nagaraju
-
దారి దోపిడీ కేసులో ‘పురం’ టీడీపీ నాయకుడు అరెస్టు
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న టీడీపీ నాయకుడు సడ్లపల్లి నాగరాజు, మరో ముగ్గురు అతడి అనుచరులు గంగాధర్, శివకుమార్, వెంకటేష్‌ను హిందూపురం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డీఎస్పీ మహేష్ వివరాలు వెల్లడించారు. ఇటీవల బైక్‌పై ఓ చిరు వ్యాపారి ఒంటరిగా వెళుతున్న సమయంలో నాగరాజు, అతని అనుచరులు దౌర్జన్యంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అతని అకౌంట్లోని రూ.33 వేలు ఫోన్‌పే ద్వారా వారి ఖాతాలకు జమ చేసుకున్నారు.ఈ విషయంపై బాధితుడు హిందూపురం రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి.. సడ్లపల్లి నాగరాజు,అతని అనుచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, నాలుగు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో..దారిదోపిడీ కేసులో అరెస్టయిన టీడీపీ నాయకుడు నాగరాజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతే కాకుండా పలుమార్లు మంత్రి లోకేశ్‌ను కూడా కలిశాడు. -
తమ్ముళ్లు, అనుయాయులే ఎమ్మెల్యేలు
సాక్షి, నరసరావుపేట: వాళ్లు ఎంపీలో, ఎమ్మెల్యేలో కాదు.. కనీసం పంచాయతీ వార్డు మెంబర్లు కూడా కాదు. అయినా వారిదే ఆ నియోజకవర్గంలో పెత్తనం. మరి వారికున్న అర్హతలేమిటంటే.. సదరు ప్రజాప్రతినిధి వారసులు, సోదరులు, బంధువులు, ఆత్మీయులు కావడమే. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ ప్రభుత్వ పథకాలు మొదలు.. పదవులు, కాంట్రాక్టులు అన్నింటిలోనూ జోక్యం చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. అందినకాడికి దోచుకుని దాచుకుంటున్నారు. ఈ పరిస్థితి పల్నాడు జిల్లాలో మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ముగ్గురు షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కుమారులు కన్నా నాగరాజు, కన్నా ఫణీంద్రలు అంతా తామే అంటూ అధికారం చెలాయిస్తున్నారు. భూముల సెటిల్మెంట్లు, మద్యం దందా.. ఇలా అన్నింటికీ రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రతి పనికి కప్పం కట్టాల్సిందేనని లావాదేవీలు చేస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరితోపాటు ఎన్నికల సమయంలో ఆరి్థక వ్యవహారాలు చూసుకున్న కాంట్రాక్టర్ దరువూరి నాగేశ్వరరావు కూడా ఇప్పుడు అన్నీ తానై షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తమ్ముడు నవీన్ చిన్న ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ప్రవీణ్ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుంటే నవీన్ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నాడు. ఇసుక రీచ్‌ల వద్ద అనధికార టోల్గేట్లు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమరావతి మండలంలో ఎర్రమట్టి దందా ఇతని కనుసన్నల్లోనే సాగుతోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లను తొలగిస్తున్నారు. మద్యం సిండెకేట్, బెల్టు షాపుల వ్యవహారం అంతా ఈయన చెప్పినట్లే సాగుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.మాజీ ఎమ్మెల్యేనా మజాకా! వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును ‘మూడు రోజుల ఎమ్యెల్యే’ అని నియోజకవర్గ ప్రజలు పిలుస్తున్నారు. వారంలో ఆయన గరిష్టంగా నియోజకవర్గంలో మూడు రోజులే ఉంటారు. మిగిలిన నాలుగు రోజుల్లో సొంత వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఆ సమయంలో నియోజకవర్గంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా చేపల చెరువులన్నింటిని ఈయన తన గుప్పిట్లో పెట్టుకున్నారని.. రియల్ ఎస్టేట్ వెంచర్లకు అక్రమంగా మట్టి తోలడం, భూకబ్జాలు, నచ్చని వారిపై అక్రమ కేసులు, వేధింపులు ఇతని కనుసన్నల్లోనే జరుగుతున్నాయని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబుకు అల్లుడు వరసయ్యే విజయ్ అంతా తానై నడిపిస్తున్నాడు.గ్రావెల్‌కు అధిక ధర నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4 వేలు ఉన్న టిప్పర్ మట్టికి ప్రస్తుతం రూ.6,500 వరకు వసూలు చేస్తున్నారు. కోటప్పకొండను అక్రమ గ్రావెల్‌కు అడ్డాగా మార్చారని, పోలీసులను అడ్డుపెట్టుకుని పంచాయితీలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ వారే విమర్శిస్తున్నారు. చిలుకలూరిపేటలో అయితే అంతా ‘అమ్మ’గారి దయేనని చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేరుకేనని, అంతా ఆయన భార్యదే పెత్తనమని చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ఒకే మాట చెబుతున్నారు. అధికారులంతా ఆమె సేవలోనే తరిస్తున్నారని విమర్శిస్తున్నారు. -
మానవత్వమా.. కళ్లు మూసుకో!
నూజివీడు: టీడీపీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికార జులుంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన అచ్చి నాగరాజు సోమవారం మద్యం తాగి అదే గ్రామ టీడీపీ అధ్యక్షుడు అన్నే సురేష్‌కు ఫోన్ చేసి దూషించాడు. దీంతో సురేష్.. మరో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు పోలవరపు శివరామకృష్ణ, కారుమంచి రాజు, కారుమంచి కిరణ్‌లతో కలిసి నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా నాగరాజును తాళ్లతో బంధించి.. తీవ్రంగా దుర్భాషలాడుతూ ఈడ్చుకెళుతూ కారులో వేసుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే నాగరాజును తాళ్లతో నిర్బంధించి ఈడ్చూకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాపశివకిషోర్ దృష్టికెళ్లింది. అమానవీయంగా ప్రవర్తించిన నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు రూరల్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్బాబులు నలుగురినీ అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. -
ఇది కథ కాదు.. వచ్చినట్టే వచ్చి.. శాశ్వతంగా దూరం
బి.కొత్తకోట: మూడేళ్ల వయసులో అదృశ్యమైన బిడ్డ.. 14 ఏళ్ల తర్వాత తల్లిండ్రుల వద్దకు చేరాడు. బిడ్డను చూసుకుని మురిసిపోతున్న ఆ తల్లిదండ్రుల నుంచి రెండేళ్ల తరువాత శాశ్వతంగా దూరమయ్యాడు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన శంకర, రెడ్డెమ్మ దంపతులకు ఆకాశ్, అభిలాష్ ఇద్దరు కుమారులు. 2008లో పెద్దకొడుకు ఆకాశ్ మూడేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆచూకీ లభించలేదు. కాగా.. ఆకాశ్‌ను బెంగళూరులో ఉంటున్న రత్నమ్మ అనే మహిళ పెంచుకుంది. మూడేళ్లు పెంచుకున్నాక ఆమె మదనపల్లె మండలం కొత్తపల్లెలో ఉంటున్న ఆటో డ్రైవర్ నాగరాజు, లలితమ్మ దంపతుల వద్దకు ఆకాశ్‌ను పంపించింది. వాళ్లే ఆకాశ్‌ను పెంచుతూ వచ్చారు. ఆ తర్వాత నాగరాజు కుటుంబం నాయనబావికి మకాం మార్చింది. ఆ బిడ్డ.. మీ బిడ్డే.. ఆకాశ్ తల్లి రెడ్డెమ్మ చెల్లెలు మంజు బెంగళూరులో ఉంటూ కూలి పనులకు వెళ్తోంది. ఓ రోజు ఆకాశ్‌ను మూడేళ్ల పాటు పెంచిన రత్నమ్మ, మంజు కూలీ పనుల్లో కలుసుకున్నారు. మూడేళ్ల వయసులో అదృశ్యమైన పిల్లాడు దొరికాడా అని మంజును ఆరా తీసింది. లేదని మంజు చెప్పడంతో రత్నమ్మ అసలు విషయం చెప్పింది. నాగరాజు దంపతులు ఆ బిడ్డను తెచ్చి తనకు ఇచ్చారని, మళ్లీ వారికే ఇచ్చినట్టు తెలిపింది. ఈ విషయాన్ని మంజు తన అక్క రెడ్డమ్మకు ఫోన్ చేసి చెప్పింది. బిడ్డను తెచ్చుకునేందుకు తల్లి రెడ్డెమ్మ ఆటోడ్రైవర్ నాగరాజు వద్దకు వెళ్లగా.. ఆకాశ్ నీ బిడ్డ అనేందుకు ఆధారమేంటని గ్రామ పెద్దలు ప్రశ్నించారు. వాడి నాలుకపై పుట్టు మచ్చ ఉంటుందని రెడ్డెమ్మ చెప్పింది.తల్లి చెప్పినట్టే ఆకాశ్ నాలుకపై పుట్టుమచ్చ ఉంది. తల్లి వద్దకు వెళ్లేందుకు మొదట్లో ససేమిరా అన్న ఆకాశ్.. రెండేళ్ల క్రితం తల్లిదండ్రుల ఇంటికి వచ్చేశాడు. ఇప్పుడు ఆకాశ్ వయసు 19. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వినాయక ఉత్సవాల్లో నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృత్యుఒడికి చేరాడు. -
పల్నాడులో మళ్లీ పేట్రేగిన టీడీపీ మూకలు..
సాక్షి, నరసరావుపేట, వినుకొండ (నూజెండ్ల): అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఎన్నికల హామీలపై ఏమాత్రం దృష్టిపెట్టని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి సర్కారు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని మాత్రం అనుకున్నది అనుకున్నట్లుగా పక్కాగా అమలుచేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి వైఎస్సార్సీపీ సానుభూతిపరులను హత్యచేయడం, వారిపై దాడులకు తెగబడడం, ఆస్తులు ధ్వంసం చేసి గ్రామాల నుంచి వెళ్లగొట్టడం పల్నాడులో సర్వసాధారణమయ్యాయి. చివరికి సొంత ఊర్లో ఇళ్లు, పొలాలు వదిలి పొట్టకూటి కోసం వలస వెళ్లి చిన్నచిన్న పనులు చేసుకుంటున్న వారిని సైతం వెంటాడి కిడ్నాప్ చేసి అంతమొందించడానికి తెలుగుదేశం పార్టీ గూండాలు వెనుకాడడంలేదు. తాజాగా.. వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు ఆటోలో వెళ్తుండగా టీడీపీ నేతలు దారికాచి దాడిచేశారు. అందులోని అతని కుటుంబ సభ్యుల్ని గాయపరిచి నాగరాజును కిడ్నాప్ చేయడం తీవ్ర అలజడి రేపింది. పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని నాగరాజును పోలీసుస్టేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి నాగరాజు బావమరిది రవి తెలిపిన వివరాలు ఏమిటంటే..వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన నాగరాజు కుటుంబ సభ్యులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సొంత గ్రామం జంగమేశ్వరపాడు గ్రామాన్ని విడచిపెట్టి వినుకొండలోని తన బావమరిది రవి వద్దకు వచ్చి ఉంటున్నారు. బతుకుతెరువు కోసం ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఈ నేపథ్యంలో.. నాగరాజు తన తల్లి వెంకమ్మ, బావమరిది రవితో కలిసి గురువారం ఉ.8.30 ప్రాంతంలో వెల్లటూరు వైపు వెళ్తుండగా వెంకుపాలెం కురవ వద్దకు రాగానే టీడీపీ నేతలు కారుతో ఆటోను అడ్డగించారు. కారులో వచ్చిన సుమారు 8 మంది రవిపై కత్తులతో దాడిచేసి గాయపరిచారు. ఆ తర్వాత నాగరాజు తల్లిపైనా దాడిచేసి నాగరాజును బలవంతంగా కారులో ఎక్కించుకుని వెల్లటూరు వైపు దూసుకెళ్లారు. కిడ్నాప్ చేసింది జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ నేతలే అని నాగరాజు కుటుంబ సభ్యులు నిర్థారించారు.అందరూ చూస్తుండగానే..పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కత్తులతో స్వైరవిహారం చేస్తూ నాగరాజును కిడ్నాప్ చేయడంతో వినుకొండ ప్రాంతంలో అలజడి రేగింది. అక్కడున్న స్థానికులు దాడిలో గాయపడిన రవి, నాగరాజు తల్లి వెంకాయమ్మలను వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న నాగరాజు భార్య, నాగమల్లేశ్వరి, చెల్లెళ్లు భువనేశ్వరి, రజనీలతోపాటు నాగరాజు తండ్రి సాంబయ్య నాగరాజును చంపేస్తారని, కాపాడాలంటూ భోరున విలపించారు. ఆ టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారు..నాగరాజు తండ్రి సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ.. జంగమేశ్వరపాడుకు చెందిన టంగుటూరి శబరి కుమారుడు మల్లికార్జున, కొండా, ఆరెద్దుల మణి, కంచర్ల బొర్రయ్య కుమారుడు రామాంజి, నానారావు కుమారుడు జల్లయ్యతోపాటు మరో ముగ్గురు తన కుమారుడిని కిడ్నాప్ చేశారని తెలిపారు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద నాగరాజు భార్య సొమ్మిసిల్లి పడిపోయింది. ఆస్పత్రి ఆవరణలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బతుకుతెరువు కోసం, ప్రాణాలు కాపాడుకునేందుకు గ్రామంలో పొలాలు, ఇళ్లు వదలేసి దూరంగా బతుకుతున్నప్పటికీ టీడీపీ నేతలు తమను ఇక్కడ కూడా బతకనివ్వడంలేదని వాపోయారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుల పట్టివేత..నాగరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినుకొండ సీఐ శోభన్‌బాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్ల సిగ్నల్ ఆధారంగా నిందితులను బొల్లాపల్లి మండలం మర్రిపాలెం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడిలో ఏడుగురు పాల్గొనగా ఆరుగురిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు.. బాధితుడు నాగరాజును రక్షించిన పోలీసులు బొల్లాపల్లి స్టేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.కత్తులతో దాడిచేసి కిడ్నాప్ చేశారు..కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా బావ నాగరాజు కుటుంబం టీడీపీ దాడులకు భయపడి వినుకొండలో నా వద్దకు వచ్చి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. అయినాసరే వదిలిపెట్టకుండా గురువారం ఉదయాన్నే కత్తులతో దాడిచేసి గాయపరిచారు. అడ్డొచ్చిన మహిళలపై కూడా దాడిచేసి నాగరాజును కారులో ఎక్కించుకుని పరారయ్యారు. నా ఫోన్‌ను సైతం లాక్కెళ్లారు. – రవి, దాడిలో గాయపడిన నాగరాజు బావమరిదినాగరాజుకు ఏం జరిగినాబాబుదే బాధ్యతమాజీమంత్రి అంబటి ఫైర్సాక్షి, అమరావతి: పల్నాడులో టీడీపీ గూండాలు కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజుకు ఎలాంటి హాని జరిగినా చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీమంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. పల్నాడులో నాగరాజు కిడ్నాప్‌పై ఆయన తీవ్రంగా స్పందించారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితను ప్ర శ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాగరాజుకు ఏమైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి. రాష్ట్రంలో ఎంత దారుణమైన ఘటనలు జరుగుతున్నా యో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే వినుకొండలో ఓ వైఎస్సార్సీపీ కార్యకర్తను అతి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనలపై చంద్రబాబు స్పందించాలన్నారు. మాజీమంత్రి మేరుగ నాగార్జున పాల్గొన్నారు.పోలీసులు చేతులేత్తేశారు: కొరముట్లరాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడే అంశంలో పోలీసులు పూర్తిగా చేతులేత్తేశారని, కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేసేందుకే అన్నట్లుగా వారి ప్రవర్తన ఉందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు తాడేపల్లిలో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. మొన్న వినుకొండ, నిన్న నంద్యాల, జగ్గయ్యపేట ఘటనలు జ రగ్గా ఈరోజు కిడ్నాప్ జరగడం అత్యంత దారుణమన్నారు. జగన్‌కి ఎక్కువ భద్రత ఉన్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
Nagaraju Incident in Palnadu: రంగంలోకి 6 స్పెషల్ టీంలు..
-
నాగరాజుకు ఏమైనా హానీ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి: అంబటి రాంబాబు
-
పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్
-
దళితుడిపై ‘దేశం’ నేతల దాడి
సాక్షి టాస్‌్కఫోర్స్: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. మాజీ వలంటీర్ దళితుడైన నాగరాజును కులం పేరుతో దూషించి దాడిచేశారు. అతడు కౌలుకు సాగుచేసిన మొక్కజొన్న పంట పొలాన్ని దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు తెలిపిన మేరకు.. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత నాగరాజు వలంటీర్ ఉద్యోగం పోయింది. దీంతో వ్యవసాయం చేసుకుందామనుకున్న నాగరాజు గ్రామంలోని కొత్తింటి రామ్మోహన్, రుద్రగౌడులకు చెందిన ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాడు. ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆదివారం అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు గాజుల పెద్ద ఎర్రిస్వామి, చిన్న ఎర్రిస్వామి, వారి కుమారులు.. అనంతపురం నుంచి మరికొందరిని తీసుకొచ్చి నాగరాజు సాగు చేసిన మొక్కజొన్న పంటను హొన్నూరు అలియాస్ హరి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌తో దున్నేశారు. పంటను నాశనం చేయవద్దని బాధితుడు కాళ్లావేళ్లాపడినా కరుణించలేదు. పొలంలోనే తీవ్రంగా కొట్టారు. పొలం తగాదాలుంటే మీరూమీరూ చూసుకోవాలని, పంటను నాశనం చేయవద్దని వేడుకున్నా వినలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం మాది.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ దాడిచేశారని తెలిపాడు. తనకు జరిగిన అన్యాయంపై పాల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పాడు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలి నాగరాజును కులం పేరుతో దూషించి, దాడిచేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు కెంగూరి ఎర్రిస్వామి డిమాండ్ చేశారు. దళితుడి పంటను దౌర్జన్యంగా దున్నేయడం దారుణమని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. -
‘లద్దాఖ్’ మృతుల్లో పెడన జవాను
పెడన: సైనిక విన్యాసాల్లో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ సమీపంలోని నదిని దాటుతున్న యుద్ధట్యాంకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో మృతిచెందిన ఐదుగురిలో కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన జవాను సాదరబోయిన నాగరాజు (32) ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి (47) మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు.ఎనిమిదేళ్ల కిందట ఇంటర్ పూర్తయిన తరువాత నాగరాజు ఆర్మీలో చేరారు. నాగరాజుకు 2019 అక్టోబర్‌లో తేలప్రోలుకు చెందిన మంగాదేవితో వివాహమైంది. మంగాదేవి పెడన మండలం ఉరివి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏడాది వయసున్న కుమార్తె హాసిని ఉంది. భర్త మరణ వార్త విన్నప్పటి నుంచి మంగాదేవి ఉలుకుపలుకు లేకుండా ఉందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగరాజు తల్లిదండ్రులు వెంకన్న, ధనలక్షి్మ. నాగరాజుకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో సెలవులకు ఇంటికి వచి్చన నాగరాజు ఆర్మీ జవానుగా పనిచేస్తున్న తన తమ్ముడు శివయ్య కుమార్తెకు అన్నప్రాశన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నాగరాజు తిరిగి విధులకు హాజరయ్యారు. నేడు స్వగ్రామానికి మృతదేహం నాగరాజు మృతదేహం సోమవారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంటుందని మిలటరీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారని పెడన ఎస్ఐ టి.సూర్యశ్రీనివాస్ చెప్పారు. ఆయన ఆదివారం నాగరాజు ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. నాగరాజు మృతదేహం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేవేండ్ర గ్రామానికి చేరుకుంటుందని ఎస్ఐ తెలిపారు. సోమవారం సాయంత్రంలోగా సైనిక లాంఛనాలు, స్థానిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు. -
సంచార సన్నాయి..
చినపోలమ్మ జాతర.. కనులపండుగ్గా జరుగుతోంది. ఊక పోస్తే ఊక రాలనంత జనం. ఆడవాళ్ళంతా తల మీద ఘటాలతో ఊగిపోతున్నారు. మగవాళ్ళంతా కోళ్లు, గొర్రెలు పట్టుకొని ముందుకు సాగిపోతున్నారు. డప్పుల మోతలు.. యువకుల చిందులు.. కలగలుపుగా ధూళి రేగుతూ జాతర ఘనంగా జరుగుతోంది.కిట్టడు మహా గొప్పగా, చాలా నేర్పుగా గాల్లోకి తారాజువ్వలు వదులుతున్నాడు. వాడు వదిలిన తారాజువ్వ సాయంత్రపు నీరెండలో ఇంద్రధనుస్సు రంగులను తలపిస్తోంది. ‘బాణసంచా కట్టాలంటే కిట్టడే కట్టాల! వాటిని మళ్ళీ వాడే వదలాల..’ జనం కిట్టడిని ప్రశంసలతో ముంచుతున్నారు. అందరి నోట కిట్టడే నానుతున్నాడు. రకరకాల బాణసంచా పేల్చి కిట్టడు తన ప్రతిభను చాటుకుంటున్నాడు.ఊరంతా సంబరంగా పొలిమేరకు చేరుకుంది. కిట్టడు కట్టిన బాణసంచలో అసలైంది నాగుపాము మందుగుండు. వెదుర్లతో పెద్ద ఎత్తున పాము ఆకారంలో కట్టి దానికి మందుగుండు జతచేసి కాల్చడానికి సిద్ధంగా ఉంచాడు. జనాలంతా తమ మొక్కులు చెల్లించుకుని, కిట్టడు కట్టిన నాగుపాము బాణసంచా కోసం ఆత్రుతగా ఎదురు చూడసాగారు. కిట్టడు దానిని వెలిగించడానికి వెళ్ళాడు. వత్తి ఎంత ముట్టిస్తున్నా వెలగడం లేదని రెండు మూడుసార్లు వెలిగించే ప్రయత్నం చేసి దాన్ని వదిలేసి వేరే దగ్గర ముట్టిద్దామని మరొక వత్తిని వెతికే పనిలో పడ్డాడు.ఇంతలోపు విధి వక్రించిట్టుగా ముందు ముట్టించిన వత్తి వేడికి నెమ్మదిగా రాజుకొని అంటుకుంది. అది గమనించి అక్కడ నుంచి కిట్టడు వెళ్ళేలోపే అందరూ ఊహించని ప్రమాదం జరిగింది. బాణసంచా వెలిగి నాగుపాము పగబట్టినట్లుగా కిట్టడి మీద విరుచుకు పడింది. నల్లగా బలంగా ఉన్న కిట్టడు.. శరీరం కాలిపోయి కమిలిపోయి నెత్తురోడి పడి ఉన్నాడు.‘గంగిరెద్దోలమయ్య మేము.. గరీబోలమయ్యా.. ఊరు వాడ తిరిగేము మేము గూడు లేక ఉన్నాము’ అనే పాటని సన్నాయి రాగంతో వీధిలో ఇంటింటికీ వెళ్ళి వినిపిస్తున్నాడు బసవన్న. కొంతమంది బియ్యం వేశారు. అయినా చాలామంది ఇళ్లల్లో టివీలు చూసుకుంటూ ‘చెయ్యోటం కాదు..’, ‘మళ్ళీ రా..’, ‘పనిలో ఉన్నాను..’ అనే మాటలే జోలిలో బియ్యం కన్నా ఎక్కువ వినిపించాయి. బసవన్న దిగులుగా ఊరు చివర బడి పక్కనున్న మర్రిచెట్టు నీడలో ఏర్పాటు చేసుకున్న గుడారం వైపు అడుగులు వేశాడు. చెట్టు దగ్గరకు చేరుకొని ఎద్దును చెట్టు మొదలకు కట్టి, దాని ముందు ఎండు గడ్డి పరకలు వేసి అక్కడే చతికిలపడ్డాడు. చెట్టు ఆకుల సందుల్ని చీల్చుకొని వస్తున్న ఎండ బసవన్న శరీరం మీద పడుతూ తన తాపాన్ని చూపించింది. ఒక్కసారిగా బసవన్నకు తన గతం గుర్తుకొచ్చింది..ఒకప్పుడు ఎద్దును పట్టుకొని బసవన్న వీధిలోకి వెళ్తే జోలి నిండిపోయేది. సంక్రాంతి సమయంలో మంచి గాత్రంతో బసవన్న పాడుతుంటే ప్రతివాళ్ళు తమ గురించి పాడించుకొని తమకు తోచింది తృణమో పణమో ఇచ్చేవారు. కాలం పగబట్టిన పాములా మారింది. మనుషులంతా ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలైపోయారు. ఎవరూ తమ జాతివారిని పట్టించుకోకపోగా అనుమానంగా, అవమానంగా చూడడం బసవన్నలో మరింత దిగులును పెంచింది.‘మాలాంటి గంగిరెద్దులోళ్ళు ఈదిలోకి వస్తున్నారంటే సాలు సిన్న పిల్లల్ని, కొత్త కోడల్ని దాసిపెట్టేత్తనరు. మేమేదో సిల్లంగి పెట్టేత్తామేమోనని భయపడతన్రు.. ఊరు ఊరు తిరుగుతూ జనాలని పొగిడి వాళ్లిచ్చే బియ్యం, డబ్బులు పుచ్చుకొని బతకడమే తెలుసును గానీ వాళ్ళ దయాభిక్ష మీద బతుకుతూ వాళ్ళకి ఎలా హాని తలపెడతామనుకుంతున్నారో’ అనే ఆలోచన బసవన్నలో మరింత అభద్రతా భావాన్ని పెంచి గోరుచుట్టు మీద రోకలి పోటులా అనిపించింది.ఎండ నడినెత్తికి ఎక్కింది. ఆలోచనల్లో నుంచి బసవన్న బయటికి వచ్చాడు. ఉదయాన్నే బొట్టుబిళ్లలు, కాటుకలు, పిన్నీసులు, తిలకాలు, అద్దాలు, పైన్లు (దువ్వెన్లు) అమ్ముకొద్దామని వెళ్లిన సోములమ్మ నిరుత్సాహంగా గుడారానికి చేరుకొంది. గబగబా గిన్నెలు కడిగి పొయ్యి మీద ఎసరు పెట్టింది. చెట్టుకానుకొని ఉన్న బడిలో మాస్టారు పిల్లలకి చెబుతున్న ‘రాకెట్ అంతరిక్ష ప్రయాణం’ అనే సై¯Œ ్స పాఠం బయటకి స్పష్టంగా వినిపిస్తోంది. బసవన్న ముగ్గురు పిల్లలు మర్రిచెట్టు దగ్గర మట్టిలో ఆడుకుంటున్నారు.ఊర్లో ఇచ్చిన పిండివంటలు కిట్టడికి, ఆమాసకి, పిక్కురుదానికి ఇచ్చి సోములమ్మ నీళ్ళు తేవడానికి బడి బోరింగ్ కాడికి వెళ్ళింది. నిర్జీవంగా ఎద్దు పక్కన కూర్చున్న బసవన్న దీర్ఘంగా ఆలోచనల్లో కూరుకుపోయాడు. నీళ్ళకుండ పట్టుకొస్తున్న సోములమ్మ భర్తను చూసి కుండ దించి దిగాలుగా ఉన్న భర్త పక్కన కూర్చుని ‘ఏమయ్యా.. అలా వున్నావు, ఒంట్లో ఏమైనా నీరసంగా వుందా..?’ అని అడిగింది.సోములమ్మ ప్రశ్నతో బసవన్న ఆలోచనలు చెరిగిపోయి ఈ లోకంలోకి వచ్చాడు. ‘ఏమీలేదే, కానీ..!’ ‘ఏవయిందయ్యా..!’ రెట్టించి అడిగింది సోములమ్మ.ఆమె వంక దిగులుగా చూస్తూ ఖాళీగా ఉన్న జోలిని చూపించి ‘పిల్లల్ని ఎలా పెంచాలో, మనం ఎలా బతకాలో తెల్డం లేదు. మా తాత, మా అయ్యల కడుపు నింపిన ఈ వుత్తి ఇప్పుడు మన కడుపులు నింపడం లేదే..’ అన్నాడు బసవన్న.‘అవునయ్యా.. ఊరు మొత్తం తిరిగినా బొట్లు, పిన్నీసులు కూడా అమ్ముడుపోవడం లేదు’ అంది సోములమ్మ. దూరంగా ఆడుకుంటున్న పిల్లలను చూసింది సోములమ్మ. బక్కచిక్కిన దేహాలతో, చింపిరి బుర్రలతో, కారుతున్న చీమిడి ముక్కులతో తమ తిరుగుడు బతుక్కి ప్రతీకలుగా ముగ్గురు పిల్లలు కనిపిపించారు.భార్యవైపు చూస్తూ ‘ఒకప్పుడంటే రేడియో ఒకటే కాబట్టి మనం ఈదిలోకి ఎల్తే అందరూ అడిగిమరీ పాటలు పాడిచ్చుకుని తోచిందిచ్చేవోల్లు. రోజురోజుకీ పరిత్తితులు మారిపోతున్నాయి సినీమాలు, టీబీలు, సెల్లుపోనులు వొచ్చాక మన పాటలు ఎవరింతారు..? పెతీ ఇంట్లోనూ టీబీ పాటలు, సెల్లు మాటలు తప్ప మనల్నెవులు పట్టించుకుంతారు.. వొస్తువులు పెరిగేకొద్దీ మన అవసరం తగ్గిపోతందే..’ అన్నాడు ఆవేదనగా బసవన్న.సోములమ్మ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె మదిలో కూడా అలాంటి బాధే సుడులు తిరుగుతోంది. కాసేపయ్యాక ‘సూడయ్యా.. గంగిరెద్దుల్నేసుకుని నువ్వు, బొట్టుబిళ్లలు, పిన్నీసులు, సవరాలు తీసుకుని నేనూ ఎన్నూర్లు తిరిగినా మన బతుకుల్లో శీకటి తప్ప ఎలుగు రాదు, మన పొట్టా నిండదు. కొత్తకొత్త పేషన్లు వచ్చిన తరువాత మన దగ్గర వస్తువులెవలు కొంతారు? ఇప్పుడింటికో కొట్టు, ఈదికో దుకాణం పెడతంటే పాతాటిని పట్టుకుని ఎవలు ఏలాడతారు’ అంది గుండెల్లో బాధను పంటి కింద నొక్కి పెట్టి పవిట కొంగున దాచిపెడుతూ.ఊరూరూ తిరుగుతూ గడిపే బసవన్న కుటుంబానికి తిండి కరువైపోయింది. ప్రభుత్వ పథకాలు పొందడానికి కావలసిన ఆధారాలు కూడా వాళ్ల దగ్గర లేవు. అటు సమాజం నుంచీ, ఇటు ప్రభుత్వం నుంచీ సాయం పొందే అవకాశం లేకుండా బసవన్న బతుకు రెంటికీ చెడిన రేవడిలా తయారైంది.ఇలాంటి ఒడిదుడుకులతోనే ఊరూరూ తిరుగుతూ తమ బతుకు బండిని నడిపించారు బసవన్న దంపతులు. తమ బతుకే ఇంత దీనావస్థ మధ్య సాగుతుంటే రానున్న కాలంలో తమ పిల్లలకి బతుకే ఉండదని భావించిన బసవన్న తన పదేళ్ళ పెద్దకొడుకు కిట్టడిని దగ్గర్లో ఉన్న పట్టణంలోని బాణసంచా దుకాణంలో పనికి కుదిర్చాడు. మిగిలిన ఇద్దరు చిన్న పిల్లల్ని తమ వెంటే తిప్పుతూ రోజుల్ని గడుపుతున్నారు. కిట్టడు ఐదు సంవత్సరాలపాటు బాణసంచా దుకాణంలో పని బాగా నేర్చుకొని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నాడు.ఇక తమ వృత్తి కడుపు నింపదని బసవన్న సోములమ్మలు ఒక నిర్ణయానికి వచ్చి పెద్దపల్లిలో ఉండిపోయారు. ఎప్పుడూ వేసుకున్న గుడారం కంటే ఈసారి ఇల్లు కాస్త దుటంగా వేసుకున్నారు. వీధుల్లో గంగిరెద్దు తిప్పడం మానేసి బసవన్న పొలం పనులకు కుదురుకున్నాడు. ఇంకా ఆశ చావని సోములమ్మ ఊర్లు తిరుగుతూ పిన్నీసులు, బొట్లు అమ్మడానికి వెళ్తుంది కానీ తన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోగా నిరాశే మిగులుతోంది.కిట్టడు ఊర్లో జరిగే పెళ్లిళ్లకు, జాతర్లకు, వారాల పండుగలకు మందుగుండు సామాన్లు కట్టే బేరాన్ని కుదుర్చుకొని తన గుడారం వద్దే సొంతంగా బాణసంచా కట్టడం మొదలుపెట్టాడు. ఆమాసగాడిని, పిక్కురుదానిని బసవన్న పెద్దపల్లిలో ఉన్న బడిలో చేర్చాడు. వాళ్ళిద్దరూ బడికి వెళ్తున్నారు కానీ వాళ్ళ ధ్యాసంతా ఇంటి దగ్గరే!బడి అలవాటు లేని ఆమాసగాడు బడిలో చెప్పాపెట్టకుండా ప్రతిరోజూ బయటకు వచ్చి చింతచెట్ల కింద, తోటల వెంట రహస్యంగా తిరుగుతూ ఒకరోజు బసవన్న కంటిలో పడ్డాడు. తిరుగుతున్న తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని ‘ఒరే ఆమాస..! సదువొక్కటే మనకి ఆయుదం. అదే మన బతుకుల్ని మారుత్తుంది, మనకొక దైర్నాన్నిత్తంది. ఊరూరూ తిరగడం తప్ప అచ్చరం ముక్క రాదు మాకు. కనీసం మీరయినా సదువుకుంటే బతుకులు బాగుంటాయిరా. సుకంగా ఉంటారు. అమావాస్య రోజు పుట్టావని అందరూ నిన్ను ఆమాస అని పిలుత్తుంతే నాకెంత బాధగా వుందో ఆలోశించావా? నువ్వు సదువుకుని గొప్పోడివయితే నీ అసలు పేరుతోనే నిన్నందరూ పిలుత్తారు, గౌరవిత్తారు’ అని చెప్పాడు.ఆమాస తండ్రివంక చూశాడు గానీ ఏమీ మాట్లాడలేదు. అతనికీ చదువుకోవాలనే ఉంది. అయినా స్థిరంలేని బతుకు కావడం వల్ల తిరగడం మీదే ధ్యాస తప్ప స్థిరంగా ఒకచోట కూర్చుని చదవాలంటే ఆమాసకి ఇబ్బందిగానే ఉంది. అయినా తండ్రి చెప్పిన మాట అతనిలో ఆలోచనలకు దారితీసింది.బాణసంచా పేలుడులో నెత్తురోడి పడి ఉన్న కిట్టడిని గ్రామస్థులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయారు. కిట్టడి విషయం తెలిసిన సోములమ్మ గుండెలు బాదుకుంటూ ‘మా తిరంలేని బతుకులకి ఎక్కడికి పోయినా సుకం లేదు. మా పని పోయి ఏదొక పని చేసుకొని బతుకుదామని అనుకున్నా దినం దీరడం లేదని’ ఏడుస్తూ భర్తతో కలిసి ఆసుపత్రికి చేరుకుంది.గాయాల మధ్య మూలుగుతూ బాగా కాలిపోయి ఉన్న కిట్టడిని చూసి నిశ్చేష్టులై భార్యాభర్తలిద్దరూ కూలబడిపోయారు. నర్సు వచ్చి ‘కిట్టడిని పెద్దాసుపత్రికి తీసుకువెళ్లాలి, ఆరోగ్యశ్రీ కార్డు, కోటా కార్డు, ఆధార్ కార్డు తీసుకురమ్మ’ని చెప్పింది. ఆ మాట విని ‘అవెక్కడ దొరుకుతాయ’ ని అమాయకంగా అడిగాడు బసవన్న.‘మీకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులయ్యా’ అంది నర్సు. ‘అలాంటివేవీ మా దగ్గర లేవు తల్లీ.. మేము ఊరూరు తిరుగుతూ జీవనం సాగించేవాళ్ళం. మాకంటూ తిరమైన ఇల్లు, వూరు లేవు తల్లీ.. గంగిరెద్దుకు ముస్తాబు చేసి తిరుగుతూ పొట్టపోసుకునే వాళ్ళమ’ ని చెప్తున్న బసవన్న వంక జాలి నిండిన కళ్లతో చూస్తూ ‘కంప్యూటర్ యుగంలో కూడా స్థిరమైన నివాసాలకు, విద్య, ఉద్యోగాలకు దూరంగా బతుకుతున్నారా?’ అని ఆశ్చర్యంగా బసవన్న వైపు చూసి అతన్ని తీసుకుని పక్కనే ఉన్న మండలాఫీసు వైపు నడిచింది నర్సు. అతని పరిస్థితి చెప్పి సర్టిఫికెట్ల విషయంలో సహాయం చేసింది.కొన్నాళ్ళకి కిట్టడి ఆరోగ్యం కుదుటపడింది. పూర్తిగా మానని గాయాల్ని తల్చుకునే కొద్దీ అతనిలో తెలియని వేదన మొదలయింది. తనను ఇంట్లో కూర్చోబెట్టి రోజూ కూలిపనులకెళ్ళి తిండి పెడ్తున్న తల్లిదండ్రుల కష్టం అతన్ని మరింతగా కుంగదీయసాగింది. ఇంతకాలం పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ శ్రమ అతన్ని ఒక రకమైన ఉద్వేగానికి గురిచేసింది. తన తర్వాత పుట్టిన తమ్ముడు, చెల్లెలి భవిష్యత్తు గురించి కిట్టడికి ఆలోచనతో పాటు ఆందోళన కలిగింది. ఒకరోజు తల్లి దగ్గరికెళ్లి ‘అమ్మా మరి నేను ఈ బాంబుల పని సెయ్యడం మానేసి పట్నంలో ఏదైనా పనిలో కుదురుకుంటానే’ అన్నాడు.మొహానికి, చేతులకు గాయాలతో ఉన్న కొడుకు వైపు దిగులుగా చూసింది. ప్రమాదం తాలూకు ఙ్ఞాపకాలు ఆమెనింకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన కొడుకు మళ్ళీ ఊపిరి పోసుకుని తనముందు తిరగడం సంతోషంగానే ఉంది. అయినా మళ్ళీ ‘పని పేరుతో’ కొడుకు దూరమవుతానంటుంటే ఆమెలో ఏదో తెలియని ఆందోళన కలిగింది.కొడుకు వైపు చూస్తూ ‘పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీలు తాగడం మేలు అయ్యా. బతకడం కోసం తలో దిక్కు అయిపోవడం కన్నా, అందరం ఒకే దిక్కులో ఉండి గెంజి తాగి బతకుదాం’ అంది సోములమ్మ. ఏమీ మాట్లాడని కిట్టడు తల్లివైపు చూస్తూ బయటికి నడిచాడు. అతనికంతా అయోమయంగా ఉంది. ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా, తల్లిదండ్రులకు భారంగా ఉండలేకపోతున్నాడు. ఆలోచనలతోనే గంగిరెద్దులకు గడ్డివేస్తూ వాటివైపు చూశాడు కిట్టడు.ఒక్కసారిగా అతనికి బాలాజీ మాస్టారు గుర్తొచ్చారు.. ‘ఒరే కిట్టా..! మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలిరా..’ అని బాలాజీ మాస్టారు చెప్పిన మాటలు కిట్టడి చెవుల్లో మారుమోగుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా కిట్టడికి మనసులో ఏదో స్ఫురించినట్లయింది. గబగబా గుడిసెలోకి నడిచి తండ్రి సన్నాయి వైపు చూశాడు, ఆప్యాయంగా దానిని తడిమాడు.పోగొట్టుకున్న అపూర్వ వస్తువేదో తనను ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది. సన్నాయిని చేతుల్లోకి తీసుకోగానే కిట్టడిలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. పారేసుకున్న వారసత్వ సంపద పరిగెత్తుకుని వచ్చి తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా అనిపించింది. సన్నాయిని పెదవులకు ఆనించి ఊదడం మొదలుపెట్టాడు కిట్టడు. నాభి నుంచి గొంతువరకు ఏదో ఆత్మీయ సంగీతసాగరం ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. తెలియని కొత్త అనుభూతి అతన్ని నిలువెల్లా కుదిపేయసాగింది. సన్నాయి రాగంతో పాటు అతని కళ్లు కూడా గంగాప్రవాహంలా మారాయి.గంగిరెద్దును తీసుకొని కిట్టడు వీధి బాట పట్టాడు. తనకొచ్చిన పాటల్ని అలవోకగా సన్నాయి మీద పలికిస్తున్న కిట్టడు అతి కొద్ది కాలంలోనే జనాల్ని ఆకర్షించాడు. కిట్టడి గొంతు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కసాగింది. జోలి నిండా బియ్యం, చేతి నిండా డబ్బులు రావడంతో అతనిలో ఉత్సాహం రెట్టింపయింది. రోజూ ఇలా కిట్టడు వీధిలో ప్రదర్శిస్తున్న దృశ్యాన్ని ఒకరోజు బాలాజీ మాస్టారు సెల్ ఫోనులో వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు.ఇప్పుడు కిట్టడు పాత కిట్టడిలా లేడు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని తన తండ్రి నుంచి వచ్చిన ‘సన్నాయి కళ’కు కొత్త జీవం పోసే పనిలో నేర్పు సంపాదించాడు. ఖాళీ సమయాల్లో తన తండ్రి బసవన్న చేత గంగిరెద్దుని ఆడించడం, వాటికి శిక్షణ ఇచ్చే విధానం, సన్నాయితో పాటలు పలికించే పద్ధతుల్ని చిన్న చిన్న వీడియోలుగా తీసి వాటిని యూట్యూబ్‌లో నేరుగా కిట్టడే అప్లోడ్ చేయసాగాడు.ఆ వీడియోలు చూసే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగి కిట్టడి గంగిరెద్దుల కళకి ప్రాచుర్యం లభించింది. పట్టణాల్లో పెద్దపెద్ద డబ్బున్నవాళ్ళ వివాహాల్లో కిట్టడి ప్రదర్శన కళ హుందాగా తయారైంది. కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కిట్టడి గంగిరెద్దుల కళ వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచింది.‘ఈ కొత్తకొత్త పరికరాలు వొచ్చి మా వుత్తిని రూపుమాపి కడుపు కాల్చితే.. ఈ సాధనాల్నే వుపయోగించి మా కిట్టడు మళ్ళీ మా వుత్తికి జీవం పోశాడు. ఎన్నాళ్ళుగానో అనుకుంతున్న సొంతింటి కల నెరవేరబోతోంది..’ అనుకుంటూ ‘తన కలని, కళని బతికించిన’ కిట్టడి వైపు బసవన్న ఆప్యాయంగా చూశాడు. – సారిపల్లి నాగరాజు -
నా బిడ్డలు నాకు కావాలి.. పీఎస్ ఎదుట ఎస్ భార్య నిరసన
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ నాగరాజు భార్య మానస మంగళవారం ఆందోళనకు దిగింది. తన భర్త రెండో పెళ్లి చేసుకొని, ఇద్దరు కుమారులను తీసుకెళ్లాడని, న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఎస్ఐ నాగరాజు తనను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని మానస తెలిపింది. రెండేళ్ల నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడని, అనంతరం రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. తన ఇద్దరు పిల్లను దూరం చేసి మరో సంసారం చేస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని వాపోయింది. రెండేళ్ల క్రితం కరీంనగర్లో పెట్టి తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి విడాకులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. దీంతో తాను ఆత్మహత్యకు యత్నించగా.. పిల్లలను తనకు ఇప్పించి న్యాయం చేస్తామని బంధువులు చెప్పడంతో విరమించినట్లు తెలిపింది. ఈ విషయమై సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్ మహిళ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు ఫోన్ చేస్తే నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాడని పేర్కొంది. బంధువులతో కలిసి కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌కు రాగా ఎస్ఐ ఆరు రోజులుగా సెలవులో ఉన్నాడని చెప్పారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పింది. సీఐ శ్రీనివాస్ వివరణ కోరగా.. ఇటీవల మానస ఈ విషయం తన దృష్టికి తీసుకువచి్చందని, కౌన్సెలింగ్ ఇచ్చామని, ఉన్నత అధికారుల ఆదేశాసుసారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ
సాక్షి, సిద్దిపేట: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ లేబర్ పార్టీ నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ జన్మించారు. తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు. కష్టపడేత త్వం కలిగిన ఉదయ్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావా న్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్‌ని నెలకొల్పారు. మంచి వక్తగా పేరు సంపాదించా రు. సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్ గెలిచే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా రు. తెలుగు బిడ్డ బ్రిటన్‌లో ఎంపీగా పోటీ చేస్తుండటం.. విజయం సాధిస్తారనే అంచనాలు ఉండటంతో తల్లి నిర్మలా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిడ్డ ఆ స్థాయికి ఎదగడంతో శనిగరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ అంతమే.. మా పంతం
అనంతపురం క్రైం: ‘టీడీపీ కోసం నా భర్త, బావ ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి సేవ చేస్తున్నాం. అయినా మాకు తీవ్ర అన్యాయం చేశారు. డబ్బున్నోళ్లకు సీట్లు అమ్ముకుని కురుబ కులస్తులకు మొండిచేయి చూపారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించం. రాష్ట్రంలోని కురుబలంతా టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం’ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ బుల్లే శివబాల ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం అనంతపురం నగర శివారులోని చెరువుకట్ట శ్మశాన వాటికలో భర్త నాగరాజు సమాధిపై ఉన్న ‘టీడీపీ కార్యకర్త’ అనే నేమ్‌బోర్డును తొలగించారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించబోమని భర్త సమాధిపై శపథం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా టీడీపీనే కుటుంబంగా..కుటుంబమే పారీ్టగా పని చేశామన్నారు. పార్టీ కోసం తన భర్తతో పాటు బావ పావురాల కిష్టాను కోల్పోయామని చెప్పారు. తనకు అనంతపురం అసెంబ్లీ లేదా పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం ఇస్తామని లోకేశ్ పాదయాత్రలో హామీ ఇచ్చారన్నారు. అనంతపురం అర్బన్‌తో కనీస పరిచయం లేని దగ్గుపాటికి సీటిచ్చిన చంద్రబాబు.. పార్టీ కోసం కష్టపడిన ప్రభాకరచౌదరికి మొండిచేయి చూపారని మండిపడ్డారు. చంద్రబాబు నా వెంట్రుకతో సమానమన్న గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు అభ్యర్థిగా, కాంట్రాక్టులు చేసుకునే అమిలినేని సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం అభ్యర్థిగా అవకాశం కల్పించి.. చాలా ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనలాంటి బీసీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. బీసీల పార్టీ అని పదేపదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవానికి బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని శివబాల విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్గురు కురుబలకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారని చెప్పారు. వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు గుర్తింపు దక్కిందని చెప్పారు. -
ఆలయ కార్యదర్శిపై అమానుష దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేశారని ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి తెగబడ్డాడు. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుతకుమారిపై రాడ్డుతో దాడిచేసి, ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఏలూరు జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని బాధితురాలిని బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకుని వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు 27వ డివిజన్ కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడికి ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. రాజరాజేశ్వరినగర్‌కు చెందిన సావన్ అచ్యుతకుమారి ఆలయ నూతన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించి నిధులు భారీఎత్తున గోల్మాల్ అయ్యాయని ఆమె గుర్తించారు. సుమారు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుసుకుని పాత కార్యవర్గ సభ్యులను ఆమె ప్రశ్నించారు. దీంతో పాత, కొత్త కార్యవర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే.. శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను ఆచ్యుతకుమారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తుండడంతో పాత కార్యవర్గ సభ్యుడు రెడ్డి నాగరాజు అతని భార్య ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణంలో పుస్తక వ్యాపారం చేసుకునేందుకు అవకాశమివ్వాలని అచ్యుతకుమారిని కోరారు. ఆలయంలో వ్యాపారం చేయడానికి వీల్లేదని, అవసరమైతే ఉచితంగా పుస్తకాల పంపిణీకి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. ఈ విషయంలో వివాదం చెలరేగడంతో రెడ్డి నాగరాజు అచ్యుతకుమారిపై దాడికి తెగబడ్డాడు. రాడ్డు తీసుకుని ఆమెను తలపైన తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె చీరను లాగేసి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో అచ్యుతకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. నిధుల గోల్‌మాల్‌పై నిలదీయడంతో.. రెడ్డి నాగరాజుతో పాటు ఉమామహేశ్వరరావు, ప్రసాద్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయని ఆస్పత్రిలో ఆమె చెప్పారు. లక్షలాది రూపాయల నిధులకు లెక్కలు లేకపోవడంతో వారిని నిలదీయగా.. రెడ్డి నాగరాజు సమయం కోసం వేచిచూసి దాడిచేశారన్నారు. -
AP: అయోధ్య రామయ్యకు ‘శ్రీరామకోటి పట్టు వస్త్రం’
ధర్మవరం: అందరి బంధువు అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నలు అపూర్వ కానుకను అందజేసి తమ భక్తి ప్రవత్తులను చాటుకోనున్నారు. రామాయణ ప్రధాన ఘట్టాలను ప్రతిబింబిస్తూ 60 గజాల పట్టువస్త్రాన్ని.. రామాయణ మహాకావ్యాన్ని ప్రతిబింబించే చిత్రాలతో పాటు శ్రీరామ నామాలను 16 భాషల్లో డిజైన్ చేసి సమర్పించనున్నారు. ఈనెల 24వ తేదీన ఈ వస్త్రాన్ని అయోధ్యకు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 నెలలు శ్రమించి.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని నేసేపేటకు చెందిన జూజారు నాగరాజు ప్రముఖ పట్టుచీరల డిజైనర్. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి చేనేతల తరఫున శ్రీరామునికి ఏదైనా కానుక పంపాలని ఆలోచించి ఈ మహాత్కార్యానికి పూనుకున్నాడు. పల్లా సురేంద్రనాథ్, పల్లా తేజ అనే ఇద్దరు నేత కారి్మకుల సహకారంతో 4 నెలలు శ్రమించి 60 గజాల పట్టువస్త్రాన్ని తయారు చేసి మహాయజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ పట్టు వ్రస్తానికి ‘శ్రీరామకోటి’ పట్టు వస్త్రంగా నామకరణం చేశాడు. 60 గజాల పొడవు..16 కేజీల బరువు చేనేత మగ్గంపై 6 గజాల పట్టుచీర తయారు చేయడం సర్వ సాధారణం. అయితే శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని ఎంతో నైపుణ్యంతో 60 గజాల పొడవు, 44 ఇంచుల వెడల్పు 16 కేజీల బరువుతో తయారు చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇందుకోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. వస్త్రం తయారీకి పట్టు, నూలు, లెనిన్, బనానాయార్న్, పాలిష్టర్తో పాటు గోల్డ్, సిల్వర్, కాపర్ జరీలు, వెల్స్పన్ తదితర ముడిపదార్థాలను వాడారు. పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా వస్త్రం తయారు చేయడం ఈ వస్త్రం ప్రత్యేకత. రామాయణంలో ప్రధాన ఘట్టాలు,168 రకాల చిత్రాలు రామాయణంలోని ప్రధాన ఘట్టాలైన శ్రీరాముని జననం, విద్యాభ్యాసం, పట్టాభిõÙకం, వనవాసం, సీతాపహరణం, రావణసంహారం, హనుమంతుని సంజీవని పర్వత ఘట్టాలను తెలుపుతూ పట్టు వ్రస్తాన్ని తయారు చేశారు. మొత్తం 168 రకాల చిత్రాలను అంచుల్లో రూపొందించారు. 16 భాషల్లో శ్రీరామ నామాలు డిజైన్ పట్టు వస్త్రం మధ్య భాగంలో ఆకుపచ్చ, తెలుపు, ఆనంద, మెరూన్, పింక్, చాక్లేట్, రాయల్బ్లూ, ఆలివ్‌గ్రీన్, వైట్ తదితర రంగుల్లో శ్రీరామ నామాలను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మళయాళం, ఒరియా, గుజరాతీ, పంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఇంగ్లిష్, అస్సాం, సింహళ (శ్రీలంక) భాషల్లో లిఖించారు. పట్టువస్త్రంపై మొత్తం 32,200 రామనామాలు పొదిగారు. నాలుగు నెలలు శ్రమించాం.. ధర్మవరం నేతన్నల తరఫున శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని తయారు చేయడం నా పూర్వ జన్మ సుకృతం. పట్టు వ్రస్తాన్ని పంపేందుకు ఆలయ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాం. వారి నుంచి అనుమతి రాగానే పట్టు వ్రస్తాన్ని పంపుతాం. –జూజారు నాగరాజు, డిజైనర్, ధర్మవరం. -
కొడుకును కాపాడుకోవాలనే తపనతో ఇద్దరూ..
సంగారెడ్డి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీకుమారుడు మృతిచెందిన సంఘటన హత్నూర మండలం తురకల ఖానాపూర్ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సాధులనగర్కు చెందిన చెక్కల ప్రభు(46) కుమారుడు నాగరాజు (23) ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం తుర్కల్ ఖానాపూర్ శివారులోని ఊర చెరువులోకి చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కొడుకు నాగరాజుకు వల చుట్టుకొని మునిగిపోతుండడంతో గమనించిన తండ్రి కొడుకును కాపాడుకోవాలనే తపనతో నీటిలోకి దిగాడు. ఈక్రమంలో ఇద్దరూ మృత్యుఒడిలోకి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లగా మృతదేహాలు నీటిలో తేలాయి. దీంతో కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న హత్నూర ఎస్సై సుభాశ్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే సునీతారెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సునీత అన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్, సర్పంచ్ భాస్కర్‌గౌడ్, నాయకులు ఉన్నారు. ఇవి చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
మరణంలోనూ వీడని బంధం! తల్లడిల్లిన తల్లి హృదయం..
కరీంనగర్: ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు.. అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మలివయసులో అండగా ఉంటారనుకున్న ఇద్దరు కుమారు హఠాత్తుగా చనిపోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఈ విషాద సంఘటన మంథనిలో విషాదం నింపింది. పుట్టినప్నుంచి ఎంతో ఆప్యాయంగా పెరిగి వారి బంధాలు.. మరణంలోనూ ఒకటిగా కలిసే పోవడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్సై కిరణ్ కథనం ప్రకారం.. మంథని పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన తాటి నాగరాజు(42), ఆయన సోదరుడు నవీన్(35) రామగిరి మండలం బేగంపేటకు శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై పనినిమిత్తం వెళ్తున్నారు. అయితే, లక్కేపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోకి వెళ్లగానే ఎదురుగా, అతివేగం వచ్చిన ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన అక్కేపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌గా గుర్తించారు. అన్నదమ్ములను ఢీకొట్టిన ట్రాక్టర్ సమీపంలోని ప్లాట్ల వద్ద అదుపుతప్పి పడిపోయినట్లు సమాచారం. ప్లాట్లలో మట్టి పడి ఉంది. ట్రాక్టర్ బోల్తాపడిన ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ట్రాక్టర్‌ను సరిచేసుకొని డ్రైవర్ అక్కడి పారిపోయినట్లు భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన నాగరాజుకు భార్య, కూతురు(12) ఉన్నారు. అలాగే నవీన్‌కు భార్య, సంవత్సరం, మూడేళ్ల కుమారులు ఉన్నారు. మృతులిద్దరూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. తల్లి రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కదిలించిన హృదయాలు.. మంథని సుభాష్‌నగర్‌కు చెందిన తాటి రాధ– బాపు దంపతులకు నలుగురు కుమారులు. అనారోగ్యంతో బాపు మూడేళ్ల క్రితం మృతి చెందాడు. భర్తను కోల్పోయిన రాధ.. దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని తన కుమారులను చూసుకుంటోంది. ఇందులో ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో కుమారుడు అమాయకుడు కావడంతో ఇంటివద్దే ఉంటున్నాడు. కాగా, నాగరాజుకు కుమారుడు లేడు. దీంతో కూతురుతో చితికి నిప్పంటించారు. అలాగే నవీన్ పెద్దకుమారుడు(3)తో చితికి నిప్పు పెట్టించడంతో అక్కడున్నవారుకన్నీటి పర్యంతమయ్యారు. అందరితో కలివిడిగా ఉండే అన్నదమ్ములు ఒకేరోజు ప్రమాదంలో మృతి చెందడం విషాదం నింపింది. ఇవి కూడా చదవండి: ఆన్లైన్ గేమ్స్‌తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!? -
పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్
హసన్‌పర్తి : ఓ రిటైర్డ్ పోలీసు అధికారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పోలీసు అధికారులకు ఇక్కడి ప్రజలు ఆదరించలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సీపీగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన నాగరాజు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సీనియర్లు ఉన్నప్పటికీ టికెట్ దక్కించుకుని వర్ధన్నపేట నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌పై విజయం సాధించారు. ప్రచారంలో కూడా వెనుకే.. నాగరాజు ఎన్నికల ప్రచారం అంతంతమ్రాతమే చేశారు. ఆయన గెలుపునకు నాయకులు, కార్యకర్తలే కష్టపడ్డారు. నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామాల్లో ఓటర్ల వద్దకు వెళ్లి ఈసారి తమకు ఓటు వేయాలని అభ్యర్థించా రు. ప్రభుత్వంపై వ్యతిరేకత నాగరాజు గెలు పునకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. -
ఆలిండియా ముద్దపప్పు.. తెలంగాణ పప్పు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పప్పు రేవంత్‌రెడ్డి, ఆల్ ఇండియా ముద్దపప్పు రాహుల్ గాంధీ దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్నట్లు మాట్లాడుతున్నారు. ఇద్దరు బిత్తిరోళ్లు ఎగేసుకుని పోయి కాళేళ్వరం ప్రాజెక్టును చూసి వచ్చి మహా ఇంజనీర్లలా బ్రిడ్జి కూలిపోతుందని తప్పు డు ప్రచారం చేస్తున్నారు. బ్రిడ్జిపై ఉండే ఎక్స్పాన్షన్ జాయింట్ల ఫొటోలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అనడం రాహుల్, రేవంత్‌ల అవగాహనారాహిత్యానికి నిదర్శనం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మానకొండూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి గడ్డం నాగరాజు గురువారం తన అనుచరులతో కలసి తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఏఐసీసీ అంటే అల్ ఇండియా చెత్తాచెదారం, టీపీసీసీ అంటే తెలంగాణ పెరట్లో చెత్తా చెదారంలా తయారైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు, బ్లాక్ మెయిలర్, నోటుకు ఓటు దొంగ, కాంగ్రెస్ పార్టీ టికెట్లను అంగట్లో పశువుల్లా అమ్ముతున్న రేవంత్‌ను పక్క న పెట్టుకొని రాహుల్ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ అయిన రేవంత్‌రెడ్డి.. రాహుల్ గాందీని కూడా కోఠిలో చారాణాకో, ఆఠాణాకో అమ్మేస్తాడు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశానికి శనీశ్వరం కాంగ్రెస్ పార్టీ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి వరమైతే కాంగ్రెస్ పార్టీ దేశానికి శనీశ్వరం. బీఆర్ఎస్ది కుటుంబ పాలనంటూ మాట్లాడుతున్న రాహుల్ తన కుటుంబ నేపథ్యం ఏమిటో చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టులోని చిన్న లోపాలను పెద్దవిగా చూపి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు జీవనదుల నడుమ ఉన్న తెలంగాణను దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ కరువు కోరల్లోకి నెట్టింది. కాంగ్రెస్ పుణ్యాన తెలంగాణలో నేల నెర్రెలు వారింది. విప్లవ ఉద్యమాల నెత్తురుతో ఎర్రవారింది. రాహుల్ గాం«దీకి తెలంగాణ చరిత్ర తెలియదు. తెలుసుకొనే సోయి, పరిజ్ఞానం కూడా లేదు. 60 ఏళ్ల పాలనలో తెలంగాణలో ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం జరగలేదు. కాంగ్రెస్ పాలన సక్రమంగా జరిగి ఉంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎందుకు ఉద్యమించారు?’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చి దాడి చేస్తే ఊరుకోం.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరి సాగులో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ. ప్రాజెక్టు ఫెయిలైతే 3.50 కోట్ల టన్నుల ధాన్యం ఎలా పండింది? కాళేశ్వరం గురించి ఆయన పక్కన ఉన్న సన్నాసులు చెప్పేది కాకుండా రాహుల్ అసలు విషయాలు తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? కుంభకోణా ల కుంభమేళా కాంగ్రెస్ పార్టీ నీతి, నిజాయతీ గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. ఇది ఢిల్లీ దొరలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నడుమ జరుగుతున్న ఎన్నిక. మోదీ విధానాలు జుమ్లా లేదా హమ్లా. ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణపై దాడి చేస్తే సహించేది లేదు’అని కేటీఆర్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, దరువు ఎల్లన్న, సిద్దం వేణు తదితరులు పాల్గొన్నారు. -
కలిసి తిరిగిండు.. కత్తితో పొడిచిండు..
కరీంనగర్: వారిద్దరూ స్నేహితులు.. నిత్యం కలిసే తిరిగేవారు.. ఉన్నట్టుండీ ఏమైందో గానీ.. వీరిలో ఒకరు తన మిత్రుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కొత్తపల్లి ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ శివారు రేకుర్తి విజయపురికాలనీకి చెందిన మావురం నాగరాజు(38) ఓ సినిమా హాల్లో, అతని భార్య చంద్రకళ శాతవాహన యూనివర్సిటీలో స్వీపర్‌గా పని చేస్తున్నారు. నాగరాజు, ఇదే ప్రాంతానికి చెందిన మేక అజయ్ మంచి స్నేహితులు. నిత్యం కలిసే తిరుగుతూ మద్యం తాగేవారు. సోమవారం ఉదయం 11 గంటలకు స్థానికుడైన మారంపల్లి వినోద్ నాగరాజు ఇంటికి వచ్చాడు. స్థానిక బెల్టు షాపులో మద్యం కొనుగోలు చేసి, అతన్ని అజయ్ ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత నాగరాజు, అజయ్‌ల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. అజయ్ కత్తితో నాగరాజు గొంతులో పొడిచాడు. స్థానికులు గమనించి, బాధితుడిని కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. తన భర్తను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే గొంతులో కత్తితో పొడిచాడని, ఇందుకు మేక రాజశేఖర్, కిరణ్, లక్ష్మి, మారంపెల్లి వినోద్‌లు సహకరించారని మృతుడి భార్య చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా నిందితుడు అజయ్ పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. -
వర్ధన్నపేట బరిలో రిటైర్డ్ ఐపీఎస్ కేఆర్ నాగరాజు
సాక్షి, వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహరచనతో వెళ్తోంది. ఇప్పటికే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణను నియమించిన పార్టీ అధిష్టానం.. ఇక్కడి నుంచి బరిలోకి దింపే అభ్యర్థి విషయంలోనూ ఆర్థిక, కుల, స్థానిక, పరిచయాలు ఉన్న వారిని ఎంపిక చేసి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పావులు కదుపుతోంది. కొద్ది రోజులుగా వరంగల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కొండేటి శ్రీధర్ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశముందని వార్తలొచ్చాయి. తాజాగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు రిటైర్డ్ ఎస్పీ, ఎస్సీ మాల వర్గానికి చెందిన కేఆర్ నాగరాజు పేరు వినిపిస్తోంది. ఇందులో భాగంగానే మామునూరు క్యాంపులో ఆదివారం జరిగిన ‘క్యాంప్ లైన్స్ బాయ్స్’ ఆత్మీయ సమ్మేళనం ఈయన పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేసింది. మీకు మేం అండగా ఉంటాం.. మీరు రాజ కీయాల్లోకి రండి’ అంటూ ఈ ఆత్మీయ సమ్మేళనంలో మిత్రులందరూ ప్రతిపాదించడాన్ని బట్టి చూస్తుంటే నాగరాజు వర్ధన్నపేట గడ్డ వేదికగా పోరుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కొల్లాపూర్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, మరికొందరు నేతలతోపాటు కేఆర్ నాగరాజు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్లనుండడంతో ఆయన చేరిక లాంఛనమేనని స్థానిక నేతలు అంటున్నారు. మళ్లీ వర్ధన్నపేట నుంచే... స్థానికుడితోపాటు వర్ధన్నపేటలోనే ప్రొహిబిషనరీ ఎస్సైగా 1990లో పోలీస్ కెరీర్ ప్రారంభించిన నాగరాజు.. ఇప్పుడు అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం మొదలెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. స్పెషల్ పార్టీలో పని చేసిన సమయంలోనూ ఇక్కడ చాలామందితో పరిచయం ఉంది. స్కూలింగ్ మామునూరు పోలీస్ క్వార్టర్స్‌లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, ఆ తర్వాత పది వరకు రంగశాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ, ఆపై చదువులు హనుమకొండలో చదివారు. ఉమ్మడి వరంగల్‌లో వర్ధన్నపేట ప్రొహిబిషనరీ ఎస్సై, నెక్కొండ, కేయూసీ, మొగుళ్లపల్లి, స్పెషల్ పార్టీ, మిల్స్ కాలనీ, పరకాలలో ఎస్ఐగా, ములుగు, సుబేదారి, సీఐడీ వరంగల్, పాలకుర్తిలో సీఐగా, డీఎస్పీగా వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జనగామలో పనిచేశారు. ఆతర్వాత హైదరాబాద్‌లో వివిధ హోదాల్లో పనిచేసి మళ్లీ వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీగా, ఆ తర్వాత ఐపీఎస్ వచ్చాక నిజామాబాద్ కమిషనర్‌గా పనిచేసి 2023 మార్చి 21న రిటైర్డ్ అయ్యారు. హాకీలోనూ జూనియర్, సీనియర్ నేషనల్స్ ఆడిన కేఆర్ నాగరాజు ఎక్కువ సమయం మాత్రం మామునూరుకే కేటాయించారు. ఇప్పటికే మామునూరు క్యాంప్‌నకు ఆనుకొని ఉన్న లక్ష్మీపురంలో ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే అరూరిపై ఉన్న వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్‌కి ఉన్న బలం, తన వ్యక్తిగత పరిచయాలు, బంధువులు, పోలీసు శాఖలో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న పరిచయాలు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఓ దఫా వర్ధన్నపేట నియోజకవర్గంలో సర్వే పూర్తిచేసినట్లు తెలిసింది. గతంలోనూ పేరు వినిపించినా.. ఇప్పటికే కేఆర్ నాగరాజు పేరు కొన్నేళ్లుగా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీనుంచే వరంగల్ ఎంపీగా పోటీచేస్తారని గుసగుసలు వినిపించినా.. చివరకు హస్తం పార్టీ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గపోరు వల్ల ఎంపీగా పోటీ చేస్తే ప్రయోజనం ఉండదనుకున్న కేఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీచేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనుంచి నమిండ్ల శ్రీనివాస్ వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు లేకపోవడం కూడా కేఆర్ నాగరాజుకు కలిసిరానుంది. ఇప్పటికే కేఆర్ నాగరాజు బరిలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన సంకేతాలు ఇస్తున్నట్టుగా ప్రచారం ఉంది. ఇంకోవైపు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరు కూడా పార్టీ శ్రేణుల్లో చక్కర్లు కొడుతోంది. దీనికితోడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు దంపతులు కూడా పార్టీని గెలిపించేవారికే సై అంటున్నట్టుగా ఉన్నారని తెలిసింది. దీంతో త్వరలోనే అభ్యర్థి ఎవరనేది తేలనుంది. -
తెరపైకి కొత్త సీపీ.. సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి
ఖలీల్‌వాడి : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు ఖాళీ అయి రెండు నెలలు గడుస్తున్నా నియామకం జరగడం లేదు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడమే కారణంగా విమర్శలు వస్తున్నాయి. పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కేఆర్ నాగరాజు పదవీ విరమణ చేయడంతో ఈ పోస్టు ఖాళీ అయ్యింది. నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు నెలలుగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ పోలీసు కమిషనర్ నియామకానికి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు వేర్వేరుగా ఇద్దరు పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఒకరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన పోలీస్ అధికారిని, మరొకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారిని నియమించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇద్దరు బలమైన ప్రజాప్రతినిధులు ప్రపొజల్స్ పంపడంతో పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నట్లు సమాచారం. ఎన్నికల గడువు సమీపించడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా వ్యవహరించే కమిషనర్ కావాలని జిల్లాలోని ప్రధాన ప్రజాప్రతినిధులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. జిల్లాలో ఎస్సై, సీఐ తదితర పోస్టులకు సదరు ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలు లేనిదే పోలీస్స్టేషన్లలో పోస్టులు భర్తీ కావడంలేదనే చర్చ పోలీస్‌శాఖలో సాగుతోంది. ఇప్పుడు వచ్చే పోలీస్‌కమిషనర్ రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉండే సీపీ ఉంటే బాగుంటుందని చర్చించినట్లు తెలిసింది. దీంతో కొత్త కొత్వాల్ కోసం మల్లాగుల్లాలు పడుతున్నట్లు సామాచారం. ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేసిన వారిని కాకుండా సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో సదరు ఐపీఎస్ అధికారి నిజామాబాద్ సీపీ పోస్టు కోసం ప్రయత్నం చేసినప్పటికీ కేఆర్ నాగరాజుకు అవకాశం లభించినట్లు తెలిసింది. దీంతో మరోసారి సదరు ఐపీఎస్ అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పోలీస్స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారులకు చెపుకుందామంటే అవకాశం లేకుండా పోయిందని పలువురు పేర్కొంటున్నారు. -
చదివింది 9వ తరగతి.. మంత్రి ఆస్తి రూ. 1,510
కృష్ణరాజపురం: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత శ్రీమంతుడు, మంత్రి ఎంటీబీ నాగరాజు తన నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో రూ. 1,510 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. సోమవారం ఆయన తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ వేశారు. రాజకీయ నాయకుల్లో అత్యంత ధనవంతుడు అంటే ఎంటీబీ నాగరాజు ముందుంటారు. గత ఎన్నికల అనంతరం ఆయన ఆస్తులు మరో రూ 495 కోట్లు పెరిగాయి. ఈసారి ఆయన హొసకోటెలో పోటీకి దిగారు. -
'అనితా ఓ అనితా' సింగర్ గుర్తున్నాడా?.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
‘ నా ప్రాణమా నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరగ నీకుమా.. పదే పదే నా ప్రాణం నిన్నే కలవరిస్తోంది. వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది.. అనితా ఓ అనితా నా అందమైన అనిత.. దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ మీద.' ఈ పాట వినని వారు ఉండరేమో. అంతలా యువతను ఊపేసింది ఆ సాంగ్. ఎక్కడ చూసినా ఆ సాంగ్ మార్మోగిపోయింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రతి ఒక్కరినీ ఊర్రూతలూగించింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరి నోళ్లలో ఈ పాట వినిపించేది. అప్పట్లో ఓ రేంజ్లో ఫేమస్ అయినా ఈ సాంగ్ రాసిన యువకుడు పేరు నాగరాజు. ఒక్క పాటతో సంచలనం సృష్టించిన నాగరాజు గురించి తెలుసుకుందాం. నాగరాజు మాట్లాడుతూ..'ఒక వీడియో సాంగ్ పాటకు అనితా పాటను అటాచ్ చేశారు. నిజంగా నేను చనిపోయానని అప్పుడు రూమర్స్ వచ్చాయి. అప్పుడు నాకు చాలా బాధనిపించింది. హైదరాబాద్ అంటే కొత్త కొత్తగా ఉంటుంది. భయంతో నేను మా ఊరికి వెళ్లిపోయా. ఇప్పుడు అనితకు పెళ్లి అయిపోయింది. నాకు కూడా పెళ్లి జరిగింది. నిజంగా అనితకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమె వల్లే నేను ఈ పాట రాయగలిగాను. అమ్మాయి ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవడం వల్ల మా లవ్ బ్రేకప్ అయింది.' అని అన్నారు. నా ప్రేమను ఓ పాట రూపంలో చెబుదామని ప్రయత్నించానని నాగరాజు తెలిపారు. ఇప్పుడు నాకు మంచి అమ్మాయి భార్యగా వచ్చిందని ఆయన అన్నారు. పెద్దబ్బాయికి మూగ, చెవుడు తన కుటుంబం గురించి నాగరాజు మాట్లాడుతూ.. 'ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయికి మూగ, చెవిటి. మాటలు రావు. చిన్నబ్బాయి కూడా అన్నతో పాటే సైగలే చేస్తుంటాడు. ఇంతకుముందు ఒక చిన్న పాన్‌షాపు పెట్టుకుని జీవనం కొనసాగించా. ఎవరన్నా పిలిస్తే వెళ్లి పాటలు పాడేవాన్ని. నా తమ్ముడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతనితో పాటే ప్రస్తుతం నేను హైదారాబాద్‌లోనే ఉన్నానని' తెలిపారు. కాగా ప్రస్తుతం అనితా పాటకు సీక్వెల్‌గా అనిత-2 సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు నాగరాజు వెల్లడించారు. 'నా ప్రాణమా నిను మరిచిపోనులే.. ఊపిరి ఆగినా నీ మీద ప్రేమ చావదే'. అంటూ సాగే సాంగ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు నాగరాజు తెలిపారు. -
టీడీపీ నేత దూషించి, దాడి చేశాడు
సాక్షి, ప్రొద్దుటూరు: తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నల్లబోతుల నాగరాజు తనపై దాడి చేసి, దూషిస్తూ నైటీ చింపేశాడని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని వరసిద్ధి వినాయక నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నల్లబోతుల చిట్స్ నిర్వాహకుడుగా ఉన్న నల్లబోతుల నాగరాజు వద్ద గతంలో తాను అప్పు తీసుకుని ప్రతి నెలా అధిక వడ్డీని చెల్లిస్తున్నానన్నారు. కొద్ది రోజులుగా తన భర్త శివప్రసాద్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో జాప్యం జరిగిందని, వడ్డీతో సహా పూర్తి డబ్బు చెల్లిస్తామని తెలిపామన్నారు. అయినా వినకుండా శనివారం నల్లబోతుల నాగరాజుతోపాటు మరికొంత మంది తమ ఇంటి వద్దకు వచ్చి తనపై దాడి చేసి నైటీ చింపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటిలో ఉన్న తన భర్త శివప్రసాద్‌ను దూషించి, జుట్టుపట్టుకుని గాయపరిచారని తెలిపారు. వెంటనే డబ్బు చెల్లించకుంటే చంపుతామని కత్తితో బెదిరింనట్లు ఆమె వివరించారు. ఘటనపై ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం నల్లబోతుల నాగరాజు కేసు రాజీ కావాలని ఇతరులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట విషాదం) -
యూకే లేబర్ పార్టీ లాంగ్‌లిస్ట్‌లో ఉదయ్
సాక్షి, హైదరాబాద్: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న హైదరాబాద్ మూలాలుగల తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజు తాజాగా ఆ పార్టీ వడపోత అనంతరం రూపొందించిన ఆశావహుల జాబితాలో చోటు సంపాదించారు. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఉదయ్ ఆశిస్తున్నారు. యూకే పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వందలాది మంది వ్యక్తులు తొలుత తాము అభ్యర్తిత్వం కోరకుంటున్న పార్టీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను వడపోసి ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి లాంగ్‌లిస్ట్ రూపొందిస్తారు. వారిలో ఒకరిని పార్టీ స్థానిక సభ్యులు ఎన్నుకుంటారు. ఆ అభ్యర్థే పార్టీ తరఫున అధికారికంగా పార్లమెంటరీ అభ్యర్థి అవుతారు. రాజకీయ అనుభవం, గెలుపు అవకాశాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత తదితరాల ఆధారంగా లాంగ్ లిస్ట్‌ను లేబర్ పార్టీ రూపొందించగా ఉదయ్ అందులో చోటు సంపాదించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రాజ్యసభ మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు దగ్గరి బంధువైన ఉదయ్ నాగరాజు.. అంతర్జాతీయ వక్తగా, లేబర్ పార్టీ విధాన నాయకుడిగా మేథో విభాగాన్ని నడిపిస్తున్నారు. ఇదీ చదవండి: UK political crisis: రిషి, బోరిస్ నువ్వా, నేనా? -
నాగరాజు కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సాయం చేసిన వైఎస్ షర్మిల
సాక్షి, నారాయణపేట జిల్లా(గరిడేపల్లి): తెలంగాణ ఉద్యమకారుడు గరిడేపల్లి మండలం నాయినిగూడెం గ్రామానికి చెందిన నాగరాజుకు సోమవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆర్థిక సాయం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో రూ. 4లక్షలను అందించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను అర్పించేందుకు రైలుకు ఎదురెళ్లి రెండు కాళ్లు, చేయి పోగొట్టుకొని ఏ పనీ చేయలేక దుర్భరజీవితం గడుపుతున్న నాగరాజు ఈ నెల 12న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అతని కన్నీటి వ్యథను “ఉపాధి కరువై.. బతుకుభారమై’ అనే శీర్షికన ఈ నెల 13న సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు వైఎస్ షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆమె నాగరాజుతో ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అతడిని నారాయణపేటకు పిలిపించుకుని సోమవారం స్వాతంత్య్రవేడుకల్లో రూ.4లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ షర్మిల స్వయంగా ఫోన్ చేసి తనను నారాయణపేటకు పిలిపించుకొని ఆర్థిక సాయం చేశారన్నారు. దీంతో ఆమెకు ఎంతో రుణపడి ఉన్నానన్నారు. తన లాంటి తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారని, వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని కోరారు. చదవండి: (Munugode Politics: ఆ పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు అటువైపే..!) -
టీడీపీ దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేత మృతి
మచిలీపట్నంటౌన్: కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం సమీపంలోని గరాలదిబ్బలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు ఒడుగు నాగరాజు (46) మృతిచెందాడు. దీంతో మృతితో మచిలీపట్నం మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం నాగరాజు అంత్యక్రియలు నిర్వహించారు. మచిలీపట్నం మండలం గరాలదిబ్బలో పంచాయతీ ఎన్నికల తరువాత వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తరచు వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 5వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడులు చేశారు. వైఎస్సార్సీపీ వారి ఇళ్లల్లోకి వెళ్లి కత్తులు, ఇనుపరాడ్లు, బరిసెలు, రాళ్లతో వీరంగం చేశారు. టీడీపీ వర్గీయుల దాడిలో ఒడుగు నాగరాజు, నిరీక్షణరావు, శివరాజు, రాజ్‌కుమార్, ఏడుకొండలు, శివ తీవ్రంగా గాయపడ్డారు. అన్నం తింటున్న నిరీక్షణరావును బరిసెతో పొడిచారు. ఆ బరిసె కన్ను మీదుగా ముఖంపై గుచ్చుకుంది. నాగరాజుకు కత్తిగాయమైంది. గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. వారం రోజులు చికిత్స తీసుకున్న నాగరాజు ఇంటికి చేరుకున్నాడు. తరువాత వాంతులవడం, అనారోగ్యంగా ఉండటంతో జూన్ 22న ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించటంతో మచిలీపట్నం ప్రభుత్వ వైద్యులు విజయవాడకు రిఫర్ చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కొద్దిరోజుల చికిత్స తరువాత పరిస్థితి మరింత విషమించటంతో మరింత మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజు శనివారం సాయంత్రం మరణించాడు. గరాలదిబ్బలో టెన్షన్ టెన్షన్.. వైఎస్సార్సీపీ నాయకుడు నాగరాజు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. నాగరాజు మృతికి టీడీపీ శ్రేణులే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతనెల 5న జరిగిన దాడి ఘటనపై బొడ్డు వీరవెంకటేశ్వరావు (నాని), బొడ్డు నాగబాబు (చిన్న)తో సహా 12 మంది టీడీపీ వర్గీయులపై పలు సెక్షన్ల కింద రూరల్ ఎస్ఐ జి.వాసు కేసు నమోదు చేశారు. నాగరాజు మృతితో వారిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిలకలపూడి, పెడన, చల్లపల్లి సీఐలు శ్రీధర్‌బాబు, వీరయ్యగౌడ్, రవికుమార్, ఐదుగురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
పెద్దల సభలో బలమైన బీసీ వాణి!
సాహు మహరాజ్ లాగా ఏపీ సీఎం జగన్ కూడా బలహీనవర్గాల ప్రజలను ఆదరిస్తున్న తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. అత్యున్నత పదవుల్లో అణగారిన, బలహీన వర్గాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం శ్లాఘనీయం. వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయి. అందుకే ‘మనకాలపు సాహు మహరాజ్ జగన్’ అంటాను. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో బీసీల కోటా నుంచి ఒక మంత్రి లేదా ఇద్దరు మంత్రులు ఉండేవారు. ఇంకా ఉంటే ఒకటో రెండో కార్పొరేషన్ ఛైర్మన్లు! అంతే బీసీలు, ఎస్సీలకు గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇచ్చిన ప్రాధాన్యం! ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అసలు బీసీలు, ఎస్సీ, ఎస్టీల ఊసే లేదు. కానీ, జగన్ ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వాలకు భిన్నంగా బీసీలకు పెద్ద ఎత్తున స్థానం కల్పించడం గమనార్హం. బీసీ సమాజం, సంఘాలు, సోకాల్డు బీసీ లీడర్లను కూడా ఈ పరిమాణం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. గతంలో సాహు మహరాజ్ వల్లనే అప్పటి అణగారిన సమాజం రిజర్వేషన్లు పొందిందని చరిత్ర చెబుతున్నది. ఆయన సాయంతోనే బీఆర్ అంబేడ్కర్ చదువుకొని భారత రాజ్యాంగ రూపకర్తగా మారారు. సీఎం జగన్ ప్రోత్సా హంతో ఇప్పుడు రాజకీయ అధికార పదవుల్లోకి వచ్చిన వారు ముందు ముందు మరిన్ని కీలక పదవులు పొంది తమ వర్గాల సాధికారత కోసం కృషిచేసే అవకాశం ఉంది. బీసీ ఉద్యమంలో ఆర్. కృష్ణయ్య నిర్వహిస్తున్న పాత్ర చాలా ముఖ్యమైనది. బీసీల కోసం గత నాలుగు దశాబ్దాలకు పైగా ‘బీసీ సంక్షేమ సంఘం’ ద్వారా అలుపెరగని, అవిశ్రాంత పోరాటం చేస్తూన్న పోరాట యోధుడాయన. రెండు తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు ఆర్. కృష్ణయ్య కృషి చిరస్మరణీయం. సుదీర్ఘ కాల ఉద్యమ నేపథ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆర్. కృష్ణయ్యకు ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలో సభ్యునిగా స్థానం కల్పించే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఒక విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని 136 బీసీ కులాలకు దక్కిన అరుదైన గౌరవంగా భావించవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభలోకి ప్రవేశిస్తున్న బీసీ ఉద్యమనేత ఆర్. కృష్ణయ్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతలు పలు రకాల విమర్శలు చేస్తుండటం దురదృష్టకరం. బీసీల సంక్షేమ పార్టీగా చెప్పుకొని టీడీపీ ఈ అంశంలో జగన్ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి, విమర్శించడం దారుణం. 2014లో రాష్ట్ర విభజన తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికలలో నారా చంద్రబాబు బీసీ ముఖ్య మంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను ప్రయోగించినందునే తెలుగుదేశం పార్టీకి నామమాత్రంగానైనా అసెంబ్లీ సీట్లు లభించాయని చెప్పవచ్చు. (👉🏾చదవండి: వైపరీత్య ఘటనల్లో రాజకీయమా?) ఇక ఆర్. కృష్ణయ్య తెలంగాణ వాడు కదా... ఆయనకు ఏ విధంగా రాజ్యసభ సీటు ఇస్తారని టీడీపీ అనుంగు అనుచరులు విమర్శలు చేయడం శోచనీయం. కృష్ణయ్య లాంటి జాతీయ స్థాయి బీసీ ఉద్యమ నేతను కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేస్తూ విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అదే విధంగా బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు, బీసీ కులాల గణాంకాలు లాంటి అనేక డిమాండ్లు బీసీలకు దశాబ్దాల తరబడి ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి. బీసీల పార్టీలుగా ఈ సమస్యలపై ఎప్పటినుంచో ఉద్యమిస్తూ ఉన్న ఆర్. కృష్ణయ్య పార్లమెంట్లో ఉంటే బీసీల వాణి మరింత స్పష్టంగా, ప్రభావవంతంగా వినిపించవచ్చు. బీసీల సమస్యలపై చిత్తశుద్ధితో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అందుకే ఆర్. కృష్ణయ్యను పెద్దల సభకు పంపడానికి నిర్ణయించింది. (👉🏾చదవండి: ఇది ఎదురుకాల్పుల కనికట్టు కథ!) - మన్నారం నాగరాజు తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు -
సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా.. నాగరాజు హత్య కేసుపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి(సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నోటీసులు పంపింది. సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా శుక్రవారం ఆదేశించింది. ఇక ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తమ దృష్టికొచ్చిందని, అయితే పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఇలాంటి ఘటనలు అరాచకత్వానికి నిదర్శమని, ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. మతాంతర, కులాంతర వివాహాలు జరిగినప్పుడు పరువుహత్యలు జరగకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏదైనా విధానం ఉందా? అంటూ చీఫ్ సెక్రటరీని కమిషన్ ప్రశ్నించింది. సీఎస్ తన నివేదికలో ఈ అంశంపై బదులివ్వాలని పేర్కొంది. ఈ హత్యోదంతం దర్యాప్తు స్థితిగతులు, బాధిత కుటుంబానికి కల్పిస్తున్న భద్రత, దర్యాప్తులో అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే అలాంటివారిపై తీసుకున్న చర్యల గురించి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. చదవండి: సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన గవర్నర్ తమిళిసై -
మేనకోడలితో వివాహేతర సంబంధం.. సినీఫక్కీలో భార్యను..
సాక్షి, కొత్తవలస (విజయనగరం): కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం పంచాయతీ జోడిమెరక గ్రామానికి చెందిన గిరిజనుడు జోడు నాగరాజు(33)..భార్య లక్ష్మిని తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు శుక్రవారం అంగీకరించాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన లక్ష్మిని ఎనిమిదేళ్ల క్రితం నాగరాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ బాబు యశ్వంత్(7) ఉన్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగరాజు ఆమెను తరచూ వేధిస్తూ వివాహేతర సంబంధాలు అంటగడుతూ అదే గ్రామానికి చెందిన వరుసకు మేనకోడలు మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతుండడంతో గ్రామస్తులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి నాగరాజును మందలించారు. చదవండి: (తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అమానుషం.. ఫొటోలు, వీడియోలు తీసి) సినీఫక్కీలో హత్యకు పథకం భార్య లక్ష్మి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు పథకం రచించి జనవరి 28న రాత్రి 7.30గంటల సమయంలో లక్ష్మి స్వీట్‌షాప్‌లో విధులు ముగించుకుని వస్తుండడంతో దారిలో కాపుకాసి తీర్థానికి రావాలని అడిగాడు. దీంతో నమ్మిన ఆమె భర్త స్కూటీ ఎక్కింది. తొలుత ఏపీ మోడల్‌స్కూల్ వైపు తీసుకువెళ్లగా అనుమానం వచ్చి బండిపైనుంచి భార్య దూకి పారిపోయే ప్రయత్నం చేసింది. తిరిగి ఆమెను స్కూటీపై ఎక్కించి బలిఘట్టం రెవెన్యూ పరిధిలోగల అర్ధాన్నపాలెం దారిలో జీడి తోటలోకి తీసుకువెళ్లి తనకు విడాకులు ఇవ్వాలని నాగరాజు కోరగా ఆమె తిరస్కరించడంతో బలంగా తోసేశాడు. దీంతో ఆమె రాళ్లకుప్పపై పడి స్పృహ కోల్పోయింది. అదే అదునుగా రాయితో ఆమె తలపై కొట్టి హత్యచేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న గోతిలో వేసి ఎండు పుల్లలు వేసి పెట్రోల్ పోసి తగుల బెట్టినట్లు నిందితుడు వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. చదవండి: (సోషల్ మీడియా పరిచయం, పెళ్లి.. ఆ తర్వాతే అసలు కథ..) స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా అభంశుభం తెలియని భార్య లక్ష్మిని వేధింపులకు గురిచేసి కిరాతకంగా హత్యచేసిన నాగరాజును ఉరితీయాలంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. జోడిమెరక గ్రామ నుంచి గిరిజనులు నినాదాలు చేస్తూ కొత్తవలస పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా చేరుకుని ఆందోళన చేశారు. -
నాగరాజు ఇంటిపై ఏసీబీ దాడులు.. దిగులుతో భార్య మృతి
సాక్షి, దొడ్డబళ్లాపురం (బెంగళూరు): నెలమంగల పట్టణంలోని కేఏఎస్ అధికారి నాగరాజు భార్య గుండెపోటుతో మృతిచెందింది. నాగరాజు ఇంటిపై ఇటీవలే ఏసీబీ అధికారులు దాడిచేసి కోట్ల విలువైన నగదు, నగలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి భార్య నాగరత్న దిగులుగా ఉంటోంది. గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చింది. బెంగళూరు కొలంబియా ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతి చెందింది. తమ ఇంటిపై వరుసగా మూడోసారి ఏసీబీ దాడి జరగడంతో ఆమె ఆ రోజే మీడియా ముందు బోరున విలపించింది. చదవండి: (కట్నం వేధింపులకు నవ వధువు బలి) -
అమ్మవారి విగ్రహం నిమజ్జనంలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి..
ముదిగొండ: దసరా సందర్భంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనంకోసం తీసుకువెళుతుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం రాత్రి పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ముదిగొండ మండలం కమలాపురంలో స్థానికులు దు ర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో శనివారం అమ్మ వారి ప్రతిమతో నిమజ్జనానికి రెండు ట్రాక్టర్లలో సాగర్ కాల్వ వద్దకు బయలుదేరారు. గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో కాల్వ ఉండగా, ఊరేగింపు అనంతరం బయలుదేరి న స్థానికులు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. బాణాపురం సమీపాన ఇసుక బావి వద్ద అమ్మవారి విగ్రహం ఉన్న ట్రాక్టర్ ముందుగా వెళ్లింది. ఆ వెనుకాల ఉన్న ట్రాక్టర్లో 25 మంది గ్రామస్తులు ఉండగా, ప్రమాదవశాత్తు అది బోల్తా పడింది. ఈ ఘటనలో కమలాపురం గ్రామానికి చెందిన భిక్షాల ఎలగొండ స్వామి(55), అవసాని ఉపేందర్ (26), ములకలపల్లి ఉమ (36), చూడబోయిన నాగరాజు (20) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరికొందరు గాయపడగా 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అదృశ్యమైన నాగరాజు దారుణహత్య
నరసరావుపేట రూరల్: ఇటీవల అదృశ్యమైన మాచర్ల నియోజకవర్గానికి చెందిన బీసీ సంఘాల నాయకుడు కంచర్ల నాగరాజును పట్టణ సమీపంలోని పెదతురకపాలెం రోడ్డు గ్రావెల్ గుంటలలో దారుణంగా హతమార్చి దహనం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామానికి చెందిన నాగరాజు ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించటం లేదు. దీంతో కుటుంబసభ్యులు 21వ తేదీన వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి సెల్‌ఫోన్ డేటా ఆధారంగా చివరి లోకేషన్ నరసరావుపేట, పరిసర ప్రాంతాలుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులతో పాటు కుటుంబసభ్యులు సైతం నాగరాజు ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాలిపోయిన మృతదేహన్ని పెదతురకపాలెం రోడ్డులో కుటుంబసభ్యులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మాచర్ల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ సుధీర్‌కుమార్, దుర్గి ఎస్ఐ రామాంజనేయులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని రూరల్ పోలీసుల సహకారం తీసుకున్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలను బట్టి మృతుడు నాగరాజే అని అతని కుటుంబసభ్యులు నిర్దారించడంతో పోలీసులు ఘటనా స్థలంలోనే శవపంచనామా, పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల సీఐ భక్తవత్సలరెడ్డి మాట్లాడుతూ నాగరాజుకు తురకపాలెంకు చెందిన ముస్లిం యువతితో ప్రేమ వివాహం అయిందని చెప్పారు. 2013 లో వివాహం అయిన మూడు నెలలకే ఆ యువతి మృతి చెందిందని తెలిపారు. ఆ కేసు 2017 వరకు కొనసాగిందన్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు మృతదేహం ఇక్కడ లభించడంతో యువతి కుటుంబసభ్యులకు ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానం ఉందన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ప్రణాళిక ప్రకారమే హత్య... వెల్దుర్తి: హత్య చేసేందుకు ముందే ప్రణాళిక చేసుకొని మధ్యవర్తిగా ఉన్న ఓ ఉపాధ్యాయురాలి ద్వారా నాగరాజును ఫంక్షన్ అని చెప్పి పిలిపించారని సమాచారం. ఫంక్షన్‌కు వెళ్లే సమయంలో వారు వెంబడించి పట్టుకొని అతనిని తీసుకెళ్లి హత్య చేశారని తెలిసింది. ఆనవాళ్లు కనబడకుండా నాగరాజు సెల్‌ను ఆ రహదారిలో వెళ్తున్న లారీలో విసిరివేశారు. కాగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాయవరం జంక్షన్ నుంచి నాగరాజు అంతిమయాత్రను నిర్వహించారు. బైక్‌ను కారు ఢీకొని మహిళ దుర్మరణం పెదకాకాని: జాతీయ రహదారిపై వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీ కొన్న ఘటనలో మహిళ దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెదకాకాని సమీపంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చేబ్రోలు కొత్త రెడ్డిపాలెంకు చెందిన గుంటూరు ప్రసాద్ నంబూరు అత్తగారింటికి వచ్చాడు. భార్య నిర్మల ఇద్దరు పిల్లలతో కలసి తిరిగి ఇంటికి బయలు దేరాడు. వారు ప్రయాణిస్తున్న బైక్ జాతీయ రహదారిపై పెదకాకాని డక్కన్ టుబాకో కంపెనీ సమీపంలోకి చేరుకునే సరికి వెనుక నుంచి అతివేగంగా అజాగ్రత్తగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో హైవేలో బైక్‌పై వస్తున్న నలుగురు గ్రిల్స్ (రెయిలింగ్) దాటి సర్వీసు రోడ్డులో పడ్డారు. ప్రసాద్, భార్య నిర్మల ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ నిర్మల (45) మృతి చెందింది. వారిలో కుమార్తె పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఘటనా స్థలానికి పెదకాకాని సీఐ సిబ్బందితో చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్ చేబ్రోలు మండలం ప్రజాశక్తి విలేకరిగా పనిచేస్తున్నాడు. బైక్‌ను ఢీ కొన్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొంది. ప్రమాద సమయంలో కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడి నుంచి పరారీ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కేటీఆర్ పీఏనంటూ మోసాలు
సాక్షి, హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ ఓ ఘరానా నేరగాడు వరుస మోసాలు చేస్తున్నాడు. గతేడాది నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు దండుకోవడానికి స్కెచ్ వేసి సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. తాజాగా ఓ ఫార్మా కంపెనీకి ఫోన్ చేసిన ఇతగాడు రూ.15 లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదు కాగా.. నిందితుడు బి.నాగరాజును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇతగాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ రంజీ ఆటగాడు కావడం గమనార్హం శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజుపై ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఏడు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నగరానికి చెందిన ఓ రియల్ఎస్టేట్ సంస్థ సీఎండీకి ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి తిరుపతిని మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగరాజు బొడుమూరు అనే యువకుడు క్రికెట్లో ప్రతిభ కనబరుస్తున్నాడని, ఇంగ్లాండ్‌లో జరిగే అండర్– 25 వరల్డ్ కప్‌కు అతడు సెలెక్ట్ అయ్యాడని చెబితే తనను తానే ప్రమోట్ చేసుకున్నాడు. నాగరాజు (తాను) టోర్నీతో పాటు 20–20 సన్‌రైజ్ టీమ్‌కూ ఎంపికయ్యాడని చెబుతూ.. నాగరాజు పేద కుటుంబానికి చెందిన వాడని చెప్పుకొన్నాడు. అతడికి క్రికెట్ కిట్‌తో పాటు లండన్ టూర్ ఖర్చుల స్పాన్సర్ షిప్ అవసరం ఉందని, అందుకు రూ. 3.3 లక్షలు ఖర్చవుతాయన్నాడు. ఇదంతా విన్న సదరు సీఎండీ పూర్తిగా తన మాటల వలలో పడ్డారని మోసగాడు నిర్ధారించుకున్నాడు. దీంతో స్పాన్సర్షిప్ నగదును డిపాజిట్ చేయాలంటూ ఓ బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చాడు. ఈ టోర్నీకి సంబంధించిన క్రికెట్ కిట్‌ను నాగరాజు బెంగళూర్‌లో మీ కంపెనీ పేరుతోనే ప్రింట్ చేయిస్తున్నాడని, దాన్ని కేటీఆర్ చేతుల మీదుగా ఆయ కార్యాలయంలో, మీడియా సమక్షంలో అందుకుంటాడని చెప్పాడు. ఇది మీ కంపెనీకి మంచి పబ్లిసిటీ ఇస్తుందంటూ నమ్మించాడు. ఇతని మాటల్ని అనుమానించిన ఆ సంస్థ ప్రతినిధులు తొలుత సందేహించారు. తమకు కాల్ వచ్చిన ఫోన్ నంబర్‌ను ట్రూ కాలర్ యాప్‌లో తనిఖీ చేయగా అందులో తిరుపతి అనే పేరే కనిపించింది. దీంతో అతడు కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగానే నమ్మిన సంస్థ నగదును ఆంధ్రప్రదేశ్‌లోని నర్సన్నపేట్‌లోని కెనరా బ్రాంచ్ శాఖలో ఉన్న ఖాతాకు బదిలీ చేశారు. త్వరలో ఎల్బీస్టేడియంలో కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారనీ నాగరాజు ఆ కంపెనీ వారితో చెప్పాడు. ఆ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా మీ సంస్థనే సార్ ఎంపిక చేశారంటూ మరో ఎర వేశాడు. ఆపై మా బంధువు ఒకరు రాజమండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, బిల్లుల కోసం రూ.2 లక్షలు సహాయం చేయాలని కోరాడు. రాజమండ్రిలోని ఎస్బీఐ శాఖలో అప్పలనాయుడు పేరుతో ఉన్న ఖాతా వివరాలను పంపాడు. దీంతో అనుమానం వచ్చిన సంస్థ ప్రతినిధులు ఆరా తీయగా తాము మోసపోయామని తేలింది. బాధ్యుల్ని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. తాజాగా నగరానికి చెందని ఓ ఫార్మా కంపెనీకి కేటీఆర్ పీఏగా పని చేస్తున్న తిరుపతిరెడ్డి పేరుతో నాగరాజు కాల్ చేశాడు. కాలుష్య నియంత్రణ మండలి మీ సంస్థను మూసేస్తోందని, అలా కాకుండా చేయాలంటే రూ.15 లక్షలు చెల్లించాలని చెప్పాడు. దీనిపై జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు కాగా.. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు తన బృందంలో వల పన్నారు. సోమవారం నాగరాజు కదలికల్ని గుర్తించి అరెస్టు చేశారు. 2014– 16 మధ్య ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీ జట్టులో ఎంపికైన బుడుమూరు నాగరాజు గతంలోనూ అనేక మంది ప్రముఖుల పేర్లు చెప్పుకొని మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. బీసీసీఐ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌గా పలువురికి ఫోన్లు చేసి వసూళ్లు, మరో ప్రముఖ రాజకీయ నాయకుడి వ్యక్తిగత సహాయకుడిగా పేర్కొంటూ ఢిల్లీలోని ఓ ఆస్పత్రి నిర్వాహకుడి నుంచి డబ్బు డిమాండ్ చేసి అరెస్టు అయినట్లు పోలీసులు చెబుతున్నారు. -
ధర్మారెడ్డి ఆత్మహత్య.. అనుమానాలెన్నో..
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ: కీసర భూవివాదం కేసులో మాజీ తహసీల్దారు నాగరాజుతో పాటు అరెస్టయిన ధర్మారెడ్డి (77) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే నాగరాజు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. ధర్మారెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన పది రోజు లకే స్థానిక ఆలయం సమీపంలో వేపచెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడం అనుమానాలకు తావి స్తోంది. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి తరలించారు. ఇదే కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి రాగానే రాంపల్లి దయారాలో ధర్మారెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. శనివారం ఇంట్లోంచి వెళ్లి.. ఆదివారం శవమై.. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ధర్మారెడ్డి ఇంటి నుంచి బయటికెళ్లారు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం తెల్లవారుజామున ఆరున్నర గంటల ప్రాంతంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలోని వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం తెలి సింది. ఏడేళ్లుగా అప్పుడప్పుడు ధర్మారెడ్డి ఆ ఆలయంలో రాత్రిళ్లు నిద్రించేవారని, చివరకు అక్కడే శాశ్వత నిద్రలోకి వెళ్లారంటూ బంధువులు రోదిం చారు. కాగా, బెయిల్‌పై ఇంటికి వచ్చినా ధర్మారెడ్డికి పోలీసుల వేధింపులు ఆగలేదని వారు అంటున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టుకొచ్చి సంతకం చేసి వెళ్లాలని చెప్పారని, ఆరోగ్యం సహకరించట్లేదని బతిమాలినా పోలీసులు వినిపించుకోలేదని వారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారని, కోర్టుకు వెళ్లలేక, మరోపక్క కొడుకుకు ఇంకా బెయిల్ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయారన్నారు. అనుమానాలెన్నో.. 77 ఏళ్ల ధర్మారెడ్డి సరిగా నడవలేరు. చీకటిపడితే కళ్లు సరిగా కనిపించవు. అటువంటి వ్యక్తి గుడి సమీపంలో 12 అడుగుల ఎత్తున్న వేపచెట్టు కొమ్మకు తాడు ఎలా కట్టారన్నది అంతుచిక్కట్లేదు. గుడిలోకి చెందిన అడుగున్నర ఎత్తుండే ఓ కుర్చీ ఘటనాస్థలిలో కనిపించింది. ఒకవేళ కుర్చీ ఎక్కి కొమ్మకు దుస్సు ముడివేశారా అంటే.. ఘటనాస్థలాన్ని చూస్తే అలా లేదు. తాడును కొమ్మకు గట్టిగా బిగించి కట్టినట్టుంది. చెట్టెక్కితేనే అది సాధ్యం. వయసు దృష్ట్యా ధర్మారెడ్డి చెట్టెక్కి కొమ్మకు తాడు కట్టడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఘటన స్థలంలో కనిపించిన కుర్చీని వేపచెట్టువైపు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కలేదు. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదీ వివాదం.. నవాబుల నుంచి వారసత్వంగా సంక్రమించిన 96 ఎకరాలకు ధర్మారెడ్డి తండ్రి నారాయణరెడ్డి 1950 నుంచి 58 మధ్యకాలంలో టెనెంట్‌గా ఉన్నారని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ‘రెండేళ్ల పాటు పన్నులు చెల్లించడంతో 38ఈ సర్టిఫికెట్ కూడా వచ్చింది. కిషన్‌సింగ్ అనే వ్యక్తి రికార్డులను తారుమారుచేసి కొందరికి ఆ భూమి విక్రయించాడు. దీనిపై విచారణ జరిపిన అప్పటి తహసీల్దార్ అందులో 24 ఎకరాలకు ధర్మారెడ్డితో పాటు అతని ముగ్గురి సోదరుల పేరుపై పట్టా పాస్‌బుక్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే, ఆ భూమి తమదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 25న ధర్మారెడ్డిని, 29న అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులను అన్యాయంగా అరెస్టు చేశార’ని వారు అంటున్నారు. కాగా, ఈ వివాదానికి సంబంధించి అప్పటికే లంచం కేసులో అరెస్టయి ఉన్న మాజీ తహసీల్దార్ నాగరాజుపై.. ధర్మారెడ్డి పేరిట అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలను సృష్టించారనే ఆరోపణలతో ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఏ సమయంలో ఏం చేశాడంటే.. – శనివారం సాయంత్రం 4.48 ని.: ధర్మారెడ్డి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చారు. 5.08: వరకు ఉండి వెళ్లిపోయారు. 5.24కి మళ్లీ వచ్చి.. రాత్రి 7.43కి బయటకు వెళ్లారు. 8.06కు మళ్లీ వచ్చి వెంటనే వెళ్లిపోయారు. – రాత్రి 8.54: ధర్మారెడ్డి ఫోన్ మాట్లాడుతూ మళ్లీ ఆలచానికి వచ్చారు. 9.30: టవల్ వేసుకొని పడుకున్నారు. 10.11: ఓ బాబుతో ముగ్గురు మహిళలు వచ్చి చాప పర్చుకొని పడుకున్నారు. ఈ అలికిడికి ధర్మారెడ్డి నిద్రలేచి 10.14 సమయంలో గుడిలోనే అటుఇటు తిరిగారు. – 11.24: ఓ మహిళ నిద్రలేచింది. అటూఇటూ చూసి మళ్లీ పడుకుంది. – 11.33: మళ్లీ లేచిన ఆమె అక్కడే ఉన్న కుళాయి నుంచి బాటిల్లో నీళ్లు నింపుకుంది. ఆపై తనతో ఉన్న ఇద్దరినీ నిద్రలేపింది. వారంతా ధర్మారెడ్డి కదలికలను గమనించారు. – 12.10: ముగ్గురు మహిళలు వెళ్లిపోయారు. – 12.13: ధర్మారెడ్డి చేతిలో టవల్‌తో వెళ్లారు. సివిల్ కేసులో పోలీసుల ప్రమేయమేంటి? మాకు ఎలాంటి సంబంధం లేని తహసీల్దార్ నాగరాజు కేసులో మా నాన్న, అన్నయ్యను పోలీసులు కొందరు పెద్దల ఒత్తిడితో ఇరికించారు. కావాలని సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. – ఉమాదేవి, మృతుడి చిన్న కుమార్తె అంత్యక్రియలకు నా కొడుకును పంపించండి కొందరి ఫిర్యాదుతో నా భర్తను, కొడుకును అన్యాయంగా అరెస్ట్ చేశారు. సదరు భూమి పత్రాలు ఎక్కడంటూ నా భర్త ధర్మారెడ్డిని ఏసీబీ అధికారులు బెదిరించారు. నా భర్త అంత్యక్రియల కోసం కుమారుడు శ్రీకాంత్‌రెడ్డిని పంపించాలి. అప్పటివరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచుతాం. – వెంకటమ్మ, మృతుడి భార్య -
వేధింపులతోనే ఆత్మహత్య: ధర్మారెడ్డి భార్య
సాక్షి, హైదరాబాద్ : కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో తన భర్తను పోలీసులు వేధించారని ఆత్మహత్య చేసుకున్న ధర్మారెడ్డి భార్య వెంకటమ్మ ఆరోపించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మృతుడి భార్య మాట్లాడుతూ.. ‘భూ వివాదంలో నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు. తహసీల్దార్ నాగరాజుకు, నా భర్తకు సంబంధం లేదు. మా ఇంట్లో సోదాల్లో ఎలాంటి పాస్‌బుక్ దొరకలేదు. (నాగరాజు కేసు : మరో వ్యక్తి ఆత్మహత్య) జైలు నుంచి బయటకు వచ్చాక నా భర్త తీవ్ర మనస్తాపం చెందారు. బెయిల్‌పైన వచ్చాక కూడా రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టాలని పోలీసులు వేధించారు. నా భర్తను కలిసి బయటకి వచ్చిన తర్వాత రోజు నాగరాజు జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త విన్నాం. ఓ వైపు పోలీసుల వేధింపులు, మరోవైపు భవిష్యత్‌లో ఏమవుతుందో అనే భయంతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి కుమార్తెలు మాట్లాడుతూ... ‘మా నాన్నపై కక్ష కట్టి కేసులు పెట్టారు. జైలు నుంచి బయటకి వచ్చాక మనస్తాపం చెందాడు. తన మర్యాద మొత్తం పోయిందని బాధపడ్డాడు. కందాడి భూపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మా నాన్నపై ఫిర్యాదు చేశారు. ఏసీబీ, విజిలెన్స్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. కేఎల్ఆర్ మా భూమిని కబ్జా చేసి వేధించారు. నాగరాజుకు మా నాన్నకు పెద్ద పరిచయం కూడా లేదు. జైలు నుంచి వచ్చాక నేను ఎందుకు బతకాలి... చనిపోతా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి మా నాన్న తిరిగి రాలేదు. ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. కాగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ లభించకపోవడంతో జైలులోనే ఉన్నాడు. ధర్మారెడ్డి మృతదేహానికి శవ పరీక్ష పూర్తయ్యింది. అసిస్టెంట్ దాక్టర్ లావణ్య మరియు 5దు గురు పీజీ డాక్టర్స్ బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కుషాయిగూడలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య
-
నాగరాజు కేసు : మరో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోటి రూపాయల లంచం కేసులో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన ధర్మారెడ్డి కుషాయిగూడ, వాసవి శివ నగర్‌లోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మోటేషన్ ఆరోపణతో ఏసీబీ ఇతన్ని అరెస్ట్ చేయగా.. 33 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. ఇదే కేసులో అరెస్ట్ అయిన దర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నాడు. కాగా కోటి రూపాయల కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఇటీవల జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఒకే కేసులో ఇద్దరు నిందితులు వరుగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది. మరోవైపు వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
నాగరాజు రెండో లాకర్లో భారీగా బంగారం
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీ ఖాతాలో భారీగా బంగారం బయటపడింది. నాగరాజు బినామీ అయిన అల్వాల్‌కు చెందిన నందగోపాల్ అనే వ్యక్తి ఇంటిపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో నందగోపాల్ పేరిట అల్వాల్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఒక లాకర్, పీజే మహేందర్ కుమార్ పేరిట మేడ్చల్‌లోని ఐసీఐసీఐ బ్రాంచ్‌లో మరో లాకర్‌ను కూడా నాగరాజు, అతని భార్య స్వప్న వాడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ లాకర్లను గురువారం అధికారులు తెరవగా నందగోపాల్ పేరిట ఉన్న లాకర్లో రూ.60 లక్షల విలువైన ఒక కిలో 250 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నాగరాజుకు సంబంధించి ఇది రెండో లాకర్ కాగా, మూడో లాకర్లో రూ.4.5 లక్షల విలువచేసే 7.29 కిలోల బరువున్న 35 వెండిబిస్కట్లు బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొదటి లాకర్ అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకులో నాగరాజు సమీప బంధువు నరేందర్ పేరిట ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. సెప్టెంబర్ 2న ఈ లాకర్‌ను తెరిచిన ఏసీబీ రూ.57.6 లక్షల విలువ చేసే కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
నాగరాజు లాకర్లలో భారీగా బంగారం
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో ఏసీబీ దూసుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవల ఆయన ఆత్మహత్యకు పాల్పడటంలో కేసును మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో నాగరాజు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. నాగరాజు బినామీ నందగోపాల్ పేరుతో ఉన్న ఈ లాకర్లో దాదాపు కేజీకిపైగా బంగారు ఆభరణాలను గుర్తించారు. బినామీ పేరుతో పెద్ద ఎత్తున్న ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించి ఏసీబీ... ఇతర ఖాతాలపై విచారణ చేస్తున్నారు. రెండు రోజలు క్రితం నందగోపాల్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా.. లాకర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లాకర్లు ఓపెన్ చేయగా.. పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతకుముందు మరో బ్యాంక్ లాకర్లలో రెండు కేజీల బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. (కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. ప్రస్తుతం కేసులో పట్టుబడ్డ నిందితులంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. -
నాగరాజుది హత్యే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యపై తమకు అనుమానాలున్నాయని, ఆయనది ముమ్మాటికీ హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల్లో బయటికి వస్తానని, లాయర్లతో మాట్లాడాలని చెప్పిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన భార్య స్వప్న, బావమరిది శేఖర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాగరాజు భార్య పలు సంచల న ఆరోపణలు చేశారు. ఆయన చాలా ధైర్యవంతుడని, ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామన్నారు. అసలు రూ. కోటి పది లక్షల లంచం కేసు తప్పుడుదని.. ఆయన్ను అన్యాయంగా ఇరికించారని వాపోయారు. తాను, పిల్లలంటే ప్రాణమిచ్చే వ్యక్తి తన ప్రాణాలు ఎందుకు తీసుకుంటాడని ప్రశ్నించారు. ఈ విషయంలో జైలు అధికారులు, పోలీసులు, ఏసీబీ మీద తమకు న మ్మకం లేదన్నారు. ఆయన మరణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీసేందుకు సీబీఐ విచారణ జరగాల్సిందేనని స్వప్న డిమాండ్ చేశారు. దాడులు జరిగిన ఆగస్టు 14 రాత్రి ఏసీబీ అధికారులే నగదు బ్యాగుల్లో తీసుకువచ్చారని, తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని నాగరాజు చెప్పారన్నారు. అసలు టర్కీ టవల్‌తో ఉరివేసుకోవడం సాధ్యం కాదని ఆమె అన్నారు. ఆ సమయం లో నాగరాజుతోపాటు ఉన్నవారంతా ఎందు కు లేవలేదని అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం 3.30 గంటలకు నాగరాజు ఆత్మహత్య చేసుకుంటే.. 6 గంటలు దాటాక తమ కు సమాచారం ఇచ్చారని వాపోయారు. అది ముమ్మాటికీ తప్పుడు కేసు.. రూ.కోటి పది లక్షల కేసు తప్పుడుకేసని నాగరాజు బావమరిది శేఖర్ ఆరోపించారు. ఆ మొత్తం ఏసీబీ వాళ్లే తీసుకువచ్చారని ధ్వజమెత్తాడు. ఈ మేరకు తమ వద్ద సీసీ టీవీ ఫుటేజీ ఉందని, వాటిని హైకోర్టుకు అందజేస్తామన్నారు. అసలు రూ.కోటి పదిలక్షల కేసు నిలవదని తెలిసాకే, నాగరాజును ఇరికించేందుకు నకిలీ పాసు పుస్తకాల కేసు పెట్టారని తెలిపారు. ఆత్మహత్యకు ముందురోజు వీడియో కాల్ నకిలీ పాసు పుస్తకాల జారీ కేసులో కందాడి ధర్మారెడ్డితోపాటు నాగరాజు మరో నలుగురిని ఏసీబీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఈ నెల 13, 14 తేదీల్లో నాగరాజును ప్రశ్నించేందుకు ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. కస్టడీకి ఒక్కరోజు ముందు.. అంటే ఈ నెల 12న కుటుంబ సభ్యులతో నాగరాజు వీడియో కాల్లో మాట్లాడారు. ఆ కాల్ రికార్డును కూడా కుటుంబసభ్యులు మీడియాకు విడుదల చేశారు. అందులో ఏముందంటే.. తాను అన్ని పత్రాలు పరిశీలించాకే ముందుకు వెళ్లానని, ఎలాంటి తప్పు చేయలేదని వీడియోలో చెప్పడం కనిపించింది. భయపడాల్సిన పనిలేదని, బెయిల్ వస్తుందని న్యాయస్థానంలో పోరాటం చేద్దామని నాగరాజుకు శేఖర్ ధైర్యం చెప్పడం వీడియోలో కనిపించింది. -
మాజీ తహసీల్దార్ నాగరాజు వీడియో కాల్?!
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు మృతి కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఆయన చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారని తెలిసింది. ‘నేను ఏ తప్పు చేయలేదు.. అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయి. అన్నీ రికార్డ్స్ పరిశీలించాకే చేశాం. న్యాయవాదికి ఈ విషయాలు చెప్పి కోర్టులో తెలపాలి’అని నాగరాజు ఆ వీడియో కాల్లో కుటుంబసభ్యులను కోరినట్టు సమాచారం. బెయిల్‌పై బయటకు వచ్చాక కోర్టులో చూసుకుందామని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక నిన్న మీడియాతో మాట్లాడిన నాగరాజు కుటుంబ సభ్యులు, అతను ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికీ హత్యేనని వారు వాదించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని శుక్రవారం తెలిపారు. కాగా, కోటి 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును నెలరోజులుగా ఏసీబీ విచారించింది. ఈక్రమంలోనే చంచలగూడ జైల్లో ఉన్న ఆయన గత బుధవారం ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. నాగరాజు మృతిపై కస్టోడియల్ డెత్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) (చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య!) -
కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోటి రూపాయల లంచం కేసులో అరెస్ట్అయిన కీసర తహసీల్దార్ నాగరాజు జైల్లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ ఈనెల 14న చంచల్‌గూడ జైల్లో టవల్‌తో ఉరివేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్ డెత్‌గా కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ హత్యనని, సీబీఐ విచారణ కోరుతు హైకోర్టులో పిటీషన్ వేస్తాము తెలిపారు. (కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య) ఈ మేరకు శుక్రవారం నాగరాజు కుటుంబ సభ్యులు సాక్షి మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఆత్మహత్య ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ‘ఎంతోమంది ఖైదీలు ఉండే జైల్లో ఆత్మహత్య చేసుకోవడం అంత సులభం కాదు. అదీ టవల్‌తో హ్యాంగిగ్ ఎలా చేసుకుంటారు..? పక్కన ముగ్గురు ఖైదీలు వున్నారు. ఆ సమయంలో వాళ్లేంచేశారు. ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదు. అందుకు తగ్గ ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఇప్పటికే సీసీ వీడియో ఏసీబీ కోర్టుకి ఇచ్చాము. ధర్మారెడ్డికి భూమి మ్యూటేషన్ కేసులో ఏతప్పు చేయలేదు. రికార్డుల ప్రకారమే నాగరాజు వ్యవహరించారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసులో ఇరికించారు. ఈ ఘటనపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. చనిపోడానికి ముందు ఉదయం మాతో ఫోన్లో మాట్లాడాడు. త్వరలోనే వచ్చేస్తున్నా.. ధైర్యంగా ఉండమని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు. ప్రభుత్వ ఉధ్యోగులకు ఇలాంటి కేసులు సహజం. న్యాయపరంగా బయటకువచ్చాక పోరాటం చేద్దామన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు. మా అందరికీ ఆయనే దిక్కు. మా పరిస్థితి ఏంటీ’అని ప్రశ్నించారు. మరోవైపు నాగరాజు చనిపోయే ముందు రోజులు కస్టడిలో భాగంగా ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు ఎవరెవరితో మాట్లాడారు, ఏం చెప్పారు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మార్వో ఆత్మహత్య; ముందు రోజు ఏం జరిగింది?
అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు పట్టుబడగా.. ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. కోటి 10 లక్షల లంచం కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాడు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నాగరాజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య! నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్ డెత్‌గా కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జైలు సిబ్బందిని విచారించారు. చనిపోయే ముందు రోజులు కస్టడిలో భాగంగా ఏసీబీ అధికారులు నాగరాజును విచారించారు. దీంతో ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు ఎవరెవరితో మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్న విషయాల్లో దర్యాప్తు సాగుతోంది. చదండి: కీసర నాగరాజా మజాకా! -
కీసర మాజీ తాహసీల్దార్ ఆత్మహత్య
-
కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.కోటి 10 లక్షల లంచం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. (1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) నాగరాజుపై ఏసీబీ ప్రశ్నల వర్షం నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించింది. రెండోసారి అతడిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. కందాడి ధర్మారెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమికి అక్రమ పద్ధతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. అసలు హక్కుదారులు, వారసులు ఉండగా నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు? ఇందుకు ఎవరు సహకరించారు? దీని వెనక ఎంత డబ్బులు చేతులు మారిందని అడిగారు. దీనికితోడు అదే ధర్మారెడ్డి స్థానికంగా ఉన్న 140 ఎకరాలు స్వాహా చేద్దామని చేసిన ప్రయత్నానికి ఎలాంటి సహకారం అందించారని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. చదవండి: కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు కాగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నాగరాజు రియల్ బ్రోకర్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే. ఇక అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
140 ఎకరాల భూమిపై ధర్మారెడ్డి కన్ను
సాక్షి, హైదరాబాద్: కీసర నాగరాజు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రూ.కోటీ పది లక్షల లంచం తీసుకుంటూ దొరకడం జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు స్థానికులు, రియల్టర్లతో కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. కీసర తహసీల్దార్‌గా ఉన్న సమయంలో నాగరాజు రాంపల్లికి చెందిన కందాడి ధర్మారెడ్డి పేరిట, తన స్నేహితులు, బంధువుల పేరిట రెండెకరాలకుపైగా భూమిని దక్కించుకున్నాడు. ఈ భూములతోపాటు మొత్తం 24 ఎకరాల భూములకు నకిలీపత్రాల సాయంతో పాసుబుక్కులు జారీ చేసిన నాగరాజును రెండోసారి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టిన ఏసీబీకి నాగరాజు అక్రమాలకు సంబంధించిన అనేక ఆధారాలు లభిస్తున్నాయని తెలిసింది. అనేక భూ సెటిల్మెంట్లు.. స్థానికంగా పలుకుబడి కలిగిన కందాడి ధర్మారెడ్డితో కలిసి నాగరాజు అనేక భూ సెటిల్మెంట్లు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. గ్రామపరిధిలో ఉన్న 140 ఎకరాలను ధర్మారెడ్డి కాజేద్దామని ప్రయత్నించిన సమయంలోనూ నాగరాజు సహాయసహకారాలు అందించినట్లు సమాచారం. సర్వే నంబరు 621, 639లలో 140 ఎకరాల వివాదాస్పద భూమి ఉంది. దీనిపై కన్నేసిన ధర్మారెడ్డి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని 24 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. 1996లో ఆ భూమి తనదే అంటూ ప్రొటెక్ట్ టెనెంట్ (పీటీ) పత్రాలను సృష్టించాడు. దీనిపై సుమారు 20 మంది స్థానికులు అభ్యంతరం తెలిపారు. 1958లో తాము కిషన్‌సేఠ్ అనే వ్యక్తి వద్ద భూమిని కొనుగోలు చేశానంటూ నకిలీపత్రాలను అప్పటి ఎమ్మార్వోకు సమర్పించారు. అయితే, అప్పుడు తన పాచిక పారలేదు. కీసరకు నాగరాజు తహసీల్దార్‌గా రాగానే మళ్లీ పైరవీ మొదలుపెట్టాడు. ఈ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ విషయాలన్నీ ప్రస్తుత ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయని తెలిసింది. ఇటీవల 24 ఎకరాలకు అక్రమంగా పాసుబుక్కులు జారీ చేయడంపైన స్థానికులు ఫిర్యాదు చేయడంతో నాగరాజు, ధర్మారెడ్డితోపాటు అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్, రియల్టర్లు వెంకటేశ్వర్రావు, జగదీశ్వరరావు, భాస్కర్‌రావులను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ 24 ఎకరాల భూమి విలువ రూ.48 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 14న పట్టుబడిన సమయంలోనూ దాదాపు 53 ఎకరాలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. -
కీసర నాగరాజా మజాకా!
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కె.ధర్మారెడ్డి అతని మనుషులకు అక్రమంగా ధారాదత్తం చేశాడన్న ఆరోపణలపై ఇటీవల విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏసీబీ డీజీని ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కుట్ర, అధికారదుర్వినిæయోగం ఆరోపణల కింద శుక్రవారం నాగరాజుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి గ్రామపరిధిలో సర్వేనం 621లో కందాడి లక్ష్మమ్మ పేరిట 14 గుంటలు, సర్వే నం.623లో కందాడి బుచ్చిరెడ్డికి 33 గుంటలు, సర్వే నం.625లో కందాడి మీనమ్మ పేరిట 19 గుంటలు, సర్వే నం 633/ఏలో కందాడి ధర్మారెడ్డి పేరిట ఎకరం రెండు గుంటలకు జూలై 9వ తేదీన అప్పటి తహసీల్దార్‌గా ఉన్న నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ సైన్లతో పాసుబుక్కులు జారీ చేశాడు. నాగరాజు మరికొందరితో కలిసి మొత్తంగా 24 ఎకరాల 16 గుంటల భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి ఈ నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఈ విషయం కీసర ఆర్డీవో వద్ద ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నా అతనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. ఈ భూముల ధర రూ.2.68 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో విలువ రూ.48.8 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. -
లవకుశ నాగరాజు ఇక లేరు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రాల్లో ‘లవకుశ’ ఒకటి. ఈ చిత్రంలో లవుడి పాత్రలో అలరించిన అనపర్తి నాగరాజు (71) ఇక లేరు. హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో శ్వాస సంబంధిత వ్యాధితో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. యన్టీఆర్ శ్రీరామునిగా, అంజలీ దేవి సీతగా నటించిన ‘లవకుశ’ చిత్రానికి సి.పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వం వహించారు. 1963లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో లవుడి పాత్రలో నాగరాజు, కుశుడి పాత్రలో సుబ్రహ్మణ్యం నటించారు. ఆ సినిమా వచ్చి 50 ఏళ్లు దాటినా ఇప్పటకీ వారు లవ, కుశలుగానే గుర్తింపు పొందారు. అమ్మ మీద అమితమైన ప్రేమ, తండ్రినే ఎదిరించే సాహసం రెండూ కలగలిపిన లవుడి పాత్రలో నాగరాజు చక్కగా నటించారు. నాగరాజు తండ్రి ఏవీ సుబ్బారావు సినీ నటుడు. అలా నాగరాజు కూడా నటుడిగా రంగప్రవేశం చేశారు. చిన్నప్పుడే నాగరాజుకి నాటకాలంటే ఇష్టం. సుబ్రహ్మణ్యం, నాగరాజు కలిసి కొన్ని నాటకాల్లో కూడా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో 340కు పైగా చిత్రాల్లో నటించారు నాగరాజు. యన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో సుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్నారు నాగరాజు. ‘సీతారామ కల్యాణం’లో లక్ష్మణుడిగా, ‘వెంకటేశ్వర మహాత్మ్యం’లో పద్మావతి దేవి తమ్ముడిగా.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. సినిమాలు మానుకున్నాక హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో నాగరాజు పూజారిగా చేయడం మొదలుపెట్టారు. ఆ ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించారు. ఆయనకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు, తెలుగు టీవీ రచయితల సంఘం అధ్యక్షుడు డి. సురేష్ కుమార్ తదితరులు సంతాపం తెలిపారు. -
‘లవుడు’ కన్నుమూత
చిక్కడపల్లి (హైదరాబాద్): తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశేష ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రం లవకుశలో లవుడు పాత్ర పోషించిన నటుడు ఆనపర్తి నాగరాజు సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్ గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2017లో ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడంతో నాగరాజు ఆరోగ్యం కూడా దెబ్బతింటూ వచ్చింది. వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన.. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ చేర్చుకోవడానికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. నాగరాజు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది. 340 చిత్రాల్లో నటన... నాగరాజు అసలు పేరు.. నాగేందర్రావు. 340కి పైగా చిత్రాల్లో నటించారు. కీలుగుర్రం, హరిశ్చంద్ర సినిమాల్లో నటించిన ఏ.వీ.సుబ్బారావు కుమారుడే నాగరాజు. భక్తరామదాసు సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. హైదరాబాద్‌లోని ఒక అపార్ట్మెంట్ వద్ద నిర్మించిన ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. అలా వచ్చే కొద్దిపాటి సంపాదనతోనే జీవితం సాగిస్తున్నారని లవకుశలో కుశుడిగా నటించిన సుబ్రహ్మణ్యం తెలిపారు. తాను అమలాపురంలో టైలర్స్ షాపును ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల శ్రీకామాక్షి పీఠంలో జరిగిన కార్యక్రమానికి నాగరాజు, సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథులుగా హాజరుకావడం విశేషం. -
కలెక్టర్, ఆర్డీవో చెబితేనే వెళ్లాను
సాక్షి, హైదరాబాద్: కీసర భూ బాగోతం ఊహించని మలుపు తిరిగింది. ఈ వ్యవహా రంలో తాను మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే శ్రీనాథ్, అంజిరెడ్డిలను కలిసేందుకు వెళ్లానని, అదే సమయంలో ఏసీబీ దాడి జరిగిందని కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ విచారణలో వెల్లడించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. గురువారం ఏసీబీ న్యాయస్థానానికి అందజేసిన నిందితుల నేరాంగీకారపత్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పలు సంచలన విషయాలు వెల్లడించింది. ఈ మొత్తం కేసులో మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్డీవో రవి, హన్మకొండ తహసీల్దార్ కిరణ్ ప్రకాశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసులో ఏ1 తహసీల్దార్ నాగరాజు, ఏ2 వీఆర్ఏ సాయిరాజు, ఏ3 శ్రీనాథ్‌యాదవ్, ఏ4 అంజిరెడ్డిలతోపాటు ఇటీవల ఏసీబీ కస్టడీలో అనేకమంది అధికారుల పేర్లు వెల్లడించారు. నాగరాజు ఏమని చెప్పాడంటే.. విచారణలో నాగరాజు ఏసీబీ అధికారులకు అస్సలు సహకరించలేదు. పలు కీలక ప్రశ్నలకు ఆయన మౌనం వహించాడు. అయితే శ్రీనాథ్, అంజిరెడ్డిల నుంచి లంచం తీసుకునే విషయమై నాగరాజు సంచలన విషయాలు వెల్లడించాడు. తాను మేడ్చల్ కలెక్టర్, ఆర్డీవో రవి ఆదేశాల మేరకే భూవివాదంపై చర్చించడానికి అంజిరెడ్డి, శ్రీనాథ్‌లను కలిసేందుకు కాప్రా వెళ్లానని స్పష్టం చేశాడు. అంజిరెడ్డి, శ్రీనాథ్యాదవ్లకు ఈ వివాదాస్పద భూమితో ఎలాంటి యాజమాన్య సంబంధం లేదన్నాడు. వాస్తవానికి శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూవివాదం తన పరిధిలో లేనేలేదని చెప్పాడు. శ్రీనాథ్ వివరణ ఇదీ.. ఏ3 నిందితుడు రియల్టర్ శ్రీనాథ్ యాదవ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రాంపల్లి దయారాలోనే సర్వే నంబర్ 614లోని 61 ఎకరాల 20 గుంటల వివాదాస్పద భూమి గురించి తనకు కీసర మండలం భోగారం గ్రామానికి చెందిన ఇక్బాల్ ద్వారా తెలిసిందని శ్రీనాథ్ చెప్పాడు. తాను అంజిరెడ్డిని, అతని సోదరుడు హన్మంతరెడ్డి ద్వారా కలిశానన్నాడు. దాంతో భూమి పొజిషల్‌లో ఉన్న పట్టాదారులు, ముస్లింలతో ఇక్బాల్ ద్వారా, గ్రామస్తులను అంజిరెడ్డి సాయంతో అనేక సార్లు సమావేశమయ్యానన్నారు. చివరికి ఈ భూ వివాదంపై తాను సూచించిన పరిష్కారానికి వారంతా అంగీకరించారన్నాడు. ఇందులో భాగంగానే ఈ భూమికి సంబంధించి మొయినుద్దీన్ గాలిబ్ మరో 37 మంది ద్వారా తన పేరిట జీపీఏ చేయించినట్లు వివరించాడు. నగదును ఎలా సేకరించావన్న ప్రశ్నకు శ్రీనాథ్ బదులిస్తూ.. ఆగస్టు 14న తాము తన స్నేహితుడు యుగంధర్‌తో కలిసి తన కారులో కాజీపేట వెళ్లామని పేర్కొన్నాడు. మొత్తం రూ.కోటీ పది లక్షలను తన స్నేహితుడైన ముడిదె తేజేశ్వర్ ఏర్పాటు చేశాడన్నారు. తేజేశ్వర్ సూచన మేరకు తాము రూ.70 లక్షలను వరంగల్ బస్టాండ్ సమీపంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తీసుకున్నామన్నారు. దేవీ థియేటర్ వెనక భాగంలో రూ.30 లక్షలు, మరో రూ.10 లక్షలను రత్నం రాజిరెడ్డి, ఆర్ఎల్ రవి నుంచి అంబేడ్కర్ భవన్ వద్ద తీసుకున్నామన్నాడు. డబ్బును కారు డిక్కీలో పెట్టుకుని రాత్రి 7.30 గంటలకు కాప్రా ఆరుల్నగర్లోని అంజిరెడ్డి ఇంటికి చేరుకున్నామని చెప్పాడు. తహసీల్దార్ నాగరాజుతో పరిచయం ఎలా జరిగింది అన్న ప్రశ్నకు.. ఈ ఏడాది మార్చిలో తన మిత్రుడు, హన్మకొండ తహసీల్దార్ అయిన కిరణ్ ప్రకాశ్ ద్వారా కీసర ఆర్డీవో రవి పరిచయమయ్యాడని, ఆయన ద్వారా నాగరాజును ఆశ్రయించానని చెప్పాడు. ఈ పనికి నాగరాజును పురమాయించేందుకు ఆర్డీవోకి ఏమైనా లంచం ఇచ్చావా? అన్న ప్రశ్నకు శ్రీనాథ్ నోరు మెదపలేదు. అదే విధంగా ఈ వ్యవహారం పరిష్కరించేందుకు, మ్యుటేషన్ ఇంకా కలెక్టర్ ప్రొసీడింగ్స్ కోసం నాగరాజుకు, వీఆర్ఏ సాయిరాజుకు అంజిరెడ్డి ఇంట్లో ఏమైనా డబ్బులు చెల్లించారా? అన్న ప్రశ్నకు శ్రీనాథ్ సమాధానం చెప్పలేదు. -
కీసర ఎమ్మార్వో కేసులో కలెక్టర్ హస్తం..!
-
కీసర ఎమ్మార్వో కేసులో కలెక్టర్ హస్తం..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుల ఏసీబీ కస్టడీ వాగ్మూలం సాక్షి మీడియా చేతికి చెక్కింది. ఈ కేసులో కీసర ఎమ్మార్వోతో పాటు పలువురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో బహిర్గతమైంది. కలెక్టర్, కీసర ఆర్డీవో, మరో తహశీల్దార్ పాత్ర ఉందని నిందితుల వాంగ్మూలంలో తేలింది. వరంగల్ జిల్లా హన్మకొండ ఎమ్మార్వో కిరణ్ ప్రకాష్ ద్వారానే ఆర్డీవో రవితో నాగరాజు ఒప్పందం కుదిరిందని ఈ కేసులో ఏ3 నిందితుడు శ్రీనాథ్ వాంగ్మూలం ఇచ్చారు. దయారాలోని 614, మరికొన్ని సర్వే నెంబర్లలోని 61 ఎకరాల 20 గుంటల భూమి.. సాయిరాజ్, అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్ కుదరిందన్నారు. మొయినుద్దీన్ మరో 37 మంది వద్ద నుంచి భూమి అగ్రిమెట్ చేసినట్లు విచారణలో వెల్లడించారు. కలెక్టర్‌తో భూమి మ్యూటేషన్ చేపించే బాధ్యత ఆర్డీవో, ఎమ్మార్వో చూసుకుంటారని మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు (కలెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది). ఏసీబీ అధికారులకు చిక్కిన కోటి పదిలక్షల రూపాయలను వరంగల్ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు) కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే భూ వివాదంపై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్‌కి వెళ్లానని ప్రధాన నిందితుడు ఎమ్మార్వో నాగరాజు (ఏ1) తెలిపారు. శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు. గతంలో తనతండ్రి డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశాడని, తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చినట్లు తెలిపారు. 1995లో టైపిస్టుగా రెవెన్యూ శాఖలో చేరినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి కుత్బుల్లాపూర్, తాండూరు, ఘటకేసర్, ఉప్పల్, ప్రాంతాల్లో వివిధ హోదాలో పనిచేసినట్లు విచారణలో చెప్పారు. అంతేకాకుండా తన పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు ఒప్పుకున్నారు. 2011లోనే నాగరాజుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 10కోట్ల ఆస్తులు గుర్తించారు. ఇక తాజా కేసు నేపథ్యంలో అతని బ్యాంకు లాకర్లలో 55లక్షల బంగారు ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీ ఆస్తులు, ఆస్తుల డాక్యుమెంట్స్‌పై విచారణ కొనసాగుతోంది. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
నాగరాజు లాకర్లో 1.5 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఎట్టకేలకు ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు. అల్వాల్‌లోని ఓ బ్యాంక్ లాకర్ నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు) మరోవైపు నాగరాజు అవినీతిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గత నెల 14న రూ.కోటి పది లక్షల నగదు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం జాతీయస్థాయిలో కలకలం రేపింది. అతడి బాధితుల్లో సామాన్యుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పుడు వారంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నాగరాజు వేధింపులకు గురైన ఓ ఎస్పీ ర్యాంకు మాజీ పోలీస్ అధికారి మీడియా ముందుకు అతడి అవినీతి బాగోతం వివరించారు. కస్టడీ ముగిసినా దరిమిలా నాగరాజు అక్రమాలపై ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.ఇక నాగరాజు వేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో ఏసీబీ న్యాయస్థానం బెయిల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు
సాక్షి, మేడ్చల్: కోటి 10 లక్షల రూపాయల లంచం కేసులో అడ్డంగా దొరికిపోయిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఏసీబీ శుక్రవారం విడుదల చేసింది. ఈ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. రాంపల్లి దాయర వద్ద ఉన్న 19 ఎకరాల 39 గుంటల భూమిని ఒరిజినల్ పట్టదారులకు ఇప్పించేందుకు అంజిరెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసినట్లు రిపోర్టులో తేలింది. ఇందులో భాగంగానే తహశీల్దార్ నాగరాజుకు 1.10 కోటి రూపాయలు డీల్‌ను అంజిరెడ్డి కుదిర్చినట్లు తేలింది. నాగరాజుకు అందజేసిన డబ్బు శ్రీనాథ్ యాదవ్ అనే వ్యక్తి సమకూర్చినట్లు బయటపడింది. దీంతోపక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ.. అంజిరెడ్డికి చెందిన ఫార్చ్యూనర్, శ్రీనాథ్ వోక్స్ వాగన్ కార్‌ను సీజ్ చేసింది. అయితే నాగరాజుతో డీల్‌కు సంబంధించి అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లో సమావేశమైనట్లు తెలిసింది. ఏసీబీ దాడి సమయంలో అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లోనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిని మొత్తం సెర్చ్ చేసిన ఏసీబీ.. ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన 65 పేజీల రెప్రజెంటేటివ్ లెటర్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంది.గుండ్ల పోచంపల్లి గ్రామ పంచాయతీ కి సంబంధించి ఇళ్ళ అనుమతికి 204 పేజీల పత్రాలతో పాటు, రాంపల్లి దాయర భూ పంచాయతీకి సంబంధించి ఆర్టీఐ నుండి సేకరించిన 105 పేజీల పత్రాలు, పలు కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు, కోర్ట్ ఆర్డర్ కాపీలతో పాటు 65 పత్రాలు స్వాధీనం చేసుకుంది. (చదవండి : కోటి లంచం కేసు : రేవంత్‌పై విచారణ..!) ఈ అంశాలపైనే మూడు రోజుల పాటు విచారించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే విచారణ సమయంలో నిందితులెవరు సహకరించలేదని ఏసీబీ తెలిపింది. దీంతో నిందితులను మరోమారు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఏసీబీ స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో నాగరాజుతో పాటు మిగతా నిందితులు ఏసీబీ కోర్టులో శుక్రవారం బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. (చదవండి : గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
కీసర తహశీల్దార్ కేసులో విచారణ వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసులో మూడోరోజు ఏసీబీ విచారణ కొనసాగుతోంది. రూ.కోటి.10 లక్షల పై రియల్టర్ శ్రీనాథ్ వివరణ ఇచ్చారు. నాగరాజుకు శ్రీనాథ్ సహకరించాడన్న నేపథ్యంలో శ్రీనాథ్‌ను అధికారులు విచారించారు. కాగా రియల్ ఎస్టేట్‌కు చెందిన సత్య డెవలపర్స్ కోసం డబ్బులు తీసుకొచ్చినట్లు చెప్పాడు. డబ్బు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో ఏసీబీకి శ్రీనాథ్ తెలిపారు. నాగరాజు సహచరుడు అంజిరెడ్డి వద్ద దొరికిన ప్రజాప్రతినిధి డాక్యుమెంట్లపై ఏసీబీ వివరాలు సేకరించింది. గుండ్లపోచంపల్లిలో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను.. ఆర్టీఐ ద్వారా సేకరించిన డాక్యుమెంట్లని అంజిరెడ్డి ఏసీబీకి తెలిపారు. రాంపల్లి దయారా గ్రామానికి సంబంధించిన రూ.54 లక్షల ఎంపీ నిధుల మంజూరు లెటర్‌హెడ్‌పై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. మరో నాలుగు నియోజకవర్గాల పనుల కోసం నిధుల కేటాయింపుకు సిద్ధం చేసిన లెటర్‌హెడ్స్ అని అంజిరెడ్డి తెలిపినట్టు సమాచారం. కాగా తహశీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు సహకరించడం లేదని, బ్యాంక్ లాకర్లపై నోరు మెదపడం లేదని అధికారులు తెలిపారు. బినామీ ఆస్తులపై, తాను చేసిన అక్రమాలపై ఏసీబీకి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కాగా ఇదే కేసులో కీసర రెవెన్యూ శాఖ సిబ్బందిని ఏసీబీ ప్రశ్నించింది. నేటితో నలుగురు నిందితుల కస్టడీ ముగియనుంది. కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట ఏసీబీ హాజరుపర్చనుంది. చదవండి: గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్ -
రూ.కోటి 10 లక్షలు ఎవరివని ఏసీబీ ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసులో రెండో రోజు ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఈ కేసులో ఎమ్మార్వో నాగరాజు, వీఆర్వో సాయిరాజ్‌తో పాటు నిందితులుగా ఉన్న అంజిరెడ్డి, శ్రీనాథ్‌లకు సంబంధించి అనేక విషయాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి ఇంట్లో దొరికిన భూ లావాదేవీల డాక్యుమెంట్ల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో కోటి 10 లక్షల రూపాయల డబ్బు ఎవరివి అన్నదానిపై పూర్తి వివరాలు రాబట్టిననట్లు సమాచారం. ఎమ్మార్వో నాగరాజు మాత్రం ఏసీబీ అధికారులకు సహకరించనట్లు తెలుస్తోంది. తాజా విచారణలో సైతం ఆయన బ్యాంకు లాకర్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. విచారణ అనంతరం ఈ కేసులో నలుగురు నిందితులను ఏసీబీ కార్యాలయం నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. వారిని రేపు మరోసారి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. (చదవండి: 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) -
గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్
సాక్షి, హైదరాబాద్ : అవినీతి నిరోధకశాఖకు పట్టుబడ్డ కీసర తహసీల్దార్ బాలరాజు నాగరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించాలని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న చెందిన రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను కోరాయి. ఒక భూపట్టా విషయంలో రూ.2 కోట్లకు డీల్ మాట్లాడుకుని రూ. 1.10 కోట్లు స్వీకరిస్తూ ఇటీవలే తహసీల్దార్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఒక ప్రభుత్వ ఉద్యోగి 20 మిలియన్లను లంచం రూపంలో తీసుకుంటూ పట్టుబడటం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అయి ఉండవచ్చని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ) అధ్యక్షుడు పల్నాటి రాజేందర్, వరంగల్ కేంద్రంగా అవినీతి వ్యతిరేక అవగాహన కార్యకలాపాలు నిర్వహిస్తున్న జ్వాల సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కు ఆన్ లైన్లో చేసుకున్న దరఖాస్తులో తెలిపారు. దీనికి గిన్నిస్ బుక్ సంస్థ స్పందించింది. ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన తమవద్ద ఇంతవరకు ఎలాంటి కేటగిరీ లేదని, దీనికోసం ప్రత్యేకంగా కేటగిరి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. -
మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి/మేడ్చల్ : కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో కోటి రూపాయలు కాకుండా 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికిపోయాడు. ఈ ఘటనతో తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు ఏ మాత్రం మారలేదన్న విషయం బయటపడింది.(బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు) వివరాలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. కాగా బుధవారమే 10వేల రూపాయల లంచం అందుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం మరో 5వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేశ్వర్‌రెడ్డి పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీశాఖకు లేఖ రాసిన ఏసీబీ మరోవైపు తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకున్న కోటి 10 లక్షల రూపాయల పై ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వీరి వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవరు అన్న కోణంలో ఏసీబీ కేసును విచారిస్తుంది. ఈ ఘటనపై గురువారం ఏసీబీ ఐటి శాఖకు లేఖ రాసింది. మనీ ట్రాన్స్ సెక్షన్ ఎక్కడి నుంచి జరిగిందో తెలపాలంటూ ఐటిశాఖను లేఖలో కోరింది. నాగరాజుకు సంబంధించిన ఆస్తుల వివరాలపై కూపీ లాగుతున్న ఏసీబీ .. విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. (కీసర భూదందాలో రాజకీయ హస్తం!) ఇదే విషయమై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ లో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు మరిగారు. అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ కి ఫిర్యాదు చేయాలి. గతంలో నాగరాజు పనిచేసిన చోట రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. నాగరాజు కు మధ్యవర్తిత్వం వహించిన ఆంజిరెడ్డి ,శ్రీనాథ్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను పరీశీలిస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నాం. అంటూ తెలిపారు. -
పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్ఐకి రూ. 35 లక్షల అప్పు
సాక్షి, మేడ్చల్: కొత్త పాసు పుస్తకాల కోసం అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు ఆశ్రయించగా, ఆర్ఐ కిరణ్ ఇళ్లు నిర్మించుకుంటున్నాడని రూ.35 లక్షలు అప్పు ఆయనకు ఇప్పించి, ఇప్పటి వరకు ఇవ్వలేదని కీసర దాయారకు చెందిన రైతు కుంటోళ్ల దశరథ తెలిపారు. మా రాంపల్లి దాయార గ్రామానికి సంబంధించిన భూముల వ్యవహారంలో పాసు పుస్తకాల జారీ విషయంపై రియల్టర్ బ్రోకర్ల నుంచి రూ. 1.10 కోట్లు లంచం తీసుకుంటూ... ఏసీబీకి చిక్కటంతో ఆయన లంచావతారం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. గతంలోనే డబ్బులివ్వాలని తహసీల్దార్ నాగరాజుకు వద్దకు వెళ్లితే... తనపై అక్రమంగా 353 ఐపీసీ కింద కేసు నమోదు చేయించి తీవ్రంగా వేధించారని దశరథ తెలిపారు. కీసర దాయార గ్రామంలో 173, 174, 175, 176, 179, 213 సర్వే నంబర్లలో తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన కొత్త పాసు పుస్తకాల కోసం నాగరాజును తరచు కలిసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాసు పుస్తకాలు ఇవ్వకపోగా ఆర్ఐ కిరణ్‌కు ఇప్పించిన రూ. 35 లక్షలు ఇవ్వలేదన్నారు. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టర్ సకాలంలో స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. కొత్త పాసు పుస్తకాలు కూడా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏసీబీకి పట్టుబడ్డ వెంకటేశ్వరరెడ్డి: రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కోనసాగుతున్నాయి. సర్వేయర్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డిపై అధికారలు తనిఖీలు నిర్వహించారు. రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి వెంకటేశ్వరరెడ్డి రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన సర్వే రిపోర్టు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. -
బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు
సాక్షి, మేడ్చల్ : ఏసీబీ విచారణలో కీసర ఎమ్మార్వో నాగరాజు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పహనీలు రాకుండా, డిజిటల్ సంతకాలు కన్పించకుండా తనవద్దకే బాధితులు నేరుగా వచ్చేలా ఎమ్మార్వో స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. 30శాతం భూములు బ్లాక్ చేసి భూ యజమానులను వేధింపులకు గురి చేసినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మార్వో నాగరాజు..విదేశాల్ల ఉన్న వ్యక్తుల పేర్లమీద భారీగా ఆస్తుల కొనుగోలు చేసి వీటిని నగరంలోని మార్వాడి సేట్లకు వడ్డీ వ్యాపారాలకు ఇచ్చినట్లు సమాచారం. వీరికి సంబంధించిన బ్యాంకు లాకర్ల తాళాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ అవినీతి తిమింగలం అక్రమాలు, ఈ కుట్ర కోణం వెనకున్న బడానేతల వివరాలను కూడా బయటపెడతామని తెలిపారు. రియల్టర్ అంజిరెడ్డి వద్ద ఏసీబీ సోదాల్లో రేవంత్‌రెడ్డి ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు లభ్యమైనట్టు సమాచారం. ఏసీబీకి చిక్కిన రియల్టర్ బ్రోకర్ అంజిరెడ్డి, రేవంత్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టు దీని ద్వారా తెలుస్తోంది. రేవంత్ వద్ద ఉండాల్సిన కీలక పత్రాలు రియల్టర్ వద్ద ఉండటంపై విచారణ చేస్తున్నామని ఏసీబీ తెలిపారు. నాలుగురోజుల పాటు కస్టడీకి అనుమతించాల్సిందిగా ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. నేడు విచారణకు సంబంధించి కస్టడీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త కోణం!) పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం నిందితులు నాగరాజు, అంజిరెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా పలు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ల ఆధారంగా నిందితులకు సహకరించిన వారి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎమ్మార్వో నాగరాజు ఇంట్లో నుంచి కొన్ని డాక్యుమెంట్లను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. మొదటినుంచి ఈ కేసులో రాజకీయనేతల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో ఇంటికి బెంజ్, ఇన్నోవా కార్లరో వచ్చిన వ్యక్తుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా విచరణ చేపడుతున్నారు. (కీసర భూదందాలో రాజకీయ హస్తం!) -
కీసర భూదందాలో రాజకీయ హస్తం!
సాక్షి, మేడ్చల్: కీసర భూదందా కేసులో రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీకి చెందిన ప్రముఖ నేత సోదరుడి హస్తం ఉందంటూ తమ గ్రామంలో పలుమార్లు సదరు నేత సోదరుడు తిరిగాడంటూ రైతులు ఆరోపణలు చేస్తున్నారు. దయార గ్రామంలోని కొందరితో కలిసి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని అన్నారు. కీసర భూదందాలో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. తహశీల్దార్ నాగరాజు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంజిరెడ్డి నుంచి కీలక సమాచారాన్ని ఏసీబీ అధికారులు సేకరించారు. విచారణలో భాగంగా అంజిరెడ్డి నివాసంలో ఓ ప్రజా ప్రతినిధికి చెందిన లేఖలు స్వాధీనం చేకున్నారు. (నాగరాజు ఇంటిలో కొనసాగుతున్న సోదాలు) గతంలో సదరు ప్రజా ప్రతినిధి ఆర్టీఐ కింద భూముల సమాచారం కోరుతూ తహశీల్దార్‌కు రాసిన లేఖలు స్వాధీనం చేసుకుకున్నారు. సదరు ప్రజా ప్రతినిధితో అంజిరెడ్డికి ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రజా ప్రతినిధి గత ఏడాది తన ఎంపీ ల్యాడ్స్ నిధులను విడుదల చేస్తూ మేడ్చల్ కలెక్టర్‌కు రాసిన లేఖలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. కోటి 10 లక్షల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. (ఒక్కొక్కటిగా వెలుగులోకి నాగరాజు అక్రమాలు) -
వరమా.. శాపమా!
ఆశ అత్యాశగా మారి స్వార్థం ముసిరినపుడు విచక్షణ జ్ఞానం మరిచి మనిషి అనేక తప్పిదాలకు పాల్పడతాడు. తప్పిదాల మూల్యమే ప్రపంచమంతా అనుభవిస్తున్న క్వారంటైన్ బందీఖాన మనిషిని బందీని చేసి స్వేచ్ఛగా ఎగిరే పక్షులతో, స్వతంత్రంగా తిరిగే జంతువులతో ప్రకృతి పరవశిస్తోంది.. భూమాత పాలిట వరమైన మహమ్మారి మనిషి పాలిట శాపమైంది.. ఊహించని విధంగా భూమిపై పెనుమార్పులు చోటుచేసుకుంటున్నవేళ 50వ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా మానవాళికి కరోనా గుణపాఠం లాంటిది. మనిషి స్వార్థానికి అడవులను, చెట్లను నరికివేసి.. పక్షుల, జంతువుల స్వేచ్ఛను హరించడం.. పరిశ్రమల పేరిట గాలి నీరు కలుషితం చేసేశాడు. భూమండలాన్ని శాసించాలన్న స్వార్థపూరిత వైఖరికి కరోనా మహమ్మారి అడ్డుకట్టవేసి మనిషిని నాలుగ్గోడల మధ్య బందీ చేసింది.. ఫలితంగా అన్ని రంగాల్లో కాలుష్యం తగ్గడం.. భూమిపై, లోపల పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. మానవ సంచారం తగ్గడంతో పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. జంతువులు మునుపెన్నడూ లేనివిధంగా స్వేచ్ఛగా తిరుగుతూ జనావాసంలోకి వస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్లో చూస్తున్నాం.. ఇంతకుముందు కని పించని జంతువులను చూసి అటవీ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. నగరాలలో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడమనేది తీరని కోరిక.. పరిశ్రమలు మూసివేయడం.. వాహనాల రద్దీ తగ్గడంతో.. గాలి నాణ్యత పెరిగి నగరాలలో వాయుకాలుష్యం తగ్గినట్లు అనేక అధ్యయనాలు తెలి యజేస్తున్నాయి. మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసి సవాల్ విసిరినా మహమ్మారి మూలాన వాతావరణంలో చోటుచేసుకుం టున్న పెనుమార్పులను.. ప్రకృతి పట్ల బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తాడని భావిద్దాం. కరోనా నుంచి గుణపాఠం నేర్చుకొని సరికొత్త ప్రపంచంలోకి సరికొత్త ఆలోచనలతో అడుగిడాలని ఆశిద్దాం. (నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం) – ఎ. నాగరాజు, అప్పాజీపేట, నల్లగొండ -
2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు అసాధ్యమే
న్యూఢిల్లీ: 2024 నాటికి దేశ జీడీపీని 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా, దీన్ని ఆచరణ సాధ్యం కాని లక్ష్యంగా ప్రముఖ ఆర్థికవేత్త ఆర్ నాగరాజ్ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని 2024 నాటికి సాధించాలంటే జీడీపీ వృద్ధి రేటు ఏటా 9% ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తు తం మన జీడీపీ సుమారు 2.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఐదేళ్లలో రెట్టింపు అయితేనే కేంద్రం లక్ష్యం నెరవేరుతుంది. ఈ లక్ష్యం అసాధ్యమైనది కాకపోయినా, ఈ దశాబ్దంలో సాధ్యం కాకపోవచ్చని నాగరాజ్ పేర్కొన్నారు. వృద్ధి రేటు పడిపోతున్న క్రమంలో ఈ లక్ష్యం ఊహించుకోలేని అత్యాశగా ఉందన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు సెపె్టంబర్ త్రైమాసికంలో 4.5%కి క్షీణించిన విషయం తెలిసిందే. పెరిగిపోతున్న వాణిజ్య ఉద్రిక్తతల ధోరణి మారకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘జీడీపీలో భారత ఎగుమతుల నిష్పత్తి 2010 నుంచి క్రమంగా క్షీణిస్తోంది. ఈ ధోరణి మారుతుందన్న సంకేతాలు ఏవీ కనిపించడం లేదు’’ అని నాగరాజ్ తెలిపారు. గత కొన్నేళ్లుగా తగ్గుతున్న వడ్డీ రేట్లు ఏ విధంగానూ సాయపడలేదని, ద్రవ్య ప్రోత్సాహకాల అవసరం ఉందన్నారు. -
అడ్డుగా ఉన్నాడనే దారుణం..
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గతంలో రెండుసార్లు భర్తను హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏకంగా సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే .. కృష్ణాజిల్లాకు చెందిన నాగరాజు(35), హేమలత దంపతులు నగరానికి వలసవచ్చి ప్రగతినగర్ ప్రాంతంలో ఉంటున్నారు. గతంలో వారు స్థానిక ప్రశాంతి గోల్డెన్ హిల్స్‌లో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో పని చేసేవారు. ఈ క్రమంలో హేమలత వెంకటేశ్వరెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిని గుర్తించిన నాగరాజు పలుమార్లు భార్యను హెచ్చరించారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎలీప్ పారిశ్రామికవాడ ప్రాంతానికి మాకాం మార్చాడు. అయినా వారి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. తమ వివాహేతర సంబంధానికి నాగరాజు అడ్డుగా ఉన్నాడని భావించిన హేమలత, వెంకటేశ్వరరెడ్డి అతడిని హత్య చేయాలని పథకం పన్నారు. ఈ నేపథ్యంలో అతడు తినే ఆహారంలో విషం కలపాలని సూచించిన వెంకటేశ్వరరెడ్డి రెండుసార్లు హేమలతకు విషం తెచ్చి ఇచ్చాడు. అయితే ఆమె ధైర్యం చేయలేకపోయింది. దీంతో అతడిని హత్య చేసేందుకు బీదర్, వాడిచెల్కాపూర్ ప్రాంతానికి చెందిన మాపన్న అనే వ్యక్తి రూ.లక్షకు సుపారీ ఇచ్చాడు. పథకం ప్రకారం ఈ నెల 10న నాగరాజును బీదర్ సమీపంలోని బాల్కి ప్రాంతానికి తీసుకెళ్లిన వెంకటేశ్వర్‌రెడ్డి మాపన్నతో అతడిని హత్య చేశారు. అనంతరం మృతదేహంపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించారు. అనంతరం ఈ విషయాన్ని హేమలతకు చెప్పడంతో ఆమె తనకు ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 11న మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హేమలత, వెంకటేశ్వరరెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. హేమలత పేరున ఫ్లాట్ రిజిస్ట్రేషన్.. హేమలతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వెంకటేశ్వరెడ్డికి ఆమెకు ప్రగతినగర్‌లోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. సంఘటనా స్థలానికి నిందితులు.. నిందితులు వెంకటేశ్వరెడ్డి, మాపన్నలను సీఐ జగదీశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఏ విధంగా హత్య చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే దానిపై వివరాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నారు. -
ఘాతుకం : మామ చేతిలో కోడలి హతం
కర్ణాటక, మండ్య: వివాహేతర సంబంధానికి అంగీకరించలేదనే కారణంగా వ్యక్తి కోడలిని హత్య చేసిన ఘటన ఆదివారం మండ్య తాలూకా రాగిముద్దనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. హాసన్ జిల్లాకు చెందిన వీణ (26)కు రాగిముద్దనహళ్లి గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు అనిల్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. కాగా రెండేళ్ల క్రితం నాగరాజు భార్య సావిత్రమ్మ మృతి చెందింది. అప్పటినుంచి నాగరాజు ప్రతిరోజూ కోడలు వీణను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో విషయాన్ని భర్త అనిల్ దృష్టికి తీసుకెళ్లడంతో అనిల్ సైతం తండ్రి నాగరాజును పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ తీరు మార్చుకోని నాగరాజు వీణను లైంగికంగా వేధించసాగాడు. దీంతో భార్య, పిల్లలతో కలసి అనిల్ గ్రామంలోనే వేరుగా ఉండసాగాడు. దీంతో వీణపై అక్కసు పెంచుకున్న నాగరాజు కొడుకు అనిల్ ఇంటికి, దుకాణానికి వస్తూ వీణను మాటలతో చేష్టలతో వేధించసాగాడు . దీనిపై అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకెళ్లిన నాగరాజు జామీనుపై విడుదలై కోడలిని మరింత వేధించసాగాడు. ఈ క్రమం లో ఆదివారం ఇంటి బయటకు వచ్చిన వీణపై తమ్ముడు మంజు సహకారంతో కత్తితో దాడి చేసిన నాగరాజు గొంతు, కడుపులో పొడిచాడు. వీణ కేకలు విన్న అనిల్, గ్రామస్థులు వెంటనే అక్కడికి వెళ్లగా అప్పటికే వీణ రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతోంది. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించగా నాగరాజు, మంజు వెంటనే బైకుపై తప్పించుకున్నారు. వీణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. మండ్య పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
దారి తప్పిన క్రికెటర్
-
సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం
పట్నంబజారు (గుంటూరు): జల్సాలకు అలవాటుపడ్డ ఓ రంజీ క్రికెట్ ఆటగాడు.. నకిలీ ‘ఆటలు’ ఆడబోయి అడ్డంగా బుక్కయ్యాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్) పేరు చెప్పి ఓ సెల్‌ఫోన్ విక్రయ కంపెనీని మోసం చేయబోయి పోలీసులకు చిక్కాడు. గుంటూరు వెస్ట్ సబ్‌డివిజన్ ఆఫీసర్ జె.కులశేఖర్, అరండల్‌పేట ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు రంజీ క్రికెట్ ప్లేయర్. ఇటీవల నిందితుడు సీఎం వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి పేరుతో గుంటూరు బ్రాడీపేటలోని హ్యాపీ మొబైల్స్ సంస్థ నిర్వాహకులకు ఫోన్ చేసి.. నాగరాజు అనే రంజీ క్రికెటర్ వస్తాడని, అతనికి రూ. 3 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అయితే కేఎన్‌ఆర్‌తో పరిచయం ఉన్న వ్యక్తులు ఆయనకు ఫోన్ చేసి అడగటంతో తాను ఎవరినీ పంపలేదని స్పష్టం చేశారు. దీంతో గుంటూరు హ్యాపీ మొబైల్స్ మేనేజర్ కందుల సతీష్ ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టి చివరికి హైదరాబాద్‌లో నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే నాగరాజుపై విశాఖపట్నం, విజయవాడతో పాటు తెలంగాణలో సైతం మరో నాలుగు కేసులు నమోదైనట్లు తేలింది. గతంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు వాడుకుని డబ్బులు దండుకున్న ఘటనల్లో నాగరాజు అరెస్టు అయినట్లు వెల్లడైంది. -
రాజీనామా ఉపసంహరణకు ముందుకొచ్చిన నాగరాజు
-
రంజీ క్రికెటర్‌ను మోసగించిన కోడెల కుమారుడు
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక క్రీడాకారుడి వద్ద శివరామ్ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేసిన వైనం తాజాగా వెలుగుచూసింది. బాధితుడైన ఆంధ్రా రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజు శుక్రవారం గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన అప్పలస్వామి కుమారుడు నాగరాజు ఆంధ్రా రంజీ జట్టు తరఫున గత ఐదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. రెండేళ్ల కిందట విజయవాడకు చెందిన భరత్‌చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరామ్ పరిచయమయ్యాడు. ఆ సమయంలో తనకు రైల్వే ఉద్యోగంపై మక్కువ ఉందని కోడెల శివరామ్‌కు చెప్పాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న శివరామ్ స్పోర్ట్స్ కోటాలో రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో గతేడాది ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్ వెళ్లాలని శివరామ్ చెప్పాడు. అతడు చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్ వెళ్లాడు. అక్కడ కోడెల శివరామ్‌కు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ చేసేటప్పుడు కబురు చేస్తామని నమ్మబలికాడు. దీంతో నాగరాజు తిరిగొచ్చేశాడు. మే 23 తర్వాత అసలు విషయం తెలుసుకుని.. మే 23న ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల కుటుంబం అక్రమంగా వసూళ్లు చేసిన కేట్యాక్స్, ఉద్యోగాలిస్తామని మోసగించిన సంఘటనలపై వరుసగా నమోదవుతున్న కేసుల విషయం తెలుసుకుని తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో ఈ నెల 2న నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అయితే.. నాగరాజును బెదిరించి కోడెల అనుచరులు బాండ్ పేపరును చించేశారు. దీంతో తాను పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు హెచ్చరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు తెలుస్తుందని, శుక్రవారం డబ్బు ఇస్తానని నరసరావుపేట రావాలని కోడెల పిలిపించాడు. అక్కడ నాగరాజు చాలాసేపు వేచి చూశాక గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని అక్కడకు పంపారు. గుంటూరుకు వచ్చి కోడెలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీకి నాగరాజు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరాడు. చదవండి: కోడెలపై లారీ ఓనర్ల ఫైర్..! ‘కోడెల ట్యాక్స్ పుట్ట బద్దలవుతోంది’ ‘కే’ ట్యాక్స్ బాధితుల క్యూ అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె ‘కే ట్యాక్స్’పై ఐదు కేసులు కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు కోడెల పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాడు -
ఎన్నికల విధుల్లో ఉద్యోగి మృతి
సాక్షి, సత్తుపల్లిటౌన్: ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి, గుండెపోటుతో మృతిచెందారు. వైరాకు చెందిన ఎదునూరి నాగరాజు(35), మధిరలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఎలక్షన్ డ్యూటీ పడింది. సత్తుపల్లిలోని జ్యోతి నిలయం పాఠశాలలో ఏర్పాటైన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి బుధవారం ఉదయం చేరుకున్నారు. సత్తుపల్లి మండలం కిష్టారంలోని 199 పోలింగ్ స్టేషన్‌ను ఇతనికి అధికారులు కేటాయించారు. పోలింగ్ సామాగ్రి తీసుకున్న తరువాత, మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉన్నదంటూ అక్కడే ఉన్న వైద్య శిబిరానికి వెళ్లారు. ఆయనను డాక్టర్ చింతా కిరణ్‌కుమార్ పరీక్షించి, వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించి, హెల్త్ అసిస్టెంట్ డి.శ్రీనివాస్ తోడుగా ద్విచక్ర వాహనంపై సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. అక్కడ ఆయనకు వెంటనే డాక్టర్ శివకృష్ణ ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. గుండెపోటుగా నిర్థారించి వైద్యం చేస్తుండగదానే నాగరాజు కుప్పకూలిపోయారు, ప్రాణాలొదిలారు. ఆయనకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. భార్య కృష్ణవేణి, కుమార్తెలు వెన్నెల, మనన్వి ఉన్నారు. మృతదేహాన్ని కుటుంబీకులకు సత్తుపల్లి తహసీల్దార్ కె.విజయ్‌కుమార్, ఆర్ఐలు విజయ్‌భాస్కర్, జగదీష్ అప్పగించారు. పిల్లల్ని ఎండకు పంపొద్దని చెప్పి... సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో భర్త నాగరాజు మృతదేహంపై పడి భార్య కృష్ణవేణి, తల్లి గుండెలవిసేలా రోదించారు. ‘‘పిల్లలను ఎండకు పంపించొద్దు. ఇంటి దగ్గర జాగ్రత్త అని చెప్పి, డ్యూటీకి వెళ్లారు. ‘‘తాను తిరిగి రాలేననే... ఇన్ని జాగ్రత్తలు చెప్పారేమో’’నని ఆమె విలపిస్తుంటే... చూపరుల కళ్లల్లో తడి చేరింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామం వైరాకు తరలించారు. -
నాగరాజు పద్మవతి దంపతులకు కేసీఆర్ క్షమాపణలు చేప్పాలి
-
నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్
ఆలేరు : నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జ్ డీసీపీ కె.నాగరాజు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆలేరు పట్టణంలోని సుభాష్‌నగర్, ఆదర్శనగర్‌లలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలతో పాటు ఒక రౌడీషీటర్‌ను, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్న ఇరువురిపై ఎక్సైజ్ కేసు నమోదు చేశామని, 3 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతే కాకుండా ద్విచక్ర వాహనాలను నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలు నడిపే వారు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. రాత్రి 2గంటల నుంచి ఉదయం 6గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఏసీపీ శ్రీనివాసాచార్యులు, 8 మంది సీఐలు, 10మంది ఎస్ఐలు, 17 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 51 మంది సివిల్ పోలీసులు, 13 మంది మహిళ పోలీసులు, హోంగార్డులు, 34 మంది ఎఆర్, సీసీఎస్, క్లూస్‌టీం, ఎస్‌ఓటీలు పాల్గొన్నారు. -
దొంగగా మారిన ‘పటాస్’ ఆర్టిస్ట్
సాక్షి, హైదరాబాద్: పాపులర్ పటాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఆర్టిస్టు.. విలాసాలకు అలవాటుపడి దొంగగా మారాడు. చివరికి నాటకీయ రీతిలో పోలీసులకు చిక్కాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీసులు శుక్రవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బరి నాగరాజు అలియాస్ నరేందర్ ఇందిరానగర్‌లో నివసిస్తున్నాడు. మొదట్లో భవన నిర్మాణ సెంట్రింగ్ పనులు చేసుకునే ఇతను పటాస్ కామెడీ షోలో అవకాశం చేజిక్కించుకున్నాడు. కొంతకాలానికి విలాసవంతమైన జీవితం అలవాటు కావడంతో డబ్బు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. బైక్‌పై రెక్కీ తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి రాత్రే ఆ ఇళ్లల్లో దొంగతనాలు చేసేవాడు. పక్కా ఆధారాలతో నాగరాజును పట్టుకున్నామని, గతంలో సెల్‌ఫోన్ చోరీ కేసులోనూ ఇతను నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడి దగ్గర్నుంచి సుమారు రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
వరల్డ్ చెస్ బాక్సింగ్ పోటీలకు నాగరాజు
హైదరాబాద్: వరల్డ్ చెస్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు పాతబస్తీ మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రతాప్ నాగరాజు ఎంపికయ్యారు. జూలై 22 నుంచి 29 వరకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగే అమెచ్యూర్ వరల్డ్ చెస్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నాగరాజు భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 62 కేజీల విభాగంలో అతను పోటీపడతాడు. గత కొన్నేళ్లుగా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన పలు టోర్నీల్లో నాగరాజు నిలకడగా పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆయన ఎంపిక అవ్వడం పట్ల స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్. దేవేందర్, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. -
పథకం ప్రకారం రౌడీషీటర్ హత్య
నరసరావుపేట టౌన్: కత్తిపట్టిన వాడు కత్తితోనే నశిస్తాడు అనే నానుడి రౌడీటర్ నాగరాజు హత్యతో నిజమైంది. ముస్లింల వేషధారణల్లో వచ్చిన ముగ్గురు యువకులు అతడ్ని కిరాతకంగా నరికారు. నాలుగు నిమిషాల్లో అంతా పని కానిచ్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ వారు చిక్కలేదు. ఉన్నతాధికారులు సత్పవర్తనతో జీవించాలని సూచించినప్పటికీ ప్రవర్తనలో మార్పురాకపోవడంతో నేడు నాగరాజు కుటుంబం రోడ్డున పడిందని పోలీసు అధికారులు చెప్పుకొస్తున్నారు. వివరాల్లో కెళితే...ఎస్ఆర్కేటీ కాలనీకి చెందిన రౌడీషీటర్ చీదనబోయిన నాగరాజు వురఫ్ బొల్లు నాగరాజు ఆదివారం రాత్రి అరండల్‌పేట గోల్డెన్ బిర్యానీ పాయింట్ ఎదుట దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. హోటల్ దగ్గర ఒక్కడే ఉండటాన్ని గమనించి ప్రత్యర్థులు వేటకొడవళ్లు, గొడ్డలితో విచక్షణారహితంగా నరికారు. హత్య ఉదంతంతో నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోని ప్రజానీకం ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. సమాచారం తెలుసుకున్న సీఐ శివప్రసాద్ నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకొన్నారు. రక్తపు మడుగులో పడిఉన్న నాగరాజును పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. నిందితుల కోసం గాలించనప్పటికీ ఫలితం దక్కలేదు. సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నాలుగు నిమిషాల్లో 27 కత్తి పోట్లు పక్కా పథకంతో రోడ్డుకు ఇరువైపులా నుంచి మారణాయుధాలతో వచ్చిన›పత్యర్థులు నాగరాజుపై అతి కిరాతకంగా దాడి చేశారు. మెడ, తల, శరీర భాగాల్లో బలంగా నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రాణం విడిచాడని నిర్ధారించుకున్న తరువాతే సంఘటన స్థలం నుంచి కదిలారు. ముస్లింల దుస్తుల్లో ఉన్న ముగ్గురు, మరో మైనర్ బాలుడు సంఘటనలో పాలుపంచుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరించారు. సోమవారం మృత దేహాన్ని పోస్టుమార్టం చేసిన సమయంలో శరీరంపై ఉన్న 27కత్తిపోట్లు, వేళ్లు తెగిపడిఉంటాన్ని పోలీసులు గుర్తించారు. ఇటీవల జైలు నుంచి విడుదల మృతుడు నాగరాజు ఎస్ఆర్కేటీ కాలనీలో మూడు నెలల కిందట జరిగిన పాల వ్యాపారి మాతంగి కన్న హత్య కేసులో నిందితుడిగా ఉండి గత మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో పాటు నాగరాజుపై రెండు హత్య, మూడు హత్యాయత్నం, మరో ఐదు దాడి, బెదిరింపుల కేసులు ఉన్నాయి. అయితే, వాటన్నింటినీ కొట్టివేయగా ప్రస్తుతం పాల వ్యాపారి హత్య కేసు మాత్రమే పెండింగ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. ఎస్ఆర్కేటీ కాలనీలో గతంలో జరిగిన రేషన్ డీలర్ హత్య కేసులో నాగరాజు ప్రధాన నిందితుడు. మృతుడి సోదరుడు నాగరాజును అంతమొందించేందుకు గతంలో రెండుసార్లు పథక రచన చేసి విఫలమయ్యాడు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు రాజీ పడటంతో కేసు గత ఆరునెలల కిందట కొట్టేశారు. ఈ క్రమంలో ప్రత్యర్థులు నాగరాజును కిరాయి మనుషులతో హత్య చేయించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
నేను చచ్చిపోతున్నా...
సారంగాపూర్(జగిత్యాల): ‘అమ్మ కు డబ్బులు పంపలేకపోతున్నాను. మా అమ్మను, నాన్నను, తమ్ముణ్ణి బాగా చూసుకోండ్రి’ అం టూ మిత్రులకు వాట్సాప్ మేసేజ్ పంపి గల్ఫ్‌లోని దోహా ఖతార్‌లో జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సారంగాపూర్ మం డలం పెంబట్లకు చెందిన తోట నాగరాజు (24) స్వగ్రామం మంచిర్యాల జిల్లా బాదంపల్లి. నాగరాజు దోహ ఖతార్‌కు ఐదేళ్లుగా వెళ్లి వస్తున్నాడు. నాగరాజుకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు శంకర్, కళావతి సంబంధం కూడా చూసి పెట్టారు. అక్కడ వాహనాల క్లీనిం గ్ పనులు చేసే నాగరాజుకు కం పెనీ నెలకు 500 దిర్హమ్స్ (రూ.8779) చెల్లించాలి. కానీ, మిషన్లు చెడిపోయాయంటూ నెల కు 100 దిర్హమ్స్(రూ.1756) ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారం రాత్రి తాను పనిచేసే చోటే ఉరేసుకొని ఆత్మ హత్య చేసు కున్నాడు. అంతకు ముందు మిత్రులకు వాట్సాప్ వాయిస్ ద్వారా తన ఆత్మహత్యకు గల కారణాలను పంపాడు. -
ప్రియుడి మోజులో భర్తనే హత్య చేయించింది
-
ప్రియుడికి సుపారీ ఇచ్చి భర్త హత్య
చౌటుప్పల్: ప్రియుడి మోజులో పడిన ఓ భార్య కట్టుకున్నోడిని కడతేర్చింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడికే సుపారీ ఇచ్చి హత్యకు పన్నాగం పన్నింది. ఈ కేసులో మృతుడి భార్యతోపాటు ఆమె ప్రియుడు, అతని ముగ్గురు మిత్రులను అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో శుక్రవారం డీసీపీ రామచంద్రారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఆరేళ్ల క్రితం వివాహం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాలకు చెందిన కమ్మరి నాగరాజు (35)కు బేగంపేటకు చెందిన జ్యోతి(22)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి జీవన(4), యశ్వంత్(2) సంతానం. నాగరాజు కర్మన్‌ఘాట్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే మూడు నెలల నుంచి భార్య జ్యోతిలో మార్పును గమనించిన నాగరాజు విషయాన్ని పసిగట్టాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో భర్తను హత్య చేయాలని ఆమె పథకం రచించింది. పెళ్లికి ముందే సంబంధం వివాహానికి ముందు నాచారంలో జరిగిన బంధువుల వివాహానికి జ్యోతి వెళ్లింది. అక్కడ కార్తీక్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమ గా మారి, వివాహేతర బంధానికి దారి తీసింది. విషయం తెలిసిన జ్యోతి తల్లిదండ్రులు కూతుర్ని నాగరాజుకిచ్చి వివాహం చేశారు. మూడు నెలల క్రితమే ఫోన్ నంబరు జ్యోతి మూడు నెలల క్రితం ప్రియుడు కార్తీక్ సెల్ నంబరును సేకరించింది. అప్పటి నుంచి తరచూ మాట్లాడుతుండేది. అప్పుడప్పుడు నేరుగా వెళ్లి కలసి వచ్చేది. ఈ క్రమంలో భార్యకు కార్తీక్‌తో వివాహేతర సంబంధం ఉందని నాగరాజు గుర్తించాడు. పద్ధతి మార్చుకొమ్మని ఆమెను మందలించాడు. పాలల్లో నిద్ర మాత్రలు కలిపి.. ఈ నేపథ్యంలో భర్త హత్యకు జ్యోతి పథక రచన చేసి.. దాని అమలు బాధ్యత ప్రియుడికి అప్పగించింది. ఇందు కు కొంత సుపారీని సైతం ఇచ్చిం ది. దీంతో కార్తీక్ గత నెల 30న నిద్రమాత్రలు తెచ్చి ఇచ్చాడు. వాటిని జ్యోతి పాలలో కలిపి భర్తతో తాగించింది. గాఢ నిద్రలో ఉండగా ప్రియుడికి ఫోన్ చేసింది. అతను మరో ముగ్గురు మిత్రులతో వచ్చాడు. వీరు అర్ధరాత్రి నాగరాజు ముఖంపై దిండు పెట్టి నులిమి హత్య చేశారు. నాగరాజు చనిపోయాడని నిర్ధారించుకున్న ఆ ఐదుగురు.. మృతదేహాన్ని ఓ అద్దె కారులో వేసుకుని చౌటుప్పల్ మండలం జిల్లేడుచెల్క శివారులో చెట్ల పొదల్లో పడేసి వెళ్లారు. మరునాడు సాయంత్రం స్థానికులు చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన పద్ధతిలో విచారణ చేయగా విషయం వెల్లడైంది. దీంతో హత్యలో భాగస్వాములైన జ్యోతి (21)తోపాటు నాచారానికి చెందిన మహం కాళి కార్తీక్(22), అతని మిత్రులు మహ్మద్ యాసిన్ (19), నదియాల్ దీపక్(24), సిర్రప్ప నరేశ్(23)లను అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ రామోజు రమేశ్, సీఐ నవీన్‌కుమార్ ఉన్నారు. -
భారత పవర్ లిఫ్టింగ్ జట్టు మేనేజర్‌గా నాగరాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి ఎం. నాగరాజ్ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆసియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్‌గా ఎంపికయ్యాడు. కేరళలోని అలెప్పీలో సోమవారం ఈ మెగా టోర్నీ ప్రారంభమైంది. ఈనెల 10 వరకు ఆసియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ జరుగుతుంది. భారత్ జట్టుకు సాయిరాం, నిత్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడ్డ లవర్స్
సాక్షి, హైదరాబాద్ : సెల్ఫీల మోజులో నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నా... సెల్ఫీల పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోనూ సెల్పీ ప్రేమికుల పాలిట శాపంగా మారింది. సెల్ఫీ తీసుకుంటుండగా.. లోయలో పడి ప్రేమికులు తీవ్రగాయాలయ్యాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మెహదీపట్నంకు చెందిన నాగరాజు, నిజామాబాద్‌కు చెందిన ప్రియాంక నార్సింగ్‌లోని ఓ ప్రముఖ స్టోర్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మంగళవారం ఉదయం... వీళ్లద్దరు బండ్లగూడలోని కాళీమందిర్ గుడికి వెళ్లారు. గుడి సమీపంలోని ఎత్తైన కొండలు చేరుకుని సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు. సెల్ఫీ తీసుకుంటుండగా... పట్టుతప్పి లోయలో పడిపోయి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రేమికులిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రమాదవశాత్తు రైలుకింద పడి ప్రయాణికుడి మృతి
గుంతకల్లు: రన్నింగ్‌లో ఉన్న రైలు ఎక్కుతూ జారిపడి ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లుకు చెందిన నాగరాజు (53) ధర్మవరంగేట్ రోడ్డులో ఓ గోల్డ్ స్మిత్ షాపులో పని చేసేవాడు. నాగరాజు శనివారం ఉదయం తన సొంత పని నిమిత్తం బెంగళూరు వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు టిక్కెట్ తీసుకున్నాడు. అప్పటికే రన్నింగ్‌లో ఉన్న రైలును ఎక్కడానికి వెళ్లి ప్రమాదవశత్తు జారి రైలు కిందకు పడ్డాడు. ఈ ప్రమాదంలో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డ నాగరాజును 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరిలించారు. రక్తం ఎక్కువగా పోవడంతో ఆయన చిక్సిత పొందుతూ మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయన లేని జీవితంలో నేనుండలేను...
♦ భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య ♦ బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని సూసైడ్ నోట్ మంథని: విధి ఆకుటుంబాన్ని వెంటాడింది. నెలరోజుల క్రితం కుటుంబ యజమాన్ని గుండెపోటుతో మృతి చెందగా మనస్థాపానికి గురైన భార్య ఉరేసుకొని తనువు చాలించిన సంఘటన సోమవారం పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో చోటుచేసుకుంది. మంథనిలోని గాంధీచౌక్‌కు చెందిన గుడిమల్ల నాగరాజు(44) గతనెల 26న గుండెపోటుతో మృతి చెందాడు. ఈయనకు భార్య స్వరూప(40), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే భర్త మరణంతో స్వరూప తీవ్రంగా కుంగిపోయింది. ఆయన లేని జీవితంలో నాకేందుకని నెలరోజులుగా మదన పడుతోంది. ఈ క్రమంలో సోమవారం తెల్ల వారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చెల్లి రమ్యను బాగా చదివించాలని, నీవు కూడా ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేసుకోవాలని పెద్దకూతురు శృతిని కోరుతూ సూసైడ్ నోట్ రాసింది. స్వరూప చిన్న కూతురు రమ్య బీటెక్, పెద్దమ్మాయి ఎంబీఏ చదువుతోంది. నెలరోజుల వ్యవధిలోనే అమ్మా..నాన్నలు దూరం కావడంతో ఆ బిడ్డల రోదన మిన్నంటింది. ఈ సంఘటన చూపరులను కలిచివేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు. -
ఫేస్బుక్ కలిపింది ఇద్దరినీ...
- యువతి ఆదర్శ వివాహం -వరుడు దివ్యాంగుడు తుమకూరు (కర్ణాటక): ఫేస్బుక్ వేదికగా ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. ఆకాంక్షలు, ఆశయాల విషయాల్లోనూ ఇద్దరిదీ ఒకే బాట. ఈక్రమంలో వారి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారి చివరకు జీవితాంతం కలిసి ఉండేలా పెళ్లితో ఒకింటి వరాయ్యారు. ఈ ఘటన తుమకూరు జిల్లా, హులియురు సమీపంలో చేసుకుంది. తుమకూరు జిల్లాకు చెందిన నాగరాజుకు రెండు కాళ్లు సచ్చు పడ్డాయి. అయినప్పటికీ కుంగిపోకుండా డిగ్రీ పూర్తి చేశాడు. అదే సమయంలో కంప్యూటర్ శిక్షణ పూర్తి చేశాడు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. తర్వాత జిల్లా పంచాయతీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరాడు. అదే సమయంలో ఫేస్బుక్ ద్వారా చిక్కమగళూరు జిల్లాలోని కడూరు ప్రాంతానికి చెందిణ జ్యోతితో పరిచయం ఏర్పడింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జ్యోతికి తల్లిదండ్రులు లేరు. బంధువుల సహకారంతో తుమకూరులోని ఓ గార్మెంట్స్‌లో పనిచేస్తోంది. ఫేస్‌బుక్‌ద్వారా కాలక్రమంలో నాగరాజు, జ్యోతి స్నేహితులుగా మారారు. ఆశయాల విషయంలో ఇద్దరివీ ఒకే రకమైన అభిప్రాయాలు కావడం, పైగా ఇద్దరిదీ ఒకే కులం కావడంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు నాగరాజును చూసేందుకు వెళ్లారు. ఆయనకు రెండు కాళ్లు లేవనే విషయం తెలిసింది. అయితే తమ ప్రేమకు అంగవైకల్యం అడ్డుకాదని జ్యోతి పేర్కొనడంతో శుక్రవారం అంబారపుర సమీపంలోని కలగెరి ఈశ్వరుడి దేవాలయంలో వివాహం చేశారు. తాలూకా పంచాయతీ స్థాయి సమితి అధ్యక్షుడు ఏజెంట్ కుమార్, సమాజ పోరాట వాది దబ్బగుంటె రవికుమార్‌లు దంపతులను ఆశీర్వదించారు. -
వడదెబ్బతో ఇద్దరి మృతి
గుత్తి (గుంతకల్లు) : జిల్లాలో వడదెబ్బ సోకి శనివారం ఇద్దరు మృతి చెందారు. గుత్తిలోని బెస్తగేరికి చెందిన చెరుకు రాజు(52) వడదెబ్బ సోకి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. లారీ డ్రైవర్‌గా పని చేసే రాజు రెండ్రోజులుగా కర్నూలు-అనంతపురం మధ్య తిరిగినట్లు వివరించారు. శుక్రవారం సాయంత్రం ఇంటికొచ్చిన కాసేపటికే ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడన్నారు. ఆ వెంటనే వాంతులు, వీరేచనాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు సెలైన్ ఎక్కించి ఇంటికి పంపారు. అయితే శనివారం తెల్లవారుజామున నిద్రలోనే మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఉరవకొండ రూరల్ మండలంలో... ఉరవకొండ రూరల్ : మండలంలోని ఆమిద్యాలలో నాగరాజు(39) అనే కూలీ వడదెబ్బ సోకి మరణించాడని గ్రామస్తులు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరుకు కూలీ పనులకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో తనకు నీరసంగా ఉందంటూ ఒక్కసారి సొమ్మసిల్లిపడిపోవడంతో తోటి కూలీలు హుటాహుటిన ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య తిప్పమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
భర్త ఇంటి ముందు వధువు ఆందోళన
అనంతపురం సెంట్రల్ : ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. మంచి సంబంధం అనుకొని వివాహంతో ఒక్కటయ్యారు. పెళ్లై పట్టుమని ఐదు నెలలు కూడా గడవలేదు. అప్పుడే మనస్పర్థలు ఏర్పడ్డాయి. వేధిపులు తట్టుకోలేని వధువు భర్త ఇంటి ముందు బుధవారం ఆందోళన దిగింది. న్యాయం కోసం గంటల కొద్దీ బైఠాయించి నిరసన చేస్తున్నా పోలీసు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఈ ఘటన అనంతపురం విద్యుత్‌నగర్ సర్కిల్ సమీపంలోని కృపానందనగర్‌లో బుదవారం జరిగింది. పోలీసు శాఖలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వీరన్న కుమారుడు నాగరాజు వివాహం నార్పల మండలానికి చెందిన రంగప్ప కుమార్తె ఉషారాణితో గత ఏడాది డిసెంబర్ 11న అయింది. నాగరాజు మడకశిరలో బీఎస్ఎన్ఎల్ శాఖలో జేఈగా పని చేస్తున్నారు. ఉషారాణి ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. చూడ ముచ్చటగా ఉన్న ఈ జంట వైవాహిక జీవితం తొలినాళ్లలో ఎంతో అన్యోన్యంగా సాగింది. అయితే నాగరాజు మడకశిరలోనే ఉంటూ వారానికోసారి ఇంటికొచ్చి వెళ్లేవాడు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అత్త, మామతో పాటు ఆడపడుచులు కూడా ఇంట్లోనే ఉంటుండడంతో ఉషారాణిని సూటిపోటి మాటలతో వేధించేవారు. ఇప్పటికే రెండు, మూడు దఫాలు పంచాయితీలు కూడా చేశారు. భర్తకు చెప్పినా కుటుంబ సభ్యులకే మద్దతు పలుకుతుండడంతో వేధింపులు తాళలేని బాధితురాలు పుట్టింటివారితో కలసి భర్త ఇంటి ముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమెకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. అయితే పోలీసులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ కుమారుడు కావడంతోనే పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని బా«ధితురాలు ఉషారాణి, ఆమె తండ్రి రంగప్ప అన్నారు. అనంతరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ యల్లమరాజును కలసి జరిగిన అన్యాయాన్ని వివరించారు. -
సెటిల్మెంట్ వివాదంలో ఏజీపీ నాగరాజు
- ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులోనే వాదనలు - ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కోర్టుల్లో న్యాయపరిరక్షణ నిమిత్తం నియమితులైన ప్రభుత్వ సహాయ న్యాయవాదులు(ఏజీపీ) సైతం సెటిల్మెంట్లు చేస్తుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. కోర్టులో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఏజీపీ ఓ కేసులో పోలీసులతో కలిసి సెటిల్మెంట్ వ్యవహారంలో పాలుపంచుకుని, బాధితులను బెదిరించినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితులు హైకోర్టులో దాఖలు చేసిన కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజీపీ నాగరాజు పోలీసుల తరఫున వాదనలు వినిపించేందుకు గురువారం కోర్టుకు వచ్చారు. నాగరాజును బాధితులు గుర్తుపట్టి, ఇతనే తమను పోలీసులతో కలిసి బెదిరించినట్లు కోర్టు హాల్లోనే న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. తాను ఎవరినీ బెదిరించలేదని ఏజీపీ చెప్పగా, తమ వద్ద ఫొటోలతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయని పిటిషనర్లు కోర్టుకు నివేదిం చారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కృష్ణా జిల్లా ఎస్పీని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా అగిరిపల్లిలో పోలీస్‌స్టేషన్ నిర్మాణం నిమిత్తం సదరు పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్ డబ్బు వసూలు చేసి, దుర్వినియోగం చేశారని, దీనిపై ఫిర్యాదు చేసినందుకు తమపై తప్పుడు కేసులు బనాయించారని, ఈ కేసులో దర్యా ప్తును సీఐడీ లేదా సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అదే గ్రామానికి చెందిన పాలేటి వీఆర్ మహేశ్వరరావు, వేమూరి విల్సన్‌రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. ఈ నెల 22న నాగరాజు అగిరిపల్లికి వచ్చి, ఎస్ఐ డబ్బు డిమాండ్ చేయలేదని, తాము అతనికి డబ్బు ఇవ్వలేదంటూ కాగితాలపై సంతకాలు పెట్టాలంటూ తమను బెదిరించారని న్యాయమూర్తికి వివరించారు. ఈ కేసులోనే వాదనలు వినిపించేందుకు వచ్చిన నాగరాజును వారు గుర్తు పట్టి, అన్ని విషయాలను కోర్టుకు నివేదించారు. -
దొంగకు ఏడాది జైలు
నిందితుడు బళ్లారి వాసి గుంతకల్లు: ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగకు ఏడాది జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం మేరకు... గుంతకల్లు మున్సిపల్ పరిధిలోని పాతగుంతకల్లుకు చెందిన కురుబ ప్రకాశ్ ఇంట్లో గతంలో జరిగిన చోరీ కేసులో కర్ణాటకలోని బళ్లారికి చెందిన కురుబ నాగరాజు నిందితుడు. పోలీసులు నిందితుడ్ని గుర్తించి అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. గుంతకల్లు జూనియర్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి వాసుదేవరావు కేసు పూర్వపరాలు పరిశీలించారు. నేరం రుజువు కావడంతో దొంగకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున కేసును ఏపీసీ సుభాషిణి వాదిచారు. దొంగను చాకచక్యంగా పట్టుకోవడంలో శ్రమించి న టూటౌన్ ఎస్ఐ వలీబాష, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, కోర్టు కానిస్టేబుల్ వెంకటేశ్, కానిస్టేబుల్ పి.శ్రీనివాసులును డీఎస్పీ సీహెచ్ రవికుమార్ అభినందించారు. -
టీడీపీ నాయకుడి దౌర్జన్యం
బేతంచర్ల(కర్నూలు): అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని బేతంచర్ల గ్రామ పంచాయతీలో వాటర్‌మెన్‌గా పనిచేస్తున్న బి. నాగరాజు అనే వ్యక్తిని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తిరుమలేశ్ చౌదరీ తీవ్ర దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపానికి గురైన వాటర్‌మెన్ విషయాన్ని పంచాయతి కార్మికులతో చర్చించి అందరు కలిసి ధర్నాకు దిగారు. శనివారం విధులు బహిష్కరించిన కార్మికులు తిరుమలేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రాణం తీసిన 'ఫేస్బుక్' ఫొటో..
-
ప్రాణం తీసిన 'ఫేస్బుక్' ఫొటో..
హైదరాబాద్ (మీర్పేట్): ప్రేమ వేధింపులతో వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మీర్పేట్ ఠాణా పరిధిలోని ఓం సాయినగర్‌లో ఈ ఘటన జరిగింది. సీఐ రంగస్వామి కథనం ప్రకారం.. జిల్లెలగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఓం సాయినగర్‌లో గల విజయహోమ్స్‌లో నివాసం ఉండే విష్ణుమూర్తి కూతురు మమత(19) ఇంటర్ వరకు చదివి ఇంట్లో ఉంటోంది. ఈమెకు గాయత్రీనగర్‌లోని నివాసం ఉండే మహేశ్వరం నాగరాజు(26)తో పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతో మమతను పెళ్లి చేసుకుంటానని ఆమెతో పాటుగా వారి కుటుంబసభ్యులకు సైతం తెలిపాడు. అయితే మమత ఇంట్లో వీరి వివాహానికి అభ్యంతరం తెలిపారు. దీంతో మమత కూడా నాగరాజును వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో గతనెల 30న మమత పుట్టినరోజును పురస్కరించుకుని మమతతో కలిసి ఉన్న ఫొటోను నాగరాజు తన ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. ఇది గమనించిన మమత మనస్తాపానికి గురై శుక్రవారం సాయంత్రం వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతు శనివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని నాగరాజును అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. ఇష్టంలేని పెళ్లికి బలవంతపెట్టడాన్ని తాళలేక తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
ఆటో ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం
పెనుకొండ రూరల్ : మండలంలోని గుట్టూరు-మునిమడుగు మార్గంలో బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో గుట్టూరుకు చెందిన నాగరాజు(28) మరణించినట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు తమ స్వగ్రామం నుంచి అత్తగారి ఊరైన మునిమడుగుకు బుధవారం రాత్రి బైక్‌లో బయలుదేరాడన్నారు. మార్గమధ్యంలో మునిమడుగు నుంచి ఎదురొచ్చిన ఆటో ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చొరవ చూపి వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతునికి భార్య అనిత, కుమారుడు రితిక్ ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఐఏఎస్ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు
- లంచమివ్వనందుకే కేసు పెట్టారు - హత్య కేసులో ఐఏఎస్ డీవీ రావు ఆరోపణలు - జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పూర్తిగా అవినీతిమయం - నెలకు రూ.75 లక్షలు మామూళ్లుగా అందుతాయి - ఉన్నతాధికారులకూ వాటాలు వెళ్తాయని ఆరోపణ - ఇవన్నీ నిరాధార ఆరోపణలు: వెస్ట్‌జోన్ డీసీపీ సాక్షి, హైదరాబాద్: డ్రైవర్ బుక్యా నాగరాజు హత్య కేసులో పోలీసులు లంచం డిమాండ్ చేశారని, ఇవ్వనందుకే తనను కేసులో ఇరికించారని ఐఏఎస్ అధికారి దారావత్ వెంకటేశ్వర రావు (డీవీ రావు) ఆరోపించారు. అసలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ అవినీతిమయమని తనకు తెలిసిందని, నెలకు రూ.75 లక్షల దాకా మామూళ్లు అందుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీవీ రావు మాట్లాడిన వీడియో దశ్యాలు బుధవా రం మీడియాకు అందాయి. అయితే ఈ ఆరోప ణలు నిరాధారమని, డీవీ రావుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ వెస్ట్జో న్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కావాలనే ఇరికించారు! మీడియాకు అందిన వీడియోలో డీవీ రావు పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఆ రోజు ఏం జరిగిందో చెప్పాలని పోలీసు స్టేషన్లో నా కుమారుడిని అడిగాను. మద్యం తాగుదామని నాగరాజు తీసుకువెళ్లడం నుంచి చివరి వరకు అన్నీ చెప్పాడు. మద్యం మత్తులో మిస్ బిహేవ్ (తప్పుడు ప్రవర్తన), మిస్ అండర్స్టాండింగ్ (తప్పుగా అర్థం చేసు కోవడం) వల్ల ఈ హత్య జరిగింది. నేనే నా కుమారుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి అప్పగించా. కానీ అధికారులు నన్ను డబ్బు డిమాండ్ చేశారు. ఇవ్వలేదని నన్ను కేసులో ఇరికించారు. సుకత్ ఒక్కడే అపార్ట్మెంట్ వద్దకు వెళ్లాడు. కానీ నేను ఆ అపార్ట్మెంట్ వద్ద ఉన్నానని పోలీసులు అంటున్నారు. ఏ తండ్రి అయినా కుమారుడిని శవం తీసుకురమ్మని పైకి పంపిస్తాడా..? డబ్బు ఇవ్వనందుకే పోలీసులు నాపైనా కేసు పెట్టారు. నన్ను మూడు రోజుల పాటు పోలీసుస్టేషన్లో నిర్బంధించి.. భోజనం, నీళ్లు ఇవ్వకుండా వేధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చి వస్తానన్నా వదల్లేదు. కానిస్టేబుల్, ఎస్సై, సీఐలు ఏకమై ఇలా ఓ ఐఏఎస్‌ను ఆపడానికి కారణం అవినీతి అధికారుల కుట్రే. దర్యాప్తు సంస్థలు దీనిపై దష్టి పెట్టాలి. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కొందరు మంచి వాళ్లూ ఉన్నారు. అక్కడికి ఎవరైనా ఏదైనా కేసులో వస్తే నాశనం అవుతారని వారు నాతో చెప్పారు. ఆ పోలీస్‌స్టేషన్‌కు నెలకు రూ.75 లక్షలు మామూళ్లు వస్తాయని.. పైఅధికారులకు కూడా ఇస్తామనీ చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో 40 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. కానీ మూడేళ్లుగా పనిచేస్తున్న జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బదిలీ కాలేదు. కేసుల్లో వచ్చిన వారి నుంచి భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారులకు ఇస్తారని, అందుకే బదిలీ చేయలేదని కొందరు చెప్పారు..’’అని డీవీ రావు వీడియోలో ఆరోపించారు. వ్యక్తిగత పరిచయంతోనే ఏసీపీ మాట్లాడి ఉండొచ్చు: డీసీపీ డీవీ రావువి నిరాధార ఆరోపణలని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పంజాగుట్ట ఏసీపీ వ్యక్తిగత పరిచయంతోనే డీవీ రావుతో మాట్లాడి ఉండొచ్చని, దీనిపై ఆరా తీస్తామని చెప్పారు. పోలీసు కస్టడీలో ఉన్న డీవీ రావుకు సంబంధించి బయటకు వచ్చిన ఈ వీడియోలను ఆయన భార్య రికార్డు చేసినట్లు తెలుస్తోందని, దీనిపైనా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. డీవీ రావును ఎవరూ డబ్బు డిమాండ్ చేయలేదన్నారు. దర్యాప్తుకు సహకరించకపోవడంతోనే డీవీ రావును అదుపులో ఉంచుకోవాల్సి వచ్చిందని.. ఆయన పాత్రపై ఆధారాలు లభించాకే అరెస్టు చేశామని వివరించారు. కానీ ఆయన తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాగా.. ఈ కేసులో నిందితులు వెంకట సుకత్ (19), డీవీ రావులను పోలీసులు బుధవారం నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రెండు వారాలు రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ఐఏఎస్ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు
-
ఓర్వలేకనే దాడులకు పాల్పడుతున్నారు
వైఎస్సార్సీపీ రామగిరి మండల కన్వీనర్ నాగరాజు అనంతపురం సప్తగిరి సర్కిల్:రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక పార్టీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ రామగిరి మండల కన్వీనర్ నాగరాజు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై దాడికి కుట్ర పన్నారన్నారు. తనపై దాడి జరిగితే ఇందుకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌దే బాధ్యతన్నారు. పేరూరు వద్ద సుజ్లా¯ŒS కంపెనీ వారు రైతుల వద్ద తీసుకున్న భూములకు నష్టపరిహారం చెల్లించకుండా అడ్డుపడుతున్నారన్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అధికార పార్టీ వారే తమ పొలాల్లోని చెట్లను నరికేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. పోలీసులు కూడా వారికి తొత్తు లుగా వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కేశవనారాయణ మాట్లాడుతూ హంద్రీ నీవా కాలువ పనులను దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 90 శా తం పూర్తి చేయగా, టీడీపీ నాయకులు 2 శాతం పనులను చేసి అంతా తామే చేశామని ప్రజలను నమ్మించే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. వచ్చిన నీటిని వినియోగించడంలోను అధికారులు, అధికార పార్టీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చిన్న పెద్దన్న మాట్లాడుతూ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎస్సీలకు పంచిన భూములను తిరిగి లాగేసుకుంటున్నారన్నారు. -
కశ్మీర్లో తెలుగు జవాను మృతి
దత్తిరాజేరు(విజయనగరం): దేశ రక్షణలో భాగంగా జమ్ముకాశ్మీర్‌లో పహారా కాస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన ఆర్మీ జవాన్ మంచు చరియలు విరిగిపడి మృతిచెందాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు(25) ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నాడు. ఈక్రమంలో జమ్ము కాశ్మీర్లో విధులు నిర్వహిస్తుండగా.. మంచు కొండ చరియలు విరిగిపడటంతో.. మృతిచెందాడని ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. నాగరాజుకు ఏడాది క్రితమే సమీప బంధువు అనూషతో వివాహం జరిగింది. రాజు మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వలస కూలీ దుర్మరణం
రాయదుర్గం రూరల్ : జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక పొట్టకూటికి పొరుగు రాష్ట్రానికెళ్లిన ఓ భవననిర్మాణ కూలి శుక్రవారం బెంగళూరులోని ఓ ఐదంతస్తుల భవనం నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు .. రాయదుర్గం మండలం ఆయతపల్లి గ్రామానికి చెందిన హరిజన నాగరాజు (30), రుద్రమ్మ దంపతులు. వీరికి ఐశ్వర్య, దీపిక సంతానం. అయితే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నాగరాజు తన పిల్లల్ని అన్న వన్నూరుస్వామి వద్ద వదిలి భార్యతో కలిసి రెండు నెలల క్రితం బెంగళూరు వలసవెళ్లాడు. అక్కడ భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా చేరారు. అయితే శుక్రవారం ఓ భవనం వద్ద పనులు చేస్తుండగా నాగరాజు ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రుద్రమ్మ భర్త మృతదేహంపై పడి గుండెలవిసేలా రోధించింది. సమాచారాన్ని ఆయతపల్లి గ్రామంలో కుటుంబసభ్యులకు తెలపడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని వాహనంలో బెంగళూరు నుంచి ఆయతపల్లికి తరలించారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. ఉపాధి పనుల కోసం సూదూర ప్రాంతాలకు వలసలు వెళ్లి అనేక మంది నైపుణ్యం లేని కూలీలు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మడకశిర రూరల్: కర్ణాటక రాష్ట్రం తుమకూర్ జిల్లా మధుగిరి తాలుకాలోని మిడిగేశి సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మడకశిర మండలం కదిరేపల్లి గ్రామానికి చెందిన రంగప్ప కుమారుడు నాగరాజు(30) అక్కడిక్కడే మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడు బెంగళూరులోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తుండే వాడన్నారు. శనివారం మధ్యాహ్నం బైక్‌లో కదిరేపల్లి గ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలోని మిడిగేసి సమీపంలో పావగడ నుంచి తుమకూర్‌కు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నడంతో నాగరాజు మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
పట్టపగలే చోరీ
అనంతపురం సెంట్రల్ : నగరంలోని శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. బాధితులు తెలిపిన మేరకు... అశోకనగర్ రెండో క్రాస్‌లో నాగరాజు, అనిత దంపతులు నివాసముంటున్నారు. నాగరాజు వ్యక్తిగత పని నిమత్తం చెన్నైకు వెళ్లాడు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అనిత అదేకాలనీలో నిర్మాణంలో ఉన్న సొంత ఇంటి వద్దకు వెళ్లింది. అరగంట తర్వాత తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. దుండగులు బీరువా తలుపులు పగలకొట్టి అందులో 20 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2లక్షలు నగదు చోరీ చేసినట్లు గుర్తించింది. వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ రంగయాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
బస్సులపై రాళ్ల దాడులు
► 24 బస్సులు ధ్వంసం ►నలుగురికి తీవ్ర గాయాలు ► వరుస దాడులతో అలజడి తిరువళ్లూరు: అర్ధరాత్రి అకతారుులు ప్రభుత్వ, ప్రరుువేటు ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడుల్లో ఐదు ప్రభుత్వ బస్సులు సహా 24 బస్సుల అద్దాలు ద్వంపమయ్యారుు. ఒకే రాత్రి 24 బస్సులపై దాడి జరిగిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించగా దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. శ్రీపెరంబదూరు నుంచి తిరువళ్లూరు వైపు అర్ధరాత్రి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న మినీ వ్యాన్‌పై ద్విచక్ర వాహనంలో వెళ్లినన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేసి అద్దాలు ద్వంశం చేశారు. అధేవిధంగా శ్రీపెరందబూరు సమీపంలోనీ క్రాస్‌రోడ్డు,సెంగాడు, ఎగువనల్లాటూరుతో పాటు పలు ప్రాంతా ల్లో గుర్తు తెలియనీ వ్యక్తులు రాళ్ల వర్షం కురిపించడంతో దాదాపు పది బస్సులు ద్వంసమయ్యాయరుు. దీంతో పాటు తిరువళ్లూరు నుంచి పూందమల్లి వైపు వెళుతున్న తిరుపతి-చెన్నై మార్గంలో నడిచే 201 బస్సుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లవర్షం కురిపించడంతో ఐదు బస్సులు ద్వంశమయ్యారుు. అరణ్‌వాయల్, మనవాలనగర్, నేమం వద్ద దాడులకు ఒడిగట్టారు. ఇదే విధంగా కాకలూరు. తొయ్యూర్, వేపంబట్టు వద్ద కూడా గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై దాడులు చేసి అద్దాలు ద్వంసం చేశారు. ఈ సంఘటనలో ప్రరుువేటు బస్సు డ్రైవర్ మునివేల్ సహ పలువురు గాయపడ్డారు. అర్ధరాత్రి బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు దాడి చేయడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దాడులు వారి పనేనా: అరుుతే దాడులు చేసిన వ్యక్తులు ఎవరై ఉంటారన్న దానిపై గుమ్మతుగా విచారణ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఉగ్రవాదానికి నాగరాజు వ్యతిరేఖంగా మాట్లాడిన హిందూ ఐక్యవేదిక నేతలు మంగళవారం భారీ నిరాహరదీక్ష చేపట్టారు. ఈ నిరాహరదీక్షలో మాట్లాడిన పలువురు ఒక వర్గంలోని యువకులు జీహాద్ పేరిట ఉగ్రవాదులుగా మారుతున్నారనని ఆరోపణలు చేశారు. ఇకపై హిందువులపై దాడులు చేస్తే ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హిందువుల నిరాహరదీక్ష, ముస్లింలపై మాట ల తూటాలతో ఆగ్రహించిన కొందరు మంగళవారం రాత్రి బస్సులపై దాడులకు దిగి వచ్చి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు విచారణనూ ముమ్మరం చేశారు. పోలీసులు ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ శ్యామ్సన్ మీడియాకు వివరించారు. -
‘పక్షిబొమ్మల’ నాగరాజుకు రాష్ట్రస్థాయి పురస్కారం
దేవీచౌక్ : తెల్లకరత్రో పక్షి బొమ్మలను తయారు చేసే మల్లేడ నాగరాజు రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల నాలుగో తేదీన లేపాక్షి ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న ఒక కార్యక్రమంలో నాగరాజు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా బుధవారం నాగరాజు ‘సాక్షి’తో తన వృత్తి అనుభవాలు ఇలా పంచుకున్నారు. ‘‘రాజమహేంద్రవరం మల్లికార్జుననగర్‌లో మా నివాసం. మా తండ్రి కొయ్యతో అందమైన పక్షి బొమ్మలను తయారు చేసేవారు. ఆయనే నాకు ఈ వృత్తిలో గురువు. మూడు దశాబ్దాలుగా నేను దారుకొయ్యతో పక్షుల బొమ్మలను తయారు చేస్తున్నా. ఈ బొమ్మలకు మార్కెట్లో ఆదరణ ఉంది. ఇటీవల నగరంలో లేపాక్షి నగర శాఖ నిర్వహించిన ప్రత్యక్ష తయారీ, ప్రదర్శన, అమ్మకాలలో నా బొమ్మలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. నగరశాఖ మేనేజర్ షేక్సిరాజుద్దీన్ నా కళను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. నా కుటుంబసభ్యులు కూడా వృత్తిలో సహకరిస్తున్నారు. లేపాక్షి హస్తకళల సంస్థ ఆధ్వర్యంలో ఈనెల నాలుగో తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.’ -
అప్పుతీర్చే మార్గం కనిపించక..
శాలిగౌరారం : రెండేళ్ల కిత్రం అనారోగ్యంతో తండ్రి మృతి.. ప్రస్తుతం తల్లి కూడా ఆరోగ్యం బాగాలేక కదలలేని పరిస్థితి.. ఇంట్లో పెళ్లీడుకొచ్చిన చెల్లి.. వీటితో ఒక పక్క కుటుంబ భారం.. మరో పక్క ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు.. వాటిని జయించేందుకు విద్యను మధ్యలోనే మానేసి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు అక్కెనపల్లి నాగరాజు (27). కానీ సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా దెబ్బతినడంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఇటుకులపహాడ్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన అక్కెనపల్లి నాగరాజు (27)కు గ్రామంలో నాలుగున్నర ఎకరాల వ్యవసాయ మెట్టభూమి ఉంది. ఉన్న వ్యవసాయ భూమిలో రెండేళ్లుగా పత్తి పంటను సాగు చేస్తూ వస్తున్నాడు. దాంతో నష్టం వచ్చింది. అయినా ఈ ఏడాది కూడా మళ్లీ పత్తిసాగు చేశాడు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు నీరు నిలవడంతో పంట మొత్తం ఎర్రబారింది. దీనికి తోడు తెగులు సోకింది. దీంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గింది. తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటికే సుమారు రూ. 10 లక్షలు అప్పు చేశాడు. చేసిన అప్పులు పెరిగిపోవడం, కుటుంబ పోషణ భారం కావడంతో ఆయన కొద్ది రోజులుగా తీవ్ర మనోవేధనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో నాగరాజు భార్య ఉమ తమ పిల్లలతో కలిసి దీపావళి పండుగ కోసం తల్లిగారింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అది గమనించిన నాగరాజు చెల్లెలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి ద్విచక్ర వాహనంపై నకిరేకల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో 108 వాహనం కలిసింది. దాంట్లో నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నాగరాజుకు వైద్యులు చికిత్స చేస్తుండగానే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సోమవారం మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చారి తెలిపారు. -
గోడ కూలి ఇద్దరు మృతి
-
ప్రమాదవశాత్తు గోడ కూలి ఇద్దరు మృతి
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం అయినాలవారిపాలెం గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి వేరొకరికి అమ్మేశాడు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ ఇంటి సామగ్రిని తరలించేందుకు కూలీలను పురమాయించాడు. ఈ క్రమంలో కూలీలు గోడను కూలగొడుతున్నారు. అయితే, అకస్మాత్తుగా గోడకూలి ఇద్దరు కూలీలపై పడింది. తోటివారు వారిని శిథిలాల నుంచి తొలగించేసరికే చనిపోయి ఉన్నారు. మృతులను నరేంద్రపురం శివారు బూరుగుకుంట గ్రామానికి చెందిన గుమ్మడి నాగరాజు(40), ముంగండ గ్రామానికి చెందిన మట్టపర్తి వెంకన్న(35)గా గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. -
ఏలూరు కలెక్టరేట్ ఎదుట కలకలం
పోలీసులు వేధింపులు తాళలేక ఓ యువకుడు కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన అచ్యుత నాగరాజు సోమవారం ఏలూరు కలక్టర్ కార్యలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద లభించిన సూసైడ్ నోట్లో సమిశ్రగూడెం ఎస్సైతో పాటు మరో పది మంది తమను వేధింపులకు గురిచేస్తున్నారని.. అందుకే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉంది. మా చావుకు సమిశ్రీగూడెం ఎస్సై, ముప్పిడి మంగయ్య, దండుబోయిన నాగలక్ష్మీ, అక్రమ్, పి. మల్లేశ్వర్రావు, సుబ్బరాయుడు, విష్ణు, తోట రమేష్, తోట మంగ కుటుంబ సభ్యులే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తాడేపల్లి వద్ద రౌడీ షీటర్ హత్య
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరు వద్ద గుర్తుతెలియని దుండగులు రౌడీ షీటర్‌ను హత్య చేశారు. కొల్లూరు గ్రామానికి చెందిన నాగరాజు అనే రౌడీ షీటర్‌ను హతమార్చి గోనె సంచిలో వేసి కృష్ణానదిలో పడేశారు. నదీ తీరంలో గోనెసంచిని గమనించిన స్థానికులు మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి గోనెసంచి విప్పగా అందులో మృతదేహం కనిపించింది. మృతదేహం కొల్లూరుకు చెందిన నాగరాజు అనే రౌడీ షీటర్దిగా గుర్తించారు. దుండలుగు హత్యచేసి గోనెసంచిలో కుక్కి నదిలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
సబ్సిడీ రుణాలు విడుదల చేయాలి
మహబూబ్‌నగర్ అర్బన్ : ఎస్సీ నిరుద్యోగ సబ్సిడీ రుణాల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు మిట్టమీది నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కేవలం పైరవీకారులు, రాజకీయ పలుకబడి ఉన్న వారికే రుణాలు అందిస్తున్నారని విమర్శించారు. బ్యాంక్ మేనేజర్లు రుణాల మంజూరులో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం ఎక్కడా కనిపించడం లేదన్నారు. దళితులపై దాడులు పెరిగాయని, అరికట్టకపోవడం దురదృష్టకరమన్నారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1.50 లక్షలు విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఓ భక్తుడు బుధవారం రూ.1,50,000 విరాళంగా అందజేశారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెంకు చెందిన కందుకూరి నాగరాజు విరాళం మొత్తాన్ని కందుకూరి విశ్వనాథ్ పేరున జమచేశారు. దాతను ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు అభినందించి విరాళం బాండ్ అందజేశారు. -
సివిల్ జడ్జి ఇంట్లో చోరీ
మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ జడ్జి నాగరాజు ఇంట్లో దొంగలు పడి బీభత్పం సృష్టించారు. జడ్జి కుటుంబసభ్యులు ఊరు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు మిర్యాలగూడ పోలీసులు క్లూస్ టీమ్‌తో చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. జడ్జికి సమాచారం ఇచ్చారు. జడ్జి కుటుంబసభ్యులు వస్తేకాని ఎంతమేర చోరీ జరిగిందనే విషయం తెలియదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫుట్‌బాల్ లీగ్ ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా వ్యాప్తంగా ఫుట్‌బాల్ లీగ్ ప్రారంభమైంది. ఫుట్‌బాల్ సంఘం జిల్లా నూతన కార్యదర్శి నాగరాజు జిల్లాలోని ఆత్మకూరులో జరిగిన లీగ్ పోటీలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికే పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్డీటీ సహకారంతోనే నిర్వహించే ఈ పోటీలు ఫిబ్రవరి వరకు కొనసాగుతాయని చెప్పారు. పోటీలను స్పెయిన్ శిక్షకుడు మికేల్, విజయభాస్కర్ పర్యవేక్షిస్తారన్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కోసం
డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవర్నెస్ నిర్వహిస్తూ వరంగల్ జిల్లా కొత్తపల్లికి చెందిన నాగరాజు నాన్‌స్టాఫ్ 50 గంటల సైకిల్ యాత్ర చందానగర్ డివిజన్లో ఆదివారం నిర్వహించారు. 26 ఆగస్టు నుండి ప్రారంభమైన సైకిల్ యాత్ర జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో కొనసాగించనున్నాడు. ఈ నేపథ్యంలో చందానగర్ డివిజన్‌కు వచ్చిన నాగరాజుకు స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. ఉదయం 7.30 గంటలకు చందానగర్ గాంధీ విగ్రహం వద్ద నాగరాజుకు స్వాగతం పలికారు. కాఫ్రా మొదటి డివిజన్ నుంచి ప్రారంభమైన నాన్‌స్టాఫ్ సైకిల్ యాత్ర నిద్ర, విశ్రాంతి లేకుండా 29 ఆగస్టు రాత్రి 12 గంటల వరకు కొనసాగుతోందని నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల అవర్నెస్ పోగ్రాం సైకిల్ యాత్ర ద్వారా తీసుకురావడం అభినందనీయమన్నారు. -
రేపల్లె సబ్‌జైలు నుంచి ఖైదీ పరారీ
రేపల్లె: గుంటూరు జిల్లా రేపల్లె సబ్‌జైలు నుంచి ఓ ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కళ్లుగప్పి కుంచాల నాగరాజు(26) అనే ఖైదీ బుధవారం సాయంత్రం తప్పించుకున్నాడు. నాగరాజు స్వస్థలం సత్తెనపల్లి మండలం బడుగుబండ గ్రామం. దొంగతనం కేసుల్లో 5 నెలల నుంచి రేపల్లె సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పరారైన ఖైదీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
పిల్లలు లేరని భార్యకు నిప్పు పెట్టాడు
పిల్లలు కలగలేదని భార్యపై కిరోసిన్‌పోసి నిప్పుపెట్టి హత్యాయత్నంచేసిన వ్యక్తికి స్థానికులు దేహశుద్దిచేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం బెంగుళూరులో జరిగింది. వివరాలు. చిత్తూరు జిల్లా రామకుప్పం గ్రామానికి చెందిన గురప్ప, సుశీలమ్మ దంపతుల కుమార్తె శ్రీదేవిని పుంగనూరుకు చెందిన న్యాయవాది నాగరాజుకు ఇచ్చి ఆరు సంవత్సరాల క్రితం పెళ్లిచేశారు. పిల్లలు కలగలేదన్న ఆగ్రహంతో నాగరాజు మంగళవారం ఉదయం భార్యపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. ఈ సంఘటనలో శరీరం తీవ్రంగా కాలడంతో ఆమెను బెంగుళూరులోని సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, బతకడం కష్టమని వైద్యులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులు బెంగుళూరులో నాగరాజును పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారిబారినుండి ఎలాగో తప్పించుకున్న నాగరాజు పరారయ్యాడు. ఈ విషయమై బాధితురాలి కుటుంబసభ్యులు పీఎస్ అగ్రహారం పోలీసులకు ఫిర్యాదు చేయడమేకాక ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుమార్తెపై హత్యాయత్నం చేసిన నాగరాజును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
వెంకట్రావుపేటలో అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య
కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నలిక నాగరాజు(30) అనే వ్యక్తి అప్పులబాధ తాళలేక ఊరి చివరన ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుమారు రూ.2 లక్షల అప్పు ఉన్నట్లు తెలిసింది. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టవరెక్కిన క్యాన్సర్ పేషెంట్
అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో మంగళవారం ఓ క్యాన్సర్ పేషెంట్ సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. గ్రామానికి చెందిన నాగరాజు(37) అనే వ్యక్తి కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోన్నాడు. క్యాన్సర్ వచ్చినా కుటుంబసభ్యులూ, బంధువులూ పట్టించుకోవటం లేదని మనస్తాపం చెందిన నాగరాజు మంగళవారం టవర్ పైకి ఎక్కి దూకుతానని బెదిరిస్తోన్నాడు. నాగరాజును కిందదించే ప్రయత్నం గ్రామస్తులు చేస్తోన్నారు. -
ఎస్బీ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న నాగరాజు
ఒంగోలు క్రైం : జిల్లా స్పెషల్ బ్రాంచి (ఎస్బీ) డీఎస్పీగా ఉప్పుటూరి నాగరాజు ఆదివారం విధుల్లో చేరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాయపాటితో పాటు నాగరాజులు ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రంవర్మను ఆయన చాంబర్లో కలిసి రిపోర్ట్ చేశారు. ఎస్పీతో కొంతసేపు ముచ్చటించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం వెంకటేశ్వరపాలేనికి చెందిన నాగరాజు 1991 ఎస్సై బ్యాచ్‌కు చెందినవారు. మొట్టమొదటగా ఎస్సైగా జిల్లాలోని నాగులుప్పలపాడులో బాధ్యతలు చేపట్టారు. అనంతరం మద్దిపాడు, కారంచేడు, చీరాల ఒన్‌టౌన్, ఒంగోలు ఒన్‌టౌన్, గిద్దలూరు టౌన్, నెల్లూరు జిల్లా నాయుడుపేట, సూళ్లూరుపేట ఎస్సైగా చేసి ఆ తర్వాత సీఐడీకి వెళ్లారు. 2010లో సీఐగా పదోన్నతి పొందారు. మొదటగా ఒంగోలు ఒన్‌టౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా రేపల్లె, ఒంగోలు ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వర్తించారు. 2014 జూలై 10న డీఎస్పీగా పదోన్నతి పొందారు. మొదటగా అనంతపురం, ఒంగోలు పీటీసీల్లో డీఎస్పీగా పనిచేశారు. ఒంగోలు పీటీసీ నుంచి బదిలీపై ఎస్బీ డీఎస్పీగా విధుల్లో చేరారు. -
లండన్ నుంచే కుట్ర !
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏళ్లనాటి కక్షల నేపథ్యంలో మంగళవారం రాత్రి ఏలూరు నగరంలో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. పెదవేగి మండలం పినకడిమిలో రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన రాజకీయ కక్షలు ఏలూరులోని జేకే ప్యాలెస్ యజమాని భూతం దుర్గారావును పొట్టన పెట్టుకున్నాయి. దరిమిలా ప్రతీ కారేచ్ఛతో హత్యల పరంపర కొనసాగుతుండగా.. ప్రత్యర్థి కుటుంబానికి చెందిన వారిని వేటాడేందుకు లండన్ నుంచి కుట్ర సాగుతోంది. ఏలూరులో తూరపాటి నాగరాజుపై చోటుచేసుకున్న కాల్పులకు సూత్రధారిగా భావి స్తున్న భూతం గోవింద్ దొరికితేగాని ఈ హత్యాకాండకు తెరపడదని పోలీ సులు భావిస్తున్నారు. అయితే, అతడిని పోలీసులు పట్టుకోగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా అతడు విదేశాల్లోనే ఉంటూ ప్రత్యర్థులను తుదముట్టించేందుకు ఎప్పటికప్పుడు పథకాలు వేస్తున్నాడని.. ఇందుకు పెద్దఎత్తున నిధులను సమకూరుస్తున్నాడని పోలీస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. తూరపాటి నాగరాజుపై మరోసారి హత్యాయత్నం జరగడంతో భూతం గోవిందు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. భూతం దుర్గారావు హత్యకు ప్రతీకారంగా 2014లో కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న భూతం గోవింద్ ఇప్పటివరకూ పోలీసులకు చిక్కలేదు. సింగపూర్, దుబాయ్, లండన్ దేశాల్లో చక్కర్లు కొడుతున్నట్టు అప్పట్లో ప్రచారం సాగింది. గోవింద్ లండన్ వెళ్లినట్టుగా అప్పట్లో విజయవాడ పోలీసులు గుర్తించారు. ఇంటర్‌పోల్ సాయం తీసుకుని, రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసినా అతడిని పట్టుకోలేకపోయారు. విదేశాల్లో పత్రికలు సైతం గోవింద్ జాడ గురించి ఆరా తీస్తున్నాయని అప్పట్లో విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇప్పటికీ అతడు లండన్ లోనే ఉన్నట్టు చెబుతున్నారు. పోలీసులతో ఉన్న సత్సంబంధాల కారణంగానే అతను తప్పించుకోగలుగుతున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. బతుకుదెరువు కోసం జాతకాలు చెప్పుకునే గోవింద్ దేశ, విదేశాల్లో తిరిగేంతగా నగదు, పెదవేగిలో 10 ఎకరాలు, పినకడిమిలో 50 ఎకరాలు, కొప్పాకలో 20 ఎకరాలు, కృష్ణాజిల్లా నూజివీడు సమీపంలోని దిగవల్లిలో 30 ఎకరాల మామిడితోట కలిపి మొత్తంగా వంద ఎకరాలకు పైగా స్థిరాస్తులు కూడబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గోవింద్ తన ఆర్థిక బలంతో విదేశాల్లోనే ఉంటూ ప్రత్యర్థులను మట్టుబెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. తూరపాటి నాగరాజుతోపాటు ఒక రాజకీయ నేతపై టార్గెట్ పెట్టిన గోవింద్ అది పూర్తయ్యే వరకూ పోలీసులకు దొరకడనే ప్రచారం సాగుతోంది. తూరపాటి నాగరాజుపై రెండోసారి హత్యయత్నం జరగడాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ సీరియస్‌గా తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను నియమించారు. పినకడిమిలోనూ గాలింపు జరిపారు. ఇటీవల ఓ పెళ్లి నిమిత్తం వచ్చినవారు ఆ తర్వాత వెళ్లిపోయారని, గోవింద్ వర్గానికి చెందిన మగవారెవరూ ఆ గ్రామంలో లేరని తేలింది. నేర చరిత్ర ఉన్న వారందరి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. గోవింద్ విజయవాడ పోలీసులతోపాటు హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులకూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వారి కేసుల దర్యాప్తు ఎక్కడివరకూ వచ్చిందనే విషయాన్ని ఇప్పటికే జిల్లా పోలీసులు ఆరా తీశారు. నాగరాజుపై కాల్పులకు తెగబడిన వారు దొరికితేగాని ఈ చిక్కుముడి వీడే అవకాశం కనబడటం లేదు. పోలీసులు ఇప్పటికైనా విదేశాల్లో చక్కర్లు కొడుతున్న గోవింద్‌ను పట్టుకుంటేనే ఈ హత్యాకాండకు ముగింపు పలికినట్టు అవుతుంది. జిల్లా పోలీసులు ఈ కేసు విషయంలో తమ సత్తా ఏ మేరకు చూపిస్తారో వేచి చూడాల్సిందే. -
ఏలూరులో కాల్పుల కలకలం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి. ఏలూరు వన్‌టౌన్ లోని వైఎంహెచ్ఏ వద్ద కురపాటి నాగరాజు అనే వ్యక్తిపై మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో నాగరాజుకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గత కొంత కాలం నుంచి నాగరాజు అజ్ఞాతంలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. పెదవేగి మండలం పినకమిడిలో మూడేళ్ల క్రితం జరిగిన బుతం దుర్గారావు హత్యకేసులో నాగరాజు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే 2014లో కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో నాగరాజుకు చెందిన అనుచరులను దుర్గారావు అనుచరులు దారుణంగా హత్యచేశారు. గతేడాది హైదరాబాద్ లోని సరూర్‌నగర్ లో నాగరాజుపై హత్యాయత్నం జరిగిన తర్వాత ప్రత్యర్థుల భయంతో అతడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. తాజాగా ఏలూరు టౌన్లో నాగరాజుపై కొందరు దుండగులు మంగళవారం రాత్రి దాదాపు తొమ్మిదిన్నర గంటల సమయంలో మరోసారి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. నాగరాజుపై నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పాత కక్షలతోనే నాగరాజుపై కాల్పులు జరిపి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పిడుగుపాటుకు ఇద్దరి మృతి
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో శుక్రవారం పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మయ్య పత్తిచేనులో విత్తనాలు నాటుతుండగా.. పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని తనికెళ్ల గ్రామానికి చెందిన నాగరాజు(28) గొర్రెలు మేపుతుండగా.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గొర్రెల మందను తోలుకొని చెట్టు కిందకు పరుగుతీశాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో.. నాగారాజు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో 10 గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. -
సబ్‌రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
వైఎస్సార్ జిల్లా మైదుకూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేసి అదనంగా ఉన్న నగదు రూ.65,198ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందని తమకు ఫిర్యాదులు అందడంతో దాడి నిర్వహించామన్నారు. సుధాకర్ అనే ప్రై వేటు వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులకు దళారీగా వ్యవహరిస్తూ వసూళ్లు చేస్తుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే కొంతమంది స్టాంపురైటర్ల వద్ద కూడా లెక్కకు మించి నగదు ఉండటమే గాక పాత తేదీలకు సంబంధించిన స్టాంపులు ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పూర్తి విచారణ అనంతరం సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. పెద్ద పప్పులూరు మండలం రామకోటి కాలనీలో చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. చేనేత కార్మికుడిగా కూలీ గిట్టుబాటు కాకపోవడం, ముడిసరుకు కోసం చేసిన రూ.4 లక్షల అప్పులు తీర్చలేక నాగరాజు 2015 నవంబర్ 29న పురుగులు మందు తాగి, ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని నాగరాజు భార్య మూడు సార్లు కలెక్టర్లను వేడుకున్నా పైసా సాయం అందలేదు. కనీసం రేషన్ కార్డు కూడా లేకపోవడంతో వితంతు పింఛన్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ తాను కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బికే గూడలో బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మూడు సెల్ఫోన్లు, రెండు ఎల్ఈడీ టీవీలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
గొడవ ఆపడానికి వెళ్తే కత్తి పోట్లు
అన్నదమ్ముల మధ్యలో జోక్యం చేసుకున్న పక్కింటి యువకుడు వారి చేతిలో కత్తిపోట్లకు గురయ్యాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణి కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు... బ్లాక్‌నెంబర్ 52లో శోభ అనే మహిళ తన కుమారులు నాగరాజు, మధుతో కలసి నివసిస్తోంది. మధు ప్లంబర్‌గా పనిచేస్తుండగా నాగరాజు మద్యం, గంజాయి వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ తల్లితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో నాగరాజు తల్లితో గొడవ పడుతుండగా తమ్ముడు మధు అడ్డుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో పక్కింట్లో ఉండే కిరణ్ వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. తమ గొడవలో ఎందుకు జోక్యం చేసుకుంటావని ఆగ్రహంతో కిరణ్‌పై నాగరాజు కత్తితో దాడి చేశాడు. కిరణ్ భుజం, చేతికి కత్తిపోట్ల కారణంగా గాయాలు కావడంతో అతడ్ని చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సును చేజ్ చేసి.. బ్యాగును పట్టుకొచ్చి..
మానవత్వం చాటుకున్న యువకుడు బస్సులో మరిచిపోరుున నగదు, ఆభరణాల బ్యాగు బాధితులకు అప్పగింత నల్లబెల్లి : పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు బయల్దేరిన దంపతులు ఆర్టీసీ బస్సులో నగదు, వెండి ఆభరణాలు ఉన్న బ్యాగును మరిచిపోరుు రోదిస్తుండగా.. ఆ బస్సును ఓ యువకుడు బైక్‌పై చేజ్ చేసి బ్యాగును తిరిగి తీసుకొచ్చి వారికప్పగించిన సంఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. వుండలంలోని బోల్లోనిపల్లి గ్రావూనికి చెందిన కోవూండ్ల మొగిళి -రాజేశ్వరి దంపతులు తమ వుూడో కువూర్తె శైలజ పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు ఓ బ్యాగ్‌లో రూ.10 వేలు, 15 తులాల వెండితో నర్సంపేట డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కి నల్లబెల్లికి బయల్దేరారు. వుండల కేంద్రానికి రాగానే వారు బస్సులోనే డబ్బులు, వెండి పెట్టిన బ్యాగ్‌ను వుర్చిపోరుు బస్టాండ్‌లో దిగారు. ఇంతలో బస్సు అక్కడి నుంచి నర్సంపేటవైపు వెళ్లిపోరుుంది. కొద్ది సవుయుం తర్వాత బ్యాగ్‌ను బస్సులో వుర్చిపోరుునట్లు గవునించిన దంపతులు మొగిళి- రాజేశ్వరి, వారి కువూర్తెలు శైలజ, సువులత విలపించసాగారు. అక్కడే ఉన్న వుండల కేంద్రానికి చెందిన రామిని నాగరాజు విషయుం తెలుసుకొని తన ద్విచక్రవాహనంపై బస్సును వెంబడిం చాడు. చివరికి నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ లో బస్సును నిలిపివేరుుంచి డ్రైవర్‌కు సవూచారమిచ్చారు. బస్సులో ఉన్న బ్యాగ్‌ను తీసుకె ళ్లి ఆ దంపతులకు నాగరాజు ట్రైనీ ఎస్సై స్వామి సవుక్షంలో అందించారు. దీంతో పోలీసులు నాగరాజును అభినందించారు. -
బావిలో పూడిక తీస్తూ ముగ్గురు మృతి
సిరుగుప్ప : సిరుగుప్ప తాలూకాలోని నాడంగ గ్రామంలో తాగునీటి కోసం బావిలోని పూడికను తీయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన సిరుగుప్ప పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. నాడంగ గ్రామంలోని బారిక రామణ్ణ కుమారులైన నాగరాజు(35), తిమ్మప్ప(32), బి.ఈరన్న కుమారుడు బి.బసవరాజు కూలీ పనుల నిమిత్తం బావిలోని పూడికను తీసేందుకు బావిలోకి దిగారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఊపిరాడక మృతి చెందినట్లు గ్రామస్తులు గుర్తించారు. సంఘటన స్థలానికి సిరుగుప్ప పోలీసులు చేరుకొని శవాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. -
లేరు కుశలవుల సాటి..
అన్నదమ్ముల అనుబంధంలో వారే మేటి లవకుశ సినిమా వచ్చి 53 ఏళ్లు. ఈ చిత్రంలో నటించిన లవకుశల ఆత్మీయానుబంధం వయసు కూడా అంతే. రక్తసంబంధం కంటే గొప్పది వీరి అనుబంధం. ఎక్కడొ పుట్టి...ఎక్కడో పెరిగినా... శ్రీరామరక్షతో అన్నదమ్ములయ్యారు. వర్ణాలు వేరైనా సీతమ్మ ఆశీస్సులతో ఒక్కటిగా పెరిగారు. అలా పెనవేసుకున్న వీరి అనురాగ గంగా ఐదు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. నటరత్న తారకరామారావు నటించిన చిత్రంలో వీరిద్దరే హీరోలు. పేర్లు వేరైనా నేటికీ లవకుశలుగానే జనహృదిలో నిలిచారు. దేవుడు కలిపిన ఈ అనుబంధంలో తలమునకలవుతున్నామంటున్న కుశుడు: నాగ సుబ్రహ్మణ్యం. లవుడు : నాగరాజు శ్రీరామనవమి సందర్భంగా సత్కారం అందుకునేందుకు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాల దొంతరలను సాక్షితో పంచుకున్నారు. సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువే.... కుశుడు (నాగ సుబ్రహ్మణ్యం) నేను అమలాపురంలో టైలరింగ్ పనిచేస్తున్నాను. ముగ్గురు అబ్బాయిలు. లవకుశ చిత్రం 1958లో మొదలై 1963లో పూర్తయింది. షూటింగ్ మొదలయ్యే నాటికి నా వయస్సు 11 సంవత్సరాలు. పూర్తయ్యాక 16 ఏళ్లు. ఆ ఐదేళ్లు మదరాసు కేసరి హైస్కూల్లో చదువుకున్నాను. లవకుశ తర్వాత సీతారామ కల్యాణం, వెంకటేశ్వర మహత్యం, వెలుగునీడలు చిత్రాల్లో నటించాను.అప్పట్లో 30 ఏళ్లు దాటితేనే హీరో వేషాలు వేయించేవారు. అందువల్ల నేను నా స్వగ్రామం అమలాపురం వచ్చేసి బుర్రకథలు చెప్పేవాడిని. 1955 నుంచే అంటే నా ఎనిమిదో ఏట నుంచే బుర్రకథలు చెప్పాను. మా నాన్నగారు ఉయ్యూరు సుబ్బారావు (కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీక్లబ్ వ్యవస్థాపకుల్లో ఒకరు) దగ్గర బుర్రకథ ఎలా చెప్పాలో నేర్చుకున్నాను. కాకినాడ మ్యాజెస్టిక్ టాకీస్‌లో నా ప్రదర్శనకు దర్శకుడు సి.పుల్లయ్య రావడం, నన్ను కుశుడి పాత్రకు ఎంపిక చేయడం యాదృచ్చికంగా జరిగింది. ఆ చిత్రం విడుదలై 53 ఏళ్లు అయినా నేటికీ మేమిద్దరం సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉంటున్నాం . షూటింగ్ సమయంలో పడిన కష్టాలు చెప్పుకుంటే ఇప్పుడు హాస్యాస్పదంగా ఉంటుంది. నా ఒంటికి నీలిరంగు పూసేటప్పుడు, కడిగేటప్పుడు మంటగా ఉండేది. లవకుశ మొట్టమొదట రంగుల చిత్రమే కాకుండా 'గేవా' రంగులతో చిత్రీకరించారు. ఓవర్ లైట్ భరించలేకపోయేవాళ్లం. అంత వేడిలో సొంత డైలాగులు చెప్పడం, పాటకు తగ్గట్లు నర్తించడం.... అది చెప్పరాని బాధ. వీటికి తోడు ఎన్టీ రామారావు, అంజలీదేవి వంటి అగ్రస్థాయి నటులతోనటించడం. ఆరునెలల పాటు రోజుకు రెండు గంటల పాటు వెంపటి పెద్దసత్యం, చినసత్యం గార్ల నాట్య శిక్షణ, బాణాలు వేయడంలో ప్రత్యేక శిక్షణాధికారి దగ్గర శిక్షణ ఇప్పించారు. పెద్దవాడైన కుశుడి పాత్రలో కొంత శాంత స్వభావం ఉంటుంది. లవుడిలో చురుకుదనం ఎక్కువ. నాలో ఉండే నెమ్మదితనం చూసి నన్ను కుశుడిగా, చురుకుగా ఉన్న నాగరాజును లవుడిగా ఎంచుకున్నారు. ఎప్పుడైనా మా ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చినా నేను పెద్దవాడిని కావడం వల్ల సర్థుకు పోతాను. అందువల్ల మా ఇద్దరి మధ్య మైత్రి ఇంకా లతలా పెనవేసుకుపోయింది. నేను చాలాకాలం తెరమరుగున ఉండిపోవడంతో చాలా మంది కుశుడు మరణించాడు అని ప్రచారం చేశారు. ఓ ఆంగ్లపత్రిక నన్ను గుర్తించి మళ్లీ ప్రపంచానికి పరిచయం చేసింది. 2006 నుంచి మళ్లీ నన్నంతా గుర్తిస్తున్నారు. నా కోసం ఆ పద్యాన్నే మార్చేశారు లవకుశ నాటకంలో నటించిన అనుభవం నాకు ఈచిత్రంలో నటించేందుకు బాగా ఉపయోగపడింది. లీలగారి చేత పాడించిన 'ఇనుడస్తాద్రిని...' పద్యానికి అనుగుణంగా నేను నటిస్తున్నప్పుడు పుల్లయ్యాగారు 'ఈ పద్యంలో కావాల్సినంత ఫోర్స్ రావట్లేదు' అన్నారు. వెంటనే నేను నాటకంలో పాడిన విధంగా పద్యం చదివి వినిపించాను. ఆయనకు బాగా నచ్చింది. ఘంటసాల గారు ఆ పద్యాన్ని వెంటనే మార్చి మళ్లీ పి.లీలగారితో పాడించారు. నా జీవితంలో అదొక మరపురాని సంఘటన. నటరత్న ఎన్టీఆర్‌కు అల్లుడైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పట్ల సానుకూలంగా స్పందించకపోవడం హాస్యాస్పదం. రూ. 40 లక్షల బడ్జెట్‌కు మేమే బేస్ : లవుడు నాగరాజు నేను ప్రస్తుతం పరిపూర్ణానందస్వామి నిర్మిస్తున్న గోమాత వైభవం' సిరియల్లో కపిల మహర్షి వేషం వేస్తున్నాను. నాకు ముగ్గురు ఆడపిల్లలు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.మా నాన్నగారు ఏవీ సుబ్బారావు సీనియర్ ( పల్లెటూరు పిల్ల, కీలుగుర్రం,పెద్ద మనుషులు చిత్రాల్లో నటించారు). చిత్తూరు నాగయ్య గారు అనుకోకుండా నన్ను చూశారు. ఆయన నిర్మిస్తున్న భక్త రమదాసు చిత్రంలో రఘురాముడి పాత్రకు నన్ను ఎంపిక చేశారు. అప్పుడు నా వయస్సు ఏడేళ్లు. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించాను. మా నాన్నగారు, సి.పుల్లయ్య గారు మిత్రులు కావడంతో ఆయన నన్ను తరచూ చూస్తుండేవారు. నాలోని చురుకుదనం చూసి నన్ను లవుడి పాత్రకు ఎంపిక చేశారు. మాకు డైలాగ్ డెలివరీ నుంచి, సుశీల -లీల గార్లు మాకు పాడిన పాటలకు లిప్ మూమెంట్ ఇచ్చేలా నటించే వరకూ శిక్షణ ఇచ్చారు. షూటింగ్ సమయంలో తెల్లవారుజామున 4.30కు కారు వచ్చేది. మేము 4 గంటలకు లేచి మా పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండేవాళ్లం. స్టూడియోకు వెళ్లి ఐదు గంటలకు మేకప్ వేసుకుని, షూటింగ్ స్పాట్‌కు 7 గంటలకు చేరుకుని ఫస్ట్ షాట్‌కు సిద్ధమయ్యేవాళ్లం. మళ్లీ రాత్రి తొమ్మిది గంటలకే మేకప్ తీయడం. సెట్-కు వెళ్లేసరికి మేమిద్దరం పాత్రలో లీనమైపోయేవాళ్లం. షూటింగ్ మొదలయ్యాక మాకు ద్రవ పదార్థాలు మాత్రమే ఆహారంగా ఇచ్చేవారు. రాత్రి షూటింగ్ పూర్తయిన తర్వాతే అన్నం పెట్టే వారు. ఆ తర్వాత హాయిగా నిద్రపోయేవాళ్లం. మా ఇద్దరిని బేస్ చేసుకుని రూ. 40 లక్షల బడ్జెట్‌తో ఈ చిత్రం తీశారు. అందుకు తగ్గట్టు నటించడంలో మా ఇద్దరికీ శక్తిసామర్థ్యాలు కలిగేలా చేసిన దర్శకుడు పుల్లయ్యగారికి మేం రుణపడి ఉంటాం. లవకుశ సినిమా తర్వాత కొన్నాళ్లు ఇద్దరం కలవలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు అమలాపురం వెళ్లినప్పుడు సుబ్రహ్మణ్యమే వచ్చి కలిశాడు. అప్పుటి నుంచి ఇద్దరం కలుస్తునే ఉంటాం. -
కొర్లాం వద్ద రోడ్డు ప్రమాదం..యువకుడి మృతి
గంట్యాడ మండలం కొర్లాం వద్ద రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై ఎస్.కోట నుంచి విజయనగరం వైపు వెళ్తున్న బైక్ అదుపుతప్పింది. బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందపడ్డారు. ఈ ఘటనలో ఎస్.కోటకు చెందిన ఎన్.నాగరాజు(25) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే నాగరాజు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హెల్మెట్ వినూత్న ప్రచారం
మలేసియా టౌన్షిప్: ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు మెదక్ జిల్లా జయదేవ్పూర్కు చెందిన నాగరాజు. ‘హెల్మెట్ ధరించండి... సీటు బెల్ట్ ధరించండి...మద్యం సేవించి వాహనం నడపవద్ద’నే సూత్రాలను తన శరీరంపై రాసుకొని శుక్రవారం వివిధ చౌరస్తాల్లో ప్రచారం చేశాడు. ఇలా స్వచ్ఛందంగా ప్రచారానికి వచ్చిన అతడిని పోలీసులు అభినందించారు. ముఖ్యమైన సందర్భాలలో ఇలా తన శరీరంపై రాసుకొని ప్రచారం చేయడం ఆయన హాబీ అని పోలీసులు తెలిపారు. -
మాకు రక్షణ కల్పించండి
సాక్షి, బెంగళూరు : తమకు రక్షణ కల్పించాల్సిందిగా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన ప్రేమజంట రాధిక(19), నాగరాజు వేడుకుంటున్నారు. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ గ్రామం వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి రాధిక బంధువులు నాగరాజు అమ్మతో పాటు బంధువులను ఇబ్బందులు పెడుతున్నారని వీరు చెబుతున్నారు. నాగరాజు తల్లితో పాటు అతని బంధువులపై కూడా భౌతిక దాడులకు దిగుతున్నారని ప్రేమికులు ఇద్దరూ బెంగుళూరులో ‘సాక్షి’తో వాపోయారు. ఈ విషయమై రాధిక మాట్లాడుతూ...‘మా అమ్మనాన్నలకు మా వివాహం ఇష్టమే. అయితే బంధువుల ఒత్తిడితో వారు మా పెళ్లికి అంగీకరించడం లేదు. ముఖ్యంగా టీడీపీ వారి అండతో మా చిన్నాన్న నాగభూషణం, పెదనాన్న గోపాల్ నాయుడు, మరో పెదనాన్న, సర్పంచ్ రామానాయుడుతో పాటు మామ ధనుంజయ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాగరాజు ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు స్థానిక పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. నాగరాజుతో పాటు వాళ్ల అమ్మ, చెల్లెలు, బావమరిదితో పాటు నాకు ఎటువంటి హాని జరిగినా వీరే కారణమవుతారు’ అని తెలిపింది. తాను మేజర్‌నని, తన ఇష్టపూర్వకంగానే నాగరాజుతో కలిసి ఇంటి నుంచి వచ్చేశానని చెప్పింది. నాగరాజును తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని రాధిక తన తల్లిదండ్రులు, బంధువులను కోరింది. -
మాకు రక్షణ కల్పించండి
బెంగళూరు: తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన ప్రేమజంట రాధిక(19), నాగరాజులు వేడుకుంటున్నారు. వివరాలు... జంతులూరు గ్రామానికి చెందిన రాధిక, నాగరాజులు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి రాధిక తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు అంగీకరించకపోవడంతో వీరిరువురూ గ్రామం వదలి వచ్చేశారు. అప్పటి నుంచి రాధిక బంధువులు నాగరాజు తల్లిని, ఆమె బంధువులను ఇబ్బందులు పెడుతున్నారని వీరు చెబుతున్నారు. నాగరాజు తల్లితో పాటు అతని బంధువులపై కూడా భౌతిక దాడులకు కూడా దిగుతున్నారని ప్రేమికులు ఇద్దరూ ‘సాక్షి’తో వాపోయారు. ఈ విషయమై రాధిక మాట్లాడుతూ...‘మా అమ్మనాన్నలకు మా వివాహం ఇష్టమే, అయితే బంధువల ఒత్తిడితో వారు మా పెళ్లికి అంగీకరించడం లేదు. ముఖ్యంగా అధికార టీడీపీ పార్టీ అండతో మా చిన్నాన్న నాగభూషణం, పెదనాన్న గోపాల్ నాయుడు, మరోపెదనాన్న, సర్పంచ్ రామానాయుడుతో పాటు మామ ధనుంజయ్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాగరాజు ప్రాణాలు తీయడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు స్థానిక పోలీసులు కూడా ఒత్తాసు పలుకుతున్నారు. నాగరాజుతో పాటు వాళ్ల అమ్మ, చెల్లెలు, బావమరదితో పాటు నాకు ఎటువంటి హాని జరిగినా వీరే కారణమవుతారు.’ అని పేర్కొన్నారు. తాను మేజర్‌నని తన ఇష్టపూర్వకంగానే నాగరాజుతో కలిసి ఇంటి నుంచి వచ్చేశానని రాధిక తెలిపారు. నాగరాజును తాను మనస్పూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని ఈ విషయాన్ని ఇంతటితో వదిలి వేయాలని రాధిక తన తల్లిదండ్రులు, బంధువులను కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మోపిదేవి మండలం వికలాంగుల కాలనీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన పూల కొండలు (22), పూల నాగరాజు (18) బైక్‌పై వెళుతుండగా మంగళవారం రాత్రి ఓ వాహనం ఢీకింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
700 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం
గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆటో నగర్లో నీలి కిరోసిన్ విక్రయిస్తుంటాడు. అతడి దుకాణంపై గురువారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేసి 700 లీటర్ల నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నాగరాజు తన సెల్‌ఫోన్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. సెల్‌ఫోన్ సహా కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. -
పెళ్లైన ఏడాదికే.. అనుమానాస్పద స్థితిలో మృతి
ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని సాగర్ రింగ్‌రోడ్డు తిరుమల నగర్‌లోని సాగర్ కాంప్లెక్స్‌లో బుధవారం అర్థ రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీలత(24)కు నాగరాజుతో ఏడాది క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున శ్రీలత అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని కనిపించింది. ఇది గుర్తించిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని పొట్టన పెట్టుకున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
టిప్పర్‌ను ఢీకొట్టిన బైక్: ఇద్దరి మృతి
ఇబ్రహీంపట్నం: రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం శివారులోని కెరళా హోటల్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం పెదలంకకు చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై ఇబ్రహీంపట్నం వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టారు. దీంతో బైక్ నడుపుతున్న నాగరాజు(28) అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. -
నకిలీ కందిపప్పు సీజ్.. 8 మంది అరెస్టు
ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని టకారిపాలెంలో 130 బస్తాల నకిలీ కందిపప్పును మంగళవారం అర్ధరాత్రి పోలీసులు సీజ్ చేశారు. కందిపప్పు పేరుతో సన్నటి పప్పును విక్రయిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అది నకిలీ పప్పుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా కిలో రూ.50కే విక్రయిస్తుండడం వారి అనుమానానికి బలం చేకూర్చేలా ఉంది. దీంతో కందిపప్పును సీజ్ చేశారు. తమకు ఆ పప్పు తమిళనాడులోని రాయవేలూరు నుంచి నాగరాజు అనే వ్యక్తి ద్వారా వచ్చినట్టు వారు విచారణలో తెలిపారు. దీంతో ఆ నిల్వలను విజిలెన్స్ విభాగానికి అప్పగించనున్నారు. -
స్ర్కూడ్రైవర్‌తో సైకో వీరంగం
సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యపేటలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన నాగరాజు మతిస్థిమితం లేకపోవడంతో అతని భార్య విడాకులు తీసుకుని వెళ్లి పోయింది. దీంతో ఉన్మాదిగా మారిన నాగరాజు శనివారం ఉదయం స్ర్కూడ్రైవర్ తీసుకుని స్థానిక చర్చిలోకి చొరబడ్డాడు. అక్కడున్న వారిని స్ర్కూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేస్తుండటంతో అంతా కలిసి అతడిని తాడుతో కట్టి, పోలీసులకు సమాచారం అందించారు. వారు నాగరాజును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
అనంతలో ఏఆర్ కానిస్టేబుల్ దందా
కాల్‌మనీ రాకెట్ అనంతలోనూ కోరలు చాచింది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ వడ్డీ దందాను భరించలేక టీచర్ల దంపతులు న్యాయం చేయాలంటూ మీడియాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పట్టణానికి చెందిన నాగరాజు, అతని భార్య టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరు ఏఆర్ కానిస్టేబుల్ అయిన సుధాకర్ నుంచి 2009లో రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వడ్డీ కింద రూ.5 లక్షలు చెల్లించారు. అయినా అప్పు తీరలేదు. శాలరీ అటాచ్‌మెంట్‌తో సుధాకర్ మరో రూ.85వేలు వడ్డీ గుంజాడు. మొత్తం రూ.6 లక్షలు వడ్డీ కిందే చెల్లించామని, ఇక అసలు కట్టలేమని నాగరాజు దంపతులు తేల్చి చెప్పారు. దీంతో సుధాకర్ మరికొంత మంది పోలీసులతో కలసి మూడు నెలల క్రితం బాధితుడి ఇంటికి వెళ్లి బెదిరించాడు. విషయం జిల్లా ఎస్పీకి తెలియడంతో టూటౌన్‌కు కేసు అటాచ్ చేశారు. దీనిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా, మరోవైపు సుధాకర్ రెండు రోజులుగా నాగరాజు దంపతులపై అప్పు విషయమై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. దీంతో తమకు న్యాయం చేయాలని నాగరాజు దంపతులు మీడియా ముందు వాపోయారు. -
యువకుడి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నాగరాజు(25) గత కొంతకాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కూడా వారిద్దరి మధ్య మరో మారు గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
బావ మరిది చేతిలో బావ హతం
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపరేవులలో సోమవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడంలేదంటూ భర్త నాగశేషుడు అత్తమామలపై దాడి చేశాడు. ఆ క్రమంలో బావ మరిది నాగరాజు జోక్యం చేసుకున్నాడు. దీంతో బావ నాగశేషుడు, బావమరిది నాగరాజు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అందులోభాగంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నాగశేషుడు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ పేలి ఏఈ మృతి
చంద్రగిరి: ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఈ నాగరాజు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నరిశింగాపురం గ్రామ సమీపంలోని శ్రీ పద్మావతి కార్లిడెట్ కంటైనర్స్ ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ ట్రాన్స్ పార్మర్‌కు మరమ్మత్తులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ పేలి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న నాగరాజుకు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను 108 సాయంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో చైన్నైలోని అపోలోకు తీసుకువెళ్లారు. కాగా.. శరీరంలోని అధిక భాగాలు కాలిపోవడంతో.. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
పట్టపగలు దోపిడీ!
♦ గుమస్తాపై దాడి ♦ రూ. 10 లక్షల అపహరణ ♦ దుండగులతో చేతులు కలిపిన గని కార్మికుడు బేతంచెర్ల : బేతంచెర్ల- బనగానపల్లె రహదారిలో మంగళవారం పట్టపగలు దోపిడీ జరిగింది. దుండగులు పక్కా పథకం ప్రకారం దాడి చేసి రూ. 10 లక్షలు అపహరించారు. గోర్లగుట్ట గ్రా మ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. పలుకూరు గ్రామానికి చెందిన నాపరాళ్ల గని యజమాని దస్తగిరిరెడ్డి దగ్గర అదే గ్రామానికి చెందిన నాగరాజు గుమస్తాగా పనిచేస్తున్నాడు. పలుకూ రు గ్రామం నుంచి నాపరాళ్లను బేతంచెర్లకు తీసుకువచ్చి అక్కడ విక్రయాలు జరుపుతుంటారు. అందుకు సంబంధించిన నగదు వసూలు కోసం నాగరాజుతో పాటు అదే గనిలో పని చేస్తు న్న కార్మికుడి శ్రీనివాసులు మంగళవా రం ఉదయం ద్విచక్రవాహనంపై బేతంచెర్లకు వచ్చారు. దాదాపు రూ. 10 లక్షలు వసూలు చేసుకుని పలుకూరుకు తిరుగు ప్రయాణమన్నారు. గోర్లగుట్ట గ్రామ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఎదురుగా మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి అటకాయించారు. అ సమయంలో గని కార్మికుడు శ్రీనివాసులు కూడా గుర్తు తెలియని వ్యక్తులతో కలిసిపోయి నాగరాజు తలపై దాడి చేసి, వీపు భాగాన కత్తిపొడిచి అతని దగ్గర ఉన్న రూ.10 లక్షలను ఎత్తుకెళ్లారు. అపస్మారక స్థితిలో పడిపోయిన గుమస్తాను వాహనదారులు బేతంచెర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108లో కర్నూలుకు తరలించారు. గని యజమాని దస్తగిరిరెడ్డి, గుమస్తా నాగరాజు ఫిర్యాదు మేరకు బేతంచెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న డోన్ డీ ఎస్పీ పీఎన్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తు లు దాడి చేసిన తీరుపై ఆరా తీశారు. ఆయన వెంట బేతంచెర్ల ఎస్ఐ హనుమంత్‌రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
సృజన సంపన్నుడు!
రైతులకు ఉపకరించే ఆవిష్కరణలతో అబ్బురపరుస్తున్న యువకుడు పేద రైతు ఇంట పుట్టిన బిడ్డ అయితేనేం... కొత్త బంగారు లోకం కోసం బోలెడు కలలు కంటున్నాడు బొమ్మగాని మల్లేష్. సృజనాత్మక ఆవిష్కరణల ద్వారా చిన్న, సన్నకారు రైతులకెంతో ఉపయోగపడే యంత్ర పరికరాలను వెలువరిస్తున్నాడు. చదువు పదో తరగతితో ఆగిపోయినా.. జ్ఞానార్జన తృష్ణ అతన్ని హోటల్ పనిలో నిలవనీయలేదు. ప్రతి అవరోధాన్నీ అవకాశంగా మార్చుకుంటూ కొత్త కొత్త యంత్ర పరికరాలను ఆవిష్కరిస్తున్నాడు. చిన్నతరహా పరిశ్రమను సైతం నెలకొల్పి ముగ్గురికి ఉపాధి కల్పిస్తూ.. తన ఆవిష్కరణలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాడు. ముప్పయ్యేళ్ల వయసులోనే అనూహ్యమైన విజయాలు సాధించినందుకు గుర్తింపుగా 8 అవార్డులు పొందిన మల్లేష్ ఇటీవల గౌరవ డాక్టరేట్‌ను అందుకోవడం విశేషం. రెక్కాడితే గాని డొక్కాడని చిన్న రైతు కుటుంబంలో బొమ్మగాని వెంకటయ్య(60), దివంగత లక్ష్మి దంపతుల ఏకైక మగ సంతానం మల్లేష్(30). వెంకటయ్య ఎకరం సొంత పొలంలో వరి సాగుచేస్తూ రోజూ ఐదారు తాటి చెట్ల నుంచి కల్లు తీస్తుంటాడు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం ఆజిమ్పేట మల్లేష్ స్వగ్రామం. పొరుగూరు అడ్డగూరు జెడ్పీ హైస్కూలు రోజూ నడిచెళ్లి పదో తరగతి వరకు చదివాడు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చదువుకు స్వస్తి చెప్పి వరంగల్‌లో హోటల్ కార్మికుడిగా ఏడాది పనిచేశాడు. ఇంకా ఏదో సాధించాలన్న తృష్ణ అతన్ని ఆ పనిలో నిలవనీయలేదు. భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో సోలార్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ డిప్లొమాలో 6 నెలలు శిక్షణ(2002) పొందాడు. ఆ శిక్షణ మల్లేష్లోని సృజనాత్మకతకు రెక్కలు తొడిగింది. సరికొత్త ఆవిష్కరణలకు పురికొల్పింది. చిన్న రైతులు కొని ఉపయోగించుకోగలిగిన చిన్న పరికరాలు, యంత్రాలు తయారు చేయడంపైనే తనకు ఆసక్తి ఎక్కువంటున్న మల్లేష్ తన సొంత తెలివితేటలతో ఇప్పటికి 9, 10 కొత్త ఉత్పత్తులు తయారు చేశాడు. బోడుప్పల్ బృందావన్ కాలనీలో ‘బీఎల్ సోలార్ ఇన్నోవేషన్స్’ అనే చిన్న పరిశ్రమను సైతం నెలకొల్పాడు. 8కి పైగా అవార్డులను అందుకున్నాడు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (2013) జాతీయ అవార్డు కూడా వీటిలో ఉంది. ‘యునెటైడ్ థియొలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ’ గత మేలో మల్లేష్‌కు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం విశేషం. ముఖ్యమైన ఆవిష్కరణలు పత్తి తీసే చేతి మిషన్ : మనిషి సులువుగా చేతితో పట్టుకొని పత్తి తీయడానికి ఉపయోగపడే చిన్న యంత్రమిది. కిలోన్నర వరకు బరువుండే ఈ యంత్రం సోలార్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని 6 గంటలు చార్జ్ చేస్తే పది - పన్నెండు గంటలు పనిచేస్తుంది. ఒక మనిషి రోజుకు 120 కిలోల పత్తి తీయొచ్చని మల్లేష్ చెబుతున్నాడు. గత ఖరీఫ్‌లో 30 వరకు ఈ మిషన్లు రైతులకు ఇచ్చానని, అవి చక్కగా పనిచేస్తున్నాయన్నాడు. ఎరువులు చల్లే యంత్రం: పొలంలోని మొక్కలకు కచ్చితమైన మోతాదులో ఎరువులు వేయడానికి వీలుగా ఉండే ఒక యంత్రాన్ని మల్లేష్ రూపొందించాడు. 15 కిలోల బరువుండే దీనిని వీపునకు తగిలించుకొని ఉపయోగించాల్సి ఉంటుంది. సోలార్ పవర్ స్ప్రేయర్: సౌరశక్తితో నడిచే పవర్ స్ప్రేయర్‌ను మల్లేష్ రూపొందించాడు. దీనికి 18 లీటర్ల ట్యాంకుంది. 7 గంటలు చార్జింగ్ చేస్తే 7 గంటలపాటు స్ప్రే చేస్తుంది. సోలార్ పేనల్‌ను కూడా ట్యాంకుకు తగిలించుకుంటే.. నేరుగా సౌర విద్యుత్‌ను వినియోగించుకుంటూ స్ప్రే చేయొచ్చు. మరో రూ. వెయ్యి చెల్లిస్తే.. ఇదే బ్యాటరీతో పనిచేసే టేబుల్ ఫ్యాన్, 2 బల్బులు, మొబైల్ చార్జింగ్ కిట్‌ను కూడా ఇస్తున్నాడు. పెడల్ పంపు: కాళ్లతో పెడల్స్‌ను తొక్కుతుంటే కుంట లేదా వాగులు వంకలు, మడుగుల్లోని నీటిని పంటలకు సులభంగా తోడడానికి పెడల్ పంపు ఉపయోగపడుతుంది. ఇందులో ఎటువంటి యంత్రాలూ 30 అడుగుల లోతు నుంచి లేదా నేల మీద ఉన్న నీటిని 20 అడుగుల ఎత్తుకు తోడిపోయగలదు. కలుపు తీసే పరికరం (వీడర్ ): ఒక ఎకరంలో కలుపు తీతకు రూ. వేలకు వేలు ఖర్చవుతాయి. కానీ, మనిషి రోజుకు 2 ఎకరాల్లో కలుపు తీయడానికి ఉపయోగపడే వీడర్‌ను మల్లేష్ రూపొందించాడు. 8 కిలోల బరువుండే ఈ వీడర్‌ను మహిళలు సైతం ఉపయోగించవచ్చు. చెట్లెక్కేందుకు దోహదపడే పరికరం : తాటి / కొబ్బరి చెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ ఏటా వందలాది మంది దుర్మరణం పాలవుతున్నారు. తాటి చెట్లు ఎక్కేటప్పుడు పట్టు తప్పి, తన బాబాయిలు ఇద్దరు వికలాంగులయ్యారు. ఈ దుస్థితి మరెవరికీ రాకూడదన్న లక్ష్యంతో మల్లేష్ చెట్లెక్కేందుకు వీలుగా ఉండే ప్రత్యేక పరికరాన్ని రూపొందించాడు. సీటుపైన కూర్చొని సునాయాసంగా చెట్టెక్కడానికి ఉపయోగపడుతుంది. బరువు 5 కిలోలు. భుజాన వేసుకొని తీసుకెళ్లి చెట్లెక్కవచ్చు. 15-20 ఏళ్ల వరకు పనిచేస్తుందని మల్లేష్ తెలిపాడు. ఎస్ఎంఎస్ సర్క్యూట్ : పండ్ల తోటల్లో నేలలో తేమ తగ్గిపోయి బెట్ట పరిస్థితి వచ్చినప్పుడు రైతుకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించే సర్క్యూట్‌ను రూపొందించాడు. చెట్ల దగ్గర భూమిలో అక్కడక్కడా సెన్సార్లు బిగించాడు. పంటకు నీరు కావాలన్న సమాచారం రాగానే మొబైల్ ద్వారానే రైతు మోటార్‌ను ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా... ఫ్యాన్, లైట్ ఆఫ్ - ఆన్ చేసేందుకు ఉపయోగపడే రిమోట్, సోలార్ ట్రైసైకిల్ వంటి అనేక యంత్ర పరికరాలను యువ ఇన్నోవేటర్ మల్లేష్ ఆవిష్కరించాడు. చిన్న రైతులకు ఉపయోగడే మరో 6-7 ఇన్నోవేషన్లు పరిశోధన దశలో ఉన్నాయన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం రూరల్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేసి తన పరిశోధనలకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తే చిన్న రైతుల అవసరాలు తీర్చే మరికొన్ని యంత్ర పరికరాలను రూపొందించగలనంటున్నాడు. ఆల్ ద బెస్ట్ మల్లేష్! - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ వారంలో తయారు చేసిస్తా.. నవంబర్ 14-30 వరకు ప్రతి ఏటా ఢిల్లీలోని ప్రగతిమైదాన్‌లో జరిగే వాణిజ్య ప్రదర్శనలో నాకు ఉచితంగా స్టాల్ ఇస్తున్నారు. అక్కడి అమ్మకాలే నన్ను ఆదుకుంటున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఇటువంటి సదుపాయం కల్పిస్తే నా వంటి ఇన్నోవేటర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త ఆవిష్కరణలపై పరిశోధనలు కొనసాగించడానికి గ్రాంటు ఇవ్వటం ద్వారా ప్రభుత్వం ప్రోత్సహించాలి. రైతులకు ఫలానా అవసరానికి పరికరం/యంత్రం కావాలని అడిగితే వారం రోజుల్లో తయారు చేసి ఇవ్వగలను. - బొమ్మగాని మల్లేష్ (88850 73666), బీఎల్ సోలార్ ఇన్నోవేషన్స్, బృందావన కాలనీ, బోడుప్పల్, హైదరాబాద్ సులువుగా విత్తనాలేసే ‘తోరణాల చట్రం’! సంక్షోభంలో ఉన్న అన్నదాతకు నాలుగు రూపాయలు మిగలాలంటే సాగు వ్యయం, శ్రమ తగ్గాలి. ఇందుకు తగిన దారులు వెతికే పనిలో నిమగ్నమైన ఒకానొక అభ్యుదయ రైతు కొడాలి కృష్ణారావు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరుకు చెందిన ఆయన తేలికపాటి సాగు పద్ధతులపై ప్రయోగాలు చేస్తుంటారు. శ్రీవరి పద్ధతిలో రెండు కేజీల బిపీటీ విత్తనంతో ఎకరానికి 38 బస్తాల దిగుబడి సాధించారు. విత్తనం ఎద బెట్టడానికి డ్రమ్‌సీడర్ కంటే సులువుగా పని పూర్తి చేసేందుకు ఉపకరించే తోరణాల చట్రం అనే పరికరాన్ని ఆయన ఇటీవల తయారు చేయించారు. అల్యూమినియం ఫ్రేముకు పాలిథిన్ కవర్లతో తోరణాల చట్రం చేయించారు. దమ్ము చేసిన పొలంలో ఈ చట్రంతో ఇద్దరు మనుషులు 9ఁ9 అంగుళాల దూరంలో మొలక గట్టిన విత్తనాన్ని సులువుగా విత్తుకోవచ్చు. విత్తనం పొలమంతా సమంగా పడుతుందన్నారు. 40 సెంట్ల పొలానికి 6 కేజీల విత్తనం వినియోగించానన్నారు. మొక్కకు ఎటు చూసినా 9ఁ9 అంగుళాల దూరం ఉండటం వలన పంటకు గాలి, వెలుతురు చక్కగా తగిలి ఆరోగ్యంగా పెరుగుతుంది. దుబ్బు బాగా చేయటంతోపాటు దిగుబడి బాగుంటుందని కృష్ణారావు (78933 37891) తెలిపారు. ఈ తోరణాల చట్రానికి చక్రాలు అమర్చితే మరింత సులభంగా విత్తుకోవచ్చన్నారు. ప్రయోగాత్మకంగా పాలిథిన్ పరదాపై ముప్పావు సెంటులో నారుమడిని ఏర్పాటు చేసి 15 రోజుల నారును ఎకరంలో నాట్లేయించానని వివరించాడు. - నాగరాజు, తోట్లవల్లూరు -
‘తుపాకీ’ కేసులో ఒకరి అరెస్టు
మరొకరి కోసం గాలింపు పోచమ్మమైదాన్ :ఎంజీఎం ఆసుపత్రిలోగన్ క లకలం రేపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో వరంగల్ ఏసీపీ సురేంద్రనాథ్ శుక్రవారం ఏర్పాటు చేసి న విలేకర్ల సమావేశంలో అరెస్టు వివరాలను వె ల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. నల్లబె ల్లిమండలం నారక్కపేటకు చెందిన అజ్మీర నాగరాజు డైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందు లు తలెత్తడంతో ఇద్దరి భార్యలను పోషించలేక డబ్బులు సంపాధించే సులువైన మార్గంగా తుపాకి చూపించి బెదిరించి డబ్బులు వసులు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన మొదటి భార్యబంధువైన గాజులశంకర్తో కలిసి జార్ఖం డ్కు పనికోసం వెళ్లి పలు నేరాలకు పాల్పడ్డాడు. అక్కడ రూ. 12వేలకు నాటు తుపాకిని కొనుక్కొన్నాడు. బుధవారం అర్ధరాత్రి ఎంజీఎం ఆ సుపత్రిలో ఒంటరిగా ఉండే ప్రభుత్వ డాక్టర్‌ను గన్నుతో బెదిరించేందకు ప్రయత్నిస్తూ.. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంటపడ్డారు. సిబ్బం ది అతడిని తనిఖీచేసి, తుపాకీని స్వాధీనం చేసుకుని విచారించినట్లు, గాజుల శంకర్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నాగరాజును రిమాం డ్కు తరలించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మట్టెవాడ సీఐ శివరామయ్య పాల్గొన్నారు. -
సాక్షి కథనానికి స్పందన, నాగరాజుకు ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో రెండు కాళ్లు, చేయి పోగొట్టుకున్న పిడమర్తి నాగరాజుకు సర్కారు అండగా నిలిచింది. ప్రభుత్వ సహాయం అందక తీవ్ర మనోవేదనకు గురవుతున్న నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెంకు చెందిన నాగరాజుపై ‘అందరికీ భారమై బతుకుతున్నా..’ శీర్షికతో ‘సాక్షి’ బుధవారం కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ బుధవారం నాగరాజుకు వ్యక్తిగతంగా రూ. లక్ష ఆర్థికసాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం కావాలని నాగరాజు కోరడంతో వెంటనే అందుకు మంత్రి అంగీకరించారు. మిర్యాలగూడలోని మార్కెట్‌యార్డులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా నాగరాజు సాక్షితో మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నా రెండు కాళ్లు, చేయి కోల్పోయాను. అప్పుడు నా వద్దకు ఎంతో మంది వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి కనబడకుండా పోయారు. ప్రభుత్వ సహాయం కోసం హైదరాబాద్ వచ్చి.. సచివాలయం చుట్టూ తిరిగా.. ఇక్కడ కూడా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు చచ్చిపోవాలనుకున్నా... కానీ, ‘సాక్షి’ నా గోడును సర్కారుకు తెలియజేసింది. నాకు న్యాయం జరిగేలా చేసిన ‘సాక్షి’కి రుణపడి ఉంటా..’’ అంటూ గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో తన మాదిరిగా వికలాంగులైన వారు చాలా మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కూడా సర్కారు ఆదుకోవాలని కోరారు. -
అపార్ట్మెంట్లో చోరీ..
మియాపూర్(హైదరాబాద్): కాపలా ఉండాల్సిన వ్యక్తే దొంగతనానికి పాల్పడ్డాడు. మదీనగూడలో ఇటీవల జరిగిన ఈ సంఘటన వివరాలు.. మియాపూర్ డీఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా సదాశివపేట గ్రామానికి చెందిన నాగరాజు అలియాస్ రాజు (36) మియాపూర్ మదీనగూడాలోని పూజితా రెసిడెన్సీలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. అదే అపార్టుమెంట్ ఐదో అంతస్తులో ఉంటున్న తిర్మలరావు ఈనెల 3వ తేదీన ఊరెళ్లాడు. అతని ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించిన వాచ్మెన్ రాజు దొంగతనానికి పథకం పన్నాడు. ఆ ఫ్లాట్ కిటికీ గ్రిల్స్‌ను తొలగించి లోపలికి ప్రవేశించాడు. బీరువా తాళాలను పగులగొట్టి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు. ఈనెల 4వ తేదీన తిర్మలరావు తిరిగి వచ్చి చూసి దొంగతనం జరిగిందని తెలుసుకున్నాడు. ఆయన మియాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాచ్‌మన్‌పై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకు విచారించగా నేరాన్ని అంగీకరించాడు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
అధికార లాంఛనాలతో నాగరాజు అంత్యక్రియలు
కట్టంగూర్: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో ముష్కరులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కానిస్టేబుల్ నాగరాజు(29) అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. నాగరాజు స్వగ్రామమైన కట్టంగూర్ మండలం రసూల్‌గూడెంలో అంత్యక్రియలు జరిపారు. నాగరాజు భౌతికకాయానికి అతని తండ్రి శ్రీమన్నారాయణ తలకొరివి పెట్టారు. స్పెషల్ పార్టీ పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు తుపాకులు పేల్చి నివాళులు అర్పించారు. అంత్యక్రియల్లో తెలంగాణ శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ సుధీర్ లక్టాకియా, ఐజీ వి.నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకర్‌రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి
-
ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్ మృతి
సూర్యాపేట: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద పోలీసులకు, దోపిడీ దొంగలకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో కట్టంగూరు పీఎస్ కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందాడు. అలాగే ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఆత్మకూరు (ఎం) ఎస్ఐ సిద్ధయ్య పరిస్థితి విషమంగా ఉంది. సిద్ధయ్య స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. ఇక రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి సోదాలు జరుపుతున్న పోలీసులపై కాల్పులకు తెగబడి సంఘటనలో ఓ కానిస్టేబుల్, హోంగార్డు మృతి చెందారు. ఈ కాల్పుల ఘటనలో గాయపడ్డ సీఐ మొగిలయ్య, హోంగార్డు కిశోర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.