అంగట్లో అంగన్ వాడీ సరుకులు! | market in anganwadi metirials! | Sakshi
Sakshi News home page

అంగట్లో అంగన్ వాడీ సరుకులు!

Published Sat, Sep 6 2014 2:50 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

market in anganwadi metirials!

సుభద్ర(బలిజిపేట రూరల్): ఒక వైపు పౌష్టికాహార వారోత్సవాలు.. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందించాల్సిన సరుకులు అంగడికి తరలిపోతున్నాయి.  ఇదేమని అడిగితే సాక్షాత్తు అంగన్‌వాడీ కార్యకర్తే బియ్యం తానే అమ్మానని సమాధానమివ్వడం విశేషం. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుభద్ర ఒకటవనంబరు అంగన్‌వాడీ  కేంద్రం నుంచి అక్రమంగా అంగట్లోకి తరలిస్తున్న 50 కిలోల బియ్యాన్ని గ్రామస్తులు శుక్రవారం పట్టుకున్నా రు. మండలంలోని పక్కి గ్రామానికి చెందిన వ్యాపారి గ్రా మంలోని అంగన్‌వాడీ కేంద్రం నుంచి బియ్యాన్ని తెస్తుండ గా పట్టుకున్నామని గ్రామస్తులు కర్రి అచ్యుతరావు, రంభ.కృష్ణ, చన్నమల్లి మహేష్, గంట ఎల్లనాయుడులు తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాన్ని సక్రమంగా తెరవడం లేద ని, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయడం లేదని గ్రామంలోని చిన్న పిల్లల తల్లితండ్రులు తెలిపారు. కార్యకర్త నెలకు 20రోజులు గ్రామంలో ఉండదని మిగిలిన 10 రోజులు వచ్చినా సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. ఇటువంటి కేంద్రాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశా రు. ఆ వ్యాపారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తే బియ్యం విక్రయ వివరాలు చాలావర కు దొరికే అవకాశాలున్నాయని గ్రామస్తులు చెప్పారు.

కేంద్రంలో ప్రీ స్కూలు పిల్లలు 21 మంది, ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల లోపు వారు 25 మంది, గర్భిణి ఒకరు, బా లింతలు ఆరుగురు ఉన్నట్టు రికార్డులలో చూపుతున్నారు.  కేంద్రాన్ని ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంట ల వరకు నిర్వహించాల్పి ఉన్నప్పటికీ పిల్లలు లేక  కేంద్రం వెలవెలబోతోంది. దీనిపై కార్యకర్త జి.హైమావతిని వివరణ కోరగా బియ్యం తానే అమ్మానని ఒప్పుకున్నారు. ‘హాజరు పట్టిలో 5వ తేదీ నాటి హాజరు వేయలేదు. ప్రీస్కూ లు విద్యార్థులకు వంటవండలేదని’ స్పష్టం చేశారు. మరికొన్ని బియ్యం తడిసి ముద్దయి  పాడయ్యాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement