హస్తిన వెళ్లనున్న చంద్రబాబు
హైదరాబాద్ : సీమాంధ్ర ప్రాంత టీడీపీ నేతల ఒత్తిడితో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో హైడ్రామా మొదలుపెడుతున్నారు. తెలంగాణపై లేఖ ఇవ్వడం ద్వారా తాము తీవ్రస్థాయిలో దెబ్బతిన్నామని, పార్టీ ఇక కోలుకునే అవకాశం లేదని నేతలంతా మండిపడటంతో, చంద్రబాబు కొత్త రాజకీయ ఎత్తుగడ మొదలుపెట్టారు. ఈ రోజు సాయంత్రం హస్తినకు పయనం అవుతున్నారు.
ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని ప్రణబ్‌ముఖర్జీని, ప్రధాని మన్మోహన్‌ను కలవాలని నిశ్చయించారు. అయితే ఈ పర్యటనలో సమైక్య అంశాన్ని ప్రస్తావించవించలేనని చంద్రబాబు పార్టీనేతలతో అన్నట్టు సమాచారం. మరోవైపు సీమాంధ్ర నేతలతో చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ఎన్టీఆర్ భవన్లో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై అరగంట పాటు చర్చించినట్లు తెలుస్తోంది.