రూపాయి బాకీ ఉండొద్దు.. | LAUGHED dollar debt .. | Sakshi
Sakshi News home page

రూపాయి బాకీ ఉండొద్దు..

Published Thu, Feb 6 2014 1:45 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

LAUGHED dollar debt ..

  • జాతరలోపు ఎవరి బిల్లులు వారికే..
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ మహంతి
  • హన్మకొండ, న్యూస్‌లైన్ : ‘నిధులున్నప్పుడు వెనుకాడొద్దు. జాతరకు సంబంధించి ఆయా విభాగాలకు చెల్లించాల్సిన బిల్లులన్నీ ఇచ్చేయండి. ఒక్క రూపాయి కూడా బాకీ ఉండొద్దు’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. కలెక్టరేట్‌లో జాతర నిర్వహణ, నిధుల వినియోగంపై మంగళవారం సమీక్ష నిర్వహించిన ఆయన పెండింగ్ బిల్లులపై నివేదికలు తీసుకున్నారు. విద్యుత్, ఆర్టీసీకి చెల్లించాల్సిన పాత బిల్లులపై అధికారులకు ఆదేశాలిచ్చారు.

    బుధవారం హైదరాబాద్ నుంచి మరోసారి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ, గిరిజనాభివృద్ధి శాఖల నుంచి పెండింగ్‌లో ఉన్న జాతర బిల్లులను వెంటనే చెల్లిం చాలని సూచించారు. విద్యుత్ శాఖ ఏర్పాట్ల బిల్లు రూ.1.12కోట్లను ప్రత్యేక ఫండ్ నుంచి విడుదల చేస్తున్నట్లు సీఎస్ ఆ శాఖకు సూచించారు. దీనిపై ఫ్యాక్స్ ద్వారా సమాచారమిచ్చారు.
     
    2004 జాతర నుంచి వినియోగించిన విద్యుత్ బిల్లులు బాకీపడిన విషయం విదితమే. దేవాదాయ శాఖ నుంచి కేవలం వినియోగించిన విద్యుత్ బిల్లు(ఎనర్జీ చార్జెస్) ఇవ్వాలని ఇటీవల డిమాండ్ పెట్టారు. అయితే జాతరలో దుకాణాలు, ఇతర కమర్షియల్ సర్వీసుల నుంచి వసూలు చేసిన బిల్లులపై సమగ్ర నివేదికలను సిద్ధం చేశారు. ఏర్పాట్ల బిల్లులు మినహాయిస్తే.. జాతర లైట్లు, అమ్మవార్ల గద్దెలు, సేవలందించిన అధికారులు, సిబ్బంది ఉన్న తాత్కాలిక ఏర్పాట్ల కోసం వినియోగించిన విద్యుత్‌కు రూ.40లక్షల బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చారు. దీంతో దేవాదాయ శాఖ నుంచి ఎనర్జీ చార్జెస్‌కు రూ.40లక్షలను వెంటనే ఇవ్వాలని సీఎస్ ఉత్తర్వులిచ్చారు.

    వీటిని రెండు రోజుల వ్యవధిలోనే చెల్లించాలన్నారు. మంచినీటి సరఫరా కోసం మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో చేసిన పనులకు వాడుకున్న బిల్లులను సైతం వెంటనే చెల్లించాలని సూచించారు. ఇప్పటివరకు ఇరిగేషన్ నుంచి విద్యుత్ శాఖకు రూ.11లక్షలు పెండింగ్ బిల్లు ఉంది. వీటిని సైతం రెండు రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.

    గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి స్నానఘట్టాలు, ఇతర పనుల కోసం వినియోగించిన విద్యుత్‌కు రూ.10లక్షలు బాకీపడ్డారని, ఆ శాఖ నిధుల నుంచి బిల్లులు ఇచ్చేయాలని ఆదేశాలిచ్చారు. జాతర నిధుల నుంచి విద్యుత్ శాఖకు రూ.10లక్షలు కేటాయించి డీడీలివ్వాలని ఉత్తర్వులిచ్చారు. కాగా, రూ.కోటిని రెండు శాఖల నుంచి ఆర్టీసీకి ఇవ్వాలని సీఎస్ ఆదేశాలిచ్చారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement