సైనిక పాఠశాల సమావేశానికి హాజరైన వైస్ అడ్మిరల్ | east navy force vice admiral sathish sony attends to korukonda sainik school | Sakshi
Sakshi News home page

సైనిక పాఠశాల సమావేశానికి హాజరైన వైస్ అడ్మిరల్

Published Wed, Feb 11 2015 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

east navy force vice admiral sathish sony attends to korukonda sainik school

విజయనగరం రూరల్: విజయనగరం పట్టణంలోని కోరుకొండ సైనిక పాఠశాల 122వ పాలక మండలి సమావేశానికి తూర్పు నావికా దళ వైస్ అడ్మిరల్ సతీశ్ సోని బుధవారం హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సైనిక పాఠశాల ఛైర్మన్ హోదాలో ఈ సమావేశానికి సతీశ్ హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని కష్టపడాలన్నారు. రక్షణ రంగంలో విద్యార్థులు చేరేవిధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఎన్‌డీఏ లక్ష్యంగా చేసుకుని అందుకు తగ్గ కృషి చేయాలని వైస్ అడ్మిరల్ సతీశ్ సోని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement