గులాబీల మహా సంబురం | KCR gets hero's welcome, party paints city pink | Sakshi
Sakshi News home page

గులాబీల మహా సంబురం

Published Thu, Feb 27 2014 1:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

గులాబీల మహా సంబురం - Sakshi

గులాబీల మహా సంబురం

కేసీఆర్‌ను అపూర్వ రీతిలో స్వాగతించిన టీఆర్‌ఎస్ శ్రేణులు
  బేగంపేట నుండి గన్‌పార్కు దాకా ఐదు గంటలు ర్యాలీ
 
 దారి పొడవునా తెలంగాణ కళారూపాలు అలరించిన బోనాలు, బతుకమ్మలు, ఒంటెలు, ఏనుగులుపోటెత్తిన గులాబీ దండు.. విలీనం వద్దంటూ ప్లకార్డులు ఒంటెలపై సాగిన హరీశ్, గంగుల, పద్మారావు తదితరులు టీఆర్‌ఎస్ నేతల ఆనంద నృత్యాలుఅమరవీరుల స్తూపానికి  కేసీఆర్ నివాళులు, తర్వాత ఇంటికి
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుకు తెలంగాణ ఘనంగా స్వాగతం పలికింది. తెలంగాణకే ప్రత్యేకమైన సాంస్కృతిక, కళా రూపాల నడుమ టీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు ఐదు గంటల పాటు ఆయనను ఊరేగించారు. తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన అనంతరం తొలిసారిగా సొంత గడ్డపై అడుగు పెట్టిన తమ నేతకు బుధవారం అడుగడుగునా నీరాజనం పట్టారు.
 
 బేగంపేట విమానాశ్రయం నుంచి అమరవీరుల స్తూపం దాకా టీఆర్‌ఎస్ నేతలతో కలసి కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ ఘనంగా సాగింది. రోడ్డుకు రెండువైపులా ఆయన ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు సందడి చేశాయి. దారి పొడుగునా ‘జై తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. నిజాం వారసత్వంగా భాగ్యనగరంలో కొనసాగుతున్న ఒంటెలు, గుర్రాలతో కూడిన ఊరేగింపు అలరించింది. వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా కేసీఆర్‌పై పూలవాన కురిపించారు. విలీనం వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
 
  ఆయన ఓపెన్ టాప్ జీపుపై అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బేగంపేట, సీఎం క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట సర్కిల్, ఖైరతాబాద్ సర్కిల్, లక్డీకాపూల్ మీదుగా గన్‌పార్క్ దాకా విజయోత్సవ ర్యాలీ ఆరు గంటల పాటు సాగింది. గన్‌పార్కులోని అమరవీరుల స్మారక స్తూపానికి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం నేరుగా టీఆర్‌ఎస్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని పూలతో అభిషేకించారు. రాత్రి 9.50కి తన నివాసానికి చేరుకున్నారు.
 
 బుధవారం సాయంత్రం 4.00కు కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరారు. కొందరు ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే శంషాబాద్ వచ్చి ఆయనకు స్వాగతం పలికారు.
 
 బేగంపేటకు చేరుకున్న కేసీఆర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు
 విమానాశ్రయంలోకి వెళ్లడానికి కార్యకర్తలు తోపులాటకు దిగడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు కేసీఆర్‌తో పాటు ఓపెన్ టాపు జీపులో ఎక్కడానికి కొందరు సీనియర్ నేతలు ప్రయత్నించినా భద్రతా సిబ్బంది తోసి పారేశారుసాయంత్రం 5.15గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విజయోత్సవ యాత్ర ప్రారంభమైంది విజయ రథంపై కేసీఆర్‌తో పాటు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల, కేకే, వివేక్, మందా జగన్నాథం మాత్రమే ఉన్నారు
 టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్నవారిలో కేసీఆర్‌తో పాటు నాయిని ఒక్కరే వాహనంపై ఉన్నారు    ర్యాలీ పొడవునా కేసీఆర్ రెండు చేతులూ పెకైత్తి విజయ దరహాసం చేస్తూ, శ్రేణులకు అభివాదం చేస్తూ సాగారుహరీశ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ , మాజీ ఎమ్మెల్యే పద్మారావు వేర్వేరుగా ఒంటెలపై ఎక్కి ముందుకు సాగారు విమానాశ్రయం నుంచి ర్యాలీ ప్రధాన రహదారిపై ఉన్న షాపర్స్‌స్టాప్ షోరూం వరకు చేరడానికే గంటన్నర పట్టింది
 గన్‌పార్కులో అమరవీరుల స్తూపాన్ని పూలమాలలతో అలంకరించారు.
 
  నలువైపులా అమరవీరుల చిత్రపటాలుంచారు బేగంపేటలో కేసీఆర్ యాత్ర ప్రారంభం కాగానే స్తూపం వద్ద తెలంగాణవాదులు ధూంధాం నిర్వహించారు ర్యాలీ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సాగుతుండగా టీఆర్‌ఎస్ శ్రేణులు, యువకులు సీఎం డౌన్‌డౌన్ అంటూ నినదించారు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ర్యాలీ సీఎం క్యాంపు కార్యాలయం దాటి పంజాగుట్ట సర్కిల్‌కు చేరుకుందివిద్యుత్ సౌధ వద్ద ముందే ఏర్పాటు చేసిన భారీ క్రేన్ పై నుంచి పూలవర్షం కురిపించారుఖైరతాబాద్‌లో పీజేఆర్ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు దారిలో భవనాల పై నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు తమ అధినేతపై పూల వర్షం కురిపించారు ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ స్వామి గౌడ్ తదితరులు తీన్‌మార్ స్టెప్పులు వేస్తూ సాగారు కార్యకర్తలు కేసీఆర్ మాస్క్‌లను ముఖానికి తగిలించుకొని నృత్యాలు చేశారు లంబాడీ మహిళలు నృత్యాలతో అలరించారు ర్యాలీకి ముందుండి సాగిన ఎమ్మెల్యేలు 9.15 గంటల సమయంలో గన్‌పార్క్‌కు చేరుకున్నారు మరో పది నిమిషాలకు కేసీఆర్ కూడా చేరుకుని అమర వీరుల స్తూపానికి నివాళులర్పించారు అమరుడు శ్రీకాంతాచారి తల్లిని కేసీఆర్ ఓదార్చారుకేసీఆర్ స్తూపం వద్దకు చేరుకోగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. స్వల్ప తోపులాట జరిగిందితరవాత కేసీఆర్ తన వాహనంలో నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్నారు.
 
 భవనాన్ని గులాబీ రంగు లైట్లతో అలంకరించారుతెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు, అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారురాత్రి 9.50 గంటలకు కేసీఆర్ తన నివాసానికి చేరుకున్నారు కుటుంబసభ్యులు గుమ్మడికాయతో దిష్టి తీసి మంగళారతులతో స్వాగతం పలికారు కేసీఆర్ తన అక్కాచెల్లెళ్లకు, బావలకు పాదాభివందనం చేశారు.
 
 కేసీఆర్‌కు భద్రత పెంపు
 బుధవారం ర్యాలీ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆదేశానుసారం కేసీఆర్‌కు రాష్ట్ర పోలీసు విభాగం తాత్కాలికం గా భద్రత పెంచింది. ప్రస్తుతం ఆయన జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్నారు. ఈ కేటగిరీలో 11 మంది అంగరక్షకులతో పాటు బులెట్ ఫ్రూఫ్ వాహనం, పైలట్, ఎస్కార్ట్‌లతో పాటు ఇంటి వద్ద సాయుధ పికెట్ ఉంటుంది. బుధవారం భారీ ర్యాలీ, కేసీఆర్ ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణిం చాల్సి ఉండటంతో అదనపు భద్రత కల్పించారు. ఆయన చుట్టూ ప్రత్యేక క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ (సీపీటీ) ఏర్పాటు చేశారు. నలుగురు అంగరక్షకులను అదనంగా నియమించారు. టీఆర్‌ఎస్ కార్యాలయంతో పాటు నివాసం వద్ద కూడా సాయుధ సిబ్బందితో పికెట్లు ఏర్పాటు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement