రెండు మూడు రోజుల్లో హస్తినకు గవర్నర్ | Governor will go to Delhi by 3 days | Sakshi
Sakshi News home page

రెండు మూడు రోజుల్లో హస్తినకు గవర్నర్

Published Tue, Mar 25 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

Governor will go to Delhi by 3 days

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ రెండు మూడు రోజుల్లో హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన తదితర అంశాలపై ఇక్కడి ప్రభుత్వ అధికారులతో నిర్వహిస్తున్న సమీక్షలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పురోగతితో పాటు ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు, ఆర్థిక పరమైన అంశాలు, రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక సీమాంధ్రలో ఏర్పడే రెవెన్యూ లోటు తదితర సమాచారాన్ని కూడా కేంద్రానికి నివేదిక రూపంలో అందించనున్నారు. అలాగే సాధారణ ఎన్నికలతో పాటు పరిపాలన పరమైన అంశాలపై కూడా మరో నివేదిక అందజేస్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement