Oscar awards
-
రూ.200 కోట్లు ఇస్తా.. ఆస్కార్ తెప్పిస్తారా? : మంచు విష్ణు
మంచు విష్ణు(Manchu VIshnu ) ప్రస్తుతం కన్నప్ప(kannappa) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో మంచు విష్ణు దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని యూట్యూబ్ ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తనపై వస్తున్న ట్రోలింగ్ కూడా స్పందించాడు. కన్నప్ప టీజర్‌కు తమిళ, కన్నడ, మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చిందని, తెలుగులో మాత్రం 15-20 శాతం మంది పని గట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారని మండి పడ్డారు.ఈ నెగటివిటీ కావాలని చేస్తున్నదే అని ఆయన ఆరోపించారు. తనపైనే కాదు రాజమౌళి లాంటి వారిపై కూడా వీళ్లు ఇలానే ట్రోలింగ్ చేస్తారని చెప్పారు.‘ఆర్ఆర్ఆర్’(RRR)కి ఆస్కార్ అవార్డు వస్తే తెలుగువారంతా గర్వంగా కాలర్ ఎగరేసి ఎంజాయ్ చేశారు. కానీ కొంతమంది మాత్రం విమర్శించారు. ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు పెడితే వస్తది కదా అన్నారు. నేను 200 కోట్లు ఇస్తా.. ఆ విమర్శలు చేసినవాళ్లు ఆస్కార్ తీసుకొస్తారా? ఆర్ఆర్ఆర్`కి ఆస్కార్ రావడమనేది ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ మూమెంట్.అసలు ఎంత మందికి అక్కడ ఇన్విటేషన్ ఉంటుంది. ఇలాంటి మూమెంట్లని గర్వించాలి. కాలర్ ఎగరేసుకోవాలి. భారతదేశంలో ఎవరూ ఇలాంటి ఘనత సాధించలేదు. ఇండియాలో డైరెక్ట్ గా ఏ సినిమాకి ఆస్కార్ రాలేదు. సత్యజిత్ రేకి గౌరవంగా లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ పురస్కారం అందించారు తప్పితే, సినిమాలకు ఇవ్వలేదు. ఇండియాలో ఇండియా టెక్నీషియన్లు చేసిన ఏ మూవీకి ఆస్కార్ రాలేదు. కేవలం `ఆర్ఆర్ఆర్`కి మాత్రమే సాధ్యమైంది. మన తెలుగు పాటని ఆస్కార్ స్టేజ్ పై వేశారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. దానికన్న గొప్పతనం ఏం కావాలి?అని ట్రోలర్స్‌పై మంచు విష్ణు మండిపడ్డారు.ఇక కన్నప్పలోని ‘లవ్ సాంగ్’ పై వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. ‘నేను సినిమా తీస్తున్నా.. డాక్యుమెంటరీ కాదు. అందుకే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి’అని అన్నారు. -
సీన్ పెరిగింది
అమెరికన్ ఫిల్మ్ మేకర్ సీన్ బేకర్ సీన్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ‘అనోరా’ సినిమాకు గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో సీన్ బేకర్‌కు నాలుగు అవార్డులు దక్కాయి. ఆస్కార్ చరిత్రలో ఒకే సినిమాకి నాలుగు అవార్డులు సాధించిన ఒకే ఒక్కడు సీన్ బేకర్ కావడం విశేషం. హాలీవుడ్ సమాచారం ప్రకారం... 1954లో వాల్ట్ డిస్నీ (అమెరికన్ యానిమేటర్, వాయిస్ యాక్టర్, ప్రొడ్యూసర్)కు నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చాయట. కానీ ఇవి ఒకే సినిమాకి రాలేదు. అలాగే 1974లో అమెరికన్ ఫిల్మ్ మేకర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొ΄్పోల ‘ది గాడ్ ఫాదర్ 2’ చిత్రానికి మూడు ఆస్కార్ అవార్డులు (బెస్ట్ పిక్చర్, డైరెక్టర్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగాల్లో) గెలుచుకున్నారు. . దయచేసి థియేటర్లలోనే సినిమా చూడండి – సీన్ బేకర్ ‘‘సెక్స్ వర్కర్స్ (వేశ్యల నేపథ్యంలో ‘అనోరా’ని రూపొందించారు) కమ్యూనిటీకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ ఆస్కార్ అవార్డును వారితో షేర్ చేసుకుంటున్నట్లుగా ఫీలవుతున్నాను’’ అన్నారు సీన్ బేకర్. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘థియేటర్స్‌లో సినిమా చూడటం ఓ గొప్ప అనుభూతి. మనందరం కలిసి నవ్వుతాం... ఏడుస్తాం... ఉత్సాహంగా అరుస్తాం. ప్రపంచమంతా వివిధ భాగాలుగా విడిపోతున్నట్లు కనిపిస్తున్న ఇలాంటి తరుణంలో థియేటర్స్‌లో అందరం కలిసి సినిమా చూడటం అనేది ఓ ముఖ్యమైన అంశం కావొచ్చు. ప్రస్తుతం థియేట్రికల్ ఎక్స్పీరియన్్స ప్రమాదంలో ఉంది. సినిమా థియేటర్స్, మరీ ముఖ్యంగా స్వంతంత్రంగా రన్ చేస్తున్న థియేటర్స్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. మనందరం సపోర్ట్ చేయాలి. సినిమాలను థియేటర్స్‌లో చూడటం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను థియేటర్స్‌లో సినిమాలు చూసే విధంగా ప్రోత్సహించాలి. అద్భుతమైన ఆర్టిస్టుల రక్తం, కన్నీళ్లు, చెమటలతో ‘అనోరా’ను నిర్మించడం జరిగింది. ఇండిపెండెంట్ సినిమాలు కలకాలం జీవించాలి’’ అని పేర్కొన్నారు సీన్ బేకర్. మరో హైలెట్ ఏంటంటే... సీన్ బేకర్ తల్లి పుట్టిన రోజునే ఆయనకు నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. తన అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్‌లో తన తల్లికి సీన్ బేకర్ థ్యాంక్స్ చెప్పారు.→ ‘‘అనోరా’ను మేం తక్కువ డబ్బుతోనే చేశాం. యంగ్ ఫిల్మ్‌మేకర్స్ మీరు చెప్పాలనుకుంటున్న కథలను చెప్పండి. మీరు ఏ మాత్రం పశ్చాత్తాపపడరనడానికి మాకు దక్కిన ఈ అవార్డు ఓ ఉదాహరణ’’ అని ‘అనోరా’ నిర్మాతలు అలెక్స్ కోకో, సమంత క్వాన్ అన్నారు. -
Oscar Awards 2025: భావోద్వేగాలకు జీవం
2024 సంవత్సరానికి ఆస్కార్ ఉత్తమ నటిగా నిలిచారు మైకీ మ్యాడిసన్ . సినిమా పేరు ‘అనోరా’. ధరించిన పాత్ర ‘వేశ్య’. హాలీవుడ్ కాని, ఇండియన్ సినిమాల్లోకానివేశ్య పాత్ర పోషించడం పట్ల తారలకు కొన్ని అభ్యంతరాలుంటాయి. అలాగే ఆ పాత్రలు పోషించిన వారందరూ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వేశ్య పాత్ర వార్తల్లోకి వచ్చింది. ‘అనోరా’ గురించి, మైకీ మ్యాడిసన్ గురించి కథనం.వారికి ఆదివారం రాత్రి. మనకు సోమవారం తెల్లవారుజాము. కాని తారలకు, తారలను ప్రేమించే ప్రేక్షకులకు ఇది పడుతుందా?అమెరికా లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 97వ అకాడమీ అవార్డ్స్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు నిద్ర మానుకొని, మేల్కొని, వివిధ స్థానిక సమయాల ప్రకారం వీక్షించారు. విజేతలకు చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేశారు. తాము ఊహించిన సినిమాకో నటికో వస్తే తెగ ఉత్సాహం ప్రదర్శించారు. అయితే వీరందరూ కొంత ఊహించినా ఇంతగా ఎక్స్పెక్ట్ చేయని ఒక సినిమా ఆశ్చర్యపరిచింది. ‘ఉత్తమ చిత్రం’ పురస్కారంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఐదు పురస్కారాలను సొంతం చేసుకుని హోరెత్తించింది. ఆ సినిమాయే ‘అనోరా’. 2024లో విడుదలైన ఈ చిత్రం అటు విమర్శకుల ప్రశంసలను, ఇటు బాక్సాఫీసు కాసుల రికార్డులనూ కొల్లగొట్టింది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో సైతం అదే పంథా కొనసాగించింది.ఎవరీ ‘అనోరా’?:నిజానికి ఇలాంటి కథలు మనకు ‘మొఘల్–ఏ–ఆజమ్’ నుంచి ఉన్నాయి. కథానాయకుడు వేశ్యను ప్రేమిస్తే సంఘం/పెద్దమనుషులు ఓర్వలేక విడగొట్టడం. కాని మొఘల్–ఏ–ఆజమ్‌లో కథానాయకుడి ప్రేమ నిజమైనది అయితే ‘అనోరా’లో కపటమైనది. అందుకే ఆ ప్రేమకు విక్టిమ్ అవుతుంది అనోరా. 23 ఏళ్ల ఈ అమ్మాయి న్యూయార్క్‌లోని ఓ క్లబ్లో స్ట్రిప్పర్‌గా పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఈమెను క్లబ్ యజమాని రష్యాకు చెందిన ఇవాన్ అనే శ్రీమంతుల కుర్రవాడికి పరిచయం చేస్తాడు. చదువుకోవడానికి అమెరికాకు వచ్చిన ఈ కుర్రాడు బాధ్యత లేకుండా పార్టీల్లో, వీడియో గేమ్స్‌లో సమయం గడుపుతూ ఉంటాడు. అనోరా సాంగత్యం ఇష్టపడ్డ ఇవాన్ తరచూ ఆమెను తన బంగ్లాకు ఒక రాత్రి కోసం తీసుకువెళుతూ ఉంటాడు. ఆ తర్వాత హఠాత్తుగా ‘నాకు వారం రోజుల పాటు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండు. 15 వేల డాలర్లు ఇస్తాను’ అని క్లబ్‌కు వెళ్లకుండా ఆపేస్తాడు. ఆ వారంలో ఆమె మీద ప్రేమ పుట్టిందని చెప్పి, ఉక్కిరిబిక్కిరి చేసి, ఉరుకుల పరుగుల మీద పెళ్లి చేసుకుంటాడు.కష్టాలు మొదలుఅయితే ఇది పిల్లల ఆట కాదు. ఇద్దరు కలవడం వెనుక, కలిసి జీవించడం వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉంటుందో మెల్లగా అనోరాకు తెలిసి వస్తుంది. ఇది క్లబ్లో తన ఇష్టానికి స్ట్రిప్పర్‌గా ఉండటం కాదని ‘పెళ్లి’ అనే వ్యవస్థ చుట్టూ అంతస్తు, సంఘ మర్యాద, వంశం... ఇలాంటివి అన్నీ ఉంటాయని అర్థమై హడలిపోతుంది. ఇవాన్‌ను ఈ పెళ్లి నుంచి బయటపడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు ఈ యువ జంటను బెదిరిస్తారు. ‘గ్రీన్ కార్డు పొందడం కోసమే ఆమె నిన్ను పెళ్లి చేసుకుంది. ఆమె వేశ్య’ అని ఇవాన్ మనసును మార్చేస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి బెదిరి అనోరాను వదిలి ఇవాన్ పారిపోతాడు. ఇవాన్‌ను వదిలి పెడితే 10 వేల డాలర్లు ఇస్తామనే బేరం పెడతారు రష్యా మనుషులు. ఈ పరిస్థితులు మానసికంగా అనోరాను బాధిస్తాయి.ఊరడించే బంధంఅయితే ఈ మొత్తం కథలో ఒక వ్యక్తి అనోరా పట్ల సానుభూతిగా ఉంటాడు. అతను ఇవాన్‌ను పెళ్లి నుంచి బయట పడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇగోర్. అనోరాకి అన్యాయం జరుగుతోందని ఆమె తన మానాన తాను బతుకుతుంటే ఇవాన్ డిస్ట్రబ్ చేశాడని అతనికి అనిపిస్తుంది. చివరకు అతను ఆమెకు స్నేహితుడిగా మారతాడు. అతనికి అనోరా తన సర్వస్వం అర్పించడానికి దగ్గరయ్యి ఆ కాస్త ఓదార్పుకు వెక్కివెక్కి ఏడ్వడంతో సినిమా ముగుస్తుంది. ఈ కథ మొత్తాన్ని తన భుజస్కందాల మీద అద్భుతంగా పోషించడం వల్ల, వివిధ భావోద్వేగాలను పలికించడం వల్ల ‘అనోరా’ పాత్ర పోషించిన మైకీ మాడిసన్‌కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అవార్డు అందుకుంటూ ఆమె ‘సెక్స్ వర్కర్ కమ్యూనిటీకి కృతజ్ఞతలు’ అని చెప్పడం విశేషం.సినిమా విశేషాలు→ ఇది కల్పిత కథ కాదు, అలాగని పూర్తి వాస్తవ కథ కూడా కాదు. దర్శకుడు సీన్ బేకర్‌కి తన స్నేహితుడు చెప్పిన ఒక రష్యన్–అమెరికన్ జంట కథ ఆధారంగా పుట్టిందే ఈ కథ. 2000–2001 సమయంలో న్యూయార్క్‌లో సీన్ బేకర్ వీడియో ఎడిటర్‌గా పని చేస్తూ అనేక రష్యన్–అమెరికన్ జంటల పెళ్లి వీడియోలను ఎడిట్ చేశాడు. ఇవన్నీ కలిసి అతని మనసులో చెరగని ముద్ర వేశాయి. ఈ సినిమాకు రచనా సహకారం కోసం కెనెడియన్ రచయిత్రి, నటి ఆండ్రియా వెరన్ను సంప్రదించాడు దర్శకుడు. అందుకు కారణం ఆమె గతంలో సెక్స్ వర్కర్‌గా పని చేసి, ఆ అనుభవాలతో ‘మోడ్రన్ వోర్’ అనే స్వీయచరిత్ర రాసింది. బార్లలో ఆడిపాడే వారికి, వేశ్యావృత్తిలో ఉన్నవారికీ మనసుంటుందనీ, అదీ ఒక తోడు కోరుకుంటుందని చెప్పడానికే తాను ఈ సినిమా తీసినట్లు ఆయన వివరించారు. → కథలో ప్రధానమైన పాత్రను ధరించిన మైకీ మాడిసన్ ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. 25 ఏళ్ల మైకీ మాడిసన్ లాస్ ఏంజెలెస్‌లో పుట్టి శాన్ ఫెర్నాండ్ వ్యాలీలో పెరిగింది. యూదు కుటుంబానికి చెందిన మైకీ తల్లిదండ్రులిద్దరూ సైకాలజిస్టులు. ఈమెకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు.→ 2013లో తొలిసారి ‘రిటైర్మెంట్ అండ్ పనిష్ బాక్స్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించే నాటికి మైకీ మాడిసన్ ఏడో తరగతి చదువుతోంది. సినిమాల వల్ల స్కూలుకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ఆ తర్వాత ఆమె చదువంతా ఇంట్లోనే సాగింది. 2017లో హీరోయిన్గా తొలి చిత్రం ‘లిజా లిజా స్కైస్ ఆర్ గ్రే’ విడుదలైంది. అంతకుముందే 2016లో ‘బెటర్ థింగ్స్’ అనే కామెడీ డ్రామా సిరీస్‌లో టీనేజ్ యువతి పాత్ర పోషించింది. ఆ సిరీస్ విజయవంతమై 2022 దాకా నడిచింది. ఈ మధ్యలో ‘ఇంపోస్టర్స్’, ‘మాన్ స్టర్’, ‘నోస్టాల్జియా’ వంటి సిరీస్‌లలోనూ నటించి, మెప్పించింది. → 2019లో వచ్చిన ‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’ అనే సినిమా మైకీకి గుర్తింపు తెచ్చింది. అందులో ‘సూసన్’ పాత్రలో ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. 77వ కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రశంసలు పొందింది. ఆ పై ‘స్క్రీమ్’, ‘లేడీ ఇన్ ది లేక్’ సినిమాల్లో నటించింది. → తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘ప్రేమమందిరం’ కథ ‘అనోరా’ పోలికలతోనే ఉంటుంది. అందులో జయప్రద దేవదాసీల ఇంట్లోనే పుట్టిన అమ్మాయి పాత్ర పోషించగా అక్కినేని జమీందారు బిడ్డ పాత్ర పోషించారు.‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’, ‘స్క్రీమ్’ సినిమాలో మైకీ నటన చూసి తాను తీస్తున్న ‘అనోరా’లో ఈ అమ్మాయి బాగుంటుందని సీన్ బేకర్ భావించారు. అలా ఈప్రాజెక్టులోకి అడుగుపెట్టిన మైకీ సినిమాను తన భుజాల మీద మోసింది. వేశ్యగా, ప్రేమికురాలిగా, పెళ్లయిన మహిళగా, ప్రియుడి చేత మోసగింపబడ్డ యువతిగా... ఇన్ని రకాల హావభావాలను ఆ పాత్రలో పలికించి అందర్నీ మెప్పించింది. -
ఆస్కార్-2025 రెడ్ కార్పెట్‌పై మెరిసిన హాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)
-
ఆస్కార్ రేసులో ఉన్నదెవరు.. భారత్‌కు అవార్డ్ దక్కేనా..?
97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ అవార్డులకు సంబంధించి రేసులో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో పది సినిమాలు పోటీ పడుతున్నాయి. ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నటుడు, ఉత్తమ నటి రేసులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఈ వేడకలకు వ్యాఖ్యాతలుగా అమెరికన్ నటుడు బోవెన్ యాంగ్, నటి రాచెల్ సెన్నాట్లు వ్యవహరించారు.భారతీయ సినిమాకి నిరాశఆస్కార్ అవార్డ్స్ రిమైండర్ లిస్ట్‌లో నిలిచిన భారతీయ చిత్రాలు ‘కంగువ, ఆడు జీవితం (‘ది గోట్‌లైఫ్), సంతోష్, స్వతంత్రవీర్ సవార్కర్, ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్, గర్ల్స్ విల్ బీ గర్ల్స్, పుతల్’ ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకోలేకపోయాయి. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం ఈ ఏడాది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పంపిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈసారి భారతీయ సినిమాకి నిరాశ ఎదురైంది. కానీ, 97వ ఆస్కార్ అవార్డ్‌ల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘అనూజ’(Anuja) మాత్రమే భారత్ నుంచి రేసులో ఉంది. ఉత్తమ చిత్రం: అనోరా, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్ అన్ నోన్ , కాన్ క్లేవ్, డ్యూన్ : పార్ట్ 2, ఎమిలియా పెరెజ్, ఐయామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, విక్డ్ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (అనోరా), బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్), జేమ్స్ మ్యాన్ గోల్డ్ (ది కంప్లీట్ అన్ నోన్ ), జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్), కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్)ఉత్తమ నటుడు: అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), తిమోతీ చాలమెట్ (ది కంప్లీట్ అన్ నోన్ ), కోల్మెన్ డొమినింగో (సింగ్సింగ్), రే ఫియన్నెస్ (కాన్ క్లేవ్), సెబస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్)ఉత్తమ నటి: సింథియా ఎరివో (విక్డ్), కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్), మికే మాడిసన్ (అనోరా), డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)ఉత్తమ సహాయ నటుడు: యురా బోరిసోవ్ (అనోరా), కిరెన్ కల్కిన్ (ది రియల్ పెయిన్ ), ఎడ్వర్డ్ నార్తన్ (ది కంప్లీట్ అన్ నోన్ ), గాయ్ పియర్స్ (ది బ్రూటలిస్ట్), జెరీమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్)ఉత్తమ సహాయ నటి: మోనికా బార్బరో (ది కంప్లీట్ అన్ నోన్ ), అరియానా గ్రాండే (విక్డ్), ఫెసిలిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్), ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్ క్లేవ్), జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్). -
ఆస్కార్ సంబరం ఆరంభం
97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది మార్చి 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరగనుంది. కాగా ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లను గురువారం రాత్రి (భారతీయ కాలమానం ప్రకారం) ప్రకటించారు. అమెరికన్ నటుడు బోవెన్ యాంగ్, నటి రాచెల్ సెన్నాట్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే ఈ నామినేషన్ల ప్రకటన ఈ నెల 17న జరగాల్సింది. కానీ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా 19కి వాయిదా వేశారు. ఫైనల్‌గా 23న ప్రకటించారు.రికార్డ్ సాధించిన స్పానిష్ మ్యూజికల్ థ్రిల్లర్ఈసారి స్పానిష్ మ్యూజికల్ థ్రిల్లర్ మూవీ ‘ఎమిలియా పెరెజ్’ నాన్–ఇంగ్లిష్ విభాగంలో 13 నామినేషన్లు దక్కించుకుని రికార్డ్ సాధించింది. గతంలో చైనా మూవీ ‘క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్’, మెక్సికన్–అమెరికన్ డ్రామా ‘రోమా’... ఈ రెండు చిత్రాలు నాన్–ఇంగ్లిష్ విభాగంలో పది నామినేషన్లు దక్కించుకున్నాయి. ఇప్పుడు 13 నామినేషన్లతో ‘ఎమిలియా పెరెజ్’ వాటిని అధిగమించింది. అలాగే ఈ చిత్రంలో ఓ లీడ్ రోల్లో నటించిన స్పానిష్ నటి కార్లా సోఫియా గాస్కాన్ (బెస్ట్ యాక్ట్రస్ లీడ్ రోల్ నామినేషన్) చరిత్ర సృష్టించారు. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన తొలి ట్రాన్స్‌జెండర్ నటిగా నిలిచారామె. ఇంకా ‘ది బ్రూటలిస్ట్, విక్డ్’ చిత్రాలకు పది నామినేషన్ల చొప్పున దక్కాయి. అంతగా అంచనాలు లేని ‘కాన్క్లేవ్’ మూవీకి 8 నామినేషన్లు దక్కడం ఓ విశేషం.⇒ ఒక్క నామినేషన్ తేడాతో... నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్ విభాగంలో 13 నామినేషన్లు దక్కించుకుని, రికార్డు సాధించిన ‘ఎమిలియా పెరెజా’కి ఇంకో నామినేషన్ దక్కి ఉంటే... ఇంగ్లిష్ ఫిల్మ్‌ల రికార్డుని కూడా అధిగమించి ఉండేది. ‘టైటానిక్, ఆన్ అబౌట్ ఈవ్, లా లా ల్యాండ్’ వంటి ఇంగ్లిష్ చిత్రాలు 14 నామినేషన్లు దక్కించుకున్నాయి.⇒ తల్లి హిస్టరీ రిపీట్: ‘ఐయామ్ స్టిల్ హియర్’ చిత్రానికి గాను ఫెర్నాండా టోర్రెస్ ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. ఇందులో విశేషం ఏంటంటే... ఆమె తల్లి ఫెర్నాండా మోంటెనెగ్రో 1991లో ‘సెంట్రల్ స్టేషన్’ చిత్రానికి గాను ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్న తొలి బ్రెజిలియన్ నటిగా రికార్డుని సాధించారు. ఇప్పుడు ఇన్నేళ్లకు మలి బ్రెజిలియన్ నటిగా టోర్రెస్ నామినేషన్ దక్కించుకుని తల్లి హిస్టరీని రిపీట్ చేశారు. ⇒ బరిలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్: ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ‘అనూజ’ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్) విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఆల్రెడీ రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన భారతీయ నిర్మాత గునీత్ మోంగా ఈ చిత్రానికి ఓ నిర్మాత కావడం విశేషం. అలాగే నటి ప్రియాంకా చోప్రా ఓ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఢిల్లీలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసే తొమ్మిదేళ్ల అనూజ స్కూల్‌కు వెళ్లాలనుకుంటుంది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని, అనూజ సోదరి పాలక్ భవిష్యత్‌ను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ చిత్రం సాగుతుంది.అనూజగా సజ్దా పఠాన్, పాలక్‌గా అనన్య షాన్భాగ్ నటించారు. ఇదిలా ఉంటే... గునీత్ మోంగా ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కి గాను బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 2023లో ఆస్కార్ దక్కింది. అంతకుముందు 2021లో గునీత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’కిగాను బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కింది. ఇప్పుడు ఆమె ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘అనూజ’కు కూడా ఆస్కార్ దక్కుతుందా? అనేది చూడాలి. భారతీయ సినిమాకి నిరాశఆస్కార్ అవార్డ్స్ రిమైండర్ లిస్ట్‌లో నిలిచిన భారతీయ చిత్రాలు ‘కంగువ, ఆడు జీవితం (‘ది గోట్‌లైఫ్), సంతోష్, స్వతంత్రవీర్ సవార్కర్, ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్, గర్ల్స్ విల్ బీ గర్ల్స్, పుతల్’ ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకోలేకపోయాయి. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం ఈ ఏడాది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పంపిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈసారి భారతీయ సినిమాకి నిరాశ ఎదురైంది.ఉత్తమ చిత్రం: అనోరా, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్ అన్ నోన్ , కాన్ క్లేవ్, డ్యూన్ : పార్ట్ 2, ఎమిలియా పెరెజ్, ఐయామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, విక్డ్ ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (అనోరా), బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్), జేమ్స్ మ్యాన్ గోల్డ్ (ది కంప్లీట్ అన్ నోన్ ), జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్), కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్) ఉత్తమ నటుడు: అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), తిమోతీ చాలమెట్ (ది కంప్లీట్ అన్ నోన్ ), కోల్మెన్ డొమినింగో (సింగ్సింగ్), రే ఫియన్నెస్ (కాన్ క్లేవ్), సెబస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్) ఉత్తమ నటి: సింథియా ఎరివో (విక్డ్), కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్), మికే మాడిసన్ (అనోరా), డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)ఉత్తమ సహాయ నటుడు: యురా బోరిసోవ్ (అనోరా), కిరెన్ కల్కిన్ (ది రియల్ పెయిన్ ), ఎడ్వర్డ్ నార్తన్ (ది కంప్లీట్ అన్ నోన్ ), గాయ్ పియర్స్ (ది బ్రూటలిస్ట్), జెరీమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్) ఉత్తమ సహాయ నటి: మోనికా బార్బరో (ది కంప్లీట్ అన్ నోన్ ), అరియానా గ్రాండే (విక్డ్), ఫెసిలిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్), ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్ క్లేవ్), జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్). -
Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’
క్రికెట్లో వరల్డ్ కప్ ఎలాంటిదో సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు అలాంటిది. ప్రపంచ వ్యాప్తంగా సినీ నటులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు పొందాలని కల కంటారు. గతేడాది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకొని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఒక దక్షిణాది చిత్రం అస్కార్ గెలిచి.. భారత ఖ్యాతీని పెంచేసింది. ఇక ఇప్పుడు 97వ ఆస్కార్ బరిలోను సౌత్ నుంచి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్దమయ్యాయి. అయితే వాటిల్లో సూర్య ‘కంగువా’(Kanguva Movie ) ఆస్కార్ బరిలోకి నిలిచింది. దీంతో పాటు పృథ్వి రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ది గోట్ లైఫ్’(Aadujeevitham: The Goat Life) కూడా ఆస్కార్‌లోకి ఎంట్రీ దక్కించుకుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’ సంతోష్ , స్వాతంత్ర్య వీర సావర్కర్ ,'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్(మలయాళం) చిత్రాలు ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయినా సినిమా నుంచి ఆస్కార్ ఫైనల్ నామినేషన్లను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది. జనవరి 17న నామినేషన్లను అనౌన్స్ చేస్తారు.‘లాపతా లేడీస్’ నో ఎంట్రీఇండియా నుంచి మొదటగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’(Laapataa Ladies ) ఆస్కార్‌కు ఎంపికైంది. అయితే ఈ చిత్రం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. డిసెంబర్ 17న ఆస్కార్ షార్ట్ లిస్ట్ చిత్రాలను అకాడమీ ప్రకటించింది. వాటిలో లాపతా లేడీస్ కు చోటు దక్కలేదు. కానీ భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ చిత్రం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌కి ఎంపికైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ హిందీ చిత్రం యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం సొంతం చేసుకుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో షార్ట్ లిస్ట్‌లో అధికారికంగా చోటు సాధించింది.ఆస్కార్ బరిలో ఫ్లాప్ చిత్రాలుఉత్తమ చిత్రం విభాగంలో ఇండియా నుంచి కంగువా, ఆడు జీవితం(ది గోట్ లైఫ్) సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఆయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం ఆడు జీవితం. ది గోట్ లైప్ పేరుతో ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది.అయితే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. ఇక భారీ అంచనాలతో వచ్చిన సూర్య కంగువా చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాదాపు రూ. 2000 కోట్లను కొల్లగొట్టే సినిమా ఇది అని చిత్ర బృందం మొదటి నుంచి ప్రచారం చేసింది. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందించలేదు. నటన, మేకింగ్ పరంగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకుంది. BREAKING: Kanguva ENTERS oscars 2025🏆 pic.twitter.com/VoclfVtLBL— Manobala Vijayabalan (@ManobalaV) January 7, 2025 -
అలాంటి సినిమాలను ఆస్కార్‌కు పంపండి: నిర్మాత గునీత్ మోంగా
‘‘ఆస్కార్ అనేది అమెరికన్ అవార్డు. కాబట్టి అక్కడి డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఉన్న భారతీయ సినిమాలను నామినేషన్స్ కోసం పంపితే అవార్డులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది’’ అని బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగా అన్నారు. ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్, ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలకు నిర్మాతగా ‘బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్’ విభాగంలో రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు గునీత్ మోంగా. కాగా ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎఫ్ఐ)కి సంబంధించిన జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలు ఆస్కార్ అవార్డు నామినేషన్‌కు వెళుతుంటాయి. కానీ అమెరికన్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ కూడా ఉన్న ఇండియన్ సినిమాలను ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి పంపితే ఆస్కార్ నామినేషన్ వచ్చే మార్గం సులువు అవుతుందని గునీత్ అంటున్నారు. ఈ విషయాలపై తాజాగా గునీత్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ‘‘ఆస్కార్ నామినేషన్ కోసం మనం ప్రయత్నం చేయవచ్చు. కానీ అది చాలా కష్టం. మన సినిమా ప్రచారానికి సమయం కేటాయించాలి. డబ్బు ఖర్చు పెట్టాలి. అక్కడి పబ్లిసిటీ మార్కెటర్స్‌ను నియమించుకోవాలి. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సమయంలో నేను అక్కడ నెల రోజులకు పైగా ఉన్నాను. అక్కడి వ్యవస్థ చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. షార్ట్‌లిస్ట్ అయిన తర్వాతి నుంచి నామినేషన్ దక్కించుకునే ప్రాసెస్ చాలా క్లిష్టతరంగా ఉంటుంది. మనతో పాటుగా ప్రపంచం అంతా ఆస్కార్ అవార్డు కోసం ఖర్చు పెడుతుంది... పోటీ పడుతుంది. మనం కూడా గట్టి పోటీ ఇవ్వాలంటే అక్కడి స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఉండాలి. ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్, ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలకు నెట్‌ఫ్లిక్స్ సపోర్ట్ ఉంది. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న షౌనక్ సేన్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’కు హెచ్‌బీవో వంటి పెద్ద సంస్థ సపోర్ట్‌గా నిలిచింది. 2001లో ‘లగాన్’ సినిమాకు నామినేషన్ వచ్చిందంటే ఆ సినిమాకు సోనీ వంటి సంస్థ సపోర్ట్ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అందుకే యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఉన్న సినిమాలను ఎఫ్ఎఫ్ఐ ఆస్కార్‌కు పంపితే అవార్డు వచ్చే చాన్సెస్ ఉంటాయి’’ అని పేర్కొన్నారు గునీత్ మోంగా. ఇక 2025లో లాస్ ఏంజిల్స్‌లో మార్చిలో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగాపు నామినేషన్ కోసం ఇండియా నుంచి ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ఎఫ్ఎఫ్ఐ పంపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... గునీత్ మోంగా నిర్మించిన తాజా ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు గెల్చుకుంది. కానీ ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ బరిలో ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రాన్ని ఎఫ్ఎఫ్ఐ పరిశీలించినప్పటికీ ఫైనల్‌గా ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ఎంపిక చేసింది. -
ఆస్కార్ అడ్రస్‌కు లాపతా లేడీస్
‘నాకు కుట్లు అల్లికలు, వంట, పాటలు, భజన వచ్చు. అమ్మ నేర్పింది’ అని కొత్త పెళ్లికూతురు అంటే ‘అత్తగారింటికి సొంతగా వెళ్లడం నేర్పలేదా?’ అని అడుగుతుంది ఒక పెద్దావిడ. అత్తగారి ఊరు ఏదో దానికి ఎలా వెళ్లాలో తెలియని స్థితి నుంచి తామేమిటో తమకు ఏం కావాలో తెలుసుకునే చైతన్యం వరకూ సాగే ఇద్దరు పల్లెటూరి నవ వధువుల కథ ‘లాపతా లేడీస్’ ఆస్కార్– 2025కు మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘‘సినిమాలు చాలానే ఉన్నాయి. కాని భారతీయతను ప్రతిబింబించే సినిమాగా ‘లాపతా లేడీస్’ ఏకగ్రీవంగా ఎంపికైంది’’ అని కమిటీ తెలిపింది. మహిళా డైరెక్టర్ కిరణ్ రావు తీసిన మహిళా గాథ ఇది.‘పితృస్వామ్యానికి వ్యతిరేక పదం మాతృస్వామ్యం అని చాలామంది అనుకుంటారు. కాని పితృస్వామ్యానికి వ్యతిరేక పదం సమానత్వం. మనకు ఒకరు ఆధిపత్యం వహించే పితృస్వామ్యం వద్దు.. మాతృస్వామ్యం వద్దు... అందరూ సమానంగా జీవించే వ్యవస్థే కావాల్సింది’ అంటుంది కిరణ్ రావు.ఆమె దర్శకత్వంలో మార్చి 2024లో విడుదలైన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ కోసం ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరీలో 2025 సంవత్సరానికిగాను మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘పతా’ అంటే అడ్రస్. లాపతా అంటే అడ్రస్ లేకపోవడం. లేకుండాపోవడం. సరిగా చె΄్పాలంటే మన దేశంలో పెళ్లయ్యాక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్లి తన గుర్తింపును తాను కోల్పోవడం.గుర్తింపు నుంచి తప్పిపొడం... ఆకాంక్షలను చంపుకోవడం... ఇదీ కథ. ఆస్కార్ కమిటీకి ఈ సినిమా నచ్చి నామినేషన్ పొందితే ఒక ఘనత. ఇక ఆస్కార్ సాధిస్తే మరో ఘనత. ‘లాపతా లేడీస్’ నిర్మాత ఆమిర్ ఖాన్ గతంలో నిర్మించి నటించిన ‘లగాన్’కు కొద్దిలో ఆస్కార్ తప్పింది. ఈసారి ఆస్కార్ గెలవడానికి గట్టి అవకాశాలున్నాయని సినిమా విమర్శకులు భావిస్తున్నారు. ముందడుగును అడ్డుకునే కపట నాటకం‘లాపతా లేడీస్’లో ఇద్దరు వధువులు అత్తగారింటికి వెళుతూ తప్పిపోతారు. ఒక వధువు మరో పెళ్లికొడుకుతో తనకు సంబంధం లేని అత్తగారింటికి చేరితే ఇంకో వధువు పారటున వేరే స్టేషన్లో చిక్కుకు΄ోతుంది. రైల్వేస్టేషన్లో ఉన్న వధువుకు తన అత్తగారి ఊరు పేరేమిటో తెలియదు. ఎలా వెళ్లాలో తెలియదు. సొంత ఊరి పేరు చెబుతుంది కానీ భర్త లేకుండా తిరిగి పుట్టింటికి చేరడం తల వంపులని వెళ్లడానికి ఇష్టపడదు.‘మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అలా చేయరు’ అంటుంది స్టేషన్లో క్యాంటీన్ నడుపుతున్న అవ్వతో. అప్పుడా అవ్వ ‘మన దేశంలో ఇదే పెద్ద కపట నాటకం. మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అది చేయకూడదు.. ఇది చేయకూడదు అని అసలు ఏదీ చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు’ అంటుంది. అయితే ఆ వధువు వెరవకుండా ఆ స్టేషన్లో ఆ అవ్వతోనే ఉంటూ అక్కడే పని చేసుకుంటూ భర్త కోసం ఎదురు చూస్తూ మెల్లగా ఆత్వవిశ్వాసం నింపుకుంటుంది. మరో వైపు వేరే వరుడితో వెళ్లిన వధువు ఆ అత్తగారింటిలో (వాళ్లంతా అసలు కోడలి కోసం అంటే రైల్వే స్టేషన్లో ఉండిపోయిన కోడలి కోసం వెతుక్కుంటూ ఉండగా) ఆశ్రయం పొంది పై చదువులు చదవడానికి తాను అనుకున్న విధంగా పురోగమిస్తుంది. సినిమా చివరలో ఒక వధువు తన భర్తను చేరుకోగా మరో వధువు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భర్తను కాదని పై చదువులకు వెళ్లిపోతుంది. ఈ మొత్తం కథలో దర్శకురాలు కిరణ్ రావు ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. మన దేశంలో స్త్రీలను పరదాలు, ఘోషాలు, ఘూంఘట్ల పేరుతో అవిద్యలో ఉంచి వారికి లోకం తెలియనివ్వకుండా కనీసం తమ వ్యక్తిత్వ చిరునామాను నిర్మించుకోనివ్వకుండా ఎలా పరాధీనంలో (పురుషుడి మీద ఆధారపడేలా) ఉంచుతున్నారో చెబుతుంది. స్త్రీలు స్వతంత్రంగా జీవించగలరు, ఆత్మవిశ్వాసంతో బతగ్గలరు వారినలా బతకనివ్వండి అంటుందీ సినిమా. పెద్ద హిట్నాలుగైదు కోట్లతో నిర్మించిన ‘లాపతా లేడీస్’ దాదాపు 25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఒకవైపు థియేటర్లలో ఆడుతుండగానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయినా జనం థియేటర్లలో చూడటానికి వెళ్లడం విశేషం. చాలా మంచి ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. రైల్వే స్టేషన్లో అవ్వగా నటించిన ఛాయా కదమ్‌కు, ఇన్స్పెక్టర్గా నటించిన రవికిషన్‌కు మంచి పేరు వచ్చింది. మిగిలిన కొత్త నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.భారీపోటీలోఆస్కార్ అఫిషియల్ ఎంట్రీ కోసం చాలా సినిమాలుపోటీ పడ్డాయి. తెలుగు నుంచి కల్కి, హనుమ్యాన్, మంగళవారం ఉన్నాయి. తమిళం నుంచి ‘మహరాజా’, ‘తంగలాన్’ ఉన్నాయి. జాతీయ అవార్డు పొందిన ‘ఆట్టం’ (మలయాళం), కేన్స్ అవార్డు ΄పొదిన ‘ఆల్ వియ్ ఇమేజిన్ యాజ్ లైట్’ కూడా ఉన్నాయి. హిందీ నుంచి ‘యానిమల్’, ‘శ్రీకాంత్’పోటీ పడ్డాయి. కాని ‘లాపతా లేడీస్’లోని అంతర్గత వేదన, మార్పు కోరే నివేదన దానికి ఆస్కార్‌కు వెళ్లే యోగ్యత కల్పించింది. ఇది మాకు దక్కిన గౌరవంఆస్కార్ నామినేషన్ కోసం ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ మా ‘లపతా లేడీస్’ సినిమాను ఎంపిక చేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ నామినేషన్‌కు మాతో పాటు మరికొన్ని అద్భుతమైన భారతీయ సినిమాలుపోటీ పడ్డాయి. అయితే కమిటీ మా చిత్రాన్ని నమ్మినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖండాంతరాలు దాటేందుకు, ప్రజల హృదయాలతో కనెక్ట్ కావడానికి సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం. భారతదేశంలో ‘లాపతా లేడీస్’కు లభించిన ఆదరణ, ప్రపంచ వ్యాప్తంగా కూడా లభిస్తుందని ఆశిస్తున్నాను.– కిరణ్‌రావు -
సెప్టెంబరులో స్టార్ట్
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆపెన్ హైమర్’ చిత్రంలో మంచి నటన కనబరచి 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్ అవార్డు అందుకున్నారు నటుడు సీలియన్ మర్ఫీ. దీంతో సీలియన్ తర్వాతి చిత్రాలపై హాలీవుడ్లో ఫోకస్ పెరిగింది. కాగా సీలియన్ నటించనున్న కొత్త చిత్రం సెప్టెంబరులో స్టార్ట్ కానున్నట్లు హాలీవుడ్ సమా చారం. హాలీవుడ్ హిట్ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’ ఆధారంగా ఓ సినిమా తీయాలనుకుంటున్నారు ఈ సిరీస్ రూపకర్త స్టీవెన్ నైట్. ‘పీకీ బ్లైండర్స్’ ఆధారంగా ఈ సినిమాను సెప్టెంబరులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ‘పీకీ బ్లైండర్స్’ సిరీస్‌లో థామస్ షేల్బేగా నటించిన సీలియన్ మర్ఫీ ఈ సినిమాలోనూ నటిస్తారన్నట్లుగా స్టీవెన్ ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా 2025 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఫిఫ్టీ ప్లస్‌లో ఫస్ట్ చాన్స్!
ఐదు పదుల వయసు దాటిన తర్వాత హీరో అవుతున్నారు ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ యాక్టర్ కే హుయ్ క్వాన్. ‘ది అవెంజర్స్’, ‘జాన్ విక్’, ‘డెడ్‌పూల్ 2’ వంటి సినిమాల్లోని యాక్షన్ సీక్వెన్స్‌లకు స్టంట్ కో ఆర్డినేటర్‌గా చేసిన జోనాథన్ యుసేబియా ‘విత్ లవ్’ అనే ఓ యాక్షన్ ఫిల్మ్‌తో దర్శకునిగా తొలిసారి మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలోనే కే హుయ్ క్వాన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. నటుడిగా దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్ ఉన్న కే హుయ్ క్వాన్‌కు హీరోగా ఇదే తొలి చిత్రమని హాలీవుడ్ సమాచారం. అలాగే ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న జోనాథన్ యుసేబియా దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ప్రస్తుతం ‘విత్ లవ్’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాను 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు క్వాన్. ఈ సినిమాకు గాను ఆయన ఉత్తమ సహాయ నటుడు విభాగంలో 2023లో జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో అవార్డు అందుకున్నారు. -
Oscars 2024: ‘ఉత్తమ చిత్రం’ వివాదంపై స్పందించిన నటుడు
ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో నంబర్ వన్ అవార్డుగా ‘ఉత్తమ చిత్రం ’ విభాగాన్ని భావిస్తారు. అందుకే ఈ విభాగాపు అవార్డును వేడుకలో చివరిగా ప్రకటిస్తారు. అలాగే వేడుకలో చివరి మూమెంట్స్ కాబట్టి ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. కానీ అలాంటి డ్రామా గడిచిన ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం) లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో కనిపించలేదు. ‘ఉత్తమ చిత్రం’ అవార్డును ప్రకటించిన ప్రముఖ నటుడు అల్ పచినో చాలా సాదాసీదాగా వెల్లడించేశారు. పోటీలో ఉన్న పది చిత్రాల పేర్లు చెప్పకుండా.. అవార్డు సాధించిన చిత్రాన్ని ప్రకటించేశారు. కవర్ని మెల్లిగా తెరుస్తూ.. ‘నా కళ్లకు ‘ఆపెన్‌హైమర్’ కనిపిస్తోందని సింపుల్‌గా ప్రకటించారు. ఇలా చేయడం పట్ల హాలీవుడ్‌లోని కొందరు నటీనటులు, ఇతర ప్రముఖులు విముఖత వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయంపై మంగళవారం అల్ పచినో స్పందించారు. ‘‘ఆస్కార్ వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా పాల్గొనడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇక వేడుకలో ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలవడానికి పోటీ పడ్డ పది చిత్రాల పేర్లను నేను చదవకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయని తెలిసింది. కానీ ఇది నేను ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. అది ఆస్కార్ ప్రొడ్యూసర్ల నిర్ణయం. వేడుక ఆద్యంతం ఈ పది సినిమాల యూనిట్ వాళ్లు హైలైట్ అవుతూనే ఉన్నందువల్ల వారు ఇలా నిర్ణయించి ఉండొచ్చు. ఆస్కార్‌కు నామినేట్ కావడం అనేది ఎవరి జీవితంలోనైనా ఓ మంచి మైల్స్టోన్. ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యక్తిగా నాకు ఈ విషయం తెలుసు. వారి పేర్లు ప్రస్తావించకపోవడం అనేది బాధకు గురి చేసే విషయమే. ఈ ఘటన పట్ల బాధపడిన వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని చెబుతూ ఓ స్టేట్మెంట్ను విడుదల చేశారు అల్ పచినో. ఇక ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఆపెన్‌హైమర్’, ‘అమెరికన్ ఫిక్షన్’, ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’, ‘బార్బీ’, ‘ది హోల్డోవర్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, ‘మేస్ట్రో’, ‘΄ాస్ట్ లీవ్స్’, ‘పూర్ థింగ్స్’, ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాలు ΄ోటీ పడగా, ‘ఆపెన్‌హైమర్’ అవార్డు దక్కించుకుంది. -
ఆస్కార్ వేదికపై అణు బాంబు మోత
అణు బాంబు సౌండ్ అదిరింది.. క్రిస్టోఫర్ కల నిజమైంది... ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు ఆకర్షణగా నిలిచింది. ఫేక్ చప్పట్లతో మెస్సీ (శునకం), ఆమిర్ ఖాన్ ‘పీకే’ తరహాలో జాన్ ప్రత్యక్షం కావడం చర్చలకు దారి తీసింది.ఇలా ఆనందాలు, వింతలు, విడ్డూరాలతో ఆస్కార్ అవార్డు వేడుక జరిగింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. విజేతల వివరాలు: • ఉత్తమ చిత్రం: (ఆపెన్ హైమర్) • దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్ (ఆపెన్ హైమర్) • నటుడు: సిలియన్ మర్ఫీ (ఆపెన్ హైమర్) • నటి: ఎమ్మాస్టోన్ (పూర్ థింగ్స్) • సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఆపెన్ హైమర్) • సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) • సినిమాటోగ్రఫీ: ఆపెన్ హైమర్ • డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్ • హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) • అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్ ) • ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) • యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్ • కాస్ట్యూమ్ డిజైన్ : హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) • ప్రోడక్షన్ డిజైన్ : జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) • ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఆపెన్ హైమర్) • విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ • డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది లాస్ట్ రిపేర్ షాప్ • ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఆపెన్ హైమర్ • సౌండ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఒరిజినల్ సాంగ్: వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) • లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్. రాబర్ట్ జూనియర్, డేవైన్ జో రాండాల్ఫ్, ఎమ్మా స్టోన్, సిలియన్ మర్ఫీ ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్ ఆపెన్‌హైమర్ జీవితంతో రూపొందిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఆపెన్‌హైమర్’ మోత ఆస్కార్ వేదికపై బాగా వినిపించింది. దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్‌తో ఆస్కార్ అవార్డును ముద్దాడేలా చేసింది. మార్చి 10న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆపెన్‌హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి విజయఢంకా మోగించింది. మొత్తం పదమూడు నామినేషన్లు దక్కించుకున్న ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు దర్శకుడు, నటుడు, సహాయనటుడు, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డు దక్కింది. అలాగే పదకొండు నామినేషన్లు దక్కించుకున్న ‘పూర్ థింగ్స్’ సినిమాకు నాలుగు విభాగాల్లో, హిస్టారికల్ డ్రామా ‘జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకు రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ‘ఆపెన్‌హైమర్’కు పోటీగా నిలుస్తుందనుకున్న ‘బార్బీ’ సినిమాకు 8 నామినేషన్లు దక్కినా, ఒక్క అవార్డు (బెస్ట్ ఒరిజినల్ సాంగ్)తో సరిపెట్టుకుంది, పది నామినేషన్లు దక్కించుకున్న ‘కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమాకి ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నిలిచిన సిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటి రాండాల్ఫ్ తొలిసారి ఆస్కార్‌ని ముద్దాడారు. గతంలో ‘లా లా ల్యాండ్’కి ఉత్తమ నటిగా ఆస్కార్ అందు కున్న ఎమ్మా స్టోన్ ఇప్పుడు ఇదే విభాగానికి అవార్డుని అందుకున్నారు. భారత సంతతికి చెందిన నిషా తెరకెక్కించిన ‘టు కిల్ ఎ టైగర్’ డాక్యుమెంటరీ ఆస్కార్ సాధించలేకపోయింది. ఇక అవార్డు విజేతల జాబితా ఈ విధంగా... స్వీట్ సర్ప్రైజ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. 96వ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ విజువల్స్ కనిపించాయి. వరల్డ్ గ్రేటెస్ట్ స్టంట్ సీక్వెన్స్ అంటూ ఆస్కార్ వేదికపై ప్రదర్శించిన విజువల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’లోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లు రెండుసార్లు కనిపించాయి. ‘టైటానిక్’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘చార్లీ చాప్లిన్’, ‘బస్టర్ కీటన్’ వంటి హాలీవుడ్ క్లాసిక్ చిత్రాల యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ‘ఆర్ఆర్ఆర్’లోని యాక్షన్ విజువల్స్ ప్లే కావడం విశేషం. అలాగే ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?’ను విజేతగా ప్రకటించే ముందు ప్లే చేసిన కొన్ని సాంగ్స్ విజువల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట కనిపించింది. ఈ సందర్భంగా.. ‘‘వరల్డ్ స్టంట్ సీక్వెన్స్‌లకు నివాళిగా ప్లే చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో ‘ఆర్ఆర్ఆర్’ స్టంట్ సీక్వెన్స్‌లు ఉండటం స్వీట్ సర్ప్రైజ్లా ఉంది’’ అని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మించారు. నా కళ్లు చెబుతున్నాయి... – అల్ పచినో మామూలుగా విజేతలను ప్రకటించే ముందు పోటీలో ఉన్నవారి పేర్లు చెప్పి, చివరిగా విజేత పేరు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రముఖ నటుడు 83 ఏళ్ల అల్ పచినో ఈ విధానాన్ని అనుసరించలేదు. ఈ ‘గాడ్ ఫాదర్’ మూవీ ఫేమ్ ఉత్తమ చిత్రాన్ని ప్రకటించడానికి వేదికపైకి వచ్చారు. ఈ విభాగంలో పది చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ చిత్రాల పేర్లు చెప్పకుండా.. ‘ఇదిగో..’ అంటూ మెల్లిగా ఎన్వలప్ కవర్ని ఓపెన్ చేస్తూ.. నా కళ్లు చెబుతున్నాయి టైప్‌లో నా కళ్లకు ‘ఆపెన్‌హైమర్’ కనబడుతోంది అనగానే వీక్షకుల నుంచి కరతాళ ధ్వనులు వినిపించాయి. అయితే అల్ పచినో ఈ విధంగా ప్రకటించడంతో.. అవార్డు ఈ సినిమాకే వచ్చిందా? అనే సందేహంలో కొందరు ఉండిపోయారు. అంతలోనే ‘అవును.. అవును..’ అన్నారు. అయితే అల్ పచినో ఇలా ప్రకటించడం పట్ల పలువురు విమర్శించారు. ఆస్కార్ అవార్డుల జాబితాలో ప్రధానమైన విభాగంలో పోటీ పడిన చిత్రాల పేర్లు చెప్పకుండా, పైగా వేడుకలో చివరి అవార్డు కాబట్టి కాస్తయినా సస్పెన్స్ మెయిన్టైన్ చేయకుండా చెప్పడం బాగాలేదని అంటున్నారు. ఇలా సాదా సీదా ప్రకటనతో ఆస్కార్ అవార్డు వేడుక ముగిసింది. నోలన్ కల నెరవేరెగా... ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ చరిత్ర కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎందుకంటే నోలన్ తీసిన సినిమాలు ఆస్కార్ అవార్డుల కోసం 49 నామినేషన్లు దక్కించుకుని, 18 అవార్డులను సాధించాయి. కానీ క్రిస్టోఫర్ నోలన్‌కు మాత్రం 95వ ఆస్కార్ అవార్డుల వరకూ ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. తొలిసారి 2002లో ‘మెమెంటో’ సినిమాకు గాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో 74వ ఆస్కార్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకున్నారు నోలన్... నిరాశే ఎదురైంది. ఆ తర్వాత 83వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఇన్సెప్షన్’ సినిమాకు బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో నామినేషన్లు దక్కినా అవార్డులు రాలేదు. 90వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ విభాగాల్లో నోలన్ ‘డంకిర్క్’ సినిమాకు నామినేషన్లు దక్కినా ఆస్కార్ అవార్డు దక్కలేదు. చివరికి నోలన్ కల ‘ఆపెన్‌హైమర్’తో నెరవేరింది. ఈ ప్రయాణంలో నేనూ భాగం అని... – క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ వేదికపై క్రిస్టోఫర్ నోలన్ మాట్లాడుతూ – ‘‘మా సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్లతో పాటు యూనిట్ అందరికీ ధన్యవాదాలు. ఇక మా కుటుంబాన్ని, ఈ సినిమాను నిర్మించిన మా నిర్మాత ఎమ్మా థామస్‌తో (భార్య ఎమ్మా పేరును ప్రస్తావించగానే ఒక్కసారిగా నవ్వులు) పాటు నా సోదరుడికి థ్యాంక్స్ చె΄్పాలి. మా సినిమాలో సత్తా ఉందని నమ్మి, డిస్ట్రిబ్యూట్ చేసిన యూనీవర్సల్ స్టూడియోస్‌కు ధన్యవాదాలు. సినిమా చరిత్ర వందేళ్లకు చేరువ అవుతోంది. ఈ అద్భుతమైన ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. కానీ ఈ ప్రయాణం తాలూకు సినిమాల్లో నేను కూడా ఓ అర్థవంతమైన భాగం అని భావించి, నన్ను గుర్తించిన ఆస్కార్ కమిటీకి ధన్యవాదాలు’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... భార్యాభర్త నోలన్, ఎమ్మా దర్శక–నిర్మాతలుగా ఒకేసారి ఆస్కార్ అవార్డులు సాధించారు. అణుబాంబు విస్ఫోటనం నేపథ్యంలోని ‘ఆపెన్‌హైమర్’లో నటించి, అవార్డు దక్కించుకున్న మర్ఫీ తన అవార్డును ప్రపంచ శాంతి ఆకాంక్షించేవారికి అంకితమిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జీవితంలో తనకు ఎంతో అండగా నిలిచిన తన భార్య సుసాన్ డౌన్‌కి అవార్డుని అంకితం ఇస్తున్నట్లుగా ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ తెలిపారు. ‘‘నేను నా జీవితంలో మరోలా (స్లిమ్‌గా) ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే... నేను నాలానే ఉండాలి’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రాండాల్ఫ్ నేనీ సినిమా చేసి ఉండాల్సింది కాదు – ఎమ్ చెర్నోవ్ ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘20 డేస్ ఇన్ మరియోపోల్’ చిత్రం ఆస్కార్ అవార్డును సాధించింది. ఈ అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్‌లో చిత్రదర్శకుడు ఎమ్ చెర్నోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రలో ఇది తొలి ఆస్కార్ అవార్డు. ఇందుకు గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఈ సినిమాను నేను చేసి ఉండకూడదని అనుకుంటున్నాను. బహుశా ఈ వేదికపై ఇలా మాట్లాడుతున్న తొలి దర్శకుడిని నేనేమో. మా ఉక్రెయిన్‌పై దాడులు చేయకుండా, మా నగరాలను ఆక్రమించకుండా ఉండేందుకు బదులుగా రష్యావారికి ఈ అవార్డు ఇస్తాను. నేను చరిత్రను, గతాన్ని మార్చలేను. కానీ కొందరు ప్రతిభావంతులతో కలిసి ఓ కొత్త రికార్డును సృష్టించగలం. అప్పుడు నిజం గెలుస్తుంది. జీవితాలను త్యాగం చేసిన మరియోపోల్ ప్రజలు గుర్తుండిపోతారు. సినిమా జ్ఞాపకాలను ఏర్పరుస్తుంది. జ్ఞాపకాలు చరిత్రను నెలకొల్పుతాయి’’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు చెర్నోవ్. ఆమిర్ ‘పీకే’ని తలపించేలా జాన్ సెనా ఆస్కార్ అవార్డు వేడుకలో జరిగిన ఓ ఘటన ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాని గుర్తు చేసింది. ఈ చిత్రంలో ఆమిర్ ఓ సీన్లో తన శరీరానికి ముందు భాగంలో ఓ రేడియో అడ్డుపెట్టుకుని అర్ధనగ్నంగా నటించారు. ఆస్కార్ వేదికపై ఇలాంటి సీనే రిపీట్ అయింది. స్టార్ రెజ్లర్ (డబ్ల్యూడబ్ల్యూఈ) జాన్ సెనా అర్ధనగ్నంగా ప్రత్యక్షమై షాక్ ఇచ్చారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును ప్రకటించేందుకు జాన్ సెనా ఇలా అర్ధనగ్నంగా రావడం చర్చనీయాంశంగా మారింది. తన శరీరానికి ముందు భాగంలో విజేత వివరాలు ఉండే ఎన్వలప్ కవర్‌ను మాత్రమే అడ్డుపెట్టుకొని వేదికపైకి రావడంతో సభికులందరూ తెగ నవ్వుకున్నారు. అయితే తాను ఇలా రావడానికి కారణం ఉందన్నారు జాన్ సెనా. ‘పురుషుడి శరీరం కూడా జోక్ కాదని, అలానే కాస్ట్యూమ్స్ అనేవి ముఖ్యం అని తెలియజెప్పేందుకే ఇలా వచ్చా’ అన్నారు సెనా. అనంతరం ‘పూర్ థింగ్స్’ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో అవార్డును ప్రకటించారు. 1974 సీన్ రిపీట్ దాదాపు 50 ఏళ్ల క్రితం (1974) జరిగిన ఆస్కార్ వేడుకల్లో నటి ఎలిజబెత్ టేలర్‌ను పరిచయం చేస్తుండగా ఓ వ్యక్తి నగ్నంగా వేదికపైకి దూసుకు రావడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా జాన్ సెనా ప్రవర్తనతో నాటి ఘటనను కొందరు గుర్తుకు తెచ్చుకున్నారు. ఫేక్ క్లాప్‌తో శునకానందం ఆస్కార్ వేడుకలో ఈ ఏడాది ఓ శునకం అందరి దృష్టినీ ఆకర్షించింది. సభికులతో పాటు క్లాప్స్ కొట్టిన ఈ శునకం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆస్కార్ కోసం పలు విభాగాల్లో పోటీ పడిన సినిమాల్లో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ ఒకటి. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఈ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన మెస్సీ (శునకం)ని అవార్డు వేడుకకు తీసుకొచ్చింది యూనిట్. ‘ఆపెన్ హైమర్’కి రాబర్డ్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకుంటున్నప్పుడు అందరితో పాటు మెస్సీ చప్పట్లు కొట్టడం ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ శునకం కూర్చున్న కుర్చీ కింద ఓ వ్యక్తి ఉండి, ఫేక్ చేతులతో క్లాప్ కొట్టాడు. అవి శునకం కాలిని పోలి ఉండటంతో మెస్సీయే చప్పట్లు కొట్టిందని భావించారంతా. -
ఆస్కార్ రెడ్ కార్పెట్: ఆ స్టార్ల రెడ్ పిన్ కథేమిటి?
ఆస్కార్ 2024 సంరంభం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ సినిమా రంగంలో నోబెల్ అవార్డులుగాభావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్‌పై ప్రత్యేకంగా కనిపించారు. 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు స్టార్లు అంతా రెడ్ పిన్లు ధరించడం విశేషంగా నిలిచింది. వీరి ఫోటోలు వైరల్ గా మారాయి. భీకర బాంబుల దాడులతో దద్దరిల్లిన గాజాలో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ వారంతా రెడ్ పిన్‌లను ధరించారు. అలాగే కాల్పుల విరమణకు పిలుపు నివ్వమని అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ను కోరుతూ ఒక బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఇజ్రాయెల్, గాజాలో హింసను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ యుద్ధంలో వేలాదిమంది, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో శాంతిని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని 'పూర్ థింగ్స్' నటుడు రమీ యూసఫ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రతకో పిలుపునిస్తున్నామనీ, పాలస్తీనా ప్రజలకు శాశ్వత న్యాయం , శాంతి కలిగేలా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. అరచేతిలో ఒక నల్ల రంగు గుండెతో డిజైన్ చేసిన ఈ రెడ్ పిన్నులను ఆర్టిస్ట్4సీజ్ఫైర్ అనే సంస్థ తయారు చేసింది. -
అస్కార్ బరిలో ఉన్న పది సినిమాలు ఇవే
-
ఆస్కార్ బరిలో మన డాక్యుమెంటరీ
జార్ఖండ్‌లో తన పదమూడేళ్ల కుమార్తెపై ముగ్గురు కుర్రాళ్లు దారుణంగా లైంగిక దాడి చేశారు. ఆమెను చంపడానికి చూశారు. ఆ అమ్మాయి కుంగిపోయింది. కాని తనకు జరిగిన అన్యాయంపై పోరాడాలనుకుంది. నిరుపేద గ్రామీణ తండ్రి అందుకు సిద్ధమయ్యాడు. ఊరు ఊరంతా వారికి వ్యతిరేకమైనా ఆ తండ్రీ కూతుళ్లు న్యాయం కోసం పోరాడారు. ‘బాధితులు పోరాడాల్సిందే’ననే పిలుపునిస్తూ ఈ ఉదంతాన్ని ‘టు కిల్ ఏ టైగర్’ పేరుతో డాక్యుమెంటరీగా తీసింది నిషా పహూజా. 2024 సంవత్సరానికి ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది ‘టు కిల్ ఏ టైగర్’. ‘ఈసారి ఇటువైపు వస్తే నిన్ను చంపినా చంపుతాం’ అని నిషా పహూజాతో జార్ఖండ్‌లోని ఆ గ్రామస్తులు అన్నారు. ఆరేళ్ల క్రితం జార్ఖండ్‌లోని ఒక గ్రామంలో 13 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఆ ఘటన తర్వాత అమ్మాయి, అమ్మాయి తండ్రి న్యాయ పోరాటానికి సంకల్పించారు. అక్కడి నుంచి ఆ గ్రామవాసులు తండ్రీ కూతుళ్లపై ఎలాంటి వొత్తిడి తెచ్చారు, అయినా సరే న్యాయం కోసం ఆ తండ్రీకూతుళ్లు ఎలా నిలబడ్డారు అని తెలిపే సంక్షిప్త చిత్రమే నిషా పహూజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ. గత సంవత్సరం మన దేశం నుంచి ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది. రేపు మార్చి 10, 2024న జరగనున్న ఆస్కార్ వేడుకలో ‘టు కిల్ ఏ టైగర్’ కూడా గెలిస్తే అది చాలా పెద్ద విశేషమే అవుతుంది. బాధితులు పోరాడాల్సిందే ‘భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ నమోదు అవుతోంది. నమోదు కానివి ఎన్ని ఉన్నాయో లెక్క తెలియదు. నేరం నమోదు అయ్యాక కూడా కేవలం 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. లైంగిక దాడులను ఎదుర్కొన్నవారు న్యాయం కోసం పోరాడినప్పుడే పెత్తందారీ స్వభావ ప్రతిఫలాలైన లైంగికదాడులు తగ్గుతాయి’ అంటుంది నిషా పహూజా. చత్తీస్‌గఢ్‌లోని 13 ఏళ్ల అమ్మాయి (ఇప్పుడు 19 సంవత్సరాలు) న్యాయ పోరాటాన్ని నిషా 2022లో డాక్యుమెంటరీగా తీసింది. అత్యాచార ఘటన జరిగిందని గ్రామస్తులు అంగీకరించినా తమ ఊరి కుర్రాళ్లపై కేసు నడవడం ఇష్టపడటం లేదు. అంతేకాదు ఇలా తమ ఊరు పరువు బజారున పడటం కూడా ఇష్టపడటం లేదు. దాంతో డాక్యుమెంటరీ యూనిట్‌ని బెదిరించారు. బాలికపై జరిగిన అత్యాచారాన్ని ‘అదో ఆకతాయి చర్య’ అని కొందరు అంటే ‘ఆ ముగ్గురిలో ఎవరో ఒక కుర్రాణ్ణి అమ్మాయి పెళ్లి చేసుకుంటే సరి’ అని మరికొందరు భావిస్తున్నారు. కాని బాధితురాలు మాత్రం ‘చితికిపోయిన నా కలలను ఎవరు తిరిగి తెచ్చిస్తారు’ అని ప్రశ్నిస్తోంది. స్త్రీ సమస్యలే ఆమె ఇతివృత్తాలు 55 ఏళ్ల నిషా పహూజా తన నాలుగేళ్ల వయసులో ఢిల్లీ నుంచి కెనడా వలస వెళ్లింది. అక్కడే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఆంగ్ల సాహిత్యం చదివింది. సీబీసీ (కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్)లో రీసెర్చర్‌గా పని చేసి జాన్ వాకర్, అలీ కజిమి వంటి కెనడియన్ ఫిల్మ్ మేకర్స్ వద్ద డాక్యుమెంటరీ నిర్మాణ మెళకువలు గ్రహించింది. ఆపై తనే సొంతంగా డాక్యుమెంటరీలు తీయడం మొదలు పెట్టింది. భారతదేశంతో సంబంధాలు తెంచుకోకుండా తరచూ వచ్చి వెళ్లే నిషా ఇక్కడి స్త్రీల సమస్యలకే ఎక్కువ డాక్యుమెంటరీ రూపం ఇచ్చింది. 2002లో ‘బాలీవుడ్ బౌండ్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. నలుగురు భారతీయ కెనడియన్ వ్యక్తులు ముంబై మహానగరానికి వచ్చి బాలీవుడ్లో తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకున్నారనేది అందులో మూలాంశం. 2012లో నిషా తీసిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. మిస్ ఇండియా కావాలని కలలు కనే భారతీయ యువతుల సంఘర్షణాయుతమైన తతంగాన్ని చూపుతూ ఈ చిత్రం తెరకెక్కింది. ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాల్లో ‘ఔట్‌స్టాండింగ్ కవరేజ్ ఆఫ్ ఎ కరెంట్ న్యూస్ స్టోరీ’ విభాగంలో పురస్కారం అందుకుంది. 2022లో నిషా తీసిన డాక్యుమెంటరీయే ‘టు కిల్ ఎ టైగర్’. 90 నిమిషాల ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కెనడా టాప్–10 చిత్రంగా నిలిచింది. అనంతరం వివిధ వేదికలపై 19 పురస్కారాలు కైవసం చేసుకుంది. ఆస్కార్ గెలుచుకుంటే అదో విశిష్ట పురస్కారం అవుతుంది. -
‘బార్బెన్‌హైమర్’ పోరు ఖరారు!
గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు కురిపించిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ‘ఒప్పెన్‌హైమర్’, దర్శకురాలు గ్రెటా గెర్విగ్ ‘బార్బీ’ చిత్రాలు ఆస్కార్ అవార్డ్స్‌లోనూ పో టీలో నిలిచాయి. 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు మంగళవారం సాయంత్రం (భారతీయ కాలమాన ప్రకారం) వెలువడ్డాయి. 23 విభాగాల్లోని ప్రధాన విభాగాల్లో ‘ఒప్పెన్‌హైమర్’కు 13 నామినేషన్లు దక్కగా, ‘బార్బీ’ ఎనిమిది నామినేషన్లను సొంతం చేసుకుంది. నామినేషన్ల జాబితాను నటుడు జాక్ క్వైడ్, నటి జాజీ బీట్జ్ ప్రకటించారు. ఇంకా అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న చిత్రాల్లో 11 నామినేషన్లతో యోర్గోస్ లాంతిమోస్ దర్శకత్వం వహించిన ‘పూర్ థింగ్స్’, పది నామినేషన్లతో మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించిన ‘కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, ఏడు నామినేషన్లతో ‘మేస్ట్రో’ ఉన్నాయి. ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఒప్పెన్‌హైమర్’, ‘బార్బీ’ పో టీ పడుతుండటంతో ‘ఇది బార్బెన్‌హైమర్ పో రు’ అని హాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఉత్తమ దర్శకుల విభాగంలో ‘బార్బీ’ దర్శకురాలు గ్రెటా గెర్విగ్కి నామినేషన్ దక్కుతుందనే అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆమె నామినేట్ కాకపో వడం ఆశ్చర్యానికి గురి చేసిందని హాలీవుడ్ అంటున్న మాట. కానీ ఇదే చిత్రానికి సహాయ నటి విభాగంలో అమెరికా ఫెర్రెరాకి దక్కడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫెర్రెరాకి నామినేషన్ దక్కుతుందనే కనీస అంచనాలు లేకపో వడమే ఈ ఆశ్చర్యానికి కారణం. అలాగే ‘బార్బీ’లో టైటిల్ రోల్ చేసిన మార్గెట్ రాబీకి ఉత్తమ నటి నామినేషన్ దక్కకపో వడం ఘోరం అనే టాక్ కూడా ఉంది. ఇక దర్శకుల విభాగంలో గ్రెటా గెర్విగ్కి దక్కకపో యినప్పటికీ ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ చిత్రదర్శకురాలు జస్టిన్ ట్రైట్కి దక్కడంతో ఈ కేటగిరీలో ఓ మహిళ ఉన్నట్లు అయింది. ఇక మార్చి 10న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో (భారత కాలమానం ప్రకారం మార్చి 11) ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. మూడేళ్లుగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కెమ్మెల్ ఈసారి కూడా ఆ బాధ్యతను నిర్వర్తించనున్నారు. ఇదిలా ఉంటే గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ (‘నాటు నాటు...’ పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు), బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డు దక్కించుకుని, భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటాయి. ఈసారి దేశం నుంచి ఏ సినిమా పో టీలో లేదు. అయితే కెనడాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన నిషా పహుజా దర్శకత్వం వహించిన కెనెడియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘టు కిల్ ఏ టైగర్’కి నామినేషన్ దక్కింది. ఉత్తమ చిత్రం: అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ∙ఒప్పెన్‌హైమర్ పాస్ట్ లైవ్స్ ∙పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉత్తమ దర్శకుడు: అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రైట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్సెస్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ఉత్తమ నటుడు: బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పెన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ఉత్తమ నటి: అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మా స్టోన్: పూర్ థింగ్స్ ఏ 91 ఏళ్ల కంపో జర్ జాన్ విల్లియమ్స్ 54వ నామినేషన్ దక్కించుకున్నారు. ‘ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ చిత్రానికి గాను ఆయనకు నామినేషన్ దక్కింది. అత్యధిక సార్లు నామినేషన్ దక్కించుకున్న సంగీతదర్శకుడిగా ఆయన రికార్డ్ సాధించారు. ఇప్పటికే ఐదు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న జాన్‌కి ఈ చిత్రం కూడా ఆస్కార్ తెచ్చి, ఆనందపరుస్తుందా అనేది చూడాలి ఏ ఈ ఏడాది నామినేషన్స్ 61 ఏళ్ల జోడీ ఫాస్టర్ని మళ్లీ పో టీలో నిలబెట్టాయి. 29 ఏళ్ల తర్వాత ‘నయాడ్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆమె నామినేషన్ దక్కించుకున్నారు. అంతకు ముందు ‘నెల్’ చిత్రానికిగాను 1995లో ఆమెకు నామినేషన్ దక్కింది. కాగా ‘ది అక్యూస్డ్’, ‘ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్’ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డులు అందుకున్నారు జోడీ. ఇప్పుడు సహాయ నటి అవార్డును ఇంటి తీసుకెళతారా చూడాలి ఏ 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో దర్శకుడు మార్టిన్ ఏ స్కోర్సెస్కి ఉత్తమ దర్శకుడిగా నామినేషన్ దక్కింది. దర్శకుడిగా పది నామినేషన్లు దక్కించుకుని, ప్రస్తుతం జీవించి ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ దర్శకునిగా స్టీవెన్ స్పీల్బర్గ్ తొమ్మిది నామినేషన్స్ దక్కించుకున్నారు. అయితే ఇప్పటివరకు పది సార్లు నామినేషన్ దక్కించుకున్న మార్టిన్‌కు ఒక ఆస్కార్ అవార్డు మాత్రమే దక్కింది. 2006లో వచ్చిన ‘డిపార్టెడ్’ సినిమాకు అవార్డు అందుకున్నారు మార్టిన్. ఇదిలా ఉంటే.. తొమ్మిదిసార్లు నామినేట్ అయినప్పటికీ రెండు సార్లు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నారు స్టీవెన్ సీల్బర్గ్. ఉత్తమ దర్శకుడి విభాగంలో విలియమ్ వైలర్ 12 నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సొంతం చేసుకున్నారు.. అలాగే మూడు ఆస్కార్ అవార్డులు సాధించారు. అయితే ప్రస్తుతం ఆయన జీవించి లేరు. -
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. ఈ ఏడాది బరిలో నిలిచిన చిత్రాలివే!
గతేడాదిలో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు మన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డుల వేడుకకు సమయం ఆసన్నమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాగే లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. మార్చి 10, 2024న ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేట్ అయిన చిత్రాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించిన ఆస్కార్ అకాడమీ.. బరిలో నిలిచిన చిత్రాల జాబితాను వెల్లడించింది. 2024 ఆస్కార్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. ఈ ఏడాది కూడా వరుసగా నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. ఇండియా నుంచి ఆస్కార్ పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. 2024లో వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే! ►ఉత్తమ చిత్రం విభాగం అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ఒప్పైన్ హైమర్ పాస్ట్ లైవ్స్ పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ►ఉత్తమ దర్శకుడి విభాగం అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్స్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ►ఉత్తమ నటుడు విభాగం బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పైన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ►ఉత్తమ నటి విభాగం అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్ ►ఉత్తమ సహాయ నటుడు స్టెర్లింగ్ కె. బ్రౌన్ : అమెరికన్ ఫిక్షన్ రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్ రేయాన్ గాస్లింగ్: బార్బీ మార్క్ రఫెలో: పూర్ థింగ్స్ ► ఉత్తమ సహాయ నటి ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్ డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్ అమెరికా ఫెర్రారా: బార్బీ జోడీ ఫాస్టర్: నయాడ్ డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్ ►బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్, ఆర్థర్ హరారీ ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్ మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్ మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్ పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్ ►బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ది ఫైర్ ఇన్సైడ్: ఫ్లామిన్ హాట్ ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ ఇట్నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ వజాజీ (ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ ►బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అమెరికన్ ఫిక్షన్ ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ కిల్లర్స్ ఆఫ్‌ది ఫ్లవర్ మూన్ ఒప్పైన్ హైమర్ పూర్ థింగ్స్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్ ది ఇటర్నల్మెమెరీ ఫోర్ డాటర్స్ టు కిల్ ఏ టైగర్ 20 డేస్ ఇన్ మరియా పోల్ ►బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ ది ఏబీసీస్ఆఫ్ బుక్ బ్యానింగ్ ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్ ఐలాండ్ ఇన్ బిట్విన్ ది లాస్ట్ రిపేష్ షాప్ నైనాయ్ అండ్ వైపో ►బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఇయల్కాపిటానో (ఇటలీ పర్ఫెక్ట్ డేస్ (జపాన్) సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్) ది టీచర్స్ లాంజ్ (జర్మనీ) ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ( యూకే) ► బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్సన్ బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: టోనీ మెక్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లాజర్ ►బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అటానమీ ఇఫ్ ఎ ఫాల్: లారెంట్ ది హోల్డోవర్స్: కెవిన్ టెంట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: తెల్మా స్కూన్మేకర్ ఒప్పైన్ హైమర్: జెన్నిఫర్ లేమ్ పూర్ థింగ్స్: యోర్గోస్ ►బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ బార్బీ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ నెపోలియన్ ఓపెన్‌హైమర్ పూర్ థింగ్స్ ►బెస్ట్ సౌండ్ ది క్రియేటర్ మ్యాస్ట్రో మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 ఒప్పైన్ హైమర్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ► ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ది క్రియేటర్ గాడ్జిల్లా మైనస్ వన్ గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్3 మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 నెపోలియన్ ►బెస్ట్ సినిమాటోగ్రఫీ ఎల్కాండే : ఎడ్వర్డ్ లచ్మెన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: రోడ్రిగో ప్రిటో మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా పూర్ థింగ్స్: రాబిన్ రియాన్ ► బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ జాక్వెలిన్ దురన్: బార్బీ జాక్వెలిన్ వెస్ట్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ జాంటీ ఏట్స్, డేవ్ క్రాస్‌మన్: నెపోలియన్ ఎలెన్ మిరాజ్నిక్: ఒప్పెన్ హైమర్ హాలీ వాడింగ్టన్: పూర్ థింగ్స్ ► బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ గోల్డా మాస్ట్రో ఓపెన్‌హైమర్ పూర్ థింగ్స్ సొసైటీ ఆఫ్ ది స్నో ► బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ది ఆఫ్టర్ ఇన్విన్సిబుల్ నైట్ ఆఫ్ ఫార్చ్యూన్ రెడ్, వైట్ అండ్ బ్లూ ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్ ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ లెటర్ టు ఎ పిగ్ నైంటీ- ఫైవ్ సెన్సెస్ అవర్ యూనిఫామ్ ప్యాచిడమ్ వార్ ఈజ్ ఓవర్! -
ప్రారంభమైన ఆస్కార్ ఓటింగ్.. 23న నామినేషన్స్ ప్రకటన
ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 10న లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది. కాగా ఓటింగ్ ప్రక్రియను శుక్రవారం మొదలుపెట్టినట్లు ఆస్కార్ అకాడమీ వెల్లడించింది. జనవరి 12న మొదలైన ఈ ఓటింగ్ జనవరి 16 సాయత్రం 5 గంటల వరకు సాగుతుంది. ఆస్కార్ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. (చదవండి: రచ్చ లేపిన గుంటూరు కారం.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?) వీరందరూ వారికి కేటాయించిన విభాగాల్లోని వారికి ఓటు వేస్తారు. అకాడమీలో సభ్యులుగా ఉన్న యాక్టర్స్ యాక్టింగ్ విభాగానికి మాత్రమే ఓటు వేస్తారు. అలాగే మిగతా విభాగాల వారు కూడా. 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డుల విజేతలను ప్రకటిస్తారు. అయితే ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’, ‘డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్’, ‘డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’ విభాగాలకు చెందిన ఓటింగ్‌కు మాత్రం ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయట. ఈ నెల 23న ఆస్కార్ నామినేషన్స్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే పది విభాగాల్లోని షార్ట్ లిస్ట్ జాబితాను ప్రకటించారు ఆస్కార్ నిర్వాహకులు. -
ఆస్కార్ రేసు నుంచి 2018 చిత్రం అవుట్
భారతీయ సినీ ప్రేమికులకు నిరాశ ఎదురైంది. 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా వెళ్లిన మలయాళ సినిమా ‘2018: ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకోలేక పోయింది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 10న లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేశారు అకాడమీ నిర్వాహకులు. ఇందులో భాగంగా.. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, ఒరిజినల్ స్కోర్ మ్యూజిక్, ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా మొత్తం పది విభాగాల్లో ఆస్కార్‌కు నామినేషన్ బరిలో ఉన్న షార్ట్ లిస్ట్‌ను ప్రకటించారు మేకర్స్. హాలీవుడ్ చిత్రాలు ‘బార్బీ, ఓపెన్ హైమర్’ల హవా ఈ షార్ట్‌లిస్ట్ జాబితాలో కనిపించింది. ఇక ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ కోసం 88 దేశాల చిత్రాలు పోటీ పడగా, 15 చిత్రాలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఈ లిస్ట్‌లో మలయాళ ‘2018’ సినిమాకు చోటు దక్కలేదు. కాగా ఇండో–కెనెడియన్ ఫిల్మ్‌మేకర్ నిషా పహుజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘టు కిల్ ఏ టైగర్’ అవార్డ్స్లతో సత్తా చాటింది. జార్ఖండ్‌లో గ్యాంగ్ రేప్‌కు గురైన తన కుమార్తెకు న్యాయం జరగాలని ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ కథనం ఉంటుంది. అస్కార్ నామినేషన్ కోసం పదిహేను డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్స్‌తో ‘టు కిల్ ఏ టైగర్’ పోటీ పడాల్సి ఉంది. ఇక అన్ని విభాగాల్లోని ఆస్కార్ నామినేషన్స్ జనవరి 23న వెల్లడి కానున్నాయి. ఇందుకోసం జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఓటింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రకటించిన ఆస్కార్‌లోని పది విభాగాల షార్ట్ లిస్ట్ జాబితాలో ఒక్క ఇండియన్ చిత్రానికి కూడా చోటు లభించలేదు. ఇక ‘2018’ విషయానికొస్తే కేరళలో 2018లో సంభవించిన వరదల ఆధారంగా ఈ సినిమాను జూడ్ ఆంటోనీ జోసెఫ్ డైరెక్ట్ చేశారు. టొవినో థామస్, కుంచాకో బోబన్, అపర్ణా బాలమురళి, అసిఫ్ అలీ, వినీత్, తన్వి రామ్, అజు వర్గీస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ఈ చిత్రం వసూలు చేసింది. ఆస్కార్ బరిలో నిలిచి నామినేషన్ దక్కించుకోలేకపోయిన నాలుగో మలయాళ చిత్రంగా ‘2018: ఏవ్రీ వన్ ఏ హీరో’ చిత్రం నిలిచింది. గతంలో 70వ ఆస్కార్ అవార్డ్స్‌కు ‘గురు (1997)’, 83వ ఆస్కార్ అవార్డ్స్‌కు ‘అదామింటే మకాన్ అబు (2011)’, 93వ ఆస్కార్ అవార్డ్స్ కోసం ‘జల్లికట్టు (2019)’, 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘2018: ఏవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ చిత్రాలను ఆస్కార్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగపు నామినేషన్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకాడమీకి పంపింది. -
బీన్స్ గింజపై ఆస్కార్ ‘నాటు నాటు’
తెనాలి(గుంటూరు జిల్లా): లాస్ ఏంజిలిస్‌లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు..ఊర నాటు’ పాటను ప్రవాస భారతీయ చిత్రకారుడు బీన్స్ గింజపై చిత్రీకరించారు. దర్శక ప్రముఖుడు రాజమౌళి తీసిన ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటను జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌పై చిత్రీకరించారు. ఆస్కార్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ అందుకున్నారు. కువైట్‌లోని పాహీల్ అల్ వతానీ ఇండియన్ ప్రైవేట్ స్కూలులో చిత్రకళ విభాగం అధిపతి ఎ.శివనాగేశ్వరరావు వైట్ బీన్స్ గింజపై సూక్ష్మంగా చిత్రీకరించారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్‌ను, మధ్యలో ఆస్కార్ అవార్డును తీర్చిదిద్దారు. చిత్రకారుడనైన తాను, ఈ సూక్ష్మచిత్రంతో ఆర్ఆర్ఆర్ బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నట్టు శివనాగేశ్వరరావు ‘సాక్షి’కి ఫోనులో వెల్లడించారు. శివనాగేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. చదవండి: రూ.6 కోట్లు ఉంటే.. అంతరిక్షంలోకి! నెరవేరనున్న భారతీయుల కల -
అర్హత లేని సినిమాలు ఆస్కార్‌కు పంపుతున్నారు: రెహమాన్
ఇన్నాళ్లకు తెలుగు చిత్రపరిశ్రమకు అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్‌ను అమాంతం పట్టుకొచ్చేశాడు కీరవాణి. రాజమౌళి దర్శకత్వం వహించిన రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్ఆర్ఆర్) సినిమాలోని నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ పాటగా అకాడమీ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమాను కూడా నామినేషన్‌కు పంపిస్తారనుకుంటే గుజరాతీ చిత్రం చెల్లో షోను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపించారు. కానీ అది ఫైనల్ నామినేషన్స్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయింది. దీనిపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్కార్‌ను సాధించే సత్తా ఉన్న ఆర్ఆర్ఆర్ను పంపించి ఉండాల్సిందని పలువురూ అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు, రెండుసార్లు ఆస్కార్ అందుకున్న ఏఆర్ రెహమాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన యూట్యూబ్ ఛానల్లో మ్యూజిక్ లెజెండ్ ఎల్ సుబ్రహ్మణ్యంతో మాటామంతీ నిర్వహించాడు రెహమాన్. వీరిద్దరూ సంగీతం గురించి, మారుతున్న టెక్నాలజీ గురించి చర్చించారు. ఇంతలో రెహమాన్ మాట్లాడుతూ.. 'కొన్నిసార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయి. అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కు పంపుతున్నారనిపిస్తుంది. కానీ జస్ట్ చూస్తూ ఉండటం తప్ప మనం ఏం చేయలేం' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అర్హత ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్‌కు పంపించకపోవడం గురించే ఆయన ఇన్‌డైరెక్ట్‌గా ఈ వ్యాఖ్యలు చేశాడంటున్నారు నెటిజన్లు. (చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) -
ఆస్కార్ విజేతలకు పార్లమెంట్ జేజేలు
న్యూఢిల్లీ: విశ్వ వేదికపై తెలుగు బావుటా ఎగరేసిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డులు సాధించినందుకు పార్లమెంట్ జేజేలు పలికింది. భారతీయ సినిమా ఖ్యాతికి ఈ విజయాలు మరింతగా వన్నెతెచ్చాయంటూ మంగళవారం రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రస్తుతించారు. ‘‘ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఇద్దరు మహిళల ఉత్కృష్ట పనితనాన్ని ఎలుగెత్తి చాటింది. భారతీయ మహిళలకు అంతర్జాతీయంగా దక్కిన అపురూప గౌరవమిది’’ అని రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఆర్ఆర్ఆర్ రచయిత వి.విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యుడేనని గుర్తుచేశారు. సభలో నవ్వులు పూయించిన ఖర్గే రెండు దక్షిణాది సినిమాలు ఆస్కార్ దక్కడం గర్వించాల్సిన గొప్ప విషయమని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా బీజేపీనుద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ‘అధికార పార్టీని నేను కోరేదొక్కటే. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది, పాట రాసింది మేమేనంటూ మోదీజీ గానీ, బీజేపీ సర్కార్ గానీ ఆస్కార్ ఘనతను తమ ఖాతాలో వేసుకోవద్దు. ఇది దేశం సాధించిన ఘనత’ అన్నారు. దాంతో సభ్యులు బిగ్గరగా నవ్వేశారు. ఆస్కార్ గెలిచిన దేశ ప్రతినిధుల గురించి పార్లమెంట్లో చర్చించడం ఆనందంగా ఉందని మాజీ నటి, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ అన్నారు. -
ఆస్కార్ వేడుక.. నంబర్‌వన్‌గా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్. మరో డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డులు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ వేడును దాదాపు 18.7 మిలియన్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈవెంట్‌ను లైవ్ ఇచ్చిన ఏబీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే గతేడాదితో ఆస్కార్‌తో పోలిస్తే దాదాపు 12 శాతం ఆడియన్స్ పెరిగినట్లు సమాచారం. గతేడాది 16.6 మిలియన్ల మంది ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించారు. అయితే గతంలో జరిగిన కొన్ని వేడుకలతో పోలిస్తే ఇది తక్కువేనని అంటున్నారు. ఇటీవల ఆస్కార్ వేడుకలు వీక్షించే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో గతంలో నేషనల్ ఫుట్ బాల్ లీగ్ తర్వాత అత్యధిక మంది చూసే కార్యక్రమంగా ఆస్కార్ నిలిచింది. ఎన్టీఆర్ నంబర్ వన్ ఆస్కార్ అవార్డుల వేడుక సందర్భంగా సోషల్ మీడియాతో పాటు ఇతర మీడియాల్లో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్ మేల్ మెన్షన్స్)లో విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలిచారని సోషల్‌మీడియాను విశ్లేషించే నెట్‌బేస్ క్విడ్ తెలిపింది. ఆయన తర్వాత మెగా హీరో రామ్‌చరణ్ ఉన్నారని వెల్లడించింది. ఆ తర్వాత ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్’ నటుడు కె హుయ్ ఖ్యాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్), అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టాప్‌లో ఆర్ఆర్ఆర్ అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్ఆర్ఆర్’ నిలిచిందని తెలిపింది. ఆ తర్వాత ది ఎలిఫెంట్ విస్పరర్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనియా 1985 చిత్రాలు ఉన్నాయి. ఇక హీరోయిన్ల విషయానికొస్తే, మిషెల్ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్, ఎలిజిబెత్ ఓల్సెన్, జైమి లీ కర్టిస్లు వరుసగా ఐదుస్థానాల్లో నిలిచారు. -
అత్యధిక ఆస్కార్స్ గెలుచుకున్న చిత్రమిదే.. పదేళ్ల కష్టానికి ప్రతిఫలం
మిషెల్ యో, స్టెఫానీ, కే హుయ్ క్వాన్, జెన్నీ స్లాట్, జామి లీ కర్టిస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్’. డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ గత ఏడాదిæ బాక్సాఫీస్ వద్ద సూపర్ బంపర్‌హిట్ కొట్టింది. 25 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అంతకు నాలుగు రెట్లు అంటే వంద మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. ఇక ఏడు ఆస్కార్ అవార్డులను సాధించిన ఈ చిత్రకథ విషయానికి వస్తే... చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఎవిలిన్ క్వాడ్ కుటుంబం అక్కడ లాండ్రీషాపు పెట్టుకుని జీవనం సాగిస్తుంటుంది. వీరు ఒక ప్రపంచంలో జీవిస్తున్నట్లే మరో ప్రపంచంలో వీరిలాంటి వారే ఉంటారు. వీరు ఒకరికొకరు తారసపడినప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అన్నదే కథ. ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రదర్శకులు డేనియల్ క్వాన్, స్కీనెర్ట్ 2010లోనే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రకథను స్టార్ట్ చేశారు. కానీ షూటింగ్‌కి వెళ్లడానికి పదేళ్లు పట్టింది. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం 2022 లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. -
ధూల్‌పేట్‌లో పుట్టి.. దుమ్ము లేపుతున్నాడు..
తెలుగు సినీ చరిత్ర పుటల్లో ఆర్ఆర్ఆర్ నాటు.. నాటు పాట నూతన అధ్యాయాన్ని లిఖించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారానికి ఎంపికైహైదరాబాద్ మహా నగరం పేరును విశ్వ వ్యాప్తం చేసింది. సిటీకి చెందిన గాయకులు పాడిన పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో నవయువ విజయాల భాగ్య ‘నగ’రి మణిహారంలో మరో ఆణిముత్యం జత చేరింది. టాలీవుడ్ రాజధానిగా.. సినిమాల తయారీకి చిరునామాగా ఉన్న నగర ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ ఆస్కార్ పురస్కారం వరించడం సిటిజనులకు గర్వకారణంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా రూపకర్తలు, కథా నాయకులు, నృత్య దర్శకుడు... అందరూ మన సిటిజనులే కాగా నాటు నాటు పాడిన ఇద్దరు యువ గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇక్కడే పుట్టి పెరిగిన వారు కావడంతో సంతోషం ద్విగుణీకృతమైంది. ధూల్‌పేట్‌లో పుట్టి.. దుమ్ము లేపుతున్నాడు.. నగరంలోని ధూల్‌పేట్‌కు చెందిన ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. ఖండాంతర ఖ్యాతి సొంతం చేసుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఇంట్లోని గిన్నెలు, స్టీలు ప్లేట్ల మీద దరువేసిన నాటి అల్లరి కుర్రోడు ఆస్కార్ ను ఇంటికి తెచ్చేసుకున్నాడు. నిన్నా మొన్నటి దాకా మన మధ్యనే ఆడి పాడిన రాహుల్ సిప్లిగంజ్ అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రముఖుల మధ్య పాడి ఆడించాడు. చిన్నవయసులో గజల్ మాస్టర్ దగ్గర కొన్నాళ్లు శిష్యరికం చేసిన రాహుల్.. మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్ షాప్‌లో పని చేశాడు. ఏడేళ్ల శిక్షణలో గజల్స్‌పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే సినిమాల్లో కోరస్‌గా అలా అలా నాగ చైతన్య తొలి చిత్రం జోష్‌లో ‘కాలేజీ బుల్లోడా’ పాటతో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తను పాడిన పాటల సీడీని తీసుకు వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించి, ఆయన సంగీత దర్శకత్వంలో ‘వాస్తు బాగుందే’ అనే పాడే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత ‘ఈగ’లో టైటిల్ సాంగ్, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్ శంకర్’లో బోనాలు.. వంటి వరుస హిట్ సాంగ్స్‌తో స్టార్ సింగర్‌గా ఎదిగిపోయాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా స్వయంగా రూపొందిస్తూ.. మంగమ్మ, పూర్ బాయ్, మాకీ కిరికిరి’, ’గల్లీకా గణేష్’, ’దావత్’.. ఇలా నగర సంస్కృతీ సంప్రదాయాలకు తనదైన గానాన్ని జతచేసి సక్సెస్ సాధించాడు. గత 2019లో బిగ్‌బాస్ సీజ న్–3లో గెలిచి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాలభైరవ.. గాన వైభవ.. ప్రముఖ సంగీత దర్శకుడు, నాటు నాటు పాటకు స్వరాలద్దిన కీరవాణి తనయుడు కాలభైరవ.. గత కొంత కాలంగా గాయకుడిగా రాణిస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పాడుతున్నాడు. గాయకుడిగానే కాకుండా మత్తు వదలరా, కలర్ ఫొటో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి సత్తా చాటాడు. బాహుబలి 2లో దండాలయ్యా...పాటతో సూపర్ హిట్ కొట్టాడు. నాటు నాటు పాటలో సహ గాయకుడు రాహుల్‌తో కలిసి స్వరం కలిపి ఏకంగా ఆస్కార్‌నే అందుకున్నాడు. కాలభైరవ,రాహుల్ సిప్లిగంజ్ సిటీ కుర్రాళ్లే విశ్వ సినీ చరిత్రలో మన నగరానికి ఖండాంతర ఖ్యాతి ఇరువురు గాయకులపై అభినందనల వెల్లువ -
ఆస్కార్ అవార్డ్ చిత్రాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన ఆస్కార్ పండుగ కొన్ని గంటల క్రితమే ముగిసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో వైభవంగా జరిగింది. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమాలు పోటీలో నిలిచాయి. అయితే అంతిమంగా ఒక్కరినే అవార్డ్ వరిస్తుంది. అలా ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పలు చిన్న సినిమాలు సైతం సత్తా చాటాయి. అయితే అవార్డ్ దక్కించుకున్న చిత్రాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఆ సినిమాల్లో ఎలాంటి సందేశం ఉందో తెలుసుకోవాలనుకునే చాలా మందే ఉంటార. అలాంటి వారికోసం విజేతలుగా నిలిచిన చిత్రాలు ఏ ఓటీటీలో అలరిస్తున్నాయో తెలుసుకోవాలనుందా? అయితే ఇది మీకోసమే. ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకున్న సినిమా అయితే ఈ ఏడాది ఆస్కార్‌లో ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకొన్న చిత్రం 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్'. ఈ సినిమా ఏడు అవార్డులతో రికార్డు సృష్టించింది. ఈ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే భారత్ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ దక్కింది. అలాగే ఇండియా నుంచి షార్ట్ షిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా సిని ప్రేక్షకులను అలరిస్తోంది. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఆస్కార్ అవార్డులు పొందిన కొన్ని చిత్రాలు ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ + హాట్ స్టార్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ - సోనీలీవ్ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ - నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌పాంథర్-వకండా ఫరెవర్ - డిస్నీ+ హాట్‌స్టార్ అవతార్ 2 - అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, వుడ్, డిస్నీ+హాట్‌స్టార్ టాప్ గన్: మావెరిక్ - అమెజాన్ ప్రైమ్ వీడియో ( తెలుగు ఆడియో కూడా ఉంది) ది ఎలిఫెంట్ విస్పరర్స్ - నెట్‌ఫ్లిక్స్ పినాషియో - నెట్‌ఫ్లిక్స్ కాగా.. ఉమెన్ టాకింగ్, నవానీ, ది వేల్ లాంటి చిత్రాలు ప్రస్తుతం భారత్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులో లేవు. -
RRRలో మీరు చూసింది అదే: జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భారతదేశ సంస్కృతిపై మాట్లాడుతూ ఎమోషనలయ్యారు. భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న దేశమని కొనియాడారు. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..'భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న వైవిధ్యమైన దేశం. ఆర్ఆర్ఆర్లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్‌తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు ఇండియన్స్‌కు పూర్తి నమ్మకం కలిగింది.' అని అన్నారు. -
Oscar Awards 2023: లాస్ ఏంజలెస్ లో సంబరాలు చేసుకున్న ప్రవాసాంధ్రులు
-
Oscars 2023 Photos: అపురూప క్షణాలు.. అవార్డు ఫంక్షన్లో మెరిసిన తారక్-రామ్‌చరణ్ ( ఫొటోలు)
-
బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్ కెరీర్ సాగిందిలా
ధూల్ పేట్లో పుట్టిన కుర్రాడు.. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఉన్న ఇష్టంతో గిన్నెలపై గరిటెలతో వాయిస్తూ సాంగ్స్ పాడేవాడు. అతని టాలెంట్‌ను గుర్తించిన తండ్రి కుమారుడికి సంగీతం నేర్పించాలని ఓ గజల్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొన్నాళ్ల పాటు శిక్షణ తీసుకున్న ఆ కుర్రాడు చిన్న చిన్న సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గా మారాడు. అలా ఓ వైపు సంగీతంలో ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్ షాప్‌లో పనిచేశాడు. తన సింగింగ్ టాలెంట్‌తో శ్రోతలను మైమరిపించేవాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా మొదలైన అతని ప్రయాణం ఈరోజు ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా ఎదిగాడు.. అతడే రాహుల్ సిప్లిగంజ్. ధూల్ పేట్ టూ లాస్ ఎంజిల్స్ వరకు సాగిన అతడి ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. గల్లీ బాయ్ పేరుకు తగ్గట్లుగానే వివాదాలు అతనితో ముడిపడి ఉన్నాయి. ఆనాటి నుంచి ఇప్పుటిదాకా సాగిన రాహుల్ విజయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. రాహుల్ సిప్లిగంజ్ బార్బర్ షాప్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు ప్రపంచంలో అత్యున్నత వేదిక ఆస్కార్ వరకు చేరుకున్నాడు. 1989 ఆగష్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో జన్మించిన రాహుల్‌కు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేదట. స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలపై కర్రలతో వాయిస్తూ ఫోక్సాంగ్స్ పాడేవాడట. ఇది గమనించిన రాహుల్ తండ్రి, ఆయనకి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్ లో సాయం చేసేవాడు. సుమారు 7 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకొని గజల్స్‌పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే కోరస్ పాడే అవకాశాలు తలుపుతట్టాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్‌లో ‘కాలేజీ బుల్లోడా’ అనే సాంగ్ పాడే అవకాశం వచ్చింది. ఆ పాటకి మంచి ప్రోత్సాహం రావడంతో.. అప్పటి వరకు తను పాడిన పాటలన్ని ఒక సీడీ చేసుకొని, దాని తీసుకోని వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించాడట.రాహుల్ ప్రతిభను చూసిన కీరవాణి అతనికి దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ అనే టైటిల్ సాంగ్ ను పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘ఈగ’లో ఈగ ఈగ ఈగ, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్ శంకర్’లో బోనాలు ఇలా పలు సినిమాల్లో సింగర్‌గా రాహుల్ అవకాశాలు దక్కించుకున్నాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. మంగమ్మ,పూర్ బాయ్, మాకి కిరికిర', 'గల్లీ కా గణేష్', 'దావత్'.. ఇలా హైదరాబాదీ సంస్కృతి, సంప్రదాయాలకు తన జోష్ మిక్స్ చేసి రాహుల్ పాటలు కంపోజ్ చేశాడు. ఇదిలా ఉంటే 2019లో తెలుగు బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొనడంతో రాహుల్ దశ తిరిగిందని చెప్పొచ్చు. పునర్నవితో లవ్‌ట్రాక్, తన పాటలు, ఎనర్జీ, శ్రీముఖితో గొడవలు ఇలా ఒకటేమిటి అన్ని షేడ్స్ చూపించి యూత్‌లో మాంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ సీజన్ విన్నర్‌గా బయటకు వచ్చి తన జర్నీని మరింత ముందుకు తీసుకుళ్లాడు. గల్లీబాయ్ పేరుకు తగ్గట్లేగానే రాహుల్ పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన కొన్ని వారాలకే ఓ పబ్‌లో జరిగిన గొడవలో రాహుల్‌పై బీరు సీసీలతో దాడి చేసిన సంఘటన అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎమ్మెల్యే బంధువులపై రాహుల్, అతని స్నేహితులకు మధ్య జరిగిన గొడవలో బీరుసీసాలతో గొడవ, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వరకు వెళ్లింది. కట్‌చేస్తే.. కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్‌లో బంజారాహిల్స్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్ వాడారనే సమాచారంతో అర్థరాత్రి పోలీసులు జరిపిన రైడ్‌లో రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 150మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకోగా పలువురు సెలబ్రిటీలతో పాటు రాహుల్ కూడా విచారణను ఎదుర్కున్నాడు. ఇలా వివాదాలతో సావాసం చేసిన రాహుల్ తనను విమర్శించినవాళ్లతోనే చప్పట్లు కొట్టించుకునేలా చేశాడు. విశ్వవేదికపై తెలుగోడి సత్తా సగర్వంగా నిరూపించాడు. ఆర్ఆర్ఆర్లోని రాహుల్ పాడిన నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆ బస్తీ పోరడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. -
‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి
తెలుగు సినిమా చరిత్ర సృష్టించిన రోజిది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది. రాజమౌళి, ఆయన భార్య రమ సంతోషంతో భావేద్వేగానికి గురయ్యారు. కార్తికేయ దంపతులతో కలిసి గంతులేశారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, లైవ్‌లో చూస్తున్న భారతీయులు సైతం ఆనందంతో పులకరించిపోయారు. తెలుగు సినిమా పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగువాళ్లతో పాటు భారత సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. -
ఆస్కార్స్ 2023: కనుల విందుగా 95వ అకాడెమీ అవార్డుల పండగ ( ఫొటోలు)
-
Oscar 2023: ఆస్కార్ స్టేజీపై 'నాటు నాటు' సందడి..
వాషింగ్టన్: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ ప్రదానోత్సవ వేడుకల్లో ఆర్ఆర్ఆర్- నాటు నాటు పాట సందడి చేసింది. అవార్డుల ప్రకటనకు ముందే స్టేజీపై ఈ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు హాలీవుడ్ డాన్సర్లు. ఈ బీట్‌కు హాలీవుడ్ నటీ నటులు ఊర్రూతలూగారు. ఆస్కార్ అవార్డుకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు పాట నామినేట్ అయిన విషయం తెలిసిందే. మన పాటకు లిస్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హాండ్( టాప్ గన్ మావరిక్), ఠిస్ ఇస్ ఏ లైఫ్ ( ఎవరీ థింగ్ ఏవిరివేర్ ఆల్ ఇట్ వన్స్) పాటలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం రూపొందింది. గతేడాది మార్చి 25న విడుదలైన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. పాన్ ఇండియానే గాక, పాన్ వరల్డ్ స్థాయిలో సినీ అభిమానులను అలరించింది. ముఖ్యంగా నాటు నాటు పాటుకు ప్రపంచ నలుమూలల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ పాటకు మ్యూజిక్ మాంత్రికుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ ఈ పాటను ఆలకించారు. ఆస్కార్ స్టేజీపైనా వీరు లైవ్‌లో ఈ పాట పాడి అభిమానులను అలరించారు. -
Oscars 2023: అట్టహాసంగా ఆస్కార్ సెలబ్రేషన్స్
ఇంగ్లీష్ గడ్డపై ఇండియన్ సినిమా సత్తా చాటింది. చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్.. తెలుగు పాట ‘నాటు నాటు’ను వరించింది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చింది. ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు) లాజ్ ఏంజిల్స్ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. ► ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఆస్కార్ గెలుచుకుంది. ఉత్తమ నటిగా ‘మిషెల్ యో’ (ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) నిలిచింది. ఈ అవార్డు వేడుకలలో ఈ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి ఏకంగా ఏడు ఆస్కార్స్ రావడం గమనార్హం. ►ఉత్తమ నటుడిగా బ్రెండన్ ప్రాసెర్(ది వేల్)ఆస్కార్ అందుకున్నాడు. ఉత్తమ నటుడి విభాగంలో బ్రెండన్‌తో ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కొలిన్ ఫార్రెల్ (ది బన్షీష్ ఆఫ్ ఇని షెరిన్), బిల్ నిగీ (లివింగ్),పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్) పోటీ పడ్డారు. అయితే , ‘ది వేల్’ చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్రెండెన్ ఫ్రాసెర్ను ఆస్కార్ వరించింది. ► 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడిగా డానియల్ క్వాన్.. డేనియల్ షినెర్ట్ అస్కార్ అందుకున్నారు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి గాను ఈ దర్శక ద్వయం అవార్డు గెలుచుకున్నారు. ఈ కేటగిరిలో టాడ్ ఫీల్డ్ – టార్, మార్టిన్ మెక్‌డొనాగ్ – ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, రూబెన్ ఓస్ట్లండ్ – ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్, స్టీవెన్ స్పీల్బర్గ్ – ది ఫాబెల్మాన్స్ నామినేట్ అయ్యారు. ►బెస్ట్ సౌండ్ విభాగంలో హాలీవుడ్ మూవీ ‘టాప్ గన్ ’ ఆస్కార్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, ది బాట్మాన్, ఎల్విస్ పోటీపడ్డాయి. ► ఇంగ్లీష్ గడ్డపై తెలుగు పాట సత్తా చాటింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా నాటు నాటు నిలిచింది. కీరవాణి స్వరపరచిన ఈపాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవపాడిన సంగతి తెలిసిందే. ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకుంటూ వేదికపై పాట పాడారు. 'Naatu Naatu' from 'RRR' wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn — The Academy (@TheAcademy) March 13, 2023 ► బెస్ట్ అడాప్టెడ్ స్ట్రీన్‌ప్లే విభాగంలో హాలీవుడ్ చిత్రం‘ ఉమెన్ టాకింగ్’కు అస్కార్ లభించింది. షేరా పాల్లే ఈ అవార్డును అందుకున్నారు. ►ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రాన్ని ఆస్కార్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఈ చిత్రానికి అవార్డు లభించింది. డేనియల్ క్వాన్, డేనియల్ షేనెర్ట్లు ఈ అవార్డులు అందుకున్నారు. ► జెమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ను ఆస్కార్ వరించింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్‌మ్యాన్, బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్, టాప్ గన్ మావెరిక్ చిత్రాలు పోటీ పడ్డాయి. 'Avatar: The Way of Water' wins Best Visual Effects #Oscars #Oscars95 pic.twitter.com/U7xJ0D20tO — The Academy (@TheAcademy) March 13, 2023 ► బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ చిత్రం ఆస్కార్ అందుకుంది. ఈ విభాగంలో బాబిలోన్, ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మరియు ది ఫాబెల్మాన్స్ పోటీ పడగా..’ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ గెలిచింది. వాకర్ బెర్టెన్ మాన్ ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’కు సంగీతం అందించారు. ► బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. క్రిస్టియన్ ఎం గొల్డెబెక్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించగా, ఎర్నిస్టైన్ హిప్పర్ సెట్ డిజైనర్‌గా ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ అవార్డ్ కోసం అవతార్ 2, Babylon, Elvis, The Fabelmans చిత్రాలు పోటీ పడ్డాయి. ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్ కు ఆస్కార్ లభించింది. ఈ అవార్డ్ కోసం ది ఫ్లయింగ్ సెయిలర్, ఐస్ మర్చంట్స్, మై ఇయర్ ఆఫ్ డిక్స్, యాన్ ఓస్ట్రిచ్ టోల్డ్ మి ది వరల్డ్ ఈజ్ ఫేక్, ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్ షార్ట్ ఫిల్మ్ నామినేట్ అయ్యాయి. The Oscar for Best Documentary Short Film goes to 'The Elephant Whisperers' #Oscars #Oscars95 pic.twitter.com/jLG0aqAg3j — The Academy (@TheAcademy) March 13, 2023 నయా చరిత్ర ►బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ను ఆస్కార్ వరించింది. ఇండియా నుంచి గెలుపొందిన మొట్ట మొదటి బెస్ట్ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ చరిత్ర సృష్టించింది. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ ఈ షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. ► ఆస్కార్ వేదికపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు సాంగ్ పాడారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్లో.. లాల్చీ, పంచకట్టులో కనిపించారు సింగర్స్. ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ చిత్రం ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డ్ కోసం “బాబిలోన్”, “బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్”, “ఎల్విస్”, “ఎవరీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్”, “మిసెస్ హారిస్ గోస్ టు ప్యారిస్” చిత్రాలు పోటీపడ్డాయి. ► బెస్ట్ సినిమాటోగ్రఫీ - ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ ► బెస్ట్ షార్ట్ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్‌బై ► బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- నావల్నీ ► బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - జేమీ లీ కర్టిస్(ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) ► బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- కి హుయ్ క్వాన్(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ► బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్- గిల్లెర్మో డెల్ టోరోస్ పినాకియో ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్నఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు హాజరయ్యారు. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఎడమ భుజంపై టైగర్ బొమ్మ ఉన్న డ్రెస్ ధరించగా, చరణ్ ఎడమ ఛాతీపై ప్రత్యేక డిజైన్ కలిగిన డ్రెస్ వేసుకున్నాడు.ఈ వేడుకలకు చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి వచ్చాడు. దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణీ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్‌తో పాటు మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. -
వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..
యావత్ ప్రపంచ దృష్టంతా ఇప్పుడు ఆస్కార్ వేడుకపైనే ఉంది. ఈ రోజు (మార్చి 12) రాత్రి 8 గంటలకు లాస్ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్ ప్రధానోత్సవం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు ఆస్కార్ అవార్డుల వేడుక ప్రారంభం కానుంది. 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేస్తారు. ఈ ఏడాది మన దేశం నుంచి మూడు విభాగాల్లో (బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్) నామినేషన్స్ దక్కాయి. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు రావాలని భారతీయ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. వీటిలో ముఖ్యంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రియులంతా ఆస్కార్ వేడక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చదవండి: Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్ ఇస్తారు! ఇదిలా ఉంటే.. ఈ సారి ఆస్కార్ వేడుకల్లో కొన్ని కీలక మార్పులు చేశారు. ఈసారి అతిథులకు స్వాగతం పలికేది రెడ్ కార్పెట్ కాదు. షాంపైన్. పేరుకు మాత్రమే రెడ్ కార్పెట్.. కానీ రంగు మాత్రం అది కాదు. ‘షాంపైన్’ కలర్ గా మార్చేశారు. తొలిసారి ఈ రెడ్ కార్పెట్ కలర్ ను మారుస్తున్నారు. 50 000 స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర 24 వేల 700 డాలర్స్ అట. ఇది మొత్తం ఇన్ స్టాల్ చేయడానికి 600 గంటలు సమయం పట్టింది అని సమాచారం. చదవండి: Oscar Awards Facts: ఆస్కార్ ప్రతిమలో వీటిని గుర్తించారా? అది దేనికి చిహ్నమంటే? ఈసారి ఈ అవార్డుల వేడుక కోసం 56.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 463 కోట్ల 92 లక్షల 47 వేల 300 రూపాయలు. ఇందులో.. కార్పెట్ వద్ద ఓ నటి వేసుకునే డ్రెస్ ఖరీదే 10 మిలియన్ డాలర్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆస్కార్ ఈవెంట్లో ఏదైనా యాడ్ ఇవ్వాలి అనుకుంటే 30 సెకన్లకు గాను 2 మిలియన్స్ డాలర్స్ చెల్లించాల్సి ఉంటుందట. మొత్తాని ఆస్కార్ చదవండి: Natu Natu Song: ఆస్కార్ బరి.. ఆ పాటతోనే గట్టి పోటీ మరీ..! ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా? -
ఆస్కార్.. ఇప్పటి వరకు గెలిచిన ఇండియన్స్ వీరే
ప్రస్తుతం అందరినోటా వినిపిస్తున్న మాటా ఒక్కటే. అదేమిటంటే తొలిసారి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటే సమయమిది. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో డాల్బీ థియేటర్లో జరుగనున్న 95 ఆస్కార్ వేడుకలపై అందరి దృష్టి పడింది. ఈ సారి మన టాలీవుడ్ దర్శకధీరుడు తెరకెక్కించిన వన్ అండ్ ఓన్లీ సెన్సేషనల్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవేదికపై మెరవనుంది. అందుకే ఈ ఏడాది ఆస్కార్ తెలుగు వారికి కూడా వెరీ వెరీ స్పెషల్. కానీ ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులను ఈ అవార్డ్ వరించింది. ప్రపంచ ఆస్కార్ సందడి వేళ ఇప్పటి దాకా ఆస్కార్ నెగ్గిన వారెవరో ఓ లుక్కేద్దాం. తొలి ఆస్కార్ విన్నర్ భాను అథైయా భాను అథైయా తొలి భారత ఆస్కార్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. 1983లో విడుదలైన గాంధీ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమెకు అరుదైన ఘనత దక్కింది. 55వ ఆస్కార్ వేడుకల్లో ఆమె అవార్డు అందుకున్నారు. మహాత్మా గాంధీ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కించారు. సత్యజిత్ రే భారతీయ సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకొచ్చిన సత్యజిత్ రే ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన ఆస్కార్స్ 1992లో సత్యజిత్‌రేకు హానరరి అవార్డును ప్రకటించింది. అయితే సత్యజిత్‌రే అనారోగ్యం కారణాలతో వేడుకలకు పాల్గొనలేదు. దీంతో అకాడమీ స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆస్కార్ అందజేసింది. రెండు అవార్డులు గెలిచిన ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు సాధించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ అవార్డులు దక్కించుకున్నారు. రెండు ఆస్కార్ అవార్డులు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. రసూల్ పూకుట్టి స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ సొంతం చేసుకున్నారు. గుల్జర్ దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన గుల్జర్ 81వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకన్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు ఉత్తమ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆయన్ను ఆస్కార్ వరించింది. గునీత్ మోన్గా ఢిల్లీకి చెందిక ప్రముఖ నిర్మాత గునీత్ మోన్గాఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగ్‌గా పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్‌కు గునీత్ ఆస్కార్ గెలుచుకుంది. తాజాగా అమెరికాలో లాస్ఎంజిల్స్ జరగనున్న 95వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి ఆల్ దట్ బ్రెత్స్( బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం), ది ఎలిఫెంట్ విస్ఫరర్స్(బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం), నాటు నాటు(బెస్ట్ ఒరిజినల్ సాంగ్) విభాగాలలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందరి చూపులు ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్‌పైనే ఉన్నాయి. కచ్చితంగా ఆస్కార్ వరిస్తుందని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ వేడుకల కోసం ఆర్ఆర్ఆర్ బృందం అమెరికా చేరుకుంది. -
ఆస్కార్ బరిలో ఆ ఐదుగురు స్పెషల్.. ఎందుకంటే?
ఆస్కార్ ఆ పేరు వింటేనే అదో గొప్ప. అవార్డ్ రాకపోయినా సరే.. కనీసం నామినేట్ అయినా ఆ ఫీలింగే వేరు. ప్రపంచ వేదికపై మన పేరు వినిపించాలని ఎవరికీ మాత్రం కోరిక ఉండదు. ఈ ఏడాది జరగునున్న 95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కేటగిరీలో ఐదుగురు పోటీ పడుతున్నారు. కాగా.. ఉత్తమ నటుడు విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఐదుగురు గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఎందుకంటే ఈ ఐదుగురు తొలిసారి ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. దీంతో ఎవరినీ అవార్డ్ వరించినా అది తొలిసారి దక్కించుకున్న ఘనత వారికి సొంతమవుతుంది.. ఉత్తమ నటుడి రేసులో తొలిసారి పోటీలో నిలిచిన ఐదుగురు వీరే ఆస్టిన్ రాబర్ట్ బట్లర్ అమెరికన్ సింగర్ ఎల్వీస్ ప్రెస్లీ జీవిత కథలో అద్భుతంగా నటించారు ఆస్టిన్ రాబర్ట్ బట్లర్. ఆయన నటనే 95వ ఆస్కార్ రేసులో నిలిచేలా చేసింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. బట్లర్ యుక్త వయస్సులోనే టెలివిజన్ ధారావాహికలు ‘ది క్యారీ డైరీస్’, ది షన్నారా క్రానికల్స్’ లో నటనకు పేరు సంపాదించారు. ఏలియన్స్ ఇన్ ది అట్టిక్(2009) చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో మోస్ట్ ప్రామిసింగ్ పెర్ఫార్మర్ అవార్డును కైవసం చేసుకున్నారు. కోలిన్ జేమ్స్ ఫారెల్ ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రంలో పాడ్రాయిక్ పాత్రతో నామినేషన్ దక్కించుకున్నారు కోలిన్ జేమ్స్ ఫారెల్(46). ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. ఫారెల్ ది వార్ జోర్ సినిమాతో కెరీర్ మొదలెట్టిన కోలిన్ జేమ్స్ ‘టైగర్ ల్యాండ్, మైనారిటీ రిపోర్ట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ కామెడీ చిత్రం ఇన్ బ్రూగెస్‌లో ఆయన పాత్రకి ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్ కామెడీ సినిమాలతో గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్. ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచారాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి యుక్త వయస్సులో ఉన్న తన కూతురితో బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నించే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది వేల్’. ఈ చిత్రంలో ఉపాధ్యాయుడి పాత్రను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన ‘డాగ్ ఫైట్’, ‘ఎన్సినో మ్యాన్, స్కూల్ టైస్, జార్జ్ ఆఫ్ ది జంగిల్’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ‘ది వేల్’ చిత్రంలోని నటనకు ఫ్రేజర్ ఉత్తమ నటుడిగా 12 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. చిన్న వయస్సులో పాల్ మెస్కల్ ఆస్కార్ ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందిన అతి చిన్న వయస్సు కలిగిన నటుడు పాల్ మెస్కల్(27). ‘ఆఫ్టర్ సన్’ ఈ చిత్రంలో 11 ఏళ్ల అమ్మాయికి తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నార్మల్ పీపుల్ అనే మినీ సిరీస్‌తో మెస్కల్ గుర్తింపు పొందారు. బ్రిటీష్ అకాడమీ టెలివిజన్ అవార్డ్స్‌లో కూడా ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. అత్యధిక వయసులో బిల్ నైజీ అత్యధిక వయసులోనూ ‘లివింగ్’ అనే చిత్ర నటుడు బిల్ నైజీ 73 ఏళ్ల వయసులో బరిలో నిలిచాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి పాత్రలో నటించి మెప్పించారు. ‘గిడియాన్స్ డాటర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. లవ్ యాక్చువల్లీ అనే చిత్రానికి బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. -
ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి!
ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులకు నామినీలుగా చోటు దక్కించుకున్న నటీనటులు, దర్శకులు, ఇతర కళాకారులకు అకాడమీ అద్భుతమైన బహుమతులు ఇస్తుంది. అయితే ఈ సారి మాత్రం భూమిని బహుమతిగా అందించబోతోంది. ఎక్కడా అనుకుంటున్నారా..? ఆస్కార్ నామినీలు ఈ ఏడాది తమ గిఫ్ట్ బ్యాగ్‌లలో ఆస్ట్రేలియాలో ఒక చదరపు మీటర్ భూమిని అందుకోబోతున్నారు. అయితే ఆ భూమిని నామినీలు ఆధీనంలోకి తీసుకోలేరు. కానీ ఆ భూమి ఆస్కార్ నామినీల పేరుతో ఉంటుంది. అంటే వారి గుర్తుగా అన్నమాట. ఇదీ చదవండి: ట్విటర్ తరహాలో మెటా.. జుకర్‌బర్గ్‌పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు! సాధారణంగా ఆస్కార్ నామినీలకు బహుమతులు ఇచ్చేందుకు అకాడమీతో సంబంధం లేకుండా అనేక వ్యాపార సంస్థలు పోటీ పడుతుంటాయి. అందులో ‘పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఒకటి. నామినీలకు ఇచ్చే గిఫ్ట్ హాంపర్‌లో చోటు దక్కించుకోవడానికి 4 వేల డాలర్లు (రూ.3,27,862) చెల్లించింది. నామీనీల గిఫ్ట్ బ్యాగ్‌లో పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ తమ ‘ఆస్సీ మేట్ కన్జర్వేషన్ ప్యాక్స్’ను చేర్చింది. దీని ద్వారా క్వీన్స్‌ల్యాండ్‌లోని వెస్ట్రన్ డౌన్స్ ప్రాంతంలో ఉన్న ‘ఎన్విరోషియన్ ఎస్టేట్’లో ఒక చదరపు మీటర్ స్థలం ఆస్కార్ నామినీల పేరుపై ఉంటుంది. దీనికి సంబంధించిన లైసెన్స్ సర్టిఫికెట్‌ను గ్రహీతలకు అందిస్తారు. ‘ఎన్విరోషియన్ ఎస్టేట్’లో కొంత భాగాన్ని పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ ఆస్కార్ నామినీలకు బహుమతిగా ప్రకటించింది. కాగా ఈ భూమి మొత్తం 1,21,774 చదరపు మీటర్లు ఉంటుందని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పేర్కొంది. దీన్ని విక్రయిస్తే వచ్చే లాభం 2.5 మిలియన్ డాలర్లు వరకు ఉండవచ్చని అంచనా వేసింది. అయితే బొగ్గు సీమ్ గ్యాస్ ఫీల్డ్ నడిబొడ్డున ఉన్న ఈ భూమిపై పర్యావరణ సంస్థల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Jayanti Chauhan: రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే.. -
నిజంగా నిజం.. డమ్మీ ఆస్కార్ ఇస్తారు!
హాలీవుడ్లో ఆస్కార్ ఫీవర్ మొదలైంది. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం సర్వం సిద్ధమైంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ ది మోస్ట్ గ్లామరస్ డే కోసం సుందరంగా ముస్తాబైంది. పుత్తడిబొమ్మ ఎవరెవరి సొంతమవుతుందోనని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ అవార్డుల వేడుక గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.. చదవండి: Oscar Awards Facts: ఆస్కార్ ప్రతిమలో వీటిని గుర్తించారా? అది దేనికి చిహ్నమంటే? అవార్డు అందుకోవడానికి వేదిక పైకి వచ్చే విజేతల్లో తడబాటు ఉండటం ఖాయం. అందుకే నామినేషన్ దక్కించుకునేవాళ్లతో అకాడమీ నిర్వాహకులు ముందే రిహార్సల్స్ చేయిస్తారు. అండ ద విన్నర్ ఈజ్.. అంటూ అనౌన్స్ చేసి, వేదిక పైకి పిలిచి ముందుగానే తయారు చేయించిన డమ్మీ ఆస్కార్ అవార్డు అందజేస్తారు. ఇలా చేయడం వల్ల వేడుక రోజు విజేతలుగా నిలిచే వాళ్లలో కొంచెం కంగారు తగ్గుతుందని నిర్వాహుల ఫీలింగ్. ఈసారి కూడా ఈ రిహార్సల్స్ జరిగాయి. శనివారం ఉదయం డాల్బీ థియేటర్లో నామినేషన్ దక్కించుకున్నవాళ్లు డమ్మీ ఆస్కార్ అందుకుని రిహార్సల్ పూర్తి చేశారు. రేపు ఉదయం అసలైన విజేతలకు నిజమైన ఆస్కార్ ప్రతిమను బహుకరిస్తారు. చదవండి: ఆస్కార్ వచ్చే ఆస్కారం ఎవరికి ఎక్కువ? Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే.. -
ఆస్కార్ అవార్డును అమ్ముకోవచ్చా? అమ్మితే ఎంతొస్తుంది?
యావత్ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలని నటీనటులు కలలు కంటారు. మరికొద్ది గంటల్లో ఆస్కార్ 2023 వేడుకలు గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎన్నో చిత్రాలు ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. అందులో భారత్ నుంచి మన తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చూడటానికి బంగారంలా మెరిసిపోయే ఆస్కార్ ప్రతిమ నిజానికి బంగారంతో చేసింది కాదు. కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు. ఈ అవార్డు తయారు చేసేందుకు సుమారు 400 డాలర్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. కానీ దీన్ని అమ్మితే మాత్రం కేవలం ఒకే ఒక్క డాలర్ వస్తుందట. అదేంటీ? ఇంత ప్రాధాన్యత ఉన్న ఆస్కార్ అవార్డును ఎవరైనా అమ్ముకుంటారా అనే కదా మీ సందేహం. 1950కు ముందు ఓ అమెరికన్ డైరెక్టర్ అమెరికన్ డైరెక్టర్ ఆర్సన్ వెల్స్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆస్కార్ అవార్డును అమ్ముకోలని చూశాడట. ఇందుకు తగ్గట్లే వేలం వేయగా ఏకంగా ఆరున్నర కోట్లు వచ్చాయట. అయితే ఈ విషయం తెలిసి ఆగ్రహించిన అకాడమీ అవార్డ్స్ కమిటీ ఎవరూ ఆస్కార్ అవార్డు అమ్మకుండా ఓ నిబంధన పెట్టింది. ఆస్కార్ విన్నర్స్ తమ అవార్డులను ఇతరులకు అమ్మడానికి వీల్లేదట. తిరిగి అకాడమీ సభ్యులకు ఇచ్చేస్తే… ఒక డాలర్ ఇస్తామనే నిబంధన తెచ్చారు. దీంతో ఒక డాలర్‌కి ఆశపడి ఎవరు అవార్డు అమ్ముకోరు కాబట్టి, ఆస్కార్ అవార్డు అమ్మకాన్ని అలా నిరోధించారు. -
ఆస్కార్ కోసం 'ఆర్ఆర్ఆర్' ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు : తమ్మారెడ్డి
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ చిత్రం నుంచి ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలు ఉండటంతో ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో సందడి చేస్తుంది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రావాలని ప్రతి తెలుగువాళ్ళతో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ యూనిట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. అదే డబ్బుతో మేం 8-10 సినిమాలు తీసి ముఖాన కొడతాం.కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుకోవడం కూడా టైమ్ వేస్ట్ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటే ఇలా మనవాళ్లే ఇలా మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబడుతున్నారు. -
ఆస్కార్‌లో ఓటు హక్కు ఉపయోగించుకున్న సూర్య
ఆస్కార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు సూర్య. ఈ నెల 12న లాస్ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక జరగనుంది. విజేతల ఎంపిక కోసం పదివేల మందికి పైగా ఉన్న ఆస్కార్ ఓటర్స్ ఈ నెల 2 నుంచి 7వరకు ఆన్లైన్లో ఓటు నమోదు చేశారు. ఇందులో భాగంగానే సూర్య కూడా ఓటు వేశారు. ఆకాడమీ ‘క్లాస్ ఆఫ్ 2022’లో భాగంగా సూర్య ఆస్కార్ సభ్యునిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే సూర్యతో ΄ాటు నటి కాజోల్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్ రీమా ఖగ్తీలు కూడా ఆస్కార్ మెంబర్స్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
ఆస్కార్ కోసం అమెరికా పయనమైన తారక్, వీడియో వైరల్
పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. గోల్డెన్ గ్లోబ్, హెచ్‌సీఏ, లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్, క్రిటిక్స్ చాయిస్.. వంటి అవార్డులు ఎగరేసుకుపోయిన ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉంది. మార్చి 13న జరగనున్న 95వ అకాడమీ అవార్డుల వేడుక కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రాజమౌళి, కీరవాణి సహా తదితరులు అమెరికాకు చేరుకున్నారు. తాజాగా యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు పయనమయ్యాడు. సోమవారం ఉదయం తారక్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి మా హీరో కూడా ఆస్కార్ వేడుకల్లో పాల్గొనబోతున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌కు వెళ్లాల్సి ఉండగా తారకరత్న మృతి చెందడంతో వాయిదా పడింది. ప్రస్తుతం ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన యంగ్ టైగర్ వచ్చీరాగానే NTR30 మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. -
అందుకే... ఆస్కార్ క్రైసిస్ టీమ్
గత ఏడాది జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్, నటుడు విల్ స్మిత్‌ల మధ్య జరిగిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వేదికపై తన భార్య, నటి జడా పింకెట్ స్మిత్‌పై క్రిస్ రాక్ జోక్స్ వేయడాన్ని సంహించలేకపో యిన విల్ స్మిత్ అందరూ చూస్తుండగానే క్రిస్‌రాక్ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన ఆస్కార్ చరిత్రలో ఓ బ్లాక్‌మార్క్‌గా నిలిచిపో యిందని కమిటీ పేర్కొంది. 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో విల్ స్మిత్ బెస్ట్ యాక్టర్‌గా నిలిచారు. అయితే ఈ విషయం కన్నా ఎక్కువగా క్రిస్ రాక్‌పై చేయి చేసుకున్న విషయంలోనే వార్తల్లో నిలిచారు విల్ స్మిత్. ఈ నేపథ్యంలో పదేళ్ల పాటు ఆస్కార్ అవార్డు వేడుకలకు విల్ స్మిత్ హాజరు కాకుండా నిషేధం విధించింది కమిటీ. ఇక ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేలా, ఒకవేళ జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా ఈసారి ఆస్కార్ నిర్వాహకులు ‘క్రైసిస్ టీమ్’ను ఏర్పాటు చేయనున్నారు. 94ఏళ్ల ఆస్కార్ అవార్డు చరిత్రలో ఇలా ఒక టీమ్‌ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ‘‘గత ఏడాది జరిగిన ఆస్కార్ వేడుకలో జరిగిన ఓ ఘటన (విల్ స్మిత్ – క్రిస్ రాక్లను ఉద్దేశిస్తూ..) మమ్మల్ని కొత్తగా ఆలోచించేలా, సరికొత్త నిర్ణయాలు తీసుకునేలా చేసింది. ఇందులో భాగంగానే క్రైసిస్ కమ్యూనికేషన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఈ బృంద సభ్యులు అందుకు తగ్గట్లుగా త్వరితగతిన స్పందిస్తారు. ఈ క్రైసిస్ మెంబర్స్ సేవలు వినియోగంలోకి రాకూడదనే (ఆస్కార్ వేడుక సవ్యంగా జరగాలని ఆశిస్తూ...) కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు ఆస్కార్ కొత్త సీఈఓ బిల్ క్రామెర్. ఇక 95వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ వేదికగా భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13న జరగనుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కిన విషయం తెలిసిందే. -
ఆస్కార్ సంబరాలు ఆరంభం.. ‘లంచ్ మీట్’లో కీరవాణి, చంద్రబోస్
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి దాదాపు నెల రోజులు ఉంది. ఈలోపు ఎప్పటిలానే ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నవారికి ‘లంచ్ మీట్’ ఏర్పాటు చేసింది అవార్డ్ కమిటీ. ఈ విందుకి సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ హాజరయ్యారు. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు కమిటీ నుంచి విందు కార్యక్రమానికి ఆహ్వానం అందగా ఈ ఇద్దరూ వెళ్లారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ని నిర్మించారు. ఇక ‘లంచ్ మీట్’ విషయానికొస్తే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ది బెవర్లీ హిల్టన్ బాల్ రూమ్‌లో విందు కార్యక్రమం జరిగింది. ఈ విందులో దాదాపు 200మంది పాల్గొన్నారని సమాచారం. అక్కడ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ను కలిశారు కీరవాణి, చంద్రబోస్. ఆ ఫోటోలను చంద్రబోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హుందాగా ఉందాం: జానెట్ యాంగ్ గత ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకకు ఓ హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్ రాక్ ఆ వేదికపై నటుడు విల్ స్మిత్ భార్య జాన్ పిన్కెట్ హెయిర్ స్టయిల్ గురించి కామెడీగా మాట్లాడారు. అది నచ్చక విల్‌స్మిత్ అతన్ని చెంపదెబ్బ కొట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రపంచం మొత్తం చూస్తున్న వేడుకలో విల్ స్మిత్ ఇలా చేయడం సరికాదని అవార్డు కమిటీ భావించింది. ఇదే విషయం గురించి తాజాగా ‘లంచ్ మీట్’లో అకాడమీ చైర్మన్ జానెట్ యాంగ్ మాట్లాడుతూ – ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. గత ఏడాది ఆస్కార్ వేడుకలో జరిగిన ఘటన (క్రిస్‌ని విల్ చెంప చెళ్లుమనిపించడం) సరైనది కాదు. అందరం బాధ్యతా యుతంగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలను ఆస్కార్ కమిటీ ఉపేక్షించదు’’ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ని ఆస్వాదించా! ఈ నెల 17న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ‘యాంట్–మ్యాన్ మరియు ది వాస్ప్: క్వాంటుమేనియా’లో సూపర్ విలన్ కాంగ్ ది కాంకరర్ పాత్ర చేసిన జోనాథన్ మేజర్స్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాట్లాడుతూ– ‘‘నేను భారతీయ చిత్రానికి అభిమానిని. ‘ఆర్ఆర్ఆర్’ని చాలాసార్లు చూశాను. మూడు గంటల ఈ సినిమాని ఆస్వాదించాను. ఇద్దరు నటులను (ఎన్టీఆర్, రామ్‌చరణ్) తెరపై చూడటం నాకు చాలా నచ్చింది. మరిన్ని ఇండియన్ సినిమాలు చూడాలనుకుంటున్నాను’’ అన్నారు. -
అందుకే కాంతార ఆస్కార్‌కు నామినేట్ కాలేదు: నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం కాంతార. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. హోంబలే ఫిలిం నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్‌కు షాట్లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. చదవండి: ‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? ఈ నేపథ్యంలో కాంతార ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంపై తాజాగా ఈ మూవీ నిర్మాత, హోంబలే ఫిలిం అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో విజయ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా సమయం నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న కథ నేపథ్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఆడియన్స్ కొత్త రకం కంటెంట్‌నే ఆదరిస్తున్నారు. అదే విధంగా ఇప్పటి ఫిలిం మేకర్స్ లక్ష్యం కూడా అదే. కాంతార, ఆర్ఆర్ఆర్ సినిమాల విషయంలో అదే జరిగింది. కాంతార ద్వారా తుళు కల్చర్‌ని అంతా తెలుసుకున్నారు. ఇకపై కూడా అలాంటి కథలపైనే దృష్టి పెడుతున్నాం’ అన్నారు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న బాలయ్య వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..! ఇక కాంతార ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంపై మాట్లాడుతూ.. ‘కాంతార సినిమా సప్టెంబర్ రిలీజయింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల నామినేషన్స్ సమయం లోపు ప్రచారం చేయలేకపోయాం. చాలా తక్కువ టైం ఉండటంతో ఎక్కువ ప్రచారం చేయలేకపోయాము. అందుకే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ అవ్వలేదనుకుంట. ఆ లోటుని కాంతార 2 తీరుస్తుంది. ఆల్రెడీ కాంతార 2 పనులు మొదలయ్యాయి. 2024 చివరి వరకు కాంతార 2 సినిమాని తీసుకొస్తాం. ఆ సినిమాని అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. -
ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్.. ఎంపికైన నాటు నాటు సాంగ్
సినీరంగంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ విడుదలయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ సంచలన మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 'నాటు నాటు సాంగ్' ఎంపికైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది. 'సరికొత్త చరిత్ర సృష్టించాం' అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది. తాజాగా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది 95వ ఆస్కార్ నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి. షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి. మొత్తానికి నామినేషన్స్‌లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి. ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా నాటు నాటు (ఆర్ఆర్ఆర్) అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్) హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్) లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్) ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) WE CREATED HISTORY!! 🇮🇳 Proud and privileged to share that #NaatuNaatu has been nominated for Best Original Song at the 95th Academy Awards. #Oscars #RRRMovie pic.twitter.com/qzWBiotjSe — RRR Movie (@RRRMovie) January 24, 2023 -
SS Rajamouli: ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను నాకు కావాల్సింది అదే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక కాకపోవడం అనేది కాస్త నిరుత్సహపరిచిందని దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. ఓ ఆంగ్ల ఆన్లైన్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విధంగా స్పందించారు. ‘‘మన దేశం తరఫున ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో నిరాశ చెందాను. ‘ఆర్ఆర్ఆర్’కు ఆఫీషియల్ ఎంట్రీ లభిస్తే బాగుండేదన్నట్లుగా విదేశీయులు సైతం అనుకుంటున్నారు. అయితే మా సినిమాకు ఎందుకు అధికారిక ఎంట్రీ లభించలేదు? అని పదే పదే ఆలోచిస్తూ ఉండే మనస్తత్వాలు కావు మావి. జరిగిందేదో జరిగిపోయింది. మనం ముందుకు సాగిపోవాలి. అయినా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కమిటీ నియమ, నిబంధనలు, మార్గదర్శకాలు వంటి అంశాల గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఈ విషయంపై కామెంట్ చేయాలనుకోవడం లేదు. ఇక దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపిన ‘ఛెల్లో షో’ (గుజరాతీ ఫిల్మ్, ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో) చిత్రానికి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఇండియన్ సినిమాయే’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి. కాగా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటునాటు’ సాంగ్‌కు ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం లభించింది. ఇక గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ కాగా, ‘ఆర్ఆర్ఆర్’తో పాటు మరో ఎనిమిది ఇండియన్ చిత్రాలు ‘ఆస్కార్ రిమైండర్ లిస్ట్’లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్స్ ఈ నెల 24న వెల్లడికానున్నాయి. అవార్డ్ ఫంక్షన్ మార్చిలో జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే. డబ్బు కోసమే... డబ్బు, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఓ దర్శకుడిగా నేను సినిమాలు తీస్తాను. విమర్శకుల ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను. ‘ఆర్ఆర్ఆర్’ ఓ కమర్షియల్ ఫిల్మ్. బాక్సాఫీస్ వద్ద నా సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయితే నేను హ్యాపీ. అవార్డ్స్‌ను బోనస్‌లా భావిస్తాను. అయితే ఓ సినిమా కోసం పడిన కష్టానికి గుర్తింపు లభిస్తే నాకు, నా చిత్రబృందానికి సంతోషం అనిపిస్తుంది’’ అని కూడా పేర్కొన్నారు రాజమౌళి. ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తర్వాతి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డు ఖాయం, రాసిపెట్టుకొండి: హాలీవుడ్ నిర్మాత
ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌ను గెలుచుకోవడం ఖాయమని హాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాసన్ బ్లక్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు 301 చిత్రాలతో ప్రకటించిన ఆస్కార్ రిమైండర్ లిస్టులో భారత్‌కు చెందిన 10 సినిమాలు ఉండడం విశేషం. అందులో, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో, హాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జాసన్ బ్లమ్ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన తన ట్వీట్లో ఇలా రాసుకొచ్చారు. చదవండి: ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయిన 'కాంతార'.. ఆర్ఆర్ఆర్కు పోటీగా ‘ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అందుకోవడం ఖాయం. మీరు ఫస్ట్ వినేది కూడా ఇదే. రాసిపెట్టుకొండి. నేను చెప్పిందే జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం నాకు నేనే సొంతగా అస్కార్ అవార్డును ప్రకటించుకుంటాను’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన ట్వీట్‌కు పలువురు హాలీవుడ్ పెద్దలు సైతం ఏకిభవిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ టీం కూడా స్పందించింది. చదవండి: హైవోల్టేజ్ యాక్షన్స్‌తో‘ పఠాన్’.. ట్రైలర్ అదిరిపోయింది! ‘మేము మిమ్మల్ని గెలుచుకున్నాం సార్. అది మాకు చాలు. ధన్యవాదాలు’ ఆయన ట్వీట్‌కు రీట్వీట్ చేసింది. కాగా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటూ నాటూ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ నామినేషన్‌కు ఎన్నికైన సంగతి తెలిసిందే. అదే విధంగా లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న స్క్రీనింగ్‌కి కూడా భారీగా రెస్పాన్స్ వస్తుండడంతో బెస్ట్ పిక్చర్ నామినేషన్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ఎంట్రీ ఇవ్వచ్చు అని హాలీవుడ్ మీడియాలు తమ కథనాల్లో పేర్కొంటున్నాయి. I’m going with RRR winning best pic. You heard it here first. Mark it down, please. If I’m right, I am awarding myself my own Oscar. — Jason Blum (@jason_blum) January 8, 2023 We won you, Blum!! ❤️ Thank you so much for your kind words. #RRR https://t.co/qWd07VUrq3 — RRR Movie (@RRRMovie) January 9, 2023 -
ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయిన 'కాంతార'.. ఆర్ఆర్ఆర్కు పోటీగా
ఆస్కార్ నామినేషన్స్‌లోకి మన సినిమా వెళ్తే ఆ కిక్కే వేరు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ సెన్సేషన్ కాంతార సినిమా కూడా ఆస్కార్ పోటీలోకి వచ్చింది. రెండు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతుంది. కేవలం రూ. 16కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డులకు కాంతార క్వాలిఫై అయ్యింది.ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాంతార చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్‌కి అర్హత లభించింనందుకు సంతోషంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం కాంతార, ఆర్ఆర్ఆర్లతో పాటు ది కశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ కతియావాడి చిత్రాలు కూడా ఆస్కార్ రిమైండర్ రేసులో ఉన్నాయి. మార్చ్12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. మరి క్వాలిఫైకి అర్హత సాధించిన మన ఇండియన్ సినిమాల ఆస్కార్ కల తీరుతుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. BIG ANNOUNCEMENT: #TheKashmirFiles has been shortlisted for #Oscars2023 in the first list of @TheAcademy. It’s one of the 5 films from India. I wish all of them very best. A great year for Indian cinema. 🙏🙏🙏 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 10, 2023 We are overjoyed to share that 'Kantara' has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the @shetty_rishab #Oscars #Kantara #HombaleFilms — Hombale Films (@hombalefilms) January 10, 2023 -
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఎంట్రీపై నెటిజన్ ట్వీట్.. ఘాటుగా స్పందించిన మంచు విష్ణు
దర్శకధీరుడు రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంతో అభిమానులు, సినీనటులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ది కశ్మీర్ పైల్స్, ఆర్ఆర్ఆర్ను వెనక్కి నెట్టి గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో' ఎంపికైంది . అయితే ఈ విషయంలో ఆర్ఆర్ఆర్కు మద్దతు కోసం చిత్రబృందం క్యాంపెయిన్ మొదలుపెట్టింది. మొత్తం 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కోసం చిత్ర బృందం క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఆస్కార్‌లో బెస్ట్ క్రింజ్ మూవీ అనే కేటగిరీ ఏదైనా ఉందా? అలాగైతే ఆర్ఆర్ఆర్ కచ్చితంగా ఆ విభాగంలో ఆస్కార్ గెలుస్తుందని ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి మంచు విష్ణు బదులిస్తూ.. 'భారతీయ సినిమాగా మనం ఎందుకు జరుపుకోకూడదు సోదరా? ఇది కేవలం ప్రాంతీయ చిత్రానికి దక్కే గౌరవం కాదు.. జాతీయంగా దేశం మొత్తం గర్వించదగ్గ విషయం' అంటూ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే థీమ్‌తో జక్కన్న రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ. రూ. 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంపిక అవుతుంది అని అందరూ భావించారు. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలవాలని కోరుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్‌కు నామినేట్ చేసింది. Why don’t we celebrate Indian cinema my brother? Now it ain’t about regional pride but national pride. https://t.co/81kNIXgRMQ — Vishnu Manchu (@iVishnuManchu) October 9, 2022 -
'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటిన ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ చివరకు నిరాశే మిగిలిందే. ఆర్ఆర్ఆర్ని ఆస్కార్‌కి నామినేట్ చేయకుండా చెల్లో షో అనే గుజరాతీ చిత్రాన్ని నామినేట్ చేశారు. దీనిపై హీరో నిఖిల్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవసరమా? నాకు ఆస్కార్‌పై వేరే అభిప్రాయం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆదరించారు. అదే సినిమాకు అతిపెద్ద విజయం అలాంటప్పుడు ఇంక ఆస్కార్ ఎందుకు? మనకు ఫిల్మ్‌ఫేర్, జాతీయ అవార్డులు ఇలా చాలానే ఉన్నాయి. నేనైతే ఆస్కార్‌కి అంత ప్రాధాన్యత ఇవ్వను. ఇటీవలె స్పెయిన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. అక్కడ థియేటర్స్ అన్ని హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాను ఇంతలా ఆదరిస్తుంటే, ఇంక ఆస్కార్ అవసరం లేదని నా ఫీలింగ్ అని నిఖిల్ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
మెగా అభిమానులకు పండగే.. ఆస్కార్ రేసులో రామ్‌చరణ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ఆలియాభట్,ఒలీవియా మోరిస్‌లు హీరోయిన్స్‌గా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో పలువురు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలె అమెరికాకు చెందిన ప్రముఖ మూవీ పబ్లికేషన్స్ వెరైటీ.. ఆస్కార్-2023కి గానూ బెస్ట్ యాక్టర్ కేటగిరిలో జూ ఎన్టీఆర్‌కి అవార్డు వచ్చే ఛాన్స్ ఉందని లిస్ట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో రామ్‌చరణ్ పేరు కూడా ఉన్నట్లు ఆ వెబ్సైట్ అంచనా వేసింది. అంతేకాకుండా బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరిలో రాజమౌళికి ఆస్కార్ వచ్చే అవకాశం ఉన్నట్లు జాబితా విడుదల చేసింది. -
Oscars: ఆస్కార్ బరిలో అలియా భట్ సినిమా!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. గంగూబాయి జీవితం ఆధారంగా రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకాన్ని బేస్ చేసుకుని ఆమె జీవిత కథనే సినిమాగా తెరకెక్కించారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆలియా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల్లో ఒటికగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. (చదవండి: అభిమాని కాళ్లు మొక్కిన హృతిక్ రోషన్, వీడియో వైరల్) లేటేస్ట్ సమాచారం ప్రకారం ఆస్కార్ బరిలో గంగూబాయి కతియావాడి సినిమా ఉందట. భారతీయ సినిమాల నుంచి గంగూబాయి కతియావాడి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విదేశాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో.. ‘గంగుబాయి’ని కచ్చితంగా ఆస్కార్ బరిలోకి దింపుతారని బాలీవుడ్ మీడియా పేర్కొంటుంది. మరో రెండు నెలల్లో ఆస్కార్ చిత్రాల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గంగూబాయి కతియావాడి కాకుండా.. ఆర్ఆర్ఆర్ , ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలు కూడా ఆస్కార్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలకు బ్యాడ్‌న్యూస్.. కొత్త రూల్స్ తెచ్చిన ఆస్కార్
95వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 12న జరగనుంది. ఈసారి అవార్డులకు సంబంధించిన కొత్త నియమ, నిబంధనలను కమిటీ ప్రకటించింది. ఆ వివరాలు... థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలకే ఆస్కారం ఒక సినిమా ఆస్కార్ అవార్డు నామినేషన్‌కు అర్హత సాధించాలంటే కచ్చితంగా థియేటర్స్‌లోనే రిలీజ్ కావాలి. ఆ సినిమా 2022 జనవరి 1నుంచి డిసెంబరు 31లోపు థియేటర్స్‌లోనే రిలీజ్ కావాలి. యూఎస్ మెట్రోపాలిటిన్ ఏరియా, లాస్ ఏంజిల్స్, ది సిటీ ఆఫ్ న్యూయార్క్, చికాగో, మియామీ, అట్లాంటాల్లోని థియేటర్స్‌లో సినిమా కచ్చితంగా ప్రదర్శితమై ఉండాలి. అయితే కరోనా కాలంలో ఓటీటీలో రిలీజైన సినిమాలూ ఆస్కార్ అవార్డుకు అర్హత సాధించాయి. కరోనా టైమ్‌లో అకాడమీ స్క్రీనింగ్ రూమ్‌లో సినిమాను ప్రదర్శిస్తే చాలు.. ఆ సినిమా అర్హతను నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అయిన కారణంగా ఈ వెసులుబాటుని తొలగించారు. ఓటీటీ కోసం సినిమాలు తీసి, ఆస్కార్ అవార్డుకు పంపాలనుకునే దర్శక–నిర్మాతలకు ఇది చేదు వార్త అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఆస్కార్‌కు అర్హత సాధించాలంటే సినిమా కచ్చితంగా థియేటర్స్‌లోనే రిలీజ్ కావాలనే నిబంధన కరోనాకు ముందు నుంచీ ఉన్న సంగతి తెలిసిందే. డాక్యుమెంటరీ విభాగంలో వచ్చే అవార్డుల పేర్లు మారాయి. ‘డాక్యుమెంటరీ ఫీచర్’ పేరు ‘డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’గా, ‘డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్’ విభాగం ‘డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్’గా మారింది. ► మ్యూజిక్ విభాగంలోని ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు విషయంలోనూ అకాడమీ మార్పులు చేసింది. ఈ విభాగంలో ఒక సినిమా నుంచి కేవలం మూడు పాటలనే పోటీకి పంపాలనే నిబంధనను విధించింది కమిటీ. ► ‘బెస్ట్ సౌండింగ్’ అవార్డు విభాగానికి అర్హత సాధించాలంటే కచ్చితంగా ఆ సినిమాను సౌండ్ బ్రాంచ్ మెంబర్స్ పర్యవేక్షణలో ప్రదర్శించాలి. కొన్ని విభాగాలకు సంబంధించి పోటీలో నిలిచేందుకు చివరి తేదీ ► డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: అక్టోబరు 3, 2022 ► యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: అక్టోబరు 14, 2022 ► లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: అక్టోబరు 14, 2022 ► ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్: నవంబరు 1, 2022 ► యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, జనరల్ ఎంట్రీ కేటగిరీ: నవంబరు 15, 2022 చదవండి 👉🏾 అది చూసి అనిల్ నాకు వంద హగ్గులు, వంద ముద్దులు అన్నారు అఖండ నటుడు కన్నుమూత -
నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను, మానసికంగా కుంగిపోయా: సమీరారెడ్డి
ఆస్కార్ అవార్డు 2022 ఈవెంట్ చోటు చేసుకున్న సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన భార్య అనారోగ్యం గురించి కమెడియన్ క్రిస్ రాక్ స్టేజ్‌పై మాట్లాడుతూ హాస్యం చేసినందుకు హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ అతడి చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘనపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీనిపై స్పందిస్తూ ఆ పరిస్థితుల్లో తాను కూడా అలాగే చేసేదాన్ని అంటూ స్మిత్‌కు మద్దతుగా నిలిచింది. ఇక తాజాగా నటి సమీరా రెడ్డి కూడా స్పందించింది. స్మిత్ భార్యను బాధించిన అలోపేసియా ఏరియాటా వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ తను కూడా గతంలో అలోపేసియా వ్యాధితో బాధపడినట్టు సీక్రెట్ రీవిల్ చేసింది. అంతేకాదు ఈ వ్యాధి అంటే ఏంటో కూడా సమీరా వివరించింది. ‘ప్రతి ఒక్కరు జీవితంలో వ్యక్తిగతంగా కొన్ని సమస్యలతో బాధపుడుతుంటారు. ఇటీవల ఆస్కార్ వివాదం నన్ను దీనిపై మాట్లాడేలా చేసింది. ఇంతకి అలోపేసియా అంటే ఏమిటో తెలుసా? ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీని వల్ల మీ జుట్టు కుదుళ్ల నుంచి ప్యాచ్‌లుగా ఊడిపోతుంది. 2016లో నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను. ఒక రోజు నా తల వెనక భాగంలో 2 ఇంచుల మేర నా జుట్టు ఉడిపోయి ఉండటం నా భర్త అక్షయ్ గమనించాడు. ఒక నెలలోనే రెండు మూడు చోట్ల నా జుట్టు ఊడిపోయి కనిపించింది. చదవండి: ఆగిపోయిన ప్రభాస్ సలార్ షూటింగ్!.. కారణం అదేనా? ఇది అంటూ వ్యాధి కాదు, ఇది మనల్ని ఎలాంటి అనారోగ్యానికి కూడా గురి చేయదు. కానీ చూట్టు రాలిపోవడం అంటే మానసికంగా కుంగదీస్తుంది. ఈ అలోపేసియా ఏరియాటా ఎందుకు వస్తుందనేది ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ.. ఇది మాత్రం పెద్ద వ్యాధి కాదు’ అంటూ సమీరా రాసుకొచ్చింది. అలాగే తను ఈ సమస్య నుంచి బయటపడ్డానని, ప్రస్తుతం తన తలలో ఎలాంటి ప్యాచ్‌లు లేవని ఆమె తెలిపింది. కాగా సమీరా రెడ్డి జై చిరంజీవా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అశోకా వంటి చిత్రాల్లో తన నటన, డాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సమీరారెడ్డి.. అంతే తక్కువ సయమంలో ఇండస్ట్రీకి దూరమైంది. అక్షయ్ అనే వ్యాపావేత్తను పెళ్లి చేసుకుని ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది సమీరారెడ్డి. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
జై భీమ్‌కు నిరాశ.. ఈ ఏడాది బరిలో ఉన్న చిత్రాలివే!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 94వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ ఫిబ్రవరి 8 (మంగళవారం) వెల్లడయ్యాయి. ట్రెసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనకు హోస్ట్స్‌గా వ్యవహరించారు. ఈ నామినేషన్స్‌లో ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’ చిత్రం ఏకంగా 12 నామినేషన్లు దక్కించుకోగా, ‘డ్యూన్’ చిత్రం 10, ‘వెస్ట్ సైడ్ స్టోరీ’, ‘బెల్ఫాస్ట్’ చిత్రాలకు ఏడేసి చొప్పున నామినేషన్లు లభించాయి. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ఈ నాలుగు చిత్రాలూ ఉత్తమ చిత్రం విభాగంలో ఉండటం విశేషం. అలా ఉత్తమ చిత్రం అవార్డు కోసం మొత్తం పది చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే నామినేషన్స్ దక్కించుకున్న వారిలో ఫైనల్‌గా ఎవరు ఆస్కార్ ప్రతిమను సొంతం చేసుకుంటారో చూడాలంటే ఈ ఏడాది మార్చి వరకూ ఆగాల్సిందే. మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. మన దేశం నుంచి ఢిల్లీకి చెందిన ఫిల్మ్‌మేకర్స్ రిటు థామస్, సుస్మిత్ ఘోష్ తీసిన ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఇప్పటికే పదిహేనుకు పైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించిన ఈ డాక్యుమెంటరీ ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకుంటే బాగుంటుందన్నది భారత సినీ ప్రేమికుల అభిలాష. దర్శకురాలు జేన్ కాంపియన్ రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేటయ్యారు. ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ సినిమాకు సంబంధించి ఉత్తమ దర్శకురాలు, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నారు. ఈ ఫీట్ సాధించిన తొలి మహిళ కాంపియనే కావడం విశేషం. ∙డేమ్ జూడీ డెంచ్ (87) ‘బెల్ ఫాస్ట్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా నామినేషన్ దక్కించుకున్నారు. ఆస్కార్ చరిత్రలో నామినేషన్ దక్కించుకున్న అత్యధిక వయసు ఉన్న నటిగా జ్యూడీ డెంచ్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు తన కెరీర్లో ఏడు భిన్నమైన విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సృష్టించారు కెన్నెత్ బ్రానాగ్. ఇంతకుముందు డైరెక్టర్, యాక్టర్, సపోర్టింగ్ యాక్టర్, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్నారు కెన్నెత్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘బెల్ఫాస్ట్’కి బెస్ట్ పిక్చర్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో చోటు దక్కింది. దీంతో కెన్నెత్ బ్రానాగ్ ఏడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మొత్తం 23 విభాగాలకు సంబంధించిన నామినేషన్లను అవార్డు కమిటీ ప్రకటించింది. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, నటి, నటీమణి నామినేషన్లు ఈ విధంగా... ఉత్తమ చిత్రం: బెల్ ఫాస్ట్, కోడా, డోన్ట్ లాకప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్, లికోరైస్ పిజా, నైట్మేర్ అల్లీ. ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ ఉత్తమ దర్శకుడు: జాన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), పాల్ థామస్ ఆండ్రూసన్ (లికోరైస్ పిజ్జా), స్టీవెన్ స్పీల్బర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ), ర్యూసుకీ హమగుచి (డ్రైవ్ మై కార్), కెన్నెత్ బ్రానాగ్ (బెల్ఫాస్ట్) ఉత్తమ నటుడు: ఆండ్రూ గార్ఫీల్డ్ (టిక్, టిక్ ... బూమ్), విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), డెంజిల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మెక్బెత్), జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ది రికార్డోస్) ఉత్తమ నటి: నికోల్ కిడ్‌మెన్ (బీయింగ్ ది రికార్డోస్), ఓలీవియా కోల్మన్ (ది లాస్ట్ డాటర్), క్రిస్టెన్ స్టీవర్ట్ (స్పెన్సర్), జెస్సికా కాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ), పెనెలోప్ క్రజ్ (సమాంతర తల్లులు) మళ్లీ నిరాశ బెస్ట్ ‘ఫీచర్ ఫిల్మ్స్ ఇన్ కన్సిడరేషన్ ఫర్ 94 ఆస్కార్ అవార్డ్స్’ అంటూ కొన్ని రోజుల క్రితం నామినేషన్ ఎంట్రీ పోటీలో ఆస్కార్ ఆకాడమీ ప్రకటించిన 276 చిత్రాల్లో తమిళ ‘ౖజై భీమ్’, మలయాళ ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’ చిత్రాలు చోటు దక్కించుకోగలిగాయి. కానీ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో మాత్రం ఈ చిత్రాలకు నిరాశ తప్పలేదు. కానీ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటించడానికి ముందు సోషల్ మీడియా, నెట్టింట్లో కాస్త డ్రామా నడిచింది. ‘ఆస్కార్ నామినేషన్స్ ఎవరికి దక్కుతాయి’ అనే చర్చలో భాగంగా అమెరికాకు చెందిన ఓ వెబ్సైట్ ఎడిటర్ జాక్వెలిన్ కోలే చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘జై భీమ్’ చిత్రానికి నామినేషన్ దక్కుతుంది. నన్ను నమ్మండి’ అంటూ జాక్వెలిన్ ట్వీట్ చేశారు. దీంతో ‘జై భీమ్’కు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందా? అనే చర్చ జోరుగా నెట్టింట్లో సాగింది. -
తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు
4 MCU Movies In Oscar Shortlist Under Visual Effects Category: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) హాలీవుడల్ చిత్రాల నిర్మాణ సంస్థ అంటే అంతగా అందరికి తెలియకపోవచ్చు. కానీ ఐరన్ మ్యాన్ సిరీస్, కెప్టెన్ అమెరికా, ది అవెంజర్స్, ఎండ్ గేమ్ చిత్రాలంటే మాత్రం తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి ఈ సినిమాలు. అయితే ఈ సినిమాలన్నింటిన్నీ నిర్మించిందే మార్వెల్ సంస్థ. హై బడ్జెట్లో విజువల్ వండర్స్‌తో అద్భుతాలు సృష్టించడంలో ఎక్కడా రాజీ పడలేదు ఈ సంస్థ. తాజాగా ఈ సంస్థ నిర్మించిన సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' డిసెంబర్ 16 (ఇండియాలో)న విడుదలై కలెక్షెన్లతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఆ జాబితాలో విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి. ఈ జాబితా ప్రకారం మార్వెల్ చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఉన్న 4 సినిమాలు మార్వెల్ సంస్థ నిర్మించినవే. ఈ కేటగిరీలో మొత్తంగా షార్ట్ లిస్ట్ చేసిన 10 చిత్రాల్లో ఏకంగా 4 సినిమాలు మార్వెల్ సంస్థకు సంబంధించినవి ఉండటం విశేషం. అవి 1. బ్లాక్ విడో 2. ఎటర్నల్స్ 3. షాంగ్ చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ 4. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. అంటే విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో తనకు తానే పోటీ పడనుంది మార్వెల్ సంస్థ. Presenting the 94th #Oscars shortlists in 10 award categories: https://t.co/BjKbvWtXgg pic.twitter.com/YtjQzf9Ufx — The Academy (@TheAcademy) December 21, 2021 అయితే ఇప్పటివరకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఆస్కార్ పొందిన చిత్రం 'బ్లాక్ పాంథర్' ఒక్కటే. 2018లో వచ్చిన ఈ సినిమా మూడు ఆస్కార్లను గెలుచుకుంది. రేన్ కూగ్లర్ తెరకెక్కించిన ఈ సినిమా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్‌ను చేజిక్కిచ్చుకుంది. సాంకేతిక విభాగంలో 2010 సంవత్సరానికి గాను ఐరన్ మ్యాన్ 2, 2012కు గాను ది అవేంజర్స్ సినిమాలు అకాడమీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యాయి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 2014కు సంవత్సరానికి గాను ఎంసీయూ చిత్రం 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ', 'కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్' సినిమాలు చివరిసారిగా నామినేట్ అయ్యాయి. మరీ ఈసారి విజువల్ ఎఫెక్ట్స్‌కు నామినేట్ అయిన మార్వెల్ 4 చిత్రాలు ఆస్కార్‌ను సాధిస్తాయో చూడాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. ఇదీ చదవండి: ఆస్కార్ అవార్డ్స్: తుది జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే.. -
ఆస్కార్ బరిలో నయనతార ‘కూళాంగల్’.. కథేంటంటే..?
‘కూళాంగల్’ (గులకరాయి) మోత ఆస్కార్ వరకూ వినిపించనుంది. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంటుందా? అనేది వచ్చే ఏడాది మార్చిలో తెలిసిపోతుంది. అయితే కొత్తవారితో కొత్త దర్శకుడు తీసిన సినిమా ఆస్కార్ పోటీ దాకా వెళ్లడం అంటే చిన్న విషయం కాదు. ప్రేక్షకుల హృదయాలను తాకింది ‘కూళాంగల్’ సినిమా. అందుకే మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఆస్కార్‌కి ఎంపికైంది. 2022 మార్చి 27న జరగనున్న 94వ ఆస్కార్ అవార్డ్ వేడుకకు మన దేశం తరఫున ‘విదేశీ విభాగానికి’ పలు చిత్రాలు పోటీ పడ్డాయి. వాటిలో హిందీ నుంచి ‘సర్దార్ ఉదమ్’, ‘షేర్నీ’, తమిళ చిత్రం ‘మండేలా’, మలయాళ సినిమా ‘నాయట్టు’ ఉన్నాయనే వార్త శుక్రవారం వచ్చింది. అయితే తమిళ చిత్రం ‘కూళాంగల్’ కూడా ఉందని, ఆ చిత్రమే ఎంపికైందని శనివారం అధికారిక ప్రకటన వెల్లడయింది. అన్ని చిత్రాలనూ పరిశీలించాక జ్యూరీ సభ్యులు ‘కూళాంగల్’ని ఎంపిక చేశారు. పీఎస్ వినోద్ రాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు విఘ్నేష్ శివన్–హీరోయిన్ నయనతార ‘రౌడీ పిక్చర్స్’ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ అధికారిక ఎంట్రీకి తమ సినిమా ఎంపికైన సందర్భంగా ‘‘అండ్ ది ఆస్కార్ గోస్ టు అని వినే చాన్స్ కూడా ఉంది! కల నెరవేరడానికి రెండు అడుగుల దూరమే ఉంది’’ అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు విఘ్నేష్. ‘‘ఇంతకన్నా ఆనందకరమైన వార్త మరోటి ఉండదు’’ అన్నారు పీఎస్ వినోద్ రాజ్. కూళాంగల్ కథేంటంటే... భర్త పచ్చి తాగుబోతు. అతన్ని మార్చాలనుకుంటుంది భార్య. తన వల్ల కాక ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు భార్య విలువ తెలుసుకుని ఆమెను ఇంటికి రప్పించడానికి తన కొడుకుతో కలసి ఆ భర్త ప్రయత్నాలు మొదలుపెడతాడు. భార్యను వెనక్కి తెచ్చుకోవడానికి అతనేం చేశాడనేది కథ. పీఎస్ వినోద్ రాజ్ తన కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ ప్రేక్షకులను హత్తుకునేలా తీశారు వినోద్. నటించిన అందరూ కొత్తవారే. కానీ పాత్రల్లో జీవించారు. ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్‌డామ్’ (ఐఎఫ్ఎఫ్ఆర్)లో ‘కూళాంగల్’ ప్రతిష్టాత్మక టైగర్ అవార్డు దక్కించుకుంది. 50 ఏళ్ల ఐఎఫ్ఎఫ్ఆర్ చరిత్రలో 2017లో మన దేశానికి తొలి అవార్డును తెచ్చిన మలయాళ ‘దుర్గా’ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న మరో సినిమా ‘కూళాంగల్’ కావడం విశేషం. -
ఒక్క నిమిషం వీడియో.. ఆస్కార్ ఆవకాశం
సాక్షి,సిటీబ్యూరో: సినిమానే జీవితాశయంగా మార్చుకుని, సినిమా రంగంలో అవకాశాల కోసం వినూత్న శైలిలో షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందిస్తున్న నేటి తరం సినిమా ప్రేమికులు ఎందరో... కానీ అలాంటి ఔత్సాహికుల కళను, ఆసక్తిని ప్రదర్శించే వేదిక ఇప్పటి వరకు లేదు. అలాంటి వారి కోసమే దేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాల వేదికగా ప్రఖ్యాతిగాంచిన జోష్ యాప్ ‘జేఎఫ్‌ఎల్‌ఐఎక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో ఓ వేదికను రూపొందించింది. ఈ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్ ఫిల్మ్ ఏకంగా ఆస్కార్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడమేకాకుండా అక్కడి సెలబ్రిటీ స్క్రీనింగ్‌లో భాగం కానుంది. (చదవండి: భర్త మరో మహిళతో జిమ్‌లో ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య) చిన్న సినిమా.. పెద్ద వేదిక... ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా కేవలం ఒకే ఒక్క నిమిషం నిడివి గల షార్ట్ ఫిల్మ్ రూపొందించాలి. దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహాకులు తెలిపారు. రోమ్కామ్, మ్యూజికల్, కామెడీ, యాక్షన్, ఫ్యాషన్ మరేదైనా కథాంశంతో షార్ట్ ఫిల్మ్ రూపొందించి, నవంబర్ 1వ తేదీలోపు జోష్ యాప్‌లో సబ్మిట్ చేయాలని పేర్కొన్నారు. ఈ ఎంట్రీలలోని ఉత్తమమైన షార్ట్ ఫిల్మ్‌ను ఎంపిక చేయడానికి న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తారలు ఫరాఖాన్, కునాల్ కోహ్లీ, ప్రభుదేవాలు వ్యవ్హరిస్తున్నారు. నవంబర్ 12న గోవాలో జరిగే గ్రాండ్ ఫినాలేలో బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌ను ప్రకటించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ తారలు వివేక్ ఒబేరాయ్, ఉర్వశి రౌతేల హోస్ట్‌గా.., సునీల్ శెట్టి, అలయా ఎఫ్, డినో మోరియా, సోనియా మెహరా, సోనాలి రౌత్ తదితరులు అతిథులుగా విచ్చేయనున్నారు. ‘జేఎఫ్‌ఎల్‌ఐఎక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్ ఆస్కార్ సెలబ్రేషన్స్‌కు వెలుతుందని, అక్కడ జరిగే సెలబ్రిటీ స్క్రీనింగ్‌లో భాగమవుతుందని ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహాకులు తెలిపారు. (చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్!) -
వచ్చే ఏడాది మార్చిలో ఆస్కార్ అవార్డ్స్
94వ ఆస్కార్ అవార్డుల వేడుకకు తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 27న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు. ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ చేయబడిన చిత్రాలను ఈ ఏడాది డిసెంబరు 21న, ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న, ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని వచ్చే ఏడాది మార్చి 27న జరపనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే ఉత్తమ చిత్రం విభాగానికి ప్రతిసారీ ఐదు నుంచి పది మధ్యలో సినిమాలను నామినేట్ చేసేవారు. కానీ ఇకపై ఉత్తమ చిత్రం విభాగానికి పది సినిమాలను నామినేట్ చేయనున్నారు. సాధారణంగా ఆస్కార్ వేడుకలు ఫిబ్రవరిలో జరుగుతాయి. కోవిడ్ కారణంగా 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన 93వ ఆస్కార్ అవార్డుల వేడుక ఏప్రిల్‌లో జరిగింది. ఇంకా వచ్చే ఏడాది బీజింగ్‌లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ (ఫిబ్రవరి 4– 20), లాస్ ఏంజెల్స్‌లో ప్లాన్ చేసిన ఓ ప్రముఖ ఫుట్‌బాల్ లీగ్‌ల కారణంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి 2022 మార్చి 27వ తేదీని ఆస్కార్ ప్రతినిధులు ఎంచుకున్నట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
Oscars 2021: ఆమెకు ఆస్కార్
ఆస్కార్ పెద్దల మనసు మారిందా? మనసు ‘తెల్లని’ కాగితం అయిందా? అందుకే ‘నల్ల’ ప్రతిభను గుర్తించిందా?... 93వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో నల్ల జాతీయులకు అవార్డులు దక్కడంతో చాలామంది మదిలో మెదిలిన ప్రశ్నలివి. 93 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో రెండోసారి ఓ మహిళకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఈసారి ఎక్కువమంది మహిళలకు అవార్డు దక్కడం కూడా ఓ విశేషం. రంగుకి, లింగ భేదానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రతిభకు అవార్డు ఇచ్చినట్లు అనిపించిందన్నది పలువురి అభిప్రాయం. ‘ఆమె’ ఆస్కార్‌తో మెరిసిన వేళ... నల్ల జాతీయులు మురిసిన వేళ.... అవార్డు వేడుక విశేషాలు తెలుసుకుందాం. ‘ఆస్కార్ అంటే తెల్ల జాతీయులదే... నల్ల జాతీయులకు చోటు ఉండదు’ అనే విమర్శ దాదాపు ఐదేళ్లుగా ‘అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ మోస్తూ వస్తోంది. అయితే ఈ ‘రంగు మరక’ను తుడిచేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈసారి ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసినట్లు కనబడుతోంది. ఇందుకు ఓ ఉదాహరణ నల్ల జాతీయులంతా కలిసి నిర్మించిన ‘నొమాడ్ ల్యాండ్’ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం. ఈ సినిమా వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఉత్తమ దర్శకుడు, నటుడు, నటీమణి.. ఇలా మూడు ప్రధాన విభాగాల్లో అవార్డు దక్కించుకోవడం విశేషం. పది నామినేషన్లు దక్కించుకున్న ‘మాంక్’ కేవలం రెండు అవార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. ఆరు నామినేషన్లు దక్కించుకున్న ‘నొమాడ్ ల్యాండ్’ మూడు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రానికిగాను ఉత్తమ దర్శకురాలిగా ఎంపికయ్యారు క్లో జావ్ (39). దర్శకుల విభాగంలో అవార్డు అందుకున్న రెండో మహిళ, తొలి ఆసియన్ మహిళ కూడా క్లో జావే కావడం విశేషం. ఇదే చిత్రానికిగాను 63ఏళ్ల మెక్ డోర్మాండ్ను ఉత్తమ నటి అవార్డు వరించింది. మూడు ఆస్కార్లు గెల్చుకున్న ఏడో నటి డోర్మాండ్ కావడం విశేషం. మరోవైపు ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రానికి గాను హెయిర్ స్టయిలింగ్, మేకప్ విభాగంలో తొలిసారి నామినేషన్ పొందిన ఇద్దరు నల్లజాతి మహిళలు మియా నీల్, జామికా విల్సన్‌లు అవార్డుని కూడా ఇంటికి తీసుకెళ్లగలిగారు. అలాగే ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం అవార్డుని కొట్టేసింది ‘సోల్’. ‘బ్లాక్’ క్యారెక్టర్ లీడ్‌గా సాగిన చిత్రం ఇది. అది మాత్రమే కాదు.. ఉత్తమ సహాయ నటిగా అవార్డు దక్కించుకున్నారు కొరియన్ నటి జంగ్ యూన్. ‘మినారీ’ చిత్రంలోని నటనకుగాను ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న తొలి కొరియన్ నటి ఆమే. ఈసారి అవార్డుల ఎంపిక పరంగా పెద్దగా విమర్శలు రాలేదు కానీ, ఉత్తమ నటుడి ఎంపిక విషయంలో కొందరు అసంతృప్తి వ్యక్తపరిచారు. ‘మా రేనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రంలోని నటనకు గాను దివంగత నటుడు చాడ్విక్ బోస్మాన్కు ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని చాలామంది ఊహించారు కానీ నిరాశే ఎదురైంది. ‘ది ఫాదర్’కి ఆంథోనీ హాప్కిన్స్ ఉత్తమ నటుడి అవార్డు పొందారు. 93 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో 80ఏళ్ల వయసు పైబడిన ఇద్దరు తారలకు అవార్డులు దక్కిన ఆనందం ఈసారే జరిగింది. ఉత్తమ నటుడిగా ఆంథోనీ హాప్కిన్స్ (83), కాస్ట్యూమ్స్ డిజైనింగ్ విభాగంలో అన్ రోత్ అనే 89 ఏళ్ల మహిళకు ఆస్కార్ దక్కింది. ఈసారి మరో విశేషం కూడా జరిగింది. మామూలుగా మహిళలకు అంటూ ఉండే విభాగాలు రెండో.. మూడో. ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి... ఇలా. మిగతా విభాగాల్లో పురుషాధిక్యం ఉంటుంది. ఆ విభాగాల్లోనూ మహిళలు అవార్డు దక్కించుకోవడం అంటే చాలా పెద్ద విషయం. ఈసారి డైరెక్షన్, మేకప్, హెయిర్ స్టయిలింగ్, కాస్ట్యూమ్స్ డిజైనింగ్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే తదితర విభాగాల్లోనూ మహిళలు రాణించడం విశేషం. మొత్తం 15కి పైగా అవార్డులు అతివల సొంతమయ్యాయి. ఇక కోవిడ్ కారణంగా వీక్షకులను వేడుకకు అనుమ తించలేదు. ఎప్పుడూ ఒకే వేదిక మీద జరిగే ఆస్కార్ అవార్డు వేడుక కోవిడ్ కారణంగా ఈసారి రెండు వేదికలు లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్, యూనియన్‌లో అవార్డు వేడుక జరిగింది. రైటర్ కమ్ డైరెక్టర్ ఎమెరాల్డ్ ఫెన్నల్ ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ చిత్రానికిగాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించారు. 13 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో అవార్డు సాధించిన మహిళ ఎమెరాల్డే కావడం విశేషం. 2008లో ‘జునో’ చిత్రానికి డాయాబ్లో కోడైకి అవార్డు దక్కింది. ‘గెట్ అవుట్’కి 2018లో ఆస్కార్‌కు నామినేట్ అయినా అవార్డును గెలుచుకోలేదు డేనియల్ కలుయా. ఈసారి ‘జుడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్య’లోని నటనకుగాను ఉత్తమ సహాయ నటుడిగాæఆయన‡ఆస్కార్ అందుకున్నారు. నాన్నతో కలిసి నేను చైనాలో పెరుగుతున్నప్పుడు సరదాగా ఓ ఆట ఆడేవాళ్ళం. చైనీస్‌లోని మంచి పద్యాలు, సామెతలను ఒకరికొకరం చెప్పుకునేవాళ్ళం. అయితే ఈ పద్యాల్లో ఒకరు ఒక వాక్యం చెబితే ఆ తర్వాతి వాక్యాన్ని మరొకరు చెప్పాలి. ఇదే గేమ్. నా చిన్నతనంలో ఇలా చాలాసార్లు ఆడుకున్నాం. వీటిలో ఒక వాక్యం ఉంది. ‘పుట్టినప్పుడు సహజంగానే అందరూ మంచివాళ్లే’. ఈ మాటలు నా చిన్నతనంలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. ఇప్పటికీ నేను దీన్ని నమ్ముతాను. అందుకే ప్రపంచంలో నేను ఏ మూల ఎవర్ని కలిసినా వారిలోని మంచిని గురించే ఆలోచిస్తాను. కేవలం ఇతరుల మంచినే కాదు.. మనలో దాగి ఉన్న మంచిని కూడా మనం ధైర్యంగా తెలుసుకుందాం. – క్లో జావ్, ఉత్తమ దర్శకురాలు నేను నా స్వస్థలమైన వేల్స్లో ఉన్నాను. నాకిప్పుడు 83 ఏళ్ళు. ఈ వయసులో నాకు ఆస్కార్ అవార్డు వస్తుందని ఊహించలేదు. సంతోషంగా ఉంది. చాలా గౌరవంగా భావిస్తున్నాను. అకాడెమీ సభ్యులకు నా ధన్యవాదాలు. చాడ్విక్ బోస్మాన్కు నా నివాళులు అర్పిస్తున్నాను. చాడ్విక్ చాలా తొందరగా మనల్ని విడిచి వెళ్లిపోయాడు. – సర్ ఆంథోనీ హాప్కిన్స్, ఉత్తమ నటుడు నా నోట మాటలు రావడం లేదు. చాలా సంతోషంగా ఉంది. నాకు నటన వచ్చని నమ్మి, అవకాశాలు ఇస్తున్నవారికి ధన్యవాదాలు. – ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్, ఉత్తమ నటి అస్కార్ అవార్డుకి ఇప్పటికే ఎనిమిదిసార్లు నామినేట్ అయ్యారు గెన్ క్లోజ్. కానీ ఆమెకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేట్ అయిన గెన్ క్లోజ్‌కు అవార్డు దక్కలేదు. కేవలం ఒకేఒకసారి నామినేట్ అయిన జంగ్ యూన్‌కు అవార్డు రావడం ఆస్కార్ వేడుకలో మరో హైలైట్. వయోలా డేవిస్, క్యారీ ముల్లిగన్, రెజీనా కింగ్, ఏంజెలా బాస్సెట్, హల్లే బెర్రీ వంటి తారలు రెడ్ కార్పెట్‌పై మెరిశారు. పొడవాటి గౌనుల్లో గ్లామర్‌గా కనిపించారు. ఖరీదు గల నగలతో నగుమోముతో వీక్షకులకు కనువిందు చేశారు. ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో డెన్మార్క్‌కు చెందిన ‘అనదర్ రౌండ్’ చిత్రం ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. చిత్రదర్శకుడు థామస్ వింటర్బెర్గ్ భావోద్వేగానికి లోనయ్యారు. వీక్షకుల కళ్లూ చెమర్చాయి. ‘‘జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేం ఈ సినిమాను తీశాం. జీవితంలో కంట్రోల్ ఉండాలి. నా జీవితంలో నేను నా కూతురు ఇదాను కోల్పోయాను. ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించడానికి రెండు నెలల ముందు నా కూతురు ఇదా ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. తనకు ఈ సినిమా స్క్రిప్ట్ బాగా నచ్చింది. అందుకని తనతో ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ చేయించాలనుకున్నాను. ఈ అవార్డు ఆమెదే’’ అని భావోద్వేగానికి లోనయ్యారు థామస్. అలాగే దాదాపు పదేళ్ల తర్వాత ఈ విభాగంలో డెన్మార్క్‌కు ఆస్కార్ అవార్డు రావడం విశేషం. ఈసారి విశేషాలు ఇవీ... ∙‘మినారి’ చిత్రంలో ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ సాధించారు కొరియన్ మహిళ జంగ్ యూన్. ఆ ఘనత సాధించిన తొలి కొరియన్ మహిళ ఆమె. నామినేట్ అయిన తొలిసారే జంగ్ యూన్‌ను అవార్డు వరించడం మరో విశేషం. ∙‘నొమాడ్ ల్యాండ్’ సినిమా తర్వాత క్లో జావ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎటర్నల్’. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆస్కార్ అవార్డు వేడుకలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అలాగే స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలోని ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ టీజర్‌ను విడుదల చేశారు. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ చిత్రానికి నామినేట్ అయిన రిజ్ అహ్మద్‌కు అవార్డు వచ్చినట్లయితే ...ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి ముస్లింగా రిజ్ అహ్మద్ చరిత్ర సృష్టించేవారు. అయితే నామినేషన్ దక్కించుకోవడం అంటే కూడా చిన్న విషయం కాదు. అవార్డు రాకపోయినా ఈ ఆస్కార్ వేడుకలో తన భార్య హెయిర్‌ను సరిచేస్తూ ఆకట్టుకున్నారు రిజ్. ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌ను క్లోజ్ చేశారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలకు కూడా ఈసారి ఆస్కార్ అవార్డ్స్‌లో చోటు దక్కింది. మా రేనీస్ బ్లాక్ బాటమ్ (2), మాంక్ (2), అక్టోపస్ టీచర్ (1), ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ (1), టు డిస్టంట్ స్ట్రేంజర్స్ (1) .. ఇలా నెట్‌ఫ్లిక్స్‌లోని చిత్రాలకు ఏడు అవార్డులు, అమెజాన్ ప్రైమ్‌లోని ‘సౌండ్ ఆఫ్ మెటల్’ చిత్రానికి (2), డిస్నీ ఫ్లస్లోని ‘సోల్’కు (2).. ఇక మరో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ హులులోని ‘నొమాడ్ ల్యాండ్’కు (3).. ఇలా మొత్తం 23 ఆస్కార్ విభాగాల్లో 14 అవార్డులు ఓటీటీలో స్ట్రీమ్ అయిన చిత్రాలు దక్కించుకోవడం విశేషం. మన దేశం తరపున ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఆస్కార్ ఎంట్రీగా వెళ్లింది. కానీ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ఇక ప్రియాంకా చోప్రా నటించిన ‘వైట్ టైగర్’ ఎడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నప్పటికీ అవార్డును అందుకోలేకపోయింది. -
చెత్త సినిమాలకు కూడా అవార్డులా..!
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సినీ రంగంలో వివిధ కేటగిరీలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను ఇస్తూంటారు. సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఏదంటే ఠక్కున చెప్పే పేరు ఆస్కార్ అవార్డు. ఈ అవార్డును సొంతం చేసుకోవడానికి ఎంతో మంది నటీనటులు, టెక్నిషియన్స్ , దర్శకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. ఈ అవార్డు కేవలం ప్రజాదరణ పొందిన సినిమాలకు మాత్రమే వరిస్తాయి. మంచి సినిమాలకు అవార్డులు లభిస్తే మనం పొందే ఆనందం అంతఇంతా కాదు. మరి అత్యంత చెత్త సినిమాల పరిస్థితి ఏంటి? అని మనలో చాలా మందికి అనిపించే ఉంటుంది. ప్రజాదరణ పొందని, లేదా అత్యంత పరమ చెత్త సినిమాలకు కూడా అవార్డులు ఇస్తే బాగుంటుందని మనలో చాలా మందికి అనిపించే ఉంటుంది. మంచి సినిమాలకే కాదు చెత్త సినిమాలకు కూడా అవార్టులు ఇస్తారండోయ్..!. వరస్ట్ సినిమాలకు కూడా హాలీవుడ్లో ఒక అవార్డు అందిస్తారు. ఆ అవార్డే గోల్డెన్ రాస్ప్బెర్రీ అవార్డు. దీనినే రజ్జీస్ అవార్డుగా కూడా పిలుస్తారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం తొలిసారిగా 1981 మార్చి 31న నిర్వహించారు. అకాడమీ అవార్డులను అందించే ముందు రోజు ఈ అవార్డు వేడుకలను అందిస్తారు. వరస్ట్‌గా నటించినవారికి, దర్శకులకు ఈ అవార్డును అందిస్తారు. ఇక్కడ విషయమేమిటంటే ఇప్పటి వరకు 14 మంది మాత్రమే ఈ అవార్డులను స్వీకరించారు. కాగా రజ్జీస్ విజేతలను పలు దేశాల నుంచి 1,097 మంది సభ్యులను ముందుగా ఎంపిక చేస్తారు. వీరు ఆన్లైన్లో సభ్యత్వ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏడాది గాను వివిధ కేటగిరీలో రజ్జీస్ అవార్డులను ప్రకటించారు.. రజ్జిస్ అవార్డు విజేతలు వీరే.. వరస్ట్ యాక్టర్:మైక్ లిండెల్- ది పిల్లో గయ్ వరస్ట్ యాక్టరస్: కేట్ హడ్సన్ర్ వరస్ట్ సపోర్టింగ్ యాక్టరస్: మాడ్డీ జిగ్లెర్ర్ వరస్ట్ సపోర్టింగ్ యాక్టర్: రూడీ గియులియాని వరస్ట్ డైరెక్టర్: సియా చదవండి: హాలీవుడ్‌ని ఏలుతున్న ఇండియన్ అమ్మాయి అర్చీ పంజాబీ -
హాలీవుడ్‌ని ఏలుతున్న ఇండియన్ అమ్మాయి అర్చీ పంజాబీ
ఆమె వయసు పాతికేళ్లు. ధరించిన పాత్ర పద్నాలుగేళ్ల అమ్మాయిది. అదే తన మొదటి సినిమా, పైగా హాలీవుడ్ సినిమా.. ధైర్యంగా కెమెరా ముందుకెళ్లింది. తన నటనా ప్రావీణ్యంతో అవార్డునూ సాధించింది. ఆమె మన ఇండియన్ అమ్మాయి – అర్చీ పంజాబీ. ►తల్లిదండ్రులు గోవింద్ పంజాబీ, పద్మా పంజాబీ. ఇద్దరూ బ్రిటన్‌లో స్థిరపడిన స్కూల్ టీచర్స్. చిన్నతనంలో కొంతకాలం ముంబైలో పెరిగింది. అందుకే తనను తాను ‘పార్ట్ బాంబేౖయెట్, పార్ట్ బ్రిటిష్’గా పరిగణించుకుంటుంది. ►ఇంగ్లండ్‌లోని బ్రూనెల్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసి, నటిగా మారాలని నిర్ణయించుకుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఆడిషన్కూ వెళ్లేది. అలా మొదటగా ‘సైరన్ స్పిరిట్స్’ టీవీ సీరియల్లో కనిపించింది. ►సినిమాల్లోకి ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’తో ఎంట్రీ ఇచ్చింది. అందులో ఓ పద్నాలుగేళ్ల అమ్మాయిలా నటించింది. కానీ, ఆమె వయసు అప్పటికే 25 సంవత్సరాలు. ఆ తర్వాత చేసిన ‘ది గుడ్ వైఫ్’ సిరీస్‌తో ఆమె బుల్లితెర స్టార్‌గా మారింది. ►అర్చీ నటించిన ‘ది కాన్స్టంట్ గార్డెన ర్’ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయింది. అంతేకాదు, వివిధ అవార్డు ఫంక్షన్స్‌లో ‘ఉత్తమ నటి’ అవార్డు, ‘ది చాపర్డ్ ట్రోఫీ’, ‘ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డు’, ‘ఇమేజ్ అవార్డు’ ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా అవార్డులే ఆమెను వరించాయి. ►టెలివిజన్ టాప్ టెన్ యాక్టర్స్‌లో ఒకరిగా నిలవడమే కాదు.. ‘యాస్మిన్’, ‘ఎ మైటీ హార్ట్’, ‘కోడ్ 46’, ‘ఎ గుడ్ ఇయర్’ వంటి పెద్ద సినిమాలూ చేసింది. ప్రస్తుతం వివిధ వెబ్‌సీరిస్ చేస్తూ బిజీగా ఉంది. ►మా అమ్మ వాళ్ల నాన్నతో గొడవపడి టీచర్ ఉద్యోగం సాధించింది. అందుకే, నేను సినిమాల్లో నటిస్తానంటే మా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. పైగా మా అమ్మ ‘ఈ ప్రపంచంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు’ అని చెప్పి నాలో స్పూర్తిని నింపింది. – అర్చీ పంజాబీ -
ఆస్కార్ అవార్డు వస్తే అదొక స్ట్రెస్
ఏప్రిల్ 26న ఆస్కార్ అవార్డులు. ’మీనారీ’ ఉత్తమ సహాయనటిగా నామినేట్ అయిన 73 ఏళ్ల నటి యువాన్ యు–జంగ్‌కి ఆస్కార్ వస్తే కనుక దక్షిణ కొరియాకే ఆమె తొలి ఆస్కార్ నటి అవుతారు. సాధారణంగా ‘బాఫ్తా’, ’సాగా’ అవార్డులు వచ్చిన కేటగిరీలకు స్కార్ కూడా వస్తుంది. యువాన్ ఆ రెండూ గెలుచుకున్నారు. ఇక మిగిలింది ఆస్కార్. ఒకవేళ తనకు ఆస్కార్ వస్తే అది తనకెంతో ‘స్ట్రెస్ఫుల్’ అవుతుందని ఆమె అంటున్నారు!! తొంభై ఏళ్లకు పైబడిన ఆస్కార్ చరిత్రలో దక్షిణ కొరియా నుంచి ఒక నటి నామినేట్ అవడం ఈ ఏడాదే తొలిసారి! 73 ఏళ్ల ఆ నటి యువాన్ యు–జంగ్. అమెరికన్ డ్రామా మూవీ ‘మీనారీ’ నుంచి ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఆమె ఆస్కార్ పోటీలో ఉన్నారు. విజేతగా నిలిస్తే దక్షిణ కొరియాలో ఆస్కార్ సాధించిన తొలి నటి కూడా యువాన్‌నే అవుతారు. అయితే.. ‘‘విజేతగా నిలవడం సంతోషమే కానీ, విజేతగా నిలబడడం ఒత్తిడితో కూడుకున్న విషయం’’ అని ఆమె అంటున్నారు! అయినా.. తేలని ఫలితం గురించి యువాన్ ముందుగానే ఒత్తిడి కొని తెచ్చుకోవడం ఎందుకు? ఎందుకంటే.. ఇప్పటికే ఆమె ‘బాఫ్తా’ (బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్), ‘సాగా’ (స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్) లో అదే చిత్రానికి, అదే కేటగిరీలో ఉత్తమ నటిగా అవార్డు పొందారు. ఇక మిగిలింది ఆస్కారే. ఆ రెండిట్లో అవార్డు వస్తే ఇక్కడా వచ్చినట్లేనని ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా ప్రకారం యువాన్ ఆస్కార్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ కొరియాలో సీనియర్ సినీ అగ్ర తారగా గుర్తింపు ఉన్న యువాన్.. ఉత్తమ చిత్రం కేటగిరీలో ఈ ఏడాది ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘మీనారీ’ చిత్రంలో అమ్మమ్మగా నటించారు. అమెరికా కల నెరవేర్చుకునేందుకు ఆర్కాన్సాస్ వలస వచ్చిన ఒక దక్షిణ కొరియా కుటుంబం చుట్టూ తిరిగే కథ మీనారీ. ఆ చిత్రంలో నెరవేరవలసిన ఒక కల ఉంటుంది. యువాన్ మాత్రం కనీసం ఆస్కార్ ‘నామినేషన్ కల’ కూడా కనలేదు. ఇప్పుడిక ఆమె ఏనాడూ కనని ఆస్కార్ ‘అవార్డు కల’ నెరవేరడం కోసం ఆమె తప్ప ఆమె అభిమానులంతా ఎదురు చూస్తున్నారు! యువాన్ ఐదు దశాబ్దాలుగా సినిమాలలో నటిస్తున్నారు. 1960లలో ఆమె రైజింగ్ స్టార్. 1971లో వచ్చిన ‘ఉమన్ ఆఫ్ ఫైర్’ చిత్రంలో ఆమె పాత్రకు అనేక అవార్డులు వచ్చాయి. వందకు పైగా సినిమాలు, లెక్కలేనన్ని టెలీ సీరియళ్లలో నటించారు. ఆమె కెరీర్ మొత్తం మీద వచ్చిన అవార్డులను మించి ఈ ఒకటీ రెండేళ్లలోనే సాధించారు! ఆస్కార్ కూడా వచ్చేస్తే నటిగా జీవిత సాఫల్యం. అయితే యువాన్ అలా అనుకోవడం లేదు. ఆస్కార్ బరిలో ఆమెకు పోటీగా మరో ఐదుగురు నటీమణులు ఉన్నారు. ‘‘గెలుస్తానని, గెలవాలనీ ప్రత్యేకంగా నాకైతే ఏమీ లేదు. అభిమానులు కోరుకుంటున్నారు. వారి ఆశ ఫలించి నాకు ఆస్కార్ వస్తే అది నాకు అవార్డు కన్నా కూడా ఒత్తిడే అవుతుంది’’ అని నవ్వుతూ అంటున్నారు యువాన్. మరింత బాధ్యత పెరిగినట్లు అనిపించడం కావచ్చు ఆ మాటకు అర్థం. వృత్తి పట్ల అంకితభావం ఉన్నవారికే ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయేమో!! సూన్–జా అమ్మమ్మ ‘మీనారీ’ చిత్రంలో అమ్మమ్మ పాత్రలో నటించారు యువాన్. ఆ అమ్మమ్మ పేరు సూన్–జా. కూతురు, అల్లుడు కోళ్లఫారంలో పని చేస్తుంటారు. కొద్దిగా పొలం కూడా ఉంటుంది. ఆ పంటను అమ్ముకుని జీవిస్తుంటారు. పొలానికి నీళ్లకోసం అల్లుడే సొంతంగా బావి తవ్వుకుంటాడు. ఇద్దరు పిల్లలు. కూతురు, కొడుకు. పెద్దవాళ్లు పనులకు వెళ్లినప్పుడు పిల్లల్ని చూసుకోడానికని యువాన్ని పిలిపించుకుంటారు. మనవడి గదిలో ఆమె ఉండేందుకు ఏర్పాట్లు చేస్తారు. మొదట వాడికి అమ్మమ్మ నచ్చదు. అమెరికా అమ్మమ్మలా ఉండదు. అందుకని! మెల్లిగా మాలిమి అవుతాడు. వాడికి గుండె జబ్బు ఉంటుంది. అదొక బెంగగా ఉండేది తల్లిదండ్రులకు. యువాన్ వాడిని ఆడించి, పరుగులు తీయించి, వైద్యసహాయం అవసరం లేనంతగా శక్తిమంతుడిని చేస్తుంది. ‘మీనారీ’ (నీటి మొక్క) ల పెంపకం గురించి, వాటి ప్రయోజనాల గురించి మనవడికి చెబుతుంటుంది. మరోవైపు.. అల్లుడు తవ్విన పంట బావి ఎండిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. భార్యాభర్తలు విడిపోయే వరకు వస్తుంది. ఆ క్రమంలో యువాన్‌కు స్ట్రోక్ వస్తుంది. ఆరోగ్యం మెరుగయ్యాక కూడా కదల్లేని స్థితిలో ఉంటుంది. ఓ రోజు అకస్మాత్తుగా వీళ్ల పంట ఉన్న గిడ్డంగికి నిప్పు అంటుకుని యువాన్ ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటుంది. అప్పటికే విడిపోయే ఏర్పాట్లలో ఉన్న అల్లుడు, కూతురు కలిసికట్టుగా వచ్చి ఆమెను కాపాడతారు. ‘జీవితం అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. అయినా ముందుకు వెళ్లాలి.. మీనారీ మొక్కలు ప్రతికూల పరిస్థితుల్లోనూ గుబురుగా పెరిగిన విధంగా..’ అనే సందేశాన్ని యూవాన్ పాత్రతో దర్శకుడు ఇప్పించారని చిత్ర సమీక్షకులు భావిస్తున్నారు. ‘మీనారీ’ చిత్రంలో అమ్మమ్మ పాత్రలో యువాన్ -
అదిగదిగో ఆస్కార్... మన తరఫున ‘వైట్ టైగర్’...
అకాడమీ అవార్డులంటేనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులని సినీ రంగ ప్రముఖులు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆలోచనాత్మకమైన కథలతో పాటుగా ఆకట్టుకునే పాత్రలు సైతం ఈ అవార్డుల రేస్‌లో పోటీపడుతుంటాయి. గత 2002లో లగాన్ తరువాత ఈ సంవత్సరం వైట్ టైగర్ చిత్రం ఆస్కార్ 2021లో ఇండియా నుంచి పోటీపడుతోంది. దాదాపు 20 సంవత్సరాల తరువాత ఇండియన్ మూవీ పోటీపడుతుండడంతో ఈ సారి అకాడమీ పండుగ మనవారికీ ఆసక్తిగా మారింది. ఈ ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ స్టార్ మూవీస్, స్టార్ వరల్డ్ ఛానెల్స్‌లో ఈ పురస్కారాల పండుగ ప్రసారమవుతోంది. అవార్డుల వేడుకలను తిలకించడమే...అవార్డుల వేడుకకు ఇంకా కొద్ది రోజులే మిగిలిన వేళ ఈ అకాడమీ అవార్డులలో పోటీపడుతున్న చిత్రాలను ఓ సారి పరిశీలిస్తే... ద వైట్ టైగర్: లగాన్ తరువాత ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్ కాబడ్డ చిత్రమిది. రాజ్‌కుమార్ రావు, ప్రియాంక చోప్రా లాంటి తారాగణం ఉన్న ఈ చిత్రంలో సామాన్యుని జీవితం ఒడిసిపట్టారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, పారాసైట్ల సమ్మేళనంలా కనిపిస్తుందీ చిత్రం. ద పాధర్: ఫ్లోరియన్ జెల్లర్ ప్లే లీ పీరీ ఆధారంగా తీర్చిదిద్దారు. వయసు మీద పడిన తండ్రి నెమ్మదిగా అన్నీ మరిచిపోతుండటం... ఈ నేపథ్యంలో కనిపించే భావోద్వేగాలు. ఆంథోనీ హోప్కిన్స్ ప్రదర్శనకు పరాకాష్ట అనతగ్గ రీతిలో ఉంటుంది. జుడాస్ అండ్ ద బ్లాక్ మెసయ్య: చారిత్రాత్మక బయోపిక్ ఇది. దర్శకత్వం మొదలు, చిత్ర నటీనటుల ఎంపిక, నటన, స్క్రిప్ట్... ప్రతిఒక్కటీ అద్భుతమే ! మంక్: డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. విశేషమేమిటంటే ఈ చిత్ర స్క్రీన్‌ప్లేను ఆయన తండ్రి జాక్ ఫించర్ తీర్చిదిద్దడం. ఇటీవలనే ఆయన మరణించారు. మినారీ: లీ ఇసాక్ రచనదర్శకత్వం వహించిన కొరియన్ అమెరికన్ ఫ్యామిలీ చిత్రమిది. స్ఫూర్తిదాయక కుటుంబ కథా చిత్రాలలో ఒకటి. రోజువారీ సగటు అమెరికన్ జీవిత గాథను ఇది వెల్లడిస్తుంది. నోమడ్‌ల్యాండ్: అందాన్ని ఆస్వాదించాలనుకునే వారు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమది. ఓ సంక్షోభంలో అన్నీ కోల్పోయిన 60ఏళ్ల వయసులోని మహిళ జీవిత ప్రయాణాన్ని కళ్లకు కడుతుంది. ప్రామిసింగ్ యంగ్ ఉమెన్: ఊహాతీత సంఘటనలతో కూడిన కథనం ఈ చిత్రబలం. ఓ అమ్మాయి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలతో సాగుంది. అద్భుతమైన అభినయం, దర్శకత్వాల కలయిక ఈ చిత్రం. సౌండ్ ఆఫ్ మెటల్:తన వినికిడి శక్తిని కోల్పోవడం ప్రారంభించిన ఓ హెవీ మెటల్ డ్రమ్మర్ జీవితంపై దృష్టి సారించిన చిత్రమిది. ఈ సినిమా ఆద్యంతం భావోద్వేగాలతో, వాస్తవికంగా సాగుతుంది. ఈ సినిమాలో కధానాయకుడు ఫీలయ్యే అనేక భావాలను మనమూ ఫీలయ్యేంతగా మనల్ని లీనం చేసుకుంటుంది. రిజ్ అహ్మద్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. ద ట్రయల్ ఆఫ్ ద చికాగో: కోర్ట్ రూమ్‌లో సంభవించే ఆసక్తికర అంశాలను అద్భుతంగా చిత్రీకరించిన వైనం ఆకట్టుకుంటుంది. కొన్ని దశాబ్ధాల క్రితం 1969లో నిజంగా చికాగోలో జరిగిన ఓ ఉదంతం ఆధారంగా తీసిన చిత్రమిది. చదవండి: ఎంత వరకు సమంజసం? మీరే ఆలోచించండి: చిరంజీవి -
ఆస్కార్‌లో భారతీయం..
అకాడమీ అవార్డ్స్... గెలువడం ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగ ప్రముఖులకు ఓ కల. అకాడమీ అవార్డు సాధించారంటే చాలు తమ జీవితాశయం నెరవేరినట్లే సంబరపడిపోతారు. భారతీయ సినీ ప్రముఖులూ అందుకు మినహాయింపేమీ కాదు. ఆ క్రమంలోనే అద్భుతమైన చిత్రాలు తీస్తూనే ఉన్నారు. వాటిల్లో కొన్ని ఆస్కార్ దాకా వెళ్తున్నాయి కూడా. నాటి మదర్ ఇండియా మొదలు నేడు వైట్ టైగర్ దాకా ఆస్కార్‌లో భారతీయ చిత్రాలు పోటీపడుతూనే ఉన్నాయి. మన దేశం తరపున ఏ చిత్రం నామినేట్ అయినా భారత్‌తో ఆస్కార్ అనుబంధం మీద చర్చ సహజమే. 93వ అకాడమీ అవార్డ్స్ లైవ్ స్టార్ మూవీస్, స్టార్ వరల్డ్ ఛానెల్స్‌లో ఏప్రిల్ 26న ఉదయం 5.30 గంటలకు ప్రసారం కానుండగా, ఈ కార్యక్రమాన్ని అదే రోజు రాత్రి 8.30 గంటలకు పునః ప్రసారం అవుతుంది. ఈ నేపధ్యంలో మన సినిమాలతో ఆస్కార్ కున్న అనుబంధం ఒకసారి పరిశీలిస్తే... ఆస్కార్‌లో భారతీయ చిత్ర ప్రవేశం 1958లో జరిగింది. మదర్ ఇండియా చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంలో పోటీపడింది. అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో ఇటాలియన్ చిత్రం నైట్స్ ఆఫ్ కబ్రినాకు అవార్డును కోల్పోయింది ఆస్కార్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయులు అనగానే చాలామంది రక రకాలుగా చెప్తారు కానీ, 1983లో ఓ భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్‌కు ఆస్కార్ లభించిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. గాంధీ చిత్రానికి గానూ భాను అథైయా గోల్డెన్ ట్రోఫీ అందుకున్నారు. ఇదే చిత్రానికి రవిశంకర్ సైతం నామినేట్ చేయబడ్డారు. మన దేశానికి ఆస్కార్‌లో లభించిన అరుదైన గౌరవం మాత్రం సత్యజిత్‌రేకు హానరరీ అకాడమీ అవార్డును 1992లో అందించడమే. ఇప్పటిదాకా ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయుడు సత్యజిత్‌రే మాత్రమే. భారతీయ కథతో రూపుదిద్దుకున్న బ్రిటీష్ చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ 2008లో ఏకంగా 8 అవార్డులు అందుకుంది. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ స్కోర్ పేరిట రెండు అవార్డులు అందుకున్నారు. ఒకటి కన్నా ఎక్కువ అవార్డులు అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్. ఇండియా నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగాలలో నామినేషన్లు పొందిన చిత్రాలుగా మదర్ ఇండియా, లగాన్, సలామ్ బాంబే మాత్రమే నిలిచాయి. ఈ సంవత్సరం వైట్ టైగర్ చిత్రానికి బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్ లభించింది. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లు దీనిలో నటించారు. మరి ఈ చిత్రం ఈ ఏడాది ఆస్కార్‌లో ఏం సాధించనుందో...చూడాల్సి ఉంది. -
'ప్రియాంక దంపతులకు ఆ అర్హత లేదేమో!'
సెలబ్రిటీలకు అప్పుడప్పుడూ మనసు నొప్పించే విమర్శలు ఎదురవుతుంటాయి. అయితే వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొంటారన్నది ముఖ్యం. కొందరు సుతి మెత్తగా ఇచ్చే సమాధానాలు చెంప చెళ్లుమనేట్లు ఉంటాయి. ఓ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్‌కి ప్రియాంకా చోప్రా దాదాపు అలాంటి సమాధానమే ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. సోమవారం 93వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ జాబితాను తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ప్రియాంకా చోప్రా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ ‘‘ఈ ఇద్దరంటే (ప్రియాంక, నిక్) నాకు గౌరవభావం లేదనను. కానీ సినిమా రంగానికి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఆస్కార్ నామినేషన్లను ప్రకటించేంత అర్హత ఇస్తుందని నేననుకోవడం లేదు’’ అన్నారు. ‘‘ఒకరి అర్హతను నిర్ణయించేవి ఏంటి? అనే మీ ఆలోచనను స్వాగతిస్తున్నాను. అయితే 60కి పైగా నేను చేసిన చిత్రాల జాబితాను మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను’’ అని ఆ జర్నలిస్ట్ ట్వీట్‌కి గట్టిగానే సమాధానం ఇచ్చారు ప్రియాంక. ఆమె ట్వీట్ చూసి, ‘చాలా కూల్‌గా భలే చెప్పావ్ ప్రియాంక’ అంటూ పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ వెళ్లి, తనను నిరూపించుకున్నారు ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. చదవండి: సితూ పాప నువ్వు అప్పుడే ఎదగకు ప్లీజ్.. -
ఇద్దరు వనితల ఆస్కార్ చరిత్ర
ఆస్కార్ చరిత్రలోనే తొలిసారి ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఒకే ఏడాది ఇద్దరు మహిళలు నామినేట్ అయ్యారు! ‘నో మాడ్ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’.. అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన క్లోయీ జావో, ఎమరాల్డ్ ఫెనెల్.. ఇద్దరూ నలభై ఏళ్ల లోపు వారే. ఈ మార్చి 31 న క్లోయీ ఝావో జరుపుకునే తన 39వ జన్మదినం తప్పనిసరిగా ప్రత్యేకమైనదై ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు ఈసారి ఆమెకు ఆస్కార్ ఆకాంక్షలు తెలిపేవారూ ఉంటారు. ఆమె దర్శకత్వం వహించిన అమెరికన్ డ్రామా ఫిల్మ్ ‘నోమాడ్‌ల్యాండ్’ కు ఆరు నామినేషన్లు దక్కడం ఆ ఆకాంక్షలకు ఒక కారణం అయితే, వాటిల్లో సగానికి సగం.. ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ ఆడాప్టెడ్ స్క్రీన్‌ప్లే’, ‘బెస్ట్ ఫిల్మిం ఎడిటింగ్’ కేటగిరీలలో క్లోయీ ఝావో నామినేషన్ పొందడం మరొక విశేషం. ఇప్పటివరకు ఆమె దర్శకత్వం వహించింది మూడంటే మూడే సినిమాలు అయినా.. వచ్చిన అవార్డులు, పొందిన నామినేషన్లు ముప్పైమూడు! తొలి సినిమా ‘సాంగ్స్ మై బ్రదర్స్ టాట్ మి’ (2015), రెండో సినిమా ‘ది రైడర్’ (2017), మూడోది ఇప్పుడీ ‘నోమాడ్‌ల్యాండ్’ (2020). ఝావో చైనా మహిళ. జడను ముందుకు వేసుకుంటే సుమారుగా మన ఇండియన్లా ఉంటారు. ఉండటం అమెరికాలో. బి.ఎ. చదివిందీ, ఎం.ఎఫ్.ఎ. చేసిందీ అమెరికాలోనే. సినిమాలు తియ్యాలన్న అభిలాష తల్లిదండ్రులనుంచేమీ ఆమెకు రాలేదు. తండ్రి బీజింగ్‌లోని ఒక స్టీల్ ప్లాంట్‌లో మేనేజర్. తల్లి హాస్పిటల్ లో వర్కర్. ఝావో కొంచెం దూకుడు. స్కూల్లో సోమరి. తనే ఆ మాట చెప్పుకుంటారు. క్లాస్ రూమ్‌లో జపాన్ వాళ్ల ‘మాంగా’ గ్రాఫిక్ నవలల్ని బుక్స్ మధ్యలో పెట్టుకుని లీనమైపోయి చదివారు. అవి బుర్రలో పని చేస్తున్నప్పుడు తనూ కొన్ని కాల్పనిక పాత్రల్ని సృష్టించారు. ఇలాంటి వాళ్లకు సినిమాలు నచ్చుతాయి. ఝావో తన టీనేజ్‌లో విపరీతంగా సినిమాలు చూశారు. కూతురు మాట వినడం లేదని, తనకు అస్సలు ఇంగ్లిష్ తెలియకపోయినా పేరెంట్స్ ఆమెను లండన్ తీసుకెళ్లి అక్కడో బోర్డింగ్ స్కూల్లో చేర్చి వచ్చారు. తల్లిదండ్రుల ఇష్టం లండన్. తన ఇష్టం లాస్ ఏంజెలిస్. హై స్కూల్ చదువు కోసం లాస్ ఏంజెలిస్ వెళ్లిపోయి, అక్కడే ఉండిపోయారు ఝావో. మొదటి సినిమా తీసేటప్పటికి ఆమె వయసు 33. ప్రస్తుతానికి ఆమె జీవిత భాగస్వామి సినిమాలే. సినిమాలు చూడటం, సినిమాలు తీయడం. సినిమాకు ఎన్ని ఫ్రేములైతే ఉంటాయో, రోజుకు అన్ని గంటలపాటు సినిమాలకు పని చెయ్యడం! క్లోయీ ఝావోకు నామినేషన్ దక్కడంతో ఆస్కార్ చరిత్రలో ‘బెస్ట్ ౖyð రెక్టర్’గా నామినేట్ అయిన తొలి ఆసియా మహిళగా గుర్తింపు పొందారు. ∙∙ ఎమరాల్డ్ ఫెనెల్.. ఝావో కన్నా నాలుగేళ్లు చిన్న. బొద్దుగా, ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్‌లా ఉంటారు. ఎప్పుడూ పుస్తకాలు చదువుతుంటారు. బ్రిటన్ మహిళ. నటి, రచయిత్రి, దర్శకురాలు. ఝావో ‘నోమాడ్‌ల్యాండ్’తోపాటు ఫెనెల్ దర్శకత్వం వహించిన ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ చిత్రం కూడా ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ యాక్ట్రెస్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’, ‘బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్’ కేటగిరీలకు కూడా ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ నామినేట్ అయింది. ఝావోలా ఫెనెల్ కూడా మూడు నామినేషన్లు పొందారు. బెస్ట్ డైరెక్టర్‌తోపాటు.. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ పే’్ల కేటగిరీల్లో ఆమెకు చోటు లభించింది. ఫెనెల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే నామినేషన్ దక్కడం ఒక విధంగా అవార్డు రావడమే. నోమాడ్‌ల్యాండ్, ప్రామిసింగ్ యంగ్ ఉమన్ ఫెనెల్ ప్రధానంగా నటి. 2010 నుంచీ ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. లండన్‌లో పుట్టారు. ఆక్స్‌ఫర్డ్‌లో బి.ఎ. చదివారు. తర్వాత సిట్కామ్ (సిట్యువేషనల్ కామెడీ) షోలలోకి వెళ్లారు. సినిమా కథలు, స్క్రిప్టులు రాశారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ రెండు చిత్రాలు.. నోమాడ్‌ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ల కథాంశం కూడా మహిళలదే కావడం యాదృచ్చికమే. తన అరవైలలో ఉన్న మహిళ ‘గ్రేట్ రిసెషన్’ కాలంలో సర్వం కోల్పోయి వ్యాన్‌లో దేశ దిమ్మరిగా గడపడం నోమాడ్ ల్యాండ్ స్టోరీ అయితే.. జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చిన ఒక మహిళ కథ ప్రామిసింగ్ యంగ్ ఉమన్. ఈ రెండు చిత్రాలలో ఏ చిత్ర దర్శకురాలికి ఆస్కార్ వచ్చినా.. వారు ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఆస్కార్ పొందిన రెండో మహిళ అవుతారు. మొదటి మహిళ క్యాథ్రిన్ బెగెలో. 2010లో ‘హర్ట్ లాకర్’ అనే చిత్రానికి ఆమెకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. నామినేషన్‌కే 48 ఏళ్లు పట్టింది! తొంభై ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు (క్లోయీ, ఫెనెల్ లను మినహాయించి) ఐదుగురు మహిళలు మాత్రమే బెస్ట్ ౖyð రెక్టర్లుగా నామినేట్ అయ్యారు. 1976లో లీనా వెర్ట్మ్యూలర్ (సెవెన్ బ్యూటీస్), 1993లో జేన్ క్యాంపియన్ (ది పియానో), 2003లో సోఫియా కొప్పోలా (లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్), 2010లో క్యాథ్రీన్ బిగెలో (ది హర్ట్ లాకర్), 2017లో గ్రెటా గెర్విగ్ (లేడీ బర్డ్) నామినేట్ అవగా.. క్యాథ్రీన్ బిగెలోకు అవార్డు వచ్చింది. ఇక బెస్ట్ డైరెక్టర్‌గా ఒక మహిళ ఆస్కార్‌కు నామినేట్ అవడానికైతే 48 ఏళ్లు పట్టింది. ఆస్కార్ తొలి మహిళా ‘బెస్ట్ డైరెక్టర్’ క్యాథ్రీన్ బిగెలో. -
ఆస్కార్ ఫైనల్ బరిలో నిలిచిన చిత్రాలు ఇవే..
లండన్: ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్. 2020 ఏడాదికి గాను 93వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే నెల ఏప్రిల్ 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుకు పోటీపడే చిత్రాల నామినేషన్‌ను లండన్‌లో ప్రియాంక- నిక్ జోనాస్ దంపతులు 2021 ఆస్కార్ నామినేషన్ చిత్రాల జాబితాను సోమవారం ప్రకటించారు. 2018లో వచ్చిన బ్లాక్ ఫాంథర్ సినిమాతో చాడ్విక్ బోస్మాన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అతను నటించిన ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రం ప్రస్తుతం ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్ రేసులో ఉంది. కాగా, బోస్మాన్ గతేడాది క్యాన్సర్‌తో మరణించడం విషాదకరం. క్రిస్టొఫర్ నొలన్ దర్శకత్వం వహించిన టెనెట్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఉంది. ఇదిలా ఉండగా భారత్ నుంచి ఆస్కార్‌కు పోటీపడ్డ సూరారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా..!) ఆస్కార్ బరిలో నుంచి వైదొలిగింది. మరోవైపు 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ వేడుకలు కోవిడ్-19 కారణంగా రెండు నెలల పాటు వాయిదా పడ్డాయి. 2021 ఆస్కార్ నామినేషన్లు - పూర్తి జాబితా ఉత్తమ చిత్రం కేటగిరీ ది ఫాదర్ జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య మాంక్ మినారి నోమాడ్ ల్యాండ్ ప్రామిసింగ్ యంగ్ వుమన్ సౌండ్ ఆఫ్ మెటల్ ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7 ఉత్తమ దర్శకుడు కేటగిరీ థామస్ వింటర్బర్గ్, (అనదర్ రౌండ్) డేవిడ్ ఫించర్, (మాంక్) లీ ఐజాక్ చుంగ్, (మినారి) క్లోస్ జావో, (నోమాడ్లాండ్) ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) ఉత్తమ నటుడు కేటగిరీ రిజ్ అహ్మద్, (సౌండ్ ఆఫ్ మెటల్) చాడ్విక్ బోస్మాన్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఆంథోనీ హాప్కిన్స్, (ది ఫాదర్) గ్యారీ ఓల్డ్మన్, (మాంక్) స్టీవెన్ యూన్, (మినారి) ఉత్తమ నటి కేటగిరీ వియోలా డేవిస్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఆండ్రా డే, (ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే) వెనెస్సా కిర్బీ, (పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్) ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్, (నోమాడ్‌ల్యాండ్) కారీ ముల్లిగాన్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) ఉత్తమ సహాయ నటుడు కేటగిరీ సాచా బారన్ కోహెన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7) డేనియల్ కలుయా, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) లెస్లీ ఓడోమ్ జూనియర్, (వన్ నైట్ ఇన్ మయామి) పాల్ రాసి, (సౌండ్ ఆఫ్ మెటల్) లాకీత్ స్టాన్ఫీల్డ్, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) ఉత్తమ సహాయ నటి కేటగిరీ మరియా బకలోవా, (బోరాట్ సబ్సీక్వెంట్ మూవీఫిల్మ్) గ్లెన్ క్లోజ్, (హిల్‌బిల్లీ ఎలిజీ) ఒలివియా కోల్మన్, (ది ఫాదర్) అమండా సెయ్ ఫ్రిడ్, (మాంక్) యుహ్-జంగ్ యూన్, (మినారి) ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీ విల్ బెర్సన్ & షాకా కింగ్, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) లీ ఐజాక్ చుంగ్, (మినారి) ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) డారియస్ మార్డర్ & అబ్రహం మార్డర్, (సౌండ్ ఆఫ్ మెటల్) ఆరోన్ సోర్కిన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీ లవ్ అండ్ మాన్స్టర్స్ మిడ్నైట్ స్కై ములన్ ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్ టెనెట్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ ఆన్వర్డ్ ఓవర్ ద మూన్ ఎ షాన్ ది షీప్ మూవీ: ఫార్మగెడాన్ సౌల్ వోల్ఫ్ వాకర్స్ (చదవండి: ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్.. నిరాశలో ఫ్యాన్స్) -
ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్..
తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా నటించిన చిత్రం ‘సూరారై పోట్రు’(తెలుగులో ఆకాశమే నీ హద్దురా). సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల ఆస్కార్ అవార్డ్ పోటీలో నామినేషన్ సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 366 చిత్రాలను నిర్వాహకులు ఎంపిక చేయగా.. అందులో మన దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ బరిలో నుంచి వైదొలిగింది. అకాడమీ స్క్రీనింగ్‌కు ఎంపిక అయిన సూరారై పోట్రు ఆ తర్వాతి రౌండ్స్‌కు నామినేట్ అవ్వలేకపోయింది. దీంతో మార్చి 15న ఆస్కార్ నుంచి అధికారికంగా తప్పకుంది. ఇదిలా ఉండగా 93వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం 2021 ఏప్రిల్ 25న జరగనుంది. కాగా ఉత్తమ చిత్రం విభాగంలో భారత్ నుంచి ఎంపికైన చిత్రాల్లో సూరారై పోట్రు ఒక్కటే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ ఒరిజనల్ స్కోర్‌తోపాటు ఇతర పలు విభాగాల్లో ఎంపికైంది. తమిళ సినిమాకు ఇంతటి అరుదైన ఘనత లభించడంతో ఆనందంలో మునిగిపోయిన అభిమానులు ప్రస్తుతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా తమిళంలో సూరారై పోట్రుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో వచ్చిన విషయం తెలిసిందే. తక్కువ ధరకే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన ఏయిర్ డెక్కన్ సీఈఓ గోపినాథ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిఖ్య, 2డీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. చదవండి: హీరో సూర్య కొత్త ప్రయాణం బర్త్‌డే పార్టీలో అల్లు అర్జున్ హంగామా -
ఆస్కార్ బరిలో సూర్య సినిమా.. భారత్ నుంచి ఆ ఒక్కటే
తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటించిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రానికి అద్భుత ఘనత లభించింది. మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి ఎంటర్ అయ్యింది. 93వ ఆస్కార్ పోటీల్లో భాగంగా.. ఉత్తమ చిత్రం విభాగంలో పోటీకి సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం ట్విటర్లో పేర్కొంది. మొత్తం 366 చిత్రాలను నిర్వాహకులు ఎంపిక చేయగా.. అందులో మన దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే నిలిచింది. దీనికి సంబంధించిన లిస్ట్‌ను ఆస్కార్ అవకాడమీ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో మార్చి 5 నుంచి 10 వరకు ఈ మూవీకి ఓటింగ్ జరగనుంది. తుది జాబితాలోని విజేత చిత్రాలను మార్చి 15న ప్రకటించనున్నారు. అయితే ఆ మధ్యనే సూరారై పొట్రు ఆస్కార్ అవార్డు బరిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. జనరల్ కేటగిరీలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు/దర్శకురాలు, ఉత్తమ ఒరిజనల్ స్కోర్‌తో కేటగిరిల్లో ఈ చిత్రం పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా తమిళంలో సూరారై పోట్రుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురాగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా తక్కువ ధరకే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన ఏయిర్ డెక్కన్ సీఈఓ గోపినాథ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిఖ్య, 2డీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. We are elated and thrilled!!! #SooraraiPottru joins OSCARS!!!https://t.co/JEDGgDWdZ9#SooraraiPottru🔥@Suriya_offl #SudhaKongara @rajsekarpandian @gvprakash @nikethbommi @Aparnabala2 @editorsuriya @jacki_art @deepakbhojraj @thanga18 @guneetm — 2D Entertainment (@2D_ENTPVTLTD) February 26, 2021 ఇదిలా ఉంటే ఆస్కార్ నామినేషన్‌కి పంపిన `జల్లికట్టు` చిత్రం నామినేషన్స్ కి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం సూర్య తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. సూర్య 40గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల సూర్య కోవిడ్ నుంచి కోలుకోగా త్వరలోనే షూటింగ్లో జాయిన్ కానున్నాడు. చదవండి: చెక్’ మూవీ రివ్యూ అదీ ప్రభాస్ రేంజ్: వంద కోట్ల రెమ్యునరేషన్! -
మూవీ మాఫియా ఇళ్లల్లో దాక్కుంది
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ రూటే సెపరేటు. మనసులో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తుంటారు. ఈ కారణంగా ఆమెను అభినందించేవాళ్లూ ఉన్నారు.. విమర్శించేవాళ్లు కూడా ఉన్నారు. ఒక్కోసారి ఆమె మాటలు, పోస్టులు వివాదాలకు దారి తీస్తూ తీవ్ర దుమారం సృష్టిస్తుంటాయి. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై, అక్కడి సినీ ప్రముఖులపై ఘాటైన వ్యాఖ్యలతో మండిపడ్డారామె. 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి ‘ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో భారతదేశం తరఫున మలయాళ సినిమా ‘జల్లికట్టు’ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా టీమ్‌ను ప్రశంసిస్తూ కంగన ఓ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖులను కూడా విమర్శించారు. ‘‘అందరిపై అధికారం చెలాయించాలని చూసే బుల్లీడవుడ్ (బుల్లీ అంటే ర్యాగింగ్ అనొచ్చు... బాలీవుడ్ ‘బుల్లీడవుడ్’ అని కంగనా ఉద్దేశం) గ్యాంగ్‌కు సరైన ఫలితాలు వచ్చాయి. భారతీయ చిత్రపరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు చెందినది మాత్రమే కాదు.. మూవీ మాఫియా గ్యాంగ్ ఇళ్లలోనే దాక్కుని, జ్యూరీని తన పనిని తాను చేసేలా చేసింది. ‘జల్లికట్టు’ చిత్రబృందానికి అభినందనలు’’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
ఆస్కార్ అవార్డ్‌ను దున్నుతుందా?
పోటీ మొదలయింది. ఆస్కార్ పరుగులోకి ఒక్కొక్కటిగా సినిమాలను ప్రకటిస్తున్నాయి ఆయా దేశాలు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న 93వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ను ఎంట్రీగా పంపుతున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. లీజో జోస్ పెలిసెరీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’. ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న దున్నపోతు చుట్టూ తిరిగే కథ ఇది. ఆ ఊరి మొత్తాన్ని ఆ దున్న ఎలా ఇబ్బంది పెట్టింది, ఈ క్రమంలో అందర్నీ ఎలా మార్చేసింది? అన్నది కథాంశం. ఈ సినిమాకు కెమెరా, ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్.. ఇలా అన్ని డిపార్ట్మెంట్లకు మంచి పేరు లభించింది. 2019, అక్టోబర్ 4న ‘జల్లికట్లు’ విడుదలైనప్పటి నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడి ట్రోఫీను అందుకున్నారు లిజో. ప్రతీ ఏడాది మన దేశం నుంచి పంపే సినిమాయే మన రేసు గుర్రం. ఆ గుర్రం గెలుపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. ఈ ఏడాది మన రేసు గుర్రం, ఈ దున్న. ఆస్కార్ జ్యూరీ ఎంపిక చేసే తుది జాబితాలో మన సినిమా ఉండాలని, ఆస్కార్ తీసుకురావాలని అందరం చీర్ చేద్దాం. హిప్ హిప్ బర్రె! ఎంట్రీగా పోటీపడ్డ సినిమాలు ఈ ఏడాది మన దేశం తరఫు నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్లేందుకు పలు సినిమాలు ఇవే అని ఓ జాబితా బయటకు వచ్చింది. ఆ జాబితాలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, హన్సల్ మెహతా ‘చాలెంజ్’, ‘ది డిసైపుల్’, ‘మూతాన్’, ‘కామ్యాబ్’, ‘షికారా’, ‘బిట్టర్ స్వీట్’ వంటి సినిమాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే ‘జల్లికట్టు’ మొత్తం దున్నపోతు చుట్టూ తిరిగినా, ఈ సినిమాలో నిజమైన దున్నను ఉపయోగించలేదు. యానిమేట్రానిక్స్ ద్వారా దున్న బొమ్మలను తయారు చేశారు. సుమారు మూడు నాలుగు దున్నలను తయారు చేశారు ఆర్ట్ డైరెక్టర్ గోకుల్ దాస్. ఒక్కో దున్నను తయారు చేయడానికి సుమారు 20 లక్షలు అయిందట. -
ఆస్కార్ బరిలోకి ‘జల్లికట్టు’
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘జల్లికట్టు’కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి భారత్ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికయింది. ఉత్తమ అంతర్జాతీయ భాషా చిత్రాల కెటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. మొత్తం 26 చిత్రాలకు గాను ఈ సినిమా ఆస్కార్ బరిలోకి ఎంపిక కావడం విశేషం. 14 మంది సభ్యులతో కూడిన జ్యురీ జల్లికట్టు మూవీని సెలెక్ట్ చేసినట్టు రాహుల్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్, టెక్నీకల్, హ్యూమన్ యాస్పెక్ట్స్ అన్నీ దీన్ని ఇందుకు అర్హమైనవిగా నిలబెట్టాయని ఆయన చెప్పారు. మనుషులు, జంతువుల మధ్య బావోద్వేగ పూరిత సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించారని, అందకే ఈ సినిమాను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జల్లికట్టు కథేంటి లిజో జోస్ పెలిసెరి దర్శకత్వంలో ఆంటోని వర్గీస్, చెంబన్ వినోద్ జోసే, సబుమోన్ అబ్దుసామద్ శాంతి బాల చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో.. ఓ కుగ్రామంలో ఓ దున్న సృష్టించిన విన్యాసాలను అద్భుతంగా చూపించారు. కేరళలోని ఓ అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలందరికి గొడ్డు మాంసం అంటే ఇష్టం. గొడ్డుమాంసం లేనిదే వారికి ముద్ద దిగదు. ఆంటోనీ అనే వ్యక్తి ఉరందరికి బీఫ్ సరఫరా చేస్తుంటాడు. అతను తెచ్చి అమ్మె అడవి దున్న మాంసం అంటే అక్కడి వాళ్లందరికి పిచ్చి. అలా ఓరోజు.. అడవి దున్న ని కబేళాకి తరలించి, దాని మాంసం విక్రయిద్దాం అనుకునేలోపు.. అది తప్పించుకుంటుంది. అడవిని ధ్వంసం చేస్తూ, మనుషుల్ని గాయపరుస్తూ.. దాగుడుమూతలు ఆడుతుంది. దాన్ని పట్టుకునేందుకు ఊరంతా ఏకమై తిరుగుతారు. ఎలాగైనా దాన్ని చంపి మాంసం తలా ఇంత పంచుకోవాలనుకుంటారు. మరి ఆ దున్న వారికి దొరికిందా? ఈలోపు ఏం జరిగింది? ఎంత నష్టపరచింది? అన్నదే కథ. -
ఆస్కార్... కొత్త రూల్స్
96వ ఆస్కార్ అవార్డు నుంచి ఉత్తమ చిత్రానికి సంబంధించిన ఎంపిక విధానం, అందులోని పలు రూల్స్‌ను మారుస్తున్నట్టు ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్స్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్. 2024లో 96వ ఆస్కార్ వేడుక జరగనుంది. అప్పటినుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. అకాడమీ ఏర్పాటు చేసిన కొత్త నియమ, నిబంధనలు పాటించిన చిత్రాలను మాత్రమే ఉత్తమ చిత్రానికి ఎంపిక చేయాలనుకుంటోంది కమిటీ. ఇక నిబంధనల విషయానికి వస్తే...ఆస్కార్‌కు ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వాలంటే... ఓ సినిమాలోని ప్రధాన పాత్ర లేదా సహాయ పాత్ర తప్పకుండా భిన్న వర్గాలకు సంబంధించినది అయి ఉండాలి. కథలోని ఐడియా తక్కువ ప్రాతినిధ్యం వహించిన వర్గానికి సంబంధించింది అయి ఉండాలి. అంతే కాదు చిత్రబృందంలోనూ వివిధ వర్గాలకు సంబంధించినవాళ్లను భాగం చేయాలి. ఇలా పలు నియమాలు పెట్టింది ఆస్కార్. ఈ నియమాలన్నింటినీ పాటిస్తేనే ఉత్తమ చిత్రం విభాగానికి సినిమా ఎంపికవుతుంది. అన్ని వర్గ, వర్ణ, లింగ బేధాలను సమానంగా ఉంచేందుకు, సినిమాల్లో భిన్నతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుందట కమిటీ. ఈ నియామాలను కేవలం సినిమాలో మాత్రమే కాదు, సినిమా చేసే టీమ్, స్టూడియో అన్నింట్లోనూ పాటించాలని పేర్కొంది. -
ఆలియా..హృతిక్లకు అరుదైన గౌరవం
‘‘బంధువులు ఉన్నవారికి బాలీవుడ్లో రెడ్ కార్పెట్ దొరుకుతుంది’’ అని ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, నిరూపించుకున్న హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సీ, దర్శకుడు అభినవ్ కశ్యప్ వంటి వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్ కూడా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తుందని దర్శఖ–నిర్మాత–రచయిత హన్సల్ మెహతా చేసిన ఓ ట్వీట్ చెబుతోంది. ‘నెపోటిస్టిక్ అకాడమీ’ అని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. దీనికి కారణం ఏంటంటే.. ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ భారతీయ సినిమాకి సంబంధించిన కొందరు ప్రముఖులకు ఆహ్వానం పంపింది. ప్రతి ఏడాదీ అవార్డుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొందరు సినీ ప్రముఖులను ఆహ్వానిస్తుంది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్. ఈ ఏడాది మొత్తం 819 మందిని ఆహ్వానించింది. భారతీయ సినిమా నుంచి హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ ఆలియా భట్, డిజైనర్ నీతూ లుల్లా, దర్శకురాలు నందినీ శ్రీకెంట్, దర్శకురాలు నిషితా జైన్ తదితరులను ఆహ్వానించారు. బాలీవుడ్లో మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టే హృతిక్, ఆలియా వంటివాళ్లను ఆహ్వానించారని అర్థం వచ్చేట్లుగా హన్సల్ మెహతా ‘నెపోటిస్టిక్ అకాడమీ’ అని ట్వీట్ చేశారనే వార్తలు మొదలయ్యాయి. ‘‘నేను చేసిన ట్వీట్‌కి అర్థం తెలియకుండా నా ట్వీట్ గురించి మాట్లాడొద్దు’’ అని మరో ట్వీట్ చేశారు హన్సల్. తాను చేసిన ‘నెపోటిస్టిక్ అకాడమీ’ ట్వీట్‌కి మాత్రం ఆయన అర్థం చెప్పలేదు. -
ఆ అవార్డులు కూడా వాయిదా!
లాస్ఏంజల్స్: కరోనా మహహమ్మారి కారణంగా ఈ ఏడాది జరగాల్సిన అన్ని అవార్డు కార్యక్రమాలను వాయిదా వేస్తూ వస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులను మొదటిసారి వాయిదా వేయడంతో పాటు అకాడమీ అవార్డులను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రముఖ హాలీవుడ్ అవార్డుల కార్యక్రమం ‘గోల్డెన్ గ్లోబ్’ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆస్కార్ అవార్డులను వాయిదా వేసిన వారం తరువాత ఈ విషయాన్ని ప్రకటించారు. (కరోనా: తొలిసారి ఆస్కార్ వాయిదా) ‘టీనా ఫే, యామీ పోలర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 28, 2021 ఆదివారం నాడు నిర్వహించనున్నాం. అవార్డు రివైజ్డ్ నామినేషన్, ఓటింగ్ పిరియడ్, అర్హతలకు సంబంధించిన తేదీలను తరువాత ప్రకటిస్తాం’ అని అవార్డు సంస్థకు చెందిన ప్రతినిధులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం 93వ అకాడమీ అవార్డులు జరగాల్సిన రోజున 78 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం డిసెంబర్లో జరగనుండగా రెండు నెలలు వాయిదా పడి ఫిబ్రవరిలో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ఆస్కార్ అవార్డులకు సూచికలుగా చూస్తారు. (కరోనా: ఆస్కార్ కొత్త నియమాలు) -
కరోనా: తొలిసారి ఆస్కార్ వాయిదా
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం అనేది ప్రతి నటుడి కల. కనీసం అవార్డు రాకపోయినా ఆ కార్యక్రమానికి వెళ్లి వస్తే చాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి ఆస్కార్ పండగకు కరోనా సెగ తగిలింది. ఆస్కార్ చరిత్రలోనే తొలిసారిగా రెండు నెలలపాటు వాయిదా పడింది. కాగా ఫిబ్రవరి 28న 93వ ఆస్కార్ వేడుకలను నిర్వహించాలని అవార్డు కమిటీ ఇదివరకే నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆలోచన విరమించుకోక తప్పలేదు. (మార్పులకు ఆస్కారం) కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల చివరిదశలో ఉన్న ఎన్నో సినిమాల షూటింగ్‌లు ఆగిపోగా, మరెన్నో చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అవార్డుల కమిటీ "ద అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్" పురస్కార వేడుకను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న పురస్కారాల ప్రధానం ఉంటుందని ప్రకటించింది. ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడే చిత్రాల అర్హత తేదీని సైతం ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. అనంతరం మార్చి 15న నామినేషన్లు వెల్లడిస్తామని తెలిపింది. (వాయిదాకి ఆస్కారం) -
వాయిదాకి ఆస్కారం
ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా పండగ ఆస్కార్ వచ్చే ఏడాది జరిగేలా లేదని టాక్ వినిపిస్తోంది. కరోనా ప్రభావం వల్లే ఈ వాయిదా అట. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో లేదా మార్చి మొదటివారంలో ఆస్కార్ అవార్డ్స్ జరుగుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న 93వ ఆస్కార్ వేడుకలను నిర్వహించాలని ఆల్రెడీ అవార్డు కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆస్కార్ అనుకున్న తేదీకి జరగకపోవచ్చని తెలుస్తోంది. ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సినిమా నామినేట్ అవ్వాలంటే ఆ సినిమా కచ్చితంగా థియేటర్లో రిలీజ్ అయ్యుండాలి. కనీసం వారం రోజుల థియేట్రికల్ రన్ ఉంటేనే ఆ సినిమాను ఆస్కార్ కమిటీ ఎంపికకు పరిగణిస్తారు. అయితే థియేటర్లో విడుదల కాకపోయినా ఆస్కార్‌కి ఆస్కారం ఉందని ఆ మధ్య కమిటీ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదట. కచ్చితంగా థియేటర్లో విడుదలైన సినిమాలనే పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం కరోనా వల్ల థియేటర్స్ మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఇలాంటి సమయంలో ఆస్కార్‌కి చిత్రాలను ఎలా ఎంపిక ఎలా చేస్తారు? అనేది ప్రశ్న. దాంతో ఆస్కార్ అవార్డ్ వేడుక కొత్త తేదీకి మారడం ఖాయం అని హాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. -
ఆస్కార్ అవార్డులు వాయిదా!
సాక్షి, న్యూఢిల్లీ : 2021, ఫిబ్రవరి 28వ తేదీన జరగాల్సిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నాలుగు నెలల పాటు వాయిదా వేయాలనుకుంటున్నారు. ప్రాణాంతక కరోన వైరస్ మహమ్మారి కారణంగా చాలా సినిమాలు నిర్మాణ దశలోనే నిలిచిపోవడం, కొత్త సినిమాలు ఎక్కువగా విడుదలకు నోచుకోక పోవడంతో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేయాలనుకుంటున్నారు. (చదవండి : శుభశ్రీతో మాట్లాడిన మెగాస్టార్) భారతీయ కాలమానం ప్రకారం సాధారణంగా సమ్మర్లో బ్లాక్‌బస్టర్ కమర్శియల్ సినిమాలు విడుదలవుతాయి. ఆ తర్వాత అకాడమి అవార్డులను దృష్టిలో పెట్టుకొని నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రత్యేక సినిమాలు విడుదలవుతాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో సినిమాలు విడుదల కావాలంటే ఇప్పటికే సినిమా షూటింగ్‌లు ప్రారంభం కావాలి. కానీ ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కుదుపేస్తున్న నేపథ్యంలో అలా జరగలేదు. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన బ్లాక్‌బస్టర్ జేమ్స్ బాండ్ చిత్రమే నవంబర్ నెలకు వాయిదా పడింది. ఎక్కువ సినిమాల నామినేషన్లకు అవకాశం ఇవ్వడం కోసం ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేయాలనే ప్రతిపాదనపై నిర్వాహకులు గత వారం, పది రోజులుగా చర్చలు జరపుతున్నారు. తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_741246272.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మార్పులకు ఆస్కారం
కోవిడ్–19 (కరోనా వైరస్) ప్రభావం వల్ల రానున్న 93వ ఆస్కార్ నియమాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఆ మార్పులు 93వ ఆస్కార్ వేడుక వరకే. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినిమాల రిలీజులు ఆగిన విషయం తెలిసిందే. ఇందువల్ల కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యాయి. ఇలా విడుదలైన వాటిలో ప్రేక్షకులు అమితంగా మెచ్చిన సినిమాలు ఉండొచ్చని, ఆయా చిత్రబృందాల కష్టానికి నిజమైన ప్రతిఫలం దక్కాలనే ఉద్దేశంతో ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డ్’ ఆస్కార్ అవార్డుల నియమాల్లో మార్పులు చేసింది. దీంతో డైరెక్ట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ అండ్ వీఓడీ (వీడియో ఆన్ డిమాండ్) ద్వారా విడుదలైన సినిమాలు కూడా ఈసారి ఆస్కార్ అవార్డ్స్ పోటీ బరిలో ఉండొచ్చు. అయితే భవిష్యత్తులో ఈ సినిమాలు కచ్చితంగా థియేట్రికల్ రిలీజ్‌ను ప్లాన్ చేసుకుని ఉండాలనే షరతు పెట్టారు. అలాగే సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఎడిటింగ్ విభాగాలను కలిపి ఒకే అవార్డు విభాగం కింద పరిగణించనున్నట్లు ఆస్కార్ అవార్డ్ కమిటీ వెల్లడించింది. ‘‘సినిమాను థియేటర్లో చూడడాన్ని మించిన అనుభూతి లేదు. కానీ కోవిడ్ 19 వైరస్ వల్ల ఆస్కార్ అవార్డు అర్హత నియమాల్లో తాత్కాలిక మార్పులు చేయక తప్పలేదు. ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయితే పాత రూల్సే వర్తిసాయి’’ అని అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 93వ ఆస్కార్ వేడుక 2021 ఫిబ్రవరి 28న జరగనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఎడిటింగ్ విభాగాలను కలిపి ఒకే అవార్డుగా పరిగణించాలనే నిర్ణయం పట్ల భారతీయ సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్, సౌండ్ మిక్సర్ రసూల్ పూకుట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని అకాడమీ పునఃసమీక్షించుకోవాలని అభిప్రాయపడ్డారు రసూల్. 2008లో వచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఇయాన్, రిచర్డ్‌లతో కలిసి రసూల్ ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. -
‘పారాసైట్’ విజయ్ మూవీ కాపీనా..!
పారసైట్.. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్లో ప్రస్తుతం ఈ కొరియన్ సినిమా గురించే చర్చ జరుగుతోంది. కారణం.. తొలిసారి ఓ కొరియన్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలవడం. ఆస్కార్ అవార్డుల్లో ఓ దక్షిణ కొరియా సినిమా ఉత్తమ విదేశీచిత్రం కేటగిరీలో కూడా పురస్కారం అందుకున్న చరిత్ర లేకపోగా.. ఈ చిత్రం ఏకంగా ఓవరాల్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్‌ప్లైతో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ పిల్మ్విభాగాల్లో కూడా అస్కార్ అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా దానికి ఈ అవార్డులు రావడంలో అతిశయోక్తి లేదంటారు. అయితే ఆస్కార్లు తెచ్చుకున్న ఈ మూవీ కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ఓ చిత్రానికి కాపీ అంటున్నారు కొందరు నెటిజన్లు. విజయ్ ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందించిన 'మిన్సార కన్నా' సినిమాతో 'పారసైట్'కు పోలికలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ‘మిన్సార కన్నా’కు, 'పారసైట్ ' కు చాలా సారూప్యతలు ఉన్నాయని .. బహుశా సౌత్ కొరియన్ డైరెక్టర్ ఈ సినిమా చూసి స్ఫూర్తి పొంది .. ఆ కథనే కొంచెం మార్చి, కొన్ని మలుపులు జోడించి 'పారసైట్ ' తీసి ఉండొచ్చని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బిలియనీర్ అయిన హీరో తన ప్రేమ కోసం హీరోయిన్ ఇంటిలో పనివాడుగా చేరుతాడు. అంతేకాదు తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి ఆ ఇంట్లో పనివాళ్లుగా పెడతాడు. చివరకు తన ప్రేమను అతడు ఎలా గెలిపించుకున్నాడు అనే కథాంశంతో ‘మిన్సార కన్నా’తెరకెక్కింది. పారసైట్ కథను మిన్సార కన్నా నుంచి తీసుకున్నారని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ‘పారసైట్’, ‘షాప్ లిఫ్టర్’ అనే చిత్రంను కూడా పోలి ఉందని మరికొంతమంది తమ కామెంట్లు వినిపిస్తున్నారు. ‘పారసైట్’ స్టోరీ ఏంటంటే.. ఓ ధనిక కుటుంబాన్ని ఓ పేద కుటుంబం తెలివిగా బోల్తా కొట్టించి వాళ్ల ఇంట్లో పనిలోకి ప్రవేశిస్తుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులన్న విషయం యజమానుల దగ్గర దాచిపెడతారు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాల్లో ఉన్న వారిని మోసగించి, ఆ ఇంటి నుంచి వెళ్లగొడతారు. యజమాని కుటుంబం విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడి సౌకర్యాలను ఉపయోగించుకుంటూ గడుపుతుంటారు. అక్కడ ఉద్యోగాలు కోల్పోయినవారికి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసిపోతుంది. ఈలోపే విహారయాత్రకు వెళ్లిన యజమానులు తిరిగి వస్తున్నారనే వార్త ఆ కుటుంబీకుల చెవిన పడుతుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారనియజమానికి తెలిస్తే.. వాళ్ల ఉద్యోగాల పోతాయన్న భయంతో వారేం చేశారు? అన్నదే సినిమా ఇతివృత్తం. పేద, ధనిక అంతరాల వలన సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయో పారాసైట్ అనే చిత్రంద్వారా దర్శకుడు బాంగ్ జోన్-హో చూపించారు. @khushsundar Today parasite movie got 4 oscar awards but after watching the movie I came to know the plot of the story which was taken from Minsara kanna. In minsara kanna all the family was employed for love help& the same here parasite all the family were employed for survival. — rajeshkannan (@rajesh7) February 10, 2020 So many thoughts running the head.. just finished watching #Parasite..Got me thinking about another movie I saw few months back - #Shoplifters... Both very good movies, similar yet different.. #aarootales — Aarti 🐾 (@talesfromaaroo) February 9, 2020 Watched korean movie #parasite lately & realized that the movie is inspired by @actorvijay 's tamil movie #minsarakanna directed by k.s.ravikumar.Parasite is a worldwide hit,but we made such films long back.#legendksravikumar#parasiteisminsarakanna#ThalapathyVijay#Thalapathy — Andrew Rajkumar (@iamrajdrew) February 5, 2020 -
ఆస్కార్ అవార్డును సీటు కింద దాచిపెట్టాడు
-
ఆస్కార్ 2020 : కొరియోత్సవం
ప్రపంచ సినిమాల తీర్థస్థలి – ఆస్కార్ వేడుకలో– ఈసారి మన గాలి వీచింది. మన ఖండపు దేశానికి అభిషేకం జరిగింది. హాలీవుడ్ పండితులు దక్షిణ కొరియా సినిమా ‘పారసైట్’కు మరో మాట లేనట్టుగా టెంకాయ్ కొట్టి దండం పెట్టారు. నాలుగు అవార్డులు సమర్పించుకున్నారు. హాలీవుడ్ పెత్తనాన్ని కొరియన్ సినిమా ఓడించిన సందర్భం ఇది. కొరియా భాష గెలిచిన సన్నివేశం ఇది. నిజంగా ఇది ఆసియావాసుల గెలుపు. మన గెలుపు. ‘తలచినదే జరిగినదా? జరిగేదే తలచితిమా?’ అని పాడుతున్నారు ఆస్కార్ అవార్డులను తీక్షణంగా అనుసరించేవాళ్లు. అవును.. ఈ ఏడాది ఆస్కార్‌లో ఆశ్చర్యాలు పెద్దగా లేవు. అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. గెలుస్తారు అనుకున్న విజేతల పేర్లే ప్రకటించబడ్డాయి. ‘పారసైట్’ హవా ఉంటుంది అనుకున్నారు. అదే జరిగింది. ఉత్తమ నటుడిగా ఓక్విన్ ఫీనిక్స్ స్పీచ్ వినబోతున్నాం అనుకున్నారు. అలాగే అయింది. ఇలా ఆస్కార్ వేడుక జరగక ముందు జరిగిన చర్చల్లో ఊహించినవి ఊహించినట్టే ఎక్కువ శాతం జరగడం ఓ విశేషం. మరి విషయానికి వస్తే... 92వ అకాడమీ అవార్డుల వేడుక ఆదివారం సాయంత్రం లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగింది. గత ఏడాది జరిగిన 91వ ఆస్కార్ వేడుకలానే ఈసారి కూడా వ్యాఖ్యాత లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది అత్యధికంగా 11 నామినేషన్లు దక్కించుకున్న ‘జోకర్’ కేవలం రెండు అవార్డులతో సరిపెట్టుకుంది. ‘ది ఐరిష్ మేన్’, ‘1917’, ‘వన్సపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ సినిమాలు ఒక్కోటి పది నామినేషన్లు చొప్పున దక్కించుకుంటే ‘1917’ మూడు అవార్డులు, ‘వన్సపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ రెండు అవార్డులు, ‘ది ఐరిష్ మేన్’ ఒక్క అవార్డు గెలుచుకున్నాయి. ఆరు విభాగాల్లో నామినేషన్లు పొందిన ‘పారసైట్’ ఈ ఏడాది అత్యధికంగా నాలుగు అవార్డులు గెలుపొందింది. ఇంగ్లిష్‌లో తెరకెక్కించని ఒక సినిమాకు ‘ఉత్తమ చిత్రం’ అవార్డు రావడం 92 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో మొదటిసారి జరిగింది. ఆ విధంగా ‘పారసైట్’ చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. సౌత్ కొరియాకి తొలి ఆస్కార్ తీసుకెళ్లిన ఘనత కూడా ఈ సినిమాదే. ఉత్తమ సహాయనటిగా తొలిసారి ఆస్కార్ అవార్డును అందుకున్నారు లారా డెర్న్. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ‘మ్యారేజ్ స్టోరీ’ సినిమాలో కీలక పాత్ర చేశారామె. ఈ ఆస్కార్ అవార్డు ఆమెకు బర్త్‌డే గిఫ్ట్‌గా మారింది. లారా ఫిబ్రవరి 10న జన్మించారు. ఆస్కార్ వేడుక ఫిబ్రవరి 9న జరిగింది. ‘‘బర్త్‌డే వేడుకలు కొంచెం ముందస్తుగా మొదలయ్యాయి’’ అని పేర్కొన్నారు లారా తోటి నటులు. ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్ పిట్ తన తొలి ఆస్కార్ అందు కున్నారు. ఉత్తమ సినిమాటో గ్రాఫర్‌గా ‘1917’ చిత్రానికిగాను రోజర్ డీకిన్స్ అవార్డు అందుకున్నారు. ‘బ్లేడ్ రన్నర్ 2049’ (2017) చిత్రానికి ఆయన తొలి ఆస్కార్ దక్కించుకున్నారు. మళ్లీ దక్కింది ఉత్తమ నటి: రెనీజెల్ వెగర్ ఓక్విన్ ఫీనిక్స్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటారని అందరూ ఊహించినట్టే ఉత్తమ నటిగా రెనీజెల్ వెగర్ గెలుస్తారని కూడా ఊహించారు. ఆస్కార్‌కు ముందు జరిగిన ‘బాఫ్తా, గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్, ఎస్ఏజీ (స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్) ల్లో ‘జూడి’ చిత్రానికిగాను అవార్డును అందుకున్నారు రెనీజెల్ వెగర్. హాలీవుడ్ ఐకాన్ జూడి గార్లాండ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జూడి’. జూడి పాత్రను పోషించినందుకుగాను నటి రెనీజెల్ వెగర్ ఆస్కార్‌ను అందుకున్నారు. ఈ అవార్డును అందుకుంటూ తనకు స్ఫూర్తిగా నిలిచిన హీరోలందర్నీ గుర్తు చేసుకున్నారు రెనీజెల్. ‘‘జూడి గార్లాండ్ ఆస్కార్‌ను అందుకోలేకపోయారు. ఆమె వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే ఈ అవార్డు లభించిందని అనుకుంటున్నాను. మనకు స్ఫూర్తిగా నిలిచిన హీరోలే మనలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసుకురాగలరు. మనల్ని ఏకం చేయగలరు’’ అన్నారు రెనీజెల్. ఆమెకు ఇది రెండో ఆస్కార్. గతంలో ‘కోల్డ్ మౌంటేన్’ చిత్రానికి సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. సాహో బాంగ్ జూన్ హూ ఉత్తమ దర్శకుడు: బాంగ్ జూన్ హూ ఒక కల నెరవేరింది. చరిత్ర సృష్టింపబడింది. ఆస్కార్ అవార్డు కోసం కొరియా ప్రయత్నం ఫలించింది. ఆస్కార్ నుంచి ప్రశంసగా చిన్న జల్లు కోరుకుంటే జడివానే కురిపించింది. ఇటీవలే కొరియన్ సినిమా నూరేళ్ల వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఎన్నో ప్రపంచ స్థాయి సినిమాలను, ప్రపంచస్థాయి ప్రతిభను ఇంతకాలంగా ప్రదర్శిస్తూనే ఉంది. అయినప్పటికీ కొరియన్ కళామతల్లికి నైవేద్యంగా పెట్టడానికి ఆస్కార్ లేకుండాపోయింది. ఆ దేశపు దర్శకులు పార్క్ చాన్ ఊక్, జాంగ్ హూన్, కిమ్ జీ ఊన్, లీ జూ–ఇక్ ఆస్కార్ తీసుకొస్తారనుకున్నా గతంలో నిరాశే మిగిలింది. కానీ ఆ లోటుని బాంగ్ జూన్ హూ తీర్చేశారు. ప్రస్తుతం కొరియా అంతా బాంగ్ జూన్ çహూను ‘సాహో’ అని కీర్తిస్తోంది. ఆయన స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘పారసైట్’ చిత్రం ఈ ఏడాది నాలుగు ఆస్కార్లను గెలుచుకుంది. మొత్తం 6 విభాగాల్లో (ఉత్తమ చిత్రం, విదేశీ చిత్రం, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్) నామినేషన్ దక్కించుకున్న ఈ చిత్రం 4 అవార్డులు (ఉత్తమ చిత్రం, దర్శకుడు, విదేశీ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగల్లో) కైవసం చేసుకుంది. సుమారు 50 మిలియన్ల జనాభా ఉండే దేశం సౌత్ కొరియా. విస్తీర్ణంలో చూసుకుంటే చాలా చిన్నది. ఇరుకైనది. చోటు కోసమే అందరి పోటీ అంతా. నీకు మరింత చోటు కావాలంటే మరింత ధనికుడివై ఉండాలన్నది అక్కడి సిద్ధాంతం. సినిమా ఎప్పుడూ సమాజానికి అద్దమే అంటారు. అవును.. ‘పారసైట్’ కూడా అద్దమే. కొరియన్లో తయారైన అద్దం. కొరియాలో జరుగుతున్న వర్గ వివక్షను చూపెట్టిన అద్దం. ‘పారసైట్’లో కిమ్ కుటుంబం చాలా పేదది. ఆకలి తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేంత. మరోవైపు పార్క్ కుటుంబం చాలా డబ్బున్నది. అవసరమైన ప్రతీ పనికి పనివాళ్లను నియమించుకునేంత. చాలా తెలివిగా పార్క్ ఫ్యామిలీలోకి ప్రవేశిస్తారు కిమ్ కుటుంబ సభ్యులు. ఆ తర్వాత జరిగే కథాంశమే ‘పారసైట్’. రెండు భిన్న జాతులకు చెందిన జీవుల మధ్య సావాసం ఏర్పడినప్పుడు, ఒక జీవి రెండోదానికి నష్టం కలిగిస్తూ లాభం పొందుతూ జీవిస్తుంది. లాభం పొందే దాన్నే పరాన్న జీవి (పారసైట్) అంటారు. క్లుప్తంగా కథనంతా టైటిల్లోనే చెప్పారు దర్శకుడు బాంగ్ జూన్ హూ. ‘‘కొరియా పరిస్థితులను ఆధారం చేసుకుని తయారు చేసిన కథ ఇది. కానీ ప్రపంచవ్యాప్తంగా అందరూ కనెక్ట్ అవుతున్నారు. అంటే ఇది కేవలం కొరియన్ సమస్య కాదు ప్రపంచంలో అందరూ ఎదుర్కొంటున్న సమస్య’’ అంటారు బాంగ్. ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాక ‘‘ఉత్తమ విదేశీ చిత్రానికి అవార్డు అందుకున్నప్పుడే ఈసారికి మన కోటా అయిపోయిందిలే అనుకున్నాను. కానీ థ్యాంక్యూ. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, స్క్రీన్‌ప్లేకి అవార్డులు వచ్చాయి. నేను సినిమా గురించి నేర్చుకుంటున్న సమయంలో ‘మన పని ఎంత వ్యక్తిగతమైనది అయితే అంత సృజనాత్మకంగా ఉంటుంది’ అని మార్టిన్ స్కోర్సిసీ చెప్పిన మాటలు నాలో ఉండిపోయాయి. నేను మార్టిన్ సినిమాల ద్వారా చాలా నేర్చుకున్నా. గెలవడం సంగతి పక్కన పెట్టండి, ఆయనతో కలసి నామినేషన్ పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకవేళ అకాడమీ వాళ్లు అనుమతి ఇస్తే ఈ అవార్డుని ఐదు భాగాలు చేసి ఈ విభాగంలో (దర్శకులు) నామినేట్ అయిన అందరికీ వాటా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రాత్రంతా తాగుతూనే కూర్చుంటాను’’ అని ప్రసంగాన్ని ముగించారు బాంగ్. జోకర్ బన్ గయా హీరో ఉత్తమ నటుడు: ఓక్విన్ ఫీనిక్స్ ‘ప్రతిభకు పట్టాభిషేకం జరగడం ఆలస్యం అవుతుందేమో కానీ జరక్కుండా మాత్రం ఉండదు’... ఉత్తమ నటుడిగా ఓక్విన్ ఫీనిక్స్ పేరుని ప్రకటించినప్పుడు ఎంతో మంది అనుకున్న మాట ఇది. గతంలో ‘ది మాస్టర్’, ‘వాక్ ది లైన్’, ‘గ్లాడియేటర్’ చిత్రాలకుగానూ ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యారు ఓక్విన్. ఆస్కార్ తనదే అని ఆశగా ఎదురుచూశారు. నిరాశే ఎదురయింది. ఈసారి మాత్రం ఉత్తమ నటుడు ఓక్విన్ ఫీనిక్సే అని ముక్తకంఠంతో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కారణం ‘జోకర్’గా ఆయన నటన ముగ్ధుల్ని చేయడమే. ముఖానికి రంగేసుకుని కామెడీ చేసేవాడే మనందరికీ తెలిసిన జోకర్. కానీ తనలోని ట్రాజెడీని తెలియజెప్పిన చిత్రం ‘జోకర్’. కామిక్ బుక్స్‌లో బ్యాట్‌మేన్ ఎదుర్కొన్న విలన్ జోకర్. బ్యాట్‌మేన్ చిత్రాల్లో చాలా ఏళ్లుగా ఈ పాత్రను చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. అసలెవరీ జోకర్? అతని పుట్టుపూర్వోత్తరాలేంటి? అతను అలా మారడానికి (తయారవడానికి) కారణాలేంటి? అనే విషయాలను ప్రస్తావిస్తూ ‘జోకర్’ సినిమాను రూపొందించారు దర్శకుడు టాడ్ ఫిలిప్ (ఉత్తమ దర్శకుడిగా నామినేషన్ పొందారు కూడా). ‘జోకర్’ కథ విషయానికొస్తే... సందర్భంతో పనిలేకుండా పగలబడి న వ్వుతుండే విచిత్రమైన డిజార్డర్‌తో బాధపడుతుంటాడు ఆర్థర్ ఫ్లెక్ (ఓక్విన్ ఫీనిక్స్). స్టాండప్ కమేడియన్ అవ్వాలన్నది అతని ఆశ. కానీ అతను నివసిస్తున్న గోతమ్ సిటీలో అప్పటికే నిరుద్యోగం, క్రైమ్ పెరిగిపోయి ఉంటుంది. ఈ క్రమంలో తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తన మానసిక æస్థితి తనని ఎలాంటిగా మనిషిగా మార్చాయి? తను ఎంచుకున్న మార్గమేంటి? అనే కథాంశంతో ‘జోకర్’ సినిమా తెరకెక్కింది. చట్ట విరుద్ధమైన పనులు చేసేందుకు ప్రేరేపించేలా ఉందని కొద్దిపాటి కాంట్రవర్శీ కూడా ఈ సినిమాను చుట్టుకుంది. అయినప్పటికీ విపరీతమైన జనాదరణ లభించింది. ఓక్విన్ నటనకు ఆస్కార్ అతని ఇంటికొస్తుంది అనే ప్రశంసల జల్లు కురిసింది. ఈ మధ్య జరిగిన ‘బాఫ్తా’, ‘క్రి టిక్స్ ఛాయిస్ అవార్డ్స్’, ‘ఎస్ఏజీ అవార్డ్స్’, ‘గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్’ అవార్డు వేడుకల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎన్వలప్స్‌లో కూడా ఓక్విన్ ఫీనిక్స్ పేరే ఉంది. కొత్త ప్రపంచం తయారు చేద్దాం ఓక్విన్ తన ప్రసంగంలో ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న కొన్ని సీరియస్ సమస్యలను చర్చించారు. ‘‘ప్రస్తుతం మనందరం లింగ వివక్ష, వర్ణ వివక్ష, జంతు హక్కులు వంటి సమస్యలపై పోరాడుతున్నాం. ఒక జాతి (అది దేశం అయినా, వర్ణం అయినా, వర్గం అయినా సరే) మరో జాతిని కంట్రోల్ చేయొచ్చు, వాళ్లను దోచుకోవచ్చు అనే నమ్మకానికి విరుద్ధంగా పోరాడుతున్నాం. మనం చేసే ప్రతీ పనిలో ప్రేమ, కరుణ అనేవి ముఖ్య ఉద్దేశాలైతే మనందరం కలసి అందరికీ ఉపయోగపడే ఓ కొత్త ప్రపంచాన్ని తయారు చేయవచ్చు. గతంలో నేను చాలాసార్లు స్వార్థంగా ప్రవర్తించాను. కానీ ఈ హాల్లో (ఆస్కార్ థియేటర్లో వాళ్లను ఉద్దేశిస్తూ) ఉన్నవాళ్లు నాకు రెండో అవకాశం ఇచ్చారు. మనం తిరిగి పుంజుకోవడానికే ఈ రెండో అవకాశం’’ అని పేర్కొన్నారు ఫీనిక్స్. సూట్‌గా చెప్పారు అవార్డు ఫంక్షన్ జరిగేది ప్రతిభను పురస్కరించుకోవడానికే అయినా హంగూ ఆర్భాటాలను ప్రదర్శించడానికి కూడా. కాని ఓక్విన్ ఆ హంగు లేకుండా గత అవార్డు ఫంక్షన్లకు వేసుకున్న సూట్‌నే వేసుకొచ్చారు. ఏం అని అడిగితే ఎందుకూ... అనవసర ఖర్చు అని తేల్చేశారు. ఒబామాకి ఆస్కార్ బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామా నిర్మాణ సంస్థలో రూపొందిన ‘అమెరికన్ ఫ్యాక్టరీ’ ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు గెలుచుకుంది. వాళ్ల నిర్మాణ సంస్థ ‘హయ్యర్ గ్రౌండ్’ నిర్మించిన తొలి డాక్యుమెంటరీ ఇది. ‘‘ఉత్తమ కథలన్నీ చాలా తక్కువ సందర్భాల్లోనే శుభ్రంగా, పర్ఫెక్ట్గా ఉంటాయి. నిజాలన్నీ అలాంటి కథల్లోనే దాగుంటాయి’’ అని ట్వీట్ చేశారు ఒబామా. ఈ అవార్డు ఫంక్షన్‌కి ఒబామా హాజరు కాకపోవడంతో ఈ సినిమా కో డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. గ్లామర్ గౌన్లు ఆస్కార్ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అంటే.. రెడ్ కార్పెట్‌పై స్టార్స్ ‘క్యాట్‌వాక్’. డిజైనర్ గౌన్లు, నగలతో చూడ్డానికి రెండు కళ్లూ చాలవన్నట్లుగా తయారై వస్తారు. ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్న సింథియా ఎరివో తెలుపు రంగులో మెరిశారు. నగలేవీ ధరించకుండా సింపుల్‌గా వచ్చేశారామె. సిల్క్ గౌనులో నటి, గాయని స్కార్లెట్ జోహాన్సన్ అందరి కళ్లూ తనవైపు తిప్పుకున్నారు. ఆమె ధరించిన 27 క్యారెట్ల వజ్రపు చెవి దుద్దులు ఓ ఎట్రాక్షన్. లైట్ పింక్ కలర్లో తళుకులీనుతున్న బ్రీ లార్సన్ గౌన్ చూశారు కదా. çపూసలు, రాళ్లతో ఈ గౌనుని డిజైన్ చేశారు. మొత్తం 1200 గంటలు పట్టిందట. అంటే.. ఈ గౌను తయారీకి 50 రోజులు పట్టింది. ఇంకా నటి పెనిలోప్ క్రూజ్ నలుపు రంగు గౌను, నడుముకి ముత్యాల బెల్ట్‌తో, ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్న చార్లెస్ థెరాన్ నలుపు రంగు గౌనులో.. ఇలా తారలందరూ రెడ్ కార్పెట్‌పై వయ్యారంగా నడిచి వచ్చిన వేళ కాలం స్తంభించిపోతే బాగుండు అనిపించే చిలిపి ఆలోచన రానివాళ్లు ఉండరేమో. విజేతల వివరాలు ఉత్తమ చిత్రం: పారసైట్ ఉత్తమ నటుడు: ఓక్విన్ ఫీనిక్స్ (జోకర్) ఉత్తమ నటి: రెనీజెల్ వెగర్ (జూడి) ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) ఉత్తమ సహాయనటి: లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ) ఉత్తమ దర్శకుడు: బాంగ్ జూన్ çహూ (పారసైట్) ఉత్తమ సంగీతం: హిల్డర్ (జోకర్) బెస్ట్‌మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్: ఐయామ్ గాన్నా లవ్ మీ ఎగైన్ (రాకెట్ మ్యాన్) ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: పారసైట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్: బాంబ్ షెల్ ఉత్తమ డాక్యుమెంటరీ: అమెరికన్ ఫ్యాక్టరీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: టైకా వైటిటి (జోజో ర్యాబిట్) బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: టాయ్‌స్టోరీ 4 బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది నైబర్స్ విండో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: బాంగ్ జూన్ (పారసైట్) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్: లెర్నింగ్ టు స్క్వేర్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ (ఇఫ్ యు ఆర్ ఏ గర్ల్) బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: హెయిర్ లవ్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ బెస్ట్ సౌండ్ మిక్సింగ్: 1917 బెస్ట్ సినిమాటోగ్రఫీ: 1917 బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది నైబర్స్ విండో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ లిటిల్ ఉమెన్ తెల్ల రంగు ఆధిపత్యం ఆస్కార్ అవార్డ్స్ విజేతల ఎంపికలో జరుగుతున్న ‘వర్ణ వివక్ష’పై ఐదేళ్లుగా ‘ఆస్కార్ సో వైట్’ అంటూ అవార్డు కమిటీ వివాదాలు ఎదుర్కొంటోంది. మహిళా డైరెక్టర్ల నామినేషన్ విషయంలోనూ వివాదం జరుగుతోంది. అందుకే ఈసారి ‘వెరీ మేల్.. వెరీ వైట్’ అంటూ పలువురు బాహాటంగానే విమర్శనాస్త్రాలు సంధించారు. డైరెక్టర్ల విభాగంలో పురుషాధిక్య ధోరణి కనబడుతోందని, మొత్తం అవార్డుల ఎంపిక పరంగా తెల్ల జాతీయుల ఆధిక్యం కనబడుతోందని సోషల్ మీడియాలోనూ విమర్శలు వచ్చాయి. 2017లో 18, 2018లో 13, 2019లో 15 మంది నల్ల జాతీయులకు నామినేషన్ దక్కింది. ఈసారి సంఖ్య బాగా తగ్గింది. జస్ట్ ఐదుగురు మాత్రమే నామినేషన్ దక్కించుకున్నారు. ఉత్తమ నటి విభాగంలో ఒకే ఒక్క నల్ల జాతీయురాలికే నామినేషన్ దక్కడం బాధాకరం అని నామినేట్ అయిన ‘సింథియా ఎరివో’ ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల విషయంలోనే కాదు.. రెడ్ కార్పెట్ దగ్గర కూడా వర్ణ వివక్ష ఉందని, తెల్ల రిపోర్టర్ల హవానే ఉందన్నారామె. బ్లాక్ రిపోర్టర్స్కి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని కూడా పేర్కొన్నారు. ప్రతిభకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని, రంగుకి కాదని అన్న సింథియా ‘వైట్ రిపోర్టర్స్’కి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. లోలా అనే బ్లాక్ ఫిమేల్ రిపోర్టర్ని పలకరించి, ‘నేను మాట్లాడాలి’ అంటూ చిన్న చాట్ సెషన్లో పాల్గొన్నారు. మహిళా దర్శకులు ఎక్కడ? హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఏ భాషలో అయినా ఇరవై ముప్పై మంది మేల్ డైరెక్టర్లు ఉంటే నలుగురైదుగురు ఫిమేల్ డైరెక్టర్లు ఉంటారు. ఆ ఉన్న తక్కువమందికి ప్రోత్సా హం దక్కకపోతే? ఇదే విషయాన్ని సూచిస్తూ నటి, దర్శక–నిర్మాత నటాలీ పోర్ట్మేన్ ఆస్కార్ అవార్డుల జాబితాలో నామినేట్ కాని మహిళా దర్శకుల పేర్లను తన డ్రెస్ మీద కుట్టించుకున్నారు. ఆమె డ్రెస్ మీద ఎంబ్రాయిడరీ చేసిన పేర్లలో ‘హస్లర్స్’ చిత్రదర్శకురాలు లోరెనీ స్కఫారియా, ‘ది ఫేర్వెల్’ దర్శకురాలు లులు వ్యాంగ్, ‘లిటిల్ ఉమన్’ దర్శకురాలు గ్రెటి గెర్విగ్ తదితరులవి ఉన్నాయి. ఆస్కార్ చరిత్ర చూస్తే ఇప్పటివరకూ కాత్రిన్ బిజెలో, లీనా వెర్ట్ముల్లర్, జేన్ కాంపియన్, సోఫియా కొప్పోలా, గ్రెటి గెర్విగ్.. ఈ ఐదుగురు మాత్రమే నామినేషన్ దక్కించుకున్నారు. వీళ్లల్లో 82వ ఆస్కార్ అవార్డ్స్ (2010)లో ‘ది హర్ట్ లాకర్’ చిత్రానికి గాను కాత్రిన్ బిజెలో ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ని సొంతం చేసుకున్నారు. లేడీ డైరెక్టర్ల విభాగంలో తొలి ఆస్కార్ అందుకున్న దర్శకురాలు ఆమే కావడం విశేషం. ఈ రికార్డ్ భవిష్యత్తులో వేరే లేడీ డైరెక్టర్‌కి దక్కే ఆస్కారం లేదని, ఎందుకంటే అకాడమీ కమిటీ వివక్ష చూపిస్తోందని అర్థమవుతోందనే విమర్శలు ఉన్నాయి. అసలు ఫిమేల్ డైరెక్టర్స్‌కి నామినేషన్ దక్కడమే గగనం అనే పరిస్థితి. గడచిన పదేళ్లల్లో 2018లో ‘లేడీ బర్డ్’ సినిమాకిగాను గ్రెటా గెర్విగ్ నామినేషన్ దక్కించుకున్నారు.. అంతే. జాలీ బిల్లీ నటుడు, గాయకుడు బిల్లీ పోర్టర్ కొంచెం జాలీ టైప్. అమ్మాయిలా డ్రెస్ చేసుకుని సరదాపడేంత జాలీ మేన్. గతేడాది ఆస్కార్ అవార్డ్ వేడుకకు బిల్ నలుపు రంగు గౌనులో హాజరయ్యారు. ఈ ఏడాది కూడా అమ్మాయిలా డ్రెసప్ అయి వచ్చారు. జూలియా బటర్స్ విశేషాలు ►యాంగ్ లీ (2012, లైఫ్ ఆఫ్ పై) తర్వాత ఆసియా నుంచి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నది బాంగ్ జూన్ హూ మాత్రమే. ►గతంలో ‘జోకర్’ పాత్రను పోషించినందుకు ఉత్తమ నటుడిగా (2008) హీత్ లెడ్జర్ ఆస్కార్ అందుకున్నారు. ఇప్పుడు ఓక్విన్ ఫీనిక్స్. ►‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’తో ఆకట్టుకున్న బాల నటి జూలియా బటర్స్ ఆస్కార్స్ వేడుకకు సాండ్విచ్ తెచ్చుకుంది. ‘‘కొన్నిసార్లు అవార్డు ఫంక్షన్లో ఏమీ పెట్టరు లేదా నాకు నచ్చేవి ఏమీ ఉండవు. అందుకే సాడ్విచ్ తెచ్చుకున్నాను’’ అని చెప్పింది జూలియా. -
‘జోకర్’కు 11 ఆస్కార్ నామినేషన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డుల బరిలో టాడ్ ఫిలిప్స్ నిర్మించిన ‘జోకర్’ సినిమా 11 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మార్టిన్ స్కోర్సెస్ నిర్మించిన ‘ది ఐరిష్‌మేన్’, శ్యామ్ మెండిస్ నిర్మించిన ‘1917’, క్వెంటిన్ టరాంటినో నిర్మించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రాలు పదేసి నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన ‘పారాసైట్’ చిత్రం ఆరు నామినేషన్లతో మూడవ స్థానంలో నిలిచింది. మొట్టమొదటి సారిగా ఆస్కార్ బరిలో దక్షిణ కొరియా చిత్రం పోటీ పడడం ఓ విశేషం కాగా, ఉత్తమ చిత్రంతోపాటు, ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం కేటగిరీలకు పోటీ పడడం మరో విశేషం. ‘పారాసైట్’ చిత్రం భారత్‌లో ఈ నెల 31వ తేదీన విడుదలవుతోంది. ‘లిటిల్ విమెన్’ లాంటి ఉత్తమ చిత్రాలను తీసిన గ్రేటా గెర్విగ్ సహా మహిళా దర్శకులెవరూ ఈ సారి ‘ఉత్తమ దర్శకులు’ కేటగిరీకి ఎంపిక కాకపోవడం దురదృష్టకరం. విమర్శకుల ప్రశంసలందుకున్న ‘పోట్రేట్ ఆఫ్ లేడీ ఆన్ ఫైర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సెలైన్ సియమ్మా, ‘ది నైటింగేల్’ దర్శకులు జెన్నిఫర్ కెంట్, ‘ది ఫేర్వెల్’కు దర్శకులు లూలూ వాంగ్, ‘బుక్స్మార్ట్’ దర్శకులు ఓలివియా వైల్డ్, ‘హస్టలర్స్’ దర్శకులు లొరేన్ స్కఫారియా, ‘ఏ బ్యూటీఫుల్ డే ఇన్ ది నైబర్‌హుడ్’ దర్శకులు మేరెల్లీ హెల్లర్లలో ఎవరూ ఆస్కార్‌కు ఎంపిక కాకపోవడం శోచనీయం. అయితే డాక్యుమెంటరీ కేటగిరీలో ఎక్కువ మంది మహిళలు పోటీ పడడం విశేషమే. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్లను వసూలు చేసిన ‘జోకర్’ సినిమాలో నటించిన జాక్విన్ ఫోనిక్స్‌కు ఉత్తమ నటుడు అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలివుడ్’ చిత్రంలో నటించిన లియోనార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్లు కూడా ప్రధానంగా ఉత్తమ నటుడి అవార్డుకు పోటీ పడుతున్నారు. అలాగే ఉత్తమ నటి అవార్డుకు ‘మ్యారేజ్ స్టోరీ’లో నటించిన స్కార్లెట్ జాన్సన్, ‘జూడీ’లో నటించిన రెన్నా జెల్వెగర్, ‘లిటిల్ విమెన్’లో నటించిన సోయిస్ రోనన్, ‘హరియెట్’లో నటించిన సింథియా ఎరివో, ‘బాంబ్‌షెల్’లో నటించిన చార్లిజ్ థెరాన్లు పోటీ పడుతున్నారు. -
ఈసారీ ఆస్కారం లేదు!
మరో ఏడాది. మరో నిరాశ. మరో నిరుత్సాహం. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్‌ని అందుకోవాలనే ఆశ అలానే మిగిలిపోనుంది. 92వ ఆస్కార్ అవార్డులకి ఈ ఏడాది మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా నిలిచిన హిందీ చిత్రం ‘గల్లీ బాయ్’ ఆస్కార్ విడుదల చేసిన షార్ట్ లిస్ట్‌లో చోటు సాధించలేకపోయింది. ఆస్కార్ ఆశల్ని తొలి దశలోనే తుంచేసింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ పోటీల్లో మన దేశం తరఫున నిలబడటానికి ఈ ఏడాది 28 సినిమాలు పోటీపడ్డాయి. ప్రపంచంవ్యాప్తంగా ఈ విభాగంలో 91 సినిమాలు ఆయా దేశాలు నుంచి నామినేట్ చేశారు. మన దేశం తరఫున ‘గల్లీ బాయ్’ని పంపాం. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జోడీగా జోయా అక్తర్ తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ బాయ్’. ర్యాపర్ కావాలనుకునే ముంబై మురికివాడ కుర్రాడిగా ఇందులో రణ్వీర్ కనిపించారు. ర్యాపర్‌గా తన కలను ఎలా చేరుకున్నాడు అన్నది కథ. 40 కోట్లతో తీస్తే 200 కోట్లకు పైగా వసూలు చేసింది ‘గల్లీ బాయ్’. అయితే ఆస్కార్ నామినేషన్ దక్కించుకోలేదు. 91 సినిమాలను ఫిల్టర్ చేసి పది సినిమాలకు కుదించి షార్ట్ లిస్ట్‌ను ప్రకటించింది ఆస్కార్. ఈ పది సినిమాల జాబితాలోకి ‘గల్లీ బాయ్’ ప్రవేశించలేకపోయాడు. 92వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ షార్ట్ లిస్ట్‌ను మంగళవారం ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. 9 విభాగల ఈ జాబితాలో విభాగానికో పది సినిమాలను షార్ట్‌లిస్ట్ చేసి ప్రకటించారు. ఉత్తమ విదేశీ చిత్రం, డాక్యుమెంటరీ మూవీ, డాక్యుమెంటరీ షార్ట్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్, మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్), లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఎంపికయిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత ఒక్కో విభాగంలో 5 సినిమాలను తుది జాబితాగా పరిగణించి ఒక్క సినిమాకి అవార్డు ప్రదానం చేస్తారు. ఆస్కార్ నామినేషన్ ఓటింగ్స్ వచ్చే ఏడాది జనవరి 2న ప్రారంభం కానున్నాయి. జనవరి 7 వరకూ ఓటింగ్ నడుస్తూనే ఉంటుంది. ఆ జాబితాను జనవరి 13న ప్రకటిస్తారు. దాని తర్వాత జనవరి 30న తుది జాబితాకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలువుతుంది. ఫిబ్రవరి 4 వరకూ ఈ ఓటింగ్ సాగుతుంది. ఐదు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 9న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. హాలీవుడ్ అండ్ హైల్యాండ్ సెంటర్లో జరగబోయే 92వ ఆస్కార్ వేడుక ఏబీసీ టెలివిజన్‌లో ప్రసారం కానుంది. సుమారు 225 దేశాల్లో ఆస్కార్ వేడుక ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆస్కార్ అవార్డులు సినిమా ప్రియులకు పండుగే. కానీ హాలీవుడ్ చిత్రాల కోసం ఏర్పాటు చేసుకున్న ఈ ఫంక్షన్‌ను అన్ని దేశాల వాళ్లు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇన్ని వందల సినిమాల్లో ఒక్క దేశం ఆస్కార్ దక్కించుకోకపోతే చిన్నబోవాల్సిన అవసరం ఏంటి? అనే వాదనలూ ఉన్నాయి. ‘ఆస్కార్ అవార్డులు ప్రపంచ స్థాయివేం కాదు. చాలా లోకల్ అవార్డులు’ అని అభిప్రాయపడ్డారు కొరియన్ సినిమా ‘ప్యారసైట్’ దర్శకుడు బాంగ్ జూన్–హో. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఫలితం ఆస్కార్ ఓటింగ్‌కి వదిలేద్దాం! ప్రతి ఏడాది ఇస్తూ వస్తున్న ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీను ఈసారి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌గా పేరు మార్చారు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎంపికయిన సినిమాలు. 1. ది పెయింటెడ్ బర్డ్ (చెక్ రిపబ్లిక్), 2. ట్రూత్ అండ్ జస్టిస్ (ఎస్టోనియా), 3. లెస్ మిసరబుల్స్ (ఫ్రాన్స్), 4. దోస్ హూ రిమైండ్ (హంగేరి), 5. హనీ ల్యాండ్ (నార్త్ మెకడోనియా), 6. కోర్పస్ క్రిస్టీ (పోల్యాండ్), 7. ‘బీన్ పోల్ (రష్యా), 8. అట్లాంటిక్స్ (సెనెగల్), 9. ప్యారసైట్ (సౌత్ కొరియా), 10. పెయిన్ అండ్ గ్లోరీ (స్పెయిన్). మార్వెల్ వర్సెస్ డీసీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ కామిక్ బుక్స్ నుంచి సూపర్ హీరోల సినిమాలు తీసి బస్టర్స్ సాధి స్తుంటాయి నిర్మాణ సంస్థలు. కానీ ఆ సినిమాలను పెద్దగా పరిగణలోకి తీసుకోదు ఆస్కార్. టెక్నికల్ విభాగాల్లో కొన్నిసార్లు అవార్డు ఇచ్చి వెన్ను తట్టింది కానీ సూపర్ హీరో సినిమాలంటే ఆస్కార్‌కి చిన్న చూపే. అయితే ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సూపర్ హీరో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్’ వివిధ విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్నాయి. మార్వెల్ సంస్థ నుంచి వచి్చన ‘ఎండ్ గేమ్’ బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), విజువల్ ఎఫెక్ట్స్ విభాగల్లో, ‘కెప్టెన్ మార్వెల్’ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నామినేట్ అయ్యాయి. డీసీ సంస్థ ఆస్కార్ బాధ్యతను ‘జోకర్’ భుజాలపై ఉంచింది. ఒరిజినల్ స్కోర్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్ విభాగాల్లో ‘జోకర్’ సినిమా నామినేట్ అయింది. చాన్స్ ఎవరికి? ప్యారసైట్ ఈ ఏడాది ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ దక్కే ఛాన్స్ ఎక్కువగా సౌత్ కొరియా చిత్రం ‘ప్యారసైట్’కి ఉందని విశ్లేషకుల అంచనా. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతానికైతే చాలామంది హాట్ ఫేవరెట్ ‘ప్యారసైట్’. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. -
ఇక 'గల్లీ బాయ్'కు ఆస్కార్ లేనట్టే!
ముంబై: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ జోయా అక్తర్ తెరకెక్కించిన 'గల్లీ బాయ్' ఆస్కార్ రేసులో లేదు. సోమవారం 92వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విడుదల చేసిన టాప్ -10 అర్హత చిత్రాల లిస్ట్‌లో గల్లీబాయ్ పేరు లేదు. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద ఆస్కార్‌కు అర్హత సాధించిన 91 చిత్రాల్లో చివరకు కేవలం 10 మాత్రమే ఆస్కార్ బరిలో నిలిచాయి. బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా కలిసి నటించిన గల్లీ బాయ్ చిత్రం 92వ ఆస్కార్ అవార్డ్స్‌కు భారత్ తరఫున ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఎంపికైంది. కానీ ఆస్కార్ అవార్డుకు ఎంపిక చేసిన 10 చిత్రాల్లో గల్లీబాయ్ చోటు దక్కించుకోలేదు. కాగా ఫిబ్రవరి 9న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఆస్కార్ బరికి ఎంపిక చేసిన పది చిత్రాలు: 1) ది పెయింటెడ్ బర్డ్ (చెక్ రిపబ్లిక్) 2) ట్రూత్ అండ్ జస్టిస్ (ఎస్టోనియా) 3) లెస్ మిజరబుల్స్ (ఫ్రాన్స్) 4) దోజ్ హు రిమెయిన్డ్ (హంగరీ) 5) హనీలాండ్ (నార్త్ మాసిడోనియా) 6) కార్పస్ క్రిస్టి (పోలాండ్) 7) బీన్పోల్ ( రష్యా) 8) అట్లాంటిక్స్ (సెనెగల్) 9) పారాసైట్ (దక్షిణ కొరియా) 10)పెయిన్ అండ్ గ్లోరీ (స్పెయిన్) -
ఆస్కార్స్‌కు గల్లీ బాయ్
‘అప్నా టైమ్ ఆయేగా!’... గల్లీ బాయ్ సినిమా ట్యాగ్‌లైన్ ఇది. అంటే ‘మన టైమ్ కూడా వస్తుంది’ అని అర్థం. ప్రఖ్యాత ర్యాప్ సింగర్ కావాలని కలలు కంటాడు ముంబై మురికివాడల్లో నివసించే మురాద్ అనే సాధారణ గల్లీ బాయ్. మురాద్ అంటే కోరిక అని అర్థం. తను బలంగా కోరుకున్నదాని కోసం కష్టపడి శ్రమిస్తాడు. ఏదో రోజు తన టైమ్ కూడా వస్తుందని నమ్ముతాడు. తను కలలు కన్నట్టే, కోరుకున్నట్టే టైమ్ వస్తుంది. ‘గల్లీ బాయ్’ పేరుతో ఫేమస్ ర్యాపర్ అవుతాడు. ఇప్పుడు ఆ గల్లీ బా యే 92వ ఆస్కార్‌కు మన దేశం తరఫున ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో ఎంపిక అయ్యాడు. ఇ ప్పుడు ఆ గల్లీ బాయే ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్ అయిన ఆస్కార్‌ను మనకు తీసుకురావాలని చాలామంది మురాద్. జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గల్లీ బాయ్’. ఆలియా భట్ కథానాయిక. 18 పాటలున్న ఈ సినిమా ఆల్బమ్‌లో దాదాపు 7 పాటలు రణ్వీర్ సింగ్ పాడటం (ర్యాప్ చేయడం) విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 92వ ఆస్కార్ అవార్డులకు రేస్ మొదలైంది. ఆస్కార్స్‌కు పంపబోయే చిత్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు అందరూ. మన దేశం నుంచి ఈ ఏడాది ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి పోటీపడే చిత్రానికి కోల్‌కత్తాలో ఎంపిక జరిగింది. 28 చిత్రాలు పోటీపడగా, ‘గల్లీ బాయ్’ ఫైనల్‌గా నిలిచింది. నటి, దర్శకురాలు అపర్ణా సేన్ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ జరిగింది. పోటీపడ్డ చిత్రాలు: హిందీ చిత్రాలు ‘అంధాధూన్, ఆర్టికల్ 15, బదాయి హో, బద్లా, కేసరి, గల్లీ బాయ్, ద తస్కెన్ట్ ఫైల్స్, ఉరి : ద సర్జికల్ స్ట్రయిక్, గోదే కో జలేబీ కిలానే లే జా రియా హూ, తెలుగు చిత్రం ‘డియర్ కామ్రేడ్’ మలయాళ చిత్రాలు ‘అండ్ ది ఆస్కార్ గోస్ టూ.., ఉయిరే, ఒలు, తమిళ సినిమాలు ఒత్త సెరుప్పు సైజ్ 7, వడ చెన్నై, సూపర్ డీలక్స్, మరాఠీ చిత్రాలు బాబా, ఆనంది గోపాల్, బందీషాలా, మై గాట్ : క్రైమ్ నెం 103/2005, అస్సామీ చిత్రం బుల్ బుల్ కెన్ సింగ్, గుజరాతీ చాల్ జీవీ లాయియే, గుజరాతీ సినిమా హెల్లోరి, కురుక్షేత్ర (కన్నడ), నేపాలీ చిత్రం పహూనా: ద లిటిల్ విజిటర్స్, బెంగాలీ చిత్రాలు తరీఖ్ : ఏ టైమ్‌లైన్, కోంతో, నగర్కీర్తన్లను పరిశీలనలోకి తీసుకున్నారు. బుధవారం మొదలైన ఈ ప్రక్రియ శనివారం సాయంత్రం వరకూ సాగింది. ఈ 28 సినిమాల్లో ఆయుష్మాన్ ఖురానా నటించిన మూడు సినిమాలు (అంధాధూన్, బదాయి హో, ఆర్టికల్ 15) ఉండటం విశేషం. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా ‘అంధాధూన్’, ఉత్తమ నటుడిగా ఆయుష్మాన్ ఖురానా జాతీయ అవార్డుకి ఎంపిక అయ్యారు. తెలుగు నుంచి కామ్రేడ్ ఒక్కడే గత ఏడాది తెలుగు నుంచి ‘రంగస్థలం, మహానటి’ సినిమాలు ఉత్తమ విదేశీ చిత్రానికి ఎంపికవ్వడం కోసం పోటీ పడ్డాయి. ఈసారి తెలుగు నుంచి ‘డియర్ కామ్రేడ్’ ఒక్క సినిమానే ఈ 28 సినిమాల్లో ఉంది. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ నిర్మించాయి. -
నేను ఎవరి బిడ్డను?
అంతర్జాతీయ చలన చిత్రం కేటగిరీ కింద ఇరాన్ డాక్యుమెంటరీ ‘ఫైండింగ్ ఫరీదా’ 2020 ఆస్కార్ అవార్డుల పోటీకి నామినేట్ అయింది. ఇరాన్ ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీని ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక చెయ్యడం ఇదే మొదటిసారి. ఇదే కేటగిరీ కింద గతంలో ఇరాన్ ‘ఎ సపరేషన్’ (2012), ‘ది సేల్స్‌మాన్’ (2017) చిత్రాలకు ఆస్కార్‌ను గెలుపొందింది. ఫరీదా అనే ఇరానీ అమ్మాయిని నలభై ఏళ్ల క్రితం డచ్ (నెదర్లాండ్స్) దంపతులు దత్తత తీసుకెళతారు. ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యాక తొలిసారి తన మాతృభూమిని, కన్నవాళ్లను చూసేందుకు వెళుతుంది. అక్కడ మూడు కుటుంబాలు ఫరీదా ‘మా అమ్మాయే’ అని ముందుకు వస్తాయి. వారిలో నిజంగా తను ఎవరింటి బిడ్డో తెలుసుకోడానికి ఫరీదా అక్కడ మళ్లీ తనను తను వెతుక్కుంటుంది. ఇదే ‘ఫైండింగ్ ఫరీదా’ స్టోరీ. -
అవార్డ్ గోస్ టూ...
-
ఆస్కార్ అవార్డ్స్: బ్లాక్ పాంథర్,రోమా చిత్రాలకు అవార్డుల పంట
-
ఆమె ఆస్కార్
ప్రపంచ సినిమా ఒక అధిరోహకుడైతే అతణ్ణి సవాలు చేసే ఎవరెస్ట్ ఆస్కార్. ప్రపంచ సినిమా ఒక నావ అయితే దాని సత్తా సవాలు చేసే పసిఫిక్ ఆస్కార్. ప్రపంచ సినిమా ఒక ప్రయోగం అయితే దాని ఫలితాలను నిగ్గుతేల్చే సైంటిస్ట్ ఆస్కార్. కథలన్నీ కంచికి చేరుతాయో లేదో కాని సినిమాలన్నీ ఆస్కార్‌కు చేరాలని కలలు కంటాయి. ఆస్కార్ వేదిక మీద తన సినిమా ప్రస్తావన రావాలని, తనకు అవార్డు దక్కాలని వేల మంది గొప్ప గొప్ప నటీనటులు, దర్శకులు కష్టపడుతూ ఉంటారు. ఆస్కార్‌లో బహుమతి గెలుచుకున్న చిత్రం ప్రపంచానికి తెలుస్తుంది. ఆస్కార్ గెలుచుకున్న నటుడు గౌరవంగా తలెత్తి చూసే స్థాయిలో నిలబడతాడు. ఆస్కార్ గెలుచుకున్న నటి వెండి తెర ఇలవేలుపుగా మారుతుంది. ఆస్కార్ మీద ఆశలు ఎన్నో అభాండాలు అన్ని. వివక్ష ఉంటుందని పక్షపాతం ఉంటుందని ఎన్నో అభిప్రాయాలు ఆరోపణలు. కాని ఈసారి మాత్రం ఆస్కార్‌లో స్త్రీలు తమ ప్రతిభ చాటారు. నటనలో, సాంకేతిక విభాగాలలో మగవాళ్లకు గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి ఆస్కార్ ఆమె ఆస్కార్గా నిలిచింది. ఆస్కార్ ఆమెది కూడా అని రుజువు చేసింది. నెల రోజులుగా ఊరిస్తున్న అత్యంత ఘనమైన 91వ ఆస్కార్ వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్ వేడుకగా ఆదివారం జరిగింది. ఎవరూ అంచనా పెట్టుకోని ‘గ్రీన్‌బుక్’ ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ను గెలుచుకుంది. ‘బొహెమియన్ రాప్సోడి’ చిత్రానికి నాలుగు,‘ రోమా’,‘ బ్లాక్ పాంథర్’ సినిమాలకు చెరి మూడు ఆస్కార్లు దక్కాయి. 2019 ఆస్కార్ వేడుకలో ప్రధానంగా కనిపించిన అంశం అకాడమీ మహిళలను గుర్తించడం. కొత్త కొత్త విభాగాల్లో స్త్రీలు అవార్డులు గెలుచుకొని రికార్డ్ సృష్టించారు. హోస్ట్ లేకపోయినా మాయ రుడాల్ఫ్, టినా ఫే, అమీ పోయిల్హర్ అవార్డ్ షోను విజయవంతంగా ప్రారంభించారు. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిలో ‘హన్నా బీచ్లర్’ అవార్డ్ పొందారు. ‘బ్లాక్ పాంథర్’ సినిమాలో సూపర్ హీరో స్వస్థలం ‘వాకాండా’ సృష్టి ఆమెకు ఈ అవార్డ్‌ను సాధించిపెట్టింది. ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకన్న తొలి నల్ల జాతీయురాలు ఈమే. ఇక కాస్ట్యూమ్ విభాగంలో తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న నల్ల జాతీయురాలుగా రూత్ కార్టర్ రికార్డు సాధించింది. నాన్ యాక్టింగ్ కేటగిరీలో కాకుండా ఇతర విభాగాల్లో నల్లజాతీయులు అస్కార్ అందుకోవడం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే ఉత్తమ సహాయనటి విభాగంలో ‘రెజీనా కింగ్’ అనే నల్ల జాతీయురాలు అస్కార్డ్ అవార్డు అందుకున్నారు. ఇలా ఒకే ఏడాది ముగ్గురు నల్ల జాతీయులూ ఆస్కార్ అందుకోవడం కూడా ఇదే మొదటిసారి. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న మెక్సికన్ చిత్రం ‘రోమా’ స్త్రీల కథాంశం కలిగి ఉండటం కూడా మరో విశేషం. ఈ విభాగంలో మెక్సికోకు ఇదే తొలి ఆస్కార్ కావడంఇంకో విశేషం. ఈ చిత్ర దర్శకుడు అల్ఫాన్సో క్వేరాన్కు 2014లో ‘గ్రావిటీ’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నారు. ఈ యేడాది ఒకే చిత్రానికి (రోమా) సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ రెండు విభాగాల్లో రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఇలా గెలుచుకున్న మొదటి వ్యక్తి కూడా అల్ఫాన్సో కావడం విశేషం. రోమా ఉత్తమ విదేశీభాషా చిత్రం రోమా సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇంగ్లిష్‌లో తీయని ఒక సినిమా అత్యధిక ఆస్కార్ అవార్డులకు నామినేట్ కావడం. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విదేశీభాషా చిత్రం సహా మొత్తం పది విభాగాల్లో ఇది నామినేట్ అయింది. ఇన్ని నామినేషన్లు పొందడం ఇంతకుముందు కేవలం 2000 సంవత్సరంలో వచ్చిన ‘క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్’కే సాధ్యమైంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విదేశీభాషా చిత్రం అవార్డులను రోమా గెలుచుకుంది. ఇంగ్లీషేతర సినిమా మూడు అవార్డులు గెలవడం కూడా ఒక ఘనత. ఇంకో విశేషం, రోమాకు సినిమాటోగ్రఫీ కూడా దర్శకుడు అల్ఫాన్సో క్వేరాన్ చేయడంతో రెండు కీలక అవార్డులను వ్యక్తిగతంగా ఆయన గెలుచుకున్నట్టయింది. 2013లో గ్రేవిటీ చిత్రానికిగానూ దర్శకుడిగా తొలి ఆస్కార్ గెలుచుకున్న క్వేరాన్ ఆ ఘనత సాధించిన తొలి లాటిన్ అమెరికన్ దర్శకుడు అయ్యాడు. అయితే అది పూర్తిగా హాలీవుడ్ చిత్రం. కానీ రోమా ఆయన దేశమైన మెక్సికో నేపథ్యంలో సాగే ఆయన మార్కు స్పానిష్ సినిమా. 1970ల్లో మెక్సికో సిటీలోని రోమా ప్రాంతంలో ఇద్దరు ఆడవాళ్లు చేసిన పోరాటం రోమా ఇతివృత్తం. పనిమనిషి క్లియో, ఆమె యజమానురాలు సోఫియా. ఇద్దరూ ఉమ్మడిగా నష్టపోయింది మగవాళ్ల వల్ల. క్లియో దృష్టికోణంలో కథ సాగుతుంది. కడుపు మాత్రం చేసి ఏ బంధపు బరువు మోపుకోకుండా క్లియోను వదిలేస్తాడు ప్రియుడు. నలుగురు పిల్లలు అయిన తర్వాత డాక్టర్ అయిన భర్త వేరే స్త్రీ మోజులో సోఫియాను వదిలేస్తాడు. భిన్న వర్గాలకు చెందిన ఈ స్త్రీలు ఈ కష్ట సమయంలో ఒకరికొకరు మానసిక ఆలంబన అవుతారు. రాజకీయాంశాలను బలంగా వ్యక్తీకరించే క్వేరాన్ గొప్పతనం ఎక్కడంటే, క్లియో ప్రియుడు ఫెర్మిన్ను పారామిలిటరీ బలగాల్లో చేర్చడం. సరిగ్గా క్లియోకు నెలలు నిండిన సమయంలో రేగిన విద్యార్థుల నిరసన జ్వాలలను అణచివేసే బలగాల్లో ఫెర్మిన్ ఉండటమూ, అతడి అసలైన కర్కశ ముఖం చూసిన భయంలో క్లియో గర్భాన్ని పోగొట్టుకోవడమూ సినిమా కేవలం ఇది ఇద్దరు ఆడవాళ్ల కథ మాత్రమే కాదనుకునేలా చేస్తుంది. స్థూలస్థాయిలో ఇందులో కనబడేది రాజ్యపు విధ్వంసం, సూక్ష్మస్థాయిలో అర్థమయ్యేది ఆ ధ్వంసమవుతున్నదాన్ని నిలబెట్టుకోవడానికి కొందరు చేసే ప్రయత్నం. దానికి రుజువు, అంతకుముందు నీటిని చూసి భయపడే క్లియో, సముద్రంలో మునిగిపోతున్న యజమానురాలి పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడుకోవడం. ఇది పాక్షికంగా క్వేరాన్ ఆత్మకథాత్మక చిత్రం. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రించడంతో రంగుల్నీ చూసీ చూసీ అలసిపోయివున్న కళ్లకు నలుపు తెలుపుల్లోని హాయి ఏమిటో తెలుస్తుంది. విదేశీభాషా విభాగంలో మెక్సికో నుంచి ఆస్కార్ గెలుచుకున్న తొలి చిత్రం కావడం ఒక విశేషమైతే, నెట్‌ఫ్లిక్స్ దీన్ని పంపిణీ చేయడం ఇంకో సంగతి. ప్రసంగాలూ... స్ఫూర్తిమాటలూ ఆస్కార్ వేడుకలో అవార్డ్ ఎవరికొస్తుంది అన్నదాని కంటే, అవార్డ్ అందుకున్న విజేత వేదిక మీద కృతజ్ఞతా పలుకుగా ఏం మాట్లాడతారన్నదానిమీదే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. 1942లో ‘మిసెస్ మిన్వెర్’ సినిమాకు ఉత్తమ నటిగా ఎంపికైన గ్రీర్ గార్సన్ ఆపకుండా ఆరునిమిషాలు మాట్లాడిందట. దాంతో ఆ ఏడాది నుంచి ఆస్కార్ యాక్సెప్టెన్స్ స్పీచ్‌ను 45 సెకండ్లకు కుదించింది అకాడమీ. అయితే 45 సెకన్లలో మాట్లాడడానికి థాంక్స్ తప్ప ఇంకేం మాటలుంటాయి అని అసహనపడకండి. నలభై అయిదు సెకన్లలో ఆలోచింపచేయొచ్చు, నవ్వించొచ్చు, బోర్ కొట్టించొచ్చు అని ఆస్కార్ కమిటీ అభిప్రాయం. దాన్ని ఫాలో అవమని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఆ నియమం ఆధారంగా గతేడాది టాక్ ఆఫ్ ది నైట్ అయ్యారు ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ స్పీచ్‌లో ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే పదం వాడారామె. ‘సినిమా సెట్లో వర్ణ, లింగ నిష్పత్తి సమంగా ఉండేలా చూసుకోవడం’ అని ఆ మాట అర్థం. ఈ ఏడాది ఉత్తమ నటి పురస్కారం అందుకున్న ఒలివియా కోల్మన్ అవార్డ్ అందుకోగానే ‘దిస్ ఈజ్ హిల్లేరియస్.. నాకు ఆస్కార్ వచ్చిందా? సరే. థాంక్స్ చెప్పాల్సిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఒకవేళ మర్చిపోతే దయచేసి క్షమించండి. మళ్లీ కలిసినప్పుడు ప్రేమతో ఓ ముద్దిస్తాను. ఆస్కార్ స్పీచ్‌లు ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిలందరూ.. ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. క్లీనర్‌గా పని చేసే రోజుల్లో నేను ఎక్కువగా చేసిన పని ఇదే. థాంక్యూ ఎవ్రీ వన్’ అంటూ తన స్పీచ్‌ని పూర్తి చేశారు. అవార్డ్ గెలుచుకున్న నటీనటులు సాధారణంగా ‘థాంక్స్ టు గాడ్’ అని దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు. అయితే ఒలివియా మాత్రం ‘థాంక్స్ టు లేడీ గాగా’ అంటూ లేడీగాగాకు కృతజ్ఞతలు చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తర్వాత ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో అవార్డ్ అందుకున్న రేకా ‘మెన్స్ట్రుయేషన్ మీద తీసిన సినిమాకు ఆస్కార్ వస్తుందని అనుకోలేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా!’ అన్నారు. ‘ఎన్నిసార్లు ఒడిపోయామన్నది ముఖ్యం కాదు. మళ్లీ ఎన్నిసార్లు తిరిగి ప్రయత్నించావన్నది ముఖ్యం. విజయం సాధించాలంటే క్రమశిక్షణతో కూడిన తపన ఉండాలి’ అంటూ స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చారు లేడీ గాగా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ‘‘షాలో’’కి ఆస్కార్ తీసుకున్నారు ఆమె. ‘వైస్’ చిత్రానికి గాను మేకప్ విభాగంలో.. గ్రెగ్ కన్నమ్, కేట్ బిస్కోయి, పాట్రికా డిహానీ లీ.. ఆస్కార్‌ని గెలుచుకున్నారు. రాసుకొని తెచ్చుకున్న థాంక్యూ చీటీని వంతుల వారీగా చదువుదామనుకున్నారు. తీరా చదవాల్సిన టైమ్‌కి కన్ఫ్యూజ్ అయ్యారు. దాంతో ఈ ఏడాది వరస్ట్ స్పీచ్ ఇదే అంటూ సోషల్ మీడియా కామెంట్స్ బారిన పడ్డారు. మాటల బాణాలు.. ట్రంప్ మీదా? ‘ప్రపంచ వేదిక సాక్షిగా మా పూర్వీకులందరినీ గుర్తుచేసుకుంటున్నా. ఈ దేశాన్ని నిర్మించింది వాళ్లే. మానవత్వాన్ని పెంపొందించుకోవడమే నిజమైన ఉద్యమం. 2020 ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయ్. అందరం చరిత్రకు సరైనవైపే ఉందాం. ప్రేమ వైపు ఉందామా? ద్వేషం వైపు ఉందామా? అందరం సరైన నిర్ణయం తీసుకుందాం!’ అన్నారు దర్శకుడు స్పైక్ లీ. ఇది ఆయన ఆస్కార్ స్పీచ్కన్నా ఆస్కార్ వేదికగా డొనాల్డ్ ట్రంప్‌కి విసిరిన బాణంలా అభిప్రాయపడ్డారు వీక్షకులు. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే (బ్లాక్లాంన్స్‌మాన్) విభాగంలో ఆయన ఆస్కార్‌ను అందుకున్నారు. 2015లో గౌరవ ఆస్కార్ అందుకున్నప్పటికీ ఇది అతని తొలి అవార్డు. అవార్డ్ అనౌన్స్ చేసిన సామ్యూల్ జాక్సన్‌పై అమాంతం దూకారు స్పైక్ లీ. ‘యాక్సెప్టెన్స్ స్పీచ్ టైమర్ అప్పుడే ఆన్ చేయకు’ అంటూ ఆస్కార్ ప్రొడ్యూసర్‌కి కేకేశారు. జెంటిల్‌మేన్ ఆఫ్ ది నైట్ ‘అండ్ ది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు రెజినా కింగ్’ అని అనౌన్స్ చేశారు. రెజినా ఉత్సాహంగా లేచారు. అవార్డ్ అందుకోబోయే కంగారులో డ్రెస్ కొంచెం ఇబ్బంది పెట్టడంతో వేగంగా కదల్లేకపోయారు. దాంతో ముందు వరుసలో కూర్చున్న ‘కెప్టెన్ అమెరికా’ పాత్రధారి క్రిస్ ఈవన్ రెజీనాకు తన చేయి అందించాడు. అంతేకాదు స్టేజ్ వరకూ ఆమెను నడిపించుకుంటూ వెళ్లాడు. దీంతో ఇంటర్నెట్ మొత్తం ‘జెంటిల్‌మేన్ ఆఫ్ ది నైట్’ అంటూ క్రిస్‌ను హైలైట్ చేసింది. హోస్ట్ లేకపోతే ఏంటి? ఒక థీమ్‌కు సంబంధించిన మోనోలాగ్‌తో ఆస్కార్‌ను ప్రారంభించడం ఆనవాయితీ. దానికి ఒక హోస్ట్ ఉంటారు. అయితే ఈ ఏడాది ఆస్కార్ వేడుకకి థీమ్ లేదు. హోస్ట్ లేరు. అయితేనేం మేమున్నామంటూ సాటర్డే నైట్ స్టార్స్ టినా ఫే, మాయా రుడాల్ఫ్, అమీ పోయిలీర్ చిన్న మోనోలాగ్‌తో ఆస్కార్ ఆస్కార్ వేడుకను ప్రారంభించారు. ఆ తర్వాత వరుస జోక్స్‌తో వేడుకను ముందుకు తీసుకెళ్లారు. ఏదో ఓ జోక్‌ను పేల్చి ‘మేమే హోస్ట్స్ అయ్యుంటే ఇలా అనేవాళ్లమేమో?’ అంటూ నవ్వులు పూయించారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ అందించడానికి స్టేజ్ మీదకు వచ్చిన ఈ స్నేహితులు ‘బేసిక్‌గా ఉమెన్ అంటేనే సపోర్టీవ్. నమ్మరా? వీళం్లదరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేది నేనే’అనే చలోక్తులు చిమ్మారు. ఆస్కార్.. నాట్ సో వైట్ ‘ఆస్కార్.. .తెల్ల జాతీయుల పక్షపాతి’ అనే అపవాదును మొన్నటి వరకూ ఉండేది. పోయిన ఏడాది నుంచి ఆ పక్షపాతం చాలా తగ్గింది అంటున్నారు విశ్లేషకులు. ఈ ఏడాది అవార్డులను అందుకున్న వారే కాదు అందించిన వాళ్లూ విభిన్నమైన వాళ్లే. రూత్ కార్టర్– కాస్ట్యూమ్ విభాగంలో ఆస్కార్ అందుకున్న మొదటి అఫ్రికన్ అమెరికన్. యానిమేటడ్ ఫిల్మ్‌కు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న మొదటి నల్ల జాతీయుడు పీటర్ రామ్సే. ఇలా ఈ ఏడాది వర్ణాలకు అతీతంగా షో జరగడంతో ఆస్కార్.. నాట్ సో వైట్ అనే మంచి పరిణామానికీ తెర తీసింది. డ్రైవింగ్‌లో ఆస్కార్ మిస్ ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ‘గ్రీన్‌బుక్’ చిత్రాన్ని ప్రకటించడం చాలామందికి రుచించలేదు. ఒక నల్లజాతి పియానిస్ట్, ఓ తెల్ల జాతి డ్రైవర్ కలిసి చేసిన ప్రయాణమే ‘గ్రీన్‌బుక్’. ఈ చిత్ర దర్శకుడు పీటర్ ఫారెల్లీపై లైంగిక వేధింపుల ఆరోపణలూ ఉన్నాయి. ‘ఎవరో ఎవర్నో డ్రైవ్ చేసిన ప్రతిసారి నేనోడిపోతున్నాను’ అంటూ ‘గ్రీన్‌బుక్’ విజయంపై కామెంట్ చేశారు దర్శకుడు స్పైక్ లీ. ఆయన తీసిన ‘బ్లాక్లాంన్స్‌మాన్’ చిత్రానికి బెస్ట్ఫిల్మ్ మిస్ అయ్యింది. 1989లో కూడా ‘డ్రైవింగ్ మిస్ డైసీ’ చిత్రం పోటీగా నిలిచి స్పైక్ లీ తీసిన ‘డూ ది రైట్ థింగ్’కు అస్కార్ మిస్ అయ్యేలా చేసింది. హైలైట్స్ ∙ఆస్కార్ స్టేజ్ సెటప్ అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టయిల్ని తలపించేలా ఉందనే కామెంట్స్ వినిపించాయి. ‘ఆర్ట్‌లో ఒక్కొక్కరు ఒక్కో బొమ్మను వాళ్లకు నచ్చిన విధంగా ఊహిస్తూ చూస్తారు. ట్రంప్ హెయిర్స్టయిల్లా ఊహించుకున్న వాళ్లకు అలా కనపడి ఉండొచ్చు’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్. ∙ఈ ఏడాది బెస్ట్ యాక్ట్రెస్ ఆస్కార్‌ను నటి గ్లెన్ క్లోజ్ గెలుస్తుంది అని అనుకున్నారంతా. గ్లెన్ కూడా తన డ్రెస్‌ను ఆస్కార్ అవార్డ్ ప్రతిమలా డిజైన్ చేసుకుంది. దాదాపు 20 కిలోల బరువున్న ఈ డ్రెస్‌తో రెడ్ కార్పెట్ పై నడిచి అందరి చూపులనూ తన వైపు తిప్పుకుంది. కాని ఆమెకు అవార్డు రాలేదు. ∙ఈ ఫంక్షన్లో లేడీ గాగా, బ్రాడ్లీ కూపర్ పాడిన ‘షాలో’ ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. ∙రెండు ఆస్కార్ పురస్కారాలను గెలుచుకున్న మొదటి నల్లజాతీయుడు మహర్షెల్లా అలీ. ఈ ఏడాది గ్రీన్‌బుక్ చిత్రానికి ఆయన ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ తీసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం మూన్లైట్ చిత్రానికి ఉత్తమసహాయనటుడు విభాగంలో తొలి ఆస్కార్ అవార్డు అందుకున్నారు మహర్షెల్లా అలీ. ∙ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలిచారు రోమీ మాలిక్. ఆ అవార్డు అందుకున్న తొలి అరబ్ అమెరికన్ వ్యక్తి రోమీ మాలిక్. స్పీచ్ ఇచ్చిన తర్వాత స్టేజీ మీద నుంచి బ్యాలెన్స్ తప్పి కింద పడ్డారు. ∙గత ఆరేళ్లుగా యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో డిస్నీ సంస్థకు ఆస్కార్ అవార్డులు వస్తూన్నాయి. ‘స్పైడర్‌మ్యాన్: ఇట్ టు ది స్పైడర్ వర్స్’ చిత్రంతో ఆ స్పీడ్‌కు బ్రేక్ వేసింది సోనీ. యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ ఏడాది ఆస్కార్‌ను చేజిక్కించుకుంది. అయినా డిస్నీ ఆస్కార్ ఖాతాలో ఈ యేడాదీ ఆస్కార్ పడింది.. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ‘బావ్’తో. ∙ ‘ఏ స్టార్ ఈజ్ బార్న్’ చిత్రం ఈ ఏడాది ఎనిమిది ఆస్కార్ నామినేషన్స్‌ను దక్కించుకుంది. కానీ ఒరిజినల్ స్కోర్ విభాగంలో మాత్రమే ఆస్కార్ అవార్డును అందుకోగలిగింది. విజేతల జాబితా ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్ ఉత్తమ డైరెక్టర్: అల్ఫాన్సో క్వేరాన్ (రోమా) ఉత్తమ నటుడు : రమీ మాలిక్ (బొహెమియన్ రాప్సోడి) ఉత్తమ నటి: ఒలివియా కోల్మన్ (ద ఫెవరెట్) ఉత్తమ సహాయ నటుడు: మహర్షెల్లా అలీ (గ్రీన్‌బుక్) ఉత్తమ సహాయ నటి : రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్) ఒరిజినల్ స్క్రీన్ ప్లే : గ్రీన్‌బుక్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : బ్లాక్లాంన్స్‌మాన్ (స్పైక్ లీ) ఉత్తమ విదేశీ చిత్రం : రోమా యానీమేటెడ్ ఫీచర్ : స్పైడర్‌మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వర్స్ సౌండ్ ఎడిటింగ్ : బొహెమియన్ రాప్సోడి విజువల్ ఎఫెక్ట్స్ : ఫస్ట్‌మ్యాన్ ఫిల్మ్ ఎడిటింగ్ : బొహెమియన్ రాప్సోడి యానీమేటెడ్ షార్ట్: బావ్ లైవ్ యాక్షన్ షార్ట్: స్కిన్ డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్: పీరియడ్: ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఒరిజినల్ స్కోర్ : బ్లాక్ పాంథర్ ఒరిజినల్ సాంగ్ : షాలో (ఏ స్టార్ ఈజ్ బార్న్) ప్రొడక్షన్ డిజైన్: బ్లాక్ పాంథర్ (రూత్ కార్టర్) సినిమాటోగ్రఫీ : రోమా (అల్ఫాన్సో క్వేరాన్) క్యాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్ (హన్నా బీచ్లర్ ) మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: వైస్ ( గ్రెగ్ కన్నమ్, కేట్ బిస్కోయి, పాట్రికా డిహానీ లీ) డాక్యుమెంటరీ ఫీచర్: ఫ్రీ సోలో సౌండ్ మిక్సింగ్ : బొహెమియన్ రాప్సోడి -
ఆ రెండు సినిమాలకు ఆస్కార్ అవార్డుల పంట
సినీ ప్రపంచంలో ఉన్నతమైన అవార్డుగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం నేడు అట్టహాసంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ప్రధానం చేసే ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం వీక్షిస్తూ ఉంటుంది. అయితే నేటి కార్యక్రమంలో ఓ భారతీయ సినిమా కూడా ఆస్కార్ అవార్డును అందుకుంది. స్త్రీ జీవితంలో ప్రధాన పరిణామమైన రుతుచక్రం ఇతివృత్తంతో రూపొందిన ‘పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ డాక్యూమెంటరీని ఆస్కార్ వరించింది. ఈ వేడుకలో రెండు హాలీవుడ్ చిత్రాలు అవార్డుల పంటను పండించాయి. ‘రోమా’, ‘బ్లాక్ పాంథర్’ చిత్రాలకు అనేక విభాగాల్లో అవార్డులు వచ్చాయి. మొత్తంగా ఏ చిత్రానికి ఏ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయంటే.. ఉత్తమ చిత్రం: గ్రీన్ బుక్ ఉత్తమ నటుడు: రామి మలేక్ (బొహేమియన్ రాప్సోడీ) ఉత్తమ నటి: ఒలీవియా కోల్మన్ (ది ఫేవరేట్) ఉత్తమ దర్శకుడు: ఆల్ఫోన్సో క్వారోన్ (రోమా) ఉత్తమ సహాయ నటుడు: మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్) ఉత్తమ సహాయ నటి: రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్) ఉత్తమ ఛాయాగ్రాహకుడు: అల్ఫాన్సో కరోన్(రోమా) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ‘బ్లాక్ పాంథర్‘ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: రూత్‌కార్టర్(బ్లాక్ పాంథర్) ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: బొహెమియన్ రాప్సోడి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ‘స్పైడర్ మ్యాన్:ఇన్ టూ ది స్పైడర్ వర్స్ ఉత్తమ విదేశీ చిత్రం: ‘రోమా’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం: ‘ఫ్రీ సోలో’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: పీరియడ్: ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్ (భారతీయ చిత్రం) -
91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం
-
ఆస్కార్-2019: విజేతలు వీరే
లాస్ఏంజెల్స్: చలనచిత్ర పరిశ్రమలో ప్రపంచ అత్యున్నత అవార్డు ఆస్కార్ 2019ను ప్రకటించారు. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ స్టేడియంలో 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఉత్తమ సహాయనటిగా రెజినా కింగ్‌ను ఈ ఏడాది ఆస్కార్ వరించింది. ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్ అనే చిత్రంలో అత్యుత్తమ నటన కనబర్చినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్ ఉత్తమ దర్శకుడు: అల్ఫోన్సో క్యురాన్ (రోమా) రామి మాలిక్(బెహమానియా రాస్పోడీ) ఉత్తమ నటి: ఓల్వియా కోల్మెన్(ది ఫేవరెట్) ఉతమ క్యాస్టుమ్ డిజైనర్: రూత్ కార్టర్ (బ్లాక్ పాంతర్) ఉతమ విదేశీ చిత్రం: రోమ (మెక్సికో) ఉత్తమ స్క్రీన్‌ప్లే: గ్రీన్‌బుక్ ఉత్తమ సహాయనటుడు: మహేర్షేలా అలీ (గ్రీన్ బుక్) ఉతమ డాక్యుమెంటరీ మూవీ: ఫ్రీ సోలో ఉతమ సినీమాటోగఫ్రీ: అల్ఫాన్సోరోన్ (రోమ) ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, సౌండ్ ఎడిటింగ్-బెహమైన్ రాప్పోడి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్-‘స్పైడర్ మ్యాన్ (ఇన్‌టూ ది స్పైడర్ వెర్స్) (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఫస్ట్ చాయిస్ నేనే!
ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ వేడుక యాంకర్ లేకుండానే సాగనుంది. అయితే ఈ ఏడాది ఆస్కార్స్‌లో యాంకర్‌గా మొదటి ఎంపిక నేనే అంటున్నారు హాలీవుడ్ యాక్టర్ డ్వేన్ జాన్సన్. కెవిన్ హార్ట్ తప్పుకోవడంతో కొత్త యాంకర్‌ను ఎంపిక చేయడం కుదరకపోవడంతో యాంకర్ లేకుండానే ఆవార్డ్స్ జరగనున్నాయి. ఈ విషయం గురించి డ్వేన్ జాన్సన్ మాట్లాడుతూ – ‘‘ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్‌ను హోస్ట్ చేయడానికి అకాడమీ అవార్డ్ మొదట నన్నే సంప్రదించింది. చాలా సరదాగా సాయంత్రాన్ని హోస్ట్ చేద్దాం అని అనుకున్నాను కూడా. కానీ ‘జుమాంజీ’ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా హోస్ట్ చేయడం కుదర్లేదు. చూద్దాం. భవిష్యత్తులో హోస్ట్‌గా చేసే అవకాశం రాకపోదా?’’ అని పేర్కొన్నారు. -
యాంకర్‌కు ఆస్కారం లేదు
‘అండ్ ది అవార్డ్ ఫర్ ది బెస్ట్ మూవీ గోస్ టూ..’ అంటూ ప్రతీ అవార్డ్ ఫంక్షన్‌ను రక్తి కట్టించేది యాంకరే. అయితే అన్ని అవార్డ్స్‌లో కల్ల ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్స్‌కు ఈ ఏడాది యాంకర్ (హోస్ట్) ఉండకపోవడం విశేషం. ఈ విషయం అధికారికంగా ఆస్కార్ బృందం నుంచే వచ్చింది. ఇలా యాంకర్ లేకుండా అవార్డ్స్ ఫంక్షన్ జరగడం గడిచిన 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. అవార్డ్స్‌ను ప్రదానం చేయడానికి స్టేజ్ మీదకు వచ్చే సెలబ్రిటీలు తదుపరి అవార్డులను ప్రకటిస్తారు. నిజానికి ఈ ఏడాది హోస్ట్‌గా కెవిన్ హార్ట్ షోను నిర్వహించాలి. కానీ గతంలో కెవిన్ చేసిన ట్వీట్స్ వివాదం కావడంతో స్వయంగా ఈ పోస్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడం కష్టంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. -
ఆస్కార్ ఆశలు గల్లంతు!
ఈ ఏడాది కూడా ఇండియన్ సినిమాకు ఆస్కార్ ఆశలు లేనట్టే. ఉత్తమ విదేశీ చిత్రంగా భారత్ తరుపున బరిలో నిలిచిన విలేజ్ రాక్‌స్టార్ సినిమా ఫైనల్ లిస్ట్‌లో స్థానం సంపాదించలేకపోయింది. 2019 ఫిబ్రవరి 24న 91వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. ఈపోటిలో పాల్గోనేందుకు భారత్ తరుపున 29 సినిమాలను చూసిన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఫైనల్‌గా విలేజ్ రాక్‌స్టార్స్‌ను పోటికి ఎంపిక చేశారు. 2017లో రిలీజ్ అయిన విలేజ్ రాక్‌స్టార్స్ సినిమాను రీమాదాస్ తెరకెక్కించారు. పరిమిత వనురులతో తన సొంత రాష్ట్రం అసోం లోనే లో బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవటంతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. దీంతో భారత్ తరుపున ఆస్కార్ బరిలో నిలిచేందుకు విలేజ్ రాక్‌స్టార్స్‌ను ఎంపిక చేశారు. కానీ సినిమా కూడా ఫైనల్ లిస్ట్ లో స్థానం సాదించలేకపోయింది. -
సహాయం చేస్తారా?
అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ విదేశీ విభాగంలో భారతదేశం తరఫున 91వ ఆస్కార్స్ అవార్డ్స్ నామినేషన్ పోటీకి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మరింత ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు సినీ ప్రముఖులు తమకు ఆర్థికంగా చేయూతనందించాలని కోరుతున్నారు చిత్రదర్శకురాలు రీమాదాస్. ‘‘విలేజ్ రాక్‌స్టార్స్ చిత్రాన్ని 30 లక్షల బడ్జెట్లో పూర్తి చేశాం. ఈ సినిమాను హాలీవుడ్ ప్లాట్‌ఫామ్‌పై ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. విమర్శకులకు స్పెషల్ షోలు వేయాలి. ఇలా చేయాలంటే కనీసం 5 కోట్లు ఖర్చవుతుందట. అంత ఖర్చుతో నేనెలా ప్రమోట్ చేయగలను? అస్సాం ప్రభుత్వం వారు కోటి రూపాయలు ప్రకటించారు. కానీ టాక్సులు పోగా 68 లక్షలు మాత్రమే వస్తాయి. నవంబర్‌లో ఆస్కార్స్‌కు సంబంధించి లాస్ ఏంజిల్స్‌లో మూవీ ప్రమోషన్ పనులు ఊపందుకుంటాయి. నా చిత్రబృందాన్ని లాస్ ఏంజిల్స్ తీసుకెళ్లి, అక్కడే కొన్నిరోజులు స్టే చేయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. బాలీవుడ్ స్టార్స్‌ని ఆర్థిక సహాయం అడుగుతున్నాను... ప్రపంచ వేదికపై ‘విలేజ్ రాక్‌స్టార్స్’ నిలబడేందుకు సహాయం చేయండి’’ అని పేర్కొన్నారు రీమాదాస్. -
ఆస్కార్ బరిలో ‘విలేజ్ రాక్ స్టార్స్’
సినిమా పండగల్లో అతి పెద్ద పండగ ఆస్కార్ అవార్డుల పండగ. ప్రపంచంలో అన్ని ప్రాంతాల సినిమాలను కొలమానంగా భావించే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు. ఈ సంబరాలు జరిగేది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అయినా హడావిడి సెప్టెంబర్ అక్టోబర్ నెలల నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే.. ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీకి బరిలో నిలిచే సినిమాలను ఆయా దేశాలు అనౌన్స్ చేస్తుంటాయి. ఈసారీ స్టార్ట్ అయింది. 2018కిగాను ఇండియన్ సినిమా తరఫున ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ అని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఒక అస్సామీ సినిమా. కొత్త దర్శకురాలు. పొదుపైన బడ్జెట్. సినిమా తీసింది చిన్న కెమెరాతోనే. మొత్తం దర్శకురాలు రీమా దాస్ స్వగ్రామమే. దాదాపు 28 సినిమాలు ఉన్న లిస్ట్‌లో, వచ్చే ఏడాది జరిగే ఆస్కార్స్‌కి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున అఫీషియల్‌గా పంపబోతున్న సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’. ఈ సినిమా విషయానికి వస్తే.. రీమా దాస్ స్వీయ దర్శకత్వం వహించి, ఎడిటింగ్ చేసిన అస్సామీ చిత్రం. రీమా దాస్ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ కూడా కాదు. సెల్ఫ్ మేడ్ ఫిల్మ్ మేకర్. ఈ ఏడాది వచ్చిన నేషనల్ అవార్డ్లోనూ ‘విలేజ్ రాక్‌స్టార్స్’ సత్తా చాటింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, చైల్డ్ ఆర్టిస్ట్, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకుంది. అంతేనా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా మంచి ప్రశంసలు పొందింది. కథ : ‘విలేజ్ రాక్‌స్టార్స్’ సినిమా కథ చాలా సింపుల్ లైన్స్‌లో ఉంటుంది. దును అనే చిన్నారి చయాగాన్ గ్రామంలో తన తల్లి, తమ్ముడుతో కలిసి ఉంటుంది. సంతలో అమ్మకు స్నాక్స్ అమ్మే పనిలో సాయంగా ఉంటుంది. ఒకసారి గ్రామంలో జరిగిన బ్యాండ్ పర్ఫార్మెన్స్ చూసి మంత్రముగ్ధురాలైన దును ఎలా అయినా గిటార్ కొనుక్కోవాలనుకుంటుంది. అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్దైనా ఫర్వాలేదనుకుంటుంది. కామిక్ బుక్స్ చదివి తను కూడా ఓ బ్యాండ్ ఏర్పాటు చేయాలనుకుంటుంది. రూపాయి రూపాయి పోగేసుకుంటుంది. ఇంతలో వరదలు వారి పంటను పూర్తిగా నాశనం చేస్తాయి. అప్పుడు దునుకి తనకు ముఖ్యమైనదేంటో ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సందర్భంలో దును తెలివిగా ఏం చేసిందనేదే సినిమా కథ. దునుగా ప్లే చేసిన బన్నితా దాస్ ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్’గా అవార్డు పొందింది. ఈ విలేజ్ రాక్‌స్టార్స్ మొత్తం దేశాన్నే తమ గ్రామం వైపు తిరిగేలా చేసింది. ఈ కథ ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. విశేషం ఏంటంటే.. అస్సామీ పరిశ్రమలో దాదాపు 29 ఏళ్ల తర్వాత జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ఇది. ఆ రకంగా అస్సామీ పరిశ్రమకు ఈ సినిమా ఓ తీయని అనుభూతిని పంచితే, ఇప్పుడు ఏకంగా ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి ఎంపిక కావడం మరో మంచి అనుభూతిని మిగ్చిలింది. ‘‘ఓ వైపేమో ఆనంద భాష్పాలు మరోపక్క మనసు గర్వంతో నిండిపోయి ఉంది. చాలా వినయంగా ఈ ఎంట్రీని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ విషయం జీర్ణించుకోవడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు దర్శకురాలు రీమా దాస్. మరి మన దేశం తరఫున ఆస్కార్‌కు వెళ్తున్న ఈ చిత్రం ఆస్కార్ బృందాన్ని మెప్పించి, నామినేషన్ దక్కించుకుని, చివరికి అవార్డునూ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఏది ఏమైనా అంత దాకా వెళ్లడమే గొప్ప విషయం. టైటిల్ విలేజ్ రాక్‌స్టార్స్ అయినా మొత్తం గ్లోబల్ విలేజ్ సెలబ్రేట్ చేసుకునే ఈ పండగలో తన సత్తా చాటితే మాత్రం చరిత్రే అవుతుంది. ఫారిన్ క్యాటగిరీలో హిందీ చిత్రం ‘మదర్ ఇండియా’ నుంచి ఆస్కార్ వైపు ఆశగా చూస్తున్న మనకు ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. గతేడాది ఆస్కార్‌కు అఫీషియల్ ఎంట్రీగా వెళ్లిన హిందీ చిత్రం ‘న్యూటన్’ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. పోటీలో నిలిచిన 28 సినిమాలు ఆస్కార్ నామినేషన్స్‌కు భారతదేశం నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ పరిగణనలోకి తీసుకున్నవి సుమారు 28 సినిమాలు ఉన్నట్టు సమాచారం. అందులో మన ‘మహానటి’, సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్’, నందితా దాస్ ‘మంటో’, సూజిత్ సర్కార్ ‘అక్టోబర్’, లవ్సోనియే’ ప్యాడ్‌మ్యాన్, తుమ్బాద్ హల్కా, పీకు వంటి సినిమాలు ఫారిన్ క్యాటగిరీలో జరిగిన రేసులో పోటీపడ్డాయి. అవార్డు ఆస్కారం ఎప్పుడు? మన దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి సినిమాలను పంపడం మొదలైంది 1957లో. అప్పటి నుంచి కేవలం మూడు సినిమాలు (మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్) మాత్రమే నామినేషన్ దక్కించుకున్నాయి. 1986లో నామినేషన్స్‌కు కె.విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ రేస్ వరకూ వెళ్లింది కానీ నామినేషన్ దక్కించుకోలేదు. అంతదాకా వెళ్లి, నామినేషన్ దక్కించుకున్నా అవార్డు వరకూ రాలేకపోతున్నాం. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి.. ఇలా మనవాళ్లు ఆస్కార్ తెచ్చినా, అది మన దేశం సినిమా కాదు. బ్రిటిష్ ఫిల్మ్ కింద వస్తుంది. రీమా దాస్ -
ఆస్కార్‌కి భారత్ తరపున ‘విలేజ్ రాక్‌స్టార్స్’
ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ‘విలేజ్ రాక్‌స్టార్స్’ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. 2019లో జరగబోయే 91వ ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కు భారత్ తరపున ఈ అస్సాం చిత్రం ఎంపికైనట్లు తెలిసింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఆస్కార్ అవార్డుకు పోటీపడుతోందని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) శనివారం ప్రకటించింది. 2019 ఆస్కార్ అవార్డుల బరిలో భారత్ నుంచి 28 చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిలో ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో పాటు సంజయ్‌లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’, ఆలియాభట్ ‘రాజీ’, రాణీముఖర్జీ ‘హిచ్కీ’, శూజిత్ సిర్కార్ ‘అక్టోబర్’ చిత్రాలున్నాయి. ఇన్ని భారీ చిత్రాలతో పోటీ పడి ‘విలేజ్ రాక్‌స్టార్స్’ చిత్రం ఆస్కార్ అవార్డు నామినేషన్‌కు ఎంపికైనట్లు ఎఫ్ఎఫ్ఐ తెలిపింది. అస్సాంలోని ఓ మారుమూల పల్లెటూరుకు చెందిన పదేళ్ల అమ్మాయి ‘ధును’కు గిటార్ అంటే ఎంతో ఇష్టం. అంతేకాక తనే సొంతంగా ఓ బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటుంది. ఈ క్రమంలో ధును తనకు వచ్చిన ఇబ్బందులను ఎలా అధిగమించింది.. చివరకు తన కలను ఎలా సాకారం చేసుకుని రాక్‌స్టార్‌గా ఎదిగింది అనేదే ‘విలేజ్ రాక్‌స్టార్స్’ కథ. రీమా దాస్ తెరకెక్కించిన ఈ సినిమా 2018లో ఉత్తమ ఫీచర్ సినిమాగా జాతీయ అవార్డు సాధించింది. అంతేకాక ఈ చిత్రంలో ధును పాత్రలో నటించిన భనిత దాస్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును అందుకుంది. గతేడాది వచ్చిన ‘న్యూటన్’ సినిమాతో పాటు అంతకు ముందు వచ్చిన ‘కోర్ట్’, ‘లయర్స్ డైస్’, ‘విసరానై’, ‘ద గుడ్ రోడ్’ వంటి చిత్రాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. కానీ ఒక్క చిత్రం కూడా ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ఫైనల్ ఐదు చిత్రాల్లో నిలవలేదు. చివరిసారిగా 2001లో ‘లగాన్’ చిత్రం మాత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ఫైనల్ ఐదు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతకుముందు 1958లో ‘మదర్ ఇండియా’, 1989లో ‘సలాం బాంబే’ కూడా టాప్ 5కి వెళ్లాయి. కానీ ఇంతవరకూ ఒక్క భారతీయ చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డ్ రాలేదు. -
ఆస్కార్ ఎంట్రీ!
ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు దాదాపు ఆరు నెలల టైమ్ ఉంది. కానీ ఆ వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రం అప్పుడే మొదలైనట్లు ఉన్నాయి. ‘వాట్ విల్ పీపుల్ సే’ సినిమా 91వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీకి ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. ఇరామ్ హాక్ దర్శకత్వం వహించారు. ఇందులో మారియా, అదిల్ హుస్సేన్ కీలక పాత్రలు చేశారు. ఆస్కార్ విషయాన్ని హుస్సేన్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. ‘‘2019 ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఆఫీషియల్ ఎంట్రీకి మా సినిమా ఎంపికైంది. మా సినిమా ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ విభాగంలో నామినేషన్ దక్కించుకుంటుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు హుస్సేన్. 91వ ఆస్కార్ వేడుకలు 2019 ఫిబ్రవరి 24న జరగుతాయని వార్తలు వస్తున్నాయి. -
ఆస్కార్‌లో మరో కొత్త అవార్డ్.. విమర్శలు
ఆస్కార్.. సినిమా రంగంలో ప్రతి కేటగిరీకి చెందిన వ్యక్తుల కలల అవార్డు. అలాంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్‌ల విభాగంలో కొత్త అవార్డు ఒకటి వచ్చి చేరనుంది. దీనిపై ద అకాడమీ అధికారిక ట్విటర్లో కొంత సమాచారాన్ని షేర్ చేశారు. ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్’అనే కొత్త కేటగిరీని అస్కార్ అవార్డుల్లో చేర్చి మరో అవార్డును అందించనున్నారు. ది అకాడమీ వారి ట్విట్ ప్రకారం.. 2020 నుంచి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు అందుబాటులోకి రానుంది. ఆ ఏడాది ఫిబ్రవరి 9న దీనిపై మరో ప్రకటన వెలువడనుంది. మూడు గంటలపాటు ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రసారం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. విమర్శల వెల్లువ బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరిని ఆస్కార్ అవార్డుల్లో చేర్చడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు అనేది.. ఆస్కార్ అవార్డులను అవమానించడమే. ఇవి ఎంటీవీ అవార్డులు అనుకున్నారా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. బెస్ట్ హర్రర్ ఫిల్మ్ అనే కేటగిరిలో ఆస్కార్ అవార్డు అని ప్రకటన రావడంతో నా నిద్ర ఎగిరిపోయిందంటూ మరొకరు ట్విట్ చేశారు. నా చిన్నప్పుడు విడుదలైన మూవీకి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేస్తానని యుగెన్ లీ యాంగ్ అనే నెటిజన్ పోస్ట్ చేశాడు. Change is coming to the #Oscars. Here's what you need to know: - A new category is being designed around achievement in popular film. - We've set an earlier airdate for 2020: mark your calendars for February 9. - We're planning a more globally accessible, three-hour telecast. pic.twitter.com/oKTwjV1Qv9 — The Academy (@TheAcademy) 8 August 2018 -
నోలన్.. ఆస్కార్ ఎప్పుడు దక్కెన్?
మార్చి 4న ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరీలో విన్నర్‌గా క్రిస్టొఫర్ నోలన్ అనే పేరు వినిపిస్తుందని కోట్లాదిమంది ఆయన అభిమానులు ఎదురుచూశారు. 21వ శతాబ్దపు సూపర్ సక్సెస్ఫుల్ దర్శకుల్లో టాప్ పొజిషన్లో ఒకరుగా ఉంటూ వస్తోన్న క్రిస్టోఫర్ నోలన్, తన ఇరవై ఏళ్ల కెరీర్లో మొదటిసారి ఆస్కార్‌కు బెస్ట్ డైరెక్టర్‌గా ఈ ఏడాదే నామినేట్ అయ్యాడు. ‘డంకర్క్’ పేరుతో తన పంథాకు భిన్నంగా, ఒక వార్ డ్రామాను తెరకెక్కించిన నోలన్, ఈ సినిమాతో అయినా ఆస్కార్ తప్పకుండా అందుకుంటాడన్న ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ రెండు విభాగాల్లో ఏదో ఒక విభాగానికి ఆయన అవార్డు అందుకుంటాడని భావించిన ఫ్యాన్స్‌కు ఈ ఏడాదీ నిరాశే ఎదురైంది. మరి నోలన్ అవార్డు ఎప్పుడు అందుకుంటాడు? ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల డాలర్లు కురిపిస్తోన్న సినిమాలను అందిస్తోన్న నోలన్, ఆస్కార్‌కు అర్హత సాధించేది ఎప్పుడు? నిజానికి నోలన్ గత చిత్రాలతో పోల్చి చూస్తే ‘డంకర్క్’ ఆయనను దర్శకుడిగా అన్నివిధాలా కొత్తగా పరిచయం చేసిన సినిమా. మేకింగ్‌లోనూ మ్యాజిక్ చూపించాడు. అయితే ఆస్కార్స్ మాత్రం గెలెర్మో డెల్టోరోకు మొగ్గు చూపింది. ‘డంకర్క్’ అన్నివిధాలా సరైన సినిమా అనుకున్నప్పుడే అవార్డు మిస్ అయింది. ఇక మళ్లీ నోలన్ సినిమా ఆస్కార్ వద్ద ఎప్పుడు నిలబడుతుందో.. నోలన్ అభిమానుల ఆస్కార్ కల ఎప్పుడు నెరవేరుతుందో!! ∙క్రిస్టొఫర్ నోలన్ -
ఆస్కార్ స్టార్స్
-
ఆస్కార్ వేడుకల్లో విశాఖ వజ్రాభరణాలు
విశాఖ సిటీ: అమెరికాలో జరిగే 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్స వాల్లో విశాఖపట్నానికి చెందిన రెండు జ్యువెలరీ దుకాణాల నుంచి వజ్రాభరణాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి. విశాఖ లోని వైభవ్ జ్యువెలరీస్, పీఎంజే జ్యువెలరీస్ సేకరించిన అరుదైన అందమైన ఫరెవర్ మార్క్ వజ్రాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రెడ్ కార్పెట్ కలెక్షన్లను ఎంపిక చేశారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆభరణాల్ని ఎంపిక చేసి ప్రదర్శిస్తారు. దేశీయ ప్రతిభను అంతర్జాతీయ వేడుకల్లో ఆవిష్కరిస్తామని జ్యువెలరీస్ సంస్థల యాజమాన్యాలు తెలిపాయి. -
ఆస్కారం లేదా?
మార్చి 4, 2018. ఆదివారం. సాయంత్రం 5 గంటలకు.. (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6:30 గంటలకు..) లాస్‌ఏంజిలెస్‌లోని హాలీవుడ్ డాల్బీ థియేటర్లో కన్నుల పండువగా ఒక వేడుక జరుగుతుంది. 10 కోట్లమందికి పైనే ఆ వేడుకను టీవీల్లో, ఆన్లైన్లో చూస్తారని అంచనా. ‘ఆస్కార్ అవార్డ్స్’ పేరుతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్వహించే ఈ వేడుక కోసం సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈసారి జరిగే వేడుక 90వది. మొత్తం ఇరవై నాలుగు విభాగాల్లో అవార్డులిస్తారు. ‘అన్డ్ ది అవార్డ్ గోస్ టూ..’ అనే మాట తర్వాత ఎవరి పేరైతే వినిపిస్తుందో ఆ పేరు ఇంక చరిత్రలో రికార్డయిపోతుంది. మన ఇండియా తరఫున ఇందులో ఎన్ని పేర్లు నమోదయ్యాయి? ఇండియన్ సినిమా ప్రస్తావన ఆస్కార్ వేడుకలో ఎన్నిసార్లొచ్చింది? మన సినిమాకు ఆస్కార్ అందుకునే ఆస్కారం లేదా? ఈ ఏడాది ఆస్కార్ వేడుకను ఇండియన్ ప్రేక్షకుల కోసం స్టార్మూవీస్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 5 (సోమవారం) ఉదయం 5:30 గంటలకు లైవ్ మొదలవుతుంది. ఆస్కార్స్నే ‘అకాడమీ అవార్డ్స్’ అని కూడా అంటారు. 1929లో మొదటిసారి ఆస్కార్ అవార్డులు ప్రారంభమయ్యాయి. ఆస్కార్స్ కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఇస్తారు. మొదట్లో 12 క్యాటగిరీల్లో అవార్డులు ఇచ్చేవారు. ఈ తొంభై ఏళ్లలో మూవీ మేకింగ్‌లో వచ్చిన మార్పులు, మారిన టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఆ అవార్డుల సంఖ్యను 24కు పెంచారు. ఈ ఇరవై నాలుగులోనే వచ్చి చేరిన ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ అనే క్యాటగిరీ ఇంగ్లిష్ భాషలో కాకుండా తెరకెక్కిన ఇతర ప్రపంచ భాషల సినిమాలను కూడా తమలో కలుపుకునేందుకు ఆస్కార్ చేర్చుకున్న ఓ అవార్డు. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ అనే క్యాటగిరీని ఆస్కార్స్ 1956లో మొదటిసారి తీసుకొచ్చింది. ఆ తర్వాతి సంవత్సరం నుంచే ఇండియన్ సినిమా ఈ క్యాటగిరీ కింద ఆస్కార్‌కు ఎంట్రీలను పంపిస్తూనే ఉంది. 1957నుంచి 2017 వరకూ మొత్తం యాభై సినిమాలను ఆస్కార్‌కు ఎంట్రీలుగా పంపింది ఇండియన్ సినిమా. 1984 తర్వాత ఒక్క 2003లో తప్పితే క్రమం తప్పకుండా ఇండియా ఆస్కార్‌కు ఎంట్రీలను పంపుతూనే ఉంది. ఆస్కార్ అవార్డులకు ఉన్న ప్రాముఖ్యత, పేరు, క్రేజ్ దృష్ట్యా ఒక సినిమా ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ క్యాటగిరీలో అవార్డు అందుకుంటే ఆ సినిమాను దేశానికే పేరు తెచ్చే సినిమాగా చూస్తారు. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాలూ ఈ క్యాటగిరీకి తమ సినిమాలను ఎంట్రీగా పంపడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి, అఫీషియల్‌గా సెలెక్ట్ చేస్తాయి. ఇండియా తరఫున ఆస్కార్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) సంస్థ ఎంట్రీలను పంపిస్తుంది. దేశవ్యాప్తంగా ఎఫ్ఎఫ్ఐకి వచ్చే సినిమాలను ఒక కమిటీ చూసి, బెస్ట్ అనుకున్న సినిమాను ఇండియా నుంచి ఆస్కార్‌కు ఎంట్రీగా పంపిస్తుంది. 2017 సంవత్సరానికి సంబంధించి ఇండియా తరఫున ‘న్యూటన్’ అనే సినిమా ఆస్కార్‌కు ఎంట్రీగా వెళ్లింది. అయితే ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో న్యూటన్ చోటు దక్కించుకోలేదు. వందకు పైగా దేశాలు పంపించే సినిమాల్లో ఐదు సినిమాలను ఫైనల్ లిస్ట్‌లో నామినేషన్స్‌గా తీసుకుంటుంది ఆస్కార్. ఇండియా నుంచి వెళ్లిన సినిమాల్లో ఇప్పటివరకూ అలా ఫైనల్ నామినేషన్స్ దక్కించుకున్న సినిమాలు మూడే మూడు.. మదర్ ఇండియా (1957), సలామ్ బాంబే (1988), లగాన్ (2001). అయితే ఈ మూడు సినిమాలూ ఆస్కార్‌ను మాత్రం అందుకోలేకపోయాయి. మిగతా నలభై ఏడు సినిమాలు ఎంట్రీలుగానే వెళ్లి వెనక్కి వచ్చేశాయి. ఈ నలభై ఏడులో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా స్వాతిముత్యం (1986). ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి వెళ్లిన ఫస్ట్ సినిమా మదర్ ఇండియా వెళ్లడమే నామినేషన్ దక్కించుకుంది. అయితే చివర్లో ఒకే ఒక్క ఓటు తేడాతో అవార్డును కోల్పోయింది. ఇక ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపిన లగాన్ ఆస్కార్ తప్పకుండా అందుకుంటుందన్న ఆశలు రేకెత్తించినా, ఆ సినిమా కూడా అదృష్టానికి నోచుకోలేదు. లగాన్ తర్వాత ఇన్నేళ్లైనా ఒక్క సినిమా కూడా ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్ అవ్వలేదు. ఈ క్యాటగిరీలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఇటలీ దేశం 14 అవార్డులను సొంతం చేసుకుంది. ఫ్రాన్స్ (12), స్పెయిన్ (4), జపాన్ (4), స్వీడన్ (3) టాప్ ఫైవ్‌లో ఉన్నాయి. అవార్డులు, నామినేషన్స్ కలిపిచూస్తే ఇండియా (0 అవార్డులు, 3 నామినేషన్లు) 33వ స్థానంలో ఉంది. మనకు ఆస్కారం లేదా? సంవత్సరానికి వెయ్యికి పైగా సినిమాలను నిర్మిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమగా పేరున్న ఇండియన్ సినిమా, ఆస్కార్‌లో మాత్రం 60 ఏళ్ల కాలంలో ఒక్క అవార్డు కూడా దక్కించుకోలేకపోవడం బాధాకరం. మరి మన సినిమా ఆస్కార్ దగ్గర నిలబడలేదా? మన సినిమాకు అంత సీన్ లేదా? అంటే సరైన సమాధానం నిజంగా లేదు. ప్రపంచ సినిమాతో పోటీ పడగల సినిమాలు మనదగ్గర రావడం లేదన్నది, ఇక్కడ వచ్చేవన్నీ కమర్షియల్ సినిమాలే అన్న వాదన ప్రధానంగా వినిపిస్తోంది. అదేవిధంగా ఎఫ్ఎఫ్ఐ ఏటా పంపించే సినిమాల విషయంలో కూడా ఎప్పుడూ వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. ఆస్కార్ వద్ద నిలబడే సత్తా ఉన్న సినిమాలను తప్పించి మరీ, అర్హతలేని సినిమాలను పంపిస్తున్నారన్న వివాదం ఎక్కువగా వినిపిస్తూంటుంది. దీనికి పరిష్కారంగా నేషనల్ అవార్డ్ దక్కించుకున్న సినిమానే ఆస్కార్‌కు పంపిస్తే బాగుంటుందన్న ఒక ప్రతిపాదన వచ్చినా, దాన్ని కూడా పక్కనబెట్టేశారు. ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో వందకు పైగా దేశాలు పోటీపడే అవార్డుకు మన సినిమా ఎంపికవ్వాలంటే? ప్యారలల్ సినిమాకు మార్కెట్ పెరగాలన్నది సినిమా పెద్దలు పరిష్కారంగా చెబుతున్నారు. అలాంటి సినిమాలకు ఇక్కడ మార్కెట్ లేకపోవడంతో ప్యారలల్ సినిమాలు రావడం లేదని, ఒకవేళ వచ్చినా క్వాలిటీలో రాజీపడే సినిమాలే వస్తున్నాయన్నది చాలామంది చెప్పే మాట. భారీ బడ్జెట్ సినిమాల వైపే మొగ్గు చూపుతోన్న పెద్ద నిర్మాణ సంస్థలు కూడా కంటెంట్ ఉన్న, కొత్తదనమున్న క్వాలిటీ సినిమాలను ప్రోత్సహిస్తే ఫలితాలు ఉంటాయని ఆశించొచ్చు. కరణ్ జోహర్, అనురాగ్ కశ్యప్, యూటీవీ పిక్చర్స్.. ఇలా పేరున్న నిర్మాతలు, నిర్మాణ సంస్థలు కలిసి చేసిన ‘లంచ్‌బాక్స్’ లాంటి ప్రయోగాలు పెరిగితే, ఆస్కార్ బరిలో నిలిచి, మన సినిమా అవార్డు అందుకునేందుకు ఎంతో దూరం లేదని ఆశించొచ్చు. ముందు ఆ దిశగా ఇండియన్ సినిమా అడుగులు వెయ్యాలి! స్పీల్బర్గ్ దేవుడికంటే ఎక్కువ! దర్శకుడు స్పీల్బర్గ్ను తమ ఇన్స్పిరేషన్గా చెప్పుకునేవాళ్లు ఎందరో! ఆయన సినిమాలన్నీ కలిపి ఇప్పటివరకూ ఆస్కార్ వద్ద వివిధ క్యాటగిరీల్లో 112 నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఇది అతిపెద్ద రికార్డ్! అలాగే అవార్డు వేదిక మీద విన్నర్స్ ఇచ్చే థ్యాంక్యూ స్పీచ్‌లో కూడా స్పీల్బర్గ్దే రికార్డు. థ్యాంక్యూ స్పీచ్‌లలో ఆయన పేరు 43సార్లు వినిపించింది. ఈ లిస్ట్‌లో దేవుడు (19) కూడా స్పీల్‌బర్గ్‌కు చాలా దూరంలోనే ఉండిపోయాడు. ఆస్కార్‌కు అర్హత పొందేదెలా? ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’, కొన్ని హానరరీ అవార్డులను మినహాయించి మిగతా ఆస్కార్ అవార్డులన్నీ హాలీవుడ్ సినిమాలకు, ఆ సినిమాలకు పనిచేసిన వాళ్లకే ఇస్తారు. ఆస్కార్‌కు అర్హత పొందాలంటే ఒక సినిమా.. 40 నిమిషాలకు మించిన నిడివి ఉండాలి ∙లాస్ ఏంజెలెస్‌లోని ఏదో ఒక కమర్షియల్ థియేటర్లో వారంరోజుల పాటు ఆ సినిమా ఆడాలి ∙థియేటర్లో కాకుండా నేరుగా డీవీడీల్లో, ఆన్లైన్లో విడుదలైన సినిమాలను లెక్కలోకి తీసుకోరు. ఆస్కార్ ఎలా ఇస్తారు? ఆస్కార్ అవార్డు పొందేందుకు అర్హత ఉన్న సినిమాలను నిర్మాతలనుంచి ఆస్కార్ కమిటీ ఆహ్వానిస్తుంది. అలా ఏటా మూడొందలకుపైనే సినిమాలు ఆస్కార్ పరిశీలనకు వస్తాయి. కమిటీ ఈ సినిమాలను పరిశీలించి, వివిధ క్యాటగిరీల్లో నామినేషన్స్ ప్రకటిస్తుంది. సాధారణంగా జనవరి నెలలో ఈ నామినేషన్స్ ప్రకటిస్తారు. ఫిబ్రవరి నెలాఖర్లో, మార్చి మొదటివారంలో విజేతలను ఆస్కార్ వేడుకలో ప్రకటిస్తారు. విజేతలను ఎంపిక చేయడానికి ఆస్కార్‌లో ఆరు వేలకు పైనే మెంబర్స్ ఉంటారు. ఓటింగ్ ద్వారా ఈ మెంబర్స్ విజేతలను ఎంపిక చేస్తారు. ఆస్కార్ బిగ్ ఫైవ్.. ఆస్కార్‌లో ఉన్న అన్ని క్యాటగిరీల్లోకి టాప్ ఫైవ్ అనదగ్గవి.. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్, అడాప్టెడ్). ఈ ఐదు అవార్డులను కలిపి బిగ్ ఫైవ్ అంటారు. ఇప్పటివరకూ బిగ్ ఫైవ్ అవార్డులను సొంతం చేసుకున్న సినిమాలు మూడు మాత్రమే. ఇట్ హ్యాపెండ్ వన్ నైట్ (1934), వన్ ఫ్లూ ఓవర్ ది కుక్కూస్ నెస్ట్ (1975), ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్ (1991). ఆ సీల్ వెనుక పెద్ద కథ.. ఆస్కార్ సీల్డ్ ఎన్వలప్ వెనుక ఒక కథ ఉంది. 1939కి ముందు ప్రత్యేకంగా ఆస్కార్ విజేతల పేర్లు దాచడమంటూ ఉండేది కాదు. ప్రెస్‌కి కూడా ఆ పేర్లు ముందే ఇచ్చేసి, రాత్రి పదకొండు తర్వాతే ప్రింట్‌కి పంపించాలన్న నిబంధన పెట్టేవారు. అయితే 1939లో న్యూయార్క్ మ్యాగజైన్ రాత్రి పదకొండుకు ముందే విజేతల పేర్లు ప్రకటించడంతో 1940 నుంచి సీల్డ్ ఎన్వలప్‌ను పట్టుకొచ్చారు. 120 గ్రాములుండే గోల్డ్ ఎన్వలప్లో విజేతల పేర్లు రాసి ఉంటాయి. దాన్ని సీల్ చేసి ఉంచుతారు. అందులో ఏ పేరు ఉంటుందన్న విషయం ఆస్కార్ కమిటీకి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆస్కార్ ట్రోఫీ అంతా బంగారం కాదు! ఆస్కార్ ప్రతిమను ఎప్పుడైనా సరిగ్గా గమనించారా? బంగారువర్ణంలో ఉండే ఆ ట్రోఫీని నిజానికి కంచుతో చేస్తారు. కత్తిని నిలువునా పట్టుకున్న ఒక సైనికుడి రూపంలో ఉన్న బొమ్మ, ఫిల్మ్ రీల్‌పై నిలబడి ఉంటుంది. ఆ బొమ్మకంతా 24 క్యారెట్ బంగారంతో కోటింగ్ ఇస్తారు. పదమూడున్నర అంగుళాల పొడవుండే ఆస్కార్ ట్రోఫీ, 3.85 కిలోల బరువు ఉంటుంది. సెడ్రిక్ గిబ్బన్స్ ఈ ఆస్కార్ ట్రోఫీని డిజైన్ చేశాడు. ఆస్కార్‌ను అమ్ముకోవచ్చా? ఆస్కార్‌ను కళాకారులు తమకిచ్చిన గౌరవంగా భావిస్తారు. అలాంటి ఆస్కార్‌ను ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అమ్మేసుకునే అధికారం విజేతలకు లేదు. ఈమేరకు ఆస్కార్స్ వారిచేత ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకుంటుంది. ఆస్కార్‌ను ఓపెన్ మార్కెట్లో అమ్మేయాలని అనుకునేవారు ముందుగా ఆస్కార్‌కు ఒక్క డాలర్‌కు ఆఫర్ చేయాల్సి ఉంటుంది. 1950లో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. ఆస్కార్ సినిమాల్లో ఇండియా ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాల్లో కొన్ని ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. ‘గాంధీ’, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాలు బిగ్ ఫైవ్ అవార్డుల్లో కీలక అవార్డులు గెలిచాయి. ‘గాంధీ’, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఈ రెండు సినిమాలూ కీలకమైన బెస్ట్ పిక్చర్ అవార్డును దక్కించుకుంటే, ‘లైఫ్ ఆఫ్ పై’ నామినేషన్ వరకూ వచ్చింది. మన ఆస్కార్ విజేతలు..! ఇండియన్ సినిమా ఆస్కార్ వద్ద ప్రతిసారీ ఖాళీ చేతులతోనే వెనక్కి వచ్చినా, ఇండియన్ స్టార్స్ కొందరు ఆస్కార్ అందుకొని మన సినిమా పేరును ప్రపంచం మొత్తం వినిపించారు. హాలీవుడ్ సినిమాలకు పనిచేయడం ద్వారా, ఆస్కార్స్‌లో వివిధ క్యాటగిరీల్లో వీళ్లు అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ అందుకున్న భారతీయులు వీళ్లే.. భాను ఆతేయ: 1983లో ‘గాంధీ’ సినిమాకుగానూ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌కు ఆస్కార్ అవార్డు అందుకుంది. ఇండియా నుంచి ఫస్ట్ ఆస్కార్ అందుకున్న వ్యక్తి కూడా ఈమే కావడం విశేషం. సత్యజిత్‌రే: ఇండియన్ సినిమా పేరును ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన దర్శకుడు సత్యజిత్‌రే సినీ పరిశ్రమకు అందించిన సేవలను గుర్తిస్తూ 1992లో ఆస్కార్స్ ఆయనకు ‘అకాడమీ హానరరీ అవార్డ్’ను ప్రదానం చేసింది. ఎ.ఆర్.రెహమాన్: ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథతో తెరకెక్కిన స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాకుగానూ ఎ.ఆర్. రహమాన్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సాంగ్ అవార్డులను అందుకున్నాడు. గుల్జార్: స్లమ్‌డాగ్ మిలియనీర్లోనే బెస్ట్ సాంగ్‌కు ఎ.ఆర్.రహమాన్‌తో కలిసి అవార్డును పంచుకున్నాడు గుల్జార్. రసుల్ పోకుట్టి: స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకే రసుల్ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అవార్డు అందుకున్నాడు. క్యూట్ అండ్ స్వీట్ స్పీచ్ 1976లో బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకున్న లూయీజ్ ఫ్లెచర్, థ్యాంక్యూ స్పీచ్ మధ్యలో.. ‘‘నన్ను క్షమించాలి..’’ అంటూ మూగ భాషలో సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టింది. లూయీజ్ తల్లిదండ్రులిద్దరూ డెఫ్ అండ్ మ్యూట్. వాళ్లకు అర్థమయ్యేలా ఆమె ఆ భాషలో వారికి థ్యాంక్స్ చెప్పింది. 1993లో తన 11 ఏళ్ల వయసులో బెస్ట్ యాక్ట్రెస్ సపోర్టింగ్ రోల్ అవార్డు అందుకున్న అన్నా పాక్విన్, థ్యాంక్యూ స్పీచ్‌లో చాలాసేపు ఏం మాట్లాడకుండా, నవ్వుతూ, ఏడుస్తూ, చిన్న చిన్న సౌండ్స్ చేస్తూ నిలబడింది. ఆ ఈవెంట్‌కు వచ్చిన వారంతా నవ్వుతూంటే అన్నా అలాగే నిలబడింది. కొద్దిసేపయ్యాకే ఆమె ‘‘థ్యాంక్యూ..’’ అంటూ నాలుగు పేర్లు తలుచుకుంది. ఈ రెండూ ఆస్కార్‌లో క్యూట్ అండ్ స్వీట్ అనిపించుకున్న స్పీచ్‌ల లిస్ట్‌లో టాప్‌లో ఉంటాయి. ఆస్కార్ వేడుకలో మన మెగాస్టార్! ఆస్కార్ అవార్డు వేడుకలో కమిటీ ఆహ్వానించిన వ్యక్తులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. 1986లో జరిగిన 59వ ఆస్కార్ అవార్డు వేడుకలకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఆయన ఆ వేడుకకు హాజరయ్యాడు కూడా! ఆస్కార్ రికార్డులు రికార్డు నంబర్ అవార్డులు గెలుచుకున్న సినిమాలు: బెన్హర్ (11), టైటానిక్ (11), లార్డ్ ఆఫ్ ది రింగ్స్ – ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ (11) రికార్డు నంబర్ నామినేషన్స్ దక్కించుకున్న సినిమాలు: ఆల్ ఎబౌట్ ఈవ్ (14), టైటానిక్ (14), లా లా లాండ్ (14) నామినేట్ అయిన అన్ని క్యాటగిరీల్లో అవార్డు కొట్టిన సినిమా: లార్డ్ ఆఫ్ ది రింగ్స్ – ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ (11) రికార్డ్ నంబర్ ఆస్కార్లు అందుకున్న వ్యక్తి: వాల్ట్ డిస్నీ (22) బెస్ట్ డైరెక్టర్‌గా ఎక్కువ అవార్డులు అందుకున్న వ్యక్తి: జాన్ ఫోర్డ్ (4 – ది క్వైట్ మ్యాన్, హవ్ గ్రీన్ వాజ్ మై వ్యాలీ, ది గ్రేప్స్ ఆఫ్ వ్రాత్, స్టేజ్‌కోచ్, ది ఇన్ఫార్మర్ సినిమాలకు) బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్న ఏకైక మహిళ: కాథ్రిన్ బైగ్లో (1 – ది హర్ట్ లాకర్ సినిమాకు) బెస్ట్ యాక్ట్రెస్‌గా ఎక్కువ నామినేషన్స్ దక్కించుకున్న వ్యక్తి: మెరిల్ స్ట్రీప్ (21) అతిచిన్న వయసులో ఆస్కార్ గెలుచుకున్న వ్యక్తి: టేటుమ్ ఓనీల్ (1974లో 10 ఏళ్ల 148 రోజుల వయసులో ‘పేపర్ మూన్’ సినిమాకుగాను ‘బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్’ క్యాటగిరీలో టేటుమ్ ఓనీల్ ఆస్కార్ అందుకుంది.) అతిపెద్ద వయసులో ఆస్కార్ గెలుచుకున్న వ్యక్తి: క్రిస్టొఫర్ ప్లమ్మర్ (2012లో 82 ఏళ్ల 75 రోజుల వయసులో ‘బిగినర్స్’ సినిమాకుగాను ‘బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్’ క్యాటగిరీలో ప్లమ్మర్ ఆస్కార్ అందుకున్నాడు.) -
గెలిచేదెవరు..?
-
ఆస్కార్.. కొత్త బెస్ట్ యాక్టర్ ఎవరో..?
ఈరోజుకి ఇరవై రోజులు ముందుకెళ్తే లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఓ పెద్ద వేడుకను సినీ అభిమానులంతా చూస్తూ కూర్చుంటారు. ఆ వేడుక పేరే ఆస్కార్స్. హాలీవుడ్ అంతా ఈ వేడుక కోసం ఎదురు చూస్తోంది. ‘‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’’ అన్న లైన్ ఇరవై నాలుగుసార్లు వినిపిస్తుంది ఆ రోజు. అందులో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ అవార్డుల తర్వాత ఆ లైన్లో అందరూ ఎదురు చూసే మూడో విభాగం బెస్ట్ యాక్టర్. ఎప్పట్లానే ఈసారి కూడా బెస్ట్ యాక్టర్ లిస్ట్‌లో గట్టి పోటీనే ఉంది. ఐదుగురిలో ఇద్దరు ఫస్ట్ టైమ్ నామినేషన్ పొందినవారు కావడం ఇక్కడ విశేషం. అలాగే వాళ్లిద్దరిలోనే ఒకరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు లెక్కలేస్తూ ఉండడం మరింత విశేషం. నామినేషన్స్ దక్కించుకున్నది ఎవరెవరో చూద్దాం... తిమోతీ ఛాలమేట్ (‘కాల్ మీ బై యువర్ నేమ్’) ఈ ఏడాది బెస్ట్ యాక్టర్‌కు నామినేషన్స్ దక్కించుకున్నవారిలో చిన్నవాడు తిమోతీ. 22 ఏళ్లు ఇతనికి. ఇంతకుముందు ఎప్పుడూ నామినేషన్ దక్కించుకోలేదు. అవార్డు గనక ఇతనికే వస్తే అతి చిన్న వయసులో బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ అందుకున్నవాడిగా రికార్డులకెక్కుతాడు. ‘కాల్ మీ బై యువర్ నేమ్’ సినిమాలో తిమోతీ ఒక టీనేజ్ బాయ్‌గా నటించాడు. అందరూ అద్భుతంగా నటించిన సినిమాలో తిమోతీ వాళ్లందరినీ మరిపించేలా నటించాడని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్కార్ రేసులో అందరికంటే తిమోతీనే ముందున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఆస్కార్ అతన్ని వరిస్తుందా? డేనియ్ డే లూయీజ్ (‘ది ఫాంటమ్ థ్రెడ్’) 1950 కాలంలో నడిచే ‘ది ఫాంటమ్ థ్రెడ్’ అనే సినిమాలో ఓ ఫేమస్ డ్రెస్మేకర్గా లూయిజ్ కనిపించాడు. ఈ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లూయిజ్ ఇప్పటికే మూడుసార్లు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. అతని నటన గురించి ప్రత్యేకించి ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ‘మై లెఫ్ట్ ఫూట్’ (1990)తో 18 ఏళ్ల క్రితమే ఆస్కార్ అందుకొని అప్పట్నుంచీ ఆయన తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నాడు. ‘దేర్ విల్ బి బ్లడ్’ (2003), ‘లింకన్’ (2013) తర్వాత ఇప్పుడు మళ్లీ ఆస్కార్ కొడితే లూయీజ్కి ఇది నాలుగో ఆస్కార్ అవుతుంది. ఇవి కాకుండా లూయిజ్.. ‘నేమ్ ఆఫ్ ది ఫాదర్’ (1994), ‘గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్’ (2003) సినిమాలకు నామినేషన్స్ దక్కించుకున్నాడు. డేనియల్ కలూయా (‘గెట్ ఔట్’) డేనియల్ కలూయా బెస్ట్ యాక్టర్‌గా నామినేషన్స్ దక్కించుకున్న చిన్నవాళ్ల లిస్ట్‌లో ఉంటాడు. ఇతనికిప్పుడు 28 ఏళ్లు. ‘గెట్ ఔట్’ సినిమాకు గాను డేనియల్ కలూయా ఈ నామినేషన్ దక్కించుకున్నాడు. ఇది ఇతనికి ఫస్ట్ నామినేషన్. ఒకవేళ ఇతనే గనక అవార్డు దక్కించుకుంటే బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ అందుకున్న అతి చిన్నవాడిగా రికార్డులకెక్కుతాడు. తెల్లజాతి అమ్మాయిని ప్రేమించిన నల్లజాతి అబ్బాయి, ఆ అమ్మాయి ఇంటికి వెళ్లడం, వాళ్ల ఫ్యామిలీని కలుసుకోవడం.. ఈ క్రమంలో కథ రకరకాల మలుపులు తిరగడమే సినిమా. డేనియల్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లిస్ట్‌లో గట్టి పోటీ ఇచ్చేట్టే కనిపిస్తున్నాడు. తిమోతీ, కలూయా.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఆస్కార్ దక్కించుకుంటారని ఎక్కువమంది అంచనా. ఎవరు దక్కించుకున్నా ఆస్కార్ అందుకున్న చిన్న వయసు యాక్టర్‌గా రికార్డు దక్కించుకుంటారు. గ్యారీ ఓల్డ్మన్ (‘డార్కెస్ట్ అవర్’) ‘టింకర్ టైలర్ సోల్జర్ స్పై’ (2012) సినిమాకుగాను గతంలో గ్యారీ ఓల్డ్మన్ ఒకసారి ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు. కాకపోతే అప్పుడు అవార్డు ఆయనను వరించలేదు. ఈసారి ‘డార్కెస్ట్ అవర్’తో ఓల్డ్మన్ తన రెండో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నాడు. ఈసారి గ్యారీ ఓల్డ్మన్ ఆస్కార్‌ను అందుకుంటాడా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఈ మధ్యే ఇదే సినిమాకుగాను బెస్ట్ యాక్టర్‌గా గ్యారీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నాడు. దీంతో ఆస్కార్ కూడా ఈయన్నే వరిస్తుంది అనేవారు కూడా చాలామందే ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. అప్పటి బ్రిటీష్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ తీసుకునే ఒక కీలక నిర్ణయం చుట్టూ సినిమా నడుస్తుంది. డెంజెల్ వాషింగ్టన్ (‘రోమన్ జె. ఇజ్రాయెల్ ఎస్క్’) డేనియల్ లూయీజ్ తర్వాత ఈ లిస్ట్‌లో ఆస్కార్‌కు దగ్గరి వ్యక్తి అంటే డెంజెల్ వాషింగ్టన్. గతంలో గ్లోరీ (1989), ట్రైనింగ్ డే (2002) సినిమాలకు ఆస్కార్ అందుకున్న డెంజెల్, ఇవి కాకుండా ఎనిమిది నామినేషన్స్ కూడా దక్కించుకున్నాడు. నామినేషన్స్, అవార్డులు కలిపి చూస్తే ఈ లిస్ట్‌లో ఆస్కార్‌కు బాగా దగ్గరి వ్యక్తి అంటే డెంజెల్ అనే చెప్పుకోవాలి. తన జీవితాన్నంతా న్యాయం కోసం పోరాడటానికే అంకితం ఇచ్చేసిన న్యాయవాది పాత్రలో డెంజిల్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ఆస్కార్ 2018 ‘బెస్ట్ యాక్టర్ అవార్డు’ ఎవరికి వస్తుందనే దానిపై ఎన్ని చర్చలు జరిగినా, అసలు ఫలితం తేలాలంటే మార్చి 4 వరకూ ఆగాల్సిందే! ఈ ఐదుగురూ ఎవరికి వారే గట్టి పోటీ ఇచ్చేవాళ్లే కావడంతో ‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’ అనే టైమ్‌కి ఎవరు లేచి నిలబడి, స్టేజ్ వరకూ వెళ్లి అవార్డు అందుకుంటారో వేచి చూడాలి!! డేనియ్ డే లూయీజ్, డెంజెల్ వాషింగ్టన్ -
ఆస్కార్ 2018 ఉత్తమ నటి ఎవరో?
ఆస్కార్.. ఆస్కార్.. ఆస్కార్ అని హాలీవుడ్ అంతా జనవరి మొదట్నుంచీ ఒకే పాట పాడుతోంది. మార్చి 4న ఆస్కార్ అవార్డులను ప్రకటించేవరకూ ఈ పాట రిథమిక్‌గా మోగుతూనే ఉంటుంది. మన దగ్గరా హాలీవుడ్ సినిమా అభిమానులు ఈ పాటను అందుకుంటున్నారు. ఏ సినిమా బెస్ట్ పిక్చర్ అవుతుంది? బెస్ట్ యాక్టర్ ఎవరవుతారు? బెస్ట్ యాక్ట్రెస్‌గా ఎవరు అవార్డు అందుకుంటారు? అన్నీ చర్చలే! నామినేషన్స్ కూడా అనౌన్స్ అయ్యాక ఈ చర్చ ఇంకా తారాస్థాయికి చేరిపోయింది. బెస్ట్ యాక్ట్రెస్ (ఉత్తమ నటి)గా నామినేషన్స్ ఎవరెవరు దక్కించుకున్నారో, వారిలో ఎవరికి అవార్డు రావడానికి ఎక్కువ స్కోప్ ఉందో చూద్దాం.. సాలీ హాకిన్స్ (చిత్రం: ది షేప్ ఆఫ్ వాటర్) ‘ది షేప్ ఆఫ్ వాటర్’.. ఈ ఏడాది బెస్ట్ పిక్చర్ జాబితాలో అవార్డు అందుకునేందుకు గట్టి పోటీనిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో హాకిన్స్ నటన కూడా ది బెస్ట్ అనిపించుకుంది. ఒక్క డైలాగ్ కూడా ఉండదు హాకిన్స్‌కు ఈ సినిమాలో. ఒక గవర్నమెంట్ ల్యాబ్‌లో మూగ భాషతోనే చెప్పాలనుకున్న విషయాలు చెప్తుంది. ఈ పాత్రలో హాకిన్స్ నటన ‘అద్భుతం’ అన్న కితాబులు అన్ని వైపుల నుంచీ వచ్చాయి. నామినేషన్స్ దక్కించుకున్న ఐదుగురిలో ఒకరైన హాకిన్స్‌కు అవార్డు దక్కే అవకాశాలు చాలానే ఉన్నాయి. గతంలో ‘బ్లూ జాస్మిన్’ (2013) అనే సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ రోల్‌కు ఆస్కార్‌కు నామినేట్ అయింది హాకిన్స్. ‘ది షేప్ ఆఫ్ వాటర్’కి గనక ఆమె అవార్డు అందుకుంటే ఉత్తమ నటిగా అదే ఆమెకు మొదటి అవార్డు. ఫ్రాన్సిస్ మెక్డొర్మాండ్ చిత్రం: త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి ‘త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’.. ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా బెస్ట్ పిక్చర్‌గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్నాక మరింత పాపులర్ అయింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంటే గొప్పే అని అన్నవారంతా, ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే సినిమాగా కూడా చూస్తున్నారు. ఇందులో ఫ్రాన్సిస్ మెక్డొర్మాండ్ వ్యవస్థపై పోరాడే ఓ తల్లి పాత్రలో కనిపించింది. కూతురును రేప్ చేసి, మర్డర్ చేస్తే, దానిపై తనకు కావాల్సిన సమాధానాల కోసం, జరగాల్సిన న్యాయం కోసం పోరాడే తల్లి పాత్రలో ఫ్రాన్సిస్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు ఆ పాత్రతోనే ఒక ప్రత్యేకమైన డెప్త్ వచ్చింది అంటారు హాలీవుడ్ సినీ పండితులు. ఫ్రాన్సిస్ గతంలో ‘మిసిస్సిపి బర్నింగ్’ (1999), ‘ఆల్మోస్ట్ ఫేమస్’ (2001), ‘నార్త్ కంట్రీ’ (2006) సినిమాలకు బెస్ట్ యాక్ట్రెస్ సపోర్టింగ్ రోల్లో ఆస్కార్‌కు నామినేట్ అయింది. ‘ఫార్గో’ (1997)కి ఉత్తమ నటిగా ఒక అవార్డు కూడా అందుకుంది. ఇప్పుడు 2018లోనూ ఆస్కార్ కొడితే ఆమెకిది రెండో ఆస్కార్! మార్గో రాబీ (చిత్రం: ఐ, టోన్యా) ‘ఐ, టోన్యా’.. ఫిగర్ స్కేటర్ టోన్యా హార్డింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఆమె జీవితంలో కాంట్రవర్సీగా నిలిచిన కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ సాగే ఈ సినిమాలో టోన్యా పాత్రలో మార్గో రాబీ నటించింది. మార్గో నటనే ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతోనే మార్గో నటిగా ఓ గుర్తింపు కూడా తెచ్చుకుంది. ‘ఐ, టోన్యా’ ఆమెకు మొట్టమొదటి ఆస్కార్ నామినేషన్. బెస్ట్ యాక్ట్రెస్ నామినేషన్స్‌లో ఉన్న మిగతావారితో పోల్చితే మార్గోపై అంచనాలు తక్కువే ఉన్నా, మంచి పోటీ ఇచ్చే అవకాశమైతే ఉంది. సీర్సా రోనాన్ (చిత్రం: లేడీ బర్డ్) ‘లేడీ బర్డ్’.. ఇటు బాక్సాఫీస్ పరంగా, అటు విమర్శకుల ప్రశంసల పరంగా 2017లో సూపర్ హిట్ అనిపించుకున్న సినిమాల్లో ఒకటి. ఇందులో ఒక హైస్కూల్ స్టూడెంట్ పాత్రలో రోనాన్ నటన అద్భుతం అనే కితాబులిచ్చారంతా. కమింగ్ ఆఫ్ ఏజ్ ప్రేమలు, వాళ్ల ఆలోచనల చుట్టూ కథ తిరుగుతుంది. రోనాన్ తప్ప ఇంకెవ్వరూ ఈ పాత్రలో నటించలేరు అన్నట్టుగా చేసిందామె. ఆస్కార్ అవార్డు నామినేషన్స్ పొందిన ఐదుగురిలో రోనాన్కు అన్ని విధాలా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకునే అర్హత, అవకాశం ఉన్నాయి. ఇది రోనాన్కు ఫస్ట్ ఆస్కార్ నామినేషన్. ఒకవేళ రోనాన్ ఆస్కార్ కొడితే, చిన్న వయసులో బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకున్న క్యాటగిరీలో నాలుగో స్థానంలో చేరుతుందామె. ఆమె వయసు ఇప్పుడు 23 సంవత్సరాలు. మెరిల్ స్ట్రీప్ (చిత్రం: ది పోస్ట్) ‘ది పోస్ట్’.. ఎంతోమంది దర్శకులకు ఇన్స్పిరేషన్ అయిన స్పీల్బర్గ్ తీసిన సినిమా. గత డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పట్నుంచీ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంది. స్పీల్బర్గ్ తన స్థాయికి తగ్గ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ‘ది పోస్ట్’. ఇక ఇందులో మెరిల్ స్ట్రీప్ నటన మేజర్ హైలైట్స్‌లో ఒకటి. వియత్నాం వార్ టైమ్‌లో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ను బయటపెట్టే కథతో ఆసక్తికరంగా నడుస్తుంది ‘ది పోస్ట్’. ఇందులో మెరిల్ ఓ జర్నలిస్ట్‌గా కనిపిస్తుంది. మెరిల్ ఇప్పటివరకూ చేసిన వాటిల్లో ది బెస్ట్ అనేంతగా విమర్శకులను మెప్పించిందీ పాత్రతో! ఇప్పటికే బెస్ట్ యాక్ట్రెస్‌గా రెండు, సపోర్టింగ్ రోల్లో ఒక ఆస్కార్ పొందిన మెరిల్, ఈ రెండు క్యాటగిరీల్లో మొత్తం 17 నామినేషన్స్ దక్కించుకున్నారు ఇప్పటివరకూ. ఆస్కార్ లిస్ట్‌లో అందరికీ గట్టి పోటీ ఇవ్వగల మెరిల్ స్ట్రీప్ ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ లిస్ట్ మొత్తంలో ఎక్కువ క్రేజ్ మెరిల్ స్ట్రీప్కే కనిపిస్తోంది. అయితే ఆస్కార్ రిజల్ట్ ఎలా ఉంటుందన్నది మార్చి 4 వరకూ చెప్పలేం!! -
ఇలా కనిపించి అలా మాయం!
ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌ని హాలీవుడ్ ప్రముఖులతో పాటు మన ప్రియాంకా చోప్రా కూడా ప్రకటించాల్సి ఉండగా అది జరగలేదు. నటుడు–దర్శకుడు ఆండీ సెర్కిస్, నటి టిఫ్ఫనీ హ్యాడిష్ నామినేషన్స్ ప్రకటించారు. ప్రియాంకా చోప్రా ఒక వీడియో ద్వారా ఉత్తమ సినిమాటోగఫ్రీ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న వారి గురించి పేర్కొన్నారు. అంతే.. అదే వీడియోలో సల్మా హయక్, మిచెల్లీ రోట్రిగ్యూజ్, రెబెల్ విల్సన్ వంటి హాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. కాగా, ప్రియాంకా చోప్రా సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో బిజీగా ఉన్నారు. ‘బేవాచ్’ తర్వాత ఆమె హాలీవుడ్లో మరో చిత్రం చేస్తున్నారు. ‘ఎ కిడ్ లైక్ జేక్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికే ఆమె అక్కడికి వెళ్లారు. ఈ ఫెస్టివల్ యూఎస్‌లో జరుగుతోంది. నామినేషన్స్ ప్రకటించింది కూడా యూఎస్‌లోని లాస్ ఏంజిల్స్‌లోనే. కాకపోతే సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నది న్యూయార్క్‌లో. అక్కణ్కుంచి లాస్ ఏంజిల్స్‌కి ఫ్లైట్‌లో వెళ్లినా కనీసం ఐదు గంటలు పడుతుందట. ఆ టైమ్ కేటాయించలేక నామినేషన్ అనౌన్స్మెంట్కి ప్రియాంక వెళ్లలేకపోయారని తెలుస్తోంది. అందుకే, వీడియోను విడుదల చేశారని సమాచారం. ఆ వీడియోలో ఇలా కనిపించి అలా మాయమయ్యారు ప్రియాంక. -
ఆస్కార్ వర్సెస్ గోల్డెన్ గ్లోబ్
ఏటా లక్షలాది మంది ఆ అవార్డు వేడుక వస్తోందంటే టీవీల ముందు వాలిపోతుంటారు. ఒక్కో క్యాటగిరీల్లో అవార్డులు అనౌన్స్ అవుతూంటే.. ‘‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’’ అనగానే కళ్లన్నీ అప్పగించి చూస్తూంటారు. వాళ్లకిష్టమైన సినిమాకో, నటుడికో, టెక్నీషియన్కో అవార్డు వస్తే ఇక పండగే! ప్రపంచవ్యాప్తంగా ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న అవార్డు ‘ఆస్కార్’. ఆస్కార్ అనేది హాలీవుడ్ సినిమాకు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ తమ సినిమాకు దక్కాలని అందరు ఫిల్మ్‌మేకర్స్ కోరుకుంటూ ఉంటారు. అందుకే ఆస్కార్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నారంటే అభిమానులకు అదొక పండగ. సినిమాను సెలెబ్రేట్ చేసుకునే పండగ. వారం క్రితమే 2017 సంవత్సరానికి సంబంధించిన ఆస్కార్ నామినేషన్స్‌ను స్వీకరించే ప్రక్రియ పూర్తయింది. రేపు (జనవరి 23) నామినేషన్స్ ప్రకటిస్తారు. మార్చి 4న అవార్డుల ప్రదానం. ఇంకా చాలా టైమ్ అయితే ఉంది. కానీ సందడి మాత్రం ఇప్పటికే మొదలైపోయింది. ముఖ్యంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానం కూడా జరిగిపోయాక ఆస్కార్ సందడి ఎక్కువయింది. హాలీవుడ్లో ఆస్కార్ స్థాయిని మించింది ఇంకేదీ లేకపోయినా గోల్డెన్ గ్లోబ్ అవార్డులను కూడా ఓ రకంగా గొప్ప అవార్డులుగానే చెప్పుకుంటారు. ఆస్కార్ కంటే ముందే ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది కాబట్టి ప్రతిసారీ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు వేడుక అయిపోయిన రోజు నుంచీ ఆస్కార్ వరుస ఎలా ఉంటుందీ అన్న చర్చ మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 7న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానం జరిగిపోయింది. ఇక అప్పట్నుంచీ గోల్డెన్ గ్లోబ్లో సత్తా చాటిన సినిమాలే ఆస్కార్‌లోనూ సత్తా చాటుతాయా అన్న చర్చ మొదలైంది. ఇక ఇక్కడే ప్రధానంగా అర్థమవుతోన్న విషయం ఏంటంటే.. ఆస్కార్‌కు, గోల్డెన్ గ్లోబ్‌కు చాలా తేడా ఉండడం. గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ పిక్చర్ అనిపించుకున్న సినిమా, ఆస్కార్‌లో కనిపించకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్లో ‘త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’ అనే సినిమా బెస్ట్ ఫిల్మ్‌గా డ్రామా జానర్లో అవార్డ్ అందుకుంది. ఇక కామెడీ/మ్యూజికల్ జానర్లో ‘లేడీబర్డ్’ బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఈ రెండిట్లో ఏదో ఒక సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంటుందా? చెప్పలేం! ఇప్పటికైతే సినీ విశ్లేషకులు ఈ రెండు సినిమాలూ కాకుండా ఆస్కార్‌లో బెస్ట్ ఫిల్మ్ అందుకునే సినిమా ‘షేప్ ఆఫ్ వాటర్’ కానీ, ‘ది పోస్ట్’ కానీ, ‘డంకర్క్’ కానీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆశ్చర్యంగా ఈ రెండిట్లోనే ఏదో ఒక సినిమాయే ఆస్కార్‌నూ అందుకోవచ్చు కూడా! నామినేషన్స్‌లో ఎలాగూ పైన చెప్పుకున్న సినిమాలన్నీ ఉండొచ్చు. మరి అందులో ఆస్కార్‌ను అందుకునే సినిమా ఏదో తెలియాలంటే మార్చి 4 వరకూ ఎదురుచూడాల్సిందే!! ► గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సినిమాలతో పాటు టీవీ సిరీస్‌లకు కూడా ఇస్తూంటారు. ► గోల్డెన్ గ్లోబ్ అవార్డులను హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ప్రదానం చేస్తుంది. ► గోల్డెన్ గ్లోబ్లో ఓటర్లు 90 మంది మాత్రమే. ► ఆస్కార్స్ కేవలం సినిమాలకు మాత్రమే. ► ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రదానం చేస్తుంది. ► ఆస్కార్స్‌లో 6,000మంది ఓట్లను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు. గోల్డెన్ గ్లోబ్ 2018 విన్నర్స్ లిస్ట్ ఉత్తమ చిత్రం (డ్రామా) త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి ఉత్తమ చిత్రం (మ్యూజికల్/కామెడీ): లేడీబర్డ్ ఉత్తమ విదేశీ భాషా చిత్రం : ఇన్ ద ఫేడ్ (జర్మనీ) ఉత్తమ దర్శకుడు: గిలియర్మొ దెల్తొరొ (ది షేప్ ఆఫ్ వాటర్) ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అలెగ్జాండర్ డెస్ప్లాట్ (ది షేప్ ఆఫ్ వాటర్) ఉత్తమ నటుడు (డ్రామా): గ్యారీ ఓల్డ్‌మేన్ (డార్కెస్ట్ అవర్) ఉత్తమ నటుడు (కామెడీ/మ్యూజికల్) జేమ్స్ ఫ్రాంకో (ది డిజాస్టర్ ఆర్టిస్ట్) ఉత్తమ నటి (డ్రామా) ఫ్రాన్సెస్ మెక్డొర్మాండ్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి) ఉత్తమ నటి (కామెడీ/మ్యూజికల్) : సొయర్స్ రోనన్ (లేడీ బర్డ్) ఉత్తమ స్క్రీన్‌ప్లే మార్టిన్ మెక్‌డొనా (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి) గ్యారీ ఓల్డ్‌మేన్, ∙ జేమ్స్ ఫ్రాంకో -
అతనికి అంత సీన్ లేదు!
2009... ‘ది రీడర్’ సినిమాకు హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ ఉత్తమ నటిగా ఆస్కార్‌కు ఎంపికయింది. ఆస్కార్ అందుకునే రోజు స్పీచ్‌లో హార్వీ వెయిన్‌స్టీన్ గురించి మాట్లాడమని ఆమెపై అందరూ ఒత్తిడి తెచ్చారు. హార్వీ ఆ సినిమాకు ఫైనాన్స్ అందించడంతో పాటు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించాడు. అయితే, కేట్ మాత్రం అతని గురించి మాట్లాడనంటే మాట్లాడను అని చెప్పింది. నిజంగానే స్పీచ్‌లో హార్వీకి కేట్ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఎనిమిదేళ్లు గడిచాయి. ఇప్పుడు హార్వీ వెయిన్‌స్టీన్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి.. ఎక్కడ చూసినా! కారణం, అవకాశాల కోసం తన వద్దకు వచ్చిన అమ్మాయిలపై హార్వీ లైంగిక దాడికి పాల్పడడమే! 2009లో ఆస్కార్ అవార్డు అందుకుంటూ తాను హార్వీ పేరు ఎందుకు ఎత్తలేదన్న విషయాన్ని కేట్ విన్స్లెట్ ఇప్పుడు బయటపెట్టింది. అందరూ కంప్లైంట్ చేస్తున్నట్లే హార్వీ లాంటి వాడిని భరించడం కష్టం అంది కేట్. కేట్ మొదటి సినిమా ‘హెవెన్లీ క్రియేచర్స్’కు హార్వీ ఓ నిర్మాత. ‘‘ఆ సినిమా అప్పట్నుంచి ఎప్పుడు నన్ను కలిసినా ‘నీకు మొదటి అవకాశం నేనే ఇచ్చా!’ అంటూండేవాడు. వాడు నాకు ఆఫర్ ఇవ్వడమేంటి? నేను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. అదే సినిమాకు మూడు సార్లు ఆడిషన్ ఇచ్చా. ఎప్పుడు కలిసినా రూడ్‌గా మాట్లాడేవాడు. అయితే నాతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే సీన్ లేదతనికి. కావాలనే పట్టుబట్టి ఆస్కార్ వేడుకలో హార్వీ గురించి మాట్లాడలేదు..’’ అని చెప్పుకొచ్చింది కేట్. -
ఆస్కార్‌లోనూ ఆ రెండు సినిమాలే!?
హాలీవుడ్ సినిమాకు అవార్డులంటే ఆస్కార్ అవార్డులే! ఇక ఆ తర్వాత చెప్పుకునే అవార్డులంటే ‘గోల్డెన్ గ్లోబ్’. చాలాసార్లు ఈ రెండు అవార్డుల ఫలితాలూ ఒకేలా ఉంటాయ్! బెస్ట్ అనుకునే సినిమా రెండు అవార్డులనూ తన్నుకుపోతుంది. ఈ ఏడాదికి కూడా ఆస్కార్ బరిలో మహా మహా దర్శకుల సినిమాలే పోటీపడనున్నాయి. ఆస్కార్ నామినేషన్స్ అనౌన్స్ కావడానికి ఇంకా నెల టైమ్ ఉంది. ఏయే సినిమాలు నామినేషన్స్ దక్కించుకుంటాయి అన్నది ఇంకా సస్పెన్సే! గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ అయితే ఇప్పటికే బయటకొచ్చేశాయ్. ఇందులో ‘ది షేప్ ఆఫ్ వాటర్’ మొత్తం ఏడు నామినేషన్స్ దక్కించుకుంది. స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన ‘ది పోస్ట్’ ఆరు నామినేషన్లు దక్కించుకుంది. ఈ రెండు సినిమాలకు చాలాకాలం నుంచే విపరీతమైన క్రేజ్ ఉంది. గోల్డెన్ గ్లోబ్లో ఈ సినిమాలు నామినేషన్స్ తెచ్చుకోవడంతో ఆస్కార్ నామినేషన్స్‌లోనూ ఈ రెండు సినిమాలదే జోరు ఉంటుందని హాలీవుడ్ సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 2018 జనవరి 7న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానం జరగనుంది. ది షేప్ ఆఫ్ వాటర్ -
పాటకు ఆస్కారం?
ఆస్కార్ ఆశలు ఇంకా చెదిరిపోలేదు. ‘న్యూటన్’ అవుట్ అయిందని బాధపడక్కర్లేదు. ఆస్కార్ అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఈసారి బాలీవుడ్ కాదు మాలీవుడ్ సినిమా రేసులో ఉంది. బెస్ట్ ఫారిన్ చిత్రం క్యాటగిరీలో ‘న్యూటన్’ అవుట్ అయ్యాక బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఓ ఇండియన్ సినిమాకి అవకాశం దక్కింది. ఆస్కార్ అవార్డ్స్ అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ ఈ సంవత్సరం ఆస్కార్ ఆవార్డ్స్ గెలిచే అవకాశం ఉన్న 70 పాటల లిస్ట్‌ను ప్రకటించింది. ఆ లిస్ట్‌లో మలయాళ సంగీతదర్శకుడు గోపీసుందర్ స్వరపరచిన ‘పులిమురుగన్’లోని రెండు పాటలు (‘కాదనయుమ్ కల్చిలంబే, మానతే మారికురంబే’) స్థానం సంపాదించుకోగలిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకున్న 70 పాటల్లో పాప్ సంగీత సంచలనాలు టేలర్ స్విఫ్ట్, నిక్ జోన్స్‌తో పాటు గోపీసుందర్ సమకూర్చిన రెండు పాటలు ఉండటం విశేషం. ఈ విషయమై గోపీసుందర్ స్పందిస్తూ – ‘‘ఈ లిస్ట్‌ను మొదటిసారి చూసి నమ్మలేదు. కానీ, అకాడమీ సంస్థ నుంచి అఫీషియల్ మెయిల్ వచ్చేసరికి నమ్మక తప్పలేదు. నాకు ఇప్పటి వరకు స్టేట్ అవార్డ్ రాలేదు కానీ, నేషనల్ అవార్డ్ లభించింది. ప్రేక్షకులకు నచ్చటమే అంతిమ విజయంగా భావిస్తా’’ అన్నారు. మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘పులిమురుగన్’ తెలుగులో ‘మన్యం పులి’గా విడుదలై, ఇక్కడా విజయం సాధించింది. 100 కోట్ల క్లబ్ చేరుకున్న తొలి మాలీవుడ్ మూవీగా పేరు సంపాదించింది. -
నో నామినేషన్
2018లో జరగనున్న 90వ ఆస్కార్స్‌కు గాను ‘ఉత్తమ ఫారిన్ ల్యాంగ్వేజ్ చిత్ర విభాగం’లో భారతదేశం తరçపున ‘న్యూటన్’ అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన విషయం తెలిసిందే. అమిత్ వి. మసూర్కర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ రావ్ నటించిన ఈ సినిమాకు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైయింది. ఈ క్యాటగిరీలో తర్వాతి రౌండ్‌కు సెలెక్ట్ అయిన తొమ్మిది చిత్రాల లిస్ట్‌ను ఆస్కార్ అవార్డ్స్ అందించే ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ విడుదల చేసింది. ఆ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది ‘న్యూటన్’. ఇది వరకు ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ ఈ క్యాటగిరీలో చోటు దక్కించుకున్నప్పటికీ అవార్డుని సొంతం చేసుకోలేకపోయాయి. ఆస్కార్‌లో అన్ని విభాగాల నామినేషన్ల పూర్తి వివరాలను జనవరి 23న విడుదల చేస్తారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చ్ 4న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరుగనుంది. ‘‘ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో మొత్తం 92 సినిమాలు పోటీకి వచ్చాయి. అక్కడిదాకా మా సినిమా వెళ్లినందుకు మాకు ఆనందంగా ఉంది. నామినేషన్ దక్కలేదనే బాధ లేదు. ఈ అనుభవం మరిన్ని మంచి సినిమాలు చేయడానికి నాకు ఉత్సాహాన్నిచ్చింది’’అన్నారు దర్శకుడు. -
భారత్ నుంచి ఆస్కార్ బరిలో 'న్యూటన్'
ఈ ఏడాది ఆస్కార్ బరిలో విదేశీ చిత్రం కేటగిరిలో పోటి పడబోయే భారతీయ చిత్రాన్ని ప్రకటించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ లో తెరకెక్కిన న్యూటన్ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటికి పంపనున్నారు. ఈ మేరకు జ్యూరీ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 26 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ చివరకు న్యూటన్ ను ఎంపిక చేసింది. తెలుగు నుంచి బాహుబలి 2తో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలను కూడా పరిశీలించినట్టుగా జ్యూరీ చైర్మన్ సీవీ రెడ్డి తెలిపారు. -
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ఆస్కార్ నటుడు!
లాస్ ఏంజెలిస్: హాలీవుడ్ దిగ్గజ నటుడు డానియల్ డే లెవిస్ తన అభిమానులకు షాకిచ్చారు. మూవీలు చేయడం ఆపేయనున్నట్లు మూడుసార్లు ప్రసిద్ద ఆస్కార్ అవార్డు పొందిన నటుడు డానియల్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని నటుడి వ్యక్తిగత కార్యదర్శి లెస్లీ డార్ట్ మంగళవారం ప్రకటించారు. ప్రఖ్యాత దర్శకుడు స్టీవ్ స్పిల్ బర్గ్ తీసిన 'లింకన్', 'దేర్ విల్ బి బ్లడ్', 'మై లెఫ్ట్ ఫూట్', 'గ్యాంగ్స్ ఆఫ్ ది న్యూయార్క్' మూవీలతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అరవై ఏళ్ల సీనియర్ నటుడి చివరి మూవీ ఈ డిసెంబర్ 25న విడుదల కానుంది. అయితే ఆ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. షూటింగ్ మాత్రం కొనసాగుతోంది. 14 ఏళ్ల వయసులో 1971లో విడుదలైన 'సండే, బ్లడీ సండే'తో ఇండస్ట్రీకి పరిచయమైన డానియల్ అంచెలంచెలుగా ఎదిగారు. మూడుసార్లు అస్కార్ అవార్డులను కొల్లగొట్టిన ఘనత ఆయన సొంతం. దర్శకరచయిత రెబెక్కా మిల్లర్ ను వివాహం చేసుకున్న డానియల్ కు ముగ్గురు సంతానమన్న విషయం తెలిసిందే. 'ఇన్నేళ్లుగా నన్ను అభిమానించి, నాపై ప్రేమ చూపించిన ప్రేక్షకులు మూవీ బృందాలకు ధన్యవాదాలు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఇక రంగుల ప్రపంచానికి సెలవు పలకాలని నిర్ణయించుకున్నానని' ఆస్కార్ గ్రహీత డానియల్ డే లెవిస్ అన్నారు. -
ఆస్కార్ వేదికపై యాంకర్ ఇలా చేశారేమిటి?
లాస్ ఏంజిలిస్: ఆస్కార్ అవార్డులను చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకం భావిస్తారు. ఈ అవార్డు అందుకోవాలన్నది కళాకారులందరి కల. ప్రతి ఏటా అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని చూసేందుకు సినీ ప్రముఖులే గాక కోట్లాది అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఈసారి భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ అవార్డుల వేడుక ప్రారంభమైంది. కేటగిరిలా వారిగా అవార్డులను ప్రకటిస్తున్నారు. ఉత్తమ చిత్రం కేటగిరి అవార్డును ప్రకటించాలి. ఈ సమయంలో నిర్వాహకులు తప్పులో కాలేశారు. ఉత్తమ చిత్రంగా లా లా ల్యాండ్‌ను ప్రకటించారు. దీంతో ఆ సినిమా బృందం సంబరాలు చేసుకుంది. అయితే వారికి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పొరపాటు తెలుసుకున్న యాంకర్ సవరణ చెబుతూ ఉత్తమ చిత్రంగా మూన్లైట్ను ప్రకటించారు. అంతే లా లా ల్యాండ్ చిత్రం బృందం సంతోషం ఆవిరికాగా.. మూన్లైట్ బృందం సంబరాల్లో మునిగిపోయింది. సాధారణంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది యాంకర్ ఏమరుపాటుతో తప్పుగా చదవడాన్ని కొందరు సినీ ప్రముఖులు తప్పుపట్టారు. బెస్ట్ మూవీ స్క్రీన్ ప్లే.. ఆస్కార్ 2017కు ఇవ్వాలని నటి శృతి హాసన్ ట్వీట్ చేసింది. -
ఆస్కార్ వేదికపై యాంకర్ ఇలా చేసిందేమిటి?
-
ఆయన తీసిన చిత్రాల్లాగే ఆయన జీవితం
వార్సా: ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహకు కూడా అందకుండా ఉత్కంఠతో ముందుకుసాగుతుంది ఆయన తీసిన క్రైమ్, హారర్, స్కాండల్ చిత్రాలు. ఆయన తీసిన చిత్రాల వలే ఆయన నిజజీవితం కూడా అలాగే ముందుకు సాగుతోంది. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే నాజీ మూకలను తప్పించుకు తిరిగాడిన జీవితం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సినీ దర్శకుడిగా మారేందుకు తోడ్పడగా, నిండు గర్భిణితో ఉన్న తన భార్య, ప్రముఖ మోడల్, సినీ తార షరాన్ టేట్ దారుణ హత్య ఆయన్ని నేరం చేసేందుకు ప్రోత్సహించింది. నాలుగు దశాబ్దాల నుంచి సెక్స్ స్కాండల్ తరుముతుంటే న్యాయం నుంచి తప్పించుకు తిరుగుతూ పొలండ్‌లో తలదాచుకుంటున్న ఆయనకు పోలండ్ సుప్రీంకోర్టు ద్వారా ప్రస్తుతం కాస్త ఊరట లభించింది. ఆయనెవరో ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. 27 సినిమాలకు నామినేషన్ పొంది ఎనిమిది ఆస్కార్ అవార్డులు సాధించిన ప్రఖ్యాత ఫ్రెంచ్ దర్శకుడు రోమన్ పొలాన్స్కీ. తన ప్రత్యక్ష అనుభవాలతో నాజీల అకృత్యాలను ఆయనతెరకెక్కించిన ‘ది పియానిస్ట్’ సినిమాకు 2002లో ఆస్కార్ అవార్డు వచ్చింది. పోలండ్ నుంచి వచ్చి పారిస్‌లో స్థిరపడిన యూదు కుటుంబంలో జన్మించిన పొలాన్స్కీ ‘మరో సినిమా’ను ప్రేమించే వారికి చిరపరిచితుడు. మాతృదేశమైన పొలండ్‌కు ఆయన కుటుంబం తిరిగొచ్చాక, తల్లిదండ్రులను నాజీ మూకలు అరెస్ట్‌చేసి కాన్సెంట్రేషన్ క్యాంప్‌కు తరలించిగా అనధగా మారిన పొలాన్స్కీ బాల్యమంతా వీధుల్లోనే గడిచింది. 1962లో ‘నైఫ్ ఇన్ ది వాటర్’ అనే తొలి చిత్రంతో పాశ్చాత్య దేశాల ప్రశంసలు అందుకున్న పొలాన్ స్కీ, వరుసగా ‘రిపల్షన్, ది ఫియర్లెస్ వ్యాంపైర్ కిల్లర్స్, రోజ్మ్యారీస్ బేబీ లాంటి చిత్రాలను తీశారు. 1969లో నిండు గర్భంతో వున్న ఆయన భార్య, మోడల్, సినీతారైన షరాన్ టేట్‌ను, ఆయన నలుగురు మిత్రులను చార్లెస్ మాన్షన్ అనే కల్ట్ నాయకుడు, ఆయన అనుచరులు అతిదారుణంగా చంపారు. ఆ విషాధం నుంచి తేరుకున్నాక 1974లో అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చిపెట్టిన ‘చైనా టౌన్’ అనే హాలివుడ్ క్లాసిక్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు సమంతా గైమర్గా చెప్పుకునే అప్పటి గెయిలీ ఫిర్యాదుపై 1977లో అమెరికాలో పోలీసులు పొలాన్‌స్కీని అరెస్ట్ చేశారు. అప్పుడు 13 ఏళ్లున్న గెయిలీని తనను మద్యం తాగించి, డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశారని ఆయనపై కేసు పెట్టారు. మద్యం మత్తులో తప్పు చేశానని ఒప్పుకున్న పొలాన్స్కీ క్షమాభిక్ష రాజీ కింద 42 రోజులపాటు జైలుకెళ్లారు. నేరానికి మానసిక చికిత్స కూడా తీసుకున్నారు. 1978లో జైలు నుంచి బయటకు వచ్చిన పొలాన్స్కీ తన శిక్ష పూర్తయిందని అనుకున్నారు. అయితే అమెరికా జడ్జీ క్షమాభిక్ష రాజీ ఒప్పందాన్ని రద్దు చేసి భారీ జైలు శిక్షను విధించారు. దాంతో ఆయన ఫ్రాన్స్‌కు పారిపోయారు. ఆయన్ని పరారీలో ఉన్న నేరస్థుడిగా అమెరికా కోర్టు ప్రకటించింది. ఆయన్ని పట్టి అప్పగించాల్సిందిగా అమెరికా దర్యాప్తు సంస్థ పలు దేశాలను కోరింది. ఈ నేపథ్యంలో 2002లో ఆయన తీసిన ‘ది పియానిస్ట్’ సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు లభించినప్పటికీ అమెరికాకు వచ్చి అవార్డును తీసుకోలేక పోయారు. ఆయన పరారీలో ఉన్నప్పటికీ చిత్రాలు తీయడాన్ని మానుకోలేదు. ఓ చిత్ర నిర్మాణం విషయమై స్విడ్జర్లాండ్ వెళ్లినప్పుడు, 2009లో స్థానిక అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన అరెస్ట్‌పై అంతర్జాతీయ చర్చ ఊపందుకున్న నేపథ్యంలో 10 నెలల గృహ నిర్బంధం అనంతరం స్విడ్జర్లాండ్ ఆయన్ని విడుదల చేసింది. ఇప్పటికే పరారీలో ఎంతో క్షోభను అనుభవించినందున ఆయనపై దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకుంటానని సమంతా గైమర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్చ జరిగింది. అయితే ఆమెరికా కోర్టు మాత్రం ఇప్పటికీ కేసు ఉపసంహరణకు అంగీకరించలేదు. పోలండ్‌లో ఉంటున్న పొలాన్‌స్కీని పట్టి అప్పగించాలంటూ అమెరికా ప్రభుత్వం పోలండ్ ప్రభుత్వాన్నీ కోరింది. దీన్ని పొలాన్స్కీ స్థానిక హైకోర్టులో సవాల్ చేయగా ప్రభుత్వ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిపై పొలండ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా ఆ అప్పీల్‌ను మంగళవారం నాడు సుప్రీం కోర్టు కొట్టివేసింది. పేరు ప్రఖ్యాతులతో పాటు అప్రతిష్ట మూటకట్టుకున్నారంటూ ఆయన్ని ఇప్పటికీ పొగిడేవారు, తెగిడే వారు ఉన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పైకొచ్చిన పొలాన్‌స్కీని బాధితురాలే క్షిమించినప్పుడు ఇంకెందుకు శిక్షించాలని పొగిడేవారు వాదిస్తున్నారు. ఈర్శాభావంతో కొంతమంది బాలివుడ్ ప్రముఖులే ఆయనపై కేసును తెగలాగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఓ బాలికను మత్తుపదార్థాలతో రేప్ చేయడం నేరమని, ఆ నేరానికి ఆయనకు శిక్ష పడాల్సిందేనని వ్యతిరేకులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ కేసు ముగింపు అమెరికా కోర్టులోనే తేలుతుందని పొలాన్స్కీ న్యాయవాది అంటున్నారు. -
ఆస్కార్‌కి ‘విసారణై’
ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్ ఎంట్రీకి ఈ ఏడాది మనదేశం నుంచి అధికారికంగా తమిళ చిత్రం ‘విసారణై’ను పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రామికులుగా పనిచేసిన తమిళుల జీవితాల ఆధారంగా ఒక ఆటోరిక్షా డ్రైవర్ రాసిన నవల ఈ చిత్రానికి ఆధారం. నిజజీవితాలకు అద్దం పట్టే ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను వెట్రిమారన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ అవార్డు అందుకుంది. నిజానికి, రానున్న ఆస్కార్స్‌లో ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’ విభాగంలో భారత సినీసీమ నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్ళేం దుకు మన ‘రుద్రమదేవి’ సహా వివిధ ప్రాంతీయ భాషల నుంచి మొత్తం 29 ఫిల్మ్‌లు పోటీ పడ్డాయి. చివరకు ‘విసారణై’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) సారథ్యంలోని జ్యూరీ ఎంపిక చేసింది. ‘ఆస్కార్ అవార్డ్స్ ఎంట్రీ సెలక్షన్ కమిటీ’ చైర్మన్, ప్రముఖ దర్శకుడు కేతన్ మెహతా గురువారం హైదరాబాద్‌లో ఈ సంగతి ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘‘ఇండియాలో ఏటా దాదాపు వెయ్యి సినిమాలు నిర్మిస్తున్నారు. ఆస్కార్ ఎంట్రీ పరిశీలనకు కొన్ని చిత్రాలనే ఎంపిక చేయడం కష్టం. ఈసారి పరిశీలించిన 29 చిత్రాలూ ఇన్స్పైర్ చేశాయి. ఎంచుకున్న కథాంశం, దాన్ని తెరపై ప్రెజెంట్ చేసిన విధానం, సాంకేతిక అంశాలను పరిశీలనలోకి తీసుకుని ‘విసారణై’ని మన ఎంట్రీగా ఎంపిక చేశాం’’ అన్నారు. ‘‘మా జ్యూరీ మెంబర్లలో తమిళ సభ్యులెవరూ లేరు. ఎంపికలో జ్యూరీపై ఎలాంటి ఒత్తిడులూ లేవు. ఉత్తమ విదేశీ భాషా చిత్రాల ఎంట్రీల సంఖ్య పెంచాలని ఆస్కార్ కమిటీకి విన్నవిస్తాం’’ అని ఆయన తెలిపారు. ఏయే భాషల నుంచి ఏయే చిత్రాలను జ్యూరీ పరిశీలించిందో వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. తెలుగు ఫిలిమ్ చాంబర్ అధ్యక్షుడు, నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘విసారణై’ని ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు. నార్తిండియన్ జ్యూరీ సభ్యులు సౌత్ ఇండియన్ చిత్రాన్ని ఎంపిక చేయడం సంతోషం’’ అన్నారు. నిర్మాత కల్యాణ్ ఈ చిత్రాన్ని ఇప్పటికే తెలుగులో ‘విచారణ’ పేరుతో అనువదించి, రిలీజ్‌కు సిద్ధం చేస్తుండడం విశేషం. ఈ సమావేశంలో ఎఫ్.ఎఫ్.ఐ చైర్మన్ టీపీ అగర్వాల్, జ్యూరీ మెంబర్లు పాల్గొన్నారు. రానున్న 89వ ఆస్కార్ అవార్డు వేడుకలు ఫిబ్రవరిలో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్నాయి. -
ఆస్కార్ అవార్డు కమిటీలో భారతీయులు
ఆస్కార్ అవార్డుల ఎంపికలో వర్ణ వివక్ష కనిపిస్తోందనే వాదన ఎప్పట్నుంచో ఉంది. గడచిన ఫిబ్రవరిలో జరిగిన అవార్డు వేడుకలో కొంతమంది నల్ల జాతి నటీనటులు బహిరంగంగానే విమర్శించారు. కొందరు ఈ వేడుకను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ‘ఆస్కార్.. సో వైట్’ అని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన స్థానం సంపాదించుకున్న ఆస్కార్ అవార్డు ఎంపికల్లో ఇలా జాతి వివక్ష జరగడం సరికాదని పలువురు సినీప్రేమికులు కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు కమిటీ ఛైర్మన్ చెరిల్ బూనె, ‘‘భవిష్యత్తులో జరగబోయే అవార్డు వేడుకల్లో ఇలాంటి వివాదం రాకుండా చూసుకుంటాం. అకాడమీ నిబంధనలు, కమిటీ సభ్యుల ఎంపిక తదితర విషయాల గురించి క్షుణ్ణంగా చర్చిస్తాం’’ అని వేడుకల సమయంలో పేర్కొన్నారు. ఈ ఏడాది అవార్డు వేడుక ముగిసి నాలుగు నెలలైంది. మరో ఎనిమిది నెలల్లో అవార్డుల వేడుక రానే వస్తుంది. ఈసారి వర్ణ వివక్షకు సంబంధించిన వివాదం రాకూడదనుకున్నారు కాబట్టి, కమిటీ మెంబర్స్ ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు. ఈ దిశలో ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో విశేష పేరు సంపాదించిన ప్రముఖులను సభ్యులుగా చేర్చుకోవాలని ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 683 మంది ప్రముఖులకు ఆస్కార్ అవార్డు కమిటీలో మెంబర్స్‌గా వ్యవహరించాలని కోరుతూ ఆహ్వాన పత్రాలు పంపింది. మన భారతీయ తారల్లో ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, నేటి తరం నాయిక, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం ఫ్రీదా పింటో, ప్రముఖ దర్శకురాలు దీపా మెహతాలకు ఆహ్వానం అందింది. అలాగే, భారతీయ మూలాలున్న బ్రిటిష్ ఫిలిం మేకర్ ఆసిఫ్ కపాడియాని మెంబర్‌గా వ్యవహరించాల్సిందిగా ఆస్కార్ అవార్డ్ కమిటీ కోరింది. ఈ ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకల్లో ‘ఎమి’ అనే లఘు చిత్రానికి దర్శకుడిగా ఆసిఫ్ ఆస్కార్ అందుకున్నారు. ‘ది గుడ్ డైనోసార్’ అనే యానిమేషన్ చిత్రానికి యానిమేటర్‌గా చేసిన సంజయ్ బక్షీకి కూడా ఆస్కార్ కమిటీ ఇన్విటేషన్ పంపించింది. ఈయన కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే. కమిటీ సభ్యుల ఎంపిక పరంగానే కాకుండా అవార్డు వేడుకను వివాదాలకు తావు లేకుండా నిర్వహించడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటోంది ఆస్కార్ అవార్డు కమిటీ. -
99 పాటలు!
సంగీత దర్శకునిగా తన ప్రతిభ ఏంటో జంట ఆస్కార్ అవార్డులు సాధించడం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన ఎ.ఆర్. రెహమాన్ ఇటీవల నిర్మాతగా మారారు. వైఎం మూవీస్ పతాకంపై ఆయన ఓ చిత్రం నిర్మించాలనుకుంటున్నారనే వార్త కొన్ని నెలలుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ వార్త నిజమే. ‘99 సాంగ్స్’ పేరుతో ఆయన ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను గురువారం రెహమాన్ విడుదల చేశారు. పలు టీవీ డాక్యుమెంటరీ సిరీస్‌లకు దర్శకునిగా వ్యవహరించిన విశ్వేష్ కృష్ణ మూర్తి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రంలో మొత్తం పది పాటలుంటాయి. ఇప్పటికే రెహమాన్ ఐదు పాట లకు స్వరాలు సమకూర్చేశారు. కథ కూడా ఆయనే రాశారని సమాచారం. ఇక.. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. గాల్లో ఎగురుతున్న పియానోని ఓ అబ్బాయి పట్టుకుంటే, అతని చేతిని పట్టుకుని మరో అమ్మాయి వేలాడే ఈ దృశ్యం చాలా పొయిటిక్గా ఉంది. దీన్నిబట్టి చూస్తుంటే.. సంగీత ప్రపంచంలో ఏదో సాధించాలనే ఆశయం ఉన్న గాయనీ గాయకుల జీవితం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందనిపిస్తోంది. ప్రధానంగా ఓ గాయకుని జీవితంతో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. తారాగణం వివరాలేవీ రెహమాన్ పేర్కొనలేదు. -
భారత సంతతి దర్శకుడికి ఆస్కార్
భారత సంతతికి చెందిన బ్రిటిష్ దర్శకుడు ఆసిఫ్ కపాడియాకు ఆస్కార్ అవార్డు దక్కింది. 'ఎమీ' అనే చిత్రానికి సంబంధించి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. ఎమీ వైన్‌హౌస్ అనే దివంగత గాయకురాలి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్‌లో నటించిన దేవ్ పటేల్, మరో నటి డైసీ రిడ్లే కలిసి దర్శకుడు కపాడియా, నిర్మాత జేమ్స్ గే రీస్లకు ఈ అవార్డు అందజేశారు. ఈ సినిమా ఇంతకు ముందు గ్రామీ అవార్డు కూడా గెలుచుకుంది. ఎమీ కేవలం 27 ఏళ్ల వయసులోనే మరణించింది. ఆమె జీవించి ఉండగా రూపొందించిన కొన్ని ఆల్బంలతో పాటు కొన్ని ఆర్కైవ్‌ల ఫుటేజిని కూడా ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. కపాడియా, గే-రీస్లకు ఆస్కార్ నామినేషన్ లభించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) అవార్డును కూడా ఈ సినిమా గెలుచుకుంది. -
'మ్యాడ్ మ్యాక్స్'కు అవార్డుల పంట
లాస్ ఏంజిల్స్ : ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నతంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 88వ ఆస్కార్ అవార్డుల పురస్కారాల్లో ఈసారి 'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్' అవార్డుల రేసులో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఏకంగా ఆరు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించిన మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం 10 నామినేషన్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. 'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్' చిత్రం కథనానికి వెళితే ఓ మహిళ, మరి కొందరు మహిళా ఖైదీలతో కలిసి చేసిన పోరాటానికి మ్యాక్స్ అనే వ్యక్తి సహాయం చేస్తాడు. వారు తమ సొంత భూమిని వెదుక్కుంటూ జీవించడానికి చేసే పోరాటమే ఈ చిత్రం. కాస్ట్యూమ్ డిజైన్‌లో జెన్నీ బీవాన్‌కు ఆస్కార్ దక్కింది. జెన్సీ బీవాన్‌కు ఆస్కార్ దక్కడం ఇదో రెండోసారి. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్న కొలిన్ గిబ్సన్, లీసా థాంప్సన్ కూడా ఆస్కార్‌ను గెలుచుకున్నారు. మేకప్-హెయిర్ స్టయిల్ విభాగంలోనూ మ్యాడ్ మ్యాక్స్ ఫిల్మ్‌కే ఆస్కార్ దక్కింది. ఫిల్మ్ ఎడిటింగ్‌లోనూ ఫ్యూరీ రోడ్‌కు ఆస్కార్ దక్కింది. మార్గరేట్ సిక్సల్ ఆ కేటగిరీలో ఆస్కార్‌ను అందుకున్నారు. సౌండ్ ఎడిటింగ్‌లో మార్క్ మాంగిని, డేవిడ్ వైట్లు ఆస్కార్లను అందుకున్నారు. సౌండ్ మిక్సింగ్ విభాగంలో క్రిస్ జెన్కిన్స్, గ్రెగ్ రుడాల్ఫ్, బెన్ ఓస్మో ఆస్కార్‌ను గెలుచుకున్నారు. ఉత్తమ్ ఎడిటింగ్ (సీక్సెల్) కాస్టూమ్ డిజైనింగ్(జెన్నీ బెవన్) ప్రొడక్షన్ డిజైనింగ్(కొలిన్ గిబ్సన్) మేకప్, కేశాలంకరణ(లెస్లే వాండర్‌వాల్ట్, ఎల్కా వార్డెజ్) సౌండ్ ఎడిటింగ్( మార్క్ మాగ్నీ, డేవిడ్ వైట్) సౌండ్ మిక్సింగ్(క్రిస్ జెన్కిన్స్, గ్రిజ్ రడాల్ఫ్) -
2016 ఆస్కార్ అవార్డుల ప్రదానం
లాస్ఏంజిల్స్ : 2016 సంవత్సరానికి ఆస్కార్ పురస్కారానికి (88వ అకాడమీ అవార్డ్స్) తెర లేచింది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లో వైభవంగా ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఏజెల్స్‌లో హాలీవుడ్ డాల్బీ థియేటర్లో ఈ వేడుగ అట్టహాసంగా జరుగుతోంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వివిధ విభాగాల్లో మొత్తం 20 మంది నటులు ఆస్కార్ కోసం పోటీపడుతున్నారు. అయితే ఇందులో 70 శాతం మంది ఇది వరకు ఆస్కార్ తీసుకున్నవాళ్లే కావడం విశేషం. ఇక 'టైటానిక్' ఫేమ్ లియోనార్డో డికాప్రియో సినిమా 'రెవనెంట్' ఈ ఏడాది అత్యధికంగా 12 విభాగాల్లో నామినేషన్లను సాధించింది. ఇక మరో చిత్రం మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం పది అంశాల్లో పోటీ పడనుంది. ఉత్తమ చిత్రాల బరిలో ది బిగ్ షార్ట్, బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్, బ్రోక్లెన్, మాడ్ మాక్స్:ఫ్రే రోడ్, ది మార్టిన్, ది రెవెనెంట్, రోమ్, స్పాట్ లైట్ చిత్రాలు ఉన్నాయి. ఉత్తమ నటుడి విభాగంలో స్టార్ హీరోలు లియోనార్డో డికాప్రియో, బ్రయాన్ క్రాన్ స్టన్, మాట్ డామన్, మైఖెల్ ఫాస్బెండర్, ఎడ్డిల్ లు పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాంచెట్, బ్రై లార్సన్, జెన్నిఫర్ లారెన్స్, షార్లెట్ రాంఫ్లింగ్, రోనన్ లు నామినేషన్స్ పొందారు. కాగా టైటానిక్ సుందరి కేట్ విన్స్లెట్ 'స్టీవ్ జాబ్స్ ' సినిమాకు గాను.. ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ పొందింది. 88వ ఆస్కార్ అవార్డులు ఇవీ... 88వ ఆస్కార్ అవార్డులు ఇవీ... ఉత్తమ నటుడు : లియెనార్డో డి కాప్రియో (ది రివెనెంట్) ఉత్తమ నటి : బ్రి లార్సన్ (రూమ్) ఉత్తమ సహాయ నటి అలీషియా వికందర్ ( ద డానిష్ గర్ల్) ఉత్తమ స్క్రీన్ ప్లే- స్పాట్ లైట్ బెస్ట్ కాస్ట్యుమ్ డిజైనర్ -జెన్నీబీవన్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొలిన్ గిబ్సన్, లిసా థామ్సన్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: మార్గరేట్ సిక్సల్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) బెస్ట్ సౌండ్ ఎడిటింగ్:డేవిడ్ వైట్ అండ్ మార్క్ మంగిని (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ ...ఎమాన్యువల్ లుబెజ్కి (ద రెవెనంట్) బెస్ట్ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ (ఇన్సైడ్ అవుట్) బెస్ట్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ (ది బేర్ స్టోరీ) బెస్ట్ సహాయ నటుడు మార్క్ రిలాన్స్(బ్రిడ్జి ఆఫ్ స్పైస్) బెస్ట్ డైరెక్టర్ అలెజాండ్రో (ది రివెనెంట్) -
ప్రియాంకకు అరుదైన అవకాశం
లాజ్ ఏంజెలెస్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరో అరుదైన అవకాశం దక్కించుకుంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రెజెంటర్ గా వ్యవహరించే ఛాన్స్ ఆమెకు వచ్చింది. ఈ విషయాన్ని 'ది అకాడమీ' ట్విటర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ప్రెజెంటర్స్ గా వ్యవహరించే 13 మంది పేర్లను ప్రకటించింది. ఫిబ్రవరి 28 సాయంత్రం(భారత కాలమాన ప్రకారం 29 తెల్లవారుజామున) అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ అవకాశం దక్కడం పట్ల ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది. 33 ఏళ్ల ఈ బాలీవుడ్ భామ అమెరికా టీవీ షో 'క్వాంటికో'లో అలెక్స్ పర్రిస్ పాత్ర దక్కించుకోవడంతో ఆమె పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. ఈ షోలో ఆమె నటనకు పీపుల్స్ ఛాయిస్ అవార్డు దక్కడంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. 'క్వాంటికో' సిరీస్ రెండో భాగం షూటింగ్ లో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. 'బాజీరావ్ మస్తానీ' సినిమాలో నటనకు గానూ ఫిలింపేర్ ఉత్తమ సహాయ నటి అవార్డును ఇటీవల అందుకున్న ప్రియాంక.. ప్రకాశ్ ఝా దర్శకత్వంలో 'జై గంగాజల్'లోనూ నటిస్తోంది. -
సినీ రంగంలోకి ‘అమెజాన్’
బెర్లిన్: కొత్తగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నామని, ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీస్తామని, ఆస్కార్ అవార్డును సాధించడం తమ లక్ష్యమని ఆన్లైన్ వ్యాపారంలో దూసుకుపోతున్న ప్రపంచ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ జర్మనీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం వెల్లడించారు. కామెడీ టీవీ సిరిస్ ద్వారా అమెజాన్ ఈ ఏడాది ఐదు ఎమ్మీ అవార్డులు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇక ఆస్కార్ అవార్డుల విషయంలో తన పోటీదారు ‘నెట్ఫిక్స్’కన్నా ముందుంటారా, లేదా ? అన్నది కాలమే చెప్పాలి. ఎందుకంటే, నెట్ఫిక్స్ తీసిన ‘బీస్ట్స్ ఆఫ్ నో నేషన్’ ఇప్పటికీ ఆస్కార్ బరిలో పోటీ పడుతున్నది. సినిమా డీవీడీల కోసం, ఆన్లైన్ రిలీజ్ కోసం మూడు నెలలపాటు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా తాము తీసిన సినిమాలను వెంటనే ఆన్లైన్లో పెడతామని జర్మనీ పత్రిక ‘డై వెల్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఫ్ వెల్లడించారు. గతేడాది నెట్‌ఫిక్స్‌కు ఎమ్మీ అవార్డుల్లో 31 నామినేషన్లు లభించగా, అమెజాన్‌కు ఒక్క నామినేషన్ కూడా లభించలేదు. అయితే ఈ ఏడాది అలాకాకుండా 12 నామినేషన్లు సాధించి ఐదు అవార్డులు గెలుచుకొంది. నెట్ఫిక్స్ 34 నామినేషన్లు సాధించినప్పటికీ నాలుగు అవార్డులు మాత్రమే దక్కించుకొంది. 1994లో స్థాపించిన అమెజాన్ తొలుత ఆన్లైన్లో పుస్తకాల విక్రయం ద్వారా వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. అనతికాలంలోనే ఈ-పుస్తకాల ద్వారా తన పాపులారిటీని పెంచుకొంది. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కొద్దికాలంలోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొంది. ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టిన అమెజాన్ ‘వాషింఘ్టన్ పోస్ట్’ మీడియా సంస్థలో కూడా పెట్టుబడులు పెట్టింది. ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ బ్రాడ్ క్యాస్టింగ్ హక్కులను కొనే అంశాన్ని కూడా పరిశీస్తోంది. డ్రోన్ల ద్వారా ప్యాకేజీలను డెలివరీ చేయాలని నిర్ణయించినట్టుగా ఇదివరకే ప్రకటించిన విషయం తెల్సిందే. డ్రోన్ల కోసం శాటిలైట్ నావిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కూడా ఉపయేగిస్తామని కూడా జెఫ్ తెలిపారు. అయితే ఏవియేషన్ అథారిటీ అనుమతి ఇంకా లభించాల్సి ఉంది. ఆన్లైన్ వ్యాపారంలో ప్రపంచంలోనే ఆరవ స్థానాన్ని ఆక్రమించిన అమెజాన్ ఏడాది రెవెన్యూ 60 లక్షల కోట్ల రూపాయలు. -
మళ్లీ లగాన్ లాంటి సినిమా!
బ్రిటీషు పాలనలో భూమి పన్ను రద్దుకు వ్యతిరేకంగా ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు. అప్పటివరకూ అలవాటు లేని ఆట అది. పన్ను భారం తగ్గాలంటే ఆడి గెలవాల్సిందే. ఆడారు.. గెలిచారు. ఆమిర్ ఖాన్ నటించిన ఈ ‘లగాన్’ చిత్రకథను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. పధ్నాలుగేళ్ల క్రితం రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకున్న ఘనత ఈ చిత్రానిది. ఇప్పుడు ఆమిర్‌ఖాన్ ఇదే తరహాలో ఓ చిత్రం రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా భూమి పన్ను నేపథ్యంలోనే సాగుతుందని బోగట్టా. ప్రస్తుతం ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంది? అనేది ఈ చిత్రం ప్రధానాంశం అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నటిస్తున్న ‘దంగల్’ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని ఆరంభించాలని ఆమిర్ అనుకుంటున్నారట! -
థ్రిల్ చేసే... మాంజ
కిషన్ ఎస్.ఎస్, అవికా గోర్, దీప్ పాఠక్, నరేష్ డింగ్రీ, ఈషా డియోల్ కాంబినేషన్లో కిషన్ ఎస్.ఎస్. దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘ఫుట్‌పాత్-2’ తెలుగులో ‘మాంజ’ పేరుతో రానుంది. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసిన అవికా గోర్ మాట్లాడుతూ - ‘‘ఇది డిఫరెంట్ మూవీ. ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. కిషన్ మాట్లాడుతూ - ‘‘బాల నేరస్థుల దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుని ‘ఫుట్‌పాత్ -2’ కథ తయారు చేశాం. ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ జనరల్ కేటగిరీలో లేటరల్ ఎంట్రీ కోసం సబ్మిట్ చేశాం’’ అని తెలిపారు. అవికా గోర్‌తో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమా చేస్తున్న టైమ్‌లో ఈ కాన్సెప్ట్ విని థ్రిల్ అయ్యామనీ, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాతలు తెలిపారు. -
లార్డ్ ఆఫ్ ది ఆస్కార్స్
లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ బి. విఠలాచార్య తెలుసా? మాయలు, మంత్రాలు, కత్తులు, బాణాల ఫైటింగులకు క్రేజ్ తెచ్చిన దర్శక మొనగాడు. హాలీవుడ్ చిత్రం ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ చూస్తుంటే, అచ్చంగా మనకు బ్లాక్ అండ్ వైట్ విఠలాచార్య సినిమాలు గుర్తుకురాకపోతే ఒట్టు! అందుకే, పిల్లల నుంచి పెద్దల దాకా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది - ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’. ఇది మొత్తం మూడు భాగాల సిరీస్. వాటిలో మూడోదీ, ఆఖరుదీ ఈ ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’. పుష్కరకాలం క్రితం విడుదలైన ఈ థర్డ్ పార్ట్ది అరుదైన రికార్డ్! అకాడమీ అవార్డులు ఆరంభమైన తరువాత అత్యధిక సంఖ్యలో (11) ఆస్కార్ అవార్డులు అందుకున్న సినిమాలు - ‘బెన్హర్’ (1959), ‘టైటానిక్’ (1997). ఆ తరువాత మళ్ళీ ఇదే. ‘ఉత్తమ చిత్రం’తో సహా నామినేటైన 11 కేటగిరీల్లోనూ ఆస్కార్ అవార్డుల్ని స్వీప్ చేసింది. ఇది మామూలుగా ఆస్కార్స వచ్చే చిత్రాలకు భిన్నమైన సినిమా. మరుగుజ్జులు, మనుషులలానే కనిపిస్తూ పాదాలకు జుట్టుండే మూడడుగుల మనుషులైన వారి హాబి ట్లు, అతీతశక్తులుండే చిట్టి పొట్టి జంతువులు, మ్యాజిక్ రింగులతో నిండిన ఫ్యాంటసీ. నటీనటులు కూడా జనానికి తెలిసినవాళ్ళేమీ కాదు. లో-బడ్జెట్ హార్రర్ చిత్రాలు తీసే ఫిల్మ్ మేకరేమో (పీటర్ జాక్సన్) దర్శకుడు. పైగా, సినిమాలకు అవార్డులొచ్చే లాస్ ఏంజెల్స్‌కు దూరంగా రచన, చిత్రీకరణ, ఎడిటింగ్ - మొత్తం న్యూజిలాండ్‌లో జరిగాయి. అయినాసరే ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ఆస్కార్లు గెలుచుకుంది. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాపీలు అమ్ముడైన నవలల్లో ఒకటి -‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’. జాన్ రొనాల్డ్ రూయెల్ టోల్కిన్ మొత్తం మూడు సంపుటాలుగా ఈ నవల రాశారు. ఈ నవలను సినిమా కన్నా ముందే రేడియాలో, రంగస్థలం మీద వేశారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో 1937 నుంచి 1949 మధ్య ఈ రచన సాగింది. మిడిల్ ఎర్త్ ప్రాంతంలో... ఎల్విష్ భాష మాట్లాడే కొన్ని జాతుల మధ్య జరిగినట్లుగా టోల్కిన్ ఈ కాల్పనిక కథను అల్లారు. నవలా రచయిత టోల్కిన్కు ఒక అలవాటుంది. ప్రపంచంలో కనుమరుగైపోతున్న భాషలను దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుతం ఉన్న భాషల ప్రాథమిక సూత్రాలనూ, మాండలికాలనూ వాడుకుంటూ, వాటికి తన ఆలోచన జోడించి, సరికొత్త భాషలో కవితలు, పాటలు రాయడం ఆయన హాబీ. ఈ నవలలో యువరాణి ఆర్వెన్ పాత్రధారిణి మాట్లాడేది - ఎల్విష్ భాష. షూటింగ్లో ఆ పాత్రధారిణికి ఈ భాష నేర్పడానికి సెట్స్ మీదే ఒక కోచ్‌ను పెట్టారు. వాళ్ళిద్దరికీ అర్థం కానిది ఏమైనా ఉంటే వివరించడానికి ఒక నిపుణుణ్ణి అమెరికాలో సిద్ధంగా ఉంచారు. అసలీ ప్రసిద్ధ నవలను సినిమాగా తీయాలని 1969లోనే హక్కులు తీసుకున్నారు. అప్పటికే సైన్స్ ఫిక్షన్ సినిమా ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’తో దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్ ఒక సంచలనం. ఆయనతో ఈ నవలను తెరకెక్కించాలనుకున్నారు. కానీ, బోలెడన్ని పాత్రలు, చాంతాడంత కథ ఉన్న ఇంత నవలను చిన్న సినిమాగా కుదించలేమంటూ నో చెప్పారట. మంచికో, చెడుకో అలా ఆగిన ఆ వెండితెర కల 30 ఏళ్ళ తరువాత పీటర్ జాక్సన్ దర్శకత్వంలో నిజమైంది. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ మూడు పార్ట్‌లుగా వచ్చినా, తీయడం మాత్రం అన్నీ ఒకేసారి తీసేశారు. ఏణ్ణర్ధం పాటు ఏకధాటిగా షూటింగ్ జరిపారు. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ, ఒక్కో పార్ట్‌గా రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఏమో - ‘ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్’. రెండో పార్టేమో - ‘ది టు టవర్స్’. నవలలోని రెండు, మూడు సంపుటాలను కలిపి ఈ మూడో పార్ట్ సినిమా ‘ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’ తీశారు. న్యూజిలాండ్‌లో వందకు పైగా వేర్వేరు లొకేషన్స్... 350కి పైగా సెట్స్ వాడారు. ఈ లొకేషన్స్‌కు యాక్టర్లనీ, టెక్నీషియన్లనీ హెలికాప్టర్లో తరలించేవారు. సుదీర్ఘంగా సాగిన షూటింగ్లో, యుద్ధ సన్నివేశాల్లో దెబ్బలు తగలనివాళ్ళంటూ లేరు. కిందపడ్డారు. కాళ్ళు మెలికపడ్డాయి. వేళ్ళు విరిగాయి. కండరాలు పట్టేశాయి. వాపులు... గాయాలు... రక్తాలు... అయినా సరే ఆగకుండా సినిమా చేశారు. ఆ కష్టం వృథా కాలేదు. ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ఫస్ట్ పార్ట్ ప్రీమియర్ షో వేశారు. జనంలోకి సినిమా వెళ్ళీవెళ్ళగానే ఆ చిత్రంలోని ప్రధాన పాత్రధారులందరూ రాత్రికి రాత్రికి జనంలో సూపర్స్టార్లైపోయారు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సిరీస్‌లో మూడు సినిమాలూ గొప్పగా ఉంటాయి. మూడింటికీ బోలెడన్ని అవార్డులు వచ్చాయి. ఈ సినిమాల కోసం కాస్ట్యూమ్, మేకప్ బృందాలు వెయ్యి యుద్ధ కాస్ట్యూమ్‌లు చేశాయి. ముఖానికి 10 వేల ప్రోస్థెటిక్స్ చేశారు. ఏకంగా 1800 హాబిట్ పాదాల తయారీ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’కు ఎక్కింది. ఒక్క మూడో పార్ట్‌లో దాదాపు 1500 విజువల్ ఎఫెక్ట్ షాట్స్ ఉన్నాయి. ఒక్కో పార్ట్ రిలీజైన కొద్దీ ఈ సిరీస్‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. 2003 చివరలో మూడో పార్ట్ వచ్చింది. ప్రపంచ సినీ చరిత్రలో 100 కోట్ల డాలర్లు వసూలు చేసిన రెండో సినిమా ఇదే. మూడో పార్ట్‌లో 1700 మందికి పైగా పేర్లు రోలింగ్ టైటిల్స్‌లో వస్తాయి. ఆ టైటిల్స్ నిడివే - తొమ్మిదిన్నర నిమిషాలు. అంత మంది శ్రమకు ఫలితమైన ఈ సినిమా ఇవాళ చూసినా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. వీలుంటే చూడండి. సమ్మర్లో 3 పార్ట్‌లూ ఒక దాని తరువాత ఒకటిగా పిల్లలకూ డి.వి.డి.లో చూపెట్టండి. - రెంటాల -
ఆస్కార్స్ 2015.. వేడుకల విశేషాలివీ!
-
అస్కార్ అవార్డుల ప్రదానోత్సవం
-
ఉత్తమ లఘు చిత్రం 'ది ఫోన్ కాల్'
-
హీరోల కంటే మేమేమి తక్కువ: పాట్రికా
హాలీవుడ్ చిత్రసీమలో కూడా మహిళల పట్ల చిన్న చూపు చూస్తున్నారని నటి పాట్రికా అర్క్విటే (46) ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. తమకు కూడా నటులతో పాటు సమాన వేతనాలందించాలని ఆమె కోరారు. పాట్రికా అర్క్విటే ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో 'బాయ్ హుడ్' చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటి అవార్డును దక్కించుకున్నారు. ఈ చిత్రంలో విడాకులు పొందిన ఓ తల్లిగా ఆమె పోషించిన పాత్ర అద్భుతం. దర్శకుడు రిచర్డ్ లింక్లటర్ ఈ పాత్రను గొప్పగా తీర్చిదిద్దారు. దాదాపు పన్నేండేళపాటు చిత్రీకరణ జరుపుకున్న గొప్ప వర్ణనాత్మక చిత్రంలో పాట్రికా అర్క్విటే గొప్ప నటనా ప్రతిభను కనబరిచారు. ఈ అవార్డు అందుకుంటున్న సందర్భంలో ఆమె మాటలు అందరినీ అమితంగా ఆకర్షించాయి. చిత్ర పరిశ్రమలో మహిళా హక్కుల గురించి ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. హాలీవుడ్లో మహిళలకు సమాన వేతనాలు ఇవ్వాలని కోరారు. దీనికి అందరు సమ్మతం తెలిపారు. 'ఓకే జీసస్.. నాకు ఈ అవార్డు అందించిన అకాడమీకి ధన్యవాదాలు. నేను ఈ అవార్డును చిత్ర బృందానికి నాతోపాటు అద్భుతంగా నటించిన ఇతరులకు అంకితం చేస్తున్నాను' అని ఉద్వేగపూరితంగా అన్నారు. పాట్రికా అర్క్విటే ఆస్కార్ నామినేషన్‌కు వరకూ రావటం కూడా ఇదే తొలిసారి. -
అస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం
లాస్ఏంజెల్స్: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ హాలీవుడ్ డాల్బీ థియేటర్లో ఈ వేడుక ఆరంభమైంది. ప్రస్తుతం అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఉత్తమ సహాయ నటుడుగా జేకే సిమన్స్ అవార్డు అందుకున్నారు. విప్లాష్ చిత్రంలో నటనకుగాను 60 ఏళ్ల సిమన్స్కు ఈ పురస్కారం దక్కింది. హాలీవుడ్ తారల హంగామాతో 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. *ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 'ఐడా' (పోలాండ్) * ఉత్తమ లైవ్ యాక్షన్ లఘు చిత్రం 'ది ఫోన్ కాల్' * ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం 'వెటరన్ ప్రెస్1' * ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - మలోన (ది గ్రాండ్ బుడా పెస్ట్ హోటల్) * ఉత్తమ సహాయ నటి పెట్రిసియా ఆర్వైడ్ (బాయ్‌హుడ్) *ఉత్తమ సౌండ్ ఎటిడింగ్ 'అమెరికన్ స్నైపర్' -
ఆస్కార్ తెర వెనక...ముందు
ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు అందుకున్నవారికి అదో మధుర స్మృతి. అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నవారికీ అదో తీపి గుర్తు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేవారికీ ఓ మధురానుభూతి. రంగు రంగుల వెలుగు జిలుగుల మధ్య. తారల తళకుబెళకుల మధ్య ఆద్యంతం హృద్యంగా సాగే అవార్డుల కార్యక్రమం వెనుక బోలెడంత తతంగం ఉంటుంది. ఈసారి ఆస్కార్ పండుగ భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ప్రారంభం అవుతుంది. అవార్డుల కార్యక్రమం రెడ్ కార్పెట్ స్వాగతంతో ప్రారంభమవుతుంది. అవార్డులతో సంబంధం లేకుండా రెడ్ కార్పెట్‌పై వయ్యారంగా నడుస్తూ కెమేరాలకు పోజులివ్వడానికీ ఒక్క హాలీవుడ్ నుంచే కాకుండా పలు ప్రపంచ దేశాల హీరోయిన్లు పోటీ పడతారు. కేట్ విన్స్లెట్, నికోల్ కిడ్మన్ లాంటి అందాల తారలతో రెడ్ కార్పెట్‌పై నడవడానికి మన బాలీవుడ్ ఐశ్వర్య రాయ్ నాలుగైదు సార్లు పోటీ పడడం తెలిసిందే. ఆఖరికి తల్లయిన సమయంలో కూడా ఆమె రెడ్ కార్పెట్‌పై అందాలు చిందించడం అంటే ఆ రెడ్ కార్పెట్‌పై నడకలకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. సినీ తారలకే కాకుండా డ్రెస్ డిజైనర్లకు కూడా ఇది పెద్ద పండుగే. ర్యాంప్‌లపై హొయలొలికించే మోడళ్లకు డ్రెస్ డిజైన్ చేయడం కంటే ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై నడిచే తారల డ్రెస్ డిజైన్‌కు వారు పోటీ పడతారు. ఇక అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించే ఆతిథేయి (హోస్ట్) పాత్ర కూడా ఆషామాషీ కాదు. వేదిక పైకి రాకముందు హోస్ట్ కొన్ని వందల సార్లు రిహార్సల్ చేస్తారు. కార్యక్రమాన్ని పండించేందుకు సినిమాలు మొదలుకొని రాజకీయ, సామాజిక, తదితర అంశాలపై సెటైర్లు వేస్తారు. ఈ విషయంలో హోస్ట్‌కు తర్ఫీదు ఇచ్చేందుకు ప్రత్యేకమైన బృందం ఉంటుంది. అవార్డుల ప్రదానం సందర్భంగా హోస్ట్‌కు ప్రాంప్టింగ్ చేయడానికి దాదాపు డజను మంది ఉంటారు. నటుడు, నిర్మాత ఓల్డే బిల్లీ క్రిస్టల్ ఏకంగా తొమ్మిది సార్లు హోస్ట్‌గా పనిచేశారు. సభికులను ఆకట్టుకునేందుకు కమెడియన్లను మారుతున్న ట్రెండ్‌ను అనుసరించి నిర్వాహకులు ఎంపిక చేస్తారు. వేదికపై నుంచి అవార్డులు అందుకునే వారు ఏం మాట్లాడుతారనే అంశంపై వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు సభికులకు కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. అవార్డులు అందుకున్న కొంతమంది అవార్డు రావడానికి కారణమైన సినిమా దర్శకుడు, నిర్మాత, తమతో పాటు పనిచేసిన నటీనటులు, సాంకేతిక సిబ్బందితోపాటు భార్య, పిల్లలు, పని మనుషులు, ఇంట్లో పెంచుకుంటున్న బొచ్చు కుక్కకు కూడా థాంక్స్ చెబుతారనడం అతిశయోక్తి కాదు. ఎవరిని మరిచిపోతే ఏం గొడవొస్తుందనే భయం కావచ్చు. ఎందుకంటే 2008లో తాను నటించిన ‘మిల్క్’ సినిమాకు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న సియాన్ పెన్ వేదికపై నుంచి పేరు పేరునా అందరికీ థాంక్స్ చెప్పి భార్య రాబిన్ రైట్ పేరు మరిచిపోయాడట. ఇంటికెళ్లాక ఆ విషయమై ఆమె పెద్ద గొడవ చేసిందట. కారణమేదైనా ఆ తర్వాత కొంతకాలానికే వారు విడాకులు తీసుకున్నారు. వేదికపై హఠాత్తుగా ఊహించని సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అవార్డులు తీసుకునే వారు ఉద్విగ్నానికి లోనై అవార్డులు ఇచ్చేవారిని (ఆడ, మగ) ప్యాసినేట్గా ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత స్టీవెన్ స్పీల్బెర్గ్ తన చిత్రం షిండ్లర్స్ లిస్ట్‌కు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ వచ్చినప్పుడు నిర్వాహకులు చెప్పినవారి నుంచి కాకుండా తన గురువు, ప్రముఖ జపాన్ దర్శకుడు అకిరా కురసోవా నుంచి అవార్డు అందుకున్నారు. -
ఆఖరి పోరాటంలో ఆస్కారం ఎవరికో?
ప్రపంచ సినిమాకు సంబంధించి అత్యధికంగా అందరి దృష్టినీ ఆకర్షించేది - ఆస్కార్ అవార్డులు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ అవార్డును అందుకోవడం చాలా మందికి ఒక కల. కానీ, ఈ ప్రతిమను సొంతం చేసుకోవడం అంత సులభం కాదు. గట్టి పోటీ ఉంటుంది. ముందు ఆస్కార్‌కు నామినేషన్లలో స్థానం దక్కించుకోవాలి. దానికే పెద్ద పోటీ ఉంటుంది. ఆ తుది నామినేషన్లలో స్థానం దక్కితే.. ఆస్కార్ అవార్డ్ పోటీ వరకు వెళ్లొచ్చు. ఆఖరి పోరాటంలో ఆస్కార్ ఎవరికి దక్కితే వారికి బోల్డంత ఆనందం. ఇక, ఈసారి ఆస్కార్ బరిలో నిలవబోయే చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితాను అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో గురువారం ప్రకటించారు. ఎక్కువ శాతం విభాగాల్లో ‘బర్డ్ మ్యాన్’, ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’ చిత్రాలు నామినేషన్లను దక్కించుకోవడం విశేషం. రహమాన్‌కు దక్కనిచోటు గతంలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి జంట ఆస్కార్ అవార్డులు అందుకుని, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు గర్వపడేలా చేశారు సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్. కాగా, ఈ 87వ ఆస్కార్ అవార్డ్స్‌లో మరోసారి రహమాన్ తన సత్తా చాటుతారని చాలామంది ఆశపడ్డారు. దానికి కారణం ఏమిటంటే, రహమాన్ సంగీత సారథ్యం వహించిన విదేశీ చిత్రాలు ‘మిలియన్ డాలర్ ఆర్మ్’, ‘హండ్రెడ్ ఫుట్ జర్నీ’, భారతీయ చిత్రం ‘కొచ్చడయాన్’లు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఈసారి ఎంట్రీలుగా వచ్చాయి. కానీ, ఈ విభాగంలో తుది నామినేషన్ల జాబితాలో వీటికి స్థానం దక్కలేదు. దాంతో ‘బెటర్ లక్ నెక్ట్స్ టైమ్’ అని రహమాన్ అభిమానులు అనుకుంటున్నారు. రహమాన్ మాత్రమే కాదు... ‘ఒరిజినల్ స్కోర్’ విభాగంలో హిందీ చిత్రం ‘జల్’కి సంగీత సారథ్యం వహించిన సోనూ నిగమ్, బిక్రమ్ ఘోష్ కూడా నామినేషన్ ఎంట్రీకి పోటీపడ్డారు. కానీ, వాళ్లకూ చుక్కెదురైంది. మన చిత్రాలు లేవు! ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా 323 చిత్రాలు బరిలోకి వచ్చాయి. మన దేశం నుంచి అధికారిక ఎంట్రీగా ‘లయర్స్ డైస్’ సినిమా వెళ్ళింది. కానీ, మలయాళ నటి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ‘లయర్స్ డైస్’ తొలి వడపోతలోనే ఇంటి ముఖం పట్టేసింది. చివరకు ఇప్పుడు అయిదే అయిదు చిత్రాలు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో తుది నామినేషన్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. అవి - పోలండ్‌కి చెందిన ‘ఇడా’, రష్యన్ మూవీ ‘లెవియాథన్’, ఎస్తోనియాకు చెందిన ‘టాంజెరైన్స్’, మరిటానియా దేశ చిత్రం ‘టింబక్టూ’, అర్జెంటేనియా చిత్రం ‘వైల్డ్ టేల్స్’. ఫిబ్రవరి 22న ఫలితాలు ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్‌కి చెందిన 6 వేల పైచిలుకు మంది సభ్యులు తమకు నచ్చిన చిత్రాలు, కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఓటు వేస్తారు. మొత్తం 17 శాఖలుగా సభ్యులను విభజిస్తారు. ఏ శాఖకు చెందిన సభ్యులు ఆ శాఖలో ఉన్న పోటీదారులకు ఓట్లు వేస్తారు. ఈ ఓట్లను పరిగణనలోకి తీసుకొని, విజేతను ఎంపిక చేస్తారు. వచ్చే నెల 6న ఉదయం 8 గంటలకు (అమెరికా టైమింగ్) ఓటింగ్ మొదలవుతుంది. 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది. ఫిబ్రవరి, 22న అవార్డుల ప్రదానం జరుగుతుంది. ఈసారి ఆస్కార్ అందుకొనే అదృష్టవంతులెవరో తెలుసుకోవడానికి అంత దాకా ఆగాల్సిందే! ఇక బరిలో మిగిలింది... ఉత్తమ చిత్రం: బాయ్ హుడ్, ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్, అమెరికన్ స్నైపర్, బర్డ్ మ్యాన్, సెల్మా, ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్, ది ఇమిటేషన్ గేమ్, విప్‌ల్యాష్, ఉత్తమ నటుడు: మైఖేల్ కీటన్, ఎడ్డీ రెడ్మేన్, బెండిక్ట్ కంబర్బ్యాచ్, బ్రాడ్లీ కూపర్, స్టీవ్ కారెల్ ఉత్తమ నటి: జూలియన్ మూర్, ఫెలిసిటీ జోన్స్, మారియన్ కోటిల్లార్డ్, రోజమండ్ పైక్, రీస్ విదర్‌స్పూన్ ఉత్తమ దర్శకుడు: రిచర్డ్ లింక్లేటర్, వెస్ ఆండర్సన్, బెన్నెట్ మిల్లర్, మార్టెన్ టిల్డమ్, అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిటు -
మళ్లీ ఆస్కార్ బరిలో!
‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో జంట ఆస్కార్ అవార్డులు సాధించిన ఎ.ఆర్. రహమాన్ మళ్లీ ఆస్కార్ అవార్డ్ పోటీలో నిలిచారు. వచ్చే ఏడాది జరగనున్న 87వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఒరిజినల్ స్కోర్’ విభాగంలో రహమాన్‌కి స్థానం లభించింది. హాలీవుడ్ చిత్రాలు ‘మిలియన్ డాలర్ ఆర్మ్’, ‘ది హండ్రెడ్-ఫుట్ జర్నీ’లతో పాటు భారతీయ సినిమా ‘కోచడయాన్’కు అందించిన మ్యూజిక్‌కి గాను రహమాన్ ఆస్కార్ నామినేషన్ బరిలో ఉన్నారు. ఈ విషయాన్ని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సెన్సైస్ అధికారికంగా ప్రకటించింది. తుది పరిశీలనకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను జనవరి 15న ప్రకటిస్తారు. మరి.. రహమాన్‌కు నామినేషన్ దక్కుతుందా? ఒకవేళ అక్కడ పాస్ అయితే ఆస్కార్ అందుకుంటారా? అనేది తెలియాలంటే రెండు నెలలు ఆగాల్సిందే. -
వెండితెరకు ‘స్లమ్ గాడ్స్’ జీవితం!
దాదాపు ఐదేళ్ల క్రితం వచ్చిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రం గురించి అందరికీ తెలుసు. ఎ.ఆర్. రహమాన్‌కి ఆ సినిమా జంట ఆస్కార్ అవార్డులు తెచ్చిపెట్టిన విషయమూ తెలిసిందే. ముంబయ్‌కి చెందిన జుహూలోని మురికివాడకు సంబంధించిన ఓ యువకుడి కథతో ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది. కాగా, ఇప్పుడదే ముంబయ్ మహానగరంలో ప్రసిద్ధి పొందిన ధారావి అనే మురికి వాడ నేపథ్యంలో శేఖర్ కపూర్ ఓ చిత్రం రూపొందించనున్నారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయనే భావనతో ఈ మురికివాడలో ఉన్న పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసేలా ఆకాశ్ దంగర్ అనే వ్యక్తి ‘స్లమ్ గాడ్స్’ అనే గ్రూప్‌ని ప్రారంభించారు. పిల్లలను చదివించడంతో పాటు, వారికి ఆసక్తి ఉన్న విషయాల్లో శిక్షణ ఇప్పించడం, యువతీ యువకుల్లో చైతన్యం నింపడం ఈ స్లమ్ గాడ్స్ ఉద్దేశం. ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యుల్లో ‘హిప్ హాప్’ నేర్చుకుని, మంచి గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. స్లమ్ గాడ్స్ని ఆరంభించిన ఆకాశ్, హిప్ హాప్ ద్వారా ప్రసిద్ధి పొందిన ఆ సభ్యుల జీవితం ఆధారంగా సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్‌తో కలిసి శేఖర్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే.. స్లమ్ గాడ్స్‌లోని ధారావికి చెందినవారితోనే కథ రాయించడంతో పాటు, వాళ్లతోనే దర్శకత్వం వహింపజేయాలనుకుంటున్నారు. -
ఆస్కార్ బరిలో మన చిత్రం.. 'లయర్స్ డైస్'
జాతీయ అవార్డు పొందిన హిందీ చిత్రం 'లయర్స్ డైస్'కు ఆస్కార్ ఎంట్రీ లభించింది. 87వ అకాడమీ అవార్డుల బరిలో గీతాంజలి థాపా, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ఈ చిత్రానికి అవకాశం వచ్చింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) నియమించిన 12 మంది సభ్యుల జ్యూరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. ఈసారి అత్యధికంగా రికార్డు స్థాయిలో 30 సినిమాలు దీనికోసం పోటీ పడ్డాయి. వీటిలోంచి లయర్స్ డైస్‌ను భారతదేశం తరఫున విదేశీ చిత్రాల కేటగిరీలో అవార్డు కోసం పంపుతున్నట్లు ఎఫ్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సుప్రాణ్ సేన్ తెలిపారు. మళయాళ నటి గీతూ మోహన్‌దాస్ తొలిసారిగా దర్శకత్వం వహించి తీసిన ఈ సినిమాలో తన మూడేళ్ల కూతురితో కలిసి ఓ మహిళ.. తప్పిపోయిన తన భర్త కోసం వెతుకుతుంటుంది. దారిలో వాళ్లకు సైన్యం నుంచి బయటికొచ్చిన ఓ వ్యక్తి కలుస్తాడు. అతడు వారు తమ గమ్యాన్ని చేరుకునేవరకు తోడుంటాడు. 61వ జాతీయ సినిమా అవార్డులలో ఈ సినిమాకుగాను గీతాంజలికి ఉత్తమనటి అవార్డు, రాజీవ్ రాయ్‌కి ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చాయి. -
ఆస్కార్... కొన్ని ఆసక్తికరమైన విషయాలు!
ఆస్కార్ పేరెలా వచ్చిందంటే... ప్రతి పేరు వెనక ఓ కథ ఉంటుంది. అలాగే ‘ఆస్కార్’ పేరు వెనక కూడా ఓ కథ ఉంది. వాస్తవానికి ముందుగా ‘అకాడమీ అవార్డ్’ అనే పిలిచేవారు. అయితే, ఆస్కార్ ప్రతిమను చూసి, అకాడమీ లైబ్రేరియన్ మార్గరెట్ హెర్రిక్ అది తన మామయ్య ఆస్కార్ మాదిరిగా ఉందని పేర్కొన్నారట. అప్పట్నుంచీ ఆ ప్రతిమను ఆస్కార్ అని అక్కడి ఉద్యోగులు పిలవడం మొదలుపెట్టారు. చివరికి ఆ పేరే స్థిరపడింది. 1927లో ఆస్కార్ అవార్డుల ప్రదానం ప్రారంభమైతే, ఆస్కార్ అనే పేరు స్థిరపడింది 1939 నుంచి అని చరిత్ర చెబుతోంది. ఆస్కార్ బొమ్మ ఎలా తయారైందంటే... 1927లో ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అవార్డ్స్ అండ్ సెన్సైస్’ అనే సంస్థ ప్రారంభించి, చిత్రరంగంలోని ప్రతిభావంతులకు అవార్డు ప్రదానం చేయాలనుకుంది ఓ కమిటీ. ఆ అవార్డు ప్రతిమ డిజైన్ని కళాదర్శకుడు సిడ్రిక్ గిబ్సన్స్ రూపొందించారు. నటీనటులు, రచయితలు, దర్శక, నిర్మాతలూ, సాంకేతిక నిపుణులు.. ఇలా చిత్రనిర్మాణంలో కీలక పాత్ర వహించే శాఖలను దృష్టిలో పెట్టుకుని ఐదు స్పోక్స్ ఉన్న ఒక ఫిలిం రీల్‌పై ఓ వీరుడు కత్తి పట్టుకుని నిలబడినట్లుగా ప్రతిమను డిజైన్ చేశారు. ఆస్కార్ ప్రతిమ ఖరీదు ఎంతంటే... ఒక్కో ఆస్కార్ ప్రతిమ తయారు చేయడానికి దాదాపు 40 గంటలు పడుతుందట. ఒక్కోదానికి సుమారు 17వేలకు పైగా ఖర్చవుతుంది. మొత్తం 24 శాఖలకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఒక్కోసారి ఒక్కో విభాగంలో ఇద్దరికీ అవార్డులు ప్రదానం చేయాల్సి వస్తుంది. అందుకని, ముందు జాగ్రత్తగా 60 ప్రతిమల వరకు తయారు చేస్తారు. అవార్డ్ వేడుక పూర్తయ్యాక మిగిలిన ప్రతిమలను లాకర్లో ఉంచి సీల్ వేస్తారు. 1945 వరకు ఒక్కో ఏడాది ఒక్కో సైజ్‌లో ఆస్కార్ ప్రతిమ ఉండేది. అయితే, ఆ తర్వాత ఒకే సైజుని ఫిక్స్ చేశారు. 13.5 అంగుళాల పొడువు, 3.85 కిలోల బరువుతో ఉంటుంది ఆస్కార్ బొమ్మ. ఎక్కువసార్లు ఆస్కార్ సొంతం చేసుకున్నది ఎవరంటే... 86 ఏళ్ల ఆస్కార్ అవార్డ్ చరిత్రలో ఎక్కువసార్లు అవార్డులు అందుకున్న వ్యక్తి వాల్ట్ డిస్నీ. వివిధ విభాగాల్లో ఆయన 22సార్లు అవార్డు గెల్చుకున్నారు. అలాగే, ఉత్తమ నటిగా నాలుగుసార్లు అవార్డ్ పొందిన ఏకైక నటి కేథరిన్ హెప్బర్న్. ఎక్కువ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు జాన్‌ఫోర్డ్ కావడం విశేషం. -
ఆస్కార్ ఉత్తమ నటుడిగా లియోనార్డో డికాప్రియా
లాస్ఏంజిల్స్ : ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నఆస్కార్ అవార్డుల విజేతల పేర్లను సోమవారం ప్రకటించారు. 86వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఉత్తమ నటుడిగా లియోనార్డో డికాప్రియో(బ్రూస్) ఎంపికవ్వగా, ఉత్తమ సహాయ నటుడిగా జారెడ్ లెటో(డల్లాస్ బయ్యర్స్ క్లబ్) ఎంపికైయ్యాడు. కాగా గత సంవత్సరం ఉత్తమ నటిగా ఎంపికైన జెన్నీఫర్ లారెన్స్ ఈసారి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. తాజా చిత్రం ‘కామసూత్ర’ త్రీడి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది. ఏకంగా మూడు విభాగాల్లో ఈ చిత్రం పోటీకి నిలవడం విశేషం. ‘బెస్ట్ మోషన్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’’ విభాగాలకు ఈ చిత్రం ఎంపికైంది. మన భారతదేశం నుంచి దాదాపు ఐదేళ్ల క్రితం ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రం ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఈ విభాగాల్లో ‘కామసూత్ర’ నిలిచింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 75 పాటలు పోటీపడబోతున్నాయి. వీటిలో ‘కామసూత్ర’ లోని ఐదు పాటలూ ఉండటం విశేషం. చెన్నయ్‌కి చెందిన సచిన్, శ్రీజిత్ ఈ పాటలకు స్వరాలందించారు. రూపేష్ పౌల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా, జనవరి 16న అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలను ప్రకటించారు. మార్చి 3న అస్కార్ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. -
వివరం : అందాకా వెళ్లడమే పురస్కారం
ఆస్కార్ రావడం గొప్ప అనుకునేవాళ్లు, ఆస్కార్ రావడం గొప్పా అనేవాళ్లు... హాలీవుడ్లో పక్కపక్క ఇళ్లల్లో ఉంటారని అంటారు. ఆస్కార్ గొప్పతనమదే! ఆస్కార్ వచ్చినా, రాకున్నా గొప్పే. అసూయను సైతం సుగుణంగా మార్చింది ఆస్కార్. సినిమాను గౌరవించినట్లే, వ్యక్తిగత అభిప్రాయాలను, ఆగ్రహాలను గౌరవించింది ఆస్కార్. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధమైన సూచనలనూ స్వీకరించింది. 1936లో హాల్మర్కు ‘బెస్ట్ సినిమాటోగ్రఫీ’ అవార్డు అలా వచ్చిందే. నామినేషన్లలో ఆయన పేరు లేదు. కానీ, ‘మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్’ చిత్రంలో సినిమాటోగ్రఫీ అత్యుత్తమంగా ఉందని అకాడెమీ సభ్యులు బ్యాలెట్లో హాల్మర్ పేరు రాసి మరీ ఓటేశారు. వారి తీర్పునకు సమ్మతి లభించింది! ప్రతిభను ఎవరూ అడ్డుకోలేరు. ఎవరెంత పట్టి ఉంచినా, పట్టనట్లు ఉండిపోయినా... ఏదో ఒకరోజు తిన్నగా అది వేదిక మీదికి వచ్చేస్తుంది. ఆ వేదిక ఆస్కార్ అయితే ఇక చెప్పాల్సిందేముందీ! అందుకే ఆస్కార్‌తో ముడివడిన కొందరు హాలీవుడ్ తారల భావోద్వేగాలను ఈవారం మీకు అందిస్తున్నాం. మేమ్... నిద్ర లేచారా? బ్రిటన్ నటి హెలెన్ మిరెన్కు ఉదయాన్నే 5.30 కి తన ఏజెంటు నుంచి ఫోన్ వచ్చింది. ‘‘గుడ్మాణింగ్ మేమ్. ఉత్తమ సహాయ నటిగా మీరు ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు’’.ఇటువైపు ఉలుకు లేదు. పలుకు లేదు. 1994లో ‘ద మ్యాడ్నెస్ ఆఫ్ కింగ్ జార్జి’ చిత్రంలో హెలెన్ నటించిన క్వీన్ చార్లెట్ పాత్ర అది. ‘‘మేమ్... నిద్ర లేచారా?’’ మళ్లీ అడిగాడు ఏజెంట్. ‘‘లేచానయ్యా. విన్నాలే. ఆస్కార్ వస్తే మంచిదే. జనానికి ఒకట్రెండ్రోజులు గుర్తుంటాం. కానీ ఈ గిన్నెల బాధ ఎప్పటికీ తప్పదు కదా. లేవాలి, తోమాలి’’. ఇదీ హెలెన్ సమాధానం! సీసాలు పగలగొట్టాడు! దర్శకుడు స్పైక్ లీ తీవ్రమైన అసహనంతో ఉన్నాడు. 1990లో ‘డ్రైవింగ్ మిస్ డైసీ’ 9 ఆస్కార్లకు నామినేట్ అయింది. తన సొంత చిత్రం ‘డు ద రైట్ థింగ్’ మాత్రం ఒక్క కేటగిరీలోనూ నామినేట్ అవలేదు. పైగా అది ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం విభాగాలలో షికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు పొందిన చిత్రం. లీ కి బాగా కోపం వచ్చింది. 24 గంటల తర్వాత గానీ మామూలు మనిషి కాలేకపోయాడు. ‘‘మీ కోపం ఎలా తగ్గిపోయింది?’’ విలేఖరి ప్రశ్న. ‘‘రోజంతా పెద్దగా బండ బూతులు తిట్టుకున్నా. సీసాలు పగలగొట్టా. అప్పుడుగానీ మనసు శాంతించలేదు’’. అది నేను కాదు బ్రో... ‘టైటానిక్’ (1997) కి 11 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. అయితే ఆ చిత్ర కథానాయకుడు లియోనార్డో డి కాప్రియో ఆస్కార్ వేడుకలను ఎగ్గొట్టి వేరే ఎక్కడో తాగి తూలుతున్నాడు. విషయం తెలుసుకోడానికి చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్ అతడికి ఫోన్ చేస్తే అటువైపు నుంచి వచ్చిన సమాధానం : ‘‘మీరు వెదుకుతున్న వ్యక్తిని నేను కాదు బ్రో’’. రేపు ఉదయం మనకు ఆస్కార్ వేడుకలకు ముహూర్తం దగ్గరపడింది. ఇవాళ సాయంత్రం (మనకు రేపు ఉదయం) హాలివుడ్లోని డాల్బీ థియేటర్ నుంచి విజేతల ప్రకటన వెలువడుతుంది. గత ఏడాది జనవరి 1 నుంచి, డిసెంబర్ 31 వరకు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చలన చిత్రాలలో 24 కేటగిరీల నుంచి స్వీకరించిన నామినేషన్లలో అత్యుత్తమమైనవిగా ఎంపికైన వాటికి ఆస్కార్ అవార్డును ప్రకటిస్తారు. ఈసారి ఉత్తమ చిత్రం కేటగిరీలో ‘గ్రావిటీ’ , ‘12 ఇయర్స్ ఎ స్లేవ్’ గట్టి పోటీ ఇస్తున్నాయి. అకాడెమీ ఉత్సవాలు (ఆస్కార్ ఉత్సవాలు) తొలిసారి 1929 మే 16న గురువారం హాలివుడ్లోని రూజ్వెల్ట్ హోటల్లో జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నవి 86వ ఆస్కార్ వేడుకలు. ఈ వేడుకలను ప్రఖ్యాత కమెడియన్, టెలివిజన్ హోస్ట్ ఎలెన్ డిజెనెరస్ నిర్వహించనున్నారు. అండ్ ద విన్నర్ ఈజ్.... ‘మర్డర్ ఇంక్ (1960) చిత్రంతో ఆస్కార్‌కు నామినేట్ అయిన పీటర్ ఫాక్, తనకా విషయం తెలిసే సమయానికి గ్రీన్విచ్ గ్రామంలో వారానికి 10-15 డాలర్ల వేతనం వచ్చే ఉద్యోగం ఏదో చేస్తూ ఉన్నాడు. అవార్డులు ప్రకటించే రోజు ఓ పాత ఫోక్స్‌వేగన్ కారులో వేదిక దగ్గరకు చేరుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో ఆయన మాటల్లోనే వినాలి. ‘‘ఒక్కో కేటగిరీలో విజేతలెవరో ప్రకటిస్తున్నారు. కొంతసేపటి నా కేటగిరీ వచ్చింది. ఊపిరి బిగబట్టి వింటున్నాను. ‘అండ్ ద విన్నర్ ఈజ్... పీటర్...’’ అనగానే ఒక్క గెంతుతో పైకి లేస్తుండగా... ‘ఉస్తినోవ్’ అని వినిపించి కూలబడిపోయాను. నా పక్కన కూర్చుని ఉన్న నా ప్రచార కార్యదర్శిపై విరుచుకుపడ్డాను. రోజంతా ఆకాశం వైపు చూస్తూ... 1993లో ‘హోవార్డ్స్ ఎండ్’ చిత్రంతో ఎమ్మా థాంప్సన్ ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకున్నారు. అవార్డు అందుకున్న రెండో రోజు ఎమ్మా ఏం చేశారో తెలుసా? తన ఆనందాన్ని తల్లితో పంచుకున్నారు. ఎలాగంటే, తల్లీకూతుళ్లిద్దరూ పూల మధ్యలో రోజంతా వెల్లకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తుండిపోయారు. ఆ రోజును తలుచుకుంటూ ‘‘ఇద్దరం పక్కపక్కనే గుండెల మీద క్రాస్‌గా చేతులు వేసుకుని చనిపోయినట్లుగా పడుకున్నాం’’ అని నవ్వుతూ చెబుతుంటారు ఎమ్మా. అతడితో కలిసి నిద్రిస్తున్నాను షిర్లీ మెక్లైన్కు మనసు విప్పి బాహాటంగా మాట్లాడ్డం అలవాటు. 1984లో ఓ సాయంత్రం బ్రాడ్వే థియేటర్ వేదిక మీద మాట్లాడుతూ ‘‘నా జీవితంలోకి కొత్తగా ప్రవేశంచిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. 35 ఏళ్లుగా నేను అతడిని గుట్టుగా ఆరాధిస్తున్నాను. అతడు అన్నిటా అధికుడు. నీతిలో, నిజాయితీలో, సృజనాత్మకతలో! ముఖ్యంగా ఇప్పుడు నేను రోజూ అతడితో నిద్రిస్తున్నాను’’ అని చెప్పారు షిర్లీ. ఆ వెంటనే పియానో వెనుక దాచి ఉంచిన ఆస్కార్ ప్రతిమను చేతిలోకి తీసుకుని గాలిలో ఊపుతూ అతనే ఇతను అని ప్రేక్షకులకు చూపించారు. అంతకు ముందే న్యూయార్క్‌లోని తన అపార్ట్మెంట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘‘ఆస్కార్ ప్రతిమను మీరు ఎక్కడ భద్రపరిచారు?’’ అన్న ప్రశ్నకు ‘‘అది నా పడక గదిలో ఉంటుంది’’ అని షిర్లీ చెప్పిన దానిని బట్టి రోజూ ఆవిడ ఆస్కార్‌తో పవళిస్తానని చెప్పిన సంగతి నిజమేననుకోవాలి. ఆస్కార్ ఖర్చులు ఆస్కార్‌కు ఒక సినిమా నామినేట్ అవడానికి చిత్ర రచయిత లేదా చిత్ర దర్శకుడికి అయ్యే ఖర్చు 2,00,000 డాలర్లు. ఆస్కార్‌ను గెలిచేందుకు ఒక ఏడాదిలో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ పెట్టే మొత్తం ఖర్చు 150 మిలియన్ డాలర్లు. ఆస్కార్ వేడుకల వ్యాఖ్యాతకు ఇచ్చే పారితోషికం 15,000 నుంచి 25,000 డాలర్లు. ఆస్కార్ వేడుకలకు హాజరయ్యే నటీమణుల ముస్తాబుకు అయ్యే ఖర్చు 5,000 నుంచి 11,000 డాలర్లు. ఒక ఆస్కార్ గౌను కుట్టడానికి అయ్యే ఖర్చు 4,000 నుంచి 6,000 డాలర్లు. (ఈ ఖర్చును ఆస్కార్ స్డుడియోవారే భరిస్తారు). ఆస్కార్ వేడుకలలో గాయనీమణులకు ఇచ్చే పారితోషికం 14,000 డాలర్లకు పైగానే. ఆస్కార్ వేదిక వరకు పరిచే రెడ్ కార్పెట్ తయారీ ఖర్చు 25,000 డాలర్లు (చదరపు అడుగుకు 1.50 డాలర్లు) ఆస్కార్ అకాడమీ సభ్యులకు సినిమాలు వేసి చూపించడానికి అయ్యే ఖర్చు 2,50,000 డాలర్లకు పైగానే. ఆస్కార్‌కు నామినేట్ అయినవారి భోజనాల ఖర్చు 2,50,000 డాలర్లు. ఆస్కార్ ట్రోఫీ తయారీకి అయ్యే ఖర్చు ఒక్కింటికి 400 డాలర్లు. ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలను లాస్ఏంజిల్స్, న్యూయార్క్, లండన్లలో ప్రదర్శిస్తారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన వారికి ‘ఆస్కార్ నామినీ’ అని రాసి ఉన్న స్వెటర్‌ను అందిస్తారు. మరికొన్ని ఆస్కార్ విశేషాలు ఆస్కార్లు మొదలైన తొలి ఏడాది (1929) బెస్ట్ ఆర్టిస్టిక్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్, బెస్ట్ టైటిల్ రైటింగ్ (మూకీ సినిమాలకు), బెస్ట్ కామెడీ డెరైక్షన్ విభాగాలకు కూడా అవార్డు ప్రదానం చేశారు. తర్వాతి ఏడాది నుంచి ఈ విభాగాలను తొలగించారు. అతి చిన్న వయసు ఆస్కార్ విజేత టాటమ్ ఓ నీల్. పదేళ్ల వయసులో ఈ అమ్మాయి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకుంది. చిత్రం : పేపర్ మూన్ (1973). అతి చిన్న వయసులో ఆస్కార్ నామినేషన్ పొందింది మాత్రం జస్టిన్ హెన్రీ. 1979 నాటి ఓట్చఝ్ఛట గట ఓట్చఝ్ఛట చిత్రంతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఇతడు నామినేట్ అయ్యాడు. అప్పటికి అతడి వయసు 8 ఏళ్లు. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు పొందిన సినిమాల నిడివి సుదీర్ఘంగా ఉంటుంది. వాటిల్లో మరీ మూడున్నర గంటల పాటు సాగే సినిమాలు: Gone with the wind, Law-rence of Arabia, BenHur. తొలి ఆస్కార్ ఉత్తమ నటుడు ఎమిల్ జేనింగ్స్ ఆస్కార్ వేడుకలకు (1927-28 అవార్డులు) హాజరు కాకుండానే ట్రోఫీని అందుకున్నారు! అత్యవసరంగా ఆయన తన జన్మస్థలం జర్మనీకి వెళ్లవలసిరావడంతో అవార్డు ప్రదానోత్సవానికి ముందే నిర్వాహకులు ట్రోఫీని అందజేశారు. మరణానంతరం కూడా కొంతమంది సినీ కళాకారులు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. అలా ఆస్కార్ చరిత్రలో తొలిసారిగా నామినేట్ అయ్యి, అవార్డు పొందిన వ్యక్తి సిడ్నీ హోవార్డ్. ‘గాన్ విత్ ద విండ్’ (1939) స్క్రీన్ రైటర్ ఆయన. ఆస్కార్ అవార్డును తిరస్కరించిన తొలి వ్యక్తి డూడ్లీ నికోల్స్. ‘ది ఇన్ఫార్మర్’ (1935) చిత్రంలో ఆయన స్క్రీన్‌ప్లేకు అవార్డు వచ్చింది. అకాడెమీకి, రైటర్స్ గిల్డ్‌కు మధ్య ఉన్న వివాదాల కారణంగా అవార్డు తీసుకోడానికి నిరాకరించారు నికోల్స్. మేరీ పిక్‌ఫోర్డ్... ఆస్కార్ అవార్డుల వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె మొదటి భర్త డగ్లాస్ ఫెయిర్‌బ్యాంక్స్ ఆ అకాడమీకి తొలి అధ్యక్షుడు. అయినప్పటికీ 1960 ఆస్కార్ ఓటింగులో మేరీ పాల్గొనలేదు! ‘‘ఓటింగుకు నేను అర్హురాలిని కాదు. ఎందుకంటే నేను సినిమాలను చూడ్డం ఎప్పుడో మానేశాను’’ అని అన్నారావిడ! మేరీ ఎలిజబెత్ మేస్ట్రాంటినో అనే ఆవిడకు ఆస్కార్ అవార్డు రాలేదు కానీ, ఆస్కార్‌కు సంబంధించిన రికార్డును తనకు తెలియకుండానే ఆమె సాధించారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన వందలాది నటులు, నటీమణులలో అందరికన్నా పొడవైన పేరు తనదేనని మేస్ట్రాంటినోకు ఆ తర్వాత ఎవరో చెప్పి సంతోషపరిచారు. బటర్ ఫ్లైయ్స్ ఆర్ ఫ్రీ చిత్రంలో మిస్ట్రెస్ బేకర్ పాత్రను పోషించిన ఎలీన్ హెకార్ట్కి 1972లో ఆస్కార్ అవార్డు వచ్చింది. మర్నాడు ఆమె ఎప్పటిలా తనకు రావలసిన చెక్కు కోసం స్థానిక నిరుద్యోగ కార్యాలయానికి వెళ్లారు. ఇక చూడండి. ఆఫీస్ ఆఫీసంతా లేచి నిలబడి చప్పట్లతో ఎలీన్కు స్వాగతం పలికారు! 1942లో ఆస్కార్ భోజనశాల ఆహ్వానితులలో చైనా రాయబారి డాక్టర్ హు ష్యీ కూడా ఉన్నారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సిసెల్ డిమిలే డాక్టర్ హు ష్యీని ఉద్దేశించి మాట్లాడుతూ పొరపాటున ‘‘గౌరవనీయులైన జపాన్ రాయబారి’’ అని, వెంటనే నాలుక కరుచుకున్నారు. అప్పటికే హాలంతా గంభీరమైన నిశ్శబ్ధం అలుముకుంది. జపాన్ దురాక్రమణదారులతో చైనా పోరాడుతున్న రోజులవి! ‘షేక్స్పియర్ ఇన్ లవ్’ చిత్రానికి 1999లో ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును అందుకుంటూ గ్వినెత్ పాల్ట్రో ఆనందభరితమై ఉద్వేగంతో కంటతడి ప్రసంగం చేశారు. ఆ రోజును జ్ఞప్తికి తెచ్చుకుంటూ ‘‘అలా ఎందుకయిందో తెలియదు. ఆ క్షణంలో నన్ను చూస్తూ కోట్లాది మంది ప్రజలు చూస్తుంటే కుదురుగా నిలబడలేకపోయాను. జ్వరం వచ్చినట్లయింది’’ అన్నారు. ఆస్కార్ నటి సుసాన్ సారాండాన్ ఆమె సహజీవన ప్రియుడు టిమ్ రాబిన్స్, వారి పిల్లలు ఈవా (13), జాక్ (9), మైల్స్ (6) మిలీనియం వేడుకలను ఎక్కడ జరుపుకున్నారనుకున్నారో తెలుసా? వారి బాత్రూమ్లో. అక్కడ ఉన్న షోకేస్‌లో ఆస్కార్ సహా వారికి వచ్చిన అవార్డులన్నీ కొలువుతీరి ఉంటాయి. 1943లో గ్రీర్ గార్సన్కు మిస్ట్రెస్ మినివర్ చిత్రం ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టింది. అవార్డు అందుకున్నాక స్వీకార ప్రసంగం (యాక్సెప్టెన్స్ స్పీచ్) చెయ్యాలి కదా. అర్ధరాత్రి మొదలైన గార్సన్ ప్రసంగం ఏకధాటిగా ఐదున్నర గంటల పాటు కొనసాగింది! ఆస్కార్ చరిత్రలో అంత సుదీర్ఘమైన ప్రసంగం ఇప్పటి వరకు లేదు. హాలీవుడ్ మెలోడ్రామా ‘ద బ్యాడ్ అండ్ ద బ్యూటిఫుల్’ చిత్రంలో అనేక సంబంధాలు కలిగి ఉన్న మహిళగా తను వేసిన పాత్రకు 1953లో ఉత్తమ సహాయక నటిగా ఆస్కార్ అవార్డు పొందిన గ్లోరియా గ్రాహమ్ ఒకే ఒక మాటలో తన స్వీకార ప్రసంగాన్ని ముగించారు. ఆ మాట: ‘థ్యాంక్యూ’. ఆస్కార్ చరిత్రలో ఇంతకన్నా చిన్న ప్రసంగం లేదు. -
ఆస్కార్ బరిలో ఓడిపోతే.. 34 లక్షలు!!
ఆస్కార్ అవార్డు దక్కడం అంటే చాలా పెద్ద గౌరవం. కానీ, అక్కడి వరకు వెళ్లి ఓడిపోయిన వారు కూడా నిరాశ చెందకుండా వాళ్ల కోసం ఓ బహుమతిని నిర్వాహకులు సిద్ధం చేశారు. అలాంటివాళ్లు ఖాళీ చేతులతో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తే బాగుంటుందని ఈ ఆలోచన చేశారు. ఓడిపోయామన్న బాధను వారి గుండెల్లోంచి ఎంతో కొంత తీసేయడానికని ఆస్కార్ రన్నరప్‌గా నిలిచినవారు 55వేల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు 34 లక్షలు) గిఫ్ట్ బ్యాగ్‌లు అందిస్తారు. వీటిలో వైన్, చాక్లెట్ ఫ్లైట్ పెయిరింగ్, స్విస్ తయారీ స్లో వాచ్, జాన్ లూయీస్ డిజైన్స్ గాజులు, కెనడియన్ రాకీస్, మెక్సికో, జపాన్ దేశాలకు లగ్జరీ ప్యాకేజిలు, స్పా ట్రీట్మెంట్లు.. ఇలా రకరకాల బహుమతులు అందులో కలగలిసి ఉంటాయి. వీటన్నింటినీ ఆస్కార్ ఆతిథ్య సంస్థ అందిస్తుంది. 86వ ఆస్కార్ అవార్డుల పండుగ మార్చి 2వ తేదీన జరగనుంది. -
ఆస్కార్ సందడి షురూ