International
-
మరో ఘటన.. అమెరికాలో రెండు విమానాలు ఢీ
ఆరిజోనా: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మరోసారి రెండు విమానాలు ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ జెట్‌ను మరో విమానం ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. లియర్‌జెట్ 35ఎ విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వే నుండి జారి రాంప్‌పై ఉన్న బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. ఆరిజోనాలోని స్కాట్‌డేల్ ఎయిర్‌పోర్టులో ఘటన జరిగింది. దీంతో ఎయిర్‌పోర్టులో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటన మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. కాగా, గత పది రోజుల్లో అమెరికాలో ఇది నాలుగో విమాన ప్రమాదం. పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పైలట్‌తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు.కాగా, మరో విమానానికి కూడా తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గత వారం.. ఫిలడెల్ఫియా రాష్ట్రంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ సమీపంలో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇళ్లపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. విమానం కూలిపోయిన వెంటనే భారీ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. -
Nepal: 23 మంది భారతీయులు అరెస్ట్.. కారణం ఇదే..
కాఠ్మాండు: నేపాల్ పోలీసులు 23 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వీరిని నేపాల్‌లోని బాగమతి ప్రాంతంలో అరెస్టు చేశారు. వీరు ఆన్లైన్లో అక్రమంగా బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలతో చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. నేపాల్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అపిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వీరు కాఠ్మాండుకు 10 కిలోమీటర్ల దూరంలోని బుద్ధనిలకంఠ ప్రాంతంలోని రెండస్తుల భవనంలో ఉండగా అరెస్టు చేశామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక రహస్య సమాచారం మేరకు ఒక భవనంపై దాడి చేసి, 23 మంది భారతీయ పౌరులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 81 వేల రూపాయలు, 88 మొబైల్ పోన్లు, 10 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని యాంటీ గేమింగ్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. వారం రోజుల క్రితం నేపాల్ పోలీసులు కోట్ల రూపాయల విలువైన ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను చేధించారు.అలాగే పది మంది భారతీయులతో సహా మొత్తం 24 మందిని అరెస్టు చేశారు. లలిత్‌పూర్‌లోని సనేపా ప్రాంతంలో రెండు ఇళ్లపై ప్రత్యేక పోలీసు బృందం దాడి చేసి, ఆన్లైన్ గేమింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 10 మంది భారతీయ పౌరులు, 14 మంది నేపాలీ జాతీయులను అరెస్టు చేసింది. అరెస్టయిన భారతీయుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని నేపాల్ పోలీసులు తెలిపారు. నిందితులు రెండు అద్దె ఇళ్లలో అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: పోటెత్తిన భక్తులు.. ప్రయాగ్‌రాజ్ సంగమం స్టేషన్ మూసివేత -
టెక్నాలజీ ఊబిలో భారతీయులు
భారతీయులు ఉదయం లేచించి మొదలు రాత్రి పడుకునేదాకా ఎల్రక్టానిక్ డివైజ్లతో గడుపుతున్నారు. డెస్క్ టాప్‌తో మమేకమవుతారు. డెస్క్ టాప్ నుంచి తల పక్కకు తిప్పితే నేరుగా ల్యాప్‌టాప్‌లో తలదూర్చేస్తారు. ఒకవేళ ల్యాప్‌టాప్ పక్కనబెడితే స్మార్ట్‌ఫోన్ లేదంటే ట్యాబ్ లేదంటే ఇంకో డివైజ్‌కు దాసోహం అవుతున్నారు. దీంతో ఎన్నో సమస్యలు. తక్కువ నిజాలు, ఎక్కువ అబద్ధాలతో కూడిన సమాచారాన్ని మాత్రమే నమ్మడం, సోషల్‌మీడియా లో ప్రతికూల వార్తలనే ఎక్కువగా ఫాలో అవడం, ఫోన్ రింగ్ కాకపోయినా వచ్చినట్లు, మెసేజ్ రాకపోయినా వచ్చినట్లు భావించడం, అతి డివైజ్‌ల వాడకంతో సాధారణ విషయగ్రహణ సామర్థ్యం సన్నగిల్లడం, ఒంటరిగా ఉంటేనే బాగుందని అనిపించడం, వెంటనే స్పందించే గుణం కోల్పోవడం, అతి ఉద్రేకం లేదంటే నిస్సత్తువ ఆవహించడం, ఏకాగ్రత లోపం.. ఇలా ఎన్నో సమస్యలకు ఎల్రక్టానిక్ డివైజ్‌లు హేతువులుగా మారాయి. వాటి అదుపాజ్ఞల్లోకి వెళ్లకుండా వాటినే తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్న భారతీయులు కేవలం మూడు శాతమేనని తాజా సర్వే కుండబద్దలు కొట్టింది. దాదాపు 83,000 కౌన్సిలింగ్ సెషన్లు, 12,000 స్క్రీనింగ్‌లు, 42,0000 అంచనాలను పరిశీలించి చేసిన సర్వేలో ఇలాంటి ఎన్నో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. డిజిటల్ డివైజ్లతో సహవాసం చేస్తూ భారతీయులు ఏపాటి మానసిక ఆరోగ్యంతో ఉన్నారనే అంశాలతో వన్టూవన్హెల్ప్ అనే సంస్థ ‘ది స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్,2024’అనే సర్వే చేసి సంబంధిత నివేదికను వెల్లడించింది. సగం మంది డివైజ్‌లను వదల్లేక పోతున్నారు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ ఎల్రక్టానిక్ డివైజ్‌లను వదిలి ఉండలేకపోతున్నారు. మరో పది శాతం మందికి డిజిటల్ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి కౌన్సిలింగ్ తీసుకుంటున్న వారి సంఖ్య 15 శాతం పెరిగింది. ఆదుర్తా, కుంగుబాటు, పనిచేసే చోట ఒత్తిడి వంటి ప్రధాన కారణాలతో ప్రజలు మానసిక ఆరోగ్యం బాగు కోసం నిపుణులను సంప్రతించడం పెరిగింది. వృత్తిసంబంధ అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 23 శాతం మంది తాము పనిచేసేచోట ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నట్లు తేలింది. ఇది ఆరోగ్యవంతమైన పని వాతావరణం ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. కౌన్సిలింగ్ కోసం పురుషుల్లో పెరిగిన ఆసక్తి గతంలో ఏదైనా థెరపీ చేయించుకోవాలన్నా, మానసికంగా ఒక సాంత్వన కావాలంటే ఒకరి తోడు అవసరమని మహిళలు భావిస్తుంటారు. మగాడై ఉండి థెరపీ చేయించుకోవడమేంటనే ఆలోచనాధోరణి ఇన్నాళ్లూ పురుషుల్లో ఉండేది. ఇప్పుడు ఆ ధోరణిలో కాస్తంత మార్పు వచ్చింది. గతంతో పోలిస్తే 7 శాతం మంది ఎక్కువగా పురుషులు థెరపీలు సిద్ధపడుతున్నారు. ఆర్థికసంబంధ కన్సల్టేషన్లు పొందిన వారిలో 70 శాతం మంది పురుషులే ఉన్నాయి. ఇక మానవీయ సంబంధాలకు సంబంధించిన కౌన్సిలింగ్ సెషన్లలో 60 శాతం దాకా మహిళలే కనిపించారు. యువతలో పెరిగిన మానసిక సమస్యలు ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువతలో నైరాశ్యం పెరుగుతోంది. 30 ఏళ్లలోపు వయసు యువతలో అత్యధికంగా ఆదుర్దా, కుంగుబాటు సమస్యలు ఎక్కువయ్యాయి. ఉద్యోగం మారాల్సి రావడం, జీవితభాగస్వామితో సత్సంబంధం కొనసాగించడం వంటి అంశాలకొచ్చేసరికి యువత ఆత్రుత, కుంగుబాటుకు గురవుతోంది. పాతికేళ్లలోపు యువతలో 92 శాతం మందిలో ఆత్రుత, 91% మందిలో కుంగుబాటు కనిపిస్తున్నాయి. ఆత్మహత్య భయాలూ ఎక్కువే ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే 22 శాతం పెరిగింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పిన వాళ్ల సంఖ్య 2023తో పోలిస్తే 17 శాతం పెరగడం ఆందోళనకరం. తమకు కౌన్సిలింగ్ అవసరమని భావిస్తున్న వారిలో సగం మంది ఇప్పటికే తీవ్రమైన భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎక్కువ మందికి తక్షణం మానసిక సంబంధ తోడ్పాటు అవసరమని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే భారతీయుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అసమానతల అంతు చూస్తారా?
విశ్వంలో ఇప్పటికీ ఎన్నో రహస్యాలు. శతాబ్దాల కాలంలో భిన్న దేశాల విభిన్న రంగాల దిగ్గజ శాస్త్రవేత్తలు ఇప్పటికి ఎన్నో సిద్ధాంతాలను రూపొందించారు. న్యూటన్ సిద్ధాంతాలు, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు ఇలా భౌతిక, రసాయన శా్రస్తాలు, గతిశక్తి, స్థితిశక్తి ఇలా ఎన్నో రకాల అంశాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు నేటి ఆధునిక ప్రపంచ అవసరాలను తీరుస్తున్నాయి. అయితే ఇప్పటికీ భౌతిక, రసాయన, ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలకు కొరుకుడుపడని టర్బులెన్స్ దృగ్విషయం అన్ని రంగాలకు పెద్ద సమస్యగా మారింది. ద్రవ ప్రవాహాల్లో హఠాత్తుగా సంభవించే అసాధారణ హెచ్చుతగ్గులు, సముద్రజలాల కదలికల్లో అనూహ్య మార్పులు, రసాయనాల్లో ఊహించని ప్రతిచర్యలు, రక్తప్రవాహాల్లో హెచ్చుతగ్గులు వంటివి ఎందుకు సంభవిస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. టర్బులెన్స్ సమస్య చాలా రంగాలకు పెద్ద గుదిబండగా తయారైంది. గాల్లో ఎగిరే విమానాలు ఒక్కసారిగా టర్బులెన్స్‌కు గురై హఠాత్తుగా కిందకు పడిపోవడమో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడమో జరుగుతున్నాయి. వెదర్ శాటిలైట్లతో ఖచ్చితత్వంతో వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వాలను వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నా ఇప్పటికీ కొన్ని చోట్ల ఊహంచని తుపాన్లు అప్పటికప్పుడు ఏర్పడి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి. సువిశాల విశ్వంలో నక్షత్రాల్లోని అయనీకరణ చెందిన అత్యంత వేడి వాయువుల్లో హఠాత్తుగా ఎందుకు మార్పులు జరుగుతున్నాయో ఖగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. మానవ కణంలో అణువుల మధ్య బంధంలోనూ హఠాత్తుగా మార్పులను చూస్తున్నాం. చివరకు కృత్రిమ గుండె పనితీరును రక్తప్రవాహంలోని టర్బులెన్స్ ప్రభావితం చేస్తూ అత్యంత సమర్థవంతమైన ఆర్టిఫీషియల్ హార్ట్ ఆవిష్కరణ అవసరమని గుర్తుచేస్తోంది. ఇలాంటి దృగ్విషయాలకు ఏకైక కారణమైన టర్బులెన్స్పై మరింత అవగాహనే లక్ష్యంగా శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఈ టర్బులెన్స్పై స్పష్టమైన అవగాహన ఉంటే సైన్స్, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో మరింత మెరుగైన డిజైన్‌తో విమానాలు, కార్లు, ప్రొపెలర్లు, కృత్రిమ గుండెలు తయారుచేయడానికి, అత్యంత ఖచ్చితత్వంతో వర్షాలు, వాతావరణం, పర్యావరణ సంబంధ హెచ్చరికలు చేయడానికి వీలు చిక్కుతుంది. వేగంగా చర్యలు జరిపి.. ప్రపంచంలో ఎక్కడ ఏ ద్రవాల్లో ఈ టర్బులెన్స్ తలెత్తుతుందో తెల్సుకోవాలంటే ఆ ద్రవాల పనితీరు, కదలికలపై నిరంతర నిఘా అవసరం. వాటి చర్యను వేగవంతం చేస్తేనే టర్బులెన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందో గుర్తించగలం. అందుకోసం ద్రవాల్లో రెండు సార్లు టర్బులెన్స్ సంభవిస్తే ఈ రెండు టర్బులెన్స్ మధ్య కాలంలో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం సంప్రదాయక పద్ధతిలో మాత్రమే డేటాను రికార్డ్చేసేవాళ్లు. ఇకపై తొలిసారిగా అత్యంత అధునాతన క్వాంటమ్ కంప్యూటర్స్ విధానంలో అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లలో ఈ డేటాను నమోదుచేసి విశ్లేషించనున్నారు. దీంతో సెకన్ కంటే కొన్ని కోట్ల రెట్లు తక్కువ కాలంలోనూ జరిగే మార్పులను నమోదు చేసి విశ్లేషించడం సాధ్యమవుతుంది. సంబంధిత పరిశోధన వివరాలు జనవరి 29వ తేదీన ప్రఖ్యాత సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్, ఫిజికల్ రివ్యూ రీసెర్చ్ జర్నల్లలో ప్రచురితమయ్యాయి. ‘‘సంప్రదాయక విధానాల్లో ప్రయోగాలు చేస్తే ఎప్పుడూ ఒక్కటే ఫలితం వస్తోంది. ఈసారి సంభావ్యత సిద్ధాంతాన్ని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్‌ను వాడి మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ప్రయతి్నస్తున్నాం. రెండు విభిన్న రసాయన మిశ్రమాలను సిములేట్ చేసి వాటిల్లో సంభవించే టర్బులెన్స్‌లను నమోదుచేయదలిచాం. సాధారణ కంప్యూటర్స్‌లో 0, 1 అనే బిట్స్ మాత్రమే వాడతారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో క్వాంటమ్ బిట్(క్వాబిట్స్) వాడతాం. దీంతో ఒకేసారి ఒకేసమయంలో వేర్వేరు చోట్ల జరిగే మార్పులను క్వాబిట్స్ నమోదుచేస్తాయి’’అని ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రవేత్త నిక్ గోరియనోవ్ చెప్పారు. కొత్త విధానంతో కంప్యూటేషన్ అత్యంత వేగవంతంగా జరుగుతుంది. ఇది మా పరిశోధనకు ఎంతో దోహదపడుతుంది’’అని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు జేమ్స్ బీటెల్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆశల ఊసుల నడుమ... ఏఐ శిఖరాగ్రం
పారిస్: 100కు పైగా దేశాల అధినేతలు, అగ్రనేతలు. అంతర్జాతీయ టెక్ దిగ్గజాల సారథులు. అత్యున్నత స్థాయి ప్రభుత్వాధికారులు. కృత్రిమ మేధ రంగానికి సంబంధించిన మేధావులు. నిపుణులు. సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మొదలైన రెండు రోజుల ఏఐ శిఖరాగ్ర సదస్సు వీరందరినీ ఒక్కచోట చేర్చింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఏఐ రంగానికి సంబంధించి జరుగుతున్న తొలి అధికారిక సదస్సు కావడం విశేషం. నానాటికీ అనూహ్యంగా మారిపోతున్న ఏఐ రంగంలో అపార అవకాశాలను ఒడిసిపట్టుకోవడం, అందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సదస్సులో లోతుగా మథనం జరుగుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ టెలివిజన్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మానవాళి చరిత్రలోనే అత్యంత అరుదైందిగా చెప్పదగ్గ శాస్త్ర, సాంకేతిక విప్లవం ఏఐ రూపంలో మన కళ్లముందు కనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఈ అవకాశాన్ని ఫ్రాన్స్, యూరప్ రెండు చేతులా అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే మనం మరింత మెరుగ్గా జీవించేందుకు, ఎంతగానో నేర్చుకునేందుకు, మరింత సమర్థంగా పని చేసేందుకు, మొత్తంగా గొప్పగా జీవించేందుకు అపారమైన అవకాశాలను ఏఐ అందుబాటులోకి తెస్తోంది’’అని మాక్రాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన 40 ఏళ్ల వాన్స్ అగ్ర రాజ్యానికి తొలిసారిగా ఓ అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. ఉపాధ్యక్షునిగా ఆయనకిదే తొలి విదేశీ పర్యటన కూడా. సదస్సులో భాగంగా పలువురు దేశాధినేతలతో ఆయన తొలిసారి భేటీ అవనున్నారు. అందులో భాగంగా మంగళవారం మాక్రాన్‌తో విందు భేటీలో పాల్గొంటారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా కల్లోలంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృక్కోణాన్ని మాక్రాన్‌కు వివరించడంతో పాటు ఆయన సందేశాన్ని కూడా వాన్స్ అందజేస్తారని చెబుతున్నారు. తెలుగు మూలాలున్న వాన్స్ సతీమణి ఉష కూడా తన ముగ్గురు పిల్లలతో సహా ఈ అధికారిక పర్యటనలో పాల్గొంటుండటం విశేషం. చైనా తరఫున ఉప ప్రధాని జాంగ్ జువోకింగ్ ఏఐ సదస్సులో పాల్గొంటున్నారు.మోదీ సహ ఆతిథ్యంఅంతర్జాతీయ ఏఐ రంగం అంతిమంగా అమెరికా, చైనా మధ్య బలప్రదర్శనకు వేదికగా మారకుండా చూడాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ఐటీతో పాటు అన్నిరకాల టెక్నాలజీల్లోనూ గ్లోబల్ పవర్‌గా వెలుగొందుతున్న భారత్ ఏఐలోనూ కచి్చతంగా అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసి తీరాలని ప్రధాని మోదీ ఇటీవల పదేపదే చెబుతున్నారు. అందులో భాగంగా టెక్ దిగ్గజాలతో మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు పారిస్ ఏఐ శిఖరాగ్రం సదవకాశమని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు మాక్రాన్‌తో పాటు మోదీ సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండటం విశేషం. మంగళవారం సదస్సునుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఏఐ వృద్ధిని కొత్త పుంతలు తొక్కించడంపై భారత ఆలోచనలను దేశాధినేతలు, టెక్, ఏఐ దిగ్గజ కంపెనీల సారథులు తదితరులతో ఆయన వివరంగా పంచుకోనున్నారు. అనంతరం ఆయా కంపెనీల సీఈఓలతో విడిగా ముఖాముఖి భేటీ కానున్నారు.తెరపైకి ‘కరెంట్ ఏఐ’ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి టెక్, ఏఐ దిగ్గజాల సీఈఓలు, అత్యున్నతాధికారులు సదస్సులో పాల్గొంటున్నారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం, సంస్కృతి తదితర రంగాల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించడంలో ఏఐ టెక్నాలజీ పాత్రను మరింత ప్రభావవంతంగా మార్చడం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా ‘కరెంట్ ఏఐ’పేరిట ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పారిస్ శిఖరాగ్రం ఏఐకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చ కోసం జరుగుతున్న తొట్ట తొలి ప్రయత్నమని మొజిల్లా పబ్లిక్ పాలసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ లిండా గ్రిపిన్ అన్నారు. ఏఐ అభివృద్ధి ప్రస్థానంలో దీన్ని నిర్ణాయక క్షణంగా అభివరి్ణంచారు. ‘‘ఏఐపై గుత్తాధిపత్యం రూపంలో కీలక సాంకేతిక పరిజ్ఞానంపై అజమాయిషీ కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకూడదు. మానవాళి ప్రయోజనాలను తీర్చడమే ఏకైక ప్రాతిపదికగా ఏఐ ఫలాలు ప్రపంచమంతటికీ అందాలి’’అని యురేíÙయా గ్రూప్ సీనియర్ జియోటెక్నాలజీ అనలిస్టు నిక్ రెయినర్స్ అభిప్రాయపడ్డారు. పారిస్ శిఖరాగ్రాన్ని ఆ దిశగా భారీ ముందడుగుగా అభివర్ణించారు. శిఖరాగ్రం వేదికగా ఏఐ రంగంలో యూరప్‌లో భారీ పెట్టుబడి ప్రకటనలు వెలువడుతాయని అక్కడి దేశాలు ఆశిస్తున్నాయి. వచ్చే కొన్నేళ్లలో ఏఐ రంగంలో ఫ్రాన్స్ ఏకంగా 113 బిలియన్ డాలర్ల మేరకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రకటించనున్నట్టు మాక్రాన్ స్పష్టం చేశారు. -
ఫ్రాన్స్‌లో ప్రధాని
న్యూఢిల్లీ: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. రక్షణ మంత్రి సెబ్ లెకొర్నూ ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం దారి పొడవునా, హోటల్ వద్ద బారులు తీరిన భారతీయుల సమూహానికి మోదీ అభివాదం చేశారు. సాయంత్రం మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విందు ఇచ్చారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలు కూడా విందులో పాల్గొన్నారు. పారిస్‌లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు మాక్రాన్‌తో కలిసి మోదీ ఆతిథ్యమిస్తున్నారు. మంగళవారం సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అనంతరం బుధవారం చారిత్రక నగరం మార్సెయిల్లో భారత్ తొలి కాన్సులేట్‌ను మాక్రాన్‌తో కలిసి ప్రారంభిస్తారు. కడారచ్లో ఫ్రాన్స్, భారత్, పలు ఇతర దేశాలు నిర్మిస్తున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్‌ను సందర్శిస్తారు. తర్వాత ఫ్రాన్స్ గడ్డపై మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలర్పించిన భారత సైనికులకు మజారŠగ్స్ వార్ సిమెట్రీ వద్ద నేతలిద్దరూ నివాళులర్పిస్తారు. అనంతరం మోదీ అమెరికా బయల్దేరి వెళ్తారు. ప్రధానిగా ఫ్రాన్స్‌లో మోదీకి ఇది ఆరో అధికారిక పర్యటన. గతేడాది భారత్–ఫ్రాన్స్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పాతికేళ్ల వేడుక జరుపుకున్నాయి. ఇరు దేశాల భాగస్వామ్యం ఇన్నొవేషన్లు, టెక్నాలజీ, మారిటైం, రక్షణ సహకారం, ఉగ్రవాదంపై పోరు, ఆరోగ్యం, సంప్రదాయేతర ఇంధన వనరులతో పాటు పలు రంగాలకు విస్తరించిందని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొంది. మాక్రాన్ ఆహా్వనం మేరకు మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. యూఎస్‌తో బంధం బలోపేతం తన అమెరికా పర్యటన ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘టెక్నాలజీ, వర్తకం, రక్షణ, ఇంధన, సరఫరా తదితర రంగాల్లో అమెరికాలో బంధాన్ని సుదృఢం చేసే అజెండా రూపకల్పనకు నా పర్యటన దోహదం చేయనుంది. ట్రంప్ తొలి హయాంలో పలు అంశాలపై ఆయనతో సన్నిహితంగా కలిసి పని చేశా. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి భేటీ అవబోతున్నా. నా మిత్రున్ని కలిసేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా’’ అంటూ ఫ్రాన్స్ బయల్దేరే ముందు ఎక్స్‌లో పేర్కొన్నారు. -
మస్క్ టీమ్‌లోకి నిఖిల్ రాజ్‌పాల్..ఎవరంటే..
వాషింగ్టన్:డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకో సంచలన నిర్ణయం తీసకుంటున్నారు. ట్రంప్ తన సన్నిహితుడైన బిలియనీర్ ఇలాన్‌మస్క్‌కు అమెరికా ప్రభుత్వ పాలన వ్యవస్థ(డోజ్)ను ప్రకక్షాళన బాధ్యత అప్పగించారు. మస్క్ నేతృత్వంలోని డోజ్ నుంచి కూడా అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సమర్థత పెంపుపై రోజుకు ఒక కొత్త నిర్ణయం వెలువడుతోంది.ఈ క్రమంలోనే డోజ్‌లో మస్క్ టీమ్‌లో ఎంతమంది పనిచేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మస్క్ టీమ్‌లో 19నుంచి24 ఏళ్ల వయసున్న ఆరుగురు ఇంజినీర్లు ఉన్నారు. వీరికి తోడు కొత్తగా నిఖిల్ రాజ్‌పాల్ అనే 30 ఏళ్ల భారతీయ యువకుడు డోజ్‌లో మస్క్ టీమ్ సభ్యుడిగా చేరారు.ఇప్పటికే మస్క్ టీమ్‌లో ఉన్న ఆకాష్బొబ్బ కూడా భారతీయ యువకుడే కావడం గమనార్హం. అయితే కొత్తగా చేరిన నిఖిల్ రాజ్‌పాల్ కంప్యూటర్ ఇంజినీర్. మస్క్‌కు చెందిన కంపెనీలు టెస్లా,ఎక్స్(ట్విటర్)లో కూడా నిఖిల్ కీలక బాధ్యతల్లో పనిచేశారు.తాజాగా డోజ్‌లో చేరిన నిఖిల్ అమెరికా ప్రభుత్వ పాలన వ్యవస్థ ప్రక్షాళనలోనూ కీలక పాత్ర పోషించనున్నట్లు చెబుతున్నారు. -
అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని సంచలన ప్రకటన
లండన్:తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ పయనించనుంది. సోమవారం(ఫిబ్రవరి10) అక్రమ వలసదారుల విషయమై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక ట్వీట్ చేశారు.‘అక్రమ వలసలకు ఇక ముగింపు పలుకుతాం. బ్రిటన్‌కు అక్రమ వలసలు పెరిగాయి. చాలా మంది అక్రమంగా బ్రిటన్‌కు వచ్చి పనిచేస్తున్నారు’అని ట్వీట్లో స్టార్మర్ పేర్కొన్నారు. Too many people are able to come to the UK and work illegally. We are putting an end to it.— Keir Starmer (@Keir_Starmer) February 10, 2025 కాగా,ట్రంప్ ఇటీవల రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలోని అక్రమ వలసదారులపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.సరైన పత్రాలు లేకుండా అమెరికాలో చాలా కాలం నుంచి ఉంటున్న వారిని గుర్తించి వారిని సొంత దేశాలకు మిలిటరీ విమానాల్లో పంపేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏ దేశమైన ధిక్కార స్వరం వినిపిస్తే పన్ను బాదుడు ఉంటుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.దీంతో అన్ని దేశాలు తమ దేశవాసులను తీసుకువస్తున్న అమెరికా విమానాలకు అనుమతి ఇస్తుండడం గమనార్హం. -
బంగ్లాదేశ్‌లో ఆపరేషన్ డెవిల్స్ హంట్.. 1300 మంది అరెస్ట్
ఢాకా: బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దాదాపు 1300 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా, షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ భవనాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని కొందరు దాడులు చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు, ప్రత్యర్థుల ఏరివేతకు మహ్మద్ యూనస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది.బంగ్లాదేశ్‌లో యూనస్ సర్కారు ప్రత్యర్థులను వేధించేందుకు సరికొత్త చర్యలు మొదలుపెట్టింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావొస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించే వారిని సర్కార్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు మొదలుపెట్టింది. ఢాకా శివారులోని గాజీపుర్‌లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ను ప్రారంభించినట్టు ఇంటీరియర్ మినిస్ట్రీ అధిపతి జహంగీర్ ఆలమ్ చౌద్రీ చెప్పుకొచ్చారు.ప్రజా భద్రతలో భాగంగానే దీనిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ‘ఆపరేషన్ డెవిల్ హంట్’లో ఇప్పటికే 1300 అరెస్ట్ చేశారు. మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జహంగీర్ ఆలమ్ మాట్లాడుతూ..‘బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం తర్వాత చేపట్టిన దాడులు మరింత పెరిగాయి. వారి ఏరివేతే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దుష్టశక్తులను అంతం చేసే వరకు ఇది ఆగదు అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇటీవల హేక్ హసీనా కుటుంబ భవనాలపై కొందరు దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మన్ స్మారక భవనంపై దాడి చేశారు. ఈ దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిని.. మ్యూజియం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని మహమ్మద్ యూనస్ కూడా విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఓ మంత్రిపై దాడికి ఈ గ్యాంగ్‌లే కారణమని సమాచారం. -
అన్నంత పనిచేసిన ట్రంప్.. ఒకేసారి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) అన్నంత పని చేస్తున్నారు. ఒక్కో దేశంపై వరుస పెట్టి సుంకాల మోత మోగించేస్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి తెరతీసేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియంపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు.ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘మంగళవారం లోపు పరస్పర సుంకాల (reciprocal tariffs) విధింపుపై ప్రకటన చేస్తాం. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది’ అని స్పష్టం చేశారు. అయితే, ఈ పరస్పర సుంకాల విధింపుల లక్ష్యం ఏంటో స్పష్టత ఇవ్వలేదు. తాను విధించబోయే పరస్పర సుంకాలు విదేశీ సుంకాలకు అనుగుణంగా ఉంటాయని చెప్పారు. ఇది అన్నీ దేశాలకు వర్తిస్తుందని అన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా నుంచి వసూలు చేస్తే.. మేము వారి నుంచి వసూలు చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.తొలిసారి ఎంత విధించారంటే?తొలిసారి 2016-2020వరకు అమెరికా అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన ట్రంప్ స్టీల్‌పై 25శాతం, 10శాతం అల్యూమినియంపై టారిఫ్ విధించారు. అదే సమయంలో కెనడా, మెక్సికో, బ్రెజిల్‌తో సహా వ్యాపార భాగస్వాములకు పన్ను రహిత(డ్యూటీ ఫ్రీ) లావాదేవీలు జరిగేలా చూశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ డ్యూటీ ఫ్రీ వ్యాపార కార్యకలాపాల్ని బ్రిటన్, జపాన్, యూరోపియన్ యూనియన్లకు విస్తరించారు. కెనడా,మెక్సికోకు దెబ్బఅమెరికా అధికారిక గణాంకాల ప్రకారం.. ట్రంప్ విధించబోయే 25శాతం సుంకం ప్రభావం కెనడా, బ్రెజిల్, మెక్సికో వాణిజ్య రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు సౌత్ కొరియా, వియాత్నంలు సైతం భారీ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కెనడా నుంచి 79శాతం అల్యూమినియం అమెరికాకు ఎగుమతి అవుతుంది. 2024 మొదటి 11 నెలల్లో అమెరికాకు 79 శాతం ఎగుమతి చేసింది. కెనడా తర్వాత అల్యూమినియం స్క్రాప్, అల్యూమినియం మిశ్రమం ప్రధాన సరఫరాదారుగా మెక్సికో కొనసాగుతుంది. ఈ తరుణంలో ట్రంప్ నిర్ణయాలు ఆయా దేశాల వాణిజ్య విభాగంలో ఆటు పోట్లు ఎదురు కానున్నాయి. -
హమాస్, గాజాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్టు కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు.పాలస్తీనాకు చెందిన గాజాపై డొనాల్డ్ ట్రంప్ తన మనసులోకి మాటను బయట పెట్టారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా ఆధ్వర్యంలో గాజాను పునర్ నిర్మించే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఇందు కోసం గాజాను కొనుగోలు చేసి సొంతం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఇతరులకు కూడా అప్పగించవచ్చు. ప్రత్యామ్నాయం లేదు కనుకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాం. హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై గాజా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతకుముందు కూడా గాజాపై ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాజాలో పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతానికి తరలించి, అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. అనంతరం అక్కడ అమెరికా బలగాలను దించి, భారీగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శాశ్వతమైన మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతమున్నట్లుగా కాకుండా అప్పుడు గాజాలో సంతోషంగా ఉండొచ్చు. తుపాకీ కాల్పులు, ఎవరైనా పొడుస్తారని, చంపేస్తారని భయాలుండవు. అమెరికా దీర్ఘకాల యాజమాన్యంలో మధ్యధర సముద్ర తీరంలోని ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.ఈ మాటలపై, పాలస్తీనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సొంత భూభాగాన్ని ఒకసారి వదిలేసి వెళితే, తిరిగి రానివ్వరంటూ వారు భయాందోళనలకు గురయ్యారు. అరబ్ దేశాలు సైతం ట్రంప్ ప్రతిపాదనను తప్పుబట్టాయి. ఈజిప్టు, జోర్డాన్ వంటి మిత్ర దేశాలు సైతం పాలస్తీనియన్ల తరలింపును వ్యతిరేకించాయి. ఇటువంటి చర్యవల్ల పశ్చిమాసియా సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి. సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రకటనను తప్పుబట్టింది. ట్రంప్ ప్రకటన సమస్యాత్మకంగా ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. జాతి నిర్మూలన ఆలోచన వద్దు: గుటేరస్ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉంటుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పునరుద్ఘాటించారు. జాతి నిర్మూలన యోచనను నివారించడం అత్యవసరమన్నారు. పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి పంపించి, గాజా నుంచి ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘సమస్య పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో పరిస్థితిని మరింత దిగజార్చరాదు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం అత్యావశ్యకం. ఏ రూపంలో అయినా జాతి నిర్మూలన నివారించాలి’ అని పేర్కొన్నారు. ఆక్రమణలకు ముగింపు పలకాలన్నారు. గాజా అంతర్భాగంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా శాంతి సుస్థిరతలకు ఇదే అసలైన పరిష్కారమని నొక్కిచెప్పారు. -
స్వదేశానికి చేరుకున్న థాయ్ బందీలు
బ్యాంకాక్: 500 రోజులపాటు హమాస్ చెరలో ఉన్న థాయ్‌లాండ్ వ్యవసాయ కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు. 2023 అక్టోబర్‌లో జరిగిన దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న పొంగ్సాక్ థేన్నా, సతియాన్ సువన్నాఖమ్, వాచరా శ్రీవూన్, బన్నావత్ సేథావో, సురసాక్ లామ్నావోలను కూడా హమాస్ అపహరించింది. ఎట్టకేలకు వారు ఆదివారం ఉదయం బ్యాంకాక్‌కు చేరకున్నారు. సువర్ణభూమి ఎయిర్‌పోర్టులో దిగిన ఐదుగురు కుటుంబాలను కలుసుకోవడంతో విమానాశ్రయంలో భావోద్వేగ వాతావావరణ నెలకొంది. కాగా, వారు మళ్లీ తిరిగి ఇజ్రాయెల్‌కు వెళ్లకుండా ఉండేందుకు నెలకు 725 పౌండ్ల వేతనంతో పాటు సుమారు 14,510 పౌండ్లను ఒకేసారి ఇవ్వనున్నట్లు థాయ్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. ఒక థాయ్ బందీ ఆచూకీ లభించలేదు. గాజాలో ఇంకా ఉన్న ఆరో థాయ్ బందీ విడుదల కోసం ప్రయత్నిస్తామని, గెలుస్తామనే ఆశ ఉందని విదేశాంగ మంత్రి సంగియంపోంగ్సా అన్నారు. అక్టోబర్ 2023 నుంచి మొత్తం 46 మంది థాయ్ కార్మికులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది హమాస్ దాడిలో, కొందరు హెజ్బొల్లా ప్రయోగించిన క్షిపణుల వల్ల మరణించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జనవరి 30న విడుదలయ్యారు. అయితే 10 రోజులపాటు వారికి ఇజ్రాయెల్ ఆసుపత్రిలోనే ఉంచి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. అనంతరం స్వస్థలాలకు పంపించారు. బ్యాంకాక్ చేరుకున్న అనంతరం బందీలు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మేం ఇక్కడ నిలబడానికి సహాయం చేసిన అధికారులందరికీ కృతజ్ఞతలు. స్వదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం’’అని చెప్పారు. తమవారిని మళ్లీ ఇంటికి దూరంగా పంపించాలనుకోవడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
రక్తపుటేరు
అర్జెంటీనాలో ఓ కాలువ ఏకంగా ఎరుపు రంగులోకి మారింది. రాజధాని బ్యూనస్ ఎయిర్ష్ సమీపంలో ఉన్న అవెల్లెనెడా మున్సిపాలిటీలోని సరండ్ కాల్వ ఒక్కసారిగా రంగు మారడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందంటే అర్జెంటీనా, ఉరుగ్వే మధ్య రియో డి లా ప్లాటాలోకి ప్రవహించే జలమార్గంలో స్థానిక తోలు, వస్త్ర పరిశ్రమలు విపరీతంగా రంగులు, రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. దాంతో కాల్వ ఎప్పుడూ పసుపు రంగులో కనిపిస్తూ యాసిడ్ వాసనలు వస్తుంటుంది. అలాంటిది గురువారం అవెల్లెనెడా వాసులు నిద్రలేచే సరికి అది ఉన్నట్టుండి రక్త వర్ణంలోకి మారి భయంకరంగా కనిపించడమే గాక తీవ్ర దుర్గంధం వెదజల్లింది. ఆ విపరీతమైన దుర్వాసనకే ఉలిక్కిపడి లేచామని చాలామంది వాపోయారు. కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారంటున్నారు. అర్జెంటీనా పర్యావరణ శాఖ దీనిపై స్పందించింది. రంగు మార్పుకు కారణాలను గుర్తించడానికి కాల్వ నుంచి నీటి నమూనాలను సేకరించింది. సమీప ఫ్యాక్టరీ నుంచి రంగు లీకవడం వల్లే కాల్వ నీళ్లు ఎర్నగా మారాయని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వేధిస్తాడు.. మొరటోడు
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలను ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల స్పెయిన్‌లో ‘గోయా’అవార్డ్‌ల ప్రదానోత్సవంలో రిచర్డ్‌కు జీవితకాల సాఫల్యత పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ ట్రంప్ విధాన నిర్ణయాలు, ట్రంప్ చుట్టూ ఉన్న నేతాగణాన్ని ప్రస్తావించారు. గిరిజనులు అడవుల్లో గిరిజనేతరుల ఆధిపత్యాన్ని కోరుకోరు అనే అర్థంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడో అనాలోచిత ట్రైబలిజం అమెరికాలో మొదలవుతోంది. ఇతరులతో పోలిస్తే మేం ప్రత్యేకం అన్న ధోరణి పెరుగుతోంది. అలాంటి ఆలోచనలను తుంచేయాల్సిన ప్రజాప్రతినిధులే ఈ ఆలోచనలకు అంటుకట్టడం విషాదకరం. ఇప్పుడు అమెరికాలో చీకటిరోజులు మొదలయ్యాయి. అందర్నీ అవహేళన చేస్తూ వేధించే మొరటు మనిషి ట్రంప్ ఏలుబడిలో ఉన్నాం. ఈయన విషయంలో ఒక్క అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. అధికారం, పెట్టుబడిదారుల సంకర వివాహమిది. బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ ఖజానానే దోచేసే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు కొలువైన ప్రభుత్వమిది. ఇది మానవళికే ప్రమాదకరం. ఇతరుల పట్ల దయ లేని పరిణతి సాధించని సంపన్న మూకలు ట్రంప్ చుట్టూ చేరారు. ఇలాంటి వ్యక్తుల కలయిక ఎంతో వినాశకరం’’అని రిచర్డ్ ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలో ఉండే రిచర్డ్ ఇటీవలే తన భార్య అలెజాండ్రా సిల్వాతో కలిసి స్పెయిన్‌కు మకాం మార్చారు. -
మెక్సికో ప్రమాదంలో 41 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని టబాస్కోలో శనివారం తెల్లవారుజామున బస్సు ట్రక్కును ఢీకొనడంతో 41 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు 48 మంది ప్రయాణికులతో దక్షిణ మెక్సికోలోని కాన్కున్ నుంచి టబాస్కోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ట్రక్కును ఢీకొనడంతో తీవ్రమైన మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. మెటల్ ఫ్రేమ్ మాత్రమే మిగిలిపోయింది. 41 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టమవుతోంది. 18 మందిని మాత్రమే గుర్తించగలిగామని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. -
ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్!
వాషింగ్టన్: చరిత్రాత్మక కవర్ పేజీలకు పెట్టింది పేరైన టైమ్ మేగజైన్ ‘ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్’ అంటూ తాజాగా వ్యంగాత్మక కవర్ పేజీ కథనం ప్రచురించింది. అందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలోని ప్రెసిడెంట్ స్థానంలో కూర్చుని కని్పస్తున్నారు. ఎరుపు బ్యాక్‌గ్రౌండ్ ముఖచిత్రంలో చేతిలో కాఫీ కప్పు పట్టుకొని ఉన్నారు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఫెడరల్ ప్రభుత్వాన్ని సమూలంగా మార్చేందుకు మస్క్ ప్రయతి్నస్తుండటం తెలిసిందే. ఆ క్రమంలో ఆయనే అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నానే అర్థంలో టైమ్ ఇలా కవర్ పేజీని డిజైన్ చేసింది. అధ్యక్ష సింహాసనం వెనుక ఉన్న అసలైన శక్తి మస్కేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది. కవర్ స్టోరీలోనూ ఈ అంశాన్ని గట్టిగానే ఎండగట్టింది. లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు మస్క్ దయపై ఆధారపడి బతకాల్సి వస్తోందని పేర్కొంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న స్పృహ ఆయనలో కన్పించడం లేదని ఆక్షేపించింది. ‘డోజ్ పనితీరుపై మా పత్రిక వైట్‌హౌస్‌కు కొన్ని ప్రశ్నలు పంపింది. కానీ వాటికి బదులివ్వడానికి వైట్‌హౌస్ నిరాకరిచింది’’ అని కథనంలోనే పేర్కొంది. మస్క్ టైమ్ మేగజైన్‌పై కనిపించడం ఇది రెండోసారి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను ‘కింగ్ మేకర్’గా అభిర్ణిణస్తూ ఇటీవలే మేగజైన్ ఓ ఫీచర్ రాసింది. టైమ్ తాజా కవర్ పేజీ ఉదంతంపై ట్రంప్‌ను ప్రశ్నించగా, ‘ఆ మేగజైన్ ఇంకా నడుస్తోందా? నాకు తెలియదు’ అంటూ అంతే వ్యంగ్యంగా స్పందించారు. -
ఆ కారిడార్ నుంచి వెనక్కు
టెల్ అవీవ్: హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో భాగంగా గాజాలోని కీలకమైన నెట్జరిమ్ కారిడార్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది. ఉత్తర, దక్షిణ గాజా ప్రాంతాలను నెట్జరిమ్ కారిడార్ విడదీస్తుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరాటం, ఆంక్షల కారణంగా లక్షలాదిమంది పాలస్తీనియన్లు దక్షిణ భాగంలో చిక్కుకుపోయారు. ఒప్పందంలో భాగంగా వీరిని నెట్జరిమ్ మీదుగా తిరిగి ఉత్తర గాజాలోకి వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. ఇందులో భాగంగానే బలగాల ఉపసంహరణ అమలైంది. అయితే, ఆదివారం ఎన్ని బలగాలు వెనక్కి వెళ్లిపోయిందీ ఇజ్రాయెల్ వెల్లడించలేదు. మొత్తం 42 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు సగం రోజులు గడిచాయి. ఒప్పందం ప్రకారం..22వ రోజైన ఆదివారం గాజాలో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ పూర్తి కావాలి. గాజాలోని దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తరం వైపు వెళ్లే పాలస్తీనియన్లను ఎలాంటి తనిఖీలు జరపకుండా ఇజ్రాయెల్ బలగాలు అనుమతించాల్సి ఉంటుంది. మొదటి విడతలో హమాస్ తమ వద్ద ఉన్న 33 మంది ఇజ్రాయెలీలను విడతల వారీగా విడిచిపెట్టాల్సి ఉంది.ఒప్పందం పొడిగింపు ప్రశ్నార్థకమేకాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఇరుపక్షాలు మరోసారి చర్చలు ప్రారంభించాల్సి ఉంది. పొడిగింపుపై ఏకాభిప్రాయం కుదిరిన పక్షంలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న మొత్తం ఇజ్రాయెలీలకు, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వందలాది మంది పాలస్తీనియన్లకు స్వేచ్ఛ లభించనుంది. మళ్లీ చర్చలపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరచక పోవడంతో కాల్పుల విరమణ పొడిగింపు అంశం ప్రశ్నార్థకంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ కీలక మధ్యవర్తిగా ఉంది. ఈ దఫా చర్చలకు తక్కువ స్థాయి అధికారులను ఖతార్‌కు పంపనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అంటున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణను పొడిగించే అవకాశాలపై ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు పరిశీలకులు. ఈ వారంలో నెతన్యాహూ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఒప్పందంపై చర్చిస్తారని భావిస్తున్నారు. అయితే, ఈ సమావేశం ఎప్పుడు జరగనుందనే విషయంలో స్పష్టత రాలేదు. 2023 అక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడులు జరిపి 250 మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకుపోవడంతో ఇరుపక్షాల మధ్య యుద్ధం మొదలుకావడం తెలిసిందే. -
‘రెడ్‌బుక్’ ఎఫెక్ట్..! కాష్పటేల్కు సెనేట్ షాక్
వాషింగ్టన్:అమెరికాలోనూ కక్ష సాధింపు రాజకీయాల కాలం నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉన్నట్లుగానే అక్కడా రిపబ్లికన్లు ఒక ‘రెడ్‌బుక్’ రాసి పెట్టుకున్నారు. అందులో వారు టార్గెట్‌గా చేసుకున్న ప్రత్యర్థుల పేర్లు రాసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరిపై ఎలా కక్ష తీర్చుకోవాలనేది ముందే డిసైడయ్యారు. ఈ కక్ష సాధించే సంప్రదాయమే ట్రంప్ 2.0లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) చీఫ్‌గా నామినేట్ అయిన కాశ్‌పటేల్ మెడకు చుట్టుకుంది. తాము కక్ష తీర్చుకోవాల్సిన డెమోక్రాట్లు చాలా మంది ఉన్నారని కాష్ పటేల్ గతంలో వ్యాఖ్యానించారు. కాష్ మాట్లాడిన ఈ మాటలే ప్రస్తుతం ఆయన ఎఫ్‌బీఐ చీఫ్‌గా పదవి చేపట్టేందుకు అడ్డంకిగా మారింది.ఈ మాటల వల్లే కాష్ పటేల్ నామినేషన్‌ను గత వారం అమెరికా ఎగువ సభ సెనేట్ ఆమోదించలేదు. కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమించడాన్ని డెమోక్రాట్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తానన్న కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమిస్తే అది రాజకీయ నియామకమే అవుతుందని వారు పేర్కొన్నారు.కాష్ పటేల్ రెడ్‌బుక్‌లో పలువురు డెమోక్రాట్ నేతలతో పాటు ట్రంప్ కేసులు వాదించిన ప్రాసిక్యూటర్లు, బైడెన్ హయాంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన కాష్ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా ట్రంప్ గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే నామినేట్ చేయడం గమనార్హం. -
బ్రిటన్ యువరాజుపై ట్రంప్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి ఎన్నికైన తర్వాత అక్రమ వలస దారుల విషయంలో కఠినంగా ఉన్నారు. అమెరికాలో ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే వారిని కచ్చితంగా వెనక్కి పంపిస్తామనే సంకేతాలు అధ్యక్షుడిగా ఎన్నికైన ఆరంభంలోనే ఇచ్చారు ట్రంప్. అయితే అమెరికాలోనే ఉంటున్న బ్రిటన్ యువరాజు హ్యారీ విషయంలో ట్రంప్ ఆచితూచి అడుగులేస్తున్నారు. డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్హ్యారీ(Prince Harry)ని వెనక్కి పంపించాలని అనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. శుక్రవారం నాటి న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం హ్యారీ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు..న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. హ్యారీని వెనక్కి పంపే విషయంలో క్లారిటీ ఇచ్చారు.‘ ప్రిన్స్ హ్యారీ విషయంలో నేను ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అతన్ని ఒంటరిగా వదిలేస్తున్నా. అతనికి ఇప్పటికే భార్యతో అనేక సమస్యలున్నాయి. అందుచేత హ్యారీపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు’ అని పేర్కొన్నారు.ఇప్పటికే హ్యారీకి సంబంధించిన అమెరికా వీసాపై అనేక న్యాయపరమైన చిక్కులున్నాయి. అమెరికా వీసా(USA VISA) ప్రొసెస్‌లో ఉండగా హ్యారీపై చట్ట వ్యతిరేకమైన డ్రగ్స్ వాడారనే ఆరోపణలు వచ్చాయి.ఇదిలా ఉంచితే, 2020 జనవరిలో రాయల్ డ్యూటీలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంటా బార్బరా సమీపంలోని మాంటెసిటోలో నివాసం ఉంటున్నారు. బ్రిటన్ రాజు చార్లెస్ III చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్‌ల మధ్య విభేదాలు తలెత్తాయి. మేఘన్‌కు తాను అనుకున్నట్లు హ్యారీతో జీవితం లేదనే కారణంతోనే అతనికి ఆమె దూరంగా ఉంటున్నట్లు గతంలోనే కథనాలు వచ్చాయి. దీనికి తోడు హ్యారీ దంపతులు రాజ కుంటుంబ సభ్యలు హోదాను వదులుకుని అమెరికాలో కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. అయితే అక్కడ చోటు చేసుకున్న పలు పరిణామాలతో హ్యారీతో మేఘన్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. -
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోగా.. ట్రక్కు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. -
గల్లంతైన విమానం ఆచూకీ దొరికింది
అలాస్కా: అమెరికాలోని అలాస్కాలో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యమైంది. పైలట్ సహా అందులోని మొత్తం పది మందీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం ఉనలక్లీట్ నుంచి టేకాఫ్ తీసుకున్న సింగిల్ ఇంజిన్ సెస్నా గ్రాండ్ కారవాన్ విమానం విమానం నోమ్ సమీపంలో గల్లంతైంది. అందులో పైలట్ సహా 10 మంది ప్రయాణికులున్నారు. మరో అరగంటలో ల్యాండవనుండగా రాడార్‌తో సంబంధం కోల్పోయింది. చిట్టచివరి లోకేషన్ ఆధారంగా హెలికాప్టర్‌తో అధికారులు గాలింపు చేపట్టి, గడ్డకట్టిన సముద్ర జలాల్లో శకలాలను కనుగొన్నారు. విమానంలో సాంకేతిక లోపం, ఇతర సమస్యలపై ప్రమాదానికి ముందు ఎలాంటి హెచ్చరికలు తమకు అందలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
హమాస్ చెర నుంచి మరో ముగ్గురికి విముక్తి
డెయిర్ అల్–బలాహ్: కాల్పుల విరమణ ఒప్పందం మేరకు శనివారం హమాస్ మిలిటెంట్లు మరో ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేశారు. ప్రతిగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 183 మంది పాలస్తీనియన్లను వదిలేసింది. వందలాదిమంది సాయుధ హమాస్ శ్రేణులు ఎలి షరాబీ(52), బెన్ అమి(56), ఒర్ లెవీ(34) అనే బందీలను వేదికపైకి తీసుకువచ్చాయి. అనంతరం వారిని రెడ్‌క్రాస్‌కు అప్పగించాయి. ఎంతో బలహీన స్థితిలో ఉన్న వారిని మాట్లాడాలంటూ బలవంత పెడుతున్నట్లుగా ఉన్న దృశ్యాలు మీడియాలో రావడంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం షరతులను హమాస్ ఉల్లంఘిస్తోందని, మధ్యవర్తులకు ఈ విషయమై అభ్యంతర వ్యక్తం చేస్తామని తెలిపింది. 2023 అక్టోబర్ 7న హమాస్ శ్రేణులు అపహరించుకుపోయిన సుమారు 250 మంది పై ముగ్గురు కూడా ఉన్నారు. జనవరి 19న కుదిరిన ఒప్పందం అనంతరం హమాస్ 18 మంది బందీలకు విముక్తి కల్పించింది. -
మరో ట్రంప్ ఉత్తర్వుకు చుక్కెదురు
వాషింగ్టన్: అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ డజన్లకొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తూ అన్ని దేశాలను కలవరపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వలస వచ్చిన వాళ్లకు పిల్లలు పుడితే వారికి దక్కే జన్మతః పౌరసత్వ హోదాను రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇచ్చిన ట్రంప్‌ను ఇప్పుడు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ఎయిడ్) ఉద్యోగుల విషయంలోనూ మరో కోర్టు కట్టడిచేసింది. వేలాది మంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులను ఉద్యోగాలు మానేసి 30 రోజుల్లోపు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను వారం రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు యూఎస్ డిస్ట్రిక్ కోర్ట్ జడ్జి కార్ల్ నిఖోల్స్ శుక్రవారం రాత్రి మధ్యంతర తీర్పు వెలువరిచారు. యూఎస్‌ఎయిడ్‌ను శాశ్వతంగా మూసేస్తానంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తాత్కాలిక తీర్పు వెలువడటం విశేషం. విదేశాల్లో యూఎస్ఎయిడ్ ఉద్యోగులు, వారి జీవితభాగస్వాములు, చదువుకుంటున్న వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైన వేళ కోర్టు ఉత్తర్వులతో తాజాగా వారికి భారీ ఊరట లభించింది. అయితే ఈ విభాగానికి నిధులు ఆపేయాలంటూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలంటూ ది అమెరికన్ ఫారెన్ సర్విస్ అసోసియేషన్, ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంస్థలు చేసిన విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. ట్రంప్ ప్రభుత్వం ఆదేశించడంతో యూఎస్ఎయిడ్లో ఇప్పటికే 500 మంది ఉద్యోగులు సెలవులపై వెళ్లగా మరో 2,200 మంది శనివారమే సెలవుపై వెళ్లాల్సి ఉంది. యూఎస్ఎయిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సహాయక, అభివృద్ధి, దాతృత్వకార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. 2016 గణాంకాల ప్రకారం యూఎస్ఎయిడ్ ప్రభుత్వ విభాగంలో 10,235 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మూడింట రెండొంతుల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. విదేశాలకు అపరిమిత సాయం అమెరికాకు గుదిబండగా మారిందని, ఉద్యోగుల్లో 90 శాతం మంది తీసేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే దశలవారీగా చాలా మంది సెలవుల మీదకు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. శాశ్వతంగా తిరిగొస్తున్నందున ప్రయాణఖర్చులు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే విధులు నిర్వర్తిస్తున్న దేశంలోనే ఈ సిబ్బంది పిల్లలు చదువుకుంటున్నారు. -
రాయల్ నేవీ చీర!
‘రాయల్ నేవీ’ అనేది కొత్త డిజైన్‌తో వచ్చిన చీర కాదు. విషయం ఏమిటంటే... సాంస్కృతిక వైవిధ్యాన్ని విస్తృతపరచడానికి శ్రీకారం చుట్టింది యూకే రాయల్ నేవీ. ఇందులో భాగంగా ‘ఫార్మల్ డ్రెస్‌కోడ్’ను అప్డేట్ చేసింది. అధికారిక కార్యక్రమాలలో మహిళా ఆఫీసర్లు చీరలు, సల్వార్ కమీజ్, లెహంగాలాంటి కల్చరల్ డ్రెస్‌లను ధరించడానికి అనుమతిస్తున్నట్లు తొలిసారిగా బ్రిటిష్ నేవీ ప్రకటించింది. అయితే వీటిపై యూనిఫాం షర్ట్, బ్లాక్ బో ధరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ పాకిస్థానీ నేవీ ఆఫీసర్ దుర్దాన అన్సారి ఫొటోను జత చేస్తూ రాయల్ నేవీ(ఆర్ఎన్) డైవర్సిటీ నెట్వర్క్ చైర్ పర్సన్ జాక్ కనాని లింక్డిన్లో కొత్త పాలసీ గురించి ప్రకటించారు. ఈ ఫొటోలో అన్సారి తెల్లని చీరలో మెస్ జాకెట్ ధరించి కనిపిస్తుంది. అయితే ‘ఫార్మల్ డ్రెస్‌కోడ్’లో మార్పు తేవడం కొందరు మాజీ బ్రిటిష్ అధికారులకు బొత్తిగా నచ్చలేదు. ‘సాంస్కృతిక గుర్తింపును యూనిఫామ్‌తో కలపడం సరికాదు’ అని విమర్శించారు. అయితే వారి విమర్శల సంగతి ఎలా ఉన్నా ఫార్మల్ డ్రెస్‌కోడ్ అప్డేట్పై ఎక్కువ మంది సానుకూలంగా, సంతోషంగా స్పందించారు.(చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
అమెరికా కలవరం.. డిపోర్టేషన్ పరేషాన్
రూపాయి విలువ ఎక్కువున్న దేశానికి ఎందుకు వెళ్తాం? సంపాదించుకోవడానికి! చదువు పేరుతో వెళ్లినా అంతిమ లక్ష్యం అక్కడ కొలువు సాధించడమే! ఈ ప్రస్తావన అమెరికా డిపోర్టేషన్ గురించే! స్టూడెంట్ వీసా మీదున్న వాళ్లు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకోకపోతే కష్టం! అక్కడున్న చట్టాల ప్రకారం చదువుకునే క్యాంపస్ లోనే కొలువులు చేయాలి. అవి దొరకడం క్లిష్టం! క్యాంపస్‌కు ఆవల ఉద్యోగాలకు వెళితే డిపోర్టేషన్ ఖాయం! ఈ క్రమంలో అక్కడున్న భారతీయ కుటుంబాలు కొన్ని.. అవసరంలో ఉన్న స్టూడెంట్స్‌కి తమ ఇళ్లల్లో డొమెస్టిక్ హెల్ప్ ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. అవి చేయడం తప్పనిసరైతే భద్రత, రక్షణను దృష్టిలో పెట్టుకుని, లీగల్ హెల్ప్ తీసుకుని అడుగేయడం మంచిది!తెలంగాణకు చెందిన నేహా (పేరు మార్చాం) అమెరికాలో ఎమ్మెస్ చదువుతోంది. వాళ్లది వ్యవసాయ కుటుంబం. అందరి పిల్లల్లాగే తమ పిల్లలూ విదేశాల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నేహా తల్లిదండ్రుల ఆశ. అందుకే నేహా వాళ్ల అక్కను (యూకే), ఆమెను అప్పులు చేసి మరీ విదేశాలకు పంపారు చదివించడానికి. ఖర్చుల కోసం అమ్మా, నాన్న మీద ఆధారపడకూడదని చదువుతూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటున్నారిద్దరూ. నేహా తన యూనివర్సిటీ దగ్గర్లోని సూపర్మార్కెట్లో సేల్స్ గర్ల్‌గా పనిచేసేది. ఆ ఏరియా పోలీసులు, ఇమిగ్రేషన్ సిబ్బంది ఆ సూపర్ మార్కెట్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న ఫారిన్ స్టూడెంట్స్‌ని తీసేయమని, లేదంటే ఆ షాప్ లైసెన్స్ రద్దవుతుందని యజమానికి వార్నింగ్ ఇచ్చారు. మరుక్షణమే నేహా జాబ్ పోయింది. ఖర్చులెలా? అప్పుడే నేహా స్నేహితురాలు ఆమెకు సబర్బ్‌లోని ఇండియన్ కమ్యూనిటీలో ఉన్న డొమెస్టిక్ హెల్పర్ కొలువు గురించి చెప్పింది. ‘వీకెండ్స్‌కి వెళ్లి ఇల్లు క్లీన్ చేయాలి. వాళ్లకు పిల్లలుంటే ఆడించాలి. గెట్ టు గెదర్స్కి అరెంజ్మెంట్స్ చేయాలి అంతే!’ అంటూ ఆ ఉద్యోగంలో చేయాల్సిన పనులను వివరించింది. ‘పేమెంట్ ప్రామ్ట్గానే ఉంటుంది. మన ఐడెంటిటీ ఎక్కడా రివీల్ చేయర’నే అభయమూ ఇచ్చింది. మరో ఆప్షన్ లేదని మారు మాట్లాడకుండా ఓ గుజరాతీ కుటుంబంలో డొమెస్టిక్ హెల్పర్‌గా చేరింది నేహా.ఇంకో స్టేట్‌లో...ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాలతి (పేరు మార్చాం) డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్లింది. భర్తకు హెచ్1బీ ఉంది. ఆమె అక్కడ తమకు తెలిసిన వాళ్ల రెస్టరెంట్లో మేనేజర్‌గా పనిచేసేది. కానీ ఈ మధ్యే ఉద్యోగం మానేసింది. రెస్టరెంట్ ఓనర్ మీద ఇమిగ్రేషన్ అధికారుల ఒత్తిడి, డిపెండెంట్ వీసా మీద తాను ఉద్యోగం చేస్తున్నట్టు ఇమిగ్రేషన్ సిబ్బందికి తెలిస్తే తన భర్త హెచ్1బీ వీసా రద్దవుతుందేమోనన్న భయంతో! ఈ ఇద్దరే కాదు.. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి.. అమెరికాలో విజిటింగ్ వీసా, స్టూడెంట్ వీసాల మీద ఆఫ్ క్యాంపస్ (వాళ్లు చదువుతున్న యూనివర్సిటీకి ఆవల) ఉద్యోగాలు చేస్తున్నవారు, డిపెండెంట్ వీసా మీద గుంభనంగా జాబ్స్ చేసుకుంటున్న వాళ్లందరి పరిస్థితి అలాగే ఉంది. కారణం.. వర్క్ పర్మిట్ లేకుండా ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తున్నవారిని, అనుమతి లేని ప్రదేశాల్లో పార్ట్ టైమ్‌కి కుదిరిన వారిని, చట్టవిరుద్ధంగా ఆ దేశంలోకి చొరబడిన వారిని వెనక్కి పంపే కార్యక్రమాన్ని ట్రంప్ కఠినంగా అమలు చేస్తున్నాడు. పాస్‌పోర్ట్‌లో ఒక్కసారి డిపోర్టెడ్ అని ముద్ర పడితే మళ్లీ ఆ దేశానికి విమానమెక్కే చాన్స్ ఉండదు. ఆ స్థితికి రావద్దని ప్రయత్నించని వారులేరు. అందుకే అది పాచి పనా.. ఇంకోటా అని చూడకుండా, పని చోట భద్రత ఉందా? రక్షణ ఎంత? అని ఆలోచించకుండా తాము పనిచేస్తున్నట్టు అమెరికన్ గవర్నమెంట్‌కు తెలియకపోతే చాలు అనుకుంటూ దొరికిన పనిలో చేరిపోతున్నారు! అమెరికా అంతటా ఇలాంటి పరిస్థితే లేదని, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు గెలిచిన రాష్ట్రాల్లోనే డిపోర్టేషన్ కఠినంగా ఉందని చెబుతున్నారు అక్కడుంటున్న తెలుగువాళ్లు కొందరు. ఇలా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వాళ్లను సొంత దేశాలకు పంపించేయడం ఇదే మోదటిసారి కాదని, ఆందోళనలు.. భయాలు కొత్తేం కాదని తేలిగ్గా తీసుకుంటున్న అమెరికా పౌరసత్వం పొందిన భారతీయులూ ఉన్నారు. అయితే ఈ డిపోర్టేషన్‌ను ఆసరాగా తీసుకుని తక్కువ జీతానికే భారతీయ విద్యార్థుల చేత ఇంటి పనులు, దుస్తుల ఇస్త్రీ, తోట పని, కార్లు తుడిపించడం, పిల్లలను ఆడించడం వంటి బండెడు చాకిరీ చేయించుకుంటున్నారని వాపోతున్నవారూ ఉన్నారు. ఏమైనా సరే.. పరాయి దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ల చట్టాలను గౌరవించడం, ఆ ప్రకారం నడుచుకోవడం తప్పనిసరని చెబుతున్నారు న్యాయసలహాదారులు.ఇది తెలుసుకోండివిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత 15 ఏళ్లుగా 15,000కి పైగా భారతీయులను అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేసింది. చట్టవిరుద్ధంగా ఆ దేశంలోకి ప్రవేశించినవారెవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని గౌరవంగా వెనక్కి రావచ్చు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న మన పౌరుల్లో అక్కడ చదువుకున్నవారు, పెళ్లి చేసుకుని డిపెండెంట్ వీసా మీద వెళ్లి తర్వాత కుటుంబ కారణాల రీత్యా విడాకులు తీసుకున్నవారు, గృహహింసకు గురైనవారే ఎక్కువ. వీరు స్వచ్ఛందంగా తమ వీసా స్టేటస్‌ను మార్చుకుంటే అమెరికాలోనే ఉండవచ్చు. భర్త వేధింపులకు గురైన అమ్మాయిలు చాలామంది స్టూడెంట్ వీసాకి మారి చదువుకుంటూ అక్కడే ఉండిపోతున్నారు. కొన్ని నేరాలలో విక్టిమ్స్ అయితే వీసాకు అర్హులవుతారు. ఇలా వారికి అర్హత ఉన్న వీసా తీసుకొని అక్కడే ఉండిపోవచ్చు.అక్కడే ఉండాలనుకునేవారు చేయవలసిన పనులు1. ఆ దేశ కోర్టును ఆశ్రయించి, పరిస్థితులను వివరిస్తూ, ఆ దేశంలో ΄పౌరసత్వం కోసమో లేక వీసా కోసమో చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే మానవీయ కోణంలో కొంత గడువు కోరడం. 2. కొన్ని ప్రత్యేక కేసులలో.. ఏదైనా అమెరికా సంస్థ నుంచి ఉద్యోగావకాశం ఉందని చూపించగలిగితే వీసా గడువు తర్వాత కూడా మరలా వీసా వచ్చేంతవరకు ఉండొచ్చు. 3. అమెరికా ΄పౌరసత్వం లేదా శాశ్వత నివాసం (పర్మనెంట్ రెసిడెన్సీ) గల వ్యక్తి కుటుంబ సభ్యులు అంటే భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు అయ్యుండి, సదరు ΄పౌరుడిచే లేదా అతని కుటుంబ సభ్యులచే గృహహింసకు లోనయ్యుంటే వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ యాక్ట్ (Vఅగిఅ) కింద.. గృహహింసకు గురిచేసిన వ్యక్తికి తెలియకుండానే గ్రీన్ కార్డు ΄పొందవచ్చు. 4. ప్రత్యేక పరిస్థితుల్లో ఆశ్రయం కోరవచ్చు. వీటన్నిటి కోసం ముందుగా మంచి ఇమిగ్రేషన్ అటార్నీ (లాయర్)ని కలవాలి. ఏజెంట్ల ద్వారా వెళ్తే మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇమిగ్రేషన్ చట్టం సులభంగా అర్థమయ్యేది కాదు కాబట్టి నిపుణుల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది – సరస్వతి రమ