భద్రాచలం, న్యూస్‌లైన్: తెలంగాణలో అంతర్భాగమైన భద్రాద్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేదిలేదని టీజేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎం. కోదండరామ్ అన్నారు. భద్రాచలం పరిరక్షణ కోసం డివిజన్ టీజేఏసీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని డిగ్రీ కళాశాలలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భద్రాచలాన్ని తెలంగాణ రాష్ట్రం లోనే ఉంచేందుకు టీజేఏసీ పక్షాన ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్(జీఓఎం)కు తగు నివేదిక కూడా అందజేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ అయితే భద్రాచలం ఆత్మవంటిదన్నారు. నదీ జలాల కోసమే భద్రాచలం ప్రాం తాన్ని ఆంధ్రలో విలీనం చేసేందుకు సీమాం ధ్రులు కుట్ర పన్నుతున్నారు.. దీన్ని తిప్పికొడతామన్నారు. నదీ జలాలను సక్రమమార్గంలో వినియోగించుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. ఆదివాసీలను ముం చేందుకు చేసే యత్నాలను అంగీకరించేది లేదన్నారు. ఈ ప్రాంతాన్ని ఆంధ్రలో విలీనం చేస్తే సీమాంధ్ర పాలకులు పోలవరం ప్రాజెక్టును ఇష్టమొచ్చినట్లు నిర్మించుకుంటారని, అదే జరిగితే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ర్టంలో ఉంటేనే విద్య, ఉద్యోగరంగాల్లో ఆదివాసీలకు తగు అవకాశాలు దక్కుతాయన్నారు. భద్రాచలం అసెంబ్లీని తెలంగాణలోని మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కలిపినందున దీన్ని విడదీయటం ఎవరి వల్లా కాదన్నారు. భద్రాచలాన్ని ముంచేందుకు సీమాంధ్రుల చేస్తున్న కుట్రలను తిప్పుకొట్టేందుకు ఈ ప్రాంత వాసులు ఏకంకావాలన్నారు.
భద్రాద్రిని తెలంగాణలోనే ఉంచేం దుకు డివిజన్ ప్రజానీకం చేసే ఉద్యమాలకు టీజేఏసీ అండగా ఉంటుందన్నారు. భద్రాచలంపై ఉద్యమాన్ని రాష్ట్రస్థాయిలో తీవ్రతరం చేస్తామన్నారు. భద్రాచలం డివిజన్‌లో ఉన్న వాజేడు, వెంకటాపురం, చర్ల తదితర మండలాల ప్రజలు ఇప్పటికే ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని సీమాంధ్రలో కలిపితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. భద్రాచలం కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే ఈ ప్రాంత మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. భద్రాచలం కోసం ఖమ్మం జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సభ నిర్వహించి ఇక్కడి సమస్యను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. భద్రాచలం విషయంలో ఎటువంటి అనుమానాలు వద్దని, శ్రీ సీతారాముల దయంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఉండేలా పోరాడుతామన్నారు.
పోలవరం కోసమే సీమాంధ్రుల కుట్ర
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసమే భద్రాచలం ప్రాంతాన్ని ఆంధ్రలో విలీనం చేయాలని సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కిరికిరి లేని తెలంగాణను ప్రకటించాలని, లేకుంటే ఆదివాసీలు విల్లంబులతో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాపై తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నాయకులు నోరువిప్పాలని గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతం నీటమునుగుతుందన్నారు. అదే జరిగితే గిరిజన సంస్కృతి వినాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని పరిరక్షించుకునేందుకు ఆదివాసీ సంఘాలన్నీ ఏకంకావాలని పిలుపునిచ్చారు.
సమావేశ ంలో టీజేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నడింపల్లి వెంకటపతిరాజు, ఉపాధ్యక్షులు ఎస్‌కే గౌసుద్దీన్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆవుల సుబ్బారావు, గెజిటెడ్‌ఉద్యోగుల సంఘం నాయకులు కుంజా సీతారాములు, డిగ్రీ క ళాశాల అధ్యాపకులు గోపి తదితరులు ప్రసంగించారు. టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విద్యా వంతుల వేదిక జిల్లా అధ్యక్షులు రామనాథం, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కెచ్చెల రంగయ్య, వెక్కిరాల, సోమశేఖర్ , తాళ ్లరవికుమార్, తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగలగడ్డ ముత్తయ్య, వీఆర్‌వోల సంఘం నాయకులు లక్ష్మణరావు, మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి దాగం ఆదినారాయణ పాల్గొన్నారు. బహిరంగసభ అనంతరం కోదండరాం స్థానిక బాలికల హాస్టల్, డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
భద్రాద్రి తెలంగాణదే..!
Published Thu, Nov 7 2013 5:18 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement