mass copying
-
గణితం ప్రశ్నలు బయటకు..
నిజాంసాగర్/కామారెడ్డి టౌన్: పదో తరగతి గణితం పేపర్లోని ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పైగా ఓ సెంటర్లో మాస్ కాపీయింగ్ కూడా జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష కేంద్రం నుంచి బుధవారం గణితం ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. వాటికి సంబంధించిన సమాధానాల చిటీలు కూడా సెంటర్లోని విద్యార్థులకు అందజేసి మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వచ్చిన నేపథ్యంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఈవో ఎస్ రాజు, తహసీల్దార్, పంచాయతీ అధికారి, ఎంఈవో, పోలీసులు విచారణ జరిపారు. వాస్తవమని తేలడంతో పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆపీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఈవో బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తమ పాఠశాలలో వంద శాతం ఫలితాలు సాధించేందుకు కొందరు ఉపాధ్యాయులు కలిసి ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు బయటకు పంపి మాస్ కాపీయింగ్‌కు పాల్పడేలా చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీకేజీలు చేయొద్దని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా, పలు కేంద్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏడుగురి అరెస్టు గణితం ప్రశ్నల లీకేజీ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ‘ఓ తండ్రి తన కుమారుడి కోసం ఎగ్జామ్ సెంటర్లో తాత్కాలికంగా వాటర్ సప్లయ్ చేసే ఓ వ్యక్తితో కొన్ని ప్రశ్నలు బయటకు తెప్పించాడు. బయట సంజయ్ అనే మరో వ్యక్తి ఈ ప్రశ్నలను సేకరించాడు. కొంతమంది మీడియా ప్రతినిధులు అతడి నుంచి ప్రశ్నలు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో జాదవ్ సంజయ్, షేక్ ముబీన్(వాటర్‌మ్యాన్), కాండే మనోజ్ (జీపీ కారోబార్), విద్యార్థులు ఇబాత్‌వార్ ఫిలిప్స్, ఇబాత్‌వార్ వరప్రసాద్, మీడియా ప్రతినిధులు మెహరీ హనుమండ్లు, కొప్పుల గంగాధర్‌లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశాం’అని ఎస్పీ తెలిపారు. -
విశాఖ ఓల్డ్ ఐటీఐ కాలేజీలో మాస్ కాపీయింగ్ కలకలం
-
పుస్తకాలు చూస్తూనే పరీక్ష!
న్యూఢిల్లీ: పరీక్ష గదిలో విద్యార్థుల దగ్గర చీటీలు కనిపిస్తే వీపు వాయగొట్టే ఉపాధ్యాయులనే మనం చూశాం. అయితే పుస్తకాలు, నోటు పుస్తకాలు చూసుకుంటూ ఎగ్జామ్ ఎంచకా రాసుకోండర్రా అని చెప్పే విధానం ఒకదానికి పైలట్ ప్రాజెక్ట్‌గా పరీక్షించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఈ వినూత్న ఆలోచన 2023 డిసెంబర్లోనే బోర్డ్ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో చర్చకొచి్చంది. నిరీ్ణత కాలావధిలో పాఠ్యపుస్తకాలను చూస్తూనే విద్యార్థి పరీక్షగదిలో ఎంత సృజనాత్మకంగా సమాధానాలు రాబట్టగలడు, సూటిగాలేని తికమక, క్లిష్ట ప్రశ్నలకు ఎలా జవాబులు రాయగలడు, విద్యార్థి ఆలోచనా విధానం, విశ్లేషణ సామర్థ్యం వంటి వాటిని మదింపు చేసే ఉద్దేశంతో ఈ ‘ఓపెన్–బుక్ ఎగ్జామ్’ పైలట్ ప్రాజెక్టుకు సీబీఎస్ఈ పచ్చజెండా ఊపింది. అయితే ఈ పరీక్ష విధానాన్ని 10, 12 తరగతి బోర్డ్ పరీక్షలో అమలుచేసే ఆలోచన అస్సలు లేదని సీబీఎస్ఈ అధికారులు స్పష్టంచేశారు. కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, సామాన్య శా్రస్తాల్లో, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, జీవశా్రస్తాల్లో ఈ ఓపెన్–బుక్ ఎగ్జామ్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. స్టడీ మెటీరియల్‌ను రిఫర్ చేస్తూనే ఇలాంటి ఎగ్జామ్ పూర్తిచేయడానికి విద్యార్థి ఎంత సమయం తీసుకుంటాడు? అనే దానితోపాటు విద్యార్థులు, టీచర్లు, సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలనూ సీబీఎస్ఈ పరిగణనలోకి తీసుకోనుంది. ఫార్మాటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)ల కోణంలో ఈ తరహా పరీక్ష అమలు తీరుతెన్నులపై సీబీఎస్ఈ ఓ నిర్ణయానికి రానుంది. -
ఇన్విజిలేటర్ కొట్టాడని విద్యార్థి బలవన్మరణం
నర్సంపేట రూరల్: పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేస్తుండగా ఇన్విజిలేటర్ మందలించి, చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన భూక్యా ఈర్య– పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు భూక్య సాయికుమార్ (23) నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బ్యాక్‌లాగ్‌లు ఉండడంతో అదే పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల సెంటర్లో సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. గురువారం పరీక్షలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో గమనించిన ఇన్విజిలేటర్.. సాయికుమార్‌ను మందలించి కొట్టాడు. దీంతో మనోవేదనకు గురై, రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయికుమార్ మృతికి ఇన్విజిలేటర్, యాజమాన్యం కారణమంటూ కుటుంబ సభ్యులు.. మృతదేహంతో కాలేజీ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం ధర్నా చేపట్టారు. ఉద్రిక్తత నెలకొనడంతో కళాశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులతో మాట్లాడిన నర్సంపేట సీఐ పులి రమేష్çగౌడ్... మృతదేహాన్ని గ్రామానికి పంపించారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ రామ్‌రాజ్‌ను వివరణ కోరగా... సాయి కుమార్ అనే విద్యార్థి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌తోపాటు బుక్‌లెట్‌ను దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని, గుర్తించిన ఇన్విజిలేటర్ మందలించి, తమ వద్దకు తీసుకొచ్చారని తెలిపారు. విద్యార్థి రిక్వెస్ట్‌తో పరీక్ష రాసేందుకు అనుమతించామే తప్ప.. ఎవరూ కొట్టలేదన్నారు. -
పేపర్లు పంపినందుకు రూ.16 లక్షలు!
సాక్షి, హైదరాబాద్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన మాజీ ఏఈ పూల రమేశ్‌కు సహకరించిన ప్రైవేట్ కళాశాల చైర్మన్ సయ్యద్ మహబూబ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు చిక్కాడు. సయ్యద్ వాట్సాప్ ద్వారా అసి స్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ప్రశ్న పత్రాలను రమేశ్‌కు ‘పంపినందుకు’రూ.16 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. రమేశ్ అరెస్టు తర్వాత పరా రీలో ఉన్న సయ్యద్ మహబూబ్‌ను బుధ వారం పట్టుకున్న అధికారులు.. అతడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యాధునిక బ్లూటూత్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించి రమేశ్ ఏడుగురితో ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాయించాడు. టోలిచౌకిలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీకి మహబూబ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 22, ఫిబ్రవరి 23న జరిగిన ఈ రెండు పరీక్షలకు సంబంధించిన సెంటర్ ఈ కాలేజీలోనే పడింది. ఈ నేపథ్యంలో రమేశ్‌తో రూ.16 లక్షలకు ఒప్పందం చేసుకున్న మహబూబ్.. పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల్లోనే ప్రశ్నపత్రాలను తన సెల్ఫోన్లో ఫొటో తీసి, రమేశ్‌కు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. ఆయా పరీక్షలకు గైర్హాజరైన వారి పేపర్లను దీనికి వినియోగించాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలను చాట్ జీపీటీ ద్వారా వెతికి, ఏడుగురు అభ్యర్థులకు అత్యాధునిక పరికరాల ద్వారా అందించే టీమ్‌కు రమేశ్ మలక్‌పేటలోని మహ్మద్ ఖాలేద్ ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేశాడు. దీని కోసం ఖాలేద్‌కు రూ.80 వేలు చెల్లించాడు. ఈ రెండు రోజులూ ఈ బృందం అక్కడ నుంచే జవాబులను అభ్యర్థులకు పంపింది. గత నెలలో రమేశ్ అరెస్టు అయిన నాటి నుంచి మహబూబ్‌తోపాటు ఖాలేద్, అభ్యర్థులు, వారికి సహకరించిన వారు పరారీలో ఉన్నారు. ఇప్పటివరకు సిట్ అధికారులు ముగ్గురు అభ్యర్థులతో పాటు ఈ నెల 9న ఖాలేద్‌ను, బుధవారం మహబూబ్‌ను పట్టుకున్నారు. మరో 35 మంది అభ్యర్థుల కోసం సిట్ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ హైటెక్ మాస్ కాపీయింగ్, ఏఈ పేపర్ లీకేజ్ ద్వారా రమేశ్ రూ.10 కోట్లు ఆర్జించాలని భావించినట్లు తెలుస్తోంది. హైటెక్ కాపీయింగ్ ద్వారా లబ్ధిపొందిన ఒక్కో అభ్యర్థి రూ.40 లక్షలు, ఏఈ పేపర్ లీక్ ద్వారా లబ్ధిపొందిన ఒక్కొక్కరు రూ.20 లక్షలు చెల్లించేలా రమేశ్ ఒప్పందాలు చేసుకున్నాడని సమాచారం. అయితే ఇతడికి ఇప్పటివరకు రూ.1.1 కోటి మాత్రమే ముట్టినట్లు తేలింది. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ‘వాట్సాప్ కాపీయింగ్’
సాక్షి, హైదరాబాద్: మొన్న టీఎస్పీఎస్సీ.. నిన్న పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్‌ల కలకలం పూర్తిగా మరువక ముందే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌లో మైనర్ విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. ఆదివారం జరిగిన ఈ పరీక్షలో ఒక మైనర్ విద్యార్థి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడగా, అతని సహకారంతో నలుగురు వాట్సాప్ ద్వారా మాస్ కాపీయింగ్ చేస్తూ దొరికిపోయారు. మొత్తం ఐదు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా వీరిపై హైదరాబాద్, రాచకొండల్లోని నాలుగు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ సంస్థ వ్యవహారాన్నీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పరీక్ష హాళ్లలోకి స్మార్ట్ఫోన్లు రావడంలో ఎవరి వైఫల్యం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సోదరుడు, స్నేహితుల కోసం.. కడపకు చెందిన టీచర్ కుమారుడైన ఓ విద్యార్థికి పదో తరగతి పరీక్షల్లో 600కు 600 మార్కులు, ఇంటర్మీడియట్లో 1000కి 940 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లోనూ 94 శాతం మార్కులు సాధించాడు. హైటె క్ సిటీ సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న ఇతడికి ఒక సోదరుడితో పాటు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఈ ఐదుగురూ ఆదివారం జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాశారు. కడప విద్యార్థికి సికింద్రాబాద్ ప్యాట్నీ సమీపంలో ఉన్న ఎస్వీఐటీ కాలేజీలో పరీక్షా కేంద్రం ఉండగా, అతని సోదరుడికి మౌలాలిలో, ఇద్దరు స్నేహితులకు (వీరిద్దరూ సోదరులు) మల్లాపూర్‌లో, మరొకరికి ఎల్బీనగర్లోని కళాశాలల్లో సెంటర్లు పడ్డాయి. అయితే తన సోదరుడితో పాటు స్నేహితులకు కూడా మంచి మార్కులు రప్పించాలని భావించిన కడప విద్యార్థి ఐదుగురితో ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాడు. కళాశాలల్లో తనిఖీ చేసే సిబ్బంది కళ్లుగప్పిన ఈ ఐదుగురూ పరీక్ష కేంద్రాల్లోకి తమ స్మార్ట్ఫోన్లు తీసుకువెళ్లారు. కంప్యూటర్ స్క్రీన్ ఫొటోలు తీసి.. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షను అభ్యర్థులు ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్లో ఒక ప్రశ్న తర్వాత మరో ప్రశ్న ప్రత్యక్షమవుతూ ఉంటే.. విద్యార్థులు జవాబులు టిక్ చేస్తూ పోతుంటారు. కడప విద్యార్థి కంప్యూటర్ స్క్రీన్‌పై తాను టిక్ చేసిన ప్రతి జవాబును ప్రశ్నతో సహా కనిపించేలా స్మార్ట్‌ఫోన్‌లో ఫొటోలు తీసి, వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయడం ద్వారా మిగిలిన నలుగురికీ చేరేలా చేశాడు. ఎస్వీఐటీ కాలేజీలో పరీక్ష హాలు పెద్దదిగా ఉండటం, ఇన్విజిలేటర్ విధుల్లో ఉన్న సిబ్బంది ఒకేచోట కూర్చుండిపోవడంతో దాదాపు గంటన్నర పాటు ఈ తతంగాన్ని ఎవరూ గుర్తించలేదు. 10.30 గంటల సమయంలో మల్లాపూర్ కేంద్రంలో ఇన్విజిలేటర్ అక్కడి విద్యార్థి వద్ద స్మార్ట్‌ఫోన్ ఉండటాన్ని గమనించారు. అందులో ఉన్న వాట్సాప్ గ్రూపులో కంప్యూటర్ స్క్రీన్ ఫొటోలను చూసిన ఆయన సదరు విద్యార్థిని ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్వీఐటీ కాలేజీ పరీక్ష కేంద్రంలోని కడప విద్యార్థి నుంచి ఈ ఫొటోలు వస్తున్నట్లు తెలుసుకుని ఆ సెంటర్ అధికారికి సమాచారం ఇచ్చారు. ఆయన పరీక్ష కేంద్రంలోకి వెళ్లి కడప విద్యార్థిని తనిఖీ చేయగా అతడి వద్ద స్మార్ట్‌ఫోన్ లభించింది. ఇదే క్రమంలో మౌలాలి, ఎల్బీనగర్‌ల్లోని పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న మరో ముగ్గురినీ పట్టుకున్నారు. వాట్సాప్ ద్వారా హైటెక్ మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్‌కు పాల్పడిన ఈ ఐదుగురూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ తరఫున జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐఓఎన్ సంస్థకు క్షమాపణ పత్రాలు రాసి ఇచ్చారు. సంస్థ సిబ్బంది ఆదివారం రాత్రి మార్కెట్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్, నాచారం పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం? విద్యార్థులపై పోలీసులు ఐపీసీలోని 188 (ప్రభుత్వం నిషేధించిన వస్తువులు పరీక్ష హాలులోకి తీసుకుపోవడం), 420 (మోసం)తో పాటు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్) యాక్ట్‌లోని 4 (బీ), 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐదుగురి ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు. ఈ పరీక్ష నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే సరైన తనిఖీలు లేక స్మార్ట్ ఫోన్లు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాయని అధికారులు చెప్తున్నారు. నాలుగు పరీక్ష కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న తనిఖీ సిబ్బంది, ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లకూ నోటీసులు ఇచ్చి విచారించడంతో పాటు వాంగ్మూలం నమోదు చేయాలని భావిస్తున్నారు. -
అంతా ‘ఓపెన్’.. ఈ పరీక్షలో మీకు నచ్చినంత కాపీ కొట్టండి..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పాస్ కావాలంటే పైసలు ఇవ్వాల్సిందే అన్నట్లుగా ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ సాగుతోంది. జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షలు గతనెల 25 నుంచి మొదలయ్యాయి. ఈనెల 4తో ముగియనున్నాయి. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న వారు 686 మంది ఉండగా, ఇంటర్ పరీక్షలు 1,253 మంది రాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్ష కేంద్రాలు మూడు, ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఏడు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో కాపీంగ్ జరుగుతోంది. అందరూ బడిమానేసిన వారే.. పదో తరగతి, ఇంటర్ చదవకుండానే మధ్యలోనే బడి, కాలేజీ మానేసిన విద్యార్థులకు ఓపెన్ విధానంలో పరీక్షలు రాసి, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంది. పలు కారణాలతో రెగ్యూలర్ చదువుకు దూరం అయిన వారు, ఉద్యోగార్థులు, గృహిణులు, వేర్వేరు వృత్తుల్లో ఉన్నవారు కూడా మళ్లీ చదువుకుని, విద్య సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంది. సర్టిఫికెట్ల కోసం.. విద్య, ఉద్యోగ, వ్యాపార, రుణాలు, విదేశీయా నం, లైసెన్సులు తదితర అవసరాల కోసం పదో తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా మారాయి. దీంతో చాలా మంది ఓపెన్ విధానంలో పరీక్షలకు హాజరువుతూ తమ విద్యార్హతను పెంచుకుంటున్నారు. ఏటా టాస్ ఆధ్వర్యంలో స్టడీ సెంటర్లలో అకాడమిక్ ప్రకారం సిలబస్ పూర్తి చేయడంతో పాటు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తుంటారు. బడిమానేసి, మళ్లీ చదువుకునే వారిలో చాలా మంది వయసు పైబడిన వారితోపాటు, యువత కూడా ఉన్నారు. దీంతో వారంతా ఓపెన్ పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాలనే ఆకాంక్షతో ఉంటున్నారు. ఇప్పటికే ఓపెన్ విధాన పరీక్షల్లో ఇన్విజిలేటర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తారనే విమర్శలు ఉన్నాయి. నిర్వాహకుల వసూళ్లు.. పాస్ కావాలనే ఉద్దేశంతో కొందరు ఓపెన్ విద్యార్థులు పైసలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు. ఆయా సెంటర్ల ఇన్విజిలేటర్లు, సెంటర్ సూపరింటెండెంట్లతో ముందే మాట్లాడుకుంటున్నారు. కొందరు టీచర్లు, విద్యార్థుల బలహీనతను ఆసరా చేసుకుని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు తీసుకుంటున్నారు. పరీక్షకు ముందే తమకు తెలిసిన ఒకరిని నియమించుకుని వారితో పైసలు వసూలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ సెంటర్లో సీనియర్ టీచర్ వారం రోజులుగా పరీక్ష రాస్తున్న వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎగ్జామ్స్‌కు హాజరవుతున్నవారే చెబుతున్నారు. ఇక బెల్లంపల్లి పట్టణంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతున్న ఓపెన్ సెంటర్లలో కూడా వసూళ్లు అందరికీ తెలిసే జరుగుతున్నాయి. పరీక్ష జరుగుతున్నప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా ఉన్నతాధికారులు కేంద్రానికి వచ్చినప్పుడు ముందే అలర్ట్ చేయడం, నోట్ బుక్‌లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వడం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకరికి బదులు మరొకరిని కూడా పరీక్షలకు అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఓపెన్ పరీక్ష కేంద్రాల్లో వసూళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఇదేందయ్యా ఇది: డీఎడ్ పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్
ఆదిలాబాద్‌టౌన్: డీఎడ్ చదివే వారంతా భావితర ఉపాధ్యాయులే.ఇక్కడ నేర్చుకుంటేనే గురువులయ్యాక విద్యార్థులను తీర్చిదిద్దేది. అయితే కష్టపడి చదవి పరీక్షలు రాయాల్సిన ఛాత్రోపాధ్యాయులు కా పీయింగ్‌కు అలవాటు పడ్డారు. ఇటీవల ఓ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడడమే కాకుండా ఇన్విజిలేటర్ నే బెదిరించిన ఘటన చోటు చేసుకున్నా పరీక్షల ని ర్వహణ తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. పరీక్షలు రాసిన విద్యార్థులే కాపీయింగ్ విషయంపై బయట చర్చించుకోవడం నిర్వహణ తీరుకు అద్దం పడుతుంది. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలతో పాటు ప్రైవేట్ బీఎడ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. పట్టణంలోని గెజిటెడ్ నం.1లో ఈనెల 22 నుంచి డీఎడ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారంతో ముగియనున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి్సన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో కష్టపడి చదివిన విద్యారులు, కాపీ కొట్టే వారు ఒకే చోటికి చేరే పరిస్థితి. ఇన్విజిలేటర్లే సూత్రధారులు.. ఈ మాస్ కాపీయింగ్‌కు కొంతమంది ఇన్విజిలేటర్లే సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డైట్ కళాశాల, డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వారికి ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే కళాశాలలో చదివిన విద్యార్థులకు అక్కడివారే ఇన్విజిలేటర్లుగా ఉండడంతో ఈ తతంగం జోరుగా సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సెంటర్‌కు అధికారులు వస్తే ముందుగానే విద్యార్థులకు సమాచారం అందిస్తున్నారు. డోర్ దగ్గర నిలబడి విద్యార్థులు తమ పని తాము కానిచ్చుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. చీటీలు రాసిన తర్వాత వాటిని ఇన్విజిలెటర్ల దగ్గర ఉంచుకోవడం కొసమెరుపు. పట్టించుకోని అధికారులు.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సిన విద్యాశాఖాధికారులు పట్టనట్లుగా ఉండడంతో పరీక్షల తీరు మారిపోయిందనే విమర్శలున్నాయి. కొంతమంది ఇన్విజిలేటర్లు కొందరిని చూసిరాయనివ్వడం, మరికొంత మందిని కాపీయింగ్ జరగకుండా చూడడంతో ఇటీవల ఓ విద్యార్థి పరీక్ష నిర్వాహకులతో వాగ్వాదానికి దిగిన విషయం విదితమే. అయితే సదరు విద్యార్థి అధికారులను వారిని ఎందుకు చూసి రాయనిస్తున్నారు.. మమ్మల్ని ఎందుకు రాయనివ్వడం లేదని ప్రశ్నించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం బయటపడకుండా ఇన్విజిలేటర్లు, అధికారులు పరీక్షలను చూసీచూడనట్లుగా వదిలేసినట్లుగా సమాచారం. ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. -
HYD: టోఫెల్లో మాస్ కాపీయింగ్‌పై దర్యాప్తు!
సాక్షి, హైదరాబాద్: టోఫెల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారం పోలీసుల చెంతకు చేరింది. ఆధారాలతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అందింది. రూ. 25 వేలు ఇస్తే టోఫెల్లో టాప్ స్కోర్ ఇస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. అంతర్జాతీయ విద్యాసంస్థల్లో సీటు పొందెందుకు రాసే టోఫెల్లో మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నట్లు తేలింది. ఒక్కో విద్యార్థి నుండి రూ. 25 వేలు లంచం తీసుకుని.. పరీక్ష గదిలోనే వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ లీక్ చేస్తోంది ముఠా. హైదరాబాద్ సైబర్ క్రైం పీఎస్ లో ఈటీఎస్( ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఇండియా ) ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
వారెవ్వా... ఏమి విగ్గు! వామ్మో ఏం తెలివిరా బాబోయ్.. వైరల్ వీడియో
ఏం బుర్రరా నీది..! అని అసాధారణ ప్రతిభాపాటవాలు, అమోఘ నైపుణ్యం కనబరుస్తున్న వారిని ప్రశంసిస్తుంటాం. ఇదిగో ఈ ఫొటోలో కనపడుతున్న వ్యక్తి తెలివితేటలను చూసి.. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. నెటిజన్లు కూడా.. విస్తుపోయారు. కాకపోతే చదువుల్లో ఇతనికున్న ప్రతిభను చూసి కాదు... వక్రమార్గంలో సబ్ఇన్స్పెక్టర్ పరీక్షను గట్టెక్కడానికి సదరు మహాశయుడు ఎంచుకున్న హైటెక్ కాపీయింగ్ పద్ధతిని చూసి. ఇంతకీ ఏం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల సబ్–ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి పోటీ పరీక్షలు జరిగాయి. ప్రభుత్వోద్యోగం... అందులోనా క్రేజీ జాబ్. మనోడు బాగా ఆలోచించి... కాపీయింగ్ ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ బ్లూ టూత్ రిసీవర్‌ను విగ్గులో అమర్చి ఏమాత్రం అనుమానం రాకుండా క్రాపు బాగా తగ్గించుకొని తన తలపై ఈ విగ్గును జాగ్రత్తగా అతికించుకున్నాడు. అత్యంత సూక్ష్మమైన... బయటికి కనిపించని రెండు ఇయర్ఫోన్లను చెవుల్లోకి జొప్పించాడు. కంటికి కనిపించంనంత సూక్ష్మమైన తీగలతో ఈ బ్లూ టూత్ నుంచి ఇయర్ఫోన్లను కనెక్ట్ చేశాడు. దిలాసాగా నడుచుకుంటూ పరీక్ష కేంద్రంలోకి వెళ్లబోతుండగా... అందరినీ చెక్ చేసినట్లే పోలీసులు మనోడిని కూడా మెటల్ డిటెక్టర్‌తో పరీక్షించారు. తల దగ్గరికి రాగానే బీప్.. బీప్.. అని శబ్దం వస్తోంది. నిశితంగా పరిశీలించిన పోలీసులు విగ్గు గుట్టును రట్టుచేశారు. విగ్గును తొలగించడం, లోపలున్న బ్లూటూత్ పరికరం, చెవుల్లోని సూక్ష్మమైన ఇయర్ఫోన్లను అతికష్టం మీద పోలీసులు వెలికితీయడం చూసి... వామ్మో ఏం తెలివిరా బాబోయ్... అంటూ నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పంచుకోగా... వైరల్‌గా మారింది. గూఢచారి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని కొందరు సరదాగా అతనికి సూచించారు. #UttarPradesh mein Sub-Inspector की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़ ☺️☺️😊😊😊@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry — Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021 -
చెప్పుల్లో బ్లూటూత్ పెట్టుకుని పరీక్షలు.. ధర రూ.6 లక్షలు!
జైపూర్: రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో హైటెక్ కాపీయింగ్ బట్టబయలైన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక ఓ పెద్ద కథే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే అజ్మీర్‌లోని కిషన్గఢ్లో ఒక అభ్యర్థి బ్లూటూత్ పరికరాన్ని తన చెప్పులలో దాచి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి పట్టుబడగా, ఇటువంటి ఘటనలే రాజస్తాన్ వ్యాప్తంగా ఆదివారం వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో సహా కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ బ్లూటూత్-అమర్చిన చెప్పులు కొనుగోలుకు రూ. 6 లక్షల వరకు చెల్లించినట్లు నిందితులు తెలిపారు. భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ హైటెక్ మాస్ కాపీ తెర వెనుక ఎవరెవరూ ఉన్నారో తెలుసుకోవడానికి పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన తర్వాత పరీక్షా కేంద్రాల నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న చెప్పులను తొలగించాలని అజ్మీర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ప్రేమించిన యువతి చెల్లి అవుతుందని తెలిసి.. -
టీచర్ల ఎంపిక పరీక్షలో హైటెక్ కాపీయింగ్.. ఏకంగా చెప్పులో..
జైపూర్: రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో హైటెక్ కాపీయింగ్ బట్టబయలయ్యింది. ‘బ్లూటూత్ చెప్పుల’ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాజస్తాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్((రీట్)ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. తొలుత అజ్మీర్‌లోని ఓ కేంద్రంలో పరీక్ష రాసేటప్పుడు అనుమానాస్పదంగా వ్యవహరించిన ఓ అభ్యర్థిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడు ధరించిన చెప్పు లోపల కనిపించకుండా సెల్‌ఫోన్‌ను అమర్చినట్లు గుర్తించారు. అలాగే చెవిలో బయటకు కనిపించని బ్లూటూత్‌తో కూడిన సూక్ష్మమైన రిసీవర్ ఉంది. పరీక్ష కేంద్రం బయట ఉన్న వ్యక్తులు అతడికి సమాధానాలు చేరవేస్తున్నట్లు కనిపెట్టారు. వాటిని సదరు అభ్యర్థి చెప్పులోని సెల్‌కు అనుసంధానించిన బ్లూటూత్ రిసీవర్ ద్వారా వింటున్నట్లు తేల్చారు. దీంతో అధికారులు అన్ని ఎగ్జామ్ సెంటర్లను అప్రమత్తం చేశారు. బికనెర్, సికార్ పట్టణాల్లోనూ ఇలాంటి బాగోతాలే బయటపడ్డాయి. మూడు పట్టణాల్లో మొత్తం ఐదుగురు చీటర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ చీటింగ్ చెప్పులను చాలా తెలివిగా తయారు చేశారని, ఇది కుటీర పరిశ్రమను తలపిస్తోందని వెల్లడించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ‘రీట్’ తదుపరి దశ పరీక్షకు అభ్యర్థులెవరూ స్లిప్పర్స్, బూట్లు, సాక్సులు ధరించి రావొద్దని అధికారులు ఆదేశించారు. ఆదివారం రీట్ సందర్భంగా అనేక ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను 12 గంటలపాటు ఆపారు. రాష్ట్రంలో 31 వేల టీచర్ పోస్టులకు 16 లక్షల మంది పోటీ పడుతున్నారు. (చదవండి: యూపీ బరిలో ఒవైసీ అలజడి) -
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో హైటెక్ తరహాలో మాస్ కాపీయింగ్
-
సరూర్ నగర్ లో హైటెక్ తరహాలో మాస్ కాపీయింగ్
-
కేఎంసీలో హైటెక్ కాపీయింగ్.. లెక్క తేలాలి!
సాక్షి, వరంగల్ : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)లో మెడికల్ పీజీ పరీక్షల సందర్భంగా హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల విద్యార్థులకు కేఎంసీలో నిర్వహిస్తున్న సప్లమెంటరీ పీజీ పరీక్షలు రెండ్రోజుల క్రితం ముగిశాయి. కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థి ఒకరు హైటెక్ విధానంలో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. కాపీ ఇలా.. కేఎంసీలో 15 రోజులు పరీక్షలు జరగ్గా చివరి రోజే వైద్య విద్యార్థి పట్టుబడటం అనుమానాలకు తావిస్తోంది. ఈ విద్యార్థి ఓ కారు తీసుకొచ్చి పరీక్ష గది వెనుక ఉంచారు. కారు డ్రైవర్‌గా సాంకేతిక పరిజ్ఞానమున్న వ్యక్తిని ఉంచి దానికి యాంటీనా బిగించారు. విద్యార్థి మోకాళ్లలో రిసీవర్ ఉంచుకుని వైర్లెస్ ఫోన్ ద్వారా జవాబులు రాసినట్లు సమాచారం. చివరి రోజు అనుమానాస్పదంగా ఉన్న కారును గుర్తించిన పరిపాలనాధికారులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎందరున్నారో తేలాలి.. కేఎంసీలో జరిగిన మాస్ కాపీయింగ్ వెనుక కొందరు ఉద్యోగుల హస్తమున్నట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహణకు ప్రశ్నపత్రాన్ని ఓ ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగి డౌన్లోడ్ చేసి తనను ఆశ్రయించిన కొందరు వైద్య విద్యార్థులకు చేరవేసినట్లు సమాచారం. తద్వారా ఆ ప్రశ్నల జవాబు ను విద్యార్థి మైక్ రిసీవర్, వైర్‌లైస్ ఫోన్ ద్వారా తెలుసుకుని కాపీయింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సహకరించి నందుకు విద్యార్థులు కొందరు ఉద్యోగు లకు రూ.లక్షల్లో చెల్లించినట్లు సమాచారం. రెగ్యులర్ ఉద్యోగులను కాకుండా ఔట్‌సోరి్సంగ్ వారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, కేఎంసీలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తే కాపీయింగ్‌లో ఇంకా ఎందరున్నారనేది తెలుస్తుందని చెబుతున్నారు. యూనివర్సిటీకి వివరాలిచ్చాం.. ఇటీవల నిర్వహించిన మెడికల్ పీజీ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని గుర్తించాం. చాలా తెలివిగా కరోనా నిబంధనలను సాకుగా చేసుకుని హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. మోకాళ్ల వద్ద వైర్లెస్ రిసీవర్ ఉంచుకుని జవాబులు తెలుసుకున్నాడు. ప్రతిమ కళాశాలకు చెందిన ఆ విద్యార్థి వివరాలను కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి అప్పగించాం. తదుపరి చర్యలు యూనివర్సిటీ అధికారులు తీసుకుంటారు. – డాక్టర్ సంధ్య, కేఎంసీ ప్రిన్సిపాల్ 9 నుంచి వ్యవసాయ డిగ్రీ కోర్సుల కౌన్సెలింగ్ రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని బైపీసీ స్ట్రీమ్ (హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ)లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఈనెల 9వ తేదీ నుంచి సంయుక్తం గా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు. బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్ 432 సీట్లు, బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ 130 సీట్లకు, బీవీఎస్సీ, ఏహెచ్ 158 సీట్లకు, బీఎఫ్ఎస్సీ 36 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వివరించారు. అడ్మిషన్ పొందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పిం చి నిర్ణీత ఫీజును వెంటనే చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.pjtrau. edu.in లో లాగిన్ కావాలని తెలిపారు. బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (హానర్స్)హార్టికల్చర్ పేమెంట్ కోటా సీట్ల కోసం విడిగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తెలుగు వర్సిటీ పరీక్షలు యథాతథం నాంపల్లి (హైదరాబాద్): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నిర్వహించే వార్షిక పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని, ఈ నెల 8న జరిగే భారత్ బంద్‌కు పరీక్షలకు ఎలాంటి సంబంధం ఉండదని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు తెలుగు వర్సిటీ అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతాయన్నారు. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతో పాటుగా బ్యాక్లాగ్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. భారత్ బంద్ జరిగే మంగళవారం కూడా పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా.. సాక్షి, హైదరాబాద్: భారత్ బంద్ నేపథ్యంలో మంగళవారం నిర్వహించే పలు పరీక్షలను వర్సిటీలు వాయిదా వేశాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం నాటి పరీక్షలన్నింటినీ వాయిదా వేసినట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొ. మంజూర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను 10న నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 8 నాటి పాలిటెక్నిక్ డిప్లమా సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఎస్బీటీఈటీ కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 23న నిర్వహిస్తామన్నారు. సీపీజీఈటీ పరీక్షను వాయిదా వేసినట్లు ఉస్మానియా వర్సిటీ వెల్లడించింది. తమ పరిధిలో ఈ నెల 8న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశామని, 9 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా ఉంటాయంది. అలాగే, భారత్ బంద్ నేపథ్యంలో కాళోజి హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. వాయిదా పడిన బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ సెకండియర్ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఈ నెల 9న జరిగే పరీక్షలన్నీ యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. 18న పీజీ..19న డిగ్రీ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 18 నుంచి వివిధ పీజీ కోర్సుల (రెగ్యులర్) రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 19 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల ఇయర్ వైజ్ పరీక్షలు జరగనున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ. శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఓయూ ప్రీ–పీహెచ్డీ పరీక్షలు ఈ నెల 28, 30 తేదీలలో నిర్వహిస్తామన్నారు. పీహెచ్డీ విద్యార్థులు జంటనగరాలతో పాటు ఆయా జిల్లాల్లో పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూడాలని సూచించారు. -
‘అనంత’లో చూచిరాత బాగోతం..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘మీకు డిగ్రీ సర్టిఫికెట్ కావాలా! అయితే, మా సెంటర్లో చేరండి.. కచ్చితంగా పాస్’’ తరహా ప్రకటనలతో దూరవిద్య కేంద్రాలు డబ్బు పోగేసుకుంటున్నాయి. జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ దూర విద్య పరీక్షలు అక్టోబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. సుమారు 3వేల మంది విద్యార్థుల వరకూ పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే, పరీక్షల్లో పాస్ చేస్తామని ముందుగానే అడ్మిషన్లు తీసుకున్న సెంటర్లు .. పరీక్షల సమయంలో పుస్తకాలు పెట్టి మరీ పరీక్షలు రాపిస్తామంటూ అదనంగా ఒక్కో విద్యార్థి నుంచి సగటున రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ వసూలు చేశారు. ఈ విధంగా వసూలు చేసి.. ఇందులో యూనివర్సిటీ అధికారులకు కూడా మామూళ్లు ఇచ్చి ఇష్టారాజ్యంగా పరీక్షలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏఎన్‌యూకు అనుబంధంగా అనంతపురంతో పాటు తాడిపత్రి, ధర్మవరం, పామిడిల్లో కేంద్రాలుండగా..ఆయా చోట్ల పరీక్షలు జరుగుతున్నాయి. ముందుగానే ఆయా సెంటర్లలో ఎవరు కూడా నేరుగా రాకుండా గేట్లు వేసి మరీ పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వస్తున్నట్టు తెలిస్తే లోపల ఉన్న వారిని అలర్ట్ చేస్తున్నారు. తద్వారా ఆ సమయంలో కాపీయింగ్ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ తర్వాత యథావిధిగా తమ పని కానిస్తున్నారు. మొత్తంగా దూరవిద్య పేరుతో కొన్ని సెంటర్లు డబ్బుల దందాకు తెరలేపి చదువుకు మరీ విలువ లేకుండా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.60 లక్షలకు పైమాటే.. జిల్లాలో మొత్తం 3వేల మంది వరకూ ఏఎన్‌యూ దూర విద్యకు హాజరువుతున్నారు. వీరికి కనీసం పుస్తకాలు కూడా సకాలంలో అందించలేదు. దీంతో పరీక్షకు ఎవ్వరూ సిద్ధమయ్యే పరిస్థితి లేదు. తీరా పరీక్షలు వచ్చిన తర్వాత ఇప్పుడు పరీక్షల్లో పాసు కావాలన్నా.. చూసి రాయలన్నా ఒక్కో విద్యార్థి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ ఇవ్వాలని సదరు దూరవిద్య కేంద్రాల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. ఫలితంగా జిల్లాలో పరీక్షలు రాస్తున్న 3వేల మంది విద్యార్థులు కాస్తా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వారు చూచి రాసేందుకు అనుమతించడం లేదు. అంతేకాకుండా ప్రత్యేకంగా పక్కన కూర్చోబెట్టి చూసిరాసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 3 వేల మంది విద్యార్థుల నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున లెక్కిస్తే రూ.60 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ వసూలు చేసినట్టు సమాచారం. ఇందులో యూనివర్సిటీ దూరవిద్య అధికారులకు కూడా భారీగానే ముట్టచెబుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ పరిశీలకులు ఎక్కడ?.. వాస్తవానికి దూరవిద్య పరీక్షలు జరిగే సమయంలో సదరు యూనివర్సిటీకి చెందిన సిబ్బంది పరిశీలకులుగా వస్తారు. పరీక్షలు జరిగే సమయంలో అక్కడే మకాం వేసి కట్టుదిట్టంగా పరీక్షలు జరిగేలా చూడాలి. అయితే, ఏఎన్‌యూ దూర విద్యలో మాత్రం ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. యూనివర్సిటీ నుంచి వచ్చిన పరిశీలకులు ఎక్కడా కనిపించని పరిస్థితి. కనీసం సెంటర్ల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. -
డబ్బులిస్తే.. ‘రాసి’పెడతారు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని టోలిచౌకి సూర్యనగర్ కాలనీలో ఉన్న న్యూ మదీన జూనియర్ కాలేజీ (సెంటర్ కోడ్– 60237) కేంద్రంగా గుట్టుగా సాగుతోన్న మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం కాలేజీపై దాడిచేసిన ప్రత్యేక బృందం.. కాలేజీ ప్రిన్సిపాల్, ముగ్గురు పరిపాలన విభాగం సిబ్బంది, ఆరుగురు విద్యార్థుల్ని పట్టుకుంది. ఇదీ జరుగుతున్న తంతు.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు బోర్డు నుంచి అనుమతి పొందిన కాలేజీల్లో న్యూ మదీన జూనియర్ కాలేజీ ఒకటి. ఇక్కడ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో కొందరికి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ షోయబ్ తన్వీర్ కచ్చితంగా పాస్ చేయిస్తానంటూ ఎర వేశాడు. ఒక్కో సబ్జెక్టుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఆయా పరీక్షల ప్రశ్నపత్రాలు స్థానిక పోలీసుస్టేషన్లలో ఉంటాయి. ఓఎంఆర్ షీట్‌తో కూడిన ఆన్సర్ షీట్స్ మాత్రం పరీక్ష కేంద్రానికే చేరతాయి. అక్కడ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంటర్మీడియట్ బోర్డ్ వీటిని అందిస్తుంది. వీటిని బోర్డుకు చెందిన ఎగ్జామినర్ పర్యవేక్షణలో ఆయా సెంటర్లకు చెందిన వారు సిద్ధం చేస్తారు. దీన్నే తన్వీర్ అనుకూలంగా మార్చుకున్నాడు. ప్రతి ప్రశ్నపత్రంతోనూ జతచేసి ఉండే ఆన్సర్‌షీట్స్ బుక్‌లెట్‌ను ముందు రోజు రాత్రే వీళ్లు మార్చేస్తున్నారు. ఓఎంఆర్ షీట్‌కు డమ్మీ జవాబుపత్రాన్ని జత చేస్తున్నారు. పరీక్ష రాసేటపుడు విద్యార్థి బుక్లెట్పై ఉండే ఓఎంఆర్ షీట్లో క్వశ్చన్ పేపర్‌తో పాటు ఈ బుక్లెట్ నంబర్ కూడా వేయాలి. మదీన జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ తమతో ఒప్పందం కుదుర్చుకున్న వారికి ఓఎంఆర్ షీట్స్‌తో డమ్మీ బుక్లెట్స్ ఇస్తున్నాడు. అదే సమయంలో ప్రిన్సిపాల్.. అసలు బుక్‌లెట్స్‌ను కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది సయ్యద్ కలీముద్దీన్, షబానా బేగం, జాహెదా షరీన్‌కు ఇచ్చి పుస్తకాల్లో చూసి రాయిస్తున్నాడు. ఆయా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలూ వీరికి ఇస్తున్నాడు. పరీక్ష ముగిశాక ఈ అసలు బుక్‌లెట్స్‌ను ఒప్పం దం చేసుకున్న విద్యార్థులకు అందించి, వాటిని ఓఎంఆర్ షీట్ కు జతచేయిస్తూ దానిపై ఆ బుక్లెట్ నంబర్ వేయిస్తున్నాడు. అదుపులో పది మంది.. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు దీనిపై పక్కా సమాచారం అందుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం న్యూ మదీన కాలేజీపై దాడి చేసింది. ఆ సమయంలో బుక్‌లెట్స్‌లో పరీక్షలు రాస్తున్న ముగ్గురు సిబ్బందితో పాటు ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద లభించిన ఆధారాలను బట్టి ఒప్పందం చేసుకున్న విద్యార్థులైన అహ్మద్ నజీర్ (సెయింట్ జోసఫ్ జూనియర్ కాలేజీ–టోలిచౌకి), మహ్మద్ అహ్మద్ హుస్సేన్, మహ్మద్ ఇక్బాల్ అబ్బాస్, ఫిరాజ్ మీర్జా (నియోసిస్ జూనియర్ కాలేజీ), మహ్మద్ రియాన్ నజీర్ (న్యూ రిలయన్స్ జూనియర్ కాలేజీ), నిసార్ అహ్మద్ (నారాయణ జూనియర్ కాలేజీ)ను పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు కామర్స్, నలుగురు కెమిస్ట్రీ పరీక్షలు రాయిస్తున్నారని గుర్తించారు. మరో ఇద్దరు విద్యార్థులైన మహ్మద్ అలీఖాన్, అబుబకర్ అబ్దుల్లా బిన్ మహఫూజ్ కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారిని టాస్క్‌ఫోర్స్ బృందం గోల్కొండ పోలీసులకు అప్పగించింది. ఈ తరహాలో మరికొందరికీ ప్రిన్సిపాల్ పరీక్షలు రాయించినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగానూ దర్యాప్తు చేపట్టారు. యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ మూకుమ్మడి మాల్ ప్రాక్టీస్ ఘటన నేపథ్యంలో న్యూ మదీన జూనియర్ కాలేజీ యాజమాన్యానికి ఇంటర్ బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేసింది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలో మాల్‌ప్రాక్టీస్ వాస్తవమేనని తేలిందని, దీంతో 8 మందిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు బుక్ చేశా మంది. యాజమాన్యం తమ తప్పిదాన్ని అంగీకరించిన నేపథ్యంలో కాలేజీ అనుబంధ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని యాజమాన్యానికి నోటీసు జారీ చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. -
చిట్కాలు చెబుతూ అడ్డంగా బుక్కయ్యాడు!
-
వీడియోతో అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్!
లక్నో: ‘చాలెంజ్ చేసి చెబుతున్నా.. నా విద్యార్థులు ఒక్కరు కూడా పరీక్షల్లో ఫెయిల్ అవ్వరు. ఎలాగైనా వారు పాసైపోతారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ప్రశ్నకు సమాధానం తెలియకపోతే జవాబుపత్రంలో ఓ వంద రూపాయలు ఉంచండి’ అంటూ పరీక్షల్లో ఎలా కాపీ కొట్టాలో చెబుతూ ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ అడ్డంగా బుక్కయ్యాడు. అతడి ‘ప్రసంగాన్ని’ ఓ విద్యార్థి చిత్రీకరించగా.. వీడియో ఆధారంగా పోలీసులు సదరు ప్రిన్సిపల్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు... రాష్ట్రంలో మంగళవారం నుంచి యూపీఎస్‌ఈబీ(బోర్డ్ ఎగ్జామ్స్) పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మావో జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం... తమ విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రిన్సిపల్, మేనేజర్ ప్రవీణ్ మాల్ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్ సెంటర్లో మీరు భయపడాల్సిన పనిలేదు. పరీక్ష రాసేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. కానీ ఎదుటి వారి చేతులు తాకొద్దు. ఒకవేళ మాట్లాడుకుంటూ దొరికిపోయినా అస్సలు భయపడవద్దు. రెండు చెంపదెబ్బలు వేసినా భరించాలి. ముఖ్యంగా సమాధాన పత్రాన్ని ఖాళీగా ఉంచకూడదు. వీలైతే అందులో ఓ వంద రూపాయల కాగితం పెట్టండి. అప్పుడు టీచర్లు మీకు గుడ్డిగా మార్కులు వేసేస్తారు. ఇలా చేస్తే నాలుగు మార్కుల జవాబుకు కనీసం మూడు మార్కులైనా వేస్తారు’’ అంటూ విద్యార్థులకు హితబోధ చేశాడు. ఈ క్రమంలో.. ఓ విద్యార్థి ప్రిన్సిపల్ మాటలను రహస్యంగా రికార్డు చేశాడు. అనంతరం గ్రీవెన్స్ సెల్లో వీడియోతో సహా ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ మాల్‌ను అరెస్టు చేశారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే అకృత్యం.. కేసు నమోదు! కాగా యూపీలో మంగళవారం నుంచి ప్రారంభమైన బోర్డ్ ఎగ్జామ్స్(పది, పన్నెండో తరగతి)కు దాదాపు 56 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఈ ఏడాది మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు యోగి సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలతో మానిటరింగ్ ఏర్పాటు చేయడంతో పాటుగా... సున్నితమైన ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రత కూడా కల్పిస్తోంది. 75 జిలాల్లలోని 7784 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ట్విటర్లో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసింది. -
అంతా ఓపెన్
ఏ సబ్జెక్టు రాస్తున్నారో తెలియదు.. ఏ ప్రశ్న ఇస్తారో తెలియదు.. అసలు సిలబస్ అంటే ఏంటో తెలియదు.. పరీక్ష రాస్తున్నామనే భయం అంతకన్నా ఉండదు.. ఎందుకంటే పరీక్ష రాయకముందే పాస్ గ్యారంటీ.. దీనికిగాను ముందస్తుగా చెల్లించిన లంచాలే వాళ్ల ధైర్యానికి వారంటీ.. అందుకే ఓపెన్‌గా పరీక్ష రాస్తారు. తాపీగా కాపీలు కొట్టేస్తారు. కట్టడి చేయాల్సిన ఇన్విజిలేటర్లే కట్టలుకట్టలు చీటీలు అందిస్తారు. వారికి అందిన మామూళ్లను బట్టి బుక్స్ కూడా ఇచ్చేసి దగ్గరుండి కాపీలు కొట్టిస్తారు. అభ్యర్థుల అవసరాలే ఆసరాగా ఓపెన్ స్కూల్ ఏజెన్సీల నిర్వాహకులు ఈ దందా కొనసాగించారు. పరీక్ష హాలులో చీటీలు ఇచ్చేందుకు ఒక రేటు, టెక్ట్స్ బుక్స్ ఇచ్చేందుకు మరో రేటు, అభ్యర్థికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసేందుకు ఇంకో రేటు చొప్పున వసూలు చేశారు. ఇందులో విద్యాశాఖ అధికారులకు వాటాలు ఇచ్చి వారి కళ్లకు గంతలు కట్టారు. మొత్తంగా ఓపెన్ పరీక్షను చూచిరాతల పరీక్షగా మార్చేశారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు చూచిరాతలను తలపించాయి. జిల్లా వ్యాప్తంగా టెన్త్, ఇంటర్ కలిపి 33 కేంద్రాల్లో 13,206 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. శుక్రవారంతో జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగిశాయి. పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా జరగాల్సిన పరీక్షలు పూర్తిగా పక్కదారి పట్టాయి. విద్యాశాఖ పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం పరీక్ష రాసేవారికి పదో తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు అత్యవసరం కావడంతో ఎంత వరకైనా సిద్ధమవుతున్నారు. విద్యార్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న స్కూల్ ఏజెన్సీలు పాస్ గ్యారంటీపేరుతో అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డాయి. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ ప్రశ్నాపత్రాన్ని అందిస్తారు. అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా జవాబు పత్రంలో సమాధానాలు రాయాలి. కానీ జిల్లాలో జరిగిన ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లు దగ్గరుండి విద్యార్థులకు చీటీలు ఇచ్చి మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్విజిలేటర్లతోపాటు పరీక్ష కేంద్రాల్లోని సిబ్బంది సహకారం ఉండడంతో విద్యార్థుల పెన్నులు జోరుగా దూసుకెళ్లాయి. ఓపెన్ స్కూల్ సెంటర్ల నిర్వాహకులు పరీక్ష కేంద్రాల వద్ద తిష్టవేసి మరీ చూచిరాతల పక్రియను కొనసాగించారు. ఇన్విజిలేటర్లకు తాయిలాలు ముట్టజెప్పి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేలా ఒప్పందం కుదుర్చుకుని మరో వైపు జంబ్లింగ్ విధానం లేకపోవటం కూడా ఇన్విజిలేటర్లకు కలిసొచ్చింది. శుక్రవారం జరిగిన చివరి టెన్త్ పరీక్ష సందర్భంగా గుంటూరు నగరంలోని ఎల్ఈఎం స్కూల్లో ఇద్దరు విద్యార్థులను డీబార్ చేశారు. ఫీజుకు అదనంగా వసూళ్లు.. ఓపెన్‌లో టెన్త్ చదివే విద్యార్థులకు సాధారణంగా రూ.750 దాకా ఫీజు ఉంటుంది. నేరుగా అభ్యర్థులు ఫీజు కట్టకుండా తమ ద్వారా పరీక్షలు రాస్తే పాస్ గ్యారంటీ అంటూ ప్రైవేట్ ఏజెన్సీలు ఆఫర్లు ఇస్తున్నాయి. పరీక్ష రాసేటప్పుడు ఇచ్చే వెసులుబాటును బట్టి రేట్లను ఫిక్స్ చేస్తున్నారు. స్లిప్‌లు పెట్టి రాయిస్తే ఒక రేటు, టెక్టŠస్ బుక్స్ చేతికిచ్చి రాయిస్తే మరో రేటు నిర్ణయిస్తున్నారు. మరి కొన్ని ఏజెన్సీలైతే అసలు వ్యక్తి బదులు మరో వ్యక్తితో పరీక్ష రాసేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీనికిగాను భారీ స్థాయిలో వసూలు చేసుతన్నాయి. వసూళ్లకోసం ప్రత్యేకంగా కొంత మందిని నియమించుకొని దందా నడుపుతున్నాయి. ఒక్కో అభ్యర్థి వద్ద రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఫీజు రూపంలో వసూల్ చేస్తున్నారని సమాచారం. ఇందులో పరీక్ష కేంద్రం నిర్వాహకులకు, విద్యాశాఖాధికారులకు కూడా మామూళ్లు అందుతున్నట్లు తెలిసింది. ఇద్దరి మధ్య అవగాహనతోనే.. ప్రైవేట్ స్కూల్ ఏజెన్సీలు, విద్యాశాఖ అధికారుల మధ్య అవగాహనతోనే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. స్కూల్ ఏజెన్సీలు పాస్ గ్యారంటీ పేరుతో విద్యార్థుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్టు వదిలేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పకడ్బందీగా నిర్వహించాం.. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డ విద్యార్థులను డీబార్ చేశాం. ప్రైవేట్ స్కూల్ ఏజెన్సీలు వసూళ్లకు పాల్పడిన విషయం మా దృష్టికి రాలేదు. – శ్రీధర్, ఏపీఓఎస్ఎస్, కో–ఆర్డినేటర్ గుంటూరు, కృష్ణా -
అంతా ‘ఓపెన్’గానే..
ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం కొందరు, ఏదైనా డిగ్రీ పట్టా పొందాలనే కోరికతో మరికొందరు.. కారణమేదైనా అభ్యర్థి అవసరమే ఓపెన్ స్టడీ సెంటర్లకు వరమవుతోంది. డబ్బిస్తే చాలు పాస్ గ్యారంటీ అంటూ ఆఫర్లు ఇస్తూ.. అందినకాడికి దోచుకుంటున్నారు. వీరు చేస్తున్న చట్ట వ్యతిరేక పనులతో నిజాయితీగా చదివి పరీక్ష రాస్తున్న విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారు. అక్రమాలను కనిపెట్టి కట్టడి చేయాల్సిన విద్యాశాఖాధికారులు కూడా వీరికే వంత పాడుతుండడంతో వ్యవహారమంతా ‘ఓపెన్’గానే సాగిపోతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: ఓపెన్‌లో టెన్త్ చదివే విద్యార్థులకు సాధారణంగా రూ.750 దాకా ఫీజు ఉంటుంది. నేరుగా అభ్యర్థులు ఫీజు కట్టకుండా తమ ద్వారా ఫీజు కట్టి పరీక్షలు రాస్తే పాస్ గ్యారంటీ అంటూ ప్రైవేట్ ఏజెన్సీల వారు విద్యార్థులకు ఆఫర్లు ఇస్తున్నారు. పరీక్ష రాసేటప్పుడు ఇచ్చే వెసులుబాటును బట్టి రేట్లను ఫిక్స్ చేస్తున్నారు. స్లిప్‌లు పెట్టి రాయిస్తే ఒక రేటు, టెక్ట్స్ బుక్స్ చేతికిచ్చి రాయిస్తే మరోరేటు పెడుతున్నారు. మరికొన్ని ఏజెన్సీలైతే అసలు పరీక్షే రాయకుండా మరో వ్యక్తితో పరీక్ష రాయిస్తున్నారు. దీనికి భారీ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకుని మరీ దందాను నడుపుతున్నారు. ఇలా ఒక్కో విద్యార్థి నుంచి రూ. 4 నుంచి రూ.6 వేల వరకు ఫీజు రూపంలో వసూల్ చేస్తున్నారని సమాచారం. ఇందులో పరీక్షా కేంద్రంనిర్వాహకులకు, విద్యాశాఖాధికారులకు కూడా మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. జిల్లాలో పరిస్థితి.. మే నెల 1 తేదీ నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు మొదలయ్యాయి. జిల్లాలో పదోతరగతి పరీక్షలను 3,774 మంది రాస్తుండగా, ఇంటర్ పరీక్షలను 4,046 మంది నమోదు చేస్తుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు 14 కేంద్రాలు, ఇంటర్మీడియెట్ పరీక్షలు 14 కేంద్రాల్లో జరుగుతున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నాటికి పరీక్షలు ముగియాల్సి ఉంది. అయితే ఫణి తుపాన్ నేపథ్యంలో గత శుక్ర, శని వారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. దీంతో పరీక్షలు ఈ నెల 10వ తేదీ వరకు జరగనున్నాయి. చూసీచూడనట్లుగా ఇన్విజిలేటర్లు.. ఓపెన్ స్కూల్ సెంటర్ల నిర్వాహకులు పరీక్షా కేంద్రాల వద్ద తిష్టవేసి మరీ చూచిరాతల ప్రక్రియను సాగిస్తున్నారు. ఇన్విజిలేటర్లకు తాయిలాలను అందించి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేలా ఒప్పిస్తున్నారు. ఇన్విజిలేటర్లుకు జంబ్లింగ్ విధానంలో ఇంతవరకు లేకపోవటం కూడా సెంటర్ల నిర్వాహకులకు సులువవుతోంది. మంగళవారం నూజివీడు పరీక్షా కేంద్రంలో చూచిరాతలకు సహకరించిన ఐదుగురు ఇన్విజిలేటర్లుకు షోకాజు నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాదికి ఓపెన్ స్కూల్ దందా ద్వారా దాదాపు 3 కోట్ల రూపాయలు వరకు చేతులు మారుతుందని ప్రచారం జరుగుతోంది. పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు చర్యలు నూజివీడు మాస్‌కాపీయింగ్ ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. అన్ని కేంద్రాల్లో పకడ్బందీగా పరీక్షల నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. పాస్ గ్యారంటీ అంటూ డబ్బులు వసూలు చేసే ఏజెంట్లను నమ్మకండి.– నాగమల్లేశ్వరరావు, ఓపెన్ స్కూల్ పరీక్షల విభాగం అధికారి, కృష్ణా జిల్లా -
ఇక్కడంతా... ఓపెన్
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: ఓపెన్ స్కూల్ పరీక్షల్లో చూచి రాతలు జిల్లాలో ఓపెన్‌గా జరుగుతున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి ముందుగానే సంబంధిత నిర్వాహకులు ‘డీల్’ కుదుర్చుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాస్ గ్యారంటీ స్కీమ్‌తో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు పరీక్ష రాస్తున్న అభ్యర్థులే నేరుగా చెబుతున్నారు. పరీక్ష రాసే సెంటర్లోనే ఒక్కో అభ్యర్థి నుంచి రూ.300 నుంచి రూ.500 వరకూ వసూలు చేస్తున్న విషయం గుప్పుమంటోంది. ముందుగా పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా అభ్యర్థులకు నేరుగా స్లిప్పులను అందజేస్తున్నారు. దీనికోసం ఒక్కో గదిలో మూడు నుంచి నాలుగు టెస్ట్ పేపర్లు పెట్టుకుంటున్నట్లు సమాచారం. బయట నుంచి ఎవరైనా పర్యవేక్షణకు వస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతించేదిలేదని అక్కడున్న ఇన్విజిలేటర్లే స్వయంగా ఎదురొచ్చి చెప్పేస్తున్నారు. జిల్లాలో 27 సెంటర్లలో 8,601 మంది అభ్యర్థులు పదో తరగతి పరీక్షలు, 35 కేంద్రాల్లో11,521 మంది అభ్యర్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలను రాస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ పరీక్షలు లోపభూయిష్టంగానే జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల నిర్వాకం కారణంగానే ఈ దుస్థితి దాపురించిందంటున్నారు. విద్యార్థులు చదివే సెంటర్లకు చెందిన ఉపాధ్యాయులనే పర్యవేక్షకులుగా నియమించి మరోసారి విద్యాశాఖ అధికారులు విమర్శల పాలయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పాఠశాలలో పరీక్షల నిర్వాహకులు తమకు కావాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులను పర్యవేక్షకులుగా నియమించి వారి ద్వారా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కొందరైతే ‘పరీక్షల్లో పాస్ కావాలి ... అన్ని విధాలా సహకరిస్తే రూ.15 వేల వరకూ ముట్టజెబుతామ’ని ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా కొంతమొత్తం అడ్వాన్స్‌గా కూడా అందజేస్తున్నారు. ఈ పరీక్షలు పదోన్నతుల కోసమో, లేక ఉద్యోగాలు చేస్తున్న వారు అర్హత పొందేందుకో రాస్తారు తప్ప ఉన్నత చదువుల కోసం కాదు కదా...అందుకే అంత సీరియస్‌గా దృష్టి పెట్టం అని నిర్వాహకులే చెబుతుండడం గమనార్హం. జిల్లా విద్యాశాఖ అధికారులకు డబ్బులు ఇస్తే సర్టిఫికెట్ తమకు వచ్చేస్తుందని అభ్యర్థులు ధీమాగా చెబుతున్నారంటే ఈ పరీక్షల నిర్వహణ ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఈ సర్టిఫికెట్లకు ఎంతో విలువ... ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి, ఇంటర్ మీడియట్ సర్టిఫికెట్లకు రెగ్యులర్‌గా చదివే విద్యార్థులకు ఉన్నంత విలువ ఉంది. ఈ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు, పదోన్నతులు పొందేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో అనేక మంది ఓపెన్ స్కూల్స్ అంటేనే మక్కువ చూపిస్తున్నారు. నామమాత్రపు ఫీజుతో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో చేరిన తరువాత వార్షిక పరీక్షల్లో నిర్వాహకులు అడిగినంత ముట్టజెబితే దర్జాగా సర్టిఫికెట్లు వచ్చి చేతిలో పడతాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అవసరాన్ని నిర్వాహకులు ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారన్నది ఓపెన్ సీక్రెట్‌గా మారిపోయింది. సెంటర్లోనే రాయ ‘బేరాలు’... జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి 62 సెంటర్లున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివే వారికి ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. ఏడాదికి 24కి తగ్గకుండా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. పదో తరగతి చదవాలనుకునేవారికి ఎలాంటి విద్యార్హతలు లేకున్నా 14 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సున్నా అర్హులే. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి 15 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సున్నా అర్హులే. ప్రతి సెంటర్‌కు ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. వారిలో ఒకరు ప్రధానోపాధ్యాయులుగా, సెంటర్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. తాము నిర్వహించే సెంటర్లలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో చేరేందుకు వచ్చే వారి వివరాలను, ఎలాంటి అవసరార్థం కోసం చేరుతున్నారో ముందుగానే తెలుసుకొని అక్కడి నుంచే రాయ‘బేరాలు’ సాగిస్తుంటారు. జోరుగా కాపీయింగ్... జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం ప్రధాన కేంద్రాల్లో పరీక్ష రాసే వారికి ఇన్విజిలేటర్లే ఎంచక్కా గైడ్లను అందజేస్తున్నట్లు పరీక్ష రాసి వచ్చే విద్యార్థులు చెబుతున్నారు. ఓపెన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం ... కేంద్రాల వద్ద 144 సెక్షన్లు అమలు చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు పత్రికలకే పరిమితమవుతున్నాయిగానీ ఆచరణలో అవేవీ కనిపించడం లేదని అభ్యర్థులే చెప్పడం గమనార్హం. ఎక్కడో చెబితే చర్యలు తీసుకుంటాం: డీఈవో అబ్రహం ఓపెన్ స్కూల్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోందని, అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లి వివరణ కోరగా, ఎక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారో చెబితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షల పర్యవేక్షణకు 12 మందితో స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామని, నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇన్విజిలేటర్ డ్యూటీలకు డిమాండ్... జిల్లాలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల ఇన్విజిలేటర్ డ్యూటీలకు ఎక్కడ లేని డిమాండ్ ఉంది. ఏటా వేసవి సెలవుల్లో ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. వేసవి సెలవుల్లో ఉండే ఉపాధ్యాయులు ఓపెన్ స్కూల్ పరీక్ష విధులకు హాజరైతే వచ్చే విద్యా సంవత్సరం ఈఎల్స్ పొందే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఇన్విజిలేటర్ డ్యూటీలంటేనే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎగిరి గంతేస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో పరీక్ష నిర్వహకులు ఒక్కో చోట అవసరానికి మించి ఇన్విజిలేటర్లను, ఓపెన్ స్కూల్ నిర్వహకులు ఏర్పాటు చేసి పరీక్ష రాసే అభ్యర్థుల నుంచి ప్రతి రోజు పరీక్షలయ్యేంత వరకూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 300 నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. -
అంతా ఓపెన్
పాలకొల్లు సెంట్రల్: ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో జరుగుతున్న పదవ తరగతి, ఇంటర్మీ డియట్ పరీక్షలు ప్రహసనంగా మారాయి. ఈ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు లంచాలతో మరీ ఓపెన్ అయిపోయాయని ప్రతిభ గల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ స్కూల్ ఈ పరీక్షల నిర్వాహకులు ఇంటర్ విద్యార్థి నుండి రూ. 4 వేలు, పదవ తరగతి విద్యార్థి నుండి రూ.3,500 పైనే అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ పరీక్షలు నిర్వహించడానికి ఓపెన్ స్కూల్ నుండి నిధులు సమకూరుస్తారని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. కాని ఇక్కడ విద్యార్థుల నుండి సొమ్ములు వసూలు చేస్తున్నారు. ఈ పరీక్షల నిమిత్తం పాలకొల్లులో 3 సెంటర్లను కేటాయించారు. బీవీఆర్‌ఎం గరల్స్ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు, ఏవీఎస్ఎన్ఎం, బీఆర్ఎంబీ హైస్కూల్లో ఇంటర్ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో అంతా ఓపెన్ మే 1వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కాగా ఇంటర్ విద్యార్థులకు 2వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3, 4 తేదీలలో జరగాల్సిన పరీక్షలను ఫొని తుఫాను కారణంగా వాయిదా వేసినట్లు విద్యార్థులు తెలిపారు. 10వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మూడు కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలకు నిర్వాహకులు తమకు అనుకూలమైన వ్యక్తులనే ఇన్విజిలేటర్లుగా నియమించుకున్నారు. పరీక్షకు హాజరైన పదవ తరగతి విద్యార్థి నుంచి రూ.100, ఇంటర్ విద్యార్థి నుండి రూ.200 ఎగ్జామ్ రూంలోనే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన విద్యార్థులకు ప్రశ్నపత్రంతో పాటు ఆన్సర్ షీటును ఇస్తున్నారు. దాంతో వాటిలోని సమాధానాలను చూసి రాస్తున్నారు. బుధవారం నుండి ఇప్పటి వరకూ జరిగిన ఈ ఓపెన్ పరీక్షలకు ఓ రోజు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలకు రాగా ముడుపులు అందించి మమ అనిపించారని విశ్వసనీయ సమాచారం. ఈ ఓపెన్ పరీక్షలు విద్యార్థుల ప్రతిభకు కొలమానంగా జరుగుతున్నట్లు లేదని వీటిని నిర్వహించే వారి జేబులు నింపుకోవడానికే జరుగుతున్నట్లు ఉందని విమర్శలు వస్తున్నాయి. -
అగ్రస్థానం అనుమానమే..?
సాక్షి, జగిత్యాల: పదోతరగతి ఫలితాల్లో జిల్లా వరుసగా రెండుసార్లు అగ్రస్థానంలో నిలిచింది. గతంలో కలెక్టర్ శరత్ చొరవతో చేపట్టిన ఉత్తేజం కార్యక్రమం సత్పలితాలనిచ్చింది. ఈనెల 16న పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈసారి కూడా రాష్ట్రంలో మళ్లీ అగ్రస్థానంలో నిలిస్తే ముచ్చటగా మూడోసారి(హ్యాట్రిక్) నంబర్‌వన్‌గా నిలిచే అవకాశం దక్కుతుంది. అయితే గతంలో మాదిరిగా ఉత్తేజం కార్యక్రమానికి కలెక్టర్ నిధులు మంజూరు చేయకపోవడంతో స్థానిక దాతల నుంచి నెట్టుకొచ్చారు. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఎన్నికల విధుల్లో ఉండడం.. కొన్ని పాఠశాలల్లో సిలబస్ కూడా పూర్తికాకపోవడం నంబర్‌వన్ సాధించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. వరుసగా రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా నంబర్‌వన్‌గా నిలుస్తోంది. 2016–17 విద్యాసంవత్సరం పదోతరగతి ఫలితాలలో జిల్లా 97.35 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. మరుసటి సంవత్సరం 2017–18 ఫలితాల్లోనూ 97.56 ఉత్తీర్ణతశాతంతో జగిత్యాల జిల్లా రెండోసారి రాష్ట్రంలో అగ్రభాగాన నిలిచింది. వీరిలో బాలికలు 98శాతం ఉత్తీర్ణత కాగా బాలురు 97 శాతం ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 201 ప్రభుత్వ పాఠశాలల్లో 117 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఉత్తేజంతో ఊపు.. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కలెక్టర్ శరత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచేందుకు ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఉత్తేజం కార్యక్రమంతో పది విద్యార్థులకు పాఠశాల సమయానికి గంట ముందు, తర్వాత స్టడీఅవర్స్‌లో చదువుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఆ సమయంలో వారికి స్నాక్స్ అందించేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. కలెక్టర్ నిధులతోపాటు విస్త్రృతమైన ప్రచారంతో దాతలు ముందుకు రావడంతో సాయంత్రం వేళ విద్యార్థుల ఆకలి తీరింది. ఫలితంగా రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలుస్తోంది. మాస్ కాపీయింగ్ మరకలు గతేడాది మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షాసమయంలో జిల్లాలోని కొడిమ్యాల మండలంలో జరిగిన మాస్‌కాపీయింగ్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందుకు ఎన్నడు లేని విధంగా ఏకంగా ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం కలకలం రేపింది. జిల్లాను ఫలితాల్లో నంబర్‌వన్‌గా ఉంచాలనే ఒత్తిడితో కొన్ని చోట్ల ఉపాధ్యాయులు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉత్తేజం అంతంతే! గత రెండేళ్లుగా జిల్లాలో పదోతరగతి విద్యార్థుల కోసం చేపట్టిన ఉత్తేజం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. కలెక్టర్ శరత్ రెండేళ్లపాటు ఉత్తేజం కోసం ఏటా సుమారు రూ.15 లక్షలు కేటాయించారు. వీటితోపాటు ఆయా మండలాలు, గ్రామాల్లో స్థానిక నాయకులు, దాతల నుంచి విరాళాలు భారీగా వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించలేదు. కేవలం గ్రామస్థాయిల్లో దాతల విరాళాలతో నెట్టుకొస్తున్నారు. రెండేళ్లుగా లభించిన ప్రచారం, ప్రోత్సాహం ఈ దఫా కరువైనట్లు కనిపిస్తోంది. దీనికితోడు ఈసారి ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో నిమగ్నమవడం.. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో ఇప్పటి వరకు సిలబస్ పూర్తికాలేదు. ఈ పరిస్థితుల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి హ్యాట్రిక్ సాధించడం కష్టతరంగా మారింది. -
అవినీతి మోత ఎందుకు ఆగుతుందీ రాత
కాకినాడలోని పలు ప్రైవేటు నర్సింగ్ స్కూల్స్ మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌నే నమ్ముకున్నాయా? ఏదో ఒకటి చేసి నర్సింగ్ కోర్సును పూర్తి చేయిస్తామని విద్యార్థులకు హామీ ఇస్తున్నాయా? రూ.లక్షలు తీసుకొని అధికార సిబ్బందిని మేనేజ్ చేసి పరీక్షలను గట్టెక్కిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసానిస్తున్నాయా? ఆ నమ్మకంతోనే దేశం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చేరుతున్నారా? నాణ్యమైన చదువునివ్వకుండా పక్కదారిలో పాస్ చేయించే ప్రయత్నం చేస్తున్నాయా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సును జిల్లాలో 38 నర్సింగ్ స్కూల్స్ అమలు చేస్తున్నాయి. దేశ నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చేరుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఇక్కడే హాస్టల్స్‌లో ఉంటూ చదువుతుండగా, మరికొంతమంది పరీక్షలకు మాత్రం వచ్చేలా లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈమేరకు విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు పిండుతున్నాయి. కోర్సు పూర్తి చేసినట్టుగా సర్టిఫికెట్ వస్తే చాలు ఆ తర్వాత ఏదో రాష్ట్రానికో, దేశానికో వెళ్లిపోయి మంచి ఉద్యోగం సాధించి, ఖర్చు పెట్టిన సొమ్మును ఇట్టే సంపాదించవచ్చనే ఆలోచనతోవిద్యార్థులు ఏమాత్రం వెనకాడటం లేదు. దేశ నలు మూలల నుంచి వచ్చి ఇక్కడ వాలిపోతున్నారు. అ లా అని అన్ని నర్సింగ్ స్కూల్స్ చేయడం ఈ రకంగా పక్కదారి పట్టడం లేదు. కొన్ని మాత్రమే అడ్డదా రులు తొక్కి విద్యార్థులను తప్పుతోవ పట్టిస్తున్నా యి. ప్రస్తుతం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జరుగుతున్న జీఎన్ఎం పరీక్షల్లో వెలుగు చూస్తు న్న స్లిప్పుల భాగోతం చూస్తుంటే పలు నర్సింగ్ స్కూల్స్‌లో చదువు కన్నా సామూహిక చూసి రాతలపైనే ఎక్కువగా తర్ఫీదునిస్తున్నట్టు తెలుస్తోంది. జి ల్లా వ్యాప్తంగా ఉన్న 38 నర్సింగ్ స్కూల్స్‌కు చెందిన 3494 విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఇం దులో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులున్నారు. ముందస్తు తనిఖీల్లోనే పెద్ద ఎత్తున స్లిప్పులతో విద్యార్థులను పట్టుకుంటున్నారు. వాటిన్నింటినీ అధికారులు భద్రపరిచి ఉంచారు. మాల్ ప్రాక్టీసుకు అనుకూలంగాపరీక్షా కేంద్రాల ఏర్పాట్లు... తల రాతను మార్చే పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇక్కడ జరుగుతున్న పరీక్షలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. సాధారణ పరీక్షల్లో విద్యార్థుల కోసం టేబుల్స్ ఏర్పాటు చేసి, వాటి మీద పరీక్ష రాసేలా చూస్తారు. వారెటువంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడినా ఇట్టే కనబడతారు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా ప్రశాంతంగా పరీక్షలు రాసుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, ఇక్కడ హేండ్లెస్ కుర్చీలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. టేబుల్స్ అన్నవే ఏర్పాటు చేయలేదు. దీంతో హ్యాండ్‌లెస్ కుర్చీలపై పరీక్షలు రాయడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెచ్చుకున్న స్లిప్పులతో పరీక్షలు రాయడం అంతే సులువు. మరి, ఎవరి అనుకూలం కోసమో...ఎవరికి లబ్ధి చేకూర్చేందుకో తెలియదు గాని దాదాపు 3500 మంది విద్యార్థులు హాజరవుతున్న పరీక్షలను సరైన కుర్చీల్లేకుండా, టేబుల్స్ ఏర్పాటు చేయకుండా చేయడం వెనుక మర్మమేంటోనని చూసినవారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఫొటోలో ఉన్న సంచె చూశారా? ఇందులో ఉన్నవి పరీక్షా ప్రశ్న పత్రాలో? సమాధాన పత్రాలో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. చూసి రాసేందుకు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు నేరుగా తీసుకొచ్చిన స్లిప్పు (చీటీ)లివీ. అత్యధిక మంది విద్యార్థులు స్లిప్పులు తీసుకొని పరీక్షా హాల్లోకి వస్తుండటం ఆశ్చర్యం కల్గిస్తోంది. ముందస్తు తనిఖీల్లో చాలా వరకు పట్టుబడుతున్నాయి. ఇక, తనిఖీలు చేయలేని విధంగా లో దుస్తుల్లో స్లిప్పులను తీసుకురావడంతో పట్టుకోలేకపోతున్నారు. -
నర్సింగ్ విద్యార్థుల కాపీయింగ్
స్థానిక వైద్య కళాశాలలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం) వార్షిక పరీక్షలకు నర్సింగ్ విద్యార్థులు చీటీలతో హాజరవుతున్నారు. పరీక్షల చీఫ్ ఎగ్జామినర్ డాక్టర్ సిద్ధాబత్తుని నాగేశ్వరమ్మ బుధవారం కొంత మంది విద్యార్థుల వద్ద చీటీలను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి చీటీలతో హాలులోకి వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష హాలులోకి బూట్లు, సాక్సులు వేసుకురావద్దని ఆదేశించారు. గుంటూరు మెడికల్: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) వార్షిక పరీక్షలకు హాజరయ్యే నర్సింగ్ విద్యార్థులు రోజూ చీటీలతో పరీక్షా హాలులోకి ప్రవేశిస్తున్నారు. దీంతో బుధవారం తనిఖీలు నిర్వహించిన పరీక్షల చీఫ్ ఎగ్జామినర్ డాక్టర్ సిద్ధాబత్తుని నాగేశ్వరమ్మ పలువురు విద్యార్థుల వద్ద చీటీలను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి చీటీలతో హాలులోకి వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు బూట్లు, సాక్సుల్లో చీటీలను పెట్టుకుని వస్తున్నట్లు అనుమానం రావటంతో హాలులోకి బూట్లు, సాక్సులు లేకుండా హాజరవ్వాలని ఆదేశాలిచ్చారు. పలువురు సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థుల దగ్గర ఏమైనా చీటీలు ఏమైనా ఉన్నాయోమోనని తనిఖీ చేయించారు. ఈనెల ఒకటో తేదీ నుంచి జీఎన్ఎం వార్షిక పరీక్షలు గుంటూరు వైద్య కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈనెల 13 వరకు థియరీ, 15 నుంచి 23వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లోని ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌తోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 ప్రైవేటు నర్సింగ్ స్కూల్స్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతున్న ఈ పరీక్షలకు విద్యార్థులు రోజూ చీటీలను తీసుకురావటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల నిర్వాహణ బాధ్యతలను ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌కు అప్పగించారు. కొంత మంది కార్యాలయ ఉద్యోగులను ఇన్విజిలేటర్లుగా నియమించి నర్సింగ్ స్కూల్ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ వారికి లోపాయికారీ ఒప్పందాలు ఉండటం వల్లే విద్యార్థులు భయం, బెరుకు లేకుండా చీటీలను పరీక్ష హాలులోకి తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలో నర్సింగ్ నిబంధనల ప్రకారం బోధనా సిబ్బంది, ప్రాక్టికల్స్ చేసే సౌకర్యాలు ఉండవు. కానీ ఆ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత రావటంపై వైద్య సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు స్కూల్ విద్యార్థులను పరీక్షల సమయంలో చూసీచూడనట్లు వదిలివేయటం వల్లే వారికి మంచి ఫలితాలు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
పైసలు పెట్టు.. కాపీ కొట్టు
నెల్లూరు , నాయుడుపేట: దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆదివారం నిర్వహించిన ప్రాథమిక, మాధ్యమ, రాష్ట్ర భాష, విశారద, ప్రవీణ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ యథేచ్ఛగా సాగింది. పట్టణంలోని ఎల్‌ఏసాగరం ఉన్నత పాఠశాల, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షలు జరగ్గా ఉపాధ్యాయుల సహకారంతో కొందరు విద్యార్థులు పుస్తకాలు పెట్టి రాశారు. ఎల్ఏ పాఠశాలలో 220 మంది విద్యార్థులు, బాలికల ఉన్నత పాఠశాలలో 108 మంది పరీక్షలకు హజరయ్యారు. మొత్తం నాలుగు గదుల్లో పరీక్షలు జరిగాయి. ఇన్విజిలేటర్లు బయట కబుర్లు చెప్పుకుంటుండగా కొందరు విద్యార్థులు చిట్టీలు, పుస్తకాలు పెట్టి పరీక్షలు రాశారు. ఫొటోలు తీయడం గుర్తించి పుస్తకాలను బయటపడవేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. విద్యార్థుల నుంచి డబ్బు తీసుకుని వదిలేసినట్లు విమర్శలున్నాయి. దీనిపై జిల్లా విద్యా శాఖకు చెందిన పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్‌కిషోర్ మాట్లాడుతూ దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షల నిర్వహణ తమ పరిధిలోకి రాదన్నారు. గతంలో తమకు అప్పగించేవారని, ఈ ఏడాది నిర్వహణపై ఎలాంటి సమాచారంలేదని తెలిపారు. నేరుగా కేంద్ర ప్రభుత్వ అధికారులే పర్వవేక్షిస్తున్నట్లు తెలిసిందన్నారు. -
చార్జ్‌షీటే తరువాయి..!
సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజ్ కేంద్రంగా ఉస్మానియా యూనివర్శిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో జరిగిన మాస్ కాపీయింగ్ కేసులో విద్యార్థులు సైతం నిందితులుగా మారారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ అధికారులు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాపీయింగ్‌కు సహకరించేందుకు దళారుల ద్వారా నగదు చెల్లించి, ఆర్కే డిగ్రీ కాలేజీ కేంద్రంగా పరీక్ష రాసిన 104 మంది విద్యార్థులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 40 మందికి సీఆర్పీసీ 41 (నిందితులుగా) నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ఆర్కే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు కొందరు దళారులనూ అరెస్టు చేసిన విషయం విదితమే. గత అక్టోబర్‌లో ఉస్మానియా యూనివర్శిటీకి సంబంధించిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీలోనూ సెంటర్ ఏర్పాటు చేశారు. సాధారణంగా పరీక్షా కేంద్రానికి యూనివర్శిటీ ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాల సెట్లను అందిస్తుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అభ్యర్థుల సంఖ్య కంటే కొన్ని ఎక్కువగానే జవాబు పత్రాల సెట్లు అందజేస్తుంది. దీనిని అనుకూలంగా మార్చుకున్న ఆర్కే డిగ్రీ కాలేజ్ యాజమాన్యం సప్లిమెంటరీ పరీక్ష రాసే 104 మంది విద్యార్థులతో కుమ్మక్కై వేరే కేంద్రానికి సంబంధించి హాల్‌టికెట్ జారీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తమ కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది. వీరికోసం యూనివర్శిటీ నుంచి అదనంగా వచ్చే జవాబు పత్రాల సెట్లను వాడుకుంది. ఇందుకుగాను ఒక్కో సబ్జెక్ట్‌కు దాదాపు రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇలా మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొందరి పేర్లతో రెండేసి ఆన్సర్ షీట్లు సిద్ధమయ్యాయి. గుట్టుగా సాగిన ఈ వ్యవహారాన్ని యూనివర్శిటీ అధికారులు గుర్తించారు. గత అక్టోబర్ 21న ఆర్కే డిగ్రీ కళాశాల కేంద్రంలో జరిగిన కంప్యూటర్ సైన్స్–3 పరీక్ష పేపర్లు దిద్దుతున్న వర్శిటీ పరీక్షల విభాగం అధికారులు ఈ మాల్ ప్రాక్టీస్ స్కామ్‌ను పసిగట్టారు. ఆర్.హరికృష్ణ అనే విద్యార్థి పేరుతో రెండు ఆన్సర్ బుక్లెట్స్ వర్శిటీకి వచ్చాయి. ఇతడికి పరీక్ష కేంద్రంలో 7257771 నంబర్లతో కూడిన బుక్లెట్ ఇవ్వగా... దీంతో పాటు 7257384 నంబర్‌తో కూడిన బుక్లెట్ సైతం అతడి నుంచి కాలేజీ ద్వారా వర్శిటీకి చేరింది. దీంతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇతడి ఫలితాన్ని ఆపేశారు. దీంతో హరికృష్ణ వర్శిటీ అధికారులను సంప్రదించగా... ఆర్కే కాలేజీ నుంచి అటెండెన్స్ షీట్ తీసుకురావాలని సూచించారు. హరికృష్ణ తీసుకువెళ్లిన షీట్లో ఉన్న వివరాల ప్రకారం 7257771 బుక్లెట్ అతడికి జారీ అయింది. దీనిపై చీఫ్ సూపరింటెండెంట్ ముద్ర ఉండగా... 7257384 నంబర్‌తో కూడిన బుక్లెట్పై కాలేజీ ప్రిన్సిపాల్ ముద్ర ఉంది. దీంతో లోతుగా ఆరా తీసిన అధికారులు మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించారు. ఆర్కే డిగ్రీ కాలేజీలో ఏకంగా బుక్‌లెట్స్‌ను విద్యార్థులకు ముందే అందించినట్లుగా వర్శిటీ అధికారులు గుర్తించారు. ఈ కేంద్రంలో పరీక్ష రాసిన మొత్తం 104 మంది విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడినట్లు తేల్చారు. వీరికి వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించినా...ఆర్కే కాలేజీలో పరీక్ష రాసినట్లు తేల్చారు. వర్శిటీ అధికారులు ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయండంతో, ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ కాలేజీ యాజమాన్యం, చీఫ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్లు తదితరులపై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ, ఏపీ పబ్లిక్ ఎగ్జామ్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్‌కు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన ఎస్సై జగదీశ్వర్‌రావు మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించిన సమాధాన పత్రాలతో పాటు అనేక ఆధారాలు సేకరించారు. ఇందులో కాలేజీ ప్రిన్సిపాల్ స్వర్ణలత పాత్ర రూఢీ కావడంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ 104 మంది విద్యార్థులను కొందరు దళారులు ఆర్కే డిగ్రీ కాలేజీ నిర్వాహకుల వద్దకు తీసుకువచ్చినట్లు తేల్చారు. నగదు చెల్లించి మాల్ ప్రాక్టీస్ ద్వారా పరీక్ష రాసిన నేపథ్యంలో వీరినీ నిందితుల జాబితాలో చేర్చారు. అందరినీ అరెస్టు చేయడం సాధ్యం కాని నేపథ్యంలో సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 40 మందిని ఈ విధంగా పిలిచిన దర్యాప్తు అధికారి వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. మిగిలిన వారికీ నోటీసుల జారీ పూర్తయిన తర్వాత విద్యార్థులతో సహా నిందితులు అందరిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయనున్నారు. గరిష్టంగా నెల రోజుల్లో దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు. -
‘చూచిరాత స్కామ్’లో మరో అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో : ఉస్మానియా యూనివర్శిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో జరిగిన మాస్ కాపీయింగ్ కేసులో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు మరో నిందితుడిని కటకటాల్లోకి పంపారు. ఈ స్కామ్‌లో పాత్రధారిగా ఉన్న రామాంతపూర్‌లోని ఎస్వీ డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ రాధాకృష్ణరెడ్డిని అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి బుధవారం తెలిపారు. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆర్కే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసిన విషయం విదితమే. ఉస్మానియా యూనివర్శిటీకి (ఓయూ) సంబంధించిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు గత ఏడాది అక్టోబర్‌లో జరిగాయి. దీని కోసం కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీ ఒకటి. సాధారణంగా పరీక్ష కేంద్రానికి యూనివర్శిటీ ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాల సెట్లను అందిస్తుంది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ సెంటర్లో పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య కంటే కొన్ని ఎక్కువగానే జవాబు పత్రాల సెట్లు ఇస్తుంది. దీన్నే ఆర్కే డిగ్రీ కాలేజ్ తమకు అనుకూలంగా మార్చుకుంది. సప్లమెంటరీ పరీక్ష రాసే 104 మంది విద్యార్థులతో కుమ్మక్కై వేరే కేంద్రానికి సంబంధించి హాల్‌టిక్కెట్ జారీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తమ కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది. వీరికోసం యూనివర్శిటీ నుంచి అదనంగా వచ్చే జవాబు పత్రాల సెట్లను వాడుకుంది. ఇందుకుగాను ఒక్కో సబ్జెక్ట్‌కు దాదాపు రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇలా మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొందరి పేర్లతో రెండేసి ఆన్సర్ షీట్లు సిద్ధమయ్యాయి. గతేడాది అక్టోబర్ 21న ఆర్కే డిగ్రీ కళాశాల కేంద్రంలో జరిగిన కంప్యూటర్ సైన్స్–3 పరీక్ష పేపర్లు దిద్దుతున్న యూనివర్శిటీ పరీక్షల విభాగం అధికారులు ఈ మాల్ ప్రాక్టీస్ స్కామ్‌ను పసిగట్టారు. ఆర్.హరికృష్ణ అనే విద్యార్థి పేరుతో రెండు ఆన్సర్ బుక్లెట్స్ వర్శిటీకి వచ్చాయి. ఇతడికి పరీక్ష కేంద్రంలో 7257771 నెంబర్‌తో కూడిన బుక్లెట్ ఇవ్వగా... దీంతో పాటు 7257384 నెంబర్‌తో కూడిన బుక్లెట్ సైతం అతడి నుంచి కాలేజీ ద్వారా వర్శిటీకి చేరింది. దీంతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇతడి ఫలితాన్ని ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ వర్శిటీ అధికారులను సంప్రదించగా... ఆర్కే కాలేజీ నుంచి అటెండెన్స్ షీట్ తీసుకురావాల్సిందిగా సూచించారు. హరికృష్ణ తీసుకువెళ్లిన షీట్లో ఉన్న వివరాల ప్రకారం 7257771 బుక్లెట్ అతడికి జారీ అయింది. దీనిపై చీఫ్ సూపరింటెండెంట్ ముద్ర ఉండగా... 7257384 నెంబర్‌తో కూడిన బుక్లెట్పై కాలేజీ ప్రిన్సిపాల్ ముద్ర ఉంది. దీంతో లోతుగా ఆరా తీసిన అధికారులు మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించారు. ఈ కేంద్రంలో పరీక్ష రాసిన మొత్తం 104 మంది విద్యార్థులు దీనికి పాల్పడినట్లు తేల్చారు. వీరికి వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించినా... పరీక్ష రాసింది మాత్రం ఆర్కే కాలేజీలో అని తేల్చారు. వర్శిటీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కాలేజీ యాజమాన్యం, చీఫ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్స్ తదితరులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్‌కు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎస్సై బి.జగదీశ్వర్‌రావు మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించిన సమాధాన పత్రాలతో పాటు అనేక ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి కాలేజీ ప్రిన్సిపాల్ స్వర్ణలత పాత్ర రూఢీ కావడంతో గతంలో ఆమెను తాజాగా రాధాకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. ఈ 104 మంది విద్యార్థులను కొందరు దళారులు ఆర్కే డిగ్రీ కాలేజీ నిర్వాహకుల వద్దకు తీసుకువచ్చినట్లు పోలీసులు తేల్చారు. నగదు చెల్లించి మాల్ ప్రాక్టీస్ ద్వారా పరీక్ష రాసిన నేపథ్యంలో వీరినీ నిందితుల జాబితాలో చేర్చారు. -
డీఎడ్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్..!
మైదుకూరు టౌన్ : ఉపాధ్యాయ ఎంపిక కోసం డీఎడ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే డీఎస్సీ పరీక్ష రాసేందుకు అర్హులౌతారు. తమ సొంత పనులు చేసుకుంటూ డీఎడ్ చదివినట్లు సర్టిఫికెట్లు పుట్టించేందుకు అభ్యర్థులు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన యాజమాన్యాలు అభ్యర్థుల దగ్గర భారీగా డబ్బులు తీసుకుని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. మైదుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో రెండు రోజులు నుంచి డీఎడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రానికి చాపాడు మండలంలోని చాపాడు, చిన్నగులవలూరు, మైదుకూరు బాలశివా డీఎడ్ కళాశాల విద్యార్థులు 305మందికి గాను శుక్రవారం 284 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసే విద్యార్థులు కళాశాలకు వెళ్లకుండా ఫీజులు పరీక్షలు రాస్తామని ముందే యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంటారు. దీంతో పరీక్ష సమయంలో ఆ కళాశాలల యాజమాన్యమే విద్యార్థుల వద్ద డబ్బును వసూలు చేసి ఎవరైతే చీఫ్‌గా ఉంటారో, వారిని స్క్వాడ్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటారు. దీంతో పరీక్ష రాసే విద్యార్థులు యాజమాన్యాలను నమ్మి వారికి లక్షల రూపాయలు కట్టబెడుతున్నారు. అధికారుల కనుసన్నల్లో కాపీయింగ్... డీఎడ్ పరీక్ష ఉదయం 9.30గంటలకు ప్రారంభమై 12గంటలకు ముగుస్తుంది. అయితే పరీక్ష ప్రారంభం కొద్ది సేపు ముందు భాగంలో గేటుకు తాళం వేయించి ఏ ఒక్కరూ లోపలికి రాకుండా అధికారులే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారికి పుస్తకాలను, మైక్రోజిరాక్స్‌లను అందిస్తున్నారు. పరీక్ష కేంద్రంలో బిట్స్‌ను చెప్పేందుకు అధికారి సమీపం వారైన ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా వేయించి వారిచేత బిట్స్, చీటీలను అందిస్తున్నారు. డబ్బులు కట్టిన వారికి ఒక విధంగా, కట్టనివారికి ఒక విధంగా పరీక్ష హాల్లో జరుగుతున్నట్లు పరీక్ష రాసే విద్యార్థులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కిటీకిల వద్ద పరీక్షకు సంబంధించిన చీటీలు, పుస్తకాలు అక్కడే ఉన్నాయని పరీక్ష అధికారి వివరణ కోరగా అవేమో తెలియదు.. పరీక్షలు మాత్రం పూర్తి నిఘాతో నిర్వహిస్తున్నామని అధికారులు నమ్మబలుకుతున్నారు. భావి తరాల ఉపాధ్యాయులే పరీక్ష సమయంలో ఇలా మాస్ కాపీయింగ్ పాల్పడితే రాబోవు విద్యార్థులు ఏవిధంగా పరీక్షలు నిర్వహిస్తారో అట్లే అర్థం అవుతుంది. నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పరీక్ష అధికారులే ఇలా అవినీతికి పాల్పడటం సరైన పద్దతికాదు. కాపీలు కొట్టించడం లేదు పరీక్ష కేంద్రం చీఫ్ సత్యనారాయణను కాపీయింగ్‌పై వివరణ కోరగా గట్టి నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు విషయాన్ని డీఈఓకు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిట్టింగ్ స్క్వాడ్ ఎంఈఓ పద్మలతను వివరణ కోరగా కాపీలు జరగడం లేదన్నారు. -
'ఓపెన్'చిట్టీలతో చిక్కులు
కర్నూలు సిటీ: ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర పరీక్షలను చిట్టీల వ్యవహారం అధికమైంది. ఇందులో చాలా కొందరు ఉపాధ్యాయుల ప్రమేయం ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు సంబంధించి నాలుగు డివిజన్లలో 29 కేంద్రాల్లో ఈ నెల 30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పదవ తరగతి పరీక్షలకు 3005 మంది, ఇంటర్ పరీక్షలకు 3213 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షల పర్యవేక్షణకు విద్యాశాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లా అబ్జర్వర్‌గా ప్రభుత్వ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ ఎలా ఉన్నా ఆదోని, డోన్ డివిజన్లలోని కేంద్రాల్లో కొందరు ఉపాధ్యాయులే పరీక్షలు రాసే వారి నుంచి డబ్బులు వసూలు చేసి పాస్‌కు గ్యారంటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సదరు ఉపాధ్యాయులు చిట్టీల వ్యవహారానికి తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. డోన్ డివిజన్లోని ఓ బాలికోన్నత పాఠశాలలో ఈ నెల 24న పరీక్ష కేంద్రంలో ఓ టీచర్ తాను ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న గదిలో కాకుండా పక్క గదిలో విద్యార్థికి చిట్టీలు ఇస్తూ సిట్టింగ్ స్క్వాడ్‌కు పట్టుబడ్డారు. జిల్లా అబ్జర్వర్ విచారించి సదరు టీచర్‌పై చర్యల నిమిత్తం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి నివేదించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి డీఈఓ తాహెరా సుల్తానాను వివరణ కోరగా మంగళవారం డోన్ హైస్కూల్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఇన్విజిలేటర్‌ను తప్పించామన్నారు. డిప్యూటీ ఈఓతో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బేరం కుదిరితే పరీక్షంతా ఓపెనే..
సాక్షి, మెట్పల్లి(కోరుట్ల): కాసులిస్తే చాలు.. ఆ పరీక్ష కేంద్రంలో సిబ్బంది కాపీయింగ్‌కే కాదు ఏకంగా అభ్యర్థులకు బదులు వారిస్థానంలో ఇతరులు వచ్చి పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. బేరం కుదిరితే దగ్గరుండి చిట్టీలు అందించి ఉత్తీర్ణతకు సహకరిస్తారు. మెట్‌పల్లిలోని ఓపెన్ డిగ్రీ పరీక్ష కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ‘ఓపెన్’గా అక్రమాలు జరుగుతున్నాయి. మాస్‌కాపీయింగ్‌కు ప్రత్యేకం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు పేరొందిన మెట్పల్లి కేంద్రంలో కొత్త అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకాలం కేవలం చిట్టీలతో కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే ప్రచారం ఉన్న ఈ కేంద్రంలో తాజాగా ఒకరికి బదులు ఇతరులు పరీక్ష రాస్తున్న విషయం బయటపడింది. సిబ్బంది అండతో బహిరంగంగా సాగుతున్న ఈ వ్యవహారంలో బుధవారం కథలాపూర్ ఎంపీపీ తొట్ల నర్సు భర్త తొట్ల అంజయ్యకు బదులు మరో యువకుడు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. ఇదీ జరిగింది... పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత సోమవారం నుంచి ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ విద్యార్థుల స్థానంలో ఇతరులు పరీక్ష రాస్తున్నారని కొందరు ప్రిన్సిపాల్ ఆబిద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పట్టించుకోలేదు. అబ్జర్వర్ హరిశంకర్‌కు తెలుపగా ఆయన విద్యార్థుల వద్దకు వెళ్లి హాల్ టిక్కెట్లు పరిశీలించారు. తోట్ల అంజయ్య అనే పేరుతో పరీక్ష రాస్తున్న ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి ఆన్లైన్లో పరిశీలించారు. అందులో మరో వ్యక్తి ఫొటో ఉండడంతో పరీక్ష రాస్తున్న వ్యక్తి నకిలీ అని తేలింది. అసలు వ్యక్తి కథలాపూర్ ఎంపీపీ భర్త కాగా, అతని స్థానంలో కోరుట్లకు చెందిన ఓ యువకుడి ఫొటోను మార్పింగ్ చేసి హాల్ టిక్కెట్ సృష్టించారు. దాంతో యువకుడు పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. కొద్దిసేపటికి అక్కడి వచ్చిన పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. సిబ్బంది అండతో పరీక్షకు వచ్చినట్లు ఆ యువకుడు చెప్పడం కొసమెరుపు. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ కూతురిని వదిలేసిన వైనం ? కేంద్రంలో ఓ కానిస్టేబుల్ కూతురు కూడా తన సోదరి స్థానంలో మూడ్రోజులుగా పరీక్షకు హాజరవుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా సిబ్బంది సహకారంతోనే సాగుతున్నట్లు తెలిసింది. యువకుడు పట్టుబడిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆమెను పరీక్ష మధ్యలోనే కేంద్రం ఉంచి బయటకు పంపడం గమనార్హం. -
అంతా ఓపెన్..!
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): తెలంగాణ రాష్ట్ర ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలు వసూలు రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కలెక్టర్, డీఆర్వో సమీక్షలు పరీక్షల నిర్వహణ తీరును మార్చలేకపోయాయి. ఆది నుంచీ అదే తీరు కొనసాగుతోంది. పరీక్షలకు ముందుగానే వసూళ్లకు పాల్పడటంతో చివరకు కలెక్టర్ ఆదేశించినా నిర్వహణలో మార్పు రాలేదు. ఒకదశలో కొంత పకడ్బందీగా నిర్వహించడంతో డబ్బులు ఇచ్చిన అభ్యర్థుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాస్ కాపీయింగ్, ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయించడం మొదటి నుంచి కొనసాగుతూ వచ్చంది. హెచ్చరికలు తుంగలోకి.. ఓపెన్ పరీక్షల్లో అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు విధు లు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టికి వెళ్లింది. వీరే మాస్‌కాపీయింగ్, చూచిరాతలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కమిషనర్ శనివారం అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లకు పరీక్ష విధుల నుం చి తప్పించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే వాటి ని తుంగలోకి తొక్కి ఆదివారం వారు యథావిధిగా వి ధులు నిర్వహించినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లాకేం ద్రంలోని శంకర్‌భవన్, మాణిక్‌భవన్, ఖిల్లా, దుబ్బ, ఆర్మూర్‌లోని ఓ పరీక్షాకేంద్రంలో అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు విధులు నిర్వహించినట్లు సమాచారం. బాన్సువాడలో ఒకరికి బదులు మరొకరు.. బాన్సువాడ టౌన్: పట్టణంలోని కోన బాన్సువాడ ఉన్నత పాఠశాలలో కొనసాతున్న ఓపెన్ ఎస్సెస్సీ పరీక్షలకు ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాసిన విషయంలో ప్రభాకర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఓపెన్ టెన్త్ సాంఘిక శాస్త్రం పరీక్షకు కారెగాం తండాకు చెందిన రమావత్ నారాయణకు బదులుగా ప్రభాకర్ అనే వ్యక్తి పరీక్ష రాస్తున్నాడు. దీంతో పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని సీఎం తెలిపారు. హెచ్ఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ‘సమూల మార్పులు’ ఇవ్వని ఫలితం ఓపెన్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతుండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్వో వినోద్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు(డీవో), ఇన్విజిలేటర్లను సమూలంగా మార్చేయాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అధికారులు వీరిని పూర్తిగా మార్చేసి విధులు కేటాయించారు. అయినా పాత కథే. మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. అదే రీతిలో పరీక్షలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్, ఫ్లయింగ్‌స్క్వాడ్స్ పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పరీక్షలు ముగిసే సమయంలో వచ్చి తూతూమంత్రంగా తనిఖీలు చేసి వెళ్లిపోతుండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది మాల్‌ప్రాక్టిస్ కేసులు.. నిజామాబాద్ జిల్లాలో సాగుతున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో ఆదివారం 8 మాల్‌ప్రాక్టిస్ కేసులు నమోదయ్యాయి. ఎస్సెస్సీలో ఐదోరోజు సాంఘికశాస్త్రం పరీక్ష జరిగింది. 8 కేంద్రాల్లో 1654 మంది అభ్యర్థులకు 1534 మంది హాజరు కాగా, 120 మంది రాయలేదు. ఇంటర్లో ఐదోరోజు కెమిస్ట్రీ పరీక్షను నిర్వహించారు. 3 కేంద్రాల్లో 179 మంది అభ్యర్థులకు 160 మంది హాజరుకాగా, 19 మంది గైర్హాజరయ్యారు. మాల్ ప్రాక్టిస్ కేసుల్లో శంకర్‌భవన్‌లో ఇద్దరు, కోటగల్లి బాలికల పాఠశాలలో ఇద్ద రు, మాణిక్‌భవన్‌లో నలుగురు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. మాణిక్‌భవన్ పరీక్షాకేంద్రంలో చూచిరాతలు, ఒకరికి బదులు మరొకరు, ఇద్దరు ఒ కేచోట కూర్చొని పరీక్షలు రాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. -
దూరవిద్యలో మాస్ కాపీయింగ్!
సాక్షి, హైదరాబాద్: దూర విద్య (ఓపెన్ స్కూల్) ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. పరీక్ష కేంద్రాలతో స్టడీ సెంటర్లు కుమ్మక్కై దందాకు తెరతీశాయి. విద్యార్థుల నుంచి భారీ వసూళ్లు చేసి పరీక్షల్లో చూసి రాసుకునేందుకు అవకాశం కల్పించాయి. ఈ వ్యవహారంలో ఓపెన్ స్కూళ్ల కోఆర్డినేటర్లే దళారులుగా మారి వసూళ్లకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో కోఆర్డినేటర్ తమ స్కూల్ విద్యార్థులు పరీక్ష రాసే సెంటర్ కోఆర్డినేటర్‌తో ముందే మాట్లాడుకొని ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మరికొన్ని కేంద్రాలైతే మరో అడుగు ముందుకేసి ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిర్యాలగూడ కేంద్రంగా.. మిర్యాలగూడ ప్రాంతంలోని పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ పూర్తయిన విద్యార్థులతో పరీక్ష కేంద్రం యాజమాన్యాలే ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. 10 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులను మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమించాలనే నిబంధన ఉంది. అయితే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని కూడా నియమించారు. మేడ్చల్, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లోని డివిజన్ కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనూ.. హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో కాపీయింగ్ వ్యవహారం భారీగా సాగుతున్నట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేవారికి పదోన్నతి కావాలంటే ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 35 వేల మందికిపైగా పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రధానోపాధ్యాయుడి స్థాయి వారిని కాకుండా తమకు అనుకూలంగా ఉండే స్కూల్ అసిస్టెంట్లను జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లుగా నియమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
అంతా..ఓపెన్
ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు అంతా ‘ఓపెన్’గానే జరుగుతున్నాయి. ఇంతకాలం మాస్‌కాపీయింగ్ యథేచ్ఛగా కొనసాగింది.. అది కొత్తపుంతలు తొక్కి ఏకంగా.. ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసే స్థాయికి చేరుకోవడం ఆ శాఖ అధికారులనిర్లక్ష్యాని కి నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షి, వరంగల్ రూరల్: ఓపెన్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఇంటర్ 1,047, టెన్త్‌లో 669 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. టీఎస్‌డబ్ల్యూ గురుకులంలో 197 మంది, నర్సంపేట జిల్లా పరిషత్ బాలుర, బాలిక పాఠశాలలో 472 టెన్త్ విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరకాలలో 488, నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ మోడల్ పాఠశాలలో 582 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. మూడు పువ్వులు..ఆరు కాయలు.. జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షల అక్రమ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. అభ్యర్థుల ప్రవేశాల నుంచే పాస్ గ్యారెంటీ అని హామీ ఇస్తూ పరీక్ష ఫీజులు తీసుకునేప్పటి నుంచి పైసలు లాగడం ప్రారంభిస్తున్నారు. హాల్ టికెట్ ఇచ్చేప్పుడే సెంటర్ నిర్వహణ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10వేల నుంచి రూ.12 వేల వరకు వసులు చేశారని సమాచారం. ‘అంతా మావాళ్లే ఉంటారు.. డబ్బులు ఇస్తే మీరు బుక్కులు పెట్టి రాసుకున్నా ఎవరూ ఏమీ అనరు’.. అని చెబుతూ పరీక్ష రాసే అభ్యర్థులను బుట్టలో వేసుకుంటున్నారు. అభ్యర్థులకు దగ్గరే ఉండి చిట్టీలు అందించడంతోపాటు ఒకరికి బదులుఇంకోకరితో పరీక్ష రాయిస్తున్నారు. ఇన్విజిలేటర్లు సైతం ఒక్కో పరీక్ష రూ.300 నుంచి రూ.500 వరకు వసులు చేస్తున్నారని సమాచారం. వాట్సప్‌లలో పరీక్ష పత్రాలు పరీక్ష ప్రారంభమైన పది నిమిషాలకే పరీక్ష పేపర్ వాట్సప్ ద్వారా బయటకు వస్తుంది. దీంతో ఆయా ఓపెన్ స్కూల్ సెంటర్ల నిర్వాహుకులు వాటికి సంబంధించిన జవాబులను తయారు చేసుకుని జీరాక్స్ పేపర్లను లోపలికి పంపిస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఒక గంటలో పరీక్ష పూర్తి చేసి బయటకు వస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాసేవారు, ఇన్విజిలేటర్లు సెల్ ఫోన్లు వాడొద్దని నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకున్నవారే లేరు. పట్టుబడుతున్న అభ్యర్థులు ఒకరికి బదులు ఇంకొకరు పరీక్ష రాస్తూ.. మాస్ కాపియింగ్‌కు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. ఈనెల 17న నర్సంపేటలో ఓపెన్ ఇంటర్ పరీక్షను ఒకరికి బదులు ఇంకొకరు రాస్తూ 23 మంది పట్టుబడ్డారు. మరో నలుగురు అభ్యర్థులు మాస్ కాపియింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. వీరిని స్క్వార్ పట్టుకున్నారు. ఈ వ్యవహారం ఇన్విజిలేటర్లకు తెలిసినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 18న పరకాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాలలో 14 మంది అభ్యర్థులు మాస్ కాపియింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఈ అక్రమ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మాస్ కాపీయింగ్నుప్రోత్సహిస్తే చర్యలు తప్పవు పరీక్షల్లో మాస్ కాపియింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు. పరీక్ష కేంద్రాలకు సిట్టింగ్ స్క్వాడ్లను సైతం ఏర్పాటు చేశాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. – నారాయణరెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి -
‘ఓపెన్’ నిర్వహణపై కలెక్టర్ సీరియస్!
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల నిర్వహణలో మాస్ కాపియింగ్‌కు రంగం సిద్ధం చేయడంపై ‘అంతా ఓపెన్’ అనే పతాక శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఓపెన్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సీరియస్ అయినట్లు సమాచారం. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను మార్చాలని, స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్లకు పరీక్షల విధులు ఎలా కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం వెంటనే సిట్టింగ్ స్క్వాడ్స్‌తో అన్ని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయించారు. ఎలాంటి అవకతవకలు, మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మమ అనిపించారు.. నిజామాబాద్‌లోని ఖిల్లా పరీక్ష కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినట్లు తెలిసింది. గేటు వద్ద ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడంతోనే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష కేంద్రంలోకి ఇతర వ్యక్తులను అనుమతించని అధికారులు ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాశారంటే ఈ పరీక్షల నిర్వహణ తీరును అద్దం పడుతోంది. మొదటిరోజు తెలుగు పరీక్షకు తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులనే ఎగ్జామినేషన్ డ్యూటీ వేయడం తీవ్ర ఆరోపణలకు దారితీస్తోంది. సిట్టింగ్ స్క్వాడ్ సైతం పరీక్ష కేంద్రాలకు చివరి నిమిషంలో అలా వచ్చి.. ఇలా వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇన్విజిలేటర్ తొలగింపు..? నగరంలోని దుబ్బ పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్‌పై తీవ్ర ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించినట్లు తెలిసింది. కాగా మొదటిరోజు దుబ్బ పరీక్ష కేంద్రం వద్ద ఓ అభ్యర్థి గొడవకు దిగారు. గతంలో డబ్బులిచ్చినా పాస్ చేయించలేదని, ఈ సారైనా పాస్ చేస్తారా.. లేదా అని ఇన్విజిలేటర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ పంచాయితీ కాస్త కలెక్టర్ దృష్టికి చేరడంతో ఆయన సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే ఆయనను ఇన్విజిలేటర్‌గా తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. అదేవిధంగా డబ్బులు వసూలు చేసి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న సీఎస్‌లను కూడా మార్చాలని ఆదేశించినట్లు తెలిసింది. స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్లకు ఎగ్జామినేషన్ విధులు కేటాయించడమే నిబంధనలకు విరుద్ధం. అందులోనా డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. నిబంధనలను బేఖాతర్ చేసి విధులు కేటాయించి అవకతవకలకు తెరలేపడం విద్యాశాఖలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాన్ని రచ్చకీడ్చింది. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు జిల్లాలో జరిగిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో మొదటిరోజే మాల్ప్రాక్టిక్ కేసు నమోదైంది. ఖిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ అభ్యర్థి నకల్ చీటిలతో పరీక్ష రాస్తుండగా సిట్టింగ్ స్క్వాడ్ బృందం పట్టుకుంది. కాగా మొదటిరోజు ఓపెన్ ఇంటర్ 3 పరీక్ష కేంద్రాల్లో 965 అభ్యర్థులకుగాను 876 మంది హాజరుకాగా 91 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఓపెన్ ఎస్సెస్సీ 8 కేంద్రాల్లో 1219 మందికిగాను 1127 అభ్యర్థులు హాజరు కాగా, 92 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సెలవుపైవెళ్లిన డీఈఓ జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేశ్ సెలవుపై వెళ్లారు. మంగళవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు వ్యక్తిగత సెలవు పెట్టినట్లు విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. ఇన్చార్జి డీఈఓగా అసిస్టెంట్ డైరెక్టర్ లాయక్అలీఖాన్ను నియమించారు. -
పాస్ గ్యారంటీ..!?
కొత్తగూడెం: తెలంగాణ సార్వత్రిక పీఠం ఆధ్వర్యంలో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలలో ఎలాంటి అక్రమాలు జగరకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఆయా సెంటర్ల నిర్వాహకులు మాత్రం విద్యార్థుల నుంచి పాస్ గ్యారంటీ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. అభ్యర్థులు ప్రతీ ఏడాది ఇలాగే నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడేనా.. అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తరగతులు లేకుండానే పరీక్షలకు.. రెగ్యులర్‌గా పది, ఇంటర్ మీడియట్ విద్యనభ్యసించలేనివారు సార్వత్రిక పీఠం ద్వారా చదువుకునేందుకు, రాష్ట్ర అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం ఓపెన్ తరగతులు నిర్వహిస్తోంది. ఇందుకోసం జిల్లాలో ఈ ఏడాది 21 అధ్యయన కేంద్రాలు నడిచాయి. దీనికి గాను జూలైలో నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్ వరకు అడ్మిషన్లు తీసుకుంటారు. అభ్యర్థులకు ప్రతి ఆదివారం, రెండో శనివారం, ఇతర సెలవు రోజుల్లో స్టడీ సెంటర్లలో తరగతులు నిర్వహించాలి. ఇందుకోసం ప్రభుత్వం స్టడీ సెంటర్ నిర్వాహకులకు ఒక్కో తరగతి సబ్జెక్టుకు రోజుకు పదో తరగతి భోదించే వారికి రూ.40, ఇంటర్ తరగతులు భోదించే వారికి రూ.60 చొప్పున చెల్లిస్తుంది. 30 అడ్మిషన్లు దాటిన కేంద్రానికి అదనపు చెల్లింపులు ఉంటాయి. హాజరు పట్టిక ద్వారా విద్యార్థుల అటెండెన్స్ నమోదు చేయాలి. తరగతుల బోధన తర్వాత ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. కానీ అనేక కేంద్రాల్లో తరగతులు నిర్వహించకుండానే పరీక్షలు రాయిస్తున్నారని సమాచారం. ఇష్టారీతిన వసూళ్లు.. రెగ్యులర్‌గా చదవలేనివారితో పాటు ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం ఈ విద్యను అభ్యసించేవారు ఎక్కువగా ఉంటారు. వారి అవసరాలను ఆసరాగా తీసుకుంటున్న నిర్వాహకులు వేల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష ఫీజు రూ.1200 కాగా, పాస్ గ్యారంటీ పేరుతో ఆయా అభ్యర్థుల వద్ద రూ. 3,000 నుంచి 10 వేల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అ«ధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్న నేపథ్యంలో స్టడీ సెంటర్ నిర్వాహకుల మాటలు నమ్మి తరగతులకు హాజరు కాకుండానే పరీక్షలు రాసేవారు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. జిల్లాలో ఓపెన్ పరీక్షలలో 4 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారని అధికారులు చెపుతుండడం దీనికి నిదర్శనం. అంతేకాక స్టడీ సెంటర్ నిర్వాహకులు సకాలంలో పుస్తకాలు పంపిణీ చేయకపోవడం, తరగతులు నిర్వహించకపోవడంతో ఆసక్తి ఉన్నా పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఉమ్మడి జిల్లా కేంద్ర అధికారులు పర్యవేక్షించాలి. కానీ వారు సక్రమంగా పట్టించుకోకపోవడంతో స్టడీ సెంటర్ల వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నేటి నుంచి పరీక్షలు... ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు మంగళవారం ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్తగూడెంలోని ఆరు కేంద్రాలలో పదో తరగతి పరీక్షలకు 1065 రెగ్యులర్, 679 మంది సప్లిమెంటరీ విద్యార్థులు, ఇంటర్ అభ్యర్థులు 5 కేంద్రాల్లో 805 మంది రెగ్యులర్, 473 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్నారు. మంగళవారం నుంచి మే 1 వరకు, ఉదయం 8.30 నుంచి 11.30 గంటల మధ్య పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి కేంద్రంలో రెవెన్యూ శాఖ వారిచే సిట్టింగ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ లతో పాటు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్స్ కమిటీ, హై పవర్ కమిటీలను ఏర్పాటు చేశామని, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఆయా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హాల్ టికెట్లను స్టడీ సెంటర్ నిర్వాహకులు జారీ చేయకపోతే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోనే పరీక్షలు ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది జిల్లా కేంద్రంలోని 11 సెంటర్లలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశాం. అభ్యర్థులు దళారుల మాటలు నమ్మకుండా మంచిగా చదివి పరీక్షలకు హాజరు కావాలి. మాస్ కాపీయింగ్‌కు పాల్పడినా, వారికి సిబ్బంది సహకరించినా సీసీఏ రూల్స్ 1991 ప్రకారం క్రమశిక్షణ చర్యలు, 25/1997 చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. – డి.వాసంతి, డీఈఓ -
ఆర్థిక స్వార్థం వల్లే టెన్త్ పరీక్షల్లో కాపీయింగ్
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఆర్థిక స్వార్థం వల్లే పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ప్రగతితీరుపై ఆయన సమీక్షించారు. ఇటీవల నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో చాలాచోట్ల కాపీలు జరిగాయంటే డబ్బులే ప్రధాన కారణంగా భావిస్తున్నానని, డబ్బులు తీసుకుని కాపీలను ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. ఒక విద్యార్థి విషయంలో డీఈఓ మళ్లీ పరీక్ష రాయించడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు. ఏ అధికారంతో ఒక విద్యార్థితో తిరిగి జవాబులు రాయించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ విధానం ద్వారా అవినీతికి అడ్డుకట్ట జిల్లాలో హాస్టళ్లలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేయడం వల్ల అవినీతికి అడ్డుకట్ట వేయగలిగామని కలెక్టర్ భాస్కర్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గురువారం సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు తీరు, స్కాలర్‌షిప్‌ల జారీ వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో 8 వేలమంది విద్యార్థులను చేర్చుకోగా అందులో 6,700 మంది హాజరవుతున్నట్టు ఇన్నాళ్లూ అధికారులు లెక్కలు చూపించారని, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయడంతో హాస్టళ్లలో ఉండేవారి సంఖ్య కేవలం 4,800 మందికి మించలేదన్నారు. డీఈఓ సీవీ రేణుక, అదనపు జేసీ షరీఫ్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ రంగలక్ష్మీ దేవి, బీసీ సంక్షేమశాఖాధికారి జి.లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించాలే తప్ప మరణాల సంఖ్యను తగ్గిస్తామంటూ నివేదికలు సమర్పించడం ఏమిటని కలెక్టర్ భాస్కర్ రవాణా శాఖాధికారులను ప్రశ్నించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి జిల్లా స్థాయి రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశానికి కలెక్టర్ భాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. 9 నుంచి సమ్మెటివ్ పరీక్షలు ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ఏప్రిల్ 9వ తేదీ నుంచి సమ్మెటివ్(ఎస్ఏ –2) పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈఓ సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ(ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ రామకృష్ణారెడ్డి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిపారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ 1 నుంచి 9వ తరగతి వరకూ ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వీటిలో భాగంగా 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులకు ఏప్రిల్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. మార్పులకు అనుగుణంగా జివి మాల్ ఏలూరు (మెట్రో): రిటైల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టెక్స్టైల్స్ రంగంలో నూతన ఒరవడి సృష్టించేందుకు జివి మాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మాల్ ఎమ్‌డి జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆకర్‡్షప్రైడ్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని దుకాణాల కంటే భిన్నంగా 365 రోజులు ఒకే ధరను తమ మాల్లో వస్త్రాలపై నిర్ణయించామని చెప్పారు. లక్కీషాపింగ్మాల్ అధినేత రత్తయ్య, ఏలూరు జివి మాల్ అధినేత కె.రామకృష్ణ పాల్గొన్నారు. -
పైసలిస్తేనే..
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో గతేడాది జరిగిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో భారీ మాస్ కాపీయింగ్ చోటు చేసుకుందని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) నిర్థారించింది. ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీ నిర్వాహకులు 104 మంది విద్యార్థులతో తమ కేంద్రంలో అక్రమంగా పరీక్ష రాయించినట్లు తేల్చారు. ఒక్కో విద్యార్థి నుంచి సబ్జెక్ట్‌కు గరిష్టంగా రూ.5 వేల చొప్పున వసూలు చేసి మాస్ కాపీయింగ్‌కు సహకరించినట్లు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ జి.స్వర్ణలతను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి కోసం సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీకి (ఓయూ) సంబంధించిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు గత ఏడాది అక్టోబర్‌లో జరిగాయి. ఇందుకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీ ఒకటి. సాధారణంగా పరీక్ష కేంద్రానికి యూనివర్శిటీ ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాల సెట్లను అందిస్తుంది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ సెంటర్లో పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య కంటే కొన్ని ఎక్కువగానే జవాబు పత్రాల సెట్లు ఇస్తుంది. దీనిని ఆర్కే డిగ్రీ కాలేజ్ తమకు అనుకూలంగా మార్చుకుంది. సప్లిమెంటరీ పరీక్ష రాసే 104 మంది విద్యార్థులతో మిలాఖత్ అయి... వేరే కేంద్రానికి సంబంధించి హాల్‌టిక్కెట్ జారీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తమ కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం కల్పించింది. వీరికోసం యూనివర్శిటీ నుంచి అదనంగా వచ్చే జవాబు పత్రాల సెట్లను వాడుకుంది. ఈ విద్యార్థుల నుంచి ఒక్కో సబ్జెక్ట్‌కు దాదాపు రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొందరి పేరుతో రెండేసి ఆన్సర్ షీట్లు సిద్ధమయ్యాయి. గుట్టుగా సాగిన ఈ వ్యవహారాన్ని యూనివర్శిటీ అధికారులు గుర్తించారు. అక్టోబర్ 21న ఆర్కే డిగ్రీ కళాశాల కేంద్రంలో జరిగిన కంప్యూటర్ సైన్స్–3 పరీక్ష పేపర్లు దిద్దుతున్న యూనివర్శిటీ పరీక్షల విభాగం అధికారులు ఈ మాల్ ప్రాక్టీస్ స్కామ్‌ను పసిగట్టారు. ఆర్.హరికృష్ణ అనే విద్యార్థి పేరుతో రెండు ఆన్సర్ బుక్లెట్స్ వర్శిటీకి వచ్చాయి. అతడికి పరీక్ష కేంద్రంలో 7257771 నెంబర్‌తో కూడిన బుక్లెట్ ఇవ్వగా... దీంతో పాటు 7257384 నెంబర్‌తో కూడిన బుక్లెట్ సైతం అతడి నుంచి కాలేజీ ద్వారా వర్శిటీకి చేరింది. దీంతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అతని ఫలితాన్ని ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ వర్శిటీ అధికారులను సంప్రదించగా... ఆర్కే కాలేజీ నుంచి అటెండెన్స్ షీట్ తీసుకురావాల్సిందిగా సూచించారు. హరికృష్ణ తీసుకువెళ్లిన షీట్లో ఉన్న వివరాల ప్రకారం 7257771 బుక్లెట్ అతడికి జారీ అయింది. దీనిపై చీఫ్ సూపరింటెండెంట్ ముద్ర ఉండగా... 7257384 నెంబర్‌తో కూడిన బుక్లెట్పై కాలేజీ ప్రిన్సిపాల్ ముద్ర ఉంది. దీంతో లోతుగా ఆరా తీసిన అధికారులు మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించారు. ఏకంగా బుక్‌లెట్స్‌ను విద్యార్థులకు ముందే అందించిన ఆర్కే కాలేజ్ కేంద్రంగా దీనికి సహకరించినట్లు యూనివర్శిటీ అధికారులు గుర్తించారు. ఈ కేంద్రంలో పరీక్ష రాసిన మొత్తం 104 మంది విద్యార్థులు దీనికి పాల్పడినట్లు తేల్చారు. వీరికి వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించినా... పరీక్ష రాసింది మాత్రం ఆర్కే కాలేజీలో అని తేల్చారు. దీంతో వర్శిటీ అధికారులు ఓయూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ కాలేజీ యాజమాన్యం, చీఫ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్స్‌తో పాటు అనేక మంది విద్యార్థులపై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ, ఏపీ పబ్లిక్ ఎగ్జామ్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్‌కు అప్పగించారు. అదనపు డీసీపీ జోగయ్య, ఏసీపీ టి.లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఎస్సై బి.జగదీశ్వర్‌రావు దర్యాప్తు చేపట్టి మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించిన సమాధాన పత్రాలతో పాటు అనేక ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి కాలేజీ ప్రిన్సిపాల్ పాత్ర రూఢీ కావడంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ 104 మంది విద్యార్థులను కొందరు దళారులు ఆర్కే డిగ్రీ కాలేజీ నిర్వాహకుల వద్దకు తీసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఎవరు అనే అంశంతో పాటు ఈ స్కామ్‌లో మిగిలిన నిందితులను గుర్తించేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్వర్ణలతను న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
హడావుడి.. గందరగోళం!
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. ఎక్కడా ఆరోపణలకు తావివ్వం. కాపీయింగ్ జరగకుండా అరికడతాం. పరీక్షల పారదర్శకత కోసమే ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో నియమిస్తున్నాం. ఎక్కడైనా కాపీయింగ్‌కు పాల్పడితే యాక్టు 25ను అమలు చేస్తామని విద్యాశాఖాధికారుల డీంబకాలు తప్ప ఎక్కడా అమలు జరిగిన దాఖలాలు కనిపించలేదు. పరీక్షల్లో అంతా హడావుడి ఆర్భాటం చేశారే తప్ప కొత్తగా సాధించిందేమీ లేదు. అటు పిల్లలను, ఇటు ఇన్విజిలేటర్లను భయాందోళనకు గురి చేసి బయటనుంచి కాపీలను రాకుండా కొంతమేర అరికట్టారేమోకానీ కొన్ని పరీక్షా కేంద్రాల్లో మాత్రం మాస్‌కాపీయింగ్, చూచిరాతలు జోరుగా సాగాయి. దీంతోపాటు చాలా చోట్ల కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజామాన్యం డబ్బులను ఎరవేసి తమకు అనుకూలమైన చీఫ్, డిపార్టుమెంట్ అధికారులతోపాటు ఇన్విజిలేటర్లను నియమించుకుని తమ పనిని చక్కబెట్టుకున్నారని జోరుగా ఆరోపణలు వచ్చాయి. ప్రొద్దుటూరు డిప్యూటీ డీఈఓ ఇటీవలే కొత్తగా బాధ్యతలను తీసుకోవడం.. ఆ డివిజన్‌పై సరైన అవగాహన లేకపోవడం తదితర కారణాలతో ప్రొద్దుటూరులో కూడా జోరుగా మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇ రాయచోటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక్కడ చాలామంది చీఫ్, డిపార్టుమెంట్ అధికారులతోపాటు ఇన్విజిలేటర్లు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి లోలోపల జోరుగా కాపీయింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఈ ఏడాది అర్హత లేని వారిని కూడా స్క్వాడ్ వి«ధుల్లో నియమించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. పులివెందుల,వీఎన్‌పల్లి, ఎర్రగుంట్ల, ఖాజీపేట, మఠం, రాజంపేటలో కూడా కాపీయింగ్ ఆరోపణలున్నాయి. పకడ్బందీగా నిర్వహించాం:పది పరీక్షలను ఈ ఏడాది చాలా పకడ్బందీగా నిర్వహించాం. ఆరోపణలు వచ్చిన ప్రతిచోట గట్టి నిఘాను ఉంచి పరీక్షలను ప్రశాంతంగా నడిపించాం. కాపీయింగ్‌ను అరికట్టాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని పరీక్ష విధుల నుంచి కూడా తొలగించాం. పరీక్షలు ప్రశాతంగా ముగిశాయి. – పొన్నతోట శైలజ, డీఈఓ -
మాస్‌కాపీయింగ్ వెనక డీఈవో హస్తం
జగిత్యాలటౌన్: జిల్లాలోని కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మాస్ కాపీయింగ్ వెనక డీఈవో హస్తం ఉందని.. అనవసరంగా ఉపాధ్యాయులను బలి చేశారని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గోదా సత్యనారాయణ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డీఈవో పట్టించుకోలేదన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. పాఠశాలల అవకతవలపై రాష్ట్ర అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్య సమితి సభ్యులు రెంటం జగదీశ్, జిల్లా కన్వీనర్ చింత అనిల్, మహిళా జిల్లా ఇన్చార్జి రాధ, జ్యోతి, నిఖిల్, శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వాట్సాప్‌లో ‘పది’ప్రశ్నపత్రం
ఖానాపూర్: పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో బయటకు వచ్చింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం వెలుగు చూసింది. సీఐ ఆకుల అశోక్, ఎస్ఐ కొల్లూరి వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదో తరగతి ఫిజికల్ సైన్స్ పేపర్–1 పరీక్ష ప్రారంభం అయిన గంటకే వాట్సాప్‌లో బయటకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో మాస్‌కాపీయింగ్ కోసం ఉపాధ్యాయులు, సిబ్బంది జవాబు పత్రాలను సిద్ధం చేస్తుండగా వారిని గుర్తించారు. ఈ మేరకు యాజమాన్యాన్ని విచారించగా.. మరో ప్రైవేట్ పాఠశాలలో చదివే ప్రముఖ వ్యాపారి రమణప్రశాంత్ కూతురు కోసం జవాబు పత్రాలు సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. సంబంధిత వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన మిత్రుడైన లక్ష్మణచాంద మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయుడు సద్దు మన్మథరెడ్డి ద్వారా తనకు వాట్సాప్ ప్రశ్నపత్రం వచ్చిందని తెలిపాడు. వెంటనే వాట్సాప్ ద్వారా ఆ పేపర్‌ను ప్రైవేట్ పాఠశాల పీఈటీ గంగాధర్‌కు షేర్ చేసినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం మన్మథరెడ్డి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకొని అసలు సూత్రధారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, అలాగే రమణ ప్రశాంత్‌తో పాటు పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది గంగాధర్, ఎస్.రవికుమార్, ఇప్ప సాయన్న, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఒకరి సస్పెన్షన్: డీఈవో ఈ ఘటనపై ఉపాధ్యాయుడు మన్మథరెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈవో ప్రణిత తెలిపారు. ప్రశ్నపత్రం లీక్ అయిందని తన దృష్టికి రాగానే.. ఎంఈవో గుగ్లావత్ రాంచందర్‌తో కలసి పరీక్ష కేంద్రాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. ఇందులో ఏమైనా ప్రైవేట్ పాఠశాలల భాగస్వామ్యం ఉందా అనే కోణంలో సైతం విచారణ చేస్తామన్నారు. -
ఉపాధ్యాయుల మాస్ కాపీయింగ్
జగిత్యాలక్రైం: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు అడ్డదారి తొక్కారు. దొంగచాటున ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో పదోతరగతి పరీక్ష పత్రంలోని ప్రశ్నలకు జవాబులు రాస్తున్న ఉపాధ్యాయులను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా వారు పరారయ్యారు. ఇదే సమయంలో ఓ ప్రిన్సిపాల్ ఎస్ఐపై దాడికి యత్నించారు. మండల విద్యాధికారి సహా మొత్తం 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా.. వారిలో ఏడుగురిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన గురువారం జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో కలకలం సృష్టించింది. ఎస్ఐ సతీశ్‌కుమార్ కథనం ప్రకారం. పదోతరగతి పరీక్షల కోసం కొడిమ్యాలలోని మోడల్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్, పూడూరు జెడ్పీహెచ్ఎస్లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొడిమ్యాలలోని రెండు పరీక్ష కేంద్రాలకు జవాబులు రాసి విద్యార్థులకు చేర వేసేందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక రచించారు. వీరంతా ఎంఈవో కార్యాలయం సమీపంలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో కొడిమ్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణగౌడ్, కోనాపూర్ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు వడ్లకొండ రమేశ్, రాంసాగర్ స్కూల్ టీచర్ శ్రీనివాస్, కొడిమ్యాల కేజీబీవీ ప్రత్యేకాధికారి మంద లింగవ్వ, కేజీబీవీ మ్యాథ్స్ టీచర్ పద్మ, మోడల్‌స్కూల్ మ్యాథ్స్ టీచర్ రాధ ఉదయం 10.45 గంటలకు కలుసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ అక్కడికి చేరుకునే సరికి ఉపాధ్యాయులు జవాబులు రాస్తూ కనిపించారు. ఆయన రాకను గమనించిన ఐదుగురు ఉపాధ్యాయులు పారిపోయారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణగౌడ్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో ఎస్ఐపై దాడికి యత్నించారు. ఎస్ఐ ఫిర్యాదుతో మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసినట్లు మల్యాల సీఐ సీహెచ్.నాగేందర్ తెలిపారు. ఏడుగురి ఉపాధ్యాయుల సస్పెన్షన్ జవాబుపత్రాలు రాస్తున్నట్లు నిర్ధారణ కావడంతో ఏడుగురు ఉపాధ్యాయులను డీఈవో వెంకటేశ్వర్లు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణగౌడ్, కోనాపూర్ మ్యాథ్స్ టీచర్ వడ్లకొండ రమేశ్, రాంసాగర్ మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్, కొడిమ్యాల కేజీబీవీ ప్రత్యే కాధికారి మంద లింగవ్వ, కేజీబీవీ మ్యాథ్స్ టీచర్ పద్మ, మోడల్‌స్కూల్ మ్యాథ్స్ టీచర్ రాధతోపాటు ఇంటి యజమాని, సూరంపేట పాఠశాల ఉపాధ్యాయుడు సతీశ్‌ను సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. -
అక్కడేం జరుగుతోంది..!
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో అధికారుల కళ్లు రాయచోటి పరీక్షా కేంద్రాలపైనే ఉన్నాయి. గత కొనేళ్ల నుంచి ఇక్కడి కేంద్రాల్లో కాపీయింగ్ జోరుగా సాగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలు సంఘటనలు రుజువు కూడా అయ్యాయి. రాయచోటిలో పరీక్షల సమయానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు సిండికేట్ అవుతాయని, పరీక్ష విధులకు వచ్చే సిబ్బంది, స్క్వాడ్ సభ్యులను మెయింటెయిన్ చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. వీటిని అరికట్టాలని డీఈఓ శైలజ ఈ సారి పది పరీక్షలకు డైట్ ప్రిన్సిపాల్ చంద్రయ్యను స్పెషల్ అధికారిగా నియమించారు. ఆయన ప్రతి సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. రాయచోటి పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.ఒక్కో సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. అయినా అక్కడక్కడ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈనెల 15 నుంచి 20వ తేదీనాటికి పరీక్ష విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలతో 8మంది ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించగా... 21వ తేదీ బుధవారం ఒక్కరోజే 9 మంది ఇన్విజిలేటర్లు, ఇద్దరు చీప్ సూపరింటెండెంట్లు,, ఒక డిపార్టుమెంట్ అధికారిని పరీక్షల విధుల నుంచి తొలగించారు. మొత్తంగా పరీక్షలు జరిగిన ఆరు రోజుల్లో 20 మందిని తొలగించారంటే పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతోంది.విద్యాశాఖ అధికారులు పరీక్షల నిర్వహణకు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. -
జోరుగా మాస్ కాపీయింగ్
నెల్లూరు(టౌన్): గత ఏడాది మార్చి 15వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరిగాయి. నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో 21వ తేదీ స్థానిక ధనలక్ష్మీపురంలోని నారాయణ పాఠశాలలో ఫిజిక్స్ పేపర్ లీకైంది. ఈ లీక్ వ్యవహారంలో శ్రీచైతన్య పాఠశాల నిర్వాహకులు కూడా ఉన్నట్లు అప్పటి విద్యాశాఖాధికారులు తేల్చారు. అయితే నేటి వరకు ఆ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మళ్లీ ఈ ఏడాది నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాకపోతే గత ఏడాది పేపరు ‘పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకూడదు.. ఉత్తీర్ణత శాతం తగ్గినా ఫర్వాలేదు.. పిల్లలకు స్వచ్ఛందంగా తెచ్చుకున్న మార్కులనే తల్లిదండ్రులు, కలెక్టర్‌కు చెబుతాం.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే ఇన్విజిలేటర్లదే బాధ్యత. విద్యార్థులను డిబార్ చేయడంతో పాటు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తాం’ ఇది డీఈఓ కె.శామ్యూల్ చెప్పిన మాటలు. అయితే ఈ ఆదేశాలు చాలా ప్రాంతాల్లో అమలు కావడం లేదు. మెజార్టీ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరిగిపోతుంది. చీఫ్ సూపరింటెండ్లు, ఇన్విజిలేటర్లు కార్పొరేట్ ప్రలోభాలకు తలొగ్గి పనిచేస్తున్నారు. చాలా కేంద్రాల్లో పరీక్షలు ప్రైవే టు పాఠశాలల యాజమాన్యం కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఈ కేంద్రాల్లో ఇన్వి జిలేటర్లే బిట్ పేపరకు జవాబులు చెబు తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నా యి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యా జమాన్యాల లక్ష్యం ఒక్కటే 10కి10 పాయింట్లు తెచ్చుకోవడమే. జి ల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎన్ని ఆదేశాలు వచ్చినా, సంబంధిత ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినా మా స్ కాపీయింగ్ ఆగడం లేదు. మాస్ కాపీయింగ్‌ను ప్రో త్సహించే వారిని కాకుం డా తమను బలి పశువును చేస్తున్నారంటూ కొందరు ఉపాధ్యాయులు వా పోతున్నారు. ప్రైవేటు ´ ఠశాలల ప్రవేశంతో చూచిరాతలు సాగుతున్నాయి. నలుగురు విద్యార్థుల డీబార్, ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఇప్పటి వరకు జరిగిన పది పరీక్షల్లో నలుగుగురు విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా అధికారులు డిబారు చేశారు. సీతారాంపురంలోని ఏపీ మోడల్ హైస్కూల్లో ఈనెల 17న మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థినులను డిబారు చేశారు. వీరితో పాటు ఇద్దరు ఉపాధ్యాయలును సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఈ నెల 21న ఆత్మకూరులోని జెడ్పీ హైస్కూల్ కేంద్రాంలో మరో ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశారు. ఉపాధ్యాయుల సస్పెన్షన్‌పై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడం, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రిపోర్టులో బాధ్యులుగా లేకపోవడంతో ప్రస్తుతం సస్పెండ్ చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రైవేటు పాఠశాలలే కీలకం జిల్లాలో 32 ప్రైవేటు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. నారాయణ, శ్రీచైతన్య, కేకేఆర్, ఎస్ఆర్కే తదితర పాఠశాలలు ఉన్నాయి. గతంలో పదో తరగతికి మార్కులు ఉండేవి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం కొందరను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ప్రణాళికలు రచించే వారు. గత ఏడాది నుంచి గ్రేడు విధానాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలలో ఎక్కువ మందికి 10కి10 పాయింట్లు తెచ్చుకోవడమే వారి లక్ష్యం. నెల్లూరురూరల్ ప్రాంతంతో పాటు రాజుపాళెం, గూడూరు, నాయుడుపేట, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ప్రాంతాలో ఎక్కువ మాస్ కాపీయింగ్ జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. సీ కేంద్రాలుగా ప్రకటించిన 28సెంటర్లల్లో సీసీ కెమెరాలను బిగిస్తామని చెప్పిన అధికారులు ఆ జోలికే పోలేదు. తమకు కావాల్సిన ఇన్విజిలేటర్లను నియమించుకోవడంతో పాటు తమకు నచ్చిన వారని చీఫ్సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులను నియమించుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఒక్కొ ఇన్విజిలేటరు నాలుగు పరీక్ష కేంద్రాలకు మార్చుతామని చెప్పినా అక్రమాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిట్ పేపరుకు జవాబులు జిల్లాలోని అన్ని కేంద్రాల్లో బిట్ పేపరుకు ఇన్విజిలేటర్లే జవాబులు చెబుతున్నారనే ఆరోపణలున్నాయి. చాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్షల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చీఫ్ సూపరింటెండెంట్లు ద్వారా ప్రశ్నపత్రం ఉదయం 10 గంటలకు బయటకు వస్తుందనే ఆరోపణలున్నాయి. కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు పది పరీక్షల్లో ఎవరు మాస్ కాపీయింగ్ పాల్పడ్డా చర్యలు తప్పవు. మాస్ కాపీయింగ్‌లో ఉపాధ్యాయుని పాత్ర ఉన్నట్లయితే వారిని కూడా సస్పెండ్ చేస్తాం. పరీక్షలు చాల పకడ్బందీగా జరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురు విద్యార్థులను డిబార్ చేశాం ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశాం. –కె.శామ్యూల్, డీఈఓ -
సీఎస్ వర్సెస్ డీఓ
గణపురం(భూపాలపల్లి) : గణపురం మండలంలోని చెల్పూరు çపదో తరగతి పరీక్ష కేంద్రం నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్) ప్రభాకర్‌రెడ్డి, డిపార్టమెంటల్ అధికారి(డీఓ)నర్సింహచారి మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న గొడవలు వీధికెక్కాయి. పరీక్ష కేంద్రంలో ఒకరినొకరు దూషించుకుంటూ దాడి చేసుకునేందుకు యత్నించడంతో పరీక్షలు రాసే విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 16న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా గణపురం మండల కేంద్రంలో రెండుసెంటర్లతోపాటు చెల్పూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో సీఎస్ ప్రభాకర్‌రెడ్డి మొదటి రోజు నుంచి సెంటర్లో మాస్ కాపీయింగ్ నడుస్తున్నా పట్టించుకోవడం లేదని డీఓ నర్సింహచారి ఆరోపిస్తూ గొడవకు దిగుతున్నుట్ల సమాచారం. అందులో భాగంగా సోమవారం ఇంగ్లిష్ మొదటి పేపర్ పరీక్ష జరుగుతుండగా పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ చేతిలో చిట్టీ ఉండడం గమనించిన డీఓ ఆమె చేతిని లాక్కొని సీఎస్ వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఈ పెనుగులాటలో ఆమె చేతులకు ఉన్న గాజులు పగిలిపోయి గాయాలయ్యాయి. విద్యాసంస్థల యాజమాన్యాల వద్ద« డబ్బులు తీసుకుంటూ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నారంటూ సీఎస్ ప్రభాకర్‌రెడ్డితో డీఓ నర్సింహచారి గొడవకు దిగారు. రెండు రోజులపాటు పరీక్ష కేంద్రంలో ఈ తంతు నడుస్తుండడంతో విషయం తెలుసుకున్న డీఈఓ శ్రీనివాస్ రెడ్డి సంఘటనపై విచారణ జరపాలని గణపురం ఎంఈఓ చిలువేరు సురేందర్, వెంటాపురం ఎంఈఓ శాగర్ల అయిలయ్యను ఆదేశించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా డీఓను తొలగిస్తున్నట్లు ఆదేశా>లు జారీచేశారు. ఆయన స్థానంలో కర్కపల్లి పాఠశాల ప్రధానోపాద్యాయుడు భద్రయ్యను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తానికి సీఎస్, డీఓల మధ్య జరిగిన గొడవతో చెల్పూరు పదో తరగతి పరీక్షా కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే పరీక్ష కేంద్రాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి వారి సెల్ఫోన్లలో పరీక్ష పత్రాలను ఫొటోలు తీసుకొని వెళ్తున్నారని, మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘పది’లో మాస్ కాపీయింగ్..
బోధన్ టౌన్ : పట్టణంలోని బీటీనగర్‌లో గల ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి పరీక్ష కేంద్రంలో చిటీలు అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సోమవారం హాల్చల్ చేస్తున్నాయి. కొందరు యువకులు పరీక్ష కేంద్రం వద్ద చిటీలు అందించడానికి గోడలు ఎక్కిన దృశ్యాలను, విద్యార్థి సంఘాల నాయకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పరీక్షకేంద్రాల వద్ద పకడ్భందీగా ఏర్పాటుచేశామని, మాస్‌కాపీయింగ్‌కు తావులేదని అధికారులు చెబుతున్నా, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదికాగా సోమవారం పట్టణంలోని పరీక్ష కేంద్రాలను డీఈవో నాంపల్లి రాజేశ్ తనిఖీ చేశారు. -
మాస్‌కాపీయింగ్ చేస్తే డీబార్
వీరఘట్టం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే డీబార్ చేస్తామని, మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించే ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తామని రాష్ట్ర పరిశీలకులు ఎస్.అరుణకుమారి హెచ్చరించారు. వీరఘట్టంలో బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ ఇన్విజిలేషన్ నియామకాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చిలిచిలికి గాలివానలా మారడంతో గురువారం ఇన్విజిలేషన్ చేసిన ఉపాధ్యాయులను క్షణాల్లో రిలీవ్ చేసి వీరి స్థానంలో 22 మంది ఉపాధ్యాయులకు శుక్రవారం ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించారు. వెంటనే ఎంఈఓ జి.సుబ్రహ్మణ్యం ఈ రెండు పాఠశాలలకు చెరో 11 మందిని కేటాయించారు. అనంతరం అరుణకుమారి బాలుర, బాలికోన్నత పాఠశాలల పరీక్షా కేంద్రాల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. మంచి వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఇద్దరు హెచ్ఎంలు డి.నాగమణి, ఎం.వి.నర్శంగరావును ప్రశ్నించారు. ఇక మీదట జరగబోయే పరీక్షలన్నింటినీ పక్కాగా నిర్వహించాలని స ూచించారు. విద్యార్థులు బెంగ పడవద్దు ఉపాధ్యాయుల మధ్య జరిగిన తగాదా చివరకు పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా ముద్ర పడేలా చేసిందని అరుణకుమారి పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతుంటే ఎందుకు మాస్‌కాపీయింగ్ జరుగుతున్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులను ప్రశ్నించారు. ఎటువంటి బెంగ పడకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు సూచించారు. అయితే శుక్రవారం పరీక్షలు ప్రారంభమయినప్పటి నుంచి ముగిసే వరకు వరుసగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అధికారులు వచ్చి పరీక్షల తీరు పరిశీలించడంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్ స్క్వాడ్ల నియామకం టెన్త్ పరీక్షల సందర్భంగా వీరఘట్టం బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో మొదటి రోజు జరిగిన తగాదా నేపథ్యంలో రెండో రోజు ఇక్కడ సిట్టింగ్ స్క్వాడ్ల నియామకం జరిగింది. బాలుర ఉన్నత పాఠశాలలో సింహాద్రినాయుడు, బాలికోన్నత పాఠశాలలో పి.రామచంద్రరావు సిట్టింగ్ వేశారు. అన్ని గదులను పరిశీలించారు. ఇక ప్రతి రోజూ సిట్టింగ్ స్క్వాడ్లు వస్తుంటారని టెక్కలి ఉపవిద్యాశాఖాధికారి టి.జోగారావు తెలిపారు. అకారణంగా మమ్మల్ని ఎందుకు రిలీవ్ చేశారు వీరఘట్టం బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో మొదటి రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ రెండు హైస్కూల్ల్లో ఇన్విజిలేషన్ చేస్తున్న 22 మందిని శుక్రవారం విధుల నుంచి తప్పించడంపై పలువురు ఉపాధ్యాయులు మండిపడ్డారు. అకారణంగా మమ్మల్ని ఎందుకు తొలగించారంటూ రాష్ట్ర పరిశీలకులు ఎస్.అరుణకుమారిని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వదిలేసి ఇంత మందిని రిలీవ్ చేయడం సరైన విధానం కాదని పలువురు ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, రిలీవ్ అయిన వారందరూ తప్పు చేసినట్టు కాదని, పరిస్థితులను అర్ధం చేసుకోవాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు. -
చూచిరాత ఇ'లా'
న్యాయశాస్త్రం డిగ్రీ అంగట్లో సరుకులా మారింది. సెమిస్టర్ పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇందుకుగాను కళాశాల యాజమాన్యం విద్యార్థుల వద్ద నుంచి ప్రత్యేకంగా ఫీజులు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించా ల్సిన యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ కళాశాలకు దాసోహమనడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చూచిరాతల అవకాశం ఉండడంతోనే తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు న్యాయశాస్త్రం అభ్యసించేందుకు పుత్తూరును ఎంచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పుత్తూరు: విశ్వసనీయ వర్గాల సమాచారం మండల పరిధిలోని ఒక ప్రైవేట్ లా డిగ్రీ కళాశాల విద్యార్థులు గత వారం రోజుల నుంచి మరో ప్రైవేట్ కళాశాలలో పరీక్షలు రాస్తున్నారు. యథేచ్ఛగా పుస్తకాలు ముందర పెట్టుకుని పక్కపక్కనే కూర్చొని పరీక్షలను రాస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇందుకు పరీక్షా కేంద్రం యాజమాన్యం సహకరిస్తుండడం, యూనివర్సిటీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. చూచిరాతల కోసం లా విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యం ఏడాదికి ప్రత్యేకంగా రూ.15 వేల నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో పరీక్షా కేంద్రం యాజమాన్యాలకు, యూనివర్సిటీ అధికారులకు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు విద్యార్థుల క్యూ.. ప్రత్యేకించి పుత్తూరులో లా డిగ్రీ చదివేందుకు తమిళనాడుకు చెందిన వందలాది మంది విద్యార్థులు కొన్నేళ్లుగా క్యూ కడుతున్నారు. గతంలో తమిళ సినీ యాక్టర్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా పుత్తూరులోని ప్రైవేట్ లా కళాశాల విద్యార్థిగానే డిగ్రీ పరీక్షలకు హాజరుకావడం అప్పట్లో సంచలనమైంది. తమిళనాడులో లా డిగ్రీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తుండడంతో చూచిరాతలకు అనుకూలంగా ఉన్న పుత్తూరును ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర పట్టణాల నుంచే కాకుండా కేరళ నుంచి కూడా లా డిగ్రీ కోసం విద్యార్థులు పుత్తూరులోని ప్రైవేట్ కళాశాలను ఆశ్రయిస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా పరీక్షల అబ్జర్వర్ అందుబాటులోకి రాలేదు. -
జోరుగా మాస్ కాపీయింగ్
భువనగిరి : జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉండగా కొందరూ ఎగ్జామినర్లు మందులు, విందులు స్వీకరిస్తూ మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆలేరు మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లో మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్న ఇ ద్దరు ఎగ్జామినర్లను అధికారులు తొలగించారు. దీనిని బట్టి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాస్ కాపీయింగ్ ఏవిధంగా జరుగుతుందో ఇట్టే చెప్పవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 1వ తేది నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. 34 పరీక్ష కేంద్రాల్లో నాలుగు విడుతల్లో ఈ ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తున్నారు. మొదటి విడుత 1వ తేది నుంచి 5, రెండో విడుత 6 నుంచి 10, మూడో విడుత 11 నుంచి 16, నా లుగో విడుత 17నుంచి 21వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్స్ పరీక్షలకు 3,010 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఎంపీసీ 1,421, బైపీసీ 1,589మంది విద్యార్థులు ఉ న్నారు. ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు 1,313మంది విద్యార్థులు ఉన్నారు. పర్యవేక్షణ ఏదీ..? ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో పర్యవేక్షణ లేక మాస్‌కాపీయింగ్ జరుగుతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను నియమించారు. ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి ఆయా కోర్సులను బట్టి నిర్ణిత ల్యాబ్ ఫీజు కంటే అదనంగా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు కళాశాల యాజమాన్యాలు వసూలు చేశారు. దీంతో ఆయా కళా శాలల యాజమాన్యాలు ప్రాక్టికల్స్ కోసం వచ్చే ఎగ్జామినర్లకు మందు, విందు, తాయిలాల సౌకర్యాలు కల్పిస్తూ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేరుకు మాత్రమే సీసీ కెమెరాల ఎదుట ప్రశ్నాపత్రం తీసినప్పటికీ పరీక్ష గదిలో మాత్రం మాస్‌కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాస్ కాపీయింగ్ మా దృష్టికి రాలేదు మాస్‌కాపీయింగ్ జరుగుతున్నట్లు ఎక్కడా మా దృష్టికి రాలేదు. ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేస్తున్నాం. ఆలేరులో విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఎగ్జామినర్లను విధుల నుంచి తొలగించాం. మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – రవీంద్రప్రసాద్, డీఐఈఓ -
ఐటీఐ పరీక్షల్లో...మాస్ కాపీయింగ్
అసలు కళాశాల క్లాసులకు రాకుండానే పరీక్షలకు హాజరు కావచ్చు... ఒకవేళ పరీక్షలు రాసే తీరిక కూడా లేకపోయినా మీ స్థానంలో వేరే వారితో పరీక్ష రాయించేస్తారు. ఒకే రోజు మూడు రోజుల పేపర్లు రాసేసుకోవచ్చు... దీనికంతటికి మీరు చేయాల్సిందేమిటంటే.. వారు అడిగినంత చెల్లించడమే. జిల్లాలోని పలు ఐటీఐ కళాశాలల్లో పరీక్షలు జరుగుతున్న తీరు ఇది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : సోమవారం ఐటీఐ మొదటి సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్, రెండో సంవత్సరం విద్యార్థులకు మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఆన్సర్లు, ప్రాక్టికల్స్ అన్నీ బోర్డు మీద ఇన్స్ట్రక్టర్లు రాస్తుంటే విద్యార్థులు చూసి ఎక్కించేసుకున్నారు. వీరికి 90 నుంచి 95 శాతం మార్కులు గ్యారెంటీ. గణపవరం, నిడమర్రు మండలం బువ్వనపల్లి, ఉంగుటూరు మండలం చేబ్రోలు, తణుకులలో ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఒక్కో దానిలో 300 మంది వరకూ చదువుతున్నట్లు లెక్కల్లో ఉంటుంది. కళాశాలకు హాజరయ్యే వారి సంఖ్య 50కి మించదు. కళాశాలలో ఫర్నీచర్ కూడా 50 నుంచి 60 మందికి సరిపడా మాత్రమే ఉంటుంది. పరీక్షల సమయంలో వేరేచోటి నుంచి తీసుకువచ్చి వేస్తారు. ఐటీఐ అంటే ప్రతి రోజూ కళాశాలకు వెళ్లాలి. ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇదెక్కడా అమలు కాదు. ఇక్కడ జిల్లా నుంచే కాకుండా కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వచ్చి చేరే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఓసీ విద్యార్థుల వద్ద నుంచి ఫీజు వసూలు చేసినా, బీసీ, ఇతర వెనుకబడిన కులాల విద్యార్థులకు వచ్చే స్కాలర్‌షిప్‌లతో కళాశాలలను నడిపేస్తున్నారు. కళాశాలకు రాని విద్యార్థుల పేరుతో వీరు స్కాలర్షిప్స్ పెడుతున్నారు. ఈ విద్యార్ధుల బ్యాంకు పుస్తకాలు కూడా కళాశాల ప్రిన్సిపల్ వద్దే ఉంటున్నాయి. విద్యార్థుల స్కాలర్షిప్లు బ్యాంకులో క్రెడిట్ అయినప్పుడు విద్యార్థిని బ్యాంకుకు తీసుకువెళ్లి విత్‌డ్రా చేయించి వారు తీసుకుంటారు. కళాశాలకు విద్యార్థులు రాకపోయినా రోజూ వచ్చినట్లుగా అటెండెన్స్‌లో చూపిస్తుంటారు. ఒక్కో సెమిస్టర్ పరీక్షకు ఐదు వేల రూపాయల చొప్పున విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి కూడా సరైన క్వాలిఫికేషన్ ఉండదు. వీరే ఇన్విజిలేటర్లుగా ఉంటారు. నిడమర్రు మండలంలోని ఐటీఐలో గణపవరం జెడ్పీహెచ్ఎస్లో పనిచేసే ఉపాధ్యాయుడే బోధన చేస్తుంటారు. తాను పనిచేసే స్కూల్లో బయోమెట్రిక్ వేసి ఇక్కడ ఉద్యోగం చేస్తుంటారు. పరీక్షలకు రాని విద్యార్థుల పేరుతో వేరేవారు పరీక్షలు రాస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ సీసీ కెమేరాలు పెట్టినా ఎక్కడా అవి పనిచేయడం లేదు. మూడు రోజులు జరగాల్సిన పరీక్షలు ఒకేరోజున ఏకబిగిన రాయించేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ మూడు పరీక్షలు రాయించేశారు. ఆన్సర్లు, ప్రాక్టికల్స్ ఇన్విజిలేటర్లు బోర్డుపైన రాస్తుంటే విద్యార్థులు చూసి ఎక్కించేశారు. రాసేవారికి ఎన్నిమార్కులకు సబ్జెక్టులు ఉంటాయో తెలియని పరిస్థితి. అయితే పరీక్షా ఫలితాలలో ప్రతి ఒక్కరికి 90 నుంచి 95 శాతం రిజల్ట్ తగ్గకుండా వచ్చేలా చూస్తారు. అసలు పరీక్షకే హాజరు కాని వారి వద్ద రూ.50 వేలు తీసుకుని వేరేవారితో పరీక్షలు రాయిస్తున్నట్లు సమాచారం. పరీక్షల సమయంలో హాజరయ్యే ఇన్విజలేటర్, స్క్వాడ్‌కు రోజుకు పది వేల రూపాయల చొప్పున ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టైంటేబుల్ ప్రకారం రేపు పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ పరీక్ష ఇవాళే జరిపేయడంతో రేపు పరీక్ష లేదని విద్యార్థులకు చెప్పారు. పరీక్షల్లో జరుగుతున్న మాస్ కాపీయింగ్‌కు సంబంధించిన ఆధారాలు ‘సాక్షి’ సంపాదించింది. -
భయం ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పెద్ద ఎత్తున జరుగుతుండటంపై ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మాస్ కాపీయింగ్ నేపథ్యంలో విద్యా ప్రమాణా లు పడిపోతున్నాయంది. మాస్ కాపీయింగ్‌కు సహకరించే ఉపాధ్యాయులు విద్యార్థులకు దేవుళ్లుగా, సహకరించనివారు దెయ్యాల్లా కనిపి స్తున్నారని వ్యాఖ్యానించింది. తక్కువ మార్కు లు వచ్చినా పర్వాలేదు.. నిజాయితీగా ఆ మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్న తల్లిదం డ్రులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించింది. మాస్ కాపీయింగ్‌కు అందరూ బాధ్యులేనంది. గతేడాది 10వ తరగతి పరీక్షల సందర్భంగా మాస్ కాపీయింగ్‌కు సంబంధించి తెలంగాణలో 4 కేసులు, ఏపీలో ఓ కేసు మాత్రమే నమోదవడంపై విస్మయం వెలిబుచ్చింది. పబ్లిక్ పరీక్షల చట్టం–1997 కింద కేసులు నమోదు చేయడంతోపాటు ప్రాసిక్యూషన్ చేస్తేనే పరిస్థితులు దార్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ‘‘భయం ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది. ఫెయిలైతే ఏమవుతుంది.. ఓ సంవత్సరం లేటవుతుంది.. ఇందుకోసం అడ్డదార్లు తొక్కా ల్సిన అవసరమేముంది?’’ అని వ్యాఖ్యానిం చింది. మాస్ కాపీయింగ్ జరగకుండా ఏదో ఒకటి చేయాల్సిన అవసరముందంటూ ఇందు కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపా లని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఉభయ రాష్ట్రాల్లోని మాస్ కాపీయింగ్, పుస్తకాలు పెట్టి రాస్తున్న రాతల్ని అడ్డుకోవడంలో విద్యాశాఖాధి కారులు దారుణంగా విఫలమవు తున్నారని, మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలంటూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గుంటుపల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీన్ని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ న్యాయవాది పేర్కొంటూ విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపట్టాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనల్లో ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఎంతమందిని ప్రాసిక్యూట్ చేశారో చెప్పాలంది. ఏపీలో ఓ కేసు, తెలంగాణలో నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలుసుకున్న ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది. చట్టాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేయట్లేదని ప్రశ్నించింది. సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ పెద్ద ఆర్థిక భారమేనని, కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని మోయాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం తమకెక్కడుందో చెప్పాలని పిటిషనర్‌ను కోరింది. మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏం చేస్తే బాగుంటుందో సలహాలివ్వాలని కోరింది. -
రాసుకున్నోళ్లకు రాసుకున్నంత..!
కదిరి: డీఎడ్ పట్టా అంగడి సరుకుగా మారిపోయింది. కాసులు విదిల్చితే చాలు.. వచ్చి చేతుల్లో వాలిపోతున్నాయి. పరీక్షలకు చదివి తయారు కాకున్నా సరే పుస్తకాలు, స్టడీ మెటీరియల్ చూస్తూ మక్కీకి మక్కీగా జవాబులు రాయగలిగితే డీఎడ్ పూర్తి చేసినట్లే. అలా కాకున్నా కాసులు కొంత ఎక్కువ మొత్తంలో ఇచ్చుకుంటే పరీక్ష కూడా వారి బదులు మరొకరితో రాయిస్తారు. ఈ బాధ్యత కూడా ఆయా డీఎడ్ కళాశాలల యాజమాన్యమే చూసుకుంటుంది. విద్యాశాఖ అధికారుల ఉదాసీన వైఖరితో ఇలా అడ్డదారిలో డీఎడ్ పట్టాలు పొందిన ప్రబుద్ధులు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. చూచిరాతే కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నాలుగు రోజులుగా డీఎడ్ పరీక్షలు జరుగుతున్నాయి. శనివారం డీఎడ్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఆంగ్ల పరీక్ష జరిగింది. మొత్తం 307 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. దీన్ని పరీక్ష అనడం కంటే చూచిరాత అనడం కరెక్ట్. వీటిపై ‘సాక్షి’ నిఘా పెట్టింది. గేటుకు తాళాలు వేసి ఎటువంటి పోలీస్ బందోబస్త్ లేకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసుశాఖకు సంబంధించిన వారి బంధువులు ఎక్కువ శాతం మంది పరీక్ష రాస్తున్నందున పోలీస్ బందోబస్త్ లేదని పరీక్ష రాస్తున్న కొందరు విద్యార్థులు పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లు అన్నీ తామై.. కదిరి, పరిసర ప్రాంతాలకు చెందిన ప్రైవేటు డీఎడ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు అక్కడ పరీక్ష రాస్తున్నారు. సర్కారు బడుల్లో పనిచేస్తూ తీరిక సమయాల్లో ఆయా డీఎడ్ కళాశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులనే ఆ పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా నియమించారు. అందుకే ఆయా కళాశాలల యాజమాన్యం చెప్పినట్లు వారే కాపీలను ప్రోత్సహించక తప్పలేదు. కాపీలు ఇవ్వడం, రాసిన తర్వాత మళ్లీ వాటిని కలెక్ట్ చేసి చెత్త బుట్టలో వేయించే బాధ్యతను కూడా ఇన్విజిలేటర్లే తీసుకున్నారు. ప్రతి అరగంటకోసారి నిండిన చెత్త బుట్టను బయట పారేస్తున్నారు. ఈ విషయం అక్కడున్న చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు కూడా తెలియందేమీ కాదు. ఆప్షన్‌ను బట్టి రేటు ఒకరి బదులు మరొకరు మొత్తం 30 మంది దాకా పరీక్ష రాస్తున్నట్లు తెలిసింది. కాపీలు రాయిస్తామంటూ పాస్ గ్యారంటీ కింద ఒక్కో అభ్యర్థి దగ్గర రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకరి బదులు మరో అభ్యర్థిని పరీక్షకు అనుమతించేందుకు మరో రేటు, ఇలా డమ్మీ అభ్యర్థిని యాజమాన్యమే సిద్దం చేయాలంటే ఇంకోరేటు వసూలు చేశారని అక్కడ పరీక్ష రాస్తున్న విద్యార్థులే కొందరు పేర్కొన్నారు. -
పబ్లిగ్గా మాస్ కాపీయింగ్!
సాక్షి, విశాఖపట్నం: శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి దూరవిద్యలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పబ్లిగ్గా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. పుస్తకాలు చూసి రాసుకునే సదుపాయాన్ని అక్కడ ఇన్విజిలేటర్లే కల్పిస్తున్నారు. ఇది బహిరంగంగానే జరుగుతున్నా ఏ ఒక్క అధికారీ అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఐదు రోజుల కిత్రం ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లా కె.కోటపాడు టీఎస్సార్ జూనియర్ కాలేజీని సెంటరుగా కేటాయించారు. దాదాపు 400 మంది అభ్యర్థులు ఈ కేంద్రంలో పరీక్షలు రాస్తున్నారు. బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ గ్రూపులకు సంబంధించి ఫిజిక్స్, స్టాటస్టిక్స్, కామర్స్, ఎకనామిక్స్ తదితర పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్కొక్క అభ్యర్థి రూ.20 వేలు చెల్లించే ఒప్పందంతో వారికి నేరుగా పుస్తకాల్లో చూసి పరీక్షలు రాసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు తెలి సింది. ఒప్పందంలో భాగంగా ఆయా అభ్యర్థులు నిర్భీతిగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న వైనాన్ని కొంతమంది కెమెరాల్లో బంధించారు. వాటిని శనివారం రాత్రి మీడియాకు విడుదల చేశారు. సంబంధిత యూనివర్సిటీ నుం చి పరిశీలకులుగా ఇద్దరు అధికారులు వచ్చారు. వారు విశాఖలోని ఒక స్టార్ హోటల్లో బస చేసినట్టు చెబుతున్నారు. వారి కనుసన్నల్లోనే ఈ కాపీయింగ్ వ్యవహారమంతా జరుగుతోంది. మరో మూడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మాస్‌కాపీయింగ్‌పై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ మాస్‌కాపీయింగ్‌పై శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజగోపాల్‌ను వివరణ కోరడానికి ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
‘మాస్ కాపీయింగ్’పై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన, సహక రించినవారిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని హైకోర్టు మంగళవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మాస్ కాపీయింగ్ చేస్తూ గతేడాది నుంచి ఇప్పటివరకు ఎంతమంది పట్టుబడ్డారో.. ఎంతమందిపై కేసులు పెట్టారో తెలపాలని ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయ రాష్ట్రాల్లో మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. -
ఉపాధ్యాయులు మందలించారని...
హైదరాబాద్: మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని ఉపాధ్యాయులు మందలించడంతో భవనంపై నుంచి దూకి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి కుమార్తె రాజేశ్వరి బాచుపల్లిలోని పూజిత ఎన్‌క్లేవ్‌లో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 23న ఇంటర్ పరీక్షల్లో రాజేశ్వరి మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో ఉపాధ్యాయులు మందలించారు. దీంతో విద్యార్థిని భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేసింది. వెంటనే కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స చేయించింది. తండ్రి రాజిరెడ్డి రాగానే కుమార్తెను అప్పగించినట్లు సమాచారం. అయితే రాజేశ్వరికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
ఆర్‌యూలో మాస్ కాపీయింగ్!
కర్నూలు(ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీలో పీజీ సెమిస్టర్ పరీక్షల్లో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతనెల 21 నుంచి వర్సిటీ ప్రాంగణంలో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మాస్ కాపీయింగ్ విషయంలో అధ్యాపకులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు మరింత రెచ్చిపోతున్నట్లు సమాచారం. కొందరు విద్యార్థులు ఏకంగా సెల్ఫోన్లు వెంట తెచ్చుకుని కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో మంగళవారం నుంచి పరీక్షల పరిశీలకులను నియమించారు. అయినా కాపీయింగ్ జోరుకు అడ్డుకట్ట పడలేదని సమాచారం. కొందరు విద్యార్థులు కాపీయింగ్ చేస్తూ పట్టుబడినా అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా శుక్రవారం జరిగిన ఇంగ్లిష్ విభాగం పరీక్షల్లో ఓ విద్యార్థి తనకు కేటాయించిన స్థానంలో కాకుండా మరొకరి స్థానంలో కూర్చొని పరీక్ష రాసినట్లు సమాచారం. ఈ విషయంలో విద్యార్థికి ఇన్విజిలేటర్‌కు మధ్య గొడవ జరగ్గా చివరకు అధికారులు ఇన్విజిలేటర్‌నే మార్చినట్లు తెలిసింది. పరీక్షలను వర్సిటీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. మాస్‌కాపీయింగ్‌పై వివరణ కోరగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
రాసుకున్నోళ్లకు రాసుకున్నంత..!
కోదాడ: రాసుకున్నోళ్లకు రాసుకున్నంత.. అన్నట్టుగా మారింది.. కోదాడలోని పాలిటెక్నిక్ పరీక్షల వ్యవహారం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సిన కళాశాలల యా జమాన్యాలే అడ్డదారులు తొక్కుతున్నాయి. పరీక్షల విధులను నిర్వహించడానికి ఇతర కళాశాలల నుంచి వస్తున్న ఇన్విజిలేటర్లను పరీక్షహాళ్లోకి వెళ్లనీయకుండా తమ వారిని పంపించడం, వినని వారిని కరెన్సీతో మ్యానేజ్ చేయడం లేదంటే బెదిరించడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోదాడలో సుమారు 5 వేల మంది విద్యార్థులు పాల్టెక్నిక్ పరీక్షలు రాస్తున్నారు. కొన్ని కళాశాలలు పాస్ గ్యారెంటీ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.4 నుంచి 5 వేలు వసూలు చేస్తున్నారని తెలిసింది. వచ్చి కూర్చొని .. ఇచ్చింది తీసుకు వెళ్లండి... అక్టోబర్ 25 నుంచి పాలిటెక్నిక్ ప్రథమ, ద్వితీయ, అక్టోబర్ 26 నుంచి తృతీయ సంవత్సర సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సెల్ఫ్ సెంటర్లో పరీక్షలు జరుగుతుండడంతో కళాశాలల యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇన్విజిలేషన్ విధులకు వస్తున్న ఇతర కళాశాలల అధ్యాపకులకు డ్యూటీలు వెయ్యడం లేదని సమాచారం. వచ్చిన వారిని కూర్చోబెట్టి తమ కళాశాలవారికే డ్యూటీలు వేసుకుని జోరుగా మాస్ కాపీయింగ్‌ను జరుపుతున్నారని కొందరు అధ్యాపకులే ఆరోపిస్తున్నారు. దీనికోసం రెండు కళాశాలలు విద్యార్థుల నుంచి డబ్బుల వసూలుకు తెరలేపినట్టు తెలుస్తోంది. మాట వినని ఇన్విజిలేటర్లకు భారీగా ముట్టజెపుతున్నారు. ఒక రోజు డ్యూటీ చేస్తే రెండు మూడు వందలు ఇస్తారు. కాని కొన్ని కళాశాలలు తాము చెప్పినట్లు వింటున్న ఇతర కళాశాలల అధ్యాపకులకు ఒక్క రోజు డ్యూటీకి ఐదు వేల రూపాయలను ముట్టజెపుతున్నారని సమాచారం. వచ్చి కూర్చొని ఇచ్చింది తీసుకువెళ్లండని, మాట వినని వారిని ఘాటుగా బెదిరిస్తున్నట్లు కొందరు మహిళా అధ్యాపకులు వాపోతున్నారు. అన్నీ మేనేజ్ పాలిటెక్నిక్ పరీక్షల నిర్వహణ సీసీ కెమెరాల నడుమ పకడ్బందీగా నిర్వహించే ఏర్పాట్లు చేసినా వాటిని కూడా ఏమార్చి తమ దందా సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాస్ కాపియింగ్ జరగకుండా చూడాల్సిన స్క్వా డ్లు అతిథుల వలె వచ్చిపోతున్నారని అధ్యాపకులే అంటున్నారు. పాస్ గ్యారెంటీ స్కీంలో భాగంగా జరుగుతున్న ఈ తంతంగంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అవకాశంగా మారిన పరీక్షల విధానం గతంలో సెల్ఫ్ సెంటర్లతో పాలిటెక్నిక్ పరీక్షలను నిర్వహించేవారు. దీంతో కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర సాంకేతిక విద్య అధికారులు ఒక కళాశాల విద్యార్థులను మరో కళాశాలకు మార్చి పరీక్షలు నిర్వహించారు. దీంతో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకపోవడం పాస్ పర్సెంటేజీ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే వారు తగ్గి పోతుండడంతో కంగుతిన్న కళాశాలలు తెర వెనుక లాబీయింగ్ జరిపి ఈ సారి ఆ విధానాన్ని ఎత్తి వేయించాయి. విద్యార్థులను మార్చకుండా ఏ కళాశాల విద్యార్థులు అదే కళాశాలలో పరీక్షలు రాసే విధంగా పాత విధానాన్నే తిరిగి తెరమీదకు తెచ్చారు. కాక పోతే పరీక్షల నిర్వహించే ఇన్విజిలేటర్లను మాత్రం ఒక కళాశాల వారిని మరో కళాశాలకు మార్చారు. -
సంతృప్తికరంగా లేకుంటే శిక్ష తప్పదు?
సాక్షి, హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ : ఐఏఎస్ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడిన ఐపీఎస్ ప్రొబెషనరీ అధికారి సఫీర్ కరీంపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయని కేంద్ర హోం శాఖ అధికారులు తెలిపారు. ముందుగా ఆయన నుంచి వివరణ కోరుతామని, వివరణ సంతృప్తికరంగా లేకుంటే మాత్రం శిక్ష తప్పదని పేర్కొన్నారు. 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సఫిర్ కరీం ప్రస్తుతం తిరునల్వేలి జిల్లా నంగునేరిలో పనిచేస్తున్నారు. ఐఏఎస్ కావాలన్న కోరికతో మరోసారి యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం చెన్నైలోని ఎగ్మోర్‌లోని పరీక్షా కేంద్రంలో హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతూ దొరికిపోయారు. ఆయనకు సహకరించిన భార్య అతని భార్య జాయిస్ జాయ్తోపాటు కోచింగ్ సెంటర్ లాఎక్స్లెన్స్ నిర్వాహకుడు రాంబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ అకాడెమీపై పోలీసులు దాడి చేసి, పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్టడీ సర్కిల్ మాస్ కాపీయింగ్‌కు అడ్డాగా మారినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని తమిళనాడు డీసీపీ అరవిందన్ తెలిపారు. జాయిస్ జాయ్తోపాటు రాంబాబును నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. వారిని ట్రాన్సిట్ వారెంట్‌పై తమిళనాడుకు తరలించనున్నట్లు సమాచారం. -
చౌకబారు పరీక్ష..!
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వారు ఏదో సమీక్షా సమావేశంలో ఉన్నారనుకుంటే పొరబడినట్లే. టెక్కలి డివిజన్లో ఖాళీగా ఉన్న 25 చౌకధరల దుకాణాల డీలర్ల ఎంపిక కోసం మంగళవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో ఎంపిక పరీక్ష నిర్వహించారు. దీనికోసం 98 మంది దరఖాస్తులు చేసుకోగా 82 మంది హాజరయ్యారు. ఎంతో పక్కాగా జరగాల్సిన ఈ పరీక్షల్లో ఇలా చూసి రాతలు చోటుచేసుకున్నాయి. కొందరు బంధువులు ఏకంగా పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల వద్దకు వెళ్లి సమాధానాలు చెప్పడం గమనార్హం. ఈ పరీక్షల్లో వయసు దాటిన వారితో పాటు కొంత మంది అధికార పార్టీకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా హాజరు కావడం విశేషం. – టెక్కలి -
కాపీయింగ్ ఓపెన్
నెల్లూరు (టౌన్): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపన్ స్కూల్ పరీక్షలు(ఎన్ఐఓఎస్) అపహాస్యం పాలవుతున్నాయి. విద్యా కేంద్రాలు, పరీక్ష నిర్వహణ సెంటర్ల నిర్వాహకులు కుమ్మక్కై పుస్తకాలను బహిరంగంగానే పెట్టి విద్యార్థులతో పరీక్షలు రాయిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు ఇదంతా మామూలేనని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. బడి బయట పిల్లలు, రోజు బడికి వచ్చి చదువుకోలేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపన్ స్కూల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏటా పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 6 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను పొదలకూరు రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం, తెలుగుగంగ కార్యాలయం వద్దనున్న సింహపురి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో నిర్వహిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయంలో 300 మంది, సింహపురి స్కూల్లో 173 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇప్పటికే రెండు పరీక్షలు ముగిశాయి. గురువారం జరిగిన హిందీ పరీక్షకు హాజరైన వారికి సింహపురి పరీక్ష కేంద్రంలో నిర్వాహకులు బహిరంగంగానే పుస్తకాలు అందించి రాయిస్తున్నారు. ఒక్కో గదిలో ఒకరు లేదా ఇద్దర్ని కూర్చొబెట్టి పరీక్షలు రాయిస్తుండగా, మరికొన్ని గదిలో పది అంతకంటే మించి అభ్యర్థులు పరీక్షలు రాయడం కనిపించింది. పాఠశాల లోపలకు ఎవరూ రాకుండా గేట్లు మూసివేసి జాగ్రత్తపడ్డారు. విద్యార్థులు పుస్తకాలు చూసి రాస్తున్న సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బంగారయ్య, సుబ్బారావు, సిట్టింగ్ స్క్వాడ్ వెంకటేశ్వర్లు సెంటరులోనే ఉండడం గమనార్హం. వారి సమక్షంలోనే మాస్ కాపీయింగ్ జరుగుతున్నా పరీక్షలు పకడ్బంధీగా జరుగుతున్నాయని బుకాయిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయంలోనూ ఇదే తరహాలో జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఎన్ఐఓఎస్ పరీక్షలకు లక్షల్లో చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరీక్షలను కొంతమంది మాఫియాగా ఏర్పడి అంతావారై జరిపిస్తున్నారని చెబుతున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి ముందుగానే విద్యార్థుల నుంచి రూ. 20వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే పరీక్ష కేంద్రంలో బహిరంగంగా పుస్తకాలు, కాపీలు అందజేసి పరీక్షలు రాయిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్న మొత్తాలను పరీక్ష సెంటర్ నిర్వాహకుల నుంచి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులకు పంచుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రీతిలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఓపన్ పరీక్షలకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. కష్టపడకుండానే నేరుగా పట్టాలు చేతపట్టుకోవచ్చన్న భావన వీరిలో ఉండటంతో విద్యా కేంద్రాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. ఈ విషయమైన ఫ్లయింగ్ స్క్వాడ్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా. పరీక్షలను పకడ్బంధీగా నిర్వహిస్తున్నాం. మాస్ కాపీయింగ్ ఎక్కడా జరగడం లేదు. మేం దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. -
రెండో రోజు స్లిప్పులతో చిక్కిన ముగ్గురు
కాకినాడ వైద్యం: కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో జరుగుతున్న నర్సింగ్ రెండో సంవత్సరం పరీక్షల్లో శుక్రవారం స్లిప్పులతో కాపీ రాస్తూ ముగ్గురు విద్యార్థులు పట్టుబడ్డారు. మాస్ కాపీయింగ్ జరుగుతోందని ఆరోపణలు రావడం, తొలిరోజు పదిమంది విద్యార్థులు స్లిప్పులతో రాస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా రెండు ప్రైవేట్ కాలేజీలకు చెందిన ముగ్గురు విద్యార్థులు స్లిప్పులు రాస్తూ పట్టుబడ్డారు. జీఎన్ఎం నర్సింగ్ రెండో ఏడాది పరీక్షలకు 1,143 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 125 మంది గైర్హాజరయ్యారు. మిగిలిన అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ‘చూసుకో..రాసుకో’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన కాకినాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు పరీక్షా కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. చూసి రాతకు పాల్పడితే తర్వాత పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని, మాస్ కాపీయింగ్‌కు సహకరించినట్టు తేలితే ఇన్విజిలేటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఎన్ఎం నర్సింగ్ పరీక్ష ప్రారంభమైన తర్వాత సుమారు రెండు గంటల పాటు ఆయన పరీక్షా కేంద్రంలో తనిఖీలు చేశారు. ఇన్విజిలేటర్లపై ఒత్తిడి తెస్తున్న గుమస్తా జీఎన్ఎం పరీక్షలు రాస్తున్న విద్యార్థులను చూసీచూడనట్లు వ్యవహరించాలని జీజీహెచ్‌లో నర్సింగ్ విభాగం చూస్తున్న గుమస్తా తమపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని పలువురు ఇన్విజిలేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లిప్పులు రాస్తున్నా పట్టించుకోవద్దని, తాను పరిపాలనాధికారులతో చెప్పి మేనేజ్ చేస్తానంటూ చెబుతున్నాడన్నారు. పరీక్షల్లో ఉదారంగా వ్యవహరిస్తే అధికారులు ఊరుకోనంటున్నారని వాపోయారు. ఏళ్లతరబడి ఒకే సీటులో నర్సింగ్ స్కూళ్లు చూసే సీటులో పాతుకుపోయి, నర్సింగ్ పాఠశాలల నిర్వాహకుల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని తమను ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. నర్సింగ్ పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శంగా జరగాలంటే ఆ గుమస్తాని పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించాలని కలెక్టర్‌ను ఇన్విజిలేటర్లు కోరుతున్నారు. -
చూసుకో.. రాసుకో!
‘‘నర్సింగ్ పరీక్షల నిర్వహణపై ఆరోపణలు వస్తున్నాయి. మాస్ కాపీయింగ్ జరుగుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాగైతే చెడ్డ పేరు వస్తుంది. పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్, స్లిప్పులు పెట్టడం వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి’’ ఇదీ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చేసిన హెచ్చరిక. ‘‘ఆ సూపరింటెండెంట్ మాటను లెక్కచేయడమేంటిలే.. మన పని మనం చేసుకుందాం’’ అనుకున్నారో ఏమో యథేచ్ఛగా స్లిప్పులు తెచ్చేశారు. ఇష్టానుసారంగా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. చివరకు సుమారు పది మంది వరకు విద్యార్థులు స్లిప్పులు చూసి రాస్తూ ఇన్విజిలేటర్లకు పట్టుబడ్డారు. మరోవైపు ఆర్ఎంసీ కళాశాల ఆవరణ బయట, డ్రైనేజీల్లో స్లిప్పులు దర్శనమివ్వడంతో పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ ఏ విధంగా జరిగిందో అర్థమవుతోంది. కాకినాడ వైద్యం: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో శుక్రవారం నుంచి ప్రారంభమైన నర్సింగ్ పరీక్షల్లో జోరుగా మాల్ ప్రాక్టీస్ జరుగుతోంది. జిల్లాలో ఉన్న సుమారు 37 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా.. ఇందులో జీజీహెచ్‌కు చెందిన ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ నుంచి కొంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. జీఎన్ఎం నర్సింగ్ పరీక్షలో అధికంగా మార్కులు సాధిస్తే ప్రభుత్వం భర్తీ చేసే జీఎన్ఎం నర్సింగ్ పోస్టుల్లో కచ్చితంగా ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులకు అధికంగా మార్కులు వచ్చేలా ఈ స్లిప్పులు అందజేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా స్లిప్పులు రాసుకునేలా ఒక్కో ప్రైవేట్ కాలేజీ నుంచి రూ.50 వేలు వంతున జీజీహెచ్‌లోని నర్సింగ్ పాఠశాలల బాధ్యతను చూసుకుంటున్న ఓ గుమస్తా వసూలు చేసినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడిన సదరు ఉద్యోగి పరీక్షా కేంద్రాల్లో నియమించిన ఇన్విజిలేటర్లకు తలో కొంత ఇచ్చి మేనేజ్ చేస్తానని నర్సింగ్ స్కూళ్ల నుంచి వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1,272 మంది హాజరు శుక్రవారం జరిగిన తొలిసంవత్సర పరీక్షకు జిల్లాలోని 37 నర్సింగ్ కాలేజీల నుంచి 1,433 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,272 హాజరయ్యారు. 161 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని కాకినాడ ఆర్డీవో ఎల్ రఘబాబు పర్యవేక్షించారు. ఇద్దరు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్లు లేకుండా రావడంతో పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు నిరాకరించడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఆలస్యంగా ప్రారంభమైన నర్సింగ్ పరీక్షలు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో శుక్రవారం నుంచి నర్సింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం) నర్సింగ్ మొదటి సంవత్సరం పరీక్షకు సంబంధించిన పరీక్షా పేపర్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసే ప్రక్రియలో విద్యుత్ కోత సంభవించడం, సర్వర్ నెమ్మదిగా పనిచేయడం వంటి సాంకేతిక కారణాలతో అనుకున్న సమయం కంటే సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా పరీక్షను అధికారులు నిర్వహించారు. ఫలితంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరగాల్సిన పరీక్ష 9.45 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12.45 గంటలకు ముగిసింది. -
ఏపీ గ్రూప్–2 మెయిన్స్‌లో కాపీ కొట్టేశారు..
♦ నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లు, పెన్ కెమెరాల అనుమతి ♦ ఆన్సర్లు తెప్పించుకొని దర్జాగా రాసుకున్న అభ్యర్థులు ♦ చీరాల, ఒంగోలు ప్రాంతాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ ♦ ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదుల వెల్లువ ♦ సీసీ ఫుటేజ్‌లు పరిశీలించాలని వినతి ఏపీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈనెల 15, 16 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన మెయిన్స్‌లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు కాదు కదా కనీసం పెన్ను కూడా అనుమతించలేదని నిర్వాహకులు చెప్పినప్పటికీ కొన్ని సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు: పది రోజుల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–2 మెయిన్స్ ఆన్లైన్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటర్లలో అభ్యర్థులు జోరుగా కాపీయింగ్‌కు పాల్పడ్డారని ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలు సెంటర్లలో ఈ కాపీయింగ్ యథేచ్ఛగా సాగిందని, ముఖ్యంగా జిల్లాలోని చీరాల, ఒంగోలు ప్రాంతాల్లోని సెంటర్లలో కాపీయింగ్ జరిగిందని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. కొన్ని కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాలు, సెల్ఫోన్లు అనుమతిచ్చారని, తద్వారా ప్రశ్న పత్రాలు బయటకు పంపి కొందరు అభ్యర్థులు అన్సర్లు తెప్పించుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదుల్లో వివరించారు. కాపీయింగ్ వల్లే అధిక మార్కులు.. ప్రకాశం జిల్లాలో చీరాల, ఒంగోలుతో పాటు పలు సెంటర్లలో ఈ అక్రమాలు పెద్ద ఎత్తున సాగినట్లు కొందరు అభ్యర్థులు ‘సాక్షి’కి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కాలేజీల్లో పెన్ కెమెరాలు, మరికొన్ని కాలేజీల్లో సెల్ఫోన్లు అనుమతించినట్లు వారు పేర్కొన్నారు. పరీక్ష అయిన మరుసటి రోజు ఏపీపీఎస్సీ ‘కీ’ విడుదల చేయగా జిల్లావ్యాప్తంగా అన్ని సెంటర్లలోనూ 230 నుంచి 260 మార్కులు రాగా.. చీరాలకు చెందిన సెంటర్లో మాత్రం 320 నుంచి 336 వరకు మార్కులొచ్చాయన్నారు. ఇది కాపీయింగ్ వల్లే సాధ్యమైనదనేది ఫిర్యాదు చేసిన అభ్యర్థుల వాదన. సీసీ ఫుటేజిలు అభ్యర్థులే తెచ్చివ్వాలట.. తమ ఫిర్యాదులకు ఏపీపీఎస్సీ స్పందించటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించాలని కొందరు అభ్యర్థులు ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు పాటు రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సమాధానంగా ఏపీపీఎస్సీ అధికారులు ఫిర్యాదుతో పాటు సదరు సెంటర్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లు మీరే తెచ్చి ఇవ్వాలంటూ అభ్యర్థులకు చెప్పినట్లు కొందరు అభ్యర్థులు పేర్కొంటున్నారు. అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్లు నిర్వహించిన కళాశాలలు సీసీ ఫుటేజ్‌లు ఎలా ఇస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలు జరిగాయని ఏపీపీఎస్సీకి వివరాలు అందించినా.. స్పందించటం లేదని వారు వాపోతున్నారు. సెంటర్లలోని సీసీ ఫుటేజ్‌లు ఇప్పటికే ఏపీపీఎస్సీ వద్ద ఉన్నాయని వాటిని పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. కొన్ని కళాశాలలు, రాష్ట్రస్థాయిలో పెద్దలు ఒత్తిడి వల్లే ఏపీపీఎస్సీ అక్రమాలను పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత స్థాయి ఉద్యోగాలకు పకడ్బందీగా పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కనీసం ఆరోపణలు వచ్చినప్పుడైనా విచారణ జరపాల్సిన ఏపీపీఎస్సీ ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కాపీ కొట్టేశారు
►గ్రూప్–2 మెయిన్స్‌లో మాస్ కాపీయింగ్ ►జిల్లాలోని పలు సెంటర్లలో అక్రమాలు ►నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లు, పెన్ కెమెరాల అనుమతి ►ప్రశ్నలు బయటకు లీక్ ►ఆన్సర్లు తెప్పించుకొని దర్జాగా రాసుకున్న అభ్యర్థులు ►చీరాల, ఒంగోలు ప్రాంతాల్లోజోరుగా మాస్ కాపీయింగ్ ►ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదుల వెల్లువ ►సీసీ ఫుటేజ్‌లు పరిశీలించాలని వినతి ►అయినా పట్టించుకోని అధికారులు ఏపీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈనెల 15, 16 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన మెయిన్స్‌లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు కాదు కదా కనీసం పెన్ను కూడా అనుమతించలేదని నిర్వాహకులు చెప్పినప్పటికీ కొన్ని సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు : పది రోజుల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–2 మెయిన్స్ ఆన్లైన్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటర్లలో అభ్యర్థులు జోరుగా కాపీయింగ్‌కు పాల్పడ్డారని ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలు సెంటర్లలో ఈ కాపీయింగ్ యథేచ్ఛగా సాగిందని, ముఖ్యంగా జిల్లాలోని చీరాల, ఒంగోలు ప్రాంతాల్లోని సెంటర్లలో కాపీయింగ్ జరిగిందని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. కొన్ని కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాలు, సెల్ఫోన్లు అనుమతిచ్చారని, తద్వారా ప్రశ్న పత్రాలు బయటకు పంపి కొందరు అభ్యర్థులు అన్సర్లు తెప్పించుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదుల్లో వివరించారు. కాపీయింగ్ వల్లే అధిక మార్కులు.. ప్రకాశం జిల్లాలో చీరాల, ఒంగోలుతో పాటు పలు సెంటర్లలో ఈ అక్రమాలు పెద్ద ఎత్తున సాగినట్లు కొందరు అభ్యర్థులు ‘సాక్షి’కి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కాలేజీల్లో పెన్ కెమెరాలు, మరికొన్ని కాలేజీల్లో సెల్ఫోన్లు అనుమతించినట్లు వారు పేర్కొన్నారు. పరీక్ష అయిన మరుసటి రోజు ఏపీపీఎస్సీ ‘కీ’ విడుదల చేయగా జిల్లావ్యాప్తంగా అన్ని సెంటర్లలోనూ 230 నుంచి 260 మార్కులు రాగా.. చీరాలకు చెందిన సెంటర్లో మాత్రం 320 నుంచి 336 వరకు మార్కులొచ్చాయన్నారు. ఇది కాపీయింగ్ వల్లే సాధ్యమైనదనేది ఫిర్యాదు చేసిన అభ్యర్థుల వాదన. సీసీ ఫుటేజిలు అభ్యర్థులే తెచ్చివ్వాలట.. తమ ఫిర్యాదులకు ఏపీపీఎస్సీ స్పందించటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించాలని కొందరు అభ్యర్థులు ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు పాటు రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సమాధానంగా ఏపీపీఎస్సీ అధికారులు ఫిర్యాదుతో పాటు సదరు సెంటర్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లు మీరే తెచ్చి ఇవ్వాలంటూ అభ్యర్థులకు చెప్పినట్లు కొందరు అభ్యర్థులు పేర్కొంటున్నారు. అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్లు నిర్వహించిన కళాశాలలు సీసీ ఫుటేజ్‌లు ఎలా ఇస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలు జరిగాయని ఏపీపీఎస్సీకి వివరాలు అందించినా.. స్పందించటం లేదని వారు వాపోతున్నారు. సెంటర్లలోని సీసీ ఫుటేజ్‌లు ఇప్పటికే ఏపీపీఎస్సీ వద్ద ఉన్నాయని వాటిని పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. కొన్ని కళాశాలలు, రాష్ట్రస్థాయిలో పెద్దలు ఒత్తిడి వల్లే ఏపీపీఎస్సీ అక్రమాలను పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత స్థాయి ఉద్యోగాలకు పకడ్బందీగా పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కనీసం ఆరోపణలు వచ్చినప్పుడైనా విచారణ జరపాల్సిన ఏపీపీఎస్సీ ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్
– ఎస్కే దూర విద్య పరీక్షలు ప్రారంభం – సెంటర్ రద్దు అయినా మారని నిర్వాహకుల తీరు – పరీక్షల పేరుతో విద్యార్థుల నుంచి వసూళ్లు – చీటిలు పెట్టి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు – పత్తాలేని పర్యవేక్షణ అధికారి? కర్నూలు సిటీ: శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. సోమవారం నుంచి ఎస్కే దూర విద్య డిగ్రీ పరీక్షలు నగరంలోని గాయత్రి ఎస్టేట్‌లో ఉన్న ఓ కాలేజీలో పరీక్షలు నిర్వహించారు. యూనివర్సిటీ అధికారి పరీక్ష కేందంలో ఉండి పర్యవేక్షించాల్సి ఉన్నా పరీక్ష మొదలు అయ్యే సమయంలో మాత్రమే ఉండి మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దూర విద్య కేంద్రాల నిర్వాహకులు.. కొందరు విద్యార్థులకు చీటిలు ఇవ్వగా, మరి కొందరు విద్యార్థులు పాత పుస్తకాలు చింపుకొని వెంట తెచ్చుకున్నట్లు సమాచారం. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, పదోన్నతుల కోసం, గృహిణులు, నిరుద్యోగులు విద్యార్హత కోసమే అధిక శాతం దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతున్నారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకొని నిర్వాహకులు విద్యార్థుల నుంచి రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేసినట్లు తెలిసింది. దూర విద్య కేంద్రాల ద్వారా చదువుతున్న వారి నుంచి యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించి, సకాలంలో మెటీరియల్ అందజేయాల్సి ఉంది. అయితే యూనివర్సిటీ అధికారులు రెండేళ్లుగా పుస్తకాలను సరఫరా చేయకపోవడంతో నిర్వాహకులకు కలిసి వస్తోంది. దీన్నో అవకాశంగా తీసుకొని పరీక్షలను చూచి రాయిస్తామని విద్యార్థుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. చూచిరాతలు జరుగుతుండడంతో గతంలో సెంటర్‌గా ఉన్న కాలేజీని రద్దు చేశారు. అయినా నిర్వాహకుల తీరు మారకపోవడం గమనార్హం. చిట్టీలు పెట్టి పరీక్షలు! శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో ఏడాదికేడాది చూచిరాతల జోరు పెరుగుతున్నా నియంత్రించ లేకపోతున్నారు. సాధారణంగా దూర విద్య అంటే సెలవు రోజుల్లో క్లాస్‌లు నిర్వహించి, రికార్డులు, సైన్స్ విద్యార్థులకు ల్యాబ్‌లో ప్రాక్టికల్ చేయించాలి. పరీక్షలకు నాలుగు నెలల ముందుగానే కోర్సు మెటీరియల్ ఇవ్వాలి. రెండేళ్లుగా యూనివర్సిటీ అధికారులు ఆదాయంపై ఉన్న ధ్యాస విద్యార్థులకు ఇవ్వాల్సిన మెటీరియల్, క్లాస్‌లు, ల్యాబ్‌పై పెట్టక పోవడం కూడా మాస్ కాపీయింగ్‌కు కారణమనే విమర్శలున్నాయి. ఒకరు తరువాత.. ఇన్విజిలేటర్ సోమవారం ప్రశ్నపత్రం ఇచ్చాక విద్యార్థులు సమాధానాలు చిటీలను చూసి ఒకరు తరువాత ఒకరు రాశారు. పరీక్షల పర్యవేక్షణకు మాత్రం యూనివర్సిటీ నుంచి వచ్చే వారిని నిర్వాహకులు ముందుగానే తమకు అనుకూలమైన వారిని డ్యూటీలో వేయించుకున్నట్లు సమాచారం. అందుకు వచ్చిన అధికారి కాసేపు ఉండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన డిగ్రీ, పీజీ దూర విద్య పరీక్షల్లో కాపీయింగ్ జరిగినట్లు యూనివర్సిటీ అధికారుల విచారణలో తెలడంతో సెంటర్‌ను రద్దు చేశారు. అయితే గాయత్రి ఎస్టేట్‌లోని కాలేజీలో పరీక్షలను నిర్వహించేందుకు మరో వ్యక్తి సెంటర్‌కు అనుమతి ఇవ్వడంతో అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాలేజీలోకి ఎవరూ రాకుండా గేట్లు వేసి, మూడు, నాల్గో ఫ్లోర్లో పరీక్షలు నిర్వహించారు. -
రూ.200లకే చిట్స్.. మాస్ కాపీయింగ్
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్లో డిగ్రీ మూడో సంవత్సర పరీక్షల్లో భారీ స్కాం బయటపడింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి రూ.200 కలెక్ట్ చేస్తున్న ఓ వ్యక్తి వారికి జవాబు పత్రాలు అందిస్తున్నాడు. ఈ స్కాంపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన మెయిల్ టుడే ఓ వీడియోను విడుదల చేసింది. ఘాజీపూర్‌లోని స్వామి సహజానంద పీజీ కళాశాలలో ఈ నెల 10వ తేదీన జరిగిన బీఏ మూడో సంవత్సర పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగింది. వెంట తెచ్చుకున్న చిట్స్, డబ్బులు ఇచ్చిన వ్యక్తి అందించిన పత్రాలతోనూ విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఈ కళాశాలలో మాస్‌కాపీయింగ్ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నట్లు మెయిల్ టుడే పేర్కొంది. అయినా అధికారులు మొద్దు నిద్ర మానుకోవడం లేదని విమర్శించింది. ఏటా విద్యార్థుల నుంచి వసూలు చేసే డబ్బు మాత్రం పెరుగుతోందని చెప్పింది. పరీక్ష హాల్లో విద్యార్థుల వద్దకు వచ్చే బంట్రోతు డబ్బును కలెక్ట్ చేస్తాడని వివరించింది. మాస్ కాపీయింగ్‌పై ప్యూన్‌ను ప్రశ్నించేందుకు మెయిల్ టుడే ప్రయత్నించగా అతను తప్పించుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా, కళాశాల పరిపాలన వ్యవస్ధలో పనిచేసే ఓ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. కొద్ది సంవత్సరాల నుంచి డిగ్రీ పరీక్షల్లో ఇదే తంతు జరుగుతోంది. అలాగే కాపీయింగ్ చేయడానికి విద్యార్థులు ఇన్విజిలేటర్లకు డబ్బులు ఇవ్వడం కూడా ఆనవాయితీగా సాగుతోందని చెప్పారు. తాజా స్టింగ్ ఆపరేషన్ ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్న విద్యా వ్యవస్ధ పరిస్ధితి ఇంకా మరలేదనడానికి నిదర్శనంగా మారింది. మాస్ కాపీయింగ్‌పై ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి దినేశ్ శర్మను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఈ ఘటనపై మాట్లాడిన బీజేపీ అధికార ప్రతినిధి మనీష్ శుక్లా.. పాత ప్రభుత్వాలపై నిందను తోసేశారు. కూనారిల్లిన వ్యవస్ధను తాము ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నామని అన్నారు. కేవలం విద్యా వ్యవస్ధే కాకుండా మిగిలిన అన్ని వ్యవస్ధల్లోనూ త్వరలో మార్పు తీసుకువస్తామని చెప్పారు. -
పరీక్షల్లో అక్రమాలపై సీఎం సీరియస్
నిన్న మొన్నటి వరకు యాంటీ రోమియో స్క్వాడ్లతో సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఇప్పుడు పరీక్షల్లో అక్రమాల మీద దృష్టిపెట్టారు. యూపీలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అక్రమాలకు పాల్పడుతున్న కేసులు బయట పడుతుండటంతో ఆయన సీరియస్‌గా స్పందించారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పరీక్ష కేంద్రాలు, 111 మంది సెంటర్ డైరెక్టర్లు, 178 మంది ఇన్విజిలేటర్లు, 70 మంది విద్యార్థులపై పోలీసు కేసులు నమోదయ్యాయి. అలాగే 57 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేకుండా నిషేధం విధించగా, 54 కేంద్రాల్లో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలను కూడా రద్దు చేసేశారు. పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నడుంకట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ముందుగా విద్యాశాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి వాళ్లకు కచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. ఆయన ప్రమాణస్వీకారం చేయడానికి మూడు రోజుల ముందే పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల హామీలను శరవేగంగా నెరవేర్చడంలో భాగంగా ముందుగా ఆయన అక్రమ కబేళాలపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటుచేశారు. విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలలో ఒక్కరు కూడా కాపీ కొట్టడానికి వీల్లేదని గట్టిగా చెప్పారు. మాస్ కాపీయింగ్ ఎక్కువగా జరిగే రాష్ట్రాలుగా యూపీ, బిహార్‌లకు ఎప్పటినుంచో పేరుంది. బిహార్‌లో గత సంవత్సరం అక్రమ మార్గాలలో టాప్ ర్యాంకులు పొందిన పలువురు విద్యార్థులను అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే. -
టీచర్లు కాదు చీటర్లు.. అడ్డంగా దొరికేశారు!
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. వీటిలో మాల్ ప్రాక్టీసు కేసుల్లో ఎక్కువగా దొరికేస్తున్నది విద్యార్థులు కాదు.. టీచర్లేనట. ఇప్పటివరకు 111 మంది సెంటర్ సూపరింటెండెంట్లు, 178 మంది ఇన్విజిలేటర్ల మీద చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అదే విద్యార్థుల మీద మాత్రం కేవలం 70 ఎఫ్ఐఆర్లే నమోదయ్యాయి. 54 చోట్ల పరీక్ష కేంద్రాలను రద్దు చేయగా, 57 కేంద్రాలను డీబార్ చేశారు. మొత్తం 327 కేంద్రాల సూపరింటెండెంట్లను మార్చామని, మాస్ కాపీయింగ్ చేయించినందుకు నాలుగు పరీక్ష కేంద్రాల యాజమాన్యాలపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేశామని యూపీ మాధ్యమిక శిక్షా పరిషత్ డైరెక్టర్ ఏఎన్ వర్మ చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి దినేష్ శర్మ సూచనల మేరకు ఏడు పరీక్ష కేంద్రాల ఆన్సర్ కాపీలను స్క్రీనింగ్ కోసం పంపుతున్నారు. పరీక్షలలో అక్రమాల గురించి తెలియజేసేందుకు వీలుగా ఒక టోల్‌ఫ్రీ నెంబరు 18001806760 ను కేటాయించారు. టీచర్లు చీటింగ్ చేశారిలా.. కొంతమంది టీచర్లు విద్యార్థులకు చిట్టీలు ఇస్తుండగా, మరికొందరు దగ్గరుండి మరీ వారికి ఆన్సర్లు డిక్టేట్ చేస్తూ దొరికేశారు. ఇంకొంతమంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను ఏకంగా పరీక్ష కేంద్రాల నుంచి బయటకు పంపేసి, అక్కడ వేరేవాళ్లతో జవాబులు రాయించారు. తర్వాత మళ్లీ వాటిని హాల్లోకి తెప్పించారు. విద్యార్థులు ఎంచక్కా కాపీలు రాసుకుంటున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా ఊరుకున్నారు. ఏకంగా విద్యార్థులు ఒకరికొకరు ఆన్సర్ షీట్లు మార్చుకుంటున్నా కూడా ఏమీ అనలేదు. పరీక్ష హాల్లోకి పుస్తకాలు, గైడ్లు తీసుకొచ్చి రాస్తున్నా మాట్లాడలేదు. ఎక్కువగా ప్రైవేటు, సెల్ఫ్ ఫైనాన్స్ సంస్థలలోనే ఈ కాపీల వ్యవహారం ఎక్కువగా సాగినట్లు గుర్తించారు. మాధ్యమిక విద్యాశాఖకు చెందిన కొంతమంది అధికారులు కూడా లంచాలు తీసుకుని కాపీ మాఫియాతో చేతులు కలిపారని యూపీ మాధ్యమిక శిక్షక్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్పీ మిశ్రా ఆరోపించారు. మాస్ కాపీయింగ్ రాకెట్లో ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు చెప్పారు. -
చూసిరాతలు
–‘పది’ పరీక్షల్లో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ – సిబ్బందే ప్రోత్సహిస్తున్న వైనం – ఒక్క కేంద్రంలోనూ చర్యలు తీసుకోని అధికారులు – ఆందోళన చెందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు - యాక్ట్–25 అభాసుపాలు అనంతపురం ఎడ్యుకేషన్ : కళ్యాణదుర్గం పట్టణంలోని ఓ కేంద్రంలో ఇన్విజిలేటర్ చొరవ తీసుకుని ఓ విద్యార్థిని రాసిన జవాబు పత్రాన్ని అదే గదిలో ఇతర విద్యార్థులకు అందజేశారు. చూసిరాతను ప్రోత్సహించారు. ఇన్విజిలేటరే కల్పించుకుని తన పేపరు ఇతర విద్యార్థులకు ఇవ్వడంతో సదరు విద్యార్థిని ప్రశ్నించే సాహసం చేయలేదు. – మరో కేంద్రంలో ఉదయం ఎనిమిది గంటలకే మూడో అంతస్తుపై పుస్తకాలు పెడుతున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత అటెండర్, వాటర్‌బాయ్ తదితరులు ప్రశ్నపత్రాన్ని పరిశీలించి.. పైకి వెళ్లి జవాబులు తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి చిట్టీలు ఇస్తున్నారు. పదో తరగతి పరీక్షలు ఏ రీతిన జరుగుతున్నాయో ఈ రెండు ఘటనలే నిదర్శనం. ఈ నెల 17 నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లూ ఉండకూడదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కోన శశిధర్ మరో అడుగు ముందుకేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా చీఫ్ సూపరింటెండెంట్లను నియోజకవర్గాలు మార్పు చేశారు. గతంలో ఏ స్కూల్లో అయితే హెచ్ఎంగా ఉండేవారో అదే స్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించేవారు. ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇక ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి జిల్లా పరిశీలకులుగా ఇక్కడే మకాం వేశారు. రోజూ పదుల సంఖ్యలో కేంద్రాలు తనిఖీలు చేస్తున్నారు. అయినా ప్రయోజనం ఉండడం లేదు. చాలా కేంద్రాల్లో మాస్‌కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. ఈ విషయంలో కొందరు ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు చక్రం తిప్పుతున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను ప్రలోభపెట్టి తమ విద్యార్థులకు లబ్ధి చేకూరేలా చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో పరీక్షల నిర్వహణ సిబ్బంది కూడా ప్రైవేట్ పాఠశాలల పిల్లలకు మాత్రమే చిట్టీలు ఇవ్వడం, చూసిరాతలు ప్రోత్సహించడం, బిట్స్‌కు సమాధానాలు చెప్పడం వంటివి చేస్తున్నారు. మరోవైపు ఆయా కేంద్రాలకు ఎవరైనా తనిఖీకి వస్తే నిమిషాల్లోనే అందర్నీ అలర్ట్ చేస్తున్నారు. తనిఖీ అధికారులు బయటకు వెళ్లగానే మళ్లీ తమ పని కానిచ్చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన మరోవైపు కష్టపడి చదువుకుని పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాము ఏడాదంతా కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే, తమతో పాటు రాస్తున్న మరికొందరు విద్యార్థులకు చిట్టీలు ఇవ్వడం, చూసి రాయిస్తుండటంతో వారు మనస్తాపానికి గురవుతున్నారు. వారితో పాటు తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే అక్రమాలను ప్రోత్సహిస్తున్నారంటూ వాపోతున్నారు. యాక్ట్ 25 అభాసుపాలు యాక్ట్- 25 నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా, ప్రోత్సహించినా ఈ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు. ఆర్నెల్ల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా ఉంటుంది. ఇంతటి కఠినమైన చట్టం అమలులో ఉన్నా కొందరు బరి తెగిస్తూ అక్రమాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఈ వ్యవహారం వెనుక కొందరు అధికారుల అండ కూడా ఉందనే ప్రచారం సాగుతోంది. కూడేరులో గణితం పేపర్ లీక్ కూడేరు : కూడేరు హైస్కూల్ పరీక్షా కేంద్రం నుంచి శుక్రవారం పదోతరగతి గణితం పేపర్–2 ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. 11 గంటలకు ప్రశ్నపత్రం బయట హల్చల్ చేసింది. దాని ఆధారంగా జవాబు స్లిప్పులను పరీక్షా కేంద్రంలోని గదుల్లోకి వేసేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. పరీక్షా కేంద్రంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రశ్నపత్రం బయటకు రావడం గమనార్హం. కొందరు సిబ్బంది సెల్ఫోన్లను లోపలికి తీసుకెళుతున్నారని, వాట్సాప్ ద్వారానో, ఇతరత్రా మార్గాల్లోనో బయటకు పంపివుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
చూ’ఛీ’రాతలు
సమ్మెటివ్3 పరీక్షల్లోనూ మాస్‌కాపీయింగ్ మార్కుల కోసం అడ్డదారి తొక్కుతున్న ప్రైవేటు విద్యాసంస్థలు 9వ తరగతి గణితం పేపర్2 లీక్ ప్రతిభకు పాతర విద్యార్థుల జీవితాలతో చెలగాటం పట్టించుకోని విద్యాశాఖ ’మాకున్నది ఒకే అమ్మాయి. ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదివిస్తున్నాం. సమ్మెటివ్ పరీక్షలను చాలా జాగ్రత్తగా.. ఎటువంటి అవకతవకలు లేకుండా జరిపిస్తామని, జవాబు పత్రాలను వేరే ఉపాధ్యాయులతో దిద్దిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కానీ, ప్రైవేటు పాఠశాలల్లో కాపీలు రాయిస్తూ.. విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేస్తున్నారు. ఎంతగా దిగజారారంటే.. తరగతి గదిలోనే పుస్తకాలను ఉంచి.. పిల్లలకు స్లిప్పులు ఇచ్చి రాయిస్తున్నారు. క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలను అరగంట ముందే విద్యార్థులకు చెప్పేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలామంది పిల్లలు ఇంటివద్ద చదవటం లేదు. దీనివల్ల వారికి పాఠ్యాంశాలు అబ్బటం లేదు. బాగా చదివే వారికి.. అస్సలు చదవని వారికి ఒకే రకంగా మార్కులు వస్తున్నాయి. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల్ని ఇలా పెడదారి పట్టించడం న్యాయమా. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నా.. అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు ఉంటున్నారు. ఉన్నతాధికారులు దీనికి ఏం సమాధానం చెబుతారు’ నిడదవోలు పట్టణానికి చెందిన ఎస్.విజయలక్ష్మి అనే మహిళ పత్రికా కార్యాలయాలకు బుధవారం పంపించిన లేఖలోని ఆవేదన ఇది. జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న సమ్మెటివ్3 పరీక్షలు ఎంత గొప్పగా సాగుతున్నాయో చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఏలూరు సిటీ : విద్యావ్యవస్థలో నూతన విధానాలను సైతం కొన్ని విద్యాసంస్థలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని విద్యార్థులందరికీ ’సమ్మెటివ్’ పేరిట ప్రభుత్వం ఏకరూప పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టింది. త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షల స్థానంలో సమ్మెటివ్1, సమ్మెటివ్2 పరీక్షలు నిర్వహించింది. తాజాగా, సమ్మెటివ్3 పేరిట వార్షిక పరీక్షలు నిర్వహిస్తోంది. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు అక్కడక్కడా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం చూసిరాతలను ప్రోత్సహిస్తున్నారు. అంగట్లో ప్రశ్నపత్రాలు సమ్మెటివ్3 పరీక్షల ప్రశ్నపత్రాలు ముందుగానే మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. బుధవారం జరగాల్సిన 9వ తరగతి సమ్మెటివ్3 గణితం పేపర్2 ప్రశ్నపత్రం మంగళవారం రాత్రే అంగట్లోకి వచ్చేసింది. ఈ విషయాన్ని ’సమ్మెటివ్3 గణితం పేపర్ లీక్’ శీర్షికన బుధవారం సంచికలో ’సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. బుధవారం మధ్యాహ్నం పరీక్షకు అర్ధగంట ముందు గణితం పేపర్2 పరీక్ష ప్రశపత్రాన్ని తెరిచిన ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. పేపర్ లీక్ కావటంతో ప్రశ్నపత్రాన్ని మారుస్తారని, లేదా పరీక్షను వాయిదా వేస్తారని భావించగా, పరీక్ష యథావిధిగా జరిగిపోయింది. ఈ మాత్రం దానికి ప్రశ్నపత్రాలు హైదరాబాద్‌లో రహస్యంగా ముద్రించటం ఎందుకు.. పబ్లిక్ పరీక్షల స్థాయిలో హడావుడి చేయటం ఎందుకు, ప్రశ్నపత్రం లీక్ అయ్యిందనే విషయం తెలిసినా రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు కనీసం విచారణ కూడా చేపట్టకపోవటం ఏమిటనే ప్రశ్నలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. ఈ ప్రశ్నపత్రం విశాఖపట్నం నుంచి జిల్లాకు వచ్చిందని.. నరసాపురం కేంద్రంగా జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలకు దాని కాపీలను చేరవేశారని సమాచారం. యథేచ్ఛగా చూసిరాతలు జిల్లాలోని చాలా పాఠశాలల్లో మాస్‌కాపీయింగ్‌ను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారు. 6నుంచి 8వ తరగది వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, లెక్కలు పరీక్షలు పూర్తయ్యాయి. 9వ తరగతి విద్యార్థులకు బుధవారం నాటితో లెక్కలు పరీక్ష పూర్తయ్యింది. ఈ పరీక్షల్లో లెక్కలు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించి చూసిరాతలను పెద్దఎత్తున నిర్వహించారు. సైన్స్ ప్రశ్నపత్రాలు కూడా ముందస్తుగానే బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. చూసిరాతల వ్యవహారం 6, 7 తరగతుల విద్యార్థుల విషయంలో పెద్దగా లేకపోయినా.. 8, 9 తరగతుల్లో సాగుతోంది. ఆ రెండు తరగతుల్లో విద్యార్థులకు వచ్చే మార్కుల ఆధారంగా పదో తరగతిలో గ్రేస్ మార్కులు కలపడానికి అవకాశం ఉండటంతో చూసిరాత పేరిట విద్యార్థులను పెడదారి పట్టిస్తున్నారు. జిల్లాలో లీక్ కాలేదు 9వ తరగతి సమ్మెటివ్3 గణితం పేపర్2 ప్రశ్నపత్రం జిల్లాలో లీక్ కాలేదు. బయట జిల్లాల నుంచి ఇక్కడకు ఎవరో తెచ్చి ఉంటారు. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు సమాచారం ఇచ్చాం. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. రాష్ట్రమంతా ఒకే ప్రశ్నపత్రాన్ని ముద్రించడం వల్ల లీక్ అయిన పేపర్‌కు బదులు మరో పేపర్ ఇచ్చే అవకాశం లేకుండాపోయింది. ఆర్ఎస్ గంగాభవాని, డీఈఓ, ఏలూరు -
దడ!
ఇంటర్ విద్యార్థులకు అగ్ని పరీక్షలా ‘నిమిషం’ పదో తరగతి విద్యార్థులను భయపెడుతున్న 5 నిమిషాలు.. క్షేత్రస్థాయి సమస్యలు పట్టించుకోరా..? కనీస సౌకర్యాలే లేనప్పుడు కఠిన నిబంధనలేల! ఆందోళనలో విద్యార్థులు ఒక్క నిమిషం..60 సెకన్లు.. రెప్పపాటులో కాలగర్భంలో కలిసిపోయే సెకన్..గట్టిగా నిట్టూర్చినా నిమిషం హరీమంటుంది. పరీక్షా సమయంలో నిమిషం అగ్ని పరీక్ష పెడుతోంది. విద్యార్థులకు కన్నీళ్లు పెట్టిస్తోంది.. పరుగులు పెట్టిస్తోంది. చదివింది మర్చిపోయేంత దడ పుట్టిస్తోంది. రవాణా సదుపాయాలుండవు.. బస్సులున్న చోటా అవి వేళకు రావు. తండ్రో, సోదరుడో బైక్‌పై డ్రాప్ చేయబోతే ఏదో సమస్య. నడక తప్ప గత్యంతరం లేని విద్యార్థులెందరో.. ఎలా రావాలి? నిమిషమే అగ్ని పరీక్ష పెడుతోందంటే విచిత్రంగా పదో తరగతి విద్యార్థులకు ఐదు నిమిషాల నిబంధనపెట్టి వారికీ దడ పుట్టిస్తున్నారు. అసలే పల్లెటూళ్లు.. పక్క గ్రామాల నుంచి రావాలంటే ఎప్పుడో వచ్చే బస్సు.. రోడ్లే లేని ఊళ్లలోని విద్యార్థులకు పొలం గట్లే గతి..ఏమిటీ అర్థం లేని నిబంధనలు.. కనీస ఆలోచన లేని అధికారుల తీరు విద్యార్థుల గుండెల్లో దడ పుట్టిస్తోన్న వైనంపై ప్రత్యేక కథనం.. పాపన్నపేట: ఒక్కో విద్యార్థిది ఒక్కో పరిస్థితి. కానీ ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులు ఒక్క నిమిషం, 5 నిమిషాలు దాటితే పరీక్షకు అనుమతించ బోమనే కఠిన నిబంధనలు విధించి తమ జీవితాలతో ఆటలాడు కుంటున్నట్లుగా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని నర్సాపూర్ జూనియర్ కళాశాలలో ఒక్క నిమిషం నిబంధన ముగ్గురు విద్యార్థులను పరీక్షలు రాయకుండా చేసింది. ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.15 వరకు కొనసాగుతాయి. జిల్లాలో మొత్తం 67 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 10,924 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 21 కేంద్రాల్లో మాత్రమే డ్యూయల్ డెస్క్‌లు ఉండగా, 9 కేంద్రాల్లో ఒక్క డెస్కు కూడా లేనట్లు సమాచారం. మిగతా వాటిలో బెంచీలు, కుర్చీలు సమకూర్చి పరీక్షలు రాయిస్తున్నారు. ఇంకా కొన్ని కేంద్రాల్లో బయట నుంచి బెంచీలు, కుర్చీలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు, వెలుతురు, టాయిలెట్లు సరిగా లేకపోగా, మరికొన్ని కేంద్రాల్లో కూర్చోవడానికి అనుకూలంగా లేని లాంగ్, బెంచీలు, కుర్చీలపైనే నడుముల నొప్పి వస్తున్నా విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యాలు లేనప్పుడు సమయానికెలా రావాలి? జిల్లాలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేవు. చాలా మంది విద్యార్థులు ఆటోలు.. అవి లేకుంటే నడుచుకుంటూ పాఠశాలకు వస్తుంటారు. పల్లెటూళ్ల నుంచి వచ్చే ఆటోల డ్రైవర్లు సామర్థ్యాని కనుగుణంగా ప్రయాణికులు నిండితేగాని ఆటోను నడపరు. కొంత మంది విద్యార్థులు పొలాల గట్లపై.. వాగులు వంకలు దాటుతూ బడికి రావాల్సి ఉంటుంది. ఎండాకాలం కావడంతో భానుడి భగభగలు అప్పుడే ప్రారంభమయ్యాయి. జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టాక పరీక్ష కేంద్రాలను చదివే బడిలో కాకుండా పొరుగు బడుల్లో నిర్వహిస్తున్నారు. అక్కడకు బస్సు సౌకర్యాలు కూడా లేవు. ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా 5 నిమిషాల నిబంధన విధించడం సరికాదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. కాపీయింగ్‌కు నిమిషం నిబంధనలకు సంబంధమేమిటి? మాస్ కాపీయింగ్‌కు, నిమిషం నిబంధనకు సంబంధం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. మాస్ కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు నిమిషం నిబంధన విధించినట్లు ఇంటర్ బోర్టు ప్రకటించడం హాస్యాస్పదం, అమానవీయం అంటున్నారు. కాపీయింగ్‌కి నిమిషం నిమింధనకు పొంతనలేనిదని పేర్కొంటున్నారు. రెండు నిమిషాలు ఆలస్యమైతే రెండు మార్కులు పోతాయనే నెపంతో పూర్తి పరీక్ష రాయకుండా చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంటి వద్ద మగవాళ్లే లేరు.. ఎలా రావాలి మాది పాపన్నపేటకు 5 కి.మీ. దూరంలోని రామతీర్థం. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలో.. ఒక్కోసారి నడిచి వస్తుంటాను. ఇప్పుడు పరీక్ష కోసం పాపన్నపేట వరకు నడిచి వచ్చి అక్కడి నుంచి 5 కి.మీ. దూరం బస్సులో ప్రయాణించి, మరో 2 కి.మీ. నడిస్తే గాని కుర్తివాడలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని చేరుకోలేం. మా నాన్న జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇద్దరు అక్కలు.. కనీసం బైక్‌పై వెళదామంటే మగవారే లేరు. – ఎస్. వనజ, రామతీర్థం పొలం గట్లపై 5 కి.మీ. నడవాలి మాది పాపన్నపేటకు 5 కి.మీ దూరంలోని ముద్దాపూర్. మా గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. రోజు 5 కి.మీ. ఓ వాగు దాటి పొలం గట్లపై నుంచి పాపన్నపేటకు వచ్చి చదువుకుంటాం. ఇప్పుడు కాలినడకన పాపన్నపేటకు వచ్చి, అక్కడి నుంచి 5 కి.మీ బస్సులో ప్రయాణించి, మరో 2 కి.మీ నడిచి 9.30కల్లా కుర్తివాడ పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యం కాకుండా వెళ్లాలంటే సాధ్యమేనా? ఎంత ప్రయత్నించినా ఒక్క రోజైనా ఆలస్యం కాదా? 5 నిమిషాల కోసం మా జీవితాన్నే నాశనం చేస్తారా. – పి.శ్వేత. ముద్దాపూర్ సుప్రియది మరో వ్యథ ‘పాపన్నపేట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఘనపురం సుప్రియది మరో వ్యథ. ఈ అమ్మాయిని అన్నారం గ్రామానికి చెందిన వాళ్ల చిన్నాన్న దత్తత తెచ్చుకున్నాడు. ప్రతి రోజు 5 కి.మీ దూరం ప్రయాణించి పాఠశాలకు వచ్చేది. కానీ ఇటీవల దత్తత తెచ్చుకున్న వాళ్ల చిన్నాన్న చనిపోవడంతో ఇంట్లో గొడవలు ఆరంభమై సుప్రియ కామారెడ్డి జిల్లాలోని తన స్వగ్రామమైన కన్నారెడ్డి నుంచి పాఠశాలకు వస్తోంది.అయితే ఆమె పదో తరగతి పరీక్షలు రాయాలంటే కన్నారెడ్డి నుంచి 3 కి.మీ. దూరం కాలినడకన వచచి 50 కి.మీ దూరం బస్సులో ప్రయాణిస్తే గాని పరీక్ష రాయాల్సిన యూసుఫ్‌పేటకు చేరుకోలేని పరిస్థితి’. ఈ అమ్మాయి భవిష్యత్తుకు అగ్ని పరీక్ష పెట్టింది ఎస్సెస్సీ బోర్డు. -
మాస్ కాపీయింగ్‌కు అవకాశం
గ్రూప్–2 లో గ్రూపు దరఖాస్తులపై అభ్యర్థుల ఆందోళన సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల 26న నిర్వహించతలపెట్టిన గ్రూప్2 ప్రిలిమ్స్ పరీక్ష మాస్ కాపీయింగ్‌కు వీలు కల్పించేలా ఉందని నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాల్టిక్కెట్ల జారీలో కొన్ని తప్పులు నెలకొనగా.. కొన్ని కోచింగ్ సెంటర్లు, ఇతర సంస్థల్లో తర్ఫీదు పొందుతున్నవారిలో అనేకమందికి పక్కపక్క హాల్టిక్కెట్ల నెంబర్లు వచ్చాయని తాజాగా వెల్లడైంది. దీంతో ఇతర అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షను ఒకవారం వాయిదా వేసి అభ్యర్థులకు హాల్‌టిక్కెట్ నెంబర్ల వరుసక్రమాన్ని మార్పు చేయాలని కోరుతున్నారు. పరీక్ష వాయిదా వేయలేం: ఛైర్మన్ దీనిపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్‌ను వివరణ కోరగా... సెకనుకు మూడు దరభాస్తులు మాత్రమే అప్లోడ్ అవుతాయని, భారీగా ఒకేసారి దరఖాస్తు చేయడానికి వీలుకాదని చెప్పా రు. ఇలాంటి అభ్యర్థులున్న చోట్ల తాము కాపీయింగ్‌కు తావులేకుండా ప్రత్యేక చర్య లు చేపడతామని చెప్పారు. పరీక్ష వాయిదా కానీ సాధ్యంకాదని స్పష్టంచేశారు. -
రాసుకున్నోళ్లకు రాసుకున్నంత
- ఐటీఐ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ - హాల్‌టిక్కెట్లు లేకుండానే పరీక్ష రాస్తున్న విద్యార్థులు హిందూపురం అర్బన్ : ఐటీఐ మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జోరుగా జరుగుతోంది. ఎస్వీ, ఏంజెల్ ఐటీఐ కళాశాలల్లో చదువుతున్న సుమారు 150 మంది విద్యార్థులకు 2 నుంచి 16వ తేదీ వరకు మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. కిరికెర వద్ద ఉన్న ఎంజెల్ ఐటీఐ కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు అంతా కుమ్మక్కై చూచిరాతలు రాయిస్తున్నట్లు కనిపిస్తోంది. బయటి వ్యక్తులు వచ్చి పరీక్ష హాలులో కూర్చుంటున్నారు. అలాగే కొందరు విద్యార్థులకు హాల్ టిక్కెట్లు కూడా లేవు. విద్యార్థులు గుంపుగా కూర్చుని పుస్తకాలు పెట్టుకుని పరీక్షలు రాస్తున్నారు. కాగా పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ఇన్విజిలేటర్లు, పర్యవేక్షకుల వద్ద ఐడీ కార్డులు కూడా లేకపోవడం గమనార్హం. -
అంతా చూచిరాతే..
నాగార్జున వర్సిటీ దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బీఈడీ కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఓపెన్ పీజీ, డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. శనివారం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. అయితే, పరీక్షలు చూచిరాతలను తలపిస్తు న్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’బృందం శనివారం పరీక్షా కేంద్రానికి వెళ్లింది. బృందం అక్కడి వెళ్లగానే పరీక్ష రాస్తున్న అభ్యర్థులు చిట్టీలు బయటపడేశారు. పాస్ గ్యారెంటీ అని హామీ ఇస్తూ ఏజెంట్లు విద్యార్థులకు చెప్పి గుంటూరుకు చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రంలో ప్రవే శాలు ఇప్పిస్తున్నారు. పరీక్షకు హాజరైతే ఒక రేటు.. హాజరు కాకుంటే మరోరేటు అం టూ డబ్బులు వసూలు చేస్తున్నారు. పరీక్షల ను ఉద్యోగులు ప్రమోషన్ల కోసం డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు అవసర మున్నందున డబ్బులు ఖర్చు చేసి పరీక్షలు రాస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కావ డంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు చాలామందికి రానున్నాయి. ఇటీవల మహబూబాబాద్ తహసీల్దార్ విజయ్‌కుమార్ తనిఖీలకు వెళ్లి ముగ్గురు అభ్యర్థులను డిబార్ చేశారు. -
టీటీసీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్!
డోన్ టౌన్ : స్థానిక పాతపేట ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న టీటీసీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోంది. ఈనెల 3వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలను 263 మంది విద్యార్థులు రాస్తున్నారు. మాస్ కాపీయింగ్ జరుగుతోందనే సమాచారంతో సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లిన విలేకరులను చూసి ఇన్విజిలేటర్లు విద్యార్థులను అలర్ట్ చేశారు. దీంతో విద్యార్థులు కిటికీల గుండా కాపీలను పారవేశారు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మకాం వేసిన కొందరు కాపీలను పరీక్షా కేంద్రంలోకి పంపుతుండడం గమనార్హం. దీనిపై చీఫ్ ఇన్విజిలేటర్ మైకేల్ వివరణ కోరగా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారమే లేదని చెప్పుకొచ్చారు. -
డీఎడ్ పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్
పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నపత్రం బయటకు వచ్చిన వైనం కిటీకీల్లో నుంచి పరీక్ష హాల్లోకి జవాబు పత్రాల పంపిణీ అంతా పబ్లిక్‌గా జరుగుతున్నా పట్టించుకోని అధికారులు రాయచోటి రూరల్: రాయచోటి పట్టణంలో నిర్వహిసున్న డీఎడ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ భారీగా జరుగుతోంది. పరీక్షలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా నిమిషాల వ్యవధిలోనే ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత దానికి సంబంధించిన జవాబు పత్రాలు పరీక్షా కేంద్రాల బయట నుంచి కిటికీ ద్వారా లోపలి విసిరేసేందుకు పలువురు సిద్ధమయ్యారు. రాయచోటి పట్టణంలో డైట్ విద్యా కేంద్రం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రెండు చోట్ల మొత్తం 17 గదుల్లో 500 మంది విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కిటికీల నుంచి కొందరు యువకులు పరీక్షా హాల్లోకి జవాబు పత్రాలు నేరుగా వేస్తున్నా అక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటం గమనార్హం. ఈ విషయాలపై పరీక్షా కేంద్రాల చీఫ్‌లు దేవరాజులురెడ్డి, రాజేంద్రప్రసాద్‌లను వివరణ కోరగా ప్రశ్నపత్రం ఎలా బయటకు వెళ్లిందో తమకు అంతు పట్టడం లేదన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. -
మాస్ కాపీయింగ్‌పై చర్యలేవి?
► తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను నిలదీసిన హైకోర్టు ► 4 వారాల్లో పూర్తి వివరాలతో అఫిడవిట్ల దాఖలుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన, అందుకు సహకరించిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎంత మందిపై కేసులు నమోదు చేశారు, ఎంత మందిని ప్రాసిక్యూట్ చేశారు, ఎంత మందికి శిక్ష పడింది.. తదితర పూర్తి వివరాలు తమకు అందజేయాలని ఆదేశించింది. ఎన్ని విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందు తర్వాత పరీక్షల ఫలితాలు ఎలా ఉన్నయనే వివరాలను కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. గడువులోగా అఫిడవిట్లు దాఖలు చేయని పక్షంలో విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు పట్టించుకోవడం లేదు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు మాస్ కాపీయింగ్, పుస్తకాలు చూసుకుంటూ పరీక్షలు రాయడాన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని... దీనిని అడ్డుకునేందుకు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశించాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గుంటుపల్లి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ఆ వ్యాజ్యంపై మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఇప్పుడు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచర్లకు మార్కులే పరమావధి అయిపోయింది. సబ్జెక్ట్ నేర్చుకునే విషయం పక్కకు వెళ్లిపోయింది. బీహార్ ఉదంతంలో టాప్ ర్యాంకర్లు చివరికి ఎలా మిగిలారో అందరూ చూశారు. ఎంసెట్ లీకేజీనీ చూశాం. లక్షల రూపాయలు చేతులు మారాయి. ఇటువంటి అనైతిక చర్యల వల్ల విద్యా వ్యవస్థ నాశనమైపోతోందని..’’ అని వ్యాఖ్యానించింది. అనంతరం నిరంజన్‌రెడ్డి వాదన వినిపిస్తూ.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ కార్యక్రమాలకు కోట్లు ఖర్చు చేస్తున్నాయని, సీసీ కెమెరాల ఏర్పాటుకు మాత్రం డబ్బు లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ స్పందిస్తూ.. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి వెళ్లడం లేదని, వాటి కోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా కూడా వేశామని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. తమ ఉత్తర్వుల కోసం ఎదురుచూడటం ఎందుకని, సీసీ కెమెరాలు పెట్టాలనుకుంటే పెట్టేయాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. అందరికీ కావాల్సింది విద్యార్థుల భవిష్యత్తేనని.. తెలంగాణ చేస్తున్నప్పుడు ఏపీ ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. ఇప్పటివరకు మాస్ కాపీయింగ్ వ్యవహారంలో తీసుకున్న మొత్తం చర్యలను వివరిస్తూ నాలుగు వారాల్లోగా అఫిడవిట్ సమర్పించాలని ఇరు రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. -
పక్కా చూసిరాత !
–ఎస్వీ యూనివర్సిటీ దూర్యవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ – శంకరాస్ డిగ్రీ కళాశాల కేంద్రంలో బరితెగింపు – పరీక్ష కేంద్రానికి తాళం వేయించి చూసిరాత – వర్సిటీ, పోలీసు,అధికారులను మేనేజ్ చేశామంటున్న వైనం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. ఇటీవల మహానందిలోని గాజులపల్లె భారతీ డిగ్రీ కళాశాలలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ మీడియా కంట పడిన నేపథ్యంలో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. ఎవరు లోపలికి రాకుండా కర్నూలులోని శంకరాస్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్ష కేంద్రానికి తాళం వేసి లోపల బుక్కులు పెట్టి విద్యార్థులతో పరీక్షలు రాయిస్తున్నారు. అంతేకాక మాస్ కాపీయింగ్‌కు వర్సిటీ, స్థానిక పోలీసులు, రెవెన్యూ, ఇతర అధికారులే అనుమతి ఇచ్చినట్లు వారు చెబుతుండడం గమనార్హం. మోహన్‌రెడ్డిదే హవా! శంకరాస్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఎస్వీ దూర విద్య పరీక్షలకు ఆ కళాశాల డైరక్టర్ హరికిషన్ చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. ఈయన పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. కాగా, ఈ కేంద్రం పరీక్షల కో ఆర్డినేటర్‌గా ప్రతిభ మోడల్ స్కూల్ యాజమాని బావమరిది మోహన్‌రెడ్డి ఉన్నారు. ఈయనే విద్యార్థుల నుంచి అడ్మిషన్ల కోసం, మాస్ కాపీయింగ్ కోసం డబ్బులను వసూలు చేస్తాడు. మాస్ కాపీయింగ్ కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా పరీక్షా కేంద్రం వద్దనే ఉండి ఎవరినీ లోపలకు వెళ్లనీయకుండా చూస్తాడు. ఏకంగా గేటుకు తాళం వేశాడు. మీడియాను సైతం నిలువరించే ప్రయత్నం చేస్తాడు. మొదట నోటితో భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. మాట వింటే ఒకే. లేకుంటే ఏమైన ఉంటే మాట్లాడుదాం..రండి అంటూ ఆఫర్ ఇస్తాడు. కాగా, ప్రవేశాలు చేయించుకునే కో ఆర్డినేటర్ పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చా అంటే సమాధానం చెప్పేనాథుడు కరువయ్యాడు. ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే పరీక్షలను ఎక్కడైనా కింది ఫ్లోర్లో నిర్వహిస్తారు. ఇక్కడ మాత్రం కింది ఫ్లోర్లను వదిలి రెండో ఫ్లోర్లో నిర్వహిస్తున్నారంటే మాస్‌కాపీయింగ్ కోసమేనని తెలుస్తోంది. ఎందుకో తనిఖీ చేసే వర్సిటీ అధికారులు మామూళ్లకు తలొగ్గి ముఖం చాటేశారు. దీంతో కేంద్రంలో బుక్కులు పెట్టి పరీక్షలు రాస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. మీడియాను తికమక పెట్టిన వైనం.. శంకరాస్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఎస్వీ దూర విద్య పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జోరుగా జరుగుతుందనే సమాచారంతో ఆదివారం సాక్షి బందం అక్కడికి వెళ్లింది. అప్పటికే పరీక్ష కేంద్రానికి తాళం వేసి ఉన్నారు. ఆ పక్కనే లోపలికి ఎవరినీ వెళ్లనీయకుండా కోఆర్డినేటర్ మోహన్‌రెడ్డి ఉన్నారు. అయినా, సాక్షి బందం లోపలి వెళ్లేందుకు ప్రయత్నించగా మొదట గట్టి అరుపులతో భయపెట్టేందుకు కోఆర్డినేటర్ చూశాడు. మీడియా అని చెప్పగా మొదట చీఫ్ సూపరింటెండెంట్ అనుమతి తీసుకొని రమ్మని చెప్పాడు. ఆయన దాదాపు 15 నిమిషాల తరువాత మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడి లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు..మాకు తెలుసు అంటూ మాట విప్పాడు. ఏమైన ఉంటే మాట్లాడుదామని పిలిచాడు. ఇలా దాదాపు మీడియా పరీక్ష కేంద్రం ఆవరణలోకి వెళ్లిన ఆరగంటకు గేటు తాళం తీశారు. అనంతరం పరీక్షలను రాస్తున్న విద్యార్థుల దగ్గరకు తీసుకెళ్లారు. ఈలోపే విద్యార్థుల దగ్గర నుంచి పుస్తకాలు తీసేసి ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగడం లేదని కలరింగ్ ఇచ్చారు. అయినా, విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లిన పుస్తకాలు ‘సాక్షి’కంట పడ్డాయి. -
చూసి రాసేసుకోవచ్చు!
దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఇష్టారాజ్యంగా పరీక్షల నిర్వహణ పర్యవేక్షకులు లేకుండానే ఎగ్జామ్స్ జవాబు పత్రాలు పంపడంలోనూ నిదానమే ఇదీ శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ డిస్టెన్స్ పరీక్షల తీరు నర్సాపూర్: శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ డిస్టెన్స్ వార్షిక పరీక్షల్లో చూసి రాతల హడావిడి ఎక్కువైంది. డిగ్రీ, పీజీ పరీక్షలు రాసే అభ్యర్థులు పుస్తకాలు దగ్గర పెట్టుకుని మరీ రాసేసుకుంటున్నారు. నర్సాపూర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో కొనసాగుత్ను స్టడీ సెంటర్లో కొన్నేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నట్లు సమాచారం. మాస్ కాపీయింగ్ కోసం స్కూల్ యాజమాన్యం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ మందికి ‘అవసరం’ దూరవిద్యలో పరీక్షలు రాసేవారిలో ప్రమోషన్ల కోసం కొందరు ఉద్యోగస్తులు రాస్తుండగా.. మరికొందరు ఇతర వ్యాపకాలు ఉన్నవారు. దీంతో వీరంతా కాపీయింగ్‌పై ఆధారపడుతున్నారు. అభ్యర్థుల అవసరాలను నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. అదనంగా డబ్బులు వసూలు చేస్తూ చూసి రాతలకు అవకాశం ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. పరీక్ష కేంద్రం మార్పు నర్సాపూర్‌తో పాటు తూప్రాన్‌లోని స్టడీ సెంటర్‌కు చెందిన అభ్యర్థులకు నర్సాపూర్‌లోని వైష్ణవి డీఎడ్ కాలేజీలో పరీక్షలు నిర్వహించాల్సిందిగా యూనివర్సిటీ ఆదేశించింది. ఈ మేరకు హాల్‌టికెట్లు జారీ చేసింది. కాగా, యూనివర్శిటీ సూచించిన కాలేజీ భవనం కాకుంగా స్థానిక స్టడీ సెంటర్, తూప్రాన్‌కు చెందిన స్టడీ సెంటర్ నిర్వాహకులు కలిసి నర్సాపూర్‌కు దూరంగా ఉన్న ఓ కొత్త భవనంలో ఎగ్జామ్ సెంటర్ కొనసాగిస్తున్నారు. కనీసం పరీక్షలు నిర్వహిస్తున్న భవనం వద్ద సూచిక బోర్డు సైతం ఏర్పాటు చేయలేదు. సెంటర్ మార్పుపై ‘సాక్షి’ ప్రశ్నించగా.. వైష్ణవి డీఎడ్ కాలేజీలో గదులు సరిపోనందున కొత్త భవనంలోకి కేంద్రాన్ని మార్చామని పరీక్షల సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి చెప్పారు. మాస్ కాపీయింగ్ ఇలా.. పలువురు అభ్యర్థులు పుస్తకాలు పక్కన పెట్టుకుని పరీక్షలు రాస్తుండగా.. ఇంకొందరు చీటీలు తెచ్చుకున్నారు. మరికొందరైతే పక్కపక్కనే కూర్చొని రాసుకుంటున్నారు. పరీక్షలు జరుగుతున్నపుడు యూనివర్శిటీకి ఇన్విజిలేటర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్విజిలేటర్ ఆదివారం వచ్చారని, సోమవారం సిద్దిపేట వెళ్లారని సెంటర్ నిర్వాహకులు చెప్పారు. జవాబు పత్రాలు పంపడంలో జాప్యమే పరీక్ష కేంద్రం ఇన్చార్జిలు జవాబు పత్రాలను వెంటనే సంబంధిత సెంటర్‌కు పంపించడం లేదని తెలిసింది. ఆదివారం జరిగిన పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను సోమవారం మధ్యాహ్నం వరకు పంపకపోవడం ఇందుకు ఉదాహరణ. సోమవారం పరీక్షలు జరుగుతుండగా.. కొందరు యువకులు ఆదివారం పూర్తయిన పరీక్ష జవాబు పత్రాలను ప్యాక్ చేస్తున్నారు. అక్కడ కూడా అధికారులెవరూ లేరు. -
పీజీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
– ఎస్వీ యూనివర్సిటీ అధికారుల సాక్షిగా చూచిరాత – పాస్ గ్యారెంటీ పేరుతో ప్రోత్సహిస్తున్న కళాశాల యాజమాన్యం – స్లిప్పులు ఇచ్చి దగ్గరుండి రాయిస్తున్న వైనం – రాసుకుపో అంటూ మీడియాపై ప్రిన్సిపాల్ ఆగ్రహం గాజులపల్లె(మహానంది): ఒకటో తరగతో...రెండో తరగతో కాదు...భవిష్యత్తులో అధ్యాపకులు, ఉన్నత స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దే పోస్టుగ్రాడ్యుయేట్ పరీక్షలను ఓ కాలేజీ యాజమాన్యం చూచిరాతగా మార్చేసింది. అభ్యర్థుల నుంచి పాస్ గ్యారంటీ అని రూ.వేలల్లో వసూళ్లు చేసిన కాలేజీ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా అభ్యర్థులను పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడేలా చేస్తోంది. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఓ భవనంలో భారతి డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం పోస్టుగ్రాడ్యుయేట్ ఎంఏ, ఎంఎస్సీ ప్రథమ సంవత్సరం పరీక్షలను దూర విద్యా విధానం ద్వారా నిర్వహిస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీ ద్వారా రాయిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. 200 మందికి గాను ప్రతి రోజూ 150 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. శనివారం నాలుగో పేపర్ పరీక్షను నిర్వహించారు. మాస్ కాపీయింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లడంతో వారి బండారం బయటపడింది. పక్కపక్కనే టేబుల్‌కు ఇద్దరు, ముగ్గురు చొప్పున కూర్చోబెట్టి స్లిప్పులు ఇచ్చి మరీ రాయిస్తున్నారు. అక్కడికి వెళ్లిన మీడియాపై ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు దురుసుగా ప్రవర్తించారు. ‘మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండి. ఎలా మేనేజ్ చేసుకోవాలో నాకు తెలుసంటూ ’ పేర్కొన్నారు. ఈ విషయంపై అక్కడే ఉన్న ఎస్సీ యూనివర్సిటీ తరపున వచ్చిన చీఫ్ సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి ‘సాక్షి’తో మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించే కళాశాలలు ఇలాంటివి ఎంకరేజ్ చేయరాదని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం. -
ఐటీఐ పరీక్షల్లో జోరుగా కాపీయింగ్?
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా గురువారం ఐటీఐ సెకెండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో 11 ప్రభుత్వ, 27 ప్రైవేటు ఐటీఐలకు సంబంధించిన విద్యార్థులు సంబంధిత పరీక్షలు రాశారు. వీరికోసం 5 ప్రభుత్వ ఐటీఐలలో, 4 ప్రైవేటు ఐటీఐలతోపాటు పోట్లదుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాల, రాజంపేటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 38 ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలకు సంబంధించి 11 సెంటర్లకు గాను 2287 మంది విద్యార్థులు పరీక్షను రాయవలసి ఉండగా 2145 మంది విద్యార్థులు మాత్రమే రాశారు. కడపలో జోరుగా కాపీయింగ్ కడప రాయచోటి రోడ్డుకు సమీపంలో గల ఓ ఐటీఐలో, అలాగే నగర శివార్లలోని మరో ఐటీఐలో జోరుగా కాపీయింగ్ జరిగినట్లు తెలిసింది. రాయచోటి రోడ్డులోని ఐటీఐలో విద్యార్థులను గుంపులు గుంపులుగా కూర్చోబెట్టి కళాశాల వారే కాపీయింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. దీంతోపాటు పరీక్షలకు వచ్చిన ఇన్విజిలేటర్లే వారికి సహకరించినట్లు తెలిసింది. విద్యార్థులు కూడా మధ్య మధ్యలో బయటకు వచ్చి వారికి కావాల్సిన పనిని కానిచ్చుకుని పోతున్నట్లు ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. కాపీయింగ్ జరిపించేందుకు కళాశాల యాజమాన్యం ప్రతి విద్యార్థి నుంచి రూ.1500లు రెండు వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పరీక్షల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఐటీఐల కన్వీనర్ నాగరాజును వివరణ కోరగా కాపీయింగ్ జరిగినట్లు తమ దృష్టికి రాలేదని, పరిశీలిస్తామని తెలిపారు. కడపలోని డీఎల్‌టీసీలో నేలబారు పరీక్షలు కడపలోని డిస్ట్రిక్ లెవెల్ ట్రెయినింగ్ సెంటర్లో గురువారం జరిగిన పరీక్షను విద్యార్థులు నేలపైన కూర్చుని రాశారు. సంబంధిత సెంటర్లో 140 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. డీఎల్టీసీ ఏడీ మంతేషులు పరీక్షను పర్యవేక్షించారు. -
ఆరు కేంద్రాల్లో సప్లిమెంటరీ పరీక్షలు
నగరంలో ఆరు కేంద్రాల్లో పరీక్ష చిత్తూరు (గిరింపేట) : మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు చిత్తూరులో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆర్ఐవో నాగభూషణం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామన్నారు. ఎక్కడగానీ మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. పరీక్షలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదన్నారు. చిత్తూరులోని కణ్ణన్, పీసీఆర్, నారాయణ, విజ్ఞాన సుమ, క్రిష్ణవేణి, విజయం కళాశాలల్లో పరీక్ష లు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం మొదటి సంవత్సర విద్యార్థులకు 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు 2 నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. తనిఖీ నిమిత్తం ఫ్లైయింగ్ స్క్వాడ్లను సైతం నియమించినట్లు తెలిపారు. -
డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
చల్లవానిపేట (జలుమూరు) : చల్లవానిపేట జంక్షన్‌కు సమీపంలోని వంశధార డిగ్రీ కళాశాలలో జరుగుతున్న గీతమ్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్(సీడీఎల్) పరీక్షల్లో విచ్చలవిడిగా చూసి రాతలు సాగుతున్నాయి. డిగ్రీ బీఏ, బీకాం ప్రథమ, తృతీయ సంవత్సరం పరీక్షలు ఈ నెల 10 నుంచి 16వరకు జరగ్గా ఇందులో అక్రమాలతో పాటు ఒకరికి బదులు వేరొకరు పరీక్షలు రాయించారని, సబ్జెక్టుల గైడ్లు పెట్టి మరీ కాపీయింగ్ చేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మంగళవారం ఇంగ్లిష్ పరీక్ష జరగ్గా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులను తీసుకువచ్చి చూసి రాతలు రాయించారు. పరీక్షలకు హాజరవుతున్న వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. గైడ్లు పెట్టి చూసిరాతలు రాయించేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 నుంచి పది వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగానే సబ్జెక్టు పేపరు అభ్యర్థి చేతికి వస్తుందని, గైడ్లోజవాబులు వెతికి మరీ చూసి రాసుకుంటున్నారని చెబుతున్నారు. మంగళవారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల కంటే సహాయకులే ఎక్కువగా ఉన్నారు. పరీక్షల నిర్వహణ కూడా ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహించారు. దీనిపై ప్రిన్సిపాల్ కె.సూర్యనారాయణ వద్ద సాక్షి ప్రస్తావించగా గీతం యూనివర్సిటీకి సంబంధించి తమ కళాశాలకు స్టడీ కేంద్రం ఉందని, ఇదే కళాశాలలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ కేంద్రం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చూసిరాతలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండడంపై అడగ్గా నాకు సంబంధం లేదని పొంతన లేని సమాధానం ఇచ్చారు. కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌గా మెట్ట ఆదినారాయణ వ్యవహరిస్తున్నారని ఆయన్నే అడగండని తప్పించుకున్నారు. ఇదే విషయూన్ని ఆదినారాయణ వద్ద ప్రస్తావించగా రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నానని ఈ రోజే కళాశాలకు వచ్చానని నాకు సంబంధం లేదని చెప్పారు. కళాశాల కరస్పాండెంట్ మధుబాబుతో మాట్లాడండి అని తప్పించుకున్నారు. -
వామ్మో! ఎన్ని రకాలుగా కాపీ కొడుతున్నారో!!
న్యూఢిల్లీ: పరీక్షల్లో కాపీ కొట్టడం కూడా ఓ కళే అన్నారు మన పెద్దలు. ఈ కళా నైపుణ్యం కూడా సమాజంలో వస్తున్న సాంకేతిక విప్లవానికి అనుగుణంగా కొత్త పుంతలు తొక్కుతోంది. పరీక్ష హాలులోకి చీటీలు పట్టుకుపోవడం, చొక్కాల కింద చేతుల మీద రాసుకోవడం పాతపడిన విద్యలు. సరికొత్త సాంకేతిక పరికరాలు అందుబాటులోకి రావడంతో మైక్రోఫోన్లు ఉపయోగించడం, సెల్ ఫోన్లు ఉపయోగించడం (పరీక్షల్లో నిషేధించారు కనుక) కూడా కనుమరుగైంది. ఇప్పుడు వాటి స్థానాల్లో కనిపించని వైర్లెస్ కెమేరాలు కలిగిన కళ్లజోడును ధరించడం, స్మార్ట్ వాచ్‌లను ఉపయోగించి కాపీ కొట్టడం కొత్త పుంతలు తొక్కింది. కళ్ల జోడుకున్న కెమేరాలు క్వశ్చన్ పేపర్‌ను స్కాన్‌చేసి ఎక్కడో ఉన్న మిత్రులకు అందజేస్తుంది. ఆ మిత్రులు ఆన్సర్లను స్మార్ట్ వాచ్‌కి పంపిస్తారు. ఇక వాటిని చూసుకొని రాసుకోవడమే తరువాయి. రహస్య సందేశాలను రాసుకోవడానికి ఉపయోగించే అల్ట్రా వాయలెట్ పెన్నులను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే దాంతో పాటు పెన్ టార్చ్లైట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే టార్చి ఫోకస్ వేసినప్పుడు మాత్రమే ఆ అక్షరాలు కనిపిస్తాయి. శరీర రంగులో కలిసిపోయే ఇయర్ ఫోన్లు, పలు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి కూడా కాపీ కొడుతున్నారు. పరీక్ష హాల్లోకి క్యాలుకులేటర్ల అనుమతిస్తున్నారు కనుక కొంత మంది అందులో ఉండే మెమోరి ఆప్షన్లను ఉపయోగించి కాపీ కొడుతున్నారు. మరికొందరు క్యాలుకులేటర్ల నల్లటి బాడీ వెనకాల పెన్సిల్‌తో జవాబులు రాసుకొని కాపీ కొడుతున్నారు. కంటికి దగ్గరగా పెట్టుకొని చూస్తే తప్పించి పెన్సిల్ రాత కనిపించదు. కొంత మంది పాత చీటిలనే కొత్త పద్ధతిలో కాపీకి ఉపయోగిస్తున్నారు. బ్రాండెడ్ మంచినీళ్ల బాటిల్‌ను కొని, లేబుల్‌ను అతి జాగ్రత్తగా తీసి అది తెల్లగా ఉండే వైపు జవాబులు అతికించి దాన్ని యథావిధిగా బాటిల్‌కు అతికిస్తున్నారు. అనుమానం రాకుండా సీల్డ్ బాటిల్‌ను పరీక్ష హాల్లోకి తీసుకెళుతున్నారు. బాటిల్ పైనుంచి ఏటవాలుగా దగ్గరి నుంచి లోపలికి చూసినప్పుడు మాత్రమే అక్షరాలు కనిపిస్తాయి. డిజిటల్ గ్లాసెస్‌ను ఉపయోగించి బొటన గోటివేలు మీద ఆన్సర్లు రాసుకొచ్చి డిజిటల్ గ్లాసెస్ సహాయంతో కాపీ కొడుతున్నారు. కొంత మంది విద్యార్థులు చీటీలు పెట్టుకునే వీలున్న మర మెకానిజం పెన్నులను కూడా కాపీ కోసం ఉపయోగిస్తున్నారు. ఇవన్ని ఇప్పటివరకు బయటపడ్డ విషయాలు మాత్రమే. దొరక్కుండా కొంత పంథాలో కాపీ కొడుతున్నవారు ఎంత మంది ఉన్నారో! -
హైటెక్ కాపీయింగ్: బీటెక్ విద్యార్థి పట్టివేత
చాంద్రాయణగుట్ట: హైటెక్ పద్ధతిలో పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని కళాశాల యజమాన్యం పట్టుకొని పోలీసులకు అప్పగించింది. పోలీసుల కథనం ప్రకారం... మాసబ్‌ట్యాంక్‌కు చెందిన షేక్ వసీం అహ్మద్ మలక్‌పేటలోని నవాబ్ షా ఆలం ఖాన్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సెకండ్ ఇయర్‌కు సంబంధించి కొన్ని సబ్జెక్ట్‌లు బ్యాక్లాగ్ ఉండటంతో ఆ పరీక్షల కేంద్రం చాంద్రాయణగుట్టలోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో పడింది. శుక్రవారం మధ్యాహ్నం థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పరీక్ష ప్రారంభమైంది. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పాఠశాల డెరైక్టర్ చేపూరి శ్రీలత తన బృందంతో కలిసి విద్యార్థులందరినీ పరిశీలిస్తున్నారు. వీరిని చూసి పరీక్ష రాస్తున్న షేక్ వసీం అహ్మద్ ఒక్కసారిగా తన పేపర్ అక్కడే వదిలేసి బయటికి పరుగు తీశాడు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది అతడిని వెంబడించి పట్టుకుని క్షణ్ణంగా తనిఖీ చేయగా... దిమ్మె తిరిగే విషయం బయటపడింది. వసీం అండర్ వేర్లో సెల్‌ఫోన్, బనియన్ అంచులలో కుట్టిన ట్రాన్స్‌మీటర్ కేబుల్, చెవిలో సూక్ష్మమైన బ్లూటూత్ పరికరం బయటపడ్డాయి. బయటి నుంచి కాల్ వచ్చిన వెంటనే నాలుగైదు రింగ్‌లకు ఆటోమెటిక్‌గా ఫోన్ రిసీవ్ కావడం... రిసీవ్ అయిన వెంటనే వైర్లెస్ ట్రాన్స్ మీటర్ స్వీకరించడం... దాని నుంచి బ్లూటూత్‌కు ఆడియో రిసీవింగ్ అవుతున్నట్లు కనిపెట్టారు. దీంతో పాటు ఫోన్ చేసిన వారి వివరాలు, సమయం లభ్యం కాకుండా ఫోన్లో సాఫ్ట్వేర్ మార్చినట్టు అధికారులు గుర్తించారు. తాను ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే స్నేహితుడి ద్వారా ఈ మాస్ కాపీయింగ్ చేస్తున్నానని నిందితుడు వసీం అహ్మద్ విలేకరులకు తెలిపాడు. ఇతను నాలుగు పరీక్షలు రాయాల్సి ఉండగా ఇప్పటికే ఒకటి రాశాడు. రెండో పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. కళాశాల డెరైక్టర్ ఫిర్యాదు మేరకు వసీంను చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ఉండాలి
పరీక్ష విధానంపై హైకోర్టు వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేని విధంగా పరీక్ష విధానం ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే మాస్ కాపీయింగ్ నిరోధానికి వినూత్న సూచనలు, సలహాలు ఇవ్వాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. వాటిని పరిశీలించి ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టీకరించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయ రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు మాస్ కాపీయింగ్, పుస్తకాలు పెట్టి రాస్తున్న రాతలను అడ్డుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నారని, మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం రెండోసారి విచారించింది. -
వందలు కాదు.. వేలల్లో అక్రమార్కులు!
♦ వరుస ఐడీలతో టెట్ హాల్‌టికెట్ల జనరేషన్‌ను గుర్తించిన అధికారులు ♦ సెంటర్లలో జంబ్లింగ్‌కు చర్యలు, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సీటింగ్ సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటిన జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో మాస్‌కాపీయింగ్‌కు అవకాశం లేకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అర్ధరాత్రులు, తెల్లవా రుజామున ఫీజుల చెల్లింపులతో వరుస రెఫరెన్స్ ఐడీలను పొంది, వాటి ఆధారంగా హాల్‌టికెట్లు జనరేట్ అయిన అభ్యర్థులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కమిటీ గుర్తిం చింది. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తమ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు వరుసగా హాల్‌టికెట్లు వచ్చేలా, ఒకే దగ్గర కూర్చొని భారీగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడేలా పన్నిన కుట్రకు టెట్ కమిటీ అడ్డుకట్ట వేస్తోంది. రెఫరెన్స్ ఐడీల ఆధారంగా హాల్ టికెట్లను జనరేట్ చేసిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వరుసగా హాల్‌టికెట్లు వచ్చేలా పన్నిన కుట్రలో వేలల్లో అభ్యర్థులున్నట్లు గుర్తించింది. ప్రస్తుతం వారందరికీ పరీక్ష హాల్లో వరుసగా సీట్లు కేటాయించకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. పరీక్ష కేంద్రాలు, వాటిల్లోని రూమ్‌ల వారీగా సీట్లల్లో మార్పు చేసేందుకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా చర్యలు చేపట్టింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆన్లైన్ ఫీజులను చెల్లించినవారు దాదాపు 8 వేల మంది వరకు ఉన్నారు. సీజీజీ దీనిని మరింత లోతుగా పరిశీలిస్తోంది. సాధారణంగా అయితే హాల్‌టికెట్ నంబర్ ప్రకారం వారందరూ వివిధ రూమ్‌ల్లో వరుసగా కూర్చోవాలి. కానీ, మాస్ కాపీయింగ్ కోసం మోసపూరితంగానే కోచింగ్ కేంద్రాలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాయన్న ఆరోపణలు, అనుమానాలున్న నేపథ్యంలో వారిని వరుసగా కాకుండా పరీక్ష కేంద్రాల వారీగా, వేర్వేరు రూమ్‌లలో కూర్చోబెట్టేలా సీటింగ్ అరేంజ్‌మెంట్‌ను జంబ్లింగ్ చేసి మారుస్తోంది. దీంతో కోచింగ్ కేంద్రాల ఆటలుసాగవని, పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి వెల్లడించారు. మరోవైపు వరుస హాల్‌టికెట్ల జనరేషన్‌పై సీజీజీకి విద్యాశాఖ నోటీసు జారీ చేసి వివరణ కోరింది. తదుపరి చర్యలను పక్కాగా చేపట్టాలని ఆదేశించింది. మే 1వ తేదీన జరగనున్న ఈ పరీక్షకు 3.74 లక్షల మంది హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష జరగనుంది. -
డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్
► జంబ్లింగ్ విధానంలో లోపించిన పారదర్శకత ► ఇప్పటికే 59 మంది విద్యార్థుల డీబార్ ఎస్కేయూ: డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపీయింగ్ సాగుతోందనడానికి ఇప్పటి వరకూ 59 మంది విద్యార్థులు డీబార్ అయిన విషయమే ఉదాహరణ. మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన జంబ్లింగ్ విధానం పారదర్శకంగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు గణనీయంగా ఫెయిల్ కావడంతో పాటు అడ్మిషన్లు తగ్గుతాయనే ఉద్దేశంతో ప్రయివేటు అనుబంధ కళాశాలలు యాజమాన్యాలు సమ్మతించలేదు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు జంబ్లింగ్ విధానంలో ప్రవేశపెట్టకపోతే డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు కనుమరుగు అవుతాయని ఎస్కేయూ యాజమాన్యం వద్ద ఏకరువు పెట్టారు. దీంతో ఎట్టకేలకు జంబ్లింగ్ విధానాన్ని అమలు పరిచారు. నిర్వాహణ లోపం... పరీక్షల్లో ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రం పంపడం, జవాబు పత్రాలు కొరత, అనుబంధ కళాశాలలకు సమాచార లోపం, తదితర అంశాలు నిర్వాహణలోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఫలితంగా యూజీ ఉద్యోగుల పనితీరుపై బహిరంగ విమర్శలు వస్తున్నా యి. యూజీ పరీక్షల వ్యవహారం పూర్తిగా గాడి తప్పింది. దీనిపై యాజమాన్యం సరైన స్థాయిలో స్పం దించడంలేదని, చాలా తేలిగ్గా తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షలకు గైర్హాజరైన వారిని ఉత్తీర్ణత చేయడం, పాస్ అయిన వారిని ఫెయిల్ చేయడం, ఎవరి మార్కులు ఎవరికి కలిపారో తెలియని అనిశ్చితి, తదితర ఘటనలపై విచారణ చేసిన కమిటీలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చేసిన సిఫార్సులు బుట్టదాఖలయ్యాయి. డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షల్లోనూ అదేతీరు డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యూరుు. ఈ పరీక్షల్లోనూ మాస్ కాపీరుుంగ్ తీరు జోరుగా సాగుతోంది. గురువారం జరిగిన పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డీబార్ అయ్యూరు. పేరుకే జంబ్లింగ్ విధానం .. ఈ పద్ధతిలో ఒక కళాశాలలోని విద్యార్థులను , మరో కళాశాలకు కాకుండా పలు కళాశాలలకు విభజించి పరీక్ష కేంద్రాలకు పంపాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా అమలు చేస్తున్నారు. ఒక కళాశాలల్లోని విద్యార్థులను మరొక కళాశాలలకు మూకుమ్మడిగా పంపుతున్నారు. దీంతో ఇరువురు కళాశాల యాజమాన్యాలు పరస్పర సహకారంతో మాస్‌కాపీయింగ్‌కు యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
పీజీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
► ప్రోత్సహిస్తున్న అనుబంధ కళాశాలల సిబ్బంది ► పల్లె కళాశాలలో అడ్డూఅదుపు లేని వైనం ఎస్కేయూ: డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించిన అనుబంధ కళాశాలల యాజమాన్యాలు మరో అడుగు ముందుకు వేశారుు. తమ పరిధిని విస్తరించుకుని పీజీ పరీక్షల్లో సైతం బరితెగింపు ధోరణిలో మాస్ కాపీయింగ్‌ను అమలు చేస్తున్నారుు. మరోవైపు అనుబంధ పీజీ కళాశాలలు సిబ్బంది కూడా భారీ దందాకు తెరతీశారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వేలు వసూలు చేసుకుని కాపీరుుంగ్కు సహకారం అందిస్తున్నారు. మంగళవారం ఎస్కేయూ క్యాంపస్ కళాశాలల్లో మాత్రం మెస్‌బిల్లులు, కోర్సు ఫీజులు విద్యార్థులు చెల్లించలేదని పరీక్ష నిలిచిపోయింది. అనుబంధ పీజీ కళాశాలల్లో మాత్రం మంగళవారం యథావిధిగా పరీక్షలు జరిగాయి. సెల్ఫ్ సెంటర్లలో ఇష్టారాజ్యం పీజీ అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ కళాశాలల్లోని పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే సెల్ఫ్ సెంటర్ల పేరుతో అనుమతులు ఇవ్వడంతో చూచిరాత పరీక్షలను తలపించాయి. కదిరిలోని వివేకానంద పీజీ కళాశాల మంత్రి పల్లె రఘనాథరెడ్డికి చెందిన విద్యాసంస్థల్లో ఒకటి. ఇక్కడ మంగళవారం జరిగిన పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలో విద్యార్థులు నేరుగా సెల్‌ఫోన్ నుంచి మెటీరియల్‌ను డౌన్లోడ్ చేసుకొని రాసుకున్నారు. మరికొంత మంది పుస్తకాలను చూసి చూచిరాత పరీక్షలు రాశారు. ఎస్కేయూ పరీక్షల అధికారులు రెండు తనిఖీ బృందాలను నియమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కళాశాలకు రానక్కర్లేదు ఎస్కేయూ అనుబంధ పీజీ సెంటర్లలో ఇష్టానుసారంగా విధానాలు అమలుచేస్తున్నా, ప్రశ్నించేవారు కరువయ్యారు. అడ్మిషన్ పొందినప్పటి నుంచి విద్యార్థి ఏ ఒక్క రోజు కళాశాలకు రావాల్సిన అవసరం ఉండదు. నేరుగా పరీక్షలకు హాజరై కళాశాలలు నిర్ధేశించిన మొత్తం కడితే విద్యార్థులు చూసిరాయడానికి కావలసిన అన్ని తతంగాలు నడిపిస్తారు. ప్రైవేటు అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులు ఉన్నట్లు కూడా తెలియవంటే ఏ స్థాయిలో తరగతులు జరుగుతున్నాయో ..అర్థం చేసుకోవచ్చునని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. -
‘ఓపెన్’ దందా
► పాస్ గ్యారెంటీ పేరుతో డబ్బు వసూలు ► జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లు ► ఉన్నతాధికారి సహకారం ► విద్యార్థులపై ఆర్థిక భారం సాక్షి, కర్నూలు: వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారికి జాతీయ సార్వత్రిక(ఓపెన్) స్కూలు ఓ వరంలా మారితే.. అభ్యర్థుల పరీక్షలు కొందరికి ఆదాయ మార్గంగా మారాయి. పరీక్ష రాసే అభ్యర్థులకు పాస్ గ్యారెంటీ పేరుతో జిల్లా వ్యాప్తంగా కొందరు అక్రమ వసూళ్లకు తెర తీశారు. ఇప్పటికే రూ. 2 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. జిల్లాలో నేషనల్ ఓపెన్ స్కూల్లో భాగంగా నిర్వహించే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు గత నెలలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు పదో తరగతి విద్యార్థులు 2,449 మంది, ఇంటర్‌కు సంబంధించి 3,524 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పది పరీక్షలకు 11, ఇంటర్ పరీక్షలకు 14 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దఫా సార్వత్రిక ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలకు నంద్యాల కీలకంగా మారింది. ఇదే విధంగా కల్లూరు, బనగానపల్లెలో కొన్ని కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో కొందరి ఆధ్వర్యంలో పరీక్షల మాటున దందా కొనసాగుతోంది. వీరికి జిల్లాలోని మరికొందరి సహకారం అందుతోంది. ఫలితంగా జిల్లా కేంద్రమైన కర్నూలుతోపాటు జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకున్నారు. నేషనల్ ఓపెన్ స్కూలులో భాగంగా నంద్యాల, బనగానపల్లె, ఆలూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలకు చెందిన వారితో ఫీజులు కట్టించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధిస్తే భవిష్యత్తులో ఏవైనా అవకాశాలు వస్తాయన్న ఆశతో చాలా మంది వీళ్ల మాటలు నమ్మి భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారు. పరీక్ష ఫీజు గడువు సమయంలో కొందరు.. అనంతరం మరికొందరు ఒక్కో పేపర్‌కు రూ. 3 వేల వరకు గరిష్టంగా అన్ని పేపర్లకు కలిపి రూ. 15 వేల వరకు చెల్లించినట్లు చెబుతున్నారు. తెలిసిన వారితో కలిస్తే రూ. 10 వేల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇలా సార్వత్రిక పరీక్షల పేరుతో సుమారు రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రం నుంచి సహకారం? ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ ప్రోత్సహించడానికి జిల్లా కేంద్రంలో ఉండే ఓ అధికారి సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వారంతా క్షేత్రస్థాయిలో వసూళ్లకు పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి డబ్బు వసూలు విషయం తెలిసినప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. డబ్బు వసూలు సంగతి తమకు తెలియదని బుకాయించే అధికారులు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, మాస్‌కాపీయింగ్ లేకుండా చూస్తే బాధితులు బయటకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అధారాలతో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు సార్వత్రిక పది, ఇంటర్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఓపెన్ విద్య పాస్ గ్యారెంటీ కోర్సు కాదు. దళారులను, ఇతరులను ఎవరూ నమ్మొద్దు. కష్టపడి చదివి పరీక్ష రాస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు. డబ్బు వసూలు విషయమై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే భాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎక్కడా మాల్‌ప్రాక్టిస్ జరగడం లేదు. ప్రతిరోజూ మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడుతున్న విద్యార్థులను డిబార్ చేస్తూనే ఉన్నాం. స్టడీ సెంటర్ల యజమానులెవరైనా విద్యార్థులతో డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే వాటిని రద్దు చేస్తాం. - రవీంధ్రనాథ్‌రెడ్డి, డీఈఓ -
అంతా ‘ఓపెన్’
► ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో చూచిరాతలు ► ఒకరికి బదులుగా మరొకరు రాస్తున్న వైనం కదిరి టౌన్:- ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు తెరలేపారు. ఈ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, హిందూపురం రోడ్డులోని మునిసిపల్ ఉన్నతపాఠశాల, సరస్వతీ విద్యామందిరం కేంద్రాల్లో సుమారు 1,500 మంది పరీక్షలు రాస్తున్నారు. మొదటిరోజే చూచిరాతలను తలపించాయి. యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నా ఇన్విజిలేటర్లు, అధికారులు ఏమాత్రమూ పట్టించుకోలేదు. విద్యార్థులు పుస్తకాలను పక్కనే పెట్టుకుని పరీక్ష రాశారు. ఒక బెంచీపై ముగ్గురు కూర్చొని ఒకరికొకరు సమాధానాలు చెప్పుకుంటూ రాయడం కన్పించింది. ఒకరికి బదులు మరొకరు కూడా రాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధ్యయన కేంద్రాల నిర్వాహకులు విద్యార్థుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసి..‘పాస్ గ్యారంటీ’ పేరుతో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. వారే సమాధాన పత్రాలు తయారు చేసి పంచుతుండటం గమనార్హం. ఈ తంతును చిత్రీకరించేందుకు కెమెరాలతో వెళ్లిన పాత్రికేయులను కొందరు ఇన్విజిలేటర్లు, అధికారులు అడ్డుకున్నారు. కెమెరాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. మరి కొందరు పరీక్ష కేంద్రంలోకి మీడియాకు అనుమతి లేదని బుకాయించారు. ఇదే సమయంలో నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు అలర్ట్ అయ్యి..విద్యార్థులను వరుస క్రమంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. పరారైన నకిలీ విద్యార్థులు గుత్తి: పట్టణంలోని మోడల్ స్కూల్, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బుధవారం ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో పది మంది నకిలీ అభ్యర్థులు పరారయ్యారు. పుట్లూరు హైస్కూల్ హెడ్మాస్టర్ లక్ష్మినారాయణను ఇక్కడ స్క్వాడ్‌గా వేశారు. ఈయన విద్యార్థులను చెక్ చేస్తుండగా సుమారు పది మంది నకిలీలు పరీక్ష కేంద్రం నుంచి పరుగులు తీశారు. జి.సంధ్యరాణి (హాల్ టికెట్ నం:1512169558) డి.విశ్వనాథ్(1512169607), శ్యామ్‌లాల్(1512169626), కట్టుబడి సాబ్(1512169629),చక్రవర్తి(1512169642),సురేష్‌బాబు(1512169683)తో పాటు మరో నలుగురి స్థానాల్లో ఇతరులు పరీక్ష రాయడానికి వచ్చారు. స్క్వాడ్ రావడంతో భయపడి పరీక్ష హాల్లో నుంచి పరారయ్యారు. -
ఓపెన్ పై విజిలెన్స్
♦ రంగంలోకి దిగిన అధికారులు ♦ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు ♦ ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన ఖమ్మం : ఇంటర్, టెన్త్ ఓపెన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చూచిరాతను తలపించే విధంగా పరీక్షలు జరగడం.. అత్తకు బదులు కోడలు, తండ్రికి బదులు కొడుకు, అన్నకు బదులు తమ్ముడు పరీక్ష రాస్తూ పట్టుబడిన విషయాలు.. అధికారులు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించిన విధానాలను వివరిస్తూ ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం విదితమే. దీనికి బాధ్యులెవరనే విషయాలను తెలుసుకునేందుకుజిల్లా అధికార యంత్రాంగం కదిలింది. ఉన్నతాధికారులు విద్యా శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అక్రమాలకు బీజాలు ఎక్కడ పడ్డాయి.. అసలు సూత్రధారులెవరు.. అనే విషయాలపై ఆరా తీసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. దీనికోసం విజిలెన్స్ బృందాలను కూడా రంగంలోకి దింపినట్లు తెలిసింది. కలెక్టర్ లోకేష్‌కుమార్ స్వయంగా ఇల్లెందు తదితర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు నేరుగా వెళ్లి తనిఖీలు చేపట్టడంతో అక్రమార్కులు ఆందోళనకు గురవుతున్నారు. పకడ్బందీగా మాస్ కాపీయింగ్.. అభ్యర్థులకు పదోన్నతి, ఉద్యోగ అవకాశాలు, లెసైన్స్‌లు తదితర అవసరాల కోసం పదో తరగతి, ఇంటర్ సర్టిఫికెట్ల అవసరం ఉంటుంది. అయితే పరీక్ష రాయకుండానే పాస్ అయ్యే మార్గం వెతుక్కున్న వారికి పలువురు దళారులు తారసపడటం.. వారికి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పలువురు అధికారులతో ఉన్న పరిచయాలను ఎరగా చూపి పాస్ చేయిస్తామని హామీలు ఇస్తూ.. వారి వద్ద నుంచి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం చూసి కూడా రాయలేని వారిని పాస్ చేయించేందుకు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అనువైన సెంటర్ల నుంచి అడ్మిషన్లు పొందడం.. ఆ తర్వాత సెంటర్ల ఏర్పాటు.. అక్కడ అనువైన వారిని సీఎస్, డీఈలతోపాటు ఇన్విజిలేటర్లను వేయించడంలో సఫలమయ్యారనే ప్రచారం జరిగింది. ప్రణాళికలో భాగంగానే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం, సమాధాన పత్రాలను బయటకు తీసుకెళ్లి రాయించడం వంటి వాటిపై ‘సాక్షి’ కథనాలు రాయడంతో.. అధికారులు స్పందించారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించగా.. ఇల్లెందులో తండ్రికి బదులు కొడుకు.. కొత్తగూడెంలో అత్తకు బదులు కోడలు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. అక్రమార్కుల వేటలో అధికారులు ఎక్కడా లేని విధంగా ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ ప్రతీ రోజు పట్టుబడటంపై జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరువు తీస్తున్న వరుస సంఘటనలకు మూలం ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దీనికోసం పలువురు అభ్యర్థులను పరీక్షలు ఎలా రాస్తున్నారు.. పాస్ గ్యారెంటీ కోసం ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చారు.. అధికారుల పాత్ర ఏమిటనే విషయాలను పరీక్ష రాస్తున్న వారిని నేరుగా అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు.. తమకేమీ తెలియదని, పాస్ చేయిస్తామని, పెద్ద పెద్ద అధికారులు తమకు తెలుసు.. అందరినీ మేనేజ్ చేస్తాం.. పాస్ గ్యారెంటీ అంటూ వేలాది రూపాయలు తీసుకొని ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో అక్రమార్కులకు ఉచ్చు బిగుస్తోంది. దీంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని మాస్ కాపీయింగ్‌లో కీలక భూమిక పోషించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
అంతా ఓపెన్!
♦ ఇన్విజిలేటర్లే సూత్రధారులు ♦ ఒక్కోపేపర్‌కు రూ.వెయ్యి వసూలు ♦ డీఈఓ హెచ్చరించినా ఆగని మాస్‌కాపీయింగ్ ♦ కొన్నిచోట్ల ఒకరికి బదులు మరొకరు రాసిన పరీక్ష అధికారులు దృష్టి పెట్టినా.. ఉన్నతాధికారులు హెచ్చరించినా.. సార్వత్రిక పరీక్షలు మళ్లీ ‘ఓపెన్’గానే ప్రారంభమయ్యాయి. మాస్ కాపీయింగ్ యథాతథంగా కొనసాగింది. ఎప్పటిలాగే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాశారు. పరీక్షల తొలిరోజు సోమవారం ఇలా 8 మందిని పట్టుకున్నారు. తండ్రికి బదులు కొడుకు.. అన్నకు బదులు తమ్ముడు..స్నేహితుని కోసం మరొకరు... పరీక్ష రాస్తూ దొరికిపోయారు. గ్యారంటీ పాస్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.5వేలు వసూలు చేసిన ఓపెన్ స్కూల్ నిర్వాహకులు పరీక్ష కేంద్రాల్లోకి పుస్తకాలతో అడుగుపెట్టడం.. ఇన్విజిలేటర్లతో బేరసారాలకు దిగడం చర్చనీయాంశమైంది. తొలిరోజు ఓపెన్ టెన్త్ పరీక్షకు 268 మంది, ఓపెన్ ఇంటర్ పరీక్షకు 361 మంది గైర్హాజరయ్యారు. ఖమ్మం/భద్రాచలం : ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ సోమవారం ప్రారంభమైన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఓపెన్‌గానే మాస్‌కాపీయింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల వరకు అధికారులే మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించారని తెలుస్తోంది. పరీక్షలు ప్రారంభమైన తొలిరోజునే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించిన 8 మందిని పోలీస్, ఇతర స్క్వాడ్ అధికారులు పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ పాఠశాలలకు సెంటర్లు ఇవ్వడం, అక్కడ డ్యూటీ చేస్తున్న అధికారులు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించడంతో తమ పాఠశాలలకు చెడ్డ పేరు వస్తోందని, ఆడ్మిషన్లు ప్రారంభమవుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని యాజమాన్యం తలలు పట్టుకుంటోంది. ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ అంతా ఓపెన్‌గానే నడుస్తోంది. ఇన్విజిలేటర్లే సూత్రధారులుగా మారి, ఒక్కో పేపర్‌కు రూ.వెయ్యి వసూలు చేసి దర్జాగా కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన పరీక్షల కోసం భద్రాచలంలో ఐదు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షకు సంబంధించి 359 మంది ఫీజు చెల్లించగా, 299 మంది హాజరయ్యారని ఎంఈఓ రంగయ్య తెలిపారు. పదో తరగతిలో 637 మందికి గాను 563 మంది హాజరయ్యారు. రెండు కేంద్రాలను ‘సాక్షి’ పరిశీలించగా అందులో ప్రైవేట్ వ్యక్తులు తిరుగుతూ మంతనాలు చేయడం దర్శనమిచ్చింది. ఓ గదిలో విద్యార్థులందరినీ ఒకేచోట కూర్చోబెట్టి పరీక్ష రాయించినట్లుగా తెలుస్తోంది. విద్యార్థులు బెంచీలపైనే పుస్తకాలు పెట్టుకుని పరీక్షలు రాసినప్పటికీ ఇన్విజిలేటర్లు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష ప్రారంభ సమయానికి 5 నిమిషాల తరువాత అనుమతించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రైవేటు కళాశాలలు, పరీక్ష ఫీజులు చెల్లించిన సెంటర్ల వారితో ముందస్తు ఒప్పందాల నేపథ్యంలో అరగంట లేటుగా వచ్చినవారిని కూడా అనుమతించినట్లు సమాచారం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించినప్పటికీ నిర్వాహకుల్లో మార్పు లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న ఎస్సై కరుణాకర్ సిబ్బందితో సెంటర్ల వద్ద బందోబస్తు నిర్వహించారు. మంగళవారం నుంచి కేంద్రాల వద్ద బందోబస్తు పెంచుతామని ఆయన ‘సాక్షి’కి వివరించారు. కాగా, ఒకరిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఎంఈఓ రంగయ్య చెప్పారు. తండ్రికి బదులు తనయుడు ఇల్లెందు: పట్టణంలో సోమవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో తండ్రికి బదులుగా కుమారుడు పరీక్ష రాస్తూ ఎస్సైకి పట్టుబడ్డాడు. పినపాక నియోజకవర్గంలోని గుండాల మండలానికి చెందిన వీఆర్ఏ మేడిపల్లి జానయ్య ఇల్లెందులోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే, జానయ్యకు బదులుగా ఆయన కుమారుడు చిరంజీవి పరీక్ష రాస్తున్నాడు. ఈ సమయంలో ఎస్సై సతీష్‌కుమార్ తనిఖీకి వచ్చి హాల్ టికెట్లు పరిశీలించారు. చిరంజీవి హాల్‌టికెట్‌పై జానయ్య పేరు ఉండగా అనుమానం వచ్చి ప్రశ్నించగా అసలు విషయం బయటికి వచ్చింది. తండ్రీకుమారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఓపెన్ టెన్త్‌లో ఓ విద్యార్థి మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతుండగా ఉపవిద్యాశాఖ అధికారి బస్వారావు డిబార్ చేశారు. ఒకరికి బదులు మరొకరు.. ఖమ్మం అర్బన్ : నగరంలోని మమత వైద్యశాల రోడ్డులోని ఓపెన్ టెన్త్ పరీక్ష సెంటర్లో సోమవారం ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. వెంటనే అతడిని కేంద్రం సూపరింటెండెంట్ రుక్మిందరావు అర్బన్ పోలీసులకు అప్పగించారు. ఆ సెంటర్లో హుస్సేన్ అనే విద్యార్థి పరీక్ష రాస్తుండగా అతడి హాల్ టికెట్‌పై అతడి తండ్రి ఫొటో ఉంది. దీంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు అర్బన్ పోలీసులు తెలిపారు. -
అంతా.. ఓపెన్!
► ఒకరికి బదులు మరొకరు! ► ఓపెన్ స్కూల్ పరీక్షల తీరిది ► తొలిరోజు 14మంది విద్యార్థుల డీబార్ మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఓపెన్‌స్కూల్ పరీక్షల తీరులో ఎలాంటి మార్పురాలేదు.. సోమవారం తొలిరోజు ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ రాష్ట్ర పరిశీలకుడు రాజేశ్వర్‌రావుకు పట్టుబడ్డారు. ఓపెన్ పదో తరగతి పరీక్షలకు 4,826మంది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా 4,388మంది హాజరయ్యారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 7,816 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 7,181 మంది వచ్చారు. జిల్లా కేంద్రంలోని మదీనామసీద్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని డీఈఓ విజయలక్ష్మిబాయి తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను డీబార్ చేశారు. అదే విధంగా వారికి సహకరిస్తున్న ముగ్గురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు. జిల్లా స్థాయి పరిశీలకుడు బోయపల్లిలో ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు. అదే విధంగా జడ్చర్లలో ఒకరి బదులు ఒకరు రాస్తుండటంతో వారిని బుక్ చేయడంతో పాటు కేసునమోదుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. జడ్చర్లలో ఇన్విజిలేటర్‌ను, నాగర్‌కర్నూల్‌లో ముగ్గురు విద్యార్థులను, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో నాగర్‌కర్నూల్‌లో నలుగురు, గద్వాలలో ఇద్దరు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను డీబార్ చేశారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని మాస్ కాపీయింగ్ ప్రోత్సహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. ఒకరిస్థానంలో మరొకరు జడ్చర్ల: పట్టణంలోని అక్షరస్కూల్ కేంద్రంలో ఓపెన్ పరీక్షలు రాస్తున్న ఇద్దరు విద్యార్థులు డీబార్ అయ్యారు. ముగ్గురు విద్యార్థుల స్థానంలో మరో ముగ్గురు పరీక్షలకు హాజరుకావడంతో వారిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తల్లికి బదులుగా కూతురు పరీక్షకు హాజరుకావడాన్ని ఇన్విజిలేటర్ గుర్తించి పట్టుకున్నారు. ఇదేకేంద్రంలో ఏకంగా పుస్తకం పెట్టి పరీక్షరాస్తున్న ఇద్దరిని డీబార్ చేశారు. ఎస్ఐ జములప్ప కేంద్రానికి చేరుకుని తల్లికి బదులుగా పరీక్షరాస్తున్న కూతురితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని సాయంత్రం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. -
పదిలో మాస్ కాపీయింగ్
♦ పీఈటీలు, డ్రాయింగ్ టీచర్లతో బిట్ పేపర్ చెప్పిస్తున్న వైనం ♦ శ్రీకాకుళం పాఠశాలలో యథేచ్ఛగా కాపీయింగ్ ♦ చర్యలు చేపట్టని విద్యాశాఖాధికారులు ‘పది’లో మాస్ కాపీయింగ్ జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు, ఇన్విజిలేటర్లే పలువురు పాత్రధారులు కావటంతో కష్టపడి చదివిన విద్యార్థులు విస్తుపోతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మచిలీపట్నం : పదో తరగతి పరీక్షలలో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరుగుతుండటం విద్యార్థులకు శాపంగా మారింది. రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులు అధికారులు, ఇన్విజిలేటర్ల వైఖరితో నిర్ఘాంతపోవాల్సి వస్తోంది. జిల్లాలోని పలు పాఠశాలల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నా స్క్వాడ్ బృందాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలపాలవుతోంది. పరీ క్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా కొందరు ఉపాధ్యాయుల వైఖరి కారణంగా పది పరీక్షల నిర్వహణ అభాసుపాలవుతోంది. అయితే విద్యాశాఖాధికారులు మాత్రం చర్యలు తీసుకుంటామని చెబుతూ తప్పించుకుతిరుగుతున్నారు. విద్యార్థుల జంబ్లింగ్ విధానం లోపభూయిష్టంగా ఉండటం గమనార్హం. అంగలూరు..., శ్రీకాకుళం..., చిన్నాపురం.. గుడివాడ పరిధిలోని అంగలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా ఉన్న ఓ పీఈటీ ఈ నెల 24న పరీక్ష హాలులో బిట్ పేపర్ చెబుతూ స్క్వాడ్ బృందానికి దొరికిపోయారు. ఈ వ్యవహారం మొత్తాన్ని స్క్వాడ్ బృందంలో సభ్యుడిగా ఉన్న డెప్యూటీ తహశీల్దార్ వీడియో తీసి విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. పీఈటీని ఇన్విజిలేటర్ బాధ్యతల నుంచి తొలగించారు. ఈ ఉపాధ్యాయుడ్ని సస్పెం డ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తుండటంతో తనదైన శైలిలో పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఘంటసాల మండలం శ్రీకాకుళం జెడ్పీ ఉన్నత పాఠశాలలో యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్ జరుగుతోంది. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో శనివారం సిట్టింగ్ స్క్వాడ్ బృందాన్ని అక్కడకు పంపారు. బందరు మండలం చిన్నాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ డ్రాయింగ్ టీచర్ బిట్ పేపరు ప్రతి తరగతి గదికి వెళ్లి జవాబులు చెబుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా విద్యార్థులు అదేమిటని ప్రశ్నిస్తే జవాబులు సక్రమంగా రాయలేని వారు బిట్ పేపరు అయినా పూర్తిచేస్తే పాస్ అవుతారు కదా అని ఉపాధ్యాయులు అనటం గమనార్హం. గుడ్లవల్లేరు మండలం కౌతవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై డీఈవో ఎ.సుబ్బారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా అంగలూరు పాఠశాలలో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్న పీఈటీని ఇన్విజిలేటర్ విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. శ్రీకాకుళం పాఠశాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్‌ను పెంచుతామన్నారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే ఇంటి వద్ద చదవకుండానే పిల్లలు పరీక్షకు హాజరయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా నిఘా పెంచుతామని చెప్పారు. -
కాపీ కొడుతూ పట్టుబడిన విద్యార్థులు
ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ నడుస్తోంది. శనివారం డిగ్రీ రెండో సంవత్సరం పరీక్షల సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఖానాపూర్ మండలంలోని పలు కళాశాలల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న 17 మంది విద్యార్థులను పట్టుకుంది. వీరిలో 12 మంది మహిళా విద్యార్థులే ఉన్నారు. మామడ మండలంలోనూ 16 మంది విద్యార్థులను పట్టుకున్నారు. దీన్ని బట్టి ఫలితాల కోసం కళాశాలలు జోరుగా మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. -
మాస్ కాపీయింగ్ నిరోధానికి ప్రణాళిక సిద్ధం చేయండి
కార్యచరణ ప్రణాళికను మా ముందుంచండి ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం తదుపరి విచారణ ఏప్రిల్‌కు వాయిదా హైదరాబాద్: అన్ని పబ్లిక్ పరీక్షల్లో ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి కోర్టు ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు గురువారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్ కాపీయింగ్‌ని అడ్డుకోవడంలో ఇరు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు దారుణంగా విఫలమవుతున్నారని, కాపీయింగ్‌ని అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాల ని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే ఓసారి విచారిం చిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అన్ని జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చామని తెలిపారు. అంతేకాక 156 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ సమయంలో పిటిషనర్ త రఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి స్పం దిస్తూ, ఈ వ్యాజ్యంలో విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేయాలని, అప్పటికి ప రీక్షలు పూర్తయి ఉంటాయని, వచ్చే ఏడాదికి ట్యాబ్‌లు ఉపయోగించే అంశంపై అప్పుడు విచారణ చేపట్టవచ్చునని తెలిపారు. తరువాత తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పది జిల్లాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో సోమవారానికల్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఏపీ ప్రతిపాదించిన వాటిని తాము కూడా అమలు చేస్తామని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మాస్ కాపీయింగ్ నిరోధానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, దానిని తదుపరి వి చార ణ నాటికి కోర్టు ముందుంచాలని ఉ భ య రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. -
మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి, ఇంటర్ తదితర పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారో వివరించాలని హైకోర్టు సోమవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రశ్నపత్రం కవర్‌ను తెరవడం మొదలు పరీక్ష ముగిసే వరకు మొత్తం ప్రక్రియను ట్యాబ్‌ల ద్వారా రికార్డింగ్ చేసే విధానం అమలుపై రెండు రాష్ట్రాల వైఖరి తెలియజేయాలని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్ కాపీయింగ్‌ను అడ్డుకోవడంలో ఉభయ రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు దారుణంగా విఫలమవుతున్నారని, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పెరిగిపోతోందని, దీనిపై పత్రికల్లో ఆధారాలతో సహా కథనాలు వచ్చాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అయితే దీనికి పరిష్కారం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. గుజరాత్లో పబ్లిక్ పరీక్షల ప్రక్రియను ట్యాబ్‌ల ద్వారా మొత్తం రికార్డ్ చేస్తున్నారని, దీంతో అక్కడ మాస్ కాపీయింగ్ ఆగిందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆ విధానాన్ని ఉభయ రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇంటర్ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమైనందున, వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఈ ఏడాదే తొలి అడుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. మొదట ఐదు నుంచి పది పాఠశాలలను ఎంపిక చేసి, అక్కడ ప్రయోగాత్మకంగా ట్యాబ్‌ల ద్వారా పరీక్షల ప్రక్రియ రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. ఈ విధానం అమలుతోపాటు మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారో వివరించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
ఈ సారీ నేలబారే!
‘పది’ పరీక్షలకు ఫర్నీచర్ కష్టాలు 169 కేంద్రాల్లో కుర్చీలు, బల్లలు కరువు బల్లలు సమకూర్చాలని ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ ఒత్తిడి పుత్తూరులో సెల్ఫ్ సెంటర్‌పై దుమారం మాస్ కాపీయింగ్‌కు సన్నాహాలు చేసుకుంటున్న కార్పొరేట్ స్కూళ్లు మంచులా కరుగుతున్న కాలం.. దగ్గర పడుతున్న పరీక్షల గడువు.. మెజారిటీ పరీక్ష కేంద్రాల్లో ఫర్నీచర్ కరువు.. బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని ప్రైవేట్‌కు విద్యాశాఖ హుకుం. చేస్తే ఎలా.. చేయకపోతే ఎదురయ్యే పరిస్థితి ఏమిటని లోలోన మధన. వెరసి ఈ సారీ పది విద్యార్థులకు నేల రాతలు తప్పేలా లేదు. తిరుపతి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కష్టాలు తప్పేలాలేవు. మెజార్టీ కేంద్రాల్లో బల్లలు, కుర్చీలు, కొన్ని చోట్ల తాగునీటి సౌకర్యాలు లేవు. పరీక్ష కేంద్రాల్లో సామగ్రిని ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు సమకూర్చాలని ఉన్నతాధికారులు ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. దీంతో తమ పాఠశాలలో ఉన్న సామగ్రిని పరీక్ష కేం ద్రాలకు తరలిస్తే, మిగిలిన తరగతుల వి ద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను కింద కూర్చోబెడితే ఫీజులు చెల్లించే తల్లిదండ్రులు ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. పరీక్షలు రాసేది మీ పిల్లలే కదా.. ఫర్నీచర్ సమకూర్చకపోతే ఎలా అనే విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలల యా జమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచా రం. దీంతో జిల్లాలోని 870కి పైగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. బయట ఫర్నీచ ర్ అద్దెకు తెచ్చినా ఆ అద్దె మేమే చెల్లించాల్సి వస్తుందని ప్రైవేటు స్కూళ్ల కరస్పాండెం ట్లు మధనపడుతున్నారు. జిల్లాలో పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య: 52,539 మొత్తం పరీక్ష కేంద్రాలు: 281 ఫర్నీచర్ పూర్తిగా లేని పాఠశాలలు: 70 పాక్షికంగా లేనివి: 99 మొత్తం: 169 కార్పొరేట్‌కు దాసొహం... జిల్లాలో ఉన్నతాధికారులు సైతం కార్పొరేట్ స్కూళ్లకు వత్తాసు పలుకుతున్నట్లు సమాచారం. పుత్తూరులో ఓ కార్పొరేట్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖాధికారులు సెల్ఫ్ సెంటర్ కేటాయించడంపై దుమారం రేగుతోంది. ఆ యాజమాన్యం మరో స్కూల్ రిజిస్ట్రేషన్‌పై నడుస్తుందని, ఇప్పుడు అదే సెల్ఫ్ సెంటర్లో పరీక్షలు రాయడం ద్వారా మాస్ కాఫీయింగ్ జరిగే అవకాశం ఉందన్న విమర్శలు వస్తున్నా యి. మరో పేరొందిన కార్పొరేట్ పాఠశాల సైతం వారి పిల్లలు పరీక్షలు రాసే సెంటర్లకు చెందిన డిపార్టుమెంట్ ఆఫీసర్లు, చీఫ్‌ల వద్దకు వెళ్లి .. తమ పాఠశాల కు చెందిన పిల్లలకు పూర్తిగా సహకరించకపోతే, ఇబ్బందులు పడతారని సిబ్బందిని హెచ్చరించినట్లు సమాచారం. మొత్తం మీద పదో తరగతి పరీక్షల్లో ఈ సారి తమ విద్యార్థులను పూర్తి స్థాయిలో గట్టెక్కించి, మంచి మార్కులు సాధించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తాం... పదో తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలకు బల్లలు సమకూరుస్తామన్నారు. ఫర్నీచర్ కోసం ఎవరిని ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. పుత్తూరులోని ఓ పాఠశాలలో సెల్ఫ్ సెంటర్ ఉన్న మాట వాస్తవమేనని, అక్కడ పదేళ్లుగా పరీక్ష కేంద్రం ఉందన్నారు. అక్కడికి సీనియర్ ఉపాధ్యాయులరాలిని చీఫ్‌గా నియమించామన్నారు. ఆ సెంటర్‌పై ప్రత్యేక దృష్టి సారించి సీసీ కెమెరాలు, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
మాస్ కాపీయింగ్‌పై అప్రమత్తం
ఎచ్చెర్ల : డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీరుుంగ్ పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిశీ లకులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు సూచించారు. వర్శిటీ పరీక్షల నిర్వహణ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 17తో డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు పూర్తవుతాయని తెలిపారు. ఈ నెల 21 నుంచి రెండో ఏడాది, మొదటి ఏడాది బ్యాక్లాగ్ విద్యార్థుల పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. రెండో ఏడాది పరీక్షలకు 12,965 మంది హాజరు కానున్నారని, మొదటి సెమిస్టర్ ఇయర్ ఎండ్ బ్యాక్లాగ్ విద్యార్థులు 8437 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఆరోపణలు ఉన్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. ప్రత్యేక స్క్వాడ్ బృందాలు సైతం పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. -
సోషల్ మీడియాలో ఇంటర్ ప్రశ్నాపత్రాలు?
సూర్యాపేట : రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపియింగ్ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. బుధవారం జరుగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం మాథ్య్-ఏ పేపర్ పరీక్ష జరుగుతుండగా ఈ విషయం బయటపడింది. నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని కొన్ని ప్రైవేటు కళాశాలలకు చెందిన అధ్యాపక బృందమే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకెళ్లి.. వాటికి సరైన సమాధానాలు రాసి... తీసుకొచ్చి... విద్యార్థులకు పంచుతున్నట్లు అధికారులకు సమాచారం. మరో వైపు ఏపీలోని నెల్లూరుజిల్లాలో కూడా కాపీయింగ్ జోరుగా జరగుతోంది. జిల్లాలోని రాపూర్ లోని ఓ ఎగ్గామ్ సెంటర్ లో మాస్ కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సెకండియన్ మ్యాథ్స్ , సివిక్స్ ప్రశ్నా ప్రతాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నట్టు సమాచారం. ఈరోజు ఉదయం 8 గంటలకే ప్రశ్నాప్రత్రాలు లీక్ అయ్యాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికి పోలీసులకు సమాచారం ఫిర్యాదు చేశారు. ఘటనకు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
28 మందిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు
సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు పెరిగిన కాపీయింగ్ సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరు పెరిగింది. మొన్నటివరకు నాలుగైదు కేసులే నమోదు కాగా, శనివారం కాపీయింగ్ చేస్తూ 28 మంది పట్టుబడ్డారు. వీరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో 8 మంది, రంగారెడ్డిలో 8 మంది, మెదక్‌లో ఏడుగురు, మహబూబ్‌నగర్‌లో ఇద్దరు, కరీంనగర్, నల్లగొండ, అదిలాబాద్ల్లో ఒక్కరు చొప్పున పట్టుబడ్డారు. శనివారం జరిగిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 4,31,898 మంది హాజరుకావాల్సి ఉండగా, 4,08,151 మంది(94.50 శాతం) హాజరయ్యారు. ఒకరికి బదులు ఇంకొకరు...: ఇంటర్ పరీక్షల్లో ఓ విద్యార్థి తన పరీక్షను స్నేహితుడితో రాయించబోయి ఇన్విజిలేటర్‌కు చిక్కాడు. చంచల్‌గూడకు చెందిన ఓ విద్యార్థి హిమాయత్‌నగర్‌లోని న్యూ సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఇంగ్లిష్ పరీక్షకు హాజరుకావాల్సిన విద్యార్థి తన హాల్‌టికెట్‌ను డిగ్రీ చదువుతున్న తన స్నేహితుడికి ఇచ్చి పరీక్ష రాయాల్సిందిగా కోరాడు. దీంతో అతను హిమాయత్‌నగర్‌లోని నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఫొటో చెకింగ్‌లో ఇన్విజిలేటర్‌కు చిక్కాడు. దీంతో ఇద్దరు విద్యార్థులతో పాటు వీరికి సహకరించిన మరో యువకుడిని కూడా నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మైనర్ కావడం వల్ల జువెనైల్ హోంకి పంపిస్తామని సీఐ భీమ్‌రెడ్డి తెలిపారు. -
స్లిప్ పట్టు.. దర్జాగా కాపీ కొట్టు!
మథుర: ప్రస్తుతం పరీక్షల సీజన్ కదా.. కానీ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కంటే వారి స్నేహితులు, బంధువులే ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు. అదేంటి, ఇందులో మతలబు ఏముందనుకుంటున్నారా... ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, విద్యార్థుల స్నేహితులు తమ పనులల్లో చాలా బిజీగా ఉన్నారు. వీరికి ఎగ్జామ్స్ అయితే, విద్యార్థుల స్నేహితులకు అసలు పరీక్షలు మొదలైనట్లు పరిస్థితి ఉంది. యూపీలోని మథురలో మాస్ కాపీయింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో ఈ ఫొటో చూస్తే అర్థమవుతోంది. అబ్బాయిలే కాపీరాయుళ్లు అని చెప్పడం ఇక నుంచి మరిచిపోవాల్సిందే. అమ్మాయిలు కూడా కాపీ కొట్టడంలో తమ సత్తా నిరూపించుకునేందుకు చేసే యత్నాలను మనం గమనించవచ్చు. మథురలో ఓ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థినులు హాలు నుంచి బయటికి వచ్చి ప్రశ్నలను లీక్ చేయడం, ఆ వెంటనే వారి మిత్రులు స్లిప్స్ ను గాల్లోకి విసరటం వాటిని ఒడిసిపట్టడం చూడవచ్చు. గతంలో బిహార్ లో బోర్డు పరీక్షలలో జరిగిన మాస్ కాపీయింగ్ ప్రస్తుతం యూపీలో రిపీట్ అవుతోంది. విద్యార్థులు ఎంచక్కా ఎగ్జామ్ హాలు నుంచి బయటకు వచ్చి క్వచ్చన్ పేపర్ లీక్ చేస్తున్న దృశ్యాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గతేడాది బీహార్ లో ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా ఈ మాస్ కాపీయింగ్ పై దుమారం రేగిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల మాస్ కాపీయింగ్ జరుగుతోందని విపక్షాలు గగ్గోలు పెట్టి ప్రభుత్వంపై ఒత్తిని తీవ్రతరం చేశారు. అయితే అలాంటిదేమీ లేదని.. పరీక్ష హాలులో ప్రశ్న, జవాబు పత్రాలు తప్ప చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదని బీహార్ సీఎం నితిశ్ కుమార్ అప్పట్లో స్పష్టం చేసినా, వాస్తవాలు ఏంటన్నది అప్పుడు అందరూ చూశారు. -
మాస్ కాపీయింగ్ చేస్తున్న విద్యార్థులు అరెస్ట్
హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడ సీఐ భీమ్‌రెడ్డి వివరాల ప్రకారం.. కాకతీయ వర్సిటీ నిర్వాహకులు సురేష్, రాజిరెడ్డితో కలిపి మరో నలుగురు డిగ్రీ దూరవిద్య పరీక్షలను నిజాం కళాశాల సెంటర్లో రాయాల్సి ఉండగా కింగ్ కోఠీలోని పద్మశాలి భవన్లో పరీక్షలు రాస్తూ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మాస్‌కాపీయింగ్ పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించినట్లు భీమ్‌రెడ్డి తెలిపారు. -
నిఘాపై నీలినీడలు
► పది’ పరీక్షల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై పునరాలోచన పదో తరగతి పరీక్షలను నిఘా నీడల నిర్వహించాలనే రాష్ట్ర పరీక్షల విభాగం తీసుకున్న నిర్ణయానికి చుక్కెదురవుతోంది. కనీసం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించకుండా.. జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించకుండా అదరాబాదరగా చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉంటే పరీక్షలు నిర్వహించనున్న సగం కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేవని డీఈఓల క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల నడుమ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంపై సర్కారు పునరాలోచన చేస్తోంది. రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలను నిఘా కెమెరాల మధ్య నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలున్నాయో లెక్క తేల్చమని డీఈఓలను ఆదేశించింది. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన విద్యాశాఖాధికారులు సగానికిపైగా విద్యాసంస్థల్లో కెమెరాలు లేవని తేల్చారు. ఈ తరుణంలో సీసీ కెమెరాల నడుమ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంపై పునరాలోచన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్న నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై మల్లగుల్లాలు పడుతోంది. సొంత నిధులతో పాఠశాలల్లో కెమెరాలను బిగించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చినప్పటికీ, ప్రైవేటు పాఠశాలల్లో కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించడం ఎంత వరకు సమంజసమని ఉపాధ్యాయసంఘాలు వాదిస్తున్నాయి. కేవలం 135 స్కూళ్లలోనే.. రాష్ట్రవ్యాప్తంగా 2,528 పరీక్షా కేంద్రాలుండగా.. వీటిలో కేవలం 202 కేంద్రాల్లోనే కెమెరాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 401 పరీక్ష కేంద్రాలకుగాను కేవలం 135 స్కూళ్లలో మాత్రమే సీసీ కెమెరాలున్నట్లు డీఈఓ నివేదిక సమర్పించారు. కెమెరాలు లేని వాటిలో ప్రభుత్వ పాఠశాలలకంటే ప్రైవేటు స్కూళ్లే ఎక్కువగా ఉన్నాయి. జిల్లా పరిషత్ పరిధిలోని 108 స్కూళ్లలో కెమెరాలు లేకపోగా.. అదే ప్రైవేటు విషయానికి వస్తే 150 విద్యాసంస్థల్లో కెమెరాల ఆనవాళ్లు లేవని తేలింది. ప్రభుత్వ 3, టీడబ్ల్యుఆర్ఎస్ 1, సాంఘిక సంక్షేమ శాఖ 1, కేజీబీవీ 1, రెండు మోడల్ స్కూళ్లలో కెమెరాలు లేవని తేల్చారు. 266 పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు లేవని స్పష్టమైనందున.. తప్పనిసరిగా పరీక్షలను కెమెరాల నీడన నిర్వహించాలనే అంక్షలను సడలించే అవకాశంలేకపోలేదని తెలుస్తోంది. నిధులెట్లా? ఒక్కో పాఠశాలలో పది తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే కనిష్టంగా రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్థాయిలో నిధులు అందుబాటులో లేవు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆయా యాజమాన్యాలు అంతగా సాహసం చేయడం లేదు. ప్రత్యేకంగా నిధులిస్తేనే సీసీ కెమెరాలను అమర్చే అవకాశం ఉందని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో తప్పనిసరిగా పరీక్షలను నిఘా కళ్లల్లో నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వి నియోగించుకోవడంపై అభ్యంతరం లేకున్నా.. హడావుడిగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఉపాధ్యాయసంఘాలు అంటున్నాయి. -
నవోదయలో కాపీయింగ్‌కు యత్నాలు!
ఖమ్మం: 2016-17 సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షపై మాస్ కాపీయింగ్ ఛాయలు అలముకున్నట్టు సమాచారం. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సెంట్రల్ సెలబస్‌తో నిర్వహించే ఈ పాఠశాలలో సీటు సాధించిన విద్యార్థి భవిష్యత్తు.. బంగారు బాట పట్టినట్టే. అందుకే ప్రతిష్టాత్మకమైన ఈ విద్యాలయలో ‘ఎలాగైనా’ సీటు వచ్చేలా చూడాలని కొందరు తల్లిదండ్రులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆరాటపడుతున్నారు. వారికి ‘మాస్ కాపీయింగ్’ మార్గంగా కనిపించింది. దీనిని సుగమం చేసేందుకుగాను కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు దళారులతో కలిసి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు అధికారులు, పరీక్ష కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లుకు డబ్బును ఎరగ వేస్తున్నారని తెలిసింది. గతంలోనూ మాస్ కాపీయింగ్ జిల్లాలోని పాలేరు, భద్రాచలం నవోదయ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల్లో గతంలో మాస్ కాపీయింగ్ జరిగిందనే ప్రచారం ఉంది. పాలేరులోని కేంద్రంలో గతంలో ఇలా అక్రమాలు జరిగాయని విమర్శలు వచ్చాయి. ఈ ప్రవేశ పరీక్షకు ఇన్విజిలేటర్లుగా ఎస్జీటీ స్థాయి ఉపాధ్యాయులను నియమించాలన్న నిబంధన ఉంది, దీనికి విరుద్దంగా స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయులను నియమించారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ‘‘ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లోని కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, ట్యూటర్లు కలిసి ఇలా చేయించారు’’ అని ఆనాడు ప్రచారం జరిగింది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి ఐదువేల రూపాయల వరకు వసూలు చేసినట్టు కూడా ప్రచారం సాగింది. ‘‘కొన్ని కేంద్రాల్లో పరీక్ష రాసిన వారికే ఎక్కువ సీట్లు వచ్చాయి. దీని వెనుక, ఏదో మతలబు ఉంది’’ అని, గతంలో కొందరు తల్లిదండ్రులు ఆరోపించిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా.. ఖమ్మం, కల్లూరు, అశ్వారావుపేట, భద్రాచలం, బూర్గంపాడు, కొత్తగూడెం, మధిర, వెంకటాపురంలోని పరీక్ష కేంద్రాల ద్వారా మాస్ కాపీయింగ్‌కు తెర లేపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. నేడు ‘నవోదయ’ ప్రవేశ పరీక్ష పాలేరు (కూసుమంచి): 20116-17 విద్యాసంవత్సరానికిగాను పాలే రులోని జవహర్ నవోదయ విద్యాలయలో తరగతిలో ప్రవేశానికి శనివారం (9వ తేదీన) ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకోసం 27 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6275 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన అరగంట తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని విద్యాలయ ప్రిన్సిపల్ వి. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక పరిశీలకుడిని నియమించామని, నవోదయ విద్యాలయ సమితి నుంచి కూడా పరిశీలకులు పర్యవేక్షిస్తారని తెలిపారు. పకడ్బందీగా నిర్వహిస్తాం నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకునిని, పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యాశాఖ అధికారుల సహకారంతో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. ఆరోపణలు వచ్చిన సెంటర్లకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలను పంపిస్తున్నాం. నవోదయ పాఠశాల ఉద్యోగులతోపాటు ఢిల్లీ నుంచి ఇద్దరు పర్యవేక్షకులు వచ్చారు. ఏదేని కేంద్రంలో అవకతవకలు జరిగితే.. సబంధిత నియంత్రణ అధికారిపై వేటు పడుతుంది. - పాలేరు నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్, పరీక్షల నిర్వాహకులు -
ఆధారాలుంటేనే సీఐడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సింగరేణి సంస్థ, జేఎన్టీయూ-హెచ్లు సంయుక్తంగా ప్రకటించాయి. పరీక్షల నిర్వహణపై సీఐడీ విచారణ నిర్వహించేందుకు ఆధారాల్లేవని, ఆధారాలు చూపిస్తే పరిశీలిస్తామన్నాయి. సింగరేణి డెరైక్టర్ పవిత్రన్ కుమార్, జేఎన్టీయూ నుంచి రాత పరీక్ష కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణ రావు, కో-కన్వీనర్ జి.కె. విశ్వనాథ్ గురువారం ఇక్కడ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సింగరేణి విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించగా ఒక్క ఆధారమూ లభ్యం కాలేదని చెప్పారు. పరీక్షల నిర్వహణ పూర్తిగా జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరిగిందని, కట్టుదిట్టంగా జరిగిన ఈ పరీక్షల్లో అక్రమాలకు ఆస్కారం లేదని పవిత్రన్ కుమార్ తెలిపారు. మెరిట్ జాబితాల ప్రకటన తర్వాతే ఆరోపణలు ప్రారంభమయ్యాయన్నారు. సోషల్ మీడియాలో ఆరోపణలు ఎవరు చేస్తున్నారో తెలియడం లేదని, ఈ-మెయిల్ ఐడీ ఆధారంగా వారిని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఫిర్యాదుదారుల వద్దకు విజిలెన్స్ అధికారులు వెళ్లి విచారణ జరపగా.. తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణల ఆధారంగా ఫిర్యాదు చేశామన్నారని చెప్పారు. అర్ధంతరంగా ముగిసిన సమావేశం సింగరేణి, జేఎన్టీయూ-హెచ్ విలేకరుల సమావేశం అర్ధంతరంగా ముగిసింది. చివర్లో విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించడంతో అసహనానికి గురైన సింగరేణి డెరైక్టర్ పవిత్రన్ కుమార్ జేఎన్టీయూ ప్రొఫెసర్లతో కలసి అక్కడి నుంచి నిష్ర్కమించారు. విలేకరుల ప్రశ్నలకు పవిత్రన్ కుమార్ ఇచ్చిన కొన్ని సమాధానాలు ఇలా వున్నాయి.. ప్రశ్న: మంచిర్యాల సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపికయ్యారు. ఓ మంత్రి, అక్కడి ఎమ్మెల్యే పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి? పవిత్రన్: మంచిర్యాల కేంద్రం నుంచి 30 నుంచి 35 వరకు ఎంపిక కానున్నారు. ఇంటిపేరు ఆధారంగా మెరిట్ లిస్టును సెర్చ్ చేసి ఆరోపణలు చేస్తున్నారు. ప్రశ్న: ఆరోపణలు నిజమని తేలితే ఏం చేస్తారు? మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా? పవిత్రన్: బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం. సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తాం. ప్రశ్న: సింగరేణి మీద ఆరోపణలు వచ్చినప్పుడు అదే సంస్థలో అంతర్భాగమైన విజిలెన్స్‌తో విచారణ జరిపిస్తే ఎలా? సీఐడీతో విచారణ జరిపిస్తారా? పవిత్రన్: ఆధారాలు పట్టుకుని వస్తే.. చర్యలు తీసుకుంటాం. (పదేపదే ఇదే ప్రశ్నను లేవనెత్తగా ఆయన అసహనంతో వెళ్లిపోయారు) విచారణలో వెలుగు చూసిన అంశాలు ఒకే కుటుంబం నుంచి ‘బంటి’ ఇంటి పేరుతో 70 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ ఇంటి పేరుతో ఐదుగురుమాత్రమే ఎంపికయ్యారు. వీరిలో బీసీ-ఏ నుంచి ఒకరు, బీసీ-బీ నుంచి ఒకరు, బీసీ-డీ నుంచి ముగ్గురున్నారు. బండారు ఇంటిపేరుతో ఇద్దరు కవలలు ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది. వీరికి ఒకే పర్సెంటేజ్లో మార్కులొచ్చినా ఉద్యోగాలకు ఎంపిక కాలేదు. 150 ప్రశ్నలకు వీరిచ్చిన సమాధానాల్లో 65 వేర్వేరుగా ఉన్నాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరిద్దరు చొప్పున మొత్తం 106 మంది ఎంపికైనట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ, కేవలం 4 కుటుంబాల నుంచి 8 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ఎంపికయ్యాయి. 40-80 మంది అభ్యర్థులు మంచిర్యాలలోని నాగార్జున కాలనీ నుంచి ఎంపికయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ కాలనీ నుంచి ఒకే అమ్మాయికి ఉద్యోగం రానుంది. పరీక్షా కేంద్రం ఆధారంగా పరిశీలించి చూశాం. ఒక సెంటర్ నుంచి 4 లేదా 5 మందికి మించి ఎంపిక కాలేదు. ఏ సెంటర్లోనూ మాస్ కాపీయింగ్ జరగలేదు. -
నిజామాబాద్‌లో జోరుగా మాస్‌కాపీయింగ్
-
‘ఓపెన్’ పరీక్షార్థుల లబోదిబో
సత్తుపల్లి: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టుగా పత్రికల్లో వరుస కథనాలు రావటంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పరీక్ష పాస్ చేయించేందుకు దళారులకు డబ్బులు ఇచ్చిన విద్యార్థులు.. ఇప్పుడు తమ పరిస్థితేమిటంటూ లబోదిబోమంటున్నారు. పాస్ గ్యారెంటీ పేరుతో వేయి నుంచి మూడువేల రూపాయల వరకు వసూలు చేసిన దళారులకు ఏం చెప్పాలో తెలీడం లేదు. అదిగో.. ఇదిగో పరీక్షల నిర్వహణలో సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ కళ్లుగప్పి, పరీక్షార్థులకు కాపీలు అందించేందుకు ఏజెంట్లు కొత్త దారులు వెతుకుతున్నట్టు తెలిసింది. సత్తుపల్లిలోని మూడు సెంటర్లతోపాటు ఖమ్మం నయాబజార్ జూనియర్ కళాశాల, ఖమ్మం ప్రభుత్వ పాఠశాల, కారేపల్లి, భద్రాచలం, పాల్వంచ కేంద్రాలలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టుగా వచ్చిన కథనాలతో వీటిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఫలానా కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరుగుతోందంటూ స్క్వాడ్ అధికారులకు అపరిచితుల మాదిరిగా ఏజెంట్లే సెల్ మెసేజ్‌లు పంపిస్తున్నట్టు తెలిసింది. ఇది నిజమేననుకుని స్క్వాడ్ అటువైపు వెళ్లగానే.. ఈ ఏజెంట్లు ఇటువైపు మరో కేంద్రంలో తమ వారికి కాపీలు అందిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. డబ్బులు ఇచ్చేయండి ‘మిమ్మల్ని నమ్మి వేల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు మమ్మల్ని కనీసంగా కూడా పట్టించుకోవటం లేదు. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి’ అని, దళారులను పరీక్షార్థులు ఒత్తిడి చేస్తున్నారు. చివరి నిమిషంలోనైనా చిట్టీలు అందించి ‘న్యాయం’ చేస్తామంటూ వారిని బుజ్జగించేందుకు నిర్వాహకులు (దళారులు) ప్రయత్నిస్తున్నారు. -
ఒకరికి బదులు మరొకరు
- ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఇద్దరు డిబార్ విద్యారణ్యపురి/పరకాల : ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అక్కడక్కడ మాస్ కాపీయింగ్ సాగుతూనే ఉంది. పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షను ఒకరికి బదులు మరొకరు రాస్తూ పట్టుపడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మేకల గోవర్ధన్‌కు బదులుగా పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన జాలిగపు అనిల్ రాస్తుండగా కళాశాల ప్రిన్సిపాల్ శేషాచార్యులు హాల్‌టికెట్ పరిశీలించి తేడా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా అదుపులోకి తీసుకున్నట్లు ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్రావు తెలిపారు. అసలు విద్యార్థి మేకల గోవర్ధన్‌ను డిబార్ చేసినట్లు చెప్పారు. హన్మకొండలోని ప్రభుత్వ హైస్కూల్లో ఒకరు కాపీరుుంగ్ చేస్తుండగా డిబార్ అయ్యూరు. కొడకండ్లలో ఐదుగురు డిబార్ కొడకండ్ల : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఐదుగురు విద్యార్థులను మంగళవారం డిబార్ చేసినట్లు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ స్వామిచరణ్ తెలిపారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన స్పెషల్ స్క్వాడ్ రాగా మాస్ కాపీరుుంగ్కు పాల్పడుతుండటంతో వారిని డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. -
‘ఓపెన్ ’గా మాస్ కాపీయింగ్
పేపర్ ఇచ్చి 10 నిమిషాలు కాకముందే కాపీ కొట్టుడు షురూ..! రంగశాయిపేట హైస్కూల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షల దుస్థితి కరీమాబాద్ : తెలంగాణ విద్యాశాఖ ద్వారా నడుస్తున్న ఓపెన్ స్కూల్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓపెన్ ఇంటర్ పరీక్ష సెంటర్లో మొదటి రోజు తెలుగు, హిందీ పరీక్ష రాసేవారు 176 మంది వివిధ మండలాలకు చెందిన వారున్నా రు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది. కాగా పరీక్ష రాసే అభ్యర్థులను గేటు ముందు సంబంధిత సిబ్బంది చెక్ చేసి లోపలికి పంపించారు. అయితే పరీక్ష హాల్లో పరీక్ష పేపర్లు ఇచ్చి పది నిమిషాలు కూడా కాలేదు.. కొందరు అభ్యర్థులు తమ వద్ద ఉన్న చిట్టీలను బయటికి తీసి రాయడం మొదలుపెట్టారు. ఇంకాకొందరు డెస్క్ లోపల నుంచి చిట్టీలు తీయడం కనిపిం చింది. ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలంటే అంతా ‘ఓపెన్’ అన్నట్లుగా ఉంది. ఈ విషయాన్ని ఇన్విజిలేట ర్లు గమనించకపోవడమో.. లేదా చూసీచూడనట్లువదిలేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎలాంటి కాపీరుుంగ్ జరగలేదు : శ్రీనివాస్‌రెడ్డి చీఫ్ కస్టోడియన్ రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఎలాంటి కాపీరుుంగ్ జరగలేదు. ప్రతి పరీక్ష హాల్‌కు వెళ్లి ఎవరి వద్దరుునా చిట్టీ లు, బుక్స్ ఉంటే స్వాధీనం చేసుకున్నాం. స్ట్రిక్ట్‌గానే చూశాం. డిప్యూటీ డీఈఓ వాసంతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. -
ఓపెన్ స్కూళ్లలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. నేడు (ఆదివారం) పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో 10 కేంద్రాల్లో ఇంటర్ వన్ సెట్టింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. సీఎస్ఐ పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందని సమాచారం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకుంది. అయితే అధికారులు మీడియాలను లోపలికి అనుమతించలేదు. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. -
కాపీరైట్?
‘పెట్టరా సులువైనా దారిలోనా..’ అన్న శివ సినిమాలోని పాట బీహార్‌కు కూడా పాకినట్టుంది. ఏకంగా తల్లిదండ్రులే మా దారి రహదారి అంటూ టెన్త్ పరీక్షలు రాస్తున్న తమ పిల్లల కోసం చిట్టీలు మోసుకొచ్చారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ దృశ్యంపై.. క్యాంపస్ కబుర్లలో మాదాపూర్‌లో వెంకటేశ్వర ఫైనార్ట్స్ కాలేజ్ విద్యార్ధులు స్పందించారు. కాపీ రైటింగ్ రాంగ్ అన్న స్టూడెంట్స్.. కాపీ రాస్తున్న విద్యార్థులది కాదు.. అందుకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులదే అసలు తప్పని అంటున్నారు. బీహార్ ఒక్కచోటే కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ మాస్‌కాపీయింగ్ జోరుగా సాగుతోందని చెబుతున్నారు. మణిదీప్: ఈ మధ్యనే యూట్యూబ్‌లో బీహార్ ఎగ్జామ్ సెంటర్ ఫొటో చూసి చాలా షాకయ్యా. సోషల్ మీడియాలో ఈ ఫొటో చాలా హల్చల్ చేస్తోందని తెలిసాక కొంచెం సిగ్గు పడ్డా. మన సంగతి పక్కనపెడితే పొరుగు దేశాల వాళ్లు ఈ చిత్రం చూసి ఓహో... ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంటుందా? అని అనుకుంటారు. చందు: మాది కూడా సేమ్ ఫీలింగ్. మరీ ఘోరంగా పేరెంట్స్ చీటీలు ఇవ్వడమేమిటో? తాడు సాయంతో ఐదంతస్తులు ఎక్కి మరీ! నందు: అలాంటి సాహసకృత్యాలు పిల్లలు చేస్తే క్రీడల్లో కప్పులు కొట్టుకోవచ్చు. అనన్య: ఇట్స్ టూ బ్యాడ్. బేసిక్‌గా బీహార్‌లో ఎడ్యుకేషన్ తక్కువ. అక్కడ చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక ఎగ్జామ్ సెంటర్‌కి అంతమంది పేరెంట్స్ వచ్చి, పిల్లలకి కాపీలు అందివ్వడమంటే ఇది అక్కడి ప్రభుత్వం ఫెయిల్యూర్. దీనికి ఉపాధ్యాయులు కూడా బాధ్యత వహించాలి. టీనా: పిల్లలతోనైనా, పేరెంట్స్తోనైనా ఇలాంటి తప్పు పని చేయించడం వెనుక ఉన్నది ‘ప్రెజర్’. మా బాబుకి 90 మార్కులు రావాలి, మా బాబుకి 98 మార్కులు రావాలని కోరుకునే పేరెంట్స్ ఉన్నారు అందులో. ఏదో నాలుగు మార్కులు వచ్చి పాసైతే చాలనే పేరెంట్సూ ఉన్నారు. కానీ మనిషిని బతికించేది మార్కులు కాదు, మంచి ప్రవర్తనేనని తెలుసుకోకపోవడం వల్లే ఇలాంటి తప్పులన్నీ జరుగుతాయి. అక్కడ స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మనోజ్: స్టూడెంట్స్ కాపీ కొట్టడం సాధారణ విషయమే. కానీ తల్లిదండ్రులే కాపీలకు సహకరించడమంటే... పిల్లల జీవితాలు మొగ్గలోనే తుంచేయడమే. వంశీ: మాస్ కాపీయింగ్ కచ్చితంగా తప్పే. పేరెంట్స్, కొన్ని చోట్ల కాలేజీల సహకారం ఉందన్నది అందరూ నమ్మాల్సిన విషయం. మార్కులు కోసం పేరెంట్స్... ర్యాంకుల కోసం కాలేజ్ యాజమాన్యాలు ఇలా తప్పుదోవలో ప్రయాణించడం మన దేశంలో చాలా సాధారణ విషయం. స్నేహ: ఒక్క బీహార్లోనే కాదు, చాలా చోట్ల నిర్లక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. దానికి మంచి మార్గాలని ఎంచుకుంటున్నారు. చెడు మార్గాలనూ ఎంచుకుంటున్నారు. బీహార్‌లో మనం చూసిన తల్లిదండ్రులు రెండో మార్గంలో వెళుతున్నారు. ప్రకాష్: స్కూల్ డేస్‌లో స్టూడెంట్స్ కాపీ కొట్టడం చాలా సహజం. కానీ నాకు తెలిసి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు లెక్చరర్స్ దగ్గరుండి చీటీలు అందిస్తున్న సందర్భాల గురించి విన్నాను. దీనంతటికీ కారణం... టార్గెట్లు. మహమ్మద్ షకీర్: బీహార్‌లో ఎగ్జామ్ సెంటర్ పిక్చర్ చూసి ‘ఇండియా పరువు పోయిందిరా బాబూ’ అనుకున్నాను. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. అయినా ఆ సీన్‌ని టీవీలో చూపించడం.. ఇంకా బాధాకరం. ఎదురుగుండా స్టూడెంట్స్, పేరెంట్స్ అలాంటి పనులు చేస్తుంటే టీచర్లు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. కుంజిన్: బీహార్‌లో మనం చూసిన పిక్చర్... దేశంలోని ప్రతి ప్రాంతంలో కనిపిస్తుంది. కాకపోతే వాటి న్యూస్ బయటకు రాలేదు. బీహార్ న్యూస్ బయటకు వచ్చింది. అదే తేడా. రూప: సర్లేండి... జరిగిందేదో జరిగిపోయింది. ఈ న్యూస్‌కి వచ్చిన స్పందనను బట్టి అయినా స్టూడెంట్స్, పేరెంట్స్ ఆలోచించే విధానంలో మార్పు రావాలని కోరుకుందాం. అన్నిటికీ మార్కులు ఒక్కటే కాదు. మంచి బిహేవియర్ అలవర్చడంలో పేరెంట్స్ ఇంట్రస్ట్ చూపిస్తే బాగుంటుంది. మన్విత: మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నా, నాకు ఆ పిక్చర్ చూసినప్పుడు నాలుగో అంతస్తు కిటికీ ఊచలు పట్టుకుని వేలాడుతున్న పేరెంట్ గనక కింద పడిపోతే అతని పిల్లల పరిస్థితి ఏంటని పించింది. మనోజ్: అవును నిజమే. పిల్లల కోసం చాలా పెద్ద పెద్ద ఫీట్స్ చేశారు. ఒక తాడు సాయంతో పై అంతస్తు వరకు ఎక్కిన సీన్ చూస్తే నాకు చాలా భయం వేసింది. గోవింద: ఆ కష్టమేదో పిల్లల్ని రోజూ సాయంత్రంపూట ఒక అరగంట చదివించడంపై పెడితే సరిపోయేది కదా. ఇకపై అయినా ఇలాంటి చిత్రాలు మనకంట పడే పరిస్థితి రాకూడదని కోరుకుందాం. భువనేశ్వరి -
మాస్ కాపీయింగ్ జరిగితే సస్పెన్షన్
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జరిగితే సంబంధిత అధికారులు, ఇన్విజిలేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సంబంధిత అధికారుల సస్పెన్షన్‌కు వెనుకాడబోమని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం ఆయన ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల్లో విద్యార్థులు మాస్‌కాపీయింగ్ చేయకుండా ఇన్విజిలేటర్లు గట్టి నిఘా ఉంచాలన్నారు. ఏ కారణం చేతనైనా పరీక్ష కేంద్రాల్లో చిన్న సంఘటన జరిగినా, మాస్‌కాపీయింగ్ జరిగినా ఆ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, సంబంధిత ఇన్విజిలేటర్‌పై కఠిన చర్యలు తప్పవన్నారు. క్వాలిటీ ఎగ్జామినేషన్ కోసం అందరూ సహకరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా, అనుమానాలకు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్, పరీక్షా సమయంల్లో విద్యుత్, అత్యవసర చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల్లో మాస్‌కాపీయింగ్ జరిగినట్లు తమ దృష్టికి వస్తే ఆ పాఠశాల అనుమతి రద్దు చేయడానికి సిఫారసు చేస్తామన్నారు. సమస్యత్మాక, అత్యంత సమస్యాత్మాక పరీక్షా కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈవో సుప్రకాష్‌ను ఆయన ఆదేశించారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 11 పోలీస్ ప్రత్యేక స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. అందరు అధికారులు పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని సూచించారు. సమావేశంలో డీఈవో సుప్రకాష్, జెడ్పీ సీఈవో ఈశ్వర్, సీపీవో ఆనంద్‌నాయక్, డీడబ్ల్యుఎంఏ పీడీ పుల్లారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, డిప్యూటీ డీఈవో శైలజ, పరీక్షల నిర్వహణాధికారి బ్రహ్మయ్య, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
ఇంటర్లో మాస్ కాపీయింగ్
ఇన్విజిలేటర్ల మాయాజాలం నిబంధనలకు తిలోదకాలు చీఫ్ సూపరింటెండెంట్‌ను నిలదీత నర్సీపట్నం: బాలికల గురుకుల కళాశాలలో మాస్ కాపీయింగ్ జరుగుతోందని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ చంద్ర శారదను శుక్రవారం నిలదీశాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇన్విజిలేటర్లను నియమించి మాస్ కాపీయింగ్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కేంద్రంలో పట్టణంలోని రుషి, డాన్‌బాస్కో, ప్రభుత్వ బాలికల, బాలుర, రవితేజ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, మోడల్ కళాశాలలకు చెందిన 520 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయా కళాశాలలకు చెందిన అధ్యాపకులను పరీక్షా కేంద్రంలో ఇన్విజలేటర్లుగా నియమించ కూడదు. నిబంధనలకు తిలోదకాలిస్తూ పరీక్షా కేంద్రం నిర్వాహకులు రాజేంద్రప్రసాద్ కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులను ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నారు. ఈ పరీక్షా కేంద్రంలో రాజేంద్రప్రసాద్ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాస్తున్నారు. రోజు తప్పించి రోజు మొదట, రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి సంవత్సర ం పరీక్ష రోజున మాత్రమే ఆ కళాశాలకు చెందిన అధ్యాపకులను ఇన్విజలేటర్లుగా వేస్తున్నారు. పరీక్షా కేంద్రంలో ఇద్దరు ఇన్విజిలేటర్లు వారి విద్యార్థులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడంపై మిగిలిన కళాశాలలకు చెందిన విద్యార్థులు వారి యాజమాన్యాల వద్ద మొరపెట్టుకున్నారు. శుక్రవారం జరిగిన ఫిజిక్స్ పరీక్షకు రాజేంద్రప్రసాద్ కళాశాలకు చెందిన ఫిజిక్స్ అధ్యాపకులు రవికిరణ్, వెంకట్‌ను ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఈ విషయం తెలుసుకుని మిగిలిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పరీక్షా కేంద్రానికి వెళ్లి కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ చంద్ర శారదను నిలదీశారు. ఆమెతో వాదనకు దిగారు. రాజేంద్రప్రసాద్ కళాశాల అధ్యాపకులను నియమించలేదని, శ్రీసాయి కళాశాలకు చెందిన అధ్యాపకులను ఇన్విజలేటర్లగా నియమించానని చీఫ్ సూపరింటెండెంట్ చెప్పుకొచ్చారు. ఇద్దరు అధ్యాపకులు రాజేంద్రప్రసాద్ కళాశాలకు చెందిన వారని, శ్రీసాయి కళాశాల పేరుతో ఇన్విజిలేషన్ వేయించుకుంటున్నారని పరీక్షలు ప్రారంభంలోనే మీ దృష్టికి తీసుకువచ్చామన్నారు. మీ ప్రోత్సాహంతోనే ఇలా జరుగుతుందని వారు ఆరోపించారు. రాజేంద్రప్రసాద్ కళాశాలకు చెందిన అధ్యాపకులు అనే విషయం తనకు తెలియదని, ఇప్పుడే విధులనుంచి తొలగిస్తానని చీఫ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ విషయమై ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐవోకు ఫిర్యాదు చేస్తామని నాయుడు, విల్సన్, డి.బాబు, వి రాజులనాయుడు పేర్కొన్నారు. దీనిపై చీఫ్ సూపరింటెండెంట్ చంద్రశారదను వివరణ కోరగా లెక్చరర్లు సరిపోక నలుగురు టీచర్స్ కావాలని ఎంఈవోను రాతపూర్వకంగా కోరగా ఇద్దరు ఉపాధ్యాయులను మాత్రమే ఇచ్చారన్నారు. తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేటు కళాశాల అధ్యాపకులను ఇన్విజిలేటర్లగా నియమించానని తెలిపారు. ఎంఈవో బీవీ రమణను వివరణ కోరగా గురుకుల కళాశాల చీఫ్ సూపరింటెండెంట్నుంచి ఎటువంటి లెటర్ రాలేదని తెలిపారు. -
స్నేహమంటే ఇదేరా..
స్నేహితులకు మీరేదైనా చేస్తున్నారా? విపత్కర పరిస్థితుల్లో వారికి సహకరిస్తున్నారా? ఒక వేళ అలాంటి పనులేవీ చేయకపోతే.. ఇదిగో.. ఈ ఫొటోలోని వ్యక్తుల్ని చూసైనా తెల్సుకోండి.. చట్టాన్ని ఉల్లంఘించైనాసరే.. స్నేహితులకు సహాయపడటం ఎలాగో.. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పనులేవో చేస్తున్నట్లు కనిపిస్తున్న వీళ్లంతా అంతకంటే గొప్పపని చేస్తున్నారక్కడ! పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు తెలియని తమతమ స్నేహితులకు కిటికీల నుంచి చిట్టీలు అందిస్తూ మీడియా కంటికి చిక్కారు! ఒకటికాదు రెండు కాదు తాడు, నిచ్చెన లేకుండా అమాంతం నాలుగు ఫ్లోర్లెక్కిమరీ మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారు. ఈ తతంగమంతా జరిగింది బీహార్‌లో! ప్రస్తుతం పరీక్షల సీజన్ కదా.. బీహార్ లోనూ ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మాస్ కాపీయింగ్ జరుగుతోందని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. అయితే అలాంటిదేమీ లేదని.. పరీక్ష హాలులో ప్రశ్న, జవాబు పత్రాలు తప్ప చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదని బీహార్ సీఎం నితిశ్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన అలా మాట్లాడిన తర్వాతిరోజే ఇదిగో మీరు చూస్తున్న ఈ చిత్రం వైశాలి జిల్లాలో ఆవిష్కృతమైంది. మరి పోలీసుల భయం లేదా? అనుకుంటారేమో! అక్కడ కూడా చట్టం తనపని తాను చేసుకుపోయింది. కిటికీల నుంచి చిట్టీలు అందిస్తున్న విద్యార్థుల స్నేహితులు, బంధువుల్ని తరిమితరిమి కొట్టింది. ఈ ఉరుకులాటలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయికూడా! -
స్లిప్పు పట్టు... కాపీ కొట్టు
సెల్ఫ్ సెంటర్లలో మాస్ కాపీయింగ్ సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి సెల్ఫ్ సెంటర్లలో మాస్ కాపీయింగ్ ఎక్కువగా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్ల నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో ఈ మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఏర్పడింది. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన రెసిడెన్షియల్ కళాశాలలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉద్యోగ భద్రత, ఇంక్రిమెంట్లు, ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందే ఉద్దేశంతో ఈ రెసిడెన్షియల్ కళాశాలల అధ్యాకులు, ప్రిన్సిపాల్స్ మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. తమ పిల్లలను విజయవాడ, గుంటూరు నగరాల్లోని కార్పొరేట్ కళాశాలల్లో చదివించినప్పటికీ, వారి పేర్లను ఈ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఎన్రోల్ చేయించి, పరీక్షలు రాయించి అధిక మార్కులు వచ్చే విధంగా చూసుకుంటున్నారు. నాలుగైదు సంవత్సరాల నుంచి సెల్ఫ్ సెంటర్లలో జరుగుతున్న మాస్ కాపీయింగ్‌పై ఉన్నతాధికారులకు కొంత సమాచారం ఉన్నప్పటికీ ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ కారణంగా ఇతర సెంటర్లలోని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 126 సెంటర్లలో 98 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీటిలో 18 సెల్ఫ్ సెంటర్లు (ఇంటర్మీడియెట్ చదివిన కళాశాలలోనే పరీక్ష రాయడం,ఆ కళాశాలఅధ్యాపకులు అక్కడే ఇన్విజిలేటరుగా బాధ్యతలు నిర్వహించడం)ఉన్నాయి. అక్కడి అధ్యాపకులు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. లాటరీ విధానంలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులను నియమించాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా నియామకాలు జరుగుతున్నాయి. జూనియర్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నప్పుడు వారికి ఆ ఆవరణలోనే ఉన్న సీనియర్ ఇంటర్ విద్యార్థుల నుంచి సహకారం అందే విధంగా చూస్తున్నారు. సీనియర్ ఇంటర్ విద్యార్థులతో సమాధానాలు అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోసారి అధ్యాపకులే సమాధానాలు చెబుతూ పరీక్షలు రాయిస్తున్నారు. సెంటరుకు కొంత దూరంలో సీనియర్ ఇంటర్ విద్యార్థులు, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేసి స్పెషల్ స్క్వాడ్ రాక సమాచారాన్ని సెల్ ఫోన్ల ద్వారా తెలుసు కుని జాగ్రత్త పడుతున్నారు. సాంఘిక సంక్షేమశాఖకు చెందిన రెసిడెన్షియల్ కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది ఎక్కువగా ఈ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఉత్తీర్ణతా శాతం రాకపోతే ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండటంతో అధ్యాపకులు ఇలా ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు ఈ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు ఇతర విద్యార్థుల కంటే మెరిట్‌గా ఉండేవారు. నాలుగైదు ఏళ్ల నుంచి ఈ వ్యవహారం జరుగుతుండటంతో అక్కడి విద్యార్థులు చదువులో బాగా వెనుకబడిపోతు న్నారు. అచ్చంపేట, కారంపూడి సెంటర్లలో ఈ మాస్‌కాపీయింగ్ అధికంగా జరుగుతోందని అక్కడి నుంచే ఫిర్యాదులు వస్తున్నాయి.ఈ విషయమై ఇంటర్మీడియెట్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కె.వెంకటేశ్వరరెడ్డిని వివరణ కోరగా, మాస్ కాపీయింగ్ సంఘటన తన దృష్టికి రాలేదన్నారు. జరిగినట్టు నిర్ధారణ అయితే చీఫ్ సూపరింటెండెంట్, శాఖాధికారి, ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేకంగా ఆయా సెంటర్లకు ఫ్లయింగ్ స్క్వాడ్లను పంపుతామని చెప్పారు. -
‘పది’లో మాస్ కాపీయింగ్‌కు చెక్
ఖానాపూర్ : చాలా మంది విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టి ప్రశ్న, జవాబులను బట్టీపట్టి పరీక్ష రాస్తున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసే విధంగా పదో తరగతి పరీక్ష విధానంలో తొలిసారిగా సీసీఈ (సమగ్ర మూల్యాంకన) విధానం అమలులోకి రానుంది. తద్వారా విద్యార్థులు పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు ఏమాత్రం పాల్పడకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రశ్నపత్రం ఇలా... పదో తరగతి పరీక్షల్లో ఇప్పటివరకు వంద మార్కుల ప్రశ్న పత్రానికి గానూ 30 మార్కులు అబ్జెక్టివ్, మిగతా 70 మార్కులు ప్రశ్నపత్రం ఉండేది. ఇందులో 35 మార్కులు సాధించిన విద్యార్థులు ఉత్తీర్ణత పొందేవారు. కాగా ఈ యేడాది నుంచి ఈ విధానానికి స్వస్తి పలికారు. 100 మార్కులకు గానూ 20మార్కులు ప్రాజెక్టు వర్క్‌కు కేటాయించారు. విద్యార్థుల రికార్డులను పరిశీలించిన పాఠశాల యాజమాన్యం 20మార్కులు వేయాల్సి ఉంటుంది. ఇందులో 20కి ఏడు మార్కులు వస్తే ఉత్తీర్ణత పొందుతారు. ఇక మిగతా 80 మార్కుల కోసం పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణతకు 28 మార్కులు సాధించాల్సి ఉంటుంది. గతంలో ప్రతీ సబ్జెక్టుకు సంబంధించి పాఠం చివరలో ప్రశ్నలుండేవి. ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబులు పాఠంలో నుంచే రాసేవారు. దీంతో పాటు క్వశ్చన్బ్యాంకు తదితర వాటిపై ఆధారపడి అందులోని ప్రశ్న, జవాబులను బట్టీ పట్టి పరీక్ష రాసేవారు. దీంతో చాలా చోట్ల పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు ఇవ్వగానే దానికి సంబంధించిన జవాబులు, జిరాక్స్ కాపీలు, పరీక్ష హాల్లోకి వెళ్లి జోరుగా మాస్‌కాపీయింగ్ జరిగేది. ఇక సీసీఈ విధానంతో పాఠ్యాంశం పూర్తి అర్థం చేసుకుంటే గానీ జవాబులు రాయలేని పరిస్థితి నెలకొంది. పలానా ప్రశ్నరావాలనే నిబంధన లేకుండా పాఠ్యాంశంలో ఎక్కడనుంచైనా ప్రశ్న రావచ్చు. దీంతో ప్రతీ పాఠంపై విద్యార్థికి కనీస పరిజ్ఞానం తప్పనిసరిగా మారింది. విద్యార్థుల్లో ఆందోళన.. తొలిసారిగా ‘పది’ పరీక్షల్లో సీసీఈ విధానం ప్రవేశ పెట్టడంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. మండలంలో మొత్తం ఆరు పరీక్ష కేంద్రాలున్నాయి. మండల కేంద్రంలోని బాలురు, బాలికల ఉన్నత పాఠశాలతో పాటు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల, ధృవ, కృష్ణవేణి టాలెంట్స్కూల్, పెంబీ జెడ్పీ పాఠశాలల్లో కేంద్రాలుండగా వెయ్యి మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది. గతంలో పరీక్ష కాలం 2.30 గంటలు కాగా సీసీఈ విధానంతో ప్రశ్న పత్రావళిని చదివేందుకు మరో 15 నిమిషాల కాలాన్ని అదనంగా కేటాయించారు. దీంతో పాటు హిందీ పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45వరకు ఉంటుంది. అరగంట ముందే కేంద్రానికి రావాలి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలి. ఈ ఏడాది సీసీఈ విధానం ప్రవేశ పెడ్తున్నాం. పాఠ్యాంశంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జవాబులు రాసుకోవచ్చు. - వై.వెంకటరమణారెడ్డి, ఎంఈవో, ఖానాపూర్ -
తొలిరోజే ఇద్దరు డిబార్
⇒ ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం ⇒ పలు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు ⇒ ఆలస్యంగా వచ్చి వెనుగిరిగిన కొందరు విద్యార్థులు నిజామాబాద్ అర్బన్ :ఇంటర్ పరీక్షలు జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని కాకతీయ, ఎస్ఎస్ఆర్ కళాశాల కేంద్రాలను జేసీ రవీందర్‌రెడ్డి తనిఖీ చేశారు. చిట్టిమిల్ల హరిప్రసాద్ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా స్క్వాడ్ అధికారులు వారిని పట్టుకున్నారు. 45 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించినా, కొన్ని చోట్ల విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. కాకతీయ జూనియర్ కళాశాల లో ఇద్దరు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగారు. ఖలీల్వాడిలోని ఎస్ఎస్ఆర్ పరీక్ష కేంద్రానికి చెందిన ఓ ఇన్విజిలేటర్ 9.40 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి వచ్చారు. అధికారులు ఆయననూ అనుమతించలేదు. సమాచారం ఆలస్యంగా ఇచ్చారని తెలిపినా, నిరాకరించారు. మొదటి రోజు పరీక్షలకు 2,121 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మంగళవారం ద్వితీయ ఇంటర్ పరీక్షలు మొదలవుతాయి. -
వినండి.... వదలండి
ఇంటర్ పరీక్షలలో కొత్త ఎత్తుగడలు - మాస్‌కాపీయింగ్ కోసం ముమ్మర యత్నాలు - ఓ అధికారికి ‘ప్రయివేటు’ భారీ నజరానా? - ఫలితాల కోసమే యూజమాన్యాల ఆరాటం - అడ్డుకుంటామంటున్న విద్యార్థి సంఘాలు నిజామాబాద్ అర్బన్ : ‘‘సర్...మేము చెప్పేది వినండి. ఈసారి మమ్మల్ని వదలండి. మంచి ఫలితాలు తెచ్చుకునే అవకాశం ఇవ్వండి. మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. గత ఏడాది కంటే ప్రస్తుతం ఎక్కువగానే అడిగింది ఇస్తాం. ఇంకేమి కావాలి’’ అంటూ వారం రోజులుగా ఇంటర్ అధికారులతో ప్రయివేటు కళాశాలల యజమాన్యాలు చర్చలు కొనసాగిస్తున్నారుు. నాలుగు సంవత్సరాల క్రితం ఇంటర్మీడియేట్ పరీక్షలలో ఇక్కడ విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరిగింది. ఇప్పుడూ అదే పరిస్థితిని తీసుకు రావడానికి ప్రరుువేట్ కళాశాల యజమాన్యాలు భారీ నజరానాతో ఓ అధికారికి గాలం వేశాయని సమాచారం. మాస్‌కాపీయింగ్ నిరోధానికి ఉన్నతాధికారులు అనేక నూ తన పద్ధతులు ప్రవేశ పెడుతున్నారు. ఇది కళాశాల యూజమాన్యాలకు మింగుడుపడడం లేదు. దీంతో తాము అనుకున్నది సాధించుకోవడానికి నెల రోజులుగా తమ ప్ర యత్నాలు ముమ్మరం చేశారు. ఇంటర్ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. దీంతో వారం రోజులుగా ఆర్ఐఓ కార్యా లయానికి వారి రాకపోకలు భారీగా పెరిగాయి. యథేచ్ఛగా ముడుపులు ఈ నెల తొమ్మిది నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 27,497, రెండవ సంవత్సరం విద్యార్థులు 29,68 4, ఒకేషనల్ విద్యార్థులు 1,658 మంది హాజరవుతున్నారు. 73 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిని జీపీఆర్ఎస్ ద్వారా నిఘా కిందకు చేర్చారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వీడియోను చిత్రీకరించనున్నారు. మాస్‌కాపీయింగ్‌ను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఫలితాల కోసం ప్రరుువేటు యజమాన్యాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కళాశాలల సంఘం నాయకులు ఓ అధికారితో తీవ్రమైన చర్చలు జరుపుతున్నారని తెలిసింది. జిల్లాకు వచ్చిరాగానే వాహనాన్ని బహుమ తిగా పొందిన అధికారి, ఈ ఏడాది కూడా భారీ నజరానాను పొందారని తెలుస్తోంది. కళాశాలకు లక్ష రూపాయల చొప్పున, మరికొన్ని కళాశాలల నుంచి రూ. 30 వేల చొ ప్పున వసూలు చేసిన ఇద్దరు సంఘం నాయకులు మాస్‌కాపీయింగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. కొన్ని కళాశాలలవారు తమ విద్యార్థులు పరీక్ష రాసే సెంటర్లలో ఇప్పటికే తమకు అనుకూలమైన ఇన్విజిలేటర్లను కేటాయించుకున్నారు. ఇందులోనూ ప్రముఖపాత్ర వహించిన అధికారి భారీగా ముడుపులు అందుకు న్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి డివిజన్లోని ఓ కళశాల యజమాని ముడుపుల కోసం వసూళ్ల కార్యక్రమం చేపట్టారు. నాలుగు రోజుల క్రితం బోధన్‌లోని ఓ విద్యాసంస్థ యజమాని ఆల్లు డు నేరుగా కార్యాలయంలోని అధికారికి ముడుపులు ఇచ్చారని తెలిసింది. ప్రాక్టికల్స్‌లో జోరుగా వసూళ్ల కార్యక్రమం జరిగింది.బాన్సువాడ డివిజన్ నుంచి ముడుపులు అందలేదని ఓ అధికారి నేటి వరకు ఆయా కళశాల యజమాన్యాలను ప్రశ్నిస్తూనే ఉన్నారని తెలిసింది. నెల రోజుల క్రితమే ఆర్మూర్ రోడ్డులోని ఓ కళాశాల యజమానిని కారులో కలుసుకొని బహుమతిగా పొందారని చెబుతున్నారు. దీంతో మాస్‌కాపీయింగ్ విచ్చలవిడిగా జరిగే అవకాశం ఏర్పడింది. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టమెం టల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను కళాశాలకు అనుకూలంగా నియమించారని సమాచారం. గత డిసెంబర్లో హైదరాబాద్‌లోని ఓ ఉన్నతాధికారి పదవీ విరమణ పేరిట ఇం టర్ అధికారి ఒకరు వసూళ్ల కార్యక్రమం చేపట్టారని సమాచారం. అనంతరం మాస్ కాపీయింగ్ కోసం కళాశాలలకు చెందిన సంఘం నాయకులు సంప్రదించగా ఈసారి నూతన పద్ధతి వీడియో చిత్రీకరణ ఉందంటూ మొదట మొండికేసిన అధికారి భారీగా ముడుపులు అందడంతో ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. కలెక్టర్ ఇంటర్ ప రీక్షలపై ప్రత్యేక దృష్టి సారించి మాస్ కాపీయింగ్‌ను పూర్తిగా నిరోధిస్తే మెరిట్ విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంది. కలెక్టర్ దృష్టిసారించాలి కలెక్టర్ ఇంటర్ పరీక్షలపై దృష్టిసారించాలి, మాస్ కాపీయింగ్ కోసం ప్రరుువేటు కళాశాలల యజమాన్యాలు, ఇంటర్ అధికారులు కుమ్ముక్కైయ్యారు. అధికారుల ైవై ఫల్యంతోనే జోరుగా మాస్‌కాపీయింగ్ కొనసాగుతుంది. అలాంటి సెంటర్లు, యజమాన్యాలపై ధర్నాలు, దాడులు చేస్తాం. మెరిట్, పేద విద్యార్థులకు అన్యాయం జరిగితే ఉరుకోం. - శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ చైర్మన్ -
అంగట్లో ఐటీఐ ప్రశ్నపత్రాలు
⇒ అడ్డూ అదుపు లేకుండా మాస్ కాపీయింగ్ ⇒ అధికారులు పర్యవేక్షించినా ఆలస్యంగానే పరీక్షలు ఖమ్మం: జిల్లాలో జరుగుతున్న ఐటీఐ పరీక్షలు రెండోరోజు శనివారం కూడా తీరు మారలేదు. గత సంవత్సరం ఈ పరీక్షల తీరు, అధికారుల లాలూచీపై విజిలెన్స్ విచారణ చేపట్టినా.. ఈ సంవత్సరం పరీక్షలు ఇష్టానుసారంగా జరుతున్నాయని పత్రికలు, మీడియా చానెల్స్ ప్రచారం చేసినా అధికారుల తీరులో మాత్రం మార్పు రాలేదు. జిల్లా వ్యాప్తంగా అనేక సెంటర్లలో మాస్ కాపీయింగ్ జోరుకు అడ్డుకట్టలేయడంలో అధికారయంత్రాంగం విఫలమైంది. వేళాపాళాలేని పరీక్షలు ఐటీఐ పరీక్షలు అంటేనే జిల్లాలో హాస్యాస్పదంగా మారాయి. చిన్నపిల్లలకు నిర్వహించే యూనిట్ పరీక్షలకు కూడా ఒక సమయం ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఐటీఐ పరీక్షలకు మాత్రం ఏలాంటి నిబంధనలు, పరీక్ష సమయాలు లేకుండా నిర్వహించడాన్ని చూసి అవ్వా ఇవీ పరీక్షలేనా.. అన్నటుల నవ్వుకుంటున్నారు. విద్యార్థుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని విద్యార్థి నుండి అడ్మిషన్ ప్రక్రియ నుంచి ప్రాక్టికల్స్, ఇతర రికార్డులు, చిరవరి పరీక్షల వరకు రేట్లు మాట్లాడుకోని పలు ప్రైవేట్ పాఠశాలలు పరీక్షలను శాసిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం రోజు ఉదయం జరగాల్సిన పరీక్షలు మధ్యాహ్నం, మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలు అర్ధరాత్రి వరకు జరిగిన విషయం విదితమే. దీనిని చూసైనా అధికారులు తమ నైజం మార్చుకోలేదు. శనివారం కూడా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో ఉదయం జరగాల్సిన పరీక్షలు గంట ఆలస్యంగా జరిగాయి. అశ్వారావుపేట సెంటర్లో ఉదయం జరగాల్సిన పరీక్షలు సాయంత్రం నిర్వహించారు. ఆన్లైన్లో ప్రశ్న పత్రాలు డౌన్లోడ్ చేసుకునేందుకు ఆలస్యం అయ్యిందని చెబుతున్నారు. అయితే ముందురోజు జరిగిన పరిస్థితిచూసైనా రెండోరోజు ప్రశ్నపత్రాల సేకరణపై దృష్టి సారించకపోవడం విడ్డూరం. ఐటీఐ ప్రశ్నపత్రాలు అంగట్లో సరుకులు మారాయి. ఢిల్లీ నుండి మెయిల్లో పంపించే ఈ ప్రశ్నపత్రాలను సేకరించడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారు. పరీక్ష సమయం దాటిన తర్వాత కూడా ప్రశ్నపత్రాలు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందాల్సి వచ్చింది. దీంతో ఒక్కపేపర్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి వాటిని ఇతర ప్రాంతాల్లో ఉన్న జీరాక్స్ సెంటర్ల వద్దకు తీసుకెళ్లి జీరాక్స్‌లు తీయించాల్సి వచ్చింది. ఇదే సందర్భంగా ముందు తీసిన ప్రశ్నత్రాల జీరాక్స్‌లను బయటకు తీసుకువచ్చి పలువురు ప్రైవేట్ వ్యక్తులు అమ్మకానికి పెట్టినట్లు తెలిసింది. ఈ ప్రశ్నపత్రాలను తీసుకెళ్ళి జవాబులు తయారు చేసి పరీక్షా కేంద్రాలకు పంపినట్లు సమాచారం. అరకొర వసతుల మధ్య, టెంట్ల కింద, నేలపైన కూర్చొని విద్యార్థులు పరీక్షలు రాయూల్సి వచ్చింది. మొదటిరోజు అవకతవకల మధ్య పరీక్షలు కొనసాగినా రెండోరోజు కూడా మార్పురాకపోవడం విమర్శలకు తావిస్తోంది. గంటన్నర ఆలస్యంగా ఐటీఐ పరీక్ష అశ్వారావుపేట: ఐటీఐ పరీక్ష శనివారం అశ్వారావుపేటలోని ఓ ఐటీఐ కళాశాలలో గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్‌కు ప్రశ్నాపత్రాలు అందలేదు. ఈ విషయాన్ని జిల్లా కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి దృష్టికి ప్రిన్సిపాల్ జాన్‌బాబు తీసుకెళ్లారు. ఆ తరువాత, ప్రశ్నాపత్రాలను అధికారులు ఈ-మెయిల్ ద్వారా పంపారు. వాటిని ప్రిన్సిపాల్ జిరాక్స్ తీయించి ఇచ్చారు. గంటన్నర ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది. ఐదువేలు ఇస్తే గట్టెక్కినట్టే..! ఈ పరీక్షల నుంచి గట్టెక్కించేందుకుగాను కళాశాల నిర్వాహకులు, సిబ్బంది ఒక్కో విద్యార్థి నుంచి ఐదువేల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ మొత్తం చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్ కూడా ఇవ్వలేదని సమాచారం. -
పకడ్బందీగా ప్రాక్టికల్స్
ఈనెల 12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 148 కేంద్రాలు, 27,438 మంది విద్యార్థులు పరీక్ష కేంద్రాలు జీపీఎస్‌తో అనుసంధానం మాస్ కాపీయింగ్‌ను ఉపేక్షించేది లేదు హాల్‌టికెట్లు ఇవ్వని కళాశాలలపై చర్యలు ఆర్ఐవో ఎల్.సుహాసిని కరీంనగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు గురువారం నుంచి నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఐఓ ఎల్.సుహాసిని వెల్లడించారు. సోమవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓలు, ఎక్స్టర్నల్ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. జిల్లాలో 148 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 50 ప్రభుత్వ కళాశాలలు, ఎనిమిది సాంఘిక కళాశాలలు, ఒక గిరిజన సంక్షేమ కళాశాల, 89 ప్రైవేట్, ఆన్ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 27,438 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవనుండగా, ఇందులో వొకేషనల్ విద్యార్థులు 5044 మంది ఉన్నారని చెప్పారు. ఫీజు బకాయిల పేరుతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హల్‌టికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణ విషయంలో డిపార్టుమెంటల్ అధికారులకు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలకు, కళాశాలల యాజమాన్యాలకు ఇదివరకే శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడవద్దని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. నిర్ణయించిన తేదీల్లో విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయితే ఇంటర్ బోర్డు కార్యదర్శి అనుమతి తీసుకొని చివరి విడతలో పరీక్ష రాసేందుకు ఆవకాశం ఉంటుందని తెలిపారు. బ్యాచ్‌కు 25 మంది విద్యార్థులకు పరీక్ష ఉంటుందని, 25 శాతం మార్కులు అందరికీ వస్తే మళ్లీ రివేరిఫికేషన్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ప్రైవేట్ పరీక్ష కేంద్రంలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకులను డిపార్టుమెంటల్ అధికారులుగా నియమించామన్నారు. ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రాలకు బోర్డు నుంచి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జీపీఎస్‌తో అనుసంధానం.. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, వార్షిక పరీక్షల కేంద్రాలపై నిఘా ఉంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టిన గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)లో జిల్లాలోని 148 పరీక్ష కేంద్రాలను అనుసంధానం చేసినట్టు ఆర్ఐవో తెలిపారు. ఈ విధానం ద్వారా పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వాడే సెల్‌ఫోన్, ల్యాండ్‌ఫోన్ల సమాచారం పూర్తిగా రికార్డు అవుతుందన్నారు. సంక్షిప్త సందేశాల సమాచారం కూడా కంట్రోల్ రూంలో ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయిలో పనిచేసే బృందం పరిశీలన చేస్తుంటుందని చెప్పారు. ప్రశ్నపత్రాలు తరిలించే వాహనాలకు సైతం ట్రాలీట్యాగ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటి ద్వారా వాహనం ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడ ఎంతసేపు ఆగింది, వాహనంలో ఏఏ విషయాలు మాట్లాడారనే పూర్తి సమాచారం నమోదై నియంత్రణ విభాగానికి చేరేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, స్క్వాడ్ సిబ్బందికి సంబంధించిన అన్ని సెల్‌ఫోన్, ల్యాండ్‌ఫోన్ నంబర్లను ఇంటర్ విద్యామండలికి పంపించామని తెలిపారు. -
100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ఈ ఏడాది సరికొత్త విధానంలో టెన్త పరీక్షలు జరుగనున్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిలో 80శాతం పబ్లిక్ పరీక్షల ద్వారా, 20 శాతం అంతర్గత పరీక్షల ద్వారా విద్యార్థి ప్రతిభను గుర్తిస్తున్నాం. జిల్లాలో వందశాతం ఫలితాలు సాధించేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: మార్చి 25 నుంచి జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నామని డీఈఓ రమేష్ స్పష్టం చేశారు. విద్యాశాఖ రూపొం దించిన ప్రణాళిక అంశాలను ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకు సరికొత్త ప్రణాళికను అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి పదో తేదీ వరకు అన్ని పాఠశాలల్లో పాఠ్యాంశ బోధన పూర్తవుతుంది. ఆ తర్వాత 45 రోజుల సమయంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశ పునఃశ్చరణ చేపడుతున్నాం. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ఈ తరగతులు కొనసాగిస్తాం. ప్రతి పాఠశాలలో ప్రత్యేకం.. ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెకులో ప్రతి యూనిట్ నుంచి ఇరవై అంశాలతో కూడిన ప్రశ్ననిధిని తయారు చేసుకోవాలని ఆదేశించాం. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా తన సబ్జెకుపై ఇలాంటి ప్రశ్నానిధిని తయారు చేస్తూ.. ఉపాధ్యాయులు తయారుచేసిన ప్రశ్నావళిని పర్యవేక్షించాలి. ఒక పాఠశాలలో తయారుచేసిన వాటికి, మరో పాఠశాలలో తయారుచేసిన ప్రశ్నానిధికి సంబంధం లేకుండా పకడ్బందీగా తయారయ్యేలా చూస్తున్నాం. వీటిని ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు బోధించాలి. కానీ బట్టీ విధానాన్ని మాత్రం ప్రోత్సహించకూడదు. గ్రేడ్ తగ్గినా.. ఉత్తీర్ణత పెరిగేలా.. కొత్త విధానంతో విద్యార్థులు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ పద్ధతితో విద్యార్థి పాఠ్యాంశంపై మంచి పట్టు సాధించవచ్చు. దీంతో భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ తొలిఏడాది గ్రేడ్లలో కొంత వెనకబడొచ్చు. కానీ ఉత్తీర్ణత శాతం మాత్రం గతేడాది కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాం. బోధనలో ప్రత్యేక చొరవ చూపి ఉత్తమ ఫలితాలు సాధించిన టీచర్లను ప్రత్యేకంగా అభినందిస్తాం. అదేవిధంగా పనితీరు అధ్వాన్నంగా ఉన్న వారిపై నిర్మొహమాటంగా చర్యలు తీసుకుంటాం. సహకారమే ముఖ్యం పాఠశాలలో ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. ఇదే తరహాల్లో ఇంటివద్ద కూడా తల్లిదండ్రులు చదివించాలి. ఎలాంటి పనులు చెప్పకుండా వారికి స్వేచ్ఛ ఇస్తే మంచింది. ఈ అంశాన్ని వారికి వివరించేందుకు ఈనెల పదో తేదీలోగా అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాల్సిందిగా ఆదేశించాం. ప్రతి పాఠశాలలో ప్రతిభలో వెనకబడిఉన్న విద్యార్థులను అడాప్ట్ (దత్తత) చేసుకుని బోధన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాం. పలుపాఠశాలల్లో ఈ పద్ధతి కొనసాగిస్తున్నారు. వెనకబడిన విద్యార్థుల తల్లిదండ్రులతోనూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. పక్కాగా పరీక్షలు.. ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు మరింత పకడ్బందీగా నిర్వహిస్తాం. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తాం. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే విద్యార్థితోపాటు సంబంధిత ఇన్విజిలేటర్పైనా కఠిన చర్యలు తీసుకుంటాం. మార్చి రెండో తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్ష ముగిసిన తర్వాత యధావిధిగా ప్రత్యేక తరగతులు, రివిజన్ ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 24 వరకు తప్పకుండా విద్యార్థులు బడికి హాజరు కావాల్సిందే. విద్యార్థుల కోసమే.. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలలో గడపాల్సి వస్తోంది. మధ్యాహ్నం భోజనం చేసినప్పటికీ ఎదిగే పిల్లలు కావడంతో సాయంత్రానికి ఆకలి వేస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు స్థానికంగా ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల సహకారం కోసం లేఖలు రాశాం. వారు స్పందిస్తూ విద్యార్థులకు స్నాక్స్ అందించేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లాలోని 437 ఉన్నత పాఠశాలలకు ఈ లేఖలు అందించా. జిల్లా విద్యాశాఖ తరఫున ఇచ్చే ఈ లేఖల్లో వారి పేర్లు, చిరునామా రాస్తున్నాం. కొత్త విధానమిదే.. పదో తరగతి పరీక్షల విధానంలో భారీ మార్పులు జరిగాయి. గతంలో వందమార్కులకు పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాదినుంచి కేవలం 80 మార్కులకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్నాం. మిగతా 20మార్కులు విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి నిర్వహించిన ఫార్మెటీవ్ 1,2,3,4ల ఆధారంగా మార్కులు వేస్తాం. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ప్రశ్నాపత్రాన్ని చదువుకునేందుకు ప్రత్యేకంగా 15నిమిషాల సమయాన్ని కేటాయించారు. హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుంటాయి. ఈ క్రమంలో ఒక పేపర్‌కు 40 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నాలుగు పెద్ద ప్రశ్నలు (4మార్కుల చొప్పున), ఆరు చిన్న ప్రశ్నలు (రెండు మార్కులు), ఏడు వ్యాఖ్య ప్రశ్నలు(ఒక మార్కు) చొప్పున 35 మార్కులు, మరో ఐదు మార్కులు ఆబ్జెక్టీవ్ పద్ధతిలో ఉంటాయి. -
ఓపెన్‌స్కూల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌స్కూల్) పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగింది. పరీక్షలు ప్రారంభమైన శనివారం రోజే ఈ ప రిస్థితి కనిపించింది. జిల్లా కేంద్రం లోని పలు కేంద్రాలను డీఈఓ నాంపల్లి రాజేష్ తనిఖీ చేశారు. షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో పరీక్ష జరుగుతున్న విషయాన్ని పరిశీలించారు. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు అభ్యర్థులను మాల్‌ప్రాక్టీస్ కేసు కింద బుక్ చేశారు. తెలుగు పరీక్ష రోజే మాస్ కాపీయింగ్ జరపడమేంటని ప్రశ్నించా రు. మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రతి కేంద్రాన్నీ తనిఖీ చేస్తానని మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న వారిని ప్రోత్సహిస్తున్న ఇన్విజిలేటర్లపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. పదవ తరగతి పరీక్షలకు 10మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 8మంది హాజరయ్యారు. ఇంటర్లో 937మంది అభ్యర్థులకు గాను 776 మంది హాజరయ్యారు. డబ్బులు తీసుకొని ఇన్విజిలేటర్లే మాస్‌కాపీయింగ్‌కు ప్రొత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పేపర్ల లీకేజి వెనుక మశ్చేందర్?
ఆర్ఆర్బీ గ్రూప్-డి పరీక్ష పత్రాల లీకేజి వ్యవహారం వెనక మశ్చేందర్ అనే రైల్వే ఉద్యోగి పాత్ర ఉన్నట్లు తెలుస్తోందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. లీకేజి ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. రైల్వే సిబ్బంది పాత్ర ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిగిలిన సెంటర్లలో పరీక్షలు ప్రశాంతంగా సాగాయని ఆయన అన్నారు. కాపీయింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై పదిమందిని పోలీసులు విచారిస్తున్నారని సాంబశివరావు అన్నారు. పరీక్ష రద్దు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తదని ఆయన చెప్పారు. పోలీసులు అందించిన వివరాలను రైల్వే బోర్డుకు నివేదిస్తామని, రైల్వే బోర్డు ఆదేశాల మేరకు నడుకుంటామని అన్నారు. మొత్తం 3.19 లక్షల మంది ఈ పరీక్షలు రాసినట్లు సాంబశివరావు చెప్పారు. -
పరీక్షను రద్దు చేయడం కుదరదు: రైల్వేశాఖ
హైదరాబాద్ : రైల్వే రిక్రూట్మెంట్ సెల్ గ్రూప్-డి పరీక్ష సందర్భంగా జరిగిన హైటెక్ కాపీయింగ్ సంఘటనపై రైల్వేశాఖ స్పందించింది. పరీక్షను రద్దు చేయడం కుదరదని, మాస్ కాపీయింగ్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని రైల్వే సీపీఆర్వో సాంబశివరావు సోమవారమిక్కడ తెలిపారు. దీనిపై నివేదిక వచ్చిన తర్వాత బాధ్యలపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆర్ఆర్సీ పరీక్ష మాస్ కాపీయింగ్‌కు సంబంధించి ప్రధాన సూత్రధారి మచ్చేందర్, మరొక రైల్వే ఉద్యోగి కోసం ప్రత్యేక బృందం..గాలిస్తోంది. నాందేడ్‌లో కూడా ఇలాంటి హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
మాస్ కాపీయింగ్ ప్రధాన సూత్రధారి కోసం గాలింపు
హైదరాబాద్:రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు కారణమైన ప్రధాన సూత్రధారి మశ్చేందర్ కోసం స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓ) పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతనితో పాటు ఈ ఉదంతానికి సహకరించిన ఓ రైల్వే ఉద్యోగి కోసం కూడా ప్రత్యేక బలగాలు గాలింపు చేపట్టాయి. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌లో ఈ ముఠా ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కంట్రోల్ రూంపై ఎస్వోటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు ఉమేందర్, పుష్పన్‌కుమార్ ఆదివారం దాడి చేసి 20 మందిని పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, తిరుపతిలోని 10 పరీక్ష కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసి 10 మంది అభ్యర్థులను అరెస్టు చేశారు. అయితే నాందేడ్ కూడా మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. నిందితులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రాలుగా ఎంచుకుని మాస్ కాపీయింగ్ దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
రైల్వే గ్రూప్-డీ పరీక్షలో మాస్‌కాపీయింగ్
* ‘వాట్స్‌యాప్’ సాయంతో ప్రశ్నపత్రం లీక్ * బ్లూటూత్ ద్వారా సమాధానాల చేరవేత * గుట్టురట్టు చేసిన ఎస్వోటీ పోలీసులు * 20 మంది ముఠా సభ్యులు..10 మంది అభ్యర్థుల అరెస్టు * పరారీలో కీలక సూత్రధారి హైదరాబాద్: రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ) గ్రూప్-డీ పరీక్షను హైటెక్ పద్ధతిలో మా స్ కాపీయింగ్ చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్వోటీ) పోలీ సులు రట్టు చేశారు. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌లో ఈ ముఠా ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కంట్రోల్ రూంపై ఎస్వోటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు ఉమేందర్, పుష్పన్‌కుమార్ ఆదివారం దాడి చేసి 20 మందిని పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, తిరుపతిలోని 10 పరీక్ష కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసి 10 మంది అభ్యర్థులను అరెస్టు చేశారు. నిందితులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించినట్లు తేలింది. ‘తాయత్తు’లో సమాధానాలు.. ఆర్ఆర్సీ పరీక్ష మాస్‌కాపీయింగ్‌లో రైల్వే ఉద్యోగి మచ్చేందర్ కీలక సూత్రధారని పోలీసు లు గుర్తించారు. పరీక్ష రాసే అభ్యర్థులకు సమాధానాలు చేరవేస్తానని ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశాడు. ఇందుకోసం 20 మంది సభ్యులతో ముఠాను ఏర్పాటు చేశాడు. మౌలాలి ఉప్పరిగూడలోని రైల్వే క్వార్టర్స్‌లోని నీళ్లట్యాంక్ సమీపంలో ఒక తాత్కాలిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాడు. అక్కడ ల్యాప్‌టాప్‌లు, బ్యాటరీలు, సెల్ఫోన్లు, బ్లూటూత్‌ల ఆధారంగా పరీక్షహాల్లో ఉండే అభ్యర్థులకు సమాధానాలు చేరవేసేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ముఠాలో కీలక సభ్యుడు వరుణ్ పరీక్ష హాల్లో అభ్యర్థిగా వెళ్లిపోయాడు. ఆదివారం నిర్వహించిన ఆర్ఆర్సీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని తన సెల్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్(మొబైల్ అప్లికేషన్) ద్వారా ముఠాకు చేరవేశాడు. ముఠాలోని మరో వ్యక్తి ఇలియాస్ జవాబులను నిపుణులైన గిరిధర్, వెంకటేశ్, అశోక్, శ్రీనివాస్(ముఠాసభ్యులే)తో తయారు చేయించాడు. తర్వాత ముఠా సభ్యులు జవాబులను తమ అభ్యర్థులకు హైటెక్ పద్ధతిలో చేరవేశారు. ఇందుకోసం మెడలో తా యత్తులా కనిపించే పరికరాన్ని(అందులో సిమ్‌కార్డు ఉంది) అభ్యర్థులకు ఇచ్చారు. దానితో పాటు జవాబులు వినిపించడానికి వైర్లెస్ ఇయర్‌ఫోన్ అందజేశారు. ఈ ముఠాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్వోటీ సిబ్బంది ఉప్పరిగూడ వద్ద ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా నగరంలోని దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్లో పరీక్ష రాస్తున్న సరిత, పరమేశ్, శ్యాంలను అరెస్టు చేశారు. అలాగే, అర్చన కాంప్లెక్స్‌లోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇద్దరు, తిరుమలగిరిలోని గౌతమ్ మోడల్ స్కూల్లో ఐదుగురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ముఠాసభ్యులు, అభ్యర్థుల నుం చి 13 సిమ్ కార్డులు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్, 9 ఇయర్ ఫోన్స్, 27 సెల్ఫోన్లు, 17బైక్‌లు, 3 డేటా కార్డులను స్వాధీనం చేసుకున్నా రు. నేరెడ్‌మెట్‌లోని డీఏవీ పాఠశాల, సమార్టిన్ పాఠశాల, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీ, పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, విజయవాడలోని సెయింట్ రిటా హైస్కూల్, రవీంద్రభారతి పబ్లిక్ స్కూల్, గౌతం డిగ్రీ కాలేజీ, మియాపూర్‌లోని సెయింట్ రిటా హైస్కూల్లో మరికొందరు విద్యార్థులు హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడి ఉంటారని పోలీ సులు అనుమానిస్తున్నారు. కీలక సభ్యుడు మచ్చేందర్ పరారీలో ఉన్నట్లు అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. పోలీసుల నివేదిక ఆధారంగా చర్యలు ఆర్ఆర్సీ గ్రూప్ డీ పరీక్షల్లో హైటెక్ మాస్‌కాపీయింగ్ జరగడంతో పరీక్షలు మళ్లీ నిర్వహిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై రైల్వే సీపీఆర్ఓ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు ఆదివారాలు పరీక్షలు సాఫీగానే సాగాయి. చివరి ఆదివారం మాస్‌కాపీయింగ్ విషయం బయటపడింది. పోలీసుల నివేదిక ఆధారంగా మాస్‌కాపీయింగ్ జరిగిందా లేదా..? కేవలం పది మంది అభ్యర్థులకే వీరు సమాధానాలు చేరవేశారా లేక మరింత మంది ఈ తరహా కాపీయింగ్‌కు పాల్పడ్డారా? అనేది తెలియాలి. అప్పుడే పరీక్షలు మళ్లీ నిర్వహించాలా వద్దా అనే విషయంపై స్పష్టత వస్తుంది’ అని అన్నారు. -
నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ?
ఆరోపణలపై విచారణకు ఆదేశించిన డీఎంఈ ఒంగోలు సెంట్రల్: రిమ్స్‌లో నిర్వహిస్తున్న నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని అన్ని జీఎన్ఎం కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న నర్సింగ్ విద్యార్థులకు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకూ నర్సింగ్ పరీక్షలను రిమ్స్‌లోని వైద్య కళాశాలలో నిర్వహిస్తున్నారు. అయితే రిమ్స్‌లో నర్సింగ్ పరీక్షల కోసం ఒక్కో విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల వరకూ వసూలు చేసిన నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు, వీటిని రిమ్స్ నర్సింగ్ పరీక్షలు నిర్వహించే అధికారులకు అందజేసిన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వైద్యకళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పరీక్షల సూపరింటెండెంట్‌గా ఉండటంతో కాపీయింగ్‌కు పెద్దగా అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయడంతో అధికారులు పని సులువైంది. మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యార్థులు 600 మంది, రెండో సంవత్సరం 383 మంది, మూడో సంవత్సరం విద్యార్థులు 370 మంది ప్రస్తుతం పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 1353 మంది రిమ్స్‌లో శుక్రవారం నుంచి పరీక్షలు రాస్తున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో కళాశాలల యాజమాన్యాలు వసూలు చేసి రిమ్స్ పరీక్షల అధికారులకు అందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం నర్సింగ్ రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో రిమ్స్ డైరక్టర్ డాక్టర్ అంజయ్య తనిఖీలకు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున తమ వద్ద ఉన్న కాపీలను చెత్త బుట్టలు, పక్కన ఉన్న బ్లాకుల్లో పడేశారు. తనిఖీ అనంతరం విద్యార్థులు యథావిధిగా కాపీలు కొట్టినట్లు సమాచారం. అయితే నర్సింగ్ పరీక్షల అధికారిగా ఉన్న కేసీటీ నాయక్ ఈ ఆరోపణలపై స్పందిస్తూ బుట్టల్లో ఉన్న కాపీలో ప్రస్తుతం జరుగుతున్న నర్సింగ్ పరీక్షలవి కావని, గత వారం పరీక్షలు జరిగిన ఏఎన్ఎం విద్యార్థులవని తెలిపారు. ప్రస్తుత విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడటం లేదని, విద్యార్థుల వద్ద నుంచి ఎటువంటి నగదు వసూలు చేయలేదని చెప్పారు. ఇప్పటికే ఈ వివాదం హైదరాబాద్ వరకూ వెళ్లింది. దీనిపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ డాక్టర్ శాంతారావు, రిమ్స్ డైరక్టర్ అంజయ్యను ప్రశ్నించినట్లు సమాచారం. విజయవాడ సిద్దార్ధ వైద్య కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యకుమారిని విచారణాధికారిగా నియమించారు. ఆమె శనివారం ఒంగోలు వచ్చి ఈ మాస్ కాపీయింగ్‌పై విచారణ జరిపారు. -
అధికార బలుపు
ఆయనో తెలుగుదేశం పార్టీ నాయకుడు. జిల్లా కేంద్రంలో న్యాయ కళాశాల నిర్వాహకుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరుల్లో ఒకడు. ఆయన నిర్వహిస్తున్న న్యాయ కళాశాల పరీక్షా కేంద్రం యోగి వేమన యూనివర్సిటీకి మారింది. మాస్ కాపీయింగ్‌కు బ్రేక్ పడింది. అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మిప్రసాద్‌కు ఫోన్ చేసి నోటి కొచ్చినట్లు దూషించాడు. నీ.. అంటూ మాతృమూర్తిని ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించాడు. నరికిపారేస్తా నా... అంటూ రెచ్చిపోయాడు. ఆ అధికారి దళితుడనే సాక్షి ప్రతినిధి, కడప: మంగళవారం మధ్యాహ్నం సమయం 12 గంటలు... అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసాద్ ఫోన్ రింగ్ అయింది. హలో అంటూ రీసివ్ చేసుకున్నారు. లక్ష్మీప్రసాదేనా.. అవునండీ మీరెవరూ... గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతున్నా... నా కొ.. ల్లారా పరీక్షలు అంత దూరంలో పెట్టారు. పరీక్షలు రాసేందుకు వస్తూ ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురైనారు. ఇంతవరకూ మీరెవర్వూ చూసేందుక్కూడా రాలేదు. నీ .. మీ ఇష్టమెచ్చినట్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంటూ పరుష పదజాలంతో దూషణలకు దిగాడు. ఏమండీ..ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు... మర్యాదగా మాట్లాడండి..అనగానే.. వెంటనే నరికేస్తా నా... రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం మాదే. నీ ఇష్టమొచ్చినట్లు పరీక్షలు నిర్వహిస్తుంటే చూస్తూ ఊరుకోవాల్నా ...అంటూ ఆగకుండా దూషణలకు దిగాడని బాధితుడు వాపోయారు. వైవీయూ రిజిస్ట్రార్ వాసంతికి బాధితుడు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మాస్ కాఫీయింగ్‌కు అవకాశం లేకపోవడంతోనే.... బసవతారకం మెమోరియల్ లా కళాశాలలో తమిళనాడుకు చెందిన విద్యార్థుల అడ్మిషన్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం పరీక్షల్లో పాస్ గ్యారెంటీ ఇవ్వడంతోనే ప్రతి ఏడాది అక్కడి నుంచి అడ్మిషన్లు వస్తున్నట్లు సమాచారం. కాగా ఈసారి పరీక్షా కేంద్రాన్ని వైవీయూలోనే నిర్వహిస్తున్నారు. దాంతో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పరీక్షలు నిర్వహిస్తే చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం రాబోవు ఏడాది అడ్మిషన్లపై పడే అవకాశం ఉంది. దాంతో ఒక్కమారుగా గోవర్ధన్‌రెడ్డి కోపం కట్టలు తెంచుకున్నట్లు సమాచారం. దుర్మార్గంగా దూషించారు: లక్ష్మీప్రసాద్ ‘పరీక్షా కేంద్రం నుంచి డిపార్టుమెంట్‌కు వెళ్లగానే ఫోన్ కాల్ వచ్చింది. రీసీవ్ చేసుకోగానే బూతులు అందుకున్నారు. ఏమాత్రం సంబంధం లేని కుటుంబసభ్యుల్ని దూషించారు. అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. ఇదే విషయాన్ని నా సహచరులకు చెప్పాను. సంఘీభావం ప్రకటించారు. రిజిస్ట్రార్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాం. దళితుడిననే చిన్నచూపుతో కులం పేరుతో దూషించారు. అని అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విధులు బహిష్కరించాలని నిర్ణయం... అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసాద్‌ను తెలుగుదేశం పార్టీ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి దూషించడంపై చర్యలు తీసుకోవాలని బుధవారం నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ విధులు బహిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం. చర్యలు తీసుకోని పక్షంలో విధులకు హాజరయ్యేది లేదని సిబ్బంది అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. -
అబేద్కర్ వర్సిటీ పరీక్షల్లో యదేచ్చగా మాస్ కాపీ
-
మార్కెట్లో ఇంటర్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలు?
ఖమ్మం, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలు అంగట్లో సరుకుమాదిరిగా దొరుకుతున్నట్లు సమాచారం. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన పేపర్లు ముందుగానే మార్కెట్లో హల్చల్ చేస్తున్నట్లు తెలియవస్తోంది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల మార్కుల దాహం, ఫెయిల్ అయిన విద్యార్థుల అవసరాలను ఆసరాగా తీసుకుని ఇంటర్మీడియెట్ రీజినల్ కార్యాలయం ఉద్యోగులే ఈ తంతంగానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలో మాస్‌కాపీయింగ్‌తో పాటు ప్రశ్నపత్రాలను ఒకరోజు ముందుగానే లీక్ చేస్తున్నట్లు తెలిసింది. ఆర్ఐవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇందులో కీలక పాత్ర పోషిస్తూ సదరు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులతో బేరసారాలు చేస్తున్నట్లు ప్రచారం. ఇప్పటి వరకు నిర్వహించిన ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం, మ్యాథ్స్-ఏ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఇంగ్లిష్, మ్యాథ్స్ పేపర్లు మార్కెట్లో విరివిగా అమ్ముడుబోయినట్లు తెలుస్తోంది. గురువారం నిర్వహించే మ్యాథ్స్-1 బీ పేపర్‌ను సైతం బేరానికి పెట్టినట్లు తెలిసింది. ఒక్కో పేపర్‌కు రూ.6 వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గత మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలు చేసిన విషయం విదితమే. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఆర్ఐవో విశ్వేశ్వరరావును సస్పెండ్ కూడా చేశారు. ఆ విషయం మర్వకముందే అదే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు దొడ్డిదారిన ప్రశ్నపత్రాలను విక్రయిస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. -
తణుకు డిగ్రి కాలేజీలో మాస్ కాపీయింగ్
-
ఎంసెట్ అక్రమాలకు చెక్
హైటెక్ మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు తరచూ పరీక్ష రాస్తున్నవారిపై పక్కా నిఘా ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసినవారిపై కూడా.. వారి సెల్ఫోన్ల ట్యాపింగ్.. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయాలు మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఎంసెట్‌లో హైటెక్ మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా 20 ఏళ్ల వయస్సు పైబడినవారు, 2012కు ముందు ఎంసెట్ రాసినవారు, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసినవారు, కాలేజీల్లో చేరినా మళ్లీ వుళ్లీ ఎంసెట్ రాస్తున్న వారందరిపై పక్కా నిఘా పెట్టనున్నారు. గత మూడు నాలుగు నెలల్లో వారు ఎవరెవరితో మాట్లాడారు.. ఏయే నంబర్లకు ఫోన్ చేశారు.. ఏయే నంబర్ల నుంచి వారికి ఫోన్లు వచ్చాయనే వివరాలన్నింటినీ కూడా సేకరించనున్నారు. పోలీసుల సహకారంతో వారి ఫోన్లను ట్యాప్ చేయడంతోపాటు వారి ఇంటికి వెళ్లి తరుచుగా ఎంసెట్ ఎందుకు రాస్తున్నారు, వారి నేపథ్యం ఏమిటి అనే తదితర వివరాలను తెలుసుకోనున్నారు. ఈనెల 22న ఎంసెట్ నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారమిక్కడ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్షలో అక్రమాల నిరోధానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇవీ నిర్ణయాలు... మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గడియారాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు. రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఫీజు కట్టిన 1,375 మంది, రూ.5 వేల ఆలస్య రుసుముతో ఫీజు కట్టిన 402 మంది, రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసిన 17 మందిపై నిఘా ఉంటుంది. 1994కు ముందు పుట్టి 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు లో పరీక్ష రాస్తున్న 10 వేల మందిపైనా నిఘా పెడతారు. 2013లో ఎంసెట్ రాసి, మళ్లీ ఇపుడు రాస్తున్నవారు 30,110 మంది ఉన్నారు. 2012లో రాసినవారు 7,296 మంది, 2011లో రాసినవారు 2,128 మంది, 2010లో రాసినవారు 667 మంది ఇప్పుడు పరీక్ష రాయడానికి దరఖాస్తు చేశారు.2012, అంతకుముందు ఎంసెట్ రాసి, కాలేజీల్లో చేరి, మళ్లీ ఎంసెట్ రాస్తున్నవారిపై నిఘా ఉంటుంది. సమస్యాత్మక కేంద్రాల్లో జామర్లు అమర్చుతారు. 2013 ఎంసెట్‌లో 5 వేలలోపు ర్యాంకు వచ్చినా మళ్లీ దరఖాస్తు చేసినవారు 933 మంది ఉన్నారు. గతంలో ఒకసారి ఎంసెట్ రాసినవారు 771 మంది, రెండుసార్లు రాసినవారు 57 మంది, మూడుసార్లు రాసినవారు 17 మంది, నాలుగు సార్లు రాసిన వారు ముగ్గురు ఇపుడు మళ్లీ దరఖాస్తు చేశారు. పాత వారు మెడికల్‌లోనే సగం! గతంలో ఎంసెట్ రాసి మళ్లీ దరఖాస్తు చేసినవారిని పరిశీలిస్తే.. వారిలో వయస్సు పైబడిన వ్యక్తుల్లో సగానికంటే ఎక్కువ మంది అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కే దరఖాస్తు చేశారు. ఇందులో 20 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్సు వారు ఎక్కువగా ఉన్నారు. -
దర్జాగా చూచిరాతలు
పాఠశాలల యాజమాన్యాల ప్రోత్సాహం ఉత్తీర్ణత శాతం పెంపునకు అడ్డదారులు నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షల్లో పెద్ద ఎత్తున మాస్‌కాపీయింగ్ జరుగుతోంది. ఒకపక్క పరీక్షలు, మరోపక్క ఎన్నికలు రావడంతో ఈ పరీక్షలపై అధికారులు దృష్టిసారించకపోవడాన్ని అవకాశంగా చేసుకుని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు చూచిరాతలను ప్రోత్సహిస్తున్నాయి. పరీక్ష ప్రారంభమైన అర్ధగంటలోపే ప్రశ్నపత్రం బయటకు వస్తోంది. వెనువెంటనే జవాబుపత్రాన్ని తయారుచేసి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ నడపడానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు బృందంగాఏర్పడి వాహనంలో పలు సెంటర్లకు తిరుగుతూ వీటిని చేరవేస్తున్నారు. ఈ తతంగం జరగడానికి విద్యాశాఖాధికారులు, ఆయా కేంద్రాల పరీక్ష నిర్వాహకులు ప్రధానభూమిక పోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో ఏడు కేంద్రాలతో పాటు వేములపూడిలోని రెండు కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో 1600మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ప్రధానంగా పట్టణంలో ఏడు కేంద్రాల్లో ఈ తతంగం జరుగుతోంది. ఎన్నికల హడావిడిలో అధికారులు, పోలీసులు, మీడియా నిమగ్నమై ఉండడంతో ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉత్తీర్ణత శాతాలను పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పర్యవేక్షణాధికారులకు, ఇన్విజిలేటర్లకు ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ముట్టజెప్పడం వల్లే ఈ తతంగం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల కాసుల కక్కుర్తి కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులు పరీక్ష కేంద్రంలో జరుగుతున్న ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లావిద్యాశాఖాధికారి దృష్టిసారించి నర్సీపట్నంలో జరుగుతున్న మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై డీఈవో బి.లింగేశ్వరరెడ్డిని సంప్రదించగా ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఫ్లయింగ్స్క్వాడ్లు, సిట్టింగ్‌స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ కేంద్రం నుంచైనా ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు తెలిస్తే సంబంధిత కేంద్ర నిర్వాహకులపై చర్యలు చేపడతామన్నారు. -
సస్పెన్షన్ ఎత్తివేయాలి
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల చూచిరాతలకు బాధ్యులను చేస్తూ కలెక్టర్ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని, ఆ సస్పెన్షన్లు ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆదిలాబాద్‌లోని పీఆర్టీయూ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఎన్నిక ల శిక్షణ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశా రు. కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బి.రవీంద్ర మాట్లాడుతూ కలెక్టర్ ఉపాధ్యాయుల మ నోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు మార్చుకోవాలని అన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుల సత్యానారాయణగౌ డ్, వెంకట్, దర్శనం దేవేందర్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలతో నిరసన దిలావర్పూర్ : పదో తరగతి పరీక్షల్లో ఇ న్విజిలేటర్లు, ఛీఫ్‌సూపరింటెండెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని గు రువారం దిలావర్పూర్లో ఉపాధ్యాయు లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాల యంలో ఎన్నికల శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మార్సీ ఎదుట నల్లబ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు హరిప్రసాద్, శ్రీనివాస్, రాజశేఖ ర్, వెంకటరమణారెడ్డి, కిషన్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల ధర్నా నేరడిగొండ : పదో తరగతి పరీక్ష కేంద్రా ల్లో మాస్‌కాపీయింగ్‌కు ఇన్విజిలేటర్లను బాధ్యులను చేస్తూ వారిని కలెక్టర్ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు గురువారం ఎంఈవో కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. టీఆర్టీ యూ, పీఆర్టీయూ, టీయూటీఎఫ్, డీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల నేత లు నూర్సింగ్, నారాయణగౌడ్, శరత్‌శ్చందర్, సుభాష్‌రెడ్డి, రమేశ్, గణేశ్ మా ట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థినుల ను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహి ళా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. సస్పెండైన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
ఏలూరు (ఫైర్‌స్టేషన్‌సెంటర్), న్యూస్‌లైన్ : జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో గురువారం మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు విద్యార్థులను డిబార్ చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. విద్యార్థులకు సహకరించిన ఐదుగురు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. పూళ్లలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ఇద్దరిని, ఇక్కడ ప్రోత్సహించిన పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్, డిపార్డుమెంటల్ అధికారులను, తాడిమళ్లలో స్లిప్‌లతో పరీక్ష రాస్తూ ఫ్లయింగ్ స్క్వాడ్‌కు పట్టుబడ్డ ముగ్గురిని డిబార్ చేసి ఆ పరీక్షా కేంద్ర చీఫ్ సూపరిం టెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రగడవరంలో పరీక్షా కేంద్రం చుట్టూ వందలాది కాపీస్లిప్లు ఫ్లయింగ్ స్క్వాడ్‌కు దొరకడంతో దీనికి బాధ్యులుగా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశామన్నారు. కొన్ని కేంద్రాల్లో సిబ్బంది ప్రోత్సాహంతోనే మాస్ కాపీయింగ్ జరగడంతో వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. విధుల్లోకి తీసుకోకపోతే బహిష్కరణ అస్త్రం సస్పెండ్ చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోని పక్షంలో మిగిలిన పరీక్షల విధులను జిల్లాలోని ఉపాధ్యాయులంతా బహిష్కరిస్తారని ఉపాధ్యాయ సం ఘాల నాయకులు రెవెన్యూ శాఖను హెచ్చరించారు. ఏ తప్పూ చేయని ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో మానసిక క్షోభకు గురవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు హెడ్మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ, ఎస్టీయూ అధ్యక్షుడు డీవీఏవీ ప్రసాదరాజు, పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి బీఏ సాల్మన్‌రాజు, యూటీఎఫ్ అధ్యక్షుడు ఎస్.శ్రీకాంత్ ఓ ప్రకటన చేశారు. -
పదవ తరగతి విద్యార్థుల హైటెక్ మాస్ కాఫియింగ్
-
విద్యాశాఖలో కలకలం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి ఇన్విజిలేటర్లపై కలెక్టర్ అహ్మద్‌బాబు కొరడా ఝుళిపించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినా విద్యాశాఖ తీరు మారకపోవడంతో వేటు వేశారు. ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యంగా, అలసత్వంగా వ్యవహరించడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. మొదటి రోజు 9, రెండో రోజూ ఐదుగురు, మూడో రోజూ 13 మంది డిబార్ అయ్యారు. ఈ మేరకు మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించిన ఇన్విజిలేటర్ల వివరాలు, కేంద్రాలను డీఈవో వద్ద తీసుకుని 24 మంది ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ ఉలిక్కిపడింది. దీంతో మిగతా ఇన్విజిలేరట్లు, సీఎస్‌లు, డీవోలు భయాందోళనకు గురవుతున్నారు. వీరితోపాటు ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించిన 18 మందిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆర్జేడీకి, ఐటీడీఏ పీవోకు, సాంఘీక సంక్షేమ శాఖ డీడీకి ఉత్తర్వులు పంపారు. వీరిపై కూడా సస్పెషన్ వేటు పడే అవకాశాలు లేకపోలేదు. జంకుతున్న ఉపాధ్యాయులు పదో తరగతి ఇన్విజిలేషన్ చేయడానికి ఉపాధ్యాయులు జంకుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లోని కొంత మంది సీఎస్, డీవోలు మామూళ్లకు ఆశపడి పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయిం గ్ను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంతో ఆ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మొదటి రెండు పరీక్షలకే 24 మంది ఉపాధ్యాయులు సస్పెండ్ కావడంతో మిగతా పరీక్షల పరిస్థితి ఎలా ఉం టుందో అని ఆందోళన చెందుతున్నారు. అధికారులు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి, కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సస్పెండ్ చేయడం సరికాదు.. - రవీంద్ర, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జిల్లాలో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించారని ఇన్విజిలేషన్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సరికాదు. వారికి షోకాజ్ నోటీసులు ఇస్తే సరిపోయేది. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయుల మనోధైర్యం దెబ్బ తింటుంది. మానసిక ఒత్తిళ్లకు గురయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకే ఉపాధ్యాయులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కానీ అధికారులు సస్పెన్షన్ విషయంలో మరోసారి ఆలోచించాలి. -
తూతూ మంత్రంగా చర్యలు
ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మంలోని రెండు పరీక్ష కేంద్రాలలో యథేచ్ఛగా కాపీయింగ్ జరుగుతున్న వైనంపై సాక్షి దినపత్రికలో గురువారం వచ్చిన కథనం కలకలం రేపింది. కాగా, ఈ వైనంపై అధికారులు స్పందించిన తీరు విమర్శలకు తావి స్తోంది. ఒక అటెండర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసి, ఓ ఏపీఎస్(అసిస్టెంట్ చీప్ సూపరిండెట్)ను తొలగించి అధికారులు చేతులు దులుపుకున్నారు. గతంలో ఆరోపణలు ఉన్నా కళాశాలకు తిరిగి అనుమతులు ఇవ్వడం, అర్హత లేని వారిని ఇన్విజిలేటర్లుగా నియమించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేంద్రంలో మాస్ కాపీయింగ్ వ్యవహారంలో అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని, కాపీరాయుళ్లను రక్షిస్తున్నారని, మాస్ కాపీయింగ్ ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోలేదని అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం జిల్లా కేంద్రంలో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతుందని ‘సాక్షి’పత్రిక,టీవీలుసంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌ను గురువారం కళ్లకుకట్టినట్టు అటుపత్రికలోనూ, ఇటుటీవీలోనూ వచ్చింది. ఇంటర్‌బోర్డ్ అధికారులు స్పం దించారు. పూర్తివివరాలు సేకరించాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలు పకడ్బందిగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో తప్పని పరిస్థితిలో చర్యలు తీసుకోవాల్సి రావడంతో అధికారులు ఆర్భాటం చేశారని, హంగామా సృష్టించారని సమాచారం. ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు’గా కేవలం ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకోవడం విస్మయం కలిగించింది. మాస్ కాపీయింగ్‌కు కీలక భూమిక పోషించిన ఓ ఉపాధ్యాయుని భార్యకు ఏ అర్హత లేకున్నా ఇన్విజిలేటరుగా నియమించడం, ఇంత జరిగినా కూడా సంబంధిత అధికారి కనీసం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయకపోవడంపై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఐవోను నిలదీసిన విద్యార్థి సంఘాలు జిల్లాలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నా పట్టించుకోని ఆర్‌ఐఓను విద్యార్థి సంఘాల నాయకులు గురువారం నిల దీశారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయనకు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ నాయకులు మెమోరాండం ఇచ్చారు. గత రెండేళ్లుగా జిల్లాలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ చెప్పారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కై మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహించారు. దీనిపై గవర్నర్‌కు ఫాక్స్ ద్వారా ఫిర్యాదు చేస్తామన్నారు. అక్రమార్కులపై చర్య తీసుకోకుంటే ప్రత్యేక్ష ఆందోళనకు దిగుతామని పీడీఎస్‌యూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రదీప్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. కాగా, మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్ఐవో విశ్వేశ్వర్రావు తెలిపారు. ఆయన గురువారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుతున్నామన్నారు. ఈ వ్యవహరంతో సంబంధమున్న వారిపై పోలీస్ కేసులు పెట్టే విషయమైపై రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. -
నో డౌట్ సర్... మేం చూసుకుంటాం
‘పేపరుకు ఐదువేల రూపాయలు ఇవ్వండి...ఇంటర్ పరీక్షల్లో మార్కులు సంపాదించుకోండి....’అంటూ కొందరు పక్కాగా ప్లాన్‌చేసి కాపీయింగ్‌కు తెరలేపారు. అక్ర‘మార్కులకు’ అడిగినంతా ముట్టచెబితే అంతా వారే చూసుకుంటారు. పరీక్ష హాలు నుంచి ప్రశ్నలు బయటకు రప్పించడం, జవాబులు రాయించడం, వాటిని విద్యార్థికి చేరేలా చూడడం...అంతా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకుని, అందరినీ మేనేజ్ చేస్తున్నారు. ఓప్రైవేట్ లెక్చరర్ సూత్రధారిగా నడుస్తున్న ఈతతంగానికి రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ...జిల్లా కేంద్రం ఖమ్మంలో రెండుకళాశాలల్లో జరుగుతున్న ఈ కాపీయింగ్‌పై సమాచారం అందడంతో సాక్షి-సాక్షి టీవీ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా ఈనిజాలు వెల్లడయ్యాయి. -
కాపీయింగ్‌కు చెక్
ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని అమలు చేస్తోంది ఇంటర్ బోర్డు. సాంకేతిక పరిజ్ఞానంతో మాస్ కాపీయింగ్‌కు పాల్పడాలనుకున్న వారికి అదే సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అన్ని ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) సెల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనుంది. రీక్ష ప్రారంభమైన క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు బయట ప్రత్యక్షమవటం.. సెల్ఫోన్ల ద్వారా ప్రశ్నలు బయటకు చేరవేస్తూ మాస్ కాపీయింగ్‌కు పాల్పడటం.. ర్యాంకుల కోసం పాకులాడే కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా చేసే చర్యలివి. దీని ఫలితంగా కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు సెల్‌ట్రాకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చి మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులకు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. పనితీరు ఇలా... ప్రతి ఇంటర్ పరీక్ష కేంద్రంలో జీపీఎస్ సిస్టం ఏర్పాటుచేసి హైదరాబాద్‌లో ఉన్న ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా ఆ సెంటర్‌కు వంద మీటర్ల దూరంలో ఉన్నవారు సెల్ఫోన్ల ద్వారా ఎవరెవరితో మాట్లాడుతున్నారనే సమాచారం ఇంటర్ బోర్డుకు అందుతుంది. దీనిద్వారా ఏ సెంటర్లో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ విధానం వల్ల ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. మాస్‌కాపీయింగ్ అరికట్టేందుకే.. - కె.వెంకట్రామయ్య, ఆర్ఐవో జిల్లాలో 159 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నాం. వంద శాతం మేర అన్ని సెంటర్లలో జీపీఎస్ నిఘా ఉంటుంది. ఈ విధానం డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది. జీపీఎస్ పరికరాలు ఎక్కడ అమర్చారనేది కూడా తెలుసుకోవటం కష్టం. ఈ విధానం ద్వారా పూర్తిగా పారదర్శకంగా ఎటువంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తాం. ఎవరైనా కాపీయింగ్‌కు ప్రయత్నించినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. సంబంధిత సెంటర్ల సూపర్వైజర్లను బాధ్యుల్ని చేసి సస్పెండ్ చేస్తారు. అందుకే సూపర్వైజర్లుగా ప్రభుత్వ శాఖలకు చెందినవారిని మాత్రమే నియమిస్తున్నాం. -
పరీక్షకు సిద్ధం
పదవాల్తేరు, ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మూడేళ్లుగా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలుస్తున్న విశాఖ జిల్లాను ఈ దఫా కూడా అదే స్థాయి లో నిలపడానికి విద్యార్థులు సమాయత్తమయ్యారు. ఉజ్వల భవి ష్యత్తుకు మేలి మలుపుగా పరిగణించదగ్గ పరీక్షలకు అధ్యాపకుల అండతో సమాయత్తమైన వారు తమ సత్తా చూపడానికి సంసిద్ధులవుతున్నారు. ఈనెల 12 నుంచి 26 వరకు జరగ నున్న ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 301 జూనియర్ కళాశాలల నుంచి మొత్తం 1,00,895 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అర్బన్‌లో 56, రూరల్‌లో 39, ఏజెన్సీలో 16 మొత్తం 111 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 19 పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా నిఘా పెట్టారు. పరీక్ష ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు అరగంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి. 8.45 గంటల తర్వాత పరీక్షలకు వచ్చే అభ్యర్థులు లేట్ రిజిస్టర్లో ఆలస్యానికి కారణం రాసిన తర్వాతే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. 9 గంటలు దాటితే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎల్.జె.జయశ్రీ చెప్పారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, అయిదు సిటింగ్ స్క్వాడ్లు, ఆర్ఐవో, డీవీఈవో బృందాలు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తాయని ఆమె తెలిపారు. -
కాపీయింగ్‌కు చెక్
ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని అమలుచేస్తోంది ఇంటర్‌బోర్డు. సాంకేతిక పరిజ్ఞానంతో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న కొన్ని కళాశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతోంది. అన్ని ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్), సెల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనున్నారు. ధర్మపురి పరీక్ష ప్రారంభమైన క్షణాల్లోనే ప్రశ్నపత్రం బయటపడుతోంది. సెల్ఫోన్ల ద్వారా ప్రశ్నలు బయటకు చేరవేస్తూ మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఈ దందాకు పాల్పడుతూ ర్యాంకులు తెచ్చుకుంటున్నాయి. కొన్ని కళాశాలలను మచ్చిక చేసుకుని వేల కొలది ముడుపులు చెల్లించి ర్యాంకులపంట పండించుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీని ఫలితంగా కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఇంటర్‌బోర్డు చర్యలు ప్రారంభించింది. జీపీఎస్ విధానం ద్వారా సెల్ ట్రాకింగ్ విధానం అందుబాటులోకి తెచ్చి మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. 12 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలను ఈ విధానంలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లకు, ఇతర అధికారులకు సమాచారం అందించారు. పనితీరు ఇలా.. ప్రతీ ఇంటర్ పరీక్ష కేంద్రంలో జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో ఉన్న ఇంటర్‌బోర్డుకు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా ఆ సెంటర్‌కు వంద మీటర్ల దూరంలో ఉన్నవారు సెల్ఫోన్ల ద్వారా ఎవరెవరకు మాట్లాడుతున్నారనే సమాచారం ఇంటర్‌బోర్డుకు అందుతుంది. ఇలా ఏ సెంటర్లో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. దీంతో లీక్ వీరుల బండారం బయటపడుతుంది. ప్రశ్నలు బయటకు చేరకుండా, పరీక్ష కేంద్రాల్లో మాస్‌కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు బోర్డు ఈ సరికొత్త విధానాన్ని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా ప్రతిభగల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. మాస్ కాపీయింగ్ అరికట్టేందుకే... : రమేశ్‌బాబు, ఆర్ఐవో గతంలో పరీక్ష పత్రాలు లీకైన సంఘటనలున్నాయి. పరీక్ష కేంద్రాలకు దగ్గర్లో జిరాక్స్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడేవారు. వాటిని అరికట్టడానికే ఇంటర్ బోర్డువారు సెల్‌ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో అధికారులు, ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లలో మాట్లాడినా కఠినచర్యలుంటాయి. -
మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే డిస్మిస్
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ పరీక్షలో ఇన్విజిలేటర్లు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే డిస్మిస్ చేస్తామని జిల్లా ఇంటర్మీడియెట్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఫజలుల్లా పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వహణపై డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్షలను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంకు అనుసంధానం చేశామన్నారు. 43 ప్రభుత్వ కళాశాలలు, 41 ప్రైవేటు కళాశాలలు, 6 ట్రైబల్ , 1 మోడల్, 5 సాంఘిక సంక్షేమ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పది సిట్టింగ్, నాలుగు ఫ్లైయింగ్, ఒకటి హైపవర్ కమిటీ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నపత్రాల నిల్వకు 42 పోలీస్స్టేషన్లు ఎంపిక చేశామన్నారు. పరీక్ష నిర్వహించే డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు 7వ తేదీన సంబంధిత పరీక్ష కేంద్రాల్లో నియామకం కావాలన్నారు. వీరికి మాత్రమే కేంద్రంలో సెల్‌ఫోన్ అనుమతి ఉంటుందని, ఇన్విజిలేటర్లకు అనుమతి లేదన్నారు. 7,8,9 తేదీల్లో ప్రశ్నపత్రాలు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందుతాయన్నారు. జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షకు 24,493, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 23,274, ప్రైవేటుగా 4,916 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అదేవిధంగా వొకేషనల్ ప్రథమ పరీక్షకు 3,350, ద్వితీయ సంవత్సరానికి 3,931, ప్రైవేటుగా 610 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆర్ఐవో ఫజలుల్లా వివరించారు. సాఫీగా జరిగేలా చూడాలి కాగజ్‌నగర్ : ఇంటర్మీడియెట్ పరీక్షలు సాఫీగా జరిగేలా చూడాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఫజలుల్లా అ న్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు గణేశ్‌కుమార్, జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
టెన్త్‌లో మాస్‌కాపీయింగ్ లేకుండా చర్యలు
కలెక్టర్ స్మితాసబర్వాల్ జిన్నారంలోని జెడ్పీహెచ్ స్కూల్, గురుకుల పాఠశాలల సందర్శన జె డ్పీహెచ్ఎస్లో పదోతరగతిలో ఉత్తీర్ణతాశాతం తగ్గుదలపై కలెక్టర్ ఆగ్రహం జిన్నారం, న్యూస్‌లైన్: పదోతరగతిలో మాస్‌కాపీయింగ్ లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు కష్టపడి చదవాలని, అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ సూచించారు. జిన్నారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణతాశాతం తక్కువగా ఉండటంతో మంగళవారం కలెక్టర్ స్మితాసబర్వాల్ పాఠశాలను సందర్శించారు. పదోతరగతిలో ఉత్తీర్ణతాశాతం ఎందకు తగ్గుతుందని కలెక్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్‌నాయక్, ఎంఈఓ ప్రకాశ్‌లను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోనే అట్టడుగు స్థాయిలో జిన్నారం పాఠశాల రెడ్‌జోన్‌లో ఎందుకుందని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఉపాధ్యాయుల పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, ఉపాధ్యాయులు విద్యను అందిస్తున్న తీరును తెలుసుకున్నారు. సీ కెటగిరికి చెందిన విద్యార్థులను ఎందుకు అడాప్షన్ చేసుకోవటం లేదని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. మీరు ఏంచేస్తారో నాకు తెలియదు, ఈ ఏడాది మాత్రం ఉత్తీర్ణతాశాతాన్ని పెంచే విధంగా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. చిట్టీలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, చిట్టీలపై విద్యార్థులు ఆశలు పెట్టుకోవద్దని కలెక్టర్ సూచించారు. అనంతరం జిన్నారంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ స్మితాసబర్వాల్ సందర్శించారు. అర్దవార్షిక పరీక్షల్లో 40మంది విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటయ్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరైన విద్యనుఅ ందించే విదంగా ఉపాధ్యాయులు కష్టపడాలని సూచించారు. పదోతరగతి పరీక్షలకు మరో 50 రోజుల సమయం ఉన్నందును విద్యార్థులను పరీక్షలకు సన్నద్దం చేయాలని సూచించారు. పదోతరగతిలో విద్యార్థులు కష్టపడి చదవాలని కలెక్టర్ సూచించారు. మరో పదిరోజుల్లో జిన్నారంలో పర్యటిస్తానని, అప్పుడు విద్యార్థుల్లో మార్పు కనిపించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో తెలుసుకునే విధంగా ఎంపీడీఓ, తహశీల్దార్లు పాఠశాలలను సందర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ స్మితాసబర్వాల్ వెంట మెదక్ ఆర్డీవో వనజాదేవీ, జిన్నారం ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ ప్రకాశ్ తదితరులు ఉన్నారు. 28పిటిసి15 : జిన్నారం : జిన్నారంలోని జెడ్పీపాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ 28పిటిసి15ఏ : జిన్నారం : జిన్నారంలోని జెడ్పీ పాఠశాలలో ఉత్తీర్ణతాశాతం ఎందుకు తగ్గుతుందని ఎంఈవో, పాఠశాల ప్రధానోపాద్యాయుడిని ప్రశ్నిస్తున్న కలెక్టర్ 28పిటిసి15బీ : జిన్నారం : జిన్నారంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నతీరుపై వైస్ప్రిన్సిపల్తో మాట్లాడుతున్న కలెక్టర్ -
చూసెయ్..రాసెయ్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దూర విద్యా విధానంలో వివిధ యూనివర్సిటీల పోస్టు గ్రాడ్యుయేషన్ పరీక్షలు కాసులు కురిపిస్తున్నాయి. హోదా కోసమో, ప్రమోషన్ కోసమో పరీక్ష రాసే అభ్యర్థుల అవసరమే పెట్టుబడిగా యేటా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డీడీలు సృష్టించడంలో జిల్లాలో సిద్ధహస్తులుగా పేరొందిన కొందరు వ్యక్తులు ‘చూచిరాత ముఠా’గా తయారయ్యారు. స్టడీ సెంటర్ల మాటున వీరు చేస్తున్న ఆగడాలకు యూనివర్సిటీ వర్గాలు కూడా అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.శ్రీ వెంకటేశ్వర, నాగార్జున ఇలా యూనివర్సిటీ యేదైనా జిల్లాలో వాటికి అనుబంధంగా ఉండే అధ్యయన కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. అడ్మిషన్లు మొదలుకుని పరీక్షల నిర్వహణ వరకు వ్యవహారమంతా అక్రమ పద్ధతుల్లో సాగుతోంది. తాజాగా జిల్లాలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తున్న పీజీ పరీక్షలు అక్రమాలకు ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి పరీక్ష ఫీజుతో పాటు మరో రూ.2 వేలు అక్రమంగా వసూలు చేసినట్లు సమాచారం. పరీక్ష కేంద్రంలోనే చూచిరాత సౌకర్యం కల్పిస్తే అభ్యర్థులు రెండు వేలు చెల్లించాలి. కొందరు అభ్యర్థులు ఇళ్ల వద్దకే ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలు తీసుకెళ్లాలంటే ఒక్కో పేపర్‌కు రూ.2 వేల నుంచి రూ.5 వేల అధ్యయన కేంద్రం నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీ వెబ్సైట్ ప్రకారం జిల్లాలో సిద్దిపేట, తూప్రాన్, గజ్వేల్, జహీరాబాద్‌లో అధ్యయన కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో సుమారు సుమారు రెండు వేలకు పైగా అభ్యర్థులు పీజీ కోర్సుల కోసం నమోదైనట్లు అంచనా. ఎనిమిదేళ్లుగా ఇదే రీతిలో పరీక్షల నిర్వహణ కొనసాగుతున్నా సంబంధిత యూనివర్సిటీలు తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉంటాయి. అధ్యయన కేంద్రాల నిర్వహకులు పరీక్షలు సరిగా నిర్వహించేలా చూడాల్సిన యూనివర్సిటీ పరిశీలకులు ‘మేనేజ్’ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. సిద్దిపేట కేంద్రంగా కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు పొరుగు రాష్ట్రాల యూనివర్సిటీల సర్టిఫికెట్లు సరఫరా చేసినట్లు ఓ ప్రైవేటు విద్యా సంస్థ నిర్వాహకుడిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అదే వ్యక్తి సిద్దిపేట కేంద్రంగా ‘చూచిరాత ముఠా’ను నడుపుతున్నారు. తూప్రాన్‌లోనూ ఇదే పరిస్థితి తూప్రాన్ స్టడీ సెంటర్లో ఎస్వీ యూనివర్సిటీ పీజీ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించినా మాస్ కాపీయింగ్ జోరు కనిపిస్తోంది. గతంలో నకిలీ డీడీలను సృష్టించిన కేసు ఎదుర్కొన్న ఓ వ్యక్తి తూప్రాన్ కేంద్రంగా ప్రస్తుతం పీజీ పరీక్షల చూచిరాత వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ వర్గాలను మేనేజ్ చేస్తున్నందున ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభ్యర్థులకు స్వయంగా భరోసా ఇస్తున్నాడు. సిద్దిపేటలో నాగార్జున యూనివర్సిటీ అధ్యయన కేంద్రం నిర్వహిస్తున్న సంస్థపైనా గతంలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు వచ్చాయి. పోలీసులు, అధికారులు దృష్టి సారిస్తే తప్ప ‘చూచిరాత ముఠా’ అక్రమాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదు.