-
AP: ఆచంటలో ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి,పశ్చిమగోదావరి: జిల్లాలోని ఆచంట మండలం కోడేరు రోడ్డుపై డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతి చెందిన వారిని కరుగోరిమిల్లి,ముత్యాలపల్లి గ్రామానికి చెందిన వాసుదేవ (13) కుక్కల నాగరాజు( 12) గా గుర్తించారు. ఆటోలో ఉన్న మరో అయిదుగురికి తీవ్ర గాయాలవడంతో 108 అంబులెన్సులో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
MRO రమణయ్య హత్య కేసును చేధించాం: విశాఖ సీపీ
విశాఖపట్నం, సాక్షి: రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసును చేధించినట్లు కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు.. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం. నిందితుడు విమానం ఎక్కి వెళ్లాడు. టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయి. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పది టీమ్‌లు రంగంలోకి దిగాయి. నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలిస్తున్నాం. చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్‌కు నిందితుడు వెళ్లినట్లు తేలింది. నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చెప్పట్లేదు అని సీపీ రవిశంకర్ వెల్లడించారు. రాత్రి పది గంటల సమయంలో హత్య జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. హత్యకు ఆర్ధిక లావాదేవీలు కారణమని భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్, భూవివాదాలే హత్యకు కారణమై ఉండొచ్చు. హత్యకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. తనతో మాట్లాడడానికి వచ్చిన వారికి తహశీల్దార్ సెండాఫ్ చెప్పడానికి వెళ్లగా.. అదే అదనుగా నిందితుడు హత్య చేశాడు అని సీపీ మీడియాకు కేసు వివరాలను వివరించారు. ఇదీ చదవండి: విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్‌గా సనపల రమణయ్య రెండు రోజుల కిందటి దాకా విధులు నిర్వహించారు. శుక్రవారం రాత్రి సమయంలో కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో రమణయ్య ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. వచ్చిరాగానే రమణయ్యతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం, తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు. అది చూసి నిందితుడిని పట్టుకునేందుకు అపార్ట్‌మెంట్‌వాసులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొలుత నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. -
విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి తహసీల్దార్‌పై దాడి చేయడంతో ఆయన మృతిచెందాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం.. కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో తహసీల్దార్ రమణయ్య నివాసం ఉంటున్నారు. కాగా, శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాడు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వద్దనే ఉన్న రమణయ్యతో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. అనంతరం, తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు. అది గమనించిన అపార్ట్‌మెంట్‌వాసులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకున్నాడు. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం వరకు రమణయ్య విశాఖ రూరల్ తహశీల్దార్‌గా పనిచేశారు. రమణయ్య విధుల్లో చాలా నిజాయితీగా ఉండేవారని తోటి అనుచరులు చెబుతున్నారు. ఇక, ఈ హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సిటీ పోలీసు కమిషనర్ రవిశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, రమణయ్య హత్య కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో నిందితుడి కోసం 12 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రమణయ్యపై ఇనుప రాడ్‌తో దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. -
బనియన్ల నిండా బంగారం, నగదే
సాకక్షి, కర్నూలు: సినీ ఫక్కీలో ఒంటిపై చొక్కా లోపల ధరించిన బనియన్లలో భారీగా బంగారం, నగదు పెట్టుకుని దర్జాగా బస్సులో నిద్రిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,84,53,500 నగదు, 4.565 కిలోల బంగారం, 5కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అక్రమంగా బంగారం తరలిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్ సమాచారం ఇవ్వడంతో కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజా వద్ద కృష్ణగిరి, వెల్దుర్తి ఎస్ఐలు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సీఐ గురువారం అర్ధరాత్రి వాహన తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో తనిఖీలు చేయగా, అమర్‌ప్రతాప్ పవార్(నంద్యాల), శబరి రాజన్(సేలం, తమిళనాడు), వెంకటేష్ రాహుల్(కోయంబత్తూరు), సెంథిల్‌కుమార్ (కోయంబత్తూరు) సినీ ఫక్కీలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. వారు పథకం ప్రకారం తమ ఒంటిపై ధరించిన బనియన్‌కు పెద్ద జేబులు ఏర్పాటు చేసుకుని వాటిలో బంగారం, వెండి, నగదు పెట్టుకుని, దానిపై చొక్కా వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అమర్‌ప్రతాప్ పవార్ నుంచి రూ.1,20,80,000, శబరి రాజన్ నుంచి 5 కిలోల వెండి బిస్కెట్లు, వెంకటేష్ రాహుల్ నుంచి 3.195 కిలోల బంగారం, రూ.19,23,500 నగదు, సెంథిల్‌కుమార్ నుంచి 1.37కిలోల బంగారం, రూ.44,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి విలువ రూ.2,74,54,800 ఉంటుంది. బంగారం, వెండి, నగదు తరలిస్తున్న వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆర్ఐ మస్తాన్, వీఆర్వో గిడ్డయ్య ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. నలుగురి నుంచి వివరాలు నమోదు చేసుకుని పంపించారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ శుక్రవారం ఉదయం సెట్ కాన్ఫరెన్స్‌లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్‌తోపాటు తనిఖీల్లో పాల్గొన్న వెల్దుర్తి సర్కిల్ సిబ్బందిని అభినందించారు. కాగా, గత నెల 26న రాత్రి ఇదే టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి అనంతపురానికి వెళుతున్న ట్రావెల్స్ బస్సులో కూడా ఓ వ్యక్తి నుంచి రూ.43.20లక్షలు స్వాదీనం చేసుకున్నారు. -
నకిలీ అధికారి అవతారమెత్తిన టీడీపీ నేత పుట్టా అనుచరుడు
సాక్షి ప్రతినిధి, కడప: సీఐడీ అధికారులమంటూ హడావుడి చేసిన నకిలీ అధికారుల బండారం బట్టబయలయిన ఘటనలో వైఎస్సార్ జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడితో సహా 8మందిని cc అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన న్యాయవాది మహేంద్రకుమార్ (38) టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు. పుట్టా సుధాకర్‌యాదవ్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన రంజిత్‌కుమార్ (47)తో పరిచయం ఏర్పడింది. అతను గతంలో తాను పనిచేసిన హైదరాబాద్ కేంద్రంగా అమెరికా ఐటీ నియామకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజా (ఏజేఏ) సంస్థ వ్యవహారాల గురించి మహేంద్రకుమార్‌కు తెలిపారు. ఆ సంస్థ లొసుగుల కారణంగా డైరెక్టర్ సుగుణాకరను బెదిరిస్తే రూ.కోట్లు కొల్లగొట్టవచ్చని చెప్పాడు. ఈ క్రమంలో కర్నూల్ రేంజ్ కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సుజన్‌ను సంప్రదించారు. ఎస్ఐ సుజన్ కడప అశోక్‌నగర్‌లో ఉంటున్న ఐటీ నిపుణుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌ను పరిచయం చేశారు. టెక్నికల్ ఇష్యూస్ బాగా తెలిసిన మరికొంతమంది సభ్యులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ మేరకు అజా సంస్థలోకి ప్రవేశించారు. సీఐడీ అధికారులుగా గుర్తింపు కార్డులు చూపించి తనిఖీలు నిర్వహించి నానా హడావుడి చేశారు. రూ.10కోట్లు డిమాండ్ అమెరికాలోని క్లయింట్ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలకు వచ్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ను భయపెట్టారు. ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే రూ.10కోట్లు ముట్టచెప్పాలని డిమాండ్ చేశారు. బేరసారాల తర్వాత రూ.2.3కోట్లు అప్పగించేలా అంగీకారం కుదిరింది. కంపెనీ ఖాతాల్లో రూ.71.80 లక్షలున్నాయని బాధితుడు చెప్పారు. నేరుగా తీసుకుంటే దొరికిపోతామని భావించి ఆ సంస్థ ఉద్యోగులు రవి, చేతన్, హరి ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారం జనవరి 26న చోటు చేసుకుంది. 27వ తేదీ ఉదయం ఆ ముగ్గురు ఉద్యోగుల్ని మాదాపూర్‌లోని బాల్కనీ హోటల్‌కు తీసుకెళ్లి బంధించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు వివరాలు తీసుకుని రూ.12.5లక్షలు తమ ఖాతాల్లోకి మార్చుకున్నారు. మిగతా సొమ్ముకోసం డైరెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. ఉద్యోగుల్ని వదిలేసి పారిపోయారు. విషయం గ్రహించిన సంస్థ డైరెక్టర్ సుగుణాకర పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో సహకరించిన వారితో పాటు, ప్రత్యక్షంగా పాల్గొన్న 10మందిపై కేసు నమోదైంది. మైదుకూరు టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు మహేంద్రకుమార్, సుబ్బకృష్ణతో పాటు 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుజన్, రాజా అనే నిందితుడు పరారీలో ఉన్నారు. -
అనకాపల్లి: పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్ దారుణ హత్య
సాక్షి, అనకాపల్లి జిల్లా: మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో దారుణం జరిగింది. పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్‌ను దారుణంగా హత్య చేశారు. గ్రామ సమీపంలో కాలువ వద్ద వాలంటీర్ నడింపల్లి హరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఏసీబీ వలలో జిల్లా మలేరియా అధికారి
ఒంగోలు టౌన్: పీఆర్సీ అరియర్స్ బిల్లు మంజూరు చేసేందుకు 25 శాతం లంచం డిమాండ్ చేసిన ప్రకాశం జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ, ఆమెకు సహకరించిన అసిస్టెంట్ జిల్లా అధికారి శీనయ్యను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని దోర్నాల పీహెచ్సీలో మల్టిపర్పస్ హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్న ఇజ్రాయిల్‌కు 2015–21 పీఆర్సీ అరియర్స్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని జిల్లా మలేరియా అధికారిణి జ్ఞానశ్రీని పలుమార్లు కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. పెండింగ్ బిల్లులో 25 శాతం లంచం ఇస్తే తాను బిల్లు మంజూరు చేస్తానని డిమాండ్ చేశారు. దాంతో ఇజ్రాయిల్ తనకు రావాల్సిన అరియర్స్‌తో పాటు..తన అర్హతల ప్రకారం పదోన్నతి కలి్పంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో స్పందించిన రీజినల్ డైరెక్టర్, ఇజ్రాయిల్ అరియర్స్ డబ్బులు ఎందుకు మంజూరు చేయలేదో వివరణ ఇవ్వాల్సిందిగా డీఎంఓకు మెమో ఇచ్చారు. అలాగే కోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు గానూ రిమార్క్స్ అడిగారు. ఈ క్రమంలో అనివార్య పరిస్థితుల్లో ఇజ్రాయిల్ అరియర్స్ పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తూ సంతకం చేశారు. బిల్లు డబ్బులు బ్యాంకులో జమ అయిన వెంటనే తనకు లంచం డబ్బులు ఇవ్వాలని కోరారు. ఈనెల 10వ తేదీ అరియర్స్ తాలుకు రూ.16,83,103 బ్యాంకులో జమయ్యాయి. జిల్లా కార్యాలయంలో ఈ నెల 24వ తేదీ జరిగిన మీటింగ్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయిల్ ఒంగోలుకు వచ్చారు. మీటింగ్ అయిపోయాక తన ఇంటికి వచ్చి కలవాలని డీఎంఓ జ్ఞానశ్రీ అతడిని ఆదేశించారు. అసిస్టెంట్ మలేరియా అధికారి శీనయ్యను ఇందుకు పురమాయించారు. దాంతో ఇద్దరూ కలిసి జ్ఞానశ్రీ ఇంటికి బయలు దేరారు. మార్గమధ్యలో ఉండగా ఫోన్ చేసిన డీఎంఓ తాను ఇంట్లో లేనని, వర్మాస్ హోటల్‌కు వచ్చి కలవాలని చెప్పారు. అక్కడ బిల్లుల డబ్బులు బ్యాంకులో పడ్డాయి కనుక ముందుగా చెప్పిన ప్రకారం తనకు బిల్లు మొత్తంలో 25 శాతం రూ.4 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అతడి డైరీలో ఉన్న చెక్‌బుక్కును చూసి ఆమె చెక్కు రాసివ్వాలని డిమాండ్ చేశారు. చెక్ చెల్లదని చెప్పడంతో ఏటీఎం, పేటీఎంల ద్వారా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అయితే రూ.4 లక్షలు ఇవ్వలేనని బతిమాలు కోవడంతో చివరికి రూ.1.40 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఇజ్రాయిల్ ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం జ్ఞానశ్రీకి డబ్బులు ఇస్తానని చెప్పడంతో వాటిని తీసుకునేందుకు అసిస్టెంట్ మలేరియా అధికారి శీనయ్యను సమీపంలోని సూపర్ బజార్ వద్దకు పంపించారు. అక్కడ ఇజ్రాయిల్ నుంచి డబ్బులు తీసుకుంటున్న శీనయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత జిల్లా మలేరియా కార్యాలయానికెళ్లి డీఎంవో జ్ఞానశ్రీని కూడా అదుపులోకి తీసుకున్నారు. -
ఇన్సూరెన్స్ సొమ్ము కోసం... శవపేటికలోని మృతదేహం అపహరణ
రంగంపేట/రాజమహేంద్రవరం రూరల్: అప్పుల పాలైన ధాన్యం వ్యాపారి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం తాను మృతిచెందినట్లు శవపేటికలో ఉన్న మృతదేహాన్ని తీసుకువచ్చి పెట్రోలు పోసి కాల్చి నమ్మించేందుకు చేసిన ప్రయత్నం పోలీసుల విచారణలో బెడిసికొట్టింది. చివరకు ధాన్యం వ్యాపారితో పాటు, అతనికి సహకరించిన ముగ్గురు కటకటాల పాలయ్యారు. రంగంపేట మండలం పాతవీరంపాలెం గ్రామశివారు కేతమల్లు వెంకటేశ్వరరావు(పూసయ్య) జీడిమామిడితోటలో ఈ నెల 26వ తేదీన కాలిన మృతదేహం ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు రంగంపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహం వెంకటేశ్వరరావుదిగా భావించి పోస్టుమార్టం కోసం అనపర్తి ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు భార్య అతని మృతదేహంపై పడి తీవ్రంగా ఆవేదన చెందుతున్న విషయం తెలుసుకున్నాడు. దీంతో అతను వెంటనే భార్యకు ఫోన్ చేసి ఎవరో బాడీని తగులబెట్టి తనను కొట్టి తుప్పల్లో పడవేశారని చెప్పాడు. వెంకటేశ్వరరావు బతికి ఉండడంతో కాలిన మృతదేహం ఎవరిదో తెలుసుకునేందుకు రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో అనపర్తి సీఐ పి.శివగణేష్, రంగంపేట ఎస్సై పి.విజయకుమార్ దర్యాప్తు చేపట్టారు. దీంతో నిందితుడు అసలు విషయాన్ని బయట పెట్టాడు. వీరంపాలెం గ్రామానికి చెందిన కేతమళ్ల వెంకటేశ్వరరావు(పోసియ్య)కు అప్పులు ఎక్కువగా ఉండడంతో తన పేరుపై ఉన్న రూ. కోటి ఇన్సూరెన్న్స్ను క్లయిమ్ చేసుకొనేందుకు ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్‌ను అమలు చేసేందుకు హుకుంపేట గ్రామానికి చెందిన వందే శ్రీను, తలారి సుబ్బారావు, మోరంపూడికి చెందిన సిరాచిన్నాలతో వెంకటేశ్వరరావును వినియోగించాడు. ఒక శవాన్ని తీసుకొచ్చి తన పొలంలో కాల్చేయాలని నిర్ణయించాడు. ఆ ముగ్గురితో రూ.రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారు ఈ నెల 25వ తేదీ రాత్రి పాతబొమ్మూరులోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఒక శవాన్ని తవ్వి బయటకు తీశారు. సదరు మృతదేహాన్ని శ్రీను కారులో వేసుకొని రాత్రి ఒంటి గంట ప్రాంతంలో పాత వీరంపాలెం వెళ్లి వెంకటేశ్వరరావుకు తెలిపాడు. ఇద్దరూ కలిసి శవాన్ని తగులబెట్టి అక్కడనుంచి పరారయ్యారు. ఈ నెల 26వ తేదీన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆ కాలిపోయిన బాడీ వెంకటేశ్వరరావుది అని భావించి శవాన్ని అనపర్తి హాస్పిటల్‌కు తరలించారు, అనంతరం గ్రామంలో తన భార్య, పిల్లలు కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని శ్రీను ద్వారా తెలిసి, ఎవరో బాడీని తగులబెట్టి తనని కొట్టి తుప్పల్లో పడేసారని డ్రామా మొదలెట్టాడు. చివరకు పోలీసులు వెంకటేశ్వరరావు, అతనికి సహకరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం డ్రామా బయటపడింది. ఆ మృతదేహం నెల్లి విజయరాజుది పాతబొమ్మూరు క్రైస్తవ శ్మశానవాటికలో తస్కరించిన మృతదేహం బొమ్మూరు గ్రామానికి చెందిన ఓఎన్జీసీ ఉద్యోగి నెల్లి విజయరాజుదిగా పోలీసులు గుర్తించారు. నెల్లివిజయరాజు అనారోగ్యంతో ఈనెల 23వ తేదీన మృతిచెందారు. ఈ నెల 24న ఖననం చేశారు. 29న అతని జ్ఞాపకార్థకూడిక నిర్వహించారు. అయితే మంగళవారం రంగంపేట పోలీసులు నిందితులను తీసుకుని పాతబొమ్మూరు శ్మశానవాటిక వద్దకు వెళ్లే వరకు గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు నెల్లి విజయరాజు మృతదేహాన్ని తీసుకువెళ్లి పెట్రోలుతో దహనం చేశారన్న విషయం తెలియలేదు. పోలీసులు విజయరాజు ఖననం చేసిన చోట తవ్వించి చూడగా అందులో మృతదేహం కనిపించలేదు. అనపర్తి హాస్పిటల్లో ఉన్న మృతదేహం విజయరాజుదిగా ఆయన కుటుంబసభ్యులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పాతబొమ్మూరులోని శ్మశానవాటికకు తీసుకువచ్చి ఖననం చేశారు. -
రూ.50 లక్షలకు టీడీపీ నేత టోకరా
బొమ్మలసత్రం (నంద్యాల): తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేద్దామని చెప్పి ఓ డీఎస్పీ కుమారుడ్ని నిండా ముంచేసిన ఘటనలో మైదుకూరు టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి మల్లిఖార్జునయాదవ్‌పై చీటింగ్ కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్‌యాదవ్ సన్నిహితుడు, కాంట్రాక్టర్ మల్లిఖార్జునయాదవ్ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి, కొల్లాపూర్ మధ్య కేతిపల్లి గ్రామంలో వంతెన నిర్మాణ పనులకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో నంద్యాలలో నివశిస్తున్న కర్నూలు, నంద్యాల జిల్లాల ఇంటెలిజెన్స్ విభాగం ఇన్ఛార్జ్ డీఎస్పీ యుగంధర్ కుమారుడు చిరంజీవిని భాగస్తుడిగా చేసుకుని కాంట్రాక్ట్ పనులు పూర్తి చేశారు. మల్లిఖార్జునయాదవ్ తప్పుడు లెక్కలు చూపిస్తున్నాడనే అనుమానంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో చిరంజీవికి రూ.80 లక్షలు చెల్లించేలా మల్లిఖార్జునయాదవ్ ఒప్పందం చేసుకున్నాడు. అయితే రూ.30 లక్షలు చెల్లించి.. మిగతా రూ.50 లక్షలు చెల్లించకుండా మొండికేశాడు.దీంతో చిరంజీవి నంద్యాల తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మల్లిఖార్జునయాదవ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ దస్తగిరిబాబు తెలిపారు. -
తీగ లాగితే.. టీడీపీ కదిలింది
సాక్షి, అమరావతి: నల్లధనం తీగ లాగితే టీడీపీ డొంక కదిలింది! పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ‘నోవా అగ్రిటెక్’ జీఎస్టీ ఎగవేతపై తనిఖీలు నిర్వహిస్తే ఆ కంపెనీ కేంద్రంగా సాగిస్తున్న నల్లధనం బాగోతం బట్టబయలైంది. గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీ భారీ ఆర్థిక అక్రమాలకు అడ్డాగా మారిందని రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తనిఖీల్లో వెల్లడైంది. వ్యాపార కార్యకలాపాల ముసుగులో షెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో నిగ్గు తేలింది. విచారణకు సహకరించకుండా మొండికేస్తున్న నోవా అగ్రిటెక్‌కు డీఆర్ఐ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా కంపెనీ యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదుకు బాపట్ల పోలీసులు సిద్ధమయ్యారు. లెక్కా పత్రాలు లేవు.. జీఎస్టీ ఎగవేస్తున్న కంపెనీల జాబితాను సేకరించిన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆయా రాష్ట్రాలకు పంపింది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న ఆ కంపెనీల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు జాబితాలో ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు విస్తుపోయారు. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి నోవా కార్యాలయంలో ఒక్క రికార్డు కూడా లేదు. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు, రశీదులు, ఇన్వాయిస్లు, బ్యాంకు లావాదేవీలు, ఇతర వివరాలేవీ లేవు. దీంతో అసలు ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో మాత్రం చాలా మంది పేర్లు ఉండగా వారిలో సగం మంది ఉద్యోగులు కూడా కార్యాలయంలో లేకపోవడం గమనార్హం. జీఎస్టీకి సంబంధించిన పత్రాలేవీ రికార్డుల్లో లభించ లేదు. దీంతో నోవా అగ్రిటెక్ కంపెనీకి నోటీసులు జారీ చేసి బాధ్యులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ డీఆర్ఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నల్లధనం కేరాఫ్ ‘నోవా’ నోవా అగ్రిటెక్ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా లభ్యమైన ఓ డైరీ ఎన్నికల్లో టీడీపీ నేతల నల్లధనం పంపిణీ గుట్టును రట్టు చేసింది. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఎలా అక్రమాలకు పాల్పడ్డారో అందులో సవివరంగా ఉంది. నల్లధనం వెదజల్లి ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి వివరాలన్నీ అందులో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం నోవా కంపెనీని నెలకొల్పినట్లు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుకాయించారు. కంపెనీ పేరిట భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు కాకుండా నల్లధనం చలామణి సాగిస్తున్నట్లు డైరీతో పాటు అక్కడ లభ్యమైన మరికొన్ని కీలక ఆధారాలు వెల్లడించాయి. అందుకోసమే కంపెనీ బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నోవాకు నగదు ఏ ఖాతాల నుంచి వస్తోంది? ఆదాయ వనరులు ఏమిటి? అనే వివరాలపై కంపెనీ ఉద్యోగులు మౌనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించాలని కోరుతూ కేంద్ర ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, స్టాక్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)లకు డీఆర్ఐ అధికారులు నివేదించారు. నోవా యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరుతూ పోలీసుశాఖ బాపట్ల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అనంతరం ఈ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఇతరులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించనున్నారు. -
‘నారాయణ’లో విద్యార్థి ఆత్మహత్య
మధురవాడ (విశాఖజిల్లా): నారాయణ క్యాంపస్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం పట్టణంలోని పీఎస్ఎన్ఎం స్కూలు సమీపంలో నివాసం ఉంటున్న నెల్లూరు రవికుమార్, ఆయన భార్య మార్కెటింగ్ శాఖలో పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, చిన్న కుమారుడు నెల్లూరు అఖిల్ వినాయక్(15)ను విశాఖలోని నారాయణ విద్యాసంస్థలో 6వ తరగతి నుంచి చదివిస్తున్నారు. ప్రస్తుతం పీఎంపాలెంలోని క్యాంపస్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గణతంత్ర వేడుకలకు సహచర విద్యార్థులు వెళ్లగా, నిఖిల్ మాత్రం హాస్టల్ రూము నంబరు 203లోనే ఒంటరిగా ఉన్నాడు. సుమారు 10.15 గంటల సమయంలో జెండా వందనం కార్యక్రమం పూర్తయి సహచర విద్యార్థులు వచ్చేసరికి నిఖిల్ వినాయక్ గదిలో ప్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఉన్నాడు. అతడిని వైద్యం నిమిత్తం గాయత్రి ఆస్పత్రికి యాజమాన్యం తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిఖిల్ ప్యాంటు కుడి జేబులో ‘నా చావుకి నేనే కారణం. పదో తరగతి ఫెయిల్ అవుతాననే భయంతో చస్తున్నాను.. ’ అని రాసిన లేఖ ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే నా కుమారుడు మృతి ‘బాగా చదువు చెబుతారని ఏడాదికి రూ.2లక్షలు ఫీజు కట్టి నారాయణ పీఎంపాలెం క్యాంపస్‌లో చేర్పించాను. నా కుమారుడు నిఖిల్‌పై గత ఏడాది ఆగస్టు 7వ తేదీన సహచర విద్యార్థులు దాడి చేయగా, బాగా దెబ్బలు తగిలాయి. ఫిట్స్ కూడా వచ్చాయి. నాలుగు నెలలు ఇంటి వద్దే ఉంచాం. ఆ తర్వాత మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చాం. గత ఏడాది గొడవ జరిగినప్పుడు ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అప్పుటి నుంచే నిఖిల్ ఆరోగ్యం పాడైంది. ఈ నెల 21న నిఖిల్ జ్వరంతో బాధపడుతున్నాడని వార్డెన్ శ్రావణ్ ఫోన్ చేసి చెప్పారు. రూ.వెయ్యి ఫోన్ పే ద్వారా పంపించగా, వైద్యం చేయించారు. అనారోగ్యానికి గురైన నిఖిల్‌ను ఒంటరిగా గదిలో మేనేజ్మెంట్ వదిలేసింది. ఉదయం 10.15 గంటలకు ఫ్యాన్‌కు వేలాడుతున్నాడని గుర్తించినా, 10.45 గంటల వరకు ఆస్పత్రికి తీసుకువెళ్లలేదు. కనీసం 108 అంబులెన్స్‌కు కూడా ఫోన్ చెయ్యలేదు. పక్కనే ఆస్పత్రి ఉన్నా, హాస్టల్ వ్యాన్‌లో గాయత్రి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నా కుమారుడి మృతికి నారాయణ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయి. మేనేజ్మెంట్ ఒత్తిడి లేదా ఇంకా ఏమైనా జరిగి ఉండవచ్చు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.– నెల్లూరి రవికుమార్, విద్యార్థి నిఖిల్ వినాయక్ తండ్రి, శ్రీకాకుళం -
ఒంటరి జీవితం భరించలేక..
బి.కొత్తకోట : భర్త దూరమై ఒంటరి జీవితం భరించలేని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం తెల్లవారుజామున బి.కొత్తకోటలో జరిగింది. హెడ్‌కానిస్టేబుల్ మారుతిరెడ్డి కథనం మేరకు వివరాలు. స్థానిక కరెంట్ కాలనీలో నివాసం ఉంటున్న కె.లక్ష్మిదేవి, రెడ్డెప్పలు భార్యాభర్తలు. వీరికి సంతానం లేదు. భర్త రెడ్డెప్ప రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇటీవల లక్ష్మిదేవి కూడా అనారోగ్యానికి గురైంది. భర్త దూరం కావడం, పిల్లలు లేకపోవడంతో ఒంటరి జీవితంపై విరక్తి కలిగింది. దీంతో ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరిశీలించారు. మృతురాలి అక్క కుమార్తె రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
నేడు ఏసీబీ కోర్టులో స్కిల్ కేసు విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో నేడు ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగనుంది. అప్రూవల్‌గా మారిన నిందితుడు ఏసీఐ ఎండి శిరీష్ చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో సీఐడి కోర్టు సమర్పించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని చంద్రబాబు తరపున న్యాయవాదులు కోరారు. దీనిపై పిటీషన్ దాఖలు చేయాలని కోర్టు అదేశించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డ్‌ను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ.. ఏసీబీ కోర్టులో విచారణ జరపనుంది. స్కిల్ కేసులో అప్రూవర్‌గా మారుతున్నట్లు ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రకాంత్ షా పిటిషన్ వేశారు. బోగస్ ఇన్వాయిస్లతో నిధులు స్వాహా చేశారని చంద్రకాంత్ షా కోర్టుకి ఆధారాలు సమర్పించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఏ-22 నిందితుడు యోగేష్ గుప్తాను నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా చంద్రకాంత్ షా పేర్కొన్నారు. స్కిల్ కేసులో ఎ- 26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016 లో తనని కలిసారన్న చంద్రకాంత్ షా.. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలని వారు కోరినట్లు పిటీషన్ పేర్కొన్నారు. ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్ టెక్కి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చానన్న చంద్రకాంత్ షా.. బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినందుకు రూ.65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమచేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అవే నిధులను సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చంద్రకాంత్ షా తెలిపారు. ఆ 65 కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నేడు ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగనుంది. -
Nara Lokesh: రెడ్‌బుక్ కేసు విచారణ నేడు
విజయవాడ, సాక్షి: నారా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు రెడ్ బుక్ బెదిరింపుల కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో కోర్టు ఆదేశాలానుసారం సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నోటీసులు అందుకోకపోవడంపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. యువగళం పేరిట యాత్ర చేపట్టిన నారా లోకేష్.. ముగింపు రోజున పలు ఇంటర్వ్యూల్లో కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేశారు. దీంతో గత నెలలో ఏసీబీ కోర్టులో సీఐడీ ఒక మెమో దాఖలు చేసింది. లోకేష్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ.. ఆధారాలతో సహా పిటిషన్లో సీఐడీ కోరింది. దీంతో తమ ముందు హాజరై స్వయంగా హాజరైగానీ లేదంటే న్యాయవాది ద్వారాగానీ వివరణ ఇవ్వాలని కోర్టు లోకేష్‌ను ఆదేశించింది. మెమోలో ఏముందంటే.. యువగళం ముగింపు సమయంలో లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. తన తండ్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ తప్పుడు కేసులు బనాయించిందని, రిమాండ్ విధించడం తప్పంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థను కించపరిచేలా ఉన్నాయని.. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల్ని తప్పుబట్టేలా ఉన్నాయని.. అన్నింటికి మించి కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మెమోలో సీఐడీ పేర్కొంది. ఆ వాంగ్మూలాలు తప్పేనంటూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్.. తదితర కేసులలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారు. అయితే.. ఆ సమయంలో తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను నారా లోకేష్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలు అధికారులు 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారు? వాళ్ల పేర్లు రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశా. మా ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తా’ అంటూ లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది సాక్ష్యులను బెదిరించి.. కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించడమే అవుతుందని సీఐడీ ఏసీబీ కోర్టు పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. గతంలో లోకేష్‌కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకీ విరుద్ధంగా ఆయన మాట్లాడారని పేర్కొంది. లోకేష్‌పై కోర్టు సీరియస్ రెడ్ బుక్ బెదిరింపుల వ్యవహారంలో కేసులో.. నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులును లోకేష్ తొలుత స్వీకరించలేదు. ఈ పరిణామంలో లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ పోస్టులో పంపాలని సీఐడీని ఆదేశించింది. దీంతో చేసేది లేక రిజిస్టర్ పోస్టులో సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపింది. -
రూ.3 కోట్ల నగదు పట్టివేత
నక్కపల్లి(అనకాపల్లి జిల్లా)/ఆదోని సెంట్రల్: జాతీయ రహదారిపై వేంపాడు టోల్‌ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న రూ.2,07,50,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ విభీషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం రాత్రి వేంపాడు టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టామని, తుని నుంచి విశాఖ వెళ్తున్న ఒక కారును ఆపి చూడగా లోపల ఐదు బ్యాగుల్లో రెండుకోట్ల ఏడు లక్షల యాభైవేలరూపాయల నగదు లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన వజ్రపు వెంకటేశ్వరరావు,యాదవరాజు కారులో ఈ నగదు తీసుకెళ్తున్నట్లుతెలిపారు. తాము ధాన్యం వ్యాపారం చేస్తున్నట్లు వీరు చెప్పారని, ఈ నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించలేదన్నారు. నగదుతోపాటు, కారును కూడా సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రూ. కోటి నగదు స్వాదీనం రైల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి నగదును స్వాధీనం చసుకున్నట్లు రైల్వే డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీర్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి దాటాక రైల్వే ఎస్పీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో గుంతకల్ డివిజన్ పరిధిలో రైళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఆదోని పట్టణానికి చెందిన కోల్కర్ మహమ్మద్ అనే వ్యక్తి నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైల్లో ప్రయాణిస్తూ ఆదోనిలో దిగాడని, రైల్వే పోలీసులు బ్యాగులు తనిఖీ చేయగా రూ.1,00,95,450 నగదు గుర్తించినట్లు తెలిపారు. విచారణలో అతడు నగదుకు సంబంధించి ఎటువంటి రశీదు అందజేయలేదన్నారు. స్వా«దీనం చేసుకున్న నగదును నిబంధనల మేరకు ఆదాయపు పన్నుశాఖకు అప్పగిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బులు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలకు సంబంధించి ప్రయాణికులు 9440627669 నంబర్‌కు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి తగిన పారితోషికం అందిస్తామని తెలిపారు. -
ఖాకీ వలలో విద్యార్థిని విలవిల
అనంతపురం క్రైం: పోలీసు లైబ్రరీలో చదువుకునేందుకు వచ్చిన ఓ విద్యార్థినిని మాయమాటలతో లోబర్చుకున్న ఆర్ఎస్ఐ ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని మారుతీనగర్‌కు చెందిన ఓ యువతి ఉద్యోగాల అన్వేషణలో భాగంగా పోలీసు లైబ్రరీలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఈ క్రమంలో అక్కడున్న ఆర్ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలతో లోబర్చుకుని పెళ్లి పేరుతో శారీరక అవసరాలు తీర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆమె పెళ్లి ఊసెత్తగానే మొహం చాటేశాడు. పలుమార్లు ఆమె ప్రాధేయపడినా వినలేదు. చివరకు విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. పంచాయితీ నిర్వహించి తన గుట్టును రట్టు చేయడంతో ఆగ్రహించిన ఆర్ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ బాధితురాలిని హతమారుస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోన్ సంభాషణ దాచుకున్న ఆమె ఆదివారం నేరుగా నాల్గో పట్టణ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. యువతిని మోసం చేసిన ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ను బదిలీ చేసిన ఎస్పీ అన్భురాజన్, ఘటనపై సమగ్ర విచారణ కు ఆదేశాలు -
హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్
సరిగ్గా ఓ రెండు నెలల క్రితం డీప్ ఫేక్ వీడియో సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. పాన్ ఇండియా హీరోయిన్ రష్మికకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. అలానే ఈ మధ్య కాలంలో ఏఐ టెక్నాలజీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీని ద్వారా మంచి ఉన్నట్లే కొందరు చెడుగానూ ఉపయోగిస్తున్నారు. అలానే రష్మిక ముఖంతో ఓ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది తెగ వైరల్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో కత్రినా, అమితాబ్, ప్రియాంక చోప్రా, సచిన్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. బ్రిటీష్-ఇండియన్ ఇన్ఫ్లూయెన్సర్ జరా పటేల్.. లిఫ్ట్ ఎక్కుతున్న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈమె బదులు ఇక్కడ రష్మిక ముఖాన్ని డీప్ ఫేక్ చేసి ఓ అజ్ఞాత వ్యక్తి.. సదరు వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా వీడియో చేసిన వ్యక్తిని ఆంధ్రాలో అదుపులోకి తీసుకున్నారు. అతడు తెలుగు కుర్రాడే అని తెలిసింది కానీ పేరు, ఇతర వివరాలు మాత్రం బయటకు రాలేదు. (ఇదీ చదవండి: చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక) -
ష్..గప్‌చుప్! ఆ టాలెంట్ రామోజీ రావుకే సొంతం
సాక్షి, హైదరాబాద్: ఎక్కడా రహస్యాలు, దాపరికాలు ఉండకూడదంటూ ఊదరగొట్టే రామోజీరావు, తన దినపత్రిక, తన గ్రూపు సంస్థల్లో జరిగే ఉదంతాలను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచాలని చూస్తారు. ముఖ్యంగా ఫిల్మ్ సిటీలో ఏం జరిగినా అంత సులభంగా బయటకు పొక్కదు. రామోజీరావు అంగీకరిస్తే తప్ప ఫిల్మ్ సిటీ ఆనే కోటలోకి తమకు కూడా ఎంట్రీ ఉండదని పోలీసు వర్గాలే చెబుతుంటాయి. కాగా ఈ క్రమంలో తమతో పాటు అవస రమైతే ప్రభుత్వం పైనా ఒత్తిడి తీసుకువచ్చి విషయం బయట పడకుండా మేనేజ్ చేస్తారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఉదంతాలు కొన్ని గతంలో చోటు చేసుకున్నాయి. అయితే గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో కన్నుమూసింది తమ ఉద్యోగి కాకపోవడం, బయటి వాడైన ప్రవాస భారతీయుడు కావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. అప్పట్లో 22 మంది ఉద్యోగులు గాయపడినా.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదాలు చోటు చేసుకోవడం కొత్తేంకాదు. చిన్న చిన్న ఉదంతాలు, తన ఉద్యోగులకు పరిమితమైన, ఒకరిద్దరికి సంబంధించిన అంశాలు ఆ కోట దాటి బయటకు రావు.. రానివ్వరు. కానీ 2008 నవంబర్‌లో చోటు చేసుకున్న ఓ భారీ అగ్నిప్రమాదం.. వారం తర్వాత ‘సాక్షి’ చొరవతో వెలుగులోకి వచ్చింది. ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వార్షిక సమావేశానికి దాని నిర్వాహకులు రామోజీ ఫిల్మ్ సిటీని ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాలు పూర్తయిన తర్వాత వేదిక కూడా ఖరారైంది. ఆ ఏడాది నవంబర్ 2న దాదాపు 3,500 మంది హాజరైన ఆ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఫిల్మ్ సిటీకి చెందిన సిబ్బంది ప్రధాన వేదికను సిద్ధం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎగరేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్టేజీ సమీపంలో దాదాపు 200 హైడ్రోజన్ బెలూన్లను ఉంచారు. ఈ కార్యక్రమం నిర్వహణను అప్పట్లో ఫైర్ సూపర్వైజర్గా ఉన్న శ్రీనివాసరావు, ఫైర్ మెన్ లక్ష్మణ్‌లు పర్యవేక్షించారు. అయితే ఈ ఉత్సవాలకు హాజరైన ఓ ప్రతినిధి హైడ్రోజన్ బెలూన్ల సమీపంలో సిగరెట్ కాల్చే ప్రయత్నం చేసినా ఫిల్మ్ సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఫైర్ సూపర్వైజర్, ఫైర్ మెన్ మాత్రం వారించే ప్రయత్నం చేశారు. ఈలోపే ఆ ప్రతినిధి విసిరేసిన సిగరెట్ పీక సమీపంలో ఉన్న హైడ్రోజన్ బెలూన్లపై పడటం, అవి ఒక్కసారిగా పేలిపోయి మంటలు వ్యాపించడం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న దాదాపు 22 మంది ఫిల్మ్ సిటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. వీరికి తన కోటలోనే ఉన్న ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించిన రామోజీరావు.. పోలీసులు, అగ్నిమాప శాఖ అధికారుల వరకు విషయం చేరనీయలేదు. తన సంస్థ కోసం పని చేస్తూ గాయపడిన వారికి మొండిచేయి చూపారు. దాదాపు వారం తర్వాత ఈ విషయం నాటకీయంగా వెలుగులోకి రావడంతో హయత్‌నగర్ (అప్పట్లో అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా లేదు) పోలీసులు సీన్లోకి వచ్చారు. దీంతో విషయం లీక్ చేశారంటూ రామోజీ సైన్యం రాద్ధాంతం చేసింది. చివరకు నామమాత్రంగా సిబ్బందికి సహాయం చేసింది. ఆ టాలెంట్ రామోజీ రావుకే సొంతం ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదాలను బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచే రామోజీ రావులో మరో టాలెంట్ కూడా ఉంది. తన సంస్థల్లో చోటు చేసుకునే ఉదంతాలు పోలీసు రికార్డులకు ఎక్కకుండా చూడటమే కాదు.. తప్పంతా క్షతగాత్రులు లేదా బాధితులదే అన్నట్టుగా కూడా చూపించగలరు. బాధితులే ఆ విధంగా చెప్పేలా చేయగల నైపుణ్యం రామోజీరావు సొంతం. 2009లో బాలానగర్‌లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌లో జరిగిన ప్రమాదమే దీనికి ఉదాహరణ. ఈ ఉదంతాన్ని చాలా రోజులు గోప్యంగా ఉంచిన యాజమాన్యం ఎట్టకేలకు పోలీసులకు తెలిపినా.. ఫిర్యాదు లేకుండా చూసుకుంది. సీన్ కట్ చేస్తే తప్పు తనదే అంటూ చెప్పిన ఆ బాధితుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం కొసమెరుపు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజయ్‌కుమార్ నిరుపేద. బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. 2009 మే 19న బాలానగర్‌లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌లో పనికి వచ్చాడు. అక్కడి మూడో అంతస్తులో పని చేస్తూ మధ్యాహ్నం వేళ కింద పడ్డాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విషయం రామోజీ కోటరీకి తెలిపారు. వాళ్ళ ఆదేశాల మేరకు విషయం బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో బిజయ్‌ను ఈనాడు ప్రింటింగ్ ప్రెస్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించాలని ప్రయత్నించారు. అక్కడ పండ్ల వ్యాపారం చేసే సయ్యద్ ముస్తఫా ఈ వ్యవహారం గమనించి అడ్డుకుని ప్రశ్నించారు. క్షతగాత్రుడికి తక్షణ వైద్యం అందాలనే ఉద్దేశంతో ‘108’కు సమాచారం ఇచ్చారు. ఈ పరిణామంతో కంగుతిన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనపై దాడి చేసి తమపైనే దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ముస్తాఫా ద్వారా ఈ ప్రమాదం విషయం వెలుగులోకి రావడంతో బాలానగర్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో హడావుడిగా బిజయ్‌కుమార్ వద్దకు వెళ్ళిన ఈనాడు సిబ్బంది కథ మార్చేశారు. అదే రోజు అతడిని తీసుకుని బాలానగర్ ఠాణాకు వచ్చారు. తన తప్పిదం వల్లే ఈనాడు కార్యాలయం పైనుంచి కింద పడ్డానని, దీనిపై కేసు వద్దని అతడితోనే రాయించి పంపారు. ఫిర్యాదు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. విస్టెక్స్ ఉదంతంలోనూ అనేక ప్రయత్నాలు విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా మరణానికి కారణమైన రామోజీ ఫిల్మ్ సిటీపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిదిండి జానకిరామ్ రాజు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇందులో ఫిల్మ్ సిటీలోని భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్న వైఫల్యాలను ఎత్తిచూపారు. అయితే విస్టెక్స్ ఉదంతంలోనూ రామోజీ తన మార్క్‌ను చూపించారు. దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న ఆర్ఎఫ్సీ ఉద్యోగుల ఫోన్లన్నీ స్వాధీనం చేసుకోవాలని, విషయం బయటకు పొక్కనివ్వొద్దని హెచ్చరించారు. పోలీసులకిచ్చిన ఫిర్యాదులోని అంశాలు రికార్డుల్లోకి ఎక్కకుండా ఉంచేందుకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు. జరిగిన ఉదంతంపై కేసు నమోదు చేసుకోవాలని, కానీ భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, అంబులెన్స్ రాక ఆలస్యం కావడం, అదనపు అంబులెన్స్ లేకపోవడం వంటివి ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) నమోదు కాకుండా చూడాలని అనేక ప్రయత్నాలు చేశారు. అవి రికార్డుల్లోకి ఎక్కి, బయటకు వస్తే ఫిల్మ్ సిటీ వ్యాపారం దెబ్బతింటుదంటూ తమ మందీమార్బలంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. కానీ పోలీసులు ససేమిరా అన్నారు. విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడమే కాకుండా ఫిర్యాదులోని ప్రతి అంశాన్నీ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. -
RFC: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్ నగర శివార్లలో ఈనాడు అధి నేత చెరుకూరి రామోజీరావు నేతృత్వంలోని రామో జీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్వా హకుల నిర్లక్ష్యం, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపో వడం, అత్యవసర సమయంలో వినియోగించడా నికి అంబులెన్స్‌లు సైతం లేక ఆస్పత్రికి తరలించ డంలో 20 నిమిషాల వరకు ఆలస్యం కావడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. అంచెలంచెలుగా ఎది గిన ప్రవాస భారతీయుడు, బహుళజాతి సంస్థ విస్టెక్స్ ఏషియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ సంజయ్ షా (56) ప్రాణాలు కోల్పోయా రు. తీవ్రంగా గాయపడిన ఆ సంస్థ ప్రెసిడెంట్ దాట్ల విశ్వనాథ్ రాజు అలియాస్ రాజు దాట్ల (52) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమా దం జరిగిన వెంటనే ఘటనా స్థలిలోనే ఉన్న షా సతీమణి అంబులెన్స్, అంబులెన్స్ అంటూ అక్కడ ఉన్న ఫిల్మ్ సిటీ సిబ్బందిని విలపిస్తూ వేడుకోవడం కంటతడి పెట్టించింది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిదిండి జానకిరామ్ రాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్ సిటీ సహా మరికొందరిపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై నుంచి అమెరికా దాకా.. ముంబైకి చెందిన సంజయ్ షా 1989లో అమెరికాకు వలసవెళ్ళారు. అక్కడి లేహై యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అమెరికాలోనే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్, జనరల్ మోటార్స్‌లతో పాటు జర్మనీలోని సాప్ సంస్థలోనూ ఉన్నత స్థానాల్లో పని చేశారు. తర్వాత సొంత కంపెనీ ఏర్పాటు కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. 1999లో అమెరికాలోని ఇల్లినాయిస్ కేంద్రంగా విస్టెక్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో విస్తరించింది. దీని వార్షిక టర్నోవర్ రూ.3,500 కోట్లకు పైగా ఉంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోనూ దీని కార్యాలయం ఉంది. దీనికి కలిదిండి జానకిరామ్ రాజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. తమ సంస్థ ఏర్పాటు చేసి 25 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించిన యాజమాన్యం రామోజీ ఫిల్మ్ సిటీని వేదికగా ఎంచుకుంది. లైమ్లైట్ గార్డెన్లో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విస్టెక్స్ కార్యాలయాల్లో ఈ వేడుకలు జరుగుతుండగా.. ప్రతి కార్యక్రమానికీ సీఈఓ సంజయ్ షా, ప్రెసిడెంట్ విశ్వనాథ్ రాజు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లోని తమ ఉద్యోగులు, క్లయింట్లతో కలిసి వేడుకల నిర్వహణకు రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్‌ను బుక్ చేసుకున్నారు. రెండురోజుల పాటు జరిగే వేడుకల కోసం గురువారం రాత్రి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. 20 అడుగుల ఎత్తునుంచి దిగుతూ.. ప్రారంభ కార్యక్రమాన్ని వెరైటీగా నిర్వహించాలని నిర్ణయించారు. కాంక్రీట్ స్టేజీపైన ఉన్న రూఫ్‌కు తాళ్లు కట్టి, వాటికి వేలాడేలా చెక్కతో ఓ ప్లాట్‌ఫామ్ తయారు చేశారు. అలంకరించిన ఆ ప్లాట్‌ఫామ్ మె ల్లగా కిందకు దిగుతుండగా సీఈఓ, ప్రెసిడెంట్లు 20 అడుగుల ఎత్తులో దానిపై నిలబడి.. ఆహుతు లకు అభివాదం చేస్తూ స్టేజీపైకి దిగేలా ఏర్పాట్లు చే శారు. ఇందుకు ఫిల్మ్ సిటీతో పాటు ఈవెంట్ మేనే జర్ల అనుమతి కూడా తీసుకున్నారు. చెక్కతో చేసిన సదరు ప్లాట్‌ఫామ్‌కు రెండు వైపులా ఇనుప చువ్వ లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7.40 గంటల సమయంలో ఈ ప్లాట్‌ఫామ్ పైకి ఇద్దరూ ఎక్కగా.. పైన ఉన్న రూఫ్‌కు కట్టిన తాళ్ల సాయంతో ప్లాట్‌ఫామ్‌ను పైనుంచి కిందకు దింపడం ప్రారంభించారు. అయితే కొద్దిసే పటికే ఒక పక్కన తాడు తెగిపోవడంతో ప్లాట్‌ఫామ్ పక్కకు ఒరిగి, దానిపై ఉన్న ఇద్దరూ దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంట్‌తో కట్టిన స్టేజీపై వేగంగా పడి పోయారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేవు.. రెస్క్యూ లేదు విస్టెక్స్, ఫిల్మ్ సిటీ ఉద్యోగులు, ఈవెంట్ మేనేజర్లు వెంటనే అక్కడ గుమిగూడారు. విస్టెక్స్ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఏదైనా పెద్ద ఆస్పత్రికి తరలించడానికి సహాయం చేయాల్సిందిగా అక్కడ ఉన్న వారిని కోరారు. ఓ వైపు సరైన భద్రతా ఏర్పాట్ల లోపం కారణంగా ప్రమాదం జరగ్గా.. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా సరైన రెస్క్యూ టీమ్ సైతం ఫిల్మ్ సిటీకి లేకపోవడంతో విలువైన సమయం వృధా అయ్యింది. ఆస్పత్రికి తరలింపు ఆలస్యమైంది. విస్టెక్స్ ప్రతినిధులు, షా భార్య 15 నుంచి 20 నిమిషాలు వేడుకుంటే తప్ప ఫిల్మ్ సిటీ నిర్వాహకులు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయలేదు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఒక అంబులెన్స్‌లో సంజయ్ షాను హయత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. విశ్వనాథ్ రాజును తీసుకువెళ్లడానికి మరో అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీ ప్రతినిధులు ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సొంత కారులోనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో సంజయ్ షా కన్నుమూశారు. విశ్వనాథ్ రాజును మెరుగైన చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శరీరంలో అనేక చోట్ల ఎముకలు విరగటంతో పాటు తీవ్ర గాయాలైన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఫిల్మ్ సిటీపై క్రిమినల్ కేసు నమోదు జానకిరామ్ రాజు తన ఫిర్యాదులో ఫిల్మ్ సిటీలోని భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం తదితర అంశాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ (ఉషా కిరణ్ ఈవెంట్స్), సీనియర్ ఈవెంట్ మేనేజర్ రితిక్ ఛటర్జీ, సేఫ్టీ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ జి.ఉదయ్ కిరణ్, ఫిల్మ్ సిటీలో స్పెషల్ ఎఫెక్ట్స్ కాంట్రాక్టర్‌గా ఉన్న ఎస్.సురేష్ బాబు, రోప్ ఆపరేటర్ ఎస్.దుర్గా సతీష్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 336, 287 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద వీరిపై ఆరోపణలు చేశారు. భార్య కళ్ల ఎదుటే ప్రమాదం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగిన సమయంలో విస్టెక్స్ సంస్థ సీఈఓ సంజయ్ షా భార్య కూడా అక్కడే ఉన్నారు. దంపతు లిద్దరూ గురువారం సాయంత్రం తమ సొంత విమానంలో ముంబై నుంచి శంషాబాద్ విమా నాశ్రయానికి, అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు. స్టేజీ కింద ఆహుతులతో కలిసి సంజయ్ భార్య కూర్చుని వీక్షిస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. దీంతో పరుగున స్టేజీ పైకి వచ్చిన ఆమె.. రక్తపు మడుగులో పడి ఉన్న తన భర్తను ఆస్పత్రికి తరలించండి అంటూ దాదా పు 15 నిమిషాలు అందరినీ వేడుకున్నారు. ఉస్మానియాలో పోస్టుమార్టం.. ముంబైకి మృతదేహం సంజయ్ షా మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భార్యకు అప్పగించారు. అక్కడి నుంచి శవపేటికను మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక అంబులెన్స్‌లో ఎయిర్‌పోర్టుకు, ఆపై విమానాశ్రయం అంబులెన్స్‌లో షా విమానం ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళారు. కానీ అందులో శవ పేటికను పెట్టడానికి అవకాశం లేకపోవడంతో కార్గో విమానంలో ముంబైకి పంపారు. షా భార్య సహా మిగిలిన వారు సంజయ్ విమానంలోనే ముంబై వెళ్ళారు. తమ స్వస్థలం గుజరాత్ అని, ఏళ్ళ క్రితమే ముంబైకి వలసవచ్చామని సంజయ్ భార్య పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. -
రామోజీ ఫిల్మ్ సిటీపై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలు అయ్యాయి. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ను నిందితులుగా చేర్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఫంక్షన్ల నిర్వహణ కోసం పలు గార్డెన్లను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి లైమ్లైట్ గార్డెన్. ఈ గార్డెన్ వద్ద విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో క్రేన్ ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ ద్వారా గెస్టులను కిందకు దించుతుండగా వైర్ తెగిపోయింది. దీంతో పలువురు కంపెనీ ప్రతినిధులు కిందపడిపోయారు. తీవ్రగాయాలతో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా అక్కడికక్కడే చనిపోయాడు. మృతిని పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన్ని మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరికొందరు కంపెనీ ప్రతినిధులకు సైతం గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదం ఎలా జరిగిందంటే.? రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్లో విస్టెక్స్ కంపెనీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విస్టెక్స్ కంపెనీ సిబ్బంది పలువురు హాజరయ్యారు. ఏర్పాట్లు అన్నీ రామోజీ ఫిలింసిటీ చేసింది. ఇందులో భాగంగా సినిమా తరహాలో ఎత్తు నుంచి ఓ క్రేన్‌లో CEOను, ఛైర్మన్‌ను కిందికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సర్కస్ తరహా ఫీట్లకు నిర్వహాకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణులైన సిబ్బందితో పాటు.. నాణ్యమైన క్రేన్లు ఉండాలి. దీంతో పాటు పబ్లిక్ ఈవెంట్లలో ఇష్టానుసారంగా సర్కస్ ఫీట్లు చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. పైగా ఏ ప్రభుత్వాధికారి కూడా ఇలాంటి ఫీట్లకు అనుమతి కూడా ఇవ్వరు. అయినా రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహాకులు అన్ని నిబంధనలను పక్కనబెట్టి.. విస్టెక్స్ కంపెనీ ఉన్నతాధికారులను క్రేన్ ఎక్కించారు. తేడా కొట్టడంతో క్రేన్ కుప్పకూలి సీఈవో సంజయ్‌షా మరణించారు. (ప్రమాదం జరిగిన గార్డెన్ ప్రాంతం ఇదే) ఇక ఈ ఘటనపై కేసు నమోదు అయ్యింది. FIR ప్రకారం.. జానకీరాం రాజు అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులుగా రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ను చేర్చి దర్యాప్తు చేపట్టారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. -
Supreme Court: బాబు బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది. జస్టిస్ బేల ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు బాబు తరపు న్యాయవాదులు సమయం కోరడంతో ఈ కేసును ధర్మాసనం ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. కంటి చికిత్స, ఇతరత్ర ఆరోగ్య సమస్యల దృష్ట్యా స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు అక్టోబర్ 31వ తేదీన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆపై ఆ బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మారుస్తూ నవంబర్ 20వ ఆదేశాలు ఇచ్చింది. అయితే.. బెయిల్‌పై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు తన పరిధిని మీరిందని పేర్కొంటూ ఆ మరుసటిరోజే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం స్కిల్ కేసులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో నారా చంద్రబాబు నాయుడిని ప్రతివాదిగా చేర్చింది. ఈ ఎస్ఎల్పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. హైకోర్టు స్కిల్ కుంభకోణంలో సీఐడీ చేసిన ఆరోపణల పూర్వాపరాల్లోకి వెళ్లి చంద్రబాబుకు క్లీన్‌చీట్ ఇచ్చిందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎస్ఎల్పీలో ఏముందంటే.. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు తేల్చిన పలు అంశాలు వాస్తవ విరుద్దం. ట్రయల్ సందర్భంగా కింది కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉంది. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఏకంగా 39 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించింది. రికార్డుల్లో ఉన్న అంశాలకు విరుద్దంగా హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కేసు లోతుల్లోకి వెళ్లకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా హైకోర్టు వ్యవహరించింది హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను డిశ్చార్జ్ పిటిషన్‌ను విచారించినట్లు విచారించింది స్కిల్ కుంభకోణం కేసు లోతుల్లోకి వెళ్లి మరీ చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది ఇదీ చదవండి: చంద్రబాబు రిమాండ్ సబబే.. తేల్చేసిన సుప్రీం కోర్టు స్పష్టంగా నగదు జాడలు ‘ప్రాజెక్టు విలువ రూ.36 కోట్లు అని చంద్రబాబు తదితరులు చెబుతున్నారు. అలా అయితే గత ప్రభుత్వం రూ.370 కోట్లు ఎందుకు విడుదల చేసినట్లు? మిగిలిన రూ.280 కోట్లు దారి మళ్లినట్లే. ఎంవోయూ, జీవో ప్రకారం అందచేయాల్సిన సాంకేతికతను సీమెన్స్, డిజైన్ టెక్‌లు అందించలేదన్నది వాస్తవం. అయితే సీఐడీ ఈ అంశాన్ని లేవనెత్తలేదని హైకోర్టు తన తీర్పులో చెప్పింది. వాస్తవానికి రిమాండ్లోనూ, హైకోర్టు వాదనల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తాం. ఫోరెన్సిక్ ఆడిట్‌ను ప్రతికూల కోణంలో చూడటం ద్వారా హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించినట్లయింది. ►స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొత్తం విజయమైందని, దీని ద్వారా 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందినట్లు తేల్చింది. ఇలా చెప్పడం ద్వారా హైకోర్టు తప్పు చేసింది. హైకోర్టు చెప్పింది ఎంత మాత్రం వాస్తవం కాదు. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చే అధికారం చంద్రబాబుకు ఉందని హైకోర్టు తేల్చింది. ఒకవేళ అలాంటిది ఉందని అనుకున్నా, చంద్రబాబు తన, షెల్ కంపెనీల స్వీయ లబ్ధి కోసం దురుద్దేశపూర్వకంగా ఆ అధికారాన్ని ఉపయోగించారు. ఈ విషయాన్ని హైకోర్టు తన తీర్పులో పూర్తిగా విస్మరించింది. ►ఈ కుంభకోణానికి సంబంధించి సీమెన్స్, డిజైన్‌టెక్ ఉద్యోగులు ఇచ్చిన వాంగ్మూలాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ప్రాజెక్టులో రాజకీయ జోక్యం ఉందని, ప్రాజెక్టు అమలుకు అడ్డువచ్చిన వారిని 24 గంటల్లో బదిలీ చేశారన్న వాంగ్మూలాలను పట్టించుకోలేద’ని సుప్రీంకోర్టు నిర్ధేశించిన పరిధుల అతిక్రమణ ‘ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హైకోర్టు తీర్పు చెల్లుబాటు కాదు. దానిని రద్దు చేయాలి. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే స్పష్టంగా తేల్చిన న్యాయపరమైన కొలమాలన్నింటినీ హైకోర్టు తన తీర్పు ద్వారా అతిక్రమించింది. బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా సాక్ష్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించడం, కేసు లోతుల్లోకి వెళ్లడాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీవ్రంగా తప్పుపట్టింది. మినీ ట్రయల్ కూడా నిర్వహించకూడదని చెప్పింది, అయితే హైకోర్టు ఏకంగా ట్రయల్ నిర్వహించింది. ►బెయిల్ మంజూరు సందర్భంగా సీఐడీ ఆరోపణలను, వారి తీవ్రతను, డాక్యుమెంట్ల విశ్వసనీయతను, సాక్ష్యాల విలువను హైకోర్టు తన తీర్పులో తేల్చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక కొలమానాలన్నింటికి విరుద్దంగా వ్యవహరించింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ నమోదు చేసిన కేసు ప్రభావితం అయ్యేలా హైకోర్టు వ్యవహరించింది. దుర్వినియోగం చేసిన నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు మళ్లించారని తేల్చేందుకు నిర్ధిష్ట ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అంశాల జోలికి వెళ్లరాదు. ►హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న బెయిల్ పిటిషన్‌ను అడ్డంపెట్టుకుని తెలుగుదేశం పార్టీ వర్గాలు సీఐడీ దర్యాప్తునకు అడ్డుగోడలా నిలబడ్డాయి. సీఐడీ సమన్లకు ఏ మాత్రం సహకరించలేదు. సీఐడీ సమన్లకు టీడీపీ వర్గాలు స్పందించలేదన్న వాస్తవాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మనీ లాండరింగ్ అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నిధులు ఎక్కడకు వెళ్లాయన్న దానిపై నిర్ధిష్ట ఆధారాలున్నాయి. వాటిని హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. అన్నీ అంశాలపై ఏపీ సీఐడీ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో నిధుల మళ్లింపు జరగలేదని తేల్చడం ద్వారా హైకోర్టు ఘోర తప్పిదానికి పాల్పడింది. క్వశ్చన్ ఆఫ్ లా.. హైకోర్టు తీర్పులో పలు అంశాలపై అనుమానాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ‘క్వశ్చన్ ఆఫ్ లా’కి సంబంధించి పలు ప్రశ్నలను సుప్రీంకోర్టు ఎదుట ఉంచింది. హైకోర్టు కసరత్తులో న్యాయపరమైన విధానం లోపించిందా? దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలు, నిందితుడి నేరానికి సంబంధించిన అంశాలపై హైకోర్టు వ్యాఖ్యలు న్యాయపరమైన అంశాలకు విరుద్ధంగా ఉన్నాయా? బెయిల్‌పై పిటిషనర్ల వాదనలు లేనప్పుడు హైకోర్టు విస్తృతమైన తీర్పు ఇవ్వగలదా? పీసీ చట్టం 1988 ప్రకారం అధికారిక నిర్ణయాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా భావించొచ్చా? అధికారం, అధికార వినియోగం, అధికారిక పరిధి లేకపోవడం, అధికార సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయడం, ఇతరులకు సొమ్ము రూపంలో లబ్ధి చేకూర్చడం తదితరాలపై హైకోర్టు నిర్ణయం సరైనదేనా?’ అనే ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందుంచింది. నిరంజన్‌సింగ్ వర్సెస్ ప్రభాకర్ రాజారామ్, సుమిత్ శుభాచంద్ర గంగ్వాల్ వర్సెస్ మహారాష్ట్ర కేసుల్లో తీర్పులతోపాటు స్కిల్ స్కామ్ కేసులో సాక్ష్యాధారాలను వివరించే అంశాన్ని హైకోర్టు పదేపదే తిరస్కరించిందని పేర్కొంది. సంగీతబెన్ వర్సెస్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తావిస్తూ ప్రస్తుత కేసులో హైకోర్టు ఆయా అంశాలను పరిశీలించకుండా బెయిల్ కేసును మినీ ట్రయల్‌గా మార్చిందని, ట్రయల్ కోర్టు పనితీరును విస్మరించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఒక్క కేసు పరిశీలనతోనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టవచ్చని నివేదించింది. క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం! సీమెన్స్, డిజైన్‌టెక్ నుంచి రావాల్సిన 90 శాతం నిధులు రాలేదని, అందువల్ల ప్రభుత్వం చెల్లించాల్సిన 10 శాతం నిధులను చెల్లించడం సరికాదన్న అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోని విషయాన్ని హైకోర్టు పూర్తిగా విస్మరించింది. అవినీతి నిరోధక చట్టం మౌలిక సూత్రాల నుంచి, పబ్లిక్ సర్వెంట్ అధికారం దుర్వినియోగం వంటి వాటి నుంచి హైకోర్టు దూరంగా వెళ్లింది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే విషయంపై హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంత మాత్రం హేతుబద్దమైనవి కావు. తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోవడం, కీలక నిందితులు సీఐడీ ముందుకు రాకపోవడం వంటి వాటి విషయంలో చంద్రబాబు పాత్ర ఉన్న విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదు. చంద్రబాబు రాజకీయంగా చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. దర్యాప్తును ప్రభావితం చేయడం, సాక్షులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తుకు విఘాతం కలిగేలా కొందరు నిందితులు మీడియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాలు దర్యాప్తునకు సహకరించడం లేదు. చంద్రబాబుకు బెయిల్ కోసం కాకుండా క్లీన్ చిట్ ఇచ్చే అంశంగా పరిగణించి ఆదేశాలు ఇచ్చినట్లు ఉంది. వీటన్నింటిరీత్యా చంద్రబాబు జుడీషియల్ రిమాండ్‌లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
CBN : ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదా
చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఇవ్వాళ బెంచ్ మీదకు రాలేదు. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా.. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేశారు చంద్రబాబు. ఈ పిటిషన్‌ను ఇవ్వాళ విచారించడం లేదని జస్టిస్ అనిరుధ్ బోస్ వెల్లడించారు. త్వరలో విచారణ తేదీని ప్రకటిస్తామని తెలిపారు. 3.20pm, జనవరి 17, 2024 విచారణ వాయిదా ఎందుకంటే.. ఏపీ ఫైబర్ నెట్ కేసుపై సుప్రీంకోర్టులో నేడు జరగని విచారణ చంద్రబాబు తరపున వాదించేందుకు కోర్టుకు వెళ్లిన సిద్ధార్థ్ లూథ్రా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం CID తరపున హాజరైన అడ్వొకేట్ ఆన్ రికార్డు ఫైబర్ గ్రిడ్ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్ ముందు ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఈ రోజు బెంచ్ కూర్చోవడం లేదని చెప్పిన జస్టిస్ అనిరుద్ధ బోస్ 14వ నెంబర్ కోర్టులో విచారణలో బిజీగా ఉన్న జస్టిస్ బేలా త్రివేది తదుపరి విచారణ తేదీని ప్రకటిస్తామన్న జస్టిస్ బోస్ 3.10pm, జనవరి 17, 2024 చంద్రబాబు పిటిషన్ వాయిదా ఫైబర్‌గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలంటూ చంద్రబాబు పిటిషన్ ఈ కేసులో జరగని విచారణ ఈరోజు తాము కూర్చోవడం లేదని స్పష్టం చేసిన జస్టిస్ అనిరుధ్ బోస్ తదుపరి విచారణ తేదిని తర్వాత ప్రకటిస్తామన్న జస్టిస్ అనిరుధ్ బోస్ 3.05pm, జనవరి 17, 2024 పిటిషన్ @ వెయిటింగ్ ఢిల్లీ: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణకు రాని పిటిషన్ 14 వ కోర్టు విచారణలో బిజీగా ఉన్న జస్టిస్ బేలా త్రివేది 2.55pm, జనవరి 17, 2024 అంతులేని అక్రమాలు.. ఫైబర్ గ్రిడ్‌లో 2014–2019 మధ్య సుమారు రూ.3,492 కోట్ల విలువైన పనులు ఫేజ్ 1 కింద రూ.333 కోట్ల పనులు సీసీ కెమెరాల కొనుగోలుకు రూ.959 కోట్లు భారత్ నెట్‌కు రూ.1,600 కోట్లు రూ.600 కోట్లతో సెట్ టాప్ బాక్సుల కొనుగోలు కొనుగోలు చేసిన 12 లక్షల సెట్‌టాప్ బాక్సుల్లో 3.40 లక్షల బాక్స్‌లు పని చేయలేదు అవి నాసిరకంగా ఉన్నాయని కింది సిబ్బంది చెప్పినా వినని పైనవాళ్లు చైనా కంపెనీలతో డీల్ కుదుర్చుకున్న హరికృష్ణప్రసాద్ 2.50pm, జనవరి 17, 2024 శాఖలు దాటి సంతకాలు ఏ ఫైలుపైనైనా సంబంధిత శాఖ మంత్రే సంతకం చేయాలి, ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. 2017లో ఏప్రిల్ 3న లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకుని IT, పంచాయతీరాజ్ శాఖలు అప్పగించిన చంద్రబాబు లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్ 14న APSFLకు సలహాదారుగా నియమించారు లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు సంబంధం లేదు కానీ APSFLకు చెందిన ఫైల్ పై లోకేశ్ సంతకాలు చేశారు భారత్ నెట్ ఫేజ్ 2కి సంబంధించిన MOU ఫైల్ పై నారా లోకేశ్ 2017 నవంబర్ 12న సంతకం BBNL(భారత్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్) రెండో దశకు సంబంధించి ఆ సంస్థకూ APSFLకూ మధ్య MOUను ఆమోదిస్తూ సంబంధిత ఫైల్‌పై కూడా లోకేశ్ సంతకం BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించిన లోకేష్ అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగింత దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు 2.45pm, జనవరి 17, 2024 CID దర్యాప్తులో బయటపడ్డ అంశాలు దోపిడీకి అడ్డాగా ఫైబర్ గ్రిడ్ రాష్ట్రంలో ఒకే కనెక్షన్‌తో ఇంటింటికీ కారు చౌకగా కేబుల్ టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తామని నాడు బాబు ప్రభుత్వం ప్రచారం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 2015లో శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఇందుకోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏర్పాటు ఆగస్టు 10, 2012 నుంచి సెప్టెంబర్ 8, 2015 వరకూ టెరా సాఫ్ట్ అనుబంధ సంస్థ టెరా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా వేమూరి హరికృష్ణప్రసాద్ వేమూరిని ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా నియమించుకున్న చంద్రబాబు ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో తొలిదశ పనులను రూ.333 కోట్లతో చేపట్టేందుకు ఆగస్టు 26, 2015న ఇన్‌క్యాప్(ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ అనుమతి ఈ టెండర్ మదింపు కమిటీలో ఐటీ సలహాదారు హరికృష్ణప్రసాద్‌ను చేర్చిన చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో ఈపాస్ యంత్రాల సరఫరాలో గోల్మాల్ చేసిన టెరా సాఫ్ట్‌ను ఏపీటీఎస్ (ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) సంస్థ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది కానీ.. ఫైబర్ గ్రిడ్ తొలి దశ టెండర్‌ను మాత్రం ఆగస్టు 30, 2015న టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టారు. టెరా సాఫ్ట్‌కు కేబుళ్లు, నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్(నాక్), హెడ్ ఎండ్ అనుభవం ఉన్నట్లు సిగ్నమ్ కంపెనీ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించిన ఘనులు దీనిపై ఫిర్యాదు చేసిన సిగ్నమ్ కంపెనీ ఎండీ నాసిరకం కేబుల్, క్లాంప్‌లతో టెరా సాఫ్ట్ తొలి దశలోనే రూ.333 కోట్లను దోపిడి 2.40pm, జనవరి 17, 2024 వాదనల సందర్భంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరాం ఏం చెప్పారంటే.. చంద్రబాబు సిఫారసుతోనే గవర్నింగ్ కౌన్సిల్లో వేమూరి హరిప్రసాద్ సభ్యుడు అయ్యాడు టెరాసాఫ్ట్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఎలాంటి కారణం లేకుండా టెండర్ గడువును పొడిగించారు చంద్రబాబు కార్యాలయం మౌఖిక ఆదేశాలతో టెండర్ గడువు చివరి తేదీకి ముందు రోజు టెరాసాఫ్ట్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు సంబంధిత శాఖకు ఇన్చార్జ్గా ఉన్న ఓ ఉన్నతాధికారి టెరాసాఫ్ట్‌కు ప్రాజెక్టు అప్పగించడంపై అభ్యంతరం తెలిపారు ఆయన్ని బదిలీ చేసి, నామమాత్రపు పోస్టుకు మార్చారు టెండర్ నిబంధనలు, ఒప్పందంలో నిర్దేశించిన ప్రమాణాలకు భిన్నంగా కాంట్రాక్టు సంస్థ నాసిరకం సామగ్రిని ఉపయోగించింది ఖజానాకు రూ.115 కోట్ల మేర నష్టం వాటిల్లింది ఈ మొత్తం టెరాసాఫ్ట్ అధినేత, చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్‌కు చేరింది తొలుత హరిప్రసాద్‌కు, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు, అక్కడి నుంచి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు నిధులు మళ్లాయి 2.35pm, జనవరి 17, 2024 వాదనల సందర్భంగా చంద్రబాబు లాయర్ అగర్వాల్ ఏం చెప్పారంటే.. చంద్రబాబు లబ్ధి పొందినట్లు ఒక్క ఆధారం చూపలేదు సీఐడీ ఈ కేసు నమోదు చేసి రెండేళ్లయింది ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేయలేదు చార్జిషీట్ దాఖలు చేయలేదు ప్రాజెక్టు వ్యయం పెంపు పూర్తిగా సంబంధిత శాఖ అంతర్గత విషయం ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు లబ్ధి పొందలేదు ఈ రెండేళ్లు చంద్రబాబు బయటే ఉన్నారని, ఒక్క సాక్షిని కూడా ప్రభావితం చేయలేదని చెప్పారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వ ప్రోద్బలంతో సీఐడీ ఈ కేసు నమోదు చేసిందన్నారు. ప్రతి కేసులో చంద్రబాబును జైలులోనే ఉంచాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోందన్నారు. 2.30pm, జనవరి 17, 2024 ఫైబర్‌నెట్ కేసు @ సుప్రీంకోర్టు కాసేపట్లో సుప్రీం కోర్టు లో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ మద్యాహ్నం 3 గంటలకు సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ ఫైబర్ నెట్ కేసుపై హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ చంద్రబాబు ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసిన చంద్రబాబు బాబు పిటిషన్ ను విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం 17ఏపై స్పష్టత వచ్చిన తరువాతే ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో చెప్పిన సుప్రీం ధర్మాసనం 2.25pm, జనవరి 17, 2024 ఫైబర్‌నెట్ కేసులో ఏం జరిగిందంటే..? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫైబర్‌నెట్ కుంభకోణం రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారని సీఐడీ అభియోగం 2021లో APSFL ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టినట్టు రికార్డులు నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయం ఢిల్లీ, సాక్షి: ఫైబర్ నెట్‌కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. స్కిల్ కేసు క్వాష్ పిటిషన్‌పై ఈ ధర్మాసనమే నిన్న భిన్న తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ తిరస్కరణ ఎదురైంది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారాయన. అయితే స్కిల్ కేసుకు సంబంధించి 17-ఎ సెక్షన్‌తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఫైబర్ కేసు పిటిషన్ విచారణ వాయిదావేసింది. అప్పటివరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీచేసింది. మంగళవారం సెక్షన్ 17-ఏపై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. చీఫ్ జస్టిస్ బెంచ్‌కు రిఫర్ చేసింది. కానీ, స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టును, రిమాండ్‌ను ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై ఇవాళ్టి విచారణలో ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఫైబర్ నెట్ కేసు నేపథ్యం.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫైబర్‌నెట్ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నది సీఐడీ ప్రధాన అభియోగం. 2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయ్యింది. టీడీపీ ప్రభుత్వంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగిందన్నది సీఐడీ చెబుతోంది. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. చంద్రబాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు. చట్టానికి విరుద్ధంగా.. ఫైబర్ నెట్ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియమించారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ– గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించడంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. ఓ ప్రాజెక్టు టెండర్ల మదింపు కమిటీలో ఆ ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు ఉండకూడదన్న నిబంధననూ ఉల్లంఘించారు. టెరా సాఫ్ట్ సంస్థ అప్పటికే బ్లాక్ లిస్టులో కూడా ఉంది. అంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. కానీ చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్లాక్ లిస్ట్ జాబితా నుంచి టెరా సాఫ్ట్ కంపెనీ పేరును తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టి మరీ టెరా సాఫ్ట్ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేయడం గమనార్హం. -
బాబుపై స్కిల్ కేసును కొట్టేయలేం
జస్టిస్ అనిరుద్ధ బోస్ ఏం చెప్పారంటే... ► స్కిల్ కేసుకు సెక్షన్ 17(ఏ) వర్తిస్తుంది.. చంద్రబాబుపై కేసు నమోదుకు ముందు గవర్నర్ అనుమతి తప్పని సరి.. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవచ్చు ► అనంతరం చంద్రబాబు విషయంలో ముందుకెళ్లొచ్చు జస్టిస్ బేలా త్రివేదీ ఏం చెప్పారంటే... ► 2018కి ముందు నేరాలకు సెక్షన్ 17(ఏ) వర్తించదు ► సెక్షన్ 17(ఏ) అమల్లో లేని కాలానికి దానిని వర్తింపజేయలేం ► చట్ట సవరణ చేసిన శాసనవ్యవస్థ ఉద్దేశం కూడా ఇదే ► 2018కి పూర్వ నేరాలకు వర్తింప చేస్తే చాలా వివాదాలు తలెత్తుతాయి ► గత నేరాలకు వర్తింప చేస్తే ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ► అంతేకాక చట్ట సవరణ తీసుకొచ్చిన ఉద్దేశమూ నెరవేరకుండా పోతుంది ► భిన్నమైన భాష్యం ప్రాథమిక దశలో దర్యాప్తునకు విఘాతం కలిగించడమే ► సెక్షన్ 17 (ఏ) తెచ్చింది అవినీతిపరులను కాపాడేందుకు కాదు ► వేధింపుల నుంచి నిజాయతీపరులైన వారిని కాపాడేందుకే ► అధికార విధుల్లో భాగం కాని నిర్ణయాలకు సెక్షన్ 17(ఏ) కింద రక్షణ సాధ్యం కాదు ► చంద్రబాబు రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు సరిగ్గానే వ్యవహరించింది ► తన పరిధి మేరకే నిర్ణయం తీసుకుంది ► 17(ఏ) కింద అనుమతి లేదని రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయలేం ► హైకోర్టు తీర్పులో కూడా ఎలాంటి చట్ట విరుద్ధత లేదు ► ఏసీబీ కోర్టు, హైకోర్టు తీర్పుల్లో ఏ రకంగానూ జోక్యం అవసరం లేదు సాక్షి, అమరావతి: యువతలో ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరుస్తామంటూ వందల కోట్లు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరిట షెల్ కంపెనీల ద్వారా వందల కోట్ల రూపాయల్ని కాజేసినందుకు చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బాబుకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్దించింది. అంతేకాకుండా ఈ కేసులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు, ప్రభుత్వ కక్షసాధింపులు లేనేలేవని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. సీమెన్స్ సంస్థకు తెలియకుండానే ఆ కంపెనీ మాజీ అధికారులను తెరపైకి తెచ్చి ... బోగస్ ఒప్పందాలతో... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు నేరుగా వందల కోట్లను తన ఖాతాల్లోకి మళ్లించుకున్న వ్యవహారంలో ఆయనపై ఆధారాలతో సహా ఏపీ సీఐడీ విభాగం కేసు నమోదు చేయటం తెలిసిందే. కేసులో బాబును అరెస్టు చేసి, ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు పరచటంతో... కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి... ఆరోగ్యం బాగాలేదని, ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటానని చెప్పి షరతులతో బెయిలు తీసుకుని బయటకు వచ్చారు. ఈ కేసులో అరెస్టయిన తరవాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి పెద్దపెద్ద న్యాయవాదులను ప్రత్యేక విమానాల్లో తెప్పించారు. మొదటి నుంచీ తనకు ఈ కేసుతో సంబంధం లేదనిగానీ, తాను అక్రమాలకు పాల్పడలేదని గానీ, డబ్బుల్ని షెల్ కంపెనీల్లోకి మళ్లించలేదని గానీ, సీమెన్స్ సంస్థ పేరిట బోగస్ ఒప్పందం చేసుకోలేదని గానీ వాదించకుండా... తాను మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి, తనను అరెస్టు చేయాలంటే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నరు అనుమతి తీసుకోవాలని, అలా తీసుకోకుండా సీఐడీ తనను అరెస్టు చేసింది కాబట్టి ఈ అరెస్టు చెల్లదని... కాబట్టి మొత్తం కేసును కొట్టేయాలని (క్వాష్ చెయ్యాలని) చంద్రబాబు వాదిస్తున్నారు. కింది కోర్టు నుంచి అత్యున్నత సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు తరఫు లాయర్లు ఇదే వాదన వినిపిస్తూ వచ్చారు. కేసును కొట్టేయడానికి కింది కోర్టు, రాష్ట్ర హైకోర్టు నిరాకరించటంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ మధ్యలోనే అనారోగ్య కారణాలు చూపించి బాబు బెయిలుపై విడుదలయ్యారు. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం... మంగళవారం తీర్పు వెలువరించింది. కేసును క్వాష్ చెయ్యాలన్న చంద్రబాబు అభ్యర్థనను తిరస్కరించింది. సీఐడీ పెట్టిన ఎఫ్ఐఆర్ను, ప్రత్యేక న్యాయస్థానం విధించిన రిమాండ్‌ను... అన్నింటినీ సుప్రీంకోర్టు బెంచ్ సమర్థించింది. అయితే గవర్నరు అనుమతి తీసుకున్నాకే చంద్రబాబును అరెస్టు చేయాలన్న సెక్షన్ 17ఏ విషయంలో ధర్మాసనంలోని ఇరువురు న్యాయమూర్తులూ భిన్నమైన తీర్పును వెలువరించారు. చంద్రబాబు నాయుడికి సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నరు నుంచి అనుమతి తీసుకోవచ్చని జస్టిస్ అనిరుద్ధ బోస్ పేర్కొనగా... సెక్షన్ 17ఏ రాకముందే ఈ నేరం జరిగింది కాబట్టి చంద్రబాబుకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేదీ స్పష్టంచేశారు. నిజాయితీపరులైన అధికారులను వేధింపుల నుంచి కాపాడాలన్న ఉద్దేశంతోనే సెక్షన్ 17ఏను తెచ్చారని, అవినీతి పరులను కాపాడేందుకు కాదని ఆయన స్పష్టంచేశారు. చంద్రబాబు రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు సరిగ్గానే వ్యవహరించిందని, తన పరిధి మేరకే నిర్ణయం తీసుకుందని విస్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడేం జరుగుతుంది? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణమనేది రాజకీయ దురుద్దేశాలతో పెట్టినదని, తనను కక్షసాధింపుతోనే అరెస్టు చేశారని చంద్రబాబు చెబుతున్నారు. సుప్రీంకోర్టు మాత్రం ఈ వాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇది అవినీతికి సంబంధించిన స్పష్టమైన కేసు అని, దీన్లో రాజకీయ దురుద్దేశాలు గానీ, కక్ష సాధింపుగానీ లేవని తేలి్చచెప్పింది. సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చెయ్యడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో... ఎఫ్ఐఆర్లో ఐపీసీ 409 (ప్రజల నమ్మకాన్ని నేరపూరితంగా వంచించటం), సెక్షన్ 120బి (దురుద్దేశపూర్వక కుట్ర) వంటివి సెక్షన్ 17ఏతో సంబంధం లేనివి కనుక యథాతథంగా కొనసాగుతాయి. ఐపీసీ 409 కింద నేరం గనక రుజువైతే యావజ్జీవ శిక్ష పడుతుంది. కాకపోతే సెక్షన్ 17ఏ వర్తిస్తుందా? లేదా? అన్న విషయంలో మాత్రం బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులూ భిన్నమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు కాబట్టి... ఈ అంశాన్ని ఇద్దరికన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులుండే విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిందిగా కోరుతూ... కేసు ఫైళ్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని కోర్టు రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మేరకు బెంచ్ ఏర్పాటు ఉంటుంది. తీర్పుల కాపీలు అప్లోడ్ చేయకపోవడంతో అందులోని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. జస్టిస్ బోస్ ఏం చెప్పారంటే... చంద్రబాబుపై కేసు నమోదు చేసే ముందు సెక్షన్ 17(ఏ) ప్రకారం ముందస్తు అనుమతి (గవర్నర్ నుంచి) తీసుకోవడం తప్పనిసరి అని జస్టిస్ బోస్ తన తీర్పులో పేర్కొన్నారు. అలా ముందస్తు అనుమతి తీసుకోకుండా చేపట్టే విచారణ లేదా దర్యాప్తు చట్ట విరుద్ధమవుతుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అందువల్ల అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(సీ), 13(1)(డీ), 13(2) ప్రకారం చంద్రబాబు విషయంలో ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గవర్నరు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చని, తదనంతరం అవినీతి నిరోధక చట్టం కింద (పీసీ యాక్ట్) చంద్రబాబు విషయంలో ముందుకెళ్లవచ్చునని తెలిపారు. అలాగే తనపై సీఐడీ నమోదు చేసిన కేసును, తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలన్న చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చుతున్నట్లు జస్టిస్ బోస్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోనంత మాత్రాన రిమాండ్ ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా పోవని ఆయన తేల్చి చెప్పారు. జస్టిస్ బేలా త్రివేది... 17 (ఏ) ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ బోస్ తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది విబేధించారు. సెక్షన్ 17(ఏ) అమల్లోకి రాకమునుపే ఈ నేరం జరిగిందని... అది అమల్లో లేని కాలానికి దానిని వర్తింప చేయలేమని జస్టిస్ త్రివేది తీర్పునిచ్చారు. అవినీతి నిరోధక చట్టానికి 2018లో సవరణలు చేసి సెక్షన్ 17(ఏ)ను చేర్చిన నేపథ్యంలో... 2018కి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17(ఏ) వర్తించదని, 2018, ఆ తరవాత జరిగిన నేరాలకే ఈ సెక్షన్ వర్తిస్తుందని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. చట్ట సవరణ చేసిన శాసనవ్యవస్థ ఉద్దేశం కూడా ఇదేనన్నారు. ‘‘17(ఏ)ను పూర్వ నేరాలకు వర్తింప చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. 17(ఏ) రావడానికి ముందున్న కాలానికి దీన్ని వర్తింప చేస్తే కొత్తగా అనేక వివాదాలకు తేరలేపినట్లవుతుంది. 2018కి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17(ఏ)ను వర్తింప చేస్తే చట్ట సవరణ చేసిన ఉద్దేశం నెరవేరకుండా పోతుంది’’ అని ఆమె తేల్చి చెప్పారు. ప్రాథమిక దశలోనే దర్యాప్తునకు విఘాతం కలిగించినట్లవుతుంది... శాసనవ్యవస్థ సెక్షన్ 17(ఏ)ను తీసుకొచ్చి న ఉద్దేశానికి మరో రకమైన భాష్యం చెప్పినా కూడా అది అసమంజసమే అవుతుందని జస్టిస్ బేలా త్రివేదీ తెలిపారు. అంతేకాక ప్రాథమిక దశలోనే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలిగించినట్లు అవుతుందన్నారు. ‘‘2018కి ముందు కేసులకు కూడా సెక్షన్ 17(ఏ) వర్తిస్తుŠందన్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనతో ఏకీభవిస్తే, పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల్లోని విచారణలు, దర్యాప్తులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీని వల్ల చాలా కేసులు నిరర్థకంగా మారతాయి. అవినీతిని రూపుమాపేందుకు తీసుకొచ్చిన చట్టం తాలుకు ముఖ్య ఉద్దేశం నెరవేరకుండా పోతుంది. అసలు అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలపై వేధింపులకు గురికాకుండా నిజాయతీపరులైన అమాయక అధికారులను కాపాడటానికే సెక్షన్ 17ఏను తీసుకువచ్చారు. అంతేతప్ప అవినీతిపరులైన పబ్లిక్ సర్వెంట్లకు రక్షణ కల్పించడానికి కాదు’’ అని జస్టిస్ బేలా తన తీర్పులో విస్పష్టంగా చెప్పారు. విధుల్లో భాగం కాని నిర్ణయాలకు రక్షణ ఇవ్వకూడదు.. అవినీతి నిరోధక చట్టం సెక్షన్లతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదైనప్పుడు, కేసు నమోదుకు ముందు సెక్షన్ 17(ఏ) కింద అనుమతి తీసుకోలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్ను కొట్టేయడం సాధ్యం కాదన్నారు. అధికార విధుల్లో భాగం కాని నిర్ణయాలకు సెక్షన్ 17(ఏ) కింద రక్షణ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఏసీబీ కోర్టు తనకున్న పరిధి మేరకే రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. చంద్రబాబును రిమాండ్‌కు పంపడం ద్వారా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎలాంటి తప్పు చేయలేదని జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో సైతం ఎలాంటి దోషం గానీ, చట్ట విరుద్ధత గానీ లేదన్నారు. హైకోర్టు తీర్పులో ఏ రకంగానూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె తన తీర్పులో స్పష్టం చేశారు. మూడు నెలల తరువాత తీర్పు... ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. ప్రధానంగా సెక్షన్ 17(ఏ)పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ, సిద్దార్థ లూత్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, ఎస్.నిరంజన్ రెడ్డి, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. వాదనల అనంతరం అక్టోబర్ 17న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 3 నెలల తరువాత మంగళవారం తీర్పును వెలువరించింది. ఇరువురు న్యాయమూర్తులు కూడా సెక్షన్ 7(ఏ) విషయంలో భిన్న తీర్పులు వెలువరించారు. ఇక ఇప్పుడేమని అరుస్తారు..? కేసు కొట్టివేతకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం తనపై అన్యాయంగా కేసు పెట్టిందని, రాజకీయంగా వేధించేందుకు జైల్లో పెట్టారంటూ చంద్రబాబు, ఆయన వందిమాగధులు చేస్తూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. తన తండ్రి విషయంలో ఏసీబీ కోర్టు అన్యాయంగా వ్యవహరించిందంటూ నారా లోకేష్ ఎల్లో మీడియా ఇంటర్వ్యూల్లో చేసిన ఆరోపణలు బూటకమని రుజువైంది. బాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు జడ్జిని, రిమాండ్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డిని సోషల్ మీడియాలో దారుణంగా దూషించిన టీడీపీకి సుప్రీం తీర్పు చెంపదెబ్బ కన్నా ఎక్కువే. సెక్షన్ 17(ఏ)ను తేల్చనున్న సీనియర్ న్యాయమూర్తి... ఇరువురు న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఏర్పాటవుతుంది. ఈ విషయంలో సీజే జస్టిస్ చంద్రచూడ్ పాలనాపరమైన నిర్ణయం తీసుకుంటారు. జస్టిస్ బోస్ కన్నా సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తారు. జస్టిస్ బోస్ ఇప్పుడు సీనియారిటీలో 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయనకన్నా సీనియర్లు అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ లేదా రెండవ స్థానంలో ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, లేదా మూడవ స్థానంలో ఉన్న జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ లేదా నాల్గవ స్థానంలో ఉన్న సూర్య కాంత్.. ఈ నలుగురిలో ఒకరి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం ఏర్పాటవుతుంది. ఈ విస్తత ధర్మాసనంలో కొత్తగా వచ్చే సీనియర్ న్యాయమూర్తితో పాటు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది కూడా ఉంటారు. ఈ ముగ్గురు కలిసి తిరిగి మొదటి నుంచి చంద్రబాబు కేసును విచారిస్తారు. జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ఇప్పటికే ఓ నిర్ణయాన్ని వెలువరించిన నేపథ్యంలో విస్తృత ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి నిర్ణయం కీలకమవుతుంది. అలాగే జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది కేవలం సెక్షన్ 17(ఏ) విషయంలోనే భిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో విస్తత ధర్మాసనం సైతం ఇదే అంశంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. విస్తృత ధర్మాసనంలో ఉండే సీనియర్ న్యాయమూర్తి ఇప్పటికే నిర్ణయం వెలువవరించిన ఇరువురు న్యాయమూర్తుల్లో ఒకరి నిర్ణయాన్ని సమర్దించవచ్చు. ఎవరి తీర్పును సమర్దిస్తారో అప్పుడు 2 :1గా మెజారిటీతో ఆ తీర్పు ఖరారు అవుతుంది. ఒకవేళ జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల నిర్ణయాలతో ఏకీభవించకుండా ఆ సీనియర్ న్యాయమూర్తి మరో భిన్నమైన నిర్ణయాన్ని వెలువరిస్తే, అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును పంపాల్సి ఉంటుంది. మొట్టమొదటిసారి.... విచారణ ముంగిట చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో చంద్రబాబు ఈ కేసులో తొలిసారిగా కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు. స్కిల్ కేసులో సీఐడీ తన దర్యాప్తును పూర్తి చేసి చార్జిïÙట్ దాఖలు చేసిన తరువాత ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణను (ట్రయల్) మొదలు పెడుతుంది. విచారణ జరిగే ప్రతీ సందర్భంలోనూ చంద్రబాబు కోర్టు ఎదుటకు హాజరు కావడం తప్పనిసరి. ఈ విధంగా చంద్రబాబు ఓ కేసులో కింది కోర్టులో విచారణను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. చంద్రబాబుపై కర్షక పరిషత్ కేసు మొదలుకుని ఇప్పటి వరకు ఎన్నో కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసుల్లో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. చాలా కేసులను నేరం లోతుల్లోకి వెళ్లనివ్వకుండా సాంకేతిక కారణాలతో కొట్టేయించుకున్నారు. ఏ కోర్టు కూడా ఏ ఒక్క కేసులోనూ పూర్తిస్థాయి విచారణ (ట్రయల్) జరిపి చంద్రబాబు నేరం చేయలేదని క్లీన్చిట్ ఇచ్చిన సందర్భాలు లేవు. టెక్నికల్ అంశాలను లేవనెత్తుతూ అన్ని కేసుల్లోనూ తనకు మాత్రమే సాధ్యమైన ‘మేనేజ్మెంట్ స్కిల్స్’తో చంద్రబాబు ఇప్పటి వరకు బయటపడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన కేసును సైతం హైదరాబాద్ ఏసీబీ కోర్టు సాంకేతిక కారణాలతోనే కొట్టేసింది. ఈ కేసును కొట్టేసిన న్యాయాధికారి అటు తరువాత జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో హైకోర్టు జడ్జి అయ్యారు. ఇప్పుడు స్కిల్ కుంభకోణంలో అలా బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. విస్మయకరంగా అరెస్టయిన 3 రోజులకే కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈసారి పాచికలు పారలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించాయి. దీంతో ఆయన ఏసీబీ కోర్టు విచారణను ఎదుర్కోక తప్పడం లేదు. బాబు కుంభకోణం నేపథ్యం ఇదీ.. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో షెల్ కంపెనీల ద్వారా ఖజానాకు చెందిన రూ.వందల కోట్లను కొల్లగొట్టారని పేర్కొంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కేసులో చంద్రబాబును నిందితునిగా చేర్చింది. గతేడాది సెపె్టంబర్ 9న ఆయనను అరెస్ట్ చేసి 10న విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అనంతరం సీఐడీ చంద్రబాబును తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది. దీంతో ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలంటూ చంద్రబాబు సెప్టెంబర్ 12న హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అరెస్టయిన 3 రోజులకే ఆయన ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఈ పిటిషన్లో తన తరఫున వాదనలు వినిపించేందుకు చంద్రబాబు దేశంలోనే అత్యధిక ఫీజులు వసూలు చేసే ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం, చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు జíస్టిస్ శ్రీనివాసరెడ్డి నిరాకరించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వుల్లో సైతం జోక్యానికి నిరాకరించారు. అంతేకాక సెక్షన్ 17(ఏ) కూడా వర్తించదని సెపె్టంబర్ 22న వెలువరించిన తీర్పులో జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. -
టీడీపీ నాయకుల అరాచకం
ఆత్మకూరు: టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అడ్డుకుని మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం మడపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మడపల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. స్థానిక రామాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో టీడీపీకి చెందిన పెద్దిరెడ్డి కిరణ్, కిషోర్, నవీన్, వినయ్, పూర్ణచంద్ర తదితరులు అడ్డుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, నిలిపివేయమనడం సరికాదని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పారు. దీంతో చెలరేగిపోయిన టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామపెద్దలు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో టీడీపీకి చెందిన కిరణ్, కిషోర్ తదితరులు వైఎస్సార్ సీపీకి చెందిన ఇనకల్లు ప్రసాద్‌రెడ్డి, పెంచలరెడ్డి, మాజీ సర్పంచ్ గుండుబోయిన నారాయణయాదవ్ ఇళ్లపై రాళ్లు, కర్రలు, కొడవలి తదితర మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో ప్రసాద్‌రెడ్డికి గాయాలు కాగా, పైదంతాలు రెండు ఊడిపోయాయి. పెంచలరెడ్డి, నారాయణయాదవ్లకూ గాయాలయ్యాయి. స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో టీడీపీ నాయకులు పరారయ్యారు. గాయపడిన వారిని తొలుత చేజర్ల పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్సై ప్రభాకర్ సిబ్బందితో కలిసి ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. -
CBN: రిమాండ్ సబబే.. కేసు కొట్టేయలేం
ఢిల్లీ, సాక్షి: స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఈ క్రమంలో.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్ పిటిషన్‌ను బదిలీ చేసింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు భారీ షాక్ లాంటిది. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టు అంటే విజయవాడలోని ACB కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తీర్పు ఎలా వెలువరించారంటే.. తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చదువుతూ.. "ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్‌ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు." అని జస్టిస్ బోసు తీర్పు ఇచ్చారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు. మొదటి తీర్పు : జస్టిస్ బోస్ ఏమన్నారంటే.. ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు చంద్రబాబు కేసులో 13(1)(c), 13(1)(d), 13(2) వర్తించవు అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్‌ను కొట్టేయలేం కేవలం అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు రిమాండ్ రిపోర్ట్‌ను కొట్టేయాలని గానీ, చెల్లుబాటు కాదని గానీ చెప్పలేం, రిమాండ్ చెల్లుతుంది, కొనసాగుతుంది రెండో తీర్పు : జస్టిస్ బేలా త్రివేది ఏమన్నారంటే.. అసలు ఈ కేసులో చంద్రబాబు పిటిషన్‌కు ఏ రకంగా 17ఏ వర్తించదు 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం పాత కేసులకు 17ఏ వర్తించదు, సవరణ వచ్చిన తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెక్షన్ వర్తిస్తుంది.. కానీ చంద్రబాబు కేసుకు వర్తించదు 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే అవినీతి నిరోధక చట్టం కింద నమోదయిన ఈ కేసును 17ఏకి ముడిపెట్టి ఊరట ఇవ్వలేం అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే గవర్నర్ అనుమతి లేదనే కారణంతో FIRను క్వాష్ చేయడం కుదరదు ట్రయల్ కోర్టు (ACB కోర్టు, విజయవాడ) ఇచ్చిన రిమాండ్ పూర్తిగా సబబే దర్యాప్తు కొనసాగించవచ్చు, ఛార్జ్‌షీట్ దాఖలు చేయవచ్చు, న్యాయప్రక్రియ కంటిన్యూ అవుతుంది ఇలాంటి కేసుల్లో 17ఏను అంగీకరిస్తే.. మొత్తం న్యాయప్రక్రియ అపహస్యం అవుతుంది పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులకు ఇదే వర్తిస్తుందన్న వాదన మొదలవుతుంది అసలు 17ఏ వర్తించాలన్న వాదనే సరికాదు, దీని పర్యవసానాలు ఊహించనంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకువస్తాయి దర్యాప్తు అధికారులకు పూర్తి అధికారాలున్నాయి, అవినీతి నిరోధక చట్టం కింద విచారణ కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు నిజాయితీపరుల రక్షణ కోసమే ఈ సవరణ తీసుకొచ్చామన్నది పార్లమెంట్ చర్చల సారాంశం ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే..! సెప్టెంబర్ 22వ తేదీన ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత.. సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సెప్టెంబర్ 25వ తేదీన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు బాబు క్వాష్ పిటిషన్ 26న సంబంధిత న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ఉన్నందున మరుసటి రోజుకి వాయిదా జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం ముందుకు సెప్టెంబర్ 27వ తేదీన బాబు క్వాష్ పిటిషన్ ధర్మాసనం నుంచి వైదొలగిన జస్టిస్ భట్ మరోసారి సీజేఐ చంద్రచూడ్ ముందుకు పిటిషన్ అక్టోబర్ 3న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు పిటిషన్ అక్టోబర్ 9,10,13వ తేదీల్లో వాడీవేడిగా సాగిన వాదనలు అక్టోబర్ 13వ స్కిల్ పిటిషన్‌కు తోడైన ఫైబర్ గ్రిడ్ కేసు పిటిషన్ స్కిల్, ఫైబర్ గ్రిడ్ పిటిషన్లను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం బెంచ్ అక్టోబర్ 17వ తేదీన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ పిటిషన్‌పై విచారణ చేస్తామని చెబుతూ.. అంతకు ముందే స్కిల్ కేసు తీర్పు వెల్లడిస్తామన్న బెంచ్ దసరా, దీపావళి సెలవుల దృష్ట్యా విచారణ వాయిదా అక్టోబర్ 31వ తేదీన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మీద బయటకు మొత్తం 52 రోజులపాటు జైల్లో చంద్రబాబు.. మధ్యలో సీఐడీ కస్టడీ విచారణ నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ అదే తేదీన పలు షరతులతో బాబుకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ఇవాళ వెలువడ్డ రెండు తీర్పులు