలా వస్తాయి? పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ టర్మ్ ఏడాది. అందువల్ల మీరు ప్రతి ఏడాది రూ.436 కట్టాలి. ఇలా డబ్బులు కట్టి పాలసీ తీసుకున్న వారు ఏ కారణం చేతనైనా మరణిస్తే.. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు లేదంటే నామినీకి రూ.2 లక్షల అందజేస్తారు. -
ఐపీవోకు ఇండియాఫస్ట్ లైఫ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,000–2,500 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్ సంస్థ బీవోబీ 8.9 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయనుంది. కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.92 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.30 కోట్లకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచనున్నాయి. ఇండియాఫస్ట్ లైఫ్‌లో బీవోబీ వాటా 65 శాతంకాగా.. కార్మెల్ పాయింట్(వార్బర్గ్ పింకస్)కు 26 శాతం, యూనియన్ బ్యాంక్‌కు 9 శాతం చొప్పున వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఇండియాఫస్ట్ లైఫ్ పేర్కొంది. -
టర్మ్ ఇన్సూరెన్స్.. తక్కువ ప్రీమీయం ఎక్కువ లాభం
-
ఎల్ఐసీ బంపరాఫర్, మరికొన్ని రోజులే..ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు!
పాలసీ దారులకు ఎల్ఐసీ బంపరాఫర్ ఇచ్చింది. కోవిడ్‌తో పాటు ఆర్ధిక కారణాల వల్ల కట్టలేని పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిచ్చింది. ఆలస్య రుసుము చెల్లించడం ద్వారా ఆగిపోయిన పాలసీలు మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని ఇప్పటికే ఎల్ఐసీ అధికారిక ప్రకటన చేసింది. అయితే మరో వారం రోజుల్లో ఎల్ఐసీ ఇచ్చిన అవకాశం ముగియనుండడంతో.. పాలసీ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్ఐసీ కోరింది. కోవిడ్-19 మహమ్మారి లైఫ్ ఇన్సూరెన్స్ అవసరాల్ని గుర్తు చేసింది. అందుకే సకాలంలో బీమా చెల్లించలేని కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనాల్ని కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాం. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25లోపు పాలసీదారులు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశం కల్పిస్తున్నాం' అంటూ ఎల్ఐసీ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇచ్చిన గడువు మరో వారం రోజుల్లో ముగుస్తుండగా, అందుకే పాలసీ దారులు పాలసీలను పునరుద్దరించుకోవాలని ఎల్ఐసీ అధికారిక వర్గాలు కోరుతున్నాయి. Press Release - Special Revival Campaign pic.twitter.com/uHIl8YF6OD — LIC India Forever (@LICIndiaForever) February 7, 2022 నిబంధనలకు మేరకు మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి ఐదేళ్లలోపు నిర్దిష్ట అర్హత గల ప్లాన్ల పాలసీలను పునరుద్ధరించవచ్చని స్పష్టం చేసింది. చెల్లించే మొత్తం ప్రీమియంలను బట్టి టర్మ్ అస్యూరెన్స్, హై-రిస్క్ ప్లాన్లు కాకుండా ఇతర ఆలస్య రుసుములలో రాయితీలు పొందవచ్చు. వైద్య అవసరాలపై ఎలాంటి రాయితీలు లేవు. అర్హత కలిగిన ఆరోగ్య, సూక్ష్మ-బీమా ప్లాన్లు కూడా ఆలస్య రుసుముతో రాయితీకి అర్హత పొందగలరని పేర్కొంది. రూ.లక్ష వరకు స్వీకరించదగిన మొత్తం ప్రీమియంతో సంప్రదాయ, ఆరోగ్య పాలసీలను ఎల్ఐసీ గరిష్ట పరిమితి రూ.2,000తో ఆలస్య రుసుముతో 20 శాతం రాయితీని అందిస్తోంది. అదేవిధంగా రూ.3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం మొత్తానికి, రూ.3,000 పరిమితితో 30 శాతం రాయితీ అందించబడుతుంది. మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ల కోసం ఎల్ఐసీ ఆలస్య రుసుములలో పూర్తి రాయితీని అందిస్తోంది. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
జీవితానికి బీమా అవసరం.. కానీ
ముంబై: దేశంలో మెజారిటీ ప్రజలు జీవిత బీమా అవసరాన్ని గుర్తిస్తున్నారు. జీవిత బీమా పాలసీ కొనుగోలును తప్పనిసరి అవసరంగా 91 శాతం మంది ప్రజలు భావిస్తున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (ఎల్ఐసీ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. అయితే ఇప్పటిప్పుడు జీవిత బీమాపై పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నది 70 శాతంగా ఈ సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా 40 పట్టణాల్లో 12,000 మంది ప్రజల అభిప్రాయాల ఆధారంగా సర్వే ఫలితాలను రూపొందించి ఇన్సూరెన్స్ కౌన్సిల్ విడుదల చేసింది. కరోనా ఎఫెక్ట్ జీవిత బీమా రంగంలో భాగస్వాములు అందరి అనుసంధాన వేదికగా లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పనిచేస్తుంటుంది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత జీవిత బీమా పాలసీ తీసుకునే వారు గణనీయంగా పెరిగినట్టు ఈ సర్వే గుర్తించింది. అయితే, జీవిత బీమా పాలసీ కొనుగోలుపై ఇప్పటికీ కొంత మందిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నట్టు పేర్కొంది. 91 శాతం మంది జీవిత బీమా ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నా.. తీసుకునేందుకు 70 శాతమే సుముఖంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ఆర్థిక రక్షణ కోసం.. భవిష్యత్తు ఆర్థిక భద్రత, కుటుంబ ఉమ్మడి ఆర్థిక లక్ష్యాలు, ఊహించనిది జరిగితే రక్షణ అన్నవి.. జీవిత బీమా కొనుగోలుకు ప్రధాన కారణాలుగా ఎక్కువ మంది చెప్పారు. ఇక జీవిత బీమా తీసుకునేందుకు ఉన్న అడ్డంకులను పరిశీలించినట్టయితే.. జీవిత బీమా అన్నది దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉండడంతోపాటు, ఖరీదైనదిగా భావించ డమేనని ఈ సర్వే పేర్కొంది. పశి్చమ భారత్‌లో అహ్మదాబాద్, ముంబై, పుణెలో 92 శాతం మంది జీవిత బీమా తప్పనిసరి అని గుర్తిస్తున్నారు. అన్ని ఆర్థిక సాధనాల్లోనూ జీవిత బీమా గురించి తెలిసిన వారు 96 శాతంగా ఉన్నారు. కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలిసిన వారు 63 శాతం మంది కాగా, ఈక్విటీ షేర్ల గురించి తెలుసని చెప్పిన వారు 39 శాతంగా ఉన్నారు. యవతతో పోలిస్తే 36 ఏళ్ల వయసుపైన ఎక్కువ మంది జీవిత బీమా కలిగి ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తాము ఏజెంట్ ద్వారా పాలసీ తీసుకుంటామని చెప్పగా.. ప్రతి 10 మందిలో ముగ్గురు బ్యాంకుల ద్వారా తీసుకుంటామని తెలిపారు. చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే! -
ఆర్థిక భద్రతకు మొదటి ప్రాధాన్యం
న్యూఢిల్లీ: జీవిత బీమా పట్ల భారతీయుల్లో గత రెండు సంవత్సరాల్లో ఎంతో అవగాహన పెరిగినట్టు మ్యాక్స్ లైఫ్ ‘ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్’ (ఐపీక్యూ) సర్వే తెలిపింది. ఈ సంస్థ వార్షికంగా సర్వే నిర్వహిస్తుంటుంది. ఇది నాలుగో ఎడిషన్ సర్వే. 2021 డిసెంబర్ 10 నుంచి 2022 జనవరి 14 వరకు ఆన్లైన్లో ఈ సర్వేను నిర్వహించింది. ► పట్టణ ప్రాంతాల్లో ప్రొటెక్షన్ క్వొటెంట్ 3 పాయింట్లు పెరిగి 50కు చేరుకుంది. గతంతో పోలిస్తే ఇది క్రమంగా పెరుగుతోంది. ► కరోనా భయాలు తగ్గిపోతుండడంతో పట్టణ ప్రాంతాల్లోని పాలసీదారులు పిల్లల విద్య, రిటైర్మెంట్ వంటి ప్రణాళికలను సమీక్షించుకుంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. ► కరోనా వల్ల ఏర్పడిన ఆందోళనలు తగ్గినా, వ్యక్తిగత రక్షణ విషయంలో ఆందోళన నెలకొంది. ► మెట్రోలు, టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో ప్రొటెక్షన్ ఇండెక్స్ పెరిగింది. అంటే రక్షణ పట్ల అవగాహన విస్తృతం అయింది. ► ముఖ్యంగా టైర్–2 ప్టణాల్లో జీవిత బీమా పట్ల అవగాహన 61 పాయింట్ల నుంచి 68 పాయింట్లకు ఎగిసింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో జీవిత బీమా పట్ల అవగాహనను ఇది తెలియజేస్తోంది. ► టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి శాతం గతేడాది ఉన్న 39 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. ► పట్టణ ప్రాంతాల్లో సగానికంటే ఎక్కువ మంది తమకున్న టర్మ్ కవరేజీ సరిపడదన్న అభిప్రాయంతో ఉన్నారు. ► పాలసీదారులు కట్టాల్సిన ప్రీమియం కంటే కూడా, తమకు కావాల్సిన బీమా రక్షణపైనే దృష్టి పెడుతుండడం మార్పునకు నిదర్శనం. ► చివరి గమ్యం వరకు జీవిత బీమా పట్ల అవగాహన కలిగించే విషయంలో అడ్డంకులను అధిగమించాల్సి రావడం పరిశ్రమ ముందున్న సవాలుగా ఈ సర్వే పేర్కొంది. అవగాహన విస్తృతం ‘‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జీవిత బీమా పట్ల అవగాహన పెరిగినట్టు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత అవగాహన గణనీయంగా పెరిగింది. కరోనా సమసిపోతున్నా గరిష్ట స్థాయిలో అవగాహన కొనసాగుతుండడం సంతోషకరం. ప్రజలు మరింత రక్షణాత్మకంగా వ్యవహరిస్తుండడం అన్నది మంచిది. ఈ అవగాహన కొనుగోళ్లకు దారితీస్తోంది. టర్మ్, సేవింగ్స్, యూనిట్ లింక్డ్ పాలసీలు ఇలా అన్ని విభాగాల్లోనూ మెరుగుదల కనిపిస్తోంది. ఒకరు ఒకటికంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటున్నారు’’ అని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో, ఎండీ ప్రశాంత్ త్రిపాఠి తెలిపారు. -
ఎల్ఐసీకి భారీ షాక్, తగ్గుతున్న ఆదాయం
జీవిత బీమా కంపెనీల (లైఫ్ ఇన్సూరెన్స్)కు డిసెంబర్ నెలలో నూతన పాలసీల రూపంలో రూ.24,466 కోట్ల ప్రీమియం ఆదాయం వచ్చింది. 2020 డిసెంబర్లో ఆదాయం రూ.24,383 కోట్లతో పోలిస్తే పెద్దగా వృద్ధి చెందలేదని తెలుస్తోంది. 2021 డిసెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను ఐఆర్డీఏఐ విడుదల చేసింది. జీవిత బీమా దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్ఐసీ పనితీరు నిరాశపరిచింది. ఈ సంస్థకు కొత్త పాలసీల ప్రీమియం (న్యూ బిజినెస్) రూపంలో ఆదాయం డిసెంబర్ నెలలో 20 శాతం క్షీణించి రూ.11,434 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఎల్ఐసీకి కొత్త పాలసీ రూపంలో రూ.14,345 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. ప్రైవేటు సంస్థల మెరుగైన పనితీరు మిగిలిన 23 ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం ఆదాయం ఉమ్మడిగా 30 శాతం పెరిగింది. రూ.13,032 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఇది రూ.10,037 కోట్లుగానే ఉంది. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ న్యూ బిజినెస్ ఆదాయం 55 శాతం పెరిగి రూ.2,973 కోట్లకు చేరింది. ఎస్బీఐ లైఫ్ ఆదాయం సైతం 27 శాతం వృద్ధితో రూ.2,943 కోట్లుగా నమోదైంది. బజాజ్ అలియాంజ్ లైఫ్ కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం 70 శాతం పెరిగి రూ.1,164 కోట్లకు చేరుకుంది. మ్యాక్స్‌లైఫ్ ఆదాయం 32 శాతం పెరిగి రూ.1,013 కోట్లుగా ఉంటే, టాటా ఏఐఏ లైఫ్ ఆదాయం 50 శాతం పెరిగి రూ.660 కోట్లుగా ఉంది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఆదాయం 6 శాతం పెరిగి రూ.544 కోట్లకు చేరింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆదాయం 6 శాతం క్షీణించి రూ.1,380 కోట్లకు పరిమితమైంది. కోటక్ మహీంద్రా లైఫ్ ఆదాయం స్వల్పంగా తగ్గగా.. ఏగాన్ లైఫ్ న్యూ బిజినెస్ ప్రీమియం 36 శాతం పడిపోయి రూ1.29 కోట్లుగా ఉంది. తొమ్మిది నెలల్లో మిశ్రమ ధోరణి 2021–22లో మొదటి తొమ్మిది నెలల్లో అన్ని జీవిత బీమా సంస్థల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 7 శాతం పెరిగి రూ.2,05,231 కోట్లుగా ఉంది. ఈ కాలంలో ఎల్ఐసీ ఆదాయం 3 శాతం తగ్గి రూ.1,26,015 కోట్లుగా ఉంటే.. 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థల ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.79,217 కోట్లుగా నమోదైంది. చదవండి: ఇన్సురెన్స్ కంపెనీకి వార్నింగ్.. రూ.79 లక్షలు చెల్లించాలంటూ ఆదేశం -
పాలసీ దారులకు షాక్?
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంను పెంచాలనుకుంటున్నట్టు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ మహేష్ బాలసుబ్రమణియన్ తెలిపారు. నూతన పాలసీకి అనుమతి కోసం త్వరలోనే బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ముందు దరఖాస్తు చేసుకోనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా బీమా సంస్థలు, బీమాపై బీమాను ఆఫర్ చేసే సంస్థలు (రీఇన్సూరెన్స్) తీవ్రంగా ప్రభావితమైనట్టు చెప్పారు. తమ ఉత్పత్తుల ప్రీమియం ధరలు, అండర్‌రైటింగ్ (చెల్లింపుల బాధ్యతను స్వీకరించడం) నిబంధనలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడినట్టు వివరించారు. గడిచిన కొన్ని నెలలుగా భారీ ఎత్తున క్లెయిమ్‌లు రావడంతో ఇప్పటికే చాలా కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల ప్రీమియంను పెంచినట్టు చెప్పారు. ‘‘చివరిగా మేము గతేడాది ఏప్రిల్‌లో ప్రీమియం పెంచాము. పరిస్థితులను మదింపు వేసిన అనంతరం నూతన ఉత్పత్తి కోసం దరఖాస్తు చేసుకుంటాము’’ అని చెప్పారు. ధరల పెంపు కాకుండా, వాస్తవ పరిస్థితులను ప్రతిఫలించేలా తమ ఉత్పత్తి ఉంటుందన్నారు. 2021–22 మొదటి ఆరు నెలల్లో 62,828 క్లెయిమ్‌లకు సంబంధించి రూ.1,230 కోట్లను ఈ సంస్థ చెల్లించడం గమనార్హం. చదవండి: మరణించినా, జీవించి ఉన్నా ప్రయోజనం.. కొత్త టర్మ్ ప్లాన్ వివరాలు -
టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటి చాలదా..?
జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ సాధనం ఎంతో కీలకమైనది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్‌తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ ఎక్కువ మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. కొందరికి ఒకటికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటి ఉంటే సరైనది.. రెండుంటే ప్రతికూలమని చెప్పడానికి లేదు. ఏ ప్రయోజనాలను ఆశించి ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు తీసుకున్నామనే స్పష్టత అయితే ఉండాలి. వాస్తవానికి ఎక్కువ ప్లాన్లను కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, ఎన్ని ఉన్నా.. కవరేజీ తగినంత ఉండడం కీలకమని గుర్తుంచుకోవాలి. ఒకటికి మించిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో ఉండే లాభ, నష్టాలపై అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది దీర్ఘకాలానికి తీసుకోతగిన బీమా సాధనం. పాలసీదారు ఏదేనీ కారణంతో మరణించినట్టయితే.. ఆ వ్యక్తిపై ఆధారపడినవారు, కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకునే సాధనం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. సరైన బీమా రక్షణతో తీసుకోవడమూ అంతే కీలకం. పాలసీదారు లేని పరిస్థితుల్లో కుటుంబ అవసరాలు, బాధ్యతలు, స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాలన్నింటినీ బీమా పరిహారం తీర్చేదిగా ఉండాలి. పాలసీ తీసుకునే సమయంలో ఎంత మొత్తంకావాలన్నది నిర్ణయించుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. దీంతో ఎక్కువ మంది అవసరానికంటే తక్కువ మొత్తానికే కవరేజీతో సరిపెట్టుకుంటుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్‌లో మాదిరిగా లైఫ్ ఇన్సూరెన్స్‌కు టాపప్ సదుపాయం ఉండదు. కనుక ఒక్కసారి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాత తదనంతర పరిస్థితుల్లో కవరేజీ చాలదని గుర్తించినట్టయితే అదనంగా మరొక టర్మ్ ప్లాన్‌ను జోడించుకోవడం మినహా మరో మార్గం లేదు. ఒకటికి మించి టర్మ్ ప్లాన్లను తీసుకోవడం మన దేశంలో చట్టబద్ధమే. ఎన్నో రకాల ప్రయోజనాలు వాటితో వస్తాయి. గరిష్ట కవరేజీ, భిన్నమైన ప్రయోజనాలు ఆయా ప్లాన్లతో ఏర్పాటు చేసుకోవచ్చు. రెండో టర్మ్ ప్లాన్ తీసుకోవాలని భావించినట్టయితే.. నేరుగా బీమా కంపెనీ నుంచి తీసుకోవడం మంచిది. వివిధ కంపెనీలు ఆఫర్ చేసే ప్లాన్లలో భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలు, మినహాయింపలు, జోడింపులు ఉంటాయి. కనుక వేర్వేరు కంపెనీల నుంచి టర్మ్ ప్లాన్ ఉండడం ఒక విధంగా లాభదాయకమే. కాకపోతే మొదటి పాలసీ తర్వాత నుంచి ఎన్ని పాలసీలు తీసుకున్నా కానీ, అంతకుముందు బీమా పాలసీల గురించి తప్పకుండా ప్రపోజల్ పత్రంలో పేర్కొనాలి. ఈ సమాచారంతోనే కంపెనీలు రిస్క్‌ను మదింపు వేసుకుని, తమ నిర్ణయాన్ని తెలియజేయగలవు. అప్పటి వరకు ఉన్న ప్లాన్ల వివరాలను దాచి పెడితే భవిష్యత్తులో క్లెయిమ్‌ల సమయంలో ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అందువల్ల గత ప్లాన్ల వివరాలు దాచిపెట్టవద్దు. వయసు ఆధారంగా.. వయసు ఆధారంగా బీమా కవరేజీని నేడు బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు 18–35 ఏళ్ల వయసు వారు వార్షికాదాయానికి గరిష్టంగా 25 రెట్ల బీమా కవరేజీకి అర్హులు. 36–40 ఏళ్ల వయసు వారు వార్షిక ఆదాయానికి 20 రెట్లు.. 41–50 ఏళ్ల గ్రూపులో ఉన్న వారు వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు కవరేజీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క పాలసీ అయినా, ఒకటికి మించి టర్మ్ ప్లాన్లు అయినా వార్షిక ఆదాయ రుజువును చూపించాల్సిందే. ఎక్కువ ప్లాన్లు ఎందుకు? ఒకటి చాలక ఇంకొకటి తీసుకుంటున్నారా..? లేక వేరే ప్రయోజనాల కోసం ఒకటికి మించి ప్లాన్లను తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు కచ్చితంగా పాలసీదారులు సమాధానం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్క ప్లాన్‌లో తగినంత కవరేజీ తీసుకుంటే అయ్యే ప్రీమియంతో పోలిస్తే.. అంతే కవరేజీని ఒకటికి మించి ప్లాన్ల రూపంలో తీసుకోవాలంటే కాస్త అధిక ప్రీమియం భరించాల్సి రావచ్చు. అయినప్పటికీ ఒకటికి మించి ప్లాన్లతో ఉంటే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే అదే మంత భారం అనిపించదు. ఒకటికి మించిన ప్లాన్లను వేర్వేరు సంస్థల నుంచి తీసుకోవడం వల్ల.. బీమా కవరేజీలో వైవిధ్యానికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. ఉదాహరణకు శాంతన్ అనే వ్యక్తి తనకు రూ.కోటి బీమా రక్షణ అవసరమని భావించాడనుకుంటే.. రూ.కోటి కవరేజీతో ఒక సంస్థ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకున్నాడనుకోండి. క్లెయిమ్ సమయంలో వివాదం లేదా సమస్య ఏర్పడి సకాలంలో పరిహారం అందకపోతే అతడి కుటుంబం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రూ.కోటి సమ్ అష్యూరెన్స్‌ను ఒకటికి మించిన పాలసీల పరిధిలో వేర్వేరుగా తీసుకుంటే.. అప్పుడు కనీసం ఒక సంస్థ నుంచి అయినా సకాలంలో పరిహారం లభిస్తుంది. ఇది మరణించిన వ్యక్తి కుటుంబానికి ఉపశమనాన్నిస్తుంది. అలాగే, శాంతన్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకుంటే.. రూ.కోటి కవరేజీకి బీమా కంపెనీలు అంగీకరించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లోనూ ఒకటికి మించిన సంస్థల నుంచి తక్కువ మొత్తాలతో బీమా ప్లాన్‌ను తీసుకోవచ్చు. అలా గరిష్ట కవరేజీకి అవకాశం లభిస్తుంది. రుణ భారం అప్పటికే ఒక టర్మ్ ప్లాన్ ఉన్నా కానీ, మరొక పాలసీ తీసుకోవాల్సిన ప్రత్యేక సందర్భాలు కూడా ఉంటాయి. మొదటి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాతి కాలంలో.. ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటే కచ్చితంగా అదనపు కవరేజీ అవసరం ఏర్పడుతుంది. రుణానికి సమాన స్థాయిలో కవరేజీతో మరొక ప్లాన్‌ను తీసుకోవాలి. గృహ రుణం, వ్యాపారం కోసం రుణాలను తీసుకుంటే, వెంటనే ఆ రుణ భారానికి సమాన స్థాయిలో టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. అలా కాకుండా అప్పటికే ఒక బీమా ప్లాన్ ఉందిలేనని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ముందు తీసుకున్న టర్మ్ ప్లాన్ కుటుంబ అవసరాల కోసమని గుర్తు పెట్టుకోవాలి. రుణాలకు ప్రత్యేకమైన కవరేజీ లేకపోతే.. అప్పుడు కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న టర్మ్ ప్లాన్.. పాలసీదారు మరణించిన తర్వాత రుణ భారాలను చెల్లించడానికి కరిగిపోవచ్చు. ముఖ్యంగా టర్మ్ ప్లాన్ కవరేజీ ‘హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ’ (హెచ్ఎల్వీ)ను మించి ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తి ఆదాయం, పొదుపు, బాధ్యతలన్నింటినీ కలిపితే వచ్చేదే హెచ్ఎల్వీ. దీనిని బట్టి ప్లాన్ ప్రణాళిక ఉంటే సరిపోతుంది. భారం దించుకోవచ్చు.. అలాగే ఎక్కువ టర్మ్ ప్లాన్లను కలిగి ఉంటే.. 50 వసంతాలను దాటి, తమపై బాధ్యతలు తగ్గిపోతున్న తరుణంలో ఒకటి, రెండు టర్మ్ ప్లాన్లను నిలిపివేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం భరించలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం ఒక ప్లాన్‌ను అయినా సరెండర్ చేయడం ద్వారా కొంత భారాన్ని దించుకోవచ్చు. అలా కాకుండా అధిక కవరేజీతో ఒక్కటే ప్లాన్ ఉంటే రక్షణ కోసం కచ్చితంగా దాన్ని కొనసాగించుకోక తప్పదు. మరోవైపు బీమా పరిశ్రమ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. పాలసీల పరంగా భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలతో కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. పాలసీదారులకు భిన్నమైన సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఉత్పత్తులతో పోలిస్తే.. 5–10–20 ఏళ్ల క్రితం ప్లాన్లు చాలా సాధారణంగానే ఉండేవి. ప్రస్తుతం టర్మ్ ప్లాన్లలో జీవిత భాగస్వామి (గృహిణులకు సైతం)కి సైతం కవరేజీని తీసుకునే అవకాశం ఉంది. అలాగే, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ రైడర్, ప్రమాద మరణం, ప్రమాద వైకల్యం, చిన్నారుల భవిష్యత్తు ప్రయోజనాలను రైడర్ రూపంలో చాలా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పాలసీదారు తన ఆర్థిక, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా టర్మ్ ప్లాన్ కవరేజీలను ఎంపిక చేసుకోవాలి. -
కోవిడ్ ఎఫెక్ట్, భారీగా పెరగనున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో బీమాపై ప్రజల మైండ్‌సెట్ నెమ్మదిగా మారుతోందని, ఇన్సూరెన్స్ అవసరం గురించి అవగాహన పెరుగుతోందని వెల్లడించారు ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ ఏజియాస్ ఫెడరల్ ఎండీ, సీఈవో విఘ్నేష్ షహాణే. టర్మ్, హెల్త్ పాలసీలకు డిమాండ్ కనిపిస్తోందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కోవిడ్ పరిణామాల కారణంగా క్లెయిమ్‌లు గణనీయంగా పెరగడంతో.. టర్మ్ ప్లాన్ ప్రీమియంలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు.. కోవిడ్ నేపథ్యంలో బీమాపై ప్రజల ధోరణి ఎలా ఉంటోంది? సాధారణంగా భారతీయుల మైండ్ సెట్ బట్టి చూస్తే.. జీవిత బీమా పాలసీ తీసుకున్నప్పుడు ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే, ఇన్వెస్ట్ చేసిన దానిలో ఎంతో కొంత వెనక్కి రావాలని ఆశిస్తారు. దీంతో టర్మ్ ప్లాన్లు తక్కువ ప్రీమియంకే అధిక కవరేజీ ఇచ్చేవి అయినప్పటికీ.. క్లెయిమ్ ఉంటే తప్ప ఆర్థిక ప్రయోజనం అందించవు కాబట్టి వాటికి అంతగా ఆదరణ దక్కలేదు. అయితే, అనిశ్చితిలో ఆర్థికంగా రక్షణ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం టర్మ్ ప్లాన్లు, హెల్త్ ప్లాన్లపై అవగాహన పెరుగుతోంది. పొదుపు పథకాలు, రిటైర్మెంట్, యాన్యుటీ ప్లాన్లపైనా ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా మంచి ఏదైనా జరిగిందంటే అది ఇదే. ఈ విషయంలో మైండ్‌సెట్ మెరుగుపడటం నెమ్మదిగా మొదలైంది. ఇది గణనీయంగా మారడానికి ఇంకాస్త సమయం పడుతుంది. పొదుపు సాధనంగా కూడా బీమా పథకాలకు ఆదరణ ఎలా ఉంది? మహమ్మారి సమయంలో ఉద్యోగాలు పోయి, జీతాల్లో కోత పడి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. దీంతో కష్టకాలంలో ఆదుకోవడానికి పొదుపు అవసరం కూడా పెరుగుతోంది. ఇటు పొదుపు అటు ఆర్థిక భరోసా పొందడానికి జీవిత బీమా మెరుగైన సాధనంగా ఉపయోగపడగలదు. పదేళ్ల లోపు పిల్లలున్న తల్లిదండ్రుల ఆర్థిక సన్నద్ధత, పెట్టుబడుల నిర్ణయాలను అంచనా వేసేందుకు మేను ఇటీవల యూగవ్ ఇండియా సంస్థతో కలిసి ఫ్యూచర్ఫియర్లెస్ సర్వే నిర్వహించాము. ఇతరత్రా పిల్లల పెళ్లి, వ్యాపారాల కోసం పొదుపు చేయడం వంటి జీవిత లక్ష్యాలకన్నా తమ పిల్లల విద్య అవసరాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇందులో పేరెంట్స్ తెలిపారు. ఇందుకోసం యూలిప్‌లు, మనీబ్యాక్, ఎండోమెంట్ ప్లాన్స్ వంటి జీవిత బీమా సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని మూడింట రెండొంతుల మంది చెప్పడం గమనార్హం. భవిష్యత్‌లో అనిశ్చితి నుంచి కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు తక్కువ రిస్కుతో దీర్ఘకాలానికి సురక్షిత పెట్టుబడి సాధనంగా జీవిత బీమాను ఎంచుకుంటున్నారు. జీవిత బీమా పాలసీలను కొనసాగించేందుకు, రెన్యూ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుండటంతో బీమా ప్రీమియం వసూళ్లు కూడా మెరుగ్గా ఉంటున్నాయి. యులిప్ (యూనిట్ లింక్డ్ పాలసీలు) అమ్మకాలు పెరగడానికి ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు బా గా రాణిస్తుండటం కూడా కొంత దోహదపడింది. కోవిడ్ క్లెయిముల పరిస్థితి ఎలా ఉంది? గత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా రూ. 116 కోట్ల క్లెయిములు వచ్చాయి. ఈసారి స్థూలంగా 2–2.5 రెట్లు పెరగవచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరం మొత్తం క్లెయిముల్లో.. కోవిడ్ క్లెయిములు 25 శాతం ఉన్నాయి. ఈసారి తొలి త్రైమాసికంలో మొత్తం క్లెయిముల్లో వీటి వాటా 75 శాతంగా ఉన్నప్పటికీ, తర్వాత త్రైమాసికాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తుండటంతో తగ్గాయి. అయితే, ఇవి తగ్గినప్పటికీ కోవిడ్ వల్ల ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తి కోవిడ్–యేతర కారణాలతో మరణించే వారి సంఖ్య గతంలో కన్నా పెరిగింది. జీవిత బీమా ప్రీమియంలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? అవును. కోవిడ్ క్లెయిములు.. ముఖ్యంగా రెండో వేవ్‌లో.. గణనీయంగా ఎగియడం వల్ల రీఇన్సూరెన్స్ సంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో అవి టర్మ్ ప్లాన్ రేట్లను పెంచే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా 20–40 శాతం మేర రేట్లు పెరగవచ్చని అంచనా. అయితే, రీఇన్సూరెన్స్ సంస్థ .. జీవిత బీమా సంస్థను బట్టి, అలాగే ఆయా రీఇన్సూరెన్స్ సంస్థలతో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్న వ్యాపార పరిమాణం బట్టి పెంపు ఆధారపడి ఉంటుంది. దక్షిణాదిలో మీ వ్యాపార ప్రణాళికలు ఏమిటి? ఫెడరల్ బ్యాంకుకు విస్తృతమైన నెట్వర్క్ ఉండటంతో దక్షిణాది రాష్ట్రాలపై మేము ముందు నుంచీ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి కాలంలో దక్షిణాదిలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మా వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందింది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయిదు ఏజెన్సీ శాఖలు, 1,000 పైచిలుకు అడ్వైజర్లు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏజెన్సీ, డిజిటల్, డైరెక్ట్ సేల్స్ మొదలైన మాధ్యమాల ద్వారా పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోబోతున్నాం. వ్యాపార వృద్ధి అంచనాలేమిటి? గత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ అనిశ్చితి కారణంగా తొలి మూడు నెలలు లాక్‌డౌన్‌లోనే గడిచిపోయినప్పటికీ మేము ఊహించిన దానికన్నా మెరుగ్గానే రాణించాం. మొత్తం ప్రీమియం వసూళ్లు 6 శాతం పెరిగాయి. వరుసగా తొమ్మిదో ఏడాది లాభాలు ప్రకటించగలిగాం, వరుసగా మూడో ఏడాది 13 శాతం మేర డివిడెండ్ ఇచ్చాం. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కూడా సెకండ్ వేవ్, లాక్డౌన్ లాంటి వాటితో అనిశ్చితిలోనే మొదలైనప్పటికీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతోంది. ప్రీమియం విషయంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30–35 శాతం వృద్ధి సాధించగలమని ఆశిస్తున్నాం. -
తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ .. తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గత మూడు నెలల వ్యవధిలో 9 శాఖలు ఏర్పాటు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2,000 మంది పైచిలుకు అడ్వైజర్లను నియమించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా సుమారు 1,400 మంది చేరారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టాటా ఏఐఏ లైఫ్ శాఖల సంఖ్య 22కి చేరగా, అడ్వైజర్ల సంఖ్య 4,400 పైచిలుకు పెరిగింది. కంపెనీ ఎండీ, సీఈవో నవీన్ తహ్లియానీ మీడియా సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమకు సుమారు 314 శాఖలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 12, తెలంగాణలో 10 ఉన్నాయని చెప్పారు. ఏజెన్సీల ద్వారా వచ్చే కొత్త ప్రీమియం వసూళ్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 8%గా నమోదైందని, అన్ని మాధ్యమాల ద్వారా వచ్చిన కొత్త ప్రీమియం వ్యాపారంలో ఇది 5.5%గా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ.54,000 కోట్లుగా ఉంటాయన్నారు. 30–40 శాతం వృద్ధి అంచనా.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ఆదాయం సుమారు 30% పెరిగి రూ. 11,105 కోట్లకు చేరిందని నవీన్ చెప్పారు. తమ కంపెనీపరంగా ఈ ఆర్థిక సంవత్సరం కూడా 30–40% వృద్ధి అంచనా వేస్తున్నామని, పరిశ్రమ సగటు 20% స్థాయిలో ఉండవచ్చన్నారు. సుమారు రూ. 488 కోట్లు సమీకరించేందుకు నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నుంచి అనుమతి లభించిందని, త్వరలో ఈ నిధులను సమీకరించనున్నామని నవీన్ పేర్కొన్నారు. కోవిడ్ క్లెయిమ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో రీఇన్సూరెన్స్ సంస్థలు కూడా రేట్లు పెంచే యోచనలో ఉన్నాయని ఆయన తెలిపారు. దీనివల్ల పాలసీదారులపై భారం పడకుండా ఉండేలా చూసేందుకు వాటితో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. -
జీవిత బీమా ‘క్లెయిమ్’ చేయాల్సి వస్తే..?
మనం ఎంతగానో ప్రేమించే వారు దూరమైతే కోలుకోవడానికి సమయం పడుతుంది. అదే సమయంలో దూరమైన వ్యక్తికి సంబంధించి కుటుంబం ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. జీవిత బీమా ఉంటే ఈ సవాళ్లను కొంత వరకైనా అధిగమించే శక్తిని సమకూర్చుకోవచ్చు. దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణానికి గురైతే నామినీగా నమోదై ఉన్న వారు క్లెయిమ్ (జీవిత బీమా పరిహారం కోసం) ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా, వేగంగా నిర్వహిస్తే.. అంతే వేగంగా పరిహారం చేతికి అందుతుంది. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాన్ని తెలియజేసే ‘ప్రాఫిట్ ప్లస్’ కథనమే ఇది. క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు నామినీగా ఉన్నవారు పాలసీదారు మరణానికి సంబంధించి సమాచారాన్ని జీవిత బీమా సంస్థకు తెలియజేయడం మంచిది. ఈ మెయిల్ లేదా ఫోన్ రూపంలో సమాచారం ఇవ్వొచ్చు. ఆ తర్వాత కావాల్సిన పత్రాలతో క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో పాలసీదారుల సౌలభ్యం కోసం బీమా సంస్థలు ఆన్లైన్లోనే చాలా వరకు ప్రక్రియలను అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎక్సైడ్ లైఫ్ క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో చేపడుతున్నాయి. ఆన్లైన్లో అనుమతిస్తున్నాయంటే.. భౌతికంగా శాఖల రూపంలో అనుమతించడం లేదని పొరపడకండి. వీలుంటే ఆయా బీమా సంస్థ కార్యాలయానికి వెళ్లి అయినా క్లెయిమ్‌ను దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ మెయిల్ లేదా వాట్సాప్ లేదా కంపెనీ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించొచ్చు. ఏజెంట్ సాయాన్ని అయినా తీసుకోవచ్చు. కరోనా మరణ కేసుల్లో క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు గాను ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశాయి. కొన్ని సాధారణ డాక్యుమెంట్లను కూడా క్లెయిమ్ దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి వస్తుంది. క్లెయిమ్ ఫారమ్‌ను బీమా సంస్థల పోర్టళ్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెత్ సర్టిఫికెట్, వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్, మెడికల్ రికార్డులు లేదా పరీక్షల ఫలితాల కాపీలను క్లెయిమ్ ఫారమ్‌తోపాటు జత చేయాల్సి ఉంటుంది. అలాగే, ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్, నామినీ బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ కేవైసీ (చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలతో), క్యాన్సిల్డ్ చేసిన చెక్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమాద మరణం అయినా, కరోనా మరణం అయినా, సాధారణ మరణం అయినా క్లెయిమ్ ఒకే విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సంస్థలు ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేశాయి. ఆన్లైన్లోనే క్లెయిమ్‌ను దాఖలు చేసి, డాక్యుమెంట్లను ఆప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. వాట్సాప్, మొబైల్ యాప్, చాట్‌బాట్స్, వెబ్ పోర్టల్ ఏ రూపంలో అయినా బీమా కంపెనీని సంప్రదించొచ్చు. 30 రోజుల ప్రక్రియ బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నిబంధనల ప్రకారం జీవిత బీమా సంస్థలు మరణ పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. క్లెయిమ్ దాఖలు చేసిన రోజు నుంచి ఈ గడువు అమలవుతుంది. ఒకవేళ పాలసీదారు మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు, సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు బీమా సంస్థలు దర్యాప్తు అవసరమని భావించొచ్చు. కనుక దర్యాప్తు అవసరమైన కేసుల్లో 90 రోజుల సమయాన్ని బీమా సంస్థలు తీసుకోవచ్చు. అంటే 90 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30 రోజుల్లోపు క్లెయిమ్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి సందేహాల్లేకుండా, అన్ని పత్రాలు దాఖలు చేసిన కేసుల్లో ఏడు రోజుల వ్యవధిలోనే బీమా సంస్థలు పరిహారాన్ని విడుదల చేస్తున్నాయి. గతంతో పోలిస్తే క్లెయిమ్ ప్రక్రియ డిజిటలైజ్ కారణంగా వేగాన్ని సంతరించుకుందని చెప్పుకోవాలి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు క్లెయిమ్‌ను చాలా ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తున్నాయి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్ లైఫ్ 48 గంటల్లోనే క్లెయిమ్‌ను పరిష్కరించేస్తున్నాయి. కాకపోతే కంపెనీ కోరిన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత 48 గంటలను పరిగణనలోకి తీసుకోవాలి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 24 గంటల్లోనే ఈ ప్రక్రియను ముగించేస్తోంది. ఇక పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థ దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ కేవలం మూడు గంటల్లోనే పరిష్కరిస్తుండడం గమనించాలి. గతంతో పోలిస్తే క్లెయిమ్‌ల విషయంలో బీమా సంస్థలు మరింత వేగాన్ని, నాణ్యతను సంతరించుకున్నాయి. డాక్యుమెంట్ల పరంగా.. కొన్ని బీమా సంస్థలు డాక్యుమెంట్ల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాయి. కరోనా వైరస్ నియంత్రణ వల్ల అమలవుతున్న ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ చర్యలు తీసుకున్నాయి. ఆస్పత్రిలో మరణం నమోదైతే సాధారణంగా క్లెయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్ (మరణ ధ్రువీకరణ పత్రం) సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి డెత్ సర్టిఫికెట్ అందుకునేందుకు సాధారణంగా 10–15 రోజులు వేచి ఉండాల్సి రావచ్చు. అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టే పరిస్థితి ఉండచ్చు. అందుకనే ఎల్ఐసీ డెత్ సర్టిఫికెట్ బదులు.. మరణించిన తేదీ, సమయం, కారణం తదితర వివరాలతో ఆస్పత్రులు జారీ చేసే డెత్ సమ్మరీని కూడా అనుమతిస్తోంది. డెత్ సమ్మరీ సర్టిఫికెట్‌పై ఎల్ఐసీ క్లాస్–1 అధికారి లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ సంతకంతోపాటు.. క్రిమేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించడం ద్వారా పరిహారాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు ఎల్ఐసీ అనుమతిస్తోంది. అలాగే, ఎస్బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్ డెత్ సర్టిఫికెట్ దాఖలు నుంచి మినహాయింపునిచ్చాయి. ఆస్పత్రుల్లో చనిపోయిన వారికే ఈ మినహాయింపు పరిమితం. ఎందుకంటే ఆస్పత్రి యాజమాన్యాలు మరణానికి కారణం, ఇతర వివరాలతో డెత్ సమ్మరీని జారీ చేస్తాయి. కనుక దీన్ని ఆధారంగా పరిగణిస్తున్నాయి. ఇతర క్లెయిమ్‌లు జీవిత బీమా కంపెనీల నుంచి తీసుకునే ఇతర పాలసీల విషయంలోనూ క్లెయిమ్‌లకు సంబంధించి నిబంధనల పరంగా సడలింపు అమలవుతోంది. గడువు తీరిన పెన్షన్ పాలసీల (యాన్యుటీ ప్లాన్లు) విషయంలో పాలసీదారు లైఫ్ సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం సాధారణంగా వ్యక్తిగతంగా హాజరుకావాలి. కరోనా మహమ్మారి తీవ్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను కంపెనీలు అనుమతిస్తున్నాయి. ఎల్ఐసీ కూడా యాన్యుటీ ప్లాన్ల విషయంలో లైఫ్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపును కల్పించింది. వీడియోకాల్ రూపంలో ఈ ప్రక్రియను చేపడుతోంది. ఎస్బీఐ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ సంస్థలు సైతం యాన్యుటీ ప్లాన్ల విషయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను అనుమతిస్తున్నాయి. -
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 100 శాఖల ఏర్పాటు
ముంబై: కస్టమర్లకు మరింత చేరువయ్యే క్రమంలో ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా 100 శాఖలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. దీనితో మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలు మరింతగా విస్తరించినట్లవుతుందని పేర్కొంది. ఈ 100 డిజిటల్ ఆధారిత శాఖల్లో ఇప్పటికే 60 బ్రాంచీల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, మిగతావి నవంబర్ ఆఖరు నాటికి అందుబాటులోకి వస్తాయని సంస్థ ఎండీ నవీన్ తహిలియాని వివరించారు. ఏజెన్సీ పంపిణీ వ్యవస్థ లేని 70 ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటైనట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,000 పైగా ఉద్యోగాల కల్పన జరగగలదని ఆయన పేర్కొన్నారు. -
కరోనా టీకాల పరస్పర గుర్తింపు.. 11 దేశాలతో భారత్ ఒప్పందాలు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్లను పరస్పరం గుర్తించే విషయంలో 11 దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదించిన వ్యాక్సిన్లు ఇందులో ఉన్నాయని తెలిపింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, ఆర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగెరీ, సెర్బియా దేశాలతో భారత్ ఈ ఒప్పందాలు కుదుర్చుకుందని పేర్కొంది. ఆయా దేశాల్లో పూర్తిగా వ్యాక్సినేట్ అయిన పర్యాటకులు భారత్‌కు వచ్చిన తర్వాత హోంక్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని, మళ్లీ కరోనా టెస్టు చేయించుకోవాల్సిన పని లేదని వివరించింది. కానీ, వారు ఆర్టీ–పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. కోవిడ్ విధుల్లో మృతులకు బీమా ఆర్నెల్లు పొడిగింపు న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్స విధుల్లో పాల్గొంటూ వ్యాధిబారిన పడి ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రస్తుతం అందిస్తున్న రూ.50 లక్షల బీమా కవరేజిని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ కింద కల్పించిన ఈ బీమా సౌకర్యం అక్టోబరు 20 (బుధవారం)తో ముగిసింది. కోవిడ్‌తో మన పోరాటం ఇంకా కొనసాగుతుండటం, వైద్య సిబ్బంది మరణాలు ఇంకా సంభవిస్తున్నట్లు రాష్ట్రాల నుంచి వస్తున్న సమాచారం మేరకు మృతుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడటానికి రూ.50 లక్షల బీమా రక్షణను మరో అరు నెలలు పొడిగిస్తున్నామని కేంద్రం తెలిపింది. (పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చుకునేందుకు ఓకే: సీబీఎస్ఈ) -
వేగవంతమైన వృద్ధిపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరుసగా గత తొమ్మిదేళ్ల నుంచి లాభాల బాటలో ఉన్న ప్రైవేట్ రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేగవంతమైన వృద్ధి సాధనపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అత్యంత సంపన్న వ్యక్తులు (హెచ్ఎన్ఐ) సహా వివిధ వర్గాలకు అనువైన పథకాలను రూపొందిస్తోంది. ‘‘2002 నుంచి ప్రతీ ఏటా క్రమం తప్పకుండా పాలసీదారులకు బోనస్‌లు ఇస్తున్నాం. పాలసీదారులను ఆకర్షించడానికి ఇది ఒక కీలకాంశం కాగలదు. దీంతో పాటు వినూత్న పాలసీలు ప్రవేశపెడుతున్నాం. ఇటీవలే ఎక్సైడ్ లైఫ్ గ్యారంటీడ్ వెల్త్ ప్లస్ పేరిట కొత్తగా గ్యారంటీడ్ సేవింగ్స్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చాం. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా ఉంటూ మెరుగైన రాబడులు కోరుకునే వారికి ఇది అనువైన పథకం. వివిధ కేటగిరీల్లో పథకాల మేళవింపును మెరుగుపర్చుకుంటున్నాం‘ అని కంపెనీ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (సీడీవో) రాహుల్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ‘మా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి పరిశ్రమలో మెరుగ్గా 98.54 శాతం స్థాయిలో ఉంటోంది. క్లెయిములను వేగవంతంగా పరిష్కరించేందుకు మేము కట్టుబడి ఉన్నామనడానికి ఇది నిదర్శనం. గడిచిన 3–4 సంవత్సరాల్లో అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం, ఈ–సేల్స్ వంటి సాధనాలపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా మా డిజిటల్ వ్యవస్థను మరింత పటిష్టపర్చుకున్నాం. కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, పాలసీల విక్రయ ప్రక్రియను సత్వరం పూర్తి చేసేందుకు మా సేల్స్ బృందాలు, భాగస్వాములకు తోడ్పడేలా డేటా, డిజిటైజేషన్ సామర్థ్యాలను పటిష్టం చేసుకున్నాం’’ అని ఆయన తెలిపారు. 800 కోవిడ్ క్లెయిములు .. కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పట్నుంచి కోవిడ్–19కి సంబంధించి 800 క్లెయిమ్స్ వచ్చాయని, వాటన్నింటిని సాధ్యమైనంత వేగంగా సెటిల్ చేశామని అగర్వాల్ వివరించారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 582 వ్యక్తిగత కోవిడ్–19 క్లెయిమ్‌లు, 147 గ్రూప్ క్లెయిమ్‌లు వచ్చాయని, వాటన్నింటిని సెటిల్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం మే నెల దాకా 38 వ్యక్తిగత క్లెయిమ్‌లు, 6 గ్రూప్ క్లెయిమ్‌లు వచ్చినట్లు తెలిపారు. మార్చి ఆఖరు నాటి దాకా కోవిడ్–19 క్లెయిమ్‌ల సెటిల్మెంట్ కింద దాదాపు రూ. 40 కోట్లు చెల్లించినట్లు అగర్వాల్ వివరించారు. మారిన పంపిణీ వ్యవస్థ.. కరోనా వైరస్ వ్యాప్తి పరిణామాల నేపథ్యంలో వ్యాపార నిర్వహణ ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయని అగర్వాల్ తెలిపారు. సాంప్రదాయ విధానాల నుంచి డిజిటల్ వ్యవస్థ వైపు బీమా సంస్థలు మారుతున్నాయని ఆయన వివరించారు. ఈ క్రమంలో తమ సంస్థకు సంబంధించి ఈ–సేల్స్ పేరిట డిజిటల్ ప్లాట్‌ఫాం తయారు చేసుకున్నామని, ప్రస్తుతం కొత్త ప్రపోజల్స్‌లో 95 శాతం భాగం దీని ద్వారానే లాగిన్ అవుతున్నాయని అగర్వాల్ పేర్కొన్నారు. లాగిన్ దగ్గర్నుంచి పాలసీ జారీ అయ్యే దాకా ఈ విధానంతో పారదర్శకత, సమర్థత పెరిగిందని, మధ్య కాలికం నుంచి దీర్ఘకాలికంలో వ్యయాలను నియంత్రించుకోవడానికి కూడా ఇది దోహదపడగలదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కస్టమర్ల ఆదాయాలు, ఆర్థిక లక్ష్యాలు తదితర అంశాల గురించి మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సేల్స్ బృందాలకు డిజిటల్ సాధనాలు తోడ్పడుతున్నాయని చెప్పారు. సరైన పథకాలను అందించడం ద్వారా జీవిత బీమా రంగంలో కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనడంలో ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తుంటారని, ఈ నేపథ్యంలో డిజిటల్ విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్నా సాంప్రదాయ పంపిణీ విధానాలు కూడా కొనసాగుతాయని వివరించారు. -
మార్పును ఆహ్వానిద్దాం..!
జీవితం పట్ల దృక్పథాన్ని మార్చేసింది కరోనా. మహమ్మారి కారణంగా చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యాయి. ఆర్థిక వ్యవహారాలను ప్రణాళికాయుతంగా నిర్వహించే వారు పెద్దగా ఇబ్బంది పడలేదు.. కానీ, ముందుచూపు లేని వారికి జీవితం పట్ల వాస్తవం బోధపడింది. నగదు కోసం కష్టాలు ఎదుర్కొన్న వారు ఎందరో.. ఆస్తులు ఉన్నా వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవడం అన్ని వేళలా సాధ్యపడుతుందని భావించలేము. దీంతో అప్పుతో గట్టెక్కే ప్రయత్నం చేసిన వారున్నారు. విల్లు రాయకుండా అకాల మరణం పాలైతే.. వారి పేరిట ఉన్న ఆస్తులను కుటుంబ సభ్యులు వెంటనే పొందలేని పరిస్థితి. డబ్బుకు సంబంధించి, ఆర్థిక అంశాలకు సంబంధించి మన ఆలోచనలు, అలవాట్లను మార్చుకోవాలన్న సందేశాన్ని ఈ మహమ్మారి ఇచ్చింది. మార్పు దిశగా అడుగులు వేసేందుకు ఏం చేయాలన్నదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. అన్ని కాలాల్లోనూ అందుబాటులో కొంత మేర నిధిని ఉంచుకోవడం అవసరమని కరోనా మహమ్మారితో ఎక్కువ మందికి తెలిసొచ్చింది. చాలా మంది అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలేనన్న ఆలోచనతో ఉంటారు. కానీ, ముందు సన్నద్ధత లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నగదుకు బదులు ఆస్తులు ఉండొచ్చు. కానీ, అవసరం ఏర్పడితే వెంటనే ఆదుకునేది నగదు బ్యాలన్సే. ఇల్లు లేదా ఫ్లాట్ లేదా ప్లాట్ ఉందనుకోండి. వెంటనే విక్రయించి సొమ్ము చేసుకోవడం కష్టసాధ్యం. అందుకే లిక్విడ్ ఆస్తుల రూపంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోగల సౌలభ్యం ఉండాలి. అలా అని లిక్విడిటీ లేని ఆస్తులు సమకూర్చుకోవద్దని కాదు. అవసరమైనంత మేర లిక్విడ్ ఆస్తులను సైతం కలిగి ఉండాలి. ‘‘పొదుపు చేస్తున్న మొత్తాన్ని తీసుకెళ్లి ఎగ్జిట్ ఆప్షన్ లేని (కాల వ్యవధి మధ్యలో పెట్టుబడులను వెనక్కి తీసుకోలేనివి) సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అవసరం ఏర్పడినప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని వీఆర్ వెల్త్ అడ్వైజర్స్ సీఈవో వివేక్ రెగే పేర్కొన్నారు. కనీసం 6 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ఉంచుకోవాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇంతకంటే ఎక్కువే సమకూర్చుకుంటే మంచిదే. ఉద్యోగాలు, ఆదాయాలకు దీర్ఘకాలం పాటు సమస్యలు ఏర్పడిన తరుణంలో కనీసం ఏడాది అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలని ఫిన్‌ఫిక్స్ రీసెర్చ్ అండ్ అనలైటిక్స్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రబ్లీన్ బాజ్‌పాయ్ సూచించారు. ఉద్యోగ భద్రత అంతగా లేని వారికి ఎక్కువ నిధి అవసరం పడుతుంది. ఒకే బుట్టలో పెట్టొద్దు ఉదాహరణకు నెలసరి అవసరాలకు రూ.50,000 కావాలనుకోండి.. ఏడాది కోసం రూ.6లక్షలు అవసరమవుతాయి. అప్పుడు దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి. నెలసరి అవసరాలంటే ఈఎంఐలు, సిప్‌లు, ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఖర్చులు అన్నీ కలసి ఉండాలి. ► మొదటి రెండు నెలల అవసరాల కోసం రూ.లక్షను స్వీప్ఇన్ ఎఫ్డీ ఖాతాలో ఉంచుకోవాలి. అవసరం ఏర్పడిన వెంటనే నిమిషాల్లోనే ఈ నిధిని వెనక్కి తీసుకోగల వెసులుబాటు ఉంటుంది. ► తదుపరి నాలుగు నెలల అవసరాలకు గాను రూ.2లక్షలు తీసుకెళ్లి డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆర్బిట్రేజ్, లిక్విడ్ ఫండ్స్‌ను ఇందుకు పరిశీలించొచ్చు. ఈ పెట్టుబడులను నాలుగు నుంచి ఐదు రోజుల్లో వెనక్కి పొందొచ్చు. ► తదుపరి ఆరు నెలల కోసం రూ.3లక్షలను ఇతర డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఊహల ఆధారంగా అడుగులు వేయొద్దు ‘ఇప్పుడు కొనేద్దాం.. తర్వాత చెల్లించొచ్చు’ ఈ విధానం మంచిది కాదు. వేతన కోతలు, ఆశావహంగా లేని వ్యాపారాలు.. ఫలితంగా భారీగా అప్పులు చేసిన వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవాలి. కొందరు అయితే రుణ వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే.. మరికొందరు ఉన్నదంతా అప్పులకే కట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెల్లింపుల సామర్థ్యానికి మించి అప్పులు చేసి చాలా మంది ఇక్కట్లు కొనితెచ్చుకున్నారు. మన చుట్టూ ఉన్నవారిలో చాలా మంది చేసే సాధారణ తప్పిదం.. భవిష్యత్తులో పెరిగే ఆదాయాన్ని చూసి ఎక్కువ మొత్తంలో ముందుగానే రుణంగా తీసుకోవడం. 2బీహెచ్‌కే ఇల్లు చాలినా.. కొన్ని రూ.లక్షలు అదనంగా చెల్లిస్తే 3బీహెచ్‌కే వస్తుంటే దానివైపే మొగ్గుచూపే వారే ఎక్కువ. తక్కువ బడ్జెట్లో వస్తున్న కారుకు బదులు ఖరీదైన సెడాన్‌ను ఈఎంఐలపై కొనుగోలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. భవిష్యత్తు ఆదాయంపై అంచనాలతో తçప్పటడుగులు వేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి చర్యలతో జీవన వ్యయం పెరిగిపోయి.. మళ్లీ వెనక్కి దిగిరాలేని ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నెలవారీ చేతికి అందే నికర ఆదాయం నుంచి చేసే రుణ చెల్లింపులు (ఈఎంఐలు) 50% మించకూడదన్నది తప్పనిసరిగా అనుసరించాల్సిన సూత్రం. రుణం వస్తుంది కదా అని తీసుకోవద్దు. దీనివల్ల రుణఊబిలోకి చిక్కుకుపోవచ్చు. ఫలితంగా భవిష్యత్తు లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడుల్లో రాజీ పడా ల్సి వస్తుంది. సాధారణంగా జీవన వ్యయాలు అన్నవి ఏటేటా పెరుగుతుంటాయి. దీనికి తగ్గ ట్టు ఆదాయం పెరిగితే ఫర్వాలేదు. లేదంటే ఈఎంఐలకు చేసే చెల్లింపులతో జీవన వ్యయాల్లో రాజీపడాల్సి వస్తుంది. హెల్త్ ప్లాన్ ఒక్కటీ సరిపోదు.. సాధారణంగా స్వల్ప అనారోగ్య సమస్యలు, చిన్న ప్రమాదాల వల్ల ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే బిల్లులు భారంగా అనిపించకపోవచ్చు. కానీ, పెద్ద ప్రమాదాలు, క్లిష్టమైన అనారోగ్య సమస్యలు.. కరోనా వంటి వైరస్ల బారిన పడిన సందర్భాల్లో బిల్లు ఎంతొస్తుందన్నది ఊహించలేము. అందుకే నామమాత్రపు కవరేజీతో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్ని విధాలా రక్షణ అనిపించుకోదు. పైగా బీమా ప్లాన్‌లో కవర్ కానివి చాలా ఉంటాయి. కరోనా కారణంగా ఆస్పత్రుల్లో రోగుల చికిత్స కోసం వినియోగించే పీపీఈ కిట్లు, శానిటైజర్లు ఇలా ఎన్నింటికో కంపెనీలు చెల్లింపులు చేయకుండా కోతలు విధిస్తున్నాయి. కోపేమెంట్, సబ్‌లిమిట్స్ వంటి షరతులున్న ప్లాన్లు తీసుకున్న వారు బిల్లులో నిర్ణీత మొత్తాన్ని సొంతంగా భరించాల్సి వస్తుంది. నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో సొంత నిధుల నుంచి చెల్లింపులు చేయాల్సి రావచ్చు. అందుకే హెల్త్‌ప్లాన్‌కు అదనంగా కొంత వైద్యనిధిని కూడా ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. విల్లు రాయాలి.. సవరించాలి కుటుంబానికి ఆధారంగా ఉన్న ఎందరినో కరోనా ఉన్నట్టుండి బలితీసుకుంది. అటువంటి కుటుంబాలు చాలా వరకు నిధుల పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారు తమ పేరిట ఆస్తులకు భవిష్యత్తు హక్కుదారులను విల్లు రూపంలో చట్టబద్ధం చేయలేదు. దీంతో ఆయా ఆస్తులను వారసులు చట్టపరంగా తమ పేరిట మార్చుకుంటే కానీ విక్రయించుకోలేరు. విల్లు లేని సందర్భాల్లో వారసులమని, హక్కుదారులమని నిరూపించుకున్న తర్వాతే వాటి విక్రయానికి వీలవుతుంది. అందుకే కుటుంబానికి ఆధారమైన ప్రతీ వ్యక్తి విల్లు రాసుకుని ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, పెట్టుబడులకు నామినీగా ఒకరిని నమోదు చేయించుకోవాలి. ‘‘ఇప్పటికిప్పుడు మీకున్న ఆస్తులను ప్రస్తావిస్తూ విల్లు రాసుకోవాలి. అదనపు ఆస్తులు సమకూరిన ప్రతీ సందర్భంలోనూ విల్లును అప్డేట్ చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల వారసులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది’’ అని టీబీఎన్‌జీ క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు తరుణ్ బిరానీ సూచించారు. అలాగే, కుటుంబంలో బాధ్యతాయుతమైన ఒకరికి డాక్యుమెంట్లు, అన్ని ఆధారాలను ఎక్కడ ఉంచేదీ తెలియజేయాలని పేర్కొన్నారు. రుణాలకు రక్షణ ఉండాల్సిందే కుటుంబం కోసం అప్పులు చేసి అకాల మరణం చెందితే.. అప్పుడు కుటుంబ సభ్యులపై చెల్లింపుల భారం పడుతుంది. మీ సామర్థ్యాల పరిధిలోనే రుణాలు తీసుకోవడమే కాదు.. ఆ రుణ విలువకు సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను కూడా తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ రుణం పూర్తిగా చెల్లించకుండానే రుణగ్రహీత మరణించినట్టయితే.. బీమా పరిహారం రూపంలో వచ్చే మొత్తం రుణాన్ని తీరుస్తుంది. దాంతో కుటుంబ సభ్యులపై అదనపు ఆర్థిక భారం పడదు. సాధారణంగా గృహరుణాలకు టర్మ్ కవర్ అనుసంధానంగా వస్తుంది. అదే వ్యక్తిగత రుణాల్లో ఇలా ఉండదు. కనుక వ్యక్తిగత రుణానికి సమాన మొత్తంతో బీమా ప్లాన్‌ను తీసుకోవాలి. అప్పటికే టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది కదా అనుకోవద్దు. కుటుంబ జీవన అవసరాల కోసం రక్షణగా తీసుకునేదే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. వ్యక్తి మరణం తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో వచ్చేదంతా రుణ చెల్లింపులకే పోతే ఆ కుటుంబం ఎలా జీవించాలి? అందుకే ప్రతీ రుణానికి విడిగా టర్మ్ కవర్ తప్పకుండా ఉండాలి. రుణానికి అనుసంధానంగా వచ్చే టర్మ్ ప్లాన్లలో.. తగ్గుతున్న రుణానికి అనుగుణంగా కవరేజీ కూడా క్షీణిస్తుంటుంది. అయితే రుణానికి అనుసంధానంగా వచ్చే టర్మ్ ప్లాన్ల ప్రీమియం సాధారణంగా ఎక్కువ ఉంటుంది. కనుక రుణం ఇచ్చే సంస్థ నుంచి కాకుండా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత ఆదా చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. విదేశీ ఈక్విటీలు.. ఈక్విటీ ఇన్వెస్టర్లలో 99 శాతానికి పైగా దేశీయంగా ఇన్వెస్ట్ చేస్తున్న వారే ఉన్నారు. ఆర్థికంగా రానున్న రోజుల్లో భారత్ దిగ్గజంగా మారుతుందన్న అంచనాలతో దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పేమీ కాదు. అయితే, నూరు శాతం పెట్టుబడులను దేశీయంగానే ఇన్వెస్ట్ చేసుకోవడానికి బదులు వైవిధ్యం కోసం కొంత మొత్తాన్ని విదేశీ ఈక్విటీలకూ కేటాయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడుల అవకాశాలను గుర్తించేందుకు విదేశీ మార్కెట్ల వైపు చూసేందుకు మంచి అనుకూల సమయంగా పేర్కొంటున్నారు. ప్రతీ ఒక్కరి అస్సెట్ అలోకేషన్‌లో విదేశీ ఈక్విటీలకూ చోటు ఉండాలన్నది సూచన. ఎందుకంటే భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో ఎక్కువగా అస్థిరతలు ఉంటుంటే.. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఈక్విటీలు బలంగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కరోనా రెండు దశల తర్వాత అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు భారీ ప్యాకేజీల మద్దతుతో వేగంగా కోలుకుంటున్నాయి. ‘‘ప్రతికూల పరిస్థితులను వివిధ దేశాలు భిన్నంగా ఎదుర్కొంటాయన్నది కరోనా చూపించింది. భౌగోళికంగా వైవిధ్యం అన్నది (వివిధ దేశాల ఈక్విటీల్లో పెట్టుబడులు) దేశం ఆధారిత రిస్క్‌లను తట్టుకునేందుకు అవసరం. పైగా ఒక్కో దేశానికి భిన్నమైన బలాలు, అవకాశాల దృష్యా అక్కడి పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. తమ పెట్టుబడుల్లో 15–20 శాతం నిధులను విదేశీ ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ఇది రాత్రికి రాత్రి కాకుండా క్రమంగా నిర్ణీత కాల వ్యవధిలో చేసుకోవాలి’’ అని గ్లోబలైజ్ ఇండియా సీఈవో విరాజ్నందా సూచించారు. అయితే ఆయా అంశాల్లో నిపుణుల సలహా అవసరం. -
తాలిబన్ నేతకు పాక్‌లో బీమా
ఇస్లామాబాద్: అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన తాలిబన్ అధినేత ముల్లా అక్తర్ మన్సూర్ పాకిస్థాన్‌లో బీమా పాలసీ తీసుకున్నాడని మీడియా వర్గాలు తెలిపాయి. ఫేక్ ఐడెంటిటీతో బీమా తీసుకున్న ముల్లా, రూ.3లక్షల ప్రీమియం కూడా చెల్లించినట్లు తెలిపాయి. 2016 మేలో యూఎస్ జరిపిన దాడిలో ముల్లా చనిపోయాడు. పాక్ కోర్టులో టెర్రర్ ఫండింగ్ కేసుకు సంబంధించిన విచారణలో ఈ బీమా సంగతి బయటపడింది. తప్పుడు ధృవీకరణలతో ముల్లా, అతని అనుచరులు ఆస్తుల కొనుగోళ్లు, విక్రయాలు జరిపి టెర్రర్ ఫండింగ్ చేసేవారని కేసు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే తాలిబన్ నేత బీమా తీసుకున్నాడని, అతని మరణానంతరం బీమాకంపెనీ రూ.3 లక్షల చెక్కును విచారణాధికారులకు ఇచ్చిందని డాన్ న్యూస్ తెలిపింది. చదవండి: నెజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్! -
రూ. 23 కోట్లు కొట్టేసిన కిలాడీ
పాకిస్తాన్: సీమా ఖార్బే అనే పాకిస్తాన్‌కి చెందిన ఓ మహిళ తాను చనిపోయినట్లు నకిలీ పత్రాలను సృష్టించి మోసపూరితంగా 1.5 మిలియన్ డాలర్లు(23 కోట్ల రూపాయలు-పాకిస్తాన్ కరెన్సీలో) పొందింది. దీనిపై పాకిస్తాన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) అధికారి కథనం ప్రకారం..ఖార్బే 2008-09 సంవత్సరాల్లో యుఎస్ వెళ్లి, ఆమె పేరు మీద రెండు భారీ జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేసింది. ఆ తరువాత 2011లో పాకిస్తాన్‌లోని కొంతమంది స్థానిక ప్రభుత్వ అధికారులకు, ఓ వైద్యుడికి లంచం ఇచ్చి, తన పేరు మీద నకిలీ మరణ ధృవీకరణ పత్రం, ఖననం చేసినట్లు మరో పత్రం పొందింది. దానిలో భాగంగా రెండు పాలసీలను క్లెయిమ్ చేసుకోవడానికి తన పిల్లల ద్వారా మరణ ధృవీకరణ పత్రాలు ఉపయోగించింది. కనీసం పది సార్లు విదేశాలకు సీమా ఖార్బే చనిపోయినట్లు ప్రకటించిన తరువాత ఆమె కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కనీసం 10 సార్లు విదేశాలకు వెళ్లొచ్చినా అధికారులు గుర్తించలేదు. అయితే అమెరికన్ అధికారులు ఖార్బే గురించి పాకిస్తాన్ అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ మోసంపై దర్యాప్తు ప్రారంభించారు. ఖార్బేతోపాటు ఆమె కొడుకు, కుమార్తె, కొంతమంది స్థానిక ప్రభుత్వ అధికారులపై ఎఫ్ఐఏ మానవ అక్రమ రవాణా సెల్ ప్రస్తుతం క్రిమినల్ కేసులను నమోదు చేసింది. -
సొంత కారులేదు.. అప్పులూ లేవు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సగటు వేతన జీవిలా తనకు వచ్చే వేతనాన్ని బ్యాంకు ఖాతాల్లో, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రంగా దాచుకుంటున్నారు. ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఆయన ఎక్కువగా తనకి వచ్చే వేతనాన్ని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), జీవిత బీమా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల రూపంలో ఉంచుతున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఆయన ఆదాయంలో రూ.36.53 లక్షలు పెరుగుదల కనిపించింది. మోదీ తాజాగా తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి ప్రధాని మొత్తం ఆస్తుల విలువ రూ.2.85 కోట్లుగా ఉంది. గత ఏడాది రూ.2.49 కోట్ల చరాస్తులుంటే ఏడాదిలో 26.26% పెరుగుదల కనిపించింది. ► మోదీ నెల జీతం రూ. 2 లక్షలు. అందులో కరోనా సాయం కింద 30% ఆయన వేతనంలోంచి కట్ అవుతోంది. ► ప్రధాని సేవింగ్స్ అకౌంట్లో రూ. 3.38 లక్షలు ఉన్నాయి. నగదు రూపంలో ఆయన దగ్గర రూ.31,450 మాత్రమే ఉన్నాయి. ► గుజరాత్ గాంధీనగర్‌లోని ఎస్బీఐ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.1.60 కోట్ల ఉన్నాయి ► నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ రూపంలో రూ. 8.5 లక్షలు. రూ. 7.61 లక్షలు ఉన్నాయి. జీవిత బీమా పథకం కింద రూ.1.51 లక్షలు, రూ.1.90 లక్షలు కడుతూ ఉంటారు. ► నాలుగు బంగారం ఉంగరాలు ఉన్నాయి. 45 గ్రాముల బరువుండే వాటి విలువ రూ1.5 లక్షలుగా ఉంది. ► గాంధీనగర్‌లో పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.1 కోట్లు. కుటుంబ సభ్యులతో పాటు మోదీకి ఆ ఇంట్లో 25% హక్కు ఉంది. ► ప్రధానికి సొంత కారు లేదు. అప్పులు కూడా లేవు. అమిత్ షా ఆస్తులు తగ్గాయ్ ! కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆస్తుల విలువ గత ఏడాదితో పోల్చి చూస్తే స్వల్పంగా తగ్గింది. షేర్ మార్కెట్లో డబ్బులు ఉంచడంతో ఆయనకి ఉన్న చరాస్తుల్లో తగ్గుదల కనిపించింది. గత ఏడాది అమిత్ షా వద్ద రూ. 32.3 కోట్లు ఉంటే ఈ ఏడాది రూ. 28.63 కోట్లకి తగ్గిపోయాయి. ఇక రూ.13.56 కోట్ల విలువైన స్థిరాస్తులు షా పేరు మీద ఉన్నట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. షా బ్యాంకు ఖాతాలో రూ.1.04 కోట్లు ఉంటే ఆయన దగ్గర నగదు రూపంలో రూ.15,814 ఉన్నాయి. రూ.44.47 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. -
టర్మ్‌ప్లాన్‌తో మెరుగైన బీమా రక్షణ
జీవిత బీమా తీసుకోవడం అంటే.. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే. అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అచ్చమైన జీవిత బీమా అని చెప్పుకోవాలి. ‘‘టర్మ్ ప్లాన్ అయితే, తక్కువ ఖర్చు (ప్రీమియం)కు గరిష్ట బీమా కవరేజీనిస్తుంది. టర్మ్ ప్లాన్ ను ఇప్పుడు 99 ఏళ్లకు మించిన కాలానికీ తీసుకునే అవకాశం ఉంది. టర్మ్ ప్లాన్‌లో చెల్లించే ప్రీమియం వెనక్కి రాదని తెలిసిందే. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే కట్టిందంతా వ్యర్థమే అవుతుందన్న ఆలోచనతో కొంత మంది టర్మ్ ప్లాన్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో బీమా కంపెనీలు పాలసీ కాల వ్యవధి తీరే వరకు జీవించి ఉంటే కట్టిన ప్రీమియంను వెనక్కిచ్చే ఫీచర్‌తోనూ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. వీటి మధ్య సారూప్య, వ్యత్యాసాలను చూస్తే.. రెగ్యులర్ టర్మ్ ప్లాన్లు అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ నిర్దేశిత కవరేజీతో, నిర్ణీత కాలానికి అందించేది. 5 నుంచి 45ఏళ్ల కాలానికి బీమా కవరేజీ లభిస్తుంది. పాలసీదారు పాలసీ కాల వ్యవధిలో మరణానికి గురైతే నామినీకి బీమా మొత్తాన్ని అందిస్తుంది. ఏకమొత్తంలో లేదా ఏటా నిర్ణీత శాతం చొప్పున ఎంచుకున్న ప్లాన్ ఆప్షన్ ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. పాలసీ కాలవ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే ఎటువంటి ప్రయోజనాలు వెనక్కి రావు. పాలసీదారుకు జీవిత కాలం పాటు సంపూర్ణ కవరేజీ అన్నది ఇందులో లభిస్తుంది. కేవలం మరణానికి కవరేజీ మాత్రమే లభిస్తుంది. భరించగలిగే ప్రీమియంతో వచ్చే ప్లాన్ ఇదొక్కటే. ప్రీమియం అన్నది పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు స్థిరంగా (మార్పు లేకుండా) ఉంటుంది. ప్రీమియం వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్ దురదృష్టవశాత్తూ మరణానికి గురైతే తన కుటుంబానికి పరిహారం రావాలి. ఒకవేళ పాలసీ గడువు తీరే వరకు జీవించి ఉన్నా ఎంతో కొంత వెనక్కి రావాలని ఆలోచించే వారు చాలా మంది ఉన్నారు. రిటర్న్ ఆఫ్ ప్రీమియం (ఆర్వోపీ) టర్మ్ ప్లాన్లు ఈ కోవకు చెందినవే. వీటిల్లో గడువు తీరే వరకు పాలసీదారు జీవించి ఉంటే కట్టిన ప్రీమియం మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. పాలసీదారుకు హామీపూర్వక విలువను ఆఫర్ చేస్తుంది. పాలసీదారుగా మీ ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా పాలసీ కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. తమకు ఎంతో కొంత వెనక్కి రావాలని ఆశించేవారికి ఆర్వోపీ టర్మ్ ప్లాన్ అన్నది విలువకు తగిన పాలసీ అవుతుంది. సాధారణంగా 20, 25, 30, 40 ఏళ్ల టర్మ్ తో ఈ పాలసీలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల కాలవ్యవధిపై ఎంతో కొంత రుణం తీసుకుని ఉంటే, 20 ఏళ్ల టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అనుకోని విధంగా మరణం చోటు చేసుకుంటే రుణం ఎలా చెల్లించాలన్న సమస్య ఉండదు. ఒకవేళ జీవించి ఉంటే చివర్లో నూరు శాతం ప్రీమియం వెనక్కి వచ్చేస్తుంది. కొన్ని ఆర్వోపీ ప్లాన్లు చెల్లించిన ప్రీమియానికి అధికంగానే వెనక్కి ఇస్తున్నాయి. ఇలా మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. బీమా ప్రీమియం చెల్లింపు సమయంలోనూ ఆ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ప్రీమియం చెల్లింపులు మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రీమియం చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. సాధారణంగా అయితే వార్షికంగా, అర్ధ సంవత్సరానికి, త్రైమాసికం, నెలవారీగా చెల్లించే ఆప్షన్లు ఉంటాయి. కొన్ని సింగిల్ (ఒక్కసారి చెల్లించే) ప్రీమియం ఆప్షన్ తోనూ వస్తున్నాయి. సంతోష్ అగర్వాల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పాలసీబజార్ డాట్ కామ్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం -
జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులందరికీ కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. సోమవారం బీఆర్కే భవన్లో మంత్రిని కలిసిన అల్లం నారాయణ వినతి పత్రాన్ని అందజేశారు. పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోందని వారందరికీ విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. విధి నిర్వహణలో భాగంగానే టీవీ విలేకరి మనోజ్ కుమార్ కరోనాతో మృతి చెందాడని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి జర్నలిస్టుకు కరోనా కిట్ (మాస్క్, సానిటైజర్, పీపీఈ కిట్, గ్లౌజ్) సరఫరా చేయాలని కోరారు. జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందేలా, టెస్ట్‌లకు వర్తించేలా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు రూ.20 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని అన్నారు. ఇందుకు మంత్రి ఈటల సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టులందరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెమ్జూ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, చిన్నపత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, జర్నలిస్టుల సంఘాల నాయకులు నవీన్ కుమార్, పార్థ సారధి తదితరులు పాల్గొన్నారు. మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఐజేయూ, టీయూడబ్ల్యూజే డిమాండ్ హిమాయత్‌నగర్: విధి నిర్వహణలో కరోనా కాటుకు బలైన టీవీ జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన తప్పదని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్‌లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మనోజ్ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం జర్నలిస్టులను ఆందోళనకు గురి చేసిందన్నారు. కరోనా మహమ్మారిని నివారించడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల మాదిరిగానే అత్యవసర విభాగంలో సేవలందిస్తున్న జర్నలిస్టులకు కూడా రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని ఆదినుంచీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
బీమాలో తప్పు చేయొద్దు..!
‘‘ఇదొక పెట్టుబడి సాధనం. దీనిపై వార్షికంగా 12 శాతం చొప్పున ఆదాయం క్రమం తప్పకుండా పొందొచ్చు’’ ఈ తరహా ఆకర్షణీయమైన ప్రకటనలు బీమా ఏజెంట్లు వినిపిస్తే మీరొక సారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇలా చెప్పినప్పుడు అసలు ఆ పెట్టుబడి సాధనం ఏమిటని మీరు ప్రశ్నించారనుకోండి... అదొక ఇన్సూరెన్స్ పాలసీ అని, అందులో ఉన్న ఫీచర్లు ఇవంటూ మరిన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేయవచ్చు. అలా చెబుతున్నారంటే అది యులిప్ పాలసీయే అయి ఉంటుంది. బీమా పాలసీలు తీసుకుంటున్న వారిని గమనిస్తే... ఎక్కువ మంది తమ అవసరాలను తీర్చేది అయి ఉండడం లేదని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. ఆర్థిక ప్రణాళిక పక్కాగా ఉండాలంటే, తమకు తగినంత బీమా రక్షణ ఉండాలన్న విషయాన్ని మరవొద్దు. జీవిత బీమా లేదా వైద్య బీమా, మరే ఇతర బీమా అయినా కానీ తగినంత బీమా కవరేజీ ఉండడం అవసరం. అదే సమయంలో అవసరం లేని బీమా ఉత్పత్తులతో మీ ఆర్థిక ప్రణాళిక భారంగా మారకుండా చూసుకోవాలి. బీమా పాలసీలకు సంబంధించి పక్కదోవ పట్టించే అంశాలను మీ దృష్టికి తీసుకురావడమే ఈ కథనం ఉద్దేశ్యం. టర్మ్ ప్లాన్లపై తప్పుదారి..! బీమా ఏజెంట్లు ప్రాథమికంగా తమకు కమీషన్ ఎక్కువగా లభించే పాలసీల విక్రయంపైనే ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో టర్మ్ ప్లాన్ కొనుగోలు చేసే వారిని తప్పుదోవ పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. వీటికి బదులు యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌ల) లేదంటే సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలను తీసుకునే దిశగా మంచి రాబడి వివరాలతో ప్రదర్శన ఇస్తుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే... టర్మ్ ప్లాన్ అన్నది అచ్చమైన బీమా కవరేజీకి సంబంధించి కచ్చితమైన పాలసీ. అనుకోని ప్రమాదంతో పాలసీదారు ప్రాణం కోల్పోతే, అతను లేదా ఆమెపై ఆధారపడిన వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా తగినంత పరిహారం లభించాలంటే అది టర్మ్ప్లాన్లోనే సాధ్యపడుతుంది. ఎందుకంటే భరించేంత ప్రీమియంతో అధిక బీమా కవరేజీ టర్మ్ ప్లాన్‌లోనే లభిస్తుంది. జీవిత బీమా తీసుకోవాలంటే అందుకు టర్మ్ ప్లాన్‌ను మించినది లేదని పాలసీఎక్స్ డాట్ కామ్సీఈవో నావల్ గోయల్ పేర్కొన్నారు. తక్కువ ప్రీమియానికి అధిక రక్షణ ఇచ్చే విధంగా ఉంటాయి. అయితే, పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు పాలసీదారులు జీవించి ఉంటే ఆ తర్వాత ఆ పాలసీపై ఎటువంటి ప్రయోజనం లభించదు. కానీ, బీమా అంటే మరణంపై కవరేజీని తీసుకోవడం. చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి పొందడం కాదని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు టర్మ్ ప్లాన్‌లో మీరు తీసుకోదలిచిన బీమా కవరేజీకి ప్రీమియం రూ.10వేలు ఉంటే, అదే యులిప్ పాలసీలో రూ.30వేలు చెల్లించాల్సి ఉంటుంది. యులిప్ పాలసీ అంటే మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌తో ముడిపడిన బీమా పథకం. దీన్ని తీసుకోవడానికి బదులు రూ.10వేల ప్రీమియంతో టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన రూ.20వేలను స్వయంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను ఆదాకు మంచి సాధనం...? ఏజెంట్లు లేదా బీమా పాలసీల విక్రయదారులు చెప్పే ఆకర్షణీయమైన వివరాల్లో పన్ను ఆదా కూడా ఒకటి. ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చని, గడువు తీరిన తర్వాత లేదా మరణంపై వచ్చే పరిహారంపై కూడా పన్ను ఉండదని వివరిస్తుంటారు. నిజానికి జీవిత బీమా పాలసీ కూడా పన్ను ఆదా ప్రయోజనం కల్పించే సాధనాల్లో ఒకటి. అయితే, పన్ను ఆదా కోసమే ఉద్దేశించిన సాధనం కాదు. ఇది బీమా రక్షణకు ఉద్దేశించినదిగా ముందు గుర్తుంచుకోవాలి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను ఆదా కల్పించే పెట్టుబడి సాధనాలు ఎన్నో ఉన్నాయి. ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. పన్ను ఆదా కోసమే అయితే వీటిని పరిశీలించొచ్చు కానీ, బీమా కాదు. ఎవరికి వారు వారి ఆర్థిక ప్రణాళికకు అనుకూలమైన సాధనాలను ఎంచుకోవడం వారి విజయానికి కీలకం. బ్యాంకు ఎఫ్‌డీల కంటే బెటర్..? ఎండోమెంట్ పాలసీలు ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరే రాబడులతోపాటు బీమా రక్షణనిస్తాయని బీమా ఏజెంట్లు చెబుతుంటారు. ఎండోమెంట్ పాలసీలు బీమా రక్షణ, పన్ను ఆదాతో పాటు చక్కని రాబడులను ఇస్తాయన్న మాటలను ఆకర్షితులై పాలసీలను తీసుకోవద్దు. రాబడులపై బ్యాంకు ఎఫ్‌డీల్లో టీడీఎస్ ఉంటుందని, బీమా పాలసీల్లో ఇది ఉండదని, కనుక బీమా పాలసీలు మంచి పెట్టుబడి సాధనాలని వివరించే వారూ ఉన్నారు. నిజానికి బీమా ఉత్పత్తుల్లో పలు రకాల చార్జీలు ఉంటాయి. కాల వ్యవధి తీరిన తర్వాత నిర్ణీత ప్రయోజనాలను అందిస్తాయి. అదే సమయంలో పాలసీ కాల వ్యవధి సమయంలో మరణిస్తే బీమా పరిహారాన్ని చెల్లిస్తాయి. అంతేకానీ రాబడులను పంచవు. కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడుల విషయంలో స్పష్టత ఉంటుంది. ఇక బీమా పాలసీలు, ఎఫ్‌డీల్లో పెట్టుబడుల రక్షణ భిన్నంగా ఉంటుంది. యులిప్‌లు మ్యూచువల్ ఫండ్స్ కంటే నయం? యూనిట్ ఆధారిత బీమా పాలసీ (యులిప్) బీమా రక్షణతోపాటు, అదనంగా మార్కెట్ ఆధారిత రాబడులను కూడా ఇస్తుందని బీమా ఏజెంట్లు చెప్పొచ్చు. అలాగే, మ్యూచువల్ పండ్స్‌లో అయితే రాబడులు మార్కెట్ ఆధారితం కనుక రిస్క్ ఉంటుందని, బీమా మాత్రం లభించదని కూడా చెప్పే అవకాశం లేకపోలేదు. యులిప్‌లు అటు బీమా రక్షణతోపాటుగా పెట్టుబడుల విషయంలోనూ ఎంతో స్వేచ్ఛ ఉంటుందని, రాబడుల విషయంలో సంతృప్తి అనిపించకపోతే, ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే పెట్టుబడి ఆప్షన్లను మార్చుకోవచ్చన్నది నిజమే కావచ్చు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోనూ దీర్ఘకాలంలో అద్భుత రాబడులను ఇచ్చినవి వందల సంఖ్యలో ఉన్నాయనేది మర్చిపోవద్దు. యులిప్ అయితే, చెల్లించిన ప్రీమియంలో కొంత భాగం మార్కెట్ల పెట్టుబడులకు వెళుతుంది. మిగిలినదంతా పాలసీదారులు మరణానికి గురైతే పరిహారం చెల్లించేందుకు గాను, మోర్టాలిటీ చార్జీల కింద మినహాయించుకుంటాయి. దీంతో నిజానికి యులిప్‌లలో అటు అచ్చమైన పెట్టుబడులు కాకుండా, ఇటు అచ్చమైన బీమా రక్షణ కాకుండా ఉంటుంది. ఇక పాలసీ సరెండర్ చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఫండ్ నిర్వహణ చార్జీలు, అలోకేషన్ చార్జీలు తదితర చార్జీల పరంగా పారదర్శకత తక్కువ. మొత్తంగా చూస్తే... బీమా అవసరం, పెట్టుబడుల ప్రాధాన్యం, మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తి ఎంపిక ఉండాలి. అవసరమైతే ఈ రంగంలో నిపుణులను సంప్రదించాలి. ఇవి గమనించండి... - పన్ను ఆదా కోసం ఆర్థిక సంవత్సరం చివర్లో బీమా పాలసీ తీసుకోవడం, ఆ తర్వాత అది తనకు తగినది కాదని తదుపరి ఆర్థిక సంవత్సరం రెన్యువల్ చేసుకోకుండా వదిలేయడం సరికాదు. - మార్కెట్ లింక్డ్ తరహా యులిప్ పాలసీలపై రాబడుల విషయంలో స్పష్టత ఉండదు. వీటిని బ్యాంకు ఎఫ్డీలతో పోల్చి చూడకూడదు - యులిప్ పాలసీల్లో మోర్టాలిటీ చార్జీల పేరుతో వసూలు చేసే చార్జీ కారణంగా ఇన్వెస్టర్ల రాబడులు చాలా వరకు తగ్గిపోతాయి. - బీమా, పెట్టుబడితో కూడిన పథకాల్లో రాబడులు, బీమా కవరేజీ తగినంత ఉండవు. - టర్మ్ కవర్లో తగినంత బీమా రక్షణను తక్కువ ప్రీమియానికే పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలకు అద్భుత సాధనం? ఆర్థిక లక్ష్యాలకు బీమా పాలసీలు అద్భుత సాధనాలనే విషయంలో ప్రతి ఒక్కరికీ స్పష్టత అవసరం. ఎందుకంటే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు బీమా పాలసీలను పెట్టుబడి సాధనాలుగా చూస్తే అది పొరపాటులో కాలేసినట్టే అవుతుంది. బీమా పాలసీలన్నవి మీ ఆర్థిక లక్ష్యాలకు కవరేజీనిచ్చే సాధనం వరకే పరిమితం. అంతేకానీ, మీ ఆర్థిక అవసరాలను పాలసీలు అచ్చంగా తీర్చలేవు. అందుకు మీ రిస్క్‌కు తగ్గ పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ చైల్డ్ ప్లాన్లు, మ్యూచువల్ ఫండ్స్ రెండూ మీ పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు ఉపయోగపడతాయి. కానీ, మంచి పనితీరు, పరిశోధనా టీమ్ కలిగిన మ్యూచువల్ ఫండ్ సాధనం బీమాతో కూడిన పెట్టుబడి సాధనం కంటే అధిక రాబడులను ఇస్తుందనడంలో సందేహం లేదు. ‘‘బీమాను కొనుగోలు చేసే వారు ఏజెంట్‌ను కలవడానికి ముందే కొంత సాధన చేయాలి. తప్పుడు బీమా పథకంలో ఇరుక్కుపోకుండా ఉండాలంటే తగినంత అవగాహన ఉండాలి. ఏజెంట్లు చెప్పే భారీ మొత్తాలు, హామీల ఆకర్షణలో పడిపోవద్దు’’ అని అలంకిత్ లిమిటెడ్ ఎండీ అంకిత్ అగర్వాల్ సూచించారు. -
మధ్యాహ్న భోజనానికి భారతీ ఆక్సా లైఫ్ చేయూత
హైదరాబాద్: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ముందుకు వచ్చింది. సంస్థ 13వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా అందించాలని తన ఉద్యోగులకు పిలుపునిచ్చింది. కడుపునిండా ఆహారం ఉంటే విద్యార్థులు మరింత మంచిగా చదువుకోగలరని తాము నమ్ముతున్నట్టు భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో వికాస్‌సేత్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 15,000 పాఠశాల్లలో ప్రతీ రోజూ 17.6 లక్షల మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ అందిస్తోంది. భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో 2025 నాటికి 50 లక్షల మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్న తమ లక్ష్యం దిశగా మరికొన్ని అడుగులు వేసేందుకు వీలవుతుందని అక్షయ పాత్ర ఫౌండేషన్ సీఈవో శ్రీధర్ వెంకట్ పేర్కొన్నారు. -
మార్కెట్లోకి ‘బిగ్‌బాస్’?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేసే రోజు భవిష్యత్తులో చూసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పెట్టుబడుల ఉపసంహరణ/వాటాల అమ్మకాల ద్వారా కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు ప్రాధా న్యం ఇస్తుండడంతో, ఎల్ఐసీ లిస్టింగ్ కూడా ప్రభుత్వ అజెండాలో భాగంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఐపీవో ద్వారా స్వల్ప మొత్తంలో వాటాలను ప్రభుత్వం విక్రయించే చాన్స్ ఉందని సమాచారం. ఎల్ఐసీ తొలిదశ ఐపీవోకు అధిక ప్రీమి యం ఉంటుందని అంచనా. ఈక్విటీ చిన్నది కావడమే దీనికి కారణం. ఎల్ఐసీలో వాటాల అమ్మకం ఆరంభ దశలో ఉందని, ఈ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు సంబంధిత వర్గాల సమాచారం. విలువ అధికం... ఎల్ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా, ఆర్థిక సేవల కంపెనీగా ఉంది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో ఎల్ఐసీ గనుక లిస్ట్ అయితే మార్కెట్ విలువ పరంగా టాప్ కంపెనీగా నిలుస్తుందని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ను దాటిపోతుందని అంచనా. రూ.5 కోట్ల ఈక్విటీ ఆధారంగా వేసిన అంచనా ఇది. లిస్ట్ చేయడం వల్ల ఖాతాలు మరింత పారదర్శకంగా నిర్వహించడంతోపాటు, పెట్టుబడులు, రుణాల పోర్ట్‌ఫోలియో వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి వస్తుంది. ఇది మరింత మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్‌కు దారితీస్తుందని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర సర్కారు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలను లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఐసీలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటే అందుకు ఎల్ఐసీ చట్టం 1956లో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం... ఎల్ఐసీ పాలసీలు అన్నింటికీ వాటి సమ్ అష్యూర్డ్, బోనస్‌లు చెల్లించే విషయంలో ప్రభుత్వం హామీదారుగా ఉంటోంది. పెట్టుబడుల కొండ ఎల్ఐసీ 2017–18 వార్షిక నివేదిక ప్రకారం చూస్తే... డిబెంచర్లు, బాండ్లలో రూ.4,34,959 కోట్ల పెట్టుబడులు కలిగి ఉండగా, ఎన్నో మౌలిక రంగ ప్రాజెక్టులకు రూ.3,76,097 కోట్లను రుణాలుగా సమకూర్చింది. అదే ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ పెట్టుబడులపై రూ.23,621 కోట్ల లాభాన్ని ఆర్జించగా, ఈక్విటీలలో ఆ ఏడాది రూ.68,621 కోట్లు పెట్టుబడులు పెట్టింది. రూ.5 కోట్ల మూలధనంతో ఎల్ఐసీ సంస్థ ఏర్పాటు కాగా, ఐఆర్డీఏఐ నిబంధనల మేరకు బీమా సంస్థల కనీస ఈక్విటీ రూ.100 కోట్లుగా ఉండాలి. ఈక్విటీ చిన్నదే అయినప్పటికీ, ఇతర కంపెనీలతో పోలిస్తే ఎల్ఐసీ నిర్వహణలో భారీ ఆస్తులు ఉన్నాయి. 2018–19లో ఎల్ఐసీ పెట్టుబడుల మార్కెట్ విలువ వార్షికంగా 8.61 శాతం పెరిగి రూ.28.74 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.26.46 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేషన్ మొత్తం ఆస్తులు రూ.31.11 లక్షల కోట్లకు చేరాయన్నది అంచనా. ‘‘అధికారికంగా ప్రకటించినా, ప్రకటించకపోయినా కానీ ఎల్ఐసీ వ్యవస్థాపరంగా చాలా ముఖ్యమైన బీమా సంస్థ. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తదితర వెంచర్ల బెయిలవుట్ విషయంలో ఎల్ఐసీ పెట్టుబడులు ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసింది. మిలియన్ల పాలసీదారుల సొమ్ములు ఇవి. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి ముందు ఎల్ఐసీ చట్టంలో సవరణ చేయాల్సి ఉంటుంది’’అని ఐఆర్డీఏఐ సభ్యుడు కేకే శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఎల్ఐసీని తన పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఓ సాధనంగా వాడుకుంటున్న పరిస్థితి ఇన్వెస్టర్లకు అవగతమే. ఓఎన్జీసీ తదితర ఎఫ్‌పీవోలకు, ఐడీబీఐ బెయిలవుట్‌కు ప్రభుత్వ ఆదేశాలతో ఎల్ఐసీయే భారీగా నిధులు సమకూర్చింది. ఏటా ప్రభుత్వ సెక్యూరిటీల్లో అతిపెద్ద పెట్టుబడిదారు కూడా ఎల్ఐసీయే. ఏటా రూ.55,000–65,000 కోట్ల మేర స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తోంది. 2018–19లో ఎల్ఐసీ నూతన పాలసీలు, రెన్యువల్ పాలసీల ప్రీమియం రూపంలో రూ.3,37,185 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. పాలసీదారులకు చెల్లించిన మొత్తం ప్రయోజనం రూ.2,50,936 కోట్లు కావడం గమనార్హం. -
హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా విషయంలో దేశంలోని మిగతా వారితో పోలిస్తే హైదరాబాదీలు చాలా మెరుగని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 83 శాతం మందికి ఏదో ఒక జీవిత బీమా పాలసీ ఉంది. ఇలా ఏదో ఒక పాలసీ ఉన్నవారి జాతీయ సగటు 65 శాతం. దీంతో పోలిస్తే భాగ్యనగర వాసులదే పైచేయి!!. అయితే, అతి తక్కువ ప్రీమియంతో జీవితానికి రక్షణనిచ్చే టర్మ్ ప్లాన్స్ విషయానికి వస్తే ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే ఈ పాలసీ తీసుకున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, కాంటార్ ఐఎంఆర్బీ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టెక్ నగరం బెంగళూరుతో పోలిస్తే హైదరాబాదీలకే రకరకాల జీవిత బీమా పాలసీల (టర్మ్ ప్లాన్, మార్కెట్ ఆధారిత ప్లాన్ మొదలైనవి) గురించి ఎక్కువగా అవగాహన ఉన్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడయిందని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ వి.విశ్వానంద్ చెప్పారు. వ్యక్తులు తమకు ఎంత వరకు భద్రత ఉందని భావిస్తున్నారు? భవిష్యత్ అనిశ్చితిని ఎదుర్కొనేందుకు మానసికంగా ఎంత మేర సన్నద్ధంగా ఉన్నారు? అనే అంశాల ప్రాతిపదికన బీమా భద్రతపై భారతీయుల వైఖరి (0–100 స్కేల్) నివేదికను తయారు చేసినట్లు ఆయన తెలియజేశారు. అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక సన్నద్ధత, జీవిత.. టర్మ్ బీమాలపై అవగాహన, పాలసీల కొనుగోలుకు కారణాలు అనే మూడు అంశాల ఆధారంగా పాయింట్లను లెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం 100కి హైదరాబాద్ 44 పాయింట్లు సాధించిందని, జాతీయ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో నమోదైన 35 పాయింట్ల సగటుకన్నా ఇది అధికమని విశ్వానంద్ చెప్పారు. అయితే, హైదరాబాదీల్లో టర్మ్ ఇన్సూరెన్స్ కేవలం 23% మందికే ఉందని, భవిష్యత్‌లో ఆకస్మిక మరణం, తీవ్ర అనారోగ్యాల బారిన పడటం వంటి వాటిని 44% మంది ఆర్థికంగా ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరని చెప్పారాయన. ఉత్తరాది, తూర్పు, పశ్చిమ రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే ఎక్కువగా జీవిత బీమా, టర్మ్ పాలసీదారులు ఉన్నట్లు సర్వేలో తేలింది. దేశానికి ఐటీ హబ్‌గా పేరొందినప్పటికీ దక్షిణాదిలో 82% జనాభా ఇప్పటికీ ఏజెంట్ల నుంచే టర్మ్ పాలసీలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. 15% మంది బ్యాంకుల నుంచి, 3% మంది మాత్రమే ఆన్లైన్ మాధ్యమం ద్వారా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. -
తపాలా బీమాతో ధీమా
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తపాలా జీవిత బీమా భరోసా కల్పిస్తోంది. ఉద్యోగుల కోసమే పలు పాలసీలను తపాలా శాఖ గత సంవత్సరమే ప్రవేశపెట్టింది. స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు కూడా తపాలా జీవిత బీమా పొందే సౌకర్యం ఉంది. మిగతా ఇన్సూరెన్స్ సంస్థల కంటే తపాలాలో బీమా చేసి అదనపు బోనస్‌లు పొందవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఉద్యోగులు ఎక్కువగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ (పీఎల్‌ఐసీ) పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈ పాలసీలో 19 నుంచి 55 ఏళ్లు ఉన్న వ్యక్తులు వివిధ రకాల పరిమితుల ఆధారంగా పాలసీ పొందవచ్చు. చిల్డ్రన్స్ కోసం.. తపాలా శాఖ జీవితాంతపు పాలసీగాని, ఎండోమెంట్ పాలసీ గాని కలిగిన తల్లిదండ్రుల మొత్తం పిల్లలు కూడా జీవిత బీమా పొందవచ్చు. ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ బీమా సౌకర్యం ఉంది. ఇందులో ముఖ్య పాలసీదారుడి వయస్సు 45 ఏళ్లకు మించరాదు. సురక్ష పాలసీ.. పాలసీదారుడి వయసు 19 నుంచి 55 ఏళ్లు ఉండాలి. పాలసీ మొత్తం విలువను పాలసీదారుడి వయసు 80 ఏళ్లు నిండిన తర్వాత గాని లేదా పాలసీదారుడి తదనంతరం వారు నిర్దేశించిన వారసులు గాని, ఆయన సూచించిన సంస్థకు ఇస్తారు. సుమంగళ్.. పాలసీదారుడి వయసు 19 నుంచి 45 మధ్య ఉండాలి. కాల పరిమితి 15 లేదా 20 ఏళ్లు. పాలసీదారుడి నుంచి దరఖాస్తు అందగానే నిర్దేశించిన వాయిదా మొత్తం చెల్లిస్తారు. వాయిదా మొత్తం చెల్లించిన అనంతరం కూడా పాలసీ కాల పరిమితి అయ్యే వరకు పాలసీ మొత్తానికి జీవిత రక్షణ ఉంటుంది. ఈ పథకంలో పాలసీపై రుణాలు, పాలసీ సరెండర్ చేసే సదుపాయం ఉండదు. సువిధ.. పాలసీదారుడి వయస్సు 19 నుంచి 45 ఏళ్లలోపు ఉండాలి. మొదటి ఐదేళ్ల వరకు తక్కువగా నిర్దేశించిన ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత పాలసీదారుడు జీవితాంతపు పాలసీని నిర్దేశించిన వయసుకు అంటే.. 50, 55, 58, 60 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీ అయ్యే ఎండోమెంట్ పాలసీగా మార్పునకు సదుపాయం కలదు. ఆ విధంగా మార్చుకుంటే మొదటి ఐదేళ్లు నిర్దేశించిన ప్రీమియం యథావిధిగా 60 సంవత్సరాలు వరకు చెల్లించాలి. యుగళ్ సురక్ష.. పాలసీదారుడి వయసు 21– 45 సంవత్సరాల మధ్య ఉండాలి. కాలపరిమితి ఐదు నుంచి పదేళ్ల వరకు ఈ పాలసీని ఆమోదించిన తేదీ నుంచి పాలసీదారుడు దంపతులకు ఒకే ప్రీమియంతో పూర్తి బీమా జమ చేసిన మొత్తానికి బోనస్ సొమ్ము కలిపి బతికి ఉన్న వ్యక్తికి ఇస్తారు. పాలసీ పొందిన వ్యక్తి భాగస్వామి ఉద్యోగి కావాల్సిన అవసరం లేదు. సంతోష్ పాలసీ.. పాలసీదారుడి వయస్సు 19– 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రీమియందారుడు ఎంపిక చేసుకున్న వయసు నాటికి పాలసీ మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు. -
బజాజ్ అలయంజ్ నుంచి రెండు కొత్త ఉత్పాదనలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండు కొత్త పాలసీలను తమ సంస్థ తేనున్నదని, అవి ఐఆర్డీఏ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ యాక్చువరీ సాయి శ్రీనివాస్ ధూలిపాళ తెలిపారు. ఇందులో ఒకటి యులిప్ పాలసీ అని వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ మొత్తం 25 రకాల పాలసీలను అందుబాటులో ఉంచిందని గురువారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘‘ఏప్రిల్–సెప్టెంబరు మధ్య ఇండివిడ్యువల్ విభాగంలో లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ 9.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రైవేటు కంపెనీలు 11.4 శాతం, బజాజ్ 12.7 శాతం వృద్ధి కనబరిచింది. క్యూ2లో న్యూ బిజినెస్ ప్రీమియం 24% అధికమైంది. పాలసీ సగటు టికెట్ సైజు రూ.39,895 నుంచి రూ.54,636లకు ఎగసింది. ఇండివిడ్యువల్ న్యూ బిజినెస్ ప్రీమియం రెండవ త్రైమాసికంలో రూ.280 కోట్ల నుంచి రూ.346 కోట్లకు చేరింది. రెన్యువల్ ప్రీమియం 17 శాతం వృద్ధితో రూ.870 కోట్లుగా ఉంది. మొత్తం ప్రీమియం రూ.2,015 కోట్ల నుంచి రూ.2,083 కోట్లకు వచ్చి చేరింది’ అని వివరించారు. -
అంగన్వాడీలకు జీవిత బీమా
బాన్సువాడ టౌన్ నిజామబాద్ : కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు భరోసా కల్పించింది. ఎన్నో పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంచింది. కాగా ఇప్పుడు వారి ఇబ్బందులు, కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సౌకర్యం కల్పించేందుకు పూనుకుంది. విధి నిర్వహణలో, ప్రమాదవశాత్తు, సహజ మరణం పొందినవారికి ఈ సౌకర్యం వర్తించే విధంగా రూపకల్పన చేసింది. ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకానికి సంబంధించి బీమా ప్రీమియంను కేంద్ర ప్రభుత్వం–భారతీయ జీవిత బీమా సంస్థలు సంయుక్తంగా భరించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వం అందించే బీమా సొమ్ము బాధితుల కుటుంబాలకు ఆసరాగా నిలవనున్నది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అంగన్వాడీ ఉచిత బీమా పథకంతో జిల్లాలో 1038 మంది టీచర్లు, 155 మినీ టీచర్లు, 1083 మంది ఆయాలకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కలిపి 2231 మంది ఉన్నారు. 35 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అనుబంధ సంఘాల సహకారంతో ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏడు విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీచర్‌కు రూ.10,500, ఆయాలకు రూ.6 వేల చొప్పున వేతనం అందిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల కష్టాల గుర్తించి వారికి భరోసా కల్పించేందుకు నిర్ణయించి బీమా సౌకర్యంతో అండగా నిలిచింది. మృతిచెందిన అంగన్వాడీ కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున బీమా సొమ్ము అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రీమియం చెల్లించే బాధ్యత కూడా.. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల బీమా ప్రీమియంను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పీఎంజీవై రూ.330, పీఎంఎస్‌జీవైరూ.12 ఎల్ఐసీ రూ.80 చొప్పున స్కీం కింద ప్రీమియం చెల్లించా ల్సి ఉంది. అయితే కేంద్ర మహిళ శిశు సంక్షమ శాఖ రూ.332, ఎల్ఐసీ రూ.100 చొప్పున సంయుక్తంగా భరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2017, జూన్ ఒకటో తేదీనాటికి 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న టీచర్లు, ఆయాలకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా కింద రూ.లక్షలాదిగా చెల్లిస్తుంది. 50 నుంచి 59 ఏళ్లలోపు టీచర్లు, ఆయాలకు జీవిత బీమా సౌకర్యం రాక ప్రత్యేకంగా అంగన్వాడీ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సంతోషంగా ఉంది.. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే టీచర్లు, ఆయాలకు మూడు బీమా పథకాలు కల్పించడం సంతోషంగా ఉంది. అయితే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అయితేనే తమకు ఒక గుర్తింపు వస్తుంది. లేదంటే తాము ఎన్నేళ్లు కష్టపడినా ఫలితం ఉండదు. –గౌరమ్మ, టీచర్, నస్రూల్లాబాద్. -
10 రోజుల్లో బీమా సొమ్ము
సాక్షి, హైదరాబాద్: రైతులకు జీవిత బీమా సదుపాయం కల్పించేందుకు ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుందని, రైతు చనిపోతే 10 రోజుల్లోగా కుటుంబానికి రూ.5లక్షల బీమా సొమ్ము అందనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. 18–60 ఏళ్ల మధ్య వయసు కలిగిన రైతులకు జీవిత బీమా సదుపాయం కల్పించనున్నామన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియంను చెల్లిస్తుందన్నారు. శనివారం ఇక్కడ జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత పాలక మండలి సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, సౌర విద్యుదుత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం రైతు బంధు కార్యక్రమం కింద 58 లక్షల ఎకరాల భూ యజమానులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిందన్నారు. కేవలం వంద రోజుల్లో 95 శాతం గ్రామీణ భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశామన్నారు. దీనికోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించామన్నారు. మిషన్ కాకతీయ కింద 46వేల చెరువులకుగాను ఇప్పటివరకు 30 వేల చెరువుల పునరుద్ధరణ పూర్తి చేశామన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం కింద రెండు 3 నెలల్లో రాష్ట్రంలో ఇంటింటికి తాగునీటి సరఫరా చేస్తామన్నారు. నగరంలో రాష్ట్ర ప్రభుత్వం–సీఐఐ మధ్య సంప్రదింపుల విభాగం ఏర్పాటు చేస్తామని సీఐఐ చేసిన ప్రతిపాదనను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ విభాగం సహకారాన్ని తీసుకుంటామన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ హబ్ గా హైదరాబాద్ గుర్తింపు పొందిందని, గతేడాది రాష్ట్రం లో ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు 13 శాతం వృద్ధి చెందా యన్నారు. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో జాతీ య సగటు వృద్ధి రేటు 9 శాతంతో పోల్చితే రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందన్నారు. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ లాంటి ప్రముఖ కంపెనీలు తమ రెండో ప్రధాన కార్యాలయాలన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నా యన్నారు. ఫార్మా, మెడికల్ డివైజెస్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్స్, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగాల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామికవాడలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమ ంలో సీఎస్ ఎస్.కె.జోషి, సీఐఐ చైర్మన్ ఆర్.దినేష్, సదరన్ రీజి యన్ డైరెక్టర్లు టీవీఎస్ సుందరం అయ్యర్ పాల్గొన్నారు. -
‘రైతు సంక్షేమంలో తెలంగాణ దిక్చూచి’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోలో విత్తనాలు, ఎరువులు, కరెంట్ కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే కోటి ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శం, దిక్చూచి అని తెలిపారు. ఆగష్టు 15 నుంచి రైతు బంధు జీవిత భీమా పథకం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కింద 50 లక్షల మందికి ప్రభుత్వం 1100 కోట్ల ప్రీమియం చెల్లిస్తుందన్నారు. ఈ నెలాఖరులోగా రైతులకు ఇచ్చిన ఫారమ్‌లో నామిని పేరు రాసి వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాలని సూచించారు. కొందరు వాస్తవాలను గ్రహించకుండా రాజకీయ దుర్భుద్ధితో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. -
ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : జిల్లాలోని రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. స్థానిక జెడ్పీ హాల్లో మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఏఓలు, ఏఈఓలకు రైతు బీమా పథకంపై మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఏదైని కారణంలో మరణిస్తే వారి కుటుంబాలకు ఉపశమనం కోసం బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీ వర్తిస్తుందన్నారు. ఈ పథకం అమలులో వ్యవసాయ అధికారులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ లేకుంటే జూలై 1వ తేదీగా నమోదు చేయాలన్నారు. రైతు కుటుంబ సభ్యుల పేర్లు, నామినీ పేర్లు నమోదు చేయాలన్నారు. నామినేషన్ వివరాలతో పాటు అర్హులైన రైతుల వివరాలు ఏఈఓలు నామినేషన్ ఫారంలో సేకరించాల్సి ఉంటుందన్నారు. డీఏఓ, ఏడీఏ, ఏఓల పర్యవేక్షణలో ఏఈఓ రైతుల వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో డీఏఓలు సుచరిత, గోవింద్‌నాయక్ పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికి మరో ముందడుగు
-
రైతన్నకు బీమా ధీమా
సాక్షి, హైదరాబాద్: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తామని వెల్లడించారు. రైతులకు ఎంత భూమి ఉన్నా, వారు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా, ఎంత వ్యయమైనా ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకానికి కావాల్సిన నిధులను బడ్జెట్లోనే కేటాయిస్తామన్నారు. ఏటా ఆగస్టు 1న ప్రీమియం చెల్లిస్తామని చెప్పారు. విశ్వసనీయత, విస్తృత యంత్రాంగమున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ ద్వారా బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు. సాధా రణ మరణమైనా, ప్రమాదవశాత్తూ చనిపోయినా రైతు ప్రతిపాదించిన నామినీకి పది రోజుల్లోగా రూ.5 లక్షల బీమా పరిహారం చెల్లించేలా ఈ పథకం ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం ప్రమాద బీమా అయితే.. ప్రభుత్వంపై వ్యయ భారం కూడా తక్కువయ్యేదని, కానీ ఎంత ఖర్చయినా మరణించిన ప్రతీ రైతు కుటుంబాన్ని ఆదుకోవడాన్ని బాధ్యతగా భావించి బీమా చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రైతుల జీవిత బీమా పథకం రూపకల్పనపై శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులు, ఎల్ఐసీ ప్రతినిధులతో మాట్లాడి విధి విధానాలు ఖరారు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో బీమా చేస్తున్నందున ఎల్ఐసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కోరారు. ‘‘తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే 93 శాతం మంది ఉన్నారు. ఒక్క ఎకరంలోపు ఉన్న వారు 18 లక్షల మంది ఉన్నారు. వారికి భూమి తప్ప మరో జీవనాధారం లేదు. ఏదేని పరిస్థితుల్లో రైతు చనిపోతే ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఉంటే ఆ కుటుంబానికి ఆసరా ఉంటుంది. కేవలం ప్రమాద బీమా వర్తింపచేయడం వల్ల ప్రభుత్వానికి భారం తక్కువగా ఉన్నప్పటికీ, రైతులకు పెద్దగా లాభం ఉండదు. కాబట్టి వ్యయం ఎక్కువైనా సరే సాధారణ మరణాలకు కూడా వర్తించే విధంగా జీవిత బీమా చేయాలని నిర్ణయించాం’’అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ వినోద్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, ఎల్ఐసీ రీజినల్ మేనేజర్ ఆర్.చందర్, డీఎం బీఎస్ నర్సింహ, డీఎం సుబ్రహ్మణ్యం, బీఎం జి.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. విధివిధానాలివే.. ఎల్ఐసీతో పాటు ఇతర బీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికే సాధారణ జీవిత బీమా వర్తిస్తుంది. 59 ఏళ్లలోపు వారిని మాత్రమే బీమా పథకానికి నమోదు చేసుకుంటారు. 60 ఏళ్ల వయసు వచ్చే వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు. అందుకే రైతులకు జీవిత బీమా పథకానికి 18 నుంచి 59 ఏళ్లలోపు వారి పేర్లు నమోదు చేస్తారు. ఆధార్ కార్డుపై నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. 2018 ఆగస్టు 15 నాటికి రైతు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రతీ ఏడాది కూడా ఆగస్టు 15నే ప్రామాణికంగా తీసుకుని పేర్లను నమోదు చేసుకుంటారు. ఈ జాబితా ప్రకారమే ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. వ్యవసాయాధికారులు క్లస్టర్ల వారీగా 18–59 వయసున్న రైతుల జాబితాను సిద్ధం చేస్తారు. ప్రభుత్వం వారి తరఫున ప్రీమియం చెల్లించి, రైతుల జాబితాను ఎల్ఐసీకి అందిస్తుంది. ఎల్ఐసీ బీమా సర్టిఫికెట్లను ముద్రిస్తుంది. ఈ సర్టిఫికెట్లను ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రైతులకు పంపిణీ చేస్తుంది. ప్రతి రైతుకు ప్రభుత్వం–ఎల్ఐసీ సంయుక్తంగా బీమా సర్టిఫికెట్‌ను అందజేస్తుంది. బీమా పరిహారంగా రూ.5 లక్షలు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించే స్వేచ్ఛ రైతుకే ఉంటుంది. ముందుగానే రైతులు నామినీని ప్రతిపాదించాల్సి ఉంటుంది. కొద్ది రోజుల్లోనే వ్యవసాయాధికారులు గ్రామాల్లో రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలను సేకరిస్తారు. రైతు మరణించిన పది రోజుల్లోగానే రూ.5 లక్షలు నామినీకి అందజేస్తారు. రైతు కుటుంబ సభ్యులు కేవలం మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. పది రోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించేలా ప్రభుత్వానికి, ఎల్ఐసీకి మధ్య ఒప్పదం కుదురుతుంది. పది రోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించకుంటే ఎల్ఐసీకి జరిమానా విధిస్తారు. ప్రభుత్వం ప్రతీ ఏడాది బడ్జెట్లోనే ప్రీమియం కోసం నిధులు కేటాయిస్తుంది. ఆగస్టు 1న ఎల్ఐసీకి చెల్లిస్తుంది. ప్రతి నెలా రైతుల వివరాలను వ్యవసాయాధికారులు అప్ డేట్ చేస్తారు. దాని ప్రకారం అర్హుల జాబితా అప్ డేట్ అవుతుంది. ఎప్పుడు భూమి కొంటే అప్పటి నుంచి బీమా వర్తించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. దేశ చరిత్రలో ఇది రికార్డు: ఎల్ఐసీ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న రైతులకు జీవిత బీమా సదుపాయం దేశ చరిత్రలో, బీమా సంస్థల చరిత్రలో సరికొత్త రికార్డుగా ఎల్ఐసీ ప్రకటించింది. ‘‘గతంలో కూడా ఇలాంటి గ్రూపు ఇన్సూరెన్సులున్నాయి. తక్కువ మంది సభ్యులు.. లక్ష నుంచి రెండు లక్షల బీమా ఉండేది. ప్రీమియం సొమ్ము తక్కువవుతుందనే ఉద్దేశంతో ప్రమాద బీమా మాత్రమే చేస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎంత వ్యయమైనా సరే, రైతులందరికీ ప్రయోజనం ఉండాలని భావించింది. ఎక్కువ ప్రీమియం అయినా సరే.. ప్రమాద బీమా కాకుండా జీవిత బీమా చేయాలని నిర్ణయించింది. రైతులందరికీ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల బీమా చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇన్ని లక్షల మందిని సభ్యులుగా గ్రూపు ఇన్సూరెన్సు చేయడం కూడా దేశ చరిత్రలో, ఇన్సూరెన్సు కంపెనీల చరిత్రలో ఎన్నడూ లేదు’’అని సీఎంతో సమీక్ష అనంతరం ఎల్ఐసీ రీజనల్ మేనేజర్ ఆర్.చందర్, డీఎంలు బీఎస్ నర్సింహ, సుబ్రహ్మణ్యం అన్నారు. -
బీమా వృద్ధికి టెక్నాలజీ దన్ను
సాక్షి, బిజినెస్ బ్యూరో : పాలసీల విక్రయం నుంచి సర్వీసుల దాకా జీవిత బీమా రంగంలో టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి పూర్తి డిజిటల్ సంస్థగా ఎదిగే దిశగా ఇన్వెస్ట్ చేస్తున్నామంటున్నారు బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ తరుణ్ చుగ్. గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమకు రెట్టింపు స్థాయిలో కొత్త ప్రీమియం ఆదాయాలు సాధించామని, ఈసారీ మరింత వ్యాపార వృద్ధికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ పనితీరు ఎలా ఉంది. ఈసారి అంచనాలేంటి? గత ఆర్థిక సంవత్సరం అటు మొత్తం జీవిత బీమా రంగానికి ఇటు మా సంస్థకూ సానుకూలంగానే గడిచింది. కొత్త బిజినెస్ ప్రీమియంలు, ముఖ్యంగా యులిప్స్‌లో పెట్టుబడులు పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు యులిప్స్‌ను సురక్షితమైన, మెరుగైన పెట్టుబడి సాధనంగా విశ్వసిస్తున్నారనడానికి ఇది నిదర్శనం. 2017–18లో పరిశ్రమ కొత్త ప్రీమియం ఆదాయం 19 శాతం పెరగ్గా, ప్రైవేట్ బీమా సంస్థల్లో మేం అత్యధికంగా 38 శాతం వృద్ధి సాధించాం. 2016–17లో మార్కెట్ వాటా 1.9 శాతం ఉండగా, గత సంవత్సరం 2.2 శాతానికి పెరిగింది. గత క్వార్టర్లో యులిప్ గోల్ అష్యూర్ వంటి పథకాలను ప్రవేశపెట్టాం. కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయాలు పెంచుకునేందుకు ఇవన్నీ తోడ్పడ్డాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కూడా పరిస్థితులు సానుకూలంగానే కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతుండటం, మరింత మెరుగైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటున్న రిటైల్ ఇన్వెస్టర్లు .. సముచిత రాబడులు అందించే పెట్టుబడి సాధనాల వైపు చూస్తుండటం తదితర అంశాలు ఈసారి వ్యాపార వృద్ధికి తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. జీవిత బీమా రంగంలో ప్రస్తుతం ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? బీమా రంగ సంస్థలు డిజిటైజేషన్ అవసరాన్ని గుర్తెరిగాయి. కస్టమర్‌కు మెరుగైన అనుభూతినివ్వడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు, వ్యయాలను తగ్గించుకునేందుకు, సులభతరంగా కార్యకలాపాల నిర్వహణకు ఇది తోడ్పడుతోంది. రాబోయే రోజుల్లో ప్రీ–సేల్స్ నుంచి పోస్ట్ సేల్స్ సర్వీసెస్ దాకా అంతా పేపర్రహితంగానే జరిగే అవకాశం ఉంది. బీమా పాలసీల అమ్మకాలు ఆన్లైన్లో మరింతగా పెరగునున్నాయి. డిజిటైజేషన్ కారణంగా ఎలాంటి సర్వీసైనా క్షణంలోనే అందుబాటులో ఉంటుంది. మా విషయానికొస్తే.. 2019 నాటికల్లా పూర్తి డిజిటల్ సంస్థగా ఎదిగే దిశగా ఐటీ ఇన్ఫ్రాను అప్‌గ్రేడ్ చేసేందుకు భారీ పెట్టుబడులు పెడుతున్నాం. మీ సంస్థలో టెక్నాలజీ వినియోగం ఎలా ఉంటోంది? కస్టమర్‌తో పాటు ఉద్యోగులకు కూడా తోడ్పడేటటువంటి టెక్నాలజీలను మేం ఉపయోగిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో లైఫ్ అసిస్ట్ పేరుతో కస్టమర్స్ కోసం పోర్టల్ ప్రారంభించాం. బజాజ్ అలయంజ్ లైఫ్ పాలసీకి సంబంధించి తలెత్తే ప్రశ్నలన్నింటినీ దీని ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఆధార్, ఫండ్ స్విచింగ్, కాంటాక్ట్ వివరాలు అప్డేట్ చేసుకోవడం మొదలైన వాటన్నింటికీ ఇది ఉపయోగపడుతుంది. దీన్ని రెండు లక్షల మందికి పైగా కస్టమర్లు ఉపయోగించుకుంటున్నారు. ఇక పాలసీ సేవలపై కస్టమర్స్‌కి తోడ్పాటు అందించేందుకు బోయింగ్ పేరిట వర్చువల్ చాట్ అసిస్టెంట్ కూడా అందుబాటులో ఉంది. ఇక మా శాఖల్లో లభించే సర్వీసులన్నీ కస్టమర్ ఇంటి దగ్గరే అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించి మోసంబీ పేరుతో చేతిలో ఇమిడే చిన్న పరికరాన్ని రూపొందిం చాం. దీని తోడ్పాటుతో కేవలం నాలుగు నెలల్లోనే రూ. 160 కోట్లకు పైగా రెన్యువల్ ప్రీమియంలు సేకరించగలిగాం. దీంతో పాటు ఫొటో డె డూప్ పేరుతో మరొక ఫీచర్ కూడా అందుబాటులోకి తెచ్చాం. కేవలం సెల్ఫీ క్లిక్ చేయడం ద్వారా పాలసీదారు ఆన్లైన్లో లాగిన్ అయి.. పాలసీ సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. లాగిన్ అయ్యేందుకు పట్టే సమయాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. అమ్మకాల కోసం ఇన్స్టాబ్ పేరుతో ప్రత్యేకంగా యాప్ కూడా ఉంది. ఏజెంటు అప్పటికప్పుడు బీమా ప్రీమియంను లెక్కగట్టి, ట్యాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా కొత్త ప్రపోజల్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా ప్రాసెస్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా గత ఆర్థిక సంవత్సరం 27,000 పైచిలుకు పాలసీలు ప్రాసెస్ చేశాం. ఇక సేల్స్ టీమ్ మధ్య పరస్పరం సమాచారం పంచుకునేందుకు ఐస్మార్ట్, పేపర్‌రహితంగా ఏజెంట్ల నియామకం చేపట్టేందుకు ఐ–రిక్రూట్ పోర్టల్ లాంటివి ఉన్నాయి. అటు మా ఉద్యోగులు, మానవ వనరుల విభాగం మధ్య అనుసంధానంగా వ్యవహరించేందుకు వికి పేరుతో చాట్‌బాట్‌ను రూపొందించాం. -
పాలసీకి ప్రాణం పోస్తారా!
(సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) : ప్రతి కుటుంబానికీ జీవిత బీమా అంటే రక్షణ కవచం లాంటిదే. మరి ఆ కవచం తుప్పుపట్టకుండా ఉండాలంటే... పాలసీ తీసుకున్న వారు సకాలంలో ప్రీమియం చెల్లిస్తూ దాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవడం తప్పనిసరి. ప్రీమియం చెల్లించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు. ఒకవేళ మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఏదైనా కారణంతోఆపేద్దామనుకుంటే..!! అలా చేయటం చాలా ఈజీయే కానీ... అది మీ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయటమేననుకోవాలి. సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే ఏ పాలసీ అయినా ల్యాప్స్ అయిపోతుంది. దీంతో ఏదైనా జరిగితే వ్యక్తి కుటుంబానికి పరిహారం అందకుండా పోతుంది. అందుకే... పాలసీ ల్యాప్స్ అయిందని వదిలేయకుండా ఓ సారి దాన్ని పరిశీలించి, అవకాశం ఉంటే పునరుద్ధరించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ల్యాప్స్ అయితే ఏంటి పరిష్కారం టర్మ్ పాలసీ తీసుకుంటే జీవితాంతం నిర్ణీత ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే అది యాక్టివ్‌గా (చెల్లుబాటు) ఉంటుంది. ఏవో కొన్ని కారణాల రీత్యా గడువులోపు ప్రీమియం చెల్లించలేదనుకోండి. అప్పుడు అదనపు గడువు (గ్రేస్ పీరియడ్) ఉంటుంది. ఆ లోగా కూడా ప్రీమియం చెల్లించకుంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. అంటే మురిగిపోతుంది. ఇన్సూరెన్స్ పరిభాషలో నుంచి చూస్తే ల్యాప్స్ అయిన పాలసీ విషయంలో అన్ని రకాల ప్రయోజనాలూ ముగిసిపోయినట్టే. దాదాపు అన్ని బీమా కంపెనీలూ వార్షిక ప్రీమియానికైతే 30 రోజులు, అర్ధ సంవత్సరం, నెలవారీ ప్రీమియంలపై 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాయి. అంటే ఈ లోపైనా ప్రీమియం చెల్లించి పాలసీ ల్యాప్స్ కాకుండా చూసుకోవచ్చు. ఇక కంపెనీలను బట్టి గ్రేస్ పీరియడ్‌లో మార్పులుండొచ్చు. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్, నియమ, నిబంధనలు చూడాలి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రేస్ పీరియడ్‌లోనూ బీమా రక్షణ కొనసాగుతుంది. అంటే గ్రేస్ పీరియడ్‌లో పాలసీదారుడికి ఏదైనా జరిగితే పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా సంస్థపై ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి గడువులోపు టర్మ్ పాలసీ ప్రీమియం చెల్లించకుండా, గ్రేస్ పీరియడ్ పూర్తయ్యేలోపు ప్రమాదం కారణంగా మరణించాడనుకుంటే... ఈ సందర్భంలో బాధితుని కుటుంబం పరిహారం కోసం క్లెయిమ్ దాఖలు చేస్తే బీమా కంపెనీ కచ్చితంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గ్రేస్ పీరియడ్ ముగిశాక ప్రమాదం జరిగి మరణం చోటు చేసుకుంటే పరిహారం చెల్లింపు బాధ్యత కంపెనీపై ఉండదు. గ్రేస్ పీరియడ్ తర్వాత...? గ్రేస్ పీరియడ్ లోపు కూడా ప్రీమియం చెల్లించకుంటే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. అపుడు పాలసీదారుడికి ఏం జరిగినా అతనిపై ఆధారపడిన వారికి కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించదు. ఒకవేళ పాలసీని పునరుద్ధరించుకోవాలని భావిస్తే అందుకు వీలుంటుంది. ఒకవేళ బీమా సంస్థ పాలసీ పునరుద్ధరణకు అంగీకరిస్తే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ పునరుద్ధరణ విషయంలో నిబంధనలన్నవి కంపెనీని బట్టి మారొచ్చు. సాధారణంగా టర్మ్ పాలసీలు ల్యాప్స్ అయితే, బకాయి ఉన్న ప్రీమియంను వడ్డీతో కలిపి చెల్లించడం ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. కాకపోతే తమ ఆరోగ్య స్థితి బాగానే ఉందని ధ్రువీకరణ ఇవ్వడం లేదా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి రావచ్చు. అయితే, బీమా సంస్థ అంగీకరిస్తేనే పాలసీ పునరుద్ధరణ సాధ్యం. ఇందుకు నిర్ణీత ప్రక్రియ ఉంటుంది. కీలకాంశాలివీ... అన్ని కంపెనీలు సకాలంలో ప్రీమియం చెల్లించాలంటూ ముందు నుంచే ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ద్వారా అలర్ట్ చేస్తుంటాయి. ప్రీమియం చెల్లించేందుకు ఎన్నో ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రీమియం చెల్లింపు ఆప్షన్లను పరిశీలించి... పాలసీదారుడు తన బ్యాంకుకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టయితే సకాలంలో (నిర్ణీత తేదీన) బ్యాంకు నుంచి ప్రీమియం బీమా కంపెనీకి వెళ్లిపోతుంది. ఇందుకోసం బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటున్నాయి. దీంతో పాలసీదారులు ప్రీమియంను బ్యాంకు ద్వారా చెల్లించొచ్చు. బీమా సంస్థ ఆఫీసుకు వెళ్లి చెల్లించొచ్చు. లేదా తన దగ్గరకే వచ్చి రెన్యువల్‌కు సంబంధించిన చెక్ తీసుకెళ్లాలని కోరొచ్చు. కొన్ని బ్యాంకులు ఏటీఎం నుంచే ప్రీమియం చెల్లింపు సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇపుడు ఆన్లైన్ చెల్లింపులూ అందుబాటులోకి వచ్చాయి. చివరిగా చెప్పేదేమంటే బీమా పాలసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాప్స్ కాకుండా చూసుకోవడమే మంచిది. పాలసీ కాల వ్యవధి ముగిసేదాకా ఏటా ప్రీమియం చెల్లించడం ద్వారా మీ కుటుంబానికి రక్షణ కల్పించడాన్ని మర్చిపోవద్దు. అలాగే, ఆదాయపన్ను సెక్షన్ 80సీ కింద పాలసీకి చెల్లించే ప్రీమియానికి పన్ను మినహాయింపు పొందొచ్చు. పాలసీ ల్యాప్స్ అయితే ఈ ప్రయోజనం కోల్పోతారు. టర్మ్ పాలసీ అన్నది మీ కోసం కాదు. మీ కుటుంబం కోసం. ఆత్మీయుల సంరక్షణ దృష్ట్యా పాలసీ తీసుకుని దాన్ని మనుగడలో ఉంచేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. -
ప్రొటెక్షన్ ప్లాన్స్‌పైనే దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రధానంగా ప్రొటెక్షన్ ప్లాన్స్‌పై దృష్టి సారిస్తోంది. అలాగే, పూర్తి స్థాయి ప్రీమియర్ ఏజెంట్స్ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంటోంది. టాటా ఏఐఏ చీఫ్ ఆఫ్ ప్రొప్రైటరీ చానల్స్ రిషి శ్రీవాస్తవ ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా సుమారు ఎనిమిది శాతం మందికి మాత్రమే బీమా కవరేజీ ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ రంగంలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. వచ్చే పదేళ్లలో జీవిత బీమా విభాగంలో సేవింగ్స్ కూడా కలిపి ఉన్న పథకాలకన్నా.. ప్రొటెక్షన్ ప్లాన్స్‌కే మరింత ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. మొత్తం పాలసీ జారీ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడంపై తాము ప్రధానంగా దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వస్తోందన్నారు. ప్రస్తుతం టాటా ఏఐఏ సుమారు ఆరు రకాల రైడర్స్‌తో 34 పైచిలుకు పథకాలు అందిస్తోందని తెలిపారు. ప్రీమియర్ ఏజెంట్స్ నెట్వర్క్ ఏర్పాటు.. ఏజెన్సీలు, బ్యాంకులు తదితర మార్గాల్లో తమ పథకాలను విక్రయిస్తున్నప్పటికీ.. సొంతంగా ప్రీమియర్ ఏజెంట్స్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. కంపెనీ ద్వారా శిక్షణ పొందిన ఈ ఫుల్‌టైమ్ ప్రీమియర్ ఏజెంట్స్.. పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందించగలరని ఆయన చెప్పారు. మిగతా ఏజెంట్లతో పోలిస్తే ప్రీమియర్ ఏజెంట్లలో అట్రిషన్ (ఉద్యోగుల వలస) చాలా తక్కువగా ఉండటం వల్ల సుదీర్ఘకాలం అటు పాలసీదారుకు ఇటు కంపెనీకీ ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5,000 పైచిలుకు ఈ తరహా ఏజెంట్స్ ఉండగా, మొత్తం ఏజెంట్స్ సంఖ్య 20,000 స్థాయిలో ఉందని శ్రీవాస్తవ వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య దాదాపు 400 దాకా ఉంటుందన్నారు. -
బీమా కోసం మళ్లీ చంపేశారు
తెనాలి రూరల్: సినీ ఫక్కీలో.. ఇన్సూరెన్స్ కోసం అనారోగ్యంతో మృతి చెందిన ఒక వ్యక్తిని రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు మృతుడి బంధువులు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగక మృతదేహాన్ని రోడ్డుపై పెట్టి దానిపై నుంచి కారును పోనిచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతమంది రైతులు రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని చూసి ప్రమాదంలో మరణించాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనుమానమొచ్చిన పోలీసులు తమదైన శైలిలో మృతుడి బంధువులను విచారించడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకెళ్తే.. తెనాలి మండలం పెదరావూరులోని సుగాలి కాలనీకి చెందిన రమావత్ ఖత్నానాయక్ (56) అనారోగ్యంతో బుధవారం ఉదయం ఇంటిలో మృతి చెందాడు. అయితే సుమారు నెలన్నర క్రితం ఆయన ప్రమాద బీమా పాలసీ తీసుకున్నాడు. దాదాపు రూ.10 లక్షల విలువైన బీమాకు గత నెల 31న బాండ్ వచ్చింది. దీంతో ఖత్నానాయక్ ప్రమాదం కారణంగా మృతి చెందాడని నమ్మిస్తే డబ్బులు వస్తాయన్న ఆలోచన కుటుంబసభ్యులు, బంధువులకు వచ్చింది. వెంటనే పథకం రచించారు. పెదరావూరు నుంచి చినపరిమి డొంకకు వెళ్లే రోడ్డులోకి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చారు. రోడ్డుపై పడుకోబెట్టి, వెనుక తెచ్చిన కారును మృతదేహం మీదకు ఎక్కించి వెళ్లిపోయారు. స్థానికంగా పొలం పనులు చేస్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఎస్ఐ జయకుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి అల్లుళ్లను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
సూచీలు శిఖర స్థాయిల్లో.. ఫండ్స్‌లో మార్పులు చేయాలా?
మ్యాక్స్ లైఫ్ మంత్లీ ఇన్కమ్ అడ్వాంటేజ్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయమంటూ బీమా ఏజెంట్ ఒకతను సూచిస్తున్నాడు. ఏడాదికి రూ.2 లక్షలు చొప్పున పన్నేండేళ్ల పాటు చెల్లించాలని, పదేళ్ల పాటు ప్రీమియమ్ చెల్లించిన తర్వాత రూ.22 లక్షలు ఏక మొత్తంగా లభిస్తుందని, పదమూడో సంవత్సరం నుంచి నెలకు రూ.23 వేల చొప్పున పదేళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందవచ్చని ఆ ఏజెంట్ చెబుతున్నాడు. ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? – సుందర్, హైదరాబాద్ మ్యాక్స్ లైఫ్ మంత్లీ ఇన్కమ్ అడ్వాంటేజ్ ప్లాన్ అనేది సాంప్రదాయ మనీ బ్యాక్ పాలసీ లాంటిది. మనీ బ్యాక్ పాలసీలు దాదాపు ఎండోమెంట్ బీమా ప్లాన్లాగానే ఉంటాయి. పాలసీ కాలంలో ఇవి పాక్షిక సర్వైవల్ బెనిఫిట్స్‌ను మాత్రమే ఇస్తాయి. ఈ తరహా పాలసీలు ఖరీదైనవి. ఇవి తగినంత బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు. మంచి రాబడులను కూడా ఇవ్వలేవు. ఇక ఈ ప్లాన్ గురించి ఆ ఏజెంట్ మీకు చెప్పిన వివరాలు సరైనవి కావు. మీరు ఈ పాలసీ తీసుకున్నట్లయితే, పాలసీ తీసుకున్న పదేళ్ల తర్వాత మీకు కొంత సొమ్ము తిరిగి వస్తుంది. ప్రీమియమ్ చెల్లింపు వ్యవధి పూర్తయిన తర్వాత మాత్రమే మీకు ప్రతినెలా గ్యారంటీగా కొంత మొత్తం పదేళ్ల పాటు లభిస్తుంది. ఉదాహరణకు మీరు రూ.10 లక్షలకు ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. పాలసీ కాల వ్యవధి పూర్తయిన తర్వాత.. మీరు బీమా చేసిన మొత్తంలో 12వ వంతులో పది శాతం నెల వారీగా లభిస్తుంది. అంటే రూ.10 లక్షల బీమాకు మీకు నెలకు రూ.8,333 లభిస్తుంది. మీ ఏజెంట్ ఉదహరించిన రివర్షనరీ, టెర్మినల్ బోనస్‌లు గ్యారంటీ కావు. ఇక మీరు చెల్లించే ప్రీమియమ్ (ఏడాదికి రూ.2 లక్షలు) చాలా ఎక్కువ. మీకు క్రమం తప్పని ఆదాయం కావాలంటే, పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ సంబంధిత సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయండి. మీకు మంచి రాబడులు వస్తాయి. బీమా, మదుపు కలగలపిన సాధనాల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు. జీవిత బీమా కోసం ప్యూర్ టర్మ్ పాలసీని తీసుకోవాలి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్ చేయాలి. మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొత్త అయితే ముందుగా, మంచి రేటింగ్ఉన్న బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఉండాలి. మీరు ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండి, స్టాక్ మార్కెట్ పట్ల అవగాహన ఉన్నట్లయితే, ఏదైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మీ సిప్‌ను కొనసాగించండి. దీనివల్ల మీ ఇన్వెస్ట్మెంట్స్ యావరేజ్ అయ్యి, మీ రాబడులు పెరుగుతాయి. నేను గత రెండేళ్లుగా ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ముందు అనుకున్న ప్రకారం, మరో పదేళ్ల పాటు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ ఈ ఫండ్ 20 శాతం వరకూ రాబడులనిచ్చింది. ఈ ఫండ్‌లో కొనసాగమంటారా? ఈ ఫండ్ నుంచి వైదొలగి, మరో ఫండ్‌కు మారమంటారా? – దేవకి, విశాఖ పట్టణం ఫ్రాంక్లిన్ ప్రైమా ఫండ్–ఇది పాత మిడ్‌క్యాప్ ఫండ్. బహుశా భారత్‌లో మొదటి ఓపెన్–ఎండెడ్ ఫండ్ ఇదే కావచ్చు. 1993లో ఈ ఫండ్ ప్రారంభమైంది. ఈ ఫండ్ పనితీరు బాగానే ఉంది. గత 4–5 ఏళ్ల కాలంలో చాలా మిడ్‌క్యాప్ ఫండ్స్ మంచి రాబడులనే ఇచ్చాయి. ఆ దృష్ట్యా చూస్తే ఈ ఫండ్ ఇచ్చిన రాబడులు (ఈ రెండేళ్లలో) తక్కువేనని చెప్పవచ్చు. ఇది ఈక్విటీ ప్రాధాన్యత గల ఫండ్. స్పెక్యులేటివ్ షేర్లలో ఇన్వెస్ట్ చేయకుండా వాటికి దూరంగా ఉంటోంది. చాలా ఏళ్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, భారీ మ్యూచువల్ ఫండ్‌గా ఎదగలేదు. అయితే ఈ ఫండ్ నిర్వహణ పద్ధతులు, మీ ఇన్వెస్ట్మెంట్ టైమ్‌ఫ్రేమ్‌ను దృష్టిలో పెట్టుకుంటే, ఈ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలాంటి సంశయాలు లేకుండా కొనసాగించవచ్చు. స్టాక్ సూచీలు శిఖర స్థాయిల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో నా పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఈక్విటీ ఫండ్స్ విషయంలో ఏమైనా, మార్పులు, చేర్పులు చేయల్సిన అవసరం ఉందా ? – సాకేత్, విజయవాడ స్టాక్ సూచీలు–సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు, మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఈక్విటీ ఫండ్స్‌ల్లో మార్పులు, చేర్పులు చేయడం సరైనది కాదు. స్టాక్ మార్కెట్ బుల్‌రన్‌లో ఉన్నప్పుడు బాగా పెరిగిన షేర్లు, స్టాక్ మార్కెట్ పతనంలో అంతే స్థాయిల్లో పడిపోతాయని గతంలో పలు మార్లు రుజువైంది. ఇదే సూత్రం మ్యూచువల్ ఫండ్స్‌కు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఒక ఫండ్ 70 శాతానికి పైగా రాబడి ఇచ్చిందనే ఉద్దేశంతో ఆ ఫండ్‌ను మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంటే, స్టాక్ మార్కెట్ బేర్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఈ ఫండ్ బాగా పడిపోవచ్చు. అయితే అన్ని ఫండ్స్ ఇలానే ఉంటాయని కూడా చెప్పలేము. మంచి ట్రాక్ రికార్డ్ఉన్న ఈక్విటీ ఫండ్స్ బుల్ మార్కెట్లో అయినా, బేర్ మార్కెట్లో అయినా మంచి రాబడులనే ఇస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ ఫండ్ దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చినట్లయితే, దానిని మార్చాల్సిన అవసరం లేదు. మార్కెట్ బాగా పెరిగినప్పుడు, ఒక ఫండ్ ఏడాది పనితీరును ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోకూడదు. -
ఐపీఓకు ఎస్బీఐ లైఫ్ దరఖాస్తు
రూ.6,500–రూ.7,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదన ముంబై: జీవిత బీమా రంగంలోని ప్రముఖ కంపెనీ ఎస్బీఐ లైఫ్ తొలి పబ్లిక్ ఆఫర్ కోసం సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ.6,500–7,000 కోట్లను సమీకరించనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన 12 కోట్ల షేర్లను ఐపీవోలో భాగంగా ప్రమోటర్లు విక్రయించనున్నారు. మొత్తం జారీ మూలధనంలో 12 శాతానికి సమానం. ఎస్బీఐ 8 కోట్ల షేర్లు, బీఎన్పీ పారిబా కార్డిఫ్ ఎస్ఏ 4 కోట్ల షేర్లను జారీ చేస్తాయి. ఈ రెండు సంస్థలు ఎస్బీఐ ప్రమోటర్లుగా ఉన్నాయి. 20 లక్షల షేర్లను ఎస్బీఐ ఉద్యోగులకు, 1.2 కోట్ల షేర్లను ఎస్బీఐ వాటాదారులకు రిజర్వ్ చేస్తారు. జేఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, బీఎన్పీ పారిబా, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డాయిష్ సెక్యూరిటీస్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహింద్రా క్యాపిటల్ కంపెనీ, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా సేవలు అందించనున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తర్వాత ఐపీవోకి రానున్న రెండో బీమా కంపెనీ ఇది. -
తగిన సమయంలో అనుబంధ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: జీవిత బీమా, బీమాయేతర సేవలకు సంబంధించి అనుబంధ సంస్థలను తగిన సమయంలో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయనున్నట్లు గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు. ఇటు ఒక్క ఉత్పత్తి మాత్రమే అందించే ఆర్థిక సంస్థగాను, అటు బహుళ ఉత్పత్తులు అందించే సంస్థలకు మాతృసంస్థగాను ఉన్న హెచ్డీఎఫ్సీ స్వరూపం చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. అధికారాల వికేంద్రీకరణతో తమ అనుబంధ సంస్థలన్నీ కూడా స్వతంత్ర బోర్డుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయని, గ్రూప్ సీఈవోల పనితీరు.. వారసత్వ ప్రణాళికలు.. కొనుగోళ్లు.. పెట్టుబడులు మొదలైన వాటి ప్రాతిపదికనే గ్రూప్ కంపెనీల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని పరేఖ్ తెలిపారు. షేర్హోల్డర్లకు వార్షికంగా పంపే సందేశంలో ఆయన ఈ విషయాలు వివరించారు. గృహ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ పెన్షన్ మేనేజ్మెంట్ కంపెనీ మొదలైన లిస్టింగ్‌కు అనువైన సంస్థలు హెచ్డీఎఫ్సీ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. మరోవైపు, గృహ రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరగడం ద్వారానే ఈ రంగం వృద్ధి చెందుతుంది తప్ప.. ఒక సంస్థ రుణాలను మరో సంస్థకు బదలాయించడం ద్వారా నమోదయ్యే ఎదుగుదలను వృద్ధి కింద పరిగణించజాలమని పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగ విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎక్కువగా అఫోర్డబుల్ హౌసింగ్ లభ్యత, వాటి ధర పైనే ఆధారపడి ఉంటాయని తెలిపారు. -
పిల్లల భవితకు ఆర్థిక భరోసా
♦ ముందు నుంచే దీర్ఘకాల ప్రణాళిక ముఖ్యం ♦ విద్యావసరాలు తీర్చటానికి చైల్డ్ ప్లాన్స్ తల్లిదండ్రులు తమ పిల్లల సంతోషాల కోసం, వారి భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దడం కోసం అనేక ప్రణాళికలు వేస్తారు. నీల్సన్ సంస్థ నిర్వహించిన ‘లైఫ్– 2015’ సర్వే ప్రకారం .. అత్యధిక శాతం మంది జీవిత బీమా తీసుకోవడానికి ముఖ్య కారణం వారి పిల్లల భవిష్యత్‌పై ఆలోచనే. మరో అధ్యయనం ప్రకారం చైల్డ్ ఇన్సూరెన్స్‌పై అవగాహన స్థాయి 99 శాతం మేర ఉంటోంది. కానీ తీసుకునే వారి సంఖ్య కేవలం 16 శాతంగాను.. తీసుకోవాలనుకుంటున్న వారి సంఖ్య 12 శాతంగా మాత్రమే ఉంటోంది. అంటే చైల్డ్ ప్లాన్‌పై అవగాహన ఉన్నవారి సంఖ్యకు .. నిజంగానే తీసుకుంటున్న వారి సంఖ్యకు మధ్య పొంతన లేదు. సరే.. దాన్నలా పక్కన పెడితే.. అనేకానేక ఆర్థిక సాధనాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పుడు పిల్లల బీమా పథకాలు, జీవిత బీమా పథకాలే ఎక్కువగా ప్రాచుర్యంలో ఎందుకున్నాయి? ఎందుకంటే పిల్లలు తగిన ప్రొఫెషన్లో చేరేందుకు కీలకమైన చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశమే. పెరిగిపోతున్న విద్యా వ్యయాలు, ప్రొఫెషనల్ విద్య ఖర్చులు, సింపుల్ పెళ్లి ఖర్చులన్నింటికి కూడా చైల్డ్ ప్లాన్ సమగ్రమైన కవరేజి ఇస్తుంది. ఇది బేసికల్‌గా పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడే ఒక పొదుపు సాధనం. ఒకవేళ పేరెంట్‌కి ఏదైనా అనుకోనిది జరిగినా.. లబ్ధిదారుకు నిర్దేశిత సమ్ అష్యూర్డ్ మొత్తం తక్షణం లభిస్తుంది. పైగా తదుపరి ప్రీమియంలు కట్టకపోయినా.. (వెయివర్ ఆఫ్ ప్రీమియం) పాలసీ మాత్రం మెచ్యూరిటీ దాకా కొనసాగుతూనే ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రీమియంలను.. పాలసీ మెచ్యూర్ అయ్యే దాకా బీమా కంపెనీయే పాలసీదారు తరఫున కడుతుంది. ఇలాంటి పథకాల్లో ఒక పద్ధతి ప్రకారం పెట్టుబడి పెడుతూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో పొదుపు మొత్తాలు గణనీయంగా పెరగడమే కాకుండా.. పిల్లల చదువు లక్ష్యాలు, ప్రొఫెషనల్ కెరియర్, మొత్తమ్మీద ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడతాయి. పిల్లల చదువుకు సంబంధించి నిర్ధిష్ట వ్యవధుల్లో కొంత మొత్తం చేతికి అందుకునే విధంగా ఈ ప్లాన్స్‌లో కొంత వెసులుబాటూ ఉంటుంది. ప్రణాళిక ఇలా... పిల్లల భవిష్యత్ కోసం ప్రణాళికలను సాధ్యమైనంత ముందునుంచే ప్రారంభించాలి. పెట్టుబడులను వీలైనంత తొందరగా మొదలుపెట్టాలి. నిర్ధిష్ట కాలవ్యవధుల్లో కొంత కొంత మొత్తం పొదుపు చేస్తూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ స్థాయిలో నిధి పోగవుతుంది. అలాగే కాంపౌండింగ్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు (అసలుకు వడ్డీ కూడా తోడవుతూ పెరుగుతూ ఉంటుంది కనుక). చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని.. ♦ నిర్ధిష్ట మొత్తం పోగవడానికి అవసరమైన కాల వ్యవధి ♦ సదరు డబ్బు ఎప్పుడెప్పుడు అవసరం అవుతుంది ♦ నిధిని సమకూర్చుకోవడానికి ఎంత మొత్తం పొదుపు చేయాల్సి ఉంటుంది. మరీ భయం వద్దు... స్థూలంగా.. చదువు ఖర్చులు రేసుగుర్రాల్లా పరుగెట్టేస్తున్నాయి. అయితే మరీ భయపడకుండా.. ఒక సముచిత లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఎంత మొత్తం డబ్బు అవసరమవుతుందో లెక్కేసేటప్పుడు.. ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. వీలైనంత త్వరగా పొదుపు చేయడం మొదలుపెట్టండి. ఎంత నిధి సమకూర్చుకున్నా ఆఖర్లో ఎంతో కొంత తగ్గవచ్చేమో. కానీ విద్యా రుణాల్లాంటివి తీసుకుని దాన్ని భర్తీ చేయొచ్చు. అయితే అన్ని వేళలూ ఒకే రకంగా ఉండవు కదా. ఒకవేళ ఇంటిపెద్దకేదైనా జరిగినా.. ఆర్థిక స్థితి గాడి తప్పినా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తుతుంది కనుక.. పూర్తిగా రుణాల మీదే ఆధారపడటం శ్రేయస్కరం కాదు. కేవలం ప్రణాళికలతో నే కాకుండా.. వివేచనతో సత్వరం అమలు చేసేస్తే సరి. -
జీవిత బీమా.. రాబడికి కాదు!
దాన్ని రిస్క్‌ను తట్టుకునే సాధనంగానే చూడాలి ►దానిపై రాబడులొస్తాయని ఇన్వెస్ట్ చేయొద్దు ►మామూలు పాలసీలకన్నా టర్మ్ పాలసీనే ఉత్తమం ►అతితక్కువ ప్రీమియానికే అత్యధిక కవరేజీ ►మిగిలిన డబ్బు ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు మళ్లించొచ్చు జీవిత బీమా అంటే పెట్టుబడి సాధనమా? దాన్ని మన జీవితానికి కవరేజీగా భావించాలా... లేక దానిపై కూడా ఆదాయం వచ్చేలా చూసుకోవాలా? నిజానికి మనలో చాలామందికి ఈ డైలమా ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కంపెనీలో బోలెడన్ని పాలసీలను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటికి ఏజెంట్లు చాలా అందమైన మాటల్ని ముసుగుగా వేస్తారు. ఫలితం... మనం పడిపోతాం!!. ఇలాంటి పాలసీలు తీసుకునేముందు మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే!. మీరు పాలసీ తీసుకుంటున్నది జీవితానికి జరగరానిది జరిగితే తగిన రక్షణ కోసమా? లేక పెట్టుబడికా? పెట్టుబడికైతే మార్కెట్లో బోలెడన్ని సాధనాలున్నపుడు దీన్లో ఎందుకు పెట్టాలి? రాబడుల్లో బీమా స్థానం చివరే!! ‘‘నెలకు రూ.25,000 ప్రీమియం చొప్పున 20 ఏళ్లు కడితే చాలు... 21వ ఏట నుంచి 16 ఏళ్ల పాటు ప్రతీ నెలా రూ.64,000 చొప్పున చేతికొస్తాయి. ఏటా కొంత మొత్తం పెరుగుతుంది కూడా. పైగా దీనిపై పన్నుండదు. 80 లక్షల బీమా కవరేజీ కూడా లభిస్తుంది’’ ఇవి ఓ బీమా ఏజెంటు వెంకట్‌తో అన్న మాటలు. నెలకు రూ.60 వేలకు పైనే సంపాదించే వెంకట్ మనసును ఇవి భలే ఆకర్షించాయి. ఓకే చెప్పేశాడు. జీవితానికి మంచి కవరేజీ, కాల వ్యవధి తర్వాత 16 ఏళ్ల పాటు పన్నులేని చక్కని ఆదాయం పెన్షన్లా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. పైపెచ్చు ఈ తరహా పాలసీలకు చెల్లించే ప్రీమియంపై ఏటా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. జీవిత బీమా కవరేజీతో పాటు మెచ్యూరిటీ తర్వాత చేతికొచ్చే ఆదాయంపైనా పన్ను ఉండదు. ఈ ఉద్దేశంతోనే ఎక్కువ మంది ఇలాంటి పాలసీలను తీసుకుంటున్నారు. కానీ, సంప్రదాయ బీమా ప్లస్ పెట్టుబడి కలిసిన పాలసీల రాబడి సగటున ఏడాదికి 4.8 శాతమే ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించాలి. 20 ఏళ్ల కాల వ్యవధిగల పాలసీలపై రాబడులు 4.5–5 శాతం స్థాయిలోనే ఉంటాయి. 25 ఏళ్ల కంటే ఎక్కువ కాల వ్యవధితో కూడిన పాలసీలపై మాత్రం కాస్త మెరుగ్గా 6 శాతం స్థాయిలో ఉంటాయి. కానీ, ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చి చూస్తే ఇంత తక్కువ రాబడులనిచ్చేవి బీమా పాలసీలే అన్నది వాస్తవం. అయితే, బీమా రక్షణ కూడా వస్తోందిగా..? అని వాదించొచ్చు. అంత సుదీర్ఘకాలానికి బీమా రక్షణ, జీవించి ఉంటే రాబడులకు హామీనిచ్చే సాధనం మరొకటి లేదన్నది నిజమే. అయితే, అదే సమయంలో బీమా కవరేజీ కోసం రాబడులను ఎందుకు కోల్పోవాలి? ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయిగా!!. బీమా రక్షణ తక్కువే భారీ ప్రీమియం... కవరేజీ మాత్రం స్వల్పం. సంప్రదాయ బీమా పాలసీల తీరు ఇదే. ఉదాహరణకు ఏటా రూ.5 లక్షల ఆదాయం పొందుతున్న ఓ వ్యక్తికి జీవిత బీమా కవరేజీ కనీసం రూ.కోటి అయినా ఉండాలి. ఇందుకు ప్రీమియం 25 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఎంత తక్కువగా చూసుకున్నా సంప్రదాయ పాలసీల్లో రూ.5 లక్షల వరకు ఉంటుంది. అదే టర్మ్ పాలసీ అయితే రూ.10 వేలలోపు వార్షిక ప్రీమియానికే రూ.కోటి కవరేజీ లభిస్తుంది. పన్ను ప్రయోజనం పరిమితమే సంప్రదాయ జీవిత బీమా పాలసీలను తీసుకునే వారిలో చాలా మంది... జీవిత బీమా రక్షణ కంటే కూడా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందేందుకే. నిజానికి సంప్రదాయ బీమా పాలసీలతో వచ్చే పన్ను ప్రయోజం ఇతర సాధనాలతో పోలిస్తే అంత మెరుగ్గా ఏమీ లేదు. ఉదాహరణకు 30 శాతం వార్షిక పన్ను రేటు పరిధిలో ఉన్నవారు బ్యాంకు ఎఫ్డీలో పెట్టుబడి పెట్టారనుకుందాం. వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించగా నికరంగా వారికి వచ్చే రాబడి 4.9 శాతం. జాతీయ పొదుపు పత్రాల్లో పెట్టుబడి పెడితే పన్ను అనంతర రాబడి 5.6 శాతం. ఇక ప్రజాభవిష్యనిధి (పీపీఎఫ్) అయితే, పన్నులేని 8 శాతం రాబడులను ఇస్తోంది. పదేళ్లలోపు కుమార్తె ఉన్న వారు... సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను రహిత 8.5 శాతం రాబడిని అందుకోవచ్చు. ఇక ఎన్పీఎస్, ఈఎల్ఎస్ఎస్ వంటి సాధనాల ద్వారా దీర్ఘకాలంలో ఇంకా అధికంగా రాబడులను అందుకునేందుకూ అవకాశం ఉంది. కాకపోతే ఈ రాబడులకు హామీ మాత్రం ఉండదు. సంప్రదాయ పాలసీకి బదులు బీమా రక్షణ కోసం తక్కువ ప్రీమియంతో ఆఫర్ చేసే టర్మ్ పాలసీని తీసుకుని, మిగిలిన మొత్తాన్ని పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్ వంటి సాధనాల్లో మదుపు చేయడం దీర్ఘకాలంలో గరిష్ట రాబడులు అందుకోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. సంప్రదాయ పాలసీలకే ఆదరణ వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పటికీ జీవిత బీమా కంపెనీలు విక్రయిస్తున్న పాలసీల్లో సింహ భాగం సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలే ఉంటున్నాయి. బీమా కంపెనీలకు వస్తున్న ప్రీమియం ఆదాయంలో 70 శాతం ఈ పాలసీల నుంచేనని ఓ అంచనా. ఎందుకూ అంటే బీమా కంపెనీలు, ఏజెంట్లు సంప్రదాయ పాలసీల గురించే ఎక్కువగా ప్రమోట్ చేయడం. 25 – 30 ఏళ్ల తర్వాత భారీగా వస్తున్న ఆదాయ అంకెలు వారిని ఆకర్షించడం. ఓ ప్రయోజనం కూడా ఉంది అయితే, సంప్రదాయ జీవిత బీమా పాలసీలతో ఓ ప్రయోజనం కూడా ఉంది. నిర్బంధ పొదుపు అలవడుతుంది. సంప్రదాయ పాలసీలో చేరిన తర్వాత ప్రీమియం కట్టడం ఆపేస్తే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. దాంతో వెనక్కి వచ్చేది నామమాత్రమే. నష్టపోవడం ఎందుకన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ప్రీమియం కడుతుంటారు. పైగా ఎక్కువ మంది తక్కువ బీమా రక్షణతో పాలసీలు తీసుకుంటుంటారు. కనుక ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే చిన్న ఇన్వెస్టర్లు రెండేళ్లలోపే పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వైదొలిగే అవకాశం ఉంది గనుక. కానీ, సంప్రదాయ జీవిత బీమా పాలసీల్లో ఇలా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండదు కాబట్టి వాటిని కొనసాగిస్తారు. కనుక ఆ మేరకు పొదుపు చేసినట్టే. -
ఆస్తులకు ధీమా... అవసరానికో బీమా!
• జీవిత బీమా, వైద్య బీమా కొంత తప్పనిసరే • వాహనం, గృహ రక్షణకు వివిధ పాలసీలు • చిన్న వయసులో తీసుకుంటే తక్కువ ప్రీమియం • ఆన్లైన్లో తీసుకుంటే ఇంకాస్త చౌక ఉండటానికి ఇల్లుండాలి. రాకపోకలకు వాహనం ఉండాలి. అవసరమైతే ఆసుపత్రికీ వెళుతుండాలి. కాకపోతే... ఇవన్నీ ఉన్నా వీటిని కవర్ చేయడానికి బీమా పాలసీలుండటం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటిలో ఏ ఒక్కదాన్లో తేడా వచ్చినా భరించటం మన వల్ల కాదు కాబట్టి!! సంపాదించే వ్యక్తికి జీవిత బీమా, వైద్య, వాహన, యాక్సిడెంట్, గృహ బీమా పాలసీలు ఎంత తప్పనిసరో వివరించేదే ఈ ప్రాఫిట్ కథనం... (సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం) చాలామంది బీమా అంటే డబ్బులు వృ«థా చేయడమనుకుంటారు. పాలసీలకు చెల్లించే ప్రీమియంలను వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చని భావిస్తారు కూడా. కానీ అనుకోనిదేదైనా జరిగితే!!? సంపాదించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదన్నా జరిగితే? అప్పుడు ఆ కుటుంబం స్థితిగతులు పూర్తిగా తల్లకిందులవుతాయి. సంపాదించే వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్‌కు గురై, అంగ వికలుడైతే కుటుంబ జీవనోపాధి దెబ్బతింటుంది. ఏదైనా పెద్ద జబ్బు బారిన పడితే అప్పటివరకూ దాచుకున్నదంతా ఆసుపత్రికి ధారపోయాల్సి ఉంటుంది. చికిత్స కోసం 3–4 రోజులు హాస్పిటల్లో ఉంటే, ఆ ఖర్చు పదేళ్ల వైద్య బీమా ప్రీమియంలతో సమానంగా ఉంటుంది. ఆన్లైన్లో కాస్త చౌకే! మానసిక ప్రశాంతత కోసం మీరు ఎంత వెచ్చించాల్సి ఉంటుందంటే... మహా అయితే 35 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.2,000–3,000 వరకూ!! అది చేస్తే తన కుటుంబ ఆర్థిక భవిష్యత్తు పట్ల భరోసాగా ఉండొచ్చు. ఒక వ్యక్తి తప్పనిసరిగా తీసుకోవలసిన ఐదు బీమా పాలసీలకు నెలవారీ అయ్యే ఖర్చు ఇది. ఈ పాలసీలన్నీ చౌకైనవి. కమిషన్ తక్కువగా వస్తుంది కాబట్టి వీటిని విక్రయించడానికి ఏజెంట్లు ఆసక్తి చూపరు. అయితే ఈ పాలసీలకు ఏజెంట్ల బెడద లేదు. వీటిల్లో ఎక్కువ భాగం ఆన్లైన్లోనే కొనుగోలు చేయవచ్చు. ఏజంట్ల ద్వారా కొనటం కన్నా ఆన్లైన్లో కొంటే కాస్తంత చౌక కూడా!!. జీవిత బీమా తప్పనిసరి... ఒక వ్యక్తి వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు బీమా అవసరమనేది సాధారణ లెక్క. ఇది అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని వేసిన అంచనా. సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఆ వ్యక్తి తీర్చాల్సిన అప్పులు పోగా ఆ కుటుంబం సాఫీగా గడవటానికయ్యే ఖర్చులన్నీ కవరయ్యేలా ఈ బీమా ఉండాలి. దీనికి టర్మ్ బీమా పాలసీలు ఉత్తమం. వీటి ద్వారా తక్కువ ప్రీమియం కే ఎక్కువ బీమా రక్షణ పొందవచ్చు. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటికి బీమా తీసుకుంటే ఆ వ్యక్తి చెల్లించాల్సిన ప్రీమియం ఏడాదికి రూ.10,000 మాత్రమే. అంటే ఒక్క రోజుకు రూ.28 మాత్రమే ఖర్చవుతుంది. రకరకాల టర్మ్ ప్లాన్లు.. బీమా కంపెనీలు వినియోగదారులు, పరిస్థితులకు తగ్గట్లుగా వివిధ రకాలైన టర్మ్ పాలసీలను అందిస్తున్నాయి. ఏటా పెరిగే ద్రవ్యోల్బణానికి తగ్గట్టు బీమా కవరేజీ ఉండే టర్మ్ ప్లాన్లూ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఏటా ప్రీమియం చెల్లించడం తలనొప్పి అనుకుంటే ఒకేసారి ప్రీమియం చెల్లించి ఊరుకునే సింగిల్ టర్మ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకుండా 10–15 ఏళ్లపాటు నెలవారీగా చెల్లించేవి... టర్మ్ పూర్తయ్యాక మీరు చెల్లించిన ప్రీమియంలు పూర్తిగా వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు... ఇలా చాలానే ఉన్నాయి. కాకపోతే వీటికి ప్రీమియం కొం చెం ఎక్కువ. ప్రీమియం, బీమా రక్షణ తర్వాత బీమా పాలసీ కాల వ్యవధే కీలకం. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 సంవత్సరాల కాలానికి టర్మ్ పాలసీ తీసుకున్నాడనుకుందాం. అతడు చెల్లించాల్సిన ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కానీ అతడికి బీమా అవసరాలు అధికంగా ఉన్న వయస్సులోనే ఈ ప్లాన్ ముగిసిపోతుంది. ఆ వయస్సులో కొత్త పాలసీ తీసుకోవాలంటే ఖర్చులు తడిసిమోపెడవుతాయి. అప్పు డు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, బీమా నిరాకరించే అవకాశాలూ ఉంటాయి. అందుకని 50 ఏళ్లు వచ్చే సమయంలో ముగిసే బీమా పాలసీలు కాకుండా 60–65 ఏళ్ల వయస్సులో ముగిసే పాలసీలు తీసుకోవడం ఉత్తమం. చిన్న వయసులోనే బీమా పాలసీ తీసుకుంటే, ప్రీమియం తక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వివిధ స్థాయిల్లో బీమా రక్షణను సమీక్షించాల్సిన అవసరం కూడా ఉంది. గ్రూప్ బీమా కవరేజ్ ఉన్నాసరే.. కొంతమంది తమకు కంపెనీ గ్రూప్ బీమా కవరేజ్ ఉందని వైద్య బీమా పాలసీలు తీసుకోరు. ఇవి ఉండడం మంచిదే అయినా, ఇవి సరిపోవని గ్రహించాలి. వీటికి మినహాయింపులు, షరతులు అధికంగా ఉంటాయి. మీరు ఉద్యోగిగా ఉన్నంతవరకూ అవి వర్తిస్తాయి. మీరు ఉద్యోగం మానేస్తే ఈ బీమా రక్షణ లభించదు. అందుకని సొంతంగా వైద్య బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరి. మీకు గ్రూప్ బీమా కవరేజ్ ఉంటే. ఈ బీమా కవర్‌ను మరింతగా పెంచుకోవాలనుకుంటే, టాప్ అప్ ప్లాన్లు తీసుకోవచ్చు. వ్యయాలు ఒక పరిమితికి మించితేనే ఇవి వర్తిస్తాయి. కాబట్టి ఇవి చౌకగా ఉంటాయి. ఉదాహరణకు మీకు గ్రూప్ కవర్ రూ. 3 లక్షలు ఉందనుకుందాం. మీరు రూ.2 లక్షల టాప్ అప్ ప్లాన్‌ను రూ.2 లక్షల పరిమితితో కొనుగోలు చేస్తే, . మీ వైద్య ఖర్చులు రూ.2 లక్షల వరకూ గ్రూప్కవర్ భరిస్తుంది. రూ.2 లక్షలను మించితే టాప్అప్ ప్లాన్ వర్తిస్తుంది. అదనంగా... ప్రమాద బీమా భారత్‌లో యాక్సిడెంట్లు అధికం. యాక్సిడెంట్ కారణంగా తాత్కాలిక లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే, ఈ పాలసీ ఆదుకుంటుంది. అందుకని యాక్సిడెంట్ డెత్ అండ్ డిజేబిలిటీ కవర్ ముఖ్యమైన మూడో బీమా పాలసీ. యాక్సిడెంట్ కారణంగా మరణం సంభవిస్తే పాలసీ తీసుకున్న వ్యక్తి నామినీకి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తారు. అంగవైకల్యం సంభవిస్తే బీమా సంస్థ తగిన మొత్తంలోనే పాలసీ తీసుకున్న వ్యక్తికి సొమ్ములు చెల్లిస్తుంది. యాక్సిడెంట్ కారణంగా పనులు చేసుకోలేని పరిస్థితుల్లో నెలవారీ ఆదాయం కావాలనుకుంటే, అదనపు కవర్‌తో కూ డిన పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కలల ఇంటికి రక్షణ... హోమ్ ఇన్సూరెన్స్ మనిషికి అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఇల్లొకటి. ఈ విషయం అర్థం చేసుకున్న కొద్దిమంది మాత్రమే హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. డ్యామేజీ జరగకుండా రక్షణ కోసం రూ.లక్షకు రూ.40 కనిష్ట ప్రీమియంతో ఈ తరహా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మీ ఇల్లు ఎంత విలువైనదో అంత మొత్తానికి పాలసీ తీసుకోనక్కర్లేదు. పునర్నిర్మాణానికి అయ్యే విలువకే బీమా తీసుకోవాలి. ఉదాహరణకు వెయ్యి చదరపు అడుగుల ఇంటికి రూ.18–30 లక్షల పాలసీకి బీమా చేయిస్తే, ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియమ్ రూ.800–2,400 రేంజ్లో ఉంటుంది. వీటిల్లో ఫైర్, ఇతర పాలసీలు కూడా ఉంటాయి. కానీ సమగ్రమైన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడమే ఉత్తమం. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులకు కూడా బీమా కవర్ తీసుకోవచ్చు. సహజ, మానవ ఉత్పాతాల కారణంగా పాడయ్యే వస్తువుల రక్షణకోసం ఈ పాలసీలు తీసుకోవచ్చు. రూ.పది లక్షల విలువైన వస్తువుకు ఏడాది ప్రీమియం కనిష్టంగా రూ.255 ఉంటుంది. దోపిడీ, తదితర విధ్వంసాల రక్షణకు కూడా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాహన బీమా తప్పనిసరి కూడా!! మీ వాహనాలకు బీమా కవర్ తీసుకోవడం ముఖ్యమైనదే కాదు... తప్పనిసరి కూడా. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే... రిపేర్లకు అయిన బిల్లులను బీమా కంపెనీ భరిస్తుంది. బీమా ఉన్న వాహనానికి యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్‌కు గురైన వ్యక్తికి పరిహారం కూడా బీమా సంస్థే చెల్లిస్తుంది. ఒక్కోసారి ఈ పరిహారం లక్షల్లో ఉండొచ్చు. అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. యాక్సిడెంట్లో గాయాలైనా, ఎవరైనా చనిపోయినా, అపరిమిత బీమా రక్షణ ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ధర్డ్ పార్టీ ప్రీమియమ్‌లు పెరిగాయి. ఏడాదికి ఇవి రూ.2,000 రేంజ్లో ఉంటాయి. తమ వాహనం పాతదైపోయిందంటూ చాలా మంది బీమా పాలసీ తీసుకోవడం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది ఖరీదైన తప్పు అని చెప్పవచ్చు. దొంగతనం, డ్యామేజ్ల కోసం బీమా పాలసీలు తీసుకోకపోయినా, థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ మాత్రం తీసుకుంటేనే మేలు. ఈ లయబిలిటీపై పరిమితి విధించాలని సాధారణబీమా కంపెనీలు ఎన్నో ఏళ్లుగా లాబీయింగ్ చేస్తున్నాయి. వచ్చే ప్రీమియం కంటే చెల్లించే పరిహారమే అధికమని ఈ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. వైద్య ఖర్చులకు బీమా మార్గం! జీవిత బీమా పాలసీ తర్వాత తీసుకోవలసిన ముఖ్యమైన పాలసీ వైద్య బీమా. కొందరైతే జీవిత బీమా కంటే వైద్య బీమాయే ముఖ్యమని కూడా అంటారు. ఎందుకంటే వైద్య ఖర్చులే భారీగా పెరుగుతున్నాయి. 3–4 రోజులు ఆసుపత్రిలో ఉంటే కనీసం రూ.50,000–60,000 ఖర్చు అవుతోంది. అయితే ఏడాదికి వైద్య బీమా వ్యయం రూ.10,000–15,000 రేంజ్‌లోనే ఉంటుంది. ఆదాయపు పన్నును పరిగణనలోకి తీసుకుంటే 30 శాతం పన్ను పరిధిలో ఉన్నవారికి వైద్య బీమా వ్యయం ఏడాదికి రూ.7,000–10,500 రేంజ్‌లోనే ఉంటుంది. మా పాలసీ తీసుకుంటే బోలెడు ప్రయోజనాలంటూ చాలా బీమా కంపెనీలు ఊదరగొడుతుంటాయి. ప్రయోజనాలున్న స్థాయిలో మినహాయింపుల కూడా ఉంటాయి. మనకు అవసరం లేని ప్రయోజనం కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావచ్చు. వైద్య బీమా పాలసీల డాక్యుమెంట్లు చిత్ర విచిత్రమైన న్యాయపరమైన, వైద్య పరమైన పదబంధాలతో మనల్ని అయోమయానికి గురి చేస్తాయి. అందుకని నగదు రహిత, లేదా వైద్య సేవలనంతరం వ్యయాలను రీయింబర్స్ చేసే సాదా సీదా ఇండెమ్నిటీ పాలసీ తీసుకోండి. అదనపు బీమా కవర్ కావాలనుకుంటే, సంబంధిత ప్రయోజనాలందించే పాలసీని ఎంచుకోండి. కుటుంబంలో పెద్దలుంటే వారికోసం ప్రత్యేకమైన పాలసీ తీసుకుంటేనే మంచిది. -
భవిత కోసం బీమా అవసరం
రాజానగరం : సెల్ ఫోన్ కొనడానికి ఇచ్చే ప్రాధాన్యం జీవితానికి ఎవరూ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు. భవిష్యత్‌పై ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ జీవిత బీమా చేయించుకునేందుకు ప్రయత్నిస్తారన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన వ్యాపారానికి జీవిత బీమా సంస్థ రాజానగరానికి ప్రకటించిన ‘బీమా గ్రామ్’ పురస్కారంతో పాటు రూ.లక్ష సాయం చెక్కును గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ ఎం.శ్యామలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సంస్థ ఎస్డీఎం రంగారావు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో ఒక సంస్థ అభివృద్ధి చెందుతూ ఎటువంటి అవరోధాలు, ఆరోపణలు లేకుండా ముందుకు వెళ్లడం ఒక్క ఎల్ఐసీకే సాధ్యమయిందన్నారు. ప్రజల నుంచి వ్యాపారం పొందుతూ వారికి ఏదో విధంగా తోడ్పడేలా బీమాగ్రామ్ వంటి పథకాలు ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. ఆదాయం ఎక్కువగా ఉన్నవారు పన్నుల నుంచి తప్పించుకునేందుకు బీమా చేస్తున్నప్పటికీ, నిజానికి బీమా అవసరం సామాన్యులకే ఎక్కువని, అది గ్రహించక అనుకోని సంఘటనలు జరిగి వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గ్రామీణాభివృద్ధికే..: గ్రామాల అభివృద్ధిలో ఎల్ఐసీ కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ‘బీమా గ్రామ్’ పథకాన్ని తీసుకువచ్చిందని జీవిత బీమా సంస్థ రాజమహేంద్రవరం డివిజన్ సీనియర్ మేనేజర్ జె.రంగారావు అన్నారు. కడియం, సీతానగరం మండలాల్లోని పలు గ్రామాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం చేశామని సంస్థ రూరల్ మేనేజర్ ఎ.శేషయ్య అన్నారు. ఎల్ఐసీ డెవలప్మెంట్ అధికారి వై.కాళీవరప్రసాద్, ఎలిపే స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు రూప, ఎంపీపీ బచ్చు శ్యామలప్రసాద్, ఉపాధ్యక్షుడు వంక మల్లికార్జునస్వామి, జెడ్పీటీసీ సభ్యుడు కొల్లాం రత్నం, పీహెచ్సీ అభివృద్ధి కమిటీ సభ్యుడు టి. నాగేశ్వర్రావు, మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు ఎంసీహెచ్ వెంకటేశ్వర్రావు, టీడీపీ కన్వీనర్ గంగిశెట్టి చంటిబాబు, ఐసీడీఎస్ సీడీపీఓ వై.సుశీలకుమారి, సర్పంచ్‌లు, కార్యదర్శులు, జన్మభూమి కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. -
బీమాకు.. హెపటైటిస్ అడ్డుకాదు!
కీళ్ల నొప్పులు, అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే... ‘హెపటైటిస్ బీ’ పరీక్షలు చేయించమని సలహా ఇస్తారు. ప్రధానంగా లివర్ దెబ్బతినడంతో పాటు పలు రకాల జబ్బులకు దారితీసే ఈ వ్యాధికి అపరిశుభ్రత, సురక్షితం కాని శృంగార విధానాల వరకూ పలు కారణాలున్నాయి. దాదాపు 4 కోట్ల మంది రోగులతో చైనా తరువాత ఇండియా ఈ వ్యాధి విషయంలో రెండో స్థానం లో ఉందని ఇటీవలే ఒక సర్వే తెలిపింది. అయితే హెపటైటిస్‌కు గురయిన వ్యక్తి జీవిత బీమా రక్షణ అవకాశాన్ని కోల్పోతాడని చాలా మంది భావిస్తుం టారు. ఇదెంతమాత్రం నిజం కాదు. వారు కూడా జీవిత బీమాకు అర్హులే. వ్యక్తులు జీవిత బీమా పొం దేందుకు అవకాశం లేని కొన్ని ప్రాణాంతక వ్యాధుల (కోవర్డ్ డిసీజెస్) జాబితాలోకి హెపటైటిస్ రాదు. అయితే కొన్ని విషయాలు మాత్రం గమనించాలి. ♦ వాస్తవ కవరేజ్ ఎంత? ప్రీమియం వ్యయాలెంత? వంటివి వ్యాధికి సంబంధించిన పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. వ్యాధి తీవ్రత, గత చికిత్స రికార్డు, మెడికల్ హిస్టరీ ఇవన్నీ దీన్ని ప్రభావితం చేస్తాయి. ♦ ఎలాంటి చికిత్స తీసుకున్నాడు? భవిష్యత్తులో తీసుకోబోయే చికిత్స విధానాలేంటి? వైద్యుడు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తున్నారా? అనేవి బీమా కంపెనీలు పరిశీలిస్తాయి. ♦ ఏ వయసులో ఈ వ్యాధి వచ్చింది? లివర్ పనితీరు పరీక్షల (ఎల్ఎఫ్టీ) రీడింగ్స్ ఏమిటి? వ్యాధి వచ్చినప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి మెరుగుపడిందా? మీరు వ్యాధిని తగ్గించుకోవటానికి ఎంత కృషి చేస్తున్నారు? మీరు వాడుతున్న మందులేంటి? వంటి అంశాలపై మీ ప్రీమియం, కవరేజీ ఆధారపడి ఉంటాయి. రిస్క్ అధికంగా ఉంటే... అధిక ప్రీమియం చెల్లించాలి. పూర్తిగా వ్యాధి తగ్గిన వారు మామూలు పాలసీలు, సగటు ప్రీమియం రేటుకు పొందే వీలూ ఉంది. -
మహిళలకూ కావాలి జీవితబీమా!
మన సమాజంలో స్త్రీలకు సముచిత స్థానముంది. ముఖ్యంగా మన దేశంలో కుటుంబ ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో గృహిణులదే కీలక పాత్ర. పొదుపులో మహిళలే ముందుంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాకపోతే కొద్ది మంది మాత్రమే వారికోసమో, కుటుంబ సభ్యుల కోసమో జీవిత బీమా చేస్తుంటారు. ప్రస్తుతం పలు సాధనాలు అందుబాటులోకి రావటంతో మహిళల్లోనూ చైతన్యం పెరిగింది. మేం ఇప్పటికే బీమా, ఎఫ్డీలు, ఇతర పెట్టుబడి సాధనాల విషయంలో మహిళల్లో గణనీయమైన మార్పుల్ని చూస్తున్నాం. మహిళలకే ఎందుకు? ఈ రోజుల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవడమనేది ఎంతో అవసరం. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మహిళలకిది చాలా అవసరం. ఉద్యోగినులకు, గృహిణులకు, ఒంటరి ఆడవాళ్లకు జీవిత బీమాలో పొదుపు చేయడమనేది అనేక సందర్భాల్లో ఆర్థిక స్వేచ్ఛనిస్తుంది. నిజానికి భారత్‌లో చిన్నమొత్తాల పొదుపు అనేది మహిళల సామ్రాజ్యం. స్టాక్ మార్కెట్లలో పొదుపు చేసే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్(యూఎల్ఐపీ) వంటివి ఎంచుకోవటం ద్వారా పొదుపు చేయటంతో పాటు బీమా రక్షణ కూడా పొందొచ్చు. మార్కెట్లలో పెట్టుబడులుంటాయి కనుక మెరుగైన రాబడులూ ఆశించవచ్చు. సాధారణంగా పిల్లల చదువు, పెళ్లిళ్లు, సొంతింటి కొనుగోలు, పదవీ విరమణ తరువాత జీవితం... ఇలాంటి జీవితావసరాల కోసం సంప్రదాయ ‘విత్ ప్రాఫిట్స్’ పథకాలను ఎంచుకోవచ్చు. జీవితానికి రక్షణ... జీవితంలో ప్రధాన సందర్భాల్లో పెట్టే ఖర్చులకు జీవిత బీమా సమర్థంగా పనికొస్తుంది. దీనికితోడు మహిళలకు తక్కువ ప్రీమియం ఉంటుంది కూడా. ప్రత్యేకించి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్సుల్లో మహిళలకు ప్రీమియంలో డిస్కౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. మహిళలు తమ అవసరానికి తగ్గట్టుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. కావాలంటే పూర్తిస్థాయి టర్మ్ పాలసీనే ఎంచుకోవచ్చు. లేనిపక్షంలో ప్రాఫిట్స్‌తో కూడిన జీవిత బీమా పాలసీనైనా తీసుకోవచ్చు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లోనూ.... ఆరోగ్య బీమాతో పాటు కొన్ని రకాలైన తీవ్ర అనారోగ్యాలకు వ ర్తించే క్రిటికల్ ఇల్నెస్ కవర్‌తో కూడిన బీమా అయితే అటు ప్రీ మియం విషయంలోనూ, ఇటు కవరేజీ విషయంలోనూ చక్కని ప్రయోజనం పొందొచ్చు. ఎందుకంటే కొన్ని తీవ్రమైన అస్వస్థతల విషయంలో అయ్యే ఖర్చును భరించటం మామూలు విషయం కాదు. ఆర్థికపరమైన బాధ్యతల నుంచి తప్పుకోవటంతో పాటు ఇంట్లో పనుల్ని కూడా వేరొకరికి అప్పగించాల్సి వస్తుంది. అందుకని ఇలాంటివన్నీ తట్టుకునేలా మహిళలకోసం ప్రత్యేకమైన ఉత్పత్తులున్నాయి. అవి మరీ క్లిష్టమైనవేమీ కాదు. ఈజీగానే అర్థం చేసుకుని ఎంచుకోవచ్చు. తరువాతి వారికి ఇవ్వాలన్నా...! కొందరు మహిళలు తమ కుటుంబానికి తగినంత మొత్తం ఇవ్వాలనుకుంటారు. పిల్లలకే కాక భర్తకు కూడా బాసటగా నిలవాలనుకుంటారు. మరికొందరైతే ధార్మిక సంస్థలకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే దానధర్మాలు చేయాలనుకుంటారు. వారికి ఇవన్నీ చేయటానికి వీలు కల్పించే ఉత్పత్తుల్లో జీవిత బీమాదే ముందు వరస. మిగతావన్నీ తరువాతేనని చెప్పాలి. చివరిగా నా సలహా ఏంటంటే మహిళలు పాలసీ తీసుకున్నాం కదా అని ఊరుకోకుండా జీవితంలో మార్పు సంభవించిన ప్రతి సందర్భంలోనూ వాటినొకసారి సరిచూసుకోవాలి. అంటే పెళ్లి, పిల్లలు పుట్టడం, ఇతరత్రా కీలక ఘటనలు సంభవించినపుడన్న మాట. అవసరమైతే కొన్ని మార్పులు చేసుకోవాలి. అంతేకాదు!! ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా తమ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి. - ప్రదీప్ పాండే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఫ్యూచర్ జెనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ -
ఉద్యోగం పోయినా బీమా!
ఈడీఎల్ఐ మూడేళ్ల పొడిగింపుపై యోచన న్యూఢిల్లీ: ఉద్యోగం పోయిన చందాదారుకూ ఆపై మూడేళ్లు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ (ఈడీఎల్ఐ) కింద జీవిత బీమా సౌలభ్యాన్ని కల్పించే అంశంపై రిటైర్మెంట్ ఫండ్ సంస్థ- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఫండ్ ట్రస్టీల సమావేశం ఈ అంశంపై చర్చించి, ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీఎల్ఐ స్కీమ్ కింద గరిష్ట బీమా మొత్తాన్ని ప్రస్తుత రూ.3.6 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు నిర్ణయాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు కూడా సమాచారం. ఈడీఎల్ఐ పథకం కింద ఒక సంస్థ యాజమాన్యం తమ కార్మికుల మూల వేతనాల్లో 0.5 శాతాన్ని ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ఉద్యోగం పోతే... ఈడీఎల్ఐ పథకం కింద బీమా ప్రయోజనమూ ఆగిపోతుంది. తాజా ప్రతిపాదన ప్రకా రం.. ఉద్యోగం పోతే... సంబంధిత ఉద్యోగి ఈడీఎల్ఐ సభ్యత్వాన్ని ‘కొంత తగ్గింపు ప్రీమియంతో’ మూడేళ్ల పాటు స్వచ్ఛందంగా కొనసాగించుకోవచ్చు. ఫండ్... తన చందాదారులకు చౌక ఇళ్ల నిర్మాణ పథకంపై కసరత్తు జరుపుతున్నట్లు ఇటీవలే కార్మిక మంత్రి దత్తాత్రేయ పార్లమెంటులో ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదు కోట్ల చందాదారులకు సంబంధించి రూ.8.5 లక్షల కోట్ల ఫండ్‌ను నిర్వహిస్తోంది. -
పిల్లలకు బీమాతోనే ధీమా..!
చదువు నుంచి అత్యవసరం దాకా చైల్డ్ప్లాన్లు పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయడానికి పెట్టుబడి సాధనాలు చాలా ఉన్నాయి. కానీ జీవిత బీమా కంపెనీలందించే చైల్డ్ ప్లాన్ల ఆకర్షణే వేరు. నిర్దిష్ట లక్ష్యం దిశగా ఒక క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి దోహదపడతాయి. వీటిలో ఉండే మరికొన్ని విశిష్టతలేమిటంటే.. నిరాటంకంగా చదువుకు తోడ్పాటు.. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా తోడయ్యే చైల్డ్ ప్లాన్ల వల్ల పాలసీదారున్నా, లేకున్నా.. పిల్లల భవిష్యత్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. అవసరమైతే పిల్లలకు కూడా బీమా కవరేజీని పెంచుకోవచ్చు. కావాలంటే వైకల్యం, క్రిటికల్ ఇల్నెస్, ప్రీమియం రద్దు వంటి రైడర్లు కూడా తీసుకుంటే మరింత భద్రత లభించినట్లవుతుంది. చైల్డ్ ప్లాన్లతో పిల్లలకు లభించే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. సహజంగానే వాటిల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన కలుగుతుంది. తద్వారా క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగించి, పిల్లలకు అవసరమయ్యే నాటికి చెప్పుకోతగ్గ మొత్తాన్ని కూడబెట్టవచ్చు. పెద్ద మొత్తానికి దీర్ఘకాలిక పెట్టుబడే కీలకం.. పిల్లల విదేశీ చదువులు కావొచ్చు.. వివాహ శుభకార్యాలు కావొచ్చు.. ప్రస్తుతం అన్నీ భారీ ఖర్చులతోనే ముడిపడి ఉంటున్నాయి. రోజు రోజుకు పెరిగిపోయే ఫీజులను చూస్తుంటే రాబోయే సంవత్సరాల్లో ఏ స్థాయిలో కట్టాల్సి వస్తుందో అర్థమవుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత ముందు నుంచీ, వీలైనంత వరకూ క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెడితేనే పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం సాధ్యమవుతుంది. ఈక్విటీల్లో దీర్ఘకాలం.. అంటేపదేళ్లు పైగా పెట్టుబడులు పెడుతూ వెడితే, స్థిరమైన రాబడి అందించే సాధనాలకన్నా మెరుగైన రాబడులే వస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లోనూ ఇదే ధోరణి ఉండొచ్చని చెప్పడానికి లేదు కానీ.. 2014 డిసెంబర్ దాకా బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏటా సుమారు 15.29 శాతం రాబడులు అందించింది. అత్యవసర పరిస్థితుల కోసం.. పిల్లల చదువులు, భవిష్యత్ అవసరాల కోసం చైల్డ్ ప్లాన్ రూపంలో లైఫ్ కవరేజీ కూడా ఉన్నప్పుడు.. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా మళ్లీ భారీ మొత్తాల్ని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం కాస్త తగ్గుతుంది. ఎమర్జెన్సీ పరిస్థితుల కోసం స్వల్పకాలిక ఫిక్సిడ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్ వంటి సాధనాల్లో చిన్న చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేసి ఉంచుకోవచ్చు. దీనివల్ల రిటైర్మెంట్ వంటి మరింత పెద్ద లక్ష్యాల పెట్టుబడుల కోసం అధిక మొత్తం కేటాయించడం సాధ్యపడుతుంది. క్రమపద్ధతిలో పెట్టుబడి సౌలభ్యం.. ఇతరత్రా బీమా పథకాల తరహాలోనే ప్రీమియం చెల్లింపునకు సంబంధించి చైల్డ్ ప్లాన్లలో కూడా నెలవారీగా, మూడు నెలలకోసారి లేదా ఏడాదికోసారి కట్టే వెసులు బాటు ఉంటుంది. వేతనజీవులైతే నెలవారీ ఆప్షన్ ఎంచుకుంటే సులువుగా కట్టుకుంటూ వెళ్లొచ్చు. అదే ప్రతీ నెలా స్థిరమైన ఆదాయం ఉండని వ్యాపారస్తుల్లాంటి వాళ్లు వార్షిక విధానాన్ని ఎంచుకుంటే.. ఒక క్రమ పద్ధతిలో బ్యాంకు రికరింగ్ డిపాజిట్‌ను ప్రారంభించి, మెచ్యూర్ అయిన మొత్తాన్ని ప్రీమియం చెల్లింపునకు ఉపయోగించవచ్చు. ఇక ప్రీమియం చెల్లించడానికి కూడా పలు మార్గాలు ఉన్నాయి. ప్రీమియం చెల్లింపు తేదీ నాటికి మన బ్యాంకు ఖాతా నుంచి సదరు మొత్తం డెబిట్ అయ్యేలా ఈసీఎస్, ఆటో డెబిట్ వంటి మార్గాలను ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డు వాడుతుంటే కార్డు కంపెనీకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వొచ్చు. లాకిన్ వ్యవధి ప్రయోజనం.. చైల్డ్ ప్లాన్లు కూడా మిగతా జీవిత బీమా పథకాల్లానే దీర్ఘకాలిక పెట్టుబడి ధోరణులను అలవరిచేవే. ఎందుకంటే ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అంత ఎక్కువ రాబడులు వచ్చే అవకాశాలుంటాయి. సంప్రదాయ ప్లాన్లయితే 2-3 ఏళ్లు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్స్) అయితే అయిదేళ్ల దాకా లాకిన్ వ్యవధి ఉంటుంది. కనీసం కొన్నాళ్ల పాటైనా పెట్టుబడిని కొనసాగించేలా చేసేందుకు ఈ నిబంధన పెట్టడం జరిగింది. ఒకవేళ ముందుగా వైదొలగాలంటే ఎంతో కొంత పెనాల్టీ కింద వదులుకోవాల్సి వస్తుంది. స్థూలంగా చెప్పాలంటే .. పిల్లల భవిష్యత్‌కు ఎటువంటి సమస్యలు ఉండకుండా భద్రతనివ్వాలనుకునే వారు ఎంచుకోతగిన సాధనాల్లో చైల్డ్ ప్లాన్లు చాలా కీలకమైనవనడంలో సందేహం లేదు. -
బీమాపై అవగాహన పెరగాలంటే..?
ఊహించని పరిణామాలు జరిగి మనకేమన్నా అయితే మనపై ఆధారపడ్డ వారికి ఆర్థిక తోడ్పాటునందిస్తుంది మనం మనకు తీసుకున్న జీవిత బీమా. అలాగే ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో లైఫ్ ఇన్సూరెన్స్ ఒక భాగం కూడా. ఈ విషయాలను పక్కన పెడితే.. దేశంలో బీమా కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నట్లు అనిపిస్తుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ సగటుతో పోలిస్తే భారత్‌లో బీమా తీసుకున్న వారు కేవలం 3.1 శాతంగా ఉన్నారు. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చినా కూడా ఇది తక్కువే. గత కొన్నేళ్లలో ఇన్సూరెన్స్ విస్తరణ మెరుగుపడుతున్నప్పటికీ.. వృద్ధి మాత్రం ఆశించినంత స్థాయిలో లేదు. దీనికి కారణం ఇన్సూరెన్స్ పాలసీల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే.. ముందుగా బీమా కంపెనీల వ్యాపార విధానాల్లో, వినియోగదారుల ఆలోచనా సరళిలో మార్పు రావాలి. ఇప్పటికీ అధిక సంఖ్యాక ఇన్సూరెన్స్ పాలసీల విక్రయం ప్రధానంగా ఇన్సూరెన్స్ కన్సల్టెంట్స్ ద్వారానే జరుగుతోంది. అలాగే ఆన్లైన్లో పాలసీ ఎంపికపై వినియోగదారుల్లో అవగాహన కూడా పెరుగుతోంది. బీమా కంపెనీ, పాలసీ ఎంపిక వంటి తదితర అంశాల్లో ఈనాటి కస్టమర్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. కావలసిన పాలసీ గురించి తెలుసుకోవడానికి, ఇతర వాటితో పోల్చుకోవడానికి ప్రస్తుతం అనేక వ నరులు అందుబాటులో ఉన్నాయి. కొందరైతే ఆన్లైన్లో పాలసీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఏజెంట్ ద్వారా పాలసీని తీసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులను ఈ సన్నివేశం ప్రతిబింబిస్తోంది. అంటే బీమా సంస్థలు కస్టమర్లతో మాట్లాడటానికి ఇంకా కొత్త మార్గాలను, విధానాలను రూపొందించుకోవాల్సి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల కస్టమర్లతో మాట్లాడడానికి వీలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు తప్పకుండా తగిన మార్గాలను అన్వేషించుకోవాలి. వినియోగదారులతో సమావేశమవ్వడం, పాలసీల గురించి వారికి తెలియజెప్పడం వంటి తదితర కార్యక్రమాలను చేపట్టాలి. కస్టమర్ల సందేహాలను, సమస్యలను నివృత్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ కార్యక్రమాల ద్వారా ఆయా కంపెనీలు కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు? కంపెనీ గురించి ఏమనుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వంటి విషయాలను తెలుసుకోవాలి. బీమా రంగం ప్రొడక్ట్‌ను విక్రయించడమనే వ్యూహం నుంచి కస్టమర్లే ప్రొడక్ట్‌ను తీసుకునే వ్యూహంవైపు క్రమంగా అడుగులు వేస్తోంది. బీమా కంపెనీలు వినియోగదారులకు అవసరమైన, అనువైన ప్రొడక్ట్స్‌ను రూపొందించాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేయాలన్నా వాటికి కస్టమరే ప్రధాన బిందువనే అంశాన్ని అవి ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. - అనుజ్ అగర్వాల్ బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో -
జీవిత బీమా.. ఎంపిక ఇలా..
ఎప్పుడేం జరుగుతుందో తెలియని ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో జీవిత బీమా పాలసీ తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరమైన నిర్ణయమే. కుటుంబం మొత్తానికి ఆర్థికపరమైన భరోసానిచ్చే పాలసీని తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలను పాటిస్తే మెరుగైన నిర్ణయం తీసుకునే వీలుంటుంది. వివిధ రకాల పాలసీలు, కవరేజీలు తదితర అంశాల గురించి తెలియజెప్పేందుకే ఈ కథనం. బీమా ఎందుకంటే.. ఇంటి పెద్దకు ఏదైనా అనుకోనిది జరిగినా కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులు కాకుండా భరోసా కల్పిస్తుంది జీవిత బీమా పాలసీ. సాధ్యమైనంత తక్కువ వయసులోనే పాలసీని తీసుకుంటే ప్రీమియం భారం తక్కువగా ఉంటుంది. పైగా యువ ప్రొఫెషనల్స్‌కి పన్ను ప్రయోజనాలిచ్చే సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే, పెళ్లి, పిల్లల చదువు, రిటైర్మెంట్ వంటి వివిధ లక్ష్యాల సాధనలోనూ భరోసాగా ఉంటుంది. సాధారణంగానైతే జీవిత బీమా పాలసీలు కేవలం లైఫ్ కవర్‌కి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ప్రస్తుతం అత్యవసర వైద్యం, ప్రమాదాల్లో అంగవైకల్యం, తీవ్ర అనారోగ్యం వంటి వాటికి కూడా కవరేజీ ఇచ్చే పాలసీలను కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి. కవరేజీ ఎంత ఉండాలి.. పాలసీదారు అనంతరం నామినీకి లభించే మొత్తాన్ని కవరేజీగా వ్యవహరిస్తారు. దీన్ని లెక్కించేందుకు సులభమైన సూత్రం ఒకటుంది. మీ వార్షిక జీతాన్ని 8తో గుణిస్తే ఎంత వస్తుందో అంత కవరేజీకి పాలసీని తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. మరింత వివరంగా కావాలంటే పాలసీదారు తదనంతరం కూడా కొనసాగే కుటుంబం నెలవారీ ఖర్చులన్నీ కొన్నాళ్ల దాకా పరిగణనలోకి తీసుకుంటే.. ఎంత మొత్తం అవసరమవుతుందనేది ఒక అంచనాకు రావచ్చు. దానికి తగ్గట్లు కాస్త అటూ ఇటుగా లెక్కవేసుకుని తక్కువ ప్రీమియంతో మెరుగైన కవరేజీ ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చు. ఏ పాలసీ తీసుకోవచ్చు .. వ్యక్తిగత పరిస్థితులను బట్టి జీవిత బీమా పాలసీని ఎంపిక చేసుకోవడం ఉంటుంది. సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు.. టర్మ్ ప్లాన్, సంప్రదాయక ఎండోమెంట్ ప్లాను, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాను (యులిప్), రిటైర్మెంట్ లేదా పింఛను ప్లాన్ల తరహాల్లో ఉంటాయి. వీటన్నింటిలోకెల్లా టర్మ్ ప్లాన్ అనేది అచ్చంగా పాలసీదారు మరణానంతర కవరేజీకి మాత్రమే ఉద్దేశించినది. దీనికి కట్టిన ప్రీమియంలు పాలసీదారు జీవితకాలంలో తిరిగి రావు. మరణానంతరం కుటుంబానికి పెద్ద మొత్తం లభిస్తుంది. మిగతా పాలసీలతో పోలిస్తే దీని ప్రీమియంలు చాలా తక్కువగా ఉంటాయి. మరోవైపు, ఎండోమెంట్ పాలసీలను తీసుకుంటే ఇవి పొదుపు, బీమా రక్షణ కల్పించే సాధనాలుగా ఉంటాయి. పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత లేదా పాలసీదారు మరణానంతరం కవరేజీ మొత్తం లభిస్తుంది. ఇక, యులిప్లనేవి మార్కెట్ ఆధారిత దీర్ఘకాలిక సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ పథకాల్లాంటివి. ఈ పథకాలు షేర్లు, డెట్ సాధనాల్లో నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం ఇన్వెస్ట్ చేసి రాబడులు అందిస్తాయి. రిటైర్మెంట్ ప్లాన్లనేవి సంప్రదాయ పాలసీల రూపంలోనైనా ఉండొచ్చు లేదా యులిప్స్ రూపంలోనైనా ఉండొచ్చు. వీటిల్లో మెచ్యూరిటీ అనంతరం తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. పాలసీ ప్రీమియం.. మనం ఎంచుకునే కవరేజీ, వయసు తదితర అంశాలను బట్టి ప్రీమియం మారుతుంటుంది. సిగరెట్లు తాగేవారు, అధిక బరువున్న వారు, ప్రమాదకరమైన వృత్తుల్లోనివారు.. హాబీలు ఉన్నవారికి ప్రీమియం అధికంగా ఉంటుంది. కనుక జీవన విధానానికి అనువైన రైడర్లను ఎంచుకోవడం మంచిది. స్థూలంగా చెప్పాలంటే.. మన రిస్కు సామర్థ్యం, నిర్దిష్ట లక్ష్యాన్ని బట్టి పాలసీ తీసుకోవాలి. కావాలనుకుంటే అదనపు రిస్క్ కవరేజీ వంటివి కూడా ఎంచుకోవచ్చు. - పంకజ్ రజ్దాన్ సీఈవో, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ -
జీవిత బీమా కూడా పెట్టుబడి సాధనమే!
పనిచేసే మహిళలకు తప్పనిసరి అవసరం జీవిత బీమా ను ప్రతిఒక్కరూ ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోవాలి. ముందుగా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉండటం సహా పలు ఇతర ప్రయోజనాలుంటాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో వయసు పెరిగే కొద్ది ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువ. ఈ విషయం మహిళలకు తెలియనిదేమీ కాదు. అయినా వారు జీవిత బీమా పాలసీని వారి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా చూడటం లేదు. ఎందుకో తెలుసా?!! ఎందుకో తెలుసుకోవాలంటే... అంతకన్నా ముందు మహిళలు జీవిత బీమా ఎందుకు తీసుకోవాలో తెలుసుకోవాలి. ఊహించని ప్రమాదం జరిగి మరణించడం, వికలాంగులుగా మారటం వంటివి జరిగితే.. కుటుంబ ఆర్థిక స్థిరత్వం కోసమే ఎవరైనా పాలసీకి ప్రాధాన్యమిస్తారు. చాలామంది ఆ బాధ్యత భర్తది అనుకుంటారు కనుక తమకెందుకులే జీవిత బీమా అనుకుంటారు. ఒకవేళ పనిచేసే మహిళ ఒంటరి అనుకోండి. ఆమె తన తల్లిదండ్రుల కోసం, తనపై ఆధారపడ్డ ఇతర కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం పాలసీ తీసుకోవాలి. ఒకవేళ పనిచేసే మహిళకు పిల్లలుంటే... వారి చదువుని దృష్టిలో ఉంచుకొని పాలసీవైపు మొగ్గు చూపాలి. ఇలా పలు రకాల అంశాలు మహిళలు జీవిత బీమా పాలసీ తీసుకోవడంలో కీలకపాత్ర వహిస్తాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తోన్న మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ఎందుకని దాన్ని ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా చూడకూడదు? చూడాలి. చూడకపోవడానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒక యుక్త వయసు మహిళ ఉన్నారనుకోండి. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులే. ఇక ఆమెపై ఆధారపడి జీవించే వారు ఎవ్వరూ లేరు. స్వతంత్రురాలు. అలాంటపుడు ఆమెకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనిపించకపోవచ్చు. చావు గురించి ఆలోచించడం ఇష్టంలేకపోవడం సహా పాలసీ తీసుకోవడం వల్ల తక్షణం లేదా జీవిత కాలం మొత్తంలో వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం చేకూరదనే ఆలోచన వల్ల కూడా చాలా మంది యుక్త వయసు మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం లేదన్నది వాస్తవం. పాలసీ తీసుకోవడానికి ఎక్కువ డబ్బు అవసరమనే అపోహ, పాలసీ గురించి సమగ్రంగా తెలియకపోవడం, ఆరోగ్యంగా ఉన్నామని భావించడం వంటి విషయాలు కూడా మహిళలు పాలసీకి దూరంగా ఉండటానికి కారణాలుగా ఉన్నాయి. ఇక మరికొందరైతే వారి వయసు వారు పాలసీ తీసుకోలేదని వీరు కూడా వాటికి దూరంగా ఉంటున్నారు. నా సలహా ఏమిటంటే... ఇలాంటి అపోహలేవీ పెట్టుకోవద్దు. పాలసీ తీసుకోవడానికి మీ సంపాదన సరిపోతుంది. వేచి ఉండకండి. ఇన్వెస్టర్లతో, కుటుంబ స్నేహితులతో, సహోద్యోగులతో మాట్లాడండి. ఎంత వీలైతే అంత త్వరగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సుబ్రత మొహంతి మార్కెటింగ్ హెడ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ -
ఇవన్నీ చూశాకే జీవిత బీమా..
పట్టణీకరణ వేగంగా జరుగుతుండటంతో సామాన్యుల జీవన ప్రమాణాలు గణనీయంగా మారుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే యువత పనివేళలు, ఆహారపు అలవాట్లు మారడమే కాకుండా వృత్తిపరంగా విపరీతమైన ఒత్తిడిని ఎదర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికి జీవిత బీమా రక్షణ అనేది తప్పనిసరిగా మారింది. మనపై ఆధారపడి జీవించే వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం అనేక బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో దేన్ని ఎంచుకోవాలన్నదే అసలు సమస్య. ప్రతీ బీమా పథకంలో ఉండే లాభ నష్టాలను పరిశీలించడం కష్టమే. కానీ పాలసీ తీసుకునేటప్పుడు కనీసం ఈ ఐదు అంశాలను పరిశీలిస్తే ఆ పాలసీకి మన అవసరాలను తీర్చే శక్తి ఉందా లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుంది. జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు తప్పకుండా పరిశీలించాల్సిన అంశాలు ఇవీ.. ఇప్పుడు అనేక బీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఒక పథకంతో మరో పథకానికి పోలిక ఉండదు. కాబట్టి తీసుకునే పాలసీ మీ ఆర్థిక లక్ష్యాలు, ఇతర అవసరాలను తీర్చే విధంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించడం అత్యంత ప్రధానం. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోండి. బీమా రక్షణ ఎంత కావాలన్న విషయం పరిశీలించేటప్పుడు అప్పటికే ఏమైనా వ్యాధులు ఉంటే వాటిని, అలాగే రుణాలు ఉంటే వాటి మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. కంపెనీ చరిత్ర... పాలసీని ఎంచుకున్న తర్వాత ఆ కంపెనీ చరిత్రను పరిశీలించండి. ఆ కంపెనీ ప్రమోటర్లు, వారి చరిత్రతో పాటు, బీమా కంపెనీ పనితీరును కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఈ వివరాలు ఆన్లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ బీమా కంపెనీ సర్వీసులు ఏ విధంగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏ విధంగా ఉంది, పాలసీదారుల సమస్యలకు ఎలా స్పందిస్తోంది. ఆ కంపెనీ సేవలపై ఏమైనా ఫిర్యాదులున్నాయా వంటివి చూడండి. క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి?... ఒక కంపెనీని ఎంచుకునేటప్పుటు క్లెయిమ్ రేషియో కూడా చాలా ముఖ్యం. వచ్చిన క్లెయిమ్స్‌లో ఎన్నింటిని పరిష్కరించింది, ఎన్నింటిని తిరస్కరించిందన్నది క్లెయిమ్ రేషియో తెలుపుతుంది. క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ పనితీరు బాగుందని లెక్క. మీరు కచ్చితమైన సమాచారం ఇస్తే క్లెయిమ్స్ తిరస్కరించే అవకాశం ఉండదు. ఈ విషయంలో మన నియంత్రణ సంస్థలు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఫండ్ పనితీరు కూడా.. ఒక వేళ మీరు యులిప్ పాలసీని తీసుకుంటే కనుక ఆ పథకంలోని ఫండ్స్ పనితీరును కూడా పరిశీలించండి. మీ రిస్క్ సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అన్ని బీమా కంపెనీలు ఎన్ఏవీలను వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో మంచి పనితీరు కనపరుస్తున్న ఫండ్‌ను మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఎంచుకోండి. పాలసీని అర్థం చేసుకోండి.. ఒకసారి పాలసీని ఎంచుకున్న తర్వాత ఆ పథకంలోని ఇతర ఫీచర్స్‌ను పరిశీలించండి. పాలసీ కాలపరిమితి, ప్రీమియం ఎంత కాలం చెల్లించాలి, మెచ్యూర్టీ తేదీ, మధ్యలో ఏమైనా ఇతర చార్జీలను చెల్లించాల్సి ఉంటుందా అన్న విషయాలను అడిగి తెలుసుకోండి. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత రెండో ఆలోచన వస్తే కనుక పాలసీని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతీ బీమా కంపెనీ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల ‘ఫ్రీ లుక్ పీరియడ్’ను ఇస్తాయి. తీసుకున్న పాలసీ నచ్చకపోతే 15 రోజుల్లోగా రద్దు చేసుకుంటే మీ ప్రీమియం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. - అంజలి మల్హోత్రా చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్, అవైవా లైఫ్ -
ఆర్థికంగా ఫిట్.. ఎలా?
ఫైనాన్షియల్ బేసిక్స్ ప్రతి ఒక్కరూ శారీరకంగా ఫిట్‌గా ఉండాలని భావిస్తారు. ఇందుకు జిమ్... వ్యాయామం, యోగా వంటి వాటిని ఆశ్రయిస్తారు. మరి ఆర్థికంగా ఫిట్‌గా ఉండాలంటే? మనం అసలు ఆర్థికంగా ఫిట్‌గా ఉన్నామో లేదో ముందు తెలుసుకోవాలి. నిజానికి శారీరక ఫిట్‌నెస్‌కు ప్రమాణాలున్నట్లుగా ఆర్థిక ఫిట్‌నెస్‌కు నిర్దిష్ట ప్రమాణాలుండవు. కానీ కొన్ని బేసిక్ నిబంధనలను పాటిస్తే ఆర్థిక ఫిట్నెస్ సాధించొచ్చు. కెరీర్ ప్రారంభమే... సేవింగ్స్‌కు పునాది సంపాదన మొదలైన తొలినాళ్లలోనే సేవింగ్స్ ప్రారంభించాలి. సాధ్యపడకపోతే కనీసం 30 ఏళ్లు వచ్చినపుడైనా సేవింగ్స్ ప్రారంభించాలి. సేవింగ్స్ ప్రక్రియను మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత మీ రిటైర్మెంట్ గడువు వెనక్కు జరుగుతుంది. మీ ఆదాయంలో 40 శాతాన్ని సేవింగ్ చేయడం మంచిది. సాధ్యపడకపోతే వ్యక్తిగత, ఇంటి ఖర్చులను ఎక్కడైనా తగ్గించుకోవచ్చేమో పరిశీలించండి. ఉదాహరణకు మీ సొంత ఖర్చులను తగ్గించుకుంటే.. ఆ మొత్తం మీ పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. అత్యవసర నిధి ఏర్పాటు మరవొద్దు... ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా గుండెపోటు రావచ్చు. బైక్ మీద వెళ్తున్నపుడు ప్రమాదం జరగొచ్చు. అనుకోకుండా ఉద్యోగం పోవచ్చు. అప్పుడు మన పరిస్థితేంటి? అందుకే అనుకోని సంఘటనలను ఎదుర్కోడానికి ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా అత్యవసర నిధి మొత్తం... మన నెల జీతానికి ఆరు రెట్లుండాలి. జీవిత బీమా తీసుకోండి... మనిషి సంఘ జీవి. ఒకడిగా జీవించలేడు. కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు మన తరవాత మనపై ఆధారపడ్డ వారి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖంగా ఉండాలంటే.. కచ్చితంగా జీవిత బీమాను తీసుకోవాలి. జీవిత బీమా కనీసం మన వార్షిక వేతనానికి 12 రెట్లు ఉండాలి. అలాగే కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమాను రూ.5 లక్షలకు తీసుకోవాలి. ఇటీవల ఆరోగ్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి. భవిష్యత్తులో ఇంకా పెరగొచ్చు కూడా. ఇన్వెస్ట్మెంట్ల సంగతేంటి.. ఇక ఇన్వెస్ట్మెంట్ల విషయానికి వస్తే.. ముందుగా మీరు ఏ స్థాయిలో రిస్క్‌ను భరించగలరో.. దాన్ని బేరీజు వేసుకోండి. అలాగే మీ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించండి. ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఒకే దానిలో చేయకండి. మీ పోర్ట్‌ఫోలియోను ఎల్లప్పుడూ డైవ ర్సిఫైడ్గా ఉంచుకోండి. వంద శాతంలో మీ వయసును తీసేస్తే వచ్చే సంఖ్యకు సమాన మొత్తాన్ని రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీ వంటి ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడిగా పెట్టండి. ద్రవ్యోల్బణం, పన్నులు వంటి అంశాలను తట్టుకొని అధిక రాబడిని పొందాలంటే రిస్క్‌ను భరించాల్సి ఉంటుందన్న విషయాన్ని మరవద్దు. ఆర్థిక వ్యవహారాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోండి. అవసరమైన సందర్భాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెన కాడవద్దు. ఆర్థిక పటిష్టత సాధించాలంటే క్రమశిక్షణ, ఓపిక అనే రెండు అంశాలను తప్పక అలవరచుకోవాలి. -
ఎక్సైడ్ లైఫ్ నుంచి ‘వెల్త్ మ్యాక్సిమా’
అందుబాటులోకి 3 బీమా పథకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపద సృష్టిని గరిష్టం చేసుకోవడంతో పాటుగా జీవితానికి బీమానందించేందుకు మూడు రకాల జీవిత బీమా ప్లాన్లను ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. అవి మ్యాక్సిమా ఇన్వెస్ట్, మ్యాక్సిమా ఫ్యామిలీ, మ్యాక్సిమా చైల్డ్ ప్లాన్లు. రిస్క్ ధోరణిలకు, అవసరాలకు అనుగుణంగా ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్‌కు మారేందుకు కూడా ఇందులో వీలుంటుంది. మ్యాక్సిమా ఇన్వెస్ట్ ప్లాన్ అంటే.. లైఫ్ కవర్ మొత్తం లేదా అక్యుములేటెడ్ ఫండ్ వ్యాల్యూలో రెండిట్లో ఏది ఎక్కువైతే అది అందుతుంది. మ్యాక్సిమా ఫ్యామిలీ అంటే.. లైఫ్ కవర్, అక్యుములేటెడ్ ఫండ్ వ్యాల్యూ రెండింటినీ కుటుంబం పొందుతుంది. మ్యాక్సిమా చైల్డ్ అంటే.. లైఫ్ కవర్ మొత్తాన్ని కుటుంబం వెంటనే పొందటంతో పాటుగా దీనికి అదనంగా ఈ ప్లాన్ ఆప్షన్ ప్రీమియం బెనిఫిట్‌ను అందిస్తుంది.సంపద సృష్టిని గరిష్టం చేసుకోవడంతో పాటుగా జీవితానికి బీమానందించేందుకు మూడు రకాల జీవిత బీమా ప్లాన్లను ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. -
ఆ ఫైట్స్‌కు 35 కోట్ల బీమా
వెండితెరపై ప్రతినాయకుణ్ణి కథానాయకుడు రఫ్ఫాడిస్తుంటే, అది నటనే అయినా నిజమని ఫీలైపోయి అభిమానులు సంబరపడిపోతారు. అక్షయ్‌కుమార్ లాంటి హీరోలు మాత్రం ఎంత రిస్క్ అయినా సరే వెనక్కి తగ్గరు. స్వయంగా తామే ఫైట్స్ చేస్తారు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అక్షయ్‌కుమార్ రిస్కులు తీసుకునే విషయంలో అప్పుడప్పుడు హద్దులు దాటేసి, జీవితాన్ని రిస్కులో పడేసుకుంటుంటారు. గాయాల బారిన పడితే కష్టమని ప్రమాద బీమా చేయించుకుంటారు. సాదాసీదా మనుషులైతే లక్షల్లో బీమా చేయించుకుంటారు. అక్షయ్ సూపర్ స్టార్ కాబట్టి ఏ కోటి రూపాయలకో తీసుకుని ఉంటారనుకోవచ్చు. కానీ, ‘హాలీడే’ సినిమా కోసం ఆయన ఏకంగా 35 కోట్ల రూపాయలకు వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకున్నారు. హిందీ సినీ రంగంలో ఈ స్థాయిలో బీమా చేయించుకున్నది ఒక్క అక్షయ్కుమారేనట. విచిత్రం ఏమిటంటే, బాలీవుడ్లో భారీస్థాయి పారితోషికాలు తీసుకొనే షారుఖ్, ఆమిర్‌ఖాన్‌లు సైతం సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ప్రత్యేకించి, బీమా చేయించుకోవడం లేదు. షూటింగ్ సమయంలో ఏదైనా గాయాలైతే, వైద్యఖర్చుల నిమిత్తం పనికొస్తుందని చిత్ర నిర్మాణ సంస్థలే యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ 5 నుంచి 10 లక్షల మేరకు బీమా చేస్తున్నాయి. ‘రౌడీ రాథోడ్’, ‘బేబీ’, ‘ఖిలాడీ 786’ లాంటి చిత్రాల్లో యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలు చేసి, రిస్కీ ఫైట్స్‌తో ‘ఖిలాడీ కుమార్’ అని పేరు తెచ్చుకున్న అక్షయ్ గతంలోనూ గాయాల బారినపడ్డారు. అయితే, అక్షయ్ కుమార్ లాంటి కొందరిని పక్కన పెడితే, హిందీ సినీ రంగంలో ఇప్పటికీ చాలామంది స్టార్స్ బీమా అంశంపై దృష్టి పెట్టకపోవడం విచిత్రమే. -
ఉద్యోగాలు-రుణాల్లో మత, లింగ వివక్ష
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగాలు, రుణాలు పొందడానికి మత, లింగపరమైన అంశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మాస్టర్‌కార్డ్ రూపొందించిన సర్వేలో వెల్లడైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెట్‌వర్క్‌ల పాత్ర, ఆర్థిక సమ్మిళిత అంశాలపై అధ్యయనం చేసే మాస్టర్‌కార్డ్ కనెక్టర్స్ ప్రాజెక్టులో భాగంగా మాస్టర్ కార్డ్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులో ఉండేందుకు గాను నరేంద్ర మోదీ ప్రభుత్వం జనధనయోజనను ప్రారంభించింది. రోజుకు రూపాయి కంటే తక్కువకే జీవిత బీమా కవర్‌ను, అలాగే నెలకు రూ. 1 చొప్పున చెల్లించే ప్రీమియంతో ఆరోగ్య, యాక్సిడెంట్ కవర్‌ను అందించే స్కీమ్‌ల ఇటీవలనే ప్రారంభమైన నేపథ్యంలో వెలువడిన ఈ సర్వే పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు..., లింగపరమైన అంశం కారణంగా ఉద్యోగాలు, రుణాలు పొందడానికి ఇబ్బందులు పడ్డామని భారత్ నుంచి సర్వేలో పాల్గొన్నవారిలో 58 శాతం మంది పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఇలా చెప్పినవారు 33 శాతంగా ఉన్నారు. ఇక మతం కారణంగా రుణాలు,ఉద్యోగాలు పొందడానికి ఇబ్బందులు పడ్డామని భారత్ నుంచి సర్వేలో పాల్గొన్నవారిలో 58 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల్లో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినవారు 28 శాతం మాత్రమే. ఉద్యోగాలు, రుణాలు పొందడంలో మహిళలకు, మతపరంగా మైనార్టీలుగా ఉన్న వారు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పౌర జీవనం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఇతర దేశాల్లో కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉంది. -
ఇండియాఫస్ట్ లైఫ్ తొలి మహిళా ఎండీగా విశాఖ
ముంబై: ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తొలి మహిళా మేనేజింగ్ డెరైక్టర్‌గా ఆర్.ఎం.విశాఖ మంగళవారం నియమితులయ్యారు. ఆమె గతంలో ఇండియాఫస్ట్ లైఫ్‌లోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంక్, లీగల్ ఆండ్ జనరల్ బ్రిటన్ల జాయింట్ వెంచరే ఈ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. -
ఎక్సైడ్ లైఫ్ జీవన్ ఉదయ్
ప్రైవేటు రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘జీవన్ ఉదయ్’ పేరుతో ఒక జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టింది. భారత మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఈ ప్లాన్‌ను రూపొందించినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పాలసీదారుడు కనిష్టంగా ఆరు నెలలకు రూ.4,000, ఏడాదికి రూ.6,000 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన ప్రీమియానికి పది రెట్లుగా ఈ ప్లాన్ జీవిత బీమా లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందచ్చు. ఒక ఏడాడి ప్రీమియం చెల్లించలేకపోయినా, జీవిత బీమా రక్షణ కొనసాగతుంది. పాలసీ కాలవ్యవధి 10/15/20 ఏళ్లు. ఈ పాలసీకి వైద్య పరీక్షలు అవసరం లేదు. -
టీ పోలీసు శాఖకు బీమా నిధులు మంజూరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు జీవిత బీమాకు సంబంధించి కోటి 90 లక్షల 93 వేల రూపాయలను మంజూరు చేస్తు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీకి చెల్లించేలా రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మకు ఆదేశాలు ఇచ్చారు. పోలీస్‌శాఖలోని కానిస్టేబుల్ మొదలుకుని ఐపీఎస్ అధికారుల వరకు, రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర భద్రతా దళాల సిబ్బంది, అధికారులకు కూడా ఈ ఇన్సూరెన్సు వర్తించేలా ఆదేశాలు ఇచ్చారు. అంతకు ముందు పోలీసు శాఖలోని సిబ్బంది, అధికారులకు బీమాను వర్తింపజేస్తు దానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరుతూ డీజీపీ అనురాగ్‌శర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు నిధులను మంజూరు చేసింది. -
ఆన్లైన్ బీమాతో 3 ప్రయోజనాలు
ప్రతీ ఒక్కరు కలిగి ఉండాల్సిన వాటిలో జీవిత బీమా ఒకటి. ఆర్థిక ప్రణాళిక అనేది బీమాతోనే మొదలు పెట్టాలి. మీ అవసరాలను తీర్చే విధంగా విభిన్నమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న వయస్సు వారి దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు , పేదవాళ్ల దగ్గర నుంచి ధనికులకు అవసరమైన అన్నిరకాల పథకాలు ఉన్నాయి. కానీ బీమా ప్రధానోద్దేశ్యం ఇంటిలో ప్రధానంగా సంపాదించే వ్యక్తికి అనుకోని సంఘటన ఏదైనా జరిగితే అతనిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఆర్థిక భరోసా కల్పించడమే. దీన్ని టర్మ్ ఇన్సూరెన్స్ పథకాలు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి. తక్కువ ధరతో అధిక బీమా రక్షణను టర్మ్ పాలసీలు కల్పిస్తాయి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఏజెంట్లు ద్వారా కాని నేరుగా ఆన్లైన్ ద్వారా కాని కొనుగోలు చేయొచ్చు. అదే ఆన్లైన్లో కొనుగోలు చేస్తే మరికొన్ని అదనపు ప్రయోజనాలు పొందచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం... తక్కువ ధర టర్మ్ ఇన్సూరెన్స్ పథకాల్లో ప్రీమియం అనేది చాలా ప్రధానమైన అంశం. ఆన్లైన్లో లభించే టర్మ్ ఇన్సూరెన్స్ పథకాల ప్రీమియాలు 50 నుంచి 70 శాతం తక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఎటువంటి మధ్యవర్తి ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీ నుంచే పాలసీ తీసుకుంటుండటంతో వ్యయాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఏజెంట్ కమీషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎంచుకోవడం విభిన్న కంపెనీల పథకాలను పరిశీలించి అందులో మీ అవసరాలకు సరిపోయే పాలసీని ఎంచుకోవచ్చు. అంతేకాదు అప్లికేషన్ ఫారం మీరే పూర్తి చేస్తారు కాబట్టి కంపెనీకి ఇచ్చే సమాచారంపై కచ్చితత్వం ఉంటుంది. దీంతో క్లెయిమ్‌ల సమయంలో సమస్యలు తలెత్తవు. సౌకర్యం చాలా సులభంగా, మీకు నచ్చిన సమయంలో పాలసీ తీసుకోవచ్చు. దీనివల్ల విలువైన సమయం ఆదా అవుతుంది. -
బీమాలో ‘టర్మ్’ ఉండాల్సిందే
ఆధునిక కాలంలో చిన్న కుటుంబాల సంఖ్య వేగంగా విస్తరిస్తోంది. అలాగే యువత ఆహారపు అలవాట్లు, లైఫ్స్టైల్లో మార్పులు కనపడుతున్నాయి. పెళ్లి చేసుకున్న వెంటనే సొంతంగా జీవితం ప్రారంభించడమే కాకుండా అత్యుత్తమమైన జీవన విధానాన్ని కోరుకుంటున్నారు. ఇంటి భద్రత, కుటుంబ సభ్యుల కోసం అనేక చర్యలు తీసుకునే వీరు వారి ఆర్థిక రక్షణ విషయానికి వచ్చే సరికి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఒక్కరికి అనేక ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, రిటైర్మెంట్లతో పాటు మరికొంత మంది తల్లిదండ్రుల బాగోగులను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్య సాధన కోసం సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచే పొదుపు ప్రణాళికలను మొదలు పెడతారు. కానీ ఇంటిలో సంపాదిస్తున్న వ్యక్తికి ఊహించడానికే వీలులేని సంఘటన జరిగితే.. ఈ ఆర్థిక లక్ష్యాలు, సేవింగ్స్ సంగతి ఏంటి? ఇవన్నీ ఆగిపోవాల్సిందేనా? ఈ ప్రశ్నలకు టర్మ్ ఇన్సూరెన్స్ చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. కుటుంబ పెద్ద లేకపోయినా అతని లక్ష్యాలు ఆగిపోకుండా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టర్మ్ ఇన్సూరెన్స్ భరోసాను అందిస్తుంది. జీవిత బీమాలో ప్రతీ ఒక్కరు కలిగి ఉండాల్సిన పాలసీల్లో టర్మ్ పాలసీ ఒకటి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించడమే కాకుండా, ఇతర పాలసీలతో పోల్చుకుంటే తీసుకునే విధానం కూడా సులభం. పాలసీ కాలపరిమితి మధ్యలో పాలసీదారునికి ఏదైనా జరిగితే ముందుగా నిర్దేశించిన బీమా మొత్తాన్ని నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కేవలం క్లెయిమ్‌లు తప్ప మెచ్యూర్టీలు ఉండకపోవడంతో ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. వయస్సు పెరిగే కొద్ది ప్రీమియం పెరుగుతుంది కాబట్టి చిన్న వయస్సులోనే దీర్ఘకాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ కాలం ప్రయోజనం పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన వారికి ప్రీమియంలు అధికంగా ఉంటాయి కాబట్టి వారికి టర్మ్ ఇన్సూరెన్స్ సూచించలేము. జీవితంలో ఆర్థిక బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ టర్మ్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా పెంచుకుంటూ ఉండండి. ఎంతుండాలి? బీమా మొత్తం ఎంచుకునేటప్పుడు రెండు అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థిక లక్ష్యాలకు కావల్సిన మొత్తంతో పాటు గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు ఏమైనా ఉంటే ఆ మొత్తానికి సరిపడా బీమాను తీసుకోవాలి. సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్లు వార్షిక జీతానికి 20 నుంచి 30 రెట్లు అధిక మొత్తానికి కనీస బీమా రక్షణ కలిగి ఉండాలి. అదే 40-50 ఏళ్ల లోపు వారికి 10 నుంచి 20 రెట్లు, 50 ఏళ్లు దాటిన వారు 5 నుంచి 10 రెట్లు బీమా కలిగి ఉంటే సరిపోతుంది. -
ఎల్ఐసీకి ఐటీ రీఫండ్ రూ. 11,500 కోట్లు
ముంబై: ఆదాయ పన్ను రీఫండ్స్ కింద రూ. 11,500 కోట్లు అందుకున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తెలిపింది. ఇందులో సింహ భాగాన్ని పాలసీదారులకు అందజేయనున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. 2007-08 నుంచి 2009-10 అసెస్మెంట్ ఇయర్స్‌కి సంబంధించిన కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించాయి. రీఫండ్స్‌ను రెండు విడతలుగా అందుకున్నట్లు ఎల్ఐసీ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో రీఫండ్ అందుకోవడం ఇదే ప్రథమం అని వివరించాయి. అయితే, ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ దీనిపై అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఎల్ఐసీ చట్టం 1956లోని సెక్షన్ 26 ప్రకారం ఎల్ఐసీకి వచ్చే ఐటీ రీఫండ్స్లో 95 శాతం మొత్తం పాలసీదారులకు, మిగతాది డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. -
మేమిద్దరం... మాకొక్కటి..!
ఒక వ్యక్తి తప్పనిసరి ఆర్థిక ప్రణాళిక అంటే... అది సమగ్ర, సంపూర్ణ జీవిత బీమా ప్రణాళిక. తన అవసరాలకు తగిన బీమా కలిగి ఉండడం ఎవ్వరికైనా ధీమానే. ఇది బీమాకు సంబంధించి ప్రాథమిక అంశం. సంఘంలో ఒకనిగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పుడు సరే కానీ కాలక్రమంలో మనిషి బాధ్యతలు పెరుగుతాయి. వివాహం... భాగస్వామిగా మరో వ్యక్తితో కలిసి వ్యాపార సంబంధాలు... ఇలా మనిషి కార్యకలాపాలు విస్తృతమవుతాయి. అలాంటి వారి విషయంలో ఉమ్మడి జీవిత బీమా ప్రణాళిక ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం ప్రతి వ్యక్తికి వారి అవసరాలకు అనుగుణంగా బీమా ప్రణాళికలు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి జీవిత బీమా ప్రణాళిక విషయంలోనూ ఇదే విధమైన ప్రొడక్టులు రూపుదిద్దుకుంటుండడం సానుకూల పరిణామం. పరస్పర ప్రయోజనం: ఒకరిపై ఒకరు ఆధారపడి సాగించే జీవన ప్రయాణంలో ఉమ్మడి జీవిత బీమా ప్రణాళిక ఎంతో అవసరం. అది వివాహం కావచ్చు... లేదా వ్యాపార భాగస్వామ్యం కావచ్చు. ఒక మంచి టర్మ్ ప్లాన్‌తో వ్యక్తి సాగించే ప్రయాణంలో ఆ వ్యక్తితో జతగూడే జీవిత భాగస్వామి కావచ్చు.. లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు.. వారిని ఉమ్మడి జీవిత బీమా బాటలో కూర్చే సౌలభ్యత ఇక్కడ ఉంది. ఆ మేరకు ఉపయోగాలు ఇక్కడ లభిస్తున్నాయి. వ్యత్యాసాలు: ప్రధానంగా రెండు వేర్వేరు ప్రయోజనాలను ఈ ప్రొడక్టులు అందిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది బీమా మొత్తం ఒకటిగా ఉండవచ్చు. లేదా రెండు వేర్వేరుగానూ ఉండవచ్చు... సింగిల్‌గా ఈ బీమా మొత్తం ఉన్నప్పుడు... దురదృష్టవశాత్తు భాగస్వామి మరణిస్తే మరొకరికి బీమా మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ సందర్భంలో పాలసీ ముగుస్తుంది. అయితే కవరేజ్ వేర్వేరుగా ఉన్నప్పుడు ఒక సభ్యుడు మరణిస్తే, సంబంధిత ప్రయోజనం (బీమా మొత్తం) అంతా చెల్లించినప్పటికీ... జీవించి ఉన్న వ్యక్తి పాలసీ, బీమా మొత్తం కొనసాగుతుంది. లాభాలు... నిర్వహణ: ఒకే పాలసీ, ఒకే ఒక్క బీమా మొత్తంతో పోల్చిచూస్తే... జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. ముఖ్యంగా చిన్న కుటుంబం... అలాగే భాగస్వామ్యంలో జరిగే వ్యాపార కార్యకలాపాల్లో ఈ పాలసీ ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. వ్యయం, నిర్వహణ, ప్రీమియం చెల్లింపు ఇత్యాది విషయాలన్నింటిలో వెసులుబాటును కల్పిస్తుంది. అలాగే ఉమ్మడి ఆస్తులు, తనఖా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నా ఈ తరహా పాలసీలు ఎంతో సానుకూలం. వెసులుబాటు: ఈ తరహా ప్రొడక్టుల్లో టర్మ్ ప్లాన్ కొనసాగుతున్న ఒక వ్యక్తి... కాలక్రమంలో అవసరమైతే తన జీవిత భాగస్వామిని కూడా చేర్చుకుని దీనిని జాయింట్ లైఫ్ ప్లాన్‌గా మలుచుకునే అవకాశం ఉంటుంది. విడాకుల కేసుల్లో ప్రాథమిక పాలసీదారు... పాలసీలో రెండవ వ్యక్తిని తొలగించుకునే వీలుంటుంది. భద్రత: జీవిత భాగస్వాముల భద్రత విషయంలో ఈ పాలసీ లాభం అపరిమితం. ప్రధానంగా ఆదాయాన్ని సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆర్థిక కష్టనష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్న సహ భాగస్వామికి ఈ తరహా పాలసీలు కొండంత అండనిస్తాయి. పిల్లల భవిష్యత్, రుణాల చెల్లింపులు, వ్యాపార కార్యకలాపాల్లో ఆర్థిక నష్టాల నివారణ... ఇలా అన్ని రకాలుగా ఇవి ప్రయోజనకరం. -
జీవిత బీమాతో రెండిందాల మేలు
ఇటీవలి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ .. ఆదాయ పన్ను చట్టంలోని 80సీ కింద మినహాయింపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల దాకా పెంచారు. దీర్ఘకాలిక పొదుపును, జీవిత బీమాను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం తీసుకున్న మంచి చర్యల్లో ఇది కూడా ఒకటి. భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా సమగ్రమైన బీమా కవరేజీ తీసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలను సమర్ధంగా వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అదెలా చేయొచ్చన్నది వివరించే ప్రయత్నమే ఈ కథనం. సాధారణంగా ప్రీమియానికి పది రెట్లు కవరేజీతో పాటు బీమా పాలసీల్లో పన్నుల పరంగా పలు ప్రయోజనాలు కూడా ఇమిడి ఉంటాయి. అవేంటంటే.. మనం ఉన్నా లేకపోయినా కూడా మనం ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడే ఏకైక ఆర్థిక సాధనం జీవిత బీమా. ఇదే దీని ప్రత్యేకత. యుక్తవయస్సులో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినప్పటికీ.. పెళ్లి చేసుకున్నాక.. కుటుంబం అంటూ ఏర్పడ్డాక జీవిత బీమా ప్రాధాన్యం ఏమిటన్నది, ఆర్థిక ప్రణాళికకు ఇదెంత కీలకమన్నది అర్థమవుతుంది. చక్కగా ప్లాన్ చేసుకోగలిగితే జీవిత బీమా పథకాలు భవిష్యత్‌లో మెరుగైన రాబడులు అందించే అద్భుతమైన పొదుపు సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇదెలాగన్నది అజయ్ అనే ఉద్యోగికి ఇచ్చిన సూచనల ద్వారా తెలుసుకుందాం. ముప్పై అయిదేళ్ల అజయ్‌కి భార్య, మూడేళ్ల కూతురు నేహ ఉన్నారు. వార్షికాదాయం దాదాపు రూ. 8 లక్షలు కాగా, భార్య గృహిణి. ఇటు కుటుంబానికి, అటు రిటైర్మెంట్ సమయానికి తనకు ఆర్థికపరమైన భరోసా లభించేలా అజయ్ పాటించాల్సిన ప్రణాళిక ఇలా ఉంటుంది. 1. కుటుంబానికి భరోసా.. ఇంట్లో సంపాదించేది అజయ్ ఒక్కరే కావడంతో కుటుంబం అంతా అతనిపైనే ఆధారపడి ఉంది. కాబట్టి రేప్పొద్దున్న తనకేదైనా జరిగినా కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూడాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇలాంటప్పుడే జీవిత బీమా అక్కరకొస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు, జీవిక కోసం పూర్తిగా తనపైనే ఆధారపడిన జీవిత భాగస్వామి ఉన్న వారికి ఈ పాలసీ చాలా ముఖ్యం. అంతే గాదు అజయ్ తన పిల్లల భవిష్యత్ చదువుల ఫీజుల కోసం, రుణాలేమైనా ఉంటే వాటి చెల్లింపుల కోసం, కుటుంబ ఖర్చుల కోసం కూడా తగినంత కవరేజి ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు రేట్లు పెరుగుతుంటాయి కాబట్టి.. అలాగే ఖర్చులూ పెరిగిపోతుంటాయి. ఈ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని కవరేజీని నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఇలాంటివాటన్నింటి కోసం అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగకరంగా ఉంటుంది. కవరేజీ ఎంత ఉండాలన్న విషయానికొస్తే.. ఒకటే బండగుర్తు. రిటైర్మెంట్కి ఎంత కాలం ఉంది, ఈ వ్యవధిలో ఎంత ఆర్జించే అవకాశం ఉందన్నది లెక్క వేసుకోగలిగితే ఎంత కవరేజీ తీసుకోవాలన్నది తెలుస్తుంది. ఉదాహరణకు, అజయ్ అరవై ఏళ్లకు రిటైర్ అవుతారనుకుంటే.. అతనికి ఇంకా 25 ఏళ్ల సర్వీసు ఉంది. దీన్ని బట్టి చూస్తే 20-25 సంవత్సరాల పాటు వార్షికాదాయాన్ని లెక్కించుకుంటే తీసుకోవాల్సిన కవరేజీ తెలుస్తుంది. అజయ్ విషయంలో సుమా రు రూ. 1.6 కోట్లు - 2 కోట్ల దాకా అవసరమవుతుంది. 2. కూతురు చదువు కోసం అజయ్ తన కుమార్తె చదువు కోసం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మాయి ప్రస్తుత వ యస్సును పరిగణనలోకి తీసుకుంటే కాలేజీలో చేరేందుకు ఇంకా 15 ఏళ్ల వ్యవధి ఉంది. ప్రస్తుతం 4 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు దాదాపు రూ. 5 లక్షలు ఖర్చవుతోంది. ధరలు ఏటా 6% పెరుగుతాయనుకుంటే 15 ఏళ్ల తర్వాత ఈ ఖర్చు రూ. 12 లక్షలయి కూర్చుంటుంది. ఇంత మొత్తం సమకూర్చుకోవాలంటే అజయ్ ప్రతి ఏడాది సేవింగ్స్ ఆధారిత జీవిత బీమా పథకంలో రూ. 45,000 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 3. రిటైర్మెంట్ కోసం.. వీటితో పాటు తాను రిటైరయిన తర్వాత తలెత్తే అవసరాల కోసం పింఛను పథకం రూపంలో అజయ్ ప్లాన్ చేసుకోవా ల్సి ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చే నిధులకు ఈ పింఛన్ పథకం రాబడి కూడా తోడయితే రిటైర్మెంట్ తర్వాత ఖర్చులను జాగ్రత్తగా ఎదుర్కొనవచ్చు. ఈ పెన్షన్ ప్లాన్ ప్రీమియం కోసం ఏటా రూ. 50,000 కడితే రిటైరయ్యే సమయానికి రూ. 34 లక్షల మేర నిధి సమకూరుతుంది. పదవీ విరమణ తర్వాత దీన్ని యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే.. ఎంచుకున్న చాయిస్‌ని బట్టి ఆదాయాన్ని అందుకోవచ్చు. 4. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు.. జీవితం అంటే .. మనం క న్న కలలను సునిశితమైన ప్లానింగ్, క్రమశిక్షణ, అంకితభావంతో సాకారం చేసుకోవడం. క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ ప్లాన్‌తో అజయ్ కూడా ఏడాదికోసారి హాలిడేలు ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడప్పుడు విదేశీ టూర్లు సైతం ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా జరగాలంటే.. ముందుగా భవిష్యత్‌లో తలెత్తే ఖర్చులను ఎలా ఎదుర్కోనాలనేది ప్లాన్ చేసుకోవాలి. తగిన బీమా పాలసీ తీసుకోవాలి. -
రెండవ పాలసీ అవసరమంటారా?
రఘుకు ఇప్పుడు 40 సంవత్సరాలు. భార్య, ఏడేళ్ల బాబుతో సంతోషంగా, ఉన్నదానితో తృప్తిగా జీవితం గడుపుతున్నాడు. వెనకా ముందూ ఆస్తిపాస్తులేవీ లేవు. రెక్కల కష్టమే బతుకు బండికి ఆధారం. వివాహానికి ముందు 15 సంవత్సరాల కాల వ్యవధితో 10 లక్షలకు జీవిత బీమా పాలసీ ఒకటి తీసుకున్నాడు. ఇప్పుడూ క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తున్నాడు. పెళ్లికి ముందు ఏ బాదరబందీ లేదు. కాబట్టి ఆ మొత్తానికి బీమా చాలు. అయితే ఇప్పుడు అవసరాలు వేరు. తన పై భార్య, బాబు ఆధారపడి ఉన్నారు. వారి భవిష్యత్‌కి బంగారు బాట వేయడం కూడా ఇప్పుడు రఘు బాధ్యత. ఆర్థికంగా లేదా వైద్య పరంగా.. లేదా మరేతర అనుకోని ఇబ్బంది వచ్చినా... రఘు సంపాదనమీద ఆధారపడినవారి జీవితానికీ కొంత భద్రత అవసరం. అవసరాలు మారుతుంటాయ్ రఘుకు సంబంధించి ముఖ్య విషయాలను గమనించాలి. అవి రఘు విషయంలోనే కాదు దాదాపు ప్రతి ఒక్కరికీ వర్తించేవే. మనిషి ఆర్థిక అవసరాలు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతుంటాయి. ఆయా అంశాలకు, కాలగమనంలో ఏర్పడే అవసరాలకు అనుగుణంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటుండాలి. ఆయా క్రమంలో జీవిత బీమా కీలకమైనది. ఒక పాలసీ ఉండగా మరొకటి తీసుకోవడం అవసరమా? అన్న ఒకరి సందేహానికి మరొకరు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ఎవరికి వారు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా సందర్భాల్లో ప్రధానంగా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని పరిశీలిస్తే... ఆర్థిక లక్ష్యాలు: ప్రతి వారూ తన వ్యక్తిగత లేదా కుటుంబ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్యాలను సాధించుకోవడానికి అనుగుణమైన ఆర్థిక భరోసా, భద్రత ఉందా లేదా అన్న అంశాలను స్వయంగా పరిశీలించుకోవాలి. అనుకోని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా... అవి లక్ష్యాలను సాధించుకునే దిశలో ఇబ్బందిని, వైఫల్యాన్ని సృష్టించకూడదు. ఈ క్రమంలో జీవిత బీమా కీలకమైనది. ప్రస్తుతం ఉన్న బీమా పరిమాణం లక్ష్య సాధన క్రమంలో సహాయపడుతుందో లేదో తొలుత నిర్ణయించుకోవాలి. లేదంటే మరో పాలసీ తీసుకోవడానికి సందేహించనక్కర్లేదు. ఉద్యోగుల విషయంలో..: సహజంగా ఉద్యోగులకు యాజమాన్యం వైపునుంచి జీవిత బీమా సౌలభ్యం ఉంటుంది. ఈ గ్రూప్ పాలసీలు సర్వసాధారణంగా దాదాపు వ్యక్తులందరికీ జీవన క్రమంలో ఎదురయ్యే వైద్య, ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొనే రీతిలో ఉంటాయి. ఈ పాలసీల సౌలభ్యత మన పూర్తి అవసరాలకు సరిపడుతుందా లేదా అన్న అంశాన్ని పరి శీలించుకోవాలి. యాజమాన్యం వైపు నుంచి తీసుకునే బీమా పరిమాణం మన అవసరాలకన్నా తక్కువగా ఉందనుకుంటే... మన అవసరాల మేరకు ప్రత్యేకంగా మరో పాలసీని తీసుకోవడానికి ఆలోచించనక్కర్లేదు. అవగాహన అవసరం: మన వార్షిక ఆదాయానికి 9 నుంచి 10 రెట్లు అదనపు లైఫ్ కవర్ ఉండడం మంచిదన్నది ఈ రంగంలో నిపుణుల సలహా. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న పాలసీల ప్రయోజనాల మీద పూర్తి అవగాహన అవసరం. జీవితానికి ఇబ్బంది ఎదురైతే కుటుంబ భవిష్యత్, పిల్లల విద్య, తత్సంబంధ లక్ష్యాలు, రిటైర్మెంట్ ఇలా ప్రతి విషయాన్నీ పరిశీలించాలి. ఆ మేరకు తగిన పాలసీ భరోసా తక్షణం అందుబాటులో ఉందో లేదో చూడాలి. ముఖ్యంగా నగదు విలువ లేకుండా, నిర్దిష్ట కాలానికి కవరేజ్ అందించే టర్మ్ పాలసీల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. రైడర్లూ కీలకమే: పాలసీకి అనుబంధంగా తీసుకునే వీలున్న ‘రైడర్ల’పై చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు. బీమా ప్రయోజనాలను అధికంగా పొందేందుకు ఈ రైడర్లు దోహదపడతాయి. స్వల్ప వ్యయాలతో ప్రస్తుత పాలసీ లబ్ధి అదనంగా మరిన్ని ప్రయోజనాలను అందించేదే... రైడర్. ఉదాహరణకు ‘క్రిటికల్ ఇల్నెస్’ పాలసీని తీసుకుందాం. ఈ పాలసీని డెరైక్ట్‌గా (స్టాండెలోన్) తీసుకోవచ్చు. లేదా ఒక పాలసీకి అదనంగా... రైడర్‌గానూ తీసుకోవచ్చు. ప్రీమియం రద్దు, ప్రమాదవశాత్తు మరణం, ఆదాయం ప్రయోజనం, సర్జికల్-హాస్పిటల్ కేర్ ఇలా రైడర్లలో పలు రకాలు ఉన్నాయి. -
కొండంతైనా లక్ష్యం..ఇలా సులభం
మీరు ఇస్తున్న పొదుపు చిట్కాలు బాగుంటున్నాయి. నేను ప్రయత్నించిన ఒక చిట్కా గురించిన విశేషాలు పంచుకోవాలనుకుంటున్నాను. మా ఊరిలో చంద్రారావనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. అందరికీ తలలో నాలుకలాగా ఉంటాడు. తనకు ఒకసారి పొదుపు, జీవిత బీమా ప్రాధాన్యాల గురించి చెప్పాను. ఏటా కనీసం రూ.3,000 కడితే అధిక కవరేజీ ఉండే బీమా పాలసీ తీసుకోవచ్చని చెప్పాను. ఒకేసారి అంత పెద్ద మొత్తం కష్టమన్నాడు. దీంతో నెలకు రూ. 300 పొదుపు చేయగలవా అంటే .. ఓస్ ఈజీగా చేసేయొచ్చు అన్నాడు. ఇక, రోజుకో తీరుగా సంపాదన ఉండే చంద్రరావు నెలకు రూ. 300 ఎలా దాచాలన్నదానికి నాకో ఆలోచన వచ్చింది. ఒక రూ.160 పెట్టి తాళం గల చిన్న డిబ్బీ కొన్నాను. నేను, నా భార్య మొదట రూ. 50 అందులో వేసి అతనికి ఇచ్చాము. రోజూ వచ్చిన ఆదాయంలో 10 శాతాన్ని డబ్బాలో వేయమని చెప్పాను. అంటే రూ. 500 వస్తే రూ. 50, రూ. 1000 వస్తే రూ. 100 ఇలా అన్నమాట. దీనితో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఇటు పొదుపుతో పాటు అటు నెల తిరిగే సరికి అందులో జమయిన మొత్తాన్ని బట్టి చూస్తే నెలవారీగా తను ఎంత ఆర్జిస్తున్నదీ కూడా అతనికి కచ్చితమైన అంచనా కూడా వస్తుంది. ఉదాహరణకు డిబ్బీలో రూ. 1,000 జమయితే అతని సంపాదన రూ.10,000 అన్నమాట. చంద్రరావు ఈ చిట్కాలను పాటిస్తుండటంతో అతనికి బ్యాంకులో ఖాతా కూడా తెరిపించాము. ప్రతీ నెలా పొదుపు మొత్తాన్ని అందులో జమచేస్తున్నాడు. అలాగే పాలసీ కూడా తీసుకుని ప్రీమియంలూ సులువుగా కట్టుకుంటున్నాడు. కాబట్టి చెప్పేదేమిటంటే .. తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. కొండలా కనిపించే భారీ లక్ష్యాన్నైనా చిన్న చిన్న అంగల్లో సులువుగా చేరుకోవచ్చు. ఆపైన భగవంతుడు మంచివారికి మంచే చేస్తాడు. - అయ్యగారి పట్టాభిరామం (రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు, కోల్ ఇండియా), వాడపల్లి, తూ.గో. జిల్లా -
బీమాలో నామినీ ఉండాల్సిందే...
జీవిత బీమా తీసుకునే వారు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తమ తదనంతరం బీమా ప్రయోజనం ఎవరికి అందాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. పాలసీదారుని మరణానంతరం ఆ వ్యక్తి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే జీవిత బీమా ముఖ్యోద్దేశం. అందుకే, బీమా పత్రాలు నింపేటపుడు నామినీ వివరాలు స్పష్టంగా పేర్కొనాలి. పాలసీలో నామినీలను పేర్కొనకపోతే బీమా మొత్తాన్ని పొందడానికి పాలసీదారుని కుటుంబ సభ్యులు ఎన్నో ఇక్కట్లకు గురికావలసి వస్తుంది. కోర్టులు జారీచేసే వారసత్వ సర్టిఫికెట్ తీసుకురమ్మని బీమా కంపెనీలు కోరతాయి. ఈ సర్టిఫికెట్‌ను పొందడం అంత సులువు కాదు. అందుకే, బీమా ప్రపోజల్ ఫారంలోనే నామినీ(ల)ను స్పష్టంగా రాస్తే సరిపోతుంది. నామినీ అంటే... తన తదనంతం బీమా సొమ్ము ఎవరికి అందాలని పాలసీదారు ప్రతిపాదిస్తాడో ఆ వ్యక్తినే నామినీ అంటారు. నామినీ పూర్తి వివరాలను, పాలసీదారునితో ఆ వ్యక్తి బంధుత్వాన్ని ప్రపోజల్ ఫారంలో స్పష్టంగా పేర్కొనాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే... పాలసీదారునికి నామినీ చట్టపరంగా వారసుడు/ వారసురాలు అయి ఉండాలి. లేదంటే నామినేషన్ చెల్లదు. చట్టం ప్రకారం పాలసీదారుని తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు నామినేషన్‌కు అర్హులు. ఒకవేళ నామినీ మైనర్ అయితే అతనికి/ ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకు కస్టోడియన్‌ను నియమించాలి. గుర్తుంచుకోవాల్సినవి... * పాలసీ గురించి, నామినేషన్ గురించి నామినీకి, కుటుంబ సభ్యులకు తెలపాలి. తద్వారా, పాలసీదారు లేనపుడు వారు అత్యధిక ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుంది. * పాలసీ కాలపరిమితి ముగిసేలోపు నామినీ దురదృష్టవశాత్తూ మరణిస్తే బీమా కంపెనీని సంప్రదించి కొత్త నామినీని పేర్కొనాలి. * ఒకరి కంటే ఎక్కువ సంఖ్యలో నామినీలుంటే వ్యవహారం సహజంగానే సంక్లిష్టమవుతుంది. కొన్నిసార్లు న్యాయ వివాదాలు కూడా ఏర్పడుతుంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా సొమ్మును ఒక నామినీకే ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తాయి. అందుకుగాను సదరు నామినీ మిగిలిన నామినీల నుంచి అంగీకారాన్ని పొందాల్సి ఉంటుంది. మిగిలిన నామినీలు అంగీకారం తెలిపే సమయంలో వివాదాలు ఏర్పడుతుంటాయి. -
ఫీజు కట్టాలన్నా కనికరించలేదు..
రైతు బీమా సొమ్ము ఫ్రీజ్ చేసిన ఆంధ్రా బ్యాంకు సిబ్బంది కదిరి: ‘సార్.. మా వాడికి కాలేజీలో ఫీజు కట్టాలి. దయచేసి మా ఖాతాలో జమ అయిన జీవిత బీమా మొత్తాన్ని ఇవ్వండి’ అంటూ ఆ రైతు దంపతులు ఎంతగా వేడుకున్నా బ్యాంకు సిబ్బంది కనికరించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన కొండ్రే వెంకటరమణమ్మ, సూర్యచంద్రారెడ్డి దంపతుల కుమారుడు సూర్యప్రకాష్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎంటెక్ చదువుతున్నాడు. ఫీజు చెల్లించేందుకు డబ్బు పంపాలని కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. జీవిత బీమా సంస్థలో సూర్యచంద్రారెడ్డి పేరున పొదుపు చేసిన మొత్తాన్ని కుమారుడికి పంపాలని వారు నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత జీవిత బీమా సంస్థ వారు కదిరి పట్టణంలోని ఆంధ్రా బ్యాంకులో ఉన్న సూర్యచంద్రారెడ్డి ఖాతాలో రూ. 9,535 జమ చేశారు. ఆ మొత్తాన్ని డ్రా చేసేందుకు సోమవారం దంపతులిద్దరూ బ్యాంకుకు వెళ్లారు. అయితే.. ‘మా బ్యాంకులో సూర్యచంద్రారెడ్డిపై పంట రుణం తీసుకున్నారు. అసలు, వడ్డీ కలిపి రూ. 70 వేలు చెల్లించాలి. ప్రస్తుతం ప్రీమియం, వడ్డీ మొత్తం చెల్లించి రుణం రెగ్యులరైజేషన్ చేసుకొంటేనే బీమా డబ్బు ఇస్తాం’ అంటూ మేనేజర్ తెగేసి చెప్పారు. ‘కొడుక్కి ఫీజు కట్టాలి సార్.. అయినా రుణాలు మాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పారు కదా’ అంటే, మాఫీ చేసినప్పుడు తీసుకెళ్దురులే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో కొడుకు ఫీజు కోసం డబ్బు ఎక్కడి నుంచి తేవాలని వారు విలపిస్తున్నారు. -
చౌకవైనా.. భేషైనవి
మొట్టమొదటి పూర్తిస్థాయి ఆన్లైన్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టిన కంపెనీ ఉద్యోగిని కావడంతో.. వీటి ప్రీమియాల గురించి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులు, కస్టమర్ల నుంచి అనేక ప్రశ్నలు నాకు ఎదురవుతుంటాయి. ఇంత చౌకగా ఉందంటే.. కచ్చితంగా ఎక్కడో ఏదో ఒక లొసుగు ఉండే ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. ముఖ్యంగా క్లెయిముల విషయానికొచ్చినప్పుడు కంపెనీలు ఏదో ఒక రకంగా ఎగ్గొట్టేస్తాయేమోనన్న భయం అన్నింటినీ మించి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే, ఇంతకు మించిన అనవసర భయం మరొకటి లేదని చెప్పవచ్చు. జీవిత బీమా వ్యాపారం అనేది దీర్ఘకాలికమైనది. క్లెయిములు సరిగ్గా చెల్లించదన్న ప్రచారం జరిగిందంటే ఏ కంపెనీ కూడా మార్కెట్లో మనుగడ సాగించలేదు. అందువల్ల, సిసలైన క్లెయిములన్నిటినీ చెల్లించడం తమ బాధ్యతన్న విషయం ప్రతి కంపెనీ గుర్తెరిగి వ్యవహరిస్తుంది. ఆన్లైన్ ప్రపోజల్ ఫారంలో కంపెనీ బోలెడన్ని వివరాలు సేకరిస్తుంది కాబట్టి సిసలైన క్లెయిమును నిరాకరించడానికి అసలు అవకాశమే లేదు. మరి సంప్రదాయ పాలసీలతో పోలిస్తే ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ఎందుకు చౌకగా ఉంటుందంటే... * అమ్మకాలపరంగా మధ్యలో ఎవరికీ కమీషన్లు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కంపెనీకి పంపిణీ ఖర్చులు తగ్గిపోతాయి. దీంతో ప్రీమియంను తక్కువ చేయొచ్చు. * పాలసీ జారీ ప్రక్రియలో సింహభాగం ఆన్లైన్లోనే జరిగిపోతుంది. పేపర్, స్టేషనరీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రయోజనాన్ని పాలసీదారుకు బదలాయించడానికి సాధ్యపడుతుంది. * ఆన్లైన్ కస్టమర్ల ప్రొఫైల్‌ని బట్టి పాలసీలు తీసుకునే వారి సగటు జీవితకాలం, వ్యాధిగ్రస్తులయ్యే అవకాశాలపై అంచనాలు మెరుగుపడగలవు. తర్వాత కాలంలో ప్రీమియంలను క్రమబద్ధీకరించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే ఆన్లైన్ టర్మ్ ప్లాన్లు ఆఫ్‌లైన్ ప్లాన్ల కన్నా చౌకగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాలసీలు.. అందుబాటు ప్రీమియంలతో గణనీయమైన జీవిత బీమా కవరేజీ అందిస్తూ చెప్పుకోతగిన సేవలందిస్తున్నాయి. కనుక కస్టమరు చేయాల్సిందల్లా తమకు ఎంత కవరేజీ కావాలో నిర్ణయించుకోవడం, కొన్ని సులభతరమైన ప్రశ్నలకు సమాధానమివ్వడం, కీలకమైన వివరాలేమీ దాచిపెట్టకుండా తెలియజేయడం, అటుపైన ప్రీమి యం చెల్లించడమే. తద్వారా కుటుంబానికి తగినంత ఆర్థికపరమైన భద్రత కల్పించారు కనుక.. ఇక ఆ తర్వాత నిశ్చింతగా కాలు మీద కాలేసుకుని ధీమాగా ఉండొచ్చు. -
సీఐ బెనిఫిట్ ఉండాల్సిందే..
జీవిత బీమా గురించి, ఆరోగ్య బీమా గురించి చాలామందికి అవగాహన ఉంది. తీవ్ర అస్వస్థత (క్రిటికల్ ఇల్నెస్-సీఐ)కు కూడా బీమా ఉంది. క్రిటికల్ ఇల్నెస్ జాబితాలో ఉన్న అనారోగ్యం బారిన పడ్డారని పరీక్షల్లో వెల్లడికాగానే బీమా చేసిన మొత్తం చేతికి అందుతుంది. బీమా చేసిన మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ చూడడానికి ఖరీదైనదిగా కన్పిస్తుంది గానీ ఇందులో ఉన్న ప్రయోజనాలను గమనిస్తే అదెంత ముఖ్యమైనదో అర్థమవుతుంది. క్రిటికల్ ఇల్నెస్ జాబితా ఇదీ.. హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కేన్సర్, అవయవ మార్పిడి, పక్షవాతం, అంధత్వం, అచేతనం (డిజెబిలిటీ), ప్రాణాం తక అనారోగ్యం (టెర్మినల్ ఇల్నెస్)జీవిత బీమా, ఆరోగ్య బీమా అందించలేని ప్రయోజనాలు క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్సులో ఉన్నాయి. జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు భారీమొత్తం అందుతుంది తప్ప అదే వ్యక్తి తీవ్ర అనారోగ్యంపాలై కోలుకున్నపుడు నయా పైసా కూడా రాదు. ఇక ఆరోగ్య బీమాలో చాలా రకాల తీవ్ర అస్వస్థతలను మినహాయిస్తుంటారు. గుండె పోటుకు గురైన వారిలో 95 శాతం మంది కోలుకుంటారు గానీ వారు ఆర్థికంగా కోలుకోవడానికి చాలాకాలం పడుతుంది. కేన్సర్ బాధితుల పరిస్థితీ ఇంతే. వైద్య ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతో అవసరం. * సాధారణ ఆరోగ్య బీమాతో పోలిస్తే క్రిటికల్ ఇల్నెస్ కవర్ విభిన్నమైనది. ఆరోగ్య బీమా * బీమా చేయించుకున్న వ్యక్తి పలుమార్లు ఆస్పత్రి పాలైనప్పటికీ అన్ని సార్లూ బీమా ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, ఆ మొత్తం బీమా చేయించిన మొత్తానికి మించకూడదు. క్లెయిమ్ చెల్లుబాటయ్యేదై ఉండాలి. * కనీసం 24 గంటలకు పైగా ఆస్పత్రిలో ఉండాలి. * హాస్పిటల్లో చేరడానికి ముందు, తర్వాత అయ్యే వ్యయాన్ని ఈ పాలసీ భరిస్తుంది. * తీవ్ర అస్వస్థతలను హెల్త్ ప్లాన్ నుంచి మినహాయిస్తారు. క్రిటికల్ ఇల్నెస్ కవర్ * పాలసీ కాలపరిమితిలోపు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పరీక్షల్లో వెల్లడైన వెంటనే పాలసీదారుకు పూర్తి బీమా మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. పాలసీని మళ్లీ రెన్యువల్ చేయించుకునే వరకు తదుపరి ప్రయోజనాలు ఉండవు. * ఆస్పత్రిలో చేరారా, లేదా అనే విషయంతో సంబంధం లేదు. తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వైద్యపరీక్షల్లో తేలితే చాలు. * ఆస్పత్రి, చికిత్స వ్యయాలతో పాటు అస్వస్థత కారణంగా కోల్పోయిన ఆదాయానికి కూడా కొంతమొత్తాన్ని చెల్లిస్తారు. * తీవ్ర అస్వస్థతలను మాత్రమే కవర్ చేస్తారు. * క్రిటికల్ ఇల్నెస్ కవర్‌ను విడిగా ఓ బీమా పాలసీగా తీసుకోవచ్చు. లేదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు రైడర్‌గానూ తీసుకోవచ్చు. మంచి హెల్త్‌ప్లాన్‌కు రైడర్‌గా క్రిటికల్ ఇల్నెస్ కవర్‌ను తీసుకోవడం ఉత్తమమని నిపుణుల సలహా. -
జీవిత బీమా పరిభాష..
బేసిక్స్ జీవిత బీమా తీసుకునేటప్పుడు రకరకాల పదాలు వినవస్తుంటాయి. వీటిలో కొన్నింటిని గురించి క్లుప్తంగా.. సమ్ అష్యూర్డ్ దీన్నే కవరేజ్ అని కూడా అంటారు. బీమా కంపెనీ పాలసీకి సంబంధించి గ్యారంటీగా ఇచ్చే సొమ్ము ఇది. పాలసీని బట్టి బోనస్‌లు, వడ్డీ మొదలైనవి కూడా దీనికి జత కావొచ్చు. పాలసీ మెచ్యూర్ అయ్యాక (వ్యవధి పూర్తయిపోయాక) పాలసీదారుకు ఈ మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ఈలోగానే పాలసీదారు మరణించిన పక్షంలో వారి వారసులకు దీన్ని అందిస్తుంది. ప్రీమియం.. పాలసీ కవరేజీ కోసం పాలసీదారు తరచుగా కొంత మొత్తం బీమా కంపెనీకి కట్టాలి. దీన్నే ప్రీమియం అంటారు. ఒక రకంగా ఇది ఇన్స్టాల్మెంట్ అనుకోవచ్చు. పాలసీదారు వయసును బట్టి ప్రీమియం మారుతుంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వ్యక్తి తీసుకునే పాలసీకి, 40 ఏళ్ల వ్యక్తి తీసుకునే పాలసీకి ప్రీమియంలు వేర్వేరుగా ఉంటాయి. ఆయా పాలసీలను బట్టి పాలసీదారు ఏకమొత్తంగా ఒకేసారైనా కట్టేయొచ్చు లేదా ఏడాదికో, ఆర్నెల్లకో, మూడు నెలలకోసారి కట్టే విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి పాలసీకి ఇన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలని ఉంటుంది. యాన్యుటీ పథకాలు.. కంపెనీకి ఒకేసారి ఏకమొత్తంగా కట్టేసి.. జీవితాంతం నెలకి కొంత చొప్పున తిరిగి పొందే పథకాలు ఇవి. ఇందులో ఇమ్మీడియట్ అని.. డిఫర్డ్ అని రెండు రకాలు ఉంటాయి. ఇమ్మీడియట్ విధానంలో .. కంపెనీకి డబ్బు కట్టేసిన మరుసటి నెల నుంచి మనకు రావాల్సిన చెల్లింపులు మొదలవుతాయి. ఇక రెండో విధానంలో.. మనం ఎప్పట్నుంచి కావాలని కోరుకుంటామో అప్పట్నుంచే కంపెనీ చెల్లించడం మొదలుపెడుతుంది. మనకు నెలకు ఎంత వస్తుందనేది.. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. -
పాలసీ పత్రాలు ఈ-రిపాజిటరీలో పదిలం
మూడేళ్లకోసారి రూ.75 వేల చొప్పున 15 ఏళ్లపాటు ఆదాయమొచ్చే ఇన్సూరెన్స్ పాలసీని మూర్తి గారు తీసుకున్నారు. తొలి విడత సొమ్ము మామూలుగానే చేతికి అందింది. పాలసీకి సంబంధించిన కీలక పత్రాలను పోగొట్టుకోవడంతో రెండో విడత డబ్బు తీసుకోవడం కష్టమైంది. అతికష్టమ్మీద, ఏడాది తర్వాత ఆ డబ్బు అందింది. దానికోసం ఆయన నానా కష్టాలు పడాల్సి వచ్చింది. క్లెయిమ్‌లను పరిష్కరించుకోవాలన్నా, చెల్లింపులు తీసుకోవాలన్నా పాలసీ డాక్యుమెంట్లన్నీ భద్రంగా ఉంచడం, బీమా కంపెనీలు కోరినపుడు వాటిని సమర్పించడం అత్యవసరం. వీటిలో ఏ డాక్యుమెంటు మిస్సయినా ఆ పెట్టుబడి అంతా నిష్ఫలంగా మారే అవకాశముంది. అదృష్టవశాత్తూ, ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఈ-రిపాజిటరీలను బీమా రెగ్యులేటర్ ఐఆర్డీఏ గతేడాది ప్రారంభించింది. ఈ-రిపాజిటరీ ఏమిటంటే... ఖాతాదారులు తమ పాలసీ వివరాలను డిజిటల్ ఫార్మాట్లో భద్రపర్చుకునే సౌకర్యమే ఇ-రిపాజిటరీ. వివిధ బీమా కంపెనీలకు చెందిన పాలసీ డాక్యుమెంట్లను ఒకే ఈ-అకౌంట్లో దాచుకోవచ్చు. అంటే, మీకు హెల్త్ పాలసీ ఒక కంపెనీది, జీవిత బీమా మరో కంపెనీది ఉన్నా ఒకే అకౌంట్లో ఆ వివరాలు భద్రపర్చవచ్చు. క్లెయిమ్ సమయంలో పాలసీదారుడైనా, కంపెనీ అయినా ఒకే క్లిక్‌తో పాలసీ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అంటే, క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా త్వరగా పూర్తవుతుందన్నమాట. ఈ-కేవైసీ ద్వారా బీమా కంపెనీల సేవలు వేగవంతం కావడంతో పాటు డాక్యుమెంట్ ఫోర్జరీలను, పాలసీదారుల గుర్తింపులో మోసాలను నివారించవచ్చు. డాక్యుమెంట్ల కోసం పాలసీదారును అడగాల్సిన అవసరం లేకుండానే బీమా కంపెనీలు కేవైసీ తనిఖీల ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని పొందగలుగుతాయి. ఈ-రిపాజిటరీల ప్రక్రియ అంతా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి డాక్యుమెంట్లను దాచడానికి స్టోరేజీ అవసరం ఉండదు. అంతా ఉచితమే... బీమా కస్టమర్లందరికీ ఈ-రిపాజిటరీ సేవలను ఉచితంగా అందిస్తారు. యూఐఏడీఐలో నమోదు చేసుకుని, ఆధార్ కార్డు ఉన్న వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. బీమా కంపెనీలకు ఈ-రిపాజిటరీ ఏజెంట్లుగా వ్యవహరించడానికి ఐదు కంపెనీలను ఐఆర్డీఏ ఎంపిక చేసింది. ఖాతాదారులు తమకు నచ్చిన కంపెనీకి తమ పాలసీల వివరాలను అందిస్తే సరిపోతుంది. తర్వాత, వాస్తవ కాలానుగుణంగా ఈ డేటాను సదరు కంపెనీ అప్డేట్ చేస్తుంటుంది. ఒక్కో ఖాతాదారునికి ఒక్కో లింక్‌ను కంపెనీ ఇస్తుంది. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే చాలు, తర్వాతి ప్రీమియం చెల్లించాల్సిన తేదీ, ఫండ్ విలువ, మెచ్యూరిటీ డేట్ మొదలైన వివరాలన్నీ కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి. పాలసీదారులకు ఏవైనా సందేహాలుంటే బీమా సంస్థ, ఏజెన్సీ కంపెనీ సమాధానమిస్తాయి. పాలసీల డీమెటీరియలైజేషన్ పుణ్యమా అని బీమా కంపెనీల సేవా ప్రమాణాలు మెరుగవుతాయి. నిర్దిష్ట బీమా అవసరాలు కలిగిన ఖాతాదారులను గుర్తించడం బీమా కంపెనీలకు సులభమవుతుంది. స్నేహిల్ గంభీర్ సీఓఓ, అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ -
ఎలాంటి పాలసీ తీసుకోవాలంటే..
రాజేశ్ సూద్ ఎండీ, సీఈఓ, మ్యాక్స్ లైఫ్ జీవిత బీమా... ప్రతి ఒక్కరికీ ధీమా కలిగిస్తుంది. వ్యక్తి ఆర్థిక ప్రణాళికలకు స్థిరత్వాన్నీ, సంపూర్ణత్వాన్నీ ఇచ్చేదే బీమా. దీర్ఘకాలిక పొదుపును, రక్షణను, పన్ను ప్రయోజనాలను సమకూర్చే ఏకైక సాధనం జీవిత బీమా మాత్రమే. తొలిసారిగా ఇలాంటి పాలసీని కొనుగోలు చేసే వారికి ఏది మంచి పాలసీ అనే సందేహం ఉంటుంది. పాలసీ తీసుకొనే ముందు చూడాల్సిన అంశాలను తెలుసుకుందాం. వారో వీరో చెప్పారని వద్దు... మీ స్నేహితులో, బంధువులో చెప్పారని పాలసీని కొనవద్దు. వ్యక్తులకు, కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే విధంగా జీవిత బీమాను రూపొందించారు. మీ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటే మీకు జీవిత బీమా చాలా అవసరం. మీపై ఆధారపడిన వారు ప్రస్తుతానికి లేనప్పటికీ, భవిష్యత్తులో అలాంటి వారు మీకు ఉంటారని భావిస్తే చిన్న పాలసీతో ప్రారంభించాలి. ఎంత మొత్తానికి జీవిత బీమా అనేది మీ వార్షిక ఆదాయం, ఖర్చులు, మీ తదనంతరం కుటుంబానికి అవసరమయ్యే సొమ్ము వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా అవగాహనకు రావచ్చు. తగిన పాలసీ: ఇప్పుడు అనేక రకాల జీవిత బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు అవసరమైనవి ఎంచుకోవాలి. తొలిసారిగా కొనే వారికి తగినవి నాలుగు రకాలున్నాయి. అవి: 1. నిర్ణీత కాలవ్యవధిలో మరణానంతర ప్రయోజనాలు (డెత్ బెనిఫిట్స్) కల్పించే టర్మ్ పాలసీ. 2. పూర్తి జీవితకాల కవరేజీ కల్పించే హోల్ లైఫ్‌టైమ్ పాలసీ. 3. మరణం సంభవించినపుడు లేదా నిర్ణీత తేదీన బెనిఫిట్లను అందించే ఎండోమెంట్ పాలసీ. 4. బీమా చేయించుకున్న వారు నిర్ణీత వయస్సుకు చేరినపుడు (రిటైర్మెంట్ వంటివి) చెల్లింపులు చేసే యాన్యుయిటీ పాలసీ. వీటిలో మీకు ఏది అన్ని విధాలుగా తగినదో తెలుసుకునేందుకు ఏజెంట్ అడ్వయిజర్‌ను సంప్రదించవచ్చు. జీవిత బీమా పాలసీని కొనడమంటే సదరు ఇన్సూరెన్స్ కంపెనీతో మీరు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్లే. కనుక, బీమా ప్రొడక్టును కొనేముందు మీ ఆర్థిక లక్ష్యాలు, దీర్ఘకాలిక అవసరాల కోసం ఏటా చేయాల్సిన పెట్టుబడులను మదింపు చేయండి. రిస్కు తీసుకునే సామర్థ్యం ఎంతవరకు ఉందో గమనించండి. మీకు ఎక్కువ అనుకూలంగా ఉండే పాలసీని ఎంచుకోండి. ఇదే కసరత్తు ఏటా చేస్తుండాలి. ఎందుకంటే, ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు కాలక్రమేణా మారుతుంటాయి కదా! -
మహిళలకు జీవిత బీమా...
సంక్షోభ సమయంలో జీవిత బీమా ఎంతగా ఉపయోగపడుతుందో, ఎలాంటి ఆర్థిక రక్షణ కల్పిస్తుందో పలువురికి తెలుసు. అయితే, తమకు, తమ ఆప్తుల భద్రమైన భవిష్యత్తుకు ఏంచేయాలనే విషయంపై చాలామంది మహిళలకు పెద్దగా అవగాహన లేదు. ఒడిదుడుకుల్లేని భవిత కోసం జీవిత బీమా చేస్తున్న స్త్రీలు తెలుసుకోవాల్సిన ఐదు ప్రశ్నలు, సమాధానాలు ఇవి... జీవిత బీమాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సురక్షిత ఆర్థిక భవిష్యత్తు కోసం చేయాలి. జీవితాంతం అందే ఆదాయం కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఒకవేళ పాలసీదారు మరణించినా కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత సమకూరుతుంది. కవరేజీ ఎంత ఉండాలి? బీమా చేయించే మహిళ ఆదాయం, ఆమె కుటుంబ సభ్యుల భవిష్యత్ అవసరాల ఆధారంగా బీమా కవరేజీ ఎంత ఉండాలో నిర్ణయించుకోవాలి. ఆమె వార్షిక ఆదాయానికి 8 నుంచి 10 రెట్ల వరకు కవరేజీ ఉండాలనేది సాధారణ నియమం. అందుకు ఎంత ప్రీమియం చెల్లిం చాలి, ప్రస్తుతం ఉన్న రుణాలు ఎన్ని, ఆస్తుల విలువ ఎంత, ఇన్వెస్ట్ చేసే నాటికి ఆమె వయసు, ఆమెకు ఎందరు పిల్లలు, వారి వయసెంత అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని కవరేజీ నిర్ణయించుకోవాలి. తమ కంపెనీ యాజమాన్యం కల్పించే బీమా కవరేజీపైనే చాలా మంది మహిళా ఉద్యోగులు ఆధారపడుతుంటారు. ఇది కరెక్టు కాదు. అనేక కంపెనీలు తమ సిబ్బందికి బీమా కవరేజీ కల్పిస్తుంటాయి. ఆ కంపెనీని వదిలేసిన తర్వాత బీమా కవరేజీ కొనసాగదనే విషయాన్ని చాలా మంది మహిళలు పట్టించుకోరు. ఉద్యోగాల్లో మార్పులు అనూహ్యంగా జరుగుతాయి కాబట్టి సొంతంగా జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. ఏ పాలసీ మంచిది? అవసరాలు, ఉద్దేశాలు వ్యక్తికీ, వ్యక్తికీ మారుతుంటాయి కాబట్టి ఆదర్శవంతమైన బీమా పాలసీ అంటూ ఉండదు. దీర్ఘకాలిక ప్లాన్ ఉండడం ప్రతి మహిళకూ అవసరం. జీవితాంతం కవరేజీ ఉండే పాలసీ అయితే తుదివరకూ నిరంతర ఆదాయం ఉంటుంది. ఆర్థిక స్వాతంత్య్రాన్నిచ్చే మనీ బ్యాక్ ఆప్షన్, పరిమిత కాలం ప్రీమి యం చెల్లింపు వంటి ప్రయోజనాలు బీమా కవరేజీలో ఉంటాయి. వృద్ధాప్యంలో రుణం తీసుకునే అవకాశం ఉండడం మరో ప్రయోజనం. కాలానుగుణంగా సమీక్షించాలా? మహిళకు వివాహమైన తర్వాత, లేదా ఆమె పిల్లలు సొంతకాళ్లపై నిలబడినపుడు ఆమె తన పాలసీని మార్చుకోవడం అవసరం. కావాలనుకుంటే లబ్ధిదారును తొలగించవచ్చు లేదా కొత్త లబ్ధిదారును చేర్చవచ్చు. ఖరీదైన ఆస్తిని కొనుగోలు చేసి భారీ రుణం తీసుకున్నట్లయితే అదనపు కవరేజీ ఉండే కొత్త పాలసీని తీసుకోవాల్సి రావచ్చు. అంటే, బీమాలో పెట్టుబడులను కాలానుగుణంగా సమీక్షించుకోవడం అవసరం. గృహిణులకూ అవసరమా? ఇంటికే పరిమితమయ్యే మహిళలకు జీవిత బీమా అవసరం లేదనేది సాధారణ అభిప్రాయం. ఇది తప్పు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కావాలంటే గృహిణులకూ జీవిత బీమా కల్పించాలి. -
ఈ బీమా చూశారా..
జీవిత బీమా అంటే చాలామందికి తెలిసిందొకటే! జీవితాన్ని బీమా చేయటం. దానికి కొన్ని రైడర్స్. అంతే!! ఇదంతా మనకు చాలా కామన్. ఇలానే విదేశాల్లో వివిధ అవయవాలను ప్రత్యేకంగా బీమా చేయించటం చాలా కామన్. కాళ్లు, దంతాలు, మీసాలు... ఆఖరికి ఛాతీపై వెంట్రుకలనూ భారీ మొత్తాలకు బీమా చేయించారు కొందరు. ఎవరికి ఏది ప్లస్సయితే దాన్ని బీమా చేయించారన్న మాట. అలాంటి కొందరి గురించి తెలుసుకుందాం... మారియా కెరే: ఆటపాటలతో కుర్రకారును ఉర్రూతలూగించే అమెరికా నటి, గాయని మారియా కెరే తన కాళ్లను 100 కోట్ల డాలర్లకు బీమా చేయించారు. మెర్వ్ హ్యూస్: 1985-94 మధ్యకాలంలో ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడైన మెర్వ్ హ్యూస్ తన మీసాన్ని 3.70 లక్షల డాలర్ల మేర ఇన్సూర్ చేయించారు. డేవిడ్ బెక్‌హామ్: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తన కాళ్లు, పాదాలను 7 కోట్ల డాలర్లకు బీమా చేయించారు. టామ్ జోన్స్: ఐదు దశాబ్దాలకు పైగా తన గాత్రంతో బ్రిటన్, అమెరికా వాసులను మైమరపిస్తున్న టామ్ జోన్స్ తన ఛాతీపై వెంట్రుకలను 70 లక్షల డాలర్లకు బీమా చేయించారు. డేవిడ్ లీ రోత్: అమెరికాకు చెందిన నటుడు, గీత రచయిత, డాన్సర్. తన వీర్యాన్ని 10 లక్షల డాలర్లకు బీమా చేయించారు. ఈయనగారి స్పెర్మ్‌తో ఎవరూ గర్భం దాల్చకూడదనేది బీమా కంపెనీకి పెట్టిన నిబంధన. అమెరికా ఫెరీరా: ఉత్తమ నటిగా పలు అవార్డులు అందుకున్న ఫెరీరా... తనకు నవ్వే ప్లస్ కాబట్టి దంతాలను కోటి డాలర్లకు ఇన్సూర్ చేయించింది. -
రుణం వచ్చేలా వృద్ధులకు పాలసీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేవలం పెన్షన్ పథకాలే కాకుండా పదవీ విరమణ తర్వాత బీమా రక్షణతో పాటు, ఆర్థిక అవసరాలను తీర్చేలా వృద్ధులకు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెస్తోంది బజాజ్ అలయంజ్. ఇప్పటి వరకు వయసుపై బడిన వారికి మార్కెట్లో సరైన బీమా పథకం లేదని, ఆ లోటును భర్తీ చేసేలా త్వరలోనే కొత్త పథకం ప్రవేశపెడుతున్నామంటున్న బజాజ్ అలయంజ్ లైఫ్ ప్రొడక్ట్ హెడ్ రితురాజ్ భట్టాచార్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. కొత్త నిబంధనలు వచ్చాక అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందా? ఈ మార్పులతో ప్రీమియం రేట్లు ఏమైనా పెరిగాయా? మార్పులు జరిగినప్పుడు కొంత ఒడిదుడుకులు ఉండటం సహజం. కొత్త నిబంధనలు వచ్చి నెల రోజులు మాత్రమే అయింది. కాబట్టి అప్పుడే అమ్మకాల గురించి వ్యాఖ్యానించటం కష్టం. మార్పులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం మేం కొత్త పథకాలపై ఏజెంట్లకు అవగాహన కల్పించే పనిలో ఉన్నాం. ఇదంతా పూర్తయి మామూలు పరిస్థితి రావడానికి మరికొన్నాళ్లు పడుతుంది. మా పథకాల పోర్ట్‌ఫోలియోను సమూలంగా మార్చి కొత్త తరహా పథకాలను ప్రవేశపెట్టడానికి ఈ నిబంధనల మార్పును చక్కగా వినియోగించుకుంటున్నాం. కొత్త నిబంధనలతో బీమా రక్షణ పెరిగింది. ఆ మేరకు ప్రీమియం ధరల్లో కొంత మార్పు ఉండచ్చు కాని ప్రీమియం ధరల్లో భారీ మార్పులేమీ రాలేదు. బజాజ్ అలయంజ్ ఎటువంటి ఉత్పత్తులపై దృష్టిపెడుతోంది? ప్రస్తుతం ఎన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం 8 వ్యక్తిగత బీమా పథకాలు, మరో 8 గ్రూపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలోకి చేరి తొలిసారిగా బీమా తీసుకునే వారికోసం, అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా బీమా రక్షణతో పాటు వారి అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండే పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ముఖ్యంగా జీవించే కాలం పెరుగుతుండటంతో 60 ఏళ్ల పైబడిన వారికి ఉపయోగపడేలా, అవసరమైతే బీమా పథకంపై రుణం తీసుకునే అవకాశం ఉండే హోల్‌లైఫ్ పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ఇంతకాలం బీమారంగం వీరి అవసరాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ విభాగంపై మేం ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. వచ్చే నెలలోనే ఇటువంటి పాలసీని ప్రవేశపెట్టనున్నాం. మొత్తం మీద నెలకు 3 పథకాలు చొప్పున ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. టర్మ్, యులిప్, ఎండోమెంట్ అన్ని పథకాలు ఉండే విధంగా బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియోపై దృష్టిసారిస్తున్నాం. కేవలం ఆన్లైన్లో తీసుకునేలా ఏమైనా కొత్త బీమా పథకాలను ప్రవేశపెడుతున్నారా? ప్రత్యేకంగా ఎటువంటి ఆన్లైన్ పథకాలనూ ప్రవేశపెట్టడం లేదు. కాని అన్ని పథకాలనూ ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా తీసుకునే పాలసీలపై ఏజెంట్లకు కమీషన్లు చెల్లించాల్సి ఉండదు కాబట్టి ఆ మేరకు ప్రీమియం భారం తగ్గుతుంది. కాని ప్రస్తుతం సరళిని చూస్తే పాలసీ వివరాలను తెలుసుకోవడానికి ఆన్లైన్ ఉపయోగించి, ఆఫ్‌లైన్‌లో పాలసీలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. పాలసీ తీసుకునే సమయంలో ఏజెంట్ సహాయం కావాలనుకోవడం దీనికి ప్రధాన కారణంగా గమనించాం. అలాగే రెన్యువల్ ప్రీమియంలు ఆన్లైన్ ద్వారా చెల్లించే వారి సంఖ్యలో 30 శాతానికిపైగా వృద్ధి నమోదవుతోంది. యులిప్ ఫండ్స్ మార్చుకోవడం, చిరునామా మార్పు వంటి సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నాం. బ్యాంకులు కేవలం ఒక బీమా కంపెనీ పథకాలనే కాకుండా అన్ని బీమా కంపెనీలు పథకాలూ అమ్మేలా ఐఆర్డీఏ విడుదల చేసిన మార్గదర్శకాల సంగతి? మొత్తం వ్యాపారంలో 55 శాతం వరకు బ్యాంకుల నుంచే వస్తోంది. దేశవ్యాప్తంగా 100కిపైగా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. బ్యాంకులను బ్రోకర్లుగా మారిస్తే మా వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. వ్యాపారం సన్నగిల్లడంతో కొన్ని బీమా కంపెనీలు శాఖల సం ఖ్యను తగ్గించుకుంటున్నాయి? బజాజ్ అలయంజ్ పరిస్థితేంటి? గతంలో ఒకే పట్టణంలో నాలుగైదు శాఖలను ఏర్పాటు చేసిన బీమా కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా వాటిని విలీనం చేస్తున్నాయి. శాఖలను పునర్ వ్యవస్థీకరించడం తప్ప పూర్తిగా మూసేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 773 శాఖలు ఉన్నాయి. తగినన్ని శాఖలు ఉండటంతో కొత్తగా ఎటువంటి విస్తరణ కార్యక్రమాల యోచన లేదు. -
టాటా ఏఐఏ నుంచి కొత్త బీమా ప్లాన్
ఇటు టర్మ్, అటు ఎండోమెంట్ ప్లాన్ల కలయికతో టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా సెక్యూర్ 7 పేరిట బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒకవైపు బీమా రక్షణ కల్పిస్తూనే మరోవైపు గ్యారంటీ రాబడులు కూడా అందించేలా దీన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. పాలసీ వ్యవధి 14 ఏళ్లు కాగా ప్రీమియం చెల్లింపు వ్యవధి ఏడేళ్లు ఉంటుందని పేర్కొంది. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత ఏడేళ్ల పాటు హామీపూర్వక వార్షిక రాబడులు ఇది అందిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 25 శాతం మొత్తాన్ని పాలసీదారుకు కంపెనీ చెల్లిస్తుంది. -
ఇకపై అధిక రాబడికి చాన్స్
‘సాక్షి’తో ఎగాన్ రెలిగేర్ చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ అమిత్ కుమార్ రాయ్ తాజా నిబంధనలతో పాలసీదారులకు లాభం ఏటా ఏజెంట్ల సంఖ్యను 30% పెంచుతాం కమీషన్ తగ్గినా అమ్మకాలు పెరుగుతాయ్ పెరుగుతున్న ఆన్లైన్ పాలసీల విక్రయాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన జీవిత బీమా మార్గదర్శకాల వలన కంపెనీల నిర్వహణా వ్యయం తగ్గి, పాలసీదారుల రాబడి పెరుగుతుందని ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఎగాన్ రెలిగేర్ తెలిపింది. కొత్త పథకాలు సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటమే కాకుండా గతంతో పోలిస్తే అధిక ప్రయోజనాలను కల్పిస్తుండటంతో వీటిపై పాలసీదారులకు ఆసక్తి పెరుగుతుందని, దీంతో కమీషన్ తగ్గినా అమ్మకాలు పెరగడం ద్వారా ఏజెంట్లు ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటారని ఎగాన్ రెలిగేర్ చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ అమిత్ కుమార్ రాయ్ అన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కొత్త ఏజెంట్ల నియామకంలో బీమా కంపెనీలు ఒత్తిడికి గురవుతన్న విషయం వాస్తవమే అయినప్పటికీ మేము ముఖ్యంగా గృహిణులు, పదవీ విరమణ చేసిన వారిపై ఎక్కువ దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 6,000 మంది ఏజెంట్లు ఉన్నప్పటికీ అందులో 1,200 మంది చురుగ్గా పనిచేస్తున్నారని, ఏటా ఏజెంట్ల సంఖ్యను 30 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. ప్రజల్లో బీమాపై అవగాహన పెరుగుతండటంతో ఆన్లైన్ ద్వారా బీమా పథకాల విక్రయం ఎక్కువతోందని, ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో 25 శాతం అన్లైన్ ద్వారా జరుగుతుంటే, 36 శాతం ఏజెంట్ల ద్వారా వస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న కాలంలో ఆన్లైన్ పాలసీల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కొత్త నిబంధనల వలన పాలసీల సంఖ్య తగ్గదని, బీమా కంపెనీలు వాటి వ్యాపార వ్యూహాలకు అనుగుణంగా కొత్త పథకాలను ప్రవేశపెడతాయన్నారు. ప్రస్తుతం ఎగాన్ రెలిగేర్ మూడు రకాల పథకాలను అందిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఆరోగ్య బీమాలో పోటీ అధికం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా కంటే జీవిత బీమా మార్కెట్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టనున్నట్లు ప్రైవేటురంగ జీవిత బీమా కంపెనీ ఎగాన్ రెలిగేర్ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలను 24 సాధారణ బీమా కంపెనీలకు తోడు, నాలుగు ప్రత్యేక వైద్య బీమా కంపెనీలు, జీవిత బీమా కంపెనీలు పోటీ పడి అందిస్తుండటంతో ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టిసారించడం లేదని ఎగాన్ రెలిగేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) యతీశ్ శ్రీవాత్సవ తెలిపారు. తమ ఖాతాదారుల కోసం వైద్య ఖర్చులతో సంబంధం లేకుండా స్థిరమైన మొత్తాన్ని అందించే వైద్య బీమా పథకాన్ని అందిస్తున్నామని, కొత్త పథకాలు ప్రవేశపెట్టే ఆలోచన లేదన్నారు. జీవిత బీమాలో ప్రవేశపెట్టనున్న నాలుగు కొత్త పథకాలకు ఐఆర్డీఏ అనుమతి లభించిందని వాటిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు ఎనిమిది పాత పథకాలను కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పు చేసి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో గ్యారంటీ రాబడి కలిగిన తొలి ఆన్లైన్ పథకం ‘ఐగ్యారంటీ’ని శ్రీవాత్సవ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ బీమా పాలసీల విక్రయంలో ఏటా 40 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తున్నామని, వచ్చే రెండేళ్లు ఇదే స్థాయిలో వృద్ధిని కొనసాగించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. మొత్తం ప్రీమియంలో 30 శాతం ఆన్లైన్ పథకాల నుంచే వస్తోందన్నారు. ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో 15 నుంచి 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎగాన్ రెలిగేర్ రూ.400 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసింది. ఐ-గ్యారంటీ గురించి ఆరు సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే మరో ఆరు సంవత్సరాలు కట్టిన ప్రీమియానికి 135 శాతం గ్యారంటీ రాబడిని అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. సగటు రాబడి చూస్తే 5.2 శాతం వస్తుందని, దీనికి పన్ను ప్రయోజనాలు అదనమని శ్రీవాత్సవ పేర్కొన్నారు. రిస్క్ తక్కువగా ఉండి స్థిరమైన రాబడి కోరుకునే వారికోసం దీన్ని రూపొందించినట్లు తెలిపారు. 12 ఏళ్ళ వారి నుంచి గరిష్టంగా 50 ఏళ్ళ వారి వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. కనీస ప్రీమియం రూ. 48,000, గరిష్ట ప్రీమియం రూ.2.50 లక్షలుగా నిర్ణయించారు. వార్షిక ప్రీమియానికి పదిరెట్లు బీమా రక్షణ లభిస్తుంది. -
న్యూ ఇండియా త్రీ ఇన్ వన్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్పాదాయ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఒకే పథకంలో మూడు రకాల బీమా రక్షణను కల్పించే విధంగా సరికొత్త బీమా పథకాన్ని ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీ న్యూ ఇండియా ప్రవేశపెట్టింది. జీవిత బీమా రక్షణతో పాటు ఆరోగ్య, ప్రమాద బీమా రక్షణను కల్పించే విధంగా దీన్ని రూపొందిచామని, ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని సోమవారం ప్రారంభిస్తున్నట్లు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ జి.శ్రీనివాసన్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే లక్ష రూపాయల బీమాతో పాటు, హాస్పిటలైజేషన్ అయితే రూ.20-30 వేలు వైద్య చికిత్సా వ్యయం కింద పొందవచ్చు. దీంతో పాటు ప్రమాద బీమా రక్షణ కూడా ఉంటుంది. ఈ మూడింటికి కలిపి వార్షిక ప్రీమియం రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్ ప్రోడక్టును ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ స్వాగతించారు. -
జీవిత బీమా ఎంత కు తీసుకోవాలి?
నా పోర్ట్‌ఫోలియోలో ఐదు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఉన్నాయి. వీటిల్లో ఆరేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయింది. వీటి నుంచి పెట్టుబడులను రెగ్యులర్ డైవర్సిఫైడ్ ఫండ్స్‌కు మళ్లించమంటారా? రెగ్యులర్ ఈక్విటీ ఫండ్స్‌లాగానే ఇవి కూడా మంచి పనితీరును కనబరుస్తాయా? -ఈశ్వర్, తిరుపతి ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌కు లాకిన్ పీరియడ్ పూర్తయితే, అవి సాధారణ ఈక్విటీ ఫండ్స్‌లాగానే పనిచేస్తాయి. ఇతర ఓపెన్-ఎండెడ్ ఫండ్స్‌లాగానే యాక్టివ్‌గా ట్రేడవుతాయి. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ విషయానికొస్తే, ఒకేసారి డబ్బులు వస్తాయి. దీని నిర్వహణ నిమిత్తం ఈ ఫండ్ మేనేజర్లకు ఎలాంటి ఇన్సెంటివ్‌లు లభించవు. అందుకనే క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్‌పై ఫండ్ మేనేజర్లకు అంతగా ఆసక్తి ఉండదు. కానీ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్‌కు మినహాయింపు ఉంటుంది. పన్ను ఆదా నిమిత్తం ఎప్పటికప్పుడు కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతారు కాబట్టి ఇవి ఆకర్షణీయంగానే ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్‌ల్లో ఏ ఫండ్ అయినా సరైన పనితీరు కనబరచకపోతే మెథాడికల్ వేలో ఈ ఫండ్స్ నుంచి వైదొలగవచ్చు. ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్ ఎలా ఉంటుంది? ఈ ఫండ్ పనితీరు నానాటికీ దిగజారుతోంది. అయినప్పటికీ పెట్టుబడులను కొనసాగించమంటారా? -పావని, ఖమ్మం డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఫ్లెక్సి డెట్ బాండ్స్‌గా వ్యవహరిస్తారు. భవిష్యత్ వడ్డీరేట్ల అవుట్‌లుక్ ఆధారంగా మెచ్యూర్ అయ్యే పేపర్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. వడ్డీరేట్లు అనుకోకుండా పెరగడంతో ఈ ఏడాది జూన్‌లో ఈ ఫండ్స్‌కు నష్టాలొచ్చాయి. వడ్డీరేట్లు తగ్గుతాయని అందరూ భావించిన తరుణంలో ఆర్బీఐ ఆశ్చర్యకరంగా వడ్డీరేట్లను పెంచేసింది. మీరు ఇన్వెస్ట్ చేసే డైనమిక్ బాండ్ ఫండ్స్ కాలపరిమితి ఏడాదికి మించినట్లయితే, వీటిల్లోనే కొనసాగడం ఉత్తమం. జూన్‌లో వచ్చిన నష్టాలను ఇప్పటికే చాలా బాండ్ ఫండ్స్ రికవరీ చేసుకున్నాయి. చాలా బాండ్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియో ప్రొఫైల్స్‌ను మార్చేశాయి కూడా. ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌కు 2011 నుంచి 4/5 స్టార్ రేటింగ్ ఉంటోంది. ఈ ఏడాది ఆగస్టు తర్వాతనే ఈ ఫండ్ రేటింగ్ 3 స్టార్‌కు తగ్గింది. ఈ ఫండ్ రేటింగ్, పనితీరు పడిపోవడం కొనసాగుతున్నట్లయితే, ఇదే కేటగిరిలోని మరో ఫండ్‌కు మారిపోవడం ఉత్తమం. ఒకటి లేదా రెండేళ్ల కాలానికి అధిక రిటర్న్‌లు కావాలనుకునే ఇన్వెస్టర్లు ఇలాంటి డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అయితే గత 3-4 నెలల్లో ఈ ఫండ్స్ పనితీరు బాగాలేని విషయం వాస్తవమే. ఎక్కువ కాలం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలనుకుంటే, మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడే ఈ ఫండ్స్ నుంచి వైదొలగండి. నా వయస్సు 45 సంవత్సరాలు. నాకు తొమ్మిదేళ్ల కొడుకున్నాడు. నా నెలసరి సంపాదన రూ.20,000. నేను ఇంతవరకూ ఎలాంటి బీమా పాలసీ తీసుకోలేదు. ఏదైనా ఉత్తమమైన టెర్మ్ పాలసీనొకదానిని సూచించండి? - రవీందర్, కడప బీమా అవసరాన్ని గుర్తించినందుకు అభినందనలు. మీరు లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని బీమానే అందిస్తుంది.మీ ప్రస్తుత ఖర్చులు, మీ కుటుంబానికున్న ఆస్తులు, అప్పులు, ఆర్థిక లక్ష్యాలు తదితర అంశాలపై అధారపడి ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. అయితే ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలనే విషయంలో ఎలాంటి నిర్దిష్ట నియమం లేదు. ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించాలంటే,,, ముందుగా మీరు చెల్లించాల్సిన అప్పులు, రోజువారీ వ్యయాలు, పిల్లాడి చదువు ఖర్చు, తదితర అంశాలను లెక్కించండి. ఆ తర్వాత మీ ఆస్తులు, మీకు లభించే ఆదాయాన్ని గణించాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు అవసరమయ్యే మొత్తానికి మీ అప్పులను కూడి దాని నుంచి మీ ఆస్తులను తీసేయండి. అలా వచ్చేదే మీకు అవసరయ్యే బీమా మొత్తం. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవైవా ఐ-లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఈషీల్డ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్2ప్రొటెక్ట్,... ఇవి కొన్ని ఉత్తమమైన ఆన్లైన్ జీవిత బీమా పాలసీలు. ఈ ఆన్లైన్ విధానం సౌకర్యంగా లేదని మీరు భావిస్తే, అవైవా లైఫ్షీల్డ్ ప్లాటినమ్ ప్రొటెక్షన్, ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ షీల్డ్-లెవల్ టెర్మ్..ఈ ఆఫ్‌లైన్ పాలసీలను పరిశీలించవచ్చు. ఏజెంట్లు ఉండరు కాబట్టి ఆఫ్‌లైన్ పాలసీల కంటే ఆన్లైన్ పాలసీలు చౌకగా ఉంటాయి. ఎంత మొత్తానికి బీమా పాలసీ తీసుకోవాలో నిర్ణయించుకున్న తర్వాత ఆయా పాలసీల ప్రీమియంలు ఎంత ఉన్నాయో పరిశీలించి మీ బడ్జెట్‌కు సరిపోయే పాలసీ తీసుకోండి. ధీరేంద్ర కుమార్ సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్ -
ప్రీమియం తగ్గించుకోవడానికెన్నో మార్గాలు
ఇప్పుడు జీవిత బీమా కంపెనీలు, సాధారణ బీమా కంపెనీలు కూడా ఆరోగ్య బీమా రంగంలోకి వచ్చేశాయి. ఈ రెండింటితో పాటు ఆరోగ్య బీమా కోసమే కొన్ని ప్రత్యేక కంపెనీలు వచ్చి చేరాయి కూడా. దీంతో ప్రీమియం రేట్లు, ఏఏ వ్యాధులకు బీమా కవరేజీ ఉంటుంది... క్లెయిమ్ ఎలా ఉంటుంది... ఇవన్నీ కంపెనీని బట్టి మారిపోతున్నాయి. పాలసీదారులను ఆకర్షించడానికి కంపెనీలు కొత్త మార్గాలు వెదుకుతున్నాయి. ఇందులో భాగంగా తక్కువ ప్రీమియంతో బీమా పాలసీలను ఇవ్వడానికి కో-పేమెంట్, డిడక్టబుల్ వంటి కొత్త పద్ధతుల్ని అందుబాటులోకి తెచ్చాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించి ఎంచుకోవటంతో పాటు ఇంకాస్త తెలివిగా వ్యవహరిస్తే ప్రీమియం భారాన్ని మరింత తగ్గించుకోవచ్చు. కో-పేమెంట్ అంటే..? పేరుకు తగ్గట్లే ఏదైనా సంభవించి ఆసుపత్రి ఖర్చులు భరించాల్సి వచ్చినపుడు బీమా కంపెనీతో పాటు పాలసీదారు కూడా కొంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అందుకే దీన్ని కో-పేమెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే మనమెంత చెల్లించాలి? బీమా కంపెనీ ఎంత చెల్లించాలి? అనేది మనం ముందే ఎంచుకోవచ్చు. ఆ ఎంపిక బట్టే పాలసీ ప్రీమియం కూడా ఉంటుంది. సాధారణంగా బీమా కంపెనీలు కో-పేమెంట్ కింద 5 నుంచి 25 శాతం వరకూ పాలసీదారు చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆ మేరకు ప్రీమియం భారం తగ్గుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి చికిత్స చేయించుకుంటే బిల్లు లక్ష రూపాయలు అయిందనుకుందాం. ఆ వ్యక్తి ఆరోగ్య బీమా పాలసీలో 20 శాతం కో-పేమెంట్ ఆప్షన్ గనక తీసుకుంటే... బిల్లులో 20 శాతం అంటే రూ.20,000 పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.80,000 బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఈ విధానం చిన్న వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారికి లేదా వృద్ధాప్యంలో పాలసీ తీసుకునే వారికి అనువైనదని చెప్పొచ్చు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చిన్న వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న వారి విషయంలో క్లెయిమ్‌లు సంభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకని అధిక ప్రీమియం చెల్లించకుండా... ఏదైనా చికిత్స వస్తే చిన్న మొత్తంతో బయటపడే అవకాశం కో-పేమెంట్‌తో సాధ్యమవుతుంది. అలాగే పెద్ద వయసులో ఉన్న వారు పాలసీ తీసుకుంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో కూడా కో-పేమెంట్ ఆప్షన్ ద్వారా ప్రీమియం తగ్గించుకోవచ్చు. విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన కో-పేమెంట్ విధానంపై మన కంపెనీలు కూడా ఇప్పుడు అధికంగా దృష్టి పెడుతున్నాయి. ఈ విధానంలో పాలసీదారుడు కూడా క్లెయింలో భాగస్వామి కాబట్టి అవసరం లేని వైద్య పరీక్షల వంటివి లేకుండా బిల్లును నియంత్రించే అవకాశం ఉంటుంది. అందుకని కంపెనీలు ఈ కో-పేమెంట్ విధానాన్ని ఎక్కువగా ఇష్ట పడుతున్నాయి. డిడక్టబుల్ అంటే... దీని పనితీరు కూడా దాదాపు కో-పేమెంట్లానే ఉన్నా చాలా తేడా ఉంటుంది. శాతాలతో సంబంధం లేకుండా చికిత్సలో నిర్దిష్ట మొత్తాన్ని భరిస్తామని ముందుగా బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడాన్నే డిడక్టబుల్స్ అంటారు. ఇక్కడ క్లెయిమ్ మొత్తంతో సంబంధం లేకుండా పాలసీదారుడు ముందుగా అంగీకరించిన మొత్తం చెల్లిస్తే మిగిలిన మొత్తం బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఉదాహరణకు మీరు ఏదైనా బీమా కంపెనీ నుంచి హెల్త్ ప్లాన్ తీసుకొని అందులో డిడక్టబుల్స్ ఆప్షన్ కింద రూ.50,000 ఎంచుకున్నారనుకుందాం. ఇటువంటి సమయంలో ఏదైనా క్లెయిమ్ సంభవిస్తే ముందుగా మీరు రూ.50,000 చెల్లిస్తే ఆ పైన జరిగిన వ్యయాన్ని కంపెనీ భరిస్తుంది. ఒకవేళ మొత్తం చికిత్సా వ్యయం రూ.80,000 అయితే కంపెనీ కేవలం రూ.30,000 మీరు రూ.50 వేలు చెల్లిస్తారు. అలా కాకుండా రెండు లక్షలు బిల్లు అయితే మిగిలిన లక్షా యాభైవేలు కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ చికిత్స వ్యయం రూ.50వేల లోపు అయితే పాలసీదారే చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పటికే ఏమైనా వ్యాధులున్న వారికి ఈ విధానం అనువుగా ఉంటుందని చెప్పొచ్చు. ఉదాహరణకు డయాబెటిస్, రక్తపోటు వంటివి ఉంటే దానికి అనుగుణంగా డిడక్టబుల్ అమౌంట్‌ను నిర్ణయించుకోవడం ద్వారా ప్రీమియం భారాన్ని తగ్గించుకోవచ్చు. తక్కువ ప్రీమియానికి మరిన్ని జాగ్రత్తలు... 50 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు వ్యక్తిగత పాలసీల కంటే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్నా, లేక గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీల్లో చేరినా ప్రీమియం బాగా తగ్గుతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల్లో తల్లిదండ్రులు, అత్తమామలకు కూడా చోటు కల్పిస్తున్నాయి. ఇలా వీళ్లందరినీ కలిపి తీసుకోవడం ద్వారా ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. చిన్న వయసు నుంచే పాలసీని కొనసాగించడం ద్వారా తక్కువ ప్రీమియంతోనే పెద్ద వయస్సు వచ్చాక కూడా పాలసీని కొనసాగించుకునే వెసులుబాటు లభిస్తుంది. క్లెయిములు లేని సంవత్సరాల్లో బీమా కంపెనీలు నో-క్లెయిమ్ బెనిఫిట్ కింద ప్రీమియం తగ్గించడం లేదా బీమా రక్షణ మొత్తాన్ని పెంచడం వంటివి చేస్తుంటాయి. దీంతో దీర్ఘకాలంలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా పొందొచ్చు. ఆరోగ్య బీమా పాలసీలను ఏజెంట్ ద్వారా కాక నేరుగా బీమా కంపెనీ లేదా ఆన్లైన్ ద్వారా కొంటే ప్రీమియంలో కొంత మినహాయింపు లభిస్తుంది. మీ ఆరోగ్య స్థితి, ఆహారపు అలవాట్లు కూడా ప్రీమియం ధరలను నిర్దేశిస్తాయి. ధూమపానం, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉంటే ఆ మేరకు ప్రీమియం తగ్గుతుంది. ఈ మధ్య బీమా కంపెనీలు యోగా, వ్యాయామం చేసే వారికి ప్రీమియం రేట్లపై తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
4 లక్షల కోట్లకు బీమా వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ బీమా వ్యాపార పరిమాణం రూ. నాలుగు లక్షల కోట్లకు చేరుకుంటుందని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ అంచనా వేస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ బీమా వ్యాపారం (జీవిత, సాధారణ) పరిమాణం రూ.3.75 లక్షల కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం బీమా వ్యాపారంలో వృద్ధిని ఆశిస్తున్నామని, దీంతో ఈ సంఖ్య రూ. నాలుగు లక్షల కోట్లకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం) స్నాతకోత్సవానికి విజయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ పాత జీవిత బీమా పథకాలను ఉపసంహరించుకోవడానికి డిసెంబర్ వరకు గడువిచ్చినట్లు తెలిపారు. కొత్త మార్గదర్శకాలతో రూపొందించిన పథకాలను వేగంగా ఆమోదిస్తున్నామని, ఇప్పటివరకు 450 పథకాలు అనుమతుల కోసం రాగా ఇప్పటికే 300 పథకాలకు అనుమతులను జారీ చేసినట్లు తెలిపారు. బీమా పథకాల్లో డీ-మ్యాట్‌ను తప్పనిసరి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం చేసిన సూచనపై ఆయన స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని తప్పనిసరి చేయలేమని, దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు. పాలసీల విక్రయంలో బ్యాంకులను ఏజెంట్లుగా ఒక కంపెనీకి చెందిన పథకాలనే విక్రయించే విధంగా కాకుండా బ్రోకర్ వలే అన్ని కంపెనీల పథకాలనూ విక్రయించడం వంటి సంస్కరణలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 15 నుంచి 20 మంది ఆఫీసర్లను నియమించుకోనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
1 నుంచి మరింత ప్రయోజనకరమైన పాలసీలు
జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలంటే..ఇప్పుడే తీసేసుకోండి.. అక్టోబర్ దాకా ఆగకండంటూ ఈమధ్య కొన్నాళ్లుగా ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్ హోరెత్తుతున్నాయి. అక్టోబర్ తర్వాత నుంచీ ప్రవేశపెట్టే కొత్త పాలసీల్లో ప్రయోజనాలు తక్కువగా ఉంటాయన్నది వీటి సారాంశం. ఇలాంటివి మీకు వస్తే.. తొందరపడిపోకుండా.. మరో రెండు రోజులు ఆగడమే మంచిది. ఎందుకంటే.. అక్టోబర్ తర్వాత నుంచి బీమా పాలసీలు మరింత ప్రయోజనకరంగా, ఆకర్షణీయంగా మారనున్నాయి. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ ఆదేశాల ప్రకారం బీమా సంస్థలు .. లైఫ్, హెల్త్ పాలసీల్లో మార్పులు, చేర్పులు చేసి కొత్త పాలసీలను సమర్పించడానికి గడువు అక్టోబర్ 1న తీరిపోతోంది. ఆ తర్వాత నుంచి వచ్చే పాలసీలు.. పాలసీదారులకు మరింత ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉండనున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాకా.. బీమా సంస్థలు పాలసీలపై ఏజెంటుకు ఇచ్చే క మీషన్ తగ్గిపోతుంది. దీనివల్ల సదరు పాలసీపై వచ్చే రాబడులు కూడా పెరిగే అవకాశముంది. తద్వారా అంతిమంగా పాలసీదారుకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఇక, కొత్త పాలసీల్లో చెల్లించే ప్రీమియం కన్నా సమ్ అష్యూర్డ్ పది రెట్లు ఎక్కువగా ఉండాలి. దీనివల్ల పన్నుపరమైన మినహాయింపులు మరికాస్త ఎక్కువగా పొందడానికి వీలవుతుంది. ప్రస్తుతం చాలా మటుకు పాలసీల్లో సమ్ అష్యూర్డ్.. ప్రీమియం కన్నా అయిదు నుంచి 8 రెట్లు దాకా మాత్రమే ఉంటోంది. వీటన్నింటి రూపు రేఖలు మారిపోతాయి. అధిక సరెండర్ వేల్యూ.. పాలసీ గడువులోగా పాలసీని ఉపసంహరించుకునే పక్షంలో బీమా సంస్థలు తిరిగి చెల్లించే మొత్తానికి (సరెండ ర్ వేల్యూ) సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సాధారణంగా మూడేళ్లయినా ప్రీమియంలు కట్టకుండా పాలసీని సరెండర్ చేస్తే ప్రస్తు తం వెనక్కి కొంత డబ్బు కూడా రావడం లేదు. కానీ కొత్త నిబంధనల ప్రకారం పాలసీని గడువులోగా సరెండరు చేస్తే వచ్చే ప్రయోజనాలు కూడా మరింత మెరుగ్గా ఉంటాయి. గతంలో లేని విధంగా రెండో ఏడాదిలో కూడా పాలసీని సరెండర్ చేసే అవకాశం లభించనుంది. అక్టోబర్ తర్వాత నుంచి మాత్రం పాలసీదారు ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు వ్యవధిని బట్టి సరెండర్ విలువ కూడా మారుతుంది. ఉదాహరణకు ప్రీమియం చెల్లింపు వ్యవధి పదేళ్ల కన్నా తక్కువైన పక్షంలో రెండేళ్లకే సరెండరు విలువ పొందవచ్చు. అదే పదేళ్లపైబడిన గడువున్న పాలసీలకైతే.. మూడేళ్ల తర్వాత సరెండరు చేసే వీలుంటుంది. ఇలాంటి సందర్భంలో చెల్లించిన ప్రీమియం మొత్తంలో సుమారు 30 శాతం కనీస సరెండరు విలువ లభిస్తుంది. అదే నాలుగో ఏడాది నుంచి ఏడో సంవత్సరం దాకా కనీస సరెండరు విలువ చెల్లించిన మొత్తం ప్రీమియాల్లో 50 శాతం దాకా లభిస్తుంది. మీరేం చేయొచ్చు.. ఒకవైపు బీమా ప్రయోజనంతో పాటు మరోవైపు పెట్టుబడి ప్రయోజనాలు కూడా పాలసీలోనే పొందాలనుకునే వారు వచ్చే నెల దాకా వేచి చూస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అదే సురక్షితమైన రాబడులు పొందాలనుకునే వారు ఎప్పుడైనా సరే.. టర్మ్ ప్లాన్ లాంటిది తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చని చెబుతున్నారు. ఏదేమైతేనేం.. నిబంధనలు సరళతరం అయ్యాయని తీసుకోవడం కాకుండా.. మన అవ సరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోవడం మంచిది. -
బీమా మార్కెట్ సెంటిమెంట్‌కు దెబ్బ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ- పాలసీల వల్ల బీమా కంపెనీలకు పాలసీల నిర్వహణ వ్యయం సగానికి సగం తగ్గుతుందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి మొత్తం పాలసీల్లో కనీసం 20 శాతం ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఇండియా ఫస్ట్ లైఫ్ ఎండీ, సీఈవో డాక్టర్ పి.నందగోపాల్ తెలిపారు. ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, లీగల్ అండ్ జనరల్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇండియా ఫస్ట్ లైఫ్ ఎండీ నందగోపాల్ హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు....ఈ-పాలసీలపై... ఎలక్ట్రానిక్ రూపంలో బీమా పాలసీలను అందించడం వల్ల ఇటు బీమా కంపెనీలకూ, అటు పాలసీదారులకూ ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఒక పాలసీ డాక్యుమెంట్‌ను కాగితం రూపంలో భద్రపర్చడానికి ఏటా రూ.150-200 వరకు ఖర్చవుతోంది. అదే ఎలక్ట్రానిక్ రూపంలో అయితే ఈ వ్యయం ప్రారంభంలో రూ.75-100కి తగ్గి, ఆ తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. పాత పథకాలను కూడా ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవచ్చు. బీమా పాలసీల కోసం ఎలక్ట్రానిక్ అకౌంట్ ప్రారంభిస్తే ఇక ప్రతి పాలసీకీ కేవైసీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పాలసీ డాక్యుమెంట్లు అన్నీ ఆన్లైన్లో పూర్తి భద్రంగా ఉంటాయి. ప్రస్తుతం ఇండియా ఫస్ట్‌లో 14 లక్షల మంది పాలసీదారులు ఉన్నారు. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 15 నుంచి 20% ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుత మార్కెట్ గురించి.. వ్యక్తిగత జీవిత బీమాతో పోలిస్తే కార్పొరేట్ బీమా రంగం ఆశాజనకంగా ఉంది. వ్యక్తిగత బీమాలో వ్యాపార అవకాశాలున్నా మార్కెట్ సెంటిమెంట్ బాగా దెబ్బతింది. వృద్ధిరేటు నెమ్మదించడం, ద్రవ్యోల్బణం వంటి ప్రభావాలు జీవిత బీమా వ్యాపారంపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా పరిశ్రమ సగటు కంటే అధిక వృద్ధిరేటును నమోదు చేయగలం. కొత్త నిబంధనలకు రెడీనా... అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న కొత్త జీవిత బీమా మార్గదర్శకాలను అమలు చేయడానికి మేం పూర్తి సిద్ధంగా ఉన్నాం. కాని ఈ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన అన్ని కంపెనీలకు చెందిన 300 పథకాలు అనుమతి కోసం నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పది రోజుల్లో ఇన్ని పథకాలకు అనుమతి మంజూరు చేయడమనేది ఐఆర్డీఏకి సాధ్యమయ్యే పనికాదని అనుకుంటున్నా. మా కంపెనీ విషయానికి వస్తే 15 పథకాలకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. వచ్చే 15 రోజుల్లో వీటికి అనుమతులు వస్తాయని భావిస్తున్నా. మొత్తం మీద చూస్తే అక్టోబర్ నుంచి అమలు చేయాలన్న నిబంధనలను మరికొంత కాలం వాయిదా వేయడం ద్వారా వీటిని అమలు చేయడానికి కంపెనీలు సిద్ధం కావడానికి తగినంత సమయం దొరుకుతుంది. -
డీఎల్ఎఫ్ ఆజీవన్ సమృద్ధి
ప్రైవేటురంగ జీవిత బీమా కంపెనీ డీఎల్ఎఫ్ ప్రమెరికా లైఫ్ హోల్‌లైఫ్ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఆజీవన్ సమృద్ధి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పాలసీలో 99 ఏళ్ల వరకు జీవిత బీమా రక్షణ ఉండటం అనేది ప్రధానమైన ఆకర్షణ. అలాగే ప్రీమియం పరిమిత కాలానికి చెల్లిస్తే సరిపోతుంది. ప్రీమియం కనీసం 15 నుంచి గరిష్టంగా 20 ఏళ్లపాటు చెల్లిస్తే చాలు 99 ఏళ్ల వరకు బీమా రక్షణ ఉంటుంది. పాలసీదారునికి 65 ఏళ్లు పూర్తయితే పాలసీ మొత్తం, గ్యారంటీ ఎడిషన్, బోనస్ చెల్లిస్తారు. ఆ తర్వాత కూడా బీమా రక్షణ కొనసాగుతుంది. ఆ తర్వాత క్లెయిమ్ జరిగితే పాలసీ మొత్తం, ఇతర బోనస్‌లు ఏమైనా ఉంటే అవి కలిపి నామినీకి చెల్లిస్తారు. ఈ పాలసీని 8 నుంచి 50 ఏళ్ల లోపు వారు తీసుకోవచ్చు.