-
బెజవాడలో వ్యక్తి దారుణ హత్య
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరం నడిరోడ్డున మంగళవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల ప్రకారం.. యనమలకుదురు డొంకరోడ్డులోని శ్రీనివాస అపార్ట్‌మెంట్స్‌లో మహ్మద్ రఫీ(54), అజ్మరీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. రఫీ వారి ఇంటి సమీపంలోనే ఆదిల్ డిజిటల్ సేవా కేంద్రాన్ని నడుపుతూ జీవనం సాగిస్తూ పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. రఫీతో కలిసి లయోలా కళాశాలలో చదువుకున్న సాగి వెంకట నరసింహరాజు(54) అనే స్నేహితుడు హైదరాబాద్‌లో నివసిస్తూ ఓ ఫార్మసీ కంపెనీని నడుపుతున్నాడు. సోమవారం నగరానికి వచ్చిన నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి ఫోన్ చేసి అయోధ్యనగర్‌లోని లోటస్ ల్యాండ్‌మార్క్‌లో ఉన్న తన ఫ్లాట్‌కు రమ్మని పిలిచాడు. దీంతో రఫీ సోమవారం తన స్నేహితుడు ఉన్న ఫ్లాట్‌కు వెళ్లాడు. రఫీకి మద్యం తాగే అలవాటు ఉంది. నరసింహరాజు మాత్రం మద్యం ముట్టడు. దీంతో నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి మద్యం తెప్పించాడు. రఫీ మద్యం తాగాడు. అనంతరం రఫీకి, నరసింహరాజుకు మధ్య డబ్బుల విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో రఫీ సమీపంలో ఉన్న కత్తెరను తీసుకొని నరసింహరాజును పొడిచేందుకు ప్రయత్నించగా అతను తన మెడలో ఉన్న కండువాను తీసి రఫీ మెడకు గట్టిగా బిగించేయడంతో రఫీ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. నరసింహరాజు విషయాన్ని 100కు ఫోన్ చేసి పోలీసులకు, 108కు ఫోను చేసి జరిగిన విషయాన్ని చెప్పగా వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రఫీని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. కత్తితో దాడి చేయబోతే ప్రతిఘటించా... తన స్నేహితుడు రఫీ ఇటీవల బాగా అప్పులపాలయ్యాడని ఈ క్రమంలో తనను రూ.3 లక్షలు అప్పుగా అడగడంతో తాను నిరాకరించానన్నారు. ఆ విషయంలో తమ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని, రఫీ పక్కనున్న కత్తెరతో తనపై దాడికి ప్రయతి్నంచగా తాను అతన్ని ఆపేందుకు కండువాతో గట్టిగా గొంతు నులిమానంటూ నిందితుడు నరసింహరాజు పోలీసులకు చెప్పుకొచ్చాడు. తన బాల్య స్నేహితుడిని తానెందుకు చంపుకొంటానంటూ వాపోయాడు. అన్నీ అబద్ధాలే.. కావాలనే నా భర్తను హతమార్చారు... నరసింహరాజు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని రఫీ భార్య అజ్మిరీ ఆరోపించింది. తన భర్త రఫీయే నరసింహరాజుకు డబ్బులు ఇచ్చాడని, వాటిని ఇవ్వమని అనేకసార్లు అడుగుతుంటే మాట దాట వేసుకుంటూ వస్తున్నాడన్నారు. ఈ విషయమే మాట్లాడేందుకు వారిద్దరూ కలిశారని తెలిపింది. పథకం ప్రకారమే తన భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి, తన భర్త పైనే కత్తెరతో దాడిచేసి నైలాన్ కండువాతో గొంతు నులిమి హత్య చేశాడని ఆమె ఆరోపించింది. నరసింహరాజుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కలిసి తన భర్తను హతమార్చి ఉంటారని, పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది. రఫీ బంధువుల ఆందోళన రఫీ కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని మంగళవారం సాయంత్రం రఫీ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చేందుకు ప్రయతి్నంచారు. పోలీసులు వారిని ప్రభుత్వ హాస్పిటల్ వద్దే అడ్డుకుని గేటు మూసేసి బయటకు రాకుండా నిలిపివేశారు. -
భార్య చెల్లెలిపై లైంగిక దాడి
యలమంచిలి రూరల్: భార్య చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఓ కామాంధుడిపై యలమంచిలి పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్సై కె. సావిత్రి మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేసిన వివరాల ప్రకారం పట్టణంలోని ధర్మవరం వీధి సీపీ పేటకు చెందిన బంగారు వెంకీ (19) భార్య ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు సేవలందించడానికి 16 ఏళ్ల చెల్లెలు ఆమె వద్ద ఉంటోంది. భార్య గర్భంతో ఉన్న సమయంలో ఆమె చెల్లెలిపై కన్నేసిన నిందితుడు ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బాలిక ముభావంగా ఉండటం, స్కూల్‌కు వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆరా తీయగా బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకుంది. ఈ ఘోరంపై మంగళవారం రాత్రి తన తల్లిదండ్రులతో కలిసి బాలిక పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై తెలిపారు. -
బైక్ కొనలేదని విద్యార్థి ఆత్మహత్య
పీఎంపాలెం: పుట్టిన రోజు నాడు విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి బైక్ కొనలేదని కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ప్రాణస్నేహితులను దుఃఖ సాగరంలో ముంచెత్తాడు. పీఎంపాలెం గాయత్రీనగర్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం జరిగిన సంఘటనకు సంబంధించిన సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. పేరిశెట్టి సూర్యనారాయణ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామం నుంచి సుమారు ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ప్రస్తుతం ఓ కళాశాలలో హాస్టల్ కుక్‌గా పనిచేస్తూ పీఎంపాలెం గాయత్రీనగర్‌లో భార్య గంగ, పెద్ద కుమారుడు గణేష్ , 9వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడు లోకేష్‌తో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం పుట్టిన రోజు కావడంతో సాయంత్రం కేక్ కట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో ఇంటి తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. అనుకోని పరిణామంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వేలాడుతున్న గణేష్‌ను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.బైక్ కొనమని తండ్రితో గొడవవిద్యార్థి గణేష్ ఎప్పటి నుంచో బైక్ కొనమని తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. బైక్ కొనే స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఇదే విషయం తల్లిదండ్రులు గణేష్ నచ్చచెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఈ విషయంపైనే తండ్రితో గొడవ పడినట్టు స్థానికులు చెబుతున్నారు. బైక్ కొనే స్థోమత లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టిన రోజు వేడుకలకు తీసుకెళ్లి అఘాయిత్యం
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఉలిక్కిపడింది. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన ఇద్దరు ఆడపిల్లలపై లైంగికదాడి జరిగిందనే విషయం వెలుగు చూడడంతో జంట పట్టణాల్లో కలకలం రేగింది. ఈ కేసులో నిందితులు కూడా మైనర్లే కావడం గమనార్హం. కాశీబుగ్గకు చెందిన పదహారేళ్ల వయసు నిండిన ముగ్గురు బాలికలను అదే వయసు కలిగిన ముగ్గురు బాలురు పుట్టినరోజు వేడుకలకు పిలిచి వారిలో ఇద్దరిపై లైంగికదాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కౌమార దశలోనే మద్యపానం అలవాటు చేసుకోవడం, మైనర్లు అని తెలిసినా వారికి మద్యం విక్రయించడం వంటి లోపాలు ఈ అకృత్యంతో బయటపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళితే..కాశీబుగ్గ: మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు బాలురులో ఒకరి పుట్టిన రోజు కావడంతో ఈ నెల 19న వారు ముగ్గురు బాలికలతో బయటకు వెళ్లారు. ఈ ముగ్గురు బాలికల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. 19న రాత్రి ఈ ఆరుగురు కలిసి పలాస సినిమా థియేటర్ సమీపంలో బిర్యానీలు, కేక్‌లు, గిఫ్ట్‌లు, మద్యం పట్టుకుని బైక్‌లపై జంట పట్టణాలను దాటి వెళ్లారు. పట్టణానికి దూరంగామనుషుల అలికిడి లేని ప్రాంతానికి చేరుకుని పుట్టిన రోజు వేడుక చేసుకున్నారు. కేక్ కటింగ్ చేసి మద్యం సేవించినట్లు సమాచారం. ఆ సమయంలో అక్కాచెల్లెళ్లపై ఇద్దరు బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. మరో బాలికతోనూ చనువుగా ప్రవర్తించడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. లైంగికదాడిని వీడియో రికార్డు చేసుకున్నారు. అదే రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో అందరూ ఇళ్లకు చేరుకున్నా రు. ఆదివారం ఉదయం మూడో బాలిక తన తల్లిదండ్రుల వద్ద ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. మిగతా ఇద్దరు బాలికల తల్లిదండ్రులకు కూడా విషయం తెలియడంతో వారు పరువు పోతుందని మిన్నకుండిపోయారు. అక్కాచెల్లెళ్లలో ఒక అమ్మా యి అనారోగ్యానికి గురి కావడం, సోమవారానికి కూడా స్పృహలోకి రాకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. సీఐ మోహనరావు ఫిర్యాదును తీసుకుని కేసును ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఏఎస్పీ/కాశీబుగ్గ డీఎస్పీ శ్రీనివాసరావుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అయితే నిందితుల్లో ఒకరు మేజర్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఉదంతాన్ని రాజీ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. బాధితుల ఇళ్ల వద్దకు చైల్డ్‌లైన్ వారు సైతం వెళ్లి వాకబు చేస్తున్నారు.నిందితుల్ని గుర్తించారు : ఎమ్మెల్యేపలాసలో నాటుకుపోయిన గంజాయి సంస్కృతే ఈ అకృత్యాలకు కారణమని, దాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి సమయం పడుతుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆమె మాట్లాడారు. బాధితు ల తల్లిని కలిశామని, పుట్టిన రోజు వేడుకల నుంచి ఆదివారం వచ్చిన చిన్నపాప సోమవారానికి కూడా ఇంకా స్పృహలోకి రాలేదని చెప్పారని తెలిపారు. ఈ విషయంలో రాజకీయం చేయకూడదని, ఎలాంటి సెటిల్మెంట్లు చేయకూడదని అన్నారు. నిందితులను గుర్తించారని, కులం, పార్టీ, స్థాయి చూడకుండా శిక్షించాలని కోరారు. -
అంతులేని అఘాయిత్యాలు
నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై దారుణం.. కనికరం లేకుండా ఆ చిన్నారి హత్య... ఆ ఘటన మరువక ముందే అనంతపురం జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం.. ఆ వెంటనే వైఎస్సార్ జిల్లాలో యువతిపై లైంగిక దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేయడం.. అంతలోనే గుంటూరు జిల్లాలో యువతిపై అత్యాచారం చేసి తలపై కొట్టడంతో బ్రెయిన్ డెడ్ కావడం... ఇలా అక్క చెల్లెమ్మలపై రోజుకో అఘాయిత్యం! ఈ నాలుగు నెలల్లో ఏకంగా 74 మంది మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు.. వీరిలో ఆరుగురు హత్యకు గురవ్వగా మరో ఐదుగురు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో వీటినిబట్టి తెలుసుకోవచ్చు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక హత్యాచారాలు.. హత్యలు.. దాడులు.. వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. గత ఐదేళ్ల పాటు రక్షణ కల్పించిన ‘దిశ’ వ్యవస్థను నీరుగార్చేశారు. ఈ ఘటనలన్నీ నమోదైనవి మాత్రమేనని, రికార్డులకెక్కనవి ఇంకా ఎన్నో రెట్లు ఉంటాయని సాక్షాత్తు హోం మంత్రి అనిత వ్యాఖ్యానించడం కొసమెరుపు.రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన ‘దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని’ తలపిస్తోంది. అడ్డూ, అదుపు లేకుండా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో యువతులు, బాలికల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ధృతరాష్ట్ర పాలకులతో మాతృ హృదయాలు ఆవేదనతో కుమిలిపోతున్నాయి.ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలే తమను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత మహిళలు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దంపడుతోంది. ఉద్యోగానికి వెళ్లిన మహిళ... కాలేజీకి వెళ్లిన విద్యార్ధిని... తుదకు వీధిలో ఆడుకుంటున్న బాలికలు ... ఇంట్లో ఉన్న చిన్నారుల భద్రతకు సైతం భరోసా కరువైంది. ఉదయం నిద్రలేచి దినపత్రిక తెరిచినా... టీవీలో న్యూస్ చానల్ పెట్టినా.. అత్యాచారం వార్త కనిపించడం సర్వసాధారణమైంది. సాక్షి, అమరావతి: దసరా పండుగ నాడు తిరుమల బ్రహ్మోత్సవాలు గానీ... విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రసారాలు గానీ.. వస్తాయని టీవీ పెడితే... అనంతపురం జిల్లాలో అత్తా కోడళ్లను వేటకొడవళ్లతో బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడిన దురాగతం గురించిన వార్తలు చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఆ ఘటన మరువక ముందే వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో శనివారం ఓ యువతిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తీవ్రంగా గాయపడిన యువతి కడప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఇక తాజాగా తెనాలిలో టీడీపీ నాయకుడు, రౌడీషీటర్ ఏకంగా ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఆమె తలపై బలంగా కొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు ఆదివారం వచ్చిన వార్త సంచలనం సృష్టింది.ఇవీ.. 4 నెలలుగా రాష్ట్రంలో యథేచ్చగా సాగుతున్న అత్యాచారాలు, హత్యలకు కొన్ని ఉదాహరణలు. ఒకప్పటి చంబల్ లోయ, బిహార్‌లోని దారుణాలను తలదన్నేలా రాష్ట్రంలో మహిళలు, బాలికలపై బరితెగించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఏం చేసినా సరే తమకు అడ్డేముందన్న అధికార మదంతో టీడీపీ రౌడీలు, గూండాలు తెగబడి మహిళలు, బాలికలను అపహరించి అత్యాచారానికి ఒడిగడుతున్నారు. అంతటితో ఆగని కొందరు ఆపై దారుణంగా హత్యలు చేసి దర్జాగా జారుకుంటున్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 74మంది మహిళలు, బాలికలు లైంగిక దాడులకు గురయ్యారు. వీరిలో ఆరుగురిని హత్య చేయడం వారి బరి తెగింపునకు నిదర్శనం. వేధింపులు భరించలేక ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి అధికారికంగా కేసులు నమోదు చేసిన ఘటనలే. టీడీపీ గూండాలకు భయపడి ఫిర్యాదు చేయని ఉదంతాలు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటాయి.పెన్షన్.. ఇంటి పట్టా కోసం కోర్కె తీర్చాలని..సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం టీడీపీ పరిశీలకుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాయచోటికి చెందిన ఖాదర్‌బాషా తనకు పెన్షన్, ఇంటి పట్టా ఇప్పిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధిత మహిళ వీడియో ఆధారాలతో సహా వెల్లడించారు. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆమెను ఏకంగా కిడ్నాప్ చేయడం రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలకు తార్కాణం. పట్టించుకోని బాబు, పవన్.. వారి దారిలోనే పోలీసులు..వరుస అత్యాచారాలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొద్దునిద్ర వీడటం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసత్య ప్రచారాలతో హడావుడి చేసిన పవన్‌కళ్యాణ్... ప్రస్తుతం టీడీపీ–జనసేన–బీజేపీ ప్రభుత్వంలో రోజూ జరుగుతున్న అత్యాచారాలపై స్పందించడమే లేదు. మరోవైపు తాము అమలు చేసేది రెడ్‌బుక్ రాజ్యాంగమేనని చంద్రబాబు, లోకేశ్ విస్పష్టంగా ప్రకటించాక... ఇక తమకు పనేం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే టీడీపీ కీచకులు రోడ్లపైకి వచ్చి అత్యాచారాలకు తెగబడుతున్నా సరే పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.టీడీపీ సోషల్ మీడియా విశృంఖలత్వంనాలుగు నెలలుగా అధికార టీడీపీ కూటమి సోషల్ మీడియా విభాగాల ఆగడాలు, వేధింపులకు అడ్డే లేకుండాపోతోంది. వేలాది ఫేక్ అకౌంట్ల నుంచి రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. వారి బాధితుల్లో సెలబ్రిటీల నుంచి సాధారణ మహిళల వరకు ఉన్నారు. పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో టీడీపీ కూటమి సోషల్ మీడియా ఆగడాలు మరింతగా పేట్రేగిపోతున్నాయి.వాసంతి జాడ నేటికీ తెలియదు!నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో వాసంతి అనే ఎనిమిదేళ్ల బాలికను జూలై 7వ తేదీ ఉదయం ఆగంతకులు అపహరించుకుపోయారు. అదేరోజు సాయంత్రం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటలపాటు పోలీసులు పట్టించుకోలేదు. రెండు రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు ధర్నా చేశాకే పోలీసులు మొద్దు నిద్ర వీడారు. అయినా కేసును సక్రమంగా దర్యాప్తు చేయనే లేదు. పది రోజుల తర్వాత వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. కనీసం తమ బిడ్డ మృతదేహాన్ని అప్పగించండి.. అంత్యక్రియలు చేసుకుంటామన్న ఆ పేద తల్లిదండ్రుల ఆవేదన కూడా చంద్రబాబు ప్రభుత్వం మనసును కరిగించలేకపోయింది. నాలుగు నెలలు గడిచినా ఆ చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వం కనిపెట్టి ఆమె కుటుంబానికి అప్పగించలేకపోయింది. విద్యా సంస్థలు.. వసతిగృహాల్లోనూ దుర్మార్గాలు⇒ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్రూముల్లో రహస్య కెమెరాలతో విద్యార్ధినుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది మంది విద్యార్ధినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. కానీ అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. నిందితులను గుర్తించి శిక్షించకపోవడం గమనార్హం.⇒ ఏలూరులో ఓ ఆశ్రమం నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో ఉంటున్న తమను వార్డెన్ భర్త శశికుమార్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధిత విద్యార్థినులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫొటోషూట్ల పేరుతో వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నట్లు బాలికలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ⇒ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో సంక్షేమ హాస్టల్లో విద్యార్ధినులపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. ⇒ అనంతపురంలో మెడికల్ కాలేజ్ విద్యార్ధినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారన్న వార్త విభ్రాంతి కలిగించింది.టీడీపీ నేతలు, కార్యకర్తల బరితెగింపు ⇒ టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన అనుచరుడు, రౌడీ షీటర్ నవీన్ తెనాలిలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఆమె తలపై తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని ఆదివారం ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యాడు. అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌తో నవీన్ (ఫైల్) గుంటూరులో సంచలనం సృష్టించిన ముగ్గురి హత్య కేసులతోపాటు మరెన్నో తీవ్రమైన నేరాల్లో నవీన్ నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ తరఫున క్రియాశీలంగా వ్యవహరించాడు. ఈ కేసును పక్కదారి పట్టించాలని పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తునట్టు సమాచారం.⇒ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసి అత్యాచారం చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో 8 రోజుల తర్వాత కేసు నమోదు చేశారు. కానీ కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలి కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ⇒ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు.⇒ అనంతపురం జిల్లాలో టీడీపీ నేత ఉపాధి హామీ పథకం మహిళా కూలీలను లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాధిత మహిళలు ఫిర్యాదు చేసినా సరే టీడీపీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ⇒ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. లోకేశ్‌తో జాన్ (ఫైల్) ఎమ్మెల్యేలే కీచకులుగా మారితే.. ఎవరైనా లైంగికంగా వేధింపులకు గురిచేస్తే న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. లేదా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి మొర పెట్టుకుంటారు. కానీ తాము ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ ఎమ్మెల్యేలే లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని బాధిత మహిళ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వీడియో ఆధారాలను విడుదల చేయడంతో యావత్ రాష్ట్రం విభ్రాంతికి గురైంది. తర్వాతి పరిణామాల్లో ఆ బాధిత మహిళ కేసును ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ వ్యవహారం మరువకముందే ఆదిమూలం మరో మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి భార్యకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తుండటం సంచలనంగా మారింది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీనిపై ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితోపాటు ఆయన వర్గీయులు ఆందోళన చేయడంతోపాటు టీడీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. -
తల్లి, కుమారుడిని బలితీసుకున్న ఎర్త్ వైర్!
సామర్లకోట : విద్యుదాఘాతంలో 24 గంటల వ్యవధిలో తల్లీకుమారుడు మృతి చెందడంతో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురానికి చెందిన చిట్టుమాని పద్మ(43) ఇంటికి సంబంధించి ఎర్త్ వైర్‌ను కొళాయి పక్కన గల చెట్టుకు చుట్టేశారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఇంటి ఎర్త్‌వైర్ తెగిపోవడంతో అలా చేయాల్సి వచ్చిoది. అయితే శనివారం పద్మ కొళాయి దగ్గర దుస్తులు ఉతికి గోడపై వాటిని ఆరబెడుతూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అయితే బంధువులు, స్థానికులు గుండెపోటుతో మృతి చెందిందని భావించారు. కాగా, ఆదివారం ఉదయం మృతురాలి కుమారుడు చిట్టుమాని విశ్వేస్(23) టిఫిన్ చేశాక ఖాళీ ప్లేట్‌ను కొళాయి పక్కన పెట్టి చేతులు శుభ్రం చేసుకొంటున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు అతనిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విద్యుదాఘాతం కారణంగా తల్లీకొడుకులు మృతి చెందారని స్థానికులు నిర్ధారణకొచి్చ.. విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. వెంటనే ట్రాన్స్‌కో సిబ్బంది అక్కడకు చేరుకుని వైర్లను తొలగించారు. -
సత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం..
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం నియోజకవర్గంలో కాల్పుల కలకలం రేగింది. బత్తలపల్లి మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై దుండగులు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దొంగలు పరారీ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
తిరుపతిలో మిస్సింగ్ కలకలం.. హైదరాబాద్‌కి బాలిక?
సాక్షి, తిరుపతి: నగరంలోని కొర్లగుంటలో నివాసం ఉంటున్న ఓ బాలిక అదృశ్యమైంది. ఈస్ట్ సీఎస్ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. కొర్లగుంట మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు కుమార్తె ఆక్సా క్వీన్(14) సాయంత్రం నుంచి ఇంట్లో కనిపించలేదు. కుటుంబీకులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది.దీంతో వెంటనే ఈస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాప హైదరాబాద్‌కి వెళ్లినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. సెల్ ఫోన్ అధికంగా వినియోగిస్తూ.. వాటర్ డ్రైవర్‌తో మాట్లాడినట్లుగా గుర్తించారు. బాలిక ఆచూకీ లభ్యమైతే 9440348671, 9440796748 నంబరులో సంప్రదించాలని సూచించారు. మరో బాలిక..ఏర్పేడు మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీలో బాలిక అదృశ్యంపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక(17) ఈ నెల 14న రాత్రి భోజనం చేసి నిద్రించింది. ఆపై 15వ తేదీ ఉదయం నుంచి బాలిక కనిపించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
AP: మరో ప్రేమోన్మాది ఘాతుకం.. గాయపడిన విద్యార్థిని మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో ప్రేమోన్మాదులు చెలరేగిపోతున్నారు. కర్నూలు జిల్లా ఘటన మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. బద్వేల్లో యువకుడి చేతిలో గాయపడిన విద్యార్థిని మృతిచెందింది. ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేష్ అనే యువకుడు ప్రెటోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించింది.విద్యార్థినిని బలవంతంగా రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విగ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. బద్వేలు సమీపంలోని సెంచరీ ఫ్లైవుడ్ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థిని మృతి పట్ల బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సంతాపం తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మహిళలకు దిశ చట్టం ద్వారా రక్షణ కల్పించామని.. కూటమి ప్రభుత్వం వచ్చాక దిశ చట్టాన్ని రద్దు చేసిందని, ఆ యాప్ కూడా మనుగడలో లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేసి.. గప్పాలు కొట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. మరో ఘటనలో..కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది.దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు.కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణని గాలికొదిలేసి.. గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతున్న @ncbn.#APisNotinSafeHands#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule pic.twitter.com/AYYengnuC3— YSR Congress Party (@YSRCParty) October 19, 2024ఇదీ చదవండి: నేను నిన్ను మోసం చేసాను.. -
దారుణం: యువతిపై అత్యాచారం.. ఆపై పెట్రోల్ పోసి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా గోపవరం అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తనకు మాయ మాటలు చెప్పి తన ఇంటి సమీపంలో ఉన్న విగ్నేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మూడు నెలల క్రితమే విఘ్నేష్‌కు వివాహం జరిగిందని, అతని భార్య గర్భిణీగా పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు. కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
మహిళ దారుణ హత్య
నందికొట్కూరు: మండల పరిధిలోని నాగటూరు గ్రామ సమీపంలోని పొలంలో శుక్రవారం సాయంత్రం మహిళ దారుణ హత్యకు గురైంది. నాగటూరు గ్రామానికి చెందిన గొల్ల నరసింహులు, శిరీష (26) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా శుక్రవారం మొక్కజొన్న పొలం పనులకు వెళ్లిన శిరీషను సొంత మామ గొల్ల కురుమన్న హత్య చేసినట్లు తెలుస్తోంది. పంట కోత కోసిన చేనులో కంకులు ఏరుతున్న సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ రామాంజనేయులు, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, సురేష్‌బాబు, లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతిరాలి సోదరుడు అశోక్ ఫిర్యాదు మేరకు మామపై హత్య కేసు, భర్త నరసింహులు, అత్త మహేశ్వరి, ఆడపచులపై వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు టౌన్ సీఐ తెలిపారు. కాగా గొల్ల కురుమన్నపై 2017లో ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న కురుమన్నను ఎన్కౌంటర్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి హత్యకు గురికావడంతో పిల్లలు అనాథలయ్యారు. -
గుంటూరు: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని సమీపంలో రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్, నండ్రు శైలజగా గుర్తించారు. పెదకాకానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు గత కొంత కాలంగా లవ్‌లో ఉన్నారు.రెండేళ్ల క్రితం మహేశ్.. హైదరాబాద్‌లోని ఓ స్టోర్‌లో పని చేస్తుండగా.. శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.అయితే, పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజుల క్రితం శైలు, మహేశ్ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్నారు.ఇదీ చదవండి: టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్ -
అమ్మానాన్నను విడిచి ఉండలేక.. జడ రిబ్బనతో చిన్నారి ఆత్మహత్య
శ్రీకాకుళం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి ఉండలేక ఏడవ తరగతి విద్యార్థిని తనువు చాలించింది. పాతపట్నం నియోజకవర్గంలోని మెలియపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో లావణ్య ఏడవ తరగతి చదువుతుంది.అయితే ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన లావణ్యను గురువారం ఆమె తల్లిదండ్రులు స్కూల్లో విడిచి పెట్టి ఇంటికి వెళ్లారు. దీంతో తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి దూరంగా ఉండలేక లావణ్య మనోవేధనకు గురైంది. తల్లిదండ్రులు వెళ్లిన గంట తర్వాత జడ రిబ్బన తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు టీచర్‌కు సమాచారం అందించారు. వెంటనే ఉపాధ్యాయులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు.ఈ విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్
సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో పేద మహిళలే టార్గెట్‌గా ఖాదర్ బాషా అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు.టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా అసలు స్వరూపం బట్టబయలైంది. పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఖాదర్.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఖాదర్ బాషా లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఖాదర్.. ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలే బహిర్గతం చేసింది. దీంతో, అసలు విషయం బయటకు వచ్చింది.ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పచ్చ నేతలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల సత్యవేడు, ఇప్పుడు రాయచోటిలో వెలుగు చూసిన ఘటనలే ఇందుకు నిదర్శనం. ఈ రెండు ఘటనల్లో బాధితులు ఎంతో ధైర్యం చేసి బయటకు రావడంతో పచ్చ నేతల బాగోతం బయటకు వచ్చింది. -
కుమారులకు విషమిచ్చి... ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి
సంతబొమ్మాళి: తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ప్రాణాలు తీసిన అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా, సంత»ొమ్మాళి మండలం కుముందవానిపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుముందవానిపేట గ్రామానికి చెందిన డెక్కల రాజుతో అదే గ్రామానికి చెందిన దుర్గకు పన్నెండేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి రుషి (10), బాలాజీ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు శ్రీకాకుళంలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. దసరా సందర్భంగా దుర్గ తమ్ముడు హరి తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. ఉదయమే వస్తానని చెప్పిన ఆమె ఎంతకూ రాకపోయే సరికి దుర్గ ఇంటికి వెళ్లిన హరి ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉండడాన్ని, అక్కడే కొనప్రాణంతో ఉన్న దుర్గను గమనించి పోలీసులకు సమాచార మిచ్చారు. టెక్కలి రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శీతల పానీయంలో విషం కలిపి తాగించడం వల్ల చిన్నారులు చనిపోగా, అది తాగిన తల్లి దుర్గ కొన ప్రాణంతో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చిన్నారుల మృతదేహాలను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి దుర్గను కూడా అదే ఆస్పత్రిలో చేర్చారు. భర్త సరిగా చూడకపోవడం వల్ల జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యాయత్నం చేశానని దుర్గ పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అత్తా, కోడలిపై గ్యాంగ్ రేప్ ఘటనలో ఐదుగురి అరెస్టు
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నల్లబొమ్మనపల్లి సమీపంలో అత్తాకోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వి.రత్న మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వారి నుంచి రూ.5,200 నగదు, రెండు మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. హిందూపురం త్యాగరాజనగర్‌కు చెందిన ఎరికల కావడి నాగేంద్ర, సాకే ప్రవీణ్‌కుమార్, మరో ముగ్గురిని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు హిందూపురం–పాలసముద్రం రోడ్డులోని బిట్ కాలేజీ వెనుక వైపున డంపింగ్ యార్డ్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. హిందూపురం త్యాగరాజనగర్ గుడ్డం ఏరియాలో ఉంటున్న చాకలి శ్రీనివాసులు అలియాస్ శ్రీనాథ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కేసుల్లో పట్టుబడ్డ నిందితులు కరడుగట్టిన నేరస్తులేనని, వారిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. ఎరికల కావడి నాగేంద్ర దోపిడీ, అత్యాచార కేసుల్లో నిందితుడని, అతనిపై అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 37కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. సాకే ప్రవీణ్‌కుమార్‌పై లేపాక్షి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైందన్నారు. పరారీలో ఉన్న చాకలి శ్రీనివాసులు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ కేసులో ముద్దాయని తెలిపారు. ఇతని స్వగ్రామం లేపాక్షి మండలం కల్లూరు కాగా.. ప్రస్తుతం హిందూపురం త్యాగరాజనగర్ గుడ్డం ఏరియాలో ఉంటున్నాడన్నారు.స్పెషల్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూస్తాం: ఎస్పీనిందితులకు స్పెషల్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. ఘటన జరిగిన 48 గంటల్లోపే నిందితులను అరెస్టు చేశామన్నారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేసును ఛేదించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీ వి.రత్న, ఇతర పోలీస్ అధికారులను సీఎం, హోంమంత్రి, డీజీపీలు ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ వి.రత్న, డీఎస్పీ మహేష్ నగదు రివార్డులు అందజేశారు. -
వేర్ ఈజ్ పోలీస్ ప్రభుత్వం?
సాక్షి, అమరావతి/ సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగ అరాచకం రాష్ట్రంలో విశృంఖలంగా సాగిపోతోంది. అమాయకులను వేధింపులకు గురిచేస్తూ, నేరగాళ్లకు అండగా నిలుస్తూ చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోంది. గత 4 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరాచకాలే ఇందుకు నిదర్శనం. తాజాగా దసరా రోజున శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని నల్ల బొమ్మనపల్లిలో అత్త, కోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆగంతకులకు టీడీపీ సర్కార్ కొమ్ముకాస్తూ.. కేసును పక్కదారి పట్టించేందుకూ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే దారుణం జరిగి మూడు రోజులైనా పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైపెచ్చు ఈ ముఠాక నాయకుడైన యువకుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. టీడీపీ నేతలు పెంచి పోషిస్తున్న ఈ నేరగాళ్ల ముఠాకు పొట్ట కూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన కుటుంబం బలైపోయింది. ఓ పేపర్ మిల్లులో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తండ్రి, కొడుకుపై వారి ఇంటి ఎదుటే దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వాచ్‌మేన్ భార్య, కోడలిని బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆత్తా కోడళ్లను బలవంతంగా ఎత్తుకుపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా, ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నిందుతలకు ప్రభుత్వ వత్తాసును స్పష్టంచేస్తున్నాయి. ఆరుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని సీసీ టీవీ రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయి. వారిలో అయిదుగురిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కానీ ఆ ముఠాకు నాయకుడిగా ఉన్న యువకుడిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం తీరు పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలీ రాష్ట్రంలో పోలీసులున్నారా.. ప్రభుత్వముందా అంటూ ప్రజలు, విపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.బాధితులను పరామర్శించేందుకు అనుమతినివ్వని పోలీసులు అత్యాచార బాధితులను కలిసేందుకు ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం అనుమతించడంలేదు. బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నించినా పోలీసులు సమ్మతించలేదు. బాధితులను కలిసేందుకు ఎవరినీ అనుమతించడంలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితులపై ఒత్తిడి తెచ్చి, నిజాలకు పాతరేసి, కేసును పక్కదారి పట్టించాలన్న ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఇతరులెవ్వరూ బాధితులను కలిసేందుకు అనుమతించడంలేదు. ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు బాధితులను కలసి మాట్లాడితే వారు వాస్తవాలు వెల్లడించే అవకాశం ఉన్నందునే ఎవర్నీ అనుమతించడం లేదన్నది సుస్పష్టం.రాష్ట్రమంతా ఇదే దారుణకాండచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాపంగా మహిళలు, యువతులపై అత్యాచారాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ బాలికను అపహరించి అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది జరిగి నాలుగు నెలలైనా ఆ చిన్నారి మృతదేహాన్ని కూడా ఆమె తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారు. ఇక పుంగనూరులో ఇటీవల ఓ ముస్లిం బాలికను అపహరించి హత్య చేశారు. తమ బిడ్డను ఎవరో అపహరించుకుపోయారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అయిదు రోజులు పోలీసులు కాలయాపన చేశారు తప్ప, ఆ చిన్నారిని రక్షించే ప్రయత్నం చేయలేదు. నిత్యం బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, అరాచకాలతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడమేలేదు.వేర్ ఈజ్ ఎమ్మెల్యే బాలకృష్ణనందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో విలన్ ఓ మహిళా అధికారిని ఆమె కుమారుడి ఎదుటే అత్యాచారం చేస్తారు. ఆ సినిమాలో హీరో పాత్రధారి బాలకృష్ణ ఆ విలన్‌ను చంపి శిక్షిస్తాడు. అంతేకాదు.. మహిళల ఔన్యత్యాన్ని కీర్తిస్తూ భారీ డైలాగులు చెబుతారు.. కట్ చేస్తే.. అదే హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఆగంతకులు అత్త, కోడలిపై వారి ఇంట్లోనే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తన నియోజకవర్గంలోనే జరిగిన ఈ ఘోరంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించనే లేదు. కనీసం పోలీసులతో మాట్లాడి నిందితులను వెంటన అరెస్ట్ చేయమని ఆదేశించనూ లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించనూ లేదు. సినిమా షూటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అందుకే హిందూపూర్ ప్రజలే కాదు.. యావత్ రాష్ట్రం ‘వేర్ ఈజ్ పోలీస్.. వేర్ ఈజ్ ప్రభుత్వం.. వేర్ ఈజ్ బాలకృష్ణ’ అని ప్రశ్నిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని కేశవరాయునిపాలేం గ్రామానికి చెందిన నాయన భవానీ (20) గడ్డి మందు తాగేసిన సంగతి తెలిసిందే. ఈమె భర్త నాయని చంటి శనివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. భర్త మరణంతో కుంగిపోయిన ఆమె ఆదివారం ఉదయం గడ్డి మందు తాగేయడంతో రిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందారు. లావేరు హెచ్‌సీ పి.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం.. భార్య సీమంతం రోజునే భర్త మృతి
కదిరి అర్బన్: లారీని ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కదిరి మండలంలో పట్నం గ్రామానికి చెందిన భాస్కర్ (24) అనంతపురంలో పాల వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. భార్య లక్ష్మి తొమ్మిది నెలల గర్భంతో ఉంది. దీంతో ఆమెకు కుటుంబసభ్యులు సీమంతం చేయాలంటే రెండు రోజలు క్రితం స్వగ్రామానికి పిలుచుకువచ్చాడు. ఆదివారం సీమంతం జరిగింది. వేడుక అనంతరం రాత్రికి తాను ఇంటికి వస్తానని తెలిపి సోమవారం ఉదయం భార్యను అనంతపురానికి పంపాడు. స్థానికంగా పనులు చక్కబెట్టుకున్న తర్వాత రాత్రికి ద్విచక్రవాహనంపై అనంతపురానికి బయలుదేరిన భాస్కర్... పట్నం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీ నేతల బెదిరింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం
ఒంగోలు టౌన్: ప్రేమపేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఒక బాలికను గర్భిణిని చేశాడు దర్శి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమారుడు. తమకు న్యాయం చేయమంటూ వేడుకున్న బాధిత బాలిక కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగడంతో భయాందోళనకు గురైన బాలిక తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధిత బాలిక తండ్రి కథనం ప్రకారం.. కావలికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కావలిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతుండగా, చిన్న కుమార్తె దర్శి సమీప గ్రామంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ 7వ తరగతి చదువుకుంటోంది. కొద్దిరోజులుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఏనిగంటి కోటేశ్వరరావు కుమారుడు వరుణ్ చౌదరి ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా లోబరుచుకొని గర్భిణిని చేశాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఆగస్టులో దర్శి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి వరుణ్ చౌదరిని అరెస్టు చేశారు.రూ.50 వేలు ఇస్తా తీసుకొని వెళ్లు ...బాలికను గర్భిణిని చేసిన వరుణ్ చౌదరి తండ్రి కొద్ది రోజులుగా రాజీ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడని బాలిక తండ్రి చెబుతున్నారు. రాజంపల్లికి చెందిన తెలుగుదేశం నాయకులను మధ్యవర్తులుగా రాయబారానికి పంపించాడన్నారు. వారి ద్వారా డబ్బులు ఇస్తానంటూ ఆశ పెట్టాడని, అయితే ఇందుకు అంగీకరించలేదని, తమకు డబ్బులు ఏమీ వద్దని, తమ కూతురిని పెళ్లి చేసుకోవాలని కోరామన్నాడు. దాంతో అగ్గిమీద గుగ్గిలమైన కోటేశ్వరరావు రూ.50 వేలు ఇస్తా, తీసుకొని పోండి. పెళ్లి అంటే ఎదురు కేసు పెట్టి బాలికను, బాలిక తల్లిని బజారుకీడుస్తానంటూ రెచ్చి పోయాడని ఆరోపించాడు. చెప్పినట్లు విని రాజీకి వస్తే సరేసరి లేకపోతే ఇబ్బందులు పడతావంటూ బెదిరింపులకు దిగాడన్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కావలిలో తన ఇంటిపై దాడి చేసి కొట్టారాని వాపోయాడు. కేసులో రాజీ పడాలని, లేకుంటే నిన్ను, నీ భార్యను చంపుతామని బెదిరించి వెళ్లారని ఆరోపించాడు. వెంటనే బాలిక తండ్రి కావలి వన్‌టౌన్ సీఐకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పామన్నాడు. వెంటనే ఎస్సై వచ్చి జరిగిన విషయం అడిగి తెలుసుకుని, చుట్టుపక్కల విచారించి వెళ్లారని తెలిపాడు.బాలిక తల్లి ఆత్మహత్యా యత్నం..ఈ ఘటనలతో బాలిక తల్లి భయాందోళనకు గురైంది. ఈ నెల 2వ తేదీ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను కావలి ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమెను ఎమర్జన్సీ వార్డులో ఉంచి కృతిమ శ్వాస అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని, లివర్ చెడిపోయిందని, ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతున్నాయని, రక్తపోటు తరచుగా పడిపోతుందని వైద్యులు తెలిపారు. ఒకవైపున నిండా పద్నాలుగేళ్ల వయసు కూడా లేని కుమార్తె నిండు గర్భంతో ఉంది. చిన్న వయసు కావడంతో కాన్పు ప్రమాదం కావచ్చని, సిజేరియన్ చేసినా ప్రాణాలకు ముప్పు రావచ్చని వైద్యులు చెబుతున్నారని, మరోవైపు ఆత్మహత్యా యత్నం చేసిన భార్య చావు బతుకుల మధ్య పోరాడుతోందని బాలిక తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అండ చూసుకునే కోటేశ్వరరావు రెచ్చి పోతున్నాడని ఆరోపిస్తున్నారు. -
వారే లేని.. నేనెందుకని..
పెదవేగి : రెండు రోజుల క్రితం కోడి పుంజులను ఈత కొట్టించేందుకు కాలువలోకి దిగిన భర్త, ఇద్దరు కుమారులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుంటుంబంలో మిగిలిన ఇల్లాలు జీవితంపై విరక్తి చెంది శనివారం బలవన్మరణానికి పాల్పడింది. ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించడంతో పెదవేగి మండలం కవ్వగుంటలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కవ్వగుంటకు చెందిన శెట్టిపల్లి దేవి (38) శుక్రవారం ఉదయం తన ఇంటి వద్ద బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రెండు రోజుల క్రితం ఆమె భర్త, ఇద్దరు పిల్లలు తమ ఇంటి సమీపంలో ఉన్న పోలవరం కుడి కాలువలో కోడి పుంజులను ఈదించడం కోసం దిగి ప్రమాదవ శాత్తూ మునిగిపోయారు. వారి మృతితో ఒంటరి అయిన దేవి భర్త, పిల్లలు లేని జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
నా భార్యను గురవయ్య కిడ్నాప్ చేశాడు!
వెంకటగిరి రూరల్: తన భార్యను గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడని బాధితుడు దట్టం గురవయ్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని కథనం.. వెంకటగిరి రూరల్ మండలం, చిన్నన్నపేటకు చెందిన దట్టం గురవయ్య, తిరుమలమ్మ(30) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు వెంకటగిరి పట్టణంలోని ఓ కాంప్లెక్స్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 1వ తేదీన కూలి పనులకని వెళ్లిన తిరుమలమ్మ మళ్లీ ఇంటికి రాలేదు. వారం రోజులుగా వెదికినా ఫలితం లేదన్నారు. అదే గ్రామానికి చెందిన పుట్ట గురవయ్య తన భార్యతో సన్నిహితంగా ఉండేవాడని, అతనే తన భార్యను కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాక గురవయ్య పార్లపల్లి గ్రామానికి చెందిన మరికొందరితో పరిచయం ఏర్పాటు చేసుకుని మహిళలను ట్రాప్ చేస్తున్నట్టు తెలిసిందన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు. -
సత్యసాయి జిల్లాలో దారుణం.. అత్తాకోడళ్లపై సామూహిక లైంగిక దాడి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గంలో దారుణం జరిగింది. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. తండ్రి, కొడుకులను కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై లైంగికదాడికి పాల్పడ్డారు. చిలమత్తూరు మండలం బొమ్మనపల్లిలో ఘటన చోటుచేసుకుంది. పేపర్ మిల్లులో వాచ్మెన్ కుటుంబంపై దాడి చేసి ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం సత్యసాయి జిల్లాకు వలస వచ్చారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వారి నివాసానికి వచ్చి దారుణానికి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని ఎస్పీ రత్న పరిశీలించారు.ఇదీ చదవండి: వామ్మో ఇన్ని ట్విస్టులా.. పోలీసులే అవాక్కయ్యారు! -
లోకో పైలట్ హత్య కేసు: నిందితుడు చిక్కాడు
విజయవాడ, సాక్షి: విజయవాడలో లోకో పైలట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బిహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే అనుమానాస్పదంగా ఉన్న దేవ్కుమార్ను లోకో పైలట్ ప్రశ్నించాడు. దీంతో ఇనుపరాడ్‌తో లోకో పైలట్‌పై నిందితుడు దాడి చేశాడని రైల్వే ఏసీసీ రత్న వెల్లడించారు. మచిలీపట్నం వద్ద నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లో విధుల్లో ఉన్న లోకో పైలట్‌ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్ లోకో పైలట్‌గా పని చేస్తున్న డి.ఎబినేజర్ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి ఎఫ్–క్యాబిన్ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు.రాడ్‌తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్‌పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్ వృధ్వీరాజ్ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్‌ను రైల్వే హాస్పటల్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు.చదవండి: అందరూ చూస్తుండగానే ప్రాణాలు తీశాడు