23న నంద్యాల ఉప ఎన్నిక
షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెల 23వ తేదీన నంద్యాల ఉప ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, గోవాలోని వాల్పోయి, పనాజీ, ఢిల్లీలోని బవానా శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలు జారీచేసింది. ఇందుకు సంబంధించి ఈనెల 29న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 5. అలాగే ఓట్ల లెక్కింపు ఆగస్టు 28వ తేదీన చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, ఓటర్ వెరిఫయేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపాట్) యంత్రాలను వినియోగించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల నియమావళి తక్షణం అమలులోకి వచ్చిందని పేర్కొంది. ఎన్నికలు జరిగే నియోజకవర్గం ఉన్న జిల్లా మొత్తానికి ఈ నియమావళి వర్తిస్తుందని తెలిపింది.
నోటిఫికేషన్ 29.07.2017(శనివారం)
అభ్యర్థిత్వాల ఉపసంహరణ గడువు 09.08.2017(బుధవారం)
నామినేషన్లకు గడువు 05.08.2017 (శనివారం)
నామినేషన్ల పరిశీలన 07.08.2017 (సోమవారం)
ఓటింగ్ 23.08.2017 (బుధవారం)
ఓట్ల లెక్కింపు 28.08.2017 (సోమవారం)