Toll Gate
-
హైదరాబాద్– విజయవాడ హైవే.. ఏ వాహనానికి ఎంత టోల్ చార్జీ?
టోల్ ప్లాజాల్లో సవరించిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది. హైదరాబాద్– విజయవాడ మార్గంలోని నేషనల్ హైవే–65పై టోల్ చార్జీలు తగ్గగా, తెలంగాణ (Telangana) మీదుగా సాగే ఇతర జాతీయ రహదారులపై మాత్రం చార్జీలు పెరిగాయి.వరంగల్– హైదరాబాద్ బైపాస్ రోడ్డుపై టోల్ ప్లాజాల్లో చార్జీలు.. → కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనం ఒక వేపు రూ.125, అప్, డౌన్ రూ.190, లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు రూ.205, అప్, డౌన్ రూ.305, బస్సు, ట్రక్కుకు ఒక వైపు రూ.425, అప్, డౌన్ రూ.635, కమర్షియల్ వాహనం ఒక వైపు రూ.465, అప్, డౌన్ రూ.695, హెచ్‌సీఎం, ఈఎంఈ వాహనం ఒకవైపు రూ.665, అప్, డౌన్ రూ.1,000, ఓవర్‌సైజ్ వాహనం ఒక వైపు రూ.810, అప్, డౌన్ రూ.1,215, నెలవారీ పాస్ (Monthly Pass) ధర రూ.340 నుంచి రూ.350కి పెరిగింది. ఎన్‌హెచ్–44పై ఇందల్వాయి టోల్గేట్ వద్ద ఇలా.. → నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్ లేదా లైట్ మోటార్ వాహనాలకు సింగిల్ జర్నీకి రూ. 90గా టోల్ చార్జీ ఖరారైంది. అలాగే 24 గంటల్లోపు రిటర్న్ జర్నీకి రూ. 135, 50 సింగిల్ జర్నీలతో కూడిన మంత్లీ పాస్‌కు రూ. 3,035, టోల్‌ప్లాజాకు 20 కి.మీ. పరిధిలో ఉండి రిజిస్టర్ చేసుకున్న వాహనాలకు మంత్లీ పాస్ రూ. 350కు పెరిగాయి. → లైట్ కమర్షియల్ వాహనాలు, లైట్ గూడ్స్ వాహనాలు, మినీ బస్‌లకు సింగిల్ జర్నీకి రూ. 145, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ. 220, మంత్లీ పాస్‌కు రూ. 4905లకు పెరిగాయి. → బస్‌లు, రెండు ఎక్సెల్ గల ట్రక్కులకు సింగిల్ జర్నీకి రూ. 310, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ. 465, మంత్లీ పాస్‌కు రూ.10,280 లకు పెరిగాయి. → హెవీ కన్స్ట్రక్షన్ వాహనాలు, ఎర్త్ మూవింగ్ వాహనాలు, మల్టీపుల్ ఎక్సల్ వాహనాలకు సింగిల్ జర్నీకి రూ.485, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ.725, మంత్లీ పాస్‌కు రూ.16,120 లకు పెరిగాయి. చదవండి: హైదరాబాద్– విజయవాడ హైవేపై టోల్ చార్జీలు ఎందుకు తగ్గాయి?→ ఏడు ఎక్సెల్లు కలిగి ఉన్న భారీ వాహనాలకు సింగిల్ జర్నీకి రూ. 590, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ.885, మంత్లీ పాస్‌కు రూ. 19,625లకు చార్జీలు (Charges)పెరిగాయి. -
విజయవాడ హైవేపై తగ్గాయి.. మిగతా చోట్ల పెరిగాయి
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/చౌటుప్పల్ రూరల్, కేతేపల్లి/రఘునాథపల్లి/దేవరుప్పుల/ఇందల్వాయి: రాష్ట్రంలోని జాతీయ రహదారులపై కొత్త టోల్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) సవరించిన చార్జీలను ప్రకటించింది. దీనిప్రకారం హైదరాబాద్– విజయవాడ మార్గంలోని నేషనల్ హైవే–65పై కనిష్టంగా రూ. 15 నుంచి గరిష్టంగా రూ. 160 దాకా టోల్ చార్జీలు తగ్గాయి. అదే సమయంలో తెలంగాణ మీదుగా సాగే ఇతర హైవేలపై మాత్రం టోల్ చార్జీలు 3.5% నుంచి 5% వరకు పెరిగాయి. ఎన్‌హెచ్ 65పై వాహనదారులకు తగ్గిన భారం.. ఎన్హెచ్ఏఐ నిర్ణయంతో హైదరాబాద్–విజయవాడ మార్గంలోని ఎన్‌హెచ్–65పై ప్రయాణించే వాహనదారులకు టోల్ చార్జీల భారం కాస్త తగ్గింది. ఈ మార్గం మీదుగా 24 గంటల్లోపు తిరుగు ప్రయాణమయ్యే అన్ని రకాల వాహనదారులకు 25 శాతం మేర ఎన్హెచ్ఏఐ తగ్గింపు ఇచి్చంది. అయితే ఏపీలోని చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద ఒకవైపు రూ. 5, రెండువైపులా రూ.10 మాత్రమే తగ్గించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు గల 181.5 కి.మీ. మేర ఉన్న జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఎన్‌హెచ్ 65పై ఎందుకు తగ్గిందంటే.. ఎన్‌హెచ్–65 రోడ్డును గతంలో నాలుగు వరుసలుగా విస్తరించారు. ఆ బాధ్యతను టెండర్ ద్వారా జీఎంఆర్ సంస్థ దక్కించుకొని రూ. 1,741 కోట్లతో పనులు నిర్వహించింది. బీఓటీ పద్ధతిలో పనులు పూర్తయ్యాక 2012 నుంచి టోల్ వసూలు మొదలుపెట్టింది. సాధారణంగా రోడ్డు ప్రధాన క్యారేజ్‌వే నిడివి ఆధారంగా టోల్ నిర్ధారించే విధానం ఎన్హెచ్ఏఐలో అమలులో ఉంది. కానీ విజయవాడ రోడ్డుపై బైపాస్ వ్యయం కూడా కలిపి గతంలో టోల్ ధరలు నిర్ధారించారు. దీంతో ఎన్హెచ్ఏఐ సహా ఇతర సంస్థల అ«దీనంలోని రోడ్లతో పోలిస్తే వాటి ధరల్లో కొంత ఎక్కువ చార్జీలు ఖరారయ్యాయి. ఇక రోడ్డు నిర్మాణ వ్యయం తిరిగి వసూలయ్యాక టోల్ ధరల్లో సహజంగా మార్పు చేస్తారు. ఇప్పుడు ఈ రోడ్డును ఆరు వరుసలకు విస్తరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్‌తో ఉన్న ఒప్పందం రద్దయింది. గత 9 నెలలుగా ఒక ఏజెన్సీతో ఎన్హెచ్ఏఐ టోల్ వసూలు చేయిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎన్హెచ్ఏఐ ఈ జాతీయ రహదారిపై టోల్ వసూలును రీనోటిఫై చేసింది. ఇంతకాలం జీఎంఆర్ సంస్థ పేరుతో ఉన్న నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రధాన రోడ్డు నిడివి ఆధారంగా ఎన్హెచ్ఏఐ–2008 ఫీ రూల్స్ ప్రకారం ధరలను లెక్కగట్టింది. ఇంతకాలం ఉన్న ధరలతో పోలిస్తే ఇవి తక్కువగా ఖరారు కావడం విశేషం. మిగతా చోట్ల.. ⇒ తెలంగాణలోని మంచిర్యాల నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ వెళ్లే జాతీయ రహదారి–363 నిడివి 94 కి.మీ. ఉండగా మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ట్రాఫిక్, రోడ్డు నిర్వహణ తదితరాలను లెక్కగట్టిన ఎన్‌హెచ్ అధికారులు ఈ మార్గంలో గతేడాదితో పోలిస్తే కనీసం రూ. 5 నుంచి రూ. 20 వరకు టోల్ చార్జీలు పెంచారు. ⇒ వరంగల్–హైదరాబాద్ బైపాస్ రోడ్డుపై జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌ప్లాజాల్లో 5 శాతం మేర టోల్ చార్జీలు పెరిగాయి. ⇒ హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్లే ఎన్‌హెచ్–44పై తెలంగాణ పరిధిలోని మార్గంలో 3.5 శాతం మేర టోల్ చార్జీలు పెరిగాయి. -
డంపర్ ట్రక్కు బీభత్సం
డెహ్రాడూన్: డంపర్ ట్రక్కు ఢీకొట్టడంతో ఓ కారు రూపు ఇలా మారిపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్–డెహ్రాడూన్ హైవేపైనున్న లచ్చివాలా టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం 7.3 0గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి వేగంగా దూసుకువచ్చిన ఈ డంపర్ ట్రక్కు ప్లాజా వద్ద వరుసగా ఆగి ఉన్న మూడు కార్లను వెనుక నుంచి ఢీకొట్టింది. ఒక కారు ఇలా ఇనుప స్తంభాన్ని గుద్దుకుని ఇలా నుజ్జవగా మరో రెండు కార్లలోని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. నుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. తెహ్రిలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఉద్యోగులైన వీరిద్దరూ విధులకు వెళ్తూ ఇలా ప్రమాదం బారినపడ్డారు. అతివేగం, ట్రక్కు బ్రేకులు ఫెయిలవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. -
మా వాహనాన్నే ఆపుతావా..
సాక్షి టాస్‌్కఫోర్స్: ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్గేట్ వద్ద ఓ ఎస్ఐ హల్చల్ చేశారు. మా వాహనాన్నే ఆపుతావా అని అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు కదిలించడంతో టోల్బూత్లో ఏర్పాటు చేసిన బూమ్ బ్యారియర్ దెబ్బతినింది. ఈ ఘటన బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. సదరు ఎస్ఐ కర్నూలు ఉపకారాగారం నుంచి ఓ ముద్దాయిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్వయంగా ఆయనే కారు నడుపుతున్నారు. వాహనం నన్నూరు టోల్‌గేట్‌కు చేరుకోగా ముందున్న మరో వాహనం ఫాస్టాగ్ స్కాన్ కాకపోవడంతో సిబ్బంది మాన్యువల్‌గా టోల్ రుసుము వసూలు చేశారు. ఆ వెంటనే బూమ్ బ్యారియర్ యథాస్థితికి వస్తుండగా ఎస్ఐ నడుపుతున్న వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలింది. ఆ సమయంలో బూమ్ బ్యారియర్ దెబ్బతినింది. ఇంతలో టోల్ సిబ్బంది వాహనం చుట్టూ గుమికూడటంతో ఎస్ఐ బూతు పురాణం మొదలుపెట్టారు. తమ వాహనాన్నే ఆపుతారా అంటూ గద్దించారు. అంతటితో ఆగకుండా టోల్ కలెక్టర్ మహబూబ్‌బాషాను బలవంతంగా అదే వాహనంలో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. టోల్ సిబ్బంది బతిమాలినా ఫలితం లేకపోయింది. ఉద్యోగిని తీసుకెళ్లి స్టేషన్లో ఉంచారు. అయితే విషయం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో టోల్ ఉద్యోగిని విడిచిపెట్టడం గమనార్హం. ఇదిలాఉంటే గతంలోనూ ఈ ఎస్ఐ టోల్గేట్ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ సమయంలో ఆయన మఫ్టీలో కారు నడుపుతుండగా సిబ్బంది ఐడీ కార్డు అడిగినట్లు తెలిసింది. నన్నే కార్డు అడుగుతావా అని సిబ్బందిపై విరుచుకుపడినట్లు సమాచారం. -
టోల్ చార్జీలు తగ్గించేందుకు చర్యలు: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై వసూలు చేసే టోల్ చార్జీల్లో వినియోగ దారులపై భారం తగ్గించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. సహేతుకమైన రాయితీని అందించేందుకు రూపొందించిన విధానాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు.పార్లమెంట్ సమావేశాల్లో సందర్బంగా బుధవారం రాజ్యసభలో అడిగిన పలు ప్రశ్నలకు నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. జాతీయ రహదారిపై ఒకే సెక్షన్లో, ఒకే దిశలో 60 కిలోమీటర్ల లోపున టోల్‌ప్లాజా ఏర్పాటు చేయరాదన్న నిబంధనలకు అనుగుణంగానే చార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పారు. 2019–20లో దేశంలో టోల్ ప్లాజాల వద్ద వసూలైన మొత్తం రూ.27 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి ఇది ఏకంగా 35 శాతం పెరిగి రూ.64 వేల కోట్లకు చేరిందని మంత్రి వివరించారు. -
బెంగళూరులో దారుణం.. టోల్గేట్ వద్ద అరాచకం!
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. టోల్గేట్ వద్ద ఓ వ్యక్తిని కారు కొంత దూరం లాకెళ్లి పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని నెలమంగళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోల్‌బూత్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. టోల్గేట్ వద్ద ఓ కారును మరో కారు ఓవర్ టేక్ చేయడంతో సదరు కారులో వ్యక్తి.. ముందుకు వచ్చి కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో, టోల్బూత్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ముందు కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆవేశంతో రగిలిపోయాడు.ఈ క్రమంలోనే కారు స్టార్ చేసి.. వాగ్వాదానికి దిగిన వ్యక్తి కాలర్ పట్టుకుని కారును ముందుకు నడిపాడు. ఆ తర్వాత కారు ఆ వ్యక్తిని దాదాపు 50 మీటర్ల దూరం కారు ఈడ్చుకెళ్లింది. కొంత దూరం వెళ్లాక అతడిని వదిలిపెట్టడంతో ఆయన కిందపడిపోయాడు. కారు డ్రైవర్ మాత్రం ఆగకుండా వెళ్లిపోయాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. Shocking Incident in Bengaluru!A man was dragged for 50 meters by a car at Nelamangala toll booth after an argument over overtaking. The entire incident was caught on CCTV. Police have launched an investigation to identify the accused. #Bengaluru #RoadRage #ViralVideo pic.twitter.com/mFJ8YOMXoQ— Shubham Rai (@shubhamrai80) February 16, 2025 -
హైవేపై అన్లిమిటెడ్ టోల్ పాస్‌లు: ధరలు ఇవే..
భారత్ ఇప్పుడు అభివృద్ధి వైపు వేగంగా దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన ఇండియాలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా ఉంది. అయితే గత పదేళ్లలో జాతీయ రహదారులపైన టోల్ ప్లాజాలు పెరిగాయి, టోల్ ఫీజులు కూడా పెరిగాయి. దీనిపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కూడా కొత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు టోల్ ఫీజుల భారాన్ని తగ్గించడానికి వార్షిక టోల్ పాస్‌లు & జీవితకాల టోల్ పాస్‌లను అందించాలని యోచిస్తోంది.వాహనదారులకు ఉపశమనం కలిగించడానికి.. టోల్ వసూల్లలో సరళీకరణను సాధించడానికి కేంద్రం టోల్ పాస్‌ల జారీలో కొత్త విధానం తీసుకురానుంది. ఇందులో వార్షిక టోల్ పాస్‌లు, లైఫ్ టైం టోల్ పాస్‌లు జారీ చేయడానికి సంకల్పించింది.వార్షిక ప్లాన్ కింద ఏడాది 3000 రూపాయలు, లైఫ్ టైం టోల్ పాస్ (15 సంవత్సరాలు) కోసం రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 340 రూపాయలకు నెలవారీ టోల్ పాస్ అందుబాటులో ఉంది. ఈ లెక్కన తీసుకుంటే ఏడాదికి రూ. 4080 చెల్లించాలి. కానీ ఏడాదికి టోల్ పాస్ తీసుకుంటే.. 1080 రూపాయలు ఆదా చేయవచ్చు.వార్షిక, లైఫ్ టైం పాస్‌లు ప్రస్తుత FASTag వ్యవస్థలో చేర్చనున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ టోల్ పాస్ వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వార్షిక టోల్ పాస్ లేదా జీవిత కాల టోల్ పాస్ అనేది ఒక టోల్ గేటుకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని చోట్లా పనిచేస్తుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.ఏకరీతి టోల్ విధానంవినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఏకరీతి టోల్ విధానంపై కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే తెలిపారు. ఇప్పుడు మనదేశంలోని రోడ్లు.. అమెరికాలోని రోడ్లకు సమానంగా ఉన్నాయని ఆయన అన్నారు.కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో రోడ్లు లేకపోవడం, అధిక టోల్ చార్జీల వసూలు వంటివి వాహనదారులలో అసంతృప్తిని నెలకొల్పాయి. కాబట్టి ఏకరీతి టోల్ ప్రవేశపెడితే.. ఇది అందరికి ప్రయోజనకారిగా ఉంటుందని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలను ఆయన అధికారికంగా వెల్లడించలేదు. అంతకంటే ముందు GSS (గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం) ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: 2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీజాతీయ రహదారులపై గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ వసూలు విధానం అమలు చేయడం ద్వారా ప్రయాణానికి ఎలాంటి అవరోధం ఉండదని ఆయన అన్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో ప్రయాణికులు చేసే ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకున్నామని.. దీనికి కారణమైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ చెప్పారు. -
కార్లకు ‘టోల్’ పాస్‌లు
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై టోల్ గేట్ ఫీజుల చెల్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కొత్త విధివిధానాలను రూపొందించింది. ప్రధానంగా ప్రైవేటు కార్ల యజమానులకు టోల్ ఫీజుల పాస్‌లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే ప్రైవేటు కార్ల యజమానులకు సౌలభ్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అన్ లిమిటెడ్ యూసేజ్ (అపరివిుత వినియోగం) ప్రాతిపదికన టోల్ ఫీజు పాస్‌లను రెండు కేటగిరీలుగా జారీ చేసే ముసాయిదాను ఎన్హెచ్ఏఐ తాజాగా ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానం ద్వారానే పాస్‌ల విధానాన్ని అమల్లోకి తెస్తారు. వార్షిక టోల్ ఫీజు పాస్, లైఫ్‌టైమ్ పాస్ (15ఏళ్లు)లను అందుబాటులోకి తేనుంది. వార్షిక పాస్ రూ.3 వేలు, లైఫ్‌టైమ్ (15ఏళ్లు) పాస్‌ను రూ.30 వేలుగా నిర్ణయించింది. వార్షిక పాస్ తీసుకుంటే జాతీయ రహదారులపై టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏడాదిలో ఎన్ని సారై్లనా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇక లైఫ్‌టైమ్ పాస్ తీసుకుంటే ఆ వాహన జీవిత కాలం అంటే గరిష్టంగా 15ఏళ్ల పాటు టోల్ ఫీజు చెల్లించకుండా జాతీయ రహదారులపై ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం టోల్ గేట్లకు సమీపంలో ఉన్న గ్రామాల వారికి ఆ ఒక్క టోల్ గేటు వరకు పాస్‌ల విధానాన్ని అమలు చేస్తోంది. అందుకోసం ఆ గ్రామాల ప్రజలు తమ అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పిస్తే నెలకు రూ.340 పాస్‌ను జారీ చేస్తోంది. అంటే ఏడాదికి రూ.4,080 అవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఏడాదిపాటు టోల్ ఫీజు లేకుండా ప్రయాణానికి రూ.3 వేలకే పాస్ అన్నది అత్యంత సమంజసమైనదిగా ఎన్హెచ్ఏఐ వర్గాలు చెబుతున్నాయి. 2023–24లో టోల్‌ఫీజుల రూపంలో రూ.55వేల కోట్లు వసూలయ్యాయి. వాటిలో ప్రైవేటు కార్ల వాటా రూ.8 వేల కోట్లు మాత్రమే. కాబట్టి ప్రైవేటు కార్లకు వార్షిక, లైఫ్‌టైమ్ టోల్ ఫీజు పాస్‌ల జారీతో రాబడిపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపించదని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. టోల్ ఫీజుల పాస్‌ల జారీ కోసం ఎన్హెచ్ఏఐ రూపొందించిన ముసాయిదాపై కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. -
త్వరలో కొత్త టోల్ పాసులు.. హైవేలపై నో టెన్షన్!
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. టోల్ గేట్ల అపరిమిత వినియోగం కోసం ఏడాది, జీవిత కాలపు టోల్ పాస్‌లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఏడాది టోల్ పాల్ కోసం రూ. 3 వేలు, జీవిత కాలపు టోల్ పాస్ కోసం రూ.30,000 నిర్ణయించినట్లు తెలుస్తోంది.అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా వాహనం జీవిత కాలం 15 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ కాలానికే జీవిత కాలపు పాస్ వర్తిస్తుంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వద్ద ప్రస్తుతం ఈ ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఇదే కాకుండా వాహనదారులకు మరింత ఊరట కలిగించేందుకు బేస్ టోల్ రేటును కూడా తగ్గించే యోచనలో రోడ్డు రవాణా శాఖ ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.ఇప్పటి వరకు ఒకే టోల్ ప్లాజా పరిధిలో తరచుగా ప్రయాణించే వారి కోసం నెలవారీ పాస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందాలంటే వినియోగదారులు వారి అడ్రెస్ ప్రూఫ్ సహా మరిన్ని వివరాలను అందింస్తూ.. నెలకు రూ.340 చెల్లంచాల్సి ఉంది. అలాగే ఈ పాస్‌ను ఏడాది పాటు వాడుకుంటూ పోతే మొత్తంగా రూ.4,080 చెల్లించాల్సి వస్తుంది.కానీ ఇప్పుడు తీసుకురానున్న కొత్త ఏడాది పాస్ ధర కేవలం రూ. 3 వేలు మాత్రమే. అది కూడా దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఏ టోల్ గేట్నైనా ఈ పాస్‌తో దాటొచ్చు. దీంతో వాహనదారులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కానుంది. కాగా ఈ ప్రతిపాదన గురించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే సంకేతాలిచ్చారు. కార్ల యజమానులకు పాస్‌లు అందించే ప్రణాళికపై పని చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు. -
కొత్త టోల్ విధానం.. ముందుగా చెప్పిన నితిన్ గడ్కరీ
భారతదేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే రోడ్డుపై టోల్ ప్లాజాలు అధికమవుతున్నాయి. టోల్ వసూళ్లు కూడా పెరిగాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' (Nithin Gadkari) 'ఏకరీతి టోల్ విధానం' గురించి ప్రస్తావించారు. ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని అన్నారు.వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఏకరీతి టోల్ విధానంపై కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం తెలిపారు. ఇప్పుడు మనదేశంలోని రోడ్లు.. అమెరికాలోని రోడ్లకు సమానంగా ఉన్నాయని ఆయన అన్నారు.కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో రోడ్లు లేకపోవడం, అధిక టోల్ చార్జీల వసూలు వంటివి వాహనదారులలో అసంతృప్తిని నెలకొల్పాయి. కాబట్టి ఏకరీతి టోల్ ప్రవేశపెడితే.. ఇది అందరికి ప్రయోజనకారిగా ఉంటుందని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలను ఆయన అధికారికంగా వెల్లడించలేదు. అంతకంటే ముందు GSS (గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం) ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.జాతీయ రహదారులపై గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ వసూలు విధానం అమలు చేయడం ద్వారా ప్రయాణానికి ఎలాంటి అవరోధం ఉండదని ఆయన అన్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో ప్రయాణికులు చేసే ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకున్నామని.. దీనికి కారణమైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ చెప్పారు.ప్రస్తుతం, జాతీయ రహదారులపై ఎక్కువగా ఉన్న ట్రాఫిక్‌లో 60 శాతం ప్రైవేట్ కార్ల వల్లనే ఏర్పడుతోంది. ఈ వాహనాల ద్వారా వచ్చే టోల్ ఆదాయం కేవలం 20-26 శాతం మాత్రమే. అయితే గత పదేళ్లలో టోల్ వసూళ్ల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి ఆదాయం కూడా పెరిగింది. 2023-24లో భారతదేశంలో మొత్తం టోల్ వసూళ్లు రూ. 64,809.86 కోట్లకు చేరాయి. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ. 2019-20లో ఈ వసూళ్లు రూ.27,503 కోట్లు.ఇదీ చదవండి: అలాంటి కార్లు టోల్ గేట్ దాటితే భారీ జరిమానా.. జైలు శిక్ష కూడా!జాతీయ రహదారులపై అన్ని టోల్ ప్లాజాలు జాతీయ రహదారుల నియమాలు, 2008 & సంబంధిత రాయితీ ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. హైవేల నిర్మాణం కూడా వేగంగా జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 37 కి.మీ హైవేల నిర్మాణ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 7,000 కి.మీ హైవేల నిర్మాణం జరిగింది. ఫిబ్రవరి-మార్చి కాలంలో రహదారుల నిర్మాణ వేగం మరింత పెరుగుతుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రపంచంలోనే భారతదేశం రెండవ అతిపెద్ద రహదారి నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దేశంలో జాతీయ రహదారులు మొత్తం 1,46,195 కి.మీ పొడవును కలిగి ఉన్నాయి. దేశంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి.. లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడానికి 34,800 కి.మీ పొడవును కవర్ చేయడానికి 2017లో ప్రభుత్వం 'భారతమాల పరియోజన' (Bharatmala Pariyojana)ను ఆమోదించింది. -
అలాంటి కార్లు టోల్ గేట్ దాటితే భారీ జరిమానా
ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. చాలామంది, వెహికల్ ఇన్సూరెన్స్ (Vehicle Insurance) తీసుకోకుండా కార్లను వినియోగిస్తుంటారు. అలాంటి వారివల్ల ప్రమాదాలు జరిగితే.. ఆ ప్రభావం ఇతరుల మీద కూడా పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఒడిశా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఓ కొత్త రూల్ తీసుకు వచ్చింది. ఇది తప్పకుండా వాహనదారులు తమ కార్లకు ఇన్సూరెన్స్ తీసుకునేలా చేస్తుందని సమాచారం.వెహికల్ ఇన్సూరెన్స్ లేని, ఏ వాహనమైన టోల్ గేట్ దాటితే.. అలాంటి వాహనదారులకు ఈ చలాన్ జారీ చేయనున్నట్లు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియమం 2025 ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. తప్పకుండా ఈ విషయాన్ని వాహన వినియోగదారులు గుర్తుంచుకోవాలి.కారు ఇన్సూరెన్స్ లేకుంటే..టోల్ గేట్లపై అమర్చిన ఈ-డిటెక్షన్ సిస్టమ్‌ల ద్వారా.. ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తిస్తారు. అలాంటి వాహనాలకు ఆటోమాటిక్ చలాన్ జారీ చేస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి టోల్ గేట్ దాటితే వారికు రూ. 2,000 జరిమానా విధిస్తారు. ఇదే రెండోసారి పునరావృతమైతే.. వారు రూ. 4,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా కాకుండా.. మూడు నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చలానా, జైలు శిక్ష రెండూ పడొచ్చు. కాబట్టి 1988లోని సెక్షన్ 146 ప్రకారం.. పబ్లిక్ రోడ్లపై నడిచే ప్రతి మోటారు వాహనం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ప్రైవేట్, వాణిజ్య వాహనాలు చెల్లుబాటు అయ్యే బీమా లేకుండా రోడ్లపై నడుపుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిని పరిగణలోకి తీసుకుని ఒడిశా (Odisha) స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్త రూల్ కింద ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది.నిజానికి ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ అనేది కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం, బీహార్ ప్రభుత్వం పొల్యూషన్ సర్టిఫికెట్లు లేని వాహనాలను గుర్తించేందుకు.. రాష్ట్రంలోని 32 టోల్ ప్లాజాలలో ఈ-డిటెక్షన్ సిస్టమ్‌ను ప్రారంభించింది. పీయూసీ లేకుండా పట్టుబడితే.. వాహనానికి రూ. 10వేలు జరిమానా విధిస్తారు. ఈ సిస్టం ట్రయల్స్ ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లోనే 5,000కు పైగా ఈ చలాన్లు జారీ చేశారు. కాబట్టి ఇదే సిస్టం త్వరలో.. పాట్నా, ముజఫర్‌పూర్, భాగల్పూర్, ఇతర స్మార్ట్ సిటీలలో కూడా ప్రారంభించనున్నట్లు బీహార్ ప్రభుత్వం వెల్లడించింది.త్వరలో ఇతర రాష్ట్రాలకు..ప్రస్తుతం ఈ డిటెక్షన్ సిస్టం కేవలం ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే అమలులో ఉంది. ఈ విధానం త్వరలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సిస్టం ప్రారంభమైతే.. జరిమానాలు లేదా జైలు శిక్షకు భయపడి వాహనదారులు తప్పకుండా నియమానాలకు అనుగుణంగా నడుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము.టోల్ కలెక్షన్ కోసం శాటిలైట్ విధానంమారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపుగ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ గతంలోనే పేర్కొన్నారు. -
ప్రైవేట్ వాహనాలకు పాస్‌లు!: నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్స్ వద్ద రద్దీని తగ్గించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రైవేట్ వాహనదారులకు నెలవారీ, వార్షిక టోల్ పాస్‌లను మంజూరు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది వాహనదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. టోల్ వసూళ్లు అత్యధికంగా కమర్షియల్ వాహనాల నుంచి (74 శాతం) వస్తోంది. అయితే మిగిలిన 26 శాతం మాత్రమే ప్రైవేట్ వాహనాల నుంచి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2025 జనవరి 16న ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రతిపాదనలో ముఖ్య ముఖ్యాంశాలునెలవారీ & వార్షిక పాస్‌లు: జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ కార్ల యజమానులు నెలవారీ లేదా సంవత్సరానికి పాస్‌లు తీసుకోవచ్చు. ఇది ఖర్చును కొంత తగ్గించడం మాత్రమే కాకుండా.. సమయాన్ని కూడా అదా చేస్తుంది.అవరోధం లేని టోల్ సేకరణ: పాస్ సిస్టమ్‌తో పాటు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. లేటెస్ట్ టెక్నాలజీతో టోల్‌ల చెల్లింపుకు ఇది సరైన మార్గం. ఈ శాటిలైట్ సిస్టం అమలులోకి వచ్చిన తరువాత ప్రత్యేకంగా టోల్ గేట్స్ అవకాశం ఉండదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐస్‌క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన శాటిలైట్ టోల్ కలెక్షన్ విజయవంతమవ్వడంతో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ సిస్టమ్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గురించి వాహన వినియోగదారులలో అవగాహన కల్పించడానికి ఓ వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేసినట్లు గడ్కరీ పేర్కొన్నారు. మొత్తం మీద దేశంలో టోల్ గేట్స్ త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌట్ కట్ చేసుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ కోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కల్గిన ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణించిన దూరానికి అయ్యే మొత్తాన్ని ఆటోమాటిక్‌గా చెల్లించడానికి సాధ్యమవుతుంది.. -
ఎలాగైనా వెళ్లాల్సిందే
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్ : సంక్రాంతి పండుగ వేళ...ప్రయాణాలు సాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా మహానగరం పల్లెబాట పట్టింది. వారం రోజులుగా సుమారు 30 లక్షల మందికి పైగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. సొంత వాహనాల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. సుమారు 8 లక్షల మందికి పైగా రైళ్లలో తరలివెళ్లినట్టు అధికారులు అంచనా వేశారు.ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీ వైపు వెళ్లే బస్సులను కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట, లక్డీకాఫల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ మీదుగా నడిపారు. వరంగల్ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్కే పరిమితం చేశారు.కొన్నింటిని సాగర్‌రోడ్డు, బీఎన్‌రెడ్డినగర్, హయత్‌నగర్ వరకు పరిమితం చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో కలిపి 12 లక్షల మందికి పైగా వెళ్లారు. హైవేలన్నీ వాహనాలతో నిండుగా..: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం కూడా రద్దీ కొన సాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి రాత్రి 7 గంటల వరకు 65 వేల వాహనాలు వెళ్లాయి. నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 వేల వాహనాలు వెళ్లాయి.హెదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా నుంచి సాధారణ రోజుల్లో 30వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా, ఆదివారం 70 వేలకు పైగా వాహనాలు వెళ్లాయి. ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం కావడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మల్టిజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. -
పల్లెకు జనం.. భాగ్యనగరం ఖాళీ
-
అలిపిరి టోల్ గేట్ దగ్గర పుష్ప-2 సాంగ్‌కు యువతి రీల్..
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట ఐటమ్ సాంగ్‌కు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. తాజాగా, అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, గతంలోను కోండపై సినీ నటి నయనతార ఫొటో షూట్, దర్శనం క్యూ లైన్లో చెన్నై యువకులు రీల్స్ చేయడం.. మొన్న అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేయడం.. ఇలా.. వరుస ఘటనలు జరుగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు.. pic.twitter.com/PLmEypMVys— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, విషయం తెలుసుకున్న యువతి.. శ్రీవారి భక్తులు తనను క్షమించాలంటూ మరో వీడియో విడుదల చేయడం గమనార్హం. https://t.co/DrCk8b8lOm pic.twitter.com/eYdYE9U2RZ— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024 -
వేంపాడు టోల్‌ప్లాజా వద్ద అఘోరీ హల్చల్
నక్కపల్లి: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అఘోరీ సోమవారం అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్‌ప్లాజా వద్ద కొద్దిసేపు హల్చల్ చేశారు. రాజమండ్రి నుంచి విశాఖవైపు వెళ్తున్న అఘోరీ తన కారులో వేంపాడు టోల్‌ప్లాజా వద్దకు వచ్చారు. టోల్ ఫీజు చెల్లించాలని సిబ్బంది కోరడంతో తన వద్ద ఫీజు తీసుకోడానికి వీల్లేదని, తాను చెల్లించనంటూ వాగ్వాదానికి దిగారు. ఘర్షణ ఎందుకని ఫీజు తీసుకోకుండానే సిబ్బంది ఆమె కారును విడిచిపెట్టారు . టోల్‌ప్లాజా దాటి కొద్దిదూరం వెళ్లిన అఘోరీ తిరిగి టోల్‌ప్లాజా వద్దకు వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కార్యాలయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. టోల్ సిబ్బంది తనపై అనుచితంగా ప్రవర్తించారని, తన ప్రైవేట్ భాగాలను ముట్టుకున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ ప్రభుత్వంలో తనలాంటి నాగసాధు మహిళా అఘోరీకే రక్షణ లేకపోతే.. సాధారణ మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. శరీరాన్ని తాకి సారీ చెబుతున్నారని, వీళ్లు అత్యాచారాలు, హత్యలు చేసి కూడా సారీ చెబుతారని ఆక్షేపించారు. తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అప్పటి వరకు కదిలేది లేదని భీష్మించారు. ఇంతలో నక్కపల్లి, పాయకరావుపేట పోలీసులు వచ్చి అఘోరీతో మాట్లాడారు. సీసీ టీవీ ఫుటేజీలు కావాలని ఆమె డిమాండ్ చేయడంతో పోలీసులు టోల్‌ప్లాజా వద్ద అఘోరీకు సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన ఫుటేజీల్లో కొన్నింటిని చూపించారు. ఇటీవల తెలంగాణ ప్రాంతంలో వార్తల్లోకెక్కిన ఈ అఘోరీని చూసేందుకు టోల్గేట్ పరిసర ప్రాంతాల వారు, జాతీయరహదారిపై రాకపోకలు సాగించేవారు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపేశారు. అఘోరీ అక్కడ ఉన్నంత సేపు వారు కూడా కదలకపోవడం గమనార్హం. -
జడ్జి గుర్తింపు కార్డు లాక్కున్నారు
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి టోల్గేట్ సిబ్బంది.. ఓ న్యాయమూర్తి కుటుంబం వెళ్తున్న కారుకు టోల్ ఫీజు చెల్లించినా జడ్జి గుర్తింపు కార్డు లాక్కోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గురువారం ఓ జిల్లా జడ్జి కుటుంబ సభ్యులు కారులో ఖమ్మం వస్తున్నారు. ఈ క్రమంలో పైనంపల్లి టోల్గేట్ వద్ద డ్రైవర్.. న్యాయమూర్తి కారు అని చెప్పినా వినకుండా రుసుము చెల్లించాలని సిబ్బంది వాదనకు దిగారు. దీంతో డ్రైవర్ రుసుము చెల్లించారు. ఆపై న్యాయమూర్తికి చెందిన గుర్తింపు కార్డు చూపించగా.. సిబ్బంది దానిని లాక్కుని ఒరిజినల్ కార్డా, కాదా? అని తెలుసుకుని తర్వాత పంపిస్తామని దురుసుగా బదులిచ్చారు. ఈ విషయం తెలియడంతో ఆ న్యాయ మూర్తి టోల్గేట్ వద్దకు వచ్చి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. సూర్యాపేట జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌తో పాటు నేలకొండపల్లి పోలీసులు సైతం వచ్చి రుసుము చెల్లించినా న్యాయమూర్తి ఐడీ కార్డు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టోల్గేట్ సిబ్బంది నుంచి కార్డు తిరిగి తీసుకున్నారు. ఈ ఘటనపై టోల్గేట్ సిబ్బంది మాట్లాడుతూ, చాలామంది నకిలీ కార్డులతో వస్తుండటంతో అనుమానం వచ్చి అడిగామని చెప్పడం గమనార్హం. -
ఈ వాహనాలకు టోల్ ఫీజు లేదు: షిండే సర్కార్ కీలక నిర్ణయం
2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే శుభవార్త చెప్పారు. ముంబైలోని ఐదు టోల్ బూత్‌లలో లైట్ వెయిట్ మోటారు వాహనాలకు టోల్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇది ఈ రోజు (అక్టోబర్ 14) అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో టోల్ ఫీజు మినహాయింపుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించాలంటే దహిసర్ టోల్, ఆనంద్ నగర్ టోల్, వైశాలి, ఐరోలి, ములుండ్ వంటి టోల్ ప్లాజాల గుండా రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ టోల్ ప్లాజాల గుండా వచ్చే లైట్ వెయిట్ వాహనాలకు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పొలిటికల్ స్టంట్ కాదు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోలేదు. టోల్ ఫీజుల మినహాయింపు కేవలం ఎన్నికల పూర్తయ్యే వరకు మాత్రమే కాకుండా.. శాశ్వతంలో అమలులో ఉండేలా చేశాము. దీనిపై విమర్శలు చేస్తున్న ప్రతి పక్షాలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిన చరిత్ర ఉందని సీఎం ఏక్‌నాథ్‌షిండే అన్నారు.టోల్ ఫీజుల మినహాయింపు హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ఎస్‌యూవీలు, జీపులు, వ్యాన్లు, ఆటో రిక్షాలు, టాక్సీలు, డెలివరీ వ్యాన్లకు వర్తిస్తుంది. ప్రతి రోజూ సుమారు ఆరు లక్షల కంటే ఎక్కువ వాహనాలు ముంబైని దాటుతున్నాయి. ఇందులో 80 శాతం లైట్ వెయిట్ వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న టోల్ ఫీజుల మినహాయింపు వీరందరికీ ఉపశమనం కలిగిస్తుంది.ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'ఇకపైన ముంబైలో టోల్ ఫీజు చెల్లించే వాహనాల జాబితాలో ట్రక్కులు, లారీలు వంటి భారీ వాహనాలు మాత్రమే ఉంటాయి. ఈ వాహనాలకు యధావిధిగా టోల్ ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. అయితే మహారాష్ట్ర సీఎం టోల్ ఫీజుల మినహాయింపుపై తీసుకున్న నిర్ణయం కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే అని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.#WATCH | Maharashtra Govt announces full toll exemption for all light motor vehicles entering Mumbai.Maharashtra minister Dadaji Dagadu Bhuse says "At the time of entry into Mumbai, there were 5 toll plazas, including Dahisar toll, Anand Nagar toll, Vaishali, Airoli and Mulund.… pic.twitter.com/jTsy4nKvN2— ANI (@ANI) October 14, 2024 -
టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!
జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తున్నప్పుడు టోల్‌ప్లాజ్ రుసుం చెల్లిస్తుంటాం కదా. అయితే ఇకపై ఆ ఛార్జీ చెల్లించాల్సిన పనిలేదు. అవునండి..మీరు నిత్యం అదే రహదారి గుండా ప్రయాణిస్తూ, మీ ఇళ్లు స్థానికంగా టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అందుకు కొన్ని ధ్రువపత్రాలు సమర్పించి టోల్‌పాస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.ముందుగా టోల్ ప్లాజా వద్ద సిబ్బందితో మాట్లాడి మీ దగ్గరున్న అడ్రస్ ప్రూఫ్ సమర్పించాలి. ఆ సమయంలో మీ ఫాస్టాగ్ అకౌంట్‌తో అడ్రస్ప్రూఫ్ను లింక్ చేసి లోకల్ పాస్ జారీ చేస్తారు. అందుకోసం రూ.340 చెల్లించాల్సి ఉంటుంది. ఇది నెలపాటు పని చేస్తుంది. వచ్చేనెల తిరిగి ఈ పాస్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కేవలం రూ.340 చెల్లించి నెలరోజులపాటు టోల్ ఛార్జీలు పేచేయకుండా ప్రయాణించవచ్చు. అయితే ఈ లోకల్పాస్ కేవలం సంబంధిత టోల్‌ప్లాజాలో మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినపుడు మాత్రం అక్కడి టోల్రేట్లకు తగినట్లుగా పూర్తి ఛార్జీలు ఫాస్టాగ్ ద్వారా చెల్లించాల్సిందే.ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!2021 ఆర్థిక సంవత్సరంలో ఫాస్టాగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.34,778 కోట్లు ఆదాయం సమకూరింది. 2022లో అది 46 శాతం పెరిగి రూ.50,855 కోట్లకు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి పది నెలలకాలంలో రూ.50 వేలకోట్ల మార్కును దాటింది. -
కడలికీ కప్పం..!
చీరాల: పెద్ద ఎత్తున మత్స్య ఎగుమతులతో పాటు పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే బాపట్ల జిల్లాలోని వాడరేవు వద్ద టోల్గేట్ పేరుతో కూటమి సర్కారు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తోంది. మినీ గోవాగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంతంలో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. కనువిందు చేసే కడలి సోయగాలను ఆస్వాదించేందుకు రాష్ట్రంతోపాటు తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు. ఆదాయంపై కన్నేసిన సర్కారు వాడరేవు, కీర్తివారిపాలెం గ్రామాల అభివృద్ధి కోసం టోల్ గేట్ ఏర్పాటు చేసినట్లు చెబుతుండటంపై పర్యాటకులు, మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కీర్తివారిపాలెం వద్ద 2017లో టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ టోల్‌గేట్‌ను ప్రారంభించగా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి దాన్ని తొలగించారు. తాజాగా కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ టోల్గేట్ ఏర్పాటైంది. గ్రామ ప్రజల అభిప్రాయం, పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య స్వయంగా టోల్‌గేట్‌ను ప్రారంభించడం గమనార్హం. తీర ప్రాంతాల్లో గ్రామాల్లో ఎక్కడా టోల్గేట్లు ఉండవు. జాతీయ రహదారిల్లో మాత్రమే ఉండే టోల్గేట్లు చిన్న గ్రామాల్లోకి రావడంతో జనం విస్తుపోతున్నారు.వసూళ్లు భారీగానే.. కార్తీక మాసంతో పాటు శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో వాడరేవు పర్యాటకులతో కళకళలాడుతుంది. కీర్తివారిపాలెం టోల్గేట్ ద్వారా ఏటా రూ.14 లక్షల ఆదాయం పొందేలా కూటమి నాయకులు స్కెచ్ వేశారు. కారుకు రూ.50, ట్రాక్టర్‌కు రూ.50, నాలుగు చక్రాల లారీకి రూ.100, వినాయకుడి విగ్రహం ట్రాక్టర్‌కు రూ.100, లారీకి రూ.200, రొయ్యలు, చేపలు రవాణా చేసే వాహనాలకు రూ.100, టూరిస్ట్ బస్‌కు రూ.200 చొప్పున టోల్ చార్జీలు నిర్ణయించి వసూలు చేసేందుకు ముగ్గురు సిబ్బందిని నియమించారు. టోల్గేట్ 24 గంటలు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు చెబుతున్నట్లు సంపద సృష్టించడం అంటే ఇదేనా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.డీపీవో ఆదేశాలతో ఏర్పాటు పర్యాటకులు అధికంగా వచ్చే వాడరేవులోని కీర్తివారిపాలెంలో గ్రామ పంచాయతీ తీర్మానం, డీపీవో ఆదేశాలతో టోల్గేట్ ఏర్పాటు చేశారు. డీపీవో ఉత్తర్వుల్లో ఏముందో తెలుసుకుంటాం. – పి.శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎంపీడీవో, చీరాల పర్యాటకం వెలవెల.. వాడరేవు నుంచి కఠారిపాలెం వరకు తీరప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏపీతోపాటు తెలంగాణ, ఇతర‡ప్రాంతాల నుంచి కూడా సేద తీరేందుకు పర్యాటకులు వస్తుంటారు. గతంలో కూడా ఈ టోల్ గేట్‌ను అక్రమంగా ప్రారంభిస్తే మేం అధికారంలో ఉన్నప్పుడు తొలగించాం. మత్స్య సంపదను లారీలు, ఆటోల్లో ఇతర ప్రాంతాలకు తరలించే వారి వద్ద రూ.100 ట్యాక్స్ వసూలు చేయడం దారుణం. టోల్గేట్ తొలగించి ప్రజలపై భారం పడకుండా చూడాలి. లేదంటే పర్యాటకం కళ తప్పే ప్రమాదం ఉంది. – కరణం వెంకటేష్, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చీరాల -
టోల్ ప్లాజాల ‘లైవ్ ట్రాక్’
టోల్ ప్లాజాల వద్ద నెలకొనే రద్దీని లైవ్‌గా ట్రాక్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా దేశంలోని సుమారు 100 టోల్ ప్లాజాలను గుర్తించింది. జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఆయా టోల్ గేట్ల వద్ద నెలకొనే ట్రాఫిక్‌ను ట్రాక్ చేస్తూ అందుకు అనువుగా హెచ్చరికలు, సలహాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.సెలవులు, వారాంతాలు, పండగలు..వంటి ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలుస్తుండడం గమనిస్తాం. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలుస్తుంటాయి. టోల్ గేట్ల నిర్వహణ సరళీకృతం చేయడంలో భాగంగా కేంద్రం ఫాస్టాక్ వంటి విధానాలు తీసుకొచ్చింది. అయినా చాలాచోట్ల వాహనాల రద్దీ తగ్గడంలేదు. అలాంటి సమయాల్లో వారికి సరైన మార్గదర్శకాలు, సలహాలు, సూచనలులేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితులను అదుపు చేయడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) టోల్ ప్లాజాలను లైవ్‌గా ట్రాక్ చేయాలని నిర్ణయించింది. అందుకోసం టోల్గేట్ టోల్ ఫ్రీ నంబర్ 1033కు వచ్చిన ఫిర్యాదుల ఆదారంగా దేశవ్యాప్తంగా దాదాపు 100 టోల్‌ప్లాజాలను ఎంచుకుంది.ఇదీ చదవండి: ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!ప్రత్యేకంగా జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఈ టోల్గేట్లను ట్రాక్ చేయనున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాల క్యూ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్చరికలు, సూచనలు అందించనున్నారు. దాంతోపాటు ట్రాఫిక్‌కు అనుగుణంగా సిబ్బందికి లేన్ల పంపిణీపై సలహాలు ఇస్తారు. ఈ జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలోని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) అభివృద్ధి చేసింది. -
టోల్ ఫీజు మినహాయింపు ఇక లేదు..
టోల్ ఫీజు మినహాయింపునకు సంబంధించిన మూడేళ్ల నాటి పాత నిబంధనలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఉపసంహరించుకుంది. టోల్ బూత్‌ల వద్ద ఫీజు వసూలు ఎక్కువ సమయం పట్టి వాహనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటే వాటిని టోల్ ట్యాక్స్ లేకుండానే అనుమతించాలని నిబంధన ఉండేది. దాన్ని ఎన్హెచ్ఏఐ తాజాగా తొలగించింది.ఎన్హెచ్ఏఐ 2021 మేలో జారీ చేసిన నిబంధన ప్రకారం ప్రతి టోల్ బూత్ వద్ద ఒక్కో వాహనం ముందుకు కదిలే సమయం 10 సెకన్ల కంటే తక్కువగా ఉండాలి. ఏ లేన్‌లోనైనా వాహనాల వరుస టోల్ బూత్ నుండి 100 మీటర్లకు మించకూడదు. టోల్ బూత్ నుండి 100 మీటర్ల దూరం దాటి వాహనాలు క్యూ పెరిగితే టోల్ వసూలు చేయకుండా వాటిని అనుమతించాలి. ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న టోల్ బూత్‌లు, భూసేకరణ పూర్తికాని టోల్ ప్లాజాల కోసం ఎన్హెచ్ఏఐ ఈ నిబంధనను రూపొందించింది.అయితే, ఇప్పుడు మూడేళ్ల తర్వాత, ఎన్హెచ్ఏఐ 2021 నాటి ఆ విధానాన్ని ఉపసంహరించుకుంది. ఈ నియమాన్ని అమలు చేయడంలో ఇబ్బందులు, ప్రజల నుండి వచ్చిన విమర్శల తర్వాత ఈ నిబంధనను తొలగించినట్లు నివేదిక పేర్కొంది. ఎన్హెచ్ఏఐ ఇప్పుడు లాంగ్ లైన్లను నిర్వహించడానికి లైవ్ ఫీడ్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. టోల్ ప్లాజాల నిర్వహణకు సంబంధించి ఎన్హెచ్ఏఐ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయానికి వర్తించే నిబంధనలు తక్షణమే రద్దవుతాయి. ఎందుకంటే ఎన్‌హెచ్ ఫీజు రూల్స్ 2008లో అటువంటి మినహాయింపు ప్రస్తావన లేదు. -
‘దారి’దోపిడీకి టీడీపీ కూటమి ముఖ్యనేత పన్నాగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ ‘దారి దోపిడీ’కి టీడీపీ కూటమి ముఖ్యనేత పన్నాగం పన్నారు. రాబోయే ఐదేళ్లలో ఏకంగా రూ. 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ గగ్గోలుపెట్టిన ఆయన అధికారంలోకి రాగానే రోడ్ల నిర్మాణం ముసుగులో అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. దోపిడీ కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) విధానాన్ని తెరపైకి తెచ్చారు. తొలుత 27 రాష్ట్ర ప్రధాన రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఆమోదించారు.తమ బినామీల నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టి.. రూ. 4 వేల కోట్లతో రోడ్లను నిర్మించి, ఆపై ఐదేళ్లలో రూ.12,500 కోట్లు టోల్ ఫీజుల వసూలు చేయనున్నారు. నికరంగా రూ. 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు. రాష్ట్రంలో వాహనదారులపై భారీగా ఆర్థిక భారం మోపుతూ.. బినామీ కాంట్రాక్టర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు ముఖ్యనేత పన్నాగం ఇది.రోడ్ల నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకున్న ప్రభుత్వంజాతీయ రహదారులను నిర్మించే కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇప్పటివరకు టోల్ ఫీజులను వసూలు చేస్తోంది. రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులను అన్ని రాష్ట్రాలు తమ ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నాయి. ఇప్పుడు ఈ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమేరకు నిర్ణయించారు. అందుకోసం రాష్ట్రంలోని 27 రహదారులను ఎంపిక చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలోనూ చంద్రబాబు ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. మొదటగా 14 రోడ్లను నిర్మిస్తామన్నారు. అనంతరం మిగిలిన రోడ్ల నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఆరోడ్లపై వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తామన్నారు. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని రహదారులను పీపీపీ విధానంలోనే నిర్మించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ ఉద్దేశం. టోలుతో భారీ దోపిడీకి కుట్ర..పీపీపీ విధానంలో 1,778 కి.మీ. ఉన్న 27 రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నామమాత్రంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఆ రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులను ముఖ్య నేత బినామీ, సన్నిహిత సంస్థలకే కట్టబెడతారన్నది బహిరంగ రహస్యం. గతేడాది ఆర్ అండ్ బి శాఖ కి.మీ.కు గరిష్టంగా రూ. 2 కోట్లు చొప్పున టెండర్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆ రేట్ల ప్రకారం చూస్తే మొత్తం 1,778 కి.మీ.కు రూ. 3,556 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఏడాదిలో మెటీరియల్ ధరలు కాస్త పెరిగాయని భావించినా మొత్తం మీద రూ. 4 వేల కోట్లకు మించదు.జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) 2023–24లో వసూలు చేసిన టోల్ ఫీజుల నిష్పత్తిలో లెక్కిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న 1,778 కి.మీ. రోడ్ల నుంచి ఏడాదికి రూ. 2,500 కోట్ల వరకు టోల్ ఫీజుల రూపంలో వసూలు అవుతుంది. ఆ ప్రకారం ఐదేళ్లకు రూ. 12,500 కోట్లు టోల్ ఫీజుల రూపంలో వసూలు చేస్తారన్నది సుస్పష్టం. అంటే ముఖ్యనేత బినామీ సంస్థలు కేవలం రూ. 4 వేల కోట్లు వెచ్చించి.. ఐదేళ్ల పాటు టోల్ ద్వారా రూ. 12,500 కోట్లు వాహనదారుల నుంచి కొల్లగొట్టనున్నారు. నికరంగా ఐదేళ్లలో ముఖ్య నేత జేబులోకి రూ. 8,500 కోట్లు చేరనుంది. వాహనదారులపై భారీ ఆర్థికభారంపీపీపీ విధానంలో నిర్మించనున్న ఆ 27 రోడ్లపై ప్రయాణించే వాహనదారులపై భారీ ఆర్థికభారం పడనుంది. ఆ మార్గంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల నుంచి కూడా టోల్ ఫీజు వసూలు చేస్తారు. దాంతో ఆర్టీసీ చార్జీలు కూడా పెంచుతారు. వాహనదారులు ఆ విధంగా ఐదేళ్లలో ఏకంగా రూ.12,500 కోట్లు భరించాల్సి ఉంటుంది. అదే ఆ 27 రోడ్లను ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ప్రజలపై టోల్ ఫీజుల భారం పడదు. నాబార్డ్ తదితర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రోడ్లు నిర్మించవచ్చు. ప్రభుత్వం దశలవారీగా బ్యాంకు రుణాలను తీర్చవచ్చు. అలా చేస్తే ముఖ్యనేతకు ఏం ప్రయోజనం..? పీపీపీ విధానంలో తమ బినామీ కాంట్రాక్టు సంస్థల ద్వారా రోడ్లను నిర్మిస్తేనే కదా ఆయన జేబులు నిండేది.పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించిన రోడ్లు1) కళింగపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా పార్వతీపురం2) గార నుంచి ఆమదాలవలస మీదుగా బత్తిలి3) చిలకపాలెం నుంచి రాజాం మీదుగా అంతర్రాష్ట్ర రాయగడ రోడ్4) భీమునిపట్నం నుంచి చోడవరం మీదుగా తుని 5) విశాఖపట్నం నుంచి ఎస్.కోట మీదుగా అరకు 6) కాకినాడ – జొన్నాడ7) రాజమహేంద్రవరం నుంచి మారేడుమిల్లి మీదుగా భద్రాచలం8) అమలాపురం – బొబ్బర్లంక 9) రాజవరం – పొదలాడ10) ఏలూరు – కైకలూరు11) ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా మేడిశెట్టివారిపాలెం12) భీమవరం నుంచి కైకలూరు మీదుగా గుడివాడ13) గుడివాడ – కంకిపాడు (విజయవాడ)14) విజయవాడ నుంచి ఆగిరిపల్లి మీదుగా నూజివీడు15) గుంటూరు – పర్చూరు, 16) నరసరావుపేట – సత్తెనపల్లి17) వాడరేవు నుంచి నరసరావుపేట మీదుగా పిడుగురాళ్ల రోడ్18) కావలి నుంచి ఉదయగిరి మీదుగా సీతారాంపురం రోడ్19) నెల్లూరు – సైదాపురం రోడ్20) గూడూరు నుంచి రాపూరు మీదుగా రాజంపేట రోడ్21) మైదుకూరు – తాటిచెర్ల రోడ్22) పులివెందుల నుంచి ధర్మవరం మీదుగా దమజిపల్లి రోడ్23) చాగలమర్రి నుంచి వేంపల్లి మీదుగా రాయచోటి రోడ్ 24) అనంతపురం నగరంలో రింగ్ రోడ్25) సోమందేపల్లి నుంచి హిందూపూర్ బైపాస్ మీదుగా తుమకుంట 26) అనంతపురం – చెన్నై రహదారిలో కదిరి రింగ్ రోడ్27) కాలవగుంట – పెనుమూరు నెండ్రగుంట రోడ్ -
టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా? కేంద్రం క్లారిటీ
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద క్యూ పొడవు లేదా వేచి ఉండే సమయాల ఆధారంగా ప్రస్తుత నిబంధనలు టోల్ ఫీజు మినహాయింపులను అందించవని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎంపీలు లేవనెత్తిన ఆందోళనలను ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో రెండు వేర్వేరు సమాధానాల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.60 కిలోమీటర్ల లోపే ఉన్నప్పటికీ రెండు ప్లాజాల్లో టోల్ వసూలు చేస్తున్నారని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ "ఎన్‌హెచ్ ఫీజు నిబంధనలు, రాయితీ ఒప్పందం ప్రకారం 60 కి.మీ పరిధిలో ఉన్నప్పటికీ ఫీజు ప్లాజాలకు అనుమతి ఉంటుంది" అని గడ్కరీ స్పష్టం చేశారు. కాగా దీనికి సంబంధించి 2022 మార్చిలో గడ్కరీ మాట్లాడిన పాత వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. 60-కిమీ పరిధిలో ఒకే ఒక టోల్ ప్లాజా ఉంటుందని, అదనంగా ఉన్నవాటిని మూడు నెలల్లో మూసివేస్తామని అందులో ఆయన హామీ ఇచ్చారు.అయితే, లోక్‌సభలో ఆయన తాజాగా ఇచ్చిన సమాధానం దీనికి విరుద్ధంగా అలాంటి మినహాయింపు లేదని పేర్కొంది. ఎగ్జిక్యూటింగ్ అథారిటీ డాక్యుమెంట్ చేసిన దాని ప్రకారం, అవసరమైతే 60 కిలోమీటర్లలోపు అదనపు టోల్ ప్లాజాలకు నిబంధనలు అనుమతిస్తున్నట్లు గడ్కరీ వివరించారు.ఇక కొత్త టోల్ ప్లాజాల రూపకల్పనకు మార్గదర్శకాల్లో భాగంగా రద్దీ సమయాల్లో వాహనాల క్యూలు 100 మీటర్లు దాటితే బూమ్ బారియర్స్‌ను ఎత్తివేసే అంశంపై మరో ఎంపీ అడిగిన ప్రశ్నకూ గడ్కరీ స్పందించారు. “ఫీజు ప్లాజాల వద్ద నిర్ణీత దూరం లేదా సమయ పరిమితి దాటి వాహనాలను నిలిపివేసిన సందర్భంలో ఆ వాహనాలను యూజర్ ఫీజు నుంచి మినహాయించే నిబంధన లేదు” అని ఆయన స్పష్టం చేశారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అమలును ఆయన గుర్తు చేశారు. ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించింది. -
టోల్‌గేట్స్ గాయబ్.. వసూళ్లు మాత్రం ఆగవు
టోల్ గేట్స్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గిందడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం తీసుకువచ్చారు. ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ విధానానికి స్వస్తి పలికి శాటిలైట్ విధానం తీసుకురావడానికి కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొన్నారు.మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ పేర్కొన్నారు.ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన శాటిలైట్ టోల్ కలెక్షన్ విజయవంతమవ్వడంతో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ సిస్టమ్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గురించి వాహన వినియోగదారులలో అవగాహన కల్పించడానికి ఓ వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేసినట్లు గడ్కరీ పేర్కొన్నారు. మొత్తం మీద దేశంలో టోల్ గేట్స్ త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌట్ కట్ చేసుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ కోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కల్గిన ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణించిన దూరానికి అయ్యే మొత్తాన్ని ఆటోమాటిక్‌గా చెల్లించడానికి సాధ్యమవుతుంది. -
ఎన్హెచ్ఏఐ కొత్త రూల్.. ఇలా చేస్తే రెట్టింపు టోల్ ఫీజు
టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ ప్రవేశపెట్టింది. ఈ ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గింది. అయితే కొంతమంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్ స్క్రీన్ మీద కాకుండా.. ఇతర ప్రదేశాల్లో అంటించి టోల్ ప్లాజాల వద్ద అనవసర ఆలస్యాలకు కారణమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. వెహికల్ విండ్‌స్క్రీన్ మీద కాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇతర ప్రదేశాలలో అంటిస్తే అలాంటి వారి నుంచి డబుల్ టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. కాబట్టి తప్పకుండా వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్‌స్క్రీన్‌పై అంటించాలి.కొందరు వాహనదారులు విండ్‌స్క్రీన్ మీద ఫాస్ట్‌ట్యాగ్‌ను అంటించకపోవడం వల్ల టోల్ ప్లాజాలో అనవసరమైన ఆలస్యానికి కారణమవుతున్నారు. కాబట్టి ఇకపై అలా చేసేవారు రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వాహన వినియోగదారులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.విండ్‌స్క్రీన్ మీద ఫాస్ట్‌ట్యాగ్‌ను అంటిస్తే టోల్ ప్లాజాలో తొందరగా ట్రాన్సక్షన్ జరుగుతుంది. అప్పుడు గేట్ వేంగంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు వెనుక వచ్చే వాహనదారులు కూడా వేగంగా ముందుకు వెళ్ళవచ్చు. అలా కాకూండా ఫాస్ట్‌ట్యాగ్ అడ్డదిడ్డంగా, ఎక్కడపడితే అక్కడ అంటిస్తే వారికి మాత్రమే కాకుండా.. వెనుక వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. -
ఔటర్‌పై కార్లు, ఇతర వాహనాలకు వేర్వేరు మార్గాలు
మణికొండ: ఔటర్ రింగ్‌రోడ్డుపై పెరుగుతున్న ట్రాఫిక్‌తో టోల్గేట్ల వద్ద వాహనదారుల పడిగాపులు పెరిగిపోతున్నాయి. వాటిని నివారించే ఉద్దేశంతో అధిక రద్దీ ఉండే పుప్పాలగూడ టోల్గేట్ వద్ద నిర్వాహకులు ప్రత్యేక దారులను ఏర్పాటు చేసి రద్దీ నివారణ చర్యలు చేపట్టారు. ఆదివారం నుంచి శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ఉన్న మూడు టోల్ వసూలు కౌంటర్లలోకి కార్లను మాత్రమే అనుమతించారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే మార్గంలో కార్లకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న వాహనదారులే ప్రవేశించాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా ఆయా మార్గాల్లోకి ప్రవేశిస్తే చెల్లించాల్సిన డబ్బుకు రెండితలు వసూలు చేస్తున్నామని టోల్గేట్ నిర్వాహకులు తెలిపారు. ఫాస్టాగ్‌లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గాల్లోకి ఇతర వాహనదారులు రావొద్దని బోర్డులు ఏర్పాటు చేసినా వారు ప్రవేశించి నగదు రూపంలో టోల్ చెల్లిస్తుండటంతో రద్దీ పెరిగిపోతోందన్నారు. అందుకే కచ్చితంగా ఫాస్టాగ్ ఉన్న కార్లను ఆయా మార్గాల్లో.. మిగతా వాహనాలను ఇతర కౌంటర్లలోకి అనుమతిస్తున్నామన్నారు. దాంతో ఆదివారం ఎక్కువగా ట్రాఫిక్ స్తంభించలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో అధిక రద్దీ ఉండే మరిన్ని టోల్ కేంద్రాల వద్ద ఇలాంటి ఏర్పాట్లను చేస్తామని వారు తెలిపారు. -
మంచిమాట చెప్పిన నితిన్ గడ్కరీ: రోడ్లు బాగుంటేనే..
టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం ప్రవేశపెట్టారు. ఈ విధానానికి కేంద్రం త్వరలోనే మంగళం పాడనుంది. ఫాస్ట్‌ట్యాగ్ స్థానంలో శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అంతే కాకుండా.. రోడ్లు సరిగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్ వసూలు చేయకూడదని గడ్కరీ ఇటీవల స్పష్టం చేశారు.నాణ్యమైన సేవలు అందించని పక్షంలో మీరు టోల్ వసూలు చేయకూడదని గ్లోబల్ వర్క్‌షాపులో నితిన్ గడ్కరీ హైవే ఏజెన్సీలకు క్లారిటీ ఇచ్చారు. నాణ్యమైన రోడ్లు లేకుండానే టోల్ వసూలు చేస్తే.. ప్రభుత్వం మీద ప్రజలకు కోపం వస్తుంది. నాణ్యమైన సేవలను అందించినప్పుడే టోల్ వసూలు చేయాలని పేర్కొన్నారు.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థను అమలు చేయాలని యోచిస్తోంది. ప్రారంభంలో ఈ విధానం కొంత దూరానికి మాత్రమే పరిమితం చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత అన్ని హైవేల మీద ఇదే వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. -
Nitin Gadkari: రోడ్డు బాగాలేకపోతే టోల్ వసూలు చేయొద్దు
న్యూఢిల్లీ: రహదారి సరిగ్గా లేకపోతే వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేయొద్దని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ రహదారుల నిర్వహణ సంస్థలను ఆదేశించారు. శాటిలైట్ ఆధారిత టోల్ రుసుముల వసూలుపై బుధవారం ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించలేనప్పుడు టోల్ చార్జి వసూలు చేయొద్దని అన్నారు. గుంతలు, బురదతో నిండిన రోడ్లపై కూడా టోల్ వసూలు చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కిలోమీటర్ల మేర రహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
టోలు ఒలుస్తున్నారు!
సాక్షి, అమరావతి: వాహనంతో రోడ్డెక్కితే చాలు ‘టోలు’ ఒలిచేస్తున్నారు. దేశంలో టోల్ చార్జీల రాబడి రికార్డుస్థాయిలో పెరిగింది. దేశంలో 2023–24లో రూ.64,809 కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేయడం విశేషం. ఇది 2022–23 కంటే 39శాతం అధికం. కేంద్ర ప్రభుత్వం ‘బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్’(బీవోటీ) విధానంలో జాతీయ రహదారులను నిర్మిస్తుండటంతో కొత్త రహదారులు టోల్ చార్జీల పరిధిలోకి వస్తున్నాయి. దేశంలో 2022 డిసెంబర్ నాటికి 35,996 కి.మీ.మేర టోల్ చార్జీలు వసూలు చేసే జాతీయ రహదారులు ఉండేవి. కాగా, 2023 డిసెంబర్ నాటికి జాతీయ రహదారులు 45,428 కి.మీ.కు పెరిగాయి. దాంతోపాటు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో టోల్ చార్జీల రూపంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ)కు ఆదాయం అమాంతంగా పెరుగుతోంది. 8 కోట్లకుపైగా ఫాస్టాగ్‌లు వాహనదారుల నుంచి టోల్ చార్జీల వసూలు చేసేందుకు 2023, డిసెంబర్ నాటికి 8కోట్లకు పైగా ఫాస్టాగ్‌లను జారీచేశారు. దీంతో ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున రూ.147.31కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇక త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు విధానాన్ని ఎన్హెచ్ఏఐ ప్రవేశపెట్టనుంది. టోల్ చార్జీలను కూడా దశలవారీగా పెంచనుంది.వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెంచాలని ఎన్హెచ్ఏఐ ముందుగా నిర్ణయించింది. కానీ, సాధారణ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం అమలును రెండు నెలలు వాయిదా వేసింది. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత 5శాతం టోల్ చార్జీలను పెంచింది. శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు అమల్లోకి వచ్చినప్పుడు మళ్లీ పెంచే అవకాశం ఉంది. దీంతో వాహనదారులపై టోల్ చార్జీల భారం మరింత పెరగనుంది. -
ఔటర్‌పై నేటి నుంచి పెరగనున్న టోల్ చార్జీలు
లక్డీకాపూల్: ఔటర్ రింగ్ రోడ్‌పై టోల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. సోమవారం నుంచి పెంచిన టోల్ చార్జీలు 5 శాతం అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్లకు ప్రతి కిలోమీటర్‌కి రూ.2.34 పైసలు, ఎల్‌సివి, మినీ బస్‌లకు రూ.3.77, బస్, 2–యాగ్జిల్ ట్రక్‌లకు రూ.6.69, భారీ నిర్మాణ మెషినరీ, ఎర్త్ మూ వింగ్ ఎక్విప్మెంట్లకు రూ.12.40, ఓవర్సైజ్డ్ వాహనాలకు రూ.15.09 చొప్పున టోల్ చార్జీలు పెరగనున్నాయి.కొత్త టోల్ రేట్లు, రో జువారీ పాసులు, నెలవారీ పాసులు తదితరాలకు హెచ్ఎండిఏ వైబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా ఐఆర్బి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ సంస్ధ నిర్వాహకులు సూచించారు. -
దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..
-
నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
ఎన్టీఆర్, సాక్షి: సొంత ఊళ్లకు వెళ్లి ఓట్లేసిన ఏపీ ఓటర్లు.. తిరిగి తెలంగాణ బాట పట్టారు. దీంతో హైదరాబాద్ వచ్చే రహదారుల్లో వాహనాల రద్దీ నెలకొంది. సోమవారం సాయంత్రం ఉదయం నుంచే ఇది మొదలుకాగా.. మంగళవారం ఉదయానికి అది మరింతగా పెరిగింది.ఆంధ్రా నుంచి పెద్ద ఎత్తున్న ఓటర్లు తిరిగి తెలంగాణకు వస్తున్నారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. పతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు ఒక అంచనా. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. అయితే.. సోమవారం మాత్రం సాయంత్రం 6.30 గంటలకు వీటి సంఖ్య 35 వేలకు పైగా చేరింది. ఈ ఉదయం ఆ రద్దీ అంతకంతకు పెరుగుతోంది.ఇక.. ఏపీలో పోలింగ్ కోసం ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటేశారు. సాయంత్రం సైతం క్యూ లైన్లలో చాలామంది వేచి ఉండడం గమనార్హం. ఏపీలో భారీగా పోలింగ్ జరిగిందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించగా, కడపటి వార్తలు అందేసరికి అది 78.36 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం ఇంకా ఎక్కువే నమోదు కావొచ్చని సీఈవో ఎంకే మీనా ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎన్హెచ్ఏఐ నిర్ణయానికి ‘నో’ చెప్పిన ఈసీ
సార్వత్రిక ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్ర ఎన్నికల సంఘం రిలీఫ్ కల్పించింది. టోల్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)ను ఆదేశించింది. కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారుల నుంచి పాత టోల్ ఛార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు ఎన్హెచ్ఏఐ సూచించింది. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన ఎన్హెచ్ఏఐ టోల్ ఛార్జీలు పెంచుతుంది. సంస్థ నిర్ణయాల ప్రకారం..సరాసరి ఐదు శాతం టోల్ ఛార్జీలు పెరుగుతాయి. ఈమేరకు ముందుగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆదివారం రాత్రి నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. కానీ కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఛార్జీల పెంపు అంశాన్ని ఎన్నికల సంఘం వద్దకు తీసుకెళ్లింది. దాంతో ఆ వ్యవహారాన్ని పరిశీలించిన ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐను ఆదేశించింది. దాంతో తాజాగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. పెరిగిన టోల్ ఛార్జీలు ఎప్పటి నుంచి అమలవుతాయో తెలియజేస్తామని చెప్పింది. అప్పటివరకు పాత ఛార్జీలే వర్తిస్తాయని పేర్కొంది. ఇదీ చదవండి: పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే.. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనదారుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తం టోల్ ఛార్జీలను సదరు వాహనదారులకు వెనక్కు చెల్లిస్తామని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెప్పాయి. ఈ నెల 26 నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడతాయి. -
పెరిగిన టోల్ ధర.. ఏమిటీ టోల్ ట్యాక్స్? ఎందుకు చెల్లించాలి?
టోల్‌ట్యాక్స్ పెంచుతున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుం పెరుగుతుంది. ఈసారి పెరిగిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. పెరిగిన ఛార్జీల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10 అదనంగా చెల్లించాలి. తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20, బస్సు, ట్రక్కులకు వరుసగా రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాలకు రూ.35 నుంచి రూ.50 చొప్పున పెంచారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు రుసుంలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక టోల్ ప్లాజాల వద్ద వసూళ్లు కూడా భారీగా పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు టోల్‌ట్యాక్స్ అంటే ఏమిటి..? దాన్ని ఎందుకు చెల్లించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. రోడ్లను ఉపయోగించడానికి ప్రతి వాహనదారుడు ప్రభుత్వానికి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వాహనం కొనేపుడే వాహనం బరువు, తయారైన సంవత్సరం, సీటింగ్ కెపాసిటీ, ఇంజిన్ రకాలను బట్టి రోడ్ ట్యాక్స్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఇక ఈ ట్యాక్స్ చెల్లించాం కదా అని నేషనల్ హైవేపై వాహనంతో రౌండ్స్ కొట్టొచ్చని అనుకోవద్దు. ఎందుకంటే మళ్లీ ఆ రోడ్డుపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని టోల్ ట్యాక్స్ అంటారు. రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. రోడ్డు వేయడానికి ఖర్చు చేసిన మొత్తం వసూలైన తరువాత టోల్ ఫీజును 40 శాతానికి తగ్గించాలనే నిబంధన ఉంది. టోల్స్ మధ్య దూరం.. టోల్ ట్యాక్స్, టోల్ ఛార్జీలను కలిపి టోల్ అని సింపుల్‌గా పిలుస్తుంటారు. ఎక్స్‌ప్రెస్ వేస్, సొరంగ మార్గాలు, వంతెనలు, జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలు సాగించే వాహనాల నుంచి ఈ టోల్ వసూలు చేస్తారు. ద్విచక్ర వాహనాలకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుంది. మిగిలిన వాహనాల పరిమాణాన్ని బట్టి టోల్ వసూలు చేస్తారు. టోల్ చెల్లించే రహదారులను టోల్ రోడ్లని అంటారు. వీటి నిర్వహణ బాధ్యతను ఎన్హెచ్ఏఐ పర్యవేక్షిస్తుంటుంది. నిర్దేశిత ప్రదేశంలో టోల్ బూత్‌లు, ప్లాజాల పేరిట కౌంటర్లు ఏర్పాటు చేసి సంబంధిత మొత్తం చెల్లించిన తరువాతనే ఇక్కడ వాహనాలను రోడ్డుపైకి అనుమతిస్తారు. రెండు టోల్ బూత్‌ల మధ్య సాధారణంగా 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతకంటే తక్కువ దూరంలోనూ ఉండే అవకాశముంది. ఆ దూరాన్ని బట్టి ట్యాక్స్ వసూలు చేస్తారు. ఏటా ఏప్రిల్ 1న అవసరాన్ని బట్టి టోల్ ధరలను పెంచుతున్నారు. ప్రయాణం సాఫీగా సాగేలా.. నాణ్యమైన, గుంతలు లేని రహదారిని వినియోగించి ప్రయాణం సాఫీగా చేస్తున్నందుకు చెల్లించే రుసుమే టోల్. రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం కూడా టోల్ నిధులను ఖర్చు చేస్తారు. ఏళ్ల తరబడి టోల్ వసూలు చేయడం వల్ల ఆ రోడ్డు వేయడానికి చేసిన ఖర్చు వసూలవుతుంది. ఈ మొత్తాన్ని ఎన్హెచ్ఏఐ తీసుకొని రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు చెల్లింపులు చేస్తుంది. టోల్గేట్ వసూలు చేసే దగ్గర టో వెహికల్, తాగునీరు, మరుగుదొడ్లు, అత్యవసర సేవలు, అగ్నిప్రమాద నియంత్రణ సౌకర్యాలుంటాయి. ఫాస్టాగ్‌తో తగ్గిన రద్దీ టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ఫాస్టాగ్ ఉపయోగపడుతుంది. ఒక స్టిక్కర్లా కనిపించే ఫాస్టాగ్‌ను మొబైల్ నంబర్లా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫాస్టాగ్‌ను కొన్ని మొబైల్ యాప్‌లు, టోల్‌ప్లాజా కేంద్రాల వద్ద విక్రయిస్తారు. మనం టోల్గేట్ వద్దకు వెళ్లగానే అక్కడి స్కానర్లు ఫాస్టాగ్‌ను రీడ్ చేస్తాయి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా నిర్దేశిత టోల్ మొత్తం అందులో నుంచి కట్ అవుతుంది. ఈ ఫాస్టాగ్‌ల కారణంగా టోల్గేట్ల వద్ద రద్దీ బాగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏవైనా కారణాల వల్ల టోల్ ప్లాజాల దగ్గర 100 మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉన్నట్టైతే వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా ముందుకు వెళ్లిపోవచ్చు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు! వీరికి టోల్ ఉండదు.. టోల్ ప్లాజాల వద్ద రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్పీకర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఆర్మీ, పోలీసు ఉన్నత అధికారులు ప్రయాణించే అధికారిక వాహనాలకు మినహాయింపు ఉంటుంది. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, అంతిమయాత్ర వాహనాల నుంచి టోల్ తీసుకోరు. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఆర్టీవో ఆఫీసులో రిజిస్టర్ అయిన వాహనాలకు స్థానికులు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. -
వాహనదారులకు ముఖ్య గమనిక, ఫాస్టాగ్‌లపై కీలక అప్డేట్!
టోల్గేట్ల వద్ద సమయం ఆదా చేయడంతో పాటు, వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిచ్చింది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేమెంట్స్ పేటీఎం బ్యాంక్ (పీపీబీఎల్) ద్వారా జరిగేవి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో పీపీబీఎల్‌లో ఫాస్టాగ్‌లను ఫిబ్రవరి 29 లోపు వినియోగించుకోవాలని ఎన్హెచ్ఏఐ సూచించింది. ఆ తర్వాత నుంచి తాము నిర్ధేశించిన బ్యాంకుల్లో మాత్రమే ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని తెలిపింది. నిర్ధేశించిన గడువు తర్వాత పీపీబీఎల్ మినహా బ్యాంకులు అందించే ఫాస్టాగ్‌లను పొందాలని వెల్లడించింది. ఇప్పుడు ఆయా బ్యాంకుల్లో నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించి ఫాస్టాగ్‌లను పొందవచ్చు. ఫాస్టాగ్ ఛార్జీలు? హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఫాస్టాగ్ యాక్టివేషన్ ఛార్జీలు నామమాత్రంగా ఉన్నాయి. అయితే, వినియోగదారులకు మూడు రకాల ఫాస్టాగ్ ఛార్జీలు ఉన్నాయని గుర్తించాల్సి ఉంటుంది. వాటిల్లో 1.ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు - ఫాస్టాగ్ యూజర్‌గా పేరు నమోదు చేసుకొని, మీ వాహనానికి ఫాస్టాగ్‌ను వినియోగించేలా యాక్టీవేట్ చేసేందుకు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఒక్కసారే ఉంటుంది. 2.సెక్యూరిటీ డిపాజిట్ - ఫాస్టాగ్ అకౌంట్ మూసివేసే సమయంలో ఎలాంటి బకాయిలు లేకుండా పూర్తిగా వాపస్ చేసేందుకు అతితక్కువ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మీ వాహనాన్ని బట్టి ఆ మొత్తం మారుతూ ఉంటుంది. యూజర్ల ఫాస్టాగ్ ఖాతాలో తగినంత నిధులు లేకుంటే, ఏదైనా బకాయి ఉన్న టోల్ ఛార్జీలను సర్దుబాటు చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్‌ని బ్యాంకులు ఉపయోగించుకోవచ్చు 3.ఫాస్టాగ్ యాక్టివేషన్ టైం : ఫాస్టాగ్ యాక్టివేషన్ అయిన వెంటనే ఏదైనా టోల్ ఛార్జీలు చెల్లించడానికి ఈ మొత్తం మీ ఫాస్టాగ్ ఖాతాలో ఉంటుంది. ఈ థ్రెషోల్డ్ మొత్తం వాహనం తరగతిపై ఆధారపడి ఉంటుంది. ఫాస్టాగ్‌లు జారీ చేసే బ్యాంకులు, వినియోగదారులు ఫాస్టాగ్ కోసం ఎంత చెల్లించాలో తెలిపే వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాహనదారుల నుంచి ట్యాక్స్ కింద రూ.100, సెక్యూరిటీ కింద రూ.100 వసూలు చేస్తుంది. కారు, జీప్, వ్యాన్, టాటా ఏస్ ఇలాంటి మినీ-లైట్ కమర్షియల్ వాహనాలకు విధిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ జాయినింగ్ ఫీజుగా బ్యాంక్ రూ. 99.12 (GSTతో సహా) వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 200, కారు, జీప్, వ్యాన్ థ్రెషోల్డ్ మొత్తం రూ. 200. ఈ మొత్తం చెల్లిస్తేనే మీ ఫాస్టాగ్ పనిచేస్తుంది. లేదంటే ఎలాంటి ఉపయోగం ఉండదు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్లు, జీప్‌లు, వ్యాన్లు, టాటా ఏస్, ఇతర కాంపాక్ట్ లైట్ కమర్షియల్ వాహనాలకు ఫాస్టాగ్ ఫీజులు లేదా సెక్యూరిటీ డిపాజిట్లకు ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయదు. కాకపోతే ఫాస్టాగ్ యాక్టివేషన్ కోసం కనీస బ్యాలెన్స్ రూ. 200 అవసరమని గుర్తించాలి. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఫాస్టాగ్ జారీ చేసినందుకు కస్టమర్ నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయదు. అయితే, తిరిగి రెన్యువల్ చేసే సమయంలో బ్యాంక్ రూ.100 (అన్ని ట్యాక్స్‌లు కలిపి) వసూలు చేస్తుంది. కారు, జీపు, వ్యాన్ వంటి వాహనాలకు బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా ఫాస్టాగ్ వన్ టైమ్ ఫీ కింద జీఎస్టీతో కలిపి రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి మారుతుంది. థ్రెషోల్డ్ పరిమితి రూ. 200తో పాటు కారు, జీప్, వ్యాన్లకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తుంది. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ రెన్యువల్ సమయంలో రీ-ఇష్యూషన్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తుంది. టాగ్ని ఆన్లైన్లో రీ-లోడ్ చేయడానికి కన్వీనియన్స్ ఫీజు రూ.10 అవుతుంది. కారు, జీప్, వ్యాన్ వంటి వాహనాలకు సెక్యూరిటీ డిపాజిట్ రూ.200, థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఉంది. ఐడీబీఐ ఐడీబీఐ బ్యాంక్ పన్నులతో సహా రూ. 100 రీ-ఇష్యూషన్ ఫీజును వసూలు చేస్తుంది. బ్యాంక్ ట్యాగ్ డిపాజిట్ రూ. 200 వసూలు చేస్తుంది. కొటక్ మహీంద్రా వీసీ4 కోసం బ్యాంక్ రూ. 100 వసూలు చేస్తుంది. ఇతర వెహికల్ క్లాస్‌కు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజుగా, డిపాజిట్‌గా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 200, కస్టమర్ వాలెట్లో లోడ్ చేసే థ్రెషోల్డ్ మొత్తంగా రూ. 200 వసూలు చేస్తుంది. బ్యాంక్ వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజుగా రూ. 100 , రీఇష్యూన్స్ ఫీజు కోసం రూ. 100 వసూలు చేస్తుంది. పీఎన్బీ కారు, జీప్ , వ్యాన్ వంటి వాహనాలకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జ్ చేయబడుతుంది . థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్‌కి ఒక్కసారి రుసుము రూ. GSTతో కలిపి 100. ట్యాగ్ జాయినింగ్ ఫీజు (వన్-టైమ్ ఫీజు) రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా), వన్-టైమ్ ట్యాగ్ రీ-ఇష్యూషన్ ఫీజు రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా). రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి ఉంటుంది. కారు / జీప్ / వ్యాన్ కోసం వన్-టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ (రిజర్వ్ చేయబడిన మొత్తం) మొత్తం రూ. 150. -
పంతంగి టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి రష్
-
సంక్రాంతికి ఎఫెక్ట్.. టోల్ గేట్ వద్ద ప్రత్యేకంగా..
సాక్షి, యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాల నుంచి ప్రజలు గ్రామాల బాట పట్టారు. సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైవేలపై వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టోల్‌బూత్‌ల మధ్య ట్రాఫిక్ క్లియర్ కోసం టోల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వివరాల ప్రకారం.. సంక్రాంతి సందర్బంగా జాతీయ రహదారి -65పై హైదరాబాద్-విజయవాడ వైపు వాహనాల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో పంతంగి, కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు టోల్ బూత్‌లను టోల్ సిబ్బంది టోల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. దీంతో, ట్రాఫిక్ కొంత మేరకు తగ్గింది. ఇక, సంక్రాంతి సందర్బంగా విజయవాడ బస్టాండ్‌కు ప్రయాణీకుల రద్దీ పెరిగింది. బస్టాండ్‌లో ప్లాట్‌ఫ్లామ్‌లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ప్రయాణీకులు చేరుకుంటున్నారు. కాగా, ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. -
టోల్‌ప్లాజా తొలగింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు
సాధారణంగా చాలామందికి నిర్ణీత గడువు తర్వాత టోల్‌ప్లాజాలను మారుస్తారు లేదా తొలగిస్తారనే అపోహ ఉంది. కానీ దానికి సంబంధించి కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రహదారుల రుసుముల నిబంధనలు-2008 ప్రకారం.. నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత మూలధన వ్యయాన్ని రికవరీ చేశాక టోల్ ప్లాజాలను తొలగించాలనే ఎలాంటి నిబంధనా లేదని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలోని జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన ఏ ఒక్క టోల్ ప్లాజాలోనూ ఇప్పటివరకు మూలధన వ్యయాన్ని పూర్తిగా రికవరీ చేయలేదని గురువారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణ బాధ్యతలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తాయి. రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్హెచ్ఏఐ పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? మరోవైపు, జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానునట్లు గడ్కరీ ఇటీవల ప్రకటించారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
మార్చి నాటికల్లా టోల్ ప్లాజాలుండవ్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ప్రస్తుత హైవే టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టనుంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ మొదలైనవి వీటిలో ఉండనున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్‌గా టోల్ వసూళ్లకు ఉపయోగపడే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్‌కు సంబంధించి తమ శాఖ రెండు పైలట్ ప్రాజెక్టులను నిర్వహించినట్లు వివరించారు. 2018–19లో టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండగా.. 2020–21లో ఫాస్ట్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టిన తర్వాత క్రమంగా 47 సెకన్లకు తగ్గింది. దీంతో చాలా ప్రాంతాల్లో నిరీక్షణ సమయం తగ్గినప్పటికీ జనాభా ఎక్కువ ఉన్న నగరాలకు దగ్గర్లో పీక్ అవర్స్‌లో ఇప్పటికీ కొంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త సాంకేతికతల పరిశీలన ప్రాధాన్యం సంతరించుకుంది. -
13 రాష్ట్రాల్లో వీరిదే హవా..! ఆదాయం రూ. కోట్లలోనే..
Sahakar Group Limited (SGL): దేశంలో రోడ్డు వ్యవస్థ మునుపటి కంటే మెరుగుపడింది. హైవేలు, అండర్ పాస్, ఫ్లైఓవర్ వంటి మార్గాలు ఎక్కువయ్యాయి, తద్వారా ప్రయాణం కూడా ఇప్పుడు సులభతరం అయిపోయింది. అయితే ఇప్పుడు ఏ ప్రధాన రహదారి ఎక్కినా ఎక్కడికక్కడ టోల్ ప్లాజాలు ఎదురవుతూనే ఉంటాయి. టోల్ ప్లాజా దాటాలంటే కచ్చితంగా టోల్ పీజు చెలించాల్సి ఉంటుంది. మనదేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థ ఏది? దాని ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో అత్యధిక టోల్ ప్లాజాలు తమ అధీనంలో ఉంచుకున్న అగ్రగామి సంస్థ 'సహకార్ గ్రూప్ లిమిటెడ్' (SGL). దేశవ్యాప్తంగా సుమారు 13 రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకుంటున్న ఈ కంపెనీ 200 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను తమ పరిధిలో ఉంచుకుంది. 1996లో 'కిషోర్ అగర్వాల్' స్థాపించిన సహకార్ గ్రూప్ లిమిటెడ్, అతి తక్కువ కాలంలోనే మంచి పురోగతిని సాధించింది. 2011 - 12 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 30 కోట్లు కాగా.. 2022 - 23 నాటికి రూ. 2700 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే టోల్ ప్లాజా రంగంలో ఎంత అభివృద్ధి సాదించించనే విషయం ఇట్టే అర్థమైపోతుంది. సహకార్ గ్రూప్ లిమిటెడ్ కంపెనీ స్వంత కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌లను, స్వంత యాజమాన్య కంప్యూటరైజ్డ్ టోల్ రెవెన్యూ ఆడిటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంతో సహా టోల్లను వసూలు చేయడానికి అప్పటికప్పుడు కొత్త విధానాలు అలవరిస్తోంది. 1996 సమయంలో ఈ సంస్థ కేవలం ముంబై చుట్టూ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ల కోసం ఆక్ట్రాయ్ సేకరణతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తరువాత మహారాష్ట్ర రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థగా అవతరించింది. ఇదీ చదవండి: మరింత తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే.. సహకార్ గ్రూప్ లిమిటెడ్ సంస్థలో సుమారు 4000 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాల సంఖ్య కూడా తప్పకుండా పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు
గాం«దీనగర్: పూర్వం రహదారిపై దారి దోపిడీలు జరిగేవి. ఇప్పుడు దొంగలు ఏకంగా జాతీయరహదారిపై టోల్‌ప్లాజా ఒకటి తెరిచేసి దర్జాగా టోల్ వసూళ్లు మొదలెట్టేశారు. ఈ దోపిడీ ఘటనకు గుజరాత్ రాష్ట్రంలోని జాతీయరహదారి వేదికైంది. నకిలీ టోల్‌ప్లాజా ద్వారా మోసగాళ్ల ముఠా ఏకంగా రూ.75 కోట్లకుపైగా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఏడాదికాలంగా ఇది జరుగుతున్నా పోలీసులకు ఇంతకాలం సమాచారం లేకపోవడం విడ్డూరం. నకిలీ టోల్‌ప్లాజా గుట్టుమట్లు తాజాగా స్థానికంగా వెలుగులోకి వచ్చాక చిట్టచివరన పోలీసులకు తెలిశాయి. ప్రస్తుతం కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టి ఐదుగురిని అరెస్ట్‌చేశారు. సంబంధిత వివరాలను పోలీసులు వెల్లడించారు. తక్కువ రేటు కావడంతో అంతా గప్‌చుప్ మోర్బీ జిల్లా, కఛ్ జిల్లాలను కలిపే 8ఏ నంబర్ జాతీయరహదారిపై వాఘసియా టోల్‌ప్లాజా ఉంది. దీని గుండా వెళ్లకుండా సమీప ప్రాంతం గుండా వెళ్లొచ్చని వాహనదారులు కనిపెట్టారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతం గుండా వెళ్లడం మొదలెట్టారు. ఈ విషయం తెల్సుకున్న ఒక ముఠా ఒక కొత్త పథకంతో రంగంలోకి దిగింది. ఈ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ‘వైట్‌హౌజ్’ అనే సిరామిక్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారు. దానికి ఇరువైపులా హైవే వరకు కొత్త రోడ్లు వేశారు. ఫ్యాక్టరీలో టోల్ ప్లాజా కౌంటర్ నిర్మించి వసూళ్ల పర్వానికి తెరలేపారు. సాధారణంగా జాతీయరహదారిపై ఒక్కో వాహనాన్ని బట్టి రూ. 110 నుంచి రూ.595 వసూలుచేస్తారు. కానీ ఈ ‘దొంగ’ మార్గంలో వెళ్లే వాహనదారుల నుంచి ఈ ముఠా కేవలం రూ.20 నుంచి రూ.200 వసూలుచేసేవారు. ఇంత తక్కువకే టోల్‌గేట్‌ను దాటేస్తుండటంతో తెల్సినవారంతా ఈ మార్గంలోనే రాకపోకలు సాగించేవారు. కొత్త వాహనదారులకు, స్థానికులకు ఇది బోగస్ టోల్‌ప్లాజా అని తెల్సికూడా.. తక్కువ ధరలో పని అయిపోతుందని మిన్నకుండిపోయారు. దాంతో ముఠా వ్యాపారం ఒక ఏడాదిపాటు యథేచ్చగా సాగింది. గత 18 నెలల్లో ఈ ముఠా దాదాపు రూ.75 కోట్లు కొట్టేసిందని మాజీ ఐపీఎస్ రమేశ్ ఆరోపించారు. నిందితుల్లో పటేల్ నేత కుమారుడు స్థానిక మీడియాలో కథనాలు, విమర్శలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఐదుగురిని అరెస్ట్‌చేశారు. సిరమిక్ ఫ్యా క్టరీ యజమాని అమర్షీ పటేల్‌తోపాటు అతని నలుగురు అనుచరులు, మరో వ్య క్తినీ అరెస్ట్‌చేశారు. అమర్షీ సౌరాష్ట్ర ప్రాంతంలో కీలకమైన పటిదార్ సామాజిక వర్గానికి చెందిన నేత కుమారుడు కావడం గమనార్హం. -
టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. టోల్‌ప్లాజా వద్ద క్యూ లైన్లో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ముంబైలోని వర్లీ ప్రాంతంలో టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రావైపు వెళ్తున్న ఇన్నోవా కారు పలు వాహనాలను బలంగా ఢీకొంది. వర్లీలో సీ లింక్‌లో ఉన్న టోల్ ప్లాజాకు 100 మీటర్ల ముందు మొదట మెర్సిడెస్ కారును ఢీకొట్టిందని, ఆ తర్వాత మరో రెండు మూడు వాహనాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ వెల్లడించారు. అయితే, మెర్సిడెస్, ఇన్నోవా సహా మొత్తం ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్టు తెలిపారు. ఇక, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో నలుగురి పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆయన తెలిపారు. Major accident at Bandra- Worli Sea link last night. 3 dead, 6 injured.#Mumbai @RoadsOfMumbai @mumbaitraffic pic.twitter.com/DgF45ekUOA — Vivek Gupta (@imvivekgupta) November 10, 2023 -
రహదారులు.. రద్దీ
బీబీనగర్/చౌటుప్పల్: విజయదశమి, బతుకమ్మల పండుగల ప్రభావం జాతీయ రహదారులపై పడింది. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారులపై శనివారం వాహనా లు భారీగా బారులు తీరాయి. పండుగలకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల కూడళ్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రజలు, వాహనదారులు అవస్థలు పడ్డారు. -
టోల్‌ప్లాజా వద్ద హైస్పీడ్‌లో కారు బీభత్సం.. ఒక్కసారిగా గాల్లోకి లేచి..
లక్నో: అతి వేగం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రోడ్డు నిబంధనలను పాటించనందకు జరిమానాలు సైతం విధిస్తున్నారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు అజాగ్రత్తతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 20ఏళ్ల యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. యూపీలోని బారాబంకి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. లక్నో-సుల్తాన్పూర్ హైవేపై హైదర్‌గఢ్ టోల్ ప్లాజా వద్దకు ఓ కారు హైస్పీడ్‌లో వచ్చింది. ఆదర్శ్(20) అధిక వేగంతో కారు నడుపుతూ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. కారు అతివేగంలో ఉండటంతో టోల్‌ప్లాజా వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, కారు ఒక్కసారిగా గాల్లోకి లేచింది.. ప్రమాదం ధాటికి కారు పార్ట్స్ అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. #बाराबंकी: लखनऊ सुल्तानपुर हाईवे पर हैदरगढ़ कोतवाली क्षेत्र में शुक्रवार शाम तेज रफ्तार कार टोल प्लाजा के गेट पर बने डिवाइडर से जा टकराई। इससे कार के परखच्चे उड़ गए। कार को काटकर अंदर फंसे घायल युवक को बाहर निकाला गया, मगर सीएचसी पर उसे मृत घोषित कर दिया गया।#सीसीटीवी pic.twitter.com/sXUsv0HsjU — Barabanki District (@districtbbk) October 14, 2023 ఇక, ఈ ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన ఆదర్శ్‌ను అక్కడి టోల్ సిబ్బంది అతి కష్టం మీద బయటకు తీశారు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. ఆదర్శ్‌ను పరిశీలించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ సందర్బంగా టోల్ సిబ్బంది మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే కారులో నుంచి మంటలు వచ్చాయన్నారు. వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేసినట్టు తెలిపారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో సంజయ్ సింగ్‌కు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ -
ఎన్‌హెచ్–363 నిర్మాణంలో అదే జాప్యం.. మరోవైపు టోల్ వసూలు..
మంచిర్యాల: జాతీయ రహదారి–363 పనులు నాలుగేళ్లు అవుతున్నా ఇంకా కొనసాగుతూ నే ఉన్నాయి. ఓ వైపు రోడ్డుపై ప్రయాణం చేస్తున్నందుకు టోల్ వసూలు.. మరోవైపు పూర్తి కాని చోట పనులు సాగుతున్నాయి. రెండేళ్లలో పూర్తి కావాల్సిన రోడ్డు నిర్మాణం కరోనా, తర్వాత కూడా గడువు పొడగిస్తూనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టు వరకే పూర్తి కావాలి. కానీ ఈ ఏడాది ఆగస్టు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదు. మరోసారి జనవరి వరకు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌కు గడువు ఇచ్చారు. ఏళ్లుగా నిర్మాణంలోనే.. రాజీవ్ రాష్ట్రీయ రహదారిని శ్రీరాంపూర్ జీఎం ఆఫీ సు నుంచి మహారాష్ట్ర సరిహద్దు కుమురంభీం జిల్లా వాంకిడి మండలం గోయగాం వరకు జాతీయ రహదారిగా మార్చుతూ 2016లో కేంద్రం గెజిట్ ఉత్తర్వులు ఇచ్చింది. 2017లో పని ఉత్తర్వులు, 2018లో భూ సేకరణ, 2019లో బిడ్డింగ్ పూర్తయ్యాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో రెండేళ్ల నిర్మాణం, 15ఏళ్ల నిర్వహణ చేపట్టాలి. రెండు భాగాలుగా మొత్తం 94.602కిలోమీటర్లు నిర్మించాలి. కాంట్రాక్టర్ రూ.1356.90 కోట్లకు బిడ్ వేయగా.. అదనపు పనులతో నిర్మాణ వ్యయం రూ.1948కోట్లకు చేరింది. జిల్లాలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి తాండూర్ మండలం గోయగాం వరకు 42కిలోమీటర్లు నిర్మించాలి. గత ఏడాదిగా పది శాతం పనుల నిర్మాణమే చేస్తున్నారు. వాస్తవానికి ఈ పనులు 24 నెలల్లో అంటే 2022 ఆగస్టులోపే చేయాలి. నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోతే రోజుకు రూ.5లక్షల చొప్పున కాంట్రాక్టర్ పరిహారం వేయాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్ గడువు పెంచాలని కనీసం కోరకున్నా అధికారులే జనవరి వరకు పెంచేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. రక్షణ చర్యలు కరువు.. నిర్మించిన రోడ్డుకు టోల్‌ప్లాజా నుంచి రోజు రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. ప్రయాణికులకు అవగాహ న, భద్రత చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల ప్ర మాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. శ్రీరాంపూర్ బైపాస్ రోడ్డు, బెల్లంపల్లి బైపాస్ రో డ్డుపై రాత్రివేళ వెలుతురు సరిగా లేక భారీ వాహనా లు అదుపు తప్పుతున్నాయి. బోయపల్లి బోర్డు, క న్నాల, సోమగూడెం చర్చి సమీపంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్తగా రోడ్డు వేయడంతో అతివేగంతోనూ కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు ఎన్హెచ్ఏఐ అధి కారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటివరకు అవేమీ చేపట్టడం లేదు. సిగ్నల్స్, మలుపులు, భద్ర త సూచికలు, రాత్రివేళ రేడియం స్టిక్కర్లు మెరిసేవి, అంబులెన్స్, ప్రథమ చికిత్స కిట్లు, టోల్‌ప్లాజా వద్ద జనరల్, మహిళలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి. ఇవేమీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నెలలో రెండుసార్లు ఉన్నతాధికారులు స్థానిక డ్రైవ ర్లు, వాహనదారులకు సలహాలు, సూచనలు ఇవ్వా లి. ఇక వర్షాలు కురిస్తే సోమగూడెం, గాంధారి వనం సమీపంలో డ్రెయిన్స్ సరిగా లేక సమీపంలో వరద నీరు చేరుతోంది. వాహనదారుల భద్రత కోసం ప్ర త్యేక కన్సల్టెన్సీ పర్యవేక్షణకు నిధులు మంజూరవుతున్నా ఖర్చుకు అలసత్వం వహిస్తున్నారు. జాప్యంతో ఇబ్బందులు.. మందమర్రి పాత బస్టాండ్ వద్ద వంతెన నిర్మాణం జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌తోపాటు ప్రమాదాలు జరగుతున్నాయి. కొత్తగా పిల్లర్లు వేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం మంచిదే కానీ, జా ప్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నాం. త్వరగా పూర్తి చేయాలి. – కొట్టె కొమురయ్య, మందమర్రి వచ్చే జనవరిలో పూర్తి చేస్తాం.. మందమర్రి వద్ద రోడ్డు నిర్మాణం ఉన్న చోట ఉన్న పైపులు మార్చడంలో జాప్యం ఏర్పడింది. దీంతో అక్కడ నిర్మాణంలో జాప్యం జరిగింది. వచ్చే జనవరి వరకు పనులు పూర్తి చేసేందుకు గడువు ఉంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనదారులు నిబంధనలు పాటించాలి. రోడ్డు భద్రత చర్యలపై స్థానిక పోలీసు, ఆర్టీఏ అధికారులతో అవగాహన చేపడతాం. – కే.ఎన్.అజయ్మణికుమార్, పీడీ, ఎన్హెచ్ఏఐ, మంచిర్యాల -
నా కారునే ఆపుతావా.. టోల్గేట్ సిబ్బందిపై ఎంపీ దాడి
కోల్‌కతా: తన కారు ఆపాడని కోపంతో ఓ టోల్ బూత్ సిబ్బందిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ప్రకారం టీఎంసీ ఎంపీ సునీల్ మండల్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. బుర్ద్వాన్‌లోని పల్సిట్లో గురువారం రాత్రి ఆయన కారు టోల్ గేటు దాటుతుండగా టోల్ ఉద్యోగి నిబంధనల ప్రకారం వాహనాన్ని ఆపాడు. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపలేదు. ట్రాఫిక్ కోన్‌ను ఢీకొట్టి ముందుకు నడిపాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న టోల్ బూత్ ఉద్యోగి ఉజ్వల్ సింగ్ ట్రాఫిక్ కోన్‌ను పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో కారు దిగి వచ్చిన ఎంపీ సునీల్ మండల్ ఆ ఉద్యోగిపై మండిపడ్డారు. నా కారునే ఆపుతావా అంటూ అతడిపై చేయి చేసుకోవడంతో పాటు తోసేశారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న ఇతర ఉద్యోగులు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంపీకి నచ్చజెప్పడంతో ఈ గొడవ సద్ధుమణిగింది. అయితే ఈ ఘటన మొత్తం టోల్‌ప్లాజాలోని సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో టీఎంసీ ఎంపీ సునీల్ మండల్స్పందించారు. తాను తొందరలో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించడంతోనే తాను చేయి చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఆ ఉద్యోగిని భౌతికంగా తోయడం తప్పేనంటూ క్షమాపణలు కూడా చెప్పారు. ये #MP #MLAs को समझना चाहिए कि टोल प्लाजा पर खडे सामान्य लोग उन्हें नहीं पहचानते. वो अपना काम कर रहे है. अगर गाडी रोक दी तो गुनाह नहीं कर दिया जनाब पश्चिम बंगाल के बर्दवान पूर्व के #सांसद #sunilmandal है हरकत तो दिख ही रही है https://t.co/w1sRx9QO3t pic.twitter.com/09EbhRDNDu — Archana Pushpendra (@margam_a) August 4, 2023 -
వాహనదారులకు అలర్ట్.. ఇక ఆగక్కర్లేదు,కొత్త టోల్ వ్యవస్థ రాబోతోంది
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అవరోధం లేని టోల్ వ్యవస్థ కోసం ట్రయల్స్ కొనసాగుతున్నాయి. వాటి ట్రయల్స్ విజయవంతం అయిన వెంటనే, దానిని అమలు చేస్తాము" అని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే వాహనదారులు టోల్ బూత్‌ల వద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. అలాగే కిలోమీటర్ల ఆధారంగా చెల్లింపుల వ్యవస్థకు ఉండొచ్చని తెలిపారు. గతంలో ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించామని, ప్రస్తుతం ప్రభుత్వం దానిని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్ వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు జాతీయ రహదారిపైకి ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద మీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను కెమెరా స్కాన్ చేసి డేటాను క్రోడీకరిస్తుంది. మీరు ప్రయాణించిన కి.మీ.లకు ఛార్జీలు విధిస్తుంది. టెలికాం సహా అన్ని రంగాలలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి పురోగతి అంతా జరుగుతోందని, టెలికమ్యూనికేషన్స్ రంగం అన్ని ఇతర రంగాలతో అనుసంధానమై ఉందని మంత్రి అన్నారు. మెరుగైన టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు టోల్ ప్లాజాల డేటాను నిర్వహించడంలో సహాయపడతాయని అన్నారు. చదవండి 'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. -
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టోల్గేట్ల నుంచి రోజుకు రూ.కోటి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జాతీయ రహదారులపై వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారి ఎక్కువ భాగం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉంది. ఈ రహదారి గుండా రోజూ వేలాది వాహనాలు గమ్యస్థానానికి చేరుకుంటున్నాయి. ఏటా సగటున 15 శాతం వాహనాల రాకపోకలు పెరుగుతున్నట్టు ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారుల పరిశీలనలో వెల్లడైంది. నిమిషానికి 55 వాహనాలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని జాతీయ రహదారులపై మొత్తం 10 టోల్గేట్లు ఉన్నాయి. వీటిగుండా రోజుకు 80 వేల వాహనాల వరకు ప్రయాణిస్తున్నట్టు అంచనా. దీన్నిబట్టి చూస్తే అన్నిచోట్లా కలిపి నిమిషానికి సగటున 55 వాహనాలు టోల్గేట్లు దాటుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 13 శాతం పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం కార్లు ఉన్నట్టు తేలింది. ప్యాసింజర్ వాహనాలే ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి. టోల్గేట్ల ద్వారా రోజూ రూ.కోటి వసూలు ఉమ్మడి జిల్లాలో టోల్గేట్ల ద్వారా రోజుకు రూ.90 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలవుతోంది. ప్రత్యేక సెలవు రోజులు, పర్వదినాల సందర్భంలో మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 60 శాతం వసూళ్లు రాప్తాడు మండలం మరూర్, పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్గేట్ల ద్వారానే వస్తున్నాయి. ఇక్కడ ఒక్కో టోల్గేట్లో రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వసూలవుతోంది. మిగతా టోల్గేట్ల నుంచి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వస్తున్నట్టు అంచనా. రానున్న ఏడాదిలో మరో రెండు టోల్గేట్లు అదనంగా వస్తున్నట్టు తెలుస్తోంది. వాహనాలు పెరిగాయి కరోనా తర్వాత నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు భారీగా పెరిగాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కంటే ప్రైవేటు టాన్స్‌పోర్టేషన్‌కు ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతుండడం ద్వారా కొనుగోలు సామర్థ్యం కూడా పెరిగింది. గతంలో ఒక అంబాసిడర్ కారు, సెల్‌ఫోన్ ఉంటే గొప్పగా చూసేవాళ్లం. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోను, చాలామంది వద్ద కార్లు కనిపిస్తున్నాయి. సొసైటీలో గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సొంతంగా ద్విచక్రవాహనం, కార్లు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. – వీర్రాజు, ఉప రవాణా కమిషనర్, అనంతపురం కార్ల విక్రయాల్లో దూకుడు ఉమ్మడి జిల్లాలో కార్ల విక్రయాలు గతంతో పోల్చితే భారీగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా నుంచి అనంతపురంలోని మెజార్టీ ప్రజలు కార్ల ప్రయాణాన్నే ఇష్టపడుతున్నారు. ఐదారేళ్ల కిందట నెలకు 150 కొత్త కార్లు కొనుగోలు అయితే మహా గొప్ప. కానీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్ల షోరూముల్లో కొనుగోలు చేసినవి 400కుపైగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే సంవత్సరానికి 5వేల కార్ల విక్రయాలు జరుగుతున్నాయంటే వాటి దూకుడును అంచనా వేయొచ్చు. వీటి వల్ల కూడా ఉమ్మడి జిల్లాలో రోడ్లు బిజీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. -
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్!
ఆదిలాబాద్: పెన్‌గంగలో శనివారం రాత్రి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మండలంలోని డొల్లార వద్ద గల బ్రిడ్జిని తాకుతూ ప్రవాహం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిడ్జి మీదుగా రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్దనే వాహనాలను అపేసారు. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్రిడ్జికి ఇరు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం ప్రవాహ ఉధృతి తగ్గడంతో రాకపోకలను అనుమతించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
టోల్ ఫీజుకు డబ్బులు లేక.. రాంగ్రూట్లో ప్రయాణించిన ఆర్టీసీ బస్సు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దుబారి టోల్ ఫీజు చెల్లించలేని కేఎస్ ఆర్టీసీ బస్సు వెనక్కు వెళ్లి పోయిన సంఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకుంది. బుధవారం బెంగళూరు నుండి మైసూరు వెళ్తున్న బస్సుకు ఫాస్ట్‌ట్యాగ్ లేకపోవడంతో రామనగర తాలూకా శేషగిరి టోల్ వద్ద డబుల్ చార్జ్ చెల్లించాలని టోల్ సిబ్బంది చెప్పారు. దీంతో డ్రైవర్ అంత డబ్బులు తన వద్ద లేవని బస్సు వెనక్కు తీసుకుని కొన్ని కిలోమీటర్ల దూరం రాంగ్ రూట్లోనే వచ్చాడు. అనంతరం సర్వీస్ రోడ్ ద్వారా ప్రయాణించాడు. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్నారు. చదవండి మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటి తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు -
టోల్ గేట్ ఉద్యోగినిపై దాడి.. జుట్టు పట్టి లాగి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. టోల్ పేమెంట్ చేయాలని అడిగినందుకు టోల్ ఫ్లాజా ఉద్యోగినిపై ఓ మహిళ దాడి చేసింది. జుట్టు పట్టుకుని కింద పడేసింది. ఈ ఘటన జాతీయ రహదారి 91పై జరిగింది. సీసీటీవీ ఆధారంగా రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. టోల్ గేట్ వద్ద ఓ కారు వచ్చి ఆగింది. టోల్ ఫ్లాజా సమీప గ్రామస్థులమని చెబుతూ.. పంపించవలసిందిగా కోరారు. ఆ గ్రామస్థులేనడానికి ఏదైనా ఆధారం చూపించమని టోల్ ఫ్లాజా ఉద్యోగిని వారికి అడిగింది. దీంతో కారులో నుంచి బయటకు దిగిన మహిళ.. సదరు ఉద్యోగినితో వాగ్వాదానికి దిగింది. అనంతరం క్యాబిన్లోకి వచ్చి ఉద్యోగిని జుట్టు పట్టుకుని దాడి చేసింది. బాధితురాలిని బూతులు తిడుతూ కింద పడేసింది. సహచర ఉద్యోగులు చొరవ తీసుకుని ఆ మహిళను నిలువరించే ప్రయత్నం చేశారు. Woman's Brazenness Caught On Camera: Toll Plaza Employee Threatened, Hair Pulled https://t.co/hGIn4pSlSO pic.twitter.com/hMjzuID9bX — NDTV (@ndtv) July 17, 2023 ఈ ఘటనపై టోల్ ఫ్లాజా యాజమాన్యం సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ టోల్ ఫ్లాజాకు సమీప గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఐడీ కార్డు అడిగిన నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం ప్రారంభమైనట్లు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్! -
టోల్గేట్ బూత్‌లను ఢీకొన్న కంటైనర్
భిక్కనూరు: భిక్కనూరు సమీపంలోని టోల్ గేట్ వద్ద సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో టోల్ బూత్ బాక్స్‌లు రెండు ధ్వంసమయ్యాయి. టోల్ గేట్ సిబ్బందికి ఒక్కరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కంటైనర్ అతి వేగంగా వచ్చి టోల్ గేట్ వద్ద ఉన్న డివైడర్‌తో పాటు రెండు బూత్ బాక్స్‌లను ఢీకొంది. దీంతో ఆరు, ఏడు బూత్ బాక్స్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారుపై టోల్‌బూత్ పడింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. అలాగే ఆరో బాక్స్‌లో విధులు నిర్వహిస్తున్న తిప్పాపూర్ గ్రామానికి చెందిన పోచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోచయ్యను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రొక్లెయినర్‌తో బోల్తా పడిన కంటైనర్‌ను పక్కకు తొలగించి ధ్వంసమైన బూత్ బాక్స్‌లను రోడ్డు పక్కకు తప్పించారు. -
వేల కోట్ల ఆదాయం.. ఓఆర్ఆర్ను అమ్మాల్సిన అవసరం ఏంటి? రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మణిహారంగా కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ సర్కార్ ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు అవసరమయ్యే ఔటర్ రింగ్ రోడ్డును అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వేల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ను కేటీఆర్ ప్రైవేటుకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సూమారు 30వేల కోట్లు ఆదాయం వచ్చే సంపదను రూ. 7,380 కోట్లకే కారుచౌకగా ముంబై కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. దేశంలోనే ఇది అత్యంత పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఇందులో రూ. 1,000 కోట్లు చేతులు మారాయని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదని.. తాము మేం అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. చదవండి: కొత్త సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ నిర్ణయాలన్నింటిపై కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుందన్నారు. ఈ నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 2018 నుంచి టోల్ వసూలు బాధ్యత ఎవరికి ఇచ్చారో హెచ్ఎండీఏ అధికారులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి కానీ.. ఉన్న వాటిని తాకట్టు పెట్టడం కాదని హితవు పలికారు. చదవండి: హైదరాబాదీలకు అలర్ట్.. రేపు పార్కుల మూసివేత -
TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. పెరిగిన టికెట్ ధరలు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులపై టీఎస్ఆర్టీసీ మరో భారం మోపింది. ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జాతీయ రహదారులపై టోల్ చార్జీలను అయిదు శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం నుంచి ఆ నిర్ణయం అమల్లోకి రానుండటంతో ఆర్టీసీపై మరింత భారం పడనుంది. పెరిగిన టోల్ చార్జీల భారాన్ని ప్రయాణికులపైనే వేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఆర్టీసీ టికెట్లో వసూలు చేసే టోల్ ఛార్జీలను పెంచింది. టోల్ ఛార్జీలను పెంపుతో టికెట్ ధరలు సైతం పెరిగాయి. ఆర్డీనరి నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 వరకు పెంచినట్లు ప్రకటించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.15 పెంచింది. ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ఛార్జీ రూ.20 వసూలు చేస్తున్నారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే సిటీ ఆర్డినరీ బస్సుల్లో రూ.4 పెంచారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. చదవండి: కేసీఆర్‌ది కొంపముంచే సర్కార్: బండి సంజయ్ -
పెరిగిన టోల్ నేటి అర్ధరాత్రి నుంచే అమలు.. ఛార్జీలు వివరాలు ఇలా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో చార్జీల పెంపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. రోడ్ల నిర్వహణకు సంబంధించి ఏటా ఏప్రిల్ ఒకటి నుంచి చార్జీల పెంపును ఆనవాయితీగా తీసుకున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ).. ఈసారి కూడా కొత్త చార్జీలను సిద్ధం చేసింది. గతేడాది వివిధ కేటగిరీల వాహనాలకు సంబంధించి 8 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచగా.. ఈసారి వాహనదారులపై కాస్త దయతలిచి 5.50 శాతంలోపే పెంపును పరిమితం చేసింది. (వాహనదారులకు షాక్?.. పెరగనున్న టోల్ చార్జీలు.. ఎంతంటే?) విజయవాడ రహదారిలోని పంతంగి టోల్ ప్లాజాను ఉదాహరణగా తీసుకుంటే.. గతేడాది కారు/జీపు/వ్యాన్ కేటగిరీలో చార్జీని రూ.80 నుంచి రూ.90కి అంటే రూ.10 పెంచగా... ఈసారి రూ.90 నుంచి రూ.95కు అంటే రూ.5 మాత్రమే పెంచింది. ఇక గతేడాది టోల్ ధరలు అమల్లోకి వచ్చాక కొత్తగా ఐదు ప్రాంతాల్లో టోల్గేట్లు అందుబాటులోకి వచ్చాయి. పెరగనున్న ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో టోల్‌ప్లాజాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1,820 కోట్లు సమకూరాయి. ఈసారి దేశవ్యాప్తంగా మరిన్ని టోల్గేట్లు అందుబాటులోకి రావడం, ధరల పెంపు నేపథ్యంలో టోల్ వసూళ్లు రూ.2 వేలకోట్లను దాటిపోతాయని అంచనా. ఫాస్టాగ్‌తో కచ్చితమైన ఆదాయం గతంలో టోల్గేట్ల వద్ద నిర్వాహకులు భారీగా అక్రమాలకు పాల్పడటంతో.. వాహనాల నుంచి వసూలు చేసిన మొత్తంలో దాదాపు 25 శాతం పక్కదారి పట్టేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనితో ప్రభుత్వ ఖజానాకు చేరే మొత్తం తక్కువగా కనిపించేది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక అక్రమాలకు తెరపడి, ప్రతి రూపాయి లెక్కలోకి వస్తోంది. దీనితో గత మూడేళ్లుగా టోల్ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 98.6 శాతం వాహనాలు ఫాస్టాగ్‌ను వినియోగిస్తున్నాయి. విజయవాడ రోడ్డులోని కోర్లపహాడ్ ప్లాజాలో.. కార్లు, జీపులు సింగిల్ జర్నీ చార్జి రూ.120 నుంచి రూ.125కు.. రిటర్న్ జర్నీ రూ.180 నుంచి రూ.200కు.. నెల పాస్ రూ.4,025 నుంచి రూ.4,225కు.. ► లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ ట్రిప్ రూ.190–రూ.200, రిటర్న్ జర్నీ రూ.285–రూ.300, నెలపాస్ రూ.6,385–రూ.6,710.. ► బస్సు, ట్రక్కులకు సింగిల్ ట్రిప్ రూ.395–రూ.415, రిటర్న్ జర్నీ రూ.595–రూ.625, నెలపాస్ రూ.13,240–రూ.13,910కు.. ► ఓవర్ సైజ్డ్ వెహికల్స్ సింగిల్ ట్రిప్ రూ.765 నుంచి రూ.805కు, రిటర్న్ జర్నీ 1,150–రూ.1,210, నెలపాస్ రూ.25,540–రూ.26840కు సవరించారు. చిల్లకల్లు టోల్‌ప్లాజాలో.. కార్, జీప్ సింగిల్ ట్రిప్పు రూ.100 నుంచి రూ.105కు, రిటర్న్ జర్నీ రూ.150–రూ.160, నెలపాస్ రూ.3,350–రూ.3,520కు పెంచారు. ► లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ ట్రిప్పు రూ.160 నుంచి రూ.165కు, రిటర్న్ జర్నీ రూ.240–రూ.250, నెలపాస్ రూ.5,290–రూ.5,560కు.. ► బస్సు, ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.330–రూ.345, రిటర్న్ జర్నీ రూ.490–రూ.515, నెలపాస్ రూ.10,940–రూ.11,495కు.. ► హెవీ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.635–రూ.665, రిటర్న్ జర్నీ రూ.955–రూ.1,000, నెలపాస్ రూ.21,170–రూ.22,240కు సవరించారు. జాతీయ రహదారి 765 మీద కడ్తాల్ వద్ద.. కార్లు, జీపులకు సింగిల్ ట్రిప్పు రూ.45, రిటర్న్ జర్నీ రూ.65, నెల పాస్ రూ.1,495కు.. ► లైట్ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.75, రిటర్న్ జర్నీ రూ.110, నెలపాస్ రూ.2,420కు.. ► బస్సు ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.150, రిటర్న్ జర్నీ రూ.230, నెల పాస్ రూ.5,070 ► హెవీ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.290, రిటర్న్ జర్నీ రూ.435, నెలపాస్ రూ.9,675కు పెంచారు. జాతీయ రహదారి 167పై మహబూబ్‌నగర్ జిల్లా మున్ననూర్ టోల్ ప్లాజా.. కార్లు, జీపుల సింగిల్ ట్రిప్పు రూ.45, రిటర్న్ జర్నీ రూ.65, నెలపాస్ రూ.1,475కు పెంచారు. ► లైట్ వెహికల్ సింగిల్ ట్రిప్పు రూ.70, రిటర్న్ జర్నీ రూ.105, నెలపాస్ రూ.2,385కు.. ► బస్సులు, ట్రక్కుల సింగిల్ ట్రిప్పు రూ.150, రిటర్న్ జర్నీ రూ.225, నెలపాస్ రూ.4,995 ► భారీ వాహనాలకు సింగిల్ ట్రిప్పు రూ.285, రిటర్న్ జర్నీ రూ.430, నెలపాస్ రూ.9,540గా నిర్ధారించారు. జాతీయ రహదారి 163 చిట్లపల్లి టోల్‌ప్లాజా వద్ద కార్లు, జీపులకు సింగిల్ ట్రిప్పు రూ.65, రిటర్న్ జర్నీ రూ.95, నెలపాస్ రూ.2,110కు పెంచారు. ► లైట్ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.100, రిటర్న్ జర్నీ రూ.155, నెల పాస్ రూ.3,410కు.. ► బస్సు/ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.215, రిటర్న్ జర్నీ రూ.320, నెలపాస్ రూ.7,145కు.. ► హెవీ వెహికల్స్‌కు సింగిల్ ట్రిప్పు రూ.410, రిటర్న్ జర్నీ రూ.615, నెలపాస్ రూ.13,645కు పెంచారు. -
వాహనదారులకు షాక్?.. పెరగనున్న టోల్ చార్జీలు.. ఎంతంటే?
వాహనదారలు నెత్తిన టోల్ బాదుడుకు రంగం సిద్ధమైంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ ఎన్హెచ్ఏఐ టోల్ ఛార్జీలను సమీక్షిస్తుంది. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త రేట్ల లిస్టును ఎన్హెచ్ఏఐ ఈరోజు రాత్రి లేదా రేపు విడుదల చేయనుంది. 2008 నేషనల్ హైవేస్ ఫీజ్ ప్రకారం.. ప్రతి ఏడు కేంద్ర రవాణ శాఖ టోల్ ఛార్జీల పెంపుపై కొన్ని ప్రతిపాదనలు తెస్తుంది. ఆ ప్రతిపాదనలకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కార్లు, తేలికపాటి వాహనాలపై ఒక్కో ట్రిప్పుకు ఐదు శాతం, భారీ వాహనాలకు టోల్ టాక్స్ అదనంగా 10 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం టోల్ టాక్స్ లను పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చదవండి: టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాంప్రదాయ టోల్ వసూళ్ల విషయంలో కేంద్రం మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టోల్ వసూళ్లపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఆరునెలల్లో దేశంలోని అన్నీ టోల్ ప్లాజాల వద్ద..జీపీఎస్ టోల్ కలెక్షన్ (GPS-based toll collection) సిస్టమ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు గడ్కరీ చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ (cii) నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. కొత్త టోల్ కలెక్షన్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీతో పాటు.. వాహనదారులు ప్రయాణించిన దూరాన్ని బట్టి ఖచ్చితమైన టోల్ ఛార్జీలను వసూలు చేసే అవకాశం కలగనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ జీపీఎస్- ఆధారిత వ్యవస్థ ప్రైలెట్ ప్రాజెక్ట్ పనిచేస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల్ని ఆపివేయకుండా.. వాహనాల నెంబర్ ప్లేట్లపై నంబర్లను గుర్తించే టెక్నాలజీపై పనిచేస్తోన్నట్లు తెలిపారు. రూ.1.40 లక్షల కోట్లకు చేరనున్న ఆదాయం ఇక టోల్ ఫీజు వసూళ్ల ద్వారా నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (nhai)కు ఏడాదికి రూ.40వేల కోట్ల ఆదాయం వస్తోందని, మరో 2-3 ఏళ్లలో రూ.1.40లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా వేశారు. వేచి చూసే సమయం మరింత తగ్గుతుంది 2018-19లో టోల్ ప్లాజాల వద్ద వెహికల్స్ కనీసం 8 నిమిషాల పాటు ఆగాల్సి వచ్చేంది. 2020-21, 2021-22లో ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌తో వాహనాలు నిలిపే సమయం 47 సెకండ్లకు తగ్గిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సీఐఐ సమావేశంలో వివరించారు. చదవండి👉 ‘హార్ట్ ఎటాక్’ను గుర్తించే యాపిల్ వాచ్ సిరీస్ 8పై భారీ డిస్కౌంట్లు! -
వాహనదారులకు షాక్.. పెరగనున్న టోల్ చార్జీలు!
హైవేలపై ప్రయాణించే వాహదారులకు టోల్ బాదుడు మరింత పెరగనుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హోచ్‌ఏఐ) ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ రేట్లను పెంచే అవకాశం ఉందని హిందీ దినపత్రిక హిందూస్థాన్ ప్రచురించింది. దీని ప్రకారం.. టోల్ రేట్లు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంది. జాతీయ రహదారుల రుసుము నియమావళి-2008 ప్రకారం.. సాధారణంగా ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ చార్జీ రేట్లు అమలులోకి వస్తాయి. అవసరాలను బట్టి నిర్దిష్ట టోల్ విషయమై విధాన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. టోల్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మార్చి నెల చివరి వారంలోపు పరిశీలించి ఆమోదించే అవకాశం ఉందని హిందూస్థాన్ నివేదిక పేర్కొంది. కార్లు, తేలికపాటి వాహనాలపై 5 శాతం, ఇతర భారీ వాహనాలపై 10 శాతం వరకు టోల్ చార్జీ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులకు టోల్ ఫీజుపై రాయితీ ఇస్తూ నెలవారీ పాస్‌లు జారీ చేస్తుంటారు. ఆ పాస్ రుసుము కూడా 10 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ! -
ఆటో నుంచి రూ.500 నోట్ల వర్షం
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నోట్ల వర్షం కురిసింది. రోడ్డుపై వెళ్తున్న ఆటో నుంచి రూ.500 నోట్లు ఎగిరాయి. రోడ్డు మీద జలజలా రాలిపడ్డాయి. రోడ్డు మీద ఉన్న వారు కేకలు వేసినా ఆటోడ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. మడపాం టోల్గేట్ వద్ద ఒక ఆటోలో నుంచి రూ.500 నోట్లు కిందకు పడ్డాయి. గమనించిన టోల్గేట్ సిబ్బంది ఆటోడ్రైవర్‌ను కేకలు వేశారు. అయినా అతడు వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో టోల్గేట్ సిబ్బంది రోడ్డుపై పడిన నోట్లను తీసుకున్నారు. పోలీసులకు విషయం తెలియడంతో నరసన్నపేట ఎస్ఐ సింహాచలం టోల్గేట్ వద్ద సీసీ పుటేజీని పరిశీలించారు. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వస్తున్న పసుపురంగు ఆటోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో పురుషులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కరజాడ వద్ద నుంచే వీరు నోట్లు విసురుకుంటూ వస్తున్నట్లు తెలిసింది. టోల్గేట్ వద్దకు వచ్చే సరికి నోట్ల వర్షం పెరిగింది. ఈ నోట్లు ఎవరివి, ఆ ఆటో ఎవరిది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీలో ఆటో నంబరును గుర్తించారు. ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోట్లు అనే ప్రచారం జరుగుతోంది. ఒక్క టోల్‌గేటు వద్దే రూ.88 వేలు లభిస్తే.. కరజాడ నుంచి లెక్కిస్తే లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి రూ.88 వేలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం తహసీల్దార్ కోర్టుకు పంపుతామని, ఎవరైనా క్లెయిమ్ చేయడానికి వస్తే ఆధారాలు చూసి విచారిస్తామని ఎస్ఐ తెలిపారు. -
Alert: హైదరాబాద్‌కు వస్తున్న వారికి పోలీసుల కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం ఇప్పుడు మళ్లీ నగరబాట పట్టారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. నవాబుపేట (ఏపీ) నుంచి చిట్యాల మండలం పెద్దకాపర్తి వరకు తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. కాగా, జాతీయ రహదారులు, స్థానిక రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తిస్తారు. బ్లాక్ స్పాట్స్ వివరాలు నవాబ్ పేట, రామాపురం, శ్రీరంగాపురం, మేళ్లచెరువు క్రాస్ రోడ్డు, కట్టకొమ్ముగూడ క్రాస్, కొమరబండ, ఆకుపాముల, ముకుందాపురం, దురాజ్ పల్లి, జమ్మిగూడ, జనగామ క్రాస్, ఎస్వీ కాలేజ్, కొర్ల పహాడ్, కట్టంగూరు, నల్లగొండ క్రాస్, చిట్యాల, పెద్ద కాపర్తి. ఈ బ్లాక్ స్పాట్ల వద్ద వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. చదవండి: (మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు.. 20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత) -
టోల్ ప్లాజాకు ‘పండుగ’
చౌటుప్పల్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి మూడు రోజులు గా పెద్ద ఎత్తున ప్రజలు తమ స్వగ్రామాలకు తరలివెళుతు న్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా నుంచి రికార్డు స్థాయిలో వాహనాలు వెళ్లాయి. 12వ తేదీన ఇరువైపులా 56,595 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఇందు లో కార్లు 42,844, ఆర్టీసీ బ స్సులు 1,300, ప్రైవేట్ బస్సు లు 4,913, గూడ్స్ వాహనాలు 7,538 ఉన్నాయి. 13వ తేదీన 67,577 వాహనాలు ఇరుమార్గాల్లో వెళ్లాయి. ఇందులో కార్లు 53,561, ఆర్టీసీ బస్సులు 1,851, ప్రైవేట్ బస్సులు 4,906, అలాగే 7,259 గూడ్స్, ఇతర వాహనాలు రాకపోకలు సాగించాయి. 11 ఏళ్లలో ఇదే మొదటిసారి: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని 4 వరుసలుగా మార్చిన తర్వాత 11 ఏళ్ల కాలంలో ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించడం ఇదే మొదటిసారని అంటున్నారు. సాధారణ రోజుల్లో పంతంగి టోల్‌ప్లాజా నుంచి రోజుకు 30 వేల నుంచి 40 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముందస్తు జాగ్రత్తలు: సంక్రాంతి పండుగకు ఈ రహదారిగుండా పెద్ద సంఖ్యలో ప్రజానీకం వెళ్తుండటంతో పోలీసులు, జీఎమ్మార్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పంతంగి టోల్‌ప్లాజా, గ్రామాల కూడళ్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించారు. -
సంక్రాంతి ఎఫెక్ట్.. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
-
టీఎస్ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) చర్యలు చేపడుతోంది. టోల్‌ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రధాన మార్గాల్లోని టోల్ ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్లను కేటాయించాలని కోరుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్.హెచ్.ఎ.ఐ), తెలంగాణ ఆర్ అండ్ బీ విభాగాలకు లేఖలు రాసింది. ఇదే అంశంపై టోల్ ప్లాజా నిర్వాహకులనూ సంప్రదించింది. తమ సంస్థ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయించాలని అభ్యర్థించింది. అందుకు ఆయా విభాగాలు అంగీకరించాయి. ఈ నెల 10 నుంచి 14 తేదీ వరకు టీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్-విజయవాడ మార్గంలోని పతంగి, కోర్లపహాడ్, హైదరాబాద్-వరంగల్ మార్గంలోని గూడురు, హైదరాబాద్-సిద్దిపేట మార్గంలోని దుద్దేడ, హైదరాబాద్-నిజామాబాద్ మార్గంలోని మనోహరబాద్, హైదరాబాద్-కర్నూలు మార్గంలోని రాయికల్ టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఆయా టోల్ ప్లాజాల వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిప్ట్‌ల్లో 24 గంటలపాటు విధులు నిర్వహించనున్నారు. ఆర్టీసీ బస్సులు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక లేన్ నుంచి బయటకు వెళ్లేందుకు స్థానిక పోలీసుల సహకారం కూడా టీఎస్ఆర్టీసీ తీసుకుంటోంది. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌లోని బస్ భవన్, ఎంజీబీఎస్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రద్దీ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పడు ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకుంటారు. "సంక్రాంతికి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. 4,233 ప్రత్యేక బస్సులను ఈ నెల 10 నుంచి 14వ తేది వరకు నడుపుతున్నాం. అలాగే, ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయించాలని ఎన్హెచ్ఏఐ, ఆర్ అండ్ విభాగాలను కోరాం. మా అభ్యర్థనను వారు అంగీకరించారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు పడే కన్నా.. టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ ఈ సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించండి. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు." అని ప్రజలకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. -
టోల్గేట్ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే హల్చల్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి–363పై మంచిర్యాల జిల్లా మందమర్రి శివారులోని టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం రాత్రి హల్చల్ చేశారు. చిన్నయ్య మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్తుండగా టోల్‌ప్లాజా సిబ్బంది వాహ నం ఆపడంతో కారుదిగిన ఆయన ఆగ్రహంతో వా రి పై దాడికి యత్నించారు. కాగా, పక్కనున్న వారు ఆయనను సముదాయించినట్లు తెలుస్తోంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే చిన్నయ్యను ‘సాక్షి’సంప్రదించగా.. ప్రమా దంలో గాయపడిన తమ బంధువుల అబ్బాయిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా అక్కడి సిబ్బంది టో ల్ వసూలు చేయడంపై మేనేజర్‌ను కలిసే ప్రయత్నం చేశానని చెప్పారు. ఎవరిపైనా తాను దాడి చేయలేదని తెలిపారు. కాగా, సోషల్‌మీడియా, టీవీ చానళ్లలో సీసీ ఫుటేజీ వీడియో ప్రసారం కావడంతో ‘రోడ్డు పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేయడంపై స్థానిక ఎమ్మెల్యేగా అక్కడి అధికారులను అడిగా’అని వివరణ ఇచ్చారు. ఎన్హెచ్ఏఐ పీడీ రవీందర్రావును ‘సాక్షి’సంప్రదించగా, ఘటనపై విచారణ చేపట్టామని తెలిపారు. -
మంచిర్యాల: టోల్‌ప్లాజా ఘటనపై ఎమ్మెల్యే చిన్నయ్య కీలక వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దాడి వార్తలను ఖండించారు. జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేస్తున్నారని, అంబులెన్స్‌ను సైతం వదలటం లేదన్నారు. ఈవిషయంపైనే మేనేజర్‌తో మాట్లాడేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ‘నేను దాడి చేసినట్లుగా టీవీలలో వార్తలు వస్తున్నాయి. జాతీయ రహదారి పనులు పూర్తి కాలేదు. సోమగూడేం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయలేదు. కాని టోల్ ప్లాజాలో నూటయాభై టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ ప్లాజా నుండి అంబులెన్స్ కూడ వదలడం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలపై మేనేజర్‌తో మాట్లాడానికి వెళ్లాను. మేనేజర్ నుంచి ఎటువంటి స్పందింన లేదు. అంతే కానీ నేను దాడి చేయలేదు. కనీసం టోల్ ప్లాజా ప్రారంభానికి కూడా నన్ను పిలువలేదు’ అని దాడి వార్తలను ఖండించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇదీ చదవండి: వీడియో: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య హల్చల్.. సిబ్బందిపై దాడి -
మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్
-
మంచిర్యాల: నా వాహనాన్నే ఆపుతారా? టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి!
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేదంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా దాడి చేయటం సరికాదంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన క్రమంలో తనకు రూట్ క్లియర్ చేయలేదంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యానికి దిగారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం కూడా చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి: అసైన్డ్ భూములపై కేసీఆర్ సర్కార్ స్పెషల్ ఫోకస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు! -
వాహనదారులకు భారీ ఊరట?..ఫాస్టాగ్‌పై కోర్టులో పిటిషన్..అదే జరిగితే..
ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ ట్యాక్స్ చెల్లించాలనే నిబంధనను తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ రవీందర్ త్యాగి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ, జస్టీస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా...ఈ నిబంధన వివక్షపూరితంగా, ఏకపక్షంగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్ వాదించింది. వాహనదారులు ఫాస్టాగ్ వినియోగించకుండా నగదు రూపంలో చెల్లించినట్లయితే..వారి వద్ద నుంచి రెట్టింపు రేటుతో టోల్ వసూలు చేస్తున్నారనే పిటిషన్‌పై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), కేంద్రం ప్రతిస్పందనను కోరింది. అధికారులు తమ ప్రత్యుత్తరాలను దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు..తదుపరి విచారణను ఏప్రిల్ 18న వాయిదా వేసింది. ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనదారుల నుంచి డబుల్ టోల్ ఛార్జీలు వసూలు చేసేలా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా(ఎంఓఆర్‌టీ అండ్ హెచ్), నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో కూడిన నేషనల్ హైవే ఫీజ్ అమాండ్మెంట్ రూల్స్ -2020 యాక్ట్‌ను రద్దు చేయాలని పిటిషన్ రవీందర్ త్యాగి కోరారు. చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ ఈ నిబంధనలు, సర్క్యులర్ వల్ల టోల్ లేన్లను 100 శాతం ఫాస్ట్‌ట్యాగ్ లేన్లుగా మారుస్తున్నాయని, దీని ఫలితంగా ఫాస్ట్‌ట్యాగ్ లేని ప్రయాణికులు టోల్ మొత్తాన్ని రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషనర్, న్యాయవాది సైతం..టోల్ కంటే రెట్టింపు నగదు చెల్లించాల్సిన అవసరం ఉన్నందున తన కారులో ఫాస్ట్‌ట్యాగ్ పరికరాన్ని ఇన్స్టాల్ చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇన్స్టాల్ చేసే ముందు రెట్టింపు రేటుతో టోల్ ట్యాక్స్ చెల్లించానని చెప్పారు. ఢిల్లీ నుంచి హర్యానాలోని ఫరీదాబాద్ పర్యటనలో తాను చూసిన ప్రయాణికుల వేదనను ఆయన ప్రస్తావించారు. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం), 19 (వాక్ మరియు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ)లను ఉల్లంఘించడమేనని, డబుల్ టోల్ టాక్స్ వసూలు చేసే పద్ధతిని నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై కేంద్రం సానుకూలంగా స్పందింస్తే డబుల్ టోల్ ట్యాక్స్ రద్దు చేయడం లేదంటే.. ఫాస్టాగ్‌ను వినియోగించేలా మరింత సమయం ఇచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే డబుల్ టోల్ ఛార్జీల నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది. డబుల్ టోల్ ఛార్జీలు టోల్ గేట్ల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉంచే సమయాన్ని తగ్గించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14, 2021న ఫాస్టాగ్ విషయంలో వాహనదారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి అర్ధరాత్రి నుంచి వాహనదారులకు ఫాస్టాగ్ తప్పని సరిగా వినియోగించాలని, లేదంటే రెట్టింపు టోల్ పే చెల్లించాల్సిందే. వాహన దారులు తప్పని సరిగా ఫాస్టాగ్ విధానంలోకి మారాల్సిందేనని కేంద్ర రవాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్ తీసుకోవాలని సూచించింది. చదవండి👉 టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాంప్రదాయ టోల్ వసూళ్ల విషయంలో కేంద్రం మార్పులు చేయాలని భావిస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలపై నంబర్ ప్లేట్లను గుర్తించేలా కెమెరా ఎయిడెడ్ టోల్ కలెక్షన్ సిస్టమ సాంకేతికతను ఉపయోగించనుంది. ఇందుకోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్) కెమెరాలను అమర్చనుంది. నిరీక్షణ తప్పనుంది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) శాఖ టోల్ ప్లాజాల వద్ద చెల్లింపుల కోసం వాహనాలు నిరీక్షించే సమయాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మరి ఫాస్టాగ్ ప్రస్తుతం, దేశం అంతటా దాదాపు 97 శాతం టోల్ వసూలు ఫాస్టాగ్ ద్వారా జరుగుతున్నాయి. అయినప్పటికీ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఓఆర్టీహెచ్ తెలిపింది. ఈ ఏఎన్పీఆర్ కెమెరాలను సెటప్ చేయడం వల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించవచ్చు’ అని సూచించింది. ఏఎన్పీఆర్ ఎలా పనిచేస్తుంది? కేంద్ర హైవే రవాణా శాఖ వివరాల ప్రకారం..దేశంలో జాతీయ ప్రధాన రహదారుల్లో ఉన్న టోల్ గెట్లను తొలగించి...వాటి స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీ ఏఎన్పీఆర్ కెమెరాల్ని ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతికత వాహనం నంబర్ ప్లేట్ మీద నెంబర్‌ను చదివి, సదరు వాహన యజమాని లింక్ ఫోన్ నెంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్‌కు చెల్లించాల్సిన అమౌంట్‌ను డిడక్ట్ చేస్తుంది. వాహనాల నంబర్ ప్లేట్ల ఫోటోను క్యాప్చర్ చేయడానికి సిస్టమ్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏఎన్పీఆర్ కెమెరాలతో సన్నద్ధం చేస్తుంది. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు కెమెరా వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుండి టోల్ మొత్తాన్ని వసూలు చేసేలా సిస్టమ్‌కు సిగ్నల్ ఇస్తుంది. ఏఎన్పీఆర్ సమర్థవంతంగా పనిచేస్తుందా? ఏఎన్‌పీఆర్‌తో టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గిస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ..దీనిపై అనేక సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ఈ పద్దతిలో 2019 తర్వాత కేటాయించిన నెంబర్ ప్లేట్లను మాత్రమే గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే, భారత ప్రభుత్వం 2019లో ప్రయాణీకుల వాహనాలకు ఓఈఎం (Original Manufacturer Number ) నెంబర్‌ను అమలు చేసింది. కెమెరాలు ఈ కంపెనీ అమర్చిన నంబర్ ప్లేట్లను మాత్రమే చదవగలవు. దీంతో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్ ) కెమెరాలు నంబర్ ప్లేట్ తొమ్మిది అంకెల రిజిస్ట్రేషన్ నంబర్‌ను మించి ఉన్నప్పుడు చదవడం సవాలుగా మారనుంది. దేశంలో చాలా మంది వాహన యజమానులు నంబర్ ప్లేట్‌పై పేర్లు రాస్తుంటారు. దీని వల్ల సదరు నెంబర్ ప్లేట్లను గుర్తించడం కష్టం నెంబరు ప్లేట్లు మురికిగా ఉంటే వాటిని గుర్తించలేం. అలాంటి వాహనాలకు టోల్ వసూలు చేయడం చాలా కష్టం. అలాగే, ఏఎన్పీఆర్ కింద టోల్ చెల్లించకుండా టోల్ ప్లాజాలను దాటేందుకు ప్రయత్నించే వాహన యజమానులకు జరిమానా విధించే నిబంధన లేదు. -
మాయని మచ్చగా తొండుపల్లి ఘటన.. ఆ అమానుషానికి మూడేళ్లు
ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది.. నలుగురు కామాంధులు చేసిన వికృత చేష్టలకు సమాజం దిగ్బ్రాంతికి గురైంది. దిశ ఉదంతం.. పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్‌నగర్ శివారులో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికీ మూడేళ్లు పూర్తయింది. ఆమె మరణం.. మహిళా రక్షణ కొత్త చట్టాలకు దిశా నిర్దేశం చేసింది. మహిళల దశ మార్చే న్యాయసహాయకులకు, నిఖార్సైననిర్ణయాలకు రూపకల్పన చేసింది. అమానుషమైన నాటి ఘటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఓ సారి గుర్తు చేసుకుంటే.. – షాద్‌నగర్ 2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయం.. దిశ అనే యువతి అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపింది. అక్కడి నుంచి పని మీద వెళ్లింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. అంతలోనే నలుగురు కామాంధులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని నిందితులు లారీలో తీసుకొచ్చి షాద్‌నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. అయితే 2019 డిసెంబర్ 6 తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్ధలానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి వారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం అయ్యింది. దిశ హత్య ఘటన జనాలను ఎంతగా కదిలించిందంటే ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరూ సమర్తిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు దిశ హత్య ఉదంతం కొత్త చట్టాలకు దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ సీబీఐ మాజీ డైరక్టర్ కార్తీకేయన్, వీఎన్ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ పూర్తి చేసి నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది. మారిన చట్టాలు దుర్మార్గుల చేతిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయిన దిశ పేరిట కొత్త చట్టాలను ప్రభుత్వాలు తీసుకొచ్చారు. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్ధలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లను, పోలీసు వ్యవస్థను, ఏర్పాటు చేశారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలపై కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్‌లో సైతం వేగం పెంచారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ల ప్రభావం కారణంగా మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. అప్రమత్తత అవసరం సమాజంలో ఇంకా అక్కడక్కడా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న, కల్పిస్తున్న సదుపాయాలను యువతులు, మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
గుజరాత్ ఎన్నికల వేళ ఆప్ నేత ఓవరాక్షన్.. కేసు నమోదు!
AAP Jagmal Vala.. గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆప్ అభ్యర్థి కిడ్నాప్ వ్యవహారం మరువక ముందే మరో ఆప్ నేత హల్చల్ చేశారు. టోల్ ప్లాజా వద్ద ఆప్ గుజరాత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ జగ్మల్వాలా రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్, సోమ్‌నాథ్ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థి జగ్మల్ వాలా టోల్ ప్లాజా వద్ద ఓవరాక్షన్ చేశారు. వెరావల్ సమీపంలోని దరి టోల్ ప్లాజా నుండి జగ్మల్ వాలా తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి మూడు వాహనాల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో వారిని టోల్ ప్లాజా సిబ్బంది నిలిపివేశారు. దీంతో, ఆగ్రహానికి లోనైన ఆప్ నేత.. అక్కడున్న సిబ్బందితో గొడవపడ్డారు. టోల్ బూత్ ఉద్యోగిపై దాడికి దిగారు. ఈ ఘటన అంతా ప్లాజాలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ఇక, ఈ ఘటనపై టోల్ బూత్ వర్కర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ఆప్ నేత జగ్మల్ వాలాపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిని తన సొంత కార్యాలయంలో బెదిరించి కొట్టిన కేసులో జగ్మల్ వాలా ఇప్పటికే జైలు శిక్ష అనుభవించాడు. కాగా, మరికొద్ది రోజుల్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఉండగా.. ఆప్ కీలక నేత ఇలా ప్రవర్తించడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. గుజరాత్లో ఆప్ అభ్యర్థి కిడ్నాప్‌కు గురయ్యారని ఆ పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేసిన వేళ.. స్వయంగా అభ్యర్థి కంచన్ జరీవాల్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వీడియో సందేశం విడుదల చేశారు. తన మనస్సాక్షి చెప్పినట్టే చేశానని, స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని, ఎవరూ ఒత్తిడి చేయలేది స్పష్టం చేశారు. దీంతో ఆప్ నేతలు షాక్ అయ్యారు. Close aid of Kejriwal and AAP Gujarat’s VP and candidate from Somnath assembly constituency, Jagmal Vala creating ruckus at toll booth. There is NO space for such #UrbanNaxals in #Gujarat 👇 pic.twitter.com/NlirHf6oyU — भाग केजरीवाल भाग, मोदी आया (@kamalsh62624609) November 17, 2022 -
టోల్ ప్లాజాలకు ‘దసరా’ వాహనాల తాకిడి.. కిలోమీటర్ల మేర..!
చౌటుప్పల్ రూరల్, బీబీనగర్: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవు దినం కావడంతో, శనివారం ఉదయం నుంచే వాహనాల్లో బయలుదేరారు. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై, హైదరాబాద్–వరంగల్ రహదారిపై రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలకు వాహనాల తాకిడి విపరీతమైంది. సరాసరి రోజుకు 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుండగా, శనివారం మరో 5వేల వాహనాలు అదనంగా వెళ్లాయి. పోలీసులు కూడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: Hyderabad: సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు -
Ranga Reddy: ఫాస్ట్ ట్యాగ్ విషయంలో గొడవ.. కొట్టుకున్న సర్పంచ్, టోల్ ప్లాజా సిబ్బంది
సాక్షి, రంగారెడ్డి: షాద్ నగర్ పట్టణ పరిధిలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న రాయికల్ టోల్ ప్లాజా వద్ద బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ ప్లాజా సిబ్బందికి, జడ్చర్ల పరిధిలోని నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ ప్రనిల్ చందర్‌కు మధ్య వాగ్వివాదం జరగడంతో ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. సర్పంచ్ ప్రనిల్ చందర్ టోల్ ప్లాజా వద్ద వెళ్తుండగా అతని ఫాస్ట్ ట్యాగ్‌లో డబ్బులు అయిపోయాయి. అతను రీఛార్జ్ చేసుకునే క్రమంలో కొంత ఆలస్యం అయింది. వెనుక వాహనాల వారు హారన్స్ కొడుతుండడంతో వాహనాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో టోల్ ప్లాజా సిబ్బందికి ఇతనికి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు దూషించుకోవడంతో గొడవ ప్రారంభమైంది. చదవండి: హైదరాబాద్‌లో మహిళ హంగామా.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో గొడవ అయితే సర్పంచ్ ప్రనిల్ చందర్ సర్పంచుల సంఘంలో నాయకుడిగా ఉన్నారు. సర్పంచ్ ప్రనిల్ చందర్‌పై దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, స్నేహితులు రాయికల్ టోల్ ప్లాజా వద్దకు వచ్చి టోల్ ప్లాజా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రనిల్ చందర్ తరపున అనుచరులు హంగామా సృష్టించి, టోల్గేట్ క్యాబిన్లను అద్దాలను ధ్వంసం చేశారు. పరస్పర దాడులతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున అనుచరులు తరలిరావడంతో ప్రనిల్ తో పాటు పలువురికి గాయాలు కూడా అయ్యాయి. -
వైరల్ వీడియో.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు.. ఎందుకో తెలుసా!
ముంబై: మహారాష్ట్రలో ఇద్దరు మహిళలు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. నాసిక్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ.. మాటమాట పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లింది. టోల్ సిబ్బంది, కారులోని మహిళ రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. టోల్ ఫీజు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా కారులోని మహిళ బయటకు దిగి టోల్గేట్ సిబ్బంది చెంప చెళ్లుమనిపించింది. అంతటితో ఆగకుండా ఉద్యోగి చేతులను మెలితిప్పి దాడి చేసింది. దీంతో సిబ్బంది కూడా మహిళపై ఘర్షణకు దిగింది. ఇద్దరూ మరాఠీలో తిట్టుకుంటూ ఘోరంగా కొట్టుకున్నారు. నడిరోడ్డుపై ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని చెంపలు వాయించుకున్నారు. ఇంత జరుగుతుంటే అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోయారు. కొంతమంది ఈ తతంగాన్ని వీడియో తీస్తున్నారే గానీ ఆపేందుకు ప్రత్నించలేదు. ఈ దృశ్యాలన్నీ టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. नासिक में कल शाम एक टोलबूथ पर हुआ हंगामा। टोल भरने को लेकर हुए विवाद पर 2 महिला आपस में भिड़ गई। @iamvinodjagdale #maharastra #WATCH pic.twitter.com/mAEHARg33l — News24 (@news24tvchannel) September 15, 2022 -
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. 12 ట్రాక్టర్లతో బీభత్సం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్లను ట్రాక్టర్లతో బద్దలుకొట్టింది. 12 మంది ట్రాక్టర్ డ్రవైర్లు టోల్ రుసుం చెల్లించకుండానే మెరుపువేగంతో దూసుకెళ్లారు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా పట్టించుకోకుండా ట్రాక్టర్లను వేగంగా నడుపుతూ ముందుకెళ్లారు. ఆగ్రాలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. #WATCH | Uttar Pradesh: At least 12 sand-laden tractors, belonging to the sand mafia, break toll barricading and speed past, in Saiyan Police Station area in Agra on 4th September. (Source: CCTV) pic.twitter.com/p2mfPseths — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 5, 2022 ఈ ఘటనపై ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరీ స్పందించారు. వారం క్రితం ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 51 ట్రక్కులను సీజ్ చేసి కేసులు పెట్టినట్లు వెల్లడించారు. ఈ చర్యలతో మాఫియా మకాం మార్చేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే హైడ్రాలిక్ ట్రాలీలతో టోల్ ప్లాజా గేట్లను ధ్వంసం చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ ఘటనపై ఎఫ్ఐర్ నమోదు చేసినట్లు ఎస్ఎస్పీ వివరించారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులందరూ ధోల్పూర్ ప్రాంతానికే చెందినవారని, అక్కడి పోలీసుల సహకారంతో అందర్నీ పట్టుకుంటామన్నారు. చదవండి: బలపరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం -
హైవే ఎక్కుతున్నారా.. ఓసారి జేబులు చెక్ చేసుకోండి!
షాద్‌నగర్: టోల్ బాదుడు ఏటా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. యథావిధిగా ఈ ఏడాది కూడా టోల్‌ప్లాజాలో ధరలు పెరుగుతుండటంతో జాతీయ రహదారిపై ప్రయాణం మరింత భారం కానుంది. టోల్ ప్లాజాలో రుసుములు పెరుగుతుండటంతో అటు వాహనదారులు, ఇటు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ –బెంగళూరు 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజాలో రుసుము భారీగా పెరిగింది. పెంచిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులపై మరింత భారం బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణించే వారిపై భారం మరింత పెరగనుంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం టోల్ ధరలు పెంచుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు సరికాదంటున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణికులు, వాహనదారులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారి వెంట సబ్వే సరిగా లేకపోవడంతో రోడ్డు పక్కన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా తప్పని పెంపు షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వరకు జాతీయ రహదారిని (సుమారు 58 కి.మీ) రూ.600 కోట్లతో విస్తరించి అవసరమైన చోట బైపాస్ నిర్మించారు. ఈ జాతీయ రహదారిని 2009లో కొత్తూరులో ప్రారంభించారు. షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులో నిర్మించిన టోల్ ప్లాజాలో ఏటా టోల్ రుసుము పెంచుతూ వస్తున్నారు. స్కూల్ బస్సుల నుంచి యథావిధిగా.. టోల్ ప్లాజాలో నెలవారీ పాసుల రుసుమును కూడా పెంచుతున్నారు. కారు, ప్యాసింజర్, వ్యాను లేక జీపు రూ.2,115 నుంచి రూ.2,425, లైట్ కమర్షియల్ వాహనాలు, మినీ బస్సులు రూ. 3,700 నుంచి రూ. 4,245, ట్రక్కు, బస్సు రూ.7,395 నుంచి రూ.8,485, మల్టీయాక్సిల్ వాహనాలు రూ.11,895 నుంచి రూ.13,635కి పెంచనున్నారు. స్కూల్ బస్సుల నుంచి యథావిధిగా నెలవారీగా రూ.1000 వసూలు చేయనున్నారు. అన్ని వాహనాలపై బాదుడే.. టోల్గేట్లో ఈసారి అన్ని రకాల వాహనాలైన కారు, ప్యాసింజర్ వ్యాన్, లైట్ కమర్షియల్ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్ వాహనాలు (అనేక చక్రాల వాహనం)లకు రుసుములను భారీగా పెంచనున్నారు. దీంతో టోల్ ప్లాజాకు ఆదాయం కూడా పెరగనుంది. నిత్యం ఈ టోల్ ప్లాజా నుంచి సుమారు 15వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు సుమారు రూ.28లక్షల మేర ఆదాయం సమకూరుతుంది. టోల్ ధరలు పెరుగుతుండటంతో మరో రూ.మూ డు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. (క్లిక్: మందుబాబులకు షాక్.. తాగేదంతా మద్యం కాదు) రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పెట్రోల్, ఢీజిల్ ధరల పెరుగుదల, టోల్ రుసుములు రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాహనాల యజమానులు తమ లారీలను నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మళ్లీ టోల్ ధరల పెంపుతో భారం తప్పదు. – సయ్యద్ సాధిక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుసుము తగ్గించాలి కరోనా నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టోల్ రుసుము పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది. రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడాల్సిన వస్తోంది. రుసుము తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – శివకుమార్, షాద్‌నగర్ -
టోల్ ఛార్జీ కట్టమన్నందుకు దాడి, తిరిగి చెప్పుతో..
భోపాల్: టోల్ ఛార్జీ కట్టమన్నందుకు టోల్ బూత్‌లో పని చేసే యువతిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ వ్యక్తిని తీవ్రంగానే ప్రతిఘటిస్తూ.. ఆ యువతి కూడా ప్రతిదాడి చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్-భోపాల్ కచ్నారియా టోల్‌ప్లాజా వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. రాజ్‌కుమార్ గుజార్ అనే వ్యక్తి తన కారుకు ఫాస్ట్‌ట్యాగ్(ఈ-టోల్ పేమెంట్ వ్యవస్థ) లేకుండానే అక్కడికి వచ్చాడు. తాను స్థానికుడినని, టోల్ ఛార్జీల నుంచి తనకు మినహాయింపు ఉందని, ఆ ప్లాజా నిర్వాహకుడికి సైతం తనకు తెలుసని చెప్పాడు. అయితే అతను, ఆ వాహనం లోకల్‌దే అని నిరూపించుకోవడానికి ఎలాంటి ఆధారాలు అతని వద్ద లేవు. పైగా నిర్వాహకుడు సైతం ఆ వ్యక్తి ఎవరో తెలీదని చెప్పాడు. దీంతో.. టోల్ ఛార్జీ కట్టాల్సిందేనని సిబ్బందిగా పని చేస్తున్న అనురాధా దాంగి తేల్చి చెప్పింది. ఆ మాట వినగానే కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్ ఆమె వైపు దూసుకొస్తూ.. దుర్భాషలాడాడు. అంతటితో ఆగక ఆమె చెంప చెల్లుమనిపించాడు. అయితే అనురాధా ఊరుకోలేదు. ఆమె సైతం తన చెప్పు తీసి రాజ్‌కుమార్‌ను చెడామడా వాయించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరగ్గా.. అక్కడే ఉన్న కొందరు ఆ ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. బూత్‌లో ఏడుగురు మహిళా సిబ్బంది ఉన్నా.. సెక్యూరిటీ గార్డులెవరూ లేనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మహిళా సిబ్బంది ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయ్యింది. అయితే.. నిందితుడిని ఇంకా పోలీసులు అరెస్ట్ చేయలేదని సమాచారం. A man slapped a woman employee of a toll both in Rajgarh after she refused to let him go without paying the tax. The man is seen angrily walking towards the employee and then slapping her across the face, The woman hits him back with her footwear @ndtv @ndtvindia pic.twitter.com/hmK0ghdImX — Anurag Dwary (@Anurag_Dwary) August 21, 2022 -
'ఫాస్టాగ్' కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
వాహనదారులకు ముఖ్య గమనిక. కేంద్రం ఫాస్టాగ్ వ్యవస్థకు మంగళం పాడనుంది. అవును.. ఫాస్టాగ్ కథ మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగియబోతోంది. మరి టోల్ చార్జీల వసూలు ఎలాగంటారా? అందుకోసం కొత్త పద్ధతిని ఆచరించబోతున్నట్లు సూత్రప్రాయంగా తెలియజేసింది. ఇప్పుడున్న ఫాస్టాగ్ స్థానంలో.. జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ వసూలు చేయాలని సంబంధింత మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇప్పుటికే ఈ జీపీఎస్ టెక్నాలజీ ఆధారిత పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం, ఒక టోల్ ప్లాజా నుండి మరొక టోల్ ప్లాజాకు మొత్తం దూరానికి టోల్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ జీపీఎస్ టెక్నాలజీతో హైవేపై వెహికల్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో.. దాని ఆధారంగా టోల్ చెల్లించాల్సి వస్తుంది. కేంద్రమంత్రి ప్రకటన ఈ ఏడాది మార్చిలో జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలోగా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా బూత్‌లను ప్రభుత్వం తొలగించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు చెప్పారు. కొత్త పద్దతిలో కదులుతున్న వెహికల్ జీపీఎస్ ఇమేజెస్ సాయంతో టోల్ ఛార్జీలను వసూలు చేసే సౌలభ్యం కలుగుతుందన్నారు. యూరప్ దేశాల్లో జీపీఎస్ ఆధారిత విధానం విజయవంతం కావడంతో మనదేశంలో దీనిని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర రవాణా శాఖ జీపీఎస్ టెక్నాలజీని పరీక్షించేందుకు మనదేశంలో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాగా, కేంద్రం ఈ కొత్త విధానాన్ని అమలు చేసే ముందు ట్రాన్స్పోర్ట్ విధానాన్ని మార్చాల్సి ఉండగా.. పైలట్ ప్రాజెక్ట్‌లో దేశవ్యాప్తంగా 1.37 లక్షల వెహికల్స్‌పై ఈ జీపీఎం వ్యవస్థను ప్రయోగించనున్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌లు రద్దీ సమాయాల్లో టోల్ గేట్ల వద్ద వాహనదారులు గంటల తరబడి ఎదురు చూసే అవసరాన్ని తగ్గించేందుకు కేంద్రం 2016లో ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ బూత్‌లలో రుసుము చెల్లించడాన్ని సులభతరం చేసింది. చదవండి👉 బుడ్డోడి చేతికి స్మార్ట్ వాచ్..ఫాస్టాగ్‌తో అకౌంట్లలో మనీని దొంగిలించవచ్చా? -
కర్ణాటకలో అంబులెన్స్ బీభత్సం.. భయంకర దృశ్యాలు వైరల్
బెంగళూరు: కర్ణాటలో ఓ అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న అంబులెన్స్ అదుపు తప్పి టోల్‌బూత్‌ను ఢీకొట్టింది. ఉడిపి జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. కుందాపురం నుంచి రోగిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అప్పటికే వర్షం పడుతుండటంతో టోల్ గేట్ వద్ద సిబ్బంది బారికేడ్లను అడ్డంగా పెట్టారు. అయితే ఇంతలో అంబులెన్స్ అటుగా రావడాన్ని గమనించిన సిబ్బంది టోల్ ప్లాజా ముందు ఉన్న రెండు బారికేడ్లను వేగంగా తొలగించారు. అంబులెన్స్ టోల్‌గేట్‌కు దగ్గరగా రావడంతో చివర ఉన్న మూడో బారికేడ్‌ను తొలగించేందుకు ఓ సిబ్బంది ప్రయత్నించాడు. అప్పటికే అతి వేగంతో వస్తున్న అంబులెన్స్ వర్షం పడి తడిగా ఉన్న రోడ్డుపై అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా వాహనం టైర్లు టర్న్ అవ్వడంతో టోల్‌బూత్ క్యాబిన్ వైపు దూసుకెళ్లి బొల్తా కొట్టింది. అంబులెన్స్‌లోని పరికరాలు అన్ని చెల్లాచెదురుగా ఎగిరి పడ్డాయి. చదవండి: వావ్ వాట్ ఏ టాలెంట్.. మైకెల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టిన కార్మికుడు ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఒక రోగి, ఇద్దరు సహాయకులతోపాటు రోడ్డుపై ఉన్న టోల్గేట్ సిబ్బంది మరణించారు. అంబులెన్స్ డ్రైవర్ మాత్రం గాయాలతో బయటపడగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ప్రమాద తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. #Karnataka Tragic Video of Ambulance Hitting Toll Plaza in Karnataka's Udupi Emerges, 4 Dead (Viewer discretion advised) pic.twitter.com/LfOOP5sRAm — India.com (@indiacom) July 20, 2022 #WATCH | Karnataka: Four people were injured after a speeding ambulance toppled at a toll gate, near Byndoor. The Ambulance was carrying a patient to Honnavara. Further details are awaited. (Source: CCTV) pic.twitter.com/M3isDaX7Eg — ANI (@ANI) July 20, 2022 -
'ది గ్రేట్ ఖలీ' ఏందయ్యా ఇదీ.. టోల్గేట్ సిబ్బందితోనా..!
చండీగఢ్: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా మరోమారు వార్తల్లో నిలిచారు. పంజాబ్, లుధియానాలోని ఓ టోల్గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ కార్మికుడిపై ఖలీ చేయి చేసుకున్నాడని అక్కడి సిబ్బంది ఆరోపించారు. టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఖలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. ఆ వీడియోలో టోల్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. మరోవైపు.. లాధోవాల్ టోల్ ప్లాజా సిబ్బంది తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు దలిప్ సింగ్ రాణా. ఈ సంఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్ నుంచి హరియాణాలోని కర్నాల్‌కు ఖలీ తన కారులో వెళ్తున్న క్రమంలో టోల్గేట్ వద్ద ఈ సంఘటన ఎదురైనట్లు చెప్పారు. ధ్రువీకరణ పత్రం అడిగిన తమ సిబ్బందిని ఎందుకు కొట్టారని ఖలీని టోల్ సిబ్బంది అడుగుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. 'మిమ్మల్ని ఐడీకార్డు చూపించాలని అడిగారు. ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది అడగగా.. మీరు నన్ను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు ఖలీ. దానికి 'మిమ్మల్ని మేము బ్లాక్మెయిల్ చేయటం లేదు.. అతడిని ఎందుకు కొట్టారు? మీ దగ్గర ఉంటే ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే.. తన వద్ద ఎలాంటి ఐడీ కార్డు లేదని ఖలీ వారితో చెప్పారు. WWE wrestler #GreatKhali clashes with toll plaza staff at #Ludhiana#TheGreatKhali #ViralVideo #Punjab #Khali #ludhiana #WWE pic.twitter.com/XYJEhsdVtL — Vineet Sharma (@Vineetsharma906) July 12, 2022 ది గ్రేట్ ఖలీ వాహనం టోల్గేట్ దాటి వెళ్లకుండా ముందు బారికేడ్ పెట్టారు అక్కడి సిబ్బంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఖలీ దానిని తీసి పక్కన పడేశారు. టోల్ సిబ్బంది ఖలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇరువురు తమ వాదనలు పోలీసులకు వినిపించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన క్రమంలో వివరణ ఇచ్చారు ఖలీ. 'నిన్న పంజాబ్‌లోని లాధోవాల్ టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది నా కారును అడ్డుకుని సెల్ఫీ కోసం నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను అందుకు అంగీకరించకపోవటం వల్ల జాతివిద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాగే కొన్ని బూతులు మాట్లాడారు.' అని ఖలీ చెప్పారు. ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్ హైవే'.. దేశంలోనే తొలిసారి! -
బుడ్డోడి చేతికి స్మార్ట్ వాచ్..ఫాస్టాగ్‌తో అకౌంట్లలో మనీని దొంగిలించవచ్చా?
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకుండా ఈజీగా టోల్ పేమెంట్ చేయోచ్చు. అయితే ఇప్పుడీ ఫాస్టాగ్ పేమెంట్ విషయంలో సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ బాలుడు ఫాస్టాగ్ స్టిక్కర్ అంటించి ఉన్న కారు అద్దాలు తుడిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో తన చేతికి ఉన్నవాచ్ను..ఆ ఫాస్టాగ్ స్టిక్కర్ మీద ట్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో అనుమానం వచ్చిన కారులోని ప్రయాణికులు సదరు బాలుడ్ని " ఏం చేస్తున్నావు. ఇటు రా అంటూ" పిలుస్తారు. దీంతో కారు అద్దం తుడుస్తున్న బాలుడు..కారు యజమానికి దగ్గరికి రాగా..ఫాస్టాగ్ స్టిక్కర్ మీద ఎందుకు ట్యాప్ చేస్తున్నావు? అని ఆ వాచ్ గురించి అడగ్గా.. బాలుడు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళతాడు. A video is spreading misinformation about Paytm FASTag that incorrectly shows a smartwatch scanning FASTag. As per NETC guidelines, FASTag payments can be initiated only by authorised merchants, onboarded after multiple rounds of testing. Paytm FASTag is completely safe & secure. pic.twitter.com/BmXhq07HrS — Paytm (@Paytm) June 25, 2022 ఆ బాలుడిని పట్టుకునేందుకు కారులో ఉన్న ప్రయాణికుడు వెంబడిస్తాడు. కానీ ఆ బాలుడు తప్పించుకోవడంతో వెంబడించిన వ్యక్తి నిరాశతో తిరిగి వచ్చి ఇదంతా ఫాస్టాగ్ స్కామ్, ఆ బాలుడిని ఉద్దేశిస్తూ.. ఇలాంటి వారు కారు అద్దాలు తుడుస్తూ స్మార్ట్ వాచ్‌తో ఫాస్టాగ్ ద్వారా డ్రైవర్లు, యజమానుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తారని ఆరోపిస్తాడు. ఫాస్టాగ్ అనేది ఫాస్టాగ్ అనేది ప్రీపెయిడ్ రీఛార్జబుల్ ట్యాగ్ సర్వీస్. దీంతో కారు డ్రైవర్లు లేదా, యజమానులు టోల్ ప్లాజాల వద్ద ఆటోమెటిక్ పేమెంట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. టోల్ గేట్ల వద్ద కారు ముందు అద్దానికి దగ్గరలో అంటించిన స్కానర్‌పై ట్యాప్ చేస్తే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీతో సదరు ఫాస్టాగ్ అకౌంట్లో నుంచి ఆటోమెటిగ్గా డబ్బులు డిడక్ట్ అవుతాయి. ఇప్పుడీ బాలుడు కూడా ఆ స్కానర్‌పై వాచ్‌తో ట్యాప్ చేశాడని, అలా చేయడం వల్ల డబ్బులు అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది నిజమా? కాదా? అయితే ఇది నిజమా? కాదా? అని ప్రశ్నిస్తూ ఐఏఎస్ అధికారి అవానిష్ శరాణ్ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా..ఫాస్టాగ్ సర్వీసుల్ని అందిస్తున్న పేటీఎం ఆ వీడియోపై స్పందించింది. స్పందించిన పేటీఎం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏమాత్రం వాస్తవం లేదని పేటీఎం కొట్టి పారేసింది.నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రకారం(ఎన్ఈటీసీ)..ఫాస్టాగ్ చెల్లింపులు చాలా సురక్షితం. ఫాస్టాగ్ లావా దేవీలు పూర్తిగా రిజిస్టర్డ్ మర్చంట్లు మాత్రమే స్కాన్ చేసుకోవచ్చు. మినహాయించి ఎవరు చేసినా ఆ బార్ కోడ్లు స్కాన్ చేయలేవు అంటూ వివరణ ఇచ్చింది. -
టోల్గేట్లకు త్వరలో టాటా
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై టోల్గేట్లు త్వరలో కనుమరుగు కానున్నాయి. టోల్‌ఫీజు చెల్లింపునకు టోల్గేట్ల వద్ద వాహనాలు బారులుతీరిన దృశ్యాలు కొన్నాళ్ల తరువాత కనిపించవు కూడా. ఎందుకంటే టోల్‌ఫీజు వసూలు కోసం కొత్త విధానంపై జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) కసరత్తు చేస్తోంది. రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని బట్టి టోలుఫీజు వసూలు చేస్తున్న విధానానికి స్వస్తి పలకాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రయాణించే దూరాన్ని బట్టి టోల్‌ఫీజు వసూలు చేసేందుకు ఉపగ్రహ ఆధారిత ‘గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం’ (జీఎన్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. పాశ్చాత్య దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. హేతుబద్ధంగాలేని ప్రస్తుత విధానం ప్రస్తుతం జాతీయ రహదారులపై రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని బట్టి టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. వాహనాలు టోల్‌గేటు వద్దకు చేరుకోగానే వాటిపై ఉన్న ఫాస్టాగ్‌ను స్కాన్‌చేసి సంబంధిత ఫీజు మొత్తం ఆ ఖాతా నుంచి ఆటోమేటిగ్గా వసూలు చేస్తున్నారు. వాహనాలు ఆ రెండు టోల్గేట్ల మధ్య దూరాన్ని పూర్తిగా ప్రయాణిస్తే ఆ ఫీజు హేతుబద్ధమే. కానీ రెండు గేట్ల మధ్య పూర్తి దూరాన్ని ప్రయాణించకపోయినా ఈ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) మీదుగా గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న వాహనాలు గుంటూరు జిల్లాలో కాజ వద్ద టోల్ ఫీజు చెల్లించాలి. మళ్లీ ఆ రహదారిపై 66 కిలోమీటర్ల తరువాత కలపర్రు వద్ద టోల్గేట్ ఉంది. అంటే కాజ నుంచి కలపర్రు వరకు 66 కిలోమీటర్ల ప్రయాణానికి కాజ టోల్గేట్ వద్ద ఫీజు చెల్లిస్తున్నారు. కాజా నుంచి కలపర్రు వరకు ప్రయాణించే వాహనాలకు ఆ టోల్‌ఫీజు సహేతుకమే. కానీ వాహనాలు కాజ గేటు దాటిన తరువాత విజయవాడ వరకుగానీ, గన్నవరం వరకుగానీ ప్రయాణించినా సరే.. కలపర్రు వరకు అంటే 66 కిలోమీటర్ల దూరానికి టోల్‌ఫీజు చెల్లించాల్సి వస్తోంది. టోల్‌గేటు దాటి ఒక కిలోమీటరు ప్రయాణించినా సరే మొత్తం 66 కిలోమీటర్లకు టోలుఫీజు చెల్లించాల్సిందే. ఈ విధంగా దేశంలో ఉన్న వెయ్యికిపైగా టోల్గేట్లలో ప్రస్తుతం ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో 4.50 కోట్లకుపైగా ఫాస్టాగ్ కలిగిన వాహనదారులు తాము ప్రయాణించే దూరానికి మించి టోల్‌ఫీజు చెల్లిస్తున్నారు. నావిగేషన్ టోల్‌ఫీజు విధానం ఇలా.. టోల్‌ఫీజు విధానాన్ని మరింత హేతుబద్ధీకరించేందుకు జీఎన్ఎస్ఎస్ ప్రవేశపెట్టాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. ఈ విధానంలో ఒక వాహనం జాతీయ రహదారిపై ప్రయాణించే దూరాన్ని బట్టి ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్‌ఫీజు వసూలు చేస్తారు. అంటే వాహనం జాతీయ రహదారిపైకి చేరుకున్నప్పటి నుంచి ఆ దారిలో ప్రయాణించే దూరాన్ని జీఎన్ఎస్ఎస్ విధానంలో పరిశీలించి టోల్ వసూలు చేస్తారు. జాతీయ రహదారిపై నుంచి పక్కకు జరగగానే ప్రయాణించిన దూరాన్ని ఆటోమేటిగ్గా లెక్కించి ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్‌ఫీజు తీసుకుంటారు. ఈ విధానంలో జాతీయ రహదారిపై ఎంతదూరం ప్రయాణిస్తే అందుకుతగ్గ టోల్ఫీజే వసూలు చేస్తారు. ఇక టోల్గేట్లు ఉండవు. కాబట్టి జాతీయ రహదారులపై టోల్‌ఫీజు చెల్లింపునకు వాహనాలు బారులు తీరాల్సిన అవసరం ఉండదు. దీంతో వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా అవుతాయి. ఐరోపా దేశాల్లో ప్రస్తుతం విజయవంతంగా అమలవుతున్న ఈ జీఎన్ఎస్ఎస్ విధానాన్ని మనదేశంలో ప్రవేశపెట్టనున్నామని కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల అభివృద్ధిశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. ఈ విధానంపై ఎన్హెచ్ఏఐ ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టును పరిశీలిస్తోంది. దేశంలో 1.37 లక్షల వాహనాల నుంచి ప్రస్తుతం ఈ విధానంలో టోల్‌ఫీజు ప్రయోగాత్మకంగా వసూలు చేస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టుపై రష్యా, దక్షిణ కొరియాలకు చెందిన నిపుణులు త్వరలో నివేదిక సమర్పించనున్నారు. అనంతరం జీఎన్ఎస్ఎస్ విధానం అమలుపై ఎన్హెచ్ఏఐ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అందుకోసం అవసరమైతే జాతీయ రవాణా విధానంలో సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. -
టోల్ చార్జీలు పెంపు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల్లో చార్జీలు పెరిగాయి. రాష్ట్రంలో ఉన్న 29 ప్లాజాల్లో హైదరాబాద్–బెంగళూరు హైవే మినహా మిగతా టోల్ ప్లాజాల రుసుములను ఎన్హెచ్ఏఐ సవరించింది. బెంగళూరు హైవేలో ఓ కాంట్రాక్టరుతో ఉన్న ఒప్పందం ప్రకారం కొత్త ధరలు సెప్టెంబర్‌లో విడుదల కానున్నాయి. మిగతా టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఆయా రోడ్ల నిడివి, వెడల్పు, వాటి మీద ప్రయాణించే వాహనాల సంఖ్య, టోల్ గేట్ల సామర్థ్యం, నిర్వహణ వ్యయం.. ఇలా పలు అంశాల ప్రాతిపదికగా టోల్ ధరలను సవరించారు. కార్లు, జీపులు లాంటి వాహనాలకు 5 నుంచి 8 శాతం, లైట్ కమర్షియల్ వాహనాలకు 10 నుంచి 15 శాతం, బస్సులు, ట్రక్కులకు 10 నుంచి 15 శాతం చార్జీలు పెరిగాయి. ఆయా కేటగిరీల్లో రూ. 5 నుంచి 50 వరకు ధరలు పెరిగాయి. టోల్ ధరలను ఏటా ఏప్రిల్ ఒకటిన సవరిస్తుంటారు. ఆర్టీసీ కూడా: తాజాగా ఆర్టీసీ కూడా టోల్ రుసుమును జనం జేబుపై వేసింది. అన్ని బస్సులకు కలిపి ఒకేసారి ఆర్టీసీ టోల్ రుసుములను చెల్లిస్తుంది. గత నాలుగేళ్లుగా టోల్ రుసుములను సంస్థ సవరించలేదు. గత ఏడాది కాలంలో ప్రయాణికుల నుంచి వసూలు చేసిన మొత్తం కంటే టోల్ నిర్వాహకులకు చెల్లించిన మొత్తం రూ.8 కోట్లు ఎక్కువని ఇటీవల గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం ఆర్టీసీ కూడా టికెట్ రేట్లలో టోల్ వాటాను పెంచింది. గతేడాది టోల్ చార్జి, ఏప్రిల్ ఒకటి నుంచి అమలయ్యే కొత్త రేట్లు (మొదటిది పాత, రెండోది కొత్త) ఇలా ఉన్నాయి. హైదరాబాద్విజయవాడ హైవే పై పంతంగి: కారు, జీపు వ్యాన్ ఇతర లైట్ వెహికిల్స్‌కు సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.80 నుంచి రూ.90కి, రిటర్న్ జర్నీతో కలిపి ఛార్జి రూ.120 నుంచి రూ.135కు, నెల పాస్ ఛార్జి రూ.2690 నుంచి రూ.2965కు పెరిగాయి. లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.130 నుంచి రూ.140కి, రిటర్న్ జర్నీ రూ.190 నుంచి రూ.210కి, నెలపాస్ రూ.4255 నుంచి రూ.4685కు పెరిగాయి. బస్, ట్రక్కుల సింగిల్ ట్రిప్ రూ.265 నుంచి రూ.290కి, రిటర్న్ జర్నీ ఛార్జి రూ.395 నుంచి రూ.435కు, నెల పాస్ రూ.8795 నుంచి రూ.9685కు, ఓవర్‌సజ్డ్ వెహికిల్ సింగిల్ ట్రిప్ రూ.510 నుంచి రూ.560కి, రిటర్న్ జర్నీ రూ.765 నుంచి రూ.845కు, నెలపాస్ రూ.17010 నుంచి రూ.18740కి పెరిగాయి. కోర్లపహాడ్: కార్లు, జీపుల సింగిల్ ట్రిప్ రూ.110 నుంచి రూ.120కి, రిటర్న్ జర్నీ రూ.165రూ.180, నెలపాస్ రూ.3650రూ.4025, లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.175రూ.190, రిటర్న్ జర్నీ రూ.260రూ.285, నెలపాస్రూ.5795రూ.6385, బస్సు, ట్రక్కుల సింగిల్ ట్రిప్ రూ.360రూ.395, రిటర్న్ జర్నీ ఛార్జి రూ.540రూ.595, నెలపాస్ రూ.12020రూ.13240, ఓవర్సైజ్డ్ హెవీ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.695రూ.765, రిటర్న్ జర్నీ రూ.1045రూ.1150, నెలపాస్ రూ.23190రూ.25545కు పెరిగాయి. చిల్లకల్లు టోల్గేట్: జీపు కార్ల సింగిల్ ట్రిప్ రూ.90 రూ.100, రిటర్న్ జర్నీ ఛార్జి రూ.135రూ.150, నెలపాస్ రూ.3040రూ.3350, లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.145రూ.160, రిటర్న్ జర్నీ రూ.215రూ.240, నెల పాస్ రూ.4805రూ.5290, బస్సు, ట్రక్కు సింగిల్ ట్రిప్ రూ.300రూ.330, రిటర్న్ జర్నీ రూ.445రూ.490, నెల పాస్ రూ.9930రూ.10940, ఓవర్సైజ్డ్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.575రూ.635, రిటర్న్ జర్నీ రూ.865రూ.955, నెల పాస్ రూ.19215రూ.21170. ► ఎన్‌హెచ్ 163 పై ఉన్న కొమల్ల టోల్‌ప్లాజాలో కార్లు, జీపులకు సింగిల్ ట్రిప్ పాత ధర రూ.100 కొత్త ధర రూ.110, రిటర్న్ జర్నీకి రూ.145170, నెలపాస్‌కు రూ.32603745. ► లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ జర్నీ రూ.160180, రిటర్న జర్నీకి రూ.235270, నెల పాస్‌కు రూ.52653745, బస్సులు,ట్రక్కు సింగిల్ ట్రిప్‌కు రూ.330 రూ.380, రిటర్న జర్నీకి 495570, నెల పాస్‌కు రూ.1103012675, సెవన్ యాక్సల్ అంతకంటే హెవీ వెహికిల్్సకు సింగిల్ ట్రిప్ రూ.630725, రిటర్న్ జర్నీకి రూ.9451090, నెలపాస్‌కు 2105524195. ► ఎన్‌హెచ్ 163 పై ఉన్న గూడూరు ప్లాజాలో కార్లు, జీపుల సింగిల్ ట్రిప్‌కు రూ.100110, రిటర్న్ జర్నీకి రూ.150 రూ.165, నెల పాస్ రూ.3290రూ.3620, లైట్ కమర్షియల్ వెహికిల్స్‌కు సింగిల్ ట్రిప్ రూ.150 రూ.165, రిటర్న్ జర్కీకి రూ.225 250, బస్, ట్రక్కులకు సింగిల్ ట్రిప్ రూ.305రూ.340, రిటర్న్ జర్నీకి రూ.460రూ.505, నెల పాస్‌కు రూ.10225రూ.11265. ఓవర్సైజ్డ్ హెవీ వెహికిల్్స సింగిల్ ట్రిప్‌కు రూ.605రూ.665, రిటర్న్ జర్నీకి రూ.905 రూ.1000, నెల పాస్‌కు రూ.20160రూ.22210 ► ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్7పై ఉన్న రోల్మామ్డా టోల్‌ప్లాజా ధరలల్లో మార్పు ఇలా: కార్లు జీపులు సింగిల్ ట్రిప్ రూ.90 రూ.100, రిటర్న్ జర్నీ రూ.135రూ.150, నెలపాస్ రూ.2980 రూ.3285, లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.145రూ.160, రిటర్న్ జర్నీ రూ.215రూ.240, నెలపాస్ రూ.4815 రూ.5305, బస్, ట్రక్కు సింగిల్ ట్రిప్ రూ.330 రూ.335, రిటర్న్ జర్నీకి రూ.455రూ.500, నెలపాస్ రూ.10090 రూ.11110, ఓవర్సైజ్డ్ హెవీవెహికిల్ సింగిల్ ట్రిప్ రూ.580రూ.635, రిటర్న్ జర్నీ రూ.865రూ.955, నెలపాస్ రూ.19260రూ.21215 ► ఎన్‌హెచ్44పై ఆర్మూర్ఎల్లారెడ్డి సెక్షన్ పరిధిలోని ఇందల్వాయి టోల్ధరలు పాతకొత్త ఇలా.. కార్లు, జీపుల సింగిల్ ట్రిప్పుకు రూ.75రూ.80, రిటర్న్ జర్నీకి రూ.110రూ.125, నెలపాస్‌కు రూ.2470రూ.2720, లైట్ కమర్షియల్ వాహనాల సింగిల్ ట్రిప్పు రూ.120రూ.130, రిటర్న్ జర్నీ రూ.180 రూ.200, నెలపాస్ రూ.3990రూ.4395, బస్, ట్రక్కు సింగిల్ ట్రిప్పు రూ.250రూ.275, రిటర్న్ జర్నీ రూ.375రూ.415, నెలపాసు రూ.8365రూ.9215 -
వాహనదారులకు షాకింగ్ న్యూస్..! పెరగనున్న టోల్గేట్ ఛార్జీలు..!
ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్...! ఏప్రిల్ 1 నుంచి హైవే రోడ్లపై ప్రయాణం మరింత ఖరీదైనది మారనున్నట్లు సమాచారం. భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..! నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను 65 శాతం పెంచనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి . హైవేలపై తిరిగే అన్ని రకాల వాహనాల టోల్ ఛార్జీలను ఎన్హెచ్ఏఐ సవరించినట్లుగా తెలుస్తోంది. ధరల పెంపుతో ఇప్పుడు వాణిజ్య వాహనాలు టోల్ ట్యాక్స్ కోసం అదనంగా రూ. 65 చెల్లించాల్సి ఉండనుంది. కాగా ప్రైవేట్ వాహనాల వన్-వే ప్రయాణం కోసం అదనంగా రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. సవరించిన ధరలు మార్చి 31 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చదవండి: కాసుల వర్షం కురిపిస్తోన్న హైదరాబాద్ కంపెనీ..! ఒక లక్షకు రూ. 3 కోట్ల లాభం..! -
రాష్ట్రంలో ఆరేడు టోల్‌ప్లాజాల తొలగింపు?
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై కొన్ని టోల్‌ప్లాజాలను మూసివేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 కి.మీ., అంతకంటే తక్కువ దూరంలో టోల్గేట్లు ఉంటే ఒకదాన్ని మూసేయనున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ రహదారులపై 29 టోల్‌గేట్లున్నాయి. కేంద్రం నిర్ణయం మేరకు పంతంగి, రాయ్కల్, కొత్తగూడెం, మన్ననూరు, గుమ్మడిదల, గూడూరు, కడ్తాల్ టోల్‌ప్లాజాలను తొలగించాల్సి ఉంటుంది. అయితే ఏవేవి మూసేస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేమని, దేశం మొత్తం యూనిట్‌గా ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయం తీసుకుంటారని ఎన్హెచ్ఏఐ స్థానిక ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. పక్క రాష్ట్రంలోని చివరి టోల్‌ప్లాజా, మన రాష్ట్రంలోని ఆ రూట్లో మొదటి టోల్‌ప్లాజాల మధ్య 60 కి.మీ. దూరంలేని పక్షంలో ఒకదాన్ని తొలగించాలి. ఆ లెక్కన రాష్ట్రంలోని టోల్‌ప్లాజాలు, పొరుగున ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని టోల్‌బూత్‌లతో కలిపి చూసి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, పీపీపీ పద్ధతిలో రోడ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్, పెట్టుబడి మొత్తాన్ని వడ్డీతో కలుపుకొని టోల్ రూపంలో వసూలుకు అనుమతి ఉంటుంది. ఇప్పుడు వాటిని ఎత్తేస్తే, కాంట్రాక్టర్ నష్టపోయే మొత్తాన్ని కేంద్రం చెల్లించాలి. ఈ విషయంలో ఎలాంటి విధివిధానాలను అనుసరిస్తారనే దానిపై అధికారుల్లో ఇంకా స్పష్టత రాకపోవడం విశేషం. ఢిల్లీ నుంచి తమకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. (చదవండి: దివ్యాంగులు ఐపీఎస్‌కు అర్హులే..) -
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక 60 కిలోమీటర్ల వరకు నో టోల్!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త తెలిపింది. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్ కలెక్టింగ్ పాయింట్లను వచ్చే మూడు నెలల్లో మూసివేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో ప్రకటించారు. 2022-23 బడ్జెట్లో కేటాయించిన రోడ్లు, రహదారుల కేటాయింపుపై లోక్ సభలో జరిగిన చర్చకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. 60 కిలోమీటర్ల పరిధిలో ఒకే ఒక్క టోల్ గెట్ ఉంటుందని ప్రకటించారు. ఇంకా భవిష్యత్ నిర్మాణం జరగబోయే రోడ్ల గురించి ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్ ప్రెస్ వేను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ-అమృత్ సర్ మార్గం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది అని అన్నారు. అలాగే, కొత్తగా నిర్మిస్తున్న మార్గం వల్ల ఢిల్లీ నుంచి అమృత్ సర్ చేరుకోవడానికి 4 గంటల సమయం మాత్రమే పడుతుందని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న వల్ల శ్రీనగర్ నుంచి ముంబై చేరుకోవడానికి 20 గంటల సమయం పడుతుందని గడ్కరీ చెప్పారు. "కొత్తగా నిర్మిస్తున్న జమ్మూ-శ్రీనగర్ హైవేను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను" అని అన్నారు. అలాగే ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేలు కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి తెలిపారు. ఢిల్లీ-ముంబై దూరాన్ని 12 గంటల్లోపు కారులో చేరుకోవచ్చు. 2024 నాటికి శ్రీనగర్-లేహ్ హైవేపై సముద్ర మట్టానికి 11,650 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ సొరంగాన్ని తెరవాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, రోడ్డు భద్రతపై మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడు అన్ని కార్లలో 6 ఎయిర్ బ్యాగులతో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. (చదవండి: బంగారం కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ధరలు!) -
ఆర్టీసీ బస్సుకు టోల్గేట్ బ్రేక్
పెద్దకొడప్గల్(జుక్కల్): టోల్ ట్యాక్స్ చెల్లించనందున పల్లెలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు టోల్గేట్ వద్దనే ఆగిపోయింది. ఫలితంగా గ్రామీణులు ఇబ్బందులపాలయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం టోల్గేట్ వద్ద బాన్సువాడ నుంచి పెద్దకొడప్గల్, బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, గ్రామాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సును టోల్గేట్ సిబ్బంది మంగళవారం ఉదయం నిలిపివేశారు. దీంతో బస్సు వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఆయా గ్రామస్తులు పలువురు ఆర్టీసీ అధికారులను సంప్రదించగా ప్రయాణికుల నుంచి టికెట్ చార్జీలు ట్రిప్పుకు రూ.200 నుంచి రూ.400 వసూలు అవుతుందని, టోల్ ట్యాక్స్ ట్రిప్పుకు రూ.480 ఉండటంతో నష్టం వస్తోందని తెలిపారు. రోజుకు మూడు ట్రిప్పులు బస్సును నడపలేకపోతున్నామన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు వెళ్లి టోల్గేట్ అధికారులతో మాట్లాడాలని, ట్యాక్స్ మినహాయింపు ఇస్తే బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్యెల్యే హన్మంత్ సింధే దృష్టికి తీసుకువెళ్తామన్నారు. -
పెరుగుతున్న టోల్‌ప్లాజాల సంఖ్య..
సాక్షి, హైదరాబాద్: గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై 23 టోల్‌ప్లాజాలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 27కు పెరిగింది. మరో నాలుగైదు రాబోతున్నాయి. గతంలో రాష్ట్ర రహదారులుగా ఉన్న రోడ్లను జాతీయ రహదారులుగా మారుస్తుండటంతో వాటిపై కొత్తగా టోల్గేట్లు ఏర్పాటవుతున్నాయి. కొత్తగా నగర శివారులోని ఔటర్ రింగు రోడ్డు నుంచి మెదక్ వరకు ఏర్పడ్డ జాతీయ రహదారిపై నర్సాపూర్ చేరువలోని గుమ్మడిదలలో టోల్గేట్ ఏర్పాటు చేశారు. నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వరకు కొత్తగా జాతీయ రహదారిని విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిట్లంపల్లి వద్ద కొత్తగా టోల్‌ప్లాజా ఏర్పాటైంది. ఇక జడ్చర్ల–కల్వకుర్తి రోడ్డులో మున్ననూరు వద్ద, ములుగు–భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై జవహర్‌నగర్ వద్ద మరో టోల్‌ప్లాజా ఏర్పాటైంది. ఈ నాలుగింటి వల్ల కూడా టోల్ వసూళ్లు కొంతమేర పెరిగాయి. ఇక గత ఏడాది కాలంలో వాహనాల సంఖ్య కూడా కొంత పెరగటంతో ఆ మేరకు వసూళ్లు పెరిగాయి. -
భారీగా పెరిగిన టోల్ వసూళ్లు.. రోజుకు రూ. 4 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్ తప్పనిసరి కావడం, ఇంటి దొంగల ఆట కట్టు కావటంతో జాతీయ రహదారులపై టోల్ రూపంలో భారీగా ఆదాయం వచ్చిపడుతోంది. ఇంతకాలం జవాబుదారీ విధానం లేకపోవటంతో ఎన్ని వాహనాలు టోల్‌ప్లాజాలను దాటుతున్నాయి, వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తోంది.. సరైన లెక్కాపత్రం లేకుండా పోయింది. సిబ్బంది హస్తలాఘవం బాగా ఉండటంతో దాదాపు సగానికి సగం మొత్తం గాయబ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు వారి ప్రమేయం లేకుండా ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుము ఆటోమేటిక్‌గా వసూలవుతుండటంతో భారీ మొత్తం జమవుతోంది. ఇంతకాలం ఫాస్టాగ్ లేని వాహనాల సంఖ్య కూడా గణనీయంగా కనిపిస్తూండేది. కానీ గత రెండు మూడు నెలల్లో ఫాస్టాగ్ పొందిన వాహనాల సంఖ్య గరిష్టస్థాయికి చేరింది. తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని జాతీయ రహదారుల మీద పరుగుపెడుతున్న వాహనాల్లో 98 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉంది. దీంతో నిత్యం రాష్ట్రంలోని 27 టోల్ కేంద్రాల ద్వారా రూ.మూడున్నర కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల వరకు ఆదాయం నమోదవుతుండటం విశేషం. ఫాస్టాగ్ తప్పనిసరితో.. మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ గతేడాది ఫిబ్రవరి నుంచి తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనం వస్తే అప్పటికప్పుడు ట్యాగ్ కొని అతికించుకోవటమో, లేదా రెట్టింపు రుసుమును పెనాల్టీగా చెల్లించి ముందుకు వెళ్లటమో, లేదా వెనుదిరిగి వెళ్లిపోవటమో చేయాల్సిన పరిస్థితిని గత ఫిబ్రవరి నుంచి అమలులోకి తెచ్చారు. దీంతో వాహనదారులందరూ ఫాస్టాగ్ కొనుగోలు చేయటం ప్రారంభించారు. తాజాగా.. సంక్రాంతి ప్రయాణాల కోసం ఎక్కువ మంది ఫాస్టాగ్ కొనేశారు. ప్రస్తుతం 98 శాతం వాహనాలకు ట్యాగ్ కనిపిస్తోంది. -
Photo Feature: పల్లెకు ‘సిటీ’జనులు
చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు పట్నం జనం పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ వాసులతోపాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల వాసులు స్వస్థలాలకు వెళ్తున్నారు. శనివారం నుంచే విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా అదనంగా టోల్ వేలను తెరిచారు. 16 టోల్ వేలు ఉండగా, విజయవాడ వైపు 10, హైదరాబాద్ వైపు 6 మార్గాలను కేటాయించారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద క్యూ కట్టిన వాహనాలు సై.. సై.. జోడెడ్లా బండి రాజానగరం: తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల పోటీలు ఉర్రూతలూగించాయి. 1,500 మీటర్లు, 1,000 మీటర్ల నిడివిలో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 63 జతల ఎద్దులు పాల్గొన్నాయి. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ పోటీలను ప్రారంభించగా, విజేతలకు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ బహుమతులు ప్రదానం చేశారు. -
టోల్‌బూత్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 20 మంది దుర్మరణం
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ మెక్సికోలోని రహదారిపై ఉన్న టోల్‌బూత్‌లోకి ఒక ట్రక్కు దూసుకురావడంతో 20 మంది మృత్యువాత పడగా, పలువురు గాయపడ్డారు. టోల్‌బూత్ వద్ద ఆపి ఉంచిన వాహనాలపైకి ఓ రవాణా ట్రక్కు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో పలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ మంటల్లో చిక్కుకుని 20 మంది సజీవ దహనమయ్యారు. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మెక్సికోలోని చాల్కో ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ కూడా మంటల్లో చిక్కుకుని మృతిచెందాడు. నవంబర్ 1వ తేదీ నుంచి చూస్తే సెంట్రల్ మెక్సికోలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం కలవర పరుస్తున్నాయి. ఆయిల్ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు.. -
టోల్గేట్ బాదుడు.. అక్టోబరు ఫాస్టాగ్ వసూళ్లు రూ.3,356 కోట్లు
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో ప్రయాణాలు ఊపందుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడాన్ని సూచిస్తూ అక్టోబర్‌లో ఫాస్టాగ్ టోల్ లావాదేవీలు రికార్డు స్థాయిలో జరిగాయి. 21.42 కోట్ల లావాదేవీల ద్వారా రూ. 3,356 కోట్లు వసూలయ్యాయి. శనివారం ఒక్క రోజే ఏకంగా రూ. 122.81 కోట్లు ఫాస్టాగ్ టోల్ వసూళ్లు నమోదయ్యాయి. ఇది ఆల్–టైం గరిష్టం కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అభివృద్ధి అంతా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో జరుగుతోంది. దీంతో రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత టోల్గేట్లు వస్తున్నాయి. సగటున ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక టోల్గేట్ ఉంటోంది. దీంతో జాతీయ రహదారి ఎక్కితే చాలు టోల్ వలిచేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం సైతం ఫాస్టాగ్ పేరుతో ఆటోమేటిక్ టోల్ సిస్టమ్‌ని నిర్బంధగా అమలు చేస్తోంది. -
టోల్ ప్లాజా: ఉన్నట్టుండి కారులో చెలరేగిన మంటలు
సాక్షి, యాదాద్రి: హైదరాబాద్-యాదగిరిగుట్ట టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న కారులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపుతోంది. బీబీనగర్ మండలం గూడూరు టోల్ గేటు వద్ద బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వ స్తుండగా.. టోల్ గేట్ ఫాస్టాగ్ లేన్-2లో రెనో కారు (TS10EE3224)లో ఉన్నట్లుండి ఆకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. (చదవండి: టోల్ అడిగితే కొడవలి చేతికిచ్చాడు) ఇది గమనించి వెంటనే కారులో ఉన్న ప్రయాణికులు కిందకు దిగారు. టోల్ గేట్ సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు చెలరేగినట్లు తెలిసింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. చదవండి: Toll Gate: ‘ఫాస్ట్’గా దోచేస్తున్నారు.. -
పెరిగిన టోల్‌ప్లాజా ధరలు.. నేటి నుంచి అమల్లోకి!
సాక్షి, షాద్‌నగర్: ప్రయాణికులు, వాహనదారులపై మరింత భారం పడనుంది. టోల్ ప్లాజా ధరలు పెరగనుండటంతో జేబులు మరింత ఖాళీ కానున్నాయి. ఏటా టోల్ ప్లాజా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజాలో పెంచిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఏటా పెంపు.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వరకు ఉన్న జాతీయ రహదారిని సుమారు 58 కిలోమీటర్ల మేర రూ.600 కోట్ల వ్యయంతో విస్తరించారు. అవసరమైన చోట్ల బైపాస్‌లు నిర్మించారు. 2009లో పనులు పూర్తిచేసి కొత్తూరులో ప్రారంభించారు. షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ శివారులో నిర్మించిన టోల్ ప్లాజా రుసుంను ఏటా పెంచుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇప్పటికే అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు టోల్ చార్జీలు కూడ పెంచడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన చార్జీలు సెప్టెంబర్ 1నుంచి అమలులోకి వస్తాయని టోల్‌ప్లాజా నిర్వాహకులు ప్రకటనలు కూడా జారీ చేశారు. చదవండి: ఇక్కడ బస్టాప్ ఎక్కడుందబ్బా.. కనిపించట్లేదు! పెరగనున్న పాసుల రుసుము టోల్ ప్లాజాలో నెల వారీ పాసుల రుసుంను కూడా పెంచనున్నారు. కారు, ప్యాసింజర్ వ్యాను లేక జీపు రూ.1,960 నుంచి రూ.2,115లు, లైట్ కమర్షియల్ వాహనాలు, మినీ బస్సులు రూ.3,430 నుంచి రూ.3,700, ట్రక్కు, బస్సు రూ.6,860 నుంచి రూ.7,395, మల్టీయాక్సిల్ వాహనాలు రూ.11,025 నుంచి రూ.11,895లు పెంచనున్నారు. స్కూల్ బస్సుకు నెలవారీ పాసు రుసుము రూ.1,000 వసూలు చేయనున్నారు. ఈ సారి పెంచేశారు గతేడాది కారు, ప్యాసింజర్ వ్యాన్లతో పాటుగా, లైట్ కమర్షియల్ వాహనాలకు టోల్ రుసుం పెంచలేదు. కానీ ఈసారి మాత్రం కారు, ప్యాసింజర్ వ్యాన్, లైట్ కమర్షియల్ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్ వాహనాల (అనేక చక్రాల వాహనం) రుసుం పెంచనున్నారు. అయితే పెంచిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోని రానున్నాయి. పెరగనున్న ఆదాయం షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా మీదుగా నిత్యం సుమారు పదివేల వాహనాలకుపైగా రాకపోకలు సాగిస్తాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది తమ సొంత వాహనాలపై ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ టోల్ ప్లాజాలో నిత్యం సుమారు రూ.25 లక్షల రూపాయల వరకు రుసుం వసూలవుతుంది. చార్జీలు పెంచడంతో టోల్ ఆదాయం రోజుకు రూ.2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈమేర వాహనదారులపై భారం పడనుంది. వాహనం వెళ్లేందుకు రానుపోను (కొత్త చార్జీలు) కారు, జీపు ప్యాసింజర్ వ్యాన్ రూ.70 రూ.105 లైట్ కమర్షియల్, మినీ బస్ రూ.125 రూ.185 ట్రక్కు, బస్సు రూ.245 రూ.370 మల్టియాక్సిల్ వాహనాలు రూ.395 రూ.595 భారం మోపడం సరికాదు ఏటా టోల్ రుసుం పెంచి వాహనదారులపై భారం మోపడం సరికాదు. చార్జీల పెంపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు, ట్రక్కులకు కిరాయిలే సరిగా రావడం లేదు. ఈ సమయంలో కిస్తులు కట్టడం కూడా గగనమవుతోంది. – సయ్యద్ సాధిక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, షాద్‌నగర్ -
Photo Story: విద్యార్థులకు ఇదో ‘పరీక్ష’!
పాఠశాల ప్రాంతం మొత్తం జలమయం నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కట్టంగూర్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల ముందు వర్షపునీరు భారీగా నిలిచిపోవడంతో ఆదివారం ఇక్కడ పరీక్ష రాసేందుకు వచ్చిన చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఇక్కడ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎటు చూసినా వర్షపునీరే ఉండడంతో పిల్లలను తల్లిదండ్రులు ఎత్తుకుని.. నీటిలోంచి వెళ్లి కేంద్రం వద్ద దింపారు. ఈ పాఠశాలకు రోజూ వచ్చే పిల్లలు, టీచర్లు ఎంతగా ఇబ్బంది పడుతున్నారోనని పరీక్షకు వచ్చినవారు చర్చించుకున్నారు. బొగత వద్ద పర్యాటకుల సందడి వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలధారలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు తరలి వచ్చారు. ప్రకృతి ప్రేమికులు ఫొటోలు, సెల్ఫీలు దిగారు. టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాలు బారులుదీరాయి. ఆదివారం కావడంతో యాదాద్రి పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదలడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ కౌంటర్ల నుంచి వాహనాలు వెళ్లడంలో జాప్యమైంది. నగదు కౌంటర్లు రెండు మాత్రమే ఉండటంతో రద్దీ నెలకొనగా, వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. -
టోల్ అడిగితే కొడవలి చేతికిచ్చాడు
దొడ్డబళ్లాపురం: టోల్ ఫీజు అడిగితే ఓ రైతు కొడవలి అందించాడు. ఈ ఘటన బెంగళూరు సమీపంలో చోటు చేసుకుంది. బెంగళూరు–హైదరాబాద్ మార్గంలోని కెంపేగౌడ ఎయిర్‌పోర్టు రోడ్డులో ఏర్పాటు చేసిన టోల్గేట్ వద్దకు గురువారం ఉదయం ఓ వ్యక్తి కారులో రాగా టోల్ ఫీజు చెల్లించాలని సిబ్బంది అడిగారు. తాను స్థానికుడినని, రైతునని, పొలం పనికి వెళ్లి వస్తున్నానని చెప్పాడు. అయితే ఆయన లగ్జరీ కారులో రావడాన్ని బట్టి రైతు కాదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ వ్యక్తి కారులో ఉన్న కొడవలి తీసి సిబ్బంది చేతికిచ్చి ఇప్పుడయినా నమ్ముతారా అని ప్రశ్నించారు. భయాందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వగా చిక్కజాల పోలీసులు ఆయన్ను పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లారు. ఆయన స్థానిక రైతు అని తేలడంతో వదిలేశారు. చదవండి: ఆ ఉద్యోగం వద్దు.. పంజాబ్ ఎమ్మెల్యే స్పష్టీకరణ -
Toll Gate: ‘ఫాస్ట్’గా దోచేస్తున్నారు..
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): ఫాస్టాగ్ పనిచేయడం లేదంటూ వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటన తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్గేట్ వద్ద ఆదివారం వెలుగు చూసింది. టోల్గేట్ వద్ద ఇటీవల ఫాస్టాగ్ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా ఫాస్టాగ్ పనిచేయడం లేదని నిర్వాహకులు వాహనదారుల నుంచి నేరుగా డబ్బులు తీసుకుంటున్నారు. ఆదివారం ఓ వాహనదారుడు డబ్బులు చెల్లించి కొంత దూరం వెళ్లిన తర్వాత అతడి ఫాస్టాగ్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. వెంటనే వెనక్కువచ్చి నిర్వాహకులను నిలదీశాడు. వారు సరైన సమాధానం చెప్పకుండా టోల్‌ప్రీ నంబర్‌కు ఫోన్చేసుకోండి. లేదంటే కౌంటర్లో వెళ్లి అడగండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఇంతలో మరో ఫాస్టాగ్ ఉన్న కారు వచ్చింది. సిబ్బంది అతడి నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు. కాసేపటికే అతడి ఫోన్‌కు కూడా ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెస్సేజ్ వచ్చింది. అయినా సిబ్బంది సరిగా స్పందించలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాంకేతిక లోపంతో కొంతమందికి ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెస్సేజ్ వస్తోందని సిబ్బంది తెలిపారు. చదవండి: Petrol, diesel price today: కొనసాగుతున్న పెట్రో సెగ -
టోల్ గేట్ల వద్ద పసుపు గీతలు.. భారీగా క్యూ ఉంటే నో టోల్ ఫీజు..!
సాక్షి, హైదరాబాద్: పసుపు గీతలు.. టోల్గేట్ల వద్ద వాహనదారుల కష్టాల పరిష్కారానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తాజాగా ముందుకు తెచ్చిన ప్రతిపాదన. ఈ పసుపు గీతలు టోల్ గేట్ల వద్ద వాహనాలు క్యూ ఏర్పడకుండా చేస్తాయని సంస్థ చెబుతోంది. సాధారణ రోజుల్లో సమస్య లేకున్నా.. పండగలు, రద్దీ ఎక్కువగా ఉండే ఇతర రోజుల్లో టోల్ గేట్ల వద్ద పెద్దయెత్తున వాహనాలు బారులు తీరుతూ గేటు దాటడం విసుగుగా మారుతోంది. ఇటీవల పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన ఫాస్టాగ్ కూడా దీనికి పూర్తిస్థాయి పరిష్కారం చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్హెచ్ఏఐ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచి్చంది. ఈ మేరకు మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపింది. తెలంగాణ ఎన్హెచ్ఏఐ అధికారులు కూడా వీటిని అందుకున్నారు. కానీ దీని అమలు విషయంలో వారిలో కొంత అయోమయం నెలకొంది. ఫాస్టాగ్‌లో కోత పడదు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద గేట్లను ఆనుకుని వంద మీటర్ల దూరంలో పసుపు రంగులో జీబ్రాలైన్స్ తరహా గీతలు ఏర్పాటు చేస్తారు. గేటు వద్ద ఆగే క్రమంలో ఈ వంద మీటర్ల దూరంలో ఉండే పసుపు రంగు గీతలకు మించి వాహనాలు బారులు తీరితే ఈ కొత్త విధానం అమలవుతుంది. అలాంటి సమయంలో పసుపు గీతలు ఉండే వంద మీటర్ల లోపు ఉన్న వాహనాలన్నింటినీ ఒకేసారి గేటు ఎత్తి ముందుకు వదులుతారు. అది కూడా ఎలాంటి టోల్ రుసుము వసూలు చేయకుండానే. అంటే ఫాస్టాగ్ మొత్తంలో ఎలాంటి కోతా పడదన్న మాట. అలా ఎప్పుడు పసుపు గీతలకు మించి క్యూలు ఏర్పడినా వదిలేయడం వల్ల భారీ క్యూలు ఏర్పడవనేది ఎన్హెచ్ఏఐ ఉద్దేశం. అలా అయితే టోల్ గేటు ఎందుకు? ఈ విషయమై స్థానిక అధికారుల్లో పూర్తిస్థాయి స్పష్టత లేదు. పసుపు రంగు గీత దాటి వాహనాలు క్యూగా ఏర్పడితే.. ముందున్న వాటిని గేటు ఎత్తి పంపించేస్తారు..సరే. కానీ అవి వెళ్లిన వెంటనే మళ్లీ వెనక క్యూ ఏర్పడితే వాటినీ అలాగే పంపాలి. అలా రద్దీ ఉన్న సమయంలో వంద మీటర్ల మేర వాహనాల వరస ఏర్పడటం సాధారణమేనని అధికారులు అంటున్నారు. అలా పంపుతూ అన్ని వాహనాలూ వదిలేస్తే ఇక టోల్ గేటు ఎందుకనేది అధికారుల ప్రశ్న. దీంతో దీనిపై ఢిల్లీ అధికారుల నుంచి స్పష్టత తీసుకున్నాక ఈ విధానం అమలులోకి తేవాలని భావిస్తున్నారు. -
గుడ్ న్యూస్: అలా అయితే టోల్ గేట్ చార్జీలు కట్టక్కర్లేదు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ చార్జీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా ప్రయాణించేలా టోల్ ప్లాజా దగ్గర రద్దీ సమయంలో కూడా వాహనదారులకు 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టకుండా ఉండేలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. టోల్ ప్లాజాల నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న పసుపు గీత దాటి వాహనాలు వేచి ఉంటే అప్పుడు ఆ గీత ముందున్న వాహనాలు టోల్ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు. ఇలా లైన్ పొడవు 100 మీటర్ల లోపునకు వచ్చే వరకు ముందు వెహికల్స్ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు అని కేంద్రం తెలిపింది. టోల్ ప్లాజా ఆపరేటర్లలో జవాబుదారీతనం తేవడానికి, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఫాస్టాగ్స్ తప్పనిసరి రూల్స్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండానే వెంటనే వెళ్లిపోవచ్చు. టోల్ చార్జీలు ఫాస్టాగ్ నుంచి కట్ అవుతాయి. దీన్ని మళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దేశంలో రాబోయే 10 సంవత్సరాలలో పెరగబోయే వాహనాల సంఖ్యకు అనుగుణంగా రాబోయే టోల్ ప్లాజాల డిజైన్ చేపట్టాలని కేంద్రం తెలిపింది. చదవండి: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు -
ఆ కారులో ఉన్నది రెజ్లర్ సుశీల్ కుమారేనా?
లక్నో: రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలింపియన్.. రెజ్లర్ సుశీల్ కుమార్ కొంతకాలంగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న సుశీల్ ఆచూకీ చెప్పినవారికి రూ. లక్ష బహుమతి కూడా ప్రకటించారు. కాగా తాజాగా సుశీల్ కుమార్ కారులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ టోల్‌ప్లాజా వద్ద కారులో డ్రైవర్ పక్కన ముందుసీట్లో సుశీల్ కుమార్ ఉన్నట్లు అక్కడి కెమెరాల్లో రికార్డైంది. అయితే అతను మాస్క్ పెట్టుకోవడంతో సుశీల్ కుమార్ ..అవునా కాదా? అని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు మే 6న అక్కడి కెమెరాల్లో రికార్డు కావడం.. సాగర్ రాణా హత్య జరిగిన రెండు రోజులకు సుశీల్ కారులో ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో సుశీల్ ఉన్న కారును ట్రేస్ చేసే పనిలో ఉన్న పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా మే 4న ఛత్రశాల్ స్టేడియం ముందు రెండు వర్గాలు కొట్టుకున్న ఘటనలో జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా మరణించగా... సుశీల్‌పై ఆరోపణలు రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కాగా సుశీల్ కుమార్‌కు ఢిల్లీ కోర్టులోనూ చుక్కెదురైంది. రెండు వారాలుగా పరారీలో ఉన్న అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సోమవారం స్థానిక రోహిణి కోర్టులో సుశీల్ పిటిషన్ దాఖలు చేయగా... మంగళవారం అతని విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీశ్ కుమార్ కొట్టి పారేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా సుశీల్‌పై ఉన్న అభియోగాలు తీవ్రమైనవవి న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. చదవండి: రెజ్లర్ సుశీల్‌కు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ కొట్టివేత Sushil Kumar: ఆచూకీ చెబితే రూ.1 లక్ష! -
ఇక టోల్‌ప్లాజాలు తొలగిస్తాం!
న్యూ ఢిల్లీ: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. టోల్ ప్లాజాల స్థానంలో పూర్తి జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణను తీసుకొస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభలో నితిన్ గడ్కరీ “వెహికల్స్ స్క్రాపింగ్ పాలసీ”పై ఒక ప్రకటన చేశారు. "ఒక సంవత్సరంలో దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు తొలగిస్తామని సభా వేదికగా హామీ ఇస్తున్నా. అంటే ఇకపై జీపీఎప్ ఆధారంగా టోల్ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం’’ అని గడ్కరీ వివరించారు. ప్రస్తుతం 93 శాతం వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించి టోల్ చెల్లిస్తున్నారు, మిగిలిన 7 శాతం మంది రెట్టింపు టోల్ చెల్లిస్తున్నప్పటికీ ఇంకా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోలేదని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్యాగ్స్ ఉపయోగించి టోల్ చెల్లించని వాహనాల కోసం పోలీసు విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. వాహనాల్లో ఫాస్ట్‌ట్యాగ్‌లు అమర్చకపోతే టోల్ దొంగతనం, జీఎస్టీ ఎగవేత కేసులు పెట్టనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపు రుసుమును సులభతరం చేసేందుకు ఫాస్ట్ ట్యాగ్స్ వ్యవస్థను దేశంలో మొదటి సారిగా 2016లో ప్రవేశపెట్టారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి వాహనాలకు దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఒకవేల ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే టోల్ ప్లాజాలలో రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వాహనాల్లో ఫాస్ట్యాగ్లు అమర్చినట్లు గడ్కరీ చెప్పారు. పాత వాహనాలకు ఉచిత ఫాస్ట్యాగ్లను ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. చదవండి: 2020లోనూ స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు -
పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు తీపికబురు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ లేకుండా ఏ జాతీయ లేదా రాష్ట్ర రహదారిపై వాహనాలను అనుమతించడం లేదు. ఒకవేళ ఫాస్టాగ్ లేకుండా ప్రయాణించాల్సి వస్తే టోల్ ప్లాజా వద్ద రెట్టింపు జరిమానా వసూలు చేస్తున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫాస్టాగ్ లేని కారణంగా రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులలో వాహనదారులు పేర్కొన్నారు. ఫాస్టాగ్ లేని వారి భాద ఈ విదంగా ఉంటే, ఫాస్టాగ్ తీసుకున్న వారి భాద మరో విదంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పలు బ్యాంకులు, మొబైల్ యాప్‌ల నుంచి ఫాస్టాగ్ కొనుగోలుచేయడానికి అవకాశం కల్పించింది. ఫాస్టాగ్ తీసుకున్నవారు టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖాతా నుంచి కట్ అయ్యినట్లు పిర్యాదు చేస్తున్నారు. ఇందులో పేటీఎం నుంచి ఫాస్టాగ్ తీసుకున్న వారు కూడా ఉన్నారు. పేటీఎం తన ఫాస్టాగ్ యూజర్లకు శుభవార్త తెలిపింది. మీ ఫాస్టాగ్ ఖాతా నుంచి అకారణంగా లేదా ఎక్కువ డబ్బు కట్ అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాటిని తిరిగి చెల్లిస్తుంది అని పేర్కొంది. ఇప్పటికే 2.6 లక్షల (82 శాతం)కు పైగా వినియోగదారులకు కట్ అయిన నగదును వారికీ తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. టోల్ ప్లాజాల నుంచి వస్తున్న ఫిర్యాదులు సహా ఇతరుల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా తమ వినియోగదారులకు సహాయం అందించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సతీష్ గుప్తా తెలిపారు. చదవండి: క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు! ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ -
ఇక రాష్ట్ర రహదారులపై ఫాస్టాగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రహదారులపై కూడా ఫాస్టాగ్ అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారులు, ఔటర్ రింగురోడ్డుపై మాత్రమే ఫాస్టాగ్‌తో నగదు రహిత చెల్లింపు విధానం అమలవుతోంది. గత 15వ తేదీ నుంచి అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలలో అన్ని గేట్లను పూర్తిగా ఫాస్టాగ్‌తో అనుసంధానించిన విషయం తెలిసిందే. గతేడాదిలోనే ఒక గేట్ మినహా మిగతావి ఫాస్టాగ్ పరిధిలోకి వచ్చాయి. కానీ, రాష్ట్ర రహదారులపై మాత్రం ఇంకా నగదు చెల్లింపు విధానం కొనసాగుతోంది. ఇక మార్చి ఒకటో తేదీ నుంచి హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై ఇది అమలులోకి రానుంది. ప్రస్తుతానికి ఒక రహదారిపైనే.. రాష్ట్రంలో టోల్‌ప్లాజాలున్న రాష్ట్ర రహదారులు రెండు. మొదటిది హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారి కాగా, రెండోది నార్కెట్‌పల్లి-అద్దంకి (పాత ఎన్‌హెచ్-5) రోడ్డు. ఇందులో రాజీవ్ రహదారిపై దుద్దెడ, రేణికుంట, బసంత్‌నగర్‌ల వద్ద మూడు ప్లాజాలున్నాయి. ఈ మూడింటినీ ఒకే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. వీటిల్లో ఫాస్టాగ్ విధానాన్ని మార్చి ఒకటి నుంచి అమలులోకి తేవాలని భావిస్తున్నారు. నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై మూడు టోల్ప్లాజాలున్నాయి. ఇందులో మాడుగులపల్లి వద్ద ఉన్న ప్లాజా తెలంగాణలో ఉండగా, మిగతా రెండు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నాయి. మాడుగులపల్లి టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ వ్యవస్థ ఏర్పాటైంది. కానీ, మిగతా రెండుచోట్ల కాలేదు. ఈ మూడు ప్లాజాలు కూడా ఒకే కాంట్రాక్టర్ పరిధిలో ఉన్నాయి. దీంతో మూడింటిని ఒకేసారి ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నార్కెట్‌పల్లి-అద్దంకి రోడ్డుపై మాత్రం మార్చి చివరికిగానీ, ఏప్రిల్ మొదటి వారంలోగాని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. సిస్టం ఏర్పాటుపై స్పష్టత లేక.. రాష్ట్ర రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌కు సంబంధించిన సెన్సార్లు, ఇతర ఆటోమేటిక్ వ్యవస్థ, దాని సాఫ్ట్వేర్ కొనుగోలు ఖర్చు విషయంలో ప్రభుత్వానికి-కాంట్రాక్టర్లకు మధ్య స్పష్టత రాలేదు. ఈ రోడ్ల ఒప్పందాలు 2010లో జరిగాయి. అప్పటికీ ఫాస్టాగ్ విధానంపై అవగాహన కూడా లేదు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏర్పాటుకు ఒక్కోప్లాజా వద్ద దాదాపు రూ.70 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం ఏర్పాటు చేసిన నోడల్ ఏజెన్సీ రూ.20 లక్షలకు మాత్రమే రీయింబర్స్ చేస్తోంది. మిగతా ఖర్చును కాంట్రాక్టర్ భరించాల్సి ఉంది. కానీ.. మొత్తం ఖర్చును రీయింబర్స్ చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌పై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు, ముందైతే ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించటంతో ప్రస్తుతానికి కాంట్రాక్టరే వ్యయాన్ని భరిస్తున్నారు. ట్యాగ్ లేకుంటే రెట్టింపు ఫీజు ఫాస్టాగ్ లేకుండా టోల్‌గేట్‌లోకి వస్తే రెట్టింపు రుసుము చెల్లించే పద్ధతి ప్రస్తుతం జాతీయ రహదారులపై అమలవుతోంది. ఇదే పద్ధతి ఇక రాష్ట్ర రహదారులపై (ఫాస్టాగ్ ప్రారంభం అయినప్పటి నుంచి) అమలులోకి రానుంది. ప్రస్తుతానికి రహదారులపై 75 వాహనాలకు మాత్రమే ట్యాగ్ ఉంటోంది. మిగతావారు అప్పటికప్పుడు ట్యాగ్ కొనటమో, రెట్టింపు ఫీజు చెల్లించి వెళ్లటమో చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోడ్లమీద దూసుకుపోయే వాహనదారులు కూడా అప్రమత్తం కావాల్సిందే. ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉన్న వాహనాల కోసం ఒక అత్యవసర మార్గం తప్ప మిగతావాటిల్లో కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాల్సిందే. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు వాట్సాప్‌కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్ -
వాహనదారులకు కేంద్రం తీపికబురు
మీకు కారు కానీ ఏదైనా భారీ వాహనం కలిగి ఉన్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. ఉచితంగానే ఫాస్టాగ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2021 మార్చి 1 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 770 టోల్ ప్లాజాలలో (స్టేట్ ప్లాజాతో సహా) ఉచితంగానే ఫాస్టాగ్ పొందవచ్చు అని ఎన్హెచ్ఏఐ తెలిపింది. దీనితో వాహనదారులకు రూ.100 ఆదా కానుంది. జాతీయ రహదారులపై నడిచే వాహనాల యూజర్ల ఫాస్టాగ్ వినియోగించడాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం, ఫాస్టాగ్ ను 87 శాతం మంది వినియోగదారులు వాడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఫాస్టాగ్ వినియోగం 7 శాతం పెరిగింది. ఇక దేశంలో 100 టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ వినియోగించే వారి సంఖ్య 90శాతం చేరుకుంది. ఒక్కరోజులోనే ఫాస్టాగ్ ద్వారా 63 లక్షల లావాదేవీలతో రూ.100 కోట్ల టోల్ వసూలు చేశారు. టోల్ ప్లాజా దగ్గర ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ఫాస్టాగ్‌లలో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించకుండా వినియోగదారులు టోల్ ప్లాజాలు దాటవచ్చు అని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో 2.5 లక్షలకు పైగా ట్యాగ్ల అమ్మకాలు జరిగాయని ఎన్హెచ్ఏఐ పేర్కొంది. ప్రతి వాహనదారుడి దగ్గర ఫాస్టాగ్ తప్పక ఉండాల్సిందే. లేదంటే భారీ జరిమానా పడుతుంది. చదవండి: వాట్సాప్‌కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్ -
ఫాస్టాగ్ తప్పనిసరి.. లేదంటే టోల్ ఫీజు రెట్టింపు!!
న్యూఢిల్లీ: టోల్ గేట్ల దగ్గర రద్దీని తగ్గించే దిశగా వాహనాలకు ఫాస్టాగ్‌లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. ట్యాగ్ లేని వాహనాలకు టోల్ ఫీజు భారం రెట్టింపు కానుంది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ (ఎన్హెచ్ఏఐ) ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లోని అన్ని లేన్లను ఫిబ్రవరి 15/16 అర్ధరాత్రి నుంచి ’ఫాస్టాగ్ లేన్లు’గా మారతాయని పేర్కొంది. ‘నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ లేని వాహనాలు, చెల్లుబాటు కాని ఫాస్టాగ్ ఉన్న వాహనాలు గానీ ఫాస్టాగ్ లేన్‌లోకి వచ్చిన పక్షంలో రెట్టింపు ఫీజు వర్తిస్తుంది‘ అని ఎన్హెచ్ఏఐ వివరించింది. డిజిటల్ విధానం ద్వారా టోల్ ఫీజుల చెల్లింపును ప్రోత్సహించేందుకు, ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయాన్ని, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కొత్త నిబంధనలు తోడ్పడగలవని తెలిపింది. 2016లో తొలిసారిగా ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుంచి నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలు, గూడ్స్ వాహనాలకు ఫాస్టాగ్ అమర్చడాన్ని తప్పనిసరి చేసింది. ఆ తర్వాత డెడ్‌లైన్‌ను ఫిబ్రవరి 15 దాకా పొడిగించింది. ఇక డెడ్‌లైన్ పొడిగించేది లేదు: మంత్రి గడ్కరీ ఫాస్టాగ్ అమలుకు సంబంధించిన డెడ్‌లైన్‌ను మరింత పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. గడువును ఇప్పటికే రెండు, మూడు సార్లు పొడిగించామని పేర్కొన్నారు. వాహనదారులు ఇకపై తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందేనన్నారు. కొన్ని రూట్లలో ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ 90 శాతం దాకా ఉంటోందని, తీసుకోని వారి సంఖ్య కేవలం పది శాతమే ఉండొచ్చని మంత్రి చెప్పారు. టోల్ ప్లాజాల దగ్గర కూడా ఇది అందుబాటులో ఉంటుందని వివరించారు. -
రేపటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి.. లేదంటే బాదుడే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రేపటి (ఫిబ్రవరి 15) నుంచి ఫాస్టాగ్ తప్పనిసరిగా అమల్లోకి రానుంది. వాహనాలకు ఫాస్టాగ్ ఉంటేనే హైవేలపైకి ఎక్కాలి, లేదంటే రెట్టింపు టోల్ బాదుడు భరించాల్సివుంటుంది. ఇప్పటికే పలుమార్లు ఫాస్టాగ్ తప్పనిసరి వినియోగాన్ని వాయిదా వేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సోమవారం నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఫాస్టాగ్ వినియోగంతో హైవేలపై టోల్ ప్లాజాల దగ్గర సమయం వృథా అయ్యే అవకాశం ఉండదు. వాహనాలకు ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. దీనికోసం వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను అందుబాటులో ఉంచుకోవల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ఖరీదు వాహనంపై ఆధారపడి ఉంటుంది. ఇక ఫాస్టాగ్ రీఛార్జ్‌ను ఆన్లైన్ లేదా టోల్‌ప్లాజాల వద్ద చేయించుకోవచ్చు. -
గుర్తుందా.. 15 తర్వాత ఫాస్టాగ్ లేకుంటే..
హైదరాబాద్: టోల్గేట్ల వద్ద నగదు రహిత టోల్ ఫీజు చెల్లింపులకు ప్రవేశపెట్టిన విధానం ‘ఫాస్టాగ్’. వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు ప్రవేశపెట్టిన విధానం ఈనెల 15వ తేదీ నుంచి పక్కాగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీ వాహనాలు ఫాస్టాగ్ విధానంలోకి మార్చుకోకపోతే ఇక టోల్‌ద్ట్లు దాటలేవు. దానికి ఇంకా వారం రోజులే గడువు ఉండడంతో ప్రభుత్వ అధికారులు అవగాహన కార్యక్రమాలు పెంచారు. దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్రం ప్రభుత్వం 2017లో ‘ఫాస్టాగ్’ విధానం తీసుకొచ్చింది. అప్పటి నుంచి అమలు చేస్తున్న ఈ విధానం గడువు పొడగిస్తూనే వస్తున్నారు. ఇక ఫిబ్రవరి 15 చివరి గడువు అని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత ‘ఫాస్టాగ్’ లేకపోతే వాహనం టోల్గేట్ దాటదని అధికారులు చెబుతున్నారు. టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ తగ్గించడంతో నగదు రహిత చెల్లింపుల ప్రోత్సాహానికి ఈ ఫాస్టాగ్ దోహదం చేస్తుంది. ఫిబ్రవరి 15 డెడ్ లైన్ ఆఖరు అని తేల్చి చెప్పింది. ఫాస్టాగ్ లేకపోతే జాతీయ రహదారులపై మీ కార్లు, లారీలు తదితర వాహనాలు అనుమతించరు. అయితే ఫాస్టాగ్ చేసుకునేందుకు కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా 720 టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు చేయించుకోకపోతే వెళ్లి ఫాస్టాగ్ చేసుకోండి. -
దివ్యాంగులకు గుడ్‌న్యూస్: నో టోల్ ఫీజు
న్యూఢిల్లీ: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఫీజు చెల్లించనవసరం లేదని ప్రకటించింది. ఈ మేరకు గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో దివ్యాంగులకు టోల్ ఫీజు మినహాయింపు కల్పిస్తున్నారా అని బీజేపీ ఎంపీ రమేశ్ బిదురీ ప్రశ్నించారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ.. ఇకపై దివ్యాంగులకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్‌ను ఎత్తివేసినట్లు ఈ సందర్భంగా గడ్కరీ గుర్తు చేశారు. యూజర్ ఫ్రెండ్లీ ఉండే రీతిలో దివ్యాంగులకు వాహనాలను డిజైన్ చేయాలంటూ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
పల్లెకు పోదాం.. చలోచలో
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్/కేతేపల్లి: సంక్రాంతి ప్రయాణాలతో మంగళవారం కూడా రహదారులపై రద్దీ నెలకొంది. నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు తరలి వెళ్లారు. విజయవాడ, విశాఖ, కాకినాడ, ఏలూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో భారీగా రద్దీ కనిపించింది. మరోవైపు తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జూబ్లీ బస్‌స్టేషన్, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలు పోటెత్తాయి. వివిధ మార్గాల్లో బస్సులు కిక్కిరిసి బయలుదేరాయి. ఇక రైళ్లలో జనరల్ బోగీల్లో అప్పటికప్పుడు టికెట్ తీసుకొనే సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న వారు టికెట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. గోదావరి, విశాఖ, ఇంటర్సిటీ, నర్సాపూర్, మచిలీపట్నం తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు 350 దాటిపోయింది. చాలా రైళ్లలో ‘నోరూమ్’దర్శనమివ్వడంతో చివరి నిమిషంవరకు ఎదురు చూసిన వాళ్లు గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించవల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో సాధారణ చార్జీలపైన 50 శాతం అదనంగా, ప్రైవేట్ ట్రావెల్స్‌ల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేశాయి. కొన్ని సంస్థలు రెండు రెట్లు పెంచాయి. భోగి వేడుకలకు మిగిలింది ఒక్కరోజే కావడంతో చార్జీలు భారమైనా చాలా మంది సొంతూళ్లకు బయలుదేరారు. మరోవైపు సొంత వాహనాల్లో సైతం భారీ ఎత్తున తరలి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేవారు ఎక్కువ శాతం సొంత కార్లు, క్యాబ్‌లను ఆశ్రయించారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సుమారు 15 లక్షల మంది నగర వాసులు సొంతూళ్లకు తరలి వెళ్లినట్లు అంచనా. జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ.. పండుగకు సొంతూళ్లకు వేళ్లే వారితో హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద మంగళవారం రాత్రి రద్దీ నెలకొంది. పంతంగి వద్ద 16 గేట్లకు గాను విజయవాడ మార్గంలో పది గేట్లు తెరిచారు. సాయంత్రం వరకు టోల్‌ప్లాజా వద్ద సాధారణంగా ఉన్న రద్దీ రాత్రి ఒక్కసారిగా పెరిగింది. సాధారణ రోజుల కంటే పండుగ సమయాల్లో 10 నుంచి 15 వేలకు పైగా వాహనాలు అదనంగా వెళ్తాయని టోల్‌ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. -
సబ్ కలెక్టర్‌కే నకిలీ టోల్ రశీదు!
నకిలీ రశీదులతో టోల్గేట్ రుసుం వసూలు చేస్తూ మోసం చేస్తున్న వీఆర్ఏల ఉదంతాన్ని మదనపల్లె సబ్‌కలెక్టర్ ఎం.జాహ్నవి గుట్టురట్టు చేశారు. సాధారణ పర్యాటకురాలిగా హార్సిలీహిల్స్ వెళ్లారు. రూ.25 చెల్లించి తీసుకొన్న రశీదుపై సబ్‌కలెక్టర్ అధికారిక సంతకం, సీలు లేకపోవడంతో ఆరా తీస్తే నకిలీదని తేలింది. ఫలితంగా ఇద్దరు వీఆర్ఏలను సస్పెండ్ చేశారు. సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు): మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పైకి వెళ్లే వాహనాల నుంచి రుసుం వసూలుచేసే బాధ్యతను కోటావూరు పంచాయతీకి చెందిన వీఆర్ఏలు ఎస్.వెంకటరమణ, ఎస్.మస్తాన్‌సాబ్‌కు అప్పగించారు. వీరు పదేళ్లకు పైగా రుసుం వసూలు చేస్తూ ఈ విధులకే పరిమితం అయ్యారు. ఈ వసూళ్లపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ చైర్మన్ అయిన మదనపల్లె సబ్‌కలెక్టర్ ఎం.జాహ్నవి గత నెల 29, 30 తేదీల్లో సాధారణ పర్యాటకురాలిగా కొండకు కారులో వెళ్తుండగా వీఆర్ఏలు టోల్‌గేటుగా రెండు సార్లు రెండు రశీదులు ఇచ్చి రూ.50 తీసుకొన్నారు. వీరు ఇచ్చిన రశీదుల నంబర్లు 9281, 8137. అయితే ప్రస్తుతం రుసుం వసూళ్లకు కేటాయించిన అధికారిక రసీదు పుస్తకాల్లోని సీరియల్ నంబర్లు 12,500, 13,200గా ఉన్నాయి. దీంతో ఈ అసలు నంబర్లకు సంబంధం లేని నకిలీ రశీదు పుస్తకాలను తయారు చేసి నగదు వసూలు చేస్తూ, సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జమ చేయకుండా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బి.కొత్తకోట తహసీల్దార్ నిర్మలాదేవిని సబ్‌కలెక్టర్ ఆదేశించారు. దీంతో వీఆర్ఏలు ఎస్.వెంకటరమణ, ఎస్.మస్తాన్‌వలీని సస్పెండ్ చేస్తూ బుధవారం తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కరోజులో రూ.1,700 బుధవారం టోల్‌గేటు వసూలుకు ఇద్దరు వీఆర్ఏలను కొత్తగా నియమించగా ఊహించని విధంగా రూ.1,700 వసూలు కావడం చూసి రెవెన్యూ అధికారులే ఆశ్చర్యపోయారు. సాధారణ రోజుల్లో ఈ స్థాయిలో టోల్ వసూలైనట్టు గత పదేళ్లలో ఎన్నడూ చూపలేదని స్పష్టమైంది. దీన్నిబట్టి చూస్తే తీవ్ర రద్దీగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు కనీసం రూ.5వేలు తగ్గకుండా వసూలు కావాలి. ఏడాదికి కనీసం రూ.7లక్షలు వసూలవ్వాలి. ఈ స్థాయిలో నగదు జమ అయ్యిందా లేదా అన్నది పరిశీలిస్తే ఏ మేరకు నకిలీ రశీదులతో దోచుకున్నారో తేలుతుంది. వసూళ్ల జమపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. స్వయంగా సబ్ కలెక్టరే నిజాలు నిగ్గుతేల్చడంతో వీఆర్ఏల వ్యవహారానికి చెక్‌పడింది. 11న వేలం పాట హార్సిలీహిల్స్‌పైకి వెళ్లే వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు అవకతవకల నేపథ్యలో ఈ కాంట్రాక్ట్‌ను ప్రయివేటుకు అప్పగించేందుకు సబ్ కలెక్టర్ జాహ్నవి నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 11న వేలం పాట నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పాటదారులు రూ.500 చెల్లించి పాల్గొనవచ్చని తెలిపారు. -
‘టోల్’కు టోకరా!
సాక్షి, కామారెడ్డి:జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులు నిరీక్షించే బాధ నుంచి విముక్తికి ఏర్పాటు చేసిన ఫాస్టాగ్‌ను కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కంటెయినర్లు, భారీ వాహనాలకు టోల్ ట్యాక్స్ భారీగా వసూలు చేస్తుండటంతో ఫాస్టాగ్ తీసుకునేటప్పుడు తమ వాహనాన్ని మినీ వెహికల్‌గా నమోదు చేసుకుని తక్కువ పన్ను చెల్లించి దర్జాగా దౌడు తీస్తున్నారు. ఇటీవల 44వ నంబర్ జాతీయ రహదారిపై ఓ టోల్‌ప్లాజా వద్ద ఓ ట్రాన్స్‌పోర్టు కంటెయినర్ ఫాస్టాగ్ స్కానింగ్ సందర్భంలో మాన్యువల్ స్కానింగ్ చేస్తున్న అక్కడి సిబ్బంది అనుమానించారు. కంటెయినర్‌కు రూ.255 ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా, వ్యాన్ పేరు మీద ఉన్న ట్యాగ్ ద్వారా రూ.75 చెల్లించినట్టు గుర్తించి కంటెయినర్‌ను నిలిపేశారు. దీంతో వాహన యజమానులు టోల్ ప్లాజా సిబ్బందితో మాట్లాడి వాహనాన్ని తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోందా..? టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలోనే ఆలస్యం లేకుండా క్షణాల్లో వాహనాలు వెళ్లేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆయా టోల్‌ప్లాజాల దగ్గర ‘ఫాస్టాగ్’సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో ఫాస్టాగ్ అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారులపై 21 టోల్ ప్లాజాలున్నాయి. అయితే కొన్నిచోట్ల పూర్తి స్థాయి పనులు పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి 15 వరకు సడలించారు. ఈ నేపథ్యంలోనే కొన్నిచోట్ల మాన్యువల్‌గా స్కానర్లను వాడుతున్నారు. వాహనం రాగానే అక్కడ పనిచేసే సిబ్బంది స్కానింగ్ యంత్రాన్ని చేతిలో పట్టుకుని వెళ్లి ట్యాగ్‌ను స్కాన్ చేస్తారు. అప్పుడు వాహనం ముందుకు కదులుతుంది. అయితే ట్యాగ్ తీసుకునే సమయంలో భారీ వాహనాలకు సంబంధించి మినీ వాహనాల పేరుతో ట్యాగ్ అమర్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. నిత్యం వివిధ రూట్లలో తిరిగే భారీ లారీలు, కంటెయినర్లు, ఇతర వాహనాలు భారీ పన్నుల నుంచి తప్పించుకునేందుకు తప్పుడు పద్ధతులకు ఎగబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ అక్రమ దందా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా జాతీయ రహదారిపై రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు నిత్యం వెళ్లే భారీ వాహనాల యజమానులు చాలా మంది ఈ ట్రిక్కును వాడుతూ టోల్‌కు టోకరా వేస్తున్నారు. టోల్ ఆదాయానికి గండి.. ఫాస్టాగ్ పద్ధతిని కూడా కొందరు తమకు అనుకూలంగా మలచుకోవడం ద్వారా టోల్ నిర్వహణ సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. వివిధ ట్రాన్స్‌పోర్టు సంస్థలకు సంబంధించిన వాహనాలు చాలా వరకు ఇదే పద్ధతిని అవలంభిస్తూ టోల్ ట్యాక్స్ తక్కువ చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. సాధారణంగా వాహనదారులకు నిర్దేశించిన ప్రకారం ట్యాక్స్ వసూలు చేసే నిర్వహణ సంస్థలు ఇలాంటి వాటిపై దృష్టి సారించాలి. వచ్చే ఫిబ్రవరి 15 నుంచి పూర్తి స్థాయిలో ఫాస్టాగ్ అమలు కానున్న నేపథ్యంలో వాహనాలు, ట్యాగ్‌లకు ఉన్న తేడాలను నిశితంగా పరిశీలించాలి. అప్పుడే ఇలాంటివి బయటపడతాయని సూచిస్తున్నారు. -
చిలకపాలెం టోల్‌ప్లాజాలో అగ్ని ప్రమాదం
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలో 16వ నంబరు జాతీయ రహదారిపై చిలకపాలెం టోల్‌ప్లాజాలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా టోల్‌ప్లాజాను అల్లినగరం ప్రాంతానికి తాత్కాలికంగా తరలించారు. ఈ నేపథ్యంలో టోల్‌ప్లాజా నిర్మాణాలు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ కట్టర్ నుంచి నిప్పురవ్వలు రాజుకుని ఫైబర్ కప్పునకు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో హైవే పనులు చేస్తున్న అప్కో కాంట్రాక్టు సిబ్బంది వాటర్ ట్రాక్టర్లతో ప్రొక్లెయిన్ సహాయంతో మంటలార్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక స్టేషన్ సిబ్బంది చేరుకుని పూర్తిగా మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మరోవైపు ట్రాఫిక్ ఏర్పడకుండా అప్కో కాంట్రాక్టు వర్కర్లు వాహనాలను దారి మరలించారు. ఒకే రోడ్డుపై రాకపోకలు సాగటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. -
ఫాస్టాగ్ యూజర్లు 57 శాతమే!
సాక్షి, అమరావతి: ఏపీలో ప్రస్తుతం ఫాస్టాగ్ యూజర్లు 57 శాతం వరకు ఉన్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అంచనా వేస్తోంది. టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ లైన్ ద్వారా ప్రస్తుతం 50 నుంచి 57 శాతం వాహనాలు మాత్రమే వెళుతున్నట్టు లెక్కగట్టింది. ఈ నెలాఖరు నాటికి 90 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉండేలా.. టోల్గేట్ల వద్ద ప్రత్యేకంగా ఫాస్టాగ్ స్టిక్కర్లను విక్రయించే కౌంటర్లు ఏర్పాటు చేసింది. జనవరి 1 నుంచి అన్ని టోల్గేట్లలో ఫాస్టాగ్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి నుంచి నగదు చెల్లించే లైన్లను తొలగించాలంటూ టోల్ ప్లాజాల నిర్వాహకులకు ఆదేశాలందాయి. ఏ వాహనమైనా ఫాస్టాగ్ లేకుండా టోల్గేట్ల వద్దకు వస్తే.. వెనక్కి పంపిస్తారు. మొండికేసి ముందుకు వెళ్దామంటే రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు. మరోవైపు ఫాస్టాగ్ ఉంటేనే రవాణా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని రవాణా శాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది. ఫాస్టాగ్ అంటే.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ)తో కూడిన స్టిక్కర్‌ను ఫాస్టాగ్ అంటారు. 2014లోనే ఫాస్టాగ్ విధానాన్ని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అమల్లోకి తెచ్చింది. వాహనాలకు అతికించి ఉండే ఈ స్టిక్కర్‌పై గల బార్‌కోడ్‌ను టోల్‌ప్లాజాలోని ఆర్ఎఫ్ ఐడీ యంత్రం రీడ్ చేస్తుంది. వాహనం టోల్ ప్లాజా దాటుతున్నప్పుడు టోల్ ఫీజును సం బంధిత వాహన యజమాని ఫాస్టాగ్‌కు రీచార్జి చేయించుకున్న మొత్తం నుంచి ఆటోమేటిక్‌గా మినహాయించుకుంటుంది. బ్యాంక్ ఖాతాతో అనుసంధానించిన ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న ‘వన్ నేషన్.. వన్ ట్యాగ్’ కింద అన్ని టోల్గేట్లలో ఫాస్టాగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నారు. కనీసం రూ.వందతో ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ పొందవచ్చు. రాష్ట్ర రహదారులపైనా.. స్టేట్ హైవేస్‌పై ఉన్న టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ అధికారులతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. టోల్గేట్లలో ఆర్ఎఫ్ ఐడీ యంత్రాలు పెట్టేందుకు అయ్యే ఖర్చులో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ భరిస్తుంది. ఇవీ ఉపయోగాలు ► ఇంధనం, టోల్గేట్ల వద్ద వేచి ఉండే సమయం ఆదా అవుతాయి. ► పొల్యూషన్ తగ్గుతుంది. ట్రాఫిక్ సమస్యలుండవు. ► ఫాస్టాగ్ ఉన్న వాహనం చోరీ అయితే.. ఆ వాహనం టోల్‌ప్లాజా దాటితే ఎక్కడ దాటిందో.. ఏ సమయంలో దాటిందో ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. వాహనాన్ని కనిపెట్టే ఆస్కారం కలుగుతుంది. ► టోల్ ఫీజుల వసూళ్లు క్యాష్‌లెస్ విధానంలో సాగటం వల్ల వాహనదారునికీ ఇబ్బందులు తప్పుతాయి. -
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు అస్వస్థత
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ శుక్రవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. గంట తరువాత కోలుకుని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు. తాను ప్రాతి నిథ్యం వహిస్తున్న కొలత్తూరులో సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. తుపాన్, భారీ వర్షాలకు నష్టపోయిన వారికి స్టాలిన్ సహాయకాలు పంచి పెడుతుండగా అకస్మాత్తుగా మైకం వచ్చి పడిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బీపీ ఎక్కువైనందున మైకం కమ్మిందని వైద్యులు తెలిపారు. ప్రా«థమిక చికిత్స అనంతరం కొద్దిసేపటి తరువాత కోలుకున్నారు. అక్కడి నుంచి కుటుంబవైద్యులతో పోరూరులోని శ్రీరామచంద్ర ఆస్పత్రికి వెళ్లారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మీడియా ద్వారా స్టాలిన్ పార్టీ శ్రేణులకు తెలిపారు. డీఎంకే ఆందోళన: చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న టోల్గేట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ డీఎంకే శ్రేణులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. చెన్నై షోళింగనల్లూరులో నిరసన సభ నిర్వహించారు. చెన్నై కార్పొరేషన్ సరిహద్దులో పది కిలోమీటర్ల తరువాత మాత్రమే టోల్గేట్లు ఉండాలని చట్టం ఉంది. కేంద్రప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం షోళింగనల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పెరుంగుడి, తరైపాక్కం 200 అడుగుల రోడ్డు, షోళింగనల్లూరులోని కరుణానిధిరోడ్డు ప్రాంతాల్లో టోల్గేట్లను నిర్వహిస్తున్నట్లు డీఎంకే ఆరోపిస్తోంది. టోల్గేట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ డీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనేతలు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఇదే డిమాండ్‌పై శుక్రవారం ఉదయం 10 గంటలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో కలిసి షోళింగనల్లూరులో ఆందోళనకు దిగారు. -
ఎమ్యెల్యే అనుచరులపై టోల్ సిబ్బంది దాడి
జైపూర్ : రాజస్తాన్‌లొని శ్రీగంగనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే జంగిడ్ గన్‌మెన్, డ్రైవర్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే వాహనం టోల్‌గేటును దాటుతుండగా సడెన్‌గా బారికేడ్ పెట్టడంతో గొడవ రాజుకుంది. ఇరు వర్గాలు మాట్లాడుతుండగానే డ్రైవర్, గన్మెన్లపై టోల్ సిబ్బంది దాడికి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఓ ప్రజాపతినిథి వద్దే ఇంత దురుసుగా ఉంటే ఇక సాధారణ ప్రజలతో ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చు అని ఎమ్మెల్యే జంగిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ ఉద్యోగులను గుండాలుగా అభివర్ణించిన ఆయన..చుట్టుపక్కల ప్రజలు జోక్యం చేసుకోకపోతే ఇంకా పెద్ద గొడవ జరిగి ఉండేదని, తనపై కూడా దాడి జరిగే అవకాశం ఉండేదని తెలిపారు. (బెంగాల్‌ను గుజరాత్‌గా ఎందుకు మారుస్తారు: మమతా బెనర్జీ ) ఈ ఘటనకు పాల్పడినవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, టోల్‌ప్లాజా నడుపుతున్న సంస్థ లైసెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు టోల్‌ప్లాజాకు చెందిన ఐదుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో , కాంగ్రెస్ ఎమ్మెల్యేకే ఇలాంటి చేదు అనుభవం చోటుచేసుకోవడంతో శాంతి భద్రతల పరిస్థితి ఎంటన్న సందేహం వ్యక్తమవుతుందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. -
అలర్ట్.. జనవరి నుంచి ఇది మస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫాస్టాగ్ అమల్లోకి రానుంది. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా అన్ని రకాల ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు కూడా తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందే. 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. రవాణా వాహనాలకు ఫాస్టాగ్ పునరుద్దరించిన తర్వాతే ఫిట్మెంట్ సర్టిఫికెట్ జారీ చేయడం తప్పనిసరి అని చేసినట్లు తెలిపింది. కాబట్టి ఇకపై ప్రతి నాలుగు చక్రాల వాహనం ఫాస్టాగ్ చేయించుకోవాల్సిందే. టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం 2017 నుంచి అమలు చేస్తోంది. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమలును తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజా ఉత్తర్వులతో వచ్చే ఏడాది నుంచి అన్ని రకాల ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరైంది. -
పాత వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ : టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లించే విధానాన్ని త్వరలోనే పూర్తిగా నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా 2017 డిసెంబర్ 1కి ముందు విక్రయించిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫాస్టాగ్ మొదలైన తర్వాత కూడా ఇంకా 40 శాతం మంది వాహనదారులు టోల్ ఫీజును నగదు రూపంలో చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2021 జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు సెంట్రల్ మోటర్ వెహికల్స్ నిబంధనలకు రహదారి రవాణా శాఖ సవరణలు ప్రతిపాదించింది. సంబంధిత వర్గాల అభిప్రాయాలను కోరుతూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. (ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్) -
రేపటి నుంచి టోల్ వడ్డన
సాక్షి, చెన్నై: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని టోల్గేట్లలో చార్జీల వడ్డనకు చర్యలు చేపట్టారు. అయితే, వాహనదారులు, లారీ యజమానులు ఈ వడ్డనను వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో 48 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్గేట్లు వాహనాలు దాటాలంటే, రుసుం చెల్లించాల్సిందే. ఈ టోల్గేట్లలో ఆరు నెలలకు ఓ సారి చార్జీల పెంపు ప్రక్రియ మొదటి నుంచి అమల్లో ఉంది. ఆ దిశగా ఆరు నెలల క్రితం 20 టోల్గేట్లలో ఐదు నుంచి పది శాతం మేరకు టోల్ వడ్డన సాగింది. దీనిని వాహన యజమాన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించే పనిలో పడ్డాయి. ఈ సమయంలో కరోనా లాక్డౌన్ అమలు కావడంతో రవాణా ఆగింది. ఆ తర్వాత సరకు రవాణా సాగడంతో టోల్ వసూళ్లను రద్దు చేశారు. క్రమంగా ఆంక్షల సడలింపులు, వాహనాలు రోడ్డెక్కడంతో మళ్లీ టోల్ వసూళ్లు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో మిగిలిన 28 టోల్గేట్లలో ఐదు నుంచి పది శాతం మేరకు టోల్ పెంపునకు చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందన్న ప్రకటన ఆదివారం వెలువడింది. ఆ మేరకు ఒక్కో టోల్ గేట్లో వాహనదారులు ఇదివరకు చెల్లిస్తున్న మొత్తం కంటే అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు చెల్లించాల్సిన పరిస్థితి. అసలే కరోనా లాక్డౌన్ పుణ్యమా ఆర్థిక ఇబ్బందులు, కష్టాల్లో ఉన్న వాహనదారులకు ఈ టోల్ వడ్డన కొత్త భారంగా మారింది. లారీ, ట్రాన్స్‌పోర్టు యజమానుల సంఘాలు వడ్డనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ సమయంలో పెంపు సబబు కాదని, ఆరు నెలల పాటు టోల్ పెంపు వద్దని ఆ సంఘం నేత కుమారస్వామి డిమాండ్ చేశారు. -
యూపీ: గ్రేటర్ నోయిడాలో గూండాల దాష్టీకం
-
యూపీ: గ్రేటర్ నోయిడాలో గుండాల దాష్టీకం
-
ఈ- పాస్ అడిగిన పోలీసుపై మాజీ ఎంపీ ఓవరాక్షన్
చెన్నై : టోల్‌ప్లాజా వద్ద ఈ-పాస్ అడిగిన కారణంగా విదుల్లో ఉన్న పోలీసుపై డీఎంకే నేత, మాజీ ఎంపీ కే. అర్జునన్ భౌతికదాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. సేలం- బెంగుళూరు హైవేలోని టోల్ ప్లాజా దగ్గర మాజీ ఎంపీ కారును ఆపి పాస్ చూపించాలని కోరగా అర్జునన్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. నా స్థాయి ఏంటో తెలుసా..నన్నే పర్మిషన్ లెటర్ అడగటానికి ఎంత ధైర్యం అంటూ ఓవరాక్షన్ చేశారు. అయినప్పటికీ ఈ- పాస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామంటూ చెప్పగా..అర్జునన్ కోపంతో ఊగిపోయారు. కారు దిగి వచ్చి సదరు పోలీసుపై చేయి చేసుకోవడమే కాకుండా కాలితో తన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలు టోల్ ప్లాజా దగ్గరున్న సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. (ఇప్పట్లో వాటికి దూరం.. ) అయితే ఇప్పటివరకు అర్జునన్‌పై అధికారులు కేసు నమోదు చేయలేదు. 1980 ప్రారంభంలో డీఎంకే ఎంపీగా విజయం సాధించిన అనంతరం అర్జునన్ అన్నాడీఎంకేలో చేరారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించాలంటే ఈ-పాస్‌ను తప్పనిసరి చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవలె ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టోల్‌ప్లాజా వద్ద ఈ-పాస్ కోసం అడగ్గా అధికారులను దుర్భాషలాడుతూ భౌతికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అర్జునన్‌పై కేసు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. (రోగ నిరోధక శక్తిని పెంచే స్వీట్ వచ్చేసింది.. ) -
హైవే ఎక్కుతున్నారా.. ఆలోచించండి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్గేట్ గేట్ల వద్ద ఫీజుల వసూలు మళ్లీ మొదలయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో టోల్ ప్లాజాల వద్ద సోమవారం నుంచి మళ్లీ ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టోల్ ఫీజుల వసూళ్లపై కేంద్ర హోం శాఖ మార్చి 25న తాత్కాలిక నిషేధం విధించింది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు మళ్లీ టోల్ ఫీజులు వసూలు చేస్తున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ), హైవేస్ డెవలపర్స్ వెల్లడించాయి. లాక్డౌన్ తర్వాత దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని పేర్కొన్నాయి. టోల్ ఫీజు వసూలు సందర్భంగా జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలిపారు. సిబ్బందికి సరిపడా గ్లోవ్స్, మాస్క్‌లు, శానిటైజర్లు అందించినట్టు చెప్పాయి. లాక్డౌన్ ఎత్తివేయకుండా టోల్ ఫీజు వసూలు చేయడాన్ని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) వ్యతిరేకించింది. రబీ వ్యవసాయోత్పత్తుల సేకరణపై ఈ చర్య తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. లాక్‌డౌన్‌తో 85 శాతం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరిపై టోల్ ఫీజు భారం మోపడం సరికాదని తెలిపింది. ఒకే వేదికపై మోదీ, పోప్.. ఇదెలా సాధ్యం! -
నేషనల్ హైవే అధికారులు ఆదేశాలు జారీ
యాదాద్రి భువనగిరి, బీబీనగర్ : కరోనా వైరస్ నిరోదక చర్యల్లో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా గుండా మంగళవారం రాత్రినుంచి వాహనాలను ఉచితంగా వదులుతున్నారు. రుసుం తీసుకోవద్దంటూ నేషన్ హైవే అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక టోల్ అధికారులు పేర్కొన్నారు. దీంతో మంగళవారం నుంచి వా హనాలనుంచి రుసుం తీసుకోకుండా వదులు తున్నట్లు అధికారులు తెలిపారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు అన్ని టోల్‌ప్లాజాల గుండా వాహనాలను ఉచితంగా వదిలేలా నేషనల్ హైవే అధికారులు నేడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాహనాలు తగ్గుముఖం పట్టడం, ఫ్రీగా వదులుతుండడంతో టోల్ సిబ్బందిని ఇళ్లకు పంపించారు. కేవలం ఇరువైపులా రెండు బూత్‌లను మాత్రమే తెరిచి ఉంచగా మిగితా కౌంటర్లను మూసివేశారు. 23వ తేదీన 10,650 వాహనాలు వెళ్లగా, 24న 3,880, 25న 1,650వరకు వాహనాలు గూడూరు టోల్ గుండా వెళ్లాయి. వాహనాల రాకపోకల సంఖ్య తగ్గిపోతుండడంతో టోల్ రుసుంను మినహాయిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి చేదు అనుభవం
సాక్షి, యాదాద్రి : చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సోమవారం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేదు అనుభవం ఎదురైంది. టోల్ ఫీజు చెల్లించాలంటూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనాన్ని టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకుంది. తాను ఎమ్మెల్సీ అని చెప్పినా అనుమతించలేదు. చివరికి ఐడీ కార్డు చూపించినా వదల్లేదు. మొదట గన్‌మెన్ లేకపోవడంతో ఎమ్మెల్సీ అని అనుకోలేదని చెప్పిన సిబ్బంది.. తర్వాత టోల్ మినహాయింపు జాబితాలో ఎమ్మెల్సీ పేరు లేదంటూ బుకాయించారు. చివరికి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వాహనాన్ని అనుమతించారు. కాగా, టోల్ ప్లాజా సిబ్బంది తీరుకు నిరసనగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ధర్నాకు దిగారు. ఏ ఎమ్మెల్సీని ఆపకుండా తనను మాత్రమే ఎందుకు ఆపారో చెప్పాలంటూ టోల్ ఫ్లాజా వద్ద బైఠాయించారు. -
కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
-
కొత్త కారు దగ్ధం; రూ. లక్ష బుగ్గిపాలు
సాక్షి, ఆదిలాబాద్ : కొత్తగా కొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతి అయింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరెడుగొండ మండలం మామడ టోల్ గేట్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. కారులో మంటలు రావడంతో... అందులో ప్రయాణిస్తున్నవారు అప్రమత్తమై కారులో నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. అయితే కారులో ఉన్న లక్ష రూపాయలు బుగ్గిపాలయ్యాయి. అయితే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది. కాగా ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టోల్‌ప్లాజా వద్ద మహిళపై అఘాయిత్యం..
చండీగఢ్ : టోల్‌ప్లాజా వద్ద మూత్రవిసర్జన కోసం వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఘటనాస్థలంలో వారి మొబైల్ నంబర్లను ఇచ్చి మరీ వెళ్లిపోయారు. ఈ ఘటన హర్యానాలో ఫిబ్రవరి 16న చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన భార్యాభర్తలు తమ బంధువులను కలవడానికి పానిపట్‌కు వెళ్లారు. అనంతరం ఆదివారం అక్కడి నుంచి బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తమ సన్నిహితుల నుంచి రూ. 20000 తీసుకోవడానికి రాత్రి 11 గంటల సమయంలో కర్నల్ టోల్‌ప్లాజా వద్ద ఆగారు. ఈ క్రమంలో సదరు మహిళ(19) మూత్రవిసర్జన కోసం పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది. ఇది గమనించిన స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మహిళను కత్తితో బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం మహిళను అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు. అంతేగాక ఘటన ప్రాంతంలో వారి మొబైల్ నెంబర్లను వదిలి వెళ్లారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డ బాధిత మహిళ భర్త దగ్గరికి వచ్చి.. తనకు జరిగిన ఘోరాన్నిచెప్పుకుని విలపించింది. దీంతో సోమవారం ఉదయం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలంలో లభించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని టోల్‌ప్లాజా వద్ద చిప్స్ అమ్ముకునే మేఘరాజ్, సోనూలుగా గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. -
ఈ నెలాఖరు వరకు ఉచిత ఫాస్టాగ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను మరింత మెరుగుపరచడం కోసం ఈ నెలాఖరు వరకు ఫాస్టాగ్‌లను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి కాగా, ఈ ఏర్పాటు నిమిత్తం వసూలు చేస్తున్న రూ. 100 చార్జీని ఈ నెల 15 నుంచి 29 వరకు ఎత్తివేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ)ని జాతీయ రహదారి ఫీజు ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్ పంపులు వంటి ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాయింట్ ఆఫ్ సేల్ వద్ద చూపించి ఫాస్టాగ్‌ను పొందవచ్చని వివరించింది. మైఫాస్టాగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని దగ్గర్లోని సెంటర్‌ను తెలుసుకోవచ్చు. ఇక ఫాస్టాగ్ వాలెట్లో సెక్యూరిటీ డిపాజిట్, కనీస బ్యాలెన్స్ వంటి మిగిలిన అంశాల్లో మార్పులు లేవని స్పష్టంచేసింది. -
పెళ్లి బృందంపై టోల్గేట్ సిబ్బంది దాడి..
సాక్షి, చెన్నై: ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై టోల్ గేట్ సిబ్బంది వీరంగం వివాదానికి దారి తీసింది. బస్సును రోడ్డుకు అడ్డంగా డ్రైవర్ నిలిపి వేయడంతో గంటల కొద్ది వాహనాలు బారులు తీరాయి. ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో చెంగల్పట్టు టోల్గేట్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఆదివారం టోల్‌గేట్‌ను ఎత్తి వేసినట్టుగా పరిస్థితి మారింది. రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో 44 టోల్ గేట్లు ఉన్నాయి. నిర్ణీత కిలోమీటర్ల దూరంలో ఈ టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి వాహనం టోల్‌చార్జ్ చెల్లించాల్సిందే. ద్విచక్రవాహనాలకు మినహాయింపు ఉంది. గుమ్మిడిపూండి నుంచి కన్యాకుమారి వరకు, ఈ ప్రధాన రహదారికి అనుబంధంగా ఉన్న సేలం – కోయంబత్తూరు, పూందమల్లి – శ్రీపెరంబదూరు – బెంగళూరు, మదురై – విరుదునగర్ , తేనిల వైపుగా ఈ టోల్ చార్జీల వసూళ్లు సాగుతున్నాయి. ఏడాదిలో రెండు విడతలుగా టోల్‌చార్జీల పెంపు ప్రక్రియ ఆది నుంచి సాగుతోంది. ఈ టోల్ వడ్డనపై రాష్ట్రంలోని వాహన దారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో టోల్గేట్లలో పనిచేస్తున్న సిబ్బంది దురుసుగా వ్యవహరించడం, రాజకీయ పక్షాల నేతల్ని సైతం లెక్క చేయని రీతిలో ముందుకు సాగుతుండడం వంటి పరిణామాలు నిత్యం ఏదో ఒక వివాదానికి దారి తీస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ప్రయాణికుల ఆగ్రహానికి ఓ టోల్ గేట్ పూర్తిగా ధ్వంసమైంది. వివాదం.. చెన్నై కోయంబేడు నుంచి శనివారం రాత్రి తిరుచ్చికి ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు బయలుదేరింది. చెంగల్పట్టు సమీపంలోని పరనూర్ టోల్గేట్లో ప్రభుత్వ బస్సుల మార్గంలో ఈ బస్సు దూసుకెళ్లింది. అయితే, ఈ బస్సు ముందుకు వెళ్లకుండా టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. టోల్ చార్జీ చెల్లించి ముందుకు వెళ్లాలని డ్రైవర్‌ను నిలదీశారు. ఇది ప్రభుత్వ బస్సు అని టోల్ సిబ్బందికి డ్రైవర్, కండక్టర్ చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. అక్కడి భద్రతా సిబ్బంది డ్రైవర్‌పై దూకుడుగా వ్యవహరించడం వివాదానికి దారి తీసింది. ఆ బస్సును డ్రైవర్ టోల్ గేట్‌కు మార్గాలకు అడ్డంగా నిలిపి వేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. దీంతో ఆగ్రహించిన టోల్ గేట్ సిబ్బంది డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేయడంతో వివాదం మరింతగా ముదిరింది. అటు వైపుగా వెళ్లే అన్ని ప్రభుత్వ బస్సులు ఎక్కడిక్కడ ఆగాయి. నాలుగు గంటల పాటు వాహనాలు టోల్ గేట్‌ను దాటలేని పరిస్థితి. దీంతో గమ్యస్థానాలకు సకాలంలో చేరుకుంటామో లేదో అన్న ఆందోళన ప్రయాణికుల్లో రేగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు టోల్ గేట్ సిబ్బందిని ప్రశ్నించారు. ప్రయాణికులపై సైతం ఆ సిబ్బంది దురుసుగా వ్యవహరించడంతో ఆ పరిసరాలు రణరంగానికి దారి తీశాయి. టోల్ గేట్‌పై ప్రయాణికులు దాడి చేశారు. అక్కడున్న సీసీ కెమెరాలు, గేట్లు, కంపూటర్లు అన్ని «ధ్వంసం చేశారు. టోల్ గేట్ సిబ్బందికి చెందిన 20 ద్విచక్ర వాహనాల్ని ధ్వంసం చేసి, ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న చెంగల్పట్టు డీఎస్పీ కందన్ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విధుల్లో ఉన్న 20 మంది టోల్ గేట్సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ రవాణా సంస్థ డ్రైవర్లు శాంతించడంతో ఐదు గంటల అనంతరం ఆటోల్ గేట్‌ను అన్ని వాహనాలు దాటాయి. ఇక, ఆదివారం ఆ టోల్ గేట్‌ను మూసే అంతగా పరిస్థితి మారింది. టోల్ గేట్లో టోల్ వసూళ్లు చేసే వాళ్లు లేక పోవడంతో, వాహనాలన్నీ వేగంగా ముందుకు దూసుకెళ్లాయి. పెళ్లి బృందంపై దాడి.. చెంగల్పట్టు టోల్ గేట్ వివాదం ఓ వైపు సాగుతుంటే, మరో వైపు నాంగునేరి టోల్గేట్లో పనిచేస్తున్న సిబ్బంది ఓ పెళ్లి బృందం మీద దాడి చేసింది. మహిళతో పాటు పదిమంది గాయపడడంతో పోలీసులు కన్నెర్ర చేశారు. కన్యాకుమారి జిల్లా మనవాల కురిచ్చికి చెందిన షేక్ సులేమాన్ కుటుంబం వివాహ కార్యక్రమం నిమిత్తం రెండు కారల్లో ఆదివారం ఉదయం తూత్తుకుడికి బయలు దేరారు. మార్గమధ్యంలోని నాంగునేరి టోల్గేట్లో సిబ్బంది దూకుడుగా వ్యవహరించడం, టోల్‌చార్జీల వసూళ్లలో జాప్యం చేయడంతో వాహనాలు బారులు తీరాయి. తాము వివాహ వేడుకకు వెళ్లాల్సిందని, త్వరితగతిన టోల్ చార్జీ వసూలు చేసి తమను పంపించాలని ఆ బృందం విజ్ఞప్తి చేసింది. ఇందుకు టోల్ సిబ్బంది దురుసుగా వ్యవహరించడం వాగ్వివాదానికి దారి తీసింది. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది ఆ పెళ్లి బృందంపై దాడి చేశారు. సులేమాన్ , సర్బుద్దిన్, అల్ అమీద్, ఆయన భార్య సమీమా, సల్మా బీవి తో పాటుగా పది మందికి రక్తగాయాలు అయ్యాయి. టోల్ గేట్ సిబ్బంది దూకుడును ఇతర వాహనాదారులు అడ్డుకునే యత్నం చేయగా, వారిపై సైతం తిరగబడడం ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న నాంగునేరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ పది మంది నాంగునేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు టోల్ గేట్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. -
రూ.70 చార్జీ కోసం టోల్గేట్లో మాజీ ఎమ్మెల్యే తగాదా
చెన్నై, టీ.నగర్: టోల్గేట్లో చార్జీ చెల్లించేందుకు నిరాకరించి సీపీఎం మాజీ ఎమ్మెల్యే తగాదాకు దిగడంతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. కరూరు– తిరుచ్చి జాతీయ రహదారిలో మనవాసి టోల్‌గేట్‌కు మారుతి ఆల్టో కారులో శనివారం సాయంత్రం 4.30 గంటలకు సీపీఎంకు చెందిన దిండుగల్ మాజీ ఎమ్మెల్యే బాలభారతి వచ్చారు. టోల్గేట్ మీదుగా ఉచితంగా వెళ్లేందుకు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యేకు ఉచిత ప్రవేశం లేదని ఉద్యోగులు తెలిపారు. బాలభారతితో వచ్చిన పార్టీ వ్యక్తులు ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. మాయనూరు పోలీసులు, టోల్గేట్ అధికారులు వచ్చి బాలభారతితో మాట్లాడారు. ఆమె టోల్ చార్జీ చెల్లించేది లేదని ఖరాఖండిగా తెలిపారు. తర్వాత ఆమెను ఎమ్మెల్యేగా నమోదు చేసి ఉచితంగా పంపివేశారు. 70 రూపాయల చార్జీ చెల్లించాల్సిన వివాదానికి 30 నిమిషాలకు పైగా టోల్గేట్లో మాజీ ఎమ్మెల్యే రోడ్డును అడ్డగించి రాద్దాంతం చేయడంతో వాహనచోదకులు అవస్థలు పడ్డారు. -
విషాదం : టోల్‌ప్లాజాను తొందరగా దాటాలనే ప్రయత్నంలో
నోయిడా : ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా టోల్‌ప్లాజా వద్ద శనివారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. అందరికంటే ముందు టోల్ కట్టాలన్న ట్రక్కు డ్రైవర్ తాపత్రయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొంది. వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో నోయిడా టోల్‌ప్లాజా వద్దకు రెండు ట్రక్కులు ఏకకాలంలో వచ్చాయి. అయితే ఎవరి ట్రక్కు ముందు వెళ్లాలనే విషయంపై ఇరు డ్రైవర్ల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు తీయడానికి ప్రయత్నించగా మరో ట్రక్కు డ్రైవర్ దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఇది పట్టించుకోకుండా సదరు ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని అలాగే ముందుకు తీయడంతో మరో డ్రైవర్ పైనుంచి వాహనం వెళ్లడంతో అక్కడిక్కడే మరణించాడు. అయితే ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవిలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సీసీటీవి ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో మరణించిన ట్రక్కు డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
టోల్‌ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, యాదాద్రి: ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపు కోల్పోయిన బస్సు టోల్‌ప్లాజా వద్ద ఆగిన వరుస వెంబడి కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే, అదృష్టవశాత్తు ఎవరూ ఈ ఘటనలో గాయపడలేదు. యాదాద్రి జిల్లాలోని పతంగి టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు కోల్పోయి.. ముందువరుసలో ఉన్న మూడు కార్లను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. ఒక్కసారిగా బస్సు బ్రేక్ ఫెయిలవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ బస్సు డ్రైవర్ చెప్తున్నారు. -
ఫాస్టాగ్ లేకుంటే రాయితీ కట్
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్ తీసుకోకుంటే టోల్‌ప్లాజాల వద్ద క్యూలో ఎదురుచూడాల్సి రావటం ఇప్పటివరకు ఉన్న సమస్య.. కానీ ఇప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ క్రమంగా కొత్త ఆంక్షలను తెరపైకి తెస్తోంది. ఎంత ప్రయత్నించినా, ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం వైపు వాహనదారులు వేగంగా మళ్లకపోతుండటంతో, ఒత్తిడి తెచ్చి మరీ ఫాస్టాగ్స్ కొనిపించాలని నిర్ణయించింది. సంక్రాంతి వేళ కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఫాస్టాగ్ ఉంటేనే ఆ రాయితీ.. టోల్‌ప్లాజాల వద్ద రాయితీ చాలాకాలంగా అమల్లో ఉంది. టోల్గేట్ దాటి వెళ్లిన వాహనాలు 24 గంటల్లో తిరుగుప్రయా ణమై సంబంధిత టోల్ ప్లాజాకు చేరుకుంటే, రిటర్న్ టోల్‌ఫీజులో సగం రాయితీ ఉంటుంది. ఇప్పుడు ఈ రాయితీని ఫాస్టాగ్ వాహనాలకే వర్తింపచేస్తున్నారు. సంక్రాంతి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. నగదు రూపంలో టోల్ చెల్లించే వాహనాలకు ఇది వర్తించదు. నగదు చెల్లించే వారు 24 గంటల్లో తిరిగి వచ్చినా మొత్తం టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ పాస్ రాయితీ కూడా.. జాతీయ రహదారులపై రెగ్యులర్ గా తిరిగే వాహనదారులకు నెలవారీ పాస్‌లనూ జారీ చేసే విధానం అమల్లో ఉంది. ఈ పాస్ తీసుకుంటే టోల్ చార్జీల్లో తగ్గింపు లభిస్తుంది. ఇప్పుడు ఈ పాస్‌లను కూడా ఫాస్టాగ్‌తో ముడిపెట్టారు. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానంలోనే ఇక రాయితీ వర్తిస్తుంది. ఫాస్టాగ్ లేకుంటే నెలవారీ పాస్ రాయితీ ఉండదు. అలాగే టోల్గేట్లకు 10 కి.మీ. పరిధిలో ఉండే వాహనదారులకు కూడా ప్రత్యేక రాయితీ పాస్ అమల్లో ఉంది. ఇప్పుడు ఈ పాస్‌ను కూడా ఫాస్టాగ్ ఉంటేనే రాయితీ వర్తించేలా మార్చారు. సంక్రాంతి నుంచి ఇదీ అమల్లోకి వచ్చింది. ఆ 2 టోల్ గేట్లు మినహా... సంక్రాంతి వరకు అమల్లో ఉన్న 25 శాతం హైబ్రిడ్ విధానం గడువు పొడిగింపునకు కేంద్రం సుముఖంగా లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద 25 శాతం లేన్లు నగదు చెల్లింపునకు వీలుగా ఉండేవి. వీటిల్లోంచి ఫాస్టాగ్ వాహనాలతోపాటు నగదు చెల్లించే వాహనాలు వెళ్లేవి. 14వ తేదీ అర్ధరాత్రితో ఈ గడువు తీరింది. దీంతో 15 నుంచి టోల్ ప్లాజాల వద్ద ఒక్కో వైపు ఒక్కో లేన్ మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయించారు. రాష్ట్రంలో 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో 15 చోట్ల ఇదే విధానం అమల్లోకి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్‌ప్లాజా, బెంగుళూరు హైవే మీదున్న రాయికల్ టోల్‌ప్లాజాలను దీని నుంచి మినహాయించారు. ఈ రెండు ప్లాజాల్లో మరో నెల రోజులు 25 శాతం హైబ్రీడ్ లేన్లు నగదు చెల్లించేందుకు అందుబాటులో ఉంటాయి. 1.12 లక్షలకు పెరిగిన ఫాస్టాగ్ వాహనాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య 1.12 లక్షలకు పెరిగింది. సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లే సందర్భంలో ఎక్కువమంది ఫాస్టాగ్స్ కొనుగోలు చేయటంతో వాటి సంఖ్య కాస్త వేగంగా పెరిగింది. దీంతో టోల్‌ప్లాజాల నుంచి దూసుకెళ్తున్న మొత్తం వాహనాల్లో 54 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నట్టైంది. టోల్ వసూళ్లలో వీటి వాటా 65 శాతానికి పెరిగింది. -
నగదు చెల్లింపునకు ఇక ఒక్క లేనే
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద బుధవారం నుంచి నగదు చెల్లించే వాహనాలకు ఒక్కోవైపు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించే విషయంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ స్పష్టమైన హామీ ఇవ్వనందున బుధవారం నుంచి దాన్ని తొలగిస్తున్నట్టు ఎన్ హెచ్ఏఐ రాష్ట్ర ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. హైబ్రిడ్ విధానంలో 25% లేన్లు నగదు చెల్లించే వాహనాలకు కేటాయించగా, ఫాస్టాగ్ వాహనాలకు మిగతావి అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా సంక్రాంతి రద్దీ ఉన్నా, ఎక్కువగా ఇబ్బంది లేకుండా వాహనాలు ముం దుకు సాగాయి. పంతంగి లాంటి రద్దీ ఎక్కువగా ఉండే టోల్‌ప్లాజాల వద్ద అర కిలోమీటరు మేర వాహనాల క్యూలు ఏర్పడ్డాయి. ప్రస్తుత హైబ్రిడ్ విధానం గడువు మంగళవారంతో తీరిపోయింది. బుధవారం నుంచి కేంద్రం ముందు చెప్పినట్టుగా టోల్ గేట్ల వద్ద ఒక్కోవైపు ఒక్కోవైపు మాత్రమే నగదు చెల్లింపు వాహనాల కోసం కేటాయించనున్నారు. తిరుగు ప్రయాణంలో ఇబ్బందే సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకొనేందుకు నగరం నుంచి భారీ సంఖ్యలో జనం ఊరిబాట పట్టారు. దాదాపు 35 లక్షల మంది ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. పండుగ తర్వాత వీరు మళ్లీ తిరుగు ప్రయాణం కానున్నారు. వెళ్లేప్పుడు హైబ్రీడ్ విధానం వల్ల టోల్గేట్ల వద్ద పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఇప్పుడు ఒక్కలే¯Œ మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయిస్తున్నందున, తిరుగు ప్రయాణంలో వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలో టోల్గేట్ల వద్ద నమోదైన లెక్కల ప్రకారం.. 55% వాహనాలకు ఫాస్టాగ్ ఉంది. 45% వాహనాలకు టోల్‌ను నగదు రూపంలో చెల్లించారు. ఇప్పుడు ఈ 45% వాహనాల తిరుగు ప్రయాణంలో ఆ ‘ఒక్కోవైపు ’నుంచే ముందుకు సాగాల్సి ఉంటుంది. దీంతో కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం క్యూలు ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ మంది పండుగకు రెండ్రోజుల ముందు వెళ్లగా, వచ్చేటప్పుడు నాలుగైదు రోజుల్లో ప్రయాణించే అవకాశం ఉంది. అంటే వెళ్లేప్పుడు ఉన్న రద్దీ ఉండదు. అయినా, ఒక్క లేన్ నుంచి అన్ని వేల వాహనాలు వెళ్లాల్సి రావటం కొంత ఇబ్బందేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇబ్బందులు తీవ్రంగా ఉంటే, అప్పటికప్పుడు కేంద్రం నుంచి అనుమతి పొంది లేన్ల సంఖ్యను పెంచే ఏర్పాటు చేస్తామంటున్నారు. ఒకవేళ హైబ్రిడ్ విధానం గడువు పెంచితే, బుధ వారం ఉదయం తమకు సమాచా రం వస్తుందని, అప్పుడు ఇబ్బంది ఉండే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. -
కారులు.. బారులు
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న వారితో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ కొనసాగింది. ఇక్కడ 16 కౌం టర్లకు గాను విజయవాడ వైపు 5 ఫాస్టాగ్‌కు, 4 నగదు చెల్లింపులకు కేటాయించారు. హైదరాబాద్ మార్గంలో 4 ఫాస్టాగ్‌కు, నగదు చెల్లింపునకు 3 మార్గాలు కేటాయించారు. ఫాస్టాగ్ లేని వాహనాలు కూడా ఆయా మార్గాల్లోకి వెళ్లడంతో మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. – చౌటుప్పల్/బీబీనగర్/కేతేపల్లి -
పండగ రద్దీ: టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్
-
పండగ రద్దీ: టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జమ్ ఏర్పడుతోంది. సంక్రాంతి పండగ సెలవులు కావడంతో హైదరాబాద్ నగర వాసులు ఇటు తెలంగాణకు, అటు ఏపీకి పయనమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్గేట్లో 8 టోల్ బూతులు తెరిచారు. బూత్‌లో ఫాస్ట్ ట్యాగ్ స్కానర్ పనిచేయకపోవడంతో పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకొని వాహనాలను పంపుతున్నారు. ఫాస్ట్ టాగ్‌పై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టోల్గేట్ వద్ద ప్రత్యేకంగా ఫాస్ట్ టాగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులంతా ఫాస్ట్ టాగ్లను తీసుకుంటున్నారు. తెలంగాణలో రేపటి నుంచి విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. దీంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు, జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ బస్టాప్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ వద్ద రహదారులు అన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్ధీ పెరిగింది. కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. -
త్వరలో అలిపిరిలో ఫాస్టాగ్
సాక్షి, తిరుమల: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో జాతీయ రహదారులపై టోల్గేట్ల వద్ద ‘ఫాస్టాగ్’ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అలిపిరి టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. తిరుమలకు వచ్చే ప్రతి వాహనానికీ ఫాస్టాగ్ ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు ఎస్బీఐ బ్యాంక్‌తో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇక వీలైనంత తర్వలో ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని టీటీడీ విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. దీంతో దేశంలో ఫాస్టాగ్ విధానాన్ని అనుసరించే తొలి దేవాలయ పాలకమండలిగా టీటీడీ ఖ్యాతి గడించనుంది. కాగా ఇప్పటికే కేంద్రం టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: పండుగపూట ఫాస్టాగ్ పరేషాన్ హైవే పక్కన హోటళ్లలో ఫాస్టాగ్ విక్రయం -
టోల్ కష్టాలు ఇక తీవ్రం
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై టోల్ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. ఈ నెల 15 నుంచి టోల్‌ప్లాజాల్లో ఒకటి మినహా మిగిలినవన్నీ ఫాస్టాగ్ లైన్లే ఉండనున్నాయి. నగదురూపంలో టోల్ చెల్లించేందుకు కేవలం ఒక లైన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఫలితంగా ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం టోల్‌ప్లాజాల్లో 25 శాతం గేట్లను హైబ్రిడ్ మార్గాలుగా కొనసాగిస్తున్నారు. వీటిలో ఫాస్టాగ్ ఉన్న వాహనాలతోపాటు సాధారణ నగదు చెల్లింపు వాహనాలు కూడా వెళ్లొచ్చు. ఈ నెల 14 వరకు ఈ వెసులుబాటు ఉంది. దీన్ని ఈ నెలాఖరు వరకు పొడి గించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రతిపాదించినట్టుగా జనవరి 15 నుంచి ప్రతి టోల్‌ప్లాజా వద్ద ఒక్కో వైపు ఒక్క లేన్ మాత్రమే నగదు చెల్లింపునకు పరిమితం చేస్తామని ఎన్హెచ్ఏఐ చైర్మన్ స్పష్టంచేశారు. దీంతో జనవరి 15వ తేదీ తెల్లవారుజాము నుంచి ఒక్కో గేట్ మాత్రమే నగదు చెల్లింపునకు ఉండనుంది. అసలే సంక్రాంతి సమయం కావడంతో విపరీతంగా రద్దీ ఏర్పడి ఇబ్బందులు తలెత్తుతా యని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గడువును పొడిగించాలని వాహనదారులతోపాటు అధికారులు కోరుతున్నారు. మ రోవైపు రాష్ట్రంలో మంగళవారం నాటికి దాదా పు 94వేల ఫాస్టాగ్స్ అమ్ముడయ్యాయి. దీంతో టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ లేన్ల నుంచి వెళుతున్న వాహనాల సంఖ్య 52 శాతానికి చేరింది. స్పీడ్ బ్రేకర్ల తొలగింపు.. ఫాస్టాగ్ తీసుకున్న వాహనాలు టోల్‌ప్లాజాల నుంచి వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నందున అక్కడ ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని ఎన్ హెచ్ఏఐ నిర్ణయించింది. ఇప్పటివరకు వాహనదారులు టోల్‌ప్లాజాల వద్ద ఆగి టోల్ చెల్లించి వెళ్లేవారు. దీంతో వెనుక వచ్చే వాహనాలు ముందున్న వాహనాలను ఢీకొట్టకుండా చూసేందుకు ఈ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఫాస్టాగ్ విధానం వల్ల వాహనం ఆగాల్సిన అవసరం లేకపోవడంతో ఈ స్పీడ్ బ్రేకర్లను తొలగిస్తున్నారు. -
సంక్రాంతికి ‘టోల్’ గుబులు!
సాక్షి, హైదరాబాద్: టోల్ రుసుము చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించటంతోపాటు నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం ఇప్పుడు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు టోల్ గేట్ల వద్ద ఇబ్బంది లేకుండా దూసుకుపోతుండగా, ట్యాగ్ లేని వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఇప్పుడే ఇలాఉంటే సంక్రాంతి సమయంలో పరిస్థితి ఏమిటని అధికారులు బెంబేలెత్తుతున్నారు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ అధికారులు మంగళవారం సమావేశమై దీనిపైనే చర్చించారు. సంక్రాంతిలోపు వీలైనన్ని ఫాస్టాగ్‌లు అమ్మేలా ప్రచారం చేయాలని నిర్ణయించారు. రద్దీ నుంచి తప్పించుకోవాలంటే ఫాస్టాగ్ కొనాల్సిందేనంటూ వివరించే కరపత్రాలు పెద్ద సంఖ్యలో ముద్రించి పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నగదు చెల్లింపు వాహనాలు క్యూలలో చిక్కుకుపోవటం, ఫాస్టాగ్ వాహనాలు ఇబ్బంది లేకుండా వెళ్లిపోతున్న తీరుకు సంబంధించిన వీడియో లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇక రద్దీ ఎక్కువుంటే ఫాస్టాగ్ వాహనాల గేట్ల నుంచి సాధారణ వాహనాలు కూడా వెళ్లేందుకు అనుమతించాలని నిర్ణయించారు. కాగా, మంగళవారం జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల మీదుగా వెళ్లిన వాహనాల్లో 53.59 శాతం ఫాస్టాగ్‌తో వెళ్లినట్టు ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ చెప్పారు. -
ఫాస్టాగ్‌తో సాఫీగా..
సాక్షి, నెట్వర్క్: టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ తెరదించేందుకు ఉద్దేశించిన ‘ఫాస్టాగ్’ విధానం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద ఈ ఫాస్టాగ్ అతికించిన వాహనాలు వేగంగా ముందుకు వెళ్లాయి. అయితే ప్రతీ వాహనానికి గేటు ఎత్తి పంపాల్సి రావడంతో కాస్త జాప్యం జరిగింది. అయినా అది పెద్ద సమస్యగా మారలేదు. ఫాస్టాగ్ లేని వాహనదారులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావటం తో వాహనాలు భారీ క్యూకట్టాయి. దీంతో వాహనాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత రెండు నెలలుగా ఎన్హెచ్ఏఐ ఈ ట్యాగ్ల విషయమై ముమ్మరంగా ప్రచారం చేసినా, ఎక్కువ మంది పట్టించుకోలేదు. అలా ట్యాగ్ లేకుండా జాతీయ రహదారులెక్కిన వాహనదారులకు టోల్‌ప్లాజాలు చుక్కలు చూపించాయి. పండుగ సమయాల్లోలా రద్దీ.. పండుగల సమయంలో టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు ఆదివారం కూడా భారీ రద్దీ ఏర్పడింది. తొలుత ఫాస్టాగ్ లేని వాహనాల కోసం ఒకే లైన్ కేటాయించాలని భావించినా.. ఆ తర్వాత 25 శాతం గేట్లు కేటాయించారు. మూడొంతుల గేట్లు ఫాస్టాగ్ వాహనాలకే వది లారు. ఇదే సమస్యకు కారణమైంది. ఎక్కువ వాహనాలకు ట్యాగ్ లేకపోవటం, వాటికి తక్కువ లైన్లు కేటాయించడంతో క్యూ కట్టాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాలతో పాటు హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిలో గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచే వాహనాల రద్దీ నెలకొంది. టోల్ దాటేందుకు ఒక్కో వాహనదారుడు గంటకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. మహబూబ్‌నగర్ జాతీయ రహదారిపై శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద వందల సంఖ్యలో వాహనాలు బార్లు తీరాయి. భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద బారులుదీరిన వాహనాలు రెట్టింపు రుసుము.. టోల్‌ప్లాజాకు కిలోమీటరు దూరంలో ప్రత్యేక సిబ్బందిని నియమించి ఫాస్టాగ్ ఉన్న వాహనాలను సంబంధిత లైన్లలోకి వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ కొన్ని సాధారణ వాహనాలూ అయోమయంలో ఫాస్టాగ్ లైన్లలోకి ప్రవేశిం చాయి. ట్యాగ్ లేకుండా ఆ వరుసలోకి వస్తే రెట్టిం పు రుసుము చెల్లించాలనే నిబంధనతో పలువురు వాహనదారులు పెనాల్టీ చెల్లించాల్సి వచ్చింది. మాల్స్‌లో విక్రయం..! ప్రస్తుతం బ్యాంకులు, టోల్‌ప్లాజాలు, ఆర్టీసీ కార్యాలయాలు, ఆన్లైన్లో ఫాస్టాగ్ పొందే వెసులుబాటు ఉంది. ఆదివారం రద్దీ నేపథ్యంలో వాహనదారులు వాటిని కొనేందుకు పోటీపడే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు.. షాపింగ్ మాల్స్ లోనూ విక్రయ కేంద్రాలు తెరవాలని భావిస్తున్నా రు. కాగా, రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని జనవరి ఒకటి నుంచి అమల్లోకి తేనున్నారు. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై మూడు చోట్ల, అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి ఒక చోట టోల్ ప్లాజాలున్నాయి. అప్పటికప్పుడే కొనుగోలు.. ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ వద్ద క్యూలలో నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఎన్హెచ్ఏఐ కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారాన్ని చాలామంది పట్టించుకోలేదు. దీని ప్రభావం ఆదివారం స్పష్టం గా కనిపించింది. ఇన్ని రోజులు ఫాస్టాగ్ తీసుకోని వారు వాహనాల లైన్లు చూసి అప్పటికప్పుడు ట్యాగ్లు కొన్నారు. అన్ని టోల్ ప్లాజాల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి అధికారులు వాటిని విక్రయిం చారు. సాధారణ రోజుల్లో సగటున రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల ట్యాగ్లు అమ్ముడవుతుండగా ఆ సంఖ్య ఆదివారం రెట్టింపైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 60 వేల ట్యాగ్లు విక్రయమైనట్లు ఎన్హెచ్ఏఐ ప్రాంతీయాధికారి కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఫాస్టాగ్ అంటే.. ఫాస్టాగ్ విధానంలో వాహనం టోల్‌గేటు వద్ద బారులు తీరే అవసరం ఉండదు. కీలకమైన ‘ఫాస్టాగ్’పేరుతో ఉండే ట్యాగ్ల ను వాహనాల ముందు అద్దానికి అతికించుకోవాలి. టోల్‌గేట్‌పై ఉండే సెన్సార్లు.. గేటు ముందుకు రాగానే ట్యాగ్‌లోని చిప్ నుంచి కావాల్సిన టోల్ రుసుమును మినహాయించుకుంటాయి. ఆ వెంటనే గేట్ తెరుచుకుం టుంది. ఒక్కో వాహనం నుంచి టోల్ రుసు ము మినహాయించుకునేందుకు 6 సెకన్ల సమయమే పడుతుంది. దీంతో వాహనదారుల సమయం ఆదా అవుతుంది. -
రాష్ట్ర రహదారులపై ఫాస్టాగ్‌కు జాప్యం
సాక్షి, హైదరాబాద్: టోల్‌ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా వాహనాలు ముందుకు వెళ్లేలా ఉద్దేశించిన ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం రాష్ట్ర రహదారులపై అందుబాటులోకి రావడానికి జాప్యమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్గేట్ల వద్ద ఈ విధానం ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ అన్ని ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 1వ తేదీనే ప్రారంభించాల్సి ఉన్నా దేశవ్యాప్తంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాత్రం అప్పటికే అన్నీ సిద్ధం చేసి పెట్టారు. ఈ నెల 15న రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సాఫీగానే ప్రారంభం కానుంది. కానీ రాష్ట్ర రహదారుల విషయానికి వచ్చే సరికి సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర రహదారులపై 4 టోల్‌ప్లాజాలా వద్ద కూడా దీన్ని ప్రారం భించాల్సి ఉంది. ఫాస్టాగ్‌కు సంబంధించి యంత్ర పరికరాల ఏర్పాటు ఖర్చును ఎవరు భరించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు మధ్య స్పష్టత కుదరలేదు. ఒక గేటుకు మాత్రం ఖర్చులో 50 శాతం కేంద్రం భరించనుంది. మిగతా గేట్లకు సంబంధించిన ఖర్చులను మాత్రం స్థానికంగా సర్ధుబాటు చేసుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వం సహకరించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. దీనిపై వారం, పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 58 వేల ఫాస్టాగ్‌లు అమ్ముడైనట్లు తెలిసింది. -
టోల్ ఫీజు వసూలు నిలిపివేత
దొడ్డబళ్లాపురం : యలహంక–హిందూపురం రహదారి మార్గంలో టోల్ ఫీజు వసూలు చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దొడ్డబళ్లాపురానికి చెందిన లాయర్ వెంకటేశ్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం పరిశీలించిన జడ్జీలు రవి మళిమఠ, ఎం నాగప్రసన్న ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. యలహంక–హిందూపురం రాష్ట్ర రహదారి మార్గంలో మారసంద్ర, గుంజూరు వద్ద ఉన్న రెండు టోల్గేట్ల వద్ద రోడ్లు పూర్తిగా అభివృద్ధిపరచకుండా టోల్ వసూలు చేస్తున్నారని లాయర్ వెంకటేశ్ ఆరోపిస్తూ పిల్ వేశారు. పనులు ఏ మేరకు జరుగుతున్నాయి, జరిగాయి అని నివేదిక ఇవ్వాల్సిందిగా ఒక ఇంజినీర్ని నియమించాలని కోర్టు గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించగా, పనులను పరిశీలించిన ఇంజినీర్ 75 శాతం పనులు జరిగాయని నివేదిక ఇచ్చారు. అయితే లాయర్ వెంకటేశ్ ఇది తప్పుల నివేదిక అని వాదించారు. అందుకు తగిన సాక్ష్యాధారాలు చూపడంతో కోర్టు టోల్ ఫీజు వసూలుకు బ్రేక్ వేసింది. దీంతో తక్షణం యలహంక–హిందూపురం రహదారి మార్గంలోని రెండు టోల్గేట్లలో ఫీజులు వసూలు చేయడం నిలిపివేసి వాహనాలను ఉచితంగా వదులుతున్నారు. -
ఇకపై టోల్‌ఫ్లాజాల వద్ద ‘ఫాస్ట్’ విధానం
టోల్‌ప్లాజా వచ్చిందంటే చాలు గంటల తరబడి నిరీక్షించాల్సిందే. అప్పటివరకు రయ్‌మంటూ సాగే వాహనాలకు టోల్‌ప్లాజాలు అడ్డుకట్టగా మారేవి. బారులు తీరిన వాహనాలకు రుసం వసూలు చేస్తూ..బోలెడు సమయం వృథా అయ్యేది. దీనికి పరిష్కారంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఈ-రుసుం చెల్లింపుతో కొత్త ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. టోల్గేట్ల వద్ద ఛార్జీల చెల్లిపులను ఎలక్ర్టానిక్ పద్దతిలో జరిపేందుకు ఉద్దేశించిన ఈ విధానం డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ విధివిధానాలు, అసునరించాల్సిన పద్దతులేంటో తెలుసుకుందాం. -ఫాస్టాగ్ కలిగిన వాహనం టోల్‌ఫ్లాజా దగ్గరకు రాగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ప్రీపెయిడ్ అకౌంట్‌కి చెల్లింపులు జరుగుతాయి. -ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ను వాహనం ముందు భాగంలో విండ్సస్ర్కీన్పై అతికించాల్సి ఉంటుంది. -ఎన్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి బ్యాంకుల ద్వారా కూడా వీటిని పొందవచ్చు. -ఫాస్టాగ్‌ను ఒక వాహనానికి మాత్రమే వినియోగించేలా రూపొందించారు. * టోల్‌ప్లాజా వచ్చినప్పుడు ఫాస్టాగ్ ఉన్న లేన్‌ను చూపుతూ కొన్ని బోర్డులు ఉంటాయి. ఆ మార్గంలోనే ఫాస్టాగ్ వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. * నిర్దేశించిన లేన్‌లో వెళ్లినప్పుడు వాహన వేగం 25-30కి మించి ఉండకూడదు. * అలాగే మీరు వెళ్తున్న లేన్‌లో మీ ముందున్న వాహనానికి కనీసం 10 మీటర్ల దూరం పాటించాలి. * ఒకసారి మీ ఫాస్టాగ్ రీడ్ అయిన తర్వాత మీ వాహనం ముందుకు సాగొచ్చనే సంకేతంగా అక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది. అప్పుడే ముందుకు వెళ్లాలి. * గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత కూడా వాహనాన్ని ఎక్కువ సమయం అక్కడే ఉంచితే... బారియర్ గేట్ మళ్లీ పడిపోయే అవకాశం ఉంది. * ఒకవేళ ఏదైనా కారణంతో మీ ఫాస్టాగ్ పనిచేయకపోతే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఎరుపు రంగులోకి మారుతుంది. * అప్పుడు టోల్‌ప్లాజా సిబ్బంది తమ చేతిలో ఉన్న పరికరంతో మీ ఫాస్టాగ్‌ను స్కాన్ చేస్తారు. ఒకవేళ ఎలాంటి ఇబ్బందీ లేకుంటే ఆకుపచ్చ లైట్ వెలుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే టోల్ఛార్జీని రుసుము ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. -
‘ఫాస్ట్’గానే ప్రజల్లోకి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై టోల్గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపుల్లో భాగంగా ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు వ్యవస్థపై వాహనదారుల్లో అవగాహన వేగంగా పెరుగుతోంది. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ వ్యవస్థలో భాగంగా వాహనాల ముందు అద్దానికి అమర్చే ఫాస్టాగ్‌ల విక్రయం ఒక్కసారిగా జోరందుకుంది. సరిగ్గా వారం క్రితం తెలంగాణలో కేవలం 3,500 ట్యాగ్లే అమ్మకం కాగా, ప్రస్తుతం వాటి సంఖ్య పదిన్నర వేలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ వారంలోనే ఎక్కువ ట్యాగ్లు అమ్ముడుపోవటం తో చాలా ప్రాంతాల్లో వాటికి కొరత ఏర్పడింది. కొన్నిచోట్ల ట్యాగ్లు అందుబాటులో లేవన్న సమాధానం వస్తుండటంతో వాహనదారులు బ్యాంకులు, టోల్‌ప్లాజాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో కూడా ఈ వారంలోనే ఏకంగా 7 వేల ట్యాగ్లు అమ్ముడు కావటంతో ఇక్కడా కొరత ఏర్పడే పరిస్థితి వచ్చేది. కానీ, నేషనల్ హైవే అథారిటీ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో ట్యాగ్‌లకు ఇండెంట్ పెట్టి తెప్పించారు. వాటి అమ్మకాలు పెరిగే సమయంలో అద నంగా 15వేల ట్యాగ్లు అందుబాటులోకి వచ్చా యి. దీంతో రాష్ట్రంలో వాటికి కొరత లేకుండా పోయింది. ప్రస్తుతం జాతీయ రహదారులపై 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో ప్రతిచోటా.. ఒక్కోవైపు 5 చొప్పున 10 కౌంటర్లు ఏర్పాటుచేసి అమ్ముతున్నారు. బ్యాంకుల్లో నేరుగా విక్రయం, ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవటంతో పోలిస్తే.. టోల్‌ప్లాజాల్లోనే ఎక్కువగా అమ్మకం అవుతున్నాయి. అన్ని టోల్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు యంత్రపరికరాల ఏర్పాటు దాదాపు పూర్తయింది. 4టోల్ కేంద్రాల్లో పనులు తుదిదశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ‘సగమే వసూలు’ నిబంధనకు తూట్లు.. వాహనం టోల్‌ప్లాజా దాటేప్పుడు తిరుగు ప్రయాణానికీ ఒకేసారి టోల్ చెల్లించేవారుంటారు. వాహనం 24 గంటల్లోపు తిరిగొస్తే, రెండోసారి సగం రుసుమే చెల్లించాలి. ఈ నిబంధనపై అవగాహన లేక టోకెన్ పద్ధతి చెల్లింపు విధానంలో.. మొత్తం రుసుము చెల్లిస్తున్నారు. అవగాహన ఉన్నవారు ప్రశ్నించి మరీ సగమే చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఫాస్టాగ్ విధానం పూర్తిగా ఆటోమేటిక్ చెల్లింపు వ్యవస్థే అయినందున ఆ సమస్య ఉత్పన్నం కాకూడదు. అయితే కొన్ని సంస్థలు, బ్యాంకులిచ్చే ట్యాగ్‌ల్లో లోపాల వల్ల పూర్తి మొత్తం కట్ అవుతోందంటూ లారీ యజమానుల సంఘం ఫిర్యాదు చేసింది. అలాంటి పరిస్థితి లేకుండా చూస్తామని, ఎక్కడైనా లోపం జరిగితే ఆ మొత్తాన్ని వాహనదారుడికి తిరిగి చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. నెల రోజులుగా ప్రయోగాత్మకంగా కొన్ని లేన్లకే ఇది పరిమితమై ఉన్నందున, పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటైతే ఇలాంటి లోపాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. పొగమంచుతో ఇబ్బందేనా..? చలికాలంలో ఉదయం, సాయంత్రం వేళ పొగమంచు కురుస్తుంటుంది. దాని తీవ్రత ఎక్కువగా ఉంటే ఫాస్టాగ్‌ల నుంచి టోల్ మినహాయింపు ప్రక్రియ మందగించే పరిస్థితి ఉండనుంది. దీనికి సంబంధించి ఎన్హెచ్ఏఐ అధికారులకు కొన్ని ఫిర్యాదులం దాయి. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, సెన్సార్లకు అడ్డుగా వచ్చి ట్యాగ్‌ను వేగంగా రీడ్ చేయలేదని తెలుస్తోంది. దీని వల్ల రుసుమును మినహాయించుకోవటంలో జాప్యం జరిగే పరిస్థితి ఉంటుందని సమాచారం. అయితే రాష్ట్రంలో ఆ సమస్య ఉత్పన్నం కాదని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ పేర్కొంటున్నారు. ఉత్తర భారతదేశంలో పొగమంచు దట్టంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో సమస్య ఉత్పన్నమయ్యేందుకు అవకాశం ఉండొచ్చన్నారు. -
టోల్గేట్ల దగ్గర బారులు తీరే పనిలేదు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని టోల్గేట్ల వద్ద డిసెంబర్ 1 నుంచి ‘ఫాస్టాగ్’ అమలు చేయనున్నామని జాతీయ రహదారుల సంస్థ రీజినల్ అధికారి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణలోని 17 టోల్‌ప్లాజాల్లోనూ ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘వాహనదారుని వాహనానికి ఫాస్టాగ్‌ను అమర్చుతాం. ఈ టాగ్‌ను బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం చేస్తాం. మొబైల్ వాలెట్ లేదా ప్రత్యేక కౌంటర్లలో ఫాస్టాగ్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. దీనిద్వారా టోల్‌ప్లాజా దగ్గర బారులు తీరకుండా సులువుగా వెళ్లిపోవచ్చు. ట్రక్కులకు కూడా అనుసంధానం చేయడం వల్ల అది ఏ టోల్‌ప్లాజా దాటింది అనే విషయం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. టోల్ ప్లాజాల దగ్గర నియమించిన ప్రత్యేక సిబ్బంది ద్వారా వాహనదారులకు ఈ విధానం గురించి అవగాహన కల్పిస్తున్నాం. వాహనదారుడు ఫాస్టాగ్ యాప్ ద్వారా దీన్ని అప్లై చేసుకోవచ్చు’ అని ఆయన తెలిపారు. (చదవండి: ఐదు సెకన్లలో టోల్ దాటొచ్చు) -
5 సెకన్లలో ‘టోల్’ దాటొచ్చు!
విజయవాడ రహదారి.. హైదరాబాద్ నుంచి వాహనాలు దూసుకుపోతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా వాటికి బ్రేక్ పడింది. ఒక వాహనం తర్వాత ఒకటి టోల్ రుసుము చెల్లించి టోకెన్ తీసుకుని ముందుకు కదిలేసరికి భారీ జాప్యం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమయం అరగంట పడుతోంది. సాధారణ రద్దీ ఉన్నప్పుడు కొన్ని నిమిషాలు అవుతోంది. అయితే డిసెంబర్ 1 నుంచి ఈ తీరు మారిపోనుంది. వాహనం రాగానే టోల్ గేట్ తెరుచుకోవటానికి కేవలం ఐదు సెకన్ల సమయమే పట్టనుంది. అదే ఫాస్టాగ్ మాయ. సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానంతో టోల్ ప్లాజాల వద్ద నిరీక్షణకు తెరపడబోతోంది. ఫాస్టాగ్ ఉన్న వాహనం రాగానే, టోల్‌ప్లాజా పైనుంచి సెన్సర్ బేస్డ్ రీడర్లు క్షణాల్లో దాన్ని పరిశీలిస్తాయి. అది ఏ తరహా వాహనం, దానికి ఎంత మొత్తం టోల్ విధించాలి అని నిర్ణయించటం మొదలు, అంత మొత్తాన్ని ఫాస్టాగ్లోని చిప్ నుంచి మినహాయించి గేటు తెరిచేయటం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. వాహనం ముందుకు కదులుతుంది. ఇందుకు ఒక్కో గేటుపై దాదాపు రూ.30 లక్షల విలువైన రీడర్లను ఏర్పాటు చేశారు. సెన్సార్ల సాయంతో అది వాహనం అద్దానికి అతికించి ఉన్న ట్యాగ్ నుంచి టోల్ రుసుమును డిడక్ట్ చేసుకుంటుంది. గేటు తెరిచి మూయాల్సిందే వాహనాలు ఒకదానికి ఒకటి తగిలి ఉన్నట్టు ఒకేసారి పెద్ద సంఖ్యలో వస్తే, ఇక్కడా కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, అది ఇబ్బందికరంగా ఉండేంత జాప్యం కాదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ముందున్న వాహనం ఖాతా నుంచి రుసుము డిడక్ట్ కాగానే ఆటోమేటిక్‌గా గేటు తెరుచుకుని వాహనం ముందుకు కదులుతుంది. కానీ ఆ వెంటనే మళ్లీ గేటు మూసుకుంటుంది. మళ్లీ సెన్సర్లు తదుపరి వాహనం నుంచి రుసుము మినహాయించాక తిరిగి గేటు తెరుచుకుంటుంది. ఒకదాని వెనక ఒకటిగా వాహనాలు వచ్చినప్పుడు... ఒకసారి గేటు తెరుచుకున్నాక అన్నీ వెళ్లిపోయే ఏర్పాటు ప్రస్తుతానికి లేదు. కచ్చితంగా గేటు మూసుకున్నాకనే వెనుక ఉన్న వాహనంపై సెన్సర్ల దృష్టి పడుతుంది. గేటు నుంచి వాహనం పొడవు ఎంత ఉంటుంతో అంత పరిమాణంలో ఉండే ప్రాంతాన్ని లూప్గా పిలుస్తారు. ఆ లూప్‌లోకి వాహనం వచ్చిన తర్వాతనే సెన్సర్లు దాని బార్‌కోడ్‌ను డిటెక్ట్ చేస్తాయి. ఆ వెంటనే ఆటోమేటిక్ వెహికిల్ క్లాసిఫయర్లు దాని కేటగిరీ, బరువును అంచనా వేసి రుసుమును నిర్ధారించి వాహనం ట్యాగ్‌లోని చిప్ నుంచి డిటెక్ట్ చేస్తాయి. ఆ లూప్‌నకు కాస్త దూరంగా ఉంటే సెన్సార్లు పట్టించుకోవు. ఫలితంగా ఆ లూప్ పరిధి నుంచి ముందున్న వాహనం కదిలి ముందుకు వెళ్తేగాని రెండో వాహనంపై సెన్సార్ల దృష్టి పడదు. దీనివల్ల కొంత జాప్యం తప్పదని అధికారులు అంటున్నారు. ఎంత ఉన్నా అది కూడా ఒక నిమిషం లోపేనని వారు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో మరింత ఆధునిక వ్యవస్థ ఏర్పాటైతే ఈ సమస్య కూడా ఉండకపోవచ్చని, ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదే పద్ధతి అమలులో ఉందని పేర్కొంటున్నారు. పెట్రోలు బంకుల్లో ఫాస్టాగ్ అమ్మకాలు? ప్రస్తుతం కొన్ని ఆన్లైన్ చెల్లింపు సంస్థల ఆధ్వర్యంలో ఫాస్టాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. గడువు దగ్గర పడుతుండటంతో టోల్‌ప్లాజాల వద్ద కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయించి ఆయా బ్యాంకుల ఆధ్వర్యంలో అమ్మకాలు జరుపుతున్నారు. వాహనదారులకు మరింత అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో త్వరలో పెట్రోలు బంకుల్లో కూడా వాటి విక్రయాలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, కేవీబీ, యాక్సిస్, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, పేటీఎం, ఇండస్‌ల్యాండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా... ఇలా మరికొన్ని బ్యాంకుల వివరాలను ప్రకటన రూపంలో ఇప్పటికే ఎన్హెచ్ఏఐ జారీ చేసింది. వీటికి అదనంగా మరిన్ని చోట్ల వాటి విక్రయానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఒప్పందం చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. త్వరలో అన్ని పెట్రోలు బంకుల్లో ఈ ట్యాగ్లు అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. -
టోకెన్ గేటులో పాత టోలే!
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. టోల్‌ప్లాజాల వద్ద అప్పటికప్పుడు రుసుము చెల్లించే పద్ధతి స్థానంలో ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు (ఈటీసీ) విధానం అమల్లోకి రానుంది. ఆ పద్ధతిలో వాహనాలకు ముందు అద్దానికి అతికించే ట్యాగ్ పేరే ఫాస్టాగ్. డిసెంబర్ 1 నుంచి మన రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో ఇది అమలు కానుంది. కొత్త విధానం ప్రారంభమైనా.. అన్ని టోల్ ప్లాజాల్లో ఇరువైపులా ఒక్కో సాధారణ గేట్ కూడా కొనసాగించనున్నారు. అయితే, ఆ గేట్ నుంచి వెళ్లే వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఖండించింది. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ లైన్లో కూడా సాధారణ టోల్నే వసూలు చేస్తామని ఎన్హెచ్ఏఐ ప్రత్యేకాధికారి కృష్ణప్రసాద్ చెప్పారు. అదే సమయంలో ఫాస్టాగ్ కోసం కేటాయించిన గేట్ల నుంచి వెళ్లే సాధారణ వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేస్తామన్నారు. కేంద్రం చెప్పే వరకు సాధారణ లైన్ కొనసాగిస్తామని, తర్వాత దానిని కూడా ఫాస్టాగ్ వేగా మారుస్తామని తెలిపారు. డిసెంబర్ 1 తర్వాత వీలైనంత తక్కువ సమయంలోనే వాటిని తొలగించి పూర్తిగా ఫాస్టాగ్ లేన్లుగా మార్చే అవకాశం ఉంది. ప్లాజాల వద్ద కూడా కౌంటర్లు.... ఫాస్టాగ్ విధానం మొదలుకావడానికి ఇంకా ఎన్నో రోజుల సమయం లేకపోయినా.. వాహనదారులు మాత్రం వాటిని తీసుకునే విషయంలో అంత ఉత్సాహం ప్రదర్శించడంలేదు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల కార్లు, 3 లక్షల లారీలు, 5 వేల బస్సులు ఉండగా.. ఇప్పటివరకు 3,500 వాహనాలు మాత్రమే ఫాస్టాగ్‌లు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ విక్రయాలపై అధికారులు దృష్టి సారించారు. అన్ని జాతీయ బ్యాంకులు, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీతోపాటు పేటీఎం, అమెజాన్ వంటి మరికొన్ని చెల్లింపు సంస్థలకు వీటిని విక్రయించే అనుమతి ఇచ్చారు. ఇవి ఆన్లైన్ ద్వారా కూడా వాటిని విక్రయిస్తుండగా, ఇప్పుడు అన్ని టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు తెరిచాయి. ఒక్కో టోల్‌ప్లాజా వద్ద ఒక్కో ధర ఫాస్టాగ్‌ల ధరలు రాష్ట్ర మంతటా ఒకే రకంగా ఉండవు. వాహనాల కేటగిరీ ఆధారంగా వాటి ధరల్లో వ్యత్యాసం ఉన్నట్టే ఒక్కో టోల్‌ప్లాజాల పరిధిలో వాటి ధర తేడా ఉంటుంది. వాహనం ఆ దారిలో ప్రయాణించే దూరం ఆధారంగా వాటి రుసుముల్లో తేడాలుంటాయి. రెండు టోల్‌ప్లాజాల మధ్య దూరం తక్కువగా ఉంటే, తక్కువ రుసుము, ఎక్కువ దూరం ఉంటే ఎక్కువ రుసుము ఉంటుంది. రూ.100 కనిష్ట ధరగా ఈ ట్యాగ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఫాస్టాగ్‌కు కాలదోషమంటూ ఉండదు. అందులో బ్యాలెన్సు అలాగే ఉంటుంది. టోల్‌ప్లాజా దాటినప్పుడు ఆ మొత్తంలోంచి నిర్ధారిత రుసుము డిడక్ట్ అవుతుంది. టోల్‌ప్లాజాల మీదుగా ప్రయాణం చేసే అవసరం ఉండదన్న ఉద్దేశంతో కొందరు వాటిని కొనేందుకు ఆసక్తి చూపడంలేదు. కాలపరిమితి లేనందున కొని పెట్టుకుని ఉంచుకోవచ్చని, టోల్‌ప్లాజాను దాటినప్పుడు రుసుము డిడక్ట్ అయ్యే వరకు ఆ మొత్తం అలాగే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
టోల్గేట్లలో ఇక ఫాస్ట్‌గా!
గుంటూరు – విజయవాడ మధ్య జాతీయ రహదారిపై రద్దీగా ఉండే కాజ టోల్‌గేట్‌ను దాటాలంటే వాహనాలు బారులు తీరిన సమయంలో 10 – 15 నిమిషాలు పడుతోంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో గంటల తరబడి నిరీక్షణ తప్పదు. వాహనాలు చీమల్లా కదులుతుండటంతో ఇంధనం వృథా అవుతోంది. జాతీయ రహదారులపై 10 టోల్గేట్లు దాటాలంటే సగటున అర లీటరు నుంచి లీటరు దాకా ఇంధనం వృథా అవుతోందని అంచనా. అదే ‘ఫాస్టాగ్’ వరుసలో వెళ్తే రెండు నిమిషాల్లో టోల్గేట్ దాటవచ్చు. ప్రస్తుతం టోల్గేట్లలో ఒక వరుస మాత్రమే ఫాస్టాగ్ కోసం అందుబాటులో ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి టోల్గేట్లలో అన్ని వరుసలను ఫాస్టాగ్‌గా మారుస్తారు. వాహనదారులు కేవలం ఒక్క వరుసలో మాత్రమే డబ్బులు చెల్లించి రశీదు తీసుకునే వీలుంటుంది. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా డిసెంబరు 1వ తేదీ నుంచి ‘వన్ నేషన్.. వన్ ట్యాగ్’ నినాదంతో అన్ని టోల్గేట్లలో ఫాస్టాగ్ విధానాన్ని విధిగా అమలు చేయనున్నారు. కేవలం ఒక్క వరుసలో మాత్రమే నగదు చెల్లించే అవకాశం ఉంటుంది. ఏపీలోని 43 ఎన్హెచ్ఏఐ టోల్గేట్లలో ఫాస్టాగ్ అమలవుతుంది. టోల్‌గేట్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే స్థానికులు, స్థానిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ప్రీ పెయిడ్ పాసులు ఇచ్చి.. ఫాస్టాగ్ విధానంలో రాయితీలు వర్తించేలా ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులిచ్చింది. పలు రకాలుగా రీ చార్జి సదుపాయం: టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ వరుసలో వాహనాలు 25–40 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్లాలి. క్యాష్ లెస్ విధానంలో ఫాస్టాగ్ అమలవుతుంది. ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ల కోసం కేంద్రం 23 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. కనీసం రూ.వందతో ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ పొందవచ్చు. అమెజాన్, ఫాస్టాగ్ యాప్, పేటీఎం ద్వారా రీ ఛార్జి చేసుకునే సదుపాయం ఉంది. ఇవీ ఉపయోగాలు.. - ఇంధనం, సమయం ఆదా. - కాలుష్యం తగ్గుతుంది. - ట్రాఫిక్ సమస్యలుండవు. - చోరీకి గురైన ఫాస్టాగ్ ఉన్న వాహనం టోల్‌ప్లాజా దాటగానే యజమాని ఫోన్‌కు మెస్సేజ్ వస్తుంది. స్టేట్ హైవే టోల్‌ప్లాజాల్లోనూ... జాతీయ రహదారులతోపాటు రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ ఆదేశాలిచ్చింది. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిలో తుమ్మలచెరువు వద్ద, సంతమాగులూరు సమీపం లోని ఏల్చూరు, రాజమండ్రి బ్రిడ్జి, పులిగడ్డ వారధి వద్ద ఇలాంటి టోల్గేట్లు ఉన్నాయి. వీటిలో రెండువైపులా ఫాస్టాగ్ డెడికేటెడ్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. టోల్గేట్లలో ఆర్ఎఫ్ఐడీ యంత్రాల వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ భరించనుంది. ఫాస్టాగ్ అంటే..? బ్యాంకు ఖాతాతో అనుసంధానం కలిగి ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో కూడిన స్టిక్కర్‌ను ఫాస్టాగ్ అంటారు. ఫాస్టాగ్ స్టిక్కర్ మీదున్న బార్‌కోడ్‌ను టోల్‌ప్లాజాలోని ఆర్ఎఫ్ఐడీ యంత్రం గుర్తించి రీడ్ చేస్తుంది. వాహనం టోల్‌ప్లాజాను దాటుతుండగా టోల్ రుసుమును రీఛార్జి మొత్తం నుంచి మినహాయించుకుంటుంది. ఈ వివరాలు వెంటనే వాహనదారుడి ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. ఏపీలో ఫాస్టాగ్ ద్వారా ప్రస్తుతం 20 నుంచి 25 శాతం వాహనాలు ప్రయాణిస్తున్నట్లు అంచనా. సిబ్బంది కుదింపు?: టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ అమలుతో భవిష్యత్తులో సిబ్బంది కుదింపు చర్యలు చేపట్టనున్నట్లు కొంతమంది టోల్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అన్ని టోల్‌ప్లాజాల్లో సగటున 105 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేలా ఎన్హెచ్ఏఐ చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు. సరుకు రవాణా సమయం ఆదా టోల్‌ప్లాజాల్లో ట్రాఫిక్ సమస్యతో సమయం, ఇంధనం వృథా అవుతోంది. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలతో ఇప్పటికే రవాణా రంగం కుదేలైంది. ఫాస్టాగ్ అమలుతో కొన్ని సమస్యలు తీరినట్లే. – ఈశ్వరరావు, లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫాస్టాగ్‌కు కేంద్రం సాయం స్టేట్ హైవేస్‌లోని టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ అమలుకు రూ.20 లక్షల చొప్పున ఖర్చవుతుంది. ఈ భారం భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. – మనోహర్‌రెడ్డి, రోడ్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ ఎండీ