సాక్షి, కాకినాడ : జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరు, అసెంబ్లీకి ఇద్దరు చొప్పున చొప్పున ఐఏఎస్ స్థాయి అధికారులను ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది. వీరిలో సాధారణ పరిశీలకులు ఈ నెల 12వ తేదీన జిల్లాకు వస్తుండగా, వ్యయ పరిశీలకులు 19వ తేదీన రానున్నారు. సాధారణ పరిశీలకులుగా కాకినాడ పార్లమెంటుకుగౌతమ్‌ఘోష్, రాజమండ్రి పార్లమెంటుకు అమర్ భట్టాచార్య, అమలాపురం పార్లమెంటుకు విమల్ కాంతిదాస్ నియమితులయ్యారు.
కాకినాడ సిటీ, రూరల్, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు నిత్యానంద మండల్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు మదన్‌లాల్, రాజమండ్రిసిటీ, రాజానగరం, అనపర్తి, మండపేట నియోజకవర్గాలకు సౌమ్య నారాయణ పాణిగ్రాహి, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రచూర్‌గోయల్ సాధారణ పరిశీలకులుగా నియమితులయ్యారు. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు షెట్టన్నవార్, రామచంద్రపురం, ముమ్మిడివరం, కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు వీరేంద్రకుమార్‌సింగ్ సాధారణ పరిశీలకులుగా నియమితులయ్యారు.
వ్యయ పరిశీలకులుగా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు లాల్ చంద్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు జయరామన్ విశ్వనాథన్, రాజమండ్రి సిటీ, రాజానగరం, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు శివప్రసాద్, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు కృష్ణమూర్తి, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు షెరవన్ పెర్మాళ్, రామచంద్రపురం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు కైలాష్‌కుమార్‌లను నియమించారు.
జిల్లాలోని మూడు పార్లమెంట్, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు 12వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. అదేరోజు పార్లమెంట్ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు జిల్లాకు రానున్నారు. నామినేషన్ల ఘట్టం 19వ తేదీతో ముగియనుంది. అదే రోజు అసెంబ్లీ వ్యయపరిశీలకులు రానున్నారు. అప్పటివరకూ జిల్లా స్థాయిలో నియమించిన ఫ్లైయింగ్ స్క్వాడ్స్, షాడో టీమ్స్ అభ్యర్థుల వ్యయాలను గణిస్తాయి.
ఆ తర్వాత పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకుల అధీనంలో ఈ కమిటీలు పనిచేస్తాయి. విశాఖ జిల్లా అరకు పార్లమెంటు నియోజకవర్గానికి జనరల్ అబ్జర్వర్‌గా పర్వేజ్ అహ్మద్‌ను నియమించగా, అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి జనరల్ అబ్జర్వర్‌గా దినేష్‌కుమార్ గుప్తా, వ్యయ పరిశీలకునిగా వీరేంద్రకుమార్‌లను కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది.
ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు
Published Fri, Apr 4 2014 1:05 AM | Last Updated on Thu, Sep 27 2018 3:19 PM
Advertisement