గురజాడను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి | Gurajada Appa Rao 's birth anniversary | Sakshi
Sakshi News home page

గురజాడను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి

Published Mon, Sep 21 2015 1:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

Gurajada Appa Rao 's birth anniversary

గురజాడను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి అన్నారు. గురజాడ అప్పారావు 153వ జయంతి ఉత్సవాలను సోమవారం విజయనగరం పట్టణంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే కేఏ నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ శోభారాణితోపాటు కలెక్టర్ ఎం.ఎం.నాయక్, జెడ్పీ సీఈవో రాజాకుమారి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఏ నాయుడు మాట్లాడుతూ... గురజాడ స్ఫూర్తిని భావి తరాలకు అందించాలన్నారు. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం అభినందనీయమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement