సాక్షి, తాడేపల్లి: విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దడానికే యూనివర్సిటీల పాలక మండలి నియామకం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 50 శాతం రిజర్వేషన్లతో ఈ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. బుధవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్సిటీ పాలక మండలి పోస్టుల్లో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 శాతం, మహిళకు 50 శాతం పదవులు కల్పించారన్న విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక న్యాయం జరగలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పచ్చ మీడియా తట్టుకోలేకపోతుందని విమర్శించారు. ప్రభుత్వం కరోనాను ఎదుర్కొంటున్న తీరు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌కు పని తప్ప ప్రచారం అలవాటు లేదన్నారు. (విపత్తులోనూ శవ రాజకీయాలా?)
"యూనివర్సిటీ పాలక మండలి పోస్టుల భర్తీ విషయంలో రిజర్వేషన్లు ఖచ్చితత్వం పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో రెండు పోస్టులు తగ్గితే ఒప్పుకోలేదు.. మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు పదవులు దక్కాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో 11 యూనివర్సిటీల పాలక మండలి భర్తీలో పదవులను నామినేటెడ్ పద్దతిలో నియమించారు. దాని కోసం ప్రత్యేక జీవో కూడా జారీ చేశారు. చంద్రబాబు క్లాస్‌మేట్ శ్రీనివాసులు నాయుడు తయారు చేసిన పాలక మండలి సభ్యుల జాబితాను బాబు ఆమోదించారు. అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా తెలియకుండా యూనివర్సిటీ పాలక మండలి సభ్యులను నియమించారు. దీనిపై ఎల్లో మీడియా ఎందుకు నోరు మెదపడం లేదు" అని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment