గవర్నర్‌ను కలిసిన ఎంపీ పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిశారు. విద్యుత్ కోతలవల్ల కరీంనగర్ జిల్లాలో రైతుల చేతికి రాబోయే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని, మరో 15 రోజులపాటు విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. తన విజ్ఞప్తి పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ కేటాయింపుల విషయంలో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.