నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ : జిల్లాలోని రైతులకు ఈయేడు సహకార బ్యాంకుల ద్వారా 200 కోట్లు పంటరుణాలుగా అందించామని డీసీసీబీ సీఈవో అనంతరావు అన్నారు. మంగళవారం ఆయన మండలకేంద్రంలోని సహకారబ్యాంకులో విలేకరులతో మాట్లాడారు. ఈ యేడు రైతులకు 270కోట్లు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారన్నారు. ఇప్పటీవరకు సుమారు లక్షమంది రైతులకు *200 కోట్లు రుణాలుగా అందించామని చెప్పారు. దీంతోపాటు *15కోట్లు దీర్ఘకాలిక రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం ఉండగా ఇప్పటివరకు *10 కోట్లు ఇచ్చామన్నారు. మహిళాసంఘాలకు *30కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు *16కోట్లు ఇచ్చామని ఆయన వివరించారు.
బాల్కొండ, ఏర్గట్ల, లింగంపేట, బీబీపేట, నాగిరెడ్డిపేట బ్రాంచుల ద్వారా ఇప్పటివరకు 3కోట్లు కిరణాదుకాణాలకు రుణాలుగా అందించామని తెలిపారు. జిల్లాలోని సహకారసంఘాలను వ్యాపారకేంద్రాలుగా మార్చి వాటిని జాతీయస్థాయిలోని మార్కెటింగ్ వ్యవస్థకు అనుసంధానం చేయాలని తాము లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. జిల్లాకు 90శాతం 25యూనిట్ల విత్తనోత్పత్తి యంత్రాలు మంజూరు కాగా వాటిలో 8సహకారసంఘాలకు ఒక్కో యూనిట్ చొప్పున కేటాయించామన్నారు. వాటిలో నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద, తాండూర్ సహకారసంఘాలకు ఒక్క యూనిట్ చొప్పున కేటాయించామని చెప్పారు. మండలకేంద్రంలోని మాల్తుమ్మెద సహకార సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని విండోచైర్మన్ రాంచందర్‌రెడ్డి సీఈవోను కోరారు.
రైతులకు 200కోట్లు రుణాలు ఇచ్చాం..
Published Wed, Sep 18 2013 2:39 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement