'ఇద్దరు నాయుళ్లు విఫలం అయ్యారు' | CPI Narayana slams chandrababu naidu, venkaiah naidu | Sakshi
Sakshi News home page

'ఇద్దరు నాయుళ్లు విఫలం అయ్యారు'

Published Mon, Jun 16 2014 12:36 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'ఇద్దరు నాయుళ్లు విఫలం అయ్యారు' - Sakshi

'ఇద్దరు నాయుళ్లు విఫలం అయ్యారు'

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి వల్ల పోలవరం ప్రాజెక్ట్ అంశం జఠిలం అవుతుందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ఎర్ర చందనం స్మగ్లర్లను కట్టడి చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ఆయన సూచించారు.

కాగా జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) ప్రస్తుతం నిర్దేశిస్తున్న నిబంధనల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పించటం సాధ్యం కాదని పేర్కొంటూ కేంద్ర ప్రణాళికా సంఘం కేంద్ర ప్రణాళికాశాఖ మంత్రి ఇందర్‌జిత్‌సింగ్‌కు నివేదిక సమర్పించినట్టు పీటీఐ వార్తా సంస్థ శుక్రవారం ఒక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement