కరీంనగర్ జిల్లాలో 9వ తరగతి విద్యార్థి కిడ్నాప్ | 9th school student kidnapped in Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్ జిల్లాలో 9వ తరగతి విద్యార్థి కిడ్నాప్

Published Mon, Oct 21 2013 2:30 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

9th school student kidnapped in Karimnagar

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ఓ విద్యార్థి కిడ్నాప్కు గురయ్యాడు. ముకరంపురలో నివసించే మునాజీరుద్దీన్ ప్రభుత్వ టీచర్  పని చేస్తున్నారు. అతని కుమారుడు ముజఫీరుద్దీన్ స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు లాగే ఈరోజూ ఉదయం 7గంటలకు ఇంట్లో నుంచి స్కూల్ కి బయలుదేరి వెళ్ళాడు. అయితే 8గంటలకు స్కూల్కు రాలేదని పాఠశాల యాజమన్యం తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించారు.

కాసేపటికే ఆ విద్యార్థి తల్లికి ఫోన్ రాగా ...తామే ముజఫీరుద్దీన్  కిడ్నాప్ చేశామని 20లక్షలు ఇవ్వాలని ఆగంతకులు బెదిరించినట్లు తల్లి చెబుతుంది. పోలీసులకు సమాచారం ఇవ్వవద్దని కూడ హెచ్చారించినట్లు వారు చెబుతున్నారు. కిడ్నాప్ విషయమై వారు పోలీసులను ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement