అడ్డగోలు అడ్మిషన్లు కుదరవు | ap higher education council notice to Private Bed colleges | Sakshi
Sakshi News home page

అడ్డగోలు అడ్మిషన్లు కుదరవు

Published Mon, Jan 12 2015 11:45 PM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

ap higher education council notice to Private Bed colleges

13 ప్రైపేటు బీఈడీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి నోటీసులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో చోటుచేసుకున్న అడ్డగోలు ప్రవేశాలను నిరాకరించాలని ఏపీ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఎడ్‌సెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా చేసిన అడ్మిషన్లను తిరస్కరించనుంది. ఈ విధంగా అడ్డగోలుగా విద్యార్థులను చేర్చుకుని, ఆ తర్వాత వాటిని అనుమతించాలన్న 13 ప్రైవేటు బీఈడీ కాలేజీల వినతులను తిరస్కరించింది. ఆయా కాలేజీలకు నోటీసులు కూడా పంపింది. ప్రస్తుతానికి 13 కాలేజీలకే నోటీసులు వెళ్లినా ఇలాంటి కాలేజీలు ఎన్నో ఉన్నాయని, వాటన్నిటికీ ఇదే నిబంధన వర్తిస్తుందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి.

వివరాలను మండలి అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచామని తెలిపాయి. మేనేజ్‌మెంట్ కోటాయే కాకుండా మైనార్టీ కాలేజీల్లో కూడా ఇలాంటి అడ్డగోలు ప్రవేశాలు అనేకం జరిగాయని తమ దృష్టికి వచ్చిందని, వాటిని కూడా తిరస్కరిస్తామని మండలి అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో 12, తూర్పు గోదావరి జిల్లాలో ఒక కళాశాలకు నోటిసులు జారీ అయ్యాయి.

నోటీసులు జారీ అయిన బీఈడీ కాలేజీలు ఇవే
1. ఏఆర్‌కేఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సూళ్లూరుపేట), 2. గుత్తికొండ శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (రామచంద్రాపురం), 3. శ్రీపద్మావతీ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ (కావలి), 4. చిలకూరు అనిల్‌కుమార్ మెమోరియల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ (గూడూరు), 5.అలెక్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (వెంకటాచలం), 6. డా.చెన్నూరు రాధాకృష్ణారెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సైదాపురం),

7. నారాయణ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (పెదరూపల్లి), 8. డి.ప్రమీల మెమోరియల్ కాలేజ్ (ఆత్మకూరు), 9. హుస్సేనీ కాలేజీ (వెంకటంపేట, దుత్తలూరు), 10. సనా కాలేజీ (చెముడుగుంట), 11. యూనివర్సల్ క్రిస్టియన్ కాలేజీ (ఇందుకూరుపేట), 12. వేలంకని కాలేజీ (కండ్రిక, వెంకటాచలం)(ఇవన్నీ నెల్లూరు జిల్లాలోనివి), 13. విలియమ్స్ కాలేజీ (రాయుడుపాలెం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement