సాక్షి, ఏలూరు :
‘తెలుగు జాతిని ముక్కలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే స్వార్థపరుల కుట్రలు, కుతంత్రాలకు దీటైన సమాధానం చెప్పాలి. తెలంగాణ నాది.. రాయలసీమ నాది.. కోస్తా, ఉత్తరాంధ్ర అన్నీ కలిసిన విశాలాంధ్ర నాది అంటూ తెలుగు వారు ముక్తకంఠంతో నినదిం చాలి. ఆ నినాదం ఎలా ఉండాలంటే.. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న ఢిల్లీ పెద్దల గుండెలదరాలి. పదవుల్ని పట్టుకుని వేలాడుతున్న నేతలకు వణుకుపుట్టాలి. ఈ పోరాటం బలి కోరితే అందుకోసం ప్రతి సమైక్యవాది ముందుండాలి’ ఏపీ ఎన్జీవోలు చేసిన ప్రతిజ్ఞ ఇది. ఆ దిశగా సమైక్యవాదులను చైతన్యపరిచేందుకు, సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను తెలియజెప్పేందుకు ఏపీ ఎన్జీవోలు నడుం బిగించారు. జిల్లాలోని అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ యజ్ఞంలో భాగస్వాములయ్యూరు. పాలకుల నిరంకుశ వైఖరిపై గర్జిస్తున్నారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం హైదరాబాద్‌లో తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు శుక్రవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా తరలివెళ్లారు. జిల్లా నలుమూలల నుంచి 15 వేలకు పైగా ఉద్యోగులు శుక్రవారం రాజధానికి తరలివెళ్లారు. ఏలూరు నుంచి 20, తణుకు నుంచి 20, తాడేపల్లిగూడెం నుంచి 17, భీమవరం నుంచి 12, నరసాపురం నుంచి 8, పాలకొల్లు నుంచి 5, నిడదవోలు నుంచి 5, కొయ్యలగూడెం నుంచి 5, కొవ్వూరు నుంచి 7, జంగారెడ్డిగూడెం నుంచి 7, ఉండినుంచి 6, గోపాలపురం నుంచి 4, ఆకివీడు నుంచి 4, పోలవరం నుంచి 3, ఉంగుటూరు నుంచి 3, ఆచంట నుంచి 2 , ఇతర ప్రాంతాల నుంచి మరో 25 చొప్పున కనీసం 153 బస్సులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరాయి. వెరుు్యకి పైగా కార్లు, ఇతర వాహనాల్లో ఉద్యోగులు తరలివెళ్లారు. రైళ్లనూ ఆశ్రయించారు. చాగల్లు, చింతలపూడి, లింగపాలెం, దేవరపల్లి, గోపాలపురం వంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఉద్యోగులు ఈ సభకు బయలుదేరడం విశేషం. అటెండర్ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకూ సొంత ఖర్చులతో హైదరాబాద్ వెళ్లారు. మరోవైపు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు జిల్లాలోని అన్నివర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. సభను అడ్డుకుంటామంటున్న తెలంగాణ వాదులను వెంటనే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని డిమాండ్ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా తాడేపల్లిగూడెం, దేవరపల్లి మండలాల్లో శనివారం బంద్ పాటిస్తున్నట్టు జేఏసీలు ప్రకటించారుు.
దాడులకు బెదరక...
చింతలపూడి ప్రాంత ఉద్యోగులతో బయలుదేరిన బస్సుపై ఖమ్మం జిల్లా పెనుబల్లి, బంజర్ గ్రామాల మధ్య తెలంగాణ వాదులు దాడికి తెగబడ్డారు. 7 గంటల ఆటోల్లో వచ్చిన వ్యక్తులు తెలంగాణ నినాదాలు చేసుకుంటూ బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు వెనుక అద్దాలు ధ్వంసమయ్యూరుు. తెలంగాణవాదులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లి తీరతామని ఆ బస్సులోని ఉద్యోగులంతా స్పష్టం చేశారు. వారంతా ఏమాత్రం బెదరక సభకు హాజరయ్యేందుకు ముందుకు కదిలారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెళ్తున్న బస్సుపై దాడి చేయటాన్ని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ ఖండించారు.
బెదిరింపులకు వెరవం...
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వచ్చే వారిని అడ్డుకుంటామంటూ తెలంగాణవాదులు చేసిన హెచ్చరికలకు బెదిరేది లేదని ఎన్జీవోల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ స్పష్టం చేశారు. సభను శాంతియుతంగా జరపాలనే తమ అభిమతానికి విరుద్ధంగా తెలంగాణవాదులు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సభను అడ్డుకోవాలని చూస్తే ప్రతిఘటనచ తప్పదని హెచ్చరించారు. నిజాలు మాట్లాడతామనే భయంతోనే తెలంగాణవాదులు ఈ సభ గురించి భయపడుతున్నారని ఆయన పేఒర్కన్నారు. ప్రయాణంలో దారిపొడవునా గర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే ఆహార, మంచినీటి ప్యాకెట్లను సమైక్యవాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని ఆయన సూచించారు.
దారులన్నీ రాజధాని వైపే
Published Sat, Sep 7 2013 12:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement