72 మందిపై క్రిమినల్ కేసులు | 72 Peoples on the criminal cases | Sakshi
Sakshi News home page

72 మందిపై క్రిమినల్ కేసులు

Published Tue, Dec 16 2014 5:45 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

72 మందిపై క్రిమినల్ కేసులు - Sakshi

72 మందిపై క్రిమినల్ కేసులు

కర్నూలు(అగ్రికల్చర్) :  జాతీయ గ్రామీణ ఉపాధి అక్రమాలపై జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ కొరడా ఝుళిపించారు. ఏకంగా 72 మందిపై  వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలని సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని పర్యవేక్షించాలని డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్లకు సూచించారు. ఇటీవలనే జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉపాధి అక్రమాలపై ధ్వజమెత్తారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలపై నిలదీశారు. బాధ్యులపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే అక్రమాలకు బాధ్యులైనవారిపై క్రిమినల్ కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటామని ఆ రోజున కలెక్టర్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా 72 మందిపై వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్లలో క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వీరిలో ముగ్గురు ఏపీఓలు ఉండగా, 21 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు మేట్‌లు, ఆరుగురు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఉండగా, మిగిలిన వారందరూ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరు దాదాపు రూ.2.93 కోట్లు దుర్వినియోగం చేసినట్లు సామాజిక తనిఖీల ద్వారా నిర్ధారణ అయింది. ఇందులో రూ.37.06 లక్షలు రికవరీ అయింది. ఇంకా రూ.2.53 కోట్లకు పైగా రికవరీ కావాల్సి ఉంది. వీరిలో చాలామందిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించగా, కొందరిని ఇంకా కొనసాగిస్తున్నారు. వీరి నుంచి స్వాహా చేసిన సొమ్ము రికవరీ కాకపోవడంతో క్రిమినల్ చర్యలకు ఆదేశాలిచ్చారు.
 
వీరిపైనే క్రిమినల్ కేసులు...
సంజామల మండలంలో కె.మధుసూదన్(టీఏ) కౌతాలం మండలంలో వెంకన్నబాబు(టీఏ), పి.చాంద్‌బాషా(ఎఫ్‌ఏ), వీరన్నగౌడు(ఎఫ్‌ఏ), వెల్దుర్తి మండలంలో జె.భాస్కర్(టీఏ), సులోచన(ఎఫ్‌ఏ), లింగన్న(ఎఫ్‌ఏ), రాంభూపాల్‌రెడ్డి(ఎఫ్‌ఏ), మద్దికెర మండలంలో రంగస్వామి(టీఏ), సుబ్బరాయుడు(టీఏ), శ్రీనివాసులు(ఎఫ్‌ఏ), వెలుగోడు మండలంలో చంద్రశేఖర్‌గౌడ్(టీఏ), విజయభాస్కర్(ఏపీఓ),

ఈడిగ వెంకట కుమార్(ఈసీ), కె.నాగరాజు ఆచారి(టీఏ), రామకృష్ణారెడ్డి(టీఏ), వెంకటేశ్వరరెడ్డి(ఎఫ్‌ఏ), రవికుమార్(ఎఫ్‌ఏ), జూపాడుబంగ్లా మండలంలో మిద్దె రత్నాకర్‌రావు(టీఏ), కొలిమిగుండ్ల మండలంలో సీపీ స్వాములు(టీఏ), పత్తికొండ మండలంలో పి.స్వాములు(టీఏ), గిరి నాయక్(టీఏ), ఎం.శంకర్(ఎఫ్‌ఏ), హారిఫ్ బాషా(టీఏ), ఆళ్లగడ్డ మండలంలో పుల్లారెడ్డి(ఈసీ), రుద్రవరం మండలంలో టి.పుల్లయ్య(టీఏ), వి.నాగేశ్వరరావు(టీఏ), పగిడ్యాల ఏపీఓ బి.గౌరీబాయి, గోనెగండ్ల మండలంలో బాలకృష్ణ(ఈసీ), హరినాథ్(టీఏ), దస్తగిరి(ఎఫ్‌ఏ), రంగరాజు(ఎఫ్‌ఏ), షేక్షావలి(ఎఫ్‌ఏ), వీరప్ప(ఎఫ్‌ఏ), ఆస్పరి మండలంలో రామచంద్ర(టీఏ), బతుకన్న(ఎఫ్‌ఏ), క్రిష్ణగిరి మండలంలో మద్దిలేటి(ఏపీఓ), మహేష్‌రెడ్డి(ఈసీ), ఆనందకుమార్(టీఏ), జి.విజయభాస్కర్(టీఏ), తులసీనాథ్ గౌడు(ఎఫ్‌ఏ), పోతురెడ్డి(ఎఫ్‌ఏ), సురేష్‌నాయుడు(ఎఫ్‌ఏ), వెంకటేశ్వర్లు(ఎఫ్‌ఏ), హేసేనమ్మ(ఎఫ్‌ఏ), మదనేశ్వరి(ఎఫ్‌ఏ), లక్ష్మీదేవి(ఎఫ్‌ఏ), బేతంచెర్ల మండలంలో ఎల్లస్వామి(ఎఫ్‌ఏ),

దేవనకొండ మండలంలో ఎం.ఓబులేసు, తులసిరాముడు, గూడూరు మండలంలో తిమ్మన్న, కల్లూరు మండలంలో బి.మనోహర్, కోడుమూరు మండలంలో మాధవి, కోవెలకుంట్ల మండలంలో ప్రభావతమ్మ, మహానంది మండలంలో డి.శ్రీనివాసులు, మిడుతూరు మండలంలో కె.వెంకటేశ్వర్లు, అవుకు మండలంలో డి.సురేష్‌బాబు, పెద్దకడుబూరు మండలంలో హేమంత్‌రెడ్డి, బి.రామాంజనేయులు, కె .లక్ష్మన్న,

ఎం.రామాంజనేయులు, తుగ్గలి మండలంలో జె.రాజు, వైకుంఠం, భీమలింగప్ప, రామకృష్ణ, ఎమ్మిగనూరు మండలం నబిరసూల్, ఆత్మకూరు మండలంలో పి.నాగరాజు(వీరందరూ ఎఫ్‌ఏలే), గోనెగండ్ల బాలమద్దయ్య టిఏ, బాలక్రిష్ణ(ఈసీ), నందవరం మండలంలో ఎల్లారెడ్డి(మేట్), దావీదు(మేట్), కౌతాళం మండలంలో బసవరాజు(ఎఫ్‌ఏ)లు ఉన్నారు. తక్షణం వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని ఈ మేరకు ఎంపీడీఓలకు ప్రొసీడింగ్ పంపామని డ్వామా విజిలెన్స్ ఆఫీసర్ చలపతిరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement