sabarimala
-
శబరిమలలో పూజ వివాదంపై స్పందించిన మోహన్‌లాల్
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా నటించిన ఎల్ 2: ఎంపురన్ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల కోసం అన్ని చోట్లకు తెగ తిరిగేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మోహన్ లాల్ కాలినడకన శబరిమల కొండ కూడా ఎక్కాడు. తోటి హీరో మమ్ముట్టి (Mammootty) పేరిట ప్రత్యేక పూజలు చేయించాడు. దీంతో వివాదం మొదలైంది. ఇప్పుడు దానిపై మోహన్ లాల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. (ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)మమ్ముట్టి స్వతహాగా ముస్లిం. ఇతడి పేరిట శబరిమల (Sabarimala) దేవాలయంలో పూజలు చేయించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే ప్రశ్న.. చెన్నై ప్రెస్ మీట్ లోనూ మోహన్ లాల్ కి ఎదురైంది. దీంతో.. 'అందులో తప్పేముంది? అతడు నా స్నేహితుడు. అందుకే ప్రత్యేక పూజ చేయించాను. అయినా నా ఫ్రెండ్ కోసం పూజా చేయించడం నా వ్యక్తిగత విషయం' అని చెప్పుకొచ్చాడు.మమ్ముట్టి ఆరోగ్యం గురించి మాట్లాడిన మోహన్ లాల్.. అతడికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందరికీ ఇలాంటివి సాధారణమే. భయపడాల్సినంతగా ఏం లేదు అని రూమర్స్ పైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం రంజాన్ సీజన్ కావడంతో మమ్ముట్టి ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మమ్ముట్టికి క్యాన్సర్ అనే పుకార్లు వచ్చాయి. దీన్ని ఆయన టీమ్ ఖండించింది. ఇది జరిగిన కొన్నిరోజులకు మమ్ముట్టి గురించి మోహన్ లాల్.. శబరిమలలో పూజ చేయించడం హాట్ టాపిక్ అయింది.(ఇదీ చదవండి: ఐసీయూలో తల్లి.. IPLకు నో చెప్పిన హీరోయిన్) -
మకర జ్యోతి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
-
భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల
-
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణమద్య రైల్వే శబరిమలకు పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ అఫిసర్ మండురూపకర్ శనివారం తెలిపారు. సికింద్రబాద్ నుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌నంబర్07175)రైలు ఈనెల 19, 26తేదిలలో సికింద్రబాద్‌లో గురువారం రాత్రీ 8గంటకు బయలు దేరి శనివారం తెల్లవారుజామున 1.30కు కొల్లం చేరుతుంది.కాకినాడ పొర్టునుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌నంబర్07173)ఈనెల 18,25తేదిలలో బుధవారం రాత్రీ 11.50కి కాకినాడ పొర్టులో బయలు దేరి శుక్రవారం ఉదయం 5.30కు కొల్లం చేరుతుంది. విజయవాడ నుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌నంబర్07177) 21, 28 తేదిలలో విజయవాడలో శనివారం రాత్రీ 10.15 బయలుదేరి సొమవారం ఉదయం 6.20కి కొల్లం చేరుతుంది. -
శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం ఇప్పటికే నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లతో పాటు అదనంగా మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాడ పోర్టు–కొల్లం (07173) ఈనెల 11, 18, 25 తేదీల్లో బుధవారం రాత్రి 11.50 గంటలకు కాకినాడ పోర్టులో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07174) ఈనెల 13, 20, 27 తేదీల్లో శుక్రవారం ఉదయం 8.40 గంటలకు కొల్లంలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్–కొల్లం (07175) ఈనెల 19, 26 తేదీల్లో గురువారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07176) ఈనెల 21, 28 తేదీల్లో శనివారం ఉదయం 5 గంటలకు కొల్లంలో బయలుదేరుతుంది. -
శబరిమలకు 44 ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్ నుంచి విజయవాడ మీదుగా కొల్లం వరకు 44 వారాంతపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–కొల్లాం (08539) ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు.ఈ రైలు ప్రతి బుధవారం విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08540) డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి గురువారం రాత్రి బయలు దేరుతుంది. శ్రీకాకుళం రోడ్–కొల్లాం (08553) ప్రత్యేక రైలు డిసెంబర్ 1 నుంచి జనవరి 26 వరకు ప్రతి ఆదివారం నడుపుతారు. శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి, మరుసటి రోజు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08554) డిసెంబర్ 2 నుంచి జనవరి 27 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కొల్లాంలో బయలు దేరుతుంది. -
Sabarimala: నేడు మకరజ్యోతి దర్శనం
తిరువనంతపురం: శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం కానుంది. ఈ నేపథ్యంలో స్వాములు భారీగా తరలి వస్తున్నారు. శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి ఉంటుందని ట్రావెన్కోర్ బోర్డ్ ప్రకటించింది. కానీ, నాలుగు లక్షల మంది దాకా వీక్షించే అవకాశం ఉండొచ్చని ఒక అంచనా. హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. శబరిమల మకరజ్యోతి/మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున...శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనం ఇస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు/ శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. #WATCH | Kerala: Devotees throng Sabarimala Temple in large numbers to offer prayers to Lord Ayyappa ahead of the Makaravilakku festival. pic.twitter.com/n2UXCMOkTP — ANI (@ANI) January 14, 2024 మకర జ్యోతి దర్శన నేపథ్యంలో.. నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు స్వామి దర్శనం కోసం శబరిమలకు పోటెత్తుతున్నారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చే మకర జ్యోతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఉంటుంది ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. -
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకరజ్యోతి దర్శనంపై కీలక నిర్ణయం
తిరువనంతపురం: కేరళలోని శబరిమల దర్శనానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. వివరాల ప్రకారం.. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. పంబా నుంచి శబరి పీఠం వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో, గంటల తరబడి భక్తులు క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు.. భక్తుల రద్దీ విషయంలో దేవస్థానం ట్రస్ట్(ట్రావెన్కోర్ దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతి సందర్శనం రోజున దర్శనాలపై కొత్త నిబంధనలను విధించింది. మకరజ్యోతి వీక్షణం కోసం 50వేల మందికే అనుమతి ఇస్తామని ట్రస్ట్ పేర్కొంది. మకరజ్యోతి దర్శనానికి మహిళలు, పిల్లలు రావొద్దని అలర్ట్ చేసింది. అలాగే, ఈనెల 14వ తేదీన 40వేల మందికి, 15వ తేదీన 50వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రెండు రోజుల్లో ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికే దర్శనం అని స్పష్టం చేసింది. சபரிமலை செல்வோர் கவனத்திற்கு.. திடீரென வந்த அறிவிப்பு - ''இதை மீறினால்..' எச்சரிக்கை.. #NewsTamil24x7 | #sabarimala | #kerala | #sabarimalai | #viralvideo | #sabarimalatemple pic.twitter.com/AFxlvutGRr — News Tamil 24x7 | நியூஸ் தமிழ் 24x7 (@NewsTamilTV24x7) January 4, 2024 ఇక ఈసారి శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. నవంబర్ 17 వ తేదీ నుంచి డిసెంబరు 27 వ తేదీ వరకూ 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. దీంతో ఏకంగా రూ.241 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే గతేడాది కంటే రూ.18.72 కోట్లు అధికంగా వచ్చినట్లు పేర్కొన్నాయి. @CMOKerala @TheKeralaPolice @BJP4Keralam In Sabarimala Devasthanam this time the crowd has gathered in large numbers and no proper action has been taken for that most of the devotees have faced great hardship as there is no toilet. Action should be taken #Kerala #sabarimalai pic.twitter.com/hBUYcK7DL3 — தயா (Social Worker) (@PresidencyDhaya) January 3, 2024 -
దేవుని కొలువులోనూ అదే నిర్లక్ష్యమా ?
-
శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం మీకు ఇష్టమా? ఇలా చేసుకోవచ్చు
శబరిమల అనగానే గుర్తొచ్చేది ముందుగా అయ్యప్ప ఆలయం, ఆ తర్వాత స్వామి ప్రసాదం. ఏటా శబరిమల అయ్యప్పస్వామిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్న అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులకు కోసం తప్పకుండా ప్రసాదం తీసుకెళ్తుంటారు. తిరుపతి లడ్డూ తర్వాత ఆ స్థాయిలో శబరిమలలో దొరికే అరవణి ప్రసాదానికి కూడా అంత పేరుంది. ఈ ప్రసాదాన్ని అరవణ ప్రసాదం అంటారు. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి చేసే ఈ ప్రసాదం తినడానికి రుచిగా ఉండటంతో పాటు చలికాలంలో తింటే ఆరోగ్యానికి మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి. కేరళలో కొన్ని ప్రత్యేక వేడుకల్లో అరవణ పాయసాన్ని తయారు చేసుకుంటారు. మరి దీని తయారీ విధానం చూసేద్దాం. కావల్సిన పదార్థాలు ఎర్రబియ్యం: ఒక కప్పు నల్ల బెల్లం: రెండు కప్పులు శొంటిపొడి: 1 టీస్పూన్ పచ్చి కొబ్బరి: ఒక కప్పు నెయ్యి: తగినంత జీడికప్పులు: పావు కప్పు నీళ్లు: ఆరు కప్పులు అరవణ ప్రసాదం తయారీ ముందుగా పాన్ మీద నల్ల బెల్లం వేసి కరిగించాలి. మరో పాన్‌లో ముందుగా పచ్చికొబ్బరి, జీడిపప్పులు వేయించి పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎర్రబియ్యం బాగా శుభ్రంగా కడిగి అన్నంలా వండుకోవాలి. ఉడికించే సమయంలోనే కాస్త నెయ్యి వేసుకోని కాస్త మెత్తగా వండుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసి ఉడికించుకోవాలి. తర్వాత శొంటి పొడి, నెయ్యి వేస్తూ దగ్గరకు పడుతున్నంత సేపు ఉడికించుకోవాలి. చివరగా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టేగీ ఉండే అవరణ పాయసం రెడీ. -
శబరిమలకు 22 అదనపు రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో 22 అదనపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు.. సికింద్రాబాద్–కొల్లాం (07111/07112) ప్రత్యేక రైలు ఈ నెల 27, జనవరి 3, 10, 17 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 29, జనవరి 5, 12, 19 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్–కొట్టాయం (0713/0714) ప్రత్యేక రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30, జనవరి 6, 13, 20 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు జామున కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొట్టాయం (07117/07118) స్పెషల్ ట్రైన్ జనవరి 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 4వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొట్టాయం (07009/07010) స్పెషల్ ట్రైన్ జనవరి 6, 13 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.05 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8, 15 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరి మలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలి పారు. వివరాలు.. కాచిగూడ–కొల్లాం (07187/07188) స్పెషల్ ట్రైన్ ఈ నెల 11వ తేదీ సోమవారం రాత్రి 11.45 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 5.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ బుధవారం ఉదయం 10.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45కు కాచిగూడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొల్లాం (07193/ 07194)స్పెషల్ ట్రైన్ ఈనెల 13వ తేదీ బుధవారం ఉదయం 10.40 గంటలకు బయ లుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంట లకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయా ణంలో 15వ తేదీ శుక్రవారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 9.40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
సీఎంకు కృతజ్ఞతతో..శబరిమలకు పాదయాత్ర
పెనుగొండ: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న తన కూతురికి లక్షలాది రూపాయల వ్యయంతో అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి అవసరమని, పేద ప్రజలకు అండగా నిలిచే నాయకుడు జగనే మళ్లీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ఓ అయ్యప్ప మాలధారుడు శబరిమలకు పాదయాత్రను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తూర్పుపాలెంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆచంట మండలం అయోధ్యలంకకు చెందిన కొప్పాడి రాంబాబు కుమార్తె హనీ చిన్న వయసులోనే అరుదైన వ్యాధికి గురైంది. వ్యవసాయం చేసుకొంటూ జీవించే రాంబాబు వైద్యం చేయించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో 2022 జూన్ 23న గంటి పెదపూడి వచ్చిన సీఎం జగన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో సత్వర వైద్యానికి ఆర్థికంగా అండగా నిలుస్తానని సీఎం భరోసా ఇచ్చారు. హనీకి ప్రతి నెలా రూ.1.50 లక్షలతో ఇంజక్షన్ చేయించవలసి ఉంది. దీనికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందంటూ సీఎం భరోసా ఇచ్చి అక్టోబర్‌లో వైద్య సహాయం ప్రారంభించారు. దీనికి గాను ఒకేసారి 40 ఇంజక్షన్లను అందజేశారు. అవి ఇప్పటివరకు రావడంతో మరోసారి 24 ఇంజక్షన్లు 2 రోజుల్లో పంపించనున్నారని రాంబాబు శుక్రవారం తెలిపారు. వైద్యం అందించడమే కాకుండా, కోనసీమ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలోనూ చదువుకునేందుకు ఏర్పాటు చేసి, నెలకు రూ.10 వేలు పింఛన్ సౌకర్యం కల్పించారని తెలిపారు. అందుకే సీఎంగా జగనే కావాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ శబరిమల వరకు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: పలు ప్రాంతాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–కొల్లాం (07129/07130) స్పెషల్ ట్రైన్ ఈనెల 26, డిసెంబర్ 3 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.55కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 28, డిసెంబర్ 5 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.55కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. నర్సాపూర్–కొట్టాయం (07119/07120) స్పెషల్ ట్రైన్ ఈనెల 26, డిసెంబర్ 3 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 27, డిసెంబర్ 4 తేదీల్లో సాయంత్రం 7 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 9కి నర్సాపూర్‌కు చేరుకుంటుంది. కాచిగూడ–కొల్లాం (07123/07124) స్పెషల్ ట్రైన్ ఈనెల 22, 29, డిసెంబర్ 6 తేదీల్లో సాయంత్రం 5.30కి బయల్దేరి మర్నాడు రాత్రి 11.55 గంటలకి కొల్లాంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 24, డిసెంబర్ 1, 8 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30కి కాచిగూడ చేరుకుంటుంది. కాకినాడ–కొట్టాయం (07125/07126) ఈనెల 23, 30 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10కి కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25, డిసెంబర్ 2 తేదీల్లో రాత్రి 12.30కి బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొల్లాం (07127/07128) స్పెషల్ ట్రైన్ ఈనెల 24, డిసెంబర్ 1 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకి బయల్దేరి మర్నాడు సాయంత్రం 7.30కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25, డిసెంబర్ 2 తేదీల్లో రాత్రి 11కి బయల్దేరి రెండవ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. -
శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
-
శబరిమలకు పోటెత్తిన భక్తులు
-
శరణకీర్తనం భక్త మానసం
-
మకరజ్యోతి దర్శనంతో పులకించిన అయ్యప్ప భక్తులు
-
శబరిమలైలో విడిచిపెట్టినా..తిరిగొచ్చిన పావురం..బిత్తరపోయిన యజమాని
సాక్షి, దొడ్డబళ్లాపురం: సమాచారాన్ని చేరవేసుకోవడానికి ఇప్పుడయితే మొబైళ్లు, ఈ మెయిళ్లు ఉన్నాయి. కొన్నేళ్లక్రితం ఉత్తరాలు, టెలిగ్రాంలు ఉండేవి. అయితే అంతకంటే ముందు మహారాజుల కాలంలో ఇవేవీ ఉండేవి కావు. అందుకే పావురాళ్లను ఉత్తరాలు చేరవేసే పోస్టుమ్యాన్లుగా ఉపయోగించేవారు. కాలం మారినా పావురాళ్ల తెలివిలో తేడా రాలేదు. ఇందుకు చక్కటి ఉదాహరణగా చిత్రదుర్గ జిల్లా మొళకాళ్మూరు తాలూకా మేగలహట్టి గ్రామంలో జరిగిన ఒక సంఘటన చెప్పుకోవచ్చు. మేళగట్టి గ్రామానికి చెందిన వెంకటేశ్ ఇటీవలే అయ్యప్ప మాల ధరించి అయ్యప్ప దర్శనం చేసుకుని వచ్చాడు. దర్శనం తరువాత తనతోపాటు తీసుకువచ్చిన పావురాన్ని గత డిసెంబరు 30న శబరిమలెలో వదిలేశాడు. ఆశ్చర్యంగా పావురం గురువారం గ్రామాన్ని చేరుకుని యజమాని వెంకటేశ్ ఒడిలో వాలిపోయింది. పెంచిన రుణాన్ని మర్చిపోలేని పావురం ఇలా గ్రామానికి తిరిగి రావడం పట్ల గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: తాగుబోతు భర్తకు గుణపాఠం..చైన్లతో కట్టేసి..) -
శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. 8 మంది భక్తులు దుర్మరణం
చెన్నై: తమిళనాడు తేని జిల్లా కుములి పర్వత ప్రాంత మార్గంలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కేరళ శబరిమల దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఓ కారు అదుపుతప్పి 50 అడుగుల లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా కలెక్టర్ కేవీ మురళీధరన్ తెలిపారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఇద్దరిలో ఏడేళ్ల బాలుడున్నాడు. తేని జిల్లా షన్ముగసుందరాపురం గ్రామానికి చెందిన 10 మంది రెండు రోజుల క్రితం శబరిమల వెళ్లారు. దర్శనం చేసుకుని ఇంటికి తిరిగివస్తుండగా ఘాట్‌రోడ్డులో కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డ వెంట ఉన్న నీటి పైప్‌లైన్‌ను ఢీకొట్టి లోయలోకి దూసుకెళ్లింది. రాత్రి 11 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే తేని, కేరళ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే చీకటి, చలి కారణంగా సహాయక చర్యలకు ఆలస్యమైంది. చివరకు క్రేన్ల సాయంతో కారును లోయలోనుంచి బయటకు తీశాయి. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చదవండి: జోడో యాత్రలోనే కరోనా ఉంటుందా?: రాహుల్ -
శబరిమలకు పోటేత్తిన భక్తులు.. రెండేళ్ల తర్వాత వీపరీతంగా రద్దీ
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది శబరిమల. కనీవినీ ఎరుగని రీతిలో శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా భయం మటుమాయం కావడంతో మణికంఠుడ్ని దర్శనం చేసుకునేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజూ లక్షమంది వరకు అయ్యప్ప సన్నిధికి వస్తున్నారు. దీక్షలు విరమిస్తున్నారు. దర్శనం, పార్కింగ్ సమస్యలు ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. పోటెత్తిన స్వాములు దాదాపు 12 గంటలపాటు క్యూలైన్లలోనే భక్తులు పడిగాపులుకావాల్సి వస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో నిమిషానికి 80 మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహనాల్లో రావడంతో పార్కింగ్ ప్రాంతాల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. సన్నిధానం, నందపంథల్ ప్రాంతాలైతే భక్తులతో కిటికటలాడుతున్నాయి. భక్తులు రద్దీ పెరగడంతో దర్శన సమయాన్ని కూడా దేవస్థానం బోర్డు 19 గంటల వరకు పొడిగించింది. రద్దీని తగ్గించడానికి వీలుగా వర్చువల్ క్యూ సిస్టమ్‌లో బుకింగ్స్‌పై పరిమితులు పెట్టారు. పంపా నది నుంచి శబరిమల మార్గమంతటా రద్దీ ఉన్నందువల్ల పులిమేడు దారిని ఎంచుకోవాలని భక్తులకు సూచిస్తున్నారు అధికారులు. రెండేళ్ల తర్వాత వీపరీతంగా రద్దీ రెండేళ్ల తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్లే భక్తులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. కరోనా ఆంక్షలు ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి మండల పూజ ఇదే కావడం వల్ల శబరిమలకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. ఆన్లైన్ తోపాటు స్పాట్ బుకింగ్ పద్ధతిలోనూ భక్తులు పెద్దసంఖ్యలో దర్శనానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. 41 రోజుల పాటు జరిగే మండల పూజ ఈనెల 27తో ముగుస్తుంది. విరామం తర్వాత ఈనెల 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. వచ్చే జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న పడిపూజ తర్వాత మళ్ళీ ఆలయాన్ని మూసేస్తారు. ఆలయంలో ఎంతో ప్రత్యేకమైన నేతి అభిషేకాలను కళ్లారా చూడడం భాగ్యంగా భావిస్తారు భక్తులు. అందుకే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వయంగా పాల్గొని తరలించాలని భావించం వల్లే దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా ఉంటారు. హుండీపై కరోనా దెబ్బ రూపంలో దేవస్థానానికి వచ్చే ఆదాయమూ బాగా పెరిగింది. కేవలం 28 రోజుల్లో దేవస్థానానికి 148 కోట్ల ఆదాయం వచ్చింది. కోవిడ్ ప్రభావం ఆంక్షలు తొలగించినా... మొదట్లో భక్తులు రాక పెద్దగా లేకపోవడంతో గత ఏడాది అంతాకలుపుకుంటే దేవస్థానానికి ఆదాయం 151 కోట్లు వచ్చింది. 201718 సీజన్లో 278 కోట్లు, 201819లో 179 కోట్లు, 201920లో 269 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా వల్ల అయ్యప్పస్వామి ఆలయ ఆదాయం గణనీయంగా తగ్గింది. కరోనా ఉధృతంగా ఉన్న 202021లో కేవలం 21 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. కరోనా నిబంధనల్ని అధికారులు కఠినంగా అమలుచేశారు. దీనికితోడు వైరస్ నిబంధనల వల్ల మణికంఠుడ్ని దర్శించుకునేందుకు వచ్చినవారి సంఖ్య అనూహ్యంగా తగ్గింది. అత్యంత కఠినం అయ్యప్ప దీక్ష అయ్యప్ప దీక్ష చేయడం అంతా ఒక ఎత్తయితే .. శబరిమల యాత్ర మరో ఎత్తు. అత్యంత నియమ,నిష్టలతో బ్రహ్మచర్యం పాటిస్తారు మాలధారులు. సుఖాలకు దూరంగా గడపడమే ఈ దీక్ష ఉద్దేశం. మాలధారణ చేసిన భక్తులు అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లడం దీక్షలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా చెబుతారు. శబరి యాత్రలో అత్యంత కీలకమైన ఘట్టం పంబానది స్నానం. ఈ నదిలో స్నానమాచరిస్తే ఇన్ని రోజులు పడిన కష్టం ఒక్కసారిగా మరిచిపోతామని, మనసు తేలికవుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ స్నానమాచరించి స్వామివారి దర్శనానికి భక్తులు బయలుదేరుతారు. ఎంతో పుణ్యం చేస్తేనే మెట్లు ఎక్కే అదృష్టం శబరిమల యాత్ర ఒక్కో దశ ఒక్కొక్క రీతిలో జరుగుతుంది. మొట్టమొదటిసారి మాలధారణ చేసిన వారు కొన్ని దశాబ్దాలుగా మాలధారణ చేసిన స్వాములుగా శబరిగిరికి వస్తారు. తొలిసారి వచ్చిన కన్నెస్వాములు ... గుర్తుగా బాణమును సమర్పించుకుంటారు. మండలం రోజులు దీక్ష. కఠోరమైన నియమాలు. మాలధారణ అనేది జీవితంలో ఒక అపురూపమైన ఘట్టమంటారు. అందుకే ఒక్కసారి స్వామి మాల ధరిస్తే ఏటా ధరించాలనిపిస్తుందని చెబుతారు. అందుకే ఎంతోమంది స్వాములు కొన్ని దశాబ్దాలుగా మాల ధరిస్తూనే ఉన్నారు. 18 మెట్లు ఎక్కిన తర్వాత అయ్యప్ప దర్శనం పూర్తవుతుంది. అలా స్వాముల్లో ఆధ్యాత్మికతకు పరిపూర్ణత లభిస్తుంది. -
Sabarimala: 90వేల మందికి మాత్రమే దర్శనం!
తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం లక్ష మందికిపైగానే తరలివస్తున్నారు. అయ్యప్ప దర్శనానికి దాదాపు 12 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది. దర్శనం కోసం సోమవారం ఒక్కరోజే 1,19,480 మంది ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో కలిసి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శబరిమలలో భక్తుల రాక, దర్శనం ఏర్పాట్లపై చర్చించారు. పార్కింగ్ సదుపాయాలు పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీగా తరలివస్తున్న భక్తులను నియంత్రించడం కష్టతరంగా మారడంతో వారి సంఖ్యపై పరిమితి విధించాలని, ప్రతిరోజూ గరిష్టంగా 90,000 మందిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే దర్శన సమయాన్ని మరో గంటపాటు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో.. భక్తుల రద్దీ నియంత్రణకు సంబంధించి కేరళ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై న్యాయస్థానం ఆదివారం సమావేశమై, విచారణ చేపట్టింది. రద్దీని నియంత్రించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని పత్తనంతిట్ట జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించింది. నిత్యం 75,000 మందికిపైగా భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో భక్తుల సంఖ్యను 90,000కు పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుఝాము నుంచే.. అయ్యప్ప స్వామిని నిత్యం 90,000 మంది సులువుగా దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు ట్రావెన్కోర్ దేవాస్వోమ్ బోర్డ్(టీడీబీ) చైర్మన్ కె.అనంతగోపన్ చెప్పారు. దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు స్వామిని భక్తులు దర్శించుకోవచ్చని చెప్పారు. ఇదిలా ఉండగా, శబరి దేవస్థానంలో నవంబర్ 17న ప్రారంభమైన 41 రోజుల మండల పూజ ఈ నెల 27న ముగియనుంది. అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిళక్కు యాత్ర కోసం ఈ నెల 30న ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. 2023 జనవరి 14న మకర జ్యోతి దర్శనంతో మకరవిళక్కు యాత్ర ముగుస్తుంది. పూజలు పూర్తయ్యాక జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు. -
శబరిమలకు భక్తుల తాకిడి.. ఒక్కరోజే లక్షమంది దర్శనం
శబరిమల అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోతోంది. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో అయ్యప్ప కొండ కిటకిటలాడుతోంది. నిన్న ఒక్కరోజే(ఆదివారం) సుమారు లక్ష మంది అయ్యప్పను దర్శించుకున్నారు. లక్షమంది దర్శనం చేసుకున్నా.. క్యూలైన్ మళ్లీ అలానే కనిపిస్తుండటం శబరిమలలో భక్తుల రద్దీకి నిదర్శనంగా కనబడుతోంది. పంబ నుంచి శబరిమల కొండకు వెళ్లేందుకు 10 గంటల సమయం పడుతుండటంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు ఉన్నా అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు అన్నదానం, మంచి నీటి సౌకర్యాలతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
అయ్యప్పా.. వచ్చేదెట్లా?
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న భక్తులకు రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. మరో రెండు నెలల వరకు అన్ని రైళ్లలో వెయిటింగ్ జాబితానే దర్శనమిస్తోంది. గత రెండేళ్లుగా దర్శనాలు నిలిచిపోయిన దృష్ట్యా ఈసారి నగరం నుంచి లక్షలాది మంది తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. మాలధారులతో పాటు సాధారణ భక్తులు సైతం రైళ్ల కోసం బారులు తీరుతున్నారు. కానీ.. భక్తుల డిమాండ్ మేరకు రైళ్లు లేవు. దక్షిణమధ్య రైల్వే అధికారులు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ అన్నింటిలోనూ ఇప్పటికే బెర్తులు భర్తీ కావడంతో పాటు వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరింది. కొన్నింటిలో బుకింగ్ కూడా అవకాశం లేకుండా ‘రిగ్రేట్’ కనిపిస్తోంది. ఈ ఏడాది కనీసం10 లక్షల మంది భక్తులు శబరిమలకు వెళ్లే అవకాశం ఉంది. దక్షిణమధ్యరైల్వే ప్రకటించిన అరకొర రైళ్లు అయ్యప్ప భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆలస్యంతో ఇక్కట్లు.. గతంలో ఇలాగే మకరజ్యోతి దర్శనం ముంచుకొస్తున్న తరుణంలో హడావుడిగా కొద్దిపాటి రైళ్లను ప్రకటించారు. అవి సైతం విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరాయి. నగరం నుంచి వెళ్లిన రైళ్లు పరిమితమే. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పైగా చాలా వరకు ఉదయం వెళ్లాల్సినవి సాయంత్రం, సాయంత్రం వెళ్లాల్సిన రైళ్లు అర్ధరాత్రి బయలుదేరాయి. గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. సకాలంలో దర్శనానికి చేరుకోలేక భక్తులు నిరాశ చెందారు. పైగా ప్రత్యేక రైళ్లలో తాగునీటి సదుపాయం లేకపోవడంతో భక్తులు స్నానాలు, పూజలు చేసుకోలేక ఇబ్బందులు పడ్డారు. విమాన చార్జీల మోత... రైళ్లలో భారీ డిమాండ్ ఉండడంతో చాలా మంది భక్తులు విమానాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వెళ్లే విమానాల్లో సైతం చార్జీలు మోత మోగుతున్నాయి. రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉన్నట్లు పలువురు భక్తులు పేర్కొన్నారు. ఈ చార్జీలు కూడా తరచూ మారిపోతున్నాయి. సంక్రాంతికి కష్టాలే... నగరం నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, బెంగళూర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ రైళ్లన్నీ నిండిపోయాయి. సంక్రాంతి సందర్భంగా సుమారు 25 లక్షల మందిప్రయాణికులు హైదరాబాద్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. వీరిలో కనీసం 15 లక్షల మంది రైళ్లపైనే ఆధారపడి ఉంటారు. రైళ్లలో అవకాశం లభించకపోవడంతో చాలా మంది సొంత వాహనాలు, ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంది. ఎందుకిలా? అయ్యప్ప దర్శనం కోసం నగరానికి చెందిన భక్తులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లే ఒకే ఒక్క రైలు శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఫిబ్రవరికి కూడా అప్పుడే బుక్ అయ్యాయి. భక్తుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు వేయాల్సిన అధికారులు ఆ దిశగా పెద్దగా దృష్టి సారించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అరకొరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్ నుంచి వెళ్లేవి తక్కువగానే ఉన్నాయి. చివరి క్షణాల్లో హడావుడిగా ప్రత్యేక రైళ్లను వేసి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం కంటే ప్రస్తుత రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్నింటిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. డిసెంబర్ నుంచి జనవరి వరకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరికి వెళ్లనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే భక్తులు తమకు అనుకూలమైన రోజుల్లో శబరికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. -
Special Trains: శబరిమలకు ప్రత్యేక రైళ్లు..
రైల్వేస్టేషన్(విజయవాడ)/లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్–కొట్టాయం (07119) డిసెంబర్ 2, 9, 16, 30, జనవరి 6, 13 తేదీల్లో, కొట్టాయం–నర్సాపూర్ (07120) డిసెంబర్ 3, 10, 17, 31, జనవరి 7, 14 తేదీల్లో, హైదరాబాద్–కొల్లాం (07133) డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9, 16 తేదీల్లో, కొల్లాం–హైదరాబాద్ (07134) డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో, సికింద్రాబాద్–కొట్టాయం (07125) డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో, కొట్టాయం–సికింద్రాబాద్ (07126) డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 తేదీల్లో నడుస్తాయని వివరించారు. విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం వెల్లడించారు. మచిలీపట్నం–కర్నూలు సిటీ (07067) డిసెంబర్ 1 నుంచి 31 వరకు ప్రతి శని, మంగళ, గురువారాలు, కర్నూలు సిటీ–మచిలీపట్నం (07068) డిసెంబర్ 2 నుంచి 2023 జనవరి 1 వరకు ప్రతి ఆది, బుధ, శుక్రవారాల్లో నడుస్తుంది. మచిలీపట్నం–తిరుపతి (07095) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో, తిరుపతి–మచిలీపట్నం (07096) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి సోమ, మంగళ, గురు, శనివారాలు, తిరుపతి–ఔరంగాబాద్ (07637) డిసెంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి ఆదివారం, ఔరంగాబాద్–తిరుపతి (07638) డిసెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–సికింద్రాబాద్ (07481) డిసెంబర్ 4 నుంచి జనవరి 29 వరకు ప్రతి ఆదివారం, సికింద్రాబాద్–తిరుపతి (07482) డిసెంబర్ 5 నుంచి జనవరి 30 వరకు ప్రతి సోమవారం నడుస్తాయి. హైదరాబాద్–తిరుపతి (07643) డిసెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్ (07644) డిసెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం, విజయవాడ–నాగర్సోల్ (07698) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, నాగర్సోల్–విజయవాడ (07699) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి శనివారం, కాకినాడ టౌన్–లింగంపల్లి (07445) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాలు, లింగంపల్లి–కాకినాడ టౌన్ (07446) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాలు, హైదరాబాద్–నర్సాపూర్ (07631) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి శనివారం, నర్సాపూర్–హైదరాబాద్ (07632) డిసెంబర్ 4 నుంచి జనవరి 1 వరకు ప్రతి ఆదివారం, విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (08585) డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో, మహబూబ్‌నగర్–విశాఖపట్నం (085856) డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..
-
అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా కొల్లాం, కొట్టాయానికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈ రైళ్లు తిరిగి కొల్లాం, కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నడుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్–కొల్లాం (07117) ఈ నెల 20, డిసెంబర్ 4, 18, జనవరి 8 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్(07118) ఈ నెల 22, డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నడుస్తాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్–కొల్లాం (07121) ఈ నెల 27, డిసెంబర్ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్ (07122) ఈ నెల 29, డిసెంబర్ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో, సికింద్రాబాద్–కొల్లాం (07123) ఈ నెల 21, 28 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్ (07124) ఈ నెల 23, 30 తేదీల్లో, సికింద్రాబాద్–కొట్టాయం (07125) ఈ నెల 20, 27 తేదీల్లో, కొట్టాయం–సికింద్రాబాద్ (07126) ఈ నెల 21, 28 తేదీల్లో నడుస్తాయని అధికారులు వివరించారు. -
రెండో పెళ్లి చేసుకున్న కనకదుర్గ.. ఆమె ఎవరో గుర్తుందా..?
శబరిమల ఆలయ విషయంలో వివాదాస్పద మహిళా కార్యకర్త కనకదుర్గ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తోటి కార్యకర్త విలయోడి శివన్‌కుట్టీని ఆమె పెళ్లాడింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారిద్దరూ తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, కనకదుర్గకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. అయితే, 2019లో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కేరళ నిరసనలు, ర్యాలీలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి జనవరి 2, 2019లో ఇద్దరు మహిళా కార్యకర్తలు వెళ్లిన విషయం తెలిసిందే. మహిళా కార్యకర్త కనకదుర్గతో పాటు లాయర్ బిందు అమ్మిని.. ప్రత్యేక భద్రత మధ్య ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. దీంతో, ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలు వెళ్లవచ్చు అని సుప్రీం తీర్పు అనంతరం ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో భర్తతో గొడవల కారణంగా కనకదుర్గ విడాకులు తీసుకుంది. 2019 జూన్‌లో ఆమె విడాకులు తీసుకున్నది. శబరిమల వెళ్లి వచ్చిన తర్వాత అత్త తనపై దాడి చేసినట్లు కనకదుర్గ మీడియాతో ఎదుట చెప్పుకొచ్చింది. అనంతరం.. మావో సానుకూల అయ్యంకలి పద గ్రూపులో కామ్రేడ్‌గా చేస్తున్న శివన్‌కుట్టితో పరిచయం అనంతరం వీరిద్దరి మధ్య అంగీకారంతో మంగళవారం వివాహం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి జీవించాలని భావిస్తున్నట్లు శివన్కుట్టి వెల్లడించారు. -
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం |
-
Sabarimala Temple: నేటి నుంచి అయ్యప్ప దర్శనం
-
రైళ్లలో పూజలు చేసుకోవచ్చు కానీ..
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు నడిపే ప్రత్యేక రైళ్లలో భక్తులు పూజలు చేసుకోవచ్చని.. కానీ హారతి కర్పూరం, దీపాలు, అగరొత్తులు వెలిగించరాదని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గురువారం నుంచి శబరిమల ప్రత్యేక రైళ్లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది. నిప్పు వల్ల రైళ్లకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో, భక్తులు రైళ్లలో అగ్గి పుల్లలు కూడా వెలిగించొద్దని ఆ ప్రకటనలో సూచించింది. మండే స్వభావం ఉన్న వాటిని వినియోగించటం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి రైల్వే పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. బుధవారం రైల్ నిలయంలో జరిగిన పెన్షన్ అదాలత్‌లో ఆయన పాల్గొన్నారు. పెన్షన్ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ సెల్‌ను ప్రారంభించారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. ఇక అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు! -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): శబరిమల వేళ్లే ప్రమాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేర్వేరు ప్రాంతాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ► సికింద్రాబాద్–కొల్లం ప్రత్యేక రైలు (07133) ఈ నెల 18న ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07134) ఈ నెల 19న సాయంత్రం 7.35 గంటలకు కొల్లంలో బయలుదేరి, రెండోరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► కాచిగూడ–కొల్లం ప్రత్యేక రైలు (07135) ఈ నెల 22న ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07136) ఈ నెల 23న సాయంత్రం 7.35 గంటలకు కొల్లంలో బయలుదేరి, రెండోరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ► నాందేడ్–కొల్లం ప్రత్యేక రైలు (07137) ఈ నెల 23న ఉదయం 9.45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.40 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ► కొల్లం–తిరుపతి ప్రత్యేక రైలు (07506) ఈ నెల 25న (శనివారం) మధ్యరాత్రి 12.45 గంటలకు కొల్లంలో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 5.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ► తిరుపతి–నాందేడ్ ప్రత్యేక రైలు (07138) ఈ నెల 26న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 3 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. -
18 నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: అయ్యప్పభక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్–కొల్లాం (07133/07134) స్పెషల్ ట్రైన్ ఈ నెల 18న ఉదయం 5.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 19వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాచిగూడ–కొల్లాం(07135/07136) ప్రత్యేక రైలు ఈ నెల 22వ తేదీ ఉదయం 5.30కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 23వ తేదీ సాయంత్రం 7.35కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3.30కి కాచిగూడ చేరుకుంటుంది. నాందేడ్–కొల్లాం (07137) స్పెషల్ ట్రైన్ ఈ నెల 23న ఉదయం 9.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.40 కి కొల్లాం చేరుకుంటుంది. కొల్లాం–తిరుపతి (07506) ప్రత్యేక రైలు ఈ నెల 25న అర్ధరాత్రి 12.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.10కి కొల్లాం చేరుకుంటుంది. తిరుపతి–నాందేడ్ (07138) స్పెషల్ ట్రైన్ ఈ నెల 26వ తేదీ రాత్రి 8.15కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. -
శబరిమలలో రోడ్డు ప్రమాదం.. కర్నూల్‌కు చెందిన ఇద్దరు మృతి
తిరువనంతపురం: శబరిమల సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మృత్యువాతపడ్డారు. కర్నూల్లోని బుధవారపేటకు చెందిన 11 మంది అయ్యప్ప స్వాములు బుధవారం టెంపోలో శబరిమలకు వెళ్లారు. శబరిమలకు 60 కి.మీ. దూరంలో టెంపో వాహనాన్ని నిలిపి.. టీ తాగడానికి వెళ్లారు. ఇంతలో వెనుక నుంచి మరో వాహనం టెంపోను ఢీ కొట్టి.. భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద గురించి తెలియడంతో బాధితుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. మా ఊరికి రావొద్దు.. -
తూర్పు వైపు స్వాముల చూపు
మండపేట: తిరుపతి, చెన్నైలో భారీ వర్షాలు శబరి యాత్రపై ప్రభావాన్ని చూపుతున్నాయి. పలుచోట్ల ట్రాక్ దెబ్బతిని నెల్లూరు, చెన్నై మీదుగా కేరళ వెళ్లే రైళ్లు రద్దవ్వడంతో ఇరుముడులు సమర్పించేందుకు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటకకు చెందిన అయ్యప్ప మాలధారులు జిల్లాకు తరలివస్తున్నారు. ఆంధ్రా శబరిమలైలుగా ప్రసిద్ది చెందిన ద్వారపూడి, శంఖవరంలోని అయ్యప్ప స్వామి ఆలయాలు స్వాములతో కిటకిటలాడుతున్నాయి. మండల దీక్షను పూర్తిచేసుకున్న అనంతరం ఇరుముడులు సమర్పించుకునేందుకు అధికశాతం మంది శబరిమలైకి వెళుతుంటారు. ముందుగానే రైలు టిక్కెట్లు కూడా రిజర్వేషన్లు చేయించుకుంటారు. కొద్ది రోజులుగా తిరుపతి, చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. శబరిమలై వెళ్లడం కష్టతరంగా మారింది. దీంతో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు ద్వారా సన్నిధానానికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఎక్కువ మంది స్వాములు మన జిల్లాకు తరలివస్తున్నారు. వసతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి రోజు వందలాదిగా తరలివస్తున్న స్వాములతో ద్వారపూడి, శంఖవరంలలోని అయ్యప్ప ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉచిత ఆన్నప్రసాదంతో పాటు ఉండేందుకు వసతి సదుపాయాలు ఉండటంతో మాలధారులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ద్వారపూడి ఆలయంలో రోజు దాదాపు 3000 మంది భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా శబరిమలై వెళ్లలేని స్వాములు జిల్లాకు వచ్చి ఇరుముడులు సమర్పించుకుంటుంటారు. ఇప్పుడు పెద్ద ఎత్తున తరలివస్తున్న స్వాములతో సందడి నెలకొంది. శబరిమలై వెళ్లలేకపోయినా జిల్లాలోని ఆలయాల దర్శనంతో మంచి అనుభూతి కలుగుతోందని స్వాములు అంటున్నారు. భక్తిశ్రద్దలతో స్వామివారికి ఇరుముడిలు సమర్పించుకుని, నేయ్యాభిషేకం, మాళిగాపురత్తమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. మాలవిసర్జన అనంతరం తమ స్వస్థలాలకు తిరుగుపయనం అవుతున్నారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. శబరిమలై వెళ్లలేక శబరిమలై వెళ్లేందుకు రెండు నెలల క్రితమే ట్రై న్కు టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకున్నాం. భారీ వర్షాలతో రైళ్లు రద్దు కావడంతో ఆంధ్రాశబరిమళైగా పేరొందిన ద్వారపూడి వచ్చాం. ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి. పి. కృష్ణాంజనేయులు, గండుబోయినపల్లి, చిత్తూరు జిల్లా ఆలయాలు చాలా బాగున్నాయి ద్వారపూడి, శంఖవరంలలోని అయ్యప్పస్వామివారి ఆలయాలు చాలా బాగున్నాయి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీలు మంచి ఏర్పాట్లు చేశారు. ఇక్కడే స్వామివారికి ఇరుముడిలు సమర్పించుకున్నాం. టి. సత్యనారాయణ, గుండుగొలను, పశ్చిమగోదావరిజిల్లా -
శబరిమల యాత్ర నిలిపివేత.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ
కొచ్చి: కేరళలో భారీ వర్షాలు కురవడంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్థానిక జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంబా నది ఉప్పొంగుతోంది. దీంతో నది డ్యామ్ వద్ద రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతరీత్యా శబరిమల యాత్ర కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సమీప స్లాట్‌లో దర్శన అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు. చదవండి: దేశంలోనే తొలి స్థానంలో ఇండోర్.. విజయవాడకు మూడోస్థానం -
తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఈ నియమాలు తప్పనిసరి!
తిరువనంతపురం: మలయాళ నెల కర్కిదకమ్ మాసపూజ సందర్భంగా శబరిమలలోని అయ్యప్ప దేవాలయం తెరచుకుంది. ఈ సందర్భంగా అయిదు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ పూజలకు భక్తులను సైతం అనుమతించనున్నట్లు ఆలయాధికారులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం దేవాలయం తెరచుకోగా, శనివారం ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ముందుగానే బుక్ చేసుకున్న 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు. కాగా కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం మొదటిసారి శనివారం ఉదయం నుంచి అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు.. కోవిడ్ టీకా రెండు డోస్‌లు వేసుకున్నవారు, ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. దర్శనానికి వచ్చే 48 నుంచి 72 గంటల ముందు చేయించుకున్న పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులను దర్శనం కోసం అనుమతిస్తారు. ఈనెల 21వ తేదీ వరకూ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిని ఇస్తున్నారు. -
ప్రజల్ని మతం పేరుతో విభజిస్తున్నారు
కొట్టాయం: దేశ ప్రజలను మత ప్రాతిపదికన బీజేపీ–ఆరెస్సెస్ విభజిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పరమత సహనానికి బాటలు వేసే ఈ రహదారిని తవ్వడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ తమ జీవిత మంతా ప్రయత్నిస్తూ ఉంటారని ఆరోపించారు. నిరంతరాయంగా ప్రజల్లో విద్వేషాన్ని, ఆగ్రహావేశాల్ని నింపుతున్నారని నిందించారు. కేరళలో శబరిమల యాత్రకు వెళ్లడానికి ముందు కొట్టాయం జిల్లాలోని ఎరుమెలి ప్రాంతంలో ఆలయం, మసీదు ఒకే చోట ఉంటాయి. ఆ రెండు పవిత్ర క్షేత్రాల మధ్య ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో రాహుల్ పాల్గొన్నారు. ఎరుమెలిలోని అయ్యప్ప సన్నిధిలో పూజలు చేశారు. దాని పక్కనే వవర్‌స్వామికి అంకితమిచ్చిన మసీదులో కూడా ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మతానికి చెందిన వవర్‌తో అయ్యప్ప స్వామి స్నేహం చేశారని భక్తుల నమ్మకం. అందుకే శబరిమల యాత్రకి వెళ్లడానికి ముందు కొట్టాయం జిల్లాలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని, వవర్ మసీదుని భక్తులు తప్పనిసరిగా సందర్శిస్తారు. ఇలా రెండు మతాలకు చెందిన క్షేత్రాలను సందర్శించడం చాలా గొప్ప విషయమని రాహుల్ పేర్కొన్నారు. ఇరు మతాలకు చెందిన ప్రజలు పరస్పర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఆనందంగా జీవించాలని, ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో దీనికి మించిన కానుక ఉండదని ప్రజలకు పిలుపునిచ్చారు. -
శబరిమల ఘటనలు నన్ను నొప్పించాయి
తిరువనంతపురం: కేరళ ఎన్నికల వేళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం శబరిమలలో గెలుపుకోసం ఒకడుగు వెనక్కితగ్గినట్టు కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం 2018లో శబరిమల వివాదంపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. కేరళ దేవాదాయ శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్, 2018లో శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించి జరిగిన ఘటనలపట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఇది జరిగి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించారు. మంత్రిగారి వ్యాఖ్యలపై స్పందిం చిన కాంగ్రెస్, బీజేపీలు, ఎల్డీఎఫ్ ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. రాజకీయ పార్టీలు, భక్తులు, సామాన్య జనంతో చర్చించాకే సుప్రీంకోర్టు తుది తీర్పుని అమలు చేస్తామని సురేంద్రన్ హామీ ఇచ్చారు. ‘‘2018లో శబరిమలలో జరిగిన ఘటనలు మనందర్నీ నొప్పించాయి. నన్ను కూడా. అలా జరగకుండా ఉండాల్సింది’’అని ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తోన్న సీపీఐ(ఎం)నాయకుడు సురేంద్రన్ వ్యాఖ్యానించారు. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల, సురేంద్రన్ ప్రకటన మోసపూరితమని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ మాట్లాడుతూ మంత్రిగారిది మొసలి కన్నీరు అని ఎద్దేవా చేశారు. శబరిమలకు జరిగిన అన్యాయానికి, నష్టానికి వెయ్యిసార్లు గంగానదిలో మునిగినా క్షమించలేమని వ్యాఖ్యానించారు. వివక్షకి తావులేకుండా, అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత, 2018లో, 10 నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్సున్న 12 మంది మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు అడ్డుకోవడంతో మూడు నెలల పాటు హై డ్రామా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రధానంగా సీపీఐ(ఎం) పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బతగిలింది. మొత్తం 20 స్థానాల్లో 19 స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పట్టుకోల్పోయిన సీపీఐ(ఎం)తిరిగి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంపుంజుకుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం సీపీఐ(ఎం) నిర్వహించిన ఇంటింటి సర్వేలో శబరిమల విషయంలో ఒక వర్గం ప్రజలు ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు గుర్తించింది. ‘శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విస్త్రుత ధర్మాసనం ముందుంది. తుది తీర్పు ఏదైనప్పటికీ, ప్రజలతోనూ, భక్తులతోనూ, రాజకీయ పార్టీలతోనూ చర్చించాకే దాన్ని అమలు చేస్తాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులుకాని, శబరిమల పోరాటానికి సంబంధించిన అన్ని సాధారణ కేసులను, ఇటీవలే పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని మంత్రి సురేంద్రన్ గుర్తుచేశారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ వీడిన సీనియర్ నేత ఆయన మాట వినకుండా తప్పు చేశానన్న ఇందిరాగాంధీ! -
అర్థనగ్నంగా పెయింటింగ్, సోషల్ మీడియాలో దుమారం
తిరువనంతపురం: కేరళ మహిళా యాక్టివిస్టు రెహానా ఫాతిమా మరో వివాదంలో చిక్కుకున్నారు. అర్థనగ్నంగా కనిపిస్తూ తన సోషల్ మీడియాలో ఖాతాల్లో బుధవారం ఓ వీడియో పోస్టు చేశారు. అందులో తన శరీరంపై కన్నబిడ్డలతో వాటర్ పెయింటింగ్ వేయించుకున్నారు. ‘బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’ పేరిట పోస్టు చేసిన సదరు వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది.(కశ్మీర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి) ‘కంటి సమస్యతో బాధపడుతున్న తల్లి విశ్రాంతి తీసుకుంటుంటే.. ఆమె పిల్లలు ఫోనిక్స్ బర్డ్ చిత్రం వేసి కూల్ చేశారు’ అంటూ వీడియోకు ఫాతిమా కామెంట్ ను జోడించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. చిన్నపిల్లలతో అర్థనగ్నంగా పెయింటింగ్స్ వేయించుకున్నందుకు తిరువల్ల స్టేషన్ పోలీసులు ఫాతిమాపై కేసు నమోదు చేశారు. ‘వీడియోను ఎలా? ఎందుకు పోస్టు చేశారన్న దానిపై విచారిస్తున్నాం’ అని స్టేషన్ ఇన్ స్పెక్టర్ తెలిపారు. (వర్సిటీల్లో పరీక్షలు రద్దు!) 2018లో అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల తర్వాత ఫాతిమా శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో హిందూవులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులకు 18 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు. -
శబరిమల ఆలయంలో భక్తులకు నో ఎంట్రీ
-
‘శబరిమల’పై సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: శబరిమల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గురువారం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్ష సందర్భంగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం మత వ్యవహారాలకు సంబంధించిన కొన్ని అంశాలను విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కక్షిదారుల తరఫు న్యాయవాదులు దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని విస్తృత బెంచ్ గురువారం కేసును విచారించింది. రోజంతా సాగిన ఈ విచారణ తరువాత జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. ‘ఆదేశాలు సోమవారం జారీ చేస్తాం. విస్తృత ధర్మాసనం చర్చించాల్సిన అంశాలను కూడా అదే రోజు ఖరారు చేస్తాం’ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కక్షిదారుల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్‌తో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఢిల్లీ న్యాయాధికారుల కేసును ప్రస్తావించారు. ఆ కేసులో నారీమన్ ఇంగ్లాండ్ న్యాయశాస్త్ర గ్రంథం హాల్స్బరీలోని ఓ నిబంధనను ప్రస్తావించారని, దాని ప్రకారం సుప్రీంకోర్టుకు ఏ రకమైన ఆంక్షల్లేని న్యాయపరిధి లభిస్తుందని... శబరిమల కేసుకు అది వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. ఒక తీర్పుపై సమీక్ష జరిపే సమయంలో న్యాయ సంబంధిత ప్రశ్నలను లేవనెత్తరాదన్నది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల వాదనగా ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: ఏప్రిల్‌లో మందిర నిర్మాణం!) -
దర్శనమిచ్చిన మకర జ్యోతి
శబరిమల : కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబళంమేడు కొండల్లో బుధవారం సాయంత్రం మకర జ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో ఇప్పటికే జ్యోతి దర్శనం కోసం శబరిమలకు చేరుకున్న భక్తులు జ్యోతిని చూసి ఆనంద పరవశులయ్యారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల సన్నిధానం మారుమోగింది. మకరజ్యోతి దర్శనానికి విచ్చేసిన అయ్యప్ప స్వాములతో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పంబ, నీలికల్, పులిమేడ్ ప్రాంతాలను జ్యోతిని వీక్షించేందుకు ట్రావెన్స్‌కోర్ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. అంతకుముందు మకరజ్యోతి వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివెళ్లారు. స్వామి కోసం పందళ రాజ వంశీకులు తీసుకువచ్చిన ప్రత్యేక ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. ఆ తర్వాత సాయంత్రం 6.50 గంటల సమయంలో పొన్నాంబలమేడు కొండపై జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చింది. -
అతిక్రమిస్తే.. జైలుకు పంపుతాం
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి వీలుగా పోలీసులు రక్షణ కల్పించాలంటూ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించడానికి సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ మేరకు ఇద్దరు మహిళా కార్యకర్తలు వేసిన పిటిషన్‌పై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం శుక్రవారం స్పష్టంచేసింది. ‘‘ఈ అంశం చాలా సున్నితమైనది. దీన్ని మరింత వివాదాస్పదం చేయొద్దు. దీనిపై గతంలోనే ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్ విచారణ జరిపింది కనక ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేం’’ అని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ‘శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలని సెప్టెంబర్ 28, 2018లో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేదు. అయితే అదే అంతిమం కాదు’ అని ధర్మాసనం పేర్కొంది. ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్ అంతిమ నిర్ణయం వెలువరించేవరకు తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేమని, ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే వెళ్లి పూజలు నిర్వహించవచ్చనని పేర్కొంది. గతేడాది ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలుపగా.. ‘చట్టం మీకు అనుకూలంగానే ఉంది. దాన్ని ఎవరైనా అతిక్రమిస్తే అందుకు కారకులను జైలుకు పంపుతాం’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. -
అయ్యప్ప కోసం 480 కి.మీ నడిచిన కుక్క..
బెంగళూరు : శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పటికే ఇరుముడి కట్టుకున్న వేలాదిమంది భక్తులు ఆలయానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఓ కుక్క వార్తల్లో నిలిచింది. భక్తుల వెంట శబరిమలకు పయనమైన కుక్క గురించి తెలిసినవారంతా దాని భక్తికి ఔరా అంటున్నారు. మరి అలుపు లేకుండా వందల కిలోమీటర్లు నడక సాగించిన శునకం దివ్యక్షేత్రానికి చేరుకుంటుందో లేదో చూడాలి. వివరాలు.. తిరుమల నుంచి 13మంది భక్తులు అయ్యప్ప క్షేత్రానికి తరలి వెళ్లాలనుకున్నారు. అక్టోబర్ 31న తిరుమల నుంచి కాలి నడక ప్రారంభించారు. వీరి వెంట ఓ శునకం కూడా నడక ప్రారంభించింది. అయితే తమ వెంట కుక్క వస్తున్న విషయాన్ని వారు గమనించలేదు. కానీ వెనక్కు చూసిన ప్రతీసారి కుక్క ఉండటంతో వారి కళ్లను నమ్మలేకపోయారు. అలా స్వాములతో కలిసి కుక్క 480 కిలోమీటర్లు ప్రయాణించింది. స్వాములు ప్రతినిత్యం వారు తెచ్చుకున్నదాంట్లో కొంత ఆ కుక్కకు పెడుతూ దాని ఆకలి తీరుస్తూ వచ్చారు. సుధీర్ఘ ప్రయాణం అనంతరం వారు నవంబర్ 17న కర్ణాటకలోని కొట్టిగెరాకు చేరుకున్నారు. తాము ప్రతి సంవత్సరం కాలినడకన శబరిమల వెళ్తామని, ఈ సంవత్సరం తమతో పాటు ఓ కుక్క శబరిమలకు ప్రయాణం అవ్వటం మర్చిపోలేనిదని స్వాములు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శునక భక్తిని మెచ్చిన నెటిజన్లు దాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు. అనేక మంది భక్తుల మనసులను అది గెలుచుకుంది అనడానికి వారు చేస్తున్న కామెంట్లే నిదర్శనం. కాగా రెండు నెలల తర్వాత ఆదివారం శబరిమల ఆలయం తెరుచుకోగా మొదటిరోజే యాభైవేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. -
ఆంక్షలపై అసంతృప్తి
నల్ల దుస్తులలో అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. పడిపూజలు జరుగుతున్నాయి. దీక్షలో ఉన్నవారు శబరిమల ప్రయాణానికి సిద్ధమవు తున్నారు. ఇదే సమయంలో సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ తాను శబరిమలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. కేరళ ప్రభుత్వం తనకు రక్షణ కల్పించినా, కల్పించకపోయినా సరే, తాను దర్శనానికి వెళ్లేది వెళ్లేదేననికచ్చితంగా చెప్పారామె. మరోవైపు కేరళ దేవాదాయ మంత్రి సురేంద్రన్ మాత్రం ‘ఆలయంలోకి ప్రవేశించ డానికి ప్రయత్నించే మహిళలకు రక్షణ కల్పించడం అనేది ఉండదు’ అంతే కచ్చితంగా చెప్పారు. అయినా తృప్తికి ఏమిటింత పట్టు? ఆమె పట్టుదల వెనుక పరిస్థితులు ఎలాంటివి? భారత రాజ్యాంగంలో మగవాళ్లు, మహిళలు సమానమే అని ఉంది. మరి ధార్మిక సంస్థల్లో ఈ రకమైన లింగ వివక్ష ఎందుకు అనేది తృప్తీ దేశాయ్ ప్రశ్న. దేశాయ్.. దేశానికి ధార్మిక సంస్థల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న కార్యకర్తగానే తెలుసు. కానీ ఆమె అంతకు ముందు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఆమెది çపుణెలోని సామాన్య కుటుంబం. మొత్తం ముగ్గురు అక్కచెల్లెళ్లు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆమె తండ్రి ఇంటిని వదిలి ఆశ్రమాలకు వెళ్లిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలను పెంచి పోషించాల్సిన బాధ్యత తృప్తి తల్లి మీద పడింది. తృప్తి పుణెలో ఉమెన్స్ యూనివర్సిటీలో హోమ్‌సైన్స్ గ్రాడ్యుయేషన్‌లో చేరారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఏడాది తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తృప్తి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి మురికివాడల్లో సేవ చేశారు. పన్నెండేళ్ల కిందట మహారాష్ట్రలోని అజిత్ కో ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన యాభై కోట్ల కుంభకోణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు తృప్తి. ఆ బ్యాంకు అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ది. అజిత్ పవార్ దిష్టిబొమ్మను తగులబెట్టిన ఆందోళనలో తృప్తి నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణతో ఆమెను అరెస్టు చేశారు. ఆమెకు అవినీతికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించిన నేపథ్యం కూడా ఉంది. ‘భూమాత బ్రిగేడ్’ స్థాపన ఒక సామాన్యమైన అమ్మాయి.. సామాజిక కార్యకర్తగా మారడానికి, వ్యవస్థలో కరడుగట్టి ఉన్న లోపాలను ప్రశ్నిస్తూ గళం విప్పడానికి, వివక్షను ఎలుగెత్తుతూ పిడికిలి బిగించడానికి వెనుక పెద్ద మధనమే జరిగి ఉండాలి. అగాధమంత అసంతృప్తి ఏదో ఆమెను ఆవరించి ఉండాలి. తండ్రి తన బాధ్యతల నుంచి పారిపోవడం, తల్లి కుటుంబ బరువు మోయాల్సి రావడం తృప్తి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. బాధ్యతలను గాలికొదిలేసి సన్యాసం స్వీకరించిన మగవాడికి మాత్రం ఆలయాల్లోకి సగౌరవంగా స్వాగతం పలుకుతూ, ఆడవాళ్ల పట్ల వివక్ష చూపించడాన్ని ఆమె సహించలేకపోయారు. భూమాత బ్రిగేడ్ పేరుతో 2010లో స్వచ్ఛంద సంస్థను స్థాపించి ధార్మిక ప్రదేశాల్లో అమలవుతున్న లింగ వివక్ష మీద పోరాటానికి సిద్ధమయ్యారు. శని శింగణాపూర్ విజయం మహారాష్ట్రలోని శనిశింగణాపూర్‌లోని శనిదేవుడి ఆలయంలోకి మగవాళ్లకు మాత్రమే ప్రవేశం ఉండేది. తృప్తి లేవదీసిన ఉద్యమంతో సుప్రీంకోర్టు ఆ ఆంక్షను తొలగించింది. తర్వాత 2016 ఏప్రిల్‌లో ముంబయిలోని హాజీ అలీ దర్గాలోకి ప్రవేశించడానికి తృప్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. అదే ఏడాది మే నెలలో ఆమె కట్టుదిట్టమైన భద్రత నడుమ మసీదు గర్భగుడిలోకి మహిళలకు అనుమతి లేని నియమాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా ఆ మసీదులోని మిగతా భాగంలోకి ప్రవేశించారు. అలాగే నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయంలో మగవాళ్లలాగానే తడివస్త్రాలతో గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే కొల్హాపూర్‌లో మాత్రం ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కొల్హాపూర్ లక్ష్మీదేవిని అర్చించుకోవడానికి మహిళలకు గర్భగుడిలోకి ప్రవేశం కల్పించాలనే వాదన ఎప్పటినుంచో ఉంది. సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాత తృప్తీదేశాయ్ మరికొందరు కార్యకర్తలతోపాటు ‘విజయ్ ర్యాలీ’ నిర్వహించారు. అయితే భక్తులు ఆ ర్యాలీని అడ్డుకుని తృప్తీదేశాయ్ని గాయపరిచారు. మహాలక్ష్మి ఆలయంలోకి చీరతోనే రావాలనే నియమాన్ని ఉల్లంఘించి సల్వార్ కమీజ్‌తో రావడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మీద దాడి జరిగింది. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ నెలలో శబరిమల ఆలయంలో ప్రవేశించడానికి తృప్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆమెను కొచ్చి ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. ‘మహిళల గొంతు నొక్కడమే’ ఈ ఏడాది ఆలయం తెరిచిన తర్వాత తిరిగి ప్రవేశానికి ప్రయత్నిస్తానని ఆమె ప్రకటించారు. శబరిమల ఆలయంలోకి రుతుక్రమ వయసులో ఉన్న మహిళల ప్రవేశం మీద సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వివాదం మీద న్యాయమూరులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో తీర్పు కోసం విస్తృత ధర్మాసనాన్ని అప్పగించారు గత ఏడాది మహిళలకు రక్షణ కల్పించిన కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఆ ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వం రక్షణ బాధ్యత చేపట్టకపోవడం మహిళల గొంతుకను అణచివేయడమే అంటున్నారు తృప్తీదేశాయ్ ఆవేశంగా, ఆవేదనగా. – మంజీర ►తృప్తీ దేశాయ్ నాస్తికురాలని కొందరు, హిందూ వ్యతిరేకి అని కొందరు అభివర్ణించడాన్ని ఆమె భర్త ప్రశాంత్ తప్పు పట్టారు. ఆమె పరమభక్తురాలని, కొల్హాపూర్‌లోని గగన్‌గిరి మహారాజ్ భక్తురాలని చెప్పారాయన. ఆమె తన కొడుకును కూడా ఆస్తికవాదిగానేపెంచుతోందని, ఆమె పోరాటం స్త్రీల పట్ల వివక్షకు వ్యతిరేకంగా మాత్రమేనని అంటారు ప్రశాంత్. ►అయ్యప్ప దర్శనం కోసం శబరిమల చేరుకున్న భక్తులతో శనివారం నాడు కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం. అదేరోజు.. వయోపరిమితి నిబంధనలకు విరుద్ధంగా దర్శనం కోసం వచ్చిన కొంతమంది మహిళా భక్తులను ఆలయ నిర్వాహ కులు ‘పంబ’ ప్రాంతం నుంచే వెనక్కు పంపించేశారు. అలా పంపించడం వివక్షేనని తృప్తీ దేశాయ్ అంటున్నారు. ఎన్ని ఆంక్షలున్నా తను అయ్యప్పను దర్శించుకునే తీరుతానని ఆమె ప్రకటించారు. -
శరణం అయ్యప్ప!
శబరిమల/తిరువనంతపురం: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. గత ఏడాది సుప్రీంకోర్టు ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పుతో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న దృష్ట్యా ఈసారి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో దేవాలయ తంత్రి(ప్రధాన పూజారి) కందరారు మహేశ్ మోహనరు, మెల్షంటి(ముఖ్య పూజారి) సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి పడి పూజ చేశారు. అనంతరం భక్తులను లోపలికి అనుమతించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి అప్పటికే వేలాదిగా తరలివచ్చిన భక్తుల అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 10–50 ఏళ్ల మధ్య వయస్సున్న 10 మంది యువతులను తిప్పి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే దేవస్థానం బోర్డు భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. పశ్చిమ కనుమల్లోని పెరియార్ పులుల అభయారణ్యం ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని ప్రతి మలయాళ నెలలోని మొదటి ఐదు రోజులతోపాటు మండలపూజ మకరవిళక్కు, విషు పండగల సమయాల్లో మాత్రమే భక్తుల సందర్శన కోసం తెరుస్తారు. మండల–మకరవిళక్కు సందర్భంగా రెండు నెలలపాటు ఆలయం తెరిచి ఉండనుంది. నిషేధాజ్ఞలు లేవు: కలెక్టర్ రుతుక్రమం వయస్సు మహిళలను కూడా ఆలయంలోకి పూజలకు అనుమతించవచ్చంటూ గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం కేరళతోపాటు దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు, వేలాదిగా పోలీసులను మోహరించినప్పటికీ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈసారి ఎలాంటి నిషేధాజ్ఞలు లేవని పత్తనంతిట్ట కలెక్టర్ ప్రకటించారు. శబరిమలకు వెళ్లే దారిలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో దాదాపు 10 వేల మంది పోలీసులను మోహరించారు. భక్తుల కోసం దేవస్వోమ్ బోర్డు పలు సౌకర్యాలు కల్పించింది. నీలాకల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. సన్నిధానం వద్ద 6,500 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏపీ మహిళల బృందం వెనక్కి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చిన 30 మంది మహిళల బృందాన్ని పోలీసులు పంబలో అడ్డుకున్నారు. వారి గుర్తింపు పత్రాలు పరిశీలించిన మీదట అందులోని నిషేధిత 10–50 మధ్య వయస్సున్న 10 మందిని తిప్పిపంపి వేశామని పోలీసులు తెలిపారు. పంబ నుంచి శబరిమల ఆలయం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, కేరళ ప్రభుత్వ వైఖరిని పునరుజ్జీవన రక్షణ కమిటీ ఖండించింది. ప్రభుత్వ విధానం కారణంగా ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న వైఖరి క్రమంగా పలుచన కానుందని ఆ కమిటీ జనరల్ సెక్రటరీ పున్నల శ్రీకుమార్ తెలిపారు. శబరిమల రావాలనుకునే మహిళలు తమతో పాటు కోర్టు ఆర్డర్‌ను తెచ్చుకోవాల్సి ఉంటుందన్న కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటన ఎలా చేస్తారు? ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి’అని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వ వైఖరిపై హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ స్పందించారు. ఆ ప్రభుత్వం ఎవరికీ రక్షణ కల్పించడంలేదని వ్యాఖ్యానించారు. కేరళ సర్కారు తనకు భద్రత కల్పించినా కల్పించకున్నా ఈ నెల 20వ తేదీ తర్వాత శబరిమల ఆలయ సందర్శనకు వెళ్తానని ఆమె ప్రకటించారు. గత ఏడాది ఉద్రిక్త పరిస్థితుల మధ్య తృప్తి దేశాయ్ ఆలయ సందర్శనకు ప్రయత్నించగా భారీ స్థాయిలో ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. చిన్నారి భక్తురాలిని గుడిలోకి పంపిస్తున్న దృశ్యం -
శబరిమల ఆలయం : పది మంది మహిళలకు నో ఎంట్రీ..
తిరువనంతపురం : శబరిమల ఆలయం తలుపులు శనివారం సాయంత్రం తెరుచుకోనున్న క్రమంలో ఆలయం లోకి ప్రవేశించేందుకు వచ్చిన పది మంది మహిళలను పోలీసులు తిప్పిపంపారు. వీరిని ఏపీకి చెందిన మహిళా భక్తులుగా భావిస్తున్నారు. శబరిమలలో పది నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు ప్రవేశించవచ్చని, పూజలు నిర్వహించవచ్చని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆలయ పరిసరాల్లో పదివేల మంది పోలీసులను నియమించారు. కాగా శబరిమలను సందర్శించాలనే మహిళలు కోర్టు ఉత్తర్వులతో వస్తే భద్రత కల్పిస్తామని కేరళ దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. శబరిమల ఆలయం ఆందోళనలు చేపట్టే ప్రాంతం కాదు..తృప్తి దేశాయ్ వంటి సామాజిక కార్యకర్తలు తమ బలప్రదర్శన చేసే స్థలం కాదని చెప్పారు. ఏమైనా మహిళా భక్తులు కోర్టు ఉత్తర్వులతో రావాలని సూచించారు. మీడియా ప్రతినిధులు సైతం సంయమనం పాటించాలని, సంచలనం కోసం ప్రయత్నించే వ్యక్తులు, నేతల అత్యుత్సాహానికి సహకరించరాదని స్పష్టం చేశారు. కాగా శతాబ్ధాల తరబడి రుతుక్రమం పాటించే మహిళలను శబరిమల ఆలయానికి అనుమతించని నిబంధనలను బేఖాతరు చేస్తూ సుప్రీం తీర్పు నేపథ్యంలో గత ఏడాది పూణేకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ శబరిమలలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.మరోవైపు నవంబర్ 20 తర్వాత తనకు ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా శబరిమల సందర్శిస్తానని తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. తమకు భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరతానని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దర్శనం కోసం తాను శబరిమల వెళ్లితీరతానని ఆమె చెప్పారు. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి యువతుల ప్రవేశం గురించి తాము న్యాయ సలహాను తీసుకుంటామని ట్రావన్‌కోర్ దేవసం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు వెల్లడించారు. -
శబరిమల వివాదం : కేరళ సర్కార్ యూటర్న్
తిరువనంతపురం : శబరిమల వివాదంపై కేరళలో పాలక వామపక్ష ప్రభుత్వం స్వరం మారింది. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఓట్ల శాతం పెరగడంతో సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వం శబరిమల ఆలయ వివాదంపై మెతక వైఖరి తీసుకున్నట్టు వెల్లడవుతోంది. శబరిమల ఆలయ సంప్రదాయాలను పరిరక్షించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ కోరారు. పది నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు, బాలికలకు శబరిమల ఆలయంలోకి అనుమతించరాదన్నది ఆలయ సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలనూ అనుమతించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కేరళ వామపక్ష ప్రభుత్వం వ్యవహరించింది. మరోవైపు సుప్రీం ఉత్తర్వులు ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని బీజేపీ, ఆరెస్సెస్ సహా హిందూ సంస్ధలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. ఈ ఆందోళనల ఊతంతో బీజేపీ వామపక్ష ప్రాబల్య కేరళలో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లను కొల్లగొట్టడం మారిన ప్రభుత్వ వైఖరికి అద్దంపడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, కేంద్రం శబరిమల ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ చట్టం చేసేందుకు కొంత సమయం పడితే ఈ లోగా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కేరళ దేవాదాయ మంత్రి కోరారు. -
‘శబరిమల’ ఓటు బీజేపీకి ఎందుకు పడలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఏకంగా 303 సీట్లతో అఖండ విజయం సాధించినప్పటికీ కేరళ రాష్ట్రంలో ఆ పార్టీకి ఎందుకు ప్రవేశం దొరకలేదు ? కనీసం మూడు సీట్లు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఎందుకు దక్కలేదు ? శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ వర్గాలు ఆందోళన చేపట్టిన విషయం తెల్సిందే. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుకూలంగా యువతులు శబరిమలలోని అయ్యప్ప గుడిలోకి ప్రవేశించిన వారిపైనా వారు దాడులు చేశారు. యుక్త వయసు మహిళలెవరూ గుళ్లోకి ప్రవేశించకుండా ఆలయ పరిసరాల్లో ఆరెస్సెస్ తన సేనలను మోహరించింది. ముందుగా సుప్రీం కోర్టు తీర్పను గౌరవిస్తామని చెప్పిన బీజేపీ, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందచ్చని భావించి మాట మార్చింది. తీర్పుకు వ్యతిరేకంగా ఆరెస్సెస్‌తో కలసి ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగిన ఏప్రిల్–మే కాలం వరకు ఆందోళనను సాగదీశాయి. శబరిమల అంశం బీజేపీకి ఓ సువర్ణావకాశాన్ని ఇచ్చిందని కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై వ్యాఖ్యానించారు. కానీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన బీజేపీకి కాకుండా బీజేపీ లాగానే సుప్రీం కోర్టు తీర్పును ముందుగా సమర్థించి, తర్వాత వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు పడ్డాయి. మొత్తం 20 సీట్లలో 15 సీట్లు కాంగ్రెస్‌కు రాగా, మిగతా నాలుగు సీట్లు దాని మిత్రపక్షాలకు వచ్చాయి. పాలకపక్ష సీపీఏం పార్టీ ఒకే ఒక్క సీటు దక్కింది. అలప్పూజ నుంచి పోటీ చేసిన సీపీఎం నాయకుడు ఏఎం. ఆరిఫ్ ఒక్కరే విజయం సాధించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఫ్రంట్ నుంచి ఏకంగా 9 మంది అభ్యర్థులు లక్షకుపైగా మెజారిటీతోని విజయం సాధించారు. యూడీఏ ఫ్రంట్‌కు 47. 2 శాతం ఓట్లు రాగా, ఎల్డీయే ఫ్రంVŠ కు 35. 1 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు కేవలం 15.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన 14.9 శాతం ఓట్లతో పోలిస్తే కొద్దిగా ఓట్ల శాతం పెరిగింది. అదే 2014 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన 10.8 శాతం ఓట్లతో పోలిస్తే ఎక్కువ పెరిగింది. బీజేపీ తరఫున గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న కుమ్మనం రాజశేఖరన్ మినహా మిగతా మూడవ స్థానంలో నిలిచారు. తిరువనంతపురం నుంచి పోటీ చేసిన రాజశేఖరన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ ఏకంగా 99, 989 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజశేఖరన్‌కు 31.1 శాతం ఓట్లు వచ్చాయి. శబరిమల ఆలయం ఉన్న పట్టణం తిట్టలో బీజేపీ అభ్యర్థి కే. సురేంద్రన్ 29 శాతం ఓట్లతో రెండో స్థానంలో వచ్చారు. ఎందుకిలా జరిగిందని వామపక్షాలను, కాంగ్రెస్, బీజేపీ వర్గాలను మీడియా విచారించగా, వామపక్ష సానుభూతిపరులు బీజేపీకి ఓటు వేయడం ఇష్టంలేక కాంగ్రెస్‌కు ఓటు వేశారని, తద్వారా ఆ పార్టీ లబ్ధి పొందిందని వామపక్ష నాయకులు వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలు మొదటి నుంచి లౌకిక వాదులని మతతత్వ బీజేపీకి ఓటు వేయడం ఇష్టం లేక తమకే ఓటు వేశారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శబరిమల ఆలయ వివాదం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లబ్ధి పొందిందని, అయితే తాము గెలవక పోయినా తమ పార్టీ కూడా బలపడిందని బీజేపీ నాయకులు చెప్పారు. భవిష్యత్తులో తాము మరింత బలపడేందుకు ఇప్పుడు సమకూర్చుకున్న బలం ఉపయోగపడుతుందని అన్నారు. -
శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
తిరువనంతపురం: మలయాళ నెల కుంభం సందర్భంగా ఈనెల 12 నుంచి 17 వరకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరవనుండటంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం పట్టుదలతో ఉండటం, సంప్రదాయ విరుద్ధంగా ఆలయంలోకి వచ్చే రుతుస్రావం వయస్సు మహిళలను అడ్డుకునేందుకు హిందూ సంస్థలు ప్రయత్నించడంతో మండల పూజల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి ఆలయంలోకి భక్తులను దర్శనానికి అనుమతించనుండటంతో పోలీసుల ఆంక్షలు, హిందూ సంస్థల నిరసనల ఎలాంటి పరిణామాలకు దారితీయనుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం సాయంత్రం ముఖ్య పూజారి వాసుదేవన్ నంబూద్రి సమక్షంలో ప్రధాన ఆలయ ద్వారాలను తెరిచి పూజలు ప్రారంభిస్తారు. శబరిమల ఆలయం పరిరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నలుగురు మించి గుమికూడరాదని ఆదేశాలు జారీచేశారు. -
‘ట్రావెన్కోర్’ యూటర్న్
-
ఆలయ ప్రవేశం తర్వాత ఆమెకు గృహప్రవేశం లేదు
అయ్యప్పస్వామిని దర్శించడంలో సఫలమైన కేరళ స్త్రీ కనకదుర్గ ఇప్పుడు తన ఇంట్లో ప్రవేశించడానికి పెనుగులాడుతోంది.అయ్యప్పని హరిహరసుతుడుగా భక్తులు పూజిస్తారు. విష్ణుమూర్తి, శివుడు పురుషులుగా ఉండగా అయ్యప్ప జన్మ సాధ్యపడలేదు. విష్ణుమూర్తి మోహినీ అవతారం– అంటే స్త్రీ అవతారం దాల్చాకనే అయ్యప్ప జన్మ సాధ్యమైంది. అంటే అయ్యప్ప జన్మలో స్త్రీ ప్రమేయం ఉంది. కాని అయ్యప్ప ఆరాధనలో, దర్శనంలో మాత్రం వయసులో ఉన్న స్త్రీల ప్రవేశం వందల ఏళ్లుగా నిషేధించబడింది.దీని గురించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై దేశంలో భిన్నమైన స్పందనలు వెలువడ్డాయి. రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కు అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశంలో భంగపాటుకు లోనవుతున్నదని, స్త్రీలకు ఆ ఆలయంలో ప్రవేశించే హక్కు సంపూర్ణంగా ఉందని కోర్టు చెప్పింది. ఆ వెంటనే ఎందరో స్త్రీలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించి భక్తుల నిరసనల వల్ల విఫలమయ్యారు. అయితే కేరళకు చెందిన కనకదుర్గ (39), బిందు అమ్మిని (40) జనవరి 2, 2019న శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. పోలీసులు వీరికి సహకరించారు. ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆలయాన్ని ప్రధాన అర్చకులు శుద్ధి చేశారు. భద్రతా కారణాల రీత్యా కొన్నాళ్లు అజ్ఞాతంగా ఉన్న ఆ స్నేహితురాళ్లు ఇద్దరూ తిరిగి సామాన్య జీవనంలోకి అడుగు పెట్టే ప్రయత్నం చేశారు. ఆ వివరాలను కనకదుర్గ ఇలా చెబుతోంది.‘మలప్పురం జిల్లాలోని అంగడిపురం మా ఊరు. డిసెంబర్ 22, 2018న నేను మా ఇంటి నుంచి అయ్యప్ప దర్శనం కోసం నా స్నేహితురాలితో బయలుదేరాను. మాకు ఆలయ ప్రవేశం వెంటనే సాధ్యపడలేదు. శబరిమలకు సమీపంలోని ఒక రహస్య ప్రదేశంలో వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు జనవరి 2, 2019న మేము అయ్యప్ప దర్శనం చేసుకున్నాం. స్త్రీల గౌరవం కోసం, సుప్రీం కోర్టు తీర్పు గౌరవం కోసం, దేశంలో స్త్రీల సమానత్వం కోసం మేము ఈ పని చేశాం. కాని ఆ వెంటనే పెద్దస్థాయిలో నిరసన వ్యక్తమైంది. మేము తీవ్రమైన తప్పు చేసినట్టుగా వ్యాఖ్యానాలు వచ్చాయి. అంత తప్పు మేము ఏం చేశాం. చట్టం మాకు కల్పించిన ఒక అవకాశాన్ని వినియోగించుకోవడం తప్పా? దర్శనం అయ్యాక మా భద్రతకోసం కొన్నాళ్లు మళ్లీ ప్రభుత్వం మమ్మల్ని వేరే చోటులో ఉంచింది. జనవరి 15న నేను ఇంటికి చేరుకున్నాను. అయితే ఇంట్లో ప్రవేశానికి నా భర్త, అత్త అడ్డు చెప్పారు. నాకు ఇద్దరు పిల్లలు. వారిని కొద్ది నిమిషాల సేపే నేను చూడగలిగాను. ఎందుకు నేను ఇంట్లోకి రాకూడదు అని ఎదురు ప్రశ్నించినందుకు నా అత్త నా బుర్ర పగుల గొట్టింది. మా ఊరిలోని ఆస్పత్రిలో వైద్యం సరిపోక కోజికోడ్ ఆస్పత్రిలో వారం రోజులు ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా తల తప్పలేక, సరిగ్గా మాట్లాడలేక అవస్థ పడుతున్నాను. నా ఇంట్లో నుంచి నన్ను తరిమేయడానికి నేనేం పాపం చేశాను? కొందరు పెద్దలు నా భర్తతో మాట్లాడితే నేను నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆలోచిస్తానని అన్నాడట. నేను చేసిన పనికి నేను ఎవరికైనా క్షమాపణ చెప్పడం కానీ, ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కానీ చేయను. నేను నా ఇంట్లో ప్రవేశానికి చట్టబద్ధంగా పోరాడతాను. కోర్టుకు వెళతాను’ అని అందామె.అయితే కనకదుర్గ పరిస్థితి పుట్టింట్లోనూ సరిగ్గా లేదు. పుట్టింటికి వెళదామనుకుంటే ఆమె సోదరుడు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ‘వారు నా మీద కోపంగా ఉన్నారు’ అంది కనకదుర్గ. ఆమె ప్రస్తుతం ఒక ప్రభుత్వ హోమ్‌లో ఉంటోంది. మరోవైపు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ‘మూడుసార్లు వెంటవెంటనే తలాక్ చెప్పి స్త్రీకు అన్యాయం చేసిన పురుషుడికి జైలు శిక్ష ఉంటుందని చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం కనకదుర్గ భర్త వంటి వ్యక్తులు ఉన్న పళంగా భార్యను బయటకు గెంటేస్తే వేయాల్సిన శిక్ష గురించి ఎందుకు చట్టం చేయదు’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవుడు దగ్గరైతే కన్నపిల్లలు దూరమయ్యే పరిస్థితి రావడం కనకదుర్గ ఉదంతంలో కనిపిస్తోంది. సాంస్కృతిక విశ్వాసాలు, చట్టం... వీటి మధ్య సాగుతున్న పోరులో మగ పెత్తనమే పై చేయి కావడం కూడా కనిపిస్తోంది. -
‘51 కాదు 17 మంది మాత్రమే’
తిరువనంతపురం : సుప్రీం కోర్టు తీర్పుకనుగుణంగా దాదాపు 51 మంది 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారంటూ కేరళ ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నివేదికలో మగవారి పేర్లు రావడం, 50 ఏళ్ల పైబడిన మహిళలర్లు కూడా ఉండటంతో విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కొత్త నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు కేవలం 17 మంది మాత్రమే శబరిమల ఆలయంలోకి ప్రవేశించారని ఈ నివేదికలో తెలిపింది. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘ఇంతకు ముందు సమర్పించిన నివేదికలో నలుగురు పురుషులు ఉన్నట్లు గుర్తించాము. వారితో పాటు 30 మంది మహిళలు 50 ఏళ్ల వయసు పైబడిన వారిగా గుర్తించి ఆ పేర్లను నివేదిక నుంచి తొలగించినట్లు’ తెలిపారు. ఈ క్రమంలో చివరకూ 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు కేవలం 17 మంది మాత్రమే ఆయంలోకి ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 2న బిందు, కనక దుర్గ అనే ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో కేరళలోని హిందూ నిరసనకారులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. -
శబరిమల ఆలయం మూసివేత
శబరిమల: అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య రెండునెలల పాటు కొనసాగిన శబరిమల వార్షిక పూజలు ఆదివారంతో ముగిశాయి. రుతుస్రావం వయస్సులో ఉన్న మహిళలను కూడా ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అధికార వామపక్ష, ప్రతిపక్ష బీజేపీ శ్రేణుల నిరసనలు, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిన విషయం తెలిసిందే. 67 రోజుల అనంతరం ఆదివారం ఉదయం 6.15 గంటలకు పండాలం రాజకుటుంబానికి చెందిన పి.రాఘవ వర్మ రాజా దర్శనం అనంతరం భస్మాభిషేకం పూజతో ఆలయ మహద్వారాన్ని మూసివేశారు. తిరిగి ఫిబ్రవరి 13వ తేదీన మళయాళం నెల కుంభం సందర్భంగా పూజల కోసం ఆలయాన్ని తెరుస్తారు. -
‘నేను కళావతిని కాదు..’
శబరిమల : నేను మగాడినండి బాబు.. అంటూ రిపోర్టర్ల ముందు మొరపెట్టుకుంటున్నాడు తమిళనాడుకు చెందిన 47 ఏళ్ల పరంజ్యోతి. పాపం ఈ పేరే అతన్నిప్పుడు ఇబ్బందుల్లో పడేసింది. విషయం ఏంటంటే.. శుక్రవారం కేరళ ప్రభుత్వం 51 మంది.. 50 ఏళ్ల లోపు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారంటూ సుప్రీం కోర్టుకు నివేదిక అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో కొందరు మగవారి పేర్లను కూడా చేర్చడంతో ప్రస్తతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. పాపం ఈ లిస్ట్‌లో పరంజ్యోతి పేరు కూడా వుంది. దాంతో నేను మగాడినండి బాబు అంటూ రిపోర్టర్ల ముందు వాపోతున్నాడు పరంజ్యోతి. పాండిచ్చేరికి చెందిన శంకర్ పరిస్థితి మరి దారుణం. ఆలయంలోకి ప్రవేశించిన 51 మంది మహిళల పేర్లలో ‘కళావతి’ అనే ఆమె ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ‘కళావతి’ పేరు పక్కన ట్యాక్సీ డ్రైవర్ శంకర్ ఫోన్ నంబర్‌ను రాశారు. దాంతో గత రెండు రోజులుగా అతని ఫోన్ నిరంతరాయంగా మొగుతూనే ఉందంట. తమిళనాడుకు చెందిన గృహిణి షీలాది మరోక కథ. ఆమె వయసు 52 సంవత్సరాలు. కానీ కోర్టుకిచ్చిన లిస్ట్‌లో షీలా పేరు కూడా ఉంది. షీలాతో పాటు మరి కొంతమంది మహిళలు లిస్ట్‌లో తమ పేర్లు కూడా ఉన్నాయంటూ మీడియా ముందుకు వచ్చారు. తమ వయసు 50 సంవత్సరాలకు పైనే అని .. కానీ కోర్టుకిచ్చిన లిస్ట్‌లో తమ పేర్లు చేర్చారని సదరు మహిళలు తెలిపారు. అయితే లిస్ట్‌లో జరిగిన అవకతవకల గురించి కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు సమాచారంతో కేరళ ముఖ్యమంత్రి సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘వారికి 24/7 రక్షణ కల్పించండి’
న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు బిందు, కనకదుర్గలకు 24 / 7 రక్షణ కల్పించాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయంలోకి ప్రవేశించినందుకు తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ.. ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు బిందు, కనకదుర్గలకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసింది. ఆడవారిని ఆలయంలోకి ప్రవేశించకుండా ఆందోళనకారులు అడ్డుగిస్తున్నారు. ఈ క్రమంలో బిందు, కనకదుర్గలు ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. కానీ ఆలయంలోకి వెళ్లి వచ్చినప్పటి నుంచి వారికి బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 15న కనకదుర్గ మీద ఆమె అత్త, బంధువలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో బిందు, కనకదుర్గలు తమకు ప్రాణ హాని ఉందని గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఆలయంలోకి వెళ్లాలనుకునే మహిళలకు పోలీసు రక్షణ కల్పించేలా కోర్టు ఆదేశించాలని కోరారు. వీరి పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టాలని వీరి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ను కోరారు. -
అత్యంత హీనంగా కేరళ సర్కారు తీరు
కొల్లం(కేరళ), బలంగిర్(ఒడిశా): శబరిమల అంశంపై కేరళ ప్రభుత్వం అత్యంత హీనంగా వ్యవహరించి, చరిత్రలో నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రేషన్ సరుకులను పక్కదారి పట్టకుండా ఆపి, రూ.90వేల కోట్ల కుంభకోణాన్ని బట్టబయలు చేసినందుకు తనను తొలగించేందుకు కుట్ర జరిగిందని ప్రధాని ఆరోపించారు. మంగళ వారం ఆయన కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లం (కేరళ), బలంగిర్ (ఒడిశా)లలో జరిగిన కార్యక్రమాల్లో ప్రసంగించారు. అవినీతి, మతతత్వం, కులతత్వం అంశాల్లో కేరళలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్డీఎఫ్) ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని పేర్కొన్నారు. ‘శబరిమల అంశంపై కేరళలోని వామపక్ష ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత హీనమైందిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇలా మరే ప్రభుత్వం కానీ, పార్టీ కానీ చేయలేదు. కమ్యూనిస్టులకు చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలపై ఏమాత్రం గౌరవభావం ఉండదని మనకు తెలుసు. కానీ, ఇంత హేయంగా వ్యవహరిస్తుందని ఎవరూ ఊహించలేరు’ అని తీవ్రంగా దుయ్యబట్టారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై పార్లమెంట్ లోపల ఒకలా, పత్తనంతిట్ట (అయ్యప్ప కొలువైన జిల్లా)లో మరోలా మాట్లాడుతున్న కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. కేరళ ప్రజలకు, వారి సంప్రదాయాలకు రక్షణగా నిలిచే ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. ‘యూడీఎఫ్, ఎల్డీఎఫ్ లకు ఒక్కటే చెబుతున్నా. మా కార్యకర్తను తక్కువగా చూడొద్దు. త్రిపురలో జరిగిందే ఇక్కడా జరుగుతుంది’ అని అన్నారు. నన్ను తొలగించేందుకు కుట్ర నకిలీ పత్రాల ద్వారా రూ.90వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకున్నందుకు తనను పదవి నుంచి తొలగించేందుకు చూశారని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘గత ప్రభుత్వాల హయాంలో దళారులు.. లేకపోయినా ఉన్నట్లు పత్రాలు సృష్టించి రేషన్ కార్డులు, వంట గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు పొందారు. మా ప్రభుత్వం అలాంటి ఆరు కోట్ల పేర్లను గుర్తించి రూ.90వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టే పెద్ద కుంభకోణాన్ని అడ్డుకుంది. తమ ఆటలు సాగకపోయేసరికి ఈ అక్రమార్కులంతా ఏకమై ఈ‘చౌకీదార్’ను తొలగించేందుకు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’ అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ కొల్లాంలోని జాతీయ రహదారి–66పై నిర్మించిన 13 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును, బలంగీర్‌లో రూ.1,550 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. -
మగవారిలా వేషం మార్చి..
తిరువనంతపురం : శబరిమల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికి ఆందోళనకారులు మాత్రం దీన్ని ఖాతరు చేయటం లేదు. మహిళలను ఆలయ ప్రాంగణంలోకి కూడా రానివ్వడంలేదు. అయితే ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కొందరు మహిళలు ఎలాగోలా ఆలయంలోకి ప్రవేశించి ఇప్పటికే అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు మహిళలు, మగవారిలా వేషం ధరించి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. తొమ్మిది మంది అయ్యప్ప భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తుండగా అనుమానం వచ్చిన ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. ఈ అయ్యప్ప భక్తుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని తెలింది. దాంతో ఆందోళనకారులు సదరు మహిళల్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ నెల 2న అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన కనకదుర్గ అనే మహిళపై ఆమె అత్త, బంధువులు మంగళవారం దాడి చేశారు. -
ఆ రెండు పార్టీల పేర్లు మాత్రమే వేరు..
తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోదీ కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమలలో తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించడంలో పినరయ్ విజయన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కమ్యూనిస్టులది, కాంగ్రెస్ పార్టీది ఒకే రకమైన తత్వమని పేర్కొన్నారు. కమ్యూనిస్ట్‌లు భారతదేశ సంస్కృతిని, ఆధ్యాత్మిక సంప్రదాయాలను గౌరవించరని మండిపడ్డారు. అంతేకాక శబరిమల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే మాట మీద నిలబడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు పార్లమెంట్లో ఒకలా.. పథనంథిట్టలో మరొకలా మాట్లాడతారని ఆరోపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పేర్లు మాత్రమే వేరు.. కానీ అవినీతి, కులతత్వం, మతతత్వం, కేరళ సాంస్కృతిక కల్పనను దెబ్బతీయడంలో రెండు ఒకేలా పని చేస్తాయని ఆరోపించారు. ఇవి రెండు పెద్ద అవకాశవాద పార్టీలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మకర కాంతుల మణికంఠుడు
కుళత్తుపుళై బాలకనే శరణం అయ్యప్పాఅరియన్ కావు అయ్యనే శరణం అయ్యప్పాఅచ్చెన్ కావు అరశనే శరణం అయ్యప్పాశబరిమలై అయ్యనే శరణం అయ్యప్పాకాంతి మలై జ్యోతినే శరణం అయ్యప్పా అని భక్తులు శరణుఘోషలో స్వామిని స్తుతిస్తుంటారు. చిత్రం ఏమిటంటే, చాలామంది భక్తులకు శబరిమల తప్ప ఈ జాబితాలోని మిగిలిన ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. వాస్తవానికి ఇవన్నీ శబరికి దగ్గరలోనే అటవీ ప్రాంతంలో ఉంటాయి. పైగా ఈ అయిదు ఆలయాలు కూడా స్వయంగా పరశురామ ప్రతిష్టిత ఆలయాలే. వీటిని కూడా శబరిమలై ఆలయం పరిపాలన బాధ్యతలు చూస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం వారే పర్యవేక్షిస్తూ ఉంటారు. 1. కుళత్తుపుళై ఇక్కడ అయ్యప్పస్వామి బాలకుని రూపంలో దర్శనం ఇస్తారు. కుళత్తు పుళై అన్నది కేరళలోని కొల్లమ్ జిల్లా పత్తనాపురమ్ తాలూకాలో ఒక చిన్న గ్రామం. కొల్లమ్ – షెన్ కొట్టయ్ జాతీయ రహదారికి చేరువలో కనిపిస్తుంది. తిరువనంతపురంకు, కొల్లమ్‌కు దగ్గరగా కనిపిస్తుంది. కుళత్తు నదికి ఆనుకొని గ్రామం ఉన్నందున ఈ పేరు వచ్చింది. నదికి అవతల వైపున గుడి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప బాలుని రూపంలో దర్శనం ఇస్తారు. ఉదయం సాయంత్రం అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఇదే మందిరంలో శివుడు, యక్షి, విష్ణుమూర్తి, గణపతి, భూతనాథన్, నగర్, కరుప్ప స్వామి వంటి దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ కొలనులో చేపలకు ఆహారం వేసే సేవకు మీనొత్తుసేవ అని పేరు. చర్మరోగాలతో బాధపడేవారు ఈ సేవ చేయించుకుంటారు. 2. అరియన్ కావు ఇది కేరళ తమిళనాడు సరిహద్దుల్లో నెలకొని ఉన్న గుడి.. కేరళ లోని కొల్లమ్ జిల్లా పథనాపురమ్ తాలూకాలోని అరియన్ కావు గ్రామం ఉంది. గుడి ఉన్న ప్రాంతం కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. ప్రతీచోట అయ్యప్పస్వామి చిన్ముద్రతో కూర్చొని కనిపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏనుగు మీద కూర్చొన్న భంగిమలో దర్శనం ఇస్తారు. కుడి కాలు కిందకు ఉంటే, ఎడమ కాలు మడిచి ఉంచుతారు. ఇక్కడ కూడా శబరిమలై మాదిరిగా పదునెట్టాంపడి ఉంటుంది. ఆలయంలో స్వామికి ఎడమవైపున అమ్మవారు, కుడివైపు పరమేశ్వరుడు దర్శనం ఇస్తుంటారు. ఆలయానికి వెలుపల నాగరాజు విగ్రహాలు, పుట్ట కనిపిస్తాయి. పాండియన్ ముడి, త్రిక్కళ్యాణమ్, కుంభాభిషేకం ప్రత్యేక ఉత్సవాలు. 3. అచ్చెన్ కోవిల్ శబరిమలైకు వెనుకగా దట్టమైన అడవుల్లో నెలకొని ఉన్న ప్రాంతంగా అచ్చెన్ కోవిల్. సాధారణంగా అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అవతారం అని మన అందరికీ తెలుసు. అయితే అచ్చెన్ కోవిల్లో మాత్రం పూర్ణ, పుష్కల అనే ఇద్దరు భార్యలతో స్వామి దర్శనం ఇస్తారు. మహా వైద్యన్ రూపంలో అయ్యప్పను కొలవటం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ పూజాదికాలన్నీ తమిళ సాంప్రదాయంలో నిర్వహిస్తుంటారు. ఇక్కడ స్వామి విగ్రహం రుద్రాక్షశిలతో చేసినదిగా చెబుతారు. అయ్యప్పతోపాటు మాళికాపురత్తమ్మ, దుర్గ, నాగరాజా, గణపతి, మురుగ, కరుప్పస్వామి, కరుప్పయి అమ్మ, చెప్పని ముదరన్, చెప్పని మాదన్, మాదన్ తేవన్ వంటి దేవతామూర్తులు కనిపిస్తారు. వెనుకభాగంలోని నాగప్రతిష్ట దర్శించతగినది. 4. శబరి మలై శబరి మలై గురించి భక్తులు అందరికీ తెలుసు. ప్రధానమైన అయ్యప్ప ఆలయంతోపాటు ఉండే ఉప ఆలయాల గురించి మాత్రం చాలా మందికి తెలియక పోవచ్చు. మహిమాన్వితమైన మూర్తిగా అయ్యప్ప భక్తుల్ని అనుగ్రహిస్తుంటారు. తండ్రి రాజశేఖరునికి ఇచ్చిన వరం మేరకు ఇక్కడ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో స్వామి విగ్రహాన్ని మకర సంక్రాంతి రోజున ప్రతిష్టించారట. అందుకే ఆలయంలో సంక్రాంతి పర్వదినాన అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి రోజున తిరువాభరణాల్ని స్వామికి అలంకరించి పూజలు చేయిస్తారు. అందుకే శబరిమలైలో సంక్రాంతికి అంతటి ప్రత్యేకత. ఇక శబరిమలై గుడిమీదనే అయ్యప్ప గుడికి ఆనుకొని కన్నెమూల గణపతి గుడి కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి కుడివైపున ఉండే ఈ ఆలయం ఎదుట కూడా ఇరుముడిని చూపించటం ఆనవాయితీ. ఇక్కడ జరిగే గణపతి హోమం విశేషమైనది గా చెప్పుకోవచ్చు. అలాగే నాగ రాజీవ గుడి కూడా ప్రశస్తమైనది. అయ్యప్పకు చిన్నన్నయ్య హోదాలో పూజలు అందుకొంటారు. దీంతో పాటు ప్రధానమైన ఆలయం మాళికాపురత్తమ్మ. అయ్యప్ప స్వామి మీద మనస్సు పడ్డ లీలావతి ఈ రూపంలో కొలువై ఉందని చెబుతారు. ఆది పరాశక్తి అంశలో దర్శనం ఇస్తుంది. 5. కాంతిమలై అయిదు ఆలయాల్లో ఈ కాంతిమలై విశిష్టమైనది. మిగిలిన నాలుగు ఆలయాలకు భక్తులంతా చేరుకొనే వీలు ఉంది. కానీ కాంతిమలైకు మాత్రం భక్తులు వెళ్లటం సాధ్యం కాదు. శబరిమలైకు ఎదురుగా ఉండే కొండనే కాంతిమలైగా పిలుస్తుంటారు. ఇక్కడకు సమీపంలోని పొన్నంబల మేడు నుంచి మకర సంక్రాంతి రోజున సాయంత్రం సమయంలో జ్యోతి రూపంలో అయ్యప్ప దర్శనం ఇస్తారని భక్తుల నమ్మకం. అందుచేత దూరంనుంచే కాంతి రూపంలో అయ్యప్పను దర్శించుకొని వెనక్కి మళ్లుతారు. పరమత సహనానికి శబరిమలై పెట్టిందిపేరు. అయ్యప్ప క్రీస్తుశకం వెయ్యివ సంవత్సరాల కాలంలో నడయాడినట్లు చెబుతారు. అప్పటికే కేరళలో ముస్లిం కుటుంబాలు స్థిరపడి ఉన్నాయి. అందులో వావర్ అనే ముస్లిం యువకునితో అయ్యప్పన్కు స్నేహం కుదిరింది. వావర్ స్వామియే, వావరిన్ తోళరే అని శరణు ఘోషలో భక్తులు పఠిస్తూ ఉంటారు. ఈ వావర్‌కు గుర్తుగా శబరిమలై కొండమీద వావరన్ నాడా (కోవెల) కనిపిస్తూ ఉంటుంది. మాళికపురత్తమ్మ ఆలయానికి సమీపంలో ఇప్పటికీ మనం చూడవచ్చు. అలాగే ఎరుమేలికి వెళ్లినప్పుడు అక్కడ వావర్ స్వామి మసీదు కనిపిస్తుంది. భక్తులందరూ వావర్ స్వామి ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీ. మలయాళ సాహిత్యం ప్రకారం అయ్యప్ప స్వామి అర్యన్ కేరళ వర్మ (రాజుల పేరు) తో పందళ రాజ్యంలో పెరిగారని చెబుతారు. మణిమాల ఉన్నందున మణికంఠుడిగా పిలుచుకొనేవారు. మహిషిని అంతం చేసేందుకు వచ్చినందున ఆ ప్రక్రియ ముగిశాక అయ్పప్ప అవతారం చాలించారని చెబుతారు. ఇందులో భాగంగా ఇప్పుడు శబరికొండపై ఉన్న మణి మండపం ప్రాంతంలో స్వామి తపస్సు చేసుకొన్నారని, స్వామికి సన్నిహితులైన వారంతా అక్కడకు చేరుకొన్న తర్వాత అయ్యప్ప స్వామి అకస్మాతుగా మకర సంక్రాంతి రోజు సాయంత్రం అదృశ్యం అయ్యారట. అదే సమయాన పొన్నంబల మేడ్ సమీపంలో ఒక దివ్యకాంతి జ్యోతిరూపంలో దర్శనం ఇచ్చిందట. అంతటితో అయ్యప్ప అవతారం పూర్తయిందని నమ్మిన భక్తులు.. శబరిమలైలో సంక్రాంతి రోజున పూజాదికాలు విశేషంగా జరిపిస్తుంటారు. ప్రతి ఏటా జ్యోతి దర్శన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అదే అయ్యప్ప గుడికి, మకర సంక్రాంతికి ఉన్న అనుబంధం. ఈ మకర సంకాంతి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో అందరికీ అన్ని శుభాలూ చేకూరాలని కోరుకుందాం. – రమా విశ్వనాథన్ -
కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు.. ఇదిగో సాక్ష్యాలు!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న హిందూత్వ, జాతీయవాదాన్ని ఎలా త్రిప్పికొట్టాలో తెలియక కాంగ్రెస్ పార్టీ తికమక పడుతోంది. ఆవిర్భావం నుంచి పార్టీకి పునాదులుగా ఉన్న లౌకికవాదం, జాతీయవాదం, లింగ సమానత్వం, మానవ హక్కులకు తిలోదకాలిస్తోంది. అధికారం కోసం అంగలారుస్తూ బీజేపీకన్నా ఎక్కువగా ఆత్మవంచనకు పాల్పడుతోంది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఓ విధానం, రాష్ట్రాల స్థాయిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా మరో విధానం అంటూ కొత్త పాటను అందుకుంది. కాంగ్రెస్ పార్టీలో పేరుకుపోతున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు మొట్టమొదటిసారిగా ప్రజల ముందు జనవరి మూడవ తేదీన బయటపడ్డాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి యాభై ఏళ్లకు లోపున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు పాటిస్తున్న ‘నిరసన దినం’లో భాగంగా కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు నల్లబ్యాడ్జీలు ధరించి పార్లమెంట్‌కు వచ్చారు. పార్లమెంట్ ఆవరణలోనే వారిని సోనియాగాంధీ అడ్డుకుని ఆ బ్యాడ్జీలను తీసి వేయించారు. అయ్యప్ప ఆలయానికి సంబంధించిన నిరసన కేరళ వరకే పరిమితం కావాలని, జాతీయస్థాయిలో ఆడ, మగ మధ్య లింగ వివక్ష చూపకూడదని ఆమె హితవు చెప్పారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవారిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకే తీరుగా స్పందించాయి. ఇరు పార్టీలు తీర్పును హర్షించాయి. కేరళ భక్తులు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో బీజేపీ ముందుగా ప్లేటు ఫిరాయించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ప్లేటు ఫిరాయించింది. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల లోపు మహిళలను అనుమతించరాదనే అయ్యప్ప ఆలయ సంప్రదాయాన్ని తాను గౌరవిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఒకటవ తేదీన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇదే విషయమై రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించగా మహిళల పట్ల వివక్ష చూపకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, కేరళ కాంగ్రెస్ ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నదని, పార్టీ అభిప్రాయమే తనదని చెప్పారు. దీన్నే ద్వంద్వ ప్రమాణాలంటారు. వ్యక్తిగతంగా గాంధీల అభిప్రాయం ఏదైనా ఉండవచ్చు. దాన్ని ఎవరూ కాదనరు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒకే అభిప్రాయం ఉండాలి. ఓటు రాజకీయాల కోసం ఏకాభిప్రాయాన్ని వదిలిపెట్టడమే ద్వంద్వ ప్రమాణాలను దగ్గరికి తీసుకోవడం అవుతుంది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రతి నెల మొదటి రోజు రాష్ట్ర సచివాలయంలో ‘వందేమాతరం’ గీతాలాపనను రద్దు చేశారు. గీతాలాపన చేయడమే దేశభక్తికి రుజువు కాదంటూ 2005 సంవత్సరం నుంచి బీజేపీ ప్రభుత్వం ఆచరిస్తున్న సంప్రదాయాన్ని ఆయన పక్కన పడేశారు. ఇక ప్రతినెల బీజేపీ శాసన సభ్యులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌవాన్ ప్రకటించగానే కమల్ నాథ్ మాట మార్చారు. మరింత మెరుగ్గా ‘వందేమాతరం’ గీతాలాపన ఉండాలన్న ఉద్దేశంతోనే తాను దీన్ని వాయిదా వేశానంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు బ్యాండుతో ఓ కిలోమీటరు మార్చింగ్తో వందేమాతరం గీతాలాపనను ప్రవేశపెట్టారు. రాజస్థాన్‌లో పశువులను అక్రమంగా తరలించారన్న అనుమానంపైన సాగిర్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని ఇటీవల ఓ హిందూత్వ మూక అన్యాయంగా కొట్టి చంపేస్తే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ మౌనం పాటించింది. గతంలోనయితే కాంగ్రెస్ నాయకులు బాధితుడి ఇంటికెళ్లి పరామర్శించేవారు, నిరసన యాత్ర జరిపేవారు. హిందూ అగ్రవర్ణాలను ఆకట్టుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ తన సిద్దాంతాలకు తిలోదకాలిస్తోందని అర్థం అవుతోంది. కానీ ద్వంద్వ ప్రమాణాల వల్ల కొత్త వర్గాల మద్దతు లభిస్తుందో, లేదో చెప్పలేంగానీ ఉన్న వర్గాల మద్దతు ఊడిపోయే ప్రమాదం ఉంటుందన్నది మరచిపోరాదు. -
‘తలకు రంగేసుకుని ఆలయంలోకి వెళ్లాను’
తిరువనంతపురం : అన్ని వయసుల మహిళల్ని అయ్యప్ప ఆలయంలోనికి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నేలకొన్న సంగతి తెలిసిందే. అనేక ఆందోళనల నడుమ ఇప్పటికే ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. వీరేకాక కేరళకు చెందిన మంజు అనే 36 ఏళ్ల మహిళ కూడా ఆలయంలోకి ప్రవేశించానని తెలిపారు. తలకు తెల్లరంగు వేసుకుని అయ్యప్ప దర్శనం చేసుకున్నాని తెలిపారు మంజు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు ఎలా తాను అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లిందనే వివరాలను కూడా షేర్ చేశారు మంజు. మంజు చెప్పిన వివరాలు.. ‘త్రిస్సూర్ నుంచి జనవరి 8న నా శబరిమల యాత్ర ప్రారంభించాను. అయితే ఆందోళనకారుల నుంచి వ్యతిరేకత ఎదురవకుండా ఉండాలనే ఉద్దేశంతో తలకు తెల్లరంగు వేసుకున్నాను. దాంతో నేను పెద్దవయసు స్త్రీలా కనిపించాను. ఈ ప్రయత్నం నాకు మంచే చేసింది. నన్ను చూసిన ఆందోళనకారులు పెద్దవయసు స్త్రీగా భావించి.. ఆలయంలోకి వెళ్లేందుకు అడ్డు చెప్పలేదు. దాంతో పోలీసుల సాయం లేకుండానే నేను అయ్యప్పను దర్శించుకున్నాను. ఆలయంలోకి ప్రవేశించిన నేను దాదాపు 2 గంటలపాటు సన్నిధానంలో గడిపానం’టూ చెప్పుకొచ్చారు మంజు. ఈ సమయంలో అఖిల భారత అయ్యప్ప సంఘం సభ్యులు తనకు చాలా సాయం చేశారన్నారు మంజు. అయితే గత ఏడాది అక్టోబరులోనే తాను అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యానని చెప్పారు మంజు. కానీ ఈ సారి మాత్రం దర్శనం చేసుకోగలిగానని సంతోషం వ్యక్తం చేశారు. -
పీరియాడిక్
సమానత్వాన్ని మూటకట్టుకుని ఇరుముడిలా నెత్తి పైనేమీ పెట్టుకోవడం లేదు మహిళలు. ఇరుముడిలోని అసమానత్వాన్ని దేవుడి దగ్గర విడిపించుకోవాలని అనుకుంటున్నారంతే. బిందు, కనకదుర్గే అనుకున్నాం. అంతకుముందు జనవరి ఒకటిన తమిళ సంతతి మలేసియా మహిళలు ముగ్గురు, వాళ్లు కాకుండా మరో నలుగురు కూడా గర్భగుడిలోకి వెళ్లొచ్చినట్లు బయటపడింది. బిందు, కనకదుర్గ వెళ్లొచ్చిన మర్నాడు కూడా శ్రీలంక మహిళొకరు దర్శనం చేసుకుని వచ్చారు. అయితే ఈ పది మందిలో బిందు, కనకదుర్గ తప్ప మిగతా వారెవరూ తాము గుడిలోకి ప్రవేశించినట్లు ఒప్పుకోవడం లేదు. బిందు, దుర్గ యాక్టివిస్టులు కనుక సుప్రీం కోర్టే అనుమతి ఇస్తే అడ్డుకోడానికి మీరెవరు అన్నట్లు చొచ్చుకుని వెళ్లొచ్చారు. ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోయినా వాళ్లు ఇదే పని చేసి ఉండేవారు. స్త్రీ, పురుషులు సమానమన్నది కోర్టు మాత్రమే చెప్పగలిగిన విషయం కాదు. ‘తమరి దగ్గర తక్కెడ ఉంది కదండీ, కాస్త తూచి చెప్పండి.. అటువైపు ఆడ మనిషి, ఇటు వైపు మగ మనిషి.. ఎవరి బరువు ఎక్కువుందో’ అని మనమే వెళ్లి అడిగాం. ‘ఎవరి బరువు ఎంతున్నా, దేవుడి దగ్గర అందరి బరువూ ఒకటే’ అని కోర్టు తీర్పు చెప్పేసింది. చెప్పి, ఊరుకోలేదు. తీర్పుకు విరుద్ధంగా ఏమైనా జరిగితే శిక్ష ఉంటుంది అని కూడా హెచ్చరించింది. తీర్పు కోసం వెళ్లి శిక్షను తూయించుకొచ్చాం! వేరే గ్రహాల్లో మనిషికి బరువుండదు. దైవం దగ్గరా అంతే. స్వర్గం అనేది కూడా ఒక గ్రహమే అని మనం అనుకుంటే. తీర్పు ఒకటుండబట్టి, ఆ తీర్పును గాఢభక్తులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి.. ఒకటి.. రెండు.. మూడూ.. అని దర్శనం చేసుకున్న యాభై ఏళ్ల లోపు మహిళా భక్తుల్ని లెక్కిస్తున్నాం కానీ, తీర్పుకు ముందు సంవత్సరాల్లో మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకుని ఉండరా?! ఇంతకంటే ఎక్కువమందే ఉండి ఉంటారు. పట్టింపు కోసమే దర్శనానికి వచ్చేవాళ్లెవరూ ఉండరు. ఆ ఒకరిద్దరు పంతం కోసమే వచ్చారనుకున్నా.. తీర్పు తర్వాత అయ్యప్ప దర్శనం కోసం ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న యాభై ఏళ్ల లోపు వయసున్న మహిళల సంఖ్య నాలుగు వేలకు పైగానే ఉంది! అంటే, అయ్యప్ప దర్శనభాగ్యం కోసం ఏళ్లుగా మహిళలు ఎదురు చూస్తున్నారనే కదా. ‘ఘనకార్యమా ఇది! వీళ్లేమైనా చంద్రమండలం మీద కాలు మోపారా?’ ఎందుకింత రాస్తున్నారు, ఎందుకింత చూపిస్తున్నారు?’.. అనే ఆగ్రహాలు, ఆవేశాలు శరణు ఘోషలా ప్రకంపిస్తు న్నాయి. ఘనకార్యమే. చంద్రమండలంపైకి వెళ్లడం కన్నా, మండలపూజా దర్శనానికి వెళ్లి రావడం ఘనకార్యమే. చంద్రుడి పైకి వెళ్లడానికి తోడుగా భూలోకపు పంచభూతాలను తీసుకెళతారు. భూలోకంలో ఉన్న ఈ ‘నిషిద్ధ’ భక్తి మండలాన్ని చేరుకోడానికి మహిళలకు అరచేతుల్లో పెట్టుకుని వెళ్లే ప్రాణాలు తప్ప వేరే తోడు ఉండదు. మరి ఊరుకోవచ్చుగా. దర్శనాన్ని కోరుకుంటున్న మనసు ఊరుకోనిస్తుందా? ఇష్టంలేని పనిని చేయవలసి వచ్చినప్పుడు మనసెంత బాధపడుతుందో, ఇష్టమున్న పనిని చేయకుండా ఉండాల్సి వచ్చినప్పుడూ అంతే బాధపడుతుంది. ఇష్టంలేని పనిని ‘చెయ్యి’ అనడం, ఇష్టమున్న పనిని ‘చెయ్యొద్దు’ అనడం.. ‘నేను నీ కన్నా ఎక్కువ’ అనే భావనలోంచి వచ్చే ఆజ్ఞాపనే. స్త్రీ విషయంలో.. ‘నీ ఇష్టం’ అనే మాట మనకింకా రాలేదు. ఇంత భాషొచ్చి, ఇంత కవిత్వం రాసీ.. ఆమె దగ్గర ‘నీ ఇష్టం’ అనే మాట మనకు నోరు తిరగడం లేదు. శబరిమల వెళ్లొచ్చిన మహిళల్ని అభినందిస్తూ.. ‘విక్టరీ కాదు. పీరియడ్ ఇది’.. అన్నారు శోభా డే. చరిత్రలో ఇదొక ‘ఎర్ర’ గుర్తు అని. కచ్చితంగా. బిందు, దుర్గ సాధించిన విజయాన్ని హిస్టారిక్ విక్టరీ అంటే తక్కువ చేసినట్లే అవుతుంది. ‘పీరియాడిక్’ హిస్టరీ ఇది. శోభా డే స్త్రీవాద రచయిత్రి. స్త్రీ జీవితంలో అనివార్యమైన ఎరుపు రంగు గురించి కదా మన అభ్యంతరాలు. వాటిని నవ్వుతూ తవ్వుతారు ఆవిడ. మగవాళ్ల గుండె జారిపోతుంది. మానవ సంతతికి ఎరుపు, తెలుపు రెండూ అవసరమైనప్పుడు తెలుపు కూడా బ్లీడింగే కదా.. అది మాత్రం పవిత్రమై, రెండోది కాకుండా పోతుందా అని శోభా డే సందేహం. సందేహం కాదు. క్లారిటీ అది. సమానత్వ ప్రదర్శనకు దేవుడి గుడే దొరికిందా అనే మాటలో న్యాయం లేదనలేం. అయితే సమానత్వాన్ని మూటకట్టుకుని ఇరుముడిలా నెత్తి పైనేమీ పెట్టుకోవడం లేదు మహిళలు. ఇరుముడిలోని అసమానత్వాన్ని దేవుడి దగ్గర విడిపించుకోవాలని అనుకుంటున్నారంతే. ఆలయాలకు పద్ధతులుంటాయి నిజమే. ఏ ఇంటికి ఆ పద్ధతి ఉన్నప్పుడు, ఏ ఆలయానికి ఆ పద్ధతి ఉండదా! ఇళ్లల్లో కూడా తమ ఇష్టాలను ఇంటి పద్ధతులకు భిన్నంగా నెరవేర్చుకోకుండా ఏమీ లేరు అమ్మాయిలు. స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాటం కాదది. గుండె నిండా ఊపిరి తీసుకునే ప్రయత్నం. స్పేస్ సరిపోవడం లేదనిపిస్తే పద్ధతుల్ని పక్కకు తోసేయడం సహజంగా జరిగే పనే. ∙ -
విషాదయాత్ర
అనంతపురం, కళ్యాణదుర్గం: శబరిమల నుంచి తిరుగుపయనమైన అయ్యప్పభక్తుల కారు తమిళనాడులో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన ఇద్దరు అయ్యప్పమాలధారులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన మున్సిపల్ తాత్కాలిక ఎలక్ట్రీషియన్ మల్లికార్జున, ఆయన కుమారుడు రాఘవేంద్ర, గోపాల్, పాపన్న, ఉమాపతి, మరో ఎలక్ట్రీషియన్ రాఘవేంద్ర, గోవిందప్ప, జైలో కారు డ్రైవర్ మల్లికార్జున ఈ నెల ఒకటో తేదీన శబరిమలకు బయల్దేరి వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. శుక్రవారం తమిళనాడు రాష్ట్రం దిండుగల్ చెక్‌పోస్టు వద్దకు రాగానే స్టీరింగ్ విరగడంతో జైలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గోపాల్ (29), రాఘవేంద్ర (12) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఆరుగురికి గాయాలయ్యాయి. ♦ మృతుడు గోపాల్(29)ది కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామం. ఏడాది క్రితం కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీకి చెందిన వడ్డే కిష్టప్ప కుమార్తె అనూషను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 8 నెలల కుమారుడు ఉన్నాడు. మామగారి ఇంటిలోనే ఉంటూ బేల్దారి పని చేస్తు జీవనం సాగించే వాడు. ♦ మరొక మృతుడు రాఘవేంద్ర (12) తల్లి రెండేళ్ల కిందట చనిపోయింది. తండ్రి మల్లికార్జున (మున్సిపల్ తాత్కలిక ఎలక్ట్రీషియన్) ఆలనా పాలనా చూసుకునేవాడు. తండ్రీకొడుకులిద్దరూ అయ్యప్ప మాలధరించారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందడం అయనను మరింత కుంగదీసింది. ♦ ప్రమాద సమాచారం తెలియగానే ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటినా సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. -
శబరిమలలో శ్రీలంక మహిళకు నో ఎంట్రీ
శబరిమల/తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం విషయంలో మరో వివాదం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు శబరిమల చేరుకున్న శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళను ఆలయ అధికారులు అడ్డుకున్నారు. ఆమెకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించారు. బిందు, కనకదుర్గ అనే మహిళలు బుధవారం అయ్యప్ప సన్నిధికి చేరుకున్న సంగతి తెలిసిందే. నిబంధలనకు విరుద్దంగా స్వామి దీక్ష ముసుగులో నల్లని దుస్తులు ధరించి వారు దర్శనం చేసుకున్నారని అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంతో కేరళ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాగా, మండలదీక్ష ఆచరిస్తున్న శశికళను లోనికి వెళ్లకుండా అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. మెడికల్ సర్టిఫికెట్తో పాటు దర్శనానికి వచ్చినా అనుమతి నిరాకరించటంపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. శశికళను అడ్డుకోవడం పట్ల రాష్ట ప్రభుత్వంపై మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శబరిమలలో కొత్త చరిత్ర వారు చివరి మెట్టును చేరగలిగారు -
ఆ ఇద్దరూ శబరిమలకు ఎలా వెళ్లారు?
దేవుడి సన్నిధే ఒక అలౌకిక అనుభూతి. దాన్ని ఆస్వాదించడానికే ఆలయానికి వెళ్తాం! రుతుచక్ర వయసులో ఉన్న మహిళల శారీరక శుభ్రత ఆధారంగానే అయ్యప్ప దర్శనం ఆడవాళ్లకు ఇవ్వలేదు. రుతుస్రావం ప్రకృతి ఇచ్చిన ప్రత్యుత్పత్తి ప్రక్రియ. అదే లేకపోతే సృష్టే లేదు అనే తర్కంతో దేవుడి దర్శనం కోసం స్త్రీలు ఉద్యమించారు. సాధించారు. నలభై రెండేళ్ల బిందు అమ్మిని, నలభై ఒక్క ఏళ్ల కనకదుర్గ... చట్టం కల్పించిన హక్కును వినియోగించుకున్నారు. ప్యూబర్టీ రాని, మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్లే శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలనే నియమాన్ని సవరించారు. శబరిమల అయ్యప్పను దర్శించుకున్న మొదటి మహిళలు (రుతుక్రమ వయసులో ఉన్న)గా చరిత్ర సృష్టించారు. మొన్న మంగళవారం రాత్రి (ఒకటవ తారీఖు) ఎర్నాకులం నుంచి బయలుదేరి బుధవారం తెల్లవారు జామున శబరిమల ప్రారంభ ప్రాంతమైన పంపానది దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పోలీసుల రక్షణతో శబరిమలకు వెళ్లారు. బుధవారం (రెండో తారీఖు) ఉదయం 3 గంటల 45 నిమిషాలకల్లా ఆలయంలోకి అడుగుపెట్టారు. ఆ ఇద్దరి నేపథ్యం బిందు... ఒక యాక్టివిస్ట్. దళిత్ యాక్టివిస్ట్. కన్నూర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్‌లో ప్రొఫెసర్. చిన్నప్పటి నుంచీ బిందు రెబల్. కాలేజీరోజుల్లో కేరళ విద్యార్థి సంఘటన (వామపక్ష విద్యార్థి సంఘం)నాయకురాలిగా పనిచేశారు. కేరళ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. కమిట్మెంట్కు మరోపేరు ఆమె. జెండర్ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయ పోరాటాల్లో ముందున్నారు. ఆ విషయాల మీద ఆమె ఇచ్చే ఉపన్యాసాలు వినడం కోసం కేరళలో స్టూడెంట్స్ చెవి కోసుకుంటారు. బిందు వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ పొలిటికల్ యాక్టివిస్ట్ హరిరన్ ఆమె భర్త. వాళ్లకు పదకొండేళ్ల కూతురు ఓల్గా. కోజీకోడ్ జిల్లాలోని పోక్కాడ్ ఆమె నివాసం. కనకదుర్గ.. ఓ భక్తురాలు ... కనకదుర్గ నాయర్ కేరళ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఉద్యోగి. భర్త ఉన్ని కృష్ణన్. ఇంజనీర్. వాళ్లకు ఇద్దరు పిల్లలు. మలప్పరంలో ఉంటారు. ఓ భక్తురాలిగా శబరిమల దర్శనానికి వెళ్లాలనుకున్నారు. బిందు, కనకదుర్గ ఎలా కలిశారు? సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ స్త్రీల ఆలయ ప్రవేశానికి ఇతరత్రా తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే సరికి రహస్యంగా ప్రణాళికలు వేసుకోవాల్సి వచ్చింది. ఆసక్తి ఉన్న మహిళలు కొంత మంది ‘నవోథన కేరళం శబరిమలయిలెక్కు’ అనే ఒక ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేశారు. అలా బిందు, కనకదుర్గ ఒకరికొకరు పరిచయం అయ్యారు. డిసెంబర్ 24న మొదటి ప్రయత్నం చేశారు. ఆలయంలో ఆడవాళ్లకు ప్రవేశం లేదు అని గట్టిగా నమ్మే వారి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆ దాడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులు సహా పోలీసులు, మీడియా కంట కూడా పడకుండా ఓ వారం రోజుల పాటు రహస్యంగా ఉండి ఈ నెల ఒకటవ తారీఖున మళ్లీ ప్రయత్నించారు. అలా దైవ దర్శనం సాధించారు. ‘‘దర్శనం అయ్యేదాకా కదిలేది లేదని చాలా మొండిగా ఉన్నాం. దాంతో పోలీసులకు సెక్యూరిటీ కల్పించక తప్పలేదు’’ అని చెప్పారు బిందు. ప్రవేశం కోసం ఇప్పటివరకు ప్రయత్నించిన మహిళలు గుడి తలుపులు తెరిచినప్పటి నుంచి కనీసం పదమూడు మంది మహిళలు దర్శనం కోసం శబరిమల బాట పట్టారు. నీలక్కల్ బేస్‌క్యాంప్ దాకా రాగలిగారు. తర్వాత హేళనకు, హెచ్చరికలకు, దాడులకు గురయ్యి బలవంతంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అలా విఫలయత్నం చేసిన మహిళల్లో మొదటి వ్యక్తి సీఎస్ లిబి. అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నాను అని ఫేస్బుక్లో పోస్ట్‌చేసి మరీ బయలుదేరిన లిబిని గుడికి 65 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకున్నారు వ్యతిరేకులు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలభై ఏళ్ల మాధవిని పంబ నుంచి వెనక్కి పంపించేశారు భక్తులు. ఢిల్లీకి చెందిన సుహాసినీ రాజ్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ రిపోర్టర్ కవితా జక్కల్ ‘వాలియ నడప్పాంధాల్’ క్యూకాంప్లెక్స్ వరకూ వెళ్లగలిగింది. కవితాతో కలిసి వెళ్లిన మరో యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా. ఇతర భక్తులు, ఆడవాళ్ల ఎంట్రీని వ్యతిరేకిస్తున్న వాళ్లు గనుక అడ్డుకోకపోయి ఉంటే రెహాన ఫాతిమా చరిత్ర సృష్టించి ఉండేది. రెహానా మీద ఆగ్రహం ఆమెను వెనక్కి పంపించేంత వరకే ఆగలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిని ధ్వంసం చేసేదాకా సాగింది. అంతేకాదు మతసంబంధమైన నమ్మకాలను కించపరిచిందని రెహానా మీద కేసూ నమోదు చేశారు. ఆ తర్వాత మేరీ స్వీటీ అనే తిరువనంతపురం వాసి యత్నమూ ఫలించలేదు. అనంతరం వచ్చిన ఆరుగురు మహిళలనూ అడ్డగించారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 47 ఏళ్ల బాలమ్మ అనే మహిళ వెళ్లింది. నడప్పాంధాల్లో ఆమెనూ అడ్డుకున్నారు భక్తులు. -
కేరళలో ఉద్రిక్తంగా మారిన బంద్
-
శబరిమలపై బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలను అనుమతించడం మంచి నిర్ణయమని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ సమర్ధించారు. లింగ సమానత్వం సాధించే దిశగా ఇది ముందడుగు వంటిదని అన్నారు. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ఆరెస్సెస్, బీజేపీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పరిసంఘ్ చైర్మన్‌గా తాను వ్యక్తిగత హోదాలో అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశాన్ని సమర్ధిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. పురుషుడి పుట్టుకకు మూలమైన స్ర్తీ అపవిత్రురాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. భగవంతుడు సర్వాంతర్యామి అంటే ఆలయం వెలుపలా దేవుడు ఉంటాడని, రాజ్యాంగం దృష్టిలో మహిళలు, పురుషులూ సమానమేనని ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. సంప్రదాయాలు కాలానుగుణంగా మారుతాయని, గతంలో బాల్య వివాహాలు, సతీసహగమనం సైతం దేశంలో సంప్రదాయాలుగా ఉండేవని తదనంతరం మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. కాగా, అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్యకు ఉదిత్ రాజ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. -
‘శబరిమలను ఘర్షణ జోన్‌గా మార్చారు’
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి బుధవారం ప్రవేశించిన ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయంలోకి వచ్చిన మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యతని, రాజ్యాంగ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించిందని చెప్పారు. శబరిమలను ఘర్షణ జోన్‌గా మలిచేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రేరేపించే హింసను కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. శబరిమలలోకి ఇద్దరు మహిళల ప్రవేశం నేపథ్యంలో సెక్రటేరియట్ ఎదుట బీజేపీ, సీపీఎం కార్యకర్తలు బాహాబాహీకి తలపడటంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయు గోళాలు ప్రయోగించిన క్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఘటన నేపథ్యంలో ఆందోళనకారులు ఏడు పోలీస్ వాహనాలు, 79 కేఎస్ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని, 39 మంది పోలీసులపై దాడులకు తెగబడ్డారని సీఎం వెల్లడించారు. అల్లరి మూకలు మహిళలపై దాడులకు పాల్పడ్డాయని, మహిళా మీడియా ప్రతినిధులపైనా దాడికి దిగారని చెప్పారు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి నిరసనగా బంద్ చేయడమంటే సుప్రీం కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకించడమేనని వ్యాఖ్యానించారు. కాగా కేరళలో శబరిమల కర్మ సమితి పేరుతో హిందూ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా 12 గంటల హర్తాళ్‌కు పిలుపు ఇచ్చాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు మూడు నెలల కిందట ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కనకదుర్గ (44), బిందు (42) అనే ఇద్దరు మహిళలు అన్ని అడ్డంకులు, కట్టుబాట్లను అధిగమిస్తూ ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. వీరి ఆలయ ప్రవేశంపై హిందూ సంఘాలు, బీజేపీ, ఆరెస్సెస్ భగ్గుమంటున్నాయి. -
శబరిమల ఎఫెక్ట్..! చెన్నైలోని కేరళ హోటల్‌పై దాడి
సాక్షి, చెన్నై : చెన్నైలోని కేరళ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెందిన ఓ హోటల్‌పై దాడి జరిగింది. థౌజండ్ నైట్లోని గ్రీమ్స్ రోడ్డులో గల హోటల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి 10.40 ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో హోటల్ అద్దాలు, సెక్యురిటీ చెక్‌పోస్టు ధ్వంసమయ్యాయి. కాగా, శమరిమల ఆలయంలోకి బుధవారం ఇద్దరు మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హిందుత్వవాదుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేసథ్యంలోనే కేరళ ప్రభుత్వ హోటల్‌పై దాడి జరిగి ఉండొచ్చని ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. (మహిళల ఆలయ ప్రవేశం.. కేరళలో తీవ్ర ఉద్రిక్తత) సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని, నిందితులని పట్టుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని కేరళ ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా 100 మంది పోలీసులను నియమించామని చెప్పారు. ఇదిలాఉండగా.. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ సహా పలు హిందూ సంఘాలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చాయి. అన్ని వయసుల స్త్రీలకు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి విదితమే. -
శబరిమల ఆలయంలోకి మహిళలు
-
మహిళల ప్రవేశం.. ఆలయం మూసివేత
తిరువనంతపురం : శబరిమల ఆలయ ప్రవేశంపై మహిళల పంతం నెగ్గింది. 50ఏళ్ల కన్న తక్కువ వయసు ఉన్న ఇద్దరు మహిళలు బుధవారం శబరిమల ఆలయ ప్రవేశం చేశారు. అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్ల లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి. బుధవారం తెల్లవారు జామున3.45 గంటల ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు హహిళలు అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.(అన్ని వయసుల వారికి అనుమతి) పోలీసుల సంరక్షణలో బిందు, కనకదుర్గ నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ బయటకు వచ్చి కేరింతలు కొడుతూ అయప్ప స్వామిని దర్శించుకున్నామని ఆనందంగా చెప్పారు. వీరిద్దరూ అయ్యప్పను దర్శించుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళలుగా(50ఏళ్లలోపు) వీరు చరిత్రకెక్కారు. ఆలయ మూసివేత ఇద్దరు మహిళా భక్తులు శబరిమల ఆలయంలోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని ఆలయాన్ని మూసివేశారు. శుద్ది చేసిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తామని ప్రధాన పూజారి చెప్పారు. భక్తుల కళ్లు కప్పి మహిళలు ఆలయంలోకి ప్రవేశించారన్నారు. పోలీసుల సహకారంతో అయప్ప స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. మహిళల ప్రవేశాన్ని అయప్ప భక్తులు, సాంప్రదాయవాదులు తప్పుబట్టారు. అలయంలో అపచారం జరిగిందని గుడిని మూసివేశారు. సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తామని చెబుతున్నారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12.40గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. 12.40గంటల తర్వాత ప్రత్యేక పూజలు చేసి, ఒంటి గంటకు భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. మరో వైపు మహిళల ప్రవేశం నిజమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేయడంతో సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల మహిళలు ప్రవేశించకుండా దశబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సెప్టెంబరు 28ను సుప్పీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పుతో కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు అయ్యప్ప భక్తులు నిరసనలు చేపట్టారు. ఇటీవల కొంత మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా.. వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు భద్రత కల్పించినప్పటికీ భక్తులు మహిళలను ఆలయంలోకి వెళ్లనివ్వలేదు. అయితే ఈ సారి ఎలాంటి ఘర్షనలు లేకుండా నిశ్శబ్దంగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.(శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు) -
2018.. కేరళను ముంచెత్తిన వరదలు
2018 ఆరంభంలో చప్పగా సాగినప్పటికీ చివరికొచ్చే సరికి దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. పలు రాష్ట్రాల శాసనసభకు జరిగిన ఎన్నికలు, 2019 సంవత్సరం అత్యంత ఆసక్తికర సన్నివేశాలకు శ్రీకారం చుట్టనుంది. సీబీఐలో జగడం, సుప్రీం జడ్జీల మధ్య వివాదం... పలు రాష్ట్రాల్లో ప్రజా తీర్పులు... 2018 ని ఒక్కసారి తరిచి చూస్తే.... (సాక్షి రౌండప్) థియేటర్లలో జాతీయ గీతం (జనవరి 9) సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు జనవరి 9న స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో చలనచిత్ర ప్రదర్శనకు ముందుగా జాతీయగీతం పాడటం తప్పనిసరని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడాలని 2016 నవంబర్ 30 న ఇచ్చిన ఆదేశాలను తదనుగుణంగా మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల మంత్రివర్గ కమిటీ సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. సుప్రీంకోర్టులో సంక్షోభం (జనవరి 12) దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా నలుగురు సీనియర్ న్యాయముర్తులు మీడియా ముందుకు వచ్చారు. సీజేఐ తీరును ఆక్షేపిస్తూ సీనియర్ జడ్జిలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. కొద్ది నెలలుగా కోర్టు పాలన వ్యవస్థలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సంధించిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కీలక కేసుల కేటాయింపుల విషయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై ఆరోపణలు సంధించారు. కావేరీ జలాలపై కీలక తీర్పు (ఫిబ్రవరి 16) తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఇచ్చింది. కమల్ హాసన్ కొత్త పార్టీ (ఫిబ్రవరి 21) ప్రఖ్యాత హీరో కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మధురైలో తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. ‘మక్కల్ నీది మయ్యం’ (ప్రజా న్యాయ వేదిక) పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నట్లు ప్రకటించి ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం (మార్చి09) సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ (48) ప్రమాణం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 35 స్థానాలు గెలుచుకుని సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం సంపాదించుకుంది. బీజేపీ భాగస్వామ్య పార్టీ అయిన ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) 8 సీట్లు గెలుచుకుంది. సీపీఎం కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 39 మందిని చంపిన ఉగ్రవాదులు (మార్చి 20) ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం( జూన్ 15, 2014) ఐఎస్ ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది మరణించారని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్ పట్టణ సమీపంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. సల్మాన్‌కు ఐదేళ్ల జైలు (ఏప్రిల్ 5) కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (52)కు ఐదేళ్లు జైలు శిక్ష పడింది. సల్మాన్‌ను దోషిగా నిర్దారిస్తూ జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. హమ్ సాథ్ హై షూటింగ్ సమయంలో (1998) రాజస్తాన్‌లోని కంకిణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని సల్మాన్ కాల్చి చంపారని కేసు నమోదైంది. కర్ణాటకలో కొలువుతీరిన సంకీర్ణం (మే 15) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 78 స్ధానాలను హస్తగతం చేసుకోగా, జేడీఎస్ 37 స్ధానాల్లో గెలుపొందింది. అయితే జేడీఎస్-కాంగ్రెస్ కూటమిగా ఏర్పడటంతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. స్టెరిలైట్ ఆందోళనలు హింసాత్మకం (మే 23) స్టెరిలైట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా తమిళనాడులో వంద రోజుల పాటు సాగిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. తూత్తుకుడి ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించగా, 60 మందికి గాయాలయ్యాయి. దుమ్ము తుపాన్‌తో 17 మంది మృతి (జూన్ -3) యూపీలో చెలరేగిన దుమ్ము తుఫానులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుపాన్ దాటికి 24 గంటల్లోనే 13 మంది చనిపోయారు. సీతాపూర్ జిల్లాలో ఆరుగురు, గొండాలో ముగ్గురు, కౌశాంబిలో ఇద్దరు చనిపోగా, ఫైజాబాద్, హర్డొయ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీని ప్రభావంతో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. లోయలో బస్పులో... 48 మంది మృతి (జూలై 1) ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలో అదుపుతప్పిన ఓ ప్రైవేటు బస్సు 200 మీటర్ల లోయలో పడటంతో 48 మంది మరణించారు. 28 సీట్లుండే బస్సులో 58 మంది ప్రయాణించడంతో ప్రమాదం సంభవించింది. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు (జూలై 18) శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయ్యప్ప ఆలయంలో మహిళలు కూడా పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పును పలు రాజకీయ పార్టీలు, మహిళా, ప్రజా సంఘాలు స్వాగతించగా.. సంప్రదాయవాదులు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. కరుణానిధి అస్తమయం (ఆగస్ట్ 7) డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి (94) మరణంతో యావత్ తమిళనాడు శోకసంద్రంలో మునిగింది. ద్రవిడ రాజకీయాలపై చెరగని ముద్రవేసిన దిగ్గజం సెలవంటూ అనంతలోకాలకు తరలింది. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన కరుణానిధికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. కేరళను కుదిపిన భారీ వర్షాలు (ఆగస్ట్ 8) కేరళను భారీ వర్షాలు కుదిపివేశాయి. తీరప్రాంతాన్ని ముంచెత్తిన వరదల్లో 26 మంది మరణించారు. వరద తాకిడికి 24 డ్యాముల గేట్లు ఎత్తివేశారు. కనీవినీ ఎరుగని వరదలతో 26 ఏళ్ల తర్వాత చెరుతోని డ్యాం గేట్లు తెరుచుకున్నాయి. వాజ్‌పేయి కన్నుమూత (ఆగస్టు 16) మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత అటల్ బీహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వాజ్‌పేయి మరణంతో యావత్‌దేశం శోకసంద్రంలో మునిగింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు వారం రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించాయి. స్వలింగ సంపర్కం నేరం కాదు (సెప్టెంబర్ 6) స్పలింగ సంపర్కం ఇక నేరం కాదని సెక్షన్ 377పై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సెక్షన్ 377తో సమానత్వపు హక్కుకు విఘాతమని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. మేజర్ల మధ్య పరస్పర అంగీకారంతో శృంగారం చేసుకోవడం నేరం కాదని పేర్కొంది. సీబీఐలో జగడం (అక్టోబర్ 24) సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలపై కేంద్రం వేటు వేసింది. కీచులాటలతో దర్యాప్తు ఏజెన్సీని దిగజార్చినందుకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాలకు కత్తెర వేసి ఆయనను సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. అయోధ్య వివాదంపై విచారణ..!! (అక్టోబర్ 29) అయోధ్య వివాదంపై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2019 జనవరిలో తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం ఈ కేసు విచారణ తేదీలను ఖరారు చేస్తుందని తెలిపింది. పటేల్ విగ్రహావిష్కరణ (అక్టోబర్ 31) భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ 143 వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 182 మీటర్ల (597అడుగులు) పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యాంక్ సమీపంలో సాధజెట్ అనే దీవిలో ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అని నామకరణం చేశారు. శబరిమల తీర్పు నిలిపివేతకు నో (నవంబర్ 13) శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రివ్యూ పిటిషన్లు జనవరి 22న విచారిస్తామని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు (నవంబర్ 21) జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీడీపీ - కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సెమీఫైనల్స్‌లో సత్తా చాటిన కాంగ్రెస్ (డిసెంబర్ 11) సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా పరిగణించిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టగా, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పాలక బీజేపీకి భంగపాటు ఎదురైంది. కీలక హిందీ రాష్ట్రాల్లో పట్టుసాధించిన కాంగ్రెస్ మూడు చోట్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి పాలన షురూ.. (డిసెంబర్ 20) డిసెంబర్ 19 అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. జూన్‌లో విధించిన గవర్నర్ పాలన డిసెంబర్ 19తో ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపారు. దీనికి కేంద్ర మంత్రివర్గంతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేశారు. -
ఒక్కటైనారు ముక్కోటి భక్తులు
దేవుడి కోసం ఇంతలా ఎప్పుడూ భక్తులు తపించి పోలేదు. అయోధ్య రాముడి కోసం రాజకీయ భక్తులు, శబరిమల అయ్యప్ప కోసం కోర్టు తీర్పు భక్తులు, షిర్డీ సాయి కోసం న్యూ ఇయర్ భక్తులు, తిరుమల శ్రీవారి కోసం బలవన్విరమణ అర్చక భక్తులు.. వీళ్లంతా క్రిస్మస్ తాత మోసుకొచ్చే కానుకల మూట కోసం నిన్న మొన్నటి వరకు ఎదురు చూసిన పసి పిల్లల్లా ఆశగా వేచి ఉన్నారు. జీసస్.. ఇంత మంచి భక్తిమాసం ఎప్పుడైనా వచ్చిందా! వెచ్చని చలి అని కాదు. కేకు ముక్కల్లో మగ్గిన తియ్యని ద్రాక్ష పరిమళం అని కాదు. ముక్కోటి దేవతలు కదా ఎప్పుడూ ఒక్కటవుతారు. ఈ డిసెంబరులో ముక్కోటి భక్తులు ఏకమయ్యారు. ఎవరి దర్శనం కోసం వాళ్లు. ఎవరి విజ్ఞప్తుల కోసం వాళ్లు. ఎవరి తీర్పుల కోసం వాళ్లు. దేశమంతటా భువి నుంచి దివికి వెలుగులు విరజిమ్మే వేడుకల తోరణాలే! రంగురంగుల వేడుకోళ్ల వినతి పత్రాలే! షిర్డీలో ఈ ఏడాది ‘న్యూ ఇయర్ దర్శనాలు’ వారం ముందుగానే.. నిన్న క్రిస్మస్ రోజున మొదలయ్యాయి. ఇకనుంచి ఇదే సంప్రదాయం. ఏటా డిసెంబర్ 31–జనవరి 1 మధ్య ఉండే ఇరవై నాలుగు గంటల వ్యవధి భక్తుల దర్శనానికి మరీ ఇరుకైపోవడంతో ఆలయ సీఈవో రుబల్ అగర్వాల్ దర్శనభాగ్యాన్ని ఏడు ‘ఇరవై నాలుగు గంటల నిడివి’కి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్రిస్మస్ నుంచి జనవరి ఫస్ట్ వరకు జరిగే ఈ దర్శనోత్సవాలకు ‘షిర్డీ ఫెస్టివల్’ అని పేరు పెట్టారు. ఆలయ ప్రాంగణంలో సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రథమ దర్శనోత్సవాలకు ఒడిశా నుంచి సుబ్రత్, నాశిక్ నుంచి వినయ కులకర్ణి, కర్ణాటక నుంచి అనిల్‌కుమార్ మిస్కిన్, షిర్డీ గాయకుడు సుధాంశు లోకేగావ్కర్, ముంబై నుంచి రవీంద్ర పింగ్లే వస్తున్నారు. ‘స్వరాంజలి సంగీతం బృందం’ ముంబై నుంచి ఇప్పటికే షిర్డీ చేరుకుంది. వీళ్లే కాదు, భక్తుల ‘ఆరగింపు సేవ’కు కొత్త సోలార్ కిచెన్ పొగలు కక్కుతూ ఉంది. అటువైపున శబరిమలకు కూడా ఈ డిసెంబరులో భక్తుల తాకిడి ఎక్కువైంది. అయితే అది కోర్టు కారణంగా కొత్తగా తయారైన భక్తుల తాకిడి మాత్రమేనని అనుకోవాలి. వారి సౌకర్యార్థం ‘ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు’ తను చేయగలిగింది చేస్తున్నప్పటికీ, ‘పంబ’లో మకాం వేసిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి.కార్తికేయన్ అంతకుమించే చేయవలసి వస్తోంది. ఆదివారం మదురై బయల్దేరి, మధ్యలో శబరిమల దర్శనానికి వచ్చిన యాభై ఏళ్లలోపు మహిళా భక్తులు పదకొండు మందిని.. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న భక్తులు అడ్డగించడంతో కార్తికేయన్ అండ్ టీమ్ సురక్షితంగా వెనక్కు పంపించవలసి వచ్చింది. పట్టింపుల భక్తులకు, పంతంపట్టి వస్తున్న భక్తులకు మధ్య ఘర్షణ.. సంక్రాంతి వచ్చిపోతే కానీ సమసిపోయేలా లేదు. ఢిల్లీలో కూడా డిసెంబర్ ఎప్పుడూ ఇంత ‘వేడి’గా లేదు. సుప్రీంకోర్టు ముందు గొంతుక్కూర్చుని తీర్పు కోసం ఎదురుచూస్తున్న అయోధ్య భక్తుల నిరసన నిట్టూర్పులు ఈ క్లైమేట్ ఛేంజ్‌కి కారణం. అయితే ఆలయ నిర్మాణానికి భక్తులు త్వరపడుతున్నంతగా జడ్జీలు హైరానా పడడం లేదు. అక్టోబర్‌లో ఫైల్ టేబుల్ మీదకు వచ్చినప్పుడు, ఆ ఫైల్ని జనవరి మొదటి వారంలోకి గిరాటు వేశారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. మొదటి వారంలో కూడా ఏ డేటో చెప్పలేదు. మొన్న డిసెంబర్ 24న డేటొచ్చింది జనవరి 4న అని. ‘ఇదంతా కాదు. వెంటనే ఆర్డినెన్స్ తెచ్చి, అయోధ్యలో రామాలయ నిర్మాణం మొదలుపెట్టాలి’ అని ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భాగవత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అడుక్కోవాల్సి వస్తోంది. రామాలయం మా హక్కు కాదా’ అని ఆర్.ఎస్.ఎస్. కార్యదర్శి భయ్యాజీ జోషీ ఆవేదన చెందుతున్నారు. ‘ఆలయ నిర్మాణానికి ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తామేమిటో చూపిస్తారు’ అని వి.హెచ్.పి. వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ హెచ్చరిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చెయ్యడానికి, ఆవేదన చెందడానికి, హెచ్చరించడానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అవకాశం లేదు కాబట్టి, ‘అంతే కదా. రామాలయ నిర్మాణం జాతి ప్రజల అభిమతం కదా. బీజేపీ ఉన్నది అందుకే కదా’ అని మాత్రం అనగలుగుతున్నారు. ‘బీజేపీ మాత్రమే రామాలయాన్ని నిర్మించగలదు. వేరెవ్వరూ నిర్మించలేరు’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ అంటున్నారు. సాధ్యాసాధ్యాలను చూడనివ్వదు కదా భక్తి పారవశ్యం! జనవరి 4న అని కోర్టు ఇచ్చిన తేదీ ‘తుది తీర్పు’ ఇవ్వడం కోసం కాదు. కనీసం వాదోపవాదాలను వినడానికీ కాదు. ఎప్పటి నుంచి ‘తను వింటుందో’ ఆ తేదీ చెప్పడం కోసం. అయోధ్యలోని ఆ 2.77 ఎకరాల వివాదా స్పద స్థలం ఎవరిదన్నది తేల్చి చెప్పడానికి కోర్టు 16 పిటిషన్లను విచారించవలసి ఉంది. అవన్నీ హిందూ భక్తులవి, ముస్లిం భక్తులవి. అలా రామభక్తులు సుప్రీంకోర్టు వైపు చూస్తుంటే, ఇక్కడ తిరుమల వారసత్వ అర్చక భక్తులు ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ) .. కోర్టు తీర్పుపై ఎలా స్పందిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. టీటీడీలో సాధారణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు (65 ఏళ్లు) నిబంధన టీటీడీలో వారత్వంగా ఉన్న అర్చకులకు వర్తించదని హైదరాబాద్ హైకోర్టు ఈ నెల 14న తీర్పు చెప్పింది. తీర్పుకు కారణం ఉంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వారసత్వ అర్చకులుగా ఉన్న శేషాద్రిని, మురళిని అరవై ఐదేళ్లు నిండిన కారణంగా విధుల్లోంచి విరమింప చేస్తున్నట్లు ఈ ఏడాది జూన్‌లో టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. (తిరుచానూరు ఆలయ నిర్వహణ కూడా టీటీడీ కిందికే వస్తుంది). టీటీడీ పరిధిలో ఇలా వారసత్వ అర్చకత్వంలో నాలుగు కుటుంబాలు ఉన్నాయి. వాటిల్లో టీటీడీ ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులు కుటుంబం కూడా ఒకటి. టీటీడీ ఇచ్చిన పదవీ విరమణ ఉత్తర్వులపై శేషాద్రి, మురళి కోర్టును ఆశ్రయించిన ఈ కేసులోనే.. టీటీడీ తీర్మానాలు ఇలా ప్రత్యేకమైన కేటగిరీలో ఉన్న అర్చకులకు వర్తించవు అని కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పును శిరసావహించి ఆ ఇద్దరినీ, వారితో పాటు తన రిటైర్మెంట్ రూల్స్ పరిధిలోకి వచ్చిన రమణ దీక్షితుల్ని టీటీడీ తిరిగి తీసుకుంటుందా, లేక తను కూడా వాదన మొదలు పెడుతుందా? ఇప్పటికింకా నిర్ణయమైతే జరగలేదు. దేవుడి కోసం ఇంతలా ఎప్పుడూ భక్తులు తపించి పోలేదు. అయోధ్య రాముడి కోసం రాజకీయ భక్తులు, శబరిమల అయ్యప్ప కోసం కోర్టు తీర్పు భక్తులు, షిర్డీ సాయి కోసం న్యూ ఇయర్ భక్తులు, తిరుమల శ్రీవారి కోసం బలవన్విరమణ అర్చక భక్తులు.. వీళ్లంతా క్రిస్మస్ తాత మోసుకొచ్చే కానుకల మూట కోసం నిన్న మొన్నటి వరకు ఎదురు చూసిన పసి పిల్లల్లా ఆశగా వేచి ఉన్నారు. అందరికీ అన్నీ లభించాలి. అగునుగాక. తథాస్తు. ఆమెన్. ∙మాధవ్ శింగరాజు ∙ -
శబరిమల చేరుకున్న మహిళలు..ఉద్రిక్తం
తిరువనంతపురం: మహిళల రాకతో శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా తాము అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చామని తమిళనాడుకు చెందిన 11 మంది ‘మనితి’ బృందసభ్యులు పంబా బేస్ క్యాంపు దగ్గరకు చేరుకున్నారు. మరోవైపు వారంతా నిషేధిత వయస్సు (50 ఏళ్లలోపు) మహిళలు కావడంతో అయ్యప్ప భక్తులు వారిని అడ్డుకున్నారు. మహిళలు కొండపైకి రావడానికి వీళ్లేదని, వారి వద్దనున్న ఇరుముడిని భక్తులు లాకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్వామిని దర్శించుకునే హక్కు తమకు న్యాయస్థానం కల్పించిందని, దర్శనం తరువాతనే తాము ఇక్కడినుంచి తిరిగి వెళ్తామని మహిళలు భీష్మించుకుని కూర్చున్నారు. భక్తులు, మహిళల ఆందోళనతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా చేరుకుని, భక్తుల డిమాండ్ మేరకు 50 ఏళ్లు నిండిన మహిళలనే ఆలయంలోకి అనుమతిస్తామని అంటున్నారు. కాగా మనితి బృందానికి చెందిన కొందరూ మహిళలు నాలుగు గ్రూపులుగా పంబా క్యాంపు వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్దకు మహిళలు వస్తున్నారని సమాచారం అందడంతో భక్తులు పెద్దఎత్తున అక్కడి చేరుకుని వారిని కొండపైకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. -
ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేస్తున్నారు!
శబరిమలకు వెళ్లే ముందు కొందరు ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని నటి రంజిత ఆవేదనను వ్యక్తం చేశారు. ఈమె శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశానికి స్త్రీలను అనుమతించడాన్ని ఆమె వ్యతిరేకించారు. తమిళంలో ముదల్ మర్యాదై చిత్రాల్లో నటించిన రంజిత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటోంది. ఇటీవల శబరిమలకు వెళ్లడానికి మహిళలు అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో శబరిమల అయ్యప్ప దేవాలయం వద్ద పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా మంది మహిళలు తాము అయ్యప్ప దర్శనం చేసుకునే తీరరతామని బయలుదేరడంతో అక్కడ వాతావరణం రణరంగంగా మారింది. ఈ పరిస్థితుల్లో కొందరు మహిళలు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ శబరిమలకు వెళ్లడానికి వేచి చూస్తాం.. అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అందులో నటి రంజిత కూడా సభ్యురాలిగా ఉన్నారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో శబరిమల ప్రాంతంలో ఒక వ్యక్తి ఒంటికి నిప్పంటించుకోవడం వల్ల అక్కడ పరిస్థితులు మళ్లీ సమస్యగా మారాయని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఆలయం వద్ద అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, భక్తులకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో నిజమైన భక్తులకు స్వామి దర్శనం చేసుకోలేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఆ మధ్య రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆమె సమర్థించారు. దీంతో కొందరు మహిళలు.. ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. మరి కొందరు శబరిమలకు వెళ్లే ముందు తన ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని, ఈ చర్యలు క్రిమినల్ కేసు కిందకు రావా? అంటూ నటి రంజిత శనివారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేస్తూ వాపోయారు. -
స్థానిక ఎన్నికల్లో ఎల్డీఎఫ్ హవా
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని 14 జిల్లాల పరిధిలో స్థానిక సంఘాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 39 సీట్లకు ఎన్నికలు జరగ్గా వాటిలో 21 సీట్లను పాలకపక్ష ఎల్డీఎఫ్ గెలుచుకోగా, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ 12 సీట్లను గెలుచుకొంది. ఇక బీజేపీకి రెండు సీట్లు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ)కు రెండు సీట్లు, స్వతంత్ర అభ్యర్థులు రెండు సీట్లు వచ్చాయి. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న పినరాయి విజయన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఫలితాలు రావడం విశేషం. ముఖ్యంగా శబరిమల ఆలయం ఉన్న పట్టణంమిట్ట జిల్లాలోని రెండు సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని భావించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆరోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ, ఆరెస్సెస్ వర్గాలు భారీ నిరసన ప్రదర్శనలను నిర్వహించాయి. అయినప్పటికీ ఈ రెండు సీట్లలో ఒక సీటులో స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించగా, మరో సీటును ఎస్డీపీఐ అభ్యర్థి గెలుచుకున్నారు. అలప్పూజ జిల్లాలో మాత్రమే రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది. -
ఇక వారిని ‘అయ్యప్పే ఆదుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ‘అప్పుడు నాకు పాతికేళ్లు. యవ్వనంతో దృఢంగా ఉన్నా. సైన్యంలో చేరేందుకు కసరత్తు చేసి బలంగా తయారయ్యాను. అయినప్పటికీ సైన్యం శారీర దారుఢ్య పరీక్షలో పాస్‌కాలేక పోయాను. కొల్లాం జిల్లా పునలూరులోని మా గ్రామానికి వచ్చి పడ్డాను. ఇక చాలు, వచ్చి నా ఉద్యోగంలో చేరంటూ నా తండ్రి ఆదేశించాడు. చేసేదేమీలేక పుణ్యమూ, పురుషార్థమూ రెండూ దక్కుతాయనుకొని వచ్చి ఈ వృత్తిలో చేరాను. ఇప్పుడు నాకు 53 ఏళ్లు. దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కొండలెక్కేటప్పుడు భరించలేని ఒళ్లు నొప్పులు వస్తాయి. పంటి బిగువున నొప్పిని భరిస్తాను. అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. విశ్రాంత వేళలో కూడా కీళ్ల నొప్పులు, వెన్నుముక నొప్పి వేధిస్తాయి. ప్రతి రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకొనిదే నిద్రరాదు’ శబరిమల ఆలయం వద్ద డోలి సర్వీసులో పనిచేసే సత్యన్ తెలిపారు. ఇక్కడ డోలి అంటే రెండు కర్రల మధ్య ఓ వెదురు కుర్చీని బిగిస్తారు. ఆ వెదురు కుర్చీలో భక్తులను కూర్చో బెట్టుకొని నలుగురు కూలీలు తీసుకెళ్లడమే డోలీ సర్వీసు. దానిలో భక్తులను పంబా నది నుంచి నాలుగు కి లోమీటర్ల దూరంలోని సన్నిధానం అయ్యప్ప ఆలయానికి తీసుకెళతారు. సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తులో సన్నిధానం ఉంది. అక్కడికి భక్తులు చెప్పులకు పాదరక్షలు లేకుండా అడ్డదిడ్డంగా ఉండే అటవి బాటలో వెళ్లాల్సి ఉండేది. శారీరకంగా బలహీనంగా ఉండే భక్తులకు అలా వెళ్లడం కష్టం కనుక 1966లో కేవలం పది డోలీలతో ఈ సర్సీసు ప్రారంభమైంది. అప్పటి ‘ట్రావన్‌కోర్ దేవసం బోర్డు’ చైర్మన్ ప్రక్కులం భాసి ఈ డోలి సర్వీసును ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డు ఆధ్వర్యంలోనే ఈ డోలి సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం 500 డోలీలు ఉండగా, వాటిని లాగేందుకు 2000 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కో భక్తుడి నుంచి డోలీ సర్వీసు కింద 4,200 రూపాయలను వసూలు చేస్తారు. అందులో 200 రూపాయలు దేవసం బోర్డుకు వెళుతుంది. నాలుగు వేల రూపాయలను నలుగురు కూలీలు సమంగా పంచుకోవాలి. సీజన్లో ఒక్కో కూలీకి 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సీజనంటే ప్రస్తుతం నడుస్తున్న మండల సీజన్. ఈ సీజన్లో 41 రోజులు అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. ఇది మలయాళం క్యాలండర్ ప్రకారం వృశ్చిక మాసంలో వస్తుంది. ఆ తర్వాత మకరవిలక్కసు సీజన్ వస్తుంది. అదో 20 రోజులు, రెండు సీజన్లు కలిసి 61 రోజులు ఆలయం తెరచి ఉంటుంది. ఈ సీజన్లోనే డోలీ కూలీలకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మొత్తం ఏడాదిలో 126 రోజులు మాత్రమే అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. డోలీ కూలీలు బస్టాండుకు వెళ్లి భక్తులను అక్కడే ఎక్కించుకొని పంబా నది తీరానికి రావాలి. నదిలో స్నానమాచరించాక మళ్లీ వారిని ఎక్కించుకొని కొండపైన అయ్యప్ప ఆలయానికి తీసుకెళ్లాలి. ఆ భక్తులే అదే రోజు వెనక్కి వస్తానంటే తీసుకరావాలి. మరుసటి రోజు వస్తానంటే మరుసటి రోజే తీసుకరావాల్సి ఉంటుంది. వారు భక్తులను రెండు గంటల్లో కొండపైకి తీసుకెళతారు. మార్గమధ్యంలో పది నిమిషాల చొప్పున మూడుసార్లు ఆగుతారు. వారికి గతంలో పంబా నది తీరాన విశ్రాంతి మందిరం ఉండేది. గత ఆగస్టు నెలలో వచ్చిన వరదల్లో అది కాస్త కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆరు బయటే వారి విశ్రాంతి. కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన డోలీ కూలీలు సీజనంతా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. వారు దేవసం బోర్డు పరిధిలో కాంట్రాక్టు కూలీలుగా పనిచేస్తున్నందున వారికి సెలవులు లేవు. రోగమొస్తే, నొప్పొస్తే ఉచిత వైద్య సౌకర్యం లేదు. మంచాన పడినా పింఛను సౌకర్యం లేదు. ఒకప్పుడు ముళ్ల పొదలు, కొనదేలి కోసుకుపోయే రాళ్ల మీది నుంచి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు సిమ్మెంట్ రోడ్డు మీద వెళుతున్నారు. భక్తులులాగే వీరు కూడా పాద రక్షలు లేకుండానే వెళ్లాలి. రావాలి. వృత్తి కారణంగా వారికి కీళ్ల నొప్పులే కాకుండా ‘డిస్క్ పొలాప్స్’ లాంటి వెన్నుముఖ జబ్బులు కూడా వస్తున్నాయి. 53 ఏళ్లు వచ్చినా మన సత్యన్ ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు కనిస్తున్నాడుకానీ చాలా మంది కూలీలు 50 ఏళ్లకే చనిపోతారట. ఇప్పుడు వారికి నిరుద్యోగం భయం పట్టుకుంది. యాత్రికుల తాకిడి ఎక్కువవడం, వారి నుంచి టీడీబీకి వస్తున్న ఆదాయం కూడా పెరగడంతో భక్తుల సౌకర్యార్థం పంబా నది నుంచి సన్నిధానం వరకు ‘రోప్ వే’ను ప్రవేశ పెట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో డోలీ సర్వీసులు రద్దు కానున్నాయి. అప్పుడు తాము రోడ్డున పడతామని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ పాలక, ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక తమకు అయ్యప్పే దిక్కని, ఆయన ఎలా కాపాడుతారో చూడాలి అని వారు మొరపెట్టుకుంటున్నారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై రాష్ట్ర అసెంబ్లీలో కుమ్ముకుంటున్న పాలక, ప్రతిపక్షాలకు వీరి గురించి పట్టించుకునే తీరికెక్కడిది! సోమవారం కూడా కేరళ అసెంబ్లీ స్తంభించిపోయింది. -
శబరి దరి చేరేదెలా అయ్యప్పా!
సాక్షి,సిటీబ్యూరో: నగరం నుంచి సంక్రాంతికి సొంతూరికి వెళ్లేందుకే కాదు.. అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లేందుకూ ‘దారి’ కనిపించడం లేదు. ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్న మాలధారులకు సైతం రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. మరో రెండు నెలల వరకు అంటే వచ్చే ఫిబ్రవరి దాకా అన్ని రైళ్లలో వెయిటింగ్ జాబితాయే దర్శనమిస్తోంది. కొన్నింటిలో ‘రిగ్రెట్’ కనిపిస్తోంది. ఏటా లక్షలాది మంది నగర వాసులు సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల కంటే రైళ్లే అనుకూలంగా ఉంటాయి. చార్జీలు తక్కుగా ఉండడమే కాకుండా సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయాన్నే సొంత ఊరు చేరుకొనేందుకు సౌకర్యంగా ఉంటుంది. కానీ అన్ని రైళ్లలోనూ భారీగా పెరిగిన వెయిటింగ్ లిస్టు ప్రస్తుతం ప్రయాణికులను వెక్కిరిస్తోంది. మరోవైపు డిసెంబర్ రెండో వారం నుంచి సంక్రాంతి వరకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరికి వెళతారు. ఈ ఏడాది కనీసం10 లక్షల మంది వెళ్లే అవకాశం ఉంది. కానీ ద.మ. రైల్వే ప్రకటించిన అరకొర రైళ్లు ఇటు సంక్రాంతి ప్రయాణికులను, అటు అయ్యప్ప భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. నగరం నుంచి చాలా తక్కువ ఏటా లాగే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు నగర భక్తులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లే ఒకే ఒక్క రైలు శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఫిబ్రవరికి కూడా ఇప్పుడే బుక్ అయ్యాయి. భక్తుల రద్దీని, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు వేయాల్సిన అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 90 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. శబరికి వెళ్లే భక్తులు, సంక్రాంతి ప్రయాణికుల కోసం ప్రకటించిన ఈ రైళ్లలో హైదరాబాద్ నుంచి బయలుదేరేవి చాలా తక్కువే. పైగా ప్రత్యేక రైళ్లలోనూ బుకింగ్‌లో పూర్తయ్యాయి. ‘కేవలం పది, పదిహేను రైళ్లు మాత్రమే అదనంగా నడుపుతారు. ఎలా వెళ్లి రాగలం’ అంటూ నగరంలోని అయ్యప్ప భక్త సమాజాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చివరి క్షణాల్లో హడావిడిగా ప్రత్యేక రైళ్లను వేసి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం కంటే ప్రస్తుత రద్దీకి అనుగుణంగా రైళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. హడావుడిగా వేస్తే దళారులకే లాభం గతంలో మకరజ్యోతి దర్శనం ముంచుకొస్తున్న తరుణంలో హడావిడిగా కొద్దిపాటి రైళ్లను ప్రకటించారు. ఆ రైళ్లు కూడా విజయవాడ, విశాఖ, కాకినాడ నుంచి బయలుదేరాయి. నగరం నుంచి వెళ్లినవి పరిమితమే. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పైగా ఉదయం వెళ్లాల్సినవి సాయంత్రం, సాయంత్రం వెళ్లాల్సిన రైళ్లు అర్ధరాత్రి బయలుదేరాయి. సకాలంలో దర్శనానికి చేరుకోలేక భక్తులు నిరాశ చెందారు. పైగా ప్రత్యేక రైళ్లలో నీటి సదుపాయం లేక భక్తులు స్నానం, పూజ చేసుకోలేపోయారు. దళారులపై నిఘా ఏదీ మరోవైపు శబరి ప్రత్యేక రైళ్లలో బెర్తులను ఎగరేసుకు పోయేందుకు దళారులు, ఏజెంట్లు ఇప్పటి నుంచే మోహరించారు. భక్తుల ప్రయాణంపై పెద్ద ఎత్తున బేరం చేసుకొనేందుకు రంగంలోకి దిగారు. ఇలాంటి వారిని నియంత్రించేందుకు నిఘా అవసరం. ప్రతిసారి ముహూర్తం ముంచుకొచ్చిన తరువాత ప్రత్యేక రైళ్లు ప్రకటించడం వల్ల భక్తుల కంటే దళారులే ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు. వారి నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈసారి కూడా అయ్యప్ప భక్తులకు అదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది. సంక్రాంతి ప్రయాణమూ కష్టమే.. సంక్రాంతి సెలవుల్లో సుమారు 25 లక్షల మంది నగరం నుంచి వెళుతుంటారు. వీరిలో కనీసం 15 లక్షల మంది రైళ్లపైనే ఆధారపడతారు. రైళ్లలో అవకాశం లేకపోతేనే సొంత వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు 150 నుంచి 200 వరకు చేరింది. కొన్నింటిలో ‘నో రూమ్’ దర్శనమిస్తోంది. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అనంతపురం, గుంతకల్లు: అయ్యప్ప మాలాధారుల రద్దీ దృష్ట్యా డిసెంబర్, జనవరి నెలల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ మీదగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ♦ హైదరాబాద్–కొల్లాం–హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలు హైదరాబాద్(07141) నుంచి డిసెంబర్ 12, 16 జనవరి 2, 5, 8, 9, 14 తేదీల్లో సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుతుంది. తిరిగి కొల్లాం(07142) డిసెంబర్ 14, 18 జనవరి 4, 7, 10, 11, 14, 16 తేదీల్లో తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి మరోసటి రోజు ఉదయం 10.35 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది. ఈ రైలు బేగంపేట, లింగంపల్లి, వికరాబాద్, తాండూరు, యద్గిర్, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, సేలం, ఈరోడ్, తిరూపూర్, కోయంబత్తూరు, పలక్కడ్, త్రిసూర్, అలువ, అరక్కోణం, కోట్టాయం, చెంగన్నూర్, కాయన్‌కులం మీదగా కొల్లారు రాకపోకలు సాగిస్తుంది. ♦ అదిలాబాద్–కొల్లాం (రైలు నం:07509) రైలు డిసెంబర్ 28న మధ్యాహ్నం 1.25 గంటలకు బయలుదేరి 30వ తేదీ ఉదయం 4.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు సహస్రకుండ్, హిమయత్‌నగర్, ధర్మబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, తిరుపతి, కాట్పాడి, సేలం, కోయంబత్తూరు మీదగా కొల్లాం చేరుకుంటుంది. ♦ అంకోల–కొల్లాం మధ్య ప్రత్యేక రైలు (నం:07507) డిసెంబర్ 14న అంకోల బయలుదేరి 16వ తేదీ ఉదయం 4.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు వాసిం, పూర్ణ, నాందేడ్, మడ్‌ఖాడ్, ధర్మబాద్, బాసర, నిజామాబా§Š,. షాద్‌నగర్, జడ్చర్ల, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, తిరుపతి, కాట్పాడి, సేలం, కోయంబత్తూరు మీదగా కొల్లాం ప్రయాణిస్తుంది. ♦ నిజామబాద్–కొల్లాం (నం:07613) రైలు డిసెంబర్ 13, 22వ తేదీల్లో మధ్యాహ్నం 12.10గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.40 గంటలకు కొల్లాంకు చేరుతుంది. తిరిగి ఈ రైలు కొల్లాం నుంచి 13, 17, 21వ తేదీల్లో తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.40 గంటలకు నిజామాబాద్‌కు చేరుతుంది. ఈ రైలు కామారెడ్డి, మేడ్చల్,వోలారం, మల్కాజ్గిరి, కాచిగూడ, జడ్చర్ల, మహబుబ్‌నగర్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రేణుగుంట, కాట్పాడి, సేలం, కోయంబత్తూరు మీదగా కొల్లాం చేరుకుంటుంది. ♦ శబరిమల నుంచి వచ్చే భక్తుదుల కోసం తిరుపతి–అంకోల (07408) ప్రత్యేక రైలు డిసెంబర్ 18న తిరుపతిలో ఉదయం 11 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.50 గంటలకు చేరుతుంది. అలాగే తిరుపలి–ఆదిలాబాద్ (07407) రైలు జనవరి 1తేదీ తిరుపతిలో ఉదయం 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్లకు రిజర్వేషన్ సౌక్యరం ఉంది. -
కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షి, చెన్నై: కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పట్ల కేరళ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన కన్యాకుమారి జిల్లా బంద్ కొనసాగుతుంది. బంద్‌లో భాగంగా బీజేపీ నేతలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలుచోట్లు ఆందోళనకారులు కేరళ రవాణా సంస్థకు చెందిన బస్సులపై దాడి చేశారు. దీంతో కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలను నిలిపివేశారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, రాధాకృష్ణన్ ఇరుముడితో అయ్యప్ప దర్శనార్థం బుధవారం శబరిమలైకి వెళ్లారు. ప్రైవేటు వాహనంలో రాధకృష్ణన్ పంబన్‌కు వెళ్లడంతో ఆయన్ను అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు ఆయనతో వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. దీంతో రాధాకృష్ణన్‌కు జరిగిన అవమానానికి నిరసనగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కన్యాకుమారిలో బీజేపీ నేడు బంద్ చేపట్టింది. -
కేరళ సర్కారు తీరేం బాగోలేదు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: శబరిమల వ్యవహారంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం తీరు నిరుత్సాహపూరితంగా ఉందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. అమిత్ మంగళవారం ట్విట్టర్లో..‘అయ్యప్ప భక్తులు ఆలయానికి వచ్చే దారిలో రాత్రి సమయాల్లో విశ్రాంతి గదులు లేక, పందుల వ్యర్థాల మధ్య దుర్భర పరిస్థితుల్లో గడుపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అయితే, భక్తులను గులాగ్ (ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో కొనసాగిన నిర్బంధ కార్మిక శిబిరాలు)లు మాదిరిగా చూడటం తగదని కేరళ ప్రభుత్వం తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. ‘ఆలయానికి వచ్చే బాలికలు, వృద్ధులతో కేరళ పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. వారికి ఆహారం, నీరు, ఆశ్రయం, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కల్పించడం లేదు’ అని పేర్కొన్నారు. వారంతా కర సేవకులే: సీఎం విజయన్ కరసేవకులను పంపించి ఆలయాన్ని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు, భక్తులను ఇబ్బందులకు గురి చేసేందుకు ఆర్ఎస్ఎస్ యత్నిస్తోందని సీఎం విజయన్ అన్నారు. పోలీసులు ఆదివారం రాత్రి ఆలయ పరిసరాల్లో ఉన్న 69 మంది వ్యక్తులను అరెస్టు చేయటాన్ని ఆయన సమర్థించుకున్నారు. ‘ఆర్ఎస్ఎస్కు చెందిన వీరు ఆలయాన్ని అధీనంలోకి తెచ్చుకునే పథకంలో భాగంగానే సన్నిధానం వద్ద ఉన్నారు. పోలీసు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు అడవి బాటలో అక్కడికి చేరుకుని, నిషేధాజ్ఞలను ఉల్లంఘించారు. 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చేయడమే వీరి ఉద్దేశం’ అని వివరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయనీయకుండా అడ్డుకుంటోందని కాంగ్రెస్ పార్టీపైనా ఆయన మండిపడ్డారు. శబరిమల అంశంలో కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ ఏకమయ్యాయని ఆరోపించారు. -
ఆకాశమంత
సగం చాలదు... పూర్తి ఆకాశం కావాలి.యుద్ధానికి సకల ఆయుధాలు కావాలి.వాదనకు అన్ని అవకాశాలు ఉండాలి.ప్రతిఘటనకు సమస్త శక్తియుక్తులు కావాలి. పాలనలో స్త్రీకి స్థానం కావాలి.అణచివేత నుంచి ఒక కంఠం పైకి లేవాలి. సుజాత లాంటి అభ్యర్థికి స్వాగతం పలకాలి. ‘‘మేము చరిత్రను రాసేవాళ్లం కాదు.. చరిత్ర కన్న బిడ్డలం’’ అంటాడు మార్టిన్ లూథర్ కింగ్. అలాంటి చరిత్ర కన్న ఆడబిడ్డే సూరేపల్లి సుజాత. కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. పోరాటంలో ఉన్న వాళ్లకు, పోరాటాలను చూస్తున్న వాళ్లకు ఆమె సుపరిచితురాలు. మరెందుకు ఇప్పుడు ఈ ప్రత్యేక పరిచయం? మార్పు కోసం.. పర్సనల్ ఈజ్ పొలిటికల్ నినాదంతో తెలంగాణ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంనుంచి పోటీ చేస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్న శక్తికి సవాలుగా! అందుకే ప్రొఫెసర్, ఉద్యమనేత సూరేపల్లి సుజాత ప్రస్తావన, చిన్న పరిచయం ఇక్కడ.. ఉద్యోగధర్మాన్ని ఎక్కడా తప్పకుండానే ప్రజాసమస్యల మీద ఉద్యమిస్తూనే ఉన్నారు. బలమైన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. అయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది?మూడు దళిత్ ఇష్యూస్‌లో నేను ఇన్వాల్వ్ అయినందుకు నామీద కేసులు పెట్టారు. కత్తి మహేష్ నిర్బంధం మీద నేను మాట్లాడ్డం, కరీంనగర్లో చనిపోయిన దళిత స్టూడెంట్‌కు న్యాయం జరగాలని కోరడం, సిరిసిల్లలో తండ్రీ కొడులు చనిపోతే వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడం. మంతెన మధుకర్ విషయం.. అన్నీ కారణమే. మంతెన మధుకర్ కేస్ ఇంకా కోర్ట్లోనే ఉంది. దళిత, ఆదీవాసీ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరుగుతుందని అంబేద్కర్ ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. నేను రాజకీయాల్లోకి రావడానికి ఇవన్నీ ప్రేరేపించాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి. మోర్దాన్ డికేడ్ యాక్టివిస్ట్‌గా పనిచేస్తూనే ఉన్నా. కుల సమస్యల మీద మాట్లాడ్డానికి చాలా ఆర్గనైజేషన్స్‌కి, మహిళా ఆర్గనైజేషన్స్‌కీ రిజర్వేషన్స్ ఉన్నాయి. అంతెందుకు కుల సమస్యల మీద స్పందించడానికి ప్రజాప్రతినిధులే ముందుకురారు. ఇవన్నీ చూశాకే రాజకీయాలలోకి రావాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుత రాజకీయాల్లో ఆడవాళ్ల పరిస్థితి... ఆడవాళ్లు రాజకీయాల్లోకి రావడమే ఒక ఉద్యమం అనిపిస్తోంది. మహిళకూ డబ్బు.. బ్యాక్‌గ్రౌండ్ (సామాజిక వర్గం, రాజకీయ కుటుంబ నేపథ్యం) తప్పడం లేదు. న్యాయం, నిజాయితీతో టికెట్ వచ్చే ప్రసక్తే లేదు. నా విషయంలోనూ సామాజిక వర్గం.. కోట్లు లేకపోవడం.. అన్నీ నాకు సవాళ్లే. నాకున్న ఉద్యమ నేపథ్యం, అవగాహనతో ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా. నిజానికి సవాళ్లు నాకు కొత్తకాదు. కాబట్టి భయపడేది లేదు. జనరల్‌లో, ఇండిపెండెంట్‌గా కాక ఒక పార్టీ నుంచి ఎందుకు పోటీ? జనరల్‌లోనే వేయాలని నేనూ అనుకున్నా. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మహిళా నేతృత్వం, బహుజన సిద్ధాంతం వల్ల బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వైపు వచ్చా. నా ఆలోచనలు ఈ సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నాయి. నా లక్ష్య సాధనకూ ఆ పార్టీలో అయితేనే స్పేస్, సపోర్ట్ ఉంటుందని అనుకున్నా. పార్టీ నన్ను ఎంకరేజ్ చేసింది. ఇక చెన్నూరే ఎందుకు ఎంచుకున్నానంటే.. ఈ ఊరితో నాకు అంతకుముందు నుంచే అనుబంధం. ఇక్కడి ఇష్యూస్ మీద అవగాహన, పోరాడిన అనుభవం ఉంది. కులం, ఓపెన్ కాస్ట్ ఇక్కడున్న పెద్ద సమస్యలు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ల అవుతున్నా ఈ ఊళ్లో హాస్పిటల్ లేదు, కాలేజ్ లేదు. మహిళలు, విడోస్ ఎక్కువగా ఉన్న ప్రాంతం. అన్నీ కోల్పోయినా కూడా ఈ ప్రాంతం ప్రజలు ఒక చైతన్యంతో ఉద్యమాలు నడిపించారు. లక్ష్యాలు... పేదరికం, వెనకబాటు ఉన్న చోట విపరీతమైన దుష్ప్రభావం ఉంటుంది. మార్పు కోసమే రాజకీయపోరాటానికి దిగాను. ‘పర్సనల్ ఈజ్ పొలిటికల్’ నా నినాదం. ప్రధాన దృష్టి యువత ఉపాధి మీదనే. యువత అంటే మగపిల్లలే కాదు. ఆడ, మగపిల్లలు కలిపి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం. అందుకే స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ ఉపాధి కల్పన, విధ్వంసం లేని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అభివృద్ధి కావాలి. వెనకబాటు తనానికి ప్రధాన కారణం చదువులేకపోవడమే. సో.. అందరికీ విద్య.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించే ప్రయత్నం జరగాలి. ఆడవాళ్లు ప్రభుత్వ పథకాల్లో బెనిఫియరీస్గా కాదు.. ఈక్వల్ సిటిజన్స్‌గా గుర్తింపు పొందాలి. అన్నిరంగాల్లో వాళ్లకు సమానమైన ప్రాతినిధ్యం అందాలి. ఎన్నికల ప్రయాణం ఎలా సాగుతోంది? స్త్రీలు.. అందునా ఒంటరి స్త్రీలు అంటే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? నా క్యాస్ట్, నేపథ్యం అన్నిటితో ఆల్రెడీ నా మీద దాడులు మొదలయ్యాయి. నేను నాన్లోకల్నని, డబ్బులు తీసుకుని తప్పుకున్నాననే ప్రచారమూ చేస్తున్నారు. మహిళా జాక్‌కు ఫౌండర్‌గా, తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించినప్పుడు ఎందుకు ఈ డౌట్ రాలేదు? నా స్థానికతను అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజాసమస్యల మీద పోరాడిన, పోరాడుతున్న స్త్రీలందరూ నాకు ఆదర్శం. వాళ్లముందు నేనెంత? అనిపిస్తుంటుంది. వాళ్లే నాకు ప్రేరణ. దళిత జీవితాలు నాకు ఇన్సిపిరేషన్. ‘‘డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ యు సీ వైల్ స్లీపింగ్ ఇట్ ఈజ్ సమ్‌థింగ్ దట్ డజ్ నాట్ లెట్ యూ స్లీప్’’ అన్న అబ్దుల్ కలామ్ మాట నా బాట. మద్దతు? థాంక్స్ టు సోషల్ మీడియా పర్ ఎవ్రీ థింగ్. ట్రోల్ చేసింది. ట్రెమండస్ సపోర్ట్‌నూ ఇస్తోంది. నేను ఏ సమస్య మీద స్పందించినా ముందునుంచి సామాజిక మాధ్యమం చాలా మద్దతుగా నిలిచింది. ఇప్పుడైతే వలంటీర్స్ గ్రూప్స్‌గా ఏర్పడి ప్రచారం చేస్తున్నారు, స్లోగన్స్, బ్యానర్స్, పోస్టర్స్, వెహికిల్స్.. ఇలా ఎవరికి ఏది వీలైతే అది చేస్తున్నారు. డబ్బు రాజకీయాలతో పోటీ పడలేని నాకు.. ఈ సోషల్ మీడియానే మంచి ప్లాట్‌ఫామ్ అయింది. అలాగే నా ఫ్రెండ్స్ కాంట్రిబ్యూషన్ కూడా. మొదటి నుంచీ నా వెన్నంటి ఉన్న ఫాదర్ ఫిగర్ ఊసాగారు (యు.సాంబశివరావు) అందరూ నా విజయం కోసం కష్టపడుతున్నారు. గెలుపుని కాంక్షిస్తున్నారు. ఫ్యామిలీ... స్వస్థలం సూర్యాపేట్. చదువుకుంది హైదరాబాద్‌లో. అమ్మ వరలక్ష్మి. హౌజ్‌వైఫ్. అమ్మ లేకపోతే ఈ రోజు నేను లేను. ధైర్యంగా ఉండడం ఆమె నుంచే నేర్చుకున్నాను. ఇద్దరు అన్నయ్యలు. నాన్న సూరేపల్లి కృష్ణయ్య .. ఎక్సైజ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. చనిపోయారు. అప్పటి నుంచి కష్టమంతా అమ్మదే. నేను పాలిటిక్స్‌లోకి వస్తుంటే వద్దనకపోవడమే వాళ్లు నాకిచ్చే సపోర్ట్(నవ్వుతూ). అన్నయ్యలు, అమ్మ అందరి సపోర్ట్ ఉంది. ఎక్కడైతే స్త్రీ, శిశు సంక్షేమానికి కూడా పురుషుడే మంత్రిగా ఉన్నాడో, ఎక్కడైతే కొత్తగా మహిళా కమిషన్నూ వేయలేదో.. స్త్రీలు సాయుధ పోరాటం చేసిన నేల మీద పాలనలో స్త్రీలకు భాగస్వామ్యం లేదో.. నిర్బంధం ఉందో.. అక్కడ పాలనలో భాగం కావాలని స్టెప్ వేశాను. చూద్దాం.. గేర్ మార్చిన ఈ ప్రయాణం గమ్యం ఏంటో? ఫలితం ఏదైనా వెనక్కి తగ్గేది లేదు’’ అంటూ ముగించింది. శబరిమలలో స్త్రీల ప్రవేశం? దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు కావడానికి ఇంత రభస జరుగుతోందంటే సమాజం ఇన్క్లూడింగ్ ఆల్ పార్టీస్‌లో హిందూమత పితృస్వామ్య వ్యవస్థ భావజాలం ఎంత బలంగా నాటుకుపోయిందో అర్థమైంది కదా! అంతటా డబుల్ స్టాండర్డే. రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కనీస అవగాహన లేనితనానికి నిదర్శనం. మీ టూ మీద? తమ పట్ల జరిగిన హింసను ఇన్నాళ్లకైనా బయటకు వచ్చి చెప్పడం మంచి పరిణామమే. దీన్ని బట్టి దేర్ ఈజ్ నో సేఫ్ స్పేస్ ఫర్ ఉమన్ అని తేలింది. ఏ మహిళకు ఎలాంటి అవమానం జరిగినా సాలిడారిటీ ఉంటుంది. అయితే మీ టూ మీద మీడియా చేసినంత ఫోకస్ సామాన్య స్త్రీలకు సంబంధించిన సమస్యల మీద ఎందుకు చేయదు? మహిళల మీద జరుగుతున్న అన్నిరకాల హింసా ఆగాలి. మహిళలను పక్కన పెట్టే ఎన్ని పథకాలు వచ్చినా అవి పనికిమాలినవే. ఆకాశంలో సగం అంటారు.. ముందు అసలు నేలమీదే సగం లేము. నేను మహిళను కాబట్టి మహిళ గురించి ఆలోచించాలి అని కాకుండా.. అందరూ ఆలోచించి సమభాగస్వామ్యం ఇచ్చినప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. స్టార్ క్యాంపెయిన్ నిజంగా ప్రజాసమస్యల మీద అవగాహన ఉండి ప్రచారానికి వస్తే మంచిదే. కాని కేవలం జనాల అటెన్షన్ కోసమే అయితే.. మార్కెట్ కల్చర్‌లో భాగంగా చూస్తా. దళిత్మూవ్మెంట్ స్వాతంత్య్రానికి ముందు.. ఇప్పుడు? దీన్ని టైమ్ అండ్ స్పేస్ కాంటెక్స్›్టలో చూడాలి. అంబేద్కర్ ఉన్నంతవరకు చాలా క్లిష్టమైన రాజకీయ అవగాహన జరిగిందని నా అభిప్రాయం. ఇప్పడు దళిత మూవ్‌మెంటే కాదు అన్ని మూవ్మెంట్స్ హైలీ పొలిటిసైజ్ అయిపోయాయి. అప్పటిలా ఒక్కనేతే దేశమంతా నడిపే అవకాశంలేదు. దళిత ఉద్యమానికి సంబంధించీ అంతే. ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉందో.. అంతే కాన్షస్నెస్ ఉంది. ఫీనిక్స్‌లా పడి లేస్తూనే ఉంది. ఒక స్వతంత్ర శక్తి ఈ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఆ శక్తిపేరు మెర్సీ మార్గరెట్. పొయెట్గా అందరికీ తెలుసు. కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత కూడా. స్వస్థలం ముషీరాబాద్‌లోని రంగానగర్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం..ఆ ప్రాంత పరిస్థితులే అంటుంది మెర్సీ. ‘నా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ ఆ ప్రాంతం అలాగే ఉంది. ఎలాంటి మార్పు లేదు. అయిదేళ్లకు ఒక్కసారి మాత్రమే కనిపించే నేతలు, అబద్ధపు హామీలతో విసిగి పోయున్నారు జనాలు. ఈ సిట్యుయేషన్ మారాలనే ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చా. చిన్నప్పుడు మా తాతయ్య, నాన్న దగ్గర రాజకీయాల గురించి వినేదాన్ని. రైటర్‌గా మారాక ఇంకొంత అవగాహన వచ్చింది.ఎన్జీవోలో పనిచేసినప్పుడూ కొన్ని విషయాలను నేర్చుకున్నా. ఆలోచనలు చేతల్లో ఉంటేనే మార్పు సాధ్యం. దానికి అధికారం ఉండాలి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. విద్య, ఆరోగ్యం, ఉపాధి నా లక్ష్యాలు. గెలుపు ఓటముల కన్నా.. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఉండాలి. ఆ ధ్యేయంతోనే ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధపడ్డా’’ అంటుంది మెర్సీమార్గరేట్. ప్రస్తుతం ఆమె భారత్ పీజీ కాలేజ్ ఫర్ విమెన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. – సరస్వతి రమ -
‘అయ్యప్ప’కు పొంచి ఉన్న పెను వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి మరో పెను వివాదం పొంచి ఉంది. ఆ వివాదానికి కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులే కారణం అవుతాయనడంలో సందేహం లేదు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రస్తుతం వివాదం రగులుతున్న విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగానే సుప్రీం కోర్టు అయ్యప్ప ఆలయానికి సంబంధించి జారీ చేసిన మరో ఉత్తర్వులు మరుగున పడిపోయాయి. శబరిమల పరిసర ప్రాంతాల్లోని అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని జస్టిస్ మదన్ బీ లోకుర్ నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచీ నవంబర్ 2వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. మొదటి వివాదం భక్తుల నమ్మకానికి సంబంధించినది కాగా, పొంచి ఉన్న వివాదం పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది. ఒకప్పుడు సన్నిదానంలో శబరిమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడు దాని చుట్టూ 63.5 ఎకరాల పరిధిలో చెట్లుపోయి కాంక్రీటు జంగిల్ ఆవిర్భవించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటే ఈ కాంక్రీటు జంగిల్లో 90 శాతం కట్టడాలను కూల్చాల్సిందే. శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణ పరిస్థితులను పరిరక్షించాలంటూ కోజికోడ్‌కు చెందిన సామాజిక కార్యకర్త శోభీంద్రన్ నాలుగేళ్ల క్రితం సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దాంతో శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే అక్రమ కట్టడాలను పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఓ కేంద్ర కమిటీని సుప్రీం కోర్టు ఆదేశించింది. అటవి ప్రాంతాల్లో గనులు, పరిశ్రమలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల అమలును పర్యవేక్షించే కమిటీయే ఇది. ఈ కమిటీ ఇటీవలనే సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో అనేక భయానక వాస్తవాలు బయట పడ్డాయి. శబరిమల ఆలయం భక్తుల నుంచి వస్తున్న భారీ ఆదాయానికి ఆశపడి 1998లో కేరళ అసెంబ్లీ ఆమోదించిన ఆలయం మాస్టర్ ప్లాన్‌నే కాకుండా ఆ తర్వాత 2007లో తీసుకొచ్చిన సవరణ ప్లాన్‌ను కూడా ఉల్లంఘించి కేరళ దేవసం బోర్డు పలు అక్రమాలను నిర్మించిన విషయాన్ని కమిటీ నివేదిక వెల్లడించింది. శబరిమల ఆలయ పరిసర కొండల్లో పుడుతున్న పంబా నదీ ప్రవాహాన్ని దెబ్బతీసేలా నది ఒడ్డునే కాకుండా నది ప్రవహించే ప్రదేశంలో కూడా అక్రమ కట్టడాలు నిర్మించారట. అందుకనే గత ఆగస్టులో వచ్చిన పంబా వరదల వల్ల రెండంతస్థుల మురుగుదొడ్ల భవనాలు, భక్తుల క్లాక్‌రూమ్‌లు, ఓ రెస్టారెంట్ కూలిపోయాయని నివేదిక తెలిపింది. ఆ మరుగుదొడ్ల స్థానంలో మరోచోట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా అవి ఇంకా పూర్తి కాలేదు. పర్యవసానంగా భక్తులు భహిర్భూమిని ఆశ్రయిస్తున్నారట. పంబా నది కాలుష్యం కాకుండా నియంత్రించేందుకు రెండు సివరేజ్ ప్లాంట్లను నిర్మించినా అందులో ఒకదాన్నే ఆపరేట్ చేస్తున్నారు. దానికి కూడా అన్ని మరుగు దొడ్ల కాల్వలను అనుసంధానించలేదు. కొన్ని కాల్వలు నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పైగా ఆగస్టులో వచ్చిన వరదల్లో ఈ రెండు సీవరేజ్ ప్లాంట్లు, మరుగుదొడ్డి కాల్వలు దెబ్బతిన్నాయి. ఆ కాల్వలు కూడా ఒవర్ ఫ్లోఅయి నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పర్యవసానంగా నీటిలో ‘ఫేకాల్ కోలిఫామ్ బ్యాక్టీరియా’ కనీసం ఊహకు కూడా అందనంతగా పెరిగిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. స్నానం చేయడానికి పనికి వచ్చే నీటిలో ‘ప్రతి 100 ఎంఎల్ నీటికి 2,500 ఎంపీఎన్’ కన్నా ఈ బ్యాక్టీరియా తక్కువ ఉండాలట. 2014–2015లో సేకరించిన శాంపిల్ నీటిలోనే ‘100 ఎంల్ నీటికి బ్యాక్టీరియా 13,20,000 ఎంపీఎన్’ ఉందట. అంటే ఉండాల్సిన దానికన్నా 500 రెట్లు ఎక్కువ. సీవరేజ్ ప్లాంటులు, మురుగు కాల్వలు దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లోబ్యాక్టీరియా మరింత ప్రమాదకరంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అడవి పందులు వచ్చి నీటిని తాగుతున్నాయంటేనే అందులో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని అర్థం అట. అయ్యప్ప ఆలయంకు వచ్చే భక్తులు విధిగా ఈ పంబా నదిలో స్నానం ఆచరిస్తారు. అంతేకాకుండా పట్టణం మిట్ట, అలప్పూజ, కొట్టాయం జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. నవంబర్ 17వ తేదీన ప్రారంభమైన ‘మండల మకరవిలక్కు’ సీజన్లో భక్తుల రద్దీ మరింత పెరగడం వల్ల పంబా నదికి వాటిల్లే కాలుష్యాన్ని అంచనా కూడా వేయలేకపోతున్నామని పంబా పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి నక్కే సుకుమారన్ నాయర్ లాంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినకుండా నది ఒడ్డుకు 50 మీటర్ల దూరంలోనే కేరళ దేవసం బోర్డు పనుల నిర్వహణా భవనాన్ని కూడా నిర్మించారని ఆయన తెలిపారు. నీలక్కల్ వద్ద భక్తుల సౌకర్యాల కోసం 2007లో సవరించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 250 ఎకరాలను కేరళ ప్రభుత్వం కేటాయించినా పట్టించుకోకుండా సన్నిధానంలోనే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నాయర్ ఆరోపించారు. గత నెలలోనే సన్నిదానంలో 52 గదుల అతిథి గృహాన్ని కేరళ దేవసం మంత్రి కే. సురేంద్రన్ ప్రారంభించారు. సన్నిదానం, పంబా ప్రాంతాల్లోనే కాకుండా నీలక్కల్ వద్ద కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కేంద్ర కమిటీ పేర్కొంది. వాటన్నింటిని కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం తన కర్తవ్యమని అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్న కేరళ ప్రభుత్వం కూల్చివేతల విషయంలో కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉంటుందా? కూల్చివేతల వల్ల భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటుంది? భక్తులుగానీ, భక్తుల తరఫున హిందూ సంఘాలుగానీ కూల్చివేతలను అనుమతిస్తాయా? -
శబరిమలలో అర్థరాత్రి ఉద్రిక్తత
-
అర్థరాత్రి శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత
-
దైవంపై నమ్మకముంటే గౌరవించాలి : చిన్న జీయర్ స్వామి
సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పులు శాస్త్రాలకు విరుద్దంగా ఉండటం సరైనది కాదని చిన్న జీయర్ స్వామి అన్నారు. శబరిమల ఆలయంపై జరుగుతున్న రాద్దాంతంపై ఆదివారం ఆయన స్పందించారు. ప్రతీ ఆలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని ఉల్లంఘించడం మంచిది కాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగం పరిధిలోనే వ్యవహరించాలని, రాజ్యాంగం శాస్త్రాలకు కల్పించిన హక్కులపై ఇతరులు కల్పించుకోవడం సరికాదన్నారు. కేవలం అయ్యప్ప ఆలయంపైనే ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారని, మసీదుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. నిజంగా దైవంపై నమ్మకం ఉంటే వాటిని గౌరవించాలని.. లేకపోతే వాటికి దూరంగా వదిలేయాలని హితవు పలికారు. కొంతమంది రాజకీయ జోక్యం చేసుకుని కేవలం ఆలయాల మీదనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజానికి ప్రమాదం లేకుండా ఎవరి స్వేచ్చను వారు పొందే హక్కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. -
ఎంపీగా ప్రమాణం తప్పిన అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నించడమంటే అయ్యప్ప భక్తులను అణచివేయడమేనని, అలా చేస్తే కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. మూడు రోజుల క్రితం ‘టైమ్స్ నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే హెచ్చరిక చేశారు. అయ్యప్ప ఆలయానికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును పినరయి విజయన్ ప్రభుత్వం అమలు చేయాలనుకోవడం కూడా రాజకీయమేనని ఆయన ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఎవరిది రాజకీయం? ఇక్కడ ఎవరిది నిజంగా రాజకీయం? అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఓ ప్రభుత్వం విధిగా అమలు చేయాలనుకోవడం రాజకీయమా ? ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా అడ్డుకోవడం రాజకీయమా? లేదా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయవద్దని, అలా చేస్తే కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని బెదిరించడం రాజకీయమా? సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయరాదని ఓ పాలక పక్ష పార్టీ అధ్యక్షుడు సూచించడం స్వతంత్య్ర భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ విషయంలో ఆయన కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లే. తన ఉత్తర్వులను ధిక్కరించడమంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనంటూ సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చినందున, ఆయన రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. తద్వారా అన్ని విధాల దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానంటూ ఓ పార్లమెంట్ సభ్యుడిగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లే. ప్రాథమిక హక్కుల విషయంలో వర్తించదు.. మత విశ్వాసాలకు సంబంధించి భారత రాజ్యాంగంలోని అధికరణ (25)1 కింద స్త్రీ, పురుషులకు సమాన హక్కులు వర్తిస్తాయి గనుక, లింగ వివక్ష చూపడానికి వీల్లేదని అయ్యప్ప ఆలయం విషయంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆలయంలోకి అన్ని వయస్కుల మగవాళ్లను అనుమతించినప్పుడు అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ ఉత్తర్వులను సమీక్షించాల్సిందిగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అది వేరే విషయం. భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేసే ఓ పార్లమెంట్ సభ్యుడిగా సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్వర్వుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రశ్నించే హక్కు అమిత్ షాకు ఉన్న మాట వాస్తవమే. అయితే పౌరుల ప్రాథమిక హక్కుల విషయంలో మాత్రం అది వర్తించదు. రాజ్యాంగంలోని (13)2 అధికరణ కింద ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత పూర్తిగా ఉన్నత న్యాయస్థానందేనని రాజ్యాంగంలోని 32 అధికరణ స్పష్టం చేస్తోంది. కనుక అయ్యప్ప ఆలయం విషయంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులను ప్రశ్నించే అధికారం ఓ ఎంపీగా అమిత్ షాకు లేకుండా పోయింది. పైగా ఆయన ఎంపీగా చేసిన ప్రమాణాన్ని ఇక్కడ అక్షరాల ఉల్లంఘించారు. ఈ రెండు తీర్పులను ఓసారి పరిశీలిస్తే.. ‘దేశ సమగ్రత, సార్వభౌమాధికారాలను పరిరక్షించేందుకు భారత రాజ్యాంగానికి మనస్ఫూర్తిగా కట్టుబడి ఉంటాను. అందుకు అనుగుణంగానే నా విధులను నిర్వర్తిస్తాను’ అని అందరితోపాటు అమిత్ షా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ‘రాజ్యాంగంలోని 141వ అధికరణ కింద సుప్రీం కోర్టు ఇచ్చే ఉత్తర్వులే ఈ దేశంలో చట్టం. ఈ చట్టాన్ని విసర్జించడానికి వీల్లేదు. ఏ ప్రభుత్వ యంత్రాంగంగానీ లేదా కోర్టుగానీ ప్రశ్నించడానికి వీల్లేదు’ అని ఒడిశా ప్రభుత్వానికి, ధనిరామ్ లూథర్ మధ్య నడిచిన వివాదంలో 2004, ఫిబ్రవరి నాలుగవ తేదీన సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఉన్నత కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని దల్బీర్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం మధ్య నడిచిన కేసులో సుప్రీం కోర్టు 1979లోనే తీర్పు చెప్పింది. ఈ రెండు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే అమిత్ షా రాజ్యాంగాన్ని అక్షరాల ఉల్లంఘించినట్లే. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి రాజ్యాంగం ప్రకారం ఎంపీగా కొనసాగడానికి వీల్లేదు. మరి దేశంలో ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన సందర్భాలు లేవా? అంటే ఉన్నాయి. బాబ్రీ మసీదు వద్ద యథాతధ స్థితి కొనసాగించాల్సిందిగా 1989లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యూపీ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఫలితంగా 1992లో బాబ్రి విధ్వంసం జరిగింది. రాజ్యాంగ విధులను నిర్వర్తించలేకపోయినందున నాటి యూపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. వివాదాస్పద ‘పద్మావతి’ బాలివుడ్ చిత్రం విడుదలకు తగిన భద్రతను ఏర్పాటు చేయాలని, అందుకు వీలుగా ఆందోళనకారులను అరెస్ట్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం తొలుత తిరస్కరించింది. తర్వాత ‘పద్మావత్’గా పేరు మార్చాక సినిమా విడుదలకు భద్రత కల్పించింది. -
శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత
-
కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో తృప్తి దేశాయ్ అడ్డగింత
తిరువనంతపురం: శబరిమలకు బయలుదేరిన భూమాత బ్రిగేడ్ చీఫ్, సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ను శుక్రవారం ఉదయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు నిలిపివేశారు. విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ గేట్ వెలుపల పెద్దసంఖ్యలో నిరసనకారులు గుమికూడి నినాదాలు చేస్తుండటంతో ఆరుగురు మహిళా యాత్రికులతో తెల్లవారుజామున 4.40 గంటలకు కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తృప్తి దేశాయ్ బృందాన్ని పోలీసులు బయటకు అనుమతించలేదు. కాగా శబరిమల వచ్చేందుకు తన ప్రయాణ ఏర్పాట్లను వివరిస్తూ తమకు భద్రత కల్పించాలని కోరుతూ తృప్తి దేశాయ్ బుధవారం కేరళ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు. తృప్తి రాకను పసిగట్టిన హిందూ సంస్ధల కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు ఆమె పర్యటను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శబరిమలకు వెళ్లకుండా ఆమెను నిరోధించేందుకు విమనాశ్రయం వెలుపల పెద్ద ఎత్తు ఆందోళనకు దిగాయి. కాగా, శబరిమలకు బయలుదేరిన తమను హతమారుస్తామని, దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని, పోలీసులు తమకు ఎలాంఇ భద్రత కల్పించకపోయినా శబరిమలకు వెళ్లి తీరుతామని తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. మరోవైపు తన శబరిమల యాత్రకు భద్రత కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆమె మెయిల్ చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హిందూ సంస్థలతో పాటు బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. విమానాశ్రయం వద్ద భారీ భద్రత తృప్తి దేశాయ్ శబరిమలను సందర్శిస్తారనే సమాచారంతో పెద్ద సంఖ్యలో నిరసనకారులు కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప దర్శనం అయ్యాకే తిరుగుముఖం పడతానని తృప్తి దేశాయ్ తేల్చిచెబుతుండటం, ఆమెను అడ్డుకుంటామంటూ నిరసనకారులు నినాదాలతో హోరెత్తిస్తుండటంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బలగాలను భారీగా మోహరించారు. -
నాకేదైనా జరిగితే కేరళ సీఎం,డీజీపీలదే బాధ్యత
-
ప్రత్యేక రోజుల్లో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్!
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమితిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి తీరతామని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. మహిళల ప్రవేశాన్ని అడ్డగిస్తూ భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి మనోభావాలను గౌరవిస్తూనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు పాటిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే మహిళలకు ప్రవేశం కల్పించే యోచనలో ఉన్నామని తెలిపారు. ఈ విషయమై ఆలయ ప్రధాన పూజారితో తాను స్వయంగా మాట్లాడతానని విజయన్ పేర్కొన్నారు. కాగా ఈనెల 17 నుంచి వార్షిక మండల దీక్ష సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై, సుప్రీంకోర్టు తీర్పు అమలు సాధ్యాఅసాధ్యాలపై చర్చించేందుకు గురువారం సీఎం విజయన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ఉత్తర్వులను అమలు చేసేందుకు కాలపరిమితి కోరాలని, అప్పటివరకూ శాంతిభద్రతలను సక్రమంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని విపక్షాలు సూచించాయి. అయితే ఈ సూచనలను సీఎం పట్టించుకోలేదని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈ కారణంగానే వాళ్లు సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. -
శబరిమల వివాదంపై అఖిలపక్ష భేటీ
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిపై చర్చించేందుకు కేరళ ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. సెప్టెంబర్ 28న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరిస్తూ రివ్యూ పిటిషన్లను జనవరి 22న విచారించాలని తీసుకున్న నిర్ణయంపై అఖిలపక్ష భేటీ లో చర్చించారు. సుప్రీం ఉత్తర్వులను అమలు చేసేందుకు కాలపరిమితి కోరాలని, అప్పటివరకూ శాంతిభద్రతలను సక్రమంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని విపక్షాలు సూచించాయి. మరోవైపు ఈనెల 17 నుంచి వార్షిక మండల దీక్ష సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపైనా అఖిలపక్ష సమావేశంలో చర్చించారు. కాగా అక్టోబర్‌లో ఐదురోజులు, ఈనెల ఆరంభంలో రెండు రోజుల పాటు పూజల కోసం శబరిమల ఆలయం తెరిచిన క్రమంలో సుప్రీం ఉత్తర్వులపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక నిరసనలకు సంబంధించి ఇప్పటివరకూ 3700 మందిని అరెస్ట్ చేయగా, పలువురిపై 546 కేసులు నమోదయ్యాయి. ఇక శబరిమల దర్శనం కోసం కేరళ పోలీస్ వెబ్సైట్లో 500 మంది యువతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. -
రివ్యూ పిటిషన్లను జనవరి 22న విచారిస్తాం
-
శబరిమల తీర్పుపై స్టే ఇవ్వం
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి అన్ని వయ సుల మహిళలను అనుమతించాలన్న తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై వచ్చే జనవరి 22న ఓపెన్ కోర్టులో విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 23వ తేదీ నాటి తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 48 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం మంగళవారం సుప్రీంకోర్టు చాంబర్లో విచారణ చేపట్టింది. న్యాయవాదులెవరూ లేకుండా కేవలం న్యాయమూర్తులు మాత్రమే పిటిషన్లను పరిశీలించారు. అనంతరం వెలువరించిన ఆదేశాల్లో... ‘ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, దాఖలైన రివ్యూ పిటిషన్లు అన్నిటిపైనా జనవరి 22న తగు ధర్మాసనం విచారణ చేపడుతుంది. ‘ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్, ఇతరులు వర్సెస్ కేరళ ప్రభుత్వం, ఇతరులు’ కేసులో సెప్టెంబర్ 28న వెలువరించిన తీర్పుపై స్టే ఉండబోదని స్పష్టం చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు.. ఇదే అంశంలో సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ జి.విజయ్‌కుమార్, ఎస్.జయ రాజ్‌కుమార్, శైలజా విజయన్ అనే వారు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాస నం..‘సెప్టెంబర్ 23నాటి తీర్పును సమీక్షించా లని నిర్ణయించినట్లయితే, తాజా పిటిషన్లను రివ్యూ పిటిషన్లతో పాటు కలిపి విచారిస్తాం. ఒకవేళ రివ్యూ పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తే, కొత్త పిటిషన్లపై ప్రాధాన్యతా క్రమంలో వేరుగా విచారణ చేపడతాం’ అని పేర్కొంది. రిట్ పిటిషన్లలో ఏముంది? శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం లింగ వివక్షేనంటూ సెప్టెంబర్ 28న అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్‌మిశ్రా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అయ్యప్ప భక్తుల జాతీయ సంఘం (నాడా), నాయిర్ సేవా సంఘం (ఎన్ఎస్ఎస్) తదితర సంఘాలు, వ్యక్తులు రివ్యూ పిటిషన్లు వేశాయి. ‘రుతు స్రావం మహిళలను ఆలయం లోకి అనుమతించాలన్న తీర్పు విప్లవాత్మకం, ఈ తీర్పుతో రుతుస్రావం మలినం, అశుద్ధం అనే దురభిప్రాయం తొలగి పోతుందనే భావన తప్పు. వార్తల్లోకి రావాలనే తలంపుతో ఉన్న దొంగభక్తులు మాత్రమే సుప్రీం తీర్పును స్వాగతించారు. వాస్తవాల ఆధారంగా ఈ కేసును పరిశీలించినట్లయితే ఈ తీర్పు అహేతు కం, అసమర్థనీయం’ అని నాడా పేర్కొంది. ‘అయ్యప్ప స్వామి ‘నైష్టిక బ్రహ్మచారి’ అయి నందున 10 ఏళ్ల లోపు 50 ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే పూజలు చేయడానికి అరు ్హలు. అంతేకానీ, మహిళలు అయ్యప్పను పూజిం చరాదన్న నియమమేమీ లేదు. చట్టంలో లోపా లతో ఈ కేసు విచారణ 40 ఏళ్లు పట్టింది. అయితే, ఆలయంలోకి మహిళలకు అవకాశం కల్పించడంఆలస్యమైందంటూ ఇలాంటి తీర్పు ఇవ్వడం సరికాదు’ అని ఎన్ఎస్ఎస్ పేర్కొంది. -
శబరిమల తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ
-
స్త్రీలోక సంచారం
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ప్రపంచ మహిళల ట్వంటీ–20 పోటీలలో సెంచరీ చేసిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు. దక్షిణ అమెరికాలోని ఉత్తర అట్లాంటిక్ తీరంలో ఉన్న గుయానాలో నవంబర్ 9న న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కౌర్ ఈ అత్యద్భుతమైన విజయం సాధించారు. నవంబర్ 9న మొదలైన ఈ ప్రపంచ మహిళల ట్వంటీ 20 మ్యాచ్‌లు నవంబర్ 24న యాంటీగువాలో ముగుస్తాయి. 22న సెమీ ఫైనల్స్. సెమీ ఫైనల్స్ చేరడానికి ముందు వరకు భారత మహిళల జట్టు నవంబర్ 11న పాకిస్తాన్‌తో, నవంబర్ 15న ఐర్లాండ్‌తో, నవంబర్ 17న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇండియా ఆడే మ్యాచ్‌లన్నీ కూడా గుయానాలోనే జరుగుతాయి. ట్వంటీ–20 ఆడుతున్న జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు.. స్మృతి మంథన, మిథాలీరాజ్, జమీమా రోడ్రిగ్స్, వేదాకృష్ణమూర్తి, దీప్తీ శర్మ, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనూజా పాటిల్, ఏక్తా భిస్త్, దయాళన్ హేమలత, మోన్సీ జోషీ, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి ఉన్నారు. ఈ మంగళ, శుక్రవారాలు శబరిమలకు సంబంధించి అత్యంత కీలకమైన రోజులు కానున్నాయి. నవంబర్ 16న శబరిమల ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇక అప్పట్నుంచీ 41 రోజుల పాటు నిరవధికంగా ఆలయ పూజలు జరుగుతాయి. నవంబర్ 13న (రేపు).. స్త్రీలకు ఆలయ ప్రవేశ హక్కును కల్పిస్తూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పన్నెండుకు పైగా వాదనలపై సుప్రీంకోర్టు సమీక్ష జరుపుతుంది. వాదోపవాదాలు ఎలా ఉన్నా.. ఈ ‘మండల’ కాలంలో శబరిమలను సందర్శించుకోవడానికి ఇప్పటి వరకు ఆన్లైన్లో 560 మందికిపైగా మహిళలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మరోవైపు, కొచ్చి, తిరువనంతపురం నుంచి శబరిమల వస్తున్న మహిళా భక్తులను భద్రత కారణాల రీత్యా హెలికాప్టర్లో తరలించడంలోని సాధ్యాసాధ్యాలపై కేరళ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. భారతదేశంలో వివాహమైన ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు.. భర్త పెట్టే హింసకు గురవుతున్నారని వడోదరలోని ‘సహజ్’ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడయింది. యు.కె.లోని ‘ఈక్వల్ మెజర్స్ 2030’ అనే సంస్థతో కలిసి ‘సహజ్’ నిర్వహించిన ఈ సర్వేలో.. ‘ఒకవైపు ఆర్థికంగా పురోగమిస్తున్న ఇండియా.. లైంగిక వివక్ష విషయంలో మాత్రం తిరోగమిస్తోందనీ.. స్త్రీల సంక్షేమం, ఆరోగ్యం, స్త్రీల భద్రత, రక్షణ అనేవి ఏమాత్రం ప్రాముఖ్యంలేని అంశాలు అయిపోయాయని’ సర్వే నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. -
దర్శనభాగ్యం
‘‘నిజంగా భక్తులైనవారు ఆలయ ఆచారాలకూ కట్టుబడి ఉంటారు’’ అని ‘రెడీ టు వెయిట్ (..టిల్ మెనోపాజ్)’ క్యాంపెయిన్ సభ్యులు అంటున్న మాటకు క్రమంగా మద్దతు లభిస్తోంది. మహిళలకూ శబరిమల ఆలయ దర్శనం కల్పించాలని కోర్టును ఆశ్రయించిన వారికి వ్యతిరేకంగా రెండేళ్ల క్రితం మొదలైన సోషల్ మీడియా ఉద్యమమే ‘రెడీ టు వెయిట్’. దివిపైన దేవుడు ఉంటే, భువిమీద న్యాయస్థానాలు ఉంటాయి. గుడి మెట్లు, కోర్టు మెట్లు.. ఎప్పుడు ఏ మెట్లు అవసరమైతే ఆ మెట్లు ఎక్కుతుంటారు మనుషులు. అయితే.. దేవుడు వినడమే తప్ప తీర్పులు ఇవ్వడు. కోర్టులు తీర్పులు ఇవ్వాలి కనుక వినక తప్పదు. ఎమీల్ రాటెల్‌బ్యాండ్ నెదర్లాండ్స్‌లో కాస్త పేరున్న మోటివేషనల్ స్పీకర్. ఎమీల్ పుట్టింది 1949 మార్చి 11న. ఆ డేట్‌ని 1969 మార్చి 11గా మార్పించుకోవాలనుకున్నాడు. దేవుడు వరాలు ఇమ్మంటే ఇస్తాడు కానీ, డేటాఫ్ బర్త్ని మార్చమంటే మారుస్తాడా? కనుక కోర్టుకు వెళ్లాడు ఎమీల్. ‘నాకిప్పుడు 69 ఏళ్లు. కానీ 49 ఏళ్లకు మించి ఉండవని అందరూ నన్ను చూసి ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇరవై ఏళ్లు చిన్నవాడిలా కనిపిస్తానట. లీగల్‌గా కూడా మీరు నా వయసును తగ్గిస్తే డేటింగ్ సైట్ ‘టిండర్’లో నా అవకాశాలు మెరుగవుతాయి. నా వయసు అరవై తొమ్మిది అని ప్రొఫైల్‌లో ఉండడంతో ఎవరూ నా వైపే చూడడం లేదు. కనుక నా ఏజ్‌ని తగ్గించండి’ అని విన్నవించుకున్నాడు. (అప్పటికే అతడు ఏడుగురు పిల్లల తండ్రి). కోర్టు వెంటనే ఏం అనలేదు. కోర్టులు కూడా ఏం చేయాలో పాలుపోక దేవుడి వైపే చూస్తాయి. దేవుడి వైపు చూడ్డం అంటే.. ‘ఇప్పుడు కాదు పొండి’ అని చెప్పి పంపేయడం. ఇటీవల ఇలాగే మన సుప్రీంకోర్టు.. అయోధ్య కేసు వాయిదాకొస్తే.. ‘ఇప్పుడేం తొందరొచ్చిపడింది, మళ్లెప్పుడైనా చూద్దాం’ అని కేసును మళ్లీ వాయిదా వేసింది. భక్తులు తీవ్రంగా నొచ్చుకున్నారు. అయోధ్యకు తొందరలేదు కానీ, శబరిమలకు తొందరొచ్చిందా?! అయోధ్యకు తొందరలేదు కానీ వివాహేతర సంబంధాలకు తొందరొచ్చిందా?! అయోధ్యకు తొందరలేదు కానీ ఎల్జీబీటీ హక్కులకు తొందరొచ్చిందా.. అని గుదులుకున్నారు. కోర్టు తీర్పుపై గుదులుకోవడమే ఉంటుంది. ఎదురు తిరగడం ఉండదు. కానీ శబరిమల ఎదురు తిరిగింది! పదీ – యాభై ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలు, యువతులు, మహిళలు కూడా శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవచ్చు అని సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజు నుంచీ కేరళ ఆధ్యాత్మిక అస్థిమితంతో ఉంది. లోపలికి వెళ్లే ప్రయత్నాలు, వెళ్లనివ్వని ప్రతిఘటనలతో అక్టోబర్ 17 నుంచి 22 వరకు, తిరిగి నవంబర్ 5న, 6న.. అరుపులు, కేకలు, నినాదాల మధ్యే ఆలయ పూజలు జరిగాయి. కేరళలో ఉన్నది సి.పి.ఎం. నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం. పూజలు ఎలా జరిగినా, కోర్టు తీర్పు ఉల్లంఘన మాత్రం జరక్కుండా చూడ్డం తన బాధ్యత అనుకుంది. శబరిమల బరిలోకి దిగిన మహిళా హక్కుల కార్యకర్తలకు, మహిళా నాస్తికులకు, మహిళా జర్నలిస్టులకు రక్షణ కల్పించింది. ఓ ఐదొందల మంది మహిళా పోలీసు సిబ్బందిని కూడా నియమించింది. వాళ్లంతా యాభై ఏళ్లు నిండినవారే! ఒక విధంగా ప్రభుత్వం ఆలయ నియమాలను గౌరవించడం ఇది. వాళ్లు భక్తులు కాదు కాబట్టి, విధినిర్వహణలో ఉన్నవారు కాబట్టి అలా ఆలయ మర్యాదల్ని పాటించడం కేరళ ప్రభుత్వానికి సాధ్యమైంది. అయితే తీర్పు తర్వాత గుడిని తెరిచిన ఎనిమిది రోజుల్లోనూ సామాన్య మహిళా భక్తులెవరూ దర్శనానికి రాలేదు! నవంబర్ 5న ఒక మహిళ ‘పంబ’ వరకు వచ్చింది కానీ.. ఆమె భక్తితో రాలేదు. భర్త తనను బలవంతంగా ఈడ్చుకొచ్చాడని ఆమె మీడియాతో చెప్పింది. ఆ భర్త సీపీఎం కార్యకర్త. అలప్పుళ జిల్లాలోని స్థానిక సీపీఎం నాయకుడి సోదరుడు. అక్టోబర్ 17న ఆలయ ద్వారాలు తెరిచిన తొలిరోజే సి.ఎస్.లిబీ అనే మహిళ తను శబరిమలకు వెళ్లి తీరుతానని ప్రకటించింది. ఆ ముందురోజే ఆమె అయ్యప్ప మీద తనకు నమ్మకం లేదని ఫేస్బుక్లో పోస్టు పెట్టింది! అయినప్పటికీ శబరిమల వెళ్తాననీ, అది తనకు కోర్టు ఇచ్చిన హక్కు అని మళ్లీ ఒక ప్రకటన చేసింది. తర్వాత ఏమైందో తెలియదు. శబరిమలను ఆమె దర్శించుకోనే లేదు. అక్టోబర్ 18న ఒక మహిళ ఆలయ పరిసరాలకు కొద్ది దూరంలో తనకు రక్షణ కావాలని పోలీసులను అడుగుతూ కనిపించారు. ఆమె పేరు సుహాసినీ రాజ్. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్. 19న మరొక మహిళ దర్శనం ఇచ్చారు. అమె కూడా దర్శనం కోసం వచ్చిన మహిళ కాదు. ఓ తెలుగు టీవీ చానల్ రిపోర్టర్. సుహాసిని లాగే, ఆమె కూడా కవరేజ్ కోసం వచ్చారు. తర్వాత రెహానా ఫాతిమా అనే కార్యకర్త శబరిమల కొండ ఎక్కారు కానీ, పద్దెనిమిది మెట్లకు (పత్తినెట్టం పడి) రెండొందల మీటర్ల దూరంలో నందపంతాళ్ దగ్గరే నిరసనకారులు ఆమెను ఆపేశారు. ఇంకో మహిళ మేరీ స్వీటీ తను నిజంగానే దైవదర్శనానికి వచ్చానని బతిమాలినా, భద్రత కారణాలతో పోలీసులు ఆమెను పంబ దగ్గర్నుంచే వెనక్కు పంపించేశారు. మరి ఆలయమార్గ ముఖద్వారాల దగ్గర గుంపులు గుంపులుగా కనిపిస్తున్న వేలాది మంది మహిళలు ఎవరు? ఎవరంటే.. కోర్టు తీర్పుపై, ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నవారు. ‘‘నిజంగా భక్తులైనవారు ఆలయ ఆచారాలకూ కట్టుబడి ఉంటారు’’ అని ఆ గుంపుల్లోని ‘రెడీ టు వెయిట్ (టిల్ మెనోపాజ్)’ క్యాంపెయిన్ సభ్యులు అంటున్న మాటకు క్రమంగా ఇప్పుడు మద్దతు లభిస్తోంది. శబరిమలలో ఈ నెల 16 నుంచీ మళ్లీ గుడి తలుపులు తెరుచుకోబోతున్నాయి. డిసెంబర్ 27 వరకు పూజలు జరుగుతాయి. చివరి రోజు మండల పూజ. 30న మళ్లొకసారి తెరుస్తారు. తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి దర్శనం. Ô¶ రణు ఘోషలోని పారవశ్యానికి మాత్రమే అలవాటు పడిన పెరియార్ అభయారణ్యంలోని పులులకు, ఏనుగులకు ఈ ఏడాది కొత్తగా రణఘోష కూడా కలిసి వినిపించవచ్చు. ఏమిటి పరిష్కారం? ప్రస్తుతానికైతే ఏం లేదు! ఎమీల్ రాటెల్‌బ్యాండ్ కోర్టుకి విజ్ఞప్తి చేసుకున్నాడు కదా.. అలా, ఆలయదర్శన యోగ్యత వయసుకు తగినట్లుగా తమ వయసును పదేళ్ల లోపుకు తగ్గించుకోడానికో, యాభై ఏళ్లకు పైబడినట్లుగా పెంచుకోడానికో అనుమతి ఇవ్వమని ఎవరికివాళ్లు వ్యక్తిగతంగా అభ్యర్థన చేసుకోవాలి. ఎమీల్ కేసును నెదర్లాండ్స్ కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. తీర్పొచ్చాక చూడాలి.. మనకేమైనా కేస్ స్టడీగా పనికొస్తుందేమో! మాధవ్ శింగరాజు ∙ -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం విశాఖపట్నం–కొల్లం–విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు (08515) ప్రత్యేక రైలు నవంబర్ 17, 20, 24, 27, డిసెంబర్ 1, 4, 8, 15, 22, 25, జనవరి 5, 12, 15 తేదీలలో రాత్రి 11.15కు విశాఖపట్నంలో బయలుదేరి రెండోరోజు ఉదయం 7 గంటలకు కొల్లం చేరుతుంది. రైలు నెంబరు (08516) ప్రత్యేక రైలు నవంబర్ 19, 22, 26, 29, డిసెంబర్ 3, 6, 10, 17, 24, 27, జనవరి 7, 14, 17 తేదీలలో ఉదయం 10 గంటలకు కొల్లంలో బయలుదేరి మరుసటిరోజు సా. 6.30కు విశాఖ చేరుతుంది. -
శబరిమల ప్రవేశం : అపచారం.. అపచారం
శబరిమల : సాక్షాత్తు సుప్రీం కోర్టే అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ తీర్పు ఇచ్చినప్పటికి భక్తులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. గత నెలలో శబరిమలలో పూజల సందర్భంగా.. నేడు జరిగే ప్రత్యేక పూజల సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం మహిళలు వచ్చారు. కానీ 10 - 50 ఏళ్లలోపు బాలికలను, మహిళలను ఆలయంలోకి రాకుండా హిందూ సంఘాలు అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలో నేడు దాదాపు 200 మంది అయ్యప్ప భక్తులు గుంపుగా వెళ్లి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను అడ్డున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఒక అపరాధం చోటు చేసుకుంది. మహిళను అడ్డుకునేందుకు వెళ్లిన సదరు అయ్యప్ప భక్తుల గుంపుకు నాయకత్వం వహిస్తోన్న ఆర్ఎస్ఎస్ నాయకుడు వల్సన్ థిల్లంకెరి ఓ అపచారం చేశారు. అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించే బంగారు మెట్ల మీద వల్సన్ నిల్చున్నాడు. అయ్యప్ప దర్శనం చేసుకోవాలని భావించే భక్తులు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా తల మీద ఇరుముడి కెట్టును ధరించాల్సి ఉంటుంది. అలా ఉన్న వారిని మాత్రమే బంగారు మెట్ల మీద నడిచి.. స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు. కానీ వల్సన్ సాధరణ వ్యక్తిలాగా శబరిమల వచ్చారు. కేవలం మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చూడ్డం కోసమే వచ్చిన వల్సన్ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న మహిళను అడ్డగించే క్రమంలో ‘ఇరుముడి కెట్టు’ లేకుండానే పవిత్ర బంగారు మెట్ల మీద నిల్చున్నాడు. అయితే మహిళలను అడ్డుకునే విషయంలో అత్యుత్సాహంగా ఉన్న భక్తులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. -
అయ్యప్ప వివాదం: ‘మెట్టు’ దిగని కేరళ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం దిగిరావడం లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను విధిగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఆ ఉత్తర్వుల అమలుకే ప్రాధాన్యం ఇస్తామని పినరయి విజయన్ స్వయంగా ప్రకటించారు. ఆయన ఈ విషయమై పలు ప్రాంతాల్లో సభలు.. సమావేశాలు నిర్వహించి ప్రజలకు నచ్చజెప్పేందుకు తీవ్రంగా కషి చేస్తున్నారు. ఎల్డీఎఫ్ ఆధ్వర్యాన తిరువనంతపురం, కొల్లాం, పట్టణంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, పలక్కాడ్ నగరాల్లో నిర్వహించిన సభలో పినరయి విజయన్ ప్రసంగించారు. ముందుగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ, ఆరెస్సెస్ సంఘాలు ఆ తర్వాత ఓట్ల రాజకీయాల కోసం ఆందోళన సాగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన హెచ్చరికపై ఆయన ఘాటుగా స్పందించారు. కేరళ విషయంలో ఆయన పన్నాగాలు సాగవని చెప్పారు. మత కలహాలను సృష్టించేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మూడువేల మంది భక్తులను అరెస్ట్ చేయడంపై అమిత్ షా స్పందిస్తూ కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని హెచ్చరించిన విషయం తెల్సిందే. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కూడా ప్రభుత్వం తరఫున గట్టిగా నిలబడి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆరెస్సెస్ శబరిమల కర్మ సమితి పేరిట దాదాపు 50 హిందూ సంఘాలను కూడగట్టి సుప్రీం ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోంది. ఆరెస్సెస్ వెన్నంటే బీజేపీ నడుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు ప్రభుత్వం పక్షంగానీ, అటు బీజేపీ పక్షంగానీ వహించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. నాయర్ సర్వీస్ సొసైటీ, అయ్యప్ప భక్తుల సంఘం నిర్వహిస్తున్న ఆందోళనల్లో పాల్గొంటోంది. ఇప్పటికే దళితులు, మైనారిటీల మద్దతున్న సీపీఎం ఆందోళనల్లో పాల్గొనని జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ ఆలయల్లో పూజారులుగా నియమించేందుకు ఏడుగురు ఎస్సీలు సహా 54 మంది బ్రాహ్మణేతరుల జాబితాను ఎల్డీఎఫ్ ఖరారు చేసింది. గతేడాది కూడా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆరుగురు దళితులు సహా 36 మంది బ్రాహ్మణేతరులను నియమించింది. ఈ నియామకాలు కూడా రానున్న ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుస్తాయని ఎల్డీఎఫ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం అయ్యప్ప ఆలయం వద్ద ప్రతిష్టంభన కొనసాగుతోంది. -
అయ్యప్పపై మరో తీవ్ర వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ పక్క రాదాంతం జరుగుతుండగా మరో వివాదం రాజుకుంది. ఈ ఆలయం తరతరాలుగా తమదని, తమ ఆలయాన్ని తమకు అప్పగించాలని, అలా జరగక పోయినట్లయితే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి సాధించి తీరుతామని కేరళకు చెందిన మాల ఆర్యులు డిమాండ్ చేస్తున్నారు. ‘12 శతాబ్దానికి చెందిన శబరిమలలోని అయ్యప్ప ఆలయం మాల ఆర్యులది. పండలం రాజ కుటుంబం 1800లో దీన్ని ఆక్రమించుకున్నారు. ఆలయంలోని పలు దేవతా విగ్రహాలను తొలగించి వాటిని అడవుల్లో విసిరేశారు. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించారు. చరిత్రగతిలో అడవుల్లో పడేసిన విగ్రహాలు కరిమల, పొన్నంబాల్మేడు, కొత్తకుతితార, నీలక్కల్, తలపరమల అడవుల్లో దొరికాయి. 1904లో పండలం రాజు ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాహ్మణ వర్గానికి చెందిన తాజమన్ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రధాన పూజారి బాధ్యతలను అప్పగించారు. అప్పటి వరకు ద్రావిడ పద్ధతిలో జరిగిన పూజాది కార్యక్రమాలను మార్చివేసి బ్రాహ్మణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. గతంలో అయ్యప్పకు పూజారులుగా వ్యవహరించిన మాల ఆర్యులు తేనతోనే అభిషేకం చేసేవారు. ఆ స్థానంలో బ్రాహ్మణ పూజారులు పాలతోని అభిషేకం చేయడం ప్రారంభించారు. 1950లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆలయ పాలనా బాధ్యతలను స్వీకరించింది. ‘మాకు ఈ ఆలయాన్ని తిరిగి అప్పగించాల్సిందిగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఆ తర్వాత అవసరమైతే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి న్యాయం సాధిస్తాం. అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం మా మంచికే జరిగిందేమో! మా గొంతును కూడా ఈ ప్రపంచానికి వినిపించేందుకు అవకాశం దొరికింది. మాకు ఆలయాన్ని అప్పగించినట్లయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తాం. మా గుండెల నిండా ఎప్పుడూ గూడుకట్టుకొనే ఉండే మా అయ్యప్ప మహిళల పట్ల ఎప్పుడూ వివక్షత లేదు’ అని ఐక్య మాల ఆర్య మహా సభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీకే సజీవ్ చెప్పారు. ఆయన అయ్యప్ప ఆలయంపై విస్తృత పరిశోధనలు జరిపారు. అయ్యప్ప ఎవరి పుత్రుడు ? శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నంబాలమేడు గుహలో కందన్, కారతమ్మ దంపతులకు అయ్యప్ప జన్మించారన్నది మాల ఆర్యులు నమ్మకం. అయ్యప్ప ఆలయం మొట్టమొదటి పూజారి కరిమల ఆర్యన్ అని, ఆయన్నే ఆలయానికి శంకుస్థాపన చేశారని, ఆఖరి పూజారి కోచుకుట్టి కోచురామన్ అని, వారి బంధువులు ఇప్పటికీ కొట్టాయం జిల్లా ముండక్కయమ్‌లో నివసిస్తున్నారని సజీవ్ తెలిపారు. దక్షిణ కేరళలోని పట్టణంతిట్ట, కొట్టాయం, ఇదుక్కి ప్రాంతాల్లోని ఎత్తైన పర్వతాల వాలున దాదాపు 30 వేల మంది మాల ఆర్యులు నివసిస్తున్నారు. వారి రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలుగా పరిగణిస్తోంది. వారి ఇళ్లన్నీ విసిరేసినట్లుగా దూర, దూరంగా కొండ చెరియ వాలుకు ఆనుకొని ఉన్నాయి. అలా వాళ్ల ఊళ్లన్ని ఎత్తైన కొండ శిఖరాల వాలునే ఉండేవని, అందుకే వారికి మాల ఆర్య (కింగ్ ఆఫ్ ది మౌంటేన్) అని పేరు వచ్చిందని 1883లోనే ప్రచురించిన ‘నేచర్ లైవ్ ఇన్ ట్రావెంకోర్’ పుస్తకంలో శామ్యూల్ మతీర్ రాశారు. ఇప్పటికే కరిమల, పొన్నంబాలమేడు, నీలక్కల్ మహదేవ్ ఆలయాలపై హక్కుల కోసం పోరాడుతున్న ఐక్య మాల ఆర్య మహా సభ ఇప్పుడు అయ్యప్ప ఆలయాన్ని తమ పోరాటంలో భాగం చేసింది. కేరళలో దాదాపు వంద ఆలయాలపై ఆదివాసీ, దళిత సంఘాలు తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి. బ్రాహ్మణ పూజారులకు ముందు మాల ఆర్య పూజారులు ఉండేవారని, వారు అయ్యప్పకు తేనాభిషేకం చేసేవారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 23వ తేదీన పట్టణంతిట్టలో జరిగి బహిరంగ సభలో వ్యాఖ్యానించడం గమనార్హం. చరిత్రగతిలో ఆదివాసీల ఆలయాలు అన్యాక్రాంతం అవడం, ధ్వంసమవడం తెల్సిందే. తూర్పు గోదావరి జిల్లా తలుపులమ్మా, కొడగులోని తాళకావేరి, చిక్‌మగలూరులోని బాబా బుడాన్ గిరి టెంపల్, తిరుపతిలో వేంకటేశ్వర స్వామి ఒకప్పడు గిరిజన దేవాలయాలన్న వివాదం ఉంది. తమ దేవుళ్ల పక్కన అన్య మతస్థులను పేర్కొనే సంస్కృతి ద్రవిడులదని, గిరిజనులు లేదా ఆదివాసీల సంప్రదాయం కూడా ద్రవిడ సంస్కృతికి దగ్గరగా ఉంటుందని చరిత్రకారులు చెబుతారు. అందుకేనేమో అయ్యప్ప ముస్లిం మిత్రుడు వావర్ మసీదు అయ్యప్పకు దగ్గరలోనే ఉంది. అయ్యప్పను సందర్శించే భక్తుల్లో 80 శాతం మంది 40 కిలోమీటర్ల దిగువనున్న వావర్ మసీదు సందర్శించాకే అయ్యప్ప వద్దకు వెళతారు. వేంకటేశ్వరుడి భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ అన్న విషయం తెల్సిందే. వేంకటేశ్వరుడు ఒకప్పటి చెంచుల ఆరాధ్య దైవంగా చరిత్రకారులు చెబుతారు. శబరిమల; కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు -
రేపు తెరుచుకోనున్న శబరిమల.. భారీ భద్రత!
శబరిమల : మకరవిలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు సోమవారం తెరుచుకోనున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకూ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సన్నిధానం తెరుచుకోవడం ఇది రెండోసారి. గతనెల మాసపూజల సందర్భంగా గుడిలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించడంతో... శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 నుంచి 50ఏళ్ల వయసు మధ్య మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులపైనా దాడులకు తెగబడ్డారు. సన్నిధానానికి వెళ్లేందుకు ప్రయత్నించిన 10మందికిపైగా మహిళలను బలవంతంగా వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో రేపు ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకోనున్నాయి. దీంతో కేరళ పోలీసులు భద్రతను కట్టుదిట్టంచేశారు. శబరిమల పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. శబరిమల పరిసరాల్లో 2,300మంది పోలీసులు పహారా కాస్తున్నారు. నీలక్కల్, ఎలవున్కల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. నీలక్కల్ నుంచి పంబ బేస్ క్యాంప్ వరకూ ఉన్న అటవీ ప్రాంతంలోనూ పోలీసులు ప్రత్యేక పికెటింగ్స్ ఏర్పాటుచేశారు. కొండపైకి వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేసి పంపిస్తున్నారు. ఆందోళనకారులు సన్నిధానం వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులతోపాటు 20మంది సభ్యుల కమాండో టీమ్‌ను కూడా సన్నిధానం వద్ద మోహరించారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నాయర్ సర్వీస్ సొసైటీ, పందలం రాజకుటుంబంతో చర్చలు జరిపేందుకు పినరయి విజయన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. -
శబరిమల వివాదంపై స్పందించిన మంచు మనోజ్
శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఓ అభిమాని సేవ్ శబరిమల క్యాంపెయిన్‌పై ఇప్పటికైనా నోరు విప్పండి అంటూ మనోజ్ ను ట్యాగ్చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన మనోజ్.. ‘మనం పేదలకు నీరు, ఆహారం, చదువు లాంటి కనీస అవసరాల తీర్చడం పై ముందుగా బాధపడాలి. మనకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆయన, తన సమస్యలను తానే పరిష్కరించుకోగలడని కూడా నమ్మాలి. మానవత్వం కోసం పోరాడండి’ అంటూ కామెంట్ చేశాడు మనోజ్. -
‘సుప్రీం’ను ఖాతరు చేయని బీజేపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అయ్యప్ప భక్తులను అరెస్ట్ చేస్తున్నారంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. అవసరమైతే కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తామంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా భాగం కాకపోయినా అధికార పార్టీ అధ్యక్షుడైనందున ఆయన మాటలను కేంద్రం వైఖరిగానే పరిగణించాల్సి ఉంటుంది. కేరళ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తామంటూ హెచ్చరించడం అంటే ఆయన ప్రభుత్వంలో భాగంగా మాట్లాడుతున్నట్లే. అలాంటి వ్యక్తి శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిన అవసరం లేదని మాట్లాడడం అంటే సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయక పోవడమే. సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ఆరెస్సెస్, బీజేపీ పార్టీలు భక్తులను సమీకరిస్తుంటే వారికి మద్దతుగా అమిత్ షా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. శబరిమలలోలాగా అయోధ్య–రామమందిరం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఆయన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయలేదుగానీ, ఈ రెండు మందిరాల అంశాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారనేది స్పష్టం అవుతుంది. రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు సంక్రమించిన అధికారాలకు సుప్రీంకోర్టు వక్రభాష్యం చెబుతూ కార్యనిర్వాహక అధికారాల పరిధిలోకి జొరబడుతోందని కేంద్రంలోని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బహిరంగంగానే సుప్రీంకోర్టును విమర్శించారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును బీజేపీ నేతలు విమర్శిస్తుంటే సుప్రీం కోర్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్థం కావడం లేదు. -
స్త్రీలోక సంచారం
♦ స్త్రీలకు శబరిమల ప్రవేశంపై జరుగుతున్న వివాదం వినూత్నమైన వాదాలకు చోటు కల్పిస్తోంది. ప్రముఖ వెబ్సైట్ ‘ది ప్రింట్’కు సామాజిక అంశాలపై తరచూ వ్యాఖ్యానాలు రాస్తుండే దిలీప్ మండల్ అనే కాలమిస్ట్ తన తాజా వ్యాసంలో ఒక కొత్త వాదనను పైకి తెచ్చారు. ‘‘మహిళలూ.. నిబంధనల రీత్యా ప్రత్యేకమైనవి అయిన శబరిమల వంటి ఆలయాలను మీరెందుకు సందర్శించాలనుకుంటున్నారు? స్త్రీ స్వేచ్ఛను ప్రబోధించే అక్షరాలు గుడి గోడలపై లిఖించి ఉండవు. ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాలు మాత్రమే స్త్రీకి స్వేచ్ఛను ప్రసాదించే ప్రదేశాలు. అయినా గుడికి వెళ్లే ఆడవాళ్లు గుడి పూజారులు అవుదామనో, ధర్మకర్తలవుదామనో, ఆలయ సంపద కోసమో, ఆలయ నిర్వహణలోని అధికారం కోసమో వెళ్లరు కదా. భక్తితో వెళతారు. దండం పెట్టుకునేందుకు వెళతారు. వేడుకునేందుకు వెళతారు. కష్టాలు చెప్పుకునేందుకు, మొక్కుల రూపంలో సంతోషాలను పంచుకునేందుకు వెళతారు. అయినప్పటికీ ఈ దేశంలోని కొన్ని ఆలయాలు ఏళ్లనాటి నుంచే స్త్రీల ప్రవేశాన్ని నిషేధించాయి. శనిశింగనాపూర్‌లో వారికి ప్రవేశం లేదు. అలాగే శబరిమలలోనూ లేదు. సుప్రీంకోర్టు తీర్పు సైతం ఆ నిషేధాన్ని చెక్కు చెదర్చలేదని ఇటీవలి పరిణామాలతో స్పష్టమైంది. రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించింది. మగాళ్ల ఓటుకు ఎంత విలువ ఉందో, ఆడవాళ్ల ఓటుకూ అంతే విలువ ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో పురుషుడికి ఉన్న సకల హక్కులు, అర్హతలు, అధికారాలు స్త్రీలకూ ఉన్నాయి. పురుషుడిలా స్త్రీ కూడా ఇప్పుడు యుద్ధ విధులను కూడా నిర్వర్తిస్తోంది. వస్తూత్పత్తి కర్మాగారాలు మహిళల అవసరాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. వాణిజ్య, వ్యాపార సంస్థలు మహిళల సేవలను వినియోగించుకోడానికి ఆసక్తి చూపుతున్నాయి. స్త్రీల జీవితాన్ని సౌకర్యవంతం చేసేలా గర్భనిరోధక మాత్రలు, వాషింగ్ మెషీన్లు, మిక్సర్ గ్రైండర్ వంటి ఆవిష్కరణల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం పాటు పడుతూనే ఉన్నారు. ఇవన్నీ ఆధునిక మహిళలకు లభిస్తున్న వరాలు. వీటిల్లో ఏ ఒక్క వరాన్నయినా ఆలయాలకు వెళ్లడం ద్వారా మహిళలు పొందగలుగుతారా? లేదు. నియమ నిబంధనలకు విరుద్ధంగా గుడిలోకి ప్రవేశించినంత మాత్రాన వారు సాధించేదేమీ లేదు. వారు పొందే విముక్తి ఏమీ లేదు. మతవిశ్వాసాలు కలిగిన మహిళలు ఎలాగూ ఆచారాలను పాటిస్తారు కనుక ఆలయ ప్రవేశం లేకపోవడం అన్నది వారికొక లోటు కాదు. స్త్రీ జీవితానికి విముక్తిని, స్వేచ్చను ఇచ్చేవి చదువు, ఉద్యోగం మాత్రమే. అతిక్రమణల వల్ల వారికి ఒరిగేదేమీ ఉండదు’’ అని దిలీప్ మండల్ తన వ్యాసంలో రాశారు. మరి.. స్వేచ్ఛ, విముక్తి భావనలతో నిమిత్తం లేకుండా జీవితంలో ఒక్కసారైనా శబరిమల అయ్యప్పను, శనిశింగనాపూర్‌లో శనీశ్వరుడిని దర్శించుకోవాలని ఆశ, ఆరాటం ఉన్న మహిళల కోరిక తీరేదెలా? ఈ ప్రశ్నలకు ఆయన కుదురైన సమాధానమేమీ చెప్పలేదు. ♦ సైనిక పాఠశాలల్లో బాలికలకు కూడా ప్రవేశం కల్పించాలని ఎట్టకేలకు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం తక్షణం దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో బాలికలకు అవసరమైన సదుపాయాలను కల్పించి, 2019లో వారి ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతారు. ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’లో ప్రవేశానికి ఈ సైనిక పాఠశాలల్లో చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది కనుక, బాలికలకు కూడా సైనిక పాఠశాలలో ప్రవేశం కల్పించాలని తల్లిదండ్రుల నుంచి ఏనాటి నుంచో వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం జరిగింది. ప్రస్తుతం మిజోరంలోని ఛింగ్‌ఛిప్ పాఠశాలలో ఆరవ తరగతిలో ఆరుగురు బాలికలు, లఖ్నోవ్ పాఠశాలలో తొమ్మిదో తరగతిలో పదిహేను మంది బాలికలు చదువుతున్నారు. వీరు కూడా ప్రత్యేక అనుమతితో ఈ ఏడాది ఏప్రిల్, జూన్లలో చేరినవారే. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వచ్చే ఏడాది నుంచి బాలికలు ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేకుండానే సైనిక పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన సైనిక పాఠశాలల ప్రిన్సిపాళ్ల సమావేశంలో రక్షణశాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం 26 సైనిక పాఠశాలలు ఉన్నాయి. -
శబరిమల; మహిళల ప్రవేశాన్ని సమర్థించినందుకు..
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని సమర్థించిన ఓ పీఠాధిపతి ఆశ్రమంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇందులో భాగంగా తిరువనంతపురం సమీపంలోని స్వామి సందీపానంద బాలికల పాఠశాల ముందు పార్క్ చేసి ఉన్న రెండుకార్లు, స్కూటర్లకు నిప్పంటించారు. అంతేకాకుండా దాడి చేసిన తర్వాత ఆశ్రమం ముందు ఓ పూలగుచ్ఛం కూడా ఉంచారు. ఈ ఘటన శనివారం వేకువ జామున 2. 30 నిమిషాలకు చోటుచేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ...సిద్ధాంతపరంగా ఒకరిని ఎదుర్కోలేని పిరికిపందలే ఇలాంటి భౌతికదాడులకు పాల్పడుతారని వ్యాఖ్యానించారు. తప్పు చేసింది ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుకు సానుకూలంగా మాట్లాడినందుకే స్వామీజీ ఆశ్రమంపై దాడి జరగడం నిజంగా సిగ్గుచేటన్నారు. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుననుసరించి కొందరు మహిళా కార్యకర్తలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా నిరసనకారులు వారిపై భౌతికదాడులకు పాల్పడ్డారు. అంతేకాకుండా వారి ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. -
‘ఏమైనా మాట్లాడితే వాగుడుకాయ అంటారు’
న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఈ క్రమంలో తనపై వస్తోన్న విమర్శలకు కాస్తా ఫన్నిగా స్పందించారు స్మృతి. ఈ సందర్భంగా తాను గతంలో నటించిన ‘క్యూంకి.. సాస్ భీ కభీ బహు థీ’ సీరియల్లోని ఓ ఫోటోను షేర్ చేశారు స్మృతి. ఈ ఫోటోలో స్మృతిని తాళ్లతో కట్టేసి ఉంచారు. మాట్లాడటానికి కూడా వీలు లేకుండా నోటిని కూడా మూసేశారు. View this post on Instagram #hum bolega to bologe ki bolta hai... 😂🤔🤦♀️ A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Oct 24, 2018 at 10:12pm PDT ఈ ఫోటోకు స్మృతి ‘నేను ఏమైనా మాట్లాడితే మళ్లీ వాగుడుకాయ అంటారు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ లైన్ 1974లో వచ్చిన కిషోర్ కుమార్ సినిమాలోని ఓ పాటలోనిది. ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘మిమ్మల్ని మీరు తగ్గించుకోని మీ మీద మీరే జోకులు వేసుకుంటున్నారు. నిజంగా మీరు గ్రేట్ మేడమ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
దేవుడా.. ఈ మగాళ్లున్నారే...!
బ్రూస్ అలెగ్జాండర్ టెక్సాస్ నుంచి న్యూ మెక్సికోకు విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడొక సాధారణ ప్రయాణికుడు. అయితే ఫ్లయిట్ ఆల్‌బుకర్క్‌లో దిగాక మాత్రం ‘పేరుమోసిన’ ప్రయాణికుడు అయ్యాడు! పోలీసులు అతడి చేతికి బేడీలు వేసి తీసుకెళ్లడంతో అతడలా పేరు మోశాడు! ప్రయాణంలో బ్రూస్ తన సహ ప్రయాణికురాలిపై కనీసం రెండుసార్లు కావాలని తలవాల్చాడు. ఒకసారి తన వేళ్లతో ఆమె వక్షోజాలను తాకాడు. ఆ మహిళ ఫిర్యాదుపై ఇప్పుడు పోలీసులు, కోర్టు అంటూ తిరుగుతున్నాడు. ఇవన్నీ కాదు.. విచారణలో అతడు అన్న మాటలకు ఈ రెండు డిపార్ట్మెంట్లు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ‘‘నచ్చిన స్త్రీల అవయవాలను తాకడం తప్పేం కాదని స్వయంగా అమెరికా అధ్యక్షుడు కొనాల్డ్ ట్రంపే అన్నాక.. (2005లో అన్నాడట) నేను చేసిన పని తప్పెలా అవుతుంది?’’ అని బ్రూస్ ప్రశ్నించాడు. దేవుడా.. ఈ మగాళ్లున్నారే...! ‘ది షూటింగ్ స్టార్ : ఎ గర్ల్, హర్ బ్యాక్‌ప్యాక్ అండ్ ది వరల్డ్’ అనే కొత్త పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురణ ఇది. రచయిత్రి శివ్యానాథ్ ఎప్పటి నుంచో ‘సోలో’ ప్రయాణాలు చేస్తున్నారు. ఆ అనుభవాలను, అనుభూతులను ఈ పుస్తకంలో పొందుపరిచారు. శివ్యానాథ్ది డెహ్రాడూన్. ఆమె తొలి జర్నీ సింగపూర్. అక్కడినుంచి ఆగ్నేయాసియా దేశాలన్నీ చుట్టి వచ్చారు. కొంతకాలం సింగపూర్ టూరిజం బోర్డులో పనిచేశారు. మంచి ఉద్యోగమే కానీ, ఎందుకో ఆమెకు ‘ఇది కాదు జీవితం’ అనిపించింది. 2011లో స్పితీ వ్యాలీకి (హిమాలయాలు) వెళ్లి, నెలపాటు సన్యాసినిగా గడిపినప్పుడు ఆ ఏకాంత ప్రశాంత వాతావరణంలో.. జీవితం అంటే ‘సోలో జర్నీ’ అని అర్థం చేసుకున్నారు శివ్యానాథ్. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ తిరిగొచ్చారు. ఊహల్లోకి, కలల్లోకి, నక్షత్రాల్లోకి, పచ్చటి పర్వతాల్లోకి, ప్రపంచ పచ్చిక బయళ్లలోకి శివ్యా చేసిన తొలి సోలో జర్నీ అది. బస్సులు, రైళ్లు, విమానాలు, ఓడల్లో ప్రయాణించారు. రకరకాల మనుషుల్ని కలుసుకున్నారు. మారిషస్ కూడా వెళ్లారు. అక్కడ ఆమెకు స్వర్గం కనిపించింది! స్వర్గమే కానీ కొన్ని భయాలు కూడా వెంటాడాయి. శివ్యా.. మధ్య అమెరికా దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు స్పానిష్ భాష నేర్చుకున్నారు. అక్కడి మన్యన్ తెగలతో కలిసి జీవించే ప్రయత్నం చేశారు. 2014లో దక్షిణ ఆస్ట్రేలియాలోని ద్రాక్షతోటల్లో కొంతకాలం ఉన్నప్పుడు అక్కడ ఆమెకు హిందీ మాట్లాడే గుజరాత్ మూలాలున్న పోలెండ్ దేశస్థుడు పరిచయం అయ్యాడు. టర్కీ, బెహ్రెయిన్, కెనడా.. శివ్యా పర్యటించిన దేశాల్లో ఉన్నాయి. ఇండియాలో అయితే ఆమె విహరించని ప్రదేశమే లేదు. ఈ అనుభవాలనన్నింటినీ శివ్యానాథ్ ఈ పుస్తకంలో రాశారు. పర్యాటనల అనుభవాలు ఎవరివి వారివే అయినా, శివ్యా అనుభవాలు ఒంటరి ప్రయాణాలకు మహిళల్ని ప్రేరేపించేంత శక్తిమంతంగా ఉన్నాయి. బహుశా ఆ శక్తి ఆమె రచనా శైలిది కావచ్చు. ‘పిచ్చి అభిమానం’ అంటుంటారు. ఈ స్థాయి అభిమానం సాధారణంగా ఫ్యాన్స్‌కి ఉంటుంది. అయితే అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్‌కు ఇంత పిచ్చి అభిమానం తన ఫ్యాన్స్ మీద ఉంది! వాళ్లకు ఏమైనా కష్టం వస్తే ఆమె తట్టుకోలేరు. తను చేయగలిగింది చేస్తారు. ఈ దయాగుణ సంపన్నురాలు చేయగలిగింది ఏముంటుంది? ఆర్థికంగా ఆదుకుంటారు. ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు’ అనుకుంటారు. తాజాగా శాడీ బార్టెల్ అనే మహిళా అభిమానికి ఆమె 15,000 డాలర్లను విరాళంగా పంపించారు. శాడీ విషయం ఆమె వరకు ఎలా వచ్చిందంటే.. విరాళాల కోసం టేలర్ స్విఫ్ట్‌ను, ఆమె అభిమానులను అభ్యర్థిస్తూ ట్విట్టర్లో శాడీ ఒక మెసేజ్ పెట్టింది. టేలర్ వెంటనే ఆ మెసేజ్‌కు స్పందించి డబ్బు పంపారు. ‘‘హేయ్ గయ్స్! ఎంతో ఆవేదనతో ఈ పోస్ట్ పెడుతున్నాను. వీలైతే నాకు, నా కుటుంబానికి సహాయం చెయ్యండి. వెంటనే ఇప్పుడేం చెప్పలేను కానీ.. అకస్మాత్తుగా ఏంటిది అని అనుకోకండి. ఐ లవ్ యు గైస్. నేను మా అమ్మను బతికించుకోవాలి. అందుకే సహాయం అడుగుతున్నా. నా వయసు ఇప్పుడు 19 ఏళ్లు. దిక్కుతోచని స్థితిలో చేతులు చాస్తున్నాను’’ అని శాడీ ట్విట్టర్ పెట్టారు. ఆ అమ్మాయి చెబుతున్నదానిని బట్టి ఆమె తల్లికి అల్సర్ కారణంగా రక్తస్రావం జరుగుతోంది. మెదడుకు ఆక్సిజన్ అందక.. చివరికది ‘బ్రెయిన్ హెమరేజ్’కు దారి తీసింది. ఆమె చికిత్స కోసం టేలర్ డబ్బు పంపగానే శాడీ తన ఫేస్బుక్ అకౌంట్లో ఆమె దాతృత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. టేలర్ తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అని ఎమోషనల్ అయింది. ఇండియాలో స్థిరపడిన 34 ఏళ్ల ఫ్రెంచి ప్రయోగశీల నటి, రచయిత్రి కల్కీ కేక్లాన్.. దీపపు పురుగులా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో తిరుగుతున్నారు. ‘స్మోక్’ అనే వెబ్ సిరీస్‌తో ఆన్లైన్ వినోదాల ప్రపంచంలోకి తొలిసారి అడుగుపెడుతున్న కేక్లాన్.. ‘స్కేర్డ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌లోని అత్యుత్తమ కథా, సాంకేతిక, నట ప్రమాణాలను చూసి స్ఫూర్తి పొందారు. గోవాలో చిత్రీకరించిన ఈ ‘స్మోక్’ అనే క్రైమ్ డ్రామాలో కేక్లాన్ అసమాన ప్రతిభను కనబరిచినట్లు ‘స్మోక్’ దర్శకుడు నీల్ గుహా ఆమెను ప్రశంసిస్తుండగా.. ‘‘కనీసం ఆ మాత్రమైనా చేయలేకపోతే వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టడం దుస్సాహమే అవుతుంది’’ అని కేక్లాన్ నవ్వుతూ అంటున్నారు. రేపటి నుంచి (అక్టోబర్ 26) ‘ఈరోస్ నౌ’ లో వీక్షకులకు అందుబాటులోకి రానున్న 11 ఎపిసోడ్ల ‘స్మోక్’ ఇప్పటికే ఈ ఏడాది కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శనకు అవకాశం పొందింది. ఒక వెబ్ సిరీస్ కాన్స్ వెళ్లడం ఇదే మొదటిసారి. అన్ని వయసులలోని మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశార్హతను కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతుగా, వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపిన మహిళా ఉద్యమకారులతో గతవారం శబరిమల ఆలయ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఈ సున్నితమైన అంశంపై వ్యాఖ్యానించడానికి కేంద్రంలో అధికార పక్షం నుంచి ప్రముఖులెవరూ ఇంతవరకు ముందుకు రాని పరిస్థితుల్లో తొలిసారి స్మృతీ ఇరానీ తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడ్డం నా ఉద్దేశం కాదు. కానీ మనసుకు అనిపించిన మాట చెబుతాను. నెలసరి రోజుల్లో రక్తస్రావంతో తడుస్తున్న వస్త్రంతో (ప్యాడ్) మనం మన స్నేహితుల ఇళ్లకు వెళతామా?! వెళ్లము కదా. ఇదీ అంతే అనుకోవాలి. ఆచారశుభ్రత ఎంత ముఖ్యమో, ఆచారాలను పాటించడానికి వ్యక్తిగత శుభ్రతా అంతే అవసరం. నాకు ప్రార్థించే హక్కు ఉండొచ్చు. కానీ అపవిత్రం చేసే హక్కు లేదు’’ అని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి అన్నారు. వ్యక్తిగత హోదాలో, ఒక పౌరురాలిగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా ఇప్పుడు దుమారం రేగుతోంది. -
రెహానా ఫాతిమాను వీడని కష్టాలు
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను కష్టాలు వీడటం లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారన్న కారణంగా ఆమెను ముస్లిం సమాజం నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రెహానాను బదిలీ చేస్తూ బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం.. పలవరివట్టం అనే ప్రాంతానికి ఆమెను బదిలీ చేసింది. అయితే అక్కడ కూడా ఆమె పని చేయడానికి వీల్లేదని, ఉద్యోగం నుంచి తొలగించాలంటూ శబరిమల కర్మ సమితి సభ్యులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. ఇలాంటి బెదిరింపులకు రెహానా భయపడే రకం కాదని, ఎవరి కారణంగానో తన ఉద్యోగాన్ని వదులుకోరని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానించారు. కాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్లో రెహానా ఫాతిమా కస్టమర్ రిలేషన్ విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. శబరిమల ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన కారణంగా ఆమెను బోట్ జెట్టీ ప్రాంతం నుంచి పబ్లిక్ కాంటాక్ట్ అంతగా అవసరం లేని పలరివట్టం ఎక్ఛ్సేంజీకి బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
శబరిమలలోకి మహిళలు.. 13న సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళల అనుమతిని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నవంబర్ 13న విచారించనుంది. జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం సహా 19మంది దాఖలుచేసిన రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం... వాటిని నవంబర్ 13న విచారిస్తామని ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్కే కౌర్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం శబరిమలలోని అయ్యప్ప ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని, ఈ అంశంపై సత్వరమే విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై 19 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపిన జస్టిస్ గొగోయ్.. ఈ వ్యాజ్యాలను నవంబర్ 13న విచారిస్తామని తెలిపారు. శబరిమలలో మహిళల నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువడినప్పటి నుంచి శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించగా భక్తులు అడ్డుకున్నారు. -
ఈ మహిళకు ముస్లింగా ఉండే అర్హత లేదు!
ప్రముఖ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ మత బహిష్కరణ విధించింది! శబరిమలకు అన్ని వయసుల స్త్రీలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా స్త్రీ, పురుష భేదం లేకుండా కేరళలోని హిందూ మతస్థులందరూ ఒక వైపు నిరసన ప్రదర్శనలు జరుపుతుండగా.. ఆలయంలోకి ప్రవేశించేందుకు రెహానా ప్రయత్నించడాన్ని తీవ్రంగా పరిగణించిన ముస్లిం కౌన్సిల్ ఆమెపై ఈ విధమైన చర్యను తీసుకుంది. అంతేకాదు, ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ‘మహల్లు’ సభ్యత్వం నుంచి తొలగించాలని ‘ఎర్నాకుళం సెంట్రల్ ముస్లిం జమాత్’ ను కూడా కేరళ కౌన్సిల్‌ను ఆదేశించింది. ‘‘ఆమె చర్య లక్షలాది మంది హైందవ భక్తుల మనసులను బాధించింది. వారి ఆచారాలను అగౌరవపరిచింది. ‘కిస్ ఆఫ్ లవ్’ ఆందోళనలో పాల్గొని, నీలి చిత్రంలో నటించి, ఇప్పుడు మతవిశ్వాసాలకు భంగకరంగా ప్రవర్తించిన ఈ మనిషికి ముస్లింగా ఉండే అర్హత లేదు’’ అని కేరళ ముస్లిం కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.పూన్కుంజు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. మరోవైపు, రెహానా శుక్రవారం శబరిమలను ఎక్కే ప్రయత్నం చేశారన్న విషయం తెలిసి కోపోద్రిక్తులైన ముస్లింలు ఆమె ఇంటిని ధ్వంసం చేశారు. జమ్మూలోని కఠువాలో ఈ ఏడాది ఆరంభంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య ఘటనలో బాలిక తరఫున న్యాయ పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త తాలిబ్ హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టిన కేసును విచారిస్తున్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఆ కేసు నుంచి ఉపసంహరించుకున్నారు. ‘‘నాకు ఏ విధంగానూ తాలిబ్ హుస్సేన్ వైపు వాదించాలని లేదు. నేనీ నిర్ణయం తీసుకోవడానికి అతడి గురించి నాకు తెలిసిన విషయాలు చాలు’’ అని జైసింగ్ అన్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థినిపై బాట్లా హౌస్ ఏరియాలోని ఆమె అపార్ట్మెంట్లో హుస్సేన్ అత్యాచారం జరిపినట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని చదివిన అనంతరం జైసింగ్ కేసు నుంచి తప్పుకున్నారు. ఆ వార్తా కథనంలో బాధితురాలు జరిగిన ఘటనలనన్నిటినీ వివరంగా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లో నాపై అత్యాచారం చేసిన హుస్సేన్ అంతకు ముందు నుంచే తనను పెళ్లి చేసుకోవాలని నన్ను వేధిస్తున్నాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో తను అందరిలాంటి మగాణ్ణి కాదని నమ్మించే ప్రయత్నం చేశాడు. అప్పటికీ వినకపోవడంతో బలప్రయోగంతో అనుభవించాడు’’ అని ఆమె వివరించారు. ప్రముఖుల్ని వెంటాడి రహస్యంగా వారి ఫొటోలు తీసుకునే ఫొటోగ్రాఫర్లను ‘పాప్పరాజ్జీ’ అంటారు. అలాంటి ఒక పాప్పరాజ్జీ తీసిన తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. పాప్పరాజ్జీల అనుచిత ప్రవర్తనతో తనలాంటి వారు ఎంతగా ఇబ్బంది పడతారో తెలియజేస్తూ ఓ పొడవాటి పోస్ట్ పెట్టిన 23 ఏళ్ల అమెరికన్ సూపర్ మోడల్ జిజీ హదీద్‌పై ఓ ఫొటో ఏజెన్సీ కేసు పెట్టింది. ‘ఫొటోలు తీసుకోవాలనుకునే వాళ్ల కోసం వీలైనంత వరకు మేము ఓపిగ్గానే చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాం. అయితే ప్రతిసారీ అలా కుదరదు. అయినప్పటికీ ఫొటోల కోసం బలవంతం చేస్తుంటారు. ఇవ్వకపోతే.. మేము ఎక్కడికి వెళితే అక్కడికి మమ్మల్ని వెంటాడి, వేటాడి ఫొటోలు తీసుకుని, వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంటారు. మాలో ఏం స్పెషల్ ఉంటుంది? ఏ సందర్భమూ లేకుండానే ఓ ఆరడుగుల మనిషి కారు ఎక్కడాన్ని, కారు దిగడాన్ని, పని చేస్తున్నచోట ఆఫీస్ బిల్డింగ్‌లోకి వెళ్లడాన్ని, మళ్లీ బయటికి రావడాన్ని నిరంతరం షూట్ చేస్తూనే ఉంటారు. అందుకోసం వారు మూర్ఖంగా, నిర్దాక్షిణ్యంగా కూడా ప్రవర్తిస్తుంటారు. అది మమ్మల్నే కాదు, మా పక్కన ఉన్న సాధారణ వ్యక్తులను కూడా ప్రమాదంలో పడేసేలా, ప్రాణాంతక స్థితిలోకి నెట్టేసేలా ఉంటుంది. మరీ వ్యక్తిగత జీవితంలోకి కూడా ప్రవేశిస్తే ఎలా? పాప్పరాజ్జీలు తమ స్వార్థాన్ని, ధనార్జన ధ్యేయాన్ని పక్కన పెట్టి.. కనీస మానవత్వంతో బిహేవ్ చేయాలి’’ అని ఆ పోస్టులో పెట్టిన హదీద్ ఆ తర్వాత కొన్ని గంటలకే దానిని తొలగించారు! ఐదు రోజుల మాస పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు పూజల అనంతరం సోమవారం మూత పడ్డాయి. అయితే ఆలయంలోకి స్త్రీల ప్రవేశంపై కేరళలో జరుగుతున్న రభస మాత్రం పూర్తి కాలేదు. మరోవైపు.. శబరిమల ఆలయంలోకి స్త్రీలను అనుమతించడం సబబా కాదా అన్నదానిపైనా సోషల్ మీడియాలో వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘‘ఒక మలయాళీగా, ఒక హిందువుగా ఈ పరిణామాలు నన్నెంతో బాధించాయి. అంతా చదువుకున్న వారే అయిన కేరళలో స్త్రీ, పురుషులు ఎందుకని ఇలా దురుసుగా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. శబరిమలను దర్శించుకోవాలని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. కానీ దర్శించుకోవాలని ఆశపడుతున్న మహిళలను నేను వ్యతిరేకించను’’ అని మాయా మీనన్ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో మలయాళీ నేపథ్య గాయని అంజూ జోసెఫ్ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ‘‘మహిళలకు హక్కులు లేని కాలానికి తిరోగమించడం కోసం పోరాడుతూ ఆ క్రమంలో పురోగమనం కోసం పోరాడిన మన ముందు తరం వారి ప్రయత్నాలను, ప్రయాసను వృథా చేస్తున్నాం. వాళ్లు మనకు ఓటు హక్కు తెచ్చారు. సతీ సహగమన దురాచారాన్ని నిర్మూలించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం తెచ్చారు. ఇప్పుడు ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మార్గం ఏర్పరిచారు. అయినప్పటికీ మనమింకా వెనకే ఉండిపోతాం అంటున్నాం’’ అని అంజు ఆవేదన చెందారు. యు.ఎస్.లోని హోండురాన్ వలస గుంపుల (మైగ్రెంట్ క్యారవాన్స్) నుంచి మహిళలను, చిన్నారులను దేశంలోకి అనుమతించే కార్యక్రమాన్ని మెక్సికో ప్రారంభించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ‘దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. డెమోక్రాట్లు వలస గుంపుల్ని కోరుకుంటున్నారు. అసలీ వలస గుంపులేంటీ అని అనేకమంది ఆశ్చర్యపోతున్నారు’ అన్నారు. -
శబరిమలలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ భక్తురాళ్లు
-
శబరిమల వివాదంపై రజనీకాంత్ స్పందన
చెన్నై: శబరిమల ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను గౌరవించాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెబుతూనే... శబరిమల ఆలయం మతపరమైన విశ్వాసాలతో ముడిపడిందని, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తాను నటిస్తున్న ‘పేట్టా’ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో రజనీకాంత్ లక్నో నుంచి విమానంలో చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు అవసరం లేదన్నారు. అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ఆచారం ఏళ్లుగా ఉంటోందని, ఇది నమ్మకానికి సంబంధించిన వ్యవహారమన్నారు. ఈ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. అటు దేశాన్ని కుదిపేస్తున్న మీటూ వివాదంపైనా రజనీకాంత్ స్పందించారు. ‘మీటూ’ ఉద్యమంతో మహిళలకు మేలు జరుగుతుందన్నారు. అయితే దీన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదని చెప్పారు. సరైన రీతిలో మీటూను బాధిత మహిళలు వినియోగించుకోవాలన్నారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను వైరముత్తు తోసిపుచ్చారని...తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కూడా వైరముత్తు చెప్పారని గుర్తుచేశారు. ఈ ఏడాది డిసెంబర్ 12వ, తేదీన పార్టీ, ఎజెండాను ప్రకటిస్తానని తాను చెప్పలేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. -
శబరిమల : మూడో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు
-
భక్తిలోనూ రాజకీయాలే!
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి సుప్రీం కోర్టు తీర్పు మేరకు అన్ని వయస్కుల మహిళలను అనుమతించకుండా ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థల భక్తులు అడ్డుకుంటుండడంతో శుక్రవారం నాటికి కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయ్యప్ప ఆలయానికి సరిగ్గా 23 కిలోమీటర్ల ఈవల నీలక్కళ్ వద్దనే ఓ టెంట్ వేసి ‘శబరిమల ఆచార సంరక్షణ సమితి’ బ్యానర్‌తో భక్తులు అయ్యప్ప ప్రార్థనలు జరుపుతున్నారు. అయ్యప్ప ఆలయానికి మొదటి ప్రవేశ మార్గంగా భావించే నీలక్కళ్ వద్దనే భక్తులతో వస్తున్న బస్సులను, ఇతర వాహనాలను ఆరెస్సెస్ కార్యకర్తలు ఆపివేసి మహిళలను దించివేస్తున్నారు. నీలక్కల్ వద్దనే ఆరెస్సెస్ టెంట్ వేయడంతో 1982లో చర్చి నిర్మాణానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ నిర్వహించిన ఆందోళన గుర్తుకు వస్తోంది. నీలక్కల్‌లోని శివాలయానికి సమీపంలో చర్చి నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ సంఘ్ పరివార్ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆ ఆందోళనకు నాయకత్వం వహించిన కుమ్మనమ్ రాజశేఖరన్ నేడు మిజోరమ్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అప్పుడాయన కేరళ విశ్వహిందూ పరిషత్ ప్రధాని కార్యదర్శిగా పనిచేశారు. శివాలయానికి సమీపంలో శిలువ 1982కు కొన్నేళ్ల ముందు నీలక్కళ్ శివాలయానికి సరిగ్గా 200 మీటర్ల దూరంలో పెద్ద శిలువ దొరికిందన్న ప్రచారం జరిగింది. ఏసుక్రీస్తు 12 ముఖ్య ప్రచార బోధకుల్లో ఒకరైన థామస్ కొన్ని శతాబ్దాల క్రితం అక్కడ చర్చిని నిర్మించారని, ఆ చర్చిలోని శిలువే బయటకు వచ్చిందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దాంతో శిలువ దొరికినట్లు భావించిన చోట క్యాథలిక్ చర్చి సభ్యులు చిన్న గుడిసె వేసి ప్రార్థనలు జరపడం ప్రారంభించారు. అక్కడ చర్చి పునర్నిర్మాణం కోసం క్యాథలిక్ చర్చి ‘నీలక్కళ్ కార్యాలయ సమితి’ని ఏర్పాటు చేసింది. ఈ చర్చి ఆందోళనను అడ్డుకోవడానికి సంఘ్ పరివార్ కొచ్చీలో హిందీ మహా సమ్మేళనాన్ని నిర్వహించింది. శివాలయం సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదంటూ ఆ సమ్మేళనం హిందువులకు పిలుపునిచ్చింది. 1982, మే 19న చర్చికి స్థలం కేటాయింపు అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కేరళ ప్రభుత్వం ఇరు మతాల వారిని మంచి చేసుకోవడంలో భాగంగా శివాలయానికి నాలుగు కిలీమీటర్ల దూరంలో చర్చి నిర్మాణాకి ఓ హెక్టార్ భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా వీహెచ్‌పీ నాయకుడు రాజశేఖరన్ నాయకత్వాన ఆరెస్సెస్ కార్యకర్తలు తిరువనంతపురంలో ర్యాలీ నిర్వహించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారన్న కారణంగా వెయ్యి మంది ఆరెస్సెస్ కార్యకర్తలు నాడు అరెస్టయ్యారు. అయినా చర్చి నిర్మాణాన్ని అడ్డుకోలేక పోయారు. ‘ఆ చర్చి ప్రభుత్వం మతతత్వ వాదానికి ప్రతీక, ఓట్ల కోసం ఆడిన నాటకం’ అని నాడు రాజశేఖరన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వమర్శించారు. నాటి ఆందోళనతో కేరళలో హిందూ సంఘాలు కాస్త బలపడ్డాయి. మద్దతిచ్చి మాటమార్చిన ఆరెస్సెస్, బీజేపీ అయ్యప్ప ఆలయంలోని అన్ని వయస్కుల ఆడవాళ్లను అనుమతిస్తూ సెప్టెంబర్ 28వ తేదీన సుప్రం కోర్టు ఇచ్చిన తీర్పును అదే రోజు ఆరెస్సెస్, బీజేపీ పార్టీలు స్వాగతించాయి. లింగ వివక్ష లేకుండా భక్తులందరికి సమాన హక్కులు ఉంటాయని, అందుకే కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆరెస్సెస్ రాష్ట్ర కార్యదర్శి పీ గోపాలన్కుట్టీ వ్యాఖ్యానించారు. ఆలయ ప్రవేశం విషయంలో లింగ వివక్షను ఎంత మాత్రం అనుమతించేది లేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై వ్యాఖ్యానించారు. అక్టోబర్ మూడవ తేదీ నాటికి కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అయ్యప్ప భక్తుల ఆందోళన తీవ్రతరం కావడంతో ఇద్దరు మాట మార్చేశారు. ఆరెస్సెస్ ప్రత్యక్షంగా ఆందోళనలోకి దిగి భక్తుల ఆందోళనకు నాయకత్వం వహిస్తోంది. ఎవరిది మాత్రం ఓట్ల రాజకీయం కాదు? -
శబరిమల ఆలయ సమీపంలోకి మహిళలు..!
-
శబరిమల ఆలయ సమీపంలోకి మహిళలు..!
నిలక్కళ్/పత్తనంతిట్ట/పంబ: శబరిమల ఆలయ పరిసరాల్లో మూడో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా భక్తులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. మాస పూజల కోసం బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు కేరళ చేరుకున్నారు. కాగా వారు ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. బుధ, గురు వారాల్లో ఆలయ పరిసరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులకు, భక్తులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసకుంది. అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేరళలో టెన్షన్ వాతావరణం చోటుచేసకుంది. మరోవైపు శుక్రవారం 250 మంది పోలీసుల బందోబస్తు మధ్య బుల్లెట్ ఫ్రూప్ జాకెట్, హెల్మెట్ ధరించిన ఇద్దరు మహిళలు ఆలయ సమీపంలోకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వారిలో ఒకరు జర్నలిస్టు కాగా, మరోకరు మహిళ కార్యకర్త ఉన్నారు. భక్తులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని శబరిమల పోలీసు కార్యాలయానికి తరలించారు. భక్తుల నిరసనల నేపథ్యంలో లోనికి అనుమతించడం సాధ్యం కాదని పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మహిళా జర్నలిస్టులు మాత్రం తాము దర్శనం చేసుకునే ఇక్కడి నుంచి వెళ్తామని పట్టుబడుతున్నట్టు సమాచారం. ఐజీ శ్రీజిత్ వారిని అక్కడి నుంచి వెనక్కి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలయ ప్రధాన పూజారి కూడా మహిళల చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రావెన్కోర్ ఆలయ కమిటీ ఈరోజు భేటీ కానుంది. కాగా, మహిళా జర్నలిస్టుల చర్యలపై కేరళ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తుల ముసుగులో అలజడి సృష్టించవద్దని పేర్కొంది. నిరసనల నేపథ్యంలో వారిని వెనక్కి వెళ్లాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేసింది. గురువారం కూడా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన న్యూయార్క్ టైమ్స్‌కు ఇద్దరు మహిళ జర్నలిస్టులను భక్తుల ఆందోళనల నేపథ్యంలో బలవంతంగా వెనక్కి పంపిచారు. -
సోషల్ మీడియా కామెంట్.. జాబ్ ఫట్
దుబాయ్: శబరిమల వివాదం నేపథ్యంలో మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు భారతీయుడొకరు సౌదీ అరేబియాలో ఉద్యోగం పోగొట్టుకున్నారు. కేరళకు చెందిన దీపక్ పవిత్రం.. రియాద్‌లోని లులు హైపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ శబరిమల ఆలయంలోకి ప్రవేశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వివక్షాపూరితమైన, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ‘మతపరమైన విషయాల్లో కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని అస్సలు సహించం. సోషల్ మీడియాను మా సిబ్బంది దుర్వినియోగం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామ’ని లులు గ్రూపు కమ్యూనికేషన్స్ అధికారి చీఫ్ వి నందకుమార్ తెలిపారు. అన్ని దేశాల సంస్కృతులను, మత విశ్వాసాలను గౌరవిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉద్యోగిపై కఠిన చర్య తీసుకున్నందుకు లులు గ్రూపు అధిపతి యూసుఫ్ అలీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే కారణంతో అంతకుముందు ఒమన్‌లో కేరళకు చెందిన మరో ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. కేరళ వరద బాధితులను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకుంది. అతడు క్షమాపణ చెప్పినప్పటికీ ఒప్పుకోలేదు. -
ఆరెస్సెస్ అండతోనే రెచ్చిపోయారు..
తిరువనంతపురం : శబరిమల ఆలయం వద్ద బుధవారం జరిగిన హింసకు ఆరెస్సెస్‌దే బాధ్యతని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. శబరిమల ఆలయం తెరుచుకున్న క్రమంలో నిన్న (బుధవారం) జరిగిన ఘటనల్లో దాడులకు తెగబడిన నిరసనకారులు ఆరెస్సెస్ మద్దతుతోనే చెలరేగారని ఆరోపించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడంపై కేరళలో పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. మహిళా భక్తులతో పాటు జర్నలిస్టులపైనా నిరసనకారులు విరుచుకుపడ్డారు. శబరిమల ఇతర ఆలయాలకు భిన్నంగా అన్ని విశ్వాసాలకు చెందిన ప్రజలను ఆలయంలోకి అనుమతిస్తుందని, ఈ విషయంలో సంఘ్ పరివార్, ఆరెస్సెస్‌లు ఎప్పుడూ అసహనంతో ఉంటారని, శబరిమలలోని ఈ ప్రత్యేకతను దెబ్బతీసేందుకు వారు చేయని ప్రయత్నం లేదని పినరయి విజయన్ ట్వీట్ చేశారు. ఆదివాసీ మలయారన్ వర్గీయులు శబరిమలలో పూజలు చేసే సంప్రదాయాన్ని వమ్ము చేయడంలో వారు కీలక పాత్ర పోషించారన్నారు. ప్రస్తుత సమస్యలను సైతం ఈ కోణంలో చూడాలన్నారు. ఆరెస్సెస్ అండతో కులతత్వ, ఫ్యూడల్ శక్తులు భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారని, దాడులతో భయోత్పాతం సృష్టించారని ఆందోళన వ్యక్తం చేశారు. -
శబరిమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. భగవత్ స్పందన!
నిలక్కళ్/పత్తనంతిట్ట/పంబ : శబరిమల ఆలయం పరిసర ప్రాంతాల్లో గురువారం కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళా భక్తులను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ.. భక్తులు చేపట్టిన ఆందోళన బుధవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళన చేపట్టిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ జరపడాన్ని నిరసిస్తూ.. గురువారం బంద్ చేపట్టారు. హిందూ సంఘాలు, భక్తుల బంద్‌తో కేరళలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్ణాటక, తమిళనాడు బస్సులను రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపివేశారు. బంద్‌తో కేరళ అంతటా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రుతుస్రావం అయ్యే వయస్సుల్లో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండగా, ఆ నిషేధాన్ని గత నెల 28న ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో గత కొన్నిరోజులుగా ఉధృతమైన నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందూ సంస్థలు చేపట్టిన బంద్‌కు బీజేపీ, దాని అనుబంధ పార్టీలు మద్దతు ఇవ్వగా.. కాంగ్రెస్ పార్టీ బంద్‌లో పాల్గొనకపోయినప్పటికీ.. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నట్టు తెలిపింది. మోహన్ భగవత్ స్పందన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమలలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. సమాజం, మహిళలు అంగీకరించి ఎంతోకాలంగా పాటిస్తున్న సంప్రదాయాలను పట్టించుకోకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, శబరిమలలోకి మహిళలను అనుమతించే విషయంలో మతపెద్దల అభిప్రాయాలను, కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి సుప్రీంకోర్టు తీసుకోలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని వెంటనే నిర్మించాలని, ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
శబరిమలకు వస్తున్న స్త్రీలను అడ్డుకుంటున్న భక్తులు
-
నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయం
-
నేడు తెరచుకోనున్న శబరిమల
తిరువనంతపురం: మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సాయంత్రం నుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనుంది. అన్ని వయసుల స్త్రీలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం ఇదే ప్రథమం. తీర్పుకు వ్యతిరేకంగా కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వామియే శరణమయ్యప్ప అంటూ భజన చేస్తూ మహిళలు సహా అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రధాన ద్వారమైన నిలక్కళ్ వద్దకు చేరి నిషేధిత వయస్సుల్లోని స్త్రీలను కొండ ఎక్కనివ్వకుండా అడ్డుకుంటున్నారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లకుండా ఇన్నాళ్లూ నిషేధం ఉండగా, వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పునివ్వడం తెలిసిందే. సుప్రీం తీర్పును నిరసిస్తూ త్రివేండ్రంలో ఓ మహిళ బహిరంగంగా ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా ఆమెను కాపాడారు. తీర్పు వచ్చాక తొలిసారిగా బుధవారమే ఆలయం తెరచుకోనుంది. ఆలయ భాగస్వామ్య పక్షాలతో మంగళవారం ట్రావెన్కోర్ దేవస్థాన మండలి భేటీ అయినప్పటికీ ఏకాభిప్రాయం లేకపోవడంతో కేరళలో నిరసనలను తగ్గించేందుకు తోడ్పడే పెద్ద నిర్ణయాలేవీ తీసుకోలేకపోయింది. తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా సుప్రీంకోర్టును తాము కోరేది లేదని కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పడం, అటు కేంద్రం నుంచి కూడా స్పందన లేకపోవడంతో నిరసనలు తాజాగా మరింత తీవ్రరూపం దాల్చాయి. ఓ భక్తురాలు మాట్లాడుతూ ‘నిషేధిత వయసులో ఉన్న ఏ మహిళనూ ముందుకు వెళ్లనివ్వం. వారు ఆలయంలోకి ప్రవేశించలేరు’ అని చెప్పారు. కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలి: ఎంపీ సుప్రీం కోర్టు తీర్పు నుంచి తప్పించుకునేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలని పత్తనంతిట్ట కాంగ్రెస్ ఎంపీ ఆంటోనీ డిమాండ్ చేశారు. శబరిమల ఆలయం పత్తనంతిట్ట నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది. సుప్రీం తీర్పుకు వ్యతిరేంగా ఎరుమేలిలో ఓ ధర్నాను ఆంటోనీ మంగళవారం ప్రారంభించారు. ఈ ధర్నాలో అన్ని మతాల మహిళలూ పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ ‘మరో నెలలో శబరిమల యాత్ర ప్రారంభం కానుంది. యాత్రికులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఈ నియోజకవర్గంలోని వ్యాపారులు ఏటా ఈ సమయానికల్లా ఏర్పాట్లు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈసారి అందరూ నిరసనల్లో పాల్గొనడానికే వెళ్తున్నారు’ అని ఎంపీ చెప్పారు. వెళ్లకుండా అడ్డుకోనివ్వం: సీఎం అయ్యప్ప గుడికి వెళ్తున్న మహిళలను నిలక్కళ్ వద్ద భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తు లు అడ్డుకుంటున్నారు. ప్రైవేటు వాహనాలేగాక కేఎస్ఆర్టీసీ బస్సుల్లోకి ఎక్కి నిషేధిత వయస్సుల్లో ఉన్న స్త్రీలను దించి వేస్తున్నారు. ఆలయానికి వెళ్తున్న భక్తులను అడ్డుకునేందుకు తాము ఎవరినీ అనుమతించబోమని కేరళ సీఎం విజయన్ చెప్పారు. ‘భక్తులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కోర్టు తీర్పును అమలు చేస్తాం’ అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై అన్న మాటలను ప్రస్తావించిన విజయన్.. రాష్ట్రం లో సమస్యలు, కల్లోలం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శబరిమలకు వెళ్లే నిషేధిత వయసుల్లోన్ని స్త్రీలను రెండు ముక్కలు చేసి ఓ భాగాన్ని సీఎంకు, మరో భాగాన్ని ఢిల్లీకి పంపాలంటూ బీజేపీ నేత, నటుడు కొల్లాం తులసి చేసిన వ్యాఖ్యలను సీఎం ఖండించారు. అన్ని వయసుల మహిళలను అనుమతిస్తే సామూహిక ఆత్మహత్యలు చోటుచేసుకుంటాయని శివసేన పార్టీ రాష్ట్ర విభాగం కూడా హెచ్చరించింది. -
నీ గుడి ముందే నిలిచాను స్వామీ... ఇయ్యరా దర్శనమూ!
దేవుడు వరమిచ్చినా..పూజారి లోపలికి రమ్మన్నా..దర్శన భాగ్యానికి అడ్డుగా నిలుస్తున్న ఆచారాల కారణంగా మహిళలు శబరిమల ఆలయం బయటే ఉండిపోవలసి వస్తుందా? నేడు అయ్యప్ప గుడి తలుపులు తెరుచుకుంటున్నాయి. శ ‘రణ’ ఘోషలో స్వామివారు ఈ భక్తురాళ్ల వేడుకోలును వింటాడా? దిక్కుతోచని స్థితి సాధారణంగా ప్రకృతి విలయాలప్పుడు ఉంటుంది. అప్పుడు దేవుడే దిక్కు అనుకుంటాడు మనిషి. ఇటీవలి వరదల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ.. ప్రస్తుతం మరో ‘విలయానికి’ సిద్ధంగా ఉంది. అది ‘దేవ విలయం’! దేవుడు సృష్టించిన విలయం అని కాదు. దేవుడి చుట్టూ మనుషులు సృష్టించుకుంటున్న విలయం! శబరిమల ఆలయంలోని అన్ని వయసుల మహిళల్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక.. ఆ తీర్పుపై అయ్యప్ప భక్తులు ‘ఒకటిగా’ విడిపోయారు. దీనర్థం ఏమిటంటే.. స్త్రీ, పురుష భక్తులు కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తలను, ప్రగతివాదులను విభేదించి ఒక పక్కకు వచ్చేయడం. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నవారికి, సమర్థిస్తున్నవారికి మధ్య పోరు మొదలై.. మేఘాలకు పేరైన కేరళను ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.విలయంలో మనిషికి దేవుడే దిక్కయినట్లు.. ఇప్పుడీ యుద్ధస్థితిలోనూ దేవుడు మనిషికి మార్గం చూపించగలడా? చూపించినా మనిషి చూడగలడా? నేడు శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఇందులో విశేషం ఏమీ లేదు. ప్రతి నెలా పూజల కోసం ఐదు రోజులు గుడి తలుపుల్ని తెరిచినట్లే ఈసారీ తెరుస్తున్నారు. అయితే ఎప్పటిలా భక్తులకు నెమ్మదైన మనసుతో అయ్యప్పను దర్శించుకునే భాగ్యం ఉంటుందా అన్నది సందేహం. గర్భగుడిలోకి వెళ్లేందుకు భక్తులు మొదట ‘పంపా’ ప్రాంతానికి చేరుకోవాలి. శబరిమల శిఖరానికి బేస్క్యాప్ (ఎక్కే చోటు) అది. అక్కడి నుంచి కొండ ఎక్కుతూ ఆలయం ఉండే ‘నిలక్కల్’కు చేరుకోవాలి. అయితే ఈ రెండు చోట్లకు ఇప్పటికే భక్తుల కన్నా ఎక్కువ సంఖ్యలో దాదాపు 30 వరకు రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన కార్యకర్తలు చేరుకున్నారు. వీళ్లందరి ధ్యేయం ఒక్కటే. ఆలయ దర్శనం కోసం వచ్చే 10–50 ఏళ్ల మధ్య వయసు గల స్త్రీలను నిరోధించడం. తిరిగి వెనక్కు పంపించడం! శబరిమలకు ఆత్మాహుతి దళం ఆలయంలోకి వెళ్లనివ్వకుండా మహిళల్ని అడ్డుకోవడం.. సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కుకు భంగం కలిగించే చర్య. అయితే పై సంస్థల వాళ్లెవరూ తీర్పును నేరుగా వ్యతిరేకించడం లేదు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం తీర్పును సమర్థించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్లలో ఎక్కువ శాతం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతుండగా.. స్థానిక ‘శివసేన’ కార్యకర్తలు, ‘అయ్యప్ప ధర్మసేన’ సభ్యులు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ రుతుక్రమ వయోపరిమితి మధ్య ఉన్న మహిళల్ని ఆలయంలోకి అనుమతించేది లేదని అంటున్నారు. శివసేన అయితే.. ఆలయ ఆచారాలను అతిక్రమించి లోపలికి ప్రవేశించాలని ప్రయత్నించే వారిని అడ్డుకునేందుకు ఏడుగురు సభ్యుల ఆత్మాహుతి దళాన్ని ఇప్పటికే శబరిమలకు పంపినట్లు ప్రకటించింది కూడా! ‘‘పంపాను దాటనివ్వం. ఒకవేళ ఆ స్త్రీలు దాటారంటే మా కార్యకర్తల మృతదేహాల మీదుగానే కొండపైకి ఎక్కాలి’’ అని సేన నాయకుడు పెరింగమల అజి అంటున్నారు. తృప్తి దేశాయ్ అయినా సరే.. ఆచారాన్ని ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు (మహిళాభక్తులు సహా) ప్రదర్శనలు జరుపుతున్న నేపథ్యంలో జెండర్ కార్యకర్త తృప్తి దేశాయ్ తను శబరిమలను దర్శించి తీరుతానని, మహిళల ప్రాథమిక హక్కులను ఎవ్వరూ అడ్డుకోజాలరని ముంబైలోని ఒక మలయాళం టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయన ఆమె పేరును ప్రస్తావించారు. అంతకుముందు తృప్తి దేశాయ్‌ని ఉద్దేశించే.. మలయాళ నటుడు కొల్లం తులసి (69).. శబరిమలను దర్శించే సాహసం చేసే ఏ మహిళనైనా రెండు ముక్కలుగా చీల్చేస్తాని అనడం తీవ్ర వివాదాస్పదం అయింది. కొండ కింద మానవ కంచె! శివసేనతో పాటు, అయ్యప్ప ధర్మసేన కూడా గట్టిగానే ఉంది. ధర్మసేనకు రాహుల్ ఈశ్వర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో మరణించిన శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందరరు మహేశ్వరరు మనవడే రాహుల్ ఈశ్వర్. ఆయన కూడా మíß ళల్ని అడ్డుకునేందుకు కొండ కింద ఒక మానవ కంచెను నిర్మిస్తున్నారు. ఈయనదీ శివసేన మాటే. కొండపై ఆలయానికి వెళ్లేందుకు నాలుగు ప్రధాన మార్గారంభాలు ఉన్నాయి. ‘‘ఆ నాలుగు చోట్లా మావాళ్లు ఉంటారు. వాళ్లకై వాళ్లు.. ఈ ఆచారాలను అతిక్రమించాలని చూసే మహిళల్ని భౌతికంగా ఏమీ అనరు. అయితే.. ఆ మహిళలు మా మృతదేహాలను దాటుకుంటూ వెళ్లాలి. మాది గాంధీ మార్గం’’ అంటున్నారు రాహుల్. నిలక్కల్‌లో సత్యాగ్రహం భారతీయ జనతా పార్టీ కూడా ఇదే దారిలో ఉంది. అయ్యప్పస్వామి జన్మస్థలంగా భావిస్తున్న పందరం నుంచి రాష్ట్ర సచివాలయానికి ఇటీవల యాత్ర జరిపిన బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శబరిమలకు కూడా నిరసన యాత్ర చేపట్టబోతోంది. పార్టీ మహిళా విభాగం ‘మహిళా మోర్చా.. ఈ నేడు (అక్టోబర్ 17) నిలక్కల్‌లో సత్యాగ్రహానికి కూర్చొంటోంది. బీజేపీ, అనుబంధ పార్టీల డిమాండ్ ఒక్కటే.. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వెయ్యాలని. లేదా తీర్పును శూన్యీకరించేలా ఒక ఆర్డినెన్స్ తేవాలని. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయ్ ఇందుకు సిద్ధంగా లేరు. శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై ఆయన సుముఖంగా ఉన్నారు. శబరిమల ఆలయం ‘ట్రావంకూర్ దేవస్వమ్ బోర్టు’ పరిధిలోకి వస్తుంది. బోర్డు అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ కూడా అన్నివర్గాల వారినీ ఆహ్వానించి, ఏకాభిప్రాయాన్ని సాధించడానికి తను చేయగలిగింది చేస్తున్నారు. మహిళా పోలీసుల సహాయం ఐదు రోజుల పూజల కోసం అక్టోబర్ 17న శబరిబల ఆలయ ద్వారాలు తెరుస్తున్న సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చని ఇంటిలిజెన్స్ వర్గాలు కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఏం చెయ్యాలన్న దానిపై పోలీస్ యంత్రాంగం ఏ విధమైన కార్యాచరణను సిద్ధం చేసిందో బయటికి వెల్లడించడం లేదు. ఈ ఐదు రోజుల పూజ తర్వాత.. కొద్ది రోజుల్లోనే అయ్యప్పల సీజన్ మొదలవుతుంది. ప్రస్తుతానికైతే 500 మంది మహిళా పోలీసులతో ఈ మహిళా భక్తుల సమస్యను నివారించవచ్చా అని శబరిమల ఉన్న పట్టణంతిట్ట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ టి.నారాయన్ యోచిస్తున్నారు. ఆహ్వానించిన ఆలయాల్లో అడుగుపెట్టాలి కానీ... ఆచారాలు, సంప్రదాయాలపట్ల, భగవంతుడిపట్ల భక్తి విశ్వాసాలు ఉన్నవారు వాటిని గౌరవించాలి కదా! మా గుడికి రావద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే, ఆ గుడికి స్త్రీలు వెళ్లడం అవసరమా? స్త్రీలు కూడా చూడదగ్గ ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిని సందర్శించి రావచ్చు కదా! ఎక్కడైతే ఆడవారికి ఆదరణ, గౌరవం, అభిమానం ఉంటాయో ఆ ఆలయానికి వెళ్లడం మర్యాద అనిపించుకుంటుంది. అంతేకానీ, కొన్ని వందల ఏళ్లుగా స్త్రీలు అడుగుపెట్టడం నిషేధించిన ఆలయానికి వెళ్లడం అవసరమా? ఇరువైపుల వాదనలూ ఓపిగ్గా విని, ఎవరి సంప్రదాయానికీ భంగం వాటిల్లకుండా ఉండేలా తీర్పులు ఇవ్వడం సముచితం. ఆడవాళ్లని ఎవరినీ రావద్దని అనడం లేదు. రుతుధర్మం ఉన్న స్త్రీలు మాత్రం రాకూడదని అంటున్నారు. దానిని గౌరవించి, ఆ ఆచారానికి కట్టుబడి ఉండటం సముచితం అనిపించుకుంటుందని నా అభిప్రాయం. – డా. ఎన్.అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త వారిని తక్కువ చేసినట్లు కాదు కదా! భారతదేశ సంప్రదాయంలో దేవాలయాలకు సంబంధించిన ఆగమశాస్త్రంలో ఎక్కడా స్త్రీలని కించపరచినట్టు కనిపించదు. స్వయంభూ లింగాలు, విగ్రహాలు ఉన్న ఆలయాలలో స్త్రీల విషయంలో స్పర్శదర్శనంతో సహా ఏ విధమైన అభ్యంతరమూ వ్యక్తం అయిన సందర్భాలు లేవు. తరతరాలుగా, యుగయుగాలుగా కూడా ఎక్కడా స్త్రీ పురుషులని వేరుగా చూడటం కానీ, స్త్రీలని తక్కువ చేసినట్లుగానీ లేవు.యజ్ఞోపవీతార్హత ఉన్నవారిలో కూడా.. పురుషులే యజ్ఞోపవీతం ధరిస్తారు కానీ స్త్రీలు యజ్ఞోపవీతం ధరించరు. ఏ ఆలయానికి సంబంధించిన ఆచారాలు, కట్టుబాట్లు ఆ ఆలయానికి ఉంటాయి.ప్రాంతీయాచారాలు ఉంటాయి. కొన్ని ఆలయాలు స్త్రీలకు నిషేధం ప్రకటించినట్లే, పురుషులకు ప్రవేశార్హతను నిషేధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. మనకు దేనికైనా రుషుల మాట ప్రమాణం. కొన్ని యంత్ర తంత్ర సిద్ధులతో మంత్రబద్ధం చేసి ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో స్త్రీలు ప్రవేశించకూడదన్న ఆచారం ఏళ్ల తరబడి ఉన్నప్పుడు దానిని గౌరవించడం మంచిది కదా! ఆలయంలో ప్రవేశం లేదని చెప్పినంత మాత్రాన వారిని తక్కువ చేసినట్లు భావించడం సరికాదు కదా! – మాతా రమ్యానంద భారతి, అధ్యక్షురాలు, శక్తిపీఠం -
‘అయ్యప్ప గుళ్లోకి ప్రవేశిస్తే నరికేస్తా’
తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించే సాహసం చేసిన మహిళలను అడ్డంగా నరికేస్తానంటూ బీజేపీ మద్దతుదారుడు, సినీ నటుడు కొల్లం తులసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల స్ర్తీలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఎన్డీయే నిర్వహించిన ర్యాలీలో తులసి ఈ వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలను నరికేసి ఒక సగం కేరళ ముఖ్యమంత్రికి మరో సగం ఢిల్లీకి పంపిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (‘శబరిమల’ నిరసన హింసాత్మకం) శబరిమల దేవాలయంలోకి స్త్రీలను అనుమంతిచడమంటే అయ్యప్ప పవిత్రతని దెబ్బతీయడమేననీ, సుప్రీం తీర్పు పట్ల మహిళలే విముఖంగా ఉన్నారని తులసి వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీం తీర్పుపై నిరసనలకు తోడు ఇప్పటికే పలువురు రివ్యూ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే, శబరిమల తీర్పుపై అత్యవసరంగా రివ్యూ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. భక్తులను తొక్కుతూ లోనికి ప్రవేశించండి.. ప్రతినెల అయ్యప్పకు పూజలుంటాయి. వచ్చే బుధవారం (అక్టోబర్ 17) జరిగే పూజా కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొంటారు. దేవాలయంలో భక్తులందరు నేలపై పడుకొని మొక్కులు చెల్లించుకుంటారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగా మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే.. నేలపై పడుకున్న భక్తులను చెప్పులతో, బూట్లతో తొక్కుతూ.. లోనికి వెళ్లండని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ వ్యాఖ్యానించారు.(తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!) Women coming to #Sabarimala temple should be ripped in half. One half should be sent to Delhi and the other half should be thrown to Chief Minister's office in Thiruvananthapuram: Actor Kollam Thulasi, in Kollam #Kerala. pic.twitter.com/r4cL72mzJm — ANI (@ANI) October 12, 2018 -
మహిళలే నిరసిస్తే ఎలా అయ్యప్పా!
సాక్షి, న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు సెప్టెంబర్ 28వ తేదీన సంచలన తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా అయ్యప్ప ఆలయంలో మహిళలకు తగిన సౌకర్యాలు కల్పిస్తామంటూ కేరళ ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు మంగళవారం నాటికి ఊపందుకున్నాయి. ఈ రోజు నుంచి సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆందోళనలను తీవ్రతరం చేయాలని కోచిలో సోమవారం నాడు జరిగిన 41 హిందూ సంఘాల నేతలు నిర్ణయించారు. వీరిలో ఆరెస్సెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ. గోపాలన్కుట్టీ కూడా పాల్గొన్నారు. ఆందోళనా కార్యక్రమాల కోసం ఆరెస్సెస్ ఓ కార్యాచరణ సమితి కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర బీజేపీ శాఖ కూడా ఆందోళనకు మద్దతు ప్రకటించింది. (శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు) సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆరెస్సెస్ నాయకుడు పీ. గోపాలన్ కుట్టీ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ‘సుప్రీం కోర్టు తీర్పును సంఘ్ పరివార్ శిరసావహిస్తోంది. కులం, లింగ వివక్ష లేకుండా ఆలయంలోకి వెళ్లే సమాన హక్కు భక్తులందరికి ఉండాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ కేరళ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై మాట్లాడుతూ ‘ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై వివక్ష చూపడాన్ని బీజేపీ ఎంత మాత్రం అనుమతించదు’ అని వ్యాఖ్యానించారు.‘మహిళల ప్రవేశాన్ని నియంత్రిస్తున్న ఆలయ యజమాన్యాల మనస్తత్వం మారాలి’ అని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషీ గతంలో పలుసార్లు వ్యాఖ్యానించారు. (తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!) ఓటు బ్యాంకు రాజకీయాలే సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అక్టోబర్ రెండున ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు మరుసటి రోజుకే ఊపందుకొని వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండడంతో ఆరెస్సెస్, బీజేపీ నాయకులు ఒక్కసారిగా మాట మార్చారు. ఆందోళన బాట పట్టారు. ముంబైలోని హాజి అలీ దర్గాలోకి, శని శింగ్నాపూర్ ఆలయాల్లో మహిళలను అనుమతించాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసినప్పుడు అదే పార్టీ ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరించడమంటే ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ, ఆరెస్సెస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఆరోపించారు. ఈ రోజు చర్చలకు రావాల్సిందిగా ఆయన పంపిన ఆహ్వానాన్ని ఆందోళన చేస్తున్న హిందూ సంఘాలన్నీ తిరస్కరించాయి. అయ్యప్ప సేవా సంఘంతో మొదలు సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అక్టోబర్ రెండవ తేదీన ఏ రాజకీయ పార్టీతోని సంబంధంలేని అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం పండలంలో శాంతియుతంగా ప్రదర్శన జరిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాయర్ సర్వీస్ సొసైటీ ‘నామ జప యాత్ర’ పేరిట నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. శబరిమల పూజారుల కుటుంబానికి చెందిన రాహుల్ ఈశ్వర్ నాయకత్వంలోని అయ్యప్ప ధర్మసేన, విహెచ్పీ నుంచి బహిష్కతుడైన ప్రవీణ్ తొగాడియా స్థాపించిన అంతరాష్ట్రీయ హిందూ పరిషత్ సహా దాదాపు హిందూ సంస్థలు నేడు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నాయి. (శబరిమల తీర్పును సవాల్ చేయం..) ఈ ప్రదర్శనల్లో మగవారికన్నా మహిళలే ఎక్కువగా పాల్గొనడం మరీ విచిత్రం. రాష్ట్రంలో 28 శాతం జనాభా కలిగిన ఎఝావా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం’తోపాటు ఆదివాసీ, దళిత సంఘాలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొనక పోవడమూ విÔó షమే. నిరసన ప్రదర్శనలను ఈ సంఘాల వారు అగ్రవర్ణాల ఆదిపత్య రాజకీయాలుగా వర్ణిస్తున్నాయి. చదవండి: శబరిమల: ‘మైలాచారాన్ని’ మరచిన సుప్రీంకోర్టు అయ్యప్పల ‘రివ్యూ’కు మోక్షం లేదా!? -
అయ్యప్పల ‘రివ్యూ’కు మోక్షం లేదా!?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావం వయస్కుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షుడు శ్యాలజ విజయన్ సోమవారం నాడు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవారిని అనుమతించాలని కోరుతూ ఇంతకుముందు పిటిషన్లు వేసిన వారు, అయ్యప్ప భక్తులు కారని, అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి అని నమ్మే భక్తుల నమ్మకాలను కాదనే హక్కు బయట వారికి లేదని రివ్యూ పిటిషన్లో వాదించారు. ఇదేమి కొత్త వాదన కాదు. జస్టిస్ ఇందు మల్హోత్ర మొన్న నలుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనే తన అభిప్రాయంగా చెప్పారు. ఎవరి మతరమైన నమ్మకాలు వారివని, మతపరమైన నమ్మకాలను కాదనడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలు కల్పిస్తున్న మత హక్కులను ఉల్లంఘించడమేనని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె వాదనను తిరస్కరిస్తూ మిగతా ముగ్గురు జడ్జీలు మహిళలకు అనుకూలంగా తీర్పు చెప్పారు. అలాంటప్పుడు ఆమె వాదననే ప్రాతిపదికగా తీసుకొని వేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు స్వీకరిస్తుందా? విచారిస్తుందా? స్వీకరించి, విచారించినా భిన్నమైన తీర్పు వెలువడే అవకాశం ఉందా? అన్నదే ఇక్కడ చర్చ. సాధారణంగా పాత వాదననే ప్రాతిపదికగా తీసుకునే పిటిషన్ సర్వ సాధారణంగా విచారణ యోగ్యం కాదు. సుప్రీం కోర్టు సంప్రదాయం ప్రకారం తీర్పు ఇచ్చిన బెంచీనే రివ్యూ పిటిషన్‌ను విచారించాల్సి ఉంటుంది. విచారణ యోగ్యమని సదరు బెంచీ అభిప్రాయపడినట్లయితే అదే బెంచీ దాన్ని విచారించవచ్చు. లేదా ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు మరో బెంచీకి అప్పగించవచ్చు. ఇటీవల తీర్పు ఇచ్చిన బెంచీలో మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రఛూడ్, జస్టిస్ రోహింటన్ నారిమన్, జస్టిస్ ఇందు మల్హోత్రలు ఉన్నారు. వారిలో దీపక్ మిశ్రా ఒక్కరే పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో బెంచీలోకి కొత్త వారు వస్తారు. కొత్తగా వచ్చే జస్టిస్ ఇందు మల్హోత్ర అభిప్రాలతో ఏకీభించినప్పటికీ విభేదించేవారు చంద్రఛూడ్, నారిమన్, ఖాన్‌విల్కర్‌లు ఉంటారు కదా! ఇక తీర్పు తారుమారే అవకాశం ఎక్కడిది? కొత్త వాదోపవాదాల కారణంగా న్యాయమూర్తుల అభిప్రాయాలు మారుతాయనుకుంటే తీర్పు ఎలా ఉండబోతుంది? హోమో సెక్యువాలిటీని నేరంగా పరిగణిస్తున్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 377వ సెక్షన్‌ను కొట్టివేస్తూ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఓ వాదనను తీసుకొచ్చారు. ‘నాన్ రెట్రోగెషన్’ దృక్పథం గురించి ఆయన ప్రస్తావించారు. అంటే, ప్రతీగమనం చేసి అంతకుముందున్న చోటుకన్నా అధ్వాన్నమైన చోటుకు రాకూడదనేది అర్థం. ఈ అర్థాన్ని విడమర్చి చెబుతూ రాజ్యాంగం స్ఫూర్తి ప్రకారం ఏ తీర్పయినా అంతకుముందు తీర్పుకన్నా మెరుగ్గా ఉండాలన్నారు. అందుకని ఓసారి కల్పించిన హక్కులను కోర్టులు కూడా వెనక్కి తీసుకోలేవని చెప్పారు. ఆయన మాటలను ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయస్కులైన మహిళలకు మొన్ననే కల్పించిన హక్కులను వెనక్కి తీసుకునే హక్కు సుప్రీం కోర్టుకు లేనట్లే. ఈ లెక్కన రివ్యూ పిటిషన్ కారణంగా తీర్పు మారే అవకాశమే లేదు. -
స్త్రీలోక సంచారం
‘అర్హత ఉండదు కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు కోరుకుంటారు’’ అని మహిళా సైంటిస్టులపై నోరు పారేసుకున్నందుకు ఒక సైంటిస్టు పరువు పోగొట్టుకున్నాడు. శుక్రవారం జెనీవాలో సి.ఇ.ఆర్.ఎన్. (యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్) సదస్సు జరుగుతోంది. ఐరోపాకు ఫిజిక్స్ ల్యాబ్ వంటిది సి.ఇ.ఆర్.ఎన్.! సదస్సులో 38 మంది సైంటిస్టులు మాట్లాడారు. వాళ్లలో ఒకరు అలెస్సాండ్రో స్ట్రుమియా. ఇటలీలోని పిసా యూనివర్సిటీ నుంచి సిద్ధాంత పత్రాలు పట్టుకుని వచ్చాడు ఆయన. స్పీచ్ మొదలైంది. ‘‘భౌతికశాస్త్రాన్ని నిర్మించింది మగవాళ్లే’’ అన్నాడు. అంతటితో ఊరుకోలేదు. ‘‘ఈ ఆడవాళ్లకు అర్హతలు ఉండవుగానీ, అందలాలు ఎక్కాలన్న కోరికలు మాత్రం ఉంటాయి’’ అన్నాడు. అకస్మాత్తుగా ఏమీ అతడు ఆడవాళ్ల ప్రస్తావన తేలేదు. ‘రిలేషన్షిప్ బిట్వీన్ హై ఎనర్జీ థియరీ అండ్ జెండర్’ అనే టాపిక్ మీద సెమినార్ అది. హై ఎనర్జీ థియరీ భౌతికశాస్త్రం లోనిదే. అలస్సాండ్రో తన పరిశీలనను వివరించడానికి తనతో పాటు స్లయిడ్స్, చార్టులు, గ్రాఫులు తెచ్చుకున్నాడు. ప్రధానంగా ఆయన పరిశీలన ఏంటంటే.. భౌతికశాస్త్ర రంగంలో మగవాళ్లు వివక్షకు గురవుతున్నారని! ఆ సంగతినే చాలా ఆవేదనగా చెబుతూ స్క్రీన్ మీద స్లయిడ్స్ వేస్తున్నాడు. ఒక స్లయిడ్లో మహిళలు క్యూలు కట్టి మరీ జెండర్ సైన్సెస్ తీసుకుంటున్నారు. తర్వాత వాళ్లంతా తమకు మూలకణ పరిశోధనా రంగంలో, కెమిస్ట్రీలో, ఇంజనీరింగ్‌లో ఉద్యోగావకాశాలు లేవని నిరసన ప్రదర్శన జరుపుతున్నారు. అంటే.. వ్యంగ్యం అన్నమాట. వీళ్లు చదివిందొకటి, అడుగుతున్నది ఒకటీ అని. అక్కడితో అలస్సాండ్రో ఆగలేదు. మగవాళ్ల గొప్పతనం గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘ఫిజిక్సులోకి రమ్మని మగవాళ్లను ఎవ్వరూ పిలిచి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్లంతట వాళ్లే ఫిజిక్సును నిర్మించుకున్నారు’’ అని ఇంకో స్లయిడ్లో చూపించాడు. ఇలా మహిళల్ని తక్కువ చేసి మాట్లాడ్డం సి.ఇ.ఆర్.ఎన్.కు కోపం తెప్పించింది. ఆహ్వానం పంపితే ఇంత అనాలోచితంగా మాట్లాడతాడా.. అని అతడిపై నిషేధం విధించింది. సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. జెనీవా ల్యాబ్‌లో భవిష్యత్తులో జరిగే ఏ కార్యక్రమానికీ అలెస్సాండ్రోకు పిలుపు ఉండదు. ఇలా అని సోమవారం నాడు సి.ఇ.ఆర్.ఎన్. ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అక్కసు వెళ్లగక్కితే అంతే.. ఉన్న అవకాశం కూడా పోతుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక, ఆ తీర్పును శిరసావహించి, మహిళా భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం కోసం కేరళ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఎన్ని సదుపాయాలను కల్పించగలిగినప్పటికీ.. స్త్రీలకు ప్రత్యేకంగా క్యూలు ఏర్పాటు చేయడం మాత్రం సాధ్యమయ్యేలా కనిపించడం లేదట! కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన హై–పవర్ కమిటీ ‘మహిళా క్యూ’ల ఏర్పాటు విషయమై ‘ఏమి సేతురా..’ అని ఆలోచనలో పడింది. రద్దీగా ఉండే రోజుల్లో శబరిమల భక్తులు అయ్యప్ప దర్శనం కోసం 8 నుంచి 10 గంటల పాటు పొడవాటి క్యూలలో నిరీక్షించవలసి వస్తుంది. మహిళలు అంతసేపు ఉండగలరా అన్నది హై కమిటీ సందేహం. మీటింగ్ అయ్యేసరికి కూడా ఈ సందేహానికి సమాధానం దొరకలేదు. అలాగని ప్రత్యేక మహిళా క్యూల ఏర్పాటుకు నిర్ణయమూ జరగలేదు. ‘‘ఇదేదో తలకుమించిన పనిలా ఉంది’’ అనుకుంటూ వెళ్లిపోయారు దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్. మనసుంటే మార్గం ఉండదా మంత్రివర్యా! ప్రభుత్వం తలచుకుంటే ఇదొక సంకటమా? మీదొక సందేహమా?! పోర్చుగీసు ప్రొఫెషన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో (33).. తొమ్మిదేళ్ల క్రితం లాస్ వెగాస్‌లోని ఒక హోటల్ పెంట్‌హౌస్‌లో తనపై అత్యాచారం చేసినట్లు ప్రముఖ మోడల్ క్యాథరీన్ మయోర్గా (34) గత నెలలో నెవాడాలోని జిల్లా కోర్టులో 32 పేజీల కంప్లయింట్ ఇచ్చిన విషయమై సోమవారం ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో రొనాల్డో సమాధానం ఇచ్చాడు. ‘‘వాళ్లు చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. అది ఫేక్. ఫేక్ న్యూస్’ అని ఓ అభిమానికి సమాధానం ఇచ్చిన రొనాల్డో ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ పోస్టును డిలీట్ చేశాడు! 2009 జూన్ 13న పెంట్‌హౌస్‌లో రొనాల్డో తనకు ఇష్టం లేకుండా తనను బలప్రయోగంతో లోబరుచుకున్నాడని బాధితురాలు చేసిన ఆరోపణ.. అతడిలా పోస్ట్‌ను డిలీట్ చెయ్యడంతో నిజమేనని అనుకోవలసి వస్తోంది. -
శబరిమలలో కనిపించిన మకర జ్యోతి
-
తెలంగాణ అయ్యప్పలపై కేరళ పిడుగు
సాక్షి, తిరువనంతపురం : తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో అడుగుపెట్టే వాహనాలపై కేరళ ప్రభుత్వం భారీగా రోడ్ ట్యాక్స్ విధించింది. కేరళ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించడంతో.. తామూ ఆ పని చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో రోడ్ ట్యాక్స్‌పై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పదాలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందాలను నీరుగార్చిందని కేరళ పేర్కొంది. అంతర్రాష్ట్ర రోడ్డు ట్యాక్స్‌లపై కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒప్పందాలున్నాయి. ఈ ఒప్పందాలను కొనసాగించాలని కేరళ ప్రభుత్వం చేసిన సూచనన తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వచ్చే స్టేజ్ కారియర్లపై కేరళ రోడ్డు పన్నును విధించింది. అయ్యప్పలపై పన్నుపోటు ప్రస్తుతం కేరళలోని అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి భారీ స్థాయిలో భక్తులు కేరళ వెళ్తున్నారు. వేల కొద్దీ తెలంగాణ వాహనాలు కేరళలో ప్రయాణిస్తున్నాయి. కొత్త ట్యాక్స్ ప్రకారం.. 49 సీట్లున్న స్టేజ్ కారియర్.. కేరళకు రూ. 15 వేలు పన్ను కట్టాలి. కేరళ ప్రభుత్వం ఒక్క సీటుకు రూ.300 నుంచి రూ. 400 వరకూ ఛార్జ్ చేస్తోంది. -
అయ్యప్ప దర్శనానికి మహిళల ప్రయత్నం
సాక్షి, శబరిమల : ఈ ఏడు అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ నెల 26న మండల పూజలు పూర్తయిన నేపథ్యంలో.. అయ్యప్ప ఆలయ ఆదాయాన్ని దేవస్థానం బోర్డు గురువారం ప్రకటించింది. మండల పూజల నాటికి 168.84 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం బోర్డు, కేరళ దేవాదాయ శాఖామంత్రి సురేంద్రన్ ప్రకటించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 25 వరకూ ప్రసాదం అమ్మకాల ద్వారా రూ. 20 కోట్లు వచ్చినట్లు ఆయన చెప్పారు. మండల - మకర విళక్కును పురస్కరించుకుని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకూ తెరచి ఉంచారు. మకరవిళక్కును పురస్కరించుకుని డిసెంబర్ 30 నుంచి జనవరి 14 వరకూ ఆలయాన్ని తెరచి ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకూ అయ్యప్ప ఆలయానికి వచ్చిన సొమ్మును.. శబరిమలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికే వినియోగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శబరిమల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని..ఆయన దేవస్థానం బోర్డుకు సూచించారు. మహిళల ప్రయత్నాలు.. అడ్డుకున్న అధికారులు ఈ ఏడాది కూడా అయ్యప్పను 10 నుంచి 50 ఏళ్ల మధ్యనున్న మహిళలు దర్శించే ప్రయత్నం చేసినట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఏ పద్మకుమార్ ప్రకటించారు. మండల పూజల సందర్భంగా 260 మంది స్త్రీలు.. అయ్యప్ప దర్శనం కోసం సన్నిధానంకు వచ్చారని ఆయన చెప్పారు. శబరిమల పవిత్రతను అందరు కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే వీరిని గుర్తించి వెంటనే వెనక్కు తిప్పి పంపినట్లు ఆయన తెలిపారు. శబరిమలలో ఆచార ఉల్లంఘన జరుగుతోందన్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అయ్యప్ప భక్తులకోసం కుటుంబశ్రీ మిషన్
సాక్షి, తిరువనంతపురం : నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా భక్తుల వస్తుంటారు. వీరిలో 65 శాతం మంది సొంత వాహనాలతో శబరిమలకు రావడం జరుగుతుంది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు.. రోడ్లకు ఇరువైపులా వాహనాలను నిలిపి వంట చేసుకోవడం పరిపాటి. ఇలా రోడ్ల పక్కన వంట చేసుకుని.. ఆపై వాటిని ఆలాగే వదిలివేయడం వల్ల భారీగా కాలుష్యం జరుగుతోంది. దీనిని నివారించేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ‘కుటుంబశ్రీ’ మిషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ మిషన్కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా.. టీడీబీ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తుంది. అందులో విశ్రమించడంతో పాటు.. వంటకు అవసరమైన పాత్రలు, గ్యాస్, నీరు, ఇతర వస్తువులను అందించడం జరుగుతుంది. వంట చేసుకుని భోజనం చేశాక.. కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చాలా తక్కువగా ఉంటుందని టీడీబీ అధికారులు ప్రకటించారు. కుటంబశ్రీ మిషన్ కింద ఇప్పటికే పథినంతిట్ట, నీలక్కల్, శబరిమల ప్రాంతాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు టీడీబీ ప్రకటించింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా.. జనవరి 5 లోపు ఏర్పాటు చేయడం జరుగుతుందని టీడీబీ తెలిపింది. -
ట్రాన్స్‌జెండర్‌ను అనుమతించని శబరిమల అధికారులు
సాక్షి,శబరిమల : శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన ఒక ట్రాన్స్‌జెండర్ (లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తి)ని అధికారులు లోపలకు అనుమతించలేదు. తమిళనాడు నుంచి వచ్చిన ట్రాన్స్‌జెండర్.. గురువారం సాయంత్రం అయ్యప్ప దర్శనానికి సన్నిధానం చేరుకున్నారు. వెళ్లూరుకు చెందిన మోహన్ (30) ఇతర స్వాముల మాదిరగానే.. 41 రోజుల పాటు దీక్ష చేసినట్లు తెలుస్తోంది. సన్నిధానం దగ్గర లింగమార్పిడి చేయించుకున్న మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో మోహన్.. లింగమార్పిడికి సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసుల ముందుంచారు. అయితే మోహన్ సమర్పించిన డాక్యుమెంట్లు సరిగా లేవని పోలీసులు తెలిపారు. సన్నిధానం నుంచి ఇద్దరు పోలీసులు మోహన్‌ను పంబాకు తీసుకు వెళ్లారు. ఇదిలా ఉండగా.. శబరిమల ఆలయంలోని అయ్యప్పస్వామిని 10-50 ఏళ్ల మధ్యనున్న మహిళలు దర్శించేందుకు వీలు లేదు. అలాగే లింగమార్పిడి చేసుకున్న వారికి కూడా ఈ నియమం వర్తిస్తుంది. మతాచారాలను అందరూ పాటించాల్సిందేనని వాటిని ఎవరూ ధిక్కరించరాదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఏ పద్మకుమార్ తెలిపారు. -
రికార్డు స్థాయిలో అయ్యప్ప ఆదాయం
సాక్షి, శబరిమల : ఈ ఏడాది శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆలయం తెరిచిన 25 రోజుల్లోనే అప్పయ్య ఆలయానికి రూ. 100 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఈ ఏడాది అదనంగా.. రూ. 15 కోట్లు వచ్చినట్లు టీడీబీ అధికారులు ప్రకటించారు. ఇది ఆల్ టైమ్ రికార్డుగా కూడా వారు చెబుతున్నారు. మండల పూజలు పూర్తయ్యే నాటికి ఆదాయం మరింత పెరుగుతుందని వారు అంటున్నారు.గత ఏడాది ఇదే సమయానికి ఆలయానికి 85.96 కోట్ల రూపాయలు ఆదాయంరాగా..ఈ ఏడాది అదనంగా మరో 15 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీడీపీ పేర్కొంది. మొత్తం రెవెన్యూ వివరాలు శబరిమల అప్పయ్య మొత్తం రెవన్యూ : 101, 08,80,925 అరవణ, అప్పం ప్రసాదం అమ్మకల ద్వారా : 52,63,02,745 హుండీ ఆదాయం : 35,89,26,885 భారీగా భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పంబ, శరంగుత్తి, సన్నిధానం దగ్గర భారీ రద్దీ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు రద్దీలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. వారిని పోలీసులు ప్రత్యేక దారిలో పంపుతున్నారని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. నెయ్యాభిషేకం కోసం అయ్యప్ప భక్తులు ఇరుముడి నెయ్యి కోసం మాళికాపురం ఆలయం దగ్గరి ప్రాంతాన్ని కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు ఇరుముడి, నెయ్యిని ఇక్కడే విప్పుకోవచ్చని తెలిపారు. అలాగే అయ్యప్ప ఆలయానికి ఉత్తరాన భండారం పేరుతో మరో కాంప్లెక్స్ ఉందని.. అక్కడ కూడా నెయ్యాభిషేకం చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
సన్నిధానం చుట్టూ భారీ భద్రత
సాక్షి, తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప ఆలయంపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచరంతో ఈ ఏడు భారీ భద్రతను పెంచారు. అలాగే ఈ సంవత్సరం ఆలయానికి భక్తులు ఎన్నడూ లేనంతగా వస్తారనే అంచనాలతో భధ్రతను కేరళ ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. శబరిమల ఆలయం చుట్టూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కేరళ పోలీస్ బలగాలు ఆలయ భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అలాగే.. పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఇప్పటికే నేవీ తమ ఆధీనంలోకి తీసుకుంది. డ్రోన్లతో పహారా! శబరిమల అయ్యప్ప సన్నిధానంకు ఈ ఏడు కేరళ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రధానంగా సన్నిధానంను ప్రతిక్షణం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డ్రోన్లను రంగంలోకి దింపింది. సన్నిధానంతో పాటు పంబా, అడవిదారి, ఎరుమేలి, ఇతర ముఖ్యప్రాంతాల్లో సైతం భద్రను పెట్టినట్టు సన్నిధానం ప్రత్యేక పోలీసు అధికారి కేకే జయరామన్ తెలిపారు. పదునెట్టాంబడి చుట్టూ పారా మిలటరీ బలగాలు పహారా కాస్తుంటాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచీ! అయ్యప్ప భద్రత కోసం కేరళ పోలీసులతో పాటు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకనుంచి అదనపు బలగాలను తెప్పించుకున్నట్లు కేకే జయరామన్ చెప్పారు. అయ్యప్పలు సహరించాలి అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రధానంగా నీలిమల, మరక్కూట్టం యూ టర్న్, లోయర్ తిరుమట్టం వద్ద సెక్యూరిటీ చెకింగ్ ఉంటుందని చెప్పారు. అనుమతి ఉన్న వారికే! సన్నిధానానికి వెళ్లే ప్రత్యేకదారిలో.. కేవలం అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అనుమతి పత్రం, లేదంటే కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటీ కార్డు ఉండాలని చెప్పారు. -
శబరిమలలో ఏపీ పోలీసులకు తీవ్రగాయాలు
శబరిమల : శబరిమల సన్నిధానం సమీపంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 14మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా వీరంతా శబరిమలలో విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని కేరళ ఆర్టీసీ బస్సు వేగంగా ముందు నుంచి ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పోలీసుల వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శబరిమలను కుదిపేస్తున్న ‘ఓక్కి’
సాక్షి, శబరిమల : కేరళలో ఓక్కి తుపాను విజృంభిస్తోంది. శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన వేలాదిమంది భక్తులు ఓక్కి తుపాను ధాటికి విలవిల్లాడుతున్నారు. తుపాను ప్రభావం చాలా ఎక్కువగా ఉండడంతో భక్తులను అడవి మార్గం గుండా ప్రయాణించవద్దని ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించింది. ముఖ్యంగా ఎరుమేలి-పంబా, సథరం-పులిమేడు మార్గాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని టీడీబీ పేర్కొంది. సన్నిధానం చుట్టూ ఉన్న ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో పెనుగాలులు వీస్తున్నాయని, అలాగే వర్షం కూడా కురుస్తోందని అధికారులు తెలిపారు. పంబానది కూడా ఉధృతంగా ప్రవహిస్తోందని.. భక్తులెవరూ నదిలోకి దిగి స్నానాలు చేయవద్దని అధికారులు ఆదేశించారు. అలాగే.. భక్తులు ఓకి తుపాను తగ్గే వరకూ రక్షణ ప్రాంతంలో ఉండాలని టీడీబీ పేర్కొంది. ఇదిలా ఉండగా ఎరుమేలి-కరిమల-సన్నిధానం మార్గం అత్యంత ప్రమాదకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మార్గంలో గాలుల ధాటికి పెద్దపెద్ద వృక్షాలు కూలిపోయాయని వారు అంటున్నారు. పంబదగ్గరున్న త్రివేణి పార్కింగ్ ప్రాంతం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. ఇక్కడ పార్కింగ్‌లో ఉన్న వాహనాలు సైతం నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ప్రస్తుతం శబరిమలకు రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. అలాగే శబరిమల ప్రాంతంలోని నదులు, నీటి ప్రవాహాలకు, విద్యుత్ స్థంభాలకు, చెట్లకు భక్తులు దూరంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇతర సూచనలు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ భక్తులు యాత్ర సాగించరాదు పంబనుంచి సన్నిధానం వరకూ నడిచే సమయంలో విద్యుత్, చెట్లకూ దూరంగా ఉండాలి. తుపాను దృష్ట్యా ఎరేమేలి-పంబా నడకదారి నిషేధం సన్నిధానం, పంబల్లో ప్రభుత్వం ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసింది. భక్తులు అందులోనే విశ్రాంతి తీసుకోవాలి. -
శబరిమల దర్శన వేళలు పెంపు
శబరిమల : అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. శబరిమల అయ్యప్పస్వామి ఆలయ దర్శన వేళల్లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మార్పులు చేసింది. ప్రధానంగా మండల పూజల సమయంలో అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు ఈ ఏడాది భారీగా భక్తులు రావచ్చన్న సంకేతాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న దర్శన సమయాన్ని పొడిగించింది. భక్తులు ఇకపై తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారిని దర్శించుకోవచ్చు. గతంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించేవారు. అలాగే అర్ధరాత్రి ఒంటి గంటవరకూ స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇదే గతంలో 11 గంటలకు అయ్యప్ప స్వామి హరివరాసనం చేసిన తరువాత ఆలయాన్ని మూసివేసేవారు. ఇప్పుడు హరివరాసనం పూజను అర్ధరాత్రి 1 గంటకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సవరణ కేవలం మండల పూజల వరకే ఉంటుందని ట్రావెన్ కోర్దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. భారీగా పోలీసు భద్రత ఈ ఏడాది శబరిమలకు భారీగా భక్తులు వస్తారన్న అంచనాలు, అలాగే ఉగ్రదాడులు జరిగే అవకాశముందన్న నిఘావర్గాల సమాచారంతో ఈ దఫా ఎన్నడూ లేనంత భద్రతను ఆలయానికి కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా శబరిమల ఆలయం, స్వామి సన్నిధానం, మాలికాపురం, శరంగుత్తి, పంబా గణపతి ప్రాంతాల్లో భారీ భద్రతను కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 1500 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తుంటారని ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులు తెలిపారు. -
ముగిసిన అయ్యప్పల పాదయాత్ర
-
శబరిమలలో ఆధునిక సౌకర్యాలు
సాక్షి, శబరిమల : కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం.. అయ్యప్ప భక్తుల కొరకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. మహిళా భక్తుల కోసం పంబా నుంచి సన్నిధానం వరకూ ప్రత్యేక క్యూ లైన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మండల పూజలు ఆరంభం కానున్న నేపథ్యంలో శబరిమల ఆయ్యప్పస్వామి ఆలయాన్ని బుధవారం అర్చకులు తెరవనున్నారు. గరురువారం నుంచి సాధారణ అనుమతి వేళల్లో స్వామి వారిని భక్తులు దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా శబరిమలలో నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని కేరళ ప్రభుత్వం మొదలు పెట్టింది. ప్రతిరోజూ 5 వేల మంది భక్తులు భోజనం చేసేలా వసతి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు కేరళ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి సుందరన్ తెలిపారు. ఈ అన్నదానం జనవరి 14 మకర విళక్కు వరకూ కొసాగుతుందని ఆయన చెప్పారు. అరవణ ప్రసాదం, అప్పం అందరికీ అందేలా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. వనయాత్ర (పెద్దపాదం) చేసే భక్తులకు తాగు నీటికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడవుల్లో ప్లాస్టిక్ నిషేధించిన కారణంగా.. బక్తులు ఎవరూ ప్లాస్టిక్ బాటిల్స్ తమ వెంట తీసుకెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు. -
శబరిమలకు 156 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 156 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, నిజామాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, తిరుపతి, కాకినాడ, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్‌ల నుం చి నవంబర్ 10, జనవరి 18వ తేదీల మధ్య నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. వీటికి సోమవారం ఉదయం 8 గంటల నుం చి అడ్వాన్సు రిజర్వేషన్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఇవీ రైళ్ల వివరాలు.. హైదరాబాద్–కొల్లాం–హైదరాబాద్(వయా కాజీపేట, గూడూరు, రేణిగుంట) నవంబర్ 17, 21 డిసెంబర్ 11, 15, 23, 31, జనవరి 3, 5, 7, 9, 11, 13 తేదీల్లో. తిరుగు ప్రయాణంలో నవంబర్ 15, డిసెంబర్ 1, 8, 15, 24, జనవరి 2, 5, 7, 9, 11, 13, 15 తేదీల్లో. హైదరాబాద్–కొల్లాం–హైదరాబాద్ (వయా రాయచూరు, గుంతకల్, రేణిగుంట) నవంబర్ 25, డిసెంబర్ 16, 19, 24 జనవరి 4, 6, 8, 10, 12, 14, 15 తేదీల్లో ఉంటాయి. తిరుగు ప్రయాణంలో నవంబర్ 27, డిసెంబర్ 18, 21, 26, జనవరి 6, 8, 10, 12, 14, 16, 17 తేదీల్లో. నిజామాబాద్–కొల్లాం–నిజామాబాద్ నవంబర్ 13, 29. తిరుగు ప్రయాణంలో నవంబర్ 19, 23 తేదీల్లో. కాకినాడ టౌన్–కొల్లాం–కాకినాడ టౌన్ నవంబర్ 10, 15, 19, 23, 27, డిసెంబర్ 12, 14, 17, 18, 20, 21, 23, 24, 28, జనవరి 1, 3, 4, 6, 7, 10, 11, 13, 14 తేదీల్లో. తిరుగు ప్రయాణంలో నవంబర్ 12, 17, 21, 25, 29, డిసెంబర్ 14, 16, 19, 20, 22, 23, 25, 26 30 , జనవరి 3, 5, 6, 8, 9, 12, 13, 15, 16 తేదీల్లో. హైదరాబాద్–కొల్లాం–హైదరాబాద్ (వయా నడికుడి, గుంటూరు) డిసెంబర్ 12, 20, 30, జనవరి 2, 16 తేదీల్లో. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 14, 22, జనవరి 1, 4, 18 తేదీల్లో. కరీంనగర్–కొల్లాం–కరీంనగర్ డిసెంబర్ 29, కాచిగూడ–కొల్లాం–కాచిగూడ జనవరి 1. తిరుగు ప్రయాణంలో జనవరి 3. నర్సాపూర్–కొల్లాం–నర్సాపూర్ డిసెంబర్ 29, 30. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 31, జనవరి 1. మచిలీపట్నం–కొల్లాం డిసెంబర్ 10, 16, 19. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 9, 15, 18 తేదీల్లో. విజయవాడ –కొల్లాం డిసెంబర్ 8, 14, 23. తిరుగు ప్రయాణం డిసెంబర్ 12, 21, 24. అకోలా–కొల్లాం (వయా నిజామాబాద్) డిసెంబర్ 14. ఆదిలాబాద్ –కొల్లాం డిసెంబర్ 28. సిర్పూర్ కాగజ్‌నగర్–కొల్లాం జనవరి 5, 11. కొల్లాం–సికింద్రాబాద్ డిసెంబర్ 31, జనవరి 7, 13. మచిలీపట్నం–కొల్లాం జనవరి 7, 13. తిరుగు ప్రయాణంలో.. జనవరి 6, 12 తేదీల్లో. విజయవాడ–కొల్లాం జనవరి 4, 10 తేదీల్లో. తిరుగు ప్రయాణం జనవరి 9, 15. కొల్లాం– తిరుపతి డిసెంబర్ 9, 16, 23, 30. తిరుపతి–అకోలా డిసెంబర్ 18. తిరుపతి–ఔరంగాబాద్ డిసెంబర్ 11, 25. తిరుపతి–ఆదిలాబాద్ జనవరి1వ తేదీన నడుస్తాయి. మరికొన్ని రైళ్లను కూడా త్వరలో ప్రకటించనున్నారు. రైళ్ల సమయాలు సహా ఇతర వివరాలు దక్షిణ మధ్య రైల్వే వెబ్సైట్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. -
‘శబరిమలను థాయ్లాండ్గా మార్చొద్దు’
చెన్నై : ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలను థాయ్‌లాండ్ కానివ్వమని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు చీఫ్ ప్రయార్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. సుప్రీం కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా సంప్రదాయ కుటుంబాల్లో జన్మించిన మహిళలు స్వతంత్రంగా ఆలయంలోకి ప్రవేశించకుండా ఉండాలని అన్నారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ గళమెత్తిన విమర్శకులపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. శబరిమలను థాయ్‌లాండ్ మార్చొద్దని వ్యాఖ్యానించారు. సవాళ్లతో కూడుకున్న నడకదారిలో 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలను వెళ్లడానికి అనుమతిస్తే.. భద్రత సంగతేమిటని ప్రశ్నించారు. -
శబరిమలలో ఆగిన పనులు
కొల్లాం: ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలతో శబరిమలలో పనులను బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వ కాంట్రాక్టర్లు ప్రకటించారు. ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉన్న అయ్యప్ప దేవస్థానం బోర్డు, కేరళ ప్రభుత్వం సంయుక్తంగా శబరిమల ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాయి. ముఖ్యంగా క్యూలైన్, దర్శనానంతరం కిందకు దిగేదారి వంటి పనులతో పాటు కొండమీద మరిన్నిపనులను సత్వరమే పూర్తి చేయాలని దేవస్థానం బోర్డు భావిస్తోంది. అవినీతి పరులైన కొందరు కాంట్రాక్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ కాంట్రాక్టర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కాంట్రాక్టర్లు కొల్లాం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిని నిరసిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టర్లు పనులను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శబమరిమల, కొల్లాం -
శబరిమల హుండీలో పాక్ కరెన్సీ కలకలం
శబరిమల: ప్రముఖ శబరిమల అయ్యప్ప ఆలయ హుండీలో పాకిస్తాన్ కరెన్సీ నోటు బయటపడటం కలకలం రేపింది. దీనిపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఆలయ హుండీని తెరవగా అందులో రూ. 20 పాకిస్తాన్ నోటు కనిపించింది. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు విదేశీ కరెన్సీని కానుకగా వేయటం సహజమే అయినప్పటికీ పాకిస్తాన్ నోటు కావటంతో పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ నోటు హుండీలో ఎవరు వేశారనే విషయాన్ని తేల్చడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను నిశితంగా పరిశీలించామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పత్తనమిట్టలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. నవంబర్ నుంచి జనవరి వరకు మాల ధారులు, భక్తుల కోసం నిరవధికంగా తెరిచి ఉంటుంది. ఆ తర్వాతి కాలం మళయాళ క్యాలండర్ ప్రకారం నెలలో ఐదు రోజులు తెరచి ఉంటుంది. -
శబరిమల ఘటనపై కేరళ పోలీసుల దర్యాప్తు
- ఉయ్యూరు, విజయవాడలో తనిఖీలు - పాదరసం విక్రేతను ప్రశ్నించిన పోలీసులు ఉయ్యూరు (పెనమలూరు): శబరిమలలో చిక్కుల్లో పడిన తెలుగు భక్తులను విడిపించే ప్రయత్నంలో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు , ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నా... ఫలితం లేకుండానే పోయింది. కేరళ పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక్కడి ప్రభుత్వం, నిఘా విభాగం కేరళ ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు భక్తులు భక్తిభావంతోనే చేశారని, తెలియక జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని నివేదించినా పట్టించుకోలేదు. ఐదుగురుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం, కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలింపు జరిగిపోయాయి. ఉయ్యూరు, విజయవాడలో దర్యాప్తు.. కేరళ నుంచి పోలీసు బృందం విజయవాడ చేరుకుంది. కమిషనరేట్‌లో బుధవారం ఆ బృందం కేసు పూర్వాపరాలపై ఆరా తీశారు. అక్కడి నుంచి ఉయ్యూ రు చేరుకుని పూజాసామగ్రి అమ్మిన మణికంఠ జనరల్ స్టోర్స్‌లో తనిఖీలు నిర్వహించారు. స్టోర్ యజమాని నాగరాజును పాదరసం ఎక్కడి నుంచి కొన్నది, పూజా సామగ్రి ఎవరికి అమ్మినది.. అనే అంశాలపై ప్రశ్నలు వేసి అదుపులోకి తీసుకున్నారు. రహస్యంగా నాగరాజును విజయవాడలో పాదరసం అమ్మే దుకాణం వద్దకు కూడా తీసుకువెళ్లి దర్యాప్తు చేపట్టారు. దుకాణదారుల వద్ద స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్లు సమాచారం. -
శబరిమలలో చిక్కుల్లోపడ్డ తెలుగు భక్తులు
ఉయ్యూరు (పెనమలూరు): శబరిమలలో తెలియక చేసిన తప్పు తెలుగు భక్తులను చిక్కుల్లోకి నెట్టింది. ఆలయంలోని ధ్వజస్తంభంపై వేసిన పూజాద్రవ్యాల వల్ల అపచా రం జరగడంతో కృష్ణా జిల్లాకు చెందిన భక్తుల్ని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం బంగారు ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట, పెద ఓగిరాలకు చెందిన దండమూడి లక్ష్మణ చౌదరి, దండమూడి వెంకట్రావ్, బొమ్మారెడ్డి సత్యనారాయణరెడ్డి, కట్టా సుధాకర్‌రెడ్డి, గుంటక ఉమామహేశ్వరరెడ్డి వెళ్లారు. వీరు తీసుకువెళ్లిన పూజా ద్రవ్యాలను ధ్వజస్తంభం ప్రతిష్టించకముందు భూమిలో వేయాలి. వీరు వెళ్లేసరికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించడంతో.. తమ వద్ద ఉన్న పూజా ద్రవ్యాలను వారు ధ్వజస్తంభంపై చల్లారు. దీంతో ఆ ప్రాంతంలో బంగారు తాపడం స్వల్పంగా దెబ్బతింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ ఐదుగుర్నీ గుర్తించిన దేవస్థానం బోర్డు వారిని కేరళ పోలీసులకు అప్పగించింది. తమకు తెలియక చేశామని వేరు వేడుకున్నా ఫలితం లేకపోయింది. కాగా, దీనిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
శబరిమలలో కలకలం
తిరువనంతపురం: కేరళలోని సుప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆదివారం ప్రతిష్టించిన బంగారు పూత ధ్వజస్తంభం ధ్వంసం కావడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 9.16 కిలోల బంగారం, 300 కిలోల రాగి, 17 కిలోల వెండితో తయారైన ధ్వజ స్తంభాన్ని ఉదయమే ఆలయ ప్రధాన అర్చకుడు ప్రతిష్టించారు. దాని అడుగుభాగం ధ్వంసమైనట్లు సాయంత్రం గుర్తించారు. సీసీటీవీ కెమెరాల్లో... ముగ్గురు పాదరసాన్ని ధ్వజస్తంభం అడుగు భాగంలో చల్లుతున్నట్లు కనిపించింది. నిందితులను పోలీసులకు అప్పగించామని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు గోపాలకృష్ణన్ చెప్పారు. రూ. 3.5 కోట్ల ఖర్చుతో తయారు చేసిన ఈ ధ్వజస్తంభాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త ఆలయానికి విరాళంగా ఇచ్చారు. వ్యాపారంలో ఆయన ప్రత్యర్థులే ఈ పని చేయించివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శబరిమల ఆయలంలో ఈ నెల 28 నుంచి పది రోజుల ఉత్సవాలు నిర్వహించారు. జూలై 7 ఆలయాన్ని మూసివేయనున్నారు. -
అయ్యప్ప ఆదాయం రూ. 243.69 కోట్లు
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా దీక్ష తీసుకునే స్వాములు, భక్తుల సందర్శనతో శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 2016-17 సంవత్సరానికి అన్ని రకాల ఆదాయాలు కలిపి స్వామివారికి రూ.243.69 కోట్లు వచ్చాయని రాష్ట్ర దేవస్వోమ్ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. నవంబర్- జనవరి మధ్య కేవలం హుండీ ద్వారానే రూ.89.70 రాగా, అప్పం విక్రయాలతో రూ.17.29 కోట్లు వచ్చినట్లు వివరించారు. దీంతో పాటు ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.46.14 కోట్లు మంజూరు చేసిందని ఆయన వివరించారు.