కనిగిరి: జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 520 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డీఎంఅండ్ హెచ్‌ఓ యాస్మిన్ అన్నారు. ఇటీవల ‘సాక్షి’లో కనిగిరి జ్వరాల మరణాలపై, అధ్వాన పారిశుద్ధ్యంపై వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. శనివారం వైద్యశాఖ, మున్సిపల్ అధికారులు శివనగర్ కాలనీని సందర్శించి, వైద్య శిబిరాన్ని పరిశీలించి, విషజ్వరంతో మృతి చెందిన బాలుడు అభిరామ్ రిపోర్ట్స్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ విలేకర్లతో మాట్లాడుతూ ఎలిసా టెస్ట్‌లో డెంగీగా నిర్ధారణ జరిగి ఒక్కటి మాత్రమే డెత్‌గా నమోదైనట్లు తెలిపారు. ఇటీవల జిల్లాలో జరిగిన మృతుల సంఖ్యపై సరైన సమాచారం వెల్లడించలేదని, మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నది వాస్తవమన్నారు. మృతులకు గల కారణాలపై ఒక నివేదిక తయారు చేసేందుకు ప్రత్యేక వైద్యాధికారుల బృందం నియమించామని, టీం సర్వే చేస్తోందని 20 రోజుల్లో తుది నివేదిక ఇస్తారని తెలిపారు చిన్నారులు, వృద్ధుల్లో ఇమ్యునిటీ పవర్ తక్కువ ఉండటం వల్లే జ్వరాలకు తోడు కిడ్నీ, న్యుమోనియా వ్యాధులతో మరణిస్తున్నట్లు వెల్లడించారు. జ్వరాలు, సీజనల్ వ్యాధులు వస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రుల్లో చూపించాలని డీఎంహెచ్‌ఓ అన్నారు. అన్ని పీహెచ్‌సీల్లో ప్లేట్‌లెట్స్ తదితర టెస్ట్‌లు చేస్తారన్నారు.
8 వారాలు స్పెషల్ డ్రైవ్:
కనిగిరిలో వైద్య, మున్సిపల్ సిబ్బందితో 8 వారాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. ప్రతి వారం 20 వార్డుల్లో రెండు టీంలు అవగాహన కార్యక్రమంతో పాటు, పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈమేరకు ప్రణాళికపై కమిషనర్ కేవీ పద్మావతి, డాక్టర్ కేఎన్ రాజ్యలక్ష్మితో చర్చించారు. సుమారు 150 మంది సిబ్బంది స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొంటారని డీఎంహెచ్‌ఓ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గణాంకాధికారి శ్రీధర్, హెల్త్ ఎడ్యుకేటర్ ఎంవీ విజయభాస్కర్, ఎంపీహెచ్‌ఈఓ హృదయరంజన్, సూపర్‌వైజర్లు బాలుడు, ఇబ్రహీం, రత్న శోభ, ఎస్తేరురాణి, బాలశ్రీను, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment