ఫాంహౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మళ్లీ ఫాంహౌస్కు వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్రంతో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన జగదేవ్‌పూర్ మండలం వెంకటాపుర్‌లోని తన ఫాంహౌస్‌లో గురువారం పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.
కాగా టీఆర్ఎస్ భవిష్యత్‌ను నిర్ణయించే కీలక సమావేశం మార్చి1న కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. టీఆర్ఎస్ పోలిట్ బ్యూరోతో పాటు పార్లమెంటరీ పార్టీ, శాసనసభపక్ష, రాష్ర్ట కార్యావర్గం ఈ సమావేశంలో పాల్గొంటుంది. కాంగ్రెస్‌తో పోత్తు, విలీనంపై కేసీఆర్ ఈ సమావేవంలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. విలీనంపై పార్టీలో తీవ్ర వ్వతిరేకత నేపధ్యంలో కేసీఆర్ వైఖరిపై పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్టీ నేతలతోపాటు టీజేఏసీ నేతలతో కూడా కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. దాంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.