ఏసీబీ వలలో అటవీ ఉద్యోగి
ఏసీబీ వలలో అటవీ ఉద్యోగి
Published Fri, Jan 31 2014 2:07 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
ఏలూరు (టూటౌన్), న్యూస్‌లైన్ :సీజ్ చేసిన వాహనాలకు విడుదల ఉత్తర్వులు ఇచ్చేందుకు రూ.10 వేలు డిమాండ్ చేసిన అటవీ శాఖ ఉద్యోగి జె.సుజాత అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కింది. రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు అటవీ శాఖ కార్యాలయంలో జె.సుజాత సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. దెందులూరు మండలం గాలాయిగూడెంకు చెందిన కె.సుబ్బరావు గత ఏడాది నవంబర్ 3న తన ట్రాక్టర్‌పై పుల్లల లోడు వేసుకుని వెళ్తుండగా, జంగారెడ్డిగూడెం డివిజన్ అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆ ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాక్టర్‌పై పుల్లల లోడుతో వెళ్తుండగా, అదే నెల 11న కామవరపుకోట వద్ద జంగారెడ్డిగూడెం డివిజన్ అధికారులు దానిని కూడా సీజ్‌చేశారు. ఆ రెండు ట్రాక్టర్లను తడికలపూడిలోని అటవీ శాఖ నర్సరీలో పెట్టారు.
ఒకే గ్రామానికి చెందిన ఆ ఇద్దరూ ట్రాక్టర్లను విడిపించుకునేందుకు డిసెంబర్ 22న జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఇందుకు అవసరమైన ఉత్తర్వులు ఇచ్చేందుకు రెండు వాహనాలకు కలిపి రూ.10 వేలు లంచం ఇవ్వాలని సుజాత ఆ ఇద్దరినీ డిమాండ్ చేసింది. అంత మొత్తం ఇచ్చుకోలేమని, రెండు ట్రాక్టర్లకు కలిపి రూ.5 వేలు ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు. అనంతరం వారిద్దరూ ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచారు. అటవీ శాఖ ఏలూరు కార్యాలయంపై వలపన్నిన అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఉదయం రూ.5 వేలను ట్రాక్టర్ యజమానులకు ఇచ్చి పంపించారు. ఆ మొత్తాన్ని సీనియర్ అసిస్టెంట్ సుజాత తీసుకుంటుం డగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వచ్చిన ఏడు నెలలకే..
సీనియర్ అస్టిసెంట్ జె.సుజాత ఏలూరు అటవీశాఖ కార్యాలయానికి బదిలీపై వచ్చి ఏడు నెలలు కావస్తోంది. గత ఏడాది జూన్ 24న విజయవాడ అటవీ శాఖ కార్యాలయం నుంచి బదిలీపై ఏలూరు కార్యాలయూనికి వచ్చారు. విధుల్లో చేరిన ఏడునెలలకే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయూరు. ఈ ఘటనతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కంగుతిన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఇదే కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏలూరు అటవీశాఖ రేంజి అధికారి షరీఫ్, నైట్ వాచ్‌మన్ ఏసీబీ అధికారులకు దొరికిపోయూరు.
Advertisement
Advertisement