చోడవరంలో 175 కిలోలు స్వాధీనం
చోడవరం: జిల్లాలో గంజాయి రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రోజూ రూ.లక్షలు విలువైన గంజాయి తరలిస్తున్నారు. గురువారం ఒక్క రోజే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 535 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 175 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం వాహనాలు తనిఖీచేస్తుండగా లారీలో గంజాయిని గుర్తించారు. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. పాడేరు నుంచి పెందుర్తి వెళుతున్న లారీ ముందు పల్సర్ మోటారు సైకిల్‌పై ఇద్దరు వస్తుండగా వెనుక లారీలో గంజాయిని రవాణాచేస్తున్నారు.
అనుమానం వచ్చి లారీని తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించామని, వెంటనే లారీతోపాటు పైలట్‌గా వెళుతున్న పల్సర్ మోటారు సైకిల్‌ను స్వాధీనంచేసుకుని ఆరుగురిని అరెస్టుచేశామని తెలిపారు. ఎల్.కోట మండలం పోతంపేటకు చెందిన లారీడ్రైవర్ కోరుకొండ రాజుతోపాటు జి.మాడుగుల మండలం చుట్టుమెట్ట కాలనీకి చెందిన కిల్లో బాబూరావు, కిల్లో ఎప్రా ఎలియాస్ రిషి, ఉబలగరువుకి చెందిన పాండ్ర సింహాచలం, పాండ్ర లక్ష్మణరావు, వంతల రామారావును అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి రూ.3వేలు నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ చెప్పారు.
యథేచ్ఛగా గంజాయి రవాణా
Published Thu, Jul 16 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement
Advertisement