Maoists attack
-
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ నెత్తుటిధార
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/బీజాపూర్/కాంకేర్/న్యూఢిల్లీ: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్ మరోసారి రక్తమోడింది. బస్తర్ అడవుల్లో నెల రోజులుగా నిశ్శబ్ద వాతావరణం ఉండగా గురువారం ఒక్కసారిగా తుపాకులు గర్జించాయి. బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో కనీసం 30 మంది మావోయిస్టులు మరణించారు. దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పశ్చిమ బస్తర్ డివిజన్‌కు చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్జీ, టాస్‌్కఫోర్స్, సీఆర్పీఎఫ్కు చెందిన సుమారు 700 మంది భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉదయం 7 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. కాల్పుల అనంతరం ఘటనాస్థలిలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా మధ్యాహ్నం సమయానికి 18 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించగా, సాయంత్రం 6 గంటల సమయానికి ఈ సంఖ్య 26కు చేరింది. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఏకే 47, ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ ప్రకటించారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవాను వీరమరణం పొందినట్లు వెల్లడించారు. మావోల మృతదేహాలను జిల్లా కేంద్రమైన బీజాపూర్‌కు తరలించారు. కాంకేర్–నారాయణపూర్ మధ్య.. మరో ఘటనలో కాంకేర్–నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉత్తర బస్తర్–మాడ్ డివిజన్ కమిటీ సమావేశమైందనే సమాచారంతో రెండు జిల్లాల భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఉదయం 8 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు కాంకేర్ ఎస్పీ ఇందిరా కల్యాణ్ ప్రకటించారు. భారీగా ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ మృతులను నారాయణ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ రెండు చోట్లా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నారాయణపూర్ జిల్లాలో తుల్తులీ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. టీసీఓఏను దాటుకుని.. ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది చివరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు భద్రతా దళాలు ఉధృతంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో జనవరిలో 50 మంది, ఫిబ్రవరిలో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే మార్చిలో వేసవి రావడంతో ట్యాక్టికల్ కౌంటర్ ఆఫెన్సివ్ క్యాంపెయిన్ (వ్యూహాత్మక ఎదురుదాడులు, టీసీఓఏ) పేరుతో మావోలు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. దీంతో గత నెల రోజులుగా నెమ్మదించిన భద్రతా దళాలు గురువారం దూకుడు కనబరిచాయి. దీంతో రెండు ఎన్కౌంటర్లలో 30 మంది మావోలు చనిపోయారు. మొత్తంగా ఈ ఏడాదిలో 120 మంది మావోయిస్టులు చనిపోవడం గమనార్హం. ఏడాదిలోగా మావోయిస్టురహిత భారత్: అమిత్ షా ‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’ దిశగా భద్రతా బలగాలు మరో గొప్ప విజయం సాధించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారని గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నిషేధిత సీపీఐ(మావోయిస్టు) సభ్యులపై మోదీ ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తోందని స్పష్టంచేశారు. లొంగిపోతే అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇస్తున్నా.. కొందరు లెక్కచేయడం లేదన్నారు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, తగిన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి భారత్.. మావోయిస్టురహిత దేశంగా మారడం తథ్యమని అమిత్ షా పునరుద్ఘాటించారు. మరో ఏడాదిలోగా మావోయిస్టులను పూర్తిగా అంతం చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు. మోదీ పాలనలో మావోయిస్టులకు చావుదెబ్బ 2025లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 104 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మరో 164 మంది లొంగిపోయారని పేర్కొంది. 2024లో 290 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించగా, 1,090 మంది అరెస్టయ్యారని, 881 మంది లొంగిపోయారని తెలిపింది. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల వ్యవధిలో 16,463 మావోయిస్టు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, మోదీ సర్కారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 దాకా వీటి సంఖ్య 53 శాతం తగ్గిపోయిందని, పదేళ్లలో కేవలం 7,744 హింసాత్మక ఘటనలు జరిగాయని హోంశాఖ స్పష్టంచేసింది. అదే సమయంలో మావోయిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది సంఖ్య 1,851 నుంచి 509కు పడిపోయినట్లు తెలిపింది. సాధారణ పౌరుల మరణాల సంఖ్య 4,766 నుంచి 1,495కు తగ్గిపోయినట్లు పేర్కొంది. 2004–14తో పోలిస్తే 2014–24లో భద్రతా సిబ్బంది మరణాలు 73 శాతం, పౌరుల మరణాలు 70 శాతం పడిపోయాయని ఉద్ఘాటించింది. 2014లో దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 126 ఉండగా, 2024లో కేవలం 12 మాత్రమే ఉన్నాయని ప్రకటించింది. మావోయిస్టుల నియంత్రణ కోసం గత ఐదేళ్లలో కొత్తగా 302 సెక్యూరిటీ క్యాంప్‌లు, 68 నైట్ ల్యాండింగ్ హెలిప్యాడ్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ వివరించింది. మృతుల్లో అగ్రనేతలు?బీజాపూర్, కాంకేర్ ఎన్కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులతోపాటు డివిజన్ కమిటీ మెంబర్లు మరణించి ఉండొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడా నేతలతోపాటు ఈ రెండు కమిటీలకు రక్షణ కల్పించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ–2, పీఎల్‌జే–5)కి చెందిన ప్లాటూన్ దళ సభ్యులు కూడా మృతుల్లో ఎక్కువ మంది ఉండే అవకాశముందని తెలుస్తోంది. -
ఛత్తీస్‌గఢ్ భారీ ఎన్కౌంటర్ : Chhattisgarh
-
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
చర్ల: పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా బైరంఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశముండిపారా గ్రామానికి చెందిన సోడి భద్రు(45) ఇంటికి ఆదివారం రాత్రి 7 గంటలకు వచ్చిన మావోయిస్టులు భద్రును బయటకు లాక్కొచ్చారు. అడ్డొచ్చిన భార్య, కుటుంబసభ్యులను పక్కకు నెట్టి ఇంటి ఆవరణలోనే గొడ్డలితో తల, నుదిటిపై నరికారు. దీంతో భద్రు అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న బైరంఘడ్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బైరంఘడ్ తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. కాగా, పోలీస్ ఇన్ఫార్మర్గా మారి తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నందునే హతమార్చామని, ఇలా ఎవరు వ్యవహరించినా ఇదే శిక్ష పడుతుందని హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ వదిలారు. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్
-
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. 15 రోజుల్లో 34 మంది హతం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. ఈ క్రమంలో 2025 ఏడాది ప్రారంభం నుంచే మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జనవరిలో ఎన్కౌంటర్ల కారణంగా 15 రోజుల వ్యవధిలో ఏకంగా 34 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఛత్తీస్‌గఢ్(chhattisgarh)లో భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. ఈనెల ఆరో తేదీన బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టుల(maoists) బెద్రే _కుట్రు ఘటనతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. మావోయిస్టుల ఘాతకంతో ఎనిమిది మంది జవాన్లు, డ్రైవర్ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనతో అడవులను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ చేపట్టాయి. ఇందులో భాగంగా 15 రోజల సమయంలో 34 మంది మావోయిస్టులను హతమార్చారు. తాజాగా బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాలకు చెందిన నక్సలైట్లు మృతి చెందారు.ఇదిలా ఉండగా.. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. వీరిలో తెలంగాణ కేడర్‌కే చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఘటన.. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు.రాష్ట్ర సరిహద్దుల్లో ఘటనతెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు. ఉదయం 9 గంటల సమయంలో తొలిసారిగా కాల్పులు మొదలయ్యాయి. అప్పటి నుంచి రాత్రి 7 గంటల వరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 19 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే మృతులు ఎవరు? ఎంత మంది చనిపోయారనే అంశంపై అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే, ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. -
వెళ్లినంత తేలిక కాదు.. వెనక్కి రావడం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ సైన్యంగా పేర్కొనే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 24వ వారోత్సవాలు ఈనెల 8తో ముగియనున్నాయి. ఒకప్పుడు పీఎల్జీఏ వారోత్సవాలంటే ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఉద్రిక్తత నెలకొనేది. ఒకవైపు పటిష్ట పోలీసు నిఘా, మరోవైపు ఆ నిఘా నేత్రాల కళ్లుగప్పి మావోయిస్టులకు మద్దతు పలికేవారు కనిపించేవారు. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. పదేళ్లుగా తెలంగాణపై పట్టు కోసం మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణ నుంచి బస్తర్ వెళ్లిన మావోయిస్టులు.. తిరిగి తెలంగాణలో ప్రభావం చూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కష్టతరమవుతున్నాయి.బస్తర్ వైపు అడుగులుశ్రీకాకుళం జిల్లాలో మొదలైన నక్సల్బరీ ఉద్యమం 80వ దశకంలో ఉత్తర తెలంగాణ జిల్లాలను ఊపు ఊపింది. అప్పటి ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్న జనాలు అన్నలకు అండగా నిలిచారు. యువకులు అడవుల బాట పట్టేందుకు ఉత్సాహం చూపారు. వందలు, వేలుగా వస్తున్న యువతరానికి దళాలుగా శిక్షణ ఇస్తూ భవిష్యత్ లక్ష్యాల దృష్ట్యా తెలంగాణ సరిహద్దులో ఉన్న బస్తర్ అడవులకు పీపుల్స్‌వార్ గ్రూపు పంపింది. జనతన సర్కార్ పేరుతో బస్తర్‌లో అన్నలు సమాంతర పాలన స్థాపించారు. దీంతో మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను 2009లో కేంద్రం చేపట్టింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, కోబ్రా దళాలు నలువైపులా బస్తర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టులకు కొత్త స్థావరం అవసరమైంది.తెలంగాణ వైపు..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వస్తే మావోయిస్టులు పాగా వేస్తారంటూ ఆం«ధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది. అందుకు తగినట్టుగానే తెలంగాణ వచ్చాక మావోయిస్టులు ఇటువైపు దృష్టి సారించారు. ఈ క్రమాన తొలి ఎన్కౌంటర్ భద్రాచలం సమీపాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలో 2015 జూన్ 15న జరిగింది. ఆ తర్వాత అప్పటి వరంగల్ జిల్లా ములుగులో మావోయిస్టుల పేరుతో కరపత్రాలు, బ్యానర్లు రావడం మొదలైంది. అనంతరం నిర్మాణ పనుల్లో ఉన్న భారీ యంత్రాలను మావోయిస్టులు తగలబెట్టారు. ముందుగా తమ ఉనికి చాటుకుని.. ఆ తర్వాత దాన్ని సుస్థిరం చేసుకునే యత్నంలో ఉండగా 2015 సెప్టెంబర్ 15న గోవిందరావుపేట మండలం రంగాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. దీంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలు నెమ్మదించాయి.పదేళ్లలో 98 మంది..తెలంగాణ వచ్చాక 2015లో జరిగిన రంగాపూర్ ఎన్కౌంటర్ మొదలు నిన్నమొన్నటి కరకగూడెం, ఏటూరునాగారం ఎన్కౌంటర్ల వరకు మొత్తం 98 మంది మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 44 సార్లు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పట్టుమని ఆరు నెలలు కూడా దళాలు ఇక్కడ ఆయుధాలతో సంచరించే పరిస్థితి లేదు. పోలీసుల నిఘా పటిష్టంగా ఉండడం ఒక కారణమైతే.. ఏజెన్సీలు, అడవి సమీప గ్రామాల ప్రజల నుంచి గతంలో లభించిన స్థాయిలో మావోయిస్టులకు ఇప్పుడు మద్దతు దొరకడం లేదు. ఫలితంగా తెలంగాణలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించిన ప్రతీసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీనికి తోడు వారు కోవర్టుల పేరుతో సృష్టిస్తున్న రక్తపాతం మరింత చేటు తెచ్చింది. చివరకు మావోయిస్టులు తమ గ్రామాల వైపు రావొద్దంటూ ప్రజలు ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది.కాళేశ్వరం మీదుగా..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు 2016లో మొదలైన తర్వాత రెండు రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. ఈ నేపథ్యాన ముందుగా మావోయిస్టు సానుభూతిపరులు, ఆ తర్వాత దళాలు మహదేవపూర్ అడవుల్లోకి రాకపోకలు సాగించడం మొదలైంది. అయితే, మహదేవపూర్ – ఏటూరునాగారం ఏరియా పరిధిలో పెద్దగా హింసాత్మక ఘటనలు మాత్రం చోటు చేసుకోలేదు. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో తరచూ కరపత్రాలు పంచడం, మందుపాతరలను అమర్చడం వంటివి చేస్తూ వచ్చారు. ఈ క్రమాన 2017 డిసెంబర్ 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు, ఆ తర్వాత 2020 సెప్టెంబర్‌లో చర్లలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మృతి చెందారు. -
అడవిలో కాల్పుల మోత..
-
ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరి హత్య
వాజేడు: పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నారనే నెపంతో మావోయిస్టులు గురువారం రాత్రి ఇద్దరు గిరిజనులను గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ములుగు జిల్లా వాజేడు పోలీసు స్టేషన్‌కు సుమారు అరకిలో మీటరు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వాజేడు మండల పరిధి బాలలక్ష్మీపురం (పెనుగోలు కాలనీ) గ్రామంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉయిక అర్జున్ (38) ఇంటికి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. వారు అర్జున్ను ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి ఆరుబయట గొడ్డళ్లతో నరికారు.అదే సమయంలో మరో ముగ్గురు మావోయిస్టులు ఉయిక రమేశ్ (38) ఇంటికి వెళ్లి మంచంపై పడుకున్న రమేశ్‌ను గొడ్డళ్లతో నరికి వెళ్లిపోయారు. రమేశ్ కొన ఊపిరితో ఉండగా స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేస్తుండగానే అతను చనిపోయాడు. పేరూ రు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రమేశ్‌కు భార్య రాంబాయి, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉండగా, అర్జున్‌కు భార్య సావిత్రి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు. మృతదేహాలను ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశువులు కాయడానికి అడవుల్లోకి వస్తున్న అర్జున్ తమ దళాల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని, ఇతనితోపాటే ఉయిక రమేశ్ కూడా పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నాడని వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఘటనాస్థలంలో వదిలిన రెండు లేఖల్లో మావోయిస్టులు పేర్కొన్నారు. అమాయకులను హత్య చేశారుఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేసిన ఉయిక రమేశ్, ఉయిక అర్జున్ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి వాజేడు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాలు, గిరిజనులు, గ్రామ పంచాయతీ సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను తీసుకు వచ్చిన అంబులెన్స్‌ను అడ్డుగా పెట్టి పెనుగోలు కాలనీకి వెళ్లే దారి వద్ద వాజేడు, వెంకటాపురం(కె) రహదారిపై ధర్నాకు దిగారు.ఇన్ఫార్మర్ ముద్ర వేసి అమాయక గిరిజనులను మావోయిస్టులు అన్యాయంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రమేశ్ భార్యకు నెలరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడటంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు ఏటూరునాగారం ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. -
భారీ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా భెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళలు సహా పది మంది మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతం ఏపీ, తెలంగాణ సరిహద్దుగా ఉండడంతో మూడు రాష్ట్రాల పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. భెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరాజ్‌గూడ, దంతేస్పురం, నగరం, భండార్‌పదర్ గ్రామాల మధ్య అడవుల్లో కుంట– కిష్టారం ఏరియా నక్సల్స్ కమిటీ సమావేశమైంది. నక్సలైట్ల సమావేశంపై పక్కా సమాచారం అందుకున్న జిల్లా, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. శుక్రవారం ఉదయం భండార్‌పదర్ గ్రామ సమీపంలో మావోలకు పోలీసులు ఎదురుపడ్డారు. దీంతో ఒక్కసారిగా పరస్పర కాల్పులు మొదలయ్యాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాల్పులు కొనసాగాయి. ఇందులో పది మంది మావోయిస్టులు చనిపోయారని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ ప్రకటించారు. మృతుల్లో డివిజినల్ కమిటీ సభ్యుడు మద్కం మాసా, మాసా భార్య దుధీ హునీ, ఏరియా కమిటీ సభ్యురాలు లఖ్మా మాధవి, గార్డ్ కొవసీ కోసా, మద్కం జితూ, మద్కం కోసీలుగా గుర్తించారు. మద్కం మాసాపై రూ.8 లక్షలు, లఖ్మాపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది. మిగతా నలుగురిని గుర్తించాల్సి ఉంది. ఘటనస్థలం నుంచి ఇన్సాస్, ఏకే 47, ఎస్ఎల్ఆర్, బ్యారెల్ గ్రనేడ్ లాంఛర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మావోలపై ఉక్కుపాదందేశంలో 2026 మార్చి నాటికి మావోయి స్టులను అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్ డివిజన్లో జరిగిన ఎన్కౌంటర్లలో 207 మంది మావోలు చనిపోగా 787 మంది అరెస్ట్ అయ్యారు. 789 మంది లొంగిపోయారు. దీంతో బస్తర్ అడవుల్లో సంచరించడం మావో యిస్టు దళాలకు కష్టంగా మారింది. నిర్బంధం పెరగడంతో దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల నుంచి ఇతర రాష్ట్రాల్లోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు మావోలు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పోలీసులు నిఘా పెంచారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు చనిపోయాడు.తెలుగు మాట్లాడే ప్రాంతంలో..ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఏపీలోని చింతూరు, తెలంగాణలోని దుమ్ముగూడెం ప్రాంతాలకు సరిహద్దుగా ఉంది. ఇక్కడ ఉన్న ఆదివాసీ గ్రామాల పేర్లు తెలుగులో ఉండడమే కాక వారు తెలుగు కూడా మాట్లాడగలరు. ఉపాధి, విద్య, వైద్యం, నిత్యావసరాల కోసం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు వచ్చివెళ్తుంటారు. ఈ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరగడంతో ఏపీ, తెలంగాణలోని సరిహద్దు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెరిగిపోవడంతో ఈ గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా గాలిస్తున్నా ఇప్పటికీ మావోయిస్టు అగ్రనా యకత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం ఒక్కటే మావోయిస్టులకు ఊరటనిస్తోంది. -
ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం!
సాక్షి, ములుగు: ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో మరోసారి అలజడి నెలకొంది.వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ సందర్బంగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో.. మృతులను పలుమార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోలేదంటూ పేర్కొన్నారు.ఇక, మృతిచెందిన వారిని ఉయిక రమేష్, ఉయిక అర్జున్‌గా గుర్తించారు. రమేష్.. పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరిద్దరి హత్య నేపథ్యంలో ఏజెన్సీలో మళ్లీ అలజడి నెలకొంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దారుణ హత్యకు సంబంధించి సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. -
మహారాష్ట్రలో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
నాగ్‌పూర్:ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర సరిహద్దులో సోమవారం(అక్టోబర్ 21) భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్‌ను నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోప్రి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కమాండో టీం కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఇటీవలే భారీ ఎన్కౌంటర్.. 40 మంది మావోయిస్టులు మృతి వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాల వేళ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ జరిగి నెల గడవక ముందే తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇదీ చదవండి: ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదు: అమిత్ షా -
నెత్తురోడుతున్న బస్తర్ అడవులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాకులు దూరని కారడవిగా పేరున్న బస్తర్ జంగిల్లో నెత్తురు ఏరులై పారుతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం తలపెట్టిన పోరు కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 187 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌తో మొదలు..దేశ భద్రతకు మావోయిస్టులను ముప్పుగా పేర్కొంటూ 2009లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ఛత్తీస్‌గఢ్‌లో అమలు చేసింది. అయితే తొలినాళ్లలోనే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు ఎక్కువగా చెడ్డపేరు వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గ్రీన్‌హంట్‌కు మరింత పదునుపెట్టి ఆపరేషన్ ప్రహార్ పేరుతో ఉధృతంగా దాడులు చేసింది. దీంతో ఛత్తీస్‌గఢ్ హింసపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఆ తర్వాత 2018లో ఆ రాష్ట్రంలో బీజేపీ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. హస్తం పార్టీ సీఎంగా భూపేష్ బఘేల్ ఎన్నికయ్యారు. ఆయన హయాంలో మావోయిస్టులపట్ల కరుణ చూపారు. మరోవైపు కరోనా మహమ్మారి రావడంతో మావోయిస్టు ఆపరేషన్లలో తక్కువ స్థాయిలో హింస చోటుచేసుకుంది.సూర్యశక్తి, జల్‌శక్తి పేరుతో ప్రత్యేక కార్యాచరణ 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఓటమిపాలై తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరిట ఉక్కుపాదంతో విరుచుకుపడుతోంది. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను రూపుమాపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా దళాలను బస్తర్ అడవుల్లోకి పంపిస్తోంది. వేసవి కాలంలో మావోయిస్టుల అడ్డాలపై సమర్థంగా దాడి చేసేందుకు వీలుగా ఆపరేషన్ సూర్యశక్తి పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేసింది. దీంతో జనవరి నుంచి జూన్ మధ్య 150 మందికిపైగా మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులకు పట్టుండే వర్షాకాలంలో కూడా వేడి తగ్గకుండా ఉండేందుకు ఆపరేషన్ జల్‌శక్తి పేరుతో యాక్షన్ ప్లాన్ రెడీ చేసి అమలు చేస్తోంది. ఫలితంగా అడవులు దట్టంగా పరుచుకున్నా ఎన్కౌంటర్లు ఆగడం లేదు. దీంతో బస్తర్ అడవులు అట్టుడికిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 187 మంది మావోయిస్టులు చనిపోగా 212 మంది అరెస్టయ్యారు. మరో 201 మంది లొంగిపోయారు. దీనికి ప్రతిగా ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు పదుల సంఖ్యలో అడవి బిడ్డలను చంపుతున్నారు. ఆర్మీ క్యాంపులపైనా దాడులకు తెగబడుతున్నారు.నాడు భారీగా ఏకే–47లు.. నేడు తూటాలకే కటకట.. పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టు పార్టీగా మారాక విస్తృతమైన ‘నెట్వర్క్’ అందుబాటులోకి రావడంతో ఆధునిక ఆయుధాలు మావోయిస్టుల చేతికి అందాయి. సల్వాజుడం, ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఎన్కౌంటర్లకు పాల్పడేందుకు రంగంలోకి దిగిన భద్రతా బలగాలపై తొలినాళ్లలో మావోయిస్టులు పైచేయి సాధించారు. ఈ క్రమంలో పలుమార్లు భద్రతా దళాల నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. ముఖ్యంగా 2007 మార్చి 15న సుక్మా జిల్లా తాడిమెట్ల దగ్గర జరిగిన దాడిలో భద్రతా దళాలకు చెందిన 145 ఆయుధాలను మావోయిస్టులు పట్టుకుపోయారు. అందులో ఏకంగా 125 ఏకే–47లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2001 నుంచి 2024 ఆగస్టు వరకు భద్రతా దళాలకు చెందిన 516 ఆటోమెటిక్ రైఫిల్స్‌ను మావోయిస్టులు ఎత్తుకుపోయారు. కానీ ఆపరేషన్ గ్రీన్‌హంట్, ఆపరేషన్ ప్రహార్, కగార్‌లతో తీవ్ర నిర్బంధం, దాడులు పెరగడం వల్ల మావోయిస్టు దళాల్లో రిక్రూట్మెంట్లు తగ్గిపోయాయి. దీంతో దళాల్లో సభ్యుల సంఖ్య కూడా కుచించుకుపోతోంది. దీంతో భద్రతా బలగాలను ఒత్తిడిలోకి నెట్టేందుకు వీలుగా తమ వైపు నుంచి ఎటాక్ తీవ్రంగా ఉండేలా డివిజన్ కమిటీ స్థాయి సభ్యులకు సైతం ఆధునిక ఆయుధాలు ఇచ్చేందుకు మావోయిస్టులు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆ«టోమేటిక్ రైఫిల్స్ కలిగి ఉండే విషయంలో మావోలకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ వాటి కోసం ఉపయోగించే తూటాల విషయంలో కొరత ఎదురవుతున్నట్లు తెలిసింది. గతంతో పోలిస్తే తూటాల సరఫరాకు మార్గాలు చాలావరకు మూసుకుపోవడమే ఇందుకు కారణం. అందువల్లే గత నెలలో బస్తర్‌లో నాలుగైదుసార్లు భద్రతా దళాల క్యాంపులపై దాడులకు పాల్పడినా మావోలు భారీస్థాయిలో కాల్పులు చేపట్టలేదు. కేవలం అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్లతోనే దాడులు చేశారు.తెలంగాణలో నిలదొక్కుకోలేక..ఛత్తీస్‌గఢ్‌లో ఒత్తిడి పెరగడంతో తెలంగాణలో తిరిగి నిలదొక్కుకోవడానికి మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఏడుగురు నక్సల్స్ చనిపోయారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇటీవల జరిగిన కరకగూడెం ఎన్కౌంటర్ అతిపెద్దదిగా పేర్కొంటున్నారు. అక్కడ ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. -
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో స్పష్టతకు రాని మృతుల సంఖ్య
నారాయణ్‌పుర్ - దంతెవాడ సరిహద్దులో శుక్రవారం పోలీసుల జరిపిన భారీ ఎన్కౌంటర్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 40 మంది మరణించగా.. పోలీసులు మాత్రం 31మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు.అయితే, మిగిలిన తొమ్మిది మంది ఎవరనేది చెప్పే ప్రయత్నం చేయలేదు పోలీసులు. పైగా ఆ తొమ్మది మంది మృతదేహాల్ని ఎవరివి అనేది దృవీకరించలేదు.ఇక ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళ మావోయిస్టులలో దళ కమాండర్ ఒకరు మరణించినట్లు ధ్రువీకరించారు. మహారాష్ట్ర నుండి 150 మంది మహిళ పోలీస్ కమాండోలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. మృతి చెందిన 31 మంది మావోయిస్టులపై సుమారు కోటి రూపాయల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ 40 మంది మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి వార్షికోత్సవాల వేళ గట్టి ఎదురుదెబ్బ తగి లింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులు చనిపోయినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్–దంతెవాడ జిల్లాల సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలైన ఎదురుకాల్పులు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ ఘటనలో మరణించిన 40 మందిలో తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్కౌంటర్లో పోలీసులకు, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఈ భారీ ఎన్‌కౌంటర్‌తో సౌత్ అబూజ్‌మడ్‌తో పాటు నార్త్ బస్తర్ మావోయిస్టు కమిటీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు. భారీ బలగాలతో ఆపరేషన్ భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు వార్షికోత్సవాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దంతెవాడ జిల్లా బస్రూర్, నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ల నడుమ గోవల్, నెందూర్, తుల్త్లీ గ్రామాల సమీపంలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమైనట్లు గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్స్, బీఎస్ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన 1,500 మంది జవాన్లు ఆపరేషన్ ప్రారంభించారు.శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయానికి ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా బయటకు సమాచారం అందింది. రాత్రి వరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతూ వచి్చంది. రాత్రి 9 గంటల సమయానికి 36 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. భద్రతా దళాల ఘన విజయం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా బస్తర్ ఏరియా ఉంది. ఇక్కడ ఏడు జిల్లాలు ఉండగా సుక్మా, బీజాపూర్, దంతేవాడ, బస్తర్ జిల్లాలను దండకారణ్యంగా.. కాంకేర్, నారాయణపూర్, కొండగావ్ జిల్లాలు పూర్తిగా, బీజాపూర్, దంతేవాడ జిల్లాలో కొంత భాగాన్ని అబూజ్‌మడ్‌గా పిలుస్తారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ మొదలయ్యాక దండకారణ్య ప్రాంతంలోనే మావోయిస్టులు, పోలీసుల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఇక్కడే ఉన్నట్టగా ప్రచారం సాగుతోంది. శుక్రవారం అబూజ్‌మడ్‌లో ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 36 మంది మావోయిస్టులు చనిపోవడం కామ్రేడ్లకు గట్టి ఎదురుదెబ్బగా, భద్రతా దళాల ఘన విజయంగా చెప్పుకోవచ్చు. మృతుల్లో.... అర్ధరాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లో తూర్పు బస్తర్ డివిజన్‌కు చెందిన అగ్రశ్రేణి నక్సలైట్ డీవీసీఎం నీతి అలియాస్ ఊరి్మళ, కొప్పే, ఎస్‌జెడ్‌సీఎం రామకృష్ణ కమలేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నీతి స్వస్థలం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఈరంగూడ గంగులూరు. ఇక రామకృష్ణది ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తమ్ముల రోడ్డు పాలంకి. -
పువర్తి క్యాంప్‌పై మావోల మెరుపుదాడి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టు అగ్రనేత మడకం హిడ్మా స్వగ్రామమైన పువర్తిలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో అడవిలో నక్కిన మావోయిస్టులు.. క్యాంప్‌పైకి రాకెట్ లాంచర్లు ప్రయోగించారు.అయితే ఇవి క్యాంప్ వెలుపల జవాన్ల సంచారం లేని చోట పడటంతో ప్రాణనష్టం తప్పింది. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. సుమారు గంటన్నరపాటు తుపాకులు, బాంబుల మోతతో పువర్తి అటవీ ప్రాంతం దద్దరిల్లింది. శుక్రవారం రాత్రంతా జవాన్లు అప్రమత్తంగా గడిపారు. శనివారం క్యాంప్ సమీప అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. చొచ్చుకుపోతున్న బలగాలు దాడులు చేయడంలో దిట్టగా పేరొందిన హిడ్మా సొంతూరిలో గత ఫిబ్రవరి 18న భద్రతా దళాలు క్యాంప్ ఏర్పాటు చేశాయి. వివిధ దళాలకు చెందిన వేలాది మంది జవాన్లు కేవలం వారం రోజుల్లోనే యుద్ధప్రాతిపదికన ఈ క్యాంప్ ఏర్పాటు చేసి మావోయిస్టులకు గట్టి హెచ్చరిక పంపారు. అంతేకాక పువర్తిలో ఉన్న స్తూపాలను ధ్వంసం చేశారు. హిడ్మా సమావేశాలు నిర్వహించే ఇంటిని తమ అదీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత బస్తర్ అడవుల్లో వరుసగా చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 150 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కోవర్టు ఆరోపణలతో ఈ ఏడాది పది మందిని మావోయిస్టులు హతమార్చారు. ఈ తరుణంలో మావోయిస్టు పార్టీలో అభద్రతా భావం నెలకొందని, తెలంగాణ కేడర్‌కు చెందిన నేతలను హిడ్మా నమ్మడం లేదనే ప్రచారం మొదలైంది. కవ్వింపు చర్య?: వరుస నష్టాల నుంచి తేరుకుని, భద్రతా దళాలను ఆత్మరక్షణలో నెట్టే లక్ష్యంతో మావోయిస్టులు పువర్తి క్యాంప్‌పై దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. రాత్రివేళ వ్యూహాత్మకంగా క్యాంప్‌పై దాడి చేసి, అక్కడున్న భద్రతా దళాలను చెదరగొట్టడంతోపాటు తమకు పట్టున్న అటవీ ప్రాంతంలోకి రప్పించి అంబుష్ దాడి చేసేందుకు యత్నించినట్టు సమాచారం. అందులోభాగంగానే భారీ సంఖ్యలో జవాన్లు మోహరించిన క్యాంప్‌పై రాకెట్ లాంచర్లు ప్రయోగించి కవ్వింపు చర్యలకు దిగారని తెలుస్తోంది. అయితే రాత్రంతా క్యాంప్ లోపలే ఉండడం ద్వారా మావోలు పన్నిన ఉచ్చులో జవాన్లు చిక్కుకోలేదని చెబుతున్నారు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 8 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలి నుంచి బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సీఆర్పీఎఫ్ బెటాలియన్–226(గాదిరాస్, సుక్మా జిల్లా) క్యాంప్‌లో పనిచేస్తున్న అస్సాంకు చెందిన జవాన్ విపుల్ భయాన్ తన సరీ్వస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ..!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఓ వైపు మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్లలో మృతి చెందడం, మరోవైపు మావోయిస్టుల కీలక ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు పట్టుసాధిస్తుండటం మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం దంతెవాడ–బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్టు తొలితరం అగ్రనాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేరు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు సహా మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమిటీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న, అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు హతమైన విషయం తెలిసిందే. తాజాగా గురువారం రఘునాథపాలెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. \దళం తుడిచిపెట్టుకుపోయినట్లే... కర్కగూడెం గ్రామానికి అతి సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పాట్రో టీంకు తారసపడిన బీఏ–ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న, లచ్చన్న సతీమణి తులసి అలియాస్ పునెం లక్కీ, పాల్వంచ మణుగూరు ఏరియా కమాండర్ కామ్రేడ్ రాము, పార్టీ సభ్యులు కోసి, సీనియర్ సభ్యులు గంగాల్, కామ్రేడ్ దుర్గేశ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌తో తెలుగు ప్రాంతాల్లో మావోయిస్టులకు చెందిన అత్యంత కీలకమైన భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే–ఏఎస్ఆర్) దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లయింది. ఇటీవల కాలంలో తెలంగాణ సరిహద్దులోపల ఇదే భారీ ఎన్కౌంటర్ కావడం గమనార్హం. ఇదే డివిజన్ కమిటీకి చెందిన మరో మావోయిస్టు విజయేందర్‌ను సైతం పోలీసులు ఈ ఏడాది జూలైలో గుండాలలో జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చారు.ఇలా దెబ్బమీదదెబ్బతో బీకే–ఏఎస్ఆర్ డివిజన్‌కు తీవ్ర నష్టం జరిగింది.క్రమంగా పట్టుసాధిస్తున్న పోలీసులు..మరోవైపు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు అత్యంత పట్టుఉన్న ప్రాంతాల్లోనూ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర, స్థానిక పోలీస్ బలగాలు చొచ్చుకుపోతున్నాయ. కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లోనూ వరుస ఎన్కౌంటర్లలో కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు మావోయిస్టులపై పట్టు సాధిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు తెలంగాణ నుంచి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రంలోకి అడుగుపెడుతుండగా హతమార్చారు. ఈ ఏడాది జూన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లోనూ 8 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు. ఇలా వరుస దాడులతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చత్తీస్‌గఢ్ వైపు ఒత్తిడి పెరగడంతో తెలంగాణలోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయతి్నస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలను తెలంగాణ గ్రేహౌండ్స్, టీజీఎస్పీ, స్థానిక పోలీసు బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. మావోయిస్టులు తెలంగాణ వైపు రాకుండా ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తూ వారిని అడ్డుకుంటున్నాయి. ఏ మాత్రం సమాచారం దొరికినా వెంటనే బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. అయితే, తాజాగా గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తూటాల మోత.. భారీ ఎన్కౌంటర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తూటాల మోత మోగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కరకగూడెం అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసు బలగాలకు, మావోయిస్టులకు కాల్పులు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో సరిహద్దు జిల్లాల గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. మృతిచెందిన మావోయిస్టులు లచ్చన్న దళంకు చెందినవారిగా గుర్తించారు. ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు గాయపడ్డారు.కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ –బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా లోహాగావ్, పురంగేల్ అడవుల్లో ఆండ్రి గ్రామం వద్ద 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ దళాల జవాన్లు కూంబింగ్ చేపట్టారు.ఇరువర్గాల మధ్య మొదలైన ఎదురుకాల్పులు దాదాపు మూడు గంటలపాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటనా స్థలిలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. వీరిని దక్షిణ బస్తర్, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ–2కు చెందిన వారిగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్, 315 బోర్‌గన్లతోపాటు బారెల్ గన్ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్ట్‌ల మృతి
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10మంది మావోలు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బీజాపూర్ దంతెవాడ జిల్లా లావాపురెంగల్ వద్ద మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. పురంగెల్ అటవీ ప్రాంతంలో రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, బీఎస్ఎఫ్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలు, వస్తుసామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ⚡⚡ Nine Naxalites eliminated in encounter by Security forces in Chhattisgarh's Dantewada District.— Āryāvarta Updates (@_AryavartaNews) September 3, 2024 -
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో 12 నుంచి 15మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు ఆరు గంటల పాటు జరగ్గా.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే, మూడు ఏకే 47 తుపాకీలతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.ఇక, కాల్పుల సందర్భంగా తిపాగడ్ దళం ఇంఛార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం మృతిచెందినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, ఈ కాల్పుల్లో ఒక జవాన్‌కు బుల్లెట్ గాయం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. -
జార్ఖండ్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి
చైబాసా: జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింహ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. గువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతంలో సోమవారం ఉదయం 5 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు ఐజీ అమోల్ వి హోంకార్ చెప్పారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమాండర్ టైగర్ అలియాస్ పాండు హన్స్దా, బట్రి దేవ్‌గమ్‌లను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు ఎస్ఎల్ఆర్లు, మూడు రైఫిళ్లు, ఒక పిస్టల్‌ను స్వాదీనం చేసుకున్నామన్నారు. మృతులను జోనల్ కమాండర్ కండె హొన్హాగా, సబ్ జోనల్ కమాండర్ సింగ్రాయ్ అలియాస్ మనోజ్, ఏరియా కమాండర్ సూర్య అలియాస్ ముండా దేవ్‌గమ్, మహిళా నక్సల్ జుంగా పుర్టి అలియాస్ మర్లా, సప్ని హన్స్‌డాగా గుర్తించామన్నారు. -
మావోయిస్టుల ఏరివేతకు ‘జల్‌శక్తి’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులకు పట్టు ఉన్నట్లు చెప్పుకునే బస్తర్ అడవుల్లో ఎండాకాలంలో సహజంగానే పోలీసు బలగాలది పైచేయి అవుతోంది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో వంద మందికి పైగా మావోయిస్టులు హతమవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే, వానాకాలానికి వచ్చేసరికి అడవులు చిక్కబడటం.. వాగులు, వంకలు ఉప్పొంగడంతో పోలీసుల కూంబింగ్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి.ఈ నేపథ్యంలో వానాకాలంలోనూ బస్తర్ అడవుల్లో మావోయిస్టుల నుంచి ఎదురయ్యే దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా అడవుల్లోకి సులభంగా చొచ్చుకెళ్లేందుకు వీలుగా గతంలో ఎన్నడూ లేనివిధంగా రోప్ వేను అందుబాటులోకి తెచ్చాయి. బేస్ క్యాంపుల ఏర్పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు, ధర్మారం, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం, బాసగూడ ప్రాంతాలు మావోయిస్టులకు అడ్డాలుగా ఉన్నాయి. అతికష్టంపై భద్రతా దళాలు చింతవాగుకు ఇరువైపులా ఉన్న పామేడు, ధర్మారంలో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ ఏడాది జనవరి 16న రాత్రి 600 మందికి పైగా మావోయిస్టులు ఈ రెండు క్యాంపులను చుట్టుముట్టి భీకరంగా దాడి చేశారు.సుమారు మూడు గంటల పాటు సాగిన దాడిలో ఆరు వందలకు పైగా గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో భద్రతా దళాలకు చెందిన నలభై మందికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. అప్పటికే చింతవాగుపై వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టినా సకాలంలో పూర్తి కాలేదు. దీంతో ఏటా వానాకాలంలో మూడు నెలల పాటు ఉప్పొంగే చింతవాగు భద్రతా దళాలకు ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా భద్రతా దళాలు వంతెనకు ప్రత్యామ్నాయంగా యుద్ధప్రాతిపదికన రోప్‌వేను నిర్మించాయి. ఈ రోప్‌వే ద్వారా రెండు క్యాంపుల మధ్య రాకపోకలకు ఆటంకాలు ఉండవని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఆపరేషన్ జల్‌శక్తి వేసవిలో మావోయిస్టు ప్రభావిత అడవుల్లోకి చొచ్చుకెళ్లిన భద్రతా దళాలు అక్కడ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇలాంటి క్యాంపులకు వానాకాలంలో భద్రత కరువైపోతోంది. భద్రతా దళాల రక్షణ వ్యవస్థను చీల్చుకుంటూ క్యాంపుల మీద మావోయిస్టులు దాడులు చేస్తున్నారు. దీంతో వానాకాలంలో కూడా బస్తర్ అడవులపై పట్టు సాధించేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ జల్‌శక్తి పేరుతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. వరదలు ఎదుర్కొని, దట్టమైన అడవుల్లో కూంబింగ్ నిర్వహించడంపై భద్రతా దళాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే రాకపోకలకు వీలుగా వంతెనలు, రోప్‌వేల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి.120 మంది హతంకేంద్రం చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఇప్పుడు తుదిదశ (ఆపరేషన్ కగార్ – ది ఫైనల్ మిషన్)కు చేరింది. బస్తర్ అడవుల్లో ఏర్పాటైన వందలాది క్యాంపుల్లో 10 వేల మంది పారామిలిటరీ దళాలు పాగా వేశాయి. వేసవి ఆరంభంలో భద్ర తా దళాల దూకుడుకు కళ్లెం వేసేందుకు మావోయిస్టు పార్టీ టెక్నికల్ కౌంటర్–అఫెన్సివ్ క్యాంపెన్(టీసీ–ఓసీ) పేరుతో దాడులు మొదలెట్టింది. దీనికి ప్రతిగా భద్రతా దళాలు ఆపరేషన్ సూర్యశక్తి పేరుతో ప్రతి వ్యూహాన్ని రూపొందించుకుని దాడులకు దిగాయి. అందువల్లే ఈ ఏడాది మావోయిస్టు పార్టీ నుంచి భద్రతా దళాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఇదే క్రమంలో భద్రతా దళాలు జరిపిన దాడులు, ఎన్కౌంటర్లలో 120 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఇక ఇప్పుడు జల్‌శక్తి పేరుతో వానాకాలంలోనూ దూకుడు పెంచేందుకు భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి. -
ఛత్తీస్‌గఢ్: పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టుల బాంబుల వర్షం
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూడ్మడ్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌పై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాంబులతో దాడి చేశారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.అర్ధరాత్రి జవాన్లు నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు ఈరక్ బట్టి క్యాంప్‌పై ఒక్కసారిగా బారెల్ గ్రెనేడ్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. నాలుగు బీజీఎల్లను ప్రయోగించారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగగా మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. అదనపు బలగాలతో క్యాంపు పరిసర అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. -
చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
చత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు. రాష్ట్రంలోని నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాో సరిహద్దుల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. కాగా 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడం ఇది రెండోసారి. సంఘటనా ప్రాంతం నుంచి ఒక ఏకే 47తోపాటు ఇతన భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రీజియన్‌లో భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా నక్సల్ ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు ఏడుగుర్ని మట్టుబెట్టాయి. -
ఏవోబీలోకి మావోయిస్టులు?
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నమావోయిస్టులు షెల్టర్ కోసం ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని దండకారణ్యం ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని కేంద్ర పోలీసు బలగాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఏవోబీలోని దండకారణ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కొన్నేళ్లుగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. అయితే, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ దండకారణ్య ప్రాంతం మావోయిస్టు పార్టీకి అడ్డాగా మారింది. ఆ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న బస్తర్ అటవీ ప్రాంతం మావోయిస్టులకు సురక్షితంగా ఉంది. అక్కడి నుంచే మూడేళ్లుగా మావోయిస్టులు తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కేంద్ర పోలీసు బలగాల నిర్బంధంలో ఉంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో పోలీసు పార్టీలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ సుమారు 79మంది కీలక నేతలు, సభ్యులను కోల్పోయింది. కాంకేరు జిల్లాలోని మాడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఏకంగా 29మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మిగిలిన క్యాడర్ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి సరిహద్దులో ఉన్న ఏపీకి చెందిన అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు, ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల అటవీ ప్రాంతానికి వచ్చి తలదాచుకుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. మరోవైపు మావోయిస్టుల కార్యకలపాలను నియంత్రించాలనే లక్ష్యంతో అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఒడిశా పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. చింతూరుకు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంపై నిఘా పెట్టారు. అప్రమత్తంగా ఉన్నాం ఏవోబీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్కౌంటర్లు, మావోయిస్టుల మరణాలు తదితర పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. సరిహద్దులో పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా అధికంగా ఉంది. ఒడిశా> పోలీసు యంత్రాంగం సహకారం తీసుకుంటున్నాం. అన్ని ఔట్ పోస్టుల పరి«ధిలో రెడ్ అలర్ట్ అమలులో ఉంది. – తుహిన్ సిన్హా, ఎస్పీ, పాడేరు -
Chhattisgarh Encounter: మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు
రాయ్‌పూర్: స్వల్ప రోజుల వ్యవధిలో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు గట్టి దెబ్బలు తగిలాయి. బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం బాసగూడ ప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు బలగాలు ప్రకటించుకున్నాయి. ఇటీవల ఇదే ప్రాంతంలో మావోయిస్టులు ముగ్గురు స్థానికులను హతమార్చారు. దీంతో.. భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన క్రమంలోనే ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇటీవల వరుసగా ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు, అంతకు ముందు చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
బస్తర్‌లో భయం భయం!
తాండ్ర కృష్ణ గోవింద్, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై రూ.కోటి రివార్డు ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర భద్రతా దళాలు క్యాంప్ నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు– భద్రతా దళాల మధ్య సాగుతున్న పోరును తెలుసుకునేందుకు ‘సాక్షి’ బస్తర్ అడవుల బాటపట్టింది. అన్నలు విధించిన ఆంక్షలు, పారామిలటరీ చెక్ పాయింట్లను దాటుకుంటూ వెళ్లి వివరాలు సేకరించింది. జవాన్లు, అధికారులతోపాటు మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్)లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ముందు, వెనక ప్రమాదం మధ్య.. బస్తర్ దండకారణ్యం పరిధిలోకి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ,బస్తర్ జిల్లాలు వస్తాయి. ఇక్కడి ప్రజలు రెండు రకాల పాలనలో ఉన్నారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ మీడియా బృందం ప్రయత్నించింది. ముందుగా భద్రాద్రి జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడుకు.. అక్కడి నుంచి సుక్మా జిల్లా పువ్వర్తికి వెళ్లింది. ఈ మార్గంలో ఎవరితో మాట్లాడినా.. వారి కళ్లలో సందేహాలు, భయాందోళన కనిపించాయి. కొండపల్లి వద్ద కొందరు గ్రామస్తులు మీడియా బృందాన్ని అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో వచ్చారంటూ గుర్తింపు కార్డులు అడిగి తీసుకున్నారు. సాయంత్రందాకా పలుచోట్లకు తీసుకెళ్లారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి ‘‘మీరంతా మీడియా వ్యక్తులే అని తేలింది. వెళ్లొచ్చు. ప్రభుత్వం తరఫునే కాకుండా ఇక్కడి ప్రజల కష్టాలను కూడా లోకానికి తెలియజేయండి’’ అని కోరాడు. అంతేగాకుండా ‘‘ఈ ప్రాంతంలోకి వచ్చేముందు అనుమతి తీసుకోవాల్సింది. అటవీ మార్గంలో అనేకచోట్ల బూబీ ట్రాప్స్, ప్రెజర్ బాంబులు ఉంటాయి. కొంచెం అటుఇటైనా ప్రాణాలకే ప్రమాదం’’ అని హెచ్చరించాడు. దీంతో మీడియా బృందం రాత్రికి అక్కడే ఉండి, మరునాడు తెల్లవారుజామున పువ్వర్తికి చేరుకుంది. అక్కడ భద్రతా దళాల క్యాంపు, హిడ్మా ఇల్లును పరిశీలించింది. అయితే భద్రతాపరమైన కారణాలు అంటూ.. ఫొటోలు తీసేందుకు, వివరాలు వెల్లడించేందుకు పారామిలటరీ సిబ్బంది అంగీకరించలేదు. ఆ పక్క గ్రామంలో హిడ్మా తల్లి ఉందని తెలిసిన మీడియా బృందం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడింది. తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ కమాండర్లు అడ్డగించారు. బైక్‌లపై తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లను చూసిన ఓ తెలుగు జవాన్ కల్పించుకుని.. ‘‘మీరు కొంచెం ముందుకొచ్చి ఉంటే.. మా వాళ్లు కాల్చేసేవారు’’ అని హెచ్చరించాడు. అదే దారిలో నేలకూలిన ఓ పెద్ద చెట్టును కవర్‌గా చేసుకుని బంకర్ నిర్మించారని, అందులో సాయుధ జవాన్లు ఉన్నారని, జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీడియా బృందం సాధ్యమైనన్ని వివరాలు సేకరించి తిరిగి చర్లకు చేరుకుంది. జనతన్ సర్కార్ ఆధీనంలో.. బీజాపూర్ జిల్లా పామేడు నుంచి చింతవాగు, ధర్మారం, జీడిపల్లి, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం మీదుగా పువ్వర్తి వరకు 60 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. పామేడు, ధర్మారం గ్రామాల వరకే ఛత్తీస్‌గఢ్‌తోపాటు ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. అక్కడివరకే పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నాయి. తర్వాత చింతవాగు దాటి కొద్దిదూరం అడవిలోకి వెళ్లగానే జనతన సర్కార్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా మావోయిస్టులు హిందీలో చెక్కలపై రాసి చెట్లకు తగిలించిన బోర్డులు వరుసగా కనిపించాయి. జనతన సర్కార్ ఆ«దీనంలోని ఈ ప్రాంతాల్లో ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలిబాట, ఎడ్లబండ్ల దారులే ఆధారం. పోడు భూములు.. స్తూపాలు జనతన సర్కార్ ఆ«దీనంలోని గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లలోని స్కూళ్లు కనిపించాయి. కానీ ఎక్కడా తరగతులు నడుస్తున్న ఆనవాళ్లు లేవు. అక్కడక్కడా కొందరు టీచర్లు కనిపించినా మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడక్కడా సంతల్లో హెల్త్ వర్కర్లు మాత్రం కనిపించారు. పరిమితంగా దొరికే ఆహారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్త్రీలు, పిల్లల్లో పోషకాహర లోపం కనిపించింది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వారు చెప్పారు. ఏ గ్రామంలోనూ గుడి, చర్చి, మసీదు వంటివి లేవు. జనతన సర్కార్‌లో మతానికి స్థానం లేదని స్థానికులు చెప్పారు. కొన్నిచోట్ల చనిపోయినవారికి గుర్తుగా నిలువుగా పాతిన బండరాళ్లు, మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు మాత్రమే కనిపించాయి. బస్తర్ అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఇప్పసారా, లంద, చిగురు వంటి దేశీ మద్యం దొరుకుతుంది. కానీ జనతన సర్కార్ ఆ«దీనంలోని ప్రాంతాల్లో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు. చాలా మందికి ఆధార్ కార్డుల్లేవు జనతన సర్కార్ పరిధిలోని గ్రామాల్లో సగం మందికిపైగా తమకు ఆధార్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డులు లేవని చెప్పారు. వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. పువ్వర్తి సమీపంలోని మిర్చిపారా గ్రామానికి చెందిన మడకం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. అది కూడా మా గ్రామాలకు పది– ఇరవై కిలోమీటర్ల దూరంలో జనతన సర్కార్‌కు ఆవల ఉండే మరో గ్రామానికి వెళ్లి రెండు, మూడు నెలలకు ఓసారి తెచ్చుకుంటాం..’’ అని చెప్పాడు. ఇక ఎన్నికల ప్రక్రియపై పటేల్‌పారా గ్రామానికి చెందిన నందా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా గ్రామాలకు నామ్ కే వాస్తే అన్నట్టుగా సర్పంచ్‌లు ఉన్నారు. ఎక్కువ మంది ఎన్నికలను బహిష్కరిస్తారు. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. సమీప పట్టణాల్లో నివాసం ఉండేవారు నామినేషన్ దాఖలు చేస్తారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. కానీ చాలా గ్రామాల్లో వారి పెత్తనమేమీ ఉండదు. పరిపాలనలో గ్రామ కమిటీలదే ఆధిపత్యం..’’ అని వివరించాడు. సమష్టి వ్యవసాయం చాలా ఊర్లలో ట్రాక్టర్లు కనిపించాయి. వాటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. ఆ ట్రాక్టర్లను ఊరంతా ఉపయోగించుకుంటారని తెలిసింది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేదు. అంతా దట్టమైన అడవి అయినా ఎక్కడా అటవీ సిబ్బంది ఛాయల్లేవు. ఇటీవలికాలంలో చేతిపంపులు, సోలార్ లైట్లు వంటివి కనిపిస్తున్నాయి. వినోదం విషయానికొస్తే.. సంప్రదాయ ఆటపాటలతో పాటు కోడిపందేలను ఆదివాసీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వం తరఫున సేవలు అందించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పువ్వర్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సుక్మా జిల్లా ఏఎస్పీ గౌరవ్ మొండల్ చెప్పారు. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి తాగునీరు, విద్యుత్, స్కూల్, ఆస్పత్రి వంటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. అయితే క్యాంపుల ఏర్పాటులో ఉన్న వేగం ప్రభుత్వ పథకాల అమల్లో కనిపించడం లేదేమని ప్రశి్నస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులే అందుకు కారణమన్నారు. ఇక క్యాంపుల ఏర్పాటు సమయంలో ఆదివాసీలు భయాందోళన చెందినా, తర్వాత శత్రుభావం వీడుతున్నారని మరో అధికారి తెలిపారు. ఈక్రమంలోనే జనతన సర్కారులోకి చొచ్చుకుపోగలుతున్నామన్నారు. ఇప్పటికీ మావోయిస్టులదే పైచేయి.. ప్రభుత్వ బలగాలు ఎంతగా మోహరిస్తున్నా ఇప్పటికీ అడవుల్లో మావోయిస్టులదే ఆధిపత్యం. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలకు ఆటపాటలే ప్రధాన వినోద సాధనాలు. మావోయిస్టులు చేతన నాట్యమండలి వంటివాటి ద్వారా ఇక్కడి ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తిస్తారు. పిల్లలకు ఏడేళ్లు దాటగానే గ్రామ కమిటీల్లో చోటు కల్పించి, భావజాలాన్ని నేర్పుతారు. మావోయిస్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత చూపితే ప్రమాదం తప్పదనే భయాన్ని నెలకొల్పారు’’ అని ఆరోపించారు. హిడ్మా అడ్డాలో క్యాంపు వేసి.. పువ్వర్తి జనాభా 400కు అటుఇటుగా ఉంటుంది. అందులో దాదాపు వంద మంది మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వీరిలో హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకోగా.. ఆయన సోదరుడు దేవా బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారు. పువ్వర్తిలో హిడ్మా కోసం ప్రత్యేక సమావేశ మందిరం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేవి. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే హిడ్మా సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఇవన్నీ భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి. ఆధునిక పరికరాల సాయంతో వందల మంది కార్మికులు క్యాంపు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి వరకు రోడ్డుకూడా లేని ఈ గ్రామంలోకి ఇప్పుడు పదుల సంఖ్యలో లారీల్లో వస్తుసామగ్రి, రేషన్ తరలించారు. బుల్డోజర్లు, పొక్లెయినర్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్‌్కఫోర్స్, డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ ఇలా వివిధ దళాలకు చెందిన సుమారు ఐదు వేల మంది సిబ్బంది మోహరించారు. గ్రామం నలువైపులా గుడారాలు, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాంపులు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని చాలా మంది ఆదివాసీలు అంటున్నారు. కొండపల్లికి చెందిన మడావి మాట్లాడుతూ.. ‘‘క్యాంపులు ఏర్పాటైన తర్వాత మా గ్రామాల్లోకి వచ్చే భద్రతాదళాలు విచారణ పేరుతో జబర్దస్తీ చేస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కాల్పుల శబ్దాలు వినవస్తున్నాయి. విచారణ పేరిట ఎవరైనా గ్రామస్తుడిని తీసుకెళ్తే.. తిరిగి వచ్చే వరకు ప్రాణాలపై ఆశలేనట్టే. అందుకే భద్రతా దళాలు వస్తున్నట్టు తెలియగానే పెద్దవాళ్లందరం అడవుల్లోకి పారిపోతున్నాం’’ అని చెప్పాడు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘స్థానికులమైన మాకు భద్రతాదళాల నుంచి కనీస మర్యాద లేదు. అభివృద్ధి పేరిట అడవుల్లోకి వస్తున్నవారు గ్రామపెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు. -
సీఏఎఫ్ కమాండర్‌ను పొట్టనబెట్టుకున్న మావోలు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సాయుధ బలగాల కమాండర్‌ను దారుణంగా చంపారు. కుట్రు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దర్బా గ్రామంలో ఆదివారం జరిగే సంతకు ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాల 4వ బెటాలియన్ జవాన్లు బందోబస్తుగా ఉన్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో గ్రామీణుల వేషధారణలో వచి్చన మావోయిస్టులు ఏమరుపాటుగా ఉన్న కమాండర్ తేజో రాం బౌర్యా తలపై గొడ్డలితో వేటు వేశారు. దీంతో, ఆయన అక్కడికక్కడే కుప్పకూలి, ప్రాణాలొదిలారు. ఆ వెంటనే మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న బలగాలు మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. -
మూడు క్యాంపులపై మావోయిస్టుల దాడి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామం మావోయిస్టులు, జవాన్ల పరస్పర కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లో ఏర్పాటుచేస్తున్న పోలీసు క్యాంప్‌లపై మావోలు మెరుపుదాడికి దిగారు. పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మారం, చింతవాగులో నిర్మించిన క్యాంప్‌లు, పామేడు పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు దాడికి దిగారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో లాంచర్లతో దాడిని ప్రారంభించిన మావోయిస్టులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఎదురుదాడికి దిగగా తెల్లవార్లూ ఆ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆయా ప్రాంతాల ప్రధాన దారులపై చెట్లు నరికి అడ్డంగా వేసి నిప్పుపెట్టి రహదారిని మూసి వేశారు. ఆ మార్గాల గుండా వస్తున్న గ్రామస్తులను వెనక్కి పంపించారు. మూడు చోట్లా ఏకకాలంలో రాకెట్ లాంచర్లు విసురుతూ, మందుపాతరలు పేల్చుతూ భయోత్పాతం సృష్టించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సైతం ఎదురుదాడికి దిగాయి. ధర్మారం క్యాంపు నిర్మాణ పనులు కొనసాగుతుండగా అందులోని జవాన్లతో పాటు పని చేసేందుకు గుంటూరు నుంచి వచి్చన 40 మంది కూలీలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ధర్మారం క్యాంప్‌పై జరిపిన దాడిలో తొమ్మిది మంది జవాన్లు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. -
పోలీసు, మావోయిస్టుల కాల్పుల్లో పసికందు మృతి
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో పోలీసులు, మానోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మాట్వాండిలో సోమవారం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో ప్రమాదవశాత్తు మాట్వాండికి చెందిన ఆరు నెలల పసికందు మృతి చెందగా.. తల్లి గాయాల పాలైంది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి పోలీసులు సాయం అంధించారు. పోలీసులు, మానోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు నక్సలైట్లకు గాయాలు అయ్యాయి. చదవండి: గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన భారత్! ఇంతకీ నేపథ్యం ఏంటంటే.. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. వెంటనే తేరుకున్న మావోయిస్టులు ఎదురుకాల్పులు జరుపుతూ సమీప అటవీప్రాంతంలోకి పారిపోయినట్టు సమాచారం. పోలీసులు మావోల క్యాంప్‌ను ధ్వంసం చేశారు. ఘటనాస్థలిలో భారీగా పేలుడు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ‘‘మావోల జాడ కోసం గాలింపు చేపట్టగా సమీప ప్రాంతాల్లో రక్తపు మరకలు ఎక్కువగా కనిపించాయి. ఎన్కౌంటర్ సందర్భంగా దాదాపు ఆరుగురు మావోలు తీవ్రంగా గాయపడి ఉండొచ్చు లేదా మరణించి ఉండొచ్చు ఉండొచ్చు’’ అని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. -
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందు పాతర..నేలకొరిగిన బీఎస్ఎఫ్ జవాన్
కాంకేర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి ఒక బీఎస్ఎఫ్ జవాను వీర మరణం పొందారు. పర్టాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సడక్టోలా గ్రామ సమీపంలో కూంబింగ్ జరుపుతుండగా గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అఖిలేశ్ రాయ్(45) చనిపోయారని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. -
భద్రాద్రి జిల్లాలో మందుపాతర నిర్వీర్యం
చర్ల: పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ మందుపాతరను గుర్తించిన పోలీసులు శుక్రవారం దాన్ని నిర్విర్యం చేశారు. దీంతో పోలీసు బలగాలకు పెనుప్రమాదం తప్పినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కలివేరు–పెదమిడిసిలేరు ప్రధాన రహదారిపై బీ కొత్తూరు వద్ద వంతెనకు సమీపాన మావోయిస్టులు 30 కిలోల మందుపాతర ఏర్పాటు చేశారు. ఈ రహదారి మీదుగా సరిహద్దు అటవీప్రాంతానికి నిత్యం బలగాలు కూంబింగ్‌కు వెళ్లివస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెళ్లే పోలీసులను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు ఈ మందుపాతరను అమర్చగా, తనిఖీల్లో భాగంగా గురువారం ఉదయం గుర్తించారు. ఓ పక్క పోలింగ్ జరుగుతున్నందున దాన్ని నిర్వీర్యం చేస్తే వచ్చే శబ్దంతో ఓటర్లు భయబ్రాంతులవుతారని భావించిన పోలీసులు మందుపాతరకు ఉన్న ఎలక్ట్రిక్ వైర్లు తొలగించారు. శుక్రవారం ఉదయం బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆధ్వర్యాన నిర్వీర్యం చేశారు. కాగా, ఈ మందుపాతరను మావోలు పేల్చినట్లయితే బస్సు లేదా లారీ వంటి భారీ వాహనం కనీసం 20 నుంచి 30 అడుగుల మేర ఎత్తు ఎగిరిపడి తునాతునకలయ్యేదని చెబుతున్నారు. మరోపక్క ఈ మార్గంలో ఇంకా మందుపాతరలు ఉండొచ్చనే భావించిన పోలీసులు నిశితంగా తనిఖీలు చేపడుతున్నారు. -
కొందమాల్‌లో మావోలు తిష్ట.. జవాన్లు కూంబింగ్ చేస్తుండగా
బరంపురం : కొందమాల్పై ఎప్పుడో పట్టు కోల్పోయిన మావోయిస్టులు మళ్లీ అదే స్థలానికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరు చాప కింద నీరులా కొత్త దళాలను ఏర్పాటు చేస్తున్నారా? కొందమాల్–కొలాహండి–గంజాం జిల్లాల సరిహద్దులను కారిడార్‌గా చేసుకొని కొందమాల్‌లో తిష్ట వేశారా? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల కిందట కొందమాల్ జిల్లా పిరింగియా పోలీసు స్టేషన్ పరిధిలో గల కొమనకుల పంచాయతీ, కొంబలోడు గ్రామం దగ్గర పోడుకొట్ట ఘాటీ ప్రాంతంలో మావోల డంప్ బయట పడడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కేకేబీఎన్ దళం మావోయిస్టుల డంపు బయటపడటంతో చత్తీస్‌గఢ్ నాయకులు కొన్ని అనుబంధ సంస్థలతో కలిసి కొందమాల్–కలాహండి జిల్లాలను కలుపుకుని కొత్త దళం ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పిరింగియా పోలీసు స్టేషన్ పరిధిలో గల కొమనకుల పంచాయతీ, కొంబలోడు గ్రామం దగ్గర పోడుకొట్ట ఘాటీ దట్టమైన అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఎస్ఓజీ జవాన్లు కూంబింగ్ చేస్తుండగా మావోల డంప్ దొరికిందని దక్షిణాంచల్ ఐజీ సత్యబ్రత బోయి తెలియజేశారు. ముమ్మరంగా కూంబింగ్ కొందమాల్ ఏఎస్పీ మినతి మిశ్రా, బౌద్ జిల్లా ఎస్పీ బి.గంగధర్, గంజాం జిల్లాకి చెందిన జగ్మోహన్ మీనాలు ఈ ఘటనపై అప్రమత్తమయ్యారు. కొందమాల్–కొలాహండి–గంజాం జిల్లాల సరిహద్దుల్లోని బల్లిగుడా, రైకియా, బమ్ముణిగామ్, దరింగబడి, గజలబడి, కటింగియా, పాణిగొండా అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. -
మహిళా మావోయిస్టులో అసభ్యకర ప్రవర్తన.. పీఎల్జీఏ సభ్యుడి హతం
చర్ల: మహిళా మావోయిస్టులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న పీఎల్జీఏ సభ్యుడిని మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పీఎల్జీఏ 17వ బెటాలియన్‌కు చెందిన మను దుగ్గ పార్టీలో పనిచేస్తున్న మహిళా మావోయిస్టులపై అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయనపై మహిళా మావోయిస్టులు అగ్ర నాయకులకు ఫిర్యాదు చేయగా.. వారు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కాంకేర్ జిల్లాలోని దండకారణ్య ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు ఆయనను హతమార్చారు. ఈ మేరకు లేఖను కూడా మృతదేహం వద్ద వదిలారు. కాగా, మావోయిస్టులు హతమార్చిన పార్టీ పీఎల్జీఏ సభ్యుడు మను దుగ్గపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఇంజనీరింగ్ కాలేజ్ పార్ట్నర్స్ భారీ స్కెచ్.. ఓనర్ హత్యకు సుపారీ -
సర్పంచ్, ఉప సర్పంచ్ల కాళ్లు, చేతులు నరికేస్తాం..
భద్రాద్రి: ఛత్తీస్‌గఢ్‌లో అభివృద్ధి పనులకే కాక గనులు తెరిచేందుకు సహకరిస్తే సర్పంచ్, ఉపసర్పంచ్‌ల కాళ్లు, చేతులు నరకడమే కాక ఇంకా ఎవరైనా ఉంటే హతమరుస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలోని ఓర్చా బ్లాక్‌లో నది నీటిని నిల్వ చేసేందుకు కరకట్ట నిర్మిస్తున్నారు. ఆది నుంచి ఈ పనులను వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు నిలివేయాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి ఓర్చా సమీపంలోని ప్రధాన రహదారి వెంట వాల్‌పోస్టర్లు వేయడంతో పాటు బ్యానర్లు కట్టారు. నదిలో కరకట్ట నిర్మాణ పనులతో పాటు, ఈ ప్రాంతంలో గనుల్లో తవ్వకాలను నిలిపివేయాలని అందులో హెచ్చరించారు. ఈ పనులకు సహకరిస్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్ల కాళ్లు చేతులు నరికివేయడమే కాక గైతాపారా, బెస్మెట్ట గ్రామాల ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మావోయిస్టులు పేర్కొన్నారు. -
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
కాళేశ్వరం: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లా బాంబ్రాగాడ్ తాలూకా దామరంచ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపారు. పెరిమిలి, అహేరి మావోయిస్టు దళాలు సమావేశమయ్యాయనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిఎదురు కాల్పుల్లో పెరిమిలి దళం కమాండర్ బిట్లు మడావి, వాసు, అహేరి దళానికి చెందిన శ్రీకాంత్ మృతి చెందారు. -
నెత్తురు చిందిన బస్తర్
చెప్పుకోదగ్గ హింసాత్మక ఘటనలు లేకుండా కనీసం రెండేళ్లనుంచి ప్రశాంతంగా కనబడుతున్న ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం నక్సలైట్లు ఐఈడీ పేల్చి మినీ బస్సులో వెళ్తున్న పదిమంది జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పోలీసులనూ, ఒక డ్రైవర్‌నూ హతమార్చిన ఉదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా పల్నార్–అరణ్పూర్ మధ్యలో ఇటీవలే నిర్మించిన రహ దారిపై ఈ ఐఈడీని అమర్చారనీ, అది కూడా రెండు మూడురోజుల క్రితమేననీ వస్తున్న కథనాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం తుపాకులు పట్టామని చెబుతున్న మావోయిస్టుల్లోగానీ, వారిని ఎదుర్కొంటున్న భద్రతా బలగాల తీరులోగానీ ఏ మార్పూ రాలేదని తాజా ఘటన చెబుతోంది. ఒకప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభావవంతంగా ఉన్న వామపక్ష తీవ్ర వాదం చాన్నాళ్లుగా తగ్గుముఖం పట్టింది. 2000కు ముందు పది రాష్ట్రాల్లోని 200 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తే ఆ సంఖ్య 2021 నాటికి 41కి పడిపోయిందంటున్నారు. ఇప్పుడది 25 జిల్లాలకు మాత్రమే పరిమితమైందనీ, గత ఎనిమిదేళ్లలో నక్సల్ సంబంధిత హింసాత్మక ఘటనలు 55 శాతం తగ్గాయనీ, మరణాలు కూడా 63 శాతం తగ్గాయనీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నాలుగు నెలల క్రితం విడుదల చేసిన నివేదిక తెలిపింది. హింసను కట్టడి చేయ టానికి అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న పర్యవ సానంగా మావోయిస్టుల లొంగుబాట్లు కూడా అధికంగానే ఉన్నాయని ఆ నివేదిక వివరించింది. అయితే ఇలాంటి విజయాలే పోలీసు బలగాల్లో ఒక రకమైన నిర్లక్ష్యానికి దారితీశాయా అన్నది ఆలోచించుకోవాలి. తాజా ఉదంతాన్నే తీసుకుంటే అరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావో యిస్టుల కదలికలున్నాయని అందిన సమాచారంతో డీఆర్జీ పోలీసులు అక్కడికి వెళ్లారు. వెళ్లేముందూ, తిరిగొచ్చేటప్పుడూ ఒకే మార్గాన్ని ఉపయోగించకూడదన్న నిబంధన ఉంది. ఒకవేళ తప్పని సరైతే రెండుసార్లూ బలగాల కన్నా ముందు ఒక ప్రత్యేక టీం వెళ్లి ఆ దారిలో మందుపాతరలు, ఇతరత్రా బాంబులు లేవని నిర్ధారించాలి. పైగా ఈమధ్యకాలంలో మావోయిస్టుల వైపునుంచి ఐఈడీల వినియోగం బాగా ఎక్కువైందని తెలుస్తూనే ఉంది. గత నాలుగు నెలల్లో ఐఈడీలు గుర్తించి వెలికితీసిన ఉదంతాలు 34 వరకూ ఉన్నాయని వార్తలు వెలువడ్డాయి. గతంలో భారీయెత్తున ఆది వాసీలను సమీకరించి పోలీసు బలగాలపై విరుచుకుపడిన మావోయిస్టులు ఇటీవల తక్కువమందితో బృందాలను ఏర్పాటుచేసి దాడులకు దిగుతున్నారని ఒక మీడియా కథనం తెలిపింది. పైగా లోగడ కేవలం అయిదారు కేజీల ఐఈడీని పేలుళ్లకు వినియోగిస్తే ఇప్పుడది 30, 40 కేజీలవరకూ ఉంటోంది. అందువల్ల ప్రాణనష్టం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించి అయినా అరణ్పూర్ వెళ్లిన డీఆర్జీ పోలీసులు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. ఒకప్పుడు లొంగిపోయిన ఆదివాసీలతో సల్వాజుడుం పేరుతో ప్రైవేటు దళాలను ఏర్పాటుచేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని రద్దుచేయక తప్పలేదు. ఆ తర్వాతే ఛత్తీస్‌గఢ్ పోలీసు విభాగంలో డీఆర్జీ పేరుతో ప్రత్యేక దళం ఏర్పాటయింది. ఇందులో కూడా అత్యధికులు లొంగిపోయిన మావోయిస్టులు. వారంతా ఆదివాసీలు. కనుక మావోయిస్టులకు వారిపై గురి ఉంటుంది. అటువంటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఘటన జరిగిన ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టులు బలంగా ఉండేవారనీ, ఇప్పుడు వారి ప్రభావం పూర్తిగా పోయిందనీ మీడియా కథనాలు చెబుతున్నాయి. డీఆర్జీ పోలీసుల్లో నిర్లక్ష్యానికి అది కూడా కారణమైవుండొచ్చు. ఒకప్పుడు మధ్య, తూర్పు భారత ప్రాంతాల్లో ఎంతో బలంగా ఉన్న తాము ఎందువల్ల బలహీ నపడవలసి వచ్చిందన్న ఆత్మవిమర్శ మావోయిస్టుల్లో కొరవడిందని తాజా ఉదంతం చెబుతోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడటం వల్ల ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తాయే తప్ప దానివల్ల కలిగే మార్పేమీ ఉండదని పదే పదే రుజువవుతోంది. మావోయిస్టులు ఏదో ఒక చర్యకు పాల్పడగానే సమీప ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలపై పోలీసులు విరుచుకుపడటం, అమాయ కులు సైతం బాధితులుగా మారడం చాన్నాళ్లుగా కనబడుతూనే ఉంది. అరెస్టులు, కేసులు, ఏళ్ల తరబడి జైళ్లపాలు కావటం పర్యవసానంగా ఆదివాసీ కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. పోషించేవారు లేక ఎన్నో కుటుంబాలు చెప్పనలవికాని ఇబ్బందులు పడుతున్నాయి. గతంతో పోలిస్తే మావోయిస్టుల ప్రభావంలో ఉన్న ప్రాంతాలు తగ్గిపోవడానికి ఇదొక ప్రధాన కారణం. కనీసం ఈ పరిణామమైనా తమ హింసాత్మక చర్యల్లోని నిరర్థకతపై పునరాలోచన కలిగిస్తే బాగుండేది. కానీ ఆ మాదిరి మార్పు రాలేదని ఈ ఉదంతం నిరూపించింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభి ప్రాయాలను ప్రకటించటానికీ, ప్రభుత్వ విధానాల్లో లోపాలున్నాయనుకున్నప్పుడు వాటికి వ్యతి రేకంగా ప్రజానీకాన్ని కూడగట్టడానికీ ఎప్పుడూ అవకాశాలుంటాయి. అలాంటి ఉద్యమాలను ప్రభుత్వాలు అణచివేయటానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటన కూడా అదే స్థాయిలో వస్తున్నది. సాగు చట్టాలపై ఏడాదిపైగా సాగిన రైతు ఉద్యమాన్ని నయానా భయానా నియంత్రించాలనుకున్న కేంద్రం చివరకు వారి డిమాండ్లకు తలొగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకోకతప్పలేదు. వీటన్నిటినీ మావోయిస్టులు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించే ప్రయత్నం చేయాలి. తమ హింసాత్మక చర్యలవల్ల సాధించేదేమీ లేకపోగా ఆదివాసులే కష్టనష్టాలు అనుభవించాల్సి వస్తున్నదని గుర్తించాలి. -
ఛత్తీస్‌గఢ్ అమరులకు ఘన నివాళులు
దంతెవాడ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో బుధవారం మావోయిస్టుల మందుపాతర పేల్చిన ఘటనలో అమరులైన 10 మంది పోలీసు సిబ్బంది, ఒక డ్రైవర్‌కు ఘనంగా నివాళులర్పించారు. కర్లి ప్రాంతంలోని పోలీస్‌లైన్స్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో మృతుల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం రోదనలు, భారత్ మాతా కీ జై నినాదాలతో ప్రతిధ్వనించింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తదితరులు హాజరై మృతులకు పూలతో నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను బఘేల్ ఓదార్చారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను వాహనాల్లో సొంతూళ్లకు తరలించారు. సీఎం బఘేల్ కూడా భుజం కలిపి ఒక జవాను మృతదేహాన్ని వాహనం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాలు వృథా కావని, మావోయిస్టులపై పోరు మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. దంతెవాడ జిల్లా అరన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసుల వాహనాన్ని నక్సల్స్ మందుపాతరతో పేల్చిన ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు(డీఆర్జీ) విభాగానికి చెందిన 10 మంది జవాన్లు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. శవపేటికను మోస్తున్న సీఎం బఘేల్ -
Dantewada: పేలుడు టైంలోని వీడియో బయటకు..
రాయ్‌పూర్: ఒక డ్రైవర్ సహా పది మంది పోలీసులను పొట్టబెట్టుకున్న మావోయిస్టుల ఘాతుకంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత మావోయిస్టులు భారీ దెబ్బ తీశారు. అయితే దంతేవాడ్ పేలుడు ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పేలుడు తర్వాత.. ఓ పోలీస్ సిబ్బంది అక్కడే ఉన్న మావోయిస్టులపై కాల్పులు జరపడానికి యత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పేలుడు తర్వాత.. మరో వాహనంలో ఉన్న పోలీస్ సిబ్బంది ఒకరు అక్కడే ఉన్న మావోయిస్టుల వైపుగా వెళ్తూ.. కాల్పులు జరిపేందుకు పొజిషన్ తీసుకుంటూ కనిపించాడు. ఓ వాహనం కింద దాక్కున్న మరో పోలీస్ సిబ్బంది అక్కడి పరిస్థితులను తన ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోలో పేలుడు జరిగిన ప్రదేశం కనిపిస్తోంది. ‘‘వాహనం మొత్తం పేల్చేశారు..’’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వాయిస్ వినిస్తోంది. పేలుడు ధాటికి పడిన పదడుగుల లోతు గుంత అంచులనూ క్లిప్‌లో చూడొచ్చు. ఇక క్లిప్ చివరిలో, తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆ వీడియో చిత్రీకరించిన పోలీస్ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్((DRG) తరపున మేం యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్‌లో మంగళవారం నుంచి పాల్గొంటున్నాం. బుధవారం మధ్యాహ్నం 1.30 గం. ప్రాంతంలో తిరుగుపయనం అయ్యాం. పేలిన వాహనానికి 100-150 మీటర్ల దూరంలో మేం ప్రయాణిస్తున్న ఎయూవీ ఉంది. మా వాహనంలో మేం ఏడుగురం ఉన్నాం. మొత్తం ఏడు వాహనాల కాన్వాయ్‌లో.. మూడో వాహనం మావోయిస్టులకు లక్ష్యంగా మారిందని తెలిపారు. పేలుడు ధాటికి ఆ వాహనంలో ఉన్న ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు. అంతా చనిపోయారు అని ఆయన తెలిపారు. మేం వాళ్లున్న దిశలో కాల్పులు జరిపాం. వాళ్ల వైపు నుంచి ఒకటి రెండు రౌండ్ల కాల్పులు మాత్రమే వినిపించాయి. ఆ తర్వాత కాల్పులు ఆగిపోయాయి అని ఆ సిబ్బంది తెలిపారు. కాన్వాయ్‌లోని ఏడు వాహనాల్లో మొత్తంలో 70 మంది సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. #Viral video surfaces showing moments after #Dantewada Naxal #attack in Chhattisgarh. pic.twitter.com/Xxr2mGr5t0 — Jammu Kashmir News Network 🇮🇳 (@TheYouthPlus) April 27, 2023 -
ఎదురుకాల్పుల్లో నేలకొరిగిన ముగ్గురు జవాన్లు
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ అటవీప్రాంతంలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డీఆర్జీ బలగాలు జేగురుగొండ నుంచి దండకారణ్య అటవీ ప్రాంతంలో రోజువారీ గాలింపుల్లో ఉండగా కందేడ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం మావోయిస్టులు కాల్పులు జరిపారు. ముగ్గురు జవాన్లు మృతి చెందగా గాయపడిన వారిని వెంటనే క్యాంప్‌కు తరలించి వైద్యమందించారు. రెండు ఏకే 47 తుపాకులు, 51 ఎంఎం మోరా్టర్‌ను మావోయిస్టులు అపహరించారు. కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయి ఉంటారని పోలీసులంటున్నారు. వారి కోసం భారీగా కూంబింగ్ చేపట్టినట్టు బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ చెప్పారు. ఆర్మీ జవాన్‌ను హతమార్చిన మావోయిస్టులు చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శనివారం ఓ ఆర్మీ జవాన్‌ను మావోయిస్టులు హతమార్చారు. జిల్లాలోని బడెతెవాడకు చెందిన జవాన్ మోతీరామ్ సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. సమీపంలోని ఉసేలీ వారపు సంతలో కోడి పందేలు చూస్తుండగా ముగ్గురు మావోయిస్టులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో మోతీరాం అక్కడికక్కడే మృతిచెందారు. -
బీరు బాటిల్ చూస్తే అనుమానించాల్సిన పరిస్థితి.. పక్కా ప్లాన్‌తో బాంబ్!
రోడ్డుపై, అడవుల్లో ఖాళీ బీరు బాటిళ్లను చూస్తే ఇక అనుమానించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మావోయిస్టులు కొత్త తరహాలో బీర్ బాటిల్ బాంబును అమర్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద ఉందని చెప్పకనే చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా ఉన్న మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(కె), భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో తమ కదలికలు ఉన్నాయని చెప్పేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో మావోయిస్టుల దుశ్చర్యలను గట్టిగా తిప్పికొడుతున్నారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ఏటూరునాగారం: ప్రెషర్ బాంబ్‌లు, కెమెరా ఫ్లాష్ బాంబ్‌లు, బ్యాటరీలు ఇలా అనేక రకాల మందుపాతరలు అమర్చిన మావోయిస్టులు రూటు మార్చారు. కూంబింగ్‌లో పాల్గొనే భద్రతా దళాలు, పోలీసులను ఏమారుస్తూ పేలుడు జరిపి భారీ విధ్వంసం సృష్టించేలా బీరు బాటిల్ బాంబ్ వ్యూహాన్ని అమల్లో పెడుతున్నారు. ప్రెషర్, బకెట్ బాంబులను భద్రతా దళాలు సులువుగా గుర్తిస్తుండటంతో తమ వ్యూహం మారుస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో పేలుడు తీవ్రత పెంచేందుకు మావోయిస్టులు పదునైన ఇనుప ముక్కలను పేలుడు పదార్థాల చుట్టూ ఉంచేవారు. అయితే మెటల్ డిటెక్టర్లు ఉపయోగించినప్పుడు, ఆ బాంబు జాడను భద్రతా దళాలు సులువుగా పసిగడుతున్నట్టు మావోయిస్టులు అనుమానిస్తున్నారు. దీంతో బీరు బాటిల్ బాంబు వ్యూహానికి పదును పెట్టినట్టు తెలుస్తోంది. ఖాళీ బాటిళ్లలో ఐఈడీ మావోయిస్టులు ఖాళీ బీరు బాటిళ్లలో ఐఈడీ తరహా పేలుడు పదార్థాలను కూర్చి విధ్వంసం సృష్టించే వ్యూహంఅమలుకు శ్రీకారం చుట్టారు. తాగి పడేసిన బీరు బాటిల్ అయితే భద్రతా దళాలు అనుమానించకుండా వదిలేస్తాయని, పైగా అందులో అమర్చిన బాంబు పేలినప్పు డు గాజు ముక్కల కారణంగా ప్రమాద తీవ్రత పెరుగుతుందనే అంచనాతో ఈ ప్లాన్ అమలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ తరహా బాంబులను ఒడిశాలో పేల్చి నట్టు సమాచారం. తాజాగా బీరు బాటిల్లో అమర్చిన బాంబును ములుగు జిల్లాలో పోలీసులు గుర్తించారు. పోలీసులు బయటకు తీసిన బీర్‌బాటిల్ , పేలుడు పదార్థాలు మందుపాతరలు, ప్రెషర్బాంబుల ఘటనలు ►ఈనెల 4న చర్ల మండలం కుర్నపల్లి మార్గంలో ఎర్రబోరు–బోదనెల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అమర్చిన శక్తిమంతమైన 20 కిలోల మందుపాతరను చర్ల పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల 28న చర్ల మండలంలోని కొండెవాయి సమీపంలోని ప్రధాన రహదారిపై శక్తిమంతమైన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల 26న కొండెవాయి అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలను మట్టుబెట్టేందుకు అమర్చిన ప్రెషర్ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల14న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పెగడపల్లి వద్ద అమర్చిన మందుపాతరను పేల్చడంతో ఏఎస్ఐ మహ్మద్ అస్లాం తీవ్రంగా గాయపడ్డాడు. ►2022 డిసెంబర్లో ఉంజుపల్లి సమీపంలో పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకొని పెట్టిన ప్రెషర్బాంబు పేలి ఆవు మృతిచెందింది. ►2021 జూలైలో చర్ల శివారు లెనిన్‌కాలనీ సమీపంలో చర్ల యువకుడు ప్రమాదవశాత్తు ప్రెషర్ బాంబును తొక్కడంతో అది పేలింది. కొత్త కోణంలో బాంబు... గతంలో ఏటూరునాగారం ఏజెన్సీ అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్‌కు ప్రయోగశాలగా ఉండేది. ఇప్పుడు మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, వాజేడు, వెంకటాపురం(కె) ప్రాంతాలను అనువైనవి గుర్తించి తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త తరహా దాడులకు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం పామునూరు అటవీ ప్రాంతంలో మందుపాతర అమర్చినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వాటిని వెతుక్కుంటూ వెళ్లిన భద్రత బలగాలకు విద్యుత్ వైర్లు కనిపించాయి. వాటిని చూసుకుంటూ ముందుకెళ్లగా ఖాళీ బీరు బాటిల్ కనిపించింది. ఆ వైర్లు ఆ సీసాలోకి పోయినట్లు గుర్తించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించి నిర్వీర్యం చేశారు. ఐఈడీ నింపిన సీసాలో భద్రత బలగాలకు గుచ్చుకునేలా ఇనుప బోల్ట్‌లు, రాగి రేకు ముక్కలు, ప్లాస్టిక్ లెడ్, కార్బన్ ముక్కలు, గన్ పౌడర్ ఇతర పేలుడు పదార్థాలను అందులో కూర్చి పెట్టారు. అది పేలితే పెద్ద ప్రమాదం ఉండేదని పోలీసులు చెబుతున్నారు. -
మావోయిస్టుల ఘాతుకం.. బీజేపీ నేత దారుణ హత్య
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళుతున్న బీజేపీ నేతను బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలోనే దారుణంగా నరికి చంపారు. దీంతో ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. బీజాపూర్ జిల్లా ఆవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పెకారం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ బీజేపీ అధ్యక్షుడు కెక్కెం నీలకంఠ (45) స్వగ్రామం పెకారం గ్రామం కాగా, కొంతకాలంగా ఊసూరులోనే ఉంటున్నాడు. ఆదివారం పెకారంలో వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మావోయిస్టులు నీలకంఠను కత్తులతో పొడవడంతో పాటు గొడ్డళ్లతో దారుణంగా నరికారు. ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందునే హతమార్చామని మృతదేహం వద్ద లేఖ వదలివెళ్లారు. దీంతో, ఈ ఘటన సంచలనంగా మారింది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే చంపాలని అనిపిస్తోంది..!
విద్యానగర్ (కరీంనగర్): టీఆర్ఎస్ పాలనలో ఎంపీటీసీలు మొదలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అవినీతి అడ్డూఅదుపు లేకుండా పోయిందని, అందుకే మావోయిస్టుల హెచ్చరికలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకుల అవినీతి ఇలాగే సాగితే రానున్న రోజుల్లో ‘అన్నలు’వస్తారని, పది నిమిషాల్లో అందరినీ చంపేసి వెళ్లిపోతారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, మెడికల్ ఉద్యోగాల మాఫియాపై మావోయిస్టులు సీరియస్‌గా ఉన్నారని, వారు దాడి చేయాలనుకుంటే 10 నిమిషాల్లో పని పూర్తిచేసి బార్డర్ దాటి వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి అంతా సీఎం కేసీఆర్‌కు తెలిసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ మంత్రి బావ రూ.8కోట్ల ప్రాపర్టీని ఆక్రమించినప్పటికీ అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే తనకే చంపాలని అనిపిస్తోందని గోనె వ్యాఖ్యానించారు. -
గూడ్స్ రైలుని హైజాక్ చేసిన మావోయిస్టులు
సాక్షి, విశాఖపట్నం: దంతెవాడ–కిరండూల్ సెక్షన్లో వెళ్తోన్న కేవీఎస్ 11 నంబర్ గూడ్స్ రైలుని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. బచెలి–భాన్సీ బ్లాక్ సెక్షన్ 433 కి.మీ సమీపంలో గూడ్స్ వెళ్లే ట్రాక్ పైకి 50 మంది మావోయిస్టులు చేరుకున్నారు. ట్రాక్‌కి అడ్డంగా నిలబడి రెడ్ క్లాత్ చూపుతూ..ట్రైన్‌ని నిలిపివేయాలని ఆదేశించారు. అప్రమత్తమైన సిబ్బంది.. ఎమర్జెన్సీ బ్రేక్ వేసి. రైలుని ఆపారు. ట్రైన్‌లోకి మారణాయుధాలతో మావోయిస్టులు ప్రవేశించి డ్రైవర్, ఇతర సిబ్బంది, వెనుక భాగంలో ఉండే గార్డ్ నుంచి వాకీ టాకీలు తీసుకున్నారు. మిగిలిన కొందరు ట్రాక్‌పై కాపలా కాయగా..కొంతమంది లోకోమోటివ్‌కి బ్యానర్ కట్టారు. అనంతరం కొన్ని కరపత్రాల్ని గూడ్స్ రైలు సిబ్బందికి ఇచ్చి దంతెవాడ వరకూ వెళ్లి అక్కడ పంపిణీ చేయాలని ఆదేశించారు. 10 నిమిషాల తర్వాత రైలు దిగి మావోయిస్టులు అడవిలోకి వెళ్లడంతో అక్కడి నుంచి రైలు బయలుదేరి భన్సీకి చేరుకుంది. వాల్తేరు డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి ఆ సెక్షన్ పరిధిలో మిగిలిన రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాలని ఆదేశించారు. కోరస్ కమాండో బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టి..రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరిస్తామని డీఆర్ఎం తెలిపారు. కాగా, సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు 18వ క్రాంతి కారీ వార్షికోత్సవాన్ని దేశమంతా నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. -
సాక్షి కార్టూన్ 18-02-2022
ఇక మన హింస కాస్త తగ్గిస్తే బెటర్ -
నయా సావిత్రి.. భర్తను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. భార్య ఏం చేసిందంటే..?
రాయ్‌పూర్ : పురాణాల్లో భర్త ప్రాణాల కోసం యుముడినే సావిత్రి ఎదురించిందని చెబుతుంటారు. అదే విధంగా తన భర్త ప్రాణాల కోసం అడవి బాట పట్టింది ఓ మహిళ. మావోయిస్టుల చెర నుండి తన భర్తను రక్షించుకునేందుకు రెండున్నరేళ్ల కూతురితో సహా తన ప్రాణాలనూ ఫణంగా పెట్టింది. తీరా భర్తను మావోయిస్టులు విడిచిపెట్టినా.. ఆమె మాత్రం అడవి నుంచి ఇంకా బయటకు రాకపోవడం కుటుంబ సభ్యులను ఆందోళన గురిచేస్తోంది. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల ఇంజినీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిసిన అశోక్ పవార్ భార్య సోనాలీ పవార్ తీవ్ర ఆవేదనకు గురైంది. దీంతో తాను ఎలాగైనా తన భర్తను రక్షించుకోవాలని భావించి.. పవార్‌ను విడుదల చేయాలని మావోయిస్టులను వేడుకుంటూ ఓ వీడియోను విడుదల చేసింది. కాగా, ఈ వీడియోకు నక్సల్స్ నుంచి స్పందన రాకపోవడంతో ఆమె అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. స్థానిక జర్నలిస్టు సాయంతో ఆమె తన రెండున్నరేళ్ల కూతురిని వెంటతీసుకొని దండకారణ్యంలోకి వెళ్లింది. ఇదిలా ఉండగా కిడ్నాప్‌కు గురైన అశోక్ పవార్, ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు విడిచిపెట్టడంతో వారు సురక్షితంగా బయటకు వచ్చారు. కానీ, వారిని వెతుక్కుంటూ వెళ్లిన సోనాలీ పవర్ మాత్రం అడవి నుంచి బయటకు రాకపోవడంతో పోలీసులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. అడవి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అశోక్ పవార్, ఆనంద్ యాదవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. అశోక్ పవార్ స్వల్ప అస్వస్థతకు గురైనట్టు పేర్కొన్నారు. సోనాలీ పవార్ కూడా సురక్షితంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, నక్సల్స్ తమను ఇబ్బంది పెట్టలేదని, ఇరువురికి రూ. 2వేలు ఇచ్చి అడవి నుంచి పంపించినట్టు ఆనంద్ యాదవ్ వెల్లడించారు. -
అడవిబాట పట్టిన భార్య.. మావోయిస్టుల చెరలో ఇంజనీర్
-
ఎప్పుడూ ఇంటి గుమ్మం దాటని అర్పిత... నాకోసం చంకలో బిడ్డను ఎత్తుకుని
Chhattisgarh Sub Engineer Ajay Roshan Lakra Abducted By Maoists Released Credit Goes To His Wife: అడవి భయపెడుతుంది. క్రూరమృగాలు ఉంటాయి. అడవి భయపెడుతుంది. దారులు తెలియకుంటాయి. అడవి భయపెడుతుంది. తుపాకులు పేలుతాయి. కాని ఆమె భయపడలేదు.ప్రాణాలు లెక్క చేయలేదు. వెనక్కు మరలలేదు. కిడ్నాప్ అయ్యి అడవిలో ఉన్న భర్త కోసం చంకలో మూడేళ్ల బిడ్డను పెట్టుకుని ముందుకు సాగింది. భర్త విడుదలకు మంకుపట్టు పట్టింది. అడవికి కూడా మనసు ఉండే ఉంటుంది. అందుకే ఆమెకు తల వంచింది. తాను ఓడి ఆమెను గెలిపించింది.ఈ ఏడాది నవంబర్‌లో చత్తిస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనను ‘సాక్షి’కి వివరించింది. నవంబర్ 11. 35 ఏళ్ల అజయ్ రోషన్ లక్రా బిజాపూర్‌లో సబ్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ‘ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన’ కింద పల్లెల్లో రోడ్లు వేయించడం అతడి పని. ఆ పనిలో భాగంగానే ప్యూన్ లక్ష్మణ్‌ను తీసుకుని అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోర్నా అనే గ్రామానికి వెళ్లాడు. వెంటనే మావోయిస్టులు అతణ్ణి, లక్ష్మణ్‌ను కిడ్నాప్ చేశారు. రోషన్ లక్రాను మావోయిస్టులు కాంట్రాక్టర్ అనుకున్నారు. కాని రోషన్ లక్రా కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతణ్ణి ఎలా విడుదల చేయాలి. ప్యూన్ని వదిలిపెట్టిన మావోయిస్టులు రోషన్ ను తమ వద్దనే ఉంచుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే భర్త కోసం అర్పిత బయలుదేరింది. 20 కిలోమీటర్లు... చంకన మూడేళ్ల కొడుకుతో అడవిలో నడుస్తూనే ఉంది. అడవి జంతువులు ఎదురైతే చెట్లు, బండ రాళ్ల మధ్య దాక్కుంటూ ముందుకెళ్లింది. అడుగు తీసి అడుగు వేస్తే విషసర్పాలు.. అయినా ఆమె బెదరలేదు. భర్తను విడిపించుకోవాలనుకున్న ఆమె పట్టుదలను చూసిన మీడియా, గ్రామస్తులు తోడుగా నిలిచారు. చివరకు మావోయిస్టులను ఒప్పించి భర్తను తిరిగి అప్పగించేలా చూశారు. బీజాపూర్‌లో అర్పితను ‘సాక్షి’ కలవగా ఆమె భర్త కోసం చేసిన పోరాటాన్ని ఇలా వివరించింది. మొదటి రోజు.. నా పేరు అర్పిత. మాది చత్తిస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా. బీజాపూర్ నుంచి700 కిలోమీటర్లు. 2018లో మా ఆయనకు బీజాపూర్‌కు బదిలీ అయింది. నేను మాత్రం ఏడాది క్రితమే బీజాపూర్‌కు వచ్చాను. నాకు హిందీ తప్ప మరాఠీ, గోండి భాషలు రావు. రోజంతా ఇంట్లోనే బాబుతో గడుపుతున్న. మా ఆయన మధ్యాహ్నం భోజనం ఇంట్లోనే తినేవారు. ఎట్టి పరిస్థితిల్లోనూ చీకటి పడక ముందే ఇంటికి చేరుకునేవారు. గత నెల 11వ తేదీన కూడా డ్యూటికీ వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పారు కానీ రాలేదు. మధ్యాహ్నం 2, 3 గంటల ప్రాంతంలో ఆయన ఫోన్‌కు ట్రై చేస్తే స్విచాఫ్ వచ్చింది. ఆఫీస్ పని మీద బయటికి వెళ్లారని అనుకున్నా. సార్ ఇంటికి వచ్చారా? సాయంత్రం 6 గంటలకు ఆయన ఆఫీస్ నుంచి ఇద్దరు వచ్చారు... అజయ్ సార్ వచ్చారా? అని. నేను ఎందుకు.. ఏమైందని అడిగా. వాళ్లు ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు. అప్పటికే ఆయన ఎక్కడికి వెళ్లి ఉంటారోననే టెన్షన్ పట్టుకుంది. రాత్రి 10 అయింది. ఆయన ఆఫీస్ నుంచి నలుగురు వచ్చారు. మీ ఆయన గోర్నా అటవీ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనుల పర్యవేక్షణ కోసం వెళ్లారు. బహుశా దారి తప్పి ఉంటారు. రేపు ఉదయం వచ్చేస్తారు.. కంగారు పడకండి అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అవసరమైతే మీకు తోడుగా మా ఇంటి మహిళలు ఉంటారు అన్నారు. నేను మళ్లీ అడిగాఏఉ అసలేం జరిగిందో చెప్పండి.. నాకు మూడేళ్ల బాబు (కియాన్ రోషన్) ఉన్నాడు... ఇక్కడ నాకు నా అనే వాళ్లు ఎవరూ లేరని వాళ్లతో అన్నాను. ఆఫీస్ నుంచి వచ్చిన వారు మళ్లీ అదే చెప్పి నిశ్చింతగా ఉండమన్నారు. రెండో రోజు... నవంబర్ 12. ఉదయం 8. ఆఫీస్ నుంచి ఇద్దరు వచ్చారు. అజయ్‌ని మావోయిస్టులు బందీ చేశారనే పిడుగు లాంటి వార్త చెప్పారు. వారి మాటలు వినగానే నేను నా భర్తను ఎలా రక్షించుకోవాలో చెప్పండి... అడవికి వెళ్తాను అన్నాను. దానికి వారు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వదిలిపెడతారని తెలిసింది... అప్పటి వరకు ఓపిక పట్టండి అన్నారు. మా ఆయనకు సంబంధించిన గుర్తింపు కార్డులు అడిగితే ఇచ్చా. వాటిని తీసుకెళ్లారు. రాత్రి 10 దాటింది. మా ఆయన గురించి ఏ సమాచారం తెలియదు. ఉదయం 8 గంటల నుంచి ఇంటి గుమ్మం ముందే బాబుతో కూర్చున్న. మావారు ఎప్పుడొస్తారా? అని ఎదురుచూసిన. అయినా అజయ్ రాలేదు. అప్పుడే నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది... మా ఆయనతో వెళ్లిన ప్యూన్ లక్ష్మణ్ ను మావోయిస్టులు వదిలిపెట్టారని. యి ఆయనను దండకారణ్యంలోకి తీసుకెళ్లారని. అది విని రాత్రంతా ఏడుస్తూనే గడిపా. మూడో రోజు.. మరుసటి రోజు నవంబర్ 13వ తేదీ ఉదయం. మా ఆయన ఆఫీస్ సిబ్బందితో కలిసి లక్ష్మణ్‌ను కలిసి మాట్లాడడానికి ఆయన ఇంటికి వెళ్లా. ‘మావోయిస్టులు నన్ను, సార్‌ను వేర్వేరుగా ఉంచారు మేడమ్. రెండ్రోజుల్లో ఆయన్ను ఒక్కసారి మాత్రమే చూశా.’ అని లక్ష్మణ్ అన్నాడు. మీడియా, ఆఫీస్ సిబ్బందితో కలిసి లక్ష్మణ్‌ను వదిలిపెట్టిన ఊరికి వెళ్లిన. అక్కడి గ్రామస్తుల ముందు నా బాధ చెప్పుకున్న. ‘మేం వాళ్లతో మాట్లాడతాం. మీ ఆయన ఇంటికి వచ్చేస్తాడు వెళ్లండి’ అని గ్రామస్తులు చెప్పారు. సాయంత్రం ఇంటికి వచ్చేశా. ఆ రాత్రి కూడా అజయ్ రాలేదు. నాలుగో రోజు నవంబర్ 14న ఉదయమే లేచి బాబుతో మళ్లీ అడవికి బయలుదేరిన. మధ్యలో మమ్మల్ని చూసిన ఆఫీస్ సిబ్బంది ఒంటరిగా వెళ్లొద్దు... ప్రమాదముందని వెళ్లకుండా ఒత్తిడి తెచ్చి ఇంటికి పంపించేశారు. ఆ రోజూ మా ఆయన గురించి ఎలాంటి సమాచారం రాలేదు. ఐదో రోజు ఐదో రోజు నవంబర్ 15న మీడియాతో కలిసి మరో ఊరికి వెళ్లిన. మా ఆయన్ను అక్కడికి తీసుకెళ్లారని తెలిసింది. ఆ గ్రామస్తులు అజయ్ ఈరోజు వచ్చేస్తారు అని కచ్చితమైన హామీ ఇవ్వడంతో ఇంటికి వచ్చేశా. ఆరోజూ మావారు ఇంటికి రాలేదు. అజయ్‌ను ఏదైనా చేసి ఉంటారా..? ఆయన బతికే ఉన్నాడా..? అనే ఏవేవో ఆలోచనలు రాసాగాయి. ఆ ఆలోచనలు రావద్దనుకున్నా పరిస్థితుల్ని చూస్తే అలానే అనిపించింది. ఆరో రోజు..! మా ఆయనను కిడ్నాప్ చేసిన ఆరో రోజైన నవంబర్ 16న మళ్లీ అడవి బాట పట్టా. ఇంటికి వస్తే మా ఆయనతోనే.. లేకపోతే రావొద్దని నిర్ణయించుకున్నా. నలుగురు మీడియా సభ్యులు నాకు తోడుగా అడవిలోకి వచ్చారు. ముందురోజు మేం వెళ్లిన ఊరికి వెళ్లి అడిగితే ఇంకో గ్రామం పేరు చెప్పారు. అయినా అధైర్యపడలే. వారు చెప్పిన ఊరికి వెళ్లాం. ఎవర్ని ఎంత అడిగినా తెలియదన్నారు. చీకటి పడుతోంది. నేను, మీడియా అక్కడ ఓ చిన్న స్కూల్లో బస చేశాం. మీడియాలో ఓ మహిళ కూడా ఉండడం నాకు ధైర్యానిచ్చింది. ఆ సమయంలో బిస్కట్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లే మా కడుపు నింపాయి. ఏడో రోజు మరుసటి రోజు నవంబర్ 17న ఉదయం లేచి గ్రామస్తులను మరోసారి వేడుకున్నాం. ఐదోరోజు వెళ్లిన ఊరికి వెళ్లాలని, అక్కడ ప్రజా కోర్టు ఉందని వారు సూచించారు. హుటాహుటిన ఆ ఊరికి వెళ్లాం. మేం అక్కడికి చేరుకోగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. ఏం జరుగుతుందోననే భయం పట్టుకుంది. బాబును గట్టిగా గుండెకు హత్తుకుని ముందుకు వెళ్లా. అప్పటికే ప్రజాకోర్టు ముగియడంతో ముందు నలుగురు, వెనక పది మందికి పైగా తుపాకులతో వస్తున్నారు. మధ్యలో నా అజయ్ కనిపించారు. ఆయన్ను చూడగానే ఏడ్చుకుంటూ పరుగెత్తుకుని వెళ్లి కౌగిలించుకున్న. మా ఆయన్ను క్షేమంగా వదిలిపెట్టినందుకు మావోయిస్టులతో పాటు సహకరించిన గ్రామస్తులు, మీడియాకు మేం రుణపడి ఉన్నాం. అర్పితే నన్ను తీసుకొచ్చింది : అజయ్ రోషన్ గత నెల 11న నేను, నా ఫ్యూన్ లక్ష్మణ్‌తో కలిసి రోడ్డు పని పర్యవేక్షణకు గోర్నాకు వెళ్లా. తిరుగు పయనంలో పది మంది మావోయిస్టులు నన్ను, లక్ష్మణ్‌ను అడ్డగించారు. స్థానికుడొకరి పేరు చెప్పి ఆయనతో చెప్పి వచ్చారా..? అని అడిగారు. మేం అవునన్నాం. మమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి అడవి లోపలికి తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్లు తీసుకుని స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత కళ్లకు గంతలు కట్టారు. పేరు, ఉద్యోగం, కుటుంబ వివరాలు, అడ్రస్ అడిగారు. నన్ను లక్ష్మణ్‌ను అప్పుడే వేరు చేశారు. మరుసటి రోజు గుట్టపైకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 17వ తేదీ వరకు ఎనిమిది స్థావరాలు తిప్పారు. వెళ్లిన ప్రతిచోటా పేరు, ఉద్యోగం, కుటుంబ వివరాలు, అడ్రస్ ఇవే అడిగారు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పిన. వాళ్లు ఎంక్వైరీ చేసుకున్నారనుకుంటా. ఏడో రోజు నన్ను ప్రజాకోర్టుకు తీసుకెళ్తున్నామని, నన్ను వదిలిపెట్టాలో.. లేదో.. వారే నిర్ణయిస్తారని చెప్పారు. అప్పుడు నేను టెన్షన్ పడ్డ. అర్పిత ఎప్పుడూ ఇంటి గుమ్మం దాటలేదు. నాకేదైన అయితే ఎంతో దూరంలో ఉన్న వాళ్ల ఊరికి ఒంటరిగా ఎలా వెళ్తుందో అని ఆందోళన చెందా. చివరకు నన్ను వారు చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి వద్దని పెద్ద గొంతుతో అరిచారు. అంతలోనే నా కళ్ల గంతలు విప్పారు. దూరం నుంచి అర్పిత పరుగెత్తుకుని వచ్చి.. ఏడుస్తూ నన్ను కౌగిలించుకుంది. తర్వాత మమ్మల్ని వెళ్లిపొమ్మన్నారు. కియాన్‌ను చంకలో ఎత్తుకుని అడవిలో నా అర్పిత పడ్డ బాధల్ని చూసే మావోయిస్టులు నన్ను వదిలిపెట్టారని అనుకుంటున్న. – ముహమ్మద్ ముజాహిద్ బాబా సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
ఈశాన్యానికి లాంగ్‌మార్చ్?
సాక్షి, హైదరాబాద్: కీలక నేతల మరణాలు, లొంగుబాట్ల నేపథ్యంలో ఉనికి కోసం మావోయిస్టు పార్టీ వ్యూహం మారుస్తోందా? కేడర్‌ను కాపాడుకు నేందుకు ఈశాన్య రాష్ట్రాలకు ‘మార్చ్’ చేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొన్నాళ్ల పాటు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాలను వదిలేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమబెంగాల్ ద్వారా నాగాలాండ్ చేరువ వ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అను కూలంగా లేని వాతావరణం కావడంతో ఉన్న నేత లను, కేడర్‌ను కాపాడుకునే పనిలో మావోయిస్టు పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఏవోబీలో ఉన్న ఆరు కమిటీలను రెండు కమిటీలుగా, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 4 కమిటీలను రెండు కమిటీలుగా మార్చేసిన మావో యిస్టు పార్టీ.. కేడర్‌ను కాపాడే పనిలో నిమగ్న మైంది. ఆర్కే మరణం, హిడ్మా ఆరోగ్య పరిస్థితి, పెద్దగా కార్యకలాపాలు లేని తెలంగాణ కమిటీ.. ఇలా అన్ని కమి టీలు దీనావస్థలో ఉండటంతో కేవలం ఆత్మరక్షణ కోసమే కార్యాచరణ రూపొందిం చుకున్నట్టు తెలిసింది. బలంగా ఉన్న అబూజ్మడ్ (ఛత్తీస్‌గఢ్)ను సైతం వదిలి వెళ్లక తప్పదనే కేంద్ర కమిటీ సూచనతో ఆత్మరక్షణ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. ఎందుకీ పరిస్థితి.. ఛత్తీస్‌గఢ్, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీలపై బలగాలు రెండేళ్లుగా ప్రత్యేక దృష్టి సారించాయి. కేంద్ర హోంశాఖతోపాటు ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు సంయుక్తంగా ప్రతీ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టాయి. ఆయా ప్రాంతాల్లో బేస్ క్యాంపులను పెంచుకొని ప్రత్యేక శాటిలైట్ ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. దీంతో మావోయిస్టు పార్టీకి చేరాల్సిన ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందులు, డబ్బులు, ఆయుధాలు.. ఇలా ప్రతీ వ్యవహారంసైనా కదలికలను బేస్ క్యాంపుల ద్వారా పసిగట్టి నియంత్రించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండానే ఇన్ఫార్మర్లు/కొరియర్లుగా వ్యవహరిస్తున్న వారిని నియంత్రించి సక్సెస్ అయ్యారు. మావో అగ్రనేత ఆర్కే మరణం కూడా ఇందులోభాగమే అని ఆ పార్టీ బహిరంగంగానే ఆరోపించింది. మందులు, ఇతర నిత్యావసరాలను అడ్డుకొని ఆరోగ్యం క్షీణించేలా చేశారని ఆర్కే భార్య కూడా ఆరోపించింది. వారసంతలపైనా నిఘా అబూజ్మడ్తోపాటు ఏవోబీలోని వారసంతలపైనా బలగాలు నిఘా పటిష్టం చేశాయి. ప్రతీ కుటుంబం ప్రతీ వారం కొనుగోలు చేసే వస్తువులపై నిఘా పెట్టింది. మునుపటి వారం కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే ఇంట్లో ఏదైనా శుభకార్యముందా? లేక మావోయిస్టు పార్టీకి అందించేందుకు కొనుగోలు చేశారా అన్నంత లోతుగా ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నాయి. సర్జరీ ఆధారిత మందులు, పెయిన్ కిల్లర్లు, కరోనా మెడిసిన్స్.. ఇలా ఆయా ఏరియాల్లోని మందుల షాపుల్లో కొనుగోలు చేసే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్ సైతం చేసింది. కొనుగోలుదారుల కదలికలను పసిగట్టి కొరియర్లను తమవైపు తిప్పుకోవడంలో కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర బలగాలు సక్సెస్ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంచేశాయి. దీనివల్లే అనారోగ్యం బారిన పడిన సీనియర్ నేతల మరణాలు జరిగినట్టు చెప్తున్నాయి. ఇదేకాకుండా రెండేళ్ల నుంచి జరిగిన రాష్ట్ర, కేంద్ర కమిటీ కీలక నేతల లొంగుబాట్లు ఆ పార్టీని మరింత అఘాతంలోకి నెట్టాయని భావిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీలు అవలంబించే విధానాలు, వ్యూహాత్మక చర్యలను పసిగట్టి నిలువరించడంలో బలగాలు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కొన్నాళ్లపాటు ఈ రెండు ప్రాంతాలను వదిలి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడినట్టు బలంగా వినిపిస్తోంది. ఎనిమిది నెలలుగా ఒక్క నియామకం లేదు... ఒకవైపు కీలక నేతల మరణాలు, మరోవైపు లొంగుబాట్లతో అతలాకుతలం అవుతున్న మావోయిస్టు పార్టీని కొత్త రక్తం లేక మరింత చీకట్లోకి నెట్టింది. ఛత్తీస్‌గఢ్, ఏవోబీ, తెలంగాణ, మహారాష్ట్రలో కొత్త నియామకాలు ఏమాత్రం జరగలేదు. ఎనిమిది నెలలుగా అంటే ఈ ఏడాదిలో దాదాపుగా రిక్రూట్మెంట్ లేకుండా చేయడంలో పోలీసులు పైచేయి సాధించారు. నియామకాలు జరగకపోవడంపై ఒక్క ఉదాహరణ మావోయిస్టు పార్టీ నుంచే వినిపిస్తోంది. ఆర్కే తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఒక ప్లాటూన్ కేవలం ఆయన రక్షణ కోసమే పనిచేసింది. మంచానికే పరిమితమైన ఆర్కేను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆయన చుట్టూ ఉన్న ప్లాటూన్ రక్షణ దళానికి కాపలాగా లోకల్ గెరిల్లా టీమ్ రక్షణ కవచంగా నిలిచింది. ఇలా మూడు నెలల పాటు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఏవోబీ జోనల్ కమిటీ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆర్కే కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. కేవలం తన కోసం రెండు వ్యవస్థలు కార్యకలాపాలు చేయకుండా ఉండిపోవడం పార్టీకి నష్టాన్ని కల్గిస్తుందని, కొంతమంది మినహా మిగతా బృందాలు కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలని సూచించారని తెలిసింది. నియామకాలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని పదేపదే చెప్పినట్టు సమాచారం. కొద్దిరోజులు దూరంగా..! ప్రస్తుత కీలక పరిణామాలతో ఈ రెండు ప్రాంతాల నుంచి కొద్దిరోజులపాటు దూరంగా ఉండటం మంచిదని, అందుకు ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్లకతప్పదని కేంద్ర కమిటీ భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఛత్తీస్‌గఢ్, ఏవోబీలో ఉన్న కీలక నేతలు, ముఖ్య కేడర్‌ను పశ్చిమబెంగాల్ మీదుగా నాగాలాండ్‌కు చేరుకోవాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చినట్టు పార్టీలోనూ చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ఉనికికే ప్రమాదం అన్న పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలకు బ్రేక్ ఇచ్చి నాగాలాండ్ రావాల్సినట్టుగా ఆదేశాలున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కార్యకలాపాల విస్తృతికి అక్కడి నుంచే పనిచేయాలన్న ఆలోచనలో కేంద్ర కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. -
ఎన్కౌంటర్లో మావోయిస్టుల సామగ్రి స్వాధీనం
పాడేరు: ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మథిలి పోలీసుస్టేషన్ పరిధిలోని తుల్సి పహద్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులకు చెందిన భారీ సామగ్రి, తుపాకీలను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దండకారణ్యంలో ఎస్‌వోజీ, జీవీ ఎఫ్ పార్టీలు, ఇతర పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించగా ఎదురు కాల్పుల ఘటనలో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మల్కన్‌గిరి జిల్లా సుదాకొండ గ్రామానికి చెందిన అనిల్ అలియాస్ కిషోర్ అలియాస్ ముఖసొడి (ఏసీఎస్ క్యాడర్, రూ.5 లక్షల రివార్డు) ఆంధ్రా, ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీలోని గుమ్మ బ్లాక్‌లో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు సోని ఏసీఎం క్యాడర్లో మావోయిస్టు కీలకనేత ఉదయ్‌కు ప్రొటెక్షన్ టీంలో పనిచేస్తున్నారు. ఆమెపైనా రూ.4 లక్షల రివార్డు ఉంది. ఆంధ్రాకు చెందిన విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలానికి చెందిన చిన్నారావు మావోయిస్టు సభ్యుడిగా, మావోయిస్టు మహిళ నేత అరుణ ప్రొటెక్షన్ టీంలో పనిచేస్తున్నారు. ఆయనపై రూ.లక్ష రివార్డు ఉంది. ఈ ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి దండకారణ్యంలో గట్టిదెబ్బ తగిలింది. -
దండకారణ్యంలో ఎన్కౌంటర్
పాడేరు (విశాఖ)/మల్కన్‌గిరి (ఒడిశా): ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దున దండకారణ్యంలో మంగళవారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తులసి పహాడ్ ప్రాంతంలోని ఓ చోట మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు మల్కన్‌గిరి ఎస్పీ ప్రహ్లాద్ సాయిల్ మిన్నాకి సమాచారం అందింది. అప్రమత్తమైన ఆయన ఆ ప్రదేశంలో కూంబింగ్ నిర్వహించాల్సిందిగా ఎస్‌వోజీ, డీబీఎఫ్ జవాన్లను ఆదేశించారు. దీంతో సోమవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టిన జవాన్లకు మంగళవారం ఉదయం మావోయిస్టుల శిబిరం కనిపించింది. జవాన్ల రాకను పసిగట్టిన మావోయిస్టులు వారి నుంచి తప్పించుకునేందుకు వారిపై కాల్పులు జరిపారు. ఆ వెంటనే జవాన్లు కూడా కాల్పులు ప్రారంభించారు. దాదాపు 2 గంటలపాటు సాగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు దుర్మరణం చెందారు. మావోలు విసిరిన గ్రెనేడ్ దాడిలో ఓ జవాన్‌కు గాయాలయ్యాయి. మరణించిన మావోయిస్టుల్లో ఆంధ్రా కేడర్‌కు చెందిన చిన్నారావు, మహిళా మావోయిస్టు సోనీ, మరో మహిళా మావోయిస్టు ఉన్నారు.కాగా, కొందరు మావోయిస్టులు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుని పరారయ్యారు. అనంతరం మావోయిస్టుల శిబిరంలోని డంప్ నుంచి వివిధ రకాల తుపాకులు, బుల్లెట్లు, మందుగుండు సామగ్రి, మావోయిస్టుల యూనిఫాం, వంట సామగ్రి, మందులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో మావోయిస్టుల మృతదేహాలను పోలీసు బలగాలు మోసుకుని వస్తున్నట్టు తెలిసింది. రోడ్డు మార్గానికి చేరేంత వరకు మృతదేహాల తరలింపులో ఎస్‌వోజీ బలగాలు అష్టకష్టాలు పడుతున్నట్టు సాయంత్రానికి శాటిలైట్ ఫోన్లో పోలీసు అధికారులకు సమాచారం అందింది. ఘటనలో మరికొందరు మావోలు తప్పించుకోవడంతో పోలీసు బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. శిబిరంలో మల్కన్‌గిరి–కొరాపుట్–విశాఖ డివిజినల్ మావోయిస్టు అగ్రనేతలు రాకేష్, అరుణ ఉన్నట్టు సమాచారం అందడంతోనే కూంబింగ్ జరిపామని, నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో మూడుసార్లు ఎదురుకాల్పులు జరిగాయని ఎస్పీ పేర్కొన్నారు. -
దంతేవాడలో మావోయిస్టుల దుశ్చర్య.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు
ఛత్తీస్‌గఢ్: దంతేవాడలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గోతియా అటవీ ప్రాంతంలో ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో నారాయణపూర్ జిల్లా నుంచి దంతేవాడ వస్తున్న ఓ బొలెరో వాహనం ధ్వంసం కావడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు మలేవాహి పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు. -
సంస్మరణంపై ‘డ్రోన్’ నిఘా
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో పారా మిలటరీ, పోలీసు బలగాలు మళ్లీ అప్రమత్తమయ్యాయి. కరోనా, కోవర్టుల కారణంగా ఇటీవల మావోయిస్టు పార్టీ పలువురు ఉద్యమకారులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుందామని ఆ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గతంలో ఏటా రెడీమేడ్ స్థూపాలు ఏర్పాటు చేసి వారోత్సవాలు ఘనంగా నిర్వహించేవారు. మావోయిస్టులు క్రమంగా ఈ ప్రాంతాల్లో పట్టు కోల్పోవడంతో కొన్నేళ్లుగా మైదాన ప్రాంతాల్లో నిర్వహించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా నక్సల్స్‌పై ప్రభుత్వాల వైఖరి మారలేదు. ఓ వైపు పోలీస్ ఎన్కౌంటర్లు, మరోవైపు కరోనా మావోయిస్టు పార్టీ కీలక నేతలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు తప్పకుండా నిర్వహించాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఘనంగా నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తుండగా, అడ్డుకునేందుకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండటంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. డేగ కన్ను, ‘డ్రోన్’నిఘా... మూడు రాష్ట్రాల్లో సాయుధ పోలీసు బలగాలు మావోయిస్టు వారోత్సవాలపై డేగకన్ను వేశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గోదావరి తీరం వెంట పోలీసు క్యాంపులు ఏర్పాటు చేశారు. తూర్పు డివిజన్ సరిహద్దుల్లో పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. మహాముత్తారం, మహదేవపూర్, ఏటూరునాగారం అటవీ ప్రాంతాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. అటవీ ప్రాంతాల్లో పోలీస్ బలగాలు నిరం తరం కూంబింగ్ నిర్వహిస్తున్నా యి. ఇటీవల ములుగు–భూపాలపల్లి–పెద్దపల్లి జిల్లాల మావోయిస్టు పార్టీ క మిటీ కార్యదర్శి కంక నాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ పేరిట పలు ప్రజా సమస్యల విషయమై అధికార పార్టీ నేతలపై హెచ్చరి కలు జారీ చేయడంతో పోలీస్‌లు అప్రమత్తమ య్యారు. గిరిజన గ్రామాలపై ‘డ్రోన్’నిఘా కొనసాగుతోంది. -
11 మంది కిడ్నాప్: త్రుటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే
రాయ్‌పూర్: మావోయిస్టుల దాడి నుంచి ఓ ఎమ్మెల్యే త్రుటిలో తప్పించుకున్నారు. ఓ పర్యటనలో ఉండగా మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. ఈ సమయంలో ఎమ్మెల్యే తప్పించుకోగా భద్రతా విధుల్లో ఉన్న ఓ జవాన్ మృతి చెందగా మరో జవాన్ గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చందన్ కశ్యప్ మంగళవారం ఓర్చాలో పర్యటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రతా దళాలు వెంటనే ఉన్నారు. ఎమ్మెల్యే పర్యటన విషయం తెలుసుకున్న మావోయిస్టులు ఎమ్మెల్యే పర్యటనపై దాడి చేశారు. ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుపడడంతో భద్రతా దళాలు ఎదుర్కొనేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు జరిగిన కాల్పుల్లో ఓ ఐటీబీపీ జవాన్ మృతి చెందాడు. ఇంకా మరొకరికి గాయాలయ్యాయి. ఈ దాడి నుంచి ఎమ్మెల్యే చందన్ సురక్షితంగా బయటపడ్డారు. ఇదిలా ఉండగా సుక్మా జిల్లా జేగురుగొండలో మావోయిస్టులు కొందరిని కిడ్నాప్ చేశారనే వార్త కలకలం సృష్టించింది. ఏకంగా 11 మంది గిరిజనులను మావోయిస్టులు అపహరించుకుపోయారని తెలుస్తోంది. అయితే పోలీస్ రిక్రూట్మెంట్ కోసం వెళ్లారనే కారణంతోనే వారిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారని వార్తలు వస్తున్నాయి. -
బీజాపూర్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా గల్గాం అడవిలో మంళవారం ఉదయం నుంచి పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఉసూర్-గల్గాం గ్రామాల మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన జవాన్ అఖిలేష్‌ను బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు. -
మావోయిస్టుల కాల్పులు.. ఇద్దరు కార్మికులు మృతి
సాక్షి, ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్ అంబైడ్‌గనిలో మావోయిస్టుల దాడికి పాల్పడ్డారు. జేసీబీ సహా 6 వాహనాలను మావోయిస్టులు తగలబెట్టారు. సూపర్వైజర్ సహా కార్మికులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కార్మికుల కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా యత్నించాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
శిక్షణకొచ్చి చిక్కారు!
సాక్షి, అమరావతి, కొయ్యూరు, పాడేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో క్యాడర్‌కు శిక్షణ తరగతులు నిర్వహించి పట్టు సాధించేందుకు మావోయిస్టులు రూపొందించిన వ్యూహం విఫలమైంది. ఒడిశాలో మూడు రోజుల నుంచి మొదలైన కూంబింగ్, ఎదురు కాల్పులు ఏపీలో ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యులు సందే గంగయ్య, రణదేవ్‌లతోపాటు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. నిస్తేజంగా ఉన్న క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు ఏవోబీ పరిధిలోని మల్కనగిరిలో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించినట్లు ఏపీ, ఒడిశా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో కూంబింగ్ చేపట్టారు. ఒడిశాలో తప్పించుకుని... మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్‌తోపాటు కొందరు అగ్ర నేతలు శిక్షణా తరగతులకు హాజరు కానున్నట్టు సమాచారం అందడంతో మూడు రోజుల క్రితం మల్కనగిరి, కొరాపుట్ జిల్లాల్లో ఒడిశా కోబ్రా పోలీసులు, బీఎస్పీ దళాలు కూంబింగ్ చేపట్టాయి. సోమవారం నుంచి విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. ఏవోబీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసు బలగాలకు కులబెడ గ్రామంలో మావోయిస్టులు తారసపడ్డారు. కొద్దిసేపు ఎదురు కాల్పులు అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. సంఘటన స్థలంలో ఇన్సాస్ రైఫిల్, ఏకే–47 మ్యాగజైన్, ఇన్సాస్ మ్యాగజైన్, డిటోనేటర్లు, బ్యాటరీలు, ఐఈడీ బాంబుల తయారీ పదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో అటు ఒడిశా ఇటు ఏపీలోనూ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. మన్యం అడవుల్లోకి సరుకులు తరలిస్తూ.. ఒడిశాలో ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల్లో కొందరు ఏపీలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో పెద్ద ఎత్తున సరుకులు కొనుగోలు చేసి అటవీ ప్రాంతంలోకి తరలిస్తుండటాన్ని గుర్తించారు. కూంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ బలగాలకు కొయ్యూరు మండలం తీగలమెట్ట ప్రాంతంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. యు.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్ట–పి.గంగవరం మధ్యనున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు సందే గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్, రణదేవ్ అలియాస్ అర్జున్, ఏరియా కమిటీ సభ్యుడు సంతు నచిక, మావోయిస్టు పార్టీ సభ్యులు లలిత, పైకే చనిపోయిన వారిలో ఉన్నట్లు గుర్తించారు. మరో మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఏకే–47తోపాటు తపంచా, నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి, మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బలిమెల ప్రాంతంలో డీసీఎంగా పనిచేసిన రణదేవ్ కూడా మృతుల్లో ఉన్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం హెలికాఫ్టర్‌తో గాలింపు చేపట్టారు. గాయపడి తప్పించుకున్న మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని విశాఖ రూరల్ ఎస్సీ బి.కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి.. ఒడిశాలో ఎదురు కాల్పుల ఘటనలో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఒడిశాలో ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టులు రెండు వర్గాలుగా విడిపోయి తప్పించుకున్నట్లు సమాచారం. వీరిలో ఏపీ వైపు వచ్చిన మావోయిస్టులు కొయ్యూరు మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. తప్పించుకుని ఒడిశాలో మరోవైపు వెళ్లినవారిలో ఉదయ్‌తోపాటు మరికొందరు అగ్రనేతలు ఉండవచ్చని భావిస్తున్నారు. వారి కోసం ఒడిశా పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
‘మహా’లో భారీ ఎన్కౌంటర్.. !
ముంబై: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలోవద్ద సీ-60 యూనిట్ మహారాష్ట్ర పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు కొనసాగుతుండడంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పులకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. -
బస్తర్‌లో అనూహ్య ఎన్కౌంటర్: ముగ్గురు గిరిజనులు మృతి
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని బస్తర్ అటవీ ప్రాంతంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయానికి తోడు పోలీసులు-నక్సలైట్ల మధ్య ఘర్షణ సామాన్య ప్రజానీకం ప్రాణాలను బలితీసుకుంటున్నది. బీజాపూర్ జిల్లా సిల్గర్ పోలీసు బేస్ క్యాంపు వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఆదివాసీ గిరిజనులు మరణించారు. గత నెలలో మావోయిస్టులు పోలీసులపై భీకర దాడికి పాల్పడిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే తాజాగా ఈ సంఘటన జరిగింది. ఎన్కౌంటర్ వార్తలను బస్తర్ రేంజ్ ఐజీ పి సుందరరాజ్ నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత మరింత అప్రమత్తమైన బలగాలు కేంద్ర, రాష్ట్ర ఆదేశాలకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో కొత్త క్యాంపులు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నుంచి సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీకి చెందిన జవాన్లు అడవిలో ఉమ్మడిగా సెర్చ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. అలా కొత్తగా ఏర్పాటైన ఓ క్యాంపుపైన నేడు మధ్యాహ్నం మావోయస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో ఈ అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. బస్తర్ రీజియన్ లోని బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో గల సిల్గర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇటీవలే కొత్త క్యాంపును ఏర్పాటు చేశాయి. గత నెల జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని వారి ఏరివేత లక్ష్యంగా కొత్త క్యాంప్ నుంచి బలగాలు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. కొంత కాలంగా ఇటు పోలీసులు, అటు నక్సలైట్ల మధ్య నలిగిపోతున్న స్థానిక ఆదివాసీ గిరిజనులు.. క్యాంపును అక్కడి నుంచి ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ మే 14 నుంచి మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా సిల్గర్ వద్దకు గిరిజనులు భారీ ఎత్తున వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు గిరిజనులకు నచ్చ చెప్పి ఆందోళన కార్యక్రమాలు విరమింపచేశారు. తిరిగి ఈ రోజు వేలాది మంది పోలీసు శిబిరం వద్దకు చేరుకున్నారు. పోలీస్ క్యాంపు వద్ద నిరసన చేస్తున్న క్రమంలో అందులో కొందరు పోలీసు శిబిరంపై దాడికి పాల్పడ్డారు. దీంతో తిరిగి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గ్రామస్తులు మృతి చెందారు. ఆదివాసీల మాటు నుంచి నక్సల్స్ పోలీసు శిబిరంపై కాల్పులు జరిపినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పి సుందరరాజ్ తెలిపారు. ప్రస్తుతం సిల్గర్ పోలీసు శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు బలగాలను భారీగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో మహిళ ఆత్మహత్య -
మావోయిస్టులు పునరాలోచించరా?
హింసను ప్రేరేపించడంలో మావోయిస్టులు కూడా రాజ్య యంత్రాంగానికి ప్రతిబింబంలా మారిపోయారు. రాజ్యవ్యవస్థ తనకు తానుగా ఒక హింసాత్మక సాధనం. దాన్ని హింసతోనే ఎదుర్కోవడం అనేది మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టదు. తుపాకులు లేకుండానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మరింత కష్టతరమైన పోరాటాలను చేస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, రైతులు, కార్యకర్తలు అందరూ.. వేగంగా నియంతృత్వం వైపు సాగుతున్న ఈ రాజ్యవ్యవస్థతో ప్రతి నిత్యం పోరాడుతున్నారు. కానీ మావోయిస్టులకు ఈ తరహా పోరాటాల పట్ల ఆసక్తి లేకపోవడమే విషాదకరం. ఈ వ్యాసం నేను రాస్తున్న సమయంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ తమ అధీనంలోనే ఉన్నాడని, అతనికి ఏ హానీ తలపెట్టబోమని మావోయిస్టులు భారత భద్రతా బలగానికి హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ నివాసి అయిన రాకేశ్వర్ సింగ్ ఏప్రిల్ 3న భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ తర్వాత తప్పిపోయారు. ఈ ఘటనలో కనీసం 23 మంది భద్రతా బలగాలు చనిపోయారు. రాకేశ్వర్ తమ అధీనంలోనే ఉన్నట్లు మావోయిస్టు నాయకత్వం నుంచి వార్త అందుకున్నామని, అతడిని క్షేమంగా విడిపించడానికి ప్రయత్నిస్తున్నామని, అతడికి ఏ హానీ తలపెట్టబోమని మావోయిస్టులు హామీ ఇచ్చారని హోంశాఖ ఉన్నతాధికారి పేర్కొన్నారు. (గురువారం రాకేశ్వర్‌ని విడిచిపెట్టారు కూడా). అంటే, భద్రతా బలగాల అధికారులు మావోయిస్టులతో మాట్లాడుతున్నారనీ, ఇరువురి మధ్య చర్చ సాధ్యమేనని స్పష్టం. అంటే ఇరువర్గాలూ పరస్పరం నష్టపోయినప్పటికీ, ఒకరు మరొకరిని హంతకులు అని ఆరోపిస్తున్నప్పటికీ, అదే సమయంలో తాము చేస్తున్న హత్యలను సమర్థించుకుంటున్నప్పటికీ ఇరువురి మధ్య చర్చ అనేది సాధ్యమే. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వ్యూహాత్మక ఎదురుదాడి కేంపెయిన్‌ను నిర్వహిస్తున్నారని, అడవుల్లోపల తమ కేడర్లకు ఆయుధాలిచ్చి మరీ శిక్షణ ఇస్తున్నారనీ, భద్రతా బలగాలకు గరిష్టంగా నష్టం కలిగించే ఉద్దేశంతో ఉన్నారని, అందుకే ముందస్తుగా భద్రతా బలగాలు లక్ష్య ఛేదనకోసం మావోయిస్టులపై దాడికి దిగగా తమపై ఎదురుదాడి చేసి దెబ్బతీశారని సీఆర్పీఎఫ్ అధికారి చెప్పారు. అయితే ఆ దాడి ఘటన తర్వాత మావోయిస్టు ప్రతినిధి కూడా ఎలా మాట్లాడి ఉండేవాడో కాస్త ఊహించుకుందాం. బహుశా అతడు కూడా సరిగ్గా ఇలాగే మాట్లాడి ఉండేవాడు. ఇంతజరిగాక కూడా అనివార్యంగా ఇరుపక్షాలూ సంప్రదింపులు జరుపుతున్నాయి. దీన్ని అందరూ ఆహ్వానించాలి. శత్రువు బలంగా ఉన్నప్పుడు, ఆధిక్యతా స్థానంలో ఉన్నప్పుడు మీరు మీ శత్రువుతో అయినా సరే మాట్లాడాల్సి ఉంది. ఈ తరుణంలో మావోయిస్టులు పైచేయి సాధించారు. వారు కూడా ఈ దాడిలో దెబ్బతిని ఉంటారు. కానీ ఎంతమందనేది మనకు తెలీదు. మావోయిస్టులూ, రాజ్యవ్యవస్థా.. అయితే ఎప్పటికైనా రాజ్యవ్యవస్థదే పైచేయి అని మావోయిస్టులు తెలుసుకోవాలి. ఇంతమంది బలగాలు మరణించిన తర్వాత కూడా భద్రతా బలగాల సంఖ్య తగ్గదు. గతంలో భద్రతా బలగాలు ఇదేవిధంగా ఎదురు దెబ్బతిని వెనుకంజ వేసినప్పటికీ వారి సంఖ్యాబలం కానీ ఆయుధ శక్తి కానీ క్షీణించలేదు. భారత భద్రతా బలగాల సాధన సంపత్తి ఎప్పటిలాగే ఉంటుంది. అది ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. పైగా దానికి ఇతర అనుకూలతలూ ఉన్నాయి. అది బహిరంగంగానే ముందుకు నడుస్తుంది. దానికి సహాయంగా నిర్విరామంగా సరఫరాలు అందుతుంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టకుండానే భారత భద్రతా బలగాలు చాలాకాలం మనగలుగుతాయి. కానీ మావోయిస్టుల విషయంలో అలా చెప్పలేం. కొత్తవారిని చేర్చుకోవడం వారికి చాలా కష్టమైన పని. వారు గణనీయంగా బలహీనపడతారు, వారి ఉనికి కూడా ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటుంది. వారి అధీనంలో ఉన్న ప్రాంతం వేగంగా కుదించుకుపోతోంది. వారు పోరాడుతున్న ప్రజలు కూడా పలు కారణాలతో దూరం జరుగుతున్నారు. మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణలో లేరు. మహారాష్ట్రలోనూ లేరు. ఇక బిహార్, జార్ఖండ్‌లలో వారు అదృశ్యమైపోయారు. మావోయిస్టు చర్యల లక్ష్యం ఏమిటి? వారు చేసే ఒక దాడికి, మరో దాడికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ చర్యల వెనక ఉన్న హేతుబద్ధత విషయమై వారి మద్దతుదారులకు కూడా స్పష్టత లేదు. తమ తరపున పోరాడమని ఆదివాసీలేమైనా వారికి చెప్పారా? లేదా ఆదివాసీ ప్రయోజనాల పరిరక్షణకు మావోయిస్టులు స్వయం ప్రకటిత సంరక్షకులుగా ఉంటున్నారా? ఈ ప్రజలను విముక్తి చేయడానికే తాము వచ్చామని మావోయిస్టులు చెబుతుంటారు. కానీ ప్రజలపై తనదే యాజమాన్యమని రాజ్యం ప్రకటిస్తుంది. దీనికి మించి ఇది ఒక భూభాగం, ఒక భూమి, వనరులకు సంబంధించినది. రాజ్య వ్యవస్థ నుంచి తమను కాపాడాల్సిందిగా ఆదివాసీలు వారిని ఆహ్వానించలేదు. ప్రజలు, అడవులు వారికి రక్షణ ఛత్రంగా మాత్రమే ఉంటున్నాయి. పైగా, ఆదివాసుల పట్ల సానుభూతి కూడా వీరికి ఉండదు. అందుకనే తమకు విధేయంగా లేరనిపించినప్పుడు ఆదివాసీలను పట్టపగలే చంపడానికి కూడా మావోయిస్టులు వెనుకాడటం లేదు. పీయూసీఎల్ (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ రైట్స్) ఇటీవలి ప్రకటన కూడా సరిగ్గా దీన్నే చక్కగా వివరించింది. ‘నిత్యం తీవ్రవాదం, తీవ్రవాద నిరోధక కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. బస్తర్‌లో మళ్లీ హింస పెరుగుతున్న సమయంలో ఈ ఎన్ కౌంటర్ సంభవించింది. ఒకవైపు పారామిలటరీ బలగాల ద్వారా సామాన్యులు నిత్యం వేధింపులకు గురవుతున్న క్రమంలో ఈ ప్రాంతం మొత్తం సైనికీకరణకు గురవుతోంది. అడవుల్లో కూడా తక్కువ దూరాల్లో సైనిక క్యాంపులు నెలకొనడంతో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య స్థానిక ఆదివాసీలు పరాయీకరణకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఇన్ఫార్మర్ల పేరిట చాలామంది పౌరులను మావోయిస్టులు చంపేశారు. రాజ్యవ్యవస్థ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తనను ప్రశ్నించిన, నిలదీసిన వ్యక్తులపై, బృందాలపై హింసకు పాల్పడుతుండటాన్ని మేం ఎంత తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నామో.. మావోయిస్టులతో సహా ప్రభుత్వేతర శక్తులు, కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని మేం కోరుతూ వస్తున్నాం. మావోయిస్టులూ రాజ్యవ్యవస్థకు ప్రతిబింబంగానే ఉంటున్నారు కానీ ఒకే ఒక తేడా ఉంది. రాజ్యవ్యవస్థ అవసరమైతే తన పనితీరును సవరించుకోవడానికి కూడా సిద్ధమవుతుంది. కానీ మావోయిస్టులు మాత్రం ఆరెస్సెస్–బీజేపీలాగే ఒకే స్వరంతో మాట్లాడుతుంటారు. ప్రజలపై యాజమాన్యం ఎవరిది అనే అంశంపై జరుగుతున్న ఈ పోరాటంలో రాజ్యానిదే ఎప్పటికీ పైచేయిగా ఉంటుంది. మావోయిస్టులు ఎప్పటికీ ప్రభుత్వేతర శక్తులుగా, చట్టవిరుద్ధ శక్తులుగా ఉంటారు. ముఖ్యంగా మావోయిస్టులు అర్థం చేసుకోవలసింది ఇదే. హింస పట్ల ఈ మతిలేని ఆకర్షణ వల్ల కొన్ని తరాలు ఇప్పటికే నాశనమైపోయాయి. రాజ్యవ్యవస్థ తనకు తానుగా ఒక హింసాత్మక సాధనం. దాన్ని మీ సొంత తార్కికతతో హింసతోనే ఎదుర్కోవడం అనేది మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టదు. తీవ్రవాదం అనే పదం ఒక సుందరమైన నగను ధరిస్తుంటుంది కానీ అది రాజ్యానికే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మావోయిస్టులు, రాజ్యవ్యవస్థ తమను విభేదించేవారిని పరస్పరం వధిస్తున్నాయన్నదే వాస్తవం. తాజా ఎన్కౌంటర్ రాజ్యవ్యవస్థ పాశవిక హింసను మరింత చట్టబద్ధం చేస్తుందనడంలో సందేహమే లేదు. మానవ హక్కుల కోసం నిలబడే ఎవరినైనా, మానవ హక్కులు అనే భావనపై విశ్వాసం లేని మావోయిస్టుల హక్కుల కోసం నిలబడే వారిపై కూడా రాజ్య అణిచివేత పెరుగుతుంది. వీరిని మావోయిస్టుల తుపాకులు, రాకెట్ లాంచర్స్ కాపాడలేవు. మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. తమ పార్టీలోపల ప్రజాస్వామిక హక్కులు ఉన్నాయా అని వారు ప్రశ్నించుకోవాలి. నాయకత్వంతో విభేదిస్తూ కూడా గౌరవప్రదంగా మావోయిస్టులు మనగలుగుతున్నారా? తుపాకులు లేకుండానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మరింత కష్టతరమైన పోరాటాలను చేస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, రైతులు, కార్యకర్తలు అందరూ... వేగంగా నియంతృత్వం వైపు సాగుతున్న ఈ రాజ్యవ్యవస్థతో ప్రతి నిత్యం పోరాడుతున్నారు. కానీ మావోయిస్టులకు ఈ తరహా పోరాటాల పట్ల ఆసక్తి లేదు. హింసాత్మక శక్తి పీడితులైన వీరు మానవ జీవితాలను, మానవ ప్రాణాలను వృథా చేస్తున్నారు. వ్యాసకర్త:అపూర్వానంద్ హిందీ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ (ది వైర్ సౌజన్యంతో) -
సైనికుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండ
సత్తెనపల్లి: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన ఎదురు కాల్పుల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుని తల్లిదండ్రులు శాఖమూరి విజయకుమారి, రవీంద్రబాబుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గుంటూరు ఆర్డీవో ఎస్.భాస్కర్‌రెడ్డి బుధవారం రూ.30 లక్షల చెక్కును అందజేశారు. తహసీల్దారు ఎస్.వి.రమణకుమారి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. హోంశాఖ మంత్రి పరామర్శ.. మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
పెళ్లింట చావు డప్పులు
సత్తెనపల్లి: పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట చావు డప్పులు మోగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ వద్ద మావోయిస్టుల దురాగతానికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను శాఖమూరి మురళీకృష్ణ (32) బలవటంతో ఆ గ్రామం శోకసంద్రమైంది. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన శాఖమూరి రవీంద్రబాబు, విజయకుమారి దంపతుల చిన్నకుమారుడైన మురళీకృష్ణ ఆరేళ్ల క్రితం సీఆర్పీఎఫ్ జవానుగా ఉద్యోగంలో చేరి భరతమాత సేవకు అంకితమయ్యాడు. కోబ్రా–210 విభాగానికి చెందిన మురళీకృష్ణ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మురళీకృష్ణకు గత ఏడాది ఆగస్ట్ 13న వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ దగ్గరి బంధువు చనిపోవటంతో వాయిదా పడింది. ఈ ఏడాది మే 22న వివాహం జరుప తలపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన మురళీకృష్ణ తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. సెలవు మంజూరైందని, మే 15న ఇంటికి వస్తానని చెప్పాడు. అలా చెప్పిన మూడో రోజే శాశ్వతంగా సెలవు తీసుకుని ఎవరికీ అందని లోకాలకు వెళ్లిపోయాడని ఆ తల్లి చేస్తోన్న రోదన వర్ణనాతీతం. -
గాలం వేసి కాపుకాచి.. భద్రత దళాలకు భారీదెబ్బ!
హైదరాబాద్: మావోయిస్టులు భద్రతా బలగాలను మరోసారి భారీ దెబ్బకొట్టారు. బలిమెల దాడుల తరహాలో దాదాపు పదమూడేళ్ల తర్వాత భారీ స్థాయిలో ప్రతీకార దాడికి దిగారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య శనివారం నాడు ఐదుగురుగా ఉండగా.. ఆదివారం 23కు చేరింది. గతంలో 2008లో బలిమెల రిజర్వాయర్‌లో కూంబింగ్ కోసం వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులను, 2010 వేసవిలో రెండు ఘటనల్లో 100 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని, 2013లో బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలను చంపేసిన మావోయిస్టులు.. ఆ తర్వాత చేసిన అతి పెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. దండ కారణ్యంలో తమకు ఇంకా పట్టు మిగిలే ఉందని చాటేందుకే అధునాతన ఆయుధాలతో అంబుష్ (ఎరవేసి చుట్టుముట్టి దాడి చేయడం) దాడికి పాల్పడ్డారని, అందుకే మృతుల సంఖ్య భారీగా ఉందని ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కొంతకాలంగా దండకారణ్యంలో జరుగుతున్న పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో.. సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు కలిసి కూంబింగ్ పెంచారు. ఈ క్రమంలోనే పీఎల్జీఏ కమాండర్ హిడ్మా ఉన్నాడంటూ కావాలని ఉప్పందించిన మావోలు.. వారు ముందుగానే సిద్ధంగా ఉన్న ప్రాంతానికి భద్రతా బలగాలు రావడంతో ఒక్కసారిగా చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. బీజాపూర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ ఆఫీసు నుంచి స్వస్థలాలకు మృతదేహాలను తరలిస్తున్న జవాన్లు ఇంతగా ప్రాణనష్టం ఎందుకు? తెర్రం దాడి ఘటనలో పోలీసుల వైపు ఇంత భారీగా ప్రాణనష్టం ఎందుకు జరిగిందన్న దానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు భారీ సంఖ్యలో ఒకేసారి వెళ్లడం, అప్పటికే మావోయిస్టులు ఎత్తుగా ఉన్న గుట్టలపై అప్పటికే పొంచి ఉండటం, ఆకస్మికంగా దాడి చేయడం, అత్యాధునిక ఆయుధాలు వాడటం వంటివి ప్రధాన కారణమని కొందరు పోలీసులు చెప్తున్నారు. ఎత్తులో ఉన్న వారికి ప్రత్యర్థులు అడవిలో చెట్లు, రాళ్ల మధ్య దాక్కున్న సులువుగా గుర్తించే వీలు చిక్కుతుందని.. అందుకే మావోలు నేరుగా పోలీసులను గురిపెట్టి కాల్చారని అంటున్నారు. మావోయిస్టులు ఆధునిక రాకెట్ లాంచర్లు వాడటంతో నేరుగా సిబ్బందిని తాకాయని.. క్షణాల్లో జరిగిన అంబుష్‌లో తప్పించుకునే వీల్లేక ఎక్కువ మంది పోలీసులు బలయ్యారని చెప్తున్నారు. అచ్చంగా 2008లో బలిమెల తరహాలోనే ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు జరపడంతో మృతుల సంఖ్య పెరిగింది. 2వేల మంది ఒక్కసారిగా వెళ్లడం వైఫల్యమే.. తెర్రం దాడిలో భద్రతా దళాల నిర్లక్ష్యం, రక్షణ చర్యలను విస్మరించడం కూడా అత్యధిక ప్రాణనష్టానికి దారితీశాయని తెలంగాణకు చెందిన పలువురు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. మార్చి 24న మావోయిస్టు కమాండర్ హిడ్మా ఉన్నాడంటూ మావోయిస్టులే.. చత్తీస్ఘడ్ భద్రతా దళాలకు వ్యూహాత్మకంగా సమాచారమిచ్చి రప్పించారని ఇప్పుడు పోలీసులకు అర్థమైంది. ఆ సమాచారం ఆధారంగానే.. 2వేల మందికిపైగా భద్రతా దళాలతో పదిరోజులుగా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. సరిగ్గా ఇక్కడే తెలంగాణ పోలీసులకు– చత్తీస్‌గఢ్ పోలీసులకు స్పష్టమైన తేడా కనిపించింది. మామూలుగా ఎవరైనా మావోయిస్టు లీడర్ ఉన్నాడంటూ సమాచారం వస్తే.. తెలంగాణ పోలీసులు ముందుగా కొందరు సభ్యులతో ఓ టీమును పంపుతారు. వారు ఇచ్చిన సమాచారంతో తర్వాతి టీం బయల్దేరుతుంది. ఒకవేళ ముందు వెళ్లిన టీం ఆపదలో చిక్కుకున్నా.. తర్వాతి టీం ఆగమాగంగా వెళ్లదు. ఎందుకంటే మావోయిస్టులు దాడి చేసినప్పుడు కొందరిని చంపకుండా వదిలేయడం, వారిని కాపాడేందుకు వచ్చిన ఇతర దళాలపై దాడి చేయడం వంటి వ్యూహాలు అమలు చేస్తారు. అందుకే తెలంగాణ పోలీసులు అదనపు బలగాల్ని పంపాల్సి వస్తే.. మొదటి దళం వెళ్లిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళతారు. ఘటనాస్థలాన్ని మూడు వైపులా చుట్టుముడతారు. అయితే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో 2113 మందికిపైగా సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో హిడ్మాను వెదుకుతూ వెళ్లారు. తాము ఉచ్చులో పడ్డామన్న సంగతి దాడి మొదలయ్యేంత వరకూ గ్రహించలేకపోయారు. ఇక బుల్లెట్ గాయాల వల్ల తీవ్రంగా రక్తస్రావం కావడం, మండుతున్న ఎండ కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బతో పోలీసుల మరణాలు పెరిగాయని వైద్యులు చెప్పారు. పొగలు చూసి వెళ్లారా? తెర్రం ప్రాంత గుట్టలపై బాగా పట్టున్న మావోలు.. హిడ్మా అక్కడే ఉన్నాడని పోలీసులు నమ్మేలా చేశారు. డ్రోన్లతో వెళ్లిన పోలీసు లకు.. దూరంగా ఎత్తయిన ప్రాంతానికి సమీ పంలో పొగలు కనిపించాయి. హిడ్మా అక్కడే దళం తో ఉన్నాడని, అక్కడ వంటలు చేసుకుంటున్నారని పొరబడి వెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టూ కొండలు, ఒక పక్కన పలుచగా అడవి, కొంత మైదానం లా ఉన్న ప్రాంతానికి భద్రతాదళాలు వచ్చేలా చేయడంలో మావోలు సఫలీకృతమయ్యారు. గతంలో జరిగిన భారీ దాడులు! 2008 జూన్ 29: బలిమెల ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని బలిమెల రిజర్వాయర్‌లో పడవల్లో కూంబింగ్‌కు వెళ్తున్న గ్రేహౌండ్స్ పోలీసులపై.. గుట్టలపై నక్కి ఉన్న మావోయిస్టులు దాడి చేశారు. పడవల్లో ఉన్న 60 మంది పోలీసులు రిజర్వాయర్‌లో దూకి ఒడ్డుకు వచ్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో మావోయిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఊచకోతలో మొత్తం 38 మంది పోలీసులు చనిపోయారు. 2010 ఏప్రిల్ 6: చింతల్నార్ ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా చింతల్నార్ అటవీ ప్రాంతంలో 200 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తోన్న కాన్వాయ్‌పై.. దాదాపు 300 మందికిపైగా మావోయిస్టులు అకస్మాత్తు దాడికి దిగారు. ఆ దాడిలో 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మరణించారు. బాంబులు విసురుతూ, కాల్పులు జరిపిన మావోయిస్టులు.. గాయపడ్డ వారిని కత్తులతో పొడిచారు. ఒక సీఆర్పీఎఫ్ జవాను శరీరంపై 78 కత్తిపోట్లు ఉన్నాయని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఇక సీఆర్పీఎఫ్ జరిపిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. 2010 మే 17: బస్సుపై దాడి 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన నెలన్నర రోజుల్లోనే మావోయిస్టులు.. మరోసారి పాశవిక దాడికి దిగారు. మావోయిస్టులకు చిక్కకూడదన్న ఉద్దేశంతో సీఆర్పీఎఫ్, ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్)లు బస్సులో సాధారణ ప్రజలతో కలిసి ప్రయాణిస్తుండగా.. మావోయిస్టులు ఆ బస్సును పేల్చివేశారు. బస్సులో ఉన్నవారిలో 44 మంది చనిపోగా.. ఆరుగురే బతికారు. మృతుల్లో 18 మంది ఎస్పీవోలు కాగా, మిగిలినవారిలో సీఆర్పీఎఫ్ జవాన్లు, సాధారణ మహిళలు, చిన్నారులు ఉండటం కలచివేసింది. 2013 మే 25: సుక్మా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జరిగిన రాజకీయ ర్యాలీలో పాల్గొని తిరిగి వెళ్తున్న కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు దాడికి దిగారు. బస్తర్ జిల్లా దర్బాఘాట్ వద్ద చెట్లు నరికి కాన్వాయ్ ను ఆపారు. మొదట ల్యాండ్ మైన్ పేల్చి, తర్వాత ఆపకుండా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మావోయిస్టులపై పోరుకు గిరిజనులతో ‘సల్వాజుడుం’ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ చీఫ్ నందకుమార్ పటేల్, విద్యాచరణ్ శుక్లా, భద్రతా సిబ్బందితో కలిపి మొత్తం 32 మంది చనిపోయారు. -
జవాన్లపై పంజా.. 23 మంది బలి!
హైదరాబాద్: నిత్యం రగిలిపోతున్న ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి రక్తసిక్తమైంది. మావోయిస్టు పార్టీ అనుబంధ దండకారణ్య పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్ జరిపిన భీకర దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య 23కు చేరింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలోని జొన్నగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతి చెందిన వారిలో.. ఎనిమిది మంది కోబ్రా, ఆరుగురు ఎస్టీఎఫ్ జవాన్లుకాగా, 8 మంది డీఆర్జీ, ఒకరు బస్తర్ బెటాలియన్ జవాన్ ఉన్నారు. మరో 30 మంది (10 మంది డీఆర్జీ, ఐదుగురు ఎస్టీఎఫ్, 15 మంది కోబ్రా) జవాన్లు గాయపడ్డారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని ప్రత్యేక హెలికాప్టర్లలో రాయ్‌పూర్‌కు తరలించగా.. మిగతా 18 మందికి బీజాపూర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరు జవాన్ల ఆచూకీ లేకుండా పోయినట్టు సమాచారం. వారి కోసం గాలింపు చర్యలు సాగుతున్నా.. అధికారులు ధ్రువీకరించడం లేదు. ఘటనా స్థలం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. పక్కాగా మాటు వేసి.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని జొన్నగూడ, టేకులగూడెం, జీరాగాన్, గోండేం, అల్లిగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో బీజాపూర్ జిల్లాలోని తెర్రం నుంచి 760 మంది, ఊసూరు నుంచి 200 మంది, పామేడు నుంచి 195 మంది, సుక్మా జిల్లాలోని మినఫా నుంచి 483 మంది, నర్సాపురం నుంచి 420 మంది.. మొత్తంగా 2,058 మంది డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ బెటాలియన్ విభాగాల జవాన్లు.. ఈ నెల 2న రాత్రి బృందాలుగా విడిపోయి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న సమాచారంతో భారీగా కూంబింగ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం జొన్నగూడ అటవీ ప్రాంతంలో.. జేగురుకొండ దండకారణ్య పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఆధ్వర్యంలోని మావోయిస్టులు దాడి చేశారు. ముందుగా మందుపాతరలు పేల్చి, తర్వాత రాకెట్ లాంచర్లతో దాడికి దిగారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. శనివారం రాత్రి దాకా ఎన్కౌంటర్ జరిగింది. కొన్ని గంటల పాటు పోరు కొనసాగడంతో పోలీసులకు చెందిన హెలికాప్టర్లు ఆ ప్రాంతంలో దిగేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ శనివారం ఐదుగురు జవాన్ల మృతదేహాలు, ఒక మహిళా మావోయిస్టు మృతదేహం లభించాయి. మిగతావారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేపట్టారు. అదృశ్యమైన జవాన్లలో పలువురి మృతదేహాలు జొన్నగూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్నట్టు ఎలక్ట్రానిక్ మీడియాలో ఆదివారం పొద్దున 10 గంటల సమయంలో ప్రసారమైంది. దాంతో పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను మొదట తెర్రం పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తరలించాయి. 650 మందికిపైనే మావోయిస్టులు సుమారు 650 మందికిపైగా మావోయిస్టులు, మిలీషియా సభ్యులు గుట్టలపై నుంచి విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్టు అంచనా. దీనితో జవాన్లు అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలోకి వెళ్లారు. అక్కడ అప్పటికే మాటువేసిన మావోయిస్టు మిలీషియా సభ్యులు జవాన్లపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో పడిపోయిన వారిపై కత్తులతో దాడి చేసి, చిత్రహింసలు పెట్టి చంపారు. సుమారు 20కి పైగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు. పలువురు జవాన్ల మృతదేహాలపై కత్తిపోట్లు ఉన్నాయని, ఓ ఇన్స్పెక్టర్ చేతిని నరికి తీసుకెళ్లారని చత్తీస్‌గఢ్ పోలీసులు చెప్తున్నారు. హిడ్మా ఆధ్వర్యంలో దాడి మావోయిస్టు జేగురుకొండ ఏరియా దండకారణ్య పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఆధ్వర్యంలో మవోయిస్టులు ఆపరేషన్ చేశారు. గతంలో జరిగిన అనేక ఘటనల్లోనూ హిడ్మాదే మాస్టర్ ప్లాన్. ఒడిశాలోని బలిమెల (36 మంది గ్రేహౌండ్స్ జవాన్ల మృతి) ఘటన మినహా చాలా దాడుల్లో హిడ్మా కీలకపాత్ర పోషించాడని పోలీసువర్గాలు చెప్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని తాడిమెట్ల (75 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి), దర్భాఘాట్‌లో మహేంద్రకర్మ సహా 36 మందిని హతమార్చిన ఘటన, మినఫా ప్రాంతంలో 17 మంది జవాన్ల హత్య, బెజ్జి ఘటనలో 16 మంది, బుర్కాపాల్‌లో 25 మంది బలగాల హత్య ఘటనల్లో ప్లాన్ హిడ్మాదేనని పేర్కొంటున్నాయి. నంబాల కోటేశ్వరరావు పాత్రపై అనుమానాలు గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావు ఈ దాడికి ప్రణాళిక రచించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చత్తీస్గడ్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న కేశవరావుది మొదటి నుంచీ దూకుడుగా ఉండే మనస్తత్వమని.. పార్టీకి పునర్వైభవం తేవడం, దండకాణ్యంలో ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడని పోలీసులు చెప్తున్నారు. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన కేశవరావు ఆర్మీ తరహాదాడులు, అంబుష్, మెరుపుదాడులు, బాంబుపేలుళ్లకు వ్యూహాలు రూపొందించడంలో దిట్ట అని.. ప్రస్తుత దాడి వెనక కూడా నంబాల స్కెచ్ ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతి చెందిన జవాన్ల వివరాలివీ.. డీఆర్జీ విభాగానికి చెందిన దీపప్ భరద్వాజ్ (ఎస్సై), రమేశ్ కుమార్ (హెడ్ కానిస్టేబుల్), నారాయణ సోడి, (హెడ్ కానిస్టేబుల్), రమేష్ కొర్సా, సుభాశ్ నాయక్ (కానిస్టేబుల్), కిశోర్ అండ్రిక్, సంకురం సోడి, బోసారం కర్టమి (అసిస్టెంట్ కానిస్టేబుళ్లు). ఎస్టీఎఫ్ విభాగానికి చెందిన శ్రవణ్ కాశ్వా (హెడ్ కానిస్టేబుల్), కానిస్టేబుళ్లు రాందాస్ కోరం, జగత్‌రాం కన్వర్, సుక్సింగ్ ఫారస్, రాంశంకర్ పైక్రా, శంకర్నాథ్. కోబ్రా 210 బెటాలియన్‌కు చెందిన దిలీప్‌కుమార్‌దాస్ (ఇన్స్పెక్టర్), రాజ్‌కుమార్ యాదవ్ (హెడ్‌కానిస్టేబుల్), కానిస్టేబుళ్లు శంభురాయ్, ధర్మదేవ్కుమార్, శాఖమూరి మురళీకృష్ణ, రాయ్, జగదీశ్, బబ్లు రాంబ, రాజేశ్వర్ సింగ్ మన్హాస్ బస్తర్ బెటాలియన్ విభాగానికి చెందిన మడవి సమ్మయ్య పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మహిళా మావోయిస్టును పామేడు ఏరియా లోకల్ గెరిల్లా స్క్వాడ్ కమాండర్ మడవి వనజగా గుర్తించారు. ఆమె మృతదేహం వద్ద ఒక ఇన్సాస్ రైఫిల్‌ను స్వాధీధీనం చేసుకున్నారు. పోలీసుల కాల్పుల్లో సుమారు 12 మంది మావోయిస్టులు మృతిచెందారని, 16 మంది గాయపడ్డారని పోలీసువర్గాలు చెప్తున్నాయి. మావోయిస్టులు వారిని ట్రాక్టర్లలో జబ్బమరక, గొమ్ముగూడ గ్రామాలకు తరలించినట్టు నిఘా వర్గాల సమాచారం అందిందని అంటున్నాయి. భద్రత పెంచిన తెలంగాణ పోలీసులు! చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడి గురించి తెలియగానే తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీలు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. పలుచోట్ల ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు. వచ్చే నెలలో పెళ్లి.. ఎన్కౌంటర్లో మృతి తెర్రం ఘటనలో విజయనగరం జిల్లా మక్కువ మండలం కంచేడువలస గ్రామానికి చెందిన రౌతు జగదీశ్ కుమార్ (27) మృతి చెందాడు. ఆయన 2010లో సీఆర్పీఎఫ్కు ఎంపికై కోబ్రా దళంలో పనిచేస్తున్నారు. విజయనగరం పట్టణంలోని గాజులరేగలో వారి కుటుంబం నివసిస్తోంది. జగదీశ్‌కు వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. ఇలాంటి టైంలో ఆయన చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
దద్దరిల్లిన దండకారణ్యం: 22 మంది జవాన్లు మృతి
-
దద్దరిల్లిన దండకారణ్యం: 22 మంది జవాన్లు మృతి
సాక్షి, చర్ల: భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులతో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్‌లోని తెర్రాం ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 22 మంది జవాన్లు అమరులవగా, మరో 31 మంది జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఒక మహిళా మావోతో పాటు మొత్తం 15 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలిసింది. ఆదివారం కూడా ఇరు వర్గాల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అయితే, మరికొంతమంది జవాన్లు అదృశ్యమయ్యారనే వార్త కలకలం రేపుతోంది. ఈనేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెప్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా తరలింపు ఎదురు కాల్పుల్లో మృతిచెందిన జవాన్లలో కోబ్రా దళానికి చెందిన ఒకరు, ఎస్టీఎఫ్ విభాగానికి చెందిన ఇద్దరు, డీఆర్జీ విభానికి చెందిన ఇద్దరు జవాన్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన జవాన్లను హెలికాప్టర్ల ద్వారా రాయ్‌పూర్, బీజాపూర్ ఆసుపత్రులకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన సమయంలో స్పాట్ లో ఉన్న 760మంది జవాన్లు ఉన్నట్టు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియడానికి మరో ఆరుగంటలపైన సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఉన్నతాధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ, ఛత్తీస్ గఢ్ సీఏం అమర జవాన్ల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ( చదవండి: మరణంలోనూ వీడని స్నేహం.. ) -
ఎన్ఐఏ దాడులు: ముంచంగి పుట్టు కేసులో ఆరుగురు అరెస్ట్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విశాఖ జిల్లా ముంచంగి పుట్టు కేసులో ఆరుగురు పౌరహక్కుల సంఘం నేత లను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ సోదాలన్నీ ముంచంగిపుట్టు ఠాణాలో నమోదైన కేసు ఆధారంగానే జరిగినట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ, తెలంగాణల్లో 31 చోట్ల సోదాలు జరిపినట్టు తెలిపింది. ఏపీలో విశాఖ పట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం,కర్నూలు, కృష్ణా, తూర్పు గోదావరి, కడపతోపాటు తెలంగా ణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజి గిరి, మెదక్ జిల్లాల్లో తనిఖీలు చేసినట్లు పేర్కొంది. వారికి మావోలతో లింకులపై అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు జరిపినట్టు వివరించింది. గతేడాది కేసు నమోదు.. మావోయిస్టులకు విప్లవ సాహిత్యం తీసుకెళ్తున్న జర్నలిస్టు పంగి నాగన్నను ముంచంగిపుట్టు పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. దీనిపై గతేడాది నవంబర్ 23న ముంచంగిపుట్టు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు గత నెల 7న కేసు నమోదు చేసిన ఎన్ఐఏ పంగి నాగన్నను విచారించింది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్టు నాగన్న అంగీకరించడం తోపాటు మరో 64 మంది పౌరహక్కుల సంఘల, విరసం నేతల పేర్లు వెల్లడించడంతో వారిపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పంగి నాగన్న, అదులూరి అన్నపూర్ణ, జంగర్ల కోటేశ్వర్రావు, మానుకొండ శ్రీనివాసరావు, రేలా రాజేశ్వరి, బొప్పుడి అంజమ్మ అనే ఆరుగురిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సాగించిన తనిఖీల్లో 40 మొబైల్ఫోన్లు, 44 సిమ్‌కార్డులు, హార్డ్‌డిస్క్, మైక్రో ఎస్డీ కార్డులు, ఫ్లాష్ కార్డులు తదితర 70 స్టోరేజ్ డివైజెస్, 184 సీడీలు/డీవీడీలు, 19 పెన్‌డ్రైవ్‌లు, ట్యాబ్, ఆడియో రికార్డర్, ఒక అనుమానితుని నుంచి రూ.10లక్షల నగదు, కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు మావోయిస్టు పార్టీ సాహిత్యంతో ఉన్న లేఖలు, అనేక అనుమానాస్పద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టులకు పౌరహక్కుల నేతలు సహకరించారని, పోలీసుల కదలికలను మావోయిస్టులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలను మావోయిస్టులకు అనుకూలంగా సమీకరించి పోలీసులను అక్కడికి రాకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని, ప్రజలను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని అభియోగాలు మోపింది. సోదాలపై నిరసన.. పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడాన్ని ఖండిస్తూ గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఆయా సంఘాలు నిరసన చేపట్టాయి. పీవోడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ ఎన్ఐఏ అధికారులు ప్రజాసంఘాల నేతల ఇళ్లపై అక్రమంగా సోదాలు చేయకూడదని హైకోర్టు ఇచ్చిన రిలీఫ్‌ఆర్డర్‌ను కూడా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ప్రజాజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వరా? అంటూ మావోయిస్టు నేత ఆర్కే సతీమణి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. -
బస్సును పేల్చిన మావోలు
చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమేనంటూ ప్రకటించి వారం కూడా గడవక ముందే పోలీసులు ప్రయాణిస్తున్న బస్సును పేల్చివేశారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు మృత్యువాతపడగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. చర్చలకు సిద్ధమని తెలిపినా బలగాలు కూంబింగ్‌కు వస్తుండడంతోనే మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో గల బొదిలి, కాడిమెట్ట అటవీ ప్రాంతాల్లో రెండు జిల్లాలకు చెందిన 90 మంది డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు) పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం 3.10 గంటలకు ఆపరేషన్ ముగించుకొని 27 మంది పోలీసులు బస్సులో నారాయణ్‌పూర్ బయలుదేరారు. ఆ బస్సు సాయంత్రం 4.14 గంటలకు కదేనార్–కన్హర్‌గావ్ మార్గంలోని వంతెన సమీపంలోకి రాగానే మావోయిస్టులు రిమోట్ సాయంతో మందుపాతరను పేల్చి వేశారు. దీంతో బస్సు 20 అడుగుల మేర ఎగిరి వాగులో పడింది. దీంతో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలుకాగా వారిని నారాయణ్‌పూర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి ఆరుగురిని ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్తి వెల్లడించారు. మృతుల్లో కానిస్టేబుళ్లు సర్వెంట్ సలాం, సాహిత్, పవన్ మండవి, అసిస్టెంట్ కానిస్టేబుల్ విజయ్ పటేల్ లెవీ, డ్రైవర్ కానిస్టేబుల్ కరుణ్‌డెహారీ ఉన్నారు. మావోయిస్టుల కోసం సంఘటనా ప్రాంతానికి పోలీసు బలగాలను తరలించి కూం బింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
మావోయిస్టుల బాంబు దాడి; ఐదుగురు జవాన్లు మృతి
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో మావోయిస్టులు బాంబు పేల్చడంతో ఒక డ్రైవర్‌తోపాటు నలుగురు పోలీసులు మృత్యువాత పడ్డారు. ఈ దాడిలో 15 మంది గాయపడగా..వారందరినీ నారాయణపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో అయిదుగురు పరిస్థితి విషమంగా ఉంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ) పార్టీ తిరిగి వస్తుండగా మంగళవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఓ బ్రిడ్జ్ వద్ద మావోయిస్టులు బాంబు పెట్టి బస్సును పేల్చేసినట్లు ఛత్తీస్‌గఢ్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీజీ అశోక్ జునేజా చెప్పారు. డ్రైవరు, ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించారని.. మరో ఇద్దరు హాస్పిటల్‌కి తీసుకెళ్లిన తరువాత మరణించారని.. మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. మావోయిస్టులు దాడి చేసిన సమయానికి బస్సులో 27 జవాన్లు ఉన్నట్లు, పేలుడు తీవ్రతకు బస్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైనట్లు పేర్కొనఆనరు. Anti-naxal ops were going on. One DRG party was returning after the op when around 4.15 pm, 3 IED blasts took place at a bridge in their route. Driver & 2 jawans died on spot, 2 died later at hospital - 5 jawans lost their lives: Ashok Juneja, DG, Anti Naxal Ops#Chhattisgarh pic.twitter.com/SEEIF5Wqr1 — ANI (@ANI) March 23, 2021 -
బీఎస్ఎఫ్ జవాన్లకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
భువనేశ్వర్ : బీఎస్ఎఫ్ జవాన్లు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జిల్లాలోని చిత్రకొండ సమితి హంతళ్‌గుడ బీఎస్ఎఫ్ క్యాంప్ 9వ బెటాలియన్‌కు చెందిన 20 మంది జవాన్లను టార్గెట్ చేస్తూ కొదలిగుడ అటవీప్రాంతంలో మావోలు అమర్చిన బాంబులను జవాన్లు మంగళవారం గుర్తించారు. కొధలిగుడ అటవీప్రాంతంలో సోమవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ డంప్‌ను గుర్తించినట్లు జవాన్లు తెలిపారు. ఇదే ప్రాంతంలో మవోలు సమావేశం అయినట్లు ముందస్తు సమాచారం అందడంతో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జవాన్ల రాకను గుర్తించిన మావోలు అక్కడ నుంచి పరారయ్యారు. జవాన్లు ఒక బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఐఈడీ బాంబులు, కుక్కర్ బాంబు, టిఫిన్ బాక్స్ బాంబు, మందులు, ఇతర సామగ్రిని గుర్తించారు. ఈ వారంలో డంప్ స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. చిత్రకొండ సమీపంలో ఇటీవల మావోలు అమర్చిన మందు పాత్ర పేలి పలువురు జవాన్లకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. -
దంతేవాడలో ఎన్కౌంటర్..
సాక్షి, ఛత్తీస్‌గఢ్: దంతేవాడ జిల్లా కలేపాల్-పోరో కాకారి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు మృతి చెందారు. మృతి చెందిన నక్సల్స్ ఐదు లక్షల రివార్డు వున్న ఐతి మాండవీ, మరో మావోయిస్ట్ రెండు లక్షల రివార్డు వున్న బెజ్జి మాండవీ గా గుర్తించారు. మృత దేహాలు వద్ద నాటు తుపాకీ, పిస్తోల్ లభ్యమయ్యాయి. కిరంథోల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. -
పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
జి.మాడుగుల: తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో ఆదిమజాతి గిరిజనుడిని (పీవీటీజీ) మావోయిస్టులు గొంతుకోసి హతమార్చారు. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వాకపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనుడు గెమ్మెలి కృష్ణారావు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి తన ఇంటిలో కుటుంబంతో సహా నిద్రిస్తున్న సమయంలో సీపీఐ (మావోయిస్టు) పెదబయలు, కోరుకొండ ఏరియా కమిటీకి చెందిన 30మంది సాయుధులైన మావోయిస్టులు వచ్చి మాట్లాడి పంపుతామని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సమీప అంగన్వాడీ భవనం వద్ద అతి క్రూరంగా గొంతుకోసి హతమార్చారు. కృష్ణారావు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని, పోలీసులకు ఎప్పటికప్పుడు మావోల సమాచారం అందిస్తున్నాడని, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోనందునే హతమారుస్తున్నామని ఘటనా స్థలంలో విడిచివెళ్లిన లేఖలో పేర్కొన్నారు. మరికొంతమంది పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే వారికీ శిక్ష తప్పదని ఆ లేఖలో హెచ్చరించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. కృష్ణారావు మృతదేహాన్ని నుర్మతి ఔట్‌పోస్టు పోలీసులు శవ పంచనామా నిమిత్తం అంబులెన్సులో తరలించారు. -
పేలుడు ధాటికి తునాతునకలైన కారు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో తర్రెం వద్ద మందు పాతరలు పేల్చారు. రహదారిపై వెళుతున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.(చదవండి: యూపీలో జర్నలిస్టు పాశవిక హత్య) ఇదిలా ఉండగా.. పోలీసు ఇన్ఫార్మర్ అన్న నెపంతో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. బీజాపూర్ జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలిలో లేఖ వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఇన్ఫార్మర్ నెపంతో హత్య
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఏజెన్సీల్లో మావోయిస్టులు మరింత అలజడి సృష్టిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో 15 రోజుల వ్యవధిలో మరో వ్యక్తిని హతమార్చారు. ఈ నెల 10న వెంకటాపురం మండలం ఆలుబాకలో టీఆర్ఎస్ నాయకుడు భీమేశ్వరరావును హత్య చేయగా, తాజాగా ఆదివారం ఉదయం చర్ల మండలంలోని చెన్నాపురం–గోరుకొండ గ్రామాల మధ్య ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన నాయకులపు ఈశ్వర్‌ను చంపి, రహదారిపైనే మృతదేహాన్ని వదిలివెళ్లారు. ఈశ్వర్ పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడనే నెపంతో హతమార్చినట్లు సమాచారం. మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయి. మృతుడి గొంతుకు తాళ్లు బిగించి చంపినట్లుగా ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. మృతదేహాన్ని చర్లకు తరలించి పోస్టుమార్టం అనంతరం కటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు ఈశ్వర్ భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ తెలిపారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సనీల్‌దత్ విడుదల చేసిన ప్రకటనలో మాత్రం మృతుడు ఈశ్వర్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కీలక నేతలు హరిభూషణ్, దామోదర్, చంద్రన్నలకు కొరియర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. అతడిని మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఒత్తిడి చేశారని, అందుకు ఈశ్వర్ నిరాకరించడంతో హతమార్చారని వివరించారు. -
ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు
సాక్షి, విశాఖ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు తెగబడ్డారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. పెదబయలు సమీపంలోని ఇంజరీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే భద్రతా బలగాలు తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రెండు నెలల వ్యవధిలో వరుసగా మావోయిస్టులు మందుపాతరలు పేల్చుతున్నారు. మరోవైపు ఏవోబీలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మందు పాతరల గుర్తింపు; యువకుడి హత్య
సాక్షి, భువనేశ్వర్ : ఇన్ఫార్మర్ నెపంతో ఓ గిరిజన యువకుడిని హత్య చేశారు మావోయిస్టులు. ఈ సంఘటన ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లోని మల్కాన్‌గిరి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్కాన్‌గిరి జిల్లా కట్ ఆఫ్ ఏరియాలో గల జోడం పంచాయతీ ఖజిరిపుట్ గ్రామానికి చెందిన దాస్ కీముడు అనే 25 ఏళ్ల యువకుడు ఇన్ఫార్మర్గా ఉంటూ తమ విషయాలను పోలీసులకు చేరవేస్తున్నాడని మావోయిస్టులు భావించారు. ( 60 గంటలు దాటినా దొరకని దీక్షిత్ ఆచూకీ ) ఇటీవల భద్రతా బలగాలు లక్ష్యంగా పాతి పెట్టిన 7 మందు పాతరల గురించి పోలీసులకు తెలియటం అతడి పనేనని వారు భావించారు. దీంతో అతడ్ని దారుణంగా హత్య చేశారు. అతడితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా గాయపరిచారు. ఈ ఘటనతో కట్ ఆఫ్ ఏరియాలోని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. -
ములుగులో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోలు హతం
సాక్షి, ములుగు : జిల్లాలోని మంగపేట మండలంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది.రామచంద్రునిపేట అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను ఇటీవల టీఆర్ఎస్ నేత భీమేశ్వరావును హతమార్చిన మావోయిస్టులుగా గుర్తించారు. కాగా, ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధ రాత్రి బయటకు లాక్కొచ్చి చంపిన విషయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు ఈ ఘూతుకానికి పాల్పడ్డారు. ఈ కేసును ప్రేస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు గస్తీ పెంచారు. ప్రతి రోజు కూంబింగ్ నిర్వహిస్తూ అనుమానితులను అరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. (చదవండి : ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ఎస్ నేత హత్య) -
దూకుడే మంత్రం
సాక్షి, హైదరాబాద్ /భద్రాది కొత్తగూడెం: తెలంగాణలో మావోయిస్టులు బలపడుతున్నారా? తమపై పోలీసులు– కేంద్ర బలగాలు ప్రకటించిన యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ములుగు జిల్లా వెంకటాపురం హత్యతో సంకేతాలు పంపారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గణపతి తరువాత రెండేళ్ల క్రితం మావోయిస్టు పగ్గాలు చేపట్టిన నంబాల కేశవరావు (అలియాస్ గంగన్న, అలియాస్ బసవరాజు, అలియాస్ బైరు) మొదటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు. మిలిటరీ ఆపరేషన్లు, ఆంబుష్‌లు, మెరుపుదాడుల్లో ఇతను సిద్ధహస్తుడు. మావోయిస్టుల ఏరివేతకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ ప్రహార్ మాదిరిగానే.. తెలంగాణలోనూ కేంద్రబలగాలు రంగంలోకి దిగుతాయన్న ప్రచారంతో తాము కూడా వెనక్కితగ్గబోమన్న సంకేతాలు ఇచ్చే క్రమంలోనే మావోలు తాజాగా వెంకటాపురం (ములుగు)లో హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది నల్లూరి గతేడాది ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఎమ్మెల్యే బీమా మాండవిని మందుపాతర పెట్టి హత్య చేయడం ద్వారా నంబాల తన పథక రచనలు మొదలుపెట్టాడు. అదే దూకుడుతో గతేడాది జూలై 12న ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావు హత్యతో తెలంగాణలో మావోయిస్టులు ఉనికిని చాటుకునే యత్నం ప్రారంభించారు. తరువాత జరిగిన మావోయిస్టు వారోత్సవాల్లోనూ దూకుడుగానే వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. శనివారం అర్ధరాత్రి ములుగుజిల్లా వెంకటాపురం మండలంలో జరిగిన హత్యలోనూ పార్టీ దూకుడు వెనక నంబాల ఆదేశాలే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అదే విధంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ ఆసిఫాబాద్‌లోనే తిష్టవేయడం, మూడు ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నా.. ఇంకా అక్కడే ఉండటం వెనకా నంబాల ఆదేశాలే కారణమై ఉంటాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర కమిటీల నియామకం జరిపిన నంబాల.. ఆయా ఏరియాల కార్యదర్శలకు రిక్రూట్మెంట్కు ఆదేశాలు ఇచ్చినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. మావోలను ఏరివేసేందుకు అక్టోబరు 4వ తేదీన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోనే తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా పోలీసు ఉన్నతాధికారులతో సీఆర్పీఎఫ్ డీజీ మహేశ్వరీ, కేంద్ర హోంశాఖ సీనియర్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎస్ఎస్ఏ), ఐపీఎస్ విజయ్‌కుమార్‌లు సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. మావోల ఏరివేతలో అవసరమైతే మరిన్ని కేంద్ర బలగాలు, వీలునుబట్టి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లను కూడా పంపేందుకు ఈ సమావేశంలో తెలంగాణ పోలీసులకు హామీ లభించింది. అదేరోజు తమ ఆచూకీ తెలిపితే చంపేస్తామని హెచ్చరిస్తూ లేఖ విడుదల చేసిన మావోలు.. అన్నట్లుగానే వారం తిరక్కముందే అధికార పార్టీకి చెందిన భీమేశ్వరరావును హతమార్చడం కలకలం రేపుతోంది. ఈ హత్యలో వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి ముచకి ఉద్గాయి అలియాస్ రఘు, అలియాస్ సుధాకర్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలో దాదాపు 25 మంది వరకు పాల్గొనడంతో వచ్చినవారంతా మావోలేనా? లేక సానుభూతిపరులు కూడా పాల్గొన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలని, తమకు సమాచారం ఇవ్వకుండా ఏజెన్సీలకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. మన్యం... ఉద్రిక్తం ఇటు మావోలు, అటు పోలీసుల పోరులో మన్యంలో రక్తపుటేరులు పారుతున్నాయి. తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లకు పొరుగునే ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఇన్ఫార్మర్లే కారణమని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెండువారాల్లో... తెలంగాణలో నాలుగు ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించడం పార్టీ జీర్ణించుకోలేకపోయింది. దీంతో ప్రతీకారచర్యలకు దిగింది. బీజాపూర్ జిల్లా గంగలూరులో పోలీస్ ఇన్ఫార్మర్లనే ముద్రవేసి పలువురిని కిడ్నాప్ చేసిన మావోలు ప్రజాకోర్టులు నిర్వహించి మొత్తం 25 మందిని చంపేశారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో ఈనెల 7న ప్రకటన సైతం ఇచ్చారు. తెలంగాణలోని జిల్లాల్లోనూ పోలీసు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అనుమానం ఉన్నవారిని అపహరించి ప్రజాకోర్టులు నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పోలీసులు, అటు కేంద్రబలగాలు, మరోవైపు మావోయిస్టుల సంచారంతో మన్యం చిగురుటాకులా వణుకుతోంది. ఎపుడు ఏం జరుగుతుందో తెలియక...గూడెంవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. త్వరలో రంగంలోకి 11 మంది ఐపీఎస్‌లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 11 మంది ఐపీఎస్‌లకు ప్రస్తుతం రాజేంద్రనగర్ సమీపంలోని ప్రేమావతిపేటలోని గ్రేహౌండ్స్ కేంద్రంలో అసాల్ట్ కమాండర్ శిక్షణ కొనసాగుతోంది. అటవీ వాతావరణాన్ని తట్టుకునేలా వీరికి కఠోర శిక్షణ ఇస్తున్నారు. దసరాతో శిక్షణ పూర్తికానున్న వీరికి ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లోని మావో ప్రాబల్య ప్రాంతాల్లో కూంబింగ్ బాధ్యతలు అప్పజెబుతారు. -
ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
-
టీఆర్ఎస్ నేతను హతమార్చిన మావోలు
సాక్షి, ములుగు: జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. వెంకటాపురం మండంలోని అలుబాక గ్రామంలో శనివారం అర్ధరాత్రి టీఆర్ఎస్ నేత భీమేశ్వర్‌రావును మావోయిస్టులు హతమార్చారు. అర్థరాత్రి ఇంట్లో నుంచి ఆయన్ని బయటకు తీసుకొచ్చి కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. ఈ హత్యలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు కూబింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి ఉనికి తెలిపేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులు వదిలివెళ్లిన లేఖ, దాడికి ఉపయోగించిన కత్తి -
కొనసాగుతున్న కూంబింగ్
సాక్షి, మంచిర్యాల: ఆసిఫాబాద్‌లోని కదంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఇందులో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని పామి డి ప్రాంతానికి చెందిన చుక్కాలు, మరొకరు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాలతిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక బాది రావుగా గుర్తించారు. చుక్కాలు యాక్షన్ టీం సభ్యుడిగా ఉండగా, బాదిరావు 3 నెలల క్రితమే కేబీఎం (కుమురంభీం–మంచిర్యాల) దళంలో చేరాడు. మృతదేహాల వద్ద 9ఎంఎం కార్బన్ ఆటోమేటిక్, 12 బోర్ ఆయుధాలు, రెండు కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, కేం ద్ర కమిటీ లేఖలు, రామజన్మభూమి ప్రతు లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలకు ఆ దివారం సిర్పూర్(టి) ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాదిరావు కు టుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఘ టన స్థలానికి జిల్లా ఇన్చార్జి ఎస్పీ, రామగుం డం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఓ ఎస్డీ, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కు మార్రెడ్డి, ఏఎస్పీ సుధీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్రావు, కాగజ్‌నగర్ రూరల్ సీఐ సురేందర్ చేరుకున్నారు. అడెళ్లు కోసం గాలింపు ఎన్కౌంటర్ మృతుల్లో మైలవరపు అడెళ్లుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న వర్గీస్‌తో పాటు మరో మహిళ ఉన్నట్లు తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వారిద్దరు కాదని ఐడీ కార్డుల ద్వారా తేల్చారు. కదంబా అటవీ ప్రాంతంలోనే మరికొందరు దళ సభ్యులు ఉ న్నారనే సమాచారంతో 14 గ్రేహౌండ్స్ బృం దాలు, ఉమ్మడి జిల్లాకు చెందిన 6 స్పెషల్ పా ర్టీ బలగాలతో ప్రాణహిత తీరం నుంచి కౌటా ల, బెజ్జూరు, దహెగాం, నీల్వాయి, చెన్నూరు గోదావరి తీరం వరకు కూంబింగ్ ముమ్మరం గా సాగుతోంది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేఎంబీ దళ నేత అయిన అడెళ్లు అలియాస్ భాస్కర్ కోసం గాలింపు విస్తృతం చేశారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 15 మంది దళంలో చేరినట్లు సమాచారం రావడంతో వారి కోసం గాలిస్తున్నారు. అనుమానితుల ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2 గంటల పాటు కాల్పులు: ఇన్చార్జి ఎస్పీ కదంబా అడవుల్లో పోలీసులకు, దళ సభ్యులకు మధ్య 2 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయని జిల్లా ఇన్చార్జి ఎస్పీ వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఘటన స్థలంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భాస్కర్ దళం సంచరిస్తుందనే సమాచారంతో కూంబింగ్ విస్తృతం చేశాం. 5 రోజుల్లో సిర్పూర్(యూ) మండలం కాకరబుద్ది, తిర్యాణి, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో మూడు సార్లు తప్పించుకున్నారు. దీంతో వారి కదలికలను గుర్తించి ముమ్మరంగా కూంబింగ్ చేయగా కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో దళ సభ్యులు తారసపడ్డారు. ఆయుధాలతో ఉన్న వారిని చూసి లొంగిపోవాలని పోలీసులు అంటుండగానే దళ సభ్యులు విచè క్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసు లు వెంటనే పొజిషన్ తీసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసులకు ఎవరికీ గాయాలు కాలేదు. తప్పించుకున్న కీలక సభ్యులు ఇక్కడే కిలోమీటరున్నర పరిధిలోనే ఉన్నారు. వారి కోసం బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి’అని తెలిపారు. పట్టుకుని కాల్చి చంపారు: మావోలు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చి న కామ్రేడ్లను పోలీసులు నిర్దాక్షిణ్యంగా పట్టుకుని కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఆదివారం సాయంత్రం కేబీఎం కమిటీ కార్యదర్శి భాస్కర్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. ‘ఈ ఎన్కౌంటర్ బూటకం. కామ్రేడ్లు చుక్కాలు, బాదిరావులు తమ ప్రాణ త్యాగంతో మరోసారి ఉమ్మడి జిల్లాలో విప్లవ కేతనం ఎగరేశారు. భారత దోపిడీ పాలకులు 2022 నాటికి విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు ఆపరేషన్ సమాధాన్‌తో తెలంగాణలోనూ అణచివేత తీవ్రతరం చేశారు. కార్డన్ సెర్చ్ పేరుతో గ్రామాల్లో సోదాలు, అక్రమ అరెస్టులు చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా చిత్రహింసలు చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలకు శిక్షలు తప్పవు’ అని లేఖలో హెచ్చరించారు. -
అటవీ శాఖ రేంజర్ హత్య
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు శుక్రవారం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్‌ను హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా బైరంగడ్ అటవీ రేంజ్ పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కూలీలకు డబ్బులు చెల్లించి తిరిగి వస్తున్న రేంజ్ ఆఫీసర్ కొండ్రోజీని మావోయిస్టులు అడ్డుకొని కిడ్నాప్ చేశారు. అనంతరం గొడ్డళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. సమాచారం తెలుసుకున్న జంగ్లా పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుంకుతున్నదుమ్ముగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట జలకళను సంతరించుకుంది. విస్తారంగా కురిసిన వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి తరలివస్తున్న గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. ఫలితంగా చూసేకొద్దీ మళ్లీ చూడాలనిపించే ఆనకట్ట అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం ‘సాక్షి’కెమెరా ఈ దృశ్యాన్ని బంధించింది. -
ఛత్తీస్‌గఢ్: పేలుడు పదార్థాలు నిర్వీర్యం
-
ఏవోబీలో ఎదురు కాల్పులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మల్కాస్‌గిరి జిల్లా సరిహద్దు గుజ్జేడు ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. 10 రోజుల వ్యవధిలో ఏవోబీలో మూడు సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్ట్ యాక్షన్ టీములు సంచరిస్తున్నాయనే సమాచారంతో పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. -
మావోయిస్టులను గట్టి దెబ్బ కొడతాం: డీజీపీ
సాక్షి, ఏటూరు నాగారం: మావోయిస్టులు అభివృద్ది నిరోధకులని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏటూరు నాగారం సబ్ డివిజన్లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్లో ములుగు, భూపాలపల్లికి చెందిన పోలీసు అధికారులతో శనివారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్, ఐజీ నాగిరెడ్డి ఐపీఎస్, ఐజీ ప్రభాకర్ రావు ఐపీఎస్, ఐజీ నవీన్ చంద్ ఐపీఎస్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్, ఓఎస్డీకే సురేష్ కుమార్, శోభన్ కుమార్, ఏఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్, సాయి చైతన్య ఐపీఎస్, గౌస్ ఆలం ఐపీఎస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో ప్రవేశించి హింసాత్మక చర్యలకు పూనుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ తరుణంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను తెలంగాణ గడ్డ మీద జరగనివ్వబోదని రాష్ట్ర ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అయినటువంటి హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారన్నారన్నారు. మావోయిస్టులకు ఎవరూ కూడా సహకరించకుండా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలోని డాక్టర్లలను, ఇంజనీర్లను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసుకునేందుకు పథక రచనతో మావోయస్టులు తిరిగి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారు చేసే ప్రయత్నాలను తెలంగాణ పోలీస్ శాఖ సమర్థంగా తిప్పి కొడుతుందని పేర్కొన్నారు. దాదాపు పది సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల కోపాగ్నికి గురై ఇక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయిన మావోయిస్టులు తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రజల కోపానికి గురి కాకూడదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రతి గ్రామం రహదారులతో అనుసంధానింపబడి విద్య, వైద్యం వంటి సదుపాయాలను పొందుతూ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్న ఈ సమయంలో మావోయిస్టులు తిరిగి తెలంగాణలో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలకు పాల్పడే మావోయిస్టులకు రానున్న రోజుల్లో తెలంగాణ పోలీస్ శాఖ గట్టి దెబ్బ కొడుతుందని హెచ్చరించారు. నక్సలిజం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే శరవేగంగా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతుందని తెలియజేశారు. -
ఏజెన్సీలో అలజడి
మణుగూరురూరల్: మణుగూరు సబ్ డివిజన్ ఏజెన్సీ ప్రాంతంలో అలజడి మొదలైంది. బుధవారం మణుగూరు అట వీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌కు గాయం కావడంతో పోలీసులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలు స్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు దళాన్ని మట్టుపెట్టాలని వెళ్లిన పోలీసులకు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం మణుగూరును ఎస్పీ సునీల్ దత్, ఏఎస్పీ రమణారెడ్డి సైతం సందర్శించారు. స్థానిక అడిషనల్ ఎస్పీ శబరీష్‌తో మాట్లాడి ఎదురుకాల్పుల తీరుతెన్నులు తెలుసుకున్నారు. అక్కడ లభించిన సామగ్రిని పరిశీలించారు. మావోయిస్టుల కాల్పుల్లో ఓ పోలీస్ గాయపడగా, ప్రతికారం తీర్చుకునేందుకు అడవులను జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. భారీగా పోలీస్ బలగాలను దింపి ఏజెన్సీ లో మారుమూల వలస గిరిజన గ్రామాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు. కొత్తగా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకుంటున్నారు. వారి వివరాలను ఆరా తీస్తున్నారు. కిట్‌బ్యాగ్‌లు లభ్యం ఎదురు కాల్పుల ప్రాంతంలో లభించిన మావోయిస్టుల సామగ్రి వివరాలను ఎస్పీ సునీల్‌దత్, ఏఎస్పీ రమణారెడ్డి, మణుగూరు అడిషనల్ ఎస్పీ శబరీష్ వెల్లడించారు. మణుగూరు మండలం మల్లెతోగు అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు కూంబింగ్ చేస్తున్న పోలీసులకు దళం తారసపడిందని తెలిపారు. లొంగిపోవాలని చెప్పినప్పటికీ వారు కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. సుమారు 10 నిమిషాల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయని, కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయని వివరించారు. మావో యిస్టులు తమ సామగ్రి వదిలి పారిపోయారని తెలిపారు. సంఘటన స్థలంలో 8ఎంఎం రైఫిల్ ఒకటి, 10 కిట్‌బ్యాగ్‌లు, మెడికల్ కిట్లు, విప్లవ సాహిత్యం, ఐఈడీ ఒకటి, డిటోనేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు లభించినట్లు తెలిపారు. పోలీసుల అదుపులో ముగ్గురు ? మావోయిస్టులు దొరికినట్లు దొరికి తప్పించుకుపోవడంతో సవాల్‌గా తీసుకున్న పోలీసులు మావోయిస్టు సానుభూతిపరులైన ముగ్గురు వలస గిరిజనులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాలను పోలీసులు మాత్రం ధ్రువీకరించడంలేదు. ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ జరుపుతున్నమాట వాస్తవమేకాని, తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదంటున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయంతో ఆదివాసీ వలస గిరిజన గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. -
అభయారణ్యంలో ఎదురుకాల్పులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/ఇల్లెందు: మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోని కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దులో ఉన్న అభయారణ్యంలో బుధవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్ట్ యాక్షన్ టీములు సంచరిస్తున్నాయనే సమాచారంతో మూడు రోజులుగా పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కరకగూడెం, ఆళ్లపల్లి సరిహద్దు మల్లేపల్లితోగు వద్ద మావోయిస్టులు తారసపడటంతో పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. 10 మంది వరకు మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే తప్పించుకున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాల్పులు జరిగిన ప్రదేశంలో వారి సామగ్రి లభించింది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను మోహరించి కూంబింగ్ ముమ్మరం చేశారు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం పోలీసులు హైదరాబాద్ తరలించారు. కాగా ఆ ప్రాంతంలో ఎక్కువమంది మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో.. మావోయిస్టులపై పోరులో భాగంగా పోలీసు బలగాలు గోదావరి పరీవాహక ప్రాంతం వ్యాప్తంగా కూంబింగ్ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టాయి. గతంలో ఎండాకాలంలోనే మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో, తెలంగాణలోని అభయారణ్యంలో పోరు జరిగేది. అయితే ప్రస్తుతం మాత్రం ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నప్పటికీ పోరు నడుస్తోంది. ఈ నెల 13న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతంలోని మాంగీ వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ నుంచి నలుగురు మావోయిస్టులు తప్పించుకోగా, వారిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మంచిర్యాల–ఆదిలాబాద్ డివిజన్ కార్యదర్శి మైలవరపు అడేళ్లు అలియాస్ భాస్కర్ కూడా ఉన్నట్లు సమాచారం. పోడు భూముల సమస్య నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణ జిల్లాల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల మీదుగా వచ్చి గోదావరి దాటి మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, పినపాక, మణుగూరు, కరకగూడెం మండలాల మీదుగా ఇతర జిల్లాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు గోదావరి పరీవాహక అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. కాగా కూంబింగ్ కొనసాగుతుందని ఏఎస్పీ (ఆపరేషన్స్) రమణారెడ్డి తెలిపారు. ఉలిక్కిపడ్డ ఏజెన్సీ ఎదురుకాల్పుల సంఘటనతో ఏజెన్సీ ఉలిక్కి పడింది. మూడు రోజులుగా ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు సబ్ డివిజన్లలో స్పెషల్ పార్టీ బలగాలతో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చినట్లు సమాచారం అందుకున్న వరంగల్, భద్రాద్రి పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మణుగూరు ఏరియాలోని మల్లేపల్లితోగు అటవీ ప్రాంతంలో ఉదయం 9గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ ప్రకటించారు. దామోదర్, భద్రూ, శాంత, భాస్కర్లతో కూడిన సుమారు 10 మంది మావోయిస్టుల కోసం అన్వేషిస్తుండగా, మణుగూరు ఏరియా మల్లేపల్లితోగు, రంగాపురం అటవీ ప్రాంతంలో నక్సల్స్ తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాల్పుల నేపథ్యంలో గుండాల మండలంలోని దామరతోగు, చెట్టుపల్లి అటవీ ప్రాంతం, తాడ్వాయి మండలంలోని దుబ్బగూడెం, గంగారం మండలంలోని పాకాల ఏరియా, ఇల్లెందు, గుండాల మండలాల సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ఉధృతం చేశారు. 2019 ఆగస్టు 21 తెల్లారుజామున మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో గుండాల మండలం దామరతోగుకు చెందిన జాడి వీరస్వామి అలియాస్ రఘు మృతి చెందాడు. ఏడాదిలోపు అదే ప్రాంతంలో మళ్లీ ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఏజెన్సీలో ఆందోళన నెలకొంది. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతుండగా, ఇదే అదునుగా మావోయిస్టులు ఏజెన్సీలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా వర్షాకాలంలో ఆకు పచ్చబడ్డ తర్వాత ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. వర్షాల కారణంగా ఇప్పటికే అటవీ ప్రాంతం కూడా పచ్చబడింది. గతేడాది కూడా గుండాల మండలం రోళ్లగడ్డ వద్ద మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో న్యూడెమోక్రసీ దళనేత లింగన్న ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలానికి ఆనుకునే ఉన్న ములుగు జిల్లాలోని మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెంలలో రెండు రోజుల క్రితమే మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. మణుగూరురూరల్: ఎదురుకాల్పుల ఘటనతో మణుగూరు సబ్‌డివిజన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ ఎంఏ షుకూర్ నేతృత్వంలో బుగ్గ, ఖమ్మంతోగు ప్రాంతాలకు వెళ్లే అటవీప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు. కాల్పుల ఘటనతో ఆదివాసీగూడేలు వణికిపోతున్నాయి. -
ఎన్కౌంటర్; నలుగురు మావోయిస్టుల మృతి
మన్పూర్ : ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో శుక్రవారం రాత్రి పోలీసులకు, మావోయిస్టులు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఎస్ఐ మృతి చెందగా, నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. రాజనందగావ్ జిల్లా మన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పర్దోని సమీపంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మామదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్యామ్ కిషోర్ శర్మ నేతృతత్వంలో పోలీసులు శుక్రవారం రాత్రి మన్పూర్ నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో అప్పటికే మాటు వేసిన మావోయిస్టులు పోలీసులపై మెరుపుదాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులతో పాటు, ఎస్ఐ శ్యామ్ కిషోర్ శర్మ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మావోయిస్టుల నుంచి ఏకే-47, రెండు 315-బోర్ రైఫిళ్లు, ఎస్ఎల్ఆర్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ జితేంద్ర శుక్లా సంఘటనా స్థలానికి వెళ్లారు. -
మావోయిస్టు నేత దేవ్‌జీ భార్య ఎన్కౌంటర్
కాళేశ్వరం/కోరుట్ల/చర్ల: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ భార్య సృజనక్క (48) ఎన్కౌంటర్లో మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా జారవండి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీన్‌బట్టి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. గడ్చిరోలి ఎస్పీ శైలేష్ బాల్కావుడే కథనం ప్రకారం.. మావోయిస్టులు రహస్య ప్రదేశంలో సమావేశమైనట్లు సమాచారం రావడంతో శనివారం సాయంత్రం పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మావోయిస్టు కసన్సూర్ దళం డివిజన్ ఇన్చార్జి సృజనక్క అలియాస్ చిన్నక్క అలియాస్ చైతు ఆర్కా మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. కొంతమంది మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారని పేర్కొన్నారు. సృజనక్క ఇరవై ఏళ్లకు పైగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తోందని, ఆమెపై రూ.16 లక్షల రివార్డు ఉందని, పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. సంఘటన స్థలంలో ఏకే 47, ప్రెషర్ కుక్కర్, క్లైమోర్మైన్, విప్లవ సాహిత్యాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవ్‌జీది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల కాగా, సృజనక్క స్వస్థలం గడ్చిరోలి జిల్లా అహేరి. కొన్నేళ్లుగా వీరిద్దరు మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహిస్తున్నారు. -
మావో పంజా
సాక్షి, హైదరాబాద్/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించిన మావోయిస్టులు ఆకస్మిక దాడి చేసి 17 మంది జవాన్లను బలితీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాలోని చింతగుఫా ఏరియాలో మీన్పా అడవుల్లో నక్సల్ కమాండర్ హీడ్మా, వినోద్, దేవా శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో 250 నుంచి 300 డీఆర్జీ (జిల్లా రిజర్వ్ గార్డులు), ఎస్టీఎఫ్ (స్పెషల్‌టాస్క్‌ఫోర్స్) జవాన్లతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు వారికి తారసపడ్డారు. ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్కౌంటర్లో 17 మంది జవాన్లు మరణించగా, 14 మంది గాయపడ్డారు. దాదాపు 8 గంటలపాటు కాల్పులు.. వేసవి రావడంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ ఏడాది కూడా ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా మావోయిస్టుల కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపులు మొదలుపెట్టారు. చింతగుఫా సమీపంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో దాదాపు 300 మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు ముగించుకుని తిరిగి వస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య శనివారం మధ్యాహ్నం 12.40 నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 8 గంటలపాటు వందలాది రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పుల సమయంలో గాయపడ్డ 14 మందిని హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఎన్కౌంటర్ దట్టమైన అటవీ ప్రాంతంలో జరగడం, రాత్రి వరకు కొనసాగడంతో 17 మంది జవాన్ల జాడ తెలియకుండాపోయింది. ఆదివారం డ్రోన్ల సాయంతో గాలించగా.. ఆ 17 మంది విగతజీవులుగా కనిపించారు. అనంతరం బలగాలు ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. అమరులైన జవాన్లు వీరే.. :డీఆర్జీ విభాగం కానిస్టేబుళ్లు హేమంత్‌దాస్, లిబ్రూరాం, సోయం రమేష్, వంజెం నాగేష్, మడకం మాసా, పొడియం లక్మా, మడకం ఇడమా, వంజం నితేంద్రం, అసిస్టెంట్ కానిస్టేబుళ్లు గంధం రమేష్ , ఉయికా కమిలేష్, పొడియం ముత్తా, ఉయికా దుర్బా, ఎస్టీఎఫ్ విభాగం కానిస్టేబుళ్లు సీతారాం రాశ్యా, హేమంత్‌బోయ్, అమర్జిత్ కల్లోజీ, అసిస్టెంట్ కానిస్టేబుళ్లు నారోద్ మితాడ్, మడకం ముచ్చు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లలో మావోలు... బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ధరించిన మావోయిస్టులు భారీ ఆయుధాలతో ఆకస్మికంగా దాడికి పాల్పడినట్లు పోలీసులు అంటున్నారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మావోయిస్టులకు తక్కువ ప్రాణనష్టం జరిగి ఉండవచ్చనంటున్నారు. వారి ధీరత్వాన్ని మరచిపోం: మోదీ భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన ఘాతుకంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తున్నాను. ఈ దాడిలో అమరవీరులైన భద్రతా బలగాలకు అంజలిఘటిస్తున్నాను. వారు చూపిన ధీరత్వాన్ని ఎన్నటికీ మరచిపోం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. -
మందుపాతర పేల్చిన మావోలు
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బస్తర్ జిల్లాలో శనివారం మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్రాజ్ కథనం ప్రకారం.. జిల్లాలోని బాన్సూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొద్లీ–బాల్వాయి గ్రామాల మధ్య రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు పనుల వద్ద భద్రతగా నిలిచేందుకు బాన్సూర్ పోలీస్ స్టేషన్ నుంచి సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక బలగాలు వెళ్తుండగా, మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఉపేందర్ సాహూ, దేవేందర్ సాహూ మృతిచెందారు. సీఆర్పీఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలు కాగా ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించి వైద్య సేవలనందిస్తున్నారు. మందుపాతర పేల్చిన అనంతరం మావోయిస్టులు, పోలీసులకు మధ్య 15 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. -
దండకారణ్యంలో యుద్ధ మేఘాలు!
సాక్షి, చర్ల(ఖమ్మం): దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. చర్ల మండల సరిహద్దున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గల పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టుతో పాటు ఇద్దరు జవాన్లు మృతి చెందిన విషయం విదితమే. కాగా, ఈ ఎదురుకాల్పుల్లో పాల్గొని తప్పించుకున్న మావోయిస్టులను పట్టుకోవాలన్న కృతనిశ్చయంతో ప్రత్యేక పోలీసు బలగాలు దండకారణ్యంలోకి పెద్దఎత్తున చొచ్చుకుపోతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, కోబ్రా, డీఆర్జీ, ఎస్టీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు సరిహద్దుకు చేరుకొని దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. సరిహద్దున బీజాపూర్ జిల్లాలో ఉన్న ఎర్రపల్లి, డోకుపాడు, తెట్టెమడుగు, యాంపు రం, జారుపల్లి, గుండ్రాయి, పాలచలమ తది తర గ్రామాలకు చెందిన ఆదివాసీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎర్రపల్లి ఎదురుకాల్పుల నేపథ్యంలో సరిహద్దులో ఉన్న తోగ్గూడెం, తిప్పాపురం, ధర్మపేట, ఎలకనగూడెం, మారాయిగూడెం, పామేడు ప్రాంతాల్లో ఉన్న బేస్‌క్యాంపులతో పాటు డీఆర్జీ, ఎస్టీఎఫ్ క్యాంపుల్లో భద్రతను పెంచారు. ఆయా క్యాంపులకు అదనపు బలగాలను తరలిస్తున్నారు. ఆకు రాలే కాలం కావడంతో ఇక నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు ఆరంభం కానుండగా, ఎప్పుడు, ఎక్కడ ఏ ప్రమాదం వచ్చి పడుతుందోనని సరిహద్దు జనం భయకంపితులవుతున్నారు. -
ఆ విషాదానికి 23 ఏళ్లు.. ఇప్పటికీ మర్చిపోలేం..
సాక్షి, కరకగూడెం(ఖమ్మం): కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు మెరుపు దాడి చేసి 16 మంది పోలీసులను బలిగొన్న విషాద సంఘటనకు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి ఏపీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక మండలం పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేది. 1997, జనవరి 9న అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో సుమారు 100 మంది మావోయిస్టులు సాయుధులై కరకగూడెం(అప్పుడు పినపాక మండలంలో ఉండేది) ఠాణాపై దాడికి పాల్పడ్డారు. బాంబులతో స్టేషన్‌ను పేల్చివేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 16 మంది పోలీసులను బలిగొన్నారు. మందుగుండు, తుపాకులను అపహరించారు. పోలీస్ సిబ్బంది బీహెచ్ఎఫ్ సెట్ ద్వారా సమీపంలోని ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌కు అదనపు సాయం కావాలని సమాచారం అందించి ప్రతిదాడి చేసేలోపే మావోయిస్టులు పోలీస్ స్టేషన్‌ను లూటీ చేసి వెళ్లిపోయారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేసరికే ఠాణాలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పాండవ, కిన్నెర, ఏటూరునాగారానికి చెందిన జంపన్న దళాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. మృతిచెందిన 16 మందిలో 8 మంది సివిల్ పోలీసులు, ఏపీఎస్పీకి చెందిన 5వ బెటాలియన్ (విజయ నగరం)కు చెందిన 8 మంది పోలీసులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ పేల్చివేత ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఆ నాటి సీఎం చంద్రబాబు నాయుడు అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి, మరో మంత్రి తుమ్మలతో కలిసి కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఏజెన్సీ ప్రజలతో సత్ససంబంధాలు కొనసాగిస్తూ... మావోయిస్టు కార్యకలాపాలకు క్రమంగా చెక్ పెడుతూ వచ్చారు. కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను అత్యంత ఆధునికంగా దాడులను ప్రతిఘటించేలా నిర్మించారు. జంపన్న మార్గదర్శకత్వంలో.. కరకగూడెం పోలీస్ స్టేషన్ పేల్చివేతలో ప్రధాన సూత్రధారి, మావోయిస్టు అగ్రనేత జంపన్న అలియాస్ జి నర్సింహారెడ్డి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో పోలీసుల సమక్షంలో తన భార్యతో కలిసి లొంగిపోయాడు. ఇప్పటికీ మర్చిపోలేం.. 23 యేళ్ల క్రితం మావోయిస్టులు కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై దాడి సంఘటనను ఇప్పటికీ మరువలేకపోతున్నాం. ఆ రోజూ రాత్రి మా గ్రామాన్ని పూర్తిగా మావోయిస్టులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మేము భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపాం. –సయ్యద్ ఖాజా హుస్సేన్, కరకగూడెం మరుభూమిలా.. అర్ధరాత్రి వేళ బాంబులు, తూటాల శబ్దాలతో గ్రామం దద్ధరిల్లింది. ఇంట్లో నుంచి బయకొస్తుండగా.. బయటకు రావద్దని మావోయిస్టులు హెచ్చరిక చేశారు. దీంతో గ్రామస్తులెవరూ బయటకు రాలేదు. తెల్లారి చూస్తే పోలీస్ స్టేషన్ మరుభూమిలా కన్పించింది. – సార భిక్షం, కరకగూడెం గ్రామస్తుడు అమరుల ఆశయ సాధనే లక్ష్యం పోలీస్ అమరుల ఆశయ సాధనే మా లక్ష్యం. ప్రజా రక్షణ కోసం ప్రాణాలు వదిలిన వారి ఆశయాలను స్మరించుకుంటూ విధులు నిర్వహిస్తున్నాం. పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. – సునీల్‌దత్, ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం -
గడ్చిరోలిలో ఇద్దరు మావోల ఎన్కౌంటర్
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతం భామ్రాగఢ్‌లోని ఛత్తీస్‌గఢ్– మహారాష్ట్ర సరిహద్దుల్లో శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 2 నుంచి మొదలయ్యే మావోయిస్టు వారోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీస్ కమాండోలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత అరుణ
సాక్షి, రాజమండ్రి : మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్ చీఫ్ చలపతి భార్య అరుణను అంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతవారం జరిగిన గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్కౌంటర్లో గాయపడిన అరుణ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరుణతో పాటు గాయపడిన మరో మావోయిస్టు సభ్యురాలు భవానీ పెదబైలు దళానికి చెందిన సభ్యురాలిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన ఆమెను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కోలుకోవడంతో విచారణ నిమిత్తం ఇంటెలిజెన్స్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇక గతవారం గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు అరుణ కూడా ఉన్నట్లు తొలుత అనుమానం వ్యక్తం చేశారు. అయితే అరుణ ఎదురుకాల్పుల్లో తప్పించుకుని పోలీసుల అదుపులో ఉందని, అమరుల బంధు మిత్రుల సంఘం ఆరోపించింది. కానీ ఆ వార్తలు అవాస్తమని పోలీసులు తేల్చిచెప్పారు. అయితే ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆరుణ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. విశాఖ మన్యంలో కూంబింగ్ కొనసాగుతోంది: డీజీపీ సాక్షి, అమరావతి : విశాఖ మన్యంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్ భవాని గాయాలతో పోలీసులకి పట్టుబడినట్లు తెలిపారు. మావోయిస్టు స్టేట్ జోన్ కమిటీ మెంబర్ జగన్ భార్య భవాని అని, పెదబైలు ఏరియా కమిటీ మెంబర్‌గా భవానీ పనిచేస్తోందన్నారు. 20 ఏళ్లుగా మావో ఉద్యమంలో వివిధ విభాగాల్లో ఆమె పనిచేసిందన్నారు. భవానిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరిలించినట్లు డీజీపీ వివరించారు. -
ఆగని తుపాకుల మోత!
విశాఖ ఏజెన్సీ తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. ఆదివారం పోలీసులు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించి 24 గంటలు గడవకముందే మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. జీకే వీధి మండలం మాదిగమళ్లు అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎదురుకాల్పులు జరిగి ముగ్గురు మావోయిస్టులు చనిపోగా.. సంఘటన స్థలంలో ఐదు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మృతదేహాలను సోమవారం రాత్రి 8 గంటలకు నర్సీపట్నం తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. అదే సమయంలో మాదిగమళ్లు సమీప పేములమల్లు అటవీ ప్రాంతంలో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మూడు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక ఏకే 47, ఎస్ఎల్ఆర్, నాటు తుపాకీ ఉన్నాయి. సాక్షి, సీలేరు(విశాఖపట్టణం) : ఏజెన్సీలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులే లక్ష్యంగా అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. ఇందులో భాగంగా తమకు మావోయిస్టులు తారసపడడంతో తాజా ఎన్కౌంటర్ చోటు చేసుకుందని పోలీసులు అంటున్నారు. సంఘటన స్థలంలో ఏకే 47 ఉండడంతో మావోయిస్టుల అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా అన్నది పోలీసు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయం కావడంతో మృతులు ఎవరన్నది గుర్తించడం కష్టంగా ఉంది. ప్రస్తుతం రెండు ఎన్కౌంటర్లతో ఈ ప్రాంత మంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. గిరిజనులంతా భయంతో వణుకుతున్నారు. ఇళ్లల్లోంచి భయటకు రాని పరిస్థితి నెలకొంది. ప్రతిఘటన తీర్చుకున్న బలగాలు.. విశాఖ ఏజెన్సీ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేస్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమలను మావోయిస్టులు దారికాచి కాల్చి చంపిన సంఘటనకు సోమవారంతో ఏడాది కావచ్చింది. ఈ నేపథ్యంలో బలగాలు ఈ రెండు ఎన్కౌంటర్లతో ప్రతిఘటన తీర్చుకున్నామని ఆనందంలో ఉన్నారు. మావోయిస్టు అగ్రనేత అరుణ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చిన సంఘటనలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఆమెనే టార్గట్ చేసుకొని బలగాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 20 రోజులుగా అరుణ ఉన్న దళాన్నే టార్గట్ చేసి కూంబింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ రెండుసార్లు ఎన్కౌంటర్లో తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎలాగైనా పోలీసులు ఆమెను పట్టుకునేటట్లు కూంబింగ్ నిర్వహిస్తూ ఏడాది రోజున ఈ రెండు ఎన్కౌంటర్లలో ఐదుగురు మావోయిస్టులను హతమార్చి ఆ పార్టీకి గట్టి దెబ్బ కొట్టారు. కాగా ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వీరు ఛత్తీస్‌గఢ్‌కి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిని బుధ్రి, విమల, అజయ్‌గా గుర్తించారు. -
విశాఖ ఏజెన్సీలో భారీ ఎన్కౌంటర్
సీలేరు (పాడేరు)/సాక్షి, అమరావతి : విశాఖ ఏజెన్సీలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఆదివారం పెద్దఎత్తున జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. పార్టీ అగ్రనాయకురాలు అరుణ ఇందులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గూడెంకొత్తవీధి మండలం సీలేరు పోలీసుస్టేషన్ పరిధిలోని మాదిగమల్లు, అన్నవరం సమీప బొడ్డమామిడికొండ ప్రాంతంలో ఆదివారం ఉ.11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..విశాఖ ఏజెన్సీలో కొంతకాలంగా మావో అగ్రనేతలు సంచరిస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున విశాఖ గ్రేహౌండ్స్ బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లాయి. ఈ క్రమంలో బొడ్డమామిడి అటవీ ప్రాంతం నుంచి ఉ.10గంటల సమయంలో 15 నుంచి 20 మంది మావోయిస్టులు కొండ దిగుతుండగా అదే సమయంలో గ్రేహౌండ్స్ బలగాలు వారికి తారసపడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది. ఘటనా స్థలిలో ఎస్ఎల్ఆర్ తుపాకి ఒకటి, రెండు 303 పిస్టళ్లు, ఆరు కిట్ బ్యాగులు, ఒక మందుపాతర లభ్యమయ్యాయి. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి ధారకొండ వారపు సంతకు వచ్చిన గిరిజనులు ఈ సంఘటన గురించి «తెలిపారు. ఎదురుకాల్పుల అనంతరం భారీవర్షం పడడంతో పోలీసు బలగాలు అడవిలోనే చిక్కుకుపోయాయి. మావోయిస్టుల మృతదేహాలను సోమవారం నాటికి బయటకు తెచ్చే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, ఎదురుకాల్పుల్లో మావోలు మృతిచెందిన అనంతరం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, సీఆర్ïపిఎఫ్ దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. పరారైన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. వారోత్సవాలతో పోలీసుల హైఅలర్ట్ కాగా, ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు పసిగట్టడంతో పోలీసులు ఏఓబీలో హైఅలర్ట్ ప్రకటించారు. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన వారోత్సవాల సమయంలోనే 2018 సెప్టెంబర్ 23న అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. వీరిరువురినీ దగ్గర్నుంచి కాల్చింది అరుణ అని అప్పట్లో పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ఇటీవల ఈస్ట్ జోన్‌కు వచ్చిన అరుణ అలియాస్ వెంకట రవిచైతన్య.. ప్రస్తుతం విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఆమె 2015లో నాటి కరీంనగర్జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌కు సోదరి. అయితే, తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో అరుణ మృతిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. షెల్టర్ కోసం రాష్ట్ర సరిహద్దు జిల్లాలకు.. గత కొన్నేళ్లుగా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ఏఓబీతోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనమైన తెలంగాణ మండలాల్లో మావోల కదలికలు మళ్లీ కనిపిస్తున్నాయి. షెల్టర్‌జోన్‌గా వీరు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో మావోలు వారోత్సవాలు నిర్వహిస్తుండడం.. ఆ పార్టీ అగ్రనేతలు అందులో పాల్గొనే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలో ఆదివారం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కాగా, ఎన్కౌంటర్ సమాచారం తెలుసుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏఓబీ సరిహద్దు జిల్లాల ఎస్పీలు, గ్రేహౌండ్స్, ఎస్పీఫ్ దళాల పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం!
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు వారోత్సవాల సమయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ఇప్పటికే ధృవీకరించాయి. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు, అరుణ కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల ఈస్ట్‌జోన్‌కు వచ్చిన అరుణ గతకొంత కాలంగా విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆమె పలు ఆపరేషన్స్‌లో పాల్గొన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఆమె మృతిపై పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా గతంలో మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన నేత కిడారి సర్వేశ్వరరావు ఎన్కౌంటర్లో అరుణ క్రియాశీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి. 2015లో కొయ్యూరు ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత అజాద్ సోదరి అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య కిడారి హత్యకు నాయకత్వం వహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దగ్గరి నుంచి కాల్చింది కూడా అరుణగానే భావించారు. ఆ తరువాత ఆమెపై అనేకసార్లు ఎదురుకాల్పులు జరిపినప్పటికి అరుణ తప్పించుకున్నారు. అయితే తాజాగా ధారకొండలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెంది ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. కాగా తాజా ఘటనతో విశాఖలోని ఏజెన్సీ గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూ ఉండటంతో.. ఏవోబీలో అధికారలు హై అలర్ట్ ప్రకటించారు. చదవండి: విశాఖలో భారీ ఎన్కౌంటర్ -
విశాఖలో భారీ ఎన్కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం 11 గంటలు దాటింది... ఎత్తైన కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతం...15 నుంచి 20 మంది మావోయిస్టులు కిందకి దిగుతున్నారు. ఇదే క్రమంలో కూంబింగ్ పార్టీలు కొండ ఎక్కేందుకు సిద్ధమవుతున్నాయి. అంతే ఒక్కసారిగా కాల్పులమోతతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ హఠాత్పరిణామానికి మిగతా మావోయిస్టులు చెల్లాచెదురైపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. ఈ ఘటన గుమ్మిరేవుల పంచాయతీ అన్నవరం, మాదిగమల్లు అటవీ ప్రాంతం బొడ్డమామిడి కొండల్లో జరిగింది. మృతుల్లో గాలికొండ ఏరియా కార్యదర్శి హరి, మావోయిస్టు చలపతి భార్య అరుణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏవోబీలో యుద్ధమేఘాలు పాడేరు: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాలు ఏ క్షణంలో రాజుకుంటాయో తెలియని నిప్పు రవ్వల్లా ఉన్నాయి. ఓవైపు మావోయిస్టుల సంచారం కొనసాగుతూ ఉంటే.. మరోవైపు వారి ఏరివేతే లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాల గాలింపు ఉధృతంగా సాగుతూ ఉండడంతో ఏవోబీలో గ్రామాలు, అటవీ ప్రాంతాలు లోలోన రగులుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా మన్యంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పోలీసు పార్టీలు అధికంగా సంచరిస్తున్నప్పటికీ మావోయిస్టులు తమ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఏవోబీలోని మూడు చోట్ల మావోయిస్టులు గిరిజనులతో భారీ బహిరంగ సభలు నిర్వహించి, పోలీసు బలగాలకు సవాల్ విసిరారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలు, స్థానిక పోలీసు దళాలు కూంబింగ్లను మరింత మమ్మురం చేశాయి. పోలీసు పార్టీలు, మావోయిస్టుల సంచారంతో సరిహద్దు గ్రామాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పచ్చని అడవులు ఇరువర్గాల బూట్ల చప్పుళ్లతో ప్రతిధ్వనిస్తున్నాయి. అడవిలో పోలీసులు, మావోయిస్టులు ఎదురుపడితే తుపాకుల మోత మోగుతోంది. తాజాగా ఆదివారం జి.కే.వీధి మండలం, గుమ్మిరేవుల పంచాయతీలోని మాదిమల్లు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఈ ప్రాంతంతో పాటు, ఏవోబీ వ్యాప్తంగా పోలీసుల కూంబింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముందస్తుగానే పోలీసుల వ్యూహం మావోయిస్టు పార్టీ ఆవిర్భావ ఉత్సవాలతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ, ఒడిశా,ఆంధ్రా రాష్ట్రాల పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఏవోబీ వ్యాప్తంగా విస్తృత కూంబింగ్ ఆపరేషన్లలో కేంద్ర పోలీసు బలగాలు నిమగ్నమయ్యాయి. విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు, జి,కే.వీధి, చింతపల్లి, జి.మాడుగుల, అన్నవరం, ముంచంగిపుట్టు, పెదబయలు పోలీసు స్టేషన్లతో పాటు, అవుట్ పోస్టులు ఉన్న రాళ్లగెడ్డ, నుర్మతి, రూడకోట ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పోలీసు పార్టీలను రంగంలోకి దింపారు. ప్రత్యేక పోలీసు పార్టీలు వారం రోజుల నుంచి ఏవోబీ వ్యాప్తంగా కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. నిర్బంధం బేఖాతరు ఏవోబీలో కాస్త పుంజుకున్న మావోయిస్టు పార్టీ, పోలీసు నిర్బంధాన్ని ఖాతరు చేయడం లేదు. ఇటీవల కాలంలో తమ కార్యక్రమాలను మరింత విస్తృతపరిచింది. ఏవోబీలోని మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర నాయకత్వం యువకులను రంగంలోకి దింపినట్లు సమాచారం. మావోయిస్టు ఉద్యమాన్ని విస్తృతం చేస్తున్న యువరక్తం ఆధ్వర్యంలో ఇటీవల ఏవోబీ వ్యాప్తంగా ప్రజలతో కీలక సమావేశాలు నిర్వహించినట్టు పోలీసుశాఖ దృష్టికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మావోయిస్టు పార్టీలో కీలకమైన క్యాడర్ గత మూడు నెలల కాలంలో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసింది. మావోయిస్టుల వరుస లొంగుబాట్లతో పోలీసు యంత్రాంగం సంతోషపడింది. అయితే బలమైన క్యాడర్ ఏవోబీలో లేనప్పటికి స్థానిక క్యాడర్‌తో మావోయిస్టు పార్టీ బలం పుంజుకుంటుందన్న సమాచారంతో పోలీసుశాఖ భారీ కూంబింగ్‌లకు వ్యూహత్మంగా వ్యహరిస్తోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. మృతుల్ని గుర్తించాల్సి ఉంది జీకేవీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిని గుర్తించాల్సి ఉంది. మృతదేహాలను కొండ కిందకు తీసుకువచ్చాక వారిని గుర్తించి అప్పుడు వారు ఎవరనేది ప్రకటిస్తాం. – సతీష్‌కుమార్, ఏఎస్పీ, చింతపల్లి -
ఏజెన్సీలో మళ్లీ అలజడి
విశాఖ ఏజెన్సీలో మళ్లీ అలజడి మొదలైంది. కొయ్యూరు గూడెంకొత్తవీధి మండలాల సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య సోమవారం రెండుసార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని ప్రచారం జరుగుతున్నా వాటిని పోలీసులు నిర్ధారించడం లేదు. తాజా ఎదురు కాల్పులతో మన్యం మరోసారి భయం గుప్పెట్లోకి వెళ్లింది. గూడెంకొత్తవీధి/కొయ్యూరు: పోలీసులు–మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుసుకున్న గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గాలికొండ ఏరియా కమిటీకి చెందిన జగన్ ఆధ్వర్యంలో 30 మంది మావోయిస్టులు పుట్టకోట నుంచి మండపల్లి వైపునకు వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అదే సమయంలో మందపల్లి మీదుగా కూంబింగ్ చేసుకువస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో తొలుత మావోయిస్టులే పోలీసులపై కాల్పులను జరిపినట్టు తెలిసింది.దీనికి ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించారు. సుమారు 15 నిమిషాల పాటు కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. దీని తరువాత భారీగా వచ్చిన పోలీసులు సమీప ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరోసారి పోలీసులు–మావోయిస్టుల మధ్య సుమారు 20 నిమిషాల పాటు కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. తరువాత పోలీసు బలగాలు నలుదిక్కులా వెళ్లి కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం దీన్ని నిర్ధారించలేదు. ఒకే రోజు రెండుసార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో మండపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. భారీగా మావోయిస్టులు.. సుమారు 30 మంది మావోయిస్టులు కాల్పుల్లో పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వారిలో ఒకరు లేదా ఇద్దరైనా మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాలు ఉంటాయ ని ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి సమీపంలో ఉన్న ప్రాంతాల్లోను గాలిస్తున్నారు. వంటపాత్రలు స్వాధీనం.. ఇదిలా ఉంటే సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులు వంట చేసేందుకు ఉపయోగించే వంటపాత్రలను, పచ్చని షీట్లను, విప్లవసాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏం జరుగుతుందోనని మందపల్లి గ్రామస్తులు ఆందోళనతో ఉన్నారు. గతంలో.. ఈ ఏడాది జూన్‌లో ప్రస్తుతం ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతానికి దగ్గరలో తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి మండలం గుల్లవల్లి ప్రాం తంలో ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు ప్లీనరి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం తెలియడంతో పోలీసులు కూంబింగ్ ఉధృతం చేశారు.అప్పట్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నారు. దానిలో అక్కిరాజు హరిగోపాల్ అలియస్ ఆర్కే ఉన్నారని వార్తలు వచ్చాయి. సరిగ్గా మూడు సంవత్సరాల కిందట ఇదే మందపల్లి ప్రాంతంలో ప్రస్తుతం కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న గంగన్న అలియస్ బస్వరాజు పున్నయ్య 15 రోజుల పాటు మావోయిస్టులకు శిక్షణ ఇచ్చినట్టుగా వార్తలు రావడంతో అప్పట్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు అదే ప్రాంతానికి సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి. -
ప్రతీకారం తీర్చుకుంటా..!
అన్నలు ఉన్నవాళ్లు రాఖీలు కట్టారు. అన్నలు లేనివాళ్లు ‘అన్న’ అనుకున్న వాళ్లకు రాఖీలు కట్టారు. అన్న ఉండీ, లేకుండా పోయిన దుఃఖంలో కవితా కౌశల్ అనే చెల్లి తన అన్నకు గుర్తుగా మిగిలి ఉన్న రైఫిల్‌కు రాఖీ కట్టింది! కవిత అన్న రాకేశ్ అసిస్టెంట్ కానిస్టేబుల్. ఛత్తీస్‌గఢ్‌లోని అరణ్‌పూర్‌లో గత ఏడాది మావోయిస్టులు దొంగ దెబ్బ తీసినప్పుడు రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటనలో రాకేశ్‌తోపాటు మరో ఇద్దరు పోలీసు సిబ్బంది, దూరదర్శన్ కెమెరామన్ దుర్మరణం చెందారు. ‘‘మా అన్నను చంపినవారిపై ప్రతీకారం తీర్చుకోవడమే నా ధ్యేయం’’ అంది కవిత, అన్న రైఫిల్‌కు రాఖీ కట్టాక. కవిత ఇప్పుడు దంతేవాడలో పోలీస్ కానిస్టేబుల్. అన్న ఉద్యోగాన్ని ఆమెకు ఇచ్చారు. -
ఇటు మావోయిస్టులు.. అటు గ్రేహౌండ్స్ బలగాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మావో యిస్టుల కార్యకలాపాలు, మరోవైపు గ్రేహౌండ్స్ బలగాల గాలింపు చర్యలు అటవీ పల్లెల్లో అలజడి రేపుతున్నాయి. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్– తెలం గాణ అంతర్రాష్ట్ర సరిహద్దులోని భద్రాచలం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రచారం చేశారు. పోలీసులు కూడా కూంబింగ్ ముమ్మరం చేశారు. నెలన్నర రోజులుగా మావోల కదలికలు గోదావరి నది పరీవాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా మావోల కదలికలున్నాయని పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోలు పాత వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్నారన్న ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు బలగాలను మోహరించాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలో గిరిజన సమస్యలపై దృష్టి సారించిన మావోయిస్టులు.. పూర్వ వైభవం కోసం కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పక్షం రోజుల క్రితం తెలంగాణ కమిటీ కార్యదర్శి హరిభూషణ్ ఆధ్వర్యంలో డివిజన్, జిల్లా నాయకులు సుమారు 40 మంది ఛత్తీస్‌గఢ్ –తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గోదావరి పరీవాహక ప్రాంతం చర్ల, ఎదిరె(జీ) సమీప అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఖమ్మం–కరీంనగర్–వరంగల్ జిల్లాలకు కలిపి (కె.కె.డబ్ల్యూ) ఉన్న డివిజనల్ కమిటీని రద్దు చేసి.. కొత్తగా 3 డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ కమిటీకి కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ లక్మ అలియాస్ హరిభూషణ్ నియమితులయ్యారు. నూతన కమిటీలు.. కార్యదర్శులు మార్పులలో భాగంగా పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని ఈ కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. మంచిర్యాల–కొమురంభీం (ఎం.కె.బి.) డివిజినల్ కమిటీకి ఇంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్‌కు నాయకత్వం అప్పగించారు. ఇంద్రవల్లి ఏరియా కమిటీ, మంగి ఏరియా కమిటీ, చెన్నూర్ – సిరిపూర్ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు సమాచారం. చర్ల – శబరి ఏరి యా కమిటీ కింద మడకం కోసీ అలియాస్ రజిత, శారదక్క నేతృత్వంలో చర్ల లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్, ఉబ్బ మోహ¯Œ అలియాస్ సునిల్ నేతృత్వంలో శబరి లోకల్ ఆర్గనైజిగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసినట్లు పోలీసుశాఖ ప్రచారం చేసింది. అమర వీరుల సంస్మరణ వారోత్సవాలకు ఏర్పాట్లు చేయగా, ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా తిరియా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌తో ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ. -
బీహార్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోల మృతి
పట్నా : బీహార్‌లోని గయా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు అక్కడ తనిఖీలు నిర్వహించగా.. మావోయిస్టులు కాల్పులు జరిపారని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో తాము ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మృతదేహాలతో పాటు ఏడు తుపాకులు, ఒక ఏకే47, మూడు రైఫిళ్లు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
ఐదేళ్ల తర్వాత ప్రతీకారం..!
మన్యం భయం గుప్పెట్లో చిక్కుకుంది. మావోయిస్టుల ఘాతుకానికి ఇద్దరు గిరిజనులు బలయ్యారు. ఐదేళ్ల క్రితం జరిగిన దాడిలో ఇద్దరు మావోయిస్టుల మృతికి కారకులని భావిస్తున్న వీరిని అర్ధరాత్రి వేళ వచ్చి దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటనతో మన్యం ఉలిక్కిపడింది. గిరిజనం దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. విశాఖపట్నం, చింతపల్లి (పాడేరు): మావోయిస్టులకు భయపడి ఐదేళ్లుగా ఆ గిరిజన కుటుంబాలు వేరే ప్రాంతాల్లో తలదాచుకున్నాయి. దళ నాయకులు హతమార్చిన సంఘటనలో పాల్గొన్న వారిపై మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఎప్పటి నుంచో నిఘా పెట్టిన తమకు చిక్కకుండా జీవనం సాగిస్తున్న వారికి ఎటువంటి హానీ చేయమని సంకేతాలు పంపారు. గ్రామానికి వచ్చి స్వేచ్ఛగా జీవించాలని అభయమివ్వడంతో 3 నెలలక్రితం భాస్కరరావు కుటుంబం, వారం రోజుల క్రితం సత్తిబాబు కుటుంబం గ్రామానికి వెళ్లి జీవనం ప్రారంభించారు. అదను చూసి మావోయిస్టులు వారిద్దరిని అతి దారుణంగా హత్య చేశారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం వీరవరం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జి.మాడుగుల మండలానికి చెందిన సింహాచలం అనే వ్యక్తి ఒక ఆధ్యాత్మిక గురువు. సంజీవరావు సింహాచలానికి శిష్యుడు. ప్రతిఏటా తులసీ మాలలు ధరించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం సింహాచలం ఆధ్వర్యంలో నిర్వహించేవాడు. 2014 అక్టోబర్‌లో గ్రామంలో మాలధరించిన వారందరిని మాలలు తీసి పూజలు నిర్వహించేందుకు సింహాచలం వీరవరానికి వచ్చాడు.. భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించి తిరిగి వెళ్లిపోతుండగా సింహాచలంతో పాటు సంజీవరావు కూడా మావోయిస్టులు తోడ్కొని వెళ్లారు. బలపం సమీపంలో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు సంజీవరావును అక్కడే హతమార్చి సింహాచలంను కోరుకొండలో నిర్వహించే ప్రజాకోర్టులో హాజరు పరుస్తామని వెంట తీసుకొచ్చారు. సింహాచలాన్ని అదుపులోకి తీసుకుని సంజీవరావును చంపేశామని మావోయిస్టులు వెల్లడించారు. భక్తులు ఒక్కసారిగా ఆగ్రహోద్రులై మావో యిస్టులపై దాడికి దిగారు. వారు కాల్పులు జరిపిన లెక్కచేయకుండా ముగ్గురు మావో యిస్టులను పట్టుకుని చితకబాదారు. కర్రలు, రాళ్లతో కొట్టడంతో శరత్, గణపతి అనే ఇద్దరు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రాంతానికి చెందిన కొర్రా నాగేశ్వరరావు అనే మావోయిస్టు తీవ్ర గాయాలతో త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ నేప«థ్యంలో మావోయిస్టులు తమపై ప్రతీకారం తీర్చుకుంటారని భావించి గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు గ్రామం విడిచి వెళ్లిపోయాయి. మూడు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా భాస్కరరావు చింతపల్లిలో నివాసం ఉంటూ జీసీసీ డిపోలో తాత్కాలిక అసిస్టెంట్‌గా జీవనం సాగిస్తున్నాడు. దివ్యాంగుడైన సత్తిబాబు తమ్మంగుల పంచాయ తీ చిట్టంగరువు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. వీరిని ఎలాగైనా హతమార్చాలనే పగతో రగిలిపోతున్న మావోయిస్టులు గత కొన్నేళ్లుగా సానుభూతిపరుల ద్వారా మీరు వచ్చి గ్రామంలో ప్రశాంతంగా జీవించాలని, తమ నుంచి ఎటువంటి హానీ ఉండబోదని సంకేతాలు పంపినట్లు స్థానికులు చెబుతున్నారు. సర్కారు నుంచి ఎటువంటి సాయం లేకపోవడం వల్ల కూలీ పనులు చేసుకుని జీవించడం కష్టసాధ్యంగా మారడం, మావోయిస్టులు అభయమిచ్చినట్లు సంకేతాలు పంపడంతో వ్యవసాయం చేసుకుని జీవించాలనే లక్ష్యంతో మూడు నెలల క్రితం భాస్కరరావు కుటుంబీకులు వీరవరంలో అడుగుపెట్టారు. వారం రోజుల క్రితం సత్తిబాబు కూడా గ్రామానికి వెళ్లి వ్యవసాయ పనులు చేయడం మొదలుపెట్టాడు. మావోయిస్టులు ఊడగొట్టిన ఇళ్లలో రేకులు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరు గ్రామంలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు సుమారు పది మంది బుధవారం అర్ధరాత్రి 40 మంది సానుభూతిపరులతో గ్రామానికి వెళ్లి వారిద్దరిని బయటకు పిలిచారు. భార్యలు తలుపుతీసి బయటకు వచ్చి ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించడంతో ఒక్కసారిగా మావోస్టులు లోపలకు చొరబడి సత్తిబాబు, భాస్కరరావులను బయటకు లాక్కొచ్చారు. కర్రలు, తుపాకులతో చితగ్గొట్టి హతమార్చారు. అడ్డుపడ్డ భార్యలను కూడా కర్రలతో కొట్టి గాయపరిచారు. మావోయిస్టు నేతలు శరత్, గణపతిలను హతమార్చిన సంఘటనలో భాVýæస్వాములైన వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ పోస్టర్లు అతికించారు. మృతి చెందిన భాస్కర్‌రావుకు ఇద్దరు భార్యలు రంభ, చిన్నమ్మిలకు కోమటి, మోహన్, పార్వతి, కుమారి, శ్రీరామ్ అనే ఐదుగురు పిల్లలున్నారు. కోమటి డిగ్రీ, మోహన్ ఇంటర్ పూర్తి చేసి ఉన్న చదువులతో దూరంగా ఉన్నారు. పార్వతి, కుమారి వంగసారలో 9వ తరగతి, శ్రీరామ్ 7వ తరగతి చదువుతున్నారు. సత్తిబాబుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. కృష్ణవేణి 4వ తరగతి, సాయి 6వ తరగతి చదువుతున్నారు. అన్నదమ్ములిద్దరూ మావోయిస్టుల చేతిలోనే హతం సంజీవరావు, భాస్కరరావు ఇద్దరు అన్నదమ్ములు. 2014లో సంజీవరావును బలపం వద్ద మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటన నేప«థ్యంలో మావోయిస్టులపై గిరిజనులు దాడి చేసి హతమార్చిన సంఘటనలో భాస్కరరావు కూడా ఉన్నాడు. దీంతో అతను కూడా వారిచేతిలోనే ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఎదిరించే గుండెలను నేలకూల్చా్చరు పెదవాల్తేరు(విశాఖతూర్పు): జిల్లాలోని చింతపల్లి మండలం బలపం పంచాయితీకి చెందిన గిరిజనుడు గెమ్మెలి సంజీవరావును మావోయిస్టులు అతికిరాతకంగా హతమార్చడం పట్ల ఆ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులు ప్రశ్నించే గొంతును చంపేశారు– ఎదిరించే గుండెలను నేలకూల్చారంటూ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. కోరుకొండ వద్ద మావోయిస్టులు సంజీవరావును అతికిరాతకంగా మట్టుబెట్టారని వారు వాపోయారు. మావోయిస్టుల దౌర్జన్యాలకు వీరవరం గ్రామం బలయిపోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. మేము పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, మీరెవరు మమ్మల్ని వెళ్ల్లగొట్టడానికి అని మావోయిస్టులను ఎదిరించిన గెమ్మెలి భాస్కరరావు, పాంగి సత్తిబాబు అమరవీరులయ్యారు. మావోయిస్టుల మాటలు లెక్క చేయకుండా గ్రామంలోనే జీవిస్తున్న నిరుపేద గిరిజన రైతులైన భాస్కరరావు, సత్తిబాబులను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోంచి నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకు వెళ్లి మరీ పిల్లలు, మహిళలు చూస్తుండగానే అతికిరాతకంగా మావోయిస్టులు చంపడాన్ని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. పీడిత ప్రజల కోసమే పోరాటం, వారి కోసమే మా ఆరాటం అంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు చేసే మావోయిస్టులు నిరుపేదలు, కోందు జాతికి చెందిన వెనుకబడిన అడవి బిడ్డలను అతికిరాతకంగా చంపడం హేయమైన చర్య అని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ అ గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు అని తరచూ ప్రకటనలు గుప్పించే మావోయిస్టులు ప్రశ్నించే గొంతునే కోసేశారు, ఎదురించే గుండెను నేలకూల్చారని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు , గిరిజన పెద్దలు, గిరిజన సంఘాలు, ఈ హత్యలను ఖండించాలని కోరారు. బిక్కుబిక్కుమంటున్న గిరిజనం బిక్కుబిక్కుమంటూ దిగులుగా కూర్చున్న గిరిజనులు అరకులోయ: విశాఖ ఏజెన్సీ, సరిహద్దు ఒడిశా ప్రాంతాలలో మావోయిస్టు పార్టీ నేతలు, సభ్యులు హల్చల్ చేస్తున్నారు. పోలీసులకు గిరిజనులు సహకరిస్తున్నారనే అనుమానాలతో గ్రామాలలో ప్రజా కోర్టులు, వెనువెంటనే శిక్షలు విధిస్తున్న మావోయిస్టుల చర్యలతో గిరిజనులు భీతిల్లుతున్నారు. ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒడిశా, ఏపీ పోలీసు యంత్రాంగం ఏవోబీలో మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకట్ట వేయడంలో విజయవంతమైంది.∙ఎన్నికలు కూడా విశాఖ ఏజెన్సీలో ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసుశాఖ ఎంతో కృషి చేసింది. మావోయిస్టుల నుంచి ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేకుండానే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల తరువాత పోలీసు యంత్రాంగం మారుమూల ప్రాంతాలలో మావోయిస్టుల ఏరివేత చర్యలను దాదాపు నిలిపివేసిందనే ప్రచారం జరిగింది. కానీ మావోయిస్టులు మాత్రం తమ కార్యక్రమాలను ఏవోబీలో చాపకింద నీరులా విస్తృతం చేస్తున్నారు. ఏవోబీ వ్యాప్తంగా మావోయిస్టులు అధికంగా సంచరిస్తూ తరచూ గ్రామాలలో ప్రజాకోర్టులు నిర్వహించడం, పోలీసులకు సహకరిస్తున్నారనే అరోపణలతో ∙గిరిజనులను హెచ్చరించడం అవసరమైతే దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఒడిశా పోలీసు బలగాలు కూంబింగ్ చర్యలను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం మావోయిస్టుల సంచారానికి కలిసోస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసు బలగాలు కూడా అవుట్‌పోస్టులలో మకాం ఉన్నా ఏవోబీలో మావోయిస్టులు సంచరిస్తున్నారు. వారోత్సవాలకు పది రోజుల ముందే.. కొయ్యూరు(పాడేరు): మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు ప్రారంభానికి పది రోజుల ముందు మావోయిస్టుల తమ ఉనికి చాటారు. వారిపై తిరుగుబాటు చేసిన ఇద్దరు గిరిజనులను హతమార్చారు. గడచిన పదిహేనేళ్లలో మావోల చేతిలో బలైనవారు 123 మంది. తాజాగా ఇద్దరిని హతమార్చడంతో మన్యం భయం గుప్పెట్లోకి వెళ్లిపోయింది. కొద్దిరోజుల కిందట మావోయిస్టులు పెదబయలు మండలంలో బొంగజంగి గ్రామానికి చెందిన పాంగి సత్తిబాబును చంపేశారు.దీనిపై మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సంఘటన మరువక ముందే మావోయిస్టులు హింసకు పాల్పడ్డారు. సత్తిబాబును హతమార్చడంతో గ్రామస్తులు భయపడి కలెక్టర్ వినయ్‌చంద్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు.అక్కడ ఉండలేమని తెలిపారు. తాజా ఘటనతో గిరిజనులు భయపడుతున్నారు. ఏటా మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తారు. పోలీసు ఇన్ఫార్మర్లే టార్గెట్ పోలీసులు, మావోయిస్టుల భయంతో ఇప్పటికే గ్రామాల నుంచి బయటకు వెళ్లకుండా ఇళ్లకే వందల సంఖ్యలో గిరిజనులు పరిమితమయ్యారు. తమ నివాసిత మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాలకు కూడా రాలేని పరిస్థితిలో భయం భయంగానే కొంతమంది గిరిజనులు జీవిస్తున్నారు. మావోయిస్టు సానుభూతి పరులు, అనుబంధ సంఘాల ప్రతినిధుల లొంగుబాటు,అరెస్ట్‌ల వ్యూహంతో పోలీసుశాఖ పనిచేస్తుండగా,మావోయిస్టు పార్టీ మాత్రం పోలీసు ఇన్పార్మర్ల వ్యవస్థను వెలికి తీస్తోంది. నిర్మానుష్యంగా కోరుకొండ చింతపల్లి: మండలంలోని బలపం పంచాయతీ కోరుకొండ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఎటువంటి సంఘటనలకు పాల్పడిన సురక్షిత ప్రాంతమైన కోరుకొండ ప్రాంతానికి వెళ్లి తలదాచుకునే వారు. పోలీసులు కూడా ఈ ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాలంటే గడగడలాడేవారు. ఎటుచూసిన మావోయిస్టుల మందుపాతరలు పోలీసు బలగాలకు స్వాగతం పలికేవి. 2014 అక్టోబర్ నుంచి పరిస్థితులు మారాయి. జి.మాడుగులకు చెందిన ఆధ్యాత్మిక గురువు సింహాచలంను అదుపులోకి తీసుకోవడంతో తిరుగుబాటు చేసిన గెమ్మెలి సంజీవరావును మావోలు హత్య చేయడం, ఆపై భక్తులు మావోలపై దాడి చేసిన ఇద్దర్ని చంపినప్పటి నుంచి మావోయిస్టులు పట్టుకోల్పోయారు. అయితే తాజా ఘటనతో ఇక్కడ నిర్మానుష్య వాతావరణం నెలకొంది. -
టీఆర్ఎస్ ఎంపీటీసీని హతమార్చిన మావోయిస్టులు
సాక్షి, చర్ల: మండల పరిధిలోని బెస్త కొత్తూరు వాసి, పెదమిడిసిలేరు ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు ఈ నెల 8న రాత్రి సుమారు 10.30 గంటలకు ఇంటి నుంచే అపహరించుకుపోయారు. శుక్రవారం హతమార్చి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఎర్రంపాడు శివారులోని అటవీ ప్రాంతంలో పుట్టపాడు మార్గంలో మృతదేహాన్ని వదిలివెళ్లారు. శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో వారితో పాటు తీసుకెళ్లిన ద్విచక్రవాహనాన్ని కూడా మృతదేహం వద్దనే వదిలివెళ్లారు. ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందువల్లే హతమార్చామంటూ అక్కడ ఒక లేఖను కూడా వదిలి వెళ్లారు. గత సోమవారం రాత్రి శ్రీనివాసరావును అపహరించుకు పోయే సమయంలో అడ్డుపడిన భార్యను తుపాకీ చూపించి బెదిరించడంతో పాటు అడ్డుపడిన కుమారుడు ప్రవీణ్‌ను కర్రతో తలపై బలంగా కొట్టారు. శ్రీనివాసరావును బీ కొత్తూరు నుంచి ఎన్ కొత్తూరు మీదుగా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి తీసుకెళ్లారు. దీంతో మంగళవారం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బీ కొత్తూరు సమీప గ్రామాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులు సుమారు 300 మంది ట్రాక్టర్లలో అడవిబాటపట్టి ఎర్రంపాడు, చెన్నాపురం తదితర గ్రామాలలో గాలింపు చేపట్టారు. అటవీ ప్రాంతంలో వీరికి తారసపడిన కొందరు ఆదివాసీలు వెనుదిరిగి వెళ్లాలని, ఒకటి రెండు రోజుల్లో శ్రీనివాసరావు ఇంటికి వచ్చేస్తాడంటూ చెప్పడంతో వారు అటవీ ప్రాంత నుంచి వెనుదిరిగారు. బుధవారం ఉదయం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని తోగ్గూడెం అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు హతమార్చి మృతదేహాన్ని పడవేశారంటూ పుకార్లు షికార్లు చేయడంతో మీడియా ఆ ప్రాంతానికి చేరుకోగా.. వేరే ద్విచక్రవాహనదారుడు రోడ్డు ప్రమాదానికి గురై ఆ ప్రాంతంలో కనిపించడంతో అతనిని పామేడు వైద్యశాలకు తరలించి మీడియా వెనుదిరిగింది. అటు తర్వాత గురువారం ఉదయం నుంచి శ్రీనివాసరావును మావోయిస్టులు విడుదల చేశారని అదుగో వస్తున్నాడని... ఇదుగో వస్తున్నాడంటూ వదంతులు వ్యాపించాయి. శుక్రవారం సరిహద్దులోని ఎర్రంపాడు శివారు అటవీ ప్రాంతంలోని పుట్టపాడు మార్గంలో మృతదేహం పడి ఉందని సమాచారం అందడంతో మీడియా ఆ ప్రాంతానికి చేరుకుంది. ఎర్రంపాడుకు సుమారు కిలోమీటరు దూరంలో నల్లూరి శ్రీనివాపరావును మావోయిస్టులు హతమార్చి మృతదేహాన్ని వదలివెళ్లారు. గొడ్డళ్లతో నరికి హతమార్చినట్లుగా తెలుస్తోంది. మృతదేహం వద్ద మావోయిస్టు పార్టీ చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరిట లేఖను వదిలివెళ్లారు. ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుండడంవల్లే ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును హతమార్చామని లేఖలో పేర్కొన్నారు. శ్రీనివాసరావు పోలీసులతో కలిసి పార్టీని నిర్మూలించడానికి ఆదివాసీ గ్రామాలలో ఇన్ఫార్మర్లను తయారు చేస్తున్నాడని, దళాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తూ ప్రజా సంఘాల వాళ్లను అరెస్టులు చేయిస్తున్నాడని, అందుకే ఖతం చేశామంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రాధేయ పడినా.. ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును కిడ్నాప్ చేసిన తర్వాత భార్య దుర్గ, కుమారుడు ప్రవీణ్‌కుమార్ నల్లూరి శ్రీనివాసరావును మానవతా దృక్పథంతో విడిచిపెట్టాలంటూ పలుమార్లు ప్రాధేయపడ్డారు. ఎటువంటి తప్పు చేయలేదని, నలుగురికీ ఉపకారిగానే ఉంటాడని, అపకారిగా ఏ మాత్రం కాదని ఒక వేళ తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే పెద్ద మనస్సు చేసుకొని మన్నించి విడిచిపెట్టాలంటూ వేడుకున్నారు. అయినప్పటికీ మావోయిస్టులు కనికరించలేదు. శోక సంద్రంలో బీ కొత్తూరు ... శ్రీనివాసరావును మావోయిస్టులు హతమార్చడంతో బెస్త కొత్తూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. కిడ్నాప్‌కు గురైన శ్రీనివాసరావును మావోయిస్టులు విడిచిపెడతారని, తిరిగి వస్తాడని ఎదురు చూసిన భార్య, కుమారుడు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు.. మృతదేహం కనిపించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివారావు ఇంటి వద్ద భార్య, కుమారుడు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ముమ్మరంగా కూంబింగ్ జరుగుతున్నా.. ఒక పక్క సరిహద్దుల్లో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నా.. మరో పక్క దండకారణ్యంలో విరివిగా సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నా.. మావోయిస్టులు అడపా దడపా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఎంపీటీసీ సభ్యుడినే హతమార్చి పోలీసులకు సవాల్ విసిరారని చెప్పకనే చెప్పవచ్చు. 2017 ఫిబ్రవరిలో చర్ల మండలంలోని పెదమిడిసిలేరుకు చెందిన సోడి ప్రసాద్‌ను మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి ఇంటికి సమీపంలోని గీసరెల్లి మార్గంలో హతమార్చారు. అటు తరువాత మళ్లీ సరిగ్గా రెండేళ్ల తరువాత మళ్లీ తాజా సంఘటనలో మండలంలోని బెస్త కొత్తూరుకు చెందిన పెదమిడిసిలేరు ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును హత్యచేశారు. ఈ రెండు హత్యలకు మధ్యలో 2018 జూలై నెలలో మావోయిస్టు పార్టీ ముఖ్య నేత అరుణ్‌కుమార్ చర్ల మండలంలోని కుర్నపల్లి శివారులో పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఎండా కాలం ఆకురాలి దండకారణ్యం కూంబింగ్‌కు అనువుగా ఉంటుంది. వర్షాకాలం అటవీప్రాంతం దట్టంగా ఉండడంతో మావోయిస్టులకు అనుకూలంగా మారుతుంది. ఈ క్రమంలో తాజా హత్యతో మరెన్ని ఘాతుకాలు జరుగుతాయోనని సరిహద్దు ప్రజానీకం తీవ్రంగా భయాందోళనలు చెందుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడి హత్య నేపథ్యంలో సరిహద్దుకు ప్రత్యేక పోలీసు బలగాలను తరలిస్తున్నారు. ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండడంతో సరిహద్దులో ఏ క్షణంలో ఏ ప్రమాదం వచ్చి పడుతుందోనని సరిహద్దు జనం తీవ్రంగా భయాందోళనలు చెందుతున్నారు. -
టీఆర్ఎస్ నేత దారుణ హత్య
-
ఉలిక్కిపడ్డ తెలంగాణ, ఎవరీ శారదక్క?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని తూర్పు అటవీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యు డు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు హత్య చేయడంతో కలకలం రేగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టులు ఓ ప్రజాప్రతినిధిని చంపడం ఇదే తొలిసారి. పోలీసులు ముఖ్యంగా తూర్పు తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయడంతోపాటు నిరంతరం కూంబింగ్‌లు జరుపుతూ మావోయిస్టుల కార్యకలాపాలు నివారించగలిగారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలతో మావోయిస్టులు కలకలం సృష్టించారు. తెలంగాణలో తిరిగి పట్టు సాధించే ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే పార్టీ సెంట్రల్ కమిటీ.. తెలంగాణలో కార్యకలాపాలను హరిభూషణ్‌కు అప్పగిం చినట్లుగా తెలుస్తోంది. భద్రాచలం ఏజెన్సీ, ఏటూరునాగారం ఏజెన్సీ పరిధిలో కొత్త కమిటీలు కూడా వేశారు. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ ఉండ గా, కొత్తగా వెంకటాపురం–వాజేడు కమి టీని నియమించారు. జూన్ ఆఖరి వారంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వేప నారాయణ అలియాస్ హరిభూషణ్, మరో నేత బడే చొక్కారా వులతోపాటు 20 మంది మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించారని నిఘావర్గాలు పోలీసులను అప్రమత్తం చేశాయి. ఇంతలోనే మావో యిస్టులు శ్రీనివాసరావును హత్య చేశారు. చదవండి: ఇన్ఫార్మర్ నెపంతో చంపేశారు ఎవరీ శారదక్క? శ్రీనివాసరావు మృతదేహం వద్ద పార్టీ కార్యదర్శి శారద పేరుతో మావోయిస్టులు ఓ లేఖ వదిలి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం గంగారం గ్రామానికి చెందిన శారద (40) హరిభూషణ్ భార్య. ఆమెను జజ్జరి సమ్మక్క అలియాస్ సారక్క, అలియాస్ శారదగా పిలుస్తారు. జూన్ ఆఖరిలో వారంలో హరిభూషణ్‌తోపాటు శారద కూడా తెలంగాణలోకి వచ్చిందన్న పోలీసుల అనుమానాలు తాజా ఘటనతో నిజమయ్యాయి. కోటేశ్వరరావు రాకతో పెరిగిన దూకుడు మావోయిస్టు పార్టీ బాధ్యతలను నంబాల కోటేశ్వరరావు తీసుకున్నప్పటి నుంచి దూకుడు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వరస దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే బీమా మండవితోపాటు నలుగురు పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. మే ఒకటో తేదీన గడ్చిరోలిలో పోలీసు కాన్వాయ్ మీద దాడి చేయడంతో 16 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. -
ఇన్ఫార్మర్ నెపంతో చంపేశారు
సాక్షి, కొత్తగూడెం : టీఆర్ఎస్ ఎంపీటీసీ కిడ్నాప్ ఉదంతం విషాదాంతమైంది. ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఆయన్ను హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ సరి హద్దు అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధి లోని బెస్తకొత్తూరుకు చెందిన పెదమిడిసిలేరు ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును ఈనెల 8న మావోయిస్టులు అపహరించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాసరావును మావోయిస్టులు బలవంతంగా ఆయన బైక్‌పైనే తీసుకెళ్లారు. అనంతరం ఆయన్ను చంపేశారని ఒకసారి, విడుదల చేశారని మరోసారి ఊహాగానాలు చెలరేగాయి. చివరకు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఆయన మృతదేహం లభ్యంకావడంతో హత్య సంగతి వెలుగుచూసింది. మావోయిస్టులు శుక్రవారం సాయంత్రం చర్ల నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రంపాడు శివారులో ఛత్తీస్‌గఢ్‌లోని పుట్టపాడుకు వెళ్లే మార్గంలో శ్రీనివాసరావు మృతదేహాన్ని, ఆయన బైక్‌ను వదిలిపెట్టి వెళ్లారు. మృతుడికి భార్య దుర్గ, కుమారుడు ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. శ్రీనివాసరావు 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెదమిడిసిలేరు నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వచ్చే నెల 7వ తేదీ వరకు ఆయన పదవీకాలం ఉంది. వేడుకున్నా కనికరించలేదు.. శ్రీనివాసరావును విడుదల చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా మావోయిస్టులు కనికరించలేదు. ఆయన కిడ్నాప్ అయిన వెంటనే గ్రామానికి చెందిన సుమారు 300 మంది సరిహద్దు అటవీప్రాంతంలో గాలించారు. ఈ క్రమంలో తారసపడిన కొందరు ఆదివాసీలు.. శ్రీనివాసరావును వదిలిపెడతారని, మీరు వెనక్కి వెళ్లిపోవాలని వారికి చెప్పడంతో ఆయన్ను విడుదల చేస్తారని భావించారు. అయితే, బుధవారం ఆయన్ను చంపేశారంటూ ప్రచారం జరగ్గా.. గురువారం విడుదల చేశారంటూ ప్రచారం సాగింది. చివరకు హత్యచేసిన సంగతి శుక్రవారం నిర్ధారణ అయింది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తను మావోయిస్టులు హతమార్చడం ఇదే మొదటిసారి. మృతదేహం వద్ద చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో మావోయిస్టులు ఓ లేఖ వదిలి వెళ్లారు. పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందునే శ్రీనివాసరావును హతమార్చినట్లు అందులో పేర్కొన్నారు. పోలీసులతో కలిసి మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు ఆదివాసీ గ్రామాల్లో ఇన్ఫార్మర్లను తయారు చేస్తున్నాడని.. దళాల సంచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పోలీసులకు చేరవేయడంతోపాటు ప్రజాసంఘాల వారిని అరెస్టు చేయిస్తున్నాడని ఆరోపించారు. ‘‘ఆదివాసీలకు చెందిన 70 ఎకరాల భూమిని పోలీసుల ప్రోద్బలంతో అక్రమంగా గుంజుకున్నాడు. ప్రశ్నించేవారిని అరెస్టులు చేయిస్తున్నాడు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో కలిసి ఆదివాసీ సంఘాల పేరుతో మావోయిస్టులపై దుష్ప్రచారం చేస్తున్నాడన్నాడు. ఆదివాసీలకు, వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీకి అడ్డుగా నిలుస్తుండటంతో ఖతం చేశాం’’అని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో అపహరించినవారిని విడిచిపెట్టారు.. 2014లో తెలంగాణ మొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలలకు టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి మానె రామకృష్ణ, మరో నలుగురిని మావోయిస్టులు అపహరించి ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. నాలుగు రోజుల తర్వాత వదిలిపెట్టారు. మావోయిస్టులకు అనుకూలమని చెప్పిన టీఆర్ఎస్.. తర్వాత వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఈ వైఖరి మార్చుకోవాలని హెచ్చరిస్తూ విడుదల చేస్తున్నట్లు అప్పుడు పేర్కొన్నారు. శ్రీనివాసరావును కూడా అలాగే విడుదల చేస్తారని భావించినా, ఆయన్ను హతమార్చారు. శ్రీనివాసరావు ఇన్ఫార్మర్ కాదు చర్ల మండలం బెస్త కొత్తూరు గ్రామానికి చెందిన నల్లూరి శ్రీనివాసరావు అనే రైతును నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన మావోయిస్టులు శుక్రవారం ఆయన్ను దారుణంగా కొట్టి చంపారు. ఇది హేయమైన చర్య. శ్రీనివాసరావు పోలీస్ ఇన్ఫార్మర్ కాదు. ఆయనకు పోలీసులతో ఎలాంటి సంబంధం లేదు. మావోయిస్టులు తమ మనుగడ కోసం చర్ల ప్రాంతానికి చెందిన రైతులు, వ్యాపారస్తులను డబ్బుల కోసం వేధిస్తున్నారు. రైతులకు అండగా నిలిచే శ్రీనివాసరావు వంటి వ్యక్తులను చంపుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఇలాంటి సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే మావోయిస్టులపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – సునీల్‌దత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ -
ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
-
టీఆర్ఎస్ నేత దారుణ హత్య: అందుకే ఖతం చేశాం
సాక్షి, ఖమ్మం: మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఈనెల 8న కిడ్నాప్‌కు గురైన టీఆర్ఎస్ నేత నల్లారి శ్రీనివాసరావును దారుణంగా హత్య చేశారు. ఆయన మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఎర్రంపాడు, పొట్టెపాడు గ్రామల మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు శుక్రవారం గుర్తించారు. అతని మృతదేహం పక్కనే శబరి ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి శారద పేరుతో ఓ లేఖను వదిలివెళ్లారు. ఆయన కొత్తగూడెం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన టీఆర్ఎస్ నేతగా తెలుస్తోంది. ‘నల్లారి శ్రీనివాసరావును పోలీసులుకు ఇన్ఫార్మర్ అయినందుకు ఖతం చేశాం. ఇంటెలిజెన్సీ, పోలీసులతో కలిసి మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి, ఆదివాసీ గ్రామాల్లో ఇన్‌ఫ్మార్మర్లను తయారు చేస్తున్నాడు. దళాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. పోలీసులకు చేరవేస్తున్నాడు. అలాగే ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేయిస్తున్నాడు. అదివాసీలకు సంబంధించిన 70 ఎకరాల భూములను పోలీసుల అండతో అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయిస్తున్నాడు. ఎస్ఐబీతో కలిసి ఆదివాసీ ప్రజాసంఘాల పేరుతో సీపీఐ మావోయిస్ట్ పార్టీపై దుష్ర్పచారం చేస్తున్నాడు. అదివాసీ వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీకి అడ్డుగా నలవడంతో శ్రీనివాసరావును ఖతం చేశాం’’అంటూ లేఖను విడుదల చేశారు. -
ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గడ్‌లో మరోసారి మావోయిస్టులు పంజా విసిరారు. భీజాపూర్ జిల్లా కేశ్కుతుల్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఘటనాస్థలిలో మారణ ఆయుధాలను, రోజువారీ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, జూన్ మొదటివారంలో దామ్‌తారి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే మవోయిస్టులు ఈ దాడికి తెగబడ్డారని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
జార్ఖండ్‌లో మావోల పంజా
సిరాయికెలా–ఖర్సవాన్: జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులను కాల్చి చంపారు. శుక్రవారం జార్ఖండ్‌లోని తిరుల్దిహ్ పోలీస్ స్టేషన్ పరిధి (జార్ఖండ్–బెంగాల్ సరిహద్దు)లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందారని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అవినాశ్‡ తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మావోయిస్టులు పోలీసు అధికారులను చంపారని అడిషనల్ డీజీపీ మురారి లాల్ మీనా తెలిపారు. అమరుల కుటుంబాలకు రాష్ట్రమంతా అండగా ఉంటుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తడోకి ఠాణా పరిధిలోని ముర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ముర్నార్ అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు పోలీస్ బలగాలపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారని డీజీపీ గిర్దార్ తెలిపారు. -
మావోయిస్టుల ఘాతుకం.. ఐదుగురి మృతి
రాంచీ: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఝార్ఖండ్‌లోని జంషెడ్పూర్ సమీపంలో పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఝార్ఖండ్- పశ్చిమబెంగాల్ సరిహద్దు ప్రాంతం సరైకెలా జిల్లాలోని ఓ మార్కెట్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా సాయుధులైన ఇద్దరు మావోయిస్టులు పోలీసుల పైకి బుల్లెట్ల వర్షం కురిపించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అంతేకాకుండా పోలీసు వాహనంలో ఉన్న ఆయుధాలను కూడా ఎత్తుకు పోయారు. అంతకు ముందు ఇదే ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో 11 భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోరుకొండ దళమే టార్గెట్
సీలేరు(పాడేరు): విశాఖ ఏజెన్సీలో మావో యిస్టు పార్టీ ఆవిర్భవించిన∙నాటి నుంచి కోరుకొండ దళం ఆ ఉద్యమానికి ఎంతో కీలకం మారింది. ఎన్నో ఏళ్లుగా కోరుకొండ దళం ఈ ప్రాంతంలో పనిచేస్తోంది. ఆ దళంలో పనిచేసిన ఎందరో మావోయిస్టులు నాయకత్వ బాధ్యతలు నిర్వహించి పోలీసుశాఖకు చెమటలు పట్టించారు. ఆ దళాన్నే టార్గెట్ చేసుకుని పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆ దళం కోసం అణువణువు గాలింపు చేపడుతూ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే గాలికొండ దళాన్ని నిర్మూలన చేశామని ప్రకటించిన పోలీసులు కోరుకొండ దళాన్ని కూడా పట్టుకుంటామని దీమాగా చెబుతున్నారు.విశాఖ ఏజెన్సీ తూర్పుగోదావరి అటవీ ప్రాంతంలో కోరుకొండ దళం ఉందని తాజాగా అందిన సమాచారంతో ఎనిమిది గ్రేహౌండ్స్ బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని దళాన్ని చుట్టుముట్టాయి. అయితే త్రుటిలో మావోయిస్టులు తప్పించుకోవడతో వారికి చెందిన తుపాకీలు, కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తప్పించుకున్నది కోరుకొండ దళమేనని పోలీసులు భావిస్తున్నారు. ఆ దళాన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో కూంబిం గ్ను మరింత ముమ్మరం చేశారు. మరిన్ని బలగాలను అటవీ ప్రాంతంలో దింపారు. ఎదురుకాల్పుల్లో పాల్గొన్న గ్రేహౌండ్స్ బలగాలు కూడా ఇంకా తిరిగి రాలేదు. మావోయిస్టు అగ్రనేత నవీన్ కీలకం విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం మారుమూల ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కోరుకొండ దళం ఉంది. ఆ దళానికి ప్రస్తుతం కీలక నేతగా నవీన్ ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే దళం వ్యూహ, ప్రతి వ్యూహాలు పన్నుతోంది. ఆయనకు ముందున్న కుడుముల రవి, ఆజాద్‌తో పాటు మరికొందరు ముఖ్య నాయకులు ఎన్కౌంటర్లో మరణించారు. ఆ తర్వాత వచ్చిన నవీన్ ఆ దళాన్ని ముందుకు నడపడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో నవీన్ కూడా ఉన్నట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. దీనికి నిదర్శనం స్వాధీనం చేసుకున్న 303 తుపాకీలేనని, ఆ స్థాయి నేతలే దీన్ని వినియోగిస్తారని పోలీసులు భావిస్తున్నారు.ఈ క్రమంలో కూంబింగ్ ఉధృతం చేసి నవీన్‌ను పట్టుకోవాలని పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఈ నేపధ్యంలో తూర్పుగోదావరి సరిహద్దు ప్రాంతంలో గిరిజన గ్రామాల్లో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని భయాందోళనలో గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. -
తుపాకీ మోతలతో దద్దరిల్లింది
సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ తూర్పు గోదావరి సరిహద్దు అటవీ ప్రాంతం పోలీసు బలగాలు, మావోయిస్టుల తుపాకీ మోతలతో దద్దరిల్లింది. ఒక్కసారిగా ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరగడంతో... కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం ఉలిక్కిపడింది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదరుకాల్పులు జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. గిరిజన గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ముందే అందిన సమాచారం గత కొద్ది రోజులుగా మావోయిస్టు అగ్రనేతలు కటాఫ్ ఏరియాని వదిలి గిరిజన గ్రామాలకు దగ్గరగా సంచరిస్తున్నారని సమాచారం ఉంది. అయితే వారిని పట్టుకునేందుకు సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి వందల మంది పోలీసులు విశాఖ ఏజెన్సీ ఆంధ్రా, ఒడిశా, తూర్పు గోదావరి సరిహద్దు ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తూ బలగాల జాడ కోసం అన్వేషిస్తున్నారు. ఈ తరుణంలో విశాఖ ఏజెన్సీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గుమ్మిరేవుల çసరిహద్దు తూర్పుగోదావరి ప్రాంతంలో మావోయిస్టు దళం సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి 7.45 గంటలకు మావోయిస్టులు ఉన్న స్థావరానికి పోలీసు బలగాలు చేరుకున్నాయి. గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. ల్యాండ్‌మైన్ అమర్చిన మావోయిస్టులు ? విశాఖ జిల్లా, తూర్పుగోదావరి సరిహద్దులో జరిగిన ఎదురు కాల్పుల సమయంలో మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కటాఫ్ ఏరియాని వదిలి గిరిజన గ్రామాలకు దగ్గరగా వచ్చి సంచరిస్తున్న సమయంలో ఏ క్షణంలోనైనా బలగాలు వస్తాయని ముందుగానే అప్రమత్తమైనట్టు సమాచారం. ఈ మేరకు తాము ఉన్న ప్రదేశంలో మావోయిస్టులు ల్యాండ్‌మైన్‌ను అమర్చినట్టు తెలిసింది. వాటిని కూంబింగ్‌కు వెళ్లిన బలగాలు కూడా గుర్తించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఆ ప్రాంతం నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారిలో అగ్రనేతలు నవీన్, చలపతి ఉన్నట్టు సమాచారం. కొనసాగుతున్న కూంబింగ్ ఎదురుకాల్పుల అనంతరం కూంబింగ్ మరింత ఉధృతం చేశారు. ఇప్పటికే ఎనిమిది గ్రేహౌండ్స్ బలగాలు ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలైన నవీన్, చలపతి మరికొంత మంది అగ్రనేతలు ఉన్నట్టు జిల్లా పోలీసులకు సమాచారం ఉంది. ఇటీవలే పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు తెలియజేశారు. అప్పటి నుంచి ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా జరిగిన ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న దళ సభ్యుల కోసం మరికొంతమంది బలగాలను పంపించినట్టు సమాచారం. ఎదురు కాల్పులు జరిగిన విషయాన్ని ఒడిశా పోలీసులకు కూడా తెలియజేశారు. ఎన్కౌంటర్ ఇలా... విశాఖ ఏజెన్సీ గుమ్మిరేవుల పంచాయతీ సరిహద్దు తూర్పుగోదావరి జిల్లా చప్పకొండ, బురదమామిడి ఆంధ్రాకు 3 కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళం ఉందని విశాఖ గ్రేహౌండ్స్ బలగాలకు పక్కా çసమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టి మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి కాల్పులు జరిపాయి. దీంతో మావోయిస్టులు కూడా కాల్పులు జరిపారు. అయితే అప్పటికే చీకటి పడిపోవడంతో మావోయిస్టులు సంఘటన స్థలం నుంచి జారుకున్నారు. మావోయిస్టుల దళం అక్కడ ఉందని, అందులో అగ్రనేతలు కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల అనంతరం బుధవారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు సంఘటన స్థలానికి వెళ్లి, అక్కడ లభించిన 303 తుపాకీలు, 14 కిట్ బ్యాగులు, విప్లవ గీతాల పుస్తకాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
జార్ఖండ్‌లో భారీ ఎన్కౌంటర్
సాక్షి, డుంకా: జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. జార్ఖండ్‌లోని డుంకాలో ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులు పరస్పరం ఎదురుపడటంతో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానికంగా కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. -
జార్ఖండ్‌లో ఐఈడీలు పేల్చిన మావోలు
రాంచీ: జార్ఖండ్‌లో మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడ్డారు. జవాన్ల వాహనాలు లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున వరుసగా ఐఈడీలు పేల్చడంతో 15 మంది గాయపడ్డారు. సెరైకెలా–ఖర్సవాన్ జిల్లాలోని హుర్దా అటవీ ప్రాంత సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. పోలీసు అధికారుల కథనం ప్రకారం.. సీఆర్పీఎఫ్ జవాన్లు, కోబ్రా, జార్ఖండ్ పోలీసులు కుచాయ్ ప్రాంతంలో కూంబింగ్ నిమిత్తం వాహనాల్లో బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వీరిని గమనించిన మావోయిస్టులు వరుసగా 15కు పైగానే ఐఈడీ (ఆధునిక పేలుడు పదార్థాలు) పేలుళ్లకు పాల్పడ్డారు. కాగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో రాంచీకి తరలించారు. మావో నేత మహరాజ్ ప్రమాణిక్ నాయకత్వంలో ఈ పేలుళ్లు జరిగాయని జిల్లా ఎస్పీ తెలిపారు. -
ఒడిశాలో ఎదురుకాల్పులు
కొరాపుట్/చర్ల: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పాడువ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల బడెల్ అటవీ ప్రాంతంలో బుధవారం మావోయిస్టులు, జవాన్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొరాపుట్ ఎస్పీ డాక్టర్ కన్వర్ విశాల్ సింగ్ బుధవారం రాత్రి విలేకరులకు వివరాలు వెల్లడించారు. బుధవారం మ«ధ్యాహ్నం 2.45 గంటలకు కిటుబ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఓజీ, డీవీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా బడెల్ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారని, దీంతో ఉభయపక్షాల మధ్య సుమారు గంటసేపు ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు సహా ఐదుగురు హతమైనట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన మొత్తం 4 రైఫిల్స్ ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతిచెందిన మావోయిస్టుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో నిందితురాలైన ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన స్వరూప ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఆర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఒకరి మృతదేహాన్ని మావోయిస్టులు తీసుకెళ్లగా, మహిళా మావో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
‘కల్వకుర్తి’లో మావోల పోస్టర్లు
కల్వకుర్తి: మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కల్వకుర్తి డివిజన్ పరిధిలోని తాండ్ర, పోతేపల్లి, బైరాపూర్ గ్రామాల్లో మావోయిస్టుల పేర్లతో పోస్టర్లు వెలిశాయి. ఏకంగా సీఎం కేసీఆర్‌కు హెచ్చరిక చేస్తూ ‘ఖబడ్డార్ సీఎం కేసీఆర్.. ఉరికొయ్యలు, చెరసాలలు విప్లవాన్ని ఆపలేవు..’అని సీపీఐ మావోయిస్టు పేర ఎర్ర సిరాతో వాల్‌పోస్టర్లు వేశారు. తాండ్ర స్టేజీ వద్ద, వెల్దండ మండలంలోని పోతేపల్లి, బొల్లంపల్లిలో ఒకటి చొప్పున అంటించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పోస్టర్లు వెలియడంతో నక్సల్స్ కార్యకలాపాలు మొదలయ్యాయా.. అనే అనుమానం వ్యక్తమవుతుంది. చాపకిందనీరులా మళ్లీ మావోయిస్టులు పార్టీని విస్తృత పరిచి యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే పోస్టర్లు వేశారని భావిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీïసీ ఎన్నికల సమయంలో ఈ పోస్టర్లు వేయడంతో నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండగా.. గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్న ప్రజల్లో ఆందోళన నెలకొంది. మావోల చెర నుంచి గిరిజనుల విడుదల చర్ల: భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాలకు చెందిన ముగ్గురు గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా విడుదల చేశారు. ఈనెల 2న మండలంలోని బోదనెల్లికి చెందిన కుంజా బుచ్చిబాబు అనే యువకుడితో పాటు చింతగుప్పకు చెందిన మరో ఇద్దరిని కిడ్నాప్ చేశారు. వారికి ఏ హానీ తలపెట్టకుండా విడుదల చేయాలని కోరుతూ గిరిజన సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు శనివారం అర్ధరాత్రి వారిని విడుదల చేసినట్లు తెలిసింది. అయితే, విడుదలకు సంబంధించి కుటుంబసభ్యులు ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. వాహనాల దహనం.. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో రోడ్డు పనులకు వినియోగిస్తున్న ఐదు వాహనాలను మావోయిస్టులు ఆదివారం దహనం చేశారు. సుకుమా జిల్లా గొల్లపల్లి నుంచి వంజలవాయి మీదుగా కుంట వరకు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల అభివృద్ధి నిధులతో రోడ్డు పనులు చేస్తుండగా, వాటిని నిలిపివేయాలంటూ మావోయిస్టులు కాంట్రాక్టర్‌ను, గుమస్తాలను హెచ్చరించినట్లు తెలిసింది. అయితే, వారు ఆ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా పనులు కొనసాగిస్తుండడంతో ఆదివారం పనులు చేస్తున్న ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వచ్చిన మావోయిస్టులు, మిలీషియా సభ్యులు డ్రైవర్లను చితకబాదారు. అనంతరం వారిని దూరంగా తీసుకెళ్లి వాహనాల ట్యాం కుల్లోని డీజిల్‌ను పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో రెండు జేసీబీలు, రెండు పొక్లెయినర్లు, ఒక ట్రక్కు దగ్ధమయ్యాయి. -
ఏజెన్సీలో మావోయిస్టుల ఘాతుకం
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని చర్ల మండలంలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలకు చెందిన ముగ్గురు గిరిజన యువకులను రెండు రోజులు క్రితం మావోయిస్టులు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వారిలో ఇద్దరు యువకులును మావోయిస్టులు హతమార్చినట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబందించి వివరాలిలా ఉన్నాయి. చర్ల మండలంలోని బోదనెగ్రగామానికి చెందిన కుంజా బుజ్జితో పాటు చింతగుప్ప గ్రామానికి చెందిన ఒక యువకుడితో పాటు మరో యువకుడిని మావోయిస్టులు రెండు రోజుల క్రితం అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజులు గడిచినా వారి ఆచూకీ లభించపోవడంతో ఇన్ఫార్‌నెపంతో వారిని హతమార్చినట్లు సమాచారం. మాట్లాడే పనుందంటూ వారిని తీసుకెళ్లిన మావోయిస్టులు రెండు రోజులు దాటినప్పటికీ వారిని విడిచిపెట్టకపోవడంతో వారిని కిడ్నాప్ చేసినట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా మావోయిస్టులు కిడ్నాప్ చేసిన గిరిజనులకు ఎటువంటి హాని తలపెట్టకుండా వారిని మానవతాదృక్పదంతో విడిచిపెట్టాలంటూ ఆదివాసీల సంఘాల పేరిట శనివారం పత్రికలకు లేఖలు అందాయి. ఎటువంటి తప్పిదాన్ని చేయని గిరిజన యువకులను మావోయిస్టులు కిడ్నాప్ చేసి ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తక్షణమే మావోయిస్టులు కిడ్నాప్ చేసిన గిరిజన యువకులను విడిచిపెట్టాలంటూ మావోయిస్టులను గిరిజన సంఘాలు కోరుతున్నాయి. -
గడ్చిరోలి పేలుడు వెనుక నంబాల
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 16 మంది పోలీసుల్ని పొట్టన బెట్టుకున్న బాంబు పేలుడుకు కీలక సూత్రధారిని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. భారీ దాడులకు ప్రణాళికలు రూపొందించడంలో దిట్టగా పేరొందిన సీపీఐ (మావోయిస్ట్) గ్రూప్ చీఫ్ నంబాల కేశవరావు (నంబాల) ఈ దాడికి నేతృత్వం వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. గడ్చిరోలి మందుపాతర పేలుడు వెనుక తెలంగాణ మావోల హస్తం ఉందన్న విషయాన్ని ‘సాక్షి’ముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. (చదవండి : పోలీసులపై మావోల పంజా) నంబాల కేశవరావు అలియాస్ గుర్రె బసవరాజుగా కూడా ప్రసిద్ధుడే. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సీపీఐ (మావో యిస్టు) కేంద్ర మిలటరీ కమాండర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన వారసుడి గా నంబాల బాధ్యతలు చేపట్టాడు. నంబాల స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని జియ్యన్నపేట. తెలంగాణలోని వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థి. శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ చదివిన అనంతరం కేశవరావుకు వరంగల్ ఆర్ఈసీలో సీటు లభించింది. అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే నాటి పీపుల్స్ వార్ కార్యక్రమాల వైపు ఆకర్షితుడయ్యాడు. అంతకుముందు– ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో క్రియాశీలకంగా పని చేసిన సమయంలో నక్సల్ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. 1984లో పార్టీలో చేరిన కేశవరావు ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి దిశానిర్దేశకుడిగా వ్యవహరిస్తున్నాడు. నంబాల కేశవరావు (ఫైల్ ఫొటో) వ్యూహాలు రూపొందించడంలో దిట్ట.. భారీ దాడులు, హత్యలకు ప్రణాళికలు రూపొందించడంలో నంబాల కేశవరావు దిట్ట. మావో కీలక నేత గణపతి సారథ్యంలోనూ పార్టీలో కీలక ఆపరేషన్లు ఇతనికే అప్పగించేవారు. గణపతి నుంచి బాధ్యతలు స్వీకరించాక, తెలంగాణలో దాడులకు పాల్పడకున్నా.. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో భీకరదాడులతో పార్టీలో తిరిగి ఉత్తేజం నింపే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో భాగంగానే గతేడాది విశాఖపట్నం జిల్లా అరకు తెలుగుదేశం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్యకు నంబాల పథకం రూపొందించాడని సమాచారం. గత ఏప్రిల్ 9వ తేదీన తొలిదశ పోలింగ్ ముగిశాక ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌ను పేల్చేయడంలో కూడా నంబాల కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నంబాల తలపై రూ.19 లక్షల రివార్డు ఉంది. ఇతని కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కూడా వెదుకుతోంది. కలసి వచ్చిన పోలీసుల నిర్లక్ష్యం..! గడ్చిరోలి దాడిలో పోలీసుల నిర్లక్ష్యంవల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. పోలీసులను ఉచ్చులోకి లాగి మావోయిస్టులు లక్ష్యాన్ని ఛేదించారు. కుర్ ఖేడా అటవీ ప్రాంతంలో ముందుగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తోన్న యంత్రాలు, వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టి పోలీసులను ఉచ్చులోకి లాగారు. వాస్తవానికి ఏదైనా ఘటన జరిగితే సమాచారం అందుకున్న వెంటనే తమపై దాడి జరిగే ప్రమాదముందని వెంటనే వెళ్లరు. కానీ, బుధవారం మాత్రం పోలీసులు ఘటనా స్థలానికి సివిలియన్ వెహికల్లో వెళ్లారు. పైగా రోడ్డుకు అడ్డంగా పెట్టిన చెట్లను పక్కకు తీసే ప్రయత్నం చేసి భారీ తప్పిదం చేశారు. అదే సమయంలో అదనుచూసి అత్యంత శక్తిమంతమైన ఐఈడీ అమర్చిన మందుపాతరను పేల్చేయడం ద్వారా 16 మందిని మావోయిస్టులు పొట్టన బెట్టుకున్నారు. -
నిర్లక్ష్యం వల్లే మావోల దాడి
గడ్చిరోలి/న్యూఢిల్లీ: గడ్చిరోలి జిల్లాలో 15 మంది పోలీస్ కమాండోలు, ఓ డ్రైవర్‌ను బలికొన్న ఘటనలో సిబ్బంది ప్రామాణిక నిర్వహణా విధానాన్ని(ఎస్పీవో) పాటించలేదని మహారాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. దాదర్‌పూర్ వద్ద 36 వాహనాలను దహనం చేసిన మావోలు పోలీసులు అక్కడకు వచ్చేలా ఉచ్చు పన్నారన్నారు. ఇలాంటి సందర్భాల్లో భద్రతాబలగాలు చిన్న బృందాలుగా విడిపోయి కాలినడకన ఘటనాస్థలికి చేరుకుంటాయని వెల్లడించారు. కానీ గడ్చిరోలిలో క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) కమాండోలు నిబంధనలు పాటించకుండా ఓ ప్రైవేటు వ్యానులో దాదర్పూర్కు బయలుదేరారనీ, తద్వారా మావోలు పక్కా ప్రణాళికతో చేసిన ఐఈడీ దాడిలో ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సందర్భంగా జవాన్లు కనీసం మైన్ప్రూఫింగ్ వాహనాన్ని వాడకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. సాధారణంగా ఇక్కడి భద్రతను, కూంబింగ్ ఆపరేషన్లను పురాదా కేంద్రంగా ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వహిస్తాయనీ, అయితే వీరంతా సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండిపోవడంతో పోలీస్ కమాండోలకు ఇక్కడి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. మావోల దాడి ఘటనను మహారాష్ట్ర డీజీపీ స్వయంగా విచారిస్తారని సీఎం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. దాడిని ఖండించిన ఎన్హెచ్ఆర్సీ: గడ్చిరోలిలో మావోయిస్టుల దుశ్చర్యను జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఖండించింది. అమరుల కుటుంబాలు తగిన రీతిలో నష్టపరిహారం చెల్లించాలని వ్యాఖ్యానించింది. -
పోలీసులపై మావోల పంజా
సాక్షి, ముంబై, హైదరాబాద్, భూపాలపల్లి/ గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కూంబింగ్‌కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను పేల్చారు. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీస్ విభాగం క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) యూనిట్‌కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న వ్యాను తునాతునకలైంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు మావోయిస్టుల ఏరివేతకు అదనపు బలగాలను ఘటనాస్థలికి పంపారు. కాగా, మావోయిస్టుల దుశ్చర్యను ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సీఎం ఫడ్నవీస్‌తో పాటు పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. మరోవైపు మావోయిస్టులకు దీటైన జవాబు ఇస్తామని మహారాష్ట్ర డీజీపీ సుబోధ్ జైశ్వాల్ ప్రకటించారు. మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవమైన మే 1నే మావోయిస్టులు ఈ ఘాతుకానికి తెగబడటం గమనార్హం. పక్కాగా వలపన్ని దాడి.. పక్కా ప్రణాళిక ప్రకారమే మావోయిస్టులు కమాండోలను ఉచ్చులోకి లాగి హత్య చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. గడ్చిరోలి జిల్లాలోని దాదర్‌పూర్ గ్రామ సమీపంలో 136వ జాతీయ రహదారి పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున పలువురు మావోయిస్టులు ఇక్కడకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు వాడుతున్న జేసీబీలు, ట్రాక్టర్లు, డంపర్లు సహా 36 వాహనాలపై కిరోసిన్, డీజిల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి అడవిలోకి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న క్యూఆర్టీ కమాండోల బృందం అక్కడకు బయలుదేరింది. వీరి వాహనం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుర్ఖేదా ప్రాంతంలోని లెన్ధారీ వద్దకు రాగానే రోడ్డుపై చెట్లు పడిపోయి ఉన్నాయి. వెంటనే వ్యాను నుంచి దిగిన కమాండోలు వాటిని తొలగించబోతుండగా అక్కడే నక్కిన మావోలు ఒక్కసారిగా మందుపాతరను పేల్చారు. అనంతరం పేలుడుకు చెల్లాచెదురైన కమాండోలపై అన్నివైపుల నుంచి చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కమాండోలు ఎదురుకాల్పులు జరుపుతూనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సాధారణ వ్యానులో ప్రయాణం.. మావోయిస్టులకు గట్టి పట్టున్న గడ్చిరోలిలో కూంబింగ్ సందర్భంగా భద్రత విషయంలో పోలీస్ కమాండోలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కీలకమైన ఆపరేషన్‌కు వెళుతూ కూడా వీరంతా మైన్‌ప్రూఫ్ వాహనంలో కాకుండా సాధారణ వ్యానులో ప్రయాణించడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయమై మహారాష్ట్ర పోలీస్ డీజీపీ సుబోధ్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘నిఘా వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఇప్పుడే చెప్పడం సరికాదు. ఈ కూంబింగ్‌కు ఓ ప్రైవేటు వాహనాన్ని ఎందుకు ఎంచుకున్నారు? క్యూఆర్టీ కమాండోల కదలికలపై మావోయిస్టులకు ముందే సమాచారం అందిందా? అనే కోణంలో విచారణ జరుపుతాం. మావోయిస్టులకు దీటుగా బదులివ్వగలిగే సత్తా మాకుంది. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకే మావోలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. గడ్చిరోలిలో ఎన్నికలు పూర్తయిందున దాడులకు ఎన్నికలను ముడిపెట్టలేమని స్పష్టం చేశారు. కాగా, 2018, ఏప్రిల్‌లో క్యూఆర్టీ కమాండోలు ఓ ఆపరేషన్‌లో 40 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇందుకు ప్రతిగానే మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. దాడి వెనుక తెలంగాణ మావోయిస్టు కమిటీ గడ్చిరోలి దాడికి మావోయిస్టులు చాలాకాలం క్రితమే పథక రచన చేశారని నిఘావర్గాలు తెలిపాయి. ఈ దాడి పథకం అమలులో తెలంగాణ మావోయిస్టు కమిటీ నాయకులే కీలకమని వెల్లడించాయి. ఈ ఆపరేషన్‌లో కనీసం 100 మంది పాల్గొని ఉంటారని పేర్కొన్నాయి. మరోవైపు హైఅలర్ట్ ప్రకటించిన తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు, గ్రేహౌండ్స్ బలగాలను సరిహద్దు ప్రాంతానికి తరలించారు. గడ్చిరోలిలో కూంబింగ్ నుంచి తప్పించుకునేందుకు మావోలు తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లో ప్రవేశించే అవకాశముండటంతో గాలింపును ముమ్మరం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వీవీఐపీలు, రాజకీయ నేతలను పోలీసులు అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలో నెత్తుటి మరకలు మహారాష్ట్రలో భద్రతాబలగాలు లక్ష్యంగా గతంలో మావోయిస్టులు చేసిన దాడులివే.. ► 2009, ఫిబ్రవరి 1: గడ్చిరోలి జిల్లాలోని మోర్కే గ్రామం వద్ద మావోలు జరిపిన దాడిలో గస్తీ బృందానికి చెందిన 15 మంది పోలీసులు దుర్మరణం. ► 2009, మే 21: మహారాష్ట్రలోని మురు మ్ గ్రామం వద్ద మావోల మెరుపుదాడి లో 16 మంది పోలీస్ సిబ్బంది మృతి. ► 2009, అక్టోబర్ 8: గడ్చిరోలిలోని లహేరీ వద్ద ఎదురుకాల్పులు. 17 మంది పోలీసులు దుర్మరణం. ► 2011, మే 19: భమ్రాగఢ్ తాలుకాలో మావోయిస్టుల మెరుపుదాడి. నలుగురు పోలీస్ సిబ్బంది మృతి. ► 2012, మార్చి 27: ధనోరాలో సీఆర్పీఎఫ్ బస్సును పేల్చివేసిన మావోలు. 12 మంది సీఆర్పీఎఫ్ ఎలైట్ యూనిట్ జవాన్లు మృత్యువాత. మరో 28 మందికి తీవ్రగాయాలు. దోషులను వదిలిపెట్టం: మోదీ ‘గడ్చిరోలిలో మన భద్రతాసిబ్బందిపై మావోయిస్టుల హేయమైన దాడిని ఖండిస్తున్నా. ఈ హింసకు పాల్పడ్డ దోషులను వదిలిపెట్టబోం. అమరులైన వీరులకు నా సెల్యూట్. వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోం. అమరుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని చెప్పారు. పిరికిపందల చర్య: రాజ్‌నాథ్ ‘తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన మావోలు ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారు. మావోల దుశ్చర్య విషయమై సీఎం ఫడ్నవీస్‌తో ఇప్పుడే మాట్లాడాను. మహారాష్ట్రకు కేంద్రం అన్నివిధాలుగా అండగా ఉంటుంది. హోంశాఖ వర్గాలు గడ్చిరోలి జిల్లా యంత్రాంగంతో టచ్‌లో ఉన్నాయి. ఈ దుర్ఘటనలో అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వీరి త్యాగం వృధాగా పోదు’ అని తెలిపారు. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా: రాహుల్ ‘గడ్చిరోలీలో మన భద్రతాసిబ్బందిపై దాడి గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. తమ ప్రియమైనవారిని కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందిస్తూ..‘ఈ విషాద సమయంలో నేను, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. దేశం మొత్తం మావోల హింసను వ్యతిరేకిస్తోంది. ఈ హింసాత్మక భావజాలాన్ని కలసికట్టుగా ఓడిస్తాం’ అని పేర్కొన్నారు. దాదర్పూర్లో మావోయిస్టులు తగులబెట్టిన వాహనాలు -
మావోయిస్టుల దాడిలో 15 మంది జవాన్ల మృతి..!
-
గడ్చిరొలి: భద్రతబలగాలు లక్ష్యంగా బాంబు పేలుడు
-
మావోయిస్టుల దాడిలో 15 మంది జవాన్ల మృతి..!
ముంబై : మావోయిస్టులు మరోసారి పేట్రేగిపో్యారు. భద్రతా సిబ్బందిపై పంజా విసిరిరారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి పేల్చేశారు. ఈ ఘటన మహారాష్ట్రాలోని గడ్చిరోలిలో బుధవారం చోటుచేసుకుంది. భారీ విస్పోటనం కారణంగా వాహనం తునాతునకలైంది. ఈ ప్రమాదంలో 15 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. జాంబిర్‌కేడ అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది. అంతకు ముందు ఇదే జిల్లా కుర్ఖేడా తాలూకా దాదాపూర్ వద్ద మావోయిస్టులు బుధవారం రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నిప్పుపెట్టారు. (చదవండి : గడ్చిరోలిలో మావోయిస్టుల విధ్వంసకాండ) -
గడ్చిరోలిలో మావోయిస్టుల విధ్వంసకాండ
-
గడ్చిరోలిలో మావోయిస్టుల విధ్వంసకాండ
సాక్షి, గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తాలూకా దాదాపూర్ వద్ద మావోయిస్టులు బుధవారం రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా ఈ ఏడాది జనవరిలో కూడా మావోలు విధ్వంసానికి పాల్పడ్డారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నిలిపివేయాలంటూ మావోయిస్టులు ఈ సందర్భంగా ఘటనా స్థలంలో కరపత్రాలు వదిలి వెళ్లారు. మరోవైపు తమ వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యేను చంపిన మావోయిస్టుల హతం
రాయ్‌పూర్ : బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని హత్య చేసిన మావోయిస్టు కమాండర్ ఎన్కౌంటర్లో హతమైనట్టు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 9న ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతరను పేల్చడంతో దంతెవాడ ఎమ్మెల్యే భీమా మాండవీతో పాటూ మరో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దౌలికర్క అడవుల్లో గురువారం ఉదయం మావోయిస్టులు తిరుగుతున్నట్లు తెలియడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఓ మావోయిస్టు కమాండర్‌తోపాటూ మరో మావోయిస్టును పోలీసులు మట్టుపెట్టారు. దీనిపై దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే మాండవీని చంపేసిన ఇద్దరు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారని తెలిపారు. హతమైన మావోయిస్టులను వర్గీస్, లింగాగా పోలీసులు గుర్తించారు. గాయపడిన మరో మావోయిస్టు దస్రును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐఈడీల ఎక్స్పర్ట్ అయిన వర్గీస్ పెట్టిన మందుపాతర పేలడంతో ఏప్రిల్ 9న ఎమ్మెల్యే భీమా మండవీ చనిపోయారు. శక్తిమంతమైన పేలుడుకి భీమా మాండవీ ప్రయాణస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా గాల్లోకి లేచి, మాండవీ శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఈ దాడిలో ఆయనతోపాటూ మరో ముగ్గురు భద్రతా సిబ్బంది, ఓ పోలీస్ డ్రైవర్ కూడా చనిపోయారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో 3 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని బహిష్కరించిన మావోయిస్టులు ప్రజలెవ్వరూ ఓటు వెయ్యొద్దని పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ప్రజలను భయపెట్టేందుకు అడవుల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. తాజా కాల్పుల్లో ఘటనా స్థలం నుంచి పోలీసులు... ఓ 315 బోర్ రైఫిల్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, రెండు పేలుడు పదార్థాలు, నక్సల్స్ క్యాంపింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
మావోయిస్టుల దాడి రాజకీయ కుట్ర
రాజ్‌నంద్‌గావ్(ఛత్తీస్‌గఢ్): దంతెవాడలో ఎమ్మెల్యే భీమా మాండవిని మావోయిస్టులు పొట్టనబెట్టుకున్న ఘటనను రాజకీయ కుట్రగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అభివర్ణించారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గంలోని డొంగర్‌గావ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘మా పార్టీ ఎమ్మెల్యే మాండవిపై మావోయిస్టుల దాడి సాధారణ ఘటన కాదు, అది రాజకీయ కుట్ర గా భావిస్తున్నాం. మాండవి భార్య కూడా సీబీ ఐ దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ ఘటనలో నిజాలు వెలికి తీయాలని ముఖ్యమంత్రి బఘేల్ నిజంగా భావిస్తే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి’అని కోరా రు. ‘సీబీఐ అంటే సీఎం బఘేల్ ఎందుకు భయపడుతున్నారు? దర్యాప్తు సంస్థ ముం దుగా తమ అనుమతి తీసుకోవాలని ఎందుకు ఉత్తర్వులిచ్చారు?’అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోయాయన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకం గా ప్రధానమంత్రిని నియమించాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మౌనం వీడి వైఖ రిని స్పష్టం చేయాలన్నారు. భారత్ నుంచి కశ్మీర్ విడిపోవాలని ఈ నేతలు కోరుకుంటున్నా రని ఆరోపించారు. చిట్టచివరి బీజేపీ కార్యకర్త ఉన్నంతవరకు దేశం నుంచి కశ్మీర్‌ను ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు. బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలపై దాడి అనంతరం దేశ ప్రజలం తా సంబరాలు జరుపుకుంటే పాకిస్తాన్‌తోపాటు కాంగ్రెస్ కార్యాలయంలోనూ విషాదచాయలు అలుముకున్నాయని ఎద్దేవా చేశారు. -
మావోల ఘాతుకం
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లిలో మావోయిస్టులు రెచ్చిపోయారు. గురువారం ఏటపల్లి తాలూకా హెడ్రీ ఠాణా పరిధిలోని పర్సల్‌గోంది అటవీ ప్రాంతం వద్ద ఎన్నికలు ముగిశాక పోలీసులు ఈవీఎంలను, పోలింగ్ సిబ్బందిని ప్రత్యేక వాహనంలో తీసుకువస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. వాహనంపై ఐఈడీ బాంబును పేల్చగా ముగ్గురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు పారిపోయారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా గాయాలైన సిబ్బంది ప్రత్యేక హెలికాప్టర్లో నాగ్‌పూర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మరోసారి మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. పోలింగ్‌కేంద్రం వద్ద మందుపాతర: ఏటపల్లి తాలూకా కసన్సూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాగేజరి గ్రామంలోని పోలింగ్ కేంద్రం సమీపంలో పోలీసులను టార్గెట్ చేస్తూ గురువారం మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పోలింగ్ కేంద్రానికి అతి సమీపంలో ఉదయం 11.30 గంటలకు మందుపాతర పేల్చగా ఓటర్లు, పోలీసులు ఉలిక్కి పడి పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదని పోలీసులు తెలిపారు. ఇక బుధవారం రాత్రి అదే ఏటపల్లి తాలూకా పరిధిలో జాంబియా గుట్లలో జవాన్ సునీల్ సైకిల్‌కు ఐఈడీ బాంబును మావోయిస్టులు అమర్చగా అది పేలడంతో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మూడు ఘటనలతో ఏటపల్లితో పాటు గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలో 61శాతం వరకు పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
ఛత్తీస్‌లో మావోల ఘాతుకం.. ఎమ్మెల్యే మృతి
-
ఛత్తీస్‌లో మావోల ఘాతుకం
సాక్షి, కొత్తగూడెం/రాయ్‌పూర్/బస్తర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవికి చెందిన కాన్వాయ్ లక్ష్యంగా మంగళవారం ఐఈడీ పేల్చారు. వెంటనే చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే మాండవి(40)తో పాటు నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుశ్చర్యపై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకూ అప్రమత్తతతో వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని ఆదేశించింది. ఐఈడీ పేల్చి.. కాల్పులు జరుపుతూ చివరి రోజు ఎన్నికల ప్రచారం ముగించుకున్న భీమా మాండవి దంతెవాడ జిల్లాలోని కువాకొండా నుంచి బచేలీకి బయలుదేరారు. వీరి కాన్వాయ్ శ్యామలగిరిలోని ‘నకుల్నార్’ ప్రాంతానికి రాగానే అక్కడే మాటేసిన మావోలు మందుపాతరను పేల్చారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. జవాన్ల శరీర భాగాలన్నీ తెగిపడి ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఐఈడీ దాడి నుంచి తేరుకునేలోపే మావోయిస్టులు అన్నివైపుల నుంచి చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరుపుతూ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందజేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. అనంతరం కూంబింగ్ ప్రారంభించాయి. ఈ దుర్ఘటనలో చనిపోయిన జవాన్లను డ్రైవర్ దంతేశ్వర్ మౌర్య, ఛగ్గన్ కుల్దీప్, సోమ్డు కవాసీ, రామ్‌లాల్ ఒయామీగా అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్ని బహిష్కరించాలని మావోలు ఇటీవల పిలుపునిచ్చారు. మరోవైపు దంతెవాడ దాడి నేపథ్యంలో భద్రాచలం డిపో నుంచి వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం వెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దు చేశారు. ముందుగానే హెచ్చరించాం: ఎస్పీ కువాకొండ మార్గంలో రాకపోకలు వద్దని తాము హెచ్చరించినా మాండవి వినిపించుకోలేదని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. తమ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఆయన గత రెండ్రోజులుగా ఇదే మార్గంలో రాకపోకలు సాగించారని వ్యాఖ్యానించారు. ‘ఈ మార్గమంతా మావోయిస్టులు ల్యాండ్మైన్లను అమర్చారు. మాండవి ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో సోమవారం కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఎమ్మెల్యే మాండవి కదలికలతో అప్రమత్తమైన మావోయిస్టులు సోమవారం రాత్రి ఐఈడీలను అమర్చి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బస్తర్ డివిజిన్‌లోని 12 స్థానాలకు గానూ 11 సీట్లను కాంగ్రెస్ దక్కించుకోగా, ఒక్క దంతెవాడలో మాత్రం మాండవి గెలుపొందారు. ఎన్నికలు ఆగవు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ లోక్‌సభ స్థానానికి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11నే ఎన్నికలు జరుగుతాయని ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రధానాధికారి సుబ్రత్ చెప్పారు. దాడి అనంతరం తొలి, రెండో విడత పోలింగ్ జరిగే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్ 11, 18, 23న 3 విడతల్లో ఎన్నికల నిర్వహణ కోసం 80,000 మంది భద్రతాబలగాలతో పాటు డ్రోన్లను ఛత్తీస్‌గఢ్‌లో మోహరించారు. మరోవైపు రాయ్‌పూర్‌లో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం భూపేశ్ బాఘేల్.. మావోలకు వారికి అర్థమయ్యే భాషలోనే బుద్ధి చెప్పాలని ఆదేశించారు. -
మావోయిస్టుల ఘాతుకం : బీజేపీ ఎమ్మెల్యే మృతి
-
మావోయిస్టుల ఘాతుకం : బీజేపీ ఎమ్మెల్యే మృతి
చత్తీస్గడ్ : చత్తీస్‌గడ్‌లో నక్సల్స్ మరోసారి విరుచుకుపడ్డారు. దంతేవాడ జిల్లాలో బీజేపీ కాన్వాయ్‌పై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బీజేపీ ఎంఎల్ఏ భీమా మాండవి దుర్మరణం చెందారు. వీరితోపాటు మరో ఆరుగురు భద్రతా సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భద్రతా బలగాలు , మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దంతెవాడలోని సకులనార్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
మాజీఎమ్మెల్సీ ఇంటిని డైనమేట్లతో పేల్చేశారు!
సాక్షి, పాట్నా: బిహార్‌లోని గయా జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ ఇంటిని మావోయిస్టులు గురువారం తెల్లవారుజామున పేల్చేశారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. మాజీ ఎమ్మెల్సీ అయిన అర్జున్ సింగ్ నివాసం గయా జిల్లాలోని బోడిబిగా ప్రాంతంలో ఉంది. మావోయిస్టులు శక్తివంతమైన డైనమేట్ పేలుడు పదార్థాన్ని ఉపయోగించి ఆయన ఇంటిని నేలమట్టం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు ముందు ఆ ఇంట్లో ఉంటున్న అర్జున్‌సింగ్ సమీప బంధువుపై మావోయిస్టుసలు భౌతికంగా దాడికి పాల్పడ్డారు. ఆ ఇంటిని ఖాళీ చేయవల్సిందిగా బెదిరించారు. ఆయన ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఆ ఇంట్లో ఎవరూలేని సమయంలో మావోయిస్టులు పేల్చేశారని దుమారియ పోలీసు అధికారి ధర్మేంద్ర కుమార్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ దాడి జరగడం పోలీసుల్లో కలవరం రేపుతోంది. గయా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రాజీవ్ మిశ్రా ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. దాడికి కారణమైన మావోయిస్టులను గుర్తించడానికి ‘సేర్చ్ ఆపరేషన్ టీమ్’ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
కటాఫ్ ఏరియాలో ఎన్నికల సందడి
విముక్తి ప్రాంతంగా మావోయిస్టులు పిలుచుకునే ఆంధ్రా ఒరిస్సా బోర్డర్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మల్కాన్‌గిరిలో చాలాకాలం తరువాత ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కుని వినియోగించుకునే పరిస్థితులు నెలకొల్పినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆం్రధ్రా ఒరిస్సా బోర్డర్ (ఏఓబీ)లోని ఈ కటాఫ్ ఏరియాపై మావోయిస్టులకు పట్టుంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా దశాబ్దం క్రితం బలిమెల రిజర్వాయర్‌లో యాంటీ నక్సల్స్ స్క్వాడ్‌ని తీసుకెళుతోన్న పడవపై మావోయిస్టులు జరిపిన దాడిలో 38 మంది పోలీసు సిబ్బంది మరణించారు. ఆ తరువాత కూడా ఆ ప్రాంతమంతా మావోయిస్టుల అధీనంలోనే ఉంది. మొన్నటి వరకూ ఈ ప్రాంతానికీ బాహ్య ప్రపంచానికీ సంబంధంలేని పరిస్థితులుండేవి. పాలనా వ్యవస్థ సైతం అక్కడ శూన్యమనే చెప్పాలి. ఎట్టకేలకు ఒడిశా ప్రభుత్వం బాహ్య ప్రపంచానికీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికీ మధ్య గురుప్రియ నదిపై నిర్మించిన బ్రిడ్జిని 2018, జూలై 26న ప్రారంభించడంతో ఈ ప్రాంతానికి రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లో నేతలకు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టే అవకాశం లభించింది. తొలిసారి ఈ ప్రాంతంలో రాజకీయ నాయకుల ప్రచారం ప్రారంభమైంది. స్థానిక ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని మల్కాన్‌గిరి ఎస్పీ జగ్మోహన్ మీనా వెల్లడించారు. -
బండకొండ ప్రాంతంలో కాల్పులు
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం బండకొండ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆత్మ రక్షణ కోసం గాలిలోకి కాల్పులు జరిపినట్లు టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు తెలిపారు. బుధవారం గాల్లోకి కాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఐజీ కాంతారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం రాత్రి అందిన సమాచారం మేరకు చిన్నగొట్టిగల్లు మండలం కటారువాండ్లపల్లె సమీ పంలోని బండకొండ ప్రాంతంలో స్మగ్లర్లు కదలికలను గమనించి కూంబింగ్ నిర్వహించామన్నారు. అక్రమ రవాణాకు అనువైన రోడ్డు మా ర్గానికి దగ్గరగా బండకొండ ప్రాంతం ఉండడంతో అక్కడ ఎర్రచందనం దుంగలను నిల్వ చేసి, వాటిని తరలించేందుకు సిద్ధం అవుతుండగా వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా రాళ్లు విసురుతూ పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. ఒక దశలో వారు ఎదురు తిరిగి దాడికి పాల్పడేందుకు ముందుకు రావడంతో ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో దుంగలు కింద పడేసి పారిపోతుండగా తమిళనాడు రాష్ట్రం జువాదిమళైకి చెందిన సెల్వరాజ్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో 13 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో భయం భయం చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాల సరిహద్దు ప్రాంతమైన బండకొండ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎర్రచందనం దుంగలు తరలించిన దాఖలాలు లేవని స్థానిక గ్రామ ప్రజలు అంటున్నారు. టాస్క్‌ఫోర్స్, డాగ్ స్క్వా డ్, పోలీసులు గ్రామాల సరిహద్దులోని పొలా ల్లో తిరగడంతో గ్రామాల్లో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కొనసాగుతున్న కూంబింగ్ బండకొండ సమీపంలో పారిపోయిన స్మగ్లర్లు కోసం తలకోన అడవుల్లో కూంబింగ్ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో స్మగ్లర్లు బరితెగిస్తున్నారంటే కచ్చితంగా ఇంటి దొంగలు సహకారం ఉందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఆ దిశగా కూడా రహస్యంగా విచారణ చేపడుతున్నట్లు వివరించారు. -
ఛత్తీస్‌లో ఎస్‌యూవీని పేల్చిన నక్సల్స్
చర్ల/బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ఓ పౌరుడి కారును పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. పెద్దకోడెపాల్ గ్రామ సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లాలో జరుగుతున్న ఓ తిరునాలకు ఎస్‌యూవీలో వెళ్తుండగా నక్సల్స్ దానిని పేల్చేశారు. బీజాపూర్ సూపరింటెండెంట్ గోవర్ధన్ రామ్ ఈ వివరాలను వెల్లడించారు. -
కిడ్నాపైన ఎస్ఐ దారుణ హత్య..!
రాయ్‌పూర్ : దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. అరన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల రేవలి గ్రామంలో ఆదివారం ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారు. వారిలో ఒకరు ఎస్ఐ కాగా, మరొకరు స్కూల్ టీచర్. దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవా వివరాల ప్రకారం.. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కశ్యప్‌ను సీఆర్పీఎఫ్ బెటాలియన్‌తో సమన్వయం చేస్తూ అరన్‌పూర్‌కు బదిలీ చేశారు. అక్కడే ఉన్న తన మిత్రుడు జైసింగ్ కురేటిని కలిసేందుకు కశ్యప్ వెళ్లాడు. సమాచారం అందుకున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆ గ్రామంలోకి చొరబడ్డారు. కశ్యప్, జైసింగ్‌లను కిడ్నాప్ చేశారు. వారి ఆచూకీ కోసం ఆ ప్రాంతమంతా కూంబింగ్ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. సున్నిత ప్రాంతమైన రేవలి, అరన్పూర్ గ్రామాలు రాయపూర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కాగా, మావోయిస్టుల చేతిలో కిడ్నాపైన ఇద్దరిలో ఎస్ఐ లలిత్ కశ్యప్‌ను దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఐని హత్య చేసిన మావోయిస్టులు అతని మృతదేహం వద్ద ఓ లేఖను వదిలివెళ్లారు. స్కూల్ టీచర్ మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి : భారీ ఎన్కౌంటర్ : 8మంది మావోయిస్టులు మృతి) -
భారీ ఎన్కౌంటర్ : 8మంది మావోయిస్టులు మృతి
గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి సవేగామ్ అటవీ ప్రాంతం జరిగిన భారీ ఎన్కౌంటర్ 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. సవేగామ్ అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య హోరా హోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోల కదలికల గురించి సమాచారం అందుకున్న బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు దళానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. -
ఇన్ఫార్మర్ నెపంతో రైతు హత్య
జయపురం: నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఓ రైతు ప్రాణాలను బలితీసుకున్నారు. రాయిఘర్ సమితిలోని హొలాబీ గ్రామ పంచాయతీ మారుమూల దుర్గమ ప్రాంతం బెనసర్ గ్రామానికి చెందిన రైతు అనంతరామ్ గోండ్ ఉరఫ్ టును గోండ్‌ను మంగళవారం రాత్రి గ్రామం మధ్యలో గల అంగన్వాడీ కేంద్రం వద్ద మావోయిస్టులు బంధించి తపాకీతో కాల్చి చంపారు. ఈ వార్త అన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఈ సఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మావోయిస్తులు గతంలో అనంతరామ్‌కు ఒక లేఖ రాసి పోలీసులకు ఇన్ఫార్మర్గా ఉన్నావు వెంటనే అ పని మానుకోమని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనంతరామ్‌ను హత్య చేసిన ప్రాంతంలో వారు మావోయిస్టులు ఓ లేఖను విడిచి పెట్టారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఇందగాం ఒరియా కమిటీ పేరుతో హిందీలో ఉన్న ఆ లేఖలో మావోయిస్టులను అంతమొందించేందుకు అనంతరామ్ పోలీసులతో కలిసి పనిచేస్తున్నాడని ఆరోపించారు. మావోయిస్టులు అడుగుజాడలపైన, కదలికలపైన కన్ను ఉంచిన నవరంగపూర్ ఎస్పీతో రైతు అనతరామ కాంటాక్ట్‌లో ఉన్నాడని మావోయిస్టులు ఆరోపించారు. 2015వ సంవత్సరం నుంచి ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని అనేక పర్యాయాలు నచ్చచెప్పినప్పటికీ మారక పోవడంతో మరణదండన విధించామని లేఖలో వెల్లడించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ముగ్గురు మావోయిస్టులు తుపాకులు, గొడ్డళ్లతో గ్రామానికి వచ్చి అనంతరామ్ ఇంటికి వెళ్లి బయటకు రావాలని పిలిచారు. ఛత్తీస్‌గఢ్ భాషలో వారు అనంతరామ్‌ను, అతని తండ్రిని దుర్భాషలాడారు. అనంతరామ్ ఇంటినుంచి బయటకు రాగా తమ వెంట ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. అలా కొంత దూరం వెళ్లిన తరువాత తుపాకులు పేలిన శబ్దం వచ్చిందని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. -
మావోయిస్టుల పేరు చెప్పి తీసుకెళ్లారు...
విశాఖపట్నం, ముంచంగిపుట్టు (పెదబయలు): మావోయిస్టులు రమ్మంటున్నారని చెప్పి తమ గ్రామానికి చెందిన ఇద్దర్ని పోలీసులు అన్యాయంగా తీసుకెళ్లారని వారిని వెంటనే విడిచిపెట్టాలని మండలంలోని బుంగాపుట్టు పంచాయతీ బూరుగుపల్లి గ్రామస్తులు కోరారు. వారు బుధవారం ముంచంగిపుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం రాత్రి బూరుగుపల్లి గ్రామానికి వచ్చిన పోలీసులు కిల్లో సురేష్ (సను), గొల్లోరు సాధూరామ్( సాదు) అనే ఇద్దర్ని అదుపులోని తీసుకున్నారని తెలిపారు. మావోయిస్టులకు చెందిన సుధీర్ అనే వ్యక్తి రమ్మన్నాడని చెప్పి అమాయకులైన తమ వా రిని పోలీసులు తీసుకుపోయారని సురేష్ తల్లిదండ్రులు సోమనాథ్,రక్నాలు కన్నీరుమున్నీరయ్యా రు. సాధూరామ్ భార్య దోయిమెత్తి గర్భిణి, అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్తకు బయట వ్యక్తులతో సంబంధం లేదని, పేదరికంలో ఉన్న తమను పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం తగదని ఆమె వాపోయింది. రాత్రి అందరూ నిద్రి స్తున్న సమయంలో పోలీసులు గ్రామంలో ప్రవేశించి భయబ్రాంతులకు గురిచేసి, మావోయిస్టుల పేరు చెప్పి ఇద్దర్ని ఎత్తుకుపోయారని వారిని విడిచిపెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మా గ్రామానికి అతిథులు ఎవరు వచ్చినా ఆదరిస్తామని, మావోయిస్టులు వచ్చినా భోజనం పెట్ట మంటే వంట చేసి పెడతామని, అందకు మమ్మల్ని నేరస్తులుగా చిత్రీకరించడం తగదని గ్రామస్తులు వాపోయారు. సురేష్,సాధూరామ్లు ముం చంగిపుట్టు స్టేషన్లో ఉన్నట్టు కొంతసేపు, రూడకోట అవుట్ పోస్టులో ఉన్నట్టు మరికొంత సేపు చెప్పి మభ్యపెడుతున్నారని, వారిని విడిచిపెట్టాలని కోరారు. స్థానిక ఎస్ఐ అరుణ్ కిరణ్‌ను వివరణ కోరగా గ్రేహౌండ్స్ దళాలు, ప్రత్యేక పోలీసు బృందాలు ఏవోబీలో గాలింపులు చేపడుతున్నాయని, గిరిజనులను కూబింగ్ పార్టీలు అదుపులోకి తీసుకుని ఉండ వచ్చని, తమకు ఏ సమాచారం లేదని చెప్పారు. -
మన్యంలో మావోల బంద్ నేడు
శ్రీకాకుళం , భామిని: మావోయిస్టుల బంద్‌కు పిలుపునివ్వడంతో మన్యంలో మరోసారి తీవ్ర ప్రభావం చూపనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ బుధవారం ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లాలో ప్రైవేటు బస్సును దహనం చేయడంతో ఆందోళన నెలకొంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గిరిజన ప్రాంతాలకు నడిచే రాత్రి బస్సులను సరిహద్దు పోలీస్ స్టేషన్లు వద్ద నిలిపివేస్తోంది. ఇప్పటికే సరిహద్దులో కీలకమైన తివ్వాకొండల పరిసరాల్లో ప్రత్యేక సాయుధ దళాలు ముమ్మర కూంబింగ్ చేపడుతున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో రాత్రి పూట వాహన తనిఖీలు చేస్తున్నాయి. నిరసన వారోత్సవాల నేపథ్యంలో.. సమాధాన్ పథకం పేరున మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టి, గిరిజన హక్కులను హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహిస్తూ ఈ నెల 25 నుంచి మన్యంలో నిరసన వారోత్సవం చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం మన్యం బంద్‌కు ప్రత్యేకంగా పిలుపు నివ్వడంతో ఆందోళన మొదలైంది. దీంతో ఏవోబీలో మావోల కదలికలు తీవ్రం కావడంతో పోలీసులు అప్రమత్తం చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రానికి అధికార పార్టీ నాయకులు.. మావోల హిట్‌లిస్టులో ఉన్న టీడీపీ నాయకులను స్వగ్రామాల్లో ఉండనీయకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటికే హెచ్చరికలు చేసిన పోలీసులు అధికార పార్టీ కార్యక్రమం పేరున సురక్షితంగా తీసుకెళ్లారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. -
మావోయిస్టుల ఘటనతో బస్సుల బంద్
చింతూరు మండలం సరివెల వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి మావోయిస్టులు బస్సు, లారీ దహనం చేసిన నేపథ్యంలో ఆంధ్రా, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని ఆ పాంతాన్ని బుధవారం పరిశీలించారు. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట ఏరియా కమిటీకి చెందిన 20 నుంచి 25 మంది దళ సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు తూర్పుగోదావరి , చింతూరు(రంపచోడవరం): ఆంధ్రా, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని తెలిపారు. చింతూరు మండలం సరివెల వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి మావోయిస్టులు బస్సు, లారీ దహనం చేసిన ప్రాంతాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం చింతూరులో విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట ఏరియా కమిటీకి చెందిన 20 నుంచి 25 మంది దళ సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం ఉందన్నారు. వారోత్సవాలు, బంద్ నేపథ్యంలో ఉనికిని చాటుకునేందుకే మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడ్డారని, ఘటనకు పాల్పడిన మావోయిస్టుల ఆచూకీ కోసం చింతూరు, ఏడుగురాళ్లపల్లి, ఎటపాక పోలీస్ స్టేషన్ల పరిధిలో బలగాలను అప్రమత్తం చేశామని తెలిపారు. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల వెంబడి 45 కిలోమీటర్ల మేర సీఆర్పీఎఫ్, ప్రత్యేక బలగాలు నిత్యం పహారా కాస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే సరిహద్దుల్లోని సుక్మా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్పీలతో మాట్లాడామని త్వరలోనే వారితో కలసి జాయింట్ ఆపరేషన్ చేపడతామని తెలిపారు. ఇటీవల జిల్లాలో మావోయిస్టుల అరెస్టులు, లొంగుబాట్లు అధికం చేశామని, మిలీషియా నెట్‌వర్క్‌పై దృష్టి సారించామని, సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీలో కొత్త రిక్రూట్మెంట్లు జరగడం లేదని ఎస్పీ తెలిపారు. త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపే అవకాశమున్నందున జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చింతూరు ఓఎస్డీ అమిత్‌బర్దర్, డీఎస్పీ దిలీప్‌కిరణ్, సీఐలు దుర్గాప్రసాద్, అనీష్‌బాబు పాల్గొన్నారు. మావోయిస్టుల ఘటనతో బస్సుల బంద్ చింతూరు (రంపచోడవరం): జాతీయ రహదారిపై మావోయిస్టులు బస్సు, లారీ దగ్ధం చేసిన నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి విలీన మండలాలకు బస్సులు బంద్ అయ్యాయి. దీంతో బుధవారం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆంధ్రాతో పాటు తెలంగాణకు చెందిన బస్సులను కూడా రద్దు చేయడంతో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన ప్రయాణికులు నిరాశకు గురయ్యారు. ఆంధ్రాలోని రాజమండ్రి, కాకినాడ, రావులపాలెం, గోకవరం, విశాఖపట్నం, విజయవాడ డిపోలకు చెందిన బస్సులు రద్దయ్యాయి. తెలంగాణలోని భద్రాచలం, హైదరాబాద్, కరీంనగర్, తాండూరు, పరిగి డిపోలకు చెందిన బస్సులు కూడా రద్దయ్యాయి. కాగా మావోయిస్టులు గురువారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం కూడా బస్సులు తిరుగుతాయో లేదోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బస్సులు బంద్ కావడంతో ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆటోడ్రైవర్లు మూడు రెట్లు అధికంగా ఛార్జీలు వసూలు చేసినట్టు ప్రయాణికులు వాపోయారు. కుంట, చట్టి, చింతూరు నుంచి భద్రాచలానికి బస్సుకు రూ.60 చార్జీ కాగా సమయాన్ని బట్టి ఆటోడ్రైవర్లు రూ.వంద నుంచి 200 వరకు ఛార్జీలు వసూలు చేశారని ప్రయాణికులు ఆరోపించారు. -
దండకారణ్యంలో కూంబింగ్
చర్ల: ఆపరేషన్ సమాధాన్‌ను వ్యతిరేకించాలంటూ మావోయిస్టులు ఇచ్చిన పిలుపుతో దండకారణ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా జనవరి 25 నుంచి 30 వరకు సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని, ఈ నెల 31న దేశవ్యాప్త బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యం లో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 5, 6 రోజులుగా సరిహద్దు అటవీ ప్రాం తంలో భారీగా మోహరించిన ప్రత్యేక పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, మిలిటెంట్లు, మిలీషియా సభ్యుల కోసం పోలీసు బలగాలు జల్లెడ పడుతుండటంతో సరిహద్దు ప్రాంతం రణరంగంగా మారింది. ఏ క్షణంలో ఏం ప్రమాదం ముం చుకొస్తుందోనని ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల గిరిజనులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. దండకారణ్యలో మోహరించిన సీఆర్పీఎఫ్, స్పెషల్‌పార్టీ, కోబ్రా బలగాలు సరిహద్దుల్లో అనుమానితులుగా కనిపించే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ వారి నుంచి మావోయిస్టుల సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేసు ్తన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు సభలు ఎక్కడ పెడుతున్నారు.. ఎవరైనా వెళ్తున్నారా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. -
ఇన్ఫార్మర్ నెపంతో ఊచకోత
కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రాగాడ్ తాలూకాలోని తాడ్‌గావ్ పోలీస్‌స్టేషన్ దగ్గర్లో మావోయిస్టులు ముగ్గురిని హత్య చేశారు. బాంబ్రాగాడ్ తాలూకా కసన్సూర్ గ్రామానికి చెందిన ఆరుగురిని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో శుక్రవారం మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన వారిలో ముగ్గురిని సోమవారం అర్ధరాత్రి దారుణంగా చంపి నడిరోడ్డుపై పడేశారు. ఘటనాస్థలిలో ఎర్రరంగు బ్యానర్లతోపాటు మావోల పేరుతో లేఖలను వదిలేశారు. గత ఏడాది ఏప్రిల్ 22న బాంబ్రాగాడ్ తాలూకా పరిధి బోరియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తాము చంపేసిన ఆ ముగ్గురు ఇన్ఫార్మర్ల కారణంగానే గత ఏప్రిల్‌లో మావోల జాడ పోలీసులకు తెలిసిందని, మావోల మరణానికి ఈ ముగ్గురు ఇన్ఫార్మర్లే కారణమని బ్యానర్లు, లేఖలో మావోలు పేర్కొన్నారు. కిడ్నాప్‌కు గురైన మిగతా ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. హత్యల నేపథ్యంలో కసన్సూర్ గ్రామంలో భయానకవాతావరణం నెలకొంది. -
హత్యలకు భారీ కుట్ర!
సాక్షి, హైదరాబాద్: జనశక్తి.. మిలిటెంట్ మల్లన్న గ్యాంగ్ పేరుతో బెదిరింపులకు గురిచేసి డబ్బులు దండుకోవడం మాత్రమే ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ అరెస్టయిన జననేతల నాయకుల ద్వారా సంచలన విషయాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూరరాజన్న జనశక్తిలోని నెట్‌వర్క్‌ను మళ్లీ క్రియాశీలం చేయడంతో పార్టీలోని కీలక వ్యక్తులకు తుపాకులు చేరడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టర్లు, డాక్టర్లు, విద్యాసంస్థల యజమానులు, బీడీ కంపెనీల యజమానులు, ప్రభుత్వాధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం వరకే తుపాకులను వాడుతున్నారా.. లేదా మరేదైనా కుట్రకు స్కెచ్ వేశారా అన్న దానిపై సిద్దిపేట, జగిత్యాల పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ వ్యవహారంబెదిరింపుల వరకే కాకుండా పాత కక్షలు, జనశక్తిని విచ్ఛిన్నం చేసిన కుట్రదారులను అంతమొందించేందుకు కూడా ప్లాన్ వేసి ఉంటారా అన్న కోణంలో విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారం ఎటు వెళ్తుంది.. ఎంత వరకు తీసుకెళ్తుందా అన్న దానిపై కలవరం మొదలైంది. గన్స్ రావడం అంత సులభమా? ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలో పోలీస్ గస్తీ పెరిగింది. అడుగడుగునా నిఘా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోలీస్ శాఖకు సమాచారం లేకుండా అత్యాధునిక తుపాçకులు జనశక్తి ముఠాల చేతుల్లోకి వెళ్లడంపై ఉన్నతాధికారులు ఆందోళనలో పడ్డట్లు సమాచారం. మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో పోలీస్ శాఖ కొంత విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలోకి తుపాకులు తెప్పించుకుని ఏకంగా పలువురిని బెదిరిస్తుండటాన్ని చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనశక్తి టార్గెట్‌లో ఎవరు? జనశక్తి కూరరాజన్న అండ్ గ్యాంగ్ టార్గెట్‌లో కొంతమంది ఉన్నట్లు పోలీసులు విచారణలో బయటపడినట్లు తెలిసింది. ఈ టార్గెట్ లిస్టులో ఉన్న వాళ్లు ప్రముఖులా.. వీఐపీలా.. లేదా ప్రభుత్వాధికారులా అన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపుల కోసం కాకుండా హత్యలకే కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సాయికిరణ్ కొంత మంది ప్రముఖుల హత్యకు కుట్రపన్నినట్లు తెలిసింది. సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేసిన సంతోష్ అనే జనశక్తి నక్సలైట్ హిట్ లిస్టులో మాజీ మావోయిస్టులు ఉండటం సంచలనం రేపుతోంది. ఎక్కడి నుంచి ఎవరి ద్వారా? జనశక్తి నేత కూరరాజన్న, ఆనంద్‌లకు పిస్టల్స్, వందలాది బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంపై పోలీసులను ఆరా తీస్తున్నారు. మావోయిస్టుల నుంచి జనశక్తి కూరరాజన్నకు ఎలాంటి సహకారం ఉండదని ఎస్ఐబీ అధికారులు కరాఖండిగా చెబుతున్నారు. అలాంటప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులకు క్లారిటీ రావట్లేదు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్నుంచి రవాణా అయ్యాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. అయితే అక్కడి నుంచి ఏ కొరియర్ తెస్తున్నాడు? ఏ రూపంలో వీటిని రవాణా చేస్తున్నారు? ఎంతకు వీటిని విక్రయిస్తున్నారన్న అంశాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
కేంద్ర దర్యాప్తు సంస్థకు ఎమ్మెల్యే కిడారి హత్య కేసు
సాక్షి, అమరావతి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు బదిలీ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విశాఖ జిల్లా డుంబ్రిగుడ పోలీసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ ఈ ఏడాది నవంబర్ 30న ఎన్ఐఏను అదేశించింది. ఈనెల 6వ తేదీన కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) హైదరాబాద్ యూనిట్‌కు అప్పగించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టినట్టు అయ్యింది. -
సరిహద్దుల్లో హై టెన్షన్
చింతూరు (రంపచోడవరం): ఇటీవల దండకారణ్యంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి 8వ తేదీ వరకు జరుగనున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) వారోత్సవాలు ఘనంగా నిర్వహించడంతో పాటు భారీ సంఘటనలకు పాల్పడడం ద్వారా తమ ఉనికిని చాటుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నట్టు తెలిసింది. దీంతో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరిగిన అనంతరం దంతెవాడ జిల్లా ఆరన్‌పూర్, సుక్మా జిల్లా సక్లేర్ వద్ద జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇదే సమయంలో ఆ రాష్ట్ర పోలీసులు పలువురు మావోయిస్టులను అరెస్టు చేశారు. దీంతో సేఫ్‌జోన్ కోసం మావోయిస్టులు ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా సరిహద్దుల్లో మకాం వేసే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని సరిహద్దు పోలీస్స్టేషన్లను సందర్శించారు. సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా వుండాలని, నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకుని మావోయిస్టుల కదలికలను గుర్తించాలని ఆయన సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై సరిహద్దుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. మావోయిస్టుల అడ్డుకట్టకు సరిహద్దుల్లో మూడు రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు సమాచార వ్యవస్థను మెరుగు పరుచుకుని మావోయిస్టుల జాడ కనుగొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసేలా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా విలీన మండలాల్లో చర్ల, శబరి ఏరియా కమిటీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందున సరిహద్దు గ్రామాల్లో అదనపు బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు ప్రధాన రహదారుల వెంబడి వాహనాల తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలే టార్గెట్‌గా: కాగా సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలో ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మావోయిస్టులు ఆ ఎన్నికలను టార్గెట్ చేయవచ్చని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు ప్రచారం నిమిత్తం సరిహద్దు మండలాలకు వచ్చే నేతలను టార్గెట్ చేసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా వుంది. ఇప్పటికే మావోయిస్టులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ మంత్రితో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. మరోవైపు మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, ఈస్ట్ గోదావరి జిల్లాల కార్యదర్శి కొయెడ శాంబయ్య అలియాస్ ఆజాద్ భార్య సుజాతక్కను రెండ్రోజుల క్రితం పోలీసులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అరెస్టు చేసినట్టు ప్రకటించారు. దీనికి నిరసనగా ఆజాద్ ఎన్నికల వేళ దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ ప్రహార్–4 పేరుతో పోలీసులు వరుస ఎన్కౌంటర్లు జరుపుతున్నారు. దీంతో దండకారణ్యం పరిధిలోని మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. వరుస ఎన్కౌంటర్లతో ఓ వైపు పోలీసులు, తమ ఉనికిని చాటుకునేందుకు మరోవైపు మావోయిస్టులు వ్యూహాలు రచిస్తుండడంతో ఆదివాసీ పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి.