చిన్నగంజాం (ప్రకాశం జిల్లా) : చిన్నగంజాం మండలం కడవకుదురు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడవకుదురు నుంచి చీరాల వైపు వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తోపాటు మొత్తం 9 మంది ఉండగా... ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఏడుగురికి గాయలు కాగా, వారిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.