న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు)ను కేంద్ర న్యాయ శాఖ ఆమోదించింది. ఈ ముసాయిదా బిల్లు 70 పేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం 25 పేజీల సిఫార్సులు రూపొందించింది. అందరూ రాయలతెలంగాణకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
రేపు సాయంత్రం 5 గంటలకు జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశం ముందుకు ఈ ముసాయిదా బిల్లు వెళుతుంది. కేంద్ర మంత్రులకు పంపడానికి మరో ఆరు పేజీల నోట్ తయారు చేశారు. రెండు ప్రత్యామ్నాయాలపై కేంద్ర మంత్రులు కసరత్తు చేస్తారు.
జిఓఎం సిఫారసులలో ప్రధాన అంశాలు:
రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు
జిహెచ్ఎంసి పరిధిలో పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని.
హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో ఉంటాయి.
కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి మేనేజ్మెంట్ బోర్డు.
సీమాంధ్ర రాజధానిని గుర్తించడానికి నిపుణులతో ఒక కమిటీ.
రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన న్యాయశాఖ
Published Wed, Dec 4 2013 8:33 PM | Last Updated on Sun, Apr 7 2019 4:41 PM
Advertisement