ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : రబీ ప్రణాళికను కొంచెం ఆలస్యంగానైనా వ్యవసాయశాఖ అధికారులు తయారు చేశారు. ఈసారి లక్ష హెక్టార్లలో అంటే 2.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. శెనగ 40 వేల హెక్టార్లు, జొన్న 20 వేలు, వరి 20 వేలు, మొక్కజొన్న 10 వేలు, వేరుశెనగ 3 వేలు, నువ్వులు 5 వేల హెక్టార్లలో సాగవుతాయని పేర్కొంటున్నారు. శెనగ సాగు విస్తీర్ణం కోసం 35 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు పంపగా, ఇప్పటివరకు 15 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీకి అందుబాటులో ఉన్నాయి. మరో 20 వేల క్వింటాళ్ల విత్తనాలు రావాల్సి ఉంది. గతేడాదితో పోల్చుకుంటే ఈ విత్తనాల ధర తగ్గింది.
గతేడాది క్వింటాలు విత్తనాల ధర రూ.6,200 కాగా, రైతులు సబ్సిడీపై రూ.4,200 చెల్లించేవారు. ఈ ఏడాది క్వింటాలు విత్తనాల ధర రూ.4,395 నిర్ణయించారు. సబ్సిడీ పోను రైతులు రూ.2,930 చెల్లిస్తే సరిపోతుంది. క్వింటాలుపై రూ.1,465 రాయితీని ప్రభుత్వం భరిస్తుంది. వేరుశనగ విత్తనాలు జిల్లాకు 3 వేలు కేటాయించగా ఇంకా రాలేదు. గతేడాది క్వింటాలు విత్తనాల ధర రూ.6,475 ఉండగా, రైతు లు రూ.4,350 చెల్లించి తీసుకున్నారు. ఈ ఏడాది క్వింటాలు విత్తనాల ధర రూ.5,400 నిర్ధారించారు. సబ్సిడీ రూ.1,800 పోను రైతులు రూ.3,600 చె ల్లించి విత్తనాలు తీసుకోవాలి. గతేడాదితో పోల్చితే శెనగ, వేరుశెనగ విత్తనాల ధరలు తగ్గడంతో రైతులపై కొంతభారం తగ్గనుంది. జొన్న, మొక్కజొన్న విత్తనాలు కిలోకు రూ. 25 రాయితీ లభిస్తుంది. పెసర్లను కిలోకు రూ.72 ధర నిర్ణయించగా, రూ.34 సబ్సిడీ పోను రైతులు రూ.38 చెల్లించాలి. మినుములు కిలో రూ.58 ధర నిర్ణయించగా 50శాతం సబ్సిడీపై రూ.29 చెల్లించాలి.
విత్తనాలు త్వరగా పంపిణీ చేయాలి..
ఖరీఫ్‌లో వర్షాల వల్ల నష్టపోయిన రైతులు రబీలో శనగ, ఇతర పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంది. రెండు, మూడు నెలలుగా భూములు ఖాళీగా ఉండడంతో విత్తనాలు త్వరగా అందిస్తే సాగుకు సిద్ధంగా ఉన్నామని రైతులు పేర్కొంటున్నారు. రబీలో సాగయ్యే శెనగ, వేరుశెనగ, పెసర, మిను ము తదితర విత్తనాలు ఏటా రాయితీపైనే ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ప్రస్తుతం శెనగ విత్తుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.
అక్టోబర్ నెల విత్తుకోవడానికి అనుకూలం. ఖరీఫ్‌లో సోయా సాగు చేసే రైతుల్లో ఎక్కువమంది తిరిగి రబీలో శెనగ సాగు చేస్తారు. రబీలో జిల్లాకు యూరియా 30,367 మెట్రిక్ టన్నులు, డీఎపీ 17,578, కాంప్లెక్స్ ఎరువులు 13,209, ఎంఓపీ 9,020 మెట్రిక్ టన్నులు అవసరం. రబీలో నగదు బదిలీపై కాకుండా, నేరుగా రాయితీపైనే విత్తనాలు అందించనుండటంతో రైతులకు భారం తగ్గనుంది.
రబీపైనే రైతుల ఆశలు
Published Tue, Oct 8 2013 4:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement