భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: మూడు అడుగుల నేల అడిగి రాక్షసరాజు బలిచక్రవర్తి గర్వాన్ని అణచిన వామనుడి అవతారంలో భద్రాద్రి రామయ్య ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీసీతారామచంద్రస్వామి వారికి తొలుత గర్భగుడిలో సుప్రభాత సేవలు నిర్వహించి ఆరాధన ఇచ్చారు. అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలోని బేడా మం డపం వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి ఉత్సవమూర్తులతో పాటు 12 మంది ఆళ్వార్లను కొలువు తీర్చారు. రెండు వైపులా ఆళ్వార్లతో చూడముచ్చగా ఉన్న స్వామి వారికి భక్తులు విశేష పూజలు నిర్వహిం చారు. అర్చక స్వాములు పూజల నడుమ వేద పండితులచే రెండు వందల పాశురముల ప్రబంధాలను చదివారు. ఆ తర్వాత ఉత్సవమూర్తుల ను ఆలయంలోకి తీసుకెళ్లి వామనావతారంలో అ లంకరించారు.
అనంతరం స్వామి వారిని బయటకు తీసుకువచ్చి అర్చకులు కుంభాహారతిని స మర్పించారు. అనంతరం ప్రత్యేక పల్లకిపై ఆల యం నుంచి ఊరేగింపుగా స్వామి వారిని గోదావరి ఒడ్డు వరకు ఊరేగింపుగా తీసుకె ళ్లారు. భక్తుల నీరాజనాలు, వికాస తరంగణి, శ్రీ కృష్ణ కోలాట భజన మండలి ఆధ్వర్యంలో మహిళలు కోలాట ప్రదర్శనతో స్వామి వారి ఊరేగింపు వైభవంగా సాగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని కల్యాణ మండప ప్రాంగణానికి తీసుకువచ్చి భక్తుల దర్శనార్ధం అక్కడ ఉంచారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం స్వామి వారిని భక్తుల కోలాహలం నడుమ తిరువీధి సేవకు తీసుకెళ్లారు. మార్గమధ్యలో ఉన్న విశ్రాంతి మండపంలో కొద్ది సేపు స్వామి వారు సేద తీరిన తర్వాత రాజవీధి ద్వారా తాతగుడి వరకు తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు.
భక్తుల నీరాజనం
వైకుంఠ ఏకాదశీ ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో జరగుతున్న అధ్యయనోత్సవాల్లోని పగల్‌పత్తు ఉత్సవాలలో రామయ్య స్వామి రోజుకో అవతారంలో దర్శనమిస్తున్నారు. తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి మహోత్సవం సమీపించే కొద్ది స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. మిథిలాస్టేడియం వద్ద, తిరువీధి సేవలో స్వామి వారిని దర్శించుకోవటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎం రఘునాధ్, ఏఈఓ శ్రవణ్‌కుమార్, వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, సన్యాసిశర్మ, ఆలయ అర్చకులు విజయరాఘవన్, అమరవాది మదనమోహనాచార్యులు, ఓఎస్డీ సుదర్శన్, పీఆర్‌ఓ సాయిబాబా, ఆలయ అర్చకులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నేడు పరుశురామావతారం : వైకుంఠ ఏకాదశీ ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం పరుశురామావాతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తండ్రి అయిన జమదగ్నిని చంపిన వేయి చేతుల గల కార్య వీర్యార్జునుని సంహరించి ఇరువది ఒక్క పర్యాయములు భూమిని అంతా గాలించి దుష్టులైన వారిని సంహరించుటకు శ్రీరామన్నారాయుణుడైన శ్రీసీతారామచంద్రస్వామి వారు పరుశురామావతారంలో దర్శనం ఇస్తారు.
వామనరూపుడై..
Published Mon, Jan 6 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement